Turkey
-
తుర్కియేలో తీవ్ర ఉద్రిక్తత
ఇస్తాంబుల్: అవినీతి ఆరోపణలతో ప్రతిపక్ష నాయకుడు ఎక్రెమ్ ఇమామోగ్లు అరెస్టుతో తుర్కియేలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆయనకు మద్దతుగా వేలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. ఇమామోగ్లును అదుపులోకి తీసుకున్న నాటి నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి ఇస్తాంబుల్ సిటీ హాల్ వద్ద గుమిగూడిన జనం తుర్కియే జెండాలు ఎగరవేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రభుత్వం నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువును, రబ్బరు పెల్లెట్లను, పెప్పర్స్పేని ప్రయోగించింది. మొత్తంగా తుర్కియేలోని 81 ప్రావిన్సుల్లో కనీసం 55 ప్రావిన్సుల్లో, దేశంలో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు జరిగాయి. ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1,133 మందికి పైగా అరెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆందోళనల్లో 123 మంది పోలీసులు గాయపడ్డారని వెల్లడించారు. జర్నలిస్టుల అరెస్టు.. మరోవైపు సోమవారం పలువురు జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది మంది రిపోర్టర్లు, ఫోటో జర్నలిస్టులను ప్రభుత్వం నిర్బంధించిందని జర్నలిస్టు యూనియన్ తెలిపింది. ఇది పత్రికా స్వేచ్ఛ, సత్యాన్ని తెలుసుకునే ప్రజల హక్కుపై దాడి చేయడమేనని, జర్నలిస్టులను మౌనంగా ఉంచి నిజాన్ని దాచలేరని పేర్కొంది. వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాజకీయ ప్రతీకారంతోనే అరెస్టు : ఇమామోగ్లు అవినీతి ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా రాజకీయనాకులు, జర్నలిస్టులు వ్యాపారవేత్తలను మొత్తంగా 100 మందిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ (సీహెచ్‌పీ) నేత ఇమామోగ్లు కూడా ఉన్నారు. ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఉగ్రవాద సంస్థతో సంబంధాలు, లంచాలు తీసుకోవడం, దోపిడీ, చట్టవిరుద్ధంగా వ్యక్తిగత డేటాను నమోదు చేయడం, టెండర్ రిగ్గింగ్ వంటి అభియోగాలపై అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సిలివ్రీలోని జైలుకు రిమాండ్‌కు తరలించారు. మరోవైపు ఇమామోగ్లును మేయర్ పదవి నుంచి సస్పెండ్ చేసినట్లు తుర్కియే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అవాంతరాలు.. ఇమామోగ్లును అరెస్టు చేసినా.. 2028 అధ్యక్ష అభ్యర్థి ఎంపిక కోసం ఆదివారం ఓటింగ్ జరిగింది. అధ్యక్ష అభ్యరి్థగా ఇమామోగ్లు ఒక్కరే పోటీ చేశారు. అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో దాదాపు కోటిన్నర మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని సీహెచ్‌పీ తెలిపింది. సుమారు పది లక్షలకు పైగా ఓట్లు తమ సభ్యుల నుంచి రాగా, మిగిలినవి ఇమామోగ్లుకు సంఘీభావంగా తమ సభ్యులు కానివారు వేసినవని సీహెచ్‌పీ వెల్లడించింది. ఈ అరెస్టు ఇమామోగ్లు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకోలేదు. అభియోగాలు రుజువైతే మాత్రం అతను ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఇదిలావుండగా, అవకతవకల కారణంగా ఇమామోగ్లు డిగ్రీని రద్దు చేస్తున్నట్లు ఇస్తాంబుల్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. అధ్యక్ష పదవిని నిర్వహించడానికి ఉన్నత విద్యను పూర్తి చేసి ఉండాలని తుర్కియే రాజ్యాంగం చెబుతోంది. ఇదే జరిగితే.. అధ్యక్ష పదవికి పోటీ చేయడం కూడా ప్రశ్నార్థకం అవుతుంది. అయితే ఇమామోగ్లు డిగ్రీ రద్దు నిర్ణయాన్ని రాజ్యాంగ న్యాయస్థానం, యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లో అప్పీల్ చేస్తామని ఇమామోగ్లు న్యాయవాదులు తెలిపారు. -
అమెరికా గుడ్ల వేట
వాషింగ్టన్: గుడ్ల కొరతతో గుడ్లు తేలేస్తున్న అమెరికా సమస్య నుంచి గట్టెక్కేందుకు వాటిని భారీగా దిగుమతి చేసుకునే పనిలో పడింది. ఇందుకోసం తుర్కియే, దక్షిణ కొరియాలను సంప్రదిస్తోంది. తక్షణం కోట్లాది గుడ్లను పంపేలా వాటితో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నట్టు వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ శుక్రవారం వెల్లడించారు. పలు ఇతర దేశాలతోనూ మాట్లాడుతున్నట్టు చెప్పుకొచ్చారు. అమెరికా తమను కూడా సంప్రదించినట్టు పోలండ్, లిథువేనియా వంటి దేశాలు ధ్రువీకరించాయి. బర్డ్‌ఫ్లూ తదితరాలతో కోళ్ల సంఖ్య బాగా తగ్గడం అమెరికాలో గుడ్ల కొరతకు దారి తీసింది. దాంతో వాటి ధరలు కొద్ది నెలలుగా చుక్కలనంటడం తెలిసిందే.డజను గుడ్లకు 5 డాలర్లు, అంతకుమించి వెచ్చించాల్సి వస్తోంది. షికాగో వంటి ప్రధాన నగరాల్లో 9 నుంచి 10 డాలర్ల దాకా ధరలు ఎగబాకాయి. అంతంత పెట్టి కొనలేక చాలామంది ఏకంగా కోళ్లనే పెంచుకుంటున్నారు. దాంతో గుడ్ల ధరలను నేలకు దించే మార్గాలపై ట్రంప్ సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఇందుకోసం 100 కోట్ల డాలర్లతో నిధి ఏర్పాటు వంటి పలు చర్యలు తీసుకున్నా పెద్దగా పలితం కన్పించడం లేదు.రెండు నెలల్లో దేశీయంగా కోళ్ల సంఖ్య పెరిగి సమస్య చక్కబడుతుందని రోలిన్స్ ఆశాభావం వెలిబుచ్చారు. బర్డ్‌ఫ్లూ దెబ్బకు గత రెండున్నరేళ్లలో అమెరికాలో కనీసం 20 కోట్ల కోళ్లను వధించారు. దాంతో చుక్కలనంటిన గుడ్ల ధరలు ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో కూడా ట్రంప్‌కు అస్త్రంగా కూడా మారాయి. తాను పగ్గాలు చేపట్టగానే వాటికి ముకుతాడు వేస్తానని ప్రకటించారు. -
Turkey: రిసార్ట్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 66 మంది మృతి
ఇస్తాంబుల్: టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. టర్కీలోని స్కీ రిసార్ట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 66 మంది దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని టర్కీ ఇంటరీయర్ మినిస్టర్ అలీ యెర్లికాయ ధృవీకరించారు.స్కీ ిరిసార్ట్లో ఘోర అగ్ని ప్రమావం చోటు చేసుకుని 66 మంది మృతి చెందగా, 55 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. ఇది అత్యంత విషాదకర ఘటన’ అని పేర్కొన్నారు.క్యాపిటల్ అంకారాకు 100 మైళ్ల దూరంలో ఉన్న కార్తాల్కాయా స్కీ రిసార్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున 3.27 ని.లకు ఈ విషాదకర ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
సిరియాపై ట్రంప్ వ్యాఖ్యలు.. టర్కీ కౌంటర్
అంకారా: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు టర్కీ కౌంటరిచ్చింది. టర్కీకి చెందిన కొందరు కీలక వ్యక్తులే తిరుగుబాటుదారుల వెనుక ఉండి.. సిరియా బషర్ అల్ అసద్‌ను దేశం వెళ్లిపోయేలా చేశారు. సిరియాను ఆక్రమించుకోవడంలో టర్కీ హస్తం ఉందని ట్రంప్ ఆరోపించారు. ఈ ట్రంప్ వ్యాఖ్యలను టర్కీ తిరస్కరించింది.ఈ నేపథ్యంలో టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ ట్రాడ్కాస్టర్.. ట్రంప్ వాదనలను కొట్టేశారు. ఈ సందర్భంగా ఫిదాన్ మాట్లాడుతూ.. సిరియాలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. రాచరిక వ్యవస్థకు ప్రజలే స్వస్థి చెప్పారు. దీన్ని మేము స్వాధీనం చేసుకోవడం అని అనలేము. ఎందుకంటే సిరియా ప్రజల సంకల్పం మేరకే ఇలా జరిగిందని మేము భావిస్తాం. ట్రంప్ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. సిరియాలో జరిగిన పరిణామాలకు టర్కీకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికైనా పాలన విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధిపత్యం కాదు.. ప్రతీ ఒక్కరికి ప్రజల సహకారం అవసరం అని కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. 2011లో చెలరేగిన అసద్ వ్యతిరేక తిరుగుబాటు ప్రారంభ రోజుల నుండి టర్కీ అతని పాలనపై వ్యతిరేకంగా ఉంది. ఈ క్రమంలో సిరియాలో మద్దతుదారులకు కీలకంగా ఉంది. రాజకీయ అసమ్మతివాదులతో పాటు మిలియన్ల మంది శరణార్థులకు టర్కీ ఆతిథ్యం ఇచ్చింది. ఇదే సమయంలో సైన్యంతో పోరాడుతున్న తిరుగుబాటు గ్రూపులకు కూడా మద్దతు ఇచ్చింది. -
‘సిరియా విషయంలో రష్యా, ఇరాన్ జోక్యం వద్దు’
డెమాస్కస్: సిరియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. తిరుగుబాటుదారుల దాడులతో దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోవడంతో ఆపద్ధర్మ ప్రధానిగా మొహమ్మద్ అల్ బషీర్ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో అసద్‌కు రష్యా, ఇరాన్ మద్దతుపై తుర్కీయో కీలక వ్యాఖ్యలు చేసింది.తాజాగా తుర్కీయే విదేశాంగ శాఖ మంత్రి హకస్ ఫిదాన్ మాట్లాడుతూ..‘సిరియా, డమాస్కస్ తిరుగుబాటుదారుల వశమైంది. ఈ క్రమంలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దళాలకు రష్యా, ఇరాన్‌లు మద్దతు ఇవ్వకూడదు. అసద్‌కు మద్దతు తెలిపే విధంగా వ్యవహరించకూడదు. ఇప్పటికే వారితో మేము చర్చించాం. ఈ విషయాన్ని వారు అర్థం చేసుకున్నారు. 2011లో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మాస్కో, టెహ్రాన్లు అసద్‌కు మద్దతుగా నిలిచాయి. ఆ దేశాలు సహాయం చేసినప్పటికీ తిరుగుబాటుదారులే గెలిచేవారు. అయితే, ఫలితం మరింత హింసాత్మకంగా ఉండేది’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే తిరుగుబాటుదారుల కారణంగా సిరియా కల్లోల పరిస్థితుల నెలకొన్నాయి. అధ్యక్షుడు అసద్ పాలనను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో దేశ రాజధాని డమాస్కస్‌తో సహా పలు నగరాలను ఆక్రమించుకున్నారు. దీంతో అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు పారిపోయారు. అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించింది. ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉన్నారు.మరోవైపు.. సిరియా తాత్కాలిక ప్రధానిగా ఎంపికైన మొహమ్మద్ అల్ బషీర్ 2025 మార్చి ఒకటో తేదీదాకా పదవిలో కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అల్ బషీర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సిరియాలో శాంతిభద్రతలు నెలకొనడానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. తిరుగుబాటు అనంతరం శాఖలు, సంస్థల బదిలీలపై చర్చించారు. రాబోయే రెండు నెలలు సిరియా ప్రజలకు సేవలందించడానికి, సంస్థలను పునఃప్రారంభించడానికి సమావేశాలు నిర్వహించామని బషీర్ వెల్లడించారు. -
మంటల్లో విమానం.. 89 మందిని సినీ ఫక్కీలో రక్షించిన సిబ్బంది
టర్కీలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. రష్యా నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ ప్లేన్కు మంటలు అంటుకున్నాయి. అయితే.. ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తతో ప్రయాణికులు, విమాన సిబ్బంది మొత్తం అందరూ సురక్షితంగా బయటపడ్డారు.అజిముత్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సుఖోయ్ సూపర్ జెట్ విమానం(రష్యా).. నల్ల సముద్రం తీరాన ఉన్న సోచి రిసార్ట్ నుంచి ప్రయాణికులను తీసుకుని టర్కీ అంటల్యా ఎయిర్‌పోర్టుకు చేరింది. అయితే ల్యాండ్ అయ్యే సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగి.. క్రమంగా విమానానికి వ్యాపించాయి.విమానంలో 89 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వెంటనే పైలట్ విమానాన్ని రన్‌వేపై ర్యాష్ ల్యాడింగ్ చేశాడు. అయితే సకాలంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది స్పందించారు. సినీ ఫక్కీలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. విమానం నుంచి అందరినీ బయటకు రప్పించారు. మంటలను ఆర్పేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సదరు విమానం ఏడేళ్ల కిందటే సర్వీస్‌లోకి వచ్చిందని, అలాగే ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు విమానయాన సంస్థ ప్రకటించింది. This was the terrifying moment a plane the #Russian-made #Sukhoi Superjet 100 passenger plane from #AzimuthAirlines went up in flames following a nightmare landing at a #Turkish #Antalya airport. pic.twitter.com/QY3EmzdQBY— Hans Solo (@thandojo) November 25, 2024 -
పంజాబ్‌లో 105 కిలోల హెరాయిన్ పట్టివేత
చండీగఢ్: సరిహద్దుల్లో డ్రగ్స్ రాకెట్‌ను పంజాబ్ పోలీసులు ఛేదించారు. 105 కిలోల హెరాయిన్‌ను సీజ్ చేయడంతోపాటు తుర్కియే కేంద్రంగా పనిచేసే డ్రగ్స్ స్మగ్లర్ నవ్ భులార్ ముఠాలోని నవ్‌జ్యోత్ సింగ్, లవ్‌ప్రీత్ కుమార్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హెరాయిన్‌తోపాటు సుమారు 32 కిలోల కెఫీన్ ఎన్‌హైడ్రస్, 17 కిలోల డెక్స్ట్రోమెథార్ఫాన్ (డీఎంఆర్) అనే నిషేధిత డ్రగ్స్‌ను కూడా పట్టుకున్నారు. ఈ మాదక ద్రవ్యాల విలువ రూ.100 కోట్ల పైమాటేనని చెబుతున్నారు. హెరాయిన్‌తోపాటు వీటిని కూడా వాడితే ఆ ప్రభావం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని డీజీపీ గౌరవ్ యాదవ్ ఆదివారం చెప్పారు. విదేశీ తయారీ పిస్టళ్లు ఐదు, ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పాకిస్తాన్ నుంచి ఈ మాదక ద్రవ్యాలను దొంగచాటుగా జల మార్గంలో తరలించేందుకు స్మగ్లర్లు భారీ రబ్బర్ ట్యూబ్‌లను వినియోగించారని వివరించారు. -
తుర్కియే వైమానిక సంస్థపై ఉగ్ర దాడి
అంకారా: తుర్కియే రాజధాని అంకారా నగర శివారులోని ఒక వైమానిక, రక్షణ రంగ సంస్థపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని తుర్కియే అంతర్గత మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. 14 మంది గాయపడ్డారు. అయితే ఎవరు దాడి చేశారు, ఎందుకు చేశారు? అనే వివరాలను బయటపెట్టలేదు. టుటాస్ అనే సంస్థ ప్రాంగణంలో దాడి జరిగినట్లు మంత్రి అలీ యెర్లికాయా చెప్పారు. తుర్కియేలో గతంలో కుర్ద్ మిలిటెంట్లు, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, వామపక్ష ఉగ్రవాదులు దాడులు జరిపారు. సంస్థలో భద్రతా సిబ్బంది షిఫ్ట్ మారే సమయంలో కొందరు ఆగంతకులు హఠాత్తుగా వచ్చి బాంబులు వేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ప్రైవేట్ ఎన్టీవీ చానెల్ తన కథనంలో పేర్కొంది. అయితే ఆగంతకులు పారిపోలేదని లోపలి సిబ్బందిని బందీలుగా చేసుకుని అక్కడే ఉన్నారని, ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. తొలుత కేవలం బాంబు పేలుడు జరిగినట్లు వార్తలొచ్చాయి. సంస్థలోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని హబర్‌టర్క్ టెలివిజన్ పేర్కొంది. -
టర్కీలో ఉగ్రదాడి.. భారీగా మృతులు..!
