మన వేలితో మన కన్నే..! | Turkey Provided Pakistan With Army Personnel, More Than 350 Drones | Sakshi
Sakshi News home page

మన వేలితో మన కన్నే..!

May 15 2025 5:09 AM | Updated on May 15 2025 5:09 AM

Turkey Provided Pakistan With Army Personnel, More Than 350 Drones

తుర్కియే నైచ్యానికి పరాకాష్ట 

భారత ముడి పదార్థాలతోనే డ్రోన్లు 

వాటినే పాక్‌కు పంపిన కండకావరం 

సైనికులను కూడా పంపినట్టు వెలుగులోకి

రెండేళ్ల క్రితం భయానక భూకంపం వేళ తుర్కియేకు అందరికంటే ముందు ఆపన్న హస్తం అందించింది భారతే. ‘ఆపరేషన్‌ దోస్త్‌’ పేరిట భారీ సాయం చేసింది. కానీ ఆ దేశం మాత్రం తిన్నింటి వాసాలే లెక్కబెడుతోంది. సాయుధ సంఘర్షణ వేళ దాయాది పాకిస్తాన్‌కు ఎడాపెడా డ్రోన్లు, ఇతర ఆయుధాలను అందజేసి కృతఘ్నుతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. 

విశ్వాస ఘాతుకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. వాటితో పాటు సైనికులను, శిక్షణా సిబ్బందిని కూడా పాక్‌కు తుర్కియే భారీగా పంపినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. డ్రోన్ల వాడకం తదితరాల్లో వాళ్లు పాక్‌ జవాన్లకు పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చినట్టు తేలింది. 

పాక్‌కు తుర్కిష్‌ కంపెనీ ఆసిస్‌గార్డ్‌ సోంగార్‌ పంపిన బైరక్తార్‌ టీబీ2, ఈహా డ్రోన్లు ఆత్మాహుతి తరహావి. లక్ష్యంపై పడి పేలిపోతాయి. ఈ డ్రోన్ల తయారీలో భారత్‌ ఎగుమతి చేసే కీలకమైన మూలకాలు, ముడి సరుకులే ప్రధాన వనరులు కావడం విశేషం! మనకు వ్యతిరేకింగా ఇలా నిస్సిగ్గుగా బరితెగించిన తుర్కియేకు ఆ కీలక ఎగుమతులను తక్షణం నిలిపేయాలని రక్షణ నిపుణులు సూచిస్తున్నారు. 

కంట్రోలర్ల నుంచి రిసీవర్‌ దాకా... 
ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా ఉగ్రశిబిరాలను భారత్‌ కుప్పకూలి్చన కొద్ది గంటలకే పాక్‌ దాదాపు 400 డ్రోన్లతో సరిహద్దు ప్రాంతాలపై దాడికి తెగించడం తెలిసిందే. తుర్కియేకు భారత ఎగుమతుల్లో సింహభాగం అల్యూమినియం, అల్యూమినియం సంబంధ ఉపకరణాలు, ఆటో ఉత్పత్తులు, విమానాల విడిభాగాలు, టెలికం ఉపకరణాలు, ఎలక్ట్రిక్‌ వస్తువులు, పరికరాలు తదితరాలే. వీటిలో చాలావరకు డ్రోన్ల తయారీలో కీలకం. 

డ్రోన్లలోని కంట్రోలర్, ఫ్రేమ్, మోటార్, ప్రొపెల్లర్, కెమెరా, ఫైట్‌ కంట్రోల్, రిసీవర్, వీడియో ట్రాన్స్‌మిటర్, యాంటెన్నా, స్పీడ్‌ కంట్రోలర్, కంట్రోలర్లను కూడా భారత్‌ నుంచే తుర్కియే దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ ఎగుమతులు ఎక్కువచయ్యాయి. ఆ విడిభాగాలతో రూపొందించిన డ్రోన్లను పాక్‌కు అందజేయాలన్నది తుర్కియే అధ్యక్షుడు రెసిప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ నిర్ణయమేనని తెలుస్తోంది. అతనికి అంతులేని భారత విద్వేíÙగా పేరుంది. తమ డ్రోన్లు, ఆయుధాలను భారత్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించకూడదనే ఒట్టు పెట్టుకున్నారు! 

మన విమానాశ్రయాల భద్రతతుర్కియే సంస్థ చేతుల్లో! 
భారత్‌లోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా అంశాల్లో కూడా తుర్కియే పరోక్షపాత్ర ఉందని వెలుగులోకి వచ్చింది. వాటిలో కార్గో హ్యాండ్లింగ్‌ వంటి కీలక కాంట్రాక్టులను తుర్కియేకు చెందిన సెలెబీ ఏవియేషన్‌ కంపెనీ చెందిన అనుబంధ సంస్థ సంపాదించిందని తేలింది. భారత్‌లో 2008 నుంచి ఈ సంస్థ సేవలందిస్తోంది. ఏటా 58,000 విమానాలు, 5.4 లక్షల టన్నుల సరకు రవాణా బాధ్యతలను చూసుకుంటోంది. అందులో 7,800 మంది సిబ్బంది ఉన్నారు. 

హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, గోవా, కొచ్చిన్, కన్నూర్‌ వంటి కీలక విమానాశ్రయాల్లో హై సెక్యూరిటీ బాధ్యతలు సెలెబీవే! గ్రౌండ్‌ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్‌మెంట్, ఎయిర్‌సైడ్‌ ఆపరేషన్స్‌ విధులను ఈ సంస్థే చూస్తోంది. విమానాలను నిలిపి ఉంచే హై సెక్యూరిటీ జోన్, ఎయిర్‌సైడ్‌ జోన్లన్లా సంస్థ సిబ్బందే విధుల్లో ఉంటున్నారు. ప్రయాణికుల బ్యాగులు, కార్గో పనులను చూసుకునేదీ వాళ్లే. అంతర్జాతీయ సర్వీసుల్లో కూడా ఈ బాధ్యతలను వీళ్లకే అప్పగించారు. తాజా పరిణామాల నేపథ్యంలో దీనిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆరు దేశాల్లోని 70 విమానాశ్రయాల్లో కూడా సెలెబీ కాంట్రాక్టులు సంపాదించింది.

ముమ్మరంగా ‘బ్యాన్‌ తుర్కియే’ 
పాక్‌కు సైనికసాయం చేస్తున్నందుకు నిరసనగా తుర్కియే ఉత్పత్తులను బహిష్కరించాలన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. ఇకపై తుర్కియే యాపిల్‌ పండ్లను దిగుమతి చేసుకోవద్దని మహారాష్ట్రలోని కీలకమైన పుణె పండ్ల మార్కెట్‌ ట్రేడర్లు నిర్ణయించుకున్నారు. ‘‘మన సైన్యానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నాం. తుర్కియేకు బదులు ఇక హిమాచల్, ఉత్తరాఖండ్‌ ఇరాన్‌ నుంచి ఆపిల్స్‌ తెప్పిస్తాం’’ అని పుణె వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌ కమిటీ ట్రేడర్‌ సుయోగ్‌ జిందే చెప్పారు. పుణెలో తుర్కియే యాపిల్స్‌ టర్నోవర్‌ రూ.1,200 కోట్ల పై చిలుకే. దాంతో ఈ నిర్ణయం ఆ దేశానికి పెద్ద దెబ్బే కానుంది. తుర్కియే నుంచి తెల్ల చలువరాయి దిగుమతులనూ నిషేధించాలన్ల డిమాండ్లు విని్పస్తున్నాయి.

యాత్రలూ బంద్‌! 
తుర్కియేకు మనోళ్ల విహార యాత్రలు కూడా భారీగా తగ్గాయి. ఆ దేశానికి క్యాన్సలేషన్‌లు భారీగా పెరుగుతున్నాయని ఈజ్‌మైట్రిప్, ఇగ్జిగో వంటి ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ప్లాట్‌ఫాంలు తెలిపాయి. తుర్కియే ప్రభుత్వ వార్తా చానల్‌ ‘టీఆర్‌టీ’ తాలూకు ‘ఎక్స్‌’ ఖాతాను కేంద్రం బ్లాక్‌ చేసింది. టర్కీతో మన వాణిజ్యం కూడా తగ్గుముఖం పడుతోంది. 2024–25 మధ్య తుర్కియేకు మన ఎగుమతులు 5.2 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కు బాహాటంగా మద్దతు ప్రకటించిన అజర్‌బైజాన్‌కు కూడా ఇదే సెగ తగులుతోంది. దాని రాజధాని బకు ఇటీవలి దాకా భారత పర్యాటకులకు ఫేవరెట్‌ డెస్టినేషన్లలో ఒకటిగా ఉండేది. ఏటా లక్షలాది మంది అక్కడికి వెళ్లేవారు. బకుకు బుకింగులు కూడా ఇప్పుడు భారీగా తగ్గిపోతున్నాయి. 

జేఎన్‌యూ కటీఫ్‌ 
తుర్కియే విద్యాసంస్థలతోనూ తెగదెంపులు చేసుకోవాలనే డిమాండ్‌ల నేపథ్యంలో ఆ దేశంలోని ఇనోను వర్సిటీతో అవగాహన ఒప్పందాన్ని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) రద్దు చేసుకుంది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. గత ఫిబ్రవరిలో కుదిరిన ఈ మూడేళ్ల ఒప్పందం ప్రకారం రెండు వర్సిటీల విద్యార్థులు, అధ్యాపకుల మారి్ప డికి అవకాశముండేది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement