
విజయవాడ నుంచి భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): హరిద్వార్, రిషికేష్, వైష్ణోదేవి, అమృత్‌సర్, ఆనంద్‌పూర్ తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకునే యాత్రికుల కోసం ఈ నెల 23 నుంచి మే 2 వరకు విజయవాడ నుంచి భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు ప్రకటించారు. తొమ్మిది రాత్రుళ్లు, పది పగళ్లు సాగే ఈ యాత్రలో మానసాదేవి ఆలయం, రామ్ జులా, లక్ష్మణ జులా, అనంద్ సాహిబ్ గురుద్వార్, నైనా దేవి ఆలయం, గోల్డెన్ టెంపుల్, మాత వైష్ణోదేవి దేవాలయ సందర్శనం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్‌పూర్ కాగజ్‌నగర్ స్టేషన్‌లలో బోర్డింగ్/డిబోర్డింగ్ సదుపాయం కల్పించారు. ఈ యాత్రలో ఎకానమి (స్లీపర్ క్లాస్) ఒక్కొక్కరికి రూ. 18,510, స్టాండర్డ్ (3 ఏసీ) ఒక్కొక్కరికి రూ. 30,730, కంఫర్ట్ (2 ఏసీ) ఒక్కొక్కరికి రూ 40, 685 టిక్కెట్ ధర నిర్ణయించారు. ఈ యాత్రలో ఆన్‌బోర్డు/ఆఫ్‌బోర్డులో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి టిఫిన్, భోజనం, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు మార్గంలో రవాణా సదుపాయం, రాత్రుళ్లు హోటళ్లలో బస తదితర ఏర్పాట్లతో పాటు కోచ్‌లలో సీసీ కెమెరాలతో నిరంతరం భద్రత ఏర్పాట్లు, టూర్ ఎస్కార్ట్‌లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఆర్‌ఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా 97013 60701 ఫోన్ నంబర్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా సూచించారు.
వేసవికి ప్రత్యేక రైళ్లు
వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే విజయవాడ మీదుగా మరికొన్ని ప్రత్యేక వారాంతపు రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి–శ్రీకాకుళంరోడ్డు (07025) ప్రత్యేక రైలు ఈ నెల 11 నుంచి జూన్ 6 వరకు ప్రతి శుక్రవారం, శ్రీకాకుళం రోడ్డు–చర్లపల్లి (07026) ప్రత్యేక రైలు ఈ నెల 12 నుంచి జూన్ 28 వరకు ప్రతి శనివారం నడపనున్నట్లు తెలిపారు. తిరుపతి–సాయినగర్ షిర్డి (07637) ఈ నెల 13 నుంచి జూన్ 29 వరకు ప్రతి ఆదివారం, ఽతిరుగు ప్రయాణంలో సాయినగర్ షిర్డీ–తిరుపతి (07638) ఈ నెల 14 నుంచి జూన్ 30 వరకు ప్రతి సోమవారం నడపనున్నారు.
హరిద్వార్, రిషికేష్, వైష్ణోదేవి, అమృత్‌సర్, ఆనంద్‌పూర్ యాత్ర