అంకారా: టర్కీ రాజధాని అంకారా శివార్లలోని ఓ ఏరోస్పేస్ సంస్థపై ఉగ్రవాదులు బుధవారం(అక్టోబర్ 23) దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మృతి చెందడంతో పాటు కొందరు గాయపడ్డట్టు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక ట్వీట్ చేశారు. Türk Havacılık ve Uzay Sanayii AŞ. (TUSAŞ) Ankara Kahramankazan tesislerine yönelik terör saldırısı gerçekleştirilmiştir.Saldırı sonrası maalesef şehit ve yaralılarımız bulunmaktadır.Şehitlerimize Allah’tan rahmet; yaralılarımıza acil şifalar diliyorum.Gelişmelerden kamuoyu…— Ali Yerlikaya (@AliYerlikaya) October 23, 2024 రాజధాని అంకారా శివారులో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు తొలుత బాంబులతో దాడి చేసి తర్వాత కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఏరోస్పేస్ సంస్థ సెక్యూరిటీ సిబ్బంది షిఫ్ట్ మారే సమయంలో దుండగులు ట్యాక్సీలో ప్రవేశించి తొలుత బాంబు వేసి తర్వాత తుపాకులతో కాల్చారు. దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: అగ్ర నేతలపై ఇజ్రాయెల్ టార్గెట్.. హమాస్ కీలక నిర్ణయం -
మనిషిగా, మంచిగా బతకలేను..అందుకే వెళ్లిపోతున్నా: టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్
"వెడ్డింగ్ విత్ ఎ గ్రూమ్" అంటూ తనను తాను పెళ్లి చేసుకున్న టిక్‌టాక్ స్టార్ కుబ్రా అయ్కుట్ (Kubra Aykut) అనూహ్యంగా ప్రాణాలు విడిచింది. టర్కీలోని తన అపార్ట్మెంట్ భవనంలోని ఐదో అంతస్తు దూకి ఆత్మహత్యకు పాల్పడటం సోషల్‌మీడియ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 26 ఏళ్ల ‘సోలోగామి’ ఫేమ్ ఇన్ఫ్లుయెన్సర్ అయుకుట్ 2023లో విలాసవంతమైన వివాహ వేడుక, వీడియో ఫోటోలతో ఇంటర్నెట్లోఅనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. ఇపుడు తన ఆకస్మిక మరణంతో కూడా అనేక ప్రశ్నల్ని మిగిల్చి వెళ్లిపోయింది .స్థానిక మీడియా నివేదికల ప్రకారం సెప్టెంబర్ 23న ఆమె చనిపోయింది. టిక్‌టాక్ వీడియోలో, ఆమె ఆత్మహత్యకు కొద్దిసేపటి ముందు, కుబ్రా తన ఇంటిని శుభ్రం చేస్తూ కనిపించడంతో ఈ ఘటన ప్రమాదమా లేక ఆత్మహత్యా అనే చర్చకు దారి తీసింది. అయితే సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.టిక్‌టాక్‌లో 10 లక్షలకుపైగా ఫాలోవర్లు,ఇన్స్టాగ్రామ్లోరెండు లక్షలకుపైగా ఫాలోవర్లున్నారు. సూసైడ్ నోట్"నేను నా ఇష్టపూర్వంకంగానే దూకాను. ఎందుకంటే నాకు ఇక జీవించాలని లేదు. ఫిస్టిక్ని బాగా చూసుకోండి. నేను నా జీవితంలో అందరికీ మంచిదాన్నే, ఇక మంచిగా ఉండలేను. మంచిగా బతకడం వల్లన నాకేమీ ఒరగలేదు. స్వార్థం ఉంటేనే, సంతోషంగా ఉంటారు చాలా రోజులుగా కష్టపడుతున్నా ఎవరూ గమనించలేదు.. నన్ను నేను ప్రేమించానుకుంటూ వెళ్లిపోతున్నాను. ఒక్క సారి నన్ను క్షమించండి’’ (హరివరాసనం : చిన్నారి విష్ణుప్రియ నృత్యాభినయం, వీడియో వైరల్) అనూహ్యంగా బరువు తగ్గడంపై ఆమె బాగా ఆందోళనలో పడిన్నట్టు తెలుస్తోంది. మరణానికి కొన్ని గంటల ముందు, సోషల్ మీడియా ఇలా పోస్ట్ చేసింది "నేను నా శక్తిని సేకరించాను, కానీ నేను బరువు పెరగడం లేదు. ఈ రోజు నేను 44 కిలోగ్రాములకు పడిపోయాను, నేను ప్రతిరోజూ ఒక కిలోగ్రాము తగ్గుతాను. నేను ఏమి చేయాలో నాకు తెలియదు; నేను అత్యవసరంగా బరువు పెరగాలి”. గత కొన్నిరోజులుగా వస్తున్న ఇలాంటి పోస్ట్‌లపై అనుచరులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వారి భయాలను నిజం చేస్తూ ఆమె తీసుకున్న కఠిన నిర్ణయం ఫ్యాన్స్‌ను విషాదంలో ముంచేసింది.ఇదీ చదవండి: చదరంగం ఎత్తులే కాదు, డ్యాన్స్ స్టెప్పుల్లోనూ మనోడు తోపు, వైరల్ వీడియో -
Turkey: ఇన్‌స్టాగ్రామ్‌ను బ్లాక్ చేసిన టర్కీ
ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో నిలిచే టర్కీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ను బ్లాక్ చేసి హెడ్‌లైన్స్‌లో చోటుదక్కించుకుంది. అమెరికన్ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌పై సెన్సార్షిప్ ఆరోపణలు చేస్తూ, ఈ నిర్ణయం తీసుకున్నట్లు టర్కీ నేషనల్ కమ్యూనికేషన్స్ అథారిటీ పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌ను ఆగస్టు 2 నుంచి బ్లాక్ చేస్తున్నట్లు బీటీకే కమ్యూనికేషన్స్ అథారిటీ తన వెబ్సైట్లో ఒక పోస్ట్‌లో వెల్లడించింది.టర్కీలోని వినియోగదారులు తమ ఇన్స్టాగ్రామ్ ఫీడ్‌ను రిఫ్రెష్ చేయలేకపోయామంటూ ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఫిర్యాదు చేశారు. కాగా టర్కీ ప్రెసిడెన్షియల్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఫహ్రెటిన్ ఆల్టున్.. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌పై పలు ఆరోపణలు చేశారు. ‘హమాస్ అమరవీరుడు హనియాకు సంతాప సందేశాలను పోస్టు చేయకుండా యూజర్స్‌కు ఇన్‌స్టా ఇబ్బందులు కలిగించిందని’ పేర్కొన్నారు. కాగా టర్కీ అధికారులు సోషల్ మీడియా సైట్స్‌కు యాక్సెస్‌ను బ్లాక్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. దీనికిముందు 2017 ఏప్రిల్, 2020 జనవరి మధ్య దేశ అధ్యక్షుడు- ఉగ్రవాదం మధ్య సంబంధాలపై రాసిన రెండు కథనాల కారణంగా వికీపీడియాను టర్కీ బ్లాక్ చేసింది.హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా టెహ్రాన్‌లో హత్యకు గురయ్యాడు. ఈ హత్య ఎవరు చేశారనే దానిపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అధికారికంగా వెల్లడికాలేదు. ఇతని మరణానికి 94 రోజుల ముందు, అతని ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లు పాలస్తీనాలో హతమయ్యారు. "Turkey’s communications authority blocked access to the social media platform Instagram,” apparently because Instagram had removed "posts by Turkish users that expressed condolences over [Israel's] killing of Hamas political leader Ismail Haniyeh." https://t.co/Mc4pERy9j5— Kenneth Roth (@KenRoth) August 2, 2024 -
కంటిచూపుతో...
టీ షర్ట్‌తో క్యాజువల్ లుక్... ఎడమ చేయి ప్యాంట్ జేబులో... లక్ష్యాన్ని స్పష్టంగా చూసేందుకు ఎలాంటి ప్రత్యేకమైన లెన్స్‌లు లేవు, ఐ కవర్ లేదు, పక్కనుంచి వచ్చే కాంతి నుంచి తప్పించుకునేందుకు వైజర్ పెట్టుకోలేదు, ఇయర్ ప్రొటెక్షన్ లేదు. లక్ష్యంపై గురి...ట్రిగ్గర్‌పై వేలు... నొక్కితే దేశానికి రజత పతకం వచ్చేసింది! టర్కీ షూటర్ యూసుఫ్ డికెక్ ఒక్కసారిగా పారిస్ ఒలింపిక్స్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు. సాధారణంగా షూటర్లు పోటీలో దిగినప్పుడు తమతో పాటు ధరించే సరంజామా ఏదీ అతను వాడలేదు. ఏదో అలా వ్యాహ్యాళికి వెళుతూ బొమ్మ తుపాకీతో సంతలో బెలూన్లను కొట్టినంత అలవోకగా అతను బుల్లెట్లను దించేయడం విశేషం. టర్కీ ఆర్మీలో సైనికుడైన 51 ఏళ్ల యూసుఫ్ హాలీవుడ్ సినిమాల స్టయిల్‌ను గుర్తుకు తెచ్చేలా షూటింగ్ చేశాడంటూ కామెంట్లు రావడం విశేషం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో తర్హాన్‌తో కలిసి యూసుఫ్ రజతం సాధించాడు. షూటింగ్లో టర్కీకి ఇదే తొలి మెడల్. -
ప్యారిస్ ఒలింపిక్స్ : ఈ షూటర్ స్టయిల్‌కి నెటిజన్లు ఫిదా ఫోటో వైరల్
ఒలింపిక్స్ క్రీడలు అంటే హోరా హోరీ పోటీలు, విజేతలు, రికార్డులు, పతకాలు. అంతేకాదు అరుదైన ఘట్టాలు, విశేషాలు ఇంకా చాలానే ఉంటాయి. తాజా ప్యారిస్ ఒలింపిక్స్‌లో టర్కీ ఒలింపిక్ షూటర్ ఇంటర్నెట్ సంచలనంగా మారాడు. నాన్ ఈస్తటిక్ థింక్స్ అనే ఎక్స్ ఖాతా షేర్ చేసిన పోస్ట్ ఏకంగా 78 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఎలాంటి ఫ్యాన్సీ పరికరాలు లేకుండా, అతని స్పెషల్ లుక్స్ నెట్టింట చర్చకు దారి తీశాయి. పలు ఫన్నీ కామెంట్స్ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కూడా స్పందించారు. విషయం ఏమిటంటే..టర్కీ ఎయిర్ పిస్టల్ షూటర్ యూసుఫ్ డికేక్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. 51 ఏళ్ల అథ్లెట్ తన జేబులో చేయి పెట్టుకుని స్టయిల్‌గా, క్యాజువ్ ఇయర్ బడ్స్‌తో ,మినిమల్ గేర్‌తో గురి చూస్తున్న ఫోటో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. సాధారణంగా షూటర్లు రెండు ప్రత్యేకమైన లెన్స్‌లను ఉపయోగిస్తారు, ఒకటి బ్లర్‌ను నివారించడానికి, మరోటి మెరుగైన ఖచ్చితత్వం కోసం, అలాగే బయటి శబ్దాలు డిస్ట్రబ్ చేయకుండా ఉండేందుకు స్పెషల్ హెడ్‌ఫోన్స్ ధరిస్తారు.కళ్లద్దాలు, బ్లర్‌ను నివారించడానికి లెన్స్‌లు, ఇయర్ ప్రొటెక్టర్లతో సహా ప్రత్యేకమైన ఇతర జాగ్రత్తలేవీ లేకుండా, పోటీదారులకు పూర్తి విరుద్ధంగా, యూసుఫ్ డికేక్ గురి పెట్టి విజేతగా నిలిచాడు. దీంతో నెటిజన్లు ప్రొఫెషనల్ హిట్‌మ్యాన్ అంటూ కమెంట్ చేశారు. ఇంకా మీమ్స్ , జోకులు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. టర్కీ రహస్య గూఢచారిని లేదా హిట్‌మ్యాన్‌ని ఒలింపిక్స్‌కు పంపిందంటూ కొంతమంది ఫన్నీగా వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా తక్కువ ప్రొఫైల్‌ను కొనసాగించడానికి స్వర్ణం గెలవకుండా తప్పించుకున్నాడని మరికొంతమంది అభిప్రాయపడ్డారు.టర్కీకి చెందిన యూసుఫ్ డికేక్ , సెవ్వల్ ఇలయిడా తర్హాన్ ఫ్రాన్స్‌లోని డియోల్స్లోని చటౌరోక్స్ షూటింగ్ సెంటర్లో జరిగిన ఇదే ఈవెంట్లో చారిత్రాత్మక పతకాన్ని గెలుచుకోవడం ద్వారా చరిత్రను లిఖించారు. షూటింగ్లో టర్కీకి ఇదే తొలి ఒలింపిక్ పతకం.बिना स्पेशल ग्लासेज और इंस्ट्रूमेंट के सिल्वर मेडल जीतने वाला 51 वर्षीय यह व्यक्ति 🙏वाकई अद्भुत है 🫡लाजवाब, शानदार और जबरदस्त पूरी दुनिया में यह चर्चा का विषय बना हुआ 'Turkey Man' इनका स्वैग लाखो युवाओं को प्रेरित करेगा। बरसों की त्याग तपस्या और अभ्यास का परिणाम 👇#Olympics pic.twitter.com/GSovPHEFu6— Sonu kumar (@Aryans8825) August 1, 2024 -
50 శాతం వడ్డీ ఉన్న దేశం (ఫొటోలు)
-
ఇజ్రాయెల్‌కు హెచ్చరిక.. టర్కీ సంచలన నిర్ణయం!
అంకారా: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్.. గాజాపై r/ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే గాజా ప్రజలకు సాయం చేసేందుకు తాము ఇజ్రాయెల్‌లోకి ప్రవేశిస్తామని ఎర్డోగాన్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ దాడులను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు.కాగా, తయ్యిప్ ఎర్డోగాన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎర్డోగాన్.. గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలస్తీనా ప్రజలకు అండగా టర్కీ అండగా నిలుస్తుందన్నారు. అలాగే, టర్కీ గతంలో లిబియా నాగోర్నో-కరాబాఖ్‌లలో ప్రవేశించినట్టుగా ఇజ్రాయెల్‌లోకి కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌లోకి వెళ్తే కనుక వారి సైన్యంపై తీవ్రమైన దాడులు జరుగుతాయి అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఎర్డోగాన్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం. కాగా 2020లో ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన లిబియా జాతీయ ఒప్పందానికి మద్దతుగా టర్కీ సైనిక సిబ్బందిని లిబియాకు పంపింది.ఇదిలా ఉండగా.. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ బాంబుల మోత మోగిస్తూనే ఉంది. తాజాగా గాజాలోని ఓ స్కూల్ భవనంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరో 100 మంది గాయపడ్డారు. సెంట్రల్ గాజాలోని డీర్-అల్-బలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల, యువత మృతదేహాలకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. వీరి మృతదేహాలను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో జనాలు వీధుల్లోకి వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. -
EURO CUP 2024: ఉత్కంఠ పోరులో ఆస్ట్రియాపై విజయం.. క్వార్టర్ ఫైనల్లో తుర్కియే
యూరో కప్ 2024 క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లన్నీ ఖరారయ్యాయి. స్పెయిన్, జర్మనీ, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, తుర్కియే జట్లు ఫైనల్ 8కి అర్హత సాధించాయి. ఇవాళ (జులై 3) జరిగిన చివరి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ఆస్ట్రియాపై తుర్కియే 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. Mert Günok's incredible 95th-minute save 🤯😱#EUROLastMinute | @Hublot pic.twitter.com/N2AImAbc7A— UEFA EURO 2024 (@EURO2024) July 2, 2024తుర్కియే తరఫున మెరి దెమిరల్ రెండు గోల్స్ చేయగా.. ఆస్ట్రియా తరఫున మైఖేల్ గ్రెగోరిచ్ గోల్ చేశాడు. చివరి నిమిషంలో తుర్కియే గోల్‌కీపర్ మెర్ట్ గునాక్ అద్భుతమైన స్టాప్‌తో మ్యాచ్ డ్రా కాకుండా చేశాడు. మరోవైపు, నిన్న జరిగిన మరో రౌండ్ ఆఫ్ 16 (ప్రీ క్వార్టర్ ఫైనల్స్) మ్యాచ్‌లో రొమేనియాపై నెదర్లాండ్స్ 3-0 గోల్స్ తేడాతో గెలుపొంది, క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్..స్పెయిన్ వర్సెస్ జర్మనీ (జులై 5)పోర్చుగల్ వర్సెస్ ఫ్రాన్స్ (జులై 6)ఇంగ్లండ్ వర్సెస్ స్విట్జర్లాండ్ (జులై 6)నెదర్లాండ్స్ వర్సెస్ తుర్కియే (జులై 7) -
టర్కీకి క్యూ కడుతున్న పురుషులు : ఎందుకో తెలుసా?
