IPL 2025
-
ఐపీఎల్-2025 ఫ్లే ఆఫ్స్ వేదికలు ఖరారు.. ఫైనల్ ఎక్కడంటే?
ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలను బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్స్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లను ముల్లాన్‌పూర్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్‌లకు ఆహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మంగళవారం జరిగిన సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. కాగా షెడ్యూల్ ప్రకారం.. మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉండేది.అయితే భారత్ -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా వారం రోజులు పాటు ఈ ఏడాది సీజన్ వాయిదా పడడంతో.. షెడ్యూల్లో బీసీసీఐ మార్పులు చేసింది. ఫైనల్ మే 25కు బదులుగా జూన్ 3న నిర్వహించినున్నట్లు భారత క్రికెట్ బోర్డు వెల్లడించింది. కానీ ఫైనల్ మ్యాచ్ వేదికను మాత్రం ఖారారు చేయలేదు. తుదిపోరుకు ఆతిథ్యమిచ్చేందుకు బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ సిద్దంగా ఉన్నప్పటికి.. నైరుతి రుతుపవనాలు కారణంగా కోల్‌కతాకు భారీ వర్ష సూచన ఉంది. ఈ క్రమంలో బీసీసీఐ ఫైనల్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఐపీఎల్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి కానుంది. గతంలో 2022, 2023 సీజన్లలో ఈ వేదికలోనే ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. వాస్తవానికి.. ఫైనల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ల సొంత మైదానంలో నిర్వహిస్తారు.ఐపీఎల్-2023 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచినందున గతేడాది సీజన్ ఫైనల్‌కు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఇప్పుడు అనివార్య కారణాల వల్ల ఫైనల్ వేదిక కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు తరలిపోనుంది.ఐపీఎల్ 2025 ప్లేఆఫ్ తాత్కాలిక షెడ్యూల్మే 29: క్వాలిఫైయర్ 1 – ముల్లన్పూర్మే 30: ఎలిమినేటర్ – ముల్లన్పూర్జూన్ 1: క్వాలిఫైయర్ 2 – అహ్మదాబాద్జూన్ 3: ఫైనల్ – అహ్మదాబాద్ -
ఆ యంగ్ క్రికెటర్‌కు నేను హాగ్ ఇవ్వలేదు: ప్రీతి జింటా
ఐపీఎల్-2025లో ఆదివారం(మే 18) రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం రాజస్తాన్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా హగ్ చేసుకున్నట్లు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి.అంతేకాకుండా 14 ఏళ్ల చిన్నారికి హాగ్ ఇవ్వడం ఏంటని కొన్ని వెబ్ సైట్లు కూడా కథనాలు ప్రచరించాయి. తాజాగా ఇదే విషయంపై ప్రీతి జింటా స్పందించారు. ఈ ఫోటోలు పూర్తిగా ఫేక్ అని, వార్తా ఛానెళ్లు కూడా ఇలాంటి తప్పుడు చిత్రాలను ప్రసారం చేయడమేంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది."ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఆఖరి న్యూస్ ఛానెల్స్ కూడా మార్ఫింగ్ చేసిన చిత్రాలను ఉపయోగించి వాటిని వార్తలుగా చూపిస్తున్నాయి. అది చూసి నేను ఆశ్చర్యపోయాను" అని ఎక్స్‌లో ఆమె రాసుకొచ్చింది.కాగా అసలు వీడియోలో మాత్రం ప్రీతి జింటా వైభవ్‌తో కరచాలనం చేసి, కాసేపు మాట్లాడినట్లు ఉంది. కొంతమంది ఏఐ సాయంతో ప్రీతీ.. వైభవ్ ను కౌగిలించుకుంటున్నట్టు ఫొటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఇక ఇది ఇలా ఉండగా.. వరుస విజయాలతో పంజాబ్ కింగ్స్ ఇప్పటికే తమ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.చదవండి: IPL 2025: ప్లే ఆఫ్స్‌కు ముందు ఆర్సీబీకి గుడ్ న్యూస్This is a morphed image and fake news. Am so surprised now news channels are also using morphed images and featuring them as news items !— Preity G Zinta (@realpreityzinta) May 20, 2025 -
IPL 2025: ప్లే ఆఫ్స్‌కు ముందు ఆర్సీబీకి గుడ్ న్యూస్
ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ ఊరట లభించింది. భుజం గాయంతో బాధపడుతున్న ఆ జట్టు స్టార్ పేసర్, ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ తిరిగి తన ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడు.ఈ ఏడాది సీజన్లో ఏప్రిల్ 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాజిల్‌వుడ్ గాయపడ్డాడు. దీంతో మే 3న సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌కు ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ దూరమయ్యాడు. అంతలోనే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వారం రోజుల పాటు వాయిదా పడడంతో హాజిల్‌వుడ్ తన స్వదేశానికి వెళ్లిపోయాడు.అతడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. ఈ క్రమంలో హాజిల్‌వుడ్ తిరిగి భారత్‌కు వస్తాడా? లేదా అన్న సందేహాలు అందరిలో నెలకొన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు అతడిని భారత్‌కు పంపించి క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకోదని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు హాజిల్‌వుడ్ తిరిగి ప్రాక్టీస్ మొదలు పెట్టడంతో త్వరలోనే భారత్‌కు చేరుకునే అవకాశముంది. మే 29 నుంచి ప్రారంభమయ్యే ప్లేఆఫ్‌లకు హాజిల్‌వుడ్ తిరిగి వస్తాడని ఆర్సీబీ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ ఏడాది సీజన్లో జోష్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన హాజిల్‌వుడ్ 18 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. కాగా ఆర్సీబీ ఇంకా రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలూండగానే ఫ్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించింది. బెంగళూరు జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో మే 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.Josh Hazlewood started bowling. We're coming for that tinpot trophy 😭🔥😭🔥😭🔥😭 pic.twitter.com/oxSFVVjxwL— M0 B0BAT 🧠 (@rohancric947) May 20, 2025 -
IPL 2025: చరిత్ర సృష్టించిన లక్నో ప్లేయర్లు.. ఐపీఎల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి..!
ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. లీగ్‌లో మునుపెన్నడూ జరగని విధంగా ఈ సీజన్లో లక్నోకు చెందిన ముగ్గురు విదేశీ ఆటగాళ్లు 400 పరుగుల మార్కును దాటారు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్లో ఒకే ఫ్రాంచైజీకి చెందిన ముగ్గురు విదేశీ ఆటగాళ్లు 400 పరుగుల మార్కును దాటడం ఇదే మొదటిసారి.నిన్న (మే 19) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో బ్యాటింగ్ త్రయం ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ఈ ఘనత సాధించింది. సీజన్ ప్రారంభం నుంచి భీకర ఫామ్‌లో ఉన్న ఈ ముగ్గురు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సత్తా చాటారు. ఈ మ్యాచ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. మార్ష్ (61), మార్క్రమ్ (61), పూరన్ (45) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.ఈ మ్యాచ్‌కు ముందే పూరన్ 400 పరుగులు పూర్తి చేయగా.. మార్క్రమ్, మార్ష్ ఈ మ్యాచ్‌లో 400 పరుగుల మైలురాయిని తాకారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన పూరన్ నాలుగు అర్ద సెంచరీల సాయంతో 455 పరుగులు చేయగా.. మార్ష్ 11 మ్యాచ్‌ల్లో ఐదు అర్ద సెంచరీల సాయంతో 443 పరుగులు.. మార్క్రమ్ 12 మ్యాచ్‌ల్లో ఐదు అర్ద సెంచరీల సాయంతో 409 పరుగులు చేశారు. ఈ సీజన్ లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో పూరన్ 9, మార్ష్ 10, మార్క్రమ్ 12 స్థానాల్లో ఉన్నారు.ఈ సీజన్లో ముగ్గురు విదేశీ బ్యాటర్లు అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నా లక్నో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోవడం సోచనీయం. నిన్న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్, మార్ష్, మార్క్రమ్ సత్తా చాటినా లక్నో గెలవలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో లక్నో తరఫున ఈ ముగ్గురు మినహా బ్యాటింగ్‌లో ఎవ్వరూ రాణించలేదు. అడపాదడపా బదోని బ్యాట్‌కు పని చెప్పాడు. మిడిలార్డర్లో పంత్ ఘోరంగా విఫలం కావడం.. సరైన్ ఫినిషర్ లేకపోవడం ఈ సీజన్లో లక్నో కొంపముంచాయి. బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ పర్వాలేదనిపించినా వీరికి సహకరించే బౌలర్లే కరువయ్యారు. రవి బిష్ణోయ్ ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. పేసర్ ఆకాశ్‌దీప్ తేలిపోయాడు. మరో పేసర్ ప్రిన్స్ యాదవ్ అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సీజన్ ప్రారంభ మ్యాచ్లకంతా దూరంగా ఉండిన మయాంక్ యాదవ్ రెండు మ్యాచ్‌లు ఆడి తిరిగి గాయపడ్డాడు. వీటన్నిటికి మించి రిషబ్ కెప్టెన్సీలో లోపాలు ఈ సీజన్లో లక్నో ఖేల్ ఖతం చేశాయి. మార్క్రమ్, మార్ష్, పూరన్ ఫామ్ మినహా ఈ సీజన్లో లక్నో గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ సీజన్లో లక్నోకు మరో రెండు లీగ్ మ్యాచ్‌లు (మే 22న గుజరాత్‌తో, మే 27న ఆర్సీబీతో) మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌ల్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవడం తప్ప లక్నో చేయగలిగిందేమీ లేదు. -
IPL 2025: ముంబై ఇండియన్స్‌లోకి బెయిర్‌స్టో.. మరో ఇద్దరు కూడా..!
జాతీయ జట్టు విధుల కారణంగా ప్లే ఆఫ్స్‌కు దూరం కానున్న ర్యాన్ రికెల్టన్ (సౌతాఫ్రికా), కార్బిన్ బాష్ (సౌతాఫ్రికా), విల్ జాక్స్ (ఇంగ్లండ్) స్థానాలను ముంబై ఇండియన్స్ మరో ముగ్గురితో భర్తీ చేసుకుంది. విల్ జాక్స్‌కు ప్రత్యామ్నాయంగా జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్), ర్యాన్ రికెల్టన్కు ప్రత్యామ్నాయంగా రిచర్డ్ గ్లీసన్ (ఇంగ్లండ్), కార్బిన్ బాష్‌కు ప్రత్యామ్నాయంగా చరిత్ అసలంకను (శ్రీలంక) జట్టులోకి తీసుకుంది. వీరు ముగ్గురు ఒకవేళ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తే అందుబాటులో ఉంటారు. లీగ్ చివరి మ్యాచ్ వరకు జాక్స్, రికెల్టన్, బాష్ అందుబాటులో ఉంటారు. బెయిర్‌స్టోను ముంబై యాజమాన్యం రూ.5.25 కోట్లకు సొంతం చేసుకుంది. గ్లీసన్‌ను రూ. కోటికి, అసలంకను రూ. 75 లక్షలకు దక్కించుకుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు (గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్) ఖరారయ్యాయి. మిగిలిన ఏకైక బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇరు జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా, వీరి ప్లే ఆఫ్స్ భవితవ్యం మే 21న జరిగే మ్యాచ్‌తో దాదాపుగా డిసైడైపోతుంది. ఆ రోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ, ముంబై తలపడనున్నాయి. ఆ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే ఇంకో మ్యాచ్‌తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ అప్పుడే ఖరారు కాదు. ఆ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై (మే 24) కూడా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. ఒకవేళ ఢిల్లీ.. ముంబైపై గెలిచి, పంజాబ్ చేతిలో ఓడినా ప్లే ఆఫ్స్ బెర్త్‌పై సందిగ్దత కొనసాగుతుంది. మే 26న జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిస్తే ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ముంబై ఆ మ్యాచ్‌లో కూడా ఓడితే లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది.కాగా, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో ఇదివరకే సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ లీగ్ దశలో తలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ఈ మ్యాచ్‌ల్లో జయాపజాలు టాప్-2 బెర్త్‌లను డిసైడ్ చేస్తాయి. లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి టాప్-2 పోజిషన్స్‌లో ఉండే జట్లకు ప్లే ఆఫ్స్‌లో ఓ మ్యాచ్ ఓడినా మరో అవకాశం ఉంటుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లకు ఆ అవకాశం ఉండదు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడే జట్టు లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. -
IPL 2025: అభిషేక్ శర్మతో గొడవ.. దిగ్వేశ్ రాఠీపై సస్పెన్షన్ వేటు
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 19) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మతో గొడవకు దిగినందుకు గానూ లక్నో బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. రాఠీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధించింది. రాఠీ కవ్వింపులకు ప్రతిగా స్పందించిన అభిషేక్ కూడా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతకు గురయ్యాడు. అభిషేక్ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా జమయ్యింది.ABHISHEK vs DIGVESH MOMENT 🤯 pic.twitter.com/oEfs0LWhoe— Johns. (@CricCrazyJohns) May 19, 2025సస్పెన్షన్ కారణంగా రాఠీ లక్నో తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో (మే 22న గుజరాత్‌తో) ఆడలేడు. ఈ సీజన్లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 23 ఏళ్ల రాఠీ.. సీజన్ ప్రారంభం నుంచి చాలా సార్లు ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఉల్లంఘించి గవర్నింగ్ కౌన్సిల్ ఆగ్రహానికి గురయ్యాడు. తాజా ఘటనతో ఈ సీజన్లో రాఠీ డీ మెరిట్ పాయింట్ల సంఖ్య ఐదుకు చేరింది. ఈ కారణంగా అతనిపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. ఓ సీజన్లో మూడు సార్లు కోడ్‌ను ఉల్లంఘిస్తే ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తారు. రాఠీ ఈ సీజన్లో పంజాబ్ (1), ముంబైతో (2) జరిగిన మ్యాచ్‌ల్లోనూ కోడ్‌ను ఉల్లంఘించి డిమెరిట్ పాయింట్లు మూటగట్టుకున్నాడు.కాగా, దిగ్వేశ్ రాఠీ వికెట్ తీసిన ప్రతిసారి నోట్ బుక్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం మేనరిజంగా పెట్టుకున్నాడు. ఎవరి వికెట్ తీసినా ఇదే తంతు కొనసాగిస్తూ వచ్చాడు. తాజాగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ వికెట్ తీసిన ఆనందంలో ఇదే పని చేశాడు. అయితే ఈసారి రాఠీ నోట్ బుక్ సెలబ్రేషన్స్ కాస్త శృతి మించాయి. అభిషేక్‌తో అతను చాలా అవమానకరంగా ప్రవర్తించాడు. వికెట్ తీశాక వెళ్లు.. వెళ్లు అన్నట్లు సైగ చేశాడు. దీంతో పాటు నోటికి కూడా పని చెప్పాడు. రాఠీ ఇంతలా రియాక్డ్ కావడానికి అంతకుముందు అభిషేక్ బాదిన బాదుడే కారణం. రవి బిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్లో అభిషేక్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. ఆతర్వాత ఓవర్లో బంతినందుకున్న రాఠీ.. అభిషేక్‌ను తొలి బంతికే ఔట్ చేశాడు. ఈ క్రమంలో నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేసుకుని ఓ మ్యాచ్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం రాజీవ్ శుక్లా రాజీ కుదుర్చడంతో అభిషేక్, రాఠీ కరచాలనం చేసుకుని, కలియతిరగడం కొసమెరుపు.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమిపాలైన లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (65), ఎయిడెన్ మార్క్రమ్ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అభిషేక్ శర్మ తన సహజ శైలిలో ఊచకోత (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) కోసి సన్‌రైజర్స్ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మధ్యలో ఇషాన్ కిషన్ (35), క్లాసెన్ (47), కమిందు మెండిస్ (32 రిటైర్డ్ హర్ట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడగా.. అనికేత్ వర్మ (5 నాటౌట్), నితీశ్ రెడ్డి (5 నాటౌట్) మ్యాచ్‌లను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ 2, విలియమ్ ఓరూర్కీ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు. -
IPL 2025: మా వ్యూహాలు మార్చాల్సిన పనిలేదు: సీఎస్కే హెడ్‌కోచ్
తన దృష్టిలో ఎప్పటికీ అనుభవానికి పెద్ద పీట ఉంటుందని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. గతంలో సీనియర్లతోనే తాము వరుసగా టైటిల్స్ గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపవాదు మూటగట్టుకున్న సీఎస్కే.. పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది ఇప్పటికి ఆడిన 12 మ్యాచ్‌లలో కేవలం మూడు మాత్రమే గెలిచి దారుణంగా విఫలమైంది.సీనియర్లు విఫలంయువ ఆటగాళ్లు ఆయుశ్ మాత్రే, నూర్ అహ్మద్, డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) లాంటివారు రాణించినా... జట్టు నమ్ముకున్న సీనియర్లు పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడా లీగ్‌లో ఎంతో అనుభవం ఉన్నా కనీస ప్రదర్శన ఇవ్వలేదు. అయితే తమ టీమ్ వైఫల్యానికి పలు కారణాలు ఉన్నాయని కోచ్ ఫ్లెమింగ్ అన్నాడు. అయితే, ఆటగాళ్ల వయసు ఇందుకు కారణం కాదని పేర్కొన్నాడు.అనుభవం అమూల్యమైంది‘ఆటగాళ్ల వయసు ఎంత ఎక్కువగా ఉందనేది నేను పట్టించుకోను. నా దృష్టిలో అనుభవం అమూల్యమైంది. గత కొన్నేళ్లలో మాకు అదే ఎన్నో విజయాలు అందించింది. ఈ సీజన్లో అది పని చేయకపోవచ్చు. ఫలితం అందరికీ నిరాశ కలిగించిన మాట వాస్తవమే కానీ వైఫల్యానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి’ అని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు.ఇన్నేళ్లుగా చెన్నై టీమ్ సీనియర్ల ఆటతో అనుసరిస్తున్న వ్యూహాలను ఇకపై కూడా మార్చాల్సిన అవసరం లేదని స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. ‘సీనియర్లపై నమ్మకం ఉంచడంతో పాటు ప్రతిభాన్వేషణ కూడా ఈ సమయంలో ముఖ్యం. జట్టులో యువ ఆటగాళ్లు ఉండాలని అందరూ అంటున్నారు. కానీ వారందరినీ వెతికి తెచ్చుకోవాలి కదా. జట్టులో వారు సరిపోతారో లేదో చూడాలి.అనుభవజ్ఞులతో కలిపి వారిని ఆడించాలి. ఈ సీజన్లో కొందరు కొత్త కుర్రాళ్లు చెలరేగడం నిజమే అయినా అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్ల ఆటగాళ్ల జాబితా చూస్తే ఐపీఎల్లో అనుభవం ఉన్నవారే కనిపిస్తారు. మాకు ఈ సీజన్ పెద్ద సవాల్‌గా నిలిచింది. ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం’ అని ఫ్లెమింగ్ వివరించాడు.చదవండి: IPL 2025: దిగ్వేష్ సింగ్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్! వీడియో వైరల్ -
ధోనికి ఒకటి.. సంజూకు రెండు.. ఒకే మ్యాచ్‌లో భారీ మైలురాయిపై కన్నేసిన సీఎస్కే, రాజస్థాన్ కెప్టెన్లు
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 20) నామమాత్రపు మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు ధోని, సంజూ శాంసన్ ఓ భారీ మైలురాయిపై కన్నేశారు.ధోని ఓ సిక్సర్, సంజూ రెండు సిక్సర్లు బాదితే టీ20ల్లో 350 సిక్సర్ల మార్కును తాకుతారు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు 33 మంది మాత్రమే ఈ మైలురాయిని తాకారు. పొట్టి క్రికెట్లో అత్యధిక సిక్సర్లు (1056) బాదిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ తర్వాతి స్థానాల్లో పోలార్డ్ (908), రసెల్ (747), పూరన్ (634), అలెక్స్ హేల్స్ (560), మున్రో (557), రోహిత్ (542), జోస్ బట్లర్ (537), మ్యాక్స్‌వెల్ (530) ఉన్నారు (టాప్-10లో).ఇదిలా ఉంటే, నేటి మ్యాచ్ నామమాత్రం కావడంతో ఇరు జట్ల బ్యాటర్లు చెలరేగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజస్థాన్ ఆటగాళ్లు ఆకాశమే హద్దు అన్న రీతిలో బ్యాటింగ్ చేయవచ్చు. ఈ సీజన్లో ఆ జట్టు బ్యాటర్లు మొదటి నుంచి విధ్వంసం సృష్టిస్తున్నప్పటికీ లక్ కలిసి రాలేదు. యశస్వి జైస్వాల్, కుర్ర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరో సారి తెగబడి ఆడే ఛాన్స్ ఉంది. కొత్తగా జట్టులోకి వచ్చిన ప్రిటోరియస్ కూడా బ్యాట్‌కు పని చెప్పవచ్చుఈ సీజన్లో చాలా మ్యాచ్‌ల్లో రాయల్స్ గెలుపు వాకిట బోల్తా పడింది. ఇలా జరిగినందుకు ఈ సీజన్లో ఆ జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ సీజన్లో రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. నేడు సీఎస్కేతో జరుగబోయే మ్యాచ్ రాయల్స్‌కు ఈ సీజన్లో చివరిది. కాబట్టి సీజన్‌ను గెలుపుతో ముగించి పరువు కాపాడుకోవాలని రాయల్స్ భావిస్తుంది.సీఎస్కే విషయానికొస్తే.. ఈ జట్టు బ్యాటర్లు కూడా నేటి మ్యాచ్‌లో విజృంభించే అవకాశం ఉంది. ఈ జట్టు బ్యాటర్లు ఎదురుదాడి చేస్తే పోయేదేముందన్న రీతిలో బ్యాటింగ్ చేయవచ్చు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం ఉంది. కుర్ర బ్యాటర్లు ఆయుశ్ మాత్రే, ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్ నుంచి రికార్డు విన్యాసాలు ఆశించవచ్చు. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇరు జట్లు ఐపీఎల్లో ఇప్పటివరకు 30 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే 16, రాయల్స్ 14 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. 2020 నుంచి ఇరు జట్ల మధ్య జరిగిన 9 మ్యాచ్‌ల్లో రాయల్స్ ఏడింట విజయాలు సాధించింది. నేటి మ్యాచ్ నామమాత్రం కావడంతో ఇరు జట్లు ప్రయోగాల బాటపట్టవచ్చు.తుది జట్లు (అంచనా)..సీఎస్కే: ఆయుష్ మ్హత్రే, డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రీవిస్, శివమ్ దూబే, MS ధోని (కెప్టెన్), ఆర్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్/మతీషా పతిరానారాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, లువాన్-డ్రే ప్రిటోరియస్, వనిందు హసరంగా, క్వేనా మఫాకా, తుషార్ దేశ్‌పాండే, కుమార్ కార్తికేయ, నాంద్రే బర్గర్, అశోక్ శర్మ/శుభమ్ దూబే -
IPL 2025: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిన్న (మే 19) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఊరట పొందే విజయం సాధించింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్‌కు ఒరిగిందేమీ లేనప్పటికీ.. లక్నో ప్లే ఆఫ్స్ ఆశలను మాత్రం ఆవిరి చేసింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సన్‌రైజర్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో ఈ స్టేడియంలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లక్నో నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ స్టేడియంలో 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించడం ఇదే మొదటిసారి (నాలుగు ప్రయత్నాల్లో).మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (65), ఎయిడెన్ మార్క్రమ్ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో పూరన్ (26 బంతుల్లో 45) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. రిషబ్ పంత్ (7) తన వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. మిగతా బ్యాటర్లలో ఆయుశ్ బదోని 3, అబ్దుల్ సమద్ 3, శార్దూల్ ఠాకూర్ 4, ఆకాశ్‌దీప్ (6 నాటౌట్) పరుగులు చేశారు.ఓపెనర్లు అందించిన శుభారంభానికి ఈ మ్యాచ్‌లో లక్నో ఇంకాస్త భారీ స్కోర్ సాధించి ఉండాల్సింది. అయితే చివరి ఓవర్లలో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్లు కోల్పోయారు. నితీశ్ రెడ్డి వేసిన చివరి ఓవర్లో లక్నో మూడు వికెట్లు (2 రనౌట్లు) కోల్పోయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఎషాన్ మలింగ 2, నితీశ్ రెడ్డి, హర్షల్ పటేల్, హర్ష్ దూబే తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అభిషేక్ శర్మ తన సహజ శైలిలో ఊచకోత (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) కోసి సన్‌రైజర్స్ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మధ్యలో ఇషాన్ కిషన్ (35), క్లాసెన్ (47), కమిందు మెండిస్ (32 రిటైర్డ్ హర్ట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడగా.. అనికేత్ వర్మ (5 నాటౌట్), నితీశ్ రెడ్డి (5 నాటౌట్) మ్యాచ్‌లను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ 2, విలియమ్ ఓరూర్కీ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా గొడవ పడిన అభిషేక్, దిగ్వేశ్ మ్యాచ్ పూర్తయ్యాక ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. రాజీవ్ శుక్లా ఈ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చాడు. -
SRH Vs LSG: లక్నోను ముంచిన సన్‌రైజర్స్
లక్నో: ఈ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట ఇదివరకే ముగిసింది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచి వారి ‘ప్లే ఆఫ్స్’ ఆశల్ని కూడా ముంచింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో లక్నోపై జయభేరి మోగించింది. ముందుగా లక్నో నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (39 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్క్రమ్ (38 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), పూరన్ (26 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్) దంచేశారు. ఇషాన్ మలింగకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), క్లాసెన్ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. దిగ్వేశ్ రాఠి 2 వికెట్లు తీశాడు. సెంచరీ భాగస్వామ్యం మిచెల్ మార్ష్ దూకుడుతో లక్నో ఆట మొదలైంది. కమిన్స్ తొలి బంతికి 4, నాలుగో బంతికి 6 కొట్టాడు. ఇదే జోరుతో హర్ష్ దూబే రెండో ఓవర్లో మార్ష్ మరో సిక్స్ బాదాడు. మూడో ఓవర్లో బౌండరీతో మార్క్రమ్ టచ్‌లోకి వచ్చాడు. నాలుగో ఓవర్ తొలి బంతికే మార్క్రమ్ అవుటవ్వాల్సింది. క్రీజు వదిలి ఆడిన అతన్ని ఇషాన్ కిషన్ స్టంపౌట్ చేయలేకపోయాడు. ఇలా బతికిపోయిన మార్క్రమ్ 6, 4లతో రెచి్చపోయాడు. దీంతో ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. మార్ష్ దంచే పనిలో ముందున్నాడు. హర్షల్, ఇషాన్ మలింగ ఓవర్లలో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఓపెనింగ్ జోడీ పవర్‌ప్లేలో 69 పరుగులు చేసింది. కాసేపటికే మార్ష్ 28 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. 9వ ఓవర్లో మార్క్రమ్కు మరోమారు లైఫ్ వచి్చంది. జీషాన్ బౌలింగ్‌లో ఇచ్చిన సులువైన క్యాచ్‌ను డీప్ ఎక్స్ట్రా కవర్లో అనికేత్ వదిలేశాడు. దీంతో అదే ఓవర్లో లక్నో 100 పరుగులు దాటింది. తర్వాత ఎట్టకేలకు మార్ష్ వికెట్ తీసిన హర్ష్ దూబే 115 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. లక్నో కెపె్టన్ రిషభ్ పంత్ (7) ఎక్కువసేపు నిలువలేదు. ఇషాన్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. రెండు లైఫ్‌లను సది్వనియోగం చేసుకున్న మార్క్రమ్ 28 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. పూరన్ మధ్యలో పడిపోయిన రన్‌రేట్ పెంచేందుకు బ్యాట్ ఝుళిపించాడు. హర్షల్ 16వ ఓవర్లో సిక్స్ బాదిన మార్క్రమ్ అదే ఓవర్లో బౌల్డయ్యాడు. నితీశ్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో భారీ సిక్సర్ బాదిన పూరన్‌తో పాటు శార్దుల్ (4)కూడా రనౌటయ్యారు. సమద్ (3)ను బౌల్డ్ చేయగా... ఆకాశ్ దీప్ (6) సిక్స్‌తో జట్టు స్కోరు 200 దాటింది. 20వ ఓవర్లో నితీశ్ 20 పరుగులిచ్చాడు. అభిషేక్ అదరహో రెండు ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు 23/1. అప్పటికి అభిషేక్ ఒక పరుగే చేశాడు. ఆకాశ్‌దీప్ మూడో ఓవర్ నుంచి అతని విధ్వంసం మొదలైంది. 4, 6 బాదిన అభిషేక్ తర్వాతి రూర్కే ఓవర్లోనూ దీన్ని రిపీట్ చేశాడు. దీంతో 3.3 ఓవర్లోనే జట్టు స్కోరు 50కి చేరింది. అవేశ్ ఖాన్ బౌలింగ్‌కు దిగితే వరుస బౌండరీలతో జోరు కనబరచడంతో పవర్‌ప్లేలో హైదరాబాద్ 72/1 స్కోరు చేసింది. ఆ తర్వాత ఓవర్ వేసిన రవి బిష్ణోయ్‌కి అభిషేక్ చుక్కలు చూపించాడు. 6, 6, 6, 6లతో 26 పరుగులు రాబట్టాడు. మూడో సిక్స్ బాదేసరికే 18 బంతుల్లో అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. మరుసటి ఓవర్లో అభిషేక్ జోరుకు దిగ్వేశ్ రాఠి బ్రేక్ వేశాడు. ఈ సందర్భంగా రాఠి, అభిషేక్ మాటామాట పెంచుకున్నారు. అంపైర్లు సముదాయించి పంపారు. 35 బంతుల్లోనే 82 పరుగుల ధనాధన్ రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత ఇషాన్ కిషన్ (28 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), క్లాసెన్‌లు ధాటిని కొనసాగించడంతో సన్‌రైజర్స్ లక్ష్యంవైపు దూసుకెళ్లింది. కిషన్ అవుటయ్యాక ‘దంచే’పనిని క్లాసెన్, కమిందు మెండిస్ (21 బంతుల్లో 32 రిటైర్డ్‌హర్ట్; 3 ఫోర్లు) చక్కబెట్టారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరు పెవిలియన్‌కు చేరినా... మిగతా లాంఛనాన్ని అనికేత్ (5 నాటౌట్), నితీశ్ రెడ్డి (5 నాటౌట్) పూర్తి చేశారు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) మలింగ (బి) హర్ష్ 65; మార్క్రమ్ (బి) హర్షల్ 61; పంత్ (సి అండ్ బి) మలింగ 7; పూరన్ (రనౌట్) 45; బదోని (సి) నితీశ్ (బి) మలింగ 3; సమద్ (బి) నితీశ్ 3; శార్దుల్ (రనౌట్) 4; బిష్ణోయ్ (నాటౌట్) 0; ఆకాశ్‌దీప్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–115, 2–124, 3–159, 4–169, 5–194, 6–199, 7–199. బౌలింగ్: కమిన్స్ 4–0–34–0, హర్ష్ దూబే 4–0–44–1, హర్షల్ పటేల్ 4–0–49–1, ఇషాన్ మలింగ 4–0–28–2, జీషాన్ అన్సారి 2–0–22–0, నితీశ్ 2–0–28–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అథర్వ తైడే (సి) దిగ్వేశ్ (బి) రూర్కే 13; అభిషేక్ (సి) శార్దుల్ (బి) దిగ్వేశ్ 59; కిషన్ (బి) దిగ్వేశ్ 35; క్లాసెన్ (సి) పంత్ (బి) శార్దుల్ 47; కమిందు (రిటైర్డ్‌హర్ట్) 32; అనికేత్ (నాటౌట్) 5; నితీశ్ రెడ్డి (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.2 ఓవర్లలో 4 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–17, 2–99, 3–140, 4–195. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 3–0–33–0, రూర్కే 2.2–0–31–1, దిగ్వేశ్ రాఠి 4–0–37–2, అవేశ్ ఖాన్ 3–0–25–0, రవి బిష్ణోయ్ 1–0–26–0, మార్క్రమ్ 1–0–14–0, శార్దుల్ 4–0–39–1. -
ఎస్ఆర్హెచ్ చేతిలో చిత్తు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో ఔట్
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కథ ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో ఓటమి పాలైంది. దీంతో ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి పంత్ టీమ్ నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌లతో 65), మార్క్రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45) మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టగా.. దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు.అభిషేక్ శర్మ విధ్వంసం.. అనంతరం 206 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలో చేధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 59) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. క్లాసెన్(47), ఇషాన్ కిషన్(35), మెండిస్(32) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ సింగ్ రెండు, విలియం ఓ రూర్క్ వికెట్ సాధించారు. -
దిగ్వేష్ సింగ్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రథీ మరోసారి తన సెలబ్రేషన్స్‌లో అతి చేశాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. 206 పరుగుల లక్ష్య చేధనలో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ దూకుడుగా ఆడాడు.ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అభిషేక్ ఏకంగా నాలుగు సిక్స్‌లతో 26 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో అతడి దూకుడుకు కళ్లెం వేసేందుకు దిగ్వేష్ సింగ్‌ను లక్నో కెప్టెన్ ఎటాక్‌లోకి తీసుకొచ్చాడు. అయితే పంత్ నమ్మకాన్ని దిగ్వేష్ వమ్ము చేయలేదు. ఆ ఓవర్లో మూడో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్ ఔటయ్యాడు. ఈ క్రమంలో దిగ్వేష్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. అభిషేక్ వైపు చూస్తూ కోపంగా ఇక ఆడింది చాలు తన నోట్‌బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో డగౌట్‌కు వెళ్లేందుకు సిద్దమైన అభిషేక్ మళ్లీ వెనక్కి వచ్చి దిగ్వేష్‌పై ఫైరయ్యాడు. అతడు కూడా అభిషేక్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి వాగ్వాదానికి దిగాడు. వెంటనే అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటికే దిగ్వేష్ సింగ్‌పై బీసీసీఐ రెండు సార్లు కొరడా ఝళిపించింది. ఓసారి అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం, మరోసారి 50 శాతం కోత బీసీసీఐ విధించింది.Fight between Digvesh Rathi and Abhishek Sharma 😳 pic.twitter.com/8ngcvpnIVK— 𝑺𝒉𝒆𝒓𝒂 (@SheraVK18) May 19, 2025 -
చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్.. ఐపీఎల్లో హిస్టరీలోనే
టీమిండియా వెటరన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా ( బంతులు పరంగా) 150 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్‌గా హర్షల్ నిలిచాడు. 2381 బంతుల్లో ఈ ఫీట్‌ను పటేల్ అందుకున్నాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనతను పటేల్ నమోదు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక పేస్ బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగ(2444 బంతులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మలింగ రికార్డును హర్షల్ పటేల్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లు పరంగా ఈ ఫీట్ సాధించిన జాబితాలో హర్షల్ పటేల్(117) రెండో స్దానంలో నిలిచాడు. తొలి స్ధానంలో మలింగ(105) కొనసాగుతున్నాడు.ఐపీఎల్లో బంతులు పరంగా అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్లు వీరే..2381- హర్షల్ పటేల్2444- లసిత్ మలింగ2543- చాహల్2656- డ్వైన్ బ్రావో2832- జస్ప్రీత్ బుమ్రామ్యాచ్ల పరంగా అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్లు వీరే..లసిత్ మలింగ- 105హర్షల్ పటేల్- 117యుజ్వేంద్ర చాహల్-118రషీద్ ఖాన్- 122జస్ప్రీత్ బుమ్రా- 124 -
IPL 2025: మళ్లీ అదే కథ.. తీరు మారని రిషబ్ పంత్
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పంత్ తీవ్ర నిరాశపరిచాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. 6 బంతులు ఎదుర్కొని కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.ఎస్ఆర్హెచ్ పేసర్ ఇషాన్ మలింగ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పంత్ పెవిలియన్‌కు చేరాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన పంత్.. తన ధరకు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 12.27 సగటుతో కేవలం 135 పరుగులు మాత్రమే చేశాడు.ఈ క్రమంలో పంత్ చెత్త ఆట తీరును లక్నో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో పంత్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. పంత్ నీవు ఇక మారవా అంటూ ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో పంత్ ఔటైన అనంతరం మ్యాచ్ వీక్షిస్తున్న లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో కొనుగోలు చేసింది.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌లతో 65), మార్క్రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45) మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టగా.. దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు.చదవండి: అతడొక అద్బుతం.. గిల్‌ను మించిపోయాడు: జడేజా -
అతడొక అద్బుతం.. గిల్‌ను మించిపోయాడు: జడేజా
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుదర్శన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 61 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 108 పరుగులు చేశాడు.అతడి విధ్వంసర ఇన్నింగ్స్ ఫలితంగా 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ వికెట్ నష్టపోకుండా ఛేదించింది. అతడితో పాటు గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కూడా 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సాయి సుదర్శన్‌పై భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు.సుదర్శన్ తన ప్రదర్శనలతో టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను మించిపోయాడని జడేజా కొనియాడాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సుదర్శన్ 12 మ్యాచ్‌లు ఆడి 56.10 సగటుతో 617 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ సాయిసుదర్శన్ వద్దే ఉంది."సాయి సుదర్శన్ అద్బుతమైన బ్యాటర్. అతడి బ్యాటింగ్ టెక్నిక్ చాలా బాగుంది. ఈ ఏడాది సీజన్లో సుదర్శన్ తన ప్రదర్శనలతో శుబ్‌మన్ గిల్‌ను మించిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఒక్క మ్యాచ్‌లోనే కాదు, అంతకుముందు మ్యాచ్‌లలో కూడా గిల్ కంటే మెరుగ్గా రాణించాడు.శుబ్మన్తో పోలిస్తే సుదర్శన్ ఎటువంటి రిస్క్ తీసుకోకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో తొలుత గిల్ బంతిని టైమ్ చేయడానికి కాస్త కష్టపడ్డాడు. గిల్ బంతిని స్టాండ్స్‌కు తరలించేందుకు తన బలాన్ని మొత్తాన్ని ఉపయోగించాడు. కానీ సాయి విషయంలో మాత్రం అలా జరగలేదు. అతడు చాలా సులువుగా షాట్లు ఆడాడు" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జడేజా పేర్కొన్నాడు.చదవండి: ఐపీఎల్-2025లో దారుణ ప్రదర్శన.. కేకేఆర్ హెడ్ కోచ్‌పై వేటు? -
IPL 2025: లక్నోను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్..
IPL 2025 LSG vs DC Live Updates:లక్నోను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్..ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైంది. దీంతో ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమించింది. 206 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలో చేధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 59) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. క్లాసెన్(47), ఇషాన్ కిషన్(35), మెండిస్(32) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ సింగ్ రెండు, విలియం ఓ రూర్క్, శార్ధూల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించారు.16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 179/316 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ 3 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ విజయానికి 24 బంతుల్లో 27 పరుగులు కావాలి.ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్ఇషాన్ కిషన్(35) రూపంలో సన్‌రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. దిగ్వేష్ సింగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్..అభిషేక్ శర్మ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 59 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. దిగ్వేష్ సింగ్ రాఠీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు సన్ రైజర్స్ స్కోర్: 117/2అభిషేక్ శర్మ ఫిప్టీలక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 6వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అభిషేక్ వరుసగా నాలుగు సిక్స్‌లు బాదాడు. అభిషేక్ 59 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 7 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న అభిషేక్, కిషన్..4 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(23), ఇషాన్ కిషన్(11) ఉన్నారు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్..206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన ఆధర్వ తైడే.. విలియం ఓరూర్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోర్: 23/1చెలరేగిన లక్నో బ్యాటర్లు..ఐపీఎల్-2025లో ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌లతో 65), మార్క్రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45) మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టగా.. దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు.లక్నో మూడో వికెట్ డౌన్..ఐడైన్ మార్క్రమ్ రూపంలో లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 61 పరుగులు చేసిన మార్క్రమ్.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి లక్నో.. 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.15 ఓవర్లకు లక్నో స్కోర్: 146/215 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(53), నికోలస్ పూరన్(16) ఉన్నారు.లక్నో రెండో వికెట్ డౌన్..రిషబ్ పంత్ రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన పంత్.. ఇషాన్ మలింగ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 12 ఓవర్లకు లక్నో రెండు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మారక్రమ్(49), రిషబ్ పంత్(7) ఉన్నారు.లక్నో తొలి వికెట్ డౌన్.. మార్ష్ ఔట్మిచెల్ మార్ష్ రూపంలో లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 65 పరుగులు చేసిన మార్ష్.. హర్ష్ దూబే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(2), మార్క్రమ్(48) ఉన్నారు.6 ఓవర్లకు లక్నో స్కోర్: 69/06 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(26), మార్ష్(41) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న మార్ష్..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(18), మార్క్రమ్(1) ఉన్నారు.ఐపీఎల్-2025లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ లక్నోకు చాలా కీలకం. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో పంత్ టీమ్ తప్పక గెలవాల్సిందే. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆరెంజ్ ఆర్మీ.. తమ ఆఖరి మ్యాచ్‌లలో గెలిచి పరువు నెలబెట్టుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు ఎస్ఆర్హెచ్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ కరోనా కారణంగా దూరమయ్యాడు.తుది జట్లులక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, విలియం ఒరూర్కేసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, హర్ష్ దూబే, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ -
ఐపీఎల్-2025లో దారుణ ప్రదర్శన.. కేకేఆర్ హెడ్ కోచ్‌పై వేటు?
ఐపీఎల్-2025లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ దారుణ ప్రదర్శన కరబరిచింది. అజింక్య రహానే సారథ్యంలో బరిలోకి దిగిన కేకేఆర్.. అందరి అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఈ టోర్నీలో వరుస ఓటములతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి కేకేఆర్ నిష్క్రమించింది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లలో సైతం కేకేఆర్ చేతులేత్తేసింది. ముఖ్యంగా వేలంలో రూ.23.75 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వెంకటేశ్ అయ్యర్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ ఏడాది సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడిన అయ్యర్.. 20.28 సగటుతో కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు.అయితే వేలంలో కేకేఆర్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ సూచన మేరకే వెంకటేశ్ అయ్యర్‌పై ఫ్రాంచైజీ యాజమాన్యం అంత భారీ ధర వెచ్చించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో చంద్రకాంత్ కేకేఆర్ మెనెజ్‌మెంట్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సీజన్ తర్వాత ప్రధాన కోచ్‌గా అతడిపై వేటు వేయాలని కోల్‌కతా ఫ్రాంచైజీ భావిస్తోందంట. చంద్రకాంత్ పండిట్ స్ధానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ను తమ ప్రధాన కోచ్‌గా నియమించేందుకు కేకేఆర్ ఆసక్తిచూపుతున్నట్లు సమాచారం. ఇయాన్ మోర్గాన్‌తో కేకేఆర్‌కు మంచి అనుబంధం ఉంది. మోర్గాన్ కెప్టెన్‌గా 2021 సీజన్లో కేకేఆర్‌ను ఐపీఎల్ ఫైనల్స్‌కు చేర్చాడు.అయితే ఫైనల్లో మాత్రం సీఎస్కే చేతిలో నైట్ రైడర్స్ ఓటమి పాలైంది. అదేవిధంగా మెంటార్‌గా ఉన్న డ్వైన్ బ్రావోను కూడా తొలిగించే యోచనలో కేకేఆర్ ఉన్నట్లు సమాచారం. నైట్‌రైడర్స్‌కు ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. మే 25న ఢిల్లీ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. చదవండి: IPL 2025: ఎస్ఆర్హెచ్కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా -
ఎస్ఆర్హెచ్కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నామమాత్రమైన పోరుకు సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమవారం ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నిష్క్రమించిన ఎస్ఆర్హెచ్.. కనీసం మిగిలిన మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌కు భారీ షాక్ తగిలింది. లక్నోతో మ్యాచ్‌కు ముందు ఆ జట్టు స్టార్ ఓపెనర్, ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్ కరోనా బారిన పడ్డాడు. అతడు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. దీంతో లక్నో మ్యాచ్‌కు హెడ్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి ధ్రువీకరించాడు."ట్రావిస్ హెడ్‌కు దురదృష్టవశాత్తు కోవిడ్-19 సోకింది. దీంతో అతడు భారత్‌కు చేరుకోవడం కాస్త ఆలస్యం కానుంది. అతడు సోమవారం భారత్‌కు రాననున్నాడు. హెడ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో లక్నోతో మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. అతడు పూర్తిగా కోలుకుని తిరిగి మా తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నామని" ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో వెట్టోరీ పేర్కొన్నాడు. కాగా భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వారం పాటు వాయిదా పడిన విషయం విధితమే. ఈ క్రమంలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌తో పాటు హెడ్ తమ స్వదేశానికి వెళ్లిపోయారు. ఐపీఎల్ రీస్టార్ట్ కావడంతో కమ్మిన్స్ తిరిగి వచ్చినప్పటికి.. హెడ్ మాత్రం కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా జట్టులో చేరనున్నాడు.ఈ సీజన్లో హైదరాబాద్ జట్టుకు మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సోమవారం లక్నోతో, ఆ తర్వాత ఆర్సీబీ, కేకేఆర్‌తో మ్యాచులు ఆరెంజ్ ఆర్మీ ఆడనుంది.చదవండి: 'అవన్నీ రూమర్సే.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు': బీసీసీఐ -
'అవన్నీ రూమర్సే.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు': బీసీసీఐ
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తల కారణంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉండాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌కు చెందిన మంత్రి మొహిసిన్ నఖ్వీ ఏసీసీ చైర్మెన్‌గా ఉండడంతో భారత క్రికెట్ బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.తాజాగా ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఆసియా కప్, మహిళల ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ నుండి వైదొలుగుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు."ఆసియా కప్, మహిళల ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ రెండు ఏసీసీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుందన్న వార్తలు మా దృష్టికి వచ్చాయి. ఈ రోజు ఉదయం నుంచి ఇదే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ నిరాధరమైన వార్తలు. బీసీసీఐ ఇప్పటివరకు తదుపరి ఏసీసీ ఈవెంట్లకు సంబంధించి ఎలాంటి చర్చలు జరపలేదు. అదేవిధంగా ఏసీసీకి ఎటువంటి లేఖ కూడా బీసీసీఐ రాయలేదు.ప్రస్తుతం మా దృష్టింతా ఐపీఎల్, తదుపరి ఇంగ్లండ్ సిరీస్‌లపైనే మాత్రమే ఉంది. ఆసియా కప్ లేదా ఏదైనా ఇతర ఏసీసీ ఈవెంట్‌పైన ఎటువంటి నిర్ణయం తీసుకున్న భారత క్రికెట్ బోర్డు ప్రెస్‌నోట్ కచ్చితంగా విడుదల చేస్తోంది" అని దేవజిత్ సైకియా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవజిత్ సైకియా పేర్కొన్నారు. కాగా మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ వచ్చే నెలలో జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో పురుషుల ఆసియా కప్ టోర్నీని నిర్వహించనున్నారు. గత ఆసియాకప్ టోర్నీ శ్రీలంక, పాక్‌ల వేదికగా హైబ్రిడ్ మోడల్లో జరిగింది.చదవండి: IPL 2025: పాకిస్తాన్ సరసన గుజరాత్ టైటాన్స్ -
IPL 2025: పాకిస్తాన్ సరసన గుజరాత్ టైటాన్స్
గుజరాత్ టైటాన్స్ జట్టు పొట్టి క్రికెట్లో ఓ అరుదైన రికార్డు సాధించింది. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 18) ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్‌లో 200 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించిన ఈ జట్టు.. పాకిస్తాన్ తర్వాత టీ20ల్లో 200, అంతకుమించిన లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించిన రెండో జట్టుగా నిలిచింది. యావత్ టీ20 ఫార్మాట్ చరిత్రలో ఈ రెండు జట్లే (పాకిస్తాన్, గుజరాత్) ఇప్పటివరకు 200, అంతకుమించిన లక్ష్యాలను వికెట్ కోల్పోకుండా ఛేదించాయి.2022లో పాకిస్తాన్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో 200కు పైగా లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది. ఆ మ్యాచ్‌లో నాటి పాక్ కెప్టెన్ అజేయమైన సెంచరీతో (66 బంతుల్లో 110) విధ్వంసం సృష్టించగా.. అతని పార్ట్నర్, ప్రస్తుత కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో (51 బంతుల్లో 88 నాటౌట్) చెలరేగాడు.నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. కేఎల్ రాహుల్ (65 బంతుల్లో 112 నాటౌట్; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్ 5, అభిషేక్ పోరెల్ 30, అక్షర్ పటేల్ 25, ట్రిస్టన్ స్టబ్స్ 21 (నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, ప్రసిధ్‌కృష్ణ, సాయికిషోర్ తలా ఒక వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్.. ఓపెనర్లు సాయి సుదర్శన్ (61 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగిపోవడంతో 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 205 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. ఈ మ్యాచ్‌లో గిల్-సాయి సుదర్శన్ నెలకొల్పిన 205 పరుగుల భాగస్వామ్యం ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యంగా రికార్దైంది. ఈ సీజన్లో గిల్-సాయి జోడీ 839 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. లీగ్ చరిత్రలోనే ఓ సీజన్లో అత్యధిక పరుగులు జోడించిన భారత జోడీగా రికార్డుల్లోకెక్కింది. -
IPL 2025: కేఎల్ రాహుల్.. ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్..!
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 18) రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ అజేయమైన సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో రాహుల్ పలు రికార్డులు సాధించాడు. కేవలం 60 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన రాహుల్.. ఓవరాల్‌గా 65 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 4 సిక్స్ సాయంతో 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్..!ఈ క్రమంలో రాహుల్ ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన రికార్డు సాధించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రాహుల్ తన ఐపీఎల్ కెరీర్లో పంజాబ్ తరఫున 2, లక్నో తరఫున 2, ఇప్పుడు ఢిల్లీ తరఫున ఓ సెంచరీ (మొత్తం 5) చేసి ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. తాజా సెంచరీతో తన టీ20 సెంచరీల సంఖ్యను ఏడుకు పెంచుకున్న రాహుల్.. పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు:8 - విరాట్ కోహ్లీ7 - జోస్ బట్లర్6 - క్రిస్ గేల్5 - కేఎల్ రాహుల్*4 - శుభ్‌మన్ గిల్4 - షేన్ వాట్సన్4 - డేవిడ్ వార్నర్పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు:విరాట్ కోహ్లీ - 9రోహిత్ శర్మ - 8అభిషేక్ శర్మ - 7కేఎల్ రాహుల్ - 7*ఫాస్టెస్ట్ ఇండియన్‌గా..ఈ మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసుకున్న భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు కింగ్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లికి ఈ మార్కు తాకేందుకు 243 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. రాహుల్ తన 224వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు.ఓవరాల్‌గా టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం (213 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్ధానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం(218) కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా కేఎల్ రాహుల్ (224), కోహ్లి (243), పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (244) ఉన్నారు.రికార్డు సెంచరీ చేసినా ఓడిన ఢిల్లీఈ మ్యాచ్‌లో రాహుల్ రికార్డు సెంచరీతో కదంతొక్కినా ఢిల్లీ ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ఢిల్లీపై విజయంతో గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఒకేసారి ఖరారయ్యాయి. నాలుగో బెర్త్ కోసం ఢిల్లీ, ముంబై, లక్నో పోటీ పడనున్నాయి. ఇవాళ (మే 19) సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో లక్నో ఓడితే ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు ఢిల్లీ, ముంబై మాత్రమే రేసులో ఉంటాయి. అంతకుముందు సీఎస్కే, రాజస్థాన్, సన్‌రైజర్స్, కేకేఆర్ వరుసగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. -
IPL 2025: ఆర్సీబీ జట్టులోకి జింబాబ్వే ప్లేయర్.. అతడికి ప్రత్యామ్నాయంగా ఎంపిక
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 8 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడం ఇది పదోసారి. ఆ జట్టు 2009, 2010, 2011, 2015, 2016, 2020, 2021, 2022, 2024, 2025 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్‌కు ముందు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ రెండూ గెలిచి మొదటి రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో లీగ్ దశను ముగించాలని భావిస్తుంది. తదుపరి మ్యాచ్‌ల్లో ఆర్సీబీ.. సన్‌రైజర్స్ (మే 23), లక్నోతో (మే 27) తలపడాల్సి ఉంది.గుజరాత్, పంజాబ్ కూడా..!నిన్న (మే 18) రాత్రి ఢిల్లీపై విజయం సాధించడంతో గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఒకేసారి ఖరారయ్యాయి. నాలుగో బెర్త్ కోసం ఢిల్లీ, ముంబై, లక్నో పోటీ పడనున్నాయి. ఇవాళ (మే 19) సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో లక్నో ఓడితే ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు ఢిల్లీ, ముంబై మాత్రమే రేసులో ఉంటాయి. అంతకుముందు సీఎస్కే, రాజస్థాన్, సన్‌రైజర్స్, కేకేఆర్ వరుసగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.ఎంగిడికి ప్రత్యామ్నాయంగా ముజరబానీవచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఆర్సీబీ బౌలర్ లుంగి ఎంగిడి స్వదేశానికి వెళ్లిపోయాడు. అతని స్థానాన్ని ఆర్సీబీ యాజమాన్యం జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీతో భర్తీ చేసింది. ముజరబానీ.. ఆర్సీబీ లక్నోతో ఆడబోయే చివరి లీగ్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు. ఈ సీజన్లో ఒకే ఒక మ్యాచ్ (సీఎస్కే) ఆడిన ఎంగిడి అందులో మూడు వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో గెలుపొందింది.🚨 BLESSING MUZARABANI WILL PLAY FOR RCB IN PLAYOFFS 🚨- He replaces Lungi Ngidi. pic.twitter.com/kzZ1rLrGgl— Johns. (@CricCrazyJohns) May 19, 2025ముజరబానీ విషయానికొస్తే.. కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన 28 ఏళ్ల ముజరబానీ.. జింబాబ్వే తరఫున 12 టెస్ట్‌లు, 55 వన్డేలు, 70 టీ20లు ఆడి 198 వికెట్లు పడగొట్టాడు. గత కొంతకాలంగా ముజరబానీ టీ20ల్లో విశేషంగా రాణిస్తున్నాడు. అందుకే ఆర్సీబీ ఈ ఆఫ్రికా ఆణిముత్యాన్ని వెతికి పట్టుకుంది. ముజరబానీ.. సికందర్ రజా తర్వాత ఐపీఎల్ ఆడనున్న రెండో జింబాబ్వే క్రికెటర్. -
IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సారధుల్లో ఒకడైన శ్రేయస్ అయ్యర్ మరో కలికితురాయిని తన కీర్తి కిరీటంపై అమర్చుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ప్లే ఆఫ్స్‌కు చేర్చిన తొలి, ఏకైక కెప్టెన్‌గా రికార్డు సాధించాడు. 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను రన్నరప్‌గా నిలబెట్టిన శ్రేయస్.. గత సీజన్లో (2024) కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ సీజన్లో పంజాబ్ ఫ్రాంచైజీ శ్రేయస్‌పై భారీ అంచనాలతో ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక ధర (రూ. 26.75 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకుంది. అంచనాలకు తగ్గట్టుగానే శ్రేయస్ తన తొలి ప్రయత్నంలోనే పంజాబ్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. నిన్న (మే 18) రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించడంతో పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఆ జట్టు 11 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించింది. చివరిగా 2014 సీజన్లో పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఇప్పుడు తిరిగి శ్రేయస్ నేతృత్వంలో మరోసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. శ్రేయస్ తనుకు మాత్రమే సాధ్యమైన వైవిధ్యభరితమైన కెప్టెన్సీతో పంజాబ్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. ఈ సీజన్లో పంజాబ్ శ్రేయస్ నేతృత్వంలో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు (ఓ మ్యాచ్ రద్దు) సాధించి 17 పాయింట్లతో (0.389) పట్టికలో మూడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌కు ముందు ఆ జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లు పట్టికలో పంజాబ్ స్థానాన్ని డిసైడ్ చేస్తాయి. పంజాబ్ తమ చివరి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (మే 24), ముంబై ఇండియన్స్‌తో (మే 26) తలపడాల్సి ఉంది.కాగా, నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 10 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్లో ఎనిమిదో విజయం నమోదు చేసింది. ఈ సీజన్లో చాలా మ్యాచ్‌ల్లో లాగే రాజస్థాన్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచే స్థితిలో ఉండి ఓటమిపాలైంది. చివరి రెండు ఓవర్లలో కేవలం 30 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా.. 19 పరుగులకు మాత్రమే పరిమితమైంది.బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ స్కోర్ (219/5) చేసింది. నేహల్ వధేరా (37 బంతుల్లో 70; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (30 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచి కొట్టారు. ప్రభ్‌సిమ్రన్ (21), శ్రేయస్ అయ్యర్ (30), అజ్మతుల్లా ఒమర్జాయ్ (21 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. ప్రియాంశ్ ఆర్య (9), మిచెల్ ఓవెన్ (0) విఫలమయ్యారు. రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 2, మపాకా, రియాన్ పరాగ్, ఆకాశ్ మధ్వాల్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి ఓడింది. ధ్రువ్ జురేల్ (31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్), వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 40; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాయల్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. అయితే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్‌ప్రీత్ బ్రార్ 3 వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బకొట్టాడు. జన్సెన్, ఒమర్జాయ్ తలో రెండు వికెట్లు తీసి రాయల్స్‌ను దెబ్బకొట్టడంలో తమవంతు పాత్ర పోషించారు. -
LSG Vs SRH: రైజర్స్ గాడిన పడేనా!
