breaking news
Gold
-
'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!
స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో.. ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అంటూనే.. భారీ క్రాష్ మొదలైందని అన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2013లో ప్రచురించిన రిచ్ డాడ్స్ ప్రాఫసీలో.. భవిష్యత్తులో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్ జరుగుతుందని హెచ్చరించాను. నేను చెప్పినట్లే.. ఆ పెద్ద ఆర్థిక సంక్షోభం సమీపంలో ఉంది. మార్కెట్ క్రాష్ అనేది కొందరికి ప్రమాదం అయినా.. స్టాక్స్ కొనుగోలు చేయాలని వేచి చూసేవారికి గొప్ప అవకాశం.ఈ సందర్భంగా కియోసాకి.. గోల్డ్, సిల్వర్ గురించి చెబుతూనే బిట్‌కాయిన్, ఎథెరియం గురించి కూడా పేర్కొన్నారు. బిట్‌కాయిన్ విలువ తగ్గిపోతున్నప్పుడు, నేను మరింత కొనుగోలు చేస్తానని అన్నారు. నా దృష్టిలో ఇవే (బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథెరియం) నిజమైన ఆస్తులని పేర్కొన్నారు.I Am Warning You: In Rich Dad’s Prophecy published 2013 I warned of the biggest stock market crash in history still coming.That giant crash is now imminent.The good news is those of you who followed my rich dad’s warning and prepared….the coming crash will make you richer…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 17, 2026ఆర్థిక సంక్షోభాలు ఎప్పుడూ నష్టాలనే కాకుండా.. అవకాశాలను అందిస్తుంది. భయపడే వారు నష్టపోవచ్చు, కానీ ఆర్థిక జ్ఞానం కలిగి, దీర్ఘకాల దృష్టితో పెట్టుబడులు పెట్టే వారు మాత్రం.. తప్పకుండా ధనవంతులు అవుతారు. ఎప్పుడైతే మార్కెట్ నష్టాలను చవి చూస్తుందో.. చాలామంది తమ స్టాక్ అమ్మేయడానికి సిద్ధపడతారు. అలాంటి సమయంలో వాటిని కొనుగోలు చేసేవారు సంపన్నులవుతారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడి అనేది ఒక వ్యక్తి ఆర్థిక దృష్టికోణం మాత్రమే. ఇందులో లాభనష్టాలు సహజమే. కాబట్టి ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. అవసరమైతే ఆర్ధిక పరిస్థితిని విశ్లేషించడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.ఇదీ చదవండి: డేంజర్లో ఉద్యోగాలు!.. 2026లో ఇదే జరుగుతుందా? -
బంగారం ధర రూ.లక్ష కంటే తక్కువకు..?
బంగారం కొనాలంటేనే భయపడుతున్న సమయంలో.. నిపుణులు పసిడి ప్రియులకు శుభవార్త చెప్పారు. తులం గోల్డ్ రేటు లక్ష రూపాయల కంటే తక్కువకు చేరుకుంటుందని పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్లో కూడా ఔన్సు ధర 3000 డాలర్లకు చేరుకుంటుందని వెల్లడించారు. రష్యా అమెరికాతో వ్యాపారం చేయడం ప్రారంభిస్తే ఇది సాధ్యమవుతుందని అన్నారు.2025లో భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. 2026 జనవరిలో కూడా అదే రీతిగా ముందుకు సాగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల ధర రూ.1.80 లక్షల స్థాయికి చేరింది. కాగా గత వారంలో ఎంసీఎక్స్ బంగారం ధర రూ. 1.56 లక్షల (10 గ్రామ్స్) వద్ద నిలిచింది. దీన్నిబట్టి చూస్తే.. ఇప్పుడు పరిస్థితులు కొంత చక్కబడ్డాయని, బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయని తెలుస్తోంది.మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రష్యా అమెరికాతో డాలర్లలో (USD) వ్యాపారం చేయడానికి తిరిగి వస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా.. రష్యన్ అంతర్జాతీయ డాక్యుమెంట్ క్రెమ్లిన్.. అమెరికాతో ఆర్థిక భాగస్వామ్యాన్ని అన్వేషిస్తోందని సూచిస్తోంది. ఈ పరిణామంలో అత్యంత ఆసక్తికరమైన భాగం మాస్కో యుఎస్ డాలర్ ఆధారిత వాణిజ్య ఒప్పందానికి తిరిగి రావడం. ఇది రష్యాతో సహా బ్రిక్స్ దేశాల డీ-డాలరైజేషన్ ప్రయత్నాలకు పెద్ద దెబ్బ అవుతుంది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?రష్యా అంతర్జాతీయ వాణిజ్యాన్ని డాలర్లతో నిర్వహిస్తే.. డాలర్ విలువ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం కొంత తగ్గిస్తాయి. ఇవన్నీ బంగారం రేటును గణనీయంగా తగ్గించడంలో దోహదపడతాయి.భారతదేశంలో నేటి బంగారం ధరలుఇండియన్ మార్కెట్లో ఈ రోజు (ఫిబ్రవరి 16) బంగారం ధరలు రూ. 1000 కంటే ఎక్కువ తగ్గాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.56 లక్షల వద్ద, 22 క్యారెట్స్ తులం బంగారం ధర రూ. 1.43 లక్షల వద్ద ఉన్నాయి. -
కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్
బ్యాంకులో అందులోనూ ప్రభుత్వరంగ బ్యాంకులో ఉంటే మన సొమ్ము, భద్రం అనుకుంటాం. తాజాగా ఆన్లైన్ జూదం (Gambling)కోసం కస్టమర్ల కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని తస్కరించిన వైనం ఆందోళన రేపింది. బెంగళూరులో జరిగిన ఈ మోసానికి సంబంధించిన వివరాలుఇలా ఉన్నాయి.బెంగళూరులోని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ (34), కస్టమర్ల లాకర్ల నుండి సుమారు 2.7 కిలోల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. ఈ బంగారాన్ని తాకట్టు పెట్టి ఆన్లైన్ జూదానికి వినియోగించాడు. జనవరి 2న కొంతమంది కస్టమర్లు తమ లాకర్లను తనిఖీ చేసినప్పుడు తమ ఆభరణాలు కొన్ని మాయమైనట్లు గుర్తించారు. దీంతో వారు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.వినియోగదారుల ఫిర్యాదు మేరకు బ్యాంకు అధికారులు నిర్వహించిన అంతర్గత తనిఖీలో మొత్తం 24 ప్యాకెట్లలో బంగారం మాయమైనట్టు తేలింది. బ్రాంచ్ మేనేజర్ లేని సమయంలో తన వద్ద ఉన్న తాళాలతో లాకర్లను తెరిచి ఈ మోసానికి పాల్పడ్డాడు. 2025 జూన్ - 2026 జనవరి మధ్య కాలంలో నిందితుడు కిరణ్ తక్కువ మొత్తంలో బంగారాన్ని దొంగిలిస్తూ వచ్చాడు. అలా క్రమంగా మొత్తం 2,793 గ్రాముల బంగారం (దాదాపు రూ. 4 కోట్లు) మాయం చేశాడు. ఇలా కొట్టేసిన బంగారాన్ని ప్రైవేట్ రుణదాతలకు తనఖా పెట్టి, ఆడబ్బును బెట్టింగ్‌లో వాడేవాడు. ఇందులో 3 ప్యాకెట్లు పూర్తిగా ఖాళీ అవ్వగా, 21 ప్యాకెట్లలో కొంత మేర బంగారం పోయింది.దొంగిలించిన బంగారాన్ని కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. మిగిలిన బంగారాన్నిరికవరీ చేసేందుకు పోలీసులుప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు 1.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) లోకేష్ జగలసర్ అన్నారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అరుదైన పక్షి, ముట్టుకుంటే మటాషే!నోట్: బంగారాన్ని తాకట్టు పెట్టే కస్టమర్లు బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని డిసిపి కోరారు. తమ లాకర్ పత్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలనీ బ్యాంకు లావాదేవీల్లో పారదర్శకత ఉండేలా చూసుకోవడం చాలా అవసరమని, ఇదే మోసాలనుంచి కస్టమర్లను రక్షిస్తుందని డిసిపి లోకేష్ జగలాసర్ సూచించారు. -
ఆర్థిక భవిష్యత్తు: బంగారం కొనాలా.. వద్దా?
కొన్ని రోజులకు ముందు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. రేట్లు పెరుగుతున్నప్పుడు.. ఏ ధరకైనా కొనేయాలని ఎగబడిన కొంతమంది జనం.. ఇప్పుడు తగ్గుతున్నాయి కదా అని వేచి చూస్తున్నారు. ఇంకా తగ్గే అవకాశం ఉందేమో అని ఆలోచిస్తున్నారని ప్రముఖ ఇన్వెస్టర్, మార్కెట్ మాస్ట్రోలో డైరెక్టర్ 'అంకిత్ యాదవ్' తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.ధరలు పెరిగినప్పుడు ఉత్సాహం చూపించారని, రేటు తగ్గుతున్నప్పుడు ప్రజలు మౌనం పాటిస్తున్నారని అన్నారు. ఇది మార్కెట్లో సహజమైన అంశం. అయితే ఇది పూర్తి స్థాయి క్రాష్ అని నిర్దారించలేము. ఇదొక స్లోడౌన్ దశ మాత్రమే.వెండి ధర భవిష్యత్తులో 100 డాలర్లు లేదా 120 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. దీనికి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలహీనత, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రధాన కారణమవుతాయి.ప్రపంచం మొత్తం.. ప్రస్తుతం భారీ రుణభారంతో ఉంది. ముఖ్యంగా అమెరికా అప్పులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫెడరల్ రిజర్వ్‌కు (Fed) అందుబాటులో ఉన్న ఎంపికలు చాలా తక్కువ. ఇలాంటి సమయంలో వారు ఎక్కువ లిక్విడిటీ అందించడం, అంటే మరింత డబ్బు ముద్రించడానికి సిద్దపడే అవకాశం ఉంది. ఇదే జరిగితే డాలర్ విలువ బలహీనపడే అవకాశం ఉంటుంది.డాలర్ విలువ ఎప్పుడైతే పడిపోతుందో.. బంగారం, వెండి ధరలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి ఇప్పటికే బంగారం లేదా వెండి కలిగి ఉన్నవాళ్లు దాన్ని నిల్వ చేసుకోండి. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే కొత్తగా గోల్డ్, సిల్వర్ కొనాలనుకుంటే.. తప్పకుండా ఓసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. ప్రస్తుతం ధరలు చౌకగా లేవు. ఎప్పుడైనా ఎక్కువ ధర వద్ద పెట్టుబడి పెట్టడం వల్ల మూలధన నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి త్వరగా ధనవంతులు కావాలని తొందరపడకూడదు. కొంత ఓపిగ్గా ఎదురు చూడండి అని.. అంకిత్ యాదవ్ వివరించారు.🚨 Big update: Gold & Silver 🩶💛✅Globally, gold and silver are slowly coming out of the high‑volatility phase. The craze to buy silver at any price is clearly cooling off – one small slowdown or mini‑crash and people’s attention has already shifted.While prices were rising…— Ankit Yadav (@ankit_investing) February 14, 2026 -
అమెరికా-ఇరాన్ యుద్ధం?.. స్టాక్ మార్కెట్లలో టెన్షన్!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం సంభవించే అవకాశంపై అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. గత సంవత్సరం ‘మిడ్ నైట్ హామర్ ఆపరేషన్’తో పోలిస్తే, ఈసారి అమెరికా మరింత వ్యూహాత్మక సైనిక చర్యలకు సిద్ధమవుతోంది. ఈ ప్రాంతంలో యూ.ఎస్. విమాన వాహక నౌక బృందాన్ని మోహరించినప్పటి నుంచి, స్థానిక యూఎస్ శిబిరాల్లో కూడా సన్నాహాలు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి.అమెరికా దళాలు వారాలపాటు సైనిక కార్యకలాపాలకు సన్నద్ధమవుతున్నాయని సైనిక వర్గాలు అంతర్జాతీయ మీడియాకు అనామకంగా తెలియజేశాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊ అనడమే ఆలస్యం.. రంగంలోకి దిగి ఇరాన్‌పై దాడులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.శాంతి చర్చలు ఫలించేనా?ఇక ఇరాన్-అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చలు జెనీవాలో జరగనుండగా, ఈ నెల 17న ఈ చర్చలు ఒమన్ మధ్యవర్తిత్వంతో జరుగుతాయని భావిస్తున్నారు. ఇరాన్ తన అణు పరీక్షలను ఆపకపోతే “సైనిక చర్యలు తప్పవు” అని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అయితే, ఇరాన్ తన అణు, క్షిపణి కార్యక్రమాలను ఆపే ఎటువంటి ప్రణాళికలు లేవని ప్రకటించింది. అంతే కాకుండా, మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై దాడి జరిగితే, ప్రతీకారం తప్పనిసరిగా జరిగుతుందని హెచ్చరిస్తోంది. ఇలా పరిస్థితులు తీవ్రమైతే, ఈ ప్రాంతంలో యుద్ధం విస్తరించే అవకాశం ఉంది. దీంతో ప్రపంచం అంతటా ముడి చమురు, బంగారం, స్టాక్ మార్కెట్లు ప్రభావితమవుతాయి.చమురు ధరలు పెరిగే అవకాశంఇదిలా ఉండగా, ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేయాలని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయించాయి. ఇరాన్-చైనా చమురు అమ్మకాలపై అమెరికా దృష్టి సారించింది. ప్రస్తుతం ఇరాన్ చమురు అమ్మకాలలో 80 శాతం చైనాకు జరుగుతున్నాయి. దీన్ని నివారించగలిగితే ఇరాన్ ఆర్థికంగా మరింత నాశనం అవుతుందని ఇరు దేశాలు అభిప్రాయపడుతున్నాయి. చైనాపై మరిన్ని సుంకాలు విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అదే జరిగితే, అరుదైన లోహాల ఎగుమతిపై చైనా మళ్లీ ఆంక్షలు విధిస్తుంది. ఇది యూఎస్-చైనా సంబంధాలను మరింత దిగజార్చుతుంది. ప్రధాన చమురు ఉత్పత్తిదారు అయిన ఇరాన్ నుంచి ముడి చమురు ఆగిపోతే మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.బంగారం, వెండి ధరలపై ప్రభావంగత వారం హెచ్చుతగ్గులకు గురైన బంగారం, వెండి ధరలకు రాబోయే రోజుల్లో ఇరాన్-అమెరికా శాంతి చర్చలు కీలకం. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కావడంతో బంగారానికి కొత్త డిమాండ్ ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ కు 5,041 డాలర్ల వద్ద ముగిసింది. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల భయాల మధ్య ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. -
‘బంగారం బాట’లో యువ భారతం
న్యూఢిల్లీ: బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా... యువ భారతం బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశవ్యాప్తంగా 18–39 ఏళ్ల మధ్య వయసు కలిగిన 5,000 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో ‘స్మిట్టెన్ పల్స్ఏఐ’ ఒక నివేదిక విడుదల చేసింది. సర్వేలో పాల్గొన్నవారిలో 62 శాతం మంది పెట్టుబడుల్లో తొలి ప్రాధాన్యతం బంగారానికి ఇచ్చారు. గతంలో బంగారం కొనాలంటే ఇంటి పెద్దల సలహా తీసుకునేవారు. కానీ ఇప్పుడు 66.7% మంది యువత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయిదు గ్రాముల లోపే పసిడి కొన్నామని 62% మంది వెల్లడించారు. 2 గ్రాముల లోపు కొనుగోలు చేసిన వాళ్లు 27.5% మంది కాగా.. 2–5 గ్రాముల మధ్య కొనుగోలు చేసిన వాళ్లు 34.4% మంది ఉన్నారు. → తమ మొదటి జీతం/సంపాదనతో తొలిసారి 24% మంది పసిడిని కొనుగోలు చేశారు. కేవలం పెట్టుబడిగా పసిడిని కొనుగోలు చేసినట్లు 23.9% మంది వెల్లడించారు. ఆర్థిక అనిశ్చితి సందర్భాల్లో, బ్యాంకు సేవింగ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలతో పోలిస్తే 65.7% మంది బంగారమే అత్యంత సురక్షితమైన సాధనంగా భావిస్తున్నామని తెలిపారు. సుమారు 65.7% మంది స్టాక్స్, మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్) కంటే పసిడినే అత్యంత సురక్షిత పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారని సర్వేలో తేలింది. → ఒకవేళ రూ.25,000 నగదు రూపంలో ఉంటే.., పసిడి కొంటామని 61.9% మంది పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్లకు 16.6%, డిపాజిట్లు 13%, షేర్లు 6.6%, క్రిప్టో 1.9% మంది ఆసక్తి చూపారు. రత్నాలు, ఆభరణ ఎగుమతులు డీలా గత నెల(జనవరి)లో రత్నాలు, బంగారు ఆభరణ ఎగుమతులు డీలా పడ్డాయి. 2025 జనవరితో పోలిస్తే 6% క్షీణించి 2,239 మిలి యన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2025 జనవరిలో ఇవి 2,376 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. రత్నాలు, ఆభరణ ఎగుమతుల ప్రో త్సాహక సమితి(జీజేఈపీసీ) వివరాలివి. ప్రపంచ వాణిజ్య సవాళ్లు, కీలక మార్కెట్లలో టారిఫ్ ఒత్తిళ్లు ప్రభావం చూపాయి. ఈ బాటలో ప్రస్తు త ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి 10 నెల ల(ఏప్రిల్ 2025–జనవరి 2026)నూ ఇవి నామమాత్ర వెనకడుగు వేశాయి. 0.6% తగ్గి 23,186 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతే డాది(2024–25) ఇదే కాలంలో ఇవి 23,335 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రధా నంగా దేశీ ఆభరణ ఎగుమతులకు ప్రధాన మార్కెట్‌గా నిలిచే యూఎస్‌కు షిప్‌మెంట్స్ 45% నీరసించడం ప్రభావం చూపింది. -
బంగారం ధరల తారుమారు.. వారం రోజుల్లో ఇలా..
బంగారం ధరలు వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ నేడు (శనివారం) స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో.. గోల్డ్ రేటు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది?, సిల్వర్ రేటు ఎలా ఉంది అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో.. ఫిబ్రవరి 8న రూ. 1,56,600 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేటికి 1,57,750 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ. 1150 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,43,550 రూపాయల దగ్గర నుంచి రూ. 1,44,600 వద్దకు (1050 రూపాయలు పెరిగింది) చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం రేటు వారం రోజుల్లో 1,56,750 రూపాయల దగ్గర నుంచి రూ. 1,57,900 వద్దకు (1150 రూపాయలు పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,43,700 నుంచి 1,44,750 రూపాయలకు (1050 రూపాయలు పెరిగింది) చేరింది.చెన్నైలో ధరల విషయానికి వస్తే.. ఇక్కడ ఫిబ్రవరి 8న 1,57,310 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. ఈ రోజుకి (శనివారం) 1,58,840 రూపాయల (రూ. 1530 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. 10 గ్రాముల రేటు 1,44,200 రూపాయల దగ్గర నుంచి రూ. 1,45,600 (1400 రూపాయలు పెరిగింది) వద్దకు చేరింది.సిల్వర్ ధరలుగత ఆదివారం (ఫిబ్రవరి 8) కేజీ సిల్వర్ రేటు రూ. 2.85 లక్షల దగ్గర ఉండేది. ఆ ధర ఇప్పుడు రూ. 2.80 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో కేజీ మీద రూ. 5000 తగ్గిందన్నమాట. సిల్వర్ ధరలు ఒక్కో నగరం ఒక్కో విధంగా ఉంటుంది. అయితే ఢిల్లీలో.. రేటు కొంత తక్కువగా ఉంటుంది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..? -
తొలి ఎంపిక బంగారమే.. సర్వేలో కీలక విషయాలు!
మారుతున్న కాలానికి అనుగుణంగా పెట్టుబడి మార్గాలు ఎన్ని వచ్చినా.. యువత మాత్రం ఇప్పటికీ బంగారం పైనే గట్టి నమ్మకం పెట్టుకుంటున్నారు. దేశంలోని జనరేషన్ జెడ్ (జెన్ జీ), మిలీనియల్స్ పెట్టుబడుల ధోరణిపై స్మిట్టన్ పల్స్ ఏఐ నిర్వహించిన తాజా సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 5,000 మంది యువత (18-39 ఏళ్లు) అభిప్రాయాలను సేకరించిన ఈ నివేదిక ప్రకారం.. సురక్షితమైన పెట్టుబడిగా 62 శాతం మంది బంగారం వైపే మొగ్గు చూపుతున్నారు.ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో సేవింగ్స్ అకౌంట్లు, ఈక్విటీల కంటే బంగారమే తమకు ధీమా ఇస్తుందని 65.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఒకవేళా రూ.25,000 పెట్టుబడి పెట్టాల్సి వస్తే.. పెట్టుబడి మొత్తాన్ని కింది విధంగా విభజించనున్నట్లు సర్వేలో వెల్లడైంది.➤బంగారం: 61.9 శాతం➤మ్యూచువల్ ఫండ్లు: 16.6 శాతం➤ఫిక్స్డ్ డిపాజిట్లు: 13 శాతం➤స్టాక్ మార్కెట్: 6.6 శాతం➤క్రిప్టో కరెన్సీ: 1.9 శాతంగతంలో బంగారం కొనుగోలు అంటే.. కుటుంబం అంతా కలిసి తీసుకునే పెద్ద నిర్ణయంగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. 66.7 శాతం కొనుగోళ్లు పూర్తిగా వ్యక్తిగత నిర్ణయాల ఆధారంగానే జరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల ప్రమేయం తగ్గుతోంది. 61.9 శాతం మంది తాము చేసిన ఇటీవలి కొనుగోలు 5 గ్రాముల లోపే ఉందని తెలిపారు. అందులో 27.5 శాతం మంది 2 గ్రాముల కంటే తక్కువ పరిమాణంలోనే కొనుగోలు చేశారు. జెడ్ జీ యువత తమ మొదటి జీతం (24.3 శాతం) అందగానే గోల్డ్ కొనుగోలు చేయాలని భావిస్తారు.డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఫిజికల్ గోల్డ్ కొనుగోలుకు కూడా యువత ప్రాధాన్యత ఇస్తోంది. పెద్ద గోల్డ్ బ్రాండెడ్ షోరూమ్‌లలో 38.3%, స్థానిక జ్యువెలరీ దుకాణాలలో 34.7 శాతం, ఆన్లైన్/యాప్స్ ద్వారా బంగారం కొనుగోలు చేసేందుకు 5.2 శాతం యువత ఆసక్తిగా చూపుతున్నారు.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?బంగారం కొంటున్నారు. కానీ కొనేటప్పుడు ప్రధానంగా ప్యూరిటీ విషయంలో 49.4 శాతం మంది ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మేకింగ్ ఛార్జీలు (21 శాతం), రీసేల్ వాల్యూ (17 శాతం)పై మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా బంగారం కొన్న తర్వాత 67.1 శాతం మంది ఏదో ఒక సమయంలో బాధపడినట్లు సర్వేలో వెల్లడయ్యాయి.కొనుగోలులో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ బంగారంపై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రాబోయే 12 నుంచి 24 నెలల్లో కచ్చితంగా బంగారం కొంటామని 52.7 శాతం మంది యువత ధీమా వ్యక్తం చేశారు. ఎక్కువ పెట్టుబడిగా కాకుండా.. క్రమ పద్ధతిలో, చిన్న మొత్తాల్లో బంగారం కొనుగోలు చేయడమే ట్రెండ్ అని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. -
పతనమైన పసిడి విలువ.. కారణాలు..
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధరలు తాజాగా భారీగా పతనమయ్యాయి. భారతీయ మార్కెట్లో బంగారం ధరలు ఇటీవల గరిష్ట స్థాయుల్లో ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా నిన్నటి మార్కెట్ సెషన్లో ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ సుమారు 6% నుంచి 9% వరకు పడిపోయి లోయర్ సర్క్యూట్‌ను తాకడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. దీనికి గల ప్రధాన కారణాలు కింద చూద్దాం.ట్రంప్ విధానాలు.. డాలర్ బలోపేతంఅమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు, సుంకాల విధింపు హెచ్చరికలు అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువను పెంచాయి. డాలర్ ఇండెక్స్ పెరగడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లకు బంగారం కొనుగోలు భారంగా మారుతుంది. ఇది సహజంగానే ధరలపై ఒత్తిడిని పెంచుతుంది.అంతర్జాతీయ అనిశ్చితి.. భౌగోళిక ఉద్రిక్తతలుఅమెరికాకు.. ఇరాన్, వెనిజువెలా వంటి దేశాలకు ఉన్న ఉద్రిక్తతలు కొంతమేర సద్దుమణగడం, దౌత్యపరమైన చర్చలు మొదలవ్వడం వల్ల సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంపై డిమాండ్ తాత్కాలికంగా తగ్గింది. ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడి ఈక్విటీ మార్కెట్ల వైపు మళ్లడం కూడా ఈ పతనానికి ఒక కారణం.మార్జిన్ పరిమితుల పెంపుఎంసీఎక్స్, అంతర్జాతీయంగా కామెక్స్ వంటి ఎక్స్ఛేంజీలు బంగారం ట్రేడింగ్‌పై మార్జిన్ రిక్వైర్మెంట్లను పెంచాయి. దీనివల్ల ట్రేడర్లు ఎక్కువ నగదును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే.. వారు తమ పొజిషన్లను ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మార్కెట్లో లిక్విడేషన్ పెరిగి ధరలు దిగివచ్చాయి.రూపాయి ప్రభావంభారత రూపాయి విలువలో మార్పులు దేశీయంగా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతి చేసుకునే బంగారం ఖరీదవుతుంది. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న భారీ కరెక్షన్ వల్ల దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయి.ఇన్వెస్టర్లు ఏం చేయాలి?ప్రస్తుత పతనం అనేది కేవలం టెక్నికల్ కరెక్షన్ మాత్రమేనని గుర్తుంచుకోవాలని ఎంసీఎక్స్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో బంగారం పట్ల సానుకూల ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం తెలివైన వ్యూహం కావొచ్చని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: రెరా బిల్డర్లకే కొమ్ముకాస్తోంది: సుప్రీంకోర్టు -
మూడు పతకాలూ మనవే
న్యూఢిల్లీ: స్వదేశంలో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్లో గురువారం సీనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. వ్యక్తిగతవిభాగంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలతోపాటు టీమ్ ఈవెంట్లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ 362 పాయింట్లతో ప్రపంచ రికార్డు స్కోరును సాధించాడు. స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. భారత్‌కే చెందిన నీరజ్ కుమార్ 361.8 పాయింట్లతో రజతం కైవసం చేసుకోగా... అఖిల్ షెరాన్ 343.5 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఐశ్వర్య ప్రతాప్, నీరజ్, అఖిల్‌లతో కూడిన భారత బృందం 1769 పాయింట్లతో టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత షూటర్లు అడ్రియన్ కర్మాకర్ 353.2 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని... మానవేంద్ర సింగ్ షెఖావత్ 338.6 పాయింట్లతో కాంస్య పతకాన్ని నెగ్గారు. అడ్రియన్ కర్మాకర్, మానవేంద్ర సింగ్, ప్రిన్స్‌లతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో 1741 పాయింట్లతో బంగారు పతకాన్ని సాధించింది. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు భారత షూటర్లు 38 స్వర్ణాలు, 16 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి 70 పతకాలు సాధించారు. -
బంగారం కంటే ఖరీదైన చెట్టు... కిలో ..రూ. కోటి
-
ఫేక్లొద్దు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక!
ప్రఖ్యాత ఆర్థిక రచయిత, వ్యాపారవేత్త రాబర్ట్ కియోసాకి తన పేరుతో సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఏఐ ఆధారిత నకిలీ (డీప్‌ఫేక్) వీడియోల గురించి హెచ్చరించారు. ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత అయిన కియోసాకి, తాను గతంలో “రియల్ ఎస్టేట్ గైస్ సెమినార్ అట్ సీ” టీ-షర్ట్ ధరించిన విషయం నిజమేనని తెలిపారు. అయితే యూట్యూబ్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న, అదే టీ-షర్ట్ ధరించి ఉన్నట్లు చూపిస్తున్న కొన్ని వీడియోలు ఏఐ ద్వారా సృష్టించిన నకిలీవని స్పష్టం చేశారు. ఆ వీడియోల్లో ఉన్న సందేశాలు కూడా అసత్యమని ఆయన పేర్కొన్నారు.“టీ-షర్ట్ నిజమే, సెమినార్ కూడా నిజమే. కానీ వీడియోలు, సందేశాలు ఏఐతో సృష్టించిన నకిలీలు” అని కియోసాకి (Robert Kiyosaki) సోషల్ మీడియాలో వెల్లడించారు. డీప్‌ఫేక్ సాంకేతికత కృత్రిమ మేధస్సు (AI)ను ఉపయోగించి నిజమైన వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా కనిపించే నకిలీ వీడియోలను రూపొందిస్తుంది. ఇటీవలి కాలంలో ఈ సాంకేతికతను ఉపయోగించి ప్రముఖుల పేరుతో మోసపూరిత పెట్టుబడి ప్రకటనలు రూపొందించే ఘటనలు పెరుగుతున్నాయి. ఈ తరహా నకిలీ వీడియోలు రూపొందిస్తున్న వారిపై కియోసాకి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పనులకంటే సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు.అదేవిధంగా, ఈ సందర్భాన్ని ఉపయోగించి ఆయన తన ఆర్థిక దృక్పథాన్ని మరోసారి ప్రస్తావించారు. ప్రభుత్వ ఫియాట్ కరెన్సీని “నకిలీ డబ్బు”గా పేర్కొంటూ, బంగారం, వెండి, రియల్ ఎస్టేట్, బిట్‌కాయిన్, ఈథిరియం వంటి “నిజమైన ఆస్తుల్లో” పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, నిజమైన సమాచారాన్ని నకిలీ కంటెంట్ నుండి వేరు చేయడం సాధారణ ప్రజలకు కష్టతరమవుతోంది. అందువల్ల పెట్టుబడులకు సంబంధించిన వీడియోలు లేదా ప్రకటనలను అధికారిక వనరుల ద్వారా ధ్రువీకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.FYI: if you see YouTube videos with me wearing a Real Estate Guys Seminar at Sea T-shirt on….the T - shirt is real and so is the seminar.The problem is the videos are AI Fakes. So are the messages.Why someone waste their time doing fake AI videos is beyond me.To those…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 11, 2026 -
Video: బంగారం కంటే ఖరీదైన చెట్టు.. కిలో.. రూ. కోటి
-
‘బంగారు ప్రయాణం’లో రహస్యాలు!
బంగారం షాపులో నగదు చెల్లించి నచ్చిన నగను కొనుక్కుంటాం. అద్దాల షోరూమ్‌లో విద్యుత్ కాంతుల మధ్య తళతళలాడే ఆ బంగారు ఆభరణాలను చూసి మురిసిపోతాం. కానీ, ఆ మెరుపు వెనుక.. వందల మంది కార్మికుల చెమట చుక్కలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? ఆ హొయల వెనుక.. వేల అడుగుల లోతులో పేలే బాంబుల మోత, ఊపిరాడని గనుల్లో ఉక్కపోత ఉందని చాలా మందికి తెలియదు కదా.. ఒక చిన్న ఉంగరం మన వేలికి చేరడానికి ముందు అది ఒక కఠినమైన శిల. ఆ శిల నుంచి స్వచ్ఛమైన పసిడిని ఒడిసి పట్టుకోవడానికి ప్రకృతితో చేసే యుద్ధమే ఈ ‘బంగారు ప్రయాణం’. బంగారాన్ని గనుల్లో నుంచి ఎలా వెలికితీస్తారో.. ఆభరణాల రూపంలోకి ఎలా మారుస్తారో తెలుసుకుందాం.అన్వేషణ, మైనింగ్బంగారం ఎక్కడ ఉందో గుర్తించడం మొదటి దశ. దీన్ని ప్రోస్పెక్టింగ్ అంటారు. భూగర్భంలో బంగారం నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించిన తర్వాత మైనింగ్ ప్రారంభమవుతుంది. బంగారం భూమిపై పొరల్లోనే ఉన్నప్పుడు పెద్ద గుంతలు తవ్వి వెలికితీస్తారు. దీన్ని ఓపెన్ పిట్ మైనింగ్ అంటారు. బంగారం చాలా లోతులో ఉన్నప్పుడు సొరంగాలు తవ్వి, పేలుళ్ల సాయంతో ముడి ఖనిజాన్ని బయటకు తీస్తారు. దీన్ని అండర్‌గ్రౌండ్ మైనింగ్ అంటారు.ముడి ఖనిజాన్ని పొడి చేయడంగనుల నుంచి సేకరించిన పెద్ద రాళ్లను క్రషర్స్ యంత్రాల్లో వేసి చిన్న ముక్కలుగా మారుస్తారు. ఆ తర్వాత వాటిని చిన్న స్పటికాల పరిమాణంలోకి, ఆపై మెత్తటి పౌడర్‌లాగా పిండి చేస్తారు. ఈ పొడిలోనే అతి సూక్ష్మమైన బంగారు రేణువులు దాగి ఉంటాయి.బంగారం వేరు చేయడంపొడి చేసిన మట్టి నుంచి బంగారాన్ని వేరు చేయడానికి ప్రధానంగా కొన్ని పద్ధతులను ఉపయోగిస్తారు.సైనైడ్ లీచింగ్: ఈ పౌడర్‌కు సోడియం సైనైడ్ ద్రావణాన్ని కలుపుతారు. ఇది బంగారాన్ని ద్రవ రూపంలోకి మారుస్తుంది. ఆ తర్వాత జింక్ పౌడర్ లేదా యాక్టివేటెడ్ కార్బన్ ఉపయోగించి బంగారాన్ని తిరిగి ఘన రూపంలోకి మారుస్తారు.గ్రావిటీ సెపరేషన్: బంగారం బరువు ఎక్కువగా ఉండటం వల్ల నీటి ప్రవాహం ద్వారా తేలికపాటి మట్టిని కొట్టుకుపోయేలా చేసి బంగారు రేణువులను కిందకు చేరేలా చేస్తారు.స్మెల్టింగ్పైన తెలిపిన ప్రక్రియలో వచ్చిన బంగారాన్ని (దీన్ని డోర్ అని పిలుస్తారు) దాదాపు 1064 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కరిగిస్తారు. ఈ దశలో బంగారం నుంచి ఇతర లోహాలు వేరవుతాయి. ఇక్కడ వచ్చే పసిడి 100% స్వచ్ఛంగా ఉండదు. ఇందులో వెండి లేదా రాగి కలిసి ఉంటాయి. వీటిని బార్స్ రూపంలోకి మారుస్తారు.శుద్ధీకరణ(రిఫైనింగ్)చివరి దశలో బంగారాన్ని పూర్తిస్థాయిలో శుద్ధి చేయడానికి మిల్లర్ ప్రక్రియ లేదా వోల్విల్ ప్రక్రియ వాడతారు. ఈ ప్రక్రియల్లో క్లోరిన్ గ్యాస్‌ను ఉపయోగించి ఇతర మలినాలను తొలగిస్తారు. దీని ద్వారా 99.9% (24 క్యారెట్) స్వచ్ఛమైన బంగారం లభిస్తుంది.ఆభరణాల తయారీచివరిగా ఈ స్వచ్ఛమైన బంగారానికి కొంత మోతాదులో రాగి లేదా వెండిని కలిపి (సాధారణంగా 22 క్యారెట్లు) నచ్చిన ఆభరణాలుగా మలుస్తారు.ఒక గ్రాము బంగారాన్ని పొందడానికి దాదాపు ఒక టన్ను ముడి ఖనిజాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అందుకే బంగారం అంత విలువైనది!ఇదీ చదవండి: భవిష్యత్తులో పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే.. -
బంగారం కంటే ఖరీదైన చెట్టు.. కిలో రూ. కోటి
బంగారం ఖరీదైనదే కానీ ఈ చెట్టు మాత్రం బంగారాన్ని మించిపోయింది. కిలోకు కోటి రూపాయలు పలికే ఒకే ఒక్క మొక్క గురించి ఎప్పుడైనా విన్నారా? అది అగర్వుడ్. ఆగ్నేయాసియాలో పెరిగే అక్విలేరియా జాతి చెట్లలో అరుదుగా ఏర్పడే ఈ కలప.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సహజ వనరుల్లో ఒకటి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రతి చెట్టులా ఇది ఉండదు. సాధారణంగా ఈ చెట్లు వాసనలేని తెల్ల కలపతో ఉంటాయి. కానీ ఒక ప్రత్యేకమైన ఫంగస్ సోకినప్పుడు లేదా చెట్టు గాయపడినప్పుడు, అది తనను తాను రక్షించుకోవడానికి ముదురు, జిగట రసాన్ని విడుదల చేస్తుంది. ఆ రసమే కాలక్రమంలో సువాసనగల నల్ల అగర్వుడ్గా మారుతుంది.అన్ని అక్విలేరియా చెట్లు అగర్వుడ్ని ఉత్పత్తి చేయవు. సహజంగా కేవలం 2 నుంచి 7 శాతం చెట్లలో మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది. అది కూడా ఒక్క రోజులో కాదు.. 10 నుంచి 30 సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సిందే. ఈ అరుదైన, సుదీర్ఘమైన ప్రక్రియ కారణంగానే అగర్వుడ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలపగా గుర్తింపు పొందింది. ఇందులో కూడా అత్యంత నాణ్యమైన రకాన్ని 'క్యారా' అంటారు. దీని ధర గ్రాముకు రూ.8.5 లక్షల వరకు చేరుతుంది. షాంఘైలో జరిగిన ఒక వేలంలో 2 కిలోల క్యారా కలప ఏకంగా రూ.154 కోట్లకు అమ్ముడైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అంటే ఒక్క చిన్న ముక్కే కోట్ల విలువ కలిగి ఉంటుందంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే..అగర్వుడ్ని ప్రపంచంలో చాలా ఖరీదైన పెర్ఫ్యూమ్లు తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా దుబాయ్, పారిస్ లాంటి నగరాల్లో లగ్జరీ సెంట్స్ కోసం దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. హిందూ, బౌద్ధ, ఇస్లామిక్ మతపరమైన ఆచారాల్లో అగర్వుడ్ ధూపానికి ప్రత్యేక స్థానం ఉంది. దాని సువాసన మనసుకు ప్రశాంతత ఇస్తుందని నమ్ముతారు. ఆయుర్వేదం, చైనీస్ వైద్యంలో ఒత్తిడి, నిద్రలేమి తదితర సమస్యలకు దీనిని ఉపయోగిస్తారు.భారతదేశంలోని అస్సాం రాష్ట్రం మంచి అగర్వుడ్కి ప్రసిద్ధి. కానీ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో అక్విలేరియా చెట్లు తగ్గిపోతున్నాయి. అందుకే అగర్వుడ్ అమ్మకంపై కఠిన నియమాలు పెట్టారు. లైసెన్స్ ఉన్నవాళ్లు మాత్రమే దీనిని అమ్మగలరు. ఇప్పుడు సహజ అగర్వుడ్ చాలా ఖరీదైన, విలాసవంతమైన వస్తువుగా మారింది. బంగారం నేలలో దొరుకుతుంది. కానీ అగర్వుడ్ తయారవ్వడానికి ప్రకృతి ఎన్నో సంవత్సరాలు తీసుకుంటుంది. -
బంగారమే బిగ్ బాస్
న్యూఢిల్లీ: గోల్డ్, వెండి ఈటీఎఫ్‌లోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. జనవరిలో రూ.24,040 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రాగా, వెండి ఈటీఎఫ్‌లు రూ.9,463కోట్లను ఆకర్షించాయి. గత డిసెంబర్లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన రూ.11,647 కోట్లతో పోల్చితే రెట్టింపునకు పైగా పెరిగాయి. అంతేకాదు ఒక నెలలో ఈక్విటీ ఫండ్స్‌కు మించి బంగారం ఈటీఎఫ్‌లు పెట్టుబడులను ఆకర్షించడం కూడా చరిత్రలో ఇదే మొదటిసారి. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి సన్నగిల్లుతూ.. బంగారం, వెండిపైకి మనసు మళ్లుతోంది. జనవరిలో ఈక్విటీ ఫండ్స్ నికరంగా రూ.24,028 కోట్లను ఆకర్షించాయి. డిసెంబర్లో వచ్చిన పెట్టుబడులు రూ.28,054 కోట్లతో పోల్చి చూస్తే 14 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక తగ్గడం వరుసగా ఇది రెండో నెల. గతేడాది నవంబర్‌లో ఈక్విటీ ఫండ్స్ రూ.29,911 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. దీంతో పోల్చితే డిసెంబర్లో 6 శాతం తగ్గాయి. ఇక గతేడాది అక్టోబర్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.24,690 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద ఈక్విటీ పెట్టుడుల రాక మూడు నెలల కనిష్టానికి చేరింది. కమోడిటీల వైపు అడుగులు.. గత కొన్ని నెలలుగా ఈక్విటీ మార్కెట్లు ఎలాంటి రాబడులు ఇవ్వకపోగా.. బంగారం, వెండి మంచి ర్యాలీ చేస్తున్నాయని.. దీంతో కొంత మేర పెట్టుబడులు కమోడిటీల్లోకి మళ్లినట్టు వీఎస్ఆర్కే క్యాపిటల్ డైరెక్టర్ స్వప్నిల్ అగర్వాల్ తెలిపారు. ఇక నుంచి ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడుల రాక క్రమంగా మెరుగుపడొచ్చని అభిప్రాయపడ్డారు. స్టాక్స్ విలువలు ఆకర్షణీయంగా ఉండడం, స్థిరీకరణ ముగియడంతో ఈ ఏడాది ఈక్విటీలు బలమైన పనితీరు చూపించొచ్చని, దీంతో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు పుంజుకోవచ్చని అంచనా వేశారు. ⇒ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్/ పన్ను ఆదా ఫండ్స్) పథకాల నుంచి రూ.594 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ⇒ మరోవైపు డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి నికరంగా రూ.74,827 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్లో ఇదే విభాగం రూ.1.32 లక్షల కోట్లను కోల్పోవడం గమనార్హం. ⇒ హైబ్రిడ్ ఫండ్స్‌లోకి (ఈక్విటీ, డెట్ కలసిన) రూ.17,356 కోట్లు.. మల్టీ అసెట్ ఫండ్స్‌లోకి (ఈక్విటీ, డెట్, బంగారం, వెండి కలసిన) రూ.10,485 కోట్లు చొప్పున వచ్చాయి. ⇒ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని అన్ని రకాల పెట్టుబడుల విలువ (ఏయూఎం) జనవరి చివరికి రూ.81.01 లక్షల కోట్లకు పెరిగింది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ పథకాల్లోకి జనవరిలోనూ రికార్డు స్థాయిలో రూ.31,000 పెట్టుబడులు వచ్చాయి. గోల్డ్, వెండికి డిమాండ్.. గోల్డ్ ఈటీఎఫ్‌లోకి రూ.24,040 కోట్లు రావడంతో.. ఫండ్స్ నిర్వహణలోని మొత్తం గోల్డ్ ఈటీఎఫ్ ఆస్తుల విలువ రూ.1.84 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.61,000 కోట్లు రావడం గమనార్హం. మరోవైపు వెండి ఈటీఎఫ్‌ల్లోకి డిసెంబర్లో రూ.9,463 కోట్లు రావడంతో.. వెండి ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తుల విలువ రూ. 1.16 లక్షల కోట్లకు పెరిగింది. డిసెంబర్లో వచ్చిన 3,962 కోట్లతో పోల్చి చూస్తే ఒక్క నెలలోనే 139 శాతం పెరిగాయి. -
తడబడిన వెండి ఎగసిన పసిడి
న్యూఢిల్లీ: అమ్మకాల ఒత్తిడికి వెండి నష్టపోగా.. కొనుగోళ్ల మద్దతుతో పసిడి ధరలు పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో మంగళవారం వెండి కిలోకి రూ.7,500 నష్టపోయి రూ.2,64,500 లక్షలకు (పన్నులు కలుపుకుని) పరిమితమైంది. బంగారం 10 గ్రాములకు రూ.2,200 పెరిగి రూ.1,60,700 వద్ద (పన్నులు సహా) స్థిరపడింది. జ్యుయలర్లు, ఇన్వెస్టర్ల నుంచి స్థిరమైన కొనుగోళ్లు వరుసగా రెండో రోజు పసిడి ధరలు పెరగడానికి కారణమని ట్రేడర్లు తెలిపారు. బంగారం, వెండి ధరలు ఒక శ్రేణి పరిధిలో చలించొచ్చని.. ఈ మార్కెట్లు సమీప కాలానికి స్థిరీకరణ దశలోకి ప్రవేశించినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్‌కు ఒక డాలర్‌కు పైగా నష్టపోయి రూ.82.16 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయింది. బంగారం స్వల్ప నష్టంతో ఔన్స్ 5,052 డాలర్ల స్థాయిలో కదలాడింది. అమెరికాలో రిటైల్ విక్రయాలు, నిరుద్యోగ డేటా కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. -
మళ్లీ పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇలా..
భారతదేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. ఈ రోజు (మంగళవారం) ఉదయం స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు సాయంత్రానికి స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ.1,57,910 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,44,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద ఉన్న గోల్డ్ రేటు సాయంత్రానికి వరుసగా రూ. 1,58,780 (రూ. 870 పెరిగింది) & రూ. 1,45,550 (రూ. 800 పెరిగింది) వద్ద నిలిచాయి. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతుంది.చెన్నైలో అయితే గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,060 రూపాయల వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,800 రూపాయల వద్ద నిలిచింది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఉదయం స్థిరంగా ఉన్న బంగారం ధర సాయంత్రానికి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 158930 రూపాయల (రూ. 870 పెరిగింది) వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,700 రూపాయల (రూ. 800 పెరిగింది) వద్ద నిలిచింది.వెండి ధరలుఉదయం కేజీ వెండి రేటు రూ. 2.90 లక్షల వద్ద ఉండేది. అయితే సాయంత్రానికి ఆ రేటు రూ. 3లక్షలకు చేరింది. అంటే కేజీ ధర గంటల వ్యవధిలో రూ. 10వేలు పెరిగిందన్నమాట. -
బంగారం ధర.. ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే?
ఇటీవల కాలంలో బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపించాయి. చైనా ట్రేడర్ల పాత్ర దీనికి కారణమని, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. ఈ విషయాలను ఆయన ఫాక్స్ న్యూస్‌లో ప్రసారమైన సండే మార్నింగ్ ఫ్యూచర్స్ కార్యక్రమంలో వెల్లడించారు.చైనాలో బంగారం ట్రేడింగ్.. కొంచెం నియంత్రణ తప్పిన స్థాయికి చేరిందని బెస్సెంట్ అన్నారు. దీనివల్ల అక్కడి అధికారులు మార్జిన్ నిబంధనలను కఠినతరం చేయాల్సి వచ్చిందని, ఈ పరిణామాలు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి, ఆ తర్వాత అకస్మాత్తుగా పడిపోయేలా చేసిందని అన్నారు.బంగారం ధరలు పెరగడానికి కారణాలుబంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందులో పెట్టుబడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతపై ఉన్న ఆందోళనలు ప్రధానమైనవి. ఇదే సమయంలో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ అవరేజ్ సూచీ 50,000 మార్క్‌ను తొలిసారి దాటింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై, కార్పొరేట్ లాభాలపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచేసింది.భారతదేశంలో బంగారం ధరలుఇండియన్ మార్కెట్లో ఈ రోజు (సోమవారం) బంగారం ధరలు పెరిగాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,55,000 దాటేసింది. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 1,44,000 క్రాస్ చేసింది. వెండి ధరలు మళ్లీ రూ. 3 లక్షలకు (కేజీ) చేరింది. -
భార్య కోసం ప్రతి ఏడాది మూడు కిలోలు బంగారమా..!?
బంగారం ధరలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలిసిందే. రోజు రోజుకి ధరలు గుభ గుయ్యిమనేలా కొండపైకి ఎక్కి కూర్చొంటున్నాయి. సామాన్యులు కొనాలి అన్న ఆలోచనే మనసులోకి రానివ్వలేనంతగా భయపెడుతోంది దాని ధర. మరోవైపు వెండి ధర కూడా అలానే అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఇంతలా బంగారం ధర దద్దరిల్లిపోతుంటే..ఇక్కడొక వ్యక్తి భార్య కోసం ప్రతి ఏడాది ఏకంగా మూడు కిలోల బంగారం కొంటాడంట. మూడు కిలలు అంటే ఇప్పుడున్న గోల్డ్ ధరల ప్రకారం..ఎంత ఖర్చు అవుతుందో ఆలోచిస్తేనే..నోటమాటరాదు కదా..!. మరి అలాంటిది అంతలా ఎవడ్రాబాబు బంగారం కొంటుంది అంటే..భారత సంతతికి చెందిన బిలియనీర్ సతీష్ సన్పాల్ భార్య తబిందా సన్పాల్, నెట్‌ఫ్లిక్స్‌లో తన రాబోయే రియాలిటీ షో 'దేశీ బ్లింగ్' ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ షో దుబాయ్‌లోని ఉన్నత వర్గ భారతీయ ప్రవాసులపైనా, వారి విలాసవంతమైన జీవనశైలిని హైలెట్ చేస్తుంది. ఈ సిరీస్‌లో నటీనటులు కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్‌తో పాటు డాన్యూబ్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ రిజ్వాన్ సజన్, అనక్స్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు సతీష్ సన్పాల్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ఈ షో ధనవంతులు ఆడంబర జీవితాన్ని వారి విలాసవంతమైన వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఆ ట్రైలర్లో బారత సంతతికి చెందిన బిలియనీర్ సతీష్ సన్పాల్ భార్య తబిందా సన్పాల్ తన భర్తకు బంగారంపై ఉన్న ప్రేమను గురించి వెల్లడిస్తుంది. తన భర్త సతీష్‌కు బంగారం కొనడం అంటే చాలా ఇష్టమని, ప్రతి ఏడాది తన కోసం మూడు కొలోల బంగారం కొంటాడని పేర్కొంది. అంటే ప్రస్తుతం ధర బట్టి..కిలో బంగారం సుమారు రూ. 1.5 కోట్లు పలుకుతుంది. అంటే మూడు కిలోల బంగారం రూ. 4.5 కోట్లు పైమాటే పలుకుతుంది..!.ఎవరీ సతీష్ సన్పాల్.. ?సతీష్ సన్పాల్ భారతదేశంలో జన్మించిన అనక్స్ హోల్డింగ్ చైర్మన్. అతని కంపెనీ దుబాయ్ రియల్ ఎస్టేట్, ఆర్థిక మార్కెట్లు, హాస్పిటాలిటీ, మీడియా వంటి అనేక రంగాలలో భాగస్వామ్యం ఉంది. అతను బ్రిటిష్-పాకిస్తానీ మహిళ అయిన తబిందా సన్పాల్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇసాబెల్లా అనే ఒక ఏడాది కుమార్తె ఉంది. ఆయన గతేడాది ప్రారంభంలో తన కుమార్తెకు కస్టమ్ పింక్ రోల్స్ రాయిస్‌ను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచాడు. ఇక సన్పాల్ ఒక ఇంటర్వ్యూలో తాను భారతదేశంలోని జబల్పూర్లో జన్మించానని, కేవలం రూ. 80 వేలు జేబులో పెట్టుకుని దుబాయ్‌కి వచ్చినట్లు తెలిపాడు. ఇక తబిందా కూడా అదే ఇంటర్వ్యూలో తాను ముస్లీం కావడంతో మొదట్లో తన కుటుంబం సతీష్‌ని పెళ్లి చేసుకోవడాన్ని అంగీకరించలేదని, అయితే ఆయన సాధించిన విజయం చూసి అభిప్రాయం మార్చుకుందని అంటుంది. అందుకు సతీష్ వెంటనే డబ్బు దేవుడు కాదని, అలా అని దేవుడి కంటే తక్కువ కూడా కాదని నవ్వుతూ అన్నాడు. View this post on Instagram A post shared by Luxe Life | لوكس لايف (@luxelifedubai) (చదవండి: 'భారతీయ పేరెంటింగ్'పై మ్యాట్రిమోని యాప్ సీఈవో ఫైర్..! భావోద్వేగపరంగా..) -
బంగారానికి బదులుందా? బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఏది?
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పెట్టుబడుల విషయమై తన అభిప్రాయాలను మరోసారి స్పష్టం చేశారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్.. మూడింటినీ కలిపి పెట్టుబడులు పెట్టడం మంచిదేనని చెప్పిన ఆయన, ఒక్క ఆస్తినే ఎంచుకోవాల్సి వస్తే మాత్రం తాను బిట్‌కాయిన్‌కే ప్రాధాన్యం ఇస్తానన్నారు.ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో, బిట్‌కాయిన్‌కు ఉన్న పరిమిత సరఫరానే దాని అతిపెద్ద బలమని కియోసాకి వివరించారు. బంగారం ధర పెరిగినప్పుడు మరిన్ని గనులు తవ్వడం ద్వారా సరఫరా పెరిగే అవకాశం ఉందని, తాను స్వయంగా గోల్డ్ మైనర్ కావడంతో ఇది తనకు తెలుసని అన్నారు.“బంగారం ధర పెరిగితే మరిన్ని గనులు తవ్వుతారు. అంటే సరఫరా పెరుగుతుంది. కానీ బిట్‌కాయిన్ విషయంలో అలా కాదు. దాని డిజైన్ ప్రకారం గరిష్టంగా 21 మిలియన్ బిట్కాయిన్లే ఉంటాయి” అని కియోసాకి (Robert Kiyosaki) తెలిపారు. బిట్‌కాయిన్ ప్రోటోకాల్ ప్రకారం 21 మిలియన్లకు మించి ఒక్క బిట్‌కాయిన్ కూడా సృష్టించలేమని, ఆ స్థాయికి మెల్లగా చేరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విధమైన నిర్మాణాత్మక కొరత బిట్‌కాయిన్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుందని అన్నారు.ఇది చదివారా? కియోసాకీకి కోపమొచ్చింది!“21 మిలియన్ల తర్వాత కొత్త బిట్కాయిన్లు రావు. ఇది అద్భుతమైన డిజైన్. అందుకే దీర్ఘకాలంలో బిట్‌కాయిన్ ధర పెరుగుతుందని నేను నమ్ముతున్నాను” అని కియోసాకి వ్యాఖ్యానించారు. తాను బిట్‌కాయిన్‌ను ప్రారంభ దశలోనే కొనుగోలు చేశానని, అదే సమయంలో గోల్డ్ మైనింగ్, చమురు తవ్వకాలు వంటి సంప్రదాయ పెట్టుబడులను కూడా కొనసాగిస్తున్నానని తెలిపారు.ఫియాట్ కరెన్సీలపై తనకు నమ్మకం లేదని, ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితుల నుంచి రక్షణనిచ్చే “హార్డ్ అసెట్స్”కే తాను మద్దతు ఇస్తానని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. అయితే నిపుణులు మాత్రం, కేవలం కొరత మాత్రమే ధరలు పెరగడానికి హామీ ఇవ్వదని, డిమాండ్, నియంత్రణలు, మార్కెట్ ఊగిసలాటలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడుతున్నారు.అయినప్పటికీ, బిట్‌కాయిన్‌ను బంగారానికి ప్రత్యామ్నాయంగా చూసే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోందని కియోసాకి వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.I am often asked:Which is a better investment?Gold or Bitcoin.Obviously I would say both for diversification of assets and add silver.Yet if I had to choose only one asset I would choose Butcoin.Why?Because gold is in theory infinite. When the price of gold rises…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 9, 2026 -
రిస్క్ లేకుంటే రాబడి లేదు!
క్యాలెండర్ మారి నెల దాటిపోయింది. ఫిబ్రవరి కూడా గడిచిపోతోంది. ఈక్విటీలు స్థిరంగా లేవు. ఇండెక్స్‌లు ఆల్‌టైమ్ గరిష్ఠాలకు దగ్గర్లో కనిపిస్తున్నా.. 80–90 శాతం షేర్లు కనిష్ఠ స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. ఇక ఎఫ్డీలను చూస్తే వడ్డీలు తగ్గి రాబడుల్లేవు. సురక్షితమని బంగారం, వెండి వంటి లోహాలవైపు వెళితే... వాటి ఎగుడుదిగుళ్లకి ఊపిరాడని పరిస్థితి. మొత్తంగా ఇప్పటివరకూ 2026 చెబుతున్నదొక్కటే. రిస్క్ తీసుకోకుంటే రాబడుల్లేవు. అలాగని రిస్క్ తీసుకున్నా నిద్ర లేదు. మరేం చేద్దాం? ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితమైన దారేది? కనీసం ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులనిచ్చే సాధనాలేంటి? వీటి విశ్లేషణే ఈ వారం ‘వెల్త్ ప్లస్’ స్టోరీ...కొందరిది రిస్క్‌కు దూరంగా ఉండే ధోరణి. కొందరిదైతే దూకుడుగా రిస్క్ గురించి ఆలోచించకుండా ముందుకెళ్లే ధోరణి. వాస్తవానికి ఇలాంటి ఏకపక్ష విధానాలు ఎప్పుడో తప్ప కలిసిరావు. ఈ సంవత్సరం ఇలాంటి విధానాలు అస్సలు కలిసొచ్చేలా లేవు. కాబట్టి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తమ పెట్టుబడుల సామర్థ్యం, కాల వ్యవధి, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ సాధనాల మధ్య కేటాయింపులు సమతుల్యం చేసుకోవాలి. ‘బ్యాలన్స్’గా నడుచుకోవడం తప్పనిసరి. ఎందుకంటే గతేడాది కూడా (2025–26లో) సంప్రదాయ ఎఫ్డీలు ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడులను ఇవ్వలేకపోయాయి. ఈక్విటీ మార్కెట్లలో ఆటుపోట్లూ పెరిగాయి. జీడీపీలో ఆర్థిక పొదుపులు 47 ఏళ్ల కనిష్టానికి చేరాయి. జీవన వ్యయాలేమో పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి ప్రజలకిది పెద్ద సవాలే. కాబట్టి ఏం చేయాలంటే...వేటి ప్రాధాన్యం వాటిదే..మనం ఆహారంలో భాగంగా బియ్యం/గోధుమలకే పరిమితం కాలేం. కూరగాయలు, పండ్లు, పప్పులు, గుడ్లు, మాంసం ఇలా అన్నింటినీ తీసుకుంటాం. ఎందుకంటే ఒక్కోదానిలో ఉండే పోషకాలు వేరు. సమతుల్య ఆహారం మానసిక, శారీరక ఆరోగ్యాన్నిస్తుంది. పెట్టుబడులకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. తమ నికర ఆర్జన ఎంత? అందులో ఖర్చులు ఎంత? మిగిలేది ఎంత? భవిష్యత్ లక్ష్యాలు ఏవి? వాటికి ఎంత మొత్తం సమకూరాలి? ఇందుకోసం ఎంత రాబడి అవసరం? ఈ అంశాల ఆధారంగా ఎఫ్డీలు/డెట్ ఫండ్స్–ఈక్విటీలు–పసిడి/వెండి ఇలా వివిధ సాధనాలకు కేటాయింపులు చేసుకోవాలి. దీన్నే అసెట్ అలోకేషన్ అని కూడా అంటుంటారు. ఏదో ఒక సాధనం కాకుండా, స్వల్పకాల అవసరాల కోసం డెట్, మధ్య కాల అవసరాలకు డెట్–ఈక్విటీ, దీర్ఘకాల అవసరాలకు ఈక్విటీ, బంగారం సాధనాలకు కేటాయింపులు ప్లాన్ చేసుకోవాలి. దీని వల్ల వైవిధ్యం ఉంటుంది. ఒక విభాగంలో ప్రతికూలతలు ఉన్న సమయంలో మరో విభాగంలోని పెట్టుబడులు మంచి పనితీరుతో ప్రయోజనం పొందొచ్చు. వేటికి ఎంత..? సంపాదనలో 35 శాతం అయినా (మూడింట ఒక వంతు) ఆదా చేయాలి. ఆదా చేసిన మొత్తంలో 30–35 శాతాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా చిన్న మొత్తాల పొదుపు పథకాలు, లేదా లిక్విడ్, మనీ మార్కెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.కనీసం 50–60 శాతాన్ని ఈక్విటీల్లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవాలి. బంగారం, వెండిలో 10–15 శాతం మించకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ, బంగారం, వెండిపై పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) మంచి సాధనం. రక్షణ–రాబడులుఎఫ్డీలు, డెట్ ఫండ్స్‌తో సంపద సృష్టి సాధ్యం కాదు. కానీ, పెట్టుబడికి రక్షణ ఉంటుంది. స్వల్పకాలంలో పెట్టుబడి కాపాడుకోవడమే ముఖ్యం.ఈక్విటీలతో సంపద సృష్టి సాధ్యం. అది దీర్ఘకాలంలో, క్రమశిక్షణతో నడుచుకున్నప్పుడే.కమోడిటీలు మిగిలిన పెట్టుబడులకు హెడ్జింగ్‌గా పనిచేస్తాయి. అదే సమయంలో మెరుగైన రాబడికీ మార్గం చూపుతాయి. ప్రీమియం లోహాలు..బంగారం, వెండి ర్యాలీ ఏ స్థాయిలో ఉంటుందో గత కొన్నేళ్ల అనుభవాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో అయితే పసిడి, వెండి ధరలు రెట్టింపయ్యాయి. దీన్ని చూసి ఇన్వెస్టర్లు పసిడి, వెండిలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. కాకపోతే ఈ ఏడాది ఊగిసలాట మామూలుగా లేదు. తాజాగా వెండి గరిష్ఠానికి చేరటం... భారీగా పతనమవటం అంతా నెలలో జరిగిపోయింది. మిగిలిన పెట్టుబడి సాధనాల నుంచి వైదొలిగి మొత్తం వీటిలోనే కుమ్మరించిన వారి పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నది వీటికీ వర్తిస్తుంది. బంగారం, పసిడి ఏటా స్థిరంగా రాబడినిస్తాయన్న భరోసా లేదు. ఇవి ఒక సైకిల్ ప్రకారం చలిస్తుంటాయి. కొన్నేళ్ల పాటు అతి తక్కువ రాబడి, స్థిరీకరణ తర్వాత కొద్ది కాలంలోనే ఎక్కువ ర్యాలీ చేయడం వీటి స్వభావం. కనుక ఏటా స్థిరంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడమే మెరుగైన విధానం.స్టాక్స్‌లో మాదిరి వీటిపై డివిడెండ్, బోనస్‌లు వంటివేవీ ఉండవు.బంగారం కంటే వెండిలో ఆటుపోట్లు ఎంతో ఎక్కువ. ఆర్థిక వ్యవస్థలు గొప్పగా పనిచేస్తున్న కాలంలో ఇవి దీర్ఘకాలం పాటు ర్యాలీకి దూరంగా ఉంటాయి. ఇన్వెస్టర్ల హెడ్జింగ్ కోసం, సెంట్రల్ బ్యాంకుల మారకం నిల్వల స్థిరత్వానికి పసిడికి డిమాండ్ ఎక్కువ. పారిశ్రామిక వినియోగం, ఇన్వెస్టర్ల పెట్టుబడిగానూ వెండికి డిమాండ్ పెరుగుతోంది.కానీ, ఇప్పటి వరకు చరిత్ర చూస్తే 1950 నుంచి ఇప్పటి వరకు పసిడి, వెండిపై రాబడి 10–11 శాతం (వార్షికంగా) చొప్పున ఉంది.పసిడి, వెండిపై పెట్టుబడులకు చార్జీలు, లిక్విడిటీ పరంగా ఈటీఎఫ్‌లు లేదా మ్యూచువల్ ఫండ్స్ పథకాలే మెరుగైనవి. ఫిక్స్డ్ డిపాజిట్లు భద్రమే కానీ..ఎఫ్డీలపై 6.5–7 శాతం రాబడి పేపర్‌పై కనిపించేంత వరకే. మన దగ్గర ద్రవ్యోల్బణం సగటున 5–6 శాతం మధ్య ఉంటోంది. అంటే ఎఫ్డీ ఇచ్చిన రాబడిని ద్రవ్యోల్బణమే తినేస్తున్నట్లు లెక్క. ఇక ఇన్వెస్టర్‌కు మిగిలేది ఏముంటుంది? కొన్ని సందర్భాల్లో ద్రవ్యోల్బణం 6 శాతాన్ని దాటిపోతోందన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ 30 శాతం ఆదాయపన్ను పరిధిలో ఉంటే ఎఫ్డీఐపై వచ్చే 6–7 శాతం రాబడిపై కూడా 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు అసలు రాబడి రాకపోగా... పన్ను అనంతరం స్వల్పంగా నష్టపోవాల్సి వస్తుంది. దీనివల్ల కాలానుగుణంగా ఆ డిపాజిట్‌కు ఉన్న విలువ తగ్గిపోతుందని గమనించాలి. ఫిక్స్డ్ డిపాజిట్ అన్నది ఎంతో సులభమైన పెట్టుబడి సాధనం. కాల వ్యవధి తీరే నాటికి ఎంత వస్తుందన్నది ముందుగానే తెలిసిపోతుంది. పైగా ఇంటి సమీపంలోని బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకుని, కావాల్సినప్పుడు అదే రోజు వెనక్కి తీసుకోగల సౌలభ్యం ఉంటుంది. ఎఫ్డీలో పెట్టుబడికి భద్రత ఎక్కువ. ఒక డిపాజిటర్‌కు ఒక బ్యాంక్ పరిధిలో రూ.5 లక్షల వరకు బీమా ఉంటుంది కనుక నిశ్చింత ఎక్కువ. కానీ, భద్రత కోసమని, సౌకర్యం ఉందని చెప్పి నికరంగా రూపాయి కూడా రాబడి లేని (ఎఫ్డీ రేటు నుంచి ద్రవ్యోల్బణం తీసేయగా) సాధనంలో ఉన్నదంతా పెట్టేస్తే ముఖ్యమైన లక్ష్యాలను సాధించడమెలా అన్నది ఆలోచించాలి. పైగా ఆర్బీఐ ఇటీవలి కాలంలో 1.25 శాతం మేర రెపో రేటును తగ్గించేసింది. భవిష్యత్తులోనూ తగ్గించొచ్చు. అలాంటప్పుడు ఎఫ్‌డీఐలపై రాబడి మరింత తగ్గిపోతుందని అర్థం చేసుకోవాలి. కాలానుగుణంగా మన పెట్టుబడి విలువ కూడా పెరగాలి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఏటా విద్య, వైద్యం, గృహ అద్దె, నిత్యాసవరాల ధరలు కూడా పెరుగుతుంటాయి. ఈ స్థాయిలో లేదంటే ఇంతకుమించి పెట్టుబడిని వృద్ధి చేసుకోవాల్సిందే. ఇక్కడే ఈక్విటీల పాత్ర కీలకం అవుతుంది. ఈక్విటీలు మెరుగే కానీ..ఈక్విటీలు ఇతర సంప్రదాయ సాధనాలకు మించి రాబడులను ఇస్తాయన్నది చారిత్రక వాస్తవం. కానీ, అది దీర్ఘకాలంలోనే సాధ్యం. పదేళ్లకు మించిన కాలంలో ఈక్విటీ ఫండ్స్‌లో రాబడి 12– 15 శాతం మధ్య ఉంది. స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో అయితే ఈ రాబడి 30 శాతం వరకు ఉంది. స్వల్పకాలానికి ఈక్విటీల పనితీరు ఎలా ఉంటుందో అంచనా వేయలేం. ఆర్థిక వృద్ధి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అనిశ్చితులు, కరెన్సీ విలువలు, దేశాల రుణ భారాలు, వడ్డీ రేట్లు, వాతావరణ మార్పులు ఇలా ఎన్నో అంశాల ఆధారంగా ఈక్విటీలు కదులుతూ ఉంటాయి. ఇలాంటి ప్రతికూలతలను జీర్ణం చేసుకుంటూ మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో ఈక్విటీలు మెరుగైన పనితీరు చూపిస్తుంటాయి.క్రమశిక్షణ, అనుభవం కలిగిన ఇన్వెస్టర్లు సైతం ఈక్విటీల పతనాలను చూసి ఆందోళన చెందుతుంటారు. ప్రతి ర్యాలీ తర్వాత దిద్దుబాటు కచ్చితంగా ఉంటుందన్నది వాస్తవం.దీంతో ఈక్విటీ పెట్టుబడులపై నిశ్చింత, ప్రశాంతత అన్నది అన్ని సందర్భాల్లో ఉండదు. ముఖ్యంగా మధ్యతరగతి ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తక్షణ రాబడుల కోసం ఫ్యూచర్స్, ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో), ఇంట్రాడే ట్రేడింగ్ వైపు అడుగులు వేస్తుంటారు. సరైన పరిశోధన, ఆయా సాధనాల పనితీరు, రిస్క్‌లు ఇవన్నీ తెలుసుకోకపోవడం ఫలితంగా నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఎఫ్‌డీల మాదిరి (రూ.5లక్షలు) ఈక్విటీ పెట్టుబడులకు ఎలాంటి గ్యారంటీ ఉండదు. స్వల్పకాలంలో పెట్టుబడి విలువ కూడా తగ్గిపోవచ్చన్నది గుర్తు పెట్టుకోవాలి. ఒక్కోసారి మెరుగైన రాబడుల కోసం మార్కెట్ సైకిల్ మారే వరకూ వేచి చూడాల్సి రావచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులతో కంపెనీలు జారీ చేసే డివిడెండ్ సైతం తిరిగి పెట్టుబడిగా మారుతుంది. దీర్ఘకాలంలో కాంపౌండింగ్‌తో రాబడి మరింత ఇతోధికం అవుతుంది. లిక్విడిటీ ఎక్కువ. సులభంగా క్రయ, విక్రయాలు చేసుకోవచ్చు. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేందుకు ఈక్విటీ పెట్టుబడులు బలంగా పనిచేస్తాయి. దీంతో కొనుగోలు శక్తి తగ్గదు.ఇదీ చదవండి: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం -
2026లో బంగారం, వెండి భవిష్యత్తు ఇదే!: బాబా వంగా
ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన జ్యోతిష్కురాలు.. బాబా వంగా పేరు మరోసారి వార్తల్లో నిలిచారు. బాల్కన్ ప్రాంతపు నోస్ట్రడామస్ అని పిలువబడే ఈమె.. అనేక దేశాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రపంచ పరిణామాలపై చెప్పిన మాటలు నిజమయ్యాయని ప్రజలు నమ్మడం వల్ల ఆమె పేరు ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందింది.ప్రపంచంలోని చాలా దేశాలు.. కరెన్సీ హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం వంటివి ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో బాబా వంగా ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి చెప్పిన మాటలు చర్చకు దారితీసాయి. కాగితపు కరెన్సీ దాని విలువను కోల్పోతుంది. దీనివల్ల ప్రపంచంలో తీవ్రమైన నగదు కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీంతో ప్రజల్లో భయం, ఆందోళనను మొదలైపోయాయి.కరెన్సీకి ఎప్పుడైతే విలువ తగ్గిపోతుందో.. అలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి, రాగి వంటి లోహాలే భద్రమైన ఆస్తులుగా మిగులుతాయని, వాటి విలువ ఈ ఏడాది మరింత పెరుగుతుందని బాబా వంగా వెల్లడించారు.2026 ప్రారంభమైన తరువాత బంగారం ధరలు అమాంతం పెరిగి తులం రేటు రూ.1.80 లక్షలకు చేరుకుంది. వెండి ధర రూ. 4 లక్షలకు చేరింది. గోల్డ్, సిల్వర్ రేట్లు ఇంతలా పెరగడం చరిత్రలో ఎప్పుడూ కనిపించలేదని ఆర్ధిక నిపుణులు సైతం వెల్లడించారు. ఇప్పుడు పరిస్థితులు కొంత సాధారణ స్థితికి వచ్చేసాయి. దీంతో రేట్లు కూడా వరుసగా తగ్గుముఖం పట్టాయి.బాబా వంగా చెప్పిన మాటలు కేవలం అంచనా మాత్రమే. ఇవన్నీ తప్పకుండా జరుగుతాయని చెప్పలేము. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కరెన్సీ విలువ తగ్గిపోతుందని భావించి, ముందుగానే బంగారం, వెండి వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం సరైంది కాదు. అయితే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు తప్పకుండా ఓసారి ఆలోచించాలి. ఎందుకంటే.. అన్ని వేళలా లాభాలే రావు, నష్టాలను కూడా కొన్ని సార్లు భరించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆలోచించాల్సిందే! -
కియోసాకీకి కోపమొచ్చింది!
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకీ, తాను బిట్‌కాయిన్‌ను 6,000 డాలర్లకి కొనుగోలు చేశానన్న వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు స్పందించారు. బిట్‌కాయిన్ కొనుగోలు చేసిన తేదీపై అనవసరంగా దృష్టి పెట్టడం ఇన్వెస్టర్ల అసలు లక్ష్యాన్ని తప్పుదారి పట్టిస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో వరుస ట్వీట్లు చేశారు.తనను “అబద్ధం చెబుతున్నాడు” అంటూ ఆరోపించిన వ్యక్తి, బిట్‌కాయిన్‌ను ఏ తేదీన కొనుగోలు చేశానన్న అంశాన్ని ప్రశ్నిస్తున్నాడని కియోసాకీ పేర్కొన్నారు. అయితే తాను గుర్తుంచుకునేది కొనుగోలు చేసిన ధర (strike price) మాత్రమేనని, తేదీ తనకు ప్రాధాన్యం కాదని చెప్పారు.“నేను ఏ తేదీన బిట్‌కాయిన్ కొన్నానో అతడికి ఎందుకు అంత ఆసక్తి?” అని ప్రశ్నించిన కియోసాకీ, ఆ విమర్శల వెనుక వ్యక్తిగత అజెండా ఉండవచ్చని ఆరోపించారు.బిట్‌కాయిన్ ధర మళ్లీ 6,000 డాలర్లకి పడితే మరోసారి కొనుగోలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆ సమయంలో తేదీ ఏమిటన్నది తనకు ఎలాంటి ప్రాధాన్యం లేదన్నారు. ప్రస్తుతం తాను మరింత బంగారం కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నానని కూడా వెల్లడించారు.తన విమర్శకులను ఉద్దేశించి, వారు ఎన్ని బిట్కాయిన్లు, బంగారం, వెండి లేదా ఈథీరియం కలిగి ఉన్నారో చెప్పాలని సవాలు విసిరారు. అలాగే అద్దె ఇళ్లు, చమురు బావులు వంటి వాస్తవ ఆస్తులపై కూడా ప్రశ్నించారు. “నేను ఈ ఆస్తులు ఎప్పుడు కొనుగోలు చేశానో నాకు గుర్తులేదు. కానీ వాటిని కొనుగోలు చేశానన్నది మాత్రం ఆనందంగా ఉంది” అని కియోసాకీ అన్నారు.అలాగే 2026 సంవత్సరానికి చెందిన 60 అమెరికన్ సిల్వర్ ఈగిల్స్ నాణేలు, 20 మిశ్రమ తేదీల గోల్డ్ ఈగిల్స్ కొనుగోలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వెండి మార్కెట్లో ఉన్న కల్లోలం కారణంగా 2026 సిల్వర్ ఈగిల్స్ భవిష్యత్తులో కలెక్టర్ కాయిన్లుగా మారవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.చివరగా, తనను అనుసరించే ఇన్వెస్టర్లకు కియోసాకీ ఒక సూచన చేశారు. “ఆస్తి విలువ, సంఖ్య కంటే కొనుగోలు చేసిన తేదీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. దీర్ఘకాలిక సంపద ఆస్తుల సేకరణతోనే వస్తుంది, తేదీలతో కాదు.” అని ముగించారు.To the person who said I was lying that I bought Bitcoin at $6000…. I know my strike price not the date he falsely accuses me of the date I bought Bitcoin on.Why would he care what date I bought it on?Does he have a personal agenda for calling me a liar?If Bitcoin hits…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 7, 2026 -
అబ్బో.. తులం బంగారం ‘లక్షా డెబ్బై’..
సిరిసిల్ల టౌన్: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తనదైన శైలిలో నవ్వులు పూయించారు. స్థానిక శాంతినగర్ చౌరస్తాలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఆయన తిరిగి వెళ్తుండగా, కొందరు మహిళలు ఆయనను చుట్టుముట్టి ‘తులం బంగారం ఎక్కడ?’ అంటూ సూటిగా నిలదీశారు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు నేతలు సీరియస్ అవుతుంటారు.. కానీ వీహెచ్ మాత్రం ఏమాత్రం తడబడకుండా ‘అబ్బో.. ఇప్పుడు తులం బంగారం ధర రూ. 1.70 లక్షలైంది!’.. అంటూ చమత్కరించడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే మెజారిటీ హామీలను అమలు చేశామని గుర్తు చేస్తూనే, తులం బంగారం, రూ.2500 పెన్షన్ అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మహిళలకు భరోసా ఇచ్చారు. -
బంగారం, వెండి ధరల్లో ఇంతమార్పా!
బంగారం, వెండి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ.. మార్కెట్లో సంచనలం సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా గోల్డ్ రేటు ఏ స్థాయిలో తగ్గిందో.. అదే స్థాయిలో పెరిగింది కూడా. ఈ కథనంలో ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు అంటే.. ఆదివారం నుంచి శనివారం వరకు ధరలు ఎలా మారాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఆదివారం (ఫిబ్రవరి 1) రూ. 1,60,580 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర శనివారం (ఫిబ్రవరి 7) నాటికి రూ. 1,56,600 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 3980 రూపాయలు తగ్గిందన్నమాట. 22 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే.. రూ. 1,47,200 నుంచి రూ. 1,43,550 వద్దకు (రూ.3650 తగ్గింది) చేరింది.చెన్నైలో రూ.1,62,550 వద్ద (ఫిబ్రవరి 1) ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు శనివారం నాటికి (ఫిబ్రవరి 7) రూ. 1,57,310 వద్దకు (రూ. 5,240 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,49,000 నుంచి రూ. 1,44,200 వద్దకు (రూ. 4,800 తగ్గింది) చేరింది.ఇదీ చదవండి: బంగారం పింక్ పేపర్లోనే ఎందుకిస్తారో తెలుసా?.. సీక్రెట్ ఇదే!ఢిల్లీ విషయానికి వస్తే.. దేశ రాజధాని నగరంలో వారం రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు 1,60,730 రూపాయల నుంచి రూ. 1,56,750 వద్దకు (రూ. 3980 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల రేటు కూడా రూ. 1,47,350 రూపాయల నుంచి రూ. 1,43,700 వద్దకు (రూ. 3650 తగ్గింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరల్లో కూడా భారీ మార్పు కనిపించింది. ఫిబ్రవరి 1న రూ. 3.20 లక్షల వద్ద కేజీ సిల్వర్ రేటు.. నేటికి (శనివారం) రూ. 2.85 లక్షలకు చేరింది. అంటే ఏడు రోజుల్లో కేజీ ధర రూ. 35వేలు తగ్గిందన్న మాట. -
మురుగులో మెరుపులు.. ఆకలిలో ఆశలు
నెల్లూరు: ముక్కు పుటరాలు అదిరే మురుగులో స్వర్ణ రేణువుల కోసం.. నిత్యం ఆకలి ఆశలు జల్లెడ పడుతుంటాయి. ఈ విభిన్న జీవన వాస్తవాలకు అద్దం పట్టే దృశ్యం నెల్లూరులోని కాపువీధిలో నిత్యం కనిపిస్తోంది. ఇక్కడ బంగారు ఆభరణాలు తయారు చేసే దుకాణాలు వరుసగా ఉంటాయి. మెరిసే ఉంగరాలు, కంఠహారాలు సిద్ధమైన తర్వాత మిగిలిపోయే సూక్ష్మ బంగారు రేణువులు వేస్ట్‌గా కాలువల్లోకి వెళ్లిపోతాయి. అవే నగరానికి చెందిన కొన్ని కుటుంబాలకు జీవనాధారం. ఆ పేదలు పొట్ట నింపుకోవడానికి రోజూ ఆకలి పోరాటం చేస్తుంటారు. మురుగు కాలువ వెంబడి నడిచే వారు ముక్కు మూసుకునే వెళ్లేవారెందరో... అయితే అదే కాలువల్లో పేరుకుపోయిన మట్టిని చేతులతో తీసి, జల్లెడ పట్టి, అందులో బంగారపు కణాలు చిక్కుతాయేమోనని వెతుకుతుంటారు. ఈ దృశ్యాలు వారి ఆకలి పోరాటాని, జీవిత వాస్తవానికి దర్పణంగా నిలుస్తాయి. -
బంగారం ధరల్లో మార్పు!.. స్వల్ప వ్యవధిలోనే..
బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ.. పసిడి ప్రియులలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదయం కనిపించిన రేటు, సాయంత్రానికి మారిపోతోంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లోని లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయం చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఉదయం రూ. 1,39,650 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,40,900 రూపాయల వద్దకు చేరింది. అదే విధంగా రూ. 1,53,710 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. 1,53,710 రూపాయల వద్ద నిలిచింది. దీన్ని బట్టి చూస్తే.. గంటల వ్యవధిలో బంగారం రేటు ఎలా మారిపోయిందో స్పష్టంగా అర్థమవుతోంది.ఢిల్లీలో కూడా బంగారం ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. 1,39,800 రూపాయల నుంచి 22 క్యారెట్ల తులం గోల్డ్ రూ. 1,41,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల పసిడి కూడా రూ. 1,52,500 నుంచి 1,53,860 రూపాయల వద్దకు చేరింది.ఇక చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు మారింది. ఉదయం 1,41,200 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం పసిడి ధర సాయంత్రానికి రూ. 1,42,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,54,040 రూపాయల వద్ద నుంచి రూ. 1,55,460కు చేరింది. అయితే వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ. 2.80 లక్షల వద్ద ఉంది. -
బంగారం, వెండి కొనడం ఆపేసిన కియోసాకి..
“రిచ్ డాడ్ పూర్ డాడ్” రచయిత రాబర్ట్ కియోసాకి, ధరలు కొత్త మార్కెట్ దిగువ స్థాయికి చేరుకునే వరకు బిట్‌కాయిన్ (BTC), బంగారం, వెండిని మరింతగా కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లకు అసలైన ప్రమాదం ధరల ఊగిసలాట కంటే, పెరుగుతున్న అమెరికా రుణ భారం అని ఆయన అభిప్రాయపడ్డారు.‘ఎక్స్’(ట్విట్టర్)లో చేసిన పోస్ట్‌లో, అమెరికా ఆర్థిక పరిస్థితిని పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న “అత్యంత పెద్ద సమస్య”గా కియోసాకి అభివర్ణించారు. అమెరికా జాతీయ రుణం సుమారు 38 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి పథకాలతో సంబంధం ఉన్న భవిష్యత్ బాధ్యతలను కలిపితే మొత్తం భారం 250 ట్రిలియన్ డాలర్ల వరకు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. “ఫెడ్, అసమర్థ నాయకులు, నకిలీ డాలర్లతో ప్రజలను దోచుకునే క్రిమినల్ బ్యాంకర్లే అసలైన సమస్య” అని కియోసాకి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడే కొనేది లేదువెండి ధర 60 డాలర్లు, బిట్‌కాయిన్ 6,000 డాలర్లు, బంగారం 300 డాలర్లు వద్ద ఉన్నప్పటి నుంచి తాను కొనుగోలు చేయడం ఆపేశానని కియోసాకి తెలిపారు. “నేను కొన్ని బిట్కాయిన్లు, కొంత బంగారం విక్రయించాను. కానీ నాకు అమ్మడం నచ్చదు ఎందుకంటే మూలధన లాభాల పన్ను చెల్లించడం నాకు ఇష్టం లేదు” అని చెప్పారు. కొత్తగా పెట్టుబడి పెట్టే ముందు, ఈ రెండు ఆస్తుల్లోనూ కొత్త దిగువ స్థాయిల కోసం “ఓపికగా వేచి చూస్తున్నాను” అని అన్నారు.గురువారం సెషన్లో బిట్‌కాయిన్ ధర 60,100 డాలర్ల వరకు పడిపోయి, రాత్రికి 65,600 డాలర్లకు చేరింది. అయినప్పటికీ, గత 24 గంటల్లో ఇది ఇంకా 6.6% తగ్గుదలలోనే ఉంది. స్టాక్ట్విట్స్ ప్రకారం.. బిట్‌కాయిన్‌పై రిటైల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఏడాది కనిష్టానికి చేరి ‘అత్యంత బేరిష్’ జోన్లోకి వెళ్లింది. చర్చల స్థాయి మాత్రం ‘అత్యధికం’గా ఉంది.బంగారం, వెండి మార్కెట్ పరిస్థితిగురువారం రాత్రి బంగారం ఔన్స్‌కు సుమారు 4,400 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ, గత రోజుతో పోలిస్తే 1.95% లాభపడింది. అయితే, స్పైడర్ గోల్డ్ షేర్స్ ఈటీఎఫ్ (GLD) రెగ్యులర్ ట్రేడింగ్‌లో 2.66% పడిపోయిన తర్వాత, ఆఫ్టర్ అవర్స్‌లో మరో 0.92% తగ్గింది. స్టాక్‌ట్విట్స్‌లో పసిడిపై సెంటిమెంట్ ‘అత్యంత బుల్లిష్’ నుంచి ‘బుల్లిష్’ స్థాయికి తగ్గింది.ఇదీ చదవండి: క్రాష్.. క్రాష్.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండిఇక వెండి ధరలు గురువారం రాత్రి 4.4% పెరిగి 73.8 డాలర్లకు చేరుకున్నాయి. రెగ్యులర్ సెషన్లో 15.77% పతనం తర్వాత, ఐషేర్స్ సిల్వర్ ట్రస్ట్ (SLV) ఆఫ్టర్ అవర్స్‌లో మరో 4.63% తగ్గింది. వెండి చుట్టూ రిటైల్ సెంటిమెంట్ కూడా ‘అత్యంత బుల్లిష్’ నుంచి ‘బుల్లిష్’ స్థాయికి దిగింది. చర్చల తీవ్రత ‘చాలా ఎక్కువ’ నుంచి ‘ఎక్కువ’కు తగ్గింది.సమయం, సహనం కీలకంధరలు తక్కువ స్థాయికి చేరేవరకు వేచి ఉండాలని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. వెండి ధర 74 డాలర్లకి, బంగారం 4,000 డాలర్లకు పడితే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తన పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం తగినంత ఎథీరియం ఉందని, భవిష్యత్తులో ఆ వాటాను పెంచుకోవడాన్ని పరిశీలిస్తానని తెలిపారు.“లాభం మీరు కొనుగోలు చేసినప్పుడు వస్తుంది… అమ్మినప్పుడు కాదు,” అని రిచ్ డాడ్ నుంచి నేర్చుకున్న ముఖ్యమైన పాఠాన్ని ఆయన గుర్తు చేశారు. తాను మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించినప్పుడు బహిరంగంగా ప్రకటిస్తానని, ధరల ర్యాలీలను వెంబడించవద్దని ఇన్వెస్టర్లను హెచ్చరించారు. చివరగా, ఆయన తరచూ చెప్పే “పందులు లావవుతాయి… కానీ అత్యాశ పందులు మాంసంగా మారుతాయి” అన్న మాటను మరోసారి గుర్తుచేశారు.AS I POSTED on X earlier. I stopped buying silver at $60.I stopped buying Bitcoin at $6000.I stopped buying gold at $300.I have sold some Bitcoin and some gold. I hate selling because I hate paying capital gain taxes.Today…. I wait patiently for new bottoms for gold…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 6, 2026 -
బంగారం పింక్ పేపర్లోనే ఎందుకిస్తారో తెలుసా?.. సీక్రెట్ ఇదే!
సాధారణంగా చాలామంది గోల్డ్ కొనుగోలు చేసినప్పుడు.. విక్రయదారులు బంగారాన్ని పింక్ కలర్ పేపర్లో చుట్టి ఇస్తుంటారు. బహుశా కొందరికి అనుమానం కూడా వచ్చి ఉండొచ్చు.. ఎందుకు ఈ రంగు కాగితంలోనే చుట్టి ఇస్తున్నారని. మీ సందేహానికి సమాధానమే ఈ కథనం..బంగారాన్ని సాధారణంగా పింక్ కలర్ పేపర్లోనే చుట్టి ఇవ్వడం వెనుక స్పష్టమైన శాస్త్రీయ కారణం కన్నా.. సంప్రదాయం, మానసిక ప్రభావం, వ్యాపారానికి సంబంధించిన ఆచారం కలిసి ఉన్నాయనే చెప్పాలి. పసిడి మన భారతీయ సంస్కృతిలో అత్యంత విలువైన లోహం. అది కేవలం ఆభరణంగా మాత్రమే అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఇది సంపదకు, శుభానికి, స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు. అంతటి విలువైన వస్తువును అందించే సమయంలో.. ఒక ప్రత్యేకత ఉండాలనే భావనతో వ్యాపారులు పింక్ కలర్ పేపర్లో చుట్టి ఇస్తూ వస్తున్నారు.రంగుఇతర రంగుల కంటే.. పింక్ కలర్ మృదుత్వం, శుభ్రత, సౌమ్యతను సూచిస్తుంది. చూడగానే హాయిని ఇచ్చే ఈ రంగు.. మనసులో సానుకూల భావనను కలిగిస్తుంది. బంగారం లాంటి మెరిసే లోహాన్ని పింక్ పేపర్ మీద పెట్టినప్పుడు అది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొనుగోలుదారు కూడా నేను చాలా విలువైన లోహాన్ని కొనుగోలు చేశాననే సంతృప్తిని ఇస్తుంది.సాంప్రదాయంచాలాకాలం నుంచి ఆభరణాల దుకాణాల్లో పింక్ లేదా లైట్ రెడ్ కలర్ పేపర్ ఉపయోగించడం అలవాటుగా మారిపోయింది. ఒక ఆచారం మొదలైందంటే.. అది అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆలాగే బంగారం విషయంలో పేపర్ రంగు నేటికీ కొనసాగుతోంది. బంగారం అంటే పింక్ పేపర్ అన్న భావన మనకు తెలియకుండానే మనసులో స్థిరపడిపోయింది.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళన.. మైఖేల్ బరీ హెచ్చరిక!వ్యాపారంఇతర పేపర్లతో పిలిస్తే.. పింక్ కలర్ పేపర్ మురికి, మడతలు వంటి వాటిని అంత త్వరగా కనిపించనివ్వదు. అంతే కాకుండా ఇది పెద్దగా ఖరీదైంది కాదు కూడా. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఒకే రంగు వాడటం వల్ల దాని గుర్తింపు ప్రత్యేకమవుతుంది. అందుకే దుకాణదారులు కూడా గోల్డ్ అంటే.. పింక్ రంగునే వాడుతుంటారు.మానసిక ప్రభావంప్రజలు ఎప్పుడైనా శుభం జరగాలనే కోరుకుంటారు. పింక్ పేపర్లో చుట్టి ఇవ్వడం వల్ల.. అది మరింత శుభంగా భావిస్తారు. పైన చెప్పుకున్నట్లు.. పింక్ రంగు మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది కూడా. ఇలా.. మొత్తం మీద గోల్డ్ అంటే పింక్ పేపర్ అని అందరూ పిక్స్ అయిపోయారు. -
పాక్‌కు బంగారం దొరికింది.. భూమిలో నుంచి బయటపడేది అప్పుడే..
