YS Jagan Mohan Reddy
-
శ్రీ సత్యసాయి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
-
వైఎస్ జగన్ అనంతపురం పర్యటన ఖరారు
అనంతపురం, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనంతపురం(Anantapur) జిల్లా పర్యటన ఖరారైంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైన పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఆయన పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తారని మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డి శనివారం ప్రకటించారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పరిటాల వర్గీయుల చేతిలో ఉగాది నాడు వైఎస్సార్సీపీ కార్యకర్త లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్(YS Jagan).. బాధిత కుటుంబంతో ఫోన్లో మాట్లాడారు. తమకు ప్రాణహాని ఉందని లింగమయ్య కుటుంబ సభ్యులు జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వాళ్లకు ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని, అవసరమైతే న్యాయపరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో త్వరలో వచ్చి కలుస్తానంటూ మాట ఇచ్చారు.వైఎస్ జగన్ పర్యటన వేళ.. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైఎస్సార్సీపీ కీలక నేతలు ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, శంకర్ నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన వైఎస్ జగన్
-
బాబు జగ్జీవన్‌రామ్‌కు వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు బాబు జగ్జీవన్‌రామ్ జయంతి. ఆయన జయంతి సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. జగ్జీవన్‌రామ్‌కు నివాళులు అర్పించారు. దేశానికి జగ్జీవన్‌రామ్ అందించిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘దళితులు, అణచివేతకు గురైన వర్గాల వారికి అండగా ఉంటూ వారి హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్‌రామ్. స్వాతంత్ర్య సమర యోధుడిగా, రాజకీయ నాయకుడిగా, ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ఆ మహనీయుడు అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శనీయం. జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు’ అర్పించారు. దళితులు, అణచివేతకు గురైన వర్గాల వారికి అండగా ఉంటూ వారి హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్‌రామ్ గారు. స్వాతంత్ర్య సమర యోధుడిగా, రాజకీయ నాయకుడిగా, ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ఆ మహనీయుడు అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శనీయం. నేడు బాబు… pic.twitter.com/f1NdjMz0g0— YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2025 -
Big Question: జగన్ దెబ్బకు కూటమిలో మొదలైన భయం!
-
మైనార్టీలు టీడీపీని వీడాలి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన టీడీపీపై రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలలో తీవ్ర ఆగ్రహం వ్యకమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందులను బహిష్కరించిన ముస్లిం సంఘాలు తాజా పరిణామాలతో టీడీపీని బాయ్‌కట్ చేయాలని నిర్ణయించాయి. ఇందుకు సంబంధించి బుధ, గురువారాల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి కీలక ముస్లిం సంఘాలు దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది.లౌకిక పార్టీగా చెప్పుకొనే టీడీపీ.. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలికి లౌకికవాదానికి చెల్లుచీటి రాసిందని ముస్లింలు మండిపడుతున్నారు. టీడీపీలోని ముస్లిం నేతలు ఆ పార్టీకి రాజీనామా చేయాలని, ముస్లిం సమాజం టీడీపీని బాయ్‌కట్ చేయాలనే డిమాండ్ బలం పుంజుకుంది.ఉమీద్ పే ‘ఉమ్మీద్’ నహీ హై వక్ఫ్ యాక్ట్–1995ను సవరించిన కేంద్ర ప్రభుత్వం ‘యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్ ఏఫీషియన్సీ అండ్ డెవలప్మెంట్ – ఉమీద్(యుఎంఈఈడి)గా మార్చింది. ఉమీద్పై ముస్లిం సమాజానికి ఉమ్మీద్ నహీ హై (నమ్మకం లేదు). ఇది మత స్వేచ్ఛపై దాడి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26లను ఉల్లంఘిస్తోంది.దేశంలో ఏ ఇతర మతాలకు వర్తించని నిబంధనలు ముస్లింలకు మాత్రం పెట్టడం దారుణం. దీనిపై రాజ్యాంగ పరిధిలో పోరాటం చేస్తాం. పూర్వీకులు ఇచ్చిన వక్ఫ్ (అల్లాహ్ పేరుతో దానమిచ్చిన) భూములు, ఆస్తులను కాపాడుకోవడం ప్రతి ముస్లిం బాధ్యత. – షేక్ మునీర్ అహ్మద్, రాష్ట్ర కన్వీనర్, ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ముస్లిం నేతల్లారా.. టీడీపీని వీడండిచంద్రబాబు పచ్చి అవకాశవాది అని మరోసారి రుజువైంది. సవరణ బిల్లుకు మద్దతు పలికి చేయాల్సిన నష్టం అంతా చేసిన టీడీపీ, జనసేన ఇంకా ముస్లిం సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడం దుర్మార్గం. సవరణ బిల్లుకు ఆమోదం పలికిన టీడీపీ.. అందుకు విరుద్ధంగా వక్ఫ్ కమిటీల్లో ముస్లింలకే ప్రాధాన్యత కల్పిస్తామని, కలెక్టర్లకు తుది నిర్ణయం ఉండకుండా ఉన్నత స్థాయి అధికారులను నియమిస్తామని చెప్పడంలో మతలబు ఏమిటి? ముస్లిం సమాజానికి ద్రోహం చేసిన చంద్రబాబును మైనార్టీ నేతలెవరైనా ఇంకా సమర్థిస్తున్నారంటే వారికి సిగ్గు లేనట్లే. 1997లో బీజీపీతో చంద్రబాబు జత కట్టడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి బషీరుదీ్దన్ బాబూఖాన్ టీడీపీకి, పదవులకు రాజీనామా చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలికిన చంద్రబాబు తీరును నిరసిస్తూ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ చైర్మన్లు టీడీపీకి, పదవులకు తక్షణం రాజీనామా చేయకపోతే ముస్లిం సమాజం క్షమించదు. – షేక్ గౌస్ లాజమ్, ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాంరాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడేందుకు, ఇచ్చిన మాటకు కట్టుబడి వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిలబడిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ముస్లిం సమాజం రుణపడి ఉంటుంది. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చరిత్రహీనులుగా మిగిలితే.. వైఎస్ జగన్ హీరోగా నిలిచారు. దేశంలోని 14.6 శాతం ముస్లింల అభ్యంతరాలను లెక్కచేయకుండా ఏకపక్షంగా సవరణ బిల్లును ఆమోదించడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాయడమే. ఆ బిల్లుకు కూటమి ఎంపీలు మద్దతు ఇవ్వటం చరిత్రలో చీకటి రోజుగా నిలుస్తుంది. ఈ బిల్లుతో వక్ఫ్ భూములతోపాటు మసీదులు, దర్గాలు, ఖబరస్తాన్లకు రక్షణ ఉండదు. – సదర్ ఉద్దీన్ ఖురేషి, ముస్లిం సంక్షేమ సంఘం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికార ప్రతినిధి -
లోకేష్ నీ స్థాయేంటో తెలుసుకో
తాడేపల్లి,సాక్షి : అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి గురించి మంత్రి నారా లోకేష్ అనుచితంగా మాట్లాడటం సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు హితువు పలికారు.రెడ్ బూక్ చూసి ఒకరు కిందపడ్డారని, మరొకరికి గుండెపోటు వచ్చిందని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు స్పందించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అధికారం శాశ్వతం కాదని లోకేష్ గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. రాజకీయాల్లో నేను ఎన్నోఎత్తుపల్లాలు చూశాను. అధికారం ఉంది కదా అని ఏనాడు హద్దు మీరలేదు. కానీ లోకేష్ అలా కాదు. అధికారం ఉందని వికటాట్టహాసం చేస్తున్నారు.వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కళ్ళు నెత్తి మీదకి ఎక్కి వాపును బలం అనుకుని లోకేష్ మాట్లాడుతున్నారు. లోకేష్ నీ స్థాయి ఏంటో తెలుసుకో. 2019లో పార్టీ ఒకటి పోవడానికి మీరు కూడా ఒక కారణం అని గుర్తుంచుకోండి. తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వస్తే మీరు ఓడిపోయారు. కూటమికి 164 సీట్లు వస్తే మీరు గెలిచారు.అబద్ధాలు ఆడటంలో చంద్రబాబు కన్నా లోకేష్ మించిపోయాడు. వైఎస్ జగన్ తెచ్చిన కంపెనీలను తానే తెచ్చానని లోకేష్ ప్రచారం చేసుకుంటున్నారు. వైఎస్ జగన్ తెచ్చిన కంపెనీలకు లోకేష్ శంకుస్థాపన చేస్తున్నారు. దావుస్ వెళ్లి చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం కంపెనీలు తెచ్చారు.చంద్రబాబు నాయుడు 52 రోజులు పాటు జైలుకి వెళ్ళిన ప్రిజనరి అని లోకేష్ గుర్తుపెట్టుకోవాలి. మీ సహచర మంత్రివర్గ సభ్యులు నీ గురించి ఏం చెప్పుకుంటున్నారో ముందు తెలుసుకో. జగన్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామని లోకేష్ చెప్తున్నారు. అదే వైఎస్ జగన్ మిర్చి యార్డుకు వచ్చినప్పుడు పోలీసులు సెక్యూరిటీని కల్పించలేదు.వైఎస్ జగన్ ప్రజల్లోకి వస్తే మీ సెక్యూరిటీ ఆపలేదు అది గుర్తుపెట్టుకోండి.మద్దతు ధరతో మిర్చి ఒక బస్తా ప్రభుత్వం కొనుగోలు చేస్తే నేను మీకు నమస్కారం చేస్తాను.మద్యపాన ప్రియులంతా చంద్రబాబుని తిట్టుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేయండి. పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం చేయండి. లోకేష్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. ఆయన స్థాయేంటో ఆయన తెలుసుకోవాలి. అధికార మదంతో లోకేష్‌కు కళ్లు నెత్తికెక్కాయి’అని ధ్వజమెత్తారు. -
YSRCP నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్
-
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. కొత్త జంటకు ఆశీర్వాదం
సాక్షి, తాడేపల్లి/కర్నూలు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు చేరుకున్నారు. జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో కుడా మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకులు కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధువరులు శ్రేయ, వివేకానందలను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. ఈ వేడుకలు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. -
ఉపఎన్నికల్లో మీరు చూపిన తెగువకు, ధైర్యానికి హ్యాట్సాఫ్: జగన్
-
ఇవాళ కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన
-
కొట్టాలి టెంకాయ మళ్లీ మళ్లీ
సాక్షి, అమరావతి: కొత్త ప్రాజెక్టులను ఆకర్షించడంలో విఫలమవుతున్న కూటమి సర్కారు.. గత ప్రభుత్వ హయాంలో వచి్చన ప్రాజెక్టులను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటోంది. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా రాష్ట్రంలో 100 కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) యూనిట్లను ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదుర్చుకోవడమే కాకుండా తొలి దశలో ఎనిమిది యూనిట్లకు శంకుస్థాపన కూడా చేస్తే ఇప్పుడు వాటిని కొత్తగా తామే తెచి్చనట్లు కూటమి ప్రచారం చేసుకుంటోంది. గత ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద తొలుత కాకినాడలో 3, రాజమండ్రిలో 2, కర్నూలు, నెల్లూరు, విజయవాడలో ఒక్కొక్కటి చొప్పున 8 ప్లాంట్లు ఏర్పాటు చేసింది.సుమారు రూ.1,920 కోట్ల పెట్టుబడితో 302 ఎకరాల్లో నెలకొల్పిన వీటిలో ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 1,05,500 టన్నులు. 70 వేల మంది రైతులకు ప్రయోజనం కలగనుందని గత ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడ సమీపంలోని కంచికచర్ల మండలం దొనబండ, తూర్పుగోదావరి జిల్లా కాపవరం వద్ద సీబీజీ ప్లాంట్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఈ ఏడాదిలోనే ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే కూటమి సర్కారు తన అనుకూల పత్రికలు, సోషల్ మీడియా ద్వారా ఈ ప్రాజెక్టును మంత్రి లోకేశ్ తీసుకొచి్చనట్లు భారీ ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. ఎన్టీపీసీ భారీ ప్లాంట్‌పైనా..రిలయన్స్ సీబీజీ ప్లాంట్ల విషయంలోనే కాదు ఎన్టీపీసీ దేశంలోనే తొలిసారిగా రూ.1.10 లక్షల కోట్లతో రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ యూనిట్ ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఒప్పందం చేసుకుంది. అన్ని పరిపాలన అనుమతులు, భూ బదలాయింపులు గత ప్రభుత్వ హయాంలోనే జరిగితే దాన్ని కూడా తామే తీసుకొచి్చనట్లు డప్పు కొంటుకుంటున్నారు. ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే రూ.పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు కాకినాడ గ్రీన్కో యూనిట్ వంటి వాటిని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. వైఎస్ జగన్ దావోస్ పెట్టుబడుల సమావేశంలో పాల్గొని ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్ సీఈవో ఆదిత్య మిట్టల్‌తో సమావేశమయ్యారు. ఆయనను ఏపీలో పెట్టుబడులకు ఒప్పించారు. కానీ, ఒక్కసారి నేరుగా కలవకుండానే ఒక్క ఫోన్ కాల్‌తో అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్‌ను తామే తీసుకొచ్చామని చెప్పుకోవడం చంద్రబాబు, లోకేశ్‌కు తప్ప ఎవరికీ సాధ్యం కాదని అధికారులే ఆశ్చర్యపోతున్నారు.నాడు ముఖేష్ అంబానీ రాక.. నేడు ఆకాష్ అంబానీ డుమ్మా రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన పెట్టుబడుల సదస్సుల్లో ఒక్కదానికి కూడా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ హాజరు కాలేదు. కానీ, 2023లో వైఎస్ జగన్ సర్కారు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్లో పాల్గొని గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ముఖేష్ అంబానీ, ఆయన తనయుడు ఆకాష్ అంబానీ 2020 ఫిబ్రవరిలో తాడేపల్లిలోని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటికి స్వయంగా వెళ్లి రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. ఇప్పుడు కనిగిరిలో రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీతో కలిసి ఐటీ శాఖ మంత్రి లోకేశ్ రిలయన్స్ సీబీజీ ప్లాంట్ శంకుస్థాపనలో పాల్గొంటారని కూటమి నేతలు పెద్దఎత్తున ప్రచారం చేశారు. ఆకాష్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా.. కనిగిరి కార్యక్రమంలో పాల్గొనలేదు. సీఎం చంద్రబాబు కాకుండా ఈ శాఖతో సంబంధం లేని లోకేశ్ హైజాక్ చేయడం.. మొత్తం పెట్టుబడులు తానే ఆకాష్ తో మాట్లాడి తెచ్చానంటూ అతి ప్రచారం చేసుకోవడంతో చివరి నిమిషంలో ఆకాష్ కనిగిరి పర్యటన రద్దు చేసుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఇది ప్రభుత్వ విశ్వసనీయతకు అద్దం పడుతోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
మధురవాడ (విశాఖ)/శ్రీకాకుళం క్రైమ్/బూర్జ/వీరఘట్టం/సాక్షి, అమరావతి : పెళ్లికి నిరాకరించారన్న కారణంతో తల్లీ కూతుళ్లపై ప్రేమోన్మాది విచక్షణారహితంగా దాడి చేశాడు. తల్లి మృతి చెందగా, కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. సీపీ శంఖబ్రత బాగ్చి, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పార్వతీపురం మన్యం జిల్లా దేవుదళ సమీపంలోని పెద్దపుర్లికి చెందిన నక్కా రాజు బతుకు తెరువు కోసం రెండేళ్ల క్రితం మధురవాడకు వచ్చి, కార్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్య గృహిణి. ఇద్దరు పిల్లలు. కుమార్తె దీపిక (20) ఆరేళ్ల క్రితం వీరఘట్టం మండలం పనసనందివాడలోని తన పిన్ని ఇంటికి ఓ కార్యక్రమానికి వెళ్లింది. ఎదురింట్లో ఉంటున్న దమరసింగి నవీన్ (26) పరిచయమయ్యాడు. నవీన్ డిగ్రీ పూర్తి చేసి, ఖాళీగా ఉంటున్నాడు. దీపిక విశాఖలోని మహిళా డిగ్రీ కళాశాలలో మైక్రోబయాలజీ పూర్తి చేసి, నర్సింగ్ చేస్తోంది. ఈ క్రమంలో దీపికను పెళ్లి చేసుకుంటానంటూ ఆమె తల్లిదండ్రులపై నవీన్ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాడు. ఇతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో పెళ్లి ఆలస్యం చేస్తూ వచ్చారు. దీంతో పెళ్లికి అంగీకరించకపోతే చంపేస్తానని కూడా పలుమార్లు బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతడి జీవితం నాశనం అయిపోతుందని దీపిక తండ్రి రాజు ఆలోచించాడు. అదే ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం12 గంటలకు కొమ్మాది జంక్షన్ హైవేకు కూతవేటు దూరంలో ఉన్న స్వయంకృషి నగర్లో బాధితుల ఇంటికి నవీన్ వచ్చాడు. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేస్తామని చెప్పడంతో విచక్షణ కోల్పోయి వాదనకు దిగాడు. ఓ దశలో ఉన్మాదంతో ఊగిపోతూ 1.30 గంటలకు తల్లీ కూతుళ్లపై చాకుతో దాడి చేశాడు. విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో నక్కా లక్ష్మి (47) అక్కడికక్కడే మృతి చెందగా, దీపికకు చేయి, మెడ ఇతర భాగాలపై తీవ్ర గాయాలై, స్పృహ తప్పింది. ఆ వెంటనే నిందితుడు పరారయ్యాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన దీపిక తల్లి చలనం లేకుండా ఉండడాన్ని గమనించింది. సహాయం కోసం ఎంత ప్రయత్నించినా ఎవరూ అందుబాటులోకి రాలేదు. మేడ మీద నుంచి అతికష్టంగా కిందికి వచ్చి ఆర్తనాదాలు చేయడంతో పక్కనే ఉన్న వ్యక్తి ఫోన్ చెయ్యడంతో పీఎంపాలెం ఎస్ఐ కె.భాస్కరరావు సంఘటనా స్థలికి చేరుకుని రక్తం మడుగులో ఉన్న దీపికను ద్విచక్ర వాహనంపై దగ్గర్లోని గాయత్రి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం మెడికవర్ ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. నిందితుడు నవీన్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ఐదు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టి, శ్రీకాకుళం జిల్లా బూర్జ నుంచి వీరఘట్టం వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. మేజి్రస్టేట్ ముందు హాజరు పరుస్తామని చెప్పారు. ఉలిక్కిపడిన పనసనందివాడ ఈ ఘటనతో నవీన్ స్వగ్రామం పనసనందివాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీపికతో కొన్నేళ్లుగా పరిచయం ఉన్నప్పటికీ, కొద్ది రోజులుగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరితో ఫోన్లో మాట్లాడినా అనుమానిస్తూ వచ్చాడు. ఓ దశలో ఆ యువతిపై చేయి కూడా చేసుకున్నాడు. దీంతో కొద్దిరోజులుగా అతనితో పెళ్లి జరిపించడంపై యువతి తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పది రోజులుగా అతని ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చివరకు కడతేర్చేందుకు పూనుకున్నాడు. వీరఘట్టం ఎస్ఐ జి.కళాధర్ గ్రామానికి చేరుకుని నవీన్ తల్లిదండ్రులు జ్యోతి, అన్నారావుల నుంచి వివరాలు సేకరించారు. కాగా, నిందితుడిని గంటల వ్యవధిలో పట్టుకున్నందుకు పోలీసులను విశాఖ డీఐజీ గోపినాథ్ జెట్టి, శ్రీకాకుళం ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అభినందించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువుకూటమి సర్కారుపై వైఎస్ జగన్ మండిపాటు విశాఖపట్నంలో ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో వేదింపులు తాళలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మరువక ముందే విశాఖలో ప్రేమోన్మాది దాడిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం, యువతి దీపిక ప్రాణాపాయ స్థితిలో ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమోన్మాది నవీన్‌ను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్ష్మి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందన్నారు. -
మీ నిబద్ధతకు హ్యాట్సాఫ్! : వైఎస్ జగన్
స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించిన 50 స్థానాలకు గానూ 39 చోట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలు గొప్ప తెగింపు చూపించి గెలిచారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం లేనప్పుడు పోటీ చేయకుండా హుందాగా వదిలేయాలి. కానీ చంద్రబాబు అలా కాకుండా నేను సీఎంను, నా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాకు బలం ఉన్నా లేకపోయినా ప్రతి పదవీ నాకే కావాలి.. ఎవరినైనా నేను భయపెడతా.. కొడతా.. చంపుతా.. ప్రలోభపెడతా..! అనే రీతిలో అహంకారంతో వ్యవహరిస్తున్న తీరును మనం అంతా చూస్తున్నాం. ఇది ధర్మమేనా? న్యాయమేనా? రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే.. తాను చేసిన మంచి పనిని చూపించి, నేను ఈ మంచి పని చేశానని ప్రజల దగ్గరకు ధైర్యంగా వచ్చి చిరునవ్వుతో వారి ఆశీర్వాదం తీసుకునేలా ఉండాలి. కానీ చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. అవి మోసాలుగా మిగిలాయి మీ జగన్ పాలనలో ప్రతి నెలా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక మేలు జరిగింది. నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేవి. చంద్రబాబు వచ్చిన తర్వాత నాలుగు వేళ్లు నోట్లోకి పోవడం మాట అటుంచి.. ఉన్న ప్లేటును కూడా తీసేశారు. ఇలాంటి పరిస్థితులలో ఆయన ప్రజల్లోకి వెళ్లలేడు. తన కార్యకర్తలను పంపించి ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పే పరిస్థితి కూడా లేదు– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘మీ అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. రాజకీయాలలో ఎప్పుడూ విలువలు, విశ్వసనీయత ఉండాలని నేను చాలా గట్టిగా నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటా.. పార్టీ కూడా అలాగే ఉండాలని మొట్టమొదటి నుంచి ఆశించా. కష్టకాలంలో మీ అందరూ చూపించిన తెగువ, స్ఫూర్తికి హ్యాట్సాఫ్..’ అని స్థానిక సంస్థల వైఎస్సార్సీపీ(YSRCP) ప్రజాప్రతినిధులను పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్రశంసించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా.. బెదిరింపులు, అక్రమ కేసులు, దాడులకు వెరవకుండా పార్టీ కోసం గట్టిగా నిలబడిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను అభినందించారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరాయని వ్యాఖ్యానించారు. ‘రాబోయే రోజులు మనవే.. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. జగన్ 1.0 పాలనలో కోవిడ్ వల్ల కార్యకర్తలకు చేయాల్సినంత చేయకపోయి ఉండవచ్చు. కానీ.. జగన్ 2.0లో అలా జరగదు. అందరికీ మాట ఇస్తున్నా. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటా. కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్ చేసి చూపిస్తాడు’ అని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..సంఖ్యాబలం లేనప్పుడు పోటీ చేయకూడదుమొన్న జెడ్పీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యులు, ఉప సర్పంచ్ స్థానాలు కలిపి దాదాపు 57 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే.. ఏడు చోట్ల అధికార పార్టీ గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఎన్నికలు వాయిదా వేశారు. మరో 50 చోట్ల వాయిదా వేసే పరిస్థితి లేకపోవడంతో అనివార్యంగా ఎన్నికలు జరిపారు. అలా ఎన్నికలు నిర్వహించిన 50 స్థానాలకు గానూ 39 చోట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలు గొప్ప తెగింపు చూపించి గెలిచారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. అసలు టీడీపీకి ఎక్కడా కనీసం గెలవడానికి కావాల్సిన సంఖ్యాబలం లేదు. అయినా సరే.. మభ్యపెట్టి, భయపెట్టి, ప్రలోభ పెట్టి.. ఏకంగా పోలీసులను వాడుకుని దౌర్జన్యాలు చేస్తూ ఎన్నికలు నిర్వహించారు. ఇన్నేళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబుకు నిజంగా బుద్ధీ, జ్ఞానం రెండూ లేవు! సూపర్ సిక్స్‌లు.. మోసాలుగా మిగిలాయిఎన్నికల మేనిఫెస్టోలో 143 హామీలతో కూటమి పార్టీలు ప్రజలను మభ్యపెట్టి, ప్రతి ఇంటికి వారి కార్యకర్తలను పంపించి పాంప్లెట్లు పంచాయి. చంద్రబాబు బాండ్లు పంపించారని ప్రతి ఒక్కరికీ చెప్పి ఎన్నికల్లో గెలిచాయి. చంద్రబాబు పాలన చేపట్టి దాదాపు 11 నెలలు అవుతుంది. మరి ఆయన చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు ఏమయ్యాయని ఎవరైనా అడగడానికి ధైర్యం చేస్తే.. ఆ స్వరం కూడా వినిపించకుండా చేయాలని తాపత్రయపడుతున్నారు. ఆ హామీలను నెరవేర్చాలనిగానీ, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంగానీ చంద్రబాబులో కనిపించడం లేదు. ప్రతి అడుగులోనూ మోసం.. పాలనలో అబద్ధాలే కనిపిస్తున్నాయి. సూపర్ సిక్స్‌లు, సెవెన్లు గాలికెగిరిపోయి మోసాలుగా కనిపిస్తున్నాయి. మాట మీద నిలబడే పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారు..సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎందుకు అమలు చేయడం లేదు అని అడుగుతుంటే రాష్ట్రం అప్పులు రూ.10 లక్షల కోట్లు అని చంద్రబాబు అంటారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలోనే రాష్ట్రం అప్పు రూ.6.50 లక్షల కోట్లు అని చూపించారు. అందులో రూ.3.13 లక్షల కోట్లు ఆయన ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆయన చేసిన అప్పులే అని తెలుసు. కానీ రాష్ట్రాన్ని భయంకరంగా చూపించాలని రూ.10 లక్షల కోట్లు అని చెబుతున్నారు. మరో రెండు రోజులు పోతే రూ.12 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అని చెబుతాడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను ఎగ్గొట్టడానికే ఈ దిక్కుమాలిన అబద్ధాలు చెబుతున్నారు. ఇలాంటి దిక్కుమాలిన అబద్ధాలు, మోసాలతో రాష్ట్రంలో పాలన చేస్తున్నాడు. ఇలాంటి పాలన పోయి మళ్లీ మాట చెబితే ఆ మాట మీద నిలబడే పాలన రావాలని, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలను పరిష్కరించాలని తపించే గుండె ఉండే మంచి పాలన రావాలని ప్రజలందరూ ఇవాళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఉన్నదల్లా రెడ్‌బుక్ రాజ్యాంగమే..మరోవైపు ఇవాళ వలంటీర్ వ్యవస్థ లేదు. పారదర్శకత లేదు. స్కీములూ లేవు. ఉన్నదల్లా రెడ్ బుక్ రాజ్యాంగమే. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. పోలీసులను అధికార పార్టీ కాపలాదారులుగా వాడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దారుణ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం..⇒ తిరుపతి కార్పొరేషన్లో మనం 48 స్థానాలు గెలిస్తే వాళ్లు కేవలం ఒక్కటే గెలిచారు. అక్కడ ఇటీవల డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా మన కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సును అడ్డుగుతున్నారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్సీని పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్ చేశారు. ఇలా చేయడానికి సిగ్గు ఉండాలి. ⇒ విశాఖ కార్పొరేషన్లో 98 స్థానాలకు వైఎస్సార్సీపీ 56 స్థానాలకు పైగా గెలిచింది. అక్కడ ప్రజాస్వామ్యయుతంగా వైఎస్సార్సీపీ మేయర్ ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టారు. మన కార్పొరేటర్లు క్యాంపుల్లో ఉంటే.. పోలీసులు వారి ఇళ్ల వద్దకు వచ్చి మీ భర్తలు ఎక్కడున్నారో చెప్పాలని, లేదంటే మిమ్మల్ని స్టేషన్‌కి తరలిస్తామని బెదిరిస్తున్నారు. బుద్ధీ, జ్ఞానం ఉన్నవారు ఎవరైనా పోలీసులను ఈ మాదిరిగా వాడుకుంటారా?⇒ అనంతపురం జిల్లా రామగిరి మండలంలో పదికి తొమ్మిది స్థానాలు మనవే. వాళ్లు ఒక్కటే గెలిచారు. సంఖ్యాపరంగా చూస్తే ఉప ఎన్నికలో మనమే గెలవాలి. కానీ అక్కడ ఎస్ఐ పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చినట్లు నమ్మించి తొమ్మిది మంది మన ఎంపీటీసీలను కిడ్నాప్ చేశాడు. వీడియో కాల్లో లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడిస్తున్నాడు. అయినా సరే మన ఎంపీటీసీలు మాట వినకపోవడంతో మండల కేంద్రంలో నిర్బంధించి బైండోవర్ కేసులు పెడుతున్నాడు. దీనిపై మన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతటితో ఆగకుండా.. ఆ మండలంలో భయం రావాలట..! అందుకోసం లింగమయ్య అనే బీసీ నాయకుడిని హత్య చేశారు. పోలీసుల సమక్షంలో చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి చర్యలు చేయిస్తున్నారు. ఇదా ప్రజాస్వామ్యం?⇒ స్వయంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని రామకుప్పంలో 16కి మొత్తం 16 ఎంపీటీసీలను మనం గెలిచాం. ఆరుగురిని ప్రలోభపెట్టగా..మిగిలిన వాళ్లు మనవాళ్లే. అక్కడ మనవాళ్లు ప్రయాణిస్తున్న బస్సును పోలీసులతో అడ్డుకుని కౌంటింగ్ దగ్గరకు పంపించకుండా చంద్రబాబు ఆపించారు. అక్కడ కోరమ్ లేకపోయినా.. ఆరుగురే ఉన్నా వాళ్ల మనిషే గెలిచినట్లు డిక్లేర్ చేశాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని.. ఎంపీపీ స్థానంలో బలం లేకపోయినా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇదీ.⇒ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం గోపవరంలో ఉప సర్పంచ్ ఎన్నికలు చూస్తే.. మనం 19 గెలిస్తే వాళ్లు నలుగురిని ప్రలోభపెట్టారు. మనవాళ్లు 15 మందిని పోలీసులు బందోబస్తు కల్పిస్తామని చెప్పి తీసుకెళ్లి టీడీపీ సభ్యులున్న చోట విడిచిపెట్టారు. అంటే టీడీపీ వాళ్లను దౌర్జన్యం చేయమని వదిలేశారు. కౌంటింగ్ హాల్లోకి మనవాళ్లను లోపలకి పంపించరు కానీ.. వాళ్లను మాత్రం పంపిస్తారు. అక్కడ నకిలీ వార్డు మెంబర్లతో ఐడీ కార్డులు తయారు చేశారు. అదే విషయం ఎన్నికల అధికారికి చెబితే ఎన్నిక వాయిదా వేశారు. మళ్లీ రెండో రోజు.. ఎన్నికల అధికారికి గుండెపోటు అని వాయిదా వేశారు. బలం లేనప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నారు. ⇒ ఇక తుని మున్సిపాల్టీలో 30కి 30 కౌన్సిలర్లు మనమే గెలిచాం. వాళ్ల దగ్గర ఏమాత్రం సంఖ్యా బలం లేదు. అయినాకూడా వైస్ చైర్మన్ పోస్టు దక్కించుకునేందుకు కావాలని ఎన్నికలకు అడ్డంకులు సృష్టించి వాయిదాల మీద వాయిదాలు వేశారు. చివరకు మున్సిపల్ చైర్మన్ మహిళను బెదిరించి రాజీనామా చేయించారు.⇒ అత్తిలిలో 20 స్థానాలకు మనం 16 గెలిస్తే.. వాళ్లు 4 గెలిచారు. ఒకరు డిస్ క్వాలిఫై కాగా మన బలం 15 ఉంది. అంటే అక్కడ ఎన్నికల్లో మనం గెలవాలి. వాళ్లకు సంఖ్యా బలం లేదు కాబట్టి ఎన్నిక జరపకుండా వాయిదా మీద వాయిదా వేస్తున్నారు. ఇదీ రాష్ట్రంలో జరుగుతోంది!!⇒ ఇంతటి దారుణమైన రాజకీయ వ్యవస్థల మధ్య.. మీ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. మీరంతా గట్టిగా నిలబడ్డారు. నా అక్కచెల్లెమ్మలు చాలా గట్టిగా నిలబడ్డారు. దీన్ని విన్నప్పుడు చాలా సంతోషం అనిపించిన సందర్భాలున్నాయి. ఈ ఎన్నికల్లో మీరు చూపించిన గొప్ప స్ఫూర్తితో... చంద్రబాబు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అనే సందేశం మీ ద్వారా వెళ్లింది. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో మీరు చూపించిన ఈ స్ఫూర్తి చిరస్ధాయిగా నిలబడుతుంది.సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యకర్తల కోసం ఎంత గట్టిగా నిలబడతానో చూపిస్తా..‘కష్ట సమయంలో ఉన్న మన కార్యకర్తలకు ఒక్కటే చెబుతున్నా. ఈ కష్ట కాలంలో మీరు చూపించిన ఈ స్ఫూర్తి, నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడు. రాబోయే రోజులు మనవే. ఈసారి కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. ఈ సారి వచ్చినప్పుడు మీ జగన్ కార్యకర్తల కోసం కచ్చితంగా ఉంటాడు. జగన్ 1.0 పాలనలో కార్యకర్తల కోసం చేయాల్సినంత చేయలేకపోయి ఉండవచ్చు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ సమయంలో రెండేళ్లు ప్రజల గురించి, వాళ్ల ఆరోగ్యం గురించే మొత్తం ఎఫర్ట్ పెట్టాం. కాబట్టి కార్యకర్తలకు ఉండాల్సినంత తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కానీ జగన్ 2.0 లో అలా జరగదు. అందరికీ మాట ఇస్తున్నా. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటా. కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్ చేసి చూపిస్తాడు’ – వైఎస్ జగన్‌విద్య, వైద్యం, వ్యవసాయం అధోగతి..ఇవాళ స్కూళ్లు నాశనం అయిపోయాయి. ఇంగ్లీషు మీడియం గాలికెగిరిపోయింది. నాడు ృ నేడు పనులు ఆగిపోయాయి. టోఫెల్ తీసేశారు. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ తరగతులు నిర్వహించి పిల్లలను గొప్పగా చదివించాలని ఆరాటపడే ఆలోచనలు గాలికెగిరిపోయాయి. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్ లేదు. ఎనిమిదో తరగతి పిల్లలకు ఏటా ట్యాబ్‌ల పంపిణీ ఆగిపోయింది.మరోవైపు వైద్యం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. 11 నెలలకు నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో పేషెంట్లకు వైద్యం చేయడానికి సుముఖంగా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. 104, 108 ఆంబులెన్సుల గురించి చెప్పాల్సిన పనిలేదు.ఈ రోజు వ్యవసాయం గురించి అందరికీ తెలిసిందే. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతన్న పూర్తిగా దళారుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన దుస్థితి నెలకొంది. పెట్టుబడి సహాయం కింద జగన్ పీఎం కిసాన్తో కలిపి రూ.13,500 ఇస్తున్నాడు... మేం వస్తే పీఏం కిసాన్ కాకుండా సొంతంగా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఇచ్చిన అమౌంట్ లేదు... బాబు ఇస్తామన్నది కూడా ఇవ్వలేదు. మరోవైపు ఆర్బీకేలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా పూర్తిగా ఎత్తివేశారు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది.పీ4 పేరుతో బాబు కొత్త మోసం..చంద్రబాబునాయుడు మోసాలు క్లైమాక్స్‌కి చేరాయి. చాలామంది చంద్రబాబు మారిపోయి ఉంటారని అనుకున్నారు. కానీ ఆయన మారలేదని నిరూపిస్తూ ఈమధ్య పీ4 అని కొత్త మోసం తీసుకొచ్చాడు. పీ4 విధానం ద్వారా సమాజంలో 20 శాతం పేదవారి బాగోగులు అన్నింటినీ 10 శాతం సంపన్నులకు అప్పగిస్తాడట. ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. అసలు చంద్రబాబుకు రాష్ట్రంలో ఎన్ని తెల్లరేషన్ కార్డులు ఉన్నాయో తెలుసా? రాష్ట్రంలో 1.61 కోట్ల ఇళ్లు ఉంటే 1.48 కోట్ల వైట్ (తెల్ల) రేషన్ కార్డులున్నాయి. అంటే 90 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో కేవలం 8.60 లక్షల మంది మాత్రమే ఆదాయపన్ను కడుతున్నారు. 25 లక్షల మంది ఐటీ ఫైల్ చేస్తున్నారు. అంటే 8.60 లక్షల మందికి.. 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డు దారులను అప్పగించాలి. అక్కడ కూడా మోసం చేస్తున్నాడు. పేదలు కేవలం 20 శాతం అంటున్నాడు. చంద్రబాబు చెప్పిన దానికి కనీసం వెయ్యి మంది కూడా ముందుకు రారు. చంద్రబాబు చెప్పింది అవాస్తవమని, జరగదని అందరికీ తెలుసు. ఆయన డ్రామాలు ఆడుతున్నాడని ప్రజలకు తెలుసు. జనం నవ్వుకుంటున్నారు. ఆయన మాట్లాడినప్పుడు మీటింగ్‌ల నుంచి వెళ్లిపోతున్నారు. అయినాసరే నేను చెప్పేది ప్రజలు నమ్మాల్సిందే అన్నట్లు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నారు. -
రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: రాజమహేంద్రవరం ఫార్మసీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘రాజమహేంద్రవరంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులు ఈ రోజు నన్ను కలిశారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని, ప్రస్తుత పరిస్థితిని నాకు వివరించారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘‘బాధ్యులకు శిక్ష పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. విద్యార్థిని పరిస్థితి ఆ తల్లిదండ్రులు వివరిస్తుంటే బాధనిపించింది. ఈ ప్రభుత్వం ఆడబిడ్డల భద్రత విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమైంది. ఫార్మసీ విద్యార్థిని కుటుంబ సభ్యులకు పూర్తి న్యాయం జరిగేలా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగ అంజలి తల్లిదండ్రులు ఈ రోజు నన్ను కలిశారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని, ప్రస్తుత పరిస్థితిని నాకు వివరించారు. బాధ్యులకు శిక్ష పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమకు… pic.twitter.com/NLm75iVpc5— YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2025 -
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
YSRCP అఖండ మెజార్టీతో గెలుస్తుంది: YS జగన్
-
కార్యకర్తలు తెగింపు చూపారు: YS జగన్
-
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్కా దీపిక కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని ఘటన మరవకముందే.. విశాఖలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు.విశాఖలో ప్రేమోన్మాది దాడిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం, యువతి దీపిక ప్రాణాపాయ స్థితిలో ఉండటం ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రేమోన్మాది నవీన్‌ను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్ష్మి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని వైఎస్ జగన్ అన్నారు. -
మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది: YS జగన్
-
టీడీపీ అరాచకాలు.. వైఎస్ జగన్‌ను కలిసిన చిత్తూరు వైఎస్సార్సీపీ నేత
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చిత్తూరు ఐదో డివిజన్ వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ మురళీధర్‌రెడ్డి బుధవారం కలిశారు. చిత్తూరు జిల్లా కొంగరెడ్డిపల్లిలో తనపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకుల సీసీ కెమెరా విజువల్స్‌ను వైఎస్ జగన్‌కు ఆయన చూపించారు.సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అనుచరులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని, ఎమ్మెల్యే అరాచకాలను వైఎస్ జగన్‌కు మురళీధర్‌రెడ్డి వివరించారు. మురళీ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పూర్తి అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మురళీధర్‌రెడ్డి వెంట చిత్తూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ విజయానందరెడ్డి ఉన్నారు. -
వైఎస్ జగన్ ను కలిసిన ఫార్మసీ విద్యార్ధిని అంజలి తల్లిదండ్రులు
-
అండగా ఉంటా.. ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులతో వైఎస్ జగన్
తాడేపల్లి,సాక్షి: ఫార్మసీ విద్యార్థినికి న్యాయం జరిగే వరకు పూర్తి అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు.రాజమహేంద్రవరంలో కిమ్స్ బొల్లినేని ఏజీఎం దీపక్ వేధింపులు తాళలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులు బుధవారం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ కుమార్తె ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్‌ను కోరారు.అందుకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. విద్యార్థిని విషయంలో కుటుంబానికి న్యాయం జరిగేవరకూ పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో విద్యార్థిని తల్లిదండ్రులు అనంత లక్ష్మి, దుర్గారావుతో పాటు, వైఎస్సార్సీపీ నేతలు మార్గాని భరత్, వరుదు కళ్యాణి, ఆరె శ్యామల ఉన్నారు. -
ఎంపీటీసీ, జడ్పీటీసీలతో వైఎస్ జగన్ భేటీ
-
నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో YS జగన్ భేటీ
-
హ్యాట్సాఫ్.. మీ నిబద్ధతకు ఎప్పుడూ రుణపడి ఉంటా: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ పాలనలో పేదల నోట్లోకి నాలుగు ముద్దలు వెళ్లేవని.. కానీ కూటమి ప్రభుత్వం వాళ్ల ముందు నుంచి ఉన్న కంచం లాగిపడేసిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బుధవారం తాడేపల్లిలోని కేంద్రకార్యాలయంలో భేటీ అయిన ఆయన.. ఈ సందర్భంగా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ల తెగువను అభినందించారు.‘‘మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను, పార్టీకూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను. ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు, ధైర్యానికి హాట్సాఫ్. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే, 39 స్థానాలు వైఎస్సార్సీపీ గెలిచింది. కార్యకర్తలు తెగింపు చూపారు. తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాల్లో ఎక్కడా గెలిచే నంబర్లు లేవు. వారికి సంఖ్యా బలం లేనే లేదు. కానీ.. భయాందోళనల ఈ ప్రభుత్వం మధ్య ఎన్నికలు నిర్వహించాలనుకుంది. పోలీసులతో భయపెట్టి, బెదిరించారు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటున్న చంద్రబాబుకి బుద్ధిలేదు. వాస్తవంగా ఈ ఎన్నికలను టీడీపీ వదిలేయాలి. కానీ అధికార అహంకారంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూశారు. నిజంగా ఇది ధర్మమేనా? న్యాయమేనా?. చంద్రబాబు(Chandrababu) అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా చంద్రబాబు వ్యవహరించలేదు. ప్రజలకిచ్చిన హామీల విషయంలో మోసం చేశారు. ప్రజలకు 143 హామీలు ఇచ్చి మభ్యపెట్టారు. చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలే కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో ఏదో ఒక బటన్ నొక్కేవాళ్లం. ఏదోరూపంలో ప్రతి కుటుంబానికీ మంచి జరిగింది. నాలుగువేళ్లూ నోట్లోకి పోయే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ఇప్పుడు ఉన్న ప్లేటును కూడా తీసేశాడు. ప్రజల్లోకి టీడీపీ కార్యకర్తలను కూడా పంపే పరిస్థితి ఆయనకు లేదు. తిరుపతి మున్సిపల్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ప్రజలంతా చూశారు. విశాఖపట్నంలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి, అక్కడ అక్రమాలు చేస్తున్నారు. మన కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం మనవాళ్లు చేశారు. అక్కడ 40వ వార్డు కార్పొరేటర్ ఇంటికి వెళ్లి.. ఆయన భార్యను భయపెట్టే ప్రయత్నం పోలీసులు చేశారు. రామగిరిలో 10 ఎంపీటీసీల్లో 9కి వైయస్సార్సీపీవే. కాని అక్కడ ఎన్నిక జరగనీయకుండా అడ్డుకుంటున్నారు. భద్రత పేరుతో పోలీసులు తీసుకెళ్లి.. దారి మళ్లించి, స్వయంగా ఎస్సై ఎంపీటీసీలను కిడ్నాప్‌చేసే పరిస్థితి కనిపిస్తోంది. అప్పటికీ వినకపోతే, ఏకంగా మండల కార్యాలయంలో నిర్బంధించి బైండోవర్ చేశారు. అంతటితో ఆగకుండా లింగమయ్య అనే బీసీ నాయకుడ్ని చంపేశారు. ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు ఇలాంటి దారుణాలు చేయిస్తున్నారు. ప్రభుత్వం అంటే ఇలాంటి పాలన చేస్తుందా?.. .. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 16కు 16 ఎంపీటీసీలు మనవాళ్లే. ఆరుగుర్ని ప్రలోభపెట్టి.. తీసుకెళ్లిపోయాడు. మరో 9 మంది వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారు. వాళ్లను ఎన్నికల కేంద్రానికి వెళ్లనీయకుండా పోలీసులు, టీడీపీ వాళ్లు అడ్డుకున్నారు. కోరం లేకపోయినా.. గెలిచామని డిక్లేర్ చేయించుకున్నారు. రాష్ట్రానికి సీఎం, కుప్పంకు ఎమ్మెల్యే చంద్రబాబే.. అయినా సరే ఒక చిన్నపదవికోసం ఇన్ని దారుణాలు చేశారు.ఈ ఎన్నికల్లో నా చెల్లెమ్మలు, నా అక్కలు మరింత గట్టిగా నిలబడ్డారు. దీనికి నేను గర్వపడుతున్నాను. ఇలాంటి ఘటనలు జరుగుతున్న పార్టీ ప్రజాప్రతినిధులు గట్టిగా నిలబడి స్ఫూర్తిని చూపించారు. వీరు చూపించిన స్ఫూర్తి చిరస్థాయిగా ఉంటుంది. కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడూ రుణపడి ఉంటాడు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి. P-4 అనే కొత్త మోసాన్ని మొదలుపెట్టాడు. సమాజంలో ఉన్న 20శాతం పేదవాళ్ల బాగోగులకు 10శాతం మందికి అప్పగిస్తాడంట!. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 1.61 కోట్ల కుటుంబాలు ఉంటే అందులో 1.48శాతం కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరంతా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో ఇన్‌కం ట్యాక్స్ కట్టేవారు ఎంతమంది ఉన్నారో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 8.6 లక్షల మంది ఇన్‌కంట్యాక్స్ కడుతున్నారు. ఆయన చెప్పిన ప్రకారం.. ఈ 1.48 కోట్ల మంది కుటుంబాలను 8.6 లక్షల మందికి అప్పగించాలి కదా?. ఇన్ని రకాలుగా మోసాలు చేస్తాడు చంద్రబాబు. చివరకు చంద్రబాబు మీటింగ్‌ల నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. చంద్రబాబుకు అన్నీ తెలుసు, కాని కావాలనే మోసం చేస్తాడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గురించి అడిగితే రాష్ట్రం అప్పుల పాలు అంటాడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎగరగొట్టడానికి అప్పులపై అబద్ధాలు చెప్తున్నాడు. ప్రజలకు సమస్యలు వస్తే వాటి పరిష్కారంకోసం తపించే ప్రభుత్వం రావాలని ప్రజలు మళ్లీ కోరుకుంటారు. మాటచెప్తే.. ఆ మాటమీద నిలబడే ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు. రాబోయే రోజులు మనవి. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. వైఎస్సార్సీపీ(YSRCP) అఖండ మెజార్టీతో గెలుస్తుంది. ఈసారి కార్యకర్తలకోసం కచ్చితంగా పార్టీ నిలబడుతుంది. కోవిడ్ కారణంగా నేను కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోవచ్చు. జగన్ 2.O దీనికి భిన్నంగా ఉంటుంది. కార్యకర్తలకోసం గట్టిగా నిలబడతాను’’ అని జగన్ అన్నారు. -
గన్నవరం ఎయిర్ పోర్ట్ లో వైఎస్ జగన్
-
వైఎస్ జగన్ హయాంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ టాప్
-
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం
-
నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున గట్టిగా నిలబడిన ప్రజా ప్రతినిధులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్‌లు చేసినా, కేసులు పెట్టి వేధించినా.. అన్ని ఇబ్బందులను గట్టిగా ఎదుర్కొని పార్టీ కోసం నిలబడి పోరాడిన వారి అంకిత భావాన్ని గుర్తిస్తూ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో 8 నియోజకవర్గాల్లోని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు, కో–ఆప్టెడ్ సభ్యులు హాజరవుతారు. ఇటీవలి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న అప్రజాస్వామిక పరిణామాలపై చర్చించడంతోపాటు, భవిష్యత్ కార్యాచరణపైనా ఈ సమావేశంలో వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం అన్ని కష్టాలు ఎదుర్కొని నిలబడిన నాయకులు, ప్రజా ప్రతిని«ధులకు మరింత స్ఫూర్తినిచ్చేలా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం⇒ వచ్చే వారం స్వయంగా నేనే వస్తా⇒ టీడీపీ ఎమ్మెల్యే బంధువుల చేతిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య ⇒ కుటుంబానికి మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ⇒బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన వైఎస్సార్సీపీ అధినేత సాక్షి, అమరావతి/రామగిరి: ‘ఏమాత్రం అధైర్యపడొద్దు.. మీ కుటుంబానికి పూర్తిగా అండగా నిలుస్తాం.. అన్ని విధాలా ఆదుకుంటాం.. వచ్చే వారం స్వయంగా నేనే వస్తా’ అని వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువుల చేతిలో దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం ఆయన ఫోన్లో పరామర్శించారు.లింగమయ్య భార్య రామాంజినమ్మ, కుమారులు మనోహర్, శ్రీనివాసులతో మాట్లాడారు. లింగమయ్య హత్యకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. ‘సార్.. రామగిరి మండలంలో రాక్షసపాలన కొనసాగుతోంది. పరిటాల సునీత నుంచి మాకు ప్రాణహాని ఉంది. ఇక్కడి పోలీసులు పరిటాల కుటుంబ సభ్యులకు తొత్తులుగా మారారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం రామగిరి ఎంపీపీ ఎన్నిక జరుగుతున్న సమయంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు జయచంద్రారెడ్డి ఇంటిపై పరిటాల సునీత సమీప బంధువులైన ధర్మవరపు ఆదర్శ్‌నాయుడు, ధర్మవరపు మనోజ్ నాయుడు దాడులకు దిగారు. వారిని మా నాన్న అడ్డుకోబోయాడు. దీంతో కక్ష కట్టి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారంటూ పండుగ వేళ ఇంట్లో ఉన్న మాపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటనలో నాన్న లింగమయ్య మృతి చెందాడు’ అంటూ కుమారులు మనోహర్, శ్రీనివాసులు... మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించారు. మీరు అధైర్య పడొద్దని, పార్టీ తప్పకుండా అండగా ఉంటుందని, ఆదుకుంటుందని లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. వైఎస్సార్సీపీ జిల్లా నేతలు, లీగల్‌సెల్‌ను అప్రమత్తం చేస్తామని, వారు తగిన రక్షణ కల్పిస్తారన్నారు. ‘మీ కుటుంబానికి ఏం జరిగినా చూస్తూ ఊరుకోం. పూర్తి అండగా నిలుస్తాం. అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఏ మాత్రం భయపడొద్దు. ధైర్యంగా ఉండండి’ అంటూ వైఎస్ జగన్ వారికి భరోసా ఇచ్చారు. -
వైఎస్ జగన్ హయాంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: స్వచ్ఛ ఇంధనంగా పిలిచే గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్‌ను వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమంగా నిలిపిందని తాజా అధ్యయనాలు, నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పునరుత్పాదక విద్యుత్‌తో పాటు ఇంధన సామర్థ్యం, విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో ఏపీ.. దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిందని జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర విద్యుత్ శాఖ విడుదల చేసిన ‘ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా’ నివేదిక ప్రకారం.. 2024 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 21,09,655 మెగావాట్లుగా అంచనా. ఇందులో పవన శక్తి నుంచి 55 శాతం, సౌరశక్తి 36 శాతం, పెద్ద జలశక్తి ప్రాజెక్టులు 6 శాతం, చిన్న జలశక్తి ప్రాజెక్టులు 1 శాతం, ఇతర వనరుల నుంచి 2 శాతం వస్తోంది. వీటిలో 20.3 శాతం అత్యధిక వాటాతో రాజస్తాన్ ముందంజలో ఉంది. మహారాష్ట్ర 11.8 శాతం, గుజరాత్ 10.5 శాతం, కర్ణాటక 9.8 శాతం, ఏపీ 7.9 శాతంతో టాప్–5లో నిలిచాయి. అలాగే, ఇటీవల ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్, ఎంబర్ సంస్థల 2018–24 నివేదిక కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. పునరుత్పాదక ఇంధన వనరులను సమర్థవంతంగా విద్యుత్ రంగానికి అనుసంధానిస్తున్న రాష్ట్రంగా.. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏపీ గుర్తింపు తెచ్చుకుందని వెల్లడించింది. ప్రధానంగా వ్యవసాయానికి 9 గంటలు ఉచిత సౌర విద్యుత్‌ను అందించడం కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్(సెకీ) నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం వంటి చర్యలు ఆదర్శనీయమని పేర్కొంది. ఏపీని తిరుగులేని ‘శక్తి’గా మార్చిన జగన్.. వైఎస్ జగన్ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుంది. ఏపీ రెన్యువబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ–2020, ఏపీ పంప్డ్ స్టోరేజీ ప్రమోషన్ పాలసీ–2022, ఏపీ గ్రీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ అమ్మోనియా ప్రమోషన్ పాలసీ–2023 వంటి వాటిని తీసుకువచ్చింది. దీంతో పునరుత్పాదక ఇంధన పరిరక్షణకు గాను రాష్ట్రపతి చేతుల మీదుగా ఏపీకి వరుసగా రెండేళ్ల పాటు అవార్డులు దక్కాయి. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో అప్పటి ప్రభుత్వం పంప్డ్ స్టోరేజ్ హైడ్రో, గ్రీన్ హైడ్రోజన్, బయో డీజిల్, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టుల కోసం 42 అవగాహన ఒప్పందాలను సైతం కుదుర్చుకుంది.టాప్ 5 ఉత్పాదక రాష్ట్రాలురాజస్థాన్ 20.3%మహారాష్ట్ర 11.8%గుజరాత్ 10.5%కర్ణాటక 9.8%ఆంధ్రప్రదేశ్ 7.9% -
రేపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
తాడేపల్లి : రాష్ట్రంలోఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన నేతలతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం కానున్నారు. పార్టీ విజయానికి సహకరించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలను వైఎస్ జగన్ స్వయంగా కలవనున్నారు. వీరితో రేపు(బుధవారం) ప్రత్యేకంగా సమావేశమై.. వారిందరికీ అభినందనలు తెలపనున్నారు వైఎస్ జగన్. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్‌లు చేసినా, కేసులు పెట్టి వేధించినా.. అన్ని ఇబ్బందులను గట్టిగా ఎదుర్కొని పార్టీ కోసం నిలబడి పోరాడిన వారి అంకితభావాన్ని గుర్తిస్తూ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లోని 8 నియోజకవర్గాల్లోని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు, కో–ఆప్షన్ సభ్యులు హాజరవుతారు. ఇటీవలి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న అప్రజాస్వామిక పరిణామాలు చర్చించడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణపైనా సమావేశంలో పార్టీ అ«ధ్యక్షుడు దిశా నిర్దేశం చేస్తారు. ముఖ్యంగా కష్టకాలంలో పార్టీ కోసం అన్ని కష్టాలు ఎదుర్కొని నిలబడిన నాయకులు, ప్రజా ప్రతిని«ధులకు మరింత స్ఫూర్తినిచ్చేలా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.‘ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా’ -
కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన వైఎస్ జగన్
-
లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
ఉమ్మడి అనంతపురం, సాక్షి: ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) పరామర్శించారు. లింగమయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భగా తమకు ప్రాణహాని ఉందని లింగమయ్య తనయుడు చెప్పగా.. అధైర్య పడొద్దని, పార్టీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయసహాయం అందిస్తామని జగన్ భరోసా ఇచ్చారు. వచ్చే వారం తానే స్వయంగా వస్తానని ఆయన చెప్పారు.అంతకు ముందు.. అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. దాడులను వ్యతిరేకించినందుకే బీసీ వర్గానికి చెందిన కురుబ లింగమయ్యను టీడీపీ నాయకులు (TDP) పొట్టనపెట్టుకున్నారని వైఎస్ జగన్ ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కురబ లింగమయ్య హత్యే దీనికి నిదర్శనమని అన్నారు. -
మా కుటుంబంపై ఎన్ని కేసులు పెట్టినా జగన్, పార్టీ ని వదిలే ప్రసక్తే లేదు
-
కూటమి పాలనలో టీడీపీ అరాచకాలపై వైఎస్ జగన్ ఫైర్
-
శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
జగన్ హయాంలో.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు భారీగా పెరుగుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు మూతపడిపోయాయని, కొత్తగా ఒక్కటి కూడా రాలేదంటూ టీడీపీ కూటమి నేతల అడ్డగోలు ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేసింది. గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో కొత్తగా 7,86,984 మంది కొత్త పారిశ్రామికవేత్తలు తయారైన విషయాన్ని రాజ్యసభకు వెల్లడించింది. ఈ కాలంలో రాష్ట్రంలోకి కొత్తగా వచ్చిన పరిశ్రమలు, కొత్త పారిశ్రామికవేత్తల వివరాలను సంవత్సరాల వారీగా గణాంకాలతో కేంద్ర స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి జయంత్ చౌదరి వివరించారు. ఇప్పటికే అప్పుల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై టీడీపీ కూటమి అడ్డగోలుగా బురదజల్లుతూ అభాసుపాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు పరిశ్రమల విషయంలోనూ కేంద్రం చేసిన తాజా ప్రకటనతో కూటమి దుష్ప్రచారానికి కళ్లెం వేసినట్లయింది.కొత్తగా 7,69,447 ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటు.. ఎంఎస్ఎంఈలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘ఉద్యమ్’ పోర్టల్‌లో సంవత్సరాల వారీగా కొత్తగా ఏర్పాటైన యూనిట్ల సంఖ్యనూ వివరించింది. దీని ప్రకారం.. జూన్ 1, 2020 నుంచి ఈ ఏడాది మార్చి 15 వరకు రాష్ట్రంలో కొత్తగా 7,69,447 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇందులో అత్యధికంగా సూక్ష్మస్థాయి (మైక్రో) యూనిట్లు మహిళల పేరిట ఉండటం గమనార్హం. అలాగే, ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జెనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) కింద గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో కొత్తగా 14,969 యూనిట్లు ప్రారంభం కాగా.. ఇందులో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఊపిరిపోసుకున్నాయి.స్టార్టప్‌ల జోరు..గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో భారీగా స్టార్టప్‌లు ఏర్పాటైనట్లు కేంద్రం ప్రకటించింది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గుర్తింపు పొందిన 2,106 సార్టప్‌లు రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో వచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు. వినూత్నమైన ఆలోచనలతో వచ్చిన విద్యార్థులను చేయిపట్టి వారి ఆలోచనను ఒక కంపెనీగా రూపుదిద్దించడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏ విధంగా నడిపించిందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఇందులో 1,159 స్టార్టప్‌లకూ మహిళలే నేతృత్వం వహిస్తుండటం గమనార్హం. ఇక సంకల్ప పథకం కింద 212 యూనిట్లు, పీఎం సూర్యఘర్ పథకం అమలుకు అవసరమైన పరికరాలు అందించడానికి రెండు యూనిట్లు, అలాగే.. గడిచిన ఐదేళ్లలో 248 అగ్రి క్లినిక్ యూనిట్ల ఏర్పాటు ద్వారా అనేకమంది ఉపాధి పొందుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. -
అన్యాయాలను ప్రశ్నిస్తే.. పొట్టన పెట్టుకున్నారు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. దాడులను వ్యతిరేకించినందుకు శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త, బీసీ వర్గానికి చెందిన కురుబ లింగమయ్యను టీడీపీ నాయకులు పొట్టనపెట్టుకున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుబ లింగమయ్య హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కురబ లింగమయ్య హత్యే దీనికి నిదర్శనమని విమర్శించారు. పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలిపారు.వారి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త, బీసీ వర్గానికి చెందిన కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. బడుగు, బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిని కచ్చితంగా చట్టంముందు నిలబెడతాం. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేదు.వ్యక్తుల భద్రతకు భరోసా కొరవడిన పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల మీద దాడులు పరిపాటిగా మారాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారు. రామగిరి మండల ఉప ఎన్నికలో జరిగిన అరాచకాల వెనుక పోలీసుల వైఫల్యం తీవ్రంగా ఉంది. అధికార పార్టీ నేతల దారుణాలను అడ్డుకోవడంలో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో వారి బాధ్యతా రాహిత్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. రామగిరిలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతల దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించినా, పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతూ వైఎస్సార్సీపీ నేతల పైనే తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ఏపీలో కక్ష రాజకీయాలకు బలవుతున్న బడుగు, బలహీన వర్గాలు
గుంటూరు, సాక్షి: కూటమి పాలనలో రాజకీయ ఆధిపత్యం కోసం టీడీపీ చేస్తున్న అరాచకాలను, అఘాయిత్యాలను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా ఖండించారు. మళ్లీ పగడ విప్పిన ఫ్యాక్షన్ రాజకీయానికి.. తాజాగా రాప్తాడులో బలైన వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య ఉదంతంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఏపీలో చట్టబద్ధపాలన లేదు. వైఎస్సార్సీపీ కార్యకర్తలమీద, నాయకులమీద దాడులు పరిపాటిగా మారాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో కొందరు అధికారపార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారు. రాష్ట్రంలో వ్యక్తుల భద్రతకు భరోసా లేని పరిస్థితులు నెలకొన్నాయి. బడుగు, బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారాయన. .. రామగిరి మండల ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకాల వెనుక పోలీసుల వైఫల్యం తీవ్రంగా ఉంది. రామగిరిలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతల(TDP Atrocities) దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించారు. అయినా పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతూ పైగా వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గం. లింగమయ్య కుటుంబానికి అండగా.. .. కురబ లింగమయ్య(Kuruba Lingamaiah) హత్యను ఖండిస్తున్నా. అధికారపార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. వారి దాడులను వ్యతిరేకించినందుకు వైఎస్సార్సీపీకి చెందిన ఓ బీసీ కార్యకర్తను టీడీపీ నాయకులు పొట్టనపెట్టుకున్నారు. అధికార పార్టీ నేతల దారుణాలను అడ్డుకోవడంలో.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. కురుబ లింగమయ్య కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు.ఇదీ చదవండి: హత్య చేయించి పరామర్శకు వస్తారా?.. టీడీపీ ఎంపీకి చేదు అనుభవం -
మత్య్సకారుల సంక్షేమానికి గత YSRCP ప్రభుత్వం కృషి
-
వైఎస్ జగన్ హయాంలో ఏపీ పోలీస్ శాఖకు దేశంలోనే అత్యున్నత ర్యాంక్
-
ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు
-
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ముస్లిం సోదరులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారురంజాన్ పండుగ సందర్బంగా వైఎస్ జగన్..‘ముస్లింలకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైనది. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్’ అని అన్నారు.భక్తి శ్రద్ధలతో కఠినమైన ఉపవాస దీక్షలు ముగించుకుని ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 31, 2025 -
2023-24లో శభాష్... పోలీస్
సాక్షి, అమరావతి: అమ్మో...! పోలీస్...! అని ప్రస్తుతం రాష్ట్రం హడలెత్తిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రెడ్‌బుక్ కుట్రలకు వత్తాసు పలుకుతూ పోలీసులు సాగిస్తున్న అరాచకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్రమ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, పోలీసు స్టేషన్లో చిత్రహింసలు... ఇవన్నీ టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సర్వసాధారణ దృశ్యాలు అయిపోయాయి. కానీ, ఇదంతా ఈ 10 నెలల్లో రాష్ట్ర పోలీసు శాఖ ఒంటికి పూసుకున్న కళంకం.ఏడాది క్రితం వరకు ఏపీ పోలీసు శాఖ పనితీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. శభాష్... ఏపీ పోలీస్... అని జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందిందని ‘సెంటర్ ఫర్ ద స్డడీ డెవలపింగ్ సొసైటీ’ (సీఎస్డీఎస్) సర్వే వెల్లడించింది. కామన్ కాజ్ సంస్థతో కలసి లోక్‌నీతి సంస్థకు చెందిన సీఎస్డీఎస్ దేశంలో పోలీసుల పనితీరుపై సమగ్ర సర్వే నిర్వహించింది. 2023–24లో దేశంలో 17 ప్రధాన రాష్ట్రాల్లో పోలీసుల పనితీరుపై నిర్వహించిన సర్వే నివేదికను ‘ద స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్–2025’ అనే పేరుతో తాజాగా వెల్లడించింది. పోలీసు విధులు సక్రమంగా నిర్వహించడంలో ఏపీ పోలీసు శాఖ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని ఆ నివేదిక పేర్కొనడం విశేషం.అదీ పోలీసింగ్ అంటే..వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖ చట్టానికి లోబడి సమర్థంగా విధులు నిర్వర్తించింది. ప్రధానంగా ఫిర్యాదులపై తక్షణ స్పందన, నిబంధనల మేరకు అరెస్టులు, అల్లర్లను అదుపు చేయడంలో రాష్ట్ర పోలీసులు అత్యంత మెరుగైన పనితీరును కనబరిచారని సీఎస్డీఎస్ సంస్థ సర్వే వెల్లడించింది. దేశంలో అత్యంత సమర్థవంతమైన పోలీసు వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. కేరళ పోలీసు శాఖ మొదటిస్థానం సాధించగా... చివరి మూడు స్థానాల్లో బిహార్(15), కర్ణాటక(16), జార్ఖండ్(17) నిలిచాయి.అప్పుడు నిబంధనల మేరకే అరెస్టులు..⇒ బాధితుల ఫిర్యాదులపై వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు స్పందన మెరుగ్గా ఉండేదని సీఎస్డీఎస్ సర్వే నివేదిక వెల్లడించింది.⇒ ఫిర్యాదు రాగానే సత్వరం స్పందించి తగిన చర్యలు చేపట్టేవారు. అదే సమయంలో నిందితులను అరెస్టు చేయడంలోనూ నిబంధనలను అతిక్రమించకుండా చట్టానికి లోబడే వ్యవహరించేవారని ఆ సర్వే స్పష్టం చేసింది.⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిందితులను అరెస్టు చేయడంలో ఎల్లప్పుడూ కచ్చితంగా నిబంధనలను పాటించేవారని 57శాతం మంది చెప్పారని ఆ సర్వే వెల్లడించింది. తద్వారా రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిందితులను అరెస్టులు చేయడంలో పోలీసులు నిబంధనల మేరకు వ్యవహరించేవారని తేల్చి చెప్పారు. అందుకే ఉత్తమ పోలీసింగ్‌లో ఏపీ పోలీసు శాఖ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.⇒ 2023–24లో అత్యధికంగా 32% అరెస్టులు దొంగతనాలు, దోపిడీ కేసులకు సంబంధించినవే ఉన్నాయి. అరెస్టుల్లో 17% మహిళలపై నేరాల కేసుల్లో, 12% అల్లర్ల కేసుల్లో, 12%హత్యలు, దాడుల కేసుల్లో, 4%పబ్లిక్ న్యూసెన్స్ కేసుల్లో చేశారు. అంటే దాదాపు అన్ని అరెస్టులు కూడా సరైన కేసుల్లోనే చేశారని నివేదిక పేర్కొంది. అక్రమ కేసులతో వేదింపులకు పాల్పడేవారు కాదని స్పష్టంగా తెలిపింది.⇒ ఆందోళనలు, ధర్నాల విషయంలో 51% కేసుల్లో పోలీసులు సంయమనం పాటించారని కూడా వెల్లడించింది. చిన్నచిన్న సంఘటనలకు కేసుల్లో కౌన్సిలింగ్ ద్వారానే 49% కేసులను పరిష్కరించారు. -
‘శ్రీకృష్ణదేవరాయలు లాగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి వైఎస్ జగన్’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. పండుగ సందర్భంగా పార్టీ నేతలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.ఉగాది వేడుకల సందర్భంగా ప్రముఖ అవధాని నారాయణ మూర్తి పంచాంగ శ్రవణం చెప్పారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మళ్ళీ విజయ దుందుభి మోగిస్తారు. ఓడితే చాలా మంది భయపడతారు. కానీ, వైఎస్ జగన్ అలా బయటపడలేదు. మిథున రాశి వారికి ఈ ఏడాది మంచి జరుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి. ఆవేశంలో ప్రజలు చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. శ్రీ కృష్ణదేవరాయలులాగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి వైఎస్ జగన్. సాంఘికంగా ఔన్నత్యాన్ని పొందుతారు. ముఖ్యమంత్రి కుర్చీలో మళ్ళీ తిరిగి వైఎస్ జగన్ కూర్చుంటారు’ అని చెప్పుకొచ్చారు.ఇక, ఉగాది వేడుకల్లో పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు ప్రజలకు YS జగన్ ఉగాది శుభాకాంక్షలు
-
ఈద్ ముబారక్ ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సోమవారం జరుపుకోనున్న సందర్భంగా మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈద్ ముబారక్(శుభాకాంక్షలు) తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధారి్మక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని వైఎస్ జగన్ తెలిపారు. మనిషి లోని చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని వైఎస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. -
సూపర్ సిక్స్‌పై పిల్లి మొగ్గలు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి ప్రజలను బుట్టలో వేసుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎగ్గొట్టేందుకు సాకులు వెతుక్కొంటున్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలు ఎలా అమలు చేయాలో అర్థం కావడంలేదని, డబ్బుల్లేవంటూ కూనిరాగాలు తీసిన చంద్రబాబు.. తాజాగా ఎన్నికలకు ముందు బయట నుంచి చూసినప్పుడు సూపర్ సిక్స్ అమలు చేయగలనని అనుకున్నానని, కానీ పరిస్థితులు మరోలా ఉన్నాయని టీడీపీ ఆవిర్భావ సభలో కొత్త రాగం మొదలెట్టారు. సంపద సృష్టించకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తే తర్వాత వాటిని కొనసాగించలేమంటూ మాయమాటలు చెబుతున్నారు. అదేపనిగా అబద్ధాలు చెప్పి ఇప్పుడు ప్లేటు ఫిరాయింపు 2014లో మోసం చేసినట్లే, 2024లోనూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు, దొంగ హామీలిచ్చారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల జీవితాలను మార్చేస్తానని మభ్యపెట్టారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో రూ.15 వేలు ఇస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఏటా రూ. 18 వేలు ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా అనేక హామీలిచ్చి అన్నీ ఎగ్గొట్టారు. ఏ కుటుంబానికీ ఒక్క రూపాయి కూడా లబ్ధి చేకూర్చలేదు. అప్పుల పైనా తప్పుడు లెక్కలే సూపర్ సిక్స్ అమలు ప్రస్తావన వచ్చినప్పుడల్లా అప్పులను బూచిగా చూపిస్తున్న చంద్రబాబుకు.. ఆ అప్పులపైనా తప్పుడు లెక్కలే చెబుతున్నారు. మొన్నటి వరకు గత ప్రభుత్వం అప్పులు రూ. 14 లక్షల కోట్లంటూ అసత్యాలు ప్రచారం చేశారు. ఆయన చెప్పిన లెక్క తప్పని ఆయన ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన గణాంకాలే స్పష్టం చేశాయి. ప్రభుత్వ అప్పులు రూ. రూ. 6.54 లక్షల కోట్లని వెల్లడించారు. మళ్లీ పార్టీ ఆవిర్భావ సభలో రాష్ట్రం అప్పు రూ. 9.74 లక్షల కోట్లంటూ మరో లెక్క చెప్పి, ప్రజలను ఏమార్చి, హామీలను ఎగ్గొడుతున్నారు. 2014లోనూ అదే మోసం నిజానికి చంద్రబాబుకు ఇచ్చిన హామీలను అమలుచేసే అలవాటు మొదటి నుంచీ లేదు. అవసరం కోసం ఏదైనా చెప్పడం, ఆ తర్వాత ప్రజలను మోసం చేయడం బాబు నైజం. 2014 ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లు 600కి పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. బేషరతుగా రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని, ఎవరూ రుణాలు చెల్లించద్దంటూ ఊరూవాడా చెప్పారు. ఈమాటల్ని నమ్మిన మహిళలు, రైతులు ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేయకుండా వారిని మోసం చేశారు. వడ్డీలు పెరిగిపోయి వారంతా డిఫాల్టర్లుగా మారిపోయారు. డ్వాక్రా రుణాలూ రద్దు చేస్తానని చెప్పి మహిళలకు నయవంచన చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, లేదంటే నిరుద్యోగ భృతి అంటూ యువతనూ వంచించారు. వైఎస్ జగన్ ఆనాడే చెప్పారు చంద్రబాబు ఎడాపెడా ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదని ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా చెప్పారు. గణాంకాలతో సహా వివరించారు. వైఎస్ జగన్ చెప్పిందే నిజమైంది. చంద్రబాబు ఒక్క హామీనీ అమలు చేయకుండా ప్రజలను నిలువునా ముంచేశారు. -
కాటమరాజు తిరునాళ్లు.. భక్తులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: కాటమరాజు తిరునాళ్లు సందర్భంగా భక్తులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శ్రీగంగా భవాని సమేత వేణుతల కాటమరాజు తిరునాళ్ల సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలం గుండంచర్లలో తిరునాళ్లు జరగనున్న నేపథ్యంలో శ్రీ వేణుతల కాటమరాజు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.శ్రీ గంగా భవాని సమేత వేణుతల కాటమరాజు తిరునాళ్ల సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలం గుండంచర్లలో తిరునాళ్లు జరగనున్న నేపథ్యంలో శ్రీ వేణుతల కాటమరాజు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. pic.twitter.com/iE78xxw2D5— YS Jagan Mohan Reddy (@ysjagan) March 29, 2025 -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
-
తెలుగువారికి వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
తాడేపల్లి: తెలుగు సంవత్సరాది(ఉగాది) పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, రాష్ట్రం సుబిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని ఆయన అభిలషించారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని వైఎస్ జగన్ తన సందేశంలో ఆకాంక్షించారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉగాది పండుగను ఇంటిల్లిపాది ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.#Ugadi— YS Jagan Mohan Reddy (@ysjagan) March 30, 2025 -
ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్సార్సీపీలోనే..
ఏలూరు: మా కుటుంబానికి వైఎస్సార్ అంటే ప్రాణం.. నా భర్త చివరి వరకూ జగన్మోహన్రెడ్డి వెంటే నడిచారు.. ప్రాణం ఉన్నంత వరకు నేను జగన్ వెంటే ఉంటాను తప్ప పార్టీని మాత్రం వీడను.. అంటూ తేల్చి చెప్పారు యలమంచిలి మండలం గుంపర్రు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు కంబాల సత్యశ్రీ. ఎంపీపీ ఎన్నిక కోసం శుక్రవారం ఉదయం మండలపరిషత్ కార్యాలయానికి వచ్చిన ఆమెను.. మీరు కనిపించడం లేదని మీ కుమార్తె ఫిర్యాదు చేశారంటూ పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ కుటుంబసభ్యుల ద్వారా తమకు అనుకూలంగా ఓటు వేయాలని కూటమి నేతలు ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు. మీరు గట్టిగా ఒత్తిడి చేస్తే ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోతానే తప్ప పార్టీని వీడనని సత్యశ్రీ తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు ఆమెను తిరిగి మండలపరిషత్ కార్యాలయం వద్ద దించి వెళ్లగా జరిగిన సంఘటనను సహచర సభ్యులకు సత్యశ్రీ కన్నీటి పర్యంతమవుతూ వివరించారు. -
హ్యాట్సాఫ్.. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా
-
స్థానిక సంస్థల ఉపఎన్నికలపై వైఎస్ జగన్ ట్వీట్
-
‘ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా’
తాడేపల్లి : స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ మేరకు వైఎస్ జగన్ తన సోషల్ మీడియా అకౌంట్‘ఎక్స్’ ద్వారా వైఎస్సార్సీపీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.‘స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు పనిచేయటం హర్షించదగ్గ విషయం. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా.. చంద్రబాబు గారు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా..కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని..జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు.విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నాను. క్లిష్ట సమయంలో వీరు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ ఎన్నికలను సమన్వయ పరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు మరియు పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందర్నీ అభినందిస్తున్నాను. పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా, @ncbn గారు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 28, 2025 స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం -
KSR Comment: డీలిమిటేషన్ పై స్పష్టంగా చెప్పిన జగన్
-
చంద్రబాబు, పవన్ ఆదేశాలతో ఏపీలో దెబ్బతింటున్న ఆధ్యాత్మిక శోభ
-
హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
-
హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?: వైఎస్ జగన్
ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే.. అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లే. ఒకరు ఆదేశిస్తారు.. మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశినాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూలి్చవేతలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపై, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు ఉందా? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ వైపు యథేచ్ఛగా జరుగుతున్న ఆలయాల కూల్చివేతలు.. మరో వైపు హిందూ ధర్మంపై కొనసాగుతున్న దాడులపై వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా స్పందించారు. ‘ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే.. అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే.. మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లే.. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు’ అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్ జిల్లా కాశినాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన అటవీ శాఖను చూస్తున్న, సనాతన వాదినని చెప్పుకుంటున్న డిప్యూటీ సీఎం.. తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని దెప్పి పొడిచారు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అని నిలదీçస్తూ గురువారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. కాశినాయన క్షేత్రం పరిరక్షణకు ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో చేసిన కృషికి సంబంధించిన ఆధారాలు, అప్పట్లో అధ్యాత్మిక శోభతో విలసిల్లిన ఆ క్షేత్రం ఫొటోలు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ క్షేత్రం కూల్చివేతకు జారీ చేసిన ఉత్తర్వులు, కూల్చివేత ఫొటోలను ట్యాగ్ చేస్తూ ‘ఇవిగో ఆధారాలు.. ఏమిటి మీ సమా«దానం’ అని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను సూటిగా ప్రశ్నించారు. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు కావా? నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే... దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు.. రాష్ట్రంలో ఆలయాలపై, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?మా ఐదేళ్ల పాలనలో ఈ క్షేత్రాన్ని పరిరక్షించాం అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై 2023 ఆగస్టు 7న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుం బిగించిన మాట వాస్తవం కాదా? అదే ఏడాది.. అదే నెల 18న అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖ రాశాను. కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రాన్ని రిజర్వ్ చేయాలని, దీని కోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని ఆ లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఆలయాల పట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ పట్ల మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఇవిగో ఆధారాలు07–08–2023:కాశినాయన క్షేత్రంలో నిర్మాణాలు నిలిపివేయాలని, ఉన్నవాటిని తొలగించాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చిన కాపీ 18–08–2023: కాశినాయన క్షేత్రం ఉన్న భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని, 12.98 హెక్టార్ల భూమిని కాశినాయన క్షేత్రానికి రిజర్వు చేయాలని కోరుతూ అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు నాటి సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖ అధికార అహంకారానికి ఇవిగో ఆధారాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో నిర్మాణాలను కూల్చివేస్తూ వచ్చారు. చంద్రబాబు ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడి చేశారు. ఇందుకు ఇవిగో ఆధారాలు (కాశినాయన క్షేత్రం కూల్చివేతకు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులు ట్యాగ్ చేస్తూ), ఏమిటి మీ సమాధానం?1–1–2025: ఏపీ అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదేశాల మేరకు కాశినాయన క్షేత్రంలోని నిర్మాణాలను తొలగించాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సంబంధిత అధికారులకు జారీ చేసిన ఆదేశాల కాపీ వీళ్ల తీరే అంత.. వారే ఉత్తర్వులిచ్చి, వారి చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్న పూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెబుతున్నారు. వీళ్ల తీరే అంత. ఈ ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతే. -
YS Jagan: ఆలయాలు కూల్చే నువ్వు హిందూ ధర్మం గురించి మాట్లాడతావా
-
మోదీ అంటే భయమా.. దక్షిణాదిపై స్పందనేది బాబు?
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం దక్షిణాది రాష్ట్రాలలో కాక పుట్టిస్తోంది. చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 14 రాజకీయ పార్టీల నేతల సమావేశం ప్రస్తుత జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గట్టిగానే చెప్పగలిగింది. ఈ సమావేశానికి హాజరు కాకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ కూడా తన అభిప్రాయాలను విస్పష్టంగా తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ కాపీని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు పంపించారు.తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ అంశం వల్ల ఏ రాష్ట్రానికి నష్టం జరగదని, ఇంకా చర్చ జరగలేదని చెబుతుంటే మరో కేంద్రమంత్రి బండి సంజయ్ మాత్రం చెన్నై సమావేశాన్ని దొంగల భేటీగా పోల్చి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సంజయ్ ఇప్పటికీ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ అంశంపై మాట్లాడడానికి నోరు పెగులుతున్నట్లు లేదు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పునర్విభజన వల్ల నష్టం జరుగుతుందని అనుకోవడం లేదని చెబుతున్నారు. వీరిద్దరు బీజేపీతో కూటమి కట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.గతంలో చంద్రబాబు నాయుడు తను కూటమిలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఊరుకోబోనని కనీసం కబుర్లయినా చెప్పేవారు. ఇప్పుడు ఆ ధైర్యం కూడా చేయలేకపోవడం గమనార్హం. పాతికేళ్లపాటు పునర్విభజన వద్దని చెన్నై భేటీలో పాల్గొన్న నేతలు కోరారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో వచ్చే సమస్యకు జగన్ తన లేఖ ద్వారా పరిష్కార మార్గాలు వివరించారు. పాతికేళ్ల నిషేధమన్న డిమాండ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదన్న సంగతి గుర్తుంచుకోవాలి. పాతికేళ్లలో ఉత్తరాది జనాభా మరింత పెరగదని ఈ నేతలు గ్యారంటీ ఇవ్వగలరా అన్న ప్రశ్న వస్తుంది. అందువల్ల ఇప్పుడే పునర్విభజన వ్యవహారానికి ఒక పద్దతైన పరిష్కార మార్గం ఆలోచించాలని చెప్పక తప్పదు.వైఎస్ జగన్ తన లేఖలో పేర్కొన్నట్లు ఆయా రాష్ట్రాలకు ప్రస్తుతం పార్లమెంటులో ఉన్న వాటాను యథాతథంగా కొనసాగించడానికి ప్రయత్నాలు జరిగితే బాగుంటుంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణలు అవసరం అవుతాయి. ఇదే ఉద్దేశం చెన్నై భేటీలో పాల్గొన్న నేతలందరికీ ఉన్నప్పటికీ, వారి తక్షణ డిమాండ్ మాత్రం పునర్విభజన వద్దన్నది కావడం గమనార్హం. అయితే, పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా నియోజకవర్గాలు పెరగకపోతే ఎన్నికైన ఎంపీలకు అవి అలవికానివిగా మారతాయి. ఉదాహరణకు ఇప్పుడు 17 లక్షల నుంచి 19 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉంటే, అది పాతిక లక్షలకు ఒక నియోజకవర్గంగా మారవచ్చు. అదే సమయంలో ఏ రాష్ట్రానికి దీనివల్ల నష్టం జరగకూడదన్నది అంతా ఒప్పుకోవాలి.ఈ సమస్యకు ప్రధాన కారణం ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా నియంత్రణ సరిగా లేకపోవడం, దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా జనాభా పెరుగుదలను నియంత్రించడం. దీనివల్ల జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను నిర్ణయిస్తే ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మొదలైన రాష్ట్రాలలో కొత్త నియోజకవర్గాలు భారీ ఎత్తున వస్తాయి. దక్షిణాదిలో మాత్రం ఆ స్థాయిలో పెరగవు సరికదా కేరళ వంటి చోట్ల నియోజకవర్గాలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 48 సీట్లు పెరిగితే ఆ రాష్ట్రం ఎంపీలు చెప్పినట్టుగా వినాల్సిన పరిస్థితి కేంద్రానికి వస్తుంది. యూపీతోపాటు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి కొద్ది రాష్ట్రాలే దేశాన్ని శాసించే పరిస్థితి రావచ్చు. ఈ పరిణామం ఒకరకంగా నియంతృత్వ ధోరణికి దారి తీయవచ్చన్నది దక్షిణాది రాష్ట్రాల నేతల భయం.జనాభా ప్రాతిపదికన పునర్విభజన రాజకీయ నేతలకే కాదు.. దక్షిణాది ప్రజలకు కూడా నష్టం కలిగించే అంశమే. నిధుల పంపిణీ వంటి వాటిలో ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ వాటా వస్తుంటే, ఉత్తరాదికి అధిక వాటా వెళ్తోంది. ఈ అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ, యూపీ నుంచి కేంద్రానికి అందే రూపాయి పన్ను అందితే, తిరిగి ఆ రాష్ట్రానికి 2.73 రూపాయలు వెళుతున్నాయని తెలిపారు. బీహార్‌కు రూపాయికి ఆరు రూపాయలకు పైగా నిధులు వెళుతుంటే తమిళనాడుకు 29పైసలు, కర్ణాటకకు 14 పైసలు, తెలంగాణకు 41 పైసలు, కేరళకు 66 పైసల వాటా మాత్రమే నిధులు వస్తున్నాయని వివరించారు. ఈ వివక్షతో పాటు ఇప్పుడు లోక్‌సభ నియోజకవర్గాలు కూడా తగ్గితే ఉత్తరాది, దక్షిణాది అంతరం బాగా పెరిగే ప్రమాదం ఉంటుంది. దేశ సమగ్రత భావానికి ఇది విఘాతం కలిగిస్తుంది. అనవసరమైన అపోహలకు దారి తీస్తుంది.కేరళ ముఖ్యమంత్రి విజయన్ కూడా ఉత్తరాదిన నియోజకవర్గాలు పెరిగితే బీజేపీ లబ్ది పొందుతుందని, దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా చెన్నై సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ది పథంలో వెళుతున్న దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధంగా కేంద్ర నిర్ణయాలు ఉండరాదని అన్నారు. బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులను ఉత్తరాదికే పరిమితం చేశారని ఆయన వ్యాఖ్యానించారు.వైఎస్ అధినేత జగన్ మాత్రం కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా చెప్పిన విధంగా దామాషా పద్దతిలో లోక్‌సభ సీట్ల సంఖ్యను నిర్ణయించాలని, తదానుగుణంగా రాజ్యాంగ సవరణలు చేయాలని ప్రతిపాదించారు. చెన్నై భేటీలో తమిళనాడు, కేరళ, పంజాబ్, తెలంగాణ ముఖ్యమంత్రులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ కూడా హాజరు కావడం విశేషం. పంజాబ్‌లోని పరిస్థితులు, ఐఎన్డీఏతో ఉన్న సంబంధాల రీత్యా హాజరై ఉండవచ్చు. నవీన్ పట్నాయక్ వర్చువల్‌గా పాల్గొని తన అభిప్రాయాలు తెలియచేశారు. తదుపరి భేటీ హైదరాబాద్‌లో జరుగుతుందని ప్రకటించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే భేటీకి ప్రధాన ప్రత్యర్ధి అయిన బీఆర్ఎస్ ఎంతవరకు హాజరు అవుతుందన్నది సందేహమే. ఇప్పటికే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి పక్షాలు పాల్గొన్న సమావేశానికి బీఆర్ఎస్ వెళ్లడంపై బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని విమర్శలు చేస్తుంది. ఒడిషా నుంచి బీజేడీ నేతలు హైదరాబాద్ వస్తారా? రారా? అన్నది చెప్పలేం. ఎటుతిరిగి డీఎంకే, వామపక్షాలు కాంగ్రెస్‌తో కలిసే ఉంటున్నాయి కనుక వారికి ఇబ్బంది ఉండదు. ఇక వైఎస్సార్సీపీ అధినేత వ్యూహాత్మకంగా వ్యవహరించి భేటీకి వెళ్లకుండా, అలాగని తన అభిప్రాయాలు దాచుకోకుండా ప్రధానమంత్రికే ఏకంగా లెటర్ రాశారు. దానివల్ల దక్షిణాదికి అన్యాయం జరగరాదని ఆయన డిమాండ్ చేసినట్లయింది. అదే సమయంలో కాంగ్రెస్ కూటమి పక్షాలు అధికంగా ఉన్న భేటీకి ఆయన హాజరు కాకుండా జాగ్రత్తపడ్డారు. ఇంతవరకు వైఎస్సార్సీపీ అటు ఎన్డీయే వైపుకానీ, ఇటు ఇండియాకూటమివైపు కానీ ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తోంది.ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేనలు మాత్రం దీనిపై మాట్లాడలేకపోతున్నాయి. సాధారణంగా అయితే గతంలో తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందని భావిస్తే పొత్తుల గురించి పట్టించుకోకుండా మాట్లాడతానని చంద్రబాబు అనేవారు. గుజరాత్ మత కలహాల అంశంలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంటులో దీనిపై చర్చ జరిగి ఓటింగ్ సమయానికి జారి పోయినప్పటికీ, కొన్నిసార్లు అయినా మాట్లాడేవారు. అలాగే ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ యూపీ, బీహార్ రాష్ట్రాలకు అధిక వాటాలో కేంద్రం నుంచి నిధుల వెళ్లే తీరుతెన్నులపై గతంలో ధ్వజమెత్తేవారు. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ మైనార్టీలకు అన్యాయం జరిగితే ఊరుకోబోనని మాట వరుసకైనా అనేవారు. కానీ, ఇప్పుడు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు అంటే ఏం భయమో తెలియదు కానీ.. ఏపీతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉన్న నియోజకవర్గాల పునర్విభజనపై మాత్రం స్పందించడం లేదు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడినా, మాట్లాడకపోయినా పెద్దగా పట్టించుకోరు. ఆయనకు దీనిపై పెద్దగా అవగాహన కూడా ఉండకపోవచ్చు. కానీ, తానే మోదీని ఎదిరించగలనని గతంలో చెప్పుకున్న చంద్రబాబు వంటి సీనియర్ నేత, ఇప్పుడు ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో ఇంత నష్టం జరుగుతుంటే కేంద్రాన్ని గట్టిగా నిలదీయ లేకపోవడం ఆయన ఎంతగా బలహీనపడ్డారో తెలియ చేస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి పాలనలో ఒకవైపు యధేచ్చగా జరుగుతున్న ఆలయాల కూల్చివేతలు, మరోవైపు హిందూ ధర్మంపై కొనసాగుతున్న దాడులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్సీపీ హయాంలోనే ఆలయాల పరిరక్షణ కొనసాగిందన్న ఆయన.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతోనే ఇప్పుడు ఏపీలో ఆధ్యాత్మిక శోభ దెబ్బ తింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్(YS Jagan) ట్వీట్లో ఏమన్నారంటే.. నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి?. ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రం(Kasinayana Kshetram)లో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మం(Hindu Dharmam)పై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?.. .. అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట వాస్తవం కాదా? అదే నెల ఆగస్టు 18, 2023న అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌గారికి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖరాసి కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్యకూడా తీసుకోలేదు. ఆలయాలపట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణపట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇది. .. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో కూల్చివేస్తూ వచ్చారు. చంద్రబాబు(Chandrababu)గారి ఆదేశాలమేరకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడిచేశారు. ఇవిగో ఆధారాలు, ఏమిటీ మీ సమాధానం? తామే ఉత్తర్వులిచ్చి, తమ చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్నపూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెప్తున్నారు. వీళ్ల తీరే అంత? .. ఈ ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతే. ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమనుతాము చిత్రీకరించుకునేది వీళ్లే. .. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీశాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటివరకూ ఒక్క మాటకూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అని వైఎస్ జగన్ నిలదీశారు.నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో… pic.twitter.com/gTRsvBfnia— YS Jagan Mohan Reddy (@ysjagan) March 27, 2025 -
ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్ఏసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్లొన్నారు. ‘‘ఈద్ ముబారక్’’ అంటూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు. విజయవాడలో బుధవారం ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి టోపీ, కండువా ధరించి నమాజ్ ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించిన వైఎస్ జగన్ ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ , మాజీ మంత్రులు అంజాద్ బాషా, జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, లేళ్ల అప్పిరెడ్డి, రుహూల్లా, డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, కల్పలతారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లం దుర్గా, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, పార్టీ నేతలు పూనూరు గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.విజయవాడలోని ఎన్ఏసీ కల్యాణ మండపం వద్ద జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ ఉప్పొంగిన అభిమానంవిజయవాడలో ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్‌కు ముస్లింలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకే ఎన్ఏసీ కళ్యాణ మండపం ఉండే గురునానక్ కాలనీ రోడ్డు, వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. కళ్యాణ మండపం పూర్తిగా నిండిపోవడంతో గేట్లు మూసివేయాల్సి వచ్చింది. వైఎస్ జగన్ అభివాదం చేయగానే సీఎం, సీఎం నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. జై జగన్ అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. ఊహించనంతగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. -
ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ (ఫోటోలు)
-
YSRCP: వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్, పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా శెట్టిపల్లి రఘురామిరెడ్డి, క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా రెడ్డి శాంతి, తానేటి వనిత, కైలే అనిల్, వై.విశ్వేశ్వరరెడ్డి నియమితులయ్యారు. -
Vijayawada: వైఎస్ జగన్ ఇఫ్తార్ విందు
-
పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైఎస్ జగన్ తీవ్ర విచారం
-
ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: రంజాన్ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్ఏసీ కల్యాణ మండపంలో జరుగుతున్న ఇఫ్తార్ విందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. -
ముస్లింలకు 4 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేసిన YSR
-
పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిష్పాక్షిక విచారణ జరగాలి: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ప్రముఖ మత ప్రబోధకుడు, పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమన్న ఆయన.. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మరోవైపు ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదంలో పాస్టర్ పగడాల ప్రవీణ్‌కుమార్ మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రవీణ్‌కుమార్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలని.. అన్ని కోణాల్లో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్లు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బుల్లెట్‌పై సోమవారం రాజమహేంద్రవరం బయలుదేరిన ప్రవీణ్‌కుమార్ అర్ధరాత్రి సమయంలో కొంతమూరు వద్ద ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం ఉదయం దాకా ఆయన అలా పడి ఉండడం ఎవరూ గమనించకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: పాస్టర్ ప్రవీణ్ ఒంటిపై గాయాలు! -
ఇఫ్తార్ విందుకు హాజరుకానున్న వైఎస్ జగన్
-
మహానగరంలో ఏదీ భద్రత?