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు నామమాత్రమైన పోరుకు సిద్ధమైంది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో రైజర్స్ తలపడనుంది. ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకున్న గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్... మెరుగైన స్థానంతో ఈ సీజన్‌కు ముగింపు పలకాలని భావిస్తోంటే... పడుతూ లేస్తూ సాగుతున్న లక్నో జట్టు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాలని తహతహలాడుతోంది. రిషభ్ పంత్ సారథ్యంలోని లక్నో జట్టు గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడింది. ఈ నేపథ్యంలో తెగించి పోరాడేందుకు రెడీ అవుతోంది. పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న లక్నో సారథి పంత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అనుకోని విరామం తర్వాతైనా పంత్ విజృంభిస్తాడా చూడాలి. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లాడిన లక్నో 5 విజయాలు, 6 పరాజయాలతో 10 పాయింట్లతో ఉంది. మరోవైపు ‘ఆరెంజ్ ఆర్మీ’ 11 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 7 ఓటములు, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో 7 పాయింట్లతో ఉంది. బౌలింగ్ మెరుగైతేనే! తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి ప్రత్యర్థులను హడలెత్తించిన సన్‌రైజర్స్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేక పరాజయాలతో సహవాసం చేసింది. ఇప్పటికే రేసు నుంచి తప్పుకున్న కమిన్స్ బృందం... ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో అయినా కాస్త మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. గతేడాది ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డు గెలుచుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఈసారి పేలవ ప్రదర్శన చేస్తుంటే... తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత జట్టుకే భారంగా మారాడు. అభిషేక్ శర్మ అడపాదడపా మెరుపులు తప్ప నిలకడలేమితో ఇబ్బంది పడుతుంటే... సీజన్లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన ట్రావిస్ హెడ్ కోవిడ్–19 సోకడంతో ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో అభిషేక్‌తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనుండగా... సచిన్ బేబీకి తుది జట్టులో చోటు దక్కనుంది. మిడిలార్డర్లో క్లాసెన్, నితీశ్, అనికేత్, మెండిస్ కీలకం కానున్నారు. ఇక ఈ సీజన్లో లయ దొరకబుచ్చుకోలేక ఇబ్బంది పడుతున్న టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీతో పాటు కమిన్స్, ఉనాద్కట్ బౌలింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరముంది. పంత్‌పైనే అందరి చూపు పది రోజుల విరామం తర్వాత బరిలోకి దిగుతున్న లక్నో జట్టు పంత్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్లో 10 ఇన్నింగ్స్‌ల్లో ఆరుసార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమైన పంత్... 12.8 సగటుతో 128 పరుగులు చేశాడు. కనీసం 100 బంతులు ఎదుర్కొన్న వారిలో పంత్‌దే అతితక్కువ సగటు, స్ట్రయిక్ రేట్. ఈ గణాంకాలు చాలు ఈ సీజన్లో పంత్ ఎంతలా తడబడుతున్నాడో అర్థం చేసుకునేందుకు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అయితే అబ్దుల్ సమద్, ఆయుశ్ బదోనీ తర్వాత ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. భారత టెస్టు జట్టు కెప్టెన్సీ రేసులో ముందు వరసలో ఉన్న పంత్ ఈ మ్యాచ్‌లోనైనా చెలరేగుతాడా చూడాలి. మార్క్రమ్, మార్‡్ష, పూరన్, మిల్లర్ రూపంలో నలుగురు భీకర బ్యాటర్లు లక్నోకు అందుబాటులో ఉండగా... మిల్లర్ ఫామ్‌లేమీ మేనేజ్మెంట్ను ఇబ్బంది పెడుతోంది. బౌలింగ్‌లో లక్నో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆరంభంలో మెరిపించిన శార్దుల్ ఠాకూర్ ప్రభావం చూపలేకపోతుండగా... మయాంక్ యాదవ్ గాయాలతో సతమతమవుతున్నాడు. విఘ్నేశ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, అవేశ్ ఖాన్ కలసి కట్టుగా కదంతొక్కాల్సిన అవసరముంది. తుది జట్లు (అంచనా) లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్), మార్క్రమ్, మార్‡్ష, పూరన్, బదోని, మిల్లర్, సమద్, రవి బిష్ణోయ్, శార్దుల్ ఠాకూర్, విగ్నేశ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, అవేశ్ ఖాన్. సన్‌రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, సచిన్ బేబీ, క్లాసెన్, నితీశ్ రెడ్డి, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, ఉనాద్కట్, హర్శల్ పటేల్, షమీ, జీషాన్ అన్సారీ. -
IPL 2025: గుజరాత్ దర్జాగా...
200 పరుగుల లక్ష్యం. ఛేదించే జట్టుకు ఏమాత్రం సులువు కానేకాదు. కానీ ఇద్దరే ఇద్దరు... గుజరాత్ ఓపెనర్లు దంచేశారు. అంతపెద్ద లక్ష్యాన్ని సులువుగా కరిగించేశారు. సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ పోటీపడ్డారు. పరుగు పెట్టేందుకు... ఫోర్లు బాదేందుకు... సిక్సర్లు కొట్టేందుకు ఇలా ప్రతిదానికి ఆఖరుదాకా పోటీపడి మరీ సాధించడంతో కఠిన లక్ష్యం కూడా ఓ ఓవర్‌కు ముందే కరిగిపోయింది. అంత చేసి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమితో కుంగిపోయింది. అంతేకాదు గుజరాత్ దర్జాగా సాధించిన విజయంతో తమతోపాటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లను కూడా ‘ప్లే ఆఫ్స్’కు తీసుకెళ్లింది. ఇక మిగిలింది ఒకే ఒక్క బెర్త్. దీని కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కాచుకున్నాయి. మరి ఆఖరి బెర్త్ ఎవరిని వరిస్తుందో చూడాలి. న్యూఢిల్లీ: ఓపెనర్ల గర్జనతో గుజరాత్ టైటిల్స్ దర్జాగా ఐపీఎల్ 18వ సీజన్లో ప్లే ఆఫ్స్ దశకు అర్హత సంపాదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాయి సుదర్శన్ (61 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఢిల్లీ బౌలింగ్‌ను దంచికొట్టారు. దీంతో టైటాన్స్ 10 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (65 బంతుల్లో 112 నాటౌట్; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. అర్షద్, ప్రసిధ్‌కృష్ణ, సాయికిషోర్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 205 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ అజేయంగా, ఆకాశమే హద్దుగా చెలరేగారు. నెల నిషేధం ముగియడంతో గుజరాత్ తరఫున రబడ ఈ మ్యాచ్ బరిలోకి దిగాడు. రాహుల్ 112 నాటౌట్ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌ను ఆరంభం నుంచి ఆఖరుదాకా నడిపించింది... పరుగులు రాబట్టింది ఒకే ఒక్కడు రాహుల్. డుప్లెసిస్ (5)తో ఓపెనింగ్ వికెట్ ఎంతోసేపు నిలబడలేదు. ఆరంభంలో స్కోరులో ఏమాత్రం జోరు లేదు. 5 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 28/1. పవర్‌ప్లేలో కనీసం బంతికో పరుగైనా చేయలేదు. అయితే ఆరో ఓవర్లో రాహుల్ రెండు సిక్స్‌లు, ఓ బౌండరీ బాదడంతో క్యాపిటల్స్ 45/1 స్కోరుతో కోలుకుంది. అభిషేక్ పొరెల్ (19 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్‌లు) అడపాదడపా భారీషాట్లు బాదాడు. రాహుల్ 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. రబడ 11వ ఓవర్లో పొరెల్, రాహుల్ చెరో సిక్సర్ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. దీంతో మరుసటి ఓవర్లోనే క్యాపిటల్స్ 100 మార్క్‌ను దాటింది. కానీ ఆఖరి బంతికి పొరెల్ వికెట్‌ను కోల్పోయింది. దీంతో రెండో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి కెపె్టన్ అక్షర్ పటేల్ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) రాగా... రాహుల్ ధాటిని పెంచాడు. 14వ ఓవర్లో వరుసగా 3 బౌండరీలు కొట్టాడు. అక్షర్ కూడా 4, 6తో దంచేపనిలో పడ్డాడు కానీ మరుసటి ఓవర్లోనే ప్రసి«ద్కృష్ణకు వికెట్ సమరి్పంచుకున్నాడు. 19వ ఓవర్లో 6, 4 బాదిన రాహుల్ 60 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. స్టబ్స్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 సిక్స్‌లు) వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఆరంభం నుంచే ధనాధన్ తొలి ఓవర్లో సాయి సుదర్శన్ బౌండరీతో శుబ్‌మన్ సిక్స్‌తో తమ ఖాతా తెరవడం ద్వారా లక్ష్యానికి దీటైన ఆరంభమిచ్చారు. నటరాజన్ వేసిన రెండో ఓవర్‌ను సుదర్శన్ 6, 4, 4, 0, 2, 4లతో చితగ్గొట్టాడు. దీంతో 20 పరుగులు వచ్చాయి. అక్షర్ మూడో ఓవర్లో మరో రెండు బౌండరీలు బాదాడు. టైటాన్స్ 6 ఓవర్లలో 59/0 స్కోరు చేసింది. ఆ తర్వాత కూడా ఇద్దరు చక్కని సమన్వయంతో ఆడటంతో పరుగులకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. ఈ క్రమంలో మొదట సుదర్శన్ 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 93/0 స్కోరు చేసింది. ఇక మిగిలిన 10 ఓవర్లలో 107 పరుగులు చేయాల్సిన దశలోనూ ఓపెనింగ్ జోడీ పరుగుల పయనం సాఫీగా సాగిపోయింది. దీంతో ఓవర్లు గడిచేకొద్దీ ఢిల్లీ బౌలర్లు కాస్తా డీలా బౌలర్లుగా మారిపోయారు. 33 బంతుల్లో గిల్ అర్ధసెంచరీ పూర్తవగా జట్టు స్కోరు 15వ ఓవర్లో 150 దాటింది. ఇక 30 బంతుల్లో 46 పరుగుల సమీకరణంతోనే... చేతిలో పది వికెట్లున్న టైటాన్స్ చేతుల్లోకే మ్యాచ్ వచ్చేసింది. ఈ లాంఛనాన్ని మరో బ్యాటర్‌కు ఇవ్వకుండా ఓపెనర్లే పూర్తి చేశారు. భారీ సిక్సర్‌తో సాయి సుదర్శన్ 56 బంతుల్లో సెంచరీ సాధించగా, చూడచక్కని బౌండరీలతో గిల్ కూడా శతకానికి చేరువయ్యాడు. కానీ ఈ లోపే 200 పరుగుల పెద్ద లక్ష్యం 19వ ఓవర్లోనే దిగిరావడంతో అతని సెంచరీకి అవకాశం లేకుండాపోయింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (నాటౌట్) 112; డుప్లెసిస్ (సి) సిరాజ్ (బి) అర్షద్ 5; పోరెల్ (సి) బట్లర్ (బి) సాయికిషోర్ 30; అక్షర్ (సి) సాయికిషోర్ (బి) ప్రసిధ్ కృష్ణ 25; స్టబ్స్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–16, 2–106, 3–151. బౌలింగ్: సిరాజ్ 4–0–37–0, అర్షద్ ఖాన్ 2–0–7–1, రబడా 2–0–34–0, ప్రసిద్‌కృష్ణ 4–0–40–1, రషీద్ ఖాన్ 4–0–32–0, సాయికిషోర్ 4–0–47–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (నాటౌట్) 108; శుబ్‌మన్ గిల్ (నాటౌట్) 93; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 205. బౌలింగ్: అక్షర్ పటేల్ 3–0–35–0, నటరాజన్ 3–0–49–0, ముస్తాఫిజుర్ 3–0–24–0, చమీర 2–0–22–0, విప్రాజ్ 4–0–37–0, కుల్దీప్ 4–0–37–0. -
IPL 2025: పంజాబ్ 11 ఏళ్ల తర్వాత...
జైపూర్: సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ టోర్నిలో పంజాబ్ కింగ్స్ జట్టు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది. రాజస్తాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు 10 పరుగుల తేడాతో గెలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ జట్టు నెగ్గడంతో... పంజాబ్ కింగ్స్ జట్టుకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ ఖరారైంది. చివరిసారి పంజాబ్ కింగ్స్ జట్టు 2014లో ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. నేహల్ వధేరా (37 బంతుల్లో 70; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (30 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి ఓడింది. ధ్రువ్ జురేల్ (31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్), వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 40; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్‌ప్రీత్ బ్రార్ 3 వికెట్లు తీశాడు. ధనాధన్ ఆరంభం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు 4, 0, 4, 4, 6, 4లతో జైస్వాల్ తొలి ఓవర్లోనే దీటైన ఆరంభమిచ్చాడు. రెండో ఓవర్‌ను వైభవ్ బౌండరీ, రెండు సిక్స్‌లతో చితగ్గొట్టాడు. దీంతో 2.5 ఓవర్లోనే రాజస్తాన్ 50 స్కోరు చేసేసింది. వైభవ్ చేసిన 40 పరుగులు 4 ఫోర్లు, 4 సిక్స్‌లతోనే సాధించడం విశేషం. ఐదో ఓవర్లో వైభవ్ అవుటవడంతో 76 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత యశస్వి ధాటిగా ఆడుతున్నా... సామ్సన్ (20), పరాగ్ (13) వికెట్లు పారేసుకోవడం ప్రతికూలమైంది. అయినా ధ్రువ్ జురేల్ భారీషాట్లతో ఆశలు రేపాడు. కానీ ఇంపాక్ట్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్ కీలక వికెట్లను తీసి రాజస్తాన్‌ను దెబ్బకొట్టాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్‡్ష (సి) హెట్‌మైర్ (బి) తుషార్ 9; ప్రభ్‌సిమ్రన్ (సి) సామ్సన్ (బి) తుషార్ 21; ఒవెన్ (సి) సామ్సన్ (బి) క్వెనా మఫాక 0; నేహల్ (సి) హెట్‌మైర్ (బి) ఆకాశ్ 70; శ్రేయస్ (సి) జైస్వాల్ (బి) పరాగ్ 30; శశాంక్ (నాటౌట్) 59; అజ్మతుల్లా (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–19, 2–34, 3–34, 4–101, 5–159. బౌలింగ్: ఫజల్హక్ 3–0–39–0, తుషార్ దేశ్‌పాండే 4–0–37–2, క్వెనా మఫాక 3–0–32 –1, పరాగ్ 3–0–26–1, హసరంగ 3–0–33–0, ఆకాశ్ మధ్వాల్ 4–0–48–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ఒవెన్ (బి) హర్‌ప్రీత్ 50; వైభవ్ (సి) బార్ట్లెట్ (బి) హర్‌ప్రీత్ 40; సామ్సన్ (సి) యాన్సెన్ (బి) అజ్మతుల్లా 20; పరాగ్ (బి) హర్‌ప్రీత్ 13; జురేల్ (సి) ఒవెన్ (బి) యాన్సెన్ 53; హెట్‌మైర్ (సి) బార్ట్లెట్ (బి) అజ్మతుల్లా 11; దూబే (నాటౌట్) 7; హసరంగ (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) యాన్సెన్ 0; క్వెన మఫాక (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–76, 2–109, 3–114, 4–144, 5–181, 6–200, 7–200. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–60–0, యాన్సెన్ 3–0–41–2, బార్ట్లెట్ 1–0–12–0, హర్‌ప్రీత్ బ్రార్ 4–0–22–3, చహల్ 4–0–30–0, అజ్మతుల్లా 4–0–44–2. -
IPL 2025: ఢిల్లీపై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్-2025లో ప్లే ఆఫ్స్‌లో గుజరాత్ టైటాన్స్ అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. దీంతో తమ ఫ్లే ఆఫ్స్ బెర్త్‌ను గుజరాత్ టీమ్ ఖారారు చేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్(18 పాయింట్లు) అగ్రస్ధానంలో కొనసాగుతోంది. గుజరాత్ విజయంతో ఆర్సీబీ(17 పాయింట్లు), పంజాబ్ కింగ్స్(17 పాయింట్లు) సైతం ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించాయి. మరో స్ధానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు పోటీపడుతున్నాయి.ఓపెనర్ల విధ్వంసం..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ధేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 19 ఓవర్లలోనే ఊదిపడేసింది. గుజరాత్ ఓపెనర్లే మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. సాయిసుదర్శన్(58 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 108 నాటౌట్) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. శుబ్‌మన్ గిల్(53 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో ఒక్కరూ కనీసం వికెట్ సాధించలేకపోయారు.రాహుల్ సెంచరీ వృథా..ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు.రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. ఇక రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు. -
కేఎల్ రాహుల్ విధ్వంసం.. 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో సూపర్ సెంచరీ
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో భాగంగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్ ఆఖరి వరకు ఆజేయంగా నిలిచాడు. తొలుత ఆచితూచి ఆడిన రాహుల్.. ఐదు ఓవర్ల తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. ఈ క్రమంలో కేవలం 60 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 65 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) రాణించారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.శుబ్‌మన్ గిల్‌ను దాటేసిన రాహుల్..ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో శుబ్‌మన్ గిల్, షేన్ వాట్సన్, డేవిడ్ వార్నర్‌లను రాహుల్ అధిగమించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన లిస్ట్‌లో రాహుల్(5) నాలుగో స్దానంలో నిలిచాడు. అగ్రస్ధానంలో విరాట్ కోహ్లి(8) కొనసాగుతున్నాడు.ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే..8: విరాట్ కోహ్లీ7: జోస్ బట్లర్6: క్రిస్ గేల్5: కెఎల్ రాహుల్4: శుభ్‌మన్ గిల్4: షేన్ వాట్సన్4: డేవిడ్ వార్నర్ -
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8,000 పరుగులు మైలు రాయిని అందుకున్న భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2025లో ఢిల్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ రికార్డును రాహుల్ సాధించాడు. రాహుల్ 224 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి 243 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగుల మైలు స్టోన్‌ను అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో కోహ్లి రికార్డును కేఎల్ బ్రేక్ చేశాడు.ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం (213 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్ధానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం(218) కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా కేఎల్ రాహుల్, కోహ్లి, పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (244) ఉన్నారు.రాహుల్ సూపర్ సెంచరీ..ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు. రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. రాహుల్ అద్బుత ఇన్నింగ్స్ ఫలితంగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: రాజస్తాన్‌పై విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్ -
రాజస్తాన్‌పై విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్(17 పాయింట్లు) రెండో స్ధానానికి చేరుకుంది. ఈ ఏడాది సీజన్లో శ్రేయస్ టీమ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. రెండింటిలో ఓ మ్యాచ్‌లో విజయం సాధించినా చాలు పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది.వధేరా, శశాంక్ మెరుపులుఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బ్యాటర్లలో నేహాల్ వధేరా( 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70), శశాంక్ సింగ్(30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(30), ఓమర్జాయ్(21), ప్రభుసిమ్రాన్ సింగ్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే రెండు, మఫాక, పరాగ్, మధ్వాల్ తలా వికెట్ సాధించారు.ఆరంభం వచ్చినా..అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేయగల్గింది. లక్ష్య చేధనలో రాజస్తాన్ ఓపెనర్లు(50), వైభవ్ సూర్యవంశీ(40) అద్బుతమైన ఆరంభం ఆందించారు.తొలి వికెట్‌కు 76 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత ధ్రువ్‌జురెల్(53) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. పంజాబ్ బౌలర్లలో హార్ప్రీత్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్, ఒమర్జాయ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: 'ధోనీకి మాత్రమే రియల్ ఫ్యాన్స్.. మిగిలినందరికీ ఉన్నది పెయిడ్ ఫ్యాన్సే' -
ఓపెనర్లే కొట్టేశారు.. ఢిల్లీని చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్
IPL 2025 DC vs GT Live Updates: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి.ప్లే ఆఫ్స్‌కు గుజరాత్..అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ వికెట్ నష్టపోకుండా 19 ఓవర్లలో ఛేదించింది. గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్(61 బంతుల్లో 108) సూపర్ సెంచరీతో చెలరేగగా.. శుబ్‌మన్ గిల్(53 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో గుజరాత్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.విజయం దిశగా గుజరాత్గుజరాత్ టైటాన్స్ విజయం దిశగా దూసుకెళ్తోంది. 16 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 165 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(87), శుబ్‌మన్ గిల్(74) ఉన్నారు.శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ..200 పరుగుల లక్ష్య చేధనలో గుజరాత్ టైటాన్స్ అద్బుతంగా ఆడుతోంది. 13 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 134 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్(59), సాయిసుదర్శన్(72) హాఫ్ సెంచరీలతో తమ బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నారు.7 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 63/07 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(46), శుబ్‌మన్ గిల్(17) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న గుజరాత్200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(25), శుబ్‌మన్ గిల్(6) ఉన్నారు.కేఎల్ రాహుల్ సెంచరీ.. గుజరాత్ ముందు భారీ లక్ష్యంఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు. రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. ఇక రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.ఢిల్లీ రెండో వికెట్ డౌన్అభిషేక్ పోరెల్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన పోరెల్.. సాయికిషోర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.కేఎల్ రాహుల్ ఫిప్టీ..అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ సాధించాడు. 65 పరుగులతో రాహుల్ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది.6 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 44/16 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(36), అభిషేక్ పోరెల్(1) ఉన్నారు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్..ఫాఫ్ డుప్లెసిస్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన డుప్లెసిస్.. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆచితూచి ఆడుతున్న ఢిల్లీ ఓపెనర్లు..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిలకడగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 14పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(9), ఫాఫ్ డుప్లెసిస్(3) ఉన్నారు.ఐపీఎల్-2025లో కీలక పోరుకు సమయం అసన్నమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లుగుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: ఫాఫ్ డు ప్లెసిస్ , అభిషేక్ పోరెల్, సమీర్ రిజ్వీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, టి నటరాజన్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్ -
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ముంబై రికార్డు బద్దలు
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు మరోసారి చెలరేగారు. జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌టో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరంభంలో 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్ ఆ తర్వాత తిరిగి పుంజుకుంది. రాజస్తాన్ బౌలర్లపై పంజాబ్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. పంజాబ్ బ్యాటర్లలో నేహాల్ వధేరా( 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శశాంక్ సింగ్(30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(30), ఓమర్జాయ్(21), ప్రభుసిమ్రాన్ సింగ్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో అత్యధిక ఐపీఎల్ స్కోర్ సాధించిన జట్టుగా పంజాబ్ నిలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉండేది. ఈ వేదికపై గతంలో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 2 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో ముంబై రికార్డును శ్రేయస్ సేన బ్రేక్ చేసింది.అదేవిధంగా ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్ నంబర్ 4 నుంచి నంబర్ 7 వరకు మొత్తం కలిపి అత్యధిక పరుగులు చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు నంబర్ 4 నుంచి నంబర్ 7 వరకు కలిపి మొత్తంగా 180 పరుగులు చేశారు. ఇంతకుముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్(174) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ముంబైని పంజాబ్ అధిగమించింది.చదవండి: 'ధోనీకి మాత్రమే రియల్ ఫ్యాన్స్.. మిగిలినందరికీ ఉన్నది పెయిడ్ ఫ్యాన్సే' -
'ధోనీకి మాత్రమే రియల్ ఫ్యాన్స్.. మిగిలినందరికీ ఉన్నది పెయిడ్ ఫ్యాన్సే'
క్రికెటర్ల ఫ్యాన్ బేస్‌పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోనికి మాత్రమే నిజమైన అభిమానులు ఉన్నారని, మిగతా క్రికెటర్లందరికి ఉన్నది పెయిడ్ ఫ్యాన్సేనని భజ్జీ వివాదస్పద కామెంట్స్ చేశాడు.ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్-2025 తర్వాత ధోనికి రిటైర్ అయ్యే ఆలోచన లేదని ఇప్పటికే తన నిర్ణయాన్ని సీఎస్కే యాజమాన్యానికి తెలియజేశాడని శనివారం వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే హర్భజన్ తన మనసులోని మాటను బయటపెట్టాడు."ఎంఎస్ ధోని తను ఎప్పటివరకు ఆడాలనుకుంటే అప్పటి వరకు ఐపీఎల్లో కొనసాగుతాడు. ఒకవేళ సీఎస్కే యాజమాని నేనే అయితే ధోని విషయంలో వేరే నిర్ణయం తీసుకునేవాడిని. నా వరకు అయితే.. ధోనికి ఒక్కడికే అసలైన అభిమానులు ఉన్నారు. మిగిలిన క్రికెటర్లందరికి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉన్నారు. అందులో కూడా కొంతమంది పెయిడ్ ఫ్యాన్సే. వారి గురించి మాట్లాడటం అనవసరం. అటువంటి వారి మాట్లాడితే ఈ చర్చ పక్కదారి పడుతుంది" అని హార్భజన్ క్రిక్‌బజ్ షోలో పేర్కొన్నాడు.ఈ క్రమంలో హార్భజన్ అనుచిత వ్యాఖ్యలపై విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ధోనిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఎంఎస్ ధోని దేశద్రోహి అంటూ ఎక్స్‌లో ప్రచారం చేస్తున్నారు. "SHAME ON DESHDROHI DHONI" అనే కీవర్డ్ ఎక్స్‌లో ట్రెండ్ అవుతోంది.చదవండి: IPL 2025: అంత అన్నారు.. ఇంత అన్నారు! ఆఖరికి అరంగేట్రంలోనే డకౌట్ -
వధేరా, శశాంక్ మెరుపులు.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2025లో జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరంభంలోనే ఇన్ ఫామ్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య(9) వికెట్ కోల్పోయినప్పటికి.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఒక మిచెల్ ఓవెన్ తప్ప మిగితా అందరూ తమ పని తాము చేసుకుపోయారు.పంజాబ్ బ్యాటర్లలో నేహాల్ వధేరా( 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70), శశాంక్ సింగ్(30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(30), ఓమర్జాయ్(21), ప్రభుసిమ్రాన్ సింగ్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే రెండు, మఫాక, పరాగ్, మధ్వాల్ తలా వికెట్ సాధించారు.తుది జట్లు..రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ మధ్వల్, ఫజల్హాక్ ఫరూఖీ, క్వేనా మఫాకా.ఇంపాక్ట్ సబ్స్: కుమార్ కార్తికేయ, శుభమ్ దూబే, అశోక్ శర్మ, కునాల్ సింగ్ రాథోడ్, యుధ్వీర్ సింగ్ చరక్పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, మిచ్ ఓవెన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, జేవియర్ బార్ట్లెట్.ఇంపాక్ట్ సబ్స్: విజయ్‌కుమార్ వైషాక్, హర్‌ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్ -
అంత అన్నారు.. ఇంత అన్నారు! ఆఖరికి అరంగేట్రంలోనే డకౌట్
ఆస్ట్రేలియా యవ ఆల్‌రౌండర్ మిచెల్ ఓవెన్ తన ఐపీఎల్ కెరీర్‌ను పేలవంగా ఆరంభించాడు. ఐపీఎల్-2025లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఓవెన్ అరంగేట్రం చేశాడు. అయితే తన తొలి మ్యాచ్‌లో మిచెల్ తీవ్ర నిరాశపరిచాడు.కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని ఖాతా తెరవకుండానే మిచెల్ పెవిలియన్‌కు చేరాడు. రాజస్తాన్ యువ పేసర్ క్వేనా మఫాకా బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి ఓవెన్ పెవిలియన్‌కు చేరాడు. కాగా మరో ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ స్ధానంలో పంజాబ్ జట్టులోకి ఓవెన్ వచ్చాడు.ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు మాక్సీ గాయం కారణంగా దూరం కావడంతో.. మిచెల్ ఓవెన్ రూ.3 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. పంజాబ్ ఈ యువ ఆటగాడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఓవెన్ మాత్రం తన మొదటి మ్యాచ్‌లోనే తుస్సుమన్పించాడు.అంతకంటే ముందు మాక్స్వెల్ సైతం ఇదే తరహా ప్రదర్శన కనబరిచాడు. ఇప్పుడు మాక్సీ స్థానంలో వచ్చిన ఓవెన్ కూడా అదే తీరును కనబరిస్తున్నాడు. అరంగేట్రంలోనే డౌకటైన ఓవెన్‌ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. మరో మాక్స్వెల్ జట్టులోకి వచ్చాడని వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. కాగా ఓవెన్‌కు మాత్రం టీ20ల్లో మెరుగైన రికార్డు ఉంది.ఈ టాస్మానియా ఆల్‌రౌండర్ ఇప్పటివరకు 35 టీ20 మ్యాచ్‌లు ఆడి 646 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు ఉండగా.. అత్యధిక స్కోరు 108. ఓవెన్ ఖాతాలో పది టీ20 వికెట్లు కూడా ఉన్నాయి. పంజాబ్ జట్టులో చేరకముందు ఓవెన్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ నుంచి ఆఫర్ రావడంతో పీఎస్ఎల్ మధ్యలోనే అతడు వైదొలిగాడు.Kwena Maphaka gets Mitchell Owen 0(2). ☝️Not a good start for Owen in the IPL. pic.twitter.com/XJtfKQtJpf— Rishabh Singh Parmar (@irishabhparmar) May 18, 2025 -
IPL 2025: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్.. తుది జట్లు ఇవే..!
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 18) మధ్యాహ్నం సువాయ్ మాన్సింగ్ స్టేడియంలో (జైపూర్) జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా శాంసన్ గత కొన్ని మ్యాచ్‌లుగా దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్ కోసం రాయల్స్ రెండు మార్పులు చేసింది. గాయపడ్డ నితీశ్ రాణా స్థానంలో సంజూ శాంసన్.. జోఫ్రా ఆర్చర్ స్థానంలో క్వేనా మపాకా తుది జట్టులోకి వచ్చారు. పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు మూడు మార్పులు చేసింది. మిచెల్ ఓవెన్, మార్కో జన్సెన్, ఒమర్జాయ్ తుది జట్టులోకి వచ్చారు. కాగా, ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ ఆ జట్టుకు నామమాత్రమే. మరోవైపు పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసులో ముందువరుసలో ఉంది. ఆ జట్లు ఈ మ్యాచ్ గెలిస్తే, ప్లే ఆఫ్స్ రేసులో ముందుకెళ్తుంది.తుది జట్లు..రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(c), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(wk), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ మధ్వల్, ఫజల్హాక్ ఫరూఖీ, క్వేనా మఫాకా.ఇంపాక్ట్ సబ్స్: కుమార్ కార్తికేయ, శుభమ్ దూబే, అశోక్ శర్మ, కునాల్ సింగ్ రాథోడ్, యుధ్వీర్ సింగ్ చరక్పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (WK), ప్రియాంష్ ఆర్య, మిచ్ ఓవెన్, శ్రేయాస్ అయ్యర్ (c), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, జేవియర్ బార్ట్లెట్.ఇంపాక్ట్ సబ్స్: విజయ్‌కుమార్ వైషాక్, హర్‌ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్ -
IPL 2025: ప్రమాదంలో విరాట్ పేరిట ఉన్న భారీ రికార్డు
ఐపీఎల్ పునఃప్రారంభం తర్వాత ఇవాళ (మే 18) రాత్రి జరుగబోయే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లో రికార్డుల రారాజు, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ భారీ టీ20 రికార్డు బద్దలయ్యే ప్రమాదముంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 33 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా విరాట్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాడు. విరాట్‌కు ఈ ఘనత సాధించేందుకు 243 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. రాహుల్‌కు 214వ ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ వచ్చింది. నేటి మ్యాచ్‌లో రాహుల్ 8000 పరుగులు పూర్తి చేస్తే, విరాట్ రికార్డుతో పాటు మరో రికార్డు కూడా సొంతమవుతుంది. యావత్ టీ20ల్లో అతి తక్కువ 8000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా రాహుల్ రికార్డుల్లోకెక్కుతాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన ఘనత విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 213 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..క్రిస్ గేల్- 213 ఇన్నింగ్స్లుబాబర్ ఆజమ్- 218 ఇన్నింగ్స్లుకాగా, ఈ సీజన్లో రాహుల్ వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేసినప్పటికీ పర్వాలేదనిపించాడు. ఈ సీజన్లో రాహుల్ ఓసారి ఓపెనింగ్, రెండు మ్యాచ్‌ల్లో మూడో స్థానం, ఏడు మ్యాచ్‌ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి 47.63 సగటున, 142.63 స్ట్రయిక్‌రేట్‌తో 381 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో రాహుల్ 10వ స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే నేడు గుజరాత్‌తో జరుగబోయే మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అత్యంత కీలకం. ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో (ఓ మ్యాచ్ రద్దైంది) 13 పాయింట్లు సాధించిన ఢిల్లీ పట్టికలో ఐదు స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం రెండు గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఇవాళ గుజరాత్‌ను ఢీకొట్టబోయే ఢిల్లీ.. ఆతర్వాతి మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ (మే 21), పంజాబ్ కింగ్స్‌తో (మే 24) తలపడాల్సి ఉంది. నేటి మ్యాచ్‌లో ఓడినా ప్లే ఆఫ్స్ రేసులో ఉండే ఢిల్లీ.. తదుపరి ముంబై, పంజాబ్‌తో జరుగబోయే మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది. -
IPL 2025 Update: ఆ విండీస్ బ్యాటర్‌కు ప్రత్యామ్నాయంగా సన్‌రైజర్స్ బౌలర్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో తమ ప్రస్తానాన్ని ముగించిన డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ తాజాగా ఓ అప్డేట్తో ముందుకొచ్చింది. లీగ్ పునఃప్రారంభం తర్వాత తిరిగి రాని విండీస్ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్‌కు (గాయం) ప్రత్యామ్నాయంగా మధ్యప్రదేశ్ మిస్టరీ స్పిన్నర్ శివమ్ శుక్లాను ఎంపిక చేసుకుంది. శుక్లా ఈ సీజన్లో కేకేఆర్ ఆడబోయే చివరి మ్యాచ్‌కు (మే 25న సన్‌రైజర్స్‌తో) అందుబాటులో ఉంటాడు. 29 ఏళ్ల శివమ్ శక్లా ఈ సీజన్లో సన్‌రైజర్స్ నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. 🚨 The mystery spinner from MP is a Knight now! Shivam Shukla replaces Rovman Powell for the remainder of the #TATAIPL2025 pic.twitter.com/usUoOnFzLG— KolkataKnightRiders (@KKRiders) May 18, 2025అక్కడ అతను ముత్తయ్య మురళీథరన్ ఆథ్వర్యంలో రాటు దేలాడు. కేకేఆర్.. సన్‌రైజర్స్‌తో ఆడబోయే తమ చివరి మ్యాచ్ కోసం వారి అస్త్రాన్నే (శివమ్ శుక్లా) ప్రయోగించనుంది. కుడి చేతి వాటం లెగ్ స్పిన్ బౌలర్ అయిన శుక్లా ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ టీ20 లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. శుక్లా సన్‌రైజర్స్ ప్రాక్టీస్ సెషన్స్‌లో అభిషేక్ శర్మ వికెట్ తీసి ప్రాచుర్యంలోకి వచ్చాడు. తదుపరి సీజన్ దృష్ట్యా కేకేఆర్ శుక్లాను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది.Shivam Shukla the mystery spinner who plays for MP in domestic under Rajat’s Captaincy. SRH picked him as Net bowler as he took Abhishek’s wicket in 1st over in practice game.Kudos to RCB’s scouting 🙏 https://t.co/artzL8rOPP pic.twitter.com/0l2hBdqUaR— Fearless🦁 (@ViratTheLegend) March 19, 2025ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 పునఃప్రారంభం తర్వాత నిన్న (మే 17) జరగాల్సిన ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించగా.. ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో ఆరు జట్లు (ఆర్సీబీ (17), గుజరాత్ (16), పంజాబ్ (15), ముంబై (14), ఢిల్లీ (13), లక్నో (10)) మాత్రమే మిగిలాయి. సీఎస్కే, రాజస్థాన్, సన్‌రైజర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.ఇవాల్టి మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఆదివారం (మే 18) ఐపీఎల్ 2025లో డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. సువాయ్ మాన్సింగ్ స్టేడియం (జైపూర్) వేదికగా మధ్యాహ్నం జరగాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్, పంజాబ్ తలపడనున్నాయి. రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. -
IPL 2025: ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ రద్దు.. రికార్డుల్లోకెక్కిన బెంగళూరు స్టేడియం
ఐపీఎల్ 2025 పునఃప్రారంభంలో జరగాల్సిన ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ (మే 17) వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచి భారీ కురుస్తుండటంతో టాస్ కూడా సాధ్యం కాలేదు. రాత్రి 10:30 గంటల సమయంలో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించగా.. ఆర్సీబీ టేబుల్ టాపర్‌గా, కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. కేకేఆర్ నిష్క్రమణతో ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో ఆరు జట్లు (ఆర్సీబీ (17), గుజరాత్ (16), పంజాబ్ (15), ముంబై (14), ఢిల్లీ (13), లక్నో (10)) మాత్రమే మిగిలాయి. సీఎస్కే, రాజస్థాన్, సన్‌రైజర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన జట్లు.ఆర్సీబీ-కేకేఆర్ మధ్య మ్యాచ్ రద్దు కావడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం రికార్డుల్లోకెక్కింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు రద్దైన స్టేడియంగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐదు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి (ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్‌తో కలుపుకుని). ఐపీఎల్ చరిత్రలో ఇన్ని మ్యాచ్‌లు ఏ వేదికపై రద్దు కాలేదు.ఐపీఎల్లో మ్యాచ్‌లు రద్దైన స్టేడియాలు (టాప్-5) చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు)-5అరుణ్ జైట్లీ స్టేడియం (ఢిల్లీ)- 1ఎకానా స్టేడియం (లక్నో)- 1బర్సపరా స్టేడియం (గౌహతి)- 1ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా)- 1రాజీవ్ గాంధీ స్టేడియం (హైదరాబాద్)- 1ఇవాల్టి మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఆదివారం (మే 18) ఐపీఎల్ 2025లో డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. సువాయ్ మాన్సింగ్ స్టేడియం (జైపూర్) వేదికగా మధ్యాహ్నం జరగాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్, పంజాబ్ తలపడనున్నాయి. రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. -
ఢిల్లీ క్యాపిటల్స్ కోలుకునేనా!
న్యూఢిల్లీ: ఐపీఎల్–2025ను ఢిల్లీ క్యాపిటల్స్ ఘనంగా ప్రారంభించింది. తొలి 4 మ్యాచ్‌లలో వరుస విజయాలు సాధించి జోరు ప్రదర్శించింది. అయితే తర్వాత జట్టు ఫామ్ ఒక్కసారిగా తిరోగమించింది. తర్వాత 7 మ్యాచ్‌లలో ఢిల్లీ కేవలం 2 మాత్రమే గెలవగలిగింది. హైదరాబాద్‌లో జరిగిన తమ చివరి పోరులో కూడా క్యాపిటల్స్ 133 పరుగులకే పరిమితమై ఓటమికి బాటలు వేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ వర్షంతో ఆ మ్యాచ్ రద్దు కావడంతో ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు మిగిలిన 3 మ్యాచ్‌లలో గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా ‘ప్లే ఆఫ్స్’కు చేరుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ నిలకడకు మారుపేరులా ఆడుతూ ముందంజ వేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉన్న ఆ టీమ్ మరో మ్యాచ్ గెలిస్తే చాలు అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లోనే దానిని అందుకోవాలని గిల్ బృందం భావిస్తోంది. ముస్తఫిజుర్ దూరం... ఐపీఎల్ కొత్త షెడ్యూల్ కారణంగా ఢిల్లీ ప్రణాళికలు కూడా మారాయి. కీలక సమయంలో జట్టును గెలిపించే సత్తా ఉన్న ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ ఆ్రస్టేలియాకు వెళ్లిపోయాడు. అతని స్థానంలో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తఫిజుర్‌ను ఢిల్లీ ఎంచుకుంది. అయితే శనివారం షార్జాలో టి20 మ్యాచ్ ఆడిన అతను తిరిగి వచ్చి ఈ మ్యాచ్ బరిలోకి దిగే అవకాశం లేదు. దాంతో తుది జట్టులో ముగ్గురు విదేశీయులే ఉండనున్నారు. డుప్లెసిస్, స్టబ్స్ పునరాగమనంతో జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తుండగా, పేసర్ చమీరా కూడా ఆడనున్నాడు. అయితే జట్టు విజయావకాశాలు భారత ఆటగాళ్లు పొరేల్, కరుణ్ నాయర్, రాహుల్, కెప్టెన్ అక్షర్ ప్రదర్శనపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. విప్రాజ్, అశుతోష్ మిడిలార్డ్‌లో చెలరేగాల్సి ఉండగా... కుల్దీప్ యాదవ్ ఎప్పటిలాగే తన పదును చూపిస్తే ప్రత్యర్థిని కట్టిపడేయవచ్చు. మార్పుల్లేకుండా... టోర్నీ వాయిదా తర్వాత ఎలాంటి ఇబ్బందీ లేకుండా దాదాపు అదే ప్రధాన ఆటగాళ్లతో జట్టును సిద్ధం చేసుకోవడంలో గుజరాత్ సఫలం కావడం విశేషం. మరో మ్యాచ్ గెలిస్తే ముందంజ వేసే టీమ్ మరో రెండు కూడా నెగ్గి టాప్ స్థానంపై గురి పెట్టింది. లీగ్ దశ వరకు బట్లర్, రూథర్‌ఫర్డ్, రబడ, కొయెట్జీ అందుబాటులో ఉంటుండటంతో టైటాన్స్ మేనేజ్మెంట్ ధీమాగా ఉంది. ఓపెనర్లు గిల్, సుదర్శన్ అందిస్తున్న చక్కటి ఆరంభాలు జట్టును ముందంజలో నిలిపాయి. ఆ తర్వాత బట్లర్ మిగిలిన పని పూర్తి చేస్తున్నాడు. సీజన్లో 500 పరుగులు దాటిన టాప్–5లో ముగ్గురు టైటాన్స్ సుదర్శన్, గిల్, బట్లర్ ఉండటం విశేషం. షారుఖ్, తెవాటియా చివర్లో అదనపు పరుగులు జోడించగలరు. ముగ్గురు పేసర్లు ప్రసిధ్, సిరాజ్, అర్షద్ చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తుండగా... స్పిన్నర్లు సాయికిషోర్, రషీద్ ఖాన్ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. బలాబలాలపరంగా చూస్తే టైటాన్స్‌దే పైచేయిగా కనిపిస్తోంది. -
‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా పంజాబ్ కింగ్స్
జైపూర్: ఐపీఎల్లో అనూహ్యంగా ఆగిపోయిన తమ ప్రస్థానాన్ని మళ్లీ మొదలు పెట్టేందుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. మే 9న ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా శుభారంభం చేసిన తర్వాత మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో పంజాబ్ గెలుపు అవకాశం చేజార్చుకుంది. ఇప్పుడు లీగ్‌లో బలహీన జట్టుపై గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు మరింత చేరువ కావాలని జట్టు భావిస్తోంది. నేడు జరిగే పోరులో రాజస్తాన్ రాయల్స్‌తో పంజాబ్ తలపడుతుంది. ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు ఇప్పటికే కోల్పోయిన రాజస్తాన్ లీగ్‌లో చివరి స్థానంలో నిలవకుండా ఉండాలని కోరుకుంటోంది. తొలిసారి మిచ్ ఓవెన్... ఐపీఎల్ వాయిదా పడటంతో పంజాబ్ ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోయింది. ఆసీస్ ఆటగాళ్లు స్టొయినిస్, ఇన్‌గ్లిస్ తిరిగి రావడానికి విముఖత చూపారు. దాంతో ఇప్పుడు తప్పనిసరి స్థితిలో తుది జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మ్యాక్స్‌వెల్ గాయంతో తప్పుకోవడంతో జట్టులోకి వచ్చిన మిచెల్ ఒవెన్ తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగడం ఖాయమైంది. విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఒవెన్ గత ఏడాది బిగ్‌బాష్ లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు హోబర్ట్ హరికేన్స్ టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే టాపార్డర్ బ్యాటర్ అయిన ఒవెన్... ప్రస్తుతం పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్‡్ష ఆర్య అద్భుతంగా ఆడుతుండటంతో మిడిలార్డర్లో ఆడాల్సి రావచ్చు. బౌలింగ్‌ను పటిష్టపర్చుకోవడంలో భాగంగా కివీస్ పేసర్ కైల్ జేమీసన్‌ను పంజాబ్ ఆడించే అవకాశం ఉంది. శ్రేయస్, వధేరా, శశాంక్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. చహల్, అర్‡్షదీప్ ఫామ్‌లో ఉండటంతో పాటు మార్కో యాన్సెన్ కూడా మెరుగ్గా రాణిస్తుండటం పంజాబ్‌కు సానుకూలాంశం. బరిలోకి సంజు సామ్సన్... రాజస్తాన్ పేలవ ఆటతో చాలా ముందే ప్లే ఆఫ్స్ అవకాశాలు చేజార్చుకుంది. జట్టు 12 మ్యాచ్‌లలో 3 మ్యాచ్‌లే గెలిచింది. మిగిలిన మ్యాచ్‌లలోనైనా రాణించి పరువు కాపాడుకోవాలని టీమ్ భావిస్తోంది. నెల రోజుల క్రితం తన ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన సంజు సామ్సన్ కోలుకొని ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా రాణిస్తుండటంతో అతను మూడో స్థానంలో ఆడతాడు. పరాగ్, జురేల్ కూడా రాణిస్తే రాయల్స్ మెరుగైన స్థితిలో నిలుస్తుంది. విదేశీ ఆటగాళ్లు హెట్‌మైర్, హసరంగ, తీక్షణ జట్టుతో చేరారు. అయితే టోర్నీ ఆరంభంనుంచి చాలా బలహీనంగా ఉన్న రాజస్తాన్ పేస్ బృందం ఆర్చర్, సందీప్ శర్మ దూరం కావడంతో ఇప్పుడు మరింత బలహీనంగా మారింది. తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ మధ్వాల్, నాండ్రే బర్గర్ పంజాబ్ బ్యాటర్లను ఎలా నిలువరిస్తారో చూడాలి. -
ఆర్సీబీతో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి కేకేఆర్ ఔట్
ఐపీఎల్-2025 పున ప్రారంభానికి వరుణుడు ఆటంకం కలిగించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో టాస్ పడకుండానే మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. ప్లే ఆఫ్స్ రేసులో కేకేఆర్ నిలవాలంటే ఆర్సీబీపై కచ్చితంగా గెలవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్ రద్దు కావడంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి కోల్‌కతా నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 12 పాయింట్లతో టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. మరోవైపు ఆర్సీబీ ఖాతాలో ఒక్క పాయింట్ చేరింది. ఆర్సీబీ 17 పాయింట్లతో అగ్రస్ధానానికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ చెరేందుకు బెంగళూరు జట్టు అడుగు దూరంలో నిలిచింది. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఒక దాంట్లో గెలిచినా చాలు ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది. ఒకవేళ ఓడినా కూడా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశముంటుంది. అయితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. -
ఆర్సీబీ ఫైనల్‌కు వెళ్తే భారత్‌కు వస్తా: ఏబీ డివిలియర్స్
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. గత రెండు మూడు సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది మాత్రం ఆర్సీబీ అందరి అంచనాలకు భిన్నంగా వరుస విజయాలతో దూసుకుపోతుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పాటిదార్ సేన దుమ్ములేపుతోంది.బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, పాటిదార్ చెలరేగుతుంటే.. బౌలింగ్‌లో జోష్ హాజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా,భువనేశ్వర్ కుమార్ వంటి వారు అదరగొడుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరు జట్టు ఫ్లే ఆఫ్స్‌కు చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీకి ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఒక మ్యాచ్‌లో గెలిచినా చాలు ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, ఆర్సీబీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర ప్రకటన చేశాడు. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ ఫైనల్స్‌కు చేరుకుంటే తను ఆ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు భారత్‌కు వస్తానని డివిలియర్స్ వాగ్ధానం చేశాడు."ఆర్సీబీ ఫైనల్‌కు చేరుకుంటే, నేను ఆ స్టేడియంలో కచ్చితంగా ఉంటాను. విరాట్ కోహ్లితో కలిసి ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడం కంటే నాకు గొప్ప అనుభూతి అంటూ మరొకటి ఉండదు. ఆర్సీబీ చాలా ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ కోసం ప్రయత్నిస్తోంది" అంటూ డివిలియర్స్ ఓ వీడియో రిలీజ్ చేశాడు.కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఏబీ డివిలియర్స్.. 2011లో ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ జట్టులో చేరాడు. ఆ తర్వాత రిటైర్ అయ్యే వరకు 11 సీజన్ల పాటు ఈ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. విరాట్ కోహ్లికి, ఏబీడీకి మంచి స్నేహ బంధం ఉంది.చదవండి: టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే: సునీల్ గవాస్కర్ -
ఇది ‘ఇండియన్’ ప్రీమియర్ లీగ్: ఫారన్ ప్లేయర్లకు శ్రేయస్ కౌంటర్?
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్-2025 సీజన్ తిరిగి శనివారం నుంచి ప్రారంభం కానుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్ సీజన్ రీ స్టార్ట్ కానుంది. అయితే ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు చాలా మంది విదేశీ ఆటగాళ్లు దూరమయ్యారు. ఈ ఏడాది సీజన్ వారం రోజుల పాటు వాయిదా పడడంతో ఫారన్ ప్లేయర్లు తమ స్వదేశాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో స్వదేశానికి వెళ్లిపోయిన ఆటగాళ్లలో కొంత మంది తిరిగి భారత్‌కు రావడానికి నిరాకరించారు. కొంతమంది జాతీయ విధుల కారణంగా దూరంగా ఉంటే, మరి కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్లో పాల్గోనేందుకు తిరిగి రాలేదు.సౌతాఫ్రికాకు చెందిన ఆటగాళ్లు భారత్‌కు వచ్చినప్పటికి ప్లే ఆఫ్స్‌కు మాత్రం అందుబాటులో ఉండేది అనుమానమే. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఆ వీడియోలో ఏముందంటే?ఐపీఎల్-2025 సెకెండ్ లెగ్ కోసం జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, జోష్ హేజిల్‌వుడ్, మార్కో జాన్సెన్ వంటి ఆటగాళ్లు తిరిగి వస్తారా? లేదా అని ఇద్దరు వ్యక్తులు సీరియస్‌గా చర్చించుకుంటారు. ఆ సమయంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జోక్యం చేసుకుని.. "మీరు మాట్లాడుకుంటున్న వాళ్లంతా నిజంగా టాలెంటెడ్ క్రికెటర్లే.కానీ ఇది 'ఇండియన్' ప్రీమియర్ లీగ్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఐపీఎల్ కొనసాగడానికి ఫారన్ ప్లేయర్స్ వస్తానే కాదు, ఇండియన్ ప్లేయర్స్ ఉంటే చాలు అని ఉద్దేశంతో అయ్యర్ అన్నాడు.Yatra pratibha avsara prapnotihi! ❤️ pic.twitter.com/UBRjCs8Bua— Punjab Kings (@PunjabKingsIPL) May 17, 2025 -
ఆగని వర్షం.. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ రద్దు
IPL 2025 RCB vs KKR Live Updates: ఆగని వర్షం.. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ రద్దుఐపీఎల్-2025 పున:ప్రారంభంలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో టాస్ పడకుండానే మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.👉బెంగళూరు వర్షం ఇంకా కురుస్తోంది. ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెసింగ్ రూమ్‌కే పరిమితమయ్యారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఆట సాధ్యపడేలా లేదు.👉బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద వర్షం ఇంకా కురుస్తోంది. దీంతో టాస్ మరింత ఆలస్యం కానుంది.👉ఐపీఎల్-2025 పున:ప్రారంభానికి వరుణడు ఆడ్డంకిగా నిలిచాడు. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. మైదానం మొత్తాన్ని కవర్లతో సిబ్బంది కప్పి ఉంచారు. దీంతో ఈ మ్యాచ్ టాస్ ఆలస్యం కానుంది. కాగా చిన్నస్వామి స్టేడియంలో అద్బుతమైన డ్రైనజీ వ్యవస్ద ఉండంతో వర్షం తగ్గిన వెంటనే మైదానాన్ని సిద్దం చేసే అవకాశముంది. -
IPL 2025: ఐపీఎల్ రీస్టార్ట్.. కేఎల్ రాహుల్‌కు ప్రమోషన్?