పొరుగు దేశం పాకిస్థాన్ గత కొన్నేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కనీసం ఆ దేశ ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితుల్లో ఉంది .అయితే, ఇప్పుడు సింధు నదిలో బంగారు నిల్వలు కనుగొనడంతో ఆ దేశానికి గడ్డు రోజులు పోతున్నట్లు కనిపిస్తోంది. మాజీ మైనింగ్ మంత్రి ఇబ్రహీం హసన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ దేశంలో భారీ బంగారు నిల్వలను కనుగొన్నట్లు పేర్కొన్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లో ఇంత పెద్ద మొత్తంలో బంగారం నిల్వలు కనుగొనబడ్డాయి. కానీ నదుల్లో బంగారు నిల్వలను కనుగొనడం వల్ల ఆఫ్రికన్ దేశాల్లో జరుగుతున్నట్లుగా కొత్త సమస్యలు వస్తాయన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. కానీ కథ ఇక్కడితో ముగియదు. గతంలో ఆఫ్రికా దేశాలు కూడా ఇలాగే బంగారు నిల్వలు కనుగొన్నారు.. బుర్కినా ఫాసో, మాలి, నైజర్ లాంటి దేశాల్లో బంగారం బయటపడింది. అయితే ఆ దేశాలు అభివృద్ధి దిశగా వెళ్లక పోగా అక్కడ బంగారం మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తీవ్రవాద గ్రూపులు తమ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నాయి. గత 15ఏళ్ల కాలంలో అనేక ఆఫ్రికన్ దేశాల్లో బంగారం, విలువైన లోహాల నిల్వలు ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. తీవ్రవాద గ్రూపులు మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉగ్రవాదం, నెట్వర్కింగ్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాయి. బంగారం ద్వారా తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలని కలలు కంటున్న స్థానిక ప్రజలను బంగారం తవ్వకం పనిలోకి దింపారు. జీతాలు స్థానికులే చెల్లిస్తున్నారు. ఆ డబ్బు మాత్రం ఉగ్రవాదులకు వెళ్తోంది. అన్ని వనరులను ఆక్రమించుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు అక్కడి యువతను కూడా తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు.ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… మన పొరుగుదేశం చైనా కూడా ఇటీవలే భారీ బంగారు నిల్వలను కనుగొంది. అక్కడి పాలకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే ఆశతో ఉంది. కానీ బంగారం దొరకడం ఒక్కటే కాదు… వాటిని పారదర్శకంగా, ప్రజల ప్రయోజనానికి ఉపయోగించడం చాలా ముఖ్యం. కాబట్టి చివరికి ప్రశ్న ఒక్కటే—ఈ బంగారం పాకిస్థాన్‌కు వరమా? లేక భవిష్యత్తులో కొత్త జియోపాలిటికల్ ఆటకు వేదిక అవుతుందా? దేశాన్ని ఆర్థికంగా నిలబెడుతుందా? లేక అంతర్గత సమస్యలను మరింత పెంచుతుందా? దీనికి సమాధానం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది.సింధు నదిలో దొరుకుతున్న బంగారం హిమలయ పర్వతాల నుంచి వచ్చిందని చెప్పవచ్చు. అక్కడ టెక్టోనిక్ కార్యకలాపాల కారణంగా మిలియన్ల ఏళ్ల క్రితం నదిలో ఖనిజాలు ఏర్పడ్డాయి. పాకిస్థాన్ మీదుగా ఆ నది ప్రవహించినప్పుడు బంగారు కణాలు దానిలో వెళ్లిపోతాయి. అనంతరం ఒడ్డున ప్లేసర్ డిపాజిట్లుగా ఏర్పడతాయి. అంటే బంగారు నిల్వలుగా రూపాంతరం చెందుతాయి. నీటి మట్టాలు తక్కువగా ఉండే శీతాకాలంలో అవి బయటపడతాయి. -
బిట్‌కాయిన్ పతనం.. మైఖేల్ బరీ హెచ్చరిక!
బంగారం, వెండి ధరలు మాత్రమే కాకుండా.. బిట్‌కాయిన్ ధర కూడా అమాంతం పడిపోతోంది. ఇది ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళనను కలిగిస్తోంది. ఈ తరుణంలో ప్రముఖ హెజ్ ఫండ్ మేనేజర్ 'మైఖేల్ బరీ' కీలక వ్యాఖ్యలు చేశారు.బిట్‌కాయిన్ పతనం కేవలం క్రిప్టో మార్కెట్‌కే పరిమితం కాదు. ఇది బంగారం, వెండి వంటి సంప్రదాయ పెట్టుబడులపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని.. మైఖేల్ బరీ హెచ్చరించారు. బిట్‌కాయిన్‌లో పెద్ద నష్టాలు వస్తే, పెట్టుబడిదారులు నగదు కోసం ఇతర ఆస్తులను కూడా అమ్మకానికి పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.బిట్‌కాయిన్ ఇప్పుడు ప్రధాన ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారింది. స్పాట్ బిట్‌కాయిన్ ETFలు, అలాగే కొన్ని పెద్ద కంపెనీలు తమ ట్రెజరీలో బిట్‌కాయిన్‌ను నిల్వ చేసుకోవడం వల్ల, క్రిప్టో మార్కెట్లో జరిగే మార్పులు మిగతా మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. ETFల నుంచి పెట్టుబడులు బయటకు వెళ్తే.. ఆ ఫండ్స్ తమ వద్ద ఉన్న బిట్‌కాయిన్‌ను అమ్మాల్సి వస్తుంది. దీని వల్ల ధరలు మరింత పడిపోతాయని మైఖేల్ బరీ పేర్కొన్నారు.బిట్‌కాయిన్ మరింత పడిపోతే, మైక్రోస్ట్రాటజీ వంటి బిట్‌కాయిన్‌పై భారీగా ఆధారపడిన సంస్థలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని బరీ హెచ్చరించారు. ముఖ్యంగా బిట్‌కాయిన్ ధర 50,000 డాలర్ల వరకు పడితే.. కొంతమంది దివాలా తీయవచ్చని, అలాగే టోకనైజ్డ్ మెటల్స్ (డిజిటల్ గోల్డ్, సిల్వర్) మార్కెట్లో కొనుగోలుదారులు తగ్గిపోతారని చెప్పారు. ఇది ఆయన చెప్పినట్లుగా ఒక 'డెత్ స్పైరల్'.. అంటే ఒక సమస్య మరో సమస్యకు దారితీసే ప్రమాదకరమైన పరిస్థితి.బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. బిట్‌కాయిన్ ద్రవ్యోల్బణానికి రక్షణగా పనిచేస్తుందనే వాదనను బరీ ఖండించారు. అంతే కాకుండా.. బిట్‌కాయిన్.. S&P 500 స్టాక్ సూచీ మధ్య పెరుగుతున్న సంబంధం కూడా ఆందోళన కలిగించే అంశంగా ఆయన పేర్కొన్నారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బరీ చెప్పిందే జరుగుతుందని కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే.. గతంలో కూడా క్రిప్టో మార్కెట్ భారీ పతనాల తర్వాత వేగంగా కోలుకున్న సందర్భాలు ఉన్నాయి. కాగా బంగారం, వెండి ధరలు సాధారణంగా.. వడ్డీ రేట్లు, డాలర్ బలం, నియంత్రణ మార్పులు వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటాయి. కేవలం క్రిప్టో అమ్మకాల వల్ల బంగారం ధరల్లో భారీ మార్పులు సంభవించే అవకాశం లేదు.ఇదీ చదవండి: ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే! -
ఎన్నారైలకు గుడ్‌న్యూస్.. అంత బంగారంపై నోట్యాక్స్
భారత ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో ఎన్నారైలకు బంగారంపై కలిపించిన వెసులుబాటు పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఎన్నార్లైలకు విధించిన బంగారం పరిమితి నిబంధనలను మారుస్తున్నట్లు తెలిపింది.ఇదివరకూ ప్రవాస భారతీయులు భారత్ వచ్చే సమయంలో వారి వెంట ఉన్న బంగారు ఆభరణాలకు విలువ ఆధారంగా సుంకం ఉండేది. మహిళలకు రూ. లక్షలోపు, పురుషులకు రూ. 50 వేల లోపు విలువ ఉన్న పసిడికి ఎటువంటి సుంకం ఉండేది కాదు. ఆ పైన విలువ ఉన్న వాటికి మత్రమే సుంకం చెల్లించే విధంగా నియమాలు ఉండేవి.అయితే ప్రస్తుత బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం పరిమితిపై వెసులుబాటును మార్చుతున్నట్లు ప్రకటించింది. ప్రవాస భారతీయులు స్వదేశానికి వచ్చే సమయంలో మహిళలకు 40 గ్రాములు, పురుషులకు 20 గ్రాముల బంగారాన్ని ఎటువంటి సుంకం లేకుండా తీసుకరావచ్చని పేర్కొంది. ఆ పైన ఉన్న వాటికి మాత్రమే పన్ను చెల్లించాలని తెలిపింది. ఇదివరకూ ఉన్న ద్రవ్య విలువ ఆధారంగా రూ. లక్షకు కేవలం ఆరు గ్రాములు, రూ. 50 వేలకు మూడు గ్రాముల పరిమితే ఉంటుంది. ప్రస్తుతం అది 20 నుంచి 40 గ్రాములకు చేరుకుంది. భారత ప్రభుత్వం ఆ పరిమితిని గణనీయంగా పెంచడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
బంగారం... భద్రతా? భారమా?
భారతీయ సామాజిక, ఆర్థిక వ్యవస్థల్లో బంగారం కేవలం విలు వైన లోహం మాత్రమే కాదు; అదొక సెంటిమెంట్, సామాజిక హోదా. ప్రస్తుతం మధ్యతరగతి మనఃస్థితికి, జాతీయ ఆర్థిక నిర్మా ణానికి మధ్య ఇది ఒక విరోధాభాసగా మారింది. ఒకవైపు బంగారం కొనాలనే సామాజిక అంచనాలు, మరోవైపు కొనలేని ఆర్థిక వాస్త వాల మధ్య సామాన్య కుటుంబాలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. బంగారం ధరల పెరుగుదల ప్రభావం ప్రధానంగా ఆడపిల్లల తల్లిదండ్రులపై పడుతోంది. సమాజంలో వేళ్లూనుకున్న కట్నకాను కల సంస్కృతి, పరువు–ప్రతిష్ఠల పేరిట సాగే ఆడంబరాలు ఒక సామాజిక సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. కుమార్తె వివాహం కోసం జీవితకాలపు పొదుపును ఖర్చు చేయడమే కాకుండా, బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి చివరకు ‘అప్పుల చక్రం’లో చిక్కుకుంటున్నారు. సంపన్న వర్గాలకు బంగారం ఒక ‘హెడ్జింగ్’ సాధనం. మార్కెట్ అస్థిరత ఉన్న ప్పుడు అది భద్రమైన పెట్టుబడిగా మారి వారి సంపదను పెంచుతుంది. అయితే ఇదే క్రమంలో సామాజిక, ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక కోణంలో చూస్తే, ప్రపంచంలోనే అగ్రగామి బంగారం దిగుమతి దేశంగా భారత్ విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఇది చెల్లింపుల సమతుల్యత లోటును పెంచి, రూపాయి విలువను బలహీనపరుస్తోంది. రూపాయి బలహీనపడితే దిగుమతుల ఖర్చు పెరిగి ద్రవ్యోల్బణం మళ్లీ తీవ్రమవుతుంది.కీలకమైన అంశం ఏమిటంటే, బంగారంపై పెట్టే అధిక పెట్టుబడి వల్ల దేశంలో ఉత్పాదక మూలధనం క్షీణిస్తోంది. పరిశ్రమలు, మౌలిక సదుపా యాలు, సాంకేతిక రంగాల్లో పెట్టుబడిగా వెళ్లాల్సిన నగదు బంగారంరూపంలో అచేతనంగా ఉండిపోతోంది. ఇది దేశ ఆర్థికవృద్ధి రేటును మందగింపజేస్తూ ‘అవుట్‌పుట్ గ్యాప్’ను సృష్టిస్తోంది. ప్రభుత్వం సావరీన్ గోల్డ్ బాండ్లు, జీఎస్టీ వంటి చర్యల ద్వారా భౌతిక బంగారం వైపు ప్రజలు వెళ్లకుండా చూస్తున్నా, సామాజిక దృక్పథం మారనంతవరకు ఆశించిన ఫలితం ఉండదు.బంగారాన్ని గౌరవానికి చిహ్నంగా కాకుండా, ఒక సాధారణ పెట్టుబడిగా మాత్రమే చూడాలి. ప్రజలు మ్యూచువల్ ఫండ్లు, పెన్షన్ పథకాల వంటి ప్రత్యా మ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. పాఠశాల స్థాయి నుంచే ఆర్థిక విద్యనుఅందించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలి. బంగారం ధరల పెరుగు దల కేవలం మార్కెట్ పరిణామం కాదు; అదొక వ్యవస్థాగత హెచ్చరిక. మానవ మూలధనం, ఆర్థిక అవగాహన, సామాజిక సంస్కరణలే నిజమైన సంపద అని గుర్తించడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం. – ఆత్మకూరి ప్రశాంత్ చారి ‘ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫ్యాకల్టీ -
మళ్లీ ట్రెండ్‌లోకి వెండి
న్యూఢిల్లీ: జీవితకాల గరిష్ట స్థాయిల నుంచి వరుసగా మూడు రోజుల పాటు తీవ్ర పతనాన్ని చూసిన వెండి, బంగారం ధరలు తిరిగి కోలుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాల మధ్య ఢిల్లీ మార్కెట్లో విలువైన లోహాల ధరలు ర్యాలీ చేశాయి. వెండి కిలోకి ఏకంగా రూ.24,000 పెరిగి (9.23 శాతం) రూ.2.84 లక్షలకు (పన్నులతో కలుపుకుని) చేరింది. పసిడి సైతం 10 గ్రాములకు రూ.5,000 లాభపడి (3.3 శాతం) రూ.1,57,700 స్థాయిని తాకింది. జనవరి 29న వెండి రూ.4,04,500 వద్ద, పసిడి సైతం రూ.1,83,000 వద్ద ఆల్‌టైమ్ గరిష్టాలను నమోదు చేయడం తెలిసిందే.కొనుగోళ్ల మద్దతు.. ‘‘బంగారం ఇటీవలి నష్టాలను మంగళవారం కొంత భర్తీ చేసుకుంది. వెండి ధర సైతం గణనీయంగా పెరిగింది. రెండు రోజుల భారీ విక్రయాలతో ధరలు క్షీణించడాన్ని ఇన్వెస్టర్లు చక్కని అవకాశంగా చూశారు’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. దీర్ఘకాల పొజిషన్లు తీసుకునేందుకు దిద్దుబాటు కోసం వేచి చూసిన ఇన్వెస్టర్లు.. ధరలు దిగిరావడాన్ని అవకాశంగా భావించినట్టు వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి స్పాట్ ధర ఔన్స్‌కు 9.55 డాలర్లు (12.07) పుంజుకుని 88.77 డాలర్లకు చేరింది.బంగారం సైతం ఔన్స్‌కు (31.10 గ్రాములు) 275 డాలర్లు లాభపడి (5.91 శాతం) 4,935.49 డాలర్ల స్థాయిని తాకింది. బంగారం, వెండికి అధిక మార్జిన్లు అవసరం కావడం, ఈ ఏడాది మేలో ఫెడ్ చైర్మన్ పావెల్ పదవీ కాలం ముగిసే వరకూ రేట్ల సవరణ ఉండదన్న అంచనాలు, రేట్ల పరంగా కఠిన దృక్పథం కలిగిన వార్‡్షను కొత్త చైర్మన్‌గా ప్రతిపాదించడం క్రితం మూడు సెషన్లలో బంగారం, వెండిలో విక్రయాలకు దారితీసినట్టు కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ ఏవీపీ కేనత్ చైన్వాలా వివరించారు. వీటి ధరలు సమీప కాలంలో అస్థిరంగానే ఉండొచ్చన్నారు. -
మళ్లీ పుంజుకున్న గోల్డ్, సిల్వర్: కొత్త ధరలు ఇలా..
జనవరి 30 నుంచి భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేటు మళ్లీ పెరుగుదల దిశగా పయనించింది. ఈ రోజు (మంగళవారం) ఉదయం రూ. 151750 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి మారిపోయింది. దీంతో పసిడి కొనుగోలుదారుల్లో మరోమారు ఒకింత ఆందోళన మొదలైంది. అయితే ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి రూ.1,53,930 (రూ.760 పెరిగింది) వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,41,100 వద్ద (రూ. 700 పెరిగింది) ఉంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై మొదలైన నగరాల్లో కూడా ఉన్నాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు వరుసగా రూ.740 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ.700 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,54,080 రూపాయల దగ్గర, 22 క్యారెట్స్ తులం పసిడి ధర రూ.1,41,250 వద్ద నిలిచాయి.చెన్నైలో గోల్డ్ రేటు ఎలా ఉందనే విషయానికి వస్తే.. ఇక్కడ బంగారం ధర దేశంలోని ఇతర నగరాల కంటే ఎక్కువ పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 3,490 రూపాయలు పెరిగి రూ.1,55,670 వద్ద నిలిచింది. 22 క్యారెట్స్ తులం రేటు 3200 రూపాయలు పెరిగి రూ.1,42,700 వద్దకు చేరింది.సిల్వర్ రేటుమంగళవారం ఉదయం రూ.20 వేలు తగ్గిన సిల్వర్ రేటు.. సాయంత్రానికి అంతే పెరిగింది (రూ.20,000 పెరిగింది). దీంతో రూ. 2.80 లక్షల దగ్గర ఉన్న కేజీ వెండి రేటు రూ. 3 లక్షలకు చేరింది.ఇదీ చదవండి: జియో, ఎయిర్టెల్.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే! -
తలైవా మెచ్చిన కార్మికురాలు.. నిజాయితీలో బంగారం..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన గొప్ప మనసు చాటుకున్నారు. నిజాయితీ గల పారిశుద్ధ్య కార్మికురాలిని ఆయన అభినందించారు. చెన్నై మహానగర పాలకసంస్థలో కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మను ఇంటికి పిలిచి మరీ సత్కరించారు. ఆమె నిజాయతీని సూపర్ స్టార్ రజనీకాంత్ మెచ్చుకోవడంతో పాటు బంగారు గొలుసును బహుకరించారు.అసలేం జరిగిందంటే..చెన్నై నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మకు 45 తులాల బంగారం దొరికింది. తనకు దొరికిన ఆ బంగారాన్ని వెంటనే పోలీసులకు అప్పగించింది. దీంతో తనకు రోడ్డుపై దొరికిన 45 తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించడంపై ఆమె ప్రశంసలు వర్షం కురిసింది. ఆమె నిజాయితీని ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఈ విషయం తెలుసుకున్న తలైవా ఆమెను ఇంటికి పిలిచి సన్మానించారు. ఆప్యాయంగా మాట్లాడిన రజనీకాంత్.. ఆమెకు ఒక బంగారపు గొలుసు గిఫ్ట్‌గా అందించారు. దీంతో ఆమె ముఖంలో ఆనందంతో నిండిపోయింది.అంతేకాకుండా పద్మకు భారత తపాలా శాఖ ఇటీవలే అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమె ఫొటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆమెకు రూ.15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా అందించింది. అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వం ఆమెను అభినందిస్తూ రూ.లక్ష నగదు బహుమతిని చెక్కు రూపంలో ఇచ్చింది. పరుల సొమ్ము తనకు వద్దని పోలీసులకు అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ⭐ A Heartwarming Gesture by #SuperstarRajinikanth ⭐Superstar #Rajinikanth personally called Padmaa and honoured her with a gold chain 👑✨Padmaa, a frontline worker, earned widespread appreciation after she recovered 45 sovereigns of gold jewellery found on the road and… pic.twitter.com/1vHv6NBF7u— Danishkumar Sankaran (@S_Danishkumar) February 3, 2026 -
బంగారం చూస్తే అలా..వీడేమో ఇలా!
అసలే బంగారం ధరలు కొండెక్కి కూచున్న తరుణంలో ఉత్తర ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. తనకిష్టమైన మెమోల కోసం లక్షల రూపాయల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టేశాడో టీనేజర్. చివరికి విషయం తెలిసిన కుటుంబ సభ్యులు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు.ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాంపూర్ కర్ఖానా పోలీస్ పరిధిలోని ఒక గ్రామంలో 14 ఏళ్ల కుమారుడి నిర్వాకాన్ని తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. వారణాసికి చెందిన పూజారి విమ్లేష్ మిశ్రా దాఖలు చేసిన అధికారిక ఫిర్యాదు ప్రకారం కొడుకు అమాయకత్వాన్ని వాడుకుని స్థానిక మోమోల దుకాణాల యజమానులు సుమారు రూ. 85 లక్షల విలువైన బంగారాన్ని దోచేశారు.ఇంట్లో అడిగితే డబ్బులు ఇవ్వరనుకున్నాడో ఏమోగానీ, ఏడవ తరగతి విద్యార్థి ఒక రోజుబీరువాలోని నగ తీసుకెళ్లి, దుకాణదారులకిచ్చి కావాలను కున్నప్పుడల్లా చెక్కగా మోమోలను లాగించేవాడు.ఈ చోరీనిఇంట్లో వాళ్లు కూడా గుర్తించక పోవడంతో దాన్నే అలవాటుగా మార్చుకున్నాడు. అటు దుకాణాదారులు కూడా పిల్లవాణ్ని వారించడంగానీ, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంగానీ చేయలేదు. పైగా ఆభరణాలు తెస్తేనే మెమోలు ఇస్తామని బాలుడు బెదిరించినట్టు సమాచారం.ఎలా బైట పడిందంటేబాలుడి అత్త పుట్టింటికి వచ్చి, తన నగలకోసం ఆరా తీయడంతో, బీరువాలో నగలు మాయమయ్యాయన్న సంగతిని గమనించారు. అనుమానం వచ్చిన బాలుడిని విచారించగా, ఆభరణాలను మోమోలు అమ్మేవారికి ఇచ్చేసినట్లు బాలుడు తన చేసిన పని గురించి చెప్పుకొచ్చాడు. బాలుడి అత్త తన ఆభరణాలను తీసుకోవ డానికి పుట్టింటికి వచ్చినప్పుడు నిజం బయటపడింది. కనిపించకుండా పోయిన ఆభరణాల ప్రస్తుత విలువ రూ. 85 లక్షలు దాకా ఉంటుందని దిగ్భ్రాంతికి గురైన విమ్లేష్ మిశ్రా, ముగ్గురు దుకాణ యజమానుల పేర్లను పేర్కొంటూ లిఖితపూర్వక ఫిర్యాదు దాఖలు చేశారు.దర్యాప్తు జరుగుతోందని పోలీసులు ధృవీకరించారు. వివరాలను ధృవీకరించి, నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు. అధికారులు ఇప్పుడు నిందితులైన విక్రేతలను గుర్తించి సబంధిత ఆభరణాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఎంత బంగారం పోయింది? దాని విలువ ఎంత అనే వివరాలను కూపీ లాగుతున్నారు.ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా? -
బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల!
యూనియన్ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టిన తరువాత.. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈ ప్రభావం ఈ రోజు (ఫిబ్రవరి 2) కూడా కొనసాగింది. దీంతో రేట్లు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. సోమవారం పసిడి ధర గరిష్టంగా 10370 రూపాయలు తగ్గింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయి వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
కుప్పకూలిన బంగారం, వెండి!.. కియోసాకి ట్వీట్
ధనికులు, పేదల మధ్య ప్రధాన తేడా డబ్బు కాదు, ఆలోచనా విధానమే అంటున్నారు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి'. దీనికి సంబంధించిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వాల్‌మార్ట్ వంటి వాటిలో సేల్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలావరకు పేదవాళ్లే తండోపతండాలుగా వెళ్లి.. అవసరం ఉన్నా, లేకున్నా వస్తువులు కోనేస్తుంటారు. తక్కువ ధర అని తెలియగానే.. ఇప్పుడు పోతే ఇలాంటి అవకాశం మళ్లీ రాదనే భావనతో ఖర్చు చేస్తారు. ఇది తక్షణం మాత్రమే సంతృప్తిని ఇస్తుంది.. కానీ దీర్ఘకాల లాభం ఉండదు.అయితే.. మార్కెట్లో క్రాష్ వచ్చినప్పుడు (షేర్స్, బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరలు తగ్గినప్పుడు) పేదవాళ్లు భయంతో తమ పెట్టుబడులను అమ్ముకుంటారు. ఇంకా పడిపోతే.. నష్టం వస్తుందనే భయమే దీనికి కారణం. ఇలాంటి సమయంలోనే ధనవంతులు కొనుగోలు చేయడానికి సిద్ధపడతారు.ధరలు పడిపోయినప్పుడు, భవిష్యత్తులో విలువ పెరిగే ఆస్తులను తక్కువ ధరకు ధనవంతులు కొనుగోలు చేస్తారు. మార్కెట్ క్రాష్ వచ్చినా వారు భయపడరు. పైగా డబ్బును పోగు చేసి లేదా ఉన్న డబ్బుతోనే.. తెలివిగా పెట్టుబడులు పెడతారు. ఇటీవల బంగారం, వెండి, బిట్‌కాయిన్ మార్కెట్లు పడిపోవడం కూడా ఇలాంటిదే. కొందరికి ఇది నష్టం లాగా కనిపించినా, మరికొందరికి ఇది గొప్ప అవకాశం.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల్లో ఊహకందని మార్పు!ధనికులు నష్టాల్లో లాభాన్ని చూస్తారు.. పేదలు భయాన్ని చూస్తారు. మార్కెట్ పైకి వెళ్లినప్పుడు కొనడం కాదు, కింద పడినప్పుడు ధైర్యంగా నిర్ణయం తీసుకోవడమే ఆర్థిక విజ్ఞానం. డబ్బు కన్నా ముందు మన ఆలోచనలు మారితేనే, మన భవిష్యత్తు మారుతుందంటున్నారు కియోసాకి.బంగారం, వెండి & బిట్‌కాయిన్ మార్కెట్ ఇప్పుడే కుప్పకూలింది. అంటే అమ్మకానికి వచ్చింది. నేను వీటిని (గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్) కొనడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు ఏమి చేయబోతున్నారు? అంటూ కియోసాకి ట్వీట్ పూర్తి చేశారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు చెబుతారు. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.DIfFERENCE BETWEEN Rich People and Poor People:When Walmart has a SALE poor people rush in and buy, buy, buy.Yet when the Financial Asset Market has a sale….a.k.a…..CRASH…the poor sell and run….while the rich rush in….and buy, buy, buy.The gold, silver, and Bitcoin…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 1, 2026 -
బంగారం, వెండి ధరల్లో ఊహకందని మార్పు!
భారతదేశంలో బంగారం ధరలు వారం ప్రారంభంలో భారీగా పెరిగి.. వారాంతంలో ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి?, ఎంత తగ్గాయి?, ఎంత పెరిగాయనే.. విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.జనవరి 25న 1,60,260 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. జనవరి 31న 1,60,580 రూపాయల వద్దకు చేరింది. వారాంతంలో గోల్డ్ రేటు భారీ తగ్గినప్పటికీ.. సోమవారం నుంచి శనివారం వరకు రూ. 3,200 పెరిగినట్లు తెలుస్తోంది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. 1,46,900 రూపాయల నుంచి 1,47,200 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు రూ. 3,000 పెరిగింది.చెన్నైలో సోమవారం (జనవరి 25) రూ. 1,59,490 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. శనివారం నాటికి రూ. 1,62,550 రూపాయల వద్దకు (3060 రూపాయలు పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,47,500 నుంచి రూ. 1,49,000లకు (రూ.1500 పెరిగింది) చేరింది.ఇదీ చదవండి: పేలిన గోల్డ్ బబుల్.. లీ మాటలు నిజమవుతున్నాయా?ఢిల్లీలో వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత పెరిగాయనే విషయానికి వస్తే.. జనవరి 25న 1,60,410 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం.. జనవరి 31 నాటికి 1,60,730 రూపాయల వద్దకు (3200 రూపాయలు పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల రేటు 1,47,050 రూపాయల నుంచి 1,47,350 రూపాయల వద్దకు (రూ.3000 పెరిగింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే వెండి ధరల్లో కూడా భారీ మార్పులు జరిగాయి. జనవరి 25న రూ.3.65 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. జనవరి 31 నాటికి రూ. 3.20 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఈ లెక్కన కేజీ ధర 45000 రూపాయలు తగ్గిందన్న మాట. -
శాస్త్రవేత్తలే షాకయ్యారు.. అసలేంటి ‘గ్రేవ్ 43’?
బంగారం.. బంగారం.. బంగారం.. రోజురోజుకూ పెరుగుతున్న పసిడి ధరలతో ఇప్పుడు గోల్డ్ హెడ్‌లైన్స్ అవుతోంది.. బ్రేకింగ్ న్యూస్‌గా మారుతోంది. కానీ, ఓ చోట సమాధుల్లో కుప్పలు తెప్పలుగా బంగారం దొరికిందంటే మీరు నమ్ముతారా? ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6,600 సంవత్సరాల క్రితమే.. ఆ సమాధుల్లో బంగారాన్ని పెట్టారని, ఆ కాలంలోనే బంగారాన్ని అందమైన ఆభరణాలుగా మార్చారని తెలిస్తే.. షాకవుతారు కదా? ఆ విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చాం. వివరాలను చదవాల్సిందే.62 సమాధులు.. కిలోల కొద్దీ బంగారం..అది బల్గేరియాలోని వర్ణా అనే నగరంలో ఉన్న శ్మశానం..! ప్రాంతం. 1972లో పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ తవ్వకాలు చేపట్టారు. ఓవైపు పారిశ్రామిక ప్రాంతం, మరో వైపు, కార్మికుల నివాస సముదాయాలు ఉండే ఆ ప్రాంతంలోని శ్మశానంలో జరిపిన తవ్వకాలతో శాస్త్రవేత్తలు అవాక్కయ్యారు. అక్కడ మొత్తం 300 సమాధులు బయటపడగా.. వాటిల్లో 62 సమాధుల్లో కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు లభించాయి.పరిశోధనల్లో ఏం తేలిందంటే..అందమైన నగలే కాకుండా.. రాజదండం, ఇతరత్రా రాచముద్రల రూపంలోనూ బంగారం లభ్యమైంది. కార్బన్ డేటింగ్ వంటి తదనంతర పరిశోధనల్లో తేలింది ఏమిటంటే.. ఆ సమాధుల్లోని మృతదేహాలు క్రీస్తు పూర్వం 4600 నుంచి 4300 సంవత్సరాల మధ్య కాలానికి చెందినవి. అంటే.. మనముంటున్న కాలంతో పోలిస్తే.. దాదాపు 6 వేల సంవత్సరాల కిందటివన్నమాట. అంటే.. అప్పట్లోనే బంగారంపై మోజు ఉన్నట్లు తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఒకింత ఆశ్చర్యచకితులయ్యారు.ఏకంగా మృత కళేబరానికి..ఈ సమాధుల్లో ‘గ్రేవ్ 43’ ఏకంగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఆ సమాధిలో కిలోన్నరకుపైగా బంగారం ఓ మృతదేహం వద్ద లభ్యమైంది. ఆ మృతదేహాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. అతను మృతిచెందినప్పుడు 60 ఏళ్ల వయసు ఉంటుందని అంచనా వేశారు. అంతలా బంగారం లభించడాన్ని బట్టి.. అతను సంబంధిత తెగకు నాయకుడై ఉంటారని భావించారు. గ్రేవ్ 43లో ఏకంగా మృత కళేబరానికి బంగారు గొలుసులు, చేతి కంకణాలు, చెవిపోగులున్నాయి. దీంతోపాటు.. బంగారు రాజదండం, బంగారు పూత పూసిన ఆయుధం ఆ సమాధిలో లభించాయి.అబ్బురపరిచే అద్భుత శైలిఇప్పుడు ఈ సమాధులు ఎందుకు హాట్ టాపిక్ అయ్యాయంటే.. మీకు తెలిసిందే..? బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి. అందుక్కారణం ప్రజల్లో బంగారంపై మోజు పెరగడమే..! భారత్‌లో బంగారు ఆభరణాలు స్టేటస్‌కి నిదర్శనమైతే.. విదేశాల్లోనూ వేల ఏళ్ల క్రితమే అంతటి క్రేజ్ ఉందని ఈ సమాధులు స్పష్టం చేస్తున్నాయి. మెషీన్లతో కాకుండా.. పూర్తిస్థాయిలో చేతితో చేసిన బంగారు ఆభరణాలు అంత అద్భుత శైలిలో తయారు చేయడం ఇప్పటి తరాన్ని అబ్బురపరుస్తున్నాయి.6,600 ఏళ్ల క్రితమే..అంటే.. 6,600 ఏళ్ల క్రితమే బంగారాన్ని కనుక్కొన్నారనే విషయం ఒక ఎత్తయితే.. దాన్ని శుద్ధి చేసి, హ్యాండీక్రాఫ్ట్ మాదిరిగా చేతితోనే ఆభరణాలుగా మార్చడం మరో విశేషం. అంతేకాదు.. ఆ కాలంలోనే సంపద అనేది సమాజంలో విభజనకు కారణమనే విషయం స్పష్టమైంది. వర్ణా శ్మశానంలో బయటపడ్డ 300 సమాధుల్లో కేవలం 62 గ్రేవ్స్లో మాత్రమే బంగారు ఆభరణాలుండడం ఇందుకు నిదర్శనం. సింధూనాగరికత సమయంలో కోటల్లో ఎగువ వర్గాలు.. కోట బయట దిగువ స్థాయి వర్గాలుండేవని చదువుకున్న విషయం తెలిసిందే..! ఈ సమాధులను పరిశీలిస్తే.. 6,600 ఏళ్ల క్రితమే బల్గేరియాలో కూడా ఇలాంటి సామాజిక ఆంతర్యాలున్నట్లు స్పష్టమవుతోంది. ఆ సమాధుల్లోంచి వెలికి తీసిన ఆభరణాలు ప్రస్తుతం బల్గేరియాలోని వర్ణా ఆర్కియాలజికల్ మ్యూజియంలో సందర్శకుల కోసం అందుబాటులో ఉన్నాయి. -
పేలిన గోల్డ్ బబుల్.. లీ మాటలు నిజమవుతున్నాయా?
బంగారం, వెండి ధరలు తగ్గుతాయి.. తొందరపడి కొనుగోలు చేయకండి అని గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'విలియం లీ' హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఆయన మాటలు నిజయమయ్యాయా అనిపిస్తోంది.గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో రేట్లు భారీగా తగ్గిపోయాయి. ధరల తగ్గుదల అటు పెట్టుబడిదారుల్లో.. వ్యాపారుల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. పసిడి ధరల పెరుగుదలను లీ.. నీటి బుడగ(బబుల్)తో పోల్చారు. ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉందన్నారు. ఆ గోల్డ్ బబుల్ ఇప్పుడు పేలిపోయింది.జనవరి 30న బంగారం ధర దాదాపు 9 శాతం తగ్గిపోయి రూ. 1.67 లక్షలకు (10 గ్రాములు) చేరింది. వెండి కూడా రెండు రోజుల్లో కేజీ ధర రూ. 75వేలు తగ్గింది. దీంతో సిల్వర్ రేటు 3.50 లక్షలకు చేరింది. ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.వైట్ ఓక్ క్యాపిటల్ ప్రకారం.. బంగారం & వెండి ధరలను భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థలోని వ్యవస్థాగత ప్రమాదాలు & కరెన్సీపై ఒత్తిడి వంటివి ప్రభావం చూపుతాయి. నిజానికి వెండి.. బంగారం నిష్పత్తి 80:1గా ఉండేది. కొన్నాళ్లుగా పెరిగిన ధరలు ఈ నిష్పత్తిని 46:1కి చేర్చింది. దీన్నిబట్టి వెండి ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడం ఇదే మొదటిసారి కాదు. 2011 ఏప్రిల్‌లో కేజీ వెండి ధర రూ.73,288 వద్దకు చేరి, ఆ తరువాత 55 శాతం పడిపోయింది. తిరిగి ఆ స్థాయి నుంచి కోలుకోవడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది. అదే విధంగా.. 2012 సెప్టెంబర్‌లో బంగారం 10 గ్రాములకు రూ.32,147 వద్ద గరిష్టాన్ని తాకి, 25 శాతం పడిపోయింది. మళ్ళీ మునుపటి స్థాయికి చేరుకోవడానికి ఏడు సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అవుతుందా? అని చాలామంది అనుకుంటున్నారు. -
లక్కుండి తవ్వకాల్లో పాము ప్రత్యక్షం
బెంగళూరు: గదగ్ జిల్లాలో లక్కుండిలో పురాతత్వశాఖ చేపట్టిన తవ్వకాల్లో శుక్రవారం ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఎ–1 గుంతలో తవ్వకాలు చేస్తుండగా రెండున్నర అడుగుల పాము ప్రత్యక్షమైంది. సూపర్వైజింగ్ చేస్తున్న సిబ్బంది కాసేపు తవ్వకాలు ఆపేశారు. అనంతరం పామును సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా పురాతన కాలం నుంచి గుప్త నిధులను పాములు కాపాడుతున్నట్లు గతంలో స్థానికులు పేర్కొన్నారు. ప్రస్తుతం పాము కనిపించడంతో తాము చెప్పినది నిజమని పేర్కొంటున్నారు. -
బంగారం, వెండి ధరలు క్రాష్
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అమ్మా.. తల్లీ.. బంగారం ధర తగ్గించు
కర్ణాటక: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరల గురించి సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ధరలు తగ్గించాలని కోరుతూ ఓ భక్తుడు అరటిపండుపై రాసి అమ్మవారికి సమర్పించాడు. ఈఘటన విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని చిమ్మల్లి గ్రామంలో జరిగింది. గ్రామంలో కొలువైన దుర్గమ్మ అమ్మవారి రథోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఒక భక్తుడు అరటి పండుపై బంగారు వరుడు దిగి రావాలి. బంగారం నేలపై చల్లుకోవాలి అని రాశాడు. అతను దానిని భక్తితో అమ్మవారి రథానికి సమర్పించి తన ప్రతిజ్ఞను నెరవేర్చాడు. ఈ ఘటన భక్తులలో ఉత్సుకతను రేకెత్తించింది. -
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?
-
మెటల్స్ క్రాష్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్స్ మధ్య ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు దిగడం, అమెరికా డాలరు పుంజుకోవడం తదితర అంశాల నేపథ్యంలో శుక్రవారం బంగారం, వెండి ధరలు గణనీయంగా పతనమయ్యాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి 10 గ్రాముల రేటు ఏకంగా రూ. 14,000 క్షీణించి రూ. 1,69,000కు తగ్గింది. అటు వెండి సైతం కేజీకి రూ. 20,000 తగ్గి రూ. 3,84,500కి క్షీణించింది. దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో బంగారం ఏప్రిల్ కాంట్రాక్టు 8% క్షీణించి రూ. 1,68,750 వద్ద ట్రేడయ్యింది.సిల్వర్ మార్చ్ కాంట్రాక్టు ఒక దశలో క్రితం ముగింపు రూ. 4,20,048తో పోలిస్తే ఏకంగా రూ. 1,07,971 మేర పతనమైంది. దాదాపు 27% పడిపోయి రూ. 2,91,922 వద్ద ట్రేడయ్యింది. రికార్డు బ్రేకింగ్ ర్యాలీ అనంతరం లాభాల స్వీకరణ జరగడంతో పసిడి, వెండి ధరలు కరెక్షన్‌కి లోనైనట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయంగా స్పాట్ మార్కె ట్లో బంగారం ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 285.30 డాలర్లు తగ్గి 5,087.73 డాలర్లకు క్షీణించింది. ఒక దశలో 425.86 డాలర్లు క్షీణించి 4,945.26 డాలర్లకు పతనమైంది. ఇక వెండి కూడా ఇంట్రాడేలో 17.5 శాతం పడి 95.26 డాలర్లను కూడా తాకింది. చివరికి 12% (14 డాలర్లు) తగ్గి 101.47 డాలర్ల వద్ద ముగిసింది. ఫ్యూచర్స్ మార్కెట్ కామెక్స్‌లో పుత్తడి ఏప్రిల్ కాంట్రాక్టు 273 డాలర్లు తగ్గి 5,085 డాలర్ల దగ్గర ట్రేడయ్యింది. వెండి దాదాపు 16 డాలర్లు క్షీణించి 98.70 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. -
గంటల వ్యవధిలో.. పతనమైన బంగారం, వెండి!
గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. శుక్రవారం గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 9000కంటే ఎక్కువ తగ్గింది. ఇదే బాటలో వెండి కూడా అడుగులు వేసింది. దీంతో ఉదయం ధరలకు.. తాజా ధరలకు చాలా మార్పు కనిపించింది.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,69,200 వద్ద ఉండగా, 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,55,100 రూపాయల వద్ద ఉంది.ఢిల్లీ, చెన్నై నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 169350 & రూ. 158500 వద్ద నిలిచాయి. 22 క్యారెట్ల తులం పసిడి విషయానికి వస్తే.. రూ. 155250 & రూ. 158500 వద్ద ఉన్నాయి.వెండి ధరలు రూ. 4.25 లక్షల నుంచి.. రూ. 4.05 లక్షల వద్దకు పడిపోయాయి. అంటే గంటల వ్యవధిలో కేజీ సిల్వర్ రేటు 25వేల రూపాయలు తగ్గిందన్నమాట.బంగారం ధరలపై విలియం లీ స్పందనబంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీన్ని చూసి చాలామంది గోల్డ్ కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. రేట్ల పెరుగుదల విషయంలో ప్రజలు గాబరాపడాల్సిన అవసరం లేదు. పెరిగిన ధరలకు కారణం.. ప్రపంచ రాజకీయ, సామాజిక పరిస్థితులే అని గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'విలియం లీ' పేర్కొన్నారు.పసిడి ధరల పెరుగుదలను లీ.. నీటి బుడగ(బబుల్)తో పోల్చారు. ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉంది. అంటే గోల్డ్ రేటు ఏ సమయంలో అయినా భారీగా తగ్గిపోతుందని అన్నారు. కాబట్టి ధరలు పెరుగుతున్నాయి, భవిష్యత్తులో బంగారం దొరకదేమో అని ఎగబడి బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.ఇదీ చదవండి: రూ.4000 విలువైన ప్రీమియం.. ఏడాదిపాటు ఉచితం! -
అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం కొనొద్దు.. విలియం లీ హెచ్చరిక!
2025 జనవరిలో రూ. 78వేలు వద్ద ఉన్న బంగారం ధర 2026 జనవరికి రూ. 1.78లక్షలు క్రాస్ చేసింది. ఏడాది కాలంలో లక్ష రూపాయలు పెరిగిందన్నమాట. గోల్డ్ రేటు రోజు రోజుకి పెరుగుతున్న తీరు చూసి పసిడి ప్రియులలో కూడా ఒకింత భయం మొదలైంది. ఇది వరకు ఎప్పుడూ లేనంతగా.. పెరిగిపోతుండడంతో రాబోయే రోజుల్లో గోల్డ్ కొనడానికి సాధ్యమవుతుందా అని ఆలోచిస్తున్నారు.బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీన్ని చూసి చాలామంది గోల్డ్ కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. రేట్ల పెరుగుదల విషయంలో ప్రజలు గాబరాపడాల్సిన అవసరం లేదు. పెరిగిన ధరలకు కారణం.. ప్రపంచ రాజకీయ, సామాజిక పరిస్థితులే అని గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'విలియం లీ' పేర్కొన్నారు.పసిడి ధరల పెరుగుదలను లీ.. నీటి బుడగ(బబుల్)తో పోల్చారు. ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉంది. అంటే గోల్డ్ రేటు ఏ సమయంలో అయినా భారీగా తగ్గిపోతుందని అన్నారు. కాబట్టి ధరలు పెరుగుతున్నాయి, భవిష్యత్తులో బంగారం దొరకదేమో అని ఎగబడి బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.కొన్ని సంస్థలు ఇచ్చే రిపోర్ట్స్ కూడా ప్రజలను భయపెడుతున్నాయి. ఇదంతా ఒక ట్రాప్ అని విలియం లీ పేర్కొన్నారు. కొన్ని పెద్ద సంస్థలు, ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని ఎక్కువ ధరకు విక్రయించుకోవడానికి ఇలా చేస్తుంటారని ఆయన అన్నారు. ఎప్పుడైతే ఒక వస్తువుకు డిమాండ్ పెరుగుతుందో.. దాని ధర కచ్చితంగా పెరుగుతుంది. కానీ బంగారం విషయంలో మాత్రం లండన్, న్యూయార్క్ వంటి దేశాల్లోని కొన్ని పెద్ద బ్యాంకులు ఫిక్స్ చేస్తాయని ఆరోపించారు.ఇదీ చదవండి: ఊహకందని రేటు.. రికార్డు స్థాయికి చేరిన వెండి!1980లో బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరిగాయి. ఈ సమయంలో కూడా చాలామంది ప్రజలు గోల్డ్ కొనడానికి ఎగబడ్డారు. కొన్ని రోజుల తరువాత గోల్డ్ రేటు 57 శాతం పడిపోయింది. 2011లో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు (2026) కూడా ఇదే రిపీట్ అవుతుందని ఆయన అన్నారు. కాబట్టి రేటు పెరిగిందని కొనేయకండి. కొన్ని రోజులు వేచి చూడండి. తప్పకుండా.. బంగారం ధర తగ్గుతుందని చెప్పారు. -
ఊహకందని రేటు.. రికార్డు స్థాయికి చేరిన వెండి!
బంగారం ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్న వారికి.. వెండి కూడా షాకిస్తోంది. ఏకంగా కేజీ సిల్వర్ రేటు రూ. నాలుగు లక్షలు దాటేసింది. భారతదేశంలో మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఈ ఒక్క రోజే (జనవరి 29) కేజీ వెండి రేటు రూ. 25వేలు పెరిగింది. దీంతో సిల్వర్ ధర రూ. 4.25 లక్షలకు (కేజీ) చేరింది. మొత్తం మీద బంగారం వెండి ధరలు జీవితకాల గరిష్టాలను చేరుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లో కూడా బంగారం, వెండి రేట్లు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఔన్సు వెండి రేటు తొలిసారి 5,600 డాలర్లు దాటేసింది.ధరలు పెరగడానికి కారణంబంగారం వెండి ధరలు పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య, బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడమే. స్టాక్ మార్కెట్ వంటి వాటిలో నష్టాలు వస్తాయనే భయంతో.. చాలామంది బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారు. ఇది ధరలు పెరగడానికి కారణమైంది.ఇదీ చదవండి: పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనావెండి ధరలు పెరగడానికి కారణం పారిశ్రామిక డిమాండ్ పెరగడం మాత్రమే కాకుండా.. బలహీనమైన యూఎస్ డాలర్ సిల్వర్ రేటును అమాంతం పెంచేసిందని విశ్లేషకులు తెలిపారు. ఆర్థిక అనిశ్చితులు & పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా గోల్డ్, సిల్వర్ రేటు పెరగడానికి దొఅహదపడ్డాయని చెబుతున్నారు. -
యాదాద్రిలో ఏం జరిగింది.. బంగారు, వెండి డాలర్లు ఎక్కడ?
సాక్షి, యాదగిరిగుట్ట: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అవినీతి బట్టబయలైంది. స్వామి వారి ఆలయంలో ఉన్న బంగారు, వెండి డాలర్లు మాయమైన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భక్తులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన బంగారం, వెండి డాలర్లు పెద్ద సంఖ్యలో కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.వివరాల మేరకు.. ఇటీవల స్వా మివారి లడ్డూ ప్రసాదంలో చింతపండు చోరీ ఘటన మరువకముందే తాజాగా ప్రచార శాఖలో విక్రయించే బంగారు, వెండి డాలర్లు మాయమయ్యాయి. వీటి ఖరీదు సుమారు రూ.10-20 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ఇవి ఏడాది క్రితమే మాయం కాగా ఇటీవల ఆడిట్ అధికారులు తనిఖీలు నిర్వహించి బంగారం, వెండి డాలర్లు మాయమైనట్టు ధ్రువీకరించారు. ఆలయ రికార్డులను తాజాగా పరిశీలించిన ఆడిట్ అధికారులు.. ఆలయానికి చెందిన ప్రచార శాఖలో నిల్వ ఉంచిన డాలర్ల లెక్కల్లో భారీ తేడాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. స్టాక్ రిజిస్టర్‌లోని లెక్కలకు, భౌతికంగా ఉన్న నాణేల సంఖ్యకు పొంతన లేకపోవడంతో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ప్రచార శాఖలో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతారాహిత్యం వల్లే చోరీ జరిగిందని భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఇక, యాదగిరిగుట్ట క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి వారి ప్రతిమతో కూడిన బంగారు, వెండితో సిద్ధం చేసిన డాలర్లను దాదాపు 20 ఏళ్లుగా విక్రయిస్తున్నారు. ఈవో పర్యవేక్షణలో దేవస్థాన ఏఈవో ఆధీనంలో కొనసాగే ప్రచార శాఖలో భద్రపరిచి విక్రయాలు సాగిస్తున్నారు. స్వామి వారికి వివిధ రూపాల్లో వచ్చిన బంగారం, వెండిని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మింట్ కంపౌండ్‌కు ఆలయ ఈవో అందజేస్తారు. -
సిల్వర్ సునామీ.. బంగారం దూకుడు..
-
గోల్డ్ 2 లక్షలు? వెండి 3 లక్షలు? కొందామా! అమ్ముదామా!
-
నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్!
గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు ఊహకందని రీతిలో.. తొలిసారిగా ఔన్స్‌కు 5,000 డాలర్లు దాటేసింది. ఇదే సమయంలో వెండి ధర కూడా ఔన్స్‌కు 100 డాలర్ల నుంచి 105 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతూ.. రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ తరుణంలో చీఫ్ ఎకనామిస్ట్ & గ్లోబల్ స్ట్రాటజిస్ట్ పీటర్ షిఫ్ (Peter Schiff) చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బంగారం ధర 100 డాలర్ల కంటే ఎక్కువ పెరిగి.. 5,085 డాలర్లు దాటేసింది. వెండి ధర 5 డాలర్ల కంటే ఎక్కువ పెరిగి.. 108.25 డాలర్లు క్రాస్ చేసింది. ఈ రెండూ కొత్త గరిష్ట స్థాయిలలో ఉన్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన అస్థిరతకు సంకేతం. ఇది రాబోయే రోజుల్లో సాధారణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే విధంగా పీటర్ షిఫ్ పేర్కొన్నారు.Gold is up over $100, trading above $5,085. Silver is up over $5, trading above $108.25, both at new record highs. Most people are clueless about what this means and are in for quite a shock. Those of us who understand have been expecting the economic crisis that’s about to hit.— Peter Schiff (@PeterSchiff) January 26, 2026బంగారం, వెండి ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణం.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక & రాజకీయ ఉద్రిక్తతలు. ముఖ్యంగా గ్రీన్‌ల్యాండ్ విషయంలో.. అమెరికా & నాటో దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. దీనితో పాటు ఉక్రెయిన్, గాజా వంటి ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా తీసుకుంటున్న చర్యలు కూడా.. పెట్టుబడిదారుల్లో భయాన్ని పెంచుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు కూడా మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా చైనాతో ఒప్పందం కుదుర్చుకుంటే కెనడాపై 100% సుంకం విధిస్తామని ఆయన బెదిరించిన తర్వాత.. పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటివాటిపై పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు. ఇది వీటి ధరలను అమాంతం పెంచేసింది.ఇదీ చదవండి: పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనాఇదిలా ఉండగా.. విశ్లేషకులు బంగారం ధర మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ఔన్సుకు 6000 డాలర్లకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. గోల్డ్ & సిల్వర్ ధరల భారీ పెరుగుదల కేవలం పెట్టుబడి అవకాశంగా మాత్రమే చూడాల్సిన విషయం కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అస్థిరతకు, అప్పుల భారానికి, రాజకీయ ఉద్రిక్తతలకు స్పష్టమైన హెచ్చరిక. కాబట్టి రాబోయే కాలంలో ఆర్థికంగా అప్రమత్తంగా ఉండటం ప్రతి ఒక్కరికీ అవసరం అని నిపుణులు చెబుతున్నారు. -
పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనా
బంగారం ధరలు భారీగా పెరుగుతున్న తరుణంలో.. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' తన ఎక్స్ ఖాతాలో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. భవిష్యత్తులో బంగారం ఎక్కడికి చేరుతుందో అనే విషయాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నారు.బంగారం ధర 5000 డాలర్ల కంటే ఎక్కువగా పెరిగింది. రాబోయే రోజుల్లో 27,000 డాలర్లకు చేరుతుందని కియోసాకి వెల్లడించారు. ఇప్పటికే పలు మార్లు వెండి ధరలు పెరుగుతాయని చెప్పిన కియోసాకి.. ఇప్పుడు గోల్డ్ రేటు భారీగా పెరుగుతుందని పేర్కొన్నారు. నిజంగానే ఆయన చెప్పిన మాటలు బంగారం విషయంలో జరుగుతాయా?, లేదా అనేది తెలియాల్సి ఉంది.GOLD soars over $5000.Yay!!!!Future for gold $27,000.— Robert Kiyosaki (@theRealKiyosaki) January 26, 2026భారతదేశంలో బంగారం, వెండి ధరలుఇండియన్ మార్కెట్లో రోజు రోజుకి పెరుగుతున్న గోల్డ్ రేటు.. ఈ రోజు (జనవరి 26) కూడా పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,950 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,48,450 రూపాయల వద్ద నిలిచింది. సిల్వర్ రేటు రూ. 10వేలు పెరగడంతో.. కేజీ వెండి ధర రూ. 3.75 లక్షలకు చేరింది.బంగారం ధరలు పెరగడానికి కారణాలుద్రవ్యోల్బణం, డాలర్ విలువ తగ్గడం, భౌగోళిక & రాజకీయ కారణాలు, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు, బంగారం సరఫరా పరిమితి, బంగారం పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడం మొదలైన కారణాల వల్ల బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.ఇదీ చదవండి: 168 గంటల్లో రూ. 16వేలు పెరిగిన గోల్డ్ రేటు! -
వామ్మో! బంగారం ఊసు ఎత్తకపోవడమే బెటర్..తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నిర్మాణంలో ఉన్న ఇల్లు బెటరా?
సొంత ఇల్లు కొనాలన్నా, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నా సామాన్యుడికి ఎన్నో లెక్కలు.. మరెన్నో సందేహాలు. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే భద్రంగా ఉంటుంది? ఎక్కడ పెడితే లాభసాటిగా ఉంటుంది? అన్నదే ప్రతి ఒక్కరి ఆలోచన. రియల్ ఎస్టేట్ నుంచి స్టాక్ మార్కెట్ వరకు, బంగారం నుంచి ఇన్సూరెన్స్ వరకు పెట్టుబడిదారుల మదిలో మెదిలే కీలక ప్రశ్నలకు ఆర్థిక నిపుణుల విశ్లేషణాత్మక సమాధానాలు మీకోసం..రియల్టీ..నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయటం మేలా... లేక నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుగోలు చేయాలా?రెండింట్లోనూ దేనికుండే లాభాలు, దేనికి ఉండే ఇబ్బందులు దానికున్నాయి. ఎందుకంటే నిర్మాణం పూర్తయి తక్షణం వెళ్లగల ఇంటిని కొనుక్కోవటం సురక్షితం. వెంటనే వెళ్లిపోవచ్చు. వేచి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలాంటి ఇళ్ల ధర సహ జంగానే ఎక్కువ ఉంటుంది. ఇక నిర్మాణంలో ఉన్న ఇల్లయితే ధర కాస్త తక్కువగా ఉంటుంది. కాకపోతే ఎప్పటికి పూర్తవుతుంది... ఎప్పుడు డెలివరీ ఇస్తారు అనే విషయాలకు గ్యారంటీ ఉండదు. ఇవన్నీ బిల్డరు పూర్వ చరిత్రను చూసి ముందుకు వెళ్లాల్సిన విషయాలే. కాకపోతే ఎంత పేరున్న బిల్డరయినా ఒకోసారి ఇబ్బందులో పడొచ్చు. దానివల్ల మనకు ఇవ్వాల్సిన ఇల్లు ఆలస్యం కావచ్చు. అందుకని మీ అవసరం, వేచిచూసే సామర్థ్యాన్ని బట్టి దేన్ని తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. బ్యాంకింగ్..ఎఫ్డీ చేయాలనుకుంటున్నాను. వడ్డీ రేటును బట్టి బ్యాంకును ఎంచుకోవాలా? లేక సర్వీసును చూశా?మీరు ఎంత మొత్తాన్ని ఎఫ్డీ చేయాలనుకుంటున్నారనేది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే అది తక్కువ మొత్తమే అనుకోండి. వడ్డీ రేటు చూసి ఎఫ్డీ చెయ్యండి. అలాకాకుండా ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేయాలనుకున్నానుకోండి. అపుడు బ్యాంకు అందిస్తున్న సేవలు, డిజిటల్ సౌకర్యాలు, ఆ బ్యాంకు ఎంత సురక్షితమైనది... అనే అంశాలన్నీ చూడాలి. 0.1 లేదా 0.25 వడ్డీ శాతం కన్నా మన సొమ్ము భద్రంగా ఉండటం ముఖ్యం కదా!. అందుకే మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారనే అంశాన్ని బట్టి బ్యాంకును ఎంచుకోండి. మీరు చేసే ఎఫ్డీ గనక రూ.5 లక్షలు లేదా అంతకన్నా తక్కువ ఉంటే.. అది ఏ బ్యాంకులో డిపాజిట్ చేసినా ఆ మొత్తానికి డిపాజిట్ క్రెడిట్ గ్యారంటీ పథకం కింద బీమా ఉంటుంది. కాబట్టి సురక్షితం. బంగారం సావరిన్ గోల్డ్ బాండ్స్ సురక్షితమేనా? అందులో ఇన్వెస్ట్ చేయొచ్చా?సావరిన్ గోల్డ్ బాండ్లు పూర్తిగా సురక్షితం. వాటికి ఆర్బీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ ఇస్తోంది. కాకపోతే ప్రస్తుతం ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చెయ్యటాన్ని కేంద్రం నిలిపేసింది. గతంలో జారీ చేసినపుడు కొన్నవాటికి మాత్రం మెచ్యూరిటీ అయిన వెంటనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇవి మరికొన్ని సంవత్సరాలు జరుగుతాయి కూడా. ఈ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినవారికి బంగారం ధర ఎంత పెరిగితే అంత చెల్లించటంతో పాటు ఏటా 2.5 శాతం మొత్తాన్ని అదనంగా కూడా చెల్లిస్తారు. భౌతికంగా బంగారం కొనటం కన్నా ఇదే ఎక్కువ లాభం కదా!. కాకపోతే ఇందులో ఉండే రిస్కల్లా ఒకటే. బంగారం ధర తగ్గితే చెల్లించేటపుడు తగ్గిన ధరే చెల్లిస్తారు. ఏడేళ్ల పాటు కాలపరిమితి ఉండటంతో పాటు ఐదేళ్ల లాకిన్ కూడా ఉంది.స్టాక్ మార్కెట్...1న బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కనక ఆదివారమైనా స్టాక్ మార్కెట్ పనిచేస్తుందని ప్రకటించారు. బడ్జెట్‌కు, స్టాక్ మార్కెట్‌కు సంబంధమేంటి?బడ్జెట్ ప్రవేశపెట్టిననాడు సెలవు దినమైతే ఆ రోజున స్టాక్ మార్కెట్ ప్రత్యేకంగా పనిచేయటమన్నది ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మొదలైన సంప్రదాయం. గత సంవత్సరం కూడా ఫిబ్రవరి 1 శనివారం వచి్చంది. ఆ రోజునా స్టాక్ మార్కెట్లు పనిచేశాయి. ఇపుడు ఆదివారం కూడా పనిచేస్తాయని ప్రకటించారు. వాస్తవానికి బడ్జెట్ అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదని గతంలో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. కానీ ఇపుడు బడ్జెట్ సమయంలో మార్కెట్ ఎలా ప్రతిస్పందిస్తుందనేది లైవ్‌లో దేశ ప్రజలకు తెలుస్తుందని, తమ నిర్ణయాలకు మార్కెట్ ఆమోదం ఉందో లేదో కూడా తెలిసిపోతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.మ్యూచువల్ ఫండ్స్...సాధారణ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయటం సురక్షితమేనా?షేర్లలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే బాండ్లలో ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్స్ చాలా సురక్షితం. అలాగని వాటిలో రిస్కు ఉండదని కాదు. అవి ఏ బాండ్లు కొంటున్నాయనేదాన్ని బట్టి అవెంత సురక్షితమో చెప్పొచ్చు. సాధారణంగా డెట్‌ఫండ్స్ ప్రభుత్వ సెక్యూరిటీల్లోను, ట్రెజరీ బిల్స్లోను, కార్పొరేట్ బాండ్లలోను, మనీమార్కెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటిలో హెచ్చుతగ్గులు తక్కువ. తక్కువైనా... స్థిరమైన రాబడులుంటాయి. అయితే ఈ ఫండ్లు కార్పొరేట్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. సదరు కంపెనీ క్రెడిట్ రేటింగ్ తగ్గితే అది కొంతమేర రిస్కే. ఇక వడ్డీరేట్లు పెరిగినపుడు బాండ్ల ధరలు తగ్గుతాయి. మార్కెట్ పరిస్థితులు బాగులేకుంటే ఫండ్లు తమ బాండ్లను అమ్మటానికి ప్రయత్నించినా ఎవరూ కొనకపోవచ్చు. ఈ రిస్క్‌లు దృష్టిలో పెట్టుకోవాలి.ఇన్సూరెన్స్ఆయుష్ ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చులు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పరిధిలోకి వస్తాయా?మన దేశంలో ఇపుడు చాలా పాలసీలు ఆయుష్ ట్రీట్మెంట్కు కవరేజీ ఇస్తున్నాయి. కొన్ని షరతులుంటున్నాయి. ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియో పతి వంటి చికిత్సలన్నీ ఆయుష్ పరిధిలోకి వస్తా యి. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలోనో, లేక ప్రభు త్వ గుర్తింపు పొందిన ఆసుపత్రిలోనో, ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ ఉన్న ఆయుష్ ఆసుపత్రిలోనో తీసుకున్న చికిత్సకే కవరేజీ ఇస్తున్నారు. ఔట్‌పేషెంట్ చికిత్సలకు కాకుండా... ఆసుపత్రిలో చేరిన చికిత్స లకే ఇది వర్తిస్తుంది. గుర్తింపు లేని ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా, నేరుగా మందులు కొనుక్కున్నా, వెల్నెస్ థెరపీ, స్పా, రిజువనేషన్ చికిత్సలకు ఇది వర్తించదు. పైపెచ్చు చాలా పాలసీలు కవరేజీ మొత్తాన్ని ఏడాదికి రూ.25వేల నుంచి రూ.50 వేలకు పరిమితం చేస్తున్నాయి.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026: బయో ఇం‘ధనం’ కావాలి.. -
రూ.లక్షల బంగారం.. లాకర్లో సేఫేనా?
ఇటీవల బంగారం ధర భారీగా పెరిగిపోయింది. ఒక్క తులం (10 గ్రాములు) బంగారమే రూ.1.5 లక్షలు దాటిపోయింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల భద్రత గురించి ఆందోళనలు సైతం ఎక్కువయ్యాయి. బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లో ఉంచితే పూర్తిగా సురక్షితం అని చాలామంది భావిస్తారు.నిజానికి, బ్యాంకు లాకర్లు బలమైన భౌతిక భద్రత అందించినప్పటికీ, ఆభరణాలు పోయినా లేదా దెబ్బతిన్నా పూర్తి ఆర్థిక రక్షణ ఇవ్వవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. లాకర్ విషయంలో బ్యాంకుల బాధ్యత పరిమితమైనదే. చాలా సందర్భాల్లో నష్టాన్ని కస్టమరే భరించాల్సి వస్తుంది.లాకర్లోని వస్తువులకు బీమా ఉంటుందా?లాకర్లో ఉంచిన ఆభరణాలకు బ్యాంకు బీమా చేస్తుందనేది ఒక పెద్ద అపోహ. వాస్తవానికి, లాకర్ కంటెంట్‌కు బ్యాంకులు ఎలాంటి బీమా ఇవ్వవు. దొంగతనం, అగ్నిప్రమాదం లేదా ఇతర కారణాల వల్ల ఆభరణాలు నష్టపోయినా, బ్యాంకు ఆటోమేటిక్‌గా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.భద్రతా వైఫల్యం, సిబ్బంది నిర్లక్ష్యం లేదా మోసం, లాకర్ నిర్వహణ లోపాలు వంటి సందర్భాల్లో మాత్రమే బ్యాంకు బాధ్యత వహిస్తుంది. బ్యాంకు తప్పిదం నిరూపితమైనా, పరిహారం మొత్తానికి పరిమితి ఉంటుంది. ఆర్బీఐ నియమాల ప్రకారం, బ్యాంకు చెల్లించే గరిష్ట పరిహారం వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు మాత్రమే. ఉదాహరణకు మీ లాకర్ అద్దె సంవత్సరానికి రూ.4,000 అయితే, మీ ఆభరణాల విలువ ఎంత ఎక్కువైనా గరిష్ట పరిహారం రూ.4 లక్షలు మాత్రమే.వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల లాకర్‌కు నష్టం జరిగితే, బ్యాంకు నిర్లక్ష్యం నిరూపించబడనంత వరకు బ్యాంకు బాధ్యత వహించదు. అటువంటి పరిస్థితుల్లో మొత్తం ఆర్థిక నష్టం కస్టమరుదే.ప్రత్యేక ఆభరణాల బీమా అవసరంవిలువైన బంగారు ఆభరణాలకు ప్రత్యేక జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పాలసీలు సాధారణంగా దొంగతనం, అగ్నిప్రమాదం, డ్యామేజ్, బ్యాంకు లాకర్లో ఉన్నప్పుడూ జరిగే నష్టం వంటి వాటికి కవరేజ్ ఇస్తాయి.క్లెయిమ్ సులభంగా రావాలంటే..ఆభరణాల ఫోటోలు భద్రపరుచుకోండి. తాజా వాల్యుయేషన్ సర్టిఫికెట్లు దగ్గర ఉంచుకోండి. ఆభరణాలు లాకర్లో ఉన్నాయని బీమా కంపెనీకి తెలియజేయండి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం, ఇప్పుడు అన్ని బ్యాంకులు ప్రామాణిక లాకర్ ఒప్పందం అనుసరించాలి. మీరు సంతకం చేసిన అగ్రిమెంట్లో మీ హక్కులు, బ్యాంకు బాధ్యతలు, పరిహార నిబంధనలు స్పష్టంగా ఉన్నాయో లేదో తప్పకుండా పరిశీలించండి.బ్యాంకు లాకర్ భౌతిక భద్రతకు మంచి ఎంపికే కానీ, పూర్తి ఆర్థిక రక్షణ ఉండదు. పరిమిత బ్యాంకు బాధ్యతలు, ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల, లాకర్ + ఆభరణాల బీమా కలిపి ఉపయోగించడమే అత్యంత సురక్షితమైన మార్గం. -
రూ. 450 లక్షల కోట్లు దాటిన దేశంలో ఉన్న బంగారం విలువ
-
బంగారు కొండ..'భారత్'.. జీడీపీని దాటేసిన భారతీయుల బంగారం
సాక్షి, అమరావతి: బంగారం... భారతీయుల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసింది. అంతర్జాతీయంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలతో భారతీయుల సంపద కూడా అంతే వేగంతో పెరుగుతోంది. ప్రస్తుతం భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)ని అధిగమించేసిందంటే ఏ స్థాయిలో ప్రజల వద్ద బంగారం ఉందో అర్థం చేసుకోవచ్చు. భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ తొలిసారిగా 5 ట్రిలియన్ డాలర్ల (రూ.450 లక్షల కోట్ల) మార్కును దాటేసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం... ప్రస్తుతం భారతదేశ జీడీపీ 4.1 ట్రిలియన్ డాలర్ల (రూ.387 లక్షల కోట్లు) వద్దే ఉంది. 2025లో బంగారం 65 శాతం పెరిగి పది గ్రాముల బంగారం ధర రూ.1.40 లక్షలకు చేరినప్పుడు.. భారతీయుల బంగారం విలువ 5 ట్రిలియన్ డాలర్లను దాటినట్లు మోర్గాన్‌స్టాన్లీ నివేదిక వెల్లడించింది. ఇప్పుడు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1.55 లక్షలు దాటడంతో ఈ విలువ మరింత పెరిగింది. భారతీయుల వద్ద ఆభరణాలు, తదితరాల రూపంలో 34,600 టన్నుల బంగారం ఉందని.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 4,500 డాలర్లు అధిగమించడం ద్వారా భారతీయుల బంగారం విలువ దేశ జీడీపీని అధిగమించిందని మోర్గాన్‌స్టాన్లీ పేర్కొంది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 4,987 డాలర్లు అధిగమించింది. ఇది కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వద్ద 880 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. గత రెండేళ్లలో ఆర్బీఐ 75 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. మొత్తం విదేశీ మారక నిల్వల్లో ఆర్బీఐ బంగారం వాటా సుమారు 14 శాతానికి సమానమట. అయితే మొత్తం 34,600 టన్నుల బంగారంలో 80 శాతం ఆభరణాల రూపంలోనే ఉందని నివేదిక వెల్లడించింది. ఇప్పుడిప్పుడే బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగా భారతీయులు భావించడం మొదలు పెట్టారని తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో బంగారం కడ్డీలు, నాణేల కొనుగోళ్లలో 24 శాతం పైన వృద్ధి నమోదవ్వడమే ఇందుకు సంకేతం. -
168 గంటల్లో రూ. 16వేలు పెరిగిన గోల్డ్ రేటు!
బంగారం ధరలు బ్రేకుల్లేని బండిలా దూసుకెళ్తోంది. ఉదయం ఒక రేటు కనిపిస్తే.. సాయంత్రానికే ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మొత్తానికి గోల్డ్ రేటు భారీగా పెరిగిపోయింది. ఈ కథనంలో వారం రోజుల్లో (జనవరి 18 నుంచి 24 వరకు) పసిడి ధరలు ఎంత పెరిగాయో వివరంగా తెలుసుకుందాం.జనవరి 18న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు హైదరాబాద్, విజయవాడలలో రూ. 1,43,780 వద్ద ఉండేది. ప్రస్తుతం ఈ రేటు రూ. 160260 వద్దకు చేరింది. అంటే 7 రోజుల్లో (168 గంటల్లో) బంగారం ధర రూ. 16వేలు కంటే ఎక్కువ పెరిగింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,31,800 వద్ద నుంచి 1,46,900 రూపాయల వద్దకు (రూ. 15వేలు కంటే ఎక్కువ) చేరింది.చెన్నైలో కూడా గోల్డ్ రేటు వారం రోజుల్లో భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,44,870 వద్ద నుంచి 1,59,490 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే వారం రోజులో 14620 రూపాయల వ్యత్యాసం కనిపిస్తోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే.. ఇది 1,32,800 రూపాయల నుంచి రూ. 1,47,500 వద్దకు చేరింది.ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకిఢిల్లీలో జనవరి 18న రూ. 1,43,930 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు ఈ రోజుకు (శనివారం) రూ. 1,60,410 వద్దకు (రూ. 16480 తేడా) చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. ఇది 131950 రూపాయల నుంచి 147050 రూపాయల వద్దకు చేరింది.వెండి ధరలుభారతదేశంలో వెండి ధరలు చాలా వేగంగా ఎగబాకాయి. గత ఆదివారం (జనవరి 18) రూ. 3.10 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. శనివారం నాటికి రూ. 3.65 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో వెండి రేటు రూ. 55వేలు పెరిగిందన్న మాట. -
కొన్నది కొంతే.. ఆర్బీఐకి బంగారం చేదైందా?!
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులన్నీ పసిడి కొనుగోళ్లను పెంచుకుంటుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాత్రం తగ్గిస్తోంది. 2025లో ఆర్బీఐ తన బంగారం కొనుగోళ్లను గణనీయంగా తగ్గించింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం, 2025లో ఆర్బీఐ కేవలం 4.02 టన్నుల బంగారమే కొనుగోలు చేసింది. ఇది 2024లో కొనుగోలు చేసిన 72.6 టన్నులతో పోలిస్తే దాదాపు 94 శాతం భారీ తగ్గుదల.ప్రపంచ కేంద్ర బ్యాంకుల ధోరణిప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ఇటీవలి సంవత్సరాల్లో బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. 2025 డిసెంబర్ నాటికి గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల వద్ద మొత్తం 32,140 టన్నుల బంగారం ఉంది. ఇక కొనుగోళ్ల విషయానికి వస్తే 2022లో అన్ని కేంద్ర బ్యాంకుల పసిడి కొనుగోళ్లు 1,082 టన్నులు కాగా 2023లో 1,037 టన్నులుగా ఉన్నాయి. 2024లో రికార్డు స్థాయిలో 1,180 టన్నులకు చేరాయి. 2025లోనూ 1,000 టన్నులకుపైగా ఉంటాయని అంచనా.అయితే, కొనుగోళ్లు తగ్గినప్పటికీ ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద సుమారు 880.2 టన్నుల బంగారం ఉంది. 2025 నవంబర్ నాటికి ఈ బంగారం నిల్వల విలువ 100 బిలియన్ డాలర్లను దాటింది.విదేశీ మారక నిల్వల్లో పెరిగిన బంగారం వాటాభారతదేశ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా కూడా గణనీయంగా పెరిగింది. ఒక సంవత్సరంలో బంగారం వాటా 10% నుంచి 16%కి పెరిగింది. 2021 మార్చిలో ఇది కేవలం 5.87% మాత్రమే. అంటే, గత ఐదేళ్లలో ఆర్బీఐ తన నిల్వల్లో బంగారం ప్రాధాన్యతను దాదాపు మూడు రెట్లు పెంచింది.కొనుగోళ్లు ఎందుకు తగ్గాయి?బంగారం ధరలు అత్యధికంగా ఉండటం, అలాగే ఆర్బీఐ నిల్వల్లో ఇప్పటికే బంగారం వాటా గణనీయంగా పెరగడం వల్ల, ఇప్పుడు ఆర్బీఐ కొత్త కొనుగోళ్ల కంటే ఉన్న నిల్వల సమతుల్య నిర్వహణపై దృష్టి పెడుతోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అభిప్రాయపడింది.ఆర్బీఐ బంగారం ఎక్కడ ఉంది?ఆర్బీఐకి చెందిన బంగారం మొత్తం భారతదేశంలోనే నిల్వ ఉండదు. 2025 మార్చి నాటికి భారత్ మొత్తం బంగారం నిల్వలు 879.59 టన్నులు కాగా ఇందులో భారత్‌లో నిల్వ చేసింది సుమారు 512 టన్నులు. మిగిలిన బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) వద్ద భద్రపరిచింది. కొంత భాగం బంగారం నిక్షేపాల (Gold Deposits) రూపంలో కూడా ఉంది. -
సాయంత్రానికి సగం తగ్గిన ధర!.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇలా..
అంచనాలకు అందకుండా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఉదయం రూ. 5400 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 2840 వద్దకు వచ్చింది. అంటే దాదాపు సగం తగ్గిందన్నమాట. ఇది పసిడి ప్రియులకు కొంత ఊరటను ఇచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లో.. తాజా గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 4950 రూపాయలు పెరిగి.. రూ.1,46,400 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. సాయంత్రానికి 2350 రూపాయలు తగ్గి.. రూ. 1,44,050 వద్దకు చేరింది. అదే విధంగా 5400 రూపాయలు పెరిగి రూ. 1,59,710 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి 2560 రూపాయలు తగ్గి రూ. 1,57,150 వద్ద నిలిచింది. దీన్నిబట్టి చూస్తే.. ఉదయం ధరలకు, సాయంత్రం ధరలకు ఎంత వ్యత్యసం ఉందో చూడవచ్చు.చెన్నైలో కూడా 1,46,500 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ. 1,45,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే.. 1,59,820 నుంచి 1,58,730 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపించింది. ఉదయం రూ. 1,46,550 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర.. సాయంత్రానికి 1,45,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,59,860 నుంచి రూ. 1,57,150 వద్దకు చేరింది.వెండి ధరలువెండి ధరలు ఉదయం ఎలా ఉన్నాయో.. సాయంత్రానికి అలాగే ఉన్నాయి. అయితే కేజీ సిల్వర్ రేటు రూ. 3.60 లక్షలకు చేరింది. గురువారం (జనవరి 22) రూ. 3.40 లక్షల వద్ద ఉన్న వెండి.. ఈ రోజు (శుక్రవారం) రూ. 20వేలు పెరిగింది. దీంతో రేటు రూ. 3.60 లక్షల వద్దకు చేరింది. -
బంగారం, వెండి తగ్గొచ్చు పెరగొచ్చు.. కానీ..
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తుల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అన్న విషయాన్ని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. తాత్కాలిక మార్కెట్ ఊగిసలాటలకంటే దీర్ఘకాలిక ఆర్థిక వాస్తవాలే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈమేరకు సోషల్ మీడియాలో రాబర్ట్ కియోసాకి తాజాగా ఒక పోస్ట్ చేశారు. అమెరికా జాతీయ రుణం నిరంతరం పెరుగుతుండటం, డాలర్ కొనుగోలు శక్తి తగ్గుతుండటమే తన పెట్టుబడి దృక్పథానికి ప్రధాన కారణమని కియోసాకి తెలిపారు.“బంగారం, వెండి లేదా బిట్‌కాయిన్ ధరలు పెరుగుతాయా పడిపోతాయా అని నేను పట్టించుకోను, ఎందుకంటే అమెరికా జాతీయ రుణం పెరుగుతూనే ఉంది, అదే సమయంలో డాలర్ విలువ క్రమంగా తగ్గుతోంది” అంటూ తన ‘ఎక్స్’ పోస్టులో రాసుకొచ్చారు.కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వ ద్రవ్య విధానాలపై కియోసాకి చాలాకాలంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజా వ్యాఖ్యల్లో, ఫెడరల్ రిజర్వ్, యూఎస్ ట్రెజరీ, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను “అధిక విద్య కలిగిన కానీ అర్హత లేని పీహెచ్‌డీలు” నియంత్రిస్తున్నారని విమర్శించారు.ధరల మార్పులపై దృష్టి పెట్టకుండా, తాను బంగారం, వెండి వంటి భౌతిక ఆస్తులతో పాటు బిట్‌కాయిన్, ఎథీరియమ్ వంటి డిజిటల్ ఆస్తులను నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉన్నానని కియోసాకి తెలిపారు. పరిమిత సరఫరా ఉన్న ఈ ఆస్తులు ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదలకు రక్షణగా నిలుస్తాయని ఆయన నమ్మకం.Q: Do I care when the price of gold silver or Bitcoin go up or down?A: No. I do not care.Q: Why Not?A: Because I know the national debt of the US keeps going up and the purchasing power of the US dollar keeps going down.Q: Why worry about the price of gold, silver,…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 23, 2026 -
ఇప్పుడు 150 టన్నుల బంగారం.. ఏడాది చివరికి నాటికి..
ఆర్ధిక పరిస్థితులు ఎప్పుడు, ఎలా మారుతాయో.. ఎవరూ అంచనా వేయలేరు. స్టాక్ మార్కెట్లు కుప్ప కూలిపోవచ్చు, కరెన్సీ విలువ అమాంతం తగ్గిపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారంకు డిమాండ్ పెరిగిపోయింది. ఈ తరుణంలో పోలాండ్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ ఆర్ధిక రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం కొనుగోలుదారు అయిన నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్.. మరో 150 టన్నుల విలువైన బంగారం కొనుగోలు చేసింది. దీంతో ప్రస్తుతం పోలాండ్ వద్ద ఉన్న బంగారం నిల్వల పరిమితిని 550 టన్నులకు చేరింది. 2026 డిసెంబర్ 31 నాటికి దీనిని 700 టన్నులకు పెంచాలని సెంట్రల్ బ్యాంక్ మేనేజ్మెంట్ బోర్డును కోరుతున్నట్లు గవర్నర్ ఆడమ్ గ్లాపిన్స్‌కీ గత వారం ప్రకటించారు.పోలాండ్ వద్ద ఉన్న బంగారం.. ప్రస్తుతం యూరోపియన్ సెంట్రల్ బ్యాంకుల దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ ఉందని సమాచారం. గోల్డ్ అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక దేశాన్ని ఆర్థికంగా రక్షించే కవచం అని ఆడమ్ గ్లాపిన్స్‌కీ పేర్కొన్నారు. పసిడి విలువ ఎప్పటికీ దాదాపు పడిపోయే అవకాశం లేదు. ఆర్ధిక అస్థిరత్వం లేదా ఆర్ధిక మాంద్యం ఏర్పడినప్పుడు ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉందని. ఇతర దేశాల ద్రవ్య విధానంతో సంబంధం లేకుండా.. ఆర్ధిక వ్యవస్థను కాపాడుకోవచ్చు.విదేశీ మారక నిల్వల్లో పోలాండ్ వాటా 2024 నాటికి 16.86 శాతంగా ఉండేది. 2025 నాటికి ఇది 28.22 శాతానికి చేరింది. ఈ ఏడాది చివరి నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. నిజానికి బంగారం పోగు చేసుకోవాలనే ఉద్దేశం ఒక్క పోలాండ్ దేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాలకు ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.బంగారం ధరలు ఇలా..భారతదేశంలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజు (గురువారం) రూ.1,54,310 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,41,450 రూపాయల వద్ద ఉంది. గోల్డ్ రేటు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా.ఇదీ చదవండి: బడ్జెట్ 2026.. ఆదివారం కూడా స్టాక్ మార్కెట్! -
పసిడి పరుగులు.. వెండి వెలుగులు
-
రికార్డు స్థాయికి బంగారం ధర..
నిజామాబాద్ రూరల్: బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వారం క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,200 ఉండగా, మంగళవారం రూ.1,50,800లకు చేరుకుంది. కిలో వెండి ధర రూ.3.17 లక్షలకు చేరింది. బంగారం, వెండి ధరల పెరుగుదల కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. వచ్చే నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉండటంతో బంగారం కొనుగోలుపై సామాన్య, మధ్యతరగతి ప్రజలు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే, బంగారం, వెండిపై పెట్టుబడులు పెరుగుతుండటంతో ధరలు పెరుగుతున్నాయని, రానున్న రోజుల్లో తులం బంగారం ధర రూ.2 లక్షల వరకు దాటే అవకాశం ఉందని నగరానికి చెందిన ఆభరణాల తయారీదారు సీహెచ్.భూషణ్‌చారి ‘సాక్షి’తో తెలిపారు. -
పసిడి పరుగులు వెండి వెలుగులు
న్యూఢిల్లీ: సర్వత్రా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడి సాధనాలుగా పరిగణించే పసిడి, వెండి రికార్డు పరుగులు కొనసాగిస్తున్నాయి. మంగళవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పసిడి రేటు కీలకమైన రూ. 1.5 లక్షల మార్కును దాటేసింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు ఏకంగా రూ. 5,100 పెరిగి రూ. 1,53,200కి చేరింది. వెండి ధర కిలోకి రూ. 20,400 పెరిగి మరో కొత్త గరిష్ట స్థాయి రూ. 3,23,000కి ఎగిసింది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర తొలిసారిగా 4,700 డాలర్ల మైలురాయిని అధిగమించింది. 66.38 డాలర్లు పెరిగి 4,737.40 డాలర్లకు చేరింది. స్పాట్ సిల్వర్ కూడా కొత్త గరిష్ట స్థాయి 95.88 డాలర్లకి పెరిగింది. దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ. 6,861 పెరిగి రూ. 1,52,500 వద్ద ట్రేడయ్యింది. అటు వెండి కూడా రూ. 17,723 ఎగిసి రూ. 3,27,998 వద్ద ట్రేడయ్యింది. అటు అంతర్జాతీయంగా కామెక్స్‌లో పసిడి రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 147.5 డాలర్లు ఎగిసి 4,724.9 డాలర్లు పలికింది. సిల్వర్ ఫ్యూచర్స్ 6.87 డాలర్లు పెరిగి తొలిసారి 95 డాలర్ల మార్కును దాటింది. అనిశ్చితి, ఉద్రిక్తతలతో ఆజ్యం.. అంతర్జాతీయంగా అనిశ్చితి, అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, రష్యా–ఉక్రెయిన్ వివాదం కొలిక్కి రాకపోవడంలాంటి అంశాల వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పసిడి, వెండి వైపు మళ్లుతున్నారని వెంచురా సంస్థ హెడ్ (కమోడిటీ, సీఆర్ఎం) ఎన్ఎస్ రామస్వామి చెప్పారు. -
మారిపోయిన గోల్డ్ రేటు.. లేటెస్ట్ ధరలు ఇలా!
భారతదేశంలో బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరుగుతూ ఉన్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. ఉదయం ఒక రేటు, సాయంత్రానికి ఇంకో రేటు ఉంది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర ఎంతలా దూసుకెల్తూ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ కథనంలో తాజా గోల్డ్ రేటు ఎలా ఉందో తెలుసుకుందాం.ఈ రోజు (జనవరి 19) ఉదయం 1,33,550 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు.. సాయంత్రానికి రూ. 1,34,050 వద్దకు (రూ. 500 పెరిగింది) చేరింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు 1,45,690 రూపాయల నుంచి రూ. 1,46,240 వద్దకు (550 రూపాయలు పెరిగింది) చేరింది.ఢిల్లీలో కూడా ధరలు తారుమారయ్యాయి. ఉదయం 1,33,700 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి రేటు.. ఇప్పటికి రూ. 1,34,200 వద్ద (రూ. 500పెరిగింది) నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు 1,45,840 రూపాయల నుంచి రూ. 1,46,390 వద్దకు (550 రూపాయలు పెరిగింది) చేరింది.చెన్నైలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల రేటు 1,34,500 రూపాయల వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 146730 వద్ద ఉంది. వెండి రేటు ఏకంగా రూ.3 లక్షలు (1000 గ్రాములు) దాటేసింది.ఇదీ చదవండి: సిల్వర్ కొత్త మార్క్.. చరిత్రలో తొలిసారి! -
ఊహించనంతగా పెరుగుతున్న బంగారం.. కారణమెవరు?
