Hyderabad
-
హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మెట్రో రైలు సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. ఎల్బీ నగర్-అమీర్‌పేట్ మధ్య మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. మియాపూర్- ఎల్బీ నగర్ మెట్రో రైలులో సాంకేతిక సమస్య ఏర్పడింది. వెంటనే సిబ్బంది స్పందించి.. సమస్యను పరిష్కరించారు. అసెంబ్లీ స్టేజీ దగ్గర అరగంట పాటు రైలును నిలిపివేయగా, గాంధీ భవన్ స్టేజీ దగ్గర మరో 10 నిమిషాలు నిలిపివేశారు. అనంతరం యథావిధిగా మెట్రో సేవలు కొనసాగాయి. గతంలోనూ మెట్రో రైలు సర్వీసులకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. అంతరాయాలు ఎక్కువగా ఉదయం, రాత్రి ఆఫీసుల నుంచి రాకపోకలు సాగించే సమయాల్లో ఏర్పడుతుండడంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. -
యువ ఐఏఎస్ అధికారికి ఫ్యూచర్ సిటీ పగ్గాలు!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఫ్యూచర్ సిటీ (Future City) అభివృద్ధిలో కీలకమైన అడుగు పడనుంది. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)కి కమిషనర్‌ను నియమించనున్నారు. చురుకైన యువ ఐఏఎస్ అధికారిని ప్రాజెక్ట్ సారథిగా నియమిస్తే బాగుంటుందనే భావనలో సీఎం రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిపాదిస్తున్న ఫోర్త్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌సీడీఏ (FCDA) పరిధిని ప్రత్యేకంగా భావిస్తోంది.ప్రపంచ ప్రఖ్యాత ఐటీ, ఫార్మా, క్రీడారంగాలకు ప్రాధాన్యతనిస్తున్న సర్కారు.. ఆ మేరకు జోన్లను కూడా నిర్దేశిస్తోంది. వీటన్నింటిని గమనంలోకి తీసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు అంతర్జాతీయ నగరాలపై అవగాహన ఉన్న యువ అధికారులకు దీని పాలనపగ్గాలు కట్టబెట్టే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. గతంలో రంగారెడ్డి జిల్లా (Rangareddy District) కలెక్టర్లుగా వ్యవహరించిన కె.శశాంక( 2013), డాక్టర్ ఎస్.హరీశ్(2015) పేర్లను పరిశీలిస్తోంది. ఈ ప్రాంతంపై వీరికి స్పష్టమైన అవగాహన ఉండడం కలిసొచ్చే అంశంగా భావిస్తోంది. అలాగే గోపి (2016) పేరును కూడా పరిగణనలోకి తీసుకుంటున్న సర్కారు.. అతి త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.90 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్.. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత గ్రేటర్లో ఫోర్త్ సిటీ (Fourth City) అవసరం ఉందని సీఎం రేవంత్ నిర్ణయించారు. 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయాలన్నది రేవంత్ సర్కార్ లక్ష్యం. మహేశ్వరం, ఆమన్‌గల్, కడ్తాల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల ఏడు మండలాల్లోని 56 గ్రామాలు ఎఫ్‌సీడీఏ పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే ఎఫ్‌సీడీఏ కోసం కొత్తగా 90 పోస్టులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటిలో 34 రెగ్యులర్ పోస్టులు కాగా..మిగిలిన 56 పోస్టులను ఔట్ సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. ఎఫ్‌సీడీఏ కమిషనర్ నియామకం పూర్తవగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణం మరింత వేగం పుంజుకుంటుందని అధికారులు చెబుతున్నారు. నాలుగేళ్లలో కార్యరూపం.. ఇప్పటికే ఫోర్త్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం ప్రారంభమవగా పనులు చకచకా సాగుతున్నాయి. ఉగాది తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో ఫ్యూచర్ సిటీకి అన్ని ప్రాంతాల నుంచి అనుసంధానం చేసేందుకు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి సైతం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మరోవైపు ఫ్యూచర్ సిటీలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను సైతం తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. వచ్చే నాలుగేళ్లలో ఫ్యూచర్ సిటీకి ఓ రూపం తీసుకువచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.చదవండి: కొత్త మెట్రో రైళ్లకు నిధుల బ్రేక్! -
అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష
హైదరాబాద్,సాక్షి: అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై కవిత ఎక్స్ వేదికగా స్పందించారు.అసెంబ్లీ ఆమోదించిన చట్టాలను కోల్డ్ స్టోరేజీకి పంపే స్క్రీన్ ప్లే.బీజేపీని కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామా. మరో సారి బయటపడిన కాంగ్రెస్, బీజేపీ బంధం. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా కుతంత్రం.అఖిలపక్షాన్ని తీసుకెళ్తే కేంద్రాన్ని నిలదీస్తారన్న జంకు. అందుకే ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నాకు హాజరు పేరిట మమ అనిపించే యత్నం.మోదీ సర్కారుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పకడ్బందీ స్కెచ్. తెలంగాణ ప్రజల ఓట్లే తప్ప.. వాళ్ల పాట్లు పట్టని కాంగ్రెస్ అగ్రనాయకత్వం. ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నాకు కాంగ్రెస్ నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత హాజరవుతారని ప్రచారం. జంతర్ మంతర్‌కు కూతవేటు దూరంలోనే ఉన్నా ధర్నాకు రాకుండా బీసీలను అవమానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం.అసెంబ్లీ ఆమోదించిన చట్టాలను కోల్డ్ స్టోరేజీకి పంపే స్క్రీన్ ప్లే...బీజేపీని కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామా...మరో సారి బయటపడిన కాంగ్రెస్, బీజేపీ బంధం...బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా కుతంత్రం...…— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 2, 2025 తెలంగాణ లో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సాగిస్తున్న ఏ ఒక్క దమనకాండపై ఇప్పటి వరకు నోరు విప్పని రాహుల్ గాంధీ. లగచర్ల రైతుల మీద, బంజారా మహిళలపై సర్కార్ అఘాయిత్యాలపై మాట్లాడరు. మూసి ప్రాజెక్టు పేరిట పేద ప్రజల ఇళ్లను కూలగొడితే స్పందించరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపించినా ఖండించరు.ఇప్పుడు ఢిల్లీ వేదికగా మా బీసీ బిడ్డల ధర్నాకు రాకుండా అవమానించారు. అందుకే మేము ముందే చెప్పాం.. ఆయన ఎన్నికల గాంధీ అని.రాహుల్ గాంధీకి తెలంగాణతో పేగుబంధం లేదు.. ఉన్నది కేవలం ఎన్నికల బంధం మాత్రమేనని. అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకి కేసీఆర్ మాత్రమే శ్రీరామ రక్ష’ అని వ్యాఖ్యానించారు. -
అమీన్పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
సాక్షి, సంగారెడ్డి: అమీన్పూర్ ముగ్గురు పిల్లల మృతి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముగ్గురు పిల్లల్ని తల్లే చంపినట్లు పోలీసులు తేల్చారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. వివాహితర సంబంధంతో భర్తతో పాటు ముగ్గురు పిల్లలను కూడా చంపాలని హంతకురాలు రజిత ప్లాన్ చేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లల్ని ఊపిరాడకుండా చేసి కన్నతల్లే చంపేసింది.ఇటీవలే పదవ తరగతి విద్యార్థుల గెట్ టుగెదర్ పార్టీలో స్నేహితుడితో రజితకు పరిచయం ఏర్పడింది. హంతకురాలు రజిత లావణ్య, ప్రియుడు సూరు శివ కుమార్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి స్థానికంగా వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 28వ తేదీ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత కడుపు నొప్పితో విలవిలలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్‌తో ముగ్గురు పిల్లలు నిద్రలోనే కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత అంతా భావించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంతో భర్త చెన్నయ్య పాత్రపై పోలీసులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైగా భార్యాభర్తల మధ్య గతకొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతుండడంతో.. రజిత తల్లితో పాటు స్థానికులు ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఆ కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు.కానీ విచారణలో చెన్నయ్య పాత్ర ఏం లేదని తేలడంతో పోలీసులు వదిలేశారు. ఆపై ఆస్పత్రిలో కోలుకుంటున్న రజితను పోలీసులు విచారించారు. ఆమె కదలికలు అనుమానంగా తోచడంతో లోతైన దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అదే వివాహేతర సంబంధం. రజిత పదో తరగతి క్లాస్మేట్స్ ఈ మధ్య గెట్ టు గెదర్ చేసుకున్నారు. ఆ టైంలో రజిత స్కూల్ డేస్‌లో చనువుగా ఉండే ఓ వ్యక్తి మళ్లీ టచ్‌లోకి వచ్చాడు.అలా తన పాత క్లాస్‌మేట్‌తో రజిత చాటింగ్, ఫోన్లు మాట్లాడడం చేసింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త, పిల్లలను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా జీవించవచ్చని అనుకుంది. మార్చి 27వ రాత్రి విషం కలిపిన భోజనం భర్త, పిల్లలకు పెట్టాలనుకుంది. అయితే భర్త మాత్రం పప్పన్నం మాత్రమే తిని పనికి వెళ్లిపోగా.. పిల్లలు ఆఖర్లో విషం కలిపిన పెరుగన్నం పిల్లలు తిన్నారు. అలా ముగ్గురు పిల్లలు సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8) నిద్రలోనే కన్నుమూశారు. -
Bird Flu : హైదరాబాద్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం.. వేల కోళ్లు మృత్యువాత
హైదరాబాద్,సాక్షి: హైదరాబాద్‌లో బర్డ్‌ప్లూ (bird flu) వైరస్ కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. నాలుగురోజుల క్రితం మండలంలోని ఓ పోల్ట్రీ ఫామ్‌లో వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన వైద్య శాఖ అధికారులు కోళ్ల రక్త నమూనాలను సేకరించారు. తాజాగా, ఆ కోళ్ల రక్త నమూనా ఫలితాలు విడుదలయ్యాయి.బర్డ్ ఫ్లూ వల్లే ఆ కోళ్లు మృత్యువాత పడినట్లు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కోడి గుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దు అని పోల్ట్రీ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందా?పక్షులకు వచ్చే జలుబు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా టైప్ –ఏ వైరస్లు వ్యాధి కారకాలు. కోవిడ్–19 కారక కరోనా వైరస్‌లో మాదిరిగానే ఈ వైరస్‌లోనూ పలు రకాలు ఉన్నాయి. తక్కువ ప్రభావం చూపేవి కొన్ని.. అధిక ప్రభావం చూపేవి మరికొన్ని. రెండో రకం వైరస్లు కోళ్లు ఇతర పక్షులకు తీవ్రస్థాయిలో ప్రాణ నష్టం కలిగిస్తాయి. సాధారణంగా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్‌లను ‘‘హెచ్’’, ‘‘ఎన్’’రకాలుగా వర్గీకరిస్తారు. సాధారణంగా ఈ వైరస్లు మనుషుల్లోకి ప్రవేశించవు కానీ.. కొన్నిసార్లు జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు కలిగిస్తాయి. ప్రాణాలు కోల్పోవడమూ సంభవమే. కోళ్లు ఇతర పౌల్ట్రీ పక్షుల వ్యర్థాలను ముట్టుకోవడం ద్వారా వ్యాధి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువ.మనుషులకూ సోకుతుందా?మనుషులకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశాలు అరుదు. కానీ హెచ్5, హెచ్7, హెచ్9 రకాల వైరస్లు మాత్రం మనుషుల్లోకి ప్రవేశిస్తాయని ఇప్పటికే రూఢీ అయ్యింది. వైరస్ సోకిన పక్షులను తాకడం, వాటి స్రావాలతో కలుషితమైన ఉపరితలాలను ముట్టుకోవడం ద్వారా మనుషులకూ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. బాగా వండిన కోడిగుడ్లు, చికెన్లతో వ్యాధి సోకే అవకాశాలు లేవు.ఇతరులకు సోకుతుందా? జలుబు లాంటి లక్షణాలే కనిపిస్తాయి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో న్యుమోనియా, శ్వాస సమస్యలు, మరణమూ సంభవించవచ్చు. మనుషుల నుంచి ఇతరులకు బర్డ్‌ఫ్లూ సోకదు.ఎలాంటి పక్షులకు సోకుతుంది?కోళ్లు, బాతులు, హంసలు, నెమళ్లు, కాకుల వంటి పక్షులపై బర్డ్‌ఫ్లూ ప్రభావం ఉంటుంది. కోళ్లలో అతిసారం, కాలి పంజా ప్రాంతాలు వంకాయ రంగులోకి మారడం, తల, కాళ్లు వాచిపోవడం, వంటివి కనిపిస్తాయి. ముక్కు, ఊపిరితిత్తుల నుంచి వెలువడే ద్రవాల ద్వారా ఈ వ్యాధి పక్షుల్లో వ్యాపిస్తుంది. వ్యాధికి గురైన పక్షుల మలం తగిలినా చాలు. కలుషిత ఆహారం, నీరు ద్వారానూ వ్యాపిస్తుంది.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?బాగా ఉడికించిన తరువాత మాత్రమే చికెన్, గుడ్లు వంటివి తినాలి. ఉడికించని పక్షి మాంసాన్ని ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉంచడం మేలు. పౌల్ట్రీ రంగంలో పనిచేసే వారు వ్యక్తిగత శుభ్రతను కచ్చితంగా పాటించాలి. కోళ్లఫారమ్‌లలో పనిచేసేటప్పుడు చేతులకు కచ్చితంగా తొడుగులు వేసుకోవడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, ఎన్95 మాస్కులు ధరించడం, పీపీఈ కిట్లు, కళ్లజోళ్లు వాడటం ద్వారా వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. -
HCU భూ వివాదం.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్,సాక్షి : తెలంగాణ హైకోర్టులో కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నానం 2:15కి వాయిదా వేసింది. రేపటి వరకు హెచ్‌సీయూ భూముల్లో చెట్లు కొట్టివేయొద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు అటవీ భూములను తెలంగాణ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ)కి బదిలీ చేసి, చదును చేయడాన్ని వెంటనే ఆపాలని హైకోర్టులో హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కె.బాబురావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ‘సర్వే నంబర్ 25లోని కంచ గచ్చిబౌలి అడవిలో 30–40 జేసీబీలతో సర్కార్ చెట్లను తొలగిస్తోంది. హింసాత్మక అటవీ నిర్మూలనను ఆపాలి’అని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు..ప్రభుత్వం ఆ 400 ఎకరాలను చదును చేస్తున్న నేపథ్యంలో అత్యవసర విచారణ చేపట్టాలని తొలి పిల్ దాఖలు చేసిన వటా ఫౌండేషన్ (ఈఎన్‌పీవో) తరఫు న్యాయవాది ఒమర్ ఫారుక్.. ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు విజ్ఞప్తి చేశారు. మధ్యంతర అప్లికేషన్ దాఖలు చేశారు. అభ్యర్థనను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనంరెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై బుధవారం విచారణ చేపట్టింది. ఇరుణ పక్షాల వాదనలు విన్న కోర్టు కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లు కొట్టివేయొద్దని ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణ అటవీశాఖకు కేంద్రం ఆదేశాలు అదే సమయంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కంచ గచ్చిబౌలి భూములపై నిజనిర్ధారణ నివేదిక పంపాలని తెలంగాణ అటవీశాఖ అధికారులకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం కోరింది. కోర్టు తీర్పులకు లోబడే ముందుకు వెళ్లాలని సూచించింది. అటవీ చట్టానికి లోబడి చర్యలు తీసుకోవాలని తెలిపింది. నిజ నిర్ధారణ నివేదికతో పాటు సంబంధిత శాఖ తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. -
HCU వద్ద తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్(వీడియో)
సాక్షి, గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. భూముల అమ్మకాల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విద్యార్థుల డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆందోళన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో, ఒక్కసారిగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది.మరోవైపు.. హెచ్‌సీయూ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. యూనివర్సిటీ విద్యార్థులు నాలుగో రోజు ఆందోళనలు తెలుపుతున్నారు. అక్కడున్న 400 ఎకరాలను యూనివర్సిటీకి అప్పగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో యూనివర్సిటీ చుట్టూ అన్ని గేట్ల వద్ద పోలీసులు మోహరించారు. LathiCharge on Students of University of Hyderabad who have protesting to stop cutting down the 400 acres Trees in the campus pic.twitter.com/1iQC52779t— Dr.Krishank (@Krishank_BRS) April 2, 2025అనంతరం, ఉద్యోగులను, విద్యార్థులను మాత్రమే యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. డ్రోన్లు ఎగురవేసి వీడియోలు తీసిన ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి యూనివర్సిటీకి బీజేపీ మహిళా మోర్చా నాయకులు వచ్చారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు.#HCU విద్యార్థులపై రేవంత్ సర్కార్ దౌర్జన్యం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను గొడ్లను కొట్టినట్టు కొడుతున్న పోలీసులు 😡#ShameOnRahulGandhi#SaveHCU#SaveHCUBioDiversity pic.twitter.com/SKlUxibKEq— BRS News (@BRSParty_News) April 2, 2025 -
బంగారం ఇచ్చి నీ భార్యను తీసుకుపో..!
చందుర్తి (వేములవాడ): బాకీ డబ్బుల వివాదంలో తన భార్య చేయి పట్టుకున్నారని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. చందుర్తి ఎస్సై అంజయ్య కథనం ప్రకారం.. వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన బోదాసు రాజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శివరాత్రి దేవయ్య, దండుగుల నరేశ్ వద్ద ఏడేళ్ల క్రితం రెండు తులాల బంగారాన్ని అప్పుగా తెచ్చుకుని జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. కొన్నాళ్లకు రెండు తులాల బంగారం తిరిగిచ్చాడు. ఒప్పందం ప్రకారం మరో తులం బంగారం బాకీ ఉన్నాడు. ఐదేళ్ల క్రితం రాజు గల్ఫ్ నుంచి స్వగ్రామానికి చేరుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పటినుంచి దేవయ్య, నరేశ్ బంగారం కోసం రాజును వేధిస్తున్నారు. మంగళవారం కూడా వచ్చి తులం బంగారం అడిగారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగింది. ‘నీ భార్యను తీసుకెళ్తేనే బంగారం ఇస్తావు..’అంటూ దేవయ్య, నరేశ్.. రాజు భార్య చేయి పట్టుకోవడంతో మనస్తాపానికి గురైన అతడు అక్కడే ఉన్న పురుగుల మందు తాగాడు. రాజు భార్య ఫిర్యా దు మేరకు దేవయ్య, నరేశ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంజయ్య వివరించారు. -
హెచ్‌సీయూ వివాదం.. రేణూ దేశాయ్ విన్నపం.. ప్రభుత్వానికి ఉపాసన సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల అడవిని మాయం చేసి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం.. ఆ భూములు మావంటూ వాటిని కాపాడుకోవడానికి పోరుబాట పట్టారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు (#HCU Protest). వందలాది జేసీబీలు అర్ధరాత్రి అడవిని ధ్వంసం చేయడానికి వెళ్తే నెమళ్ల ఆర్తనాదాలు, భయంతో పరుగులు తీస్తున్న దుప్పిల వీడియోలు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తున్నాయి. అడవిని కాపాడుకుందాంఅవి చూసిన సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలుష్యంతో నిండిపోతున్న నగరానికి ఆక్సిజన్ అందిస్తున్న భూముల్ని అమ్మడం అన్యాయమని మండిపడుతున్నారు. అడవి నరికివేత ఆపేయాలని, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని నినదిస్తున్నారు. హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన (Upasana Konidela) ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరు ఇదే గనక చేయాలనుకుంటే అక్కడున్న మూగజీవాలు, పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారు? నరికివేసిన చెట్లను తిరిగి ఎక్కడ పెంచుతారు? వీటన్నింటికీ సమాధానం చెప్పండి అని కోరింది.దయచేసి వేడుకుంటున్నా..పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ (Renu Desai) స్పందిస్తూ.. రెండు రోజుల క్రితమే నాకు విషయం తెలిసింది. అన్ని విషయాలు కనుక్కున్నాకే వీడియో చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డిగారూ.. ఒక తల్లిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా.. నాకు 44 ఏళ్లు. రేపోమాపో ఎలాగైనా పోతాను. కానీ పిల్లలు.. మన రేపటితరానికి ఆక్సిజన్, నీళ్లు అవసరం. వదిలేయండి..అభివృద్ధి అవసరం.. కాదనను. ఐటీ పార్కులు, బహుళ అంతస్తుల భవనాలు.. అన్నీ అవసరమే! కానీ ఈ 400 ఎకరాలను మాత్రం వదిలేయండి. నిర్మానుష్యంగా ఉన్న భూముల్ని వెతకండి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏదో ఒకటి చేయండి. మీరు చాలా సీనియర్. ఒక తల్లిగా అడుక్కుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి అని వీడియో రిలీజ్ చేసింది. మూగజీవాల్ని అడవి నుంచి తరిమేయకండి అంటూ యాంకర్ రష్మీ గౌతమ్ సైతం వీడియో షేర్ చేసింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam)చదవండి: లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు -
స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న సంగతి మరవొద్దు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో ఇవాళ విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ బుధవారం వాదనలు వినిపించారు. స్పీకర్‌కు కోర్టులు గడువు విధించడం సరికాదని ఆయన వాదించారు. ఈ క్రమంలో.. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా? అని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవు. ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాకే జ్యుడీషియల్ సమీక్షకు అవకాశముంటుంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ స్పీకర్‌కు గడువు విధించడం సరికాదు. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ తీర్పు సరైందే. స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పడం భావ్యం కాదు. ఒకవేళ సూచనలు చేస్తే స్వీకరించాలా? లేదా? అనేది స్పీకర్ నిర్ణయమే. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదు’’ అని ముకుల్ రోహత్గీ వాదించారు.ముకుల్ రోహత్గీ వాదనల్లో జస్టిస్ బీఆర్ గవాయ్ జోక్యం చేసుకున్నారు. హైకోర్టు జోక్యం చేసుకోవద్దా?. రాజ్యాంగ పరిరక్షకులుగా న్యాయస్థానాలు వ్యవహరిస్తాయి. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే సుప్రీం కోర్టు కూడా చేతులు కట్టుకుని చూస్తుండాలా?. నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా?. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న విషయం మరిచిపోవద్దు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేమా? ఆయనకు విజ్ఞప్తి చేయడమో.. ఆదేశించడమో చేయలేమా? అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అయితే అది ప్రత్యేక సందర్భమన్న రోహత్గి.. సుప్రీం కోర్టుకు న్యాయసమీక్ష చేసే అధికారం ఉందని, నిర్ణయాలపై న్యాయసమీక్ష చేయొచ్చని తెలియజేశారు.. ఫిరాయింపులపై పిటిషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని వాదించారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారంలోనే పిటిషన్ వేశారన్నారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారని.. కనీసం ఆలోచించే అవకాశం కూడా లేకుండా పిటిషన్లు వేశారని కోర్టుకు తెలియజేశారు.2024 మార్చి 18న పిటిషనర్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. 2025 జనవరి 16న 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. స్పీకర్ తన విధులు నిర్వర్తిస్తున్నారు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున ఇవాళ ముకుల్ రోహత్గీ వాదనలు ముగిశాయి. ఇక అసెంబ్లీ కార్యదర్శి తరపున రేపు(గురువారం) వాదనలు వినిపిస్తానన్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ బెంచ్ సమ్మతి తెలిపి విచారణ వాయిదా వేసింది. తెలంగాణలో కారు పార్టీ గుర్తు మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని, ఉన్నత న్యాయస్థానం చెప్పినా వాళ్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని.. అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతరులు పిటిషన్లు వేశారు. అయితే మొదటి నుంచి ఈ కేసు విచారణలో తెలంగాణ స్పీకర్ తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేస్తూనే వస్తోంది. గత విచారణలో.. బీఆర్ఎస్ తరఫున ఆర్యమా సుందరం వాదనలు పూర్తి చేశారు. ఆ వాదనల సమయంలో.. సుప్రీం కోర్టు ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలే చేసింది. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. -
హైదరాబాద్‌లో నాకు నచ్చేవి ఇవే: జూనియర్ ఎన్టీఆర్
అంతర్జాతీయ స్థాయి సక్సెస్‌లు అందుకుంటున్న టాలీవుడ్ (Tollywood)కు కేంద్ర బిందువు హైదరాబాద్. అలాంటి పరిశ్రమలో గ్లోబల్స్టార్స్గా పేరున్న అనేకమంది నటీనటులకు మన నగరం నిలయం. అయితే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న టాలీవుడ్ స్టార్స్ కూడా నగరంలోని కొన్ని రుచులకు దాసులే. వారు తమ అభి‘రుచుల్ని’ సంతృప్తి పరుచుకోడానికి నగరంలోని కొన్ని రెస్టారెంట్స్‌కి తరచూ రౌండ్స్ వేస్తుంటారు. అభిమానులకు చిక్కకుండా రహస్యంగా తమ టేస్ట్ బడ్స్‌ను శాంతింపజేస్తుంటారు. అదే విధంగా మన టాలీవుడ్ టాప్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌కి సైతం నగరంలో తనకు నచ్చిన, ఇష్టమైన వంటకాలు వడ్డించే రెస్టారెంట్స్ ఉన్నాయి.గత నెల్లో దేవర చిత్రాన్ని అంతర్జాతీయ మార్కెట్లో ప్రమోట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రం అక్కడి థియేటర్లలో సందడి చేస్తోంది. మరోవైపు తారక్ తిరిగి నగరానికి వచ్చేశారు. అయితే తారక్ జపాన్ టూరుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఆ ఇంటర్వ్యూలో నగరంలో తాను ఇష్టపడే రెస్టారెంట్స్ రుచుల వివరాలు ఆయన వెల్లడించడమే ఇందుకు కారణం.ఫ్రెండ్.. జపనీస్ ట్రెండ్.. నగరంలోని నాగ చైతన్య అక్కినేనికి చెందిన షోయు రెస్టారెంట్ ఎన్టీఆర్ ఎంచుకున్న మొదటి ఎంపిక. ‘ఈ అద్భుతమైన కళాత్మక ప్లేస్ నా స్నేహితుడు నాగ చైతన్య సొంతం. ఈ ప్రదేశంలో కొన్ని అద్భుతమైన జపనీస్ వంటకాలు అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా జపనీస్ వంటకమైన సుషీ అక్కడ సూపర్బ్. హైదరాబాద్‌లో జపనీస్ వంటకాలకు నేను జై కొట్టే ప్లేస్ అది. ఇది నిజంగా అంతర్జాతీయ వంటకాలకు కేరాఫ్’ అంటూ ఎన్టీఆర్ కొనియాడారు. మరికొన్ని ప్రదేశాలు.. జపనీస్ వంటకాలకు సంబంధించి తన ఫేవరెట్‌ను తెలియజేయడంతో పాటు అచ్చమైన హైదరాబాదీ వంటకాలకు సంబంధించి కూడా ఎన్టీఆర్ కొన్నింటిని పేర్కొన్నారు. తాను ఆస్వాదించే మరికొన్ని రుచుల కోసం.. పాతబస్తీలోని షాదాబ్, జూబ్లీహిల్స్‌లోని స్పైస్ వెన్యూ, తెలంగాణ స్పైస్ కిచెన్, పాలమూరు గ్రిల్, అమీర్‌పేట్‌లోని కాకతీయ డీలక్స్ మెస్ కూడా ఆయన ఎంచుకున్న నచ్చే రుచుల జాబితాలో ఉన్నాయి.చదవండి: పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్‌పై ట్రోలింగ్.. నటుడి ఆగ్రహం -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన విచారణ.. శ్రవణ్ రావుకు మళ్లీ నోటీసులు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావు(Shravan Rao) విచారణ ముగిసింది. మూడు రోజుల కిందట విచారణకు హాజరైన ఆయన.. సుదీర్ఘంగా సాగిన విచారణలోనూ అసంపూర్తిగా సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రావాలని దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేయడంతో ఆయన హాజరయ్యారు. అధికారులు అడిగిన పత్రాలను సమర్పించగా.. ఈ నెల 8వ తేదీన మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో శ్రవణ్ రావు ఏ6గా ఉన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో ఓ మీడియా సంస్థ అధినేత అయిన ఈయన సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులు నడుచుకున్నారనేది దర్యాప్తుసంస్థ ప్రధాన అభియోగం. అయితే కిందటి ఏడాది మార్చిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే.. శ్రవణ్ రావు అమెరికా వెళ్లిపోయారు. ఇంతకాలం విచారణకు హాజరు కాకుండా వచ్చారు. తాజాగా.. అరెస్ట్ నుంచి సుప్రీం కోర్టు(Supreme Court)లో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఊరట పొందిన ఆయన.. దర్యాప్తుకు తప్పనిసరిగా సహకరించాలన్న షరతు మేరకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరయ్యారు. అయితే గత విచారణ టైంలో ఆయనను మీడియా కంటపడనీయకుండా పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కీలకంగా శ్రవణ్ రావుతొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సిరిసిల్ల డీసీఆర్బీ అప్పటి డీఎస్పీ ప్రణీత్‌రావు పేరు మాత్రమే ఉంది. దర్యాప్తు ముందుకెళ్తున్నకొద్దీ నిందితుల జాబితా పెరుగుతూ వచ్చింది. ఈక్రమంలోనే శ్రవణ్‌రావును ఆరో నిందితుడిగా చేరుస్తూ న్యాయస్థానంలో పోలీసులు మెమో దాఖలు చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఆయన సూచించారని అనుమానిస్తున్నారు. ఆయన్ను సుదీర్ఘంగా విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
కేపీహెచ్‌బీకాలనీ: ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్ధిపేట జిల్లా, ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఉప్పరపల్లి మహేందర్ (25) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అడ్డగుట్ట సొసైటీలోని హాస్టల్లో ఉంటున్నాడు.సోమవారం సాయంత్రం హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో హాస్టల్ నిర్వాహకుడు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమలో ఓడిపోవడమే తన మరణానికి కారణమని రాసి ఉన్న లెటర్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు పై పడిన సెల్‌ఫోన్ తీసుకుంటుండగా...శామీర్‌పేట్: రోడ్డు పడిన సెల్ ఫోన్ తీసుకుంటుండగా కారు ఢీ కొని ఓ యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం రాత్రి జినోమ్‌వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సిద్దిపేట్ జిల్లా, మామిడ్యాల గ్రామానికి చెందిన పొట్ట ప్రవీణ్ (23), హైదరాబాద్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని బైక్‌పై రాజీవ్ రహదారి మీదుగా వెళుతుండగా తుర్కపల్లి గ్రామ సమీపంలో తన జేబులోంచి సెల్‌ఫోన్ రోడ్డుపై పడింది. దీంతో కిందపడిన సెల్‌ఫోన్‌ను తీసుకుంటుండగా అదే సమయంలో నగరం నుంచి వేగంగా వచి్చన ఎర్టిగా కారు వెనక నుంచి అతడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. జినోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విదేశీ యువతిపై లైంగికదాడి బాధాకరం
మీర్‌పేట: విదేశీ యువతిపై లైంగికదాడి జరగడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె మీర్‌పేట మిథులానగర్లోని స్నేహితుడి ఇంట్లో ఉంటున్న జర్మనీకి చెందిన యువతిని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై ఆసక్తి పెంచుకుని నెల రోజుల క్రితం యువతి దేశానికి వచి్చందన్నారు. నెల రోజుల పాటు ఎన్నో జ్ఞాపకాలు తనవెంట తీసుకెళ్దామనుకునే లోపే ఇలాంటి చేదు అనుభవం కలిగిందన్నారు. రాష్ట్రంలో ప్రతి గంటకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, తాజాగా నాగర్‌కర్నూలు జిల్లాలో ఆలయానికి వచి్చన వివాహితపై, ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగిక దాడులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, పోలీసులు పెట్రోలింగ్ చేయడం లేదని ఆరోపించారు. విదేశీ యువతి ఘటనలో ఫొటోలు, వీడియో రికార్డింగ్‌ల వంటి ఆధారాలు ఉన్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 22 శాతం నేరాలు పెరిగాయని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు, గృహహింసలు పెరిగిపోతుండడం ఆందోళనకరమన్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట బీజేపీ నాయకులు అందెల శ్రీరాములు యాదవ్, ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, గాజుల మధు, భిక్షపతిచారి, ముఖేష్ ముదిరాజ్, రవినాయక్, రాజు, నీలారవినాయక్ తదితరులు ఉన్నారు. -
కొత్త మెట్రో రైళ్లకు నిధుల బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: కొత్త మెట్రో రైళ్లకు నిధుల కొరత బ్రేకులు వేస్తోంది. నగరంలోని వివిధ కారిడార్లలో ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 5 లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ మేరకు కొత్త రైళ్లను కొనుగోలు చేయాలని రెండేళ్ల క్రితమే హైదరాబాద్ మెట్రోరైల్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అప్పట్లో నాగ్‌పూర్ మెట్రో రైళ్లను లీజుకు తీసుకోవాలని భావించారు. కానీ సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదు. అనంతరం సొంతంగా కొనుగోలు చేసేందుకు సైతం ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రోరైల్ సన్నాహాలు చేసింది. ఈ మేరకు బెంగళూరు కేంద్రంగా మెట్రోరైళ్లను తయారు చేస్తోన్న భారత్ ఎర్త్‌మూవర్స్ లిమిటెడ్ సంస్థతో సంప్రదింపులు కూడా జరిపారు. కానీ పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్‌కు ఇప్పుడు నిధుల కొరత అతి పెద్ద సవాల్‌గా మారింది. గత పదేళ్లలో మెట్రో నష్టాలు సుమారు రూ.6500 కోట్లకు చేరుకున్నట్లు అంచనా. ఈ పరిస్థితుల్లో ప్రతి రోజు ఒకవైపు ప్రయాణికుల అవసరాలకనుగుణంగా రైళ్లను నడుపుతూనే మరోవైపు అదనపు నిధులను కేటాయించి కొత్త రైళ్లను కొనుగోలు చేయడం కొంత కష్టంగానే మారినట్లు అధికారులు చెబుతున్నారు.ఏటేటా నష్టాలే... నగరంలో మెట్రో రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి వరుసగా నష్టాలు నమోదవుతున్నాయి. రైళ్ల నిర్వహణలో ప్రయాణికుల నుంచి టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయం ఏ మాత్రం సరిపోవడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నాగోల్ నుంచి రాయదుర్గం, ఎల్బీనగర్ నుంచి మియాపూర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కారిడార్లలో ప్రతిరోజు 57 రైళ్లు సుమారు 1050 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.45 గంటల వరకు మెట్రోలు అందుబాటులో ఉండేవిధంగా వేళలను కూడా పొడిగించారు. రోజుకు 5 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను కలి్పంచేందుకు అదనపు ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేయడం, డిజిటల్ సేవల విస్తరణ, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ పెంపు, తదితర సేవలపైన ఎల్అండ్టీ దృష్టి సారించింది. ప్రస్తుతం 2 కిలోమీటర్ల కనిష్ట దూరానికి రూ.10 నుంచి గరిష్టంగా 26 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.60 చొప్పున చార్జీలు అమలవుతున్నాయి. అయినప్పటికీ గత పదేళ్లలో ప్రయాణికుల నుంచి టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయం నష్టాలను ఏ మాత్రం భర్తీ చేయలేదు. పైగా ఏటేటా నష్టాలే నమోదై ఇప్పుడు రూ.6500 కోట్లకు చేరాయి. చార్జీల పెంపు అనివార్యమా... ఈ పరిస్థితుల్లో నగరంలో మెట్రోరైళ్ల నిర్వహణకు టిక్కెట్ చార్జీల పెంపు అనివార్యంగా మారినట్లు అధికారవర్గాల అంచనా. ‘2017 నుంచి ఇప్పటి వరకు చార్జీలు పెంచలేదు. ఇదే సమయంలో ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఒకటి, రెండు సార్లు చార్జీలను సవరించారు. ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన సదుపాయాలు కలి ్పంచేందుకు చార్జీల పెంపు కొంత ఊరటనివ్వగలదని భావిస్తున్నాం.’ అని ఓ అధికారి వివరించారు. ప్రభుత్వం నుంచి సానుకూలత కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్రం నుంచి రావలసిన రూ.200 కోట్లు లభించినా కొంత మేరకు ఊరట కలుగుతుందని పేర్కొన్నారు.కనీసం 10 రైళ్లు అవసరం... ప్రస్తుతం నగరంలో 57 రైళ్లు ఉన్నాయి. ఒక్కో ట్రైన్‌కు 3 కోచ్‌లు ఉంటాయి. వెయ్యి ట్రిప్పులకు పైగా తిరుగుతున్నాయి. మరో 10 రైళ్లను అదనంగా కొనుగోలు చేయగలిగితే 30 కోచ్‌లు వినియోగంలోకి వస్తాయి. దాంతో కనీసం రోజుకు 1.5 లక్షల నుంచి 2 లక్షల మందికి అదనంగా ప్రయాణ సదుపాయం కల్పించేందుకు అవకాశం ఉంటుంది. 3 కోచ్‌లు ఉన్న ఒక ట్రైన్‌కు రూ.65 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. తయారీ సంస్థల నుంచి రైళ్లను కొనుగోలు చేయడంతోపాటు నగరానికి తరలించడం కూడా ఎంతో ముఖ్యం. ఈ లెక్కన 10 రైళ్లకు సుమారు రూ.650 కోట్లకు పైగా నిధులు అవసరం. కొత్త రైళ్ల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదా, చార్జీలను పెంచేందుకు అవకాశం ఇవ్వడం పరిష్కారంగా భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. -
బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత
సాక్షి,హైదరాబాద్/హిమాయత్‌నగర్: హెచ్‌సీయూ భూము లను పరిశీలించడానికి బీజేపీ ఎమ్మెల్యేలు వెళతారన్న ముందస్తు సమాచార నేపథ్యంలో వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిని ఆయన నివాసంలో హౌస్అరెస్ట్ చేశారు. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను పోలీసులు చుట్టుముట్టి అక్కడకు వచ్చిన ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణ, నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి సమీప పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో ఓయూ, కేయూ భూములు కూడా అమ్ముతారేమో: ఏలేటి ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, రాబోయే రోజుల్లో ఉస్మానియా, కాకతీయ వర్సిటీల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మేయాలని చూస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ‘తెలంగాణలో అరాచక పాలన నడుస్తోంది. భూములు అమ్మితే కానీ ప్రభుత్వం నడవని పరిస్థితి. రియల్ ఎస్టేట్ దందా చేయడానికే ఈ ప్రభుత్వం ఉందా’అని ఏలేటి ప్రశ్నించారు. మంగళవారం హెచ్‌సీయూ సందర్శనకు వెళుతున్న తన హౌస్అరెస్ట్, బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్‌ను ఆయన ఖండించారు. వెంటనే అఖిలపక్ష బృందాన్ని హెచ్సీయూకు తీసుకెళ్లి చూపించాలని డిమాండ్ చేశారు. ‘త్వరలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలను సందర్శిస్తాం. వర్సిటీల భూముల జోలికి వెళితే సహించేది లేదు. భూముల వేలం ఆపడానికి ఉద్యమిస్తాం’అని హెచ్చరించారు. కాంగ్రెస్ మిత్రపక్ష నేతలైన ప్రొఫెసర్ కోదండరామ్, కూనంనేని సాంబశివరావులకు హెచ్‌సీయూ భూముల వివాదం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వేలాన్ని వెనక్కి తీసుకోవాలి: పాయల్ శంకర్ హెచ్‌సీయూ భూము ల వేలాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసు కోవాలని బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో ఎమ్మె ల్యే ధన్పాల్ సూర్యనా రాయణ గుప్తాతో కలి సి ఆయన మీడియాతో మాట్లాడారు ‘ధరణి పేరుతో నాడు కేసీఆర్ దోపిడీ చేశారు. భూమాత పేరుతో నేడు కాంగ్రెస్ భూ దందా చేయడానికి ప్రయ త్నిస్తోంది’అని ఆరోపించారు. హెచ్‌సీయూ భూములపై వాస్తవ పరిస్థితు లకు తెలుసుకుందామని వెళుతుంటే పోలీసులు తమను నిర్బంధించారని, అణచివేత ప్రజాపాలన అవుతుందా అని పాయల్‌శంకర్ ప్రశ్నించారు. -
అట్టుడికిన హెచ్‌సీయూ
గచ్చిబౌలి: కంచ గచ్చిబౌలి భూముల వేలానికి నిరసనగా హైదరాబాద్ సెంట్రల్ యూ నివర్సిటీ వద్ద ధర్నాకు వచ్చిన సీపీఎం, బీజేవైఎం కార్యకర్తల ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హెచ్‌సీయూ ప్రధాన ద్వారం బయట నిరసనకా రులు.. వర్సిటీ లోపల విద్యార్థుల ధర్నాతో హెచ్‌సీ యూ అట్టుడికిపోయింది. మంగళవారం హెచ్‌సీయూ విద్యా ర్థులు మహాధర్నాకు పిలుపు ఇవ్వడం, వర్సిటీ భూములను పరిశీలిస్తామని బీజేపీ ఎమ్మెల్యే లు చెప్పిన విషయం తెలిసిందే.ఉదయం 11 గంటల సమయంలో అటు సీపీఎం, ఇటు బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ ప్రధాన ద్వారం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్, వర్సిటీ భూములను వేలం వేయొద్దని, విద్యార్థులకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని నినదించారు. అప్పటికే భారీ సంఖ్యలో మోహరించిన పోలీసు బలగాలు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారిని అరెస్టు చేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దొరికినవారిని దొరికినట్టే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మహిళా నాయకురాళ్లను అరెస్ట్ చేశారు. నాలుగైదు వాహనాల్లో నిరసన కారులను నార్సింగి, కొల్లూరు, మాదాపూర్, రాజేంద్రనగర్, రాయదుర్గం పీఎస్‌లకు తరలించారు. దాదాపు 68 మందిని అరెస్టు చేసి, వారిపై కేసులు నమోదు చేసి రాత్రి విడుదల చేసినట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థులు మహాధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారు. ఆందోళనకు నాయక త్వం వహించిన వారిలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ల మహేందర్, సీపీఎం నేత శోభన్, ఉస్మానియా యూనివర్సిటీ పీడీఎస్‌యూ అధ్యక్షుడు ఆవుల నాగరాజు తదితరులు ఉన్నారు. ఆందోళనల నేపథ్యంలో మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ⇒ఆందోళన సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ల మహేందర్ మాట్లాడుతూ వర్సిటీ భూములను కాపాడేందుకు ఎన్ని ఉద్యమాలైనా చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. భూముల వేలాన్ని తక్షణమే సీఎం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.⇒ విద్యార్థులపై పోలీసుల ఉక్కుపాదాన్ని నిరసిస్తూ ధర్నాకు వెళితే ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారని సీపీఎం నాయకులు వాపోయారు. హెచ్‌సీయూ భూముల వేలాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
అసత్య ప్రచారం గట్టిగా తిప్పి కొట్టాలి
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) భూములకు సంబంధించిన వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందుబాటులో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కలతో సమావేశమయ్యారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో జరిగిన ఈ భేటీలో యూనివర్సిటీ భూములు, పూర్వాపరాలపై చర్చించారు.ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టాలని సూచించారు. హెచ్సీయూకు 1975లో భూమి కేటాయించినా.. అప్పటి నుంచి ఇప్పటివరకు యూని వర్సిటీకి ఎలాంటి చట్టబద్ధత కల్పించలేదని వివరించినట్లు సమాచారం. వాస్తవానికి 2,300 ఎకరాలు యూనివర్సిటీకి కేటాయించినా.. వివిధ దశల్లో ప్రభుత్వ అవసరాల కోసం భూమిని తీసుకుంటూ వచ్చినట్టుగా చెప్పారని తెలిసింది. ప్రస్తుతం యూనివర్సిటీ పరిధిలో ఉన్న 1,500కు పైగా ఎకరాలపై యూనివర్సిటీకి హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుందామని అన్నట్టు తెలిసింది. ఆ భూముల్లోనూ శిలలు, చెరువులు కాపాడదాంరాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అభివృద్ధి చేయాలనుకుంటున్న 400 ఎకరాల్లోనూ.. యూనివర్సిటీ విద్యార్థులు, పర్యా వరణవేత్తల మనోభావాలు దెబ్బతినకుండా సహజ సిద్ధ శిలా సంపద లేదా చెరువులను కాపాడుదామని ఆ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబులను కోరినట్లు తెలిసింది. వీరి ప్రతిపాదనతో ముఖ్యమంత్రి కూడా ఏకీభవిస్తూ.. వాటిని ఎట్టిపరిస్థితు ల్లోనూ పరిరక్షించాల్సిందేనని స్పష్టం చేసినట్లు చెబుతు న్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమా నికీ ఏదో విధంగా అడ్డుపుల్లలు వేయడమే పనిగా విపక్షాలు పెట్టుకున్నాయని, ఇప్పుడు కూడా విద్యార్థులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. కాగా ఆ భూములు పూర్తిగా ప్రభుత్వానివేనని, అందులో ఎలాంటి వివాదం లేదని సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చిన అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పినట్లు తెలిసింది.వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్లతో మంత్రుల సమావేశంముఖ్యమంత్రితో సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు.. వర్సిటీ మాజీ ప్రొఫెసర్లు డి.నర్సింహారెడ్డి, హరగోపాల్, ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం పర్యావరణవేత్తలతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. యూనివర్సిటీకి భూముల కేటాయింపు, అలైనేషన్ లేక పోవడం, వివిధ అవసరాల కోసం ప్రభుత్వం భూమి తిరిగి తీసుకోవడం లాంటి వివరాలను వారికి వివరించారు. -
ఆటిజం.. అర్థం చేసుకుందాం
సుధ (పేరు మార్చాం) ఇద్దరు పిల్లల తల్లి. పిల్లలకు ఏడాదిన్నర వయసు నుంచి మారాం చేసినా, అన్నం తినకపోయినా సెల్ఫోన్లో వీడియోలు పెట్టి చూపించడం అలవాటు చేసింది. ఐదేళ్ల వయసుకు వచ్చినా ఇద్దరు పిల్లలకు మాటలు సరిగా రాలేదు. ఎవరు ఏం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితి లేదు. వైద్యులను సంప్రదిస్తే ఆటిజం అని చెప్పారు.రాజ్యలక్ష్మికి నెలలు నిండకుండానే ముగ్గురు పిల్లలు పుట్టారు. ఇద్దరు కుమారుల్లో ఒకరికి రెండేళ్లు వచ్చే వరకు నడక రాలేదు. వైద్యుల వద్దకు వెళ్లగా ఆటిజం ఉన్నట్టు తేల్చారు. రెండో బాబుకు సమస్య పాక్షికంగా ఉన్నట్టు చెప్పారు.ఇదో జబ్బు అని చెప్పలేం. బుద్ధి మాంద్యతా అంటే అదీ కాదు. మానసిక వైకల్యం అనీ అనలేం. ఏదో పెద్ద లోపంగా పరిగణించలేం. ప్రత్యేకంగా మందులంటూ ఏమీ లేవు. ఎందువల్ల దీని బారిన పడతారనే దానికి స్పష్టమైన కారణాలూ ఇప్పటివరకు తెలియవు. థెరపీలు, తల్లిదండ్రులకు అవసరమైన కౌన్సెలింగ్ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం. అదే ఆటిజం (సాధారణ పిల్లల్లా లేకపోవడం). ఇది చిన్న పిల్లల్ని పీడించే ఓ రుగ్మత..ఓ సమస్య అని మాత్రమే చెప్పగలమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఆటిజంతో బాధ పడుతున్న కొందరిలో తెలివితేటలు (ఇంటెలిజెన్స్ కోషియంట్– ఐక్యూ) ఒకింత ఎక్కువగా ఉండటం గమనార్హం. కాగా ఇలాంటివారిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోపగించుకోవడం కానీ వేరుగా చూడడం కానీ చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లల్లో ఉండాల్సిన సహజ చురుకుదనం లేమి కారణంగా తల్లిదండ్రులను ఎంతో వేదనకు గురిచేసే ఆటిజంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం మీ కోసం..ఏంటీ ఆటిజం.. ?ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన రుగ్మత. అంటే న్యూరలాజికల్ డిజార్డర్‌గా భావించవచ్చు. అంతేగానీ ఓ జబ్బుగా పరిగణించడానికి వీల్లేదు. ఒకే రకమైన/నిర్దిష్ట లక్షణాలుండవు. ఏ ఇద్దరు పిల్లల్లోనూ ఒకేలా ఉండవు. లక్షణాల విస్తృతి చాలా ఎక్కువ. అందుకే దీనిని స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన రుగ్మత) లేదా ఆటిజమ్ స్పెక్ట్రమ్ అని చెబుతుంటారు. ఎలాంటి లక్షణాలుంటాయి?» చూడటానికి సాధారణ పిల్లల్లాగే కన్పిస్తుంటారు. కానీ.. » వయసుకు తగిన వికాసం లోపించిందా? అన్పించవచ్చు. » సాధారణ చిన్నారుల్లా ప్రతిస్పందించకపోవచ్చు. పేరు పెట్టి పిలుస్తున్నా పలుకకపోవచ్చు. » ఇతరులతో సమాచారం పంచుకోవడం (కమ్యూనికేషన్లో ఇబ్బంది), సంభాషిoచడంలో ఇబ్బంది పడుతుండొచ్చు. ఎదుటివారి కళ్లలో కళ్లు కలిపి చూస్తూ మాట్లాడలేరు. ఎంత పిలిచినా పలకకుండా వినికిడి లోపం ఏదైనా ఉందేమో అనిపించేలా ప్రవర్తిస్తారు. » దాదాపు 25 శాతం మంది చిన్నారులు మాటల్ని సరిగా పలుకలేరు. మాటలు రావడంలో ఆలస్యం అవుతుంది. » ఏదో లోకంలో ఉన్నట్టుగా ఉంటుండొచ్చు లేదా పలికిన మాటే పదే పదే పలుకుతూ ఉండవచ్చు. » యాస్పర్జస్ డిజార్డర్ ఉన్న పిల్లల్లో తెలివితేటలు ఒకింత ఎక్కువగా ఉండి, కొన్ని పనుల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. » కుదురుగా ఉండకుండా ఎప్పుడూ పరుగెడుతూ, గెంతుతూ ఉంటారు.» నీట్‌గా ఉండకపోవడం. చక్కగా డ్రస్ చేసుకోడానికి,సమయానికి హెయిర్ కట్ చేయించుకోడానికి నిరాకరించడం.» చేసిన పనులే పదే పదే చేస్తుండటం (రిపిటేటివ్ బిహేవియర్). కొత్త పనులపై ఆసక్తి చూపకపోవడం. ఎప్పుడూ తమకు ఇష్టమైన ఆట వస్తువునో మరొకటో పట్టుకుని ఉండటం. » గోడలపై ఉన్న సున్నం నాకడం లేదా తినడానికి యోగ్యం కాని పదార్థాలను తినడానికి యత్నించడం (పేపర్లు, షర్ట్ కాలర్ వంటి వాటిని నోట్లో పెట్టుకుని తినడానికి ప్రయత్నించడం లాంటి డిజార్డర్లు). » పిల్లలు సాధారణంగా చేసే గీతలు గీయడం, రాయడం, కత్తెర వంటి పనిముట్లను ఉపయోగించడం, నమలడం కూడా సరిగా చేయకపోవడం » సంతోషం, బాధ వంటి భావనలను త్వరగా అర్థం చేసుకోలేరు. వాటిని అర్థమయ్యేలా చెప్పలేరు. » తలను గోడకు లేదా నేలకేసి బాదుకోవడం, ఇతరులను బలంగా ఢీకొట్టడం,వస్తువులను విసిరేయడం వంటి దురుసు ప్రవర్తనలు కనబరచడం.రకరకాల థెరపీలతోనే చికిత్సచిన్నారుల వ్యక్తిగత లక్షణాలూ, భావోద్వేగ పరమైన అంశాలను బట్టి న్యూరో స్పెషలిస్టులు, సైకాలజిస్టులు, స్పీచ్ థెరపిస్టులు, బిహేవియరల్ థెరపిస్టులు ఇలా అనేక మంది స్పెషలిస్టుల సహాయంతో, సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ వంటి ప్రక్రియలతో సమీకృత చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలకు అవసరమైన విద్య అందించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సికింద్రాబాద్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్’(ఎన్ఐఈపీఐడీ) వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ చిన్నారుల కనీస స్వావలంబన కోసం పలు సామాజిక సంస్థలు, ఎన్జీవోలు కూడా పనిచేస్తున్నాయి. అటిజమ్ ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారుతోంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు కావడం, పిల్లలతో గడిపే తీరిక లేకపోవడం, ఎక్కువగా స్క్రీన్కు అడిక్ట్ కావడం వంటివి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. చదవండి: టీకాలతో ఆటిజం వస్తుందా? అసలు చికిత్స ఉందా? -
మాకూ 'మంత్రి' ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఎడతెగని సస్పెన్స్‌గా మారిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశం ఆశావహులను ఒక్కచోట నిలువనీయటం లేదు. అమాత్య పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకొంటున్నారు. కొందరు నేతలు పార్టీ అధిష్టానానికి లేఖల ద్వారా విన్నపాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనే ఢిల్లీ పెద్దలకు సామాజిక వర్గాలవారీగా ఎమ్మెల్యేలు లేఖలు రాశారు. తాజాగా పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డి రాసిన లేఖ కూడా వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖ పార్టీలో చర్చకు దారితీసింది. ఉమ్మడి జిల్లాలు.. సామాజిక వర్గాలురాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతానికి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. రెడ్డి సామాజిక వర్గానికి నాలుగు, బీసీలకు రెండు, మాల, మాదిగ, ఆదివాసీ వర్గాలకు ఒక్కోటి చొప్పున కేబినెట్ బెర్తులు లభించాయి. విస్తరణ జరిగితే బీసీ, రెడ్డి వర్గాలకు ఒకటి లేదా రెండు బెర్తులు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. జనాభా ప్రాతిపదికన మాదిగ, లంబాడా వర్గాలకు చెరో బెర్తు ఇవ్వాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. బెర్తు దక్కని నాలుగు ఉమ్మడి జిల్లాల నేతల నుంచి కూడా కేబినెట్లో స్థానంపై చాలా ఆశలున్నాయి. ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఎన్నికలకు ముందే అధిష్టానం మాట ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన కేబినెట్లో ఖాళీ బెర్తులు భర్తీ చేయాలి? ఎన్ని భర్తీ చేయాలన్న దానిపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. విస్తరణ వార్తల నేపథ్యంలో మాదిగ, లంబాడా వర్గాలతో పాటు రంగారెడ్డి జిల్లా నేతలు ఇప్పటికే అధిష్టానానికి లేఖలు రాశారు. ఒకరిద్దరికి మంత్రి పదవుల కేటాయింపులో కుటుంబ కథా చిత్రాలు కూడా నడుస్తున్నాయి. ఉంటుందా... వాయిదానా?ఇలాంటి పరిస్థితుల్లో అసలు కేబినెట్ విస్తరణ ఉంటుందా లేదా? అన్న అనుమానాలు రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ నెల 3 లేదా 4వ తేదీన విస్తరణ ఉంటుందని, మళ్లీ వాయిదా పడినా మరో వారం రోజుల్లో కచ్చితంగా విస్తరణ జరుగుతుందని ఢిల్లీ నుంచి సంకేతాలు అందుతున్నాయి. మరోవైపు కేబినెట్ విస్తరణ జరిగితే ఈ వారంలోనే ఉంటుందని, లేదంటే నిరవధికంగా వాయిదా పడినట్టేననే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతుండడం గమనార్హం.ఢిల్లీకి వెళ్లిన సీఎం, నేడు వెళ్లనున్న డిప్యూటీముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం వెళ్లనున్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని పార్లమెంటులో కూడా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు జంతర్‌మంతర్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాలో వారు పాల్గొంటారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, వాకిటి శ్రీహరి, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ప్రకాశ్‌గౌడ్, ఈర్లపల్లి శంకరయ్య తదితరులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఈ ధర్నాకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఢిల్లీలో రాహుల్‌ను సీఎం కలుస్తారని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉన్నందున వారితో పార్టీ అధిష్టానం మరోమారు చర్చలు జరిపి, మంత్రివర్గ విస్తరణ ముహూర్తాన్ని ఫైనల్ చేస్తుందా? అనేది నేడో రేపో తేలనుంది. -
కొలిక్కి చేరని ‘క్లింటన్’ కేసు!
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జర్మన్ యువతిపై జరిగిన అఘాయిత్యం రాజధానిలో తీవ్ర కలకలం సృష్టించింది. 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని బంజారాహిల్స్‌లో ఓ విదేశీ యువతిపై అత్యాచారం జరిగింది. అమెరికా నుంచి వచ్చి, బేగంపేటలోని క్లింటన్ ఫౌండేషన్‌లో న్యూట్రీషన్‌గా పనిచేసిన బాధితురాలిపై 2010 జూలై 7న ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అప్పట్లో ఈ కేసు తీవ్ర సంచలనంగా మారడంతో ఏకంగా రాష్ట్ర డీజీపీ రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా నిందితుడిని మాత్రం పట్టుకోలేకపోయారు. తుపాకీ చూపించి అత్యాచారం...అమెరికాకు చెందిన సదరు యువతి (అప్పట్లో 25 ఏళ్లు) ఉద్యోగ నిమిత్తం 2009లో నగరానికి వచ్చింది. బంజారాహిల్స్ రోడ్డు నెం. 11లోని ఓ ఇంటి పెంట్‌హౌజ్‌లో ఏడాదిన్నర పాటు నివసించింది. ఎప్పటిలాగే తన విధులు ముగించుకుని 2010 జూలై 6 రాత్రి 8 గంటలకు తన ఇంటికి చేరుకుంది. తలుపులు లోపల నుంచి తాళం వేసుకుని నిద్రించింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దాదాపు 30 ఏళ్ల వయసున్న యువకుడు కిటికీ గ్రిల్ తొలగించి లోపలకు ప్రవేశించాడు. బెడ్రూమ్లోకి వెళ్లి రివాల్వర్ చూపిస్తూ అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి పారిపోయాడు. ఉదయం బాధితురాలు నేరుగా ఆస్పత్రికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తెలిసిన వారిగా ఆధారాలు లభించినా...ఈ కేసు దర్యాప్తు కోసం నాటి పోలీసు కమిషనర్ ఏకే ఖాన్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఘాతుకం జరిగిన రోజు యువతి అల్మారాలో రూ.5 లక్షలు ఉన్నాయి. ఆమె ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడు తొలుత ఆ డబ్బు గురించే అడిగాడు. దీంతో ఆమెకు తెలిసిన వ్యక్తే ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానించారు. ఆ అమెరికన్ అప్పట్లో బేగంపేటలోని ఓ జిమ్‌కు వెళ్లేవారు. అక్కడ ఆమెతో సన్నిహితంగా మెలిగే కొందరిని అనుమానించారు. క్లూస్ టీమ్ నిపుణులు ఘటనా స్థలి నుంచి 14 ఆధారాలు సేకరించారు. ఎన్ని రకాలుగా దర్యాప్తు చేసినా... కేసు మాత్రం కొలిక్కిరాలేదు. ఆ యువతి తన స్వదేశానికి వెళ్లిపోతూ ‘ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐ హావ్ స్వీట్ మెమరీస్ ఇన్ హైదరాబాద్. బట్.. దిస్ ఇన్సిడెంట్ ఈజ్ ఎ బ్యాడ్ మెమరీ ఫర్ మీ’ (హైదరాబాద్‌లో కొంతకాలంగా ఎన్నో తీపి జ్ఞాపకాలు భద్రపర్చుకున్నా. ఈ దురదృష్టకర ఘటన చేదు గుర్తుగా మిగిలిపోయింది) అని పోలీసులతో అన్న మాటలు ఇప్పటికీ అధికారులను వెక్కిరిస్తూనే ఉన్నాయి.‘విదేశీ’ కేసులపై ప్రత్యేక చట్టం తేవాలి..విదేశీయులపై జరిగే నేరాలకు సంబంధించిన కేసులు దేశంలో తక్కువగానే నమోదవుతున్నాయి. అత్యాచారం వంటి ఉదంతాలు అరుదు. అనేక కేసుల్లో నిందితులు చిక్కుతున్నా.. ఈ కేసుల్లో శిక్షలు పడే శాతం మాత్రం దారుణంగా ఉంటోంది. బాధితులు తమ దేశాలకు వెళ్లిపోయిన తర్వాత కేసు విచారణను పట్టించుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్రతి కేసుకూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు పెట్టడం సాధ్యం కాకపోవడంతో విచారణకు చాలా సమయం పడుతోంది. ఇవన్నీ నేరగాళ్లకు కలిసి వస్తున్నాయి. విదేశీయులపై జరిగే నేరాలకు సంబంధించి ప్రత్యేక చట్టం, కోర్టులు అమలులోకి తీసుకువస్తే ఈ పరిస్థితులు మారే అవకాశం ఉంది. – పి.రామకృష్ణ, మాజీ డీఎస్పీ -
ఎగుమతి కోసం ప్రత్యేక వరి సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగవుతున్న వరికి ఉన్న డిమాండ్‌ను వాణిజ్య పరంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ భూముల్లో పండే వరి ధాన్యానికి విదేశాల్లో ఆదరణ ఉండడంతో ప్రభుత్వమే మరింత నాణ్యమైన వరి పండించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. పిలిప్పీన్స్‌తో ఇప్పటికే బియ్యం ఎగుమతి ఒప్పందాన్ని కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలకు కూడా బియ్యం ఎగుమతి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం ఆయా దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపింది. వియత్నాం మన బియ్యం కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. అయితే తమకు నాణ్యమైన, ప్రమాదకర రసాయనాలు వాడకుండా పండించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పంపాలని కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎంపికచేసిన ప్రాంతాల్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసి ఎక్స్‌పోర్టు క్వాలిటీతో బియ్యం ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. పిలిప్పీన్స్కు పంపింన ఐఆర్–64, ఎంటీయూ 1010 రకాలతో పాటు ఆ దేశ ప్రజలు ఇష్టపడే రీతిలో ఎంపిక చేసిన బియ్యాన్ని ప్రత్యేకంగా పండించి ఎగుమతి చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారం తీసుకోనుంది. సోమవారం కాకినాడలో పిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతి చేసే కార్యక్రమానికి హాజరైన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ అల్దాస్ జానయ్య.. మంత్రి ఉత్తమ్, విదేశీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆసక్తి చూపిన వియత్నాం మనదేశంలో తెలంగాణలో పండించిన ధాన్యం నాణ్యత మిగతా రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉంది. తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితులు, సారవంతమైన భూమి, మట్టిలో ఉన్న పోషకాలు వెరసి నాణ్యమైన ధాన్యం పండుతోందని వియత్నాం ప్రతినిధులు తేల్చారు. పిలిప్పీన్స్కు పంపుతున్న బియ్యం నాణ్యతలో నంబర్ వన్‌గా ఉంది.వియత్నాం మ రింత నాణ్యమైన బియ్యం కావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ సహకారంతో లక్ష హెక్టార్లలో (2.5 లక్షల ఎకరాలు) నాణ్యమైన వరిని పండించి, ఆ బియ్యాన్ని వియత్నాంతో పాటు ఇండోనేషియా తదితర దేశాలకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దక్షిణ తెలంగాణ, నిజామాబాద్‌లో సాగు.. వ్యవసాయ విశ్వ విద్యాలయం ఇచ్చే నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసిన జిల్లాల్లో ప్రభుత్వం రైతుల చేత సాగుచేయించనుంది. నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మంతోపాటు ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, మెదక్ జిల్లాలో కలిపి ఖరీఫ్‌లో 2.5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నీటి వనరులున్న సారవంతమైన భూమి ఉన్న గ్రామాలను ఎంపిక చేసి, ఆ గ్రామాల్లోని రైతుల ద్వారా వరిని పండించి ధాన్యాన్ని సేకరించాలని భావిస్తున్నారు. ఇందుకోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వియత్నాం, ఇండోనేషియా ప్రజలు ఇష్టపడే నాణ్యత గల వరి వంగడాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. వియత్నాంకు అవసరమైన బియ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని వియత్నాంకు చెందిన బియ్యం డీలర్ వివేక్ శర్మ ‘సాక్షి’కి తెలిపారు. తెలంగాణ వరికి విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఎగుమతి అవకాశాలను సది్వనియోగం చేసుకోనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. -
హెచ్‌సీయూది కాదు.. ఆ 400 ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానిది (హెచ్‌సీయూ) కాదని ప్రభుత్వం పేర్కొంది. ఆ భూమి వర్సిటీదే కానప్పుడు తీసుకుంటున్నామనడంలో వాస్తవం ఏముంటుందని ప్రశ్నించింది. ఈ భూముల కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేసింది. ఈ భూమిని పరిశ్రమల స్థాపనకు వినియోగిస్తామని తెలిపింది. ప్రస్తుతం వర్సిటీ పరిధిలో ఉన్న భూములకు చట్టబద్ధత కల్పిస్తామని వెల్లడించింది. హెచ్సీయూకు చెందిన ఇంచ్ భూమిని కూడా తీసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. పర్యావరణానికి ముప్పు తెచ్చే చర్యలు వర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఏమాత్రం చేపట్టబోమని హామీ ఇచ్చింది. హెచ్‌సీయూ భూములను లాక్కునేందుకు ప్రభు త్వం ప్రయత్నిస్తోందంటూ వివిధ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం, అభివృద్ధిని అడ్డుకునేలా బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచా రం చేస్తున్నాయని విమర్శించారు. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వ అ«దీనంలోనే ఉందని చెప్పారు. వర్సిటీకి భూమి ఇచ్చింది కాంగ్రెస్ సర్కారే: భట్టి భూమి ఇచ్చి హెచ్‌సీయూను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని భట్టి అన్నారు. ఇందులో 400 ఎకరాల భూమిని తెలుగుదేశం ప్రభుత్వం బిల్లీరావుకు చెందిన మోసపూరితమైన కంపెనీ ఐఎంజీ భారత్‌కు కట్టబెట్టిందని తెలిపారు. ఈ భూమి తీసుకున్నందుకు పరిహారంగా యూనివర్సిటీకి ఆనుకునే మరోచోట (గోపన్‌పల్లి వైపు) 397 ఎకరాలు ఇచ్చిందని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారుల మధ్య అప్పట్లోనే ఒప్పందం జరిగిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2006 నవంబర్ 21న ఐఎంజీ భారత్‌కు టీడీపీ ఇచ్చిన భూమిని రద్దు చేశారని తెలిపారు. దీంతో బిల్లీరావు హైకోర్టును ఆశ్రయించారని, కానీ వైఎస్సార్ అలుపెరగని న్యాయ పోరాటంతో ప్రజల భూమిని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళుగా ఈ భూమిని కాపాడే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. రూ.కోట్ల విలువైన భూమిని గాలికొదిలి పరోక్షంగా ఫ్రాడ్ కంపెనీకి మేలు చేసిందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి న్యాయ పోరాటం చేసి, విజయం సాధించామని, ప్రజల భూమిని ప్రజలకు చెందేలా చేశామని వివరించారు. ప్రస్తుతం ఈ భూమిని టీజీఐఐసీ ద్వారా పరిశ్రమల స్థాపనకు వినియోగించే ప్రయత్నం చేస్తున్నామని భట్టి పేర్కొన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చి, యువతకు ఉద్యోగాలు కల్పించడమే దీని ఉద్దేశమన్నారు. ఇందులో ప్రభుత్వంలోని ఏ ఒక్కరి స్వార్థం లేదని చెప్పారు. వర్సిటీ పరిసర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తుంటే వాటికి తమ హయాంలోనే అనుమతులు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ నేతలు..ఇప్పుడు పర్యావరణం దెబ్బతింటోందని మాట్లాడటంలో అర్థం లేదని విమర్శించారు. వారి రాజకీయ కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు భట్టి విజ్ఞప్తి చేశారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదు: శ్రీధర్‌బాబు కంచె గచ్చిబౌలిలోని 25వ సర్వే నంబర్లో ఉన్న భూమికి ఇప్పటివరకూ కచ్చితమైన రికార్డులు లేవని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 2016లో దీనిపై అప్పటి ప్రభుత్వం ఐఏఎస్‌లతో కమిటీ వేసిందని, ఆ కమిటీ 1,500 ఎకరాలపై యూనివర్సిటీకి హక్కులు కల్పించేందుకు కొన్ని సిఫారసులు చేసిందని చెప్పారు. అయితే గత ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మంత్రి విమర్శించారు. ఇటీవల తాము యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, రిజి్రస్టార్‌తో సంప్రదింపులు జరిపామని, చట్టబద్ధమైన హక్కులు కల్పించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఆ 400 ఎకరాల భూమిలో చెరువులు, బండరాళ్లు దెబ్బతింటున్నాయని ఒక వర్గం మీడియా, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఫెవికాల్ బంధంతో అసత్యాల ప్రచారం: పొంగులేటి హెచ్‌సీయూ ప్రాంతంలో పర్యావరణం దెబ్బతింటోందని నిరూపించగలరా? అని బీఆర్ఎస్, బీజేపీ నేతలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై ప్రత్యేక కమిటీ వేస్తామని, ఒక్క పక్షిగానీ, జంతువు గానీ చనిపోయిందని రుజువు చేయాలని విపక్షాలను డిమాండ్ చేశారు. రెండు ప్రతిపక్ష పార్టీలూ ఫెవికాల్ బంధంతో అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. దశాబ్దాలుగా ఈ భూమి కోర్టు పరిధిలో ఉంటే పోరాటం చేయలేని బీఆర్ఎస్, పరోక్షంగా బిల్లీరావుకు సహకరించిందని ఆరోపించారు. ప్రజల భూమిని తాము కాపాడుతుంటే అబద్ధాలతో గందగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ కృషిని చూసి విపక్షాలు జీరి్ణంచుకోలేకపోతున్నాయన్నారు. యూనివర్సిటీ ఏర్పాటు మొదలు, దాని అభివృద్ధికి కృషి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని పేర్కొన్నారు. వర్సిటీ భూమిలోంచి గత ప్రభుత్వం రోడ్డు వేయబోతుంటే హెచ్‌సీయూ వీసీ కోర్టును ఆశ్రయించారని, అప్పుడు ఈ భూమిపై వర్సిటీకి అధికారం లేదని అప్పటి ప్రభుత్వం చెప్పిందన్నారు. విద్యార్థుల మనోభావాలు ఏమాత్రం దెబ్బతిననివ్వబోమని చెప్పారు. విద్యార్థుల ముసుగులో అరాచకం చేయాలని చూసే శక్తులను ఏమాంత్రం ఉపేక్షింబోమని మంత్రి హెచ్చరించారు. -
పుత్తడి @ రూ. 94,000
సాక్షి, స్పెషల్ డెస్క్: పసిడి దూకుడు ఆగడం లేదు. తాజాగా మరో రికార్డును తిరగరాస్తూ 10 గ్రాముల (24 క్యారట్లు) పుత్తడి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.94,000లకు చేరింది. ఒకానొక దశలో రూ.94,200లను కూడా తాకింది. ఒక్క రోజులోనే ధర రూ.2,500 దూసుకెళ్లడం గమనార్హం. పరిశ్రమ నిపుణులు అంచనా వేసినట్టుగానే రూ.1 లక్షకు చేరువ దిశగా పుత్తడి ధర పరుగులు తీస్తోంది. ఏప్రిల్ 2 నుంచి అన్ని దేశాలపై టారిఫ్‌ల పెంపు అమలు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో కొనుగోళ్ల సెంటిమెంట్‌కు బలాన్నిచ్చింది. ఇన్వెస్టర్లకుతోడు ఆభరణాల వర్తకులు సైతం కొనుగోళ్లకు దిగడంతో పసిడి ధర ఆల్‌టైం హై నమోదు చేసింది. అటు 22 క్యారట్ల పసిడి రూ.86,300లకు చేరింది. మరోవైపు వెండి లో మూడురోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. కిలోకు రూ.500 నష్టపోయి రూ.1,02,500 స్థాయికి పరిమితమైంది. కాగా, గతేడాది ఏప్రిల్ 1న బంగారం ధర రూ.70,000 నమోదైంది. అంటే ఏడాదిలో రూ.24 వేలు పెరగడం విశేషం. ఇక 2020 ఏప్రిల్ 1న పసిడి ధర రూ.46,500 పలికింది. తాజా రి కార్డుతో పోలిస్తే ఐదేళ్లలో ధర రెండింతలకు ఎగిసింది. ధరలో 102 శాతం వృద్ధి నమోదైందన్న మాట. సురక్షిత ఆస్తుల వైపు.. 2025లో ఇప్పటివరకు పసిడి 18 కొత్త గరిష్టాలను తాకింది. 2024లో 40 కంటే ఎక్కువసార్లు ఆల్‌టైమ్ గరిష్టాలను అందుకుంది. ఏప్రిల్ 1న అంతర్జాతీయంగా ఔన్స్ (31.1గ్రాములు) ధరరూ.2,68,784 దాటింది. రెండు వారాల క్రితం ఇది రూ.2,56,800 ఉంది. యూఎస్ ప్రతిపాదిత సుంకాలు, ఆర్థిక అని శ్చితి ఆందోళనల మధ్య బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆర్థిక మాంద్యం ముప్పు, ఫెడరల్ రిజర్వ్ రేటు కోతలకు అవకాశముందన్న అంచనాల కారణంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్ బంగారం వంటి సురక్షిత ఆస్తుల వైపు మళ్లుతోంది. పెట్టుబడికి సురక్షిత సాధనంగా పుత్తడి నిలిచిందని సికింద్రాబాద్‌లోని ఆదినాథ్ జువెల్లర్స్ ఎండీ ముకేశ్‌కుమార్ సురానా వివరించారు. ఐదేళ్లలో 3,627 టన్నులు.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనా ప్రకారం 2019 నాటికి భారతీయ కుటుంబాల వద్ద సుమారు 24,000–25,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. 2020 నుంచి 2024 వరకు 3,627 టన్నుల పసిడిని భారత్ దిగుమతి చేసుకుంది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద ఉన్న పుత్తడి నిల్వలు 2019 నాటికి 618.2 టన్నులు. 2024 డిసెంబర్ నాటికి ఇవి 876.18 టన్నులకు చేరాయి. ఐదేళ్లలో ఆర్బీఐ 258 టన్నులు అదనంగా సమకూర్చుకుంది. కరోనా మహమ్మారి, తదనంతర కాలంలో అమ్మకం, తాకట్టు ద్వారా కోట్లాది కుటుంబాలను బంగారమే ఆదుకుంది. గత ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో ప్రజల వద్ద పుత్తడి నిల్వలు 25,000 టన్నులు ఉన్నాయని హెచ్ఎస్బీసీ గ్లోబల్ వెల్లడించింది. దాచిందంతా బంగారమే.. అవును మీరు చదివింది నిజమే. దాచిందంతా బంగారమే. ఎంతలా అంటే ఊహకు అందనంత. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.11,87,50,00,00,00,000 కోట్లు. సింపుల్‌గా రూ.118 లక్షల కోట్లకుపైమాటే. భారతీయ కుటుంబాలు దాచుకున్న 25,000 టన్నుల బంగారం విలువ ఐదేళ్లలో ఈ స్థాయిలో ఎగిసింది. పుత్తడి ధర ఐదు సంవత్సరాల్లో రెండింతలకుపైగా దూసుకుపోవడమే ఇందుకు కారణం. అయితే ఒక్క ఏడాదిలోనే భారతీయ కుటుంబాల వద్ద బంగారం రూపంలో ఉన్న ఈ సంపద రూ.60 లక్షల కోట్లు వృద్ధి చెందడం మరో విశేషం. ఆభరణం, పొదుపు, పెట్టుబడి.. బంగారం కొనుగోలుకు కారణం ఏదైనా ఈ ‘గోల్డెన్డేస్’జనానికి కాసులు కురిపిస్తోందని పెద్దపల్లికి చెందిన బంగారం వ్యాపారి కట్టా సంజీవ్ కుమార్ తెలిపారు. ధర దూకుడుగా ఉన్నా భవిష్యత్ అవసరాల కోసం కొనుగోళ్లు జరుపుతున్నారని చెప్పారు.ఐదేళ్ల బంగారం ముచ్చట్లు3,627 టన్నులు భారత్ దిగుమతి చేసుకున్న పుత్తడి258 టన్నులు ఆర్బీఐ అదనంగాసమకూర్చుకున్న బంగారంరూ. 47,500 అధికమైన పసిడి ధరపసిడి రూపంలో పెరిగిన సంపదరూ.118 లక్షల కోట్లు ఐదేళ్లలోరూ.60 లక్షల కోట్లు సంవత్సరంలో2,16,265 టన్నులు 2024 డిసెంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన పసిడి11.56 శాతం మొత్తం పరిమాణంలో భారతీయుల వద్ద ఉన్న బంగారం -
బీజేపీ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని రంగాల్లోనూ బీజేపీ విఫలం కావడంతోపాటు ఆ పార్టీ నిజ స్వరూపాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. బీజేపీలో 75 ఏళ్లు దాటినవారు అధికారిక పదవుల నుంచి తప్పుకోవాలంటూ ఆ పారీ్టలో ఒత్తిళ్లు వస్తున్నాయి. దీంతో బీజేపీ నాయకత్వం అనేక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. రాబోయే రోజుల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు మాత్రమే ఏర్పడతాయి. సంకీర్ణ రాజకీయాల్లో మనం కీలకంగా మారుతాం’అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 20 మంది ముఖ్య నేతలతో మంగళవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో వరంగల్‌లో నిర్వహించే పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లపై చర్చించారు. దేశ, రాష్ట్ర రాజకీయ స్థితిగతులపైనా కేసీఆర్ ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు తగినంత సమయం ఇచ్చాం ‘రాష్ట్రంలో అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజలు వందశాతం ప్రభుత్వ పనితీరుపై పూర్తి అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిన్నరగా తగినంత సమయం ఇచ్చాం. ప్రభుత్వాన్ని ఎండగట్టి, హామీల అమలు వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీ బహిరంగసభ నిర్వహించడమే సరైన మార్గం. అందుకే వరంగల్‌లో జరిగే బహిరంగసభను విజయవంతం చేసేందుకు పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో కదలాలి. తెలంగాణ సోయి మనకు ఉన్నా ఏమరుపాటుతనంతోనే ఓటమి పాలయ్యాం. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా, ప్రజలకు చేరువయ్యేందుకు మనం కృషి చేయాలి’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. రజతోత్సవ సభ కేంద్రంగా దిశానిర్దేశం వరంగల్‌లో నిర్వహించే పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నియోజకవర్గాల వారీగా జనం, వాహనాల సమీకరణపై పలు సూచనలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి నుంచి రెండు లక్షల మంది జనసమీకరణ లక్ష్యంగా నిర్దేశించినట్టు సమాచారం. బుధవారం నుంచి జిల్లాల వారీగా ముఖ్య నేతలతో బహిరంగసభ సన్నాహాలపై కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో సమీక్షిస్తారు. బుధవారం ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లా నేతల సమావేశం జరుగుతుంది. కేసీఆర్ వరుస సమీక్షల నేపథ్యంలో కేటీఆర్ జిల్లాల వారీగా బహిరంగసభ సన్నాహక సమావేశాలు రద్దయ్యే అవకాశమున్నట్టు తెలిసింది. బహిరంగసభ తర్వాతే సంస్థాగత నిర్మాణం వరంగల్ సభ నిర్వహణ సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, పార్టీనేత గ్యాదరి బాలమల్లుకు అప్పగించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు జన సమీకరణపై దృష్టి పెట్టాల్సిందిగా కేసీఆర్ ఆదేశించారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు, అన్ని స్థాయిల్లో పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు షెడ్యూలు విడుదల చేస్తామని కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. -
ఆ 400 ఎకరాల చదును వెంటనే ఆపండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు అటవీ భూములను తెలంగాణ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ)కి బదిలీ చేసి, చదును చేయడాన్ని వెంటనే ఆపాలని హైకోర్టులో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కె.బాబురావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ‘సర్వే నంబర్ 25లోని కంచ గచ్చిబౌలి అడవిలో 30–40 జేసీబీలతో సర్కార్ చెట్లను తొలగిస్తోంది. హింసాత్మక అటవీ నిర్మూలనను ఆపాలి’అని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు..ప్రభుత్వం ఆ 400 ఎకరాలను చదును చేస్తున్న నేపథ్యంలో అత్యవసర విచారణ చేపట్టాలని తొలి పిల్ దాఖలు చేసిన వటా ఫౌండేషన్ (ఈఎన్‌పీవో) తరఫు న్యాయవాది ఒమర్ ఫారుక్.. ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు విజ్ఞప్తి చేశారు. మధ్యంతర అప్లికేషన్ దాఖలు చేశారు. అభ్యర్థనను పరిశీలించిన ధర్మాసనం రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై బుధవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. వాస్తవానికి వటా దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. కానీ, సర్కార్ చెట్లను తొలగించి భూమి చదును చేస్తున్న నేపథ్యంలో ఈ రెండు పిల్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఐటీ, ఇతర అవసరాల కోసం ఎకరం రూ.75 కోట్లకు సంస్థలకు కేటాయించేలా కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల అటవీ భూములను టీజీఐఐసీకి సర్కార్ కేటాయించింది. దీనికి సంబంధించి గత ఏడాది జూన్ 26న రెవెన్యూశాఖ జారీ చేసిన జీవో 54ను సవాల్ చేస్తూ వటా ఫౌండేషన్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం గత నెల 24న విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు చెప్పాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుందా? చేస్తే ఎలాంటి ఆదేశాలిస్తుంది? అనేది ఉత్కంఠగా మారింది. -
ట్రిపుల్ ఆర్ పరిహారం పంపిణీ షురూ
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం అలైన్మెంటులో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు మార్గం సుగమమైంది. ఉత్తర భాగానికి తాజా గా కేంద్ర అటవీ శాఖ పర్యావరణ అనుమతులు జారీ చేయటంతో గ్రామాల వారీగా అవార్డులు పాస్చేయటం ప్రారంభించారు. త్వరలో పరిహారం డబ్బులు వారి ఖాతాల్లో జమ చేసేందుకు ఎన్హెచ్ఏఐ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తర భాగంలో 1,950 హెక్టార్ల మేర భూమిని సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి నిర్వాసితులకు రూ.5,100 కోట్లను పరిహారంగా అందించాల్సి ఉంది. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.2,550 కోట్లు భరించాల్సి ఉండగా, ఇటీవలి బడ్జెట్లో ట్రిపుల్ ఆర్కు రూ.1,250 కోట్లు ప్రతిపాదించింది. ఈ మొత్తాన్ని పరిహారం కోసమే వినియోగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం వాటాకు సంబంధించిన నిధులు ఎన్హెచ్ఏఐ ఖాతాలో జమ అయ్యాయి. ఇప్పుడు భూసేకరణ ప్రాధికార సంస్థ (కాలా)ల వారీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా డబ్బులు ఉమ్మడి ఖాతాలోకి విడుదల కానున్నాయి. అక్కడి నుంచి రైతుల ఖాతాలకు బదిలీ అవుతాయి. రోడ్ నంబర్ నిబంధన నుంచి మినహాయింపు కొత్తగా నిర్మించబోయే జాతీయ రహదారులకు రోడ్ నంబర్‌ను కేటాయించిన తర్వాతనే పర్యావరణ అనుమతులు వస్తాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచి్చంది. దీంతో ట్రిపుల్ ఆర్కు ఎక్స్‌ప్రెస్ వే నంబర్ కేటాయించటానికి ముందు పర్యావరణ అనుమతులు జారీ చేసేందుకు వీలు కలిగింది. ట్రిపుల్ ఆర్ బడ్జెట్‌కు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అప్రూవల్ రావాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే దానికి నంబర్ కేటాయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తవటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తరభాగం 162 కి.మీ. నిడివి రోడ్ నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ టెండర్లు పిలిచింది. రెండు పర్యాయాలు గడువు కూడా పొడిగించింది. పర్యావరణ అనుమతులు రాకుండా టెండర్లను తెరిచేందుకు వీలుండదు. ఫలితంగా టెండర్ల గడువు పొడిగిస్తూ వెళ్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే పర్యావరణ అనుమతుల జారీకి కేంద్రం ఓకే చెప్పింది. 80% మ్యుటేషన్ అయ్యాకే పనులు..: రోడ్ నిర్మించే సంస్థను ఎంపిక చేసేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. అక్కడి సాంకేతిక సమస్యలు పరిష్కరించుకున్న తర్వాత వాటిని ఓపెన్ చేసి నిర్మాణ సంస్థను ఖరారు చేస్తారు. అప్పటికి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావాలంటే, మొత్తం అలైన్మెంట్ నిడివిలో 80 శాతం భూమికి సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. వీలైనంత వేగంగా, ఎలాంటి సాంకేతిక, న్యాయ సంబంధిత చిక్కులు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.త్వరలో మ్యుటేషన్..భూపరిహారం జారీకి వీలుగా కాలా (భూసేకరణ ప్రాధికార సంస్థ)ల వారీగా అవార్డుల జారీ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కాలాల పరిధిలోని గ్రామాలవారీగా రైతులు, వారి అ«దీనంలో ఉన్న భూముల వివరాలను అధికారులు సేకరించారు. ఆయా రైతులను కాలా కార్యాలయానికి పిలిపించి అవార్డులపై సంతకాలు తీసుకుంటున్నారు. రైతు భూమి విస్తీర్ణం, ఆ భూముల్లోని నిర్మాణాలు, విలువైన తోటలు, చెట్లు, ఇతర నిర్మాణాలు, కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం వాటికి చెల్లించే మొత్తం.. తదితర వివరాలను తెలుపుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే వారి ఖాతాల్లో పరిహారం నగదు జమ చేయనున్నారు. మరో నెలన్నరలో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైనా భూ యజమానులు ఈ పరిహారం మొత్తాన్ని తీసుకునేందుకు ససేమిరా అంటే ఆర్బిట్రేషన్ ప్రకారం మరోసారి పరిశీలించి తుది మొత్తాన్ని ఖరారు చేస్తారు. అప్పటికి కూడా ఆ మొత్తం తక్కువగా ఉందన్న కారణంతో తీసుకునేందుకు నిరాకరించే పక్షంలో కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఖాతాలో జమ చేస్తారు. ఖాతాల్లో జమ చేసిన తర్వాత భూముల దస్తావేజులను అధికారులు సేకరించి భూమి మ్యుటేషన్ చేయిస్తారు. దీంతో ఆ భూములు ఎన్హెచ్ఏఐ అధీనంలోకి వెళ్తాయి. -
వర్శిటీ భూములను మేం లాక్కోవడం లేదు: భట్టీ
సాక్షి, హైదరాబాద్: హెచ్‌యూసీ భూములపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని.. ఆ భూములను ప్రభుత్వం తీసుకోవడం లేదని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. హెచ్‌సీయూ వ్యవహారంపై తెలంగాణ మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. కావాలనే బీజేపీ, బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నాయని.. హెచ్‌సీయూ నుంచి ఒక ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదు.. వర్శిటీ భూమి వర్శిటీకే ఉంది.. కావాలనే విద్యార్థులను రెచ్చగొడుతున్నారు’’ అని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ఆ భూముల్లో చెరువు, రాక్‌ఫామ్‌లను కాపాడతామని.. జీవ వైవిధ్యానికి ఎలాంటి నష్టం కలగకుండా చూస్తామని మంత్రి అన్నారు.ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ‘‘ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరిస్తున్నాం. అభివృద్ధిని అడ్డుకోవాలని కొన్ని పార్టీలు యత్నిస్తున్నాయి. కంచ గచ్చిబౌలి భూములపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే. ప్రభుత్వ పనికి అడ్డు తగిలితే ఉపేక్షించం’’ అని భట్టి హెచ్చరించారు. -
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఐదు రోజుల పాటు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భానుడి భగభగల నుంచి కాస్త ఊరట లభించనుంది. తెలంగాణలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రేపు, ఎల్లుండి ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు పడతాయని.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణం కేంద్రం తెలిపింది.ఇక..వర్ష ప్రభావంతో ఏప్రిల్ 2, 3 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కొన్నాళ్ల కిందట అకాల వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్– విజయవాడ హైవే.. ఏ వాహనానికి ఎంత టోల్ చార్జీ?
టోల్ ప్లాజాల్లో సవరించిన చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రకటించింది. హైదరాబాద్– విజయవాడ మార్గంలోని నేషనల్ హైవే–65పై టోల్ చార్జీలు తగ్గగా, తెలంగాణ (Telangana) మీదుగా సాగే ఇతర జాతీయ రహదారులపై మాత్రం చార్జీలు పెరిగాయి.వరంగల్– హైదరాబాద్ బైపాస్ రోడ్డుపై టోల్ ప్లాజాల్లో చార్జీలు.. → కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వాహనం ఒక వేపు రూ.125, అప్, డౌన్ రూ.190, లైట్ కమర్షియల్ వాహనం, లైట్ గూడ్స్ వాహనం, మినీ బస్సు రూ.205, అప్, డౌన్ రూ.305, బస్సు, ట్రక్కుకు ఒక వైపు రూ.425, అప్, డౌన్ రూ.635, కమర్షియల్ వాహనం ఒక వైపు రూ.465, అప్, డౌన్ రూ.695, హెచ్‌సీఎం, ఈఎంఈ వాహనం ఒకవైపు రూ.665, అప్, డౌన్ రూ.1,000, ఓవర్‌సైజ్ వాహనం ఒక వైపు రూ.810, అప్, డౌన్ రూ.1,215, నెలవారీ పాస్ (Monthly Pass) ధర రూ.340 నుంచి రూ.350కి పెరిగింది. ఎన్‌హెచ్–44పై ఇందల్వాయి టోల్గేట్ వద్ద ఇలా.. → నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద కారు, జీపు, వ్యాన్ లేదా లైట్ మోటార్ వాహనాలకు సింగిల్ జర్నీకి రూ. 90గా టోల్ చార్జీ ఖరారైంది. అలాగే 24 గంటల్లోపు రిటర్న్ జర్నీకి రూ. 135, 50 సింగిల్ జర్నీలతో కూడిన మంత్లీ పాస్‌కు రూ. 3,035, టోల్‌ప్లాజాకు 20 కి.మీ. పరిధిలో ఉండి రిజిస్టర్ చేసుకున్న వాహనాలకు మంత్లీ పాస్ రూ. 350కు పెరిగాయి. → లైట్ కమర్షియల్ వాహనాలు, లైట్ గూడ్స్ వాహనాలు, మినీ బస్‌లకు సింగిల్ జర్నీకి రూ. 145, 24 గంటల లోపు రిటర్న్ జర్నీకి రూ. 220, మంత్లీ పాస్‌కు రూ. 4905లకు పెరిగాయి. → బస్‌లు, రెండు ఎక్సెల్ గల ట్రక్కులకు సింగిల్ జర్నీకి రూ. 310, 24 గంటల లోపు రిటర్న్ జర్నీకి రూ. 465, మంత్లీ పాస్‌కు రూ.10,280 లకు పెరిగాయి. → హెవీ కన్స్ట్రక్షన్ వాహనాలు, ఎర్త్ మూవింగ్ వాహనాలు, మల్టీపుల్ ఎక్సల్ వాహనాలకు సింగిల్ జర్నీకి రూ.485, 24 గంటల లోపు రిటర్న్ జర్నీకి రూ.725, మంత్లీ పాస్‌కు రూ.16,120 లకు పెరిగాయి. చదవండి: హైదరాబాద్– విజయవాడ హైవేపై టోల్ చార్జీలు ఎందుకు తగ్గాయి?→ ఏడు ఎక్సెల్లు కలిగి ఉన్న భారీ వాహనాలకు సింగిల్ జర్నీకి రూ. 590, 24 గంటల లోపు రిటర్న్ జర్నీకి రూ.885, మంత్లీ పాస్‌కు రూ. 19,625లకు చార్జీలు (Charges)పెరిగాయి. -
హెచ్‌సీయూ భూముల వివాదం.. మంత్రులతో రేవంత్ అత్యవసర భేటీ
సాక్షి, హైదరాబాద్: మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. హెచ్‌సీయూలో ఆందోళనపై సీఎం చర్చించారు. ఈ భేటీకి భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క హాజరయ్యారు. హెచ్‌సీయూతో పాటు కీలక అంశాలపై మంత్రుల బృందం చర్చించినట్లు సమాచారం. కాగా, హెచ్‌సీయూలో ఉద్రికత్త నెలకొంది. యూనివర్సిటీ ముట్టడికి సీపీఎం, బీజేవైఎం నేతలు ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.కాగా, కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములకు సంబంధించి మొదలైన వివాదం క్రమంగా ముదురుతోంది. భూములు తమవంటే తమవేనంటూ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) వేర్వేరు వాదనలు వినిపిస్తూ ‘ప్రకటనల యుద్ధానికి’ తెరలేపాయి. మరోవైపు వర్సిటీ భూములు కాపాడుకుంటామంటూ విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విపక్షాలు వారి పోరాటానికి మద్దతు పలకడమే కాకుండా, ప్రభుత్వ వైఖరిపై విరుచుకు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం కంచె గచ్చిబౌలి భూముల వివాదమే హాట్ టాపిక్‌గా మారింది.కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని 2004 లో చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ అకాడమీకి అ ప్పగించింది. అయితే ఆ కంపెనీకి సామర్థ్యం లేద ని, కంపెనీ బోగస్ అని ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఆ కేటాయింపుల్ని రద్దు చేసింది. ఈ రద్దుపై ఐఎంజీ కోర్టును ఆశ్రయించింది. 21 ఏళ్ల పాటు జరిగిన న్యాయపోరాటం త ర్వాత ఆ భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ భూములను ప్రభుత్వం టీజీఐఐసీకు కేటాయించింది. ఆ భూ ములను అభివృద్ధి చేసి పరిశ్రమలకు విక్రయించాల ని టీజీఐఐసీ నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆ భూములు హెచ్సీయూవి అంటూ విద్యార్థులు ఆందోళనలకు దిగడంతో వివాదం మొదలైంది. -
కేబినెట్ విస్తరణ.. కాంగ్రెస్ హైకమాండ్‌కు జానారెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉండే చాన్స్ ఉందనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానానికి ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాశారు. ఖర్గే, కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ నిర్ణయంతో ప్రజలకు ప్రయోజనమే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహద పడుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.కాగా, తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. ఇప్పటికే ఆశాహుల జాబితాను హైకమాండ్‌కు పంపించినట్లు సమాచారం. ఇప్పటికే తమ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ.. ఇటీవల మాదిగ, లంబాడి, బీసీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు కూడా అధిష్టానానికి లేఖలు రాశారు. ఈ మేరకు ఏఐసీసీ నేతలు రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్, పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌లకు తమ వినతులను పంపారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. ఇందులో నాలుగింటిని భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
గోడు చెప్పుకోలేక..వినేవారులేక!
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న రాష్ట్రానికి చెందిన ఓ మూగ, బధిర విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం అర్ధరాత్రి హాస్టల్ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఎం. రాహుల్ చైతన్య (18) అనే యువకుడు తనువు చాలించాడు. పుట్టినరోజున తల్లికి మెసేజ్ పంపి బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు. మృతుడి స్వస్థలం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామం. ఇదే కళాశాలకు చెందిన కాట్రవత్ అఖిల్ (20) అనే మరో తెలంగాణ విద్యార్థి కార్డియాక్ అరెస్ట్‌తో ఆదివారం రాత్రే మరణించడం గమనార్హం. తీవ్రంగా గాయపడిన రాహుల్‌ను సమీపంలోని ఎస్ఆర్ఎన్ హాస్పిటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ధూమన్‌గంజ్ ఏసీపీ అజేంద్ర యాదవ్ తెలిపారు. తమ కళాశాలలోని మూగ, బధిర విభాగంలో రాహుల్ చైతన్య బీటెక్ ఫస్టియర్‌లో చేరాడని అలహాబాద్ ట్రిపుల్ ఐటీ పీఆర్వో పంకజ్ మిశ్రా చెప్పారు. గత మూడు నెలలుగా అతను తరగతులకు హాజరుకావడం లేదని.. చదువుల సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నారు. ఈ ఒత్తిడి గురించి అతను తల్లికి కూడా తెలియజేశాడని వివరించారు. ఇద్దరు విద్యార్థుల మరణంపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టేందుకు యాజమాన్యం త్రిసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. -
14 ఏళ్లుగా.. వేసవిలో వారి పాలిట అక్షయ పాత్ర
నగరంలోని సనత్‌నగర్‌కు చెందిన శ్రీనివాస రామానుజ చారిటబుల్ ట్రస్ట్ పేదలకు, బాటసారులకు సేవలందిస్తోంది. వేసవిలో వారి పాలిట అక్షయ పాత్రలా మారుతోంది. ప్రతి రోజూ మధ్యాహ్నం మితాహారాన్ని అందిస్తూ అభాగ్యుల ఆకలి తీరుస్తోంది. యేటా రెండు నెలల పాటు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం వేసవి కావడంతో మంగళవారం నుంచి మరోసారి ఈ మహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. – సనత్‌నగర్ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 ఏళ్లుగా అన్నార్థుల ఆకలి తీరుస్తోంది శ్రీనివాస సమాజ సేవా సమితి. స్థానిక బీకేగూడ పార్కు వద్ద రోజుకు 250 నుంచి 300 మంది వరకూ మధ్యాహ్నం మిత భోజనాన్ని వడ్డించేందుకు సీనియర్ సిటిజన్స్ సిద్ధమయ్యారు. దాతల సహకారంతో.. రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున దాతలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు పోటీపడు తుంటారు. అయితే రోజుకో దాత అనే సంప్రదాయాన్ని ట్రస్ట్ కొనసాగిస్తూ వస్తోంది. దాతల కోరిక మేరకు పుట్టిన రోజు, పెళ్లిరోజు వంటి కొన్ని ప్రత్యేక తేదీల్లో వారి పేరున నలుగురికీ ఆహారాన్ని పంచుతోంది. ఈ యేడాదికి గానూ ఇప్పటికే జూన్ 2 వరకూ అన్ని రోజులకు సరిపడా దాతలు తమ తేదీలను బుక్ చేసుకున్నారు. రోజుకు రూ.5వేల చొప్పున.. ఒక్కో దాత నుంచి రోజుకు రూ.5వేల చొప్పున మాత్రమే స్వీకరిస్తారు. వీటితో రుచికరమైన వంటకాలను అందిస్తారు. బగారా రైస్, టమాటా రైస్, జీరా రైస్, కర్రీ, పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి, స్వీట్స్‌తో పాటు ప్లేట్లు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను కలిపి రూ.5,000 గా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ట్రస్ట్‌కు నగదు, చెక్కు రూపంలో స్వీకరిస్తారు. దాతల సహకారం అపూర్వం.. మంగళవారం ఉదయం 11.30 గంటలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఈ మితాహార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇలాంటి అపూర్వమైన కార్యక్రమంలో దాతల సహకారం అపూర్వం. దీనికి సీనియర్ సిటిజన్స్ తోడవ్వడం మా అదృష్టం. వారి సహకారం మరువలేనిది. ఏటా మాదిరిగానే చలివేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిన శ్యాంసుందర్రాజ్కు కృతజ్ఞతలు. – పార్థసారథి, శ్రీనివాస రామానుజ ట్రస్టీ -
HCU భూములపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలి.. లేదంటే
హైదరాబాద్,సాక్షి: కంచ గచ్చిబౌలి (kancha gachibowli)లో వివాదం నెలకొన్న 400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (hcu) భూముల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay Kumar) వ్యాఖ్యానించారు.హెచ్‌సీయూ భూముల వేలాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. అక్కడ వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు మంగళవారం హెచ్‌సీయూలో పర్యటించేందుకు బీజేపీ నేతలు బయల్దేరారు. ఈ క్రమంలో హెచ్‌సీయూ భూములపై బండి సంజయ్ మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలోనిది. అటవీ శాఖ పరిధికి చెందిన భూముల్లో మొక్కల్ని నరకాలన్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదం తీసుకోవాలి. ఇదే అంశంపై గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోంది. వట ఫౌండేషన్ అనే ఎన్జీవో దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ భూములను వేలం వేయడం కుదరదు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల చదను పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోంది. చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోంది. ఆ భూములను డీఫారెస్టైజేషన్ చేసి అమ్మి వేల కోట్లు దండు కోవాలనుకోవడం దుర్మార్గం.గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని రేవంత్ రెడ్డి గతంలో వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారా?. కంచె గచ్చిబౌలి భూముల విక్రయం కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. తక్షణమే గచ్చిబౌలి భూముల అమ్మకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని’ హెచ్చరించారు. -
సన్న బియ్యం పంపిణీకి బ్రేక్
హైదరాబాద్: ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈనెల 1వ తేదీ నుంచి ఇవ్వాల్సిన సన్నబియ్యం పంపిణీకి బ్రేక్ పడింది. రేషనింగ్ ఖైరతాబాద్ సర్కిల్–7 పరిధిలోని 81 రేషన్‌షాపుల పరిధిలో రూ.2,95,779 మంది కార్డుదారులకు తీవ్ర నిరాశే మిగిలింది. ఉగాది కానుకగా వీరందరికీ ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. అయితే కోడ్ నేపథ్యంలో సన్నబియ్యం పంపిణీ చేపట్టవద్దని ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో సర్కిల్–7 పరిధిలో ఏప్రిల్ నెల కోటా కింద దొడ్డి బియ్యాన్ని పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు. సన్న బియ్యం బస్తాలు ఒక మూలన పెట్టాలని కూడా ఆదేశించారు. అన్ని రేషన్ షాపులు దొడ్డి బియ్యం పంపిణీ చేయనున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఏప్రిల్ 29 వరకు అమలులో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నెల కోటా కింద సన్న బియ్యం ఇవ్వడం లేదని, మే నెల నుంచి పంపిణీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో విదేశీ మహిళపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్: మీర్పేట్లో విదేశీ మహిళపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. లిఫ్ట్ పేరిట ఆమెను ఎక్కించుకుని వెళ్లిన కొందరు యవకులు ఘాతుకానికి ఒడిగట్టారు.మీర్‌పేట వద్ద వాహనాల కోసం ఎదురు చూస్తున్న విదేశీయురాలిని లిఫ్ట్ వంకతో తీసుకెళ్లారు. ఆపై పహాడీషరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయ్యింది. సదరు బాధితురాలు జర్మనీకి చెందిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం.. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
బస్సును ఓవర్టేక్ చేయబోయి..
హైదరాబాద్: బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పిన ఇన్నోవా వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.గుంటూరుకు చెందిన కొండేపాటి పుల్లారావు నగరానికి వచ్చి బీఎన్‌రెడ్డి నగర్లో నివాసం ఉంటున్నాడు. సోమవారం అతను భార్య పిల్లలతో కలిసి బైక్‌పై ఈసీనగర్ నుంచి పెద్ద చర్లపల్లి వైపుగా వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఇన్నోవా వాహనం బస్సును ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో పుల్లారావు (32) అక్కడికక్కడే మృతి చెందగా, అతడి భార్య నాగరాణి, కుమారులు రుత్విక్, రాజేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. ఇన్నోవా డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. -
ప్రభుత్వమా? బుల్డోజర్ కంపెనీయా?
హైదరాబాద్, సాక్షి: హెచ్‌సీయూ భూముల వెనుక దాస్తున్న నిజం ఏంటో బయటపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తాజా హెచ్‌సీయూ ఉద్రిక్తతల పరిణామాలపై స్పందించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పర్యావరణ పరిరక్షణ పేరిటి పేదల ఇళ్లు కూల్చారు. అభివృద్ధి పేరుతో గిరిజన తండాలపైకి వెళ్లారు. జంతువుల ప్రాంతాలకు వెళ్లి సామూహిక హత్య చేస్తున్నారు. పైగా అభివృద్ధి, ప్రభుత్వ భూమి అని సమర్థించుకుంటున్నారు. ఇది ప్రభుత్వమా? బుల్డోజర్ కంపెనీయా?. ఎన్నికైన ప్రజాప్రతినిధులా? రియల్ ఎస్టేట్ ఏజెంట్లా?.. విధ్వంసం ఒక్కటే మీ ఎజెండా… ఖజానాకు కాసులు నింపుకోవడమే మీ లక్ష్యం. సెలవు దినాల్లో, అర్ధరాత్రి మీ బుల్డోజర్లు ఎందుకు నడుస్తున్నాయి?. కోర్టులు అంటే ఎందుకు మీకు అంత భయం? అంటూ రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే.. హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటానికి కేటీఆర్ ఇప్పటికే మద్దతు ప్రకటించారు. -
HCUలో భూ రగడ.. ఓయూలో ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: హెచ్‌సీయూలో ఉద్రికత్త నెలకొంది. యూనివర్సిటీ ముట్టడికి సీపీఎం, బీజేవైఎం నేతలు ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తరుణంలో హెచ్‌సీయూ భూములపై బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క ఇద్దరూ హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులే. HCU వెళ్తే ఆ ఇద్దరు మంత్రులు ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు? క్యాబినెన్‌లో మంత్రుల మధ్య ఏకాభిప్రాయం లేదని స్పష్టంగా తెలుస్తుంది. రాబర్ట్ వాద్రా కోసమే భూములు అమ్మకానికి పెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్.. హెచ్‌సీయూ గురించి మాట్లాడుతున్నారు. BRS, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. BRS చేసిన మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. భూముల వేలం ఆపడానికి ఉద్యమిస్తాం.అభివృద్ధి అంటే భూముల అమ్మకమా?’ అని ప్రశ్నించారు.పార్లమెంట్‌కు చేరిన హెచ్‌సీయూ భూముల రగడ :రాజ్యసభ జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్హెచ్సీయూ భూముల వేలాన్ని వెంటనే ఆపివేయాలిపర్యావరణాన్ని కాపాడాలిఅరుదైన పక్షులు, వృక్షజాతులు అక్కడ ఉన్నాయిఉగాది పండుగ రోజున అర్ధరాత్రి హెచ్‌సీయూ భూముల్లో బుల్డోజర్లు నడిపించారుహెచ్సీయూ భూముల అమ్మకంపై పోరాడుతున్న బీజేపీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారుభూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ హెచ్‌సీయూ విద్యార్థులు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారుఉచిత హామీల పథకం కోసం భూములను అమ్మవద్దు తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదురాహుల్, రేవంత్ రాజ్యాంగం నడుస్తుందిమంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం:కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న 11మంది మంత్రులుసీఎం ఎందుకు మీటింగ్ పెట్టారనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్అధికారులపై విద్యార్థుల దాడి : డీసీపీ వినీత్హెచ్సీయూలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలుఇటు ఉస్మానియాలో ఆందోళన బాట పట్టిన విద్యార్థులు హెచ్‌సీయూ భూములపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని మాదాపూర్ డీసీపీ వినీత్ విజ్ఞప్తిప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం టీజీఐఐసీ ఆధ్వర్యంలో కంచ గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లో అభివృద్ధి పనులు అభివృద్ధి పనులు అడ్డుకున్న విద్యార్థులు అధికారులు, కార్మికులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని డీసీపీ వినీత్ వెల్లడిహెచ్సీయూ భూముల వివాదంపై హైకోర్టులో పిటిషన్ :కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వట ఫౌండేషన్కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవంగా ప్రకటించాలని పిటిషన్అత్యవసర పిటిషన్‌గా విచారణకు స్వీకరించాలని కోరిన వట ఫౌండేషన్ లాయర్రేపు విచారణకు స్వీకరిస్తామని తెలిపిన హైకోర్టు యూనివర్సిటీ భూముల్ని పరిశీలించేందుకు బయల్దేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారయణతోపాటు ఇతర బీజేపీ నేతలు యూనివర్సిటీకి వెళ్లకుండా అడ్డుకున్నారు. హెచ్‌సీయూ భూమల వేలం వ్యవహారంపై ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దీంతో నిరసనల్ని ఉద్ధృతం చేయాలని విద్యార్థులు నిర్ణయించారు. బీజేపీ విద్యార్థి యువజన విభాగం హెచ్‌సీయూని ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హెచ్‌సీయూ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రికత నెలకొంది. హెచ్‌సీయూ భూముల్ని పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ శ్రేణుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. హెచ్‌సీయూ భూముల్ని పరిశీలించేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు బయల్దేరారు. భూముల వద్ద వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోనున్నారు. ఈ తరుణంలో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) క్యాంపస్ అట్టుడికిపోతోంది. ఇవాళ్టి నుంచి పోరాటం ఉధృతం చేయాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో తరగతుల్ని బహిష్కరించి ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఒకవైపు.. బీజేపీ ఎమ్మెల్యేలు HCU సందర్శన వేళ.. హైదరగూడ MLA క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో యూనివర్సిటీ వద్దకు వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీని సందర్శిస్తామని అంటోంది. ఇప్పటికే భూముల వేలం పై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని బీజేపీ నిర్ణయించింది. తద్వారా వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని భావిస్తోంది. ఇప్పటికే యువ మోర్చా ఆధ్వర్యంలో HCU భూముల వేలానికి వ్యతిరేకంగా పోరాటం నడుస్తోంది.మరోవైపు.. వామపక్ష పార్టీలు సైతం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఆందోళనకు సిద్ధమైంది. సెంట్రల్ యూనివర్సిటీ భూమి అమ్మకాన్ని ప్రభుత్వ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌తో సీపీఐ, సీపీఎంలు నిరసన చేపట్టబోతున్నారు. హెచ్‌సీయూ భూముల పరిరక్షణ కోసం పాటుపడుతున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన అణచివేతకు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో.. ఈ ఉదయం కేబీఆర్ పార్కు వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. ‘ప్రకృతిని కాపాడండి.. అది మనల్ని కాపాడుతుంది’.. ‘హెచ్‌సీయూ అడవి నరికితే.. హైదరాబాద్ ఊపిరి ఆగుతుంది‘ అంటూ ప్లకార్డుల ప్రదర్శనతో బీఆర్ఎస్వీ నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి, పలువురు ప్రకృతి ప్రేమికులు మద్దతు తెలిపారు.కంచె గచ్చిబౌలి భూములపై ఇప్పటికే టీజీఐఐసీ (TGIIC) కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)భూమి లేదని తెలిపింది. ఈ మేరకు టీజీఐఐసీ వెల్లడించింది. వేడెక్కిన క్యాంపస్ హెచ్‌సీయూలో 400 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. సదరు స్థలాన్ని పొక్లెయిన్లతో చదును చేస్తున్న విషయం తెలుసుకున్న విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గత రెండురోజులుగా నెలకొన్న ఉద్రిక్తతలతో HCU మొత్తం ఇప్పుడు పోలీసు పహారాలో ఉంది. -
యువతలో జోష్ నింపుతున్న క్రియేటర్ మీట్స్
సృజనాత్మక శక్తి కలిగిన క్రియేటర్లకు హైదరాబాద్ నగరం చిరునామాగా మారుతోంది. పలువురు యువతీ యువకులు సోషల్ మీడియాలో తమ సత్తా చాటుతున్నారు. అత్యధిక ఫాలోవర్లను, వ్యూస్‌ను అందుకుంటూ దూసుకుపోతున్నారు. పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్న సిటీ డిజిటల్ స్టార్స్‌ను సొంతం చేసుకునేందుకు, మరింత మందిని తమవైపు తిప్పుకునేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ హైదరాబాద్ నగరంపై దృష్టి సారించాయి. విభిన్న రకాల ఈవెంట్లతో నగర యువతను ఊపేస్తున్నాయి. ఈ యాప్స్ ఉపయోగించేవారిలో అత్యధికులు టీనేజర్లు, అందులో యువతులు ఉండడంతో ఈ ఆన్లైన్ యాప్స్ వారి కోసం నగరంలో పలు ఆఫ్‌లైన్ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నాయి. క్రియేటర్లకు అవగాహన, మార్గదర్శకత్వం అందించడంతో పాటు కొత్త కొత్త సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూ మరింత రాణించేందుకు అన్ని విధాలా సహకరిస్తున్నాయి. అంతేకాకుండా తమ ఫాలోయింగ్, లైక్స్, వ్యూస్ ఉపయోగించుకుంటూ ప్రకటనలు పొందడం, మానిటైజేషన్ అవకాశాలను మెరుగుపరుచుకోవడంపైనా అవగాహన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ తొలి ప్రాధాన్యత.. దేశవ్యాప్తంగా దాదాపు 200 మిలియన్ల క్రియేటర్లను కలిగి ఉన్న ప్రముఖ సోషల్ వేదిక స్నాప్‌చాట్ తన తొలి స్నాప్‌చాట్ క్రియేటర్ కనెక్ట్ కార్యక్రమాన్ని నగరంలోని దుర్గం చెరువు సమీపంలో ఉన్న ఆలివ్ బిస్ట్రో రెస్టారెంట్లో గత బుధవారం నిర్వహించింది. క్రియేటర్లకు అన్ని రకాలుగా సహాయ సహకారాలతో పాటు ఆదాయం ఆర్జించే అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ఈవెంట్ నిర్వహించినట్టు స్నాప్ ఇన్ కార్పొరేషన్ కంటెంట్, ఏఆర్ భాగస్వామ్యాల డైరెక్టర్, సాకేత్ ఝా సౌరభ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ కంటెంట్ క్రియేటర్లకు తోడ్పడేందుకు నగరానికి చెందిన క్రియేటివ్ మీడియా సంస్థలు, తమడ మీడియా, చాయ్ బిస్కెట్, సిల్లీ మాంక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ప్రకటించారు. ప్రత్యేకంగా క్రియేటర్ డే సృష్టి.. అంతర్జాతీయ స్థాయిలో క్రియేటర్ల కోసం ప్రత్యేకంగా క్రియేటర్స్ డే కూడా నిర్వహిస్తున్నారు. మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్, ఇన్‌స్టా ముంబయి, బెంగళూర్ సహా హైదరాబాద్‌లో నూ క్రియేటర్స్ డే ఘనంగా నిర్వహిస్తున్నాయి. దీంతో పాటే ఔత్సాహిక యువత కోసం ఈ యాప్స్ గతేడాదిలో క్రియేటర్స్ ల్యాబ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చాయి. నటి రష్మిక మందన్న, హీరో నానితో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ ఈవెంట్స్‌లో పాల్గొంటుండడంతో వీటికి యువత నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో నగరాన్ని క్రియేటర్స్ హబ్‌గా చూడడం తథ్యం అనిపిస్తోంది. సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవడం బాగుంది.. ‘యూ ట్యూబ్, ఇన్‌స్టా ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిత్యం వేలాది, లక్షలాది మందితో కనెక్ట్ అవ్వొచ్చు’ అని చెప్పారు యాంకర్ లాస్య. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీగా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకుంది లాస్య.. ప్రత్యేకంగా ఇలాగే చేయాలనే ముందస్తు ప్లాన్స్ లేకుండా అప్పటికప్పుడు చేసే సరదా బిట్స్ కూడా వీక్షకాదరణ పొందే అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం టీవీకి, సినిమాకీ కొంత దూరంగా ఉన్నా, దీని ద్వారా ఆ లోటు తీరుతోంది. అయితే ఇప్పటికీ మంచి అవకాశం వస్తే వెండితెరపై మెరిసేందుకు సిద్ధమే. నా భర్త మంజునాథ్‌తో కలిసి కంటెంట్ క్రియేట్ చేస్తున్నా. ఈ సోషల్ మీడియాలో క్రియేటర్స్‌గా రాణించాలంటే ఎప్పటికప్పుడు మన స్కిల్స్ మెరుగుపరుచుకుంటూ, కొత్త కొత్త పోకడలు అందిపుచ్చుకుంటూ ఉండడం అవసరం. దీనికి ఈ యాప్స్ నిర్వహిస్తున్న ఆఫ్‌లైన్ ఈవెంట్స్ బాగా ఉపకరిస్తున్నాయి. ఈ కారణంగానే మేము స్నాప్ చాట్ ఏర్పాటు చేసిన క్రియేటర్స్ కనెక్ట్ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యాం. – మంజునాథ్ లాస్య (యాంకర్) (చదవండి: పింకీ ట్రిగ్గర్..! గంటల తరబడి ఫోన్ వాడుతున్నారా..?) -
ప్రత్యేక విమానంలో ముంబైకి కొడాలి నాని తరలింపు
హైదరాబాద్: వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. యాంజియో నిర్వహించిన వైద్యులు ఆయన గుండెలో మూడు బ్లాక్‌లు ఉన్నట్లు తేల్చారు. దీంతో కొడాలి నానిని బైపాస్ సర్జరీ నిమిత్తం కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం 11 గంటల సమయంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో (ఎయిర్ అంబులెన్స్) వైద్యుల పర్యవేక్షణలో ముంబైకి తరలించారు. అక్కడ ఆయనకు బైపాస్ సర్జరీ చేయనున్నట్లు తెలిసింది. -
డీజిల్ లీకై రేంజ్ రోవర్ కారు దగ్ధం
నార్కట్‌పల్లి: రేంజ్ రోవర్ కారు డీజిల్ ట్యాంకు లీకేజీ కావడంతో మంటలు ఎగిసిపడి కారు దగ్ధమైంది. ఈ ఘటన సోమవారం నార్కట్‌పల్లి– అద్దంకి హైవేపై నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు వద్ద జరిగింది. హైదరాబాద్‌కు చెందిన శివప్రసాద్, శివకుమార్, గోవర్ధన్ ముగ్గురు స్నేహితులు కలిసి గుంటూరులో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. సోమవారం అద్దంకి వద్ద పెట్రోల్ బంక్‌లో రేంజ్ రోవర్ కారుకు పెట్రోల్ పోయించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. చెర్వుగట్టు సమీపంలోకి రాగానే కారు డీజిల్ ట్యాంక్ లీకై చిన్నచిన్న మంటలు రావడాన్ని గుర్తించిన వారు కారును రోడ్డు పక్కన నిలిపి బయటకు వచ్చారు. వెంటనే అగి్నమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు చాలా వరకు కాలిపోయింది. నార్కట్‌పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
పోలీసు పహారాలో హెచ్‌సీయూ
గచ్చిబౌలి/రాయదుర్గం: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ అట్టుడుకిపోతోంది. క్యాంపస్ మొత్తం పోలీసు పహారాలో ఉంది. మరోవైపు ఆందోలనలు కొనసాగిస్తున్న విద్యార్థులు, మంగళవారం నుంచి పోరాటం ఉధృతం చేయాలని నిర్ణయించారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టబోమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులపై కేసులు నమోదు చేసిన పోలీసులు..క్యాంపస్‌లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.ప్రధాన రహదారి నుంచి క్యాంపస్ ప్రధాన ద్వారం వరకు స్టాపర్స్ అమర్చారు. ప్రధాన ద్వారం వద్ద యూనివర్సిటీ హస్టళ్ల ముందు గచ్చిబౌలి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల కదలికలపై నిఘా పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయించిన స్థలంలో ఎలాంటి ఆటంకం లేకుండా పనులు సాగేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ బందోబస్తును మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల రిమాండ్ పనులను అడ్డుకోవడం, తోపులాటకు దిగడంతో పోలీసు అధికారికి గాయాలయ్యాయంటూ టీజీఐఐసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు హెచ్సీయూకు చెందిన ఇద్దరు పీహెచ్‌డి విద్యార్థులపై కేసు నమోదు చేశారు. పొలిటికల్ సైన్స్ పీహెచ్డీ స్కాలర్, హెచ్‌సీయూ స్టూడెంట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్ఎఫ్ఐ) ఎర్రం నవీన్, కంప్యూటర్ సైన్స్ పీహెచ్డీ స్కాలర్, ఏబీవీపీ నాయకులు రోహిత్ బొండుగులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరిలించారు. వీరిపై బీఎన్ఎస్ 329 (3), 118(1), 132, 191(3), 351(3), రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేటి నుంచి తరగతుల బహిష్కరణ హెచ్‌సీయూలో భూముల పరిరక్షణ కోసం మంగళవారం నుంచి తరగతులు బహిష్కరించి క్యాంపస్ లోని పరిపాలనా భవనం ముందు నిరవధిక నిరసన చేపట్టాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఇచ్చిన పిలుపునకు ఏఐఎస్ఏ, ఏఐఓబీసీఎస్ఏ, ఏఎస్ఏ, బీఎస్ఎఫ్, డీఎస్‌యూ, ఫ్రటర్నిటీ, ఎంఎస్ఎఫ్, పీ డీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, ఎస్ఐఓ, టీఎస్ఎఫ్ వంటి విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం శవయాత్ర హెచ్‌సీయూ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా క్యాంపస్‌లో సోమవారం సాయంత్రం రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి శవయాత్రను నిర్వహించారు. వర్సిటీ ప్రధాన గేటు వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
40 వేల ఎకరాలు అమ్ముతున్నావు.. ఆ 400 ఎకరాలు వదిలేయ్
సాక్షి, హైదరాబాద్: 40 వేల ఎకరాలను అమ్మకానికి పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి...హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను వదిలేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. హెచ్‌సీయూ భూములను విక్రయించొద్దంటూ విద్యార్థులు నిస్వార్థంగా చేస్తున్న ఆందోళనకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సోమవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ హెచ్‌సీయూ విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వందలాది మంది పోలీసులు, జేసీబీలు, బుల్డోజర్లతో వేలాది వృక్షాలను నేలకూల్చడంతోపాటు, నెమళ్లు, దుప్పులు, జింకలు, అరుదైన పక్షిజాతులను అక్కడ నుంచి తరలించే యత్నం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.తెలంగాణ ఉద్యమ వీరుల త్యాగాల ఫలితమే సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పారు. యూనివర్సిటీ భూములు, విద్యార్థులపై ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఆ ప్రాంతం మొత్తం కాంక్రీట్ జంగిల్‌గా మారిందని అక్కడున్న ఈ లంగ్‌స్పేస్ లేకుండా చేయడంతో జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి భూములు అమ్మడం, అప్పులు తేవడమే ఎజెండాగా పనిచేస్తున్నారని విమర్శించారు. ముంబైలో 2,500 చెట్లు కొడితేనే.. పర్యావరణం నాశనమైందని గొంతు చించుకున్న రాహుల్‌గాంధీ హెచ్‌సీయూ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. హైకోర్టులో ఇప్పటికే ఈ అంశంపై పిల్ ఉన్న నేపథ్యంలో కోర్టుకు సెలవులున్న తరుణంలో రాత్రికిరాత్రే విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. ఈ అంశంపై తమ పార్టీ ఎంపీలు రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నిస్తారని, కేంద్ర వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేస్తామన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్నికలయ్యాక సెంట్రల్ యూనివర్సిటీలో ఫుట్‌బాల్ ఆడడానికి వచ్చినప్పుడే ఆ భూములపై కన్నేశారని కేటీఆర్ విమర్శించారు. విద్యార్థులను జైలుకు పంపించినట్టు చెబుతున్నారని, వారికి ఏ విధంగా న్యాయ సహాయం చేయాలో ఆలోచిస్తామన్నారు. గుంట నక్కలు అంటూ... ఆయన కామెంట్లు చేశారని, తాము ప్రవేశిస్తే ఇదంతా బీఆర్ఎస్ చేయిస్తుందని ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తారనే ఆగామని చెప్పారు. యూనివర్సిటీ పూర్వ విద్యార్థులైన భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు అయినా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పోరాటం చేస్తాం: విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీని భయకంపితం చేస్తోందని, విద్యార్థులపై తీవ్ర బలప్రయోగం చేస్తోందని, అడ్డుకుంటున్నవారిని అదుపులోకి తీసుకుంటోందని విద్యార్థి సంఘం నాయకులు ఉమేష్ అంబేడ్కర్, శరణ్య, నిహార్ సులేమాన్, త్రివేణి వాపోయారు. న్యాయపరమైన అంశాలు తర్వాత చర్చించొచ్చని ముందు పర్యావరణాన్ని కాపాడాలని, నెమళ్లు, జింకలు చేస్తున్న రోదనలు పాలకులకు వినిపించడం లేదా అని వారు ప్రశ్నించారు. ఆ భూములను కాపాడుకోవడానికి ఎంతవరకైనా పోరాడుతాం అని స్పష్టం చేశారు. -
విజయవాడ హైవేపై తగ్గాయి.. మిగతా చోట్ల పెరిగాయి
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/చౌటుప్పల్ రూరల్, కేతేపల్లి/రఘునాథపల్లి/దేవరుప్పుల/ఇందల్వాయి: రాష్ట్రంలోని జాతీయ రహదారులపై కొత్త టోల్ చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) సవరించిన చార్జీలను ప్రకటించింది. దీనిప్రకారం హైదరాబాద్– విజయవాడ మార్గంలోని నేషనల్ హైవే–65పై కనిష్టంగా రూ. 15 నుంచి గరిష్టంగా రూ. 160 దాకా టోల్ చార్జీలు తగ్గాయి. అదే సమయంలో తెలంగాణ మీదుగా సాగే ఇతర హైవేలపై మాత్రం టోల్ చార్జీలు 3.5% నుంచి 5% వరకు పెరిగాయి. ఎన్‌హెచ్ 65పై వాహనదారులకు తగ్గిన భారం.. ఎన్హెచ్ఏఐ నిర్ణయంతో హైదరాబాద్–విజయవాడ మార్గంలోని ఎన్‌హెచ్–65పై ప్రయాణించే వాహనదారులకు టోల్ చార్జీల భారం కాస్త తగ్గింది. ఈ మార్గం మీదుగా 24 గంటల్లోపు తిరుగు ప్రయాణమయ్యే అన్ని రకాల వాహనదారులకు 25 శాతం మేర ఎన్హెచ్ఏఐ తగ్గింపు ఇచి్చంది. అయితే ఏపీలోని చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద ఒకవైపు రూ. 5, రెండువైపులా రూ.10 మాత్రమే తగ్గించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వరకు గల 181.5 కి.మీ. మేర ఉన్న జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఎన్‌హెచ్ 65పై ఎందుకు తగ్గిందంటే.. ఎన్‌హెచ్–65 రోడ్డును గతంలో నాలుగు వరుసలుగా విస్తరించారు. ఆ బాధ్యతను టెండర్ ద్వారా జీఎంఆర్ సంస్థ దక్కించుకొని రూ. 1,741 కోట్లతో పనులు నిర్వహించింది. బీఓటీ పద్ధతిలో పనులు పూర్తయ్యాక 2012 నుంచి టోల్ వసూలు మొదలుపెట్టింది. సాధారణంగా రోడ్డు ప్రధాన క్యారేజ్‌వే నిడివి ఆధారంగా టోల్ నిర్ధారించే విధానం ఎన్హెచ్ఏఐలో అమలులో ఉంది. కానీ విజయవాడ రోడ్డుపై బైపాస్ వ్యయం కూడా కలిపి గతంలో టోల్ ధరలు నిర్ధారించారు. దీంతో ఎన్హెచ్ఏఐ సహా ఇతర సంస్థల అ«దీనంలోని రోడ్లతో పోలిస్తే వాటి ధరల్లో కొంత ఎక్కువ చార్జీలు ఖరారయ్యాయి. ఇక రోడ్డు నిర్మాణ వ్యయం తిరిగి వసూలయ్యాక టోల్ ధరల్లో సహజంగా మార్పు చేస్తారు. ఇప్పుడు ఈ రోడ్డును ఆరు వరుసలకు విస్తరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జీఎంఆర్‌తో ఉన్న ఒప్పందం రద్దయింది. గత 9 నెలలుగా ఒక ఏజెన్సీతో ఎన్హెచ్ఏఐ టోల్ వసూలు చేయిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఎన్హెచ్ఏఐ ఈ జాతీయ రహదారిపై టోల్ వసూలును రీనోటిఫై చేసింది. ఇంతకాలం జీఎంఆర్ సంస్థ పేరుతో ఉన్న నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో ప్రధాన రోడ్డు నిడివి ఆధారంగా ఎన్హెచ్ఏఐ–2008 ఫీ రూల్స్ ప్రకారం ధరలను లెక్కగట్టింది. ఇంతకాలం ఉన్న ధరలతో పోలిస్తే ఇవి తక్కువగా ఖరారు కావడం విశేషం. మిగతా చోట్ల.. ⇒ తెలంగాణలోని మంచిర్యాల నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్ వెళ్లే జాతీయ రహదారి–363 నిడివి 94 కి.మీ. ఉండగా మంచిర్యాల జిల్లా మందమర్రి, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ట్రాఫిక్, రోడ్డు నిర్వహణ తదితరాలను లెక్కగట్టిన ఎన్‌హెచ్ అధికారులు ఈ మార్గంలో గతేడాదితో పోలిస్తే కనీసం రూ. 5 నుంచి రూ. 20 వరకు టోల్ చార్జీలు పెంచారు. ⇒ వరంగల్–హైదరాబాద్ బైపాస్ రోడ్డుపై జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్ల, దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్‌ప్లాజాల్లో 5 శాతం మేర టోల్ చార్జీలు పెరిగాయి. ⇒ హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్లే ఎన్‌హెచ్–44పై తెలంగాణ పరిధిలోని మార్గంలో 3.5 శాతం మేర టోల్ చార్జీలు పెరిగాయి. -
స్కూల్ యూనిఫాం.. ఇక పక్కా కొలతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల యూనిఫాం తయారీలో ప్రభుత్వం ఈసారి మార్పులు తీసుకొచ్చింది. సగటు కొలతలకు బదులు కచ్చితమైన కొలతలతోనే యూనిఫాం అందించాలని నిర్ణయించింది. ప్రతి విద్యార్థి కొలతలనూ టైలర్లు వ్యక్తిగతంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టరేట్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లోని విద్యాశాఖ అధికారులంతా దీన్ని విధిగా పాటించాలని ఆదేశించింది. గతం మాదిరి కాదు... గతంలో యూనిఫాంకు కొలతలు తీసుకొనే పద్ధతి వేరుగా ఉండేది. విద్యార్థులందరినీ గ్రూపులుగా విభజించే వారు. ఎత్తు, లావు ఆధారంగా 10 మందిలో ఒకరి కొలత తీసుకొని మిగతా వారికి కూడా అదే కొలతలతో కుట్టేవాళ్లు. దీనివల్ల కొందరికి పొట్టిగా, మరికొందరికి వదులుగా యూనిఫాం ఉంటోంది. దీంతో కొంత మంది విద్యార్థులు టైలర్ల దగ్గరకు వెళ్లి అవసరమైన సైజ్ మేరకు యూనిఫాంలో మార్పులు చేయించుకుంటున్నారు. నిరుపేద పిల్లలు మాత్రం ఇచ్చిందే వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యా కమిషన్ సిఫార్సులు, స్థానిక హెచ్ఎంల ఫిర్యాదుల దృష్ట్యా ప్రతి విద్యార్థికీ కచ్చితంగా కొలతలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దుస్తులు పంపిణీ చేసిన తర్వాత విద్యార్థి నుంచి ఫిర్యాదు వస్తే తిరిగి దాన్ని సరిచేయాలని స్పష్టం చేసింది. ప్రతి విద్యార్థి పూర్తిగా సంతృప్తి చెందితేనే స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ)కు బిల్లులు మంజూరు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈసారి ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు నిక్కర్ బదులు ఫ్యాంట్లు ఇస్తున్నట్లు కూడా ప్రభుత్వం వెల్లడించింది. 19.91 లక్షల మంది విద్యార్థులు.. రెండేసి జతలు.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 19.91 లక్షల మంది విద్యార్థులకు ఏటా రెండు జతల యూనిఫాం అందిస్తున్నారు. ఇందుకు అయ్యే వస్త్రం కోసం ప్రభుత్వం రూ. 90 కోట్లు వెచ్చిస్తోంది. స్థానిక స్వయం సహాయక సంఘాల చేత యూనిఫాం కుట్టిస్తోంది. ఇందుకుగాను వారికి కుట్టుకూలి కింద రూ. 30 కోట్లు చెల్లించనుంది. పాఠశాలల పునఃప్రారంభం రోజే యూనిఫాంను విద్యార్థులకు అందించాల్సి ఉంది. సాధ్యాసాధ్యాల మాటేమిటి? ప్రభుత్వ ఆదేశాలపై స్వయం సహాయక బృందాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఇలాంటి ఆదేశాలిచ్చేటప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులనూ తెలుసుకోవాలని కోరుతున్నాయి. ప్రభుత్వం వస్త్రం సేకరించి జిల్లాలు, మండలాలకు పంపేందుకే మే ఆఖరు వరకు సమయం పడుతుందని అంటున్నాయి. ఆ తర్వాత కేవలం 15 రోజుల్లోనే యూనిఫాం కుట్టి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని టైలరింగ్ మహిళలు అంటున్నారు. అదీగాక.. ప్రతి విద్యార్థికి వస్త్రం సగటున అర మీటరే వస్తోందని.. దీనివల్ల కొందరికి సరిపోవట్లేదని చెబుతున్నారు. ప్రతి జతకు ప్రభుత్వం ఇచ్చే రూ. 75 కుట్టుకూలి కనీస వేతనంగా కూడా ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో స్వయం సహాయక బృందంలో కనీసం నలుగురు చొప్పున ఉండే సభ్యులు పాఠశాలల చివరి పనిదినంలోగా కొలతలు తీసుకోవడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు సొంతంగా కొలతలు తీసుకొని పంపిస్తే తమకు తేలికగా ఉంటుందని చెబుతున్నారు. టెన్షన్ పెడితే ఎలా? ప్రభుత్వం ఇచ్చే కుట్టుకూలీ కనీసం ట్రాన్స్‌పోర్టు ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. వస్త్రం సగటున ప్రతీ విద్యార్ధికి 50 సెంటీమీటర్లే వస్తుంది. అదీగాక 15 రోజుల్లో కుట్టి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు. మా పరిస్థితినీ ప్రభుత్వం ఆలోచించాలి. టెన్షన్ పెడితే ఎలా? ప్రతీ స్కూల్‌కు వెళ్ళి కొలతలు తీసుకొని, యూనిఫాం అందించాంటే 45 రోజులు పడుతుంది. అంత సమయం ఎక్కడిస్తున్నారు. కొలతలు వాళ్ళే తీసి ఇవ్వాలి. అప్పుడే సమయం కలిసి వస్తుంది. – ఎ. మాధవీగౌడ్ (టైలర్, కరీంనగర్) ఎక్కువ మంది టైలర్లను తీసుకుంటే సమస్యకు పరిష్కారం ప్రతి విద్యార్ధికి కచ్చితమైన కొలతలతో యూనిఫాం అందించాలనే నిర్ణయం సరైందే. సరిగా కుట్టలేదని విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అయితే టైలర్ల విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కుట్టడానికి ఎక్కువ మందిని పెడితే సమస్య పరిష్కారం అవుతుంది. – పరాంకుశం రాజాభాను చంద్రప్రకాశ్ (ప్రభుత్వ గెజిటెడ్ ప్రధానోపాధాయుల సంఘం పూర్వ అధ్యక్షుడు) -
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులుగా 'టిమ్స్'
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్పెషాలిటీ అనగానే ఇప్పటివరకు కార్పొరేట్ ఆస్పత్రులే గుర్తుకొచ్చేవి. గుండె, మూత్రపిండాలు, న్యూరో సంబంధిత సమస్యలొస్తే ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించేవారు. ఆ కొరత తీర్చేందుకు స్పెషలైజ్డ్ హాస్పిటళ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) పేరుతో నగర శివార్లలో నిర్మిస్తున్న ఆస్పత్రులను స్పెషలైజ్డ్ హాస్పిటళ్లుగా మార్చనున్నారు. ప్రస్తుతం నిర్మాణపరంగా వివిధ దశల్లో ఉన్న ఈ మూడింటిని స్పెషాలిటీ ఆస్పత్రులుగా మార్చడంతోపాటు ప్రతీ ఆస్పత్రికి ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. తద్వారా అక్కడ ప్రొఫెసర్లు, డాక్టర్ల కొరత కూడా తీరనుంది. పీజీ స్టూడెంట్లు డాక్టర్లుగా సేవలు అందించే వీలు కలుగుతుంది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తే, నర్సుల కోసం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో పేదలు, మధ్యతరగతి వర్గాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు స్పెషలైజ్డ్ కొన్నే..ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం.. జనరల్ ఆస్పత్రులుగా ప్రసిద్ధి. ఇక్కడ అన్ని రకాల వైద్యసేవలు అందిస్తున్నా, స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ అందుబాటులో లేదు. హైదరాబాద్‌లో ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్, నిలోఫర్ పిల్లల దవాఖానా, సరోజినిదేవి కంటి ఆస్పత్రి వంటివి మాత్రమే స్పెషాలిటీ ఆస్పత్రులుగా ఉన్నాయి. అయితే గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, గ్యాస్ట్రో వంటి స్పెషాలిటీ ఆస్పత్రులు లేకపోవడంతో కొత్తగా నిర్మిస్తున్న మూడు టిమ్స్‌ను అందుకు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్డియాక్ స్పెషాలిటీ ఆస్పత్రిగా సనత్‌నగర్ టిమ్స్ హైదరాబాద్‌కు నలుదిక్కులా నాలుగు టిమ్స్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మొదటి టిమ్స్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీ నగర్లలో మూడు టిమ్స్ భవన నిర్మాణ పనులు ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి. అయితే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉన్న టిమ్స్ ను ఖాళీ చేయించి స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించారు. – సనత్‌నగర్‌లో నిర్మిస్తున్న టిమ్స్‌ను గుండె సంబంధమైన వ్యాధుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్డియాక్‌తోపాటు కార్డియో థొరాసిక్ సేవలను ఇక్కడ అందుబాటులోకి తేనున్నారు. గ్రామీణస్థాయి నుంచి హైదరాబాద్ వరకు గుండె జబ్బులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను జూన్ 2 న ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ హాస్పిటల్‌కు అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బంది కోసం ఇప్పటికే ప్రభుత్వానికి డీఎంఈ నరేంద్రకుమార్ లేఖ రాశారు. అందుబాటులో ఉన్న సిబ్బందితోనైనా హాస్పిటల్‌ను ప్రారంభించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. న్యూరో, గ్యాస్ట్రో కోసం ఎల్బీనగర్లో నిర్మిస్తున్న టిమ్స్‌ను న్యూరో సూపర్ స్పెషాలిటీగా మార్చాలని ప్రభుత్వం భావించింది. ఈ ఆస్పత్రికి అనుబంధంగా వనస్థలిపురం మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఉంటుంది. అల్వాల్‌లో నిర్మిస్తున్న టిమ్స్‌ను గ్యాస్ట్రో సంబంధ వ్యాధుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మారుస్తున్నారు. దీనికి కుత్బుల్లాపూర్ మెడికల్, నర్సింగ్ కాలేజీలను అనుసంధానం చేస్తారు. – వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (డబ్లు్యఎస్ఎస్హెచ్)ను కూడా జూన్‌లోనే ప్రారంభించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే ఎంజీఎంను విలీనం చేస్తారు. ఈ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌కు కాకతీయ మెడికల్ కాలేజ్ అనుబంధంగా కొనసాగనుంది. -
హైదరాబాద్‌లో వాన్గార్డ్ తొలి జీసీసీ
సాక్షి, హైదరాబాద్: అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ‘వాన్గార్డ్’ తొలిసారిగా భారతదేశంలో అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది చివరిలోగా ఈ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు.. రానున్న నాలుగేళ్లలో 2,300 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రకటించింది, వాన్గార్డ్ దాదాపు ఐదు కోట్ల మంది పెట్టుబడిదారులతో సుమారు 10.4 ట్రిలియన్ డాలర్ల సంస్థగా కొనసాగుతోంది. వాన్గార్డ్ సీఈవో సలీం రాంజీ, ఐటీ డివిజన్ సీఈవో, ఎండీ నితిన్ టాండన్, మానవ వనరుల ప్రధానాధికారి జాన్ కౌచర్, జీసీసీ–ఇండియా వాన్గార్డ్ హెడ్ వెంకటేశ్ నటరాజన్‌లు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో జరిగిన చర్చల అనంతరం వాన్గార్డ్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ప్రకటించిన ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఈ సంవత్సరం చివరి నాటికి నగరంలో పనిచేయడం ప్రారంభిస్తుందని ఆ సంస్థ సీఈవో ప్రకటించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ఈ జీసీసీ ఇన్నోవేషన్ హబ్‌గా పనిచేస్తుందని చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, మొబైల్ ఇంజనీరింగ్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అందుకు అవసరమైన ఇంజనీర్లను తక్షణమే నియమించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..హైదరాబాద్‌లో వాన్గార్డ్ జీసీసీ ఏర్పాటుకు ముందుకు రావటం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి జీసీసీ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వాన్గార్డ్ రాకతో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రభుత్వం తరఫున తగినంత సహకారం అందిస్తామని కంపెనీ ప్రతినిధులకు సీఎం భరోసా ఇచ్చారు. తమ వినియోగదారులకు ప్రపంచస్థాయి సేవలను అందించటంతో పాటు ఏఐ, మొబైల్, క్లౌడ్ టెక్నాలజీలో ప్రతిభావంతులైన ఇంజనీర్లకు అవకాశాలు కల్పించటం తమకు సంతోషంగా ఉందని సలీం రాంజీ తెలిపారు. -
ప్రజాసేవే లక్ష్యం
పట్టుదల, తపన, దానికి తగ్గ సాధన తోడైతే ఎంతటి లక్ష్యమైనా తలొంచి తీరుతుందని గ్రూప్‌వన్ టాపర్ లక్ష్మీదీపిక కొమ్మిరెడ్డి నిరూపించారు. తెలంగాణ రాష్ట్రస్థాయిలో టాప్ ర్యాంక్ సాధించానన్న విషయం తెలిసిన దీపిక ముందు కొద్దిసేపటి వరకు అది కలే అనుకున్నారు. నిజమేనని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలారు. గ్రూప్1 పరీక్షల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించడానికి ఆమె పడిన కష్టం, తల్లిదండ్రుల ప్రోత్సాహం అన్నీ కలిపి ఆమెను మొదటి స్థానంలో నిలిపాయి. వివరాలు ఆమె మాటల్లోనే ..‘‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఉండేది సఫిల్గూడప్రాంతంలో. అమ్మ పద్మావతి గృహిణి, నాన్న కృష్ణ కొమ్మిరెడ్డి రిటైర్డ్ సీనియర్ ఆడిట్ ఆఫీసర్. పదో తరగతి సఫిల్‌గూడలోని డీఏవీ పాఠశాల, ఇంటర్ నారాయణగూడ శ్రీ చైతన్య, 2013లో మెడిసిన్ లో 119వ ర్యాంక్‌తో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశా. మాస్టర్స్ డిగ్రీ చేయడం కోసం అమెరికా వెళ్లాను. అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతురిని. అందుకే డాక్టరుగా ఇక్కడే ప్రాక్టీస్ చేద్దామని అనుకున్నా. కానీ అనుకోకుండా నా దృష్టి సివిల్స్‌పై మళ్లడంతో ఆ దిశగా ప్రయత్నించాలనుకున్నాను. అందుకు అమ్మానాన్నలు కూడా అంగీకరించారు. అదేసమయంలో గ్రూప్స్‌కు నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకున్నా. ఆలోచన వచ్చిందే తడవుగా సిలబస్ చెక్ చేశాను. పాత ప్రశ్నాపత్రాలు పరిశీలించాను. ప్రిపరేషన్ సులభమనే అనిపించింది. దాంతో కోచింగ్‌కు వెళ్లాలనిపించలేదు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్1 పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించాను. 2020లో మొదటిసారిగా యూపీఎస్సీ పరీక్ష రాశా! కాని, అది నేను అనుకున్నంత సులువు కాదని మూడు ప్రయత్నాలు విఫలం అయ్యేవరకు అర్థం కాలేదు. దాంతో అంతవరకు ఆప్షనల్‌గా ఉన్న తెలుగు బదులు ఆంత్రపాలజీని ఎంచుకుని గత ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ పై దృష్టి సారించాను. అలాగే గత సెప్టెంబర్‌లో యూపీఎస్సీ మెయిన్స్, అక్టోబర్‌లో టీజీపీఎస్సీ మెయిన్స్ కూడా రాశాను. ఈ సంవత్సరం మార్చి16న యూపీఎస్సీ ఇంటర్వ్యూకి హాజరయ్యాను.. ఆ ఫలితాలు వస్తాయనుకుంటే ఈ ఫలితాలు ముందుగా వచ్చాయి.సివిల్స్ సాధనే ఆశయం...నా జీవితాశయం సివిల్స్.. కెరీర్లో ఎదుగుదలతోపాటు ప్రజాసేవ చేయాలన్నది నా ఆకాంక్ష. త్వరలోనే వీటిని సాధిస్తానన్న నమ్మకం ఉంది. రోజూ కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే చదివేదాన్ని. పరీక్షల సమయంలో మాత్రం 8– 9 గంటలు చదువుకునేదాన్ని. పరీక్షల సమయంలో మా అమ్మ కూడా నాతోపాటే జాగారం చేసేది. వొత్తిడి అనిపించినప్పుడు సరదాగా ముచ్చట్లు పెట్టుకునే వాళ్లం. పుస్తక పఠనం ముందునుంచే ఇష్టం. పాటలు పాడటం నా హాబీ. వొత్తిడి సమయంలో ఇవి నాకు చాలా ఉపయోగపడ్డాయి.’’ అంటూ ముగించారు దీపిక.సోషల్ మీడియాను సక్రమంగా ఉపయోగించుకోవాలికోచింగ్ల మీద ఆధార పడి సమయం, డబ్బును వృథా చేయద్దు. సోషల్ మీడియాలో చాలా మంచి సమాచారం అందుబాటులో ఉంది. దానిని సరిగా ఉపయోగించుకోగలగాలి. కెరీర్లో రాణించడానికి అవసరమైన ప్రణాళికను ముందే సిద్ధం చేసుకుని అందుకు తగ్గట్టు కృషి చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ధైర్యంగా ఎదుర్కొని గమ్యమే లక్ష్యంగా ముందుకు సాగాలి. అప్పుడే ఆశయాన్ని సాధించగలం. – డా. లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డి, గ్రూప్ వన్ టాపర్ – పవన్ కుమార్ పలుగుల, సాక్షి, ఉప్పల్/ కాప్రా -
'కంచె'.. గర్జించె..
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములకు సంబంధించి మొదలైన వివాదం క్రమంగా ముదురుతోంది. భూములు తమవంటే తమవేనంటూ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) వేర్వేరు వాదనలు వినిపిస్తూ ‘ప్రకటనల యుద్ధానికి’తెరలేపాయి. మరోవైపు వర్సిటీ భూములు కాపాడుకుంటామంటూ విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విపక్షాలు వారి పోరాటానికి మద్దతు పలకడమే కాకుండా, ప్రభుత్వ వైఖరిపై విరుచుకు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం కంచె గచ్చిబౌలి భూముల వివాదమే హాట్ టాపిక్‌గా మారింది. పూర్వాపరాలు.. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని 2004 లో చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ అకాడమీకి అ ప్పగించింది. అయితే ఆ కంపెనీకి సామర్థ్యం లేద ని, కంపెనీ బోగస్ అని ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఆ కేటాయింపుల్ని రద్దు చేసింది. ఈ రద్దుపై ఐఎంజీ కోర్టును ఆశ్రయించింది. 21 ఏళ్ల పాటు జరిగిన న్యాయపోరాటం త ర్వాత ఆ భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ భూములను ప్రభుత్వం టీజీఐఐసీకు కేటాయించింది. ఆ భూ ములను అభివృద్ధి చేసి పరిశ్రమలకు విక్రయించాల ని టీజీఐఐసీ నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆ భూములు హెచ్సీయూవి అంటూ విద్యార్థులు ఆందోళనలకు దిగడంతో వివాదం మొదలైంది. విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు: సర్కారు కొందరు స్థిరాస్తి వ్యాపారులు, రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వం పేర్కొంటోంది. దీని వెనుక కొన్ని స్థిరాస్తి గుంటనక్కలు ఉన్నా యని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే సదరు భూముల తమవేనంటూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సోమవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఈ భూములు సర్కారువే నంటూ ప్రభుత్వం కూడా అందుకు సంబంధించి రెండు డాక్యుమెంట్లు సోమవారం విడుదల చేసింది. 2004 జనవరి 31న కంచె గచ్చిబౌలి సర్వే నంబర్ 25 లోని 534.28 ఎకరాల హెచ్‌సీయూ భూమిని ప్రభుత్వానికి స్వా«దీనం చేసినట్టుగా ఉన్న, అప్పటి రిజిస్ట్రార్ వై.నర్సింహులు, మరో ముగ్గురు సాక్షులు సంతకాలతో కూడిన ఒక డాక్యుమెంట్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేసింది. అలాగే ఈ భూమికి ప్రత్యామ్నాయంగా 2004 ఫిబ్రవరి 3వ తేదీన అప్పటి యూనివర్సిటీ రిజిస్ట్రార్ నర్సింహులుకు గోపన్‌పల్లిలోని సర్వే నంబర్ 36లో ఉన్న 191.36 ఎకరాలు, సర్వే నంబర్ 37లో ఉన్న 205.20 ఎకరాలు మొత్తం 397.16 ఎకరాల భూమిని ముగ్గురు సాక్షుల సమక్షంలో స్వా«దీనం చేసినట్లుగా ఉన్న మరో డాక్యుమెంటు కూడా బహిర్గతం చేసింది. హెచ్సీయూకు సంబంధం లేదు.. కంచె గచ్చిబౌలిలోని ప్రస్తుత వివాదాస్పద భూమితో సెంట్రల్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని సర్కారు వాదిస్తోంది. 21 ఏళ్ల క్రితం ఐఎంజీ భారత్‌కు కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకున్నట్లు చెబుతోంది. ప్రస్తుతం టీజీఐఐసీ ద్వారా వేలానికి ప్రతిపాదించిన భూమిలో చెరువు లేదని, శిలా సంపదకు జీవ వైవిధ్యానికి ఎలాంటి భంగం వాటిల్లదని పేర్కొంటూ సీఎంవో సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. ‘చట్టపరంగా దక్కిన ఈ భూమిపై వివాదాలు సృష్టించడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. కంచె గచ్చిబౌలి సర్వే నంబరు 25లోని 400 ఎకరాల భూమిని 2004లో ఐఎంజీ అకాడమీకి కేటాయించారు. పనులు ప్రారంభం కాకపోవడంతో రద్దు చేసి 2006 నవంబర్ 21న ఏపీ యువజన, టూరిజం, సాంస్కృతిక శాఖకు కేటాయించారు. దీనిపై ఐఎంజీ కోర్టుకు వెళ్లడంతో 2024లో మార్చిలో హైకోర్టు, అదే ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చాయి’అని పేర్కొంటోంది.. ఐటీ, ఇతర ప్రాజెక్టుల కోసం టీజీఐఐసీకి.. ఈ భూముల్లో ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటు కోసం గత ఏడాది జూన్‌లో టీజీఐఐసీకు బదలాయించారు. ఆక్రమణలకు గురికాకుండా శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు ఆ 400 ఎకరాల భూమికి సంబంధించి పంచనామా నిర్వహించి 2024, జులై 1వ తేదీన టీజీఐఐసీకి అప్పగించా రు. ఈ భూమికి సంబందించిన ఉమ్మడి హద్దుల గుర్తింపునకు సహకరించాలని కోరుతూ టీజీఐఐసీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్‌ను కలవడంతో పాటు మెయిల్ కూడా పంపారని, రిజిస్ట్రార్ సమ్మతితోనే 2024 జూలై 19న సర్వే చేసి హద్దులు నిర్ధారించారని ప్రభుత్వం వాదిస్తోంది. వన్య ప్రాణులు లేవు.. చెరువులు లేవు! ‘టీజీఐఐసీ అభివద్ధి చేస్తున్న 400 ఎకరాల్లో అడవి దున్నలు, నెమళ్లు, చెరువులు లేవు. ప్రపంచ స్థాయి ఐటీ మౌలిక వసతులు, అనుసంధానత పెంపు, తగినంత పట్టణ స్థలాల లభ్యత అనే ప్రభుత్వ ప్రాధాన్యానికి ప్రస్తుత ప్రాజెక్టు కట్టుబడి ఉంది. టీజీఐఐసీ అభివృద్ధి చేసే లే ఔట్లో శిలా సంపద, హరిత స్థలాల పరిరక్షణ కోసం ప్రణాళిక సిద్ధమైంది. మాస్టర్‌ప్లాన్‌లో సుస్థిరాభివద్ధికి సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళిక (ఈఎంపీ) తయారు చేస్తోంది. ఈ దిశగానే 400 ఎకరాల ప్రభుత్వ భూమిని సాధ్యమైనంత ఎక్కువ ఉపయోగించుకునేలా టీజీఐఐసీ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేసింది..’అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.వర్సిటీ అంగీకరించిందనడం అవాస్తవం: రిజిస్ట్రార్‘రాష్ట్ర ప్రభుత్వం, టీజీఐఐసీ చెప్తున్నట్లుగా 2024 జూలైలో సదరు భూముల్లో రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వే నిర్వహించలేదు. ఇప్పటివరకు సదరు భూమి రూపు రేఖలను మాత్రమే ప్రాథమికంగా తనిఖీ చేశారు. భూమి హద్దులు నిర్ణయించేందుకు యూనివర్సిటీ అంగీకరించిందని టీజీఐఐసీ చేస్తున్న వాదనలో నిజం లేదు. భూమి హద్దులు నిర్ధారించేందుకు యూనివర్సిటీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దేశంలోనే పేరొందిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించాలని అందిన వినతులను పరిశీలించాలి. రాష్ట్రపతితో నియమితులైన ఆరుగురు సభ్యులతో కూడిన యూనివర్సిటీ సభ్యుల అనుమతితోనే ఏదైనా భూ బదలాయింపు జరుగుతుంది..’అని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ సోమవారం నాటి ప్రకటనలో స్పష్టం చేశారు. ఇలా రెండు పక్షాలు ఎవరి వాదనలు వారు వినిపిస్తుండగా..విద్యార్థులు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి ఆందోళనకు సంఘీభావం తెలపాలని కోరారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వం భూముల అమ్మకాలకు పూనుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరతీసింది. -
SRH Vs HCA వివాదంపై సీఎం రేవంత్ సీరియస్
సాక్షి,హైదరాబాద్ : హెచ్‌సీఏ- సన్ రైజర్స్ హైదరాబాద్ వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్నివేధింపులు గురి చేసి పాసులు అడిగిన విషయంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసుల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని సూచించారు. విజిలెన్స్ డీజీ కొత్తకోట శశ్రీకాంత్‌కు ఆదేశాలు జారీ చేశారు.ఎస్ఆర్హెచ్ను పాసులు విషయంలో ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పాసుల వ్యవహారంపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. తాజా, ఇదే అంశంపై సీఎం రేవంత్ సైతం స్పందించారు. అసలేం జరిగిందంటే?ఉచిత పాస్‌ల విషయంలో (ఐపీఎల్ 2025) సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. పాసుల కోసం హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ సంచలన ఆరోపణలు చేసింది. ఇలా చేస్తే హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని బెదిరించింది. ఈ అంశానికి సంబంధించి సన్‌రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్ రావు ఓ ఘాటు లేఖ రాశారు.ఇలాంటి ప్రవర్తన సహించంఉచిత పాస్‌ల కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు జగన్మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయి. ఇలాంటి ప్రవర్తనను మేము ఏమాత్రం సహించం. ఇలాగే కొనసాగితే మేము వేదికను మార్చుకునేందుకు మేం వెనకాడం. మేము ఉప్పల్ స్టేడియంను హోం గ్రౌండ్‌గా ఎంచుకుని మ్యాచ్‌లు ఆడటం వారికి ఇష్టం లేనట్లుంది. ఇలా అయితే లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరుతున్నాం. తద్వారా ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యానికి తెలియజేయగలరు. మీకు ఇష్టం లేకపోతే మీరు కోరుకున్నట్లే హైదరాబాద్ నుంచి తరలిపోతామని సన్‌రైజర్స్ ప్రతినిథి హెచ్‌సీఏ కోశాధికారికి రాసిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నాము. గత సీజన్ నుండి మాత్రమే ఈ సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నాము. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి ప్రతి సీజన్లో 50 కాంప్లిమెంటరీ టికెట్లు (F12A బాక్స్) ఇస్తున్నాము. ఈ ఏడాది వారు అదనంగా మరో 20 టికెట్లు అడుతున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చినప్పుడు పరస్పరం చర్చించి స్నేహపూర్వక పరిష్కారానికి వస్తామని వారికి తెలియజేసాము.హెచ్‌సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్అయినా పట్టించుకోకుండా హెచ్‌సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్ చేశారు. SRH-LSG మ్యాచ్ రోజున సీటింగ్ బాక్స్‌కు (F3) తాళం వేశారు. మేము అడిగిన అదనపు టికెట్లు ఇవ్వకపోతే తాళం తెరవమని బెదిరించారు. గత రెండేళ్లలో హెచ్‌సీఏ నుంచి మా సిబ్బందికి ఇలాంటి బెదిరింపులు చాలా వచ్చాయి. అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఈ ఏడాదే చాలాసార్లు మా వారిని బెదిరించారు. ఇది ఏమాత్రం సహించరానిది. మేము స్టేడియంకు అద్దె చెల్లిస్తున్నాము. ఐపీఎల్ సమయంలో స్టేడియం మా ఆధీనంలో ఉండాలి అని శ్రీనాథ్ తన ఈ-మెయిల్లో హైలెట్ చేశారు. కాగా, ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) హోం గ్రౌండ్‌గా ఉన్న విషయం తెలిసిందే. -
వాహనదారులకు షాక్.. ORRపై టోల్ ఛార్జీలు పెంపు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓఆర్ఆర్పై వెళ్లే వాహనదారులకు బిగ్ షాక్. హైదరాబాద్ ఔటర్ రింగ్(ORR) రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంచుతూ సదరు నిర్వహణ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెరిగిన ధరలను నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయని ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ వెల్లడించింది.అయితే, హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్ను ఐఆర్బీ సంస్థ రెండేండ్ల క్రితం 30 ఏండ్ల కాలానికి లీజు తీసుకుంది. నిబంధనల ప్రకారం ఏటా 5 శాతం వరకు టోల్‌ఛార్జీలను పెంచుకునే వెసులుబాటు సంస్థకు కల్పించింది. ఇందులో భాగంగా టోల్ ధరలను పెంచింది.కొత్త ఛార్జీలు ఇలా..కారు, జీపు, వ్యాన్, లైట్ వాహనాలకు కిలోమీటర్‌కు 10 పైసలు పెంచింది. దీంతో ప్రస్తుతం కిలోమీటర్‌కు రూ.2.34గా ఉన్న చార్జీలు రూ.2.44కు పెరిగాయి.మినీబస్, ఎల్సీవీలకు కిలోమీటర్‌కు 20 పైసలు వడ్డించింది. దీంతో ప్రస్తుతం ఉన్న రూ.3.77 నుంచి రూ.3.94కు చేరింది.రెండు యాక్సిల్ బస్సులకు కిలోమీటర్‌కు రూ.6.69 నుంచి రూ.7కు పెంచింది.భారీ వాహనాలకు కిలోమీటర్‌కు రూ.15.09 నుంచి రూ.15.78కు పెంచింది. -
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హెచ్‌సీయూ యూనివర్సిటీ వద్ద 400 ఎకరాల భూమి అమ్మకం వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో 400 ఎకరాల భూమి వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదే అంటూ క్లారిటీ ఇచ్చింది.నగరంలోని హెచ్‌సీయూ వద్ద 400 ఎకరాల భూ వ్యవహారంపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించారు. ఈ క్రమంలో..‘ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదు. ఆ భూమి యజమాని తామేనని న్యాయస్థానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుంది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుంది. వేలం.. అభివృద్ధి పనులు అక్కడ ఉన్న రాళ్లను దెబ్బతీయవు. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు (లేక్) లేదు సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా హెచ్‌సీయూది కాదని తేలింది అని క్లారిటీ ఇచ్చింది. అలాగే, విద్యార్థులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు.. సెంట్రల్ యూనివర్సిటీలో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇద్దరు పీహెచ్డీ స్కాలర్స్ విద్యార్థులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎర్రం నవీన్ కుమార్, రోహిత్‌పై 329(3), 118(10, 132, 191(3), 351(3) r/w 3(5) బీఎన్ఎస్ యాక్ట్ కింద గచ్చిబౌలి పోలీసులు కేసులు పెట్టారు. -
తెలంగాణకు మళ్లీ వర్షాలు, నాలుగు రోజులపాటు..
హైదరాబాద్: తెలంగాణలో భానుడి భగభగల నుంచి కాస్త ఊరట లభించనుంది. మళ్లీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భూ ఉపరితలం వేడెక్కిన ప్రభావంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది.రేపు రాత్రి(ఏప్రిల్ 1వ తేదీ) నుంచి మూడో తేదీ వరకు వానలు కురుస్తాయని, అయితే 4వ తేదీన వర్ష ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఊరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశమూ ఉందని హెచ్చరించింది. ఏయే జిల్లాలపై ఈ ప్రభావం ఉంటుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.ఇక..వర్ష ప్రభావంతో ఏప్రిల్ 2, 3 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కొన్నాళ్ల కిందట అకాల వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. -
పంచాంగ శ్రవణం.. తరలివచ్చిన జనం
నిజాంపేట్: అది వేంకటేశ్వర స్వామి సన్నిధి.. భక్తులకు పెన్నిధి.. ఆలయ ప్రాంగణం వేదికగా పంచాంగ శ్రవణం.. స్థానికులు భారీగా తరలివచ్చి శ్రద్ధాసక్తులతో వీక్షించారు. ఇదీ ఆదివారం సాయంత్రం బాచుపల్లిలోని క్రాంతినగర్ కాలనీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కనిపించిన సన్నివేశం. ‘సాక్షి’మీడియా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం సాయంత్రం ఆరు నుంచి రాత్రి 9 గంటల వరకు సాగింది. ‘సాక్షి’డైరెక్టర్ రాణిరెడ్డి, ఆలయ చైర్మన్ కాంతారావు, సర్క్యులేషన్ జీఎం కీర్తికిరణ్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రఖ్యాత నర్తకి యామినిరెడ్డి బృందం చేసిన కళాత్మక కూచిపూడి నృత్యం ఆహూతులను ఆకట్టుకుంది. అనంతరం సిద్ధాంతి చక్రవర్తులు శ్రీవత్సాచార్యులు పంచాంగ పఠనం చేశారు. విశ్వావసు నామ సంవత్సరంలో రాశిఫలాల గురించి చాలా విపులంగా వివరించారు. ‘విశ్వాసం అని నామధేయంతో ఈ సంవత్సరముంది. విశ్వాసులు అంటే సూర్యుడి ప్రజ్వలితం ఏ «విధంగా ఉంటుందో ఈ సంవత్సరం కూడా అంతే ప్రజ్వలితంగా ఉంటుంది. అందరి జీవితాల్లో విశ్వావసు అంత గొప్ప వెలుగును నింపుతుంది. 12 రాశుల వారికి 12 స్థానాల్లో శుభ ఫలితాలను తెలుసుకోవచ్చు’అని పేర్కొన్నారు. అనంతరం అన్ని రాశుల వారి ఆదాయం, వ్యయం, రాజయోగం, అవమానం ఏ యే స్థాయిల్లో ఉందో వివరించారు. తర్వాత భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. భారతీ సిమెంట్స్ ఈ కార్యక్రమానికి స్పాన్సరర్‌గా వ్యవహరించింది. కార్యక్రమంలో సాక్షి సర్క్యులేషన్ మేనేజర్ వినోద్‌కుమార్, మహేశ్‌రెడ్డి, స్థానిక నాయకులు జీవీ రెడ్డి, కొమ్మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జైపాల్‌రెడ్డి, సంగమేశ్, మహేశ్, వెంకటేశ్, భూపతి, చరణ్, సూర్య తదితరులు పాల్గొన్నారు.రాశి ఫలాలు తెలుసుకున్నాం.. ఉగాది పండుగ సందర్భంగా మా కాలనీలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయడం మా అందరికీ సంతోషంగా ఉంది. పంచాంగంతో మా రాశుల ఫలాలు తెలుసుకున్నాం. సిద్ధాంతి గారి ఆధ్యాతి్మక ప్రసంగం ఎంతో ఆలోచింపజేయడంతోపాటు ఆచారించాల్సిన ఆవశ్యకతను తెలిపింది. – జి.ప్రసన్న, క్రాంతినగర్అవగాహన కలిగింది.. శుభ ముహూర్తాలు, అందులో గ్రహాల బలాల వల్ల జరిగే ఫలితాలు బాగా అర్థమయ్యాయి. సాక్షి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహాన్ని ఇవ్వడంతోపాటు రాశి ఫలాలపట్ల అవగాహన ఏర్పడింది. –ఎ.ఊర్మిళ చాలా సంతోషంగా ఉంది.. ఉగాది పండుగను ఇలా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. సాక్షి మీడియా ఆ«ధ్వర్యంలో విశ్వావసు నామ ఉగాదిని ఈ విధంగా నిర్వహించడం చాలా గొప్ప విషయం. తెలుగు పండుగల ప్రాధాన్యతను ఇలా చాటి చెప్పడం మంచి పరిణామం. ప్రజలంతా ఎంతో సంతోషంగా ఈ పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. – కాంతారావు, ఆలయ కమిటీ చైర్మన్, క్రాంతినగర్‘సాక్షి’ చొరవ అభినందనీయం ప్రతి నిత్యం ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు సాక్షి మీడియా ఎంతగానోకృషి చేస్తోంది. వాటితోపాటు పండుగలను నిర్వహిస్తూ తెలుగు సంప్రదాయాల్లో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందకరమైన విషయం. – నందిగామ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ బాచుపల్లి -
HCU వద్ద హైటెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం విక్రయించ వద్దని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం 200 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంలా మారింది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లో ఆదివారం వందలాదిగా మోహరించిన పోలీసులు విద్యార్థులపై లాఠీ దెబ్బలతో విరుచుకుపడి దాదాపు 200 మందిని అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు జేసీబీలతో పోలీసుల కాపలా నడుమ వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లోకి వచ్చారు. దట్టమైన పొదలు, చెట్లను తొలగించే ప్రయత్నం చేశారు. అది గమనించిన కొందరు విద్యార్థులు అక్కడికి చేరుకునేసరికి పోలీసులు చుట్టుముట్టారు.Hyderabad Central University witnessed police brutality.Students peacefully protesting against CM @revanth_anumula remarks calling HCU students “cunning foxes” and opposing a land grab near their campus were met with violence lathi charge, phones smashed, voices silenced.… pic.twitter.com/25oHPIGoXH— Harish Rao Thanneeru (@BRSHarish) March 30, 2025ఈ క్రమంలో పర్యావరణాన్ని దెబ్బతీస్తూ.. జీవ వైవిధ్యానికి నష్టం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని నినదిస్తూ అక్కడికి చేరుకున్న విద్యార్థులపై పోలీసులు రెచ్చిపోయారు. కాళ్లు, చేతులు పట్టుకొని నేలపై ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారు. అరెస్టులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని వర్సిటీలో పరిగెత్తిస్తూ మరీ లాఠీలతో చితకబాదారు. 200 మందికి పైగా విద్యార్థులను రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, కొల్లూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఠాణాలకు తరలించే క్రమంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని అడిగినందుకు హెల్మెట్లు, ప్రొటెక్షన్ షీల్డ్‌తో విచక్షణా రహితంగా కొట్టారు. కొందరు పోలీసులు తమను బూతులు తిట్టారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.Save our university land from being auctioned for private entities. University is an intellectual power house,don't kill the progress of the Telangana. Save our land.@KTRBRS @BRSHarish @Krishank_BRS @dhanyarajendran @revathitweets @bainjal @CharanT16 @RahulGandhi @priyankagandhi pic.twitter.com/81zQ3APMVd— sree charan (@mscharan) March 30, 2025బట్టలు చిరిగినా వదలకుండా..పోలీసుల అరాచకాన్ని ప్రశ్నించిన ఆడపిల్లలను మహిళా పోలీసులు జుట్టు పట్టుకుని నేలపై ఈడ్చుకుంటూ వ్యాను ఎక్కించారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో విద్యార్థినులు గాయాలపాలయ్యారు. బట్టలు చిరిగిపోయినా పట్టించుకోకుండా విద్యార్థులను లాకెళ్లారు. అడ్డుకోబోయిన యువకులను కాళ్లు, చేతులు పట్టుకుని వ్యాన్‌లో పడేశారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ తోటి విద్యార్థులు వర్సిటీ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు. బయటకు రాకుండా నిర్బంధించడంతో అక్కడే కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. Mohabbat Ka Dukaan at HCU today. Kudos to @RahulGandhi & Congress sarkaar You have outdone yourselves pic.twitter.com/NPZOqG7Uoh— KTR (@KTRBRS) March 30, 2025 -
బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు.. డీజీపీ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో యాప్స్‌పై విచారణ జరిపేందుకు సిట్ చీఫ్‌గా ఐజీ రమేష్ నియామకం అయ్యారు.వివరాల ప్రకారం.. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహరాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే యాప్స్ కేసులను విచారించేందుకు ఐదుగురు ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా ఐజీ రమేష్ నియామకం అయ్యారు. అలాగే, సిట్ సభ్యులుగా సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్, శంకర్ ఉన్నారు. ఇక, సిట్.. 90 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై పంజాగుట్ట, మియాపూర్‌లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులను సిట్‌కు బదిలీ చేశారు. #SayNoToBettingApps pic.twitter.com/jPRzks6PqV— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 31, 2025 ప్రిడిక్షన్ పేరుతో బెట్టింగ్ ఉబిలోకి.. జాగ్రత్త!!ఐపీఎల్ మ్యాచ్ ల ప్రిడిక్షన్ పేరుతో కొందరు కొత్త దందా. టెలిగ్రాం ఛానెల్ లో జాయిన్ కావాలంటూ యువతను బెట్టింగ్ కు బానిసలను చేస్తున్న వైనం.ఐపీఎల్ ను ఎంజాయ్ చేయండి. అంతేకానీ ఇలాంటి మాయగళ్ల మాటలు విని మీ జేబులు గుల్ల చేసుకోకండి. pic.twitter.com/XfO1BObmgD— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 30, 2025 -
బెట్టింగ్ యాప్‌లపై సిట్ చీఫ్‌గా ఐజీ రమేష్
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ వ్యవహారాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అధిపతిగా ఐజీ ఎం.రమేష్ పేరు ఖరారైంది. ఈ మేరకు డీజీపీ డాక్టర్ జితేందర్ ఆదివారం ఉత్తర్వులు (ఆర్సీ నం.191/ఎల్ అండ్ ఓ–ఐ/2025) జారీ చేశారు. తొలుత ఈ బా«ధ్యతల్ని డీఐజీగా ఉన్న అభిషేక్ మహంతికి అప్పగించాలని భావించారు. అయితే ఆయన తెలంగాణకు కేటాయింపుపై స్పష్టత లేకపోవడం, హైకోర్టు ఆదేశాల మేరకే ఇక్కడ కొనసాగుతుండటంతో డీజీపీ కార్యాలయంలో పీ అండ్ ఎల్ విభాగం ఐజీగా ఉన్న రమేష్‌ను ఎంపిక చేశారు. విదేశీ లింకులతో పాటు ఇతర కీలకాంశాలతో ముడిపడిన బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ఈ లోపు అభిషేక్ మహంతికి వ్యతిరేకంగా క్యాట్ ఉత్తర్వులు వస్తే ఆ ప్రభావం కేసుల దర్యాప్తుపై పడుతుందని డీజీపీ కార్యాలయం భావించింది. ఈ నేపథ్యంలోనే మరో సమర్థుడైన అధికారిగా పేరున్న రమేష్‌ను ఖరారు చేసింది. సిట్‌లో ఇంటెలిజెన్స్ ఎస్పీ సీహెచ్ సింధు శర్మ, సీఐడీ ఎస్పీ కె.వెంకటలక్ష్మీ, సైబరాబాద్‌లో పని చేస్తున్న అదనపు ఎస్పీ ఎస్.చంద్రకాంత్, సీఐడీ డీఎస్పీ ఎం.శంకర్ సభ్యులుగా ఉన్నారు. ఈ కేసుల దర్యాప్తునకు అవసరమైన ఇతర అధికారులను సిట్ ఎంపిక చేసుకోనుంది. దీంతో పాటు ఆర్థిక నిపుణులు, న్యాయాధికారులు, ఆడిటర్లు, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ నిపుణులు తదితరులను సీఐడీ అదనపు డీజీ అనుమతితో నియమించుకునే అవకాశం ఉంది. దర్యాప్తే కాదు..సిఫారసులూ చేయాలి ఈ సిట్ కేవలం కేసుల్ని దర్యాప్తు చేయడం మాత్రమే కాకుండా బెట్టింగ్ యాప్స్ తీరుతెన్నులు, వ్యవహారాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వీటిని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఈ యాప్స్‌ను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు, ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ, సమాచార ప్రసార, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ, హోం మంత్రిత్వ శాఖలతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తదితరాల బాధ్యతలను గుర్తించాల్సి ఉంది.ఈ యాప్స్ ఆర్థిక లావాదేవీలు, వాటి మార్గాలను గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకువెళ్లాలని డీజీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలాంటి అనేక అంశాలు, సమగ్ర వివరాలతో కూడిన నివేదికను సిట్ 90 రోజుల్లో డీజీపీకి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం డీజీపీ కార్యాలయం కేంద్రంగానే పని చేయనుంది. -
హెచ్‌సీయూ రణరంగం
సాక్షి, హైదరాబాద్/ రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసన ఆదివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం ఉగాది రోజున జేసీబీలతో వందల సంఖ్యలో పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించి భూములను చదును చేయటం ప్రారంభించారు. విషయం తెలిసి వందలమంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగటంతో అందరినీ ఈడ్చుకెళ్లి లారీల్లో పడేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. అరుపులు.. కేకలు.. అరెస్టులు ఆదివారం సెలవు దినం, ఉగాది పర్వదినం కూడా కావటంతో క్యాంపస్‌లో ఉదయం వాతావరణం ప్రశాంతంగానే మొదలైంది. కొద్ది సేపటికే పోలీసులు తండోప తండాలుగా వచ్చి క్యాంపస్‌లోని అన్ని అంతర్గత రోడ్లను ఆ«దీనంలోకి తీసుకొని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈస్ట్ క్యాంపస్ వైపు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేశారు. వర్సిటీ ప్రహరీ లోపలి భూములను జేసీబీలతో చదును చేయటం ప్రారంభించారు. విషయం తెలిసిన విద్యార్థులు రోడ్లపైకి దూసుకొచ్చారు.దీంతో పోలీసులకు, విద్యార్థులకు తోపులా జరిగింది. విద్యార్థుల నినాదాలతో క్యాంపస్ దద్దరిల్లింది. పోలీసులు ఏమాత్రం ఉపేక్షించకుండా కనిపించిన విద్యార్థిని కనిపించినట్లే వాహనాల్లోకి ఎక్కించి మాదాపూర్, గచ్చిబౌలి, కొల్లూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. విద్యార్థినులను కూడా ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్లలో పడేశారు. మొత్తం 52 మంది విద్యార్థులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పక్కా ప్రణాళికతో హెచ్‌సీయూ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిని విక్రయించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతకాలంగాక్యాంపస్లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నిరసనను అణచివేసేందుకు ప్రభుత్వం కూడా పక్కా ప్రణాళికతోనే వెళ్తున్నట్లు ఆదివారం నాటి ఘటనను బట్టి తెలుస్తోంది. శనివారం రాత్రి నుంచే పోలీసులు క్యాంపస్‌లో కొద్దిమొత్తంలో మకాం వేశారు. ఆదివారం ఉగాది సందర్భంగా చాలామంది విద్యార్థులు స్వగృహాలకు వెళ్లే అవకాశం ఉందని గురించి క్యాంపస్‌ను పూర్తిగా అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. క్యాంపస్‌లోకి బయటి వారు రాకుండా ముందు జాగ్రత్తగా మెయిన్ గేటుకు తాళం వేశారు. లోపలివారిని బయటకు కూడా వెళ్లనీయలేదు. శనివారం రాత్రే విద్యార్థులకు, పోలీసుల మధ్య జరిగిన తోపులాటలో చాలామంది గాయపడ్డారు. గతంలో ఎన్నడూ లేని«విధంగా హెచ్‌సీయూ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడం పట్ల విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
గ్రూప్–1 మెయిన్స్ టాపర్లు మహిళలే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి సివిల్ సర్విసు కొలువులుగా భావించే గ్రూప్–1 ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అర్హత పరీక్షల ఫలితాల్లో మహిళలు టాపర్లుగా నిలిచారు. మల్టీజోన్–1, మల్టీజోన్–2 రెండుచోట్లా టాప్ ర్యాంకులను మహిళా అభ్యర్థులే సాధించారు. మల్టీజోన్–2లో టాప్ స్కోర్ 550 మార్కులు కాగా.. మల్టీజోన్–1లో 532.5 మార్కులు టాప్ స్కోర్‌గా ఉన్నాయి. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ జాబితా (జీఆర్ఎల్)ను తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఆదివారం విడుదల చేసింది. ఉగాది పండుగ సందర్భంగా అభ్యర్థులకు తీపికబురు అందించే ఉద్దేశంతో తెలుగు నూతన సంవత్సరం తొలి రోజున జీఆర్‌ఎల్‌ను విడుదల చేసినట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి. జనరల్ ఇంగ్లిష్‌లో అర్హత సాధించిన వారే జాబితాలో.. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది ఫిబ్రవరి 19న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 4,03,465 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. జూలై 7వ తేదీన ఫలితాలను విడుదల చేసింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి 31383 మందిని మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేసింది. మెయిన్స్ పరీక్షలు గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించింది.మొత్తం 31,403 మంది పరీక్షలకు హాజరు కాగా.. 21,093 మంది మాత్రమే మొత్తం 7 పేపర్లూ రాశారు. ఈ నెల 10న అభ్యర్థుల ప్రొవిజినల్ మార్కుల జాబితాను కమిషన్ విడుదల చేయగా..మార్కుల రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 24 వరకు కమిషన్ అవకాశం కలి్పంచింది. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులు ఏడు పేపర్లలో సాధించిన మొత్తం మార్కుల వివరాలతో కూడిన జీఆర్‌ఎల్‌ను కమిషన్ తాజాగా వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచింది. జనరల్ ఇంగ్లీ‹Ùలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే జనరల్ ర్యాంకింగ్ జాబితాలో ఉన్నారు. అభ్యర్థి లాగిన్‌లో మార్కుల మెమోలు పేపర్ల వారీగా అభ్యర్థుల మార్కులను కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థుల లాగిన్‌లో మెమోలు అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు వారి టీజీపీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీల ద్వారా లాగిన్ అయ్యాక పేజీని తెరిచి మెమోను డౌన్లోడ్ చేసుకోవాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ మెమోలు ఏప్రిల్ 5వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని కమిషన్ కార్యదర్శి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే జీఆర్ఎల్ ఏప్రిల్ 28వ తేదీ వరకు నెలరోజుల పాటు అందుబాటులో ఉంటుందని వివరించారు. ప్రస్తుతం విడుదల చేసిన జీఆర్ఎల్ ఆధారంగా త్వరలో 1:2 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేయనున్నట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి.అలాఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేపట్టిన తర్వాత తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. అభ్యర్థులు అన్నిరకాల ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు అనెక్జర్–6 ప్రకారం నిర్దేశించిన డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకోవాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఇలావుండగా హైకోర్టు ఆదేశాలతో మెయిన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థుల (స్పోర్ట్స్ కోటా విషయంలో 20 మంది కోర్టును ఆశ్రయించారు) వివరాలను విడుదల చేయలేదు. లాగిన్ విషయంలో అభ్యర్థులకు ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే కమిషన్ టెక్నికల్ డెస్‌్కను 040–23542185, 040–23542187 ఫోన్ నంబర్లలో లేదా ‘హెల్ప్‌డెస్‌్క(ఎట్)టీఎస్పీఎస్సీ.జీఓవీ.ఇన్’లో సంప్రదించవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. ఐఏఎస్ నా కల.. నల్లగొండ: గ్రూప్ –1 ఫలితాల్లో నల్లగొండకు చెందిన దాది వెంకటరమణ 2వ ర్యాంకు సాధించాడు. టీజీపీఎస్సీ ఆదివారం ప్రకటించిన ర్యాంకింగ్‌లలో దాది వెంకటరమణ (హాల్ టికెట్ నంబర్ 240920349) 535.5 మార్కులు సాధించాడు. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన వెంకటరమణ తల్లి దాది రమాదేవి ప్రధానోపాధ్యాయురాలిగా, తండ్రి శ్రీనివాసరావు ఆర్‌డబ్ల్యూఎస్‌లో కాంట్రాక్టు ఏఈగా పని చేస్తున్నారు. వీరి స్వస్థలం సూర్యాపేట. ఉద్యోగరీత్యా నల్లగొండలోని బృందావన్ కాలనీలో స్థిరపడ్డారు.ఐదు సంవత్సరాలుగా వెంకటరమణ సివిల్స్‌కు ప్రిపేరవుతూ గ్రూప్–1లో రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించాడు. వెంకటరమణ ఇటీవల విడుదలైన జూనియర్ లెక్చరర్, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా సాధించడంతో పాటు గ్రూప్–2లో 378వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఐఏఎస్ కావాలన్నది తన ఆశయమని, అయితే గ్రూప్–1 ద్వారా డిప్యూటీ కలెక్టర్ పోస్టు సాధించానని చెప్పాడు. భవిష్యత్‌లో ఐఏఎస్ కల నెరవేర్చుకుంటానని తెలిపాడు. అమ్మానాన్నల సహకారంతో విజయం సాధించానని పేర్కొన్నాడు.ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తా.. శాయంపేట/హనుమకొండ: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం తహరాపూర్ (మాందారిపేట) గ్రామానికి చెందిన జిన్నా తేజస్వినిరెడ్డి గ్రూప్–1 ఫలితాల్లో స్టేట్ 4వ ర్యాంకు సాధించింది. తేజస్విని తల్లిదండ్రులు జిన్నా హేమలత, విజయపాల్‌రెడ్డి ప్రస్తుతం హనుమకొండ విద్యానగర్‌లో ఉంటున్నారు. తేజస్వినిరెడ్డి మల్జీజోన్–1లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఆమె 2019 మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–2లో మండల పంచాయతీ అధికారిగా ఉద్యోగం సాధించింది.మొదటి పోస్టింగ్ నేలకొండపల్లి, రెండవ పోస్టింగ్ టేకుమట్ల, ప్రస్తుతం రేగొండలో ఉద్యోగం చేస్తున్నది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే గ్రూప్–1కు సన్నద్ధమైంది. ‘నేను సివిల్ సర్విసెస్‌లో చేరాలన్నది తాత కోరిక. అది నెరవేర్చడానికి కష్టపడి చదివాను. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో గ్రూప్–1లో స్టేట్ 4వ ర్యాంకు సాధించాను. చాలా సంతోషంగా ఉంది. నాకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వస్తుంది. ఆ హోదాలో ప్రభుత్వ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందేలా చూడవచ్చు. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడమే లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తాను’అని తేజస్వినిరెడ్డి తెలిపారు. అమ్మమ్మ, తాతయ్యకు అంకితం.. మిర్యాలగూడ: గ్రూప్–1 ఫలితాల్లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన పూనాటి హర్షవర్ధన్ (హాల్‌టికెట్ నంబర్ 240911138) 525.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించాడు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన రాజ్యలక్ష్మి, తిరుపతిరావుల కుమారుడైన హర్షవర్ధన్ పదో తరగతిలో 568 మార్కులు, ఇంటర్లో 972 మార్కులు సాధించాడు. అనంతరం బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసి రూ.27 లక్షల వార్షిక వేతనంతో అమెజాన్‌లో ఏడాది పాటు ఉద్యోగం చేశాడు. అనంతరం యూపీఎస్సీ సివిల్ సర్విసెస్ కోసం ఢిల్లీ వెళ్లి నాలుగేళ్ల శిక్షణ తీసుకున్నాడు.గత సంవత్సరం తిరిగి హైదరాబాద్‌కు వచ్చి గ్రూప్–1 కోసం సన్నద్ధమై పరీక్షలో సత్తాచాటి రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకు సాధించాడు. హర్షవర్ధన్ తల్లి గృహిణి, తండ్రి బియ్యం వ్యాపారి. హర్షవర్ధన్ తమ్ముడు అమెరికాలో చదువుతున్నాడు. కష్టపడి చదివి గ్రూప్–1లో ర్యాంకు సాధించానని.. ఈ విజయాన్ని తన అమ్మమ్మ జంపాల నర్సమాంబ, తాతయ్య కొండయ్యకు అంకితం ఇస్తున్నట్లు హర్షవర్ధన్ తెలిపాడు. ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు..మీర్‌పేట: ఆదివారం వెలువడిన గ్రూప్–1 ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా మీర్‌పేట మున్సిపల్ పరిధిలోని జిల్లెలగూడకు చెందిన సిద్ధాల లావణ్య, బీరప్పల కుమార్తె కృతిక రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన ప్రిపరేషన్ గురించి వివరించింది. ‘మొదట సివిల్స్‌కు సిద్ధం అయ్యాను. నాలుగుసార్లు ప్రయత్నించినప్పటికీ మంచి ర్యాంకు రాలేదు. దీంతో 2022లో గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతో అప్పటి నుంచి చదవడం ప్రారంభించాను. రోజులో ఇన్ని గంటలు చదవాలన్న నిబంధన పెట్టుకోకుండా ఒక చాప్టర్ పూర్తిగా చదవాలని అనుకుని ఎన్ని గంటలైనా చదివి పూర్తి చేశాను. పరీక్షలు దగ్గరపడుతున్నప్పుడు మాత్రం రోజులో 10 నుంచి 12 గంటలు చదివాను’అని తెలిపారు. తాను ఎక్కడా శిక్షణ తీసుకోలేదని, ఆన్లైన్ కోర్సులు కొనుగోలు చేసి చదివినట్లు వెల్లడించింది. సివిల్స్ ప్రిపరేషన్ గ్రూప్–1లో మంచి ర్యాంకు సాధించేందుకు ఉపయోగపడిందని తెలిపింది. ఆమె గ్రూప్–4లో 511వ ర్యాంకు సాధించింది. కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా కూడా ఉద్యోగం సాధించి జనవరి నుంచి విధులు నిర్వహిస్తోంది. తనకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వస్తుందని తెలిపింది. కృతిక తల్లి లావణ్య గతంలో సరూర్‌నగర్ మండల ఎంపీపీగా, మీర్‌పేట కార్పొరేటర్‌గా పనిచేశారు. నానమ్మ కష్టం వృథా కానివ్వలేదు..ఏటూరునాగారం: ఆరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ బిడ్డను.. దివ్యాంగురాలైన నానమ్మ అన్నీ తానే అయ్యి సాకింది. ఆమె కష్టాన్ని ఆ బిడ్డ వృథా కానివ్వలేదు. కటిక పేదరికం ఎన్ని అవరోధాలు సృష్టించినా మొక్కవోని దీక్షతో చదివి గ్రూప్–1 ఫలితాల్లో స్టేట్ 105వ ర్యాంకు సాధించాడు. ములుగు జిల్లా ఏటూరునాగారంలోని మానసపల్లికి చెందిన దైనంపల్లి ప్రవీణ్‌కుమార్ తన నానమ్మ రుణం ఇలా తీర్చుకున్నాడు. కష్టాలనే విజయంగా మార్చుకొని.. ప్రవీణ్‌కుమార్‌కు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు సమ్మయ్య, రజిత అనారోగ్యంతో మరణించారు. దీంతో నానమ్మ ఎల్లమ్మ అతడిని పెంచి పెద్ద చేసింది. స్వగ్రామంలో సఫాయి కార్మికురాలిగా పనిచేస్తూ మనవడిని చదివించింది. ప్రవీణ్ ఏటూరునాగారం జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి పూర్తి చేశాడు. ములుగు మండలం జాకారం సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇంటర్, ఉస్మానియా యూనివర్సిటీలో 2019లో బీటెక్ పూర్తి చేశాడు. ‘గ్రూప్–1 ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో ప్రిపేర్ అయ్యాను. ఫలితాల్లో 105వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. డీఎస్పీ హోదా కలిగిన ఉద్యోగం వస్తుంది’అని ప్రవీణ్‌కుమార్ సంతోషం వ్యక్తంచేశాడు. ‘నా కొడుకు, కోడలు లేనందుకు మనవడికి గొప్ప ఉద్యోగం రావడం గర్వంగా ఉంది. నాకు రెండు కాళ్లు లేకున్నా గ్రామ పంచాయతీలో సఫాయిగా పనిచేసి పెద్దచేసిన. ఇప్పుడు గొప్ప స్థాయికి పోయిండు. ఎంతో ఆనందంగా ఉంది’అంటూ ఎల్లమ్మ భావోద్వేగంతో చెప్పింది. -
గెలుపు ఎర వేస్తారు.. తర్వాత ఓడిస్తారు: వీసీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ‘బెట్టింగ్ యాప్స్ ప్రభావం ఎక్కువగా యువత పైనే ఉంటోంది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేకమంది వీటికి బలవుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఈ వ్యసనానికి బానిసలుగా మారుతున్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్‌లకు భిన్నంగా ఈ బెట్టింగ్ యాప్స్ యువతనే టార్గెట్‌గా చేసుకుని దోచుకుంటున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ఎలాగైనా ఎదుటివాళ్లు ఓడిపోయే విధంగానే డిజైన్ చేసి ఉంటాయి. ఒకటీ రెండుసార్లు డబ్బు వచ్చినా అది కేవలం దోచుకోవడానికి ఎర అనే విషయం తెలుసుకోవాలి..’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో సజ్జనార్ ప్రారంభించిన అవగాహన కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రాన్నీ కదిలించింది. తెలంగాణ సర్కారు వీటిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. గతంలో మల్టీ లెవల్ మార్కెటింగ్ దందాల పైనా ఇలానే పోరు కొనసాగించిన సజ్జనార్.. వాటికి సంబంధించి ప్రత్యేక చట్టం రావడానికి కారణమయ్యారు. తాజాగా బెట్టింగ్ యాప్స్‌పై యుద్ధం ప్రకటించిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అవగాహన పెంచేందుకే ‘సే నో టు బెట్టింగ్ యాప్స్’ యువత ప్రాణాలు తీసుకోవడం కదిలించింది. బెట్టింగ్ యాప్‌ల బారినపడ కుండా వారిని కాపాడటం కోసం, వారిలో అవగాహన కల్పించడానికి ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ ప్రారంభమైంది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది సెర్చ్ చేశారు. క్యాంపెయినింగ్ మొదలైన తర్వాత ‘ఎక్స్’ను 1.2 కోట్లు మంది, ఇన్‌స్ట్రాగామ్‌ను 85 లక్షలు మంది వీక్షించారు. ప్రస్తుతం అనేక మంది సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లతో పాటు ప్రముఖులు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్లు ఆయా ప్రకటనలు చేసేప్పుడు తదనంతర పరిణామాలను ఊహించలేదు. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సైబర్ టెర్రరిజం కిందికే వస్తుంది. మన పోలీసులు ఆది నుంచీ ముందున్నారు సమాజంలో జరుగుతున్న వివిధ రకాలైన ఆర్థిక దోపిడీలను అడ్డుకోవడంలో మన పోలీసులు ఎప్పుడూ ముందుంటున్నారు. ఒకప్పుడు ఎంఎల్ఎం స్కామ్స్, ఆపై మైక్రో ఫైనాన్స్ దుర్వినియోగాలను పకడ్బందీగా కట్టడి చేశారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వంతు వచ్చింది. అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి కేవలం పాత్రధారులనే కాదు సూత్రధారులకూ చెక్ చెప్పే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చట్టాన్ని కూడా కఠినంగా అమలు చేయాలి. అన్నివర్గాల్లో అవగాహన కల్పించాలి. బెట్టింగ్ యాప్‌లను బ్యాన్ చేయడం, ప్రమోటర్లతో పాటు నిర్వాహకుల పైనా చర్యలు తీసుకోవడం అవసరం. ఈ బెట్టింగ్ ప్రకటనలను అనుమతించిన మీడియా ప్లాట్‌ఫామ్‌లూ బాధ్యత వహించేలా చేయాలి. లావాదేవీలను సులభతరం చేసే చెల్లింపు గేట్‌వేల లైసెన్స్‌లు రద్దు చేయాలి. అడ్డుకట్ట వేయకపోతే ఓ తరాన్ని ఫణంగా పెట్టాల్సిందే.. బెట్టింగ్ నెట్‌వర్క్‌లు విదేశాల నుండి పనిచేస్తుంటాయి. అందువల్ల వీరిని కనిపెట్టి, కట్టడి చేయడం కష్టసాధ్యమైన అంశం. అందువల్ల అంతా ముందుకు వచ్చి అందరిలోనూ అవగాహన కల్పించడం ద్వారా ఈ ఉచ్చు నుంచి యువతను తప్పించాలి. పోలీసులు సైతం ఎప్పటికప్పుడు బెట్టింగ్ దందాలపై అవరసమైన చర్యలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లు అనేక కుటుంబాలు కుప్పకూలడానికి కారణం అవుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆర్థిక ఉగ్రవాదంతో సమానం. ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేయకపోతే దానికి ఓ తరాన్ని ఫణంగా పెట్టాల్సి వస్తుంది. ఈ తరుణంలో అందరం కలిసి ముందుకు వెళితేనే మన సమాజాన్ని కబళిస్తున్న బెట్టింగ్ భూతానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టగలం. యువతరాన్ని రక్షించుకోగలం. తల్లిదండ్రుల అప్రమత్తతా కీలకం బెట్టింగ్ యాప్‌ల విషయంలో తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి. ఈ భూతాన్ని పూర్తిగా పారద్రోలాలంటే తల్లిదండ్రుల సహకారం అనివార్యం. ప్రతి ఒక్కరూ తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సోషల్‌మీడియా వినియోగదారుల్లో 16–30 ఏళ్ల మధ్య వయసు్కలే ఈ యాప్‌ల టార్గెట్‌గా ఉంటున్నారు. ఇక తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న ఎందరో విద్యార్థులు తమ చదువుకు ఉద్దేశించిన డబ్బును బెట్టింగ్‌లో పోగొట్టుకుని విద్యకు దూరమైన ఉదంతాలు ఉన్నాయి. యువత అనేకమంది అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి ఇవి ఆత్మహత్యలు కాదు.. బెట్టింగ్ యాప్స్, వాటిని ప్రమోట్ చేసే వాళ్లు చేసిన హత్యలు. -
నా సంకల్పమేదీ విఫలం కాలేదు
సాక్షి, హైదరాబాద్: తమ ప్రభుత్వ ఆలోచనల్లో స్పష్టత ఉందని. సంకల్ప బలం ఉంటే దేవుడు కూడా సహకరిస్తాడన్న సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. తన జీవితంలో సంకల్పించిన లక్ష్యం ఏదీ ఇప్పటివరకు విఫలం కాలేదన్నారు. తెలంగాణ రైజింగ్ 2050 లక్ష్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలన్న సంకల్పం కూడా విజయవంతమవుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, పర్యాటక సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా రవీంద్రభారతిలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం మాట్లాడారు. పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ ‘తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టేందుకు మా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుంది. తెలంగాణ రైజింగ్ నినాదాన్ని నిజం చేస్తూ దేశంలో తెలంగాణ ఓ వెలుగు వెలిగేలా చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగు రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. లాంటి కీలక నిర్ణయాలతో హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడేలా మారుస్తాం. మన ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ ఆ ఆలోచనకు నమూనాగా నిలవబోతుంది. ఇది జనావాస యోగ్యానికే పరిమితమయ్యే నగరం కాదు. ఉద్యోగ, ఉపాధి కల్పన సంక్షేమ పథకాల అమలుకు నిధులు కావాలంటే ఆ నగరానికి పెట్టుబడులు భారీగా రావాల్సి ఉంది. ఆ పెట్టుబడులతో రాష్ట్ర ఆదాయం పెరగాల్సి ఉంది. అందుకే ఆ నగరం జనావాసాలకే పరిమితం కాకుండా ఓ పెట్టుబడుల నగరంగా రూపు దిద్దుకుంటుంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం..‘అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రజల నుంచి నూరు శాతం మద్దతు వస్తుందని మా ప్రభుత్వం అనుకోవటం లేదు. దేవుళ్ల ఆరాధన విషయంలోనే భిన్నాభిప్రాయాలుండే సమాజం నుంచి.. ప్రభుత్వ నిర్ణయాలకు పూర్తి ఆమోదం ఆశించలేం. కానీ మెజారిటీ ప్రజల సంక్షేమం కోసం మేం తీసుకునే చర్యలు అడ్డుకుంటే ఆగిపోతాయని అనుకునేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రజల నుంచి మాకు సూచనలొస్తున్నాయి. కాబట్టి వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం..’ అని రేవంత్ అన్నారు. ఉగాది పచ్చడి లాగానే భట్టి బడ్జెట్ ‘ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కూడా షడ్రుచుల ఉగాది పచ్చడి లాగానే ఉంది. తీపి ఉంది, పులుపు ఉంది, కారం ఉంది. కాస్తోకూస్తో ఉప్పు కూడా ఉంది. కొన్ని అంశాల్లో స్వేచ్ఛగా నిధులిచ్చారు. కొన్నింటి విషయంలో తప్పనిసరి నియంత్రణ పాటించారు. ఉద్యోగ ఉపాధి, పరిశ్రమలు, వ్యవసాయం, విద్య వైద్యం తదితరాలకు మెరుగ్గా నిధులిచ్చారు. బడ్జెట్ కేటాయింపులు అమలు కావాలంటే, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి. అది జరగాలంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు స్థిరంగా ఉండాలి. అసాంఘిక శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలు సన్న బియ్యం కోరుకుంటున్నారు..నేను, భట్టి జోడెద్దుల్లా రాష్ట్రాన్ని పురోగమన పథంలోకి తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. గతంలో పండుగ పూట మాత్రమే తెల్లన్నం చూసే భాగ్యం పేదలది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి రూ.1.90కే, తర్వాత ఎన్టీఆర్ రూ.2కే కిలోబియ్యం ఇచ్చి కొంత మార్పు తెచ్చారు. సోనియాగాంధీ ఆధ్వర్యంలో ఆహారభద్రత చట్టం వచ్చాక ఇప్పుడు పేదలు శ్రీమంతుల తరహాలో సన్న బియ్యం తినాలని కోరుకుంటున్నారు. వారికోసం హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో పాటు గవర్నర్, ఎన్నికల వ్యవస్థ, న్యాయవ్యవస్థ, పార్టీలు, ప్రజా సంఘాలతో సత్సంబంధాలు కొనసాగిస్తాం. ఎక్కడైనా లోపాలుంటే సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతాం. రాష్ట్ర ప్రజలందరికీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు..’ అని సీఎం అన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాభివృద్ధి: భట్టిఅన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు మల్లు రవి, అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, శంకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వా మి దేవస్థానం నూతనంగా రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. యాదగిరి క్షేత్ర ముఖ్య అర్చకులు మంగళగిరి నర్సింహమూర్తిని ఉగాది పురస్కారం, అవార్డుతో సన్మానించారు. -
మన దగ్గరే 'బంగారు' కొండ
సాక్షి, స్పెషల్ డెస్క్: సుమారు 25,000 టన్నులు.. భారతీయుల వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలు ఇవి. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా.. బంగారం అంటే మన వాళ్లకు అమితపైన ప్రేమ ఉంది కాబట్టి ఆ మాత్రం ఉండొచ్చు అనే కదా మీ ఆలోచన. అసలు విషయం చెబితే నోరెళ్లబెట్టాల్సిందే. ప్రపంచంలో ఉన్న 10 ప్రధాన కేంద్ర బ్యాంకుల (ఆర్బీఐలాంటి సెంట్రల్ బ్యాంక్స్) వద్ద ఉన్న మొత్తం పసిడి నిల్వల కంటే మన భారతీయుల వద్ద ఉన్న బంగారమే ఎక్కువని హెచ్ఎస్బీసీ గ్లోబల్ తాజా నివేదికలో వెల్లడించింది. భారతీయుల కుటుంబాల్లో ఉన్న ‘బంగారు కొండ’ ఏపాటితో దీనిని బట్టి అర్థం అవుతుంది. తరతరాలుగా సంపదను సంరక్షించుకోవడం, భద్రత కోసం బంగారాన్ని ఒక ప్రాధాన్య ఆస్తిగా మనవారు ఆధారపడిన విధానాన్ని ఈ కొండ నొక్కి చెబుతోంది. భారతీయులు పసిడిని ఇలా విస్తారంగా కూడబెట్టుకోవడం దేశ ఆర్థిక, సాంస్కృతిక నిర్మాణంలో పుత్తడికి ఉన్న ప్రాముఖ్యతకు నిదర్శనం.ప్రత్యామ్నాయంగా పుత్తడి..యూఎస్ఏ, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, తుర్కియే దేశాలు ఈ టాప్–10 జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల సెంట్రల్ బ్యాంకుల మొత్తం బంగారం నిల్వలను మించి భారతీయుల వద్ద పసిడి ఉందంటే.. పొదుపు, పెట్టుబడి వ్యూహం విషయంలో భారతీయుల్లో ఈ యెల్లో మెటల్ ఎంతటి కీలకపాత్ర పోషిస్తోందో అవగతం అవుతుంది. భారతీయ కుటుంబాలకు బంగారం ప్రాధాన్యత కలిగిన ఆస్తిగా ఉందనడంలో సందేహం లేదు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, కరెన్సీ విలువల హెచ్చుతగ్గులకు దీనిని ఒక విరుగుడుగా ప్రజలు భావిస్తున్నారు. వివాహాలు, పండగలు, మతపర వేడుకలు గోల్డ్ డిమాండ్‌ను గణనీయంగా పెంచుతున్నాయి. బ్యాంకుల్లో పొదుపు చేస్తే వచ్చే వడ్డీ కంటే బంగారం కొనుగోలు ద్వారా దీర్ఘకాలంలో అధిక ఆదాయం పొందవచ్చన్నది ప్రజల మాట. అందుకే అత్యధిక కుటుంబాల్లో బ్యాంకు డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా పుత్తడి అవతరించింది. సెంట్రల్ బ్యాంక్స్ సైతం..ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా, చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా భారత్ నిలిచింది. పుత్తడి దిగుమతులు సైతం భారత వాణిజ్య లోటు పెరగడానికి కారణం అవుతున్నాయి. అయితే కుటుంబ సంపద పరిరక్షణలో పసిడి ఇప్పటికీ ముఖ్యమైన భాగంగా ఉంది. భారతీయ కుటుంబాలు వ్యక్తిగతంగా బంగారాన్ని దాచుకోవడంలో ముందంజలో ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా ఇటీవలి కాలంలో పుత్తడి కొనుగోళ్లను పెంచాయి. ఆర్థిక అస్థిరతల నుంచి రక్షణ ఇచ్చే సాధనం బంగారమేనని ఇవి భావిస్తుండడమే ఇందుకు కారణం. ఈ ప్రపంచ ధోరణులకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన బంగారు నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. 2024 డిసెంబర్ నాటికి ఆర్బీఐ వద్ద 876.18 టన్నుల నిల్వలు పోగయ్యాయి. తొలిస్థానంలో ఉన్న యూఎస్ఏ 8,133 టన్నులు, రెండోస్థానంలో ఉన్న జర్మనీ వద్ద 3,352 టన్నుల నిల్వలు ఉన్నాయి. -
విద్యార్థులపై ఇష్టానుసారం దాడి చేస్తారా?, ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ((Hyderabad Central University)ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు.హెచ్‌సీయూలో భూముల వేలం వివాదాన్ని వ్యవతిరేకిస్తూ ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనతో భారీగా మొహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి సెంట్రల్ వర్శిటీలో ఉద్రిక్తతపై బండి సంజయ్ స్పందించారు. ‘విద్యార్థులపై లాఠీఛార్జీ అమానుషం. ప్రభుత్వ భూములను తెగనమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా?. భావితరాలకు గజం జాగా కూడా మిగిల్చరా? పోలీసుల ద్వారా భయాందోళనలకు గురిచేసి కాంగ్రెస్ పాలన చేయాలనుకుంటోంది. వర్శిటీ భూములకే రక్షణ లేకపోతే ఎలా?. ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోంది.భూముల రక్షణ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఇష్టానుసారం దాడి చేస్తారా?.తక్షణమే అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయాలి. హెచ్‌సీయూ భూముల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
హెచ్‌సీయూ వద్ద మళ్లీ ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ(హెచ్ సీయూ) భూముల విక్రయాన్ని నిరసిస్తూ విద్యార్థి లోకం ఆందోళన చేపట్టింది. భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ గత రాత్రి(శనివారం) నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో యూనివర్శిటీ వద్ద భారీగా పోలీసుల్ని మోహరించి ఆందోళనను అణిచివేయాలని ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు’(ఆదివారం) యూనివర్శిటీ పరిధిలోని పచ్చచెట్లను నరికివేయడానికి ప్రభుత్వం పూనుకుంది. వర్శిటీ పక్కన ఉన్న భారీ స్థలంలో చెట్లను కొట్టివేస్తుండగా విద్యార్ధులు అడ్డగించారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్శిటీ మెయిన్ గేటుకు తాళం వేశారు పోలీసులు. యూనివర్శిటీ ప్రాంగణంలో జేసీబీలతో చెట్లను కూల్చివేసి నేలను చదును చేసే యత్నం చేస్తున్నారు. విద్యార్థులు అరెస్టు..ఎస్ఎఫ్ఐ ఖండనఆందోళనకు దిగిన విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఆందోళనను అణచివేసే క్రమంలో పెద్ద ఎత్తున అరెస్టులు కొనసాగుతున్నాయి. దీన్ని తెలంగాణ ఎస్ఎఫ్ఐ ఖండించింది. అహంకారంతో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేసిన విద్యార్థులను విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది. HCU విద్యార్ధులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండించండి. ఎక్కడ ఎడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం , నియంతృత్వం, అహంకారం తో వ్యవరిస్తున్న రేవంత్ రెడ్డి తక్షణమే బేషరతుగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి.@VP_Sanu @KTRBRS @TV9Telugu @NtvTeluguLive @ndtv @V6News @MayukhDuke pic.twitter.com/49WFvdScad— SFI Telangana (@TelanganaSfi) March 30, 2025 ఇదీ వివాదం.. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములను ఎప్పటికప్పుడు ఏదో సాకు చూపి వెనక్కు లాక్కుంటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ ఏర్పడిన 50 ఏళ్లలో దాదాపు 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నారని అంటున్నారు. మొదట 2300 ఎకరాల్లో హెచ్‌సీయూను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపిస్తున్నారు.తాజాగా టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు నిర్ణయించడంతో విద్యార్థి సంఘాలు, వర్కర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పోరాటానికి దిగారు. వీరంతా జేఏసీగా ఏర్పడి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఈ స్థలం హెచ్‌సీయూది కాదని, అందుకే కోర్టు తీర్పు మేరకే అభివృద్ధి చేసేందుకు 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే జరిగితే ఇక మిగిలేది 1400 ఎకరాలు మాత్రమే.హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, హెచ్‌సీయూ భూములు (HCU Lands) వర్సిటీ అవసరాలకే వినియోగించేలా చొరవ చూపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చుట్టూ ఐటీ కారిడార్ ఉండడంతో ఈ భూముల విక్రయం ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 400 ఎకరాలను విక్రయిస్తే మార్కెట్ విలువ ప్రకారం రూ.10 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వ అంచనా వేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. -
హైదరాబాద్ నగరంలో భారీ సంఖ్యలో కొత్త కార్ల బుకింగ్
హైదరాబాద్ నగరంలో పలు సాంస్కృతిక వేదికల్లో ఉగాది (Ugadi) ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు భాషా సాంస్కృతి శాఖ ఆధ్వరంలోనే కాకుండా పలు సాహిత్య, సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యంలో కళ, నృత్య ఉత్సవాలు, సాహిత్య వేడుకలు, ఉగాది పురస్కారాల సంబరాలను నిర్వహిస్తున్నారు. వారాంతాలతో పాటు సోమవారం రంజాన్ పండుగ కూడా కలిసి రావడంతో మూడు రోజుల సెలవులను ఆస్వాదించడానికి ఈ వేదికలను ఎంచుకుంటున్నారు.సోషల్ మీడియాలో షష్ట గ్రహ కూటమి.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో షష్ట గ్రహ కూటమి ((Shasta Graha Kutami) అనే అంశం వైరల్‌గా మారింది. అరుదుగా సంభవించే ఈ షష్ట గ్రహాల కూటమి వల్ల పలు మార్పులు సంభవిస్తాయని, ముఖ్యంగా రాశులపై ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్యులు, పండితులు వెల్లడిస్తున్నారు. 2019లో సంభవించిన ఈ షష్ట గ్రహ కూటమి అనంతరం కరోనా (Corona) మహమ్మారి విజృంభించిందని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. కానీ, విశ్వంలో నిత్యం ఏర్పడే మార్పుల్లో భాగంగానే ఈ ఆరు గ్రహాల కూటమి, అంతకు మించి ఎలాంటి ప్రభావాలూ ఉండబోవని నగరానికి చెందిన పరిశోధకులు సోషల్‌మీడియా (Social Media) వేదికగా పోస్టులు షేర్ చేస్తున్నారు. ఉగాదికి కోరిక తీరింది.. వసంతానికి శుభారంబంగా అందరి జీవితాల్లోనూ వసంత శోభ వరించాలని ప్రకృతి దీవెనలతో నూతన సంవత్సరాది ప్రారంభమవుతోంది. అయితే ఈ ఏడాది అందరి చూపు నూతన వాహనాలపై పడింది. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా వాహనాలపై టాక్స్ పెరగనుందని నివేదికలు చెబుతున్న నేపథ్యంలో ఈ ఉగాదికి నగరవాసులు భారీ సంఖ్యలో కొత్త వాహనాలను బుకింగ్ చేసుకున్నారని ఆయా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.చదవండి: హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ పతనంతెలుగు సంవత్సరాది.. అందరికీ ఇష్టమైన ఉగాది..! జీవితంలో అన్ని అనుభవాలను, అనుభూతులను సముపాళ్లలో ఆస్వాదించాలనే మంచి సందేశాన్నందిస్తూ నూతన తెలుగు ఏడాదికి ఆహ్వానం పలుకుతోంది. ఈ నేపథ్యంలో నగరమంతా కొంగొత్త ఆశలతో పండుగ శోభ వెల్లివిరుస్తోంది. సంక్రాంతికి ఆంధ్రా, దసరాకు తెలంగాణ (Telangana) ఊళ్లకు ప్రయాణమయ్యే నగరవాసులు.. ఉగాదికి మాత్రం నగరంలో ఉండటానికే ప్రధాన్యమిస్తున్నారు. ఈ సందర్భంగా నగరమంతా ఉగాది సంబరాల ఏర్పాట్లు, షాపింగ్ సందడితో కనిపిస్తోంది. మరోవైపు సాంస్కృతికప్రదర్శనలు, ఉగాది పురస్కారాలు, సాహిత్య కార్యక్రమాలు వంటి ఉత్సవాలకు సిద్ధమైంది. – సాక్షి, సిటీబ్యూరో -
జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ ..!
హైదరాబాద్: టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి నటిస్తూ నిర్మిస్తున్న సినిమాలో భాగంగా ఆఫీస్ ను ప్రారంభించారు. జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమాను నిర్మించడంతో పాటూ అందులో నటిస్తున్నారు జగ్గారెడ్డి. ఉగాది పండుగ సందర్భంగా సినిమా ఆఫీస్ ను నందినగర్ లో ప్రారంభించారు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి చిత్రానికి వడ్డీ రామానుజం దర్శకత్వం వహిస్తున్నారు.సినిమా ఆఫీస్ ప్రారంభోత్సవంలో భాగంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘నేను ఇటీవల ఢిల్లీ లో చెప్పినట్టు జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా స్టార్ట్ చేస్తున్నాము. ఉగాది పండుగ సందర్భంగా సినిమా ఆఫీస్ ను ప్రారంభించాము. నా నిజ జీవితంలో జరిగిన సంఘటనల సమాహారంగా ఈ సినిమా వుంటుంది. నా నిజ జీవితం పాత్రలో నేను నటిస్తున్నాను. మిగతా విషయాలు త్వరలో ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు.జగ్గారెడ్డి కూతురు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ.. నాన్న జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్ కి వచ్చారు. ఆయన జీవితం ఒక ఇన్సిరేషన్ అని పేర్కొన్నారు. -
తెలంగాణ ఆర్టీసీకి మహాలక్ష్మి షాక్
సాక్షి, హైదరాబాద్: మహిళల ఉచిత ప్రయాణాలకు సంబంధించి ఆర్టీసీకి రీయింబర్స్ చేయాల్సిన మొత్తంలో దాదాపు రూ.650 కోట్లను తెలంగాణ ప్రభుత్వం బకాయిపెట్టింది. ఆర్థిక సంవత్సరం ముగియటానికి మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. ఆది, సోమ, మంగళవారాలు వరుస సెలవులు. శనివారం పనివేళలు ముగిసే సమయానికి ఆ మొత్తం విడుదల కాలేదని తెలిసింది. దీంతో ఇక అవి మురిగిపోతాయన్న ఆందోళన ఆర్టీసీలో వ్యక్తమవుతోంది. ఆర్టీసీకి గతేడాది బడ్జెట్లో రూ.4,084 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో దాదాపు రూ.800 కోట్లు బకాయి ఉండగా, వారం క్రితం రూ.156 కోట్లు విడుదలయ్యాయి. మిగతావి అలాగే పేరుకుపోయి ఉన్నాయి.గత బడ్జెట్లో కేటాయించిన నిధులు మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) వరకు మాత్రమే సరిపోతాయి. ఇతరత్రా అభివృద్ధి పనులకు, రాయితీ బస్పాసుల సర్దుబాటుకు సరిపోవు. ఇప్పుడు బడ్జెట్ నిధులు కూడా పూర్తిగా విడుదల కాని పక్షంలో, మహాలక్ష్మి భారాన్ని కూడా ఆర్టీసీ (TGSRTC) మోయాల్సి వస్తుంది. బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగినందున.. మహాలక్ష్మి కేటాయింపులను రూ.5,500 కోట్లకు పెంచాలని బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆర్టీసీ కోరింది. కానీ, సర్కారు రూ.4,400 కోట్లే కేటాయించింది. గతంలోనూ అంతే.. 2023 బడ్జెట్‌కు సంబంధించి కూడా గతేడాది చివరలో కొన్ని నిధులు విడుదల కాలేదు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1,500 కోట్లు బడ్జెట్లో చూపగా, చివరికి రూ.500 కోట్ల వరకు చేతికి అందకుండా పోయాయి. మరోసారి అదే దుస్థితి ఎదురుకావటం ఆర్టీసీకి ఇబ్బందిగా మారబోతోంది. శనివారం ఆలస్యంగానైనా నిధులు విడుదలై, తదుపరి పనిదినం రోజు ఖాతాలోకి చేరే అవకాశం కూడా ఉందన్న ఆశతో ఆర్టీసీ ఉంది.చదవండి: టెన్త్.. జవాబు పత్రాలు చిందర వందర -
ఇళ్లకు కూల్ రూఫ్ వేసుకుంటే సరి..
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఇంటి లోపల వేడి, ఉక్కపోత పెరిగిపోతోంది. దీంతో బయటే కాదు ఇంట్లోనూ ఉండలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఇళ్లంతా చల్లగా ఉంటే ఆ హాయి వేరే కదూ.. అయితే పైకప్పులో కూల్ రూఫ్ టైల్స్, పెయింటింగ్స్ వేసుకుంటే సరి. సూర్యరశ్మిని గ్రహించి, ఇంట్లోకి వేడిని రాకుండా నిరోధించే శక్తి ఉండటం వీటి ప్రత్యేకత. పట్టణీకరణ, కాంక్రీట్ జంగిల్ కారణంగా నగరాలలో అర్బన్ హీట్ ఐల్యాండ్ (యూహెచ్ఐ) ప్రభావం ఏర్పడుతుంది. దీంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. –సాక్షి, సిటీబ్యూరోవేసవి కాలంలో వేడి గాలులతో 32 కోట్ల మంది భారతీయులు అధిక ప్రమాదకర పరిస్థితులకు గురవుతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చెట్ల పెంపకం, వేడి, కాలుష్యాన్ని తగ్గించే ఆచరణీయ పద్ధతులు ఉన్నప్పటికీ ప్రపంచ నగరాలు కూల్ రూఫ్, గ్రీన్ బిల్డింగ్ వంటి వినూత్న పరిష్కార మార్గాల వైపు దృష్టి సారిస్తున్నాయి. న్యూయార్క్, కాలిఫోర్నియా, టొరంటో వంటి అంతర్జాతీయ నగరాలు కూల్ రూఫ్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ గణనీయమైన పర్యావరణ ప్రయోజనాలను పొందుతున్నాయి. ఇదే తరహాలో గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోనూ ‘కూల్ రూఫ్ పాలసీ’ని అమలులోకి తీసుకొచ్చింది. కూల్ ఉంటేనే ఓసీ.. మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వేతర నివాస, వాణిజ్య భవనాలకు కూల్ రూఫ్ తప్పనిసరి. 600 గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలోని నివాస భవనాలకు కూల్ రూఫ్ ఉండాల్సిందే. అంతకంటే చిన్న ఇళ్లు స్వచ్ఛందంగా స్వీకరించవచ్చు. ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతి ప్రక్రియలో కూల్ రూఫ్ విధానాన్ని మిళితం చేసింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) జారీ చేసేందుకు సంబంధిత అధికారులు కూల్ రూఫ్లను నిర్ధారించుకున్నాకే ఓసీ జారీ చేస్తారు. కూల్ రూఫ్ పాలసీ అమలుతో ఐదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏటా సుమారు 12 కోట్ల యూనిట్ల విద్యుత్ ఆదా అవుతోందని ప్రభుత్వం అంచనా వేసింది.ఎంత ఖర్చవుతుందంటే.. కూల్ రూఫ్ టైల్స్‌ను జిర్కోనియం సిలికేట్, జింక్ ఆక్సైడ్ల నానోమీటర్ల పరిమాణంలో ఉండే చిన్న కణాల మిశ్రమాలను అల్యూమీనియం సిలికెట్ కణాలతో కూడిన ప్రత్యేక గ్లేజ్తో తయారు చేస్తారు. వీటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద కాలుస్తారు. దీంతో వీటికి సూర్యరశ్మిని గ్రహించి, ఇంట్లోకి వేడిని చేరనివ్వదు. కూల్ రూఫ్ ఏర్పాటుకు రకాన్ని బట్టి చ.అ.కు రూ.120–1,000 వరకు ఖర్చు అవుతుంది. ప్రత్యేకమైన పెయింటింగ్‌లు లేదా నిర్ధిష్ట సిరామిక్ టైల్స్‌తో తయారైన కూల్ రూఫ్‌లు ఉన్నాయి. ఏసీ వినియోగం తక్కువ.. సంప్రదాయ పైకప్పుతో పోలిస్తే కూల్ రూఫ్‌లు తక్కువ సౌరశక్తిని గ్రహిస్తాయి. ఇవి సూర్యరశ్మిని తక్కువగా గ్రహించి, ఇంట్లోకి వేడిని వెళ్లనివ్వదు. దీంతో ఇంట్లో ఏసీ, కూలర్ల వినియోగం తక్కువగా ఉంటుంది. సంప్రదాయ పైకప్పులతో పోలిస్తే కూల్ రూఫ్ పైకప్పు ఉన్న ఇంటిలోపల గది ఉష్ణోగ్రతలు 5–9 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. -
ఫ్యూచర్ సిటీ దేశానికి ఆదర్శం: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉగాది వేడుకలను నిర్వహించారు. ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. అనంతరం అర్చకులు భద్రాచలం రాములవారి కల్యాణానికి రావాలని ఆహ్వానిస్తూ కల్యాణ పత్రికను సీఎంకు అందజేశారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రం సంక్షేమం దిశగా దూసుకెళ్తోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌కు గుర్తింపు ఉండాలి. మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ ఇందులో భాగమే. శాంతి భద్రతలు అదుపులోకి ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. నేను, భట్టి విక్రమార్క జోడెద్దుల్లా రాష్ట్రం కోసం శ్రమిస్తున్నాం. దేశ ప్రజలకు తెలంగాణ ఆదర్శంగా ఉండాలి. దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాలి. ఫ్యూచర్ సిటీని నిర్మించి దేశానికి ఆదర్శంగా నిలుస్తాం. పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ రూపకల్పన జరుగుతుంది. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నాం’ అని తెలిపారు.భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మిళితం. వ్యవసాయ అభివృద్ధికి, పేదలకు విద్య అందిచేందుకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చాం. విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నింటికీ బడ్జెట్ లో నిధులు కేటాయించాం. దేశంలోనే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ను తీసుకొచ్చి పేదలకు ఆకలి దూరం చేసేందుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు పేదలకు సన్నబియ్యం అందించే పథకానికి ఉగాది రోజున శ్రీకారం చుడుతున్నాం.దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందు భాగంలో నిలిచింది. రైతులు పండించిన సన్న ధాన్యాన్ని పేదలకు అందించబోతున్నాం. ఆదాయం పెంచాలి.. పేదలకు పెంచాలన్నది మా ప్రభుత్వ విధానం. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు.. ఇది అభివృద్ధి చేసే సందర్భం. మా ఆలోచనలో, సంకల్పంలో స్పష్టత ఉంది. తెలంగాణ రైజింగ్-2050 ప్రణాళికతో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతాం’ అని చెప్పుకొచ్చారు. అంతకుముందు.. ఉగాది వేడుకల్లో భాగంగా రవీంద్రభారతిలో పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఈ ఏడాది పరుగులు పెడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఏడాది ప్రజలు మెచ్చే విధంగా పాలన చేస్తారు. తెలంగాణలో వర్షాలకు ఇబ్బంది లేదు. శాంతి భద్రతల విషయంలో నిరంతరం పోలీసులు పనిచేస్తారు’ అని చెప్పుకొచ్చారు. -
హీరో ప్రభాస్ పీఆర్వోపై కేసు నమోదు
బంజారాహిల్స్(హైదరాబాద్): తనను చంపుతామని బెదిరించిన హీరో ప్రభాస్ పీఆర్వోగా చెప్పుకుంటున్న వ్యక్తిపై యూట్యూబర్ చేసిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–44లో డయల్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్లో విజయ్‌సాధు అనే జర్నలిస్ట్ అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. తన డయల్ స్యూస్ ఛానల్లో ఈ నెల 4న హీరో ప్రభాస్‌కు మేజర్ సర్జరీ జరిగిందంటూ ఓ వీడియోను విజయసాధు పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది. మరుసటి రోజు సురేష్ కొండి అనే వ్యక్తి ఫోన్ చేసి తాను ప్రభాస్ పీఆర్వోనని పరిచయం చేసుకున్నాడు. డార్లింగ్ ఇన్ డేంజర్ అనే హెడ్డింగ్‌తో ప్రభాస్‌కు మేజర్ సర్జరీ జరిగిందంటూ, అనారోగ్యం బారిన పడ్డాడంటూ డయల్ న్యూస్ యూట్యూబ్‌లో పెట్టిన పోస్ట్‌కు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని సురేష్ ప్రశ్నించాడు. వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయాలని బెదిరిస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. అయితే ఈ వీడియోను విజయ్‌సాధు డిలీట్ చేయలేదు. దీంతో సురేష్ ఈ పోస్ట్‌ను ప్రభాస్ ఫ్యాన్స్‌కు పంపించాడు. ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ అభిమానులు ఫోన్‌కాల్, ఎస్ఎంఎస్, వాట్సప్ మెసేజ్‌లలో విజయసాధును తీవ్రంగా దూషిస్తూ నిన్ను చంపేస్తాం..నీ ఆఫీసును తగలబెడతాం..అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా ఈ నెల 6వ తేదీన ఉదయం 10 మంది యువకులు యూట్యూబ్ కార్యాలయానికి వచ్చి తాము ప్రభాస్ అభిమానులం అంటూ న్యూసెన్స్ చేయగా భయాందోళనకు గురైన విజయసాధు డయల్ 100కు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని అల్లరి మూకలను పంపించి వేశారు. న్యూసెన్స్‌కు కారణమైన సురేష్ కొండిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం
నాంపల్లి: నిలోఫర్ ఆసుపత్రిలో ఒకే కాన్పులో ఓ మహిళ నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. పిల్లలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారు. కోలుకున్న తల్లీపిల్లలను శనివారం డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని హస్తినాపురం ప్రాంతానికి చెందిన అమృత (24) పురిటి నొప్పులతో ఫిబ్రవరి 22న నిలోఫర్‌లో అడ్మిట్ అయ్యారు. ఏడున్నర నెలలకి పురిటి నొప్పులు రావడంతో నిలోఫర్ వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి పెద్దాపరేషన్ చేశారు. ఈ కాన్పులో ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వీరి బరువు 1.6 కేజీ, 1.5 కేజీ, 1.4 కేజీ, 1.2 కేజీలుగా ఉన్నారు. శిశువులకు పుట్టుకతో శ్వాస సంబంధమైన సమస్య తలెత్తడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.రవికుమార్, ఎన్‌హెచ్‌ఓడీ డిపార్ట్మెంట్ ఆఫ్ నియోనటాలజీ ప్రొఫెసర్ ఎల్.స్వప్న పర్యవేక్షణలో పూర్తిస్థాయిలో పదిరోజుల పాటు చికిత్సలు అందించారు. నిలోఫర్ వైద్యుల పర్యవేక్షణలో పిల్లలు ఇన్ఫెక్షన్, కామెర్లు, కంటి సమస్యల నుంచి బయటపడ్డారు. 35 రోజుల ట్రీట్మెంట్ తర్వాత నలుగురు పిల్లలు డిశ్చార్జ్ అయ్యారు. -
కాల్పుల కలకలం
గోల్కొండ: గుడిమల్కాపూర్ కింగ్స్ ప్యాలెస్ గార్డెన్లో దావత్ – ఎ– రంజాన్ షాపింగ్ ఎక్స్‌పోలో శనివారం రెండు స్టాళ్ల నిర్వాహకుల మధ్య జరిగిన గొడవ గాలిలోకి కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. గుడిమల్కాపూర్ కింగ్స్ ప్యాలెస్‌లో దావత్– ఎ– రంజాన్ పేరుతో రంజాన్ షాపింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్స్పో శుక్రవారం రాత్రి ముగిసింది. శనివారం ఉదయం నిర్వాహకులు తమ స్టాళ్లను తొలగిస్తున్నారు. కాగా.. ఫారూక్ అహ్మద్, సయ్యద్ హారూన్ సోదరులు బొమ్మల షాపు నిర్వహిస్తుండగా.. వీరి స్టాల్ పక్కనే దుబాయ్‌కి చెందిన తౌఫిక్ అనే వ్యక్తి పర్ఫ్యూమ్ షాపు నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఫారూక్ అహ్మద్ తనకు ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ఇవ్వాలని తౌఫిక్‌ను అడుగుతున్నాడు. ఈ విషయమై శనివారం ఉదయం ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకుంటూ స్టాళ్లను ధ్వంసం చేయసాగారు. పర్ఫ్యూమ్ స్టాల్ నిర్వాహకుడు తౌఫిక్ ఈవెంట్ ఆర్గనైజర్ అయిన మీర్ హసీబుద్దీన్ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. తమపైనే షికాయత్ చేస్తావా అంటూ ఫారూక్ అహ్మద్, సయ్యద్ హారూన్‌లు కలిసి తౌఫిక్‌పై దాడికి వెళ్లారు. వీరి మధ్య పరస్పరం తోపులాట చోటుచేసుకుంది. ఇది గమనించిన ఈవెంట్ ఆర్గనైజర్ మీర్ హసీబుద్దీన్ తనపై కూడా దాడి జరగవచ్చనే అనుమానంతో తన వద్ద ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్‌తో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం వినగానే స్టాళ్లను తొలగించిన వ్యాపారులు, వారి సహాయకులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న గుడిమల్కాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కాల్పులు జరిపిన మీర్ హసీబుద్దీన్ నుంచి రివాల్వర్‌ను స్వా«దీనం చేసుకుని నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
IPL 2025: ఇలా అయితే హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపోతాం: సన్‌రైజర్స్ యాజమాన్యం
ఉచిత పాస్‌ల విషయంలో (ఐపీఎల్ 2025) సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య గొడవలు పతాకస్థాయికి చేరాయి. పాస్‌ల కోసం హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ సంచలన ఆరోపణలు చేసింది. ఇలా చేస్తే హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని బెదిరించింది. ఈ అంశానికి సంబంధించి సన్‌రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్ రావు ఓ ఘాటు లేఖ రాశారు.ఉచిత పాస్‌ల కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు ఏ జగన్మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయి. ఇలాంటి ప్రవర్తనను మేము ఏమాత్రం సహించం. ఇలాగే కొనసాగితే మేము వేదికను మార్చుకునేందుకు కూడా వెనకాడము. వారి ప్రవర్తన చూస్తే మేము ఉప్పల్ స్టేడియంను హోం గ్రౌండ్‌గా ఎంచుకుని మ్యాచ్‌లు ఆడటం వారికి ఇష్టం లేనట్లుంది. ఇలా అయితే లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరుతున్నాను. తద్వారా ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం మరియు మా యాజమాన్యానికి తెలియజేయగలము. మీకు ఇష్టం లేకపోతే మీరు కోరుకున్నట్లే హైదారబాద్ నుంచి తరలిపోతామని సన్‌రైజర్స్ ప్రతినిథి హెచ్‌సీఏ కోశాధికారికి రాసిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. సన్‌రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ ఈ విషయాలను కూడా తన ఈ-మెయిల్లో రాశారు. గత 12 సంవత్సరాలుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నాము. గత సీజన్ నుండి మాత్రమే ఈ సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నాము. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి ప్రతి సీజన్లో 50 కాంప్లిమెంటరీ టికెట్లు (F12A బాక్స్) ఇస్తున్నాము. ఈ ఏడాది వారు అదనంగా మరో 20 టికెట్లు అడుతున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చినప్పుడు పరస్పరం చర్చించి స్నేహపూర్వక పరిష్కారానికి వస్తామని వారికి తెలియజేసాము.అయినా పట్టించుకోకుండా హెచ్‌సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్ చేశారు. SRH-LSG మ్యాచ్ రోజున సీటింగ్ బాక్స్‌కు (F3) తాళం వేశారు. మేము అడిగిన అదనపు టికెట్లు ఇవ్వకపోతే తాళం తెరవమని బెదిరించారు. గత రెండేళ్లలో హెచ్‌సీఏ నుంచి మా సిబ్బందికి ఇలాంటి బెదిరింపులు చాలా వచ్చాయి. అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఈ ఏడాదే చాలాసార్లు మా వారిని బెదిరించారు. ఇది ఏమాత్రం సహించరానిది. మేము స్టేడియంకు అద్దె చెల్లిస్తున్నాము. ఐపీఎల్ సమయంలో స్టేడియం మా ఆధీనంలో ఉండాలి అని శ్రీనాథ్ తన ఈ-మెయిల్లో పేర్కొన్నారు.కాగా, ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) హోం గ్రౌండ్‌గా ఉన్న విషయం తెలిసిందే. -
టెన్త్.. జవాబు పత్రాలు చిందర వందర
సాక్షి, హైదరాబాద్/కారేపల్లి: విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ముఖద్వారంగా భావించే పదో తరగతి పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల తరలింపుపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పరీక్షలు నిర్వహించామా.. జవాబు పత్రాలు పంపించామా.. అంతే.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మంలో శనివారం వెలుగు చూసిన ఘటన ఇందుకు అద్దం పడుతోంది.. ఏం జరిగిందంటే..: ఖమ్మం జిల్లా కారేపల్లిలోని మోడల్ స్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కోమట్లగూడెం(గాం«దీనగర్)లోని హైస్కూల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 28న ఫిజికల్ సైన్స్ పరీక్ష ముగిశాక జవాబు పత్రాలను కారేపల్లి పోస్టాఫీస్‌లో పార్శిల్ బుకింగ్ చేశారు. అక్కడి సిబ్బంది జవాబు పత్రాలను మూడు పార్శిళ్లు చేసి బ్యాగులో సీల్ వేసి కారేపల్లి బస్టాండ్‌లో ఖమ్మం వెళ్లే బస్ కండక్టర్‌కు అప్పగించారు. బస్సు ఖమ్మం పాత బస్టాండ్‌కు సాయంత్రం చేరుకుంది. అక్కడి నుంచి ఆర్ఎంఎస్ (రైల్వే మెయిల్ సర్వీస్) క్యాంప్ ఆఫీస్‌కు పంపించి, ఆ తర్వాత నిర్దేశిత మూల్యాంకన కేంద్రానికి చేరవేస్తారు. అయితే, శుక్రవారం సాయంత్రం జవాబుపత్రాల బ్యాగ్‌ను ఖమ్మం పాత బస్టాండ్‌లో బస్సు నుంచి కిందకి పడేయగా, డ్రైవర్ బస్సును కదిలించడంతో టైరు ఆ బ్యాగ్ పైనుంచి వెళ్లింది. దీంతో బ్యాగ్ చిరిగి కారేపల్లి మోడల్ స్కూల్లో పరీక్ష రాసిన విద్యార్థుల జవాబుపత్రాలు బయట పడ్డాయి. ఈ విషయం శనివారం బయటకురావడంతో కలకలం రేగింది. జవాబు పత్రాలన్నీ భద్రం.. జవాబు పత్రాలు రోడ్డుపై పడిన ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. దీంతో ఆర్ఎంఎస్ కార్యాలయానికి ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, డీఈఓ సోమశేఖరశర్మ వెళ్లి ప్యాకేజీలను పరిశీలించారు. జవాబు పత్రాలన్నీ భద్రంగా ఉన్నాయని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదని డీఈఓ తెలిపారు. ఇదే విషయమై కారేపల్లి పోస్ట్ మాస్టర్ ఝాన్సీ లక్ష్మిబాయిని వివరణ కోరగా.. పార్సిల్ బుకింగ్ చేయడం, ప్యాకర్ ద్వారా బస్సులో వేయడమే తమ బాధ్యత అని చెప్పారు. ఖమ్మం బస్టాండ్‌లో ఆర్ఎంఎస్ వారికి బ్యాగ్ అప్పగించే వరకు కండక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోస్టల్ శాఖకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఈ అంశంపై విద్యాశాఖకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కలెక్టర్ నివేదిక పంపారు. మూడు గంటలు ఆలస్యంగా.. ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయటకొచి్చన ఫొటోలను పరిశీలిస్తే బండిల్‌లోని పేపర్లు ఇప్పదీసి మళ్లీ పెట్టినట్టుగా ఉన్నాయి. ప్రతిరోజూ పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది. 1.30లకు జవాబు పత్రాలను పోస్టల్ శాఖకు అందజేయాలి. కారేపల్లి నుంచి ఖమ్మంకు రావడానికి గంట సమయం పడుతుంది. కానీ రాత్రి పొద్దుపోయాక ఖమ్మంకు జవాబు పత్రాలు వచి్చనట్టు తెలుస్తోంది. ఇంత ఆలస్యానికి కారణాలేంటి? ఈ ఒక్క కేంద్రమే కాదు.. జిల్లాలోని ప్రతీ పరీక్ష కేంద్రం నుంచి జవాబు పత్రాలు దాదాపు 3 గంటల ఆలస్యంగా వస్తున్నట్టు సమాచారం. ఆ మూడు గంటల్లో ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు ఘటనపై జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక తెప్పించాం. రవాణా వల్లే బండిల్ పగిలిందని కలెక్టర్ చెప్పారు. డీఈవో చేత విచారణ చేయిస్తున్నాం. ఎక్కడైనా అవకతవకలు జరిగాయా అన్న కోణంలోనూ విచారణ చేపట్టాలని ఆదేశించాం. పరీక్షలపై విశ్వాసం పెంచాల్సిన అవసరం ఉంది. – ఈవీ నర్సింహా రెడ్డి, పాఠశాల విద్య డైరెక్టర్. -
హిమాచల్‌లో 2 హైడల్ ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 520 మెగావాట్ల సామర్థ్యంతో రెండు జలవిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. శనివారం సిమ్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కు సమక్షంలో తెలంగాణ జెన్కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా, హిమాచల్ ఇంధన శాఖ కార్యదర్శి రాకేష్ కన్వర్లు ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఒప్పందం మేరకు.. హిమాచల్ ప్రభుత్వ సహకారంతో 400 మెగావాట్ల సెలీ, 120 మెగావాట్ల మియర్ జలవిద్యుత్ కేంద్రాలను రాష్ట్ర జెన్కో బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (బూట్) విధానంలో నిర్మించనుంది. తొలుత అక్కడ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహించి నివేదికను సిద్ధం చేయనుంది. దాని ఆధారంగా డీపీఆర్‌ను సిద్ధం చేయనుంది. తెలంగాణ రాష్ట్ర క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ 2025 పాలసీ కింద పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యం పంచుకునేందుకు ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకుంది. హిమాచల్‌లో ఏడాదిలో 9–10 నెలల పాటు నదుల్లో నీటి ప్రవాహం ఉండనుండడంతో పుష్కలంగా జలవిద్యుదుత్పత్తి జరపడానికి అవకాశం ఉంటుంది. 5 వేల మంది స్థానికులకు ఉద్యోగాలు, ఇతర ప్రయోజనాలు హిమాచల్‌ప్రదేశ్‌లోని చినాబ్ నదిపై రూ.6,200 కోట్లతో ఈ రెండు విద్యుత్ కేంద్రాలను జెన్కో నిర్మించనుండగా, ఆ రాష్ట్రానికి చెందిన 5 వేల మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. హిమాచల్‌కు మరికొన్ని అదనపు ప్రయోజనాలను కూడా జెన్కో కలిగించనుంది. ప్రాజెక్టు వ్యయంలో 1.5 శాతాన్ని లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ (ఎల్ఏడీఎఫ్) కోసం జెన్కో ఇవ్వనుంది. ప్రాజెక్టుల నిర్మాణంతో ప్రభావితం కానున్న కుటుంబాలకు 10 ఏళ్ల పాటు నెలకు 100 యూనిట్లు విద్యుత్‌కు సమాన విలువైన డబ్బులను చెల్లించనుంది. విద్యుత్ భద్రతను పెంపొందిస్తున్నాం: భట్టి విక్రమార్క విద్యుత్ భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి కొనసాగిస్తామన్నారు. తమ రాష్ట్రంలోని వనరులకు రక్షణతో పాటు వాటి ఆధారంగా నిర్మించే జలవిద్యుత్ కేంద్రాలతో స్థానిక ప్రజలకు ప్రయోజనం కల్పించే విషయంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుక్కు అన్నారు. పవర్ బ్యాంకింగ్, ట్రేడింగ్ రంగాల్లో సైతం తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముఫారఫ్ అలీ ఫారూఖీ, జెన్కో హైడల్ డైరెక్టర్ సచ్చిదానందం, హిమాచల్‌ప్రదేశ్ ఎనర్జీ డైరెక్టర్ రాకేష్ ప్రజాపతి, ఆ రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి అరిందం చౌదరి పాల్గొన్నారు. హిమాచల్‌కు 40 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ హిమాచల్ ప్రాజెక్టులను జెన్కో నామినేషన్ విధానంలో నిర్మించనుంది. విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి 100 శాతం మూలధన పెట్టుబడులను సంస్థ భరించనుంది. అప్ ఫ్రంట్ ప్రీమియం(ముందస్తు పెట్టుబడి) కింద జెన్కో ఇప్పటికే రూ.26 కోట్లను హిమాచల్‌కు చెల్లించింది. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ జెన్కో ఆధ్వర్యంలోనే జరగనుంది. స్థలం ఇవ్వడంతో పాటు సహకారాన్ని అందించినందుకు గాను ఆ రాష్ట్రానికి 40 ఏళ్ల పాటు 12–30 శాతం వరకు విద్యుత్‌ను తెలంగాణ ఉచితంగా సరఫరా చేయనుంది. రెండు విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 12శాతాన్ని తొలి 12 ఏళ్ల పాటు, ఆ తర్వాతి 18 ఏళ్ల పాటు 18 శాతాన్ని ఆ రాష్ట్రానికి ఉచితంగా సరఫరా చేయనుంది. మిగిలిన 10 ఏళ్ల పాటు 30 శాతం విద్యుత్‌ను ఆ రాష్ట్రానికి ఉచితంగా అందించనుంది. బూట్ ఒప్పందం ప్రకారం 40 ఏళ్ల తర్వాత రెండు విద్యుత్ కేంద్రాల యాజమాన్య హక్కులను హిమాచల్‌ప్రదేశ్‌కు జెన్కో బదిలీ చేయనుంది. ఆ తర్వాత తెలంగాణకు ఎలాంటి విద్యుత్ సరఫరా జరగదు. -
ఒక్క సంతకంతో కొడంగల్‌కు అన్నీ వస్తాయి: సీఎం రేవంత్
కొడంగల్: ‘ఒక్క సంతకంతో కొడంగల్‌కు అన్నీ వస్తాయి. ఎవరినీ అడుక్కోవాల్సిన అవసరం లేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మంచి చెడుల్లో ఎల్లప్పుడూ కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని పాలించే శక్తిని కొడంగల్ ప్రజలే ఇచ్చారని వ్యాఖ్యానించారు. కొడంగల్‌లోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం శనివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేయదని అన్నారు. కొందరికి వాళ్ల కుర్చీ పోయిందనే దుఃఖం ఉందని, వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. నేనేం చేస్తానో.. ఏం చేశానో నాకంటే మీకే ఎక్కువగా తెలుసునన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసుఫ్ పాల్గొన్నారు. శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ కొడంగల్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా పద్మావతీ సమేత శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ధర్మకర్తలు శ్రీవారి ప్రతిమను బహూకరించారు. అర్చకులు ఆశీర్వాదం అందించారు. -
ఆరోగ్యశ్రీలోకి మరో 164 ప్రైవేటు ఆస్పత్రులు
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలోకి కొత్తగా 164 ప్రైవేటు ఆస్పత్రులు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి చేసుకున్న దరఖాస్తులకు సూత్రప్రాయంగా అంగీకారం లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో 1,042 ఆస్పత్రులు ఉండగా, అందులో 409 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. మొత్తంగా వెయ్యి ప్రైవేటు ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లోకి తీసుకురావాలని అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు 3 వేలకుపైగా ఆస్పత్రులు సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) పొందేందుకు అర్హత సాధించాయి. ఈ నేపథ్యంలో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ పరిధిలోకి కనీసం వెయ్యి ఆస్పత్రులను తీసుకురావాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. రెట్టింపైన ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ కింద చికిత్స ఖర్చును రూ.10 లక్షలకు పెంచింది. అలాగే కొత్తగా 163 వ్యాధులను జతచేసి ఆరోగ్యశ్రీ పరిధిలోకి 1,835 వ్యాధులను చేర్చింది. 1,375 ప్రొసీజర్లకు సంబంధించి హాస్పిటళ్లకు చెల్లిస్తున్న ధరలను 20 శాతం పెంచింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కింద 2024–25 ఆర్థిక సంవత్సరంలో 3,53,474 మంది చికిత్స చేయించుకున్నారు. కాగా, హాస్పిటళ్లకు సగటున ఏటా రూ.684 కోట్ల చొప్పున (నెలకు రూ.57 కోట్లు) బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెల్లిస్తే, కాంగ్రెస్ హయాంలో రూ.966.54 కోట్లు చెల్లించారు. అంటే నెలకు రూ.87 కోట్లు చెల్లించారు. -
విద్యుత్ డిమాండ్‌కు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఓ వైపు వేసవి తాపం పెరగడం.. మరోవైపు బోరుబావుల కింద పెద్ద మొత్తంలో యాసంగి పంటల సాగు జరుగుతుండడంతో విద్యుత్ డిమాండ్ అమాంతంగా పెరిగిపోతోంది. రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ ఈనెల 20న 17,162 మెగావాట్లకు చేరుకుని కొత్త రికార్డును సృష్టించింది. గతేడాది మార్చి 8న రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,623 మెగావాట్లకు చేరగా, ఈ ఏడాది ఫిబ్రవరి 5 వరకు ఇదే అత్యధికం. ఫిబ్రవరి 6న గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,752 మెగావాట్లకు చేరి కొత్త రికార్డు సృష్టించగా, నాటి నుంచి రోజురోజుకూ పెరుగుతూ రికార్డులు సృష్టిస్తోంది. గత నెలలోనే 16 వేల మెగావాట్లు, ఆ తర్వాత 17 వేల మెగావాట్ల మైలురాళ్లను దాటింది. గత ఫిబ్రవరి 19 నుంచి ఇప్పటివరకు గడిచిన 39 రోజుల్లో ఏకంగా 31 పర్యాయాలు రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 16 వేల మెగావాట్లు, ఒకసారి 17 వేల మెగావాట్లకు మించిపోయింది. గ్రిడ్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించడంలో ఈ ఏడాది విద్యుత్ సంస్థలు సఫలమయ్యాయి. మార్చి, ఏప్రిల్‌లో గరిష్ట డిమాండ్ 17,500 మెగావాట్లకు చేరవచ్చని ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఎక్స్ఛేంజీల నుంచి రోజూ 80 ఎంయూల విద్యుత్ కొనుగోళ్లు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిపోవడంతో విద్యుత్ ఎక్స్ఛేంజీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో స్వల్ప కాలిక విద్యుత్ కొనుగోళ్లు జరుపుతోంది. రోజువారీ సగటు విద్యుత్ వినియోగం 290–335 మిలియన్ యూనిట్లు (ఎంయూ) ఉండగా, అందులో 50–80 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ను పవర్ ఎక్స్ఛేంజీల నుంచి కొనుగోలు చేస్తుండడం గమనార్హం. దక్షిణాది రీజియన్‌లో ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజీల (ఐఈఎక్స్) రోజువారీగా విక్రయిస్తున్న మొత్తం విద్యుత్‌లో 80– 90 శాతాన్ని తెలంగాణనే కొనుగోలు చేస్తోంది. విద్యుత్ డిమాండ్ గరిష్టంగా పెరిగే వేళల్లో యూనిట్‌కు రూ.10 గరిష్ట ధరతో పవర్ ఎక్స్ఛేంజీలు విద్యుత్‌ను విక్రయిస్తుండగా డిమాండ్ లేని సమయాల్లో యూనిట్‌కు రూ.2.5 కనిష్ట ధరతో విక్రయిస్తున్నాయి. ఈ కొనుగోళ్ల కోసం నిత్యం సగటున రూ.50 కోట్ల మేర డిస్కంలు వెచ్చిస్తున్నాయి. పేరుకే 20 వేల మెగావాట్ల సరఫరా సామర్థ్యం రాష్ట్రం 20,275 మెగావాట్ల విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని (కాంట్రాక్ట్ కెపాసిటీ) కలిగి ఉంది. అందులో ప్రధానంగా జెన్కోకి సంబంధించిన 4,842.5 మెగావాట్ల థర్మల్, 2,442.76 మెగావాట్ల జలవిద్యుత్‌తో పాటు 1,200 మెగావాట్ల సింగరేణి, 3186.76 మెగావాట్ల కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌తో పాటు 839.45 మెగావాట్ల సెమ్‌కార్ప్ విద్యుత్ ఉంది. అయితే 1,000 మెగావాట్ల ఛత్తీస్‌గఢ్ విద్యుత్, 807.31 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ సరఫరా జరగడం లేదు. దీంతో రాష్ట్ర వాస్తవ విద్యుత్ సరఫరా సామర్థ్యం 18,467.69 మెగావాట్లకు తగ్గిపోయింది. ఇందులో 6,123 మెగావాట్ల సౌర విద్యుత్ లభ్యత పగటి పూటే ఉండనుంది. -
ముందుగానే ఎందుకు పారిపోయారు?
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఓ మీడియా ఛానల్ అధినేత శ్రవణ్‌రావు ఎట్టకేలకు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. గత ఏడాది మార్చి నుంచి అమెరికాలో తలదాచుకున్న ఆయన.. శనివారం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఎదుటికి వచ్చారు. ఉదయం 11.20 గంటలకు విచారణాధికారి ముందు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు వివిధ అంశాలపై ఆయనను ప్రశ్నించారు. ‘అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా మారకముందే దేశం విడిచి ఎందుకు పారిపోయారు? ఫోన్ ట్యాపింగ్‌లో మీ పాత్ర ఉన్నందుకే దర్యాప్తు పరిణామాలను ఊహించి పారిపోయారా? ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావుతో మీకు ఉన్న సంబంధాలు ఎలాంటివి? విదేశాలకు పారిపోయేందుకు ఎవరు సహకరించారు? అక్కడ ఎవరి వద్ద తలదాచుకున్నారు?’అని సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. కీలకంగా శ్రవణ్‌రావు? అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు 2024 మార్చి 10న నమోదు కాగా... మే మొదటి వారంలో శ్రవణ్‌రావును ఆరో నిందితుడిగా చేర్చారు. అయితే ఆయన అప్పటికే అమెరికా పారిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల నగదు లావాదేవీలపై దృష్టి పెట్టిన ప్రణీత్‌కు.. శ్రవణ్ కీలక ఇన్ఫార్మర్గా పనిచేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్‌లను ఇప్పటికే నిందితుల ఫోన్ల నుంచి రిట్రీవ్ చేశారు. ముగ్గురు బీఆర్ఎస్ నాయకుల ఆదేశాల మేరకే శ్రవణ్‌రావు ఈ పాత్ర పోషించారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనూ శ్రవణ్‌ను ప్రశ్నించారు. ప్రధానంగా రేవంత్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు, వీరికి అండగా నిలుస్తున్న వారి వివరాలను తన నెట్వర్క్ ద్వారా సేకరించిన శ్రవణ్.. ఆ వివరాలను వాట్సాప్ ద్వారా ప్రణీత్‌రావుకు పంపాడని ఆధారాలు సేకరించారు. గత ఏడాది మార్చి 22న దర్యాప్తు అధికారులు జూబ్లీహిల్స్ రోడ్ నెం.78లోని శ్రవణ్ ఇంట్లో సోదాలు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అప్పట్లో అత్యాధునిక ట్యాపింగ్ పరికరాలను విదేశాల నుంచి తెప్పించి పలు చోట్ల మినీ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి శ్రవణ్ కార్యాలయం కేంద్రంగానూ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పరికరాల కొనుగోలు వెనుక శ్రవణ్ పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ విచారించారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు సెల్ఫోన్ల నుంచి రిట్రీవ్ చేసిన డేటా ఆధారంగానూ శ్రవణ్‌ను ప్రశ్నించారు. అయితే, ఆయన విచారణకు సహకరించలేదని పోలీసులు చెప్తున్నారు. కొన్ని ప్రశ్నలకు గుర్తులేదు, తెలీదు అని బదులిచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2వ తేదీన మరోసారి విచారణకు రావాలని శ్రవణ్‌రావును పోలీసులు ఆదేశించారు. రహస్యంగా రావటం.. రహస్యంగానే పోవటం అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ సందర్భంగా గతంలో ఎప్పుడూ కనిపించని గోప్యతను శ్రవణ్‌రావు విషయంలో పోలీసులు పాటించారు. ఆయన మీడియా కంటపడకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రవణ్ రాక విషయం తెలుసుకున్న మీడియా.. ఉదయం 10 గంటల నుంచే సిట్ కార్యాలయం ఉన్న జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌కు చేరుకుంది. అయితే, మీడియాను పోలీసులు ఠాణా ప్రధాన గేటు దాటి లోపలికి అనుమతించలేదు. శ్రవణ్‌రావు విచారణకు వచ్చిన సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా.. ఆయన చుట్టూ పోలీసులు నిలబడి కెమెరా కంటికి దొరకనివ్వలేదు. విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చే సమయంలో అయినా ఫొటోలు తీసుకుందామని భావించిన మీడియా సాయంత్రం 6 వరకు వేచి చూసింది. ఈసారి మరో ఎత్తు వేసిన పోలీసులు.. శ్రవణ్‌రావును వెనుక గేటు నుంచి చాటుగా పంపించారు. దీంతో మిగిలిన నిందితుల విషయంలో లేని గోప్యత శ్రవణ్‌రావు విషయంలోనే ఎందుకు పాటించారని పోలీసులను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి అధికారుల నుంచి సమాధానం కరువైంది. -
ప్రజారోగ్య డైరెక్టర్‌పై విచారణ
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో కీలకమైన ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్) డాక్టర్ రవీందర్ నాయక్‌తోపాటు ఆరుగురు ఉద్యోగులపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. సీనియారిటీ జాబితాలో మొదటి వరుసలో ఉన్న ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డీహెచ్గా నియమించింది. ఆయన హయాంలో ఉద్యోగుల డిçప్యుటేషన్లు, బదిలీలలో అనేక అక్రమాలు జరిగాయని, డిప్యుటేషన్లు లేవంటూనే జోన్లు, క్యాడర్ పోస్టులతో సంబంధం లేకుండా ఉద్యోగులను బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలోనే మెమో ఇచ్చి విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.. తాజాగా పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల కమిషనర్ ఆర్.వి.కర్ణన్‌ను ఆదేశించింది. ఆయనతో పాటు డీహెచ్ కార్యాలయంలో పనిచేసే మరో ఆరుగురిపై కూడా విచారణకు ఆదేశిస్తూ 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు, అక్రమ డిప్యుటేషన్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పారామెడికల్ బోర్డు కార్యదర్శిగా కీలక హోదాలో రవీందర్ నాయక్ పనిచేశారు. ఆ సమయంలో పారా మెడికల్ బోర్డులో అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నట్లు ఫిర్యాదు లు రావడంతో పలువురు అధికారులను బదిలీ చే శారు. రవీందర్ నాయక్‌ను కూడా ఆ హోదా నుంచి తప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వా త ఆరోగ్యశాఖకు డైరెక్టర్‌గా ఇన్చార్జి హోదాలో ఆయన వచ్చారు. గతేడాది ఆరోగ్యశాఖలో జరిగిన సాధారణ బదిలీల్లో డీహెచ్ ఆఫీస్ వేదికగా అక్ర మాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. డీహెచ్ కార్యాలయంలోనే కీలక పోస్టుల్లో పనిచేసిన మరో ఆరుగురు ఉద్యోగులకు ఈ అక్రమాల్లో పాత్ర ఉన్న ట్లు ఆరోపణలు వచ్చాయి. వీరిలో ఇద్దరు అధికారులు అర్హత లేకున్నా డిప్యుటేషన్లపై డీహెచ్ కార్యా లయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ పరిణామాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గత సంవత్సరం విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ నివేదిక అనంతరం గత నవంబర్‌లో డీహెచ్‌తో పాటు మరో ఆరుగురికి చార్జి మెమోలు జారీ చేశారు. మెమోలకు వారిచి్చన వివరణలను పరిశీలించిన సర్కారు సంతృప్తి చెందకపోవడంతో మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. -
జెన్ ఏఐలో ఇంకా వెనుకబాటే..!
సాక్షి, హైదరాబాద్: ‘జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’(జెన్ ఏఐ) వల్ల కలిగే ప్రయోజనాలను ఉపయోగించుకోవడంలో భారత పరిశ్రమలు, సంస్థలు వెనుకడుగు వేస్తున్నాయి. గ్లోబల్ ఐటీ పవర్‌హౌస్‌గా గుర్తింపు పొందడంతో పాటు టెక్నాలజీ ట్రేడ్‌లో 250 బిలియన్ డాలర్ల పరిశ్రమగా 50 లక్షల మంది ఐటీ నిపుణులతో విరాజిల్లుతున్న భారత ఐటీ పరిశ్రమ ‘జెన్ ఏఐ’కీలక మలుపు వద్ద నిలిచింది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి అవుట్ సోర్సింగ్ రంగంలో భారత్ ఆధిపత్యం కొనసాగుతున్న దశలో ఎల్ఎల్ఎం ఫైన్ ట్యూనింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి నైపుణ్యాల్లో యువతరం (నెక్స్్ట–జనరేషన్) ‘51 శాతం మేర స్కిల్డ్ టాలెంట్ గ్యాప్’ను ఎదుర్కొంటున్నట్టు తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల భవిష్యత్తులో కృత్రిమ మేథ ఏఐ సంబంధిత ఆవిష్కరణల్లో తమ ప్రాధాన్యతలను కోల్పోయే పరిస్థితులు ఏర్పడవచ్చుననే ఆందోళన భారత నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ‘జెన్ ఏఐ’వల్ల కలిగే ఉత్పాదకత వృద్ధి ప్రయోజనాలను 83 శాతం డెవలపర్లు గుర్తించినా, వారు దీనిని ఉపయోగిస్తున్నది 39 శాతమేనని, దానిని అనుసరిస్తూ, తమకు తగ్గట్టుగా వర్తింప చేసుకునే నవయువ డెవలపర్లు 31 శాతానికే పరిమితమవుతున్నట్టు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) తాజా అధ్యయనంలో తేలింది.ఈ సవాళ్లను సరైన పద్ధతుల్లో సమాధానాలు వెతుక్కోవడంతో పాటు వాటిని అధిగమించే దిశలో చర్యలు చేపట్టకపోతే గ్లోబల్ ఏఐ లీడర్లుగా ఉన్న యూఎస్ఏ, చైనాల కంటే వెనుకబడే ప్రమాదం ఉందని అధ్యయనం హెచ్చరించింది. ఈ రంగంలో మధ్యస్థ శక్తులుగా ఎదిగిన దక్షిణ కొరియా, జపాన్, సౌదీ ఆరేబియా కూడా పైస్థాయికి చేరుకునే ప్రయత్నాలు చురుగ్గా సాగిస్తున్న సమయంలో భారత్‌కు ఇది సవాళ్లతో కూడుకున్నదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితులను అధిగమించి కృత నిశ్చయంతో ముందుకు సాగేందుకు అవసరమైన శిక్షణ కొరవడడం, ఈ అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగిస్తున్న క్రమంలో ఎదురవుతున్న భద్రతాపరమైన సందేహాలు, జెన్ ఏఐ వంటి వాటితో ఉద్యోగాలు పోతాయనే భయం తదితర కారణాలతో వివిధ కంపెనీలు ఆచితూచి స్పందిస్తున్నాయని తెలిపింది. మారుతున్న సాంకేతికతలకు తగ్గట్టుగా ఐటీ సర్వీసుల్లో జెన్ ఏఐ వర్తింపును వేగవంతం చేయడం ద్వారా పైచేయి సాధించాలంటే భారత్ వివిధ చర్యలు చేపట్టాలని అధ్యయనం సూచించింది. రెండేళ్లు గడుస్తున్నా వెనుకబాటే.. 2022 చివర్లో ఏఐ, జెన్ ఏఐ అనేవి పరిశ్రమల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టాయి. అయితే రెండేళ్లు గడుస్తున్నా జెన్ ఏఐను అందిపుచ్చుకుని, వర్తింపజేసుకునే విషయంలో అధిక శాతం పరిశ్రమలు వెనుకబడ్డాయి. ఇందుకు కారణం టెక్నాలజీ కాదని మానవ స్వభావం, ప్రవర్తనదేనని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు మొదలు డెవలపర్లలో ఉద్యోగాలు కోల్పోతామనే భయం వెంటాడుతుండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అధునాతన టూల్స్‌ను ఉద్యోగులు ఉపయోగించి మంచి ఫలితాలను సాధించేలా చేయడమనేది పెద్ద సవాల్‌గా మారుతోందని అంటున్నారు. ఈ సాంకేతికతను పూర్తిస్థాయిలో అమలు చేసే విషయంలో కస్టమర్ల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతున్నట్టుగా కంపెనీలు పేర్కొంటున్నాయి. భారత్ ఏం చేయాలంటే.. » వివిధ ప్రావీణ్యాలు, నైపుణ్యాల ఆధారిత శిక్షణా పద్ధతులు (ట్రైనింగ్ మోడళ్లు) చేపట్టాలి. »ఏఐ, జెన్ ఏఐలు ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్న దానిపై ‘ప్రొఫిషియెన్సీ బేస్డ్ ట్రైనింగ్ మోడల్స్ తీసుకురావాలి. » మేనేజ్మెంట్, వర్క్‌ఫోర్స్ తమ నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రోత్సాహకాలు అందించడంతోపాటు, ఉత్తమ శిక్షణ నిమిత్తం ‘ఎగ్జిక్యూటివ్ స్పాన్షర్షిప్’ చేపట్టాలి.» భద్రతా పరమైన ఆందోళనలు, సమస్యలు అధిగమించేందుకు పరిశ్రమ క్లయింట్లతో దృఢమైన బంధాలు కొనసాగించేలా వ్యూహాలు రూపొందించుకోవాలి.జనరేటివ్ ఏఐ అంటే.. జనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ) అనేది యూజర్ కోరుకున్న కంటెంట్ లేదా విజ్ఞప్తికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ కోడ్‌ను రూపొందించుకుంటుంది. ముఖ్యంగా ట్రైనింగ్, ట్యూనింగ్, జనరేషన్ అనే మూడు దశలుగా పనిచేస్తుంది. టెక్ట్స్, ఇమేజేస్, ఆడియోల రూపంలో ఒరిజనల్ కంటెంట్‌ను తయారు చేయగలదు. అధునాతన మెషీన్ లెర్నింగ్ మోడళ్లు మరి ముఖ్యంగా డీప్ లెరి్నంగ్ మోడళ్లపై ఆధారపడి ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. ఇది మనుషుల మెదళ్ల మాదిరిగా నేర్చుకోవడం, నిర్ణయం తీసుకునే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. -
రజతోత్సవాలపై బీఆర్ఎస్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: పార్టీ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఏప్రిల్ 27న నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయడంపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎర్రవల్లి నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సభకు జన సమీకరణపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సభకు ఎంత మంది తరలివచ్చే అవకాశముందని ఆరా తీస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరుపై ప్రజలు స్పందిస్తున్న తీరును అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. బడ్జెట్ సమావేశాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఎప్పటికప్పుడు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. అదే సమయంలో పార్టీ ముఖ్యనేతలతో వరుస భేటీలు నిర్వహించారు.ఉత్తర తెలంగాణలో బీజేపీ అంతర్గతంగా నిర్వహిస్తున్న కార్యకలాపాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పార్టీ సంస్థాగత నిర్మాణం, ఏడాది పొడవునా నిర్వహించాల్సిన రజతోత్సవ వేడుకల తీరుతెన్నులపైనా నేతల అభిప్రాయాలు కోరుతున్నట్లు తెలిసింది. సభ ఏర్పాట్లకు ప్రత్యేక కమిటీలు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీఆర్ఎస్ అధినేత.. సభ నిర్వహణలో పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. సభ నిర్వహణ కోసం 20కి పైగా కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు సభా స్థలి ఎంపిక, రైతుల నుంచి నిరభ్యంతర పత్రాల సేకరణ, పోలీసుల అనుమతులకు దరఖాస్తులు తదితర పనుల్లో తలమునకలయ్యారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్‌కు కూడా బాధ్యతలు అప్పగించారు. సుమారు 1,200 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లు జరగనుండగా, మైదానం చదును చేయడం, వేదిక నిర్మాణం తదితరాలకు సంబంధించిఏప్రిల్ 2న భూమి పూజ చేస్తారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమీక్షలు సభను విజయవంతం చేసేందుకు జిల్లాలవారీగా ఈ నెల 20న సన్నాహక భేటీలకు శ్రీకారం చుట్టిన కేటీఆర్.. ఇప్పటికే సూర్యాపేట, కరీంనగర్ జిల్లాల ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఏప్రిల్ మొదటి వారంలో తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో వరుస సమావేశాలు జరుగనున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షులను కూడా ఈ సమావేశాల్లో భాగస్వాములను చేస్తారు. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత ఏప్రిల్ రెండో వారంలో కేటీఆర్ జిల్లాలవారీగా రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. కేటీఆర్ జిల్లా పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. -
పరీక్ష తప్పదు.. సీనియారిటీ రాదు!
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ పాలనాధికారుల (జీపీవో) పోస్టుల భర్తీలో మరో అడుగు ముందుకు పడింది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గాను గ్రామ స్థాయిలో భర్తీ చేయనున్న ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ శనివారం జీవో నం: 129 విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం గతంలో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)గా పనిచేసి వేరే శాఖల్లోకి వెళ్లిన వారిలో మళ్లీ రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు ఆప్షన్లు ఇచ్చిన వారిని మాత్రమే ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు. వీరికి కూడా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. పరీక్ష వద్దని, తమను నేరుగా మళ్లీ రెవెన్యూలోకి తీసుకోవాలని పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలు చేసిన అభ్యర్థనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండా పరీక్ష నిర్వహణ వైపే మొగ్గు చూపింది. అలాగే మళ్లీ రెవెన్యూలోకి వస్తున్నంత మాత్రాన గతంలో రెవెన్యూ శాఖల్లో పనిచేసిన కామన్ సీనియార్టీ వర్తించదని, సర్వీసు మళ్లీ మొదటి నుంచీ ప్రారంభం కావాల్సిందేనని జీవోలో స్పష్టం చేసింది. ఈ నిబంధనలపై వీఆర్వో, వీఆర్ఏల సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎవరెవరు అర్హులు? జీవో నం.129 ప్రకారం ఈ గ్రామ పాలనాధికారుల పోస్టులను గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలుగా పనిచేసిన వారితో మాత్రమే భర్తీ చేస్తారు. గతంలో వీఆర్వోలుగా పనిచేసి ఇతర శాఖల్లో విలీనమైన వారు, వీఆర్ఏలుగా పనిచేస్తూ ఇతర శాఖల్లో రికార్డ్/ జూనియర్ అసిస్టెంట్లుగా నియమితులైన వారిని వారి అర్హతల ఆధారంగా ఈ పోస్టుల్లో నియమిస్తారు. అర్హతలేమిటి? గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉండి మళ్లీ రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు ఆప్షన్లు ఇచ్చిన వీఆర్వోలు, వీఆర్ఏలు ఈ పోస్టుకు అర్హులు. అదే విధంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉంటే వీఆర్వోలుగా ఐదేళ్లు పనిచేసి ఉండాలి. లేదంటే వీఆర్ఏతో పాటు ఇతర శాఖల్లో నియమితులై ఐదేళ్లు పూర్తయి ఉండాలి. ఉద్యోగ బాధ్యతలివే గ్రామ పద్దుల నిర్వహణ, ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాల జారీకి తగిన విధంగా విచారణ జరపడం, ప్రభుత్వ భూములు, చెరువులు, ఇతర నీటి వనరుల ఆక్రమణలపై విచారించడం, భూసంబంధిత వివాదాల దర్యాప్తు, భూముల సర్వేలో సర్వేయర్లకు సహకారమందించడం, ప్రకృతి విపత్తుల సమయంలో పనిచేయడం, అత్యవసర సర్వీసులందించడం, ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం లబ్దిదారులను గుర్తించడం, ఎన్నికల సంబంధిత విధులు, ప్రొటోకాల్ సహకారం, ఇతర ప్రభుత్వ శాఖలతో గ్రామ, క్లస్టర్, మండల స్థాయిలో అంతర్గత సహకారం, ప్రభుత్వం లేదా సీసీఎల్ఏ, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలు నిర్దేశించే ఇతర పనులు. ఎంపిక ఎలా? దరఖాస్తుదారులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తారు. రెవెన్యూ వ్యవస్థపై దరఖాస్తుదారులకు ఉన్న అవగాహన, పట్టును అంచనా వేసే విధంగా ఈ పరీక్ష ఉంటుంది. ఈ గ్రామపాలనాధికారులను ఎంపిక చేసి వారిని వివిధ జిల్లాల్లో నియమించే అధికారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) లేదా సీసీఎల్ఏ నియమించే అధికారికి ఉంటుంది. జిల్లాలకు పంపిన వారిని కలెక్టర్లు అక్కడి అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన సర్వీసు నిబంధనలను త్వరలోనే రూపొందిస్తారు. తప్పుల తడక జీవోను అంగీకరించం: తెలంగాణ వీఆర్వోల జేఏసీ‘ఈ జీవో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇచ్చినట్టుగా లేదు. ఇంకా బీఆర్ఎస్ ఆనవాళ్లు ఉన్న వారి వారసులు కొందరు ఇచ్చినట్టుగా ఉంది. సీనియార్టీ కలపబోమని, పరీక్ష రాసిన తర్వాతే మళ్లీ రెవెన్యూ శాఖలోకి రావాలని ఈ జీవో ద్వారా చెబుతున్నారు. మళ్లీ పరీక్ష అంటే ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టే. సీనియార్టీ ఇవ్వడం లేదంటే మా శ్రమకు గుర్తింపు ఇవ్వనట్టే. అసలు జీవోలోనే ఎన్నో తప్పులున్నాయి. తప్పులతడక జీవోను మేం అంగీకరించబోం. కామన్ సీనియార్టీ ఇచ్చి ఎలాంటి పరీక్ష లేకుండా పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలను మళ్లీ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలి. లేనిపక్షంలో ఉద్యమ బాట తప్పదు..’అని వీఆర్వోల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్, నేతలు హరాలే సుధాకర్‌రావు, పల్లెపాటి నరేశ్, కాందారి భిక్షపతి, ఎస్.కె.మౌలానా, సర్వేశ్వర్, ప్రతిభ, చింతల మురళి, వెంకట్‌రెడ్డిలు శనివారం ఒక సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు. -
రోజుకు 98 మొబైల్ఫోన్ల రికవరీ
సాక్షి, హైదరాబాద్: చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీలో జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులు రెండో స్థానంలో నిలిచినట్టు సీఐడీ డీజీ శిఖాగోయల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజుకు సరాసరిన 98.67 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్టు పేర్కొన్నారు. టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్‌ను వినియోగించి మొబైల్ఫోన్ల జాడ కనిపెడుతున్నట్టు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 780 పోలీస్ స్టేషన్లలో సీఈఐఆర్ పోర్టల్‌ను వినియోగిస్తున్నట్టు చెప్పారు. మొబైల్ ఫోన్ల రికవరీలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ (10,861 మొబైల్ ఫోన్లు), సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ (9,259), రాచకొండ పోలీస్ కమిషనరేట్ (7,488) తొలిమూడు స్థానాల్లో నిలిచినట్టు పేర్కొన్నారు. మొబైల్‌ఫోన్ చోరీకి గురైతే www.tspolice.gov.in లో లేదా www.ceir.gov. in లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సీఐడీ సైబర్ క్రైం ఎస్పీ బి.గంగారాం ఇతర అధికారులను శిఖాగోయల్ అభినందించారు. -
మళ్లీ కాల్పుల మోత
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య శనివారం భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో ఏకంగా 17 మంది మావోయిస్టులు మృతి చెందగా వీరిలో 11 మంది మహిళలే ఉన్నారు. ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, దర్భా డివి జన్ కార్యదర్శి, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు జగదీశ్ అలియాస్ బుద్రా మరణించినట్టు పోలీసులు ధ్రువీకరించారు. ఇద్దరు డీఆర్జీ జవాన్లు గాయపడగా వారిని ఎయిర్‌లిఫ్ట్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. పక్కా సమాచారంతో..: సుక్మా – దంతెవాడ జిల్లాల సరిహద్దు కేర్లపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోగుండ గుట్టల దగ్గర మావోయిస్టు దర్భా డివిజన్, కేర్లపాల్, నేషనల్ పార్క్ ఏరియా కమిటీలు సమావేశమయ్యాయని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సుక్మా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ), సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత గుట్టల వద్దకు చేరుకున్నాయి. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గంటల వరకు అనేకసార్లు కాల్పులు చోటు చేసుకున్నా యి. అనంతరం ఘటనా స్థలిని పరిశీలించగా 17 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తేలింది. మృతదేహాలను సుక్మాకు తరలించారు. ఇందులో ఏడుగురి వివరాలు మాత్రమే తెలిశాయి. ఘటనా స్థలంలో ఏకే 47, ఇన్సాస్, రాకెట్ లాంఛర్లు, ఇతర ఆటోమేటిక్ వెపన్లు లభించాయి. మిలటరీ ఆపరేషన్లలో దిట్ట జగదీశ్!: సుక్మా జిల్లా లోని పౌర్గుండం గ్రామానికి చెందిన బుద్రా కుహరామి చిన్నప్పుడే మావోయిస్టుల్లో చేరాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ దర్భా డివిజన్ కమిటీ కార్యదర్శి స్థాయికి చేరాడు. మరో మావోయిస్టు అగ్రనేత జగదీశ్ మాస్టర్జీ 2011లో అరెస్ట్ అయ్యాక ఆయన పేరును బుద్రా ఉపయోగిస్తున్నాడు. భద్రతా దళాలే లక్ష్యంగా దాడులు చేయడం, మిలిటరీ ఆపరేషన్లకు వ్యూహాలు రచించడం, పేలుడు పదార్థాలను ఉపయోగించడంలో దిట్టగా జగదీశ్‌కు పేరుంది. ఈ క్రమంలో 2023 ఏప్రిల్ 23న ఆరన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భద్రతా దళాల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని శక్తివంతమైన ఐఈడీ బాంబు పేల్చగా పది మంది డీఆర్జీ జవాన్లు మరణించారు. ఈ దాడి వెనుక మాస్టర్ మైండ్ జగదీశ్‌దేనని పోలీసుల విచారణలో తేలింది. అప్పటి నుంచి జగదీశ్ కదలికలపై భద్రతా దళాలు కన్నేసి ఉంచాయి. డీఆర్జీ జవాన్ల సంబరాలు జగదీశ్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది. ఎదురుకాల్పుల మృతుల్లో ఆయన ఉన్నట్టు తెలియగానే యాంటీ నక్సల్స్ ఆపరేషన్ (కగార్) చేపడుతున్న జవాన్లు సంబరాలు చేసుకున్నారు. జవాన్లకు బస్తర్ డీఐజీ కమలోచన్ కశ్యప్, సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్‌లు మిఠాయిలు పంచారు. ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ‘ఎక్స్’లో స్పందించారు. ‘అనదర్ స్ట్రైక్ ఆన్ నక్సలిజం’(నక్సలిజంపై మరో దాడి) అని అన్నారు. ‘ఆయుధాలు పట్టుకున్న వారికి నాదొక్కటే విజ్ఞప్తి, హింసతో మీరు ఎలాంటి మార్పు తేలేరు. శాంతితోనే మార్పు సాధ్యం’అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2026 మార్చి చివరి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని పునరుద్ఘాటించారు. ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట సుక్మా జిల్లా ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటలా ఉండేది. క్షేత్రస్థాయిలో జన మిలీíÙయా మద్దతుతో మావోలు ఇక్కడ గట్టిగా నిలదొక్కుకున్నారు. 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయిన తాడిమెట్ల – చింతల్నార్ దాడి, సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలతో సహా 32 మంది చనిపోయిన జీరామ్ఘాట్ దాడులు ఇక్కడే చోటుచేసుకున్నాయి. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ విజయాలు దక్కలేదనే భావన యాంటీ నక్సల్స్ టీమ్స్‌లో ఇంతకాలం ఉండేది. కాగా ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోవడం సుక్మా జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారని చెబుతున్నారు. సుక్మా ఎన్కౌంటర్ బూటకం – పౌరహక్కుల సంఘం ఖండన సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గడ్డం లక్ష్మణ్, నారాయణరావులు ఆరోపించారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఆపరేషన్ కగార్ పేరుతో 60 ఏళ్లకు పైబడిన వారిని, కదల్లేని వాళ్లను నిరాయుధులుగా పట్టుకుని చిత్రహింసలు పెడుతూ హత్యాకాండ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. 14 నెలల హత్యాకాండలో 470 మంది మరణించారని తెలిపారు. ఇప్పటికైనా కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జరిగిన అన్ని ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలన్నారు. -
Telangana: పేదలందరికీ.. సన్నబియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలందరికీ సన్న బియ్యం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఉగాది రోజున ప్రారంభం కానుంది. ఆహార భద్రతా కార్డులు కలిగిన వారికి ఇప్పటివరకు ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దొడ్డు బియ్యం దురి్వనియోగంతో.. వేల కోట్ల రూపాయల సబ్సిడీ భరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న బియ్యంలో 85 శాతానికి పైగా దుర్వినియోగం అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఇష్టపడని పేద, మధ్య తరగతి వర్గాలు పెద్ద సంఖ్యలో రేషన్ దుకాణాల నుంచి తీసుకున్న బియ్యాన్ని ఆ సమీపంలోనే దళారులకు కిలో రూ.10 నుంచి 13 రూపాయలకు విక్రయించడం, లేదంటే డీలర్ల నుంచి అసలు బియ్యం తీసుకోకుండా అతను ఇచ్చిన మొత్తం తీసుకుని వెళ్లడం జరిగేది. ఈ నేపథ్యంలోనే దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దీనిపై రేషన్‌కార్డులు, సన్న బియ్యం పంపిణీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. ప్రజలు తినని దొడ్డు బియ్యాన్ని రూ.10,665 కోట్లు వెచ్చించి పంపిణీ చేయడం కంటే అదనంగా మరో రూ.2,800 కోట్లు వెచ్చించి సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల ఉచిత బియ్యం పథకం సద్వినియోగం అవుతుందని తేల్చింది. ఈ మేరకు సన్న బియ్యం పంపిణీకి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సన్న బియ్యం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి, ఏప్రిల్ నెల కోటాను ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. నెలకు 2 ఎల్ఎంటీలు అవసరం నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరం కానున్నాయి. ఈ నేపథ్యంలో గత వానాకాలం సీజన్లో 4.41 లక్షల మంది రైతుల నుంచి సేకరించిన 24 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీల) సన్న ధాన్యాన్ని గత డిసెంబర్ నుంచే మిల్లింగ్ చేయించడం ప్రారంభించడం ద్వారా ఆరు నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆదీనంలోని గోడౌన్లలో నిల్వ చేసిన బియ్యాన్ని ఏప్రిల్ 1 నుంచి పంపిణీ చేసేందుకు వీలుగా మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లకు పంపించింది. రాష్ట్రంలో 2.85 కోట్ల లబ్ధిదారులకు పంపిణీ చేసే సన్న బియ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు రూ.10,665 కోట్లు సబ్సిడీ రూపంలో భరిస్తున్నాయి. సన్న బియ్యం పంపిణీ కారణంగా ఇకపై రూ.13,522 కోట్లు భరించాల్సి వస్తుంది. ఇందులో కేంద్రం రూ.5,489 కోట్లు భరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.2,800 కోట్ల భారం పడడంతో భరించాల్సిన రాయితీ రూ.8,033 కోట్లకు పెరిగింది. త్వరలోనే మరో 30 లక్షల మంది పీడీఎస్ నెట్‌వర్క్‌లోకి.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డులకు తోడు కొత్త కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 30 లక్షల మందిని అర్హులుగా ప్రాథమిక పరిశీలనలో తేల్చారు. ఇందులో 18 లక్షల దరఖాస్తులు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు చేర్చడం (అడిషన్స్) గురించి కాగా.. వీరందరినీ అర్హులుగా గుర్తించి ఇప్పటికే ఆన్లైన్లో చేర్పుల జాబితాలో పొందుపరిచినట్లు తెలిసింది. జాబితాలో పేర్లు ఉన్నవారికి కూడా సన్న బియ్యం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. మరో 12 లక్షల మందిని (సుమారు 4 లక్షల కుటుంబాలు) కూడా రేషన్‌కార్డులకు అర్హులుగా జాబితాల్లో చేర్చాలని పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. వీరందరికీ కొత్తగా 4 నుంచి 5 లక్షల కార్డుల వరకు అవసరమని అంచనా వేశారు. కొత్త లబ్ధిదారుల చేరికతో సన్నబియ్యం వినియోగించుకునే వారి సంఖ్య 3.10 కోట్లకు పెరగనుంది. అలాగే కార్డుల సంఖ్య 94 లక్షలకు చేరే అవకాశం ఉంది. 84 % మందికి నెలకు 6 కిలోల చొప్పున ⇒ రాష్ట్రంలో ప్రస్తుతం 89.73 లక్షల ఆహార భద్రతా కార్డులు ఉండగా, వాటిలో 2.85 కోట్ల లబ్ధిదారులు నమోదై ఉన్నారు. ఇకనుంచి వీరందరికీ నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకం కింద సుమారు 35 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ గత మూడేళ్లుగా సన్న బియ్యంతోనే భోజనాన్ని వడ్డిస్తున్నారు. వీరు కాకుండా ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 84 శాతం మందికి సన్న బియ్యం పంపిణీ అవుతాయని, దొడ్డు బియ్యం వినియోగం దాదాపు జీరో అవుతుందని చెబుతున్నారు. -
హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
హైదరాబాద్: హెచ్‌సీయూ భూముల వ్యవహారం మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసింది. వర్శిటీ భూముల విక్రయాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్శిటీ భూముల విక్రయాన్ని ఆపాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దాంతో సెంట్రల్ యూనివర్శిటీలో పోలీసుల్ని భారీగా మోహరించారు.అసలు వివాదం ఎందుకంటే..!హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములను ఎప్పటికప్పుడు ఏదో సాకు చూపి వెనక్కు లాక్కుంటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ ఏర్పడిన 50 ఏళ్లలో దాదాపు 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నారని అంటున్నారు. మొదట 2300 ఎకరాల్లో హెచ్‌సీయూను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపిస్తున్నారు.తాజాగా టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు నిర్ణయించడంతో విద్యార్థి సంఘాలు, వర్కర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పోరాటానికి దిగారు. వీరంతా జేఏసీగా ఏర్పడి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఈ స్థలం హెచ్‌సీయూది కాదని, అందుకే కోర్టు తీర్పు మేరకే అభివృద్ధి చేసేందుకు 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే జరిగితే ఇక మిగిలేది 1400 ఎకరాలు మాత్రమే.హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, హెచ్‌సీయూ భూములు (HCU Lands) వర్సిటీ అవసరాలకే వినియోగించేలా చొరవ చూపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చుట్టూ ఐటీ కారిడార్ ఉండడంతో ఈ భూముల విక్రయం ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 400 ఎకరాలను విక్రయిస్తే మార్కెట్ విలువ ప్రకారం రూ.10 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వ అంచనా వేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. -
ఎల్ఆర్ఎస్ చెల్లింపులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ చెల్లింపులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెలవు రోజుల్లో ఎల్ఆర్ఎస్ చెల్లింపులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల 30,31 సెలవు రోజుల్లో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపులకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 31న కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేయనున్నాయి.మాజీ వీఆర్వోలు, వీఆర్ఏల నియామకంపై జీవో విడుదలమాజీ వీఆర్వోలు, వీఆర్ఏల నియామకంపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. విధి విధానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. డిగ్రీ అర్హత ఉన్న మాజీ వీఆర్వోలు, వీఆర్ఏలకు గ్రామ పాలన అధికారులుగా అవకాశం కల్పించింది. -
అరుదైన శస్త్ర చికిత్సతో వృద్ధుడి గుండె పదిలం
హైదరాబాద్ : ఆరోగ్య సంరక్షణలో విశ్వసనీయత, మెరుగైన ఆరోగ్య ఫలితాలతో ప్రాణాలకు కాపాడటంతో కాపాడటంతో అద్వితీయంగా కృషి చేస్తున్న ఆలివ్ హాస్పిటల్... గుండె సంబంధిత వ్యాధి చికిత్సలో అరుదైన మైలురాయిని చేరుకుంది. వైద్య రంగంలో అత్యంత క్లిష్టమైనది కాగా, ట్రాన్సాకాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ (TAVR) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రంగంలో ఈ విప్లవాత్మక శస్త్రచికిత్స ప్రక్రియను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ కృతిక్ కులకర్ణి, ఆలివ్ హాస్పిటల్ లోని కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మొహమ్మద్ ఆసిఫ్ సంయుక్తంగా నిర్వహించారు. తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్, రెగర్జిటేషన్ ఉన్న వృద్ధి రోగులకు TAVR ఒక ప్రాణాలను రక్షించే పరిష్కారం. ఇది సాంప్రదాయ ఓపెన్-హార్ట్ సర్జరీకి ఇదొక ఇన్వాసివ్ ప్రత్యామ్నాయం కాగా, అత్యంత ప్రమాదకర స్థాయిలో లేదా సాంప్రదాయ గుండె శస్త్రచికిత్స చేయించుకోలేని రోగులకు సురక్షితమైన, మరింత ప్రభావవంతమైన ఈ చికిత్సను మాత్రమే అందిస్తారు. తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్, రెగర్జిటేషన్‌తో బాధపడుతున్న వృద్ధి రోగులకు ఇదొక సంజీవనీల పనిచేస్తుందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.ఈ బృందానికి సారథ్యం వహించిన డాక్టర్ కృతిక్ కులకర్ణి తన బృంద సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ "తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్, రిగర్జిటేషన్ ఉన్న వృద్ధులకు ఈ ప్రక్రియ ఒక వరం. ఇది వారికి పునర్జీవం పోసేలా పనిచేస్తోంది. వేగంగా కోలుకోవడం, మెరుగైన జీవన నాణ్యతను అందిస్తుంది. మా క్యాత్ ల్యాబ్ బృందం, OT టెక్నీషియన్లు, అనస్థీషియా బృందం, హాస్పిటల్ అడ్మిన్ సహకారంతో ఎంతో క్లిష్టమైన శస్త్రచికిత్సను సునాయాసంగా విజయవంతం చేయగలిగాం. డాక్టర్ పాషా, డాక్టర్ బన్సాల్, డాక్టర్ ప్రవీణ్ మరియు డాక్టర్ జియాకు ప్రత్యేక కృతజ్ఞతలు. అహ్మదాబాద్‌కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ కూడా ఈ ప్రక్రియలో మార్గదర్శకుడిగా హాజరై బృందానికి తన అమూల్యమైన సలహాలను అందించారు. ఆయనుకున్న విస్తృత అనుభవం విజయానికి తోడ్పడిందన్నారు.olive రంగంలో ఈ విజయం మా ఆసుపత్రి యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా, మా రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణను అందించడంలో మా యొక్క అంకితభావాన్ని చాటుకున్నాం. కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మొహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ... "ఆరోగ్య సంరక్షణ పురోగతిలో ఈ అద్భుతమైన అద్భుతమైన ప్రయాణంలో మేము భాగస్వామ్యం కావడం మాకు దొరికి దొరికి అదృష్టం. ఆలివ్ ఆలివ్ హాస్పిటల్ వైద్య శాస్త్ర రంగంలో నిరంతరం కృషి చేస్తూ ముందుకు సాగుతోంది. రోగులకు నాణ్యమైన వైద్యాన్ని ఉన్నత స్థాయి ప్రమాణాలతో అందిస్తోంది. TAVR ప్రక్రియ విజయవంతంగా అమలు చేయడం ద్వారా హృదయ సంరక్షణకు ఒక కొత్త ప్రమాణం ఏర్పడింది. భవిష్యత్తులో ఆపత్కర పరిస్థితుల్లో రోగులకు TAVR ద్వారా పునర్జీవం పోసే అవకాశం ఉంటుంది. ఇంత కీలకమైన బాధ్యతల నిర్వహించిన తమకు రోగి కుటుంబ సభ్యుల సహకరించడం అభినందనీయం, వారికి ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తోంది." అని అన్నారు. ఆలివ్ హాస్పిటల్ గురించి: తెలంగాణలో రాష్ట్ర స్థాయిలో ఆలివ్ హాస్పిటల్స్ ఆధునాతన వైద్య సంరక్షణకు కృషి చేస్తుంది. సమగ్ర ఆరోగ్య ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన వైద్యాన్ని నిబద్ధతతో 2010 నుండి అందిస్తోంది. విశ్వసనీయమైన వైద్యం అందించాలని లక్ష్యంతో కట్టుబడి ఉంది. మొత్తం మానవాళికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడంలో గత 15 సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తోంది. అత్యుత్తమ ప్రతిభతో ఆలివ్ హాస్పిటల్ తెలంగాణలోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులలో ఒకటిగా మారింది. ఆలివ్ హాస్పిటల్ 210 పడకల, అత్యాధునిక మల్టీస్పెషాలిటీ హెల్త్‌కేర్ సౌకర్యం వివిధ స్పెషాలిటీలలో విస్తృత శ్రేణి వైద్య సేవలను అందిస్తుంది, కార్డియాక్ కేర్, ఎమర్జెన్సీ సర్వీసెస్, న్యూరో కేర్, కిడ్నీ కేర్, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్స్, గైనకాలజికల్ సర్వీసెస్, అడ్వాన్స్డ్ డయాగ్నస్టిక్స్. ఇంటర్వెన్షనల్ సర్వీసెస్ వంటి రంగాలలో అనేక అధునాతన విధానాలలో మార్గదర్శకత్వం" వహించింది. తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి, సమర్ధులైన వెద్యులను నియమించుకోవడానికి కట్టుబడి ఉండటం వలన భారతదేశులో ఆరోగ్య సంరక్షణ యొక్క నాణ్యమైన ప్రమాణమైన నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ నుండి గుర్తింపు పొందింది. -
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మెట్రో ప్రయాణికులకు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. మెట్రో సమయం పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకే అందుబాటులో ఉన్న మెట్రో సేవల సమయం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ఇకపై ఏప్రిల్ 1 నుంచి రాత్రి 11.45 గంటల వరకు మెట్రో సర్వీసులు నడవనున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ మారిన వేళలు అమల్లో ఉంటాయని తెలిపారు.కాగా, ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్న ఆఫర్ మరో ఏడాది పొడిగించారు. విద్యార్థుల 20 ట్రిప్పుల డబ్బులతో 30 ట్రిప్పులు వెళ్లే ఆఫర్ పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. సూపర్ సేవర్ హాలిడే ఆఫర్, ఆఫ్-పీక్ వేళల్లో స్మార్ట్ కార్డులపై ఇచ్చే తగ్గింపు మార్చి 31తో ముగియనుంది. తాజాగా ఈ ఆఫర్‌ను మరో ఏడాది పొడిగిస్తూ మెట్రో నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని మెట్రో ఎండీ పేర్కొన్నారు. -
హాస్టళ్లకు గిరాకీ.. అద్దెలూ పెరుగుతున్నాయ్..
సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థుల వసతి గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులకు మెట్రో నగరాలకు వలస వస్తుంటారు. ప్రభుత్వ నూతన విద్యా విధానాలు, వినూత్న సాంకేతికత కారణంగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థుల వలసల వృద్ధికి ప్రధాన కారణమని కొలియర్స్ ఇండియా అడ్వైజరీ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వప్నిల్ అనిల్ తెలిపారు.క్యాంపస్‌లు, హాస్టళ్లు, పీజీ గృహాలలో అపరిశుభ్రత, భద్రత కరువు, ఎక్కువ అద్దెలు వంటి రకరకాల కారణాల వల్ల స్టూడెంట్ హౌసింగ్ విభాగం ఇప్పటివరకు ఈ రంగం అసంఘటితంగా, నియంత్రణ లేకుండా ఉంది. ఒకే వయసు వ్యక్తులతో కలిసి ఉండటం, ఆధునిక సౌకర్యాలు, మెరుగైన ప్రయాణ వసతులతో సులువైన రాకపోకలు, రోజువారీ కార్యకలాపాలలో సహాయం వంటి రకరకాల కారణాలతో యువతరం వసతి గృహాలలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాలలో స్టాంజా, హౌసర్, యువర్ స్పేస్, ఓలైవ్ లివింగ్ వంటి సంస్థలు విద్యార్థి వసతి గృహాల సేవలను అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 1.10 కోట్ల మంది వలస విద్యార్థులు ఉండగా.. 2036 నాటికి 3.10 కోట్లకు చేరుతుందని కొల్లియర్స్ నివేదిక అంచనా వేసింది. అయితే ఆయా విద్యార్థులకు కోసం వసతి గృహాలలో కేవలం 75 లక్షల పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపింది. కరోనా తర్వాత విద్యార్థి గృహాల అద్దెలు ఏటా 10–15 శాతం మేర పెరుగుతున్నాయి. -
హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య
సాక్షి,రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణం చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఏడాది క్రితం అమిష్ లోయా అనే వ్యక్తితో కోర్టు మ్యారేజ్ చేసుకున్న పింకీ.. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పింకీ ఆత్మహత్యకు తన భర్త వేధింపులే కారణమా? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. అమిష్ లోయా అనే వ్యక్తితో ఏడాది క్రితం పింకీ శర్మ వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజుల పాటు వీరి కాపురం సజావుగా సాగినప్పటికీ.. తర్వాత ఇద్దరి మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి.అప్పటి నుంచి బయటకెళ్లటప్పుడు పింకీ శర్మను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడని.. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కూడా పింకీ శర్మ, అమిష్ మధ్య ఘర్షణ జరిగిందని సమాచారం. దీంతో పింకీ శర్మను ఇంట్లో పెట్టి బయటకు వెళ్లిపోయాడు. కాసేపటికి ఇంటికి తిరిగొచ్చేసరికి పింకీ శర్మ చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'రేవంత్ సర్కార్ - గల్ఫ్ భరోసా' అనే మినీ డాక్యుమెంటరీని శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. చిత్ర బృందం ఇటీవల ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికులు, నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, కెమెరామెన్ పి.ఎల్.కె. రెడ్డి, ఎడిటర్ వి. కళ్యాణ్ కుమార్, సౌదీ ఎన్నారై మహ్మద్ జబ్బార్‌లు పాల్గొన్నారు. చదవండి: విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు -
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ పతనం
రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వ ప్రతికూల విధానాలు, ఆకాశాన్నంటిన ప్రాపర్టీ ధరలు.. కారణాలేవైనా.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పల్టీలు కొడుతూ పతనమైపోతోంది. రెండేళ్ల క్రితం ఎన్నికలతో మొదలైన స్థిరాస్తి రంగం మందగమనం.. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటికీ కోలుకోలేదు. ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో గ్రేటర్లో గృహ విక్రయాలు, లాంచింగ్స్ భారీగా తగ్గాయి. దేశంలోనే ఇళ్ల అమ్మకాలు, లాంచింగ్స్‌లో అత్యధిక క్షీణత మన నగరంలోనే ఉండటం గమనార్హం. - సాక్షి, సిటీబ్యూరో హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి మూడు నెలల్లో (క్యూ1) 10,100 ఇళ్లు అమ్ముడుపోయాయి. 2024 క్యూ1లో 19,660 సేల్ అయ్యాయి. ఏడాది కాలంలో విక్రయాలలో 49 శాతం తగ్గుదల నమోదయిందని అనరాక్ గ్రూప్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. అలాగే నగరంలో 2025 క్యూ1లో కొత్తగా 10,275 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. అదే 2024 క్యూ1లో 22,960 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఏడాదిలో లాంచింగ్స్ 55 శాతం తగ్గాయని పేర్కొంది. అయితే ఆశ్చర్యకరంగా నగరంలో కొత్తగా ప్రారంభమైన ఇళ్లలో లగ్జరీ గృహాలదే ఆధిపత్యం. గ్రేటర్లో కొత్త ఇళ్ల నిర్మాణాలలో రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ ఇళ్ల వాటా 70 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇన్వెంటరీ 5 లక్షలపైనే.. ఏడు నగరాల్లో అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) కాస్త తగ్గాయి. 2024 క్యూ1లో 5,80,890 యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. 2025 క్యూ1 నాటికి 5,59,810కు క్షీణించాయి. అంటే ఏడాది కాలంతో పోలిస్తే ఇన్వెంటరీ 4 శాతం తగ్గింది. స్థిరమైన ఆర్థిక పరిస్థితి, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణ నియంత్రణ కారణంగా దేశంలో గృహాల ధరలు ఏటేటా పెరుగుతున్నాయి. ఏడాది కాలంలో ప్రాపర్టీ ధరలు మాత్రం 17 శాతం మేర పెరిగాయి. అత్యధికంగా ఎన్సీఆర్లో 34 శాతం, బెంగళూరులో 20 శాతం వృద్ధి చెందాయి.దేశంలోనూ సేమ్.. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లోనూ స్థిరాస్తి రంగం తిరోగమనంలోనే ఉంది. ఈ ఏడాది క్యూ1లో ఏడు ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు 28 శాతం, లాంచింగ్స్ 10 శాతం క్షీణించాయి. 2025 క్యూ1లో 93,280 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదే గతేడాది క్యూ1లో 1,30,170 ఇళ్లు విక్రయమయ్యాయి. ఇదే సమయంలో 7 నగరాల్లో 2025 క్యూ1లో 1,00,020 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. 2024లో 1,10,865 గృహాలు ప్రారంభమయ్యాయి. అంటే ఏడాదిలో 10 శాతం లాంచింగ్స్ క్షీణించాయి.లగ్జరీదే హవా.. లాంచింగ్స్‌లో లగ్జరీ, అల్ట్రా లగ్జరీ గృహాలే అత్యధికం. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ తరహా ఇళ్ల వాటా 42 శాతం ఉన్నాయి. ఆ తర్వాత రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర ధర ఉండే ప్రీమియం యూనిట్ల వాటా 27 శాతం, రూ.40–80 లక్షల ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్స్ వాటా 12 శాతంగా ఉన్నాయి. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. దంపతులు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హఫీజ్‌పేట్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. బెట్టింగ్ నిర్వహిస్తున్న దంపతులు అజయ్, సంధ్యలను ఎస్వోటీ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముగ్గురు పంటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఫేక్ కంపెనీల పేరుతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి.. రెండు మ్యాచ్‌లపై రూ.40 లక్షల వరకు లావాదేవీలు జరిపారు. మొత్తం ఏడు అకౌంట్లను పోలీసులు గుర్తించారు. బ్యాంక్ అకౌంట్లలోని రూ.22 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. నిందితుడు అజయ్‌పై గతంలో నాలుగు బెట్టింగ్ కేసులు నమోదయ్యాయి. -
Hyd:గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్: గుడిమల్కాపూర్‌లోని కింగ్స్ ప్యాలెస్‌లో నిర్వహించిన ఆనం మీర్జా ఎక్స్‌పోలో కాల్పుల కలకలం రేగింది. ఎక్స్‌పోలో ఇద్దరు షాప్ యజమానుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వారిలో ఓ షాపు యజమాని గాలిలో కాల్పులు జరిపాడు. దీంతో ఎక్స్‌లో ఉన్నవారు భయాందోళనలకు గురయ్యారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్స్పో నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో ఎక్స్పో ప్రాంతంలో భద్రతను పెంచినట్లు పోలీసులు వెల్లడించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన శ్రవణ్‌రావు సిట్ విచారణ
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉత్కంఠకు తెర పడింది. మీడియా సంస్థ నిర్వాహకుడు, ఈ కేసులో నిందితుడు శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఎదుట హాజరయ్యారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో శ్రవణ్‌రావు విచారణ ముగిసింది ఏడు గంటలకుపైగా శ్రవణ్‌రావును సిట్ అధికారులు ప్రశ్నించారు.ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఏ6 నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్‌కు ఈ నెల 26వ తేదీన సిట్ నోటీసులు జారీ చేసింది. 29వ తేదీన తమ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాల్సిందిగా తెలిపింది. ఆయన అమెరికాలో ఉండడంతో కుటుంబ సభ్యులకు ఆ నోటీసులను అందజేసింది. అయితే ఈలోపు అరెస్ట్ నుంచి ఆయనకు సుప్రీం కోర్టు ఊరట ఇచ్చింది. అయినప్పటికీ ఈ కేసులో విచారణకు సహకరించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం షరతు విధించింది. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు. మరోవైపు.. శ్రవణ్ రావు విచారణకు కచ్చితంగా హాజరు అవుతారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ వేకువఝామున విమానంలో ఆయన నగరానికి వచ్చారని తెలుస్తోంది. ఈ కేసులో శ్రవణ్ వాంగ్మూలం కీలకంగా మారవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ వెర్షన్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో శ్రవణ్ రావు సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులు నడుచుకున్నారనేది దర్యాప్తుసంస్థ ప్రధాన అభియోగం. ఓ మీడియా సంస్థకు అధిపతిగా ఉంటూ 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చారని.. కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఈయనే సూచించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన్ను విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే ఆయన తొలుత లండన్‌కు.. అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సిట్ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయనపై రెడ్‌కార్నర్ నోటీస్ సైతం జారీ అయింది. అయితే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో.. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు వేసి ఊరట పొందినప్పటికీ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
నాతో ఉంటే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు..!
ఫిలింనగర్: ఇంటర్వ్యూకు వెళ్లిన ఓ వివాహితను పరిచయం చేసుకున్న స్పా యజమాని ప్రేమ పేరుతో వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తుండటంతో బాధితురాలు ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మల్కాజగిరిలోని హనీ స్పా యజమాని విక్కీ విక్రమ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..ఫిలింనగర్‌లోని దీన్‌దయాళ్‌నగర్ బస్తీకి చెందిన వివాహిత (35) మాదాపూర్‌లోని ఓ స్పాలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నది. ఇటీవల మరింత మెరుగైన ఉద్యోగం కోసం మల్కాజిగిరిలోని హనీ స్పాలో ఇంటర్వ్యూకు వెళ్లగా స్పా యజమాని విక్కీ విక్రమ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య తరచూ ఫోన్ సంభాషణ జరుగుతుంది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తన భర్తకు ఈ విషయం తెలియదని ఆమె చెప్పగా అదంతా తాను చూసుకుంటానని, నాతో ఉంటే నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్మబలికాడు. దీంతో ఆమె విక్కీ విక్రమ్‌తో మరింత సన్నిహితంగా మెలిగింది. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో ఆమె దూరంగా ఉండసాగింది. ఇది భరించలేని విక్రమ్ గురువారం అర్ధరాత్రి ఆమె ఇంటికి వచ్చి బయట నుంచి డోర్ లాక్ చేశాడు. దీంతో ఆమె భయంతో అరవడంతో చుట్టుపక్కల వారు గమనించారు. దీంతో విక్రమ్ అక్కడి నుంచి ఉడాయించాడు. తనను శారీరికంగా, మానసికంగా వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 75, 78 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బేస్మెంట్ పూర్తయితే వెంటనే రూ. 1,00,000
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన గ్రామాల్లో.. ఇళ్ల గ్రౌండింగ్ పనులు వేగవంతం చేయాలని రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 516 గ్రామా ల్లో ఒకేసారి మంజూరు చేసిన ఇళ్లను వెంటనే పనులు ప్రారంభించాలని, ఇదివరకే ఒకవేళ నిర్మాణాలు ప్రారంభించి..బేస్మెంట్ వరకు పూర్తయిన వారికి రూ.లక్ష తక్షణమే ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు.శుక్రవారం సచివాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సహచర మంత్రులు సీతక్క, కొండా సురేఖలతోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశమని, దీనిని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్లు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం నాలుగు విడతల్లో డబ్బు చెల్లిస్తుందని, మొదటి విడతలో బేస్మెంట్ లెవల్ పూర్తయిన తర్వాత రూ.లక్ష, ఇస్తుందని ఆ వివరాలను వెంటనే పంపించాలన్నారు.ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ఇళ్ల స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు కేటాయించని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని చెప్పారు. నిర్మాణం పూర్తికాక, కేవ లం గోడలు నిర్మించి కాంట్రాక్టర్ వెళ్లిపోతే. అలాంటి ఇళ్లను లబ్ధిదారులే నిర్మించునేలా అవసరమైన ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుందని మంత్రి చెప్పారు. తాగునీటి సమస్య లేకుండా... వేసవిలో ఏ గ్రామంలో లేదా పట్టణాల్లోగాని తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవా లని మంత్రి పొంగులేటి ఆదేశించారు. వచ్చే మూడు నెలలు చాలా కీలకమని, ప్రజలు తాగునీరు రావడం లేదన్న విమర్శ రాకుండా పనిచేయాలని సలహా ఇచ్చారు. నీటికొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయడం, చెడిపోయిన బోర్లు, హ్యాండ్ పంప్‌లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. జూన్‌లోగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తి వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తిచేసి..జూన్ చివరినాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. మడికొండ డంపింగ్ యార్డు సమస్యకు వారం రోజుల్లో తాత్కాలిక పరిష్కారం చూపించి, ఆ తర్వాత శాశ్వత పరిష్కా రానికి చర్యలు తీసుకోవాలన్నారు.మునిసిపల్ కమిషనర్, డైరెక్టర్ శ్రీదేవి అక్కడ పర్యటించాలని మంత్రి సూచించారు. డంపింగ్ యార్డుకు 150 నుంచి 200 ఎకరాల భూమిని సేకరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, యశస్వినిరెడ్డి, దొంతి మాధవరెడ్డి, నాగరాజు, మురళీనాయక్, రామచంద్రనాయక్, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బసవ రాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఉన్నతాధికారులు దానకిశోర్, హరిచందన, కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ ‘మాసం’
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల..రాష్ట్ర రెవెన్యూ శాఖలో కీలక మార్పులకు వేదిక కాబోతోంది. రాష్ట్రంలో అధికార మార్పిడికి కారణమైందని భావిస్తున్న ధరణి చట్టం ఏప్రిల్‌లోనే చరిత్రగా మిగిలిపోనుంది. వ్యవసాయ భూముల లావాదేవీల కోసం ధరణి స్థానంలో ‘భూభారతి’చట్టం అమల్లోకి రానుంది. ఉగాది నుంచే భూభారతి చట్టాన్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావించినా, ఏప్రిల్ రెండో వారం తర్వాత అమల్లోకి రానుందని సమాచారం. ఇప్పటికే న్యాయశాఖ నుంచి కూడా భూభారతి మార్గదర్శకాలకు క్లియరెన్స్ వచి్చందని, సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలన అనంతరం ఈసారి జరగబోయే కేబినెట్లో ఆమోదం తీసుకొని అమల్లోకి తెస్తామని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. భూభారతి పైలట్ ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లా భూభారతి చట్టంలో పొందుపరిచే మార్గదర్శకాలకు అనుగుణంగా జరగాల్సిన అన్ని కార్యకలాపాలను నిజామాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పైలట్‌గా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో చేపట్టిన భూభారతి ప్రాజెక్టు ద్వారా ఆ జిల్లాలోని 922 గ్రామాల్లో ఉన్న దాదాపు 14 లక్షల ఎకరాల భూమి వివరాలను డిజిటలైజ్ చేసే ప్రయత్నం జరిగింది. జిల్లాలోని 914 గ్రామాల్లో భూముల సర్వే కూడా పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో కొత్తగా అమల్లోకి రానున్న భూభారతి చట్టం మార్గదర్శకాలను కూడా పూర్తిస్థాయిలో ఈ జిల్లాలోని ఎంపిక చేసిన గ్రామాల్లో పైలట్ పద్ధతిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.భూమి రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాపింగ్, అవసరమైన మేరకు సర్వేయర్ల నియామకం లాంటి కీలక చర్యలు కూడా ఈ పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని రెవెన్యూ శాఖ యోచిస్తోంది. అయితే, కేబినెట్ ఆమోదం పొందిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా చట్టం అమల్లోకి వస్తుందని, చట్టం మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలు చేసే ప్రక్రియ మాత్రం పైలట్ పద్ధతిలో నిజామాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో చేపడతామని, అక్కడి అనుభవాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా భూభారతిని పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. రిజిస్ట్రేషన్లు ఇక ఈజీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలోనూ ఏప్రిల్ నెలలోనే కీలక మార్పులు జరగనున్నాయి. వ్యవసాయేతర భూముల క్రయవిక్రయ లావాదేవీల కోసం ఇప్పటికే ఆన్లైన్ విధానం అమల్లో ఉన్నా, ఎక్కువగా మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను సులభతరం చేసేందుకుగాను ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని విస్తృతంగా అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు ఈజీ రిజిస్ట్రేషన్లు జరిగేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలకు ఆయన శ్రీకారం చుడుతున్నారు.ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో హైదరాబాద్ పరిసర సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాల్లో ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టు కింద అమల్లోకి తెచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 90 శాతం లావాదేవీలు ఆన్లైన్ స్లాట్స్ ద్వారా, 10 శాతం మాత్రమే మాన్యువల్ పద్ధతిలో జరగనున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా 10 నిమిషాల్లో పూర్తయ్యేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ మార్పులు కూడా జరుగుతున్నాయి. ఇక, వీలును బట్టి ఈ నెలలో రాష్ట్రంలో భూముల విలువల సవరణ ప్రక్రియ కూడా చేపట్టే అవకాశాలున్నాయని, ధరణి పోర్టల్‌ను ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయడం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుందని, ఇందుకోసం పలు ఐటీ కంపెనీలతో రెవెన్యూ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నాయని తెలుస్తోంది. -
ఆ ‘క్లిక్కే’ వేరు!
సాక్షి, స్పెషల్ డెస్క్: మనతోని అట్లుంటది.. అవును ఆటైనా, పాటైనా.. ఆఖరుకు రిటైల్ అయినా రికార్డులు సృష్టించడంలో ఆ ‘క్లిక్కే’వేరు. ప్రపంచ ఆన్లైన్ రిటైల్ రంగంలో కస్టమర్ల సంఖ్య పరంగా అమెరికాను దాటి రెండవ అతిపెద్ద మార్కెట్‌గా భారత్ అవతరించింది. 28 కోట్ల మంది ఆన్లైన్ షాపర్స్‌తో రిటైల్ మార్కెట్‌ను మన దేశం షేక్ చేస్తోందని ఫ్లిప్‌కార్ట్ సహకారంతో బెయిన్ అండ్ కంపెనీ రూపొందించిన నివేదిక వెల్లడించింది. 92 కోట్ల మంది ఈ–రిటైల్ షాపర్స్‌తో చైనా తొలి స్థానంలో కొనసాగుతోంది. 27 కోట్ల ఆన్లైన్ షాపర్లతో అమెరికా మూడో స్థానంలో నిలిచింది. క్విక్ కామర్స్, ట్రెండ్–ఫస్ట్ కామర్స్, హైపర్–వాల్యూ కామర్స్ భారత్‌లో తదుపరి ఆన్లైన్ కొనుగోళ్ల వృద్ధి అధ్యాయాన్ని నిర్వచించనున్నాయి.ఐదు మించి ప్లాట్‌ఫామ్స్.. ఈ–రిటైల్ షాపర్స్‌లో జెన్–జీ తరం (1997–2012 మధ్య పుట్టినవారు) సంఖ్య దాదాపు 40% ఉంది. ప్రత్యేక షాపింగ్ అలవాట్లు వారి సొంతం. వారిలో సగం మంది ఏటా ఐదు, అంతకంటే ఎక్కువ ప్లాట్‌ఫామ్‌ల నుంచి కొనుగోళ్లు చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ బ్రాండ్లపై ఇతర కస్టమర్లతో పోలిస్తే జెన్–జీ తరం మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోంది. హైపర్ వాల్యూ కామర్స్ (అతితక్కువ ధరగల ఉత్పత్తులు) సామాన్యులను ఆకర్షిస్తోంది. ఈ–రిటైల్‌లో 2021లో 5% వాటా కలిగి ఉన్న ఈ విభాగం ఇప్పుడు 12% మించిపోయింది. కిరాణా, జీవనశైలి, సాధారణ వస్తువులు ఈ–రిటైల్ మార్కెట్లో 55% వాటా కలిగి ఉన్నాయి. ఇవి 2030 నాటికి మూడింట రెండు వంతులకు చేరనున్నాయి. తోడైన క్విక్ కామర్స్.. భారత్‌లో తలసరి జీడీపీ రూ. 2,99,950 కంటే ఎక్కువగా ఉన్న కేరళ, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, చండీగఢ్, తమిళనాడు ఇప్పటికే ఈ–రిటైల్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే 1.2 రెట్లు అధికంగా వ్యాప్తి చెందాయి. దేశంలోని ఈ–రిటైల్ రంగంలో ప్రధానంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తూ గ్రామాల వరకు వ్యాపారాన్ని విస్తరించాయి. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ తదితర క్విక్ కామర్స్ కంపెనీలు మొత్తం ఈ–కామర్స్ జోరుకు సహాయపడుతున్నాయి.క్విక్ కామర్స్ యాక్టివ్ కస్టమర్ల సంఖ్య 2 కోట్లు దాటింది. స్వల్పకాలిక స్థూల ఆర్థిక ఎదురుగాలులు ఉన్నప్పటికీ భారత ఈ–రిటైల్ మార్కెట్లో దీర్ఘకాలిక అవకాశాలు బలంగా ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. ట్రెండ్–ఫస్ట్ ఫ్యాషన్ (సరసమైన ధరలకు ట్రెండీ కలెక్షన్) ఒక్కటే నాలుగు రెట్లు పెరిగి 2028 నాటికి సుమారు రూ. 68,560–85,700 కోట్లకు చేరుకోనుంది. ట్రెండ్–ఫస్ట్ ఫ్యాషన్ ఆదాయంలో సగానికిపైగా ఆన్లైన్ అమ్మకాల ద్వారానే రానుంది. పెద్ద నగరాలతో సమానంగా..⇒ ఈ–రిటైల్‌లో 2020 నుంచి ఇప్పటివరకు నమోదైన కొత్త కస్టమర్లలో దాదాపు 60% మంది తృతీయ శ్రేణి పట్టణాలు, చిన్న నగరాలకు చెందినవారే. అలాగే 2021 నుంచి ఈ–రిటైల్ ప్లాట్‌ఫామ్‌లలో చేరిన నూతన విక్రేతలలో 60% కంటే ఎక్కువ మంది ద్వితీయ శ్రేణి, చిన్న నగరాల నుంచి ఉన్నారు. మొత్తం ఆర్డర్స్‌లో తృతీయ, ఆ తర్వాతి స్థాయి పట్టణాల వాటా 45% పైగా ఉంది. ద్వితీయ శ్రేణి, చిన్న నగరాల్లో వినియోగదార్ల ఈ–రిటైల్ ఖర్చు మెట్రో, ప్రథమ శ్రేణి నగరాలతో సమానంగా ఉంది. అంతేగాక వివిధ వస్తు విభాగాలలో సగటు అమ్మకపు ధరలు సమానంగా లేదా కొంచెం తక్కువగా ఉన్నాయి.పదింటిలో ఒకటి ఈ–రిటైల్‌కు..ఈ–రిటైల్ (ఆన్లైన్ కొనుగోళ్లు) విపణి భారత్‌లో 2019– 2024 మధ్య ఏటా 20% వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది. 2024లో ఈ రంగంలో రూ. 5,14,200 కోట్ల వ్యాపా రం జరిగింది. ఏటా 18% వృద్ధితో 2030 నాటికి ఇది రూ. 14,56,900–16,28,300 కోట్లకు చేరుకుంటుందని అంచనా. స్థూల ఆర్థిక కారకాలు, వినియోగం క్షీణించిన కారణంగా దేశీయ ఈ–రిటైల్ వృద్ధి గతేడాదిలో 10–12 శాతానికి మందగించినప్పటికీ తాజాగా రికార్డు సృష్టించడం విశేషం. ఒకానొక దశలో ఈరంగం 20% పైగా వృద్ధి సాధించింది.2030 నాటికి దేశంలో తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) రూ. 2,99,950– 3,42,800లకు చేరనున్న నేపథ్యంలో కస్టమర్లు రిటైల్‌లో 10 డాలర్లు (రూ. 857) వెచి్చస్తే ఒకటి ఈ–రిటైల్ కోసం ఖర్చు చేస్తారట. అనవసర ఖర్చుల పెరుగుదల అందుకు ఆజ్యం పోయనుందని నివేదిక వివరించింది. -
మరీ ఇంత బద్ధకమా?
సాక్షి, హైదరాబాద్: ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియలో పోస్టుమెట్రిక్ విద్యార్థులు బద్ధకం వీడడం లేదు. దరఖాస్తు కోసం నెలల తరబడి గడువు ఇచ్చినా, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా గడువు తేదీని పలుమార్లు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల దరఖాస్తు ప్రక్రియ గతేడాది సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభమైంది. ఇంటర్ మొదలు, డిగ్రీ, పీజీ, వృత్తివిద్య, సాంకేతిక విద్య కోర్సులు చదువుతున్న విద్యార్థులు డిసెంబర్ 31లోపు ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. పోస్టుమెట్రిక్ విద్యార్థులు దాదాపు12 లక్షల మంది ఉంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. నాలుగు నెలల పాటు అవకాశం కల్పించినా, సగం మంది విద్యార్థులు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేదు. దీంతో దరఖాస్తు గడువును మార్చి 31వరకు పొడిగిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా ఏడు నెలల పాటు అవకాశం కల్పించినా, 10.3 లక్షల మంది మాత్రమే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా 1.7లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదని సంక్షేమశాఖలు గుర్తించాయి. కాలేజీ యాజమాన్యాల నుంచి సేకరించిన సమాచారం అధారంగా ఆయా విద్యార్థులకు దరఖాస్తు చేసుకునేందుకు మరో రెండు నెలలు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మే 31వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాల యాజమాన్యాల ఉదాసీనత పోస్టుమెట్రిక్ విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తు చేసుకోవడంలో కళాశాల యాజమాన్యాల బాధ్యత కీలకం. విద్యార్థుల దరఖాస్తులను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రత్యేకంగా కాలేజీలో ఒక వ్యక్తిని నియమించి ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేయించాలి. ఈ మేరకు సంక్షేమ శాఖలు కాలేజీలకు ఆదేశాలు జారీ చేశాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నా, ప్రైవేట్ కాలేజీలు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. విద్యార్థులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వారంతా దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని సంక్షేమశాఖ అధికారులు తాజాగా కాలేజీ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.దరఖాస్తు ప్రక్రియలో జాప్యం జరుగుతుండడంతో వాటి పరిశీలన సైతం ఆలస్యమవుతోందని సంక్షేమ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తయితే కాలేజీల వారీగా పరిశీలన ప్రారంభించి వేగవంతంగా మంజూరు చేయవచ్చని సంక్షేమ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో నెలకొన్న జాప్యంతో ముందుకు సాగని పరిస్థితి నెలకొందని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. మరోవైపు వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో వారికోసమైనా గడువును పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. -
ఉగాది తర్వాత ఏఐ సిటీకి శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: ఉగాది తర్వాత ఏఐ సిటీ నిర్మాణానికి మహేశ్వరంలో భూమిపూజ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు చెప్పా రు. మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌లో శుక్రవారం క్లియర్‌టెల్లిజెన్స్ ఇండియా డెలివరీ అండ్ ఆపరేషన్స్ కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భావితరాల అవసరాలకు అనుగుణంగా, సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలోనే 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మిస్తున్నట్లు వివరించారు.అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ సిటీ నిర్మితం అవుతుందని.. ఈ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్ప టికే టెక్ దిగ్గజ సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయని మంత్రి తెలిపారు. ఏఐ, డేటా ఇంజనీరింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సొల్యూషన్స్ తదితర రంగాల్లో సేవలు అందించే క్లియర్ టెల్లిజెన్స్ సంస్థ తమ భారత శాఖను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడంపై శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో క్లియర్ టెల్లిజెన్స్ సీఈఓ ఓవెన్ ఫ్రివోడ్, మేనేజింగ్ పార్ట్నర్ అనిల్ భరాడ్వా, డైరెక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు. -
జేఈఈ మెయిన్స్ తేదీల్లో మార్పులు?
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్–2 పరీక్ష తేదీలు మారే అవకాశం కన్పిస్తోంది. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. వాస్తవానికి ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో రెండో విడత జేఈఈ మెయిన్స్ జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులను శనివారం విడుదల చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది. అయితే ఇదే రోజు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరీక్ష ఉంటుంది. సీబీఎస్ఈ ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. దీని ప్రకారం ఏప్రిల్ 2న లాంగ్వేజెస్, 3న హోం సైన్స్, 4న ఫిజియాలజీ ఉంటుంది.సీబీఎస్ఈ పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగుతుంది. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరో షిఫ్ట్ సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుంది.దీంతో సీబీఎస్ఈ పరీక్ష రాసే విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌కు హాజరయ్యే అవకాశం లేకుండా పోతుంది. లేదా మెయిన్స్ రాసే విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షను వదిలేయాల్సి ఉంటుంది. పలువురు విద్యార్థులు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శుక్రవారం ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ అధికారులు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పరీక్ష మార్పు లేదా ప్రత్యామ్నాయాలపై నిర్ణయం ప్రకటించాలని కేంద్రం ఎన్టీఏకి సూచించింది. -
టీచర్లకు ‘ప్రవేశ’ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: సమ్మర్లో సర్కారీ టీచర్లకు సరికొత్త పరీక్ష ఉండనుంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించే పోటీని ప్రభుత్వం పెట్టబోతోంది. ఇందుకు సంబంధించి విధానపరమైన నిర్ణయం ఇప్పటికే జరిగింది. ఇందులో భాగంగా ప్రతి టీచర్‌కూ విద్యార్థులను చేర్పించేందుకు టార్గెట్ పెడతారు. ఈ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ సాధించి తీరాల్సి ఉంటుంది. ఎక్కువ మందిని చేర్పించిన వారికి పాయింట్స్ ఇస్తారు. ఇవి వారి సర్విస్ రికార్డులోకి ఎక్కుతాయి. పదోన్నతులు, బదిలీల సమయంలో వీటిని ఒక ప్రామాణికంగా తీసుకుంటారు.ఇక విద్యార్థుల కోసం క్షేత్రస్థాయికి వెళ్ళే టీచర్లకు వివిధ స్థాయిల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వేసవి శిబిరాలు కూడా నిర్వహించనున్నారు. ఊరూరా ప్రచా రం చేపట్టాలని కూడా నిర్ణయించారు. వీటన్నింటికీ సిద్ధమవ్వాలని జిల్లా అధికారులకు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఏటా వేసవిలో బడిబాట కార్యక్రమం చేపడుతున్నా..మొక్కుబడిగానే సాగు తోంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల చేరికలు పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎందుకు తగ్గుతున్నారు? ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరికలు రానురాను తగ్గుతున్నాయి. 2022–23లో 28.80 లక్షలు చేరితే, 2024–25 నాటికి ఈ సంఖ్య 25.13 లక్షలకు తగ్గింది. అంటే 3.5 లక్షలకు పైగా విద్యార్థులు తగ్గిపోయారన్న మాట. మరోవైపు ప్రైవేటు స్కూళ్ళలో ప్రవేశాలు పెరుగుతున్నాయి. 22–23లో 30.17 లక్షల మంది ఉంటే, 24–25లో ఈ సంఖ్య 37 లక్షలకు చేరింది. అంటే దాదాపుగా 7 లక్షలు పెరిగారు. ఈ పరిస్థితిపై విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిది. దీనిపై ముఖ్యమంత్రి అధికారులతో ఇటీవల సమీక్షించారు. మరోవైపు రాష్ట్ర విద్యా కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిది.ప్రభుత్వ బడులపై విశ్వాసం పెంచేలా చర్యలు చేపట్టాలని సిఫారసు చేసింది. ఇందులో టీచర్లూ కీలక పాత్ర పోషించేలా చూడాలని సూచించింది. ఇంకోవైపు ‘ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.80 వేలు ఖర్చు చేస్తోంది. మౌలిక వసతులూ కల్పిస్తున్నాం. ప్రైవేటు కన్నా, ప్రభుత్వ స్కూళ్ళలోనే అర్హత గల టీచర్లున్నారు. అయినా పిల్లలెందుకు చేరడం లేదు?’అని సీఎం అనేకసార్లు విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల చేరికలను విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలో పిల్లల చేరికలు పెరిగేలా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. -
ఆ పెన్ను, పేపర్ నాటితే మొక్క
పరిచయ కార్యక్రమంతో అంకురార్పణ కొద్దిరోజుల క్రితం నగరంలో ప్రపంచ సుందరి పోటీల పరిచయ కార్యక్రమం జరిగింది. మిస్ వరల్డ్ సంస్థ చైర్మన్, సీఈఓ జూలియా మోర్లేతోపాటు 2024 ప్రపంచ సుందరి క్రిస్టీనా పిస్కోవాల బృందం నగరానికి వచి్చంది. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల పరిచయ కార్యక్రమంలో పర్యావరణ అనుకూల, మట్టిలో నాటే నోట్ ప్యాడ్, పెన్నులు అందించారు.ఇలా నాటాలి..నోట్ ప్యాడ్ అట్ట భాగాల్లో బంతి గింజలు చేర్చారు. వాడేసిన తర్వాత ఆ కాగితాన్ని నీటిలో తడిపి ముద్ద చేసి మట్టిలో కప్పేయాలి. నీళ్లు పోస్తుంటే ఆ ప్రాంతంలో బంతి మొక్కలు పెరుగుతాయి. పెన్ను చివరి భాగంలో మొక్కజొన్న గుజ్జుతో రూపొందించిన ప్లాస్టిక్ భాగం ఉంటుంది. అందులో టమాటా, బెండ, వంగ, పాలకూర, ఆవాలు లాంటి గింజలు ఉంచుతారు. పెన్ను భాగాన్ని రీసైకిల్డ్ పేపర్ కార్డ్‌తో తయారు చేస్తారు. వినియోగించిన తర్వాత రీఫిల్ తొలగించి పెన్నును మట్టిలో కలిపేస్తే మొక్క చిగురిస్తుంది. మొక్కజొన్న వ్యర్థాలతో రూపొందించిన ప్లాస్టిక్ కావటంతో అది నిమిషాల్లోనే తడి మట్టిలో కరుగుతుందని తయారీ దారులు పేర్కొంటున్నారు. పర్యావరణానికి ఎంతో మేలు కాగితం, పెన్నుల తయారీలో పర్యావరణ అనుకూల విధానాలను మేం అలవంభిస్తున్నాం. ఇప్పుడు పర్యాటక శాఖకు అలాంటివి మిస్ వరల్డ్ కోసం సరఫరా చేస్తున్నాం. వినియోగించిన కాగితాలను రీసైక్లింగ్‌తో తిరిగి తయారు చేస్తున్నందున, చెట్లను రక్షించినట్టు కావటంతోపాటు, కెమికల్స్ వాడటం, నీళ్లు, విద్యుత్ వినియోగాన్ని నియంత్రించటం సాధ్యమవుతుంది. 8 వేల కాగితాల తయారీకి ఒక చెట్టు కలపను వాడాల్సి వస్తుంది. పునరి్వనియోగంలో చెట్టుతో పనిలేదు. విద్యార్థి ఓ విద్యాసంవత్సరంలో సగటున 80 పెన్నులు వాడతాడు. పర్యావరణ అనుకూల పెన్నుల వినియోగంతో అంతమేర ప్లాస్టిక్‌ను నియంత్రించొచ్చు. ఇక రీసైక్లింగ్‌లో కెమికల్స్ అసవరం ఉండదు. నీళ్లు, కరెంటు వినియోగం బాగా తగ్గుతుంది. టీ–హబ్ కేంద్రంగా మా పరిశోధనలు సాగుతున్నాయి. – అక్షయ్ దేశ్‌పాండే, స్విచ్ ఎకో సంస్థప్రపంచస్థాయి వేడుక ద్వారా మంచి సందేశంప్రపంచస్థాయి పోటీలను వీలైనంతమేర పర్యావరణ అనుకూల పద్ధతుల్లో నిర్వహించాలన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకే పర్యాటక శాఖ కార్యదర్శి స్మితాసబర్వాల్ ఈ తరహా పేపర్, పెన్నుల వినియోగానికి ప్లాన్ చేశారు. దీని ద్వారా ప్రజల్లోకి పర్యావరణ హిత సందేశం చేరుతుందని భావిస్తున్నాం. – మామిడి హరికృష్ణ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ -
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్
సాక్షి,హైదరాబాద్: అర్హత ఆధారంగా ఎంతమందికైనా రేషన్‌కార్డులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త రేషన్ కార్డ్‌లలో చిప్ ఉంటుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. కొత్త రేషన్ కార్డులో క్యూ ఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని, చిప్ ఉండదని స్పష్టం చేశారు.ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీ, రేషన్ లబ్ధి దారులకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంపై ఉత్తమ్ కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘ ఏప్రిల్ 30న తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రాబోతుంది. హుజూర్ నగర నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తున్నాం. తెలంగాణలో 85శాతం జనాభాకు సన్నబియ్యం అందబోతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవడానికి వీలుగా డ్రా సిస్టం అందుబాటులోకి తెస్తున్నాం. ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా అర్హతను ఆధారంగా ఇస్తున్నాం.కొత్తగా ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. కార్డు ఉన్నా లేకున్నా లబ్ధిదారుల లిస్ట్‌లో ఉంటే చాలు ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం ఇస్తాం. తెలంగాణ ఏర్పాటు నాటికి 89లక్షల 73వేల 708 కార్డులు ఉంటే.. గత పదేళ్ళలో 49వేల 479 కొత్త కార్డులు ఇచ్చారు. 90లక్షల రేషన్ కార్డులు. 2.85 కోట్ల లబ్దిదారులు ప్రస్తుతం ఉన్నారు.రూ.10665 కోట్ల నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఖర్చు చేస్తున్నాయి. త్వరలోనే బియ్యంతో పాటు పప్పు, ఉప్పులాంటి వస్తువులు ఇస్తాం. ఉగాది రోజు సీఎం రేవంత్‌రెడ్డి సన్న బియ్యం కార్యక్రమం ప్రారంభిస్తారు. కొత్త రేషన్ కార్డులో క్యూ ఆర్ కోడ్ మాత్రమే ఉంటుంది. చిప్ ఉండదు. రేషన్ కార్డుపై ప్రధాని ఫోటోపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 30లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వం చేయనుంది’అని అన్నారు. -
Vishnu Priya: విష్ణు ప్రియకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తున్నే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో నటి విష్ణు ప్రియాకు (Vishnupriya) భారీ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది.బెట్టింగ్ యాప్స్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ విష్ణు ప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విష్ణు ప్రియకు ముందుస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. విచారణ అధికారి ఎదుట హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖులపై కేసులుబెట్టింగ్ యాప్ వివాదంలో తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ప్రముఖులపై కేసులు నమోదు చేశారు. విచారిస్తున్నారు. వారిలో విష్ణు ప్రియా సైతం ఉన్నారు. అయితే ఈ వివాదంలో నటి విష్ణుప్రియ మార్చి 20 పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.ఈ తరుణంలో విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందుస్తు బెయిల్ కావాలని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఈ రోజు ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఎఫ్ఐఆర్ను రద్దు చేయడానికి మరియు దర్యాప్తును నిలిపివేయడానికి హైకోర్టు తిరస్కరించింది. అదే సమయంలో ఈ కేసులో పోలీసులతో సహకరించాలని విష్ణుప్రియకు హైకోర్టు సూచించింది. చట్టబద్ధంగా దర్యాప్తు కొనసాగించాలని పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
సాక్షి,నాగర్ కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్‌కు దిగారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిని సీనియర్లు వేధించారు. విద్యార్థిపై బెల్ట్‌తో ముగ్గురు సీనియర్ల దాడి చేశారు. అనంతరం బాధితుడి నుంచి ఫోన్ లాక్కున్నారు. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకొని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన బాధిత విద్యార్థి పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
నారాయణ పేట జిల్లాలో విచిత్రం
కోస్గి: ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పిస్తూ అమలుచేస్తున్న ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) గందరగోళంగా మారింది. 336 గజాల ప్లాటుకు ఏకంగా రూ.104 కోట్ల ఎల్ఆర్ఎస్ ఫీజు విధించటంతో సదరు ప్లాటు యజమాని బిక్కమొహం వేశాడు. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం భోగారం (Bogaram) గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి తన ప్లాటు క్రమబద్ధీకరణ (Land Regularisation) కోసం గతంలో రూ.1,000 ఫీజు చెల్లించి వివరాలు నమోదు చేసుకున్నాడు.గురువారం తన ప్లాటుకు సంబంధించిన ఫీజు వివరాలు తెలుసుకునేందుకు కోస్గిలోని ఓ ఆన్లైన్ కేంద్రానికి వెళ్లాడు. అయితే 336.9 గజాల ప్లాటుకు రూ.104,35,19,683 ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని ఆన్లైన్లో చూపడంతో అవాక్కయ్యాడు. ఆన్లైన్లో చూపిన వివరాల మేరకు 336.9 గజాల ప్లాటుకు సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన మార్కెట్ విలువ (Market Value) రూ. 2,21,22,016 కుగాను రెగ్యులరైజ్ చార్జీలు రూ.1,12,676,14 ఉండగా.. 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీ రూ.104.34 కోట్లు చూపించారు. ఈ విషయంపై ఎంపీడీఓ శ్రీధర్‌ను వివరణ కోరగా.. సదరు ప్లాటు యజమాని వివరాలు సేకరించి జిల్లా అధికారులకు పంపించినట్లు తెలిపారు. ఆ ప్లాటుకు తగ్గిన ఎల్ఆర్ఎస్ రుసుము!జడ్చర్ల: జడ్చర్లలోని ఓ ప్లాటుకు ఎల్ఆర్ఎస్ రుసుము రూ.27.33 కోట్లుగా నిర్ణయించటంపై గురువారం మీడియాలో వచ్చిన కథనాలపై మున్సిపల్ అధికారులు స్పందించారు. సంబంధిత దరఖాస్తును మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి పరిశీలించి సరిచేశారు. కిష్టారెడ్డి నగర్‌లోని సర్వే నంబర్ 108లో కె.ఝాన్సీకి చెందిన 200 చదరపు గజాల ప్లాటుకు ఎల్ఆర్ఎస్ ఫీజు (LRS Fee) ఏకంగా రూ.27,33,42,785గా నిర్ణయించిన విషయం విదితమే. ఈ విషయాన్ని మీడియా వెలుగులోకి తేవటంతో అధికారులు తప్పును సరిదిద్దారు. ఆ ప్లాటుకు రూ.30,034లను ఎల్ఆర్ఎస్ ఫీజుగా నిర్ణయించారు. అలాగే తప్పుగా చూపిన ప్లాటు విస్తీర్ణాన్ని కూడా సరిచేశారు.హైదరాబాద్‌లో స్పందన అంతంతే.. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 2020లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారు 1,07,865 మంది కాగా.. వీరిలో ఇప్పటి వరకు కేవలం 5,505 మంది మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీని వినియోగించుకున్నారు. తద్వారా జీహెచ్ఎంసీకి రూ.69.62 కోట్లు సమకూరాయి. మొత్తం దరఖాస్తుదారుల్లో 58,523 మందికి ఆటోమేటిక్‌గా ఫీజు లెటర్స్ జారీ కాగా, వారిలో కేవలం 5,505 మంది మాత్రమే 25 శాతం ఫీజు రాయితీని వినియోగించుకున్నారు. వీరిలో 40 మందికి ప్రొసీడింగ్స్ జారీ అయినట్లు సమాచారం. మరో నాలుగు రోజుల్లో గడువు ముగుస్తుందని, మిగతా వారు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ సూచించింది.చదవండి: సజ్జనార్‌కు మరో కీలక బాధ్యత? -
సజ్జనార్‌కు మరో కీలక బాధ్యత?