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్-2025 సీజన్ తిరిగి ప్రారంభానికి సిద్దమైంది. శనివారం(మే 17) చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ ఏడాది సీజన్ పునఃప్రారంభం కానుంది.ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ మెనెజ్‌మెంట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో అగ్రస్థానానికి ప్రమోట్ చేయాలని ఢిల్లీ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇంకా మూడు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఢిల్లీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 13 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది. ఈ మూడు మ్యాచ్‌లలో అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు విజయం సాధిస్తే.. ఎటువంటి సమీకరాణాలు లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది. ఈ క్రమంలో రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలని హెడ్ కోచ్ హేమంగ్ బదాని, మెంటార్ కెవిన్ పీటర్సన్ నిర్ణయం తీసుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను రాహుల్ ప్రారంభించే అవకాశముంది. ఈ ఏడాది సీజన్లో రాహుల్ 10 మ్యాచ్‌లలో ఆడాడు. కేవలం ఒక్క మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్.. రెండు సార్లు మూడో స్ధానంలో, మిగిలిన మ్యాచ్‌లలో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆరంభ మ్యాచ్‌లలో ఢిల్లీ ఇన్నింగ్స్‌ను జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్, డుప్లెసిస్ ప్రారంభించారు. ఆ తర్వాత ఫ్రెజర్ మెక్ గర్క్‌ను పేలవ ఫామ్ కారణంగా ఢిల్లీ మెనెజ్‌మెంట్ పక్కన పెట్టింది. దీంతో అతడి స్ధానంలో అభిషేక్ పోరెల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయితే డుప్లెసిస్ గాయం బారిన పడడంతో కరుణ్ నాయర్ కూడా ఓపెనర్‌గా వచ్చాడు. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీకి ఓపెనర్లు మాత్రం మంచి ఆరంభాన్ని అందించలేకపోయారు. ఇప్పుడు రాహులైనా ఢిల్లీకి మంచి ఆరంభాలను అందిస్తాడో లేదో వేచి చూడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో మే 18న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. -
కోహ్లి జీవితంలో అన్నీ ఉన్నాయి.. అదొక్కటే లోటు: సురేశ్ రైనా
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)ని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ‘రన్‌మెషీన్’ తన వృత్తిగత జీవితంలో అన్నీ సాధించేశాడని.. అయితే, పదిహేడేళ్లుగా ఓ లోటు మాత్రం అలాగే మిగిలిపోయిందన్నాడు. ఇంతకీ అదేమిటంటే..!?కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి కోహ్లి.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ విషయంలోనూ రోహిత్‌నే అనుసరించాడు.రోహిత్ సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వారంలోపే తానూ టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్లు కోహ్లి వెల్లడించాడు. ఇక ఇప్పటికే ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్ లీగ్ ఐపీఎల్లో కొనసాగుతున్న వీరిద్దరు.. భారత్ తరఫున వన్డేల్లోనూ కొనసాగనున్నారు.ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌కాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచాడు. అంతకు ముందు దక్కన్ చార్జర్స్ ఆటగాడిగానూ ట్రోఫీ గెలిచిన జట్టులో భాగమయ్యాడు. అయితే, క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచీ అంటే 2008 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తోనే ఉన్న కోహ్లికి ఇంత వరకు ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.చిరకాల కల నెరవేరేనా?ఈసారి మాత్రం కోహ్లి చిరకాల కల నిజమయ్యేలా కనిపిస్తోంది. ఐపీఎల్-2025లో వరుస విజయాలతో జోరు మీదున్న పాటిదార్ సేన చాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్లుగానే ఆర్సీబీ ఈసారి ఇప్పటికే పదకొండు మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.ఇక ఐపీఎల్-2025 పునఃప్రారంభం నేపథ్యంలో శనివారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే కోహ్లి మైదానంలో దిగబోతున్నాడు.కోహ్లి జీవితంలో అన్నీ ఉన్నాయి.. అదొక్కటే లోటుఒకవేళ ఆర్సీబీ గనుక ఈసారి ట్రోఫీ గెలిస్తే అతడి సంతోషానికి అవధులు ఉండవు. ఆర్సీబీకి వెన్నెముక, ప్రధాన బలం అతడే. తన జీవితంలో అన్నీ ఉన్నాయి.. అయితే, ఆర్సీబీ ట్రోఫీ గెలవకపోవడం మాత్రమే లోటు.ఆర్సీబీకి టైటిల్ అందించేందుకు అతడు తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఈసారి ఆర్సీబీ ట్రోఫీని ముద్దాడుతుందనే అనుకుంటున్నా. విరాట్ కోహ్లి బ్యాట్ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ జాలువారితే అదేమీ పెద్ద కష్టం కాబోదు’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. కోహ్లితో పాటు మిగిలిన పది మంది కూడా రాణిస్తేనే ఇది సాధ్యమవుతుందని రైనా చెప్పుకొచ్చాడు. కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. 505 పరుగులు సాధించి.. ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు.ఆరెంజ్ క్యాప్ పోటీలో సూర్యకుమార్ యాదవ్ (510), సాయి సుదర్శన్ (509), శుబ్‌మన్ గిల్ (508)లతో కోహ్లి పోటీపడుతున్నాడు. కాగా ఆర్సీబీ- కేకేఆర్ మధ్య మే 17 నాటి మ్యాచ్‌కు వర్షం ఆటంకంగా మారే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక అన్న సంగతి తెలిసిందే. చదవండి: బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్‌గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్: టీమిండియా మాజీ కోచ్ -
‘ఈసారి హార్దిక్ అలా చేయడం లేదు.. అందుకే ముంబై దూసుకెళ్తోంది’
ఐపీఎల్-2025 (IPL 2025)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. వరుస పరాజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కొట్టడం అద్భుతమని కొనియాడాడు. ఇందుకు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్సీ ప్రధాన కారణమని గావస్కర్ ముంబై సారథిని ప్రశంసించాడు.గతేడాది చేదు అనుభవాలుకాగా గతేడాది ముంబై ఇండియన్స్, హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఐదుసార్లు జట్టును చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కాదని పాండ్యాకు పగ్గాలు అప్పగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మైదానం లోపలా, వెలుపలా అతడిని హేళన చేస్తూ నిరుత్సాహపరిచారు.ఖేల్ ఖతమే అనుకున్నవేళఈ క్రమంలో గతేడాది ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడగున పదో స్థానంతో సీజన్‌ను ముగించింది. తాజా ఎడిషన్‌లో తొలి ఐదు మ్యాచ్‌లలో నాలుగు ఓడిపోయింది. దీంతో ముంబై ఖేల్ ఖతమే అని అనుకున్న సమయంలో.. ఊహించని రీతిలో పుంజుకుంది.అంతా హార్దిక్ వెంట ఉన్నారువరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ముంబై జట్టు, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ తీరును కొనియాడాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘గతేడాది సొంత జట్టు అభిమానుల నుంచే హార్దిక్‌కు మద్దతు లేదు.కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముంబై ప్రేక్షకులు, ముంబై జట్టు మద్దతుదారులు అంతా హార్దిక్ వెంట ఉన్నారు. ప్రతి ఒక్కరు టీమ్‌ను గెలిపించాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆరంభంలో తడబడినా ముంబై అద్భుత రీతిలో తిరిగి పుంజుకుంది.హార్దిక్ ఈసారి అలా చేయడం లేదుహార్దిక్ పాండ్యా ప్రభావం ఈసారి గట్టిగానే ఉంది. అతడు తన భావోద్వేగాలను మైదానంలో ఎక్కువగా కనిపించకుండా దాచేస్తున్నాడు. మిస్‌ఫీల్డ్ అయినప్పుడు, క్యాచ్‌లు జారవిడిచినపుడు ఫీల్డర్లకు మరేం పర్లేదు అన్నట్లుగా మద్దతుగానే ఉంటున్నాడు.ఒకవేళ కెప్టెన్ ఇలాంటపుడు అతిగా స్పందిస్తే.. ఫీల్డర్ కూడా డీలాపడిపోతాడు. అయితే, హార్దిక్ ఈసారి అలా చేయడం లేదు. అందుకే ముంబై ఇంత త్వరగా తిరిగి రేసులోకి వచ్చింది. అయినా.. వాళ్లకు ఇది అలవాటే. ముంబై ఇండియన్స్ అభిమానిగా ఆ జట్టు విజయపరంపర కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’’ అని సునిల్ గావస్కర్ పేర్కొన్నాడు.ధనాధన్‌కాగా ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఇప్పటికి పన్నెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడు గెలిచింది. పద్నాలుగు పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్న హార్దిక్ సేన.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిచి సగర్వంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది. ఇక హార్దిక్ పాండ్యా వ్యక్తిగత ప్రదర్శన విషయానికొస్తే.. పదకొండు ఇన్నింగ్స్‌లో 158 పరుగులు చేసిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. పదమూడు వికెట్లు కూడా పడగొట్టాడు. మరోవైపు.. పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ 510 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు.చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక! -
IPL 2025: ఆర్సీబీని గెలిపిస్తాం కదా!.. అంతా కోహ్లి మయం!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండుల్కర్ (100) తర్వాత అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా కోహ్లి (82) కొనసాగుతున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ రికార్డుల రారాజు.. ఇటీవలే టెస్టు ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు (Test Retirement) పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు.. టీమిండియా తరఫున వన్డేల్లోనూ కొనసాగుతున్నాడు కోహ్లి.అంతా కోహ్లి మయం..ఈ క్రమంలో ఇటీవల వ్యక్తిగత పని పూర్తి చేసుకొని తిరిగొస్తుండగా మైదానంలో ఒక అభిమాని ఎందుకు టెస్టులకు రిటైర్మెంట్ తీసుకున్నావని కోహ్లిని అడిగాడు. ఇందుకు స్పందిస్తూ ‘ఆర్సీబీని గెలిపిస్తాం కదా’ అని కోహ్లి జవాబిచ్చాడు. ఈ సీజన్లో బెంగళూరుకు టైటిల్ అందించాలని అతను ఎంత పట్టుదలగా ఉన్నాడో అర్థమవుతుంది. కోహ్లి బ్యాటింగ్‌లోనూ అది కనిపిస్తోంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటికి 11 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 7 అర్ధసెంచరీలతో ఇప్పటికే 505 పరుగులు సాధించిన కోహ్లి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.టెస్టు ఫార్మాట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మొదటిసారి కోహ్లి మైదానంలోకి దిగుతుండటంతో అందరి దృష్టీ అతనిపైనే ఉంది. గురువారం అతడి ప్రాక్టీస్ సెషన్ సమయంలో కూడా చిన్నస్వామి స్టేడియంను ఫ్యాన్స్ హోరెత్తించారు. వందల సంఖ్యలో హాజరైన అభిమానులు కోహ్లి ప్రతీ కదలికపై సందడి చేశారు. దాదాపు గంట పాటు అతను నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. కోహ్లి ఉన్నంత సేపూ అతని పేరు తప్ప అక్కడ మరేమీ వినిపించలేదు.భారీ స్థాయిలో స్పందనకోల్‌కతాతో శనివారం జరిగే మ్యాచ్‌లోనూ ఇదే పరిస్థితి ఉండవచ్చు. కోహ్లి టెస్టుల నుంచి రిటైర్ అయిన తర్వాత కొందరు వీరాభిమానులు సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని పంచుకున్నారు. ‘కింగ్’పై తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ, టెస్టు క్రికెటర్‌గా కోహ్లిని గుర్తు చేస్తూ ఐపీఎల్ మ్యాచ్‌కు కూడా తెలుపు రంగు టెస్టు జెర్సీలతో స్టేడియానికి రావాలని పిలుపునిచ్చారు. ఇందుకు భారీ స్థాయిలో స్పందన లభించింది.ఎలాంటి ప్రభావం చూపదుఈ రకంగా చూస్తే శనివారం ఆర్సీబీ రెగ్యులర్ జెర్సీ ‘రెడ్ అండ్ గోల్డ్’లో కాకుండా ‘విరాట్ 18’ వైట్ జెర్సీలే మైదానాన్ని ముంచెత్తవచ్చు. అయితే విరాట్‌పై మైదానం బయటి స్పందనలు, వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపించవని... ఏకాగ్రత చెదరకుండా తనదైన శైలిలో ఎప్పటిలాగే అతను బాగా ఆడి మ్యాచ్‌ను గెలిపించాలనే ఏకైక లక్ష్యంతోనే బరిలోకి దిగుతున్నాడని ఆర్సీబీ డైరెక్టర్ మో బొబాట్ వ్యాఖ్యానించారు. కాగా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారం పాటు వాయిదా పడిన ఐపీఎల్ తాజా ఎడిషన్ శనివారం (మే 17) నుంచి పునః ప్రారంభం కానుంది. ఆర్సీబీ- కోల్‌కతా జట్ల మధ్య జరిగే శనివారం నాటి మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక.ఇదిలా ఉంటే.. కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ సారథ్యంలో ఆర్సీబీ ఈసారి అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న బెంగళూరు జట్టు.. ఎనిమిదింట గెలిచి పదహారు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతాపై తాజా మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక! -
IPL 2025: ‘షో’ మళ్లీ షురూ...
బెంగళూరు: ఐపీఎల్ 18వ సీజన్లో తొమ్మిది రోజుల విరామానంతరం తర్వాతి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా లీగ్‌ను గవరి్నంగ్ కౌన్సిల్ వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం నేటి నుంచి మ్యాచ్‌లు పునఃప్రారంభమవుతున్నాయి. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగే పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతుంది. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ ఈ నెల 7న జరిగింది. మే 8న ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేసి లీగ్‌కు విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆ మ్యాచ్ మళ్లీ నిర్వహిస్తారు. 70 మ్యాచ్‌ల లీగ్ దశలో 57 మ్యాచ్‌లు ముగిశాయి. మిగిలిన 13 మ్యాచ్‌లతో పాటు నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2, ఫైనల్) కలిపి మొత్తం ఈ సీజన్లో మరో 17 మ్యాచ్‌లు ఉన్నాయి. ఆరు వేదికలు బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లలో లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల వేదికలు ఇంకా ప్రకటించలేదు. జూన్ 3న ఫైనల్ జరుగుతుంది. ముస్తఫిజుర్, డుప్లెసిస్ రెడీ... ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్‌లలో పాల్గొనే విదేశీ ఆటగాళ్ల విషయంలో శుక్రవారం మరింత స్పష్టత వచ్చింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరభ్యంతర పత్రం జారీ చేయడంతో పేసర్ ముస్తఫిజుర్ రహమాన్‌కు మార్గం సులువైంది. ఢిల్లీ తరఫున అతను బరిలోకి దిగుతాడు. ఢిల్లీ టాప్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ తాను మిగిలిన మ్యాచ్‌లకు తిరిగి రావడం ముందే స్పష్టం చేసేశాడు. ఓపెనర్ డుప్లెసిస్ కూడా ఆడేందుకు సిద్ధం కావడం క్యాపిటల్స్‌కు సానుకూలాంశం. స్టబ్స్ మిగిలిన లీగ్ దశలో ఉండి ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం వెళ్లిపోతాడు.ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన హైదరాబాద్, చెన్నై, రాజస్తాన్ జట్లకు విదేశీ క్రికెటర్ల ప్రాతినిధ్యం పెద్దగా సమస్య కాకపోవచ్చు. అయితే ఫలితాన్ని ప్రభావితం చేయగల విదేశీ ఆటగాళ్లు ఉన్న టీమ్‌లకు వారంతా తిరిగి రావడం ప్లే ఆఫ్స్ అవకాశాలకు పెద్ద బలంగా మారింది. సాల్ట్, షెఫర్డ్, టిమ్ డేవిడ్‌లతో ఆర్సీబీ సంతృప్తిగా కనిపిస్తుండగా... హాజల్‌వుడ్ మాత్రం దూరమయ్యాడు. స్టొయినిస్, ఇన్‌గ్లిస్ విషయంలో పంజాబ్ కింగ్స్‌కు ఇంకా పూర్తి సమాచారం లేదు. ముంబై ఇండియన్స్ తరఫున అంతా అందుబాటులో ఉండగా... ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆ్రస్టేలియా కెప్టెన్ కమిన్స్ మిగిలిన మూడు లీగ్ మ్యాచ్‌ల కోసం సన్‌రైజర్స్‌తో చేరడం ఆశ్చర్యకరం! గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ... సీజన్లో జోరు చూపిస్తూ ఎనిమిది విజయాలు సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరో విజయంపై గురి పెట్టింది. ప్రస్తుతం 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ సొంతగడ్డపై గెలిస్తే 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. బ్యాటర్లంతా ఫామ్‌లో ఉండటంతో పాటు పదునైన బౌలింగ్‌తో జట్టు బాగా బలంగా కనిపిస్తోంది. బెతెల్, కోహ్లి శుభారంభం అందిస్తుండగా, కెప్టెన్ రజత్ పాటీదార్ వేలి గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగుతున్నాడు. భువనేశ్వర్, యశ్ దయాళ్, కృనాల్, సుయాశ్‌లతో బౌలింగ్ కూడా బాగుంది. మరోవైపు కోల్‌కతా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్న టీమ్ ఖాతాలో 11 పాయింట్లే ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా... 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ ఖాయమేమీ కాదు. ఇతర ఎన్నో సమీకరణాలతో ముందంజ వేయడం ఆధారపడి ఉంటుంది. కానీ ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం అధికారికంగా ప్లే ఆఫ్స్ చాన్స్ కోల్పోయిన నాలుగో జట్టుగా కేకేఆర్ నిలుస్తుంది. -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ రాకకు లైన్ క్లియర్!
ఐపీఎల్ 2025 పునఃప్రారం వేళ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందింది. ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లో ఆడేందుకు ముస్తఫిజుర్ రెహ్మాన్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అతడు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వారం రోజులు వాయిదా పడడంతో చాలా మంది ఫారన్ ప్లేయర్లు తమ స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే ఐపీఎల్ రీ స్టార్ట్ అవుతుండడంతో కొంతమంది తిరిగి భారత్‌కు రావడానికి సిద్దపడితే, మరి కొంతమంది నిరాకరించారు. అందులో ఒకరు ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్.ఐపీఎల్ 16వ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు తన అందుబాటులో ఉండడని మెక్‌గర్క్ ఢిల్లీ ఫ్రాంచైజీకి తెలియజేశాడు. ఈ క్రమంలో మెక్‌గర్క్ స్ధానంలో బంగ్లాపేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ముస్తఫిజుర్‌తో ఢిల్లీ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికి అతడు యూఏఈతో టీ20 సిరీస్ ఆడేందుకు దుబాయ్‌కు పయనమయ్యాడు.యాదృచ్ఛికంగా యూఏఈ-బంగ్లా సిరీస్ కూడా మే 17 నుంచి ప్రారంభం కానుంది. దీంతో అతడు తిరిగి భారత్‌కు వస్తాడా లేదా అన్న సందిగ్ధం నెలకొంది. ఎట్టకేలకు బంగ్లా క్రికెట్ బోర్డు అతడికి ఎన్వోసీ మంజారు చేయడంతో ఢిల్లీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.కాగా ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్లు మిచెల్ స్టార్క్, ఫాఫ్ డుప్లెసిస్ సైతం దూరమయ్యారు. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మూడు మ్యాచ్‌లలోనూ ఢిల్లీ విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది. -
‘ఇక్కడి నుంచి పో..’: సహనం కోల్పోయిన స్టార్క్.. వీడియో వైరల్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) సహనం కోల్పోయాడు. ‘‘ఇక్కడి నుంచి వెళ్లిపో’’ అంటూ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. కాగా ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో భాగంగా ఢిల్లీ స్టార్క్‌ను రూ. 11. 75 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది.ఈ క్రమంలో ఈ సీజన్లో ఢిల్లీ (Delhi Capitals) తరఫున పదకొండు మ్యాచ్‌లు ఆడి పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు స్టార్క్. చివరగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా అతడు బరిలోకి దిగాడు. అయితే, భారత్- పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాలలో బ్లాక్ అవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) విధించడంతో పంజాబ్- ఢిల్లీ మ్యాచ్ అర్దంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.భార్య అలిసా హేలీతో కలిసిఈ నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్లను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించి.. ఆపై కట్టుదిట్టమైన భద్రత నడుమ ఢిల్లీకి చేర్చింది. ఈ పరిణామాలతో తీవ్ర భయాందోళనకు లోనైన స్టార్క్, అతడి భార్య అలిసా హేలీ ఢిల్లీకి చేరుకుని.. వెంటనే స్వదేశానికి పయనమయ్యారు.ఇక్కడి నుంచి పో..ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి స్టార్క్ దగ్గరగా వెళ్లి వీడియో తీసే ప్రయత్నం చేశాడు. దీంతో అతడు పక్కకు వెళ్లిపో అంటూ సైగ చేశాడు. అయితే, కాసేపటి తర్వాత సదరు వ్యక్తి మరోసారి స్టార్క్ దగ్గరికి వెళ్లి పలకరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆసీస్ బౌలర్.. ‘‘పో.. పో.. ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపో’’ అన్నట్లుగా విసుక్కున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో చాలా మంది స్టార్క్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అసలే భయపడిన వాడిని మరింత భయపెట్టడం సరికాదంటూ సెటైర్లు వేస్తుండగా... మరికొందరు మాత్రం స్టార్క్ అంతలా విసుక్కోవాల్సిన అవసరం లేదని.. ఏదేమైనా ఒకరి గోప్యతకు భంగం వాటిల్లేలా ప్రవర్తించడం ఏమిటని సదరు వ్లాగర్‌కు చివాట్లు పెడుతున్నారు.మే 17 నుంచి తిరిగి ప్రారంభంఇదిలా ఉంటే... మే 17 నుంచి ఐపీఎల్-2025 తిరిగి ప్రారంభం కానుంది. అయితే, ఢిల్లీకి ఆడుతున్న ఆసీస్ స్టార్లు స్టార్క్, జేక్ ఫ్రేజర్-మెగర్క్ తిరిగి ఇండియాకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇష్టమైతేనే భారత్‌కు తిరిగి వెళ్లవచ్చు అని క్రికెట్ ఆస్ట్రేలియా తమ ఆటగాళ్లకు సూచించగా.. స్వదేశంలోనే ఉండేందుకు వీరిద్దరు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఢిల్లీకి లీగ్ దశలో ఇంకో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 13 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతున్న అక్షర్ సేన.. ప్లే ఆఫ్స్‌నకు గురిపెట్టింది. అయితే, స్టార్క్, మెగర్క్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం తీవ్ర ప్రభావం చూపనుంది.చదవండి: మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్Go away😭pic.twitter.com/hqkyHzCEg4— Ghar Ke Kalesh (@gharkekalesh) May 15, 2025 -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. హ్యాండ్ ఇచ్చిన స్టార్ ప్లేయర్?
ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు ఆ జట్టు స్టార్ బ్యాటర్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దూరంగా ఉండనున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సేవలను కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు డుప్లెసిస్ సైతం ఊహించని షాకిచ్చాడు.భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్ వారం రోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డుప్లెసిస్ తన స్వదేశానికి వెళ్లిపోయాడు. అయితే దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయిన డుప్లెసిస్ తిరిగి భారత్‌కు వచ్చేందుకు తిరష్కరించినట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో తమ కథనంలో పేర్కొంది.డుప్లెసిస్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ ఏడాది సీజన్లో డుప్లెసిస్ గాయం కారణంగా కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మిగితా ఆరు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే డుప్లెసిస్ గత కొన్ని మ్యాచ్‌ల్లో ఢిల్లీ తరపున ఆడినప్పటికి, అతడు ఇంకా పూర్తి ఫిట్ సాధించకపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఫాఫ్ సౌతాఫ్రికాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మరో సౌతాఫ్రికా ఆటగాడు డోనోవన్ ఫెర్రీరా సైతం ఢిల్లీ క్యాపిటల్స్‌కు హ్యాండ్ ఇచ్చాడు. అతడు కూడా తిరిగి ఐపీఎల్లో పాల్గోనేందుకు రావడం లేదని ఢిల్లీ ఫ్రాంచైజీకి తెలియజేశాడు. వీరిద్దరి కంటే ముందు మిచెల్ స్టార్క్, జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ సైతం ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలగారు.ముగ్గురే ముగ్గురు..దీంతో ప్రస్తుతం ఢిల్లీ జట్టులో కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే మిగిలారు. ట్రిస్టన్ స్టబ్స్, శ్రీలంక పేసర్ దుష్మంత చమీర, బంగ్లాదేశ్ స్పీడ్ స్టార్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ విదేశీ ప్లేయర్లగా ఉన్నారు. ఫ్రేజర్-మెక్‌గుర్క్ స్థానంలో ముస్తాఫిజుర్ రెహమాన్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికి.. అతడికి ఇంకా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎన్వోసీ మంజారు చేయలేదు. దీంతో అతడు ఇంకా ఢిల్లీ జట్టుతో చేరలేదు.ప్రస్తుతం బంగ్లా క్రికెట్ బోర్డుతో బీసీసీఐ సంప్రదింపులు జరుపుతోంది. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మూడు మ్యాచ్‌లలోనూ ఢిల్లీ విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది.చదవండి: IND vs ENG: 'గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే బెటర్' -
IPL 2025: నేనైతే వెళ్లేవాడిని కాదు.. మీరూ వెళ్లొద్దు: ఆసీస్ మాజీ క్రికెటర్
ఐపీఎల్-2025 (IPL 2025) ప్లే ఆఫ్స్ దశకు చేరుకున్న వేళ అనుకోని విధంగా వారం పాటు వాయిదా పడింది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో లీగ్‌ను పునఃప్రారంభించేందుకు బోర్డు సిద్ధమైంది.కొందరు వచ్చేశారుఇప్పటికే పది ఫ్రాంఛైజీలకు తమ ఆటగాళ్లందరినీ ఒకే చోట చేర్చాల్సిందిగా ఆదేశించిన బోర్డు.. శనివారం (మే 17) నుంచి మ్యాచ్‌లు కొనసాగించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంత మంది విదేశీ ఆటగాళ్లు భారత్‌కు చేరుకోగా.. మరికొంత మంది జాతీయ జట్టు విధుల దృష్ట్యా స్వదేశాల్లోనే ఉండిపోయారు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ ఐపీఎల్ ఆడే విదేశీ ఆటగాళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘ఐపీఎల్ ఆడేందుకు తిరిగి ఇండియాకు వెళ్లాలా వద్దా అనే నిర్ణయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఆటగాళ్లకే వదిలివేసింది.నేనైతే ‘నో’ చెప్పేవాడినినిజానికి మధ్యలోనే ఇలా లీగ్‌ను వదిలివేయడం నిరాశకు గురిచేస్తుంది. ప్రొఫెషనల్‌గా, ఆర్థికంగా ఒక్కోసారి ఎదురుదెబ్బలు తగులుతాయి. అయితే, అన్నింటికంటే భద్రతే ముఖ్యం. ఒకవేళ నేనే గనుక వారి స్థానంలో ఉండి ఉంటే.. ఇండియాకు వెళ్లి లీగ్ పూర్తి చేయాలని ఆదేశించినా.. కచ్చితంగా ‘నో’ చెప్పేవాడిని.ఎందుకంటే నా వరకు చెక్కుల కంటే కూడా ప్రాణాలు ముఖ్యమైనవి. అయితే, ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఐపీఎల్ ఒక్కటనే కాదు.. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడేందుకు కూడా ఆటగాళ్లు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదనే నేను భావిస్తున్నా’’ అని మిచెల్ జాన్సన్ ది వెస్ట్రన్ ఆస్ట్రేలియన్‌కు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు.సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఓప్పుకోవడానికి కారణం అదేఅదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది. ఆ తర్వాత వారం రోజులకే లార్డ్స్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఉంది. కాబట్టి ఈ మెగా మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుంది’’ అని మిచెల్ జాన్సన్ పేర్కొన్నాడు.అయితే, బీసీసీఐతో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఉన్న ఆర్థిక సంబంధాల దృష్ట్యా ప్రొటిస్ ఆటగాళ్లంతా తిరిగి ఐపీఎల్లో పాల్గొంటారని జాన్సన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీల సారథ్యంలోనే సౌతాఫ్రికా టీ20 లీగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.రిక్కీ పాంటింగ్ ఉండటమే కాదు.. వాళ్లనూ ఒప్పించాడుఇదిలా ఉంటే.. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. పాక్ దుశ్చర్యలను తిప్పికొట్టేందుకు భారత్ అక్కడ బ్లాక్ అవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) ప్రకటించడంతో స్టేడియం కూడా చీకటైపోయింది.ఈ క్రమంలో ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులను సురక్షితంగా అక్కడి నుంచి తరలించింది బీసీసీఐ. అంతేకాదు.. వందే భారత్ రైలులో అత్యంత భద్రత నడుమ పంజాబ్, ఢిల్లీ ఆటగాళ్లను ఢిల్లీకి చేర్చింది. ఈ నేపథ్యంలో కాస్త భయాందోళనకు లోనైనప్పటికీ.. భారత్‌లోనే ఉండిపోవాలని పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్, ఆసీస్ దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ నిర్ణయించుకున్నాడు. బీసీసీఐ చేసిన ఏర్పాట్లు, భారత ప్రభుత్వం తీసుకున్న రక్షణ చర్యల నేపథ్యంలో ఆటగాళ్లను కూడా ఇందుకు ఒప్పించాడు. అయితే, మిచెల్ జాన్సన్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. కాగా ముంబై ఇండియన్స్ తరఫున రెండుసార్లు (2013, 2017) ఐపీఎల్ గెలిచిన జట్టులో జాన్సన్ సభ్యుడు. చదవండి: మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్ఐపీఎల్ 2025 పునఃప్రారంభం.. ఎవరు తిరిగొస్తున్నారు.. ఎవరు రావడం లేదు..? -
IPL 2025 Restart: పీఎస్ఎల్కు గుడ్ బై చెప్పి ఐపీఎల్లో చేరిపోయిన మరో ప్లేయర్
శ్రీలంక విధ్వంసకర బ్యాటర్ కుసాల్ మెండిస్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025కు మధ్యలోనే గుడ్ బై చెప్పాడు. ఆ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మెండిస్.. బట్లర్‌కు ప్రత్యామ్నాయంగా గుజరాత్ టైటాన్స్ నుంచి ఆఫర్ రావడంతో ఐపీఎల్‌కు వచ్చేశాడు. మెండిస్ నిన్ననే గుజరాత్ జట్టులో చేరిపోయాడు. ఐపీఎల్‌లాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా వాయిదా అనంతరం మే 17 నుంచి ప్రారంభం కానుంది. ఆ లీగ్‌లో కూడా ఐపీఎల్‌లాగే విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లిపోయారు. ఐపీఎల్లో దాదాపుగా అందరు విదేశీ ఆటగాళ్లు లీగ్ పునఃప్రారంభానికి అందుబాటులోకి వస్తుంటే.. పీఎస్ఎల్లో మాత్రం విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. మెండిస్‌కు ముందు ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ ఓవెన్ కూడా పీఎస్ఎల్కు గుడ్ బై చెప్పి ఐపీఎల్లో చేరిపోయాడు. మిచెల్ ఓవెన్‌ను పంజాబ్ కింగ్స్ మ్యాక్స్‌వెల్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకుంది. ఓవెన్, మెండిస్ ఇద్దరూ పీఎస్ఎల్తో ఒప్పందం ఉన్నప్పటికీ దాన్ని తెంచుకుని ఐపీఎల్ పంచన చేరాడు. భద్రతా కారణాల వల్ల పీఎస్ఎల్లో ఆడలేనని మెండిస్ తాజాగా స్పష్టం చేశాడు. అంతకుముందే ఓవెన్ తనకు ఐపీఎల్ ఆఫరే ముఖ్యమని పీఎస్ఎల్కు తేల్చి చెప్పాడు. వీరిద్దరిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్చలు తీసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు మరో విదేశీ ఆటగాడు కార్బిన్ బాష్ కూడా పీఎస్ఎల్కు హ్యాండిచ్చి ముంబై ఇండియన్స్‌లో చేరిపోయాడు. ఐపీఎల్ ఆఫర్ రావడం అదృష్టంగా భావించే విదేశీ ఆటగాళ్లు..పీఎస్ఎల్ లాంటి చిన్న లీగ్‌ను తృణప్రాయంగా వదిలేసుకుంటున్నారు.ఇదిలా ఉంటే, జాతీయ విధుల కారణంగా జోస్ బట్లర్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండడం లేదు. దీంతో గుజరాత్ అతనికి ప్రత్యామ్నాయంగా మెండిస్‌ను ఎంపిక చేసుకుంది. బట్లర్ మే 26 వరకు గుజరాత్‌కు అందుబాటులో ఉంటాడు. మెండిస్‌ను గుజరాత్ యాజమాన్యం రూ. 75 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న బట్లర్ ప్లే ఆఫ్స్‌లో గుజరాత్‌కు అందుబాటులో లేకపోవడం ఆ జట్టు టైటిల్ విన్నింగ్ అవకాశాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఈ సీజన్లో బట్లర్ 11 మ్యాచ్‌లు ఆడి 71.43 సగటుతో 500 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. బట్లర్ గుజరాత్ ఆడబోయే తదుపరి మూడు లీగ్ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా గుజరాత్ ప్లే ఆఫ్స్ బెర్త్ అధికారికంగా ఖరారవుతుంది. గుజరాత్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఢిల్లీ (మే 18), లక్నో (మే 22), సీఎస్కేతో (మే 25) తలపడాల్సి ఉంది. -
IPL 2025 Resumption: రేపటి ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ జరిగేనా..?
భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా వారం వాయిదా పడిన ఐపీఎల్ 2025 రేపు (మే 17) జరుగబోయే కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌తో పునఃప్రారంభం కానుంది. అయితే లీగ్ పునఃప్రారంభానికి వరుణుడు అడ్డుపడేలా ఉన్నాడు. రేపటి మ్యాచ్‌కు వేదిక అయిన బెంగళూరులో నిన్నటి నుండి వర్షం జోరుగా కురుస్తుంది. రేపు మ్యాచ్ జరిగే సమయంలో కూడా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవారం రోజులు బెంగళూరులో ఇదే వాతావరణం కొనసాగనున్నట్లు తెలుస్తుంది. రేపటి మ్యాచ్ కోసం కేకేఆర్, ఆర్సీబీ జట్లు ఇదివరకే బెంగళూరుకు చేరుకున్నాయి. వర్షం కారణంగా ఇరు జట్ల ప్రాక్టీస్ సెషన్లు రద్దయ్యాయి. ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లకు పరిమితమయ్యారు. Tim David enjoying the Bengaluru rain. 😂🔥 pic.twitter.com/nOKhZhHukO— Johns. (@CricCrazyJohns) May 16, 2025వర్షంలో ఎంజాయ్ చేసిన టిమ్నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వర్షం కురుస్తుండగా ఆ జట్టు ఆటగాడు టిమ్ డేవిడ్ చేసిన విన్యాసాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. టిమ్ షర్ట్ లేకుండా వర్షంలో తడుస్తూ తెగ ఎంజాయ్ చేశాడు.కొన్ని ఓవర్లైనా జరుగుందిచిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉండటంతో భారీ వర్షం కురిసినా రేపటి మ్యాచ్ కొన్ని ఓవర్ల పాటైనా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.పూర్తిగా రద్దైతే..వర్షం కారణంగా రేపు జరగాల్సిన కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్ పూర్తిగా రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ మరో పాయింట్ లభించినా టాప్ ప్లేస్‌కు ఎగబాకుతుంది. కేకేఆర్ విషయానికొస్తే.. ఇప్పటికే అనధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు రేపటి మ్యాచ్ రద్దైతే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలుగుతుంది.పాటిదార్, హాజిల్‌వుడ్ దూరంరేపటి మ్యాచ్‌కు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ దూరం కానున్నాడని తెలుస్తుంది. లీగ్ వాయిదాకు ముందే గాయపడిన అతను ఇంకా కోలుకోలేదని సమాచారం. పాటిదార్ స్థానంలో రేపటి మ్యాచ్‌లో జితేశ్ శర్మ ఆర్సీబీకి సారథ్యం వహించవచ్చు. మరోవైపు భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా స్వదేశానికి వెళ్లిన ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ కూడా రేపటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని తెలుస్తుంది. హాజిల్‌వుడ్ లీగ్ తదుపరి లెగ్ ఆడేందుకు అంగీకారం తెలిపినప్పటికీ.. భారత్‌కు ఇంకా తిరిగి రావాల్సి ఉంది. -
మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) అదరగొడుతోంది. కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) సారథ్యంలో ఇప్పటికే ప్లే ఆఫ్స్ దిశగా దూసుకుపోతున్న ఆర్సీబీ... ఈసారైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఒకవేళ అదే జరిగితే పాటిదార్ బెంగళూరు జట్టుకు తొలి ఐపీఎల్ ట్రోఫీ అందించిన కెప్టెన్‌గా చరిత్రకెక్కుతాడు.మెగా వేలంలో నన్ను కొనలేదుఅయితే, ఒకప్పుడు తనకు జట్టులో చోటే ఇవ్వని ఆర్సీబీకి తిరిగి రావొద్దని పాటిదార్ అనుకున్నాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు నాకు ఫ్రాంఛైజీ నుంచి కాల్ వచ్చింది.మేము నిన్ను తీసుకోబోతున్నాము సిద్ధంగా ఉండు అని చెప్పారు. నేను మరోసారి ఆర్సీబీకి ఆడబోతున్నానని ఎంతో సంతోషపడ్డాను. కానీ మెగా వేలంలో వాళ్లు నన్ను కొనలేదు.దీంతో నేను స్థానిక మ్యాచ్‌లలో ఆడుతూ కాలం గడిపాను. అప్పుడు అకస్మాత్తుగా ఆర్సీబీ నుంచి మరోసారి ఫోన్‌కాల్ వచ్చింది. గాయపడిన లవ్నిత్ సిసోడియా స్థానంలో నిన్ను జట్టులోకి తీసుకుంటున్నాం అని చెప్పారు.తిరిగి ఆర్సీబీకి వెళ్లాలని అనుకోలేదుకానీ నిజం చెప్పాలంటే.. నాకు అప్పుడు తిరిగి ఆర్సీబీకి వెళ్లాలని అనిపించలేదు. ఎందుకంటే.. ఇంజూరీ రీప్లేస్‌మెంట్‌గా వెళ్తే నాకు ఆడే అవకాశం రానేరాదు. డగౌట్లో ఉత్తినే కూర్చోవడం నాకసలు ఇష్టం లేదు.వేలంలో నన్ను కొననందుకు కోపం వచ్చిందని చెప్పను గానీ.. తీవ్ర నిరాశకు గురయ్యాను. కానీ గాయపడిన ఆటగాడి స్థానంలో వెళ్లినా నాకైతే ఆడే ఛాన్స్ ఇవ్వరు. అందుకు కోపం వచ్చింది. అయితే, అది కూడా కాసేపే... ఆ తర్వాత నేను మళ్లీ సాధారణ స్థితికి వచ్చేశాను’’ అని రజత్ పాటిదార్ ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో గత జ్ఞాపకాలు పంచుకున్నాడు.కోహ్లినే కీలకం.. సూచనలు, సలహాలుఅదే విధంగా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టడం కొత్తగా అనిపించిందన్న పాటిదార్.. ‘‘సారథిగా నా పేరును ప్రకటించగానే ఎన్నో సందేహాలు చుట్టుముట్టాయి. జట్టులో విరాట్ కోహ్లి వంటి దిగ్గజ ఆటగాడు ఉన్నాడు. ఆయన నా కెప్టెన్సీలో ఆడటమా? అని సందేహించాను.అయితే, కెప్టెన్సీ మార్పు విషయంలో కోహ్లి పూర్తి మద్దతుగా నిలబడ్డాడు. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అనుభవజ్ఞుడైన కోహ్లి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా విజయవంతమయ్యేందుకు కోహ్లి నాకెన్నో సూచనలు ఇచ్చాడు’’ అని కోహ్లితో తన అనుబంధాన్ని వివరించాడు.కాగా ఐపీఎల్-2025లో ఆర్సీబీ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఎనిమిది గెలిచింది. తద్వారా 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా ఒకప్పుడు జట్టులో చోటే దక్కించుకోలేని రజత్ పాటిదార్.. ఈసారి ఏకంగా కెప్టెన్‌గా నియమితుడు కావడంతో పాటు సారథిగా అదరగొడుతుండటం విశేషం. ఈ సీజన్లో ఇప్పటికి అతడు 239 పరుగులు సాధించాడు.చదవండి: IPL 2025 Resumption: ఆసక్తి రేపుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడి పోస్ట్ -
IPL 2025: ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్లు ఆడాల్సిన మ్యాచ్‌లు ఇవే..!
భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా వారం రోజులు వాయిదా పడిన ఐపీఎల్ 2025 రేపటి నుండి (మే 17) పునఃప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో (రీస్టార్ట్‌లో) కేకేఆర్, ఆర్సీబీ బెంగళూరు వేదికగా తలపడనున్నాయి. రీవైజ్డ్ షెడ్యూల్ ప్రకారం జూన్ 3న జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ ముస్తుంది. మే 27 వరకు లీగ్ మ్యాచ్‌లు జరుగనుండగా.. మే 29 (క్వాలిఫయర్ 1), మే 30 (ఎలిమినేటర్), జూన్ 1 (క్వాలిఫయర్ 2) తేదీల్లో ప్లే ఆఫ్స్ జరుగుతాయి.ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు ముందు మరో 13 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో అధికారంగా ఏడు జట్లు ఉండగా.. చెన్నై, రాజస్థాన్, ఎస్ఆర్హెచ్ నిష్క్రమించాయి. ప్లే ఆఫ్స్ రేసులో పేరుకు ఏడు జట్లు ఉన్నప్పటికీ ప్రధానమైన పోటీ మాత్రం ఐదు జట్ల మధ్యే ఉంది. వీటిలోనూ రెండు బెర్త్‌లను ప్రస్తుతం టేబుల్ టాపర్లుగా ఉన్న గుజరాత్, ఆర్సీబీ (11 మ్యాచ్‌ల్లో తలో 8 విజయాలతో 16 పాయింట్లు) దాదాపు ఖరారు చేసుకున్నాయి.ఈ రెండు జట్లు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో వారి ప్లే ఆఫ్స్ అవకాశాలు నల్లేరుపై నడకే అని చెప్పాలి. గుజరాత్, ఆర్సీబీ మూడింటిలో తలో మ్యాచ్ గెలిచినా కనీసం మూడు, నాలుగు స్థానాల్లోనైనా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.ఇక మిగిలింది రెండు బెర్త్‌లు. ఈ రెండు బెర్త్‌ల కోసం మూడు జట్ల మధ్య పోటీ ఉంది. రేసులో పంజాబ్ కింగ్స్‌కు (11 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లు) అవకాశాలు ఎక్కువగా ఉండగా.. ఢిల్లీ, ముంబైకి ఆతర్వాతి అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ముంబైతో పోలిస్తే ఢిల్లీకే కాస్త ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 13 పాయింట్లు కలిగి ఉండగా.. ముంబై 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఐదు జట్లలో ముంబై మినహా మిగతా నాలుగు జట్లు ఇంకా తలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.ప్లే ఆఫ్స్ రేసులో ప్రధానంగా ఉన్న జట్లు ఆడాల్సి మ్యాచ్‌లు ఇవే..గుజరాత్మే 18న ఢిల్లీతో (రాత్రి, ఢిల్లీ)మే 22న లక్నోతో (అహ్మదాబాద్)మే 25న సీఎస్కేతో (మధ్యాహ్నం, అహ్మదాబాద్)ఆర్సీబీమే 17న కేకేఆర్‌తో (బెంగళూరు)మే 23- సన్‌రైజర్స్‌తో (బెంగళూరు)మే 27- లక్నోతో (లక్నో)పంజాబ్మే 18న రాజస్థాన్‌తో (మధ్యాహ్నం, జైపూర్)మే 24న ఢిల్లీతో (జైపూర్)మే 26న ముంబై ఇండియన్స్‌తో (జైపూర్)ముంబై ఇండియన్స్మే 21న ఢిల్లీతో (ముంబై)మే 26న పంజాబ్‌తో (జైపూర్)ఢిల్లీమే 18న గుజరాత్‌తో (రాత్రి, ఢిల్లీ)మే 21న ముంబై ఇండియన్స్‌తో (ముంబై)మే 24న పంజాబ్‌తో (జైపూర్) -
IPL Restart: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుండె పగిలే వార్త.. స్టార్ ఆటగాడు హ్యాండ్ ఇచ్చాడు
ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుండె పగిలే వార్త తెలిసింది. ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ లీగ్ తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని స్టార్క్ స్వయంగా కన్ఫర్మ్ చేశాడు. భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా అందరూ విదేశీ ఆటగాళ్లతో పాటే స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్క్.. భారత్‌కు తిరిగి రావడం లేదని తేల్చి చెప్పాడు. దీనికి ఢిల్లీ యాజమాన్యం కూడా ఒప్పుకుంది.ఈ సీజన్లో మంచి ఫామ్‌లో ఉన్న స్టార్క్ (11 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు, ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా) లీగ్ కీలక దశలో హ్యాండ్ ఇవ్వడం ఢిల్లీ విజయావకాశాలను భారీగా దెబ్బ తీస్తుంది. స్టార్క్.. ఐపీఎల్ ముగిసిన తర్వాత వారం రోజుల్లో ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసమే భారత్‌కు తిరిగి రాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా స్వదేశానికి వెళ్లి, తిరిగి రానని ప్రకటించిన రెండో ఆటగాడు స్టార్క్. స్టార్క్‌కు ముందు అతని దేశానికే (ఆస్ట్రేలియా) చెందిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ కూడా లీగ్ తదుపరి లెగ్ కోసం భారత్‌కు రానని స్పష్టం చేశాడు.స్టార్క్ గురించి ముందుగానే సమాచారమున్న ఢిల్లీ యాజమాన్యం అతనికి ప్రత్యామ్నాయంగా బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్‌కు తాత్కాలిక రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేసుకుంది. అయితే ప్రస్తుతం ముస్తాఫిజుర్ కూడా అందుబాటులోకి రావడం అనుమానంగా మారింది. ముస్తాఫిజుర్‌కు అతని దేశ క్రికెట్ బోర్డు ఇప్పటివరకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు.ఇదిలా ఉంటే, ఈ సీజన్లో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 6 విజయాలతో 13 పాయింట్లు (సన్‌రైజర్స్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఓ పాయింట్ లభించింది) సాధించి, పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఢిల్లీ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 18న గుజరాత్‌ను ఢీకొట్టనున్న ఈ జట్టు.. మే 21 ముంబైతో.. మే 24న పంజాబ్‌తో తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఢిల్లీ.. గుజరాత్, పంజాబ్ చేతుల్లో ఓడి, ముంబై ఇండియన్స్ ఒక్కదానిపై గెలిచినా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి (ముంబై ఇండియన్స్ పంజాబ్ చేతుల్లో కూడా ఓడాల్సి ఉంటుంది). -
IPL 2025: ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు ఎలా చేరుతుంది..?
భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా వారం రోజులు వాయిదా పడిన ఐపీఎల్ 2025 రేపటి నుండి (మే 17) పునఃప్రారంభం కానుంది. కేకేఆర్, ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో (బెంగళూరు) ఐపీఎల్ రీస్టార్ అవుతుంది. ఐపీఎల్ పునఃప్రారంభం నేపథ్యంలో ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఏయే జట్లకు దక్కే అవకాశం ఉందో అన్న దానిపై ఓ లుక్కేద్దాం.ప్రస్తుతం గుజరాత్, ఆర్సీబీ తలో 16 పాయింట్లు (11 మ్యాచ్‌ల్లో తలో 8 విజయాలు) ఖాతాలో కలిగి ఉండి ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నాయి. ఇరు జట్లు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో ఈ జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు నల్లేరుపై నడకే అని చెప్పాలి. ఈ రెండు జట్లు మూడింటిలో తలో మ్యాచ్ గెలిచినా కనీసం మూడు, నాలుగు స్థానాల్లోనైనా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.ఇక మిగిలింది రెండు బెర్త్‌లు. ఈ రెండు బెర్త్‌ల కోసం ప్రధానంగా మూడు జట్ల మధ్య పోటీ ఉంటుంది. రేసులో పంజాబ్ కింగ్స్‌కు (11 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లు) అవకాశాలు ఎక్కువగా ఉండగా.. ఢిల్లీ, ముంబైకి ఆతర్వాతి అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ముంబైతో పోలిస్తే ఢిల్లీకే కాస్త ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 13 పాయింట్లు కలిగి ఉండగా.. ముంబై 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఐదు జట్లలో ముంబై మినహా మిగతా నాలుగు జట్లు ఇంకా తలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు ఎలా చేరుతుంది..?ఈ సీజన్లో ముంబై మరో 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 14 పాయింట్లతో పట్టికలో 4వ స్థానంలో ఉంది. ముంబై మిగిలిన రెండు మ్యాచ్‌లు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడాల్సి ఉంది. ముంబై ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిస్తే 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. వీరి టేబుల్ స్థానం మొదటి రెండు స్థానాల్లో ఉన్న గుజరాత్, ఆర్సీబీ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు జట్లు 22 పాయింట్లతో ముగించే అవకాశాలు ఉన్నాయి.ముంబై తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిస్తే, వారి ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా సంక్లిష్టమవుతాయి. ఒకవేళ ముంబై ఢిల్లీని ఓడిస్తే.. ఆతర్వాత పంజాబ్ కూడా ఢిల్లీని ఓడించాలి. అప్పుడు ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలుగుతుంది. ముంబై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.ఒకవేళ ముంబై పంజాబ్‌ను ఓడించి ఢిల్లీ చేతిలో ఓడితే.. ఆతర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ కూడా పంజాబ్‌ను ఓడిస్తే పంజాబ్ ఇంటికి (పంజాబ్ రాజస్థాన్ చేతిలో కూడా ఓడాలి) ఢిల్లీ (17), ముంబై (16) ప్లే ఆఫ్స్‌కు చేరతాయి. ఒకవేళ ముంబై తమ రెండు మ్యాచ్‌ల్లో ఓడితే వారి ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే.కేకేఆర్, లక్నో కూడా రేసులోనే..!కేకేఆర్ (11), లక్నోకు (10) ప్లే ఆఫ్స్ అవకాశాలు లేనప్పటికీ.. టెక్నికల్‌గా ఆ జట్లకు ఇంకా ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ రెండు జట్లు తదుపరి ఆడాల్సిన అన్ని మ్యాచ్‌ల్లో (కేకేఆర్ 2, లక్నో 3) గెలవాల్సి ఉండటంతో పాటు.. ఈ జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉన్నాయి.ఈ మూడు టీమ్‌లు ఔట్ఈ సీజన్లో సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించాయి. తదుపరి ఆడబోయే మ్యాచ్‌ల ఫలితాలతో ఈ జట్లకు ఒరిగేదేమీ లేనప్పటికీ.. ఈ జట్లు ఇతర జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. -
పునఃప్రారంభానికి ముందు ఐపీఎల్ 2025 పరిస్థితి ఇది..!
భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా వారం రోజులు వాయిదా పడిన ఐపీఎల్ 2025 రేపటి నుండి (మే 17) పునఃప్రారంభం కానుంది. ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా తమతమ ఫ్రాంచైజీల క్యాంప్‌ల్లో చేరుతున్నారు. తదుపరి లెగ్‌కు కొందరు విదేశీ ఆటగాళ్ల లభ్యత సమస్య మినహా లీగ్ ముందులా రంజుగా సాగేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు. పునఃప్రారంభం రోజున జరిగే మ్యాచ్‌లో కేకేఆర్, ఆర్సీబీ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ బెంగళూరులో జరుగనుంది.టాప్‌లో గుజరాత్ఈ సీజన్లో అంచనాలకు మించి రాణిస్తున్న గుజరాత్ లీగ్ వాయిదా పడే సమయానికి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ సీజన్ 11 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ 8 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి 16 పాయింట్లు సాధించింది. గుజరాత్ ఇంకా 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒకటి గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారవుతుంది.ప్లే ఆఫ్స్ రేసులో మొత్తం ఐదు జట్లులీగ్ వాయిదా పడే సమయానికి ఐదు జట్లు ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. ఇంకా ఏ జట్టుకు ప్లే ఆఫ్స్ బెర్త్ అధికారికంగా ఖరారు కాలేదు. ప్లే ఆఫ్స్ రేసులో గుజరాత్ (16), ఆర్సీబీ (16) ముందు వరుసలో ఉండగా.. పంజాబ్ (15), ముంబై ఇండియన్స్ (14), ఢిల్లీ (13) పోటాపోటీ పడుతున్నాయి.కేకేఆర్, లక్నో కూడా రేసులోనే..!లీగ్ వాయిదా పడే సమయానికి కేకేఆర్ (11), లక్నోకు (10) ప్లే ఆఫ్స్ అవకాశాలు లేనప్పటికీ.. టెక్నికల్‌గా ఆ జట్లకు ఇంకా ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ రెండు జట్లు తదుపరి ఆడాల్సిన అన్ని మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉండటంతో పాటు.. ఈ జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉన్నాయి.ఈ మూడు టీమ్‌లు ఔట్లీగ్ వాయిదా పడే సమయానికి సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. తదుపరి ఆడబోయే మ్యాచ్‌ల ఫలితాలతో ఈ జట్లకు ఒరిగేదేమీ లేనప్పటికీ.. ఈ జట్లు ఇతర జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.ఆరెంజ్ క్యాప్ హెల్డర్‌గా సూర్యకుమార్లీగ్ వాయిదా పడే సమయానికి ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ వద్ద ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) ఉంది. స్కై ఈ సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడి 63.75 సగటున 170.57 స్ట్రయిక్‌రేట్‌తో 510 పరుగులు చేశాడు.నూర్ అహ్మద్, ప్రసిద్ద్ కృష్ణ వద్ద పర్పుల్ క్యాప్లీగ్ వాయిదా పడకముందు ప్రసిద్ద్ కృష్ణ (గుజరాత్), నూర్ అహ్మద్ (సీఎస్కే) వద్ద పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) ఉంది. వీరిద్దరు తలో 20 వికెట్లు తీశారు.పునఃప్రారంభానికి ముందు ఐపీఎల్ 2025 పరిస్థితి ఇది57 మ్యాచ్‌ల పాటు సజావుగా సాగిన ఐపీఎల్ 2025.. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా 58వ మ్యాచ్ మధ్యలో బ్రేక్ పడింది. పునఃప్రారంభానికి ముందు ఐపీఎల్ 2025 పరిస్థితి ఇలా ఉంది.పాయింట్ల పట్టిక..అత్యధిక పరుగులు..అత్యధిక వికెట్లు.. -
ఐపీఎల్ 2025 పునఃప్రారంభం.. ఎవరు తిరిగొస్తున్నారు.. ఎవరు రావడం లేదు..?
భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా వారం వాయిదా పడ్డ ఐపీఎల్ 2025 రేపటి నుండి (మే 17) పునఃప్రారంభం కానుంది. ఈ సీజన్ జూన్ 3న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. యుద్దం కారణంగా మధ్యలో వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లు ఎవరు తిరిగొస్తున్నారు.. తిరిగి రాని వారికి ప్రత్యామ్నాయాలు ఎవరు అన్న సమాచారాన్ని ఈ వార్తలో తెలుసుకుందాం. తిరిగి రాని విదేశీ క్రికెటర్లకు ప్రత్యామ్నాయ ఆటగాళ్ల ఎంపికకు ఐపీఎల్ బోర్డు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.గుజరాత్ టైటాన్స్తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..జోస్ బట్లర్ (దేశీయ విధుల కారణంగా ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండడు)కగిసో రబాడషెర్ఫాన్ రూథర్ఫోర్డ్రషీద్ ఖాన్దసున్ షనకకరీమ్ జనత్గెరాల్డ్ కొయెట్జీప్రత్యమ్నాయ ఆటగాళ్లు..కుసాల్ మెండిస్ (బట్లర్‌కు ప్రత్యామ్నాయం, ప్లే ఆఫ్స్ కోసం)ఆర్సీబీతిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..ఫిల్ సాల్ట్ లియామ్ లివింగ్స్టోన్జేకబ్ బేతెల్రొమారియో షెపర్డ్టిమ్ డేవిడ్లుంగి ఎంగిడినువాన్ తుషారఢిల్లీ క్యాపిటల్స్తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..డుప్లెసిస్సెదిఖుల్లా అటల్ట్రిస్టన్ స్టబ్స్డొనొవన్ ఫెరియెరాదుష్మంత చమీరాప్రత్యమ్నాయ ఆటగాళ్లు..ముస్తాఫిజుర్ రెహ్మాన్ (జేక్ ఫ్రేజర్‌కు ప్రత్యామ్నాయం)* ముస్తాఫిజుర్‌కు ఇంకా అతని సొంత దేశ క్రికెట్ బోర్డు నుంచి అనుమతి రాలేదు. * మిచెల్ స్టార్క్ అందుబాటులోకి వచ్చేది లేనది ఇంకా తెలియ రాలేదు.కోల్‌కతా నైట్ రైడర్స్తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..సునీల్ నరైన్ఆండ్రీ రసెల్క్వింటన్ డికాక్రహ్మానుల్లా గుర్బాజ్స్పెన్సర్ జాన్సన్అన్రిచ్ నోర్జేతిరిగి రాని ఆటగాళ్లు..రోవ్‌మన్ పోవెల్ (ఆరోగ్య సమస్య)మొయిన్ అలీ (కుటుంబ ఆరోగ్య సమస్య)పంజాబ్ కింగ్స్తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..అజ్మతుల్లా ఒమర్జాయ్మార్కో జన్సెన్జేవియర్ బార్ట్లెట్ప్రత్యమ్నాయ ఆటగాళ్లు..కైల్ జేమీసన్ (ఫెర్గూసన్‌కు ప్రత్యామ్నాయం)మిచెల్ ఓవెన్ (మ్యాక్స్‌వెల్‌కు ప్రత్యామ్నాం, ఐపీఎల్ వాయిదాకు ముందే ఎంపిక)* స్టోయినిస్, ఆరోన్ హార్డీ, జోస్ ఇంగ్లిస్‌పై ఇంకా స్పష్టత లేదు (పంజాబ్ తొలి మ్యాచ్ తర్వాత రావచ్చు)లక్నో సూపర్ జెయింట్స్తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..డేవిడ్ మిల్లర్మార్క్రమ్మిచెల్ మార్ష్మాథ్యూ బ్రీట్జ్కీనికోలస్ పూరన్షమార్ జోసఫ్ప్రత్యమ్నాయ ఆటగాళ్లు..విలియర్ ఓరూర్కీ (మయాంక్ యాదవ్‌కు ప్రత్యామ్నాయం)సన్‌రైజర్స్ హైదరాబాద్తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..పాట్ కమిన్స్ట్రవిస్ హెడ్వియాన్ ముల్దర్కమిందు మెండిస్హెన్రిచ్ క్లాసెన్ఎషాన్ మలింగరాజస్థాన్ రాయల్స్తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..హసరంగమఫాకఫజల్హక్ ఫారూకీతీక్షణబర్గర్తిరిగి రాని ఆటగాళ్లు..జోఫ్రా ఆర్చర్ (రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించలేదు)* హెట్‌మైర్ రావడం అనుమానమేచెన్నై సూపర్కింగ్స్తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..డెవాల్డ్ బ్రెవిస్రచిన్ రవీంద్రడెవాన్ కాన్వేనాథన్ ఇల్లిస్పతిరణనూర్ అహ్మద్తిరిగి రాని ఆటగాళ్లు..సామ్ కర్రన్జేమీ ఓవర్టన్ముంబై ఇండియన్స్తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..విల్ జాక్స్ (ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండడు)కార్బిన్ బాష్మిచెల్ సాంట్నర్రికెల్టన్రీస్ టాప్లేట్రెంట్ బౌల్ట్ముజీబ్ రెహ్మాన్ -
IPL 2025: ముంబై ఇండియన్స్‌లోకి శ్రీలంక కెప్టెన్..!
ఐపీఎల్-2025 రీ షెడ్యూల్ కారణంగా దారుణంగా నష్టపోతున్న ఫ్రాంచైజీలలో ముంబై ఇండియన్స్ ఒకటి. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ఆర్ధరంతరంగా ఆగిపోయిన ఈ ఏడాది ఐపీఎల్ సీజన్.. తిరిగి మే 17 నుంచి ప్రారంభం కానుంది. అయితే చాలా మంది విదేశీ ఆటగాళ్లు జాతీయ విధుల కారణంగా ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నారు.ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు స్టార్ ప్లేయర్లు ర్యాన్ రికెల్టన్, కార్బిన్ బాష్, విల్ జాక్స్ సేవలను కోల్పోయే అవకాశముంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు ఎంపిక చేసిన దక్షిణాఫ్రికా జట్టులో బాష్, రికెల్టన్ భాగంగా ఉన్నారు. బాష్, రికెల్టన్ ఒకవేళ ఐపీఎల్లో పాల్గోనేందుకు తిరిగి భారత్‌కు వచ్చినా, ప్లే ఆఫ్స్‌కు మాత్రం కచ్చితంగా దూరంగా ఉండనున్నారు.దక్షిణాఫ్రికా క్రికెట్‌తో బీసీసీఐ సంప్రదింపులు జరిపినప్పటికి.. సదరు క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లు లీగ్ పూర్తి అయ్యేంతవరకు ఉండేందుకు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు వెస్టిండీస్‌తో త్వరలో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక చేసిన ఇంగ్లండ్ జట్టులో జాక్స్ సభ్యునిగా ఉన్నాడు. అతడు కూడా భారత్‌కు తిరిగి వచ్చినా ప్లే ఆఫ్స్‌కు మాత్రం దూరంగా ఉండనున్నాడు.ముంబై జట్టులోకి శ్రీలంక కెప్టెన్..?ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంకపై కన్నేసినట్లు తెలుస్తోంది. తమ జట్టులోకి తీసుకునేందుకు చరిత్ అసలంకాతో ముంబై చర్చలు జరుపుతున్నట్లు శ్రీలంక వార్తా సంస్థ న్యూస్ వైర్ తమ కథనంలో పేర్కొంది. అసలంకకు టీ20ల్లో అద్బుతమైన రికార్డు ఉంది. అతడికి బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించే సత్తా ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో చరిత్‌కు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతడితో ఒప్పందం కుదర్చుకునేందుకు ముంబై ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా ఐపీఎల్ రీ షెడ్యూల్ కారణంగా ఈ సీజన్లో ఆటగాళ్ల తాత్కాలిక ప్రత్యామ్నాయాలకు బీసీసీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌కు ఈ ఏడాది సీజన్లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో హార్దిక్ సేన గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది.చదవండి: IPL 2025: హ్యాండ్ ఇచ్చిన జోస్ బట్లర్.. గుజరాత్ జట్టులోకి విధ్వంసకర వీరుడు? -
పంజాబ్ జట్టులోకి డేంజరస్ ప్లేయర్ ఎంట్రీ.. ఇక దబిడి దిబిడే?