ఆడపిల్లల భద్రతకు ప్రమాదం పొంచివున్నదని స్పష్టంగా కనబడుతున్నా కళ్లుమూసుకున్న పోలీస్ యంత్రాంగం సాక్షిగా హైదరాబాద్‌లో మొన్న శనివారం ఒక యువతిపై లైంగిక దాడి జరిగింది.ఎంఎంటీఎస్‌లో ప్రయాణిస్తుండగా బోగీలో ఎవరూలేని సమయం చూసి దుండగుడు దాడి చేయగా తప్పించుకునే యత్నంలో నడుస్తున్న రైలునుంచి ఆమె దూకి తీవ్ర గాయాలపాలైంది. పగలంతా కిక్కిరిసి వుండే ఎంఎంటీఎస్ రైళ్లు చీకటిపడే వేళకు దాదాపు ఖాళీ అవుతుంటాయి. జనం ఎక్కువున్న సమయాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఆడవాళ్ల బోగీల్లో ఎక్కి వెకిలిచేష్టలకు పాల్పడటం, సెల్ఫోన్లు, ఆభరణాలు అపహరించటం వంటివి పెరిగాయని అనేకులు చెబుతున్నారు. హిజ్రాల ఆగడాలు సరేసరి. ఒంటరిగా ప్రయాణించక తప్పని స్థితిలో ఈ అరాచకాలు ఇంకెంత మితిమీర గలవో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఈ మాదిరి ఉదంతాలపై నిత్యం ఫిర్యాదులు అందుతూనే ఉంటాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రయాణికుల సంఘాలు కూడా ఆందోళనలు చేసినా పోలీసులు మేల్కొనలేదు. రైల్వే భద్రతా దళం(ఆర్పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీస్(జీఆర్పీ) విభాగం అసలు దీన్ని సమస్యగానే భావించలేదు. ఆ విభాగాలు కర్తవ్య నిర్వహణలో విఫలం కావటమే నిజమైన సమస్య. కనీసం చీకటిపడింది మొదలు అర్ధరాత్రి సర్వీసులు ఆగిపోయే వరకైనా బందోబస్తు అవసరమని గ్రహించలేదు. సరిగదా అంతక్రితం ఎంఎంటీఎస్ రైళ్లలోవుండే హోంగార్డుల్ని సైతం ఈమధ్య తొలగించారంటున్నారు. హైదరాబాద్ నగరంలో సుమారు 30 ఎంఎంటీఎస్ స్టేషన్లువుంటే కేవలం పది స్టేషన్లలో మాత్రమే భద్రత ఉండటం, అది కూడా అంతంత మాత్రం కావటం దారుణం. స్టేషన్లలో అక్కడక్కడ పేరుకు ఆర్పీఎఫ్, జీఆర్పీ కానిస్టేబుళ్లు కనబడు తుంటారు. కానీ మహిళల కోచ్‌లు ఎలావున్నాయో, భద్రత ఏ మేరకు అవసరమో గమనించేపాటి పని కూడా వారినుంచి ఆశించే స్థితి లేదంటే నిర్వాహకులు సిగ్గుపడాలి. సాంకేతికత విస్తరించిన ఈ కాలంలో కూడా దాన్ని సవ్యంగా వినియోగించలేని అశక్తతలో ప్రభు త్వాలుండటం విచారకరం. హైదరాబాద్ నగర శివారులో 2019 నవంబర్‌లో ఒక మహిళా వైద్యు రాలిని అపహరించి, ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసిన ఉదంతం చోటు చేసుకున్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని తెలంగాణకు సంబంధించిందిగా చూడలేదు. అలాంటి పరిస్థితి ఏపీలో తలెత్తకూడదన్న సంకల్పంతో పోలీస్ వ్యవస్థను కదిలించి కేవలం మూడు నెలల వ్యవధిలోనే దిశ యాప్ అందుబాటులోకి తెచ్చారు. దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు నెలకొల్పారు. లక్షలాదిమంది ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవటంవల్ల ఆపత్కాలంలో అనేకమందిని రక్షించటం సాధ్యమైంది. 2021 సెప్టెంబర్‌లో ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష రాయటానికి ఢిల్లీ వెళ్లిన ఏపీ యువతి తెల్లారుజామున దిగి ఆటో ఎక్కాక కీడు శంకించినప్పుడు దిశ యాప్ వల్లే పోలీసులను అప్రమత్తం చేసింది. ఏపీ పోలీసుల సమన్వయంతో ఆమె క్షేమంగా పరీక్ష రాసింది. తిరిగి ఏపీకి వెళ్లే రైలు ఎక్కేవరకూ సాయం దొరికింది. హైదరాబాద్‌లో బెంగళూరు వెళ్లే రైలెక్కిన మహిళ సైతం ఈ యాప్‌ను ఉపయోగించుకునే తనను తాను రక్షించుకోగలిగింది. దేశంలో ఏ మూలనున్నా ఈ యాప్ ద్వారా సమాచారం అందుకుని మహిళలను రక్షించిన ఉదంతాలు కోకొల్లలు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక వెనకా ముందూ చూడకుండా దీన్ని రద్దుచేశారు. తొమ్మిది నెలలు జాప్యంచేసి, అదే యాప్‌కు సురక్షా అనే పేరు తగిలించి ఈ నెల మొదటివారంలో మళ్లీ తీసుకొచ్చారు. వేషం మారిన ఈ యాప్‌పై మహిళల్లో పెద్దగా ప్రచారం చేసిన దాఖలా కూడా లేదు. అఘాయిత్యాలు మితిమీరిన ఈ కాలంలో దిశవంటి యాప్‌ను కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేవరకైనా కొనసాగించాలన్న ఇంగితజ్ఞానం కూటమి ప్రభు త్వానికి లేకపోయింది. బహుశా ఆ యాప్ కొనసాగివుంటే ఎంఎంటీఎస్‌లో ఆపదలో చిక్కుకున్న యువతికి అది ఆసరాగా నిలిచేదేమో! ఎక్కడో వేరే రాష్ట్రంలోవున్న యువతులకు ఆపత్కాలంలో సాయపడటం మాట అటుంచి, తాడేపల్లిలో డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో దుండ గుల బారిన పడిన మహిళను కూడా కాపాడలేని అశక్తతలో ఏపీ పోలీసులు కూరుకుపోయారు. ఫలితంగా ఆ మహిళపై దుండగులు అత్యాచారం చేసి, హతమార్చారు. అదే ప్రాంతంలో మొన్న జనవరి 31న మరో మహిళ బలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈమాదిరి అఘాయిత్యాలకు అంతేలేదు.ఎంఎంటీఎస్ ఉదంతంలో రైల్వే పోలీసులు బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. దుండ గుడు పట్టుబడవచ్చు కూడా. ఈ ఉదంతం పోలీసులకు ఎలాంటి గుణపాఠం నేర్పిందోగానీ మళ్లీ మరోటి జరిగేవరకూ పట్టనట్టు వ్యవహరించే ధోరణికి ఇకనైనా స్వస్తి పలకాలి. ఖర్చు తగ్గించుకుని లాభార్జన చేయాలన్న యావ భద్రతకు తూట్లు పొడుస్తుందన్న సంగతి ఎంఎంటీఎస్ నిర్వాహకులు తెలుసుకోవాలి. ఆకతాయిలూ, అసాంఘిక శక్తులూ, యధేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించేవారూ తమకేం కాదన్న భరోసాతో ఉండటం మహిళలకూ, పిల్లలకూ ప్రాణాంతకమవుతుంది. రైల్వే స్టేషన్లతోపాటు బోగీల్లో సైతం సీసీ కెమెరాలుంటే, వాటిని నిత్యం పర్యవేక్షిస్తుంటే, తక్షణం చర్యలు తీసుకునే యంత్రాంగం పనిచేస్తే ఆగడాలను అరికట్టడం సులభమవుతుంది. అలాగే మహిళల రక్షణకు తగిన యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. గడప దాటితే క్షేమంగా తిరిగొస్తామో లేదోనన్న భయాందోళనల మధ్య పౌరులు బతికే దుఃస్థితి ఉండటం మంచిదికాదని ప్రభుత్వం, రైల్వేశాఖ గుర్తించాలి. -
విపత్తులను మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం
-
ఒకవైపు డబ్బులు లేవు అంటారు.. మరోవైపు విలాసాలకు ఖర్చు పెడుతున్న కూటమి సర్కార్
-
అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్
-
విపత్తులను మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: కరువు ఉరిమినా.. తుఫాన్లు తుడిచిపెట్టినా.. వరదలు, వర్షాలు ముంచెత్తినా.. అన్నదాతపై చంద్రబాబు ప్రభుత్వానికి కనికరం లేదు. కష్టాల్లో ఉన్న రైతులను ఉదారంగా ఆదుకోవాల్సిందిపోయి వారిని అన్ని విధాలుగా మోసం చేస్తోంది. ఖరీఫ్ సీజన్ ముగిసి, రబీ కూడా చివరి దశకు చేరుకుంది. అయినా, ఖరీఫ్ ప్రారంభంలో దెబ్బతిన్న పంటలకూ పరిహారం ఇవ్వాలన్న ధ్యాసే లేదు. ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా అటకెక్కించి ఆ పరిహారమూ అందకుండా చేసింది. సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు చెల్లించాల్సిన రూ.26 వేల ( పీఎం కిసాన్ సాయంతో కలిపి)పెట్టుబడి సాయమూ ఇవ్వకుండా మోసం చేసింది. ఇంకొక వైపు సీజన్ ముగియకుండానే అందించాల్సిన పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) చెల్లింపులోనూ కావాలనే కాలయాపన చేస్తోంది. పంటలకు మద్దతు ధర లభించేలా చూడటంలోనూ చంద్రబాబు సర్కారుది మొండి వైఖరే. ఎరువులు, పురుగు మందులు, నాణ్యౖమెన విత్తనాలు లేక రైతులు అల్లాడుతున్నా పట్టించుకోవడంలేదు. వ్యాపారులు, దళారుల చేతిలో అన్యాయానికి గురవుతున్న అన్నదాతను ఆదుకోవాలన్న ఆలోచనే లేదు. మొత్తం మీద ప్రకృతి విపత్తులకంటే అన్నదాతకు కూటమి సర్కారు నిర్లక్ష్యమే పెద్ద విపత్తుగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి.అడ్డగోలు కోతలతో.. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు నెలకొక వైపరీత్యం రైతులను వెంటాడుతూనే ఉంది. ఖరీఫ్ మొదట్లోనే జూలైలో అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. 16 జిల్లాల 1.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం మాత్రం 44 వేల ఎకరాల్లోనే పంటలు దెబ్బతిన్నాయని, 31 వేల మందికి రూ.31.53 కోట్లు చెల్లించాలని లెక్కతేల్చింది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కృష్ణా, వంశధార, నాగావళి నదులతో పాటు బుడమేరు, ఏలేరు వరదలు పంట పొలాలను ముంచెత్తాయి. 10 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తొలుత 5.93 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన 4 లక్షల మందికి రూ.557.63 కోట్ల పరిహారం ఇవ్వాలని అంచనావేశారు. ప్రభుత్వం ఇందులో అడ్డగోలుగా కోతలు వేసి దెబ్బతిన్న పంటల విస్తీర్ణం 3.11 లక్షల ఎకరాలకు కుదించింది. కేవలం 2 లక్షల మందికి రూ.319.08 కోట్లు ఇవ్వాలని చెప్పింది. పోనీ అదైనా ఇచ్చిందా అంటే అదీ లేదు.వైఎస్ జగన్ హయాంలో..⇒ విపత్తులకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకొనేందుకు ప్రత్యేకంగా రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు ⇒ ఏ సీజన్ పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అదే సీజన్ ముగిసేలోగా జమ. ఇలా ఐదేళ్లలో 34.41 లక్షల మందికి రూ.3,261.60 కోట్లు చెల్లించి అండగా నిలిచారు. ⇒ రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా ఐదేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్లు అందజేశారు. ⇒ వైఎస్సార్ రైతు భరోసా కింద ఐదేళ్లలో 53.58 లక్షల మందికి రూ.34,288.17 కోట్లు లబ్ధి చేకూర్చారు.చంద్రబాబు హయాంలో.. ⇒ బీమా ప్రీమియం బకాయిలు రూ.1,280 కోట్లు చెల్లించకపోవడం వల్ల రైతులకు దాదాపు రూ.2వేల కోట్లకు పైగా పరిహారం అందకుండా మోకాలడ్డారు. ⇒ 2024–25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈ పాటికే రూ.833 కోట్లు బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఇందులో పైసా కూడా చెల్లించకపోవడంతో రైతులకు రూ.1200 కోట్లకుపైగా బీమా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. ⇒ కూటమి పాలనలో పంటల బీమా పథకం ఉందో లేదో కూడా తెలియని అయోమయ స్థితి నెలకొంది. ⇒ సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు కేంద్రమిచ్చే పీఎం కిసాన్ సాయంతో సంబంధం లేకుండానే ఒకే విడతలో ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున 2024–25లో చెల్లించాల్సిన రూ.10,717 కోట్లు కూడా చంద్రబాబు ఎగ్గొట్టారు.సగం మండలాల్లోనే కరువంటూ..లోటు వర్షపాతంతో రాయలసీమ జిల్లాల్లో 100 మండలాలకు పైగా కరువు కోరల్లో చిక్కుకున్నాయి. 60 రోజులకు పైగా చినుకు జాడ లేదు. 10 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం మాత్రం మొక్కుబడిగా 54 మండలాలనే కరువు ప్రభావితంగా ప్రకటించింది. వీటికీ పైసా పరిహారం విదల్చలేదు. నవంబరులో విరుచుకుపడిన ఫెంగల్ తుఫాను కోతకొచ్చిన పంటలను తుడిచిపెట్టింది. దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. అయినా రైతులను ఆదుకున్న పాపాన పోలేదు. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది జూలై మొదలుకొని డిసెంబర్ వరకు వివిధ వైపరీత్యాలకు 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని, రూ.2 వేల కోట్లకు పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. ఇందులోనూ కోతలేసి చివరికి 6.65 లక్షల ఎకరాల్లోనే పంటలు దెబ్బతిన్నట్లు, రూ.527.18 కోట్లు చెల్లించాలంటూ లెక్కగట్టింది.దీంతోపాటు ఆధార్ సీడింగ్ కాకపోవడం, సరైన బ్యాంక్ ఖాతా నంబర్లు ఇవ్వక పోవడం వంటి సాంకేతిక కారణాలతో నిలిచిన 2023, 24 సీజన్ల కరువు సాయం బకాయిలు రూ.311.39 కోట్లు విడుదల చేయకుండా మోకాలడ్డింది. ఇలా మొత్తం రూ.838.57 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో కేవలంæ 1.85 లక్షల మందికి రూ.284.56 కోట్లు చెల్లించి చేతులు దులిపేసుకుంది. అదీ కూడా ప్రజలు, వివిధ సంస్థలు ఇచ్చిన వరద విరాళాల పుణ్యమే. -
బీమా ఎగ్గొట్టావు 'పరిహారం కట్టు బాబూ': వైఎస్ జగన్
చంద్రబాబు ఇక్కడి రైతులకు కచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్సూరెన్స్ సొమ్ము కచ్చితంగా రావాలి. ఒకవేళ రైతన్నలకు అది రాని పరిస్థితి ఉంటే.. తదుపరి వచ్చేది మన ప్రభుత్వమే. ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. అలాగే ఇవాళ రైతులకు రాని ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తాం. ప్రతి రైతన్న ముఖంలో సంతోషం కనిపించేలా చేస్తాం. సాక్షి కడప: ‘అకాల వర్షం.. పెనుగాలులు.. వడగళ్ల ధాటికి అరటి తోటలు నేల కూలాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతన్నలు ఇవాళో రేపో అరటి గెలలు కోసే సమయంలో తీవ్ర నష్టం సంభవించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. ఇన్పుట్ సబ్సిడీ అందించి ఎంతో కొంత ఆసరాగా నిలబడాలి.. కానీ ఈ సర్కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేదు.. ఇలాంటప్పుడు ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించి రైతులను ఆదుకోవాలి’ అని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) డిమాండ్ చేశారు. పడిపోయిన గెలలను కూడా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో భారీ ఈదురు గాలులు, అకాల వర్షాలకు నేలవాలిన అరటి తోటలను వైఎస్ జగన్ సోమవారం పరిశీలించారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతలలో అరటి తోటల్లోకి వెళ్లి రైతులను ఓదార్చి నష్టాన్ని ఆరా తీశారు. కోమన్నూతల వద్ద తోటలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లాలోని లింగాల మండలంతోపాటు అనంతపురం జిల్లాలోని నేర్జాంపల్లె, దాడితోట తదితర గ్రామాల్లో దాదాపు 4 వేల ఎకరాల్లో అరటి తోటలకు నష్టం జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబు ప్రీమియం ఎగ్గొట్టడంతో... అరటి రైతు ఎకరానికి రూ.1.50 లక్షల వరకు ఖర్చు పెట్టి సాగు చేస్తే తీరా పంట చేతికొచ్చే సమయంలో పెను గాలులు దెబ్బతీయడంతో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఆదాయం రాకపోగా, చివరికి నష్టం మిగలడం బాధేస్తోంది. రైతన్నలకు ఉచిత పంటల బీమా ఒక హక్కుగా వైఎస్సార్సీపీ హయాంలో అమలయ్యేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. దీన్ని ఎత్తివేయడం ఒక నేరమైతే.. 2024 మే, జూన్ నెలల్లో కట్టాల్సిన పంటల ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని చంద్రబాబు కట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సిన ప్రీమియం రూ.1,280 కోట్లు కట్టి ఉంటే రైతులకు మేలు జరిగేది. బాబు అధికారంలోకి వచ్చాక ప్రీమియం ఎగ్గొట్టడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ తర్వాత 2024–25కి సంబంధించిన ప్రీమియం కూడా ఆయన కట్టలేదు. అసలు ఈ రోజు ఉచిత పంటల బీమా ఉందా? లేదా? మీరిచ్చిన జీవోను చూస్తే దశల వారీగా ఎత్తేస్తామని చెబుతున్నారు. చంద్రబాబు పుణ్యాన ఇప్పటికే పలు పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ధాన్యం రంగు మారింది. మొక్కజొన్న, జొన్నకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. వరుసగా రెండేళ్లు ఖరీఫ్ సీజన్లో అదే జరిగింది. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. పంటలకు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. ఈ–క్రాప్ పక్కాగా నమోదు చేయాలి. ప్రతి రైతు పండించిన పంటల వివరాలు ఈ–క్రాప్ కింద నమోదు చేసి నష్టం జరిగితే వారికి ఇన్సూరెన్స్ వచ్చేలా చూడాలి. ఎవరూ ఇన్సూరెన్స్ కట్టలేదన్న పరిస్థితి ఉత్పన్నం కాకూడదు.పెట్టుబడి సాయం... సున్నామన ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా కింద రైతన్నలకు ఏటా రూ.13,500 చొప్పున ఇచ్చాం. చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే రూ.26,000 (కేంద్ర సాయంతో కలిపి మొత్తం) ఇస్తానన్నాడు. కానీ రూ.20 కూడా ఇవ్వలేదు. ఇప్పటికే ఒక ఏడాది పెట్టుబడి సాయాన్ని రైతులకు ఎగ్గొట్టారు. ఇవాళ పరిస్థితి చూస్తుంటే రైతులను ఎంతమాత్రం ఆదుకునే ఉద్దేశం కనిపించడం లేదు. సున్నా వడ్డీ పంట రుణాలకు మంగళం పాడారు. రైతులకు సున్నా వడ్డీ మొత్తం చెల్లించలేదు. ఇలా అన్నదాతలకు అడుగడుగునా చంద్రబాబు అన్యాయం చేస్తూనే ఉన్నారు. నిరుపయోగంగా కోల్డ్ స్టోరేజీ..రాష్ట్రంలోనే అరటి సాగు పులివెందులలో అత్యధికం. ఆ రైతన్నలకు మేలు చేయడం కోసం ఇక్కడ రూ.25 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేశాం. ఎన్నికలకు ముందే అన్ని వసతులతో ప్రారంభించాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దారుణంగా వ్యవహరిస్తోంది. టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీకి అప్పగించడం లేదు. దీన్ని బట్టే రైతులపై ఈ సర్కార్ ఎంత కపట ప్రేమ చూపుతోందో అర్థమవుతోంది. ఈ కోల్డ్ స్టోరేజీ సామర్థ్యం 500 మెట్రిక్ టన్నులు కాగా, దాన్ని టెండర్ ద్వారా యూజర్ ఏజెన్సీకి అప్పగిస్తే రైతులకు మేలు జరిగేది. కానీ ఆ పని చేయకుండా, కోల్డ్ స్టోరేజీని వాడుకోకుండా నిరుపయోగంగా వదిలేశారు. అదే ఇప్పుడు యూజర్ ఏజెన్సీ ఉండి ఉంటే వారు పంట కొనుగోలు చేసేవారు. మరోవైపు రైతులు తమ పంటను ఇక్కడ దాచుకునే వీలుండేది. తద్వారా నష్టపోయే అవకాశం లేకపోగా మంచి జరిగేది. వైఎస్సార్సీపీ హయాంలో రెండు కంటైనర్ల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతులు కూడా చేసి రైతులకు ప్రోత్సాహం అందించాం. పంటల ధరలు దారుణంగా పతనం.. రాష్ట్రంలో వర్షాలు, ఈదురు గాలులతో పంటలకు తీవ్ర నష్టం జరగ్గా మరోవైపు ధరలు దారుణంగా పడిపోయాయి. నెల క్రితం టన్ను అరటి ధర రూ.26 వేలు ఉంటే ఇప్పుడు రూ.9 వేలకు పడిపోయింది. అయినా కొనుగోళ్లు లేవు. కొన్నిచోట్ల రూ.6వేలకు పతనమైనా ఈ ప్రభుత్వం ఎక్కడా రైతులను పట్టించుకోవడం లేదు. మిర్చిది కూడా అదే పరిస్థితి. ధాన్యం కొనుగోళ్లలోనూ అదే దుస్థితి. ధాన్యం రైతులు క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు. మిర్చి రూ.11,800కి కొంటామని చెప్పి ఒక్క కేజీ కూడా కొనుగోలు చేయలేదు. పెసలు, శనగలు, మినుములు, కందులు.. ఇలా ఏ పంటకూ ఇవాళ గిట్టుబాటు ధర లేదు. చీనీ రైతులకు వైఎస్సార్సీపీ హయాంలో టన్నుకు లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చింది. స్యూట్ (కమీషన్) లేకుండా రైతులకు మనం మేలు చేయగా, ఈరోజు చీనీ టన్ను కేవలం రూ.23 వేలు, రూ.18 వేలు, రూ.15 వేలు మాత్రమే పలుకుతోంది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.నష్టపోయిన రైతన్నకు ఇదే నా భరోసా..ఈ 4 వేల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతన్నలకు భరోసా ఇస్తున్నా. ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే నా పర్యటన! చంద్రబాబు ఇక్కడి రైతులకు కచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా కచ్చితంగా రావాలి. ఒకవేళ రైతన్నలకు అది రాని పరిస్థితి ఉంటే.. తదుపరి వచ్చేది మన ప్రభుత్వమే. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. అలాగే ఇవాళ రైతులకు రాని ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తాం. ప్రతి రైతన్న ముఖంలో సంతోషం కనిపించేలా చేస్తాం. అంతేకాకుండా ప్రతి రైతుకు 2023లో మన ప్రభుత్వంలో ఇచ్చినట్లుగా రూ.50 వేలు కూడా ఇస్తాం. ఇది ప్రతి రైతుకూ భరోసా కల్పిస్తూ చెబుతున్నా. పార్టీ తరఫున కూడా రైతులకు సాయం అందించి ఆదుకుంటాం.నేలమట్టమైన తోటలు.. చలించిన జగన్ఎక్కడ చూసినా నేలమట్టమైన అరటి చెట్లు.. మట్టి పాలైన గెలలు.. కంటతడి పెడుతున్న రైతన్నలను చూసి వైఎస్ జగన్ చలించిపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల గ్రామాల పరిధిలో అరటి తోటలను ఆయన స్వయంగా పరిశీలించారు. తమ బాధలు చెబుతున్న సమయంలో రైతన్నలు కన్నీటి పర్యంతం కాగా, వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. దారి వెంట అరటి తోటలను పరిశీలిస్తూ.. పొలాల్లోకి వెళ్లి ప్రతి రైతుకూ ధైర్యం చెప్పి ఓదార్చుతూ ముందుకు సాగారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. జిల్లాలో జగన్ రెండు రోజుల పర్యటన సోమవారం మధ్యాహ్నంతో ముగిసింది. వేంపల్లెలో జడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి నివాసంలో నూతన వధూవరులు సాయి భైరవ ప్రీతంకుమార్రెడ్డి, వైష్ణవిలను ఆశీర్వదించిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని తిరిగి విజయవాడకు పయనమయ్యారు. తీవ్రంగా నష్టపోయాం.. ఆత్మహత్యలే శరణ్యం..ఎనిమిది ఎకరాల్లో అరటి పంట సాగు చేశా. మొక్క రూ.20 చొప్పున 9,500 మొక్కలను కొనుగోలు చేశా. సుమారు రూ.16 లక్షలు పెట్టుబడి చేతికి అందకుండా పోయింది. ఇంటిల్లిపాది అన్నపానీయాలు లేకుండా గడుపుతున్నాం. ఎరువుల దుకాణాల్లో అప్పులు చేశాం. పెట్టుబడికి అప్పులు తెచ్చాం. పది రోజుల్లో చేతికొస్తుందనుకున్న పంట కళ్లెదుటే నేలమట్టమైంది. ప్రభుత్వం ఆదుకోకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం. – మందలపల్లి కేశవయ్య, తాతిరెడ్డిపల్లె, లింగాల మండలంఅరటి వ్యాపారులు, కూలీలను వెళ్లగొట్టారు..గత నెలలో టన్ను అరటి రూ.25–26 వేల వరకు పలికింది. అయితే ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని కూలీలను పులివెందుల పోలీసులు చితకబాదారు. లారీలను ఆపి డబ్బులు వసూలు చేశారు. దీంతో పులివెందుల నుంచి వ్యాపారులు, కూలీలు వెళ్లిపోవడంతో ధరలు పడిపోయాయి. ప్రస్తుతం ధర రూ.6–10 వేలుæమాత్రమే ఉంది. లారీలు, కూలీలు లేకపోవడం, పంట ఒక్కసారిగా చేతికి అందడంతో అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు అకాల వర్షాలు నిండా ముంచాయి. 3.5ఎకరాల్లో అరటి సాగుచేసి రూ.7లక్షలు నష్టపోయా. – పీసీ వాసుదేవరెడ్డి, కోమన్నూతుల, లింగాల మండలంపెట్టుబడి సాయం ఏది?మూడు ఎకరాల్లో అరటి సాగు చేశా. సుమారు రూ.6 లక్షల మేర పెట్టుబడులు పెట్టా. గాలివానకు పంట మొత్తం నేలకూలింది. నేల కూలిన అరటి పంటను తొలగించాలన్నా ఎకరాకు రూ. 30 వేల వరకు ఖర్చయ్యే పరిస్థితి నెలకొంది. ఈ ప్రభుత్వం ఇంతవరకు రైతు భరోసా సొమ్ములు కూడా అందించలేదు. – పీసీ ప్రభాకర్‌రెడ్డి, అరటి రైతు, కోమన్నూతల, లింగాల మండలంఎప్పుడూ చూడలేదుపదేళ్లుగా అరటి సాగు చేస్తున్నా. ఏప్రిల్, మే నెలల్లో ఈదురు గాలులు, వర్షాలు కురిసే నాటికి పంట చేతికి వచ్చేది. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చే సమయంలో మార్చిలోనే వడగళ్ల వానలు కురిశాయి. ఈదురు గాలులు వీచాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఐదు ఎకరాలలో పంట సాగు కోసం రూ.10 లక్షల వరకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేశా. ఊరు వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – పురుషోత్తంరెడ్డి, అరటి రైతు, కోమన్నూతల, లింగాల మండలంరూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు..అరటి రైతులకు పంటల బీమాను వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఐదు ఎకరాలలో అరటి సాగు చేశా. 6,000 మొక్కలు అకాల వర్షాల వల్ల నేల కూలాయి. అరటి గెలలపై నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. – దినేష్‌కుమార్‌రెడ్డి, కోమన్నూతుల, లింగాల మండలం -
రాసిపెట్టుకోండి.. ఇది నా మాట.. అధికారంలోకి వస్తాం.. 50 వేలు ఇస్తాం
-
తాతిరెడ్డిపల్లెలో అరటి రైతులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
-
రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది
-
రైతుల పరామర్శ తరువాత వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.. రైతులకు జగన్ భరోసా
-
Watch Live: రైతులకు వైఎస్ జగన్ పరామర్శ
-
వైఎస్ జగన్ ఇఫ్తార్ విందు కార్యక్రమంపై దేవినేని అవినాష్..
