NTR
-
జత్వానీ కేసుతో నాకేం సంబంధం లేదు: పీఎస్ఆర్ స్వీయ వాదనలు
విజయవాడ, సాక్షి: ముంబై నటి జత్వానీ కాదంబరి కేసుతో తనకేం సంబంధం లేకపోయినా ఇబ్బంది పెడుతున్నారని సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు(PSR Anjaneyulu) అంటున్నారు . బుధవారం ఉదయం ఆయన్ని సీఐడీ పోలీసులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. రిమాండ్ కోసం వాదనలు జరిగ్గా.. తన కేసులో తానే పీఎస్ఆర్ వాదనలు వినిపించుకుంటున్నారు.ముంబయి నటి జెత్వానీ కాదంబరిని వేధించారంటూ ఏపీ సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులును మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ బేగంపేటలోని నివాసం నుంచి ఆయన్ని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ఈ ఉదయం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. జత్వానీ కేసులో ఏం జరిగిందనేది జడ్జి ముందుకు స్వాయంగా వాదనలు వినిపించారు. తన పాత్ర లేకపోయినా కేసు పెట్టారని వాదించారు. అసలు ఈ కేసులో ఏం జరిగిందనే అంశాలను జడ్జికి వివరించారాయన. మాజీ డీసీపీ విశాల్ గున్నీని ప్రొటెక్ట్ చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో అప్రూవర్‌గా మారారు. 164 స్టేట్ మెంట్ ఇవ్వమని విశాల్ గున్నీని అడిగినా.. ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ కేసులో తనకు సంబంధం లేని విషయాలను చెప్పించారు అని జడ్జి ముందు పీఎస్ఆర్ వాపోయారు. ప్రస్తుతం జడ్జి ఎదుట వాదనలు కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: పీఎస్ఆర్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఏమన్నారంటే.. -
విచారణకు వస్తానని చెప్పినా అరెస్ట్ చేశారు: కోర్టులో రాజ్ కేసిరెడ్డి
విజయవాడ తాను సిట్ విచారణకు హాజరవుతానని చెప్పినా అరెస్టు చేశారని ఏసీబీ కోర్డులో రాజ్ కేసిరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు(మంగళవారం) రాజ్ కేసిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. దీనిలో భాగంగా రాజ్ కేసిరెడ్డిని న్యాయమూర్తి పలు ప్రశ్నలు అడిగారు. సోదాల్లో ఏమైనా సీజ్ చేశారా? అని న్యాయమూర్తి అడగ్గా, కారు తప్ప ఏమీ సీజ్ చేయలేదని కేసీరెడ్డి తెలిపారు. తన ఇంటితో పాటు బంధువులు ఇళ్లల్లో,స్నేహితుల ఇళ్లల్లో సోదాలు చేశారని కేసిరెడ్డి తెలిపారు. విచారణ పేరుతలో తల్లి దండ్రలను ఇబ్బందులు పెట్టారని తెలిపిన కేసిరెడ్డి.. సిట్ అధికారులే రిపోర్ట్ ఇచ్చారని, తాను సంతకాలు చేయలేదని కోర్టుకు తెలిపారు. -
టీడీపీ ఎంపీ చిన్ని బినామీదే ‘ఉర్సా’.. డీల్ బట్టబయలు చేసిన కేశినేని నాని
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ భూమిని పెట్టుబడుల పేరుతో దోచుకునేందుకు కేశినేని చిన్ని ప్రయత్నం చేశారంటూ ‘ఉర్సా’ వెనుక డీల్‌ను మాజీ ఎంపీ కేశినేని నాని బయటపెట్టారు. టీడీపీ ఎంపీ కేశినేని బినామీదే "ఉర్సా" అంటూ ట్వీట్ చేశారు. కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్‌లు భాగస్వాములు. 21 సెంచరీ ఇన్వెస్టమెంట్ ప్రాపర్టీస్ పేరుతో గతంలో కోట్లు వసూళ్లు చేశారు. కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్, కోట్లు వసూళ్లు చేసి జనాన్ని మోసం చేశారు’’ అంటూ కేశినేని నాని ఎక్స్ వేదికగా తలిపారు."ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్" అనే కంపెనీకి విశాఖలో 60 ఎకరాల కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దురుద్దేశం ఉన్నట్టు పేర్కొన్న నాని.. 5,728 కోట్ల డేటా సెంటర్ ప్రాజెక్ట్ పేరుతో ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పడలో 56.36 ఎకరాలు.. మొత్తం 60 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయని.. ఈ కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ తమ బినామీ పేరుతో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని నాని ఆరోపించారు.‘‘ఉర్సా క్లస్టర్స్ కేవలం కొన్ని వారాల క్రితమే రిజిస్టర్ అయ్యింది. వీరికి ఎటువంటి అనుభవం లేదు. ప్రాజెక్ట్ చేయగల సామర్థ్యం కూడా లేదు. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, ఎంపీ చిన్ని ఇంజినీరింగ్ క్లాస్మేట్. అబ్బూరి సతీష్ ఎంపీ చిన్ని బిజినెస్ భాగస్వామి కూడా. ఇద్దరు కలిసి 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ప్రజల నుండి కోట్లు వసూలు చేసి ప్రజలను మోసం చేసిన నేపథ్యం ఉంది. ఈ భూమి కేటాయింపు వెనుక చిన్ని తన ఎంపీ పదవి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న పరపతిని ఉపయోగించారు’’ అని నాని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఊరూపేరు లేని 'ఉర్సా'చిన్ని సాండ్ మైనింగ్, ఫ్లై ఆష్, రియల్ ఎస్టేట్ మాఫియాలతో కలిసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు ఉన్నాయన్న కేశినేని నాని.. ఉర్సా క్లస్టర్స్‌కు ఇచ్చిన భూ కేటాయింపు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కంపెనీ యజమానులు, డబ్బు మూలాలు, రాజకీయ కనెక్షన్లపై సంపూర్ణ దర్యాప్తు చేయాలన్నారు. ప్రభుత్వ భూమిని "పెట్టుబడుల" పేరుతో దోచుకునే ఈ ప్రయత్నాన్ని ఆపాలంటూ చంద్రబాబుకు కేశినేని నాని ఫిర్యాదు చేశారు.Respected @ncbn garu,I would like to begin by sincerely appreciating your bold and visionary step in allotting land to Tata Consultancy Services (TCS) in Visakhapatnam. Such initiatives will pave the way for real investments, job creation, and the upliftment of Andhra Pradesh’s… pic.twitter.com/pJMQeSGgNi— Kesineni Nani (@kesineni_nani) April 22, 2025 -
ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులుపై కూటమి కక్ష సాధింపు
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోంది. ఈ క్రమంలో.. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయుల్ని(PSR Anjaneyulu) అరెస్ట్ చేసింది. ముంబై నటి కేసుకుగానూ ఏపీ సీఐడీ ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పీఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ముంబై నటి జత్వానిని ఆయన వేధించారనే అభియోగాల కింద సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బేగంపేట నివాసంలో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నటి కాదంబరి జత్వానీ(Kadambari Jatwani) కేసులో ప్రధాన నిందితుడు ఇప్పటికే బెయిల్ మీద ఉన్నాడు. మరోవైపు.. పలువురు పోలీసు ఉన్నతాధికారుల్ని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని విపరీతంగా ప్రయత్నించింది. కక్ష పూరితంగా కేసులు నమోదు చేయించగా.. హైకోర్టు ఆ ఇద్దరు అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పీఎస్ఆర్ను కక్ష పూరితంగా అరెస్ట్ చేయించింది. -
భలే మంచి ‘ఉద్యోగ’ బేరమూ..!
తాడేపల్లి రూరల్: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రాజధాని ముఖద్వారం ఉండవల్లి కేంద్రంగా దాదాపు 200 మంది నిరుద్యోగులను మోసం చేయడానికి సిద్ధపడిన ఒక జనసేన నాయకుని ప్రయత్నం ఆదిలోనే బెడిసికొట్టిన వైనమిది. సేకరించిన వివరాల ప్రకారం, విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో పార్కింగ్ ఫీజు వసూలు చేసే శివ అనే ఒక జనసేన నాయకుడు ఉండవల్లిలోని మూడు బొమ్మల సెంటర్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. రాష్ట్రంలోని దేవదాయ శాఖ, పౌరసరఫరాల శాఖలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ఎటువంటి పరీక్షలు లేకుండా నేరుగా ఎంపీతో, మంత్రితో మాట్లాడి ఆ ఉద్యోగాలు ఇప్పిస్తానని రాష్ట్ర వ్యాప్తంగా తమ నాయకులు, కార్యకర్తలతో గడచిన కొంత కాలంగా ప్రచారం నిర్వహించాడు.ఈ ప్రచారం మేరకు దాదాపు 200 మంది నిరుద్యోగులు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సోమవారం ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. వీరి నుంచి రూ.10 వేల నుంచి రూ. 2 లక్షల వరకూ వసూళ్ల దందా ప్రణాళికను సిద్ధం చేసుకున్న నిందితుడు నిరుద్యోగుల నుంచి నగదు, సర్టిఫికెట్లు సేకరించడానికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో సమాయత్తం అవుతుండగా, మీడియా రాకతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.అయితే ‘తగ్గేదేలే..’ అన్నట్లు ఎంపీ, మంత్రులు తన వెనుక ఉన్నారంటూ బెదిరింపులకు దిగాడు. ఇంతలో ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకోవడంతో, ఉద్యోగాలు ఇవ్వడం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నానని ఒప్పుకున్నాడు. డిగ్రీలు చదివి ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటే ఎలా నమ్మారంటూ నిరుద్యోగులను ప్రశ్నించగా, ఎంపీ బాలశౌరి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహన్ తనకు తెలుసని, వారి ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని నిందితుడు చెప్పినట్లు అక్కడివారు తెలిపారు. ఇంకా ఎవ్వరూ డబ్బులు చెల్లించలేదని కూడా వారు పేర్కొనడం గమనార్హం. -
ముగ్గురు రైల్వే ఉద్యోగులకు జీఎం సేఫ్టీ అవార్డులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్ల నిర్వహణలో లోపాలను గుర్తించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన విజయవాడ డివిజన్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులు ‘జీఎం మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డును అందుకున్నారు. సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం నుంచి విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్‌తో పాటుగా సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు, నాందే డ్ డివిజన్ల డీఆర్ఎంలతో వర్చువల్ పద్ధతిలో భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన దెందులూరు ఆపరేటింగ్ విభాగంలోని స్టేషన్ సూపరింటెండెంట్ టి.వి.ఎం.యూ మహేశ్వర్, రాజమండ్రి ఆపరేటింగ్ విభాగంలోని పాయింట్ మెన్ కె.నథానియేల్, రాజమండ్రిలోని ట్రైన్ మేనేజర్ లోకేష్‌కుమార్‌లకు జీఎం అరుణ్‌కుమార్ జైన్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించారు. -
యానిమేషన్ స్కాంలో రూ. కోట్లు పోతున్నా ఫిర్యాదుకు వెనకడుగు
న్యాయపరంగా నిలుస్తాయా..? ఎటువంటి ఆధారాలులేని పత్రాలను పట్టుకొని ఏ కోర్టు మెట్లు ఎక్కినా ఉపయోగం లేదన్న భావన బాధితుల్లో నెలకొంది. దీంతో పాటు లెక్కల్లో చూపని బ్లాక్‌మనీ అధిక మొత్తంలో ఉండటంతో ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనకడుగు వేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినవారికి ఒత్తిళ్లు అధికమయ్యాయి. యానిమేషన్లో పెట్టిన డబ్బులు తిరిగిరావని భావించిన బాధితులు ఉన్న ఆస్తులను అమ్మి తెచ్చిన అప్పులను తీర్చే పనిలో ఉన్నారు. మరికొంత మంది ఉన్న ఆస్తుల కంటే అప్పులు అధికంగా ఉండటంతో ఐపీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. -
అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదని, జవాబుదారీతనంతో సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారం లభిస్తుందనే ఆశతో ఎండలను సైతం లెక్కచేయక సుదూర ప్రాంతాల నుంచి వచ్చి సమస్యలపై అర్జీలను సమర్పిస్తున్నారన్నారు. జవాబుదారీతనంతో అర్జీలను పరిష్కరించాలన్న ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అర్జీల వివరాలు ఇవి.. రెవెన్యూ శాఖకు సంబంధించి 63 అర్జీలు రాగా.. పోలీస్ శాఖకు 26, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 14, సర్వే 8, విద్య 7, ఉపాధి కల్పన 6, పంచాయతీరాజ్ 4, వైద్య 4, విద్యుత్ 3, జలవనరులు 3, ఆర్డబ్ల్యూఎస్ 3, బీసీ వెల్ఫేర్ 3, పౌరసరఫరాలు 3, దేవదాయ 2, మార్కెటింగ్ 2, రిజిస్ట్రేషన్ 2, హౌసింగ్, స్కిల్ డెవలప్మెంట్, విభిన్న ప్రతిభావంతులు, ఎకై ్సజ్, మెప్మా, వ్యవసాయం, కోఆపరేటివ్, కార్మిక శాఖలకు సంబంధించిన ఒక్కొక్క అర్జీతో కలిపి మొత్తం 162 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి పాల్గొన్నారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. ● ఇంటర్మీడియెట్ విద్య పెన్షనర్లకు 2018 నుంచి రావాల్సిన డీఆర్ ఏరియర్స్, 11వ పీఆర్సీ ఏరియర్స్ తక్షణమే విడుదల చేయాలని, ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు మీద అన్ని ఆస్పత్రుల్లో అన్ని వ్యాధులకు వైద్య సేవలు అందించాలని, 12వ పీఆర్సీ కమిషనర్‌ను నియమించాలని కోరుతూ పలువురు పెన్షనర్లు అర్జీ సమర్పించారు. ● బీసెంట్‌రోడ్డులో చిరువ్యాపారాలు చేసుకునే వారిని ఇటీవల కొంత కాలం నుంచి అధికార పార్టీ నేతలు వేధిస్తున్నారు. దీంతో హాకర్స్ అండ్ తోపుడు బండ్ల యూనియన్ ప్రతినిధులు, సీఐటీయూ నాయకుడు దోనేపూడి కాశీనాథ్ కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించారు. తాము 50 ఏళ్లుగా బీసెంట్ రోడ్డులో చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని.. కొందరికి కార్పొరేషన్ గుర్తింపు కార్డులు జారీ చేసిందని.. దీంతో తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. పీజీఆర్ఎస్లో కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి 162 అర్జీలు స్వీకరణ -
పెద్దాస్పత్రిపై పగ
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య రంగంపై కూటమి ప్రభుత్వ వివక్ష కొనసాగుతోంది. వైద్య కళాశాలలు, ప్రభుత్వాస్పత్రిలో అదనపు భవనాల నిర్మాణాలకు గ్రహణం పట్టింది. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తి చేసుకున్న భవనాలకు పదినెలలుగా అతీగతీ లేకుండా పోయింది. దీంతో అవి ఎప్పటికి పూర్తవుతాయో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. రోగులకు నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అదనపు భవన నిర్మాణాలు చేపట్టగా, ప్రస్తుత ప్రభుత్వం మోకాలడ్డటంతో నిలిచిపోయాయి. నిలిచిన క్యాజువాలిటీ నిర్మాణం.. ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా అత్యాధునిక క్యాజువాలిటీ బ్లాక్ నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒక్కో బ్లాక్ 2వేల చదరపు మీటర్ల విస్తీర్ణంతో నాలుగు అంతస్తుల్లో నిర్మించేందుకు రెండేళ్ల కిందట పనులు ప్రారంభించింది. అందులో అత్యవసర చికిత్స విభాగంతో పాటు, ట్రామాకేర్, ఏఎంసీ, అత్యవసర నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది అందుబాటులోకి వస్తే అత్యవసర వైద్యం అవసరమైన వారికి సత్వరమే సేవలు అందుతాయని అంతా భావించారు. ఇప్పటికే 50శాతం పైగా నిర్మాణం పూర్తికాగా.. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పది నెలలుగా పనులు నిలిచిపోయాయి. పేద రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు చేపట్టిన నిర్మాణం నిలిపి వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య కళాశాల భవనాలపైనా.. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలకు 2023–24 విద్యా సంవత్సరంలో పోస్టు గ్రాడ్యుయేషన్ సీట్లు వంద వరకూ పెరిగాయి. పెరిగిన సీట్లకు అనుగుణంగా కేంద్రం నుంచి నిధులు సైతం మంజూరయ్యాయి. ఆ నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కింద మరిన్ని నిధులు కేటాయించి దాదాపు రూ.90 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టారు. అదనపు తరగతి గదులతో పాటు, లెక్చర్ హాల్స్, లేబొరేటరీ వంటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. 2024 జూన్ నాటికే 50 శాతం పైగా పనులు పూర్తి కాగా ప్రస్తుతం నత్త నడకన నడుస్తున్నాయి. అవి పూర్తి అయితే కాని విద్యార్థులకు సదుపాయాలకు అందుబాటులోకి వస్తాయి.విజయవాడ ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో నిలిచిపోయిన నిర్మాణ పనులు ఆస్పత్రిలో ఆగిన అభివృద్ధి పది నెలలుగా ముందుకు సాగని నిర్మాణాలు నిలిచిన కొత్త క్యాజువాలిటీ భవనం పనులు నత్త నడకన సాగుతున్న వైద్య కళాశాలలో అదనపు గదుల నిర్మాణం వైద్య రంగంపై వివక్ష తగదు.. కూటమి ప్రభుత్వం వైద్య రంగంపై వివక్ష చూపడం తగదు. విజయవాడ ఆస్పత్రి, వైద్య కళాశాలలో నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి. రోగులు, వైద్య విద్యార్థుల అవసరాల కోసం చేపట్టిన నిర్మాణాలు పూర్తి చేసి, భవనాలు అందుబాటులోకి తీసుకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.02 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ. 3.02 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం మహామండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 18 రోజులకుగాను రూ. 3,02,92,986 నగదు, 440 గ్రాముల బంగారం, 5.225 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. లెక్కింపును ఈవో పర్యవేక్షించారు. దేశంలో రాజ్యాంగానికి ముప్పు పెనమలూరు: దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. పోరంకి విజ్ఞాన భారత్ పాఠశాలలో సోమవారం అబ్దుల్ కలాం స్టడీ సర్కిల్ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వాహకుడు అమరయ్యశాస్త్రి అధ్యక్షతన.. ‘భారత రాజ్యాంగం నేడు ఎదుర్కొంటున్న సవాళు’్ల అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొలీజియం కమిటీ దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి అనేక మతాలకు, జాతులకు, కులాలకు దేశ సమైక్యత విధానాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించారన్నారు. అయితే దేశంలో నేటి రాజకీయ పరిస్థితుల కారణంగా రాజ్యాంగానికి తూట్లు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ సైతం నాయకుల చేతిలో సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. విజ్ఞాన్ భారత్ పాఠశాల కరస్పాండెంట్ ప్రొఫెసర్ కొడాలి రామశేషాద్రిరావు తదితరులు పాల్గొన్నారు. ‘మా పాఠశాలను తరలించొద్దు సారూ!’వక్కపట్లవారిపాలెం(నాగాయలంక): మండలంలోని వక్కపట్లవారిపాలెం శివారు బ్రహ్మానందపురం పాఠశాలను గ్రామానికి దూరంగా తరలించవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వేడుకున్నారు. మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తమ ఇబ్బందులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా పంచాయతీ పరిధిలో రెండు కిలోమీటర్ల దూరంలోని వక్కపట్లవారిపాలెం పాఠశాలలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టారని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సహేతుకం కాదని వాపోయారు. బ్రహ్మానందపురంలో నివసించే వారంతా షెడ్యూల్ కులానికి చెందినవారని, ఇక్కడి పాఠశాలలో 45 మంది విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకుంటున్న చిన్న పిల్లలని, వీరంతా రెండు కిలోమీటర్ల దూరం ఎలా నడిచి వెళ్తారని ప్రశ్నించారు. మార్గ మధ్యలో అవనిగడ్డ–నాగాయలంక, భావదేవరపల్లి ప్రధాన రహదారులు ఉన్నాయని ఈ రహదారులు ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీతో ఉంటాయని, చిన్నపిల్లలు ఆ రోడ్ల వెంట ఎలా వెళ్లగలరని అన్నారు. పాఠశాలను తరలించే ప్రయత్నం విరమించకపోతే నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని 30 మందికి పైగా గ్రామస్తులు బందరు వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రతి కార్డుదారుడికీ ఈ–కేవైసీ తప్పనిసరి చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని పొందేందుకు రేషన్‌కార్డులోని ప్రతి ఒక్క సభ్యుడు ఈ–కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ తెలిపారు. సోమవారం నాటికి జిల్లాలో 71,110 మంది సభ్యులు ఇంకా ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ లబ్ధిదారుల వివరాలు రేషన్ షాపు డీలరు వద్ద, పౌరసరఫరాల డెప్యూటీ తహసీల్దార్ వద్ద, పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయంలో గ్రామ రెవెన్యూ అధికారి, డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా చేసుకోవచ్చన్నారు. -
‘అప్పులు సాకుగా చూపి పథకాలు ఎగ్గొట్టేందుకు కుట్ర’
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అప్పులు సాకుగా చూపి సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర అఽధికార ప్రతినిధి పి.ప్రసాద్ అన్నారు. సంపద సృష్టించి సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టి 11 నెలలు కావొస్తున్నా ఏ ఒక్క పథకం అమలు చేయలేదన్నారు. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేయాలని కోరుతూ సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే నవరత్నాలకు మించిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలను నమ్మించి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇతర వర్గాలకు 176 అడ్డగోలు హామీలిచ్చిందన్నారు. అప్పుల పేరుతో ఈ పథకాల ఎగవేతకు పథకం పన్నడం ప్రజాద్రోహమని విమర్శించారు. క్విడ్ ప్రోకోగా.. రైతులకు ఇచ్చిన హామీల్ని వదిలి భారీ భూములను క్విడ్ ప్రొకోగా కంపెనీలకు కట్టబెడుతున్నారని గుర్తు చేశారు. ప్రజలు ఏమీ చేయరని చంద్రబాబు భావిస్తే.. ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దూరంలోనే లేదని ప్రసాద్ హెచ్చరించారు. పార్టీ నగర కార్యదర్శి పి.పద్మ, ఇఫ్టూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముని శంకర్, దాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అంతా.. గప్‌చుప్
● విజయవాడ కేంద్రంగా యానిమేషన్ స్కాం.. బాధితుల్లో నరసరావుపేట వాసులే అధికం ● ఒక్కొక్కరి వద్ద రూ.కోట్లు వసూలు చేసిన స్కామర్ కిరణ్ ● కనీసం కార్యాలయ సీల్, అడ్రస్ కూడా లేకుండా అగ్రిమెంట్ కాగితాలు జారీ ● న్యాయపరంగా వెళ్లాలంటే చెల్లవేమోనన్న భయం ● పెట్టుబడి పెట్టింది బ్లాక్‌మనీ కావడంతో ఫిర్యాదుకు అవకాశం లేదంటూ వాపోతున్న వైనం ● అధిక వడ్డీల ఆశతో గుల్లవుతున్న ప్రజలు సాక్షి, నరసరావుపేట / నరసరావుపేట టౌన్: సాధారణంగా రూ.వెయ్యి పోతే.. పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీసి ఫిర్యాదు చేస్తాం. దొంగతనం చేసింది ఎవరో తెలిస్తే వెంటనే అతన్ని పట్టుకొని నగదు రికవరీకి ప్రయత్నిస్తాం. అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.400 కోట్లకు పైగా మోసం చేసిన వాడు ఎవడో తెలుసు.. అయినా ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు అందడం లేదు. బాధితుల సంఖ్య సుమారు వందల్లో ఉన్నా ఒక్కరూ ముందుకు రాకపోతే తామేమి చేయలేమని పోలీసులు చేతులెత్తుస్తున్నారు. ఇది యానిమేషన్ స్కాం ఉదంతంలో బాధితులు తీరు. విజయవాడ కేంద్రంగా యానిమేషన్ ప్రోగ్రామింగ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన కిరణ్ ఆర్థిక నేరానికి తెర తీశాడు. రాష్ట్రవ్యాప్తంగా రూ.వందల కోట్ల వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. ఇతని బాధితుల్లో నరసరావుపేట వాసులు అధికంగా ఉన్నారు. పెట్టిన పెట్టుబడికి అధిక శాతం వడ్డీ ఆశ చూపడంతో అనేకమంది స్తోమతకు మించి అప్పులు చేసి మరీ భారీగా పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం కిరణ్ మోసం చేసి పరారవడంతో బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సీల్ కూడా లేని అగ్రిమెంట్ కాపీలు... రూ.లక్ష పెట్టుబడి పెట్టే సమయంలో సైతం ఇరువర్గాల మధ్య జరిగే అగ్రిమెంట్లు చాలా పక్కాగా ఉండేలా చూస్తారు. అలాంటిది పదుల కోట్ల రూపాయాలను యానిమేషన్ కంపెనీలో పెట్టుబడి పెట్టినా సరైనా పత్రం బాధితుల వద్ద ఒక్కటీ లేదంటే స్కాం ఎంత పక్కాగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. కంపెనీ పేరుతో పెట్టుబడిదారులకు జారీ చేసిన ఒప్పంద పత్రాలలో ఎక్కడా కంపెనీ పర్మినెంట్ అడ్రస్ లేదు. విజయవాడలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయాన్ని నెల రోజుల క్రితం ఖాళీ చేయడంతో బాధితులకు ఎక్కడికిపోవాలో కూడా పాలుపోవడం లేదు. మరోవైపు అగ్రిమెంట్ కాపీలో పెట్టుబడులు స్వీకరించే కంపెనీ సీలు ఉండటం రివాజు. అయితే యానిమేషన్ కంపెనీ జారీ చేసిన అగ్రిమెంట్లలో ‘ఓకే’ అన్న అక్షరాలతో మాత్రమే సీల్ వేసి స్కామర్ కిరణ్ సంతకం చేసిన పత్రాలను జారీ చేశారు. రూ.వందల కోట్ల విలువైన కంపెనీకి సీల్ కూడా లేకపోవడం ఏంటని ప్రశ్నించలేదంటే బాధితులు అధిక వడ్డీలకు ఆశపడి ఎలా మోసపోయారో అర్థమవుతోంది. స్పందించని ప్రభుత్వం రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోటు ఆర్థిక నేరాలు వెలుగుచూస్తున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాఽధితులకు న్యాయం చేయకపోగా నిందితులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఇటీవల సాయిసాధన చిట్‌ఫండ్ స్కాం బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. -
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కృష్ణాజిల్లా కేసరపల్లికి చెందిన భక్తులు సోమవారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. కేసరపల్లికి చెందిన బి.నీలిమ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,04,893ల విరాళాన్ని అందించారు. నిత్యాన్నదానం, బంగారు తాపడం పనులకు.. విజయవాడకు చెందిన భక్తులు నిత్యాన్నదానానికి, బంగారు తాపడం పనులకు వేర్వేరుగా విరాళాలను అందజేశారు. విజయవాడ మాచవరానికి చెందిన అట్లూరి రామ్మోహన్రావు, సువర్ణ దంపతులు నిత్యాన్నదానానికి రూ.లక్ష, బంగారు తాపడం పనులకు రూ.లక్ష విరాళాన్ని అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
ఆంధ్రా హాస్పిటల్లో ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సిన్ క్యాంప్
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) ఉచిత వ్యాక్సినేషన్ క్యాంప్ సినీహీరో మహేష్‌బాబు సహకారంతో ఆంధ్రా హాస్పిటల్లో ప్రారంభమైంది. ఈ క్యాంప్‌ను సోమవారం ఆస్పత్రి పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు, ఫీటల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ పాతూరి పద్మలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేష్‌బాబు ఫౌండేషన్ సహకారంతో తమ ఆస్పత్రిలో తొమ్మిదేళ్ల నుంచి 45 సంవత్సరాల లోపు మహిళలకు మూడు డోసులను ఉచితంగా ఇస్తామన్నారు. ఈ వ్యాక్సిన్ మూడు డోసులు రూ.6 వేలుగా పేర్కొన్నారు. మహేష్‌బాబు ఫౌండేషన్ రూ.40 లక్షల సహకారంతో ఈ క్యాంప్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఈ హెచ్‌పీవీ వ్యాక్సిన్ దోహదపడుతుందని వైద్యులు రామారావు, పద్మ తెలిపారు. -
మహిళా పోలీసుల ఆరోగ్య రక్షణకు వైద్యశిబిరాలు
పెనమలూరు: మహిళా పోలీసుల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు అన్నారు. కానూరు టాప్‌స్టార్ ఆస్పత్రిలో సోమవారం క్యాన్సర్‌పై అవగాహన, మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. మహిళా పోలీసులు పని ఒత్తిడిలో ఉండి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుందన్నారు. మహిళా పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే విధుల నిర్వహణ సక్రమంగా జరుగుతుందని, వారి కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకోని క్యాన్సర్‌పై అవగాహన, ఉచిత వైద్య పరీక్షల శిబిరం ఏర్పాటు చేశామన్నారు. క్యాన్సర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే సులభంగా జయించవచ్చన్నారు. ఎన్టీఆర్ జిల్లా సురక్ష ఫౌండేషన్ కన్వీనర్ కేవీ నరసమయ్య మాట్లాడుతూ.. మహిళా పోలీసులతో పాటు ఇతర సిబ్బంది ఆరోగ్య భద్రతకు మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ.. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను తాను డొనేట్ చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీపీ సరిత, టాప్‌స్టార్ ఎండీ తాతినేని శ్రీనివాస్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
బండెనక బండి కట్టి..
కంచికచర్ల: బడే హజరత్ ఉరుసును ప్రతి ఏడాది ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. మండలంలోని పెండ్యాలతో పాటు ఇతర గ్రామాల నుంచి చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో కొలువై ఉన్న బడే హజరత్ దర్గా ఉరుసుకు తరలివెళ్తుంటారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చి ముస్లింలు బండెనెక బండికట్టి వరసగా ఉత్సవాలకు తరలివెళ్తారు. 400 ఏళ్లుగా ఉత్సవాల నిర్వహణ.. ఉరుసు ఉత్సవాలను మతాలకతీతంగా జరుపుకుంటారు. ముస్లింలు ఉరుసుకు వెళ్లేందుకు హిందువులు ఎద్దుల బండ్లను ఉచితంగా కట్టి వారితో పాటు ఉత్సవాల్లో పాల్గొంటారు. బాపట్ల జిల్లాలోని చీరాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, వినుకొండ, గుంటూరు, కృష్ణాజిల్లాలోని చల్లపల్లి, అవనిగడ్డ, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ, వైరా, మధిర, సూర్యాపేట తదితర ప్రాంతాల నుంచి పెండ్యాల గ్రామానికి చెందిన ముస్లింలకు ఉచితంగా ఎడ్ల బండ్లను కడతారు. ఉరుసు ఉత్సవాల్లో వారు కూడా వచ్చి పాల్గొంటారు. 400 ఏళ్ల నుంచి ముస్లింలు ఈ ఉత్సవాల్లో పాల్గొని అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న పెండ్యాల గ్రామానికి చెందిన ముస్లిం సంతతికి చెందిన వారంతా ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాలు చందర్లపాడు మండలంలోని తోటరావులపాడు గ్రామంలో కొలువై ఉన్న బడేమియా తాతయ్య షాషమియాను ప్రార్థించి అక్కడ నుంచి సాయంత్రానికి తుర్లపాడు చెరువులో ఉన్న బడేమియా హజరత్ దర్గాకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. గ్రామంలో ఇళ్లకు తాళాలు వేసి.. తుర్లపాడులో కొలువై ఉన్న బడే హజరత్ ఉరుసు ఉత్సవాలు ఈ నెల 23, 24 తేదీలలో జరుగనుంది. గ్రామంలో మొత్తం జనాభా 14 వేల మంది ఉన్నారు. వారిలో 12 వేలకు పైగా ముస్లింలు ఉన్నారు. ఊరంతా రెండు రోజుల పాటు తుర్లపాడు వెళ్లేందుకు ఇళ్లకు తాళాలు వేస్తారు. వృద్ధులు నడవలేనివారు ఇళ్లకు కాపలా ఉంటారు. ఉరుసు ఉత్సవాలకు తరలి వెళ్తున్న ఎద్దుల సవారీలను చూసేందుకు పెండ్యాల మునేటి తీరాన ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారు. రేపటి నుంచి తుర్లపాడు ఉరుసు బడే హజరత్ ఉరుసుకు తరలివెళ్లనున్న ముస్లింలు హిందువులు, ముస్లింలు ఐక్యంగా జరుపుకునే తుర్లపాడు పండుగ కులమతాలకతీతంగా ఉరుసు తుర్లపాడు ఉరుసు ఉత్సవాలకు కులమతాలకు అతీతంగా జరుపుకుంటాం. హిందువులు ఎడ్ల బండ్లను ఉచితంగా కడతారు. హిందువులు భక్తి పారవశ్యంతో పాల్గొంటారు. రెండు రోజుల పాటు జరుపుకునే ఉరుసు ఉత్సవాలను ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. – షేక్ మలక్‌బషీర్, ఎంపీపీ, పెండ్యాల -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 20257నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీ ఆర్ఎస్) జరుగుతుందని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 514.80 అడుగుల వద్ద ఉంది. ఇది 139.9642 టీఎంసీలకు సమానం. తిరుపతమ్మకు జేజేలు పెనుగంచిప్రోలు: జైజై తిరుపతమ్మ అంటూ భక్తజనం ఆదివారం పెనుగంచిప్రోలు తిరుపతమ్మకు జేజేలు పలికారు. భక్తులతో క్యూలు కిటకిటలాడాయి. -
టెర్రస్ గార్డెన్ పెంపకంతో ఆరోగ్యకరమైన పంట
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంటి టెర్రస్‌పై కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించాలని, తద్వారా రసాయనాలు లేని ఆరోగ్యకరమైన పంట లభిస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా) చౌదరి అన్నారు. ఆదివారం సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ) ఆధ్వర్యంలో భవానీపురంలోని వాసవి కల్యాణమండపంలో వంటింటి వ్యర్థాలతో సేంద్రియ ఎరువును తయారు చేసుకుని కూరగాయలు పెంచటంపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రతి కుటుంబం తమకు అవసరమైన కూరగాయలను ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువును తయారు చేసుకుని పండించుకోవాలని, తద్వారా ఆరోగ్యమైన జీవితాన్ని పొందవచ్చని తెలిపారు. టెర్రస్ గార్డెనింగ్పై యువత ఆసక్తి పెంచుకోవాలన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన పర్యావరణవేత్త మద్దుకూరి సుబ్బారావు మాట్లాడుతూ కిచెన్‌లో కూరగాయలతో వంట చేసినప్పుడు వచ్చే వ్యర్థాలను బయట పడేయకుండా వాటిని కంపోస్ట్ ఎరువుగా తయారు చేసుకోవచ్చన్నారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా పండే కూరగాయలను తినటం వలన మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. అంతేకాకుండా పర్యావరణాన్ని కాపాడినవారం అవుతామని అన్నారు. సదస్సుకు ఏపీఎఫ్సీసీఐ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు అధ్యక్షత వహించారు. సీటీజీ వ్యవస్థాపకుడు శ్రీనివాస్, విజయవాడ టీమ్ పీవీడీ నాగేశ్వరరావు, గూడవల్లి సురేష్‌బాబు, నర్రా నాగేంద్రప్రసాద్, పద్మజ, జి.పద్మాదేవి పాల్గొన్నారు. -
బడుగుల చదువుకు భరోసా
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో విద్యా సంస్కరణలు అమలు చేసిన ఘనత నాటి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిది. ఆయన పాలన పేద విద్యార్థులకు సువర్ణాక్షరం. ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్ సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ పేదలకు అవకాశం కల్పించడానికి ఆలోచన చేశారు. ఆయన ప్రవేశపెట్టిన విద్యాహక్కు చట్టం ద్వారా ప్రతి ప్రైవేట్ విద్యాసంస్థ మొదటి తరగతిలో 25 శాతం సీట్లు పేదలకు కేటాయించేలా నిర్ణయించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో 2022–23 నుంచి ఈ పథకాన్ని అమలు చేశారు. అదే క్రమంలో ఎన్టీఆర్ జిల్లాలోనూ ఈ పథకాన్ని అమలు చేయడంతో వేలాది మంది పేద కుటుంబాలు లబ్ధి పొందాయి. అధిక శాతం విద్యార్థులకు అందుబాటులో.. విద్యాహక్కు చట్టం సెక్షన్ 12 (1) సీ ద్వారా గడిచిన మూడేళ్లలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 4,056 మంది విద్యార్థులను మొదటి తరగతికి విద్యాశాఖ ఎంపిక చేసింది. వారిని వారి సమీప ప్రాంతాల్లోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుకునే వీలు కల్పించింది. తొలి ఏడాది 2022–2023 విద్యాసంవత్సరంలో 120 మందికి, 2023–2024లో 1,127 మందికి అవకాశం కల్పించింది. 2024–2025 విద్యాసంవత్సరంలో మొదటి ఫేజ్‌లో 990, రెండో ఫేజ్‌లో 397, నాలుగో ఫేజ్‌లో 1422 మందిని ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిలో అధిక శాతం విద్యార్థులు ఆయా విద్యాసంస్థల్లో కొనసాగుతున్నారు. 2025–26 సంవత్సరానికి నోటిఫికేషన్ ఈ విద్యాహక్కు చట్టం –2009 సెక్షన్ 12 (1)సీ అమలులో భాగంగా 2025–2026 విద్యా సంవత్సరానికి ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ సిలబస్ చదువుతున్న పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 28 నుంచి మే 15వ తేదీ వరకూ వివిధ వర్గాల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. విద్యార్థులు ఆధార్ ద్వారా ప్రాథమిక వివరాలతో http://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు అర్హతలు ఇవి ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాల్లో ప్రవేశం కోసం 31.03.2025 నాటికి ఐదేళ్ల వయసు నిండి ఉండాలి. స్టేట్ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశానికి 01.06.2025 నాటికి ఐదేళ్ల వయసు నిండాలి. విద్యా హక్కు చట్టం–2009, సెక్షన్ 12(1) ఇ ప్రకారం, ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పిల్లలకు వారి నివాసానికి ఒక కిలోమీటర్ లేని పక్షంలో రెండు కిలోమీటర్లు తర్వాత మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లను కేటాయించింది. ఎంపిక విధానం ఒకటో తరగతి ప్రవేశాలకు పోర్టల్‌లో నమోదు కోసం ఈ నెల 28 నుంచి మే 15 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తుల్లో విద్యార్థుల అర్హతలను మే 16 నుంచి 20వ తేదీ వరకూ నిర్ధారణ ప్రక్రియను చేపడతారు. లాటరీ ద్వారా మొదటి విడత ఫలితాలను మే 21 నుంచి 24 మధ్య విడుదల చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ జూన్ 2వ తేదీ చేస్తారు. రెండో విడత లాటరీ ఫలితాలను జూన్ 6వ తేదీ విడుదల చేస్తారు. అడ్డుకునేందుకు కార్పొరేట్ సంస్థల యత్నం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. వివిధ రూపాల్లో నాటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు అండగా నిలవాల్సిందేనని సూచించారు. దాంతో కార్పొరేట్ సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. న్యాయస్థానం విద్యాహక్కు చట్టం అమలు చేయాల్సిందేనని తీర్పు ఇవ్వడంతో పాటు కొన్ని సూచనలు చేసింది. దాంతో ఏటా పేద వర్గాలకు కార్పొరేట్ సంస్థల్లో 25 శాతం సీట్లు ఉచితంగా దక్కుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం కింద 25 శాతం ఉచిత సీట్లు పథకాన్ని ప్రవేశపెట్టిన జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ జిల్లాలో గత మూడేళ్లలో 4,056 మందికి అవకాశం 2025–26 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ ఇచ్చిన సమగ్ర శిక్షాభియాన్ అడ్డుకోవాలని చూసినా ముందుకే.. పేదలకు అన్ని విధాలుగా భరోసా ఇచ్చిన నేత జగన్మోహన్రెడ్డి. ఆయన నిరంతరం పేద కుటుంబాలు చదువు కోవాలి.. తద్వారా వారి కుటుంబాలు అభి వృద్ధి చెందాలని భావించారు. అందులో భాగంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే విద్యాహక్కు చట్టం ద్వారా 25 శాతం సీట్లు పేదలకు కేటాయించే దిశగా చర్యలు చేపట్టారు. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూసినా ఆయన ముందుకు సాగారు. –వానపల్లి రవీంద్ర, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగ నేత -
విజయవాడ చిల్ట్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ సంఘం ఎన్నిక
మధురానగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం ఏకగ్రీవమైంది. ముత్యాలంపాడులోని అజయ్ స్కూల్లో ఎన్నిక జరిగింది. 2025–26 సంవత్సరానికి నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా ముదిగొండ శ్రీహరి, కార్యదర్శిగా భీమిశెట్టి గణేష్, కోశాధికారిగా పుప్పాల శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికై న కార్యవర్గ సభ్యులతో సంఘ గౌరవాధ్యక్షుడు దేవినేని కిశోర్‌కుమార్, ఏపుగంటి సాయి కృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. -
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి ఆది దంపతులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ నేపథ్యంలో అంతరాలయ, వీఐపీ దర్శనాలను దేవస్థానం రద్దు చేసింది. దీంతో భక్తులకు త్వరతిగతిన అమ్మవారి దర్శన భాగ్యం లభించింది. పెద్ద ఎత్తున పాల్గొన్న ఉభయ దాతలు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన ఆర్జిత సేవలకు ఆదివారం డిమాండ్ కనిపించింది. తెల్లవారుజామున అమ్మవారికి ప్రధాన ఆలయంలో నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో శ్రీచక్ర నవార్చన, లక్ష కుంకుమార్చన, చండీ హోమం, నవగ్రహ హోమాలలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ ఉభయ దాతలు విశేషంగా పాల్గొన్నారు. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద , 7వ అంతస్తులో మైక్ ప్రచార కేంద్రం వద్ద దేవస్థానం మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. దాతల సహకారంతో ప్రతి రోజు మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. కిటకిటలాడిన క్యూ లైన్లు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి అంతరాలయ దర్శనాలను రద్దు చేశారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు కిటకిటలాడాయి. దీంతో ఆలయ అధికారులు అంతరాలయ దర్శనం రద్దు చేశారు. కౌంటర్లలో టికెట్ల విక్రయాలను పూర్తిగా నిలిపివేశారు. రూ.300, రూ.100 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యేలా క్యూలైన్లను నియంత్రించారు. రూ.300 టికెట్లపై కేటాయించి క్యూలైన్‌తో పాటు అదనంగా బంగారు వాకిలి దర్శనం కల్పించారు. రూ.100 టికెట్ భక్తులకు వారికి కేటాయించిన క్యూతో పాటు అదనంగా మరో క్యూలైన్ కేటాయించడంతో దర్శనం త్వరగా పూర్తయింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు అంతరాలయ దర్శనం పూర్తిగా నిలిపివేశారు. ఆన్లైన్లో ముందుగానే రూ.500 టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం అంతరాలయ దర్శనం కల్పించారు. సూర్యోపాసన సేవ లోక కల్యాణార్ధం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆదివారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాల అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించారు. సేవలో పలువురు భక్తులు, ఉభయదాతలు పాల్గొనగా, వారికి ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. 21న కానుకల లెక్కింపు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడులను సోమవారం లెక్కించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం మహా మండపం ఆరో అంతస్తులో ఉదయం 7–30 గంటల నుంచి కానుకల లెక్కింపు జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. దుర్గ గుడి కౌంటర్లలో సీసీ కెమెరాలు అదనపు వసూళ్లకు చెక్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సెల్‌ఫోన్ భద్రపరుచుకునే కౌంటర్లు, లగేజీ కౌంటర్లలో అదనపు వసూళ్లు, ఉచితంగా ఏర్పాటు చేసిన చెప్పుల స్టాండ్‌లో డబ్బుల వసూళ్లపై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులకు ఆలయ అధికారులు చెక్ పెట్టారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మహా మండపం దిగువన, ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్ వద్ద చెప్పులు, లగేజీ, సెల్‌ఫోన్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. చెప్పుల స్టాండ్‌ను దేవస్థానం ఉచితంగా నిర్వహిస్తుండగా, లగేజీ, సెల్ఫోన్లు కౌంటర్లను కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు. అయితే రద్దీ సమయంలో భక్తుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఇటీవల ఫిర్యాదులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో కౌంటర్లోని సిబ్బంది అదనపు వసూళ్లకు చెక్ పెడుతూ ఆయా కౌంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌లో సిబ్బంది నిరంతరం ఈ కెమెరాలను పర్యవేక్షిస్తూ, కౌంటర్ల వద్ద ఎటువంటి వివాదాలు జరిగినా వెంటనే ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఆర్జిత సేవలకు డిమాండ్ అంతరాలయ దర్శనం రద్దు -
క్రీస్తు పునరుత్థానం..లోకానికి శుభోదయం
గుణదల(విజయవాడ తూర్పు): మానవాళి రక్షణార్ధమై యేసుక్రీస్తు సిలువ మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడని మేరీమాత పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు అన్నారు. గుణదల మాత ప్రధానాలయంలో ఈస్టర్ పండుగ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. పునరుత్థానుడైన యేసు క్రీస్తును ఆరాధించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అనేక ప్రాంతాల నుంచి యాత్రికులు రావడంతో పుణ్యక్షేత్రం సందడిగా మారింది. ఈ సందర్భంగా ఆలయంలో సమష్టి దివ్యబలి పూజ నిర్వహించారు. భక్తులనుద్దేశించి ఫాదర్ జయరాజు మాట్లాడుతూ క్రీస్తు పునరుత్థానం లోకానికి జయమన్నారు. మానవాళిని రక్షించేందుకే యేసుక్రీస్తు సిలువ మరణం పొందారని గుర్తు చేశారు. యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, ఆయన ఆచరించి చూపిన మార్గంలో నడుచుకోవాలన్నారు. ఈస్టర్ పండుగ అందరి జీవితాలలో దీవెనలు నింపాలని ఆశీర్వదించారు. అనంతరం సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులతో పాటు యాత్రికులు కూడా పెద్ద సంఖ్యలో పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు. కాలి నడకన కొండ శిఖరాగ్రం వరకు వెళ్లి క్రీస్తును వేడుకున్నారు. పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల కోసం ఆలయ గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
కిడ్నీ వ్యాధి బారిన పడిన గ్రామాలు
గిరిజనుల గోడు పట్టించుకోండి రక్షిత మంచినీరు లేక, ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉన్న నీరు తాగి కిడ్నీ వ్యాధిబారిన పడిన పడిన ఎ.కొండూరు మండలంలోని గిరిజనుల బాధలను అధికారులు గుర్తించాలి. అవసరమైన వైద్యసేవలు అందించాలి. తండాలకు శుద్ధి చేసిన జలాలు అందించడానికి చర్యలు తీసుకోవాలి. – మేకల డేవిడ్, ఎ.కొండూరు రక్షిత మంచినీటి ప్రాజెక్టులు పూర్తిచేయండి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎ. కొండూరు, గంపలగూడెం మండలాల్లో రక్షిత నీటి సరఫరా పనులు చేపట్టారు. ఈ పనులను ఇంతవరకు కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేదు. కిడ్నీ రోగుల విషయంలో ప్రభుత్వం కాలక్షేపం చేయడం తగదు. అధికారులు చర్యలు తీసుకోవాలి. – నల్లగట్ల స్వామిదాసు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, తిరువూరు పురోగతిలో పనులు కిడ్నీ ప్రభావిత గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాం. రూ.50 కోట్ల వ్యయంతో ఎ.కొండూరు మండలంలోని 38 గ్రామాలకు కృష్ణా నదీ జలాలను సరఫరా చేసే ప్రాజెక్టు పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా నిర్దేశించారు. పనులు పురోగతిలో ఉన్నాయి. – రాఘవేంద్ర, ఆర్డబ్ల్యూఎస్ డీఈ, తిరువూరు ● ‘తిరువూరు’లో రక్షిత నీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం ● కిడ్నీరోగుల గోడు పట్టదా! ● జూన్ ఆఖరుకు పనుల పూర్తికి కలెక్టర్ ఆదేశం ● ఎ.కొండూరులో అరకొరగా ట్యాంకర్లతో నీటి సరఫరా తిరువూరు: తండాల్లో ప్రజలకు శుద్ధ జలం అందక ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీ రోగులకు రక్షిత నీటి సరఫరా చేయడానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే.. ప్రస్తుత కూటమి పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కిడ్నీ రోగులు అత్యధికంగా ఉన్న ప్రాంతం తిరువూరు రెవెన్యూ డివిజన్. ఇక్కడ తండాల్లో కిడ్నీ రోగులకు రక్షిత నీటి సరఫరాకు కావాల్సిన పనులను కూటమి ప్రభుత్వం నత్తనడకన చేస్తోంది. ఎ.కొండూరు మండలంలో 15 తండాల్లో 244 కిడ్నీ కేసులున్నట్లు ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఎ. కొండూరు, గంపలగూడెం మండలాల్లో కిడ్నీ రోగులు అత్యధికంగా ఉన్నారు. మూడు రోజుల క్రితం గంపలగూడెం మండలం గోసవీడులో 14 ఏళ్ల బాలిక మరణిండంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గంపలగూడెంలోని నారికింపాడు, అనుముల్లంక, కనుమూరు, కొత్తపల్లి, వినగడప తండాలలో కిడ్నీ వ్యాధి గ్రస్తుల స్వాంతనకు చర్యలు లేవు. పనులు పూర్తయ్యేదెప్పుడో! గత ఏడాదిగా వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూయస్ శాఖల జిల్లా అధికారులు సమీక్షలు, పరిశీలనలు చేస్తున్నా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు తాగునీరందని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టింది. గతేడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికారులు పట్టించుకోకపోవడంతో గిరిజనులకు బోరు నీరే దిక్కైంది. గత ఫిబ్రవరిలో కలెక్టర్ లక్ష్మీశ ఎ.కొండూరు మండలంలో కృష్ణా జలాల సరఫరాకు చేపట్టిన ప్రాజెక్టు పనులను తనిఖీ చేశారు. అప్పుడు.. ఈ ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేసి అన్ని గ్రామాలకు నీరందించాలని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను ఆదేశించారు. చాలీచాలని నీటితో అవస్థలు రెడ్డిగూడెం మండలం కుదప వద్ద నిర్మించిన రిజర్వాయర్ నుంచి ట్యాంకర్లతో ఎ.కొండూరు మండలంలోని గ్రామాలకు కృష్ణా జలాలను ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నా వారి అవసరాలకు చాలక ఇబ్బంది పడుతున్నారు. గతంలో కృష్ణా జలాల సరఫరా కోసం నిర్మించిన సంప్‌లు నిరుపయోగంగా మిగిలాయి. ఎ.కొండూరు మండలంలోని 38 గ్రామాల్లో పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడినట్లు గ్రామీణ నీటిసరఫరా విభాగం గుర్తించింది. ప్రత్యేకంగా కృష్ణా జలాలను శుద్ధి చేసి ఎ.కొండూరుకు అందించే ప్రాజెక్ట్‌కు సుమారు రూ.49.94 కోట్ల వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం మైలవరంలోని సీపీడబ్ల్యూసీ స్కీం వరకు వస్తున్న కృష్ణా జలాలను కుదపలోని సంప్ వద్దకు తీసుకెళ్లి ట్యాంకర్ల ద్వారా తండాలకు పంపుతున్నారు. రక్షిత నీరు లేక పెరుగుతున్న రోగులు ఫ్లోరైడ్, సిలికాన్ శాతం అధికంగా ఉన్న ‘ఎ.కొండూరు’లోని పలు గ్రామాల్లో బోర్ నీటిని తాగుతున్న గిరిజనుల కిడ్నీలు పాడై ఆస్పత్రుల పాలవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎ.కొండూరు, తిరువూరులో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఎ.కొండూరు మండలంలోని మత్రియా తండా, కేశ్యాతండా, దీప్లా నగర్, మాన్సింగ్తండా, కొండూరు తండా, గొల్లమందల తండా, పెద తండా, వెంకట తండా, కుమ్మరికుంట్ల తండా, గోపాలపురం గ్రామాల్లో కిడ్నీరోగుల సంఖ్య అధికంగా ఉంది. ఈ మండలంలో 413 మంది కిడ్నీ రోగులను ప్రభుత్వం గుర్తించగా, 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. శాశ్వత ప్రాజెక్టు ఏర్పాటు నత్తనడక మండలంలోని గిరిజన తండాలకు కృష్ణా జలాల సరఫరాకు నిర్దేశించిన శాశ్వత ప్రాజెక్టులో భాగంగా కుదప సంప్ వద్ద కొండపైన ఓవర్ హెడ్ రిజర్వాయర్ నిర్మాణంలో ఉంది. పైపులైన్ల పనులు 200 కిలోమీటర్లు చేపట్టాల్సి ఉండగా పనులు త్వరితగతిన పూర్తిచేయాలని రోగులు కోరుతున్నారు. కిడ్నీ బాధితులకు రక్షిత మంచినీరందించడంతో పాటు డయాలసిస్ రోగులకు అవసరమైన వైద్యసేవలు చేయాలని, పెన్షను మంజూరు, పౌష్టికాహారం సరఫరాకు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ఎ.కొండూరు మండలంలోని అన్ని గ్రామాల్లోనూ కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. కోడూరు, మారేపల్లి, పోలిశెట్టిపాడు గ్రామాలకు ఇంతవరకు రక్షిత మంచినీరందించలేదు. ఆ గ్రామాల్లో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్నా ముందు జాగ్రత్తగా కృష్ణా జలాల సరఫరాకు చర్యలు తీసుకోవట్లేదు. శుద్ధిచేసిన జలాల సరఫరాకు పైపులైన్ల నిర్మాణం పూర్తి చేసినా ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం పూర్తవలేదు. -
