NTR district News
-
కిసాన్ క్రెడిట్ కార్డులు తక్షణమే జారీ చేయాలి
ఏపీ కౌలురైతుల సంఘం, ఏపీ రైతు సంఘంగాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకులు కౌలు రైతులకు ‘కిసాన్ క్రెడిట్ కార్డులు‘ తక్షణమే జారీ చేయాలని ఏపీ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు మల్నీడు యల్లమందారావు, ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పెయ్యల వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రబీలో కౌలు రైతులకు ష్యూరిటీ లేని పంట రుణాలు వడ్డీ లేకుండా తక్షణమే మంజూరు చేయాలని, సాగు భూమి దామాషాను బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలన్నారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ కన్వీనర్ సీవీఎన్ భాస్కరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ‘ఏపీ పంట సాగుదారు హక్కుల చట్టం 2019’ ప్రకారం గుర్తింపు కార్డులు పొందిన వారికి హామీలు లేకుండానే బ్యాంకు నుంచి పంట రుణాలు పొందవచ్చనని నిబంధనలు ఉన్నా వాటిని పాటించడం లేదని కౌలురైతుల ఆవేదనను లీడ్ బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. రుణాలు ఇవ్వాలని అడిగితే భూ యజమాని ష్యూరిటీ సంతకం పెట్టాలని, భూ యజమాని పంట రుణాలు తీసుకోకుండా ఉండాలంటూ ఇలా అనేక ఆంక్షలు పెడుతూ అప్పు ఇవ్వకుండా తిరస్కరిస్తున్నారని తెలిపారు. దేవదాయ ధర్మాదాయ, వక్ఫ్ భూములు సాగు చేస్తున్న కౌలురైతులకు రుణాలు ఇవ్వాలని కోరారు. పంట రుణాల సమీక్ష సమావేశంలో కౌలు రైతులను, సంఘాల ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని విన్నవించారు. లీడ్ బ్యాంకు కన్వీనర్ సి. భాస్కరరావు సానుకూలంగా స్పందించారన్నారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా లీడ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ రమేష్ ను కలిసి జిల్లాలో రబీలో పంటరుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. -
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగ కమిటీల నియామకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా , నియోజకవర్గాల అనుబంధ విభాగాల కమిటీలను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీ వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి రజని (ఈస్ట్), జాయింట్ సెక్రటరీ కొమ్మవీర వెంకట స్వప్న, రైతు విభాగం కార్యదర్శి కలపాల నెహ్రూ, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, కార్యదర్శి పల్లెం రవికుమార్, బూత్ కమిటీస్ వింగ్ కార్యదర్శి చలమాల అనిల్ కుమార్, పంచాయతీరాజ్ వింగ్ కార్యదర్శి చిట్టిబొమ్మ శ్రీహరి నియమితులయ్యారు. జిల్లా అనుబంధ విభాగం కమిటీ అధ్యక్షులు రైతు విభాగం అధ్యక్షుడిగా ఏలూరి శివాజీ (జగ్గయ్యపేట), బీసీ సెల్ ప్రెసిడెంట్ మార్త శ్రీనివాస్ (నందిగామ), స్టూడెంట్ వింగ్ జొన్నలగడ్డ కోమలి సాయి (ఈస్ట్), వీవర్స్ వింగ్ తంగెళ్లమూడి రామారావు(నందిగామ), అంగన్వాడీ వింగ్ శాఖమూరి వెంకట కుమారి ( నందిగామ), డాక్టర్స్ వింగ్ అంబటి నాగరాధాకృష్ణ (సెంట్రల్), దివ్యాంగుల విభాగం మెట్టు వెంకటరెడ్డి(వెస్ట్) నియమితులయ్యారు. -
No Headline
లబ్బీపేట(విజయవాడతూర్పు): పంటకు గిట్టుబాటు ధరలేక దిగులు చెందుతున్న మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ నేతలపై కేసులు కట్టడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. కూటమి ప్రభుత్వం తన అనుకూల మీడియాలో తప్పుడు ప్రచారం చేయించడం సిగ్గుచేటన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో గురువారం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేక రైతుకు పెనుభారంగా మారిందని తెలిపారు. ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అండగా నిలవడానికి వెళ్లిన వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. జడ్ ప్లస్ కేటగిరి ఉన్న నాయకుడికి కనీస భద్రత ఇవ్వకుండా, అన్యాయంగా కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలు చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగిందంటే అది వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే అన్నారు. నాడు మిర్చి రైతులకు పంటల బీమా అందించామని, ప్రస్తుత ప్రభుత్వం ఆర్బీకే, ఈ క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని తెలిపారు. చంద్రబాబు ఇప్పటికై నా కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలను గాలికొదిలేశారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మిర్చి కొనుగోలు చేసి, రైతులకు అండగా ఉండాలని అవినాష్ డిమాండ్ చేశారు. మీడియాలో తప్పుడు ప్రచారం దుర్మార్గం వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
చల్లపల్లి: మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని ఆముదార్లంకలో చోటుచేసుకుంది. చల్లపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆముదార్లంకకు చెందిన తిరుమలశెట్టి రమణ(41) వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రమణకు భార్య శ్యామలమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో పెద్దమనుషుల సమక్షంలో మూడు సంవత్సరాల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి శ్యామలమ్మ తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోగా రమణ తన సోదరుల వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన రమణ బుధవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న రమణ కుటుంబ సభ్యులు వెంటనే రమణను రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించటంలో అక్కడి నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రమణ గురువారం ఉదయం మృతి చెందాడు. రమణ సోదరుడు ఏడుకొండల ఫిర్యాదు మేరకు చల్లపల్లి హెడ్‌కానిస్టేబుల్ బీవీఎస్‌వీ ఈశ్వరప్రసాద్ కేసు నమోదు చేశారు. -
అవయవదానమిచ్చి.. ఆదర్శంగా నిలిచి..
భవానీపురం(విజయవాడపశ్చిమ): అవయవ దానంతో కొందరి జీవితాల్లో వెలుగులు నింపిన ముత్యాల సరస్వతి (55) జీవితం ధన్యమైంది. విజయవాడ గొల్లపూడి బైపాస్ రోడ్‌లోని బాలాజీ టవర్స్‌లో నివసిస్తున్న ముత్యాల సరస్వతి, ఆమె కుమారుడు ముత్యాల రామ్‌కుమార్ ఈ నెల 14న బైక్‌పై వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సరస్వతి తలకు దెబ్బతగిలి తీవ్రంగా గాయపడింది. దాంతో రామ్‌కుమార్ తల్లిని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆమె చికిత్సకు స్పందించకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు 19వ తేదీన వైద్యులు ప్రకటించారు. ముత్యాల సరస్వతి అవయవాలను దానం చేసేందుకు ఆమె కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు. చిరస్మరణీయురాలు.. విషయం తెలిసి తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా హాస్పిటల్‌కు వచ్చి మృతురాలికి పుష్పాంజలి ఘటించారు. చనిపోతూ మరి కొందరి జీవితాల్లో వెలుగులు నింపిన సరస్వతి చిరస్మరణీయురాలని కొనియాడారు. ఆమె దేహం నుంచి రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లు సేకరించామని తెలిపారు. కళ్లను ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలకు అప్పగించామని చెప్పారు. మృతురాలి కుటుంబసభ్యులకు జీవన్‌దాన్ సర్టిఫికెట్, రూ.10వేలు అందించామని, అయితే ఆ మొత్తాన్ని పేదల వైద్య సేవలకు ఖర్చు చేయాలని ఆమె కుమారుడు రామ్‌కుమార్ తిరిగి హాస్పిటల్‌కే ఇచ్చేశారని పేర్కొన్నారు. అనంతరం సరస్వతి మృతదేహాన్ని గొల్లపూడిలోని ఆమె నివాసానికి తరలించే ఏర్పాట్లు చేశారు. వెలంపల్లి నివాళులు.. సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు గురువారం సరస్వతి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ముత్యాల రామ్‌కుమార్, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్పొరేటర్లు యరడ్ల ఆంజనేయరెడ్డి, బాపతి కోటిరెడ్డి, ఎండీ ఇర్ఫాన్, నాయకులు పదిలం రాజశేఖర్, వెలది అనిల్ శర్మ, పలువురు పార్టీ శ్రేణులు ఉన్నారు. కాగా గురువారం విద్యాధరపురంలోని హిందూ స్మశానవాటికలో సరస్వతి అంత్యక్రియలు నిర్వహించారు. మరో నలుగురికి పునర్జన్మనిచ్చిన మహిళ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కృత్తివెన్ను: మండల పరిధిలోని అడ్డపర్ర వద్ద గురువారం రాత్రి 216 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అడ్డపర్రకు చెందిన గార్లపాటి కోటేశ్వరరావు(65) రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా కృత్తివెన్ను నుంచి మచిలీపట్నం వైపుగా వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో కోటేశ్వరరావు కిందపడిపోయి అపస్మార స్థితిలోకి వెళ్లాడు. స్థానికుల సమాచారంతో 108 వాహన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కోటేశ్వరరావును పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
సమర్థంగా ఎమ్మెల్సీ ఎన్నికలు
ఉయ్యూరు: కృష్ణా–గుంటూరు జిల్లాల పట్టభద్రుల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల పోలింగ్ నిర్వహణ సమర్థంగా జరగాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. ఉయ్యూరు పట్టణంలో పోలింగ్ నిర్వహించే జిల్లా పరిషత్ పాఠశాల, రెవెన్యూ డివిజన్ పరిధిలో పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాన్ని ఎస్పీ ఆర్.గంగాధర్‌రావుతో కలిసి గురువారం పరిశీలించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 25 పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పంపిణీ, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు భద్రపరిచేందుకు వీలుగా ఆర్డీఓ కార్యాలయం ఉన్న మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్‌రూమ్ అందుబాటులోకి తెచ్చామన్నారు. పెనమలూరు, తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో 11 పోలింగ్ కేంద్రాలు, కంకిపాడు, ఉయ్యూరు, తోట్లవల్లూరు మండలాల్లో 8 పోలింగ్ కేంద్రాలు, మొవ్వ, పామర్రు, పమిడిముక్కల మండలాల్లో ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రంలో నాలుగు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రి పంపిణీ చేస్తామన్నారు. పోలింగ్ సామగ్రి తరలించేందుకు వీలుగా సెక్టార్ రూట్ వారీగా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. పటిష్ట బందోబస్తు.. ఎస్పీ ఆర్.గంగాధర్‌రావు మాట్లాడుతూ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందిని మాత్రమే డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలకు అనుమతిస్తామన్నారు. సామగ్రి, బ్యాలెట్ బాక్సులు తరలించే వాహనాలకు ఎస్కార్ట్‌గా సీఐతో కూడిన బందోబస్తు ఉంటుందన్నారు. ఆర్డీఓ హెలా షారోన్, తహసీల్దార్ సురేష్‌కుమార్, కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు, డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉయ్యూరులో పోలింగ్ సామగ్రి పరిశీలన -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025భూసేకరణ గగనమే.. పరామర్శకు వెళితే కేసులు కడతారా..–8లోuసమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు అదిగో.. ఇదిగో.. మెట్రో రైలు అంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఎలాంటి హడావుడి చేసిందో.. ప్రస్తుతం కూటమి హయాంలోనూ అలాంటిదే జరుగుతోంది. భూసేకరణ ప్రతిపాదనలు కూడా రాకుండా మెట్రో రైలు వచ్చేసిందంటూ ఊదరగొడుతోంది. ప్రతిపాదనలు, గ్రాఫిక్‌ల కనికట్టు చేస్తూ గతంలో తెచ్చిన వాటినే మళ్లీ తెరపైకి తెచ్చి హంగామా చేస్తున్నారు కూటమి పాలకులు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: మెట్రో రైలు కూత వినపడే పరిస్థితి ఇప్పట్లో కానరాకపోయినా పాలకులు మాత్రం హడావుడి చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక విజయవాడలో మరోసారి మెట్రో డ్రామా తెరపైకి వచ్చింది. మెట్రో రైలు అంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది. దీనికి ప్రతిపాదనలు, గ్రాఫిక్‌లు అంటూ కనికట్టు చేస్తోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నన్ని రోజులూ మాయ చేసింది. మెట్రో రైలు వచ్చేసిందంటూ ఊదరగొట్టింది. అప్పుటి ప్రతిపాదనలనే ఇప్పుడు మళ్లీ తెరపైకి తెచ్చి హంగామా చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచినా కనీసం భూసేకరణకు సంబంధించి ఎన్టీఆర్, కృష్ణా జిల్లా కలెక్టరేట్లకు ప్రతిపాదనలు సైతం ఇప్పటి వరకు రాక పోవడం గమనార్హం. అడ్డంకులను అధిగమించి.. అడుగులు పడేనా....! ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్సీ) అధికారులు తొలిదశలో గన్నవరం, పెనమలూరు రెండు కారిడార్లుగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు హడావుడి చేస్తున్నారు. 1వ కారిడార్ 26 కిలో మీటర్లు, పీఎన్బీఎస్ నుంచి ఆరంభమై విజయవాడ రైల్వేస్టేషన్ మీదుగా రామవరప్పాడు జాతీయ రహదారిపైకి వచ్చి అక్కడ నుంచి గన్నవరం వరకు వెళ్తుంది. 2వ కారిడార్ కింద 12.5 కిలోమీటర్లు పీఎన్బీఎస్ నుంచి ఆరంభమై ఎంజీరోడ్డు మీదుగా బెంజిసర్కిల్.. ఆటోనగర్ మీదుగా పెనమలూరు వరకు వెళ్లనుంది. అంటే మొత్తం రెండు కారిడార్లకు 34 స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ జిల్లాలో 20, కృష్ణా జిల్లాలో 14 స్టేషన్లు ఉన్నాయి. ఇవన్నీ గతంలో చేసిన ప్రతిపాదనలే. వీటిని పాలకులు మళ్లీ తెరపైకి తెచ్చారు. నిర్మాణ వ్యయం రూ. 11,009 కోట్లు, భూసేకరణ వ్యయం రూ.1,152 కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఒక్కో మెట్రోస్టేషన్ నిర్మాణానికి రూ.25 కోట్లు అవుతుందని ఏపీఎంఆర్సీ అధికారులు లెక్క కట్టారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో భూగర్భంలో మూడు కిలోమీటర్ల దూరం మెట్రో రైలు నిర్మాణం చేయాల్సి ఉంటుంది. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాజధాని ప్రాంతానికి ముఖద్వారమైన విజయవాడను ‘ట్రాఫిక్’ క్రమశిక్షణతో కూడిన నగరంగా తీర్చిదిద్దడానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గురువారం రహదారి భద్రత కమిటీ (డీఆర్ఎస్సీ) సమావేశం జరిగింది. జిల్లాలో రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, బ్లాక్ స్పాట్ల వద్ద తీసుకున్న చర్యలు, రహదారి భద్రత ఉల్లంఘనలపై చర్యలు, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ స్కీం–2022, ఐ–రాడ్ అమలు, రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలపై చర్చించారు. ట్రాఫిక్ వ్యవస్థను సమర్థంగా నిర్వహించే అస్త్రం యాప్‌పై కమిటీలో చర్చించారు. 2024లో జిల్లాలో మొత్తం 1,343 రహదారి ప్రమాదాలు జరిగాయని, వీటిలో 431 మరణాలు నమోదయ్యాయని అధికారులు వివరించారు. ఈ మరణాల్లో జాతీయ రహదారులపై ప్రమాదాలతో 212, రాష్ట్ర హైవేలపై ప్రమాదాలతో 79, ఇతర రహదారులపై ప్రమాదాలతో 140 సంభవించాయని వివరించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రహదారి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందన్నారు. బ్లాక్స్పాట్లు.. ఎన్‌హెచ్–16పై 17 బ్లాక్స్పాట్లు, ఎన్ హెచ్–30పై 17, ఎన్‌హెచ్–65పై 49, ఎస్‌హెచ్–192పై 1, ఎస్‌హెచ్–236పై 3, ఎస్‌హెచ్–32పై 3, ఇతర రహదారులపై 49 మొత్తం 139 హాట్స్పాట్లను గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో ఒక్క ప్రమాదం కూడా జరగ కుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. సమగ్రంగా ట్రాఫిక్ డేటా విశ్లేషణ: సీపీ జిల్లాతోపాటు విజయవాడలో ట్రాఫిక్ వ్యవస్థను సమర్థంగా నిర్వహించడానికి రియల్‌టైమ్ డేటాను విశ్లేషిస్తున్నామని.. ఆ ఫలితాల ఆధారంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. బెంజిసర్కిల్ వద్ద అనలిటిక్స్‌ను విశ్లేషించగా.. 84 శాతం మంది హెల్మెట్‌ను ధరించినట్లు వెల్లడైందని తెలిపారు. ట్రాఫిక్ పరిస్థితుల అధ్యయనానికి డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో డీసీపీలు గౌతమిశాలి, మహేశ్వరరాజు, కేజీవీ సరిత, ఎం.కృష్ణమూర్తి నాయుడు, డీటీసీ ఎ.మోహన్, ఆర్ అండ్ బీ ఎస్ఈ టి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డీఆర్సీసీ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు 7న్యూస్రీల్మైట్రో రైలుకు సంబంధించి భూసేకరణ చేయాలంటే కత్తిమీద సామే. రెండు జిల్లాల్లో కలిపి 91 ఎకరాల భూమిని సేకరించాల్సింది. మైట్రో రైలు వెళ్లే మార్గం పటమట, మొగల్రాజపురం, మాచవరం, గుణదల, ప్రసాదంపాడు, నిడమానూరు, ఎనికేపాడు వంటి కీలక ప్రాంతాల్లో భూసేకరణ చేయాల్సింది. ఇప్పటికి భూసేకరణకు సంబంధించి ప్రతిపాదనలు ఏపీఎంఆర్సీ నుంచి ప్రతిపాదనలు కలెక్టరేట్లకు చేరలేదు. చేరిన తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వడం, భూసేకరణకు బాగా సమయం తీసుకొనే అవకాశం ఉంది. అంటే గతంలో మాదిరే కూటమి ప్రభుత్వం విజయవాడ నగరవాసులకు మెట్రో రైలు అంటూ ఊరించి ఉసూరుమనిపించే అవకాశం ఉందనే భావన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. -
మర్చిపోయిన బ్యాగ్ మహిళకు అప్పగింత
భవానీపురం(విజయవాడపశ్చిమ): బంగారు ఆభరణాలు, నగదు ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను ఆటోలో మరిచిపోయిన ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు దర్యాప్తు చేసి తిరిగి వాటిని అప్పగించారు. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిళ్లా పార్వతి, దుర్గారావు దంపతులు చిట్టినగర్ సొరంగం దగ్గర నివసిస్తున్నారు. ఈ క్రమంలో పార్వతి తన కుటుంబసభ్యులతో కలిసి ఐదు రోజుల క్రితం విజయనగరం వెళ్లారు. తిరిగి గురువారం ఉదయం 10 గంటల సమయంలో విజయవాడ రైల్వే స్టేషన్ వెస్ట్ బుకింగ్ వద్ద దిగి బయటకు వచ్చారు. అక్కడ ఆటోను కిరాయికి మాట్లాడుకొని చిట్టినగర్ సొరంగం దగ్గర ఉన్న ఇంటికి చేరుకున్నారు. ఆటో దిగే సమయంలో పార్వతి తన హ్యాండ్ బ్యాగ్‌ను ఆటోలోనే మరిచి పోయారు. అందులో ఐదు తులాల బంగారు వస్తువులు, పది వేల రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ ఉన్నాయి. వెంటనే ఆమె కొత్తపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తక్షణమే సీఐ చిన కొండలరావు తమ సిబ్బందిని విచారణకు పంపారు. బాధితురాలు ఆటో ఎక్కిన సమయం, దిగిన సమయం తెలుసుకున్నారు. అలాగే ఆయా ప్రదేశాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆటో డ్రైవర్ నున్న దగ్గర కండ్రిక వెళ్లిపోగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అతని ఆటోను గుర్తించారు. ఫిర్యాదులో పేర్కొన్న బంగారపు వస్తువులు, నగదు, ఫోన్ స్వాధీనం చేసుకుని ఆమెకు తిరిగి ఇచ్చారు. -
బాలికపై లైంగిక దాడి.. నిందితులకు జీవిత ఖైదు
విజయవాడలీగల్: బాలికను బెదిరించి, లైంగిక దాడి చేసిన కేసులో నిందితులకు విజయవాడ పోక్సో కోర్ట్టు న్యాయమూర్తి వి.భవాని జీవిత కాలం కఠినకారాగార శిక్ష, జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే బాలిక, ఆమె తల్లిదండ్రులు చనిపోవడంతో తన తాత ఇంట్లో ఉంటూ దగ్గరలోని స్కూల్లో చదువుతోంది. ఈ క్రమంలో సాయి అనే యువకుడు పరిచయమయ్యాడు. అప్పుడప్పుడూ ఫోన్లో ఆమెతో మాట్లాడుతూ ఉండేవాడు. 2022 మే నెలలో రాత్రి సమయంలో సాయి బాలికకు ఫోన్ చేసి బయటకు పిలిచి, లైంగికదాడి చేశాడు. మరలా రెండు రోజుల తరువాత సాయి బయటకు రమ్మని అడుగగా, బాలిక రాను అని చెప్పడంతో మొదటి సారి కలిసిన సమయంలో తీసిన ఫొటోలను అందరికీ చూపిస్తాను అని భయపెట్టి బయటకు తీసుకొచ్చి మరో ఇద్దరు వ్యక్తులతో కలసి లెంగికదాడి చేసి.. ఎవరికై నా చెపితే చంపుతామని బెదిరించారు. తరువాత బాలిక పిన్ని గమనించి, కడువు ఎత్తుగా ఉందని అడగగా, బాలిక జరిగిన విషయం చెప్పింది. మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా అప్పటి దిశా పోలీస్‌స్టేషన్ ఏసీపీ బి.వి.నాయుడు పటమట దర్శిపేటకు చెందిన సిరిగిరి చంద్రశేఖర్ అలియాస్ సాయి, పటమట లంబాడీ పేటకు చెందిన అనురాజ్ ప్రకాష్ అలియాస్ శ్రీనుతో పాటు మరో జువైనల్ సహా ముగ్గురిని అదుపులోనికి తీసుకుని విచారించి, కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో పోక్సో చట్టం ప్రకారం నిందితులైన సిరిగిరి చంద్ర శేఖర్ అలియాస్ సాయి, అనురాజ్ ప్రకాష్ అలియాస్ శ్రీనుకు మరణించేంత వరకు కఠినకారాగార శిక్ష, సాయికి రూ.32 వేలు, ప్రకాష్‌కు రూ.20 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అదే విధంగా బాధిత బాలికకు జరిమానా నుంచి రూ.30 వేలు, మరో రూ.ఐదు లక్షలను నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించారు. -
మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు
విజయవాడస్పోర్ట్స్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు క్రీడా, వక్తృత్వ, వ్యాసరచన పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ ఎన్జీజీవో(నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్స్) అసోసియేషన్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలకుమారి తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన కరపత్రాలను విజయవాడలోని రవాణా శాఖ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఆమె ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ మార్చి ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు మార్చి 4, 5 తేదీల్లో ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం, గాంధీనగర్‌లోని ఏపీ ఎన్జీజీవో హోంలో క్రీడా, వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రన్నింగ్, వాకింగ్, టగ్ ఆఫ్ వార్, టెన్నికాయిట్, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్, క్యారమ్స్, చెస్, పాటలు, నృత్యం అంశాల్లో పోటీలుంటాయన్నారు. విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరి, ఏపీ ఏన్జీజీవో అసోసియేషన్ మహిళా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్‌తో మోసం.. వ్యక్తిపై కేసు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఒక వ్యక్తిని మోసం చేసిన వారిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. విశాఖపట్నంకు చెందిన పూసర్ల విశ్వేశ్వర రావు గొల్లపూడి గ్రామంలోని సర్వే నంబర్ 234/1 నందు ఎకరం భూమిని గ్రామానికి చెందిన నూతలపాటి ఉషారాణి వద్ద కొనుగోలు చేశాడు. 2016లో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఏడాది తర్వాత ఆర్ఓఆర్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. సదరు భూమిని తాను కోనుగోలు చేయడానికి నెల రోజుల ముందే భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తికి విక్రయించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై అతను వెంటనే ఉషారాణిని సంప్రదించగా.. భాస్కర్‌రెడ్డికి తాము బాకీ ఉన్నామని, అతని భాకీ చెల్లించి రిజిస్ట్రేషన్ రద్దు చేసుకుంటామని తెలిపారు. ఉషారాణి, ఆమె భర్త మల్లిఖార్జునరావు రిజిస్ట్రేషన్ రద్దు చేసుకునేందుకు 10 రోజులు గడువు కోరారు. గడువు ముగిసినా భాస్కరరెడ్డికి చేసిన రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోకపోవడంతో బాధితుడు విశ్వేశ్వరరావు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉషారాణి, ఆమె భర్త కుట్ర పూరితంగా తనను మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అధికారుల సమావేషాలు!
పెడన: ఇంటర్మీడియెట్ విద్యాధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. సాధారణంగా అధికారిక సమావేశాలు జిల్లా కేంద్రంలో నిర్వహించడం పరిపాటి. అయితే అందుకు భిన్నంగా ఇంటర్ అధికారులు ఉయ్యూరు కేంద్రంగా సమావేశాలు నిర్వహిస్తూ విధానపరమైన నిర్ణయాలు చేస్తున్నారు. ఇటీవల ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ముందు సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఉయ్యూరులోనే నిర్వహించారు. ఇప్పుడు తాజాగా ఇంటర్ పరీక్షల నిర్వహణపై కూడా ఇక్కడే సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఒకటో తేదీ నుంచి పరీక్షలు.. మార్చి ఒకటో తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లాలోని ఆర్ఐవోలు, డీఐఈవోలు జిల్లా కేంద్రాల్లో ఫ్లైయింగ్ స్క్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటు అధికారులు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, కస్టోడియన్లు ఇలా 150 మందికిపైగా సిబ్బందిని నియమించారు. వీరందరికీ ఈ నెల 23న జిల్లా కేంద్రంలో కాకుండా ఉయ్యూరులో సమావేశం పెట్టి దిశానిర్దేశం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేటుకు మేలు చేసేందుకేనా? వాస్తవంగా జిల్లా కేంద్రంలో ఇటువంటి సమావేశాలు నిర్వహించి జిల్లా కలెక్టర్‌ను ఆహ్వానించాలి. కానీ ఇంటర్మీడియెట్ అధికారులు ఆ దిశగా అడుగులు ముందుకు వేయకపోవడం, జిల్లా కలెక్టర్ ప్రమేయాన్ని తగ్గించడం విమర్శలకు తావిస్తోంది. అదీ కాకుండా ప్రైవేటు కళాశాలలను ఎన్డీయే కూటమి అందలం ఎక్కించడమే లక్ష్యంగా పావులు కదుపుతుందనే విషయానికి ఈ సమావేశం బలం చేకూర్చుతోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో పనిచేసిన ఇంటర్ ఉన్నతాధికారులు జిల్లా కేంద్రంలోనే సమావేశాలు నిర్వహించి పరీక్షల సిబ్బందికి మార్గదర్శకాలను జారీ చేసేవారు. కానీ ఇప్పుడున్న అధికారి మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా జిల్లా కేంద్రానికి ఎక్కడో దూరంగా ఎన్టీఆర్ జిల్లాకు దగ్గరగా ఉన్న ఉయ్యూరులో సమావేశాలను నిర్వహిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మరో పక్క జిల్లా కేంద్రానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన జిల్లా అధికారులు జిల్లా కేంద్రాన్ని వదిలిపెట్టి ఉయ్యూరులో సమావేశాలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. కావాలని జిల్లా కేంద్రాన్ని నిర్వీర్యం చేస్తున్నారనే పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రాత మారని బందరు.. ఉమ్మడి కృష్ణాజిల్లాగా ఉన్న సమయంలో మచిలీపట్నం కేంద్రంగా ఉన్నా.. విజయవాడలోనే అత్యధికంగా జిల్లా అధికారులుండే వారు. దీంతో విజయవాడలోనే సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం జిల్లాలు విడిపోయినా, అధికారులు జిల్లా కేంద్రాల్లో ఉంటున్నా కూడా జిల్లాకేంద్రంగా మచిలీపట్నాన్ని గుర్తించకపోవడం విడ్డూరంగా ఉంది.ఇంటర్ విద్యాధికారుల రూటే సెపరేటు జిల్లా కేంద్రం వైపు చూడని అధికారులు సమావేశాలన్నీ ఉయ్యూరులోనే.. జిల్లా కేంద్రంలోనే పెట్టాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ కలెక్టర్ ప్రమేయాన్ని తగ్గించడంపైనా విమర్శలు ప్రైవేటు కళాశాలలకు లబ్ధి చేకూర్చేందుకేనని ఆరోపణలు జిల్లా కేంద్రంలోనే నిర్వహించాలి.. ఇంటర్ పరీక్షలు నిర్వహించే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులకు, ఫ్లయింగ్ స్క్వాడ్లకు, కస్టోడియన్లకు సమావేశం జిల్లా కేంద్రంలో పెట్టాలని స్పష్టం చేశాం. అయితే ఆ రోజు అంటే 23న గ్రూపు–2 పరీక్ష ఉందన్నారు. 22న పెట్టుకోవాలని చెప్పాం. బందరులోని హిందూ కళాశాల, నోబుల్ కళాశాలలున్నాయి. వాటిల్లో సమావేశం పెట్టుకోవాలని ఆదేశించాం. – వీవీ సుబ్బారావు, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినర్, ఇంటర్మీడియెట్ -
కాసులిస్తేనే ఇసుక
కంచికచర్ల: నందిగామ నియోజకవర్గంలో టీడీపీ నేతల ఇసుకదందా యథేచ్ఛగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఎంపీ అనుచరులు ప్రకృతి వనరులపై కన్నేశారు. ‘నో చలానా.. ఓన్లీ క్యాష్’ అంటూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా లేకుండా దోచేస్తున్నారు. ఒక్కో లారీకి రూ. 10వేలు ఇస్తే చాలు ఎన్ని టన్నులయినా లారీలకు నింపుతామని ఎంపీ అనుచరులు బహిరంగంగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో పెండ్యాల, చెవిటికల్లు, వేములపల్లి ఇసుక రీచ్‌లన్నీ మూతపడ్డాయి. అదేమంటే ఒక్క రీచ్ సరిపోతుందని ప్రభుత్వ పెద్దలు అంటున్నారని ఇసుక కొనుగోలు దారులు చెబుతున్నారు. కూటమి పార్టీకి చెందిన నాయకులకు ఎవ్వరికీ సంబంధం లేకుండా ఏకపక్షంగా ఎంపీ అనుచరులు ఒకే రీచ్ నుంచి ఇసుకను తోడేస్తున్నారు. నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం కాసరబాద ఇసుక రీచ్ నుంచి రోజుకు 80 నుంచి 100 లారీల వరకు ఇసుకను విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుం కూడా చెల్లించటం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారుల సైతం ఈ దందాకు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామ సచివాలయాల ద్వారా ఇసుక బుక్ చేసుకున్నా.. తట్టెడు ఇసుక దొరకదని రీచ్‌ల వద్ద ఎంపీ అనుచరులు బహిరంగంగా చెబుతున్నారు. గట్టిగా అడిగిన వారిపై పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలకు డబ్బు ముట్టచెప్పితే చాలు దండిగా ఇసుక లోడ్ చేస్తున్నారు. ఇటీవల ఓ లారీ యజమానికి ఇసుకరీచ్‌లో పనిచేస్తున్న వ్యక్తుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ బయటకు రావటంతో ఈ విషయం బట్టబయలైంది. కంచికచర్ల మండలంలోని మూడు ఇసుక రీచ్లయిన పెండ్యాల – 1, పెండ్యాల–2, వేములపల్లి రీచ్‌లను మూసివేయించారు. రోజుకు రూ.10లక్షల ఆదాయం.. చందర్లపాడు మండలం కాసరబాద ఇసుక రీచ్ నుంచి ఎంపీకి రోజుకు రూ.10లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర వ్యక్తులకు వచ్చిన రీచ్‌లను మూసివేయించి కేవలం కాసరబాద రీచ్‌ను తెరిచి రూ. లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. రూ.10వేలు చెల్లించిన వారికి ఒక్కో లారీకి 30 టన్నుల నుంచి 40 టన్నుల ఇసుక లోడింగ్ చేస్తున్నారు. డబ్బు ఇచ్చిన వారికి భారీ పొక్లెయిన్లతో ఇసుకను ఎత్తి పోస్తున్నారు. ఇసుక అక్రమంగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం, వైరా, మధిర, హైదరాబాద్, విజయవాడకు తరలించి పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండి కొడుతున్నారు. కూటమి పెద్దల లక్ష్యం అదేనా? సార్వత్రిక ఎన్నికల్లో డబ్బులు బాగా ఖర్చు అయ్యాయని ఆ డబ్బులు సంపాదించాలంటే ఇసుక, మద్యం పాలసీల ద్వారా రాబట్టు కోవాలని ప్రభుత్వ పెద్దలు బహిరంగంగా అంటున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తమ నాయకుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రూ.100కోట్లకు పైగా ఖర్చు అయ్యాయని ఆ డబ్బులు ఇసుక రూపంలో వసూలు చేసుకోవటం తప్పా అని ఎంపీ అనుచరులు అంటున్నారని ఆరోపిస్తున్నారు. ఏ నాయకుడికి సంబంధం లేదని తమ నాయకుడు రూ.200 కోట్లు సంపాదించే వరకు పార్టీ నాయకులెవ్వరికీ వాటాలు ఇచ్చేది లేదని ఎంపీ అనుచరులు ఖరాఖండిగా అంటున్నట్లు తెలుస్తోంది. క్లియరెన్స్ రాగానే ప్రారంభిస్తాం.. నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల మండలంలోని పెండ్యాల–1, పెండ్యాల–2, వేములపల్లి, చందర్లపాడు మండలంలోని ఏటూరు గ్రామాల్లోని ఇసుక రీచ్‌లకు ఆరు నెలల క్రితం అనుమతి ఇచ్చాం. కానీ ఆ రీచ్‌లను తిరిగి పునరిద్దరించేందుకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. అది రాగానే రెండు రోజుల్లో తిరిగి రీచ్‌లు ప్రారంభిస్తాం. రీచ్‌లలో అక్రమ వసూళ్లు చేస్తే చర్యలు తీసుకుంటాం. – వీరాస్వామి, మైనింగ్ ఏడీ విజయవాడ రూ.10వేలు కొట్టు.. లోడ్ పట్టు టీడీపీ నేతలకు డబ్బు చెల్లిస్తే చాలు.. దండిగా ఇసుక నందిగామ నియోజకవర్గంలో ఎంపీ అనుచరుల హల్చల్ చలానా సైతం ఇవ్వకుండా దోపిడీ చందర్లపాడులోని కాసరబాద రీచ్ నుంచి మాత్రమే ఇసుక తరలింపు మిగిలిన అన్ని రీచ్‌లు మూత మిన్నకుండిపోతున్న రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు -
చికెన్, గుడ్డు నిర్భయంగా తినండి
చల్లపల్లి: కోడిగుడ్డు, కోడి మాంసం ఎటువంటి సందేహాలు, అపోహలు లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ నిర్భయంగా తినవచ్చని పశుసంవర్థక శాఖ కృష్ణాజిల్లా జాయింట్ డైరెక్టర్ చిన్న నరసింహులు అన్నారు. చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రలో బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్, జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘం, కృష్ణాజిల్లా లేయర్స్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గుడ్డు, చికెన్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు పశు సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్‌తో పాటు, కృష్ణాజిల్లా డీఎంహెచ్ఓ శర్మిష్ట, మచిలీపట్నం ఆర్డీవో స్వాతి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పౌల్ట్రీ రంగ ప్రముఖులు మాలెంపాటి కాంచనరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిన్న నరసింహులు మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క బర్డ్స్ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. -
సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బుధవారం కార్యకలాపాలు ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత సాంకేతిక సమస్య తలెత్తింది. సాయంత్రం 3 గంటల వరకు సాంకేతిక లోపాన్ని సరిచేయలేదు. దీంతో కక్షిదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సప్తమి మంచి రోజు కావడంతో ఎక్కువ మంది ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. వీరంతా నిరాశకు గురయ్యారు. సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో తెలియక కొందరు తిరిగి వెళ్లగా మరికొందరు కార్యాలయాల వద్దే వేచి చూశారు. సాయంత్రానికి కూడా సాంకేతిక లోపం తొలగకపోవడంతో చేసేది లేక తిరిగి వెళ్లారు. సిబ్బంది కూడా లోపం ఎక్కడ ఉందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ– సైన్ సమస్య భూముల క్రయ విక్రయాల్లో ఈకేవైసీ అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. కక్షిదారులు తొలుత ఈకేవైసీ నిర్థారించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పార్టీల సంతకాలు ఆన్లైన్ ద్వారా(ఈ–సైన్) సేకరిస్తారు. అయితే ఈ– సైన్ తీసుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు సాంకేతిక లోపం సరిచేసినప్పటికీ.. మరలా కొద్దిసేపటికి నిలిచిపోయింది. రిజి స్ట్రేషన్ డాక్యుమెంట్‌పై పార్టీల సంతకాలు ఆన్లైన్ ద్వారా తీసుకున్నారు. సాంకేతిక సమస్య కారణంగా కొంతమంది వద్ద మాన్యువల్‌గా సంతకాలు తీసుకున్నారు. -
ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం దిగొచ్చే వరకు తమ పోరాటం ఆగదని సంచార పశు ఆరోగ్య సేవ (1962) సిబ్బంది హెచ్చరిస్తున్నారు. ఈ నెల 15, 16 తేదీలలో వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వాట్సాప్ మెసేజ్ ద్వారా సమాచారం పంపటంపై 17వ తేదీ నుంచి ఉద్యోగులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. తాము పని చేస్తున్న సంస్థ అధికారుల తోను, పశు సంవర్థక శాఖ సంచాలకుడితోనూ సంప్రదించినా ఫలితం లేకపోవడంతో వారు ఆందోళనను కొనసాగిస్తున్నారు. వాట్సాప్ మెసేజ్‌లో సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను అప్పగించాలని పేర్కొన్నప్పటికీ ఉద్యోగ భద్రతపై భరోసా కల్పించకపోవడంతో వాటిని అప్పగించకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం 2022లో ప్రవేశ పెట్టిన సంచార పశు వైద్య సేవ పథకం నిమిత్తం తొలుత 175 వాహనాల (1962)ను, సెకండ్ ఫేజ్‌లో మరో 165 వాహనాలను అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో ఫస్ట్ ఫేజ్‌లో విడుదల చేసిన 175 వాహనాలకు సంబంధించిన ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ముందుగా ఉద్వాసన పలికింది. సెకండ్ ఫేజ్‌లో విడుదల చేసిన 165 వాహనాల ఉద్యోగులను నేడో రేపో తొలగించనున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. కర్కశంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో నియమించిన ఉద్యోగులను అర్థాంతరంగా తొలగించి కూటమి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని సంచార పశు వైద్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవీకే గ్రూప్‌కు చెందిన ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ద్వారా గత మూడేళ్ల నుంచి 1962 సంచార వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మూగజీవాలకు వైద్య సేవలను అందిస్తున్న దాదాపు 2 వేల మంది ఉద్యోగులను తొలగించటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాన్ని కొనసాగించడానికి బడ్జెట్ లేదని పశుసంవర్థక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పటం సిగ్గుచేటని సిబ్బంది మండిపడుతున్నారు. కొనసాగుతున్న సంచార పశు వైద్య సిబ్బంది ఆందోళన ఉద్యోగ భద్రతపై అధికారులస్పందన నిల్ వాహనాల అప్పగింతపై తొలగని ప్రతిష్టంభన నేడో రేపో మరో 165 వాహనాల ఉద్యోగులకు ఉద్వాసన విధులు నిర్వర్తిస్తున్న వారిని తొలగించటమేనా.. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు విధులు నిర్వర్తిస్తున్న దాదాపు 2వేల మందిని ఒకే సారి తొలగించడమేనా ఉద్యోగ, ఉపాధి కల్పన అంటూ సంచార పశు ఆరోగ్య సేవ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవీకే సంస్థ కాంట్రాక్ట్ అయిపోతే, కొత్తగా వచ్చే మరో సంస్థ అయినా ఈ పథకాన్ని కొనసాగించాల్సిందే కదా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు అందించే ఉచిత వైద్య సేవలను నిలిపేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మనుషులైతే 108 వాహనానికి ఫోన్ చేస్తారు. మరి మూగజీవాలైన పశువులకు అనారోగ్యం వస్తే ఎవరికి చెప్పుకుంటాయని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారా అంటూ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. -
క్షయ నిర్మూలనకు కలిసికట్టుగా అడుగులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో క్షయను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు కలిసికట్టుగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం (ఎన్టీఈపీ)–జిల్లా టీబీ ఫోరం కమిటీ సమావేశం జరిగింది. ఎన్టీఈపీ కింద చేపడుతున్న టీబీ నియంత్రణ కార్యక్రమాలు, వ్యాధి నిర్థారణ పరీక్షలు, చికిత్స, ఉచిత మందుల పంపిణీ, నిక్షయ్ పోషణ్ యోజన తదితర అంశాలపై సమా వేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలో 10 టీబీ యూనిట్ల ద్వారా ఎన్టీఈపీ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రోగికి చికిత్స సమయంలో నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా ప్రతినెలా రూ.వెయ్యి డీబీటీ ద్వారా అందిస్తున్నామన్నారు. క్షయ నియంత్రణలో వినూత్న చర్యలు చేపట్టే దిశగా స్థానిక సంస్థలను ప్రోత్సహించేందుకు టీబీ ముక్త్ పంచాయతీ కార్యక్రమాన్ని కూడా అమలుచేస్తున్నామని కలెక్టర్ వివరించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.సుహాసిని, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ జె.ఉషారాణి, ఐఎంఏ సభ్యులు డాక్టర్ రవీంద్రనాథ్, డీపీవో పి.లావణ్య కుమారి, వాసవ్య మహిళా మండలి సెక్రటరీ డాక్టర్ జి.రశ్మి పాల్గొన్నారు. జిల్లా టీబీ ఫోరం కమిటీ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ -
దళిత మహిళలపై పెరుగుతున్న హింస
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశవ్యాప్తంగా దళిత మహిళలపై హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తంచేశారు. విజయవాడ లెనిన్ సెంటర్లోని అంబేడ్కర్ భవన్లో దళిత సీ్త్ర శక్తి (డీఎస్ఎస్) 19వ వార్షిక మహాసభ కన్వీనర్ గెడ్డం ఝాన్సీ అధ్యక్షతన బుధవారం జరిగింది. ‘దళిత ఆదివాసి మహిళలపై జరుగుతున్న హింస, మానసిక ఆరోగ్యం – వివిధ కోణాలు’ అంశంపై వక్తలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కాకి సునీత మాట్లాడుతూ.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం దళిత మహిళలపై హింసాత్మక ఘటనలు పెరిగాయని ఆందోళన వ్యక్తంచేశారు. 23 శాతం మహిళలపై లైంగిక దాడులు జరుగుతుంటే రెండు శాతం మాత్రమే నిందితులకు శిక్షపడుతోందని తెలిపారు. మహిళలపై హింసలో ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. అయినప్పటికీ నిత్యం సీ్త్రలపై హింస పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి హింసాత్మక ఘటనలపై దళిత సీ్త్ర శక్తి పోరాడటం అభినందనీయమన్నారు. తొలుత డీఎస్ఎస్ జాతీయ కన్వీనర్ ఝాన్సీ గెడ్డం మాట్లాడుతూ.. 19 ఏళ్లుగా దళిత, ఆదివాసి సీ్త్రలు, బాలికల కోసం డీఎస్ఎస్ చేసిన కార్యక్రమాలను వివరించారు. ఆచార్య నాగార్జున వర్సిటీ ప్రొఫెసర్ సరస్వతి అయ్యర్ మాట్లాడుతూ.. సీ్త్రలపై హింస అనేక ప్రభావాలకు గురి చేస్తోందన్నారు. సీనియర్ పాత్రికేయుడు ఎం.విశ్వ నాథరెడ్డి మాట్లాడుతూ.. సమాజంలోని సీ్త్ర, పురుష సంబంధాలు హింసాత్మక ఘటనలతో ఉండకూడదన్నారు. హింసకు ఎవరు పాల్పడినా సహించకూడదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు హింసకు గురైతే పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. అనంతరం డీఎస్ఎస్ వార్షిక నివేదికను ఆవిష్కరించారు. సీనియర్ పాత్రికేయుడు శ్యామ్ సుందర్, జీజీహెచ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వరాజ్య లక్ష్మి, సైకాలజిస్ట్ శ్రావణి కృష్ణకుమారి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాధిక ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఎస్ కోఆర్డినేటర్లు, దళిత మహిళలు పాల్గొన్నారు. -
విద్యార్థినిపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు
చిలకలపూడి(మచిలీపట్నం): విద్యార్థినిపై కళాశాల ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మచిలీపట్నంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని జిల్లా కోర్టు సమీపం శిడింబి అగ్రహారంలో ఉన్న ఆదిత్య డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ఆ కళాశాల ప్రిన్సిపాల్ రాజ శేఖరరెడ్డి లైంగికంగా వేధిస్తున్నాడు. ఆ విద్యార్థినిని తరచూ బయటకు తీసుకెళ్లటంతో పాటు నిత్యం చాటింగ్ చేస్తున్నాడు. దీనిని గమనించిన విద్యార్థిని తల్లిదండ్రులు ఈ నెల 14వ తేదీన ప్రిన్సిపాల్ రాజశేఖరరెడ్డి వద్దకు వచ్చి నిలదీశారు. దీంతో వాగ్వాదం జరగ్గా ప్రిన్సిపాల్‌పై విద్యార్థిని తల్లిదండ్రులు దాడి చేశారు. ఈ సమాచారం కళాశాల చైర్మన్‌కు తెలియడంతో ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు. ఏఐఎస్ఎఫ్ ఆందోళన విద్యార్థినికి న్యాయం చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ నాయకులు కళాశాల ముందు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న చైర్మన్ కళాశాలకు వచ్చారు. ప్రిన్సిపాల్‌పై కాకినాడలో ఫిర్యాదు చేశామని యాజ మాన్యం చెప్పింది. ఘటనను కావాలనే నీరు కారుస్తున్నారని, మచిలీపట్నంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్ డిమాండ్ చేశారు. అందుకు యాజమాన్యం నిరాకరించడంతో ఏఐఎస్ఎఫ్ నాయకులు కళాశాల ఫ్లెక్సీలను చింపి ఆందోళన చేపట్టారు. అనంతరం చైర్మన్ తమ కళాశాల ఉద్యోగుల ద్వారా ప్రిన్సిపాల్ రాజశేఖరరెడ్డిపై చిలలకపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళనను విరమించారు. -
మత్స్యకారుల సంక్షేమాభివృద్ధికి కృషి చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద అమలవుతున్న పథకాల రాయితీలను మత్స్యకారులకు అందించి వారి సంక్షేమాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ డి.కె. బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం సాయంత్రం మత్స్యశాఖ అధికారులతో పథకాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పథకాలపై మత్స్యకారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. బోట్లు, వలలు, మోటారు ఇంజిన్లు వంటి యూనిట్ల మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొంతమంది లబ్ధిదారులకు పలు రకాల యూనిట్లకు సంబంధించి సబ్సిడీ రాయితీలు ఇంకా రావాల్సి ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఈ విషయాలను పై అధికారులకు తెలియజేసేందుకు లేఖలు సమర్పించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఆయా యూనిట్ల మంజూరుకు పూర్తిస్థాయిలో ఆర్థిక చేయూతనిచ్చేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి నాగబాబు, పలువురు మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయం కోనేరుసెంటర్: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సముద్ర తీరంలో పరిశుభ్రత కోసం దక్షిణ కొరియా కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ఏఎస్ ఈజెడ్ కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ బాలాజీ అన్నారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్ ఒడ్డున ఏఎస్ఈజెడ్ సంస్థ ప్రతినిధులు వలంటీర్లతో కలిసి మంగినపూడి బీచ్ తీరంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. సముద్ర తీరంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను ఏరి శుభ్రం చేశారు. అనంతరం సంస్థ ప్రతినిధులు కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్‌ను కలిసి సంస్థ లక్ష్యాలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా నదులు, సముద్ర తీరాలలో కాలుష్య రహితానికి సంస్థ చేస్తున్న కృషిని కలెక్టర్‌కు వివరించారు. పర్యాటకశాఖ జిల్లా అధికారి జి.రామ లక్ష్మణరావు, సంస్థ ప్రతినిధులు విలియం, ప్రేమ్ కుమార్, దక్షిణ కొరియా విశ్వవిద్యాలయ విద్యార్థులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. కృష్ణా కలెక్టర్ బాలాజీ -
కర్ణాటక బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ అరెస్ట్
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కర్ణాటక బ్యాంకులో కిలోల కొద్దీ బంగారు నగలను మాయం చేసిన అసిస్టెంట్ మేనేజర్‌ను అరెస్టు చేసిన కృష్ణా జిల్లా పోలీసులు పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారాన్ని రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు బుధవారం రాత్రి తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం మేరకు.. మచిలీపట్నంలోని కర్ణాటక బ్యాంకులో విజయవాడకు చెందిన గన్నే సోమేశేఖర్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. క్రికెట్, పేకాట, ఆన్లైన్ గేమ్‌లకు బానిసైన సోమ శేఖర్ బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను తన సొంత ప్రయోజనాల కోసం వాడుకోవటం మొదలుపెట్టాడు. బ్యాంకు అధికారులకు తెలియకుండా ఖాతాదారులు తాకట్టు పెట్టిన మూడు కిలోల బంగారు నగలను లాకర్ నుంచి తీసి, విజయవాడలోని నాన్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లతో పాటు తాను పనిచేసే బ్యాంకులోనూ తాకట్టుపెడుతూ వచ్చాడు. తాకట్టు పెట్టగా వచ్చిన సొమ్ముతో జల్సా చేయటంతో పాటు జూదాల్లో పెట్టి పోగొట్టుకున్నాడు. ఇటీవల కర్ణాటక బ్యాంకు అధికారులు ఆడిట్ చేయగా తాకట్టులో ఉన్న బంగారు నగల లెక్క తేలలేదు. అనుమానం వచ్చిన అధికారులు ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు బందరు డీఎస్పీ సీహెచ్.రాజా ఆధ్వర్యంలో ఆర్‌పేట సీఐ ఏసుబాబు, చిలకలపూడి సీఐ ఎస్కే నబీ, సీసీఎస్ సీఐ కె.వి.ఎస్.వరప్రసాద్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. నిందితుడు సోమశేఖర్‌ను గత నెల 31వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు అతడికి రిమాండ్ విధించింది. నిందితుడు సోమశేఖర్ ఇచ్చిన సమాచారం మేరకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్న పోలీసులు విజయవాడలోని నాన్ ఫైనాన్స్ కంపెనీల్లో సోమశేఖర్ తాకట్టుపెట్టిన రెండున్నర కిలోల నగలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారాన్ని మరికొన్ని నాన్ ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టినట్లు తెలుసుకున్న పోలీసులు, దానిని కూడా రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అతి తక్కువ సమయంలో నిందితుడిని అరెస్ట్ చేయటంతో పాటు రెండున్నర కిలోల బంగారు నగలను రికవరీ చేసిన సీఐలతో పాటు ప్రత్యేక బృందాలు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నాన్ ఫైనాన్స్ కంపెనీలు, గోల్డు లోన్లు ఇచ్చే ఇతర సంస్థలు బంగారంపై ఖాతాదారులకు రుణాలు ఇచ్చే ముందు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, బందరు డీఎస్పీ సీహెచ్ రాజా, సీఐలు, ఏసుబాబు, నబీ, వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం మిగిలిన నగల రికవరీకి చర్యలు వివరాలు వెల్లడించిన ఎస్పీ గంగాధరరావు -
బయటే కొనాలట!
పాన్‌టాప్ మాత్రలూ లేవట‘‘సార్.. గ్యాస్ ట్రబుల్‌కు వేసుకునే పాంటాప్ మాత్రలు కూడా లేవంటున్నారు. బయట కొనుక్కోమని చెపుతున్నారు’’ అంటూ ఓ రోగి సాక్షాత్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో అమాత్యవర్యులు కంగుతిన్నారు. విజయవాడ జీజీహెచ్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకస్మిక తనిఖీలో ఆయనకు ఈ విధంగా ఊహించని అనుభవం ఎదురైంది. లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం విజయవాడ జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం 10.30 గంటలకు ఆస్పత్రికి వచ్చిన ఆయన మధ్యాహ్నం 3 గంటల వరకూ ఆస్పత్రిలోనే ఉన్నారు. పలు విభాగాలను సందర్శించిన అనంతరం వైద్యులతో సమీక్ష జరిపారు. లోపాలను సరిదిద్దాలని, అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు తీసుకోవాలన్నారు. డైట్‌పై సంతృప్తి తనిఖీల్లో భాగంగా రోగులకు పెడుతున్న డైట్‌ను పరిశీలించారు. ప్రతిరోజూ ఎన్ని గంటలకు డైట్ పెడుతున్నారు. ఎంత పెడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. మెనూ కూడా పరిశీలించారు. అంతేకాదు ఆ డైట్‌ను తిని రుచి చూశారు. బాగానే ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో అటువైపుగా ఓ రోగిని బంధువులే స్ట్రెచ్చర్‌పై తీసుకెళ్లే దృశ్యాలు చూశారు. అదేమిటని అధికారులను అడగ్గా, ఎంఎన్ఓ, ఎఫ్‌ఎన్‌ఓల కొరత ఉందని వారు మంత్రికి చెప్పారు. న్యూరాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను అక్కడి వైద్యురాలు ఇవాంజెలిన్ బ్లెస్సీని అడిగి తెలుసుకున్నారు. విధులకు రాని వారిపై చర్యలు తీసుకోవాలి విధులకు అనధికారికంగా హాజరు కాని వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావును ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంఈ (అకడమిక్) డాక్టర్ డి.వెంకటేశ్వరరావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్‌కుమార్, ఇతర వైద్యులు పాల్గొన్నారు. డ్రైనేజీ అస్తవ్యస్తం సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ను సందర్శించిన ఆయన నాలుగో అంతస్తులోని ఓ టాయిలెట్లోకి వెళ్లారు. అక్కడ డ్రైనేజీ పైప్లైన్లు పూడిపోవడంతో మురుగు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లడాన్ని మంత్రి ప్రత్యక్షంగా చూశారు. అంతేకాదు అక్కడ మంచినీరు కూడా సరిగా రాని విషయాన్ని తెలుసుకున్నారు. ఆ బ్లాక్‌లో డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారిందని, దానికి మరమ్మతులు చేయాల్సి ఉందని వైద్యాధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రోగులు టాయిలెట్‌కు వెళ్లాలంటే ఎంతటి దయనీయ స్థితి ఉందో మంత్రి పత్యక్షంగా వీక్షించారు. వాటి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మందుల కోసం గంటల తరబడిక్యూలో ఉండాల్సి వస్తోంది ఓపీల వద్దా అదే పరిస్థితి సాక్షాత్తూ వైద్య మంత్రి సత్యకుమార్ యాదవ్‌కే ఫిర్యాదు చేసిన పలువురు రోగులు విజయవాడ జీజీహెచ్‌లో మంత్రి ఆకస్మిక తనిఖీలు అన్నీ సమస్యలే... మంత్రి సత్యకుమార్ యాదవ్ తొలుత అత్యవసర చికిత్సా విభాగాన్ని సందర్శించారు.అక్కడి నుంచి నేరుగా ఓపీ విభాగాలకు వెళ్లారు. ఈఎన్టీ, ఆర్థో, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ ఓపీలను పరిశీలించారు. కొన్ని చోట్ల వైద్యులు కాకుండా పీజీలు పరీక్షలు చేయడాన్ని గమనించారు. అక్కడి నుంచి ఓపీ కౌంటర్ వద్దకు వెళ్లగా రోగులు బారులు తీరి కనిపించారు. రోగుల సహనాన్ని పరీక్షించేలా ఓపీ కౌంటర్ నడుస్తున్న తీరును ఆయన పరిశీలించారు. ఒక్కో చీటీ ఇచ్చేందుకు ఎంత సమయం పడుతుందో ప్రత్యక్షంగా చూశారు. మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అక్కడి నుంచి ఫార్మసీ వద్దకు వెళ్లారు. అక్కడ కూడా రోగులు బారులు తీరి కనిపించారు. మందులు ఇచ్చేందుకు ఎందుకు జాప్యం జరుగుతోందని అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఓ రోగి పాన్‌టాప్ బిళ్లలు కూడా ఇవ్వడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వార్డులతో పాటు, సెంట్రల్ డయాగ్నోస్టిక్ బ్లాక్‌ను సందర్శించారు. పలు పరీక్షలు బయటకు రాస్తున్నట్లు రోగులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. -
వీరమ్మతల్లీ...పాహిమాం...
ఉయ్యూరు: వీరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం భక్తజన కోలాహలంగా మారింది. శిడి బండి మహోత్సవం పూర్తవటంతో అమ్మవారిని దర్శించుకుని శిడి మొక్కులు తీర్చుకునేందుకు బుధవారం వేకువజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించారు. మహిళలు పాలపొంగళ్లు నైవేద్యంగా సమర్పించారు. వీరమ్మతల్లీ...అమ్మా...పాహిమాం...అంటూ చల్లని తల్లికి పూజలు చేశారు. ఉయ్యూరు పాల వ్యాపారులు, వీరమ్మతల్లి ఆటో వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు అమ్మవారికి ఊరేగింపుగా వెళ్లి పొట్టేళ్లను కానుకగా సమర్పించారు. తొలుత శిడిబండికి పూజలు జరిపించారు. వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జంపాన పూర్ణిమ, కేపీస్ డెంటల్ ఆసుపత్రి చైర్మన్ దాడి కై లాష్కుమార్ అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. గ్రామ రీసర్వే లెక్కలు పక్కాగా ఉండాలి కలెక్టర్ జి.లక్ష్మీశ కేతనకొండ(ఇబ్రహీంపట్నం): గ్రామాల్లో జరుగుతున్న రీసర్వే లెక్కలు పక్కాగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మండలంలోని కేతనకొండ గ్రామ సచివాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. గ్రామానికి సంబంధించిన ఆన్లైన్ స్థితిగతులను పరిశీలించారు. గ్రామంలో 608 ఎకరాలకు గ్రౌండ్ లెవల్ ట్రూతింగ్ జరిగినట్లు సర్వేయర్లు వివరించారు. అందుకు సంబంధించిన రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి రైతుకు సర్వే వివరాలు నోటీసు రూపంలో తెలియజేయాలని సూచించారు. రీసర్వే సమాచారం నోటీసు బోర్డులో పెట్టాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ వరప్రసాద్, సర్వేయర్లు పాల్గొన్నారు. టీబీ ముక్త్ పంచాయతీల్లో చర్యలపై సమావేశం లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో టీబీ ముక్త్ పంచాయతీలుగా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు, నందిగామ మండలం పల్లగిరి ఎన్నికై న సందర్భంగా అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సమావేశం నిర్వహించారు. నగరంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలో డాక్టర్ మాచర్ల సుహాసిని సమావేశంలో జిల్లా టీబీ అధికారి డాక్టర్ జె.ఉషారాణి, డీఎల్‌టీఓ డాక్టర్ గుణశ్రీ, డాక్టర్ కె.శ్రీనివాస్, డాక్టర్ విజయకృష్ణ, డాక్టర్ రవీంద్రనాథ్, దినేష్, లీలాకుమార్ తదతరులు పాల్గొన్నారు. టీచింగ్ వైద్యులకు యూజీసీ స్కేల్ ఇవ్వండి వైద్య మంత్రిని కోరిన వైద్యుల సంఘం ప్రతినిధులు లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న టీచింగ్ వైద్యులకు యూజీసీ స్కేల్స్ వర్తింపజేయాలని గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(జీడీఏ ఏపీ) ప్రతినిధులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను కోరారు. ఆయన బుధవారం ప్రభుత్వాస్పత్రిని సందర్శించగా అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ బాబ్జి శ్యామ్‌కుమార్, డాక్టర్ మహేష్, డాక్టర్ నూరుల్లా, డాక్టర్ సరళ తదితరులు కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. టీచింగ్ వైద్యులకు యూజీసీ స్కేల్స్ అమలు చేయడంతో పాటు, పీఆర్సీ ఎరియర్స్‌ను విడుదల చేయించాలని కోరారు. వారి సమస్యలు విన్న మంత్రి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
పీహెచ్‌సీల్లో డీఎంహెచ్ఓ అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహా సిని మంగళవారం అర్ధరాత్రి ఎ.కొండూరు, రెడ్డిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. రాత్రి వేళల్లో విధుల్లో ఉండాల్సిన సిబ్బందిని తనిఖీ చేసి, హాజరు పట్టీ పరిశీలించారు. ఆ కేంద్రంలో అందిస్తున్న సేవల రికార్డులను పరిశీలించారు. ఎ.కొండూరు పీహెచ్సీలో కాన్పు జరిగిన బాలింత, శిశువుల ఆరోగ్య పరి స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్సీడీ–సీడీ సర్వే పరిశీలన జిల్లాలో జరుగుతున్న ఎన్సీడీ– సీడీ సర్వేను డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని బుధవారం పరిశీలించారు. కంచికచర్ల–2 సచివాలయం పరిధిలో జరుగుతున్న సంచార చికిత్స కార్యక్రమం, వసంతకాలనీలో జరుగుతున్న ఎన్సీడీ–సీడీ సర్వేను తనిఖీచేశారు. సర్వే లక్ష్య సాధన దిశగా పనిచేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ, సామర్లకోట రైల్వే స్టేషన్లలో తనిఖీలు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు వాణిజ్య విభాగం బృందంతో కలసి బుధవారం కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా కాకినాడ టౌన్ చేరుకుని స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలు, టాయిలెట్లు, వెయిటింగ్ హాల్స్, ప్రయాణికులకు అందుతున్న సదు పాయాలు, లైటింగ్, పరిశుభ్రతను తనిఖీ చేశారు. స్టాళ్లలో అభించే ఆహార పదార్థాలు, వాటి నాణ్యత, గడువు తేదీలు, వాటర్ బాటిళ్లను పరిశీలించారు. ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని ఎమ్మార్పీకే విక్రయించేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాకినాడ టౌన్ స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 31.37 కోట్లతో జరుగుతున్న పనుల పురో గతిపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ప్రయాణికులు, సిబ్బంది, స్టాళ్ల నిర్వాహకులతో మాట్లాడారు. ప్రయాణికులకు ఇంకా మెరుగైన సేవలు అందిందుకు వారి అభిప్రాయాలను సేకరించారు. అక్కడ నుంచి కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలోనూ తనిఖీలు చేపట్టారు. అక్కడ ప్రయాణికులకు అందుతున్న సేవలు, రైళ్ల నిర్వహణ, సమయపాలన తదితర విషయాలపై అధికారులు, సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో కమర్షియల్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గడ్డిమందు తాగి ప్రైవేటు బస్ డ్రైవర్ ఆత్మహత్య
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రైవేటు బస్సు డ్రైవర్ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. విద్యాధరపురం సంజీవ్‌గాంధీ కాలనీకి చెందిన బాలాజీరెడ్డి ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అనారోగ్యం కారణంగా కొద్ది రోజులుగా డ్యూటీకి వెళ్లడం లేదు. 18వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతని భార్య శకుంతల ఫోన్ చేయగా భవానీపురం లారీ స్టాండ్‌లో మందు తాగుతున్నానని సమాధానం ఇచ్చాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో శకుంతల లారీ స్టాండ్ వద్దకు వెళ్లి చూడగా అక్కడ పడిపోయి ఉన్నాడు. ఏమైందని శకుంతల ప్రశ్నించగా గడ్డి మందు తాగినట్లు చెప్పాడు. దీంతో ఆమె స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చింది. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించాడు. భవానీపురం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
హ్యాండ్ బాల్ పోటీల విజేత కేబీఎన్ కళాశాల
మైలవరం: స్థానిక డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల హ్యాండ్‌బాల్ పురుషుల పోటీల విజేతగా విజయవాడ కేబీఎన్ కళాశాల జట్టు నిలిచింది. విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల ద్వితీయ స్థానం, లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తృతీయ స్థానం దక్కించుకున్నాయి. ఈ టోర్నీ బుధవారం ముగిసింది. టోర్నీలో పాల్గొన్న అన్ని జట్ల నుంచి మెరుగైన క్రీడాకారులను కృష్ణా యూనివర్సిటీ హ్యాండ్‌బాల్ జట్టుకు ఎంపిక చేసినట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ మేజర్ మన్నేస్వామి తెలిపారు. ఎంపికై న జట్టు ఈ నెల 27 నుంచి తమిళనాడు రాష్ట్రం సేలంలోని పెరియార్ యూనివర్సిటీ నిర్వహించే దక్షిణ భారత విశ్వవిద్యాలయ పోటీలకు ప్రాతి నిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు. డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల చీఫ్ డోనర్ డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి, గ్లోబల్ స్టార్ కన్సల్టెన్సీ ఎండీ జె.చంద్రశేఖరరెడ్డి చేతులు మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ల రవి తది తరులు పాల్గొన్నారు. -
సీసీ రోడ్ల నిర్మాణం.. అంతులేని నిర్లక్ష్యం
గుడ్లవల్లేరు: కృష్ణా జిల్లాలో సంక్రాంతి పండుగ నాటికే పూర్తికావాల్సిన సీపీ రోడ్ల నిర్మాణ పనులు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. ఈ పనుల నిర్వహణలో అంతులేని నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామా పథకం కింద గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కాంపోనెంట్ నిధులను కేటాయించింది. అక్టోబర్‌లో పల్లె పండుగ పేరిట ఈ పనులకు శ్రీకారం చుట్టారు. సంక్రాంతి పండుగ నాటికి ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. సంక్రాంతి వెళ్లి శివరాత్రి సమీపించినా లక్ష్యంలో 70 శాతం మాత్రమే పనులే పూర్త య్యాయి. ప్రస్తుతం పనులు సాగుతున్న తీరును గమనిస్తే పనులు పూర్తి కావడానికి మరో నెల రోజులకు పైగా పడుతుందని అంచనా. అక్టోబర్‌లో పనులు ప్రారంభం పల్లె పండుగ కార్యక్రమం కింద గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ పనులు చేపట్టేందుకు వారం రోజుల పాటు విధి విధానాలు, పనుల గుర్తింపుపై గత ఏడాది ఆగస్టులో అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ సభలను అధికార ప్రజా ప్రతినిధులు నిర్వహించారు. జిల్లాలో ఉపాధి నిధులు రూ.15,537.59 లక్షలతో 1,964 పనులను గుర్తించి ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించారు. ఆమోదం రావడంతో గత ఏడాది అక్టోబర్‌లో నిర్మాణ పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో ఆ పనులకు భూమిపూజలకే రెండు వారాలకు పైగా సమయం పట్టింది. నవంబర్ నుంచి పనులను చేపట్టారు. రూ.5 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు.. పల్లె పండుగ కార్యక్రమం పేరిట ఒక్కొక్క అభివృద్ధి పనికి రూ.5 లక్షల నుంచి రూ.60 లక్షలతో అంచనాలు రూపొందించారు. కూటమి ప్రభు త్వంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సూచించిన నేతలకే ఆ పనులను ఎక్కడికక్కడ కట్టబెట్టారు. చాలా గ్రామాల్లో సర్పంచులకు ఈ పనులు కేటాయించక పోవటంతో వారి నుంచి వ్యతిరేకతను కూడా కూటమి ప్రభుత్వం మూట కట్టుకుంది. ఆ పనులను ఎలాంటి అనుభవం లేని కొత్త వారికి కట్టబెట్టడంతో పనుల్లో జాప్యం జరుగుతుందోన్న విమర్శలు లేకపోలేదు. పనుల నిర్వహణ ఇలా.. జిల్లాలోని 25 మండలాల్లో ఉపాధి నిధుల కింద రూ.15,537.59 లక్షలతో పనులు మంజూరయ్యాయి. ఇందులో సీసీ రోడ్లతో పాటు అవసరమైన చోట మాత్రమే డ్రెయిన్లను నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల ఆయా గ్రామాల టీడీపీ నేతలు చెప్పిన ప్రాంతాల్లో సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. ఇందులో 80 శాతం సీసీ రోడ్ల నిర్మాణానికే నిధులను కేటాయించారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులను పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆ పనులు పూర్తయిన రోడ్లను కచ్చితంగా 21రోజుల పాటు నీటితో తడిపి క్యూరింగ్ చేయాలన్నది నిబంధన. అయితే ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో అన్ని రోజుల పాటు క్యూరింగ్ చేయటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. త్వరలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి జిల్లాలోని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పురోగతిలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే నెల 15వ తేదీకల్లా పూర్తి చేయాలని పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. పూర్తి నాణ్యతా ప్రమాణాలతో పంచా యతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. నాసిరకంగా చేసే పనులకు బిల్లులు మంజూరు కావు. – పున్నమరాజు రమణరావు, కృష్ణా జిల్లా పంచాయతీరాజ్ ఎస్ఈ జిల్లాలో సంక్రాంతికే సీసీ రోడ్ల నిర్మాణం పూర్తికావాలన్నది లక్ష్యం సంక్రాంతి వెళ్లి శివరాత్రి వస్తున్నా పూర్తికాని నిర్మాణ పనులు గత అక్టోబర్‌లో ప్రారంభమైన పనులు 70 శాతమే జరిగిన వైనం -
సీనియర్ సిటిజన్ రాయితీలపై ప్రచారం అసత్యం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ీసనియర్ సిటిజన్లకు టికెట్లో 50 శాతం రాయితీని రైల్వేశాఖ పునరుద్ధరించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అసత్యమని విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో ప్రకటించారు. ఆ ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. గతంలో రైల్వేశాఖ సీనియర్ సిటిజన్లకు టికెట్ ధరలో 50 శాతం రాయితీ ఇచ్చేదని, 2020 మార్చి నుంచి కరోనా సమయంలో ఈ రాయితీని తొలగించిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి రాయితీని పునరుద్ధరించలేదని స్పష్టంచేశారు. కొన్ని సోషల్ మీడియాల్లో మాత్రం రాయితీపై తప్పుడు ప్రచారం జోరుగా సాగడంతో సీనియర్ సిటిజన్లలో కొంత అయోమయం నెలకొందని వివరించారు. కచ్చితమైన సమాచారం కోసం భారతీయ రైల్వే వెబ్సైట్లు లేదా అధీకృత మీడియాల్లో వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రయాణికులు పరిగణలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు. రైల్వే ప్రయాణికులను గాయపరిచి చోరీచేసే నిందితుల అరెస్టు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ ఔటర్లో కదులుతున్న రైలులో ఫుట్‌బోర్డుపై ఉండే ప్రయాణికులను కిందకు లాగి, వారిపై బ్లేడుతో దాడి చేసి నగదు, సెల్ ఫోన్లు చోరీ చేసే ఇద్దరు నిందితులను ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు మైనర్ కావడంతో జువైనల్ హోంకు, మరో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ జి.వి.రమణ కథనం మేరకు.. ఈ నెల రెండో తేదీన శ్రీనివాసరావు అనే వ్యక్తి తెనాలి నుంచి విజయవాడకు రైలులో బయలుదేరాడు. ఆ రైలు బస్‌స్టేషన్, పూలమార్కెట్ సమీపంలోకి రాగానే కొంత మంది బ్లేడ్ బ్యాచ్ సభ్యులు అతడిని కిందకి లాగి బ్లేడుతో గాయపర్చి పర్సు, సెల్‌ఫోన్ చోరీ చేశారు. మరుసటి రోజు కూడా ఇదే తరహాలో పవన్ కుమార్‌ను బ్లేడుతో గాయపర్చి అతని వద్ద సెల్‌ఫోన్ దోచుకున్నారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో రైల్వే ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ ఆదేశాలతో జీఆర్పీ డీఎస్పీ రత్నరాజు పర్యవేక్షణలో సీఐ జి.వి.రమణ ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో చోరీలకు పాల్పడిన వారిలోని ఒక మైనర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా మరో ముగ్గురు యువకులతో కలసి బ్లేడుతో దాడి చేసి చోరీలకు పాల్పడినట్లు తెలిపాడు. మైనర్ ఇచ్చిన సమాచారం మేరకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కన్నీటి రాజేష్‌ను అదుపులోకి తీసుకుని చోరీ చేసిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు. 107 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఎటువంటి బిల్లులు, పత్రాలు లేకుండా రైలులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలకు పైగా విలువైన 107 కిలోల వెండి ఆభరణాలను విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ జీఆర్పీ ఇన్స్పెక్టర్ జి.వి.రమణ కథనం మేరకు.. మంగళవారం రాత్రి పోలీసులు విజయవాడ స్టేషన్లో సాధారణ తనిఖీలు చేపట్టారు. జీటీ ఎక్స్‌ప్రెస్‌లో ఆగ్రా నుంచి వచ్చి విజయవాడలో దిగిన సందీప్ వద్ద బ్యాగులను సోదా చేశారు. వాటిలో 107 కిలోల వెండి ఆభరణాలు కనిపించాయి. బిల్లులు లేకుండా నగరంలోని ఒక జ్యూయలరీ షాపు యజ మాని రాహుల్‌కు ఇవ్వడానికి వెండి ఆభరణాలను తీసుకొచ్చినట్లు సందీప్ తెలిపాడు. సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు ఆ ఆభరణాలను జీఎస్టీ అధికారులకు అప్పగించారు. -
17లారీలు స్వాధీనం..
మైనింగ్ బిల్లులు లేకుండా మెటల్, కంకర రవాణా చేస్తున్న 17 లారీలను జి.కొండూరు మండల పరిధి కట్టబడిపాలెం గ్రామ శివారులో మైనింగ్ ఏడీ వీరాస్వామి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న టిప్పర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సంఘటనా స్థలానికి చేరుకొని అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్రషర్లు, క్వారీలపై చర్యలు తీసుకోకుండా కిరాయి కోసం వచ్చిన లారీలపై ప్రతాపం చూపిస్తున్నారని మైనింగ్ అధికారులపై నాయకులు మండిపడ్డారు. బిల్లులు ఇవ్వకుండా మైనింగ్ చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా నిత్యం లారీ యజమానులనే దొంగలుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అనుమతులు సక్రమంగా ఉన్న క్రషర్ల, క్వారీలలో రవాణా చేసుకునేందుకు జాబితా ఇవ్వమని అడిగినా మైనింగ్ అధికారులు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. క్రషర్లు, క్వారీల యజమానులు వారి సొంత లారీలకు మాత్రమే బిల్లులు ఇచ్చి తమ లారీలకు బిల్లులు ఇవ్వడం లేదన్నారు. ప్రశ్నిస్తే తమ లారీలకు లోడింగ్ ఆపేస్తున్నారని చెప్పారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ మంగళవారం తెల్లవారుజామున 4గంటల వరకు ఎంత మొరపెట్టుకున్నా వెనక్కి తగ్గని మైనింగ్ శాఖ అధికారులు ఏడు లారీలను జి.కొండూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. మరో ఏడు లారీలకు ఒక్కొక్క లారీకి రూ. 22,500 చొప్పున జరిమానా విధించి అక్కడి నుంచి పంపారు. మరో మూడు లారీలు సీజ్ చేసిన ప్రదేశంలోనే సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణలో ఉంచారు. -
అనధికార కట్టడాలపై కొరడా
పెనమలూరు: తాడిగడప మునిసిపాలిటీలో అనధికార కట్టడాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. పోరంకి, తాడిగడపలో పలు అక్రమ నిర్మాణాలను టౌన్‌ప్లానింగ్ అధికారులు గుర్తించారు. దీంతో మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు పోరంకి బీజేఆర్ నగర్లో అనధికార భవన నిర్మాణంలో అదనపు ఫ్లోర్లను ధ్వంసం చేశారు. తాడిగడప మనోజ్నగర్లో కూడా అనధికార కట్టడాన్ని అధికారులు గుర్తించి శ్లాబ్‌కు కన్నాలు పెట్టారు. అనధికార నిర్మాణాలు నిర్మించినా, అక్రమ లేఅవుట్లు వేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ భవానీప్రసాద్ అన్నారు. ఇళ్ల స్థలాలు కొనే వారు, భవనాల్లో ఫ్లాట్ కొనే వారు నిబంధనల ప్రకారం నిర్మించారా లేదా అనే విషయం తెలుసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం టౌన్ ప్లానింగ్ అధికారులను సంప్రదించాలని సూచించారు. జోనల్ మాస్టర్ ప్లాన్ రూపొందించండి కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): ఎకో సెన్సిటివ్ జోన్లో పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా భవిష్యత్తులో చేపట్టబోయే పనులకు సంబంధించి జోనల్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఆయన చాంబర్లో మంగళవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా వైల్డ్ లైఫ్ సాంక్చ్యూరి పరిధిలో ఎకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. జోన్ పరిధిలోని గ్రామాల్లో పర్యావరణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా భవిష్యత్తులో చేపట్టబోయే పనులకు సంబంధించి ఆయా శాఖలు మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె. చంద్రశేఖర్, ఆర్డీవో కె. స్వాతి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శ్రీనివాస్, జిల్లా పర్యాటకశాఖ అధికారి రామలక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగర వాసులందరూ పాల్గొనాలి పటమట(విజయవాడతూర్పు): జాతీయ స్థాయిలో జరిగే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విజయవాడ వాసులందరూ పాల్గొనాలని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. గతంలో నగరాన్ని స్వచ్ఛందంగా ఉంచినందుకు జాతీయ స్థాయిలో స్వచ్ఛ నగరాల్లో ఒకటిగా విజయవాడ నిలిచిందన్నారు. అదే మాదిరిగా ఈ సారి జరిగే స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనూ నగర వాసులు చురుగ్గా పాల్గొని విజయవాడను ఉత్తమ స్థానంలో నిలపాలన్నారు. ప్రస్తుతం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రజాభిప్రాయాన్ని క్యూ ఆర్(క్విక్ రెస్పాన్స్) కోడ్ ద్వారా స్కాన్ చేసి, ఫోన్ నంబర్, ఓటీపీ నమోదు చేసి, సర్వేలో ఉన్న పది ప్రశ్నలకు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ప్రజలను కోరారు. -
పెళ్లి కొడుకుగా మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్: మంగళగిరి గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 18 నుంచి 27 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు మంగళవారం స్వామి పెళ్లి కుమారుడి ఉత్సవం శోభాయమానంగా నిర్వహించారు. స్వామికి గణపతి పూజ, పంచామృత అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని పెళ్లికుమారుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణానికి చెందిన చంద్రిక జ్యూయలర్స్ అధినేత జంజనం నాగేంద్రరావు, విజయలక్ష్మి దంపతులు ఈ ఉత్సవానికి కై ంకర్యకర్తలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్లు బోగి కోటేశ్వరరావు, సీతారామ కోవెల ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ వాకా మంగారావు తదితరులు పాల్గొన్నారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి జె.వి.నారాయణ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. -
పెదవి చీలిక శాపం కాదు
సిద్ధార్థ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రామోజీరావు గన్నవరం రూరల్: పెదవి చీలిక, అంగిలి చీలిక శాపం కాదని చిన అవుటపల్లి డాక్టర్స్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ రామోజీరావు అన్నారు. మండలంలోని ముస్తాబాద జెడ్పీ హైస్కూల్లో మంగళవారం ఓరల్ అండ్ మాక్సిలో ఫేషియల్ సర్జరీ విభాగం ఆధ్వర్యాన విద్యార్థులకు గ్రహణం మొర్రిపై అవగాహన కల్పించారు. డాక్టర్ రామోజీరావు మాట్లాడుతూ చిన్నతనంలో ఏర్పడే పెదవి చీలికతో ఆత్మన్యూనతకు గురవుతారని, మిగిలిన వారితో కలసి ముందుకు నడవలేరని చెప్పారు. దీనిని అధిగమించడం ఈ రోజు చాలా తేలికన్నారు. తమ కళాశాలల్లో గ్రహణం మొర్రి ఉన్నవారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. హెచ్‌వోడీ డాక్టర్ ఎన్.కోటేశ్వరరావు మాట్లాడుతూ చీలిక ఉన్న బాలలను ఆదరించాలన్నారు. అంగిలి చీలిక ఉన్న వారిని చైతన్యపరిచి వారికి ఆపరేషన్ల ద్వారా నూతన జీవితాన్ని అందించడమే లక్ష్యమన్నారు. విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన, ఇబ్బందులను అధిగమించే ప్రక్రియలను డాక్టర్ వసుధ వివరించారు. పెడోడాంటిక్స్ హెచ్‌వోడీ డాక్టర్ రవిచంద్రశేఖర్, డాక్టర్ నాయుడు, ప్రొఫెసర్ శ్రీకాంత్ గుంటూరు, ఇన్చార్జి హెచ్ఎం శ్రీపతి రామ్‌గోపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
సాగుదారులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
కిసాన్ మేళాలో కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఘంటసాల: సాంకేతికతను సాగులోకి తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఘంటసాలలోని వ్యవసాయ పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణాజోన్ కిసాన్ మేళా మంగళవారం నిర్వహించారు. వ్యవసాయ పరిశోధనా ప్రాంగణంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివన్నారాయణ అధ్యక్షతన జరిగిన కిసాన్ మేళాను విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఆర్.శారదా జయలక్ష్మీదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ బాలాజీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఏఆర్ఎస్, కేవీకే, ఇతర వ్యవసాయ ప్రదర్శన స్టాల్స్, యంత్రాలను పరిశీలించారు. ముందుగా ఏఆర్ఎస్, కేవీకే ప్రధాన శాస్త్రవేత్తలు వరి మాగాణుల్లో అపరాల సాగు–సవాళ్లు, భవిష్యత్తు కార్యాచరణ గురించి వివరించడంతో పాటు వివిధ పంటల్లో నూతన వంగడాలు, నూతన పద్ధతులు తెలియజేసి రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అనంతరం ఘంటసాల వ్యవసాయ పరిశోధన స్థానం ప్రచురించిన వరి మాగాణులలో మినుము, పెసర సాగు యాజమాన్యం, వరి మాగాణులలో మినుమును ఆశించే కాండం గజ్జి తెగులు యాజమాన్యం పుస్తకాలను ఆవిష్కరించారు. రైతులకు క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ, కృష్ణా మండలం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎన్వీవీఎస్ దుర్గా ప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖాధికారి ఎన్.పద్మావతి, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి నరసింహులు, ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి.సత్యప్రియ లలిత తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా వర్సిటీ వీసీగా రాంజీ
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతిగా కె. రాంజీని నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. కాగా జేఎన్టీయూ ప్రొఫెసర్ కె. శ్రీనివాసరావు ఆరు నెలలుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ ఉపకులపతిగా కొనసాగిన విషయం విదితమే. త్వరలో రాంజీ కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సుబ్బారాయుడి సేవలో రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు బుద్ధు సతీష్‌శర్మ, విరూప్శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. -
వైభవం.. శిడి బండి సంబరం
ఉయ్యూరు: అశేష భక్తజన కోలాహలం.. సన్నాయి మేళాల జోరు, డప్పు వాయిద్యాల హోరు.. జై వీరమ్మ.. జైజై వీరమ్మ భక్తజన నినాదాల నడుమ.. శిడిబండి ఊరేగింపు కనుల పండువగా సాగింది. పెళ్లి కుమారుడు ఉయ్యూరు మౌర్యకిరణ్ శిడిబుట్టలో కూర్చున్న ఉత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. పారుపూడి, నెరుసు వంశస్తులు మూడు సార్లు శిడి ఆడించటంతో ఉత్సవం ముగిసింది. నయనానందకరంగా.. ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో 11వ రోజు నిర్వహించే ప్రధాన ఘట్టమైన శిడిబండి వేడుక మంగళవారం నయనానందకరంగా సాగింది. పాత వాటర్ ట్యాంకు రోడ్డులో ప్రత్యేకంగా తయారుచేసిన శిడిబండికి స్థానికులు పసుపునీళ్లు ఓరబోసి గుమ్మడికాయలు కట్టి, కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఊరేగింపుగా బయలుదేరిన శిడి బండికి దారిపొడవునా భక్తులు పువ్వులు విసురుతూ పసుపునీళ్లు ఓరబోస్తూ హారతులు పట్టారు. పూల దండలు, గుమ్మడికాయలను శిడిబండికి కట్టి భక్తి పారవశ్యం చెందారు. కాలేజ్ రోడ్డు, ప్రధాన రహదారి వెంబడి సాగిన ఊరేగింపులో అశేష భక్తజనం పాల్గొని తన్మయత్వం చెందారు. శిడిబుట్టలో కూర్చున్న పెళ్లి కుమారుడు.. సంప్రదాయం ప్రకారం ఉయ్యూరు దళితవాడ నుంచి పెళ్లి కుమారుడు ఉయ్యూరు మౌర్య కిరణ్ ఊరేగింపుగా ఆలయం వద్దకు తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు మౌర్య కిరణ్‌ను శిడి బుట్టలో కూర్చోబెట్టి ఆలయ ప్రదక్షిణ చేయించారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా శిడిబండిని నిలిపి మూడుసార్లు శిడి ఆడించటంతో ఉత్సవం ముగిసింది. శిడి ఆడే సమయంలో భక్తులు అరటికాయలు విసురుతూ భక్తిపారవశ్యం చెందారు. వేడుక అనంతరం పెళ్లి కుమారుడితో పాటు ఉయ్యూరు వంశస్తులు, బంధువులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో 300 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఉత్సవానికి పోటెత్తిన భక్తజనం -
నిబంధనలు పాతరేసి.. యథేచ్ఛగా తవ్వకాలు
జి.కొండూరు: ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ బోర్డు నుంచి క్రషర్లు, క్వారీల యజమానులు అనుమతులు పొందకుండానే మైనింగ్ చేస్తున్నారు. అయితే ఇటీవల మైనింగ్ అధికారులు క్రషర్లు, క్వారీల యజమానులతో సమావేశమై క్లియరెన్స్ తెచ్చుకున్న తర్వాతనే మైనింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ అనుమతులు పొందకుండానే మైనింగ్ నిర్వహణ సాగిపోతోంది. దీనిపై అధికారులు చర్యలు చేపట్టడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల పరిధిలో క్వారీల నిర్వహణ సాగుతోంది. మైలవరం, నందిగామ నియోజకవర్గాలలోని జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల మండలాల్లో గతంలో 154 క్వారీల వరకు ఉండగా ప్రస్తుతం 69 క్వారీల వరకు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్వారీలలో బ్లాస్టింగ్ల ద్వారా పెద్ద పెద్ద బండరాళ్లను క్రషర్లకు తరలించి 40ఎంఎం, 20ఎంఎం, 12ఎంఎం, బేబీ చిప్స్, డస్ట్, వెట్ మిక్స్ ఇలా రకరకాలుగా విభజించి స్థానికంగా నిర్మిస్తున్న కట్టడాలు, రహదారులకు సరఫరా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ క్వారీల నుంచి రోజుకి 500కి పైగా భారీ వాహనాలతో 20వేల టన్నులకు పైగా రాతి సంపదను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఈ రెండు నియోజకవర్గాల్లోని క్వారీల నుంచి ఏడాదికి రూ.300కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది. నిత్యం బాంబుల మోత.. క్వారీలలో నిబంధనల ప్రకారం 8 అడుగుల లోతు వరకే డ్రిల్లింగ్ వేసి పేలుళ్లు జరిపి కొండ నుంచి రా మెటీరియల్‌ను తీయాల్సి ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా బోర్లు వేసే యంత్రాలతో కొండలకు 50 నుంచి 100 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ వేసి బ్లాస్టింగ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ పేలుళ్ల వల్ల సమీప ప్రాంతాలలో వ్యవసాయ భూములలో పెద్ద పెద్ద బండరాళ్లు పడి పంటలు, డ్రిప్ పైపులు, బోరు బావులు, ధ్వంసమవుతున్నాయి. ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. అనుమతులు లేకుంటే కఠిన చర్యలు.. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేని క్రషర్లు, క్వారీలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఈసీ బోర్డును ఏర్పాటు చేసిన నేపథ్యంలో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. మైనింగ్ బిల్లులు లేకుండా అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎటువంటి వారినైనా సహించేదిలేదు. సోమవారం రాత్రి సీజ్ చేసిన వాహనాలలో ఏడు లారీలకు జరిమానా విధించాం. – వీరాస్వామి, మైనింగ్ ఏడీ అనుమతులు లేకుండానే క్వారీలు, క్రషర్ల నిర్వహణ బిల్లులు లేని కంకర లారీలను సీజ్ చేస్తున్న అధికారులు క్వారీలు, క్రషర్లపై కేసులెందుకు పెట్టరంటూ లారీ ఓనర్ల నిలదీత నిత్యం తమనే దొంగలుగా చిత్రీకరిస్తున్నారంటూ ఆవేదన -
కథలు వద్దు.. పని పూర్తి కావాలి
కంకిపాడు: ‘కథలు వద్దు. పని పూర్తి కావడం కావాలి. నేను చెప్పేది మీరు చెప్తే సమస్య పరిష్కారం ఎలా అవుతుంది’ అని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ పేర్కొన్నారు. మండలంలోని పునాదిపాడు, కంకిపాడు గ్రామాల్లో కలెక్టర్ సోమ వారం విస్తృతంగా పర్యటించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెత్త సేకరణ తీరు, సంపద కేంద్రాల నిర్వహణపై సమీక్ష చేశారు. వివిధ గ్రామాల్లో చెత్తసేకరణపై కలెక్టర్ ప్రశ్నించగా, మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. దీంతో కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. కథలు వద్దు.. పనులు ఎంతవరకు జరిగాయో చెప్పాలన్నారు. తడి, పొడి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, సంపద తయారీ కేంద్రాల కేంద్రాల నిర్వహణ సమర్థవంతంగా సాగాలని స్పష్టంచేశారు. అన్ని గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావాలని ఆదేశించారు. తడి, పొడి చెత్త వేరు చేసే ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని స్పష్టం చేశారు. వారంలో వంద కుటుంబాల్లో మార్పులు తీసుకురావాలని పేర్కొన్నారు. కంకిపాడు, పునాదిపాడు సంపద తయారీ కేంద్రాల నిర్వహణ బాగుందని, అన్ని కేంద్రాలు ఇదే రీతిగా పనిచేయా లని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రీ సర్వేపై సమీక్ష చేశారు. ఫ్రీ సర్వే రికార్డులను పరిశీలించి తగు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వి.భావనారాయణ, ఎంపీడీఓ పి.అనూష, మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి బాపూజీ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
సొరంగం భద్రత ప్రశ్నార్థకం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): చిట్టినగర్ సొరంగం భద్రత ప్రశ్నార్థకంగా మారింది. 60 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సొరంగం లోపల నుంచి వస్తున్న నీటి ఊట ఇప్పుడు నీటి ధారలుగా మారింది. భారీ వాహనాల రాకపోకలే ఇందుకు కారణమని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పగటి వేళ బస్సులు, ట్రాక్టర్ల రాకపోకలతో బిజీగా ఉండే సొరంగ మార్గంలో రాత్రి పది గంటల తర్వాత ట్రావెల్ బస్సులు, లారీలు, టిప్పర్ల వేగానికి ప్రకంపనలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఇదే పరి స్థితి మరి కొంత కాలం కొనసాగితే సొరంగం మను గడే ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొరంగంలో నీటి ఊటలను ఇటీవల విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు, నిపుణులు పరిశీలించారు. సొరంగం దెబ్బ తిన్నకుండా ఉండేందుకు కొండపై ఉన్న కొన్ని ఇళ్లను తొలగించాలని సూచించారు. ఈ నేపథ్యంలో తొలగించాల్సిన ఇళ్లను కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. నీటి ఊట ధారలై.. గతంలో సొరంగం లోపల మూడు నాలుగు చోట్ల నీటి ఊట ఛాయలు కనిపించేవి. అయితే ఒక ఏడాది నుంచి నీటి ఊట స్థానంలో లీకేజీలు ఏర్పడి నీరు ధారలుగా ప్రవహిస్తోంది. ఇప్పుడు ఆ నీటి ధారలు పదుల సంఖ్యకు చేరాయి. సొరంగం నుంచి ప్రయాణించే వారిపై నీటి ధారలు పడుకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రోడ్డుపైకి చేరిన నీరు మడుగుగా మారి, నాచు పట్టి ప్రమాదాలకు కారణమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి చెమ్మ ఉన్న చోట తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సొరంగం సుందరీకరణ పనుల్లో భాగంగా వేసిన త్రీడీ పెయింటింగ్ సైతం నీటి ధారల వల్ల దెబ్బతింది. సొరంగం పైభాగంలో ఇళ్లకు మార్కింగ్ సొరంగంలో నీటి ధారలు అధికం కావడంతో కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు రంగంలోకి దిగారు. 15 రోజుల కిందట మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో పాటు ఇంజినీరింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. సొరంగం మనుగడ దెబ్బతినకుండా చేపట్టాల్సిన చర్యలను వెంటనే తీసుకోవాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇంజినీరింగ్ అధికారులు రెండు రోజుల పాటు సొరంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పై భాగంలో ఉన్న ఇళ్లను తొలగించాలని నిర్ణయించారు. ఈ మేరకు కొండపైకి చేరుకున్న అధికారులు కొన్ని ఇళ్లకు ప్రాథమికంగా మార్కింగ్ చేయడంతో పాటు నివాసితుల వివరాలను నమోదు చేసుకున్నారు. దీనిపై కమిషనర్‌తో చర్చించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు. నీటి ఊట, లీకేజీలతో సొరంగానికి ముప్పు భారీ వాహనాలను నిషేధించాలంటున్న స్థానికులు కొండపై కొన్ని ఇళ్లు తొలగించాలని వీఎంసీ నిర్ణయం -
చికిత్స పొందుతూ మహిళ మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన లబ్బీపేట(విజయవాడతూర్పు): మెరుగైన వైద్యం కోసం జి. కొండూ రు నుంచి జీజీహెచ్‌కు వచ్చిన 30 ఏళ్ల మహిళ ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందింది. అపస్మారక స్థితికి చేరుకున్న మహిళకు వైద్యులు ఇంజెక్షన్ ఇవ్వడంతోనే ప్రాణాలు పోయాయంటూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యమే ప్రాణాలు తీసిందంటూ ఆరోపించారు. వివరాల ప్రకారం జి.కొండూరు మండలం కందులపాడుకు చెందిన వల్లూరు శిరీష(30) రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెకు షుగర్‌లెవల్స్ అధికంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ.. లెవల్స్ కంట్రోల్ చేయడానికి ఇంజెక్షన్ ఇచ్చారు. పరిస్థితి మరింత దిగజారి ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే మహిళ మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణంటూ బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులు ఇంజెక్షన్ ఇవ్వడంతోనే కోమాలోకి వెళ్లి ప్రాణాలు విడిచిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిండా ముప్పై ఏళ్లు కూడా లేవని, సరైన వైద్యం అందితే ప్రాణాలు దక్కేవని, తల్లి, మామయ్యలతో పాటు, ఇతర బంధువులు పేర్కొన్నారు. వైద్యుల నిర్లక్ష్యం లేదు.. మహిళ ఆస్పత్రికి వచ్చేసరికే పరిస్థితి విషమంగా ఉంది. షుగర్‌లెవల్స్ ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. అంతేకాదు షుగర్‌లెవల్స్ తీవ్రస్థాయికి పెరగడంతో నిమోనియాకు గురవడంతో ఆస్పత్రికి వచ్చిన కొద్దిసేపటికే మృతి చెందింది. దీనిలో వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదు. – డాక్టర్ ఎ. వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్, జీజీహెచ్ -
భారీ వాహనాల వేగానికి కళ్లెం వేయాల్సిందే..
రాత్రి పది నుంచి తెల్లవారుజాము ఐదు గంటల వరకు సొరంగం నుంచి భారీ వాహనాల రాకపోకలే నీటి ధారలకు కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. టన్నుల బరువుతో మితి మీరిన వేగంతో లారీలు, టిప్పర్లు ఈ మార్గంలో రాకపోకలు సాగించడంతో వచ్చే ప్రకంపనల నేపథ్యంలోనే సొరంగానికి పగుళ్లు ఏర్పడుతున్నాయని వివరిస్తున్నారు. సొరంగం రోడ్డుకు రెండు వైపులా ఉన్న ఇళ్లలో సామగ్రి సైతం టిప్పర్లు, లారీల వేగానికి పడిపోతున్నాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. సొరంగం పరిరక్షణకు చర్యలు తీసుకోకుంటే, ఈ నిర్మాణం చరిత్రగా మాత్రమే మిగులుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు సొరంగం మనుగడపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. -
21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
విజయవాడ కల్చరల్: రంగం ప్రజా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు రంగం రాజేష్ సోమవారం తెలిపారు. బాలోత్సవ్ భవన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషా ఉద్యమగీతాలు, దేశ భక్తి జానపదగీతాలు, అభ్యుదయ గీతాలాపన కార్యక్రమాన్ని గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి గాయనీ గాయకులు పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. తెలుగు భాషలో పోటీలు.. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మాతృ భాషా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన విజయవాడలోని ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం, పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని తెలుగు శాఖ, ఉయ్యూరులోని ఏజీఅండ్ ఎన్జీ సిద్ధార్థ కళాశాలలోని తెలుగుశాఖ సంయుక్తంగా తెలుగు భాషలో పోటీలను నిర్వహిస్తున్నామని పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ ప్రకటనలో తెలిపారు. పాఠశాల, కళాశాల స్థాయిలో ఈ పోటీలు విజయవాడ మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాల ఆవరణలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. పద్యాలాపన, ఆంగ్లపదాలకు తెలుగుమాటలు రాయడం, అచ్చంగా తెలుగులో మాట్లాడడం, తెలుగు గద్యపఠనం పోటీలు జరుగుతాయని వివరించారు. ఈ నెల 19వ తేదీలోగా 83748 65621, 98485 47022ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. -
వసతి గృహం తనిఖీ
చిలకలపూడి/కోనేరు సెంటర్(మచిలీపట్నం): మండల పరిధిలోని పల్లెతాళ్లపాలెంలో ఉన్న వసతి గృహాన్ని సోమవారం సాయంత్రం జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆమె ఈ వసతిగృహాన్ని పరిశీలించారు. వసతి గృహంలో విద్యార్థులకు కల్పించిన వసతి సౌకర్యాలతో పాటు విద్యార్థులు చదువుకునే విద్యుత్ దీపాలు ఏ విధంగా ఉన్నాయి.. ఆహారం మెనూ ప్రకారం అందుతుందా లేదా? విద్యార్థులు పడుకునే నేల పరిశుభ్రంగా ఉందా, లేదా.. అని ఆమె పరిశీలించారు. అనంతరం ఒక్కొక్క విద్యార్థిని పిలిచి ఏమైనా అసౌకర్యాలు ఉంటే తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీలి ముసలయ్య, వసతి గృహ సంక్షేమాధికారి ఎండీ షహతుల్లా, తాలుకా ఎస్ఐ కేవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. జనసేన ఆరోపణలపై ఉద్యోగ సంఘాల మండిపాటు ఇబ్రహీంపట్నం: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఎన్టీటీపీఎస్, దాని యాజమాన్యంపై జనసేన నేతలు చేసిన నిరాధార ఆరోపణలు, అక్రమ కేసులపై సంస్థ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. సంస్థపై వ్యాఖ్యలను టీఎన్టీయూసీ, ఏపీఎస్ఈబీ, ఏఈఈ, ఏపీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్, బీసీ వెల్ఫేర్, 327 అసోసియేషన్ల నాయకులు సోమవారం ఓ ప్రకటనలో ఖండించాయి. చీఫ్ ఇంజినీర్ టి.నాగరాజు ఆధ్వర్యంలో ఎన్టీటీపీఎస్ రికార్డు స్థాయి జనరేషన్ సాధిస్తూ ఎన్నో రికార్డులు సొంతం చేసుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వం, జెన్కో ఆదేశాల మేరకు సంస్థ నడుస్తోందని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం నడవదన్నారు. సంస్థ వెలుపల రోడ్డుపైన జరిగిన బూడిద లారీ సంఘటన సంస్థకు, సీఈ నాగరాజుకు జనసేన నేతలు ఆపాదించడం ఏమిటన్నారు. హైవేపై జరిగిన విషయానికి సంస్థకు సంబంధం ముడిపెట్టడం ఎందుకని ప్రశ్నించారు. పేరు ప్రఖ్యాతలు కలిగిన సంస్థ ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి కల్పిస్తోందని, రాష్ట్రంలో వెలుగులు నింపుతున్న సంస్థను రాజకీయాల్లోకి లాగవద్దని యూనియన్ నాయకులు హితవు పలికారు. -
క్యాష్ లెస్.. యూజ్ లెస్!
● నూజివీడుకు చెందిన పెన్షనర్ అబ్దుల్(70) ఇటీవల పక్షవాతానికి గురయ్యాడు. నగరంలోని ఓ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రికి రాగా, అక్కడ ఈహెచ్ఎస్లో సేవలు అందుబాటులో లేవని చెప్పడంతో డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సి వచ్చింది. వైద్యానికి రూ.2.50 లక్షలు ఖర్చు చేశాడు. ఇలా ఎందరో ఉద్యోగులు, పెన్షనర్లు డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నారు. ● గన్నవరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి(64)కి ఇటీవల హార్ట్‌బీట్ తగ్గింది. ఆస్పత్రికి వెళ్లగా ఫేస్మేకర్ వేయాలని చెప్పారు. గతంలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ పథకంలో వేసేవాళ్లు. ఇప్పుడు అతనికి ఈహెచ్ఎస్ పథకంలో చేయలేమని చెప్పడంతో అప్పు చేసి డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సిన పరిస్థితి నెలకొంది. అదేమంటే రీయింబర్స్మెంట్ వస్తాయిగా అంటున్నారని ఆ ఉద్యోగి వాపోతున్నారు. ఆ ఫైల్ పెడితే ఎప్పుడు వస్తాయో, ఎంత వస్తాయో తెలియదంటున్నాడు. లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం మిథ్యగానే మారింది. గత ప్రభుత్వం ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయగా, నేడు కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఈహెచ్ఎస్ సేవలను నిలిపివేస్తామని మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించినా, ప్రభుత్వంలో కనీస స్పందన కనిపించలేదు. దీంతో ఉద్యోగులు ఈహెచ్ఎస్ కార్డు తీసుకుని ఆస్పత్రులకు వెళ్తే, ఈ కార్డుపై తాము వైద్యం చేయడం లేదని, డబ్బులు చెల్లించాల్సిందేనని చెప్పడంతో అప్పులు చేసి మరీ చెల్లించాల్సిన దయనీయ స్థితి నెలకొంది. దీంతో చేసేది లేక చిన్న తరగతి ఉద్యోగులు ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయిస్తుంచాల్సి వస్తోంది. మరికొందరు తక్కువ రేటులో వైద్యం అందుతుందని మంగళగిరి ఎయిమ్స్‌కు తరలిపోతున్నారు. 45 రోజుల కిందటే.. జిల్లాలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో 45 రోజుల కిందటే ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం నిలిపివేశారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆషా) ఓ హోటల్లో సమావేశం నిర్వహించి చర్చించిన అనంతరం మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. నాటి నుంచి జిల్లాలోని నెట్వర్క్ ఆస్పత్రులన్నింటిలో ఈహెచ్ఎస్ సేవలు నిలిచిపోయాయి. గతంలో నిర్వహించి ఉచిత ఓపీ పరీక్షలను కూడా నిలిపివేశారు. దీంతో జిల్లాలోని వేలాది మంది ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ జీతాల నుంచి ఈహెచ్ఎస్ కోసం కొంత వ్యయం చెల్లిస్తున్నా, వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. ప్రభుత్వ మొండి వైఖరితోనే.. గత ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఆ ఏడాది మొదటి క్వార్టర్ ఆరోగ్యశ్రీ చెల్లింపులు కూడా జరిపేందుకు వీలుకాలేదు. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం జూన్‌లో ఏర్పాటైంది. అంటే జనవరి నుంచి జూన్ వరకూ ఆరు నెలల్లో ఆరోగ్యశ్రీ కింద అందించిన సేవలకు గాను రూ.2 వేల కోట్ల వరకూ బకాయి ఉంది. వాటిని చెల్లించాలని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. గత ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న రూ.1500 కోట్లు బకాయిలు చెల్లించిందనీ, అలాగే ఇప్పుడు చెల్లించాలని కోరినా స్పందన కొరవడింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈహెచ్ఎస్ సేవలు నిలిపివేశారు. అమలయ్యేలా చూడాలి.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందించేలా ప్రభుత్వం చొరవ చూపాలి. కార్డు తీసుకుని ఆస్పత్రికి వెళ్తే, ఇది పనికిరాదు డబ్బులు కట్టాలంటున్నారు. వెంటనే ప్రభుత్వం చర్చలు జరిపి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్యం అందేలా చూడాలి. – కె. శ్రీనివాసరావు, ఉద్యోగి పేరుకే నగదు రహిత వైద్య పథకం45 రోజులుగా ఈహెచ్ఎస్ సేవలు బంద్ పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే సేవలంటున్న ఆస్పత్రుల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు -
చుక్క రాదు.. దాహం తీరదు
వేసవికి ముందే జిల్లాలో తాగునీటి ఇబ్బందులు ‘నా పేరు బి.కుమారి. కంచికచర్ల అరుంధతీనగర్‌లో నివసి స్తున్నాను. జలజీవన్ మిషన్ పథకంలో ప్రతి ఇంటికీ కుళాయి ఏర్పాటు చేసి నిత్యం తాగునీరు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆ కుళాయికి 12 రోజులకు ఒకసారే నీరు వస్తోంది. చేసేదేమీ లేక వాటర్ ప్లాంట్ నుంచి రోజుకు 20 లీటర్లు తాగునీరు కొని జాగ్రత్తగా వాడుకుంటున్నాం. కొంతమంది గ్రామానికి కిలోమీటర్ దూరంలోని పేరకలపాడు క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న కుళాయి నుంచి క్యానుల్లో తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడే తాగునీటి ఎద్దడి ఇలా ఉంటే ఇక వేసవిలో ఇంకా ఎంత తీవ్రంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నాం. ● కొన్ని గ్రామాల్లో వారానికి ఒక రోజే కుళాయిలకు నీటి సరఫరా ● దూర ప్రాంతాల నుంచి తాగునీరు తెచ్చుకొంటున్న వైనం ● పైపులైన్ల లీకులకు మరమ్మతులు చేపట్టని అధికారులు సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో వేసవికి ముందే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. పలు గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. వారా నికి ఒక రోజుకు కూడా కుళాయిలకు నీరు విడుదల కాని పరిస్థితుల్లో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. పలు గ్రామాల్లో తాగునీటి పైపు లైన్లకు, చేతి బోర్లకు చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయడం లేదు. వీటి నిర్వహణ గ్రామ పంచాయతీలదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. జిల్లాలో 19 సీపీడబ్ల్యూ స్కీమ్‌లు ఉన్నాయి. వీటి నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. వాటికి నీరు అందేలా కృష్ణా నదిలో ట్రెంచ్‌లు కొట్టాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదు. దీంతో ప్రజలను తాగునీటి సమస్య వెంటాడుతోంది. చేసేదేమీ లేక ఆర్వో ప్లాంట్లకు వెళ్లి రోజూ రూ.20 వెచ్చించి 20 లీటర్ల తాగునీరు కొనుగోలు చేసి, జాగ్రత్తగా వాడుకుంటూ దాహార్తి తీర్చుకుంటున్నామని ప్రజలు వాపోతు న్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రోజూ నీటి సరఫరా జరిగేదని, ఇప్పుడు వారానికి ఒక రోజు కూడా నీరు రాని దుస్థితి నెలకొందని, అయినా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు వాపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మండు వేసవిలో పరిస్థితిని ఎలా ఉంటుందో తలచుకొని ఆందోళన చెందుతున్నారు. నందిగామ నియోజకవర్గంలో.. నందిగామ నియోజకవర్గాన్ని తాగునీటి సమస్య వేధిస్తోంది. కంచికచర్ల మండలంలోని చెవిటికల్లు వద్ద కృష్ణానదిపై కంచికచర్ల, బత్తినపాడు పైలెట్ ప్రాజెక్టులు నిర్మించారు. ఈ రెండు పైలెట్ ప్రాజెక్టుల ద్వారా కంచికచర్ల మండలంలోని పది గ్రామాలు, బత్తినపాడు పైలెట్ ప్రాజెక్టు నుంచి వీరులపాడు మండలంలోని 20 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ నీరు రోజూ రావడంలేదని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వారానికో, పది రోజులకో ఒకసారి కుళాయిల నుంచి నీరు వస్తోందని, ఇలా అయితే ఎలాగని వాపోతున్నారు. ఇప్పడే ఈ విధంగా తాగునీటి ఎద్దడి ఉంటే ఇక మండు వేసవిలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. గ్రామాల్లో బోరు పంపులకు కూడా మరమ్మతులు చేపట్టడంలేదని, ఫలితంగా వాడుక అవసరాలకూ ఇబ్బందులు తప్పడంలేదని ఆయా గ్రామాల మహిళలు పేర్కొంటున్నారు. పాలకులు, అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. తిరువూరు నియోజకవర్గంలో.... తిరువూరు నగరపంచాయతీ పరిధిలో కుళాయిలకు వారానికి రెండుసార్లు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. కట్టెలేరులో పంపింగ్ స్కీముకు సరిపడా నీరందడంలేదు. దీంతో బోర్ పాయింట్లు వేసి నీరందించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా పలు ప్రాంతాలకు సక్రమంగా తాగునీరు అందడంలేదు. రాజుపేటలోని పలు ప్రాంతాల్లో నాలుగు రోజులకు ఒకసారి కూడా కుళాయి నీరు రావడం లేదు. వేసవిలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిచాల్సిన దుస్థితి నెలకొంది. గంపలగూడెం మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు తీవ్ర నీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణకు వెళ్లి తాగునీరు తెచ్చుకుని గొంతు తడుపుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో... జగ్గయ్యపేట మునిసిపాలిటీ పరిధిలోని విలియంపేట, కాకాని నగర్, ఆర్టీసీ కాలనీ, చింతలతోపు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. చిల్లకల్లు, తిరుమలగిరి, అన్నవరం ప్రాంతాల్లోనూ తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెంలో కొన్ని రోజులుగా కుళాయిల నుంచి తాగునీరు రంగు మారి వస్తోంది. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వత్సవాయి మండలంలో మునేరుకు వచ్చిన వరదల కారణంగా పలు చోట్ల పైపులైన్లు కొట్టుకుపోయాయి. దీంతో వత్సవాయి మండల కేంద్రంలో రెండు రోజులకొక సారి నీరు సరఫరా జరుగుతోంది. మక్కపేట, సింగవరం, గోపినేనిపాలెం, భీమవరం, మాచినేని పాలెం, కంభంపాడు గ్రామాలకు నీరు సక్రమంగా సరఫరా కావటం లేదు.శాశ్వత పథకం ఏర్పాటు చేయాలి తిరువూరు పట్టణానికి తాగునీటి సరఫరాలో నిరంతరం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాలకుల ఉదాసీన వైఖరితో పలు మార్లు రకరకాల పథకాలను ప్రతిపాదించి విరమించుకోవడం పరిపాటైంది. ఇకనైనా శాశ్వత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేయాలి. – ముదిగొండ దుర్గాప్రసాద్, తిరువూరు నీటి కొరత లేకుండా చర్యలు గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకొంటున్నా. మార్చి 15వ తేదీలోపు పైపులైన్ల నిర్మాణ పనులను పూర్తి చేస్తాం. కృష్ణా నదిలో సీపీ డబ్ల్యూఎస్ స్కీంలకు నీటి కొరత లేకుండా ట్రెంచ్‌లు కొడుతున్నాం. – విద్యాసాగర్, ఇన్చార్జి ఎస్ఈ, ఆర్‌డబ్లూఎస్, ఎన్టీఆర్ జిల్లా -
సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈ నెల 27న జరిగే ఉమ్మడి కృష్ణా –గుంటూరు శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్ల) పాత్ర కీలకమని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశమందిరంలో మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమం సోమవారం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని, పోలింగ్ ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకూ ప్రతి అంశాన్నీ నిశి తంగా పరిశీలించి, సాధారణ పరిశీలకులకు నివేదిక అందించాలన్నారు. ఈసీఐ మార్గదర్శకాలపై శిక్షణ కార్యక్రమాల ద్వారా విధుల నిర్వహణపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లా పరిధిలో 112 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారని, పోలింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో, సహాయ రిటర్నింగ్ అధికారి ఎం.లక్ష్మీనరసింహం, నోడల్ అధికారి కె.శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
నమ్మంచి.. ముంచారు!
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే.. రూ.1500 ఇస్తారని నమ్మించి.. ఆ అకౌంట్లను సైబర్ నేరాలకు వినియోగిస్తున్న విషయం అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం.. సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన పలువురు మహిళలు, పురుషులు 59వ డివిజన్ శానిటరీ విభాగంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తుంటారు. అయితే అక్కడ శానిటరీ మేస్త్రిగా పనిచేసే డానియేల్ అతని కుమారుడు రాముకు ఆన్లైన్లో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఇలా ఆమెతో చాటింగ్‌లో ఉన్న రాముకు వన్‌టౌన్‌లోని బీబీఎస్ బ్యాంక్‌లో అకౌంట్లు ఓపెన్ చేయిస్తే రూ.1500 డబ్బులు వస్తాయని సదరు మహిళ రాముకు చెప్పింది. మనం అలా డబ్బులు బాగా సంపాదించి.. విదేశాలకు కూడా వెళ్లవచ్చని నమ్మించింది. దీంతో రాము తన తండ్రి డానియేల్ పనిచేసే కార్యాలయంలోని పారిశుద్ధ్య కార్మికులకు ఈ విషయాన్ని చెప్పి వారి వద్ద నుంచి ఆధార్‌కార్డ్‌లు, ఫొటోలను సేకరించాడు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.1500 వస్తాయనే ఆశ చూపి పలువురు కార్మికులతో గతేడాది బ్యాంకు అకౌంట్లను ఓపెన్ చేయించి వారికి రూ.1500 చొప్పున నగదు అందించారు. వారికి వచ్చిన బ్యాంకు పాస్‌బుక్, ఏటీఎం కార్డులు, చెక్ బుక్‌లను వారే తిరిగి తీసేసుకున్నారు. సైబర్ క్రైం నోటీసులతో.. అయితే ఇలా ఖాతాలు తెరిచిన పీట్ల వెంకటేశ్వరరావు, పీట్ల దుర్గాభవాని, వేముల సుశీల, వేముల ఇస్సాక్‌లకు ఈ నెల 10వ తేదీన మహారాష్ట్రలోని జలగాం వద్ద జరిగిన ఓ సైబర్ క్రైమ్ కేసుకు సంబంధించి నోటీసులు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన వారు విషయం తెలుసుకోగా వారి నలుగురి ఖాతాలలో సుమారు రూ.17.50 లక్షలు జమ అయి.. వాటిని తీసినట్లుగా ఉంది. వెంటనే వారు శానిటరీ మేస్త్రి డానియేల్, అతని కుమారుడు రాములను నిలదీయగా వారు పొంతన లేని సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించడం వరకే తమకు తెలుసని అంత డబ్బులు ఎలా వచ్చాయో.. ఎలా పోయాయో తమకు తెలీదని చెప్పడంతో బాధితులు సింగ్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇలా బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేసిన మరికొంతమంది కార్మికులకు కూడా ఇదే విధంగా పోలీసుల నుంచి నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు ఎంతమంది అకౌంట్లు ఓపెన్చేశారు.. ఎంతమందికి నోటీసులు వచ్చాయనే వివరాలను సేకరిస్తున్నారు. దీనిపై బాధితుల నుంచి పూర్తి సమాచారం తీసుకున్న తరువాత కేసు నమోదు చేసి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. డబ్బు ఆశ జూపి పారిశుద్ధ్య కార్మికులతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించిన వైనం ఒక్కొక్కరి ఖాతాలో రూ. 17లక్షలు వేసి, విత్ డ్రా మహారాష్ట్ర నుంచి ఖాతాదారులకుసైబర్ క్రైం నోటీసులు స్థానిక పోలీసులను ఆశ్రయించిన నలుగురు కార్మికులు -
విజయవాడ సిటీ
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20257కృష్ణలంకలో అగ్నిప్రమాదం విజయవాడ కృష్ణలంక పరిధిలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మూడు పోర్షన్ల పూరిల్లు దగ్ధమైంది. ఈ పోర్షన్లలోని సామగ్రి మొత్తం బుగ్గిపాలైంది. లీకేజీలపై అప్రమత్తంగా ఉండాలి గ్యాస్ పైప్‌లైన్ లీకేజీలపై స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాజు సూచించారు. పైప్‌లైన్ లీకులపై సోమవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. అనధికార కట్టడాల కూల్చివేత పెనమలూరు మండలంలోని యనమలకుదురులో అనధికార కట్టడాలను మునిసిపల్ అధికారులు సోమవారం కూల్చివేశారు. అనుమతులు లేని ఐదు కట్టడాలపై చర్యలు తీసుకున్నారు.–8లోu -
బఫర్ జోన్లో చికెన్ షాపులు మూసేయాలి
● బర్డ్‌ఫ్లూ కారణంగానే అనుమల్లంకలో కోళ్ల మృతి ● నిరంతరం అప్రమత్తంగా ఉండాలి ● 35 గ్రామాల పరిధిలో కట్టుదిట్టమైన బయో సెక్యూరిటీ ● జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చికెన్ దుకాణాలపై బర్డ్ ఫ్లూ ప్రభావం చూపుతోంది. గంపలగూడెం మండలంలోని అనుమల్లంక గ్రామంలో కోళ్ల మరణాలకు బర్డ్‌ఫ్లూ వ్యాధే కారణమని నిర్ధారణ కావడంతో ఆ గ్రామానికి పది కిలోమీటర్ల పరిధిలోని 35 గ్రామాల్లో తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలను కొనసాగించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. సమన్వయ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమల్లంక ఘటన నేపథ్యంలో చేపడుతున్న నివారణ, నియంత్రణ చర్యలపై సమీక్షించేందుకు కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. భోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (నిహ్షాద్) నుంచి ఈ నెల 14న వచ్చిన ఫలితాల్లో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ఫ్లూయంజా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు పశు సంవర్థక శాఖ అధికారులు తెలిపారు. అప్పటికే యుద్ధప్రాతిపదికన భద్రతా చర్యలు తీసుకున్నట్లు వివ రించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన కేంద్రమైన అనుమల్లంకకు పది కిలోమీటర్ల పరిధిలో బఫర్ జోన్‌గా నిర్ణయించి, ఆ ప్రాంతంలో వ్యాధి నియంత్రణ చర్యలను పకడ్బందీగా కొనసాగించాని కలెక్టర్ ఆదేశించారు. బఫర్ జోన్లో చికెన్, గుడ్ల దుకాణాలను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మూసి ఉంచాలని స్పష్టం చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని, శానిటైజేషన్‌కు స్ప్రేయర్లు, ఫాగర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో పర్యవేక్షణ జిల్లాలో ఉన్న 116 కోళ్లఫారాల్లోనూ నిరంతర పర్యవేక్షణతో పాటు బయో సెక్యూరిటీ చర్యలను చేపట్టాలని కలెక్టర్ లక్ష్మీశా పేర్కొన్నారు. బర్డ్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బఫర్ జోన్లో ఫీవర్ సర్వేలను నిర్వహించాలని, అవసరమైతే నమూనాలను పరీక్షించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతంలో పక్షుల్లో అసహజ మరణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని అటవీ అధికారులకు కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్థక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, డీపీఓ పి.లావణ్య కుమారి, ఫారెస్ట్ రేంజ్ అధికారి పి.రాజు తదితరులు పాల్గొన్నారు. -
దుర్గగుడికి వాట్సాప్ నంబరు
94418 20717 ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కల్పిస్తున్న సదుపాయాల్లో లోటుపాట్లను ఆలయ అధికారులకు భక్తులు వాట్సాప్ నంబరు ద్వారా తెలియజేయొచ్చు. ఇందు కోసం దేవస్థానం 94418 20717 నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులకు దేవస్థానం ప్రసాదాలు, అన్న ప్రసాదం అందజేస్తోంది. ఆయా సేవల్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. సదుపాయాలపై సూచనలు, సలహాలతో పాటు ఆలయ సమాచారం సైతం ఈ వాట్సాప్ ద్వారా అందించొచ్చు. భక్తుల సూచనలు, ఫిర్యాదులపై ఆలయ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారనే సమాచారాన్ని వెల్లడిస్తారు. చిన్నాపురం పీహెచ్‌సీని సందర్శించిన డీఐఓ కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రేమ్ చంద్ సోమవారం బందరు మండలం చిన్నాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సంద ర్శించారు. పీహెచ్‌సీలోని పలు విభాగాలను పరిశీలించారు. ల్యాబ్‌ను సందర్శించి వైద్య పరీక్షలకు అవసరమైన అన్ని పరికరాలు జరుగుతున్నదీ లేనిదీ ఆరాతీశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు సక్రమంగా అందుతు న్నది లేనిది తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలకు వైద్య సేవలు అందించే విషయంలో జాగ్రత్తలు వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెలివరీలు ఎక్కువ జరిగేలా చూడాలని ఆదేశించారు. పీహెచ్సీ నిర్వహణ, సిబ్బంది పనితీరుపై సంతప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ జి.లాస్య హరిత, ఎంపీహెచ్ఈఓ పి.వి.పరమేశ్వరరావు, వైద్య సిబ్బంది భారతి, రాంబాబు, హుస్సేన్‌బీ, సీతారాం, హేమ నాయక్, బాబా రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