ఐపీఎల్-2025 పునఃప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ మిచెల్ ఓవెన్ పంజాబ్ జట్టులో బుధవారం చేరాడు. గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన ఆరో ఆసీస్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ స్థానంలో మిచెల్ ఓవెన్‌ను పంజాబ్ మెనెజ్‌మెంట్ ఎంపిక చేసింది.కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మధ్యలో ఆగిపోవడంతో ఓవెన్.. పంజాబ్ జట్టుతో చేరడం కాస్త ఆలస్యమైంది. గురువారం(మే 15) నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌లో పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్.. ఓవెన్‌ను సహచర ఆటగాళ్లకు పరిచయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పంజాబ్ కింగ్స్ ఎక్స్‌లో షేర్ చేసింది. కాగా ఈ ఆసీస్ క్రికెటర్ ముందుగా పాకిస్తాన్ సూపర్ లీగ్-2025లో పెషావల్ జల్మి జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అతడు ఈనెల 9న ఆ జట్టు చివరి గ్రూప్ మ్యాచ్ ఆడాక ఓవెన్ ఐపీఎల్లో భాగం కావాల్సి ఉండేది. కానీ పీఎస్ఎల్ కూడా అర్ధాంతరంగా వాయిదా పడడంతో చివరి మ్యాచ్ ఆడకుండానే ఓవెన్ భారత్‌కు చేరుకున్నాడు.ఎవరీ మిచెల్ ఓవెన్..?23 ఏళ్ల మిచెల్ ఓవెన్ లిస్ట్-ఎ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్ రెండింటిలోనూ టాస్మానియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 22, 2021న మార్ష్ వన్-డే కప్‌తో లిస్ట్-ఎ క్రికెట్లో అడుగుపెట్టిన ఓవెన్.. షెఫీల్డ్ షీల్డ్‌లో సౌత్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అక్టోబర్ 3, 2023న ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. టీ20ల్లో కూడా అతడికి మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 35 టీ20లు ఆడిన ఓవెన్ 647 పరుగులు చేశాడు. అందులో 452 పరుగులు ఈ ఏడాది బిగ్‌బాష్ సీజన్లో చేసినవే కావడం గమనార్హం. బీబీఎల్ 2024-25 సీజన్లో ఓవెన్ 452 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. సిడ్నీ థండర్‌తో జరిగిన ఫైనల్లో మ్యాచ్‌లో ఓవెన్ విధ్వసకర సెంచరీతో చెలరేగాడు.కేవలం 39 బంతుల్లోనే ఓవెన్ తన రెండో బీబీఎల్ సెంచరీ మార్క్‌ను ఓవెన్ అందుకున్నాడు. ఓవెన్‌కు పేస్ బౌలింగ్ చేసే సత్తాకూడా ఉంది. అతడు త్వరలోనే ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్-2025 సీజన్ మే 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది.చదవండి: ICC: డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ.. విజేతకు ఎన్ని కోట్లంటే? -
హ్యాండ్ ఇచ్చిన జోస్ బట్లర్.. గుజరాత్ జట్టులోకి విధ్వంసకర వీరుడు?
ఐపీఎల్-2025 పునఃప్రారంభానికి సర్వం సిద్దమైంది. మే 17వ తేదీ నుంచి క్యాష్ రిచ్ లీగ్‌లోని మిగిలిన మ్యాచులు మొదలవనున్నాయి. అయితే ఐపీఎల్ పునఃప్రారం వేళ గుజరాత్ టైటాన్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్.. జాతీయ విధుల కారణంగా ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.భారత్-పాక్ మధ్య ఉద్రిక్తల కారణంగా స్వదేశానికి వెళ్లిపోయిన బట్లర్..తిరిగి ఐపీఎల్లో పాల్గోనేందుకు రావడం లేదు. ఈ విషయాన్ని బట్లర్ ఇప్పటికే గుజరాత్ ఫ్రాంచైజీకి తెలియజేశాడు. వెస్టిండీస్‌తో త్వరలో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక చేసిన ఇంగ్లండ్ జట్టులో బట్లర్ సభ్యునిగా ఉన్నాడు. మే 29 నుంచి ఇంగ్లండ్ జట్టు విండీస్ పర్యటన ప్రారంభం కానుంది. కాగా తొలుత బట్లర్ ఐపీఎల్లో ఆడేందుకు తిరిగి భారత్‌కు వస్తాడని, ప్లే ఆఫ్స్‌కు మాత్రమే దూరం కానున్నడాని వార్తలు వినిపించాయి. కానీ పూర్తిగా ఇప్పుడు మిగిలిన సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. జోస్ బట్లర్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు.ఈ ఏడాది సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన బట్లర్..71.43 సగటుతో 500 పరుగులు చేశాడు. ప్లే ఆఫ్స్‌కు ముందు బట్లర్ దూరం కావడం గుజరాత్‌కు గట్టి ఎదురు దెబ్బగానే చెప్పాలి. గుజరాత్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉంది. టైటాన్స్‌కు ఇంకా మూడు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు గిల్ సేన తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది.గుజరాత్ జట్టులోకి స్టార్ ప్లేయర్..ఇక గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం బట్లర్ స్ధానాన్ని శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండీస్‌తో భర్తీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ శ్రీలంక క్రికెటర్ పాకిస్తాన్ సూపర్ లీగ్-2025లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. అయితే పీఎస్ఎల్ తాత్కాలికంగా వాయిదా పడడంతో మెండిస్‌తో గుజరాత్ టైటాన్స్‌తో జతకట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో మే 18న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.చదవండి: IPL 2025 Resumption: ఢిల్లీ క్యాపిటల్స్‌పై దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు -
IPL 2025 Resumption: ఆర్సీబీకి శుభవార్త.. హాజిల్‌వుడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు..?
మే 17 నుంచి ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కానున్న వేల ఆర్సీబీకి శుభవార్త అందింది. భారత్-పాక్ మధ్య యుద్దం కారణంగా స్వదేశాలకు వెళ్లిపోయిన ఆ ఫ్రాంచైజీ ప్లేయర్లంతా తిరిగి వచ్చేందుకు అంగీకరించారని తెలుస్తుంది. జాతీయ విధుల కారణంగా జేకబ్ బేతెల్ ఒక్కడే తదుపరి లెగ్‌కు అందుబాటులో ఉండడని సమాచారం.స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ తిరిగొచ్చేందుకు అంగీకరించడం ఆర్సీబీకి అతి పెద్ద శుభవార్త. వాస్తవానికి హాజిల్‌వుడ్ ఐపీఎల్ వాయిదా పడకముందే గాయపడ్డాడు. రీ షెడ్యూల్ తర్వాత అతను అందుబాటులో రావడం దాదాపుగా అసాధ్యమేనని అంతా అనుకున్నారు. ఐపీఎల్ ముగిసిన వారం రోజుల్లోనే (జూన్ 11) డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో హాజిల్‌వుడ్ జాతీయ విధులకే ప్రాధ్యాన్యత ఇస్తాడని ప్రచారం జరిగింది.అయితే ఆర్సీబీ యాజమాన్యం చర్చల కారణంగా హాజిల్‌వుడ్ సీజన్ అయిపోయే వరకు ఆడేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది. మరోవైపు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా తమ ఆటగాళ్లకు లీగ్ అయిపోయే వరకు కొనసాగేందుకు అనుమతి ఇవ్వడంతో లుంగి ఎంగిడి సేవలు కూడా ఆర్సీబీ లీగ్ అయిపోయే వరకు వినియోగించుకోనుంది.మిగతా విదేశీ ఆటగాళ్ల విషయానికొస్తే.. ఫిల్ సాల్ట్ విండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపిక కాలేదు. దీంతో అతను ప్లే ఆఫ్స్‌లో ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. టిమ్ డేవిడ్, లివింగ్‌స్టోన్ వారి జట్లలో సభ్యులుగా లేరు. వీరి నుంచి కూడా ఎలాంటి సమస్య లేదు. ఐర్లాండ్‌తో సిరీస్‌కు ఎంపికైనా రొమారియో షెపర్డ్ తమ బోర్డును ఒప్పించుకుని లీగ్ మొత్తానికి అందుబాటులోకి వచ్చాడు. మొత్తంగా చూస్తే.. విదేశీ ఆటగాళ్లంతా లీగ్ అయిపోయే వరకు అందుబాటులో ఉండటం ఆర్సీబీకి శుభపరిణామంగా చెప్పవచ్చు.ఈ సీజన్లో ఆర్సీబీ గతంలో ఎన్నడూ లేనట్లుగా హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తుంది. విదేశీ ఆటగాళ్లతో పాటు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా పూర్తిగా అందుబాటులో ఉండటం (టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించడం), అందులోనూ భీకర ఫామ్‌లో ఉండటం ఆర్సీబీ తొలి టైటిల్ కలను నెరవేర్చేలా కనిపిస్తుంది. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ దేశీయ ఆటగాళ్లు కూడా అత్యంత ప్రమాదకరంగా ఉన్నారు. బౌలర్లలో యశ్ దయాల్, కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఆర్సీబీ ప్రస్తుమున్న ప్రధాన సమస్య వారి కెప్టెన్ రజత్ పాటిదార్ ఒక్కడే. పాటిదార్ గాయంతో బాధపడుతుండటంతో పాటు పెద్దగా ఫామ్‌లో లేడు. అతనితో పాటు వికెట్ కీపర్ జితేశ్ శర్మకు కూడా అంచనాలకు తగ్గట్టుగా రాణించడం లేదు. వీరిద్దరు కూడా లైన్లోకి వచ్చారంటే ఈ సీజన్లో ఆర్సీబీ టైటిల్ గెలవకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. దేవ్‌దత్ పడిక్కల్ స్థానంలో వచ్చిన మయాంక్ అగర్వాల్ కూడా టాపార్డర్‌లో మ్యాజిక్ చేసే అవకాశం ఉంది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో (11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు) ఉన్న ఆర్సీబీ.. ఈ సీజన్లో మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 17న కేకేఆర్‌తో (బెంగళూరు), మే 23న సన్‌రైజర్స్‌తో (బెంగళూరు), మే 27న లక్నోతో (లక్నో) తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. -
IPL 2025 Resumption: ఆసక్తి రేపుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడి పోస్ట్
ఐపీఎల్ ఫ్రాంచైజీలు తాత్కాలిక రీప్లేస్మెంట్ల కోసం వెతుకుతున్న వేల, టీమిండియా ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఓపెనర్ పృథ్వీ షా పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తి రేపుతోంది. ఈ సీజన్ మెగా వేలంలో అమ్ముడుపోని షా.. "బ్రేక్ కావాలంటూ" ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు షా రీప్లేస్మెంట్ ఆటగాడిగా వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు.2018లో అరంగేట్రం చేసిన 25 ఏళ్ల షా.. ఐపీఎల్లో డీసెంట్ రికార్డు (79 మ్యాచ్‌ల్లో 147.467 స్ట్రయిక్‌రేట్‌తో 1892 పరుగులు) కలిగి ఉన్నాడు. అయితే వ్యక్తిగత అలవాట్లు, ఫిట్నెస్ కోల్పోవడం అతన్ని ఐపీఎల్ పాటు దేశవాలీ క్రికెట్‌కు దూరం చేశాయి. గత సీజన్లో ఢిల్లీకి ఆడిన షా.. 8 మ్యాచ్‌ల్లో 163.63 స్ట్రయిక్‌రేట్‌తో 198 పరుగులు చేశాడు. ప్రస్తుత సీజన్లో ఢిల్లీ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ సేవలు కోల్పోవడంతో షా ఆ జట్టులో చోటు ఆశిస్తున్నాడు.ప్రస్తుత తరుణంలో షాకు ఢిల్లీ అవకాశం ఇవ్వకపోయినా ముంబై ఇండియన్స్ ఛాన్స్ ఇవ్వొచ్చన్న టాక్ నడుస్తుంది. ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇంగ్లండ్ ఆటగాడు విల్ జాక్స్ స్థానాన్ని భర్తీ చేసేందుకు దేశీయ బ్యాటర్ కోసం చూస్తుందని సమచారం. ఒకప్పుడు టీమిండియా భవిష్యత్తుగా కీర్తించబడ్డ పృథ్వీ షా ఇప్పుడు ఐపీఎల్లో ఛాన్స్ కోసం వెంపర్లాడటం ఆసక్తికరంగా మారింది. క్రమశిక్షణ లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా ఇలాంటి గతే పడుతుందని జనాలు అంటున్నారు. పృథ్వీ షాలా కావొద్దని ఇప్పుడిప్పుడే షైన్ అవుతున్న యువ ఆటగాళ్లకు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే, భారత్-పాకిస్తాన్ మధ్య యుద్దం కారణంగా వారం రోజులు వాయిదా పడిన ఐపీఎల్ 2025 మే 17 నుంచి పునఃప్రారంభం కానుంది. యుద్దం నేపథ్యంలో స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ క్రికెటర్లు జాతీయ జట్ల అవసరాల దృష్ట్యా ఐపీఎల్ తదుపరి లెగ్‌లో పాల్గొనలేకపోతున్నారు. కొందరు ఇతరత్రా కారణాల చేత ఐపీఎల్లో కొనసాగేందుకు విముఖత చూపారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ గవర్నింగ్ బాడీ తిరిగి రాని ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసుకునేందుకు ఫ్రాంచైజీలకు వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలోనే పృథ్వీ షా లాంటి చాలా మంది భారత ఆటగాళ్లు ఛాన్స్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. -
IPL 2025 Resumption: ఆ దేశ ఆటగాళ్లు లీగ్ పూర్తయ్యే వరకు అందుబాటులో ఉంటారు..!
ఐపీఎల్ 2025 విషయంలో క్రికెట్ సౌతాఫ్రికా (CSA) యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తుంది. తొలుత తమ ఆటగాళ్లు ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండరని (డబ్ల్యూటీసీ ఫైనల్ సన్నాహకాల కోసం) ప్రకటించిన ఆ క్రికెట్ బోర్డు, తాజాగా మనసు మార్చుకున్నట్లు సమాచారం. లీగ్ పూర్తయ్యే వరకు (జూన్ 3) వారి ఆటగాళ్లు సంబంధిత ఫ్రాంచైజీలతో ఉండేందుకు క్రికెట్ సౌతాఫ్రికా అంగీకరించినట్లు ఐపీఎల్ వర్గాలు అంటున్నాయి.ఈ ప్రచారం నిజమైతే ఫ్రాంచైజీలకు సగం టెన్షన్ వదిలినట్లే. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 20 మంది సౌతాఫ్రికా ఆటగాళ్లు వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిలో 8 మంది డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ ఎనిమిది మందిలో ఆరుగురు (కార్బిన్ బాష్, జన్సెన్, ఎంగిడి, రబాడ, రికెల్టన్, స్టబ్స్) ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలు ప్లే ఆఫ్స్‌లో ముందున్నాయి. ఈ ఆరుగురు ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండకపోతే సంబంధిత ఫ్రాంచైజీలు భారీగా నష్టపోతాయి.చక్రం తిప్పిన ఫ్రాంచైజీ యజమానులుక్రికెట్ సౌతాఫ్రికా ఆథ్వర్యంలో నడిచే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ ఆరు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలే నడిపిస్తున్నాయి. తాజా పరిస్థితి నేపథ్యంలో ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న ఫ్రాంచైజీల యాజమాన్యాలు చక్రం తిప్పాయి. వారు క్రికెట్ సౌతాఫ్రికాతో మాటామంతి జరిపి ఆ దేశ ఆటగాళ్లను ప్లే ఆఫ్స్ పూర్తయ్యే వరకు కొనసాగేందుకు ఒప్పించినట్లు తెలుస్తుంది.కాగా, రీ షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వారం రోజుల్లోనే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ సౌతాఫ్రికా తమ ఆటగాళ్లను ముందుగా అనుకున్నట్లు మే 26వ తేదీలోగా స్వదేశానికి తిరిగి రావాలని కోరింది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలు చక్రం తిప్పడంతో క్రికెట్ సౌతాఫ్రికా తమ సన్నాహకలను (డబ్ల్యూటీసీ ఫైనల్) వాయిదా వేసుకుంది. జూన్ 3 తర్వాతే వాటి షెడ్యూల్‌ను ప్లాస్ చేసుకుంది.ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న ఫ్రాంచైజీలకు చెందిన సౌతాఫ్రికా ఆటగాళ్లు (డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన వారు)..కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్)మార్కో జన్సెన్ (పంజాబ్ కింగ్స్)లుంగి ఎంగిడి (ఆర్సీబీ)కగిసో రబాడ (గుజరాత్)ర్యాన్ రికెల్టన్ (ముంబై)ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ)డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జన్సెన్, కగిసో రబడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్. -
IPL 2025 Resumption: బట్లర్ స్థానంలో బెయిర్‌స్టో.. హాజిల్‌వుడ్ స్థానంలో నవీన్ ఉల్ హాక్..?
వారం వాయిదా అనంతరం ఐపీఎల్ 2025 మే 17 నుండి పునఃప్రారంభం కానుంది. భారత ఆటగాళ్లంతా లీగ్ తదుపరి లెగ్ కోసం రెడీగా ఉండగా.. విదేశీ ఆటగాళ్ల పూర్తి లభ్యత ఇంకా డైలమాలో ఉంది. జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండటంతో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌కు చెందిన ఆటగాళ్లు ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో విదేశీ ఆటగాళ్ల స్థానాల్లో తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఐపీఎల్ గవర్నింగ్ బాడి అనుమతిచ్చింది.బట్లర్ స్థానంలో బెయిర్‌స్టో..?ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో ముందువరుసలో ఉన్న గుజరాత్ జోస్ బట్లర్ సేవలను లీగ్ దశ వరకే పొందగలుగుతుంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ జరిగే తేదీల్లో విండీస్‌తో వన్డే సిరీస్ షెడ్యూలై ఉండటంతో బట్లర్ ఆ మ్యాచ్‌లు ఆడేందుకు స్వదేశానికి వెళ్లిపోతాడు. అతని ప్రత్యామ్నాయ ఆటగాడిగా గుజరాత్ యాజమాన్యం జానీ బెయిర్‌స్టో పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సీజన్ మెగా వేలంలో అమ్ముడుపోని బెయిర్‌స్టోకు ఐపీఎల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఐపీఎల్లో బెయిర్‌స్టో 50 ఇన్నింగ్స్‌ల్లో 144.45 స్ట్రయిక్‌రేట్‌తో 1589 పరుగులు చేశాడు. బెయిర్‌స్టో కూడా బట్లర్ లాగే వికెట్ కమ్ బ్యాటర్. బెయిర్‌స్టోకు బట్లర్లాగే మూడో స్థానంలో ఆడిన అనుభవం ఉంది. బెయిర్‌స్టో బట్లర్ లాగే సంయమనంతో బ్యాటింగ్ చేయడంతో పాటు మెరుపులు మెరిపించగలడు. కాబట్టి గుజరాత్ యాజమాన్యం బట్లర్‌కు సరైన ప్రత్యామ్నాయంగా బెయిర్‌స్టోను భావించవచ్చు.హాజిల్‌వుడ్ స్థానంలో నవీన్..?ప్రస్తుత సీజన్లో ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న మరో జట్టు ఆర్సీబీ. ఈ సీజన్లో ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించిన హాజిల్‌వుడ్ డబ్ల్యూటీసీ ఫైనల్ కారణంగా ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. అతని స్థానాన్ని ఆర్సీబీ ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హాక్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ సీజన్ మెగా వేలంలో అమ్ముడుపోని నవీన్ ఐపీఎల్లో 18 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు తీశాడు. గత రెండు సీజన్లలో (2023, 2024) లక్నో తరఫున అద్బుతంగా రాణించిన నవీన్.. ప్లే ఆఫ్స్‌లో తమకు ఉపయోగపడగలడని ఆర్సీబీ భావించవచ్చు. నవీన్ పేరును విరాట్ కోహ్లి సిఫార్సు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గత సీజన్లో నవీన్, విరాట్ మధ్య చిన్నపాటి యుద్దం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయినా విరాట్ నవీన్ పేరును సిఫార్సు చేయడం ఆశ్చర్యంగా ఉంది. -
IPL 2025 Resumption: ఢిల్లీ క్యాపిటల్స్‌పై దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు
ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఓ ప్రత్యేక కారణంగా వార్తల్లోకెక్కింది. బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టులోకి తీసుకున్నందుకు ఆ జట్టు భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాడిని జట్టులోకి ఎలా తీసుకుంటారని భారత అభిమానులు డీసీ యాజమాన్యంపై మండిపడుతున్నారు. తాజాగా జరిగిన యుద్దంలో బంగ్లాదేశ్ పాక్‌కు అండగా నిలిచిన విషయాన్ని ప్రస్తావిస్తూ ముస్తాఫిజుర్ ఎంపికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముస్తాఫిజుర్ ఎంపిక సిగ్గుచేటు చర్యగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌మీడియా #BocottDelhiCapitals ట్రెండింగ్‌లో ఉంది.కాగా, భారత్-పాక్ మధ్య యుద్దం నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోయిన ఢిల్లీ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (ఆస్ట్రేలియా) ఐపీఎల్‌కు తిరిగి రానని స్పష్టం చేశాడు. దీంతో అతనికి ప్రత్యామ్నాయంగా డీసీ యాజమాన్యం ముస్తాఫిజుర్‌ను ఎంపిక చేసుకుంది. రూ. 6 కోట్ల భారీ మొత్తం చెల్లించి ఒప్పందం చేసుకుంది.As a Delhiite, I can no longer support @DelhiCapitals. The franchise's support for players from a country known for its anti-India stance, including backing Pakistan, is unacceptable to me. #BoycottDelhiCapitals pic.twitter.com/M3qMGcshWk— Abhinav (@AbhinavStarx) May 14, 2025ముస్తాఫిజుర్ ఎంపిక ఢిల్లీకి మేలు చేస్తుందిపై విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుత కీలక దశలో ముస్తాఫిజుర్ ఎంపిక ఢిల్లీకి మేలే చేస్తుంది. ఏదైనా కారణం చేత మిచెల్ స్టార్క్ తదుపరి మ్యాచ్‌లకు దూరమైతే ఢిల్లీని అతనే ఆదుకునే అవకాశం ఉంది. ముస్తాఫిజుర్‌కు పరిమత ఓవర్ల ఫార్మాట్లో, ముఖ్యంగా టీ20ల్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. పైగా అతను ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు. గత సీజన్లో సీఎస్కే తరఫున 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజుర్‌కు గతంలో (2022, 2023) డీసీ ఆడిన అనుభవం కూడా ఉంది.పీడ వదిలిందనుకుంటున్న అభిమానులుఢిల్లీ ఓపెనర్ మెక్‌గుర్క్ ఐపీఎల్ తదుపరి లెగ్‌కు అందుబాటులో ఉండనని ప్రకటించిన నేపథ్యంలో ఆ జట్టు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో 9 కోట్లు పెట్టి కొనుక్కున్న మెక్‌గుర్క్ దారుణంగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్‌ల్లో 105.77 స్ట్రయిక్‌రేట్‌తో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ.. ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 పరాజయాలు, ఫలితం తేలని ఓ మ్యాచ్‌లో లభించిన పాయింట్‌తో (ఎస్ఆర్హెచ్) కలుపుకుని 13 పాయింట్లు (0.362) సాధించింది.ఈ సీజన్లో డీసీ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 18న గుజరాత్‌తో (ఢిల్లీ), మే 21న ముంబై ఇండియన్స్‌తో (ముంబై), మే 24న పంజాబ్‌తో (జైపూర్) తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండు ఖచ్చితంగా గెలిస్తేనే డీసీ ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. -
IPL 2025 Resumption: ఆర్సీబీకి అదిరిపోయే వార్త
ఐపీఎల్ పునఃప్రారంభానికి ముందు ఆర్సీబీకి అదిరిపోయే వార్త అందింది. ఆ జట్టు సంచలన ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ లీగ్ తదుపరి లెగ్‌లో పాల్గొనేందుకు భారత్‌కు తిరిగి వచ్చాడు. అతనితో పాటు కేకేఆర్ ఆటగాళ్లు సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ కూడా ఇండియాలో ల్యాండ్ అయినట్లు కేకేఆర్ మెంటార్ డ్వేన్ బ్రావో సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు.Romario Shepherd is on his way for the IPL A major boost for RCB! ⭐ pic.twitter.com/OB5Uvsg7AL— Cricket Winner (@cricketwinner_) May 14, 2025ఐపీఎల్ పునఃప్రారంభం కానున్న మే 17వ తేదీ కేకేఆర్, ఆర్సీబీ బెంగళూరు వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం షెపర్డ్, నరైన్, రసెల్ బెంగళూరుకు చేరుకున్నారు. ఈ సీజన్లోనే ఆర్సీబీతో జతకట్టిన షెపర్డ్.. సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి వార్తల్లోకెక్కాడు. ఈ ఫిఫ్టి ఆర్సీబీ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టి కాగా.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైంది. ఈ ఇన్నింగ్స్ తర్వాత షెపర్డ్‌పై అంచనాలు ఒక్కసారిగా పెరిపోయాయి. ఆర్సీబీ అభిమానులు షెపర్డ్‌ను తమ తురుపుముక్కలా భావించడం మొదలు పెట్టారు.కాగా, కొద్ది రోజుల ముందు వరకు షెపర్డ్ లీగ్ తదుపరి లెగ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్న సందిగ్దత ఉండింది. ఈ దశ ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే తేదీల్లోనే వెస్టిండీస్ ఐర్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం ప్రకటించిన విండీస్ జట్టుకు షెపర్డ్ ఎంపికయ్యాడు. దీంతో అతను ఐపీఎల్‌కు తిరిగి రాడని అంతా అనుకున్నారు. అయితే అతను విండీస్ క్రికెట్ బోర్డు అనుమతి తీసుకుని ఐపీఎల్‌కు తిరిగి వచ్చినట్లు తెలుస్తుంది. ఐర్లాండ్‌తో విండీస్ వన్డే సిరీస్ మే 21, 23, 25 తేదీల్లో జరుగనుంది.ప్రస్తుతానికి షెపర్డ్ ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చాడు కానీ, ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది మరో క్వశ్చన్ మార్క్‌గా మారింది. ఎందుకంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ జరిగే రోజుల్లో వెస్టిండీస్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ జట్టుకు కూడా షెపర్డ్ ఎంపికయ్యాడు. ఐర్లాండ్‌తో సిరీస్ అంటే విండీస్ క్రికెట్ బోర్డు లైట్‌గా తీసుకుంది కానీ ఇంగ్లండ్‌తో సిరీస్ కాబట్టి షెపర్డ్‌కు తప్పక ఆడాల్సిందేనని పట్టుబట్టవచ్చు. ఈ నేపథ్యంలో షెపర్ట్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం అనుమానమే.ఇదిలా ఉంటే, ఈ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు మరో అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఆ జట్టు తదుపరి లెగ్‌లో ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో (11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు) ఉంది. ఆర్సీబీ తదుపరి ఆడబోయే మ్యాచ్‌ల్లో కేకేఆర్ (మే 17), సన్‌రైజర్స్ (మే 23), లక్నోతో (మే 27) తలపడాల్సి ఉంది. -
ఐపీఎల్ 2025కు సంబంధించి బిగ్ అప్డేట్
ఐపీఎల్ 2025కు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా స్వదేశాలకు వెళ్లిపోయిన ఆటగాళ్లకు తాత్కాలిక ప్రత్యామ్నాయాలకు ఎంపిక చేసుకునే వెసులుబాటును లీగ్ గవర్నింగ్ బాడీ కల్పించింది. అయితే ప్రత్యామ్నాయంగా వచ్చిన ఆటగాళ్లకు తదుపరి సీజన్‌కు (2026) అర్హత ఉండదని తెలిపింది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం గాయపడిన ఆటగాళ్లకు మాత్రమే ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అది కూడా సీజన్లో వారి 12వ మ్యాచ్‌లోపే ఈ అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా గవర్నింగ్ బాడీ ఫ్రాంచైజీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. కాగా, మే 17 నుంచి లీగ్ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో చాలా మంది విదేశీ ఆటగాళ్లు వేర్వేరు కారణాల చేత అందుబాటులోకి రావడానికి మొరాయిస్తున్నారు. దీంతో ఫ్రాంచైజీలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న ఫ్రాంచైజీలకు ఈ విషయం పెద్ద తలనొప్పిగా మారింది. ఫామ్‌లో లేని ఆటగాడు తిరిగి రాకపోతే ఫ్రాంచైజీలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఫామ్‌లో ఉన్న ఆటగాడిని వేరే ఆటగాడితో భర్తీ చేయాలన్నా ఫ్రాంచైజీలకు అది పెద్ద మైనస్సే అవుతుంది. ఏది ఏమైనా కీలక దశలో ప్రత్యామ్నాయ ఆటగాడిగాని ఎంపిక చేసుకునే వెసులుబాటులో లభించడంతో ఫ్రాంచైజీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.ఇదిలా ఉంటే, భారత్-పాక్ మధ్య యుద్దం కారణంగా లీగ్ వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. యుద్దం సమసిపోవడంతో లీగ్ రివైజ్డ్ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ షెడ్యూల్ వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్‌తో క్లాష్ అయ్యింది. ఈ సిరీస్ జరగాల్సిన మే 29, జూన్ 1, 3 తేదీల్లో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రీ షెడ్యూల్ అయ్యాయి. దీంతో ప్లే ఆఫ్స్‌కు ఎంపికైన ఫ్రాంచైజీలకు సంబంధించిన ఆటగాళ్లు (ఇంగ్లండ్, వెస్టిండీస్ సిరీస్‌కు ఎంపికైన వారు) దేశమా.. ఐపీఎలా అని తేల్చుకోలేకపోతున్నారు.దేశానికే ఆడాలని విండీస్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లపై (ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపికైన వారిని) ఎలాంటి ఒత్తిడి చేయనప్పటికీ.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మాత్రం జాతీయ విధులే ముఖ్యమని తేల్చి చెప్పింది. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు లీగ్ దశ మ్యాచ్‌లు పూర్తి కాగానే జాతీయ విధులు నిర్వర్తించేందుకు వెళ్లిపోతారు. విండీస్ ఆటగాళ్లు ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉంటారా లేరా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ సమయంలో జరిగే వన్డే మ్యాచ్‌ల్లో పాల్గొనాల్సిన ఇంగ్లండ్, విండీస్ ఆటగాళ్లు..జేకబ్ బేతెల్ (ఆర్సీబీ)విల్ జాక్స్ (ముంబై ఇండియన్స్)జోస్ బట్లర్ (గుజరాత్)షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (గుజరాత్)రొమారియో షెపర్డ్ (ఆర్సీబీ)జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్ రాయల్స్), జేమీ ఓవర్టన్ (సీఎస్కే) కూడా ఈ సిరీస్‌కు ఎంపికైనప్పటికీ వారి ఫ్రాంచైజీలు ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించాయి. -
IPL 2025 Resumption: ఆ ఇంగ్లిష్ ప్లేయర్లు వస్తారు కానీ..!
వాయిదా అనంతరం జరుగబోయే ఐపీఎల్ 2025లో పాల్గొనాల్సి ఉన్న ఇంగ్లండ్ ప్లేయర్లపై సందిగ్దత వీడింది. జోస్ బట్లర్ (గుజరాత్ టైటాన్స్), విల్ జాక్స్ (ముంబై ఇండియన్స్), జేకబ్ బేతెల్ (ఆర్సీబీ), లియామ్ లివింగ్‌స్టోన్ (ఆర్సీబీ) ఐపీఎల్ తదుపరి లెగ్‌లో పాల్గొనేందుకు భారత్‌కు వస్తారని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు (ఈసీబీ) చెందిన ఓ కీలక అధికారి స్పష్టం చేశారు. అయితే వీరిలో వెస్టిండీస్ సిరీస్‌కు (ఐపీఎల్ ప్లే ఆఫ్స్ సమయంలో జరిగే సిరీస్) ఎంపికైన బట్లర్, బేతెల్, జాక్స్ లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యే వరకే సంబంధిత ఫ్రాంచైజీలతో ఉంటారని, ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని తేల్చేశారు.మరోవైపు జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్ రాయల్స్), జేమీ ఓవర్టన్ (సీఎస్కే), సామ్ కర్రన్ (సీఎస్కే) ఐపీఎల్ తదుపరి లెగ్‌లో పాల్గొనేందుకు భారత్‌కు తిరిగి రారని కూడా స్పష్టం చేశారు. మరో ఇద్దరు ఇంగ్లిష్ ఆటగాళ్లు ఫిల్ సాల్ట్ (ఆర్సీబీ), మొయిన్ అలీపై (కేకేఆర్) క్లారిటీ లేదని అన్నారు.సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్కు సంబంధించి వారి ఫ్రాంచైజీ (సీఎస్కే) ఇదివరకు ఈ విషయాన్ని స్పష్టం చేయగా.. రాజస్థాన్ కూడా ఆర్చర్ అందుబాటులోకి రాడన్న విషయాన్ని లైట్‌గా తీసుకుంది. ఈ రెండు ఫ్రాంచైజీలు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. కర్రన్, ఓవర్టన్, ఆర్చర్‌కు తాత్కాలిక రీప్లేస్మెంట్ల కోసం కూడా ఆయా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది.కాగా, ఐపీఎల్ ప్లే ఆఫ్స్ జరిగే తేదీల్లో (మే 29, జూన్ 1, 3) ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. హ్యారీ బ్రూక్ తొలిసారి నాయకత్వం వహిస్తున్న ఇంగ్లిష్ జట్టులో ఐపీఎల్ స్టార్లు బట్లర్, ఆర్చర్, ఓవర్టన్, విల్ జాక్స్, జేకబ్ బేతెల్‌కు చోటు దక్కింది.ఇదిలా ఉంటే, భారత్-పాక్ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మధ్యలో విదేశీ ఆటగాళ్లంతా స్వదేశాలకు వెళ్లిపోయారు. జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించాల్సిన ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా ఐపీఎల్ తదుపరి లెగ్‌లో పాల్గొనేందుకు తిరిగి భారత్‌కు రానున్నారు. మే 8న రద్దైన ఐపీఎల్.. మే 17న పునఃప్రారంభం కానుంది. లీగ్ దశ మ్యాచ్‌లు మే 27న ముగియనుండగా.. మే 29 (తొలి క్వాలిఫయర్), మే 30 (ఎలిమినేటర్), జూన్ 1 (రెండో క్వాలిఫయర్) తేదీలోల ప్లే ఆఫ్స్ జరుగనున్నాయి. జూన్ 3న ఫైనల్ జరుగనుంది. -
రాజస్తాన్ క్యాంపులో చేరిన సంజూ శాంసన్.. వీడియో వైరల్
ఐపీఎల్-2025 మరో మూడు రోజుల్లో పునఃప్రారంభం కానుంది. భారత్-పాక్ మధ్య యుద్ద వాతవారణం నెలకొనడంతో తాత్కాలికంగా వాయిదా పడిన ఈ ఏడాది ఐపీఎల్ సీజన్.. మే 17 నుంచి తిరిగి అభిమానులను అలరించనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ సీజన్ రీస్టార్ట్ అవుతుండడంతో ఆటగాళ్లు ఒక్కొకరుగా తమ జట్లతో కలుస్తున్నారు. తాజాగా రాజస్తాన్ రాయల్స్ క్యాంపులో కెప్టెన్ సంజూ శాంసన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ మెనెజ్‌మెంట్ షేర్ చేసింది. ఆ వీడియోలో సంజూకు రాజస్తాన్ ఫ్యాన్స్ ఘన స్వాగతం పలుకుతున్నట్లు కన్పించింది. కాగా రాజస్తాన్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్.. కేవలం మూడింట మాత్రమే విజయం సాధించింది. రాయల్స్‌కు ఇంకా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఆర్ఆర్ జట్టు భావిస్తోంది.ఫిట్‌నెస్‌పై నో క్లారిటీ?కాగా పక్కటెముక గాయంతో బాధపడుతున్న సంజూ శాంసన్.. ఆఖరి రెండు మ్యాచ్‌లలోనైనా ఆడుతాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. సంజూ ఈ ఏడాది సీజన్లో కేవలం 7 మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. మిగితా మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అతడి స్ధానంలో రాజస్తాన్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్ వ్యవహరిస్తున్నాడు. సంజూ 7 మ్యాచ్‌ల్లో 37 సగటుతో 224 పరుగులు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో మే 18న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. Our Malluminati is back! 💗🔥 pic.twitter.com/RNOdhYEIcl— Rajasthan Royals (@rajasthanroyals) May 14, 2025చదవండి: Rohit-Kohli: ప్రస్తుతానికి ఎలాంటి కమిట్మెంట్స్ లేవు.. ఫోకస్ అంతా ఐపీఎల్‌పైనే..! -
Rohit-Kohli: ప్రస్తుతానికి ఎలాంటి కమిట్మెంట్స్ లేవు.. ఫోకస్ అంతా ఐపీఎల్‌పైనే..!
రోజుల వ్యవధిలో టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెట్ దిగ్గజాలు ప్రస్తుతం తమ ఫోకస్ అంతా ఐపీఎల్ 2025పైనే పెట్టారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు, మధ్యలో కూడా వారిపై ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు సంబంధించిన ఒత్తిడి ఉండేది. టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వారిద్దరు ఫ్రీబర్డ్స్ అయ్యారు. వారిపై ఐపీఎల్ మినహా ఎలాంటి బాధ్యతా లేదు. ఈ ఇద్దరు దిగ్గజాలు అంతర్జాతీయ టీ20లకు గతేడాదే రిటైర్మెంట్ ప్రకటించారు. వారు ఇకపై భారత్ తరఫున వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉంటారు. భారత్ ఆడబోయే వన్డేలు సమీప భవిష్యత్తులో లేవు. దీంతో వారి దృష్టి మొత్తం ఐపీఎల్ 2025పైనే కేంద్రీకృతమై ఉంది.మే 17 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్, కోహ్లి ముందున్న తక్షణ కర్తవ్యం వారి జట్లను ప్లే ఆఫ్స్‌కు చేర్చడం. ఇందు కోసం వారు అందరి కంటే ముందుగానే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఐపీఎల్ రీవైజ్డ్ షెడ్యూల్‌కు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా లేదా అన్న సందిగ్దత కొనసాగుతుండగా.. ఈ భారత సూపర్ స్టార్లు మాత్రం దాని తాలూకా ఆలోచనలు లేకుండా ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నారు. ఐపీఎల్ తదుపరి లెగ్ కోసం రోహిత్ మూడు రోజుల కిందటి ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. విరాట్ ఇవాళే బరిలోకి దిగాడని తెలుస్తుంది.ఐపీఎల్ పాక్షికంగా వాయిదా పడే సమయానికి రోహిత్, విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్, ఆర్సీబీ పాయింట్ల పట్టికలో నాలుగు, రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ బెర్తుకు అతి చేరువలో ఉన్నాయి. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై 7 విజయాలతో 14 పాయింట్లు సాధించగా.. ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో ఎనిమిది గెలిచి 16 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ముంబై ఈ సీజన్లో మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 21న ఢిల్లీతో (ముంబై), మే 26న పంజాబ్‌తో (జైపూర్) తలపడనుంది. ముంబై ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ బెర్త్ సాధిస్తుంది.ఆర్సీబీ విషయానికొస్తే.. ఆ జట్టు ఈ సీజన్లో మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 17న కేకేఆర్‌తో (బెంగళూరు), మే 23న సన్‌రైజర్స్‌తో (బెంగళూరు), మే 27న లక్నోతో (లక్నో) తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది.ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ తమ ఆరో టైటిల్ వేట కొనసాగిస్తుండగా.. ఆర్సీబీ తమ తొలి టైటిల్ దిశగా సానుకూల అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ కమిట్మెంట్స్ లేని రోహిత్, విరాట్ తమ జట్లకు ఐపీఎల్ టైటిల్ గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. -
ఐపీఎల్‌కు తిరిగి రానని స్పష్టం చేసిన ఆసీస్ ప్లేయర్.. ప్రత్యామ్నాయ ఆటగాడి ప్రకటన
భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మధ్యలో విదేశీ ఆటగాళ్లంతా స్వదేశాలకు వెళ్లిపోయారు. మే 17 నుంచి ఐపీఎల్ తిరిగి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో చాలా మంది ఆటగాళ్లు తిరిగి భారత్‌కు వచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. జాతీయ జట్ల అవసరాల దృష్ట్యా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌కు చెందిన ఆటగాళ్లు లీగ్ తదుపరి లెగ్‌కు అందుబాటులో ఉండరని తెలుస్తుంది.ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపుతూ ఐపీఎల్ తదుపరి మ్యాచ్‌ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. దీంతో డీసీ యాజమాన్యం అతనికి ప్రత్యామ్నాయంగా బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఎంపిక చేసుకుంది. ముస్తాఫిజుర్‌ను డీసీ రూ. 6 కోట్లకు సొంతం చేసుకుంది. ముస్తాఫిజుర్ ఈ సీజన్లో డీసీ అడబోయే తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న డీసీ.. ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 పరాజయాలు, ఫలితం తేలని ఓ మ్యాచ్‌లో లభించిన పాయింట్‌తో కలుపుకుని 13 పాయింట్లు (0.362) సాధించింది. ఈ సీజన్లో డీసీ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 18న గుజరాత్‌తో (ఢిల్లీ), మే 21న ముంబై ఇండియన్స్‌తో (ముంబై), మే 24న పంజాబ్‌తో (జైపూర్) తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండు ఖచ్చితంగా గెలిస్తేనే డీసీ ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా మే 8న ఢిల్లీ, పంజాబ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. అంతకుముందు హైదరాబాద్‌లో ఢిల్లీ, సన్‌రైజర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఫలితాలు వచ్చినా ఢిల్లీకి వ్యతిరేకంగా ఉండేవి. ఈ రెంటిలో సన్‌రైజర్స్ మ్యాచ్‌కు గానూ ఢిల్లీకి ఓ పాయింట్ లభించగా.. పంజాబ్‌తో మ్యాచ్‌ను తిరిగి మొదటి నుండి ప్రారంభించనున్నారు (మే 24). పంజాబ్‌తో మ్యాచ్ రద్దయ్యే సమయానికి ఢిల్లీ ధీన స్థితిలో ఉండింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్మ, ప్రభ్‌సిమ్రన్ చెలరేగిపోయారు. 10 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 122 పరుగులు చేసింది.పీడ వదిలిందనుకుంటున్న ఢిల్లీ అభిమానులుఢిల్లీ ఓపెనర్ మెక్‌గుర్క్ ఐపీఎల్ తదుపరి లెగ్‌కు అందుబాటులో ఉండనని ప్రకటించిన నేపథ్యంలో ఆ జట్టు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో 9 కోట్లు పెట్టి కొనుక్కున్న మెక్‌గుర్క్ దారుణంగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్‌ల్లో 105.77 స్ట్రయిక్‌రేట్‌తో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు డకౌట్లు ఉన్నాయి. మెక్‌గుర్క్ స్థానంలో వచ్చిన ముస్తాఫిజుర్ బౌలింగ్ విభాగంలో ఉపయోగపడగలడని డీసీ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ డబ్ల్యూటీసీ ఫైనల్ కారణంగా తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. ప్లే ఆఫ్స్ బెర్త్ సాధించాలంటే ఫామ్‌లోనే లేని మెక్‌గుర్క్ కంటే ముస్తాఫిజుర్ నయమవుతాడని డీసీ అభిమానులు అనుకుంటున్నారు. -
IPL 2025 Revised Schedule: సీఎస్కే అభిమానులకు శుభవార్త
మే 17 నుంచి ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎస్కే అభిమానులకు శుభవార్త. జేమీ ఓవర్టన్ (ఇంగ్లండ్) మినహా అందరు విదేశీ ఆటగాళ్లు తమ తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారని ఆ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథ్ స్పష్టం చేశారు. ఓవర్టన్ తన జాతీయ జట్టుకు (విండీస్‌తో వన్డే సిరీస్) ప్రాతినిథ్యం వహించాల్సి ఉండటంతో అతను భారత్‌కు తిరిగి రాలేడని విశ్వనాథ్ తెలిపారు.సీఎస్కేలో ఉన్న మిగతా విదేశీ ఆటగాళ్లు డెవాల్డ్ బ్రెవిస్ (సౌతాఫ్రికా), రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్), సామ్ కర్రన్ (ఇంగ్లండ్), డెవాన్ కాన్వే (న్యూజిలాండ్), మతీష పతిరణ (శ్రీలంక), నాథన్ ఇల్లిస్ (ఆస్ట్రేలియా), నూర్ అహ్మద్ (ఆఫ్ఘనిస్తాన్) త్వరలో జట్టులో చేరతారని పీటీఐకి చెప్పారు.కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సీఎస్కే ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట మాత్రమే విజయాలు సాధించిన ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ సీజన్లో సీఎస్కే మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. మే 20న రాజస్థాన్ రాయల్స్‌తో (ఢిల్లీలో).. మే 25న గుజరాత్‌తో (అహ్మదాబాద్‌లో) తలపడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లతో సీఎస్కేకు కానీ వారి ప్రత్యర్థులకు కానీ ఎలాంటి ఉపయోగం లేదు. ఈ రెండు మ్యాచ్‌లు నామమాత్రంగానే సాగనున్నాయి. గుజరాత్ ప్లే ఆఫ్స్ బెర్త్‌కు అతి సమీపంలో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ సీఎస్కే తర్వాత ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.ఇదిలా ఉంటే, భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మధ్యలో విదేశీ ఆటగాళ్లంతా స్వదేశాలకు వెళ్లిపోయారు. ఐపీఎల్ తిరిగి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో చాలా మంది తిరిగి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. జాతీయ జట్ల అవసరాల దృష్ట్యా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌కు చెందిన ఆటగాళ్లు లీగ్ తదుపరి లెగ్‌కు అందుబాటులో ఉండరని తెలుస్తుంది. ఐపీఎల్ రీ షెడ్యూల్ అయిన తర్వాత వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్‌తో క్లాష్ అయ్యింది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ జరిగే తేదీల్లోనే ఈ సిరీస్ జరుగనుంది.ఐపీఎల్ ముగిసిన తర్వాత వారం వ్యవధిలోనే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య అత్యంత కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌కు కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆ రెండు జట్ల క్రికెట్ బోర్డులు ఐపీఎల్ తదుపరి లెగ్ నుంచి వైదొలగాలని భావిస్తున్నాయి. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆటగాళ్ల ఇష్టానికే ఈ విషయాన్ని వదిలిపెట్టగా.. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు మాత్రం తమ ఆటగాళ్లను తిరిగి వచ్చేయాలని ఒత్తిడి చేస్తోంది. -
ఐపీఎల్ రీ స్టార్ట్.. ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్!
ఐపీఎల్-2025 సీజన్ పునఃప్రారంభానికి సమయం అసన్నమవుతోంది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఈ ఏడాది క్యాష్‌రిచ్ లీగ్ సీజన్ తిరిగి మే 17 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే రీ షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ప్రకటించింది.అయితే ఐపీఎల్ తాతాత్కాలికంగా వాయిదా పడడంతో చాలా మంది విదేశీ ఆటగాళ్లు తమ స్వదేశానికి వెళ్లిపోయారు. దీంతో వారు మిగిలిన మ్యాచ్‌లు కోసం తిరిగి భారత్‌కు వస్తారా లేదా అన్న సందిగ్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందింది.న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తిరిగి ముంబై ఇండియన్స్ జట్టులో చేరనున్నాడు. వారం పాటు ఈ ధనాధాన్ టీ20 లీగ్ వాయిదా పడడంతో బౌల్ట్ తన స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఐపీఎల్ మళ్లీ రీ స్టార్ట్ కానుండడంతో బౌల్ట్ ఒకట్రెండు రోజుల్లోనే భారత గడ్డపై అడుగుపెట్టనున్నట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో తమ కథనంలో పేర్కొంది. ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఇంకా రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో ఉన్న ముంబై.. తమ ప్లే ఆఫ్స్ స్ధానాన్ని పదిలి చేసుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాలి.ఈ సమయంలో బౌల్ట్ తిరిగి జట్టులో చేరడం ముంబైకి కలిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. ఈ ఏడాది సీజన్లో బౌల్ట్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఈ కివీ స్టార్ పేసర్.. 18 వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్ తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో మే 21న ఢిల్లీ క్యాపిటల్స్, మే 26న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. దిగ్గజాలకు సైతం సాధ్యం కాని ఘనత సాధించాడు -
‘మాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఇలా’!.. మండిపడ్డ ప్రీతి జింటా
ప్రీతి జింటా (Preity Zinta).. కేవలం నటిగానే కాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ సహ యజమానిగానూ గుర్తింపు సంపాదించారు. ఐపీఎల్ వేలం సమయంలో ఆటగాళ్ల కొనుగోలు విషయంలో అనుసరించే వ్యూహాలలో భాగమయ్యే ప్రీతి.. స్టేడియంలో తమ జట్టు ఆటగాళ్లను ఉత్సాహపరచడంలోనూ ముందే ఉంటారు.ఇక ఐపీఎల్-2025 (IPL 2025)లో టైటిల్ దిశగా పంజాబ్ కింగ్స్ దూసుకుపోతుండటంతో ప్రీతి ఆనందంలో మునిగితేలుతున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె.. తన వ్యక్తిగత విషయాలతో పాటు, పంజాబ్ జట్టుకు సంబంధించిన విశేషాలను కూడా షేర్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలో ఇటీవల ప్రీతి జింటాకు చేదు అనుభవం ఎదురైంది. ‘ఎక్స్’ వేదికగా ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించగా ఓ నెటిజన్ అనుచిత ప్రశ్నతో ప్రీతికి ఆగ్రహం తెప్పించాడు.మాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే..పంజాబ్ కింగ్స్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ ప్రదర్శనను ప్రీతితో ముడిపెడుతూ.. ‘‘మేడమ్.. మీరు మాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే.. అతడు మీ జట్టుకు సరిగ్గా ఆడటం లేదు’’ అంటూ నీచంగా కామెంట్ చేశాడు. ఇందుకు ప్రీతి జింటా గట్టిగానే బదులిచ్చారు.ఇదే ప్రశ్న వారినీ అడగగలవా? ‘‘ఐపీఎల్ ఫ్రాంఛైజీల పురుష యజమానులను కూడా నువ్వు ఇదే ప్రశ్న అడగగలవా? లేదా మహిళను కాబట్టి నా పట్ల ఇలా వివక్షపూరితంగా కామెంట్ చేస్తున్నావా?క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టేంత వరకు కార్పొరేట్ సెటప్‌లో మహిళలు ఎంతగా కష్టపడాల్సి వస్తుందో నాకసలు తెలియదు. నాకు తెలిసి నువ్వు ఏదో సరదా కోసమని ఇలా మాట్లాడి ఉంటావు.. కానీ దయచేసి ఇలా చెత్తగా ప్రవర్తించవద్దు.గత పద్దెమినిదేళ్లుగా నేను కష్టపడి సంపాదించుకున్న పేరుకు కాస్త గౌరవం ఇవ్వండి. అందుకు నేను కచ్చితంగా అర్హురాలినే. ఇలా లింగవివక్షకు పాల్పడటం సరికాదు.. ధన్యవాదాలు’’ అంటూ ప్రీతి జింటా దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు.ప్లే ఆఫ్స్ బెర్తు దాదాపుగా ఖాయంకాగా కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకున్న పంజాబ్.. టైటిల్ లేని లోటును ఈసారి ఎలాగైనా తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ సీజన్లో ఇప్పటికి 11 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడింట గెలిచింది. ప్రస్తుతం 15 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.ఇక ఇటీవల భారత్- పాకిస్తాన్ సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ధర్మశాలలో బ్లాక్ అవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) విధించడంతో హుటాహుటిన స్టేడియాన్ని ఖాళీ చేయించాల్సి రాగా.. ప్రీతి జింటా కూడా తన వంతు సాయం చేశారు.మరోవైపు.. ఐపీఎల్లో గతంలో పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్.. ఐపీఎల్-2025లో తిరిగి జట్టుతో చేరాడు. అయితే, ఈసారి అతడి ప్రదర్శన అస్సలు బాగాలేదు. ఏడు మ్యాచ్‌లు ఆడి కేవలం 48 పరుగులే చేశాడు. ఇక గాయం కారణంగా మధ్యలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. చదవండి: తుదిజట్టులో చోటే కష్టం.. అలాంటి ఆటగాడు కెప్టెనా?: భారత మాజీ క్రికెటర్ -
IPL 2025: మే 26లోగా తిరిగి రండి.. సౌతాఫ్రికా ప్లేయర్లకు వార్నింగ్..!
ముందుగా అనుకున్నట్లుగా మే 26 తేదీలోగా స్వదేశానికి తిరిగి రావాలని ఐపీఎల్-2025 ఆడుతున్న తమ ఆటగాళ్లకు (డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన వారికి) క్రికెట్ సౌతాఫ్రికా వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 20 మంది సౌతాఫ్రికా ఆటగాళ్లు వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిలో 8 మందికి డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన సౌతాఫ్రికా జట్టులో చోటు దక్కింది.ఈ ఎనిమిది మంది విషయంలోనే క్రికెట్ సౌతాఫ్రికా, ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య పేచీ పడేలా ఉంది. సంబంధిత ఫ్రాంచైజీలు క్రికెట్ సౌతాఫ్రికాతో చర్చలు జరుపుతున్నా వారు ససేమిరా అంటున్నట్లు తెలుస్తుంది. ఆటగాళ్లకు లీగ్ కంటే దేశమే ముఖ్యం కావాలని సౌతాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ భావోద్వేగంతో పిలుపునిచ్చాడు. సదరు 8 మంది సౌతాఫ్రికా ప్లేయర్ల నిర్ణయంపై వారి ఫ్రాంచైజీల భవితవ్యం ఆధారపడి ఉంది.డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన 8 మంది సౌతాఫ్రికా ఆటగాళ్లు (ఐపీఎల్ ఆడుతున్న వారు)..కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్)మార్కో జన్సెన్ (పంజాబ్ కింగ్స్)లుంగి ఎంగిడి (ఆర్సీబీ)కగిసో రబాడ (గుజరాత్)ర్యాన్ రికెల్టన్ (ముంబై)ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ)ఎయిడెన్ మార్క్రమ్ (లక్నో)వియాన్ ముల్దర్ (ఎస్ఆర్హెచ్)పైనున్న ఆటగాళ్లలో ఐదుగురు (కార్బిన్ బాష్, జన్సెన్, ఎంగిడి, రబాడ, రికెల్టన్) సంబంధిత ఫ్రాంచైజీలకు ప్లే ఆఫ్స్‌లో కీలకమవుతారు. వీరు అందుబాటులో లేకపోతే వారి జట్ల విజయావకాశాలు ఖచ్చితంగా ప్రభావితమవుతాయి. మిగతా ముగ్గురు (స్టబ్స్, మార్క్రమ్, ముల్దర్) ఆటగాళ్లలో ఒకరి (ముల్దర్) జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించడంతో ఎలాంటి ఇబ్బంది లేదు. మరో ఇద్దరి (స్టబ్స్, మార్క్రమ్) జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం లైన్లో ఉన్నాయి. క్రికెట్ సౌతాఫ్రికా, బీసీసీఐ మధ్య ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం.. మే 25న ఐపీఎల్ ఫైనల్ ముగిస్తే, ఆ మరుసటి రోజే (మే 26) సౌతాఫ్రికా ఆటగాళ్లంతా స్వదేశానికి బయల్దేరాలి. అనంతరం మే 30న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన సౌతాఫ్రికా జట్టు ఇంగ్లండ్‌కు బయల్దేరాలి. అక్కడు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు జింబాబ్వేతో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. జూన్ 7న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం లండన్‌కు బయల్దేరాలి. ఐపీఎల్ 2025 ముందస్తు షెడ్యూల్ ప్రకారం సౌతాఫ్రికా జట్టు ప్రణాళిక ఇది.అయితే భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడింది. దీంతో సీన్ మొత్తం మారిపోయింది. ఐపీఎల్ రివైజ్డ్ షెడ్యూల్‌కు (జూన్ 3) డబ్ల్యూటీసీ ఫైనల్‌కు (జూన్ 11) కేవలం వారం రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. దీని వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఆటగాళ్లు ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌ల వరకు మాత్రమే అందుబాటులో ఉండే పరిస్థితి ఏర్పడింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జన్సెన్, కగిసో రబడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్.డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక కాని మిగతా సౌతాఫ్రికా ఆటగాళ్లు (ఐపీఎల్ ఆడుతున్న వారు)..డెవాల్డ్ బ్రెవిస్ (చెన్నై సూపర్ కింగ్స్), ఫాఫ్ డుప్లెసిస్, డోనోవన్ ఫెరీరా (ఢిల్లీ క్యాపిటల్స్), గెరాల్డ్ కోట్జీ (గుజరాత్ టైటాన్స్), క్వింటన్ డికాక్, అన్రిచ్ నోర్ట్జే (కోల్‌కతా నైట్ రైడర్స్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ బ్రీట్జ్కే (లక్నో), నండ్రే బర్గర్, క్వేనా మఫాకా, డ్రే ప్రిటోరియస్ (రాజస్థాన్ రాయల్స్), హెన్రిచ్ క్లాసెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) -
IPL 2025: ఎవరు ఆడతారు... ఎవరు ఆగిపోతారు?