ఎల్ఈడీ లైట్లతో ప్రమాదం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): నిబంధనలకు నీళ్ళొదిలేస్తున్నారు.. కనీస ఆలోచన లేకుండా.. ఇతరుల ప్రాణాలకు ముప్పు అని తెలిసినా.. ఎల్ఈడీ లైట్ల వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. ద్విచక్ర వాహనాలు మొదలుకుని.. ఆటోలు, లారీలు, ప్రైవేట్ బస్సుల్లో లైట్ల వినియోగం జరుగుతోంది. అయినా పట్టించుకోవాల్సిన రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) అధికారులు మాత్రం మొద్దు నిద్రపోతున్నారు. కొన్నాళ్ళ క్రితం గుంటూరు రూరల్ మండలం అంకిరెడ్డిపాలెం వద్ద ఒక బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. అయితే ప్రమాదానికి కారణం తెలిసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. నేరుగా ఇంజిన్ నుంచి ఎల్ఈడీ లైట్లుకు వైర్లు అనుసంధానం చేయటం ద్వారానే ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఆ ప్రమాదంలో బస్సు దగ్ధమై, ప్రయాణికులు మాత్రం స్వల్ప గాయాలతో బయట పడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాహనాలకు సంబందించి ఎల్ఈడీ లైట్ల వినియోగాన్ని పూర్తిస్థాయిలో నిషేధిస్తూ.. కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకుని వచ్చింది. భారీ ఫోకస్ వచ్చే లైట్లు వినియోగించటం ద్వారా, ఎదురుగా వచ్చే వాహనదారులకు కనపడకపోవటంతో ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు 90శాతం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం కంపెనీల ఫోకస్ లైట్లు ఇచ్చిన వాటి వరకే వినియోగించాలనేది చట్టం. అదనపు ఫిట్టింగ్‌లు చేయకూడదని స్పష్టంగా నిబంధనలు ఉన్నప్పటీకీ.. వాహనదారులు యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారు. వాహనాల చట్టం 1988 (మోటార్ వెహికల్ యాక్ట్) ప్రకారం.. వాహనాల్లో అనుమతించని మార్పుల్లో ఎల్ఈడీ లైట్లు వినియోగం ఒకటి. ఈ చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం వాహనాల నిర్మాణం, ఫీచర్లలో అనుమతి లేకుండా మార్పులు చేయటం చట్ట విరుద్ధం. ఎల్ఈడీ లైట్లు హాలోజెన్ లైట్ల కంటే అధికంగా ప్రకాశిస్తాయి. తద్వారా ఇతర డ్రైవర్లకు గందరగోళం ఏర్పడటంతోపాటు, అంధత్వాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఆర్టీఏ, ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అధికమైన వాట్స్, అన్ అప్రూవ్డ్ లైట్లు నిషేదించిన పరిస్థితులు ఉన్నాయి. కారుల్లో 75 వాట్స్, లారీలకు 100 వాట్స్, బైక్‌లకు 10 వాట్స్ లోపు మాత్రమే లైట్ల వినియోగం ఉండాలి. జైలు శిక్షకు కూడా అవకాశం ఆర్టీఏ రూల్ ప్రకారం ఎల్ఈడీ లైట్లు వినియోగం చేపడితే వాహనాన్ని సీజ్ చేయటంతోపాటు జరిమానా విధించవచ్చు. జరిమానా రూ.1,000 నుంచి రూ.పదివేల వరకు పడే అవకాశం ఉంది. గత కొద్ది కాలం క్రితం బెంగుళూరుతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కేవలం వారం రోజుల వ్యవధిలో 8వేల కేసులు నమోదు చేశారంటే ఎల్ఈడీ లైట్లు వినియోగం పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. లైట్ల వినియోగం ద్వారా ఒకొ సారి జైలు శిక్షకు దారి తీసే అవకాశాలు లేకపోలేదు. ఇష్టానుసారంగా వినియోగం ద్విచక్రవాహనాలు మొదలుకుని భారీ వాహనాల వరకు పట్టించుకోని ఆర్టీఏ శాఖ అధికారులు అడ్డగోలుగా అమ్మకాలు.. మోటార్ వెహికల్ షాపుల్లో ఎల్ఈడీ లైట్ల విక్రయాలు చేపట్టకూడదని నిబంధనలు చెబుతున్నాయి ఆయా వాహనాన్ని బట్టి దాని వినియోగానికి సరిపడా వాట్స్ కంటే అధిక ప్రమాణాలు ఉండకూడదని నిబంధనలు ఉన్నాయి. రోడ్డు మంత్రిత్వ శాఖ (మినిస్టరీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే లైట్లు వినియోగించాలి. అయితే దీనిపై చర్యలు తీసుకునేందుకు ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసులకు అధికారం ఉంది. అయినా కనీసం చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఇటీవల కాలంలో కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు. -
చలసానిపై నిరాధార ఆరోపణలు తగదు
కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గ సభ్యులు హనుమాన్‌జంక్షన్ రూరల్: కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులుపై అజ్ఞాత మహిళ నిరాధారమైన లైంగిక ఆరోపణలు చేయటాన్ని ఖండిస్తున్నామని ఆ యూనియన్ పాలకవర్గ సభ్యులు ఉయ్యూరు అంజిరెడ్డి, బొడ్డు రామచంద్రరావు, పలగాని కొండలరావు, నెక్కలపు వాణిశ్రీ, శనగల వెంకట శివజ్యోతి చెప్పారు. హనుమాన్‌జంక్షన్‌లోని పాలశీతల కేంద్రంలో కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గ సభ్యులు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. అజ్ఞాతంలో ఉంటూ ఆరోపణలు చేయటం సరికాదని, తగిన సాక్ష్యాధారాలతో కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గాన్ని ఆశ్రయించాలని లేదా పోలీసులు, మీడియా ముందుకు రావాలని ఆ మహిళను డిమాండ్ చేశారు. అన్యాయం జరిగినట్లు నిరూపితమైతే యూనియన్ తరఫున చర్యలు తీసుకోక తప్పదని, అంతేకాక చట్టరీత్యా కూడా చర్యలకు ఉపక్రమిస్తామన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ చలసాని ఆంజనేయులు ప్రైవేట్ కంపెనీ కాదని, లక్షా యాభై వేల మంది పాడి రైతుల సంస్థ అని చెప్పారు. కృష్ణా మిల్క్ యూనియన్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా గుర్తు తెలియని మహిళ పదేపదే ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు విడుదల చేయటం తగదన్నారు. -
కార్తికేయుని ఆలయంలో భక్తజన సందడి
మోపిదేవి: శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తులతో క్యూలు సందడిగా మారాయి. అన్నప్రసాదం ప్రాంగణం వద్ద భక్తులు బారులు తీరి కనిపించారు. డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో సూపరిటెండెంట్ బొప్పన సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గోశాల రోడ్డు అభివృద్ధి పనులు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మహా మండపం నుంచి కనకదుర్గనగర్ వరకు ఉన్న గోశాల రోడ్డు అభివృద్ధి పనులకు ఆదివారం దుర్గగుడి ఈవో కె.రామచంద్రమోహన్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహా మండపం ఎదుట ఏర్పాటు చేసిన అమ్మవారి చిత్రపటం వద్ద పూజలు చేసిన తర్వాత పనులను ప్రారంభించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మరిన్ని అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. సకాలంలో రోడ్డు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఈఈ వైకుంఠరావు, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. టేబుల్ టెన్నిస్‌లో షణ్ముఖ్ సత్తా విజయవాడస్పోర్ట్స్: కేంద్రీయ విద్యాలయం రీజనల్ అంతరాష్ట్ర టేబుల్ టెన్నిస్ పోటీల్లో విజయవాడ క్రీడాకారుడు ఆర్.షణ్ముఖ్ సత్తా చాటాడు. ప్రకాశం జిల్లా రాజంపల్లిలో ఇటీవల జరిగిన పోటీల్లో అండర్–17 బాలుర విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 39 కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు తలపడ్డారు. నగరంలోని మధురానగర్ కేంద్రీయ విద్యాలయం–1లో షణ్ముఖ్ పదో తరగతి చదువుతున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీల్లో బంగారు పతకం సాధించిన షణ్ముఖ్‌ను, అతనికి శిక్షణ ఇచ్చిన కోచ్ షేక్ గౌస్‌బాషా, షేక్ అబ్దుల్‌ను ఏపీ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.విశ్వనాథ్, సంయుక్త కార్యదర్శి బి.శ్రీనివాస్ అభినందించారు. సాఫ్ట్‌బాల్ విజేత ఏజీ అండ్ ఎస్జీ జట్టు పెనమలూరు: కృష్ణా యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఏజీ అండ్ ఎస్జీ కాలేజీ విజేతగా నిలిచింది. తాడిగడప మున్సిపాలిటీ పోరంకి కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో ఆదివారం కృష్ణా యూనివర్సిటీ ఇంటర్‌కాలేజీ సాఫ్ట్‌బాల్ పోటీలు జరిగాయి. ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్జీ కాలేజీ ప్రథమ స్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీ, తృతీయ స్థానంలో ఆంధ్ర లయోల కాలేజీ, నాలుగో స్థానంలో ఎస్ఆర్ఆర్ ఆండ్ సీవీఆర్ ప్రభుత్వ కాలేజీ నిలిచాయి. విజేత జట్టుకు రెక్టర్ ప్రొఫెసర్ మండల బసవేశ్వరరావు, టీడీపీ నేత అనుమోలు ప్రభాకరరావు బహుమతీ ప్రదానం చేశారు. టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వినయ్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపాల్ భూలక్ష్మి, సెలక్షన్ కమిటీ సభ్యులు డాక్టర్ ఆర్.రఘురామ్, చంద్రబాబు పాల్గొన్నారు. -
ఘనంగా చెన్నుని పుష్పయాగం
మాచర్ల: మాచర్లలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. అర్చకులు కొండవీటి రాజగోపాలాచార్యులు, ఈఓ ఎం పూర్ణచంద్రరావు, జేఏ వీరారెడ్డి, గౌరవాధ్యక్షులు పోలిశెట్టి చంద్రశేఖరరావు, పందిరి సాంబశివరావు, షరాబు వెంకటరత్నం, గజవెల్లి కిషోర్, కంభంపాటి అనిల్‌కుమార్, సూరె యలమంద, తిరివీధి వెంకట నాగేశ్వరరావు, కంభంపాటి వెంకటరమణలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారి పుష్పయాగం మండపంలో జరిపారు. ఈ ఉత్సవాన్ని చూసిన భక్తులు జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ అంటూ నామస్మరణ చేశారు. ఆరోగ్యం పౌరుడి ప్రాథమిక హక్కుగా మారాలి డాక్టర్ పీవీ రమేష్ కృష్ణలంక (విజయవాడ తూర్పు): ఆరోగ్యం పౌరుడి ప్రాథమిక హక్కుగా మారాలని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ అన్నారు. విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ప్రజారోగ్య వేదిక, జన విజ్ఞాన వేదిక, ఎంబీ విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ఆరోగ్య రంగం – మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ – ఆరోగ్య బడ్జెట్ విశ్లేషణ’ అంశాలపై ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవీ రమణయ్య అధ్యక్షతన ఆదివారం రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో వర్చువల్‌గా రమేష్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలన్నారు. ప్రముఖ బడ్జెట్ విశ్లేషకుడు డాక్టర్ డేవిడ్ సుధాకర్ మాట్లాడుతూ ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు జీడీపీలో కనీసం ఆరు శాతం ఉండాలని, అయితే 1.9 శాతానికి మించడం లేదన్నారు. ప్రఖ్యాత వైద్యుడు, ఐఎంఏ మాజీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి.సమరం తదితరులు సదస్సులో పాల్గొన్నారు. అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి పెదవడ్లపూడి(మంగళగిరి) : ప్రేమించుకున్న జర్మనీ అబ్బాయి ఆంధ్రా అమ్మాయి ఇరు కుటుంబాల అంగీకారంతో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరికి సమీపంలోని పెదవడ్లపూడిలో వైభవంగా హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. పెదవడ్లపూడికి చెందిన సుందర్శనం రవికుమార్, లక్ష్మీ దంపతుల కుమార్తె మౌనిక జర్మనీలో పీహెచ్డీ చేస్తూ ఉద్యోగం చేస్తుంది. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న జర్మనీకి చెందిన ఫాబియన్ డువెన్ బేక్‌తో పరిచయమై అది ప్రేమగా మారింది. దీంతో ఇరువురూ తమ ఇళ్ళల్లో తల్లితండ్రులకు తెలియజేసి అందరి అంగీకారంతో పెదవడ్లపూడి సాయిబాబా ఆలయంలో వైభవంగా వివాహం చేసుకున్నారు. -
జాతి వైరం మరిచి.. స్నేహం చిగురించి..
కుక్క, పిల్లి మధ్య సహజంగానే జాతి వైరం ఉంటుంది. పిల్లి కనిపించిందంటే కుక్క ఒక్క ఉదుటున దాడి చేస్తుంది. కుక్క కనిపిస్తే పిల్లి వెంటనే తన దారి మార్చుకుంటుంది. అయితే విజయవాడ ఏలూరు రోడ్డు సమీపంలో ఓ కుక్క, పిల్లి మధ్య స్నేహం చిగురించింది. రెండూ ఆడుకుంటూ, సరదాగా ఆట పట్టించుకుంటూ సందడి చేస్తున్నాయి. స్థానికులు వాటి సరదా చేష్టలు చూసి ముచ్చట పడుతున్నారు. ఆదివారం కుక్క, పిల్లి ఆడుకుంటూ ఇలా ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
కొలికపూడికి మరో షాక్.. తిరువూరులో రెండుగా చీలిన టీడీపీ
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరులో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ను పూర్తిగా పక్కన పెట్టేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పోటాపోటీగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తన నివాసం వద్ద చంద్రబాబు బర్త్ డే వేడుకలను కొలికపూడి శ్రీనివాస్ ఏర్పాటు చేయగా, ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఛైర్మన్ శావల దేవదత్ ఫ్యాక్టరీ సెంటర్లో ఈ వేడుకల నిర్వహించారు.అయితే, ఎమ్మెల్యే కొలికపూడి నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు దూరంగా ఉన్నారు. శావల దేవదత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి తిరువూరు నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.కాగా, ఇటీవల ఎమ్మెల్యే కొలికపూడిని చంద్రబాబు.. ఘోరంగా అవమానించిన సంగతి తెలిసిందే. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి రోజునే కొలికపూడికి అవమానం జరగడం గమనార్హం. చంద్రబాబుకు తాను నమస్కారం పెట్టి పలకరించినా అదేమీ బాబు పట్టించుకోలేదు.. కొలికపూడికి కరచాలనం కూడా చేయకుండానే వెళ్లిపోయారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్లలో పర్యటనకు వచ్చారు.ముప్పాళ్లలో హెలికాప్టర్ దిగిన చంద్రబాబు.. అక్కడున్న టీడీపీ నేతలను పలికరిస్తూ కరచాలనం చేస్తూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి కూడా చంద్రబాబుకు నమస్కరించారు.. ఆయన్ను చూసిన బాబు ముఖంలో సీరియస్‌నెస్ కనిపించింది. దీంతో, కొలికపూడిని పట్టించుకోకుండా.. చూసీచూడనట్టుగా బాబు ముందుకు సాగారు. -
ఉత్సాహంగా రన్ ఫర్ జీసస్
లబ్బీపేట(విజయవాడతూర్పు): క్రీస్తు సందేశం సమస్త మానవాళికి శాంతి సందేశం కావాలని విజయవాడ కేథలిక్ డయోసిస్ బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, సీఎస్ఐ కృష్ణా, గోదావరి డయోసిస్ బిషప్ టి. జార్జికొర్నేలియస్ పిలుపునిచ్చారు. ఈస్టర్ (పాస్కా) సందర్భంగా ఏపీ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చిలు, నగరంలోని అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శనివారం రన్ ఫర్ జీసస్ నిర్వహించారు. పటమటలోని సెయింట్ పాల్స్ చర్చి వద్ద బిషప్‌లు జోసఫ్ రాజారావు, కొర్నేలియస్, మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్‌లు పునరుత్థానుడైన క్రీస్తును స్వాగతిస్తూ కాగడాలు వెలిగించి ఆనందోత్సాహాల మధ్య రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిషప్‌లు రాజారావు, కొర్నేలియస్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాన్ని క్రైస్తవులు ఎంతో భక్తి విశ్వాసాలతో జరుకుంటున్నారని చెప్పారు. ఫాదర్ మువ్వల ప్రసాద్, ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్ పాస్టర్ ఎస్. జయకుమార్ బాబు మాట్లాడుతూ రన్ ఫర్ జీసెస్ తెలుగు రాష్ట్రాల్లో దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సెయింట్ పాల్స్ కథెడ్రల్ చర్చి నుంచి ప్రారంభమైన ర్యాలీ సెయింట్ పాల్స్ బసిలికా సీయస్ఐ చర్చి ప్రాంగణానికి చేరుకొంది. రన్ ఫర్ జీసెస్ స్టేట్ కో–ఆర్డినేటర్ శివాజిరాజు అల్లూరి విశ్వప్రసాద్, ప్రవీణ్, కరుణానిధి, మాజీ డెప్యూటీ మేయర్ ఎస్. గ్రిటన్ తదితరులు పాల్గొన్నారు. -
అద్భుతం.. హంసలదీవి సాగరతీరం
కుటుంబసభ్యులతో కలిసి తీరంలో సేదతీరిన జేసీ గీతాంజలి శర్మ కోడూరు: ప్రకృతి రమణీయ దృశ్యాలకు నెలవైన హంసలదీవి సాగరతీరం అద్భుతంగా ఉందని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. కుటుంబసభ్యులతో కలిసి జేసీ సాగరతీరాన్ని శనివారం వేకువజామున సందర్శించారు. పాలకాయతిప్ప శింకు నుంచి పవిత్ర కృష్ణా, సాగర సంగమం వరకు పడవ ప్రయాణం చేసి ప్రకృతి అందాలను తిలకించారు. మడచెట్ల వివరాలను అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాగర సంగమ విశిష్టతను రెవెన్యూ అధికారులు జేసీకి వివరించారు. అక్కడ కొంతసేపు సేదతీరి పాలకాయతిప్ప బీచ్‌లో పర్యటించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాబేళ్ల సంతానోత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కేంద్రంలో ఉత్పత్తి అయిన తాబేళ్ల పిల్లలను కుటుంబ సభ్యులతో కలిసి జేసీ సముద్ర బాట పట్టించారు. తాబేళ్ల పిల్లలు సముద్రం వైపు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్తున్న దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో ఉన్న వివిధ రకాల జీవరాశుల నమునాలను ఆసక్తిగా తిలకించారు. మైరెన్ ఎస్ఐ పూర్ణమాధురి, రెవెన్యూ, అటవీ, పంచాయతీరాజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పెద ఓగిరాలలో భారీ చోరీ
ఉయ్యూరు రూరల్: మండలంలోని పెద ఓగిరాలలో శనివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. ఇంటి యజమాని నిద్రిస్తున్న క్రమంలో చోరీ జరిగినట్లుగా కంకిపాడు సీఐ మురళీకష్ణ తెలిపారు. గ్రామానికి చెందిన మా రెడ్డి మాధవి ఒంటిరిగా ఉంటుంది. భర్త వ్యాపారం రీత్యా గుంటూరులో ఉంటారు. కుమారుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. మాధవి ఒక్కరే ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో దుండగులు వెనుక తలుపుకున్న తాళం వద్ద గొళ్లాన్ని విరగ్గొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.15 లక్షల నగదుతో పాటు కొంత బంగారాన్ని దొంగిలించినట్లు తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో పరిశీలించారు. గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు ఘటన స్థలాన్ని సందర్శించి బాధితురాల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ బాబు తెలిపారు. బైక్ చోరీ.... భారీ చోరీ జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే ఇంటి బయట నిలిపి ఉంచిన ఓ బైకును సైతం దొంగలు అపహరించారు. ప్రతిరోజు ఇంటి లోపల భద్రపరచుకునే వాహన యజమాని శుక్రవారం రాత్రి బయటనే పార్కింగ్ చేసి ఉంచడంతో దుండగులు ఆ బైకును సైతం దొంగిలించారు. -
కారు ఢీకొని ఇద్దరు దుర్మరణం
బంటుమిల్లి: మండల పరిధిలోని నారాయణపురం గ్రామ శివారులో 216 జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు టీవీ మెకానిక్‌లు దుర్మరణం చెందారు. ఎస్ఐ గణేష్‌కుమార్ కథనం మేరకు... మచిలీపట్నం పట్టణానికి చెందిన వాసాబత్తుల వీరాచారి (40), అనకాపల్లి శివప్రసాదు (40) ద్విచక్రవాహనంపై రాజమండ్రి వెళ్లి పనులు పూర్తి చేసుకుని మచిలీపట్నం తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం 6 గంటల సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగం పేరుతో రూ. 22 లక్షలు స్వాహా పెనమలూరు: ఉద్యోగం పేరుతో మహిళ వద్ద రూ. 22 లక్షల సొమ్ము సైబర్ నేరగాళ్లు స్వాహా చేసిన ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. తాడిగడప గ్రామానికి చెందిన నూకల విజయశ్రీ ఉద్యోగం కోసం ప్రయత్నాల్లో ఉంది. ఆమె ఆన్లైన్లో రెంట్కామ్ అనే వెబ్సైట్లో చాట్ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెతో చాటింగ్ చేసి గ్రూప్‌లో చేర్చారు. ఆన్లైన్లో ఆమెకు టాస్కు ఇవ్వగా సకాలంలో పూర్తి చేసింది. దీంతో సైబర్ నేరగాళ్లు సొమ్ము పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని విజయశ్రీకి ఆశ చూపి నమ్మించారు. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ఈ నెల 5 నుంచి 7వ తేదీల్లో విజయశ్రీ పలు దఫాలుగా రూ. 22,09,857 ఆన్లైన్లో సొమ్ము ట్రాన్స్ఫర్ చేసింది. సొమ్ము బదిలీ అయిన తర్వాత గ్రూప్‌లో ఉన్న వ్యక్తులు స్పందించడం మానేశారు. దీంతో తాను మోసపోయానని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య మంగొల్లు(వత్సవాయి): ఫ్యాన్‌కు ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఏలూరి నరసింహారావు, స్వాతి దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె అయిన ఏలూరి రాజ (14) జగ్గయ్యపేటలోని ఒక ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. తల్లి స్వాతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. కారు దూసుకెళ్లి మహిళ మృతి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రోడ్డు పక్కన బుట్టలు అల్లుకునే వారిపై కారు దూసుకెళ్లిన ఘటన భవానీపురం పోలీసు స్టేషన్ పరిఽధిలోని గుప్తా సెంటర్ చోటుచేసుకుంది. విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్‌కు చెందిన పిల్లి యశోద కుటుంబం గుప్తాసెంటర్లోని షాదీఖానా రోడ్డు పక్కన బుట్టలు అల్లుకుంటూ జీవనం సాగిస్తోంది. శనివారం యశోద, ఆమె మామ లక్ష్మయ్య, అత్త పిల్ల రాములమ్మ, ఆడపడుచు దుర్గా రోడ్డు పక్కన కూర్చుని బుట్టలు అల్లుకుంటున్న సమయంలో కుమ్మరిపాలెం వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. కారు రాములమ్మ (50) పైకి ఎక్కింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపుమడుగులో పడి ఉన్న ఆమెను భవానీపురంలోని ఓ హాస్పిటల్లో చేర్చించారు. వైద్యులు పరీక్షించి ఆమె మృతి చెందినట్లు చెప్పారు. ఈ ఘటనపై మృతిరాలి కోడలు యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయండి
మధురానగర్(విజయవాడసెంట్రల్): హనుమజ్జయంతిని పురస్కరించుకుని హిందూ సమాజానికి ధైర్య సాహసాలను ఇచ్చే హనుమాన్ శోభాయాత్ర (బైక్ ర్యాలీ)ను విజయవంతం చేయాలని శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. వచ్చేనెల 22న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగబోయే శోభాయాత్ర స్టిక్కర్, పోస్టర్ విడుదల కార్యక్రమం మాచవరం దాసాంజనేయస్వామి దేవాలయంలో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా శివస్వామి పాల్గొని వీహెచ్‌పీ కేంద్రీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, వీహెచ్‌పీ ప్రాంత కోశాధికారి దుర్గాప్రసాద్ రాజు, వీహెచ్‌పీ విజయవాడ మహానగర్ అధ్యక్షులు సానా శ్రీనివాస్‌తో కలిసి బైక్ స్టిక్కర్, వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు. -
స్వచ్ఛాంధ్రతో పరిశుభ్రంగా గ్రామాలు
మైలవరం: స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి లావణ్యకుమారి తెలిపారు. మైలవరం ఎస్వీఎస్ కల్యాణ మండపంలో గ్రామ పంచాయతీ, వెలుగు కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విచ్చల విడిగా ప్లాస్టిక్ వస్తువులు వినియోగించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని చెప్పారు. క్యారీ బ్యాగులు ఎక్కడబడితే అక్కడ పడేయడంతో భూమి ఉపరితలంలో పేరుకుపోతున్నాయని తెలిపారు. దీంతో వర్షపు నీటిని భూమి పీల్చుకోలేకపోతుందని పేర్కొన్నారు. వాడిన ప్లాస్టిక్ వస్తువులను పంచాయతీ పారిశుద్ధ్య వాహనం వచ్చినపుడు అప్పగిస్తే వాటిని దూరంగా డంప్ చేస్తారని వెల్లడించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంచకుని ఆరోగ్యవంతమైన గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. రోగం వచ్చాక మందులు వాడేకన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మేలన్నారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతి బాబు మాట్లాడుతూ ఇళ్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. పంచాయతీ కార్మికులను సత్కరించారు. తహసీల్దారు అబ్దుల్ ధారియా, సర్పంచ్ మంజుభార్గవి, తదితరులు పాల్గొన్నారు. మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ వేస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అప్పారావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ బి. శివహరిప్రసాద్, ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.జిల్లా పంచాయతీ అధికారి లావణ్యకుమారి -
కారు పల్టీకొట్టి నలుగురికి తీవ్ర గాయాలు
నున్న(విజయవాడరూరల్): వెస్ట్ బైపాస్ జాతీయ రహదారి నున్న గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలకు గాయాలైన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న కారు విజయవాడ వెస్ట్ నేషనల్ బైపాస్ రోడ్డులో నున్న స్లిప్‌వే వద్దకు వచ్చేసరికి కంట్రోల్ తప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంటు దిమ్మను వేగంగా ఢీ కొట్టింది. కారు పల్టీకొట్టగా డ్రైవింగ్ చేస్తున్న పాము కాసుబాబు లోపల ఇరుక్కు పోయాడు. ఆయన భార్య శిరీషకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు మగ పిల్లలకు గాయాలు కాగా ఒక బాబుకి కుడి కాలు విరిగింది. హైవేపై వెళుతున్న ప్రయాణికులు,సెక్యూర్టీ సిబ్బంది హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి వెళ్లి కారులో ఇరుక్కుపోయిన వారిని బటయకు తీశారు. నేషనల్ హైవే అంబులెన్స్‌లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాకినాడకు చెందిన పాము కాసుబాబు హైదరాబాద్ రెడ్డీస్ ల్యాబ్‌లో ఐటీ మేనేజర్ గా పని చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో ఇద్దరు పిల్లలు భార్యతో కలిసి కారులో కాకినాడు వెళుతున్నారు. నేషనల్ హైవే పక్కన టవర్ నిర్మాణం పనులు నిమిత్తం రోడ్డుపై పనులు పూర్తి కాలేదు. రోడ్డు సగభాగంలో రబ్బీష్ కుప్పలు పోసి సింగిల్‌వే మూసివేసి ఉండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న నున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తతో పాటు ఇద్దరు పిల్లలకు గాయాలు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతుండగా ఘటన -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ఇచ్చేవి గోరంత.. ప్రచారం కొండంత–4లోuప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ విమానాశ్రయం(గన్నవరం): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా మే రెండో తేదీన గన్నవరం విమానాశ్రయానికి విచ్చేస్తున్న సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. ప్రధాన మంత్రి పర్యటన నేపథ్యంలో విమానాశ్రయంలో ఎస్పీ ఆర్.గంగాధరరావు, జేసీ గీతాంజలిశర్మతో కలిసి కలెక్టర్ పలు శాఖల జిల్లా అధికారులతో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరావతి రాజ ధాని పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు పీఎం విచ్చేస్తున్నట్లు తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రధానితో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎయిర్‌పోర్ట్‌కు వస్తారని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందో బస్తు ఏర్పాటు చేయాలన్నారు. అదే సమయంలో సాధారణ ప్రయాణికులకు ఎటువంటి ఆటంకం కలుగ కుండా ముందుగానే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునేలా సమాచారం అందించాలని సూచించారు. జి.కొండూరు: మాటలు కోటలు దాటుతున్నాయి గానీ.. చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదన్నట్లు తయారైంది కూటమి ప్రభుత్వ తీరు. పేద ప్రజలకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ప్రభుత్వం అందిస్తోన్న కార్పొరేషన్ రుణాల మంజూరులో ప్రభుత్వం కేటాయించిన యూనిట్లకు, వచ్చిన దరఖాస్తులకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. యూనిట్ల కేటాయింపు వందల్లో ఉంటే దరఖాస్తులు మాత్రం వేలల్లో వచ్చాయి. సిఫార్సు లేనిదే రుణాల మంజూరు కష్టమని ప్రచారం జరగడంతో ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు కూడా ముప్పై శాతానికి పైగా దరఖాస్తుదారులు వెనకాడారు. యూనిట్ల కేటాయింపులో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి మరిన్ని యూనిట్లను కేటాయిస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని దరఖాస్తుదారులు ఆశిస్తున్నారు. కేటాయింపులు అంతంతమాత్రమే.. అన్ని సామాజిక వర్గాల్లో నిరుపేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా రాయితీపై అందించే వ్యక్తిగత రుణాల కేటాయింపు అంతంమాత్రంగానే ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లకు రుణాల మంజూరు కోసం 2,335యూనిట్లను ప్రభుత్వం కేటాయించగా 34,767మంది దరఖాస్తులు చేశారు. వీరికి యాభైశాతం ప్రభుత్వం రాయితీపై యూనిట్ కాస్ట్ ఆధారంగా రుణాలను మంజూరు చేస్తారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు 990యూనిట్లను ప్రభు త్వం టార్గెట్‌గా కేటాయించగా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఎస్సీ రుణాలకు ప్రభుత్వ రాయితీ 40శాతం నుంచి ప్రారంభమై ఎంచుకున్న యూనిట్ ఆధారంగా రాయితీని అందిస్తారు. సిఫార్సులు ఉంటేనే రుణాలు.. కార్పొరేషన్ రుణాల కోసం ముందస్తుగానే కూటమి నాయకులు తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు జాబితాను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంటర్వ్యూల అనంతరం మండల స్థాయి కూటమి నాయకులు తయారు చేసి ఇచ్చిన జాబితానే మండల పరిషత్ అధికారుల లాగిన్ నుంచి బ్యాంకర్లకు పంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నిరుపేద మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల పేరుతో నగదు బదిలీకి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా అన్ని సామాజిక వర్గాలలో 45–60 ఏళ్ల మధ్య వయస్సుగల మహిళలకి ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ ఆర్థిక సాయం తిరిగి చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా గ్రామ వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులను గుర్తించి పథకాన్ని అమలు చేశారు. ఈ పథకాలతో పాటు మరికొన్ని నగదు బదిలీ పథకాల ద్వారా లబ్ధి పొందిన ఎన్నో కుటుంబాలు కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదిగారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రాయితీపై అందించే వ్యక్తిగత రుణాలకు కూడా టార్గెట్లు పెట్టడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా అయితే కూటమి అనుకూలస్తులే లబ్ధి పొందుతారు తప్ప అసలైన పేద కుటుంబాలకు మేలు జరగదని దరఖాస్తుదారులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పారదర్శకత పాటించాలి.. కార్పొరేషన్ రుణాల మంజూరులో పారదర్శకత పాటించాలి. ఇంటర్వ్యూలలో ఎంపిక చేసిన దరఖాస్తుదారుల జాబి తా నుంచి డ్రా పద్ధతిలో ఎంపిక చేస్తే న్యాయం జరుగుతుంది. వేలల్లో దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో రుణాల మంజూరు టార్గెట్‌ను పెంచాలి. – పొన్నం శ్రీనివాసరావు, రజక సంఘం నాయకుడు, జి.కొండూరు గ్రామం టార్గెట్లు వద్దు.. కార్పొరేషన్ రుణాలకు పరిమితి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ మంజూరు చేయాలి. దరఖాస్తు చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూల అనంతరం తుదిజాబితా నుంచి డ్రా పద్ధతిలో ఎంపిక చేయాలి. పారదర్శకత పాటించకపోతే అసలైన పేదలకు న్యాయం జరగదు. – పులిపాక ప్రకాశ్, జనసేన నాయకుడు, జి.కొండూరు ●అన్యాయం జరుగుతోంది.. మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లు విడివిడిగా ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ పేరుతో ఉమ్మడిగా రుణాలను మంజూరు చేయడం వల్ల అధిక జనాభా ఉన్న వర్గానికి సంక్షేమ రంగంలో అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి కార్పొరేషన్ల వారీగా పరిమితి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలను అందించాలి. – మందా నాగమల్లేశ్వరరావు, ఏపీ ఎంఆర్ పీఎస్ అమరావతి అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం 3న్యూస్‌రీల్ ఎన్టీఆర్ జిల్లాలో రుణాల మంజూరు టార్గెట్ 2,335 యూనిట్లు మాత్రమే వచ్చిన దరఖాస్తులు 34,767 అర్హత, పారదర్శకతకు తావే లేదు సిఫార్సులకే అవకాశమంటూ ప్రచారం యూనిట్లు పెంచాలని విన్నవిస్తున్న దరఖాస్తుదారులుఎన్టీఆర్ జిల్లాలో వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాల టార్గెట్, దరఖాస్తుల వివరాలు.. కార్పొరేషన్ రుణాల దరఖాస్తులు టార్గెట్బీసీ 1,466 23,975 కాపు 508 6,840 ఈడబ్ల్యుఎస్ 361 3,952 ఎస్సీ 990 (ప్రక్రియ కొనసాగుతోంది) -
‘అద్దె గర్భం’ అనుమతులపై సమీక్ష
లబ్బీపేట(విజయవాడతూర్పు): సహాయక పునరుత్పత్తి సాంకేతికత(ఏఆర్టీ), అద్దె గర్భం(సరోగసి) చట్టం–2021 అమలులో భాగంగా జిల్లా మెడికల్ బోర్డు శనివారం సమావేశమైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దె గర్భం సేవలు పొందడానికి దరఖాస్తు చేసుకున్న ఏడుగురు దంపతుల అప్లికేషన్లను పరిశీలించారు. వారు అర్హత కలిగి ఉన్నారో లేదో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. వాటిని అమలు చేస్తే అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశంలో ఎన్హెచ్ఎం కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ నవీన్, జీజీహెచ్ ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ కేశవచంద్ర, పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పి. అనిల్‌కుమార్, డాక్టర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటిన డీఎంహెచ్ఓ.. ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్రా– స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తమ సిబ్బందితో కలిసి కార్యాలయం పరిధిలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డెప్యూటీ డెమో ప్రభాకరరెడ్డి, సత్యనారాయణ, కార్తీక్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికీ సురక్షిత తాగునీరు నందిగామరూరల్: ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల సురక్షిత తాగునీటిని అందించడమే జల్ జీవన్ మిషన్ లక్ష్యమని కేంద్ర జల్ జీవన్ మిషన్ వెరిఫికేషన్ బృంద సభ్యుడు హరిపాల్‌సింగ్ అన్నారు. మండలంలోని పెద్దవరం, పాతబెల్లంకొండవారిపాలెం, లింగాలపాడు, అడవిరావులపాడు, తక్కెళ్లపాడు గ్రామాల్లోని జల్ జీవన్, ప్రజల తాగునీటికి సంబంధించిన పనులను శనివారం ఆయన పరిశీలించారు. లింగాలపాడు, అడవిరావులపాడు గ్రామాలలో కొందరు జల్ జీవన్ మిషన్ పనులలో అవకతవకలు జరిగాయని ఆరోపించగా.. స్పందించిన బృంద సభ్యుడు పనులు పూర్తి స్థాయిలో జరగలేదని ఇంకా జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం ఆయా గ్రామాలలో ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటికి పరీక్షలు నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈ విద్యాసాగర్, ఏఈ రవికుమార్, తేజ, సర్పంచ్‌లు సూరా వెంకట నర్సమ్మ, బొల్లినేని పద్మజ పాల్గొన్నారు. నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపుపై హర్షంకూచిపూడి(మొవ్వ): యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో నాట్య శాస్త్రాన్ని ప్రత్యేకంగా నమోదు చేశారని కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించటంతో ప్రముఖ కూచిపూడి నాట్య క్షేత్రం కూచిపూడిలో కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాపీఠంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు, నాట్య విద్యార్థులు కలిసి నటరాజ స్వామికి శనివారం పూలమాలవేసి ఆనందోత్సాహాలతో స్వీట్లు పంచుకొన్నారు. జాతీయ ఖోఖో పోటీలకు గుడివాడ విద్యార్థులుగుడివాడ టౌన్: ఖేలో ఇండియా జూనియర్ ఖోఖో జాతీయ స్థాయి పోటీలకు గుడివాడ ఎస్పీఎస్ మునిసిపల్ హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారని వ్యాయామ ఉపాధ్యాయుడు మడకా ప్రసాద్ శనివారం తెలిపారు. పాఠశాలకు చెందిన డి.రాకేష్, టి.తిమోతి, సాజిత్‌ఖాన్, బి.జయ సూర్యతేజ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. మే నాలుగు నుంచి 11వ తేదీ వరకు బిహార్ రాష్ట్రంలోని గయ పట్టణంలో జరిగే జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు తమ విద్యార్థులు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. -
అన్ని వర్గాలనూ మోసం చేసిన కూటమి
లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పది నెలల పాలనలోనే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వక విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యకర్గ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షుల పదవీ బాధ్యతల స్వీకారోత్సవం శనివారం విజయవాడలోని ఓ ఫంక్షన్ హాలులో ఘనంగా జరిగింది. పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఎప్పుడు మంచి చేయాలని ఆలోచన చేసే వారన్నారు. వైద్య రంగాన్ని మెరుగు పరిచి పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా చూశారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేస్తున్నట్లు ఆరోపించారు. వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తోందని, ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్దాం.. కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్దామని కార్యకర్తలు, నాయకులకు వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని, గతంలో వైఎస్సార్ సీపీ రైతులకు అండగా నిలిచి, గిట్టుబాటు ధర కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. పేదలకు మేలు చేసేందుకు అందించిన సంక్షేమ పథకాలను కూటమి అటకెక్కించిందన్నారు. నిత్యం వైఎస్సార్ సీపీపై అస త్య ప్రచారాలు చేస్తూ, తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. సంపద సృష్టి పేరుతో అందరినీ మభ్యపెడుతోందన్నారు. కార్యకర్తకు పెద్దపీట.. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ పెద్దపీట వేస్తుందన్నారు. కార్యకర్తలందరూ క్రమశిక్షణతో పనిచేయాలని, కష్టపడిన ప్రతి ఒక్కరికీ పదవులు వస్తాయన్నారు. మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహనరావు, నల్లగట్ల స్వామిదాసు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, ఎండీ రూహుల్లా, జగ్గయ్యపేట పార్టీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజరెడ్డి, బెల్లం దుర్గతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సంక్షేమం లేదు.. అంతా క్షామమే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం రాజ్యసభ సభ్యుడు, కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి -
ఈ–వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు
పటమట(విజయవాడతూర్పు): ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ– వేస్ట్) వల్ల తీవ్ర అనర్థాలు పొంచి ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఈ–వ్యర్థాల సేకరణను ఉద్యమంగా చేపట్టి, వాటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా విలువైన లోహాల వృథాలను అరికట్టడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో భాగస్వాములు కావాలని కోరారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వీఎంసీ ఆధ్వర్యంలో శనివారం బెంజిసర్కిల్ సమీపంలోని నారా చంద్రబాబు కాలనీలో ఈ–వ్యర్థాల ప్రత్యేక నిర్వహణ (స్పెషల్ డ్రైవ్) కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ నెలలో ఈ–వ్యర్థాల సేకరణ ప్రత్యేక డ్రైవ్‌గా చేపట్టినట్లు తెలిపారు. నగరంలో నిత్యం 700 కిలోల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉండే లెడ్, కాడ్మియం, మెర్క్యురీ, బెరీలియం వంటి మూలకాలు అతి ప్రమాదకరమైనవని, వాటిని బహిరంగ ప్రదేశాల్లో పడేస్తే భూమి, నీరు, గాలి కలుషితం అవుతాయని, ఫలితంగా ప్రజలు రోగాలబారిన పడతారని వివరించారు. అనంతరం స్థానికుల నుంచి ఈ–వ్యర్థాలను సేకరించారు. వీఎంసీ అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ జోనల్ కమిషనర్ కె.షమ్మీ, ఇన్చార్జి చీఫ్ మెడికల్ ఆఫీసర్ గోపాలకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కట్టు కథలు.. తప్పుడు ప్రచారాలు.. కూటమి సర్కార్‌పై మిథున్‌రెడ్డి ఫైర్
సాక్షి, విజయవాడ: కూటమి సర్కార్ వచ్చాక తమపై కక్ష సాధింపులకు దిగుతున్నారని.. కట్టు కథలు అల్లి తప్పుడు ప్రచారాలకు తెగబడుతున్నారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ తమ ప్రతిష్టను దిగజారుస్తున్నారని.. తమ సొంత భూములను అటవీ భూములు అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీ మిథున్‌రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బెయిల్ పిటిషన్ కోర్టు పరిధిలో ఉందని.. అందుకే మద్యం కేసు గురించి తాను పూర్తిగా మాట్లాడలేనని తెలిపారు. మద్యం కేసు కూడా రాజకీయ వేధింపుల్లో భాగంగా పెట్టిన కేసు మాత్రమే. నాపై పెట్టడానికి డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి’’ అని మిథున్‌రెడ్డి వ్యాఖ్యానించారు.‘‘మద్యం కేసు తప్పుడు కేసు అని చెప్పగలను. ఈ కేసును ధైర్యంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానంలో కేసు గురించి తేలిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ అంశంపై వివరంగా మాట్లాడతాను’’ అని మిథున్‌రెడ్డి చెప్పారు. -
అధికారంలో ఉన్నప్పుడు విజయసాయే చక్రం తిప్పింది
విజయవాడ, సాక్షి: లిక్కర్ కేసు విచారణ సందర్భంగా రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వైఎస్సార్సీపీ కోటరీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ పడింది. అసలు అలాంటి కోటరీ ఒకటి ఉందో లేదో ఆయనకే తెలియాలి అంటూ వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజయసాయికి చురకలు అంటించారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదోరకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారు. ఆయన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయనే కదా ప్రధానంగా చక్రం తిప్పింది. అలాంటప్పుడు పార్టీలో కోటరీ ఉందో? లేదో?.. కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా?. ఇప్పుడేమో నెంబర్ 2 నుంచి 2 వేల స్థానానికి పడిపోయానని ఆయనే చెప్పుకుంటున్నాడు. .. మేం అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు. మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎప్పుడూ లేదు.. రాబోయే రోజుల్లో కూడా ఉండదు. మా పార్టీలో నెంబర్ వన్ నుంచి 100 వరకూ అన్నీ జగన్ మోహన్ రెడ్డే’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘‘మా హయాంలో ఎలాంటి స్కాములు జరగలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. లిక్కర్ స్కామ్ అంటూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. భయపెట్టి కొంతమందిని లొంగదీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. అన్నింటి పైనా న్యాయపోరాటం చేస్తాం’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. -
ఏపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్
సాక్షి, హైదరాబాద్: ఏపీ మైలవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు హైడ్రా షాక్ తగిలింది. కొండాపూర్ పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఆయన చేపట్టిన అక్రమ కట్టడాలను శనివారం ఉదయం అధికారులు కూల్చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు.కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయ సమీపంలోని సర్వే నెంబర్ 79లో 39 ఎకరాల స్థల వివాదంపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతో భారీ పోలీసు బందోబస్తు అక్కడికి చేరుకున్న హైడ్రా.. వసంత కృష్ణ ప్రసాద్ కబ్జాల పర్వాన్ని గుర్తించింది. ఆ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తోపాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించింది. కూల్చివేతలను అడ్డుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగించింది. ఈ క్రమంలో వసంత హౌస్ పేరుతో ఏర్పాటు చేసిన ఆఫీస్‌తో పాటు భారీ షెడ్లను తొలగించారు. హఫీజ్‌పేటలో రూ.2000 కోట్ల విలువగల వివాదాస్పద భూమిలో ఆయన కబ్జా పెట్టినట్లు తేలింది. అలాగే.. మాదాపూర్‌లోని 20 ఎకరాల భూమిని వసంత గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేసినట్లు హైడ్రా గుర్తించింది. ఈ వ్యవహారంపై ఆయన అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
ఉద్యోగుల్లో గ్రూపుల గోల..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రతిష్ట మసకబారుతోంది. పరీక్షల నిర్వహణలో విఫలం అవడం, సిబ్బందిలో గ్రూపు రాజకీయాలు పెచ్చుమీరడంతో వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఓ కాంట్రాక్టు ఉద్యోగి వైద్య విద్యార్థులకు గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తున్నాడంటూ అధికారులకు ఫిర్యాదులు సైతం రావడంలో ఒక్కసారిగా అంతా షాక్ తిన్నారు. ఇంత జరిగిన తర్వాత పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలకు అధికారులు చేస్తున్నా, పరువు బజారున పడిందంటూ వైద్య వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికై నా కఠిన నిబంధనలు విధించాలంటూ పలువురు వైద్యులు కోరుతున్నారు. స్లిప్పులు రాస్తూ.. ఈ నెల 7 నుంచి 21 వరకూ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఇక్కడ నిమ్రా, ఎన్ఆర్ఐ విద్యార్థులతో పాటు, సిద్ధార్థ విద్యార్థులు కూడా పరీక్షలు రాస్తున్నారు. అయితే విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చాయి. అంతేకాదు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో యూనివర్సిటీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఒకసారి ముగ్గురు, మరోసారి ఇద్దరి నుంచి స్లిప్పులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున కాపీయింగ్ జరిగినట్లు చెబుతున్నారు. అందుకు వైద్య కళాశాలలో కొందరి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సమయం కంటే ముందుగానే పేపర్ డౌన్లోడ్ చేసినట్లు కూడా విమర్శలు వచ్చాయి. విద్యార్థులకు గంజాయి.. వైద్య కళాశాల హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు ఒక కాంట్రాక్టు ఉద్యోగి గంజాయి విక్రయిస్తున్నాడంటూ అధికారులకు రాతపూర్వక ఫిర్యాదులు అందడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే విచారించి ఆ ఉద్యోగిని విధుల నుంచి తప్పించారు. గంజాయి విక్రయించారా లేదా అనేది ఇప్పటి వరకూ తేల్చలేదు. ఇదిలా ఉంటే, ఆ ఉద్యోగిని మరలా విధుల్లోకి తీసుకోవాలంటూ పలువురు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆరోపణలు ఉన్న వ్యక్తిని ఎలా తీసుకుంటారని పలువురు ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. మసకబారుతున్న వైద్య కళాశాల ప్రతిష్ట సిద్ధార్థ మెడికల్ కాలేజీలో వ్యవస్థ అస్తవ్యస్తం యథేచ్ఛగా విద్యార్థుల మాస్ కాపీయింగ్ విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు ఉద్యోగుల మధ్య గ్రూపుల గోల ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో దశాబ్దాలుగా ఇక్కడే పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. వారంతా గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, తప్పుడు ఫిర్యాదులు ఇస్తూ కళాశాల పరువు తీస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు. అంతేకాకుండా అవినీతి, అక్రమాల్లో సైతం వారి పాత్ర ఉంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవల వచ్చిన ఆరోపణలన్నీ దీర్ఘకాలంగా ఇక్కడే పనిచేస్తున్న వారిపైనే అంటున్నారు. అధికారులు ప్రక్షాళన చేయకుంటే రానున్న రోజుల్లో వైద్య కళాశాల పరువు మరింతగా బజారున పడే అవకాశం ఉందంటున్నారు. పరిస్థితి విషమించక ముందే చర్యలు తీసుకోవాలని పలువురు ఉద్యోగులు హితవు పలుకుతున్నారు. -
మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు!