ఆధునిక ప్రపంచంలో అందానికి ప్రాధాన్యత పెరిగింది. వయసు పైబడినా కూడా 20 సమ్‌థింగ్ లాగా కనిపించడం సాధ్యమే. శరీరంలోని ఏ భాగాన్నైనా మన ఇష్టం వచ్చినట్టు తీర్చిదిద్దుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే గత ఇరవయ్యేళ్లుగా గ్లోబల్ బ్యూటీ పరిశ్రమ గణనీయమైన పురోగతి సాధించింది.వయసు పెరుగుతున్న కొద్దీ పురుషులను భయపెడుతున్న సమస్య బట్టతల. కొంతమందికి చిన్న వయసులోనే వెంట్రుకలు రాలుతూ ఉంటే బట్టతల వచ్చేస్తుందేమో అని టెన్షన్ వారిని స్థిమితంగా కూర్చోనీయదు దీనికి పరిష్కారం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. మరోవిధంగా చెప్పాలంటే బట్టతల మీద కృత్రిమంగా జుట్టును మొలిపించుకోవడం. ఈ విషయంలో టర్కీ టాక్ ఆప్ ది వరల్డ్‌గా నిలుస్తోంది. టర్కీకే ఎందుకుహెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఖర్చు భారీగానే ఉన్నప్పటికీ అనేక కారణాల వల్ల జుట్టు మార్పిడికి ప్రపంచ వ్యాప్తంగా టర్కీ ఒక ముఖ్యమైన డెస్టినేషన్‌గా మారిపోయింది. బట్టతలపై పుష్కలంగా జుట్టు రావాలన్నా, బట్టతల మచ్చలను కప్పిపుచ్చుకోవాలన్నా టర్కీకి క్యూ కడుతున్నారు పురుషులు.పెరుగుతున్న ప్రజాదరణఇండియా టుడే కథనం ప్రకారం "అత్యంత నైపుణ్యం, అనుభవజ్ఞులైన సర్జన్లు, అధునాతన వైద్య సదుపాయాలు, పాశ్చాత్య దేశాలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చులతో సహా అనేక కారణాల వల్ల టర్కీ జుట్టు మార్పిడికి ప్రముఖ గమ్యస్థానంగా మారింది" అని ఆర్టెమిస్ హాస్పిటల్ చీఫ్, కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ విపుల్ నందా తెలిపారు.అంతేకాదు వసతి, రవాణాతో సహా మెడికల్ టూరిజం ప్యాకేజీలను కూడా అందజేస్తోందట టర్కీ ప్రభుత్వం. చికిత్స కోసం దేశాన్ని సందర్శించే ప్రతి వ్యక్తికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అలాగే స్థానిక క్లినిక్‌లు అత్యాధునిక సాంకేతికతలు, సాంకేతికతలతో చక్కటి ఫలితాలను సాధిస్తున్నాయి. అయితే ఈ విషయంలో టర్కీలో బ్లాక్ మార్కెట్ కూడా విస్తరించిందంటూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చు విషయానికి వస్తే..క్లినిక్, సర్జన్ నైపుణ్యం లాంటి అంశాల ఆధారంగా జుట్టు మార్పిడికి అయ్యే ఖర్చు మారుతుంది. మన ఇండియాలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దాదాపు 83 వేల నుంచి రూ. 2 లక్షల 50 వేలు అవుతుంది. టర్కీలో, సగటున సుమారు రూ. 1,24,000 నుండి రూ. 2 లక్షల 90 వేల వరకు ఉంటుంది. ఇది పాశ్చాత్య దేశాల కంటే చాలా తక్కువ. -
Istanbul: భారీ అగ్ని ప్రమాదం.. 29 మంది మృతి
టర్కీ ఆర్థిక రాజధాని ఇస్తాంబుల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బెసిక్తాస్ డిస్ట్రిక్ట్‌లోని గైరెట్టెప్లోని 16 అంతస్తుల భవనంలో మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పునర్నిర్మాణంలో ఉన్న మాస్వ్కెరేడ్ నైట్ క్లబ్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 29 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన ప్రదేశానికి చేరుకొని ఫైర్ ఇంజన్లతో మంటలను అర్పివేశారు. బెసిక్తాస్ జిల్లాలోని గైరెట్టెప్లో అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 29కి చేరిందని నగర గవర్నర్ దావత్ గుల్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించింది. మంగళవారం మధ్యాహ్నం 12. 47 నిమిషాలకు భవనంలో మంటలు ప్రారంభించినట్లు పేర్కొంది. అయితే అగ్ని మాపక సిబ్బంది కొన్ని గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భవనంలోని అంతస్తుల కిటికీల నుంచి భారీగా మంటలు, దటమైన పొగ కమ్ముకున్నట్లు వీడియోల్లో కనిపిస్తుంది. అయితే భవనంలోని మొదటి, రెండో అంతస్తులలో నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగినట్లు గవర్నర్ దావత్ గుల్ అన్నారు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు మంత్రి అలీ యోర్లికాయ తెలిపారు. క్లబ్ యజమానితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాల కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పారు. -
వేలెడంత.. బారెడంత..
ప్రపంచంలోనే అత్యంత పొడవైన అబ్బాయి.. అత్యంత పొట్టి అమ్మాయి.. ఇద్దరూ ఒకచోట చేరితే.. ఇదిగో ఇలా ఉంటుంది. ఇతడి పేరు సుల్తాన్ కోసెన్.. వయసు 41 ఏళ్లు.. టర్కీకి చెందిన కోసెన్ పొడవు ఏకంగా 8 అడుగుల 3 అంగుళాలు.. మరి ఈమె పేరు జ్యోతి ఆమ్గే.. వయసు 30 ఏళ్లు..ఇండియాకు చెందిన ఈమె పొడవు కేవలం రెండు అడుగులే. ఇద్దరి మధ్య తేడానే ఆరు అడుగులకన్నా ఎక్కువ. సుమారు ఆరేళ్ల కింద ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గర ఈ ఇద్దరితో నిర్వహించిన ఫొటోషూట్ అప్పట్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. మళ్లీ రెండు రోజుల కింద అమెరికాలోని కాలిఫోర్నియాలో మరో ఫొటో షూట్ కోసం వారిద్దరూ కలిశారు. అక్కడ తీసిన చిత్రాలే ఇవి. అకొండ్రోప్లాసియాగా పిలిచే లోపం వల్ల జ్యోతి ఎదుగుదల లేక మరుగుజ్జులా ఉండిపోతే.. పిట్యుటరీ గ్రంథిలో ట్యూమర్‌తో గ్రోత్ హార్మోన్ విపరీతంగా ఉత్పత్తయి కోసెన్ ఇలా భారీగా ఎదిగిపోయాడు. -
నాటోలో స్వీడన్ చేరికకు తుర్కియే ఆమోదం
అంకారా: నాటోలో స్వీడన్ సభ్యత్వానికి తుర్కియే గురువారం అధికారికంగా ఆమోదం తెలిపింది. హంగేరీ కూడా ఓకే చెబితే నార్డిక్ దేశం స్వీడన్ నాటో దేశంగా మారిపోనుంది. ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనకు తుర్కియే పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఫిన్లాండ్, స్వీడన్ నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. నాటో సభ్యదేశమైన తుర్కియే ఫిన్లాండ్ సభ్యత్వానికి మాత్రమే సమ్మతం తెలిపింది. స్వీడన్ సభ్యత్వంపై అభ్యంతరం తెలుపుతూ వస్తోంది. వాటికి కూడా తగు పరిష్కారం దొరకడంతో తాజాగా ఆమోదం తెలిపింది. ఇక, నాటోలో స్వీడన్ చేరికపై హంగరీ పార్లమెంట్లో ఫిబ్రవరి ఆఖరులో చర్చించొచ్చని భావిస్తున్నారు. -
America Britain Attacks : టర్కీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
అంకారా: యెమెన్‌లోని హౌతీ గ్రూపు స్థావరాలపై అమెరికా, బ్రిటన్ చేస్తున్న వైమానిక దాడులపై టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డొగాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు హౌతీలపై అవసరమైన దానికంటే ఎక్కువ దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. హౌతీలపై దాడులకు దిగడం ద్వారా ఎర్ర సముద్రాన్ని రక్త సముద్రంగా మార్చేందుకు అమెరికా, బ్రిటన్ ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. వివిధ మార్గాల ద్వారా తమకు అందుతున్న సమాచారం ప్రకారం అమెరికా, బ్రిటన్ల దాడుల నుంచి హౌతీలు తమను తాము రక్షించుకుంటూ సరైన రీతిలో స్పందిస్తున్నారని ఎర్డోగాన్ తెలిపారు. తాము కూడా అమెరికా, బ్రిటన్ల దాడులపై అవసరమైన రీతిలో స్పందిస్తామని చెప్పారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూపు మిలిటెంట్లు ఎర్ర సముద్రం నుంచి వెళ్లే వాణిజ్య నౌకలపై డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు దిగుతున్నారు. ఈ దాడులు ఎక్కువవడంతో అమెరికా, బ్రిటన్లకు చెందిన వైమానిక బలగాలు తాజాగా యెమెన్‌లోని హౌతీ గ్రూపు స్థావరాలు లక్ష్యంగా దాడులు జరిపి పలు స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇదీచదవండి.. చైనా బొగ్గు గనిలో భారీ పేలుడు.. 10 మంది మృతి -
ప్రపంచంలోని 10 అత్యంత ప్రసిద్ధ చర్చిలు (ఫొటోలు)
-
గాజా గాయాలు.. పార్లమెంట్ మెనూ నుంచి వాటి తొలగింపు!
ఇజ్రాయెల్-హమాస్ గ్రూప్ మధ్య జరుగుతున్న యుద్ధం ఒకవైపు భారీ ప్రాణ నష్టం.. మరోవైపు భారీ మానవతా సంక్షోభం దిశగా ముందుకెళ్తోంది. గాజాలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. అదే సమయంలో పాశ్చాత్య, మిడిల్ ఈస్ట్ దేశాల నడుమ రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. తుర్కియే(పూర్వపు టర్కీ) ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ మెనూ నుంచి కోకాకోలా, నెస్లే ఉత్పత్తులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. హమాస్‌తో జరుగుతున్న పోరులో ఇజ్రాయెల్‌కు ఆ కంపెనీలు మద్దతు ప్రకటించాయని, అందుకే వాటిని తమ పార్లమెంట్ క్యాంటీన్ నుంచి తొలగిస్తున్నట్లు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ ప్రాంగణంలోని రెస్టారెంట్లలో, కఫేటేరియాల్లో, టీ హౌజ్‌లలో ఇకపై ఆయా ఉత్పత్తులను అమ్మకూడదని పార్లమెంట్ స్పీకర్ నుమాన్ కుర్తుల్మస్ పేరిట ఒక ప్రకటన వెలువడింది. మరోవైపు ఈ పరిణామంపై ఆ కంపెనీలు స్పందించాల్సి ఉంది. గాజాకు సంఘీభావంగా.. తమ దేశ ప్రజల డిమాండ్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ ఆ ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు గాజా దాడుల నేపథ్యంగా.. సోషల్ మీడియాలోనూ ఇజ్రాయెల్ ఉత్పత్తులను, పాశ్చాత్య దేశాల కంపెనీలను బహిష్కరించాలనే డిమాండ్ నానాటికీ పెరిగిపోతోంది. యుద్ధ వాతావరణ నేపథ్యంలో టర్కీ-ఇజ్రాయెల్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఇప్పటికే తీవ్రంగా దెబ్బ తిన్నాయి. -
బ్లింకెన్ పర్యటన వేళ.. టర్కీలో యూఎస్ ఎయిర్‌బేస్‌పై దాడి
అంకారా: టర్కీలో పాలస్తీనా మద్దతుదారులు అమెరికా వైమానిక స్థావరంపై దాడికి ప్రయత్నించారు. వందల సంఖ్యలో నిరసనకారులు ఎయిర్‌బేస్‌పై విరుచుకుపడ్డారు. బారికేడ్లను దాటడానికి ప్రయత్నిస్తూ పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు, ఖుర్చీలను విసిరారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు ట్యియర్ గ్యాస్, జల ఫిరంగులను ప్రయోగించారు. గాజా యుద్ధంపై చర్చలు జరపడానికి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ నేడు(సోమవారం) టర్కీలో పర్యటిస్తున్న క్రమంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. గాజా యుద్ధంపై ఇజ్రాయెల్‌ను టర్కీ మొదటినుంచీ విమర్శిస్తోంది. హమాస్ పేరుతో అమాయకులైన ప్రజలపై దాడులకు పాల్పడుతోందని ఇజ్రాయెల్‌ను నిందిస్తోంది. ఇదే క్రమంలో పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య శాంతి నెలకొనడానికి ప్రయత్నాలు చేస్తోంది. యుద్ధం ప్రారంభమైన నాటినుంచి టర్కీలో పాలస్తీనా మద్దతుదారులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు తెలుపుతున్న నేపథ్యంలోనే తాజాగా వైమానిక స్థావరంపై దాడి జరిగింది. ఇస్లామిస్ట్ టర్కిష్ సహాయ సంస్థ IHH హ్యుమానిటేరియన్ రిలీఫ్ ఫౌండేషన్ గాజాపై ఇజ్రాయెల్ దాడులను, ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతును నిరసిస్తూ ఈ దాడికి పిలుపునిచ్చింది. 🚨 JUST IN: Turkish Police Disperse Pro-Palestinian Protesters Near İncirlik Air Base Which Houses U.S. Troops pic.twitter.com/TsAjfbTz6G — Mario Nawfal (@MarioNawfal) November 5, 2023 ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేస్తున్న క్రమంలో పశ్చిమాసియాలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బ్లింకెన్ ఆదివారం వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌తో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, గాజాలో పాలస్తీనియన్ల ఇబ్బందులపై చర్చించారు. ఇరాక్‌లోనూ పర్యటన చేపట్టారు. బాగ్దాద్‌లో ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుదానీతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి నేడు తుర్కియేలో పర్యటించనున్నారు. ఇదీ చదవండి: గాజాను రెండుగా విభజించాం.. ఇజ్రాయెల్ సైన్యం కీలక పకటన -
భారత్- యూరప్ కారిడార్‌తో టర్కీకి ఇబ్బంది ఏమిటి? చైనా సాయంతో ఏం చేయనుంది?
ఆమధ్య రాజధాని ఢిల్లీలో జరిగిన జీ-20 సమావేశంలో ఇతర అంశాలతోపాటు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్ణయం భారత్ మిడిల్ ఈస్ట్ మీదుగా యూరప్‌కు చేరుకునేలా కొత్త కారిడార్‌ను నిర్మించడం. అమెరికా భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ కారిడార్‌లో సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయెల్ వంటి దేశాల సహకారం చేరింది. ఈ కారిడార్ గేమ్ ఛేంజర్‌గా, చైనా దూకుడు చూపుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే బీఆర్ఐకి భారత్, అమెరికాల పదునైన సమాధానం అని నిపుణులు అంటున్నారు. అయితే చైనా కంటే ముందు టర్కీ ఈ కారిడార్ విషయంలో టెన్షన్ పడుతోంది. దీంతో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అంటే ఐఎంఈసీని ఫ్లాప్ చేయడానికి ప్రత్యేక కారిడార్‌ను నిర్మించాలని యోచిస్తోంది. యూఎస్ నేతృత్వంలోని సైనిక కూటమి నాటోలో టర్కీ సభ్యదేశంగా ఉన్నప్పటికీ, ప్రధాన సమస్యల పరిష్కారం విషయంలో అమెరికాకు భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది. దీనికి కారణం టక్కీ ఇస్లామిక్ దేశం అయినందున దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ పాకిస్తాన్‌కు సన్నిహితంగా మెలుగుతున్నారు. దీంతో ఆయన భారతదేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. కార్గో రవాణాలో 40 శాతం సమయం ఆదా వాస్తవానికి ఐఎంఈసీ అనేది భారతదేశం నుండి ఐరోపాకు వస్తువులను రవాణా చేయడానికి మరొక మార్గాన్ని ఏర్పాటు చేసే ప్రాజెక్ట్. భారతదేశం, యుఎఇ, సౌదీ అరేబియా, జర్మనీ, ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్, ఇజ్రాయెల్, జోర్డాన్ వంటి దేశాలు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యమయ్యాయి. ఈ కారిడార్ ద్వారా భారతదేశం నుండి జర్మనీకి కార్గో రవాణాలో 40 శాతం సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం భారత సరుకులు షిప్పింగ్ కోసం జర్మనీ చేరుకోవడానికి 36 రోజుల సమయం పడుతుండగా, ఈ కారిడార్ నిర్మాణం తర్వాత ఈ దూరం 22 రోజుల్లో ఈ తతంగం పూర్తి కానుంది. ఇరాక్ మీదుగా కారిడార్ నిర్మించాలని.. ఈ కారిడార్ ఒక మెగా ప్రాజెక్ట్. దీనిలో గల్ఫ్ దేశాలలో రైల్వేల నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. భారతదేశ ప్రాముఖ్యతను పెంచే ఈ ప్రాజెక్ట్‌తో టర్కీకి సమస్య ఏమిటనే విషయానికి వస్తే టర్కీ భౌగోళిక స్వరూపం యూరప్, పశ్చిమ ఆసియా మధ్య ఉంది. ఈ ప్రాజెక్ట్ సిద్ధమైతే మధ్యధరా సముద్ర ప్రాంతంలో టర్కీ ప్రాముఖ్యత తగ్గుతుంది. టర్కీ ఇంతకాలం తాను ఈ ప్రాంతానికి అలెగ్జాండర్‌గా పరిగణించుకుంటూ వచ్చింది. ఈ ప్రాంతంలోని గ్రీస్, సైప్రస్ వంటి దేశాలతో టర్కీకి శత్రు సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు పోటీగా, ఇప్పుడు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కొత్త కారిడార్‌ను నిర్మించాలనుకుంటున్నాడు. అయితే ఇది అంత సులభం కాదు. ఇరాక్ మీదుగా 1,200 కి.మీ కారిడార్‌ను నిర్మించాలని టర్కీ యోచిస్తోంది. ఇందులో హైస్పీడ్ రైలు నెట్వర్క్, రోడ్డు నిర్మాణం ఉండనున్నాయి. దీనికి దాదాపు 17 బిలియన్ డాలర్లు ఖర్చు కానుంది. టర్కీ యోచనకు అనేక అడ్డంకులు అయితే భారత్‌ను యూరప్‌కు అనుసంధానించే కారిడార్ ప్రాజెక్టుకు పోటీగా ప్రాజెక్టును సిద్ధం చేయాలన్న టర్కీ యోచనలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో టర్కీ తన మిత్రదేశం చైనాతో జతకట్టి ఐఎంఈసీ కారిడార్ నిర్మాణాన్ని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోంది. కాగా ఈ విషయంలో చైనా ఇంకా తన వైఖరిని వెల్లడించలేదు. ఇప్పటికే మిడిల్ ఈస్ట్‌లో ఆర్బీఐ ప్రాజెక్ట్ చేపట్టిన చైనా.. భవిష్యత్తులో టర్కీతో చేతులు కలిపి, ఐఎంఈసీ కారిడార్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: అక్టోబరు 14 నుంచి మరిన్ని విపత్తులు? -
ఇజ్రాయెల్‌కు అమెరికా విమాన వాహక నౌక.. ఇక హమాస్‌కు చుక్కలే?
టెల్ అవివ్/జెరూసలేం: ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. దక్షిణ ఇజ్రాయెల్‌లో పరిస్థితి భీతావహంగా మారింది. హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ జవాన్ల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. గాజా నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకువచ్చిన తీవ్రవాదులు వీధుల్లో జవాన్లతో తలపడుతున్నారు. హమాస్ దుశ్చర్య పట్ల ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం పెద్ద సంఖ్యలో రాకెట్లను గాజాపై ప్రయోగించింది. మరోవైపు.. ఇజ్రాయెల్‌కు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంతానికి విమాన వాహక నౌకను పంపాలని అమెరికా నిర్ణయించింది. ఫోర్డ్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అక్కడికి వెళ్లాలని ఆదివారం పెంటగాన్ ఆదేశించినట్లు ఇద్దరు అమెరికా అధికారులు వెల్లడించారు. 5వేల నావికులు, యుద్ధ విమానాలతో కూడిన ద యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వాహక నౌకను, క్రూజ్లను, డిస్ట్రాయర్స్‌ను పంపనున్నట్లు తెలిపారు. The United States is moving the USS Gerald R. Ford, the world's largest aircraft carrier and largest warship, to the shores of Israel. Hamas Statement: "The relocation of the American aircraft carrier does not frighten us, and the Biden administration must understand the… pic.twitter.com/7CjUGchzSB — OLuyinka🀄️🔌 (@Luyinkacoaltt) October 9, 2023 LATEST:-Hamas fires Hundreds of rockets towards Tel Aviv Airport,, Israel.#IsraelPalestineWar #IsraelPalestineWar #hamasattack #hamasattack #FreePalastine #FreePalastine #Palestine #IStandWithPalestine #طوفان_القدس #IsraelPalestineWar pic.twitter.com/3LyEl2FJ2E — M Musharraf sheikh (@m_m_musharraf) October 9, 2023 ఇది ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడంతోపాటు హమాస్‌కు అదనపు ఆయుధాలను సమకూర్చే వారిపై నిఘా ఉంచనుంది. వర్జీనియా కేంద్రంగా ఉండే ఈ విమాన వాహక నౌక ప్రస్తుతం మధ్యధరా సముద్ర ప్రాంతంలోనే ఉంది. నౌకా విన్యాసాల కోసం ఈ ప్రాంతానికి వచ్చింది. ఈ గ్రూప్‌లో క్రూజ్ యూఎస్ఎస్ నార్మండీ, డిస్ట్రాయర్లు యూఎస్ఎస్ థామస్ హడ్నర్, యూఎస్ఎస్ రాంపేజ్, యూఎస్ఎస్ క్యార్నీ, యూఎస్ఎస్ రూజ్‌వెల్ట్‌తోపాటు ఎఫ్-35, ఎఫ్-15, ఎఫ్-16, ఏ-10 యుద్ధ విమానాలు ఉంటాయి. Gaza is being heavily bombed at the moment. Video from today’s bombing. #GazaUnderAttack #Gaza #IsraelPalestineWar#Palestine #Hamas #Palestinian #IsraelUnderAttack #Israel #Mossad #Israel #IsraelUnderAttack #PalestinaLibre #Hizbullah #Lebanon #IsraelAtWar pic.twitter.com/4siVZpl8Mp — Pulkit Sharma (@_Pradhyumn_) October 9, 2023 ఇక, ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇవ్వడంపై టర్కీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. అనవసరంగా ఈ విషయంలో తలదూరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. 🚨BREAKING🚨 Turkey Leader🇹🇷 Tayyip Erdoĝan: "America stay away ,we will defend palestine at any price". #طوفان_القدس #جوري_المغربيه #FreePalestine #Israel #IsraelUnderAttack #Palestine #Gaza #Hamas #حماس_تنتصر #حماسpic.twitter.com/ZaHvdozUX9 — Mahad (@MahadCricket) October 9, 2023 ఇదిలా ఉండగా.. యుద్ధం తీవ్రతరం కావడం వల్ల మరణించిన వారి సంఖ్య 1,100 దాటింది. ఇజ్రాయెల్‌లో 700 మందికి పైగా మరణించారు. గాజాలో కనీసం 400 మంది మరణించినట్టు సమాచారం. ఇరువైపులా 2,000 మంది చొప్పున గాయపడినట్లు తెలుస్తోంది. తమ సైనిక దళాలు 400 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలియజేశాయి. చాలామందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాయి. Gaza is being heavily bombed at the moment. Video from today’s bombing. #GazaUnderAttack #Gaza #IsraelPalestineWar#Palestine #Hamas #Palestinian #IsraelUnderAttack #Israel #Mossad #Israel #IsraelUnderAttack #PalestinaLibre #Hizbullah #Lebanon #IsraelAtWar pic.twitter.com/4siVZpl8Mp — Pulkit Sharma (@_Pradhyumn_) October 9, 2023 బందీలపై తీవ్రవాదుల అత్యాచారాలు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లో బీభత్సం సృష్టించారు. ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. వీరిలో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉండడం గమనార్హం. ఈ బందీలను అడ్డం పెట్టుకొని పెద్ద బేరమే ఆడబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేలాది మంది పాలస్తీనావాసులు ఖైదీలుగా ఇజ్రాయెల్ ఆ«దీనంలో ఉన్నారు. వీరిని విడిపించుకోవడానికి మిలిటెంట్లు ఇజ్రాయెల్ బందీలను పావులుగా ప్రయోగించబోతున్నట్లు సమాచారం. ఇంకోవైపు చాలామంది ఇజ్రాయెల్ పౌరులను మిలిటెంట్లు అపహరించినట్లు ప్రచారం సాగుతోంది. BREAKING – Hamas militants started a new air assault on parts of Israel !!#Israel #hamasattack #GazaUnderAttack #IsraelUnderAttack #Palestine #Gaza #Israel_under_attack #IsraelPalestineWar pic.twitter.com/z0YbHdyB43 — عساف (@Sa91af) October 8, 2023 భారతీయులు క్షేమం.. ఇజ్రాయెల్, గాజాలో భారతీయులంతా ఇప్పటిదాకా క్షేమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారికి ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. ఇజ్రాయెల్‌లో దాదాపు 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. భారతీయులకు తాము అందుబాటులో ఉంటున్నామని, వారి తగిన సలహాలు సూచనలు ఇస్తున్నామని భారత రాయబార కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితి త్వరలోనే అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేశాయి. మరోవైపు గాజాలో వాతావరణం భయంకరంగా ఉందని అక్కడి భారతీయులు చెప్పారు. ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యం పూర్తిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఇలా ఉండగా, ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్‌కు ఈ నెల 14 దాకా తమ విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. -
తుర్కియే పార్లమెంట్ భవనం ఎదుట ఆత్మాహుతి దాడి
అంకారా: పాకిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడి మిగిల్చిన విషాదాన్ని మరువక ముందే తుర్కియేలో ఉగ్రావాదులు పంజా విసిరారు. తుర్కియే పార్లమెంట్ భవనం ఎదుట ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడినట్లు తెలిపింది తుర్కియే అంతర్గత వ్యవహారాల శాఖ. ప్రభుత్వం ఇది తీవ్రవాదుల పనేనని ప్రకటించింది. ఆదివారం ఉదయం 9.30 ప్రాంతంలో ఇద్దరు తీవ్రవాదులు ఒక కమర్షియల్ వాహనంలో తుర్కీయే పార్లమెంట్ భవనం వద్దకు వచ్చారు. డైరెక్టరేట్ జనరల్ భద్రతా విభాగం ఎంట్రన్స్ గేట్ వద్దకు రాగానే వీరిద్దరూ బాంబులతో దాడి చేశారనన్నారు. వారిలో ఒకరు ఆత్మాహుతికి పాల్పడగా మరొక తీవ్రవాది బాంబును నిర్వీర్యం చేశామని తెలిపింది అంతర్గత వ్యవహారాల శాఖ. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పొందుపరుస్తూ ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు స్వల్పంగా గాయపడినట్లు తెలిపింది. బాంబు శబ్దానికి చుట్టుపక్కల ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. తీవ్రవాదులు దాడులు చేసిన జిల్లాలో పార్లమెంట్ సహా అనేక ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉన్నాయని తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రసంగం తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరగాల్సి ఉన్నాయని అంతలోనే ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని తెలిపింది స్థానిక మీడియా. దాడులు జరిగిన సమాచారం అందగానే అత్యవసర సేవల విభాగం వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి తరలి వచ్చారు. A terrorist attack occurred outside Turkey's interior ministry in Ankara. Two attackers, arriving in a commercial vehicle, executed the assault, injuring two officers. One attacker detonated himself in front of a ministry building, while the other was neutralized. The… pic.twitter.com/ovaiv3eVky — Pakistani Index (@PakistaniIndex) October 1, 2023 ఇది కూడా చదవండి: భారత సంతతి జడ్జి చేతిలో గూగుల్ భవితవ్యం -
తుర్కియే వక్రబుద్ధి.. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశం
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి 78వ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా తుర్కియే దేశాధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. భారత్ పాకిస్తాన్ వ్యవహారాల్లో తలదూర్చవద్దని భారత్ పలుమార్లు హెచ్చరించినా కూడా పట్టించుకోని ఆయన తాజా సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి దక్షిణాసియాలో శాంతి స్థాపన జరగాలంటే భారత్ పాక్ మధ్య సంధి కుదర్చాలని అన్నారు. సహకరిస్తాం..? న్యుయార్క్ వేదికగా జరుగుతున్న ఐక్యరాజ్యసమితి 78వ అసెంబ్లీ సమావేశాల్లో తుర్కియే అధ్యక్షుడు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దక్షిణాసియా ప్రాంతంలో ప్రాంతీయ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు స్థాపించబడాలంటే భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చర్చలు జరగాలని ఇరుదేశాల పరస్పర సహకారం ద్వారా కశ్మీర్లో సుస్థిరమైన శాంతని నెలకొల్పాలని అన్నారు. ఈ చర్చలకు తుర్కియే సహకారం ఉంటుందని చెప్పుకొచ్చారు. భారత్ పాకిస్తాన్ దేశాలు స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం సాధించి 75 ఏళ్లు పూర్తయినా రెండు దేశాల మధ్య శాంతి సంఘీభావం స్థాపించబడాలపోవడం దురదృష్టకరమని అన్నారు. కశ్మీర్లో శాశ్వత శాంతితో పాటు శ్రేయస్సు కూడా స్థాపించబడలని కోరుకుంటూ ప్రార్ధిస్తున్నానన్నారు. చెప్పినా వినకుండా.. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ ప్రస్తావన తీసుకురావద్దని భారత్ గతంలో కూడా అనేక మార్లు తుర్కియేను హెచ్చరించింది. ఒకవేళ వారు ఆ పని చేస్తే తాము సైప్రస్ అంశాన్ని లేవనెత్తుతామని కూడా తెలిపింది. ఇటీవల జరిగిన జీ20 సమావేశాల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్‌తో వాణిజ్యం, మౌలిక సదుపాయాల సంబంధాలను బలోపేతం చేయడానికి చర్చలు కూడా జరిపారు. అయినా కూడా ఎర్డొగాన్ ఐక్యరాజ్య సమితిలో తమ మిత్రదేశమైన పాకిస్తాన్‌కు వత్తాసు పలికారు ఆ దేశ అధ్యక్షుడు. ప్రపంచం వారికంటే పెద్దది.. సమావేశాల్లో ఎర్డొగాన్ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ పాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఐదు శాశ్వత సభ్యులతో పాటు తాత్కాలిక సభ్యులుగా ఉన్న 15 దేశాలను కూడా శాశ్వత సభ్యులుగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ 20 సభ్యదేశాలను రొటేషన్ పధ్ధతిలో శాశ్వత సభ్యదేశాలుగా కొనసాగించాలని అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా, ఫ్రాన్స్ కన్నా ప్రపంచం చాలా పెద్దదని ఆయన అన్నారు. President of Turkey's @RTErdogan, powerful speech at the United Nations, advocating for the rights and peace in Kashmir, exemplifies how true leaders take action. "Beyond @ImranKhanPTI, Have any other Pakistani leaders raised their voices on the Kashmir issue at the UN? And the… pic.twitter.com/S79NZsdJiX — Sanaullah khan (@Saimk5663) September 20, 2023 ఇది కూడా చదవండి: ట్రూడో ఆరోపణలు తీవ్రమైనవే: అమెరికా -
ప్రపంచంలోనే ఇలాంటి హోటల్ ఎక్కడా లేదు.. అంత స్పెషల్ ఏంటంటే..
ప్రపంచంలో అక్కడక్కడా కాలంచెల్లిన బోయింగ్ విమానాల్లో నడిపే హోటళ్లు ఉన్నాయి. అయితే, టర్కీలో మాత్రం ఏకంగా విమానం ఆకారంలోనే నిర్మించిన విలాసవంతమైన హోటల్ ఉంది. ప్రపంచంలో ఇలాంటి హోటల్ ఇదొక్కటే! ప్రైవేట్ బీచ్, ఒక ‘పెద్దలకు మాత్రమే’ స్విమ్మింగ్‌పూల్ సహా నాలుగు స్విమ్మింగ్‌పూల్స్, ఒక ఆక్వా పార్క్ ఈ హోటల్ ప్రత్యేకతలు. టర్కీలోని అంతాల్యా నగరానికి చేరువలోని లారా సముద్రతీరం వద్దనున్న ఈ హోటల్ పేరు ‘కాంకోర్డ్ డీలక్స్ రిసార్ట్’. అంతాల్యా విమానాశ్రయం నుంచి పది కిలోమీటర్ల దూరంలోనున్న ఈ హోటల్ టర్కీలో పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ హోటల్లో పిల్లల ఆటపాటల కోసం ప్రత్యేకమైన కిడ్స్ క్లబ్, మినీ గోల్ఫ్‌కోర్స్, టెన్నిస్ కోర్ట్ తదితరమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఇందులో విందు వినోదాల కోసం పన్నెండు రెస్టారెంట్లు, పదహారు బార్లు కూడా ఉన్నాయి. ఇద్దరు మనుషులు ఇందులో ఒకరోజు బస చేసేందుకు 73 పౌండ్లు (రూ.7,245) మాత్రమే! -
అనారోగ్యంతో తుర్కియే గుహలో చిక్కుబడిన అమెరికా అన్వేషకుడు
ఇస్తాంబుల్: తుర్కియేలోని ఓ గుహలో వెయ్యి మీటర్ల లోతులో అనారోగ్యంతో చిక్కుకుపోయిన అమెరికాకు చెందిన మార్క్ డికే(40)ను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ అన్వేషణలో భాగంగా తుర్కియేలోని టారస్ పర్వతాల్లో ఉన్న మోర్కా గుహల్లోకి మార్క్ డికే వెళ్లారు. మోర్కా గుహ లోతు 1,276 మీటర్లు కాగా, మార్క్ డికే 1,120 మీటర్ల లోతులోని బేస్‌క్యాంప్‌లో ఉన్నారు. జీర్ణాశయంలో రక్తస్రావం కారణంగా ముందుకు వెళ్ల్లలేని స్థితిలో ఉండిపోయారని యూరోపియన్ కేవ్ రెస్క్యూ అసోసియేషన్ ప్రకటించింది. ఆయనకు అనేక అంతర్జాతీయ గుహాన్వేషణల్లో పాలుపంచుకున్న అనుభవం ఎంతో ఉంది. గృహల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడంలో స్వయంగా ఆయన సిద్ధహస్తుడని వివరించింది. సాధారణ పరిస్థితుల్లో అనుభవజు్ఞలైన గృహాన్వేషకులకే అక్కడికి వెళ్లేందుకు 15 గంటలు పడుతుందని టర్కిష్ కేవింగ్ ఫెడరేషన్ వివరించింది. మార్క్ డికే కోసం ఆరు యూనిట్ల రక్తం పంపించామని టర్కీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. డికేను కాపాడేందుకు తుర్కియే, అమెరాకాతోపాటు హంగరీ, బల్గేరియా, ఇటలీ, క్రొయేíÙయా, పోలాండ్ దేశాలకు చెందిన 150 మంది నిపుణులను రప్పిస్తున్నట్లు యూరోపియన్ కేవ్ రెస్క్యూ అసోసియేషన్ తెలిపింది. ఎంతో క్లిష్టమైన ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొన్ని రోజుల వరకు పట్టవచ్చని చెబుతున్నారు. -
అప్పటి దాకా ధాన్యం ఒప్పందం ఉండదు
మాస్కో: యుద్ధం కొనసాగుతున్న వేళ నల్ల సముద్రం మీదుగా ఉక్రెయిన్ ధాన్యం రవాణా కారిడార్‌ను పునరుద్ధరించాలంటే పశ్చిమ దేశాలు ముందుగా తమ డిమాండ్లను అంగీకరించాల్సిందేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. దీంతో, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియా దేశాలకు ఎంతో కీలకమైన ఆహార ధాన్యాల సరఫరాపై నీలినీడలు అలుముకున్నాయి. టర్కీ, ఐరాస మధ్యవర్తిత్వంతో కుదిరిన ధాన్యం రవాణా కారిడార్ ఒప్పందం నుంచి జూలైలో వైదొలిగింది. ఈ ఒప్పందం పునరుద్ధరణపై చర్చించేందుకు సోమవారం రష్యాలోని సోచిలో తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్‌తో ఆయన సమావేశమయ్యారు. రష్యా నుంచి ఆహారధాన్యాలు, ఎరువుల ఎగుమతులకు గల అవరోధాలను తొలగిస్తామన్న వాగ్దానాలను పశ్చిమదేశాలు నిర్లక్ష్యం చేశాయని ఈ సందర్భంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది వరకు రికార్డు స్థాయిలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం ఓడల రాకపోకలు, బీమాకు సంబంధించిన అవరోధాల కారణంగా తీవ్రంగా దెబ్బతిందన్నారు. పశి్చమదేశాలు ఇచి్చన వాగ్దానాలను నెరవేర్చిన పక్షంలో కొద్ది రోజుల్లోనే ఒప్పందంపై సంతకాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో త్వరలోనే పురోగతి సాధిస్తామని ఎర్డోగన్ చెప్పారు. -
ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ కాంతిలో ఉల్కపాతం
అంకారా: టర్కీలో శనివారం రాత్రి అద్భుత దృశ్యం అవిష్కృతమైంది. నిప్పలు చిమ్ముతూ నేలరాలాల్సిన ఉల్కపాతం.. గ్రీన్‌కలర్‌లో కాంతిని వెదజల్లుతూ భూమి వైపుకు దూసుకొచ్చింది. గుముషానే ప్రావిన్స్‌లోని ఎర్జురం నగరం ప్రాంతానికి వచ్చే సరిగి గ్రీన్ కలర్ రంగులో కాంతిని వెదజల్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. A large green meteor was spotted blazing through the sky in Turkey moments ago. Wow. pic.twitter.com/eQEYLG2ihB — Nahel Belgherze (@WxNB_) September 2, 2023 టర్కీలో రాత్రిపూట అంతా ప్రశాంతంగా ఉండగా.. ఒక్కసారిగా ఆకాశంలో నుంచి ఉల్కపాతం సంభవించింది. అయితే.. అది గ్రీన్ కలర్ రంగులో కాంతిని వెదజల్లింది. ఈ దృశ్యాలను చూపుతున్న వీడియోలో ఓ బాలుడు బెలూన్‌తో ఆడుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను నహెల్ బెల్గెర్జ్ తన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేశారు. Green meteor lights up the sky over Turkey on Saturday.pic.twitter.com/Y89ORYz6CP — Science girl (@gunsnrosesgirl3) September 3, 2023 అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రకారం అంతరిక్షంలో దుమ్ము, దూళి కణాలు కలిగిన శిలలు భూవాతావరణంలో కిందికి పడిపోయినప్పుడు భారీ స్థాయిలో కాంతిని వెదజల్లుతాయి. అతి వేగంగా భూమి వైపుకు ప్రయాణిస్తాయి. అయితే.. తాజాగా టర్కీలో సంభవించిన ఘటనపై అధికారులు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ ఇవ్వలేదు. గత వారంలో కొలరాడోలోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తెల్లవారుజామున 3.30 సమయంలో ఉల్కలు నెలరాలాయి. Malatya, Erzurum, Elazığ, Gaziantep, Diyarbakır ve çevre illerden görülen büyük ve çok parlak bir göktaşı düşüşü gözlemlendi. İşte o anlar... ☄️👀 #göktaşı #meteor #malatya #erzincan #elazığ #gaziantep #malatya #erzurum pic.twitter.com/lDWTYGzAZM — Hava Forum (@HavaForum) September 2, 2023 ఇదీ చదవండి: Plane Crash: సంతోషంగా పార్టీ.. అందరూ చూస్తుండగా కళ్ల ముందే ఘోర ప్రమాదం! -
‘నాలుగు కాళ్ల’ వింత కుటుంబం.. పశువుల తరహాలో నడక!
ప్రపంచంలో రకరకాల మనుషులు కనిపిస్తారు. అలాగే చిత్రమైన కుటుంబాలను కూడా మనం చూస్తుంటాం. విచిత్రమైన అలవాట్లు లేదా భిన్న ధోరణి కారణంగా ఆయా కుటుంబాల వారు ప్రత్యేకంగా కనిపిస్తారు. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఒక కుటుంబంలోని సభ్యులు జంతువుల మాదిరిగా నాలుగు కాళ్లతో నడుస్తుంటారు. వీరు తమ రెండు చేతులను రెండు కాళ్లుగా ఉపయోగిస్తుంటారు. ఈ విచ్రితమైన కుటుంబం టర్కీలోని ఒక శివారు గ్రామంలో ఉంటోంది. ఈ కుటుంబంలోని ఐదురుగురు సభ్యుల గురించి 2000లో ఒక వార్తాపత్రికలో ప్రచురితమయ్యింది. ఈ నేపధ్యంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(ఎల్ఎస్ఈ)కి చెందిన మానసిక శాస్త్రవేత్త నికోలస్ హంఫ్రే ఈ విచిత్ర కుటుంబాన్ని కలుసుకునేందుకు టర్కీ వెళ్లారు. ఈ విచిత్ర కుటుంబంలో తల్లిదండ్రులకు 18 మంది పిల్లలు. అయితే వీరిలోని ఆరుగురు జంతువుల తరహాలో నడిచేందుకు ఇష్టపడతారు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక క్రియేటర్ ఈ విచిత్ర కుటుంబంపై 60 నిముషాల డాక్యుమెంటరీ రూపొందించారు. దానిలో శాస్త్రవేత్త హంఫ్రే మాట్లాడుతూ ఇలాంటి మనుషులను తాను ఎన్నడూ చూడలేదని, ఈ ఆధునిక యుగంలో వీరు పశుఅవస్థకు తిరిగి వెళుతున్నట్లున్నదని అన్నారు. కొందరు శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ కుటుంబసభ్యులు అనువంశిక సమస్యల కారణంగా ఇలా ప్రవర్తిస్తుండవచ్చని అన్నారు. కాగా ఈ ఆరుగురు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లలో ప్రస్తుతం ఐదుగురు మాత్రమే జీవించివున్నారు. వీరు 22 ఏళ్ల నుంచి 38 ఏళ్ల మధ్య వయసు కలిగినవారు. వీరి మెదడులో ఒక భాగం కుంచించుకుపోయిందని, దీనిని సెరెబెలర్ వర్మిస్ అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. సెరెబెలర్ వర్మిస్ కలిగినవారు తమ రెండు చేతులను కాళ్ల మాదిరిగా వినియోగించేందుకు ఇష్టపడతారన్నారు. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పిండిమర.. ఒకరిని కాపాడబోయి.. వరుసగా నలుగురు! -
భూమిలో 285 అడుగుల లోతులో 'నగరం'.. 20 వేల మందిదాక..
ఇదొక పురాతన అధోలోక నగరం. ప్రస్తుత తుర్కియాలోని కపడోసియ ప్రాంతంలో ఉంది. భూమి లోపల 285 అడుగుల లోతున పదకొండు అంతస్తుల్లో ఉన్న ఈ నగరాన్ని తొలి పర్షియన్ సామ్రాజ్యానికి చెందిన పాలకులు నిర్మించి ఉంటారని చరిత్రకారులు, పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా. దీనిని క్రీస్తుపూర్వం 550 ప్రాంతంలో నిర్మించి ఉంటారని వారు భావిస్తున్నారు. ఇందులో ఇరవైవేల మంది నివాసం ఉండేందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయి. నూనె గానుగలు, మద్యం పీపాలను భద్రపరచుకునే గదులు, తిండి గింజలు భద్రపరచుకునే గదులు, ప్రార్థన మందిరాలు వంటివీ ఉన్నాయి. దీని లోపలికి గాలి, వెలుతురు ప్రసరించేందుకు వీలుగా 180 అడుగుల పొడవైన మార్గం ఉండటం విశేషం. తొలిసారిగా దీనిని విహార యాత్రకు వచ్చిన ఒక కుటుంబం 1963లో గుర్తించడంతో ఈ నగరం గురించి ఆధునిక ప్రపంచానికి తెలిసింది. తుర్కియాలో దీనికి ‘డెరింకుయు’ అని పేరు పెట్టారు. అంటే నేలమాళిగ నగరం అని అర్థం. (చదవండి: టీచరే బడిదొంగ... ఇరవై ఏళ్లుగా డుమ్మా!) -
ప్రజాస్వామ్యంలో నిరంకుశ నేత
నిరంకుశులు అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యం పేరుకే మిగులుతుంది. అతి జాతీయవాదం ప్రబలినప్పుడు ఆలోచనను అది మింగేస్తుంది. ఆ చేదు నిజానికి టర్కీ (తుర్కియే) మరోసారి సాక్షీ భూతమైంది. తొలి దఫాలో ఫలితం తేలకపోయేసరికి రెండో దఫా సాగిన ఎన్నికలు, నాటకీయ ఫక్కీలో రోజుకొకరిది ఆధిక్యంగా మారిన ఎన్నికల ప్రచారం తర్వాత టర్కీ తాజా అధ్యక్ష ఎన్నికల్లో ఎర్డొగాన్ తన పట్టు నిలబెట్టుకున్నారు. ఎన్నికలు ‘అత్యంత న్యాయవిరుద్ధంగా సాగా’యన్న ప్రత్యర్థి మాటలు ఎలావున్నా లెక్కల్లో అంతిమ విజయం ఎర్డొగాన్దే అయింది. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశానికి ఎగ బాకినా, కరెన్సీ విలువ పాతాళానికి పడిపోయినా ఆయన మాత్రం ప్రపంచ వేదికపై దేశప్రతిష్ఠను పెంచానని పౌరులకు నమ్మబలికారు. కుర్దిష్ వేర్పాటువాదుల్ని తన ప్రత్యర్థి సమర్థిస్తున్నారంటూ నమ్మించారు. అతి జాతీయవాదంతో ఆధిక్యాన్ని నిలుపుకొన్నారు. అదే ఈ ఎన్నికల విడ్డూరం. 2017లో రిఫరెండం ద్వారా టర్కీలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అధ్యక్ష తరహా పాలనగా మార్చిందీ, ఆ పైన ప్రధాని పదవిని రద్దు చేసిందీ ఎర్డొగానే. న్యాయవ్యవస్థ, ఎన్నికల నిర్వహణ వ్యవస్థ సహా ప్రభుత్వ వ్యవస్థలన్నిటినీ నియంత్రణలో పెట్టుకున్న ఘనుడాయన. నైపుణ్యం కన్నా విధేయతే గీటురాయిగా అయినవాళ్ళతో వాటిని నింపేశారు. ప్రధాన స్రవంతి మీడియా అంతా చేతుల్లో ఉన్న ఆయనకు ఎన్నికల ప్రచారం పరాకాష్ఠకు చేరినవేళ 32 గంటల ప్రసార సమయం లభిస్తే, ప్రత్యర్థికి దక్కింది 32 నిమిషాలే. విజయానికై ఎంతకు దిగజారడానికైనా వెనుకాడకపోవడం ఆయన నైజం. దాంతో, దేశంలో ఎన్నడూ లేనన్నిసార్లు హత్యాయత్నం జరిగిన నేతగా పేరొందిన ప్రతిపక్షాల అభ్యర్థి కెమల్ కిలిచదరోగ్లూ చివరకు బహిరంగ సభల్లో బుల్లెట్ ప్రూఫ్ చొక్కా వేసుకొని, ప్రచారం చేయాల్సిన దుఃస్థితి. మాటల్లో సౌమ్యత, మనిషి కొంత మహాత్మా పోలికలతో ‘గాంధీ కెమల్’ అని ముద్దుగా అందరూ పిలుచుకొనే ప్రజాస్వామికవాది ఓడిపోయారు. నిజానికి 600 సభ్యుల పార్లమెంట్‌కూ, అధ్యక్ష స్థానానికీ మే 14న జరిగిన ఎన్నికలు ప్రస్తుత అధ్యక్షుడిని ఇంటికి సాగనంపి, ప్రతిపక్షాల సమష్టి అభ్యర్థి కెమల్కు పట్టం కడతాయని భావించారు. ఎన్నికల జోస్యాలూ ఆ మాటే చెప్పాయి. తీరా జరిగింది వేరు. 