బంగారం ధరలు రోజు రోజుకి అమాంతం పెరిగిపోతూ ఉన్నాయి. ధరల పెరుగుదల చాలామంది పసిడి ప్రియులలో నిరాశను కలిగిస్తున్నాయి. ఇంతకీ గోల్డ్ రేటును ఎవరు నిర్ణయిస్తారనేది చాలామంది తెలుసుకోవాలనుకునే విషయం. ఈ కథనంలో పసిడి ధరలను నిర్ణయించడంలో అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఎంత వరకు ఉంటుంది?, మన దేశంలో గోల్డ్ రేటును ఏఏ అంశాలు ప్రభావితం చేస్తాయనే విషయాలను తెలుసుకుందాం.బంగారం ధరలను ప్రభావితం చేసే అంతర్జాతీయ అంశాలుఎల్బీఎంఏ ఫిక్సింగ్: ఎలక్ట్రానిక్ వేలం ప్రక్రియ ద్వారా ఎల్‌బీఎంఏ (లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్) రోజుకు రెండుసార్లు బెంచ్‌మార్క్ బంగారం ధరలను నిర్ణయిస్తుంది. ఈ ధరలు ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులకు రిఫరెన్స్ పాయింట్‌గా పనిచేస్తాయి.గోల్డ్ ఫ్యూచర్స్ & ట్రేడింగ్ మార్కెట్లు: కమోడిటీ ఎక్స్ఛేంజీ-కామెక్స్ (న్యూయార్క్), షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్ (ఎస్జీఈ), మల్టీ కామోడిటీ ఎక్స్చేంజీ-ఎంసీఎక్స్ (ఇండియా) వంటి ప్రధాన ఫైనాన్షియల్ ఎక్స్ఛేంజీలు బంగారం ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ట్రేడింగ్ యాక్టివిటీ, ఇన్వెస్టర్ల సెంటిమెంట్, స్పెక్యులేషన్ ఆధారంగా నేరుగా ధరల కదలికలను ప్రభావితం చేస్తాయి.సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్ & మానిటరీ పాలసీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ)తో సహా కేంద్ర బ్యాంకులు గణనీయమైన బంగారు నిల్వలను కలిగి ఉన్నాయి. వారి క్రయవిక్రయాలు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.ద్రవ్యోల్బణం & ఆర్థిక అనిశ్చితి: బంగారం తరచుగా ద్రవ్యోల్బణం, ఆర్థిక తిరోగమనానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా ఉపయోగించబడుతుంది. ప్రపంచ మార్కెట్లు మాంద్యం, వాణిజ్య వివాదాలు లేదా భౌగోళిక రాజకీయ సంఘర్షణలు వంటి అనిశ్చితిని ఎదుర్కొన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి.మన దేశంలో బంగారం ధరలను ప్రభావితం అంశాలుదిగుమతి సుంకాలు, ప్రభుత్వ నిబంధనలు: భారతదేశంలో బంగారం దిగుమతులపై ఆధారపడుతుంది. ప్రభుత్వం కస్టమ్ సుంకాలు పసిడి ధరను నిర్ణయిస్తాయి. ఇది స్థానిక ధరలను నేరుగా ప్రభావితం చేస్తుంది. పన్ను విధానాల్లో మార్పులు బంగారాన్ని మరింత ఖరీదైనవి లేదా సరసమైనవిగా మారుస్తాయి.కరెన్సీ మారకం రేట్లు: బంగారం అమెరికా డాలర్లలో ట్రేడ్ అవుతుంది కాబట్టి, భారత రూపాయి మారకం రేటులో హెచ్చుతగ్గులు దేశీయ పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి. రూపాయి బలహీనపడితే భారతీయ కొనుగోలుదారులకు బంగారం ఖరీదుగా మారుతుంది.పండుగలు, వివాహాలు: దేశంలో బంగారం పట్ల బలమైన సాంస్కృతిక అనుబంధం ఉంది. ముఖ్యంగా దీపావళి, అక్షయ తృతీయ వంటి పండుగలు, వివాహ సీజన్లలో దీన్ని అధికంగా కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరుగుతాయి.దేశీయ సరఫరా, మార్కెట్ ధోరణి: బంగారం స్థానిక లభ్యత, ఆభరణాల రూపకల్పనలో వినియోగదారుల ప్రాధాన్యతలు, బంగారు పెట్టుబడి ఉత్పత్తులలో ఆవిష్కరణలు (ఈటీఎఫ్‌లు, డిజిటల్ బంగారం మొదలైనవి) వివిధ ప్రాంతాల్లో ధరల వ్యత్యాసాలను ప్రభావితం చేస్తాయి.ఐబీజేఏ: ఐబీజేఏ (ఇండియన్ బులియన్ జ్యువెల్లర్స్ అసోసియేషన్) గ్లోబల్ బెంచ్‌మార్క్‌లు, దేశీయ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా రోజువారీ ధరల మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. రిటైల్ బంగారం ధరలో స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది.గోల్డ్ రేటును ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ మాత్రమే నిర్ణయించదు. ఇది అంతర్జాతీయ మరియు దేశీయ కారకాల కలయికతో నిర్ణయించబడుతుంది. కాబట్టి బంగారం ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. అవి ఆర్థిక విధానాలు, ప్రపంచ ఆర్థిక ధోరణులు, వినియోగదారుల ప్రవర్తనల కారణంగా మారుతాయి. అంతర్జాతీయ, దేశీయ కారకాలను అర్థం చేసుకోవడం ద్వారా పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు బంగారాన్ని ఎప్పుడు కొనాలి.. ఎప్పుడు అమ్మాలి లేదా పెట్టుబడి పెట్టాలి అనే దానిపై నిపుణులు సలహాతో నిర్ణయాలు తీసుకోవచ్చు.ఇదీ చదవండి: వారం రోజుల్లో ఇంత పెరిగిందా.. బంగారం ధరల్లో భారీ మార్పు! -
వారం రోజుల్లో ఇంత పెరిగిందా.. బంగారం ధరల్లో భారీ మార్పు!
బంగారం ధరలు వారం రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ దాదాపు రూ. 1,50,000 మార్క్ చేరుకోవడానికే అన్నట్లు దూసుకెళ్తున్నాయి. జనవరి 11వ తేదీ 1,40,460 రూపాయల వద్ద ఉన్న గోల్డ్ రేటు.. నేటికి 1,43,780 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధరల్లో ఎంత మార్పు వచ్చిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,40,460 నుంచి రూ. 1,43,780లకు చేరుకుంది. వారం రోజుల్లో పసిడి ధరలు 3320 రూపాయలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం విషయానికి వస్తే.. వారం రోజుల్లో 1,28,750 రూపాయల నుంచి 1,31,800 రూపాయల వద్దకు చేరింది. అంటే 3050 రూపాయలు పెరిగిందన్నమాట.చెన్నైలో జనవరి 11న 1,39,650 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర 17వ తేదీ నాటికి 1,44,870 రూపాయల (రూ.5220 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం రేటు రూ. 1,29,000 నుంచి రూ. 1,32,800 (రూ. 3800 పెరిగింది) వద్దకు చేరింది.ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకిఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. 1,40,610 రూపాయల నుంచి వారం రోజుల్లో 1,43,930 రూపాయల (రూ. 3320 పెరిగింది) మార్క్ చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,28,900 వద్ద నుంచి రూ. 1,31,950 వద్దకు (3050 రూపాయలు పెరిగింది) చేరింది. -
అవునా.. నిజమా!.. ఇది సాధ్యమా?
బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,43,780 వద్ద ఉంది. ఈ ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో ఒక ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.''1990లో ఒక కేజీ బంగారంతో.. మారుతి 800 వచ్చేది. 2000లో మారుతి ఎస్టీమ్, 2005లో ఇన్నోవా, 2010లో ఫార్చ్యూనర్, 2019లో బీఎండబ్ల్యు ఎక్స్1, 2025లో డిఫెండర్, 2030 నాటికి రోల్స్ రాయిస్ కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఒక కేజీ బంగారం కొని 2040 వరకు వేచి ఉండండి.. మీరు ఒక ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేయగలుగుతారు'' అని వివరించారు.ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకిఈ రోజు రేటు ప్రకారం.. ఇండియన్ మార్కెట్లో ఒక కేజీ బంగారం విలువ రూ. 1,43,78,000. ఈ ధరలో ఒక లగ్జరీ కారును కొనుగోలు చేయవచ్చు. ధరలు ఇలాగే కొనసాగితే.. 2040 నాటికి ఒక కేజీ బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది. ఒకవేళా గోల్డ్ రేటు తగ్గితే.. అంచనాలు తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది.Interesting Economics & Observation:1990 .....1KG gold = Maruti 8002000......1KG gold = Esteem2005......1KG Gold = Innova2010......1KG Gold = Fortuner2019.....1KG Gold = BMW X12025…..1Kg #Gold = Defender2030….. 1kg #Gold = Rolls RoyceKeep 1 KG #gold & wait till…— A K Mandhan (@A_K_Mandhan) January 15, 2026 -
గోల్డ్ కార్డు: బంగారంతోనే షాపింగ్!
నగదుకు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని వినియోగించే వినూత్న విధానంతో ‘ఓ గోల్డ్ మాస్టర్ కార్డు’ను దుబాయ్‌లో అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్డు ద్వారా వినియోగదారులు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించకుండా, నేరుగా కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు.ఓ గోల్డ్ మేనేజ్మెంట్ సంస్థ తమ డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌ను లైఫ్‌స్టైల్ సూపర్ యాప్‌గా తిరిగి ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ యాప్ ద్వారా తక్కువ పరిమాణంలోనూ బంగారం యాజమాన్యాన్ని పొందే అవకాశం కల్పిస్తున్నారు.కొత్తగా ప్రవేశపెట్టిన ఓ గోల్డ్ మాస్టర్ కార్డుతో, వినియోగదారులు బంగారాన్ని నగదు మాదిరిగా ఉపయోగించి వివిధ వస్తువులు, సేవలను కొనుగోలు చేయవచ్చు. ఈ లావాదేవీలు సులభమైనవి, సురక్షితమైనని, అన్ని చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ వినూత్న వ్యవస్థను మావరిడ్ ఫైనాన్స్, మాస్టర్ కార్డ్ సహకారంతో అమలు చేశారు.ఈ కార్డు వినియోగదారులకు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. విమానాశ్రయ లాంజ్‌లకు కాంప్లిమెంటరీ ప్రవేశం, హోటళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు, ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై ఆఫర్లు, అలాగే రెస్టారెంట్లు, ఈ-కామర్స్, ఎంటర్టైన్మెంట్ సేవలపై రాయితీలు లభిస్తాయి.ఓ గోల్డ్ మాస్టర్ కార్డు ద్వారా 8,000కు పైగా బ్రాండ్ల ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. యాప్ ద్వారా వోచర్లు, గిఫ్ట్ కార్డులను సులభంగా రీడీమ్ చేసుకునే సదుపాయం ఉంది. అలాగే ఈ-సిమ్ కార్డులు, రివార్డులు, లాయల్టీ ప్రోగ్రామ్‌లను సులభంగా యాక్సెస్ చేయవచ్చని ఓ గోల్డ్ వ్యవస్థాపకుడు బందర్ అల్ ఓట్మాన్ తెలిపారు. -
పండగవేళ పసిడి దూకుడు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఆ రాష్ట్రంలో బంగారు నిక్షేపాలు.. తవ్వాలంటే..
ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరినీ ఆకర్షించే స్వర్ణ లోహం ఘనత వెనుక కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. భూమిపై అత్యంత విలువైనదిగా భావించే ఈ లోహం కేవలం ఆభరణాలకే పరిమితం కాలేదు. ఇదొక అద్భుతమైన రసాయన మూలకంగా గుర్తింపు పొందింది. దీని మెరుపును చూసిన ప్రాచీన గ్రీకులు ‘షైనింగ్ డాన్ (ప్రకాశించే ఉషోదయం) అని అభివర్ణించారు. అలాంటి బంగారం ఇప్పుడు కేరళ భూముల్లో నిక్షిప్తం కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.భూమిలో ఆవిర్భావం..భూమి ఆదిలో ద్రవ రూపంలో ఉన్నప్పుడు, దానిలోని గురుత్వాకర్షణ శక్తి వల్ల బంగారం వంటి బరువైన లోహాలన్నీ కేంద్ర భాగం (Core) వైపు వెళ్లిపోయాయి. తదుపరి కాలంలో అంతరిక్షం నుంచి పడిన ఉల్కాపాతం వల్లే భూమి ఉపరితలంపై బంగారం చేరిందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. అందుకే భూమి పైపొర అయిన 'క్రస్ట్' భాగంలో బంగారం లభ్యత చాలా తక్కువగా ఉంటుందని అంటారు. భూమి లోపలి పొరల నుంచి బంగారం ఉపరితలానికి చేరుకోవడానికి అగ్నిపర్వత ప్రక్రియలు, మాగ్మా ప్రధాన కారణాలుగా నిలుస్తాయి. భూగర్భంలోని వేడి ద్రవాలు, వాయువులు కలిసి శిలల మధ్య ఖాళీల్లోకి చొచ్చుకుపోతాయి. మాగ్మా చల్లబడినప్పుడు, అందులోని సల్ఫైడ్ ఖనిజాలతో కలిసి బంగారం స్ఫటికాలుగా లేదా స్వచ్ఛమైన లోహంగా మారుతుంది.టన్ను మట్టిలో..కేరళ కేవలం ప్రకృతి సోయగాలకే కాదు, భూగర్భ నిధులకు కూడా నిలయమని ఇటీవలి పరిశోధనల్లో నిరూపితమైంది. ముఖ్యంగా రాష్ట్రంలోని నిలంబూర్, వయనాడ్, అట్టప్పాడి, పునలూర్, పలు తీర ప్రాంతాల్లో స్వర్ణ నిక్షేపాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. నిలంబూర్-పంతలూర్ బెల్ట్ బంగారానికి పెట్టింది పేరు. ఇక్కడ టన్ను మట్టి లేదా రాయిని వెలికితీస్తే సుమారు 0.5 నుంచి 4.5 గ్రాముల బంగారం లభించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. బ్రిటిష్ కాలంలోనే ఇక్కడి పున్నప్పుళ, కరక్కోడ్ వంటి ప్రాంతాల్లో మైనింగ్ జరిగేది. ఇప్పటికీ అక్కడి నదుల్లో బంగారు రేణువుల కోసం స్థానికులు అన్వేషణ సాగిస్తుండటం గమనార్హం.వాయనాడ్, అట్టప్పాడిలో పసిడి జాడలుకేరళలోని వయనాడ్ ప్రాంతంలోని మానంతవాడి, మేప్పాడి, తరియోడ్ వంటి చోట్ల స్వర్ణ నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే అట్టప్పాడిలోని భవానీ నదీ తీర ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరిపిన పరిశోధనల్లో టన్నుకు 1.2 గ్రాముల వరకు బంగారం దొరకవచ్చని తేలింది. అలాగే అలప్పుజ, చవర తదితర తీర ప్రాంతాల్లో సముద్రపు ఇసుకలో కూడా అత్యల్ప పరిమాణంలో పసిడి రేణువులు కనిపించడం విశేషం.మైనింగ్‌కు అడ్డంకులు కేరళలో బంగారం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, మైనింగ్ చేయడం ఆర్థికంగా లాభదాయకమా కాదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. చాలా చోట్ల బంగారం పరిమాణం చాలా తక్కువగా ఉండటం, పర్యావరణపరంగా ఇబ్బందులు ఏర్పడే ప్రాంతాలు కావడంతో తవ్వకాలు జరపడం అనేది సవాలుతో కూడుకున్న పనిగా మారింది. ఏదిఏమైనప్పటికీ కేరళ భూగర్భంలో దాగున్న ఈ స్వర్ణ సంపద శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.ఇది కూడా చదవండి: దేశమంతటా నువ్వుల నైవేద్యాలు.. రహస్యం ఇదే! -
రికార్డు మీద రికార్డు.. రెండు రోజుల్లో రూ.21000 జంప్
గత వారాంతాన వెండి కేజీ రూ. 2,50,000 వద్ద స్థిరపడగా.. సోమవారం రూ. 15,000 జంప్‌చేసి రూ. 2,65,000ను తాకిన విషయం విదితమే. తాజాగా మరో రూ. 6,000 బలపడటంతో రెండు రోజుల్లో 21,000 దూసుకెళ్లింది. 2026లో ఇప్పటివరకూ రూ. 32,000(13.4 శాతం) లాభపడింది. 2025 డిసెంబర్ 31న కేజీ వెండి రూ. 2,39,000 వద్ద ముగిసింది. అన్ని పన్నులు కలుపుకుని 99.9 స్వచ్చత పసిడి 10 గ్రాములు సోమవారం రూ. 2,900 ఎగసి రూ. 1,44,600కు చేరగా.. తాజాగా మరో రూ. 400 లాభపడి రూ. 1,45,000ను తాకింది. మరోపక్క గ్లోబల్ మార్కెట్లలోనూ పసిడి ఔన్స్(31.1 గ్రాములు) సోమవారం 4,630 డాలర్ల వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. ఈ బాటలో వెండి ఔన్స్ 86.26 డాలర్ల వద్ద సరికొత్త గరిష్ట రికార్డ్ సాధించింది. మంగళవారం సైతం న్యూయార్క్ కామెక్స్ ఫ్యూచర్స్‌లో తొలుత బంగారం(ఫిబ్రవరి కాంట్రాక్ట్) 4,632 డాలర్లకు, వెండి(మార్చి) 88.56 డాలర్లకు చేరడం గమనార్హం! -
వారెవ్వా ఏమి జోరు..
న్యూఢిల్లీ: రోజుకో రికార్డు నెల కొల్పుతున్న వెండి, బంగారం మరోసారి దూకుడు ప్రదర్శించాయి. కేజీ వెండి ధర రూ. 6,000 జంప్‌చేసి రూ. 2,71,000ను తాకింది. ఈ బాటలో స్థానిక(ఢిల్లీ) మార్కెట్లో బంగారం 10 గ్రాములు రూ. 400 పెరిగి రూ. 1,45,000కు చేరింది. ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వివరాల ప్రకారం వెండి అన్ని పన్నులు కలుపుకుని, పూర్తి స్వచ్చత కలిగిన బంగారం ధరలివి. వెరసి మరోసారి పసిడి, వెండి చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక అస్థిరతలు ధరలపై ప్రభావం చూపుతున్నట్లు బులియన్ వర్గాలు మరోసారి తెలియజేశాయి.అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు తలెత్తినప్పుడు పెట్టుబడులకోసం ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనాలవైపు చూసే సంగతి తెలిసిందే. సాధారణ ప్రజలతోపాటు.. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ఈటీఎఫ్‌లు, అసెట్ మేనేజర్స్ పసిడిలో ఇన్వెస్ట్ చేస్తుంటే.. వెండికి సోలార్, ఈవీ, ఎల్రక్టానిక్స్ తదితర ఇండ్రస్టియల్ డి మాండ్ సైతం జత కలుస్తోంది. 2 రోజుల్లో రూ. 21,000 గత వారాంతాన వెండి కేజీ రూ. 2,50,000 వద్ద స్థిరపడగా.. సోమవారం రూ. 15,000 జంప్‌చేసి రూ. 2,65,000ను తాకిన విషయం విదితమే. తాజాగా మరో రూ. 6,000 బలపడటంతో రెండు రోజుల్లో 21,000 దూసుకెళ్లింది. 2026లో ఇప్పటివరకూ రూ. 32,000(13.4 శాతం) లాభపడింది. 2025 డిసెంబర్ 31న కేజీ వెండి రూ. 2,39,000 వద్ద ముగిసింది.అన్ని పన్నులు కలుపుకుని 99.9 స్వచ్చత పసిడి 10 గ్రాములు సోమవారం రూ. 2,900 ఎగసి రూ. 1,44,600కు చేరగా.. తాజాగా మరో రూ. 400 లాభపడి రూ. 1,45,000ను తాకింది. మరోపక్క గ్లోబల్ మార్కెట్లలోనూ పసిడి ఔన్స్(31.1 గ్రాములు) సోమవారం 4,630 డాలర్ల వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. ఈ బాటలో వెండి ఔన్స్ 86.26 డాలర్ల వద్ద సరికొత్త గరిష్ట రికార్డ్ సాధించింది. మంగళవారం సైతం న్యూయార్క్ కామెక్స్ ఫ్యూచర్స్‌లో తొలుత బంగారం(ఫిబ్రవరి కాంట్రాక్ట్) 4,632 డాలర్లకు, వెండి(మార్చి) 88.56 డాలర్లకు చేరడం గమనార్హం! -
2026లో ఊహించని స్థాయికి బంగారం, వెండి!
బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం వల్ల సామాన్యులు వీటిని కొనుగోలు చేయడానికి వెనుకడుకు వేస్తున్నారు. అయితే ధైర్యం చేసి కొనుగోలు చేసినవారికి మాత్రం మంచి లాభపడ్డారు. 2025లో అమాంతం పెరిగిన గోల్డ్, సిల్వర్ రేటు 2026లో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తాయా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం అయింది.నిజానికి 2026 ప్రారంభమై 10 రోజులు పూర్తి కావొచ్చింది. ఈ మధ్యలోనే 10 గ్రాముల గోల్డ్ రేటు భారతదేశంలో రూ.5000 పెరిగింది. దీంతో పసిడి ధర రూ. 1.40 లక్షలు దాటేసింది. ఇదిలాగే కొనసాగితే.. రాబోయే జూన్ నాటికి గోల్డ్ రేటు రూ.2 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు బంగారం ధరలు భారీ మొత్తంలో పెరగడం బహుశా ఇదే మొదటి సారి అని కూడా చెబుతున్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు గోల్డ్ రేటు 140 శాతం పెరిగింది.వెండి ధరల విషయానికి వస్తే.. 2025 ప్రారంభంలో దాదాపు రూ. 90వేలు వద్ద ఉన్న సిల్వర్ రేటు.. 2026లో రూ.2.75 లక్షల వద్దకు చేరింది. ఇది త్వరలోనే మూడు లక్షల రూపాయలకు చేరే అవకాశం ఉందని కొందరి అంచనా.బంగారం రేటు పెరగడానికి కారణాలు!భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్స్. కొత్త టారిఫ్ ప్లాన్స్ వల్ల పెట్టుబడిదారుల్లో కొంత భయం మొదలైంది. దీంతో చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపారు. అమెరికా డాలర్ విలువ కొంత తగ్గడం, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల.. మన దేశంలో కూడా గోల్డ్ రేట్లు పెరగడానికి కారణం అయింది.మన దేశంలో కూడా పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో మాత్రమే కాకుండా.. బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా కొంత నష్టాలు రావొచ్చు.. కానీ బంగారం మాత్రం ఎప్పుడూ పెరుగుతూ ఉంటుందనే కారణంగానే ఇన్వెస్టర్లు ఇటువైపు తిరుగుతున్నారు. ఇది కూడా బంగారం ధర పెరగడానికి కారణం అవుతోంది.భారతదేశంలో గోల్డ్ రేటు పెరగడానికి మరో కారణం ఏమిటంటే పండుగ సీజన్స్. పండుగల సమయంలో బంగారం కొంటే మంచిదని చాలామంది సెంటిమెంట్‌గా భావిస్తారు. దీంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది, ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా బంగారం ధరలకు ఆజ్యం పోసినట్లే అయింది.వెండి ధరలు పెరగడానికి కారణాలువెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు. -
బంగారాన్ని వెండి మించిపోతుందా? వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఏం చెప్పారు?
-
పునాదుల్లో భారీగా బంగారం.. విద్యార్థి చొరవతో..
గదగ్: కర్ణాటకలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గదగ్ జిల్లా, లక్కుండి గ్రామంలో ఒక ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా కూలీలు పునాదుల కోసం భూమిని తవ్వుతుండగా అనూహ్యంగా బంగారు నిధి లభ్యమయ్యింది. పునాదుల్లో పసిడి ఆభరణాలు బయటపడటంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది. పాతకాలపు రాగి బిందెలో దాచి ఉంచిన ఈ విలువైన సంపదను చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.ఈ నిధిని స్థానికంగా ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రజ్వల్ రిత్విక్ అనే విద్యార్థి గుర్తించాడు. భూమిలో కనిపిస్తున్న రాగి బిందెను గమనించిన ఆ బాలుడు, వెంటనే గ్రామ పెద్దలకు ఆ సమాచారం అందించాడు. ఆ రాగి బిందెను తెరిచి చూడగా, అందులో వివిధ రకాల బంగారు ఆభరణాలు కనిపించాయి. బాలుడి నిజాయితీని గ్రామస్తులు మెచ్చుకున్నారు. విషయం తెలుసుకున్న గదగ్ జిల్లా ఎస్పీ రోహన్ జగదీష్ నేతృత్వంలో పోలీసుల బృందం, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.అధికారులు ఆ బంగారాన్ని పరిశీలించి, అది సుమారు 470 గ్రాముల బరువు ఉన్నట్లు నిర్ధారించారు. ఆ రాగి బిందెలో మొత్తం 22 రకాల బంగారు వస్తువులు ఉన్నాయని, వాటిలో గొలుసులు, చెవి కమ్మలు వంటి విలువైన ఆభరణాలు ఉన్నట్లు ఎస్పీ మీడియాకు తెలిపారు. అధికారులు ఈ బంగారు నిధిని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం లభ్యమైన 470 గ్రాముల బంగారాన్ని ప్రభుత్వ ట్రెజరీకి తరలించారు. పురావస్తు శాఖ నిపుణులు ఈ ఆభరణాల చారిత్రక నేపథ్యాన్ని పరిశీలించే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: కేరళలో అమిత్ షా.. ‘స్వామి కార్యం.. స్వకార్యం’ -
పసిడి దూకుడు.. రూ.5400 పెరిగిన గోల్డ్ రేటు!
2025లో భారీగా పెరిగిన బంగారం ధరలు.. 2026లో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త ఏడాది ప్రారంభమై 10 రోజులు కావొస్తుంది. ఈ సమయంలో గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 5400 పెరిగింది. దీంతో పసిడి ధరలు తారా స్థాయికి చేరుకున్నాయి.జనవరి 1న హైదరాబాద్, విజయవాడలలో 1,35,060 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. నేటికి (జనవరి 10) రూ. 1,40,460 వద్దకు చేరింది. అంటే 10 రోజుల్లో గోల్డ్ రేటు 5,400 రూపాయలు పెరిగిందన్న మాట. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,800 నుంచి రూ. 1,28,750 వద్దకు (రూ.4950 పెరిగింది) కదిలింది.చెన్నైలో జనవరి మొదటి రోజు రూ. 1,36,140 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. ఈ రోజుకు (జనవరి 10) 1,39,560 రూపాయల వద్దకు చేరింది. ఈ లెక్కన 10 రోజుల్లో రూ. 3420 పెరిగిందని స్పష్టమవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,400 నుంచి రూ. 1,29,000 వద్దకు (రూ.4600 పెరిగింది) కదిలింది.ఢిల్లీలో 135210 రూపాయల వద్ద ఉన్న గోల్డ్ రేటు పది రోజుల్లో రూ. 5400 పెరిగి.. 1,40,610 రూపాయలకు ఎగిసింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,950 నుంచి రూ. 1,28,900 వద్దకు (రూ.4950 పెరిగింది) కదిలింది.సిల్వర్ రేటువెండి ధరల విషయానికి వస్తే.. జనవరి 1న కేజీ సిల్వర్ రేటు రూ. 2.56 లక్షల దగ్గర ఉంది. జనవరి 10 నాటికి రూ. 2.75 లక్షల వద్దకు చేరింది. అంటే కేజీ సిల్వర్ రేటు జనవరి ప్రారంభం నుంచి రూ.19,000 పెరిగిందన్నమాట. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ ఒక్కరోజు సంపాదన ఎంతో తెలుసా? -
పడిలేచిన పసిడి.. ఒక్కసారిగా పెరిగిన రేటు!
శుక్రవారం ఉదయం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, 24 గంటలు పూర్తి కాకూండానే మరింత పెరిగాయి. దీంతో గోల్డ్ రేట్లలో గంటల వ్యవధిలోనే గణనీయమైన మార్పు కనిపించింది. ఈ కథనంలో తాజా పసిడి ధరలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో రూ. 1,27,150 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి మరో 550 రూపాయలు పెరిగింది. దీంతో రేటు రూ. 1,27,700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 600 పెరగడంతో రూ. 1,39,310 వద్ద నిలిచింది. బెంగళూరు, ముంబై మొదలైన నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.చెన్నై నగరంలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,28,000 వద్ద.. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,39,640 వద్ద ఉంది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో.. సాయంత్రానికే పసిడి ధరల్లో మార్పులు కనిపించాయి. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,27,850 వద్ద (1200 రూపాయలు పెరిగింది) .. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,39,460 వద్ద (1310 రూపాయలు పెరిగింది)కు చేరింది. -
లేడీ కిలాడీలు.. సీసీ ఫుటేజ్‌లో షాకింగ్ దృశ్యాలు
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ చోరీ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కస్టమర్లుగా నటిస్తూ గోల్డ్ షాప్‌కు వెళ్లిన మహిళలు చోరీకి పాల్పడ్డారు. ముగ్గరు మహిళలు కేవలం 14 నిమిషాల్లోనే రూ.14 లక్షల విలువైన బంగారు చెవి పోగులు దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రయాగ్‌రాజ్‌లోని కల్యాణ్ జువెలర్స్ షోరూమ్‌లో డిసెంబర్ 31 2025న ఈ ఘటన జరిగింది.ఆభరణాలు కొనేందుకు కస్టమర్లుగా వెళ్లిన ముగ్గురు మహిళలు.. సేల్స్‌మెన్ వారికి బంగారు ఆభరణాలను చూపించడంలో బిజీగా ఉన్న సమయంలో షోకేస్‌లో ఉన్న చెవిపోగుల డిస్ప్లే ప్యాడ్‌ను దొంగలించారు. ఎవరికీ కనిపించకుండా దుస్తుల్లో దాచి అక్కడ నుంచి వెళ్లిపోయారు. కేవలం 14 నిమిషాల్లోనే పనిపూర్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.డిస్ప్లే ప్యాడ్ కనిపించకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. ఈ వ్యవహారం బయటపడింది. జువెలర్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళల్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.इन महिलाओं ने बड़ा हाथ मारा है. कल्याण ज्वेलर्स से 14 लाख के गहने चुराए.प्रयागराज स्थित कल्याण ज्वेलर्स में ये चोरी हुई है. चार महिलाओं ने सेल्समैन को बातों में उलझाए रखा और मौका मिलते ही गहना चोरी कर लिया. पूरी घटना CCTV में कैद है. pic.twitter.com/mhmYetbwEh— Priya singh (@priyarajputlive) January 7, 2026ఈ ఘటనపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. సేల్స్‌మన్‌ను దృష్టి మళ్లించి, షాప్‌లో ఆభరణం దాచడం సినిమా సన్నివేశంలా ఉందంటూ ఒకరు.. సెక్యూరిటీ గార్డ్‌తో పాటు, సీసీటీవీని గమనిస్తూ వెంటనే అలర్ట్ చేసే వ్యక్తిని కూడా నియమించాలంటూ మరొకరు సూచనలు ఇస్తున్నారు. మరో నెటిజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ.. అది కూడా ఒక స్కిల్‌నే, దాంతో సంపాదించనివ్వండి.” అంటూ కామెంట్ పెట్టారు. -
మారిన గోల్డ్ రేట్లు.. లేటెస్ట్ ధరలు ఇలా..
బుధవారం ఉదయం.. పెరిగిన బంగారం ధరలు, 24 గంటలు పూర్తి కాకూండానే తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేట్లలో గంటల వ్యవధిలోనే గణనీయమైన మార్పు కనిపించింది. ఈ కథనంలో తాజా పసిడి ధరలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో రూ. 127850 వద్ద ఉన్న 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికే 500 రూపాయలు తగ్గింది. దీంతో రేటు రూ. 126750 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 550 తగ్గడంతో రూ. 138270 వద్ద నిలిచింది. బెంగళూరు, ముంబై మొదలైన నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.చెన్నై నగరంలో కూడా గోల్డ్ రేటు వరుసగా రూ. 300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 330 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) తగ్గింది. కొత్త ధరలు రూ. 1,28,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,39,640 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్). అయితే ఢిల్లీలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ రేటు ఉదయం ఎలా ఉందో.. సాయంత్రానికి అలాగే ఉంది.వెండి ధరలు కూడా తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో రూ. 2.83 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. సాయంత్రానికి 2.77 లక్షల రూపాయల వద్దకు చేరింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు సైతం చెబుతున్నారు. సంక్రాంతి నాటికి వెండి రేటు రూ. 3 లక్షలకు చేరుతుందని కొందరు పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: మార్చి 2026 నుంచి ఏటీఎమ్‌లో రూ.500 నోట్లు రావా.. నిజమెంత? -
బంగారం బాటలో మరో మెటల్.. ఫుల్ డిమాండ్!
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో.. ఇతర లోహాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ప్లాటినం ధరలు కూడా దూసుకెళ్తున్నాయి, ఇదే వరుసలో రాగి రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు లిథియం కూడా ఇదే వరుసలోకి చేరింది.బంగారం అనేది కేవలం ఒక లోహంగా మాత్రమే కాకుండా.. మన దేశంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇండియాలో గోల్డ్‌ను సెంటిమెంట్‌గా భావించేవారి ఎక్కువగా ఉందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. దీనిని కొందరు ఆస్తిగా కూడా పరిగణిస్తారు. ఈ కారణాల వల్లనే ఇందులో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య ఎక్కువగా ఉంది.లిథియంకు డిమాండ్ఇప్పుడు బంగారం, వెండి మాదిరిగానే.. లిథియంకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దీనిని బ్యాటరీల తయారీలో, ఎలక్టిక్ వెహికల్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, కెమెరాలు, ల్యాప్‌టాప్‌లలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా.. ఇంధన, క్లిన్ ఎనర్జీ వంటి రంగాల్లో కూడా దీని వినియోగం చాలా ఎక్కువైంది. కాబట్టి చాలామంది ఇందులో కూడా పెట్టుబడులు పెడుతున్నారు.సాధారణ లేదా పాత బ్యాటరీలతో పోలిస్తే.. లిథియం అయాన్ బ్యాటరీలు చాలా మన్నికైనవి. ఛార్జింగ్ కూడా వేగంగా ఉంటుంది. కాబట్టి దీనిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలు ఎక్కువగా వినియోగిస్తారు. రాబోయే రోజుల్లో ఈవీల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లిథియం డిమాండ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.ప్రపంచంలో ఎక్కువ లిథియం నిల్వలుప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ లిథియం నిల్వలు కలిగిన దేశాల జాబొత్యలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో చిలీ, అర్జెంటీనా, బొలీవియా, చైనా ఉన్నాయి. ఈ దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో లిథియం నిల్వలు కొంత తక్కువే. అయితే మనదేశంలో లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్ మొదలైనవి ఉన్నాయి. కాబట్టి.. భవిష్యత్తులో లిథియంను ఇండియా దిగుమతి చేసుకుపోవాల్సిన అవసరం వచ్చే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: అటెన్షన్.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ! -
బంగారం ధరల్లో ఊహకందని మార్పు!
కొత్త సంవత్సరంలో బంగారం ధరలు తగ్గుతాయనుకుంటున్న పసిడి ప్రియులకు నిరాశే మిగులుతోంది. ఈ రోజు (డిసెంబర్ 5) కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 2400 పెరిగింది. నిజానికి ఉదయం 1580 రూపాయలు పెరిగిన రేటు.. సాయంత్రానికి రూ. 2400కు చేరింది. అంటే గంటల వ్యవధిలోనే పసిడి ధరలు మరో 820 రూపాయలు పెరిగింది. ఇక దేశంలోని వివిధ నగరాల్లోని లేటెస్ట్ గోల్డ్ రేట్ల విషయానికి వస్తే..హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఉదయం 1,37,400 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,38,220 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే 24 గంటల వ్యవధి పూర్తి కాకుండానే బంగారం రేటు భారీగా పెరిగిందని స్పష్టమవుతోంది. 22 క్యారెట్ల రేటు 2200 రూపాయలు పెరిగి కూడా రూ. 1,26,700 వద్దకు చేరింది.చెన్నైలో తాజా బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,39,200 వద్ద, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 127600 వద్ద ఉంది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,38,370 వద్ద, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,26,850 వద్దకు చేరింది. పసిడి ధరలు మాత్రమే కాకూండా.. వెండి రేటు కూడా గణనీయంగా పెరిగింది. -
ఆన్లైన్లో కొన్న బంగారంపై లోన్ ఇస్తారా?
దైనందిన ఆర్థిక జీవనంలో మనకు అనేక అనుమానాలు, సందేహాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో రియల్టీ, బ్యాంకింగ్, బంగారం, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్.. ఇలా భిన్న అంశాలపై పాఠకులు అడిగిన ప్రశ్నలకు నిపుణుల ద్వారా సమాధానాలు అందిస్తోంది ‘సాక్షి బిజినెస్’..రియల్టీ..ఆదాయంతో పోల్చితే గృహ రుణంపై చెల్లించే ఈఎంఐ ఎంతవరకూ ఉండాలి?సాధారణంగా అయితే గృహరుణంపై చెల్లించే ఈఎంఐగా మీ ఆదాయంలో 30 శాతాన్ని మించకపోతే మంచిది. 35–40 శాతమైతే కాస్త రిస్కే. ఎందుకంటే నెలవారీ క్యాష్ ఫ్లో తక్కువగా ఉంటుంది. ఇక 40 శాతం దాటితే వద్దనే చెప్పాలి. ఇంటి ఖర్చులకు డబ్బులు మిగలటం చాలా కష్టమవుతుంది. మెడికల్, ఉద్యోగ ఎమర్జెన్సీలు తలెత్తితే మేనేజ్ చేయటం కష్టం. అధిక వడ్డీలకు అప్పులు చేసి ఇరుక్కుపోయే ప్రమాదముంటుంది. ఒకవేళ ఎక్కువ మంది సంపాదిస్తుంటే, 6–12 నెలల ఎమర్జెన్సీ నిధి చేతిలో ఉన్నపుడు, ఇతరత్రా రుణాలేవీ లేనప్పుడు మాత్రం 40 శాతానికి అటూ ఇటుగా ఉన్నా మేనేజ్ చేయొచ్చు.బ్యాంకింగ్..నా భార్యతో జాయింట్‌గా ఎఫ్డీలను ఓపెన్ చేయొ చ్చా? పన్ను ప్రయోజనాలు?ఇద్దరూ కలిసి ఫిక్స్డ్ డిపాజిట్లు ఓపెన్ చేయటానికి ఇబ్బందులుండవు. పన్ను ప్రయోజనాలు ఫస్ట్ హోల్డర్‌కే వర్తిస్తాయి. ఎఫ్డీ తెరిచేటపుడు దాన్ని విత్‌డ్రా చేయటం, రెన్యూవల్ చేయటం వంటి హక్కులు ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఉండేలా స్పష్టంగా పేర్కొనాలి. అలాకాని పక్షంలో ఫస్ట్ హోల్డర్‌కే ఆ హక్కులుంటాయి. తన మరణం తరువాతే మిగిలిన వ్యక్తికి వస్తాయి. ఇద్దరు కలిసి ఎఫ్డీ తెరిటేపుడు ఒకరు సీనియర్ సిటిజన్ అయితే వారినే ఫస్ట్ హోల్డర్‌గా పేర్కొంటే వడ్డీ కాస్త ఎక్కువ వస్తుంది. లేని పక్షంలో ఇద్దరిలో ఎవరు తక్కువ ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటారో వారి పేరిట తెరిస్తే... వడ్డీపై పన్ను తక్కువ చెల్లించాల్సి వస్తుంది.బంగారంబంగారం ఆన్లైన్లో కొన్నాను. దీన్ని తనఖా పెట్టవచ్చా?ఆన్లైన్లో కాయిన్లు, ఆభరణాల రూపంలో కొంటే దాన్ని తనఖా పెట్టవచ్చు. స్వచ్ఛతకు సంబంధించిన కొన్ని నిబంధనలున్నాయి. వాటికి లోబడి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తనఖా పెట్టుకుంటాయి. ఒరిజినల్ బిల్లు తప్పనిసరిగా ఉండాలి. బంగారం 22 లేదా 24 క్యారెట్ల స్వచ్ఛతను కలిగి ఉండాలి. హాల్‌మార్క్ ఉంటే ఈజీగా అంగీకరిస్తారు. కొన్ని బ్యాంకులైతే ప్రయివేటు మింట్ల నుంచి వచి్చన కాయిన్లను 50 గ్రాములకన్నా ఎక్కువ తీసుకోవటం లేదు. అలాంటి పక్షంలో ముత్తూట్, మణప్పురం వంటి ఎన్బీఎఫ్సీలు బెటర్. మీకు బంగారంపై రుణం సత్వరం కావాలంటే ఎన్బీఎఫ్సీలే నయం. బ్యాంకులు నిబంధనల విషయంలో కఠినంగా ఉంటాయి.స్టాక్ మార్కెట్...ట్రేడింగ్ ఖాతా ఓపెన్ చేయడానికి నిబంధనలేంటి? సిబిల్ స్కోరు అవసరమా?ట్రేడింగ్ ఖాతా తెరవటానికి సిబిల్ స్కోరు అవసరం లేదు. కాకపోతే 18 ఏళ్లు నిండి ఉండాలి. పాన్ కార్డు, ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఉండాలి. షేర్లలో ఇన్వెస్ట్ చేయటం వరకూ పర్వాలేదు గానీ... ఎఫ్అండ్ఓ, కమోడిటీ–కరెన్సీ డెరివేటివ్స్‌లో ట్రేడింగ్ చేయాలంటే మాత్రం ఆదాయపు ధ్రువీకరణ పత్రం అవసరం. దీనికోసం ఐటీఆర్, 3 నెలల శాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, నెట్‌వర్త్ సర్టిఫికెట్ వంటివాటిలో ఏదైనా సరిపోతుంది. షేర్లను హోల్డ్ చేయడానికి డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. మనకైతే మామూలు కేవైసీ సరిపోతుంది. ఎన్ఆర్ఐలకు ప్రత్యేక ఎన్ఆర్ఈ ఖాతా అవసరం.మ్యూచువల్ ఫండ్స్...సిప్‌లలో ఎంతశాతం రాబడిని ఆశించవచ్చు?సిప్‌లలో రాబడులనేవి అది ఏ తరహా ఫండ్.. ఎంతకాలం ఇన్వెస్ట్ చేశారన్నదానిపై ఆధారపడి ఉంటుంది. పదేళ్లకు మించి చూస్తే... లార్జ్‌క్యాప్ ఫండ్లు 10–012 శాతం, మిడ్ క్యాప్ ఈక్విటీ 12–15 శాతం, స్మాల్ క్యాప్ ఈక్విటీ 14–18 శాతం, హైబ్రిడ్ ఫండ్లు 8–10 శాతం, డెట్ ఫండ్లు 5–7 శాతం రాబడులను అందించిన పరిస్థితి ఉంది. సిప్‌లు కనీసం ఏడేళ్లకు పైబడి చేస్తేనే మంచి ఫలితాలొస్తాయి. స్వల్పకాలా నికైతే ఒకోసారి నెగెటివ్ రాబడులూ ఉండొచ్చు. మార్కెట్లలో ఎగుడుదిగుళ్లు సహజం. వాస్తవ రాబడులనేవి మార్కెట్ సైకిల్స్, మీరు ఎంచుకున్న ఫండ్ నాణ్యత, మీ క్రమశిక్షణపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా.. దీర్ఘకాలమైతేనే ‘సిప్’ చెయ్యండి.ఇన్సూరెన్స్హెల్త్ ఇన్సూరెన్స్‌కు టాప్–అప్ చేయించడం మంచిదేనా?హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తక్కువగా ఉందని భావిస్తే టాప్–అప్ మంచిదే. మీ అవసరాలు, బడ్జెట్ కూడా చూసుకోవాలి. టాప్–అప్ మీ ఇన్సూరెన్స్ మొత్తం సరిపోని పక్షంలో మాత్రమే అక్కరకొస్తుంది. అంటే మీకు రూ.5 లక్షల బీమా ఉందనుకుందాం. రూ.10 లక్షలకు టాప్–అప్ తీసుకుంటే... మీకు అవసరం వచి్చనపుడు రూ.5 లక్షలు పూర్తయిపోయాక ఈ టాప్ అప్ మొత్తం అక్కరకొస్తుంది. అందుకని మీకు ప్రస్తుత ఇన్సూరెన్స్ సరిపోదని భావిస్తున్నపుడే టాప్–అప్ వైపు చూడాలి. మీరు యువకులై ఉండి, మీకు కవరేజీ గనక రూ.10 లక్షల వరకూ ఉందనుకుందాం. అపుడు టాప్–అప్ అవసరం చాలా తక్కువపడుతుంది.మీ సందేహాలకూ నిపుణుల ద్వారా సమాధానాలు కావాలంటే business@sakshi.com కు మెయిల్ చేయండి. -
బంగారు గృహాల భారతదేశం
ప్రముఖ వజ్రాల వ్యాపార సంస్థ డీ బియర్స్ వజ్రాలను ‘‘స్త్రీలకు అత్యంత ప్రియమైనవిగా’’ ప్రచారం చేసినా, భారత మహిళల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నది మాత్రం బంగారమే. ఆభరణాలుగా అలంకరణకు మాత్రమే కాకుండా, విలువ తగ్గని ఆస్తిగా (ఖరీదైన కారు లేదా తాజా ఐఫోన్ లాగా కాదు) బంగారం భారతీయులకు సంపద సృష్టిలో విప్లవాత్మక పాత్ర పోషించింది.బిలియన్ డాలర్ల సంపద సృష్టి 2011 నుంచి 2024 మధ్య భారత్ భారీగా బంగారం దిగుమతి చేసుకుంది. దీనివల్ల వాణిజ్య లోటు పెరిగిందనే విమర్శలు వచ్చాయి. కానీ నేటి ధరలతో చూసుకుంటే, ఈ బంగారం భారత కుటుంబాలకు అసాధారణమైన సంపదను సృష్టించింది.ఈ కాలంలో దిగుమతి చేసిన బంగారం విలువ సుమారు ఒక ట్రిలియన్ డాలర్లకు పెరిగింది.దాదాపు 175% పెరుగుదల. భారతదేశ ప్రస్తుత విదేశీ మారక నిల్వలకంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. అప్పట్లో వాణిజ్య లోటుపై ఆందోళన వ్యక్తం చేసిన విశ్లేషకులు, దీర్ఘకాల సంపద సృష్టిని అంచనా వేయలేకపోయారు.ఆభరణాల రీ–ఎగుమతులు – గ్లోబల్ జువెలరీ హబ్‌గా భారత్ దిగుమతి చేసిన బంగారంలో కొంత భాగం ఆభరణాల రూపంలో మళ్లీ విదేశాలకు ఎగుమతి అవుతోంది. ఇది ప్రపంచ ఆభరణాల తయారీ, వ్యాపార కేంద్రంగా భారతదేశానికి ఉన్న స్థానాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే దేశీయంగా నిల్వ ఉన్న అపారమైన బంగారం సంపద ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గించదు.భారత కుటుంబాల వద్ద 25,000–30,000 టన్నుల బంగారం అంచనాల ప్రకారం భారత కుటుంబాల వద్ద 25,000 నుంచి 30,000 టన్నుల బంగారం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నిల్వలలో ఒకటి. ప్రస్తుత ధరలతో దీని విలువ 3.4 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.1 ట్రిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. ఇది భారత గృహ సంపదలో బంగారం ఎంత కీలక భాగమో స్పష్టం చేస్తోంది.2025లో బంగారం బ్లాక్‌బస్టర్, 2026పై అంచనాలు భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు ఇవన్నీ కలిసి 2025లో బంగారాన్ని బ్లాక్‌బస్టర్ ఆస్తిగా మా ర్చాయి. భారతదేశంలో పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడుల కారణంగా డిమాండ్ నిలకడగా కొనసాగింది. అయితే 2026కి చూస్తే, బంగారంపై దృక్పథం సానుకూలంగానే ఉన్నా కొంత జాగ్రత్త అవసరం. ద్రవ్య విధానాలు, వడ్డీ రేట్లు, కరెన్సీ మార్పులు బంగారం ధర విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ద్రవ్యోల్బణం దీర్ఘకాలం కొనసాగితే బంగారం కొనుగోలు శక్తిని కాపాడే కీలక రక్షణగా నిలుస్తుంది. వడ్డీ రేట్లు తీవ్రంగా పెరిగినా, దీర్ఘకాలంలో బంగారం విలువ నిలకడగా ఉంటుంది.పోర్ట్‌ఫోలియోలో బంగారం ఆర్థిక నిపుణులు సాధారణంగా పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో 5–10% బంగారానికి కేటాయించమని సూచిస్తారు. ఇది ఈక్విటీల వృద్ధితో సమతుల్యతను కలిగిస్తుంది. ఇప్పటికే భౌతిక బంగారం ఎక్కువగా కలిగి ఉన్నవారు, లిక్విడిటీ కోసం గోల్డ్ ఫండ్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. కొత్త ఏడాదిలో బంగారంలో పెట్టుబడులకు కొత్త మార్గాలు తెరుచుకోనున్నాయి. సావరిన్ గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్ వంటి మార్గాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.ఇటీవల ప్రభుత్వ నిబంధనల మార్పులతో, ఫండ్ మేనేజ్మెంట్ సంస్థలు బంగారం వంటి కమోడిటీల్లో పెట్టుబడి పెట్టే కొత్త ఫండ్స్‌ను ప్రారంభించనున్నాయి. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ కేంద్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో, భౌతిక బంగారం ఆధారిత, ప్రొఫెషనల్‌గా నిర్వహించే గోల్డ్ ఫండ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇవి రెసిడెంట్ ఇండియన్లు, ప్రవాస భారతీయులకు ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను కల్పిస్తాయి.ముగింపు ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో, 2026లో కూడా బంగారం భారత పెట్టుబడిదారుల వ్యూహాత్మక ఆస్తిగా కొనసాగనుంది. ధరల్లో హెచ్చుతగ్గులు సహజమే అయినా, సంస్కృతి, గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు, అపారమైన నిల్వ విలువ ఇవన్నీ బంగారాన్ని సంపద రక్షణలో అనివార్య భాగంగా నిలుపుతున్నాయి. సంప్రదాయ బంగారంతో పాటు ఆధునిక పెట్టుబడి సాధనాలను కూడా వినియోగించుకుంటే, పెట్టుబడిదారులు లాభాలను పొందుతూనే ఆర్థిక ఉపద్రవాలను సమర్థంగా ఎదుర్కొగలరు. -
వెండి, బంగారం కంటే ఖరీదైన కూరగాయ..! KG ఎంతంటే..?
-
న్యూ ఇయర్లో మొదటిసారి తగ్గిన గోల్డ్ రేటు: కొత్త ధరలు ఇలా..
వరుసగా రెండు రోజులు ధరలు తగ్గిన తరువాత.. బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోచు చేశాయి. వెండి రేటు కూడా అదే బాటలో పయనించింది. దీంతో గోల్డ్, సిల్వర్ ధరలు నూతన సంవత్సరంలో మొదటిసారి తగ్గాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు: రెండో రోజూ..
జనవరి 1న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు (జనవరి 2) అమాంతం దూసుకెళ్లాయి. నేడు గోల్డ్ రేటు గరిష్టంగా 1140 రూపాయలు పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చింది. వెండి రేటు కూడా అదే బాటలో అడుగులు వేస్తూ రూ. 4000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 2.60 లక్షలకు చేరింది.ఈ కథనంలో బంగారం, వెండి ధరలు హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
తవ్వకాల్లో 500 ఏళ్ల ఓడ.. బంగారం ఎంతుందంటే..!
ఆఫ్రికాలో 500 సంవత్సరాల పురాతన ఓడ ఏడారిలో జరిపిన తవ్వకాల్లో శాస్త్రవేత్తలకు లభ్యమయ్యింది. అయితే సముద్ర గర్భంలో ఉండాల్సిన నౌక ఇంత భారీ పరిమాణం గల నౌక ఇసుక ఏడారిలోకి ఎలా వచ్చిందబ్బా అని వారు తొలుత హవాక్కయ్యారు. తాజాగా అందులో అపారమైన బంగారం. వెండితో పాటు పెద్ద మెుత్తంలో ఖజానా దొరికింది.2008 సంవత్సరంలో ఆఫ్రికాలోని నమీబియాలో నమీబ్ ఏడారిలో వజ్రాల కోసం శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. అప్పుడు ఆశ్చర్యకరంగా 500 సంవత్సరాల పురాతన బోమ్ జీసస్ అనే నౌకను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో దాదాపు 2వేల బంగారు నాణేలు, వెండి నాణేలు, వందల కిలోగ్రాములు రాగి కడ్డీలు ఇతర జంతువుల దంతాలు లభించాయి. దీంతో దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు దానిపై పరిశోధన జరపగా అది వాణిజ్య నౌకగా గుర్తించారు.అయితే ఆ నౌక 1533 సంవత్సరంలో ఆఫ్రికా నుంచి భారత్‌కు వాణిజ్యానికి వెళుతోందని తెలిపారు. ఆ సమయంలో నమిబీయా తీరాన్ని తీవ్ర మంచుతుపాను తాకడంతో ఓడ రాళ్లను ఢీకొట్టి మునిగిపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో ఓడలో ప్రయాణించిన వారి అవశేషాలు ఎక్కడ లభ్యం కాలేదు ఈ విషయం వారికి ఇప్పటికీ రహస్యంగానే ఉంది. -
'బంగారం'లాంటి ఛాన్స్.. పసిడి ధరల్లో భారీ మార్పు!
బంగారం ధరలు వరుస పెరుగుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. రెండు రోజుల్లో ఏకంగా రూ. 6000తగ్గింది. దీంతో పసిడి ధరల్లో ఊహించని మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉందో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా రెండు రోజుల్లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.6220 తగ్గి, రూ. 1,36,200 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 5700 రూపాయలు తగ్గింది. దీంతో రేటు రూ.1,24,850 వద్దకు చేరింది.ఢిల్లీ నగరంలో ధరలు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా పెరిగినప్పటికీ.. రేట్లలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,36,350 వద్ద, 22 క్యారెట్ల రేటు రూ. 1,25,000 వద్ద ఉంది.చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల గోల్డ్ రేటు రెండు రోజుల్లో 5450 రూపాయలు తగ్గడం వల్ల.. 10గ్రాముల ధర రూ. 137460 వద్ద ఉంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 5000 తగ్గింది. కాబట్టి రేటు రూ. 1,26,000 వద్ద నిలిచింది. -
మెటల్స్.. క్రాష్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటం, ఎగుమతులపై చైనా ఆంక్షలు తదితర అంశాల కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పసిడి, వెండి, రాగి తదితర కమోడిటీల ధరలు సోమవారం కుదేలయ్యాయి. వరుసగా నాలుగు సెషన్ల పాటు కొనసాగిన వెండి ర్యాలీకి బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, గరిష్ట స్థాయిలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్) ఫ్యూచర్స్ మార్కెట్లో మార్చి కాంట్రాక్టు ఒక దశలో సుమారు 6 శాతం క్షీణించి రూ. 2,26,275 (కిలోకి) వద్ద ట్రేడయ్యింది. సోమవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన సిల్వర్, ఇంట్రాడేలో జీవితకాల గరిష్టం రూ. 2,54,174ని తాకినప్పటికీ రూ. 2,25,500కి కూడా క్షీణించింది. ఇంట్రాడే గరిష్టం నుంచి దాదాపు రూ. 28,674 మేర పతనమైంది. గత వారంలో సిల్వర్ ఏకంగా రూ. 31,348 (15.04 శాతం) ఎగిసిన సంగతి తెలిసిందే. పసిడి 3%, రాగి 13 శాతం డౌన్ .. అటు పసిడిలో కూడా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫిబ్రవరి కాంట్రాక్టు పది గ్రాముల బంగారం ధర ఒక దశలో రూ. 4,946 మేర (3.54 శాతం) క్షీణించి రూ. 1,34,927కి తగ్గింది. ఇంట్రాడేలో రూ. 1,40,444 గరిష్ట స్థాయిని చూసింది. అంతక్రితం సెషన్లోనే (శుక్రవారం) పుత్తడి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 1,40,465ని తాకిన సంగతి తెలిసిందే. ఇక, రాగి విషయానికొస్తే, జనవరి కాంట్రాక్టు 13 శాతం క్షీణించి రూ. 1,211.05 (కిలోకి) పడిపోయింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 1,392.95ని తాకింది. రికార్డ్ స్థాయి ర్యాలీ అనంతరం ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో వెండి, పసిడి రేట్లు తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. భారీగా కొనుగోళ్ల వల్ల ఈ రెండూ ప్రస్తుతం ఓవర్‌బాట్ స్థితిలో ఉండటమనేది అప్రమత్తత వహించాల్సిన అవసరాన్ని సూచిస్తోందన్నారు. తదుపరి ర్యాలీకి ముందు కొంత కరెక్షన్ మంచిదని చెప్పారు. అటు అంతర్జాతీయంగా కామెక్స్‌లో 2026 మార్చి నెల వెండి కాంట్రాక్టు ఔన్సుకి (31.1 గ్రాములు) 8 శాతం పైగా నష్టపోయి ఒక దశలో 70.56 డాలర్లకు తగ్గింది. ఇంట్రాడేలో 82.61 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. అటు పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు అయిదు శాతం పైగా క్షీణించి ఒక దశలో 4,323.20 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఇంట్రాడేలో నమోదైన 4,580.70 డాలర్ల స్థాయితో పోలిస్తే 257.5 డాలర్ల మేర పతనమైంది. తర్వాత కొంత కోలుకుని 4,344.50 వద్ద ట్రేడయ్యింది. ఫ్యూచర్స్ రేట్ల ప్రభావం మంగళవారం దేశీయంగా స్పాట్ మార్కెట్లో కనిపిస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కారణాలు ఇవి.. వడ్డీ రేట్ల కోతలు, అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా కమోడిటీల్లో ర్యాలీ మొదలైందని, ప్రస్తుతం పరిస్థితులు కాస్త చక్కబడుతున్న దాఖలాలు కనిపిస్తుండటంతో లాభాల స్వీకరణ జరుగుతోందని భావించవచ్చని జేఎం ఫైనాన్షియల్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మేర్ తెలిపారు. అలాగే ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఉద్దేశించిన శాంతి చర్చలు తుది దశకు చేరాయన్న సంకేతాలు కూడా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుతాయనే ఆశాభావం కలిగిస్తున్నాయని యూబీఎస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు, సీఎంఈ, కామెక్స్లాంటి ప్రధాన డెరివేటివ్స్ ఎక్సే్చంజీలను నిర్వహించే సీఎంఈ గ్రూప్.. వెండి డెరివేటివ్స్ కాంట్రాక్టులపై మార్జిన్లను 20,000 డాలర్ల నుంచి 25,000 డాలర్లకు పెంచేయడం వల్ల ట్రేడర్లు అమ్మకాలకు దిగి ఉంటారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. స్పాట్లో వెండి అప్.. ఫ్యూచర్స్ మార్కెట్లో పతనమైనప్పటికీ.. సోమవారం స్పాట్ మార్కెట్లో వెండి రేటు మరో కొత్త రికార్డును తాకింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ట్రేడర్లు కొనుగోళ్లు కొనసాగించడంతో, న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలోకి రూ.3,650 పెరిగి రూ. 2,40,000 స్థాయిని తాకింది. మరో వైపు 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి రేటు పది గ్రాములకు రూ.500 క్షీణించి రూ. 1,41,800 వద్ద క్లోజయ్యింది. -
రూ.3170 తగ్గిన గోల్డ్ రేటు!: గంటల్లో మారిపోయిన ధరలు
భారతదేశంలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. డిసెంబర్ 29న గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 3170 తగ్గి.. పసిడి ప్రియుల మదిలో ఆశలు చిగురించేలా చేసింది. దీంతో గోల్డ్ రేటు తగ్గుముఖం పట్టింది. ఈ కథనంలో తాజా పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.సోమవారం ఉదయం హైదరాబాద్, విజయవాడలలో 650 రూపాయలు తగ్గిన 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 2900 తగ్గింది. అంటే గంటల వ్యవధిలోనే 650 రూపాయలు కాకుండా.. అదనంగా మరో 2,250 రూపాయలు (మొత్తం 2,900 రూపాయలు తగ్గింది) తగ్గింది.24 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా మరింత తగ్గింది. దీంతో తులం ధర రూ. 1,39,250 వద్దకు చేరింది. అంతకు ముందు రోజు రేటు రూ. 1,42,420 వద్ద ఉండేది. దీనిబట్టి చూస్తే ఈ రోజు రూ. 3,170 తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గడంతో.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 3170 రూపాయలు తగ్గి.. రూ. 1,39,400 వద్దకు చేరింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 2950 తగ్గి, రూ. 1,27,800 వద్ద నిలిచింది.వెండి ధరలువెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. MCX సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ సోమవారం 8 శాతం లేదా కిలోకు రూ. 21,000 తగ్గింది. నాన్-స్టాప్ ర్యాలీ తర్వాత కేజీ సిల్వర్ రేటు రూ. 254,174 నుంచి రూ. 233,120కు చేరింది. సోమవారం ఉదయం రూ. 2.50 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద ఉన్న వెండి రేటు.. కొన్ని గంటల్లోనే భారీ పతనాన్ని చవిచూసింది. -
భూగర్భంలో విలువైన సంపద.. భారత్‌లో ఎక్కడుందంటే?
ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఒకటి. ఇక్కడ ఇనుము, బొగ్గు, మాంగనీస్ వంటి వాటితో పాటు బంగారం కూడా ముఖ్యమైన ఖనిజ వనరు. ఇతర ఖనిజాల విషయాన్ని పక్కనపెడితే.. బంగారం భారతీయ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, సంప్రదాయాలలో విశిష్ట స్థానం పొందింది. వివాహాలు, పండుగలు, ఆభరణాలు, పెట్టుబడులు వంటి అనేక రంగాల్లో పసిడిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అందువల్ల భారతదేశంలోని బంగారు గనులు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.కోలార్ గోల్డ్ ఫీల్డ్స్భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం బంగారు గనులకు కేంద్రంగా నిలిచింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఇండియాలో మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో విస్తృతంగా తవ్వకాలు జరిపారు. అయితే ప్రస్తుతం కొన్ని ఆర్ధిక సాంకేతిక కారణాల వల్ల క్లోజ్ చేశారు.హట్టి గోల్డ్ మైన్స్కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్.. ప్రస్తుతం భారతదేశంలో క్రియాశీలంగా పనిచేస్తున్న అత్యంత ముఖ్యమైన బంగారు గని. రాయచూర్ జిల్లాలో ఉన్న ఈ గనులు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. బంగారు ఉత్పత్తిలో హట్టి గనులు ప్రస్తుతం ప్రధాన వనరుగా నిలుస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీలను ఉపయోగిస్తూ.. ఇక్కడ తవ్వకాలు కొనసాగుతున్నాయి.రామగిరికర్ణాటక మాత్రమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రామగిరి (అనంతపురం జిల్లా) ప్రాంతం పూర్వకాలంలో బంగారు తవ్వకాలకు ప్రసిద్ధి. కడప, చిత్తూరు జిల్లాల కొన్ని ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు గుర్తించారు. అదే విధంగా తెలంగాణలోని రామగిరి (పెద్దపల్లి జిల్లా) ప్రాంతం కూడా చారిత్రకంగా బంగారు గనులకు ప్రసిద్ధి చెందింది.ఇవి కాకుండా.. ఝార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్భూమ్ జిల్లా, రాజస్థాన్‌లోని బనాస్‌వారా, ఉదయ్‌పూర్ ప్రాంతాలు, కేరళలోని వయనాడు జిల్లా మొదలైన ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ప్రాంతాల్లో జరిగే తవ్వకాలకు పరిమితులు విధించారు. కాబట్టి ఇక్కడ విరివిగా తవ్వకాలు జరపడం నిషిద్ధం.బంగారు గనులు - ఎదుర్కొంటున్న సవాళ్లుబంగారు గనుల తవ్వకాలు అనుకున్నంత సులభమేమీ కాదు. ఈ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. లోతైన గనులు, అధిక వ్యయం, పర్యావరణ సమస్యలు, ఆధునిక సాంకేతిక అవసరాలు వంటి అంశాలు తవ్వకాలను ప్రభావితం చేస్తున్నాయి. అయినప్పటికీ, దేశీయంగా బంగారు ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కొత్త అన్వేషణలు, ఆధునిక పద్ధతులను ప్రోత్సహిస్తోంది. -
వెండి వెలుగులు
సాక్షి, అమరావతి : మరో నాలుగు రోజుల్లో ముగియనున్న 2025 సిల్వర్‌నామ సంవత్సరంగా రికార్డులకు ఎక్కనుంది. మార్కెట్లో వెండి ధరలు పరుగులు తీస్తూ బంగారం తళుకులు వెలవెలబోయేలా ఆకాశాన్నంటుతున్నాయి. నూతన గరిష్ట స్థాయిలకు చేరుకోవడమే కాకుండా ఒక్క ఏడాదిలోనే ఏకంగా 154 శాతం పైగా వృద్ధి చెందిందంటే ఏ స్పీడ్‌తో పరుగులు తీసిందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది డిసెంబర్ 26న కేజీ వెండి రూ.91,600గా ఉంటే అదిప్పుడు ఏకంగా రూ.2,36,350ని తాకి రికార్డులు సృష్టించింది. అక్టోబర్ 28న అంతర్జాతీయ మార్కెట్లో కేజీ వెండి ధర 45.43 డాలర్లుగా ఉంటే అదిప్పుడు నూతన గరిష్ట స్థాయి 72.70 డాలర్లకు అంటే రెండు నెలల్లో 69 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి 72.70 డాలర్లు తాకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గడిచిన ఏడాదికాలంలో పది గ్రాముల బంగారం ధర రూ.77,730 నుంచి 79.10 శాతం పెరిగి రూ.1,39,216కు చేరింది. బంగారం కూడా నూతన గరిష్ట స్థాయిలకు చేరినా ఏడాదిలో వెండి పరుగుతో పోలిస్తే వెనుకపడిపోయింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లైతే ఈ ఏడాది కాలంలో కేవలం 10 శాతం రాబడులను మాత్రమే అందించాయి.న్యూ ఏజ్ టెక్నాలజీ వల్లే భారీ పెరుగుదల పారిశ్రామికంగా ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్న ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, సోలార్ విద్యుత్, సెమీకండక్టర్స్, డేటా సెంటర్స్, రక్షణ పరికరాలు వంటి అనేక విభాగాల్లో వెండిని వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న సిల్వర్‌లో 60 శాతం పారిశ్రామిక అవసరాలకే వినియోగిస్తారంటే వెండి ఎంత కీలకపాత్ర పోషిస్తోందో అర్థం చేసుకోవచ్చు. 2024లో సుమారు రెండు కోట్ల కేజీల వెండిని పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించినట్లు అంచనా. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ, సెమీ కండక్టర్స్ వంటి రంగాలు వేగంగా వృద్ధి చెందుతుండడంతో సిల్వర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఉత్పత్తి కంటే పారిశ్రామిక డిమాండ్ పెరుగుతుండటం వెండి ర్యాలీకి ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికితోడు యుద్ధ భయాలు, అమెరికా టారిఫ్ బెదిరింపులతో పెట్టుబడులను బంగారం, వెండి, ప్లాటినం, కాపర్ వంటి కీలక లోహాల్లోకి తరలిస్తుండటంతో అన్నీ రికార్డు స్థాయి ధరలకు చేరుకున్నాయని, ఒడిదుడుకులు అధికంగా ఉండే వెండి మరింత ఎక్కువగా పెరిగిందంటున్నారు. దీనికితోడు మన దేశీయ కరెన్సీ ఈ ఏడాదిలో 8 శాతంపైగా పతనం కావడం మరింత కలిసొచ్చిందంటున్నారు. ఇంకా పెరిగితే రిస్కే ఎక్కువ ఇతర మెటల్స్‌తో పోలిస్తే వెండి ఎంత వేగంగా పెరుగుతుందో అంతకంటే వేగంగా పతనమవుతుందని గత అనుభవాలు స్పష్టం చేస్తుండటంతో ప్రస్తుతం పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఆచితూచి అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం – వెండి ధరల మధ్య ఉండే తేడాని గోల్డ్ సిల్వర్ రేషియోగా లెక్కిస్తారు. 2025లో 107గా ఉన్న గోల్డ్ సిల్వర్ రేషియో నిష్పత్తి వెండి పరుగుతో అది 64కి పడిపోయింది. 2016, 2021లో కూడా ఈ నిష్పత్తి ఈ స్థాయికి చేరినప్పుడు వెండి ధరలు బాగా పతనమైన విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. కేజీ వెండి ధర రానున్న రోజుల్లో రూ.2.50 లక్షల మార్కును చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పది గ్రాముల బంగారం రూ.1.65 లక్షలకు చేరుకోవచ్చని... ఈ స్థాయికి చేరుకున్న తర్వాత ధరల్లో కొంత సర్దుబాటు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టకొని బంగారం, వెండిలో ఒకేసారిగా కాకుండా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందిగా వీరు సూచిస్తున్నారు.కరెక్షన్కు అవకాశం కొత్త ఏడాదిలో బంగారం, వెండి ధరలు మరికొంత పెరిగినా దిద్దుబాటుకు గురయ్యే అవకాశాలు అంతకంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వెండి ఎంత వేగంగా పెరిగిందో పతనం కూడా అంతే వేగంగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. సాంకేతికంగా చూస్తే రికార్డు స్థాయికి చేరిన సిల్వర్‌లో లాభాల స్వీకరణకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026లో వెండి ధరలు పెరిగే అవకాశాలున్నా మధ్యలో ఒక భారీ కరెక్షన్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. – సతీష్ కంతేటి, డైరెక్టర్, జెన్ సెక్యూరిటీస్ -
బంగారం, వెండిలా.. దూసుకెళ్తున్న మరో మెటల్ రేటు!
సాధారణంగా విలువైన లోహాలు అంటే చాలామందికి బంగారం, వెండి గుర్తుకొస్తాయి. దీంతో వీటికి డిమాండ్ ఎక్కువై.. రేటు కూడా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో రాగి ధరలు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ రేటు 12000 డాలర్లు దాటేసింది.2025లో బంగారం, వెండి ధరలు వరుసగా 70 శాతం, 140 శాతం పెరిగాయి. ఇదే సమయంలో రాగి రేటు ఏకంగా 35 శాతం పెరిగిపోయింది. 2009 తరువాత కాపర్ రేటు ఇంతలా పెరగడం బహుశా ఇదే మొదటిసారి. దీంతో నిపుణులు దీనిని కొత్త బంగారం లేదా కొత్త వెండి అని పిలుస్తున్నారు.రాగి ధరలు భారీగా పెరగడానికి కారణాలుమార్కెట్లో రాగి ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం..భౌగోళిక, రాజకీయ కారణాలు.రాగిని ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో, డేటా సెంటర్లలో, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో వినియోగించడంఅమెరికా విధించిన సుంకాలు కూడా రాగి ధర పెరగడానికి ఓ కారణం అనే చెప్పాలి. సుంకాల కారణంగా.. రాగి రేటు భవిష్యత్తులో పెరుగుతుందేమో అని చాలామంది దీనిని నిల్వ చేసుకుంటున్నారు. దీంతో సరఫరా తగ్గిపోయి.. డిమాండ్ పెరుగుతోంది. డిమాండుకు తగిన సరఫరా లేకపోవడం వల్ల.. ధర పెరిగింది.రాగి ఉత్పత్తి తగ్గడం కూడా సరఫరా తగ్గడానికి కారణమైంది. -
పసిడి సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ: పసిడి, వెండి రికార్డు ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధరల్లో సరికొత్త రికార్డు నమోదైంది. మంగళవారం 10 గ్రాములకు రూ.2,650 పెరిగి రూ.1,40,850కు చేరుకుంది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం ధర 78 శాతం పెరిగినట్టయింది. 2024 డిసెంబర్ 31న ఉన్న రూ.78,950 నుంచి నికరంగా రూ.61,900 వరకు 10 గ్రాములకు పెరిగింది. ఢిల్లీ మార్కెట్లో వెండి ధర కిలోకి మరో రూ.2,750 పెరగడంతో సరికొత్త రికార్డు రూ.2,17,250 నమోదైంది. వెండి ధర ఈ ఏడాది ఏకంగా 142 శాతం పెరగడం గమనార్హం. 2024 డిసెంబర్ 31న కిలో ధర రూ.89,700 వద్ద ఉండగా, అక్కడి నుంచి నికరంగా రూ.1,27,550 లాభపడింది.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ వెండి ధర ఔన్స్‌కు 1.4 శాతం పెరిగి 70 డాలర్ల మార్క్‌ను మొదటిసారి చేరుకుంది. బులియన్లో అసాధారణ ర్యాలీ కొనసాగుతోందని, అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌కు 4,500 మార్క్‌ను చేరుకున్నట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. యూఎస్ ఫెడ్ 2026లో ఒకటికి మించిన రేట్ల కోతను చేపట్టొచ్చన్న అంచనాలు తాజాగా మరో విడత పసిడి, వెండి ధరల్లో ర్యాలీకి కారణమవుతున్నట్టు చెప్పారు. దీనికితోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సురక్షిత సాధనంగా డిమాండ్ సైతం కొనసాగుతున్నట్టు తెలిపారు. అంతర్జాతీయంగా పసిడి స్పాట్ ధర ఔన్స్‌కు ఈ ఏడాది 18,92 డాలర్ల నుంచి 4,500 డాలర్లకు చేరుకోవడం గమనార్హం -
‘బాబ్బాబు.. టన్నుల్లో బంగారం ఇస్తాం.. ఆ దీవిని మాకిచ్చేయండి!’
వాషింగ్టన్:ప్రపంచంలోనే అతిపెద్ద దీవి గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కన్నేశారు. అపారమైన ఖనిజ సంపద, ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం కారణంగా ఆయన తాజాగా ప్రత్యేక ప్రతినిధిని నియమిస్తూ అమెరికా దౌత్య ప్రయత్నాలను పునరుద్ధరించారు.గ్రీన్లాండ్లోని లిథియం, రాగి వంటి ఖనిజ సంపదను సొంతం చేసుకోవాలన్న అమెరికా ప్రయత్నాలు ఎప్పట్నుంచో సాగుతున్నాయి. 55–57 వేల మంది జనాభా ఉన్న ఈ దీవి, ఖనిజ సంపదతో పాటు భౌగోళికంగా కూడా కీలకంగా మారింది. 2016లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలపాలని ప్రయత్నాలు చేశారు. ‘గ్రీన్‌లాండ్‌ను మాకు ఇచ్చేయండి, 800 కోట్లు విలువ చేసే బంగారం ఇస్తాం’ అని ప్రతిపాదనలు పెట్టినా డెన్మార్క్ తిరస్కరించింది.అక్కడి ప్రజలు తమ ప్రాంతాన్ని అమెరికాలో కలపాలని కోరుకుంటున్నారని, డెన్మార్క్ వైఖరి వారికి నచ్చడం లేదని పలు మార్లు మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్లీ ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై దృష్టి సారించారు. ప్రత్యేక ప్రతినిధి నియామకం ద్వారా వాణిజ్య, భద్రతా, వ్యూహాత్మక అంశాలను బలపరచాలని సంకేతం ఇచ్చారు.గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ, డెన్మార్క్‌తో అనుబంధం కొనసాగుతోంది. దీనిపై డెన్మార్క్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ట్రంప్ మాత్రం ‘ఖనిజ సంపద కోసం కాదు, అమెరికా జాతీయ భద్రత కోసం ఈ నిర్ణయం’ అని స్పష్టం చేశారు. ఈ నియామకం అమెరికా ఆర్కిటిక్ వ్యూహానికి కొత్త దిశను చూపిస్తోంది. -
భారీగా పెరిగిన బంగారం ధర: కొత్త రేట్లు ఇలా..
బంగారం ధరల హీట్ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. 2025 జనవరిలో రూ. 79వేలు వద్ద ఉన్న గోల్డ్ రేటు.. ఇప్పుడు రూ. 1.38 లక్షలకు చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే ఏడాదిలో రూ. 59వేలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. అంతే కాకుండా గత రెండు రోజులుగా పసిడి ధరలు గరిష్టంగా రూ. 4370 పెరిగింది.హైదరాబాద్, విజయవాడలలో గోల్డ్ రేటు రెండు రోజుల్లో (డిసెంబర్ 22, 23) రూ. 4370 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,180 నుంచి రూ. 1,38,550 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,23,000 దగ్గర నుంచి రూ. 1,27,000 వద్దకు (రూ. 4000 పెరిగింది) చేరింది.ఢిల్లీ నగరంలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. డిసెంబర్ 22, 23 తేదీల్లో రూ. 4370 పెరిగింది. దీంతో ఇక్కడ 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,38,700కి చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల రేటు రూ. 4000 పెరగడంతో రూ. 1,27,150 వద్దకు చేరింది.చెన్నైలో పసిడి ధరలు పెరగడంతో.. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,39,310 వద్దకు (రూ. 4030 పెరిగింది), 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,27,700 వద్దకు (రూ. 3700 పెరిగింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా రెండు రోజుల్లో (సోమ, మంగళవారాలు) రూ. 8000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 2.34 లక్షలకు చేరింది. -
ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రూ.1.4 లక్షలకు చేరువలో బంగారం!: ఇక కొనేదెలా..
బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజు (డిసెంబర్ 22) ఉదయం గరిష్టంగా రూ. 1100 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి మరోమారు పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో తాజా గోల్డ్ రేటు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.1,24,000 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,24,800 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 800 పెరిగిందన్న మాట. (ఉదయం 1000 రూపాయలు పెరిగిన గోల్డ్ రేటు, ఇప్పడు మరో 800 రూపాయలు పెరిగి.. మొత్తం రూ. 1800 పెరిగింది).24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 1970 పెరగడంతో 10 గ్రాముల ధర రూ. 1,36,150 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 1100 రూపాయలు పెరిగింది. సాయంత్రానికి మరో 870 రూపాయలు పెరగడంతో రెండూ కలిపి మొత్తం రూ. 1970 పెరిగింది).ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి పెరిగింది. దీంతో సాయంత్రానికి 24 క్యారెట్ల ధర రూ. 1970 పెరగడంతో 10 గ్రాముల రేటు రూ. 1,36,300 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1800 పెరిగి.. 1 24,950 రూపాయల వద్దకు చేరింది.ఇక చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1850 పెరగడంతో రూ. 1,37,130 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1700 పెరిగి.. 1,25,700 రూపాయల వద్దకు చేరింది. -
కియోసాకి ఆర్ధిక సూత్రాలు: ధనికులయ్యే మార్గాలు!
ప్రపంచ ఆర్థిక అంశాలు, పెట్టుబడులపై సూచనలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. తన ఎక్స్ ఖాతాలో యాక్టివ్‌గా ఉంటూ.. ధనవంతులు అవ్వడం ఎలా?, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను పేర్కొంటూ ఉంటారు. ఇందులో భాగంగానే.. ఈ మధ్య కాలంలో కొన్ని ఆర్ధిక పాఠాలను వెల్లడించారు.👉కియోసాకి మొదటి సూచన చమురు, సహజ వాయువు వంటి ఇంధనాలపై పెట్టుబడులు పెట్టడం. కృత్రిమ మేధస్సులో వేగవంతమైన పురోగతి, ప్రపంచ ఇంధన డిమాండ్‌ను గణనీయంగా పెంచుతుందని, సాంప్రదాయ ఇంధన ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారన్న ఆయన తాను ఇంధన రంగంలోనే పెట్టుబడుతున్నట్లు వెల్లడించారు.👉ఓడిపోయినవారు ఎప్పుడూ పాత ఆలోచనలు పట్టుకుంటారు. విజేతలా ఆలోచించడం ప్రారంభించండి. డబ్బును పట్టుకోవడం మానేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా మారండి. 1996లో ప్రచురించబడిన రిచ్ డాడ్ పూర్ డాడ్లో.. నేను “పొదుపు చేసేవారు ఓడిపోతారు” అని హెచ్చరించాను.👉ఆర్థిక సంక్షోభానికి చిక్కకుండా ఉండాలంటే ‘నెట్ వర్క్ మార్కెటింగ్’లో చేరాలని సూచించారు. ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి నెట్ వర్క్ మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా వ్యవస్థాపక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక పతనానికి సిద్ధం కావాలని అన్నారు.👉ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ధనవంతులు ఎలా జీవిస్తారో అలాగే మీరూ జీవించండి. మాంద్యం ప్రభావం నుంచి బయటపడటానికి తక్షణమే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఆయన సూచించారు. సొంత కారు ఉన్నవారు వెంటనే ఉబర్ (Uber) వంటి సేవల్లో చేరి అదనపు ఆదాయాన్ని సంపాదించాలని సూచించారు.👉ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో, అనేక ఆస్తుల ధరలు తగ్గుతాయి. తక్కువ ధరకు మంచి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో మరింత ధనవంతులు అవ్వొచ్చు. నేను మూడు ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ సూత్రాన్నే పాటించాను.👉ఆర్థిక పతనాలు ఒక్కరోజులో జరగవని, దశాబ్దాల పాటు నిర్మాణం చెందుతాయని కియోసాకి పేర్కొన్నారు. 1965లో అమెరికా నాణేల్లో వెండిని తొలగించడం, 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్‌ను బంగారం ప్రమాణం నుంచి వైదొలగించడం వంటి చరిత్రాత్మక సంఘటనలు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మార్చేశాయని చెప్పారు.👉ప్రభుత్వాలు అతిగా డబ్బు ముద్రిస్తే దాని ఫలితం అధిక ద్రవ్యోల్బణం (Hyper-Inflation) అని అంటారు. ఇదే జరిగితే డబ్బు విలువ బాగా పడిపోతుంది. అవసరమైన వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. ప్రజల జీవితం చాలా ఖరీదవుతుంది. కాబట్టి నా సూచన ఏమిటంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం కొనండి.👉మాటలను నియంత్రించుకోవాలి. ''మీరు మాట్లాడే మాటలే మీరు'' అవుతారని కియోసాకి అన్నారు. రిచ్ డాడ్ (ధనిక తండ్రి).. తన కొడుకు నుంచి చేతకాదు, చేయలేను.. అనే మాటలను ఒప్పుకోరు. ఎందుకంటే మాటలే మనల్ని నియంత్రిస్తాయని అంటారు. పూర్ డాడ్ (పేద తండ్రి).. పదేపదే నేను చేయలేను అని చెప్పేవారు. ఆయన ఆ మాటలకే కట్టుబడిపోయారు. దీంతో ఆయన ఎంత డబ్బు సంపాదించినా జీవితాంతం పేదవాడిగానే ఉండిపోయారని కియోసాకి పేర్కొన్నారు. -
2026లో బంగారం కొనడం కష్టమే!.. ఎందుకంటే?
2025 ఇంకొన్ని రోజుల్లో ముగుస్తుంది. బంగార ధరలు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది (2025) ప్రారంభంలో రూ.78,000 ఉన్న గోల్డ్ రేటు.. ప్రస్తుతం రూ.1.3 లక్షలకు చేరుకుంది. దీంతో 2026లో పసిడి ధరలు ఇంకెలా ఉండబోతున్నాయో అని చాలామంది ఆందోళన చెందుతున్నారు.2026 డిసెంబర్ నాటికి బంగారం ధర ఔన్సుకు 14% పెరిగి 4,900 డాలర్లకు చేరుకుంటుందని.. గోల్డ్‌మన్ సాచ్స్ (Goldman Sachs) అంచనా వేసింది. సెంట్రల్ బ్యాంక్ డిమాండ్, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతలు వంటివి గోల్డ్ రేటు పెరగడానికి కారణమవుతున్నాయి. వచ్చే ఏడాది కూడా బంగారం ధర భారీగా పెరుగుతుందని నివేదికలో గోల్డ్‌మన్ సాచ్స్ వెల్లడించింది.భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. గ్లోబల్ మార్కెట్లో కూడా గోల్డ్ రేటు 61 శాతం పెరిగింది. ఈ విధంగా ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. ట్రంప్ టారిఫ్స్ ప్రకటనలు. స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిన సమయంలో చాలామంది పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇది కూడా గోల్డ్ రేటు గణనీయంగా పెరగడానికి ఓ కారణమైంది.ప్రస్తుతం బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. ఎందుకంటే అంతర్జాతీయ ఆర్ధిక అనిశ్చితులు, ద్రవ్యోల్బణం సమయంలో పెట్టుబడిదారులకు గోల్డ్ సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఉపయోగపడుతుంది. రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు సైతం బంగారంపై పెట్టే పెట్టుబడి.. మిమ్మల్ని ఆర్ధిక సమస్యల నుంచి బయటపడేస్తుందని చెబుతున్నారు. కాబట్టి చాలామంది పసిడిపై పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. కాబట్టి రేటు కూడా పెరుగుతుందని స్పష్టంగా అవగతం అవుతోంది.నేటి ధరలువరుస హెచ్చుతగ్గుల మధ్య ఈ రోజు (డిసెంబర్ 20) బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,34,180 వద్ద.. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,23,000 వద్ద నిలిచాయి. చెన్నైలో మాత్రమే ఈ ధరలు కొంత ఎక్కువగా ఉన్నాయి.ఇదీ చదవండి: మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్ -
మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్
ఎనిమిది ఆర్ధిక పాఠాలు చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. ఇప్పుడు తాజాగా లెసన్ 9 అంటూ తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు మరింత ధనవంతులు కావడం ఎలా?, అనే విషయం గురించి వెల్లడించారు.ఫెడ్ (FED) భవిష్యత్తు కోసం తమ ప్రణాళికలను ప్రపంచానికి తెలియజేసింది. వడ్డీ రేట్లను తగ్గించింది. భవిష్యత్తులో భారీగా డబ్బు ముద్రణ జరుగుతుందని, దీనిని కియోసాకి ఫేక్ మనీ ప్రింటింగ్ అని అభివర్ణించారు. ఈ ఘటనను లారీ లెపార్డ్ తన గొప్ప పుస్తకంలో "ది బిగ్ ప్రింట్" అని పిలిచారు.ప్రభుత్వాలు అతిగా డబ్బు ముద్రిస్తే దాని ఫలితం అధిక ద్రవ్యోల్బణం (Hyper-Inflation) అని అంటారు. ఇదే జరిగితే డబ్బు విలువ బాగా పడిపోతుంది. అవసరమైన వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. ప్రజల జీవితం చాలా ఖరీదవుతుంది. కాబట్టి నా సూచన ఏమిటంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం కొనండి.ఇదీ చదవండి: పాత రూ.500, రూ.1000 నోట్లు ఉంటే నేరమా.. జరిమానా ఎంత?గత వారం ఫెడ్ రేట్ల తగ్గింపును ప్రకటించిన వెంటనే నేను మరింత వెండిని కొన్నాను. వెండి ధర భారీగా పెరగనుంది. బహుశా 2026లో ఔన్సు రేటు 200 డాలర్లకు చేరవచ్చు. ఈ ధర 2024లో 20 డాలర్ల వద్ద మాత్రమే ఉంది. దీన్ని బట్టి చూస్తే సిల్వర్ రేటు ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.LESSON # 9: How to get richer as the world economy crashes.The FED just let the world know their plans for the future.The FED lowered interest rates…signaling QE (quantitative easing) or turning on the fake money printing press….What Larry Lepard calls “The Big Print” the…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 17, 2025 -
దిగొచ్చిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. దాంతోపాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి ధరల్లో మార్పులు కూడా పసిడి ధరలు తగ్గేందుకు కారణంగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం ధర మరింత పెరిగేలా ప్రభుత్వం చర్యలు!
భారతదేశంలో బంగారం వినియోగానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. అయితే, ఇటీవల మారుతున్న అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, రూపాయి విలువ క్షీణత వంటి కారణాలతో కేంద్ర ప్రభుత్వం బంగారంపై బేస్ ఇంపోర్ట్ ట్యాక్స్‌ను పెంచడంపై చర్చిస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు, దీనివల్ల కలిగే పర్యవసానాలను చూద్దాం.ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడానికి ప్రధాన కారణాలుభారత ప్రభుత్వం సాధారణంగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్(ద్రవ్యలోటు) నియంత్రించడానికి, రూపాయి విలువను కాపాడటానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలోపేతం కావడం, భారత రూపాయి విలువ ఆల్-టైమ్ కనిష్టానికి (దాదాపు రూ.91 మార్కుకు) పడిపోవడం ఆందోళనగా మారింది. రూపాయి పతనమైతే దిగుమతి చేసుకునే వస్తువుల ఖరీదు పెరుగుతుంది. బంగారం దిగుమతులకు డాలర్లలో చెల్లింపులు చేయాల్సి రావడంతో విదేశీ మారక నిల్వలు హరించుకుపోకుండా చూసేందుకు ట్యాక్స్‌ను ఆయుధంగా వాడుతున్నారు.పెరుగుతున్న వాణిజ్య లోటుదేశం నుంచి అయ్యే ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు వాణిజ్య లోటు ఏర్పడుతుంది. భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకునే వస్తువుల్లో ముడి చమురు తర్వాత బంగారం రెండో స్థానంలో ఉంది. దిగుమతులు తగ్గించడం ద్వారా ఈ లోటును పూడ్చాలని ప్రభుత్వం భావిస్తోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ అనిశ్చితి వల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది మన దిగుమతి బిల్లును మరింత పెంచుతోంది.దిగుమతి సుంకం రేట్లు (ప్రస్తుతం)గతంలో (2024 బడ్జెట్లో) ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6%కి తగ్గించింది. అయితే ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిపుణులు ఈ సుంకాన్ని మళ్లీ పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.అంశంప్రస్తుత రేటుగత రేటు (2024 జులైకి ముందు)బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD)5%10%అగ్రికల్చర్ సెస్ (AIDC)1%5%మొత్తం సుంకం6%15% పర్యవసానాలువినియోగదారులపై భారంసుంకం పెరగడం వల్ల దేశీయంగా బంగారం ధరలు పెరుగుతాయి. సామాన్యులకు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనడం భారంగా మారుతుంది. ఇప్పటికే 10 గ్రాముల ధర రికార్డు స్థాయిలకు చేరడంతో అదనపు పన్ను కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది.స్మగ్లింగ్ పెరిగే ప్రమాదందిగుమతి సుంకం ఎక్కువగా ఉంటే దేశీయ మార్కెట్ ధరలకు, అంతర్జాతీయ ధరలకు మధ్య వ్యత్యాసం పెరుగుతుంది. ఈ గ్యాప్‌ను సొమ్ము చేసుకునేందుకు అక్రమ మార్గాల్లో (స్మగ్లింగ్) బంగారాన్ని తరలించే ముఠాలు చురుగ్గా మారే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) హెచ్చరిస్తోంది.జ్యువెలరీ పరిశ్రమపై ప్రభావంపెరిగిన ధరల వల్ల అమ్మకాలు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ఆభరణాల తయారీ రంగంలో పనిచేసే లక్షలాది మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం పడుతుంది. అలాగే, భారత్ నుంచి జరిగే ఆభరణాల ఎగుమతులు కూడా అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకోవడం కష్టమవుతుంది.ప్రత్యామ్నాయ మార్గాలుప్రభుత్వం కేవలం పన్నుల మీదనే ఆధారపడకుండా భౌతిక బంగారం దిగుమతిని తగ్గించడానికి కొన్ని ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్ మార్కెట్ ద్వారా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు సాధానాలుగా ఉన్నాయి. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌ల ద్వారా ఇళ్లలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల ద్వారా చెలామణిలోకి తీసుకురావాలి. ఇప్పటికే ఈ పని చేస్తున్నా దీన్ని మరింతగా పెంచాలి.బేస్ ఇంపోర్ట్ ట్యాక్స్ పెంపు అనేది ఆర్థిక వ్యవస్థను సమతుల్యం చేయడానికి ప్రభుత్వం తీసుకునే ఒక కఠినమైన నిర్ణయం. రూపాయి విలువను కాపాడటం, వాణిజ్య లోటును తగ్గించడం దీని వెనుక ఉన్న సానుకూల ఉద్దేశ్యాలు అయినప్పటికీ దీనివల్ల దేశీయంగా ధరలు పెరగడం, జ్యువెలరీ రంగం మందగించడం వంటి సవాళ్లు తప్పవని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో ప్రజలు భౌతిక బంగారం వైపు కాకుండా డిజిటల్ బంగారం లేదా బాండ్ల వైపు దృష్టి సారిస్తేనే దిగుమతుల భారం తగ్గే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారీగా జీతాల పెంపు ఈ రంగాల్లోనే.. -
తగ్గిన బంగారం దిగుమతులు: నవంబర్‌లో 60 శాతం..