వాదనలు సమర్థంగా వినిపించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పోలవరం– బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, నాగార్జున సాగర్ ఎడమకాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు అన్నారు. సోమవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ఆవశ్యకత, కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుతం ఉన్న 66 శాతం వాటా కొనసాగింపు, నదీ యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం, ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జునసాగర్ ఎడమకాలువ 3వ జోన్ లో ప్రస్తుతం సాగుచేసిన ఆరుతడి పంటలను రక్షించటానికి పూర్తి స్థాయిలో సాగునీటి విడుదల వంటి విషయాలను ప్రస్తావించారు. ఎన్ఎస్పీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు మాట్లాడుతూ సాగర్ ఎడమ కాలువ పరిధిలో సాగు చేసిన పంటలను రక్షించేందుకు నీటి విడుదలకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు, కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణారావు -
శివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు
పెనమలూరు: మండలంలోని యనమలకుదు రులో వేంచేసిన శ్రీ పార్వతి సమేత శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 25వ తేదీ నుంచి జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఉయ్యూరు ఆర్డీఓ హేలాషారోన్ ఆదేశించారు. యనమలకుదురులో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా 26న స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారని ఆర్డీఓ తెలిపారు. ప్రభోత్సవంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నదిలో భక్తులు పుణ్య స్నానాలు చేసే సమయంలో ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక బోట్లు ఏర్పాటు చేసి, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాడిగడప మునిసిపల్ కమిషనర్ భవానిప్రసాద్, సీఐ వెంకటరమణ, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీఓ ప్రణవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తొలుత ఆలయాన్ని ఆర్డీఓ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించండి చిలకలపూడి(మచిలీపట్నం): విద్యార్థులకు రుచి కరమైన పౌష్టికాహారాన్ని అందించాలని, నిర్ల క్ష్యాన్ని ఉపేక్షించేది లేదని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి అరుణసారిక స్పష్టంచేశారు. స్థానిక వలందపాలెం బీసీ బాలుర కళాశాల వసతి గృహాన్ని ఆమె సోమవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహార పదా ర్థాను అందించాలని, పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. తాను తరచూ తని ఖీలు చేస్తానన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన న్యాయ విజ్ఞాన సద్సులో న్యాయమూర్తి అరుణసారిక మాట్లాడుతూ.. న్యాయసేవాధి కార సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికీ న్యాయం జరి గేలా కృషి చేస్తామన్నారు. న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి రామకృష్ణయ్య మాట్లాడుతూ.. పేదలకు తక్షణ న్యాయం అందేలా న్యాయవిజ్ఞాన సదస్సులు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీలి ముసలయ్య, వసతి గృహ సంక్షేమా ధికారి షేక్ జహీరున్నీసాబేగం పాల్గొన్నారు. పరిశోధనలతో మరిన్ని అవకాశాలు కోనేరుసెంటర్(మచిలీపట్నం): సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, మెడిసిన్ రంగాల్లో పరిశోధనలకు భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ సీనియర్ సైంటిస్ట్, విశ్రాంత ఆచార్యుడు అప్పాజోస్యుల శ్రీనివాసరావు పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన సెమినార్లో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యసించారు. పరిశోధనలు చేసే విద్యార్థులకు దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ ప్రాధాన్యం ఉంటుందన్నారు. అనంతరం శ్రీనివాసరావును ఆయా విభాగాల అధిపతులు సత్కరించారు. ఈ సెమినార్లో రెక్టార్ ఆచార్య ఎం.వి.బసవేశ్వరరావు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రధాన ఆచార్యులు ఆచార్య ఎన్.ఉష, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సుజాత, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ వీరబ్రహ్మచారి పాల్గొన్నారు. చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు చాలా ఘోరంగా మారాయని మాజీ ఎంపీ చింతా మోహన్ చెప్పారు. యూనివర్సిటీలో చదువుకునే అమ్మాయిలు బాత్రూమ్కు వెళితే నిచ్చెనలు వేసుకొని ఫొటోలు తీస్తున్నారని, వారికి భద్రత కరువైందని ఆందోళన వ్యక్తంచేశారు. గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో చింతా మోహన్ సోమవారం విలేకరులతో మాట్లా డుతూ.. రైతులకు రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పిన చంద్రబాబు పైసా ఇవ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్టులో సీఎం చంద్రబాబు రూ.6 వేల కోట్లు స్వాహా చేశారని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. రూ.లక్ష కోట్లు ఒక్క తుళ్లూరు ప్రాంతంలోనే ఖర్చు చేయకుండా కర్నూలు నుంచి ఒంగోలు వరకు, శ్రీకాకుళం, విజయనగరం వంటి వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
కృష్ణలంకలో అగ్నిప్రమాదం
కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణలంక, 20వ డివిజన్లో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం చోటుచేసుకుని మూడు పోర్షన్లు కలిగిన తాటాకు ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఆయా పోర్షన్లలో నివాసం ఉంటున్న కుటుంబసభ్యులు కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడగా.. సామాన్లన్నీ కాలి బూడిదయ్యాయి. సేకరించిన వివరాల మేరకు.. 20వ డివిజన్, ద్వారకానగర్‌లో నిర్మలా శిశుభవన్ సమీపంలో అల్లమల్ల ఆంజనేయులుకు మూడు పోర్షన్లు కలిగిన తాటాకు ఇల్లు ఉంది. ఒక పోర్షన్లో అతను తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుండగా.. మధ్య పోర్షన్లో అతని తల్లి అల్లమల్ల లక్ష్మి ఒంటరిగా ఉంటోంది. మరో పోర్షన్లో బొచ్చా రమణమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి అద్దెకు ఉంటున్నారు. ఆదివారం రాత్రి అందరూ భోజనం చేసి నిద్రపోయారు. రాత్రి సుమారు 12గంటల సమయంలో రమణమ్మ కుమారుడు టాయిలెట్‌కు వెళ్లేందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. తన ఇంటిపై తాటాకు కాలిపోతూ మంటలు వ్యాపించడాన్ని చూసి పెద్దగా కేకలు వేశాడు. ఏం జరిగిందోనని మూడు పోర్షన్లలో నివాసం ఉంటున్న వారితో పాటు చుట్టుపక్కల వారు ఇళ్లల్లోనుంచి బయటకు వచ్చి చూశా రు. అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి మిగతా రెండు పోర్షన్లకు సైతం అంటుకోవడంతో క్షణాల్లో పూర్తిగా దగ్దమయ్యాయి. మూడు ఇళ్లల్లోని వంటసామగ్రి, మంచాలు, బీరువాలు, ఫ్రిడ్జ్‌లు, బట్టలు, టీవీలు, కుట్టుమిషన్లు, పిల్లలు పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్ కార్డులు విలువైన వస్తువులన్నీ చూస్తుండగానే పూర్తిగా కాలిపోవడంతో మూడు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, కృష్ణలంక పోలీసులు గంట పాటు శ్రమించి ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. కళ్ల ముందే ఇల్లు కాలిపోవడంతో కట్టుబట్టలతో మిగిలామని బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఆహుతైన తాటాకిల్లు కట్టుబట్టలతో మిగిలిన మూడుకుటుంబాలు మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది -
పైప్‌లైన్ లీకేజీలపై అప్రమత్తంగా ఉండాలి
మైలవరం: గ్యాస్ పైప్‌లైన్ లీకేజీలపై స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ టి.రాజు తెలిపారు. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, గెయిల్ ఇండియా లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో మైలవరం–తిరువూరు రోడ్డులో మైలవరం మండల పరిధిలోని హెచ్‌పీసీఎల్ వారి విశాఖ–విజయ వాడ–సికింద్రాబాద్, విజయవాడ–ధర్మపురి పైప్‌లైన్ వద్ద ఎమర్జెన్సీ రెస్పాన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్‌ను అనుసరించి సోమవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ పైప్‌లైన్ 628 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని, మైలవరం నుంచి తిరువూరు వరకు ఉన్న పైప్‌లైన్‌ను పర్యవేక్షించడానికి లైన్వాకర్ను నియమించామన్నారు. పైప్‌లైన్ మార్గంలో ఎక్కడైన లీక్ అయిన సందర్భంలో లైన్ వాకర్‌కు సమాచారం ఇస్తే ఆయన ద్వారా వెంటనే క్విక్ రెస్పాన్స్ టీమ్ స్పందించి లీక్ మరమ్మతు పనులు చేపడతామన్నారు. -
ఏటీఎల్ మారథాన్‌కు ఏడు ప్రాజెక్ట్‌లు ఎంపిక
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): అటల్ టింకరింగ్ ల్యాబ్స్(ఏటీఎల్) మారథాన్ 24–25కు ఎన్టీఆర్ జిల్లా నుంచి ఏడు సైన్స్ ప్రాజెక్ట్‌లు ఎంపికై నట్లు జిల్లా సైన్స్ అధికారి మైనం హుస్సేన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ సైన్స్ పోటీలకు దేశ వ్యాప్తంగా 1,575 టీమ్ ఐడియాస్ ఎంపిక కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి 76 ఎంపికై నట్లు పేర్కొన్నారు. అందులో ఎన్టీఆర్ జిల్లా నుంచి ఏడు ఎంపిక కావటం విశేషమని తెలిపారు. వాటిల్లో ఏపీ బాలయోగి గురుకులం (జగ్గయ్యపేట)కు చెందిన ఆరు ప్రాజెక్ట్‌లు, ఏపీ మోడల్ స్కూల్ (గంపలగూడెం) నుంచి ఒక ప్రాజెక్ట్ ఎంపికై నట్లు తెలిపారు. ఎంపికై న ప్రాజెక్ట్‌ల ఉపాధ్యాయులను, విద్యార్థులను జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు అభినందించినట్లు పేర్కొన్నారు. సూపర్ మార్కెట్లో విద్యార్థి నిర్బంధం ఇబ్రహీంపట్నం: కళాశాల విద్యార్థి దొంగతనం చేశాడనే నెపంతో స్థానిక ఓ సూపర్ మార్కెట్ నిర్వాహకులు మూడు గంటలపాటు గదిలో నిర్భందించి చిత్రహింసలు పెట్టిన ఘటన సోమ వారం జరిగింది. సరుకుల కొనుగోలుకు వచ్చిన ఓ కళాశాల విద్యార్థి రెండు ప్యాకెట్లు కొనుగోలు చేయకుండా జేబులో పెట్టుకుని తస్కరించినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించిన ఆ దుకాణ యాజమా న్యం విద్యార్థిని బంధించినట్లు చెబుతున్నారు. ఇతరుల ద్వారా విషయం తెలుసుకున్న విద్యార్థి స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు జరిగిన విషయంపై ఆరా తీసి, విద్యార్థిని విడిపించారు. ఈ ఘటనపై ఇరువర్గాలు పోలీ సులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి కృష్ణలంక(విజయవాడతూర్పు): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఒడిశా రాష్ట్రానికి చెందిన రవి(52) అనే వ్యక్తి సుమారు 30ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. బందరురోడ్డులో ఒక టిఫిన్ బండి వద్ద పూరి మాస్టార్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 10గంటల సమయంలో టిఫిన్ బండి వద్ద కళ్లు తిరిగి కిందపడిపోయాడు. ఉలుకూ పలుకూ లేకపోవడంతో చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం అతనిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి చూసి మృతి చెందినట్లు నిర్దారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనధికార కట్టడాల కూల్చివేత పెనమలూరు: యనమలకుదురులో అనధికార కట్టడాలను అధికారులు సోమవారం కూల్చివేశారు. తాడిగడప మునిసిపాలిటీ పరిధి యనమలకుదురులో కుప్పలు తెప్పలుగా అనఽధికార నిర్మాణాలు చేపట్టారు. వీటికి ఎటువంటి అనుమతులు లేవు. అనుమతులు లేని కట్టడాలు, లేఅవుట్లపై గతంలో ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు రావటంతో అధికార యంత్రాంగం స్పందించింది. గ్రామంలో అనధికార కట్టడాలు గుర్తించి వాటిలో ఐదు కట్టడాలను సోమవారం కూల్చివేశారు. మసీదు వద్ద నాలుగు, డొంక రోడ్డులో ఒక నిర్మాణాన్ని కూల్చారు. టౌన్ ప్లానింగ్ అధికారులు వివరాలు తెలుపుతూ తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో అక్రమ లేఅవుట్లు, అనధికార కట్టడాలు చేపట్టరాదన్నారు. వినియోగదారులు స్థలాలు, భవనాలు కొనుగోలు చేసే సమయంలో అనుమతులు ఉన్నాయో లేదో ముందుగానే తెలుసుకోవాలన్నారు. -
ఇటు కళకళ.. అటు వెలవెల
మచిలీపట్నంటౌన్: బర్డ్‌ఫ్లూ ప్రభావం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఆదివారం వచ్చిందంటే నగరంలోని అన్ని వర్గాల ప్రజలు మాంసాహారాన్ని భుజించేందుకు ఇష్టపడతారు. ఎక్కువగా చికెన్నే తింటుంటారు. అయితే ఈ ఆదివారం మాత్రం బర్డ్‌ఫ్లూ ప్రభావం ప్రచారంతో ప్రజలు చికెన్‌ను తినేందుకు అయిష్టత చూపినట్లు స్పష్టంగా కనిపించింది. నగరంలోని చికెన్ షాపులు కొనుగోలుదారులు లేక వెలవెలబోయాయి. మటన్, చేపల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. చేపల మార్కెట్ కిటకిట.. బందరలోని మోకా భాస్కరావు చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. కేజీ చికెన్ ధర రూ. 170 ఉంది. అయితే చేపలు, మటన్ ధరలకు రెక్కలొచ్చాయి. నగరంలో కిలో మటన్‌ను సాధారణంగా రూ. 800కు విక్రయిస్తుండగా ఆదివారం మాత్రం ఇది రూ.900 నుంచి రూ. వెయ్యి వరకూ విక్రయించారు. చేపలు రాగండి రకం కిలో రూ.170, బొచ్చ రకం కిలో రూ. 220కు విక్రయించారు. అధిక ధర పలికినా వీటిని కొనుగోలు చేసేందుకే ప్రజలు మొగ్గు చూపారు. ఇవి కూడా మధ్యాహ్నం 12 గంటల కల్లా అన్ని దుకాణాల్లోనూ నిండుకోవటం గమనార్హం. చికెన్ వైపు చూడని మాంసం ప్రియులు మటన్, చేపలు కొనుగోలుకు మొగ్గు -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20257పీజీఆర్ఎస్కు విరామం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు.సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 538.50 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడికాలువకు 10,000 క్యూసెక్కులు విడుదలవుతోంది.● తెరచుకోని రివర్ ఫ్రంట్ పార్కు ● వెలవెలబోతున్న అంబేడ్కర్ స్మృతి వనం ● ప్రభ కోల్పోయిన భవానీ ద్వీపం ● పలు పార్కుల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఇవ్వని వైనం ● పట్టించుకోని ప్రభుత్వం, కొరవడిన పర్యవేక్షణ ● ప్రైవేటుకు అప్పగించేందుకు ‘కూటమి’ సన్నాహాలుపచ్చదనం కనుమరుగు.. అంబేడ్కర్ స్మృతివనంలో మొక్కలు ఎండిపోయి కళావిహీనంగా మారిన దృశ్యంపలు కీలక ప్రాజెక్టులతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విజయవాడకు కొత్త అందాలను తీసుకొచ్చింది. పచ్చందాలతో నగర వాసులతో పాటు ఇతర జిల్లాల ప్రజలను విపరీతంగా ఆకర్షించేలా వాటిని నిర్వహించింది. కృష్ణానదిపై రివర్ ఫ్రాంట్ పార్కు, ఎంజీ రోడ్డులో అంబేడ్కర్ స్మృతి వనం, రాజీవ్‌గాంధీ పార్కు ఆధునికీకరణ వంటి వాటితో పాటు కీలక సెంటర్లలో పార్కులకు మరమ్మతులు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. వాటి పర్యవేక్షణను గాలికొదిలేసి, ప్రైవేటు పరం చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. – సాక్షి ప్రతినిధి, విజయవాడ న్యూస్‌రీల్ -
రివర్ ఫ్రంట్.. రివర్స్ గేర్..
కృష్ణా నది తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి అందాలతో రిటైనింగ్ వాల్ వెంబడి అత్యంత సుందరంగా నిర్మించిన కృష్ణమ్మ జలవిహార్(రివర్ ఫ్రంట్ పార్క్) మూత పడింది. కనకదుర్గ వారధి దగ్గర నుంచి పోలీస్ కాలనీ డీపీ స్టేషన్ వరకు 1.25 కి.మీ. పొడవుతో ఈ పార్కును ఆహ్లాదకరంగా అన్ని హంగులతో నిర్మించారు. దీనికోసం రూ.12.3కోట్లను గత ప్రభుత్వం వెచ్చించింది. అయితే చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా నదికి భారీగా వరద వచ్చింది. ఆ సమయంలో రిటైనింగ్ వాల్‌పైన నీరు ప్రవహించడంతో పార్కులోనికి నీరు ప్రవహించి, వాకింగ్ ట్రాక్‌తో పాటు, కొన్నిచోట్ల లాన్ దెబ్బతింది. అప్పటి నుంచి ప్రజలకు పార్కులోకి ప్రవేశం లేకుండా గేట్లు వేశారు. చిన్న, చిన్న మరమ్మతులను పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి పార్కును తీసుకొని రావడంతో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆరు నెలలుగా పార్కు ప్రజలకు అందుబాటులోకి లేకుండా పోయింది. -
24 నుంచి మహా శివరాత్రి మహోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిపై 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మహా శివరాత్రి మహోత్సవాలను నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో ఆది దంపతులకు మంగళ స్నానాలతో ప్రారంభమై, మండపారాధనలు, కల్యాణోత్సవం, రథోత్సవం, పూర్ణాహుతితో ముగుస్తాయి. మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో పవళింపు సేవ జరుగుతుంది. ఆదిదంపతులకు మంగళ స్నానాలు.. మహా శివరాత్రి ఉత్సవాలలో భాగంగా 24వ తేదీ ఉదయం 9 గంటలకు గంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు పంచామృత అభిషేకాలు, మంగళస్నానాలు, నూతన వధూవరుల అలంకరణ జరుగుతుంది. సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ, మండపారాధన, కలశ స్థాపన, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్ర హవనం, బలిహరణ వంటి వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. 25వ తేదీ మండపారాధనలు, కలశారాధన, మూల మంత్ర హవనం, బలిహరణ జరుగుతుంది. త్రికాల అభిషేకాలు, కల్యాణోత్సవం.. 26వ తేదీ సాయంత్రం మల్లేశ్వర స్వామి వార్లకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు త్రికాల అభిషేకాలు, రాత్రి 8.30 గంటలకు మహాన్యాసం, లింగోద్భవ కాలాభిషేకం, రాత్రి గంగా పార్వతీ(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వారి దివ్య లీలా కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 27వ తేదీ ఉదయం 9 గంటలకు మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద సదస్యం, సాయంత్రం నాలుగు గంటలకు కెనాల్‌రోడ్డులో రథోత్సవం జరుగుతుంది. 28వ తేదీ ఉదయం 9 గంటలకు మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద యాగశాలలో పూర్ణాహుతి, ధాన్యకోట్నోత్సవం, దుర్గాఘాట్‌లో అవభృతోత్సవం, ధ్వజావరోహణంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. మార్చి 1 నుంచి ద్వాదశ ప్రదక్షిణలు.. ఉత్సవాలలో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం స్వామి వారికి పంచహారతుల సేవ అనంతరం ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవ నిర్వహిస్తారు.ఇంద్రకీలాద్రిపై ఐదు రోజుల పాటు నిర్వహణ -
14వ రోజు కొనసాగిన రిలే దీక్షలు
గన్నవరం: స్థానిక పశువైద్య కళాశాల విద్యార్థులు ఉపకార వేతనాలు పెంపు కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 14వ రోజుకు చేరుకున్నాయి. పలువురు పశువైద్య విద్యార్థులు దీక్షలో బైఠాయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మెడికల్, డెంటల్, ఆయుష్ విద్యార్థులకు నెలకు రూ. 23వేల నుంచి రూ. 26 వేలు స్టైఫండ్ చెల్లిస్తున్న ప్రభుత్వం వెటర్నరీ విద్యార్థులకు మాత్రం రూ. 7 వేలు ఇవ్వడం అన్యాయమన్నారు. స్టైఫండ్ పెంపు కోసం గత పదమూడేళ్లుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిగిలిన వైద్య విద్యార్థులతో సమానంగా వెటర్నరీ విద్యార్థులకు కూడా ఉపకార వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. -
నిర్లక్ష్యంతో నిర్వీర్యం..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎన్నో ఏళ్ల కరకట్ట వాసుల సమస్య అయిన రిటైనింగ్ వాల్‌ను నిర్మించడమే కాకుండా నగర ప్రజలకు ఆహ్లాదకరంగా సేదదీరేందుకు కృష్ణానది ఒడ్డున కృష్ణమ్మ జలవిహార్‌ను ఏర్పాటు చేసింది. పార్కులో వాకింగ్ ట్రాక్‌తో పాటు ఓపెన్ జిమ్, చిన్నారుల ఆటపరికరాలు ఉంచింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పార్కును మూసేసి శిథిలావస్థకు తీసుకొచ్చింది. – కావాటి దామోదర్, మాజీ కార్పొరేటర్ పరిరక్షించాలి.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంబేడ్కర్ స్మృతి వనాన్ని అశ్రద్ధ చేస్తోంది. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, రాష్ట్రానికి ఒక ఐకాన్‌గా దీనిని ఏర్పాటు చేసింది. అలాంటి చోట వేరే ఎగ్జిబిషన్లకు అనుమతులిచ్చి పచ్చదానాన్ని పాడు చేస్తున్నారు. కనీస నిర్వహణ లేకపోవడం బాధాకరం. ప్రజాధనం వెచ్చించి నిర్మించిన కట్టడాలను పరిరక్షించాలి. – పంతాల సాయి, కృష్ణలంక, విజయవాడ● -
స్వరపేటిక క్యాన్సర్‌కు విజయవంతంగా శస్త్ర చికిత్స
జీజీహెచ్‌లో రెండేళ్లలో నలుగురికి పునర్జన్మ లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలో గత ప్రభుత్వం అత్యాధునిక సౌకర్యాలు, పరికరాలు సమకూర్చడంతో క్లిష్టతరమైన శస్త్ర చికిత్సలను సైతం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తాజాగా జీజీహెచ్ ఈఎన్టీ విభాగంలో స్వరపేటిక క్యాన్సర్‌కు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అంతేకాదు రెండేళ్లలో నలుగురికి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి పునర్జన్మను ప్రసాదించారు. ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ కె.రవి తెలిపిన వివరాల ప్రకారం ఆటోనడుపుకునే 52 ఏళ్ల సుదర్శన్‌కు ఊపిరి ఆడకపోవడం, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలతో చికిత్స నిమిత్తం ఈఎన్టీ విభాగానికి వచ్చారు. అతనికి పరీక్షలు చేసి స్వరపేటిక క్యాన్సర్‌గా వైద్యులు నిర్ధారించి ల్యారింజెక్టమీ చేయాలని తెలిపారు. దీంతో ఈ నెల 14న సుదర్శన్‌కి ఈఎన్టీ వైద్యుల బృందం క్లిష్టతరమైన ల్యారింజెక్టమీ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించగా, ప్రస్తుతం వేగంగా రికవరీ అవుతున్నట్లు తెలిపారు. శస్త్ర చికిత్సలో ఈఎన్టీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లీలాప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ జీబీ శ్రీనివాస్, డాక్టర్ కె.ఆదిత్య, ఎనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ వినయ్‌కుమార్, డాక్టర్ కిరణ్, డాక్టర్ సుష్మ, డాక్టర్ చరణ్ పాల్గొన్నారు. విజయవంతంగా శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లను వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్‌కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు అభినందనలు తెలిపారు. -
సూర్య భగవానుడికి 241 పాత్రలతో పాయసం నివేదన
మంగళగిరి టౌన్: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ వేదిక ప్రాంగణంలో మాఘ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం సూర్య భగవానుడికి వాసవీ క్లబ్, వాసవీ పరివార్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహిళా సభ విభాగాల ఆధ్వర్యంలో 241 పాత్రలతో పాయసంతో సూర్య భగవానుడికి నివేదన సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఆవు పాలు, పిడకలతో ఏక కాలంలో శ్రీ సూర్యనారాయణస్వామికి పాయసం వండి నివేదించడం ఎంతో శుభప్రదమని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఎంతోమంది మహిళలు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆదివారమని, ఆ రోజున తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. -
ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ అధ్యక్షురాలు అపర్ణ
నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయండి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నాలుగు లేబర్ కోడ్లను అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం మళ్లీ ప్రయత్నిస్తోందని వీటిని రద్దు చేయాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (ఐఎఫ్టీయూ) జాతీయ కమిటీ అధ్యక్షురాలు అపర్ణ అన్నారు. నాలుగు లేబర్ కోడ్లను కార్పొరేట్ కంపెనీల కోసం మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. స్థానిక సున్నంబట్టీల సెంటర్లో ఉన్న పూలే–అంబేడ్కర్ భవన్లో ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ సభ్యుల సమావేశం ఆదివారం జరిగింది. అపర్ణ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో కార్మిక వర్గానికి తగిన రీతిలో నిధులు కేటాయించలేదన్నారు. ఉద్యోగుల నూతన పెన్షన్ స్కీమ్ రద్దుచేసి ఓల్డ్ పెన్షన్‌ను అమలుచేయాలన్నారు. విశాఖ ఉక్కుతో సహా ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వారానికి 90 గంటలు రోజుకు 15 గంటలు పనిచేయాలని ఎల్అండ్టీ కంపెనీ చైర్మన్ చేసిన వాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను నిలుపుచేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 15 నుంచి మే 1 తేదీ వరకు మేడే అమరవీరుల స్ఫూర్తితో పోరాటాలను నిర్వహించాలని సమాఖ్య నిర్ణయించిందన్నారు. సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు ప్రసాద్, వెంకటేశ్వరావు, వివిధ రాష్ట్రాల సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. -
కోడిపందేల శిబిరంపై పోలీసుల దాడులు
కోడూరు: కోడిపందేల శిబిరంపై కోడూరు పోలీసులు ఆదివారం సాయంత్రం మెరుపు దాడులు చేశారు. విశ్వనాథపల్లి శివారు కుమ్మరిపాలెం గ్రామంలో కోడిపందేల బరి జరుగుతుందనే సమాచారంతో దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ చాణిక్య తెలిపారు. దాడుల్లో పది మంది పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. శిబిరం వద్ద ఉన్న 17 ద్విచక్రవాహనాలు, నాలుగు కోడిపుంజులతో పాటు రూ.13,980 నగదును సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మండలంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. 10 మంది పందెంరాయుళ్ల అరెస్టు -
భక్తజన కోలాహలం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై భక్తజన కోలాహలం అధికంగా ఉంది. మాఘ మాసం, వివాహాల సుముహూర్తాల నేపథ్యంలో దుర్గగుడిలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. నవ దంపతులు పెళ్లి దుస్తులపై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వివాహాలకు హాజరైన వారు తిరుగు ప్రయాణంలో అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంలో ఆదివారం పండుగ వాతావరణం కనిపించింది. ఉదయం 6 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల తాకిడి ప్రారంభమవ్వగా మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. మరోవైపు చిన్నారులకు అన్నప్రాసనలు జరిపించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. భక్తజనంతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. సర్వ దర్శనానికి రెండు గంటలు, రూ. 100, రూ. 300 క్యూలైన్లో గంట, రూ. 500 క్యూలైన్లో గంటన్నర సమయం వేచి ఉండాల్సి వచ్చింది. సామాన్య భక్తులకు తోడు వీఐపీలు, సినీ ప్రముఖులు అమ్మ వారిని దర్శించుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. వేద ఆశీర్వచనం అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు ఎల్డీ ప్రసాద్ అమ్మవారి ప్రసాదాలను అందించారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లును పర్యవేక్షించారు. క్యూలైన్లు త్వరగా ముందుకు కదలడానికి ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దుర్గమ్మ సన్నిధిలో విశేషంగా ఆర్జిత సేవలు ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం పలు ఆర్జిత సేవలు నిర్వహించారు. ఆదిదంపతులకు నిర్వహించిన ఆర్జిత సేవలతో పాటు మల్లేశ్వర స్వామి ఆలయం సమీపంలోని యాగశాలలో సంకటహర చతుర్ధి రాజగోపురం వద్ద సూర్యోపాసన సేవ నిర్వహించారు. సంకటహర చతుర్ధి పురస్కరించుకుని యాగశాలలో గణపతికి పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ, గణపతి హోమాలను అర్చకులు జరిపించారు. స్వామివారికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఉభయదాతలు తరలివచ్చి తమ గోత్రనామాలతో పూజలు జరిపించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్యోపాసన సేవ చేశారు. లోక సంరక్షణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ మాఘమాసంలో విశేష పర్వదినాల్లో సూర్యోపాసన సేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఉభయదాతలకు ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో ఖడ్గమాలార్చన నిర్వహించగా 17 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. చండీహోమంలో 98 మంది, లక్ష కుంకుమార్చనలో 31 మంది, శ్రీచక్ర నవార్చనలో 9 మంది, పంచహారతుల సేవలో 21 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ కిటకిటలాడిన క్యూలైన్లు అమ్మ ఆశీస్సుల కోసం నవ దంపతులు -
పోటెత్తిన భక్తజనం
ఉయ్యూరు: ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తజనం అమ్మవారి దర్శనానికి తరలిరావటంతో వేకువజాము నుంచే ఉయ్యూరు పట్టణం భక్తజనసంద్రంగా మారింది. డప్పు వాయిద్యాలతో పాలపొంగళ్లు, పొట్టేళ్లు, కోళ్లతో భక్తులు ఊరేగింపుగా తిరునాళ్లకు తరలివచ్చి చల్లని తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అమ్మవారిని దర్శించుకుని పొట్టేళ్లను కానుకగా సమర్పించారు. విజయవాడ–మచిలీపట్నం ప్రధాన రహదారి, కాటూరురోడ్డు, ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు గంటలతరబడి బారులుతీరారు. అమ్మా వీరమ్మతల్లీ.. చల్లంగ చూడమ్మా.. కాపాడమ్మా.. అంటూ భక్తులు వేడుకున్నారు.వైభవంగా వీరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం -
సొమ్ము కాజేసిన ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులపై కేసు
పెనమలూరు: ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు సంస్థ సొమ్ము కాజేయడంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం క్రిష్ ఫైనాన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఈ కంపెనీ బ్రాంచి పోరంకిలో ఉంది. దీనిలో పని చేస్తున్న యూనిట్ మేనేజర్ వంగా పృధ్వీబాబు, కలెక్షన్ ఆఫీసర్ కడియం రంజిత్.. రుణాలు తీసుకున్న కస్టమర్ల వద్ద నుంచి వసూళ్లు చేసిన సొమ్ము తిరిగి సంస్థకు చెల్లించకుండా సొంత ఖర్చులకు వాడుకున్నారు. పృధ్వీబాబు రూ.1,20,490, రంజిత్ రూ.1,80,610 మొత్తం రూ.3,01,100 సంస్థ సొమ్ము వాడుకున్నారు. ఉద్యోగులు సొమ్ము వాడుకున్న ఘటనపై సంస్థ క్లస్టర్ మేనేజర్ టి.రాంబాబు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటోడ్రైవర్ మృతదేహం లభ్యం ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ కాల్వలో దూకి గల్లంతైన ఆటోడ్రైవర్ మృతదేహం కృష్ణానది పవిత్రసంగమం ప్రాంతంలో ఆదివారం పోలీసులకు లభ్యమైంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం కొత్తపాలెంకు చెందిన ఆటోడ్రైవర్ కొంపల్లి రమేష్ (33) కుటుంబ కలహాల నేపథ్యంలో శనివారం సాయంత్రం రోడ్డు పక్కన ఆటో నిలిపి ఎన్టీటీపీఎస్ కాల్వలో దూకి గల్లంతయ్యాడు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాత్రి వేళ గాలించినా ఆచూకీ లభించలేదు. పవిత్రసంగమం వద్ద మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంధువుల సమక్షంలో పంచనామా చేసి పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో కండక్టర్ దుర్మరణం తోట్లవల్లూరు: ఎడ్లబండిని ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి ఆర్టీసీ కండక్టర్ దుర్మరణం చెందిన ఘటన తోట్లవల్లూరు, ఉయ్యూరు రహదారిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తోట్లవల్లూరు ఎస్సీ వాడకు చెందిన చీకుర్తి సురేష్(42) ఉయ్యూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్. విధులు ముగించుకుని ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై ఉయ్యూరు నుంచి తోట్లవల్లూరు వస్తున్నాడు. కనకవల్లి డ్రెయిన్ సమీపంలోకి రాగానే ముందు వెళుతున్న ఎడ్లబండిని సురేష్ ప్రమాదవశాత్తు వెనుక నుంచి ఢీకొట్టాడు. అతను ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతునికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. పమిడిముక్కల సీఐ చిట్టిబాబు, తోట్లవల్లూరు ఎస్ఐ అవినాశ్ ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి వివరాలను నమోదు చేసుకున్నారు. సురేష్ మృతదేహం చూసి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
కూరగాయలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం
ఉయ్యూరు: రైతులు పండించే కూరగాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ విజయ సునీత అన్నారు. మండలంలోని చిన ఓగిరాల గ్రామంలో క్యాబేజీ, వంగ తోటలను ఆదివారం ఆమె సందర్శించారు. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో క్యాబేజీ, వంగ, ఇతర కూరగాయల ధరలు తగ్గటంతో క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. విజయ సునీత మాట్లాడుతూ స్థానికంగా రైతులు పండించే కూరగాయలు నేరుగా రైతుబజారులో అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. రైతులు సంఘంగా, గ్రూపుగా, వ్యక్తిగతంగా రైతుబజారు ఎస్టేట్ అధికారిని కలిసి ఉత్పత్తులను అమ్ముకుని గిట్టుబాటు ధర పొందొచ్చన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే క్యాబేజీ, వంగ వంటి కూరగాయలు తాత్కాలికంగా నిలిపివేయాలని రైతులు కోరారు. రైతుల సూచనలను పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని సునీత తెలిపారు. -
స్మృతి వనంపై కక్ష..
రాష్ట్రానికే ఐకాన్‌గా నిలబడిన అంబేడ్కర్ స్మృతి వనం నేడు వెలవెలబోతోంది. గడ్డి, మొక్కలు ఎండిపోయి కళావిహీనంగా మారింది. గత ప్రభుత్వం ఈ ప్రాంగణాన్ని అందమైన మొక్కలతో ఆహ్లాదం పంచేలా గ్రీనరీతో తీర్చిదిద్దింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో పచ్చదనం పూర్తిగా కనుమరుగైంది. కూటమి ప్రభుత్వం పర్యవేక్షణను పూర్తిగా గాలికి వదిలేసింది. నిర్వహణ భారం అంటూ ప్రభుత్వం క్రమేణా, దీని బాధ్యతను ప్రైవేటుకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తోంది. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించి, 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. అటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రభ మసకబారేలా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. -
పేదలపై కూటమి కుట్ర!
● జగనన్న కాలనీల్లో ప్రభుత్వ సర్వే ● స్థలాల స్వాధీనానికి పన్నాగం ● లబ్ధిదారుల్లో ఆందోళన ● కాలనీల్లో అభివృద్ధిని పట్టించుకోని కూటమి పాలకులు పెనమలూరు: పేదల ఇళ్లపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విషం కక్కుతోంది. సర్వే పేరుతో ఇళ్ల స్థలాల స్వాధీనానికి పన్నాగం పన్నింది. ప్రభుత్వ ఆదేశాలతో కొద్ది రోజులుగా రెవెన్యూ అధికారులు జగనన్న కాలనీలపై సర్వే చేస్తున్నారు. మండల పరిధిలో జగనన్న కాలనీల్లో లబ్ధిదారుల్లో ఎంత మందికి స్థలాలు, గృహాలు కేటాయించింది.. అందులో ఎంత మంది ఇళ్లు కట్టుకున్నారనే అంశంపై సర్వే చేస్తోంది. గృహాలు నిర్మించుకోని లబ్ధిదారుల ఇళ్ల స్థలాలు రద్దు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వివరాలోకి వెళితే వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత పేదలందరికీ ఇళ్లు పథకం అమలుచేశారు. ఇందులో భాగంగా మండల పరిధిలో ఇళ్లు లేని నిరుపేద లబ్ధిదారులను ఎంపిక చేశారు. పెనమలూరులో 9.74 ఎకరాల ప్రభుత్వ భూమి, వణుకూరులో 228.73 ఎకరాల ప్రైవేటు భూమి సేకరణ చేసి మొత్తం 11,569 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు ఇచ్చారు. గతంలో మండలంలో ఇలా ఇళ్ల స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం లేదు. ఇది జగనన్నకే దక్కింది. మొదటి ఫేజ్‌లో గృహాలు మంజూరు జగనన్న పాలనలో రెండు ఫేజ్‌ల్లో లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోవడానికి నిర్ణయించారు. మొదటి ఫేజ్‌లో ఇళ్లు కట్టుకోవడానికి నిధులు మంజూరు చేశారు. మొత్తం 7,400 మందికి గృహాలు మంజూరు చేయగా అందులో 3,407 మంది ఇళ్లు నిర్మించుకుని గృహ ప్రవేశాలు సైతం చేశారు. పెనమలూరు గ్రామంలో గృహాల నిర్మాణం వేగంగా జరిగింది. వణుకూరు లేఅవుటు 1,2,3,4లో లబ్ధిదారులు గృహాలు నిర్మించారు. అయితే లేఅవుటు 5, 6లో నాడు అభివృద్ధి పనులు మొదలుపెట్టినా సార్వత్రిక ఎన్నికల కోడ్‌తో పనులు నిలిచాయి. కోడ్ కారణంగా పూర్తిస్థాయిలో ఇళ్ల స్థలాల మెరక పనులు పూర్తి కాలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి పేదలపై చిన్నచూపు చూసి కాలనీలను పట్టించుకోలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. నిధులు కేటాయించని కూటమి ఎన్నికల ముందు వరకు జగనన్న కాలనీల్లో అభి వృద్ధి పనులు జరిగాయి. తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూటమి ఈ కాలనీల అభివృద్ధిని మరిచింది. గతం ప్రభుత్వం మట్టి రోడ్లు, విద్యుత్ సౌకర్యం తదితర వసతులు అమర్చింది. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం జగనన్న కాలనీలకు నిధులు కేటాయించలేదు. అలాగే కొత్తగా గృహాలు మంజూరు చేయకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు జరగలేదు. జగనన్న కాలనీల్లో గృహాలు నిర్మించని లబ్ధిదారులకు ఇబ్బందిగా మారింది. పట్టించుకునేదెవరు.. జగనన్న కేటాయించిన ఇళ్ల స్థలాల్లో గృహాలు నిర్మించుకుంటామని, తమకు గృహాలు మంజూరు చేయలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. అసలు తమను ఎవ్వరు పట్టించుకోవడం లేదని, కాలనీల్లో వసతుల ఏర్పాటులో వేగం లేదని కూటమి ప్రభుత్వం విఫలమైందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం జగనన్న కాలనీల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించి ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. లబ్ధిదారుల్లో ఆందోళన జగనన్న పాలనలో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు నేడు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఇళ్లు నిర్మించని లబ్ధిదారుల పట్టాలు రద్దు చేస్తామని ప్రకటించడం.. ఆందోళనకు కారణమైంది. పైగా అధికారులు జగనన్న కాలనీలపై సర్వే చేయడంతో తమ భవిష్యత్తు ఏమిటని లబ్ధిదారులు బెంబేలెత్తుతున్నారు. లేఅవుట్లను అభివృద్ధి చేసి గృహాలు మంజూరు చేసి కూటమి ప్రభుత్వం గృహాలు నిర్మించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఏది ఏమైనా మార్చి నాటికి ప్రభుత్వం ఏమి చేస్తుందో తేలనుంది. ఈ దిగువ పట్టిక అఽధికారులు సిద్ధం చేసిన విచారణ నివేదిక. అధికారుల తనిఖీ గ్రామం లబ్ధిదారులు నిర్మించిన కట్టని గృహాలు గృహాలు యనమలకుదురు 2828 715 2113 కానూరు 3259 589 2670 తాడిగడప 912 256 656 పోరంకి 1458 357 1101 పెనమలూరు 1010 515 495 గంగూరు 663 228 435 గోసాల 397 187 210 వణుకూరు 568 480 88 చోడవరం 193 45 148 పెదపులిపాక 281 35 246 11,569 3,407 8,162 జగనన్న కాలనీల్లో గృహాల నిర్మాణంపై అధికారులు వివరాలను నమోదు చేశారు. జగనన్న కాలనీలో ఎవరు ఇళ్లు నిర్మించారు... ఎవరు నిర్మాణం చేయలేదో నివేదిక సిద్ధం చేశారు. అర్హులకు స్థలాలు కేటాయించారా లేదా అని కూడా విచారణ చేస్తున్నారు. లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను కొందరు దళారులు చట్ట విరుద్ధంగా కొనుగోలు చేశారని, దీనిపై కూడా అధికారులు విచారణ చేశారు. అలా స్థలాలు అమ్మినవారి పట్టాలు రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇళ్ల నిర్మాణం చేయని లబ్ధిదారుల విషయంలో ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే ఇళ్ల స్థలాల స్వాధీనానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ‘కూటమి’ నేతలకు కట్టబెట్టడానికి పన్నాగం పన్నుతోందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. -
గురువులకు ‘క్లస్టర్’ తిప్పలు
● కూటమి వింత నిర్ణయంపై ఉపాధ్యాయుల విమర్శలు! ● తూతూమంత్రంగా జిల్లాలో 69 క్లస్టర్ సమావేశాలు ● విద్యార్థులకు సెలవిచ్చి సమావేశం ● పలుమార్లు సాంకేతిక ఇబ్బందులు వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉపాధ్యాయులకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించడానికి శనివారం ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించిన క్లస్టర్ సమావేశాలు గందరగోళంగా మారాయి. విద్యార్థులు తరగతులకు సెలవిచ్చి మరీ క్లస్టర్ సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయులు ఉరుకులు పరుగులతో క్లస్టర్ సమావేశాలకు పరుగుతీయాల్సి వచ్చింది. అక్కడకు వెళ్లాక అడుగడుగునా సాంకేతిక సమస్యలతో సమావేశ లక్ష్యం నీరు గారింది. విద్యాశాఖ సమున్నత లక్ష్యంతో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ‘స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు’ విధానాన్ని సంస్కరణ పేరుతో కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో 69 క్లస్టర్లలో జరిగిన సమావేశాలు లక్ష్యానికి భిన్నంగా సాగాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో రెండు రోజులు జరిగిన సమావేశాలు గతంలో రెండు రోజులపాటు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు జరిగేవి. తొలిరోజు 50 శాతం మంది, తర్వాత రోజు 50 శాతం మందితో నిర్వహించేవారు. దీంతో ఇబ్బందులు ఉండేవికావు. విద్యార్థులకు తరగతులు యథావిధిగా సాగేవి. కూటమి ప్రభుత్వం స్కూల్ కాంప్లెక్స్ స్థానంలో క్లస్టర్ విధానం తీసుకొచ్చింది. ప్రతి నెలా మూడో శనివారం క్లస్టర్ సమావేశాలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించాలని ఆదేశించింది. ఆ రోజు ఉదయం పూటకు తరగతులను పరిమితం చేసి మధ్యాహ్నం నుంచి విద్యార్థులకు సెలవు ప్రకటించింది. ఉపాధ్యాయుల అవస్థలు ఎన్టీఆర్ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 69 క్లస్టర్లలో సమావేశాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయులు పాఠశాల నుంచి క్లస్టర్ సమావేశం జరిగే ప్రాంగణానికి వెళ్లడానికి సకాలంలో బస్సు సదుపాయం లేక నానా తంటాలు పడ్డారు. 12 గంటలకు పాఠశాల ముగిస్తే భోజనం చేసి ఒంటి గంటకు సమావేశానికి హాజరు కావాలని ఆదేశాలుండటంతో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పదవీవిరమణకు దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులు, మహిళలు అనేక అవస్థలు పడినట్లు వ్యాఖ్యానించారు. సాయంత్రం వరకూ హాజరు నమోదు యాప్ పనిచేయకపోవడంతో మరింత అసహనానికి గురయ్యారు. పలుమార్లు సాంకేతిక సమస్యలు జిల్లాలో దాదాపుగా అన్ని క్లస్టర్ స్కూల్ సమావేశాలకు సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. స్క్రీన్ ప్రదర్శనతో ఐఎఫ్‌టీ ద్వారా నిర్వహించిన బోధన నైపుణ్య తరగతులకు కొన్నిచోట్ల ఇంటర్నెట్ లింక్ అంతరాయం ప్రతి అరగంటకు ఒకసారి తలెత్తింది. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర అసహనానికి గురయ్యారు. మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు గతంలో ఉన్న చక్కని పరిస్థితులను తోసిపుచ్చి క్లస్టర్ సమావేశాల పేరుతో నూతన విధానాన్ని తీసుకురావడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఉపాధ్యాయులకు సమయం చాలకపోవడం, హాజరు నమోదుకు అవకాశం ఇవ్వక పోవడం తదితర అంశాలపై జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. -
ఘనంగా అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం
భవానీపురం(విజయవాడపశ్చిమ): అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ (ప్రివెంటీస్) ఆధ్వర్యాన శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వేడుకలు జరిగాయి. కస్టమ్స్ ఆర్థిక భద్రత, గ్లోబల్ వాణిజ్య సులభతపై అవలంబించాల్సిన ముఖ్య పాత్రను సూచించింది. ఈ ఏడాది థీమ్ అయిన ‘కస్టమ్స్ – సమర్థత– భద్రత – శ్రేయస్సు’ ను అమలు చేయాలని పేర్కొన్నారు. కస్టమ్స్ కమిషనర్ సాదు నరసింహారెడ్డి నేతృత్వం వహించగా ముఖ్యఅతిథిగా చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్ వరిందర్ మెహత, అతిథిగా డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఎ పాటిల్ హాజరయ్యారు. సాదు నరసింహారెడ్డి మాట్లాడుతూ 2024–25లో (జనవరి 2025 వరకు) విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ (ప్రివెంటీస్) ద్వారా రూ.11,480 కోట్లు ఆదాయం లభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 36 మంది ఉద్యోగులు అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేసినందుకు సత్కరించారు. కస్టమ్స్ అదనపు కమిషనర్ ప్రశాంత్ కుమార్ ప్రసంగించగా అసిస్టెంట్ కమిషనర్ అబ్దుల్ అజీమ్ అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. -
ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశమైలవరం: ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ తెలిపారు. మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలంలో శనివారం కలెక్టర్ లక్ష్మీశ పర్యటించారు. ప్రతి నెలా మూడో శనివారం ఒక్కో ఇతివృత్తంతో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛాంధ్ర, హరితాంధ్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్న విధానంతో పాటు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. నేను, నా పరిసరాలు పరిశుభ్రతకు రోజూ కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు బాధ్యతగా స్వచ్ఛత కార్యక్రమాలకు శ్రమదానం చేస్తానని, ఏపీని స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దిడంలో కృషి చేస్తానంటూ కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీపీఓ లావణ్యకుమారి, తిరువూరు ఆర్డీఓ కె.మాధురి, ప్రత్యేక అధికారి పి.బాలాజీకుమార్, తహసీల్దార్ సుశీలాదేవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మైలవరం రైతుబజార్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. -
జాతీయ సదస్సులో సిద్ధార్థ వైద్యులకు పతకాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): జైపూర్‌లో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకూ జరిగిన జాతీయ చర్మవ్యాధుల వైద్యుల సదస్సులో పాల్గొన్న విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల వైద్యులు, పీజీ విద్యార్థులు పలు అంశాల్లో సత్తా చాటారు. వివిధ రాష్ట్రాల నుంచి చర్మవ్యాధుల వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల చర్మవ్యాధుల విభాగాధిపతి డాక్టర్ టి.వాణి ఆధ్వర్యాన పీజీ విద్యార్థి డాక్టర్ ధర్మాకర్ సమర్పించిన పరిశోధన పత్రానికి బంగారు పతకం లభించింది. ఐడీఓజే జర్నల్‌కు సంబంధించి అత్యుత్తమ సమీక్షకురాలిగా డాక్టర్ టి.వాణి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరిని శనివారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్‌కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు అభినందించారు. ఆకాశవాణి విశ్రాంత వ్యాఖ్యాత ఏబీ ఆనంద్ మృతి విజయవాడ కల్చరల్: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సీనియర్ అనౌర్స్గా చేసిన ఏబీ ఆనంద్ (ఆరుమళ్ల బ్రహ్మానందరెడ్డి) (87) అనారోగ్య కారణాలతో శనివారం విజయవాడ మాచవరంలోని స్వగృహంలో కన్నుమూశారు. 30 ఏళ్లకు పైగా ఆకాశవాణిలో పని చేసిన ఆయన తన రేడియో అనుభవాలను తెలియజేస్తూ స్వ...ర్..లోకం పేరిట నాలుగు పుస్తకాలను రచించారు. ఆయన రేడియో నాటికలు, ప్రకటనలు, డాక్యుమెంటరీలు, సాహితీమూర్తుల పరిచయాలు విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం తదితర కేంద్రాల నుంచి ప్రసారమయ్యాయి. 1970 నుంచి 1990 మధ్య కాలంలో ఉషశ్రీ ధర్మ సందేహాల నిర్వహణ అత్యంత ప్రజాదరణ పొందింది. ఆయన పదవీ కాలంలో గొల్లపూడి మారుతీరావు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సినీ నటుడు సీఎస్ఆర్ ఆంజనేయులు, విన్నకోట రామన్నపంతులు, నండూరి సుబ్బారావు, సి.రామ్మోనరావు, విన్నకోట విజయరాం, సుత్తి వీరభద్రరావు వంటి తెలుగు ప్రముఖల కార్యక్రమాలలో పాల్గొని వాటిని విజయవంతం చేశారు. ఆనంద్ మృతికి విజయవాడ ఆకాశవాణి కేంద్రం సహచరులు, ఉద్యోగులు, సాహితీ సంస్థల నిర్వాహకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చీపురుపట్టిన వైద్యాధికారి మచిలీపట్నంటౌన్: కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చిత్తజల్లు శర్మిష్ట శనివారం చీపురు పట్టారు. స్వర్ణ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆమె చీపురును చేపట్టి సిబ్బందితో కలసి కార్యాలయ ఆవరణను శుభ్రం చేశారు. ఆవరణలోని వ్యర్థాలను ఊడ్చి, పిచ్చి మొక్కలు తొలగించారు. కార్యక్రమంలో 104 నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయభారతి, డాక్టర్ నిరీక్షణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళంవేదాద్రి(జగ్గయ్యపేట): యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకానికి విజయవాడకు చెందిన ఆచంట విష్ణువర్థన్ దంపతులు శనివారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. నగదును ఈవో కానూరి సురేష్‌బాబుకు అందజేశారు. గోసంరక్షణ నిమిత్తం వారు మరో రూ.40వేలు విరాళమిచ్చినట్లు వివరించారు. మరో ముగ్గురు దంపతులు నిత్యాన్నదానానికి రూ.5,116 చొప్పున అందజేశారని ఈఓ తెలిపారు. -
ఆక్రమణలే అజెండా..