6.4 కోట్ల మంది ఓటర్లలో 88 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొంటే, 49.5 శాతం ఓట్లు ఎర్డొగాన్కూ, 44.8 శాతం ప్రత్యర్థికీ వచ్చాయి. ఆయన కూటమి ‘పీపుల్స్ అలయన్స్’ పార్లమెంట్లో 323 స్థానాలు, ప్రత్యర్థి ‘నేషన్ అలయన్స్’కు 213 స్థానాలు దక్కాయి. అధ్యక్ష పదవికి కావాల్సిన 50 శాతం ఓట్ల కోసం దేశ చరిత్రలో తొలిసారిగా కథ రెండో దఫా ఎన్నికల దాకా సాగింది. ఈ మదగజాల పోరులో సుమారు కోటి మంది సిరియన్ శరణార్థుల గోడు ఎవరికీ పట్టలేదు. ఇరుపక్షాలూ శరణార్థుల్ని వెనక్కి పంపేస్తామన్నాయి. సౌమ్యుడైన కెమల్ సైతం చివరకు ఓట్ల పునాదిని పెంచుకొనే వ్యూహంతో శరణార్థులపై కటువుగా మాట్లాడారు. అయినా లాభం లేకపోయింది. మే 28న రెండో దఫాలో 84 శాతం ఓట్లు పోలైతే, 48 శాతం వద్దే ప్రత్యర్థి ఆగిపోయారు. 52 శాతం ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడికే పట్టం దక్కింది. ఇల్లలకగానే పండగ కాదన్నట్టు... ఎన్నికల్లో ఎర్డొగాన్ గెలిచారు కానీ, కథ అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇప్పటికి గెలిచినా, భిన్న ధ్రువాలుగా చీలిపోయిన దేశంలో, ఆయన అజెండాను ఇప్పటికీ 47 శాతం పైగా వ్యతిరేకిస్తున్నారని మర్చిపోరాదు. అందుకే, వరుసగా అయిదోసారి అధ్యక్షుడై, అధికారంలో మూడో దశాబ్దంలోకి అడుగిడుతున్న ఆయన ముంగిట అనేక సవాళ్ళు న్నాయి. టర్కీలో ద్రవ్యోల్బణం 44 శాతానికి చేరింది. 2018 నుంచి ఇప్పటికి కరెన్సీ విలువ 80 శాతం క్షీణించింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 151 మిలియన్ డాలర్ల లోటులో పడ్డాయి. ఫిబ్ర వరిలో 50 వేల మంది మరణించిన భారీ భూకంప వేళ సర్కార్ పనితీరూ అంతంత మాత్రమే. ఇన్ని కష్టాల మధ్యా యూఏఈ, సౌదీ, రష్యాల నుంచి గణనీయ విదేశీ సాయంతో బండి నెట్టుకొచ్చారు. రానున్న అయిదేళ్ళలో ఈ నిరంకుశ నేత ఆర్థికవ్యవస్థను ఎలా సుస్థిరం చేస్తారన్నది ఆసక్తికరం. ఇక, భౌగోళికంగా ఆసియా – ఐరోపాల కొసన ఉండడం, ముస్లిమ్ ప్రపంచంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రపంచ దేశాల్లో టర్కీ ఒకటి. రష్యా నుంచి లాభపడుతున్న ఈ ‘నాటో’ సభ్యదేశపు విదేశాంగ విధానం స్పష్టమే. రష్యాకూ, పాశ్చాత్య ప్రపంచానికీ మధ్య సాగుతున్న ప్రస్తుత పోరాటంలో ఆ దేశం తన వైఖరిని మార్చుకోదు. పాశ్చాత్య ప్రపంచానికి కాక పుట్టేలా ప్రాంతీయంగా, విదేశీ వ్యవహారాల్లో వ్యూహాత్మక స్వతంత్రతను చూప నుంది. భారత్‌తో ఒకప్పుడు బలమైన బంధమున్నా, 370వ అధికరణం రద్దు తర్వాత కశ్మీర్‌పై ఎర్డొ గాన్ ప్రకటనలు, పాక్‌తో సాన్నిహిత్యం నేపథ్యంలో మన సంబంధాలెలా ఉంటాయో వేచి చూడాలి. మొత్తం మీద ఎన్నికలనేవి అన్నిసార్లూ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్న నమ్మకాన్ని అందిస్తాయని చెప్పలేం. ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేసి, అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసే నిబంధనల్ని మార్చేసి, అసలు స్ఫూర్తికే తిలోదకాలిచ్చినప్పుడు ఎన్నికలు నామ మాత్రమే! ప్రజాస్వామ్యం పేరుకే! సైన్యం తెర వెనుక ఉండి కథ నడిపే పాకిస్తాన్ సహా అనేక దేశాల్లో ఇదే ప్రహసనం. దశాబ్ది పైచిలుకుగా టర్కీలో ఎర్డొగాన్ చేసిందీ, జరిగిందీ ఇలాంటి ప్రజాస్వామ్య పరిహాసమే. కానీ, అధికారాన్ని నిలుపుకోవడానికి అక్కరకొచ్చిన ఈ ఆట ఆర్థిక కష్టాల్లోని దేశాన్ని ముందుకు నడిపించడానికి ఇకపైనా పనికొస్తుందా? -
Turkey: నరాలు తెగే ఉత్కంఠ.. చారిత్రక విజయం
ఇస్తాంబుల్: టర్కీ(తుర్కీయే) అధ్యక్ష ఎన్నికల్లో రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్(69) మరోసారి ఘన విజయం సాధించారు. సుప్రీం ఎలక్షన్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికలకు తుది ఫలితాలు వెలువడిన అనంతరం.. తన విజయాన్ని ఆదివారం రాత్రి స్వయంగా ప్రకటించారాయన. దారుణమైన ఆర్థిక సంక్షోభం, దానికి తోడు భారీ భూకంపంతో కుదేలు కావడం.. ఆయనకు ఎన్నికల్లో ప్రతికూల అంశాలు అవుతాయని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ, ఆ అంచనాలు తప్పాయి. చారిత్రక విజయం అందుకున్నారాయన. రాబోయే ఐదేళ్ల కాలం తామే దేశాన్ని పరిపాలించబోతున్నామని ప్రకటించారాయన. ఈ మేరకు తన స్వస్థలం ఇస్తాంబుల్‌లో ఓ బస్సు టాప్‌పైకి ఎక్కి తన మద్దతుదారులను ఉద్దేశించి.. ఆయన మాట్లాడారు. మీ నమ్మకాన్ని చురగొనాలన్నది దైవాజ్ఞ అంటూ పేర్కొన్నారాయన. మరోవైపు ఎర్డోగాన్ విజయాన్ని ఆయన మద్దతుదారులు, యువత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున్న నిర్వహించింది. మే 14వ తేదీన ఓటింగ్ జరగ్గా.. తొలి విడత కౌంటింగ్‌లో ఆసక్తికర ఫలితాలు రావడం ఉత్కంఠ రేపింది. ఒకానొక దశలో ఎర్డోగాన్ ఓడిపోతారేమోనని భావించారంతా. ఎర్డోగాన్‌కు 49.5 శాతం, కిలిక్దారోగ్లుకి 44.9 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో రెండో(తుది) రౌండ్ ఫలితం కోసం టర్కీ ఉత్కంఠగా ఎదురు చూసింది. అయితే కౌంటింగ్‌లో ఎర్డోగాన్ 52 శాతం ఓట్లు సాధించారు. ప్రత్యర్థి కెమల్ కిలిక్దారోగ్లుకు 48 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో.. ఎర్డోగాన్ విజయం ఖరారైంది. Cumhurbaşkanı #RecepTayyipErdoğan: "Milletimizin her iradesi gibi bu sonucun da başımızın üstünde yeri vardır. Kazanan sadece biz değiliz. Kazanan Türkiye'dir, kazanan demokrasimizdir." ADAM KAZANDI BAŞLASIN TÜRKİYE YÜZYILI 🇹🇷 pic.twitter.com/l3AJPSveWI — Emel@259126411 (@EMel259126411) May 29, 2023 గత రెండు దశాబ్దాలుగా ఎర్డోగాన్ పాలకుడిగా కొనసాగుతున్నారు. అధ్యక్షుడిగా, అంతకు ముందు ప్రధానిగా ఆయన పని చేశారు. ఇదిలా ఉంటే.. ఎర్డోగాన్ చారిత్రక విజయం పట్ల పలు దేశాల అధినేతలు, ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుట్రెస్ సోషల్‌మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. Congratulations @RTErdogan on re-election as the President of Türkiye! I am confident that our bilateral ties and cooperation on global issues will continue to grow in the coming times. — Narendra Modi (@narendramodi) May 29, 2023 జార్జియా మూలాలు ఉన్న రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ కుటుంబం.. ఆయన 13వ ఏట ఇస్తాంబుల్‌కు వలస వచ్చింది. సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన ఆయన.. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల్లో ఆ విశ్వాసాలను పక్కనపెట్టాడు. సంస్కరణల పేరిట ఆయన తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా మహిళలకు స్వేచ్ఛలాంటివి.. మతపరమైన విమర్శలకు దారి తీశాయి. అయితే పేదల సంక్షేమం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు మళ్లీ ఆయన్ని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాయి. 2014 నుంచి టర్కీకి అధ్యక్షుడిగా పని చేశారు. 2003 నుంచి 2014 నడుమ.. ఆ దేశ ప్రధానిగా పని చేశారు. అంతకు ముందు ఆయనపై రాజకీయ నిషేధం కొనసాగడం గననార్హం. బ్యాన్‌కి ముందు.. 1994-98 మధ్య ఇస్తాంబుల్ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2001లో ఏర్పాటు చేసిన జస్టిస్ ఫర్ డెవలప్మెంట్ పార్టీ(AKP) సహ వ్యవస్థాపకుడు కూడా. 1954లో రిజ్, గునెయ్జులో పుట్టిన ఎర్డోగాన్.. ఆర్థిక శాస్త్రంలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఆపై రాజకీయాల వైపు అడుగులేశారు. ఇస్లామిక్ రాజకీయ నేత నెక్మెట్టిన్ ఎర్బకన్కు ప్రియ శిష్యుడిగా కొనసాగి.. స్థానిక రాజకీయాల్లో రాణించాడు. ఆపై ఇస్తాంబుల్‌కు మేయర్ అయ్యాడు. జైలు శిక్ష.. మార్పు 1997లో ఇస్తాంబుల్ మేయర్‌గా కొనసాగుతున్న టైంలో.. ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు. టర్కీ ఉద్యమకారుడైన జియా గోకాల్ప్ రచనల్లోని ఓ పద్యాన్ని పఠించే సమయంలో.. మాతృకలో లేని అంశాలను జోడించి చదివి వినిపించారాయన. అయితే ఆ పదాలు అభ్యంతరకరంగా ఉండడంతో.. వివాదం మొదలైంది. ఆయన చేసిన పని హింసకు, విద్వేషానికి దారి తీసేలా ఉందంటూ పది నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. దీంతో.. ఆయన తన మేయర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతేకాదు.. ఆయనపై రాజకీయ నిషేధం అమలులోకి వచ్చింది. ఈలోపు ఆయన తన తన శిక్షను జరిమానా కింద మార్చాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. కోర్టు ఆ శిక్షను నాలుగు నెలల కిందకు కుదించింది. అప్పుడు ఆయన్ని కిర్క్లారెలీలోని పినర్హిసార్ జైలుకు తరలించారు. ఆయన జైలుకు వెళ్లిన రోజునే.. దిస్ సాంగ్ డసన్ట్ ఎండ్ హియర్ అనే ఆల్బమ్ ఒకటి ఆయన రిలీజ్ చేశారు. అందులో ఏడు పద్యాలతో కూడిన ట్రాక్ లిస్ట్ ఉండగా.. 1999లో బెస్ట్ సెల్లింగ్‌గా నిలవడంతో పాటు ఏకంగా మిలియన్ కాపీలు అమ్ముడుపోయి రికార్డు సృష్టిచింది. అంతేకాదు.. అక్కడి నుంచే జస్టిస్ ఫర్ డెవలప్మెంట్ పార్టీ(AK Parti)కి ఆలోచన చేశాడాయన. ఆ తర్వాత మత విశ్వాసాలను పక్కనపెట్టి.. పాశ్చాత్య ధోరణి తరహా పాలనను తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలో వామపక్ష భావజాలంతో ముందుకు సాగారాయన. పేదల మనిషిగా తన పాలన ముద్రపడేలా ముందుకెళ్లారు. 2013లో టర్కీ ప్రధాని హోదాలో పినర్హిసార్ జైలును సందర్శించిన ఆయన.. తనకిది పునర్జన్మ ఇచ్చిన ప్రదేశమని ప్రకటించుకున్నారు. ఆ సమయంలో టర్కీలో విపరీతమైన ప్రజాదరణ ఆయన వశమైంది. -
వీడియో: రష్యా ప్రతినిధి కవ్వింపు.. ఉక్రెయిన్ ఎంపీ పంచ్‌ల వర్షం
అంకారా: రష్యా ప్రతినిధిపై ఉక్రెయిన్ ఎంపీ దాడి చేశారు. రష్యా ప్రతినిధి కవ్వింపు చర్యతో ఆగ్రహానికిలోనైన ఉక్రెయిన్ ఎంపీ.. అతడిపై దాడికి దిగాడు. ముఖంపై పంచ్ ఇచ్చి.. గాయపరిచాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. టర్కీ దేశ రాజధాని అంకారాలోని గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది. బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ 61వ పార్లమెంటరీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇక, ఈ సమ్మిట్‌కు పలువురు రష్యా ప్రతినిధులు, ఉక్రెయిన్ ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో సమ్మిట్‌కు హాజరైన ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండర్ మారికోవ్స్కీ తమ దేశ జెండాను ప్రదర్శించాడు. ఇదే సమయంలో అటుగా వస్తున్న రష్యా ప్రతినిధి ఒకరు ఓవరాక్షన్ చేశారు. ఒలెక్సాండర్ చేతిలోని జెండాను ఒక్కసారిగా లాక్కొని అక్కడి నుంచి పరుగులు తీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఉక్రెయిన్ ఎంపీ.. అతన్ని వెంబడించి పట్టుకున్నాడు. పిడిగుద్దులు గుద్దుతూ రష్యా ప్రతినిధిని చావబాదాడు. అక్కడే ఉన్న ఇతర అధికారులు వీరిని అడ్డుకున్నారు. అనంతరం రష్యా ప్రతినిధి చేతిలోని జెండాని ఎంపీ లాక్కున్నాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా ప్రతినిధి కవ్వింపు చర్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: మరో ఆప్షన్ లేదు.. లొంగిపోతానన్నా వినొద్దు.. జెలెన్స్కీని మట్టుబెట్టాల్సిందే! -
మెక్సికోకు 'కుక్కపిల్ల'ను గిఫ్ట్‌గా ఇచ్చిన టర్కీ!..అదే ఎందుకంటే?..