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఇప్పుడు లీగ్‌లో జరగాల్సిన తర్వాతి మ్యాచ్‌లపై అందరి దృష్టీ నిలిచింది. ఆరు నగరాలు బెంగళూరు, ముంబై, లక్నో, అహ్మదాబాద్, ఢిల్లీ, జైపూర్లలో మిగిలిన 13 లీగ్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్ధమైన గవర్నింగ్ కౌన్సిల్... ‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్‌ల వేదికలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు మ్యాచ్‌ల వేదికలకంటే ఆయా జట్లకు ఎవరెవరు ఆటగాళ్లు అందుబాటులో ఉంటారనే విషయంపైనే ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్‌ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు మే 9న ప్రకటించడంతోనే దాదాపు అందరు విదేశీ క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నవారు కూడా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు మే 17 నుంచి ఐపీఎల్ మళ్లీ మొదలవుతున్నట్లుగా బీసీసీఐ సోమవారమే ప్రకటించింది. దాంతో ఫ్రాంచైజీలు తమ జట్లలోని కీలక ఆటగాళ్లను రప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఆటగాళ్ల ఇష్టానికి... యుద్ధం కారణంగా టోర్నీ వాయిదా పడకుండా ఉంటే మే 25న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ ముగియాల్సి ఉంది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ 3 వరకు టోర్నీ పొడిగించాల్సి వచ్చింది. అయితే విదేశీ ఆటగాళ్లందరూ మే 25 ప్రకారమే సిద్ధమై లీగ్ కోసం తమ ప్రణాళికలకు రూపొందించుకున్నారు. ఆ తేదీ తర్వాత ఆయా జాతీయ జట్ల సిరీస్‌లు, ఇతర ఒప్పందాల ప్రకారం వారు ఐపీఎల్లో కొనసాగే అవకాశం లేదు. ఐపీఎల్ తేదీల ప్రకారమే తాము ఎన్ఓసీలు జారీ చేశామని, దీనిపై మళ్లీ చర్చించిన తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. న్యూజిలాండ్ బోర్డు కూడా దాదాపు ఇదే తరహాలో స్పందించింది. మరో వైపు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ఆటగాళ్ల ఇష్టానికి వదిలేసింది. వారి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రధానంగా రెండు సిరీస్‌ల కారణంగా ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్లు ఆడే విషయంలో ఇబ్బంది ఎదురు కావచ్చు. ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్‌లో పాల్గొనే ఆటగాళ్లలో చాలా మంది ఐపీఎల్లో భాగంగా ఉన్నారు. ఐపీఎల్ కొత్త తేదీల్లోనే ఈ సిరీస్ ఉంది. మరో వైపు జూన్ 11 నుంచి ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఉంది. ఇందులో ఆడే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెటర్లలో చాలా మంది కోసం ఐపీఎల్ టీమ్‌లు ఎదురు చూస్తున్నాయి. మే 31న ఎట్టి పరిస్థితుల్లోనూ టెస్టు టీమ్ ఒక చోటకు చేరాలని దక్షిణాఫ్రికా బోర్డు స్పష్టంగా ఆదేశించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన దక్షిణాఫ్రికా జట్టులోంచి రబడ, ఎన్గిడి, స్టబ్స్, మార్క్రమ్, రికెల్టన్, బాష్, యాన్సెన్, ముల్డర్ ప్రస్తుతం ఐపీఎల్ జట్లలో ఉన్నారు.అహ్మదాబాద్‌లోనే ఫైనల్! ‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్‌ల వేదికల విషయంలో బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. పాత షెడ్యూల్ ప్రకారం రెండు మ్యాచ్‌లు హైదరాబాద్, మరో రెండు కోల్‌కతాలో జరగాల్సి ఉంది. అయితే ఈ రెండు నగరాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక ఏర్పాట్ల సమస్యను దృష్టిలో ఉంచుకొని ‘ప్లే ఆఫ్స్’ను ఇక్కడి నుంచి తరలించాలని బోర్డు యోచిస్తోంది. మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించిన ఎక్విప్మెంట్ను సిద్ధం చేయడంతో పాటు ఇతర ఏర్పాట్లు కూడా కొత్త వేదికలో కష్టమని భావిస్తోంది. పైగా ‘ప్లే ఆఫ్స్’ తేదీల్లో హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో వర్ష సూచన ఉంది. అందుకే మిగిలిన లీగ్ మ్యాచ్‌ల కోసం ఇప్పటికే ఎంపిక చేసిన ఆరు వేదికల నుంచి ఏవైనా రెండింటిలో ‘ప్లే ఆఫ్స్’ జరపాలనేది ఆలోచన. ఇదే కారణంగా చెన్నై, హైదరాబాద్ తమ హోం గ్రౌండ్లో ఆడాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌లను కూడా ఫ్రాంచైజీలకు చెప్పి అక్కడి నుంచి తరలించారు. టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన ఈ రెండు జట్ల చివరి మ్యాచ్‌లకు ఢిల్లీ వేదికవుతోంది. బీసీసీఐ యోచన ప్రకారం క్వాలిఫయర్–1, ఎలిమినేటర్లను ముంబైలో నిర్వహించి... క్వాలిఫయర్–2, ఫైనల్ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో నిర్వహించవచ్చు. -
IPL 2025: గుజరాత్, ఆర్సీబీ, ముంబై జట్లకు భారీ షాకిచ్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు
ఐపీఎల్ ఫ్రాంచైజీలు గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. ప్లే ఆఫ్స్ రేసులో ముందు వరుసలో ఉన్న ఈ మూడు జట్లకు చెందిన ప్రధాన ఆటగాళ్లను త్వరలో వెస్టిండీస్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది. ఐపీఎల్ 2025లో కీలకమైన ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు జరుగుతుండగా వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ జరుగనుంది. భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్ వారం రోజుల వాయిదా పడిన విషయం తెలిసిందే. అనంతరం ప్రకటించిన రివైజ్డ్ షెడ్యూల్‌తో ఈ సిరీస్ క్లాష్ అయ్యింది.ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ఈ సిరీస్‌లో తొలి వన్డే మే 29న, రెండో వన్డే జూన్ 1, మూడో వన్డే జూన్ 3వ తేదీన జరుగనున్నాయి. సరిగ్గా ఇదే తేదీల్లో ఐపీఎల్ క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ రేసుకు సమీపంలో ఉన్న జట్లకు చెందిన ఆటగాళ్లను, అదే తేదీల్లో జరిగే సిరీస్‌కు ఎంపిక చేయడంతో సదరు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పాలుపోవడం లేదు. ఇంగ్లండ్ వన్డే జట్టుకు ఎంపిక చేసిన ఆటగాళ్లలో జోస్ బట్లర్ గుజరాత్‌కు.. జేకబ్ బేతెల్ ఆర్సీబీ.. విల్ జాక్స్ ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నారు. ఈ మూడు ఫ్రాంచైజీలకు ఈ ముగ్గురు ఆటగాళ్లు చాలా కీలకం.ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల్లో బట్లర్, బేతెల్, జాక్స్ లేకపోవడం ఆయా జట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకు చెందిన ఆటగాళ్లు లీగ్ తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీల కష్టాలు మరింత తీవ్రమయ్యాయి.ఆటగాళ్లు కూడా దేశమా.. ఐపీఎలా అన్న సందిగ్దంలో ఉండిపోయారు. ఐపీఎల్ వాయిదా పడటం ఇన్ని సమస్యలు తెచ్చి పెట్టింది. విండీస్‌తో వన్డే సిరీస్‌తో పాటు తదుపరి జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (జూన్ 6, 8, 10) కోసం కూడా ఇంగ్లండ్ జట్లను ఇవాళ ప్రకటించారు. రెండు జట్లకు సారధిగా హ్యారీ బ్రూక్ ఎంపికయ్యాడు.వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (గుజరాత్), జేకబ్ బేతెల్ (ఆర్సీబీ), విల్ జాక్స్ (ముంబై ఇండియన్స్), జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్ రాయల్స్), జేమీ ఓవర్టన్ (సీఎస్కే), గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, బ్రైడాన్ కార్స్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, జో రూట్, జామీ స్మిత్విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, టామ్ బాంటన్, జేకబ్ బేతెల్, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్ కూడా వేర్వేరు ఐపీఎల్ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నా ఆ జట్లు ఇదివరకే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.మరోవైపు ఇదే సిరీస్ (వన్డే) కోసం విండీస్ జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు. విండీస్ ఆటగాళ్లలో ఫెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (గుజరాత్), రొమారియో షెపర్డ్ (ఆర్సీబీ), షమార్ జోసఫ్ (లక్నో) వేర్వేరు జట్ల తరఫున ఐపీఎల్లో ఆడుతున్నారు. రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్ ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లు కూడా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నాయి. అయితే ఈ సిరీస్‌తో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు క్లాష్ కావడంతో వీరు కూడా ఆయా జట్లకు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. -
IPL 2025 Revised Schedule: దేశమా.. ఐపీఎలా..?
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్దం సమసిపోయాక ఐపీఎల్ 2025 పునఃప్రారంభ తేదీని ప్రకటించారు. మే 17 నుంచి క్యాష్ రిచ్ లీగ్ కొన్ని మార్పులతో కొనసాగుతుంది. మే 8న రద్దైన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ మే 24కు షెడ్యూల్ కాగా.. కొన్ని మ్యాచ్‌ల వేదికల్లో మార్పులు జరిగాయి. లీగ్ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేసిన బీసీసీఐ.. ప్లే ఆఫ్స్ వేదికలను ప్రకటించాల్సి ఉంది. వారం వాయిదా అనంతరం క్యాష్ రిచ్ లీగ్ జూన్ 3న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.ఇదిలా ఉంటే, భారత్, పాక్ మధ్య యుద్దం నేపథ్యంలో ఐపీఎల్ 2025లో ఆడే విదేశీ ప్లేయర్లంతా స్వదేశాలకు వెళ్లిపోయారు. లీగ్ పునఃప్రారంభం కానుండటంతో వారు తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులోకి వస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. చాలా మంది క్రికెటర్లు ఐపీఎల్లో తిరిగి పాల్గొనేందుకు సంసిద్దత వ్యక్తం చేయగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికాకు చెందిన క్రికెటర్లు ఇంకా డైలమాలో ఉన్నారు.ఐపీఎల్ తదుపరి మ్యాచ్‌లు జరుగబోయే తేదీల్లో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ షెడ్యూలై ఉంది. మే 29, జూన్ 1, 3 తేదీల్లో ఇరు జట్లు మూడు వన్డేలు ఆడనున్నాయి. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లలో ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు.ఇంగ్లండ్ ఆటగాళ్లలో జోస్ బట్లర్ (గుజరాత్), విల్ జాక్స్ (ముంబై), జేకబ్ బేతెల్ (ఆర్సీబీ), జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్), జేమీ ఓవర్టన్ (సీఎస్కే).. వెస్టిండీస్ ఆటగాళ్లలో ఫెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (గుజరాత్), రొమారియో షెపర్డ్ (ఆర్సీబీ), షమార్ జోసఫ్ (లక్నో) వేర్వేరు జట్ల తరఫున ఐపీఎల్లో ఆడుతున్నారు. ఐపీఎల్ తేదీలతో ఇంగ్లండ్, విండీస్ వన్డే సిరీస్ క్లాష్ కావడంతో వీరంతా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.మరోవైపు ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వారం రోజుల్లోనే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగాల్సి ఉంది. ఈ కీలక మ్యాచ్ కోసం ఇరు జట్లను ఇవాళే ప్రకటించారు. ఇరు జట్లలో మొత్తం 13 మంది ఆటగాళ్లు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పాల్గొంటున్నారు. ఐపీఎల్ తర్వాత వారం రోజుల వ్యవధే ఉండటంతో వీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అని అంతా ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఐపీఎల్లో పాల్గొనే విషయాన్ని ఆటగాళ్లకే వదిలేయగా.. క్రికెట్ సౌతాఫ్రికా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.ఆసీస్ ఆటగాళ్లు..పాట్ కమిన్స్ (ఎస్ఆర్హెచ్)ట్రవిస్ హెడ్ (ఎస్ఆర్హెచ్)జోష్ హాజిల్‌వుడ్ (ఆర్సీబీ)జోస్ ఇంగ్లిస్ (పంజాబ్)మిచెల్ స్టార్క్ (ఢిల్లీ)సౌతాఫ్రికా ఆటగాళ్లు..మార్క్రమ్ (లక్నో)ఎంగిడి (ఆర్సీబీ)స్టబ్స్ (ఢిల్లీ)కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్)ర్యాన్ రికెల్టన్ (ముంబై ఇండియన్స్)జన్సెన్ (పంజాబ్)రబాడ (గుజరాత్)ముల్దర్ (ఎస్ఆర్హెచ్)పైన పేర్కొన్న ఆటగాళ్లలో కొందరు ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశం లేని జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరి నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న జట్లకు (గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్, ముంబై, ఢిల్లీ) ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లతో సమస్య వస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేసిన సౌతాఫ్రికా జట్టులో ఏకంగా ఎడుగురు ఆటగాళ్లు ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరంతా దేశమా.. ఐపీఎలా అని తలలు బాదుకుంటున్నారు.ఐపీఎల్ 2025లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్ల జాబితా..RCB: టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, రొమారియో షెపర్డ్, జోష్ హాజిల్‌వుడ్, లుంగి ఎంగిడి, నువాన్ తుషార,CSK: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, సామ్ కర్రన్, డెవాల్డ్ బ్రెవిస్, జేమీ ఓవర్టన్, నాథన్ ఎల్లిస్, నూర్ అహ్మద్, మతీష పతిరణPBKS: జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జన్సెన్, మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్లెట్KKR: ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్, రోవ్‌మన్ పావెల్, రహ్మానుల్లా గుర్బాజ్, మోయిన్ అలీ, స్పెన్సర్ జాన్సన్, అన్రిచ్ నోర్ట్జేSRH: ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్, హెన్రిచ్ క్లాసెన్, కమిండు మెండిస్, వియాన్ ముల్డర్, ఎషాన్ మలింగGT: జోస్ బట్లర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రషీద్ ఖాన్, కరీం జనత్, దాసున్ షనక, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబడDC: ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, సెదిఖుల్లా అటల్, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవన్ ఫెరియెరా, దుష్మంత చమీరా, మిచెల్ స్టార్క్MI: బెవాన్ జాకబ్స్, విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్, రీస్ టాప్లే, ట్రెంట్ బౌల్ట్, ముజీబ్ రెహ్మాన్LSG: ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మిచెల్ మార్ష్, మాథ్యూ బ్రీట్జ్కీ, నికోలస్ పూరన్, షమార్ జోసఫ్RR: షిమ్రోన్ హెట్‌మైర్, వనిందు హసరంగ, డ్రి ప్రిటోరియస్, మహీశ్ తీక్షణ, క్వేనా మఫాకా, ఫజల్హక్ ఫారూకీ, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్ -
ఐపీఎల్ 2025 రీ షెడ్యూల్.. దారుణంగా నష్టపోనున్న ఆర్సీబీ
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఐపీఎల్ పునఃప్రారంభానికి లైన్ క్లియర్ అయ్యింది. మే 8న రద్దైన ఐపీఎల్ 2025, మే 17 నుంచి పునఃప్రారంభం కానుంది. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ నిన్న రాత్రి ప్రకటించింది. మే 8న 10 ఓవర్ల పాటు సాగి రద్దైన ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ ఈ నెల 24న మొదటి నుంచి నిర్వహించనున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌కు నిన్న ప్రకటించిన రీ షెడ్యూల్‌కు చాలా తేడాలున్నాయి. వేదికలు చాలా వరకు మారాయి. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల వేదికలు ఖరారు కావాల్సి ఉంది. క్యాష్ రిచ్ లీగ్ జూన్ 3న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 వాయిదా పడటం ప్లే ఆఫ్స్‌కు అతి చేరువలో ఉన్న ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టింది. ఆ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండటం, గాయాల బారిన పడటంతో జట్టును వీడనున్నారు. ఐపీఎల్ వాయిదాకు ముందే ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ గాయపడ్డారు. పాటిదార్ ఐపీఎల్ పునఃప్రారంభం తర్వాత కూడా కొన్ని మ్యాచ్‌లు మిస్ అవుతాడు. పాటిదార్ స్థానంలో కొన్ని మ్యాచ్‌లకు విరాట్ కోహ్లి లేదా జితేశ్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.రీ షెడ్యూల్లో ఆర్సీబీ ఆడబోయే మ్యాచ్‌లకు ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకు చెందిన ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చు. ఐపీఎల్ పూర్తికాక ముందే (మే 29) ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ మొదలవుతుంది. ఐపీఎల్ పూర్తైన వారం రోజులకే (జూన్ 11) ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో నాలుగు జట్లకు చెందిన ఆటగాళ్లు ఆర్సీబీ ఆడబోయే తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు.ఆర్సీబీ జట్టులో ఇంగ్లండ్ ఆటగాళ్లు: ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్వెస్టిండీస్ ఆటగాళ్లు: రొమారియో షెపర్డ్మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఐపీఎల్ ఫైనల్ తర్వాత వారం రోజుల సమయమున్నా (డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం).. ఆ దేశ క్రికెట్ బోర్డు ఐపీఎల్ ఆడటం ఆటగాళ్ల చాయిస్‌కే వదిలిపెట్టింది. దీంతో ఆ దేశ టెస్ట్ జట్టులో కీలక సభ్యుడైన జోష్ హాజిల్‌వుడ్ తదుపరి ఐపీఎల్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం దాదాపు అసాధ్యమేనని తెలుస్తుంది. హాజిల్‌వుడ్ పోతే ఎంగిడి ఉన్నాడులే అనుకుంటే అతను కూడా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌నే తన మొదటి ఛాయిస్‌గా ఎంచుకోవచ్చు.ఈ లెక్కన చూస్తే ఆర్సీబీలో టిమ్ డేవిడ్ మినహా ఒక్క విదేశీ ఆటగాడు కూడా మిగిలే అవకాశం లేదు. శ్రీలంక పేసర్ నువాన్ తుషార ఉన్నా అతను ఏ మేరకు అందుబాటులో ఉంటాడో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. మొత్తంగా చూస్తే, ప్రస్తుత సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆర్సీబీని ఐపీఎల్ వాయిదా పడటం దారుణంగా దెబ్బకొట్టింది. ఆ జట్టు తదుపరి మ్యాచ్‌ల్లో కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోతే లయ తప్పే ప్రమాదముంది. ఈ సీజన్‌పై ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, ఆ ఫ్రాంచైజీ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సాలా కప్ నమ్మదే అని ఆర్సీబీ అభిమానులు ఇప్పుడిప్పుడే నమ్మడం మొదలుపెట్టారు. ఈ లోపే భారత్, పాక్ మధ్య యుద్దం మొదలై ఆర్సీబీ గెలుపు జోష్‌ను దెబ్బకొట్టింది. మరి, ఉన్న వనరులతో ఆర్సీబీ మున్ముందు మ్యాచ్‌ల్లో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. ఐపీఎల్ వాయిదాకు ముందు ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, స్వస్థిక్ చికారా, మయాంక్ అగర్వాల్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్‌స్టోన్, మనోజ్ భాండగే, జేకబ్ బేతెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రాఠీ, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్, సుయాశ్ శర్మ, లుంగి ఎంగిడి, రసిఖ్ దార్ సలామ్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. -
CA: ఇష్టం లేకపోతే వెళ్లొద్దులే!
ఐపీఎల్-2025 (IPL 2025) వాయిదా పడటంతో స్వదేశం చేరిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు అండగా నిలుస్తోంది. ఇష్టమైతేనే లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు వెళ్లాలని.. లేదంటే ఇక్కడే ఉండిపోవచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా ( CA) సూచించిందని ఆ దేశ మీడియా కథనం వెలువరించింది.కాగా భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025ని వారం పాటు వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన ఆస్ట్రేలియన్ క్రికెటర్లంతా లీగ్ వాయిదా పడగానే స్వదేశానికి వెళ్లిపోయారు.వారు మాత్రం ఇక్కడేకోచింగ్ స్టాఫ్‌లో ఉన్న రికీ పాంటింగ్, బ్రాడ్ హాడిన్ తదితరులు మాత్రం భారత్‌లోనే ఉండిపోయారు. ప్రస్తుతం భారత్, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఈనెల 17 నుంచి తిరిగి ఐపీఎల్‌ను ప్రారంభించాలని బీసీసీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విదేశీ క్రికెటర్లకు పిలిపించుకొని సిద్ధంగా ఉండాలని బోర్డు ఇదివరకే ఫ్రాంచైజీలకు తెలిపింది.అయితే ఆటగాళ్లంతా ఐపీఎల్ కోసం వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో సీఏ వారికి అండగా నిలవాలనుకుంటుందని ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ పత్రిక తమ కథనంలో పేర్కొంది. దాయాది దేశాల మధ్య నెలకొన్న యుద్ధవాతావరణ పరిస్థితులతో తమ ఆటగాళ్లంతా భయాందోళనకు గురయ్యారని అలాంటపుడు మళ్లీ ఐపీఎల్ కోసం వెళ్లమని క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పబోదని ఆ కథనంలో రాసింది.ఫైనల్‌కు సిద్ధమయ్యే క్రమంలోనే?నిజానికి తమ ఆటగాళ్లకు మే 25తో ముగిసే ఐపీఎల్ షెడ్యూల్ వరకే ఆడేందుకు సీఏ అనుమతిచ్చింది. ఇప్పుడు గనక వారు మళ్లీ వెళ్లాలంటే సీఏ నుంచి మరోసారి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాల్సి ఉంటుందని ఆ పత్రిక వెల్లడించింది. పైకి భయం అంటూ కారణాలు చెబుతున్నా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్‌కు సిద్ధమయ్యే క్రమంలోనే ఆసీస్ క్రికెటర్లు ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఫ్రాంఛైజీలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.ఐపీఎల్-2025లో వివిధ ఫ్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు👉సన్‌రైజర్స్ హైదరాబాద్: ప్యాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్, ఆడం జంపా (గాయం కారణంగా ఇప్పటికే దూరం)👉రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: జోష్ హాజిల్‌వుడ్, టిమ్ డేవిడ్👉పంజాబ్ కింగ్స్: మార్కస్ స్టొయినిస్, గ్లెన్ మాక్స్వెల్ (రూల్డ్ అవుట్), మిచ్ ఓవెన్ (ఇంకా జట్టుతో చేరలేదు), జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, జేవియర్ బార్ట్లెట్👉లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్👉కోల్‌కతా నైట్ రైడర్స్: స్పెన్సర్ జాన్సన్👉ఢిల్లీ క్యాపిటల్స్: మిచెల్ స్టార్క్, జేక్ ఫ్రేజర్-మెగర్క్👉చెన్నై సూపర్ కింగ్స్: నాథన్ ఎల్లిస్. -
ఐపీఎల్ రీ షెడ్యూల్ ప్రకటన...
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో వాయిదా పడిన ఐపీఎల్ 18వ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లను ఈ నెల 17 నుంచి తిరిగి నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, పోలీసు సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, లీగ్ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిన బోర్డు మిగిలి పోయిన 17 మ్యాచ్‌ల్ని ఆరు వేదికలు బెంగళూరు, జైపూర్, న్యూఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లలో నిర్వహిస్తామని ప్రకటించింది. మే 17 నుంచి 27 వరకు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో రెండు ఆదివారాలు రాగా రెండేసి మ్యాచ్‌లు (డబుల్ హెడర్) నిర్వహిస్తారు. 29న తొలి క్వాలిఫయర్, 30న ఎలిమినేటర్, 1న రెండో క్వాలిఫయర్, 3న ఫైనల్‌తో ఈ సీజన్ ఐపీఎల్ ముగుస్తుంది. ‘ప్లేఆఫ్స్’ మ్యాచ్ వేదికల్ని తర్వాత ప్రకటిస్తారు. కాగా ఈ నెల 10న హైదరాబాద్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆఖరి పోరును 25వ తేదీన న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈనెల 8న ధర్మశాలలో అర్ధాంతరంగా ఆగిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను 24న న్యూఢిల్లీలో మొదటి నుంచి నిర్వహిస్తారు. -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్!.. రూ. 11.75 కోట్ల ఆటగాడు దూరం!
ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ బౌలర్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఐపీఎల్-2025 (IPL 2025)లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాగా భారత్- పాకిస్తాన్ (IND vs PAK) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.అలిసా హేలీతో కలిసిఈ క్రమంలో కొంతమంది విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు తిరిగి వెళ్లిపోయారు. ఇందులో స్టార్క్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తన భార్య అలిసా హేలీతో కలిసి ఈ పేస్ బౌలర్ సిడడ్నీకి చేరుకున్నాడు. అయితే, అక్కడి స్థానిక మీడియాతో మాట్లాడేందుకు అతడు నిరాకరించాడు.భారత్‌కు తిరిగి వెళ్లడు!ఈ నేపథ్యంలో స్టార్క్ మేనేజర్ స్పందిస్తూ.. ఐపీఎల్-2025 పునః ప్రారంభమైనా స్టార్క్ భారత్‌కు తిరిగి వెళ్లే అవకాశం లేదని ఆస్ట్రేలియా నైన్ న్యూస్‌కు తెలిపాడు. దీంతో మిగిలిన మ్యాచ్‌లలో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్క్ సేవలను కోల్పోనున్నట్లు తెలుస్తోంది.వారు కూడా దూరమే..!ఇక మెల్బోర్న్ వార్తా పత్రిక ‘ది ఏజ్’ కథనం ప్రకారం.. ఒకవేళ తమ ఆటగాళ్లు తిరిగి ఇండియాకు వెళ్లవద్దని నిర్ణయించుకుంటే.. క్రికెట్ ఆస్ట్రేలియా (CA) వారికి పూర్తి మద్దతుగా ఉండనుంది. కాగా స్టార్క్‌తో పాటు ఆసీస్ కెప్టెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్లు ప్యాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్ కూడా తిరిగి భారత్ రాకపోవచ్చు.ఫైనల్ ఆడాలిఇప్పటికే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. మరోవైపు.. మే 16 నుంచి ఐపీఎల్-2025 తిరిగి మొదలైనా.. మే 30న ముగుస్తుందనే వార్తలు వస్తున్నాయి. అయితే, జూన్ 11 నుంచే ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్ ఆడాల్సి ఉంది.ఇంగ్లండ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగే ఈ మెగా మ్యాచ్‌కు ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో భారత్‌కు వెళ్లి వచ్చి.. వెంటనే మళ్లీ ఈ మ్యాచ్‌కు సిద్ధం కావడం కాస్త కష్టంగా మారుతంది. ఈ నేపథ్యంలో కమిన్స్, హెడ్లతో పాటు స్టార్క్ కూడా స్వదేశంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.మరోవైపు.. న్యూజిలాండ్ క్రికెటర్లు కూడా ఇప్పటికే స్వదేశానికి చేరుకోగా.. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మే 25 వరకు నిరభ్యంతర పత్రాల గడువు ఉంది.. కాబట్టి ఆ తర్వాతే ఆటగాళ్లను తిరిగి రమ్మని ఆదేశించే అవకాశం ఉంది.రూ. 11.75 కోట్ల భారీ ధరకుకాగా.. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ మిచెల్ స్టార్క్‌ను రూ. 11.75 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇప్పటికి అతడు 14 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ తరఫున ఈ సీజన్లో టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. మరోవైపు.. ఢిల్లీ పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరు గెలిచి పట్టికలో ఐదో స్థానంలో ఉంది. కాగా పంజాబ్ కింగ్స్‌తో గురువారం నాటి ఢిల్లీ మ్యాచ్ ఉద్రిక్తతల కారణంగా అర్థంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. చదవండి: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు! -
మరేం పర్లేదు.. ఇక్కడే ఉందాం!.. ఆటగాళ్లకు సర్ది చెప్పిన హెడ్ కోచ్
భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025 (IPL 2025) వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఈ నేపథ్యంలో లీగ్‌లో పాల్గొంటున్న విదేశీ ఆటగాళ్లు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొంతమంది ఇప్పటికే స్వదేశాలకు చేరుకునే క్రమంలో దుబాయ్ వరకు వెళ్లినట్లు సమాచారం. అయితే, పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఆటగాళ్లకు వారి హెడ్ కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) సర్దిచెప్పినట్లు తెలుస్తోంది.మరేం పర్లేదు.. ఇక్కడే ఉందాం!సొంత దేశానికి తిరిగి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ... పాంటింగ్ ఢిల్లీలోనే ఉండేందుకు ప్రాధాన్యతనిచ్చాడు. అప్పటికే అతడి లగేజీ విమానాశ్రయానికి చేరుకోగా... అతి కష్టం మీద దానిని తిరిగి తెప్పించుకున్నాడు. అప్పటికే భారత్ నుంచి స్వదేశాలకు తిరుగు పయనమైన విదేశీ ఆటగాళ్లతో పాటు మిగిలిన వారిలో పాంటింగ్ దైర్యం నింపాడు.ఈ విషయం గురించి పంజాబ్ కింగ్స్ జట్టు సీఈవో సతీశ్ మీనన్ మాట్లాడుతూ.. ‘స్వదేశానికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ పాంటింగ్ నిరాకరించాడు. అంతేగాకుండా విదేశీ ఆటగాళ్లలో ధైర్యం నింపాడు. వారంతా త్వరలో జట్టుతో చేరబోతున్నారు’ అని పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2025లో పంజాబ్ జట్టులో ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ స్టొయినిస్, ఆరోన్ హార్డీ, జోష్ ఇన్‌గ్లిస్, జేవియర్ ఉన్నారు. కాగా భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గురువారం ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయిన విషయం తెలిసిందే.వందే భారత్ రైలులోశత్రు దేశ వ్యూహాలకు చెక్ పెట్టే క్రమంలో ధర్మశాలలో బ్లాక్ అవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) చేయడంతో త్వరత్వరగా స్టేడియాన్ని ఖాళీ చేయించడంతో పాటు.. ఆటగాళ్లను కూడా బీసీసీఐ అక్కడి నుంచి తరలించింది. ఈ క్రమంలో ధర్మశాల నుంచి ఢిల్లీకి వందే భారత్ రైలులో ఆటగాళ్లను తరలించింది.ఇందులో భాగంగా బస్సులు, ట్రైన్లు మారుతూ ప్రయాణించడంతో విదేశీ ఆటగాళ్లలో ఒకరకమైన భయాందోళన పెరిగిపోవడంతో... వారంతా తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని ఆశించారు. ‘దాడుల వార్తలతో విదేశీ ఆటగాళ్లు కాస్త ఆందోళన చెందారు. వీలైనంత త్వరగా దేశం వీడి ఇళ్లకు చేరుకోవాలని భావించారు.వారి స్థానంలో ఉంటే ఎవరైనా అలాగే అనుకుంటారు. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం పాంటింగ్ వారికి సర్దిచెప్పాడు’ అని ఓ అధికారి తెలిపారు. కాగా పంజాబ్ పేస్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ మాత్రం దుబాయ్‌కు చేరుకున్నారు. ఐపీఎల్ తిరిగి ప్రారంభం కావడంపై త్వరలో ప్రకటన రానుండగా... జట్లన్నీ తమ ఆటగాళ్లను అందుబాటులో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు సంబంధించి బీసీసీఐ ఆదివారం ఫ్రాంఛైజీలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కాగా, శనివారం భారత్- పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి రాగా.. పరిస్థితులు కాస్త చక్కబడ్డాయి. ప్లే ఆఫ్స్ రేసులో పంజాబ్ఈ నేపథ్యంలో వీలైనంత త్వరలో తిరిగి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మే 16 లేదంటే 17న తిరిగి ఆరంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్ మార్గదర్శనం, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ సీజన్లో పంజాబ్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ఢిల్లీతో గురువారం మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 10.1 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 122 పరుగులు చేసింది. ఐపీఎల్ తిరిగి ప్రారంభమైనప్పుడు ఈ మ్యాచ్ అక్కడి నుంచే కొనసాగే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇందులో గెలిస్తే పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంటుంది. ఇప్పటికి శ్రేయస్ సేన ఖాతాలో పదిహేను పాయింట్లు ఉన్నాయి. చదవండి: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు! -
IPL 2025: 16 లేదా 17 నుంచి ఐపీఎల్!
న్యూఢిల్లీ: ప్రతీ వేసవిలో మెరుపు క్రికెట్ వినోదాన్ని పంచే ఐపీఎల్‌కు ఈసారి ఉద్రిక్త పరిస్థితుల సెగ తగిలింది. భారత్, పాక్‌ల మధ్య డ్రోన్ల యుద్ధంతో లీగ్‌ను వారంపాటు వాయిదా వేశారు. ఇపుడు తాజా కాల్పుల విరమణ నేపథ్యంలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్న బీసీసీఐ ఐపీఎల్ పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ వారాంతంలోనే ఆటను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నెల 16 లేదంటే 17 నుంచి ఐపీఎల్ మళ్లీ మొదలవనుంది. ఫైనల్ వేదికను కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు మార్చే యోచనలో బీసీసీఐ ఉంది. ఈ మార్పునకు వర్ష సూచనే కారణమని తెలిసింది. ఆటగాళ్ల సంసిద్ధత, విదేశీ ఆటగాళ్లను వెంటనే రప్పించే ఏర్పాట్లను వెంటనే పూర్తిచేయాలని రేపటికల్లా ఫ్రాంచైజీలన్నీ రెడీగా ఉండాలని బీసీసీఐ సూచించింది. అన్నీ డబుల్ హెడర్‌లేనా? ఈ నెలాఖరుకల్లా ఐపీఎల్‌ను పూర్తిచేయాలని పట్టుదలతో ఉన్న లీగ్ పాలకమండలి మిగతా లీగ్ మ్యాచ్‌ల్ని డబుల్ హెడర్ (రోజూ రెండు మ్యాచ్‌ల చొప్పున)లుగా నిర్వహించే ప్రణాళికతో ఉంది. హైదరాబాద్‌లోనే ఆ రెండు ప్లే ఆఫ్స్ హైదరాబాద్ అభిమానులకు ఎలాంటి నిరాశలేకుండా ముందనుకున్న షెడ్యూల్ ప్రకారమే రెండు ‘ప్లేఆఫ్స్’ మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతాయని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. తేదీలు మారినా... తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోనే నిర్వహిస్తారు. అయితే రెండో క్వాలిఫయర్ సహా ఫైనల్ పోరుకు వేదికైన కోల్‌కతాలోనే వాతావరణ సమస్యలు ఎదురవుతాయని తెలిసింది. ఈ నేపథ్యంలో విజేతను తేల్చే మ్యాచ్‌కు వర్షం అడ్డులేకుండా ఉండేలా అహ్మదాబాద్‌ను ఫైనల్ వేదికగా ఖరారు చేసే అవకాశముంది. మొత్తానికి సోమవారం షెడ్యూల్‌పై కసరత్తు పూర్తి చేస్తారని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. -
ఆర్సీబీకి భారీ షాక్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్?
ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి బీసీసీఐ ప్రణాళికలు మొదలు పెట్టింది. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఐపీఎల్‌ను తిరిగి ప్రారంభించేందుకు భారత క్రికెట్ బోర్డు సిద్దమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే మే 15 లేదా మే 16న ఐపీఎల్ మ్యాచ్‌లు మళ్లీ మొదలయ్యే అవకాశముంది.అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్ పునఃప్రారంభమవుతున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హాజిల్ వుడ్ గాయం కారణంగా ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. హాజిల్ వుడ్ ప్రస్తుతం భుజం నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే మే 3న సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు. అయితే అతడు జట్టుతో పాటు ఉండడంతో తర్వాతి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని ఫ్యాన్స్ భావించారు. కానీ అంతలోనే బీసీసీఐ ఐపీఎల్‌ను వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసింది. దీంతో హాజిల్‌వుడ్ తన స్వదేశానికి వెళ్లిపోయాడు.ఈ క్రమంలో అతడు తిరిగి భారత్‌కు వచ్చే సూచనలు కన్పించడం లేదు. జూన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఉన్నందున ముందు జాగ్రత్తగా అతడిని తిరిగి పంపకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే ఆర్సీబీకి గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. ఈ ఏడాది సీజన్లో హాజిల్‌వుడ్ 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. టోర్నీ నిలిచే సమయానికి అత్యధిక వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా ఉన్నాడు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ కూడా తిరిగి వచ్చేది అనుమానమే. కాగా ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ దుమ్ములేపుతోంది. 11 మ్యాచులలో 8 విజయాలు సాధించి.. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అడుగు దూరంలో నిలిచింది.చదవండి: #Virat Kohli: మనసు మార్చుకోని కోహ్లి.. త్వరలోనే రిటైర్మెంట్? -
ఐపీఎల్-2025 ఫైనల్ వేదిక, తేదీ మార్పు?
ఐపీఎల్-2025 సీజన్‌ను తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు లభిస్తే మే 15 లేదా 16వ తేదీన ఐపీఎల్ తిరిగి మొదలయ్యే అవకాశముంది. మంగళవారం (మే 13) నాటికి ఆటగాళ్లందరినీ జట్టుతో చేరేలా చూసుకోవాలని ఫ్రాంఛైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఫైనల్ వేదికను మార్చాలని భారత క్రికెట్ బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం.. మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇప్పుడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి ఫైనల్ వేదికను మార్చనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ తేదీలో కూడా మార్పు చోటు చేసుకోనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. మే 25 బదులుగా మే 30న తుది పోరు జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్-2025ను బీసీసీఐ వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే మిగిలిన మ్యాచ్‌లకు విదేశీ ఆటగాళ్ల అందుబాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. చాలా మంది ఫారన్ ప్లేయర్లు ఇప్పటికే తమ స్వదేశాలకు వెళ్లిపోయారు.చదవండి: IND vs SL: ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్.. ఫైనల్లో శ్రీలంక చిత్తు -
IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌గా జితేష్ శర్మ..?
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్-2025ను బీసీసీఐ వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే పరిస్థితులు కాస్త చల్లారడంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. మే 15 నుంచి ఐపీఎల్ రీ స్టార్ట్ కానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మంగళవారం (మే 13) నాటికి ఆటగాళ్లందరినీ జట్టుతో చేరేలా చూసుకోవాలని ఫ్రాంఛైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. డబుల్ హెడర్ (ఒకే రోజు రెండు) మ్యాచ్‌లు నిర్వహించి, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మే 25న ఈ ఏడాది సీజన్‌కు ముగింపు పలకాలని బీసీసీఐ యోచిస్తోంది.ఆర్సీబీ కెప్టెన్‌గా జితేష్ శర్మ..ఇక ఇది ఇలా ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ గాయం కారణంగా కనీసం ఒక మ్యాచ్‌కైనా దూరమయ్యే అవకాశముంది. మే 3న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పాటిదార్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడికి రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో అతడు కనీసం రెండు మ్యాచ్‌లకైనా దూరమవుతాడని అంతా భావించారు.కానీ ఐపీఎల్-2025లో మధ్యలోనే ఆగిపోవడంతో ఆర్సీబీకి కలిసొచ్చింది. అతడు చేతి వేలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఒకవేళ ఐపీఎల్-2025 మే 15 నుంచి తిరిగి ప్రారంభమైతే.. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు పాటిదార్ కానున్నాడు. పాటిదార్ గైర్హజరీలో వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ ఆర్సీబీ జట్టును నడిపించనున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని జితేష్ శర్మ ధ్రువీకరించాడు."లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు పాటిదార్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో కెప్టెన్‌గా నాకు అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. ఇది నాకు, నా కుటుంబానికి చాలా గొప్ప విషయం. దేవదత్ పడిక్కల్, రజిత్ పాటిదార్ ఇద్దరూ అందుబాటులో లేనందున, వారిస్ధానాలను ఎవరితో భర్తీ చేయాలని నేను ఆలోచిస్తున్నాను. నాకు నిజంగా ఇది చాలా పెద్ద బాధ్యత" అని ఐపీఎల్ సస్పెన్షన్‌కు ముందు జితేష్ శర్మ ఆర్సీబీ బోల్డ్ డైరీస్‌లో పేర్కొన్నాడు. ఒకవేళ మే 15న ఐపీఎల్ తిరిగి ప్రారంభం కాకపోతే కెప్టెన్సీ అవకాశాన్ని జితేష్ కోల్పోయే ఛాన్స్ ఉంది.చదవండి: ENG vs IND: రోహిత్ శర్మ స్థానంలో యువ సంచలనం..? ఇక భారత్‌కు తిరుగులేదు? -
IPL 2025: ఆటగాళ్లను రప్పించండి.. ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఆదేశాలు?
ఐపీఎల్-2025 టోర్నీని వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భావిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం (మే 13) నాటికి ఆటగాళ్లందరినీ జట్టుతో చేరేలా చూసుకోవాలనిఫ్రాంఛైజీలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.అదే విధంగా.. విదేశీ ఆటగాళ్లను కూడా వీలైంత త్వరగా భారత్‌కు రప్పించాలని ఆదేశించినట్లు సమాచారం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మే 25న ఫైనల్ నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబుల్ హెడర్ మ్యాచ్లుఇందులో భాగంగా డబుల్ హెడర్ (ఒకే రోజు రెండు) మ్యాచ్‌లు నిర్వహించాలనే యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం. కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్ తాజా ఎడిషన్ 57 మ్యాచ్‌లు పూర్తైన తర్వాత వాయిదా పడిన విషయం తెలిసిందే.పహల్గామ్ ఉగ్రదాడికి.. భారత్ ఆపరేషన్ సిందూర్‌తో గట్టిగా బదులిస్తోందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్- పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉగ్రవాదులను లక్ష్యం చేసుకుని భారత్ దాడులు చేస్తే.. పాకిస్తాన్ మాత్రం సామాన్యులు, భారత సైనిక స్థావరాలపై దాడులకు తెగబడింది. అయితే, భారత సైన్యం వీటిని సమ ర్థవంతంగా తిప్పికొట్టింది.అర్ధంతరంగా ముగిసిపోయిందిఈ క్రమంలో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయింది. శత్రువును దారి మళ్లించే క్రమంలో ధర్మశాలలో బ్లాకవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) విధించడంతో ఆట మధ్యలోనే స్టేడియాన్ని ఖాళీ చేయించారు.ఈ నేపథ్యంలో తాజా ఐపీఎల్ సీజన్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. అయితే, శనివారం భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే, దాయాది మరోసారి తన వంకర బుద్ధిని చూపి.. దాడులకు తెగబడింది. తెల్లవారిన తర్వాత మాత్రం పరిస్థితులు కాస్త సద్దుమణినట్లు తెలుస్తోంది.ఆ జట్టుకు మాత్రం తటస్థ వేదికఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం భేటీ అయిన బీసీసీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘మంగళవారం నాటికి అన్ని ఫ్రాంఛైజీలు తమ మ్యాచ్‌లు జరిగే వేదికలకు ఆటగాళ్లను చేర్చాలని బోర్డు ఆదేశించింది.పంజాబ్ జట్టుకు మాత్రం తటస్థ వేదిక ఉంటుంది. కాబట్టి ఇంకా వారి గమ్యస్థానాన్ని నిర్దేశించలేదు. త్వరితగతిన టోర్నీని పూర్తి చేసేందుకు డబుల్ హెడర్ మ్యాచ్‌లు నిర్వహించాలని బోర్డు భావిస్తోంది’’ అని తెలిపాయి.కాగా ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టాప్-4లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతేభారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ‘‘మిగిలిన మ్యాచ్‌లను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాం. వేదికలు, తేదీలు కొత్తగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది.స్టేక్హోల్డర్లు, జట్ల యజమానులు, ప్రసారకర్తలు.. ఇలా లీగ్‌లో భాగమైన ప్రతి ఒక్కరితో చర్చలు జరపాలి, ముఖ్యంగా ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాడు.చదవండి: BCCI: ప్లీజ్ కింగ్!.. కోహ్లిని ఒప్పించేందుకు రంగంలోకి అతడు! -
SRH: బ్యాటర్ల వైఫల్యం... బౌలర్ల నిస్సహాయత
ఐపీఎల్లో గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ఈ సీజన్లో ఆడిన మొదటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై సునామీలా విరుచుకుపడింది. 20 ఓవర్లలో 286 పరుగులతో ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపుతూ... గత సీజన్ జోరును కొనసాగించింది. ఇప్పటికే హిట్టర్లతో బలంగా ఉన్న రైజర్స్‌కు ప్యాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ తోడవడంతో... ఆ దూకుడు మరింత పెరిగింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ అనికేత్ వర్మ ఇలా ఒకటి నుంచి ఏడో స్థానం వరకు అందరూ దంచే వాళ్లే ఉండటంతో... ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ కప్పు కొట్టడం ఖాయమనే అంచనాలు పెరిగిపోయాయి!అయితే వాటిని అందుకోవడంలో పూర్తిగా విఫలమైన సన్‌రైజర్స్ అంతకంతకూ నాసిరకమైన ఆటతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడటం ప్రారంభించింది. తొలి పోరు అనంతరం ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కదాంట్లోనే గెలిచి... ప్లే ఆఫ్స్ రేసుకు దూరమైంది. భారీ ఆశలు పెట్టుకున్న హిట్టర్లు ఘోరంగా విఫలమవగా... కెప్టెన్ కమిన్స్ సహా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా జట్టు పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గని జట్లు ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేస్తుంటే... మాజీ చాంపియన్ రైజర్స్ మాత్రం తిరోగమనం బాటపట్టింది. ఈ సీజన్లో రైజర్స్ వైఫల్యానికి కారణాలు పరిశీలిస్తే...–సాక్షి, క్రీడావిభాగం‘మా ఆటగాళ్లు మంచి టచ్‌లో ఉన్నారు. వాళ్లకు బౌలింగ్ చేయాలంటే నాకే భయంగా ఉంది. బంతి మీద ఏమాత్రం దయ లేకుండా విరుచుకుపడుతున్నారు. నెట్స్‌లో వాళ్లకు బంతులేయడం కూడా కష్టమే’... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ తొలి మ్యాచ్ ఆడిన అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కెపె్టన్ కమిన్స్ అన్న మాటలివి. అప్పటికే ‘300 లోడింగ్’ అనే మాట విస్తృత ప్రచారం కాగా... రైజర్స్ జోరు చూస్తే అదేమంత కష్టం కాదనిపించింది. క్రీజులోకి అడుగుపెట్టిన ప్రతి ఆటగాడు ధనాధన్ బాదుడే లక్ష్యంగా దూసుకెళ్తుంటే ఆరెంజ్ ఆర్మీ చరిత్ర సృష్టించడం ఖాయమనిపించింది. మార్చి 23న హైదరాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ముంబై నుంచి రైజర్స్ గూటికి చేరిన ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 106; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) తొలి పోరులోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. హెడ్ హాఫ్ సెంచరీ బాదగా... టాప్–5 ఆటగాళ్లంతా 200 పైచిలుకు స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు రాబట్టారు. ఛేదనలో రాయల్స్ పోరాడినా రైజర్స్ సునాయాసంగా గెలుపొందింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ హాట్ ఫేవరెట్‌గా మారిపోయింది. నిలకడ కొనసాగించలేక... ఉప్పల్ వేదికగానే జరిగిన రెండో మ్యాచ్‌లో హైదరాబాద్‌కు ఓటమి ఎదురైంది. గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌పై రికార్డు విజయం సాధించిన రైజర్స్... ఈ సారి 190 పరుగులు చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. అయినా ఒక్క ఓటమే కదా అని అభిమానులు పెద్దగా ఆలోచించలేదు. విశాఖపట్నం వేదికగా ఢిల్లీతో జరిగిన మూడో పోరులో మనవాళ్ల డొల్లతనం బయట పడింది. హిట్టర్లంతా విఫలమవడంతో ఒక దశలో 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కొత్త కుర్రాడు అనికేత్ సిక్సర్లతో రెచ్చిపోవడంతో కాస్త పరువు నిలబెట్టుకున్నా... మ్యాచ్‌లో మాత్రం పరాజయం తప్పలేదు. ఇక కోల్‌కతాతో పోరులో అయితే 201 పరుగుల లక్ష్యఛేదనలో 16.4 ఓవర్లలో 120 పరుగులకే జట్టు ఆలౌటైంది. ఒక్కరంటే ఒక్కరూ కాస్త పోరాడే ప్రయత్నం చేయలేదు. ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ గుజరాత్ చేతిలోనూ చెత్తగా ఓడింది. దీంతో పెంచుకున్న ఆశలన్నీ పేకమేడలా కూలిపోగా... వాస్తవ పరిస్థితి అభిమానులకు సైతం అర్థం అయింది. అభిషేక్ సెంచరీతో ఊపు... జట్టంతా నిరాశలో కూరుకుపోయిన దశలో అభిషేక్ శర్మ తిరిగి ఆరెంజ్ ఆర్మీలో జవసత్వాలు నింపాడు. ఇక ముందంజ వేయడం కష్టమే అనుకుంటున్న సమయంలో ఉప్పల్ వేదికగా పంజాబ్‌తో జరిగిన పోరులో అభి ‘షేక్’ ఆడించాడు. మొదట పంజాబ్ 245 పరుగులు చేయగా... భారీ లక్ష్యఛేదనలో హైదరాబాద్ అదరక బెదరక ఎదురు నిలిచింది. వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో 55 బంతుల్లోనే 141 పరుగులతో ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించాడు. సెంచరీ అనంతరం అతడు జేబులో నుంచి ఓ కాగితం తీసి చూపడం హైలైట్‌గా నిలిచింది. ‘ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం’ అనే ఆ అక్షరాలతో ఒక్కసారిగా జట్టులో నూతనోత్తేజం కనిపించింది. అభిషేక్‌తో పాటు హెడ్ కూడా ధడధడ లాడించడంతో సన్‌రైజర్స్ మరో 9 బంతులు మిగిలుండగానే కొండంత లక్ష్యాన్ని ఛేదించింది. సమస్యలన్నీ తీరినట్లే... తిరిగి విజయాల బాటపడతాం అని కెపె్టన్ విశ్వాసం వ్యక్తం చేయగా... ఇదే దూకుడు కొనసాగించాలని అభిమానులు ఆశించారు. మళ్లీ అదే తీరు... పంజాబ్‌పై గెలుపుతో వచ్చిన ఉత్సాహాన్ని రైజర్స్ కొనసాగించలేకపోయింది. తదుపరి ముంబైతో వరుసగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రైజర్స్ పరాజయం పాలైంది. వాంఖడేలో ఓ మాదిరి పోరాటం అయినా కనబర్చిన కమిన్స్ సేన... ఉప్పల్‌లో అయితే అప్పనంగా మ్యాచ్‌ను ప్రత్యర్థి చేతుల్లో పెట్టింది. ఈ సీజన్లో చెత్త ప్రదర్శన చేస్తున్న చెన్నైపై గెలిచిన హైదరాబాద్... గుజరాత్ చేతిలో రెండో సారి కూడా ఓడింది. ఉప్పల్‌లో ఢిల్లీతో మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దు కావడంతో రైజర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు కాగా... ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఆరెంజ్ ఆర్మీ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. గతేడాది భారీ హిట్టింగ్తో అదరి దృష్టి ఆకర్శించిన రైజర్స్... వేలంలోనే అనేక తప్పులు చేసింది. సుదీర్ఘకాలంగా ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనేశ్వర్ కుమార్ వంటి తెలివైన బౌలర్‌తో పాటు... యార్కర్ కింగ్ నటరాజన్‌ను వదిలేసుకున్న హైదరాబాద్ జట్టు... భారీ ధరపెట్టి టీమిండియా పేసర్లు మొహమ్మద్ షమీ, హర్శల్ పటేల్‌ను కొనుగోలు చేసుకుంది. వీరిద్దరూ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం జట్టుకు భారం కాగా... కమిన్స్, హెడ్, క్లాసెన్ కాకుండా... నాణ్యమైన నాలుగో విదేశీ ప్లేయర్ కూడా అందుబాటులో లేకపోవడం ఫలితాలపై పడింది. పదే పదే అవే తప్పులు...భారీ షాట్లు ఆడటమే తమ లక్ష్యం అన్నట్లు ఆడుతున్న సన్‌రైజర్స్ ప్లేయర్లు ప్రాథమిక సూత్రాలను సైతం మరుస్తున్నారు అనేది సుస్పష్టం. జట్టు పరిస్థితి స్కోరుబోర్డుపై గణాంకాలు చూసి షాట్ల ఎంపిక అనేది ఆటలో ప్రాథమిక నియమం. కానీ ఈ సీజన్లో రైజర్స్ ఓడిన మ్యాచ్‌లను పరిశీలిస్తే... వారు దీన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని అర్థం అవుతోంది. ఢిల్లీతో మ్యాచ్‌లో 20 పరుగులకే 2 ప్రధాన వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి రెండో బంతికే ఓ పేలవ షాట్ ఆడి వెనుదిరిగాడు.ఏమాత్రం ఆసక్తి లేనట్టు నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి బంతిని అందించి పెవిలియన్ బాట పట్టాడు. ఈ ఒక్క మ్యాచ్ అనే కాదు... చాలా సార్లు ఇదే తరహా ఆటతీరు కనిపించింది. కోల్‌కతాతో పోరులో 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సమయంలో కాస్త సంయమనం చూపిన మిడిలార్డర్... దాన్ని ఎక్కువసేపు కొనసాగించలేక పోయింది. ఈ కోవలో ఒకటా రెండో ఎన్నో ఉదాహరణలు. ప్రయతి్నంచి విఫలం కావడం ఒక తీరు అయితే... ప్రతీసారి ఒకే విధంగా విఫలం కావడం మరో తీరు. ఈ సీజన్లో రైజర్స్ రెండో దాన్నే కొనసాగించింది. పదే పదే చెత్త షాట్ సెలెక్షన్‌తో మూల్యం చెల్లించుకుంది. రైజర్స్ తరఫున అరంగేట్ర మ్యాచ్ తర్వాత ఇషాన్ కిషన్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోగా... గత సీజన్లో ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’గా నిలిచిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి... ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఆ్రస్టేలియా గడ్డపై టెస్టు సెంచరీ బాది చరిత్ర సృష్టించిన ఈ యువ ఆల్‌రౌండర్... ధాటిగా ఆడాలనే తపనలో బంతిని నేల మీద నుంచి కొట్టడమే మరిచినట్లు పదే పదే గాల్లోకి షాట్లు ఆడి ఔటయ్యాడు. దీంతో అతడికి తుది జట్టులో స్థానం కూడా గగనం కాగా... అభిషేక్ అప్పుడప్పుడు తప్ప నిలకడ లేని ఆటగాడు అనే ముద్ర వేసుకున్నాడు. హెడ్, క్లాసెన్ రాణించినా... వారు కూడా ప్రతీ మ్యాచ్‌లోనూ సత్తాచాటకపోవడంతో రైజర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక బౌలింగ్ వైఫల్యాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ సీజన్లో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన వారిలో రైజర్స్ బౌలర్లు ముందు వరుసలో నిలుస్తారు. షమీ, కమిన్స్, హర్షల్ పటేల్, ఉనాద్కట్, సిమర్జీత్ సింగ్ ఇలా ఒకరిని మించి ఒకరు పరుగులు ఇచ్చుకోవడంలో పోటీ పడ్డారు. దీంతో వికెట్లు పడగొట్టడం పక్కన పెడితే... కనీసం ప్రత్యర్థులపై ఒత్తిడి కూడా పెంచలేకపోయారు. కెప్టెన్ కమిన్స్ సైతం భారీగా పరుగులు ఇచ్చుకుంటుండగా... మిగిలిన జట్ల మాదిరిగా ఓ ప్రధాన స్పిన్నర్ లేకపోవడం రైజర్స్‌ను దెబ్బకొట్టింది. మరి ఇక ఈ సీజన్లో మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో అయినా రైజర్స్ ఈ తప్పిదాలను సరిదిద్దుకొని సమష్టిగా కదంతొక్కితే కాస్త పరువైనా నిలుస్తుంది. లేదంటే గత ఏడాది పట్టికలో పై నుంచి రెండో స్థానంలో నిలిచిన హైదరాబాద్... ఈసారి కింది నుంచి రెండో స్థానంలో నిలవాల్సి ఉంటుంది. -
IPL 2025: బీసీసీఐ కొత్త ప్రణాళికలు .. ‘మే’లోనే ముగించాలని..
న్యూఢిల్లీ: ఐపీఎల్‌కు వారం రోజుల పాటు విరామం ఇచ్చిన బీసీసీఐ భారత్, పాక్ యుద్ధానికి సంబంధించి తాజా పరిణామాల తర్వాత మళ్లీ కొత్త ప్రణాళికలతో సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాల్పుల విరమణ నేపథ్యంలో పరిస్థితులు మెరుగవుతాయి కాబట్టి వీలైనంత తొందరగా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లను ముగించాలని గవర్నింగ్ కౌన్సిల్ ఆలోచనతో ఉంది. ఈ వారాంతంలో టోర్నీ మళ్లీ మొదలు కావచ్చని వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మే 15 నుంచే మ్యాచ్‌లు జరగవచ్చు. అసలు షెడ్యూల్ ప్రకారం మే 25లోపే లీగ్‌ను ముగించాలని బోర్డు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ కొనసాగింపుపై నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. మూడు వేదికల్లో మ్యాచ్‌లు... ఐపీఎల్–2025 లీగ్ దశలో మొత్తం 57 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. పంజాబ్, ఢిల్లీ మధ్య జరుగుతున్న 58వ మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. దీనిని ‘రద్దు’గా పరిగణించి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించాలా లేక మళ్లీ నిర్వహించాలా అనే అంశంపై ఇంకా గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోలేదు. లీగ్ దశలో మరో 12 మ్యాచ్‌లతో పాటు 4 ప్లే ఆఫ్స్ కలిపి మొత్తం 16 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ముందుగా ఊహించినట్లుగానే దక్షిణాదిలో ఉన్న వేదికలను ఎంచుకొని మ్యాచ్‌లు జరపాలని బీసీసీఐ ప్రాధమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇందు కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను ఎంపిక చేశారు. అసలు షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ ఎలాగూ రెండు ప్లే ఆఫ్స్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఆటగాళ్లు వెనక్కి వస్తారా... ఐపీఎల్ ఫ్రాంచైజీలు, నిర్వాహకులకు మిగిలిన మ్యాచ్‌ల కోసం విదేశీ ఆటగాళ్లను వెనక్కి రప్పించడమే ఇప్పుడు పెద్ద సమస్య. ఐపీఎల్ వాయిదా గురించి తెలిసిన వెంటనే శుక్ర, శనివారాల్లో పలువురు విదేశీ క్రికెటర్లు, సహాయక సిబ్బంది తమ స్వస్థలాలను బయల్దేరి వెళ్లిపోయారు. వీరందరికీ ఐపీఎల్ ఇప్పట్లో మళ్లీ జరగదని, ఏడాది చివర్లో మళ్లీ నిర్వహించవచ్చనే సమాచారమే ఉంది. దాంతో వారంతా వెనక్కి వెళ్లిపోయారు. ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ జట్లకు చెందిన ఆటగాళ్లకు, ఇతర సిబ్బందికి తాజా సమాచారాన్ని అందించాయని, మళ్లీ వెంటనే వెనక్కి వచ్చే ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కూడా చెప్పినట్లు సమాచారం. కొందరు ఆదివారం బయల్దేరేందుకు సిద్ధమవుతుండగా వారిని ఆగిపోవాలని ఒక ఫ్రాంచైజీ చెప్పగా... మరికొందరు సగం దూరం ప్రయాణించగా, ఎక్కడ ఉన్నారో అక్కడినుంచే వెనక్కి రావాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెళ్లిపోయిన బట్లర్, కొయెట్జీలను వెనక్కి రమ్మని గుజరాత్ టైటాన్స్ కోరింది. అయితే అందరు విదేశీ ఆటగాళ్లు దాదాపు ఒకే మాట మీద ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మే 25 తర్వాత లీగ్ కొనసాగితే తాము ఉండలేమని తేల్చేశారు. జూన్ 11 నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో ఈ రెండు టీమ్‌ల ప్లేయర్లు మాత్రం అందుబాటులో ఉండే అవకాశాలు పూర్తిగా లేనట్లే. -
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ తిరిగి ప్రారంభం?
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..! మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్-2025 సీజన్ తిరిగి వచ్చే వారం ప్రారంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో త్వరలోనే ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానున్నట్లు స్పోర్ట్స్ టాక్ తమ కథనంలో పేర్కొంది. పెహల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం.. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్ధావరాలపై దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌లో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులను భారత సాయుధ దళాలు మట్టుబెట్టాయి. అనంతరం పాకిస్తాన్ సైన్యం సరిహద్దు వెంబడి కాల్పులు జరపడం, అందుకు భారత్ ధీటుగా బదులివ్వడం వంటి చర్యలు జరిగాయి. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే ఐపీఎల్-2025ను వారం రోజుల పాటు బీసీసీఐ తాత్కాలికంగా వాయిదా వేసింది. అయితే శనివారం ఇరు దేశాలు సీజ్‌ఫైర్‌కు ఒప్పుకొన్నాయి. ఈ విషయాన్ని భారత్-పాకిస్తాన్ అధికారికంగా ధ్రువీకరించాయి. మే 10 సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. మే 12న ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో ఆగిపోయిన ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. మే 8న ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు అయింది. ఈ మ్యాచ్ మళ్లీ తొలి బంతి నుంచి ప్రారంభం కానున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. రెండు మూడు రోజుల్లో కొత్త షెడ్యూల్‌ను ఐపీఎల్ పాలకమండలి ఖారారు చేసే అవకాశముంది.చదవండి: ప్లీజ్ కోహ్లి రిటైర్ అవ్వకు.. నీ అవసరం టీమిండియాకు ఉంది: రాయుడు -
పాకిస్తాన్‌కు అంత సీన్ లేదు.. త్వరలోనే ఐపీఎల్ మళ్లీ మొదలు!
ఐపీఎల్-2025 (IPL 2025)ని వాయిదా వేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయాన్ని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) స్వాగతించాడు. దేశ సరిహద్దుల వెంబడి నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా బోర్డు సరిగ్గా స్పందించిందని పేర్కొన్నాడు. అయితే, త్వరలోనే ఈ మెగా టోర్నీ మళ్లీ మొదలవుతుందని ధీమా వ్యక్తం చేశాడు.దాయాది దుశ్చర్యలుపాకిస్తాన్కు ఎక్కువ కాలం పోరాడే శక్తి లేదని.. కాబట్టి త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని గంగూలీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని దాదాపు తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో భారత్ చేపట్టిన ఈ చర్యను దాయాది జీర్ణించుకోలేకపోతోంది. అందుకే అనుచితంగా దాడులకు తెగబడుతోంది.ఈ క్రమంలో దాయాది పాక్ దుశ్చర్యలకు భారత్ గట్టి సమాధానిమిస్తోంది. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారి.. రణరంగాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా సరిహద్దుల వెంబడి పాక్ ఎక్కువగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ.. సామాన్యులు, సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తోంది. భారత్ ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది.ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ధర్మశాల స్టేడియంలో గురువారం పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా ఆగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వారం రోజుల పాటు లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.పాకిస్తాన్‌కు అంత సీన్ లేదుఈ పరిణామాలపై స్పందించిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ బీసీసీఐ భారత, విదేశీ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.అయితే, త్వరలోనే లీగ్ మళ్లీ మొదలు కావాలని ఆకాంక్షిద్దాం. ప్రస్తుతం టోర్నీ ప్లే ఆఫ్స్ దశలో ఉంది. ఇలాంటి తరుణంలో ధర్మశాల, చండీగఢ్, ఢిల్లీ, రాజస్తాన్, జైపూర్ వంటి ప్రాంతాలు మినహా.. మిగతా చోట్ల ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది.కాలక్రమేణా పరిస్థితులు చక్కబడతాయనే విశ్వాసం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇలాంటి పరిస్థితులను, ఒత్తిడిని ఎక్కువ కాలం భరించలేదు. ఆ దేశానికి అంతటి సామర్థ్యం లేదు. కాబట్టి బీసీసీఐ కచ్చితంగా ఐపీఎల్-2025ని పూర్తి చేస్తుంది’’ అని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు.సురక్షితంగా ఢిల్లీకిఇదిలా ఉంటే.. ధర్మశాలలో మ్యాచ్ రద్దు కాగానే.. బీసీసీఐ పంజాబ్- ఢిల్లీ ఆటగాళ్లను సురక్షితంగా ఢిల్లీకి చేర్చింది. అత్యంత భద్రత నడుమ వందే భారత్ రైలులో ఆటగాళ్లను తరలించింది. కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025లో ఇప్పటికి 57 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నాయి. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేట్ అయిపోయాయి. మిగతా మ్యాచ్‌లలో ఢిల్లీ, కోల్‌కతా, లక్నో జట్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి.చదవండి: విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు! -
టెస్టుల్లో అద్భుతం.. కానీ వన్డే, టీ20లలో మాత్రం వేస్ట్!
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) బ్యాటింగ్ తీరుపై భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ (Sanjay Bangar)విమర్శలు గుప్పించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో పంత్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని అన్నాడు. వన్డే, టీ20 క్రికెట్లో సరైన షాట్ల ఎంపిక విషయంలో ఇప్పటికీ అతడు తడబడుతుండటం ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నాడు.అత్యంత ఖరీదైన ఆటగాడిగాఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో రిషభ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ. 27 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఈ ఉత్తరాఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ చరిత్ర సృష్టించాడు.చెత్త ప్రదర్శనఅయితే, ఆట విషయంలో మాత్రం పంత్ తుస్సుమనిపించాడు. ఇప్పటి వరకు పది ఇన్నింగ్స్ 12.80 సగటుతో.. 99.22 స్ట్రైక్‌రేటుతో 128 పరుగులే చేశాడు. పంత్ ఐపీఎల్ ఆడటం మొదలుపెట్టిన నాటి (2016) నుంచి అతడి కెరీర్లో ఇదే అత్యంత చెత్త ప్రదర్శన అని చెప్పవచ్చు.టెస్టుల్లో అద్బుతం.. కానీ వన్డే, టీ20లలో మాత్రం వేస్ట్!లక్నో కెప్టెన్‌గా ఫర్వాలేదనిపిస్తున్నా.. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా పంత్ విఫలం కావడం తీవ్రమైన విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. ‘‘వైట్ బాల్ క్రికెట్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడంలో పంత్ తడబడుతున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది.50, 20 ఓవర్ల ఫార్మాట్లో అతడి ఆట గొప్పగా లేదు. అయితే, టెస్టు క్రికెట్లో మాత్రం అతడొక అద్భుతమైన బ్యాటర్. సంప్రదాయ ఫార్మాట్లో అతడి ఆటకు పేరు పెట్టే పనేలేదు.కానీ ఈ ఐపీఎల్ సీజన్లో అతడు అవుటైన విధానం చూస్తుంటే.. స్కూప్ షాట్లు ఆడేందుకు అతడు విఫలయత్నం చేసిన తీరును గమనించవచ్చు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు.వారం పాటు వాయిదా అదే విధంగా.. రిషభ్ పంత్ బ్యాటింగ్ టెక్నిక్ సరిగా లేదని సంజయ్ బంగర్ ఈ సందర్భంగా విమర్శించాడు. తనలోని అత్యుత్తమ బ్యాటర్ ఆడే విధానాన్ని పంత్ మర్చిపోయాడని.. అందుకే ఇలా విఫలమవుతున్నాడని అభిప్రాయపడ్డాడు.కాగా ఐపీఎల్-2025లో పంత్ సారథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని.. ఐదు గెలిచి.. ఆరింట ఓడింది. తద్వారా పది పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025ని వారం పాటు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.టీమిండియా తరఫున ఇలా..టెస్టుల్లో రిషభ్ పంత్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటికి 43 మ్యాచ్‌లు ఆడి 2948 పరుగులు చేశాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఖాతాలో ఆరు టెస్టు సెంచరీలు ఉన్నాయి.అయితే, వన్డేల్లో 31 మ్యాచ్‌లలో కలిపి పంత్ కేవలం 871 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 76 అంతర్జాతీయ టీ20లలో కలిపి 1209 పరుగులు సాధించగలిగాడు. ఇక ఐపీఎల్లో మొత్తంగా 122 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 3412 రన్స్ తన ఖాతాలో జమ చేసుకున్నాడు.చదవండి: విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు! -
IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!
ఐపీఎల్-2025 (IPL 2025)లో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణ ఎప్పుడన్న అంశంపై క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికి ఈ సీజన్లో లీగ్ దశలో భాగంగా 58 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అయితే, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టోర్నీ వాయిదా పడిన విషయం తెలిసిందే.అందుకే వాయిదాఓవైపు యుద్ధం జరుగుతుండగా.. మరోవైపు వినోదం కోసం ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం సరికాదని భావిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి, సైన్యానికి మద్దతుగా నిలిచే క్రమంలో వారం రోజుల పాటు ఐపీఎల్-2025ని వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) బీసీసీఐని సంప్రదించినట్లు సమాచారం. ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో మిగిలిన పదహారు మ్యాచ్‌లకు తాము ఆతిథ్యం ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాంది గార్డియన్ కథనం ప్రకారం.. ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ బీసీసీఐ అధికారులను సంప్రదించి.. ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణ గురించి ప్రతిపాదనలు చేశారు. బీసీసీఐకి అభ్యంతరం లేకపోతే తమ దేశంలో ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తామని తెలిపారు.‘‘వారం రోజుల తర్వాత కూడా ఐపీఎల్-2025ను పునఃప్రారంభించేందుకు పరిస్థితులు అనుకూలించకపోతే.. ఈసీబీ ఆ బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. సెప్టెంబరులో మిగిలిన మ్యాచ్‌లను తాము పూర్తి చేస్తామని ఈసీబీ వర్గాలు వెల్లడించాయి’’ అని ది గార్డియన్ పేర్కొంది.కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ మే 25తో ముగియాల్సి ఉంది. అయితే, సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాలలో మే 8 నాటి పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలోనే రద్దు చేశారు. ఈ క్రమంలో టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తారనే వార్తలు రాగా.. వారం పాటు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.ఢిల్లీకి చేరుకున్నారుఇదిలా ఉంటే.. పంజాబ్- ఢిల్లీ ఆటగాళ్లతో సహా సహాయక సిబ్బంది మొత్తాన్ని వందే భారత్ రైలులో జలంధర్ నుంచి ఢిల్లీకి సురక్షితంగా తరలించారు. ఇక కొంత మంది విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లాలని భావిస్తుండగా.. ఫ్రాంఛైజీలు అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.మరోవైపు.. దాడులకు బరితెగించిన పాకిస్తాన్‌కు భారత్ దీటుగా సమాధానం ఇస్తుండటంతో దాయాది ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్-2025ని ఇప్పటికైతే నిలిపివేస్తున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. చదవండి: IPL 2025: ప్రత్యామ్నాయ తేదీలు ఏవి? -
IPL 2025: ధనాధన్‌గా దూసుకొచ్చారు
14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో కోట్లు కొల్లగొట్టిన బిహార్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ... బరిలోకి దిగిన మూడో మ్యాచ్‌లోనే రికార్డు సెంచరీతో తన పేరు మారుమోగేలా చేసుకున్నాడు! ప్రదాన ఆటగాళ్లంతా విఫలమవుతున్న చోట... నేనున్నానంటూ బాధ్యతలు భూజానికెత్తుకున్న 17 ఏళ్ల ఆయుశ్ మాత్రే ఆడింది తక్కవ మ్యాచ్‌లే అయినా... చెన్నై భవిష్యత్తు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు!పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ ధాటిగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లకు గుబులు పుట్టిస్తుంటే... ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ అభిషేక్ పొరెల్ తన నిలకడతో ఆకట్టుకున్నాడు. తాజా ఐపీఎల్ సీజన్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న అన్క్యాప్డ్ ఓపెనర్లపై కథనం... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ వారం రోజులపాటు వాయిదా పడింది. ఇప్పటి వరకు 58 మ్యాచ్‌లు జరిగాయి. మరో 12 లీగ్ మ్యాచ్‌లు... ఆ తర్వాత 4 ప్లే ఆఫ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. వారం రోజుల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి ఐపీఎల్ టోర్నీ ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో స్టార్ ఆటగాళ్లకంటే ఏమాత్రం అంచనాలు లేని యువ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. హేమాహేమీలతో పోటీపడుతూ... తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది ముఖ్యంగా యువ ఓపెనర్ల జోరు ఎక్కువ కనిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీ (రాజస్తాన్ రాయల్స్), ఆయుశ్ మాత్రే (చెన్నై సూపర్ కింగ్స్), అభిషేక్ పొరెల్ (ఢిల్లీ క్యాపిటల్స్)... ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ (పంజాబ్ కింగ్స్) ఈ కోవలోకే వస్తారు. టీమిండియా గడప తొక్కాలంటే... ఐపీఎల్లో రాణించడం తప్పనిసరిలా మారిపోయిన ప్రస్తుతం తరుణంలో ఈ సీజన్లో ఈ ఐదుగురు ఆటగాళ్లు తమదైన ముద్ర వేస్తున్నారు. ఇందులో ఒక్కొక్కరి శైలి ఒక్కో రకం కాగా... అందరి లక్ష్యం భారీగా పరుగులు సాధించడమే. తాజా సీజన్లో అన్క్యాప్డ్ (జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని ఆటగాళ్లు) ప్లేయర్లుగా బరిలోకి దిగి పేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా విరుచుకుపడుతున్న ఈ యువతరం... భారత క్రికెట్ భవిష్యత్తుపై మరింత భరోసా పెంచుతోంది. ఆహా... ఆయుశ్ ముంబైకి చెందిన 17 ఏళ్ల ఆయుశ్ మాత్రేకు అనూహ్యంగా ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో ఈ యువ ఓపెనర్‌ను రూ. 30 లక్షలు ఇచ్చి జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే 15 బంతుల్లో 32 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం ఓపెనర్... బెంగళూరుతో మ్యాచ్‌లో 48 బంతుల్లో 94 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. బౌలర్ ఎవరైనా లెక్కచేయకపోవడం... బంతి తన పరిధిలో ఉంటే చాలు విరుచుకుపడటం ఆయుశ్ ప్రధాన అ్రస్తాలు. ఈ సీజన్లో చెన్నై జట్టు పేలవ ప్రదర్శన కనబర్చడంతో ఆయుశ్ మెరుపులు పెద్దగా వెలుగులోకి రాలేదు. అయితే సాధారణ ఆటగాళ్లను సైతం మ్యాచ్ విన్నర్లుగా తీర్చిదిద్దగల ధోని సారథ్యంలో మాత్రే భవిష్యత్తులో మరింత రాటుదేలడం ఖాయమే. మ్యాచ్‌లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 5 163 94 181.11అభిషేక్ అదుర్స్ఈ ఏడాది అంచనాలకు మించి రాణిస్తున్న ఆటగాళ్లలో అభిషేక్ పొరెల్ ఒకడు. గతేడాది ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచగా... దాన్ని పొరెల్ నిలబెట్టుకుంటున్నాడు. తాజా సీజన్లో సహచర ఓపెనర్లు నిలకడ కనబర్చలేకపోయినా... పొరెల్ మాత్రం ప్రభావం చూపాడు. 22 ఏళ్ల ఈ ఎడం చేతి వికెట్ కీపర్... కేఎల్ రాహుల్ తర్వాత ప్రస్తుతం ఢిల్లీ జట్టులో రెండో అత్యధిక స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. పేస్‌తో పాటు స్పిన్‌ను కూడా సమర్థవంతంగా ఎదుర్కోగల పొరెల్ నైపుణ్యం అతడిని క్లాస్ ప్లేయర్ల జాబితాలో చేర్చుతుంది. బంతిపై మరీ పగబడినట్లు కాకుండా... సుతారాంగా అతడు కొట్టే షాట్లు క్రీడాభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. బ్యాటింగ్‌లో భళా అనిపించుకుంటున్న పొరెల్... స్ట్రయిక్ రొటేషన్ ప్రాధానత్యను అర్థం చేసుకుంటూ ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్న తీరు ముచ్చటేస్తోంది. మ్యాచ్‌లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 12 265 51 149.71వైభవ్ జ్వాలఐపీఎల్లో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ బాది... తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్న 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మూడో మ్యాచ్‌లోనే రికార్డు సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెటే శ్వాసగా పెరిగిన ఈ బిహార్ ఎడంచేతి వాటం ఓపెనర్... గుజరాత్ టైటాన్స్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. జైపూర్ వేదికగా జరిగిన పోరులో 7 ఫోర్లు, 11 సిక్స్‌లతో చెలరేగిపోయాడు. రెండొందల పైచిలుకు లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నా ఏమాత్రం వెరవకుండా విరుచుకుపడి టి20ల్లో సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 94 పరుగుల వద్ద ఉండి కూడా ధైర్యంగా సిక్స్ కొట్టి మూడంకెల స్కోరు అందుకున్న ఈ కుర్రాడు. ఆ తర్వాత పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా... అతడిలో ప్రతిభకు కొదవలేదని మాత్రం నిరూపితమైంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాదిరిగా వైభవ్క కూడా చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంచనాల ఒత్తిడి దరి చేరనివ్వకుండా... నిలకడ కొనసాగిస్తే వీరిలో కొందరు ఆటగాళ్లు టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.మ్యాచ్‌లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 5 155 101 209.45ఫటాఫట్.. ప్రభ్సిమ్రన్ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ మంచి ప్రదర్శన చేస్తోంది అంటే... దాని ప్రధాన కారణాల్లో ఓపెనింగ్ జోడీ ప్రదర్శన ముఖ్యమైంది. ఒక ఎండ్‌లో ఆర్య అదరగొడుతుంటే... మరో ఎండ్ నుంచి ‘పిట్ట కొంచం కూత ఘనం’లాగా ప్రభ్‌సిమ్రన్ చెలరేగిపోతున్నాడు. ఫలితంగానే చాన్నాళ్ల తర్వాత పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్ దిశగా సజావుగా సాగుతోంది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ శిక్షణ, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భయం లేకుండా ఆడుతున్న 24 ఏళ్ల ప్రభ్‌సిమ్రన్ సింగ్... జట్టు నమ్మదగ్గ ఆటగాళ్లలో ఒకడిగా మారిపోయాడు. లక్నోపై 48 బంతుల్లోనే 91 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రన్... స్లో పిచ్‌పై కోల్‌కతా స్పిన్నర్లను ఎదుర్కొని 83 పరుగులు చేశాడు. పవర్‌ప్లేను పూర్తిగా వినియోగించుకుంటూ భారీగా పరుగులు రాబడుతున్న ఈ కుడి చేతి వాటం బ్యాటర్... భవిష్యత్తుపై భరోసా పెంచుతున్నాడు.మ్యాచ్‌లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 12 487 91 170.87ప్రియాన్ష్ ‘స్పెషల్ టాలెంట్’ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో ‘స్పెషల్ టాలెంట్’ అని ప్రశంసలు అందుకున్న 23 ఏళ్ళ ప్రియాన్ష్ ఆర్య... చెన్నైపై సెంచరీ బాది ప్రకంపనలు సృష్టించాడు. బంతిని నిశితంగా గమనించడంతో పాటు దాని వేగాని ప్రియాన్ష్ ఆర్య..కి అనుగుణంగా షాట్లను ఎంపిక చేసుకొని అప్పటికప్పుడు వాటిని అమలు చేయడంలో ప్రియాన్ష్ దిట్ట. ముల్లాన్‌పూర్ వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ప్రియాన్ష్... ఇన్నింగ్స్‌ను పరిశీలిస్తే ఇది అవగతమవుతుంది.బ్యాటింగ్‌కు అంతగా అనుకూలంగా లేని పిచ్‌పై ఆర్య అదరగొట్టి ఐపీఎల్లో ఐదో వేగవంతమైన శతకం (39 బంతుల్లో) చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఢిల్లీకి చెందిన ఈ ఎడం చేతివాటం బ్యాటర్... ఫోర్ల కంటే ఎక్కువ సిక్స్‌లు కొట్టడంలో సిద్ధహస్తుడు. అభిమానులు ముద్దుగా ‘లెఫ్ట్ హ్యాండ్ సెహ్వాగ్ ’ అని పిలుచుకుంటున్న ఆర్య... ఈ సీజన్లో పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో కలిసి జట్టుకు మెరుగైన ఆరంభాలు అందించడం... పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబడుతుండటంతో... మిడిలార్డర్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతోంది.మ్యాచ్‌లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 12 417 103 194.85 -
వారం రోజుల విరామం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2025 మ్యాచ్‌లకు బ్రేక్ పడింది. భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లీగ్‌ను వెంటనే నిలిపివేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. లీగ్‌ను ‘వారం రోజుల పాటు’ ఆపేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. గురువారం ధర్మశాలలో ఢిల్లీ, పంజాబ్ మధ్య మ్యాచ్‌ను అకస్మాత్తుగా ఆపేసినప్పుడే లీగ్ కొనసాగడంపై సందేహాలు వచ్చాయి.శుక్రవారం దీనిని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఒకవైపు యుద్ధం సాగుతుండగా, మరోవైపు ఐపీఎల్ రూపంలో వినోదం కొనసాగడం సరైంది కాదని బోర్డు భావించింది. ఫ్రాంచైజీలు, ప్రసారకర్తలు, స్పాన్సర్లతో పాటు లీగ్‌తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్నవారందరితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. ‘ఐపీఎల్ భాగస్వాములందరితో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం.ప్రస్తుత స్థితిలో మేం దేశం వెంట ఉన్నాం. ప్రభుత్వానికి, సైన్యానికి మా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశాన్ని రక్షిస్తున్న ఆర్మీ ధైర్యసాహసాలకు మేం సెల్యూట్ చేస్తున్నాం. మన దేశంలో క్రికెట్ పట్ల అపరిమిత ప్రేమ ఉందనేది వాస్తవం. అయితే దేశంకంటే, దేశం సార్వభౌమత్వం, భద్రతకంటే ఏదీ ఎక్కువ కాదు. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే బీసీసీఐ ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది. మాకు మద్దతుగా నిలిచిన ఐపీఎల్ భాగస్వాములందరికీ కృతజ్ఞతలు’ అని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. లీగ్ కొనసాగించడం, కొత్త తేదీలు, వేదికలపై అన్ని వర్గాలతో చర్చించిన తర్వాత పరిస్థితులను బట్టి త్వరలో నిర్ణయం తీసుకుంటామని కూడా బోర్డు స్పష్టం చేసింది. క్రికెటర్లు స్వస్థలాలకు... ఐపీఎల్ వాయిదాపై ప్రకటన వచ్చిన వెంటనే అన్ని జట్లలోని క్రికెటర్లు తమ సొంత నగరాలకు బయలుదేరేలా ఆయా ఫ్రాంచైజీలు ఏర్పాట్లు చేశాయి. స్వదేశానికి వెళ్లిపోవాలనుకునే విదేశీ క్రికెటర్లకు ఏర్పాట్లపరంగా ‘ప్లేయర్స్ అసోసియేషన్’ సహకరిస్తోంది. గురువారం ధర్మశాలలో మ్యాచ్ రద్దయ్యాక ఢిల్లీ, పంజాబ్ క్రికెటర్లు, సహాయక సిబ్బందిని ముందుగా బస్సు ద్వారా జలంధర్‌కు తరలించారు. అక్కడి నుంచి వారంతా ప్రత్యేక వందేభారత్ రైలులో ఢిల్లీకి పయనమయ్యారు. విమర్శల బారిన పడరాదనే... ఐపీఎల్ సీజన్ లీగ్ దశలో 58 మ్యాచ్‌లు ముగియగా... మరో 12 మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. వీటిలో అహ్మదాబాద్‌లో మూడు... లక్నో, బెంగళూరులలో రెండు చొప్పున...హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, జైపూర్లలో ఒక్కో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇవి కాకుండా 4 ప్లే ఆఫ్స్‌లలో రెండేసి మ్యాచ్‌లకు హైదరాబాద్, కోల్‌కతా వేదికగా నిర్వహించాల్సి ఉంది. వాస్తవికంగా చూస్తే సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం ఉన్నా... ఉత్తరాదిలోని కొన్ని నగరాలు మినహా ఈశాన్యం, దక్షిణం వైపు సాధారణ పరిస్థితులే ఉన్నాయి. బీసీసీఐ స్థాయి, దానికి ఉన్న సాధన సంపత్తిని దృష్టిలో పెట్టుకొని చూస్తే కేవలం వేదికలు మార్చి చకచకా ఈ 16 మ్యాచ్‌లు నిర్వహించడం ఏమాత్రం సమస్య కాదు. అయితే ఒకవైపు యుద్ధం సాగుతుంటే, మన సైనికులు పోరాడుతుంటే మీకు ఆటలు కావాలా అని సగటు భారతీయుడు ఆగ్రహిస్తున్నాడు. ఇంత సంకట స్థితిలో ఎన్నో విషయాల్లో ప్రభుత్వం నుంచి ఆంక్షలు, హెచ్చరికలు వస్తుండగా ఐపీఎల్ మాత్రం కొనసాగడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. దాంతో బీసీసీఐ కూడా పునరాలోచనలో పడింది. అయితే పూర్తిగా సీజన్‌ను రద్దు చేయకుండా, లేక సుదీర్ఘ సమయం వాయిదా వేయకుండా ‘ఒక వారం వాయిదా’ అంటూ సన్నాయి నొక్కులు చూపిస్తోంది. బహుశా వచ్చే వారం రోజుల్లో పరిస్థితులు మెరుగుపడవచ్చని, అప్పుడు మళ్లీ ఆడించవచ్చనే ఆలోచన కనిపిస్తోంది!ప్రత్యామ్నాయ తేదీలు ఏవి?బీసీసీఐ ‘వారం’ విరామం ప్రకటనను బట్టి చూస్తే వెంటనే కొనసాగించాలని భావిస్తున్నట్లుగా ఉంది. షెడ్యూల్ ప్రకారం మే 25న ఐపీఎల్ ముగియాలి. ఇప్పుడు మరో వారం దీనికి జోడిస్తే జూన్ 1న ముగిసేలా కొత్త షెడ్యూల్ ఇవ్వవచ్చు. సరిగ్గా చెప్పాలంటే టోర్నీని ముగించేందుకు బోర్డుకు 10 రోజులు చాలు. ‘డబుల్ హెడర్’లుగా రోజుకు రెండు లీగ్ మ్యాచ్‌ల చొప్పున 6 రోజులు... ప్లే ఆఫ్స్‌కు మరో 4 రోజులు సరిపోతాయి. జూన్ మొదటి వారంలో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరాల్సి ఉంది కాబట్టి కష్టమనే చర్చ ఉన్నా... తొలి టెస్టు జూన్ 20న మొదలవుతుంది. ఐపీఎల్లో ఆడుతున్న టెస్టు జట్టు సభ్యులు జూన్ 10 వరకు చేరుకున్నా సమస్య లేదు. ఇప్పటికిప్పుడు మ్యాచ్‌లు నిర్వహించకుండా ఆగిపోతే ఇంగ్లండ్ సిరీస్ తర్వాత ఆగస్టు, సెపె్టంబర్ వరకు లీగ్ వెళుతుంది. అయితే ఆగస్టులో భారత జట్టు బంగ్లాదేశ్‌తో వన్డే, టి20 సిరీస్‌లను ఆడనుంది. దీనిని వాయిదా వేసినా ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్, ఇంగ్లండ్ బోర్డు నిర్వహించే ‘హండ్రెడ్’ టోర్నీలు ఉన్నాయి. ‘హండ్రెడ్’లో సగం జట్లను ఐపీఎల్ యజమానులే కొన్నారు కాబట్టి ఇది అసాధ్యం. సెప్టెంబర్‌లో 19 రోజులు ‘ఆసియా కప్’ టోర్నీకి కేటాయించారు. దీనికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ ఇక్కడ ఆడకపోవడమే కాదు... భారత్, పాక్ మధ్య మ్యాచ్‌లు జరగడం కూడా అసాధ్యమే! కాబట్టి ఈ ఒక్క టోర్నీని రద్దు చేస్తే ఐపీఎల్‌కు కావాల్సిన సమయం లభిస్తుంది. -
IPL 2025: ఐపీఎల్ వాయిదా.. టికెట్ల డబ్బులు రీఫండ్
పాకిస్తాన్-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్-2025ను వారం రోజుల పాటు బీసీసీఐ తాత్కాలికంగా వాయిదా వేసింది. ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. త్వరలోనే కొత్త షెడ్యూల్, వేదికలను ఖారారు చేస్తామని భారత క్రికెట్ బోర్డు తెలిపింది.దీంతో మే 9(శుక్రవారం) నుంచి మ్యాచ్‌లు ఆగిపోనున్నాయి. ఐపీఎల్ నిరవధిక వాయిదా పడడంతో ఆయా ఫ్రాంచైజీలు అభిమానులకు టిక్కెట్ల డబ్బులను రీఫండ్ చేయడం ప్రారంభించాయి. షెడ్యూల్ ప్రకారం..ఏక్నా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడాల్సింది. కానీ వాయిదా పడడంతో టిక్కెట్ల డబ్బులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ ప్రకటించింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా టిక్కెట్ల డబ్బులను రీఫండ్ చేస్తామని వెల్లడించింది. కాగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా అర్ధాంతంగా రద్దు అయ్యింది. ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌లో యూఏఈలో నిర్వహించే అవకాశముంది. -
'ఐపీఎల్‌ను ఇంగ్లండ్‌లో నిర్వహించండి'.. బీసీసీఐకి మాజీ క్రికెటర్ సూచన
ఐపీఎల్-2025ను భారత క్రికెట్ బోర్డు వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నీ ఎప్పుడు పునఃప్రారంభమవుతుందో స్పష్టమైన తేదీని మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు.దీంతో విదేశీ ఆటగాళ్లు తమ స్వదేశానికి పయనం కానున్నారు. ఆ తర్వాత ఐపీఎల్ తిరిగి ప్రారంభమైన కూడా చాలా మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే మిగిలిన టోర్నీని విదేశాలకు తరలించిన ఆశ్చర్యపోనక్కర్లలేదు. బీసీసీఐకు యూఏఈ మొదటి అప్షన్‌గా ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లను కూడా యూఏఈలోనే నిర్వహించాలని పీసీబీ నిర్ణయించింది. దీంతో బీసీసీఐ ఐపీఎల్ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహిస్తుందా? లేదా భారత్‌లోనే కొనసాగుస్తుందా అన్నది వేచి చూడాలి. ఈ క్రమంలో భారత క్రికెట్ బోర్డుకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కీలక సూచనలు చేశాడు. ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్‌లను పూర్తి చేయడానికి ఇంగ్లండ్‌ను మంచి ఎంపికగా బీసీసీఐ పరిగణించాలని వాన్ అభిప్రాయపడ్డాడు. "ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌లను యూకేలో నిర్వహిస్తే బాగుటుంది. మాకు చాలా స్టేడియాలు ఉన్నాయి.అంతేకాకుండా భారత ఆటగాళ్లు ఐపీఎల్‌ను పూర్తి చేసుకుని టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్‌లోనే ఉండిపోవచ్చు. ఇది కేవలం నా ఆలోచన మాత్రమే" అని ఎక్స్‌లో వాన్ రాసుకొచ్చాడు. కాగా ఈ ఏడాది జూన్‌లో భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.చదవండి: IPL 2025: ఐపీఎల్ వాయిదా ఎన్ని రోజులంటే? బీసీసీఐ కీలక ప్రకటన -
ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్‌కు బాంబు బెదిరింపులు
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. భారత్ తమ సైనిక చర్యలతో దాయాది దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇండియన్ ఆర్మీ.. డ్రోన్లు, క్షిపణులతో ఉగ్ర శిబిరాలు, సైనిక స్థావరాలపై దాడి చేస్తూ పాకిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బకొట్టింది.పాక్ కూడా సరిహద్దు వెంబడి తీవ్ర స్ధాయిలో కాల్పులకు తెగబడుతూ కవ్వింపు చర్యలకు దిగుతోంది. అంతేకాకుండా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ముఖ్య నగరాల్లో డ్రోన్ దాడికి యత్నించి పాక్ విఫలమైంది. ప్రస్తుతం ఇరు దేశాల్లోనూ యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. అరుణ్ జైట్లీ స్టేడియంను పేల్చివేస్తామని పేర్కొంటూ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) కు శుక్రవారం బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని డీడీసీఎ అధికారి ఒకరు ధ్రవీకరించారు."మీ స్టేడియంలో బాంబు పేలుడు జరుగుతుంది. భారత్‌లో పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ బ్లాస్ట్‌తో ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం తీర్చు కుంటామని" మెయిల్లో రాసి ఉన్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు. కాగా ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్‌గా ఉంది. ఈ అరుణ్ జైట్లీ స్టేడియం మే 11న గుజరాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ ఐపీఎల్-2025ను వారం రోజుల పాటు బీసీసీఐ తాత్కాలికంగా నిలిపివేసింది. -
ఐపీఎల్ వాయిదా ఎన్ని రోజులంటే? బీసీసీఐ కీలక ప్రకటన
ఐపీఎల్-2025 సస్పెన్షన్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరో కీలక ప్రకటన చేసింది. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది సీజన్‌ను వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ ఏడాది సీజన్ పూర్తిగా రద్దు అవుతుందన్న ఊహాగానాలకు భారత క్రికెట్ బోర్డు చెక్‌పెట్టింది."ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచులను వారం రోజుల పాటు తక్షణమే నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించింది. సంబంధిత అధికారులు, వాటాదారులతో సంప్రదించి అప్పటి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తాము. చాలా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన చెందుతున్నాయి.ఫ్రాంచైజీలు, ప్రసారకర్తలు, స్పాన్సర్లు అందరి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే ఐపీఎల్ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది. మన సాయుధ దళాల బలంపై బీసీసీఐకి పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ, స్టేక్ హోల్డర్స్ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం ముఖ్యమైనది బోర్డు భావించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది సీజన్ తిరిగి మళ్లీ మే 16 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. కాగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అర్ధాంతంగా రద్దు అయింది. భద్రతా కారాణాల దృష్ట్యా మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేశారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.చదవండి: ఆపరేషన్ సిందూర్ 2.0పై అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు -
వాయిదా పడకముందు ఐపీఎల్-2025లో పరిస్థితి ఇది..!
భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 నిరవధికంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇవాళ (మే 9) అధికారికంగా ప్రకటించింది. యుద్ద పరిస్థితుల్లో లీగ్‌ను కొనసాగించలేమని చెప్పింది. దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది. ఐపీఎల్ 2025 భవితవ్యాన్ని త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ రద్దునిన్న (మే 8) ధర్మశాల వేదికగా పంజాబ్-ఢిల్లీ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. షెడ్యూల్ ప్రకారం ప్రారంభమైన మ్యాచ్‌ను బ్లాక్ అవుట్ ప్రకటించడంతో అత్యవసరంగా రద్దు చేశారు. తొలుత ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఐపీఎల్ వర్గాలు.. ఆతర్వాత అసలు విషయాన్ని వెల్లడించాయి. పాక్ దాడులను తెగబడే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ ప్రకటించాడు.ఈ మ్యాచ్‌పై ప్రస్తుతానికి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారా లేక ఫ్రెష్‌గా మరో మ్యాచ్‌ను స్టార్ట్ చేస్తారా లేక ఆగిపోయిన దగ్గరి నుంచే కొనసాగిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.వాయిదా ప్రకటనకు ముందు ఐపీఎల్ 2025 పరిస్థితి ఇది57 మ్యాచ్‌ల పాటు సజావుగా సాగిన ఐపీఎల్ 2025.. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా 58వ మ్యాచ్ మధ్యలో బ్రేక్ పడింది. వాయిదా ప్రకటనకు ముందు ఐపీఎల్ 2025 పరిస్థితి ఇలా ఉంది.పాయింట్ల పట్టిక..అత్యధిక పరుగులు..అత్యధిక వికెట్లు.. -
ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా.. అధికారిక ప్రకటన
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 నిరవధికంగా వాయిదా పడింది. ఈ మేరకు బీసీసీఐ ఇవాళ (మే 9) అధికారిక ప్రకటన విడుదల చేసింది. వేదిక, తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడిస్తామని బీసీసీఐ పేర్కొంది. యుద్ద పరిస్థితుల్లో లీగ్ నిర్వహించలేమని బీసీసీఐ చెప్పింది. దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమ ప్రాధాన్యత అని బోర్డు ఉన్నతాధికారి వివరించారు. ఉద్రిక్తతల కారణంగా పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ రద్దునిన్న (మే 8) ధర్మశాల వేదికగా పంజాబ్-ఢిల్లీ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దైంది. షెడ్యూల్ ప్రకారం ప్రారంభమైన మ్యాచ్‌ను బ్లాక్ అవుట్ ప్రకటించడంతో అత్యవసరంగా రద్దు చేశారు. తొలుత ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఐపీఎల్ వర్గాలు.. ఆతర్వాత అసలు విషయాన్ని వెల్లడించాయి. పాక్ దాడులను తెగబడే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ ప్రకటించాడు.మ్యాచ్ రద్దు ప్రకటన వచ్చిన వెంటనే ఆటగాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియాన్ని వీడారు. ఆటగాళ్లతో పాటు ఇరు జట్ల బృందాలను హుటాహుటిన ప్రత్యేక ట్రయిన్ ద్వారా పఠాన్‌కోట్ గుండా ఢిల్లీకి తరలించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ స్కోర్ 122/1గా (10.1 ఓవర్లలో) ఉండింది. పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (34 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (28 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు) భారీ షాట్లతో విధ్వంసం సృష్టించారు.ఏం జరిగిందంటే..?ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడి 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన తర్వాత కొద్ది రోజుల కామ్‌గా ఉన్న భారత్.. ఈ మంగళవారం అర్దరాత్రి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్ పేరిట సాగిన ఈ ప్రతి దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.ఇందుకు బదులుగా పాకిస్తాన్ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడింది. రాకెట్లు, మిసైళ్లతో జనావాసాలను టార్గెట్ చేసింది. పాక్ దుశ్చర్యకు భారత్ సైతం ధీటుగా బదులిస్తోంది. భారత బలగాలు పాక్ మిస్సైల్లను గాల్లోనే పేల్చేస్తున్నాయి. సమాంతరంగా పాక్‌లోని కీలక నగరాలపై డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే భారత బలగాలు పాక్‌ను కోలుకోలేని దెబ్బతీశాయి. అయినా పాక్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. కాల్పులకు పాల్పడుతూనే ఉంది. -
IPL 2025, DC VS PBKS: బ్లాక్ అవుట్‌కు ముందు బ్లో అవుట్
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో నిన్న (మే 8) ధర్మశాల వేదికగా జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దైంది. షెడ్యూల్ ప్రకారమే ప్రారంభమైన మ్యాచ్‌ను బ్లాక్ అవుట్ ప్రకటించడంతో అత్యవసరంగా రద్దు చేశారు. బ్లాక్ అవుట్ ప్రకటనకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ పరుగుల వరద పారించింది. ఆ జట్టు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (34 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (28 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు) భారీ షాట్లతో విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి ధాటికి పంజాబ్ పవర్ ప్లేలో 69 పరుగులు చేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన ప్రియాంశ్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రభ్‌సిమ్రన్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి సీజన్లో వరుసగా నాలుగోసారి ఈ ఘనత సాధించాడు. ప్రియాంశ్, ప్రభ్‌సిమ్రన్ పోటీపడి చెలరేగడంతో పంజాబ్ 10 ఓవర్లలో ఏకంగా 122 పరుగులు చేసింది.అనంతరం 11వ ఓవర్ తొలి బంతికే సీజన్ తొలి మ్యాచ్ ఆడుతున్న నటరాజన్ ప్రియాంశ్ ఆర్యను ఔట్ చేశాడు.అప్పుడే అధికారుల నుంచి బ్లాక్ అవుట్ సమాచారం రావడంతో స్టేడియం నిర్వహకులు ఓ ఫ్లడ్ లైట్‌ను బంద్ చేశారు. కొద్ది సేపటికి మరో రెండు ఫ్లడ్ లైట్లు కూడా బందయ్యాయి. దీని తర్వాత మరి కొద్ది సేపటికి మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆటగాళ్లు సహా స్టేడియం మొత్తం ఖాళీ చేయాలని అత్యవసర ప్రకటన వచ్చింది.తొలుత ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఐపీఎల్ వర్గాలు.. ఆతర్వాత అసలు విషయాన్ని వెల్లడించాయి. పాక్ దాడులను తెగబడే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ ప్రకటించాడు. మ్యాచ్ రద్దు ప్రకటన వచ్చిన వెంటనే ఆటగాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియాన్ని వీడారు. ఆటగాళ్లతో పాటు ఇరు జట్ల బృందాలను హుటాహుటిన ప్రత్యేక ట్రయిన్ ద్వారా పఠాన్‌కోట్ గుండా ఢిల్లీకి తరలించారు.బ్లాక్ అవుట్ అంటే ఏంటి..?యుద్ధం లేదా ఎమర్జెన్జీ పరిస్థితుల్లో నగరాన్ని మొత్తం చీకటి చేయడం. శత్రువుల వైమానిక దాడులను కష్టతరం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇలా చేస్తే శత్రువుల టార్గెట్ మిస్ అవుతుంది. ఫలితంగా దాడుల నుంచి రక్షణ పొందొచ్చు. -
IPL 2025: భారత్‌ను వీడి వెళ్లే యోచనలో ఆస్ట్రేలియా క్రికెటర్లు..?
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. లీగ్ కొనసాగింపుపై ఇవాళ (మే 9) అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ లోపే ఐపీఎల్లో పాల్గొంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు భారత్‌ను విడిచి వెళ్లాలని భావిస్తున్నట్లు ప్రముఖ ఆస్ట్రేలియా దినపత్రిక సిడ్ని మార్నింగ్ హెరాల్డ్ ఓ కథనంలో పేర్కొంది. భారత్‌లో యుద్ద పరిస్థితుల నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు భయాందోళనలకు గురవుతున్నట్లు ఆటగాళ్ల ఏజెంట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ద్వారా ఆస్ట్రేలియా ప్రభుత్వానికి సందేశం చేరవేశారట. ముఖ్యంగా భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఆసీస్ ప్లేయర్లు బిక్కుబిక్కుమంటున్నట్లు సిడ్ని మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. వీలైనంత త్వరగా తమను భారత్ నుంచి దాటించాలని కొందరు ఆసీస్ ప్లేయర్లు క్రికెట్ ఆస్ట్రేలియాకు విన్నవించుకున్నారట.ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, మార్కస్ స్టోయినిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, జోస్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, స్పెన్సర్ జాన్సన్, ఆరోన్ హార్డీ, నాథన్ ఇల్లిస్, జేవియర్ బార్ట్లెట్ వివిధ ఫ్రాంచైజీలకు ఆడుతున్నారు. వీరితో పాటు రికీ పాంటింగ్, బ్రాడ్ హడిన్, మైక్ హస్సీ వంటి వారు వేర్వేరు జట్ల తరఫున కోచింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.కాగా, నిన్న (మే 8) ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ బ్లాక్ అవుట్ కారణంగా రద్దైంది. తొలుత ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశామని ప్రకటించిన ఐపీఎల్ వర్గాలు.. ఆతర్వాత అసలు విషయాన్ని వెల్లడించారు. పాక్ దాడులను తెగబడే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ ప్రకటించాడు. మ్యాచ్ రద్దు ప్రకటన వచ్చిన వెంటనే ఆటగాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియాన్ని వీడారు. ఆటగాళ్లతో పాటు ఇరు జట్ల బృందాలను హుటాహుటిన ప్రత్యేక ట్రయిన్ ద్వారా పఠన్కోట్ గుండా ఢిల్లీకి తరలించారు.బ్లాక్ అవుట్ అంటే యుద్ధం లేదా ఎమర్జెన్జీ పరిస్థితుల్లో నగరాన్ని మొత్తం చీకటి చేయడం. శత్రువుల వైమానిక దాడులను కష్టతరం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇలా చేస్తే శత్రువుల టార్గెట్ మిస్ అవుతుంది. ఫలితంగా దాడుల నుంచి రక్షణ పొందొచ్చు. నేటి ఆర్సీబీ, లక్నో మ్యాచ్ జరుగుతుందా..?ధర్మశాలలో నిన్న జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యాక ఐపీఎల్ 2025 కొనసాగుతుందా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే నిన్న ఈ విషయంపై ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ స్పందిస్తూ.. ఇవాళ (మే 9) జరగాల్సిన ఆర్సీబీ, లక్నో మ్యాచ్ యధాతథంగా కొనసాగుతుందన్నట్లు చెప్పాడు. నేటి మ్యాచ్‌లో ఎలాంటి అపాయమూ లేని లక్నోలో జరుగనుండటమే అప్పుడు ధుమాల్ చేసిన ప్రకటనకు కారణం కావచ్చు. అయితే దీనిపై తుది నిర్ణయం మరి కాసేపట్లో వెలువడే అవకాశం ఉంది. -
RCB Vs LSG: ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ లక్ష్యంగా...
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో రెండు భిన్నమైన జట్ల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు సమీపించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో తలపడుతుంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన లక్నో జట్టు సొంతగడ్డపై జరగనున్న పోరులో సత్తా చాటాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే లక్నో ‘ప్లే ఆఫ్స్’ ఆశలు గల్లంతయ్యే అవకాశమున్న నేపథ్యంలో... సమష్టిగా కదం తొక్కేందుకు రెడీ అయింది. ఈ సీజన్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముందుకు సాగుతున్న ఆర్సీబీ 11 మ్యాచ్‌లాడి 8 విజయాలు, 3 పరాజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మరోవైపు లక్నో 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 6 పరాజయాలతో 10 పాయింట్లతో ఉంది. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తేనే లక్నో జట్టు ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన లక్నో సారథి రిషభ్ పంత్ ఏమాత్రం ప్రభావం చూపెట్టలేకపోతున్నాడు. బ్యాటింగ్ స్థానాల్లో మార్పు చేసుకున్నా ఫలితం మాత్రం శూన్యంగా మారింది. మరి ఈ మ్యచ్‌లో బెంగళూరు విజయం సాధించి ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ ఖరారు చేసుకుంటుందా లేక లక్నో పోటీలో నిలుస్తుందా చూడాలి! ఒత్తిడిలో పంత్ బృందం ఈ సీజన్లో లక్నో విజయాల్లో టాప్–3 కీలక పాత్ర పోషిస్తున్నారు. మార్క్రమ్, మిచెల్ మార్ష్ , నికోలస్ పూరన్ రాణిస్తుండటంతో ఆ జట్టుకు మంచి ఆరంభాలు లభిస్తున్నాయి. పూరన్ 11 మ్యాచ్‌ల్లో 410 పరుగులు చేయగా... మార్క్రమ్ 348 పరుగులు చేశాడు. మార్ష్ 10 మ్యాచ్‌ల్లో 378 పరుగులు కొట్టాడు. మిడిలార్డర్లో ఆయుశ్ బదోని కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు. అతడు 326 పరుగులు చేయగా... భారీ ఆశలు పెట్టుకున్న పంత్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఈ సీజన్లో పంత్ 12.80 సగటుతో కేవలం 128 పరుగులే చేశాడు. ధాటిగా ఆడగల సత్తాఉన్న పంత్ 99.22 స్ట్రయిక్‌రేట్ మాత్రమే నమోదు చేశాడు. చావో రేవో తేల్చుకునేందుకు బరిలోకి దిగాల్సిన పరిస్థితుల్లో పంత్ మాట్లాడుతూ... ‘మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే ‘ప్లే ఆఫ్స్’ రేసులో ఉంటాం. ఇప్పుడు మా ముందు ఉన్న లక్ష్యం అదే. టాపార్డర్ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ప్రతి మ్యాచ్‌లో వాళ్లపైనే భారం వేయడం కూడా తగదు’ అని పంత్ అన్నాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ భారీగా పరుగులు ఇచ్చుకుంటుండగా... ఫీల్డింగ్‌లోనూ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. మరి కీలక పోరులో నెగ్గాలంటే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో లక్నో మెరవాల్సిన అవసరముంది. ఫుల్ ఫామ్‌లో విరాట్... లీగ్ ఆరంభం నుంచి బరిలోకి దిగుతున్నా... ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఆర్సీబీ... ఈ సీజన్లో తమ కల నెరవేర్చుకోవాలని భావిస్తోంది. అందుకు తగ్గట్లే అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శనతో నిలకడగా విజయాలు సాధిస్తోంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫుల్ ఫామ్‌లో ఉండటం బెంగళూరుకు ప్రధాన బలం. ఈ సీజన్లో ఆడిన 11 మ్యాచ్‌ల్లో విరాట్ 63.13 సగటుతో 505 పరుగులు చేసి ‘ఆరెంజ్ క్యాప్’ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. అందులో 7 అర్ధశతకాలు ఉన్నాయి. ఆరంభంలో కోహ్లి ఇన్నింగ్స్‌లో స్థిరత్వాన్ని తెస్తే... రజత్ పాటీదార్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా దాన్ని కొనసాగిస్తున్నారు. ఆఖర్లో టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ వంటి హిట్టర్లు ఉండటం ఆ జట్టు భారీ స్కోర్లు చేయగలుగుతోంది. అయితే ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు దేవదత్ పడిక్కల్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కర్ణాటక ఆటగాడు మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసుకుంది. చెన్నైతో జరిగిన గత మ్యాచ్‌లో షెఫర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు దేవదత్ పడిక్కల్ గాయం కారణంగా దూరవడంతో ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారింది. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాళ్, కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ కీలకం కానున్నారు.తుది జట్లు (అంచనా) లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్), మార్క్రమ్, మార్ష్ , పూరన్, బదోనీ, మిల్లర్, సమద్, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, దిగ్వేశ్ రాఠీ, ఆకాశ్ సింగ్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, జాకబ్ బెథెల్, మయాంక్ అగర్వాల్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, ఇన్‌గిడి, యశ్ దయాళ్, సుయాశ్ శర్మ. -
ఐపీఎల్ వాయిదా?