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లలో దందా సాగిస్తున్నారు. సిండికేట్‌గా మారి రైతులను అందినకాడికి దోచుకుంటున్నారు. వాస్తవానికి రైతు కొనుగోలు కేంద్రంలో విక్రయించిన ధాన్యం ఏ మిల్లుకు చేరుతుందో తెలియదు. మిల్లుకు చేరిన ధాన్యం ఏ రైతుదో మిల్లరుకూ తెలియదు. కానీ ఏ రైతు ధాన్యం మిల్లుకు చేరిందో మిల్లర్లకు తెలిసిపోతోంది. ఎందుకంటే మిల్లర్లు ఇచ్చే కమీషన్‌కు కక్కుర్తి పడి కొందరు అధికారులు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది ఇష్టారాజ్యంగా రైతులను దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చిన సొమ్ము వాటాలు వేసుకుంటున్నట్లు సమాచారం. దళారీ రాజ్యం.. రైతుల అవసరాలను ఆసరాగా తీసుకొని కొందరు మిల్లర్లు దళారులను పంపి ధాన్యం తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఆ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లులకు తరలించి ప్రభుత్వం నిర్ణయించిన బస్తా రూ. 1,740 ధర పొందుతున్నారు. మిల్లర్లకు కొందరు అధికారులు, కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది సహకరిస్తున్నారు. ఎక్కడికక్కడ పర్సంటేజ్లేనని రైతులు చెబుతున్నారు. జిల్లాలో పరిస్థితి.. జిల్లాలో 19,907 మంది రైతులు 50,484.1 ఎకరాల్లో రబీలో వరి సాగు చేశారు. మొత్తం 1,66,470 టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారుల అంచనా. జిల్లాలోని 107 కొనుగోలు కేంద్రాల ద్వారా 50వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను 17 మిల్లులను ట్యాగ్ చేసింది. ఇప్పటికీ కేవలం 14,281 టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. కనీసం 50శాతం కూడా కొనుగోలు చేయలేదు. ఈనెల 3వ తేదీ నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి. రైతులు తాము పండించిన ధాన్యాన్ని అకాల వర్షాల నుంచి కాపాడుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే తేమశాతం 17, నూక తక్కువగా ఉండాలి వంటి నిబంధనలు ఉన్నాయి. కల్లాల్లో ఆరబెట్టాలంటే ప్రతి రోజూ ఏదోచోట వర్షం కురుస్తోంది. నిల్వ చేసుకొనేందుకు రైతులకు ఏ మాత్రం అవకాశం లేదు. విధిలేని పరిస్థితుల్లో తక్కువ ధరకు విక్రయించి దందాకు బలైపోతున్నారు.న్యూస్రీల్సిండికేట్గా ఏర్పడి ధాన్యం దోపిడీ రైతు అవసరాలను ఆసరాగా తీసుకొని ధరలో కోత కమీషన్లకు కక్కుర్తిపడి సహకరిస్తున్న కొందరు అధికారులు, సిబ్బంది ఎవరికీ చెప్పుకోలేక రైతుల దీనావస్థ కేంద్రాల వద్దే కొనుగోల్మాల్ఓ రైస్ మిల్లర్ నుంచి విజయవాడ రూరల్ మండలంలోని రైతుకు ఫోన్ వచ్చింది. ‘మీ ధాన్యం మా మిల్లుకు చేరింది. ధాన్యంలో నూక ఎక్కువగా వస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ఇవ్వడం కుదరదు. ధాన్యం దిగుమతి చేసుకోలేను.. రూ.1400కు అయితే దిగమతి చేసుకుంటా’ అని తెగేసి చెప్పాడు. మరో ముగ్గురు రైతులకు అదే మిల్లరు ఫోన్ చేసి అలాగే మాట్లాడాడు. తాను చెప్పిన ధర అయితే ఓకే.. లేదంటే లేదు అని బెదిరించినంత పనిచేశాడు. వాతావరణంలో మార్పులు, అకాల వర్షాలు.. ధాన్యం నిల్వ చేసుకొనే సామర్థ్యం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు మిల్లర్ చెప్పిన రేటుకు సరే అని అంగీకరించారు. ఒక్కో రైతు 75 కేజీల బస్తాకు రూ. 340లకు పైగా నష్టపోయారు. కొనుగోలు కేంద్రంలో సంచులు కూడా పలుకుబడి ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారు. కేంద్రాల్లో నిల్వ ఉండా ల్సిన సంచులు.. ధాన్యం లారీతోపాటే వస్తున్నాయి. లారీలు కూడా సరిగా రావడం లేదు. దళారులు వచ్చి తక్కువ రేటుకు అడుగుతున్నారు. కాదని కొనుగోలు కేంద్రానికి వెళ్తే తేమశాతం పేరుతో ఇంకా ఎండబెట్టాలంటున్నారు. మిల్లర్లపై ప్రభుత్వ నియంత్రణ లేదు. – ఓరుగంటి రాంబాబు, పైడూరుపాడు కొనుగోలు కేంద్రాల కేంద్రంగానే మిల్లర్ల దందా సాగుతోందని సమాచారం. రైతులు తమ ధాన్యం అమ్ముకొనేందుకు కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లగానే ఆ సమాచారం మిల్లర్‌కు చేరుతోంది. అంతే వెంటనే ఆ రైతు కల్లాల్లో దళారులు వాలిపోతున్నారు. రైతుల అవసరాలు ఆసరాగా తీసుకొని ధరలో కోత విధిస్తున్నారు. మా ధర ఇంతే అంటూ తెగేసి చెబుతున్నారు. రైతు అంగీకరించకపోతే అతని సమాచారం కొనుగోలు కేంద్రాలకు వెళుతోంది. అక్కడ అతనికి గోనె సంచులు ఇవ్వడం లేదు. ఒక వేళ సంచులు ఇస్తే హమాలీలు కాటా వేసేందుకు వెళ్లడం లేదు. వాతావరణం చూస్తే గంటల వ్యవధిలో మారిపోతోంది. దళారులు కొనుగోలు చేసిన ధాన్యం ముందుగానే కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లులకు చేరుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విక్రయించి వాటాలు వేసుకుంటున్నారు. మిల్లర్ల తరఫున రైతుల పేరుతో విక్రయించి వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. మరి కొందరు రైతుల వద్ద ముందే విత్ డ్రా ఫారాలు తీసుకొని తమ వద్ద ఉంచుకుంటున్నారు. డబ్బు డ్రా చేసి రైతుకు ముందే చెప్పిన ధర మేరకు ఎంత డబ్బు ఇవ్వాలో అంత ఇచ్చేసి, మిగిలిన సొమ్ము మింగేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు, మిల్లర్ల వద్ద ఉండాల్సిన యాప్ కొందరు దళారుల ఫోన్లలోనూ ఉండడం విశేషం. అధికారులు, మంత్రులు పర్యటించిన ఒకటి రెండు రోజులు అంతా హడావుడి చేస్తున్నారు. తర్వాత షరామామూలే. మిల్లర్లపై రాయనపాడు, పైడూరుపాడు రైతులు కొందరు ఏకంగా మంత్రికే విన్నవించారు అయినా పరిస్థితిలో మార్పులేదని చెబుతున్నారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
కృష్ణలంక(విజయవాడతూర్పు): విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కృష్ణలంక జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులో ప్రయాణికులు ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. విజయవాడకు చెందిన ఓ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వెళ్లే క్రమంలో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో వారధి వైపు నుంచి జాతీయ రహదారి గుండా భవానీపురం వెళ్తోంది. బస్టాండ్ సమీపానికి చేరుకోగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దానిని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును పక్కన ఆపాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులో నుంచి మంటలు ఎగిసిపడటాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సులో ప్రయాణికులెవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్ సిబ్బంది, పోలీసులు భావిస్తున్నారు. -
మొక్కుబడిగా ధాన్యం కొనుగోలు
తిరువూరు: తిరువూరు డివిజన్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి మొక్కుబడి తంతుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. డివిజన్ పరిధిలోని 5 మండలాల్లో 41 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇంతవరకు కేవలం 2,222 టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. గతవారం రోజులుగా భారీ వర్షాల కారణంగా వరిధాన్యాన్ని త్వరితగతిన విక్రయించడానికి రైతులు ప్రయత్నిస్తుండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో స్పందన కరువైంది. అవసరానికి తగినట్లు ఖాళీ సంచుల సరఫరాలో సైతం నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద రైతులకు మాత్రమే ఈ కేంద్రాల్లో ధాన్యం విక్రయించే అవకాశం లభిస్తోందని, చిన్న రైతుల్ని పట్టించుకోవట్లేదని గంపలగూడెం మండలంలో పలువురు రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో కంటే ప్రైవేటు మిల్లర్లకు, వ్యాపారులకు, దళారులకు విక్రయించడమే సులువని రైతులు భావిస్తున్నారు. సిబ్బందిలో నిర్లక్ష్యం.. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ధాన్యం కొనుగోలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. రైతులు తమ కల్లాల్లోని ధాన్యాన్ని విక్రయించడానికి ముందుకు వచ్చినా తేమశాతం పరిశీలించడానికి, ధర నిర్ణయించడానికి తమకు తీరిక లేదన్నట్లు పీపీసీ సిబ్బంది వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపించారు. కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని సిబ్బంది చెబుతుండగా, కల్లాల్లోనే తేమశాతం పరిశీలించి కొనుగోలు చేయాలని తిరువూరు ఆర్డీవో ఆదేశించారు. ప్రైవేటు వ్యాపారులు తిరువూరు డివిజన్లో 2,300 టన్నుల ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేసినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. డివిజన్లోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను గురువారం మరోసారి పరిశీలించిన తిరువూరు ఆర్డీవో మాధురి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా గోపీ బాధ్యతల స్వీకరణ
చిలకలపూడి (మచిలీపట్నం): జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి.గోపీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న అరుణసారిక బదిలీ కావటంతో విశాఖపట్నం ఏపీ వాల్యూయాడెడ్ ట్యాక్స్ అప్పిలయేట్ ట్రిబ్యూనల్ చైర్మన్‌గా పనిచేస్తున్న జి. గోపీని జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ లోపభూయిష్టం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ లోపభూయిష్టంగా చేశారని ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ విమర్శించారు. గాంధీనగర్‌లోని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన రోస్టర్ విధానంతో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రోస్టర్ విధానాన్ని పక్కనపెట్టి మాల, మాదిగ ఉప కులాలకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు ఉన్న 15శాతం రిజర్వేషన్‌ను మాదిగలకు 7, మాలలకు 7, ఉప కులాలకు ఒక శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అప్పుడే మాదిగల 30 ఏళ్ల పోరాటానికి ఫలితం ఉంటుందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ వద్దని, ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన లోపభూయిష్టమైన వర్గీకరణ వల్ల మాదిగలకు నష్టం జరుగుతుంటే, మాదిగలకు ఐకాన్ అని చెప్పుకొనే మంద కృష్ణమాదిగ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ఈ నెల 23 నుంచి మే 30వ తేదీ వరకు రాష్ట్రంలోని ముఖ్య నగరాలు, పట్టణాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు చెరుకూరి కిరణ్ మాదిగ, పూనూరు జార్జ్ మాదిగ, మంద నాగమల్లేశ్వరరావు మాదిగ, రెల్లి సంఘం నాయకుడు ఎర్రంశెట్టి ప్రసాద్ రెల్లి పాల్గొన్నారు బీచ్ కబడ్డీ పోటీలకు స్థల పరిశీలన మంగినపూడి(మచిలీపట్నంరూరల్): మండల పరిధిలోని మంగినపూడిబీచ్‌లో మే నెలలో నిర్వహించనున్న బీచ్ కబడ్డీ పోటీలకు అనువైన ప్రదేశం కోసం అధికారులు, స్పోర్ట్స్ అథారిటీ బృందం గురువారం బీచ్‌లోని పలు ప్రాంతాలను పరిశీలించారు. జాతీయస్థాయి బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించిన మెప్మా పీడీ పి. సాయిబాబు, కబడ్డీ అసోసియేషన్ అధికారులు పరిశీలించి నిర్వ హించే ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఆంధ్ర కబ డ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ అర్జునరా వు, కృష్ణాజిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు పరిశుభ్రతే లక్ష్యం గన్నవరం: మండలంలోని సూరంపల్లి గ్రామంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. అర్జునరావు నేతృత్వంలో అధికారులు పర్యటించారు. గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించిన ఈ బృందం పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తోందన్నారు. దీని కోసం ప్రతి గ్రామంలోని ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బంది తప్పనిసారిగా ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని చెప్పారు. ఈ చెత్త ద్వారా వర్మికంపోస్ట్ ఎరువుల తయారీతో సంపదను సృష్టించాలన్నా రు. సర్పంచ్ ఈలప్రోలు శ్రీనివాసరావు, ఎంపీ డీఓ టి. స్వర్ణలత, ఈఓపీఆర్డీ టి. భారతి, పంచా యతీ కార్యదర్శి టి. లక్ష్మణరావు పాల్గొన్నారు. -
స్పందించని సహృదయం
లబ్బీపేట(విజయవాడతూర్పు): పేద రోగులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ హృదయం స్పందించడంలేదు. ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో అత్యాధునిక సౌకర్యాలు, వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నా అత్యవసర సమయంలో రోగులు తమ గుండెలను అరచేతిలో గుంటూరుకు వెళ్లాల్సిన పరి స్థితి దాపురించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యం పొందలేక, ప్రభుత్వాస్పత్రికి వస్తే గుంటూరు వెళ్లండని వైద్యులు ఉచిత సలహా ఇస్తుండటంతో చేసేదేమీ లేక రోగులు తమ పేదరికాన్ని నిందించుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. గుండె శస్త్ర చికిత్స విభాగానికి గ్రహణం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని గుండె శస్త్ర చికిత్స విభాగానికి గ్రహణం పట్టింది. ఆ విభాగంలో ఆధునిక సౌకర్యాలు ఉన్నా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఆ విభాగంలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, పోస్ట్ ఆఫ్ ఇంటెన్సివ్ కేర్ వార్డును ఏర్పాటు చేసి ముగ్గురు వైద్యులను నియమించారు. ప్రస్తుతం గుండె ఆపరేషన్లు జరగడం లేదు. గుండె ఆపరేషన్లు అవసరమైన రోగులను గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లండంటూ వైద్యులు ఉచిత సలహా ఇస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఐదో అంతస్తులో కార్డియో థోరాసిక్ శస్త్ర చికిత్స (గుండె ఆపరేషన్) విభాగం ఉంది. అక్కడ ఆధునిక ఆపరేషన్ థియేటర్‌తో పాటు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడా ఉంది. ఈ విభాగాన్ని కోవిడ్‌కు ముందు ఏర్పాటు చేశారు. కోవిడ్ నేపథ్యంలో ఎక్కువ రోజులు మూత పడి ఉండటంతో మరలా 2023లో రూ.20 లక్షలతో థియేటర్‌ను ఆధునికీకరించారు. లామినర్ ఫ్లోరింగ్, రోగులకు ఇన్ఫెక్షన్లు రాకుండా మాడ్యులర్లను ఏర్పాటు చేశారు. శస్త్ర చికిత్స అనంతరం రోగులను ఉంచేందుకు ఆధునిక సౌకర్యాలతో పోస్ట్ ఆఫ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ శస్త్ర చికిత్సలు మాత్రం జరగడం లేదు. అందుబాటులో ముగ్గురు వైద్యులు కార్డియో థోరాసిక్ శస్త్ర చికిత్స విభాగంలో ప్రస్తుతం ముగ్గురు వైద్యులు ఉన్నారు. వారంలో మూడు రోజులు (సోమ, బుధ, గురు) అవుట్‌పేషెంట్లు వారు సేవలు అందిస్తున్నారు. గుండె సర్జరీలు మాత్రం చేయడం లేదు. చేతి రక్తనాళాలు, కాళ్ల రక్తనాళాల్లో పూడికలు వంటి వాటికి మాత్రమే సర్జరీలు చేస్తున్నారు. ఇక్కడ గుండె ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన సిబ్బందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సి ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపడం లేదు. దీంతో గుండె సర్జరీ తర్వాత రోగులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై ప్రస్తుతం జీజీహెచ్ సిబ్బందికి సరైన అవగాహన లేక పోవడంతోనే సర్జరీలు చేసేందుకు వైద్యులు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ప్రభుత్వం చొరవ చూపి గుండె సర్జరీలు చేసేలా చూడాలని రోగులు వేడుకొంటున్నారు. గుంటూరు రిఫర్ చేస్తున్నారు ప్రస్తుతం కార్డియాలజీ విభాగంలో క్యాథ్‌ల్యాబ్ పీపీపీ మోడ్‌లో నిర్వహిస్తున్నారు. అక్కడ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత స్టెంట్ అవసరమైతే అక్కడే వేస్తున్నారు. బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తే మాత్రం గుంటూరుకు రిఫర్ చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ ఉన్న రోగులు అయితే విజయవాడలోని ఏదో ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తున్నారు. ఇక్కడికి ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు జిల్లాలకు చెందిన రోగులు వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చిన వారు, మరలా గుంటూరు వెళ్లా లంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. బెజవాడ జీజీహెచ్‌లో హృద్రోగులకు అందని మెరుగైన వైద్యం ఆధునిక సౌకర్యాలున్నా గుండె వైద్య విభాగం అలంకార ప్రాయం బైపాస్ ఆపరేషన్లకు గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోపేదలకు గుండె ఆపరేషన్లు దూరం గుంటూరు వెళ్లమన్నారు ఇటీవల నాకు తెలిసిన వ్యక్తికి ఛాతీలో నొప్పి వస్తే ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. అక్కడ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. ఇక్కడ సర్జరీలు చేయడం లేదని, గుంటూరు వెళ్లాలని వైద్యులు చెప్పడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వాళ్లతో మాట్లాడి చేయించాల్సి వచ్చింది. ఇలా ఎంతో మంది గుండె సర్జరీల కోసం ఇబ్బంది పడుతున్నారు. – సయ్యద్ అలీం, కో ఆప్షన్ సభ్యుడు, వీఎంసీ గతంలోనే సౌకర్యాల కల్పన గత ప్రభుత్వ హయాంలోనే విజయవాడ జీజీహెచ్‌లో గుండె శస్త్ర చికిత్సలు చేసేందుకు సౌకర్యాలు కల్పించాం. ఆపరేషన్ థియేటర్‌ను రూ.20 లక్షలతో ఆధునికీకరించాం. ముగ్గురు వైద్యులను నియమించాం. ఇంతలో ఎన్నికలు రావడంతో సేవలను ప్రారంభించలేకపోయాం. ప్రస్తుత ప్రభుత్వం వైద్య రంగాన్ని విస్మరించింది. గుంటూరులో గుండె సర్జరీలు చేస్తుంటే విజయవాడలో చేయక పోవడం బాధాకరం. – యర్రంశెట్టి అంజిబాబు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ సభ్యుడు -
వేదాంక్షికి గిన్సిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
మధురానగర్(విజయవాడసెంట్రల్): నగరం లోని కావ్య కౌస్తుభ కుచిపూడి నృత్యాలయం విద్యార్థిని పరమాత్ముని శ్రీవెంకట కృష్ణ వేదాంక్షి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. 2023 డిసెంబర్లో హైదరాబాద్‌లో 4,218 మంది కుచిపూడి కళాకారులు క్లాసికల్ ఇండియన్ డాన్స్‌లో ఏడు నిమిషాల పాటు అతిపెద్ద ఏకకాలిక ప్రదర్శన ఇచ్చి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. గురువు డాక్టర్ కోట సరిత మార్గ దర్శనంలో వేదాంక్షి కుచిపూడి కళా వైభవంలో పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నిలిచింది. ప్రథమ చికిత్సలపై అవగాహన పెంచుకోవాలి లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రథమ చికిత్స లపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్ నరసింహం సూచించారు. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలో బేసిక్ లైఫ్ సపోర్టు విభాగం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖలో పనిచేసే 60 మంది సిబ్బందికి గురువారం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఎంఈ డాక్టర్ నరసింహం మాట్లాడుతూ.. అత్యవసర విభాగమైన విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రథమ చికిత్సపై శిక్షణ అవసరమన్నారు. బీఎల్ఎస్ విభాగం నోడల్ ఆఫీసర్ డాక్టర్ సొంగా వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యుత్ షాక్, గుండెపోటు, పాము కాటు వంటి సందర్భాల్లో ప్రథమ చికిత్సలపై వైద్యులు అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. అడిషనల్ డీఎంఈ డాక్టర్ డి.వెంకటేష్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఫలించిన లక్ష్యం.. మెరిసిన మత్స్యం
తిరువూరు: ఇంటర్మీడియెట్ విద్యలో గత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ఫలితం ఇప్పుడు ప్రతిబింబిస్తోంది. దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందుతోంది. గత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు ఫలించాయని ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు మరోమారు నిరూపించాయి. తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల రెండు సంవత్సరాలుగా స్టేట్ టాప్ ర్యాంకర్లను అందించింది. గతేడాది ఆదూరి స్వప్న హెచ్ఈసీ గ్రూపులో 912 మార్కులు సాధించి జగనన్న ఆణిముత్యాలు పురస్కారానికి ఎంపికై ంది. ఈ ఏడాది ఇదే కళాశాలలో ఫిషరీస్ ఒకేషనల్ గ్రూపు విద్యార్థిని పింగళి ప్రత్యూష 964 మార్కులు సాధించి మరోసారి రాష్ట్రస్థాయిలో కళాశాలకు పేరు తెచ్చింది. అకుంఠిత దీక్షతో ఆశయసాధన నిరుపేద కుటుంబానికి చెందిన ప్రత్యూష పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాక కోవిడ్ పరిస్థితుల కారణంగా చదువు కొనసాగించలేకపోయింది. ఆమె సొంత ఊరు అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామం. ఆ గ్రామంలో పదో తరగతి పూర్తయిన తదుపరి బైపీసీ గ్రూపులో ఇంటర్మీడియెట్ చదవడానికి ప్రయత్నించినా పరిస్థితులు అనుకూలించక మధ్యలోనే మానేయాల్సి వచ్చింది. తల్లి చిన్నతనంలోనే మరణించగా తండ్రి రెక్కల కష్టంతో చదివిస్తుండటంతో ఎలాగైనా ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే లక్ష్యంతో ప్రత్యూష మళ్లీ ఇంటర్మీడియెట్లోనే చేరాలని నిర్ణయించుకుంది. ఫిషరీస్‌లో చదువుకోవాలన్నది ఆమె లక్ష్యం. తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కోర్సు ఉండటం, వసతి గృహం కూడా అందుబాటులో ఉందని గుర్తించింది. తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ గ్రూపులో ఫిషరీస్ కోర్సు తీసుకుంది. తన సోదరి ప్రోత్సాహంతో తిరువూరు కళాశాలలో చేరి ఇక్కడే బాలికల ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ చదువు కొనసాగించింది. కళాశాలలో నిర్వహించే అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధిస్తుండటంతో ఆ బాలికపై కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. స్టేట్ ర్యాంకు సాధించాలనే లక్ష్యంతో బాలికకు అవసరమైన ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ ఏడాది ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 1000కి 964 మార్కులు సాధించడంలో తోడ్పాటు అందించారు. ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో సత్తాచాటిన ప్రత్యూష ఒకేషనల్ ఫిషరీస్ కోర్సులో 1000కి 964 మార్కులు విద్యారంగంలో గత ప్రభుత్వ సంస్కరణల ఫలితం -
ఐక్యరాజ్య సమితి సమావేశాలకు మోజెస్ అబ్రహాం హాజరు
చిలకలపూడి(మచిలీపట్నం): న్యూయార్స్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న ఎకనామికల్ అండ్ సోషల్ కౌన్సిల్ (ఈసీఓఎస్ఓసీ) యూత్ ఫోరం–2025 సమావేశాలకు మచిలీపట్నానికి చెందిన డాక్టర్ బొకినాల మోజెస్అబ్రహాం భారత ప్రతినిధిగా హాజరయ్యారు. ఈ నెల 15న ప్రారంభమైన ఈ సమావేశాలు గురువారం ముగిశాయి. ప్రపంచ వ్యాప్తంగా పాల్గొన్న యువనాయ కులతో కలిసి ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ అంశంపై జరిగిన చర్చలో మోజెస్ అబ్రహాం పాల్గొన్నారు. ఆరోగ్యం, లింగ సమానత్వం, వాతావరణ పరిరక్షణ, శాస్త్రసాంకేతికత, యువ ఉద్యోగవకాశాలు వంటి అంశాలపై తాను ప్రసంగించానని డాక్టర్ మోజెస్ తెలిపారు. పాలసీ నిర్ణయాల్లో యువత భాగస్వామ్యం, శాంతి నిర్మాణం, డిజిటల్ పరివర్తన, ప్రపంచ స్థాయి భాగస్వామ్యాల ప్రాధాన్యతను ఈ ఫోరం ప్రధానంగా ప్రతిబింబించిందని తెలిపారు. మోజెస్ మచిలీపట్నం నోబెల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్‌లో డాక్టరేట్, ఐఐటీ కాన్పూర్, యూనివర్సిటీ ఆఫ్ బార్సిలోనా వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో శుద్ధ ఇంధన సాంకేతికతపై పరిశోధనలు చేశారు. ప్రస్తుతం ఫిలడెల్ఫియాలోని డ్రెక్సెల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రకటించిన ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రపంచ యువ నాయకులతో కలిసి చర్చలు జరపడం గర్వంగా ఉందని మోజెస్ తెలిపారు. -
కాలేజీ బస్సు ఢీకొని మహిళ మృతి
పెనమలూరు: మండలంలోని పెదపులిపాక గ్రామంలో గురువారం ఓ ఇంజినీరింగ్ కాలేజీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ వివాహిత దుర్మరణం చెందింది. పెనమలూరు పోలీసుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా రేపల్లె పద్మసాలివారి వీధికి చెందిన చిలుమూరు శిరీష(38), శ్రీనివాసకిరణ్ భార్యాభర్తలు. శిరీష పుట్టినిల్లు తాడిగడప. గురువారం ద్విచక్రవాహనంపై వారు తాడిగడప వస్తుండగా పెదపులి పాకలోని చెరువు వద్ద ఓ ఇంజినీరింగ్ కాలేజీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాసకిరణ్, శిరీష ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. శిరీష తలపై బస్సు చక్రాలు ఎక్కాయి. దీంతో ఆమె తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనివాసకిరణ్ అవనిగడ్డలో విద్యుత్ శాఖలో పని చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
పెనమలూరు: విద్యార్థులు క్రీడల్లో రాణించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ ఇండియన్ టీం క్రికెటర్ ఎం.ఎస్.కె.ప్రసాద్ సూచించారు. కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ డీమ్డ్ టూబీ యూనివర్సిటీలో గురువారం తొలి వార్షిక క్రీడోత్సవంలో ఆయన ప్రసంగించారు. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే అవసరమన్నారు. క్రీడల్లో రాణిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. తాను ఇండియన్ టీమ్‌లో ప్లేయర్‌గా, బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ పని చేసినందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో ఉత్తమ ప్రదిభచాటిన యు.సాయిసుబ్రహ్మణ్యం, త్రినాథ్చౌదరి, ప్రణీత, ఎ.మణికంఠకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు ఎం.రాజయ్య, కార్యదర్శి పి.లక్ష్మణరావు, వైస్‌చాన్స్‌లర్ వెంకటేశ్వరరావు, ప్రో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎ.వి.రత్నప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్, ఫిజికల్ డైరెక్టర్ పి.రఘు తదితరులు పాల్గొన్నారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ -
‘ముస్లింలు మీటింగ్‌కు టీడీపీ నేతల పర్మిషన్ కావాలా?’
సాక్షి, కృష్ణాజిల్లా: వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ కాసిం అబూ ఇంటిపై గత అర్ధరాత్రి టీడీపీ రౌడీలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అబూ ఇంటి అద్దాలను టీడీపీ నేతలు పగలగొట్టారు. పార్టీ నేతల ద్వారా విషయం తెలుసుకున్న ఆ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని.. అబూ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధ్వంసమైన ఫర్నిచర్‌ను ఆయన పరిశీలించారు. టీడీపీకి చెందిన కొందరు తమ ఇంటి వద్ద భయాందోళన సృష్టిస్తున్నారంటూ పేర్ని నాని వద్ద అబూ తల్లి బేగం ఆవేదన వ్యక్తం చేశారు.అబూ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ పేర్ని నాని, వైఎస్సార్సీపీ శ్రేణులు భరోసా ఇచ్చారు. టీడీపీ నేత కడియాల గణేష్, మరికొందరు అర్ధరాత్రుళ్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ అబూ ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీ నేత ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గుడివాడ డీఎస్పీకి పేర్ని నాని, వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి చర్యలు తీసుకోకుంటే, ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామంటూ పేర్ని నాని హెచ్చరించారు.గుడివాడలో రౌడీ రాజ్యం: పేర్ని నానివక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేంగా సమావేశం పెట్టడానికి వీల్లేదని అబూని టీడీపీ నేత కడియాల గణేష్ హెచ్చరించాడు. నా ఆదేశాలు ఖాతరు చేయకుండా మీటింగ్ పెడితే నీ అంతుచూస్తానని బెదిరించాడు. గణేష్ హెచ్చరించినా అబూ మీటింగ్‌కు హాజరయ్యారు. ముస్లింలు సమావేశం పెట్టినందుకు ఓ ఎస్ఐ వచ్చి కమ్యూనిటీ హాల్‌కు తాళం వేశారు. పోలీసు యూనిఫామ్ వేసుకుని కొందరు అధికారులు వ్యవస్థలను దిగజారుస్తున్నారు. ఇలాంటి పోలీసులను జిల్లా ఎస్పీ, డిజిపి అదుపులో పెట్టుకోవాలిపదిమంది ముస్లింలు కలిసి మీటింగ్ పెట్టుకోకూడదని ఏమైనా చట్టం ఉందా?. ముస్లింలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా టీడీపీ నేతల పర్మిషన్ కావాలా?. కమ్యూనిటీ హాల్‌కు తాళం వేయడంతో రోడ్డుమీదే ముస్లింలు మీటింగ్ పెట్టుకున్నారు. గత రాత్రి అబూ ఇంటిపై టీడీపీ రౌడీలు దాడి చేశారు. ఐరన్ రాడ్లతో అబూ ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. అబూను చంపేస్తామని టీడీపీ రౌడీలు బెదిరించారు. గుడివాడలో రౌడీ రాజ్యం నడుస్తోంది.. ప్రజాస్వామ్యం బతికే పరిస్థితి లేదు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశాం. -
పట్టించుకోరా?.. మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు
సాక్షి, కృష్ణా జిల్లా: మంత్రి నాదెండ్ల మనోహర్‌ను రైతులు నిలదీశారు. గురువారం.. పునాదిపాడులో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్.. రైస్ మిల్లును, కల్లాల్లో ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని మంత్రిని రైతులు నిలదీశారు. కోత కోసి రెండు రోజులైనా ఎవరూ పట్టించుకోవడం లేదన్న రైతులు.. గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు.డ్యామేజ్ అయిన (చిల్లులుపడిన) గన్నీ బ్యాగులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దున్నపోతు ఈనిందా దొడ్లో కట్టేశామా అనేలా అధికారుల తీరు ఉందంటూ రైతులు మండిపడ్డారు. దళారులు, అధికారులు, మిల్లర్లతో కుమ్మక్కైపోయారని రైతులు ఆరోపించారు. బాలాజీ మిల్లు చెబితేనే ధాన్యం కొంటున్నారంటూ రైతులు ఆరోపించారు. రైతుల ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పలేకపోయారు. -
సందేశాత్మకంగా సాంఘిక నాటికలు
విజయవాడ కల్చరల్: పీఎమ్‌కే ఫైన్ ఆర్ట్స్, ఏపీ చలన చిత్ర వాణిజ్యమండలి ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని కందుకూరి కల్యాణమండపంలో ఐదురోజులపాటు నిర్వహించే 44వ జాతీయ సాంఘిక నాటికల పోటీలు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. తొలి నాటికగా ఆరాధన ఆర్ట్స్ అకాడమీ గుంటూరు వారు ప్రదర్శించిన మరీ అంతొద్దు నాటిక సందేశాత్మకంగా సాగింది. రచన ఆకురాతి భాస్కర్ చంద్ర, దర్శకత్వం నడింపిల్లి వెంకటేశ్వరరావు. రెండవ నాటికగా చెరుకురు సాంబశివరావు రచించి, దర్శకత్వం వహించిన విముక్తి నాటికను, మూడో నాటికగా ద్వార బంధాల చంద్రయ్య నాయుడు నాటికను ప్రదర్శించారు. కార్యక్రమాలను కళాపోషకుడు డోగిపర్తి శంకరరావు ప్రారంభించారు. నాటక రంగానికి పూర్వవైభవం తీసుకురావాలని సూచించారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పీఎమ్‌కే ఫైన్ ఆర్ట్స్ వ్యవస్థాపకుడు పసుపులేటి వెంకటరమణ పాల్గొన్నారు. రంగస్థల సినీ నటుడు కొప్పుల ఆనంద్ నిర్వహించారు. -
గురుకులంలో కొత్త చరిత్ర
నిమ్మకూరు(పామర్రు): గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ ఇంటర్మీడియెట్ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా సత్తా చాటారు. గత విద్యా సంవత్సరాల్లో చదువుల కోసం శ్రద్ధతో తీసుకున్న ప్రత్యేక చర్యలు వారికి ఉపకరించాయి. ఉత్తమ ఫలితాలు.. పామర్రు మండల పరిధి నిమ్మకూరు గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు గత ప్రభుత్వం మంచి వసతులతో కూడిన విద్యను అందించింది. విద్యార్థులకు కళాశాలలో అన్ని సబ్జెక్టులలో మెరుగైన విద్యాబోధన, ల్యాబ్‌లలో అన్ని రకాల పరీక్షలకు చక్కని తర్ఫీదునిచ్చింది. అవసరమైన వారికి ప్రత్యేక శిక్షణ తరగతుల నిర్వహించింది. అంతే కాకుండా హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు మంచి ఆహారం, వసతి తదితరాలను కల్పించింది. వాటి ఫలితంగా విద్యార్థులు పరీక్షల్లో సత్తా చాటారు. గురుకుల కళాశాలలో 2024–25 ఏడాదిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో వెలమల మణికంఠ ఎంపీసీ గ్రూపులో 987/1000, బైపీసీలో దూది రేష్మ 990/1000, సీఈసీలో ఆర్. వనదుర్గ 949/1000 సాధించి ఏపీ గురుకులాల స్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచారు. ఎంఈసీలో జీవీవీఎస్ చైతన్య 971/1000, సీజీటీలో ఎల్. కుసుమ రాణి 971/1000 సాధించింది. వీరందరూ ఒకే కళాశాలకు చెందిన వారు కావడం.. అందరూ 900లకు పైగా మార్కులు సాధించడం విశేషమని గురుకులం ప్రిన్సిపల్ గ్రేస్ సుభాషిణి పేర్కొన్నారు. -
సేవా కార్యక్రమాల నిర్వహణ అభినందనీయం
జిల్లా ఎస్పీ గంగాధరరావు పెడన: ప్రార్థించే పెదవులు కంటే సాయం చేసే చేతులు మిన్న అన్న విధంగా 1989 పోలీస్ బ్యాచ్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. రామలక్ష్మీ వీవర్స్ కాలనీలోని అమ్మఫుడ్ ఫౌండేషన్‌లో వృద్ధులకు 1989 పోలీస్ బ్యాచ్ బుధవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ బ్యాచ్ సేవా కార్యక్రమాలను నిర్వహించి అందరి మన్ననలు పొందుతున్నారని చెప్పారు. పెద్దలు ఆశీస్సులుతో మరింత మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. సంతృప్తికరమైన జీవితాన్ని ఆశ్వాదించడానికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. అనంతరం అమ్మఫుడ్ ఫౌండేషన్ నిర్వాహకులు మల్లికార్జునరావు దంపతులను సన్మానించి వారికి రూ.10వేల నగదు అందజేశారు. 1989 పోలీస్ బ్యాచ్‌లో ఉత్తమసేవా అవార్డులు పొందిన కొసనం హేమానందం, లక్ష్మణరావులను, ఇతర రాష్ట్రాల్లో ఆట పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన జి.ఉమామహేశ్వరరావు, అంజిబాబులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, ఏఎస్‌లు, కానిస్టేబుళ్లు వి. రాజేంద్రప్రసాద్, వీరవల్లి గోపీ, రణధీర్, అడపా వెంకటేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం మార్గదర్శకాలకు అనుగుణంగానే ఎంబీబీఎస్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. అశోక్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7న ప్రారంభమైన పరీక్షలు, 21 వరకూ కొనసాగనున్నాయని, తమ విద్యార్థులతో పాటు, ఎన్ఆర్ఐ, నిమ్రా కళాశాలల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. పరీక్ష హాలుకు అనధికారికంగా ఎవరూ వెళ్లకుండా గ్రిల్స్ ఏర్పాటు చేశామని, పర్యవేక్షకులుగా అధ్యాపకులనే నియమించినట్లు పేర్కొన్నారు. సీసీటీవీ పర్యవేక్షణతో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగించకుండా తనిఖీలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రశ్నాపత్రాలను సైతం ఉదయం 9.40 గంటల తర్వాతే డౌన్లోడ్ చేస్తున్నామని వివరించారు. డీఎంఈ, రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, పరీక్షల విభాగంలోని అన్ని బోధనేతర సిబ్బందిని మార్పు చేసినట్లు పేర్కొన్నారు. కఠినమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కొన్ని మాల్ ప్రాక్టీస్ ఘటనలు జరిగాయని, ఇన్విజిలేటర్ల నుంచి వివరణలు కోరుతూ మెమోలు ఇచ్చినట్లు తెలిపారు. రూ.4.30 లక్షలు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు పెనమలూరు: పోరంకికి చెందిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.4.30 లక్షల సొమ్ము స్వాహా చేసిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం పోరంకి శ్రీనివాసానగర్, మధురిమ అపార్టుమెంట్‌కు చెందిన కె.వీరవెంకటనాగచక్రధర్ పశువులు దాణా వ్యాపారం చేస్తాడు. కొద్ది నెల క్రితం పనిపై బెంగళూరుకు వెళ్లాడు. తిరిగి బెంగళూరు నుంచి విజయవాడకు రావటానికి వీఆర్ఎల్ ట్రావెల్స్ బస్ టికెట్ తీసుకున్నాడు. అయితే బస్సు మిస్ అవ్వటంతో టికెట్ సొమ్ము తిరిగి ఇవ్వమని వీఆర్ఎల్ వెబ్సైట్లో ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ ద్వారా లైన్లోకి వచ్చి వీరవెంకటనాగచక్రధర్ నమ్మించి బ్యాంకు ఖాతా నెంబర్, ఐడీ, పాస్ వర్డ్ తీసుకున్నాడు. ఆ తరువాత ఫోన్ బ్లాక్‌చేసి అతని బ్యాంకు ఖాతాలో రూ.4.30 లక్షల సొమ్ము స్వాహా చేశాడు. ఈ ఘటన పై బాధితుడు పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. -
పోష్ చట్ట ప్రయోజనాలు పుస్తకావిష్కరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): హైకోర్టు న్యాయవాది అనుపమ దార్ల రచించిన ‘మీరు పనిచేసే చోట లైంగిక వేధింపులా.. పోష్ చట్ట ప్రయోజనాలు’ పుస్తకాన్ని రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం ఆవిష్కరించారు. లైంగిక వేధింపుల నివారణ చట్టం ఆధారంగా చేసుకుని రచించినట్లు రచయిత అనుపమ తెలిపారు. అందరికీ అర్థమయ్యేలా తెలుగులో రచించిన పుస్తకంలో చట్టంలోని నిబంధనలు, వ్యవస్థీకృత, అసంఘటిత రంగంలో పనిచేసే మహిళల హక్కులు తదితర అంశాలను వివరించినట్లు పేర్కొన్నారు. శ్రామిక మహిళలకు సురక్షితమైన పని ప్రదేశాలు పొందడానికి ఈ చట్టం బలమైన కవచం అయినప్పటికీ, అమలు కేవలం కాగితాలకే పరిమితమని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం ఈ పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్పు ట్రస్టు డైరెక్టర్ రావూరి సూయజ్, హ్యాపీ లైఫ్ కౌన్సెలింగ్ సెంటర్ డైరెక్టర్, మనస్తత్వవేత్త డి.కల్యాణి పాల్గొన్నారు. జిల్లాలో విరివిగా మొక్కలు పెంపకం కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమానికి సంసిద్ధం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమంపై సంబంధిత అధికారులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలానికి ముందుగానే రహదారి మార్గాలు, విద్యాసంస్థలు, కాలువలు, చెరువు గట్లపై మొక్కలు విరివిగా నాటి పచ్చదనం పెంపొందించేలా చూడాలని కోరారు. మేజర్ గ్రామపంచాయతీల్లో రహదారులను గుర్తించి మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. చాలా గ్రామ పంచాయతీల్లో తాగునీటి చెరువులు ఉన్నాయని వాటి గట్లపై కూడా మొక్కలు నాటాలని ఆదేశించారు. మొక్కలకు నీరు పోసి సంరక్షించే బాధ్యతను పంచాయతీలో ఒకరికి బాధ్యత అప్పగించాలని పేర్కొన్నారు. వారికి మూడు సంవత్సరాల పాటు ఉపాధి హామీ పథకం ద్వారా వేతనం చెల్లిస్తామని వెల్లడించారు. గ్రామాల్లో కనీసం 25 సెంట్లకు పైగా ఉన్న స్థలాన్ని గుర్తించాలని అక్కడ పల్లెవనాల అభివృద్ధికి చొరవ చూపాలని చెప్పారు. జిల్లాలో 196 పాఠశాలల్లో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కావాల్సిన మొక్కల జాబితా సంబంధిత అధికారులు డ్వామా పీడీ కి అందజేస్తే వారు సరఫరా చేస్తారన్నారు. ఆయా జిల్లాలోని అన్ని దేవాలయాల ప్రాంగణాలతో పాటు వాటికి ఆనుకుని ఉన్న స్థలాల్లో కూడా మొక్కల పెంపకం చేపట్టాలని కోరారు. సంక్షేమ వసతి గృహాల్లోనూ మొక్కలు పెంచేలా చూడాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, డ్వామా పీడీ శివప్రసాద్ యాదవ్, డీఈవో పీవీజె రామారావు పాల్గొన్నారు. -
మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రత్యేక చర్యలు
కోనేరుసెంటర్: జిల్లాలో మహిళలు, చిన్నారుల రక్షణకు పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఏలూరు రేంజ్ ఐజీపీ జీవీజీ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. తొలుత స్టేషన్ సమీపంలోని పింగళి వెంకయ్య విగ్రహానికి ఎస్పీతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన స్టేషన్‌ను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ ఆహ్లాదకర వాతావరణంలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ విషయంలో సిబ్బంది అత్యంత జాగ్రత్త వహించాలని సూచించారు. అలసత్వం వహించినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు సీరియస్‌గా ఉంటాయని చెప్పారు. సామరస్యంగా పరిష్కరించండి.. స్టేషన్‌కి వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమస్యను సామరస్యంగా విని సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఐజీపీ సూచించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండేలా జాగ్రత్త వహించాలన్నారు. మహిళలు, చిన్న పిల్లలపై జరిగే నేరాలను కట్టడి చేయడానికి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో శక్తి యాప్ గురించి, వారికి ఉన్న రక్షణ చట్టాల గురించి శక్తి టీం బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలన్నారు. సైబర్ నేరాల నియంత్రణకి సామాజిక మాధ్యమాల వినియోగం, ఓటీపీ ఫ్రాడ్స్, బ్యాంక్ మోసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. స్టేషన్ విజిట్‌కు వచ్చిన ఐజీపీకి జిల్లా ఎస్పీ పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానం పలికారు. సిబ్బంది నుంచి ఆయన గౌరవవందనం స్వీకరించారు. డీఎస్పీ సీహెచ్ రాజ, బందరు సబ్–డివిజన్ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. మచిలీపట్నం పీఎస్ సందర్శనలో ఐజీపీ అశోక్‌కుమార్ -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
తిరుమలగిరి(జగ్గయ్యపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం వాల్మీకోద్భవ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధవారం పవళింపు సేవ, అశ్వ వాహనోత్సవంతో ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై గ్రామంలో ఊరేగించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ ఇళ్ల ముందుకు స్వామి వారు వస్తుండటంతో వారు పోసి హారతులిచ్చి పూజలు చేశారు. అనంతరం ఆలయంలో పూర్ణాహుతి, స్వామి వారికి కలశ స్నాపనోత్సవం, చూరసంవాదం, మహానివేదన, 12 సేవలను అర్చకులు పరాంకుశం వాసుదేవవాచార్యులు, తిరునగరి రామకృష్ణమాచార్యులు ఘనంగా నిర్వహించి ఉత్సవాలు ముగిసినట్లు తెలిపారు. మహిళలకు పసుపు, కుంకుమ, జాకెట్‌తో పాటు కుంకుమ భరణాలను ఆలయ ఏసీ వరప్రసాద్ అందజేశారు. చైర్మన్ భరద్వాజ్, సిబ్బంది పాల్గొన్నారు. -
అకాల వర్షం.. అపార నష్టం
పెనుగంచిప్రోలు: పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం, ఈదురు గాలులు రైతులను తీవ్రంగా నష్టపరిచింది. మంగళవారం రాత్రి వచ్చిన గాలులకు మొక్కజొన్న నేలవాలగా, మామిడికాయలు రాలిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, మిర్చి అక్కడక్కడా తడిసింది. కోత కోసి అమ్మేదశలో మొక్కజొన్న, అసలే అంతంత మాత్రం కాపుకొచ్చిన మామిడి ఈదురు గాలులకు వర్షార్పణం అయాయ్యని రైతులు ఆవేదన చెందుతున్నారు. అసలే మద్దతు ధర లేక ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న తరుణంలో మిర్చి, ధాన్యం కల్లాల్లో ఆరబోసి పట్టాలు కప్పినా గాలులకు పట్టాలు కొట్టుకు పోయి అక్కడకడ్కడా తడవటంతో కొనే నాథుడు ఉండటని లేదని అంటున్నారు. ఈ ఏడాది రబీ సాగు చేస్తున్న రైతులతో పాటు, మామిడి, మొక్కజొన్న మీద ఆశలు పెట్టుకున్న రైతులందరికీ చేదు అనుభవమే ఎదురయింది. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు పట్టాలు కూడా ప్రభుత్వం అందించలేకపోతుందని వాపోతున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నారు. వత్సవాయి: మంగళవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులు బెంబేలెత్తిపోయారు. కల్లాల్లో ఉన్న మిర్చి, మొక్కజొన్న పంటలపై పట్టాలను కప్పుకున్నారు. రాత్రి సమయంలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన పెద్ద వర్షం ప్రారంభమైంది. సుమారు గంటపాటు వర్షం పడింది. ఈదురుగాలులు బాగా రావడంతో కొన్నిచోట్ల పంటపై కప్పిన పట్టాలు కూడా లేవడంతో పంట తడిచిపోయింది. అసలే మిర్చి పంటకు సరైన ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే మూలిగేనక్కపై తాటికాయ పడ్డట్లు రైతుల పరిస్థితి ఉందని వాపోతున్నారు. జగ్గయ్యపేట: ఈదురుగాలులతో కూడిన వర్షంతో కల్లాల్లోని ధాన్యం రాశులు తడిసిపోయాయి. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడ్డారు. పట్టణంలోని మార్కెట్ యార్డులోని ధాన్యం, ఆటోనగర్ కల్లాల్లోని మొక్కజొన్న, గౌరవరం, షేర్‌మహ్మద్‌పేట గ్రామాల్లోని కల్లాల్లోని ధాన్యం పూర్తిగా తడిసింది. కొన్ని కల్లాల్లో ధాన్యం తడిసి మొలకెత్తినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి బుధవారం పరిశీలించారు. తీవ్రంగా దెబ్బతిన్న పంటలు ఆందోళనలో రైతులు ఆదుకోవాలని వినతి రైతులను పట్టించుకోవాలి ఈదురు గాలులు, వర్షానికి మొక్కజొన్న నేల వాలింది. కోతకు వచ్చిన సమయంలో నేల వాలటంలో కంకుల్లోకి నీరు పోయి కుళ్లి పోతాయి. రైతులకు అవసరమైన పట్టాలు అందిస్తే కొంతవరకు పంటను కాపాడుకునే వీలుంటుంది. రైతుల పరిస్థితిని గుర్తించి ప్రభుత్వం పట్టించుకోవాలి. –దురిశాల రంగయ్య, రైతు, పెనుగంచిప్రోలు పట్టాలపై నీరు చేరింది ఐదు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. వర్షానికి ఆరబోసిన మొక్కజొన్నపై పరదా పట్టాలు కప్పాను. అయినా అక్కడక్కడ కొంత తడిసింది. కచ్చితంగా పంట అమ్మే సమయంలో వర్షాలు, గాలులు రైతులను వేదనకు గురి చేస్తున్నాయి. –యల్లేశ్వరరావు, రైతు, పెనుగంచిప్రోలు -
వీసీ లేక.. సమస్యలు వీడక
లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన, దేశంలోనే మొట్ట మొదటి హెల్త్ వర్సిటీగా గుర్తింపు పొందిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ప్రతిష్ట మసకబారుతోంది. విశ్వ విద్యాలయం పేరును మార్చడంపై చూపిన శ్రద్ధ, వైస్ చాన్స్‌లర్ నియామకంపై లేకపోవడంతో కీలక నిర్ణయాల్లో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఫలితంగా వర్సిటీ పరిధిలో వైద్య విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అంతేకాదు ఏదైనా సమస్య తెలిపేందుకు రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వీసీ అందుబాటులో లేక పోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పది నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. బలవంతంగా రిజైన్ చేయించి.. హెల్త్ యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌గా ఉన్న డాక్టర్ కె. బాబ్జి పదవీ కాలం 2026 ఫిబ్రవరి వరకూ ఉంది. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆయనను నియమించిందనే కక్షతో బలవంతంగా పదవిలో నుంచి తప్పుకునేలా చేశారు. పాలకుల ఒత్తిడితో గత ఏడాది జూలై 1 డాక్టర్స్ డే రోజున ఆయన పదవికి రిజైన్ చేశారు. నాటి నుంచి కొత్త వీసీని నియమించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తమకు నచ్చిన వారు దొరక్క పోవడమా.. కూటమి పార్టీల మధ్య సమన్వయం లేక పోవడమో.. కారణమేమో గానీ నియామకం మాత్రం జరపడం లేదు. నోటిఫికేషన్ జారీ చేసి నాలుగు నెలలు గడిచింది.. ఎంపిక ఎప్పుడు చేస్తారో తెలియని దయనీయ స్థితి నెలకొంది. పడకేసిన పాలన.. హెల్త్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా పడకేసింది. ప్రస్తుతం రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ నరసింహం ఇన్చార్జి వీసీగా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రతిరోజూ అరగంట మాత్రమే వీసీ చాంబర్లో ఉంటున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. అది కూడా సిబ్బంది ఎవరూ విధులకు రాని సమయంలో ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకూ ఉంటున్నట్లు సమాచారం. ఏదైనా అత్యవసర పని ఉంటే ఆ విభాగాలకు చెందిన వారు ఉరుకులు, పరుగులపై రావాల్సి వస్తోందంటున్నారు. లేదంటే ఫైళ్లు తీసుకుని డీఎంఈ కార్యాలయానికి వెళ్లాల్సిందేనని చెబుతున్నారు. దీంతో ప్రతి పనిలోనూ తీవ్రమైన జాప్యం జరుగుతున్నట్లు యూనివర్సిటీ ఉద్యోగులు వివరిస్తున్నారు. మసకబారిన ప్రతిష్ట.. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ప్రతిష్ట కూటమి ప్రభుత్వంలో మసకబారుతోంది. వర్సిటీకి పెద్ద దిక్కు లేక పోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పరీక్షల నిర్వహణ ఇటీవల అస్తవ్యస్తంగా మారింది. వైద్య కళాశాలల్లో విద్యార్థులతో ఇష్టారాజ్యంగా కాపీలు రాయించారు. విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విద్యార్థుల వద్ద స్లిప్‌లు ఉన్నట్లు గుర్తించారు. యూనివర్సిటీకి పెద్దదిక్కు లేక పోవడంతో చుక్కానీ లేని నావలాగా పరిస్థితి తయారైనట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో వైద్య రంగంతో పాటు, వైద్య విద్యను, యూనివర్సిటీ ప్రతిష్టను కూటమి ప్రభుత్వం మంటగలిపిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత పరిణామాలపై వైద్యవర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో గాడి తప్పిన పాలన వీసీ నియామకంపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం పది నెలలుగా వీసీ లేకపోవడంతో కీలక నిర్ణయాల్లో జాప్యం పరీక్షల నిర్వహణపైనా ఇటీవల ఆరోపణలు పాలనా పరంగా అనేక ఇబ్బందులు మసకబారుతున్న యూనివర్సిటీ ప్రతిష్ట -
కేబుల్ వైర్ల దొంగలు అరెస్టు
తోట్లవల్లూరు: పంట పొలాల్లో వ్యవసాయ మోటార్లకు సంబంధించిన కేబుల్ వైర్లు కత్తిరించే దొంగలను పోలీసులు పట్టుకున్నారు. రైతులకు గత కొంతకాలంగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చోరులు ఎట్టకేలకు దొరికారు. మండలంలోని బొడ్డపాడు–చినపులిపాక మార్గంలో కల్వర్టు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కేబుల్ వైర్ల చోరీ వెలుగు చూసింది. ఎస్ఐ సీహెచ్ అవినాష్ తెలిపిన వివరాల ప్రకారం..గన్నవరం మండలం బుద్దవరానికి చెందిన చలందార్ల స్వామి, ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన చలమచర్ల మహేశ్వరరావు అలియాస్ మహేష్, అదే గ్రామానికి చెందిన మరో 17 ఏళ్ల బాలుడు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. తమకు అవసరమైన డబ్బును సంపాదించే క్రమంలో మండల పరిధిలోని లంక ప్రాంతాల్లో గల పంట పొలాల్లో వ్యవసాయ మోటార్లకు చెందిన కేబుల్ వైర్లను తస్కరించడం మొదలుపెట్టారు. చోరీ చేసిన వైర్లను కాల్చి దానిలోని రాగితీగను అమ్ముకోవటానికి తీసుకెళుతూ పట్టుబడినట్లు ఎస్ఐ చెప్పారు. నిందితుల నుంచి తొమ్మిది కేజీల రాగి వైరు, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తు చేసుకోండి – డీఎస్డీవో అజీజ్ విజయవాడస్పోర్ట్స్:ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యాన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ పర్యవేక్షణలో మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు జరిగే వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు ఆసక్తి ఉన్న క్రీడా సంఘాలు, వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు, కోచ్‌లు, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా డీఎస్డీవో ఎస్.ఎ.అజీజ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని క్రీడాంశాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. శాప్ ఆదేశాల మేరకు ఒక్కో క్రీడాంశంలో ఎనిమిది నుంచి 14 సంవత్సరాల లోపు వయసున్న 25 మంది బాలురు, 25 మంది బాలికలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 17వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఇందిరాగాంధీ స్టేడియంలోని తమ కార్యాలయంలో పూర్తి చేసిన దరఖాస్తులను అందజేయాలని సూచించారు. -
యాత్రికులకు గుడ్ న్యూస్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పూరి, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ తదితర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకునే యాత్రికుల కోసం సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) విజయవాడ డివిజన్ ఏరియా మేనేజర్ ఎం.రాజా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మే ఐదు నుంచి 17వ తేదీ వరకు తొమ్మిది రాత్రిళ్లు, పది పగళ్లు సాగే ఈ యాత్రలో పూరిలోని జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్యదేవాలయం, గయాలోని విష్ణుపాద దేవాలయం, వారణాసిలోని కాశీవిశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణదేవి ఆలయం, సాయంత్రం గంగా హారతి, అయోధ్యలోని సరయు నది వద్ద రామజన్మభూమి, హనుమాన్‌గర్హి, ఆరతి, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం దర్శనం ఉంటుందన్నారు. ఈ ప్రయాణంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయంలో పాటుగా పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు రోడ్డు మార్గంలో రవాణా సదు పాయం, హోటళ్లలో బస ఏర్పాట్లు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి కోచ్‌కు ఎస్కార్ట్, టూర్ గైడ్, టూర్ మేనేజర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ పర్యాటక రైలుకు విజయవాడ, ఏలూరు, రాజ మండ్రి, సామర్లకోట, తునిలో బోర్డింగ్/డీబోర్డింగ్‌కు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్యాకేజీ వివరాలు ఇలా.. మూడు కేటగిరీల్లో ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని మేనేజర్ రాజా తెలిపారు ఎకానమీ (స్లీపర్ క్లాస్) పెద్దలకు ఒక్కొక్కరికీ రూ.16,800, పిల్లలకు రూ.15,700, స్టాండర్డ్ (3ఏసీ) పెద్దలకు రూ.26,600, పిల్లలకు రూ.25,300, కంఫర్ట్ (2ఏసీ) పెద్దలకు రూ.34,900, పిల్లలకు రూ.33,300గా పేర్కొన్నారు. టికెట్లు బుకింగ్ కోసం విజయవాడలోని ఐఆర్సీటీసీ కార్యాలయం లేదా 92814 95848, 89773 14121లో సంప్రదించాల్సిందిగా మేనేజర్ రాజా సూచించారు. విజయవాడ మీదుగా ‘భారత్ గౌరవ్’ రైలు -
ఖేలో ఇండియా రాష్ట్ర జట్లు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: ఏడో ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండర్–18 కబడ్డీ (బాలుర), ఖోఖో (బాలుర), ఫుట్‌బాల్(బాలికల) జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్లను ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో బుధవారం ఎంపిక చేశారు. కబడ్డీకి 49 మంది, ఖోఖో పోటీకి 45 మంది, ఫుట్‌బాల్‌కు 49 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ (టెక్నికల్) రమణ పర్యవేక్షణలో స్పోర్ట్స్ ఆఫీసర్లు సురేంద్ర, కోటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా డీఎస్డీవో ఎస్.ఎ.అజీజ్ ఈ పోటీలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ముందుగా ఆన్లైన్లో నమోదు చేశారు. మధ్యాహ్నం నుంచి జరిగిన ఎంపిక పోటీలను శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ప్రారంభించారు. ఈ పోటీలకు పరిశీలకులుగా ఆయా క్రీడాంశాలకు సంబంధించి అసోసియేషన్ల ప్రతినిధులు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ), నామినేటెడ్ స్పోర్ట్స్ పర్సన్స్ వ్యవహరించారు. జట్లకు ఎంపికై న క్రీడాకారులు మే 2 నుంచి 15వ తేదీ వరకు బీహార్‌లో జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2025 జాతీయ పోటీల్లో పాల్గొంటారని శాప్ ఎండీ పి.ఎస్.గిరీషా వెల్లడించారు. -
చేరువైన విజయం
శ్రమ ఫలం..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన విద్యా సంస్కరణల ఫలితంగా ఓ మట్టిలో మాణిక్యం మెరిసింది. పేదలకు ఇంటర్మీడియెట్ విద్యను చేరువ చేసేందుకు తీసుకొచ్చిన హైస్కూల్ ప్లస్ కాన్సెప్ట్‌తో ఓ పేద విద్యార్థిని కార్పొరేట్ స్థాయి మార్కులు సాధించి సత్తా చాటింది. ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేని స్థితిలో.. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవించే కుటుంబంలో నుంచి వచ్చిన హరిణి అనే విద్యార్థిని స్టేట్‌లో ఉన్న హైస్కూల్ ప్లస్‌లలో ప్రథమస్థానం సాధించి ఔరా అనిపించింది. జి.కొండూరు: ‘మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును మాత్రం మన దగ్గర నుంచి ఎవరూ తీసుకోలేరు చిన్నప్పా’ ఇది ఇటీవల వచ్చిన ఓ సినిమాలోని డైలాగ్. ఇదే సిద్ధాంతంతో బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదల్లో అక్షరాస్యత పెంచి విద్యా వంతులను చేస్తే ఉన్నత స్థానాలకు చేరుకొని సమాజంలో గౌరవంగా బతుకుతారనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఈ సంస్కరణలలో భాగంగానే పేద విద్యార్థులు పదో తరగతి అనంతరం చదువు ఆపకూడదనే లక్ష్యంతో ఇంటర్ విద్యను చేరువ చేసేందుకు ప్రతి మండలానికి ఇంటర్ కళాశాల కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. 2022–23 విద్యా సంవత్సరానికి గానూ హైస్కూలు ప్లస్‌లను ప్రవేశపెట్టారు. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. ఇటీవల వచ్చిన ఇంటర్ ఫలితాల్లో మైలవరం ఎంబీఎం గరల్స్ హైస్కూలు ప్లస్‌లో చదివిన భూక్యా హరిణి అనే విద్యార్థిని స్టేట్‌లో ఉన్న హైస్కూల్ ప్లస్‌లలో ప్రథమస్థానం సాధించి ప్రైవేటు కళాశాలలకు సైతం సవాలు విసిరింది. ఆది నుంచి తెలుగు మీడియం చదివిన హరిణి ఇంటర్లో ఇంగ్లిష్ మీడియంలో చేరి అసాధారణ ఫలితాలను సాధించి అబ్బుర పరిచింది. నిరుపేద కుటుంబం నుంచి.. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండల పరిధి వెదురుబీడెం గ్రామానికి చెందిన భూక్యా హరిణి తండ్రి గోపి రోజువారీ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోసిస్తున్నాడు. ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో గ్రామ శివారులోని మామిడితోటలోని రేకులషెడ్డులో నివాసం ఉంటున్నారు. హరిణి తల్లి దేవి అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటారు. హరిణికి తమ్ముడు పూర్వా దుర్గాప్రసాద్ ఉన్నాడు. ఇతను ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. నిరుపేద కుటుంబం కావడంతో హరిణి చదువంతా ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగింది. సొంత గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదివి, మైలవరం ఎంబీఎం గరల్స్ హైస్కూల్లో తొమ్మిది, పది తరగతులను పూర్తి చేసింది. పదో తరగతిలో 498 మార్కులు సాధించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేటు కళాశాలలో చదివే స్తోమత లేక ఇదే పాఠశాలలో 2023–24 విద్యా సంవత్సరంలో ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ చేరింది. ఇటీవల వచ్చిన ఫలితాల్లో 978మార్కులతో రాష్ట్రంలో ఉన్న 294హైస్కూల్ ప్లస్‌లలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇదే పాఠశాల నుంచి ఇంటర్ బైపీసీలో 976 మార్కులతో పటాన్ సాజిదా కాతూన్ అనే విద్యార్థిని రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇంటర్ ఫలితాల్లో హైస్కూల్ ప్లస్ విద్యార్థిని సత్తా మాజీ సీఎం జగన్ తీసుకొచ్చిన విద్యా సంస్కరణల ఫలితం ఇంటర్ విద్య కోసం గత ప్రభుత్వంలో హైస్కూల్ ప్లస్‌లు ఏర్పాటు మట్టిలో మాణిక్యాలకు వరంలా మారిన కాన్సెప్ట్ ప్రోత్సాహమిస్తే వైద్య విద్య చదువుతానంటున్న హరిణిహైస్కూల్ ప్లస్ అభివృద్ధి ఇలా.. రాష్ట్రంలో ఉన్న హైస్కూల్ ప్లస్‌లలో ఇంటర్ ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన మైలవరం ఎంబీఎం గరల్స్ హైస్కూల్ ప్లస్‌కు గత ప్రభుత్వ హయాంలో రూ.229.30లక్షలను కేటాయించి అదనపు గదులను నిర్మించారు. వీటితో పాటు నాడు–నేడు కింద ఆధునిక వసతులను కల్పించారు. పాఠశాల తరగతులకే సరిపడా గదులు లేని ఈ పాఠశాలను ఇంటర్ విద్యకు సైతం సరిపడా గదులు నిర్మించడంతో పాటు కళాశాల వాతావరణం ఉట్టిపడేలా తీర్చి దిద్దారు. -
దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి సన్నిధిలో నిత్యం జరిగే అన్నప్రసాద వితరణ నిమిత్తం పలువురు దాతలు బుధవారం విరాళాలు అందజేశారు. కాకినాడ జిల్లా జగన్నాథగిరికి చెందిన కె. వెంకట నాగేశ్వరరావు రూ. లక్ష, ఆయన కుటుంబ సభ్యులైన కె. వెంకట లక్ష్మి పేరిట రూ. లక్ష, కేపీ శ్రీదేవి పేరుతో మరో రూ. లక్ష కలిపి మొత్తం రూ.3 లక్షలు, విజయవాడ రూరల్ మండలం గొల్లపూడికి చెందిన ఎం. సురేష్ రూ. లక్ష విరాళంగా ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు దాతలు, వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అలాగే అమ్మవారి చిత్రపటాలు, ప్రసాదాలు అందజేశారు. విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలుభవానీపురం(విజయవాడపశ్చిమ): సంకట హర చతుర్థి సందర్భంగా ఇంద్రకీలాద్రిపైగల శ్రీదుర్గామల్లేశ్వర స్వామి సన్నిధిలోని యాగశాలలో బుధవారం శ్రీవిఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతికి అభిషేకం చేసి హోమం జరిపించారు. మానవులను కష్టాల నుంచి గట్టెక్కించేది సంకట హర చతుర్థి పూజ అని, వినాయకునికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి అని అర్చకస్వాములు భక్తులకు వివరించారు. అలాగే సంకట హర చతుర్థి పూజ ఆచరించడం వల్ల మనిషి జాతకంలోని సమస్యలు తొలిగిపోయి అన్ని పనుల్లో ఏర్పడే సంకటాలు సమసిపోయి, సఫలత చేకూరుతుందని వివరించారు. రాష్ట్ర కమిటీ ఎన్నికభవానీపురం(విజయవాడపశ్చిమ): సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల (1962) కాంట్రా క్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా బి.నరేష్ నాయక్ (కృష్ణాజిల్లా) ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఇటీవల జరిగిన మహాసభలో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఎ.వి.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా ఎం.ఎన్.వి.శ్రీధర్ (ఎన్టీఆర్ జిల్లా), కోశాధికారిగా జె.వెంకటేశ్వర్లు (తిరుపతి బాలాజీ), ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.సురేష్ (విజయనగరం), ఉపాధ్యక్షుడిగా జి.రోహిత్ కుమార్ (శ్రీకాకుళం), మల్లిక (కాకినాడ), డి.వి.సతీష్ (వెస్ట్ గోదావరి), షేక్ షరీఫ్ (పల్నాడు), కార్యదర్శులుగా ఎ.హేమసుందర్ (తూర్పు గోదావరి), పెదపాటి సురేష్ (అంబేడ్కర్ కోనసీమ), కె.రవి (ఏలూరు), సి.సంతోష్ కుమార్ (కడప) ఎన్నియ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఐ.లక్ష్మీనారాయణ, ఆర్.నరేష్, టి.దుర్గాప్రసాద్, కె.రాకేష్, పి.నాగేంద్రబాబు, బి.రవికిరణ్, కె.రమేష్, ఆర్.గోపాలరావు, సీహెచ్ చిట్టిబాబు, బి. గోవింద నాయక్, ఎం.సతీష్ కుమార్, టి.జోహారి, మోహన్‌ను ఎన్నుకున్నారు. కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి జగ్గయ్యపేట అర్బన్: రైతులు దళారీలు, మిల్లర్ల చేతిలో నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి అన్నారు. జగ్గయ్యపేటలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడు ధాన్యానికి రూ. 2,320, సాధారణ రకం రూ. 2,300 మద్దతు ధర ప్రకటించిందని, రైతులు పీపీసీ ద్వారా ధాన్యం అమ్ముకోవాలని సూచించారు. గోనె సంచులు, హమాలీల ఖర్చులు, రవాణా ఖర్చులు కూడ ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. రానున్న రెండు మూడు రోజులు వర్ష సూచన ఉన్నందున రైతులు తమ వరి కోతలను వాయిదా వేసుకోవాలన్నారు. ఆరబెట్టిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడం లేదా సురక్షిత ప్రాంతాలకు చేరవేసి, తడవకుండా భద్రపరచుకోవాలని సూచించారు. ఏడీఏ భవాని, ఏవో వరలక్ష్మి, రైతులు పాల్గొన్నారు. -
ఘనంగా దాసాంజనేయ స్వామి దేవస్థానం ప్రతిష్ట
హనుమాన్‌జంక్షన్ రూరల్:బాపులపాడు మండలం వీరవల్లిలో కృష్ణా మిల్క్ యూనియన్‌కు చెందిన ‘ప్రాజెక్టు కామథేను’ పాల ఫ్యాక్టరీ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయ స్వామి దేవస్థానం ప్రతిష్టా మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట కనులపండువగా సాగింది. మహోత్సవం తిలకించేందుకు పాడి రైతులు, పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు దంపతుల చేతుల మీదగా ఆలయ శిఖర ప్రతిష్టను చిన్న జీయర్ స్వామి నిర్వహించారు. సీతారాముల పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి దేవస్థానం నుంచి తెచ్చిన ముత్యాల తలంబ్రాలను భక్తులను అందించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ఆయన ప్రవచనాన్ని అందించారు. కృష్ణాజిల్లా ప్రాంతంలో గోవుల పెంపకం మరింత పెరగాలని, గో సంపద వృద్ధి చెందటం ద్వారా నేల సారాన్ని పెంచుకునే కృషి చేయాలి సూచించారు. పాల సహకార సొసైటీలకు యూనియన్ తరుపున బోనస్‌లను చిన్న జీయర్ స్వామి చేతుల మీదగా పంపిణీ చేశారు. అనంతరం మహా అన్నప్రసాద వితరణ జరిగింది. కృష్ణా మిల్క్ యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వర బాబు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు, ఇతర పాలకవర్గ సభ్యులు, పాల సహాకార సంఘాల అధ్యక్షులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చౌటుప్పల్: ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని గణేష్‌నగర్ కాలనీలో మంగళవారం రాత్రి జరిగింది. బుధవారం స్థానిక సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామానికి చెందిన పందేటి చలపతిరావు(38) చౌటుప్పల్ పరిధిలోని దివీస్ ఫార్మా కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. గత 20 ఏళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని గణేష్‌నగర్ కాలనీలో నివాసముంటున్నాడు. మంగళవారం సాయంత్రం చలపతిరావు భార్య భవిత ప్రార్థన నిమిత్తం స్థానికంగా చర్చికి వెళ్లింది. కుమార్తె ఇంట్లోనే ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జీవితంపై విరక్తితో చలపతిరావు రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లోని మరో గదిలోకి వెళ్లి సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రార్థన ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన భవిత తన భర్త ఆత్మహత్య చేసుకోవడాన్ని చూసి భోరున విలపించింది. మృతుడి తండ్రి వీరరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. భార్య, కుమారుడు అదృశ్యంపై కేసు పెనమలూరు: కానూరులో భార్య, కుమారుడు అదృశ్యమయ్యారని భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... కానూరు శివాలయం వీఽధికి చెందిన లంకె దుర్గాప్రసాద్, భార్య దుర్గాభవాని, 3 సంవత్సరాల కుమారుడితో ఉంటున్నాడు. ప్రైవేటు కంపెనీలో పని చేస్తాడు. ఈ నెల 14వ తేదీ రాత్రి దుర్గాప్రసాద్ ఫోన్ మాట్లాడుతుండగా కుమారుడు ఫోన్ కావాలని అల్లరి చేశాడు. ఈ విషయమై భార్యాభర్తలకు మధ్య గొడవ జరిగింది. రాత్రి దుర్గాభవాని, కుమారుడు ఇంట్లో నిద్రపోగా దుర్గాప్రసాద్ దగ్గరలో ఉన్న తల్లి ఇంట్లో నిద్రపోయాడు. అయితే 15వ తేదీ ఉదయం దుర్గాప్రసాద్ ఇంటికి రాగా భార్య, కుమారుడు కనిపించలేదు. తాను తిరిగి రానని భార్య ఇంటి గోడపై రాసింది. దుర్గాప్రసాద్ వెంటనే దుర్గాభవాని పుట్టిల్లు పామర్రుకు ఫోన్ చేయగా రాలేదని తెలిపారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలి: బుగ్గన
సాక్షి, విజయవాడ: రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘానికి వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర పర్యటనలో ఆ సంఘ ప్రతినిధులను కలిసిన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. పన్నుల వాటా లెక్కకు 2011 జనాభా లెక్కల పరిగణన 1971 తర్వాత పలు రాష్ట్రాలలో జనాభా తగ్గింది. ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. కాబట్టి పన్నుల వాటాలో ప్రత్యేక బోనస్ కూడా ఇవ్వాలని ఆర్థిక సంఘానికి బుగ్గన నివేదించారు.పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలి:16వ ఆర్థిక సంఘానికి పార్టీ తరపున విజ్ఞప్తి చేశాం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా గురించి ప్రస్తావించాం. 14వ ఆర్థిక సంఘంలో డాక్టర్ వైవీ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటాను తొలిసారిగా 32 శాతం నుంచి 42 శాతం వరకు పెంచుతూ సిఫార్సు చేశారు. ఆ తర్వాత 15వ ఆర్థిక సంఘం డాక్టర్ ఎన్‌కె సింగ్ ఉన్నప్పుడు 41 శాతం ఇచ్చారు.అయితే 42 శాతం సిఫార్సు చేసినా, వాస్తవంగా నిధులు వచ్చే సరికి అందులో 10 శాతం తగ్గుతుంది. అంటే మనకు నికరంగా వచ్చేది 32 శాతమే. ఎందుకంటే కేంద్రం సెస్సులు, సర్ఛార్జ్ల పేరుతో ఆ వాటాలో కోత పెడుతుంది. అందుకే మా పార్టీ నుంచి ఏం కోరామంటే, పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వమని కోరాము. ఎందుకంటే, రాష్ట్రాలకు అవసరాలు, ఖర్చులు ఉంటాయి అని చెప్పాం. అందుకే కనీసం 50 శాతం ఇస్తే, 40 శాతం నిధులు వస్తాయి కాబట్టి.ఆ రాష్ట్రాలకు ప్రత్యేక బోనస్ ఇవ్వాలి:రాష్ట్రాలకు పన్నుల వాటా నిర్ధారణకు గతంలో 1971 జనాభా లెక్కలు తీసుకునే వారు. కానీ, ఇప్పుడు 2011 జనాభా లెక్కలు పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే పలు రాష్ట్రాలు అనేక విధానాల ద్వారా జనాభా తగ్గించాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు ఇప్పుడు నష్టం జరుగుతోంది. కాబట్టి, కుటుంబ నియంత్రణ బాగా అమలు చేసి, జనాభా తగ్గించుకున్న రాష్ట్రాలకు ప్రత్యేకంగా బోనస్ ఇవ్వాలని కోరాం.2014–19 మధ్యలోనే రాష్ట్ర అప్పులు ఎక్కువ:రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ తర్వాత 14,15 ఆర్థిక సంఘాలు వచ్చాయి. 14వ ఆర్థిక సంఘం సమయంలో టీడీపీ, 15వ ఆర్థిక సంఘం ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంది. ఒక కఠోర వాస్తవం ఏమిటంటే.. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2014–19 మధ్యలోనే రాష్ట్ర అప్పులు దారుణంగా పెరిగాయి. కానీ, గత కొన్నేళ్లుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, వైయస్సార్సీపీ ప్రభుత్వంపై దారుణంగా దుష్ప్రచారం చేసింది. ఇంకా చేస్తోంది.రాష్ట్ర విభజన తర్వాత, టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2014–19 మధ్యలోనే ఎక్కువ అప్పు చేశారు. అప్పుడే అప్పు శాతం ఎక్కువ. 2019–24 మధ్య కోవిడ్ ఉన్నా, వైఎస్పార్సీపీ ప్రభుత్వంలో చేసిన అప్పు శాతం తక్కువ. ఆ లెక్కలు కేంద్ర ప్రభుత్వ విభాగాలే తేల్చి చెబుతున్నాయి. అన్నింటికీ పక్కాగా గణాంకాలు ఉన్నాయి. అయినా ఇష్టానుసారం అప్పుల లెక్కలు చెప్పారు. రూ.14 లక్షల కోట్లు అని, రూ.12 లక్షల కోట్లు అని నోటికొచ్చిన అంకెలు చెప్పారు.ఇప్పుడు వారంతా ఏమయ్యారు?:వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మంగళవారం అప్పు చేస్తున్నారని, రాష్ట్రం మరో శ్రీలంక అవుతోందని విషం చిమ్మారు. అదే పనిగా దుష్ప్రచారం చేశారు. మరి ఇప్పుడు వారంతా ఏమయ్యారు?. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంత కంటే దారుణంగా ఎక్కువ అప్పు చేస్తోంది. పైగా, ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ ఉన్నా, ఒక్క పథకం కూడా ఆపలేదు.5 ఏళ్లలో ఏం కడతారు?:మనకు అధికారం ఇచ్చింది 5 ఏళ్లకా? అంత కంటే ఎక్కువా?. ఆ సమయంలో ఒక రాజధాని కడతారా? లేక ఒక నగరం కడతారా?. అసలు మనకున్న శక్తి ఎంత?. మన దగ్గర ఒక బైక్, ఒక కారు కొనే డబ్బులు ఉన్నప్పుడు విమానం కొంటానంటే ఎలా? ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తోంది అదే. మరి ఆ అప్పు తిరిగి ఎవరు చెల్లించాలి. మా పార్టీ విధానం అప్పుడైనా, ఇప్పుడైనా ఒక్కటే. సామాన్యులు బాగుండాలి. వారు అభివృద్ధి చెందాలి. వారికి ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు కావాలి అని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. -
ఏపీని ఏం చేయాలనుకుంటున్నావ్ బాబూ: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ‘‘రాజధాని కోసం రైతుల నుంచి దాదాపు 34 వేల ఎకరాలు తీసుకున్నారు. అంతకు ముందే వాగులు, కొండలు, రోడ్లు అన్నీ కలిపి దాదాపు 58 వేల ఎకరాల విస్తీర్ణం ఉంది. సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది 2700 ఎకరాలు మాత్రమే. తాత్కాలికం పేరుతో సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. ఇప్పుడు అదనంగా మరో 44 వేల ఎకరాలు తీసుకుంటామని ప్రకటించారు. రాజధాని కోసం 31 వేల కోట్లు అప్పుచేశారు.. ఇంకా 69 వేల కోట్లు అవసరమంటున్నారు. ఇలాంటి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు నిలదీశారు.‘‘రెండు కళ్ల సిద్ధాంతంతో పరోక్షంగా ఉమ్మడి ఏపీ విభజనకు దోహదపడ్డారు. మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా హమీని ఎగ్గొట్టేసింది. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నా చంద్రబాబు సరైన పోరాటం చేయడం లేదు. ప్రజలకు ఉపయోగపడేవి వదిలేసి అవుటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు అంటారేంటి చంద్రబాబు. హైపర్ లూప్ అనే రైలు అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనే లేదు. ఏపీలో హైపర్ లూప్ రైలుకు డీపీఆర్ చేయమని చెప్పడం చంద్రబాబు అనాలోచిత.. తొందరపాటు చర్య. పెద్ద పెద్ద ధనవంతులకు, కార్పొరేట్లను బాగుచేయడం కోసం ఇలాంటివి చేయడం సరికాదు’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.‘‘గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో పేదలను గాలికి వదిలేశారు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్లకు మేలు జరిగేలా పనిచేస్తున్నారు. మీ నిర్ణయాల వల్ల ప్రజలు, రైతులు, విద్యార్ధులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. 58 వేల ఎకరాలుంటే మళ్లీ 44 వేల ఎకరాలు తీసుకోవడం దేనికి. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ 44 వేల ఎకరాలు తీసుకుంటున్నారా చంద్రబాబు. పొలం ఉన్న రైతు అమ్ముకోలేడా... రైతు తరపున మీరు అమ్ముతారా?. ప్రభుత్వం ఉన్నది.. రియల్ ఎస్టేట్ వాళ్లను బాగుచేయడానికా?. 40 అంతస్తుల బిల్డింగ్లు ప్రజలకు ఒరిగేదేంటి. ప్రజలకు కావాల్సింది ఎత్తైన భవనాలు కాదు.. మంచి పరిపాలన. ప్రజలకు మేలు చేయకుండా మెట్రో రైలు జపం చేయడమెందుకు?’’ అంటూ శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు.‘‘ఏపీలో ఉన్న ఆరు ఎయిర్ పోర్టులు సరిపోవా.. మళ్లీ కొత్తవి పెట్టడం దేనికి?. అమరావతిలో 5 వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఎవరడిగారు.. ఎవడికి కావాలి. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ పోర్టు కావాలని ఎవరడిగారు. శ్రీకాకుళంలో నాలుగైదు ఎకరాలున్న వాళ్లు కూడా బెజవాడలో తాపీ పనులు చేసుకుంటున్నారు. శ్రీకాకుళంలో కావాల్సింది ఎయిర్ పోర్టు కాదు.. పంటలకు సాగునీరు. ఉద్ధానంలో కిడ్నీ వ్యాధితో రోజుకొకరు చనిపోతుంటే నీకు కనిపించడం లేదా?. చంద్రబాబు ఆలోచనలో ఇప్పటికైనా మార్పు రావాలని నేను కోరుతున్నా. పి4 గురించి తర్వాత ముందు సూపర్ సిక్స్ గురించి మాట్లాడండి చంద్రబాబు. కేంద్రం ఇచ్చేది కాకుండా రైతులకు 14 వేలు ఇస్తామన్నారు.. ఏమైపోయింది ఆ హామీ?. మెట్రోరైళ్ల పై ఉన్న శ్రద్ధ రైతులపై ఎందుకు లేదు చంద్రబాబూ’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.చంద్రబాబు పి4 స్కీంపై సెటైర్లు చంద్రబాబు పి4 స్కీంపై వడ్డే శోభనాద్రీశ్వరరావు సెటైర్లు వేశారు. పి4 విధానం అంటున్నారు మంచిదే. డబ్బున్నవాళ్లు పేదలకు సాయం చేయడం ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. రాష్ట్రంలోనే అతిపెద్దవైన మూడు విద్యాసంస్థలు మీ నాయకులవే. మీకు చేతనైతే నారాయణ, భాష్యం విద్యాసంస్థల్లో పది శాతం పేద విద్యార్ధులకు సీట్లు ఇప్పించండి. పేదల కోసం హెరిటేజ్ నుంచి మీరేమీ ఇవ్వరా? మీ హెరిటేజ్ నుంచి మధ్యాహ్న భోజనం విద్యార్థులకు పాలు, పెరుగు, మజ్జిగ ప్యాకెట్లైనా ఇవ్వొచ్చు కదా?పేదల కోసం హెరిటేజ్ కూడా మేలు చేస్తుందని ప్రజలకు తెలియజేయండి. మీరు చేస్తే మిమ్మల్ని చూసి మరికొంతమంది సాయం చేసేందుకు ముందుకు వస్తారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు వ్యాఖ్యానించారు. -
విజ్ఞాన జ్యోతి.. అంబేడ్కర్ స్ఫూర్తి
ఓ సామాజిక విప్లవం.. ఓ తాత్విక అధ్యయనం.. ఓ అభ్యుదయ భావ మూర్తిమత్వం.. అణగారిన ప్రజల గుండెల్లో వెలుగు దివ్వె, భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని వక్తలు కొనియాడారు. సోమవారం ఆయన జయంతి సందర్భంగా వాడవాడలా అంబేడ్కర్ విగ్రహాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంతోపాటు అంబేడ్కర్ స్మృతి వనం వద్ద నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. రాజ్యాంగ రూప శిల్పిగా జాతికి చేసిన మేలులను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ పొలిటికల్ ఎడ్వైజరీ కమిటీ సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. గౌతంరెడ్డి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కాలే పుల్లారావు, ఎమ్మెల్సీ రుహుల్లా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ నేత పోతిన వెంకట మహేష్, పలువురు కార్పొరేటర్లు, ఎస్సీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
దుర్గగుడి అభివృద్ధి పనులకు విరాళం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకంతో పాటు పలు అభివృద్ధి పనులకు గుంటూరుకు చెందిన వై. మధుసూదనరావు విరాళం అందజేశారు. నిత్యాన్నదానానికి రూ. లక్ష, బంగారు గోపురం అభివృద్ధి పనుల నిమిత్తం మరో రూ. లక్ష, దేవస్థానంలో గో సంరక్షణ నిమిత్తం రూ.లక్ష, శివాలయం అభివృద్ధి పనులకు రూ.15,101 కలిపి మొత్తం రూ.3,15,101 విరాళంగా సోమవారం ఆలయ అధికారులను కలిసి అందించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులకు అమ్మవారి దర్శనం కల్పించి వేద పండితులతో ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. అనంతరం దాతకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. వైభవంగా ద్వాదశ ప్రదక్షిణలు భవానీపురం(విజయవాడపశ్చిమ): చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపైగల దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి నిర్వహించిన ద్వాదశ ప్రదక్షిణలు వైభవంగా జరిగాయి. కల్యాణోత్సవం, నదీ విహారం అనంతరం స్వామివారి ఆలయం చుట్టూ ద్వాదశ అంశాలతో (12) ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ద్వాదశ ప్రదక్షిణల్లో పంచ వాయిద్యం, వేద పఠనం, రుద్ర సూక్తం, స్త్రోత్ర పఠనం, భేరి, కాహలకం (కొమ్ము బూర), కాంస్య నాదం, మురళీ నాదం, గానం, నృత్యం, మౌనం అనే అంశాలతో ప్రదక్షిణలు చేశారు. అనంతరం అద్దాల మండపంలో పవళింపు సేవ నిర్వహించారు. ఉద్యోగోన్నతుల విషయంలో అన్యాయం విజయవాడరూరల్: పంచాయతీరాజ్ శాఖ మండల పరిషత్, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ అధికారులు(ఏఓ)గా పని చేస్తున్న వారికి ఉద్యోన్నతులు కల్పించే విషయంలో ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏఓల సమావేశం తీర్మానించింది. సోమవారం విజయవాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఏపీ పంచాయతీరాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశం అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన జరిగింది. ఎంపీడీఓలుగా ఉద్యోగోన్నతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం జీఓ–35 ద్వారా ఈఓపీఆర్డీలకు రెండు వంతులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు ఒక వంతు చొప్పున కేటాయించడం అన్యాయమని సమావేశం పేర్కొంది. జీఓ–35ని సవరించాలని సమావేశం డిమాండ్ చేసింది. పి.కృష్ణప్రసాద్, ఎస్కే బాబూరావు, రవికుమార్, విజయ్‌కుమార్, పలు జిల్లాల నుంచి ఏఓలు సమావేశంలో పాల్గొన్నారు. కొనసాగుతున్న కల్యాణోత్సవాలు జగ్గయ్యపేట: తిరుమలగిరిలో వేంచేసియున్న వాల్మీదకోద్భవ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారికి సోమవారం కలశ స్నాపనం, సప్తముని పూజా సదస్యం, మహానివేదనం, నిత్యహోమం, బలిహరణ, ఆస్థానోత్సవ కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు తిరునగరి రామకృష్ణమాచార్యులు, పరాంకుశం వాసుదేవాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ సదస్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ చైర్మన్ భరద్వాజ్, ఏసీ ప్రసాద్, వేద పండితులు పాల్గొన్నారు. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. -
రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్
రైతుకు నష్టం కలిగిస్తే సహించేది లేదు విజయవాడరూరల్: రైతుకు నష్టం, నష్టం కలిగితే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే మిల్లులను డీ ట్యాగ్ చేస్తామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఇతర జిల్లాల మిల్లర్ల ద్వారా సేకరిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌తో కలిసి గొల్లపూడి మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం రాయనపాడు, పైడూరుపాడులో పర్యటించి, రైతుల ధాన్యపు రాశులను పరిశీలించి మాట్లాడారు. ప్రత్యేక వెసులుబాటు.. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి బుడమేరు వరదల కారణంగా నష్టపోయిన రైతులకు దాళ్వా పంట ఆలస్యమైనందున ఈ పంటలో నమోదైన ఖరీఫ్‌ని రబీలోకి వచ్చేలా వెసులుబాటు కల్పించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర మేరకు మిల్లర్లు ధాన్యం సేకరించడం లేదని, అదే విధంగా తరుగు పేరిట అధిక కోతలు విధిస్తున్నట్లు కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లఘించే మిల్లర్లపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో లక్ష టన్నులు అయినా సేకరిస్తామని, రైతులు ఆందోళనతో తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. విజయవాడ ఆర్డీఓ కావూరి చౌతన్య, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఎం.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు మట్టిపాలు!
● ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా తవ్వకాలు ● అనుమతులు లేకుండా దోపిడీ ● ఎంయూడీఏ, బుడమేరు, చెరువుల నుంచి భారీగా తరలింపు ● పట్టించుకోని అధికారులు పేట్రేగిపోతున్న మట్టి మాఫియా సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా నిర్వహిస్తూ రూ. కోట్లు గడిస్తోంది. వేసవి కాలం కావడంతో చెరువులు, నదులు, వాగులు, కొండలు, గుట్టల్లో మట్టిని యథేచ్ఛగా తవ్వేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండదండలు ఈ మాఫియాకు ఉండటంతో, అధికారులు సైతం తమకేమి పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రైవేటు వెంచర్లు, కట్టడాలు, రోడ్డు పనులకు భారీగా మట్టి తరలించి, కోట్ల రూపాయలను కొల్లగొడుతోంది. అధికారం మనదే.. లోడెత్తండి.. ● మైలవరం నియోజకవర్గంలో యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. జి.కొండూరు మండల పరిధి కోడూరు చెరువు నుంచి ఇటీవల అక్రమంగా మట్టిని ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రెడ్డిగూడెం మండల పరిధి రెడ్డిగూడెం, రంగాపురం, కొత్తనాగులూరు, జి.కొండూరు మండల పరిధి చిన్ననందిగామ గ్రామాల నుంచి గతంలో డంప్ చేసిన మట్టిని ఇటుక బట్టీలకు అక్రమ రవాణా చేస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. నియోజకవర్గ ప్రజా ప్రతినిధి బంధువు అండతో దందా జరుగుతోందని సమాచారం. ● జగ్గయ్యపేట నియోజకవర్గంలో జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో అక్రమ గ్రావెల్ రవాణా జరుగుతోంది. అధికార పార్టీ నాయకులు రాత్రి వేళల్లో టిప్పర్లు, ట్రాక్టర్లతో రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో 65వ నంబర్ జాతీయ రహదారి సూర్యాపేట నుంచి కోదాడకు 6 రోడ్ల విస్తరణలో భాగంగా గ్రావెల్‌ను రాత్రి వేళల్లో తరలిస్తున్నారు. వత్సవాయి మండలంలో భీమవరం సమీపంలోని కొంగర మల్లయ్యగట్టు నుంచి రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అనుచరులు ఈ మట్టి దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ● తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు మండలం గోపాలపురంలో కొండను గుల్ల చేస్తున్నా రు. విస్సన్నపేట మండలంలో కొండపర్వలో భారీగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. రోజుకు వందల ట్రక్కుల మట్టిని తెలంగాణకు తరలిస్తున్నారు. ట్రిప్పర్‌కు రూ.12వేల–రూ.15వేలు వసూలు చేస్తున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు, పొలాల మెరక చేయడానికి, రోడ్లు నిర్మించడానికి విక్రయిస్తున్నారు. విజయవాడ రూరల్ మండల పరిధిలో పోలవరం కుడికాలువ మట్టిని టీడీపీ నేతలు రాత్రివేళల్లో అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. తిరువూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి ప్రోద్బలంతోనే దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. -
మహనీయుడు అంబేడ్కర్
భవానీపురం(విజయవాడపశ్చిమ): సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం ప్రాతిపదికన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని రాష్ట్ర ఆరోగ్య, వైద్య శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశతో కలిసి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దగల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ సామాజికవేత్తగానే కాకుండా ఆర్థికవేత్తగా, న్యాయనిపుణుడిగా అంబేడ్కర్ దేశానికి విశిష్ట సేవలు అందించారని అన్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే మనది భిన్నమైన రాజ్యాంగమని, బడుగు, బలహీనవర్గాల ఉన్నతికి వీలుగా ఎంతో విపులంగా రచించారని కొనియాడారు. అంబేడ్కర్ స్ఫూర్తితో ఉన్నత శిఖరాలకు.. స్వయం కృషి, స్వీయ ప్రతిభతో అత్యున్నత స్థాయికి ఎదిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచనలు చదవటానికి మన జీవిత కాలం సరిపోదని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ జగదీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, దళిత నాయకులు జి. కిశోర్‌కుమార్, ఎం. క్రాంతి, ఎన్. బాలాజి, బి. దేవదాస్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ -
నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి
తిరువూరు: భారీ వర్షాలు, ఈదురుగాలులతో నియోజకవర్గంలో రైతులు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తిరువూరు మండలంలో కురిసిన వడగళ్లవానకు తడిసిన ధాన్యాన్ని ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. గత వారం రోజుల్లో రెండుసార్లు వీచిన ఈదురు గాలులతో రైతులు పూర్తిగా నష్టపోయారని, మామిడి, బొప్పాయి, వరి, మొక్కజొన్న తదితర పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని స్వామిదాసు పేర్కొన్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని చెప్పారు. ఆరుగాలం కష్టపడినా ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నిండా మునిగారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకానికి తరలించగా తడిసిన ధాన్యాన్ని, కాకర్లలో మామిడితోటల్లో రాలిన కాయలను పరిశీలించారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తాళ్లూరి నవీన్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి స్వామిదాసు -
ప్రమాదంలో పడిన రాజ్యాంగం
భవానీపురం(విజయవాడపశ్చిమ): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం నేడు పెను ప్రమాదంలో పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ పాలనలో రాజ్యాంగాన్ని మార్చివేసేందుకు అనేక కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ పార్లమెంట్ స్థానాలు వస్తే అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనుస్మృతి రాజ్యాంగాన్ని తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారని అన్నారు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచి లౌకికవాదాన్ని మట్టు పెట్టేందుకు ఇటీవల ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లు నిదర్శనమని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకుని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రజాస్వామ్యవాదులు ప్రతిజ్ఞ చేయాలని, అదే అంబేడ్కర్‌కు నిజమైన నివాళి అన్నారు. సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ లౌకిక వ్యవస్థకు పెద్ద పీట వేసే దేశ ప్రజలు అయోధ్య ఎన్నికతో బీజేపీకి బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవారు కాలగర్భంలో కలిసిపోతారని అన్నారు. డీ లిమిటేషన్ పేరుతో ఉత్తర, దక్షిణ భారత దేశాన్ని విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద రాజకీయాలు లౌకిక వ్యవస్థకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు లంకా దుర్గారావు, నక్కా వీరభధ్రరావు, బుట్టి రాయప్ప, పంచదార్ల దుర్గాంబ, ఎం. సాంబశివరావు, కేవీ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ -
రైతులను ఇబ్బంది పెడితే బ్లాక్‌లిస్టులో పెడతాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెడతామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. నగరంలోని కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఆయన జిల్లాలోని రైస్ మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతుల నుంచి మిల్లర్లపై అనేక ఆరోపణలు వస్తున్నాయని, ఇప్పటికై నా పద్ధతి మార్చుకోవాలని లేదంటే చర్యలు తప్పవన్నారు. మిల్లర్ల విషయంలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నప్పటికీ కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. తేమశాతం, నూకలు సాకు చూపి రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదన్నారు. మిల్లర్లు పద్ధతి మార్చుకుని ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దళారీ వ్యవస్థను సహించేది లేదని అన్నారు. ధాన్యం అన్ లోడింగ్ విషయంలో కాలయాపన చేయయడం రైతును ఇబ్బంది పెట్టడమేనని, 24 గంటల్లో మార్పు రావాలన్నారు. పంట దిగుబడి విషయంలో రైతు సంతోషంగా ఉన్నాడని, కొనుగోలు జరిగిన 24 గంటల్లో నగదు రైతు ఖాతాలకు జమ అవుతున్నప్పటికీ, మిల్లర్ల విషయంలో రైతు అసంతృప్తిని అర్థం చేసుకుని పూర్తి సహకారం అందించాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ రబీలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరగటం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేసినా, దళారీ వ్యవస్థను ప్రోత్సహించినా సంబంధిత మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. సమావేశంలో ఆర్డీఓ కె.చైతన్య, పౌరసరఫరాల శాఖ డీఎం ఎం.శ్రీనివాస్, మిల్లర్లు పాల్గొన్నారు. మిల్లర్లకు మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక -
చదువుల సరస్వతులకు సత్కారం
మచిలీపట్నంఅర్బన్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లాలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాల్లో ఉంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థినులను జిల్లా యంత్రాంగం ఘనంగా సత్కరిం చింది. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ జూనియర్ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 143 మందిలో 104 మంది ఉత్తీర్ణులు కాగా ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మొత్తం 79 మంది విద్యార్థులలో 73 మంది ఉత్తీర్ణత సాధించారు. 968 మార్కులు సాధించిన శ్యామలీల ఎస్సీ సంక్షేమ బాలికల వసతి గృహాల్లోని విద్యార్థినులు ఇంటర్ మొదటి సంవత్సరంలో 73 శాతం, ద్వితీయ సంవత్సరంలో 93 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎన్. శ్యామలీల అత్యధికంగా ఎంపీసీలో 968 మార్కులు సాధించింది. వొకేషనల్ ఎంపీహెచ్‌డబ్ల్యూలో కాకర రమ్య 964 మార్కులు, బైపీసీలో కె.మేఘన సంధ్య 954 మార్కులు, సీఈసీలో కుతాడ సిరి 926, వొకేషనల్ ఏజీటీలో పెద్ది రమామణి 910, సీఈసీలో బూర్ల లక్ష్మి 903 మార్కులు సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వొకేషనల్ ఎమ్మెల్టీ కోర్సులో దాసి వర్ష, వి.చంద్రిక 480, దండాబత్తిన వెన్నెల 475, బోయిన ఈశ్వరి నాగజ్యోతి 475 మార్కులు సాధించారు. వొకేషనల్ ఏజీటీ కోర్సులో చాట్రగడ్డ అనుష్క 478 మార్కులు, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులో ఎల్.షైనీ 473 మార్కులు, సీఈసీ కోర్సులో పుట్టి పూర్ణిమ 438, ముంగర మెర్రీ గోల్డ్ 416 మార్కులు సాధించారు. ఎంపీసీలో బదిన కొండలమ్మ 424, ఎ.సాయి నవ్యశ్రీ 420 మార్కులు సాధించారు. బైపీసీలో విశ్వనాథపల్లి కెంపు రత్నం 401 మార్కులు సాధించారు. విద్యార్థినులకు జ్ఞాపికలు ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 17 మంది ఎస్సీ సంక్షేమ బాలికల వసతి గృహాల్లోని విద్యార్థినులకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం అభినందన జ్ఞాపికలు అందజేశారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని ఎన్.శ్యామలీల(968)తో పాటు ఇతర విద్యార్థినులను అభినందించారు. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థినులు ఎస్సీ సంక్షేమ బాలికల వసతి గృహాల్లోని విద్యార్థినుల అత్యుత్తమ ప్రదర్శన ఇంటర్ మొదటి సంవత్సరంలో 73 శాతం ఉత్తీర్ణత ద్వితీయ సంవత్సరంలో 93 శాతం ఉత్తీర్ణత -
కాపర్ దొంగలు...కర్షకులకు సవాలు
జి.కొండూరు: కాపర్ దొంగలు రైతులకు తలపోటుగా మారారు. వ్యవసాయ బోర్లలో విద్యుత్ మోటార్లకు ఉండే కాపర్ కేబుళ్లను అందినకాడికి కోసి ఎత్తుకు పోతున్నారు. ఇవే ఘటనలు పదేపదే జరుగుతుండడంతో రైతులు తలలు బాదుకుంటున్నారు. కేబుళ్లకు అయ్యే ఖర్చు కన్నా మోటార్ల రిపేర్లకు అయ్యే ఖర్చు తమకు భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి కేబుళ్ల దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు. జి.కొండూరు మండల పరిధిలోని మునగపాడు, చెర్వుమాధవరం, సున్నంపాడు గ్రామాల్లో ఈ విధంగా తరచుగా విద్యుత్ కేబుళ్లను చోరీ చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. ఆ మూడు గ్రామాల్లో నిత్యం చోరీలే జి.కొండూరు మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీల పరిధిలో 4 వేల వరకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా చెర్వుమాధవరం, మునగపాడు, సున్నంపాడు గ్రామ పంచాయతీల పరిధిలో 450 వరకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఈ మూడు గ్రామాల పరిధిలో గత ఏడాదిన్నర కాలంగా వ్యవసాయ బోర్లలో ఉన్న విద్యుత్ మోటార్లకు స్టార్టర్ బోర్డు నుంచి మోటార్లలోకి విద్యుత్‌ను సరఫరా చేసే కాపర్ విద్యుత్ కేబుళ్లను కోసి చోరీ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వలన మోటార్లకు వందల అడుగులోతుకు వెళ్లిన కేబుళ్లు జారి బోర్లలో పడిపోతున్నాయి. ఈ క్రమంలో మోటార్లను పైకి తీసి కేబుళ్లను జాయింట్ చేసి మళ్లీ మోటార్లను అమర్చాల్సి వస్తుంది. ఈ పని చేయడానికి ఒక్కొక్క మోటారుకు రూ.3వేల వరకు ఖర్చు అవుతుంది. ఒక్కొక్క మోటారు వద్ద ఇప్పటికే మూడు నుంచి ఐదు సార్లు చోరీలు జరగడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. దొంగలు తాము చోరీ చేసిన కాపర్ విద్యుత్ కేబుళ్లను కరిగించి దాని నుంచి కాపర్‌ను వేరు చేసి కేజీ రూ.300 నుంచి 400 వరకు విక్రయిస్తారని తెలుస్తోంది. బయట మార్కెట్లో కాపర్ విలువ కేజీ రూ.800 నుంచి రూ.900 వరకు ఉన్న క్రమంలో చోరీ చేసిన కాపర్‌కి డిమాండ్ ఉండడంతో దొంగలు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిత్యం ఈ మూడు గ్రామాల్లోనే చోరీలు జరగడం పట్ల రైతులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ మూడు గ్రామాల్లోనే పాడి పశువులు, పందెం కోళ్లు సైతం చోరీలు జరగడంతో స్థానికంగా ఉండే వ్యక్తులే ఈ పని చేస్తున్నారనే ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ మోటార్ల వద్ద విద్యుత్ కేబుళ్ల చోరీ అస్తమానం రిపేర్ల ఖర్చుతో రైతులకు ఆర్థిక భారం వరుస చోరీ ఘటనలతో బెంబేలు దొంగలపై పోలీసులు దృష్టి పెట్టాలంటున్న రైతులు -
రాజధాని అభివృద్ధికి భూముల పరిశీలన
ఇబ్రహీంపట్నం: అమరావతి రాజధాని అభివృద్ధికి మండలంలోని జూపూడి, చినలంక, పెదలంక గ్రామాల్లోని లంక భూములను రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యేలు వసంత వెంకట కృష్ణప్రసాద్, బొండా ఉమామహేశ్వరరావు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ ప్రాంతంలో భూములు సేకరించి స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా మెరక ప్రాంత భూములు 2 వేల ఎకరాలు సేకరించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. త్వరగా అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇందుకు అవసరమైన హైలెవల్ కమిటీ వేసి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అమరావతి స్పోర్ట్స్ సిటీలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్రీడా విశ్వవిద్యాలయం నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అథ్లెట్లు, ఫిజియోథెరఫిస్టులు, కోచ్‌లకు కూడా ఇక్కడే శిక్షణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడతామని తెలిపారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కడసారి చూపునకు వస్తూ...
యడ్లపాడు: నాయనమ్మ మరణించిందని తెలిసి కడసారి చూపునకు వస్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ హృదయ విదారక ఘటన పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చిలకలూరిపేట పోలిరెడ్డిపాలెం ఎదురుగా ఉన్న లక్ష్మీనర్సింహ కాలనీకి చెందిన మక్కెన శ్రీనివాసరావు దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నవాడైన శివరామకృష్ణ(28)కి ఏడాదిన్నరక్రితం సమీప బంధువు నందినితో పెళ్లయింది. శివరామకృష్ణ విజయవాడలోనే ఉంటూ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం చిలకలూరిపేట రూరల్ మండలం అప్పాపురంలో ఉన్న నాయనమ్మ సుబ్బలమ్మ చనిపోయిందన్న వార్త తెలిసి చూసేందుకు బైక్‌పై బయలుదేరాడు. యడ్లపాడు గ్రామంలోని ఎన్ఎస్ఎల్ నూలుమిల్లు వద్ద ఫ్లై ఓవర్ వద్దకు రాగానే ఎదురుగా వెళ్తున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో బైక్ అదుపు తప్పి ఆ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో శివరామకృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో కుటుంబసభ్యులు శివరామకృష్ణను విజయవాడ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సుబ్బులమ్మ భౌతికకాయాన్ని చూసేందుకు వచ్చిన బంధుమిత్రులు సోమవారం ఉదయం ఆమెకు అప్పాపురం గ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. శివరామకృష్ణ భౌతికకాయానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం నానమ్మ మరణ వార్త విని వస్తుండగా దుర్ఘటన -
అంబేడ్కర్ ఆశయ స్ఫూర్తితో పాలించిన జగన్
భవానీపురం(విజయవాడ పశ్చిమ): అంబేడ్కర్ ఆశయ స్ఫూర్తితోనే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగించారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేసి అధికారంలో భాగస్వాములను చేశారని గుర్తు చేశారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ వైఎస్సార్ సీపీ పొలిటికల్ ఎడ్వైజరీ కమిటీ సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డిలతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రైవేటు పరం చేస్తే ఉద్యమిస్తాం : వెలంపల్లి విజయవాడ నడిబొడ్డున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేస్తే ఉద్యమిస్తామని వైఎస్సార్ సీపీ పొలిటికల్ ఎడ్వైజరీ కమిటీ సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. భారత రాజ్యాంగ రూపకల్పనతో దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేసిన అంబేడ్కర్ విగ్రహం విజయవాడలోనే ఉండాలని భావించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 125 అడుగుల ఎత్తులో నగర నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేశారని అన్నారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం చట్ట సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ అంబేడ్కర్ ఆలోచనలను తు.చ తప్పకుండా అమలు చేసిన ఏకై క ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని అన్నారు. గౌతంరెడ్డి మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగిపోయి సమసమాజం ఏర్పడాలన్నదే అంబేడ్కర్ ఆలోచనా విధానమని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కాలే పుల్లారావు, ఎమ్మెల్సీ రుహుల్లా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజరెడ్డి, వైఎస్సార్ సీపీ నేత పోతిన వెంకట మహేష్, పలువురు కార్పొరేటర్లు, ఎస్సీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
నగరంలో 23 చిత్ర యూనిట్ సందడి
గుణదల(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలో 23 చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం ప్రమోషన్లో భాగంగా ఏలూరు రోడ్డు గుణదలలోని రామ్స్ థియేటర్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో తేజ మాట్లాడుతూ.. మల్లేశం, మెట్రో వంటి హిట్ చిత్రాల దర్శకుడు రాజ్ రాచకొండ దర్శకత్వంలో 23 పేరుతో చిత్రం విడుదల చేస్తున్నామన్నారు. విభిన్నమైన పాత్రలతో కథనం నడుస్తుందని చెప్పారు. దర్శకుడు రాజ్ రాచకొండ మాట్లాడుతూ.. 1990 దశకంలో చిలకలూరి పేట ప్రాంతంలో జరిగిన ఒక బస్సు అగ్ని ప్రమాద ఘటనను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. గ్రామీణ నేపథ్యంలో తీసిన సన్నివేశాలు ఆలోచింప చేసే విధంగా ఉంటాయని తెలిపారు. కథాంశంలోని బస్సు ప్రమాదంలో సుమారు 20–23 మధ్య వయసు గల యువకులు మరణించారని అందుకే ఈ చిత్రానికి 23 అనే పేరు పెట్టామన్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు. కార్యక్రమంలో చిత్ర హీరోయిన్ తన్మయ పాల్గొన్నారు. పనిచేసే కంపెనీకి రూ.40 లక్షల టోకరాగాంధీనగర్(విజయవాడసెంట్రల్): పనిచేస్తున్న కంపెనీని మోసం చేసిన వ్యక్తిపై భవానీపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు... భవానీపురంలోని డనకన్స్ టీ కంపెనీలో చింత విశ్వేశ్వరరావు డిపో ఇన్చార్జిగా పనిచేస్తున్నాడు. కంపెనీ గోడౌన్‌లోకి వచ్చే రుజువు చూసుకోవడం, ధ్రువీకరించడం, కంప్యూటర్లో ఎంటర్ చేయడం అతని బాధ్యత. ఉత్పత్తులను కంపెనీ డిస్ట్రిబ్యూటర్లకు పంపి ఇన్వాయిస్లు తయారు చేస్తాడు. ఈ క్రమంలో గతేడాది ఫిబ్రవరి రిపోర్టులు హెడ్ ఆఫీసులో పరిశీలించగా 4.8 టన్నుల సరుకు తేడా వచ్చింది. దీనిపై విశ్వేశ్వరరావును వివరణ కోరగా సరిచేస్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత మరలా సరుకు తేడా గురించి ప్రశ్నించగా మోసానికి పాల్పడినట్లు అంగీకరిస్తూ కంపెనీకి లేఖ రాశాడు. అనంతరం ఫిజికల్ ఆడిట్ రిపోర్టు పరిశీలించగా 11 టన్నులు సుమారు రూ.40 లక్షల విలువగల సరుకు తేడా వచ్చింది. జోనల్ అకౌంటెంట్ సరుకులో ఎందుకు వ్యత్యాసం వచ్చిందని అడగ్గా దుర్వినియోగం చేసినట్లు అంగీకరిస్తూ కంపెనీకి మరో మెయిల్ పంపాడు. కంపెనీలో రూ.40 లక్షల విలువైన సరుకును తేడా చేసి మోసం చేశాడు. దీనిపై కంపెనీ ఏరియా బిజినెస్ మేనేజర్ అరిగెల వెంకట సత్య వరప్రసాద్ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
పెంతలన్ గేమ్‌కు విస్తృత ప్రచారం కల్పించాలి
పటమట(విజయవాడతూర్పు): పెంతలన్ గేమ్‌కు విస్తృత ప్రచారం కల్పించి రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా మోడరన్ పెంతలన్ అసోసియేషన్ కృషి చేస్తోందని ఆ యూనియన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. మోడరన్ పెంతలన్ జాతీయ క్రీడలు వచ్చే ఏడాది జనవరిలో మేఘాలయలో జరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనేలా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. మోడరన్ పెంతలన్ అసోసియేషన్ వార్షిక జనరల్ బాడీ సమావేశం నగరంలోని ఓ హోటల్లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు. రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. 2025 జనరల్ బాడీ అధ్యక్షుడిగా ఉజ్వల ప్రసాద్‌ను, చైర్మన్‌గా తనను, కోశాధికారిగా డింపుల్ కృష్ణ, కార్యదర్శి ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో ఎన్నుకున్నామన్నారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విజయవాడ, కాకినాడ, తిరుపతిలో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. -
మత్స్యకారుల్లో చైతన్యం తీసుకురావాలి
పటమట(విజయవాడతూర్పు): మత్స్యకారులు చైతన్యవంతులై ఐక్యంగా ఉద్యమించినప్పుడే మరిన్ని సంక్షేమ పథకాలు అందిపుచ్చుకుంటారని, సంఘాన్ని చైతన్యం చేయాలని మత్స్యకార సంఘం నాయకులు అర్జిలిదాస్, సైకం భాస్కరరావు, లకనం నాగాంజ నేయులు, కొల్లు శ్రీనివాసరావులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల సముదాయ సంఘాల నెట్ వర్క్(ఫిష్ కాన్) ఆద్వర్యంలో పటమట అయ్యప్ప నగర్‌లోని సంఘం కార్యాలయంలో మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధిపై ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మత్స్యకారులు ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి పట్టి తెచ్చే మత్స్య సంపద ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు విదేశీ మారక ద్రవ్యం ఆర్జించిపెడుతున్న వీరి సంక్షేమాన్ని పాలక పక్షాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. మత్స్యకారులకు అవసరమైన పథకాలు రూపొందించి అమలు చేయలని డిమాండ్ చేశారు. మత్స్యకారులకు గ్రామాల్లో పక్కా ఇళ్లు, నాణ్యమైన విద్య, వైద్యం అవసరమైన అన్ని సౌకర్యాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంది ఇవ్వాలన్నారు. ఫిష్ కాన్ గ్రామ స్థాయి సంఘాల నుంచి ఇంటర్ నేషనల్ సంఘాలతో అనుసంధానమై ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని మత్స్య కారులకు అందిస్తోందని చెప్పారు. సమావేశంలో నాయకులు పీత ఈశ్వర ప్రసాద్, నాగిడి తాతారావు తదితరులు పాల్గొని మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించి పలు అంశాలపై సలహాలు, సూచనలు చేశారు. అనంతరం ఫిష్ కాన్ లోగోను నాయకులు ఆవిష్కరించారు. కారు ఢీ కొని టిప్పర్ డ్రైవర్ దుర్మరణం కంకిపాడు: కారు ఢీ కొని టిప్పర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటనపై కంకిపాడు పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. ఎస్ఐ డి.సందీప్ తెలిపిన కథనం మేరకు.. పెనమలూరు మండలం తాడిగడప ప్రాంతానికి చెందిన బోయి అచ్చయ్య(46) టిప్పర్ డ్రైవర్. సొంతంగా కిరాయిలు తిప్పుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం ఉదయం జి.కొండూరు నుంచి తన టిప్పర్‌లో కంకరు లోడు చేసుకుని పమిడిముక్కల మండటం మంటాడ గ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో దావులూరు టోల్గేట్ దాటిన తరువాత టిప్పరు ఆపి కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు దాటే క్రమంలో డివైడర్‌పై నించున్నాడు. విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొని దానిపై నిలబడ్డ అచ్చయ్యను ఢీ కొంది. దీంతో అచ్చయ్య తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. -
సహకార రంగ బ్యాంకులు బలోపేతం చేయాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): సహకార రంగ బ్యాంకుల బలోపేతానికి, గ్రామీణ వ్యవసాయ రంగ ప్రయోజనాల కోసం రెండంచెల విధానం ప్రవేశపెట్టాలని, ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. గ్రామీణ వ్యవసాయ మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.2.5 లక్షల కోట్లు కేటాయించాలని, సహకార సూత్రాలను కచ్చితంగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీసీబీఈఏ) వజ్రోత్సవాలు జరిగాయి. సంఘం జెండాను సభా ప్రాంగణంలో వ్యవస్థాపక నాయకుడు చలసాని మాధవరావు ఆవిష్కరించారు. ఛాయాచిత్ర ప్రదర్శనను ఏఐబీఈఏ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.హెచ్.వెంకటాచలం ప్రారంభించారు. బ్యాంకింగ్ రంగంలో రాజకీయ జోక్యం పెరిగింది.. ఆహ్వాన సంఘం చైర్మన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. దేశంలో పాలక ప్రభుత్వాల నిరంకుశ విధానాలతో సంహకార రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. సహకార రంగంలో రెండంచెల విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ, జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉన్న గ్రామీణ సహకార బ్యాంకులలో, షెడ్యూల్ బ్యాంకుల్లో రుణాల విధానం వేర్వేరుగా ఉందని, రెండంచెల విధానంతో అప్పుల మీద వడ్డీ రేటు మూడు శాతం మేర తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ రంగంలో రాజకీయ జోక్యం పెరిగిందన్నారు. సహకార రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పూర్వ అప్కాబ్ చైర్మన్ తొండెపు దశరథ జనార్దన్ మాట్లాడుతూ.. సహకార రంగాభివృద్ధికి, ఉద్యోగుల శ్రేయస్సుకు తాను కట్టుబడి ఉన్నానని, రెండంచెల విధానం అమలుకు కృషి చేస్తానన్నారు. సహకార బ్యాంకు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి.ఎస్.రాంబాబు మాట్లాడుతూ.. ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుకు రక్షణ లేకుండా పోయిందని, కార్పొరేట్ ఎగవేత దారులు ఎక్కువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత సంఘం కార్యకలాపాల సావనీర్‌ను ఆవిష్కరించారు. అనంతరం 70 మంది సీనియర్ నాయకులను సత్కరించారు. కార్యక్రమంలో ఆప్కాబ్ పూర్వ అధ్యక్షులు విజయేంద్రరెడ్డి, మల్లెల ఝాన్సీరాణి, సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి.ఎస్.రవికుమార్, ఉపాధ్యక్షుడు వి.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏపీ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వజ్రోత్సవాల్లో వక్తలు సంఘం కార్యకలాపాల సావనీర్ ఆవిష్కరణ -
ఉద్యోగుల బకాయిలపై కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిపడిన రూ.25 వేల కోట్ల చెల్లింపులపై రానున్న మంత్రివర్గ సమావేశంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ డిమాండ్ చేశారు. తక్షణం ఐఆర్ ప్రకటించాలన్నారు. విజయవాడ విద్యాధరపురంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీపీఎస్‌పై స్పష్టత ఇవ్వాలి.. వేతన సవరణ విషయంలో హైకోర్ట్ విశ్రాంత జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్లో 2025 మార్చి 31 నాటికి ఉన్న బకాయిలను నమోదు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను పునరుద్ధరించాలని కోరారు. ఆర్థికపరమైన చెల్లింపులకు చట్టబద్ధ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జీపీఎస్ చట్టాన్ని కొనసాగిస్తుందా, రద్దు చేస్తుందా అన్న విషయంపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. సీపీఎస్ ఉద్యోగులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా ఐక్యవేదిక తరుఫున జూన్‌లో విజయవాడలో సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో ఐక్యవేదిక కో చైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్, పెన్షన్ సంఘాల అధ్యక్షుడు రామచంద్రరావు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, వీఆర్వోల అసోసియేషన్ అధ్యక్షుడు భూపతి రాజు, ఐక్యవేదిక వైస్ చైర్మన్ కేదారేశ్వరరావు, రవీంద్రబాబు, డెప్యూటీ సెక్రటరీ జనరల్ నరసింహారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మాగంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తక్షణమే ఐఆర్ ప్రకటించాలి ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ -
రోడ్డు ప్రమాదంలో అన్న మృతి.. తమ్ముడికి గాయాలు
కొక్కిలిగడ్డ(మోపిదేవి): మోపిదేవి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్న మృతి చెందగా, తమ్ముడికి గాయాలైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఆనందంతో తల్లిదండ్రులు, స్నేహితులతో సెలవులు గడుపుదామని ఇంటికి వచ్చిన శివతేజస్(15) రోడ్డు ప్రమాదానికి గురై అందరికీ దూరమయ్యాడు. తమ్ముడు శివజస్వంత్ చేతులు విరిగి తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. దీంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్లితే మండలంలోని కొక్కిలిగడ్డ గ్రామానికి చెందిన రాయన నరసింహారావు కుమారులిద్దరూ శివతేజస్, శివ జస్వంత్ ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై ఆదివారం సాయంత్రం మోపిదేవికి బయలు దేరారు. 216 జాతీయ రహదారిపైకి వచ్చిన ద్విచక్ర వాహ నాన్ని చల్లపల్లి నుంచి అతివేగంగా మోపిదేవి వైపు వస్తున్న లారీ వెనుక నుంచి ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కావడంతో వెంటనే 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మచిలీపట్నం హాస్పి టల్‌కు తరలించారు. దారిలోనే శివతేజస్ మృతి చెందగా, తమ్ముడు శివజస్వంత్కు చేయి విరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి నరసింహారావు పామర్రు అగ్నిమాపక కేంద్రంలో, ఆయన భార్య శ్రీలక్ష్మి అవనిగడ్డలో ఆర్టీసీ కండక్టర్‌గా పని చేస్తున్నారు. విజయవాడ చైతన్య కళాశాలలో ఫస్ట్ ఇంటర్ చదువుతున్న శివతేజస్ సెలవులకు ఇంటికి వచ్చారు. ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత.. తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో శివతేజస్ ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గంటల వ్యవధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడి మృతితో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చల్లపల్లి సీఐ ఈశ్వరరావు తెలిపారు. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు -
రంగస్థల, సినీ నటుడు బోలెం రామారావుకు నంది అవార్డు
చల్లపల్లి: ప్రముఖ రంగస్థల, సినీ నటుడు కృష్ణాజిల్లా, చల్లపల్లికి చెందిన బోలెం రామారావు నేషనల్ బంగారు నంది అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వ బాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జి.సి.ఎస్.వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉగాది, డాక్టర్ అంబేడ్కర్ జయంతి, మహనీయుల ప్రత్యేక అవార్డుల–2025 కింద ఈ జాతీయ బంగారు నంది అవార్డును రామారావు అందుకున్నారు. సాధారణ మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన వృత్తిరీత్యా ఆర్టీసీ డ్రైవర్ అయినప్పటికీ మొదటి నుంచి రంగస్థల నాటకాలు, ఏకపాత్రాభినయాలు అంటే మక్కువ ఎక్కువ. కేవలం దివి ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నాటక పరదర్శనలు ఇచ్చిన రామారావు కళారంగ వాసులకు సుపరిచితుడే. సత్యహరిశ్చంద్ర నాటకంలో విశ్వామిత్రుడిగా, వీరబాహుడుగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. బాలనాగమ్మ నాటకంలో మాయల ఫకీరుగా 500లకు పైగా ప్రదర్శనలు, ఏకపత్రాభినయాలు చేసి ప్రేక్షకులను రంజింపజేశారు. విజయ మూవీతో పరిచయం.. రంగస్థల నటుడిగా పేరు ప్రఖ్యాతలు ఘడించిన రామారావుకు సినీ రంగంలో కూడా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. సురేష్ ప్రొడక్షన్లో విజయ మూవీతో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం తరువాత విక్రమార్కుడు, బాహుబలి–1, బ్రహ్మిగాడి వీరగాథ, సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాల్లో పలు పాత్రల్లో నటించారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గుమ్మడి వెన్నెల, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ పతాని రామకృష్ణగౌడ్, సీనియర్ ఆర్ట్టిస్ట్ దొరైస్వామిల చేతుల మీదుగా బోలెం రామారావు ఆదివారం ఈ అవార్డును, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. బోలెం రామారావుకు పలువురు కళాకారులు, ప్రముఖులు, దివిప్రాంత ప్రజలు అభినందనలు తెలిపారు. -
గాయని మల్లాది స్వాతికి విశిష్ట మహిళా పురస్కారం
విజయవాడకల్చరల్: విజయవాడ నగరానికి చెందిన శాసీ్త్రయ సంగీత విద్వాంసురాలు, గాయని మల్లాది స్వాతికి 2025 సంవత్సరానికి విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నట్లు ఆదివారం ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బల్లెం వేణుమాధవ్ ఆర్ట్స్ థియేటర్ సంస్థ ప్రతి ఏటా దేశంలో వివిధ రంగాల్లో సేవలను అందించిన వారికి విశిష్ట మహిళా పురస్కారం అందిస్తోంది. 2025 సంవత్సరానికి గానూ స్వాతికి ఈ పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని తెలుగు చలన చిత్ర మండలి హాల్లో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి చేతుల మీదుగా శనివారం పురస్కారం అందుకున్నారు. స్వాతి నగరంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో కర్నాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో కచేరీలు, సినీ సంగీత విభావరి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరానికి చెందిన పలు సంస్థలు ఆమెను అభినందించాయి. -
ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీలు ప్రారంభం
మంగళగిరి: ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) రోగులకు ఇక నుంచి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించనుంది. గుండె జబ్బుల రోగులకు బైపాస్ సర్జరీలతోపాటు ఐసీయూ విభాగం ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు కొన్ని జబ్బులకు ఓపీడీ సేవలు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడు ఇన్‌పేషంట్ సేవలు, అత్యవసర విభాగం, ఐసీయూలను ప్రారంభించారు. తొలిసారిగా శనివారం ఓ రోగికి వైద్యులు బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. రోజుకు 3,500 మందికి సేవలు2015లో శంకుస్థాపన చేసుకున్న ఎయిమ్స్ 2018లో వైద్య సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం 46 విభాగాలలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తోంది. ఎయిమ్స్ ఆస్పత్రి భవనాలతోపాటు రెసిడెన్సియల్, మెడికల్, నర్సింగ్ కళాశాలల భవనాల నిర్మాణాలను పూర్తి చేసుకుంది. రోజుకు 3 వేల నుంచి 3,500 మంది రోగులకు సేవలందిస్తున్న ఎయిమ్స్ ఇప్పటివరకు 22,49,986 లక్షల మంది రోగులకు సేవలందించింది. 37,13,713 ల్యాబ్ పరీక్షలు నిర్వహించింది. ఈ నెలలో ఇప్పటి వరకు 38,212 మంది రోగులు ఓపీడీ సేవలందుకోగా మార్చి చివరి వరకు 4,39,933 మంది రోగులకు సేవలందించింది. 42,843 మంది ఇన్ పేషంట్ విభాగంలో చికిత్స పొందారు. ఎయిమ్స్‌కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రోగులు తరలివస్తుండడం గమనార్హం. విజయవంతంగా బైపాస్ సర్జరీ తొలిసారిగా చేసిన బైపాస్ సర్జరీ విజయవంతం కావడం సంతోషంగా ఉంది. నేను డైరెక్టర్‌గా పదవి చేపట్టిన కొద్ది కాలంలోనే బైపాస్ సర్జరీ జరగడంతో పాటు ఐసీయూ ప్రారంభించి రోగులకు సేవలందిస్తున్నాము. ఇప్పుడు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి రోగులు ఇక్కడకు వచ్చి చికిత్స పొందుతున్నారు. ఇకపై మరింత సమర్థంగా వైద్యసేవలు అందిస్తాం. ప్రొఫెసర్ డాక్టర్ అహెంతమ్ శాంత సింగ్ ఎయిమ్స్ డైరెక్టర్ -
కృష్ణానదిలో దూకి యువకుడి ఆత్మహత్య
కోడూరు: అప్పుల బాధ తట్టుకోలేక కృష్ణానదిలోకి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ చాణిక్య తెలిపిన వివరాల ప్రకారం.. కోడూరు తూర్పు వైపునకు చెందిన గంధం సతీష్(27) అవివాహితుడు, విజయవాడలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి సతీష్ స్నేహితులతో కలిసి అవనిగడ్డ లంకమ్మ సంబరానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో సతీష్ ఆత్మహత్య చేసుకొనేందుకు ఉల్లిపాలెం–భవానీపురం వారధి వద్దకు వెళ్లాడు. వారధి వద్దకు వెళ్లిన తరువాత ‘ఉల్లిపాలెం బ్రిడ్జి మీద నుంచి దూకి చనిపోతున్నానని.. అమ్మనాన్నను జాగ్రత్తగా చూసుకోండి’ అని స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో కంగుతిన్న స్నేహితుడు సతీష్‌కు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదు. దీంతో స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు హుటాహుటినా వారధిపైకి వెళ్లగా సతీష్ ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్, చెప్పులు ఉండడాన్ని గమనించారు. సతీష్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్థారించారు. అయితే అర్ధరాత్రి కావడం, నది మధ్యలో లోతు ఎక్కువగా ఉండడంతో అప్పటికప్పుడే సతీష్ అప్పటికప్పడే గల్లంతయ్యాడు. యువకుడు తండ్రి బ్రహ్మారావు ఫిర్యాదు మేరకు ఘటనపై కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి, ఆదివారం సతీష్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అవనిగడ్డ ఫైర్ సిబ్బందితో పాటు స్థానిక మత్స్యకారుల సహాయంతో మూడు బోట్లలో పోలీసులు కృష్ణానదిని జల్లెడపట్టారు. ఆదివారం సాయంత్రం 6గంటల సమయంలో వారధికి సమీపంలోని మడచెట్ల వద్ద సతీష్ మృతదేహం లభ్యమైంది. శవ పంచనమా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ఆస్పకి తరలించినట్లు ఎస్ఐ చెప్పారు. అప్పుల బాధ తాళ్లలేక సతీష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. -
వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ వడ్డెర/వడియ రాజుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముందు సంఘం రాష్ట్ర కార్యాలయాన్ని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం ప్రారంభించారు. ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 40 లక్షల జనాభా ఉన్న వడ్డెర్లకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరుగుతోందన్నారు. వడ్డెర్లను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ వడ్డెర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ ఈనాటిది కాదన్నారు. స్వాతంత్య్ర వచ్చిన నాటి నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలని పోరాడుతున్నామన్నారు. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్, జనార్ధనరెడ్డి వడ్డెర్లకు ఎన్నో ఫలాలు అందించారని, కూటమి ప్రభుత్వం వాటన్నింటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తాను చట్టసభల్లో అడుగుపెట్టిన తర్వాత వడ్డెర్ల సమస్యలను అనేక పర్యాయాలు ప్రస్తావించానన్నారు. హక్కుల సాధనకు ప్రతి ఒక్కరు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. క్వారీల్లో అవకాశం కల్పించాలి.. సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు వేముల బేబీరాణి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, నామినేటెడ్ పదవులలో వడ్డెర్లకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. టీటీడీ బోర్డు చైర్మన్‌గా వడ్డెర కులానికి అవకాశం రాలేదన్నారు. కనీసం బోర్డు మెంబర్లుగా కూడా నియమించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల చైర్మన్లుగా, డైరెక్టర్లు వడ్డెర్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి మండల కేంద్రంలో వడ్డే ఓబన్న విగ్రహం ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని కోరారు. కమ్యూనిటీ హాళ్లు నిర్మాణం చేయాలని, వడ్డెర్లకు క్వారీల్లో అవకాశం కల్పించాలని, సబ్సిడీపై యంత్రపరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓసీసీఐ చీఫ్ అడ్వైజర్ గుంజ నరసింహారావు, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య, మంజుల నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు బత్తుల నాగేశ్వరరావు, కన్వీనర్ వేముల శివ, ప్రధాన కార్యదర్శి వేముల మల్లేశ్వరరావు, యువజన సంఘం అధ్యక్షుడు వీరాంజనేయులు, జాయింట్ సెక్రటరీ ఎర్ల రవిచంద్ర, వేముల శ్రీదేవి, ఒంటిపులి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు
పెడన: బల్లిపర్రు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం జరిగిన 5వ తరగతి, జూనియర్ ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పాఠశాల ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ ఎన్.రూతమ్మ తెలిపారు. జూనియర్ ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి 197 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 154 మంది హాజరయ్యారని, 43 మంది ఆబ్సెంట్ అయినట్లు పేర్కొన్నారు. ఐదో తరగతి ప్రవేశ పరీక్షకు 135 మందికి 53 మంది హాజరయ్యాని తెలిపారు. 18 నుంచి రాష్ట్ర స్థాయి నాటక పోటీలు గుడివాడ టౌన్: కృష్ణా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ నెల 18, 19, 20 తేదీల్లో రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం గుడివాడ ఎస్పీఎస్ హైస్కూల్ ఆవరణలో పోటీల బ్రోచర్లను ఆవిష్కరించారు. ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి ఎస్పీఎస్ హైస్కూల్ వేదికపై నాటక పోటీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు పీవీ సత్యనారాయణ, కార్యదర్శి ఏఎస్వీ ప్రసాదు, కన్వీనర్ ఆర్వీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలు గుడివాడ టౌన్: ఎన్టీఆర్ స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. శనివారం బాలికల విభాగంలో పోటీలు ముగియగా ఆదివారం బాలురు, పురుషుల విభాగం పోటీలు ముగిశాయి. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ విభాగాల్లో పోటీలు జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ లంకదాసరి ప్రసాదరావు, స్టేడియం కమిటీ సభ్యుడు డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి జ్యోతిసురేఖ విజయవాడస్పోర్ట్స్: ఆర్చరీ ప్రపంచ కప్ పోటీల్లో రాష్ట్ర క్రీడాకారిణి వెన్నం జ్యోతిసురేఖ గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్ర, దేశ క్రీడా ఖ్యాతిని ప్రపంచానికి చాటారని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. అమెరికాలో జరిగిన ఆర్చరీ ప్రపంచ్ కప్ స్టేజ్–1 టోర్నీలో పతకం సాధించిన జ్యోతిసురేఖను మంత్రి ఒక ప్రకటనలో అభినందించారు. ఆదివారం జరిగిన కాంపౌండ్ మిక్సిడ్ విభాగం ఫైనల్స్‌లో రిషబ్యాదవ్తో కలిసి 153–151 తేడాతో చైనీస్ జోడీ హువాంగ్ ఐ జౌ– చెన్చిహు లిన్ని ఓడించి దేశానికి తెలుగు తేజం బంగారు పతకాన్ని అందించడం రాష్ట్ర ప్రజలు గర్వించదగ్గ విషయని పేర్కొన్నారు. ఏపీ జీఈఏ ఐక్యవేదిక కో–చైర్మన్‌గా బాలాజీ వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక (ఏపీ జీఈఏ) కో చైర్మన్‌గా ఏపీ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఏపీ జీఈఏ కార్యాలయంలో ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ అధ్యక్షతన సమావేశం జరిగింది. బాలాజీ ఎన్నికపై ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సత్యనారాయణ, రాష్ట్ర సంఘటన కార్యదర్శి సీహెచ్ శ్రావణ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. -
గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విజయవాడరూరల్: రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ చెప్పారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల వేధింపులతో రైతులు పడుతున్న ఇబ్బందులపై ‘ధరలకు చెల్లిన నూకలు’ శీర్షికతో ఆదివారం ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన కలెక్టర్ ఆదివారం నున్నలో పోలవరం కాల్వ రోడ్డుపై రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం రాసులను పరిశీలించారు. వాతావరణ హెచ్చరికలతో పరదాలతో కప్పి ఉంచిన ధాన్యం రాసుల వద్ద ఉన్న రైతులను కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ పలకరించారు. ధాన్యం పూర్తిగా ఆరిపోయినా తేమ ఉందని సీరియల్ ప్రకారం కొనుగోలు చేస్తామని సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు రైతులు ఆయనకు చెప్పారు. భీమవరపు మల్లికార్జునరెడ్డి అనే రైతు ధాన్యం రాసిని పరిశీలించిన కలెక్టర్ తేమశాతం కొలిచే మిషన్ పట్టుకు రావాలని చెప్పారు. తేమశాతం కొలిచే మిషన్ లేకపోవడంతో రైతులను సీరియల్ అంటూ ఇబ్బంది పెట్టడం ఏంటని టెక్నికల్ అసిస్టెంట్ రాహుల్‌పై కలెక్టర్ మండి పడ్డారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దురైతులను ఇబ్బంది పెడుతున్న సిబ్బందిపై యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ ముత్యాల శ్రీనివాస్‌ను ఉద్దేశించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. పి.నైనవరం మిల్లర్ వద్ద కొను గోలులో ఇబ్బంది పెడుతున్నారని రైతులు తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ ఎంపీపీ యర్కారెడ్డి నాగిరెడ్డి కలెక్టర్ లక్ష్మీశకు తెలిపారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లాలో దాళ్వా సీజన్లో వరిపంట 1.60 లక్షల టన్నుల దిగుబడులున్నాయన్నారు. జిల్లాలో 107 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రూ.6 కోట్లను చెల్లించామని చెప్పారు. రైస్‌మిల్లుల వద్ద తహసీల్దార్ స్థాయి అధికారులను ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. రైతులతో ఆర్డీఓ సమావేశం జి.కొండూరు: ఎన్టీఆర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల వేధింపులతో రైతులు పడుతున్న కష్టాలపై ‘సాక్షి’ ఆదివారం ప్రచురించిన ‘ధరకు చెల్లిన నూకలు’ కథనానికి ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. కలెక్టర్ లక్ష్మీశ నున్న ప్రాంతంలో ధాన్యం నిల్వలను పరిశీలించగా, ఆర్డీఓ కావూరి చైతన్య జి.కొండూరు మండల పరిధి కవులూరు గ్రామంలో ధాన్యం రైతులతో సమావేశమయ్యారు. రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు లోబడి మద్దతు ధరకే రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కుంటముక్కల గ్రామ శివారులోని రైస్ మిల్లును తనిఖీ చేశారు. వాతావరణ మార్పులతో ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించడంతో పాటు కల్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా పట్టాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చాట్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ముగిసిన చైత్రమాస బ్రహ్మోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న చైత్రమాస బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఆదివారం ఉదయం మల్లేశ్వరస్వామి ఆలయ సమీపంలోని యాగశాలలో పూర్ణాహుతి చేశారు. ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరవగా స్థానాచార్య శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం వసంతోత్సవాన్ని వైభవంగా చేశారు. అర్చకులు, సిబ్బంది, ఆలయ అధికారులు ఒకరిపై మరొకరు రంగులు, గులామ్‌లు చల్లుకుంటూ మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పవిత్ర కృష్ణానదికి తరలివచ్చారు. దుర్గాఘాట్‌లో శ్రీగంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు అవభృత స్నానాలు జరిపించారు. అనంతరం ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆది దంపతుల నదీ విహారం శ్రీగంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లు ఆదివారం పవిత్ర కృష్ణానదిలో విహరించారు. చైత్రమాస బ్రహ్మోత్సవాల ముగింపు పురస్కరించుకొని దుర్గాఘాట్ సమీపంలోని వీఐపీ స్నానఘాట్ వద్ద ప్రత్యేకంగా అలంకరించిన పడవపై ఆది దంపతుల నదీవిహారాన్ని ఆలయ అర్చకులు జరిపించారు. ముల్లోకాలకు గుర్తుగా మూడు పర్యాయాలు నదీలో మూడు పర్యాయాలు విహరించారు. -
కబ్జాకోరులు
● ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల స్థలంపై పెద్దల కన్ను ● స్థలం విలువ రూ.300 కోట్లపైనే.. ● ఎకరానికిపైగా ప్రైవేటు పాఠశాలకు! ● తెరవెనుక అధికార పార్టీ ప్రజాప్రతినిధి.. మధురానగర్(విజయవాడసెంట్రల్): దశాబ్దాల చరిత్ర కలిగిన ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన స్థలంపై పెద్దల కన్ను పడింది. నగరం నడిబొడ్డున ఉన్న ఎస్ఆర్ఆర్ కాలేజీకి చెందిన రూ. 300 కోట్ల విలువైన 6.67 ఎకరాల స్థలం కబ్జా కోరల్లో చిక్కుకుంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధితో పాటు మరి కొందరు బడా నేతల అండదండలతో ఆ స్థలంలో పాగా వేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లతో ఓ ప్రైవేటు పాఠశాలకు ఎకరంపైగా స్థలం కట్టబెట్టినట్లు తెలుస్తోంది. మరి కొందరు పెద్దలు కళాశాల స్థలాన్ని కబ్జా చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. గులాబీతోటలో 6.67 ఎకరాలపై.. మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బీఆర్టీఎస్ రోడ్డు సమీపంలోని గులాబీతోటలో 6.67 ఎకరాల స్థలం ఉంది. 1958లో నూజివీడు రాజావారు కళాశాలకు ఈ స్థలాన్ని దానంగా ఇచ్చారు. దీన్ని కొందరు ఏడాదికి రూ.150 చొప్పున లీజుకు తీసుకున్నారు. కొంతకాలం సక్రమంగా లీజు చెల్లించిన లీజుదారులు ఆ తర్వాత కౌలుదారీ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కళాశాల స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో కళాశాల యాజమాన్యం దీనిపై కేసు వేశారు. హైకోర్టు 2009లో సెటిల్మెంట్ కోర్టులో తేల్చుకోవా లంటూ తీర్పు ఇచ్చింది. దీనిపై లీజుదారులు స్టే తెచ్చుకున్నారు. ప్రస్తుతం హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. పూర్వ విద్యార్థుల పోరాటం ఈ కళాశాలలో చదువుకొని దేశ, విదేశాల్లో స్థిరపడిన కళాశాల పూర్వ విద్యార్థులు స్థలాన్ని కాపాడుకొనేందుకు రంగంలోకి దిగారు. రాజకీయాలకు అతీతంగా వారు పోరాటం ప్రారంభించారు. ఆ స్థలంలో ఆక్రమణలు తొలగించారు. ఈ స్థలాన్ని అన్యాక్రాంతం కానివ్వబోమంటూ ఇప్పటికే ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలను సైతం అందజేశారు. అమలు కాని హామీ.. కళాశాల స్థల వివాద విషయంలో నాటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆ స్థలాన్ని సందర్శించారు. ఇది ముమ్మాటికీ కళాశాల స్థలమని, ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కళాశాల నుంచి ఇక్కడ వరకు రైవస్ కాల్వపై ఫుట్‌బ్రిడ్జి సైతం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఫుట్‌బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు కొలతలు తీయటంతో పాటు రూ.1.25 కోట్ల వ్యయ అంచనా తయారు చేశారు. కానీ బ్రిడ్జి పనులు ప్రారంభం కాలేదు. క్రయవిక్రయాలు చేయరాదంటూ బోర్డులు నూజి వీడు రాజావారు సొంత ఆస్తులను కాకుండా జాగీరు భూమిని కొనుగోలు చేసి కళాశాలకు స్థలం అందజేశారు. దీంతో కౌలుదారీ చట్టం వర్తించదని పూర్వ విద్యార్థులు పేర్కొంటున్నారు. 2017లో హైకోర్టులో కేసు ఉన్నా కళాశాల స్థలంలో నిర్మాణాలు, క్రయ, విక్రయాలు చేసేందుకు సిద్ధపడ్డారు. నాటి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెలగా జోషి, పూర్వ విద్యార్థులు, కళాశాల విద్యార్తులతోకలిసి ఆ స్థలంలో ఆక్రమణలను అడ్డుకున్నారు. ఈ స్థలం క్రయ విక్రయాలు చేయరాదంటూ బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. ప్రభుత్వమే కాపాడాలి కళాశాలకు ఎంతో చరిత్ర ఉంది. దీని అభివృద్ధికి దాతలు విలువైన స్థలం ఇచ్చారు. కాలక్రమేణా ఆక్రమించుకొనేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. పూర్వ విద్యార్థులుగా అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నాం. కోర్టుల్లో కేసులు వేశాం. విద్యాశాఖ మంత్రి అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదు. విలువైన కళాశాల స్థలాన్ని ప్రభుత్వమే కాపాడాలి. ఇప్పటికే జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి. – దోనేపూడి శంకర్, పూర్వ విద్యార్థి విద్యార్థులతో కలిసి.. ఎంతో మంది మేధావులను తయారు చేసిన కాలేజీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించటం విచారకరం. 6.67 ఎకరాలు న్యాయపరంగా కళాశాలకు చెందు తుంది. ఈ స్థలం అన్యాక్రాంతం కాకుండా చూస్తున్నాం. కళాశాల సిబ్బంది, విద్యార్థులతో కలిసి స్థలాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నాం. – లంకా జానయ్య, కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం నేత కళాశాలకు చెందిన స్థలమిది 6.67 ఎకరాలు ఎస్ఆర్ఆర్ కళాశాలకు చెందిన స్థలం. దాతల ఆశయాలకు అనుగుణంగా ఈ స్థలం అన్యాక్రాంతం కాకుండా విద్యార్ధులతో కలిసి పనిచేస్తున్నాం. నిజానిజాలు వెలికి తీసి అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ స్థలం భావితరాలకు ఉపయోగపడటానికి కృషి చేస్తున్నాం. –డాక్టర్ వెలగా జోషి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ తప్పుడు రిజిస్ట్రేషన్లు స్ధల వివాదం కోర్టులో ఉన్నా ఇటీవల కొందరు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధి.. ఇతర నేతలు ఆక్రమణ దారులకు అండగా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రజాప్రతినిధి ఇక్కడ నిర్మాణాలు చేసుకోవచ్చంటూ భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. నగరంలో ప్రముఖ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఎకరం స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. మరి కొందరు ప్రముఖులు కళాశాల స్థలాన్ని దక్కించుకొనేందుకు చక్రం తిప్పుతున్నారు. ఇక్కడ క్రయ విక్రయాలు చేయవద్దంటూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చినా వాటిని పట్టించుకోవడం లేదు. -
విద్వేషాలు సృష్టించాలని చూస్తున్న బీజేపీ
సమైక్యతా శంఖారావంలో వక్తలు మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): దేశంలో ఐక్యంగా ఉన్న ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ మైనార్టీ విభాగం చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ ఘడి ఆరోపించారు. సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మనీ ఏపీ చాప్టర్ ఆధ్వర్యంలో విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఆదివారం సమైక్యతా శంఖారావం సభ జరిగింది. ఇమ్రాన్‌ప్రతాప్ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు ఆమోదించి పార్లమెంట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా చీకటి చట్టాన్ని చేశారని ఆరోపించారు. గతంలో నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కలిగేలా పలు చట్టాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. పార్ల మెంట్లో ఏకపక్షంగా ఆమోదించిన వక్ఫ్ బిల్లును తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్పొరేట్ మీడియాను తమ చేతిలో పెట్టుకుని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో వాస్తవాలను ప్రచారం చేస్తూ ముందు భాగాన ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలను రెచ్చగొడుతున్న పవన్‌కల్యాణ్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లా డుతూ.. కూటమి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతనం ధర్మం అంటూ రెచ్చగొట్టేలా ఉపన్యాసాలు చేస్తూ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. మతసామరస్యానికి కృషిసొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మనీ ఉపాధ్యక్షుడు కె.విజయరావు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో మత సామరస్యానికి తమ సంస్థ కృషి చేస్తోందన్నారు. న్యాయవాది దివాకర్ బాబు మాట్లాడుతూ.. ప్రపంచ యుద్ధంలో కంటే మతాల కారణంగా జరుగుతున్న ఘర్షణల్లో ఎక్కువ మంది మనుషులు మరణిస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు సభకు అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు తులసీరెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు అజీజ్ పాషా, మైనారిటీ హక్కుల నాయకులు షఫీ అహ్మద్, అయూబ్ ఖాన్, సీపీఎం నేత బాబురావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, మౌలానా అబుల్ కలామ్ అజాద్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. తొలుత ప్రజానాట్య మండలి కళాకారులు గీతాలు ఆలపించారు. హేరామ్ నుంచి జైశ్రీరామ్ వరకు అనే పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. -
అమరావతి కోసం మరో భారీ భూ సమీకరణ
సాక్షి, గుంటూరు: అమరావతి కోసం మరో భారీ భూ సమీకరణకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. 44,676 ఎకరాలను సీఆర్డీఏ సమీకరించనుంది. మూడు పంటలు పండే భూముల్ని ప్రభుత్వం మళ్ళీ సమీకరించనుంది. ఇప్పటికే 54 వేల ఎకరాలు సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం.. 54 వేల ఎకరాల్లో ఒక్క శాశ్వత భవనం నిర్మించలేదు.గత ఆ భూములు ఉంటుండగానే మళ్లీ 44,676 ఎకరాలు భూముల సమీకరణకు సిద్ధమైంది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లో కొత్తగా భూ సమీకరణ చేయనుంది. 11 గ్రామాల్లో 44,676 ఎకరాలు భూములను ప్రభుత్వం సమీకరించనుంది.కాగా, రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకే ప్రభుత్వ పెద్దలు భూములు కాజేసిన సంగతి తెలిసిందే. ఆశ్రిత పక్షపాతం.. అవినీతి.. అధికార దుర్వినియోగం.. వెరసి అమరావతిని చంద్రబాబు అక్రమాల పుట్టగా మార్చేశారు. అడ్డగోలు నిర్ణయాలతో అమరావతిని భ్రష్టు పట్టించారు. రాజధాని ఇక్కడా.. అక్కడా అంటూ లీకులిచ్చి స్కాములకు బీజం వేశారు.రాజధాని ఎంపిక నుంచి భూముల కొనుగోళ్లు, భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్), ప్రైవేట్ సంస్థలకు కేటాయింపు, సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు, ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూముల వ్యవహారం వరకు ఏది తవ్వినా టన్నుల కొద్దీ అవినీతి పుట్ట బద్దలైంది. అమరావతిని అక్రమాల అడ్డాగా మార్చేసిన తీరు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. -
ధరకు చెల్లిన నూకలు
బస్తా రూ.1500 చొప్పన విక్రయించా నేను రెండు ఎకరాల్లో దాళ్వా సాగు చేశాను. వరి కోసి ధాన్యం అరబెట్టినప్పటికీ కొనేవారు లేక ప్రయివేటు వ్యాపారులకు 75 కిలోల బస్తా రూ.1500 చొప్పున విక్రయించా. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి ఉంటే బస్తాకు రూ.240 అదనంగా ధర వచ్చేది. రెండు ఎకరాలకు రూ.70 వేల పెట్టబడి పెట్టి తీవ్రంగా నష్టపోయాను. – జూపల్లి సుబ్బారావు, రైతు, పైడూరుపాడు, విజయవాడరూరల్ మండలం ధాన్యం కొనే నాథుడే లేడు నేను తొమ్మిదెకరాల్లో దాళ్వా సాగు చేశాను. రూ.3.5 లక్షల పెట్టుబడి పెట్టాను. పంట మంచిగా పండింది అనుకుంటే ధాన్యం కొనేవారు లేరు. మా గ్రామానికి పది వేల సంచులు అవసరమైతే వెయ్యి సంచులు ఇచ్చారు. ధాన్యం ఆరబెట్టి సిద్ధంగా ఉన్నప్పటికీ కొనేందుకు ఎవరూ రావడంలేదు. ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. – కాగితపు వెంకటేశ్వరరావు, రైతు, పైడూరుపాడు, విజయవాడరూరల్ మండలం జి.కొండూరు: అన్నదాతకు ఆపద వచ్చింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. అధిక తేమ, బియ్యంలో నూకలు వస్తున్నాయంటూ మిల్లర్లు ధర తగ్గించేశారు. ప్రకృతి కూడా సహకరించకపోవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు వచ్చినకాడికి తెగనమ్ముతున్నారు. ఖరీఫ్ పంటను వరదలు ముంచేశాయి. ఆ నష్టాలను పూడ్చుకునేందుకు రబీలో వరి సాగుచేసిన రైతులకు మిల్లర్ల మాయాజాలంతో కష్టాలు తప్పడంలేదు. తమకు మద్దతు ధర దక్కేలా చూడాల్సిన ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని రైతులు వాపోతున్నారు. రైతులకు దక్కని మద్దతు ఎన్టీఆర్ జిల్లాలో రబీ సీజన్లో 19,985 హెక్టార్లలో వరి సాగైంది. ప్రభుత్వం 50 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అనుమతినిచ్చింది. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటా ధర రూ.2,320, 75 కేజీల బస్తా ధర రూ.1740గా నిర్ణయించింది. జి.కొండూరు, విజయవాడరూరల్ మండలాల రైతులు ధాన్యం విక్రయించేందుకు నరకయాతన పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ 17 శాతానికి తక్కువగా ఉంటే కొనుగోలు చేస్తారు. రైతులు రోజుల తరబడి ధాన్యాన్ని ఆరబెట్టి తేమ 16 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే మిల్లర్లు అనేక సాకులతో వేధిస్తున్నారు. మిల్లర్లు, ప్రయివేటు వ్యాపారులు, సహకార సొసైటీల సిబ్బంది ఏకమై ధాన్యంలో తేమ ఎక్కువ ఉందని, ధాన్యం ముక్కలవుతోందని సాకులు చూపి మద్దతులో కోత విధిస్తున్నారు. నిబంధనల ప్రకారం 17 శాతం తేమ ఉన్న 75 కిలోల ధాన్యం బస్తాను రూ.1740కి కొనుగోలు చేయాలి. అయితే రూ.1500 నుంచి రూ.1600లోపే మిల్లర్లు ధర చెల్లిస్తున్నారు. 17 శాతం కంటే తేమ ఎక్కువగా ఉంటే బస్తాకు రూ.1300లకు మించి ధర ఇవ్వడంలేదని రైతులు వాపోతున్నారు. వాతావరణంలో మార్పులు వచ్చి సాయంత్రం సమయానికి వర్షపు జల్లులు పడుతుండటంతో చేసేది లేక రైతులు వచ్చిన కాడికి ధాన్యాన్ని తెగనమ్ముతున్నారు. కొన్ని గ్రామాల్లో గన్నీ సంచుల కొరత ఉందని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి తేమతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మిల్లర్ల మాయాజాలంతో ధాన్యం రైతుల గగ్గోలు అధిక తేమ శాతం, బియ్యం ముక్కలవుతోందంటూ ధర తగ్గించిన మిల్లర్లు ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడి కల్లాల్లోనే పేరుకుపోయిన ధాన్యం నిల్వలు వాతావరణంలో మార్పులతో ఆందోళనలో అన్నదాతలు ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికి సేకరించిన ధాన్యం 7,200 టన్నులు మాత్రమే.. అంకెల్లో ఇలా.. రబీ వరి సాగు విస్తీర్ణం : 19,985 హెక్టార్లు ప్రభుత్వ కొనుగోలు లక్ష్యం : 50 వేల టన్నులు ఎకరాకు ప్రభుత్వం కొనే ధాన్యం : 39.2 క్వింటాళ్లు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు : రూ.2,320 ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య: 107 ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలు : 34 శుక్రవారం వరకు సేకరించిన ధాన్యం : 7,200 టన్నులు ధాన్యం సేకరిస్తున్న మిల్లుల సంఖ్య: 16 ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు మారత కృష్ణారావు. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలంలోని కవులూరుకు చెందిన ఈ రైతు రబీలో 2.4 ఎకరాల్లో వరి సాగు చేశారు. వారం క్రితం రెండెకరాల్లో కోతలు పూర్తిచేసి ధాన్యాన్ని ఆరబెట్టారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం ధాన్యాన్ని ఆరబెట్టి స్థానిక సొసైటీని సంప్రదించారు. 75 కిలోల ధాన్యం బస్తా ప్రభుత్వ మద్దతు ధర రూ.1,740 కాగా రూ.1,620కే కొనుగోలు చేస్తా మని సొసైటీ సిబ్బంది చెప్పారు. అదేమని అడిగితే ఇష్టమైతే అమ్ముకో లేదంటే ఉంచుకో అని చెప్పడంతో చేసేది లేక వచ్చిన ధరకే పంటను తెగనమ్మారు. తక్కువ ధరకు విక్రయించడంతో రూ.9 వేలకు పైగా నష్టపోయినట్లు కృష్ణారావు వాపోయారు. -
సహకార వ్యవస్థలో రెండంచెల విధానం అమలు చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సహకార వ్యవస్థ మనుగడ సాగించాలంటే రెండంచెల విధానాన్ని అమల్లోకి తేవాలని రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. రెండంచెల విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలని, ఐదు లక్షల సంతకాలు సేకరించాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల నుంచి లేఖలు తీసుకోవాలని, విజయవాడలో మహాధర్నా నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. విజయవాడలోని ఐలాపురం హోటల్లో ఏపీ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీసీసీబీలను రాష్ట్ర సహకార బ్యాంకులుగా మార్పు చేయాలని, సహకార బ్యాంకింగ్‌లో రెండంచెల విధానం తేవాలని కోరుతూ శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం, రైతు, కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని రెండంచెల విధానం అమలు చేయాలన్న యూనియన్ డిమాండ్‌కు మద్దతు ప్రకటించాయి. రెండంచెల విధానంలో అటు రైతులకు, ఇటు ఉద్యోగులకు జరిగే మేలును వక్తలు వివరించారు. వ్యవసాయ రుణాల పంపిణీ జాప్యం నివారించడమే కాకుండా వడ్డీ రేట్లు తగ్గుతాయని వక్తలు పేర్కొన్నారు. సహకార వ్యవస్థ మనుగడ సాగిస్తుందన్నారు. గ్రామీణ పేదలకు మేలు.. రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ సహకార వ్యవస్థను వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రావడానికి ముందు, తర్వాత అని రెండుగా విభజించి చూడాల్సి ఉంటుందన్నారు. 2002 సంవత్సరానికి పూర్వం సహకార వ్యవస్థను అప్పటి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. 2004లో అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుదేలైన సహకార రంగాన్ని ఆదుకొని గాడిలో పెట్టారన్నారు. రూ.వందల కోట్ల ఆర్థిక సాయం అందించి సహకార వ్యవస్థను బతికించారన్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన బ్యాంకులను లాభాల బాట పట్టించారని చెప్పారు. సహకార వ్యవస్థలో రెండంచెల విధానం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేరళ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని మన రాష్ట్రంలోనూ రెండంచెల విధానం అమల్లోకి తేవాలన్నారు. ఇందుకు తమ సహకారం ఉంటుందని, ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ సహకార వ్యవస్థలో పెత్తనమంతా రాజకీయ నాయకులదేనన్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి పెరిగిపోయిందన్నారు. ఈ వ్యవస్థలో రెండంచెల విధానం అమల్లోకి తెస్తే గ్రామీణ పేదలకు మేలు జరుగుతుందన్నారు. తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు అందుతాయని చెప్పారు. ఏఐటీయూసీ నాయకులు రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కో ఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కేవీఎస్ రవికుమార్, రైతు సంఘం నాయకులు కేశవరావు, కేవీవీ ప్రసాద్, జమలయ్య, భవానీప్రసాద్, బ్యాంకుల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో తీర్మానం సహకార రంగాన్ని వైఎస్సార్ బతికించారు : పూనూరు గౌతంరెడ్డి -
ఇంటర్ ఫలితాల్లో శ్రీచైతన్య విజయభేరి
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఇంటర్మీడియెట్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు విజయదుందుభి మోగించాయని శ్రీచైతన్య విద్యాసంస్థల డీన్ పి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఎంజీ రోడ్డులోని ఎంఅండ్ఎం శ్రీ చైతన్య విద్యాసంస్థల క్యాంపస్‌లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శనివారం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్–2025 ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారన్నారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 992 మార్కులతో కె.మానస, జి.లహరి రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలిచారన్నారు. అలాగే బైపీసీ విభాగంలో షేక్ ఆఫీఫా తబస్సుమ్ 992 మార్కులతో అసాధారణ ప్రతిభ కనబరిచిందన్నారు. 990 ఆపై మార్కులు 172 మంది, 247 మంది 985 ఆపై మార్కులు, 792 మంది 980 ఆపై మార్కులు, 8551 మంది 900 ఆపై మార్కులు పొందారని వివరించారు. ఫస్టియర్ ఫలితాల్లోనూ విజయ పరంపర ప్రథమ సంవత్సర ఫలితాల్లోనూ తమ విద్యార్థుల విజయ పరంపర కొనసాగిందన్నారు. ఎంపీసీ విభాగంలో 467 మార్కులతో ఇద్దరు విద్యార్థులు ఎం.వినూత్న, బి.యశ్వంత్ నాయక్ అగ్రస్థానంలో నిలిచారన్నారు. బైపీసీ విభాగంలో చల్ల లేఖన 437 మార్కులతో రాష్ట్రంలో ప్రఽథమ స్థానం పొందారని చెప్పారు. ఎంపీసీ విభాగంలో 466 ఆపై మార్కులు 23 మంది, 465 ఆపై మార్కులు 157 మంది, 460 ఆపై మార్కులు 1212 మంది, 400 ఆపై మార్కులు 7927 మంది సాధించారని తెలిపారు. బైపీసీ విభాగం నుంచి 436 ఆపై మార్కులతో 14 మంది, 435 ఆపై మార్కులు 67 మంది, 430 ఆపై మార్కులు 469 మంది, 400 ఆపై మార్కులు 2063 మంది విద్యార్థులు సాధించి సత్తా చాటారన్నారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఏజీఎం మద్దినేని మురళీకృష్ణ, డీన్స్, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతమ్మ సేవలో అధికారులు పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మవారిని శనివారం పశుసంవర్ధక శాఖ జెడీ హనుమంతరావు, ఎన్ఆర్ఈజీఎస్ జాయింట్ కమిషనర్ శివరామ్, అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు వారిని అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం అమ్మవారి గోశాలను సందర్శించి పలు సూచనలు చేశారు. పశువైద్యాధికారి పి.అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ శనివారం వైభవంగా సాగింది. దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం కాగా విశేష సంఖ్యలో అమ్మవారి భక్తులు, ఉభయదాతలు, సేవా సిబ్బంది కుటుంబ సమేతంగా హాజరయ్యారు. తెల్లవారుజామున 5.55 గంటలకు కామథేను అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై శ్రీ గంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 8 కిలో మీటర్ల మేర ప్రదక్షిణ.. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ ఉత్సవ మూర్తులకు పూజాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలు, కోలాట నృత్యాల మధ్య గిరి ప్రదక్షిణ కుమ్మరి పాలెం, విద్యాధరపురం, సితార, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్‌రావునగర్, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా ఆలయానికి చేరుకుంది. సుమారు 8 కిలో మీటర్ల మేర సాగిన గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ద్వారా భక్తుల మనోభీష్టి నెరవేరుతుందని, అమ్మవారి కరుణా కటాక్షాలతో కుటుంబం సుఖ సంతోషాలతో విరసిల్లుతుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. భక్తులు పసుపు నీళ్లుతో గిరి ప్రదక్షిణ మార్గాన్ని శుద్ధి చేసి ఆది దంపతులకు భక్తితో పూజా ద్రవ్యాలను సమర్పించారు. గిరి ప్రదక్షిణ మార్గాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. గిరి ప్రదక్షిణ పూర్తయిన అనంతరం భక్తులు కొండపైకి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. -
మాదిగలకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సీఎం చంద్రబాబునాయుడు వర్గీకరణ ముసుగులో మాదిగలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మండిపడ్డారు. విజయవాడలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. వర్గీకరణలో మాదిగలకు 6, మాలలకు 8 రోస్టర్ పాయింట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల చంద్రబాబుపై మాదిగల్లో అసంతృప్తి నెలకొందన్నారు. రోస్టర్ పేరుతో జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని కోరితే కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ స్వార్థ ప్రయోజనాలు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాదిగలకు మరోసారి అన్యాయం చేస్తున్నారన్నారు. గద్దె దింపడం కూడా మాదిగలకు తెలుసు 30 ఏళ్లుగా వర్గీకరణ ఉద్యమం చేస్తున్న మాదిగలకు చంద్రబాబు చేస్తున్న సామాజిక న్యాయం ఇదేనా అంటూ నిలదీశారు. ఓ వైపు వర్గీకరణ తుది దశకు చేరుకుందని చెబుతూనే ... మరో వైపు విద్య, ఉద్యోగ, సంక్షేమ పథకాలు ఉమ్మడిగా ప్రకటిస్తున్నారన్నారు. ఇలా చేస్తే వర్గీకరణ తర్వాత మాదిగలకు మిగిలేది ఏమిటని ప్రశ్నించారు. మాదిగల డప్పు కొట్టి, చెప్పు కుట్టి, వర్గీకరణ చేసి పెద్ద మాదిగ అవుతానంటే నమ్మి భుజాన మోసామన్నారు. తీరా వర్గీకరణ అంశం రాష్ట్రాల పరిధిలోకి వచ్చిన తర్వాత మాదిగలకు ద్రోహం చేయడం అత్యంత బాధాకరమన్నారు. ఓట్లు వేసి గెలిపించిన మాదిగలకు గద్దె దింపడం కూడా తెలుసునని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేసిన రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని, ఆంధ్రాలో మాదిగలకు అన్యాయం చేసిన చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోవడం ఖాయమన్నారు. లోపాలను సరిచేసి మాదిగలకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 25న నెల్లూరు, 30న కడప, మే 10న రాజమండ్రి, మే 20న విశాఖపట్నం, మే 30న అమరావతిలో మాదిగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. నాయకులు చెరుకూరి కిరణ్ మాదిగ, పూనూరు జార్జి మాదిగ పాల్గొన్నారు. -
నయనానందకరం.. శ్రీవారి కల్యాణం
తిరుమలగిరి(జగ్గయ్యపేట): పండు వెన్నెల.. మల్లె పందిరి.. రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ వేదికపై వాల్మీ కోద్భవ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం శనివారం రాత్రి నయనానందకరంగా జరిగింది. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ మూర్తులతో కొండపైన ఉన్న ఆలయం నుంచి గ్రామంలో ఊరేగించి ఎదురు కోలోత్సవం జరిపించారు. అనంతరం కొండ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంలోకి విగ్రహాలను ప్రతి ష్టించి ఆలయ ప్రధానార్చకుడు తిరునగరి రామకృష్ణ మాచార్యులు, పరాంకుశం వాసుదేవాచార్యులు పర్యవేక్షణలో కల్యాణ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ స్వామికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ చైర్మన్ భరద్వాజ్, పాలకవర్గ సభ్యులు, పలువురు దంపతులు పీటలపై కూర్చున్నారు. స్వామి కల్యాణాన్ని తిలకిం చేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వాసుదేవాచార్యులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఐపీఎస్ అధికారి మనీషారెడ్డి ఆధ్వర్యంలో నందిగామ ఏసీపీ తిలక్, సీఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో జగ్గయ్యపేట, వత్సవాయి, చిల్లకల్లు ఎస్ఐలు రాజు, తోట శ్రీనివాస్ వంద మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఏసీ ప్రసాద్, ఇన్చార్జ్ తహశీల్దార్ మనోహర్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
మచిలీపట్నంలో భారీగా గంజాయి పట్టివేత
కోనేరుసెంటర్: మచిలీపట్నంలో గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న ఐదుగురిని చిలకలపూడి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చిలకలపూడి సీఐ ఎస్కే నబీ శనివారం విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం ఆనంద్‌పేటకు చెందిన ఉదయ్‌కుమార్ హైదరాబాద్‌లో ఉంటూ మూడు రోజుల క్రితం మచిలీపట్నం వచ్చాడు. ఉదయ్‌కుమార్, బుట్టాయిపేటకు చెందిన షేక్‌రియాజ్, బందరు మండలం నవీన్మిట్టల్కాలనీకి చెందిన గోపీ, ముస్తాఖాన్పేటకు చెందిన బలగం నాగరాజు, కాగి జస్వంత్‌లు శనివారం ఉదయం మాచవరం మెట్టు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చిలకలపూడి స్టేషన్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నాడు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం తమదైన శైలిలో విచారణ చేయగా ఐదుగురు గంజాయి అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు 25.62 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాగరాజు ద్విచక్ర వాహనంతో పాటు ఉదయ్‌కుమార్ కారును స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. వీటితో పాటు వారి నుంచి 6 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ గంగాధరరావు ఆదేశాల మేరకు మరింత దర్యాప్తు చేస్తున్నామన్నారు. గంజాయి కేసులో లోతైన దర్యాప్తు చేపట్టి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బందరు డీఎస్పీ రాజా ఆధ్వర్యంలో గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక టీమ్‌లు పనిచేస్తున్నట్లు చెప్పారు. గంజాయి విక్రయాలకు సంబంధించి ప్రజల వద్ద ఎటువంటి సమాచారం ఉన్నా నేరుగా తమకు తెలియజేసి గంజాయి నిర్మూలనకు సహకరించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. సమావేశంలో ఎస్ఐ యుఎల్ సుబ్రహ్మణ్యం, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. 25.65 కేజీల గంజాయి స్వాధీనం, ఐదుగురి అరెస్ట్ బైక్, కారును సీజ్ చేసిన చిలకలపూడి పోలీసులు -
వక్ఫ్ సవరణ బిల్లు ప్రమాదకరం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు దేశానికి చాలా ప్రమాదకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో పంజాసెంటర్‌లో శనివారం సాయంత్రం వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథి నారాయణ మాట్లాడుతూ.. దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నిందన్నారు. అందులో భాగంగానే అన్ని రాజ్యంగ వ్యవస్థలపై ఆధిపత్యం చెలాయిస్తోందన్నారు. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్‌బిల్లు ఆమోదంపై చంద్రబాబు మూడు సూచనలు చేశానని చెబుతున్నాడని, అవి ఏమిటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు మూడు నామాలు పెట్టిన చంద్రబాబు తన బోగస్ మాటలు ఆపాలని హితవు పలికారు. చంద్ర బాబు, పవన్‌కల్యాణ్ బీజేపీకి లొంగిపోయారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ కేవలం మైనార్టీలకు మాత్రమే చెందిన అంశం కాదని, ఇది రాజ్యాంగంపై దాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర సమితి కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ -
ఇంటర్లో ఎన్టీఆర్ సత్తా
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు మరో సారి తమ సత్తాచాటారు. రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతాన్ని మించి ఫలితాలు సాధించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో జిల్లా తృతీయ స్థానాల్లో నిలిచింది. గత ఏడాది ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రెండో స్థానంలో నిలిచిన జిల్లా ఈ ఏడాది మాత్రం తృతీయ స్థానానికి పడిపోయింది. మొదటి సంవత్సరం విద్యార్థులు 81 శాతంతో, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 89 శాతం ఫలితాలతో రాష్ట్రంలో తృతీయ స్థానంలో నిలిచారు. 2023 వరకూ ఉమ్మడి కృష్ణాజిల్లాగా ఫలితాలు ప్రకటించగా, గత ఏడాది నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లాల వారీగా ఇంటర్మీడియెట్ బోర్డు ఫలితాలను ప్రకటిస్తోంది. 39,200 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షకు హాజరవగా 31,676 మంది ఉత్తీర్ణులయ్యారు. 35,484 మంది రెండో సంవత్సరం పరీక్షలు రాయగా 31,736 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో 74.6 శాతం ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 74.6 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 830 మంది పరీక్షలకు హాజరవగా 620 మంది ఉత్తీర్ణత (74.6 శాతం) సాధించారు. ప్రభుత్వ కాలేజీల్లో ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మొదటి ఏడాది 241 మంది మంది పరీక్షలు రాయగా 206 మంది ఉత్తీర్ణులై 85 శాతం సాధించారు. రెండో సంవ త్సరం 189 మంది హాజరవగా 177 మంది ఉత్తీర్ణులై 94 శాతం సాధించారు. ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి 641 మంది విద్యార్థులు రెండో సంవత్సరం పరీక్షలు రాయగా 443 మంది ఉత్తీర్ణులై 69 శాతం ఫలితాలు సాధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 66 శాతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండో సంవత్సరం విద్యార్థులు 66 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో పది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు న్నాయి. మొదటి ఏడాది పరీక్షకు 997 మంది హాజరవగా 485 మంది ఉత్తీర్ణులై 49 శాతం, రెండో సంవత్సరానికి సంబంధించి 606 మందికి 398 మంది ఉత్తీర్ణులై 66 శాతం ఫలితాలు సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లో ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం పరీక్షలకు 241 మంది విద్యార్థులు హాజరవగా 206 మంది ఉత్తీర్ణులై 85 శాతం, రెండో సంవత్సరం పరీక్షలకు 189 మంది హాజరవగా 177 మంది ఉత్తీర్ణులై 94 శాతం ఫలితాలను సాధించారు. ప్రభుత్వ కాలేజీలకు సంబంధించి ఫలితాల్లో రాష్ట్రంలో రెండో సంవత్సరం ఫలితాల్లో 19 స్థానం, మొదటి సంవత్సరం ఫలితాల్లో ఏడో స్థానానికి పరిమితమమైంది. ఏపీఎస్‌డబ్ల్యూఆర్ మొదటి ఏడాది 84 శాతం, రెండో ఏడాది 96 శాతం, ఏపీటీడబ్ల్యూర్ మొదటి ఏడాది 94 శాతం రెండో ఏడాది 99 శాతం, హైస్కూల్ ప్లస్ మొదటి ఏడాది 39 శాతం, రెండో ఏడాది 52 శాతం, మోడల్ స్కూల్ మొదటి ఏడాది 88 శాతం, రెండో ఏడాది 81 శాతం, కేజీబీవీ మొదటి ఏడాది 68 శాతం, రెండో ఏడాది 81 శాతం ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన జి.రాజ్య లక్ష్మి ఎంపీసీలో 1000కి 984 మార్కులు, బైపీసీలో మైలవరం జెడ్పీ బాలికల పాఠశాలలో ఉన్న హై స్కూల్ ప్లస్‌లో బూక్యా హరిణి 978, పఠాన్ షాజిదా ఖాతూన్ 976, పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన షేక్ రేష్మా 973 మార్కులను సాధించారు. ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిన జిల్లా ప్రథమ సంవత్సరంలో 81, ద్వితీయ సంవత్సరంలో 89 శాతం ఉత్తీర్ణత మే 12 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలురోజూ రెండు పరీక్షలు ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. ఒకే రోజు రెండు పరీక్షలు జరుగుతాయి. ఉదయం తొమ్మిది నుంచి 12 గంటల వరకూ మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకూ రెండో సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తారు. మే 28 నుంచి జూన్ మొదటి తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకూ అవకాశం ఉంది. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు సంబంధించి ఫీజు చెల్లింపునకు ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ అవకాశం కల్పించారు. -
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను అందజేశారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకం, బంగారు గోపురం పనులకు భక్తులు విరాళాలను అందించారు. అమ్మవారి నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన ఎం.శ్రీనివాసరావు కుటుంబం రూ.1,01,116, హైదరాబాద్‌కు చెందిన కె.విష్ణువర్ధనదేవి రూ.లక్ష హైదరాబాద్‌కు చెందిన మరో భక్తుడు వి.శ్రీనివాస్ రూ. 1,01,116 విరాళాన్ని అందించారు. బంగారు తాపడం పనులకు విజయవాడకు చెందిన డి.రామాంజనేయులు రూ.1,51,116, విశాఖపట్నంకు చెందిన కె.బాలకృష్ణారావు కుటుంబం రూ.లక్ష అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలతో సత్కరించారు. -
వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్లు, ప్రధాన కార్యదర్శి నియామకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో వివిధ హోదాల్లో నాయకులను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ సీపీ పొలిటికల్ ఎడ్వైజరీ కమిటీ మెంబర్లుగా మాజీ మంత్రులు జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. నృత్యకళాకారులకు గిన్నిస్ బుక్‌లో చోటుపెద్దఆవుటపల్లి(గన్నవరం): ఉంగుటూరు మండలం పెద్దఆవుటపల్లికి చెందిన శ్రీవిజయలలిత కూచిపూడి నృత్య అకాడమీ నృత్య కళాకారులు 30 మంది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికా ర్డ్స్‌లో చోటు దక్కించుకున్నారని నాట్యచారిని జి.వనజ చంద్రశేఖర్ తెలిపారు. ఆమె శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. 2023 డిసెంబర్ 24న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో భరత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 7,209 మంది కళాకారులతో కూచిపూడి కళావైభవం మహా బృంద నాట్య ప్రదర్శన జరిగిందని పేర్కొన్నారు. ఈ బృందంలో తమ అకాడమీ విద్యార్థులు 30 మంది భాగస్వాములయ్యారని తెలిపారు. ఆ నాట్య ప్రద ర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు ఎక్కిందని పేర్కొన్నారు. నాట్య ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులందరికీ గిన్నిస్ బుక్ నుంచి సర్టిఫికెట్లు అందాయని వివరించారు. కొనసాగుతున్న వెయిట్ లిఫ్టింగ్ పోటీలుగుడివాడ టౌన్: స్థానిక ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12వ రాష్ట్ర క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలు శనివారం కూడా కొనసాగాయి. మహిళల విభాగంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ స్థాయిలో ఈ పోటీలు జరి గాయి. మాస్టర్స్ మహిళా విభాగం పోటీలు శనివారం ముగిశాయి. ఈ పోటీల్లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన జగపతి తిరుపతమ్మ మూడు విభాగాల్లో బంగారు పతకాలు సాధించి స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ది చాంపియన్‌గా నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేడియం కమిటీ సభ్యుడు గుత్తా శివరామ కృష్ణ(చంటి), కోచ్ ఎం. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యుడి సేవలో డీజీపీ మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా సతీ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలు పూర్ణకంభంతో ఘన స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా పుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీ రామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు, వేదపండితులు బాలకృష్ణ శర్మ, మణిదీప్ శర్మ, విరూప్ శర్మ వేద ఆశీర్వచనాలు అందజేశారు. కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధరరావు, అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ పాల్గొన్నారు. -
సింహ వాహనంపై ఆది దంపతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస బ్రహ్మో త్సవాల్లో ఐదో రోజైన శనివారం శ్రీగంగ, పార్వతి (దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు సింహ వాహన సేవ జరిగింది. సాయంత్రం ఐదు గంటలకు ఆలయ ప్రాంగణంలోని మల్లేశ్వర మహా మండపం నుంచి నగరోత్సవ సేవ ప్రారంభమైంది. సింహ వాహనంపై అధిష్టించిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు ఆలయ అర్చకులు పూజలు చేశారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వాహన సేవ కనకదుర్గనగర్, రథం సెంటర్, బ్రాహ్మణవీధి, కొత్తపేట, సామారంగం చౌక్, మొయిన్‌రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. సింహ వాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులకు భక్తులు పూజాసామగ్రి సమర్పించారు. ఉదయం మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద మూలమంత్ర హవనం, సదస్యం, వేద స్వస్తి జరిగాయి. -
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో క్షణాల్లో చెక్ చేసుకోండిలా..
