demolish illegal structures
-
అక్రమ నిర్మాణాలే టార్గెట్.. మైలార్దేవుపల్లిలో కూల్చివేతలు
రంగారెడ్డి: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇక, హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన అధికారులు, హైడ్రా అధికారులు ఫుల్ ఫోకస్ పెట్టారు. తాజాగా మైలార్దేవుపల్లి పరిధిలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. తాజాగా మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లక్ష్మీగూడలో కూల్చివేతలు ప్రారంభించింది. రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్‌పై ఉన్న ఆక్రమణలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగిస్తున్నారు. రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబ్బంది అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. -
కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన
హైదరాబాద్, సాక్షి: కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్న ఆయన.. అయితే హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమని స్పష్టత ఇచ్చారు. మంగళవారం కాముని చెరువు, మైసమ్మ చెరువులను ఆయన పరిశీలించి.. మీడియాతో మాట్లాడారు.హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లం. జులై తర్వాత.. అంటే హైడ్రా ఏర్పాటు తర్వాత కడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం. గతంలో అనుమతులు తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్నవాటి వైపు కూడా వెళ్లం. కానీ, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదు అని ప్రకటించారాయన. అలాగే..కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా తనిఖీలు చేస్తుందని, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు హైడ్రా పనిచేస్తుందని స్పష్టత ఇచ్చారు. హైడ్రా ఎప్పుడూ పేదవాళ్లు, చిన్నవాళ్ల జోలికి పోదు. ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసిన నమ్మొద్దు అని ప్రజలకు రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణలో హైడ్రా బుల్డోజర్లకు కొన్నాళ్లు బ్రేక్. ఇప్పట్లో నిర్మాణాల కూల్చివేతలు వద్దని ప్రభుత్వ నిర్ణయం. అంతర్గత వ్యవస్థను పూర్తి స్థాయిలో పటిష్టం చేసుకోవడంపై హైడ్రా దృష్టి
-
ఇప్పటంలో జనసేన మూకల ఓవరాక్షన్.. గుడిలోకి వెళ్లి తాళాలు వేసి..
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా ఇప్పటంలో గతంలో తొలగించకుండా మిగిలిపోయిన ఆక్రమణల విషయంలో జనసేన మూకలు శనివారం మరోసారి గ్రామంలో చిచ్చుపెట్టేందుకు యత్నించారు. అధికారులు ఎంతచెప్పినా వినకపోవడంతోపాటు గ్రామంలోని రామాలయంలోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. సదరు ఆక్రమణలు ప్రభుత్వ భూమిలోనివేనని అధికారులు స్పష్టంచేయడం.. పోలీసుల హెచ్చరికలతో జనసేన మూకలు తోకముడిచాయి. వివరాల ప్రకారం.. గతంలో నానా రభస సృష్టించి ఇప్పటంలో అభివృద్ధి పనులను జనసేన శ్రేణులు అడ్డుకోవడంతో మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటీఎంసీ) అధికారులు అప్పట్లో కొన్ని ఆక్రమణలను తొలగించలేదు. వీటిని తిరిగి శనివారం తొలగించేందుకు సిద్ధమవుతుండగా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి జనసేన, టీడీపీ శ్రేణులు గ్రామంలో మరోసారి రగడ సృష్టించేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని రాయడానికి వీల్లేని భాషలో ఇష్టానుసారం దూషించారు. కానీ, ఎంటీఎంసీ అధికారులు మాత్రం సంయమనం పాటించారు. అంతేకాక.. తామేమీ ప్రైవేట్ ఆస్తులను తొలగించడంలేదని.. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించుకున్న ప్రహరీ గోడలు, మెట్లు, వ్యాపార సముదాయాలు మాత్రమే తొలగిస్తున్నామని స్పష్టంచేశారు. ఇంతలో అది ప్రభుత్వ భూమి అయితే ఆధారాలు చూపాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేయగా అధికారులు అందుకు సరేనన్నారు. అదే సమయంలో గ్రామంలో బయట వ్యక్తులు ఎవరూ ఉండకూడదని పోలీసులు హెచ్చరించడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. వారిని అడ్డుకునే ప్రయత్నంలో జనసేన మూకలు రెచ్చిపోగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు అక్కడి రామాలయంలోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. ఇంతలో ఎంటీఎంసీ అధికారులు 1916 నాటి రికార్డులను తీసుకొచ్చి వారికి చూపించారు. దీంతో.. అధికారులు ఆక్రమణలపై చేసిన మార్కింగ్ కొలతలు.. రికార్డుల్లో ఉన్న కొలతలు ఒకటేనని తేలిపోయింది. ఇక ఏం మాట్లాడాలో అర్ధంకాక అధికారులతో జనసేన మూకలు వాదనకు దిగాయి. పోలీసులు హెచ్చరించడంతో వారు బయటకొచ్చి వెళ్లిపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి సద్దుమణిగింది. ఇదిలా ఉంటే.. జనసేన శ్రేణులు గుడిలోకి వెళ్లి తాళాలు వేసుకోవడం.. ప్రభుత్వం, సీఎంపై నానా మాటలు అనడంతో గ్రామానికి చెందిన మహిళలు బహిరంగంగానే ఆక్షేపించారు. -
బుల్డోజర్లతో ‘‘అమిత్ షా ఇంటిని కూల్చేయండి’’