దేశీయంగా బంగారం దిగుమతులు గత నెలలో వార్షికంగా 60 శాతం క్షీణించాయి. వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం నవంబర్‌లో 4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2024) నవంబర్‌లో 9.8 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతులు నమోదయ్యాయి.2025 అక్టోబర్‌లో మూడు రెట్లు ఎగసి 14.72 బిలియన్ డాలర్లను తాకిన పసిడి దిగుమతులు ఈ ఏడాది(2025) ఏప్రిల్–నవంబర్ కాలంలో 3.3 శాతం పెరిగి 45.26 బిలియన్ డాలర్లను తాకాయి. గతేడాది ఇదే కాలంలో ఇవి 43.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా.. పసిడి దిగుమతులు క్షీణించడంతో గత నెలలో దేశ వాణిజ్య లోటు తగ్గి 24.53 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది ఐదు నెలల కనిష్టంకాగా.. దిగుమతులు నీరసించడంతో దిగుమతుల బిల్లు సైతం తగ్గిందని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. -
Gold Price: తగ్గేదేలే అంటున్న బంగారం మరో వైపు వెండికి రెక్కలు
-
ఉద్యోగం చేస్తూ కోటీశ్వరులు కావాలంటే..
ఉద్యోగం చేసేవారికి కోటీశ్వరులు కావాలనే కల నెరవేర్చుకోవడానికి క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ప్రణాళిక చాలా ముఖ్యం. కేవలం పొదుపు చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. అందుకే పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బు మీ కోసం పనిచేసేలా చేయాలి. దీనికి తోడు చక్రవడ్డీ (Compounding) శక్తిని అర్థం చేసుకోవడం, వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టడం, రిస్క్‌ను తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి వివిధ మార్గాల్లో పెట్టుబడులను విభజించడం చాలా అవసరం. పెట్టుబడి పెట్టడానికి ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ప్రధాన మార్గాలు ఏమిటో చూద్దాం.మ్యూచువల్ ఫండ్స్ఉద్యోగులకు కోటీశ్వరులయ్యే లక్ష్యాన్ని చేరేందుకు మ్యూచువల్ ఫండ్స్ అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలలో ఒకటి. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి సిప్ విధానం అనుకూలంగా ఉంటుంది. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. చిన్న మొత్తంతో మొదలుపెట్టి జీతం పెరిగే కొద్దీ సిప్ మొత్తాన్ని పెంచుకుంటూ పోవడం మంచి పద్ధతి.ఈక్విటీ ఫండ్స్దీర్ఘకాలంలో (10-15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ) అధిక రాబడిని ఆశించేవారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్, ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్) అనుకూలం. ఇవి అధిక రిస్క్‌తో కూడినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని అధిగమించే శక్తిని కలిగి ఉంటాయి.డెట్ ఫండ్స్ఇవి బాండ్లు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ వంటి స్థిర ఆదాయ సాధనాల్లో పెట్టుబడి పెడతాయి. తక్కువ రిస్క్, స్థిరమైన రాబడి కోరుకునే వారికి ఇవి ఉపయోగపడతాయి.ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ఇవి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్. పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది. అయితే వీటికి కనీసం మూడు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది.ఈక్విటీ, స్టాక్ మార్కెట్పెట్టుబడిపై అధిక నియంత్రణ, అధిక రాబడిని కోరుకునే వారికి స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టడం ఒక మార్గం. స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టాలంటే మార్కెట్‌పై, కంపెనీల ఫండమెంటల్స్‌పై మంచి అవగాహన ఉండాలి. ఇది మ్యూచువల్ ఫండ్స్ కంటే అధిక రిస్క్‌తో కూడుకున్నది. దీర్ఘకాలికంగా బలంగా ఉన్న మంచి వృద్ధి సామర్థ్యం కలిగిన నాణ్యమైన కంపెనీల షేర్లను ఎంచుకోవడం వల్ల అద్భుతమైన రాబడిని పొందే అవకాశం ఉంది. మీ పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని మాత్రమే డైరెక్ట్ ఈక్విటీకి కేటాయించడం, ఒకే రంగంలో లేదా ఒకే షేరులో ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా వైవిధ్యపరచడం చాలా ముఖ్యం.రియల్ ఎస్టేట్భౌతిక ఆస్తులుఇళ్లు, అపార్ట్మెంట్లు లేదా వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో మూలధనం అవసరం. అద్దెల ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం, ఆస్తి విలువ పెరగడం ద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధి లభిస్తుంది. అయితే నిర్వహణ ఖర్చులు, లిక్విడిటీ లేకపోవడం (అంటే అవసరమైనప్పుడు త్వరగా నగదుగా మార్చలేకపోవడం) వంటి సవాళ్లు ఉంటాయి.రీట్స్(Real Estate Investment Trusts)రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇదొక సులభమైన మార్గం. రీట్స్ అనేవి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న మ్యూచువల్ ఫండ్స్ లాంటివి. వీటి ద్వారా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి, భారీ వాణిజ్య ఆస్తుల యజమాన్యంలో భాగస్వామి కావచ్చు. అద్దెల ఆదాయంలో వాటాను పొందవచ్చు. ఇది తక్కువ రిస్క్‌తో రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను అందిస్తుంది.చిన్న వ్యాపారాలుపెట్టుబడి పెట్టడం ద్వారా కాకుండా మీ ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా కూడా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఉద్యోగానికి భంగం కలగకుండా మీ నైపుణ్యాలు లేదా అభిరుచులకు అనుగుణంగా ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ సేవలు, కన్సల్టింగ్, లేదా చిన్న ఆన్లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా అదనపు ఆదాయాన్ని సృష్టించవచ్చు.ఈ సైడ్ బిజినెస్ ద్వారా వచ్చిన అదనపు ఆదాయాన్ని పైన పేర్కొన్న పెట్టుబడి మార్గాల్లోకి మళ్లించడం ద్వారా అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకోవచ్చు. కొంతమంది విజయవంతమైన చిరు వ్యాపారాల్లో చిన్న మొత్తంలో మూలధనాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా లాభాలు పొందవచ్చు. కానీ దీనికి ఆ వ్యాపారంపై పూర్తి అవగాహన ఉండాలి. ఇది కొంత రిస్క్‌తో కూడుకుంది.ఇతర ముఖ్యమైన పెట్టుబడి మార్గాలుపీపీఎఫ్: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రభుత్వం మద్దతుతో నడిచే సురక్షితమైన, దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. దీనికి 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. రాబడి స్థిరంగా, పన్ను రహితంగా ఉంటుంది. ఇది తక్కువ రిస్క్ కోరుకునే వారికి అనుకూలం.ఎన్పీఎస్: జాతీయ పింఛను పథకం అనేది ఉద్యోగులకు దీర్ఘకాలిక పదవీ విరమణ పొదుపు కోసం ఉద్దేశించింది. ఇది ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడి పెడుతుంది. సెక్షన్ 80సీ, 80సీసీడీ(1బీ) కింద అదనపు పన్ను ప్రయోజనం లభిస్తుంది.బంగారం: భౌతిక బంగారం లేదా సావరీన్ గోల్డ్ బాండ్లు (SGBs), గోల్డ్ ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. బంగారం తరచుగా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా హెడ్జింగ్‌గా(ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మార్కెట్ పడుతున్నప్పడు బంగారం పెరుగుతుంది. ఈక్రమంలో మార్కెట్ పడినప్పుడు బంగారంలోని పెట్టుబడి తీసి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు) పనిచేస్తుంది. పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణకు సహాయపడుతుంది.ఇదీ చదవండి: బంగారం ధరలపై భారీ ఊరట.. తులం ఎంతంటే.. -
బంగారం ధరలపై భారీ ఊరట.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం డబుల్: గంటల్లో తారుమారైన ధరలు!
కొన్నాళ్లుగా బంగారం, వెండి ధరలు బ్రేకుల్లేకుండా దూసుకెళ్తున్నాయి. ఈ రోజు కూడా అదేబాటలో పయనించాయి. అయితే సాయంత్రానికి మరోమారు రేటు పెరగడంతో పసిడి ప్రియులు అవాక్కవుతున్నారు. ఉదయం 980 పెరిగిన పసిడి ధర.. సాయంత్రానికి దాదాపు డబుల్ అయింది. దీంతో రేటు ఊహకందని విధంగా పెరిగిపోయింది. అనూహ్యంగా వెండి కూడా 5000 పెరిగింది. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.1,23,500 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,24,100 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 400 పెరిగిందన్న మాట. (ఉదయం 750 రూపాయలు పెరిగిన గోల్డ్ రేటు, ఇప్పడు మరో 400 రూపాయలు పెరిగి.. మొత్తం రూ. 1350 పెరిగింది).24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 1470 పెరగడంతో 10 గ్రాముల ధర రూ. 1,35,380 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 820 రూపాయలు పెరిగింది. సాయంత్రానికి మరో 650 రూపాయలు పెరగడంతో రెండూ కలిపి మొత్తం రూ. 1470 పెరిగింది).ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల ధర రూ. 1460 పెరగడంతో 10 గ్రాముల రేటు రూ. 1,35,530 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1350 పెరిగి.. 124250 రూపాయల వద్దకు చేరింది.ఇదీ చదవండి: రూ.2.40 లక్షలకు వెండి.. కొత్త ఏడాదిలో కష్టమే!ఇక చెన్నైలో విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1580 పెరగడంతో రూ. 1,36,530 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,450 పెరిగి.. 1,25,150 రూపాయల వద్దకు చేరింది.వెండి రేటు ఇలాబంగారం ధరలు పెరిగినా.. దాదాపు ఎప్పుడూ స్థిరంగా ఉండే వెండి రేటు ఈ రోజు రెండోసారి పెరిగింది. ఉదయం కేజీ రేటు 3000 పెరిగింది. ఇప్పుడు ఆ ధర రూ. 5000లకు చేరింది. అంటే ఉదయం నుంచి.. సాయంత్రానికే మరో 2000 రూపాయలు పెరిగింది. దీంతో సిల్వర్ ధర రూ. 2,15,000లకు చేరింది. -
పీక్‌లో గోల్డ్, సిల్వర్: డీలా పడిన ప్లాటినం!
భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఊహకందని రీతిలో పెరుగుతున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు క్రాస్ చేయగా.. కేజీ వెండి రూ. 2 లక్షలు దాటేసింది. ఈ రెండు కాకుండా ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇరిడియం, రుతేనియం, ఓస్మియం వంటి విలువైన లోహాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ చాలామందికి తెలిసిన లోహాలు గోల్డ్, సిల్వర్, ప్లాటినం మాత్రమే. పెట్టుబడిదారులకు పల్లాడియం గురించి తెలుసుంటుంది.ఇతర లోహాల సంగతి పక్కన పెడితే.. బంగారం వెండి ధరలు మాత్రమే ఎందుకు పెరుగుతున్నాయి. ప్లాటినం ధరలు ఎందుకు చాలా తక్కువ. దీనికి కారణం ఏమిటి?.. ఇతర లోహాల పరిస్థితి ఏమిటి? అనే విషయాలను ఇక్కడ క్షుణ్ణంగా పెరిశీలిద్దాం..బంగారం ధరలు పెరగడానికి కారణాలుద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలర్ విలువ & యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు, పండుగలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాల కారణంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారులు బంగారంపైన ఇన్వెస్ట్ చేయడం, డిమాండుకు తగ్గ.. బంగారం సరఫరా లేకపోవడం కూడా ధరలు పెరగడానికి కారణాలు అవుతున్నాయి.స్టాక్ మార్కెట్లలో పెట్టే పెట్టుబడులలో.. లాభనష్టాలు ఉంటాయి. కానీ బంగారం పెట్టే పెట్టుబడి భద్రంగా ఉంటుందని భావిస్తారు. ఈ కారణంగానే పెట్టుబడిదారులు.. మార్కెట్స్ కుప్పకూలినప్పుడు గోల్డ్ మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.వెండి ధరలు పెరగడానికి కారణాలుఈ ఏడాది వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. దీనికి ప్రధాన కారణం డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడం ఒక కారణం అయితే.. ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తయారీలలో వెండి వినియోగం పెరిగిపోవడం కూడా మరో కారణం. నీటి శుద్ధి, వైద్య రంగం, పారిశ్రామిక రసాయనాలు, ఉత్ప్రేరకాలలో కూడా వెండి వినియోగం విరివిగా ఉంది. ఎలక్ట్రానిక్స్, కండక్టర్లు, సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలలో కూడా వెండిని ఉపయోగిస్తారు.ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. వెండిని పారిశ్రామిక రంగంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల.. సిల్వర్ రేటు రెండు లక్షల రూపాయలు దాటేసింది.ప్లాటినం ధరలు ఎందుకు తక్కువ?➤బంగారం, వెండితో పోలిస్తే.. ప్లాటినం ధరలు చాలా తక్కువ. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.➤బంగారం, వెండి ఆభరణాలకు ఉన్నంత డిమాండ్.. ప్లాటినం ఆభరణాలు లేదు.➤ప్లాటినంపై పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువ➤ఇండస్ట్రీల్ వినియోగం ఎక్కువగా ఉంది.➤ప్లాటినం ముఖ్యంగా దక్షిణ ఆఫ్రికా, రష్యాలలో మాత్రమే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.➤డిమాండ్ తక్కువగా ఉండటం వల్లనే.. ప్లాటినం ధరలు తక్కువగా ఉన్నాయి.ఇతర లోహాలుబంగారం, వెండి మాదిరిగానే.. ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇరిడియం, రుతేనియం, ఓస్మియం కూడా విలువైన లోహాలు. అయితే వీటికున్న డిమాండ్ భారతదేశంలో చాలా తక్కువ. ఈ కారణంగానే వీటి ధరలు కూడా అలాగే ఉన్నాయి. బహుశా భవిష్యత్తులో వీటి ధరలు పెరుగుతాయా? అనేది తెలియాల్సి ఉంది. -
దిగొచ్చిన కనకం ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గంటల వ్యవధిలో.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు ఈ రోజు (డిసెంబర్ 12) ఉదయం గరిష్టంగా రూ. 2180 పెరిగింది. అయితే.. సాయంత్రానికి రేటు మళ్లీ పెరిగింది. దీంతో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో తాజా గోల్డ్ రేటు ఎలా ఉందనే.. విషయం తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.1,21,600 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,22,100 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 500 పెరిగిందన్న మాట. (ఉదయం 1750 రూపాయలు పెరిగిన గోల్డ్ రేటు, ఇప్పడు మరో 500 రూపాయలు పెరిగి.. మొత్తం రూ. 2250 పెరిగింది).24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 2450 పెరగడంతో 10 గ్రాముల ధర రూ. 1,33,200 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 1910 రూపాయలు పెరిగింది. సాయంత్రానికి మరో 540 రూపాయలు పెరగడంతో రెండూ కలిపి మొత్తం రూ. 2450 పెరిగింది).ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల ధర రూ. 2450 పెరగడంతో 10 గ్రాముల రేటు రూ. 1,33,350 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 2250 పెరిగి.. 1,22,250 రూపాయల వద్దకు చేరింది.ఇక చెన్నైలో విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 3490 పెరగడంతో రూ. 1,34,950 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 3200 పెరిగి.. 123700 రూపాయల వద్దకు చేరింది. -
ట్రంప్ గోల్డ్ కార్డు వచ్చేసింది
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ట్రంప్ గోల్డ్ కార్డు’ వీసా పథకం అమల్లోకి వచ్చింది. బుధవారం శ్వేతసౌధంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయనే స్వయంగా గోల్డ్ కార్డు విక్రయాలను ప్రారంభించారు. ఇందుకోసం trumpcard. gov అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి, శాశ్వత నివాసానికి, తర్వాత పౌరసత్వం పొందడానికి కూడా వీలు కలి్పంచే ఈ కార్డు ధర మిలియన్ డాలర్లు(రూ.9.02 కోట్లు). అమెరికాలో స్థిరపడాలని భావించే విదేశీయులు వ్యక్తిగతంగా లేదా విదేశీ ఉద్యోగుల తరఫున అమెరికాలోని కంపెనీలు కొనుగోలు చేయొచ్చు. కంపెనీల మాత్రం రెండు మిలియన్ల డాలర్లు(రూ.18.03 కోట్లు) చెల్లించాలి. గోల్డ్ కార్డు కోసం వెబ్సైట్లోకి వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. తొలుత డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రాసెసింగ్ ఫీజు కింద 15,000 డాలర్లు(రూ.13.54 లక్షలు) చెల్లించాలి. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత ఆన్లైన్లోనే మిలియన్ డాలర్ల రుసుము చెల్లించవచ్చు. అమెరికాలో అతి తక్కువ సమయంలో నివాసిత హోదా, తద్వారా పౌరసత్వం పొందాలంటే ‘ట్రంప్ గోల్డ్ కార్డు’ కొనుగోలు చేయడం చక్కటి మార్గమని ప్రభుత్వం వెల్లడించింది. కార్డు విక్రయాల ద్వారా వచ్చే సొమ్ముతో అమెరికా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలియజేసింది. ట్రంప్ గోల్డ్ కార్డు అనేది నిజానికి ఒక వీసా లాంటిదే. నైపుణ్యం కలిగిన విదేశీయులను అమెరికాలో ఉద్యోగాల్లో నియమించుకోవడం, వారు ఇక్కడే ఉండిపోయే అవకాశం కల్పించడం, పౌరసత్వం ఇవ్వడం, అమెరికా అభివృద్ధి కోసం వారి సేవలు ఉపయోగించుకోవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. విదేశీ నిపుణులు రావడం ఒక బహుమతి గోల్డ్ కార్డు వీసా విక్రయాలు అధికారికంగా ప్రారంభం కావడం పట్ల డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తంచేశారు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న నైపుణ్యం కలిగిన విదేశీ విద్యార్థులు ఇకపై స్వదేశాలకు వెళ్లిపోవాల్సిన అవసరం ఉండదని, అమెరికాలోనే ఉద్యోగాలు పొందవచ్చని, ఇక్కడే ఉండిపోవచ్చని సూచించారు. గ్రీన్ కార్డు కంటే గోల్డ్ కార్డు అత్యత్తమమైనదని స్పష్టంచేశారు. ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరారు. ట్రంప్ బుధవారం మధ్యాహ్నం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, డెల్ టెక్నాలజీస్ సీఈఓ మైఖేల్ డెల్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. వెబ్సైట్ ద్వారా గోల్డ్ కార్డులు కొనుగోలు చేయొచ్చని ట్రంప్ సూచించారు. అమెరికాలో చదువుకుంటున్న భారత్, చైనా విద్యార్థులు విద్యాభ్యాసం ముగిసిన తర్వాత స్వదేశాలకు వెళ్లిపోయే పరిస్థితి ఉండడం నిజంగా సిగ్గుచేటు అని అన్నారు. విదేశీ నిపుణులు అమెరికాకు రావడం, అమెరికా ప్రగతి కోసం పనిచేయడాన్ని ఒక బహుమతిగా భావిస్తామని చెప్పారు. సమస్య ఏమిటో తెలిసింది..యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్‌తోపాటు ఇతర కంపెనీల ప్రతినిధులతో తనకు ఎదురైన అనుభవాన్ని ట్రంప్ పంచుకున్నారు. ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులకు చదువు అయిపోయిన తర్వాత సొంత దేశాలకు వెళ్లిపోతున్నారని, వారిని ఉద్యోగాల్లో నియమించుకోలేకపోతున్నామని, వారంతా అమెరికాలోనే ఉండేలా చూడాలని టిమ్ కుక్ తనను కోరారని తెలిపారు. అసలైన సమస్య ఏమిటో తనకు తెలిసిందని చెప్పారు. ఇకపై ఆ సమస్య ఉండదన్నారు.సొమ్ము చేసుకోవడానికేనా? ఇండియాలో హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను హఠాత్తుగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో జరగాల్సిన ఇంటర్వ్యూలను ఐదారు నెలలపాటు వాయిదా వేశారు. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైళ్లను, వారు చేసిన పోస్టులను క్షుణ్నంగా తనిఖీ చేయాల్సి ఉందని అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్టుమెంట్ ప్రకటించింది. వేలాది మంది దరఖాస్తుదారుల ఇంటర్వ్యూలు నిలిచిపోయాయి. తదుపరి షెడ్యూల్ కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు విక్రయాలకు తెరతీయడం గమనార్హం. అధిక డిమాండ్ ఉన్న హెచ్1బీ వీసా నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం ఇటీవల కఠినతరం చేసింది. విదేశాల నుంచి వలసలను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. మరోవైపు విదేశీయులను ఆకర్శించడానికి గోల్డ్ కార్డు వీసాను తీసుకొచి్చంది. గోల్డ్ కార్డు పేరిట భారీగా సొమ్ము చేసుకోవడం, ఆర్థిక లోటును పూడ్చుకోవడమే ట్రంప్ సర్కార్ అసలు లక్ష్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్లాటినం వెర్షన్ కార్డును కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీని ధర 5 మిలియన్ల డాలర్లు. కంపెనీలు ఈ కార్డు కొంటే కొన్ని రకాల పన్ను రాయితీలు, మినహాయింపులు లభిస్తాయి. త్వరలో ఈ కార్డు అందుబాటులోకి రానుంది.ఐదేళ్ల తర్వాత పౌరసత్వం: హోవార్డ్ లుట్నిక్ గోల్డ్ కార్డుకు సంబంధించిన మరిన్ని వివరాలను అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుంటే మిలియన్ డాలర్లు, కంపెనీలు దరఖాస్తు చేస్తే రెండు మిలియన్ల డాలర్లు చెల్లించాలని స్పష్టంచేశారు. ఈ కార్డు కొనుగోలు చేసినవారు ఐదేళ్ల తర్వాత అమెరికా పౌరసత్వం పొందడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ఒక కార్డుతో ఒక్కరు మాత్రమే అమెరికాలో ఉండడానికి వీలవుతుందని పేర్కొన్నారు. కంపెనీలు ఎన్ని కార్డులైనా కొనుగోలు చేయొచ్చని అన్నారు. కార్డు ఎన్ని రోజుల్లో రావొచ్చు..గోల్డ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యి కార్డు చేతికి అందడానికి కొన్ని వారాల సమయం పడుతుందని చెబుతున్నారు. అవసరాన్ని బట్టి అదనపు డాక్యుమెంట్లు కూడా సమర్పించాలి. దరఖాస్తు రుసుము 15,000 డాలర్లు నాన్ రీఫండబుల్. అంటే గోల్డ్ కార్డు వచి్చనా రాకున్నా ఈ సొమ్ము వెనక్కి తిరిగిరాదు. కార్డు వచి్చన వారికి అమెరికాలో చట్టబద్ధమైన పరి్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ కల్పిస్తారు. ఈబీ–1 లేదా ఈబీ–2 వీసాదారుల హోదా లభిస్తుంది. అసాధారణమైన, అద్భుతమైన తెలివితేటలు, నైపుణ్యాలు ఉన్నవారికి ఈబీ–1 లేదా ఈబీ–2 వీసాలు ఇస్తుంటారు. ట్రంప్ గోల్డ్ కార్డు కొంటే పరోక్షంగా ఈబీ–1 లేదా ఈబీ–2 వీసా పొందినట్లే. -
రూ.3200 నుంచి.. రూ.లక్ష దాటిన గోల్డ్
బంగారం.. ఇది ఒక విలువైన లోహం. ప్రపంచంలోని చాలా దేశాలు దీనిని అలాగే చూస్తాయి. కానీ భారత్ దీనికి భిన్నం. ఎలా అంటే.. బంగారం అంటే విలువైన లోగా మాత్రమే కాకుండా.. పవిత్రం, ఒక ఆభరణం, లక్ష్మీదేవిగా భావిస్తారు. ఈ కారణంగా ఎప్పటికప్పుడు గోల్డ్ కొనేస్తుంటారు. దీంతో ధరలు కూడా అమాంతం పెరుగుతూ వచ్చేసాయి.ఉదాహరణకు 1990లలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,200. అంటే గ్రామ్ గోల్డ్ కొనాలంటే.. కేవలం రూ. 320 వెచ్చించాలన్నమాట. అయితే ఇప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 1,30,750 రూపాయలు. అంటే ఇప్పుడు ఒక గ్రామ్ గోల్డ్ కొనాలంటే రూ. 13075 ఖర్చు చేయాలి. దీన్నిబట్టి చూస్తే.. 35 సంవత్సరాల్లో గోల్డ్ రేటు ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.35 సంవత్సరాల్లో బంగారం ధరలు ఎందుకింతలా పెరిగాయి?, భవిష్యత్తులో తగ్గే సూచనలు ఉన్నాయా? అనే వివరాలను క్షుణ్ణంగా ఈ కథనంలో చూసేద్దాం.బంగారం ధరలు ఎందుకిలా..ద్రవ్యోల్బణం: గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణమే. దేశంలో వస్తువుల ధరలు పెరగడం వల్ల.. ఈ ప్రభావం బంగారంపై కూడా చూపించింది. రూపాయి బలహీనపడటం కూడా పసిడి ధరలు అమాంతం పెరగడానికి కారణమైంది.భద్రమైన ఆస్తి: ప్రపంచంలోనే సంక్షోభం వచ్చినప్పుడల్లా.. ప్రజలు బంగారం వైపు పరుగెడతారు. 2001లో ఏర్పడిన ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, 2008 నాటి ఆర్ధిక సంక్షోభం, 2020లో వచ్చిన కోవిడ్ 19, 2022-25 వరకు రష్యా-ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ సమస్యలు వంటివి బంగారంలో పెట్టుబడి పెట్టడానికి కారణమయ్యాయి. దీంతో రేట్లు రాకెట్లా దూసుకెళ్లాయి.కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు: చైనా, రష్యా, టర్కీ, ఇండియా వంటి దేశాలు.. గత దశాబ్దంలో టన్నుల కొద్దీ బంగారం కొనుగోలు చేశాయి. ఇది గ్లోబల్ మార్కెట్లో డిమాండ్‌ను పెంచేసింది.డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి: ఎక్కడైనా డిమాండ్‌కు సరిపడా.. ఉత్పత్తి ఉన్నప్పడే ధరలు స్థిరంగా లేదా కొంత తక్కువగా ఉంటాయి. కానీ మార్కెట్లో బంగారం కొనేవాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరికి సరఫరా చేయడానికి కావలసినంత బంగారం ఉత్పత్తి జరగలేదు. దీంతో ఆటోమేటిక్‌గా ధర పెరిగింది. 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు దాటేసింది.డాలర్ విలువ & యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు: సాధారణంగా.. డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం విలువ తగ్గుతుంది. ఇదే వ్యతిరేఖ దిశలో జరిగితే.. డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది. గోల్డ్ రేట్ల పెరుగుదలపై.. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు కూడా ప్రభావం చూపుతుంది.ఇతర కారణాలు: పండుగలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాలు వచ్చినప్పుడు కూడా బంగారం కొనేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. పెట్టుబడిదారులు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా పసిడి రేటు భారీగా పెరుగుతుంది.భవిష్యత్తులో తగ్గే సూచనలు ఉన్నాయా?2025 డిసెంబర్ 9, 10 తేదీల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమీక్ష జరగనుంది. ఈసారి కూడా 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ వడ్డీ రేటు తగ్గితే.. బంగారం ధర పెరుగుతుంది. ఈ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేకపోతే.. గోల్డ్ రేటు తగ్గే అవకాశం ఉంది. -
అతిపెద్ద ఆర్థిక పతనం వస్తోంది.. ఇది ఎనిమిదో పాఠం
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ఇన్వెస్ట్మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ “చరిత్రలోనే అత్యంత తీవ్రమైన పతనం” దిశగా సాగుతోందని సోషల్ మీడియాలో వరుస పోస్ట్‌లు చేస్తూ వస్తున్నారు. ఆర్థికంగా ప్రపంచం పతనమైనా అందులో చిక్కుకోకుండా ధనవంతులు ఎలా కావాలో పాఠాలు చెబుతున్నారు. అందులోభాగంగా ఎనిమిదో పాఠాన్ని తాజాగా ‘ఎక్స్’లో పంచుకున్నారు.చరిత్ర చూడండి..ఆర్థిక పతనాలు ఒక్కరోజులో జరగవని, దశాబ్దాల పాటు నిర్మాణం చెందుతాయని కియోసాకి పేర్కొన్నారు. 1965లో అమెరికా నాణేల్లో వెండిని తొలగించడం, 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్‌ను బంగారం ప్రమాణం నుంచి వైదొలగించడం వంటి చరిత్రాత్మక సంఘటనలు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మార్చేశాయని చెప్పారు.ఈ పరిణామాలు ప్రపంచాన్ని “రుణ ఆర్థిక వ్యవస్థగా” మార్చాయని, దీని ఫలితంగా అమెరికా జపాన్ వంటి దేశాలు భారీ రుణభారంతో సతమతమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇంటి అద్దెలు పెరగడంతో ఉద్యోగాలు ఉన్నవారు కూడా రోడ్డునపడుతున్నారన్నారు.కియోసాకి తన వ్యక్తిగత పెట్టుబడి అనుభవాలను కూడా పంచుకున్నారు. 1970లలో బంగారం కొనడం ఎలా ప్రారంభించారో, ఇప్పటికీ బంగారం వెండి విదేశాల్లో నిల్వ చేస్తానని చెప్పారు. దశాబ్దాల క్రితం కొన్న బంగారు నాణెం విలువ ఇప్పుడు భారీగా పెరిగిందని, ఇది ఆర్థిక అస్థిరత సమయంలో విలువ నిలుపుకొనే ఆస్తులు ఎంత ముఖ్యమో నిరూపిస్తుందని అన్నారు.ఫెడ్ ఏర్పాటే ప్రస్తుత సంక్షోభానికి మూలంప్రస్తుత సంక్షోభానికి మూలం 1913లో ఏర్పడిన ఫెడరల్ రిజర్వ్‌నేనని ఆయన ఆరోపించారు. ఆధునిక ఫియట్ కరెన్సీలు విలువ కోల్పోవడానికి ఈ సంస్థ విధానాలు ప్రధాన కారణమని కియోసాకి అభిప్రాయపడ్డారు. బంగారం, వెండి లను “దేవుని సొమ్ము”గా.. బిట్‌కాయిన్, ఈథీరియంను “ప్రజల డబ్బు”గా కియోసాకి అభివర్ణించారు.ద్రవ్యోల్బణం, రుణ సంక్షోభం, నివాస సమస్యలు పెరుగుతున్న సమయంలో కూడా, సిద్ధపడి పెట్టుబడులు మారుస్తున్న వారు లాభపడతారని కియోసాకి పునరుద్ఘాటించారు. “వాళ్లే విజేతలు” అని, “ఫెడరల్ రిజర్వ్ లేదా ప్రభుత్వం రక్షిస్తుంది” అనే నమ్మకంతో ఉన్నవారు నష్టపోతారని హెచ్చరించారు.స్కూళ్లలో ఆర్థిక విద్యను ఎందుకు బోధించడంలేదనే ప్రశ్నను ఆయన మళ్లీ లేవనెత్తారు. ఎవరికివారే స్వయంగా ఆర్థిక జ్ఞానం పెంచుకోవాలని, రాబోయే అనిశ్చిత కాలానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.కియోసాకి గత కొన్నేళ్లుగా ఇదే తరహా హెచ్చరికలు చేస్తూ, బంగారం, వెండి, క్రిప్టోకరెన్సీలు వంటి ప్రత్యామ్నాయ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఆర్థిక నిపుణులు ఆయన అంచనాలను కొట్టిపడేస్తున్నప్పటికీ, రుణభారం, ద్రవ్యోల్బణంపై ఆందోళన ఉన్న పలువురికి ఆయన సందేశం ఇంకా ఆందోళన కలిగిస్తోంది. LESSON # 8: How you can get richer as the world economy collapses.CRASHES do not happen over night.CRASHES take decades to occur.For Example:Silver crashed in 1965: when the US government turned silver coins into fake coins…. Violating Greshams Law which stated when…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 10, 2025 -
పసిడి రుణాలకు భలే గిరాకీ: 2026 మార్చి నాటికి..
ఒకప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం అన్నది చాలా తక్కువగానే ఉండేది. అది కూడా ఎక్కువగా అసంఘటిత రంగంలోనే. కానీ, ఇప్పుడు బంగారాన్ని కుదువ పెట్టి అప్పు తీసుకోవడం అన్నది వేగంగా విస్తరిస్తోంది. అది కూడా సంఘటిత రంగంలో బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల వద్ద రుణం తీసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. నిమిషాల వ్యవధిలోనే రుణం లభించడం, వడ్డీ తక్కువగా ఉండడం చాలా మందిని ఆకర్షిస్తోంది. రుణాన్ని తిరిగి చెల్లించడంలోనూ వెసులుబాటు ఈ మార్కెట్ విస్తరణకు దోహదం చేస్తోంది. పెద్ద ఎత్తున డిమాండ్‌ను సొంతం చేసుకునేందుకు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) పెద్ద సంఖ్యలో కొత్త శాఖలు ప్రారంభించేందుకు ప్రణాళికలు వేసుకుంటుంటే, బ్యాంక్‌లు సైతం సెక్యూర్డ్ విభాగమైన పసిడి రుణాల్లో వాటాను పెంచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి.ఏడు నెలల్లో 63.6 శాతం వృద్ధి..2025 అక్టోబర్ చివరికి బంగారం రుణాల అవుట్‌స్టాండింగ్ (నికరంగా తిరిగి రావాల్సిన మొత్తం) రూ.3.38 లక్షల కోట్లుగా ఉన్నట్టు డేటా తెలియజేస్తోంది. ఏడాది కాలంలో ఇది ఏకంగా 128.5 శాతం పెరగ్గా, ఈ ఏడాది మార్చి చివరి నుంచి చూస్తే 63.6 శాతం వృద్ధి చెందింది. గడిచిన ఏడాది కాలంలో జారీ అయిన వ్యక్తిగత రుణాల్లో పసిడి రుణాలు పావు శాతానికి చేరాయి. 2025 మార్చి నాటికి మొత్తం బంగారం రుణాల మార్కెట్ విలువ రూ.14.5 లక్షల కోట్లకు చేరగా, 2026 మార్చి నాటికి రూ.15 లక్షల కోట్లకు విస్తరిస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. ఎన్బీఎఫ్సీలు వచ్చే ఏడాది కాలంలో 3,000 కొత్త శాఖలను ప్రత్యేకంగా బంగారం రుణాల కోసమే ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నాయి.సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐలు) ఎగవేతలు పెరగడంతో రుణ నిబంధనలను కఠినతరం చేశాయి. దీంతో గతంలో మాదిరి సులభంగా అన్సెక్యూర్డ్ రుణాలు లభించని పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా రైతులు, చిన్న వర్తకులు, స్వయం ఉపాధిపై ఉన్నవారు బంగారంపై రుణాలను ఆశ్రయిస్తుండడం కూడా ఈ మార్కెట్ విస్తరణకు దోహదం చేస్తోంది. బంగారం ధరలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరగడంతో మరింత అధిక మొత్తంలో రుణం, అది కూడా సులభంగా లభిస్తుండడంతో రుణగ్రహీతలు అటువైపు మొగ్గుచూపిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.సాగు, వ్యాపార అవసరాలకే అధికం..బంగారాన్ని కుదువపెట్టి రుణాలు తీసుకుంటున్న వారిలో 70 శాతం మంది వ్యవసాయం, వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారు. మిగిలిన 30 శాతం మంది గృహ నవీకరణ, వివాహాలు, ఇతర వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నట్టు డేటా తెలియజేస్తోంది. వేతన జీవులు స్వల్పకాల అవసరాలకు సైతం పసిడి రుణాలను తీసుకుంటున్నారు. రుణాలను వేగంగా ప్రాసెస్ చేస్తుండడం, వడ్డీ రేట్లలో పారదర్శకత ఈ మార్కెట్ విస్తరణకు మద్దతునిస్తున్నాయి.విస్తరణకు భారీ అవకాశాలుబంగారం మార్కెట్ మరింత విస్తరణకు అవకాశాలున్నట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే భారతీయ గృహాల్లో ఉన్న బంగారంలో కేవలం 5.6 శాతాన్ని ఇప్పటికి పసిడి రుణాల కోసం వినియోగించుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇక బంగారం రుణాల్లో సంఘటిత రంగం వాటా 37 శాతంగానే ఉంది. ఇప్పటికీ 63 శాతం అసంఘటిత రంగంలో (పాన్ బ్రోకర్లు, స్థానిక వడ్డీ వ్యాపారులు)నే బంగారంపై రుణాలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితులను గమనించిన ఎన్బీఎఫ్సీలు ప్రత్యేకంగా చిన్న పట్టణాల్లోనూ కొత్త శాఖల ద్వారా మరింత మందికి చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. డిజిటల్ సాధనాలు, ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యాల ద్వారా కొత్త కస్టమర్లను చేరుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. బంగారం రుణాల్లో 80 శాతం మార్కెట్ దక్షిణాది రాష్ట్రాలోనే ఉండగా, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో విస్తరణపై ఎన్బీఎఫ్సీలు తాజాగా దృష్టి సారించాయి. -
Penukonda: కారులో మూడు కోట్ల నగదు తరలిస్తున్న దుండగులు
-
‘కొత్త కరెన్సీ వస్తోంది.. డాలర్‌కు గుడ్‌బై’
ప్రముఖ ఇన్వెస్టర్, పాపులర్ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. అమెరికా డాలర్ స్థిరత్వం గురించి ఎప్పుడూ విమర్శలు చేసే ఆయన మరోసారి యూఎస్ కరెన్సీ గురించి వ్యాఖ్యానించారు. బ్రిక్స్ దేశాలు కొత్త కరెన్సీని ప్రకటించాయన్న పుకారు వార్తను ప్రస్తావిస్తూ ఇక అమెరికా డాలర్ పని అయిపోయింది.. ‘‘బై బై యూఎస్ డాలర్’’ అంటూ తన ‘ఎక్స్’ పోస్ట్ లో రాసుకొచ్చారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల సమూహం బ్రిక్స్ బంగారం మద్దతు ఉండే "యూనిట్" అనే "డబ్బు"అని ప్రకటించాయి అన్నారు. ‘అప్రమత్తంగా ఉండండి.. నష్టాలపాలవ్వొద్దు’ అని యూజర్లకు సూచించారు.‘నా అంచనా ఏమిటంటే యూఎస్ డాలర్ల పొదుపు చేసేవాళ్లు అత్యంత నష్టపరులు అవుతారు. మీరు యూఎస్ డాలర్లను కలిగి ఉంటే... అధిక ద్రవ్యోల్బణం మిమ్మల్ని తుడిచిపెట్టవచ్చు. నేను నా మంత్రానికి కట్టుబడి ఉన్నాను, బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథర్‌లను కలిగి ఉన్నాను’ అని రాసుకొచ్చారు.బంగారం, వెండిపై దీర్ఘకాలంగా పెట్టుబడులు పెడుతున్న కియోసాకి.. ఇటీవలి సంవత్సరాలలో బిట్ కాయిన్, ఎథేరియంలను డాలర్ క్షీణత నుంచి కాపాడుకునే ఆస్తులుగా పేర్కొంటున్నారు.BIG BREAKING $ NEWS:BRICS: Brazil, Russia, India, China, South Africa announces the “UNIT”a gold backed “money.”BYE BYE US DOLLAR!!!!!Stand by, stay awake, stay tuned in.DONT BE A LOSERMy forecast is Savers of US dollars biggest losers.If you own US Dollars…. Hyper…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 5, 2025 -
పసిడి రూ. 1,300 అప్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయంగా పసిడి ధరలు పెరిగాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,300 పెరిగి రూ. 1,32,900కి చేరింది. అటు వెండి సైతం కేజీకి రూ. 3,500 పెరిగి రూ. 1,83,500 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ధర ఒక దశలో సుమారు 15.10 డాలర్లు పెరిగి 4,223.76 డాలర్లకు చేరింది. -
బంగారం ధరల్లో ఇంత మార్పా!: గంటల వ్యవధిలోనే..
బంగారం ధరలు ఈ రోజు (డిసెంబర్ 2) మరోమారు తగ్గాయి. దీంతో పసిడి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ఈ కథనంలో హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ నగరాల్లోని లేటెస్ట్ గోల్డ్ రేట్ల గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఉదయం రూ. 250 తగ్గిన 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 550 రూపాయలకు చేరింది. అంటే గంటల వ్యవధిలో 300 రూపాయలు తగ్గింది. దీంతో రేటు రూ. 1,19,050 (22 క్యారెట్స్ 10గ్రా) వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 610 తగ్గింది (ఉదయం రూ. 280 మాత్రమే తగ్గింది). దీంతో సాయంత్రానికి 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 1,29,870 వద్ద నిలిచింది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు మరింత తగ్గాయి. సాయంత్రానికి 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి ధర 610 రూపాయలు తగ్గి రూ. 1,30,020 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 550 రూపాయలు తగ్గి రూ. 1,19,200 వద్ద నిలిచింది.చెన్నైలో బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. రేటు ఉదయం ఎలా ఉందో.. సాయంత్రానికి అలాగే ఉంది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి ధర 320 రూపాయలు తగ్గి రూ. 1,31,350 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 300 రూపాయలు తగ్గి రూ. 1,20,400 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Gold Prices: శాంతించిన బంగారం ధరలు.. ఇవాళ తులం ఎంతుందుంటే..!
-
ఎగసి అలసిన పసిడి.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఆగని పసిడి పరుగు.. ఒకే రోజు రూ.3 వేలు పెరుగుదల
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి ధర సోమవారం 10 గ్రాములకు రూ.3,040 పెరిగి రూ.1,33,200కు చేరింది. ఇటీవలే నమోదైన జీవితకాల గరిష్ట ధర రూ.1,34,800కు చేరువైంది. మరో రూ.600కు పైగా పెరిగితే పసిడి ధరల్లో కొత్త రికార్డు నమోదు కానుంది. ప్రస్తుతం వివాహాల సీజన్ నడుస్తుండడంతో డిమాండ్ స్థిరంగా కొనసాగుతున్నట్టు, ఇది ధరలకు మద్దతునిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వెండి ధర సైతం వరుసగా ఐదో రోజు ర్యాలీ చేసింది. కిలోకి రూ.5,800 పెరిగి రూ.1,77,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 42 డాలర్లు ఎగసి (ఒక శాతం) 4,262.52 డాలర్ల స్థాయిని అందుకుంది. వెండి ధర (స్పాట్ మార్కెట్) ఔన్స్‌కి 3 శాతానికిపైగా ర్యాలీ చేసి 59 డాలర్లకు చేరింది. గత వారం రోజుల్లోనే వెండి ధర 16.7 శాతం పెరగడం గమనార్హం. అంతేకాదు 2025లో వెండి ధర రెట్టింపైంది. 2024 డిసెంబర్ 31న ఔన్స్ ధర 28.97 డాలర్ల వద్ద ఉంది. ‘‘యూఎస్ డాలర్ బలహీనపడడం, యూఎస్ ఫెడ్ వచ్చే వారంలో వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు పెరగడం, సెంట్రల్ బ్యాంకుల నుంచి పసిడి కొనుగోళ్లు బలంగా కొనసాగుతుండడం ధరలను మరింత గరిష్టాల దిశగా నడిపిస్తోంది’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. -
బంగారం ధరలు తగ్గుతాయా.. 46ఏళ్ల తరువాత రికార్డ్!
పండుగలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాలు వచ్చాయంటే.. బంగారం కోనేస్తుంటారు. కొన్నేళ్లుగా ఇది ఆనవాయితీగా వస్తోంది. దీంతో పసిడికి డిమాండ్ పెరిగిపోయింది, ధరలు కూడా పెరుగుదల దిశగా పరుగులు పెడుతూ ఉన్నాయి. ప్రస్తుతం గోల్డ్ రేటు జీవితకాల గరిష్టాలను చేరుకుని, సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిపోయింది. రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉండనున్నాయో ఇక్కడ పరిశీలిద్దాం.2025 డిసెంబర్ 9, 10 తేదీల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమీక్ష జరగనుంది. ఈసారి కూడా 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ వడ్డీ రేటు తగ్గితే.. బంగారం ధర పెరుగుతుంది. ఈ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేకపోతే.. గోల్డ్ రేటు తగ్గే అవకాశం ఉంది.2025 ప్రారంభం నుంచి బంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఆగష్టు నుంచి నవంబర్ వరకు బంగారం ధరలు పెరుగుదల దిశగా పరుగులు పెడుతున్నాయి. ఈ నెలలో (డిసెంబర్) పెడ్ వడ్డీ రేట్లు తగ్గి.. బంగారం ధరలు పెరిగితే, 1979 తరువాత గోల్డ్ రేటు పెరుగుదల విషయంలో రికార్డ్ బ్రేక్ చేసినట్లే అవుతుంది. ఇదే జరిగితే 46ఏళ్ల తరువాత సరికొత్త రికార్డ్ క్రియేట్ అవుతుంది.1979లో బంగారం ధరలు ఎందుకు పెరిగాయంటే?1979లో అంతర్జాతీయ అనిశ్చితులు, ఆర్థిక అస్థిరత, రాజకీయ సంక్షోభాలు, ద్రవ్యోల్బణ భయం వంటి కారణాల రేటు 120 శాతం కంటే ఎక్కువ పెరిగింది.1979 తరువాత 2022, 2023లలో 14 శాతం, 2024లో 21 శాతం మేర బంగారం ధరలు పెరిగాయి. 2025లో గోల్డ్ రేటు 60 శాతం పెరుగుదలను అందుకుంది. దీన్నిబట్టి చూస్తే.. 46 సంవత్సరాల తరువాత బంగారం ధరలు పెరిగాయని స్పష్టంగా అర్థమవుతోంది.నేటి ధరలు ఇలా..గోల్డ్ రేటు ఈ రోజు (డిసెంబర్ 01) గరిష్టంగా రూ. 980 పెరిగింది(చెన్నైలో). దీంతో బంగారం ధర రూ. 1,30,630 వద్దకు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలలో 24 గ్యారేట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 660 పెరిగి రూ. 1,30,480 వద్ద నిలిచింది. 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 600 పరైగింది. దీంతో 10 గ్రాముల 22క్యారెట్ల పసిడి ధర రూ. 1,19,600 వద్దకు చేరుకుంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే.. గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇదీ చదవండి: చెప్పినవే చేస్తాను.. విజేతగా మారాలంటే? -
చెప్పినవే చేస్తాను.. విజేతగా మారాలంటే?
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత, అమెరికన్ వ్యాపారవేత్త 'రాబర్ట్ కియోసాకి'.. ఎప్పటికప్పుడు పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా.. మనీ టిప్ 2 పేరుతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా ఎలా ఉండాలో అనే విషయం గురించి పేర్కొన్నారు.కియోసాకి తన ట్వీట్ ప్రారంభంలో.. 100 డాలర్లకు ఎంత కొంటారు? అని చెబుతూ.. 1900లో వంద డాలర్లకు, ఎనిమిది నెలలకు సరిపోయే సామాగ్రి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి దిగజారిపోయింది అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా ఎలా ఉండాలంటే.. ఓడిపోయేవారిగా ఉండటం మానేయండని పేర్కొన్నారు.ఓడిపోయినవారు ఎప్పుడూ పాత ఆలోచనలు పట్టుకుంటారు. విజేతలా ఆలోచించడం ప్రారంభించండి. డబ్బును పట్టుకోవడం మానేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా మారండి. 1996లో ప్రచురించబడిన రిచ్ డాడ్ పూర్ డాడ్లో.. నేను “పొదుపు చేసేవారు ఓడిపోతారు” అని హెచ్చరించాను.ఇదీ చదవండి: 'ప్రపంచం పేదరికంలో ఉన్నా.. మీరు ధనవంతులు కావచ్చు'నేను చెప్పేవాటినే పాటిస్తుంటాను. నేను 1965 నుండి వెండిని ఆదా చేస్తున్నాను. 1972 నుండి బంగారం, 2019 నుంచి బిట్‌కాయిన్. 2023 నుంచి ఎథీరియం ఆదా చేస్తున్నానని కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇటీవల నేను నా 4.5 మిలియన్ డాలర్ల ఇంటిని 2000లో కొనుగోలు చేసిన 4,50,000 డాలర్ల బంగారంతో కొనుగోలు చేసానని అన్నారు. త్వరలో టిప్ 3 వస్తుంది అని ట్వీట్ ముగించారు.HOW MUCH WILL $100 BUY?1900: $100 would buy 8 months of groceries.1960: $100 was worth $372000: $100 worth $62025: $100 worth $3.80Money tip # 2: On how to be a winner as the global economy crashes is:“Stop Being a Loser.”Losers are losers because they…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 30, 2025 -
వారంలో ఇంత తేడానా!.. భారీగా పెరిగిన గోల్డ్ రేటు
బంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ.. రూ.1.30 లక్షలు దాటేసింది. కేవలం ఈ వారం రోజుల్లో (నవంబర్ 23 నుంచి 29 వరకు) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 3,980 పెరిగింది. ఈ కథనంలో ఏడు రోజుల్లో బంగారం ధరల్లో వచ్చిన మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో.. ఈ వారం రోజుల్లో ఊహకందని మార్పులు జరిగాయి. నవంబర్ 23న రూ. 1,25,840 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు.. ఈ రోజుకి (నవంబర్ 29) రూ. 1,29,820 వద్దకు చేరింది. అంటే రూ. 3980 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే.. రూ. 1,15,350 వద్ద ఉన్న 10 గ్రాముల పసిడి ధర రూ. 1,19,000 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. రేటు 3650 రూపాయలు పెరిగింది.చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు దాటేసింది. అంటే వారం రోజుల్లో బంగారం ధరలు రూ. 3,810 పెరిగింది. 22 క్యారెట్ల పసిడి ధరలు రూ. 1,16,300 నుంచి రూ. 1,19,800 వద్దకు (రూ.3500 పెరిగింది) చేరాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. గత ఆదివారం (నవంబర్ 23) రూ. 1,25,990 వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం రేటు శనివారం (నవంబర్ 29) నాటికి రూ. 1,29,970 వద్దకు (రూ. 3,980 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,15,500 నుంచి రూ. 1,19,150 వద్దకు (రూ. 3,650 పెరిగింది) చేరింది. -
'ప్రపంచం పేదరికంలో ఉన్నా.. మీరు ధనవంతులు కావచ్చు'
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా ఒక ట్వీట్ చేసారు. ఇందులో ''ప్రపంచం పేదరికంలో ఉన్నప్పుడు మీరు ధనవంతులు కావచ్చు'' అని వెల్లడించారు.''జపాన్ క్యారీ ట్రేడ్ ముగిసింది. బబుల్ మార్కెట్లు తగ్గబోతున్నాయి. నా మంత్రానికి కట్టుబడి.. బంగారం, వెండి, బిట్‌కాయిన్ & ఎథెరియం కొనండి. గ్లోబల్ మార్కెట్స్ కుప్పకూలిపోతున్నప్పుడు ఎలా ధనవంతులు కావాలో నేను రాబోయే ట్వీట్లలో వెల్లడిస్తాను. అవును: ప్రపంచం పేదరికంలో ఉన్నప్పుడు మీరు ధనవంతులు కావచ్చు. జాగ్రత్త వహించండి.'' అని రాబర్ట్ కియోసాకి తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఇదీ చదవండి: కియోసాకి ఆర్ధిక సూత్రాలు: ధనవంతులయ్యే మార్గాలుకియోసాకి ప్రకారం.. తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని ప్రపంచ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే.. జపాన్ క్యారీ ట్రేడ్ ఇప్పుడు పనిచేయడం తగ్గిపోతోంది. దీని ప్రభావంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడుతుందని, బంగారం, వెండి వంటివాటితో పెట్టుబడి పెట్టండి. స్టాక్ మార్కెట్లలో అల్లకల్లోలం ఏర్పడినా.. ప్రపంచం పేదరికంలో ఉన్నా.., మీరు తప్పకుండా ధనవంతులు అవుతారు.Japan “Carry Trade” ended.Watch out below. Bubble Markets about to deflate.Standing by my mantra…buy gold, silver, Bitcoin, and Ethereum.More recommendations on how to get rich while world collapses will follow in future Tweets.Yes: you can get richer while world gets…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 29, 2025 -
Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధర
-
అంతులేని వేగం.. ఆగేదెప్పుడో!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్.. వివరాలివే..
కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అనేక మందికి బంగారం కేవలం ఆభరణంగా కాకుండా అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడి సాధనంగా మారింది. అత్యవసర ఆర్థిక అవసరాల కోసం తమ బంగారాన్ని అమ్మివేయడం లేదా తాకట్టు పెట్టడం సర్వసాధారణం. అయితే అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బంగారాన్ని సాధారణ పద్ధతిలో తాకట్టు పెట్టకుండా, అమ్ముకోకుండానే దాన్ని ఉపయోగించుకునే అద్భుతమైన మార్గం ఉంటే? అవును, అదే బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ (Overdraft on Gold Jewellery) సదుపాయం. పెరుగుతున్న బంగారం ధరల నేపథ్యంలో అనేక ప్రముఖ బ్యాంకులు తమ వినియోగదారులకు ఈ ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తూ వారి ఆర్థిక అవసరాలకు భరోసా కల్పిస్తున్నాయి.గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే?బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం అనేది ఒక రకమైన సురక్షితమైన రుణం (Secured Loan). ఇది వ్యక్తిగత రుణం లాంటిది కాకుండా, ఒక క్రెడిట్ లైన్‌లాగా పనిచేస్తుంది. సాధారణంగా గోల్డ్ లోన్‌లో ఒకేసారి మొత్తం డబ్బు తీసుకుని దానిపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయంలో మీ బంగారు ఆభరణాల విలువను బట్టి బ్యాంక్ నిర్దిష్ట పరిమితి(Limit)తో రుణాన్ని మంజూరు చేస్తుంది. వినియోగదారుడు ఈ పరిమితి నుంచి అతనికి అవసరమైన మేరకు ఎప్పుడైనా, ఎంతైనా డబ్బును డ్రా చేసుకునే సౌలభ్యం ఉంటుంది.మీరు డ్రా చేసుకున్న అసలు మొత్తంపై (Utilised Amount) మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మంజూరైన మొత్తం పరిమితిపై కాదు. ఈ సౌకర్యం సాధారణంగా ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు చెల్లుబాటు అవుతుంది. మీ సౌలభ్యాన్ని బట్టి క్రమానుగతంగా రుణం తిరిగి చెల్లించవచ్చు.వినియోగదారులకు ఉపయోగాలుబంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం ద్వారా వినియోగదారులకు కీలక ప్రయోజనాలు ఉన్నాయి. యూజర్లు డ్రా చేసుకున్న మొత్తానికే వడ్డీ లెక్కిస్తారు. ఉదాహరణకు, మీకు రూ.5 లక్షల పరిమితి మంజూరైతే అందులో రూ.2 లక్షలు మాత్రమే వాడుకుంటే ఆ రూ.2 లక్షలపై మాత్రమే వడ్డీ చెల్లించాలి.ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలో నిధులు జమ చేయడం ద్వారా తీసుకున్న రుణాన్ని ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా పాక్షికంగా లేదా పూర్తిగా తిరిగి చెల్లించవచ్చు. నెలవారీ ఈఎంఐ (EMI) లాంటి కఠిన నిబంధనలు ఉండవు.వ్యాపార అవసరాలు, వైద్య ఖర్చులు లేదా ఇతర అత్యవసరాల కోసం తక్షణమే నిధులు పొందవచ్చు.గోల్డ్ లోన్ లేదా గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్‌లకు వ్యక్తిగత రుణాల కంటే వడ్డీ రేట్లు సాధారణంగా తక్కువగా ఉంటాయి.బంగారు ఆభరణాలు సురక్షితంగా బ్యాంకు వాల్ట్‌లో ఉంటాయి. వాటిని అమ్ముకోవాల్సిన అవసరం లేదు.బంగారం విలువను ఎలా లెక్కిస్తారు..బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందడానికి వినియోగదారులు సాధారణంగా కొన్ని అర్హతలు కలిగి ఉండి ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా 18 క్యారెట్ల (Carat) నుంచి 24 క్యారెట్ల మధ్య స్వచ్ఛత కలిగిన బంగారు ఆభరణాలపై బ్యాంకులు ఓడీ ఇస్తాయి. వినియోగదారుడికి కావలసిన పరిమితిని బట్టి తగినంత బరువున్న బంగారాన్ని సమర్పించాల్సి ఉంటుంది.బ్యాంక్ నియమించిన వాల్యుయేటర్ బంగారు ఆభరణాల స్వచ్ఛతను, బరువును నిర్ధారించి వాటి ప్రస్తుత మార్కెట్ విలువను లెక్కిస్తారు. ఈ విలువలో 70% నుంచి 75% వరకు ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిని మంజూరు చేస్తారు.ఛార్జీలుబంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ (OD) సౌకర్యాన్ని వినియోగించుకునేటప్పుడు వినియోగదారులు చెల్లించాల్సిన ప్రధాన ఛార్జీల్లో వడ్డీ రేటు ముఖ్యమైనది. ఓడీ పరిమితి నుంచి తీసుకున్న అసలు మొత్తానికి మాత్రమే లెక్కిస్తారు. ఈ వడ్డీ సాధారణంగా రోజువారీగా లెక్కిస్తారు. బ్యాంకును అనుసరించి సంవత్సరానికి 8% నుంచి 15% మధ్య మారుతూ ఉంటుంది.కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇది బ్యాంక్ ఓవర్‌డ్రాఫ్ట్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి, అకౌంట్‌ను సెటప్ చేయడానికి వసూలు చేసే ఏకమొత్తం ఛార్జీ. ఈ ఫీజు సాధారణంగా మంజూరైన మొత్తం ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిలో 0.5% నుంచి 1.5% వరకు ఉంటుంది.వాల్యుయేషన్ ఛార్జీలు.. బ్యాంక్ నియమించిన వాల్యుయేటర్ బంగారు ఆభరణాల స్వచ్ఛతను, బరువును తనిఖీ చేసి దాని ప్రస్తుత మార్కెట్ విలువను నిర్ణయిస్తారు. ఈ సర్వీసు కోసం వసూలు చేసే ఫీజునే వాల్యుయేషన్ ఛార్జీలు అంటారు. అలాగే రుణ ఒప్పందాలను చట్టబద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు స్టాంప్ డ్యూటీ ఛార్జీని వినియోగదారులే భరించాల్సి ఉంటుంది.ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని అందిస్తున్న బ్యాంకులు1. ఫెడరల్ బ్యాంక్: డిజి గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ పథకం2. సీఎస్బీ బ్యాంక్: ఓవర్ డ్రాఫ్ట్ గోల్డ్ లోన్ స్కీమ్3. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB): టీఎంబీ గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్4. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India): బంగారు ఆభరణాలపై ఎస్ఓడీ (Secured Overdraft on Gold Ornaments - SOD).ఇదీ చదవండి: ఇండియాలో ‘గూగుల్ మీట్’ డౌన్ -
సిల్వర్ ఈటీఎఫ్‌ల మెరుపులు
’’అలుపెరుగకుండా పరుగుతీస్తున్న బంగారం బాటలోనే వెండిలో కూడా పెట్టుబడులు చేపట్టేందుకు మూడేళ్ల క్రితం దేశీయంగా ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ప్రొడక్టు (ఈటీపీ)లకు తెరతీశారు. వీటిలో ఈటీఎఫ్‌లు ప్రధాన భాగం. దీంతో 2022లో వెండి ఈటీఎఫ్‌లు ఊపిరిపోసుకున్నాయి. తొలి దశలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అంతగా ఆసక్తి చూపకపోయినప్పటికీ ఏడాదిన్నర కాలంగా ఇవి జోరందుకున్నాయి. దీంతో 2007లోనే ప్రారంభమైన పసిడి ఈటీఎఫ్‌లను వెనక్కి నెడుతూ వెండి ఈటీఎఫ్‌లు భారీస్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్ ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహా లు బంగారం, వెండిలో పెట్టుబడులకు వీలుగా రూపొందించిన ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు)కు ఆదరణ పెరుగుతోంది. ప్రపంచ దేశాలలో బంగారం వినియోగంలో భారత్, చైనాలు టాప్ ర్యాంకులో నిలుస్తుంటే.. వస్తురూపేణా (ఫిజికల్) వెండి కొనుగోళ్లకు సైతం భారత్ రెండో ర్యాంకులో నిలుస్తోంది. దేశీయంగా ఇటీవల ఈటీఎఫ్‌ల ప్రవేశంతో ప్రధానంగా వెండిలో పెట్టుబడులు అధికమయ్యాయి.పసిడి ధరల ర్యాలీతో పోలిస్తే కొద్ది నెలలుగా వెండి వెనుకబాటు దీనికి కారణమైనట్లు బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇటీవల కొద్ది నెలలుగా సౌర విద్యుదుత్పత్తితోపాటు.. ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రిక్ వాహన తయారీ, వినియోగానికి పెరుగుతున్న డిమాండ్ వెండి ధరలకు జోష్నివ్వనున్న అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశాయి. ఫలితంగా ఇటీవల వెండిలో ఫిజికల్ కొనుగోళ్లు, ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడులు ప్రవహిస్తున్నట్లు వివరించాయి. 200 శాతం జూమ్ 2022తో పోలిస్తే సిల్వర్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు వార్షిక ప్రాతిపదికన 200 శాతం దూసుకెళ్లాయి. న్యూయార్క్ సిల్వర్ ఇన్స్టిట్యూట్ వివరాల ప్రకారం ఈ కాలంలో దేశీ ఇన్వెస్టర్ల హోల్డింగ్స్ 18 రెట్లు ఎగశాయి. ఈ బాటలో గత 18 నెలల్లో పెట్టుబడులు భారీగా జంప్‌చేశాయి. తాజాగా వెండి హోల్డింగ్స్ 5.8 కోట్ల ఔ న్స్‌లు (1,800 టన్నులు)ను దాటాయి. 2024 చివరితో పోలిస్తే ఇది 51 శాతం అధికం! పెట్టుబడుల దూకుడు మూడేళ్ల క్రితం(2022 తొలి త్రైమాసికం) వెండి ఈటీఎఫ్‌లు ప్రవేశపెట్టినప్పుడు హోల్డింగ్స్ 2.1 మిలియన్ ఔన్స్‌లు (65 టన్నులు) మాత్రమే. తదుపరి పెట్టుబడులు ఊపందుకోవడంతో 2024 చివరి క్వార్టర్‌కల్లా 3.8 కోట్ల ఔన్స్‌ల (1,183 టన్నులు)కు చేరాయి. ఇది వార్షికంగా 200 శాతం వృద్ధికాగా.. ఒక్క 2024లోనే 2.51 కోట్ల ఔన్స్‌ల (782 టన్నులు) పెట్టుబడులు జత కలిశాయి. ఆపై వెండి ఈటీఎఫ్‌లు మరింత జోరందుకున్నాయి. పసిడి వెనుకడుగు వెండి ఈటీఎఫ్‌లతో పోలిస్తే ఇన్వెస్టర్లు పసిడి ఈటీఎఫ్‌లలో పెట్టుబడులకు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇందుకు బంగారం కాయిన్లు, ఆభరణాల(ఫిజికల్) కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రభావం చూపుతోంది. ఫలితంగా 2007లో ప్రారంభమైన గోల్డ్ ఈటీఎఫ్‌ల హోల్డింగ్స్ 2 మిలియన్ ఔన్స్‌ల(64 టన్నులు)కు చేరినట్లు తెలియజేశాయి. 2024లో గోల్డ్ ఈటీఎఫ్‌లలో కేవలం 0.5 మిలియన్ ఔన్స్‌లు(15 ట న్నులు) జమయ్యాయి. అయితే 2024కల్లా గత నాలుగేళ్ల కాలంలో ఇవి 27.4 టన్నుల నుంచి 54.5 టన్నులకు పుంజుకున్నాయి. 2025లో కొనుగోళ్లు మరింత పెరిగాయి. కాగా.. ఈ ఏడాది(2025)లో ఇప్పటివరకూ వెండి ధరలు 75 శాతం దూసుకెళ్లగా.. పసిడి 55 శాతం బలపడిన విషయం విదితమే.పసిడి రూ. 3,500 జూమ్⇒ ఢిల్లీలో రూ. 1,28,900కి గోల్డ్ ⇒ వెండి కూడా రూ. 5,800 అప్ న్యూఢిల్లీ: పసిడి ధరలు మరోసారి పరు గు తీశాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో మంగళవారం 99.9% స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ. 3,500 పెరి గి రూ. 1,28,900కి చేరింది. వెండి ధర కూడా కిలోకి రూ. 5,800 పెరిగి రూ. 1,60,800కి చేరింది. మరోవైపు, ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో డిసెంబర్ డెలివరీ పసిడి కాంట్రాక్టు ధర రూ. 1,458 ఎగిసి ఒక దశలో రూ. 1,25,312 వద్ద ట్రేడయ్యింది. వెండి కూడా రూ. 2,583 మేర ఎగిసి రూ. 1,57,065 వద్ద ట్రేడయ్యింది. న్యూయార్క్ కామెక్స్‌లో పసిడి డిసెంబర్ కాంట్రాక్టు ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 47.8 డాలర్లు పెరిగి 4,142 డాలర్ల స్థాయిని తాకింది. సిల్వర్ ఫ్యూచర్స్ రేటు 1.94 శాతం పెరిగి 51.30 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. -
బంగారం... ఎందుకీ హెచ్చుతగ్గులు?
బంగారం ధరలు కొన్నిసార్లు విపరీతంగా పెరుగుతుంటాయి. కొన్ని సార్లు అమాంతం తగ్గిపోతుంటాయి. ఇలా పెరుగుతూ.. తగ్గుతూ తులం గోల్డ్ రేటు రూ. 1.20 లక్షలు దాటేసింది. ఇంతకీ గోల్డ్ రేటు పెరగడానికి కారణం ఏమిటి?, ధరలు తగ్గడానికి దోహదపడే అంశాలు ఏమిటనేది.. ఇక్కడ తెలుసుకుందాం.గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణాలుద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం పెరిగితే.. కరెన్సీ విలువ తగ్గుతుంది. ఈ సమయంలో ప్రజలు తమ డబ్బును కాపాడుకోవడానికి బంగారంపై పెట్టుబడి పెడతారు. దీనివల్ల గోల్డ్ కొనేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీంతో పసిడి ధర అమాంతం పెరుగుతుంది.ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు & ఆర్థిక అస్థిరత: ప్రపంచ యుద్దాలు, రాజకీయ పరిణామాలు, ఆర్ధిక సంక్షోభాలు పెరిగినప్పుడు.. సురక్షితమైన పెట్టుబడి కోసం పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతారు. ఇది కూడా బంగారం ధర పెంచడానికి కారణమవుతుంది.రూపాయి / డాలర్ విలువ: రూపాయి విలువ లేదా డాలర్ విలువ తగ్గినప్పుడు కూడా ప్రజలు బంగారంపైన పెట్టుబడి పెడతారు. ఈ సమయంలో ఆయాదేశాలు దిగుమతి చేసుకునే బంగారం విలువ పెరుగుతుంది. దీంతో కొనుగోలుదారులు కూడా బంగారం కొనుగోలు చేయడానికి కొంత ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వస్తోంది.పండుగ సీజన్స్: ముఖ్యంగా భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం పండుగ సీజన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే దీపావళి, ధనత్రయోదశి వంటి పండుగల సమయంలో బంగారం కొంటే మంచిదని భావించే చాలామంది ఫాల్స్ కొనుగోలు చేస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్ కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతుంది.సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు: ప్రపంచ బ్యాంకులు బంగారం నిల్వలు పెంచితే మార్కెట్లో.. గోల్డుకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే.. ధరలు తప్పకుండా పెరుగుతాయి.బంగారం ధరలు తగ్గడానికి కారణాలుఆర్థిక పరిస్థితులు: ప్రపంచ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడినప్పుడు పెట్టుబడిదారులు బంగారానికి ప్రత్యామ్నాయంగా.. స్టాక్ మార్కెట్, బాండ్స్ వంటి అధిక రిటర్న్స్ ఇచ్చే వాటిమీద పెట్టుబడి పెడతారు. దీనివల్ల గోల్డ్ కొనేవారి సంఖ్య తగ్గుతుంది. దీంతో ధరలు కూడా తగ్గుతాయి.డాలర్ విలువ: డాలర్ విలువ పెరిగినప్పుడు.. పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపరు. దీంతో గోల్డ్ రేటు తగ్గుతుంది. డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం.వడ్డీ రేట్లు: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచితే.. డిపాజిట్లు, బాండ్స్ వైపు తిరుగుతారు. ఇది గోల్డ్ మీద ఆసక్తిని తగ్గిస్తుంది. ధరలు ఆటోమాటిక్‌గా తగ్గుతాయి.సెంట్రల్ బ్యాంకులు: సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద ఉన్న బంగారం నిల్వలను అమ్మినప్పుడు కూడా గోల్డ్ రేటు తగ్గుతుంది.సీజన్: పండుగలు, పబ్బాలు లేనప్పుడు చాలామంది సాధారణ ప్రజలు బంగారం కొనాలనే ఆలోచన చేయరు. కాబట్టి ఇలాంటి సమయంలో బంగారం ధరలు తగ్గుతాయి.''ఒక్కమాటలో చెప్పాలంటే.. పసిడికి డిమాండ్ పెరిగితే, ధరలు పెరుగుతాయి. డిమాండ్ తగ్గితే.. ధరలు కూడా తగ్గుతాయి.''ఇదీ చదవండి: జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు -
భార్యపై ప్రేమ: నాణేలు కూడబెట్టి..
ఇటీవల కాలంలో భార్య, భర్తకు.. భర్త, భార్యకు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం, సర్ప్రైజ్ ఇవ్వడం సర్వ సాధారణం అయిపోయింది. అయితే కొంతమంది భిన్నంగా ఆలోచిస్తారు. దీనికి కారణం వారి ఆర్ధిక స్తోమత కావచ్చు.. లేదా ఇంకేదైనా కారణం కూడా కావొచ్చు. ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని అహిర్వాన్ ప్రాంతానికి చెందిన 22ఏళ్ల అభిషేక్ యాదవ్.. పాన్ షాప్ నడుపుకుంటూ ఉండేవాడు. ఇతడు ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత తన భార్యకు బంగారు గొలుసు ఇచ్చి సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు. అయితే అతని ఆర్ధిక పరిస్థితి కారణంగా ఒకేసారి గొలుసు కొనలేడు. కాబట్టి డబ్బు కూడబెట్టాలనుకున్నాడు. అప్పటి నుంచి నాణేలను పోగు చేయడం ప్రారంభించాడు. ఏడాది పొడువునా రూ.10, రూ. 20నాణేలను కూడబెట్టాడు.మొత్తం కూడబెట్టిన నాణేల బస్తాలను.. బంగారు ఆభరణాల దుకాణానికి తీసుకెళ్లాడు. బస్తాలను కౌంటర్లో దగ్గర పెట్టాడు. ఇది చూసిన షాప్ యజమాని మహేష్ వర్మ మొదట ఆశ్చర్యపోయాడు. ఇన్ని నాణేలను బ్యాంకు కూడా తీసుకోదని వర్మ.. అభిషేక్‌తో చెప్పాడు. కానీ కొంతసేపటి తరువాత అంగీకరించాడు. మొత్తం నాణేలను లెక్కపెడితే.. రూ. 1.05 లక్షలు ఉన్నాయి. దీనిని లెక్కపెట్టడానికి రెండు గంటల సమయం పట్టిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: షఫాలీ వర్మ కొత్త స్పోర్ట్స్ కారు: ధర ఎంతో తెలుసా?అభిషేక్ యాదవ్ తన భార్య కోసం కొన్న గొలుసు రూ. 1.25 లక్షలు. కానీ అతడు తెచ్చిన డబ్బును మహేష్ వర్మ తీసుకుని, మిగిలిన డబ్బును వాయిదాల పద్దతిలో కట్టించుకోవడానికి అంగీకరించాడు. మొత్తానికి యాదవ్ తన భార్య కోసం.. బంగారు గొలుసు కొనేసాడు.A Kanpur Paan sellar saves ₹20 Coins daily to buy ₹1 Lakh Gold Chain as a surprise Gift for his Wife.JEWELLER : I was SHOCKED. It took more than two hours to count all the coins 😳MAN : I’ll present it to her when she returns from her Maayka ♥️ pic.twitter.com/Dr0nMX6htj— News Algebra (@NewsAlgebraIND) November 23, 2025 -
‘క్రాష్ మొదలైంది.. బంగారం, వెండి కొనుగోలుకిదే సమయం’
పెట్టుబడులు, ఆర్థిక విషయాలపై ఎప్పకప్పుడు వ్యాఖ్యానించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా మరో హెచ్చరికను జారీ చేశారు. "చరిత్రలో అతిపెద్ద క్రాష్" ప్రారంభమైందంటూ సోషల్ ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.2013లో తాను ప్రచురించిన పుస్తకం రిచ్ డాడ్స్ ప్రొఫెసీని ప్రస్తావిస్తూ దశాబ్దం క్రితం తాను అంచనా వేసిన ప్రపంచ మాంద్యం ఇప్పుడు బయటపడుతోందని, ఇది ఒక్క అమెరికాను మాత్రమే కాకుండా యూరప్, ఆసియాను కూడా ప్రభావితం చేస్తుందని చెప్పారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వేగవంతమైన పురోగతి ఉద్యోగాలను ఊడ్చేస్తుందని, ఇది జరిగితే వాణిజ్య, నివాస రియల్ ఎస్టేట్ రెండింటిలోనూ భారీ పతనం తప్పదని రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) నమ్ముతున్నారు.బంగారం, వెండి.. కొనాల్సిందిప్పుడే.. తన దీర్ఘకాల పెట్టుబడి అభిప్రాయాలను పునరుద్ఘాటిస్తూ, కియోసాకి బంగారం (Gold), వెండి, బిట్ కాయిన్, ఎథేరియం హోల్డింగ్స్ ను పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తన ఫాలోవర్లకు సూచించారు. ముఖ్యంగా ఈ పరిస్థితిలో వెండి కొనడం ఉత్తమం, సురక్షితమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక ఔన్స్‌కు 50 డాలర్ల వద్ద ఉన్న వెండి (Silver Price) త్వరలో 70 డాలర్లకి పెరుగుతుందని, 2026 నాటికి అయితే 200 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.ఇది చదివారా? బిట్‌కాయిన్ క్రాష్: కియోసాకి షాకింగ్ ప్రకటనధనవంతులవుతారు!"శుభవార్త ఏమిటంటే, లక్షలాది మంది తమ సంపదను పోగుట్టుకుంటున్నా... మీరు సిద్ధంగా ఉంటే... ఈ క్రాష్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది"అని కియోసాకి రాసుకొచ్చారు. ఈ క్రాష్ నుంచి సంపన్నులు అయ్యేందుకు మరిన్ని మార్గాలను రానున్న ట్వీట్లలో వివరిస్తానన్నారు.BIGGEST CRASH IN HISTORY STARTINGIn 2013 I published RICH DADs PROPHECY predicting the biggest crash in history was coming.Unfortunately that crash has arrived.It’s not just the US. Europe and Asia are crashing.AI will wipe out jobs and when jobs crash office and…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 23, 2025 -
పెరిగిన బంగారం ధరలు: ప్రధాన కారణం ఇదే!
బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజు (నవంబర్ 22) గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే పెరిగింది. దీంతో పసిడి ధరలు పెరుగుదల దిశగా పరుగులు తీశాయి. ఇంతకీ ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇది బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అయింది. మన దేశంలో పెళ్లి అంటేనే చాలామంది ఆడంబరంగా జరుగుపుకుంటారు. ఇలాంటి సమయంలో గోల్డ్ కొనేవాళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 14నాటికి సుమారు 48 లక్షల వివాహాలు జరగనున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా.ఈ ఏడాది 48 లక్షల వివాహాలు జరుగుతున్నాయంటే.. బిజినెస్ కూడా రూ. 6.5 లక్షల కోట్లు ఉంటుందని CAIT తన నివేదికలో వెల్లడించింది. ఇందులో 15 శాతం (సుమారు రూ. 97,500 కోట్లు) గోల్డ్ బిజినెస్ ఉంటుంది. అంటే ఈసారి రూ. 97,500 కోట్ల విలువైన బంగారం సేల్.. ఈ పెళ్లిళ్ల సీజన్లో జరుగుతుందని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే పసిడికి డిమాండ్ పెరుగుతుంది. తద్వారా ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.ఈ రోజు ధరలు ఇలానిన్న (నవంబర్ 21) స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు సమంత పెరిగింది. దీంతో బంగారం ధర గరిష్టంగా.. 1,860 రూపాయలు పెరిగి, రూ. 125840 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్దకు చేరింది. 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ పసిడి రేటు 1700 రూపాయలు పెరిగి.. రూ.115350 వద్ద నిలిచింది.ఇదీ చదవండి: అప్పుడు రూ.30 లక్షలు.. ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీ! -
డిజిటల్ గోల్డ్‌ను నియంత్రించం
న్యూఢిల్లీ: డిజిటల్ బంగారం లేదా ఈ–బంగారం వంటి ఉత్పత్తులను నియంత్రించాలనుకోవడం లేదని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. ఇవి తమ పరిధిలోకి రావన్నారు. రీట్, ఇని్వట్–2025 జాతీయ స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచి్చన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మ్యూచువల్ ఫండ్స్ అందించే గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) లేదా ట్రేడింగ్‌కు వీలయ్యే ఇతర బంగారం సెక్యూరిటీలనే సెబీ నియంత్రిస్తున్నట్టు చెప్పారు. నియంత్రణల పరిధిలో లేని డిజిటల్ గోల్డ్ లేదా ఈ–గోల్డ్‌లో లావాదేవీలతో రిస్క్ ఉందంటూ.. వీటికి దూరంగా ఉండాలంటూ ఇటీవలే సెబీ హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. ‘‘ఆ తరహా డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు సెబీ నియంత్రించే బంగారం ఉత్పత్తులకు భిన్నమైనవి. వాటిని సెక్యూరిటీలుగా లేదా కమోడిటీ డెరివేటివ్‌లుగా నోటిఫై చేయలేదు. అవి పూర్తిగా సెబీ నియంత్రణల వెలుపల పనిచేస్తున్నాయి. అటువంటి డిజిటల్ బంగారం సాధనాలతో ఇన్వెస్టర్లు గణనీయమైన రిస్‌్కను ఎదుర్కోవాల్సి రావచ్చు’’అని సెబీ తన ప్రకటనలో పేర్కొంది. భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయమంటూ కొన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు డిజిటల్ గోల్డ్‌పై ప్రచారం చేస్తున్నట్టు సెబీ దృష్టికి రావడంతో ఈ హెచ్చరిక జారీ చేసింది. దీంతో డిజిటల్ గోల్డ్‌ను ఆఫర్ చేసే ప్లాట్‌ఫామ్‌లు తమను సైతం సెబీ నియంత్రణల పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశాయి. -
తారుమారైన బంగారం ధరలు: సాయంత్రానికే..
బంగారం ధరలలో రోజురోజుకి ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఈ రోజు (నవంబర్ 21) ఉదయం పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి తగ్గుముఖం పట్టాయి. అంటే గంటల వ్యవధిలో పసిడి ధరలు తారుమారయ్యాయి.విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో బంగారం ధరలు ఉదయం రూ. 1,14,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,24,480 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద ఉన్నాయి. ఈ ధరలు సాయంత్రానికి వరుసగా రూ. 1,13,800 (రూ. 250 తగ్గింది), రూ. 1,24,130 (రూ. 280 తగ్గింది) వద్దకు చేరాయి.ఢిల్లీలో కూడా ఉదయం పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి తగ్గింది. ఉదయం 24 క్యారెట్ల 10 గ్రామ్స్ ధర రూ. 200 (రూ. 1,24,630), 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 220 (రూ. 1,14,250) పెరిగింది. ఈ ధరలు సాయంత్రానికి వరుసగా రూ. 280 (రూ. 1,24,130), రూ. 250 (రూ. 1,13,800) తగ్గింది.చెన్నైలో బంగారం ధరలు ఉదయం ఎలా ఉన్నాయో.. సాయంత్రానికి అలాగే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ధరలు రూ. 1,14,600 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,25,020 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద ఉన్నాయి.ఇదీ చదవండి: అప్పుడు రూ.30 లక్షలు.. ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీ! -
బంగారం ధరల్లో ఊహించని మార్పు!: గంటల వ్యవధిలో..
బంగారం ధరలు తగ్గుతూ.. పెరుగుతూ కొనసాగుతున్నాయి. ఈ రోజు (గురువారం) ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి మరోమారు తగ్గింది. దీంతో పసిడి ధరలలో మరోమారు మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.ఉదయం హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 మాత్రమే తగ్గింది. సాయంత్రానికి ఈ ధర రూ. 600లకు చేరింది. అంటే సాయంత్రానికి మరో 450 రూపాయలు తగ్గిందన్నమాట. కాగా 22 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 550 తగ్గింది (ఉదయం రూ. 150 మాత్రమే తగ్గింది). ప్రస్తుతం బంగారం ధరలు వరుసగా రూ. 1,24,260 (24 క్యారెట్స్), రూ. 1,13,900 (22 క్యారెట్స్) ఉన్నాయి.ఢిల్లీలో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధరల్లో ఉదయం సాయంత్రానికి తేడా ఉంది. ఉదయం నుంచి సాయంత్రానికే గరిష్టంగా రూ. 600 తగ్గింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,14,050 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,24,410 వద్ద ఉంది.ఇదీ చదవండి: లక్షకు రెండు లక్షలు!: బంగారంలాంటి లాభాలుచెన్నైలో మాత్రం బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. ఉదయం ఎంత రేటు ఉందో.. సాయంత్రానికి అంతే ఉంది. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,15,000 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,25,460 వద్ద ఉంది. అయితే వెండి ధరల్లో సాయంత్రానికి ఎటువంటి మార్పు లేదు. -
లక్షకు రెండు లక్షలు!: బంగారంలాంటి లాభాలు
ఒక మనిషి ఆర్థికంగా ఎదగాలంటే.. తప్పకుండా పొదుపు చేయాలి. ఈ పొదుపును సరైన మార్గంలో పెట్టుబడిగా పెడితే.. ఊహకందని లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇన్వెస్ట్ చేయడానికి స్టాక్ మార్కెట్, ఫిక్స్డ్ డిపాజిట్, గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్, రియల్ ఎస్టేట్ వంటి చాలామార్గాలు ఉన్నాయి.ఐదేళ్ల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే.. ఇప్పుడు ఎంత ఆదాయం వచ్చేది అనే విషయాన్ని వెల్త్ మోజో.. తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.ఐదేళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి, ఈరోజు దాని విలువ సుమారుగా..నిఫ్టీ 50: రూ. 1.8 లక్షలునిఫ్టీ నెక్స్ట్ 50: రూ. 2.2 లక్షలుమిడ్క్యాప్ ఇండెక్స్: రూ. 2.7 లక్షలుస్మాల్ క్యాప్ ఇండెక్స్: రూ. 3.1 లక్షలుబంగారం: రూ. 1.9 లక్షలువెండి: రూ. 2.0 లక్షలుఫిక్స్‌డ్ డిపాజిట్: రూ. 1.35 లక్షలురియల్ ఎస్టేట్: రూ. 1.15 లక్షల నుంచి రూ. 1.25 లక్షలుబిట్కాయిన్: రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షలుదీన్నిబట్టి చూస్తే ఐదు సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తికి.. ఇప్పుడు సుమారు రూ. 2 లక్షలు వస్తుందన్నమాట. అంటే లక్ష రూపాయలకు, మరో లక్ష లాభం. కాగా బంగారం వెండి ధరలు కూడా ఐదేళ్లలో ఊహకందని రీతిలో పెరిగాయి.ఇదీ చదవండి: నా దృష్టిలో అది నిజమైన డబ్బు: మిగతాదంతా ఫేక్..If you had invested ₹1,00,000 five years ago, here’s what it would roughly be worth today:📊 Nifty 50: ~₹1.8L🚀 Nifty Next 50: ~₹2.2L📈 Midcap Index: ~₹2.7L🔥 Smallcap Index: ~₹3.1L🪙 Gold: ~₹1.9L🥈 Silver: ~₹2.0L🏦 Fixed Deposit: ~₹1.35L🏢 REITs/InvITs:…— Wealthmojo™ (@wealthmojo1) November 18, 2025 -
పసిడి రూ. 3,900 డౌన్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు సన్నగిల్లిన నేపథ్యంలో పసిడి ధరలు మంగళవారం గణనీయంగా తగ్గాయి. దేశీయంగా ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 3,900 క్షీణించింది. రూ. 1,25,800కి తగ్గింది. వెండి రేటు కూడా కేజీకి రూ. 7,800 తగ్గి రూ. 1,56,000కు దిగి వచ్చింది.అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు సన్నగిల్లడం, ఈ వారం కీలక డేటా విడుదల అనంతరం ఫెడ్ రిజర్వ్ తీసుకోబోయే చర్యల గురించి ఇన్వెస్టర్లు నిరీక్షిస్తుండటంతో పసిడి, వెండి అమ్మకాల ఒత్తిడికి లోనైనట్లు ఆగ్మంట్ హెడ్ (రీసెర్చ్) రెనిషా చైనాని తెలిపారు. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్‌లో) డిసెంబర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుకు సంబంధించి పసిడి రేటు క్రితం ముగింపు రూ. 1,22,927తో పోలిస్తే ఒక దశలో సుమారు రూ. 2,165 క్షీణించి రూ. 1,20,762కి తగ్గింది. వెండి ఫ్యూచర్స్ కూడా డిసెంబర్ కాంట్రాక్టు రూ. 3,660 మేర (సుమారు 2.36 శాతం) పతనమై రూ. 1,51,652 వద్ద ట్రేడయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లు చూస్తే కామెక్స్ గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఔన్సుకి సుమారు 65 డాలర్లు (1.60 శాతం) క్షీణించి 4,009.5 డాలర్లకు తగ్గింది. గత నాలుగు సెషన్లలో పుత్తడి ధర ఏకంగా 204.1 డాలర్లు (సుమారు 4.84 శాతం) క్షీణించింది. అలాగే డిసెంబర్ కాంట్రాక్టు వెండి రేటు 2.38 శాతం క్షీణించి 49.50 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. -
ఐదు రోజుల్లో రూ. 5వేలు!.. బంగారం ధరల్లో భారీ మార్పు
అమెరికా డాలర్ బలపడటం, వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గిస్తుందనే ఆశలు సన్నగిల్లడం వంటి కారణాల వల్ల ప్రపంచ మార్కెట్లలో.. మంగళవారం బంగారం ధరలు పడిపోయాయి.భారతదేశంలో నేడు (మంగళవారం) 24 క్యారెట్ల బంగారం ధర రూ. 123660 (10 గ్రామ్స్), 22 క్యారెట్ల ధర రూ. 1,13,350 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 1740 & రూ. 1600 తక్కువ. పసిడి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.నవంబర్ 13న రూ. 1,28,620 లక్షల వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర.. ఈ రోజు (నవంబర్ 18) రూ. 1,23,660 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. కేవలం ఐదు రోజుల్లో రూ. 4960 తగ్గిందని తెలుస్తోంది. అంటే ఐదు రోజుల్లో దాదాపు 5000 రూపాయలు తగ్గిందన్నమాట.వెండి విషయానికి వస్తే.. రూ. 1.83 లక్షల (నవంబర్ 13) వద్ద ఉన్న సిల్వర్ రేటు.. నేటికి రూ. 1.70 లక్షలకు చేరింది. అంటే వెండి రేటు కూడా ఐదు రోజుల్లో రూ. 13వేలు తగ్గిందన్నమాట.అమెరికా డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, ఫెడ్ వడ్డీ రేట్లు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఫెడ్ వడ్డీ రేటు పెరిగినప్పుడు.. గోల్డ్ రేటు తగ్గుతుంది. ఫెడ్ వడ్డీ రేటు తగ్గినప్పుడు.. పసిడి ధరలు పెరుగుతాయి. బంగారం ధరలు పెరుగుదల, తగ్గుదలల మీద.. రాజకీయ, భౌగోళిక కారణాలు.. ఆర్ధిక వ్యవస్థలు ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: నా దృష్టిలో అది నిజమైన డబ్బు: మిగతాదంతా ఫేక్.. -
బంగారం ధరలు ఢమాల్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. నిన్నటి మాదిరిగానే మంగళవారం కూడా తులం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఇస్త్రీ పెట్టెలో రూ.1.55 కోట్ల బంగారం
హైదరాబాద్: షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవె న్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రూ.1.55 కోట్ల బంగారాన్ని పట్టు కున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 14న షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి గురించి ముందస్తు సమా చారం ఉన్న డీఆర్ఐ అధికారులు అతడి బ్యాగేజీలో ఉన్న ఇస్ట్రీపెట్టె (ఐరన్ బాక్స్)ను విప్పి చూడగా మొత్తం 11 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. ఆ బంగారం విలువ రూ.1.55 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. క్యారియర్‌గా ఆ బంగారాన్ని తీసుకొచ్చిన వ్యక్తి దానిని ఎవరికోసం తెచ్చాడన్న విషయంపై దర్యాప్తు చేయగా, ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి కోసం తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆదివారం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