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు(AP Inter Results) శనివారం విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 70 శాతం, సెకండ్ ఇయర్లో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్ష రాసిన విద్యార్థులు కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.com వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.క్లిక్ 👉🏼 ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ రిజల్ట్స్ క్లిక్ 👉🏼 సెకండ్ ఇయర్ ఇయర్ రెగ్యులర్ రిజల్ట్స్‌క్లిక్ 👉🏼 ఫస్ట్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్‌క్లిక్ 👉🏼 సెకండ్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్ AP Inter Results 2025.. ఎలా చెక్ చేసుకోవాలి.. ?➤ ముందుగా https://results.sakshieducation.com ను క్లిక్ చేయండి.➤పైన కనిపిస్తున్న లింక్‌లపై క్లిక్ చేయండి.➤ మీ హాల్‌టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.➤ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి. ➤ తర్వాతి స్క్రీన్‌లో ఫలితాలు డిస్ప్లే అవుతాయి.➤ భవిష్యత్ అవసరాల కోసం డౌన్లోడ్/ప్రింట్ అవుట్ తీసుకోండి.ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో చిత్తూరు లాస్ట్‌ఇదిలా ఉంటే.. ఇంటర్లో ఈ ఏడాది 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి - 19 వరకు ఫస్టియర్ పరీక్షలు జరగగా, మార్చి 3- 20 వరకు సెకండియర్ పరీక్షలను నిర్వహించారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావడంతో ఇవాళ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయిగా నిలిచింది. ఫస్ట్ , సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఫస్ట్ ప్లేస్‌లో కృష్ణా జిల్లా నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో గుంటూరు , ఎన్టీఆర్ జిల్లాలు నిలిచాయి. ఇక.. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో లాస్ట్ ప్లేస్‌లో సీఎం సొంతజిల్లా చిత్తూరు నిలవడం గమనార్హం. సెకండ్ ఇయర్ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. మే 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని ఇంటర్‌బోర్డు ప్రకటించింది. -
సెపక్ తక్రా రాష్ట్ర జట్లు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: మణిపూర్‌లో ఈనెల 15నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న జాతీయ స్కూల్ గేమ్స్ అండర్–17 బాలబాలికల సెపక్ తక్రా పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్లను ఎంపిక చేసినట్లు ఏపీ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి.భానుమూర్తిరాజు తెలిపారు. బాలురు జట్టుకు జి.సతీష్, కె.కుశల్, డి.ఎం.షాహిద్, టి.జశ్వంత్, టి.వంశీ, బాలికలు జట్టుకు పి.హరిప్రియ, కె.వెంకటలక్ష్మి, పి.దుర్గమధురశ్రీ, సి.తేజ, జి.రమ్య ఎంపికై నట్లు వివరించారు. ఈ జట్లుకు కోచ్, మేనేజర్లుగా ఎస్.రమేష్, ఎం.సంతోషికుమారి, డి.సుంకరరావు వ్యవరిస్తారని వెల్లడించారు. ఈ జట్లను సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు(ఎస్పీడీ) బి.శ్రీనివాసరావు పటమట జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం అభినందించారు. -
నంది వాహనంపై ఆది దంపతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఇంద్రకీలాద్రి పై నిర్వహిస్తున్న చైత్ర మాస బ్రహ్మోత్సవాలలో నాల్గో రోజైన శుక్రవారం శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు నంది వాహనంపై నగరోత్సవ సేవ జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహా మండపం దిగువన నంది వాహనాన్ని వివిధ వర్ణాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగా, శ్రీ గంగా పార్వతి (దుర్గ) సమేతంగా మల్లేశ్వర స్వామి వారు అధిష్టించారు. ఆది దంపతులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం నగరోత్సవ సేవను లాంఛనంగా ప్రారంభించారు. మహామండపం నుంచి ప్రారంభమైన నంది వాహన సేవ కనకదుర్గనగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, సామారంగం చౌక్ మీదగా ఆలయానికి చేరుకుంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, చిన్నారులు, మహిళల కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల నడుమ ఊరేగింపు కనుల పండువ గా సాగింది. నగరోత్సవ సేవలో ఆలయ ఏఈవో దుర్గారావు, ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్ల ద్వారా చెక్కుల పంపిణీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్):మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ శుక్రవారం వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఆటోలు పంపిణీ చేశారు. పలువురికి ఆర్థిక సాయం అందజేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల ప్రజల ఆర్థిక స్వాలంబనకు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా కార్పొరేషన్ల తరఫున లబ్ధిదారులకు సబ్బిడీపై రుణాలను మంజూరు చేస్తున్నామన్నారు. ఈ కార్పొరేషన్ల నుంచి ఈ ఏడాది ఇప్పటివరకు 400 మంది లబ్ధిదారులకు రూ.8.05కోట్ల ఆర్థికసాయం అందించినట్లు వివరించారు. లబ్ధిదారులు ఆటోలు, చిరు వ్యాపారాలు, జనరిక్ మెడికల్ షాపులు నిర్వహించుకునేందుకు వెనుకబడిన సంక్షేమశాఖ ద్వారా ఆధ్వర్యంలో రుణాలను మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరెడ్డి, జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారిణి. కె.లక్ష్మీదేవమ్మ, సహాయ సంక్షేమ అధికారి పి.శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్ ఏఇవో కె.రాజేంద్రబాబు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు రజనీకుమారి, హేమప్రియ, ఆంజనేయులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 20259సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 515.10 అడుగుల వద్ద ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాల్వకు నీటిని నిలుపుదల చేశారు. మిర్చి యార్డుకు వరుస సెలవులు కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శనివారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. మంగళవారం నుంచి క్రయ విక్రయాలు కొనసాగుతాయి.పూలే చిరస్మరణీయుడు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద శుక్రవారం జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళుల ర్పించిన వైఎస్సార్ సీపీ నేతలు పూలే చిరస్మరణీయుడని కొనియాడారు. – 10 లోu -
రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తోన్న ప్రభుత్వం
కృష్ణలంక(విజయవాడతూర్పు): లౌకిక రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షించాలని, మతసామరస్యం కోరుతూ సొసైటీ ఫర్ కమ్యునల్ హార్మనీ ఆధ్వర్యంలో ఈనెల 13న విజయవాడ నగరంలోని సిద్ధార్థ అకాడెమీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సమైక్యతా శంఖారావం సదస్సును జయప్రదం చేయాలని నిర్వహణ జాతీయ కమిటీ చైర్మన్ కె.విజయరావు, రాష్ట్ర సమన్వయకర్త, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు. గవర్నర్‌పేటలోని బాలోత్చవ భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమైక్యతా శంఖారావం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగ కల్పించిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. భిన్నమతాలు, జాతులు, భాషలు, వర్గాలు, సంస్కృతుల సమాహారంగా ఉన్న మనదేశంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఘర్షణలు సృష్టించే విధంగా పాలక బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు కుట్రలు చేస్తున్నాయన్నారు. 1947 చట్టం ప్రకారం చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, మసీదులు, చర్చీల విషయంలో ఎలాంటి జోక్యం ఉండరాదన్నారు. వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ పార్లమెంట్లో ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వందేళ్ల కిందటే స్వామి వివేకానంద చికాగోలో మనదేశ ఔన్నత్యంపై ప్రసంగించిన వైనాన్ని గుర్తుచేశారు. విజయరావు మాట్లాడుతూ సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మనీ జాతీయస్థాయిలో మత సామరస్యం కోసం కృషి చేస్తుందన్నారు. 13న జరిగే సదస్సులో రాజ్యసభసభ్యుడు ఇమ్రాన్ప్రతాప్గదీ, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, యూపీ మాజీమంత్రి మోయిద్అహ్మద్ తదితరులు వక్తలుగా పాల్గొంటారని వివరించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు మాట్లాడుతూ ఇటీవల వివిధవర్గాల వారు వివిధరకాల శంఖారావాల పేరుతో నానాయాగి చేశారన్నారు. పాలకులే మతం, భక్తి పేరుతో రోజుకో మాటలు చెబుతున్నారని, వాటికి ప్రత్యామ్నాయంగా ఈ సదస్సు జరుగుతుందని తెలిపారు. సమావేశంలో మైనారిటీ హక్కుల రాష్ట్ర కన్వీనర్ షేక్ బాజీ, న్యాయవాది మతీన్, సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మనీ కార్యదర్శి అబ్దుల్ రెహమాన్, రైతుసంఘ నాయకుడు వై.కేశవరావు, ఐద్వా నాయకురాలు శ్రీదేవి, అరస నాయకుడు మోతుకూరి రుణ్‌కుమార్, సూర్యారావు పాల్గొన్నారు. మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు -
బీసీలకు 52శాతం రిజర్వేషన్లు కల్పించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన బీసీలకు 52శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.పుష్పరాజ్ డిమాండ్ చేశారు. బీసీలకు 52శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీఎస్పీ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో ఽశుక్రవారం ధర్నా చేశారు. ఈసందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో బీసీలు 52శాతం ఉన్నారని గత ప్రభుత్వం లెక్కలతో తేల్చిందన్నారు. ఆ మేరకు బీసీలకు విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థలపదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీహార్ సీఎం నితీష్‌కుమార్ కులగణన జరిపి బీసీలకు 65శాతం రిజర్వేషన్లు ప్రకటించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శులు కొదమల ప్రభుదాసు, గంగవరపు దేవా , జిల్లా అధ్యక్షుడు ఉదయ్కిరణ్యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు దొండపాటి శామ్యూల్ కుమార్, సిటీ కన్వీనర్ పి.డేనియల్, నాయకులు దాసరి కృష్ణ, ఉడుముల బుజ్జి, మద్దిరాల వినోద్, కోటేశ్వరరావు, మల్లాది అశోక్, బూదాల బాబురావు, కె.వి.రత్నం, నందిగం రామ్మోహన్, మేకల దుష్యంత్, ప్రత్తిపాటి మల్లయ్య పాల్గొన్నారు. -
పూలే సిద్ధాంతాలు ఆదర్శప్రాయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సమ సమాజ స్థాపనకు అహర్నిశలు కృషి చేసిన సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలేను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత పూలే చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సామాజిక అసమానతలను రూపుమాపేందుకు పూలే అలుపెరగని పోరాటం చేశారన్నారు. మానవుడికి విద్య జ్ఞానజ్యోతి లాంటిదని పూలే విశ్వసించేవారన్నారు. బడుగు, బలహీన వర్గాలలో ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాటం చేయడంతో పాటు సాధికారత దిశగా కృషి చేశారన్నారు. మన దేశంలో గాంధీజీ కంటే ముందే మహాత్మా అని బిరుదు పొందారన్నారు. ఆయన సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహం, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి కె. లక్ష్మీదేవమ్మ, సహాయ సంక్షేమ అధికారి పి.శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్ ఏఈవో కె.రాజేంద్రబాబు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు రజనీకుమారి, హేమప్రియ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
ఉపాధి కూలీల ఆకలి కేకలు
● జనవరి 17 నుంచి రూ.18 కోట్ల మేర వేతన బకాయిలు ● పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపని కూలీలు ● సిబ్బంది మెడపై వేలాడుతున్న లక్ష్యాల కత్తి ● రూ.70 కోట్లు మెటీరియల్ కాంపొనెంట్ బకాయిలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉపాధి హామీ పథకం కింద ఉన్న ఊళ్లో ఉపాధి దొరికినా చేసిన పనికి సకాలంలో వేతనం అందక కూలీలు అవస్థలు పడుతున్నారు. నాలుగు కారం మెతుకులు మింగి, నీళ్లు తాగి కాలం వెళ్లదీస్తున్నారు. వేతనం రాని పనికి వెళ్లే కంటే వలస వెళ్లడం మేలని కొందరు ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. గ్రామీణ నిరుపేదలు, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడం, వలసల నివారణే లక్ష్యంగా ఏర్పాటైన ఈ పథకం ఉద్దేశం నీరుగారుతోంది. వారం రోజుల్లో చేసిన పనికి వేతనం ఇవ్వాలన్న నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. ఆరుబయట ఎండలో రెక్కలు ముక్కలు చేసుకుని పని చేసిన కూలీలకు రెండు నెలలుగా వేతనాలు నిలిచిపోయాయి. మరో వైపు మెటీరియల్ కాంపొనెంట్ నిధులు కోట్లల్లో బకాయిలు పడ్డాయి. ఆర్నెల్లుగా కార్యాలయ నిర్వహణ ఖర్చులు లేక వ్యవస్థ చతికిలపడింది. నిబంధనల ప్రకారం వారంలోగా వేతనం ఇవ్వాలి ఎన్టీఆర్ జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లక్ష్యం నెరవేరడం లేదు. వేసవిలో వ్యవసాయ కూలీలకు పనులు దొరకవు. ఈ పథకం కింద పనులు గుర్తించి కూలీలకు ఉపాఽధి కల్పించాలి. ఒక్కొక్కరికి రోజుకు రూ.300 వేతనం అందించాలి. తాజాగా ప్రభుత్వం వేతనం రూ.307గా నిర్ణయించింది. పనులు చేసిన కూలీలకు నిబంధనల ప్రకారం వారంలోపు వేతనం అందించాలి. కానీ ఇదంతా కాగితాలకే పరిమితమైంది. ఉపాధి హామీ పథకంలో పనులు కల్పిస్తున్నా గత రెండు నెలలుగా కూలీలకు వేతనాలు జమ చేయడం లేదు. వేతనాలు ఎప్పటికి వస్తాయో చెప్పలేని పరిస్థితి. జిల్లాలోని 16 మండలాల్లో 6 లక్షల పనిదినాలకు జనవరి 7 నుంచి వేతనాలు అందడం లేదు. రూ.16 నుంచి రూ.18 కోట్లు వేతన బకాయిలు ఉన్నాయి. కార్యాలయ నిర్వహణకు కూడా డబ్బుల్లేవు పథకంలో చేపట్టిన పనులకు సంబంధించి డిసెంబర్ నుంచి బకాయిలు ఉన్నాయి. మెటీరియల్ కాంపొనెంట్ కింద జిల్లాలో రూ.70 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఓ వైపు కూలీలకు వేతనాలు అందక పనులు ముందుకు సాగడం లేదు. వీటికి తోడు మండలాల్లో కార్యాలయ నిర్వహణకు డబ్బులు లేక సిబ్బంది అవస్థలు పడుతున్నారు. లక్ష్యాలు నిర్దేశించి ఉన్నతాధికారుల వేధింపులు ఉపాధి హామీ పథకానికి లక్ష్యాలు నిర్దేశించి వాటిని చేరుకోవాలని దిగువ స్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారు. వారం వారం కూలీలకు వేతనాలు అందితే పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపుతారని, కానీ రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా లక్ష్యాలు చేరుకోవాలంటే ఎలా అంటూ కొందరు సిబ్బంది తమలో తాము మథన పడుతున్నారు. ప్రతి వారం సమీక్షలు నిర్వహించి మెడపై కత్తి పెట్టి మరీ లక్ష్యాలు చేరుకోవాలంటున్నారని, కార్యాలయాల నిర్వహణకు పైసా ఇవ్వకుండా సస్పెండ్ చేస్తాం. షోకాజ్ నోటీసులు ఇస్తామంటూ తీవ్రమైన వత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. పై నుంచి ఎండ మాడిపోతోంది...లోపల కడుపు కాలిపోతోంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉపాధి కూలీలు పనిచేయాల్సి వస్తోంది. మండే ఎండల్లో, కాలే కడుపుతో ఎన్నాళ్లని పనిచేయగలరు. రెండు నెలలకు పైగా వేతనాలు అందని పరిస్థితుల్లో ఉపాధి హామీ పనులకు రావడానికి కూలీలు ఆసక్తి చూపడం లేదు. వలసలు నివారించడానికి ఉద్దేశించిన ఈ పథకం వేతనాలు సరిగా ఇవ్వకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కూలీలు వలసబాట పట్టాల్సిన దుస్థితిని కలుగజేస్తోంది. మరోవైపు ఉపాధి హామీ పథకం సిబ్బంది మెడపై లక్ష్యాల కత్తి వేలాడుతోంది. కూలి డబ్బులు రావడం లేదు వేసవిలో ఉపాధి పనులకు వెళుతున్నా. రెండు నెలల నుంచి డబ్బులు ఇవ్వడం లేదు. కుటుంబం గడవడానికి ఇబ్బందిగా ఉంది. చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోతే ఎలా బతికేది? – మంద రాహేలు, చెవుటూరు శానా ఇబ్బందిగా ఉంది నేను వ్యవసాయ కూలి పనులకు వెళ్తాను. ఉపాధి పనికి వెళ్తే గతంలో వారంలో డబ్బులు ఇచ్చేవారు. కొద్ది రోజుల నుంచి డబ్బులు రావడం లేదు. శానా ఇబ్బందిగా ఉంది. – నాగేశ్వరరావు, చెవుటూరు -
కలానికి సంకెళ్లా..?
సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, మరో ఆరుగురు పాత్రికేయులపై క్రిమినల్ కేసులు పెట్టడాన్ని శుక్రవారం పలు పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లా కేంద్రంతో పాటు పలు నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేశాయి. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సాక్షి దిన పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, మరో ఆరుగురు పాత్రికేయులపై క్రిమినల్ కేసులు బనాయించడాన్ని ఏపీయూడబ్ల్యూజే, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం(సామ్నా) తీవ్రంగా ఖండించాయి. ఆ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహంను కలిసి వినతిపత్రం అందజేశాయి. ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎస్కే బాబు, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం(సామ్నా) రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి, ఏపీయూడబ్ల్యూజే అర్బన్ శాఖ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు ఎం. మురళీకృష్ణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు జి.రఘు రామ్, అబ్దుల్ ఖదీర్, సీనియర్ నాయకులు జి.రామారావు, బీవీ శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ కోశాధికారి సయ్యద్ మహమ్మద్ హుస్సేన్, జీవన్ కుమార్ డీఆర్వోకు వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు. అనంతరం డీఆర్వో కార్యా లయం ఎదుట బైఠాయించారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, క్రిమినల్ కేసులు ఎత్తివేయాలి, పత్రికాస్వేచ్ఛను కాపాడాలంటూ నినాదాలు చేశారు. అనంతరం సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు మీడియాతో మాట్లాడుతూ ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి, మరో ఆరుగురు పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమేనని తాము భావిస్తున్నామన్నారు. సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎస్కే బాబు, సామ్నా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఏపీయూ డబ్ల్యూజే సభ్యులు, ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ ఆధ్వర్యంలో... కృష్ణలంక(విజయవాడతూర్పు): సాక్షి దినపత్రిక సంపాదకుడు ధనంజయరెడ్డితో పాటు మరో ఆరుగురు జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వెంకట్రావు,జి.ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కన్వీనర్లు వి.శ్రీనివాసరావు, కె.మునిరాజు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మాచర్ల మండలంలో జరిగిన పి.హరిశ్చంద్ర అనే వ్యక్తి హత్య కేసు వార్త ప్రచురణ కారణంగా సమాజంలో వైషమ్యాలు పెచ్చరిల్లుతాయనే సాకుతో కేసు బనాయించటం అక్రమమన్నారు. హంతకులను పట్టుకుని శిక్షించాల్సిన పోలీసులు ఆ పనికి బదులుగా ఇటువంటి కేసులు బనాయించటం ఎంతమాత్రం సమంజసంగా లేదన్నారు. ఇటీవల కర్నూలు జిల్లా ఆదోని పోలీస్‌స్టేషన్ వ్యవహారాలపై ప్రచురితమైన ఒక వార్తకు సంబంధించి కూడా ఎనిమిది దినపత్రికలకు పోలీసులు నోటీసులు జారీ చేశారని గుర్తు చేశారు. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసే ఇటువంటి చర్యలకు పోలీసులు పాల్పడకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై పెట్టిన క్రిమినల్ కేసులు తక్షణం ఉపసంహరించుకోవాలి ఏపీయూడబ్ల్యూజే, చిన్న మధ్య తరహా పత్రికల సంఘం (సామ్నా) డిమాండ్ ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేసిన వివిధ యూనియన్ల నాయకులు -
ప్రణాళికాబద్ధంగా నగరాభివృద్ధి
● వీఎంసీ స్థాయీసంఘం సమావేశంలో మేయర్ భాగ్యలక్ష్మి ● అజెండాలో 31 అంశాలు ఆమోదిస్తూ తీర్మానం పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయటానికి ప్రణాళికాబద్ధంగా నిధులు సమకూరుస్తున్నామని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో శుక్రవారం ఆమె అధ్యక్షతన స్థాయీసంఘం సమావేశం జరిగింది. అజెండాలో మొత్తం 38 అంశాలు రాగా అందులో రెండు అంశాలు రద్దు చేశారు. నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ కేటాయించాలని ఒక అంశం, రెండు అంశాల్లో లీజును ఏడాది వరకు కేటాయింపులు జరగ్గా పూర్తి వివరాలు తర్వాత సమావేశంలో అందించాలని ఒక అంశం, ధ్రువీకరణకు ఒక అంశం, రికార్డుకు ఒక అంశంతో పాటు 31 అంశాలు ఆమోదిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగరంలో మూడు సర్కిళ్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వీఎంసీ మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రధానాంశాలు ● స్వచ్ఛ సర్వేక్షణ్–2020లో నగరంలోని వివిధ డివిజన్లలో పారిశుద్ధ్య నిర్వహణకు 2020 జనవరిలో కాంట్రాక్టర్ ద్వారా పారిశుద్ధ్య కార్మికులను వీఎంసీ నియమించుకుంది. ఈ క్రమంలో కాంట్రాక్టరుకు వారం రోజులకు మాత్రమే వర్క్ ఆర్డర్ ఇవ్వగా 28 రోజులకు 300 మంది పారిశుద్ధ్య కార్మికులకు రోజుకు రూ.400 చొప్పున 28 రోజులకు రూ.33.60 లక్షలు బిల్లులు పెట్టారు. దీనిపై పూర్తిస్థాయిలో వివరాలు లేవని, ఇప్పటికే రెండుమార్లు వాయిదా వేసినప్పటికీ అధికారులు పూర్తిస్థాయిలో వివరాలు అందించనందున స్థాయీ సంఘం ప్రతిపాదనను రద్దు చేసింది. ● కృష్ణలంక బాలాజీనగర్ కర్మల భవనం మూడేళ్లపాటు లీజుకు ఇవ్వాలని, దీనికి ఇప్పటికే టెండర్లు వేయగా ఇరువురు మాత్రమే టెండర్లలో పాల్గొన్నారని, అత్యధికంగా పాడుకున్న జి.శ్రీనివాసరావుకు కేటాయించాలని వచ్చిన ప్రతిపాదనపై టెండరుదారుకు ఏడాది మాత్రమే లీజుకు ఇవ్వాలని సభ్యులు తీర్మానం చేశారు. ● సర్కిల్–3 పరిధిలోని విజయ్ నగర్ కాలనీలో ఉన్న డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ పాత మోటర్ల స్థానంలో కొత్త మోటర్లు అమర్చాలని, అందుకు రూ.49.80 లక్షల వ్యయం వీఎంసీ జనరల్ ఫండ్స్ నుంచి కేటాయించాలని వచ్చిన ప్రతిపాదనను స్థాయీ సంఘం సభ్యులు ఆమోదిస్తూ తీర్మానం చేశారు. ● 56వ డివిజన్లోని పాతరాజరాజేశ్వరి పేట మెయిన్‌రోడ్డులో మహంకాళమ్మ గుడి జంక్షన్ నుంచి రైల్వేగేటు వరకు రోడ్డుకు ఇరువైపులా పేవర్‌బ్లాక్స్, డ్రైన్ల మరమ్మతులకు రూ.48.23 లక్షలు వీఎంసీ జనరల్ ఫండ్స్ నుంచి విడుదల చేయాలని వచ్చిన ప్రతిపాదనను సభ్యులు ఆమోదిస్తూ తీర్మానం చేశారు. ● సర్కిల్–3 పరిధిలోని 4వ డివిజన్ సెంట్రల్ ఎకై ్సజ్ కాలనీలో రోడ్డు నం.1 మిగిలిన రోడ్లకంటే కూడా పల్లంగా ఉందని, ఈ రోడ్డు మెరుగుపరచటానికి అవసరమయ్యే నిధులు రూ.39.42 లక్షలు వీఎంసీ జనరల్ ఫండ్స్ నుంచి విడుదల చేయాలని సభ్యులు తీర్మానించారు. -
అనుబంధ కమిటీల్లో జిల్లా నాయకులకు చోటు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో నియమించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా కేసరి శివారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా ముక్కపాటి నరసింహారావు, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శులుగా డాక్టర్ రెవరెండ్ సందీప్, కలపాల అజయ్‌కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. డాక్టర్ చంద్రహాస్‌కు అరుదైన గౌరవం ఇబ్రహీంపట్నం: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నానికి చెందిన మైనింగ్ రంగ నిపుణుడు డాక్టర్ నిడుముక్కల చంద్రహాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. చాంబర్ ఆఫ్ మైనింగ్ అసోసియేషన్, ఇస్తాంబుల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో టర్కీలో గురువారం రాత్రి జరిగిన ఫ్రాగ్బ్లాస్ట్ సింపోసిజం సిరీస్‌లో 36 దేశాల ప్రతినిధులు పాల్గొనగా, సౌత్ ఇండియా తరపున డాక్టర్ చంద్రహాస్ హాజరై ఓపెన్ మైనింగ్ అంశంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఓపెన్ మైనింగ్‌పై చంద్రహాస్ ఇచ్చిన ప్రజెంటేషన్‌ను మెచ్చిన ఇస్తాంబుల్ యూనివర్సిటీ ప్రతినిధులు ఆయనకు ప్రశంసాపత్రం అందజేసి అభినందించా రు. కెనడాలో 2028లో జరగనున్న సిరీస్‌కు కూ డా ఆహ్వానించారు. ఈసందర్భంగా పలువురు చంద్రహాస్‌కు అభినందనలు తెలియజేశారు. బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటుకు డిమాండ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశంలో బీసీ కులాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులుగా షేక్ నాగుల్ మీరాను నియమించి ఆయనకు నియమాకపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా బీసీల జీవితాలలో మార్పు రాలేదన్నారు. తమిళనాడులో బీసీల ఐక్య పోరాట ఫలితంగా 69శాతం రిజర్వేషన్లు సాధించారని గుర్తుచేశారు. అదే తరహాలో దేశ వ్యాప్తంగా బీసీలు పోరాడి రిజర్వేషన్లు సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్‌కోటా కేటాయించాలని, దేశవ్యాప్తంగా కులగణనతోపాటు బీసీ కులగణను కూడా చేపట్టాలని కోరా రు. బీసీల రక్షణ కోసం వెంటనే చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగుల్‌మీరా మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన వెంగళరావు యాదవ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బీసీ సంఘం నేతలు కలిసి నాగుల్ మీరాను సత్కరించారు. -
దుర్గమ్మకు 110 గ్రాముల బంగారు హారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు రూ.10 లక్షల విలువైన 110 గ్రాముల బంగారు హారాన్ని భక్తులు శుక్రవారం కానుకగా సమర్పించారు. హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన దేవినేని సురేంద్ర కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్‌ను కలిసి బంగారు హారాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఈవో రామచంద్రమోహన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను బహూకరించారు. వక్ఫ్ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధం ● బిల్లును ఉపసంహరించుకునే వరకూ పోరాటం ● లబ్బీపేట మసీదు వద్ద ముస్లిం సంఘాల నిరసన లబ్బీపేట(విజయవాడతూర్పు): కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తెచ్చిందని ముస్లిం సంఘాలు మండిపడ్డాయి, వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టే కుట్రలో భాగమే ఈ సవరణ బిల్లు అని వారు నినదించారు. లబ్బీపేటలోని మసీదులో శుక్రవారం నమాజు అనంతరం వందలాది మంది ముస్లింలు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిం జాక్ రాష్ట్ర కన్వీనర్ మునీర్ అహ్మద్ షేక్ మాట్లాడుతూ దేశంలోని 25 కోట్ల మంది ముస్లింలను మోసం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలో హిందూ, ముస్లింలు ఐక్యతగా సోదరభావంతో నివసిస్తున్నా, వారి మధ్య అగాధం సృష్టించేందుకు ఒక ప్రణాళిక ప్రకారం అనునిత్యం ముస్లింలను వేధించడమే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. ముస్లిం సంస్థల్లో ముస్లిమేతరులకు ప్రాధాన్యం కల్పించి వక్ఫ్ బోర్డును బలహీనపరిచేందుకు ఈ సవరణ బిల్లును తెచ్చారన్నారు. ఈ బిల్లును ఉపసంహరించే వరకూ పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు ముస్లింలను మోసం చేశాయన్నారు. కార్యక్రమంలో ముక్తార్ అలి, అబిద్, ఎస్ఐఓ ప్రతినిధులు అమిర్ ఫాహెద్, అబ్దుల్ హఫీజ్, అమీర్ యహ్యా ఖాన్, అబ్దుర్రఖీభ్, కరీమ్ మొహిద్దీన్, మొహ్మద్ రియాజ్, ముసైబ పాల్గొన్నారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి ఆర్డీఎంఏ నాగనరసింహారావు పెనమలూరు: మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి పెట్టాలని, మున్సిపాలిటీలకు ఆదాయం సమకూరే విధంగా పన్నులు సకాలంలో వసూలు చేయాలని రీజినల్ డైరెక్టర్ అప్లేట్ కమిషనర్(ఆర్డీఎంఏ)సీహెచ్ నాగనరసింహారావు అన్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన మున్సిపల్ కమిషనర్లకు తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని ఒక హోటల్లో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యలపై కమిషనర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సకాలంలో పన్నులు వసూలుకు చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి వెంటనే పనులు చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో పాలన పారదర్శకంగా ఉండాలని, అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మున్సిపాలిటీల్లో సిబ్బంది పని తీరు మెరుగుపరిచే విధంగా కమిషనర్లు కసరత్తు చేయాలని అన్నారు. సమావేశంలో రెండు జిల్లాల మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. -
జ్యోతిరావు పూలే చిరస్మరణీయుడు
భవానీపురం(విజయవాడపశ్చిమ): సమ సమాజం కోసం ఉద్యమించిన స్పూర్తి ప్రదాత, సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే చిరస్మరణీయుడని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కొనియాడారు. జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి వైఎస్సార్ సీపీ నేతలు పూలమాలలువేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి చదువు ఒక్కటే మార్గమని భావించిన మహనీయుడు పూలే అన్నారు.పూలే, అంబేడ్కర్ల ఆశయాలు, ఆలోచనలను చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కి డైవర్షన్ పాలిటిక్స్‌ను నడిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘చెప్పాడంటే..చేస్తాడంతే’ అనేమాట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే వర్తిస్తుందని పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి నాందీ... సామాజిక న్యాయానికి నాందీ పలికిన గొప్పవ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే కాగా, ఆయన స్పూర్తితో పాలన సాగించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్ పేర్కొన్నారు. పూలే ప్రేరణతో మాజీ సీఎం వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించి అమలుచేశారని ఆయన గుర్తుచేశారు. విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పూలే ఆశయాలకనుగుణంగా వైఎస్ జగన్ పాలన సాగించారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేసిందన్నారు. పత్రికా స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం సంకెళ్లు వేసిందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు షేక్ ఆసిఫ్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజరెడ్డి, నాయకులు కాలే పుల్లారావు, బూదాల శ్రీను, పోలిమెట్ల శరత్, తోలేటి శ్రీకాంత్, జమల పూర్ణమ్మ, విద్యార్థి నాయకుడు రవిచంద్ర, కార్పొరేటర్లు యరడ్ల ఆంజనేయరెడ్డి, ఎండీ ఇర్ఫాన్, గుండె సుందరపాల్, దేరంగుల రమణ, జి.నవీన్, పిళ్లా సూరిబాబు, మజ్జి శ్రీను పాల్గొన్నారు. పూలేకు నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతున్న దేవినేని అవినాష్, పక్కన అరుణకుమార్, విష్ణు తదితరులు -
‘సాక్షి’ ఎడిటర్‌పై కేసు.. కూటమి సర్కార్ కక్ష సాధింపే: జర్నలిస్ట్ సంఘాలు
సాక్షి, విజయవాడ: సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డితో పాటు మరో ఆరుగురు జర్నలిస్టులపై కేసు నమోదు చేయడాన్ని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. వెంటనే కేసును ఎత్తివేయాలని ఎన్టీఆర్ జిల్లా డీఆర్వోకు జర్నలిస్ట్ సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు. సామ్నా రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు మాట్లాడుతూ, వార్త రాయడం సమాజంలో జర్నలిస్టు ప్రాథమిక ధర్మం. కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసులు పెట్టినట్లు భావిస్తున్నాం...రాజ్యాంగానికి ఏ వ్యవస్థా అతీతం కాదు. విలేకరి వార్త రాస్తే ఎడిటర్లపై కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామిక విలువలను గౌరవించడం లేదని దీన్ని బట్టి తెలుస్తోంది. ఇలా కేసులు పెట్టడం మంచి పద్దతి కాదు. తక్షణమే కేసును నమోదు ఉపసంహరించుకోవాలి. జర్నలిస్టులకు మా యూనియన్లు అండగా ఉంటాయి. మా పోరాటం కొనసాగిస్తాం’’ అని ధర్మారావు హెచ్చరించారు.కక్ష సాధింపు రాజకీయాలకు సంకేతం..ఐజేయూ నేషనల్ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు మాట్లాడుతూ.. సాక్షి ఎడిటర్‌తో పాటు ఇతర జర్నలిస్టులపై పెట్టిన కేసులు అక్రమం అని.. తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు రాజకీయాలకు సంకేతం. రాజకీయ పార్టీలు కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదు. ఇలా కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమేభావ్యం కాదు..సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛను అణగదొక్కాలని చూడటం ప్రభుత్వానికి భావ్యం కాదు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ప్రభుత్వం కోరుతున్నాం. పత్రికల పై దాడులు చేయకుండా ప్రభుత్వం సంయమనం పాటించాలి. సాక్షి ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి -
AP Inter Results: రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు రేపు(శనివారం) విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష రాసిన విద్యార్థులకు కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.com వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.ఇదిలా ఉంటే.. ఇంటర్లో ఈ ఏడాది 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి - 19 వరకు ఫస్టియర్ పరీక్షలు జరగగా, మార్చి 3- 20 వరకు సెకండియర్ పరీక్షలను నిర్వహించారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయ్యింది. దీంతో రేపు, ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు.AP Inter Results 2025.. ఎలా చెక్ చేసుకోవాలి.. ?➤ ముందుగా https://results.sakshieducation.com ను క్లిక్ చేయండి.➤ "AP Inter 1st Year / 2nd Year Results 2025" అనే లింక్‌పై క్లిక్ చేయండి.➤ మీ హాల్‌టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.➤ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి. ➤ తర్వాతి స్క్రీన్‌లో ఫలితాలు డిస్ప్లే అవుతాయి.➤ భవిష్యత్ అవసరాల కోసం డౌన్లోడ్/ప్రింట్ అవుట్ తీసుకోండి. -
కొండపల్లిలో ఎక్స్పీరియన్స్ సెంటర్
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): హస్త కళాకారుల చేతుల నుంచి జీవం పోసుకుని దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని భావితరాలకు చాటి చెప్పాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కొండపల్లిలో గురువారం పర్యటించిన ఆయన వన్నెతగ్గని సృజనాత్మక బొమ్మల తయారీకి ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. హస్తకళాకారుల సొసైటీ భవనాన్ని పరిశీలించి, చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్యాటక్ హబ్‌గా జిల్లా.. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పర్యాటకంగా జిల్లా అభివృద్ధి చెందేందుకు అపార అవకాశాలున్నాయన్నారు. భౌగోళిక, ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతికంగా జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్యాకేజీలు రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఎక్స్పీరియన్స్ భవనంలో మౌలిక వసతులు, సుందరీకరణ పనులు చేపట్టి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆర్డీవో కావూరి చైతన్య, జిల్లా పర్యాటక అధికారి శిల్ప, కొండపల్లి మునిసిపల్ కమిషనర్ రమ్య కీర్తన, తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కొండపల్లి బొమ్మల ఖ్యాతి భావితరాలకు తెలిసేలా ఏర్పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
చిన్న ఆస్పత్రులను యాక్ట్ నుంచి మినహాయించాలి
ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.నందకిషోర్ లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా ఆస్పత్రులను క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నుంచి మినహాయించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.నందకిషోర్ అన్నారు. రాష్ట్రంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌లో కొన్ని సవరణలు తప్పనిసరిగా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడలోని ఐఎంఏ హాలులో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఎంఏ కోరిక మేరకు చాలా రాష్ట్రాల్లో క్లినిక్స్, చిన్న, మధ్యతరహా ఆస్పత్రులు అంటే 50 పడకల లోపు ఉన్న వాటిని చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారని, మన రాష్ట్రంలో కూడా ఆ విధంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. వైద్యులపై దాడుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా రాష్ట్రంలో చట్టాల్లో సవరణలు చేయాలన్నారు. ప్రస్తుతం మూడేళ్ల శిక్ష పడే కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇస్తున్నారని, ఆ చట్టాన్ని ఏడేళ్లకు పొడిగించడం ద్వారా నాన్ బెయిలబుల్ కేసులుగా నమోదు చేయాలన్నారు. పీఎన్డీటీ యాక్ట్‌లో గర్భిణులను టాగింగ్ చేయడం ద్వారా ప్రతి మాతా శిశువుని సంరక్షించవచ్చునన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్‌పై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎం.సుభాష్‌చంద్రబోస్, జాతీయ యాక్షన్ కమిటీ సభ్యులు డాక్టర్ పి.ఫణిదర్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి.సేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రావణ వాహనంపై ఆది దంపతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన గురువారం శ్రీ గంగా పార్వతీ(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి రావణ వాహనంపై నగర పుర వీధుల్లో విహరించారు. ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం మూల మంత్రహవనం, సాయంత్రం ఔపాసన, బలిహరణ వంటి వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు రావణ వాహనాన్ని అధిష్టించిన ఆది దంపతులకు ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఇతర ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించి నగరోత్సవాన్ని ప్రారంభించారు. మహా మండపం నుంచి ప్రారంభమైన ఊరేగింపు కనకదుర్గనగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, సామా రంగం చౌక్, మొయిన్‌రోడ్డు మీదగా ఆలయానికి చేరుకుంది. కోలాట బృందాలు, డప్పు కళా కారుల విన్యాసాలతో పాటు దేవస్థాన వాయిద్యాల బృందం, పంచవాయిద్యాలతో వాహనం ముందుకు సాగింది. ఆది దంపతులు నగర వీధుల్లోకి విచ్చేయడంతో స్థానిక భక్తజనం, దుకాణదారులు పూజా సామగ్రిని సమర్పించి పూజలు జరిపించుకున్నారు. ఏఈవో చంద్రశేఖర్, దుర్గారావు, ఆలయ అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా, భక్తజనులు పాల్గొన్నారు. కనులపండువగా నగరోత్సవ సేవ -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025‘సూపర్ సిక్స్’ ఎగవేతకు కుట్ర ధర్నాలో ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్నికల ముందు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం అప్పులను సాకుగా చూపి వాటిని ఎగవేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రగతి శీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) మండిపడింది. గురువారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నందు ప్రగతిశీల మహి ళా సంఘం(పీఓడబ్ల్యూ) ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్. గంగాభవాని మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేసిందన్నారు. కూటమి నేతలు బ్రాందీ షాపుల వాటాలు పంచుకోవడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు మహిళలు, విద్యార్థులు, యువజనులు, రైతులు, కార్మికులకు హామీలు గుప్పించిన చంద్రబాబు.. ఇపుడు అమాయకంగా ఖజానాలో డబ్బు లు లేవని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారం చేపట్టిన పది నెలల్లో రూ. 1.50 కోట్ల అప్పులు చేశారని, అయినా పథకాలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. పవన్ కల్యాణ్ ఏమైపోయారో.. పీఓడబ్ల్యూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు పి.పద్మ మాట్లాడుతూ మహిళలపై చేయి వేయాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకుంటామని ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికిన డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏమైపోయారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో చిన్న పిల్లలు, మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలు అంతులేకుండా జరుగుతున్న పవన్ కల్యాణ్ నోరు మెదకపోవడాన్ని తప్పుపట్టారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. దుర్గ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దుర్గమ్మ సన్నిధిలో ఎన్నికల కమిషనర్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఏపీ, తెలంగాణ ఎన్నికల కమిషనర్లు గురువారం దర్శించుకున్నారు. తెలంగాణ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ ఇంద్రకీలాద్రికి విచ్చేయగా ఆలయ అధికారులు వారిని సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్డీ ప్రసాద్, ఏఈవో చంద్రశేఖర్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టు వస్త్రాలతో వారిని సత్కరించారు. నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు గురువారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన డి. మాల్యాద్రి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,11,116 విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఆలయ అధికారి లక్ష్మణ్ దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. సాగరతీరంలో మాక్ డ్రిల్ కోడూరు: మండలంలోని హంసలదీవి సాగరతీరం వెంట పోలీసులు గురువారం ప్రత్యేక మాక్‌డ్రిల్ చేశారు. కోస్టల్ అధికారుల ఆదేశాల మేరకు గురువారం తీరంలో సీ–విజిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మచిలీపట్నం ఆర్మడ్ రిజర్వ్ డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పాలకాయతిప్ప మైరెన్ సీఐ సురేష్‌రెడ్డి పర్యవేక్షణలో 50 మంది పోలీసులు కోడూరు, నాగాయలంక మండలాల్లోని తీరప్రాంత గ్రామాల్లో పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులు తీరప్రాంత గ్రామాల్లోకి ప్రవేశించి, ఏదో ఒక ప్రాంతంలో దాగి ఉంటే, వారిని కనిపెట్టేందుకు చేపట్టే చర్యలతో మాక్ డ్రిల్ చేపట్టామని మైరెన్ సీఐ సురేష్‌రెడ్డి తెలిపారు. వేటకు వెళ్లిన మత్స్యకారుల ఐడీ కార్డులను పరిశీలించడంతో పాటు వారికి కూడా అనుమానితులను గుర్తించే ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఐదేళ్లుగా కార్యవర్గం లేదు.. అధికారుల పర్యవేక్షణ అసలే కనపడదు.. ఇళ్ల మధ్యే పరిశ్రమల వ్యర్థాలు.. వెరసి ప్రమాదంలో పడిన ప్రజారోగ్యం.. ఇది రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన విజయవాడ ఆటోనగర్ వద్ద పరిస్థితి. ఇక్కడి పరిస్థితులను పర్యవేక్షించాల్సిన ‘ఐలా’ చేష్టలుడిగిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులే ఐలాకు ఎన్నికలు నిర్వహించకుండా మోకాలడ్డుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆసియాలోనే అతిపెద్ద పారిశామ్రికవాడగా విజయవాడ ఆటోనగర్ గుర్తింపు పొందింది. 3వేలకు పైగా చిన్న, పెద్ద తరహా పరిశ్రమలు, 50వేల మందికి పైగా కార్మికులు నిత్యం ఇక్కడ పని చేస్తుంటారు. 100 టన్నులకు పైగా వ్యర్థాలు నిత్యం ఇక్కడి పరిశ్రమల నుంచి వస్తాయి. అయితే వీటిని గుంటూరులోని జిందాల్ పరిశ్రమకు తరలించాలని విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ చెబుతోంది. వీరు ఆ పని చేయకుండా టన్నుల కొద్దీ వ్యర్థాలను పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని తాడిగడప మునిసిపాలిటీ, కానూరు నుంచి ఎనికేపాడుకు వెళ్లే దారిలో విజయ ఇంజినీరింగ్ కళాశాల వద్ద దాదాపు 100 ఎకరాల పంట పొలాల్లో నిత్యం తెచ్చి పోస్తున్నారు. ఇక్కడ కళాశాలలు, పలు కాలనీలు ఉన్నాయి. ప్లాస్టిక్, ఆహార వ్యర్థాలు, కాలం తీరిన మందులను వేయడంతో దుర్గంధం వెదజల్లుతోంది. వీటిని దహనం చేస్తుండటంతో విషవాయువులు వ్యాప్తి చెంది, ఆ సమీప ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు కలుషితమై వ్యాధులు ప్రబలుతున్నాయని, కేవీఆర్ కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. శానిటేషన్ పర్యవేక్షిస్తున్న ఐలా అధికారులు పట్టించుకోవడం లేదు. సుప్రీం కోర్టు ఉత్తర్వులు బేఖాతరు.. పొల్యూషన్‌కు సంబంధించిన మట్టి, మునిసిపల్ వ్యర్థాలు పంట పొలాల్లో వేయటానికి వీలులేదని సుప్రీం కోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నా, అధికారులకు చెవికెక్కడం లేదు. రాత్రి వేళ్లలో పంట పొలాల్లో వ్యర్థాలు పోసి తగులబెడుతున్నారు. దీంతో అక్కడ ఆ పంట పొలాలతో పాటు, చుట్టుపక్కల ఉన్న పొలాల్లో సైతం పంటలు పండక రైతులు అల్లాడిపోతున్నారు. స్థానికులు అడ్డుకుంటున్నా.. ఇటీవల రాత్రి సమయాల్లో డంప్ చేస్తున్న లారీలను స్థానికులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చి, ఆరు లారీలను సీజ్ చేశారు. వాటిని వదిలి వేయాలని వ్యర్థాలను తీసి వేస్తామని, ఐలా అధికారులు ఒత్తిడి తెచ్చినప్పటికీ, స్థానికుల నుంచి తీవ్ర అభ్యతరం వ్యక్తం అవుతోంది. నిడమానూరు, ఎనికేపాడు, కానూరు గ్రామాల సర్పంచ్‌లు, పెద్దలు, అంతకు మునుపు పోసిన చెత్తను, వ్యర్థాలను పూర్తిగా తొలగించే వరకు, సీజ్ చేసిన లారీలను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో అక్కడ నామ మాత్రంగా చెత్త తొలగింపు కార్యక్రమం చేపట్టారు. పూర్తి స్థాయిలో చెత్త తొలగించడంతోపాటు, అక్కడ వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కానూరు–ఆటోనగర్ ప్రధాన రహదారి పక్కనే చెత్త కుప్పలు వేస్తున్నారు. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. చెత్త కుప్పలు కారణంగా రోడ్డుపై ప్రయాణం చేయటం చాలా ఇబ్బందికరంగా ఉంది. – అవినాష్, పెయింటర్, పోరంకి కానూరు ఆటోనగర్‌కు వచ్చే దారిలో భారీగా చెత్త తీసుకువచ్చి వేస్తున్నారు. కార్మికులు పని చేసే ప్రాంతంలో చెత్త వేయటం వల్ల ఆరోగ్యం క్షీణిస్తోంది. చెత్తకు నిప్పు పెట్టడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది. చెత్తవేసే వారిపై చర్యలు తీసుకోవాలి. – సురేష్, ఆటోనగర్ కార్మికుడు, విజయవాడ పన్ను వసూళ్లు 50 శాతం కంటే తక్కువగా ఉన్నందున ఎన్నికలు నిర్వహించలేదు. వసూళ్లు 50 శాతం దాటితే ఎన్నికలు నిర్వహిస్తాం. మేము కార్పొరేషన్ పన్ను కడుతున్నప్పటికీ చెత్త తరలింపునకు స్థలం కేటాయించలేదు.. జిందాల్‌కు తరలించాలని కార్పొరేషన్ అధికారులు సూచించారు. ఇక్కడ ఖాళీగా ఉన్నందున డంపింగ్ చేశాం. ఇబ్బంది అయితే మరో చోటుకు తరలించేందుకు ప్రయత్నిస్తాం. – కె. బాబ్జీ ఇన్చార్జి కమిషనర్, ఐలా పంట పొలాల్లో పేరుకు పోయిన వ్యర్థాలను తగలబెడుతున్న దృశ్యం7న్యూస్‌రీల్ పంట పొలాల్లోకి పరిశ్రమ వ్యర్థాలు స్థానికులు అడ్డుకుంటున్నా ఫలితం శూన్యం జిందాల్‌కు తరలించకుండా రాత్రి వేళల్లో తెచ్చి పడేస్తున్న వైనం ఐదేళ్లుగా ఐలాకు ఎన్నికలు లేకపోవడంతో కొరవడిన పర్యవేక్షణఎన్నికలను అడ్డుకుంటోంది ఎవరు? ఏపీఐఐసీ అందుకే నిర్వహించలేదు.. ఐలా(ఇండ్రస్టీయల్ ఏరియా లోకల్ అథారిటీ) పర్యవేక్షణలో ఆటోనగర్ నడుస్తుంది. దీనికి మూడేళ్లకొకసారి ఎన్నికలు నిర్వహించాలి. అయితే గత ఐదేళ్లుగా ఐలాకు ఎన్నికలు నిర్వహించటం లేదు. దీనికి ప్రస్తుతం ఇన్చార్జి కమిషనర్‌గా జోనల్ మేనేజర్ కె. బాబ్జి వ్యవహరిస్తున్నారు. ఈయన ప్రస్తుతం విజయవాడ, ఏలూరు, జోనల్ మేనేజర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఐలాకు ఎన్నికలు జరగకుండా అధికారులే అడ్డుకుంటున్నారన్న విమర్శలు అధికంగా వినిపిస్తున్నాయి. ఎన్నికలు జరిగితే, పాలక వర్గం పర్యవేక్షణ ఉంటుందనే భావనతో ప్రభుత్వాన్ని సైతం అధికారులు మభ్య పెడుతున్నట్లు చెబుతున్నారు. పైగా రూ.20లక్షల–రూ.25లక్షలకు పైగా ముడుపులు అధికారులకు అందుతున్నట్లు సమాచారం. దీంతో ఏదో సాకుచూపి, ఎన్నికలు జరగకుండా అధికారులు మోకాలడ్డుతున్నట్లు చెబుతున్నారు. శానిటేషన్‌కు సంబంధించి టెండర్లు నిర్వహించకుండానే అధికారులు పనులు కట్టబెట్టడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. -
అవినీతి తప్ప అభివృద్ధి శూన్యం
గుణదల (విజయవాడతూర్పు): రాష్ట్రంలో, విజయవాడ నగరంలో వైఎస్సార్ సీపీ హయాంలో రూ.వందల కోట్ల అభివృద్ధి జరిగిందని, కూటమి ప్రభుత్వం హయాంలో ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ అన్నారు. గుణదలలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలకు అక్రమాలు, అవినీతిపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి జరగకపోవటంతో ఆ పార్టీల నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదన్నారు. కూటమి నేతలు హామీలపై బాండ్లు ఇచ్చారని, కానీ అవి పనికిరాకుండా పోయాయని, తల్లికి వందనం, నిరుద్యోగ భృతిలాంటి ఎన్నో పథకాలు దిక్కు లేకుండా పోయాయని విమర్శించారు. ప్రజలు ఇప్పుడు వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను మననం చేసుకుంటున్నారన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూటమి నేతలకు పట్టడం లేదని, ప్రజలందరి పక్షాన తాము పోరాడటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తూర్పులో చంద్రబాబు డూప్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధి చంద్రబాబు డూప్ అని, చంద్రబాబు చెప్పే అబద్ధాలకు మరికొన్ని అబద్ధాలను చేర్చి ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజలను ఏమార్చేందుకు పీ–4 అని కొత్త స్కాంను తీసుకొచ్చారన్నారు. టీడీపీ సోషల్ మీడియాలో జగన్ కుటుంబ సభ్యులపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను పట్టుకుని వాళ్లు మాట్లాడుతున్నారని, మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు. సమావేశంలో డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మాజీ డెప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, వీఎంసీ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ వెంకట సత్యం, కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
విజయవాడ నుంచి భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): హరిద్వార్, రిషికేష్, వైష్ణోదేవి, అమృత్సర్, ఆనంద్‌పూర్ తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకునే యాత్రికుల కోసం ఈ నెల 23 నుంచి మే 2 వరకు విజయవాడ నుంచి భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్సీటీసీ అధికారులు ప్రకటించారు. తొమ్మిది రాత్రుళ్లు, పది పగళ్లు సాగే ఈ యాత్రలో మానసాదేవి ఆలయం, రామ్ జులా, లక్ష్మణ జులా, అనంద్ సాహిబ్ గురుద్వార్, నైనా దేవి ఆలయం, గోల్డెన్ టెంపుల్, మాత వైష్ణోదేవి దేవాలయ సందర్శనం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో బోర్డింగ్/డిబోర్డింగ్ సదుపాయం కల్పించారు. ఈ యాత్రలో ఎకానమి (స్లీపర్ క్లాస్) ఒక్కొక్కరికి రూ. 18,510, స్టాండర్డ్ (3 ఏసీ) ఒక్కొక్కరికి రూ. 30,730, కంఫర్ట్ (2 ఏసీ) ఒక్కొక్కరికి రూ 40, 685 టిక్కెట్ ధర నిర్ణయించారు. ఈ యాత్రలో ఆన్‌బోర్డు/ఆఫ్‌బోర్డులో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి టిఫిన్, భోజనం, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు మార్గంలో రవాణా సదుపాయం, రాత్రుళ్లు హోటళ్లలో బస తదితర ఏర్పాట్లతో పాటు కోచ్‌లలో సీసీ కెమెరాలతో నిరంతరం భద్రత ఏర్పాట్లు, టూర్ ఎస్కార్ట్‌లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఆర్ఆర్సీటీసీ వెబ్సైట్ లేదా 97013 60701 ఫోన్ నంబర్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా సూచించారు. వేసవికి ప్రత్యేక రైళ్లు వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే విజయవాడ మీదుగా మరికొన్ని ప్రత్యేక వారాంతపు రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి–శ్రీకాకుళంరోడ్డు (07025) ప్రత్యేక రైలు ఈ నెల 11 నుంచి జూన్ 6 వరకు ప్రతి శుక్రవారం, శ్రీకాకుళం రోడ్డు–చర్లపల్లి (07026) ప్రత్యేక రైలు ఈ నెల 12 నుంచి జూన్ 28 వరకు ప్రతి శనివారం నడపనున్నట్లు తెలిపారు. తిరుపతి–సాయినగర్ షిర్డి (07637) ఈ నెల 13 నుంచి జూన్ 29 వరకు ప్రతి ఆదివారం, ఽతిరుగు ప్రయాణంలో సాయినగర్ షిర్డీ–తిరుపతి (07638) ఈ నెల 14 నుంచి జూన్ 30 వరకు ప్రతి సోమవారం నడపనున్నారు. హరిద్వార్, రిషికేష్, వైష్ణోదేవి, అమృత్సర్, ఆనంద్‌పూర్ యాత్ర -
కానూరులో వ్యక్తి ఆత్మహత్య
పెనమలూరు: కానూరు మురళీనగర్‌లో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటంతో పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన షగీర్‌ఖాన్(30), భార్య దిల్రుబాబీబీ, ముగ్గురు పిల్లలతో కానూరు మురళీనగర్‌లో గత కొద్ది కాలంగా ఉంటున్నాడు. భర్త ఆటోనగర్‌లో పాత ఇనుము షాపులో పని చేస్తుండగా, భార్య స్టీల్ కంపెనీలో పని చేస్తోంది. భర్త షగీర్‌ఖాన్ మద్యానికి బానిసగా మారటంతో భార్య దిల్రుబాబీబీతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం భార్య పనికి వెళ్లగా, ముగ్గురు పిల్లలు స్కూల్‌కు వెళ్లారు. షగీర్‌ఖాన్ భార్య దిల్రుబాబీబీకి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. భార్య మధ్యలో పని వదిలి ఇంటికి వచ్చి తలుపుకొట్టింది. భర్త తలుపు తెరవకపోవటంతో ఇంటి యజమాని, ఇరుగుపొరుగువారికి సమాచారం తెలిపింది. పోలీసుల సహకారంతో బలవంతంగా తలుపులు తెరిచి చూడగా షగీర్‌ఖాన్ చున్నీతో ఉరేసుకుని మృతిచెంది ఉన్నాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగస్వాములు కండి
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలని భావించే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌లోని 10 మార్గదర్శక సూత్రాలను సాధించడంలో అధికారులు భాగస్వాములు కావాలని జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం జిల్లా, మండల స్థాయి అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, డీఎల్పీఓలు, వార్డు సచివాలయాల అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధనలో అధికారులు కీలక పాత్ర పోషిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. స్థానికంగా అందుబాటులో ఉండే వనరులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో నూతన ఆవిష్కరణలతో రోల్ మోడల్‌గా నిలుస్తున్న వారిని ప్రోత్సహించాలన్నారు. సమాజంలో జీరో పావర్టీని సాధించేందుకు అధికారులు అంకిత భావంతో పని చేయాలని సూచించారు. రాబోయే నాలుగేళ్లలో పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణ, మండల, జిల్లా స్థాయిలలో ప్రజలను కీలక భాగస్వాములను చేసేందుకు కృషి చేయాలన్నారు. సంపన్న కుటుంబాలు(మార్గదర్శి) నిస్సహాయ కుటుంబాలను (బంగారు కుటుంబం) దత్తత తీసుకుని వారి సమగ్రాబివృద్ధికి దోహదం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేయాలి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా మండల స్థాయిలో వర్క్‌షాపులు నిర్వహించి అధికారులకు అవగాహన కల్పిస్తామని అన్నారు. ప్రతి ఏడాది 15 శాతం వృద్ధి రేటుతో అనుకున్న లక్ష్యాలను సాధించేలా ప్రణాళిక రూపొందించుకున్నామని తెలిపారు. గణాంకాల ప్రకారం సర్వీస్ సెక్టార్లో మన జిల్లా రాష్ట్రంలోనే రెండవ స్థానం, పారిశ్రామిక వృద్ధిలో 5వ స్థానం, వ్యవసాయ రంగంలో 23వ స్థానంలో ఉన్నామని వివరించారు. అన్ని రంగాలలో జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్, 2047 లక్ష్యాలను చేరుకునే విధంగా విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ తక్వియుద్దీన్, ఆర్థికవేత్త ప్రొఫెసర్ ఎం.ప్రసాదరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. జిల్లా ప్రత్యేక అధికారి జయలక్ష్మి – -
కుమారుడికి విషమిచ్చి తండ్రి ఆత్మహత్య
పెనమలూరు: ఆర్థిక బాధలు ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. యనమలకుదురులో ఏడేళ్ల కుమారుడికి విషమిచ్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురు గ్రామంలోని వినోద్ పబ్లిక్ స్కూల్ రోడ్డులో వేమిరెడ్డి భవాని ఆమె భర్త సాయిప్రకాష్‌రెడ్డి, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు. భవాని విజయవాడ గాంధీనగర్‌లో జన ఔషధి మెడికల్ షాపులో పని చేస్తోంది. భర్త సాయిప్రకాష్‌రెడ్డి వన్‌టౌన్‌లో బంగారం వర్క్ షాపు నిర్వహిస్తాడు. కరోనా సమయంలో వ్యాపారం లేక భర్త సాయిప్రకాష్‌రెడ్డి అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. భర్త మానసికంగా ఇబ్బందులు పడుతుండటంతో భార్య అతనికి ధైర్యం చెప్పసాగింది. ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం భర్త పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు. భవాని తాను మెడికల్ షాపునకు వెళ్లి వస్తానని విజయవాడ వెళ్లింది. వెళ్లిన అరగంటలోనే భవానికి ఇంటి సమీపంలో ఉన్న వారు ఫోన్ చేసి ఆమె భర్త సాయిప్రకాష్‌రెడ్డి (34), కుమారుడు తక్షిల్ (7) విష పదార్థం తీసుకున్నారని చెప్పారు. వారిని పటమటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. భవాని పటమట ఆస్పత్రికి చేరుకుని వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్య చికిత్సకు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న తండ్రి, కొడుకు అదే రోజు రాత్రి మృతి చెందారు. సాయిప్రకాష్‌రెడ్డి చనిపోక ముందు తాను, కుమారుడు సైనేడ్ తీసుకున్నామని విజయ్ అనే మిత్రుడికి ఫోన్ వాయిస్ మెసేజ్ చేశాడు. మృతుడి భార్య భవాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక బాధల కారణంగానే ఘటన -
కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): టీడీపీ కూటమి ప్రభుత్వం ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలను తెచ్చిపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు అన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలన్నారు. గురువారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ధర్నా జరిగింది. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై గత 10 నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే కుట్రలు చేస్తోందని విమర్శించారు. సమ్మె కాలపు ఒప్పందాలపై జీవోలు జారీ చేయకుండా జాప్యం చేస్తోందని మండిపడ్డారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, అక్రమ తొలగింపులు, వేధింపులు ఆపాలని కోరుతూ ఈ నెల 16వ తేదీ, సమ్మెకాలపు ఒప్పందాలపై జీవోలు ఇవ్వాలని ఈ నెల 17 వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని సభ తీర్మానించింది. సంఘం అధ్యక్షుడు టి.నూకరాజు అధ్యక్షతన జరిగిన ధర్నాలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య, రాష్ట్ర కోశాధికారి ఎస్.జ్యోతిబసు, పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ధర్నాచౌక్‌లో మున్సిపల్ కార్మికుల ధర్నా -
తటాకాలు కావివి.. పంట పొలాలే!
పెనుగంచిప్రోలు: గత ఏడాది సెప్టెంబర్ నెలలో మునేరుకు వచ్చిన భారీ వరద రైతులకు తీరని వేదన మిగిల్చింది. ఆ వరదలకు మునేరు తువ్వ కాలువకు గండ్లు పడి వత్సవాయి మండలం వేములనర్వతో పాటు పెనుగంచిప్రోలు మండలంలోని పెనుగంచిప్రోలు, ముచ్చింతాలకు చెందిన 220 ఎకరాల్లో పైగా పంట భూములు కోతకు గురయ్యాయి. వరదలకు పంట కొట్టుకు పోవటంతో పాటు పొలాలు కోతకు గురై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా మునేరుకు వచ్చిన వరదతో పక్కనే కాలువకు పెద్ద పెద్ద గండ్లు పడి ఒక్కో చోట 10 నుంచి 15 అడుగుల గోతులు పడ్డాయి. మునేరుకు వరదలు వచ్చి 8 నెలలు అవుతున్నా కోతకు గురై గుంతలు పడిన భూముల్లో నేటికీ వరద నీరు అలానే ఉంది. దీంతో అవి తటాకాల్లా దర్శనమిస్తున్నాయి. రైతులు ఆ భూముల్లో నీటిని తోడేసి, మట్టితో చదును చేయాలంటే ఎకరానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో రైతులు అంత పెట్టుబడి పెట్టలేక అలానే ఉంచేశారు. ఇప్పటికే ఖరీఫ్, రబీ రెండు సీజన్లు పోయాయి. మళ్లీ ఖరీప్ సీజన్ రానుంది. దీంతో తమ పరిస్థితి ఏమిటని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమకు ప్రభుత్వం నుంచి కొంత తోడ్పాటు అవసరమని అంటున్నారు. ఇసుక మేటలు తొలగించుకుంటున్న రైతులు... ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా లేకపోవటంతో కొందరు రైతులు ఇక తప్పనిసరై వరద ముంపునకు తమ పొలాల్లో ఇసుక మేటను సొంతంగా తొలగించుకుంటున్నారు. కొందరు రైతులు జేసీబీ, ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని అవసరమైన రైతులకు తోలుతున్నారు. కొన్ని పొలాల్లో 3 నుంచి 4 అడుగుల మేర ఇసుక మేట ఉంటే కొన్ని చోట్ల 6 నుంచి 7 అడుగుల వరకు ఉంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేచి చూస్తున్న రైతులు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో తమకు తామే ఇసుక మేటలు తొలగించుకుని ఖరీప్ సాగు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. కోలుకోలేని దెబ్బ తీసిన మునేరు వరద 8 నెలలవుతున్నా నేటికీ తొలగని వరద నీరు దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు సొంతంగా ఇసుక మేటలు తొలగించుకుంటున్న వైనం -
మొక్కజొన్న ధర ఢమాల్!
కంకిపాడు: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది మొక్కజొన్న రైతుల పరిస్థితి. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా, మార్కెట్లో ధర రోజురోజుకూ పతనం అవుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆపద సమయంలో వెన్నుదన్నుగా నిలవాల్సిన సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కొనుగోలు కేంద్రాల ఊసే లేకపోవటంతో ధర నిర్ణయం దళారుల ఇష్టారాజ్యంగా తయారైంది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీ సీజన్లో 11,875 ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేశారు. ప్రస్తుతం పది రోజులుగా మొక్కజొన్న కోత సాగుతోంది. కండెలు కోసి గింజలు వేసే యంత్రాలతో మొక్కజొన్న గింజలు వేరు చేయిస్తున్నారు. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న రాశులు ఉన్నాయి. దిగుబడులు సంతృప్తికరం.. ఎకరాకు కౌలు రూ. 12 వేలు, పెట్టుబడులు రూ. 40 వేలు వెచ్చించి రైతులు సాగు చేపట్టారు. ఎకరాకు సరాసరిన 40–45 క్వింటాళ్ల వరకూ దిగుబడులు లభించాయి. పక్షులు, కత్తెర పురుగు ఉద్ధృతితో అక్కడక్కడా నష్టం వాటిల్లినా దిగుబడులు ఘనంగానే వచ్చాయి. ప్రభుత్వం క్వింటా మద్దతు ధర రూ. 2,225గా నిర్ణయించింది. దీంతో ఆశించిన ధర దక్కుతుందని మొక్కజొన్న రైతులు ఆశించారు. నీరసపడుతున్న అన్నదాతలు.. దిగుబడులు చేతికందే వరకూ క్వింటా మొక్క జొన్నలు బహిరంగ మార్కెట్లో రూ.2,250 నుంచి రూ.2400 వరకూ పలికింది. ప్రస్తుతం పంట చేతికి వస్తోంది. ఈ తరుణంలో ధర నేల చూపులు చూస్తోంది. రోజు రోజుకీ ధరలు దిగజారుతున్నాయి. క్వింటా ధర రూ. 1950 నుంచి రూ. 2వేలు మాత్రమే పలుకుతోంది. ధర పడిపోతుండటంతో మొక్కజొన్న రైతులు నీరసించిపోతున్నారు. దీనికి తోడు ఇటీవల కురిసిన అకాల వర్షాలతో కోత దశలోనూ, ఆరబెట్టిన మొక్కజొన్నలు వర్షానికి తడిచాయి. ఈ పంటను ఆరబెట్టి, ఎండగట్టి మార్కెట్‌కు తరలించేందుకు ఒక్కో రైతు ఎకరాకు రూ. 5 వేలు వరకూ అదనపు పెట్టుబడులు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రైతులు పంటను ఎండబెట్టి గింజ నాణ్యతను కాపాడుకునే పనిలోనే ఉన్నారు. అయితే ప్రకృతి మాత్రం రైతులు వదలటం లేదు. అల్పపీడనం రూపంలో అన్నదాతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈడుపుగల్లులో ఆరబోసిన మొక్కజొన్న గింజలు ఆశాజనకంగా దిగుబడులు రోజు రోజుకూ పడిపోతున్న ధరతో ఆందోళన మద్దతు ధర దక్కక తిప్పలు కొనుగోలు కేంద్రాల ఊసేదీ? ప్రకృతి ప్రకోపంతో అదనపు ఖర్చులు సర్కారు నిర్లక్ష్యం.. నెల రోజుల క్రితమే ప్రతిపాదనలు.. జిల్లా వ్యాప్తంగా సాగు వివరాలను సేకరించాం. మార్కెట్ ఒడిదొడుకులను అంచనా వేశాం. నెల రోజులు క్రితమే ప్రభుత్వానికి నివేదిక కూడా పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. రైతులు ఆందోళన చెందొద్దు. – మురళీకిషోర్, డీఎం, మార్క్‌ఫెడ్, కృష్ణాజిల్లా కూటమి సర్కారు అన్నదాతను అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తోంది. పంట చేతికందే నాటికి మార్కెట్లో ధర తగ్గుముఖం పడితే మద్దతు ధర కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యాన్ని కనబరుస్తోంది. పది రోజులుగా మొక్కజొన్న మార్కెట్‌కు చేరుతోంది. మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో తక్కువ ధర పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో అయినా కొనుగోలు కేంద్రాలను తెరిపించి రైతులకు మద్దతు ధర దక్కేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం ప్రదర్శిస్తుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. -
సమన్వయంతో జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉద్యోగులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర కార్యవర్గ సభ్యులు బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ను శాలువాతో సత్కరించి మొక్కను అందజేశారు. ఇటీవల జిల్లా శాఖకు నిర్వహించిన ఎన్నికలలో నూతనంగా ఎన్నికై న జిల్లా అధ్యక్షుడు డి. సత్యానారాయణరెడ్డి, సహా అధ్యక్షుడు వి.వి. ప్రసాద్, కార్యదర్శి పి. రమేష్‌కు కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలపడంలో ఉద్యోగుల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. కలెక్టర్‌ను మార్యాదపూర్వకంగా కలిసిన వారిలో జిల్లా కార్యవర్గ సభ్యులు బి. సతీష్ కుమార్, డి. విశ్వనాథ్, జి.రామకృష్ణ, బీబీ రమణ, వి. నాగార్జున నగర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
వైభవంగా వెండి రథోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు వెండి రథంపై నగరోత్సవ సేవ నిర్వహించారు. సాయంత్రం 5 గంట లకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద వెండి రథంపై కొలువై ఉన్న స్వామి వార్లకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఆలయ ఈఈ వైకుంఠరావు, ఏఈవో దుర్గారావు, ఇతర ఆలయ అధికారులు వెండి పల్లకీని ముందుకు లాగి నగరోత్సవాన్ని ప్రారంభించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య ఊరేగింపు ముందుకు సాగింది. ఘాట్‌రోడ్డు నుంచి ప్రారంభమైన నగరోత్సవం కుమ్మరిపాలెం, కామకోటి నగర్, శంకరమఠం, విద్యాధరపురం, సొరంగ మార్గం, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా ఆలయానికి చేరుకుంది. కల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా వెండి రథంపై అధిష్టించిన స్వామి వారు భక్తుల ఇంటి ముంగిటకు విచ్చేయడంతో హారతులిచ్చి పూలు, పండ్లు, కొబ్బరి కాయలను సమర్పించి, పూజలు చేశారు. బెజవాడ వీధుల్లో ఊరేగిన దుర్గామల్లేశ్వరులు -
నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు బుధవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన ఎం. యతిరాజం కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండి తులు ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ అధికారి దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. ఆరోగ్య కేంద్రం సందర్శన కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆరోగ్య కార్యక్రమాల తనిఖీల్లో భాగంగా కృష్ణలంక, భ్రమరాంబపురంలోని పట్టణ ఆరోగ్య కేంద్రం కృష్ణలంక–7ను, క్షేత్రస్థాయిలో వ్యాధి నిరోధక టీకాల సెషన్ జరిగే ప్రాంతాన్ని బుధవారం ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్ఓ) డాక్టర్ ఎం.సుహాసిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య కేంద్రంలోని అన్ని రకాల రిజిస్టర్లను పరిశీలించారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహణపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కృష్ణలంక–7 వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక, డీపీఓ మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ‘పది’ మూల్యాంకనం వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారంతో ముగిసింది. విజయవాడ బిషప్ అజరయ్య హైస్కూల్ ప్రాంగణంలో ఈ నెల మూడో తేదీన ప్రారంభమైన ఈ వాల్యూయేషన్‌లో 826 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వీరిలో 92 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 552 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 182 మంది స్పెషల్ అసిస్టెంట్లు ఉన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,70,781 జవాబు పత్రాలకు వాల్యూయేషన్ పూర్తి చేశారు. అందులో తెలుగు–29,805, స్పెషల్ తెలుగు– 1,231, హిందీ–22,737, ఇంగ్లిష్–11,462, లెక్క లు–21,414 భౌతికశాస్త్రం–21,500, బయోలజికల్ సైన్స్–24,390, సోషల్–27,454, సంస్కృతం–8,309, వోకేషనల్–2,479 ఉన్నాయి. విజయవంతంగా.. జిల్లా విద్యాశాఖాదికారి మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ‘పది’ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని విజయవంతంగా ముగించామన్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్పాట్ కొనసాగిందన్నారు. జిల్లాకు వచ్చిన 1,70,781 జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి, రాష్ట్ర ప్రభుత్వ శాఖకు పంపించినట్లు చెప్పారు. విజయవాడలో పోస్టర్లపై నిషేధం భవానీపురం(విజయవాడపశ్చిమ): పోస్టర్ రహిత నగరమైన విజయవాడలో బహిరంగంగా పోస్టర్లను అతికించటం, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టటం నిషేధమని నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలో ప్రజారోగ్యం, పర్యావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవడంతోపాటు నగర సుందరీకరణను కాపాడుకునేందుకు తగిన చర్యలు చేపట్టామని అన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ/ప్రైవేట్ భవనాలు, ప్రహరీలు, ట్రాఫిక్ డివైడర్లు, కరెంట్ పోల్స్, ట్రాఫిక్ ఐల్యాండ్స్, ఫ్లై ఓవర్లు/బ్రిడ్జిలు తదితర ప్రాంతా ల్లో పోస్టర్లను అతికించటాన్ని నిషేధించామని వివరించారు. వివిధ సంస్థలకు చెందినవారు తమ ప్రకటనల నిమిత్తం వాల్ పోస్టర్లను నగరంలో పైన పేర్కొన్న ప్రాంతాలలో పోస్టర్లను అతికిస్తే వారిపై చట్ట రీత్యా (1997 చట్టం) చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకటనదారులు, ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి లక్ష రూపాయల వరకు గరిష్టంగా జరిమానా వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పోస్టర్లను అతికించిన వారితోపాటు వాటిని ప్రింటింగ్ చేసిన వారిని కూడా గుర్తించామని వివరించారు. -
వైఎస్సార్ పాదయాత్ర ఒక మరపురాని చరిత్ర
మధురానగర్(విజయవాడసెంట్రల్): దేశ రాజకీయాల్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర ఒక సంచలనంగా మరపురాని చరిత్రను సృష్టించిందని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మహానేత చేపట్టిన పాదయాత్ర 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రంలోని కరువు సంబంధిత సమస్యలను, రైతుల పట్ల అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ ఉదాసీనతను ఎత్తిచూపడానికి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 11 జిల్లాల్లో 1,500 కి.మీ. పాదయాత్ర చేపట్టారని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ తో తనకు ఉన్న అనుబంధాన్ని, తన జీవితంపై ఆయన చూపిన ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ జీవితం భావితర నాయకులకు ఒక పాఠ్యపుస్తకమన్నారు. అనారోగ్యంతో ఉన్నవారికి, ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ వైద్యసేవలు అందించేందుకు 108 సేవలను ప్రారంభించి పేదల ప్రాణాలకు భరోసా కల్పించారని అన్నారు. క్యాన్సర్, గుండె జబ్బులు సహా 942 వ్యాధులకు చికిత్సలను ఆరోగ్యశ్రీ కింద చేర్చి ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందేలా చేశారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు -
దళిత ప్రజాప్రతినిధికి సెగ..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరులో నియోజకవర్గ ప్రజాప్రతినిధి, పార్లమెంట్ ప్రజాప్రతినిధి ఇద్దరూ తోడు దొంగలై దోచుకున్నారు. అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లు రూ.కోట్లు వెనకేసుకున్నారు. వాటాల్లో తేడా రావడంతో విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలి ఒకరిపై మరొకరు రాజకీయ ఎత్తులు వేసుకుంటూ కాలయాపన చేశారు. ఇలా కొన్ని నెలలుగా తిరువూరు నియోజకవర్గ అధికార పార్టీలో జరుగుతున్న రాజకీయ చదరంగంలో పార్లమెంట్ నియోజకవర్గ ప్రజాప్రతినిధిదే పైచేయిగా నిలిచింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఒంటరిగా మిగిలారు. నోటి దురుసు తనం, ఆవేశమే ఆయనకు శాపంగా మారాయి. దానిని ఓ సామాజికవర్గం తమకు అనుకూలంగా మార్చుకుని ఆధిపత్య పోరులో దళిత ప్రజాప్రతినిధిపై ఫిర్యాదులు చేస్తూ, అధిష్టానం వద్ద పై చేయి సాధించింది. ప్రస్తుతం టీడీపీ అధిష్టానం సైతం ఆచితూచి అడుగులు వేస్తూ, ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోకుండా గుమ్మనంగా వ్యవహరిస్తోంది. పొమ్మనకుండా పొగబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పార్లమెంట్ ప్రజాప్రతినిధిదేపై చేయి అక్రమ దందా వాటాల్లో తేడా వచ్చిన నాటి నుంచి నియోజకవర్గ ప్రజాప్రతినిధిపై పార్లమెంట్ ప్రజాప్రతినిధి వేసిన రాజకీయ ఎత్తుగడలు ఫలించాయి. పక్కా ప్రణాళిక ప్రకారం నియోజకవర్గ ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా ఉన్న నాయకులందరినీ పార్లమెంట్ ప్రజాప్రతినిధి ఏకతాటిపైకి తీసుకొచ్చి అధిష్టానానికి ఫిర్యాదు చేయించారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఒంటెద్దు పోకడలను ఆది నుంచి గమనిస్తున్న అధిష్టానం సైతం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. జిల్లా సీనియర్ నాయకులతో చర్చలు జరిపి నియోజకవర్గ ప్రజాప్రతినిధిని పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇదే క్రమంలో పార్లమెంట్ ప్రజాప్రతినిధి తిరువూరు రాజకీయాల్లో చక్రం తిప్పడం ప్రారంభించారు. తిరువూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి నుంచి డైరెక్టర్ పోస్టుల వరకు తన వర్గీయులనే ఎంపిక చేయించారు. ఈ నెల ఐదో తేదీన జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా నియోజకవర్గ ప్రజాప్రతినిధి వెంట నాయకులెవరూ వెళ్లకుండా చేయడంలో పార్లమెంట్ ప్రజాప్రతినిధి విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు ఎమ్మెల్యే సీటును ఆశించి భంగపడిన సేవల దేవదత్‌ను తెరమీదకు తీసుకొచ్చి ఆయన నాయకత్వంలోనే తాము పని చేస్తామంటూ తిరువూరు నియోజకవర్గ ప్రముఖ టీడీపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయించారు. ఈ సమాచారాన్ని సైతం అధిస్టానానికి చేరవేసిన పార్లమెంట్ ప్రజాప్రతినిధి సేవల దేవదత్‌ను తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా ప్రకటించేందుకు వ్యూహం పన్నారు. బాబు సమక్షంలో అవమానం క్లైమాక్స్‌కు చేరిన తిరువూరు రాజకీయ చదరంగం వర్గపోరులో పంతం నెగ్గించుకున్న పార్లమెంట్ ప్రజాప్రతినిధి ఆయన వర్గీయులకే మార్కెట్‌యార్డు పదవులు నియోజకవర్గ దళిత ప్రజాప్రతినిధికి అడుగడుగునా అవమానాలు ఆ ప్రజాప్రతినిధిని పక్కనబెట్టి కొత్త ఇన్చార్జిని ప్రకటిస్తారని ప్రచారం పార్లమెంట్ ప్రజాప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు ఈ నెల ఐదో తేదీన నందిగామ వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు స్వాగతం పలికే క్రమంలో తిరువూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధికి అవమానం జరిగిందని దళిత సంఘా లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబుకు ఎదురుగా వెళ్లిన నియోజకవర్గ ప్రజాప్రతినిధి గులాబీపువ్వు ఇచ్చి స్వాగతం పలికేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన్ను చంద్రబాబు పట్టించుకోకుండా పక్కన ఉన్న నాయకులతో ఫొటోలు దిగుతున్న వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఇదేనా దళిత ప్రజాప్రతినిధికి ఇచ్చే గౌరవం అని విమర్శిస్తున్నారు. దళిత ప్రజాప్రతినిధిపై అగ్రకుల పార్లమెంట్ ప్రజాప్రతినిధి పంతం నెగ్గించుకుని రాక్షసానందం పొందుతున్నారని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. -
ఆర్చరీ కోచ్ చెరుకూరికి న్యాయం చేయాలి
విజయవాడస్పోర్ట్స్: ఓల్గా ఆర్చరీ అకాడమీ అధ్యక్షుడు, ఆర్చరీ సీనియర్ కోచ్ చెరుకూరి సత్యనారాయణకు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని పలువురు క్రీడా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అకాడమీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు రెండు పర్యాయాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ చెరుకూరి సత్యనారాయణ మహానాడులోని ఆర్చరీ అకాడమీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం మూడో రోజు కొనసాగింది. దీక్ష చేపడుతున్న చెరుకూరి సత్యనారాయణను ఆంధప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్.డి.ప్రసాద్, నెట్‌బాల్ సంఘం ప్రతినిధి శివరామ్, కబడ్డీ సంఘం కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్, జూడో సంఘం సీఈవో వెంకట్ నామిశెట్టి, దక్షిణ భారత అథ్లెటిక్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ ఆకుల రాఘవేంద్రరావు, మాజీ కార్పొరేటర్, టీడీపీ నాయకుడు నరసింహచౌదరి, ఆర్చరీ సంఘం ప్రతినిధులు, అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారుల తల్లిదండ్రులు ప్రేమ్‌కుమార్, వెంకటరమణ, నాగేశ్వరరావు, రంగారావు, చెన్నకుమార్ పరామర్శించి సంఘీబావం ప్రకటించారు. చెరుకూరి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించిపోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చెరుకూరి సత్యనారాయణకు న్యాయం చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని పలు క్రీడా సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.క్రీడా సంఘాల నాయకుల డిమాండ్ -
పటిష్టంగా అట్రాసిటీ చట్టం అమలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా, కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా అధికారులు చొరవ చూపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల రక్షణతో పాటు ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం–జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సమావేశం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగింది. అట్రాసిటీ కేసుల విచారణలో పురోగతి, బాధితులకు పరిహారం, క్షేత్రస్థాయిలో పౌర హక్కుల రక్షణకు తీసుకుంటున్న చర్యలు తదితరాలపై సమావేశంలో చర్చించారు. సమన్వయంతో పనిచేయాలి.. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని.. చట్టం పటిష్టంగా అమలుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరిహారం అందించేందుకు, కేసుల సత్వర విచారణలో ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా చూడాలని, కులధ్రువీకరణ, మెడికల్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. 2022, ఏప్రిల్ 4 నుంచి ఇప్పటి వరకు తిరువూరు డివిజన్లో పది కేసుల్లో బాధితులకు రూ. 10.75లక్షలు, విజయవాడ డివిజన్లో 150 కేసుల్లో బాధితులకు రూ. 1,78,21,250, నందిగామ డివిజన్లో 56 కేసుల్లో బాధితులకు రూ.65 లక్షలు మేర మొత్తం 216 కేసుల్లో దాదాపు రూ. 2.54 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించామన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు. కేసుల వివరాలు ఇవీ.. సీపీ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ 2023, డిసెంబర్ 21 నుంచి 2024, డిసెంబర్ 31 వరకు పశ్చిమ, దక్షిణ, ఉత్తర, మధ్య డివిజన్లతో పాటు నందిగామ డివిజన్, మైలవరం డివిజన్, మహిళా పీఎస్ పరిధిలో వేధింపుల నిరోధక చట్టానికి సంబంధించి 31 పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్, 30 పెండింగ్ ట్రయల్ కేసులు ఉన్నట్లు వివరించారు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె.శ్రీనివాస శిరోమణి, డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, డీసీపీ కేజీవీ సరిత, ఆర్డీఓలు కావూరి చైతన్య, కె.బాలకృష్ణ, కె.మాధురి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. డీవీఎంసీ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు -
బంగారం, నగదు చోరీపై కేసు నమోదు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): బంగారం, నగదు చోరీపై వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో బుధవారం రాత్రి కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే గన్నవరంలో భీమవరపు సామ్రాజ్యం (64) కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె తన బంగారపు తాడు తెగిపోవటంతో కొత్త తాడు చేయించుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా మూడు కాసుల బంగారపు తాడు, మరో మూడు కాసుల బరువైన రెండు బంగారపు గాజులు, రూ.50 వేల నగదును తీసుకుని తన ఆడబిడ్డ గుజ్జు లక్ష్మీకుమారితో కలిసి బుధవారం మధ్యాహ్నం గన్నవరం నుంచి విజయవాడకు బయలుదేరింది. గన్నవరం నుంచి రామవరప్పాడు వరకు ఒక ఆటో, అక్కడి నుంచి కాళేశ్వరరావు మార్కెట్ వరకూ మరో ఆటో ఎక్కి వన్‌టౌన్‌కు చేరుకుంది. ఆటో దిగి సంచిలో చూసుకోగా బంగారం, నగదు కనిపించలేదు. దాంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమందించి వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాంబే కాలనీలో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహంపాయకాపురం(విజయవాడరూరల్): వాంబే కాలనీ సి బ్లాక్ సమీపంలో డ్రైనేజీ కాల్వలో గుర్తు తెలియని వృద్ధుని శవం పడి ఉండటంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. నున్న రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు, సుమారు 70–75 సంవత్సరాల వయస్సు కలిగి బక్కచిక్కి తెల్లనిగడ్డం, జుట్టుతో టీషర్ట్–నిక్కరు ధరించిన వ్యక్తి మృతదేహం ఉంది. స్థానికుల సహకారంతో శవాన్ని పరిశీలించగా ఎలాంటి గాయాలు లేవు. సచివాలయ వీఆర్వో టి.జాన్ రాఘవులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు 5–2 అడుగులు ఎత్తు, చామనచాయ రంగు, తెలుపు జుట్టు, తెల్ల టీషర్ట్, లైట్ గ్రీన్ నిక్కరు ధరించి ఉన్నాడని, వయస్సు 70–75 సంవత్సరాలు ఉండవచ్చని తెలిపారు. వివరాలు తెలిసిన వారు నున్న పోలీసు స్టేషన్లో సంప్రదించవచ్చన్నారు.