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో అక్రమ కట్టాల పేరిట ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేతలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు కలుగజేసుకోవడంతో ఈ కూల్చివేత నిలిచిపోయింది. కానీ, అధికారులు మాత్రం సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా.. దాదాపు రెండు గంటలపాటు కూల్చివేతల పనులను కొనసాగించారు. ఆ సమయంలో జహంగీర్‌పురిలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక, ఇటీవల హనుమాన్ జయంతి వేడుకల సమయంలో జహంగీర్‌పురిలో గొడవలు జరిగిన విషయం విధితమే. ఈ సందర్బంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్వయంగా ఈ అల్లర్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మీరు బుల్డోజర్లను ఉపయోగించాలనుకుంటే.. బీజేపీ హెడ్‌క్వార్టర్స్, అమిత్ షా ఇంటిని కూల్చేయండి అంటూ మండిపడ్డారు. అప్పుడు అల్లర్లు ఆగిపోతాయి అంటూ రాఘవ్ చద్దా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 15 ఏళ్లుగా బీజేపీ పార్టీనే మున్సిపల్ అధికారాన్ని అనుభవించిందని, ఆ సమయంలో అనేక ముడుపులు తీసుకొని, అక్రమ నిర్మాణాలకు అనుమతినిచ్చిందని తెలిపారు. ముడుపులు తీసుకున్న బీజేపీ నేతల ఇళ్లను కూడా ఇలాగే కూల్చేయాలని చద్దా డిమాండ్ చేశారు. ఇళ్ల కూల్చివేతపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. రాహుల్ ట్విట్టర్ వేదికగా..‘‘భారత రాజ్యాంగ విలువలను కూల్చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదలు, మైనారిటీలే లక్ష్యంగా ఇలా చేస్తున్నారని రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. This is a demolition of India’s constitutional values. This is state-sponsored targeting of poor & minorities. BJP must bulldoze the hatred in their hearts instead. pic.twitter.com/ucSJK9OD9g — Rahul Gandhi (@RahulGandhi) April 20, 2022 ఇది చదవండి: ప్రశాంత్ కిషోర్‌పై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయన అంటేనే ఓ బ్రాండ్.. -
ఆక్రమణలపై కొరడా: పీలేరులో అక్రమ నిర్మాణాల కూల్చివేత
సాక్షి, చిత్తూరు: పీలేరులో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. శనివారం అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. తిరుపతి రోడ్డులో కబ్జాదారులు భారీ ఎత్తున భవనాలు నిర్మించారు. మదనపల్లె సబ్‌కలెక్టర్ జాహ్నవి నేతృత్వంలో ఉదయం నుంచి పోలీసుల బలగాల సమక్షంలో భవనాల కూల్చివేత చేపట్టారు. ఇప్పటికే 10 భవనాలను రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. -
కూల్చివేతలు.. పోలీసులపై రాళ్లదాడి
సాక్షి, హైదరాబాద్ : శేరిలింగపల్లి మండలం గోపంపల్లి కేశవనగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తాము ఉంటున్న నివాసాలను కూల్చుతున్నారంటూ ఆందోళనకారులు పోలీసులపై కారం, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్ఐలతో పాటు పలువురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు రెవిన్యూ అధికారులు, పోలీసులతో కలిసి కేశవ నగర్‌కు వచ్చారు. కూల్చివేతలకు నిరసనగా ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అరెస్ట్ చేసేందుకు పోలీసులు రావడంతో కోపంతో రాళ్లదాడికి దిగారు. దీంతో ప్రతిగా పోలీసులు కూడా ఎదురుదాడికి దిగడంతో ఆ ప్రాంతమంతా కశ్మీర్‌ను తలపించింది. కేశవనగర్‌లోని సర్వేనంబర్ 37/2 రెండు ఎకరాల భూమిని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భాగంగా అందులో ఉన్న నిర్మాణాలను అధికారుల సహాయంతో కూల్చివేసింది. -
'టీఆర్ఎస్ నేతల ఇళ్లను వదిలి మిగతావారిపై పడ్డారు'
హైదరాబాద్ : అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండోరోజు కూడా కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది. కాగా కట్టడాల కూల్చివేతను శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మంగళవారం అడ్డుకున్నారు. కూల్చివేతలను ఆపివేయాలని ఆయన ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కోరారు. అయితే కూల్చివేతలు ఆపేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. దాంతో కూల్చివేతలను అడ్డుకున్న ఎమ్మెల్యే గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ టీఆర్ఎస్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతల ఇళ్లను వదిలి మిగతా వారిపై పడ్డారని ఆయన ఆరోపించారు. తెలిసీ, తెలియక కొన్న భూములను రెగ్యులరైజ్ చేయాలని ఎమ్మెల్యే గాంధీ డిమాండ్ చేశారు. కాగా అక్రమ నిర్మాణాలపై చర్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. గురుకుల ట్రస్ట్ భూముల్లోని అక్రమ నిర్మాణాల వివరాలను ఆగమేఘాల మీద ఆరా తీసి కూల్చివేతలు కూడా చేపట్టారు. ట్రస్ట్ భూముల్లో వెలిసిన కాలనీల్లో ఒకటైన అయ్యప్ప సొసైటీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం సెంట్రింగ్‌ను, మరో భవనంపై పిల్లర్లను నిన్న ధ్వంసం చేశారు. దీంతో అయ్యప్ప సొసైటీలోని భవన యజమానుల గుండెల్లో దడ మొదలైంది. ఏ క్షణాన తమ భవనంపైకి వచ్చి పడతారోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.