సాక్షి, హైదరాబాద్: కేవలం ప్రమోటర్లు, ఇన్ఫ్లూ్యయెన్సర్ల దగ్గరే ఆగకుండా బెట్టింగ్ యాప్స్ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VS Sajjanar) సైతం కీలకపాత్ర పోషించనున్నారని తెలుస్తోంది.సిట్ ఏర్పాటుపై బుధవారం అసెంబ్లీలో ప్రకటన చేయడానికి ముందు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఓ కీలక సమావేశం నిర్వహించారు. శాసనసభ ప్రాంగణంలోని ఆయన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్‌లతోపాటు సజ్జనార్ సైతం పాల్గొన్నారు.కీలక కేసులు పర్యవేక్షించిన అనుభవం సజ్జనార్ సీఐడీ ఎస్పీగా ఉన్నప్పుడు మల్టీ లెవల్ మార్కెటింగ్‌పై పోరు ప్రకటించారు. వివిధ సంస్థల కార్యకలాపాలను బహిర్గతం చేయడంతో పాటు ప్రత్యేక చట్టం రావడానికీ కారణమయ్యారు. → సైబరాబాద్ సీపీగా పనిచేసిన రోజుల్లోనూ అనేక బెట్టింగ్ యాప్స్‌పై కేసులు నమోదు చేయించడంతోపాటు వాటి దర్యాప్తుల్ని పర్యవేక్షించారు. → ఇటీవల ఆయన సోషల్‌మీడియా వేదికగా చేపట్టిన ‘హ్యష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ #SayNoToBettingApps క్యాంపెయినింగ్ వైరల్‌గా మారింది. దీని కారణంగానే ఆయా యాప్స్, సెలబ్రెటీలు, ఇన్‌ఫ్యూయెన్సర్లపై ఫిర్యాదులు, కేసుల నమోదు తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి. → అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి ఏర్పాటు చేసే సిట్‌లో సజ్జనార్‌కు స్థానం కల్పించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. నేరుగా సిట్‌లోకి తీసుకోవడమా? ప్రస్తుతం ఆయనకు ఉన్న బాధ్యతల నేపథ్యంలో సూచనలు, సలహాలతో సిట్ ఏర్పాటు, దర్యాప్తు చేయించడమా? అనేది ఒకట్రెండు రోజుల్లో తేలనుంది.తెలంగాణ సచివాలయ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా యాదగిరి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయ బీసీ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షునిగా టి.శేఖర్, అధ్యక్షునిగా తిరందాస్ యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా దీటి శ్రీకాంత్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా నవీన్‌కుమార్, ఇతర సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లును ఆమోదించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వానికి సంఘీభావంగా నిలుస్తామని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో తమవంతు కృషి చేస్తామని, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని సభ్యులంతా తీర్మానించారు. ఆ రిటైర్డ్ ఉద్యోగులందరూ ఇంటికే: సీఎస్సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలోని వివిధ విభాగాలు, కార్పొరేషన్లు, బోర్డులు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులందరినీ ఈనెల 31లోగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తొలగించాల్సిన వారి జాబితాను ఆయా ప్రభుత్వ శాఖలకు పంపించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shanti Kumari) ఈనెల 25న అన్ని శాఖలకు లేఖ రాశారు. రిటైర్డ్ అయ్యాక పునర్నియామకం లేదా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమితులైన వారందరిని తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు.ఎవరైనా రిటైర్డ్ అధికారులు, ఉద్యోగుల సేవలు ఇంకా అవసరమని భావిస్తే ఎందుకు అవసరమో వివరిస్తూ మళ్లీ తాజాగా నియామకానికి అనుమతులు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పొదుపు చర్యలు భాగంగా రిటైర్డ్ అధికారులను తొలగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ ఉత్తర్వుల మేరకు పురపాలక శాఖలోని పలు డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న దాదాపు 177 మందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చదవండి: 2030.. కండక్టర్ ఉద్యోగానికి ఏఐ!జీహెచ్ఎంసీలో 50 మందిపై వేటు ప్రభుత్వ అధికారం, ఉద్యోగం నుంచి రిటైరయ్యాక సైతం వివిధ పేర్లతో మున్సిపల్ పరిపాలన శాఖలోని వివిధ విభాగాల్లో కొనసాగుతున్న వారిని వెంటనే పంపించాల్సిందిగా తాజాగా వెలువడిన ఉత్తర్వుతో జీహెచ్ఎంసీలోని దాదాపు యాభై మంది ఇక ఇళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. జీహెచ్ఎంసీలో ఇలా కొనసాగుతున్న వారిలో అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ కమిషనర్, డిప్యూటీ సిటీప్లానర్, సూపరింటెండెంట్, ఆర్డీఓ, ఈఈ, సూపరింటెండెంట్ల స్థాయిల నుంచి దిగువ స్థాయిల వరకు ఉన్నారు. వీరు రీ అపాయింట్మెంట్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ల పేరిట తిరిగి జీహెచ్ఎంసీలోనే కొనసాగుతున్నారు.కొందరు కొన్ని ‘కీ’లక స్థానాల్లో ఉండి చక్రం తిప్పుతున్న వారు సైతం ఉన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం మేరకు వారి గడువు 2024లోనే ముగిసిపోవాల్సి ఉండగా, చాలామంది ఇప్పటికీ కొనసాగుతున్నారు. కొందరిని మాత్రం గడువు ముగిసిన వెంటనే ఉండటానికి వీల్లేదంటూ పంపించిన సంబంధిత అధికారులు.. చాలామంది ఇంకా కొనసాగుతున్నా పట్టించుకోలేదు. దీన్ని టాప్ ప్రయారిటీగా పేర్కొంటూ వెంటనే పంపించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయడంతో వీరు ఇక ఇళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. -
‘ప్లీజ్ సార్.. నాకూ అవకాశం ఇవ్వండి’
న్యూఢిల్లీ, సాక్షి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో.. తెలంగాణ రాజకీయం హైదరాబాద్ నుంచి హస్తినకు మారింది. త్వరలో కేబినెట్ విస్తరణ ఉండనున్న నేపథ్యంలో మంత్రి పదవుల కోసం ఆశావహులు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌తో అధిష్టానం చర్చలు పూర్తి చేసినప్పటికీ ‘చివరి అవకాశం’గా భావిస్తున్న కొందరు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో.. మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర రాజకీయాల్లో వాడివేడిగా చర్చ నడుస్తోంది. తెలంగాణ కేబినెట్లో చోటు కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ నడుస్తోంది. ఎలాగైనా మంత్రిపదవిని ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ పెద్దల ఇల్లు, కార్యాలయాల చుట్టూ కొందరు ఎమ్మెల్యేలు పదే పదే చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, బాలు నాయక్ , మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సహా పలువురు నేతలు ఢిల్లీలో మకాం వేసి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు కేబినెట్లో చోటు కల్పించాలని మాధవరెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. డీసీసీ అధ్యక్షుల సమావేశం తర్వాత ఆయన అధిష్టాన పెద్దలను కలుస్తారని సమాచారం. మరోవైపు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ ముసాయిదాపై జరగున్న సమావేశంలో పాల్గొననున్న భట్టి.. జాతీయ నేతలను కలసి మంత్రివర్గంలో తన వారి కోసం ప్రయత్నాలు చేస్తారనే ప్రచారం నడుస్తోంది. మంత్రివర్గంలో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో నాలుగు నుంచి ఐదు భర్తీ చేస్తారని తెలుస్తోంది. అతిత్వరలోనే(ఏప్రిల్ 3వ తేదీ అని ప్రచారం) మంత్రివర్గ విస్తరణ ఉండనుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. -
భవనంపై నుంచి దూకి నవ వధువు ఆత్మహత్య
ముషీరాబాద్: భర్త, అత్తింటి వేధింపులు తాళలేక ఓ నవ వధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్‌పూర్‌లో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భోలక్‌పూర్‌కు చెందిన సౌజన్యకు మూసాపేటకు చెందిన జిమ్ నిర్వాకుడు శబరీష్ యాదవ్‌తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.అయితే, సౌజన్యకు గుండెలో రంధ్రం ఉందని, చెప్పకుండా పెళ్లి చేశారని ఆమె భర్త, అతడి కుటుంబ సభ్యులు సౌజన్యను తరచూ వేధిస్తున్నారు. ఈ విషయం దాచినందుకు అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు. పలుమార్లు ఆమెను పుట్టింటికి పంపారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి అత్తింటికి వెళ్లిన సౌజన్యను తమ ఇంటికి రావొద్దంటూ అక్కడినుంచి వెల్లగొట్టారు.దీంతో మనస్తాపం చెందిన సౌజన్య పుట్టింటికి వచ్చి మూడంతస్తుల భవనం పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికి మృతి చెందినట్లు ముషీరాబాద్ పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి పుష్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మైలార్‌దేవ్‌పల్లిలో దారుణం.. నీళ్ల బకెట్లో వేసి కన్నతల్లే చంపేసింది
మైలార్‌దేవ్‌పల్లి: నీళ్ల బకెట్లో పడి 14 రోజుల పసికందు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే చిన్నారిని తల్లే నీటి బకెట్లో వేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మైలార్దేపల్లి ఇన్స్పెక్టర్ నరేందర్ గురువారం వివరాలు వెల్లడించారు. తమిళనాడు ప్రాంతానికి ముదిలాని మణి, ఆరోగ్య విజ్జి(30) భార్యాభర్తలు అలీనగర్‌లోని ఓ కంపెనీలో పని చేస్తూ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.వీరికి ఒక కుమారుడు, 14 రోజుల కుమార్తె ఉన్నారు. మణికి రెండు కిడ్నీలు పాడైపోవడంతో అతడి చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. దీంతో గత కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో పాప జన్మించడంతో ఆమె పోషణ విషయమై ఆరోగ్య విజ్జి ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న భర్త పనికి వెళ్లిన సమయంలో విజ్జి తన కుమార్తెను బాత్రూమ్లోని నీటి బకెట్లో పడేసి హత్య చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించింది. గురువారం నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
అల్మాస్‌గూడలో హైడ్రా పంజా
● రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ స్టేడియం కూల్చివేత ● మూసిన మూడు రోడ్లు, పార్కు స్థలానికి విముక్తి ● హైడ్రా సీఐపై దాడికి భూ యజమానుల యత్నం బడంగ్పేట్: కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్‌గూడలో హైడ్రా పంజా విసిరింది. రోడ్లను ఆక్రమించి నిర్మించిన బాక్స్ క్రికెట్ స్టేడియాన్ని నేలమట్టం చేసి కాలనీవాసులకు విముక్తి కల్పించింది. వివరాలు ఇలా ఉన్నాయి. అల్మాస్‌గూడలో బోయపల్లి కుటుంబీకులు 1982లో జీపీ లే అవుట్ చేశారు. కాలనీకి బోయపల్లి ఎన్క్లేవ్ అని పేరుపెట్టారు. సర్వే నంబర్ 39,40,41,42,44లో 5.7 ఎకరాల లే అవుట్ ఉండగా అందులో మూడు రోడ్లు, 236 గజాల పార్కు స్థలం చూపించి ప్లాట్లు విక్రయించారు. భూ యజమానులు మూడు లింక్ రోడ్లతో పాటు పార్కు జాగా ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఆక్రమించిన రోడ్ల స్థానంలో బాక్స్ క్రికెట్ స్టేడియం నిర్మించారు. దీనిపై కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల క్రితం హైడ్రా అధికారులు లే అవుట్‌ను పరిశీలించి కబ్జాను నిర్ధారించారు. గురువారం హైడ్రా సీఐ తిరుమలేశ్ నేతృత్వంలో 40 మందికి పైగా సిబ్బంది యంత్రాలతో అక్కడికి చేరుకున్నారు. -
‘ఆర్డర్ల బాధితుడి’కి నగదు రిఫండ్
సాక్షి, సిటీబ్యూరో: నగర వ్యాపారిని ఫోన్ ద్వారా సంప్రదించి, భారీ ఆర్డర్ల పేరుతో ఎర వేసి, మోసం చేసి, రూ.9.5 లక్షలు కాజేసిన కేసులో ఆ మొత్తాన్ని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు రిఫండ్ చేయించారు. దీనికి సంబంధించిన డీడీని అదనపు సీపీ పి.విశ్వప్రసాద్ బుధవారం బాధితుడికి అందజేశారు. ఇంటర్నెట్ ద్వారా నగర వ్యాపారి ఫోన్ నెంబర్ సంగ్రహించిన సైబర్ నేరగాళ్లు ఆయన ఉత్పత్తులకు ఉత్తరాదిలో మార్కెటింగ్ చేస్తామని నమ్మించారు. దీనికోసం తమ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకుని, దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నట్లు నకిలీ ఈ–మెయిల్స్ సృష్టించారు. సరుకు సరఫరాకు ముందు తమకు రూ.9.5 లక్షల చెల్లించాలని చెప్పిన సైబర్ నేరగాళ్లు ఆ మొత్తం తమ ఖాతాల్లో వేయించుకుని మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నమోదైన కేసును ఏసీపీ ఆర్జీ శివమారుతి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ కె.ప్రసాద్‌రావు దర్యాప్తు చేశారు. కీలక నిందితులు అమర్నాథ్ సింగ్, రణ్వీర్ సింగ్‌లను అరెస్టు చేసి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆ ఇద్దరూ బాధితుడి నుంచి కాజేసిన మొత్తం తిరిగి ఇచ్చేందుకు అంగీకరించారు. దీనికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్‌ను పోలీసుల ద్వారా బాధితుడికి అందజేశారు. -
డ్రగ్స్, గంజాయి స్వాధీనం
శ్రీనగర్‌కాలనీ: ఎస్టీఎఫ్ పోలీసులు గురువారం వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎర్రగడ్డ మెట్రోస్టేషన్ సమీపంలో కొందరు యువకులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్టీఎఫ్ బీ టీమ్ సీఐ భిక్షారెడ్డి నేతృత్వంలో దాడి చేసి ఎస్కే అహ్మద్ రహీమ్, మహ్మద్ ఫక్రుద్దీన్ అనే యువకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 2.78 గ్రాముల ఎండిఎంఏ, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సౌదీఅరేబియాకు చెందిన సఫార్, బెంగళూరుకు చెందిన సప్లయర్ ఇబ్రహీం జహీర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ధూల్‌పేటలో.... లోయర్ ధూల్‌పేటలో జుంగూర్ బస్తీలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్టీఎఫ్ బీ టీమ్ ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించి 1.3కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కునాల్‌సింగ్, వినోద్‌సింగ్, హేమబాయిలను అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అనికేష్సింగ్, ఆర్తిబాయి, నరేన్, గణేష్‌సింగ్ పరారీలో ఉన్నారని వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో ఎస్సైలు బాలరాజు, సంద్య, కానిస్టేబుళ్లు యాదగిరి, అనీఫ్, నితిన్, మహేశ్వర్, శ్రీనివాసరెడ్డి, కౌసిక్ పాల్గొన్నారు. -
హైడ్రా సీఐపై దాడికి యత్నం
బాక్స్ క్రికెట్ స్టేడియాన్ని కూల్చివేస్తుండగా భూమికి సంబంధించిన వ్యక్తులు అడ్డుకునే యత్నం చేశారు. హైడ్రా సీఐ తిరుమలేశ్‌తో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో దాడికి యత్నించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అదే రీతిలో సీఐ బదులివ్వడంతో భూ యజమానులు వెనక్కి తగ్గారు. హైడ్రా సిబ్బంది వెంటనే జేసీబీతో క్రికెట్ స్టేడియాన్ని ధ్వంసం చేసి చదును చేశారు. లేఅవుట్లో చూపించిన పార్కు స్థలంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో ఇది పార్కు స్థలం అంటూ బోర్డు పాతించారు. దాడికి యత్నించిన వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు సీఐ తిరుమలేశ్ తెలిపారు. అనంతరం కాలనీవాసులు సీఎం రేవంత్‌రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. -
మెట్రో రెండో దశపై కేంద్రం నజర్
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రెండో దశ ప్రాజెక్టుపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రెండో దశలో ప్రతిపాదించిన మొదటి 5 కారిడార్ల డీపీఆర్‌లపైన సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు అధికారుల బృందం రెండు రోజుల క్రితం ఢిల్లీలో పర్యటించింది. డీపీఆర్లలోని సాంకేతిక అంశాలపైన చర్చలు జరిగినట్లు తెలిసింది. వివిధ మార్గాల్లో చేపట్టనున్న కారిడార్లపై కేంద్ర అధికారులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకే హెచ్ఏంఆర్ఎల్ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. మెట్రో రెండో దశలో ప్రభుత్వం మొదట 76.4 కిలోమీటర్లతో 5 కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 5 కారిడార్లపైన హెచ్‌ఏఎంఆర్‌ఎల్ సమగ్రమైన ప్రాజెక్టు నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రానికి అందజేసింది. కేంద్రం నుంచి ఆమోదం లభిస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. సుమారు రూ.24 వేల కోట్ల అంచనాలతో రెండో దశలో మొదటి 5 కారిడార్లను ప్రతిపాదించారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టు డీపీఆర్‌లలో సాంకేతిక అంశాలపైన చర్చలు సాధారణమైన అంశమేనని, కేంద్ర కేబినెట్ దీనిపైన దృష్టి సారించినప్పుడే కీలకమైన ముందడుగు పడ్డట్లుగా భావించాలని హెచ్‌ఏఎంఆర్‌ఎల్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో నార్త్, ఫ్యూచర్ సిటీల డీపీఆర్‌లు.. మరోవైపు నార్త్‌సిటీలో ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ వరకు ప్రతిపాదించిన రెండు కారిడార్లతో పాటు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌సిటీలోని స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో రెండో దశ ‘బి’ విభాగంలో ప్రతిపాదించిన కారిడార్లకే ఏప్రిల్‌లో డీపీఆర్‌లను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరుకే అందజేయాల్సి ఉండగా ప్రాజెక్టుపైన సర్వేలు, అధ్యయనాల దృష్ట్యా ఏప్రిల్‌లో డీపీఆర్‌లు పూర్తి చేసే అవకాశం ఉంది.‘బి’ విభాగంలో ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, శామీర్‌పేట్ ఓఆర్ఆర్ వరకు 22 కిలోమీటర్లు, ఫ్యూచర్‌సిటీ కారిడార్ 41 కిలోమీటర్ల చొప్పున నిర్మించనున్న సంగతి తెలిసిందే. రెండో దశలో రెండు విభాగాలుగా మొత్తం 8 కారిడార్లలో 190.4 కిలోమీటర్ల వరకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. డీపీఆర్‌లపై స్పష్టత ఢిల్లీలో ఎన్వీఎస్ రెడ్డి పర్యటన సాంకేతిక అంశాలపై అధికారులతో చర్చలు రెండోదశ మొదటి 5 కారిడార్లలో 76.4 కిలోమీటర్లు నార్త్, ఫ్యూచర్సిటీలపై వచ్చే నెలలో డీపీఆర్‌లు -
జీహెచ్ఎంసీలో 50 మందిపై వేటు
రిటైరయ్యాక కొనసాగుతున్న అధికారులు ఇక ఇళ్లకే సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ అధికారం, ఉద్యోగం నుంచి రిటైరయ్యాక సైతం వివిధ పేర్లతో మున్సిపల్ పరిపాలన శాఖలోని వివిధ విభాగాల్లో కొనసాగుతున్న వారిని వెంటనే పంపించాల్సిందిగా తాజాగా వెలువడిన ఉత్తర్వుతో జీహెచ్ఎంసీలోని దాదాపు యాభై మంది ఇక ఇళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. జీహెచ్ఎంసీలో ఇలా కొనసాగుతున్న వారిలో అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ కమిషనర్, డిప్యూటీ సిటీప్లానర్, సూపరింటెండెంట్, ఆర్డీఓ, ఈఈ, సూపరింటెండెంట్ల స్థాయిల నుంచి దిగువ స్థాయిల వరకు ఉన్నారు. వీరు రీ అపాయింట్మెంట్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ల పేరిట తిరిగి జీహెచ్ఎంసీలోనే కొనసాగుతున్నారు. కొందరు కొన్ని ‘కీ’లక స్థానాల్లో ఉండి చక్రం తిప్పుతున్న వారు సైతం ఉన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం మేరకు వారి గడువు 2024లోనే ముగిసిపోవాల్సి ఉండగా, చాలామంది ఇప్పటికీ కొనసాగుతున్నారు. కొందరిని మాత్రం గడువు ముగిసిన వెంటనే ఉండటానికి వీల్లేదంటూ పంపించిన సంబంధిత అధికారులు.. చాలామంది ఇంకా కొనసాగుతున్నా పట్టించుకోలేదు. దీన్ని టాప్ ప్రయారిటీగా పేర్కొంటూ వెంటనే పంపించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయడంతో వీరు ఇక ఇళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. 30న ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణం నిజాంపేట్: బాచుపల్లి, క్రాంతినగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖ మీడియా సంస్థ ‘సాక్షి’ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్లు సాక్షి– ఉగాది పంచాంగ శ్రవణం కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గురువారం వారు మాట్లాడుతూ ఈ నెల 30న బాచుపల్లి, క్రాంతినగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రఖ్యాత నర్తకి యామినిరెడ్డి బృందం కళాత్మక కూచిపూడి నృత్యం, సిద్ధాంతి చక్రవర్తులు శ్రీవత్స్యాచార్యుల పంచాంగ పఠనం, ఆధ్యాత్మిక ప్రసంగాలు, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రముఖ సంస్థ భారతీ సిమెంట్స్ ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. -
24 గంటల్లో వాటర్ ట్యాంకర్ల డెలివరీ
సాక్షి,సిటీబ్యూరో: వాటర్ ట్యాంకర్లను పెండెన్సీ లేకుండా 24 గంటల్లో డెలివరీ చేసేలా చర్యలు తీసుకున్నట్లు జలమండలి ఒక ప్రకటనలో వెల్లడించింది. వాటర్ ట్యాంకర్ల పెండెన్సీపై ‘సాక్షి’ లో గురువారం ప్రచురితమైన ‘‘ట్యాంకర్.. ఫికర్!’’ కథనంపై స్పందించిన జలమండలి వివరణ ఇచ్చింది. ఈ నెల 25,26 తేదీల్లో బుకింగ్ జరిగిన ట్యాంకర్లను ఎలాంటి పెండెన్సీ లేకుండా 24 పని గంటల్లోనే క్లియర్ చేసినట్లు పేర్కొంది. మొత్తం ఫిల్లింగ్ స్టేషన్లలో రోజువారీగా సగటున 9049 నుంచి 9080 వరకు ట్యాంకర్ల బుకింగ్ జరుగుతుందని, అందులో 86 నుంచి 112 వరకు బుకింగ్ లు మాత్రమే వివిధ కారణాలతో పెండింగ్ పడుతున్నట్లు తెలిపింది. ట్యాంకర్ల డిమాండ్ దృష్ట్యా డెలివరీలను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పసికందును కన్నతల్లే చంపేసింది మైలార్‌దేవ్‌పల్లి: నీళ్ల బకెట్లో పడి 14 రోజుల పసికందు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే చిన్నారిని తల్లే నీటి బకెట్లో వేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మైలార్దేపల్లి ఇన్స్పెక్టర్ నరేందర్ గురువారం వివరాలు వెల్లడించారు. తమిళనాడు ప్రాంతానికి ముదిలాని మణి, ఆరోగ్య విజ్జి(30) భార్యాభర్తలు అలీనగర్‌లోని ఓ కంపెనీలో పని చేస్తూ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు, 14 రోజుల కుమార్తె ఉన్నారు. మణికి రెండు కిడ్నీలు పాడైపోవడంతో అతడి చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. దీంతో గత కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో పాప జన్మించడంతో ఆమె పోషణ విషయమై ఆరోగ్య విజ్జి ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న భర్త పనికి వెళ్లిన సమయంలో విజ్జి తన కుమార్తెను బాత్రూమ్లోని నీటి బకెట్లో పడేసి హత్య చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించింది. గురువారం నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఓపెన్‌టాప్ జీపులో వెళ్తూ పిస్టల్ తిప్పుతూ.. న్యూసెన్స్‌కు పాల్పడిన యువకులపై కేసు నమోదు బంజారాహిల్స్: ఓపెన్ టాప్ జీపులో వెళుతూ.. గాలిలో పిస్టల్ తిప్పుతూ న్యూసెన్స్‌కు పాల్పడిన యువకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్డునెంబర్–1లోని సెర్వి హోటల్ సమీపంలో కొందరు యువకులు నెంబర్ ప్లేట్ లేని ఓపెన్ టాప్ జీపులో వెళ్తున్నారు. వాహనాన్ని నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వెళ్లడంతో పాటు ఓ యువకుడు పిస్టల్‌ను గాలిలో తిప్పుతూ వెళ్తున్నాడు. ఇన్‌స్ట్రాగాంలో ఈ వీడియో వైరల్ అయ్యింది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ బ్లూ కోల్ట్ కానిస్టేబుల్ శ్రీకాంత్ అధికార ట్యాబ్‌లో ఈ వీడియోతో కూడిన ఇన్‌స్ట్రాగాం లింక్‌ను గమనించాడు. దీనిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయుధాల చట్టం ఉల్లంఘించి పిస్టల్‌ను గాలిలో తిప్పుతూ ప్రజలకు భయభ్రాంతులకు గురిచేశారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భవనం పైనుంచి దూకి నవ వధువు ఆత్మహత్య ముషీరాబాద్: భర్త, అత్తింటి వేధింపులు తాళలేక ఓ నవ వధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్ పూర్ లో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భోలక్‌పూర్‌కు చెందిన సౌజన్యకు మూసాపేటకు చెందిన జిమ్ నిర్వాకుడు శబరీష్ యాదవ్‌తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే సౌజన్యకు గుండెలో రంధ్రం ఉందని, చెప్పకుండా పెళ్లి చేశారని ఆమె భర్త, అతడి కుటుంబ సభ్యులు సౌజన్యను తరచూ వేధిస్తున్నారు. ఈ విషయం దాచినందుకు అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు. పలుమార్లు ఆమెను పుట్టింటికి పంపారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి అత్తింటికి వెళ్లిన సౌజన్యను తమ ఇంటికి రావొద్దంటూ అక్కడినుంచి వెల్లగొట్టారు. దీంతో మనస్తాపం చెందిన సౌజన్య పుట్టింటికి వచ్చి మూడంతస్తుల భవనం పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికి మృతి చెందినట్లు ముషీరాబాద్ పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి పుష్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని మహిళ దారుణ హత్య సనత్‌నగర్: గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లగొండకు చెందిన నాగరాజు బతుకు దెరువు నిమిత్తం కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చాడు. అయితే భార్యతో గొడవల కారణంగా ఆమెను వదిలేసి ఒక్కడే ఉంటున్నాడు. కూలీగా పని చేస్తూ ఫుట్‌పాత్‌లపై నిద్రించేవాడు. ఈ నేపథ్యంలో అతడికి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పరిసరాల్లో భిక్షాటన చేసుకునే మహిళతో పరిచయం ఏర్పడింది. బుధవారం రాత్రి ఇద్దరూ కలిసి భరత్‌నగర్ బ్రిడ్జి కిందికి వెళ్లి ఏకాంతంగా గడిపారు. అనంతరం నాగరాజు ఆమెను తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. దీనిపై సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సనత్‌నగర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు నాగరాజును అరెస్టు చేశారు. అయితే మృతురాలి వివరాలు తెలియరాలేదు. ఆమె సంబంధీకులు ఎవరైనా ఉంటే సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఇన్స్పెక్టర్ తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ లైన్.. ఫైన్!
ఓహెచ్ లైన్ల స్థానంలో ఇక యూజీ కేబుళ్లు జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ నెట్వర్క్ ఇలా.. 33/11కేవీ సబ్స్టేషన్లు 498 33కేవీ యూజీ కేబుల్ 1,280 కి.మీ 33కేవీ ఓవర్‌హెడ్ లైన్స్ 3,725 కి.మీ 11 కేవీ ఓవర్‌హెడ్ లైన్స్ 21,643 కి.మీ పవర్ ట్రాన్స్ఫార్మర్లు 1,022 11కేవీ యూజీ కేబుల్ 957 డీటీఆర్లు 1,50,992 ఇంటర్మీడియట్ స్తంభాలు 58,271 ● ఆసక్తిగల ఏజెన్సీల నుంచి డీపీఆర్‌ల ఆహ్వానం ● గ్రేటర్లో 900 కిలోమీటర్ల ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్లు ● అండర్ గ్రౌండ్ కేబుల్స్‌కు రూ.520 కోట్లు అవసరం ● డిస్కంకు నేడు డీపీఆర్‌లు సమర్పించనున్న ఏజెన్సీలు సాక్షి, సిటీబ్యూరో: ఇళ్లపై వేలాడుతూ ప్రమాదకరంగా మారిన ఓవర్‌హెడ్ (ఓహెచ్) విద్యుత్ లైన్ల స్థానంలో అండర్ గ్రౌండ్ (యూజీ) కేబుల్స్ వేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు డిలైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను తయారు చేసి సమర్పించాల్సిందిగా కోరుతూ డిస్కం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఆరు ప్రముఖ అధ్యయన సంస్థలు ఇందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. 900 కిలోమీటర్ల ఓహెచ్ లైన్ల స్థానంలో యూజీ కేబుళ్లును వేసేందుకు రూ.520 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు అంచనా. ఆయా ఏజెన్సీలు రూపొందించిన నివేదికను శుక్రవారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు సమర్పించనున్నాయి. ఓవర్‌హెడ్ లైన్ రహిత నగరంగా.. ● గ్రేటర్లో ప్రస్తుతం 60 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 52 లక్షలకుపైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిరోజూ గరిష్ట విద్యుత్ డిమాండ్ 60 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. వచ్చే వేసవిలో విద్యుత్ డిమాండ్ 100 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం లేకపోలేదు. పాతబస్తీ సహా ప్రధాన బస్తీల్లో ఇప్పటికీ నిజాం కాలం నాటి ఓవర్‌హెడ్ లైన్లు, ఇనుప స్తంభాలే దర్శనమిస్తున్నాయి. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ లైన్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ● చిన్నపాటి ఈదురుగాలితో కూడిన వర్షానికే తెగిపడుతున్నాయి. విద్యుత్ అంతరాయాలతో పాటు అనేక మంది మృత్యువాతకు కారణమవుతున్నాయి. లైన్ల కింద అనేక చోట్ల భారీ భవంతులు వెలిశాయి. ఇంటిపై దుస్తులను ఆరవేసేందుకు వెళ్లిన మహిళలు, పతంగ్‌లను ఎగరేసేందుకు వెళ్లిన పిల్లలు ఓవర్‌హెడ్ లైన్‌కు ఆనుకుని విద్యుత్ షాక్‌తో మృతి చెందుతున్న ఘటనలు సైతం విదితమే. ఓవర్‌హెడ్ లైన్ల స్థానంలో యూజీ కేబుళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించడంతో పాటు విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపర్చవచ్చని డిస్కం భావిస్తోంది. హైదరాబాద్‌ను ఓవర్‌హెడ్ లైన్ రహిత నగరంగా అంతర్జాతీయ పటంలో చూపింవచ్చని యోచిస్తోంది. ప్రాధాన్య క్రమంలో పనులు.. ● హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ప్రమాదకరంగా మారిన బహిరంగ విద్యుత్లైన్ల (ఓవర్‌హెడ్)ను తొలగించి, వాటిస్థానంలో అండర్ గ్రౌండ్ (యూజీ) కేబుళ్లను వేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇప్పటికే సుమారు 900 కిలోమీటర్ల ఓవర్ హెడ్ (ఓహెచ్) లైన్లు ఉన్నట్లు గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ కేబుళ్ల ఏర్పాటుకు రూ.520 కోట్లకు పైగా ఖర్చు కానుందని అంచనా వేసింది. డీపీఆర్ సమర్పించిన ఏజెన్సీలకే పనులను అప్పగించాలని యోచిస్తోంది. ● గ్రేటర్ మొత్తంగా ఒకే సమయంలో కాకుండా ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టనున్నట్లు రెండు రోజుల క్రితం అసెంబ్లీలో విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించడం తెలిసిందే. పేదలు ఎక్కువగా నివసించే నందినగర్, వారాసిగూడ, రాంనగర్, చిలకలగూడ, ఎన్టీఆర్ నగర్, ఇందిరా పార్కు, అశోక్‌నగర్, పద్మారావునగర్, గాంధీనగర్, ఖైరతాబాద్, నాంపల్లి, రాజేంద్రనగర్, బోరబండ, శ్రీరామ్‌నగర్, లెనిన్‌నగర్, మన్సూరాబాద్, నాగోలు, అడ్డగుట్ట, మెహిదీపట్నం, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారిన లైన్లను మార్చే అవకాశం ఉంది. -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ
దుండిగల్: విద్యుత్ కేబుల్ లైన్ మార్చడానికి లంచం డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఏఈని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధిలోని డీపోచంపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న సురేందర్‌రెడ్డి 11కేవీ విద్యుత్ లైన్ మార్చడానికి, ఓ భవనానికి కేబుల్ లైన్ వేయడానికి సదరు భవన యజమాని నుంచి రూ.30 వేలు డిమాండ్ చేశాడు. ఈ విషయమై సదరు భవన యజమాని ఏసీబీ అధికారులను సంప్రదించారు. అధికారులు సూచించిన విధంగా గురువారం ఏఈ సుందర్‌రెడ్డికి ఆయన కార్యాలయంలో నగదు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. -
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల లొల్లి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పీజీ విద్యార్థులకు సంబంధించి అదనపు ఫీజుల లొల్లి నడుస్తోంది. ఫీజులు చెల్లించిన విద్యార్థులనే తరగతులు, వైద్యసేవలకు అనుమతిస్తామని కాలేజీ యాజమాన్యాలు తేల్చిచెబుతున్నాయి. సాధారణంగా పీజీ వైద్య విద్యార్థులకు తరగతి గదిలో కంటే ఓపీ(అవుట్ పేషెంట్), ఐపీ(ఇన్ పేషెంట్) విభాగాల్లోనే ఎక్కువగా విధులుంటాయి. 60 శాతం ఫీజులు చెల్లించినా... ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పీజీ వైద్య విద్యార్థులకు వేర్వేరుగా ఫీజులున్నాయి. మూడేళ్ల క్రితం ఫీజుల పెంపుతో కేటగిరీ‘ఏ’లో సీటు సాధించిన విద్యార్థి రూ.7 లక్షలు, , కేటగిరీ ‘బి’లో సీటు సాధించిన విద్యార్థి రూ.24 లక్షల చొప్పున ఫీజులను ఖరారు చేశారు. అయితే ఆ ఫీజుల పెంపును సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలనుసారం కేటగిరీ‘ఏ’విద్యార్థులు 60 శాతం చొప్పున, కేటగిరీ ‘బి’విద్యార్థులు 70 శాతం చొప్పున ఫీజులు చెల్లిస్తున్నారు. తాజాగా న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల గడువు ముగిసిన నేపథ్యంలో పూర్తిస్థాయి ఫీజులు చెల్లించాలని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. హాజరు లేదు... డ్యూటీలు లేవు... అదనపు ఫీజులు చెల్లించని పీజీ వైద్య విద్యార్థులను పలు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు తరగతులకు అను మతించడం లేదు. సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని ప్రైవేటు మెడికల్ కాలేజీలు రెండో సంవత్సరం పీజీ చదువుతున్న వైద్య విద్యార్థులకు ఈనెల 15వ తేదీ నుంచి డ్యూటీలు రద్దు చేశారు. తాజాగా ఆయా విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు సైతం స్వీకరించడం లేదు. మరోవైపు తరగతులకు సైతం హాజరు కావొద్దని స్పష్టం చేయడంతో ఆయా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఫీజు నిధులు ఇవ్వకపోవడంతో... కన్వీనర్ కోటాలో సీటు సాధించిన పీజీ వైద్య విద్యార్థికి ఏటా రూ.3.5 లక్షల వరకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుండగా, బీసీలకు మాత్రం సీలింగ్ పద్ధతిలో రూ.3.5లక్షలు చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తుంది. ప్రస్తుతం పీజీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫస్టియర్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటికీ విడుదల కాలేదు. దీంతో కాలేజీ యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని, ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత తిరిగి చెక్కుల రూపంలో వెనక్కి తీసుకోవాలని విద్యార్థులకు చెబుతున్నాయి. -
ముందే ప్లానేద్దాం.. సమ్మర్లో టూరేద్దాం!
సాక్షి, హైదరాబాద్: సమ్మర్ వెకేషన్‌కు ఇప్పటినుంచే మనవారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏటేటా పెరుగుతున్న పర్యాటకుల డిమాండ్‌కు తగ్గట్టుగానే...దేశవ్యాప్తంగా హోటళ్లు (హోటల్ రూమ్‌లు), ఇతర ప్రత్యామ్నాయ విడిదుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ వేసవిలో వివాహాలకు కూడా ముహూర్తాలు ఉండటంతో హోటళ్లకు కూడా డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోల్చితే ఇప్పటికే లగ్జరీ, మిడ్–స్కేల్, బడ్జెట్ సెగ్మెంట్లలో హోటల్ గదుల రేట్లు 10 నుంచి 12 శాతం పెరిగినట్టుగా ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ వర్గాలు చెబుతున్నాయి. తమతమ కుటుంబ బడ్జెట్, వేసవి విడిదులకు సంబంధించి ఖర్చు చేయగలిగే స్తోమతను బట్టి దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలు, విదేశాల్లోని ప్రముఖ సందర్శన ప్రదేశాలు, మరికొందరు వీసా ఫ్రీ దేశాల్లో వేసవి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. కశ్మీర్, గోవా, హిమాచల్, కేరళలకు వెళ్లేందుకు క్రేజ్ దేశీయంగా చూస్తే.. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, గోవా, రాజస్తాన్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాలు వేసవి సెలవులకు గమ్యస్థానాలుగా అగ్రభాగాన నిలుస్తున్నాయి. వీటితోపాటు హిల్‌స్టేషన్లుగా పేరుగాంచిన ముస్సోరి, మనాలి, రుషికేశ్ తదితర ప్రాంతాల్లోని హోటళ్ల గదులకు డిమాండ్ అత్యధికంగా ఉన్నట్టుగా వెల్లడైంది. కూర్గ్, మహబలేశ్వర్ వంటి టూరిస్ట్ డెస్టినేషన్లకు కూడా క్రమంగా పర్యాటకులు పెరుగుతున్నట్టుగా వివిధ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యేకంగా మహబలేశ్వర్‌లోని బీచ్‌కు ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నట్టుగా తెలుస్తోంది. ఉదయ్‌పూర్, జైపూర్లు కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనుకబడి లేవు. రుషికేశ్, కాసోల్, హంపి, ముక్తేశ్వర్ వంటి పర్యాటక ప్రదేశాల్లో హాస్టళ్లకు డిమాండ్ పెరుగుతున్నట్టుగా జో వరల్డ్ సంస్థ వెల్లడించింది. టాప్ ఇంటర్నేషనల్ సమ్మర్ డెస్టినేషన్స్ ఇవే.. ఇంటర్నేషనల్ సమ్మర్ డెస్టినేషన్స్‌గా స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, హంగేరీ, ఆ్రస్టియా, చెక్ రిపబ్లిక్, ఇతర ఐరోపా దేశాలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. వీటితోపాటు దుబాయ్, ఈజిప్ట్, జపాన్, సింగపూర్, వియత్నాం, ఇండోనేసియాలకు ఏటా డిమాండ్ పెరుగుతోందని అట్లీస్ సంస్థ వెల్లడించింది. ఇక ఈ వేసవి సీజన్లో యూఏఈ, యూఎస్ఏలకు అత్యధికంగా బుక్సింగ్ జరిగినట్టు ఈ సంస్థ తెలిపింది. ఈ దేశాల్లో పర్యటించేందుకు ముందుగానే పర్యాటకులు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా ఆ సంస్థ అంచనా వేసింది. అంటార్కిటికాలో ఐస్‌బ్రేకర్ క్రూయిజ్‌లు, ఫిన్లాండ్లో నార్తర్న్ లైట్స్ అనుభవాలు, గాజు గోపుర ఇగ్లూలు, ఆర్కిటిక్ సూట్లు మరియు ఆర్కిటిక్ ట్రీహౌస్‌లలో బస వంటి ప్రీమియం అనుభవాలను కూడా ప్రయాణికులు కోరుకుంటున్నారు. సౌత్ ఆఫ్రికా వైన్‌యార్డ్‌లలో కన్వర్టిబుల్ కార్లు లేదా హార్లే–డేవిడ్‌సన్‌లతో సెల్ఫ్–డ్రైవ్ సాహసాలు కూడా ప్రజాదరణ పొందుతున్నాయి.తొలిసారి విదేశీ పర్యటనలకు వెళుతున్న వారిలో ఎక్కువగా కాంబోడియా, శ్రీలంక, అజర్‌బైజాన్‌లను ఇష్టపడుతున్నారు. ఈ దేశాల సందర్శనకు సులభంగా వీసా ప్రక్రియ ఉండటంతోపాటు ఆయా సమ్మర్ ట్రిప్‌లకు అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉండడమే అందుకు కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీసా అవసరం లేని ప్రాంతాలకు ఆదరణ... ఇక వీసా అవసరం లేని వివిధ పర్యాటక దేశాలు భారత టూరిస్ట్‌లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే వీసా ఫ్రీ దేశాలు అయిన నేపాల్, భూటాన్, థాయ్‌లాండ్, మాల్దీవులు, మారిషస్ వంటి వాటికి భారత్ టూరిస్టుల నుంచి భారీగా డిమాండ్ పెరిగినట్టు హాలిడే, టూరిజం నిర్వాహకులు చెబుతున్నారు. ఈ దేశాలు వీసా రహిత సులభ ప్రవేశ కారణంగా గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయి. ఎస్ఓటీసీ ట్రావెల్ హాలిడేస్, కార్పొరేట్ టూర్స్ విభాగం నివేదిక ప్రకారం.. వీసా రహిత గమ్యస్థానాలు ప్రయాణికులకు ఖర్చులను ఆదా చేసే అవకాశాన్ని అందిస్తున్నాయని, దీనిని వారు లగ్జరీ అనుభవాల కోసం ఉపయోగిస్తున్నారని పేర్కొంది. ఉదాహరణకు థాయ్‌లాండ్‌లో ముయే థాయ్ (కిక్‌బాక్సింగ్) నేర్చుకోవడం, లగ్జరీ రిసార్ట్‌లలో డిటాక్స్ కార్యక్రమాలు, మారిషస్‌లో స్నార్కెలింగ్ లేదా మాల్దీవ్స్‌లో మిషెలిన్–స్టార్ అండర్‌వాటర్ డైనింగ్ వంటివి ఉన్నాయి. అదే సమయంలో ఫినామినన్–ఆధారిత ప్రయాణం ఒక కీలక ధోరణిగా ఉద్భవించిందని ఈ నివేదిక తెలిపింది. -
2030.. కండక్టర్ ఉద్యోగానికీ ఏఐ!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వేదిక ఇటీవల విడుదల చేసిన ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్–2025’ఉద్యోగాలకు సంబంధించి పలు ఆసక్తికరమైన వివరాలు వెల్లడించింది. కిందిస్థాయి ఉద్యోగాల్లోకి సైతం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చొరబడుతోందని, ఫలితంగా 2030 నాటికి కొన్ని రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయని, మరికొన్ని రంగాల్లో ఉద్యోగాలు క్రమంగా కనుమరుగయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 2030 నాటికి బస్ కండక్టర్ వంటి ఉద్యోగానికి కూడా ఏఐ టెక్నాలజీ తెలుసుకుని ఉండటం అవసరమని, ఆఖరుకు వ్యవసాయం చేసే వాళ్ళకూ ఏఐ టెక్నాలజీ అవసరం ఏర్పడుతుందని ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ (ఉద్యోగాల భవిష్యత్తు) రిపోర్టు పేర్కొంది. జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచాలని, విద్యార్థుల్లో ఆ మేరకు నైపుణ్యం పెంచాలని సూచించింది. 2023లో సేకరించిన లెక్కల ప్రకారం భారత్‌లో 4.16 లక్షల మంది మాత్రమే ఏఐ నిపుణులు ఉన్నారు. కాగా 2025 చివరి నాటికి 6.29 లక్షలు 2026 నాటికి 10 లక్షల ఏఐ నిపుణులు అవసరమని పేర్కొంది. ఈ మేరకు కంప్యూటర్ కోర్సుల్లో సిలబస్‌ను మార్చాలని ఏఐ ఆధారిత పరిశ్రమల తోడ్పాటుతో సిలబస్‌కు రూపకల్పన చేయాలని సూచిస్తోంది. అంతర్జాతీయ యూనివర్శిటీలు ఇప్పటికే ఈ బాటలో పయనిస్తున్నాయి. అమెరికా స్కూల్ స్థాయి నుంచే ఏఐపై బోధన చేస్తోంది. భారత్ కూడా ఈ దిశగా పయనించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. -
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ వద్దు
సాక్షి, హైదరాబాద్: జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటు స్థానాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టరాదంటూ సీఎం గురువారం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. సీఎం ప్రసంగం అనంతరం ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. తీర్మానంపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ప్రధాన మంత్రులు ఇందిరాగాందీ, వాజ్‌పేయి జనాభా లెక్కన కాకుండా, ఉన్న 543 పార్లమెంటు సీట్లనే కొనసాగిస్తూ పునర్విభజన చేశారని గుర్తుచేశారు. అదే విధానాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్‌పై పలు వివరాలను సీఎం సభ ముందుంచారు. సంప్రదింపుల తర్వాతే ముందుకెళ్లాలి ఎవరినీ సంప్రదించకుండా కేంద్రం ఇష్టారీతిగా డీలిమిటేషన్‌ను చేపట్టడం మంచిది కాదని సీఎం అన్నారు. ‘లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు, అనుసరించబోయే విధానాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు లేకుండా జరుగుతున్న తీరుపై సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల తర్వాతే పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని ఈ సభ కోరుతోంది. కేంద్ర లక్ష్యాలకు అనుగుణంగా జనాభా నియంత్రణను సమర్ధంగా అమలు చేసిన రాష్ట్రాలకు పునర్విభజన ప్రక్రియ శాపంగా మారకూడదు. అందుకే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలి. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ఇప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేపట్టాలి. తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. ప్రాతినిథ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నిర్దేశించిన మేరకు 119 అసెంబ్లీ స్థానాలను 153కు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తోంది. అందుకే అవసరమైన మేరకు రాజ్యాంగ సవరణలు చేపట్టాలని ఈ సభ కేంద్రాన్ని కోరుతోంది’అని సీఎం తెలిపారు. గత విధానాలకు విరుద్ధంగా మోదీ చర్యలు గతంలో నాలుగుమార్లు పార్లమెంటు స్థానాల పునర్విభజన జరిగినప్పుడు అనుసరించిన విధివిధానాలనే రాజ్యాంగంలో పొందుపర్చారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ అందుకు విరుద్ధంగా వెళ్తున్నారని విమర్శించారు. ‘1971 జనాభా లెక్కల తర్వాత పునర్విభజన ప్రతిపాదన వచ్చినప్పుడు నాటి ప్రధాని ఇందిరాగాం«దీ.. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్య అంతరం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం చెడిపోతుందని భావించి.. 25 ఏళ్లపాటు పాతవాటినే కొనసాగించాలని నిర్ణయించారు. ఆ సంఖ్య ప్రకారమే వాటి పునర్విభజన చేయాలని చట్టాన్ని సవరించారు. 543 స్థానాలకుగాను దక్షిణాది 6 రాష్ట్రాల్లో ఉన్న 130 నియోజకవర్గాలను పునర్విభజించారు. 2006 తర్వాత జరిగిన పునర్విభజనలో నాటి ఉమ్మడి రాష్ట్రంలో 42 నియోజకవర్గాలను ఎస్సీ, ఎస్టీ జనాభా ఆధారంగా మొత్తం సంఖ్య పెరగకుండా పునర్వి భజించారు. 2002 జనాభా లెక్కల తర్వాత నాటి ప్రధాని వాజ్‌పేయి కూడా ఇందిరాగాంధీ విధానాన్నే అనుసరించి మరో 25 ఏళ్లపాటు అదే సంఖ్య కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం అందుకు భిన్నంగా పనిచేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ఆందోళన తెలిపేందుకు ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, ప్రజా ప్రతినిధులతో చెన్నైలో సమావేశం నిర్వహించారు. కానీ, కేంద్రం అలాంటి నిర్ణయమే తీసుకోలేదని కొందరు కేంద్ర మంత్రులు అంటున్నారు. వారి మాటలు అర్ధసత్యమేనని నేను చెప్తున్నా’అని పేర్కొన్నారు. దక్షిణాది ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం విధించిన జనాభా లక్ష్యాలను దక్షిణాది రాష్ట్రాలు పకడ్బందీగా అమలుచేస్తే.. ఉత్తరాది రాష్ట్రాలు విఫలమయ్యాయని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘దక్షిణాదిలో జనన మరణాల మధ్య అంతరం 1.8 శాతం మాత్రమే ఉంది. 543 ఎంపీ సీట్లలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల వాటా 24 శాతం. ప్రస్తుత జనాభా ఆధారంగా పునర్విభజన జరిగితే అది 19 శాతానికి తగ్గుతుంది. అప్పుడు దక్షిణాది ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఏర్పడుతుంది. ఇది దక్షిణాదికి క్షేమకరం కాదు. అందుకే రాజకీయాలకు అతీతంగా మనం గళం విప్పాలి. రాష్ట్రంలో భట్టి విక్రమార్క, కేకే, జానారెడ్డిల ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి, ఉమ్మడి మాటగా కేంద్రానికి వినిపించాలని నిర్ణయించారు. అందులో భాగంగా సభలో ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నాం. తెలుగు రాష్ట్రాలపై వివక్ష తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 153కు, ఏపీలో 225కు పెంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచినా.. కేంద్రం దాన్ని అమలు చేయలేదు. ఈ విషయాన్ని నేను పార్లమెంటులో ప్రస్తావించినప్పుడు 2026లో జనాభా లెక్కల తర్వాతే అది సాధ్యమని బదులిచ్చింది. కానీ, కేంద్రంలోని ప్రధాన పార్టీ తన ప్రయోజనాల కోసం జమ్మూకశ్మీర్, సిక్కింలో అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియ చేపట్టింది. ఇది ద్వంద్వ వైఖరి కాదా? పార్లమెంటులో 24 శాతం ప్రాతినిథ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు.. పన్నుల రూపంలో జీడీపీకి 36 శాతం సమకూరుస్తున్నాయి. కానీ తిరిగి కేంద్రం నుంచి మనకు వస్తోంది చాలా తక్కువ. కేంద్రానికి మనం రూపాయి చెల్లిస్తే.. తిరిగి వస్తోంది 42 పైసలు మాత్రమే. అదే బిహార్ ఒక రూపాయి చెల్లిస్తే.. తిరిగి ఆ రాష్ట్రానికి కేంద్రం రూ.6.06 అందిస్తోంది. ఉత్తరప్రదేశ్‌కు రూ.2.73, మధ్యప్రదేశ్‌కు రూ.1.70 చొప్పున అందిస్తోంది. ఇంతకాలం ఆర్థిక ప్రయోజనాలను వదులుకున్నా, ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యాన్ని వదులుకునేందుకు మనం సిద్ధంగా లేము. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పక్షాలు కలిసికట్టుగా పోరాట ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలో అన్ని దక్షిణాది రాష్ట్రాల పార్టీలతో హైదరాబాద్‌లో ఓ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని పార్టీలు అందులో భాగస్వాములు కావాలి’అని సీఎం పిలుపునిచ్చారు. ఈ తీర్మానంపై సీఎం మాట్లాడిన తర్వాత ఇతర పక్షాల అభిప్రాయాన్ని తీసుకోకుండానే, సభ ఏకగ్రీవంగా ఆమో దించిందని స్పీకర్ ప్రకటించారు. -
మక్కకు మద్దతేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మక్కలు పండించిన రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,225 కాగా.. మార్కెట్లోకి వచ్చిన పంటకు తొలుత రూ.2,300కు పైగా ధర పలికినప్పటికీ, చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.2,000కు కాస్త ఎక్కువగా మాత్రమే ధర పలుకుతోంది. జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ తదితర జిల్లాల్లో మక్కలకు బహిరంగ మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కకపోవడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. మార్క్‌ఫెడ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న సేకరించాలని నిర్ణయించింది. ఉగాది తరువాత వీటిని ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. మక్కను సమర్థవంతంగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. 22.91 ఎల్ఎంటీల దిగుబడి అంచనా రాష్ట్రంలో ఈసారి మొక్కజొన్న సాగు గతంలో ఎన్నడూ లేనంత గణనీయంగా పెరిగింది. యాసంగిలో సాధారణ మొక్కజొన్న సాగు 5.89 లక్షల ఎకరాలు కాగా, గత సంవత్సరం 6.64 లక్షల ఎకరాల మేర సాగయింది. కానీ ఈసారి దాదాపు 2 లక్షల ఎకరాలు అధికంగా 8.83 లక్షల ఎకరాల మేర సాగయింది. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో ఈ పంట ఎక్కువగా సాగైంది. దీంతో 22.91 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీల) మేర ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇప్పటికే కోతలు మొదలు కాగా, ప్రైవేటు వ్యాపారులు, దళారులు, కోళ్ల పరిశ్రమకు చెందిన వారు కొనుగోళ్లు సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) దక్కడం లేదు. చాలా జిల్లాల్లో రూ.2,000 నుంచి రూ.2,150 వరకు మాత్రమే ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని జిల్లాల్లో రైతులు ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ ఆందోళనలకు దిగారు. 320 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో మార్క్‌ఫెడ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. మొక్కజొన్న పంట విస్తీర్ణం ఆధారంగా ఆయా జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత ఏడాది 309 కేంద్రాలు ఏర్పాటు చేయగా, కేవలం 2.67 ఎల్ఎంటీల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. ప్రైవేటు వ్యాపారులు ఎంఎస్పీ కన్నా ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయడంతో మార్క్‌ఫెడ్ కేంద్రాలకు మక్కలు రాలేదు. కానీ ఈసారి పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉండటంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ఎక్కువ మక్కలను సేకరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 320 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా..అత్యధికంగా నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఇవి ఏర్పాటు కాబోతున్నాయి. -