-
రైతులపై కూటమి ప్రభుత్వ కపట ప్రేమ: వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం: ఏపీలో రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందన్నారు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. పంట నష్టం కారణంగా వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు. అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి. కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు కూడా అందడం లేదు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్యూరెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది. వర్షాలు, గాలులతో పంట నష్టం తీవ్రంగా ఏర్పడింది. నెల కింద రూ.26వేలు ధర పలికితే ఇప్పుడు ఎవరూ కొనడం లేదు.వైఎస్సార్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేది. మన వైఎస్సార్సీపీ పాలనలో ప్రతీ రైతుకు న్యాయం చేశాం. అరటి సాగులో రాష్ట్రంలోనే పులివెందుల నంబర్ వన్ స్థానంలో ఉంది. మా ప్రభుత్వంలో రూ.25కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌లు కూడా వాడుకోలేకపోతున్నారు. యూజర్ ఏజెన్సీకి అప్పగించి ఉంటే నష్టం జరిగేది కాదు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. మళ్లీ ప్రతీ రైతు కళ్లలో ఆనందం కనిపించేలా చేస్తాం. అధికారంలోకి వచ్చాక ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం’ అని రైతులకు హామీ ఇచ్చారు. అకాల వర్షానికి భారీ నష్టం..శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. -
నష్టపోయిన రైతులను పరామర్శించనున్న జగన్
-
చవ్వా విజయ్ శేఖర్ రెడ్డి పార్థివదేహానికి YS జగన్ నివాళి
-
రేపు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(సోమవారం) పులివెందులలో పర్యటించనున్నారు. లింగాలలో పడిపోయిన అరటి తోటలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. భారీవర్షాలు, ఈదురు గాలులకు అరటి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. బాధిత రైతులను ఆయన పరామర్శించనున్నారు.వైఎస్సార్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానకు భారీగా అరటి పంటలు నేలకూలాయి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని కోమనంతల, వెలిగండ్ల, పార్నపల్లి, లింగాల గ్రామాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అకాల వర్షాలతో సరిగ్గా కోతకు వచ్చిన సమయంలో భారీ పంట నష్టం ఏర్పడింది. చేతి కందిన పంట నేలకూలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పులివెందుల: చవ్వా విజయశేఖర్‌రెడ్డి భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా విజయశేఖర్‌రెడ్డి భౌతికకాయానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు.అనంతరం విజయశేఖర్‌రెడ్డి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు.పులివెందుల ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా విజయశేఖర్‌రెడ్డి అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ప్రజల సందర్శనార్ధం ఆయన పార్థివదేహాన్ని పాల్‌రెడ్డి ఫంక్షన్ హాలులో ఉంచారు. విజయశేఖర్‌రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్‌కి దగ్గరి బంధువు. -
నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
-
వైఎస్ జగన్ గురించి సతీష్ కుమార్ రెడ్డి అద్భుత మాటలు
-
1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు 1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలని.. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి( YS Jagan Mohan Reddy) వివరించారు. జాతీయ ప్రాధాన్యతగా జనాభా నియంత్రణను నిజాయితీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ప్రక్రియ శిక్షగా మారకూడదని స్పష్టంచేశారు. దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాల్లో సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్ కసరత్తు చేపడతామని హోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీ అమలుకు అడ్డంకిగా మారిన రాజ్యాంగంలోని 81(2)(ఏ) అధికరణ(ఆర్టికల్)ను సవరిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. దీనివల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయని, లోక్‌సభలో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న అంశం ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి వైఎస్ జగన్ శుక్రవారం లేఖ రాశారు. శనివారం మీడియాకు విడుదల చేశారు. కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యంతోపాటు ఆయా రాష్ట్రాల ప్రజల మనోభావాలను డీలిమిటేషన్ ప్రక్రియ ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. డీలిమిటేషన్ ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలు దేశ సామాజిక, రాజకీయ సామరస్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉన్నందున, ఈ అంశం తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలని ప్రధాని మోదీని కోరారు. ఈ విషయంలో ప్రధానిగా మీ నాయకత్వం, మార్గ నిర్దేశం చాలా ముఖ్యమని.. మీరిచ్చే హామీ అనేక రాష్ట్రాలకున్న భయాలను, అపోహలను తొలగించడానికి దోహద పడుతుందని ప్రధానికి వైఎస్ జగన్ వివరించారు. లోక్‌సభలో ఇప్పుడున్న సీట్ల పరంగా ఆయా రాష్ట్రాలకు ఉన్న వాటాను కుదించకుండా పునర్విభజన (డీలిమిటేషన్) కసరత్తు చేపట్టాలని కోరారు. ఆ లేఖలో ఇంకా ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకూడదు రాజ్యాంగంలో 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026లో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. కానీ.. దీనికి ముందుగా 2021లో చేపట్టాల్సిన జనాభా లెక్కింపు ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. 2026 నాటికి జనాభా లెక్కల ప్రక్రియను పూర్తి చేయడానికి ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇది జరిగిన వెంటనే డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందన్న అంశం అనేక రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా ఈ ప్రక్రియ ద్వారా తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణను నిజాయితీగా చేయడం వల్లే.. జనాభా నియంత్రణ కోసం వివిధ రాష్ట్రాలు అనేక విధానాలు అమలు చేశాయి. అయితే వాటి ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. దీని వల్ల జనాభా పెరుగుదల వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంది. దేశ వ్యాప్తంగా జనాభా వృద్ధి ఒకే తరహాలో లేదు. అసమతుల్యత ఉంది. దీని వల్ల డీలిమిటేషన్ అంశం విస్తృత స్థాయిలో ఆందోళనకు దారి తీస్తోంది. 42వ.. 84వ రాజ్యాంగ సవరణల ద్వారా ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపును నిలిపేశారు. కాలక్రమేణా అన్ని రాష్ట్రాలు జనాభా నియంత్రణ కసరత్తులో భాగంగా ఒకే స్థాయిలో ఫలితాలు సాధిస్తాయని భావించి ఈ సీట్ల కేటాయింపును నిలిపేశారు. దేశ జనాభాలో ఆయా రాష్ట్రాల వాటా 1971 నాటికి అనుకున్న స్థాయికి చేరుకుంటుందని భావించారు. కానీ, 2011 జనాభా లెక్కల గణాకాంలను చూస్తే.. దశాబ్దాల తరబడి జనాభా వృద్ధి, దాని అంచనాలు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేవని తేలింది. 1971, 2011 మధ్య 40 సంవత్సరాల్లో దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది. గత 15 సంవత్సరాల్లో జనాభా మరింత తగ్గిందని మేం నమ్ముతున్నాం. జనాభా నియంత్రణను జాతీయ ప్రాధాన్యతగా తీసుకున్నందున, దక్షిణాది రాష్ట్రాలు నిజాయితీగా తమ విధానాలను అమలు చేయడం వల్ల ఈ వాటా తగ్గింది. 1971 జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు 24.80 శాతం అయితే, 2011 జనాభా లెక్కల ప్రకారం 20.88 శాతంగా ఉంది. అపోహలు, భయాలు తొలగించండి రాష్ట్రాల్లో ఇప్పుడున్న జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే దేశ విధానాల రూపకల్పన సహా శాసన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాలకు సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్ కసరత్తు చేపడతామని హోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అయితే ఈ హామీని అమలు చేయాలంటే రాజ్యాంగ పరంగా చేయాల్సిన సడలింపును కూడా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 (2) (ఎ) జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు జరగాలని పేర్కొంది. దీని ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియలో ముందుకు వెళ్తే ఈ నిబంధన వల్ల హోంమంత్రి అమిత్‌షా ఇచ్చిన హామీని అమలు చేయడంలో అడ్డంకులు ఏర్పడతాయి. అందువల్ల దామాషా ప్రకారం ప్రతి రాష్ట్రానికి సీట్ల కేటాయింపుపై రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. దీని వల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయి, ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే అంశం ఉత్పన్నం కాదు. డీలిమిటేషన్ ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలు దేశ సామాజిక, రాజకీయ సామరస్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉన్నందున ఈ అంశం తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాను. ఈ విషయంలో ప్రధానిగా మీ నాయకత్వం, మార్గనిర్దేశం చాలా ముఖ్యం. మీరిచ్చే హామీ అనేక రాష్ట్రాలకున్న భయాలను, అపోహలను తొలగించడానికి దోహద పడుతుంది.డీఎంకే నాయకులకు లేఖ ప్రతి డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష కమిటీ సమావేశం శనివారం చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశం నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు.. ఆయన ప్రధాని మోదీకి రాసిన లేఖ ప్రతిని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి డీఎంకే నాయకులకు పంపారు. -
రంగంలోకి అంగడి చదువు!
పేదరికం కారణంగా కొంతమంది ఏపీ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయలేకపోయారన్న వార్తలు వస్తున్నాయి. మన పాలక వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవలసిన పరిణామం ఇది. ఉన్న ఊళ్లో ఉపాధి లేక పొట్టకూటికోసం వెనుకబడిన ప్రాంతాల ప్రజలు వలసబాట పడుతున్నారు. చదువుకుంటున్న వారి పిల్లలు కూడా గత్యంతరం లేక తల్లిదండ్రులను అనుసరించవలసి వస్తున్నది. వారిలో పదో తరగతి చదివిన పిల్లలు కూడా ఉన్నారు. వలస కారణంగా వారు కీలకమైన పదో క్లాసు పరీక్షలకు దూరమయ్యారు. వారి భవిష్యత్తు గురించి వ్యవస్థ పట్టించు కోనట్టయితే డ్రాపవుట్లుగా మిగిలే అవకాశం ఉన్నది. వారి భావి జీవితం వలసకూలి టైటిల్‌తో ముడిపడే ప్రమాదం ఉన్నది.‘‘ఒక్క మలినాశ్రు బిందువొరిగినంత వరకు... ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను’’ అంటాడు కవి బాలగంగాధర తిలక్. నిజంగా ప్రజల ఆలనాపాలనా చూడవలసిన ఏపీ సర్కార్‌కు మాత్రం అటువంటి సెంటిమెంట్లేవీ లేవు. ఇప్పుడు ఒక్క కన్నీటి బొట్టు రాలడం కాదు. మూర్తీభవించిన కన్నీరు దారిపొడుగునా ప్రవహిస్తున్నది. ‘‘జగన్ సర్కార్ అమలు చేసిన ‘అమ్మ ఒడి’ పథకాన్ని కొనసాగించి ఉన్నట్లయితే మా పిల్లలు తప్పకుండా పదో తరగతి పరీక్ష రాసేవార’’ని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. నాణ్యమైన సార్వత్రిక విద్యను అమలు చేయడం కోసం జగన్ మోహన్ రెడ్డి ఎంతగా మేధామథనం జరిపి పథకాన్ని రూపొందించి ఉంటారో ఈ విషాద పరిణామాన్ని చూస్తే అర్థమవు తున్నది.మన దేశంలో విద్యాహక్కు చట్టం అమలులో ఉన్నది. అటు వంటి చట్టాన్ని అమలు చేయాలని భారత రాజ్యాంగం కూడా ఆదేశించింది. దురదృష్టవశాత్తు ఇది మొక్కుబడి తతంగంగా మారిందన్న సంగతి అందరికీ తెలిసిందే. బడికి వచ్చే పిల్లలకు అరకొర చదువు చెప్పడం ప్రభుత్వ స్కూళ్ల కర్తవ్యంగా మారి పోయింది. ఉద్దేశపూర్వకంగా తలెత్తిన ఈ ధోరణి ఫలితంగా తామరతంపరగా ప్రైవేట్ విద్యాసంస్థలు పట్టుకొచ్చాయి. స్థోమత ఉన్నవాళ్లంతా ప్రైవేట్ స్కూళ్లలో మెరుగైన విద్యను కొనుగోలు చేయడం, పేద పిల్లలు సర్కారు బడి చదువులతో పోటీలో నిలవలేకపోవడం... గత మూడు దశాబ్దాలుగా బాగా ఎక్కువైంది. ఈ ధోరణి పట్ల పలువురు ప్రగతిశీల సామాజిక వేత్తలు, మేధావులు అసహనాన్నీ, ఆందోళననూ వ్యక్తం చేస్తూనే ఉన్నారు.ఐక్యరాజ్య సమితి సైతం తన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్డీజీలు) పిల్లలందరికీ నాణ్యమైన విద్య ఉచితంగా సమా నంగా అందుబాటులో ఉండాలని నాలుగో లక్ష్యంగా నిర్దేశించింది. మన్నికైన జీవన ప్రమాణాలతో మానవజాతి దీర్ఘకాలం పాటు ఈ భూగోళంపై మనుగడ సాగించాలంటే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం అవసరమేనని మేధాప్రపంచం అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. కానీ పాలకుల్లో చిత్త శుద్ధి లేకపోవడం ఈ లక్ష్యాలకు ఆటంకంగా మారింది. ఉదార ప్రజాస్వామిక వ్యవస్థలు క్రమంగా ‘ప్లుటానమీ’ (సంపన్నులు శాసించే వ్యవస్థలు)లుగా పరివర్తనం చెందుతున్నాయని పలు వురు పొలిటకల్ ఎకనామిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన దశాబ్ద్ద కాలానికి ఈ పదప్రయోగం వ్యాప్తిలోకి వచ్చింది.సంస్కరణలు ప్రారంభమైన తొలి దశాబ్దిలో క్రియాశీలకంగా ఉన్న రాజకీయ నాయకుల్లో చంద్రబాబు కూడా ఒకరు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వరాదనే వాదాన్ని ఆయన బలంగా వినిపించేవారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ డిమాండ్‌ను ఆయన ఎంత తీవ్రంగా వ్యతిరేకించేవారో చాలామందికి గుర్తుండే ఉంటుంది. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అమలుచేసిన తర్వాత ఈ అంశానికి సర్వత్రా ఆమోదం లభించింది. అలాగే ప్రభుత్వ సేవలన్నింటికీ ప్రజలు యూజర్ ఛార్జీలు చెల్లించాలనే నియమం పెట్టింది కూడా చంద్రబాబే! మితిమీరిన ప్రైవేటీకరణ సూపర్ రిచ్ వర్గాన్ని సృష్టించడం, తిరిగి ఆ వర్గం మొత్తం ఆర్థిక – రాజకీయ వ్యవస్థలను ప్రభా వితం చేయడం ప్లుటానమీకి దారి తీస్తున్నది.ఇటువంటి వ్యవస్థల్లో సహజ వనరుల దగ్గ ర్నుంచి సర్వే సర్వత్రా ప్రైవేటీకరణే తారకమంత్రంగా పనిచేస్తుంది. విద్యారంగం ఇందుకు మినహాయింపేమీ కాదు. విభజిత రాష్ట్రానికి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ‘విద్య ప్రభుత్వ బాధ్యత కాద’ని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతిని గుర్తు చేసుకోవడం అవసరం. ఈ నేపథ్యాన్ని అర్థం చేసు కుంటేనే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ రంగంలో నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని ఎందుకనుకుంటున్నారో అర్థమవుతుంది. అమరావతి కోసం అరవై వేల కోట్ల రూపాయల అప్పును ఆగమేఘాల మీద పుట్టించగలిగిన వ్యక్తి, తాను పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ‘తల్లికి వందనం’ ఎందుకు అమలుచేయలేకపోయాడో అర్థమవుతుంది. ఈ పూర్వరంగం అర్థం కానట్లయితే ఆర్థిక వెసులుబాటు లేకనే అమలు చేయలేకపోయారనే మోసపు ప్రచారానికి తలూప వలసి వస్తుంది.విద్యారంగంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పూర్తి ప్రజాస్వామికీకరణ చర్య లను చేపట్టింది. ప్రజల ఆకాంక్షల మేరకు ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించింది. భాషా – సంస్కృతుల ముసుగులో పెత్తందారులు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా చలించలేదు. సీబీఎస్ఈ సిలబస్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. నగరాల్లో సూపర్ రిచ్ పిల్లలకు మాత్రమే పరిమితమైన అంతర్జాతీయ స్థాయి ఐబీ సిలబస్‌ను పిల్లలందరికీ ఉచితంగా ఈ సంవత్సరం నుంచి అమలుచేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసింది. అంతర్జా తీయ స్థాయిలో మన పిల్లలు పోటీపడాలన్న తపనతో చేపట్టిన కార్యక్రమాలివి. డిజిటల్ యుగంలో తన రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో వెలుగొందాలని పాఠశాలల్లో డిజిటల్ బోర్డు లను ఏర్పాటు చేయించారు. ఎనిమిదో క్లాసు నుంచి విద్యార్థుల చేతికి ట్యాబ్‌లను ఉచితంగా అందజేశారు.పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహార లోపం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి స్వయంగా పూనుకొని తయారు చేయించిన మెనూతో మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులపై పైసా భారం పడకుండా పుస్తకాలు, బ్యాగ్, బెల్ట్, యూనిఫామ్‌లను పాఠశాలల ప్రారంభానికి ముందే సిద్ధం చేసి ఉంచేవారు. మూడు నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు అన్ని సబ్జెక్టులూ ఏకోపాధ్యా యుడే బోధించే పద్ధతికి స్వస్తిచెప్పి వారికి సబ్జెక్టు వారీగా బోధించే టీచర్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆ మూడు తరగతులను కిలోమీటర్ పరిధి లోపల ఉండే అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలో విలీనం చేశారు. ఫలితంగా ఆ విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల సదుపాయం ఏర్పడింది. ఆ వయసు పిల్లల్లో గ్రాహ్యశక్తి బలంగా ఉంటుందన్న అధ్యయనాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల తన పదవీ కాలంలో రెండేళ్లు కోవిడ్ కోతకు గురైనప్పటికీ పాఠశాల విద్యారంగంలో పెను మార్పులకు జగన్ తెరతీశారు.పేద – ధనిక తేడాల్లేని, లింగవివక్ష అసలే లేని ఒక నవ యుగ విద్యాసౌధ నిర్మాణం కోసం ఇన్ని ఇటుకల్ని పేర్చిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి తప్ప ఈ దేశంలో మరొకరు లేరు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విద్యావ్యవస్థ పునర్నిర్మాణా నికి ఇంత వేగంగా అడుగులు వేసిన వ్యక్తి కూడా మరొకరు కాన రారు. కేరళ రాష్ట్ర విద్యారంగం మొదటి నుంచీ కూడా మిగతా దేశంతో పోల్చితే ఆరోగ్యంగానే ఉన్నది. ఆర్థిక సంస్కరణల తర్వాత కూడా అది తన ప్రతిష్ఠను కాపాడుకోగలిగింది.చదువుల తల్లి సరస్వతిని అమ్ముకోవడం తరతరాలుగా మన సంస్కృతిలో తప్పుగానే భావిస్తున్నారు. ఇందుకు ఆంధ్ర భాగవతం కర్త బమ్మెర పోతనామాత్యులే ఉదాహరణ. ‘‘బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ / కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్ / హాలికులైననేమి? గహనాంతర సీమల కందమూల / కౌద్దాలికు లైననేమి నిజ దార సుతోదర పోషణార్థమై’’ అన్నారు. తాను రాసిన కావ్యాన్ని సరస్వతిగా భావించి, దాన్ని రాజులకు అంకిత మివ్వడానికి ఆయన నిరాకరించారు. అలా వచ్చిన సొమ్ము పడుపువృత్తితో వచ్చిన సొమ్ముగా ఆయన అసహ్యించుకున్నారు. ఆ సంప్రదాయానికి విరుద్ధంగా ఇప్పుడు చదువుల తల్లిని అంగట్లో నిలబెట్టి అమ్ముకుంటున్నారు. దానికి మనం ఎన్ను కున్న ఏలికలు వత్తాసుగా నిలబడుతున్నారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరమే ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లను విడిచిపెట్టి ప్రైవేట్ స్కూళ్లలో చేరారు. ఆయన అధికారంలోకి వస్తే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం రద్దవుతుందన్న భయం ఒక కారణం. ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ కింద డబ్బులొస్తా్తయనే నమ్మకం కూడా ఇంకో కారణం కావచ్చు. అట్లా మారిన విద్యార్థులు ఇప్పుడు ఫీజులు కట్టలేక అల్లాడు తున్నారు. ఇంగ్లీషు మీడియాన్ని రద్దు చేస్తారనే ప్రచారం, సీబీఎస్ఈ సిలబస్‌ను ఎత్తేయడం దేన్ని సూచిస్తున్నాయి? ఎని మిదో తరగతి నుంచి విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌లను నిలిపి వేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లలో కొత్త కంటెంట్ లోడ్ చేయలేదు. ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద దాదాపు ఇరవై వేల స్కూళ్లలో సౌకర్యాలను ప్రైవేట్ స్కూళ్ల కంటే మిన్నగా జగన్ ప్రభుత్వం మెరుగుపరిచింది. మిగిలిన స్కూళ్లలో ఆ కార్యక్ర మాన్ని నిలిపివేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత చాలాచోట్ల నాసిరకంగా మారింది. మూడు నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థులకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్‌ను ఎత్తేస్తారట! ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ స్కూళ్లపై ప్రజలకు ఏర్పడ్డ నమ్మకాన్ని చంపేయడమే లక్ష్యంగా పెట్టు కున్నట్టు కనిపిస్తున్నది. మరోపక్క పెద్ద ఎత్తున ప్రైవేట్ స్కూళ్లకు, జూనియర్ కాలేజీలకు అనుమతులిస్తున్నారన్న ప్రచారం సాగుతున్నది. ప్రభుత్వ స్కూళ్ల సంఖ్యను పెద్ద ఎత్తున తగ్గించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. మెడికల్ కాలేజీల సంగతి తెలిసిందే! మరోసారి ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ప్రైవేట్ జేగంట మోగుతున్నది. అంగడి చదువులు మళ్లీ రంగప్రవేశం చేస్తున్నాయి. విద్యా విప్లవానికి గ్రహణం పట్టింది. ఈ ప్రభుత్వం మారితేనే గ్రహణం విడిచేది!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ
-
డీలిమిటేషన్‌పై ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
అమరావతి, సాక్షి: నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఓ లేఖ రాశారు. వచ్చే ఏడాది(2026) జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధానిని వైఎస్ జగన్ కోరారు. ‘‘గత 15 ఏళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్(Delimitation) ప్రక్రియ గనుక చేపడితే.. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో నడుస్తోంది. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడండి.. .. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలి. అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుంది. అందుకే దక్షిణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలి. ఈ కోణంలో ఆలోచించి డీలిమిటేషన్ చేపట్టాలని కోరుకుంటున్నా. అటు లోక్‌సభ ఇటు రాజ్యసభలో.. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు నిర్వహించాలని కేంద్రాన్ని కోరుకుంటున్నా’’ అని ప్రధాని మోదీని వైఎస్ జగన్ లేఖలో కోరారు. 👉పూర్తి లేఖ కోసం ఇక్కడ క్లిక్ చేయండిమరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్రంలోని బీజేపీకి తమిళనాడు అధికార పక్షం డీఎంకేకు మధ్య రాజకీయ సమరం జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం(మార్చి 22న) తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ లేఖ సారాంశాన్ని డీంఎకేకు కూడా పంపించారు. -
‘మీరు వైఎస్ జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందే’
కృష్ణాజిల్లా: ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే అది వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమన్నారు మాజీ మంత్రి పేర్నినాని. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాలనపై నిప్పులు చెరిగిన పేర్ని నాని.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వైఎస్ జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు సూచించారు.‘ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఒక్క జగన్‌కే సాధ్యం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చంద్రబాబు...ఆయన తొత్తు పవన్ కళ్యాణ్ ... జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. ఎ న్నికల ముందు సూపర్ సిక్స్ ..షణ్ముఖ వ్యూహం అని హామీలిచ్చారు. కూటమి ఎమ్మెల్యేలు స్క్రిప్ట్ లు వేసుకుని బ్రతకాల్సిందే. ఐదేళ్ల క్రితం మన బ్రతుక్కి వచ్చింది 23 సీట్లు కాదా?, రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని ధ్వజమెత్తారు పేర్ని నానివైఎస్సార్సీపీ నాయకుల అరెస్టుల వల్ల జనాల్లో జగన్ పరపతి ఏమీ తగ్గలేదని. అరెస్టులతో కూటమి నాయకులు మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం వైఎస్సార్సీపీ నాయకులను ఏమీ చేయలేదన్నారు. పోసాని కృష్ణమురళిపై ఏ ఆధారాలు లేకుండానే 18 కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు పేర్ని నాని. -
‘చంద్రబాబు శకుని పాత్ర వేస్తే బాగుండేది’
