
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని బడంగ్‌పేటలో రోడ్డును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
వివరాల ప్రకారం.. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్‌గూడలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. కాలనీవాసుల ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. రోడ్డును ఆక్రమించి ఇండోర్ క్రికెట్ కోర్డును నిర్మాణం జరిగింది. ఈ క్రమంలో సదరు నిర్మాణాన్ని హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేశారు.
ఈరోజు ఉదయం జేసీబీల సాయంతో క్రికెట్ కోర్టును కూల్చివేశారు హైడ్రా అధికారులు. ఫిర్యాదు చేయగానే స్పందించి అక్రమాలను కూల్చివేసినందుకు హైడ్రాకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు కాలనీ వాసులు. ఈ సందర్బంగా కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో, అక్కడ ఉద్రికత్తకర వాతావరణం చోటుచేసుకుంది.
ఇదిలా ఉండగా.. ప్రతీ సోమవారం బుద్ధభవన్‌లో ప్రజావాణి కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. 2025 జనవరి నుంచి ప్రారంభించిన ఈ ప్రజావాణికి హైదరాబాద్ ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. తమ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై పలువురు ఫిర్యాదు చేస్తున్నారు.

హైడ్రా అధికారులపై దాడికి యత్నం..
కూల్చివేతల సందర్భంగా హైడ్రా అధికారులను బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి, ఇతర వ్యక్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే హైడ్రా సీఐ తిరుమలేష్‌పై దాడికి ప్రయత్నించారు. బోయపల్లి ఎన్‌క్లేవ్ కాలనీవాసులు బోయపల్లి వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డిపై హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.
1982 జీపీ లేఔట్ చేసి ప్లాట్లను విక్రయించిన భూ యజమానులు. సర్వే నెంబర్ 39,40,41,42,44లో మొత్తం 5 ఎకరాలు ఏడు గుంటల భూమి. లేఅవుట్‌లో 236 గజాల పార్కు స్థలం కబ్జా చేసిన భూ యజమానులు. మూడు రోడ్లను కాలనీ వాసులకు చూపించిన భూ యజమానులు. రోడ్లు మూసి వేయడంతో కాలనీవాసులు ఇబ్బందులను హైడ్రాకు విన్నవించారు. దీంతో, కూల్చివేతల సందర్బంగా దాదాపు 40 మంది హైడ్రాధికారులు పాల్గొన్నారు. స్థానిక పోలీసులకు బందోబస్తు సమాచారం ఇచ్చినట్టు తిరుమలేష్ తెలిపారు. బడంగ్‌పేట్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు తిరుమలేష్ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులను అడ్డుకున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.