ధర్మశాల: ఉగ్రవేటకు తలపెట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ఏమాత్రం జీర్ణించుకోలేని పాకిస్తాన్ మిలిటరీ కుటిలబుద్ధితో క్రూరమైన దాడులకు తెగబడుతోంది. సరిహద్దు రాష్ట్రాల పౌరులపై విచక్షణారహితంగా మోర్టార్లు, ఫిరంగులతో దాడులు చేస్తోంది. దీంతో భారత బలగాలు దీటుగా బదులిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కాస్తా యుద్ధభూమిని తలపించడంతో భారత రక్షణ దళాలు కీలక నగరాల్లో విద్యుత్ సరఫరా (పవర్ బ్లాక్ అవుట్)ను నిలిపివేసింది. ఇంటర్నెట్, మొబైల్ సేవల్ని నిలిపివేసింది. పాక్ ప్రయోగించిన మిస్సైళ్లు, డ్రోన్లను నిర్వీర్యం చేసేందుకు భారత సాయుధ బలగాలు రాత్రంతా శ్రమిస్తున్నాయి. ఇలా ప్రస్తుతం దేశం కోసం భారత త్రివిధ దళాలు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే స్టేడియాల్లో ఐపీఎల్ వినోదం పట్ల నెట్టింట తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. భారత పౌరులు, ప్రధాన నగరాలే లక్ష్యంగా పాక్ ఆర్మీ విచక్షణా రహితంగా జరిపే దాడుల్ని తిప్పికొడుతున్నప్పటికీ... పొరపాటున ఏ మిసైల్, డ్రోన్ దాడి అయిన స్టేడియంలో పడితే... వేలల్లో ప్రేక్షకులు, పదుల సంఖ్యలోని విదేశీ, భారత క్రికెటర్లకు జరిగే ప్రాణనష్టం ఊహకందదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను రద్దు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వినోదం కంటే కూడా దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమకు ప్రధానమని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అందుబాటులో ఉన్న బీసీసీఐ ఉన్నతాధికారులతో నేడు సమావేశమై ఐపీఎల్‌పై తుది నిర్ణయం తీసుకుంటారు. శుక్రవారం ఐపీఎల్ రద్దు లేదంటే వాయిదా ప్రకటన వెలువడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. నేటి మ్యాచ్ యథాతథం ప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్నాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌ల విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాల్ని పాటిస్తాం. ఇప్పటివరకైతే కేంద్రం నుంచి మాకెలాంటి సూచనలు రాలేదు. ఆటగాళ్ల భద్రత, రవాణా తదితర పరిస్థితుల్ని సమీక్షించాకే తుది నిర్ణయం తీసుకుంటాం. లక్నోలో శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు ఏ ఇబ్బందులు లేవు. కాబట్టి మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలే ఉన్నాయి. –ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఐపీఎల్లో నేడులక్నో X బెంగళూరువేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
చరిత్ర సృష్టించిన ప్రభ్‌సిమ్రన్ సింగ్.. తొలి ప్లేయర్‌గా రికార్డు
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కూడా ప్రభ్సిమ్రాన్ బ్యాట్ ఝూళిపించాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను ప్రభ్సిమ్రాన్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున వరుసగా అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్‌గా రికార్డులెక్కాడు. ఈ ఏడాది సీజన్లో ప్రభుసిమ్రాన్ వరుసగా హాఫ్ సెంచరీలను సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మాక్స్వెల్ పేరిట సంయుక్తంగా ఉండేది. వీరంతా వరుసగా మూడు సార్లు పంజాబ్ తరపున హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.తాజా మ్యాచ్‌లో ఆర్ధశతకంతో మెరిసిన ప్రభ్సిమ్రాన్ వీరిని అధిగమించాడు. అదేవిధంగా ఐపీఎల్లో నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన తొలి అన్క్యాప్డ్ ప్లేయర్ కూడా ప్రభ్సిమ్రానే కావడం గమనార్హం. ఈ సీజన్లో ఇప్పటికి (ఈ మ్యాచ్‌తో కలిపి) 12 ఇన్నింగ్స్‌లు ఆడిన ప్రభ్‌సిమ్రన్ 487 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్దానంలో కొనసాగుతున్నాడు.మ్యాచ్ రద్దు..కాగా భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ను నిర్వహకులు రద్దు చేశారు.భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నడుమ స్ధానికంగా బ్లాక్ అవుట్ విధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. మ్యాచ్ రద్దు అయ్యే సమయానికి పంజాబ్ స్కోర్ 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. -
ధర్మశాలలో బ్లాక్ అవుట్..? పంజాబ్ కింగ్స్, ఢిల్లీ మ్యాచ్ రద్దు
ఐపీఎల్-2025లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రద్దు అయింది. భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ను నిర్వహకులు రద్దు చేశారు. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నడుమ స్ధానికంగా బ్లాక్ అవుట్ విధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్ స్వయంగా రంగంలోకి దిగి ప్రేక్షకులను స్టేడియం నుంచి బయటకు పంపించారు. జమ్మూలో జారీ చేయబడిన రెడ్ అలర్ట్ ఆధారంగా ముందు జాగ్రత్త చర్యగా ఈ మ్యాచ్‌ను రద్దు చేసినట్లు ధుమాల్ పేర్కొన్నారు. వర్షం కారణంగా గంట ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. పంజాబ్ స్కోర్ 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య ఔటైన వెంటనే స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో ఫ్లడ్ లైట్ల సమస్య తలెత్తడంతో మ్యాచ్ ఆగిపోయిందని అంతా భావించారు. కానీ భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ఉద్డేశ్వపూర్వకంగానే ఫ్లడ్ లైట్స్ ఆపి, మ్యాచ్ రద్దు చేశారు. అయితే టెక్నికల్ ఫెయిల్యూర్ కారణంగానే మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్టుగా బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. మ్యాచ్ రద్దు కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు చెరో పాయింట్ లభించింది.#WATCH | Dharamshala: Sudhir, a cricket fan says, "The match has been called off because of security reasons. What do we have to be afraid of? We are in our country. If anyone, it should be Pakistan who should be afraid. Bharat Mata ki Jai." https://t.co/N3YDWolW07 pic.twitter.com/QjiNCQn9sZ— ANI (@ANI) May 8, 2025IPL Chairman requesting fans to leave the Dharamshala Stadium. pic.twitter.com/9rVqVfPa12— Bhagavad Gita 🪷 (@Geetashloks) May 8, 2025 -
IPL 2025: ఆయుశ్ మాత్రే నుంచి మయాంక్ అగర్వాల్ వరకు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గాయపడిన ఆటగాళ్ల సంఖ్య చాలా పెద్దగా ఉంది. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ సీజన్లో 17 మంది ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. వీరికి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఆయా జట్లు ఇదివరకే ప్రకటించాయి. ప్రత్యామ్నాయ ఆటగాళ్లుగా వచ్చిన వారిలో చాలా మంది తుది జట్లలో చోటు దక్కించుకుని మ్యాచ్‌లు ఆడారు. కొందరికి ఇంకా అవకాశాలు రాలేదు. సీజన్ ప్రారంభానికి ముందే గాయాల కారణంగా వైదొలిగిన వారిలో హ్యారీ బ్రూక్, ఉమ్రాన్ మాలిక్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. మిగిలిన ఆటగాళ్లు సీజన్ మధ్యలో గాయపడి లీగ్ నుంచి వైదొలిగారు.ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి గాయాల కారణంగా వైదొలిగిన ఆటగాళ్లు..ఆర్సీబీదేవ్దత్ పడిక్కల్- మయాంక్ అగర్వాల్ (రీప్లేస్మెంట్)సీఎస్కేరుతురాజ్ గైక్వాడ్- ఆయుశ్ మాత్రేగుర్జప్నీత్ సింగ్- డెవాల్డ్ బ్రెవిస్వన్ష్ బేడి- ఉర్విల్ పటేల్ముంబై ఇండియన్స్అల్లా ఘజన్ఫర్- ముజీబ్ రెహ్మాన్లిజాడ్ విలియమ్స్- కార్బిన్ బాష్విజ్ఞేశ్ పుతుర్- రఘు శర్మకేకేఆర్ఉమ్రాన్ మాలిక్- చేతన్ సకారియాగుజరాత్ టైటాన్స్గ్లెన్ ఫిలిప్స్- దసున్ షనకపంజాబ్ కింగ్స్గ్లెన్ మ్యాక్స్‌వెల్- మిచెల్ ఓవెన్లక్నో సూపర్ జెయింట్స్మొహిసిన్ ఖాన్- శార్దూల్ ఠాకూర్ఎస్ఆర్హెచ్బ్రైడన్ కార్స్- వియాన్ ముల్దర్ఆడమ్ జంపా- స్మరణ్ రవిచంద్రన్‌స్మరణ్ రవిచంద్రన్- హర్ష్ దూబేఢిల్లీ క్యాపిటల్స్హ్యారీ బ్రూక్- సెదిఖుల్లా అటల్రాజస్థాన్ రాయల్స్నితీశ్ రాణా- లుహాన్ డ్రి ప్రిటోరియస్సందీప్ శర్మ- నండ్రే బర్గర్రీప్లేస్మెంట్ ఆటగాళ్ల ద్వారా అత్యధిక లబ్ది పొందింది సీఎస్కే. రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన ఆయుశ్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్ జట్టులో స్థిరపడిపోయారు. వచ్చీ రావడంతోనే అవకాశం దక్కించుకున్న ఉర్విల్ పటేల్ కూడా తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. -
పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ రద్దు
IPL 2025 PBKS vs DC Live Updates: పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ రద్దుధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రద్దు అయింది. భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ను నిర్వహకులు రద్దు చేశారు.పంజాబ్ తొలి వికెట్ డౌన్..ప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 70 పరుగులు చేసిన ఆర్య.. టి. నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10.1 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య హాఫ్ సెంచరీపంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య హాఫ్ సెంచరీ సాధించాడు. ఆర్య 56 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 9 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. క్రీజులో ఆర్యతో పాటు ప్రభుసిమ్రాన్ సింగ్(45) ఉన్నారు.6 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 69/06 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజులో ఆర్య(42), ప్రభ్సిమ్రాన్ సింగ్(26) ఉన్నారు.2 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 20/02 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య(12), ప్రభ్సిమ్రాన్ సింగ్(3) ఉన్నారు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్..ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మరి కాసేపట్లో టాస్అభిమానులు గుడ్ న్యూస్. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ 8:30 గంటలకు ప్రారంభం కానుంది. వర్షం తగ్గుముఖం పట్టడంతో 8:00 గంటలకు టాస్ పడనుంది.టాస్ మరింత ఆలస్యం..ధర్మశాలలో ప్రస్తుతం వర్షం భారీగా కురుస్తోంది. దీంతో టాస్ మరింత ఆలస్యం కానుంది.ఐపీఎల్-2025లో ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. ప్రస్తుతం వర్షం ఆగినప్పటికి, మైదానాన్ని మాత్రం కవర్లతో కప్పి ఉంచారు. దీంతో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యం కానుంది. -
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ హోం గ్రౌండ్‌కు బాంబు బెదిరింపు
'అపరేషన్ సిందూర్' తర్వాత భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సజావుగా కొనసాగడం అనుమానంగా మారింది. షెడ్యూల్ ప్రకారం లీగ్ కొనసాగుతుందని బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చెబుతున్నా.. అభిమానుల్లో ఏదో తెలీని గందరగోళం నెలకొంది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు జరగాలంటే జట్లు వేర్వేరు వేదికలు తిరుగుతూ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే పాక్ దాడులకు పాల్పడవచ్చన్న అనుమానంతో భారత ప్రభుత్వం దేశంలో పలు విమానాశ్రయాలను మూసి వేయించింది. ఇందులో ఐపీఎల్ మ్యాచ్‌లకు వేదికలైన చండీఘడ్, ధర్మశాల ఉన్నాయి. ఈ క్రమంలో మే 11న ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ అహ్మదాబాద్‌కు షిఫ్ట్ అయ్యింది.తాజాగా ఓ వార్త ఐపీఎల్ వర్గాల్లో కలకలం రేపుతుంది. మే 16న జైపూర్‌లోని సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరగాల్సిన పంజాబ్, రాజస్థాన్ మ్యాచ్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సువాయ్ మాన్ సింగ్ స్టేడియంను పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు దిగారు. ఈ ఈ-మెయిల్ ఇవాళ (మే 8) ఉదయం 9:13 గంటల సమయంలో వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్ పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు స్టేడియంను ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్లు, తనిఖీ యూనిట్లతో స్టేడియంను జల్లెడ పట్టారు. స్టేడియంలో ఎలాంటి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.కాగా, నిన్న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు కూడా ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. స్టేడియంను పేల్చి వేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగారు. అయితే పోలీసులు వెంటనే అలర్టై మ్యాచ్‌ను సజావుగా సాగేలా చూశారు. నిన్న ఈడెన్ గార్డెన్లో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్, సీఎస్కే తలపడ్డాయి. వరుసగా రెండు రోజులు ఐపీఎల్ వేదికలకు బాంబు బెదిరింపులు రావడాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సీరియస్‌గా తీసుకుంది. మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం కలగకుండా సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంది.మరోవైపు భారత దళాలు పాక్‌లోని రావల్పిండి స్టేడియంపై చేసిన డ్రోన్ దాడి కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. లీగ్‌లో భాగంగా ఇవాళ బాబర్ ఆజం కెప్టెన్సీలోని పెషావర్ జల్మీ- డేవిడ్ వార్నర్ సారథ్యంలోని కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. డ్రోన్ దాడి నేపథ్యంలో ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. పాక్ క్రికెట్ బోర్డు క్రికెటర్లను రావల్పిండి విడిచి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు తెలుస్తుంది.కాగా, పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి బదులుగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భారత దళాలు పాక్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేస్తున్నాయి. మంగళవారం జరిగిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతూ ఉంది. -
IPL 2025: రాజస్థాన్ రాయల్స్‌లో మరో కీలక మార్పు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్థాన్ రాయల్స్.. తమ జట్టులో గాయపడిన ఆటగాళ్లకు ప్రత్యామ్నాయాలను ప్రకటించింది. తొలుత నితీశ్ రాణాకు ప్రత్యామ్నాయంగా సౌతాఫ్రికా బ్యాటర్ లువాన్ డ్రి ప్రిటోరియస్‌ను జట్టులోకి తీసుకున్న రాయల్స్.. తాజాగా మరో గాయపడిన ఆటగాడు సందీప్ శర్మకు ప్రత్యామ్నాయంగా సౌతాఫ్రికాకే చెందిన నండ్రే బర్గర్‌ను ఎంపిక చేసుకుంది. బర్గర్‌ను రాయల్స్ రూ. 3.5 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ సీజన్లో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉన్నా బర్గర్‌పై రాయల్స్ భారీ మొత్తాన్ని వెచ్చించింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన బర్గర్ గత ఐపీఎల్ సీజన్లో కూడా రాయల్స్‌కే ఆడాడు. ఆ సీజన్లో అతను 6 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు. సందీప్ శర్మ విషయానికొస్తే.. ఈ సీజన్లో ఓ మోస్తరు ఫామ్‌లో ఉండిన సందీప్ చేతి వేలి గాయం కారణంగా రెండు మ్యాచ్‌ల ముందే వైదొలిగాడు. సందీప్ ఈ సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు తీశాడు. రాజస్తాన్ రాయల్స్‌కు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ అనే సిస్టర్ ఫ్రాంచైజీ ఉండటంతో ప్రత్యామ్నాయ ఆటగాళ్లుగా ఆ దేశ ఆటగాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. నితీశ్‌కు ప్రత్యామ్నాయంగా రాయల్స్ జట్టులోకి వచ్చిన లువాన్ డ్రి ప్రిటోరియస్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతన్ని రాజస్థాన్ రాయల్స్ సీజన్లో మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌ల కోసం రూ. 30 లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన ప్రిటోరియస్‌కు విధ్వంసకర వీరుడిగా పేరుంది. అతను వికెట్‌కీపింగ్ కూడా చేయగలడు.ఇదిలా ఉంటే, ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆది నుంచే షాకులు తగులుతున్నాయి. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గాయం కారణంగా వీల్‌చైర్ నుంచే మార్గదర్శనం చేస్తుండగా.. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ కూడా కొన్ని మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. ఈ సీజన్లో రాజస్థాన్ సీఎస్కే (మే 12), పంజాబ్ కింగ్స్‌తో (మే 16) మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్ 3 విజయాలు, 9 పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. -
Operation Sindoor: ఐపీఎల్-2025లో ఓ మార్పు
ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ముంబై ఇండియన్స్- పంజాబ్ కింగ్స్ (MI Vs PBKS)జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ వేదిక మారింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం (మే 11) ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో వేదికను ధర్మశాల (Dharmashala) నుంచి అహ్మదాబాద్‌కు మార్చారు.సిద్ధంగా ఉన్నాంగుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ ఈ విషయం గురించి స్పోర్ట్‌స్టార్‌కు వెల్లడించారు. ‘‘చివరి నిమిషంలో ధర్మశాల నుంచి వేదికను మార్చాల్సి వచ్చినపుడు.. బీసీసీఐ మమ్మల్ని సంప్రదించింది. మ్యాచ్ నిర్వహణకు మేము సిద్ధంగా ఉన్నామని వారికి సమాచారం ఇచ్చాము’’ అని తెలిపారు.కాగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ పంజాబ్ కింగ్స్‌కు రెండో సొంత మైదానం. ఇక్కడ మూడు మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడ శ్రేయస్ సేన ఓ మ్యాచ్ ఆడింది. మే 3న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడి 37 పరుగులు తేడాతో గెలిచింది.ఇక ఈ రోజు అంటే మే 8న ఢిల్లీ క్యాపిటల్స్‌తో పంజాబ్ మ్యాచ్ ఆడుతుంది. ఈ క్రమంలో మే 11న ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టాల్సి ఉంది. అయితే, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రెండు రోజుల పాటు ధర్మశాల విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు అక్కడికి ప్రయాణించే పరిస్థితి లేదు.వాంఖడేకు మారుస్తారనుకుంటేఈ నేపథ్యంలో వేదికను ముంబైలోని వాంఖడేకు మారుస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఏ జట్టుకు హోం అడ్వాంటేజీ ఉండకూడదనే ఉద్దేశంతో వేదికను తటస్థంగా అహ్మదాబాద్‌కు మార్చినట్లు సమాచారం. నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ ఆడేందుకు ముంబై గురువారమే అక్కడికి చేరుకునే అవకాశం ఉండగా.. పంజాబ్ ఢిల్లీతో మ్యాచ్ ముగిసిన తర్వాత అక్కడికి చేరుకోనుంది.భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లుకాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట ముష్కరులకు బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో దాయాది దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాద శిబిరాలపై దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడింది. మిసైళ్లతోనూ దాడి చేయగా భారత్ విజయవంతంగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో ధర్మశాలలో పంజాబ్- ఢిల్లీ మ్యాచ్‌కు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు.ఇదిలా ఉంటే.. పంజాబ్ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడు గెలిచింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ప్రస్తుతం 15 పాయింట్లు కలిగి ఉన్న పంజాబ్.. పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు ముంబై నాలుగో స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: Operation Sindoor: పాక్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ!The many colours of IPL 🎨From the eyes of Painter Andy Brown 🧑🎨Presenting - 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗮𝗻𝗱 𝗖𝗮𝗻𝘃𝗮𝘀 ft. #TATAIPL 🌄WATCH the full video 🎥 🔽 -By @mihirlee_58 | #PBKSvDChttps://t.co/EfOvuYOD86 pic.twitter.com/wtbw0VMNMS— IndianPremierLeague (@IPL) May 8, 2025 -
ఐపీఎల్ ఆడుతుండగానే మరో జాక్‌పాట్ కొట్టిన సీఎస్కే చిచ్చరపిడుగు
సీఎస్కే చిచ్చరపిడుగు ఆయుశ్ మాత్రే ఐపీఎల్ 2025 ఆడుతుండగానే మరో జాక్ పాట్ కొట్టాడు. నిన్న (మే 7) జరిగిన ముంబై టీ20 లీగ్ వేలంలో మాత్రేకు భారీ ధర దక్కింది. మాత్రేను ట్రయంప్ నైట్స్ ముంబై నార్త్ ఈస్ట్ ఫ్రాంచైజీ రూ. 14.75 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ వేలంలో మాత్రే నాలుగో ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. వేలంలో అత్యధిక మొత్తం అథర్వ అంకోలేకర్‌కు దక్కింది. అంకోలేకర్‌ను ఈగల్ థానే స్ట్రయికర్స్ ఫ్రాంచైజీ రూ. 16.25 లక్షల ధరకు సొంతం చేసుకుంది. అంకోలేకర్ తర్వాత అత్యధిక బిడ్డింగ్ ముషీర్ ఖాన్, సాయిరాజ్ పాటిల్‌కు దక్కింది. ముషీర్‌ను ఏఆర్సీఎస్ అంధేరి.. సాయిరాజ్‌ను ఈగల్ థానే స్ట్రయికర్స్ రూ. 15 లక్షలకు దక్కించుకున్నాయి.వీరి తర్వాత వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కేకేఆర ప్లేయర్ అంగ్క్రిష్ రఘువంశీ నిలిచాడు. రఘువంశీని ముంబై ఫాల్కన్స్ రూ. 14 లక్షలకు దక్కించుకుంది. షమ్స్ ములానీకి 14 లక్షలు, సూర్యాంశ్ షేడ్గేకు రూ. 13.75 లక్షలు లభించాయి.కాగా, ముంబై టీ20 లీగ్ ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ ఏడాది ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఎనిమిది జట్లు నిన్న జరిగిన వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఒక్కో జట్లు గరిష్ఠంగా 18 మంది ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి జట్టు ఓ ఐకాన్ ఆటగాడిని ఎంపిక చేసుకుంది. ఐకాన్ ఆటగాడికి రూ. 20 లక్షలు లభిస్తాయి. సూర్యకుమార్ యాదవ్ (ముంబై నార్త్ ఈస్ట్), అజింక్య రహానే (బాంద్రా బ్లాస్టర్స్), పృథ్వీ షా (ముంబై పాంథర్స్), శ్రేయస్ అయ్యర్ (ముంబై ఫాల్కన్స్),శివమ్ దూబే (అంధేరి), శార్దూల్ ఠాకూర్ (థానే స్ట్రయికర్స్), సర్ఫరాజ్ ఖాన్ (ముంబై సబర్బ్స్), తుషార్ దేశ్‌పాండే (మరాఠ రాయల్స్) ఐకాన్ ప్లేయర్స్‌గా ఎంపికయ్యారు. ఈ లీగ్ మే 26 నుంచి జూన్ 8 వరకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనుంది.జట్ల వివరాలు..ట్రయంఫ్ నైట్స్ ముంబై నార్త్ ఈస్ట్ ఐకాన్ ప్లేయర్: సూర్యకుమార్ యాదవ్ (20 లక్షలు) ప్లేయర్స్: సిధాంత్ ఆధత్రావ్ (7.75 లక్షలు), ఆయుష్ మాత్రే (14.75 లక్షలు), సూర్యాంశ్ షెడ్గే (13.75 లక్షలు), పరీక్షిత్ వల్సంకర్ (7.25 లక్షలు), జే జైన్ (4 లక్షలు), హృషికేశ్ గోరే (3.40 లక్షలు), ఆకాష్ పవార్ (3 లక్షలు), శ్రేయాస్ గురవ్ (3 లక్షలు), భరత్ సుదమ్ పాటిల్ (2 లక్షలు), మకరంద్ పాటిల్ (2 లక్షలు)బాంద్రా బ్లాస్టర్స్ ఐకాన్ ప్లేయర్: అజింక్యా రహానే (20 లక్షలు) ప్లేయర్లు: సువేద్ పార్కర్ (8.50 లక్షలు), ఆకాశ్ ఆనంద్ (8.25 లక్షలు), రాయ్స్టన్ డయాస్ (7 లక్షలు), కర్ష్ కొఠారి (5 లక్షలు), తుషార్ సింగ్ (3 లక్షలు), అథర్వ పూజారి (3 లక్షలు), ఓం కేష్కామత్ (3.20 లక్షలు), ధనిత్ రౌత్ (4.60 లక్షలు), నమన్ పుష్పక్ (3 లక్షలు), పార్థ్ అంకోలేకర్ (3 లక్షలు), అతిఫ్ హబీబ్ అత్తర్వాలా (6.25 లక్షలు), ద్రుమిల్ మత్కర్ (7.25 లక్షలు), మహ్మద్ అదీబ్ వాసియుల్ ఉస్మాని (2.70 లక్షలు)నార్త్ ముంబై పాంథర్స్ ఐకాన్ ప్లేయర్: పృథ్వీ షా (20 లక్షలు)ప్లేయర్స్: తనుశ్ కోటియన్ (10 లక్షలు), మోహిత్ అవస్తీ (10.50 లక్షలు), ఖిజార్ దఫేదార్ (5.50 లక్షలు), దివ్యాంష్ సక్సేనా (5.25 లక్షలు), అభిజ్ఞాన్ కుందు (5 లక్షలు), ఆయుష్ వర్తక్ (6.25 లక్షలు), సౌరభ్ సింగ్ (3 లక్షలు), హర్షల్ జాదవ్ (5 లక్షలు), ప్రిన్స్ దేవాంగ్ షైక్ (2 లక్షలు), షాలిక్ జౌక్ల్ (2 లక్షలు), అలీమ్ (3.40 లక్షలు), ముజామిల్ కద్రి (2 లక్షలు)SoBo ముంబై ఫాల్కన్స్ ఐకాన్ ప్లేయర్: శ్రేయాస్ అయ్యర్ (20 లక్షలు) ప్లేయర్స్: అంగ్క్రిష్ రఘువంశీ (14 లక్షలు), వినాయక్ భోయిర్ (5.75 లక్షలు), సిద్ధార్థ్ రౌత్ (7 లక్షలు), హర్ష్ అఘవ్ (5.25 లక్షలు), కుష్ కరియా (3 లక్షలు), నిఖిల్ గిరి (3 లక్షలు), ప్రేమ్ దేవ్కర్ (3 లక్షలు), ఆకాశ్ పార్కర్ (11.25 లక్షలు), అమోల్ టార్పురే (3 లక్షలు), ఇషాన్ ముల్చందని (3.40 లక్షలు), మయూరేశ్ తండేల్ (2 లక్షలు)ARCS అంధేరీ ఐకాన్ ప్లేయర్: శివమ్ దూబే (20 లక్షలు) ప్లేయర్లు: ప్రసాద్ పవార్ (13 లక్షలు), ముషీర్ ఖాన్ (15 లక్షలు), హిమాన్షు సింగ్ (5.50 లక్షలు), అఖిల్ హెర్వాద్కర్ (6.50 లక్షలు), సిద్దిద్ తివారీ (3 లక్షలు), ప్రవార్జా (3 లక్షలు), రజారీ 3 లక్షలు (3 లక్షలు), సాక్షం ఝా (3.60 లక్షలు), ప్రసూన్ సింగ్ (3 లక్షలు), ఐశ్వరీ సర్వే (2 లక్షలు), అజయ్ మిశ్రా (2 లక్షలు), బద్రే ఆలం (2.50 లక్షలు), మొయిన్ ఖాన్ (2 లక్షలు), మోనిల్ సోనీ (2.20 లక్షలు)ఈగిల్ థానే స్ట్రైకర్స్ ఐకాన్ ప్లేయర్: శార్దూల్ ఠాకూర్ (20 లక్షలు) ప్లేయర్లు: శశాంక్ అత్తార్డే (6.50 లక్షలు), సాయిరాజ్ పాటిల్ (15 లక్షలు), అథర్వ అంకోలేకర్ (16.25 లక్షలు), హర్ష్ తన్నా (16.25 లక్షలు), హర్ష్ తన్నా (7.7 లక్షలు), రవీంద్ర కుమార్ యాదవ్ (3.80 లక్షలు), ఆర్యన్ చౌహాన్ (3 లక్షలు), హర్ష్ సలుంఖే (3 లక్షలు), నూతన్ గోయెల్ (3.20 లక్షలు), ఆర్యరాజ్ నికమ్ (2.10 లక్షలు), అమర్త్య రాజే (2 లక్షలు), కౌశిక్ చిఖాలికర్ (2 లక్షలు)ఆకాశ్ టైగర్స్ ముంబయి సబర్బ్స్ ఐకాన్ ప్లేయర్: సర్ఫరాజ్ ఖాన్ (20 లక్షలు)ప్లేయర్లు: హార్దిక్ తామోర్ (8.50 లక్షలు), జే బిస్తా (12 లక్షలు), షమ్స్ ములానీ (14 లక్షలు), సిల్వెస్టర్ డిసౌజా (5 లక్షలు), అయాజ్ అహ్మద్ అఫ్జల్ అహ్మద్ ఖ్ (5.25 లక్షలు), సిద్ధార్థ్ అక్రే (4.60 లక్షలు), అర్జున్ డాని (4.20 లక్షలు), మహమ్మద్ యాసీన్ సౌదాగర్ (3 లక్షలు), జైద్ పాటంకర్ (3.60 లక్షలు), కరణ్ షా (2 లక్షలు), కృతిక్ శంకరప్ప హనగవాడి (2 లక్షలు)ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ ఐకాన్ ప్లేయర్: తుషార్ దేశ్‌పాండే (20 లక్షలు)ప్లేయర్లు: సిద్దేశ్ లాడ్ (10.25 లక్షలు), సచిన్ యాదవ్ (7 లక్షలు), ఆదిత్య ధుమాల్ (7.25 లక్షలు), ఖాన్ అవైస్ నౌషాద్ (4.20 లక్షలు), సాహిల్ జాదవ్ (3 లక్షలు), నమన్ ఝవార్ (3 లక్షలు), మాక్స్వెల్ స్వామినాథన్ (4.60 లక్షలు), వరుణ్ రావ్ (3 లక్షలు), రోహన్ ఘాగ్ (3 లక్షలు), అజయ్ సింగ్ జానూ (2.20 లక్షలు), చిన్మయ్ సుతార్ (5 లక్షలు), ఇర్ఫాన్ ఉమెయిర్ (9.25 లక్షలు), పరాగ్ ఖానాపుర్కార్ (6 లక్షలు) -
కరుణ్ నాయర్ కంటే బెటర్.. అతడిని ‘తుదిజట్టు’లోకి తీసుకోండి!
ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభంలో వరుస విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిట.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న అక్షర్ సేన.. ఆరింట గెలిచి.. నాలుగు ఓడిపోయింది.ఐదో స్థానంలోఇక చివరగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో వెనుకబడ్డ ఢిల్లీ.. అదృష్టవశాత్తూ వర్షం వల్ల గట్టెక్కింది. ఉప్పల్‌లో వాన తెరిపినిచ్చినా ఆట సాగేందుకు వీలు లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ రాగా.. ఢిల్లీ ఖాతాలో ఓవరాల్‌గా 13 పాయింట్లు చేరాయి.తద్వారా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత.. ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం మరో కీలక పోరుకు ఢిల్లీ సిద్ధమైంది.పటిష్ట పంజాబ్ కింగ్స్ (PBKS vs DC)తో ధర్మశాల వేదికగా తలపడనుంది. ఇందులో గెలిస్తేనే ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సులభతరంగా మారతాయి. లేదంటే.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇంతటి కీలక మ్యాచ్‌కు ముందు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఢిల్లీ యాజమాన్యానికి కీలక సూచన చేశాడు.కరుణ్, అభిషేక్‌ల కంటే బెటర్పవర్ హిట్టర్ అశుతోష్ శర్మను తుదిజట్టులోకి తీసుకోవాలని ఆకాశ్ చోప్రా సూచించాడు. ‘‘అశుతోష్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా కాకుండా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించండి. మీరు తొలుత బ్యాటింగ్ చేసినట్లైతే ఇదే సరైన వ్యూహం.విప్రాజ్ నిగమ్ తర్వాత అతడిని పంపండి. నిజానికి కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్ కంటే అశుతోష్ మెరుగ్గా, నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కాబట్టి అందరూ అవుటైన తర్వాత కాకుండా ముందే అతడిని బ్యాటింగ్‌కు పంపండి.మ్యాచ్ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకుని.. మలుపు తిప్పగల సత్తా అతడికి ఉంది’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఆర్డర్ ఎందుకు మారుతుందో తనకైతే అర్థం కావడం లేదని ఈ కామెంటేటర్ పేర్కొన్నాడు.వారి వ్యూహం ఏమిటో అర్థం కావడం లేదు‘‘ఇప్పటికి దాదాపు ఆరు ఓపెనింగ్ జోడీలను మార్చి ఉంటారు. దీని వెనుక వారి వ్యూహం ఏమిటో అర్థం కావడం లేదు. ఓపెనర్ల విషయంలోనే స్పష్టత లేకపోతే.. ప్లే ఆఫ్స్ చేరడం కూడా కష్టమే అవుతుంది’’ అని ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు.ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫినిషర్‌గా అశుతోష్ శర్మ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికి ఎనిమిది ఇన్నింగ్స్ ఆడి 186 పరుగులు చేశాడు. మరోవైపు.. కరుణ్ నాయర్ 7 ఇన్నింగ్స్ ఆడి 154 పరుగులు చేయగా.. అభిషేక్ పోరెల్ 11 ఇన్నింగ్స్‌లో 265 రన్స్ సాధించాడు.చదవండి: KKR vs CSK: పో.. పో!.. వరుణ్ చక్రవర్తికి షాకిచ్చిన బీసీసీఐ -
వరుణ్ చక్రవర్తి ఖాతాలో భారీ రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఖాతాలో భారీ రికార్డు చేరింది. నిన్న (మే 7) సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన వరుణ్.. ఐపీఎల్లో అత్యంత వేగంగా (మ్యాచ్‌ల ప్రకారం) 100 వికెట్ల మైలురాయిని తాకిన స్పిన్నర్‌గా అమిత్ మిశ్రా, రషీద్ ఖాన్ సరసన నిలిచాడు. వరుణ్, మిశ్రా, రషీద్ తలో 83 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించారు. ఐపీఎల్లో అత్యధిక వికెట్ల వీరుడు యుజ్వేంద్ర చహల్‌కు 100 వికెట్లు తీసేందుకు 84 మ్యాచ్‌లు అవసరం కాగా.. ఐపీఎల్లో నాలుగో అత్యధిక వికెట్ల వీరుడు సునీల్ నరైన్‌కు 86 మ్యాచ్‌లు అవసరమయ్యాయి.ఓవరాల్‌గా (స్పిన్నర్లు, పేసర్లు కలుపుకుని) ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో వరుణ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. వరుణ్, మిశ్రా, రషీద్‌తో పాటు ఆశిష్ నెహ్రా కూడా 83 మ్యాచ్‌ల్లోనే 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఓవరాల్‌గా అత్యంత వేగంగా 100 ఐపీఎల్ వికెట్లు తీసిన రికార్డు కగిసో రబాడ పేరిట ఉంది. రబాడ కేవలం 64 మ్యాచ్‌ల్లోనే 100 వికెట్ల మైలురాయిని తాకాడు. రబాడ తర్వాత లసిత్ మలింగ (70 మ్యాచ్‌లు), హర్షల్ పటేల్ (81), భువనేశ్వర్ కుమార్ (81) అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకారు.ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన బౌలర్లు కగిసో రబడ - 64 మ్యాచ్‌లు లసిత్ మలింగ - 70 మ్యాచ్లుహర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్ - 81 మ్యాచ్లువరుణ్ చకరవర్తి, ఆశిష్ నెహ్రా, రషీద్ ఖాన్, అమిత్ మిశ్రా - 83 మ్యాచ్లుమ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓ మోస్తరు స్కోర్‌ను (180) కాపాడుకునే క్రమంలో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు (జడేజా, బ్రెవిస్) తీశాడు. ఈ మ్యాచ్‌లో వరుణ్‌తో పాటు సునీల్ నరైన్ (4-0-28-0) కూడా రాణించినా కేకేఆర్ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో వైభవ్ అరోరా ఏకంగా 30 పరుగులు సమర్పించుకుని కేకేఆర్ ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. వైభవ్ 3 వికెట్లు తీసినా 3 ఓవర్లలో ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. వైభవ్ వేసిన 11వ ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్ తాండవం చేశాడు. మూడు సిక్సర్లు, మూడు బౌండరీలు బాది అప్పటిదాకా కేకేఆర్ చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను సీఎస్కే వైపు తిప్పాడు. బ్రెవిస్ ఔటయ్యాక శివమ్ దూబే (45), ధోని (17 నాటౌట్) ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి సీఎస్కేకు సీజన్లో మూడో విజయాన్ని అందించారు. -
IPL 2025: చరిత్ర సృష్టించిన ధోని
సీఎస్కే స్టాండ్ ఇన్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 200 మందిని ఔట్ చేయడంలో భాగమైన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. నిన్న (మే 7) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ క్యాచ్, ఓ స్టంపౌట్ చేసిన తర్వాత ధోని ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్లో సీఎస్కే, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీల తరఫున 276 మ్యాచ్‌లు ఆడిన ధోని 153 క్యాచ్‌లు, 47 స్టంపింగ్‌లు చేశాడు. ధోని తర్వాత దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్‌కీపర్‌గా ఉన్నాడు. డీకే.. ఢిల్లీ డేర్ డెవిల్స్, ఆర్సీబీ, కేకేఆర్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీల తరఫున 236 మ్యాచ్‌లు ఆడి 174 మందిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. ఇందులో 137 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు ఉన్నాయి. ధోని, డీకే తర్వాత అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్లలో వృద్దిమాన్ సాహా, రిషబ్ పంత్, రాబిన్ ఉతప్ప తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఐపీఎల్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్లు..200 - MS ధోని (CSK/RPS) - 153 క్యాచ్‌లు, 47 స్టంపింగ్‌లు174 - దినేష్ కార్తీక్ (DD/RCB/KKR/GL/MI/KXIP) - 137 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు113 - వృద్ధిమాన్ సాహా (GT/SRH/PBKS/CSK/KKR) - 87 క్యాచ్‌లు, 26 స్టంపింగ్‌లు100 - రిషబ్ పంత్ (DC/LSG) - 76 క్యాచ్‌లు, 24 స్టంపింగ్‌లు90 - రాబిన్ ఉతప్ప (KKR/CSK/RR/MI/RCB/PWI) - 58 క్యాచ్‌లు, 32 స్టంపింగ్లుఓవరాల్గా కూడా ధోనిదే అగ్రస్థానంఓవరాల్గా చూసినా పొట్టి క్రికెట్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్లలో ధోనినే మొదటి స్థానంలో ఉన్నాడు. యావత్ టీ20 ఫార్మాట్లో ధోని 316 మందిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. ధోని తర్వాత క్వింటన్ డికాక్ రెండో స్థానంలో ఉన్నాడు. డికాక్ తన టీ20 కెరీర్లో 307 డిస్మిసల్స్లో భాగమయ్యాడు.నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ సీజన్లో ధోని ఎట్టకేలకు కెప్టెన్‌గా రెండో విజయాన్ని సాధించాడు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్కేకు ఈ సీజన్ల ఇది మూడో గెలుపు. ఈ గెలుపు వల్ల సీఎస్కేకు ఒరిగింది ఏమీ లేనప్పటికీ.. కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మాత్రం దెబ్బకొట్టింది. ఈ ఓటమితో కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ జట్టు ఇకపై ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కడం అనుమానమే. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 11 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. టాప్-5లో ఉన్న గుజరాత్ (16), ఆర్సీబీ (16), పంజాబ్ (15), ముంబై (14), ఢిల్లీ (13) కేకేఆర్ కంటే మెరుగైన పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ సీజన్లో సీఎస్కేతో పాటు సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ పోటీ నుంచి ఇదివరకే నిష్క్రమించాయి. లక్నో (10), కేకేఆర్ (11) కూడా నిష్క్రమణ అంచుల్లో ఉన్నాయి.నిన్నటి మ్యాచ్‌లో ధోని వికెట్‌కీపింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ రాణించి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కీపింగ్‌లో రఘువంశీ, నరైన్‌ను ఔట్ చేయడంలో భాగమైన ధోని.. ఛేదనలో కీలక సమయంలో సిక్సర్ కొట్టి తన జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ధోని ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి, చివరి దాకా క్రీజ్‌లో నిలబడ్డాడు. ఫలితంగా సీఎస్కే సీజన్లో మూడో విజయం నమోదు చేసింది. -
నితీశ్ రాణా అవుట్.. రాజస్తాన్ జట్టులోకి చిచ్చర పిడుగు
ఐపీఎల్-2025 (IPL 2025) ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన రాజస్తాన్ రాయల్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ నితీశ్ రాణా (Nitish Rana) గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లన్నిటికీ దూరమయ్యాడు. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ ఈ విషయాన్ని గురువారం ధ్రువీకరించింది.నితీశ్ రాణా స్థానంలో సౌతాఫ్రికా బ్యాటర్ లువాన్ డ్రి ప్రిటోరియస్ (Lhuan-dre Pretorius)ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. రూ. 30 లక్షల కనీస ధరతో అతడిని సొంతం చేసుకున్నట్లు తెలిపింది. కాగా 19 ఏళ్ల ప్రిటోరియస్ టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లు ఆడి.. 911 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఇప్పటి వరకు సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 97.చిచ్చర పిడుగేఎడమచేతి వాటం బ్యాటర్ అయిన ప్రిటోరియస్.. వికెట్ కీపర్‌గా కూడా! సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో రాజస్తాన్ ఫ్రాంఛైజీ పర్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఈ ఏడాది లీగ్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు.ఎస్ఏటీ20- 2025లో ప్రిటోరియస్ 12 మ్యాచ్‌లలో కలిపి 166కు పైగా స్ట్రైక్‌రేటుతో 397 పరుగులు సాధించాడు. సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ జట్టుపై 51 బంతుల్లో 97 పరుగులు సాధించిన తీరు అతడి కెరీర్లో హైలైట్‌గా నిలిచింది. ఇక కౌంటీల్లో విటలిటి బ్లాస్ట్‌తో కూడా అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాగా గతేడాది అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్లోనూ సౌతాఫ్రికా తరఫున ప్రిటోరియస్ టాప్ రన్ స్కోరర్‌గా నిలవడం విశేషం.ఆది నుంచే షాకులుఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆది నుంచే షాకులు తగులుతున్నాయి. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ గాయం కారణంగా వీల్‌చైర్ నుంచే మార్గదర్శనం చేస్తున్నాడు. ఇక తొలి మూడు మ్యాచ్‌లకు కెప్టెన్ సంజూ శాంసన్ ఫిట్నెస్ లేని కారణంగా.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే బరిలోకి దిగాడు. ఆ తర్వాత తిరిగి వచ్చినా గాయంతో మళ్లీ జట్టుకు దూరమయ్యాడు.ఇక సంజూ గైర్హాజరీలో రియాన్ పరాగ్ రాజస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. ఇప్పటికి రాయల్స్ ఆడిన 12 మ్యాచ్‌లలో ఏకంగా తొమ్మిది ఓడి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ సీజన్లో జట్టుకు ఇంకా రెండు మ్యాచ్ (చెన్నై, పంజాబ్)లు మిగిలి ఉన్నాయి. కాగా నితీశ్ రాణా ఈ సీజన్లో పదకొండు మ్యాచ్‌లు ఆడి 217 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 81.పడిక్కల్ స్థానంలో మయాంక్ అగర్వాల్గాయం కారణగా ఐపీఎల్‌కు దూరమైన దేవదత్ పడిక్కల్ స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు... భారత ఆటగాడు మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసుకుంది. తాజా సీజన్లో 10 మ్యాచ్‌లాడి 247 పరుగులు చేసిన పడిక్కల్ కండరాలు పట్టేయడంతో మిగిలిన సీజన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో కర్ణాటకకే చెందిన మయాంక్‌ను 1 కోటి రూపాయల ధరతో ఆర్సీబీ తీసుకుంది.మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అఫ్గానిస్తాన్ ప్లేయర్ సాదిఖుల్లాను జట్టులోకి తీసుకుంది. ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ స్థానంలో 23 ఏళ్ల సాదిఖ్‌ను ఎంపిక చేసుకుంది. అతను 49 టి20ల్లో 1507 పరుగులు చేశాడు. వేలంలో అమ్ముడుపోయిన తర్వాత ఐపీఎల్లో ఆడేందుకు నిరాకరించడంతో బ్రూక్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. చదవండి: అతడికి థాంక్యూ.. అద్భుతంగా ఆడాడు.. ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాతే..: ధోని -
పో.. పో!.. వరుణ్ చక్రవర్తికి షాకిచ్చిన బీసీసీఐ
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) స్టార్ క్రికెటర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy)కి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో మ్యాచ్‌లో అనుచిత ప్రవర్తనకు గానూ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడికి మొట్టికాయలు వేసింది. మ్యాచ్ ఫీజులో ఇరవై ఐదు శాతం మేర కోత విధించింది.అంతేకాదు.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ వరుణ్ చక్రవర్తి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది. ఐపీఎల్-2025లో భాగంగా కేకేఆర్ బుధవారం చెన్నైతో తలపడిన విషయం తెలిసిందే.రహానే రాణించినాసొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (11) విఫలం కాగా.. సునిల్ నరైన్ (26) ఫర్వాలేదనిపించాడు.వన్‌డౌన్‌లో వచ్చిన అజింక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ (48) ఆడగా.. మనీశ్ పాండే (36 నాటౌట్), ఆండ్రీ రసెల్ (38) కూడా రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగలిగింది.చెన్నై బౌలర్లలో స్పిన్నర్లు నూర్ అహ్మద్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. పేసర్ అన్షుల్ కాంబోజ్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడుఇక కేకేఆర్ విధించే లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై ఆదిలోనే ఓపెనర్లు ఆయుశ్ మాత్రే, డెవాన్ కాన్వే డకౌట్ కావడంతో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ 31 పరుగులతో రాణించగా.. ఆరో స్థానంలో వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ దంచికొట్టాడు.కేవలం 25 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసిన బ్రెవిస్.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. అయితే, హాఫ్ సెంచరీతో జోరు మీదున్న ఈ సౌతాఫ్రికా చిచ్చర పిడుగును కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పెవిలియన్‌కు పంపాడు.వరుణ్ రౌండ్ ది వికెట్ బౌల్ చేయగా.. బ్రెవిస్ ముందుకు వచ్చి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో లాంగాన్ మీదుగా వెళ్లిన బంతి రింకూ సింగ్ చేతిలో పడటంతో.. బ్రెవిస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అత్యంత కీలకమైన ఈ వికెట్ తీసిన తర్వాత వరుణ్ చక్రవర్తి..‘‘ పో.. పో’’ అంటూ వేలు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు.pic.twitter.com/vhf3iwOR8o— Knight Vibe Media (@Kkrmediareels) May 7, 2025 డీమెరిట్ పాయింట్ కూడా ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి వరున్ చక్రవర్తికి జరిమానా విధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం వరుణ్ చక్రవర్తి లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడని.. అందుకే అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. అదే విధంగా.. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు డీమెరిట్ పాయింట్ కూడా జతచేసింది.ఇక బ్రెవిస్ విధ్వసంతో గెలుపు దిశగా వచ్చిన చెన్నై.. శివం దూబే (45), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(17 నాటౌట్) కారణంగా విజయతీరాలకు చేరింది. కేకేఆర్‌పై రెండు వికెట్ల తేడాతో గెలిచి ఈ సీజన్లో మూడో గెలుపు నమోదు చేసింది. మరోవైపు.. ఈ విజయంతో చెన్నైకి వరుస ఓటముల తర్వాత ఊరట లభించగా.. కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.చదవండి: అతడికి థాంక్యూ.. అద్భుతంగా ఆడాడు.. ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాతే..: ధోనిElation for the men in yellow 🥳@ChennaiIPL make it 1⃣-1⃣ against #KKR in the season with a 2⃣ wicket win at Eden Gardens💛 Updates ▶ https://t.co/ydH0hsBFgS #TATAIPL | #KKRvCSK pic.twitter.com/6MTmj6NPMH— IndianPremierLeague (@IPL) May 7, 2025 -
అతడికి థాంక్యూ.. అద్భుతంగా ఆడాడు.. ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాతే..: ధోని
ఐపీఎల్-2025 (IPL 2025)లో ఒక్క విజయం.. ఒకే ఒక్క విజయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఊరట కలిగించింది. వరుస పరాజయాలు, పరాభవాల తర్వాత బుధవారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై గెలిచింది. తద్వారా ఈ సీజన్లో ఎట్టకేలకు మూడో గెలుపు నమోదు చేసింది. ఏదీ కలిసిరాలేదుఈ నేపథ్యంలో కేకేఆర్‌పై విజయానంతరం సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ సీజన్లో మేము కొన్ని మ్యాచ్‌లో మాత్రమే గెలిచాం. ఇది మాకు మూడో విజయం. ఏదేమైనా గెలవడం సంతోషంగానే ఉంటుంది కదా!అయితే, ఈ ఏడాది మాకూ ఏదీ కలిసిరాలేదు. ఎక్కడ తప్పు జరిగిందో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మా జట్టులో 25 మంది ఆటగాళ్లు ఉన్నారు. వాళ్ల సేవలను ఎలా ఉపయోగించుకోవాలన్న అంశంపైనే ప్రస్తుతం నా దృష్టి కేంద్రీకృతమై ఉంది.వచ్చే ఏడాదైనా సరైన సమాధానం లభిస్తుందని భావిస్తున్నాం. ఏ బ్యాటర్‌ను ఏ స్థానంలో పంపాలి.. ఎవరైతే పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేస్తున్నారన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది’’ అని ధోని పేర్కొన్నాడు.అతడికి కృతజ్ఞతలుఅదే విధంగా.. ‘‘ఈ మ్యాచ్‌లో గెలుపునకు బ్రెవిస్ కారణం. అందుకు అతడికి కృతజ్ఞతలు. అతడి వల్లే ఈరోజు నేను ఇక్కడ నిలబడగలిగాను. చక్కటి షాట్లతో బ్రెవిస్ అలరించాడు. అతడు బాదిన రెండు సిక్సర్ల వల్ల మాపై ఒత్తిడి తగ్గి విజయం దిశగా పయనం సాధ్యమైంది’’ అని ధోని సౌతాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్‌ను ప్రశంసించాడు.అప్పుడే రిటైర్మెంట్ఇక తన ఐపీఎల్ భవితవ్యం గురించి ప్రస్తావన రాగా.. ‘‘నాకిప్పుడు 43 ఏళ్లు. ఇప్పటికి చాలా ఏళ్లుగా నేను క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. అయితే, ఈ లీగ్‌లో నా చివరి సంవత్సరం ఏది అన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేను.నిజానికి ఏడాదిలో కేవలం రెండు నెలలు మాత్రమే ఇక్కడ క్రికెట్ ఆడతాం. ఒక్కసారి ఐపీఎల్ ముగిసిపోతే మరో 6-8 నెలలు నాకు విశ్రాంతి దొరుకుతుంది. నా శరీరం ఎంత వరకు ఒత్తిడిని తట్టుకుందనే అంశం మీదే అంతా ఆధారపడి ఉంది. ఇప్పటికైతే రిటైర్మెంట్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకుల నుంచి లభించే ప్రేమ, ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అని ధోని పేర్కొన్నాడు.బ్రెవిస్ విధ్వంసం కాగా ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిన చెన్నై తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన రహానే సేన 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లో నూర్ అహ్మద్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. అన్షుల్ కాంబోజ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో చెన్నైకి ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే, డెవాన్ కాన్వే డకౌట్ అయ్యారు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన ఉర్విల్ పటేల్ 31 పరుగులతోరాణించగా.. డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 52) అద్బుత అర్ధ శతకంతో చెలరేగాడు.ఆఖర్లో శివం దూబే (45), ధోని (17 నాటౌట్) రాణించడంతో.. చెన్నై 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఈ సీజన్లో ఇప్పటికి 12 మ్యాచ్‌లు ఆడిన చెన్నైకి ఇది మూడో గెలుపు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ధోని సేన అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.ఐపీఎల్-2025: కోల్‌కతా వర్సెస్ చెన్నై👉వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా👉టాస్: కోల్‌కతా.. తొలుత బ్యాటింగ్👉కోల్‌కతా స్కోరు: 179/6 (20)👉చెన్నై స్కోరు: 183/8 (19.4)👉ఫలితం: రెండు వికెట్ల తేడాతో కోల్‌కతాపై చెన్నై గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నూర్ అహ్మద్ (చెన్నై స్పిన్నర్- 4/31).Last over maximums 🤝 MS Dhoni A never ending story 💛Updates ▶ https://t.co/ydH0hsBFgS #TATAIPL | #KKRvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/fyQcVOIusT— IndianPremierLeague (@IPL) May 7, 2025 -
CSK Vs KKR: కోల్‌కతాకు చెన్నై ఝలక్
కోల్‌కతా: ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ కీలక పోరులో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ అవకాశాలపై దెబ్బ కొట్టింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై 2 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అజింక్య రహానే (33 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆండ్రీ రసెల్ (21 బంతుల్లో 38; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), మనీశ్ పాండే (28 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించగా...నూర్ అహ్మద్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం చెన్నై 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు సాధించింది. డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా...శివమ్ దూబే (40 బంతుల్లో 45; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఉర్విల్ పటేల్ (11 బంతుల్లో 31; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. పవర్‌ప్లేలోపే సగం వికెట్లు కోల్పోయి 60/5 వద్ద నిలిచిన చెన్నై ఓటమి ఇక లాంఛనమే అనిపించింది. కానీ బ్రెవిస్, దూబే పోరాడంతో పాటు చివర్లో ధోని (17 నాటౌట్) పట్టుదలగా నిలబడటంతో గెలుపు సాధ్యమైంది. తాజా ఫలితంతో కోల్‌కతా ‘ప్లే ఆఫ్స్’కు వెళ్లడం దాదాపు అసాధ్యంగా మారింది. మిగిలిన 2 మ్యాచ్‌లలో గెలిచి గరిష్టంగా 15 పాయింట్లకు చేరినా ముందుకెళ్లడం కష్టమే. సాంకేతికంగా రేసులో ఉన్నా... ఈసారి కథ ముగిసినట్లే! ఐపీఎల్లో నేడుపంజాబ్ X ఢిల్లీవేదిక: ధర్మశాలరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: బ్రెవిస్ విధ్వంసం.. కేకేఆర్‌పై సీఎస్కే విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 7) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి కేకేఆర్‌ను దెబ్బేశాడు. అన్షుల్ కంబోజ్, జడేజా తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రహానే (48), మనీశ్ పాండే (36 నాటౌట్), రసెల్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే 60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. డెవాల్డ్ బ్రెవిస్ (52) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో తన జట్టును తిరిగి గెలుపు ట్రాక్‌లో పెట్టాడు. మధ్యలో దూబే (45) బాధ్యతాయుతంగా ఆడి సీఎస్కే విజయతీరాలవైపు మళ్లించాడు. ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరమైన తరుణంలో అప్పటిదాకా కామ్‌గా ఉన్న ధోని (17 నాటౌట్) సిక్సర్ కొట్టి సీఎస్కేకు గెలుపుకు చేరువ చేశాడు. నాలుగో బంతికి కంబోజ్ బౌండరీ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఈ గెలుపు వల్ల సీఎస్కేకు ఒరిగేది ఏమీ లేనప్పటికీ కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బకొట్టింది. బ్రెవిస్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 30 పరుగులువైభవ్ అరోరా వేసిన 11వ ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్ శివాలెత్తిపోయాడు. 3 ఫోర్లు, 3 సిక్సర్లు సహా 30 పిండుకున్నాడు. ఈ ఒక్క ఓవర్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు ఓటమి ఖాయమనుకున్న సీఎస్కే ఒక్కసారిగా గెలుపు ట్రాక్‌లోకి వచ్చింది.బ్రెవిస్ 20 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. -
IPL 2025: పడిక్కల్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించిన ఆర్సీబీ
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతూ, ప్లే ఆఫ్స్ బెర్త్‌కు అతి సమీపంలో ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు ముందు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌ల్లో లక్నో (మే 9), సన్‌రైజర్స్ (మే 13), కేకేఆర్‌లతో (మే 17) తలపడనుంది.కాగా, ఆర్సీబీకి సీఎస్కేతో ఆడిన గత మ్యాచ్‌లో ఓ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వన్‌డౌన్ ఆటగాడు, ఇన్ఫామ్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ గాయపడ్డాడు. తాజాగా ఆర్సీబీ యాజమాన్యం పడిక్కల్ స్థానాన్ని భర్తీ చేసింది. పడిక్కల్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసింది. మయాంక్‌ను ఆర్సీబీ కోటి రూపాయలకు దక్కించుకుంది. 34 ఏళ్ల మయాంక్‌కు ఐపీఎల్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2011 నుంచి అతను వివిధ ఫ్రాంచైజీల తరఫున 127 మ్యాచ్‌లు ఆడి 2661 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత సీజన్లో మయాంక్ సన్‌రైజర్స్‌లో ఉన్నాడు. ఈ సీజన్ మెగా వేలంలో మయాంక్‌ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. తమ తొలి టైటిల్ వేటను విజయవంతంగా సాగిస్తున్న ఆర్సీబీకి మున్ముందు ఆడబోయే కీలక మ్యాచ్‌ల్లో మయాంక్ ఏ మేరకు తోడ్పడతాడో చూడాలి. మయాంక్‌కు గతంలో (2011) ఆర్సీబీకి ఆడిన అనుభవం ఉంది. మయాంక్ స్వస్థలం బెంగళూరే కావడం అతనికి కలిసొచ్చే అంశం. మయాంక్ దేవ్ స్థానాన్ని భర్తీ చేయగలడో లేదో చూడాలి. దేవ్ ఈ సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడి 247 పరుగులు చేశాడు.హ్యారీ బ్రూక్‌కు ప్రత్యామ్నాయంగా అటల్లీగ్ ప్రారంభానికి ముందు వైదొలిగిన హ్యారీ బ్రూక్ స్థానాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు సెదిఖుల్లా అటల్‌తో భర్తీ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 13 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో కొనసాగుతుంది. -
KKR Vs CSK: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో సీఎస్కే తరఫున ఆల్‌టైమ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా అవతరించాడు. ఐపీఎల్ 2025లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ (మే 7) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లు వేసిన జడేజా కీలకమైన రహానే వికెట్ తీశాడు. సీఎస్కే తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా అవతరించే క్రమంలో జడేజా డ్వేన్ బ్రావోను అధిగమించాడు. ఐపీఎల్లో జడేజా సీఎస్కే తరఫున 184 మ్యాచ్‌ల్లో 141 వికెట్లు సాధించగా.. బ్రావో 116 మ్యాచ్‌ల్లో 140 వికెట్లు తీశాడు.ఐపీఎల్లో సీఎస్కే తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..141* - రవీంద్ర జడేజా (184 మ్యాచ్‌లు)140 - డ్వేన్ బ్రావో (116 మ్యాచ్‌లు)95 - ఆర్ అశ్విన్ (104 మ్యాచ్‌లు)76 - దీపక్ చాహర్ (76 మ్యాచ్‌లు)76 - ఆల్బీ మోర్కెల్ (78 మ్యాచ్‌లు)60 - శార్దూల్ ఠాకూర్ (57 మ్యాచ్‌లు)58 - మోహిత్ శర్మ (48 మ్యాచ్‌లు)మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి కేకేఆర్‌ను దెబ్బేశాడు. అన్షుల్ కంబోజ్, జడేజా తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రహానే (48), మనీశ్ పాండే (36 నాటౌట్), రసెల్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సునీల్ నరైన్ 26, గుర్భాజ్ 11, రఘువంశీ 1, రింకూ సింగ్ 9 పరుగులు చేసి ఔటయ్యారు.కాగా, ఈ సీజన్లో సీఎస్కే కథ ముగిసిన విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఆడిన 11 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది.కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఇంకా పోటీలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 11 పాయింట్లు సాధించింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఓ పాయింట్ వచ్చింది. కేకేఆర్ ఈ మ్యాచ్‌తో కలుపుకుని ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. -
IPL 2025: రికార్డుల్లోకెక్కిన రహానే
ఐపీఎల్ 2025లో భాగంగా కేకేఆర్, సీఎస్కే మధ్య ఇవాళ (మే 7) జరుగుతున్న మ్యాచ్‌లో అజింక్య రహానే ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి ఔటైన రహానే.. ఐపీఎల్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఘనత సాధించిన ఏడో భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా తొమ్మిదో ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రహానే తన 197 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. రహానేకు ముందు విరాట్ కోహ్లి (8509), రోహిత్ శర్మ (6928), శిఖర్ ధవన్ (6769), డేవిడ్ వార్నర్ (6565), సురేశ్ రైనా (5528), ఎంఎస్ ధోని (5406), ఏబీ డివిలియర్స్ (5162), కేఎల్ రాహుల్ (5064) ఐపీఎల్లో 5000 పరుగుల మార్కును అధిగమించారు. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కేకేఆర్ 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. రహ్మనుల్లా గుర్బాజ్ 11, సునీల్ నరైన్ 26, రహానే 48, రఘువంశీ 1 పరుగు చేసి ఔట్ కాగా.. రసెల్ 17, రసెల్ 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 2, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.కాగా, ఈ మ్యాచ్ కోసం కేకేఆర్ ఓ మార్పు చేసింది. వెంకటేశ్ అయ్యర్ స్థానంలో మనీశ్ పాండే తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు సీఎస్కే ఈ మ్యాచ్‌లో ప్రయోగాల బాట పట్టింది. ఉర్విల్ పటేల్, డెవాన్ కాన్వే, అశ్విన్ తుది జట్టులోకి వచ్చారు.ఈ సీజన్లో సీఎస్కే కథ ముగిసిన విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఆడిన 11 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది.కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఇంకా పోటీలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 11 పాయింట్లు సాధించింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఓ పాయింట్ వచ్చింది. కేకేఆర్ ఈ మ్యాచ్‌తో కలుపుకుని ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.తుది జట్లు..కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), సునీల్ నరైన్, అజింక్యా రహానే(c), అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తిఇంపాక్ట్ సబ్స్: హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, లువ్నిత్ సిసోడియా, అన్రిచ్ నోర్ట్జే, మయాంక్ మార్కండేచెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ఆయుష్ మ్హత్రే, ఉర్విల్ పటేల్, డెవాన్ కాన్వే, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రీవిస్, రవిచంద్రన్ అశ్విన్, MS ధోని(w/c), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానాఇంపాక్ట్ సబ్స్: శివమ్ దూబే, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, జామీ ఓవర్టన్, దీపక్ హుడా -
IPL 2025: కేకేఆర్‌పై సీఎస్కే విజయం
కేకేఆర్‌పై సీఎస్కే విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 7) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి కేకేఆర్‌ను దెబ్బేశాడు. అన్షుల్ కంబోజ్, జడేజా తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రహానే (48), మనీశ్ పాండే (36 నాటౌట్), రసెల్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే 60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. డెవాల్డ్ బ్రెవిస్ (52) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో తన జట్టును తిరిగి గెలుపు ట్రాక్‌లో పెట్టాడు. మధ్యలో దూబే (45) బాధ్యతాయుతంగా ఆడి సీఎస్కే విజయతీరాలవైపు మళ్లించాడు. ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరమైన తరుణంలో అప్పటిదాకా కామ్‌గా ఉన్న ధోని (17 నాటౌట్) సిక్సర్ కొట్టి సీఎస్కేకు గెలుపుకు చేరువ చేశాడు. నాలుగో బంతికి కంబోజ్ బౌండరీ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఈ గెలుపు వల్ల సీఎస్కేకు ఒరిగేది ఏమీ లేనప్పటికీ కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బకొట్టింది. సీఎస్కే గెలవాలంటే 30 బంతుల్లో 40 పరుగులు చేయాలి15 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 140/6గా ఉంది. ధోని (3), దూబే (24) క్రీజ్‌లో ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన సీఎస్కే12.1వ ఓవర్- 11వ ఓవర్లో 30 పరుగులు రాబట్టిన బ్రెవిస్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బ్రెవిస్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 30 పరుగులువైభవ్ అరోరా వేసిన 11వ ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్ శివాలెత్తిపోయాడు. 3 ఫోర్లు, 3 సిక్సర్లు సహా 30 పిండుకున్నాడు. ఈ ఒక్క ఓవర్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు ఓటమి ఖాయమనుకున్న సీఎస్కే ఒక్కసారిగా గెలుపు ట్రాక్‌లోకి వచ్చింది. 11 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 123/5గా ఉంది. బ్రెవిస్ 20 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. దూబే 12 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. 60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సీఎస్కే5.2వ ఓవర్- సీఎస్కే 60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రవీంద్ర జడేజా (19) క్లీన్ బౌల్డయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్కే4.6వ ఓవర్- 56 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో రఘువంశీకి క్యాచ్ ఇచ్చి అశ్విన్ (8) ఔటయ్యాడు.టార్గెట్ 180.. 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సీఎస్కే180 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్కే 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆయుశ్ మాత్రే, డెవాన్ కాన్వే డకౌట్ కాగా.. ఉర్విల్ పటేల్ 31 పరుగులకు ఔటయ్యారు. అశ్విన్ (4), జడేజా క్రీజ్‌లో ఉన్నారు. 3 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 37/3గా ఉంది. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, మొయిన్ అలీ, హర్షిత్ రాణా తలో వికెట్ తీశారు. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన కేకేఆర్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నామమాత్రపు స్కోర్‌కు పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి కేకేఆర్‌ను దెబ్బేశాడు. అన్షుల్ కంబోజ్, జడేజా తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రహానే (48), మనీశ్ పాండే (36 నాటౌట్), రసెల్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. రసెల్ ఔట్16.6వ ఓవర్- 149 పరుగుల వద్ద కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. డేంజరెస్‌గా కనిపిస్తున్న ఆండ్రీ రసెల్ (38) నూర్ అహ్మద్ బౌలింగ్‌లో బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 124/4రసెల్ 18, మనీశ్ పాండే 17 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. రహానే ఔట్12.2వ ఓవర్- 103 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి రహానే (48) ఔటయ్యాడు. 12 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 101/3రహానే (31 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మనీశ్ పాండే (13 బంతుల్లో 14) క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్నూర్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో కేకేఆర్ రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి నరైన్ ఔట్ కాగా.. నాలుగో బంతికి రఘువంశీ (1) పెవిలియన్‌కు చేరాడు. నరైన్‌ను స్టంపౌట్ చేసిన ధోని, రఘువంశీ క్యాచ్ కూడా పట్టుకున్నాడు. 8 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 73/3గా ఉంది. రహానే (32), మనీశ్ పాండే (1) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ ధాటిగా ఆడుతుంది. 7 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది.8వ ఓవర్ తొలి బంతికి నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సునీల్ నరైన్ (26) స్టంపౌటయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్‌ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 7) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్, సీఎస్కే తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం కేకేఆర్ ఓ మార్పు చేసింది. వెంకటేశ్ అయ్యర్ స్థానంలో మనీశ్ పాండే తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు సీఎస్కే ఈ మ్యాచ్‌లో ప్రయోగాల బాట పట్టింది. ఉర్విల్ పటేల్, డెవాన్ కాన్వే, అశ్విన్ తుది జట్టులోకి వచ్చారు.ఈ సీజన్లో సీఎస్కే కథ ముగిసిన విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఆడిన 11 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది.కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఇంకా పోటీలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 11 పాయింట్లు సాధించింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఓ పాయింట్ వచ్చింది. కేకేఆర్ ఈ మ్యాచ్‌తో కలుపుకుని ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.తుది జట్లు..కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), సునీల్ నరైన్, అజింక్యా రహానే(c), అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తిఇంపాక్ట్ సబ్స్: హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, లువ్నిత్ సిసోడియా, అన్రిచ్ నోర్ట్జే, మయాంక్ మార్కండేచెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ఆయుష్ మ్హత్రే, ఉర్విల్ పటేల్, డెవాన్ కాన్వే, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రీవిస్, రవిచంద్రన్ అశ్విన్, MS ధోని(w/c), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానాఇంపాక్ట్ సబ్స్: శివమ్ దూబే, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, జామీ ఓవర్టన్, దీపక్ హుడా -
Operation Sindoor: ముంబై ఇండియన్స్‌పై ఎఫెక్ట్
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ ముంబై ఇండియన్స్‌పై పడింది. తమ తదుపరి మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ ఇవాళ (మే 7) సాయంత్రం ముంబై నుంచి చండీఘడ్ మీదుగా ధర్మశాలకు ప్రయాణించాల్సి ఉంది. అయితే ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ధర్మశాల ప్రయాణం వాయిదా పడింది. భారత ప్రభుత్వం సూచనల మేరకు చండీఘడ్ సహా దేశంలో పలు విమానాశ్రయాలు మూసివేశారు. చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇందులో ముంబై ఇండియన్స్ ప్రయాణించాల్సిన విమాన సర్వీస్ కూడా ఉంది. బీసీసీఐ నుంచి తదుపరి సూచనలు వచ్చే వరకు ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలోనే ఉండనుంది.ఈ నెల 11న ముంబై ఇండియన్స్ ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసమే వారు ధర్మశాల ప్రయాణానికి సిద్దమయ్యారు. ఈ లోపే విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు ధర్మశాలలో రేపు (మే 8) ఓ మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్.. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇదివరకే ధర్మశాలకు చేరుకున్నాయి.కాగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ దాడులకు తెగబడే అవకాశం ఉండటంతో భారత ప్రభుత్వం పలు విమానాశ్రయాలను మూసి వేయాలని సూచించింది. అయితే దీని ప్రభావం ఐపీఎల్ పడే అవకాశం ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారం సాగాలంటే ఆయా జట్లు ఓ వేదిక నుంచి మరో వేదికకు విమానాల ద్వారా ప్రయాణించాల్సి ఉంది. దేశంలో పలు విమానాశ్రయాలు మూసివేసిన నేపథ్యంలో జట్ల ప్రయాణానికి ఆటంకం కలుగవచ్చు. దీని ప్రభావం ఐపీఎల్ షెడ్యూల్‌పై పడే అవకాశం ఉంది.స్పందించిన బీసీసీఐషెడ్యూల్ మార్పు అంశంపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశాయి. ఈ విషయంపై బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులను బీసీసీఐ నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నాయి.మ్యాచ్ ముగిసిన కొద్ది సేపటికే ఆపరేషన్ సిందూర్ మొదలైందిముంబై ఇండియన్స్ -గుజరాత్ టైటాన్స్ మధ్య నిన్న (మే 6) జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. ఈ మ్యాచ్ ముగిసిన కాసేపటికే భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది.జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో గత నెల 22వ తేదీన పాక్ ఉగ్రమూకలు దాడులకు తెగబడి 26 మంది అమాయకుల ఫ్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. దీనికి బదులుగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్‌కు బుద్ధి చెప్పింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. -
IPL 2025: చెత్త రికార్డును సమం చేసిన హార్దిక్ పాండ్యా
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో ఓ చెత్త రికార్డును సమం చేశాడు. నిన్న (మే 6) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ ఓవర్లో ఏకంగా 11 బంతులు వేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలా ఓ ఓవర్లో 11 బంతులు వేసిన ఐదో బౌలర్‌గా హార్దిక్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. హార్దిక్‌కు ముందు సిరాజ్ (2023లో ఆర్సీబీకి ఆడుతూ ముంబై ఇండియన్స్‌పై), తుషార్ దేశ్‌పాండే (2023లో సీఎస్కేకు ఆడుతూ లక్నోపై), శార్దూల్ ఠాకూర్ (2025లో లక్నోకు ఆడుతూ కేకేఆర్‌పై), సందీప్ శర్మ (2025లో రాజస్థాన్‌కు ఆడుతూ ఢిల్లీపై) ఈ చెత్త ప్రదర్శన చేశారు. శార్దూల్, సందీప్ శర్మ, హార్దిక్ ఇదే సీజన్లో ఈ చెత్త ప్రదర్శన చేయడం విశేషం.కాగా, తీవ్ర ఉత్కంఠ నడుమ నిన్న మధ్య రాత్రి వరకు సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగుల స్వల్ప స్కోర్ మాత్రమే చేసింది. ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు తేలిపోయారు. విల్ జాక్స్ (53), సూర్యకుమార్ యాదవ్ (35), కార్బిన్ బాష్ (27) ఓ మోస్తరుగా రాణించడంతో ముంబై ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.గుజరాత్ బౌలర్లు, ఫీల్డర్లు తొలుత తడబడినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని ముంబైని కట్టడి చేశారు. సాయి కిషోర్ 2, సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కొయెట్జీ తలో వికెట్ తీశారు. పవర్ ప్లేలో గుజరాత్ ఆటగాళ్లు మూడు సునాయాసమైన క్యాచ్‌లు వదిలేయగా.. గిల్ ఒక్కడే మూడు క్యాచ్‌లు పట్టాడు.అనంతరం గుజరాత్ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో వర్షం పదే పదే అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం గుజరాత్ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147 పరుగులు డిసైడ్ చేశారు. ఛేదనలో తొలుత సునాయాసంగా విజయం సాధించేలా కనిపించిన గుజరాత్.. మధ్యలో ముంబై బౌలర్లు అనూహ్య రీతిలో పుంజుకోవడంతో తడబాటుకు లోనైంది. ఓ దశలో మ్యాచ్ గుజరాత్ చేతుల్లో నుంచి జారిపోయేలా కనిపించింది. చివరి ఓవర్లో గుజరాత్ గెలుపుకు 15 పరుగులు అవసరం కాగా.. తెవాతియా, కొయెట్జీ బౌండరీ, సిక్సర్ బాది గెలిపించారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా.. ముంబై నాలుగో స్థానానికి దిగజారింది. -
IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు?.. స్పందించిన బీసీసీఐ!
‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)నేపథ్యంలో ఐపీఎల్-2025లో షెడ్యూల్లో మార్పులు ఉంటాయా? లేదంటే క్యాష్ రిచ్ లీగ్ ప్రణాళిక ప్రకారమే ముందు సాగుతుందా? అని అభిమానుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు స్పందించాయి.ఐపీఎల్ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవని.. లీగ్ యథావిథిగా ఉంటుందని స్పష్టం చేశాయి. కాగా మార్చి 22న ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ మొదలు కాగా.. మే 6 నాటికి 56 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇందులో రెండు మాత్రమే వర్షం కారణంగా రద్దయ్యాయి.టాప్‌లో గుజరాత్ఈ క్రమంలో పదకొండింట ఎనిమిది విజయాలతో గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలోకి కొనసాగుతుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా 16 పాయింట్లు ఉన్నా రన్‌రేటు పరంగా వెనుకబడి రెండో స్థానంలో ఉంది.మరోవైపు.. పంజాబ్ కింగ్స్ (15 పాయింట్లు), ముంబై ఇండియన్స్ (14 పాయింట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (13 పాయింట్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ (11 పాయింట్లు), లక్నో సూపర్ జెయింట్స్ (10 పాయింట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఇక ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (7 పాయింట్లు), రాజస్తాన్ రాయల్స్ (6 పాయింట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (4 పాయింట్లు) ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి.ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు కాగా ముంబై ఇండియన్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య మంగళవారం నాటి మ్యాచ్ వర్షం వల్ల అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. అయితే, ఈ మ్యాచ్ ముగిసిన కాసేపటికే భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసి.. వాటిని ధ్వంసం చేసింది.జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట బుద్ధి చెప్పింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.ఇలాంటి సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా ఐపీఎల్ మ్యాచ్‌లు వాయిదా వేస్తారేమోనని సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యలో బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులను బీసీసీఐ నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నాయి.దేశ ప్రయోజనాలే ముఖ్యంఇక ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందిస్తూ.. భారత ప్రభుత్వ నిర్ణయాలను బీసీసీఐ శిరసా వహిస్తుందని స్పష్టం చేశారు. సమయానికి తగినట్లు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను తప్పక పాటిస్తామని పేర్కొన్నారు.‘‘ఐపీఎల్ పాలక మండలి ఈ పరిస్థితులను గమనిస్తోంది. ఐపీఎల్ షెడ్యూల్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. అయితే, ఏదీ మన చేతుల్లో లేదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా బీసీసీఐ అందుకు కట్టుబడి ఉంటుంది. మద్దతుగా ఉంటుంది’’ అని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు.సురక్షితం, భద్రంఇక టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘భారత్‌లో ప్రతి ఒక్కరు సురక్షితంగా, భద్రంగా ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు. మన దేశ సైన్యంపై అందరికీ అమితమైన విశ్వాసం ఉంది. విదేశీ ఆటగాళ్లు కూడా తాము భద్రంగా ఉన్నామని, ఉంటామని నమ్మకంగా ఉన్నారు. కాబట్టి లీగ్‌లో మార్పులు ఉండవనే అనుకుంటున్నా’’ అని ధీమా వ్యక్తం చేశాడు.చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్ -
ఆఖరి ఓవర్లో నువ్వెందుకు వెళ్లలేదు?.. అన్నీ తెలిసి అతడిని పంపిస్తావా?
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) ఆగ్రహం వ్యక్తం చేశాడు. గుజరాత్ టైటాన్స్ (MI vs GT)తో మ్యాచ్‌లో కీలకమైన ఓవర్లో బౌలర్‌గా బాధ్యతలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించాడు. ఇలాంటి పొరపాట్లు ప్లే ఆఫ్స్ అవకాశాలపై ప్రభావం చూపుతాయని.. ఒక్కోసారి ఇలాంటి వాటి వల్లే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నాడు.ఐపీఎల్-2025లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో తలపడింది. సొంతమైదానంలో టాస్ ఓడిన హార్దిక్ సేన తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగుల మేర నామమాత్రపు స్కోరు చేసింది.అయితే, లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్‌కు వర్షం పదే పదే అంతరాయం కలిగించింది. పద్నాలుగు ఓవర్లు ముగిసిన తర్వాత.. మరోసారి వాన పడింది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పరిస్థితి అలాగే ఉండగా.. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 19 ఓవర్లలో టైటాన్స్ లక్ష్యాన్ని 147 పరుగులుగా నిర్దేశించారు.స్లో ఓవర్ రేటు కారణంగాఈ దశలో ఆఖరి ఓవర్లో టైటాన్స్ విజయానికి పదిహేను పరుగులు అవసరమయ్యాయి. అయితే, అప్పటికే స్లో ఓవర్ రేటు కారణంగా ఇన్నింగ్ రింగ్ బయట ముంబై కేవలం నలుగురు ఫీల్డర్లను ఉంచాల్సిన పరిస్థితి.ఇలాంటి సమయంలో హార్దిక్ పాండ్యా తనే బంతితో రంగంలోకి దిగకుండా.. మరో పేసర్ దీపక్ చహర్ చేతికి బంతినిచ్చాడు. చహర్ బౌలింగ్‌ను ఫోర్‌తో మొదలుపెట్టిన టైటాన్స్.. ఆ ఓవర్లో కీలక సిక్సర్ బాదింది. ఇక చహర్ ఒత్తిడిలో ఓ నో బాల్ కూడా వేశాడు. ఆ తర్వాత వికెట్ తీసినా ఫలితం లేకుండా పోయింది.గుజరాత్ జయభేరిమొత్తానికి ఆఖరి ఓవర్లో టైటాన్స్ 15 పరుగులు సాధించి జయభేరి మోగించింది. పాయింట్ల పట్టికలో గుజరాత్ అగ్రస్థానానికి చేరగా.. ముంబై నాలుగో స్థానానికి దిగజారింది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ఆఖరి ఓవర్ హార్దిక్ పాండ్యా వేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.ఆఖరి ఓవర్లో నువ్వెందుకు వెళ్లలేదు?ఈ మేరకు జియోస్టార్‌లో మాట్లాడుతూ.. ‘‘హార్దిక్ ఇప్పటికి చాలా సార్లు కీలక సమయాల్లో ఆఖరి ఓవర్లో బంతితో బరిలో దిగాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఫైనల్ ఓవర్లో మూడు వికెట్లు తీశాడు. అప్పుడు భారత్ గెలిచింది.ఆ తర్వాత ఇటీవలే టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లోనూ అతడు సౌతాఫ్రికాతో ఫైనల్లో చివరి ఓవర్ వేసి ఇండియాను గెలిపించాడు. కాబట్టి ఈసారి కూడా అతడే రంగంలోకి దిగి ఉంటే బాగుండేది.అన్నీ తెలిసి అతడిని పంపిస్తావా?దీపక్ చహర్ ఎక్కువగా ఆఖరి ఐదు ఓవర్లు వేయలేదని కామెంట్రీలో విన్నాను. అరుదుగా మాత్రమే డెత్ ఓవర్లలో వస్తాడు. ఇదంతా తెలిసి కూడా ఇలా ఎందుకు చేశారు? స్లో ఓవర్‌రేటు వల్ల ఫీల్డర్ల విషయంలోనూ మీకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఇలాంటివి ప్లే ఆఫ్స్ అవకాశాలను గల్లంతు చేస్తాయి.. ఇప్పటికైనా కూర్చుని మాట్లాడుకుని పొరపాట్లను సమీక్షించుకోండి’’ అని సునిల్ గావస్కర్ ముంబై ఇండియన్స్‌కు సూచించాడు.చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్Rain delays, wickets falling, and nerves running high 📈...@gujarat_titans edge past everything to seal a thrilling win over #MI that had fans on the edge of their seats! 🥳Scorecard ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/NLYj3ZlI3w— IndianPremierLeague (@IPL) May 6, 2025 -
ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్!.. ఆశిష్ నెహ్రానూ వదల్లేదు
ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)తో పాటు జట్టు మొత్తానికి జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ పాలక మండలి ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ముంబై మంగళవారం గుజరాత్ టైటాన్స్ (MI Vs GT)తో తలపడింది.ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు తేలిపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులకు హార్దిక్ సేన పరిమితమైంది.గెలిచిన గుజరాత్ఇక గుజరాత్ లక్ష్య ఛేదనకు దిగగా పదే పదే వర్షం అంతరాయం కలిగించింది. అయితే, ఎట్టకేలకు అర్ధరాత్రి తర్వాత వాన తెరిపినవ్వడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 19 ఓవర్లలో 147 పరుగులు చేయాల్సి ఉండగా.. గుజరాత్ పని పూర్తి చేసింది. ముంబైపై మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.కాగా ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో బౌలింగ్ కోటా పూర్తి చేయలేకపోయింది. దీంతో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారీ జరిమానా విధించింది.రూ. 24 లక్షల ఫైన్ఈ సీజన్లో రెండోసారి ఇదే తప్పిదాన్ని పునరావృతం చేసినందుకు హార్దిక్‌కు రూ. 24 లక్షల ఫైన్ వేసింది. అదే విధంగా.. నిబంధనల ప్రకారం.. ఇంపాక్ల్ ప్లేయర్ సహా తుదిజట్టులోని ఆటగాళ్ల అందరికి రూ. 6 లక్షల జరిమానా లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే అది జరిమానాగా వర్తిస్తుందని వెల్లడించింది.మరోవైపు గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రాకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. అతడికి కూడా జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ పాలక మండలి తెలిపింది.ఆశిష్ నెహ్రాను వదల్లేదుఈ మేరకు.. ‘‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నాం. అదే విధంగా అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జత చేస్తున్నాం’’ అని ఐపీఎల్ పాలక మండలి తమ ప్రకటనలో పేర్కొంది.ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.20 ప్రకారం ఆశిష్ నెహ్రా లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడని.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినందుకు ఈ మేర చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. నెహ్రా కూడా తన తప్పును అంగీకరించాడని పేర్కొంది. అయితే, నెహ్రా ఏం తప్పు చేశాడన్న విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. కాగా వర్షం వల్ల పదే పదే మ్యాచ్ టైమింగ్‌ను మార్చడంపై మైదానంలోనే నెహ్రా అంపైర్లతో వాదనకు దిగాడు. అందుకే అతడికి జరిమానా వేసినట్లు తెలుస్తోంది.ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ గుజరాత్👉వేదిక: వాంఖడే, ముంబై👉టాస్: గుజరాత్.. తొలుత బౌలింగ్👉ముంబై స్కోరు: 155/8 (20)👉గుజరాత్ స్కోరు: 147/7 (19)👉ఫలితం: డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ముంబైపై మూడు వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపుచదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్ Rain delays, wickets falling, and nerves running high 📈...@gujarat_titans edge past everything to seal a thrilling win over #MI that had fans on the edge of their seats! 🥳Scorecard ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/NLYj3ZlI3w— IndianPremierLeague (@IPL) May 6, 2025 -
మేకను బలి ఇచ్చిన అభిమానులపై కేసు
దొడ్డబళ్లాపురం: విరాట్ కోహ్లి కటౌట్ ముందు మేకను బలి ఇచ్చిన ఆర్సీబీ అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు తాలూకా మారమ్మనహళ్లిలో చోటుచేసుకుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించారు. దీంతో ఆనందం పట్టలేని అభిమానులు మారమ్మనహళ్లిలో విరాట్ కోహ్లి కటౌట్ పెట్టి మేకను బలి ఇచ్చారు. సదరు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో మొళకాల్మూరు పోలీసులు పాలయ్య, జయణ్ణ, తిప్పేస్వామిలపై కేసు నమోదు చేశారు. -
వర్షమా?.. ఎక్కడ?: ఆశిష్ నెహ్రా, రాహుల్ తెవాటియా ఆగ్రహం
ఐపీఎల్-2025 (IPL 2025)లో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ రేసులో మరో ముందడుగు వేసింది. ముంబై ఇండియన్స్ (MI vs GT)తో మంగళవారం నాటి మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో గెలిచి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకువచ్చింది. అయితే, ఈ గెలుపు గుజరాత్‌కు అంత సులువుగా ఏమీ దక్కలేదు.వర్షం కారణంగా పదే పదే వాయిదా పడిన మ్యాచ్ ఎట్టకేలకు పూర్తి కావడంతో గిల్ సేనకు ఊరట దక్కింది. ఒకవేళ వాన వల్ల మ్యాచ్ రద్దయిపోతే ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చేది. అప్పుడు గుజరాత్ ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త క్లిష్టంగా మారేవి. మరోవైపు.. బ్యాటింగ్ పరంగా విఫలమైన ముంబై పాలిట వర్షం వరంగా మారేది. టైమింగ్‌ను మార్చడంతోఅందుకే, మధ్యలో వాన తెరిపినిచ్చినా మ్యాచ్ టైమింగ్‌ను పదే పదే మార్చడంపై గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనేక అవాంతరాల అనంతరం.. అర్ధరాత్రి దాటిన తర్వాత 12:09 AM నుంచి మ్యాచ్‌ను 12:25 AMకు మార్చిన అంపైర్లు.. ఆ తర్వాత మ్యాచ్ పునఃప్రారంభాన్ని 12:30 AMకు వాయిదా వేశారు.వర్షమా?.. ఎక్కడ?ఈ నేపథ్యంలో మైదానంలోకి వచ్చిన ఆశిష్ నెహ్రా అంపైర్లతో వాదనకు దిగినట్లు కనిపించింది. మరోవైపు.. టైటాన్స్ బ్యాటర్ రాహుల్ తెవాటియా కూడా.. ‘‘వర్షం ఎక్కడ పడుతోంది’’ అన్నట్లుగా అంపైర్లతో వాదించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కీలకమైన మ్యాచ్‌లో గెలుపునకు దగ్గరైన వేళ వరుణుడితో పాటు అంపైర్లు కూడా తమతో దోబూచులాడటం నచ్చకే వీళ్లిద్దరూ ఇలా ఫైర్ అయ్యారంటూ అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.Rahul Tewatia saying where is rain.- Ashish Nehra is furious.Rain go 🤣#MIvGT #MIvsGT pic.twitter.com/oEiO7q1Qpf— its cinema (@iitscinema) May 6, 2025రాణించిన గుజరాత్ బౌలర్లుకాగా ముంబైలోని వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ముంబైని 155 పరుగులకు కట్టడి చేయగలిగింది. సాయి కిషోర్ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఇక ముంబై బ్యాటర్లలో ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (2), రోహిత్ శర్మ (7) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దశలో వన్‌డౌన్ బ్యాటర్ విల్‌జాక్స్ (53), సూర్యకుమార్ యాదవ్ (35) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఆఖర్లో కార్బిన్ బాష్ (27) కూడా రాణించడంతో ముంబై ఎనిమిది వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది.డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారంఇక లక్ష్య ఛేదనలో టైటాన్స్‌కు పదే పదే వర్షం ఆటంకం కలిగించింది. అయితే, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (43), వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ (30), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (28) రాణించారు. అయితే, ఆఖర్లో వర్షం వల్ల డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 19 ఓవర్లలో గుజరాత్ లక్ష్యాన్ని 147గా నిర్ణయించారు.ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో అనేక నాటకీయ పరిణామాల నడుమ గుజరాత్ 19 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి సరిగ్గా 147 పరుగులు చేసి జయభేరి మోగించింది. చివరి ఓవర్లో ముంబై పేసర్ దీపక్ చహర్ బౌలింగ్‌లో (4,1, 6, N1, 1, W, 1) తెవాటియా కొట్టిన ఫోర్, కోయెట్జి బాదిన సిక్సర్ గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాయి.ఇక ఈ సీజన్లో ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న గుజరాత్‌కు ఇది ఎనిమిదో విజయం. ఫలితంగా గిల్ సేన ఖాతాలో ఇప్పుడు 16 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్‌రేటు (0.793) పరంగానూ మెరుగ్గా ఉండటంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి దూసుకువచ్చింది.చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్Rain delays, wickets falling, and nerves running high 📈...@gujarat_titans edge past everything to seal a thrilling win over #MI that had fans on the edge of their seats! 🥳Scorecard ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/NLYj3ZlI3w— IndianPremierLeague (@IPL) May 6, 2025 -
టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: హార్దిక్
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) స్పందించాడు. ఆఖరి వరకు తమ జట్టు పోరాడిన తీరు అద్భుతమని కొనియాడాడు. అయితే, నో బాల్స్ వేయడం ప్రభావం చూపిందన్న హార్దిక్.. టీ20లలో ఇలా చేయడం నేరంతో సమానమని పేర్కొన్నాడు.ఐపీఎల్-2025 (IPL 2025) ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరచుకునే క్రమంలో ముంబై మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో తలపడింది. సొంత మైదానం వాంఖడేలో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. గుజరాత్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.వాన వల్ల పదే పదే ఆగిన ఆటఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆరంభంలోనే ఓపెనర్ సాయి సుదర్శన్(5) వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (43) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. జోస్ బట్లర్ (30), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (28) అతడికి సహకరించారు.ఈ క్రమంలో 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసి విజయం దిశగా గుజరాత్ పయనిస్తున్న వేళ వర్షం వల్ల చాలా సేపు మ్యాచ్ నిలిచిపోయింది. అయితే, వాన తెరిపినిచ్చిన తర్వాత ముంబై బౌలర్లు ఒక్కసారిగా విజృంభించారు. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ధాటికి పదహారు బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు నష్టపోయింది.ఈ క్రమంలో మిగిలిన రెండు ఓవర్లలో గుజరాత్ విజయానికి 24 పరుగులు అవసరమైన వేళ... భారీ వర్షం వల్ల ఆట మళ్లీ ఆగిపోయింది. ఫలితంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం గుజరాత్ లక్ష్యం 19 ఓవర్లలో 147గా మారగా.. ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన పరిస్థితి.ఆఖరి ఓవర్లో దీపక్ చహర్ నో బాల్ఈ నేపథ్యంలో తమ పేసర్ దీపక్ చహర్‌ను ముంబై బరిలోకి దించింది. అయితే, తొలి బంతికే రాహుల్ తెవాటియా ఫోర్ బాదగా.. మరుసటి బంతికి ఒక రన్ వచ్చింది. ఆ తర్వాత గెరాల్డ్ కోయెట్జి సిక్సర్ బాదాడు. దీంతో మూడు బంతుల్లో విజయ సమీకరణం నాలుగు పరుగులుగా మారింది.ఇలాంటి కీలక సమయంలో చహర్ నోబాల్ వేశాడు. అయితే, ఆ తర్వాత అతడు వేసిన లో ఫుల్ టాస్కు తెవాటియా ఒక్క పరుగే రాబట్టాడు. దీంతో రెండు బంతుల్లో ఒక్క పరుగు అవసరం కాగా.. చహర్ కోయెట్జిని పెవిలియన్‌కు పంపాడు. అయితే, ఆఖరి బంతికి అర్షద్ ఖాన్ పరుగు తీయడంతో గుజరాత్ విజయం ఖరారైంది.అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకేఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ముంబై సారథి హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘మా వాళ్లు ఆఖరి వరకు పట్టుదలగా పోరాడారు. జట్టుగా మేము సమిష్టిగా ముందుకు సాగాము. అయితే, ఇంకో 25 పరుగులు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.ఏదేమైనా మా బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇక క్యాచ్ డ్రాప్‌ల వల్ల మూల్యం చెల్లించాల్సి వచ్చిందని నేను అస్సలు అనుకోను. మా వాళ్లు ఈరోజు వందకు 120 శాతం కష్టపడ్డారు.ఏదేమైనా నో బాల్స్ వేయడం సరికాదు. నేను కూడా అదే పని చేశాను. నిజానికి నా దృష్టిలో టీ20 మ్యాచ్‌లో నో బాల్స్ వేయడం నేరం లాంటిది. ఇవే మన కొంప ముంచుతాయి. అయితే, మా వాళ్ల ప్రదర్శన పట్ల నేనైతే సంతోషంగానే ఉన్నాను’’ అని చెప్పుకొచ్చాడు.కాగా గుజరాత్ ఇన్నింగ్స్ పదకొండో ఓవర్లో హార్దిక్ కూడా నో బాల్ వేశాడు. ఇక 12వ ఓవర్లో ముంబై శుబ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ను కూడా జారవిడిచింది. కాగా ముంబైపై మూడు వికెట్ల తేడాతో గెలిచిన గుజరాత్ 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్ Rain delays, wickets falling, and nerves running high 📈...@gujarat_titans edge past everything to seal a thrilling win over #MI that had fans on the edge of their seats! 🥳Scorecard ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/NLYj3ZlI3w— IndianPremierLeague (@IPL) May 6, 2025 -
KKR vs CSK: నిలవాలంటే గెలవాలి
కోల్‌కతా: డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ భవితవ్యం ఈ మ్యాచ్‌లో తేలనుంది. ఐపీఎల్ 18వ సీజన్ ప్లేఆఫ్స్ రేసులో కోల్‌కతా ఉంటుందా లేదంటే లీగ్‌తోనే సరిపెట్టుకుంటుందా అనే విషయం నేడు చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. మరోవైపు ధోని బృందం ఇది వరకే లీగ్ నుంచి ని్రష్కమించింది. అయితే ఐపీఎల్ కెరీర్ చరమాంకంలో ఉన్న ధోని ఆటతీరును, లోయర్‌ఆర్డర్‌లో క్రీజులోకి వస్తున్న తీరును పరిశీలిస్తే ఈ సీజనే చివరిదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే జరిగితే... భారత విఖ్యాత స్టేడియం ఈడెన్ గార్డెన్స్‌లో తాను ఆడే ఆఖరి పోరును ధోని చిరస్మరణీయం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చెన్నైకి నామమాత్రమైనా... నైట్‌రైడర్స్‌కు కీలకమైన ఈ పోరు ఆసక్తికరంగా జరగడం ఖాయం. బ్యాటింగే కోల్‌కతా బలం కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు బ్యాటింగే బలం. ఇప్పటికే ఈ సీజన్లో నాలుగుసార్లు 200 పైచిలుకు పరుగుల్ని సాధించింది. లక్నోతో ఎదురైనా 239 పరుగుల భారీ లక్ష్యఛేదనలోనూ నైట్‌రైడర్స్ 4 పరుగుల తేడాతోనే ఓడింది. దీన్నిబట్టి చెప్పొచ్చు కోల్‌కతా బ్యాటర్ల బలమెంతో! తొలిదశను పక్కన బెడితే గత రెండు మ్యాచ్‌ల్లో చేసిన 200 ప్లస్ స్కోరు కేకేఆర్ ప్లేఆఫ్స్‌కు ఎంత కష్టపడుతుందో సూచిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్లతో జరిగిన ఈ మ్యాచ్‌ల్లో ఏ ఒక్కరి విధ్వంసంతోనూ, ఒకరిద్దరి మెరుపు ఇన్నింగ్స్‌లతోనూ అంతపెద్ద స్కోరు సాధ్యమవలేదు. బ్యాటింగ్ ఆర్డర్ అంతా మూకుమ్మడిగా రాణించింది. గుర్బాజ్, కెపె్టన్ అజింక్య రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, రసెల్ అందరూ బ్యాట్లకు పని చెప్పారు. ఇక అంతకుముందు ఢిల్లీతో జరిగిన పోరులో ఏ ఒక్కరు కూడా అర్ధసెంచరీ సాధించలేదు. అయినాసరే టాపార్డర్ 20 ప్లస్ స్కోర్లు, రింకూ సింగ్ (36), టాప్‌స్కోరర్ రఘువంశీ (44) చేసిన పరుగులతోనే కోల్‌కతా సులువుగా 200 పైచిలుకు స్కోరును సాధించింది. బౌలింగ్‌లోనూ వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌ల స్పిన్ మ్యాజిక్ ప్రత్యర్థులను చుట్టేస్తుంది. వైభవ్ అరోరా, హర్షిత్ రాణాలు తమ పేస్ బౌలింగ్‌లో నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి సమష్టి ప్రదర్శన సొంతగడ్డపై ఈ మ్యాచ్‌లో కనబరిస్తే కోల్‌కతాకు ఎదురే ఉండదు. చెన్నైకిది చేదు సీజన్ ఐపీఎల్‌కే వన్నెతెచ్చిన టీమ్‌లలో చెన్నై ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన 17 సీజన్లలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టు చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే). 5 టైటిల్స్‌తో ముంబై ఇండియన్స్‌తో సమానంగా ఉన్నప్పటికీ... పదిసార్లు ఫైనల్ చేరిన (5సార్లు రన్నరప్) ఏకైక జట్టు సీఎస్కే. లీగ్ చరిత్రలో ఇంతటి ఘనచరిత్ర కలిగిన ధోని జట్టుకు ఈ సీజన్ అత్యంత చెత్తగా సాగుతోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడితే రెండంటే రెండే మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఏకంగా 9 పరాజయాలతో లీగ్ నుంచి ని్రష్కమించిన సూపర్‌కింగ్స్‌కు మిగిలిందల్లా మిగతా మ్యాచ్‌లు ఆడి గెలవడమే! జోరు మీదున్న కోల్‌కతాను ఆపుతుందా... మరో భంగపాటుతో అట్టడునే నిలుస్తుందో చూడాలంటే చీకటి పడేదాకా ఆగాల్సిందే! -
MI vs GT: ముంబై జోరుకు బ్రేక్
ముంబై: ఐపీఎల్–2025లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్రకు కాస్త విరామం... వరుసగా ఆరు విజయాలతో కొనసాగించిన జోరుకు గుజరాత్ టైటాన్స్ బ్రేక్ వేసింది. మంగళవారం వాంఖెడే మైదానంలో జరిగిన పోరులో గుజరాత్ 3 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) ముంబైపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విల్ జాక్స్ (35 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 43 బంతుల్లో 71 పరుగులు జోడించారు. చక్కటి బౌలింగ్‌తో ముంబైని తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో టైటాన్స్ సఫలమైంది. అనంతరం గుజరాత్ 19 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్ గిల్ (46 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (27 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్), రూథర్‌ఫర్డ్ (15 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో 14 ఓవర్ల తర్వాత 107/2తో గుజరాత్ మెరుగైన స్థితిలో నిలిచింది. చేతిలో 8 వికెట్లు ఉన్న జట్టు మరో 36 బంతుల్లో 49 పరుగులే చేయాలి. గుజరాత్ విజయం లాంఛనమే అనిపించింది. ఈ దశలో వానతో చాలా సేపు ఆట ఆగిపోయింది. అంతా చక్కబడి మ్యాచ్ మొదలైన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బుమ్రా, బౌల్ట్ చెలరేగిపోవడంతో గుజరాత్ బ్యాటింగ్ తడబాటుకు లోనైంది. తర్వాతి 4 ఓవర్లలో 25 పరుగులు చేసిన జట్టు 16 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. 2 ఓవర్లలో 24 పరుగులు చేయాల్సిన ఉన్న సమయంలో మళ్లీ భారీ వర్షంతో ఆట ఆగిపోయింది. దాంతో ఆటను ఒక ఓవర్ కుదించి డక్‌వర్త్–లూయిస్ ప్రకారం గుజరాత్ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147గా నిర్దేశించారు. దాంతో చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. చహర్ వేసిన ఈ ఓవర్లో టైటాన్స్ 15 పరుగులు చేసి విజయాన్నందుకుంది. స్కోరు వివరాలు: ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) సుదర్శన్ (బి) సిరాజ్ 2; రోహిత్ (సి) ప్రసిధ్ (బి) అర్షద్ 7; జాక్స్ (సి) సుదర్శన్ (బి) రషీద్ 53; సూర్యకుమార్ (సి) షారుఖ్ (బి) సాయికిషోర్ 35; తిలక్ (సి) గిల్ (బి) కొయెట్జీ 7; పాండ్యా (సి) గిల్ (బి) సాయికిషోర్ 1; నమన్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 7; బాష్ (రనౌట్) 27; చహర్ (నాటౌట్) 8; కరణ్ శర్మ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–2, 2–26, 3–97, 4–103, 5–106, 6–113, 7–123, 8–150. బౌలింగ్: సిరాజ్ 3–0–29–1, అర్షద్ 3–0–18–1, ప్రసిధ్ 4–0–37–1, సాయికిషోర్ 4–0–34–2, రషీద్ ఖాన్ 4–0–21–1, కొయెట్జీ 2–0–10–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) రికెల్టన్ (బి) బౌల్ట్ 5; గిల్ (బి) బుమ్రా 43; బట్లర్ (సి) రికెల్టన్ (బి) అశ్వని 30; రూథర్‌ఫర్డ్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 28; షారుఖ్ (బి) బుమ్రా 6; తెవాటియా (నాటౌట్) 11; రషీద్ ఖాన్ (ఎల్బీ) (బి) అశ్వని 2; కొయెట్జీ (సి) నమన్ (బి) చహర్ 12; అర్షద్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19 ఓవర్లలో 7 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1–6, 2–78, 3–113, 4–115, 5–123, 6–126, 7–146. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–32–1, బౌల్ట్ 4–0–22–2, బుమ్రా 4–0–19–2, హార్దిక్ పాండ్యా 1–0–18–0, కరణ్ శర్మ 2–0–13–0, అశ్వని కుమార్ 4–0–28–2, జాక్స్ 1–0–15–0. -
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సీజన్లు 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో కలుపుకుని సూర్య ఇప్పటివరకు మూడు సార్లు (2025 (510*), 2023 (605), 2018 (512)) ఓ సీజన్లో 500 ప్లస్ పరుగులు చేశాడు. సూర్య తర్వాత ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సీజన్లు 500 ప్లస్ పరుగులు చేసిన ఘనత సచిన్ టెండూల్కర్ (2010, 2011), క్వింటన్ డికాక్‌కు (2019, 2020) దక్కుతుంది. వీరిద్దరు తలో రెండు సార్లు ఈ ఘనత సాధించారు.ఇవాళ (మే 6) గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్య ఈ సీజన్లో 500 పరుగుల మార్కును తాకాడు. ఈ మ్యాచ్‌లో సూర్య సీజన్ లీడింగ్ రన్ స్కోరర్‌గానూ అవతరించాడు. ఈ మ్యాచ్‌లో 24 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేసిన సూర్య సాయి కిషోర్ బౌలింగ్‌లో షారుక్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సీజన్లో సూర్య 12 మ్యాచ్‌ల్లో 510 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ సాధించే క్రమంలో సూర్య విరాట్‌ను (505) అధిగమించాడు.ఈ సీజన్లో సూర్య చేసిన స్కోర్లు..29(26), 48(28), 27*(9), 67(43), 28(26), 40(28), 26(15), 68*(30), 40*(19), 54(28), 48*(23) & 35(24)ఈ సీజన్లో టాప్-6 లీడింగ్ రన్ స్కోరర్లు..సూర్యకుమార్ యాదవ్-510విరాట్ కోహ్లి- 505సాయి సుదర్శన్- 504యశస్వి జైస్వాల్- 473జోస్ బట్లర్- 470శుభ్‌మన్ గిల్- 465మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఆది నుంచే కష్టాలు ఎదురయ్యాయి. రెండో బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ రికెల్టన్ (2) ఔటయ్యాడు. నాలుగో ఓవర్లో రోహిత్ శర్మ (7) పెవిలియన్‌కు చేరాడు. అనంతరం విల్ జాక్స్ (53), సూర్యకుమార్ యాదవ్ (35) కాసేపు నిలకడగా ఆడినా.. స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔటయ్యారు. ఆతర్వాత వచ్చిన తిలక్ వర్మ (7), హార్దిక్ పాండ్యా (1), నమన్ ధిర్ (7) ఇలా వచ్చి అలా వెళ్లారు. 16.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 123/7గా ఉంది. కార్బిన్ బాష్ (4), దీపక్ చాహర్ క్రీజ్‌లో ఉన్నారు. పవర్ ప్లేలో గుజరాత్ ఆటగాళ్లు మూడు సునాయాసమైన క్యాచ్‌లు వదిలి పెట్టినా ముంబై ఇండియన్స్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ 2, సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కొయెట్జీ తలో వికెట్ పడగొట్టారు. శుభ్‌మన్ గిల్ మూడు క్యాచ్‌లు పట్టాడు. -
MI VS GT Live Updates: .. ఉత్కంఠ పోరులో ముంబైపై గుజరాత్ విజయం
ఉత్కంఠ పోరులో ముంబైపై గుజరాత్ విజయం సాధించింది. వర్షం అంతరాయం వల్ల 19 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. చివరి ఓవర్లో లక్ష్యం 15 పరుగులు కాగా వర్షం కారణంగా DLS పద్ధతిలో 3 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపొందింది. మ్యాచ్ మొదలైన కాసేపటికే వర్షం పడటంతో మరోసారి మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. తిరిగి మొదలైన మ్యాచ్.. లక్ష్యానికి చేరువగా గుజరాత్14 ఓవర్ల తర్వాత వర్షం పడటంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. తిరిగి అర్ద గంట తర్వాత మ్యాచ్ మళ్లీ మొదలైంది.గుజరాత్ లక్ష్యానికి చేరువగా ఉంది. 14 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 107/2గా ఉంది. గిల్ 8, రూథర్‌ఫోర్డ్ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయంవర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలుపు దిశగా సాగుతుంది. గుజరాత్ గెలవాలంటే 36 బంతుల్లో 48 పరుగులు చేయాలి. 14 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 107/214 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 107/2గా ఉంది. గిల్ 8, రూథర్‌ఫోర్డ్ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్11.3వ ఓవర్- 78 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. అశ్వనీ కుమార్ బౌలింగ్‌లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (30) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 68/110 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 68/1గా ఉంది. గిల్ 28, బట్లర్ 28 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 156.. 6 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 29/1156 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆచితూచి ఆడుతుంది. ఆదిలోనే వికెట్ కోల్పోవడంతో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. 6 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 29/1గా ఉంది. గిల్ (12) పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. బట్లర్ 10 పరుగులతో అతనికి జతగా ఉన్నాడు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్1.2వ ఓవర్- 156 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ 6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రికల్టెన్కు క్యాచ్ ఇచ్చి ఇన్ఫామ్ బ్యాటర్ సాయి సుదర్శన్ (5) ఔటయ్యాడు. సత్తా చాటిన గుజరాత్ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబైటాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన గుజరాత్ ముంబైని స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. గుజరాత్ బౌలర్లందరూ సత్తా చాటడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ 2, సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కొయెట్జీ తలో వికెట్ పడగొట్టారు. ముంబై ఇన్నింగ్స్‌లో విల్ జాక్స్ (53), సూర్యకుమార్ యాదవ్ (35), కార్బిన్ బాష్ (27) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో బాష్ బ్యాట్ ఝులిపించకపోయుంటే ముంబై ఈ మాత్రం స్కోర్ కూడా సాధించలేకపోయేది. ఏడో వికెట్ కోల్పోయిన ముంబై16.2వ ఓవర్- 123 పరుగుల వద్ద ముంబై ఏడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి నమన్ ధిర్ (7) ఔటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన ముంబై13.5వ ఓవర్- 113 పరుగుల వద్ద ముంబై ఆరో వికెట్ కోల్పోయింది. గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ (7) ఔటయ్యాడు. కష్టాల్లో ముంబై ఇండియన్స్12.3వ ఓవర్- 106 పరుగుల వద్ద ముంబై ఐదో వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి హార్దిక్ పాండ్యా (1) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై11.4వ ఓవర్- 103 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి విల్ జాక్స్ (53) ఔటయ్యాడు. డీప్ స్క్వేర్ లెగ్‌లో సాయి సుదర్శన్ క్యాచ్ పట్టాడు. మూడో వికెట్ కోల్పోయిన ముంబై10.4వ ఓవర్- 97 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (35) ఔటయ్యాడు.10 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 89/210 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 89/2గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ (34), విల్ జాక్స్ (45) క్రీజ్‌లో ఉన్నారు. 6 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 56/26 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 56/2గా ఉంది. విల్ జాక్స్ 30, సూర్యకుమార్ యాదవ్ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. జాక్స్‌కు 0, 29 పరుగుల వద్ద రెండు లైఫ్స్ లభించాయి. సాయి సుదర్శన్, సిరాజ్ చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లు వదిలేశారు. రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్3.3వ ఓవర్- ముంబై ఇండియన్స్ 26 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (7) ఔటయ్యాడు. రెండో బంతికే వికెట్ తీసిన సిరాజ్టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ రెండో బంతికే ముంబైని దెబ్బకొట్టింది. సిరాజ్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ అద్బుతమైన క్యాచ్ పట్టడంతో ఇన్ ఫామ్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ (2) ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్‌ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 6) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం గుజరాత్ ఓ మార్పు చేయగా.. ముంబై గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగుతుంది. గుజరాత్ తరఫున వాషింగ్టన్ సుందర్ స్థానంలో అర్షద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణఇంపాక్ట్ సబ్‌లు: వాషింగ్టన్ సుందర్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, దాసున్ షనక, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ సబ్స్: కర్ణ్ శర్మ, రాజ్ బావా, రాబిన్ మింజ్, రీస్ టోప్లీ, అశ్వనీ కుమార్ -
ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టు.. రోహిత్ శర్మకు నో ప్లేస్
ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రికెట్ దిగ్గజాలు ఆడమ్ గిల్‌క్రిస్ట్, షాన్ పొలాక్ తమ ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో వారు ఏడుగురు భారత ప్లేయర్లు, నలుగురు విదేశీ ఆటగాళ్లకు చోటిచ్చారు. ఈ జట్టుకు సారధిగా ఎంఎస్ ధోనిని ఎంపిక చేశారు. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు చోటు దక్కలేదు.🚨 G.O.A.T #IPL XI alert 🚨@gilly381 & @7polly7 build their best #IPL XI, right here#IPL2025 #ViratKohli #MSDhoni @myvoltas pic.twitter.com/NolGsfGAZ8— Cricbuzz (@cricbuzz) May 6, 2025ఈ జట్టుకు ఓపెనర్లుగా క్రిస్ గేల్, విరాట్ కోహ్లిని ఎంపిక చేశారు. విదేశీ ప్లేయర్ల ఎంపికలో గిల్‌క్రిస్ట్ క్రిస్ గేల్ పేరు ప్రతిపాదించగా.. పొలాక్ ఏబీ డివిలియర్స్‌ను ఎంపిక చేశాడు. ఏబీడి ఆధునిక టీ20 బ్యాటింగ్‌కు ఆధ్యుడని పొలాక్ ప్రశంసించాడు. మిగిలిన రెండు విదేశీ ఆటగాళ్ల బెర్త్‌ల కోసం గిల్‌క్రిస్ట్, పొలాక్ కలిసి లసిత్ మలింగ, సునీల్ నరైన్ పేర్లను ప్రతిపాదించారు. బౌలింగ్ ఎరీనాలో మలింగ 'గోట్' అని పొలాక్ కీర్తించాడు. స్పిన్ బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్ కంటే సునీల్ నరైనే మోస్ట్ వ్యాల్యుయబుల్ ప్లేయర్ అని పొలాక్ అభిప్రాయపడ్డాడు.వన్‌డౌన్‌లో బ్యాటింగ్ కోసం గిల్‌క్రిస్ట్, పొలాక్ కలిసి సురేశ్ రైనాను ఎంపిక చేశారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు ఏబీడిని ఎంచుకున్నారు. ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ కమ్ వికెట్ కీపర్‌గా ఆరో స్థానంలో ఎంఎస్ ధోని, ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, సునీల్ నరైన్‌ను ఎంపిక చేశారు. పేస్ బౌలర్లుగా మలింగ, బుమ్రా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా చహల్‌ను ఎంపిక చేశారు.ఆడమ్ గిల్‌క్రిస్ట్, షాన్ పొలాక్ కలిసి ఎంపిక చేసిన ఐపీఎల్ ఆల్ టైమ్ XI: క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, ఎంఎస్ ధోని (కెప్టెన్ కమ్ వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్. -
IPL 2025: చెత్త ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషబ్ పంత్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఘెరంగా విఫలమవుతున్న ఆటగాళ్లతో ఓ జట్టును రూపొందించింది ఐస్‌ల్యాండ్ క్రికెట్. ఈ జట్టుకు సారధిగా రిషబ్ పంత్‌ను ఎంపిక చేసింది. ఈ జట్టుకు ఐపీఎల్ 2025 మోసగాళ్లు, స్కామర్ల జట్టని నామకరణం చేసింది. ఈ జట్టులో రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, లియామ్ లివింగ్‌స్టోన్, దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, మతీష పతిరణ, మహ్మద్ షమీకి చోటు కల్పించింది. పంత్‌ను కెప్టెన్ కమ్ వికెట్ కీపర్‌గా ఎంపిక చేసింది. ఈ జట్టును నిన్న తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.On a rain day in Reyjavík, we give you our IPL 2025 frauds and scammers team:R TripathiR RavindraI KishanR Pant (c & wk)V IyerG MaxwellL LivingstoneD HoodaR AshwinM PathiranaM ShamiNo impact player: M Kumar— Iceland Cricket (@icelandcricket) May 5, 2025ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఎంపిక చేసిన ఈ టీమ్‌పై సోషల్‌మీడియాలో విపరీతమైన స్పందన వస్తుంది. నిజంగానే వీరు స్కామర్లు, మోసగాళ్లు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కోట్లలో డబ్బు తీసుకుని కనీస వందల విలువ చేసే ప్రదర్శన కూడా చేయలేకపోతున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కొందరేమే ఆటగాళ్లు ఎలా ఆడినా ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఇలాంటి విమర్శలు చేయకూడదని సలహాలు ఇస్తున్నారు. కాగా, ఐస్‌ల్యాండ్ క్రికెట్‌కు ఇలాంటి వివాదాస్పద పోస్ట్‌లు చేయడం కొత్తేమీ కాదు. క్రికెట్‌కు సంబంధించిన అంశాలపై గతంలో చాలా సందర్భాల్లో వ్యంగ్యంగా స్పందించింది.ఇదిలా ఉంటే, మోసగాళ్లు.. స్కామర్లు అంటూ ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఐపీఎల్ ఆటగాళ్లను విమర్శించడం సరి కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారి అభిప్రాయాన్ని పక్కన పెడితే, ఐస్‌ల్యాండ్ క్రికెట్ ప్రకటించిన జట్టులోని ఆటగాళ్లుందరూ తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్నారన్నది కాదనలేని సత్యం. రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు 20 కోట్లకు పైగా మొత్తాన్ని తీసుకున్నా కనీస ప్రదర్శన చేయలేకపోతున్నారు. మిగతా ఆటగాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. మ్యాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్ లాంటి విదేశీ ఆటగాళ్లయితే ఏదో హాలిడేకి వచ్చామన్నట్లు ఐపీఎల్‌ను చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఇషాన్ కిషన్, షమీపై వారి ఫ్రాంచైజీ ఎంతో నమ్మకముంచితే వారు ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. అశ్విన్ అయితే తనకున్న ఘన చరిత్రను చెత్త ప్రదర్శనలతో దిగజార్చుకున్నాడు. రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా లాంటి వారు కోట్లు మింగి గల్లీ క్రికెటర్ల కంటే హీనమైన క్రికెట్‌ను ఆడుతున్నారు.రాహుల్ త్రిపాఠి- 3.4 కోట్లురచిన్ రవీంద్ర- 4 కోట్లుఇషాన్ కిషన్- 11.25దీపక్ హుడా- 1.7 కోట్లురిషబ్ పంత్- 27 కోట్లువెంకటేశ్ అయ్యర్- 23.75గ్లెన్ మ్యాక్స్‌వెల్- 4.2 కోట్లులియామ్ లివింగ్‌స్టోన్- 8.75 కోట్లురవిచంద్రన్ అశ్విన్- 9.75 కోట్లుమతీష పతిరణ- 13 కోట్లుమహ్మద్ షమీ- 10 కోట్లు -
IPL 2025: వీవీఐపీల మధ్య ఘర్షణ.. లైంగిక వేధింపుల కేసు పెట్టిన ఐపీఎస్ అధికారి భార్య
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా మే 3న జరిగిన ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ సందర్భంగా ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో వీవీఐపీ ప్రేక్షకుల బాక్స్‌లో (బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో) రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో ఒక కుటుంబం ఇన్కమ్ ట్యాక్స్ ప్రముఖులకు చెందినది కాగా.. మరో కుటుంబం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కుటుంబానికి చెందినది. ఈ రెండు కుటుంబాల మధ్య సీట్ల విషయంలో మొదలైన గొడవ చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఐపీఎల్ అధికారి భార్య ప్రత్యర్థి వర్గంపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆమెను, ఆమె కుమార్తెను లైంగికంగా వేధించారని కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.ఇదిలా ఉంటే, నువ్వా నేనా అన్నట్లు సాగిన ఆ మ్యాచ్‌లో సీఎస్కేపై ఆర్సీబీ 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. జేకబ్ బేతెల్ (55), విరాట్ కోహ్లి (62), రొమారియో షెపర్ట్ (53 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఆఖర్లో షెపర్ట్ సునామీలా విరుచుకుపడి ఆర్సీబీకి భారీ స్కోర్ అందించాడు. షెపర్డ్ కేవలం 14 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఈ హాఫ్ సెంచరీ ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైంది.ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్నాడు. పతిరణ వేసిన చివరి ఓవర్లోనూ అదే జోరు కొనసాగించిన షెపర్డ్ ఆ ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే.. చివరి బంతి వరుకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగలిగింది. ఆయుశ్ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సీఎస్కేను గెలిపించేందుకు సర్వ శక్తులు ఒడ్డారు. చివరి ఓవర్లో సీఎస్కే గెలుపుకు 15 పరుగులు అవసరం కాగా.. యశ్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. జడేజా, ధోని, దూబే లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నా 12 పరుగులకే పరిమితం చేశాడు.