స.హ.చట్టం జవాబులో స్పష్టంగా.. నూజివీడు మండలం మీర్జాపురం గ్రామ సర్వే నంబర్ 301లోని 25 సెంట్ల స్థలం తల్లిబోయిన భూలక్ష్మికి చెందిన ప్రైవేటు భూమి అని 22.02.2014లో నూజివీడు తహసీల్దార్ సర్టిఫికెట్ మంజూరు చేశారు. అదే భూమికి సంబంధించి సమాచార హక్కు చట్టం దరఖాస్తుదారునికి ఇచ్చిన ఆర్సీఆర్టీఐ 29/2022 ద్వారా ఇచ్చిన జవాబులో భూమి ప్రభుత్వానికి చెంది నదని స్పష్టంగా పేర్కొనడం పరిశీలనాంశం. 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పట్లో జిల్లా మంత్రిగా కొలుసు పార్థసారథి కొనసాగడం గమనార్హం. నూజివీడు మండలం మీర్జాపురంలో ఆక్రమణలకు గురైన భూమిసాక్షి ప్రత్యేక ప్రతినిధి: కూటమి ముఖ్యనేతల అండదండలతో విలువైన నివేశన స్థలాలు, గ్రామ కంఠాలు, ప్రభుత్వ పోరంబోకు భూముల్లో పచ్చముఠాల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో, నేటి కూటమి పాలనలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ వర్గాల సహకారంతో రికార్డులను తారుమారు చేయడం రివాజైన భూఆక్రమణదారు.. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురంలో అమాత్యుడి అండదండలతో రూ.కోట్లు విలువ చేసే భూమికి టెండర్ పెట్టాడు. వ్యూహాత్మకంగా పావులు పూర్వ ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో నూజివీడు–హనుమాన్ జంక్షన్ ప్రధాన రహదారిలోని మీర్జాపురం గ్రామ సర్వే నంబర్ 284/2లో 25 సెంట్ల పట్టాభూమిని 2005లో తల్లిబోయిన వెంకట్రామయ్య నుంచి గోళ్ల లోకేశ్వరరావు కొనుగోలు చేశారు. 2015లో టీడీపీ అధికారంలో ఉండగా 284/2లోని హద్దులనే చూపి సవరణ దస్తావేజు (2361/2015) పేరిట సర్వే నంబరు 301లో 25 సెంట్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ స్థలంలో నిర్మాణాలను చేపట్టారు. వాస్తవంగా పైరెండు సర్వే నంబర్ల మధ్య వందల మీటర్ల దూరం ఉంది. ఆ తర్వాత కొన్ని నెలలకు రిజిస్ట్రేషన్ నంబర్ తప్పుగా నమోదైందంటూ మరో సవరణ దస్తావేజు (2380/2015) ద్వారా తన కుమారుడు గోళ్ల లక్ష్మీ పెరుమాళ్ల పేరిట సర్వే నంబర్ 301లోని 1,210 చదరపు గజాలను గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రభుత్వ భూమి, అదీ ఒకే సర్వే నంబర్లో విస్తీర్ణాన్ని సెంట్లు, చదరపు గజాలుగా రిజిస్ట్రేషన్ చేయడం పరిశీలనాంశం. సర్వే నంబర్ 301/1, 301/2లోనూ ప్రభుత్వ భూమి ఉంది. ఈ వ్యవహారాలన్నింటికీ ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ విభాగాల ఉన్నతాధికారుల సహకారం మెండుగా ఉండటం గమనార్హం. వైఎస్సార్ సీపీ హయాంలో.. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక మీర్జాపురం ప్రధాన రహదారి వెంబడి జరిగిన భూఆక్రమణలపై కృష్ణా కలెక్టర్, నూజివీడు ఆర్డీఓ తదితర అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ప్రభుత్వ ఆక్రమిత భూమిలో విద్యుత్ వసతి కల్పించి, కనెక్షన్లు ఎలా ఇస్తారని స్థానికులు ప్రశ్నించడంతో అధికారుల్లో చలనం వచ్చింది. భూమి ప్రభుత్వానిదా? ప్రైవేటుదా? వాస్తవ స్థితిగతులను తెలియజేయాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరడంతో నూజివీడు తహసీల్దార్ కార్యాలయం స్పందించక తప్పలేదు. చివరకు సర్వే నంబర్ 301లోని భూమి ప్రభుత్వానిదని నిర్ధారించింది. తొలుత గట్టుగా ఉన్న భూమిని తర్వాత గ్రామ కంఠంగా మార్పు జరిగిందని స్పష్టంగా పేర్కొంది. నూజివీడు మండల రెవెన్యూ శాఖ భూమి రికార్డుల వివరాల ప్రకారం 301/1, 301/2లో.. పట్టాదారు పేరు, అనుభవదారు పేరు వద్ద ఫెయిర్ అడంగల్ దాఖలా అని ఉందే తప్ప ఫలానా వారి భూమి అని పేర్కొనకపోవడం గమనార్హం. కూటమి సర్కార్‌లో విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరణ మీర్జాపురంవాసుల ఫిర్యాదులతో ప్రభుత్వ ఆక్రమిత స్థలంలోని విద్యుత్ కనెక్షన్‌ను 2022 డిసెంబర్లో అధికారులు తొలగించారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన నెల వ్యవధిలోనే విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరణ జరిగింది. మంత్రి కొలుసు పార్థసారథికి ప్రధాన అనుచరుడైన గోళ్ల లోకేశ్వరరావు ఆక్రమిత భూమిలో తాజాగా నిర్మాణాలను చేపట్టి వేగవంతం చేశారు. ప్రధాన రహదారి వెంట ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను ఎలా కొనసాగనిస్తారని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారు ప్రస్తుతం కరవయ్యారు. దశలవారీ 50 సెంట్లు కబ్జా మరో ఏడున్నర ఎకరాలపైనా కన్ను రూ.25 కోట్ల విలువైన భూమికి ఎసరు ప్రభుత్వ స్థలాల దోపిడీకి ‘రెవెన్యూ’ సహకారం మీర్జాపురంలో అక్రమార్కుడిదే హవారూ.25 కోట్ల విలువైన భూమిపై కన్ను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అండ దండలు మెండుగా ఉండటంతో సర్వే నంబర్ 301, 301/1, 301/2లోని భూమిలో లేఅవుట్ వేయడానికి గోళ్ల లోకేశ్వరరావు సన్నద్ధమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏడు ఎకరాలకు పైగా ఉన్న భూమి ప్రస్తుత మార్కెట్ విలువ అంచనాల ప్రకారం రూ.25 కోట్ల వరకు ఉంటుందంటున్నారు. అంతకుముందు దశలవారీగా ఆక్రమించిన 50 సెంట్లు దీనికి అనుసంధానంగా ఉంది. గోళ్లపై ఆరోపణలు.. ఫిర్యాదులు టీడీపీకి చెందిన గోళ్ల లోకేశ్వరరావుపై ఏళ్ల తరబడి భూఆక్రమణలు, మోసాలకు పాల్పడుతున్నారని మీర్జాపురం గ్రామస్తులతో పాటు ఇతర ప్రాంతాల వారి నుంచి పలు ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. ప్రస్తుత మంత్రి పార్థసారథికి ప్రధాన అనుచరుడైన ఆయన కిరాయి రౌడీలను అడ్డుపెట్టుకుని చేసే దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేదనే రాతపూర్వక ఫిర్యాదులు ఆయా సమయాల్లోని ఉన్నతాధికారులకు అందాయి. పీఏసీఎస్ అధ్యక్షుడిగా పాతిక లక్షలను స్వాహా చేసి నాడు మంత్రిగా ఉన్న పార్థసారథి ద్వారా బయటపడ్డారనే దుమారం రేగింది. రియల్ ఎస్టేట్ మోసాలకు కొదవలేదంటారు. ఓ ఐపీఎస్ అధికారి సమీప బంధువుకు టోకరా వేయడానికి ప్రయత్నించి నాలుక్కరుచుకున్నారనేది వినికిడి. మంత్రి అడుగుజాడల్లో ఉంటూ ఆయన అండదండలతో ఇష్టానుసారం రెచ్చిపోతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. -
ప్రమాదంలో పౌల్ట్రీ పరిశ్రమ
అపోహలతో తీవ్ర నష్టం బర్డ్ ప్లూ వచ్చేసిందని అపోహ ప్రజల్లోకి వెళ్లడంతో చికెన్ కొనేందుకు ముందుకు రావడంలేదు. నా కోళ్ల ఫారంలో 20 వేల కోళ్లు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాయి. అమ్మకాలు తగ్గిపోవడంతో ఫారం వద్ద కేజీ రూ.80కి అడుగుతున్నారు. ఇదే తీరు కొనసాగితే తీవ్రంగా నష్టపోతాం. – వంగా నాగరాజారెడ్డి, కోళ్ల ఫారం యజమాని, కోడూరు, జి.కొండూరు మండలం రూ.35 లక్షలు నష్టపోయాను నా కోళ్ల ఫారంలో అంతు చిక్కని వైరస్‌తో 15వేల కోళ్లు మృతి చెందాయి. వారం రోజుల్లో అమ్మకానికి వస్తాయనుకున్నాం. ఈ ఘటనతో రూ.35 లక్షలు నష్ట పోయాను. ఈ సమస్యను ఎలా అధిగమించాలో అర్థం కావడంలేదు. – అత్తునూరి పద్మారెడ్డి, కోళ్ల ఫారం యజమాని, అనుముల్లంక, గంపలగూడెం మండలంజి.కొండూరు: పౌల్ట్రీ పరిశ్రమను వైరస్ కోలుకోలేని దెబ్బతీసింది. బర్డ్ ఫ్లూ కలకలంతో ప్రమాదంలో పడింది. ఎన్టీఆర్ జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో చికెన్ విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. బర్డ్ ప్లూ కలకలం, మరో వైపు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న అపోహలతో ఈ పరిశ్రమ భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. మృత్యువాత పడిన కోళ్ల శాంపిల్స్ ఫలితాలు రాకపోవడంతో విక్రయాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. దీంతో కోళ్ల ఫారాల యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. వీరికి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తేనే పరిశ్రమ నిలబడుతుందని, లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోయి మూతపడుతుందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో జిల్లాలో మొత్తం 116 కోళ్ల ఫారాలు ఉండగా వీటిలో 25 లేయర్ ఫారాలు, బ్రాయిలర్ ఫారాలు 83, నాటుకోళ్ల ఫారాలు 8 ఉన్నాయి. వీటిలో లేయర్ ఫారాల్లో 14,20,000 కోళ్లు ఉండగా బ్రాయిలర్ కోళ్లు 9,30,000, నాటు కోళ్లు 1800 నుంచి 2వేల వరకు ఉన్నాయి. బ్రాయిలర్ కోళ్ల ద్వారా జిల్లాలో సంవత్సరానికి 5,592 టన్నుల మాంసం ఉత్పత్తి జరుగుతుంది. లేయర్ ఫారాల ద్వారా ఏడాదికి 45.99 కోట్ల వరకు కోడి గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. జిల్లాలో ఏడాదికి మాంసం ఉత్పత్తిపై రూ.55.92 కోట్లు, కోడి గుడ్లపై రూ.206.95 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. వారానికి విక్రయాలు ఇలా బర్డ్ ప్లూ కలకలంతో ఎన్టీఆర్ జిల్లాలో చికెన్ విక్రయాలు యాభై శాతానికి పైగా పడిపోయాయి. బర్ల్ ప్లూ రాకముందు వరకు జిల్లాలో వారానికి వెయ్యి టన్నుల వరకు మాంసం విక్రయాలు జరిగేవి. వైరస్ కలకలంతో గంపలగూడెం మండల పరిధి అనుమల్లంకలో15 వేల బ్రాయిలర్ కోళ్లు మృత్యువాత పడడంతో చికెన్ విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. విజయవాడజోన్ పరిధిలో శనివారం పేపరు రేటు ఫారం వద్ద లైవ్‌బర్డ్ కేజీ రూ.111, రిటైల్ లైవ్‌బర్డ్ కేజీ రూ.133, డ్రస్స్‌డ్ చికెన్ కేజీ రూ. 193, స్కిన్లెస్ కేజీ రూ.219గా నిర్ణయించినా.. ప్రజలు కొనడానికి ఆసక్తి చూపకపోవడంతో రూ.180 నుంచి రూ.200 వరకు కూడా విక్రయించారు. ఈ ప్రభావంతో కోళ్ల ఫారం వద్ద బ్రాయిలర్ కోళ్లు కేజీ రూ.75 నుంచి రూ.80 మాత్రమే ధర పలుకుతోందని ఫారం యజమానులు వాపోతున్నారు. కోడి మాంసం ఉత్పత్తికి తయారయ్యే సమయానికి కేజీకి అన్ని ఖర్చులు కలిపి రూ.100 వరకు అవుతున్న నేపథ్యంలో తక్కువ ధరకు విక్రయిస్తే తీవ్రంగా నష్టపోతామని చెబుతున్నారు. ఫారం వద్ద గుడ్డు ధర ప్రస్తుతం రూ.4.5 పలుకుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించకపోతే నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల ఆలస్యంతో మరింత నష్టం గంపలగూడెం మండల పరిధి అనుముల్లంకలో నిర్వహిస్తున్న ఒకే కోళ్ల ఫారంలో ఈ నెల 9వ తేదీ నుంచి వరసగా నాలుగు రోజులపాటు 15వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. వాటి మృతికి కారణాలను తెలుసుకునేందుకు అధికారులు 12వ తేదీన కోళ్ల నుంచి శాంపిళ్లను సేకరించి భోపాల్‌లోని ల్యాబ్‌కి పంపారు. వీటి ఫలితాలు రాకపోవడంతో బర్డ్ ఫ్లూతో కోళ్లు మృతి చెంది ఉంటాయనే ఆందోళన ప్రజల్లో ఉంది. కొనసాగుతున్న పర్యవేక్షణ కోళ్ల మృత్యువాతతో పశు వైద్యశాఖ అప్రమత్తమైంది. ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. కోళ్ల ఫారాల నిర్వాహకులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అనుముల్లంక పరిసరాల్లో 10 కిలోమీటర్ల మేర రెడ్‌జోన్‌గా ప్రకటించి చికెన్ విక్రయాలను నిలిపివేశారు. జిల్లా పరిధిలో 12స్టేట్ బోర్డర్ చెక్‌పోస్టుల్లో 36మంది సిబ్బందితో మూడు షిఫ్ట్‌ల్లో బ్రాయిలర్ కోళ్ల రవాణాపై నిఘా పెట్టారు. శాంపిళ్ల ఫలితాలు వచ్చే వరకు తనిఖీలు కొనసాగుతాయని జిల్లా అధికారులు చెబుతున్నారు. వేడిలో వైరస్ వ్యాపించే అవకాశం లేదు ఆహార పదార్థాలు బాగా ఉడికించి తింటే ఎటువంటి వైరస్ వ్యాపించే అవకాశం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చికెన్, గుడ్డు తిన్నవారైనా, తినే వారైనా పెద్దగా ఆందోళన చెందవద్దని చెబుతున్నారు. జిల్లాలో ఒక్క కోళ్ల ఫారం మినహా ఎక్కడా కూడా కోళ్ల మృతి చెందలేదని ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, సోషల్ మీడియా పోస్టులు నమ్మొద్దని సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ కలకలం పడిపోయిన చికెన్ విక్రయాలు ఎన్టీఆర్ జిల్లాలో 15వేల కోళ్లు మృత్యువాత తీవ్రంగా నష్టపోతున్న పౌల్ట్రీ ఫారంల యజమానులు జిల్లాలో ఏడాదికి రూ.250 కోట్లకు పైగా వ్యాపారం -
పీఎం సూర్యఘర్ రుణాల మంజూరు వేగవంతం చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీఎం సూర్యఘర్ పథకం లబ్ధిదారులకు రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారులకు రుణాల మంజూరుపై శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సమన్వయ శాఖల అధికారులు, వెండర్లు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యఘర్ పథకం ద్వారా జిల్లాలో రెండు లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్యానల్స్ అమర్చాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇప్పటివరకు 72 వేల రిజిస్ట్రేషన్లు వచ్చినందున, ఇన్స్టలేషన్స్ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చొరవచూపాలన్నారు. ప్రజలకు కరెంటు బిల్లుల భారాన్ని తప్పించేందుకు, పర్యావరణ పరిరక్షణకు, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి ఈ పథకం వీలుకల్పిస్తుందన్నారు. ప్రభుత్వ రాయితీ మినహా మిగిలిన సొమ్మును బ్యాంకర్లు రుణంగా మంజూరు చేయవలసి ఉంటుందన్నారు. బ్యాంకర్లు త్వరితగతిన దరఖాస్తులను పరిష్కరించి, రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో ఆదర్శ సౌర గ్రామాల్లో 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, సూర్యఘర్ జిల్లా నోడల్ అధికారి ఎం.భాస్కర్, టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హనుమయ్య, ఎల్డీఎం కె.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం.. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను ప్రమాదాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం గాంధీనగర్ లోని ఎన్జీజీఓ హోమ్ లో శనివారం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రహదారులపై వాహనదారుల భద్రతపై నిరంతరం అవగాహన, ప్రచార కార్యక్రమాలు జిల్లా రవాణ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. అవగాహన సదస్సులలో పాల్గొన్న విద్యార్థులు హెల్మెట్ ఆవశ్యకతను ప్రచారం చేయాలన్నారు. హెల్మె ట్ ధరించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాసోత్సవాల్లో పాల్గొన్న వివిధ శాఖల అధికారులకు, రోడ్డు భద్రతపై నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం వంటి అంశాలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు, సామాజిక మాధ్యమాలలో తమ వంతు బాధ్యతగా ప్రచారం నిర్వహించిన ప్రసార మాధ్యమాల ప్రతినిధులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఏపీ ఎన్జీజీవో ప్రధాన కార్యదర్శి ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగులు హెల్మెట్ ధరించి మిగతా సమాజానికి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. జిల్లా రవాణాధికారి ఎ.మోహన్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం పౌరుల రక్షణ కోసమేనని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం.రాజుబాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.సుహాసిని, నగర పాలక సంస్థ జోనల్ కమిషనర్ ప్రభుదాసు, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రసన్న కుమార్, రవాణాశాఖ అధికారి ఆర్.ప్రవీణ్ కుమార్, నెహ్రూయువ కేంద్రం డీవైఓ ఎస్.రాము పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
చిలకలపూడి(మచిలీపట్నం): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని సహాయ రిటర్నింగ్ అధికారి, డీఆర్వో కె. చంద్రశేఖరరావు అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సాధారణ పరిశీలకులకు నివేదిక పంపాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనలు పూర్తిగా చదివి అర్ధం చేసుకోవాలన్నారు. జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, పోలింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు సూక్ష్మ పరిశీలకులను నియమించారన్నారు. వీరు ఆయా పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలన్నారు. పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని నిబంధనల మేరకు ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ బూత్‌లో ఎన్నికల సిబ్బంది, పోలింగ్ ఏజెంట్లు ఎవరికి కేటాయించిన సీట్లలో వారు కూర్చోవాలని, ఓటర్లతో ఎన్నికల సిబ్బంది మాత్రమే మాట్లాడాలన్నారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించకూడదన్నారు. పోలింగ్ బూత్‌కు 100 మీటర్ల మేర ఎలాంటి ప్రచారం జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ల
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల ఉత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. ముందుగా అమ్మవారి కల్యాణం పీటలపై కూర్చొన్న శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారి వంశీకులు కొల్లా వెంకట చంద్రమౌళి, కాకాని వెంకట శ్రీనివాసరావు దంపతులతో కలశ పూజలు, పంచాహ్నిక కల్యాణాన్ని పురోహితులు, వేదపండితులు, అర్చకులు పాపమాంబ వంశీకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఐదు రోజుల కల్యాణ ఉత్సవం అనంతరం ఆలయ ఆవరణలో హోమం ఏర్పాటుచేసి శాంతి సంరక్షణకు పూర్ణాహుతి కార్యక్రమం జరిపించారు. అనంతరం హోమద్రవ్యాలను హోమగుండంలో వేసి తిరునాళ్లకు ముగింపు పలికారు. అనంతరం అమ్మవారి వంశీకులు, పాపమాంబ వంశీకులను నూతన వస్త్రాలతో సత్కరించారు. అర్చకులు, ఆలయ సిబ్బంది, వేదపండితులు, పురోహితులను అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కల్యాణం రోజున తిరుముడి సమర్పించి దీక్ష విరమించని స్వాములు పూర్ణాహుతి రోజు దీక్ష విరమించారు. తిరుముడిలోని ముద్దర(నెయ్యితో నింపిన) టెంకాయలను ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన హోమగుండంలో వదిలారు. పూర్ణాహుతిలో స్వాములతోపాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పాలు, పొంగళ్లతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఈఓ బీహెచ్‌వీఎస్‌ఎన్ కిషోర్‌కుమార్, ఈఈ ఎల్.రమ, ఏఈవో తిరుమలేశ్వరరావు, ఏఈలు రాజు, అరవింద్, ప్రధానార్చకులు మర్రెబోయిన గోపిబాబు,ఆలయ సిబ్బంది, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
స్వచ్ఛాంధ్ర– స్వచ్ఛ దివస్‌ను పక్కాగా అమలు చేయాలి
ఏపీ చీఫ్ సెక్రెటరీ విజయానంద్ పాయకాపురం(విజయవాడరూరల్): ఇంటి వద్దనే వ్యర్థాల సెగ్రిగేషన్ జరగాలని ఏపీ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ అన్నారు. శనివారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో 63వ డివిజన్ రాజీవ్ నగర్, ఆయుర్వేద హాస్పిటల్ వద్ద నిర్వహించిన, స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన వాకథాన్‌ను ఆయన ప్రారంభించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు దోమ కాటు వల్ల, అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు విజయవాడ నగరపాలక సంస్థ వారు ఫాగింగ్, స్ప్రేయింగ్, డ్రోన్ స్ప్రేయింగ్, యాంటి లార్వా ఆక్టివిటీస్, చేసే స్టాల్ సందర్శించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్‌ను వీక్షించారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వాటిని రీసైకిల్ చేసే విధంగా అందరూ సహాయపడాలని, అందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన వ్యర్థాలకు, మూడు రకాల బుట్టలను విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలకు అందించడమే కాకుండా ఇంటి వద్దనే వ్యర్థాలు వేరుచేసి ఇవ్వాలని అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో 120 మైక్రోన్స్ కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించిందని తెలిపారు. అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి.చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్చార్జ్ డాక్టర్ సురేష్ బాబు, జాన్ డైరెక్టర్ డాక్టర్ లత, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్‌రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, బయాలజిస్ట్ సూర్య నాయక్, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.