
భారత మహిళల క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. ఈ రెండు సిరీస్‌లలో భారత కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన వ్యహరించనున్నారు.
అదేవిధంగా ఇంగ్లండ్ టూర్‌కు స్టార్ ప్లేయర్లు శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్ గాయాల కారణంగా దూరమయ్యారు. శ్రేయాంక చేతి వేలి గాయంతో బాధపడుతుండగా.. రేణుకా మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటుంది. దీంతో వీరిద్దరూ శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లోనూ భారత్ జట్టులో భాగం కాలేదు. మరోవైపు వన్డే జట్టు నుంచి కష్వీ గౌతమ్‌ను సెలక్టర్లు తప్పించారు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో గౌతమ్ ఆడే అవకాశం వచ్చినప్పటికి, పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఆమెను సెలక్టర్లు పక్కన పెట్టారు.
షెఫాలీ రీ ఎంట్రీ..
ఇక భారత టీ20 జట్టులోకి స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ రీ ఎంట్రీ ఇచ్చింది. డబ్ల్యూపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున షెఫాలీ అద్బుతంగా రాణించడంతో సెలక్టర్లు తిరిగి పిలుపు నిచ్చారు. ఈ ఏడాది డబ్ల్యూపీఎల్ సీజన్‌లో షెఫాలీ 152.76 స్ట్రైక్ రేటుతో 304 పరుగులు చేసింది.
ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా సైతం టీ20 జట్టులోకి పునరాగమనం చేసింది. అదేవిధంగా వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన శ్రీచరణి వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకుంది. ఇటీవలే శ్రీలంక పర్యటనతో అరంగేట్రం చేసిన శ్రీచరణి.. తన అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇక భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది.
భారత టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా , హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, శుచి రణ్‌ఉపాధ్యాయ, కె అరుణ్‌జో ఉపాధ్యాయ్, కె అరుణ్‌జో ఉపాధ్యాయ్ ఉపాధ్యాయ్ సత్ఘరే
భారత వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా , తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, కె అరుణ్ధా రెడ్డి, షుచి అమాన్‌ప్రీత్‌కౌర్ గౌడ్, సయాలీ సత్ఘరే
చదవండి: IND vs ENG: టీమిండియాతో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్ క్రికెట్ మాస్టర్ ప్లాన్