సాక్షి,గుంటూరు : విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సాంస్కృతి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు శకుని పాత్ర వేస్తే బాగుండేదని, ఆయన ఆ పాత్రకు బ్రహ్మాండంగా సరిపోతారని మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.ఏపీ బడ్జెట్ సమావేశాలపై అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘2025 బడ్జెట్ సమావేశాలు 16 రోజుల పాటు జరిగాయి. ప్రతిపక్షం లేని శాసన సభ సమావేశాలు చప్పగా సాగాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్ళలేదు. వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. సమావేశాలు కూటమి నేతలు ఒకరినొకరు పొగుడుకోవడానికే సరిపోయింది. శాసన మండలిలో ప్రతిపక్షం ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను మండలిలో మా సభ్యులు ఎండగట్టారు.ఒక్క క్వింటా మిర్చిని ఈ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. బెల్ట్ షాపులు ఊరూరా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎంతో దౌర్భాగ్యపు స్థితిలో పని చేస్తుందో స్వంత పార్టీ సభ్యులే శాసన సభలో చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు దొంగచాటుగా సంతకం చేయాల్సిన అవసరం ఏముంది. ప్రతిపక్షం హోదా ఇవ్వండి. స్పీకర్ అయన్నపాత్రుడు వైఎస్ జగన్ గురించి ఏవిధంగా మాట్లాడారో అందరూ చూశారు. అచ్చెన్నాయుడు ఏటువంటి వ్యాఖ్యలు చేశారో అందరికి తెలుసు. ప్రజా సమస్యలపై పోరాటం మాకు ముఖ్యం. స్పీకర్,డిప్యూటీ స్పీకర్ శాసన సభకు పవిత్రత లేకుండా చేశారు. వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా మార్చి శునకానందం పొందుతున్నారు.మంచి మిత్రుడు అని వైఎస్ గురించి చంద్రబాబు చెబుతాడు. మరి ఆయన పేరుపై ఎందుకంత కోపం. శాసన సభ్యుల వేసిన స్కిట్స్‌లో కూడా జగన్ పేరు మర్చిపోలేకపోయారు. ఆ స్కిట్లో చంద్రబాబుకు శకుని పాత్ర ఇస్తే బాగుండేది. ఆయన శకుని పాత్రకు బ్రహ్మాండంగా సరిపోతారు’ అని సెటైర్లు వేశారు. -
జగన్ నామ స్మరణతోనే ముగిసిన AP అసెంబ్లీ
-
హజ్ యాత్రికులకు కూటమి సర్కార్ ద్రోహం
రాష్ట్రం నుంచి హజ్‌కు వెళ్లే ముస్లింల సౌకర్యార్థం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టుదలతో సాధించిన ఎంబార్కేషన్ పాయింట్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేయించింది. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ రద్దుకు వీలుగా ఏకంగా ఏపీ హజ్ కమిటీతో లేఖ రాయించింది. దీంతో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అరూప్ బర్మన్ ఈ నెల 18న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్సింగ్కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. – సాక్షి, అమరావతి వైఎస్ జగన్ కృషితో సాకారం..భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ఆయా రాష్ట్రాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎంబార్కేషన్ పాయింట్‌కు కేంద్ర పౌర విమానయాన, విదేశీ వ్యవహారాలు, మైనార్టీ తదితర శాఖలు సమీక్షించి అనుమతి ఇస్తాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చే వరకు హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల నుంచి హాజీలు వెళ్లేవారు. ఈ పరిస్థితిని గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి.. విజయవాడ(గన్నవరం) విమానాశ్రయానికి ఎంబార్కేషన్ పాయింట్ కోసం అనుమతి సాధించింది. అలాగే ఇక్కడి నుంచి ప్రయాణించే వారిపై పడిన అదనపు చార్జీలను సైతం వైఎస్ జగన్ సర్కార్ భరించింది. ఈ విషయంలో విదేశీ వ్యవహారాల శాఖ, పౌర విమానయాన, కేంద్ర హజ్ కమిటీలతో వైఎస్సార్సీపీ ఎంపీలు అనేక పర్యాయాలు సంప్రదించారు. కేంద్రానికి అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో లేఖ కూడా రాసి ప్రతినిధి బృందాన్ని పంపించి మాట్లాడించారు. అయినా సానుకూల ఫలితం లేకపోవడంతో గన్నవరం విమానాశ్రయం నుంచి వెళ్లే హాజీలపై రూ.80 వేల చొప్పున పడుతున్న అదనపు చార్జీల భారాన్ని అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే భరించింది. వైఎస్సార్సీపీ హయాంలో గత రెండేళ్లలో ఏకంగా 2,495 మంది విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్‌కు వెళ్లారు. 1,813 మందికి చార్జీల భారం లేకుండా రూ.14.50 కోట్లకు పైగా అందించింది.ముస్లిం సమాజాన్ని మోసం చేశారు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముస్లింల ప్రయోజనాలను కాపాడటంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికే వక్ఫ్ సవరణ బిల్లు వంటి వాటిలో టీడీపీ డబుల్ గేమ్ ఆడింది. తాజాగా ఎంబార్కేషన్ పాయింట్ పోయేలా లేఖ ఇప్పించి.. ముస్లిం సమాజాన్ని మోసం చేసింది. ఇది ముమ్మాటికి ముస్లింలను అవమానపర్చడమే. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా స్పందించి ఎంబార్కేషన్ పాయింట్‌ను తిరిగి సాధించాలి. – షేక్ మునీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ కన్వినర్ ఇది చంద్రబాబు మార్క్ కుట్ర.. హజ్ యాత్రకు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ రద్దు కచ్చితంగా చంద్రబాబు మార్క్ కుట్ర. ఏపీకి చెందిన ఎంపీ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా.. ఎంబార్కేషన్ పాయింట్ రద్దు చేస్తుంటే ఏం చేస్తున్నారు? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్లు? రూ.లక్ష హామీని ఎగవేసేందుకే ఇలా కుట్ర చేశారా? – షేక్ నాగుల్ మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జగన్ తీసుకువస్తే.. బాబు నాశనం చేశారు పొరుగు రాష్ట్రాల్లో ఏపీకి చెందిన హాజీలు అవస్థలు పడకూడదని అప్పటి సీఎం వైఎస్ జగన్.. పట్టుదలతో ఎంబార్కేషన్ పాయింట్ సాధించారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో విమాన టికెట్ ధరలు ఎక్కువగా ఉంటే ఆ భారాన్ని కూడా భరించారు. అలాంటి సౌలభ్యాన్ని చంద్రబాబు నాశనం చేశారు. – దస్తగిరి, ముస్లిం దూదేకుల జేఏసీ చైర్మన్ -
ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్ వెంటే ఉంటాం YSRCP కార్పొరేటర్లు
-
సునీతా విలియమ్స్, విల్మోర్ కు వైఎస్ జగన్ అభినందనలు
-
మీ సంకల్ప శక్తి, అంకితభావాన్ని చూసి గర్విస్తున్నాం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అభినందనలు తెలిపారు. సురక్షితంగా భూమి మీదకు తిరిగి రావటంపై హర్షం వ్యక్తం చేస్తూ.. సునీతతో పాటు మరో వ్యోమగామి బచ్ విల్మోర్కు కూడా అభినందనలు తెలియజేశారు. మీ సంకల్ప శక్తి, అంకితభావాన్ని చూసి మేము గర్విస్తున్నామంటూ ఆయన ట్వీట్ చేశారు.సుమారు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, విల్మోర్లు.. ఎట్టకేలకు మిషన్ విజయవంతంగా పూర్తి చేసుకుని భూమ్మీదకు వచ్చారు #sunitawilliamsreturn. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. భారత ప్రధాని మోదీ సైతం వెల్‌కమ్‌బ్యాక్ సునీత అంటూ అభినందనలు తెలియజేశారు. -
జగన్ పై వ్యక్తిగత విమర్శలు.. అసెంబ్లీలో చంద్రబాబు నీచపు బుద్ది
-
వైఎస్ జగన్ హెలికాప్టర్ విజువల్స్
-
వైవీ సుబ్బారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
-
వైవీ సుబ్బారెడ్డి తల్లి పార్థీవదేహానికి నివాళులు అర్పించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వైవీ సుబ్బారెడ్డి తల్లి పార్థివ దేహానికి వైఎస్ జగన్, విజయమ్మ నివాళులు
-
LIVE: YV సుబ్బారెడ్డి తల్లికి YS జగన్ నివాళి
-
వైఎస్ జగన్ విజువల్స్ @ గన్నవరం
-
గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
బాపట్ల జిల్లాలో YS జగన్ పర్యటన
-
మేదరమెట్లకు వైఎస్ జగన్.. వైవీ సుబ్బారెడ్డి తల్లి పార్థీవదేహానికి నివాళులు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) బాపట్ల జిల్లా మేదరమెట్లకు బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ పార్థీవదేహానికి నివాళులు అర్పించారు వైఎస్ జగన్. వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు జగన్.అనారోగ్యంతో పాటు, వయోభారంతో బాధపడుతున్న వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85)సోమవారం కన్నుమూశారు. పిచ్చమ్మ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయలుదేరారు. పార్లమెంట్ సమావేశాల కోసం సుబ్బారెడ్డి నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. నేడు ఒంగోలులోనే సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివదేహం ఉండనుంది. ఈ రోజు మేదరమెట్లలో ఆమె అంత్యక్రియల జరగనున్నాయి. -
తెనాలికి వైఎస్ జగన్ రాక.. పోటెత్తిన అభిమాన సంద్రం
-
మాజీ ఎమ్మెల్యే తనయుడి రిసెప్షన్‌కు హాజరైన వైఎస్ జగన్
గుంటూరు: జిల్లాలోని తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ తనయుడు సత్యనారాయణ చౌదరి వివాహ రిసెప్షన్ కు మాజీ ముఖ్యమంత్రి,వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. తెనాలి ఏఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్లో వధూవరులు మధువంతి, సత్యనారాయణ చౌదరిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్.వైఎస్ జగన్ రెడ్డి రాకతో భారీ స్థాయిలో అభిమానం సంద్రం తరలివచ్చింది. భారీ సంఖ్యలోవైఎస్సార్సీపీ కార్యకర్తలు , అభిమానులు నాయకులు తరలివచ్చారు. తెనాలిలో జగనన్న కారు వెంట పరిగెడుతు జగనన్నకు ఘనస్వాగతం పలికారు అభిమానులు. -
బాపట్ల జిల్లా పర్యటనకు వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ పార్థీవదేహానికి నివాళులు అర్పించనున్నారు. వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.వైఎస్ జగన్ దిగ్భ్రాంతిగత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85)సోమవారం కన్నుమూశారు. పిచ్చమ్మ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయలుదేరారు. పార్లమెంట్ సమావేశాల కోసం సుబ్బారెడ్డి నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. నేడు ఒంగోలులోనే సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివదేహం ఉండనుంది. రేపు ఉదయం 10:30 గంటలకు మేదరమెట్లలో ఆమె అంత్యక్రియల జరగనున్నాయి. రేపు బాపట్ల జిల్లా పర్యటనలో భాగంగా మేదరమెట్లలో పిచ్చమ్మ పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పిస్తారు. -
వైవీ సుబ్బారెడ్డి తల్లి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యర్రం పిచ్చమ్మ(85) ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయలుదేరారు. కాగా, పార్లమెంట్ సమావేశాల కోసం సుబ్బారెడ్డి నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. నేడు ఒంగోలులోనే సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివదేహం ఉండనుంది. రేపు ఉదయం 10:30 గంటలకు మేదరమెట్లలో ఆమె అంత్యక్రియల జరగనున్నాయి. పిచ్చమ్మ పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు. -
పదో తరగతి విద్యార్థులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్ష తెలిపారు. మంచి ఫలితాలు సాధించాలని కోరుకున్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు. ప్రశాంతంగా పరీక్షలపై దృష్టి సారించండి. మంచి ఫలితాలు సాధించాలి’ అని కోరుకుంటున్నట్టు తెలిపారు.Best of luck to all the students appearing for the 10th class exams!I Stay calm, stay focused, and give your best.— YS Jagan Mohan Reddy (@ysjagan) March 17, 2025ఇక.. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. చివరి పరీక్షను రంజాన్ సెలవు ఆధారంగా ఈ నెల 31 లేదా ఏప్రిల్ ఒకటో తేదీన నిర్వహిస్తారు. 2024–25 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 6,19,275 మంది రెగ్యులర్, 30,609 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు.రెగ్యులర్ విద్యార్థుల్లో ఇంగ్లిష్ మీడియంలో 5,64,064 మంది, తెలుగు మీడియంలో 51,069 మంది, ఉర్దూలో 2,471 మంది, హిందీలో 16 మంది, కన్నడలో 623 మంది, తమిళంలో 194 మంది, ఒడియాలో 838 మంది పరీక్షలు రాసేందుకు ఎన్రోల్ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. వాటిలో 163 సమస్యాత్మక సెంటర్లుగా గుర్తించి సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నారు. -
అది YS జగన్ చిత్తశుద్ధి.. సభలో సీఎం రేవంత్ పొగడ్తలు
-
పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా YS జగన్ ఘన నివాళులు
-
పొట్టి శ్రీరాములు జయంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: పొట్టి శ్రీరాములు జయంతి ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. ‘‘ఆంధ్రులు ఉన్నంత కాలం శ్రీ పొట్టి శ్రీరాములు గారు చిరస్మరణీయులు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసిన ఆయన దృఢసంకల్పం, త్యాగనిరతి ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. నేడు శ్రీ పొట్టి శ్రీరాములుగారి జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఆంధ్రులు ఉన్నంత కాలం శ్రీ పొట్టి శ్రీరాములు గారు చిరస్మరణీయులు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసిన ఆయన దృఢసంకల్పం, త్యాగనిరతి ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. నేడు శ్రీ పొట్టి శ్రీరాములుగారి జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు. pic.twitter.com/Af7J8ai5MN— YS Jagan Mohan Reddy (@ysjagan) March 16, 2025 -
బాలినేని.. జగన్ గురించి మాట్లాడే స్థాయేనా నీది?
ప్రకాశం, సాక్షి: జనసేన ఆవిర్భావ సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy) చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ భగ్గుమంది. వైఎస్సార్సీపీ ఇచ్చిన అధికారంతో పదవి అనుభవించడమే.. అడ్డగోలుగా అకమార్జనకు పాల్పడ్డారని, పైగా కోవర్టు రాజకీయాలతో బాలినేని పార్టీని ఘోరంగా దెబ్బ తీశారని వైఎస్సార్సీపీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బాలినేని.. నీ మంత్రి పదవి త్యాగం చేశావా?. కనబడ్డ భూమి అంతా కబ్జా చేశావ్. ఒంగోలులో బ్రాహ్మణుల భూమి కాజేశావు. వేల కోట్ల రూపాయలతో సామ్రాజ్యం నిర్మించుకున్నావ్. నీ చరిత్ర ఏంటో మొత్తం ప్రకాశం జిల్లాకి తెలుసు. వైవీ సుబ్బారెడ్డి ద్వారానే కదా నువ్వు వైఎస్సార్‌కు బంధువైంది. అలాంటిది జగన్ వెంట నడవడానికే నెలల తరబడి ఆలోచించావు కదా?. నువ్వు ఆస్తులు అమ్ముకున్నావా?. మీ నాన్న ఆస్తి ఎంత ఉంది.. ఎక్కడ అమ్మావు?. కోట్ల రూపాయల ఖర్చు చేసి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని రష్యా వెళ్తావు. కాసినోకు వెళ్తా అని నువ్వే చెప్పావు.. బహుశా ఆస్తి అంతా అక్కడే పోగొట్టావా?. మొదటి నుండి నువ్వొక టీడీపీ కోవర్టువి. ఆ పార్టీలో కుదరక పోవడంతోనే జనసేనలో చేరావ్. నీలాంటి వాడికి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) గురించి మాట్లాడే స్థాయి ఉందా?’’ అంటూ వైస్సార్సీపీ ఒంగోలు ఇంచార్జ్ కామెంట్స్ చుండూరి రవి బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో వైఎస్సార్సీపీ ఓటమికి బాలినేనే కారణమని మాజీ పీడీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసు వెంకయ్య ఆరోపించారు. బాలినేని గ్రూపులు చేసి పార్టీని భ్రష్టుపట్టించారు. ఇక్కడి విషయాలు జగన్ దాకా చేరకుండా అడ్డం పడ్డారు. ఇప్పుడు ఆయన పార్టీని వీడాక స్వేచ్ఛగా ఉంది. అధికారం అనుభవించి కోట్లు పోగేసుకున్న బాలినేని.. ఇప్పుడు ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారాయన. -
‘జగనన్న చేసిన మంచి ప్రతి కుటుంబంలో ఉంది’
తూర్పుగోదావరి జిల్లా: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మంచి ప్రతి కుటుంబంలోనూ ఉందని మాజీ హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. జగనన్న పేదల గడపలకే సంక్షేమాన్ని చేర్చారని..కూటమి ప్రభుత్వం వచ్చాక అరాచకం దారుణంగా ఉందని, సోషల్ మీడియా కార్యకర్తలపై దాడి, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి వారి వాహనాల ధ్వంసం తప్పితే అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు.గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు.. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ హోం మంత్రి తానేటి వనిత, రాజమండ్రి పార్లమెంట్ కన్వీనర్ గూడూరు శ్రీనివాస్ లు పాల్గొన్నారు. జగనన్నను తలుచుకోని కుటుంబం లేదు‘ఎన్నికలు వచ్చేవరకు ప్రతి కార్యకర్త ఫైట్ చేస్తూనే ఉండాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న ఏ విధంగా ఇబ్బందిపడి బయటకు వచ్చారో అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 15 ఏళ్లు పూర్తయింది. కూటమి తొమ్మిది నెలల పాలనలో జగనన్నను తలుచుకోని కుటుంబం లేదు. కూటమి నాయకులు సైతం జగనన్నను తలుచుకుంటున్నారు. అందరూ కలిసి ఐక్యతతో జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ. తగిలిన గాయాలు, మనపై కట్టిన కేసులు అవి.. ఎవరు మర్చిపోవద్దు మనకి కూడా ఒక రోజు వస్తుంది. అప్పుడు కూటమి నేతలకు తిరిగి ఇస్తాం. పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి పాదాభివందనం. ప్రతి కార్యకర్తకు ఆడబిడ్డగా నేను అండగా ఉంటాను. జగనన్న చేసిన మంచి ప్రతి కుటుంబంలో ఉంది’ అని తానేటి వనిత పేర్కొన్నారు.జగన్ అంటేనే నిజం..వైఎస్ జగన్ అంటేనే నిజం అని అన్నారు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. జగన్ పాలనలో ఒక్క పైసా కూడా ఆశించకుండా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పని చేశారన్నారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వద్దని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబే చెబుతున్నారని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి స్వార్థంగా మాట్లాడిన వాడు చంద్రబాబు తప్ప ఇంకెవరూ లేరన్నారు. రాష్ట్ర సంపద పొందాల్సింది పేదవాడు. అది ఒక వర్గానికో ఒక పార్టీకో చెందటానికి మనం రాచరికంలో లేము. సంక్షేమ పథకాలు పొందాలంటే ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?, టీడీపీ, బీజేపీ, జనసేన, ఈనాడు, టీవీ 5, ఏబీఎన్ కలిసి ప్రజలను మోసం పోయేలా చేశారు. సూపర్ సిక్స్ అని అబద్ధపు హామీలతో గద్దెనెక్కినవాడు చంద్రబాబు.. ఎన్నికల ముందు రాష్ట్రంలో రూ. 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయన్నార చంద్రబాబు, పవన్, పురందేశ్వరీ. శ్వేతపత్రాలని కొన్ని రోజులు హడావుడి చేశారు. చివరకు మతాల మీదకు తెచ్చారు. లడ్డూలో కల్తీ అంటూ చంద్రబాబు ప్రమాదకరమైన ట్రోల్స్ చేశారు. ప్రతినెల డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు చేస్తున్నాడు. ఆరున్నర లక్షల కోట్లు అని చివరికి చెప్పక తప్పలేదు. సంపద సృష్టిస్తానంటూ అధికారం కోసం అబద్ధాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు. గత సంవత్సరం అమ్మబడి ఎత్తేశాడుఅన్నదాత సుఖీభవ అన్నాడు అది ఎత్తేశాడు. కేంద్రం ఇచ్చేవి కాకుండానే ప్రతి రైతుకు 20000 ఇస్తానన్నాడు. ఉచిత బస్సు లేదు.. మూడు గ్యాస్ సిలిండర్లు అన్నాడు ఒకటి ఇచ్చాడు. చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే 79 వేల కోట్లు కావాలి...?, మహిళలకు 15000 ఇస్తా అన్నాడు ఎలా మోసపోయారో వారికి చెప్పాలి .మేనిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాలను అమలు చేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్’ అని పేర్కొన్నారు. -
Meruga Nagarjuna: లోకేశ్ సకల శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు
-
రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
-
వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: దేశవ్యాప్తంగా నేడు ప్రజలంతా హోలీ పండుగ జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.హోలీ పండుగ సందర్బంగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ ప్రజలందరి జీవితాల్లో సరికొత్త సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ హోలీ మీ అందరి జీవితాల్లో సరికొత్త సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు.#happyholi2025— YS Jagan Mohan Reddy (@ysjagan) March 14, 2025 -
పిన్నెల్లి ప్రజలకు YS జగన్ భరోసా
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా: వైఎస్ జగన్
సాక్షి అమరావతి, సాక్షి ప్రతినిధి, గుంటూరు: టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, మద్దతుదారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం పల్నాడు జిల్లాలో గ్రామ బహిష్కరణకు గురైన దళిత, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన దాదాపు 400 కుటుంబాలకు చెందిన బాధితులు వైఎస్ జగన్‌ను గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కలుసుకున్నారు. మాచవరం మండలం పిన్నెల్లి, తురకపాలెం, మాదినపాడు, చెన్నాయపాలెం, కొత్తగణేశునిపాడు గ్రామాలకు చెందిన వారంతా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌ను కలిశారు. టీడీపీ నేతలు ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్సీపీ సానుభూతి పరులపై, ఇళ్లపై దాడులకు తెగబడి అక్రమ కేసులు బనాయించి పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని తెలిపారు. ఈ అకృత్యాలను భరించలేక గ్రామాలు విడిచి ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. స్వగ్రామాలకు దూరంగా గడుపుతుండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే కారణంతో తమను ఊరి నుంచి బహిష్కరించారని, గ్రామంలోకి వస్తే చంపేస్తామని టీడీపీ కూటమి నేతలు బెదిరిస్తున్నారని పిన్నెల్లి గ్రామానికి చెందిన బాధిత కుటుంబాల సభ్యులు వైఎస్ జగన్ ఎదుట వాపోయారు. ‘అధైర్యపడొద్దు.. మీకు అన్ని విధాలా అండగా ఉంటాం..’ అని వారికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచి వారికి పూర్తి న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. కాగా, వచ్చే రెండు నెలల్లో ‘చలో పిన్నెల్లి’ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. గ్రామ బహిష్కరణపై న్యాయపరంగా కూడా హైకోర్టులో పోరాడుతోంది.గురజాల నియోజకవర్గ నాయకులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ దహన సంస్కారాలకూ నోచుకోని దుస్థితిటీడీపీ శ్రేణుల దురాగతాలతో గ్రామం విడిచి వెళ్లి వేరే ప్రాంతంలో ఉంటున్నాం. మా కుటుంబ సభ్యుడు మృతి చెందినా స్వగ్రామానికి వెళ్లే పరిస్థితి లేక మేం తలదాచుకుంటున్న ప్రాంతంలోనే దహన సంస్కారాలు పూర్తి చేశాం. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట పడేదెప్పుడో తెలియడం లేదు. మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నా. – అమరావతి హసన్ (బుజ్జి), పిన్నెల్లి, వైఎస్సార్సీపీ నాయకుడుమహిళలపైనా దాడులు..ఎన్నికల ఫలితాలు వెలువడ్డ వెంటనే టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ సానుభూతి పరుల నివాసాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డాయి. ఇంట్లో ఉన్న మహిళలను సైతం దౌర్జన్యంగా లాక్కొచ్చి దాడి చేశారు. టీడీపీ శ్రేణుల అఘాయిత్యాలతో ఆర్థికంగా, శారీరకంగా నష్టపోయాం. బంధువుల నివాసాల్లో కుటుంబ సభ్యులతో తలదాచుకుంటున్నాం. మాకు రక్షణ కల్పించండి.– రత్తయ్య, కొత్తగణేశునిపాడు, వైఎస్సార్సీపీ నాయకుడుఆర్థికంగా నష్టపోయాం టీడీపీ శ్రేణుల అఘాయిత్యాలతో కుటుంబంతో సహా గ్రామాన్ని విడిచి వేరే ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. మా పొలాలు సాగు చేసుకోలేక నష్టపోతున్నాం. మాకు న్యాయం చేయాలి. – పిక్కిలి కొండలు, పిన్నెల్లి గ్రామం, వైఎస్సార్సీపీ నాయకుడు -
బహిష్కరణకు గురైన కుటుంబాలకు అండగా వైఎస్ జగన్
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసే మంచి ఏమీ లేకపోయినా కక్ష సాధింపు చర్యలు మాత్రం తీవ్రతరమవుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే పల్నాడు జిల్లా పిన్నెళ్లి గ్రామంలోని 400 కుటుంబాలపై బహిష్కరణ వేటు వేసింది. బహిష్కరణకు గురైన వారంతా ఎస్సీ, బీసీ, మైనార్టీలే. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. బహిష్కరణకు గురైన పిన్నెళ్లి గ్రామంలోని కుటుంబాలకు అండగా నిలిచారు వైఎస్ జగన్ఈ క్రమంలోనే అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. గ్రామంలోకి వస్తే తమను చంపుతామని బెదిరిస్తున్నారని వారు వైఎస్ జగన్‌కు విన్నవించుకున్నారు. వీరికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. దీనిలో భాగంగా ‘చలో పిన్నెళ్లి’ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ‘ సిద్ధమైంది. రెండు నెలల్లో చలో పిన్నెళ్లి’ కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్సీపీ‘ నిర్ణయించింది. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సహా పిన్నెల్లి, తురకపాలెం, మాదెనపాడు, చెన్నాయపాలెం గ్రామస్తులున్నారు. -
జగన్ ను కలిసిన పిన్నెల్లి గ్రామస్తులు
-
Vijayasaireddy: ఆయన నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తాం?