ఢీ అంటే ఢీ.. సీఎం రేవంత్, కేటీఆర్ మధ్య మాటల తూటాలు
సాక్షి, హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీ రామారావు మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత విమర్శలతో గురువారం శాసనసభ అట్టుడికింది. బిల్లుపై చర్చ ప్రారంభంలో కేటీఆర్ మాట్లాడుతూ తొలుత కేంద్రంపై ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ సర్కారు ఏ ఒక్క ఎన్నికల హామీ నిలబెట్టుకోలేదని, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఈ వైఖరి వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ దశలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని కేటీఆర్ విమర్శలను తిప్పికొట్టారు. ‘మేం కక్ష పూరితంగా వ్యవహరిస్తే కేసీఆర్ కుటుంబం అసెంబ్లీలో కాదు.. జైల్లో ఉండేది’ అని సీఎం అంటే.. ‘మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి. ఏం ఫరక్ పడదు’ అంటూ కేటీఆర్ స్పందించారు. ‘ఏం చేసినా పెద్దాయన (కేసీఆర్) ఆయన సీటు ఇవ్వడు..’ అని ముఖ్యమంత్రి అంటే.. ‘రేవంత్‌లో అపరిచితుడు ఉన్నాడు’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిందని రేవంత్ విమర్శించారు. ఆ తర్వాత మాట్లాడిన కేటీఆర్ అదే స్థాయిలో సీఎంపై ధ్వజమెత్తారు. పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మెరుగైన రైతు రుణమాఫీ చేశామన్న రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. ఏ ఊర్లోనైనా రుణమాఫీ వంద శాతం జరిగిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. కేటీఆర్ ప్రసంగానికి అధికార పక్ష సభ్యులు అనేకసార్లు అడ్డుపడ్డారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం అభ్యంతరాలు లేవనెత్తడంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసకుంది. కేటీఆర్, సీఎం పరస్పర వ్యక్తిగత, రాజకీయ విమర్శలతో సభ వేడెక్కింది. విపక్షం ఆరోపణలకు సీఎం సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు: రేవంత్ ‘రైతుల రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.16,143 కోట్లే మాఫీ చేసింది. మొదటి ఐదేళ్లల్లో వడ్డీ తీసివేస్తే జరిగిన రుణమాఫీ రూ.13,514 కోట్లు మాత్రమే. రెండోసారి నాలుగేళ్ళల్లో ఒక్క రూపాయి కూడా చేయలేదు. ఆఖరి ఏడాది 21,35,557 మంది రైతులకు రూ.11,909 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. కానీ మేం రుణమాఫీ చేసి చూపించాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే రూ.20,616,89 కోట్లు మాఫీ చేశాం. ఎన్నికల నిబంధనతో వారు రైతుబంధు ఇవ్వకపోతే..మేము వచ్చాక ఇచ్చాం. వరి వేస్తే ఉరి అని రైతులకు చెప్పి, కేసీఆర్ కుటుంబసభ్యుల ఫామ్‌హౌస్‌ల్లో పండిన వడ్లను క్వింటాల్‌కు రూ.4,500 చొప్పున కావేరి సీడ్స్‌కు అమ్ముకున్నారు. వారు పదేళ్లలో చేయలేని పనులు మేము చేస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు..’ అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. అప్పుల రాష్ట్రంగా మార్చారు.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసింది. 2014 నాటికి 16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు రూ.90,160 కోట్లయితే, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ. 6,69,257 కోట్లు అప్పు చేశారు. వాళ్ళు పెట్టిన రూ.40,154 కోట్ల బకాయిలు కలిపితే, మొత్తం అప్పు రూ.7,19,151 కోట్లు. మేము అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రూ.1,58,041 కోట్లు అప్పు చేశాం. గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పులకు అసలు, వడ్డీ కలిపి రూ.1,53,359 కోట్లు చెల్లించాం. ఇవి తీసేస్తే మేము చేసిన అప్పు రూ.4,682 కోట్లు మాత్రమే. విపక్షం అబద్ధాల పునాదులపై వెళ్తే లాభం లేదు. ఇప్పటికే కూలిపోయింది. ఇప్పటికైనా మర్యాదగా ఉండాలి..’ అని సీఎం ధ్వజమెత్తారు. ఫాంహౌస్‌ల కోసం ప్రాజెక్టులు కట్టారు.. ‘బీఆర్ఎస్ నేతల ఫాం హౌస్‌ల కోసమే ప్రాజెక్టులు కట్టారు. ప్రతి ప్రాజెక్టు పక్కన వందల ఎకరాలు కొన్నారు. కొండపోచమ్మ నుంచి ఎర్రవల్లి ఫాం హౌస్‌కు కాల్వలు తీసి నీళ్ళు తీసుకెళ్ళారా లేదా? చెప్పాలి. రంగనాయక సాగర్ దగ్గర హరీశ్‌రావుకు ఫాం హౌస్ ఉందా లేదా? దీనిపై కాంగ్రెసేతర శాసనసభ్యులతో కమిటీకి సిద్ధమా? మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం కడితే కుప్పకూలిపోతుందని ఇంజనీర్లు చెప్పినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులను జైలుకు పంపుతాం. కాళేశ్వరంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందు పెడతాం. కాళేశ్వరం లేకున్నా వ్యవసాయానికి నీళ్శివచ్చు. లగచర్లలో అధికారులను చంపమని విపక్షం రెచ్చగొట్టింది..’ అని సీఎం ఆరోపించారు. పెద్దాయనకు ప్రమాదం తెచ్చేలా ఉన్నారు.. ‘పెద్దాయన (కేసీఆర్) సీటు కోసం కుటుంబంలోని ఇద్దరూ ఆశ పడుతున్నారు. కానీ పెద్దమనిషి వదిలేట్లు లేడు. వీపు చింతపండు అవుతుందని పెద్దాయనే చెప్పాడు. పెద్దమనిషి ఉంటేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఆయన వందేళ్ళు ఉండాలని, ప్రతిపక్షంలో ఉంటూ మంచి సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కానీ వీళ్ళిద్దరూ పోటీ పడి పెద్దాయనకు ప్రమాదం తెచ్చేలా ఉన్నారు. ఆయనకు రక్షణ కల్పించాలి. ‘ఈ సందర్భంగా నేపాల్ యువరాజు దీపేంద్ర అధికారం కోసం కుటుంబాన్ని ఏకే 47 తుపాకీతో కాల్చిన ఉదంతాన్ని ప్రస్తావించారు) మీరు జాతిపిత అని చెబుతున్న కేసీఆర్‌ను కామారెడ్డిలో బండకేసి కొట్టారు..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఫాంహౌస్ ఫొటోలు పత్రికలకిచ్చానని కేసులు పెట్టారు – తీవ్రవాదులు, నక్సల్స్ ఉండే డిటెన్షన్ సెల్లో ఉంచారు: రేవంత్ ‘కేటీఆర్ ఫాంహౌస్‌ను ఎవరో డ్రోన్‌తో చిత్రీకరించి నాకు ఫోటోలు ఇస్తే.. నేను వాటిని పత్రికలకు పంపిస్తే అక్రమ కేసులు పెట్టారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేస్తే రూ.500 జరిమానా విధిస్తారు. కానీ నేను అప్పుడు పార్లమెంట్ సభ్యుడిని. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నా. నన్ను అరెస్టు చేసి నక్సల్స్, తీవ్రవాదులును నిర్బంధించే డిటెన్షన్ సెల్లో ఉంచారు. మరోఖైదీ కానీ, మరొక వ్యక్తి కానీ కనిపించని విధంగా కక్షసాధింపుగా ఆ గది కేటాయించారు. రాత్రిళ్లు పడుకోవడానికి కూడా సరిపోని గది అది. అందులోనే చిన్న బాత్రూమ్. బయటకు కనపడేలా ఉంటుంది. రాత్రి ఎలాగోలా పడుకుందామని అనుకున్నా. లైట్ ఆఫ్ చేశారు కాదు. ఏమిటంటే పైనుంచి ఆర్డర్ అనేవారు. ఆ ట్యూబ్‌లైట్ చుట్టూ పురుగులు.. వాటి కోసం వచ్చే 30 బల్లులు. ప్రతిరోజూ నిద్ర లేకుండానే గడిపా. ఉదయం పూట బయటకు వదిలినప్పుడు చెట్ల కింద పడుకున్నా. 16 రోజులు అలా నిర్బంధంలో ఉంచారు. నా కూతురు పెళ్లి పత్రిక రాసుకునే కార్యక్రమానికి కూడా వెళ్లడానికి వీల్లేదంటూ ఢిల్లీ నుంచి లాయర్‌ను తీసుకునివచ్చి వాదించారు. కోర్టు కండిషనల్ బెయిల్ ఇవ్వడంతో నేరుగా కార్యక్రమానికి వెళ్లి తిరిగి జైలుకు వచ్చా. ఇప్పుడు ఆ కోపాన్ని దిగమింగుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నా. అంతకంతకు దేవుడే చూసుకుంటాడని అనుకున్నా. సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజునే నాపై కక్ష చూపించిన వాళ్లు ఆసుపత్రిపాలయ్యారు. కక్ష సాధింపు ఎవరిది? మీదా? నాదా?. ఆ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తానంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూడా నేను అమలు చేయలేదు..’ అంటూ సీఎం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. డ్రోన్ ఎగరేసి ఆడోళ్ల ఫొటోలు తీస్తారా – మీ భార్యాపిల్లల ఫొటోలు తీస్తే ఊరుకుంటారా?: కేటీఆర్ ‘సీఎం ఇంటి మీదికి డ్రోన్ పంపిస్తే ఆయన ఊరుకుంటాడా? ఆయన భార్యా పిల్లలను ఇష్టం వచ్చినట్టు ఫొటోలు తీస్తామంటే ఊరుకుంటాడా? మీకే భార్యా పిల్లలు ఉన్నారా? వేరే వాళ్లకు లేరా? వాళ్లకు కుటుంబాలు ఉండవా? లేని రంకులు అంటగట్టిం ఆనాడు ఇష్టమున్నట్టు మాట్లాడినప్పుడుం నీతులు గుర్తుకు రాలేదా? మా ఇంట్లో పిల్లల్ని తిట్టింది ఈ కాంగ్రెస్ నేతలు కాదా? మా ఇంట్లోని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది ముఖ్యమంత్రి కాదా?..’ అని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను జైల్లో పెట్టించారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘మా ఇంటి మీదకు డ్రోన్ ఎగరేసి ఇంటివాళ్ల ఫొటోలు తీయటం సరైన పనేనా అన్నది సీఎం చెప్పాలి. రేవంత్‌రెడ్డిని ప్రభుత్వం జైల్లో పెట్టలేదు. కోర్టులు రిమాండ్ చేశాయి. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జైల్లో ఉన్నా. అయినా రేవంత్‌రెడ్డి స్వాతంత్య్రం కోసం పోరాడాడా? ఏం గొప్ప పని చేసి జైలుకెళ్లాడు? ముఖ్యమంత్రి ఏమనుకున్నా మాకు ఫరక్ పడదు. ఏం చేసినా ఫరక్ పడదు. పదవి, అధికారం శాశ్వతం అని సీఎం అనుకుంటున్నారు కానీ అవి ఏవీ శాశ్వతం కాదు. ముఖ్యమంత్రికి అపరిమిత అధికారాలు ఉండవు. ఆయన ఎవరినీ జైలుకు పంపలేరు. కోర్టులు మాత్రమే ఆ పని చేయగలవు. రేవంత్ తిట్లన్నీ మాకు దీవెనలే.ం ఆయనకు తుపాకుల గురించి బాగా తెల్సుం. తెలంగాణపై గన్ను ఎక్కుపెట్టిన రైఫిల్‌రెడ్డి రేవంత్‌రెడ్డి. తెలంగాణ జాతి పిత ముమ్మాటికీ కేసీఆరే. తెలంగాణ బూతు పిత రేవంత్‌రెడ్డే..’ అని కేటీఆర్ అన్నారు -
నన్ను జైల్లో పెట్టి హింసించినా.. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడలేదు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు.. గురువారం మధ్యాహ్నాం సెషన్లో తొలుత కేటీఆర్ ప్రసంగించగా.. ఆ ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు ఎవరిది? మీదా? నాదా?.. ఎవరైనా అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేస్తే రూ.500 ఫైన్ విధిస్తారు. కానీ, డ్రోన్ ఎగరేశానని బీఆర్ఎస్ హయాం(BRS Rule)లో నాపై కేసు పెట్టారు. అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పంపారు. నన్ను జైల్లో ఉంచి చిత్రహింసలకు గురి చేశారు. నక్సలైట్లు, దేశ ద్రోహులు ఉండె డిటెన్షన్ సెల్లో పార్లమెంట్ సభ్యుడినైన నన్ను వేశారు. నేను పడుకోకుండా రాత్రిళ్లు లైట్లు వేశారు. జైల్లో 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపా. .. చర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. నా బిడ్డ లగ్గానికి రాకుండా ఢిల్లీ నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చారు. చర్లపల్లి జైలు నుంచి ఫంక్షన్ హాల్ కు వచ్చి.. మళ్ళీ జైలుకు పోయా. నా కుటుంబ సభ్యులను అసభ్యంగా తిట్టినా భరించా. సొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా… చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించా. దేవుడు అన్ని చూస్తుంటాడంటూ సహనంతో ఎదురు చూశా. అంతేకానీ.. కేసీఆర్ కుటుంబంపై ఏనాడూ.. ఎలాంటి రాజకీయ కక్ష చర్యలకు పాల్పడలేదు. వారిని జైలుకు పంపుతానన్న హామీని కూడా నెరవేర్చలేదు. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. కేసీఆర్ కుటుంబంలో ఏం జరగాలో అది జరిగింది. నా మీద కక్ష చూపిన వారిని ఆ దేవుడే ఆసుపత్రిపాలు చేశాడు. నేను నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటే ఇవాళ కేటీఆర్(KTR) అసెంబ్లీలో కూర్చొని ఇలా మాట్లాడేవారు కాదు. ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం నాకు అధికారం ఇచ్చారు. కక్షలు తీర్చుకోవడానికి కాదు. ఎవరివి కక్ష సాధింపు చర్యలో తెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోంది’’ అని సీఎం రేవంత్ అన్నారు. ఇదీ చదవండి: అది నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా: కేటీఆర్ -
ఎంబీబీఎస్ డాక్టర్ ప్రాణం తీసిన బట్టతల
సాక్షి,హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. బట్టతల కారణంగా నిశ్చితార్ధం వరకు వచ్చి పెళ్లి ఆగిపోవడంతో ఓ ఎంబీబీఎస్ డాక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు.సికింద్రాబాద్ పోలీసుల వివరాల మేరకు.. గుజరాత్‌కు చెందిన ప్రకాష్ మాల్ కుటుంబం కొన్నేళ్ల క్రితం సికింద్రాబాద్‌లో స్థిరపడింది. ప్రకాష్ మాల్ చిన్న కుమారుడు పురోహిత్ కిషోర్ ఎంబీబీఎస్ డాక్టర్‌గా అల్వాల్ బస్తీ ఆస్పత్రిలో సేవలందిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో కిషోర్‌కు కొన్ని రోజుల కిందట నిశ్చితార్ధం జరిగింది. బట్టతలతో పాటు ఇతర కారణాల వల్ల నిశ్చితార్ధం ఆగిపోయింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు కిషోర్‌కు పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నారు. కానీ సంబంధాలు కుదరడం లేదు.బట్టతల ఉండడం, వయస్సు పెరిగిపోతుండడంతో డాక్టర్ కిషోర్ మనోవేధనకు గురయ్యారు. ఈ క్రమంలో గురువారం జామాబాద్ నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న హుజూర్‌సాహిబ్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. డాక్టర్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
‘ఒకరు సహాయ మంత్రి.. ఇంకొకరు నిస్సహాయ మంత్రి’.. అసెంబ్లీలో కేటీఆర్ సెటైర్లు
సాక్షి,హైదరాబాద్: మాకు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది నిజమే. కానీ కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నానే. పురావస్తు శాఖ చరిత్రను తవ్వినట్లు.. గత ప్రభుత్వం, గత ప్రభుత్వము అని తవ్వుతూనే ఉంది. మరి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడారు. ‘కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ది వేగంగా జరిగింది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అన్నీ రంగాల్లో అభివృద్ధిని సాధించింది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రాష్ట్రం పేరు ఎక్కడా వినపడలేదు. అధికారంలోకి ఎవరు వచ్చినా రాష్ట్రాభివృద్ధే మాకు ముఖ్యం.తెలంగాణా పథకాలను కేంద్రం కాపీ కొట్టింది. రాష్ట్రానికి ఎన్నోసార్లు కేంద్రం అన్యాయమే చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటి? మాకు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది నిజమే. కానీ కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నానే. 2014 నుంచి కేంద్రంతో సఖ్యతతో ఉండి రాష్ట్రానికి నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేశాం. ట్యాక్స్ రూపంలో రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే నిధులు ఎక్కువ.. రాష్ట్రానికి వచ్చేది తక్కువ. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది దానిపై భట్టి విక్రమార్క ఒక్క మాట అనలేదు. 8 ప్లస్ 8 16కావాలి...కానీ తెలంగాణలో గుండు సున్నా అయింది. భారత జాతిని సాధుతున్న రాష్ట్రంలో తెలంగాణ టాప్ ఫైవ్‌లో ఉంది. పురావస్తు శాఖలో చరిత్రను తవ్వినట్లు.. గత ప్రభుత్వము అని తవ్వుతూనే ఉన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఒక్కరూ మాట్లాడలేదు. ఒక్క విభజన హామీ నెరవేర్చలేదు.తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు...ఒకరేమో సహాయ మంత్రి, ఇంకొకరు నిస్సహాయమంత్రి. హైదరాబాద్ మెట్రో, అదిలాబాద్ వెనుకబడిన ప్రజలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ధర్మంతో కూడిన రాజకీయాలు చేయాలి తప్ప.. రాజకీయాల్లోకి ధర్మాన్ని లాగొద్దు. దేశం కోసం ధర్మం కోసం అనే వాళ్ళు వేములవాడ, కొండగట్ట, ధర్మపురి, భద్రాచలం ఆలయాలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. మహాకుంభ మేళాకు కేంద్రం 2100 వంద కోట్లు ఇచ్చింది.వన్ ట్రిలియన్ ఎకానమీ 2030 వరకు ఎలా సాధిస్తారో చెప్పాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కొటేషన్స్‌కు మాత్రమే పరిమితం అయ్యాయి. గత బడ్జెట్లో ఇండ్ల లెక్కలు 6లక్షలు అన్నారు.. ఈ సారి 5లక్షలు అంటున్నారు. కేంద్రంతో సఖ్యత అంటున్నారు..మరి ఏం సాధించారో చెప్పాలి. మా ప్రభుత్వం పోగానే ల్యాండ్ క్యూజర్లు కొన్నారని విమర్శలు చేశారు. అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసిన కార్లను ఇప్పుడు సీఎం,మంత్రులు వినియోగిస్తున్నారని’ అన్నారు. -
తొలి సంతకం నేనే చేస్తా.. అవయవదానానికి ముందుకొచ్చిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా అవయవదానానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకొచ్చారు. అవయవదానం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సభలో తాను అవయవ దానానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. మనం లక్షలాది మంది ప్రజలకు ప్రతినిధులం. మనం అందరికీ ఆదర్శంగా నిలవాలి’’ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. మన నియోజకవర్గాల్లో కూడా అవయవదానం అంశంలో చైతన్యం తీసుకురావాలన్న కేటీఆర్.. ప్రజలందరికీ దీనిపై అవగాహన కల్పించాలని కోరారు.ఈ మేరకు ఆలోచన ఉన్న సభ్యులు ముందుకు వస్తే శాసన సభ ప్రాంగణంలోనే సంతకాల సేకరణ చేపడదామని స్పీకర్‌కు కేటీఆర్ సూచించారు. అందరి కంటే ముందు తానే సంతకం చేస్తానని సభలో కేటీఆర్ ప్రకటించారు. అవయవ దానం అనేది గొప్ప మానవీయ చర్య. ఇది మరింత మందికి జీవితాన్ని ప్రసాదిస్తుందని కేటీఆర్ అన్నారు.ఎంతో ఉపయోగకరం.. అభినందనలు: హరీష్రావుఅవయవదానం బిలుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అవయవదానంపై పెట్టిన బిల్లు ఎంతో ఉపయోగకరమని.. అభినందనలు తెలుపుతున్నామన్నారు. నాకున్న సమాచారం మేరకు ఈరోజు వరకు 3724 మంది అవయవదానం కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు. ఈ రోజు పెట్టిన బిల్లు వీరందరికీ ఎంతో ఊరట చెందే విషయం. ఈ బిల్లు ద్వారా గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్కు అవయవదానం చేసే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా స్వాప్ ద్వారా పరస్పరం అవయవ దానం చేసుకునే అవకాశం కలుగుతుంది. అవయవాల మార్పిడి దందా చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవచ్చు’’ అని ఆయన చెప్పారు...ఇప్పటివరకు బ్రెయిన్ డెడ్ అయిన విషయాన్ని న్యూరో ఫిజీషియన్లు మాత్రమే నిర్థారించే వారు. ఈ బిల్లు ద్వారా డాక్టర్లందరూ నిర్ధారణ చేసే అవకాశం కల్పించారు. దీంతో త్వరగా నిర్థారణ చేసి, అవయవ దానం చేసే అవకాశం కలుగుతుంది. జీవన్ దాన్ ప్రోగ్రాం విజయవంతంగా జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 189 అవయవ మార్పిడులు మాత్రమే జరిగితే. బీఆర్ఎస్ పాలనలో 2014లో 233, 2015లో 364, 2016లో 563, 2017లో 573, 2018లో 469, 2019లో 257, 2020లో 616, 2021లో 716, 2022లో 729, 2023లో 725 అవయవ మార్పిడులను జరిపాం. దేశంలో అత్యధిక అవయవదానాలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణను నిలిపాం.తెలంగాణ రాష్ట్రం అనేక అవార్డులు కూడా పొందింది. ఒకపుడు అవయవదానానికి అమెరికా, లండన్ వెళ్లాల్సి వచ్చేది. బీఆర్ఎస్ హయాంలో నిమ్స్, ఉస్మానియా, గాంధీ లాంటి ప్రభుత్వాసుపత్రుల్లో 609 అవయవమార్పిడి చికిత్సలు జరిగాయి. అవయవమార్పిడి ఖరీదైన చికిత్స, పేదోళ్లు చేసుకోలేరు అనుకుంటారు, కానీ, కేసీఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 577 అవయవమార్పిడిలు చేశాం. 20 లక్షల ఖర్చయ్యేవి నయాపైసా ఖర్చు లేకుండా ప్రభుత్వాసుపత్రుల్లో చేశాం. సంవత్సరం పాటు మందులు కూడా ఇచ్చాం. కుటుంబీకులు త్వరగా నిర్ణయం తీసుకుంటే ఎక్కువ మందికి మేలు జరుగుతుంది’’ అని హరీష్‌రావు వివరించారు. -
బడంగ్‌పేటలో హైడ్రా కూల్చివేతలు.. పలువురు అరెస్ట్!
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని బడంగ్‌పేటలో రోడ్డును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.వివరాల ప్రకారం.. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్‌గూడలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. కాలనీవాసుల ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. రోడ్డును ఆక్రమించి ఇండోర్ క్రికెట్ కోర్డును నిర్మాణం జరిగింది. ఈ క్రమంలో సదరు నిర్మాణాన్ని హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేశారు. ఈరోజు ఉదయం జేసీబీల సాయంతో క్రికెట్ కోర్టును కూల్చివేశారు హైడ్రా అధికారులు. ఫిర్యాదు చేయగానే స్పందించి అక్రమాలను కూల్చివేసినందుకు హైడ్రాకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు కాలనీ వాసులు. ఈ సందర్బంగా కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో, అక్కడ ఉద్రికత్తకర వాతావరణం చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా.. ప్రతీ సోమవారం బుద్ధభవన్‌లో ప్రజావాణి కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. 2025 జనవరి నుంచి ప్రారంభించిన ఈ ప్రజావాణికి హైదరాబాద్ ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. తమ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. హైడ్రా అధికారులపై దాడికి యత్నం..కూల్చివేతల సందర్భంగా హైడ్రా అధికారులను బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి, ఇతర వ్యక్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే హైడ్రా సీఐ తిరుమలేష్‌పై దాడికి ప్రయత్నించారు. బోయపల్లి ఎన్క్లేవ్ కాలనీవాసులు బోయపల్లి వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డిపై హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.1982 జీపీ లేఔట్ చేసి ప్లాట్లను విక్రయించిన భూ యజమానులు. సర్వే నెంబర్ 39,40,41,42,44లో మొత్తం 5 ఎకరాలు ఏడు గుంటల భూమి. లేఅవుట్లో 236 గజాల పార్కు స్థలం కబ్జా చేసిన భూ యజమానులు. మూడు రోడ్లను కాలనీ వాసులకు చూపించిన భూ యజమానులు. రోడ్లు మూసి వేయడంతో కాలనీవాసులు ఇబ్బందులను హైడ్రాకు విన్నవించారు. దీంతో, కూల్చివేతల సందర్బంగా దాదాపు 40 మంది హైడ్రాధికారులు పాల్గొన్నారు. స్థానిక పోలీసులకు బందోబస్తు సమాచారం ఇచ్చినట్టు తిరుమలేష్ తెలిపారు. బడంగ్పేట్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు తిరుమలేష్ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులను అడ్డుకున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. -
MMTS Train Incident: లభించని నిందితుడి ఆచూకీ
సికింద్రాబాద్: ఈ నెల 22న మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచార యత్నం ఘటన మిస్టరీ వీడలేదు. మరుసటి రోజు నుంచి ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నా నిందితుడి ఆచూకీ తెలియడంలేదు. పలు బృందాలుగా ఏర్పడిన రెండు వందలకు పైబడిన పోలీసులు బృందాలుగా ఏర్పడిన వివిధ విభాగాల పోలీసులు కేసు దర్యాప్తులో ఏమాత్రం ప్రగతి సాధించలేకపోతున్నారు. ఘటన మిస్టరీని ఛేదించడంలో పోలీసులకు రెండు సమస్యలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఒకటి ఘటన జరిగిన ప్రాంతం నుంచి ఎటు పది కిలోమీటర్ల దూరంలోని ఎంఎంటీఎస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు లేకపోవడం. మరోవైపు బాధితురాలు ఘటన భయం నుంచి ఇంకా తేరుకోకపోవడం. ముఖానికి, తలకు తీవ్రమైన గాయాలు కావడం, పళ్లు ఊడిపోవడంతో యశోదా ఆసుపత్రిలో బాధితురాలికి పలు శస్త్ర చికిత్సలతో కూడిన వైద్యం చేస్తున్నారు. ఈ కారణంగా బాధితురాలు పోలీసులతో వివరంగా మాట్లాడలేకపోతోంది. బాధితురాలు కాస్త కోలుకుని ఘటన భయం నుంచి బయటపడి పూర్తి వివరాలు వెల్లడిస్తే గానీ దర్యాప్తు ముందుకు సాగే అవకాశం లేదన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన రెండో రోజే పలువురు పాత నేరస్తుల ఫొటోలను బాధితురాలికి పోలీసులు చూపించారు. ఇందులో నిందితుడి మాదిరి ఉన్నట్టు రెండు ఫొటోలను అనుమానితులుగా బాధితురాలు పేర్కొంది. ఆ ఇరువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితురాలికి చూపించగా వారిరువురు కాదన్నట్టు సమాధానం చెప్పడంతో దర్యాప్తు మళ్లీ మొదటికి వచి్చంది. ఘటన జరిగిన సమయంలో బాధితురాలు ఫోన్‌కాల్‌లో మాట్లాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలి మిత్రులను కూడా రప్పించిన పోలీసులు మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే నిందితుణ్ని గుర్తిస్తాం: రైల్వే పోలీసులు అనుమానితులుగా భావిస్తున్న ఇరువురు పాత నేరస్తులు అత్యాచార యత్నానికి పాల్పడిన వారు కాదని బాధితురాలు చెప్పినప్పటికీ వారి కదలికలపై పోలీసులు దర్యాప్తు చేశారు. ఇందులో ఒకరు ఘటన జరిగిన సమయంలో కల్లు కాంపౌండ్‌లో మరొకరు ఇంకో ప్రదేశంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మీదుగా గుండ్ల పోచంపల్లి వరకు ఎంఎంటీఎస్ స్టేషన్లను ఆవరించి ఉన్న పలు గ్రామాల్లోనూ దర్మాప్తు చేపట్టిన పోలీసులకు నిందితుడి గుర్తింపు కోసం ఎటువంటి ఆధారాలు లభించలేదు. కాగా.. సీసీ కెమెరాలు లేకపోవడం వంటి సాంకేతిక సమస్యలతో దర్యాప్తులో ఆలస్యం జరుగుతోందని, త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని రైల్వే పోలీసులు చెబుతుండడం గమనార్హం. -
మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేయండి
ఉస్మానియా యూనివర్సిటీ: యూనివర్సిటీలలో నూతన పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని, విద్యార్థులు, పరిశోధకులు మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. బుధవారం ఓయూ క్యాంపస్ సైన్స్ కాలేజీ ఫిజిక్స్ విభాగంలో మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ ఫర్ సొసైటల్ అప్లికేషన్స్ అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమానికి వీసీ ప్రొ.కుమార్ అధ్యక్షత వహించగా ఓయూ ఛాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. సమాజ అవసరాలు తీర్చేలా పరిశోధనలు జరగాలని అన్నారు. పరిశోధన ఫలాలు ప్రధానంగా గిరిజనులకు చేరాలన్నారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో విభిన్న విభాగాలు కలసి పనిచేయాలని, తద్వారా నాణ్యతమైన ఉత్పత్తులు చౌకగా లభిస్తాయన్నారు. పరిశోధనలలో ఓయూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతోందని వీసీ ప్రొ.కుమార్ అన్నారు. అంతరం సదస్సు సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సదస్సు చైర్మన్, హెడ్ ప్రొ.శ్రీనివాస్, ఏఆర్‌సీఐ డైరెక్టర్ డా.విజయ్, ఎఎండీ డైరెక్టర్ ధీరజ్ పాండే, ప్రొ.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. – గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ -
ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
లింగోజిగూడ: శివారు ప్రాంతాల ఏటీఎంలే లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.4 లక్షల నగదు, కారు, వివిధ రకాల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. రాజస్తాన్‌లోని డీగ్ జిల్లా సందీక గ్రామానికి చెందిన రాహుల్ అలియాజ్ రాహుల్ ఖాన్, మధ్యప్రదేశ్‌లో జేసీబీ మెకానిక్‌గా పని చేస్తున్న సందీక గ్రామానికి చెందిన జాహుల్ భాదన్ ఖాన్, జల్పల్లి షాజహాన్ కాలనీకి చెందిన ఎండీ సర్ఫారాజ్లు ఓ ముఠాగా ఏర్పడి ఏటీఎంలలో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గత ఫిబ్రవరి 22 నుంచి 26 రావిర్యాల, పహడీషరీఫ్, బాలాపూర్, జల్పల్లి, బీబీనగర్, భువనగిరి, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల్లోని ఏటీఎంల వద్ద రెక్కీ నిర్వహించారు. చివరకు రావిర్యాల, మైలార్‌దేవ్‌పల్లి ఏటీఎంలలో చోరీ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఫిబ్రవరి 26న మరికొందరు స్నేహితుల సాయంతో రావిర్యాల ఎస్బీఐ ఏటీంలో రూ.29 లక్షల 69 వేల 900 ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి మైలార్దేవ్ పల్లి, మధుబాన్ కాలనీలో మరో ఎస్బీఐ ఏటీఎంలో చోరికి ప్రయత్నించగా మిషన్‌లో మంటలు రావడంతో అక్కడి నుంచి నాందేడ్ మహారాష్ట్ర మీదుగా పారిపోయారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాహుల్‌ఖాన్, ముస్తాఖీన్ ఖాన్, వహీద్‌ఖాన్, షకీల్ ఖాన్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.4 లక్షల నగదు, కారు, చోరీకి ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
ఎంసీఈఎంఈని సందర్శించిన ఆర్మీ చీఫ్
కంటోన్మెంట్: టెక్నాలజీ పరంగా భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్మీ సంసిద్ధంగా ఉండాలని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్) జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. బుధవారం ఆయన సికింద్రాబాద్‌లోని మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (ఎంసీఈఎంఈ)ని సందర్శించారు. ‘ఆత్మ నిర్భర్’లో భాగంగా ఎంసీఈఎంఈ పరిధిలోని ల్యాబరేటరీల్లో రూపొందించిన అధునాత పరికరాలు, చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలించారు. డ్రోన్లు, అటానమస్ రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఈఎంఈ టెక్నీషియన్స్ సామర్థ్యాన్ని పరిశీలించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈఎంఈలో చోటు చేసుకుంటున్న మార్పుల పట్ల సీఓఏఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. -
‘ఎస్టేట్స్’ దూకుడు!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక సంవత్సరం ముగియవస్తుండటంతో ఆదాయ లక్ష్యాలను చేరుకునేందుకు జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వం ఆస్తిపన్ను బకాయిల వడ్డీలపై 90 శాతం రాయితీ కూడా ఇవ్వడంతో ట్యాక్స్ సెక్షన్ సెలవుల్లేకుండా పని చేస్తోంది. దాంతోపాటు ట్రేడ్ లైసెన్సుల విభాగం, ఎస్టేట్స్ విభాగాలు సైతం టార్గెట్లు చేరుకునేందుకు ముమ్మరంగా పర్యటిస్తూ దూకుడు పెంచాయి. ముఖ్యంగా, ఇటీవలి కాలం వరకు తన ఆస్తులేమిటో, ఎంతమొత్తం రావాలో కూడా పెద్దగా పట్టించుకోని ఎస్టేట్స్ విభాగం దూకుడు పెంచింది. ఆ విభాగానికి నగరంలోని పలు ప్రాంతాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు, మార్కెట్లు ఉండటం తెలిసిందే. వాటిలో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు ఎంతో ఆదాయాన్ని పొందుతున్నప్పటికీ, జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన నామమాత్రపు అద్దెలు మాత్రం చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో అద్దెల్ని కచ్చితంగా వసూలు చేయాలని భావించిన ఎస్టేట్స్ అధికారులు నిబంధనల మేరకు నోటీసులు, హియరింగ్‌లు వంటివి నిర్వహించారు. అంతిమంగా దుకాణాలను సీజ్ చేసే చర్యలు చేపట్టారు. ఈ నెల 8వ తేదీన తొలుత ఈ చర్యలు ప్రారంభించాక, కొద్దిమేర ఫలితం కనిపించింది. తిరిగి మళ్లీ పరిస్థితి షరామామూలుగా మారడంతో మంగళ, బుధ వారాల్లో సంబంధిత అధికారులు, సిబ్బంది దూకుడు పెంచారు. ప్రముఖ వాణిజ్య ప్రాంతాల్లో , భారీ వ్యాపాలు జరిగే ప్రాంతాల్లో ఉన్న కాంప్లెక్స్‌లలో భారీ బకాయిల అద్దెలున్న దుకాణాలను సీజ్ చేశారు. ● వీటితోపాటు సికింద్రాబాద్ ఓల్డ్ జైల్ కాంప్లెక్స్, పుత్లిబౌలి తదితర ప్రాంతాల్లోనూ కొన్ని షాపుల్ని సీజ్ చేశారు. వెరసి మొత్తం 223కు పైగా దుకాణాల్ని సీజ్ చేశారు. ● దీంతో దిగివచ్చిన వ్యాపారులు చెల్లించాల్సిన అద్దెల బకాయిల్లో కొంత చెల్లించి, మిగతా త్వరలో చెల్లిస్తామని వేడుకున్నారు. పుత్లిబౌలిలోని రెండు దుకాణాల నుంచే రూ.2.36 లక్షలు వసూలైంది. అలా రెండు రోజుల్లో రూ. 46 లక్షల అద్దెలు వసూలయ్యాయి. సీజ్ చేసిన మిగతా దుకాణాల నుంచీ అద్దెలు రాగలవని అధికారులు ఆశిస్తున్నారు. అలా ప్రస్తుతం సీజ్ చేసిన దుకాణాల నుంచి రూ. కోటికి పైగా వచ్చే అవకాశముందని చెబుతున్నారు. అద్దెలు చెల్లించని దుకాణాల సీజ్ ● చర్యలతో దిగివస్తున్న నిర్వాహకులు ● రెండు రోజుల్లో 223 దుకాణాలకు పైగా సీజ్ ● రూ. కోటికి పైగా ఆదాయం సీజ్ చేసిన దుకాణాలు ఇలా.. ఎక్కడ ఎన్ని కోఠి సబ్వే 67 సుల్తాన్‌బజార్ కాంప్లెక్స్ 53 పటాన్చెరు 56 మంగళ్‌హాట్ మార్కెట్ 24 కుషాయిగూడ 23 -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
రాంగోపాల్‌పేట్: మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు ఇద్దరు యువకులను బలి తీసుకుంది. బుధవారం ఉదయం మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ పరశురాం కథనం ప్రకారం.. బన్సీలాల్‌పేట్ చాచా నెహ్రూ నగర్‌కు చెందిన ఏడుకొండలు కుమారుడు గంటాడి దేవీ ప్రణయ్ (18), బన్సీలాల్‌పేట్ బీజేఆర్ నగర్‌కు చెందిన ఎర్రా హర్షిత్ (21) స్నేహితులు. వీరిద్దరూ మారేడుపల్లిలోని పెస్టోమెన్ అనే పెస్ట్ కంట్రోల్ సంస్థలో పని చేస్తున్నారు. రాత్రి విధులు ముగించుకున్న వీరు.. తమ యజమాని చెందిన ద్విచక్ర వాహనంపై ప్యారడైజ్ హోటల్‌కు వచ్చి టీ తాగారు. అనంతరం ఉదయం 4.40 గంటలకు జిమ్‌కు వెళ్లేందుకు ఎస్డీ రోడ్డు మీదుగా ప్యాట్నీ వైపు బైక్‌పై వస్తున్నారు. అదే సమయంలో కాప్రాకు చెందిన కొమురయ్య తాజ్‌హోటల్ వైపు వేగంగా కారు నడుపుతూ వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో బైక్ నడుపుతున్న దేవీ ప్రణయ్ తలకు, ఇతర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న హర్షిత్‌కు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందాడు. కారు డ్రైవర్ కొమురయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్డర్ల పేరుతో అందినంత స్వాహా
సాక్షి, సిటీబ్యూరో: నగర వ్యాపారిని ఫోన్ ద్వారా సంప్రదించి, భారీ ఆర్డర్ల పేరుతో ఎర వేసి, మోసం చేసిన కేసులో ఇద్దరు సైబర్ నేరగాళ్లను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో పట్టుబడిన వీరిపై దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 17 కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించామని డీసీపీ దార కవిత బుధవారం వెల్లడించారు. ఇంటర్నెట్ ద్వారా నగర వ్యాపారి ఫోన్ నెంబర్ సంగ్రహించిన సైబర్ నేరగాళ్లు సంప్రదించారు. ఆయన ఉత్పత్తులకు ఉత్తరాదిలో మార్కెటింగ్ చేస్తామని, భారీ ఆర్డర్లు తెస్తామంటూ నమ్మబలికారు. దీనికోసం తమ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. వీరి మాట నమ్మిన వ్యాపారి రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించారు. ఆపై వ్యాపారి ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో భారీ డిమాండ్ ఉన్నట్లు, వారి నుంచి ఆర్డర్లు వస్తున్నట్లు సైబర్ నేరగాళ్లు నకిలీ ఈ–మెయిల్స్ సృష్టించారు. ఇవన్నీ నిజమేనని సదరు వ్యాపారి నమ్మారు. ఆ సరుకు సరఫరాకు ముందు తమకు రూ.9.5 లక్షల చెల్లించాలని చెప్పిన సైబర్ నేరగాళ్లు ఆ మొత్తం తన ఖాతాలో పడిన తర్వాత స్పందించడం మానేశారు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ కె.ప్రసాద్‌రావు నేతృత్వంలో కానిస్టేబుళ్లు జి.క్రాంతి కుమార్ రెడ్డి, ఎ.సతీష్, ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, జె.వెంకటేష్, జి.రాకేష్‌లతో కూడిన బృందం దీన్ని దర్యాప్తు చేసింది. బ్యాంకు ఖాతాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన అధికారులు ఢిల్లీలో ఓ డమ్మీ కంపెనీకి సీఈఓగా ఉన్న అమర్నాథ్ సింగ్, మార్కెటింగ్ హెడ్‌గా పని చేస్తున్న రణ్వీర్ సింగ్ బాధ్యులని తేల్చారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం వీరిని అరెస్టు చేసింది. వీరిపై మహారాష్ట్ర, పంజాబ్‌ల్లో రెండేసి, రాజస్థాన్‌లో 5, హర్యానా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ల్లో ఒక్కోటి చొప్పున కేసులు ఉన్నట్లు గుర్తించారు. నగరవాసికి టోకరా వేసినసైబర్ నేరగాళ్లు ఢిల్లీలో ఇద్దరిని అరెస్టు చేసినసిటీ సైబర్ కాప్స్ -
మూడంచెల్లో..
చెత్త సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ తిప్పలు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ విభాగాలకు సంబంధించిన సమస్యలకు ఎంతో కొంత పరిష్కారం చూపగలుగుతున్నప్పటికీ, చెత్త సమస్యలు మాత్రం తీరడం లేదు. ఏళ్ల తరబడిగా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి వివిధ చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నప్పటికీ, తగిన ఫలితాలంటూ కనిపించడం లేదు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ సవ్యంగా జరగకపోవడంతో రోడ్ల వెంబడి బహిరంగ ప్రదేశాల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. వీటిపై నిత్యం ఫిర్యాదులందుతున్నాయి. సోషల్ మీడియా వేదికగానూ ఫొటోలతో సహా ప్రజలు వీటిపై ఫిర్యాదు చేస్తుండటంతో ఆన్లైన్ మానిటరింగ్ విధాన్ని ప్రవేశపెట్టారు. అయినప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో ఇప్పుడిక మూడు పర్యాయాలు చెత్త తరలింపును పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే రూ.1000 జరిమానాలు విధిస్తున్నా, ఇక్కడ చెత్త వేయొద్దని మైకుల్లో హెచ్చరిస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. చెత్త వేసేవారికి ఈ– పెనాల్టీల విధానాన్ని సైతం అందుబాటులోకి తెచ్చారు. వీటి వల్ల జీహెచ్ఎంసీకి పెనాల్టీల రూపేణా ఆదాయం వస్తున్నప్పటికీ, ఎక్కడ పడితే అక్కడ ఉన్న చెత్త సమస్య సమసిపోలేదు. మూడు పర్యాయాలు.. ఈ నేపథ్యంలో రోడ్ల వెంబడి చెత్త కనిపించకుండా ఉండేందుకు మూడుసార్లు పర్యవేక్షణతో, ఎక్కడ చెత్త తరలించలేదో గుర్తించి సంబంధిత సిబ్బంది, అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఈ విధానంలో మూడు అంశాల్ని పరిశీలిస్తున్నారు. 1. ఇంటింటి నుంచి చెత్త తరలించే స్వచ్ఛ ఆటోలు ఎన్ని గైర్హాజరవుతున్నాయో గుర్తించడం. 2. చెత్తను సర్కిళ్లలోని సమీప ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలించాల్సిన ఆటోల్లో ఎన్ని పని చేయడం లేదో గుర్తించడం. 3. బహిరంగ ప్రదేశాల్లో చెత్తకుప్పలు గుట్టలుగా పోగయ్యే ప్రాంతాలను గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్‌గా గుర్తిస్తున్నారు. వాటిలో ఎన్నింటిని క్లీన్ చేసిందీ, ఎన్ని చేయనిదీ గుర్తిస్తున్నారు. ఈ పనుల్ని కేవలం రోజుకు ఒక్కసారి మాత్రమే కాకుండా మూడు పర్యాయాలు పర్యవేక్షిస్తున్నట్లు శానిటేషన్ విభాగం అడిషనల్ కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్ తెలిపారు. ఆమేరకు.. ఉదయం 8గంటలలోగా ఎన్ని స్వచ్ఛ ఆటోలు, ట్రాన్స్ఫర్ స్టేషన్ల ఆటోలు తమ పని పూర్తిచేసింది గుర్తిస్తారు. పని చేయని ఆటోల సిబ్బందిని అలర్ట్ చేస్తారు. అలాగే జీవీపీల్లో ఎన్నింటిని శుభ్రం చేయలేదో గుర్తించి సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు మరోసారి పరిశీలిస్తారు. ఆ తర్వాత 2.30 గంటలకు మరోమారు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. ఉన్నతాధికారులు కార్యాలయాల నుంచే పరిశీలించేందుకు రియల్‌టైమ్‌లో ఆయా ప్రాంతాలు కనిపించేలా వెబ్‌పోర్టల్ నిర్వహిస్తున్నారు. తొలిదశలో ఉదయం 8 గంటలలోగా 30 శాతం కంటే తక్కువ పనిచేసిన వారిపై తగిన చర్యలు తీసుకోనున్నారు. తద్వారా ఒకేసారి కాకున్నా క్రమేపీ చెత్త సమస్యలు పరిష్కారమవుతాయని అధికారులు భావిస్తున్నారు. రోజుకు మూడుసార్లు పరిశీలించే యోచన -
ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
లింగోజిగూడ: శివారు ప్రాంతాల ఏటీఎంలే లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.4 లక్షల నగదు, కారు, వివిధ రకాల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. రాజస్తాన్‌లోని డీగ్ జిల్లా సందీక గ్రామానికి చెందిన రాహుల్ అలియాజ్ రాహుల్ ఖాన్, మధ్యప్రదేశ్‌లో జేసీబీ మెకానిక్‌గా పని చేస్తున్న సందీక గ్రామానికి చెందిన జాహుల్ భాదన్ ఖాన్, జల్పల్లి షాజహాన్ కాలనీకి చెందిన ఎండీ సర్ఫారాజ్లు ఓ ముఠాగా ఏర్పడి ఏటీఎంలలో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గత ఫిబ్రవరి 22 నుంచి 26 రావిర్యాల, పహడీషరీఫ్, బాలాపూర్, జల్పల్లి, బీబీనగర్, భువనగిరి, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల్లోని ఏటీఎంల వద్ద రెక్కీ నిర్వహించారు. చివరకు రావిర్యాల, మైలార్‌దేవ్‌పల్లి ఏటీఎంలలో చోరీ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఫిబ్రవరి 26న మరికొందరు స్నేహితుల సాయంతో రావిర్యాల ఎస్బీఐ ఏటీంలో రూ.29 లక్షల 69 వేల 900 ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి మైలార్దేవ్ పల్లి, మధుబాన్ కాలనీలో మరో ఎస్బీఐ ఏటీఎంలో చోరికి ప్రయత్నించగా మిషన్‌లో మంటలు రావడంతో అక్కడి నుంచి నాందేడ్ మహారాష్ట్ర మీదుగా పారిపోయారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాహుల్‌ఖాన్, ముస్తాఖీన్ ఖాన్, వహీద్‌ఖాన్, షకీల్ ఖాన్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.4 లక్షల నగదు, కారు, చోరీకి ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేయండి
ఉస్మానియా యూనివర్సిటీ: యూనివర్సిటీలలో నూతన పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని, విద్యార్థులు, పరిశోధకులు మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. బుధవారం ఓయూ క్యాంపస్ సైన్స్ కాలేజీ ఫిజిక్స్ విభాగంలో మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ ఫర్ సొసైటల్ అప్లికేషన్స్ అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమానికి వీసీ ప్రొ.కుమార్ అధ్యక్షత వహించగా ఓయూ ఛాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. సమాజ అవసరాలు తీర్చేలా పరిశోధనలు జరగాలని అన్నారు. పరిశోధన ఫలాలు ప్రధానంగా గిరిజనులకు చేరాలన్నారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో విభిన్న విభాగాలు కలసి పనిచేయాలని, తద్వారా నాణ్యతమైన ఉత్పత్తులు చౌకగా లభిస్తాయన్నారు. పరిశోధనలలో ఓయూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతోందని వీసీ ప్రొ.కుమార్ అన్నారు. అంతరం సదస్సు సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సదస్సు చైర్మన్, హెడ్ ప్రొ.శ్రీనివాస్, ఏఆర్‌సీఐ డైరెక్టర్ డా.విజయ్, ఎఎండీ డైరెక్టర్ ధీరజ్ పాండే, ప్రొ.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. – గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ -
పది వేల మందితో మళ్లీ వస్తాం
ఇబ్రహీంపట్నం/యాచారం: పది వేల మంది నిరుపేదలతో మరోసారి రామోజీ ఫిలిం సిటీకి వస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరించారు. యాజమాన్యం ఆక్రమించిన పేదల ఇళ్ల స్థలాలను వదిలేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఫిలింసిటీ వద్ద ఆందోళన నిర్వహించిన సీపీఎం నేతలను అరెస్టు చేసిన పోలీసులు వీరిని ఇబ్రహీంపట్నం, యాచారం పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాల వద్దకు వెళ్తున్న లబ్ధిదారులను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని..ఆ భూములతో పోలీసులకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. 2007లో అప్పటి ప్రభుత్వం సుమారు 600 మందికి 20 ఎకరాల్లో 60 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి సర్టిఫికెట్లు ఇచ్చిందని.. అప్పటి నుంచి ఈ భూములు రామోజీ కబ్జాలోనే ఉన్నాయని ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితంలేకపోవడంతో వారి స్థలాల్లోకి లబ్ధిదారులు వెళ్లారన్నారు. పోలీసులు రామోజీ యాజమాన్యానికి తొత్తులుగా మారి పేదలను అడ్డుకుంటున్నారని..రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవాల్సిన విషయంలో పోలీసులు తలదూర్చడం తగదన్నారు. రామోజీ కబంధ హస్తాల్లో ఉన్న మరో 300 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం బయటకు తీస్తామని అన్నారు. పేదల భూములు కబ్జా పెట్టిన రామోజీ యాజమాన్యంపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పేదల పక్షాన పోరాడుతున్న తమపై కేసులు బనాయించడం సరికాదన్నారు. నేడు, రేపు ఆందోళనలు: సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య పోలీసుల అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ గురు, శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పోలీసుల తోపులాటలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పి.జగన్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. బుగ్గరాములు, సామేల్, జగదీశ్, జగన్, జంగయ్య, కిషన్, వెంకటేశ్, నర్సిరెడ్డి, ఎల్లేశ్, తులసిగారి నర్సింహ, అరుణ, స్వప్న, ప్రకాశ్‌కారత్, చరణ్, ఆనంద్, శ్రీకాంత్, శివ యాదగిరి, నర్సింహ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల కస్టడీలో ఉన్న వారిని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్యపరామర్శించారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరన్నారు. పేదల భూముల్లో గుడిసెలు వేస్తాం రెవెన్యూ సంబంధిత విషయంలో పోలీసుల జోక్యం తగదు రామోజీ యాజమాన్యంపై కేసులు పెట్టాలి త్వరలో పది వేల మందితోగుడిసెలు వేస్తాం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ -
పత్తర్‌గట్టీ భవనం పెచ్చులూడి..ఇరువురికి గాయాలు
దూద్ బౌలి: పాతబస్తీలోని చారిత్రక కట్టడం పత్తర్‌గట్టీ భవనం పెచ్చులూడి ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. బుధవారం రాత్రి వందలాది మంది రంజాన్ షాపింగ్‌లో మునిగి ఉండగా..అకస్మాత్తుగా పత్తర్‌గట్టీ భవనంలోని ఓ షాపు కిటికీ పైనుంచి గచ్చు పెచ్చులు ఊడిపడగా షాపు ముందున్న ఓ చిరువ్యాపారి, మరో యువకుడు గాయపడ్డారు. సమాచారం అందుకున్న చార్మినార్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పురావస్తు శాఖ అధికారులు చారిత్రాత్మక కట్టడం అయినా పత్తర్‌గట్టి భవనాన్ని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
సమాజ పరివర్తనే సంఘ్ ప్రధాన లక్ష్యం
కాచిగూడ: సమాజ పరివర్తనే ప్రధాన లక్ష్యంగా సంఘ్ పనిచేస్తోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచం రమేష్ అన్నారు. బుధవారం బర్కత్‌పుర కేశవ నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రాంత సంఘ్ చాలక్ బర్ల సురేందర్ రెడ్డితో కలిసి ఆయాన మాట్లాడుతూ బెంగళూర్‌లో ఇటీవల జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధుల సభలో చేసిన తీర్మానాలు, సంఘ్ శతాబ్ది సంవత్సరం సందర్భంగా తెలంగాణ, దేశ వ్యాప్తంగా చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమాలను వివరించారు. నూరేళ్ళ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సంఘ్ ఆలోచనలు, భావాలను సమాజం వద్దకు తీసుకెళ్లేలా వచ్చే నవంబర్–డిసెంబర్–జనవరి నెలల్లో దేశంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్లడానికి జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. సమాజ పరివర్తనకు సంబంధించిన అంశాలను ప్రజలకు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి లక్ష మంది ఒక యూనిట్‌గా హిందూ సమాజ ఉత్సవాలు చేస్తామని, ఇందులో స్థానిక నేతలు, హిందూ సంస్థలకు భాగస్వామ్యం కల్పించి హిందుత్వాన్ని, ధర్మాన్ని సమాజంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. -
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
గచ్చిబౌలి: రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బుధవారం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో సీ్త్రనిధి 12వ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మొదలైన సీ్త్రనిధి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. అవకాశాలు ఇస్తే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారని, కోటిమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. కోవిడ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన యువతులను సీ్త్రనిధి సభ్యులుగా చేర్చి ఆదుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలు గౌరవంగా ఉండే విధంగా మహిళాఆర్మీ కృషి చేస్తుందని, అందుకు త్వరలోనే మార్యదర్శకాలు రూపొందిస్తామని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా సీ్త్ర నిధికి భవనం కేటాయిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. సీ్త్రనిధి బ్యాంక్‌పై సెర్ప్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవిందర్‌రావు రూపొందించిన పాటను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. అనంతరం డివిడెండ్ ఫండ్ చెక్‌ను మహిళా సమాఖ్య సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈఆర్పీ సీఈఓ దివ్య, సీ్త్రనిధి అధ్యక్షురాలు ఇందిర, ఎండీ విద్యాసాగర్‌రెడ్డి, కోశాధికారి సరస్వతి, కొమురంభీం అడిషనల్ కలెక్టర్ దీపక్‌తివారి, వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, కోఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రార్ సురేంద్రమోహన్, మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.