విశాఖపట్నం, సాక్షి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే తాను వైఎస్సార్సీపీకి దూరమయ్యానని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు(Vijayasai Kotary Comments) మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన గతంలో ఢిల్లీలో మాట్లాడిన మాటలకు.. ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేదని అమర్నాథ్ చురకలంటించారు. ‘‘వైఎస్ జగన్(YS Jagan) కోటరీ అంటే అది ప్రజలే. అయినా ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉండదో చెప్పండి. ఆ మాటకొస్తే చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా?. మొన్నటి వరకు కోటరిలో ఉన్న మనమే.. ఇప్పుడు ఆ కోటరీ గురించి మాట్లాడితే ఏమి బాగుంటుంది?. ఒకరి మీద ప్రేమ పుడితే మరొకరి మీద ప్రేమ విరిగిపోతుంది. మరి విజయసాయిరెడ్డికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదు. అయినా పార్టీ మారిన ఆ వ్యక్తి నుంచి ఇంతకంటే ఏమి ఆశిస్తాం?.ప్రస్తుతం రాష్ట్రంలో మూడు వర్గాలు ఉన్నాయి. ఒకటి కూటమి వర్గం.. రెండోది వైఎస్సార్సీపీ వర్గం. ఇక మూడోది.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు చూసే వర్గం. గతంలో వైఎస్సార్సీపీలో కీలకమైన పదవులు అనుభవించారు. మళ్ళీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే పార్టీ నుంచి వెళ్లే పోయేవారా?. ఇదే విధంగా మాట్లాడేవారా?. అసలు ఇటువంటి వ్యాఖ్యలను ప్రజలు హర్షిస్తారా?. ఆ మధ్య రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. ఇప్పుడేమో కోటరీ అంటూ మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తే తేడాగా కనిపిస్తోంది. ఆయన తాజా వ్యాఖ్యలు మళ్లీ రాజకీయాల వైపు చూస్తున్నారనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది’’ అని గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) అన్నారు. ఒక్క హామీ అమలు చేయలేదుకూటమి ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చలేదు. హామీలు అమలు చేయకపొగా.. వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారు. నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. కానీ, బడ్జెట్లో నిరుద్యోగ భృతి కోసం రూపాయి కూడా కేటాయించలేదు. అలాగే ఫీజు రియింబర్స్‌మెంట్ ఇప్పటిదాకా కాలేదు. జగన్ హయాంలో తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు. ఈ సమస్యలపై పోరాటంలో యువత పోరు కార్యక్రమం చేపట్టాం.. అది విజయవంతం అయ్యింది. ప్రజలకు ఎల్లప్పుడూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది అని అమర్నాథ్ అన్నారు. -
మాట తప్పని నైజం.. జగన్ మాటే జనం పాట
-
పోలీసుల దౌర్జన్యం.. యువత పోరు సక్సెస్
-
వైఎస్ జగన్‌ను కలిసిన తమిళనాడు మంత్రి
-
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ నయవంచనపై తిరుగుబాటు... వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో ‘యువత పోరు’లో కదంతొక్కిన విద్యార్థులు, తల్లితండ్రులు, నిరుద్యోగులు
-
వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజాపక్షమే
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించాయి.ఊరూరా పార్టీ జెండాలు రెపరెపలాడాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ఎక్కడికక్కడ పార్టీ కార్యాలయాల్లో జెండాను ఎగురవేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఆయన చిత్ర పటాల వద్ద నివాళులర్పించారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు కేకులు కట్ చేసి పంచిపెట్టారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదానం, దుస్తుల పంపిణీ , ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఏ రాజకీయ పార్టీతో పొత్తులు లేకుండా, పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రతి ఎన్నికల్లోనూ ఒంటిరిగా పోటీ చేసి, విజయాలను సొంతం చేసుకున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. అనునిత్యం ప్రజాపక్షంగానే వైఎస్సార్సీపీ అడుగులు ముందుకు వేసిందని, గత పోరాటాల గురించి చర్చించుకున్నారు. అన్ని జిల్లాల కార్యాలయాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు పార్టీ జెండాను ఎగుర వేసి కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు. నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో, డివిజన్లు, వార్డుల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకలు ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. జెండా ఆవిష్కరణ సందర్భంగా వైఎస్సార్సీపీ జిందాబాద్, జై జగన్ అంటూ పార్టీ శ్రేణులు దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. పేదల బతుకుల్లో వెలుగు నింపేందుకు ఏర్పడిన పార్టీ వైఎస్సార్సీపీ అని నేతలు కొనియాడారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం వైఎస్ జగన్ ప్రసంగం అందరినీ ఆకట్టుకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్’ అని వైఎస్ జగన్ అన్న మాటలు అన్ని వర్గాల్లో భరోసా కలిగించాయి. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జనం గుండెల్లో వైఎస్సార్‌సీపీఈ ఫొటోలో కనిపించే మహిళా వ్యవసాయ కూలీలు అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సింగంపల్లికి చెందిన వారు. బుధవారం వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగనన్న చేసిన మేలును, అందించిన పథకాలను గుర్తు చేసుకుంటూ పొలంలోనే వైఎస్సార్సీపీ జెండాలతో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించి వైఎస్ జగన్ ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. – ఆత్మకూరు -
దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్ జగన్‌కు ఆహ్వానం
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను తమిళనాడు పీడబ్ల్యూడీ శాఖ మంత్రి ఈవీ వేలు, రాజ్యసభ ఎంపీ విల్సన్ కలిశారు. ఈనెల 22న చెన్నైలో నిర్వహించే దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్ జగన్‌ను ఆహ్వానిస్తూ తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ రాసిన లేఖను వైఎస్ జగన్‌కు అందజేసి, దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి ఆహ్వానించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ వివిధ రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపారు. దీన్లోభాగంగా తమిళనాడు డీఎంకే నేతలు వైఎస్ జగన్‌ను కలిశారు. -
చంద్రబాబూ.. తొలి హెచ్చరిక
అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను సైతం ఊడగొడుతున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ఏటా రూ.7,200 కోట్లు చొప్పున ఖర్చు చేయాలి. కానీ గతేడాది బడ్జెట్లో ఒక్క పైసా కేటాయింపూ లేదు. ఈ ఏడాదికి కూడా ఒక్క పైసా కేటాయించలేదు. రెండేళ్లలో ప్రతి నిరుద్యోగికీ రూ.72 వేల చొప్పున బకాయి పడ్డారు. మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందకుండా అడ్డుకుంటూ.. పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేస్తున్నారు.సాక్షి, అమరావతి: విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్సీపీ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘యువత పోరు’ కార్యక్రమాన్ని పలు చోట్ల పోలీసులతో అడ్డుకోవాలని యత్నించినా వాటన్నింటినీ అధిగమించి చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై నిలదీశారని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ‘చంద్రబాబూ..! నిరుద్యోగులు, విద్యార్థులు మీకు పంపిన తొలి హెచ్చరిక ఇది’ అని హెచ్చరించారు. ‘యువత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. పలు సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులతో సహా అన్ని వర్గాలకూ పార్టీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుందని ‘ఎక్స్’ వేదికగా భరోసా ఇస్తూ తన ఖాతాలో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అందులో ఏమన్నారంటే.. » చంద్రబాబూ..! పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా ‘‘యువత పోరు’’ ద్వారా గళమెత్తిన విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నా. పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే యత్నాలను అధిగమించి సంవత్సరం కాలంగా మీ ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై నిలదీశారు. నిరుద్యోగులు, విద్యార్థులు మీకు పంపిన తొలి హెచ్చరిక ఇది. » పేదరికం కారణంగా ఎవరూ పెద్ద చదువులకు దూరం కాకూడదన్న దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం విద్యాదీవెన ద్వారా సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ద్వారా హాస్టల్, మెస్ ఛార్జీలను నేరుగా తల్లులు, ఆ పిల్లల ఖాతాలకే జమ చేస్తూ అమలు చేసిన ఈ పథకాలను మీ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. చంద్రబాబూ..! మీ గత పాలనలోని చీకటి రోజులనే మీరు మళ్లీ తెచ్చారు. » 2024 జనవరి – మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను ఏప్రిల్‌లో వెరిఫై చేసి మే నెలలో చెల్లించాల్సి ఉంది. అక్కడి నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు ఇవ్వాలి. వసతి దీవెన కింద హాస్టల్ ఖర్చులకు మరో రూ.1,100 కోట్లు ఇవ్వాలి. ఈ రెండు పథకాలకు ప్రతి ఏడాదికి రూ.3,900 కోట్లు ఖర్చు చేయాలి. కానీ చంద్రబాబూ..! మీరిచ్చింది కేవలం రూ.700 కోట్లు మాత్రమే. అది కూడా ఇప్పటికీ పూర్తిగా పిల్లలందరికీ చేరలేదు. అంటే గతేడాది పిల్లలకు బాకీ పెట్టిన రూ.3,200 కోట్లు.. అది కాకుండా ఈ ఏడాది ఖర్చు చేయాల్సిన మరో రూ. 3,900 కోట్లు.. రెండూ కలిపితే మొత్తం రూ.7,100 కోట్లు ఈ సంవత్సరం ఖర్చు పెట్టాలి. కానీ ఈ బడ్జెట్లో మీరు ప్రవేశపెట్టింది కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే. అంటే దీని అర్థం.. పేద విద్యార్థుల చదువులు, వారి బాధ్యత విషయంలో మీరు తప్పించుకుంటున్నట్లే కదా? ఆ పిల్లల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నట్టే కదా? చదువుకుంటున్న పిల్లలకు ఇది మీరు చేస్తున్న ద్రోహం కాదా? విద్యార్థులను ఇంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబూ? » కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా కాకముందే మిమ్మల్ని ప్రశ్నిస్తూ నిరుద్యోగులు, ఇంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కడం ఎప్పుడైనా చూశారా చంద్రబాబూ? ప్రజల పక్షాన నిలుస్తూ, విద్యార్థుల సమస్యలపై చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ‘‘యువత పోరు’’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పిల్లలు, తల్లిదండ్రులు, నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలందర్నీ అభినందిస్తున్నా. విద్యార్థులతో సహా అన్ని వర్గాలకూ పార్టీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నా. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను సైతం ఊడగొడుతున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ఏటా రూ.7,200 కోట్లు చొప్పున ఖర్చు చేయాలి. కానీ గతేడాది బడ్జెట్లో ఒక్క పైసా కేటాయింపూ లేదు. ఈ ఏడాదికి కూడా ఒక్క పైసా కేటాయించలేదు. రెండేళ్లలో ప్రతి నిరుద్యోగికీ రూ.72 వేల చొప్పున బకాయి పడ్డారు. మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందకుండా అడ్డుకుంటూ.. పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేస్తున్నారు. -
నిరంతరం ప్రజలతోనే.. : వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజలకు తోడుగా, వారికి అండగా నిలబడుతుంది. ప్రజల తరపున వారి గొంతుకై నిలుస్తుంది. ‘‘యువత పోరు’’ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి నాయకుడు, కార్యకర్తకు అభినందనలు. సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ.. వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ (నోరు లేని ప్రజల గొంతుక)గా ఉంటుందని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి (YS Jagan Mohan Reddy) వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజల కష్టాల్లో నుంచి పుట్టింది.. వైఎస్సార్ సీపీని స్థాపించి 15 ఏళ్లు అవుతోంది. పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచి.. ఈ ప్రయాణంలో ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి వారి తరపున వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూ వస్తోంది. మనం ప్రతిపక్షంలో కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల ప్రయాణంలో పదేళ్లు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. అధికార పక్షానికి ధీటైన సమాధానం ఇస్తూ వస్తున్నాం. కళ్లు మూసి తెరిచేసరికే ఇప్పటికే దాదాపు సంవత్సరం అయిపోయింది. మరో మూడు నాలుగు సంవత్సరాల్లో జరిగే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది వైఎస్సార్సీపీనే. ఈరోజు వైఎస్సార్సీపీకి చెందిన ప్రతి కార్యకర్త గ్రామంలోని ఏ ఇంటికైనా ధైర్యంగా వెళ్లగలడు. ఏ పేద ఇంటికైనా మన కార్యకర్త సగర్వంగా, కాలర్ ఎగరేసుకుని వెళ్లగలిగే అవకాశం ఉంది. ఆ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి సోదరుడు, ప్రతి అవ్వ, తాత, ప్రతి రైతు చిరునవ్వుతో పలకరిస్తారు. ఎందుకంటే.. వైఎస్సార్సీపీ ఎప్పుడైనా కూడా చెప్పిందంటే చేస్తుందన్న నమ్మకం ఈ రోజుకూ ప్రతి ఇంట్లో ఉంది కాబట్టే! వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న వైఎస్ జగన్ పిల్లల ఫీజుల కష్టాలు... ‘యువత పోరు’ ఈరోజు విద్యాదీవెన, వసతి దీవెనకు సంబంధించి, పిల్లలకు జరుగుతున్న అన్యాయంపై నిరసన కార్యక్రమం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 10 నెలలు అవుతోంది. ఎన్నికల వేళ వాళ్లు చెప్పిన సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ హామీలన్నీ గాలికెగిరిపోయాయి. చదువులు, వైద్యం, గవర్నెన్స్, వ్యవసాయం.. ఏది చూసినా వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి, ఒక్కొక్క క్వార్టర్‌కు రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఏడాదికి నాలుగు క్వార్టర్లకు రూ.2,800 కోట్లు కేటాయించాలి. వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్‌లో మరో రూ.1,100 కోట్లు కేటాయించాలి. అంటే.. గత ఏడాది ఈ రెండింటికి సంబంధించి పిల్లల చదువుల కోసం మొత్తం రూ.3,900 కోట్లు కేటాయించాల్సిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కేవలం రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే.. రూ.3,200 కోట్లు బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరిస్తున్న పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతేకాకుండా ఈ ఏడాది 2025–26కి సంబంధించి విద్యాదీవెన కింద రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.1,100 కోట్లు కలిపి మొత్తం మరో రూ.3,900 కోట్లు ఇవ్వాలి. అంటే గతేడాది పెట్టిన రూ.3,200 కోట్ల బకాయిలతో కలిపి మొత్తం దాదాపు రూ.7,100 కోట్లు కేటాయించి, పిల్లలను ఆదుకోవాల్సింది పోయి కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే నామమాత్రంగా కేటాయించి పిల్లల చదువులతో ఆడుకుంటున్నారు. పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా యాదృచ్ఛికంగా ఈరోజు జరుగుతోందని చెప్పడానికి సంతోషిస్తున్నా. ⇒ శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, అనుబ«ంధ విభాగాల అ«ధ్యక్షులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన తమిళనాడు మంత్రి ఈవీ వేలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తమిళనాడు మంత్రి ఈవీ వేలు, ఎంపీ విల్సన్ బుధవారం కలిశారు. ఈ నెల 22న చెన్నైలో జరగనున్న దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు. తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ రాసిన లేఖను వైఎస్ జగన్‌కు డీఎంకే నేతలు అందజేశారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలకు సీఎం స్టాలిన్ ఆహ్వానం పంపించారు. -
YSRCP ద్వారా ఎదిగిన వ్యక్తి విజయసాయిరెడ్డి: టీజేఆర్
-
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: వరుదు కళ్యాణి
-
YSRCP 'యువత పోరు' విజయవంతం: YS జగన్
-
Usha Sri Charan: ర్యాలీకి అనుమతి లేదని బారికేడ్లు అడ్డంపెట్టిన పోలీసులు
-
చంద్రబాబూ.. తొలి హెచ్చరిక ఇది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కుట్రలను ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. ‘‘పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా “యువత పోరు’’ ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.‘‘పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా వాటన్నింటినీ అధిగమించి ఈ సంవత్సర కాలంగా మీ ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై నిలదీశారు. నిరుద్యోగులు, విద్యార్థులు మీకు పంపిన తొలి హెచ్చరిక ఇది.. చంద్రబాబు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘‘పేదరికం వల్ల పెద్ద చదువులకు ఎవ్వరూ దూరం కాకూడదన్న దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం విద్యాదీవెన ద్వారా సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను, వసతి దీవెన ద్వారా హాస్టల్, మెస్ ఛార్జీలను నేరుగా వారి తల్లులు, ఆ పిల్లల ఖాతాలకే జమచేస్తూ, అమలు చేసిన ఈ పథకాలను మీ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. చంద్రబాబూ… మీ గత పాలనలోని ఆ చీకటి రోజులనే మళ్లీ మీరు తీసుకు వచ్చారు’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘2024 జనవరి - మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బును ఏప్రిల్‌లో వెరిఫై చేసి, మేలో చెల్లించాల్సి ఉంది. అక్కడ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు ఇవ్వాలి. వసతి దీవెన కింద హాస్టల్ ఖర్చులకు మరో రూ.1,100 కోట్లు ఇవ్వాలి. ప్రతి ఏడాదికి ఈ రెండు పథకాలకు రూ.3,900 కోట్లు ఖర్చు చేయాలి. కానీ చంద్రబాబుగారూ, మీరిచ్చింది కేవలం రూ. 700 కోట్లు. అదికూడా ఇప్పటికీ పూర్తిగా పిల్లలందరికీ చేరలేదు...అంటే గతేడాది పిల్లలకు బాకీ పెట్టిన రూ.3,200 కోట్లు, అదీ కాక ఈ ఏడాది ఖర్చుచేయాల్సిన మరో రూ. 3,900 కోట్లు, రెండూ కలిపితే రూ.7,100 కోట్లు ఈ సంవత్సరం ఖర్చుపెట్టాలి. అయితే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే. దీని అర్థం పేద విద్యార్థుల చదువులు, వారి బాధ్యత విషయంలో మీరు తప్పించుకుంటున్నట్టే కదా ? ఆ పిల్లల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నట్టే కదా? చదువుకుంటున్న పిల్లలకు మీరు చేస్తున్న ద్రోహం కాదా? విద్యార్థులను ఇంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబూ....అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు లేదా అందాక నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం లేదు కదా వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను ఊడపీకుతున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ప్రతి ఏటా రూ.7,200 కోట్లు ఖర్చు చేయాలి. కాని, గత ఏడాది బడ్జెట్లో ఒక్కపైసా కేటాయింపూ లేదు. ఈ ఏడాదికి కూడా ఒక్కపైసా కేటాయించలేదు. ఈ రెండేళ్లలోనే ప్రతి నిరుద్యోగికీ రూ.72వేల చొప్పున బకాయి పడ్డారు. అలాగే వైయస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేస్తూ, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందనీయకుండా అడ్డుకోవడమే కాదు, పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేస్తున్నారు. ..కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదికూడా కాకముందే మిమ్మల్ని ప్రశ్నిస్తూ, నిరుద్యోగులు, ఇంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కడం ఎప్పుడైనా చూశారా చంద్రబాబూ? ప్రజల పక్షాన నిలుస్తూ, విద్యార్థుల సమస్యలపై, వారికోసం చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ “యువత పోరు’’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పిల్లలు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలందర్నీ అభినందిస్తున్నాను. అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థుల సహా అన్నివర్గాలకూ పార్టీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.1. @ncbn గారూ పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా “యువత పోరు’’ ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని… pic.twitter.com/dn2LslNZzI— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2025 -
కూటమి సర్కార్‌పై జనాగ్రహం.. వైఎస్సార్సీపీ యువత పోరు (ఫొటోలు)
-
పార్టీ ఆవిర్భావం సందర్భంగా కేడర్ కు YS జగన్ శుభాకాంక్షలు
-
నాతో నడుస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం(YSRCP 15th Formation Day) సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నేళ్ల ప్రయాణంలో తన వెంట నడిచిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ సందేశం విడుదల చేశారాయన.‘‘నాన్నగారు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్(YSR) గారి ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వరకూ తమ భుజస్కందాలపై మోస్తున్న కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నాయకులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. .. నా ఒక్కడితో మొదలై, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ప్రజల ఆశీస్సులతో శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సుదీర్ఘ కాలంలో పార్టీ నిరంతరం ప్రజలతోనే ఉంది, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంది. అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో దేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమం, అభివృద్ధిని అందించింది.క్లిక్ చేయండి: జనం జెండా.. ఈ చిత్రాలు చూశారా?.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించడం, దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. విలువలకు విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన పార్టీ పట్ల, నా పట్ల నమ్మకంతో విశ్వాసంతో నాతో నడుస్తున్న పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు అంటూ ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల చిత్రాలను షేర్ చేశారాయన.ఇదీ చదవండి: 3-4 ఏళ్లలో అధికారంలోకి వచ్చేది వైఎస్సార్సీపీనే! -
YSRCP అంటే వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్.. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్ జగన్ (చిత్రాలు)
-
ప్రజల కష్టాల నుంచి వైఎస్ఆర్ సీపీ ఆవిర్భవించింది: వైఎస్ జగన్