మెక్సికోకు టర్కీ మూడు నెలల వయసున్న జర్మనీ షెపర్డ్ కుక్కపిల్లను ఇచ్చించి. ఈ మేరకు మెక్సికో సైన్యం బుధవారం టర్కీ గిఫ్ట్‌గా ఇచ్చిన ఆ కుక్క పిల్లను స్వాగతించింది. అసలు టర్కీ ఎందుకు ఆ కుక్కపిల్లనే గిఫ్ట్‌గా ఇచ్చిందంటే..ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి నెలలో టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకృతి విలయతాండవానికి వేలాదిగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నాటి ఘటనలో భూకంప శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు మెక్సికో రెస్క్యూ డాగ్‌లతో మోహరించింది. ఆ టర్కీ రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రొటీయో అనే జర్మన్ షెషర్డ్ జాతికి చెందిన కుక్క చాలా చురుకుగా సేవలందించింది. ఐతే అది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయింది. ఈ జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్క భూకంపాలు, ప్రకృతి వైపరిత్యాలకు గురయ్యే ప్రదేశంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఆయా ప్రదేశంలోని శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారి ఆచూకిని కనిపెట్టడంలో ప్రసిద్ధి చెందింది. దీంతో టర్కీ ఆ జాతికి చెందిని మూడు నెలల వయసున్న కుక్క పిల్లను విధి నిర్వహణలో ప్రాణాలొదిలేసిన కుక్క పిల్లకు బదులుగా మెక్కికోకు గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ కుక్కపిల్లకు 'ఆర్కాదాస్గా' నామకరణం ఈ కుక్కపిల్లకు మెక్కికో సైన్యం స్వాగతం పలకడమే గాక ఆర్కాదాస్ అని పేరుపెట్టింది. టర్కిష్‌లో ఆర్కాదాస్ అంటే స్నేహితుడు అని అర్థం. మృతి చెందిన ప్రోటియోని సంరక్షించిన ట్రెయినరే ఆర్కాదాస్కి కూడా శిక్షణ ఇస్తారని మెక్సికో సైన్యం తెలిపింది. ఈ మేరకు సదరు కుక్కపిల్ల గ్రీన్‌కలర్ సైనిక యూనిఫాం ధరించి బుధవారం మెక్సికో సైనిక స్థావరంలో జరుగుతున్న అధికారిక వేడుకలో పాల్గొంది. సరిగ్గా మెక్కికో జాతీయ గీతం స్పీకర్ల నుంచి వస్తుండగా.. ఒక్కసారిగా ఆ కుక్కపిల్ల ఉద్వేగభరితంగా మొరిగి తన విశ్వాసాన్ని చాటుకుంది. ఈ నేపథ్యంలో మెక్కికో రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్కాదాస్ తరుఫున ఒక ట్వీట్ కూడా చేసింది. ఆ ట్వీట్లో.."నన్ను ఎంతో ఆప్యాయంగా స్వాగతించిన మెక్సికోకు చెందిన స్నేహితులకు ధన్యవాదాలు. రెస్క్యూ డాగ్‌గా ఉండేందుకు నావంతుగా కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను ". అని పేర్కొంది రక్షణ శాఖ. కాగా, టర్కీ రెస్క్యూ ఆపరేషన్‌లో మరణించిన ప్రోటీయో కుక్కుకు మెక్కికో ఘనంగా సైనిక అంత్యక్రియలు నిర్వహించి నివాళులర్పించింది. (చదవండి: మరో ఆప్షన్ లేదు.. లొంగిపోతానన్నా వినొద్దు.. జెలెన్స్కీని మట్టుబెట్టాల్సిందే!) -
ఐఎస్ఐఎస్ చీఫ్ మృతి..ప్రకటించిన టర్కీ అధ్యక్షుడు
అనుమానిత ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ హుస్సేన్ అల్ ఖురాషి సిరియాలో మృతి చెందినట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రకటించారు. టర్కీ గూఢచార సంస్థ ఎంఐటీ ఇంటిలిజెన్స్ నిర్వహించిన ఆపరేషన్‌లో హతమయ్యినట్లు పేర్కొన్నారు. తీవ్రవాద సంస్థలపై ఎలాంటి వివక్ష లేకుండా టర్కీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఎర్గోగాన్ అన్నారు. 2013లో డేష్/ఐసిస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన మొదటి దేశాలలో టర్కీ ఒకటిగా నిలిచింది. ఇంటిలిజెన్స్ ఏజెంట్లు స్థానిక మిలటరీ పోలీసుల సాయంతో సిరియాలో ఆఫ్రిన్ వాయవ్య ప్రాంతంలో జిండిరెస్‌లోని ఒక జోన్‌ని మూసివేసి ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు ఎర్డోగాన్. ఈ ఆపరేషన్‌లో ఇస్లామిక్ పాఠశాలగా వినియోగిస్తున్న పాడుపడిన పోలాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. టర్కీ 2020 నుంచి ఉత్తర సిరియాలో దళాలను మోహరించి ఈ ఆపరేషన్లను నిర్వహిస్తోంది. ఈ ప్రాంతంలో సిరియన్ సహాయకుల సాయంతో మొత్తం జోన్లను నియంత్రిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఐఎస్ఐఎస్ మునుపటి చీఫ్ అబూ హసన్ అల్-హషిమీ అల్-ఖురాషి మరణించినట్లు నవంబర్ 30న ప్రకటించింది టర్కీ. అతని స్థానంలోకి ప్రస్తుతం టర్కీ చనిపోయినట్లు ప్రకటించిన ఐఎస్ఐఎస్ అబూ హుస్సేన్ అల్-ఖురాషీ వచ్చాడు. కాగా, అమెరికా కూడా ఏప్రిల్ మధ్యలో హెలికాప్టర్ దాడులతో ఒక ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో ఐఎస్ఐఎస్కు చెందిన అబ్ద్-అల్ హదీ మహ్మద్ అల్-హాజీ అలీని హతమార్చినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అంతేగాదు 2019లో వాయువ్య సిరియాలో జరిగిన ఆపరేషన్‌లో ఐఎస్ఐఎస్ అబూ బకర్ అల్ బాగ్దాదీని చంపినట్లు యూఎస్ ప్రకిటించింది. ఆ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ఒకప్పుడూ నియంత్రించి తరిమికొట్టినప్పటికీ ఇప్పటికీ సిరియాలో దాడలు చేస్తుండటం గమనార్హం. (చదవండి: ఏ మూడ్‌లో ఉందో సింహం! సడెన్‌గా కీపర్‌పైనే దాడి..చూస్తుండగా క్షణాల్లో..) -
టర్కీలో మరోసారి భూకంపం
టర్కీ aka తుర్కియేను మరోసారి భూకంపం వణికించింది. శనివారం ఉదయం గోక్సన్ జిల్లాలో ప్రకంపనలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఆ ప్రకంపనలతో భీతిల్లిన జనం వీధుల వెంట పరుగులు తీశారు. గోక్సన్ జిల్లాకు నైరుతి వైపున ఆరు కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేల్‌పై 4.4 తీవ్రతతో భూకంప కేంద్రం నమోదు అయ్యింది. ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ప్రకంపనలు వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రకంపనల ధాటికి నష్టం ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి మొదటి వారంలో సంభవించిన భారీ భూకంపంతో ఇప్పట్లో కోలుకోలేని విధంగా టర్కీ నష్టపోయింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. మరోవైపు టర్కీతో పాటు పొరుగున ఉన్న సిరియా సైతం భూకంపంతో తీవ్రంగా నష్టపోయింది. ఇదిలా ఉండగా.. టర్కీ భూకంప బాధితుల సహాయార్థం కేరళ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ. 10 కోట్లు మంజూరు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: కరోనా పుట్టుకపై మరో షాకింగ్ కోణం! -
టర్కీలో వరదల బీభత్సం.. 14 మంది మృతి
అంకారా: ప్రకృతి ప్రకోపంతో టర్కీ వణికిపోతోంది. వేలాది మందిని బలిగొన్న భీకర భూకంప ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న టర్కీలో వరదలు ముంచెత్తుతున్నాయి. అదియమాన్, సాన్లీయుర్ఫా ప్రావిన్స్‌లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరదల వల్ల ఇప్పటిదాకా 14 మంది మృతిచెందారని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. కనీసం ఇద్దరు కనిపించకుండాపోయారని తెలియజేశాయి. -
టర్కీ భూకంప బాధిత చిన్నారుల కోసం ఫుట్‌బాల్ ప్రేమికులు ఏం చేశారో చూడండి..!
ఈ ఏడాది ఫిబ్రవరి 6న టర్కీ దేశాన్ని భారీ భూకంపం (రిక్టర్ స్కేలుపై 7.8 మ్యాగ్నిట్యూడ్) అతలాకుతలం చేసిన విషయం విధితమే. ఈ మహా విలయంలో దాదాపు 50000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారిలో మహిళలు, వృద్దులు, చిన్న పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఘనా స్టార్ ఫుట్‌బాలర్, న్యూకాస్టిల్ వింగర్ క్రిస్టియన్ అట్సూ కూడా ఉన్నాడు. ఈ భారీ భూకంపం టర్కీతో పాటు సిరియా దేశంపై కూడా విరుచుకుపడింది. భూకంపం తెల్లవారు జామున 4:17 గంటల సమయంలో రావడంతో ప్రాణ నష్టం అధికంగా జరిగింది. ఇదిలా ఉంటే, టర్కీ సూపర్ లీగ్‌లో భాగంగా ఫిబ్రవరి 26న అంటాల్యాస్పోర్-బెసిక్టాస్ క్లబ్‌ల మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా బెసిక్టాస్ అభిమానులు తమ మానవతా దృక్పథాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు. ఈ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలోని బెసిక్టాస్ అభిమానులు టర్కీ, సిరియా భూకంప బాధిత చిన్నారుల కోసం ఖరీదైన బొమ్మలు, గిఫ్ట్‌లు, కండువాలను మైదానంలోకి విసిరారు. ఊహించని విధంగా ఇలా జరగడంతో లీగ్ నిర్వహకులు మ్యాచ్‌ను కాసేపు (4 నిమిషాల 17 సెకెన్ల పాటు) నిలిపివేసి దాతలను ఎంకరేజ్ చేశారు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. చిన్న పిల్లల కోసం బెసిక్టాస్ అభిమానులు చేసిన వినూత్న సాయం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి దాతృత్వ హృదయాలకు జనం సలాం కొడుతున్నారు. -
ఇటలీ పడవ ప్రమాదంలో 24 మందికి పైగా పాకిస్తానీలు గల్లంతు
ఇటలీ సముద్ర జలాల్లో వలసదారులు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ప్రమాదంలో 59 మంది గల్లంతవ్వగా, వారిలో 24 మంది పాకిస్తానీలు ఉన్నట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఈ ప్రమాదం నుంచి సుమారు 81 మంది ప్రాణాలతో బయటపడగా, ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స తీసుకుంటున్న వ్యక్తితో సహా 20 మంది ఆస్పత్రి పాలైనట్లు ఇటాలియన్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 58 మృతదేహాలను వెలికితీశారని, 61 మంది ప్రాణాలను రక్షించినట్లు వెల్లడించారు. టర్కీ నుంచి బయలుదేరిన ఈ చెక్క పడవలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెండు డజన్ల మందికి పైగా పాకిస్తానీయులు మునిగిపోయారన్న నివేదికలు త్రీవ ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. సాధ్యమైనంత త్వరగా వాస్తవాలను నిర్థారించాలని విదేశాంగ కార్యాలయాన్ని ఆదేశించారు. కాగా, మానవ స్మగ్లర్లు యూరప్‌లోకి వలసదారులను అక్రమంగా రవాణా చేయడానికి ఉపయోగించే మార్గాలలో టర్కీ ఒకటి. (చదవండి: ఇటలీ సముద్ర జలాల్లో పడవ మునక ) -
తుర్కియే- సిరియా భూకంపాలు: కదిలే భూమిని కనిపెట్టలేమా!
మనిషి చూపులు అంతరిక్షం అంచులను తాకుతున్నాయి! కోటానుకోట్ల కిలోమీటర్ల దూరంలో ఏముందో? ఏం జరుగుతుందో.. దుర్భిణుల సాయంతో ఇట్టే పసిగట్టగలుగుతున్నాం! కానీ.. మన కాళ్లకింద నేల లోపలి రహాస్యాలు మాత్రం.. ఇప్పటికీ చేతికి చిక్కకుండానే ఉన్నాయి! తుర్కియే- సిరియాల్లో ఇటీవలి భూకంపాలు రెండూ.. ఇందుకు తాజా నిదర్శనం! వాన రాకడ.. ప్రాణం పోకడలను కొంచెం అటు ఇటుగానైనా గుర్తించగల మానవ మేధ..భూకంపాల విషయానికి వచ్చేసరికి ఎందుకు విఫలమవుతోంది? ఫిబ్రవరి ఆరు.. 2023.. తెలతెలవారుతుండగానే తుర్కియే ఆగ్నేయ ప్రాంతాన్ని మహా భూకంపం కుదిపేసింది. ప్రజలింకా నిద్రలో ఉండగానే.. భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ముంచుకొచ్చిన ఈ విలయం తాకిడికి వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఎలక్ట్రానిక్ పరికరాలపై 7.8 తీవ్రతతో నమోదైన భూకంపం గురించి ప్రపంచానికి తెలిసింది కూడా ప్రకంపనల ద్వారానే అంటేనే ఈ భూకంపాలు ఎంత నిశ్శబ్దంగా మనిషిని కబళించగలవో ఇట్టే అర్థమైపోతుంది. తుర్కియేలో తొలి భూకంపం సంభవించిన కొన్ని గంటల తరువాత సిరియా ఉత్తర ప్రాంతంలో సుమారు 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. రెండు భూకంపాల కేంద్రాలూ భూమికి అతితక్కువ లోతులోనే పుట్టాయి. దీంతో కదలికల తీవ్రత ఎక్కువగా ఉండింది. ప్రధాన భూకంపం తరువాత వచ్చిన ప్రకంపనలూ ఎక్కువ కాలం కొనసాగాయి. రక్షణ చర్యలకు విఘాతం కలిగించే స్థాయిలో ఇవి ఉండటం గమనార్హం. సహాయక పనుల కోసం అక్కడికి చేరుకున్న వారు కూడా.. నేల కుప్పకూలిపోవడం, గ్రౌండ్ లిక్విఫికేష¯Œ వంటి ప్రమాదాల్లో చిక్కుకునే రిస్క్ ఉందని అమెరికా జియలాజికల్ సర్వే హెచ్చరించింది కూడా. రోజులు గడుస్తున్న కొద్దీ శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించడం వీలైంది. 228 గంటల తరువాత కూడా కొంతమంది ప్రాణాలతో బయటపడటం అందరికీ ఊరటనిచ్చింది కానీ.. అప్పటి నుంచి ఇప్పటివరకూ అందరి మనసులను.. ఈ భూకంపాలను ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయామన్న ప్రశ్న మాత్రం వేధిస్తూనే ఉంది. తుర్కియే, సిరియాల్లో సంభవించిన భూకంపాలతో సుమారు 41 వేల మంది మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి. గాజియాన్‌టెప్ పట్టణం సమీపంలో తొలి భూకంపం తరువాత కూడా పలుమార్లు భూమి కంపించింది. ఈ ఆఫ్టర్‌షాక్స్ మధ్యలోనే ఇంకో భూకంపమూ సంభవించింది. తొలి భూకంపం తీవ్రత 7.8. ఆ లెక్కల ప్రకారం ఇది చాలా పెద్ద భూకంపం. భూమి లోపల వంద కిలోమీటర్ల పొడవైన ఫాల్ట్‌లైన్ లో రావడంతో పరిసరాల్లోని భవనాలకు తీవ్ర నష్టం జరిగింది. ఏటా సంభవించే అత్యంత ప్రమాదకరమైన భూకంపాలను పరిగణనలోకి తీసుకుంటే గత పదేళ్లలో కేవలం రెండు మాత్రమే ఈ స్థాయిలో ఉండటం, అంతకుముందు పదేళ్లలోనూ నాలుగు మాత్రమే ఈ స్థాయిలో ఉండటం గమనార్హం. అలాగని కేవలం ప్రకంపనల ఫలితంగానే ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని కూడా చెప్పలేం. ఎందుకంటే ప్రజలు ఇళ్లల్లో నిద్రలో ఉన్న సమయంలోనే ప్రమాదం జరగడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇంకో కారణం.. ఆ ప్రాంతాల్లోని భవనాల దృఢత్వం! తుర్కియే, సిరియా.. రెండింటిలోనూ భూకంపాలను తట్టుకోగల భవనాలు దాదాపుగా లేవని నిపుణులు గుర్తు చేస్తున్నారు. 200 ఏళ్లుగా భూకంపాల్లేవు.. తుర్కియే, సిరియాల్లో గత 200 ఏళ్లుగా చెప్పుకోదగ్గ తీవ్రతతో భూకంపాలు లేవు. పోనీ చిన్నస్థాయిలోనైనా ప్రకంపనలేవైనా నమోదయ్యాయా? అంటే అదీ లేదు. దీంతో ఆ ప్రాంతంలో భూకంపాల సన్నద్ధత కూడా తక్కువగానే ఉండింది. 1970 నుంచి ఈ ప్రాంతంలో ఆరు కంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు మూడే మూడు నమోదయ్యాయి. ఇంతకీ భూకంపాలు ఎందుకొస్తాయి? ఎలా వస్తాయన్న అనుమానం కలుగుతోందా? సమాధానాలు తెలుసుకుందాం! కాకపోతే ఇందుకోసం భూమి నిర్మాణాన్ని కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉల్లిపాయ మాదిరిగానే భూమి కూడా పొరలు పొరలుగా ఉంటుందని మనం చదువుకుని ఉంటాం. ఈ పొరల్లో అన్నింటికంటే పైన ఉన్నదాన్ని క్రస్ట్ అంటారు. మన కాళ్ల కింద మొదలై కొన్ని కిలోమీటర్ల లోతు వరకూ ఉంటుంది ఈ పొర. దాని దిగువన మాంటెల్, అంతకంటే దిగువన కోర్ అని పేర్లున్న పొరలు ఉంటాయి. ఇప్పుడు పై పొర క్రస్ట్ గురించి కొంచెం వివరంగా.. భూమి మొత్తం ఇది ఒకే ఒక్కటిగా ఉండదు. ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఒక్కో ముక్కను టెక్టానిక్ ప్లేట్ అని అంటారు. ఈ ప్లేట్లు స్థిరంగా కాకుండా.. కదులుతూ ఉంటాయి. టెక్టానిక్ ప్లేట్లు కదిలే క్రమంలో ఘర్షణ పుడుతూంటుంది. రెండు ప్లేట్లు ఢీకొనడం.. లేదా ఒకదాని కిందకు ఒకటి చేరడం.. లేదా ఒకదానికి ఒకటి దూరంగా జరగడం వంటి నాలుగు రకాల కదలికల కారణంగా ఆయా ప్రాంతాల్లో ఘర్షణ జరగుతూ ఉంటుంది. అత్యధిక పీడనం నిల్వ అవుతూ వస్తుంది. ఈ పీడనం కారణంగా ఒక్కోసారి ఒక ప్లేట్ అకస్మాత్తుగా ఇంకోదానిపై జరగడం వల్ల అప్పటివరకూ అక్కడ నిల్వ ఉన్న పీడనం భూకంపం రూపంలో విడుదల అవుతుంది. తుర్కియే, సిరియాల్లో భూకంపాలు సంభవించిన ప్రాంతం మూడు టెక్టానిక్ ప్లేట్ల సంగమ స్థలం. అనటోలియా, అరేబియన్ , ఆఫ్రికా ప్లేట్లు కలిసే చోటనే భూకంపాలు సంభవించాయి. అరేబియా ప్లేట్ ఉత్తరం వైపు కదులుతూ అనటోలియన్ ప్లేట్‌పై ఒత్తిడి తెచ్చిన కారణంగా భూకంపం సంభవించింది. 1822 ఆగస్టు 13న ఈ ప్రాంతంలోనే 7.4 తీవ్రతతో ఒక భూకంపం సంభవించింది. ఆ తరువాత ఆ స్థాయి భూకంపం వచ్చింది ఈ ఏడాదే. 1822 నాటి భూకంపంలోనూ ఈ ప్రాంతంలో ప్రాణనష్టం, విధ్వంసం ఎక్కువగానే నమోదైంది. ఒక్క అలెప్పో నగరంలోనే 7000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఏడాది పాటు కొనసాగిన ప్రకంపనలు మరింత విధ్వంసం సృష్టించాయి. తాజాగానూ ప్రకంపనలు మరికొంత కాలం కొనసాగుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయాం? వాస్తవానికి భూకంపాలను ముందుగానే గుర్తించేందుకు ఇప్పటివరకూ ఎలాంటి టెక్నాలజీ లేదు. చాలా చాలా కష్టమైన వ్యవహారమీ భూకంపాలు. భూకంపం జరిగిన తరువాత కూడా కేవలం ఒకట్రెండు నిమిషాలు మాత్రమే దాని సంకేతాలు మనకు తెలుస్తూంటాయి. అందుకే భూకంపాల గురించి తెలిసే ఈ అతికొద్ది సమాచారం ఆధారంగా వాటిని ముందుగానే గుర్తించడం పెను సవాలుగా మారింది. నిజానికి 1960ల నుంచే భూకంపాలను ముందుగా గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. టెక్టానిక్ ప్లేట్ల అమరిక, లోటుపాట్లు (ఫాల్ట్‌లైన్స్) అత్యంత సంక్లిష్టంగా ఉన్న కారణంగా ఇప్పటివరకూ సాధించింది కొంతే. ప్రపంచం మొత్తం వ్యాపించిన ఫాల్ట్లైన్లకు తోడు భూమి లోపలి నుంచి పలు రకాల శబ్దాలు, సంకేతాలు వెలువడుతూండటం కూడా పరిస్థితిని మరింత జటిలం చేశాయి. భూకంపం ఎక్కడ వస్తుంది? ఎప్పుడు వస్తుంది? తీవ్రత ఎంత? అన్న మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పగల పద్ధతిని ఆవిష్కరించగలిగితే మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ ఇప్పటివరకూ ఈ ప్రశ్నలకు సమాధానం లభించలేదు. జంతువుల ప్రవర్తన నుంచి అయనోస్ఫియర్ వరకూ.. భూకంపాలను ముందుగానే గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ అనేక ప్రయత్నాలు చేశారు. భూకంపం వచ్చే ముందు జంతువులు ప్రవర్తించే తీరుతో మొదలుపెట్టి భూ వాతావరణపు పైపొర అయనోస్ఫియర్‌లోని కణాల పరిశీలన వరకూ అనేక రకాలుగా యత్నిస్తున్నారు. తాజాగా మనుషులు గుర్తించలేరేమో అని.. సూక్ష్మమైన సంకేతాలను గుర్తించేందుకు కృత్రిమ మేధను వాడే ప్రయత్నమూ జరుగుతోంది. భూమి మాదిరిగానే ఉండే మోడల్‌ను ఉపయోగించి మెషిన్ లెర్నింగ్ సాయంతో ఇటలీలోని సేపియేంజా యూనివర్సిటీ అధ్యాపకుడు క్రిస్ మరోన్ ప్రయత్నిస్తున్నారు. అయితే పరిశోధనశాలలో తాము భూకంపాలను బాగానే గుర్తించగలగుతున్నామని, వాస్తవ పరిస్థితుల్లో మాత్రం విఫలమవుతున్నామని మరోన్ తెలిపారు. చైనాలో శాస్త్రవేత్తలు అయనోస్ఫియర్‌లో విద్యుదావేశంతో కూడిన కణాలు భూకంపాల వల్ల ఏవైనా కంపనలు సృష్టించాయా? వాటి ద్వారా ముందస్తు గుర్తింపు వీలవుతుందా? అన్నది పరిశీలిస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎర్త్ క్వేక్ ఫోర్క్యాస్టింగ్కు చెందిన జింగ్ లియూ అంచనా ప్రకారం భూకంపానికి ముందు రోజుల్లో అయనోస్ఫియర్‌లో మార్పులు జరుగుతాయి. ఫాల్ట్ జోన్ల ప్రాంతం పైన భూ అయస్కాంత క్షేత్రంలో మార్పులు రావడం వల్ల విద్యుదావేశ కణాలు కంపనలు సృష్టిస్తాయి. 2010 ఏప్రిల్‌లో కాలిఫోర్నియాలోని బాజా ప్రాంతంలో భూకంపం వచ్చింది. దానికి పది రోజుల ముందే అయనోస్ఫియర్‌లో మార్పులను గమనించామని ఆయన చెబుతున్నారు. చైనా ఇంకో అడుగు ముందుకేసి అయనోస్ఫియర్‌లో జరిగే ఎలక్ట్రికల్ తేడాలను గుర్తించేందుకు 2018లో ‘చైనా సెసిమో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ శాటిలైట్’ను ప్రయోగించింది కూడా. గత ఏడాది చైనా ఎర్త్‌క్వేక్ నెట్వర్క్ సెంటర్ శాస్త్రవేత్తలు ఒక ప్రకటన చేస్తూ భూకంపానికి 15 రోజుల ముందు అయనోస్ఫియర్‌లోని ఎలక్ట్రాన్ల సాంద్రత గణనీయంగా తగ్గిందని తెలిపారు. 2021 మే, 2022 జనవరి నెలల్లో చైనాలో వచ్చిన భూకంపాలకు ముందు ఈ పరిశీలనలు జరిగాయి. ఇజ్రాయెల్‌లోని ఏరియల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాము భూకంపాలను 48 గంటల ముందే 83 శాతం కచ్చితత్వంతో గుర్తించగలమని ఇటీవలే ప్రకటించారు. గత 20 ఏళ్లలో అయనోస్ఫియర్‌లోని ఎలక్ట్రాన్ కంటెంట్‌లో వచ్చిన మార్పులకు కృత్రిమ మేధను జోడించడం ద్వారా ఇది సాధ్యమైందని వారు చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే.. జపాన్‌లో కొంతమంది కొన్ని విచిత్రమైన సూచనలు చేస్తున్నారు. భూకంపాలు వచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో నీటి ఆవిరి ఆధారంగా భూకంపాలను ముందుగానే గుర్తించవచ్చునని, అది కూడా 70 శాతం కచ్చితత్వంతో చేయవచ్చునని చెబుతూండటం విశేషం. కాకపోతే ఈ పద్ధతిలో నెల రోజులు ముందు మాత్రమే భూకంపాన్ని గుర్తించ వచ్చు. మరికొందరు భూ గురుత్వాకర్షణ శక్తిలో వచ్చే మార్పుల ఆధారంగా భూకంపాలను గుర్తించవచ్చునని చెబుతున్నారు. మొత్తమ్మీద చూస్తే.. శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ భూకంపాలను అవి సంభవించేందుకు ముందుగానే కచ్చితంగా గుర్తించడం సాధ్యంకావడం లేదనేది నిష్ఠుర సత్యం!! మీకు తెలుసా..? ► యునైటెడ్ స్టేట్స్ జియలాజికల్ సర్వే లెక్కల ప్రకారం భూమి ఏటా కొన్ని లక్షల సార్లు కంపిస్తూంటుంది. వీటిల్లో చాలావాటిని మనం అస్సలు గుర్తించం. తీవ్రత తక్కువగా ఉండటం, లేదా జనావాసాలకు దూరంగా సంభవించడం దీనికి కారణం. అయితే ఏటా సంభవించే భూకంపాల్లో ఏడు లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగినవని దాదాపు 17 వరకూ ఉంటాయి. ఎనిమిది స్థాయి తీవ్రత ఉన్నది ఒక్కటైనా ఉంటుంది. ► టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగా హిమాలయాల ఎత్తు పెరుగుతోందని మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. అలాగే అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరం మొత్తం లాస్ ఏంజిలెస్ వైపు కదులుతోంది. మన గోళ్లు పెరిగినంత వేగంగా అంటే ఏడాదికి రెండు అంగుళాల చొప్పున ఈ కదలిక ఉన్నట్లు అంచనా. సా¯Œ ఆండ్రియాస్ ఫాల్ట్ రెండు వైపులు ఒకదాని కింద ఒకటి జారిపోతూండటం వల్ల ఇలా జరుగుతోంది. అయితే ఈ రెండు నగరాలు కలిసిపోయేందుకు ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాల సమయం ఉందిలెండి! ► 2011 మార్చి 11న జపాన్ తీరంలో 8.9 తీవ్రతతో వచ్చిన భూకంపం మన రోజు లెక్కను మార్చేసింది. భూమిలోపలి పదార్థం పంపిణీ అయిన తీరులో భూకంపం మార్పు తేవడంతో భూమి కొంచెం వేగంగా ► భూకంపం తరువాత ఆ ప్రాంతాల్లోని కాలువలు, చెరువుల్లోని నీరు కొంచెం కంపు కొడతాయి. అడుగున ఉన్న టెక్టానిక్ ప్లేట్లు కదిలినప్పుడు అక్కడ చిక్కుకుపోయి ఉన్న వాయువులు పైకి రావడం దీనికి కారణం. ► 2010 ఫిబ్రవరి 27న సంభవించిన 8.8 స్థాయి తీవ్రమైన భూకంపం కారణంగా చిలీలోని కోన్ సెప్కియాన్ నగరం పశ్చిమం దిక్కుగా సుమారు పది అడుగులు జరిగింది! మొత్తం భూకంపాల్లో 90 శాతం పసిఫిక్ మహా సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ వెంబడి వస్తూంటాయి. ► 2015లో నేపాల్‌లో వచ్చిన 7.8 స్థాయి తీవ్రమైన భూకంపం కారణంగా పలు హిమాలయ పర్వతాలు కుంగిపోయాయి. ఇందులో ఎవరెస్టు కూడా ఉంది. కనీసం ఒక్క అంగుళం మేర దీని ఎత్తు తగ్గినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
టర్కీ, సిరియా భూకంపం: 50 వేలు దాటిన మృతుల సంఖ్య
అంకారా: టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రకృతి విలయంలో ఇప్పటి వరకు రెండు దేశాల్లో 50,000పైగా మృతి చెందారు. ఒక్క టర్కీలోనే 44,218 మంది మరణించినట్లు డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు శుక్రవారం వెల్లడించారు. అదే విధంగా సిరియాలో 5,914 మంది మృతి చెందినట్లు తెలిపారు. దీంతో రెండు దేశాల్లో కలిపి మరణించిన వారి సంఖ్య 50 వేలు దాటింది. కాగా ఫిబ్రవరి 6న తుర్కియే, సిరియాలో సెను భూకంపాలు వచ్చిన విషయం తెలిసిందే. అత్యంత హృదయ విదారకమైన ప్రకృతి వైపరీత్యాల్లో ఇదీ ఒకటి. తెలవారుతూండగానే 7.8 తీవ్రతతో నమోదైన భూకంపం వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది. ఘోర విపత్తులో ఎత్తైన భవనాలు నెలకొరిగాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 1,60,000 భవనాలు, 5,20,000 అపార్టుమెంట్లు ధ్వంసమవడం లేదా దెబ్బతినడం జరిగిందని అక్కడి ప్రభుత్వాలు వెల్లడించాయి. అయితే ఇంతటి విషాదం తర్వాత కూడా టర్కీలో పలుమార్లు మళ్లీ భూకంపాలు నమోదవ్వడం గమనార్హం. -
టర్కీలో మళ్లీ భూకంపం.. ముగ్గురు మృతి.. 200 మందికి గాయాలు..
ఇస్తాన్‌బుల్: టర్కీ, సిరియాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. హతాయ్ ప్రావిన్స్ డిఫ్నీ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి ముడు అపార్ట్మెంట్లు కూలిపోయాయి. ముగ్గురు చనిపోయారు. మరో 200 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. భూకంపం సంభవించింది సరిహద్దు ప్రాంతం కావడంతో సిరియాలోనూ భూప్రకంపనలు వచ్చాయి. ఆరుగురు గాయపడ్డారు. Moment of the earthquake from Kayseri #Turkey #turkiyeearthquake pic.twitter.com/NoDuZ1iEll — Mandy Ricci (@ADV561SDV56) February 21, 2023 రెండు వారాల క్రితమే టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. వేల భవనాలు కుప్పకూలి 47,000 మందికిపైగా చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.. ఇప్పుడు మళ్లీ భూకంపం రావడం ఆందోళనకు గురిచేస్తోంది. #Turkey 🇹🇷#turkeyearthquake2023 New earthquakes in Turkey in the city of Hatay shook the south of the country. from 6.4, 6.2. There were deaths as well as missing and thousands of wounded. It was announced that a new tsunami is coming in Iskenderum among others city.👇🏻 pic.twitter.com/vq5DROI1Vz — Daniel Von Sáenz ☭⃠🇵🇪🇯🇪🇩🇪➕️ (@DanielS12576850) February 21, 2023 అయితే తాజాగా భూకంపం వచ్చిన ప్రాంతంలో జనాలు ఎక్కువగా నివసించడం లేదని అధికారులు పేర్కొన్నారు. గత భూకంపంలో కూలిపోయిన తమ ఇళ్ల నుంచి సామాన్లు, వస్తువులు తీసుకోవాడనికి వెళ్లి ఉంటారని చెప్పారు. New,Bandara di Hatay #Turkey diguncang gempa M6.4 kedalaman 10km senin,20/02/2023 air laut surut.#turkeyearthquake2023 #TurkeySyriaEarthquake2023 pic.twitter.com/lOztUAAHyw — 📿 frenkyf¹ (@frenkyfi) February 21, 2023 చదవండి: విద్వేషమే విడదీసింది! కొరియన్ యుద్ధానికి కారణమెవరు? చివరకు మిగిలింది -
నివారించలేం, జననష్టం తగ్గించగలం
సుమారు 46,000 మందిని బలిగొన్న టర్కీ భూకంపంలో ఇంతటి భారీ ప్రాణనష్టాన్ని నివారించేందుకు అవకాశం ఉండిందా? దాదాపు టర్కీ మొత్తం భూకంప ప్రమాద పరిధిలోనే ఉన్నప్పటికీ, ప్రభుత్వంలోని విపరీతమైన అవినీతి ఫలితంగా భవన నిర్మాణ నియంత్రణలు అమల్లోకి రాలేదు. భవిష్యత్తులో వచ్చే భూకంపాలను సమర్థంగా ఎదుర్కొనేందుకని ‘భూకంప పన్ను’ కూడా వసూలు చేశారు. ఆ మొత్తాన్ని ఎలా ఖర్చు పెట్టారన్న విషయంలో అనేక ప్రశ్నలున్నాయి. ఈ మొత్తాన్నీ గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. భూకంప ముప్పును ఎదుర్కొనే విషయంలో టర్కీ వద్ద ఉన్న జ్ఞానానికీ, ఆచరణకూ మధ్య అంతరం ఉంది. ఇలాంటి విధ్వంసానికి సన్నద్ధంగా ఉండటం అసంభవం.’’ ఫిబ్రవరి ఆరున టర్కీని భారీ భూకంపం తాకిన రెండు రోజులకు అత్యంత దారుణంగా దెబ్బతిన్న ప్రాంతంలో పర్యటించిన తర్వాత ఆ దేశ అధ్యక్షుడు రీజెప్ తాయిప్ ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్య ఇది. నిజంగానే ఇంతటి విధ్వంసపు స్థాయి ఇంతకుముందు చూడనిదే. తెలతెల వారుతూండగానే 7.8 తీవ్రతతో భూకంపం రావడం, వేల మందిని బలితీసుకోవడం ఘోరమే. (సుమారు 46,000 మంది చనిపోయారని అంచనా.) అత్యంత హృదయ విదారకమైన ప్రకృతి వైపరీత్యాల్లో ఇదీ ఒకటి. అయితే, ఇంతటి ప్రాణనష్టాన్ని, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు అవకాశం ఉండిందా? పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా తగ్గించే వీలు లేకపోయిందా? అసాధ్యమని ఎవరైనా చెబితే అది రాజకీయ ప్రకటనే అవుతుంది. టర్కీకి భూకంపం ముప్పు ఉందని తెలిసినా అందుకు సన్నద్ధంగా లేకపోవడం కచ్చితంగా ఓ వైరుధ్యమే. చేజారిన అవకాశాలు భూకంప ముప్పునకు సంబంధించి టర్కీ ఒక మ్యాపును రూపొందించింది. 2018 లోనే దీన్ని సమీక్షించి, మార్పులు చేర్పులు చేసి ప్రచురించారు కూడా. దాని ప్రకారం దాదాపు దేశం మొత్తానికి భూకంప ప్రమాదం ఉంది. తూర్పు అనతోలియా ఫాల్ట్ జోన్, ఉత్తర అన తోలియా ఫాల్ట్ జోన్ రెండూ దేశాన్ని అల్లుకుని ఉన్నాయి! దాదాపు 1,400 కిలోమీటర్ల పొడవైన ఉత్తర అనతోలియా ఫాల్ట్ జోన్ టర్కీ ఉత్తరార్ధ భాగంలో తూర్పు నుంచి పశ్చిమానికి ఉంది. దేశంలోని ప్రధాన నగరాలైన అంకారా, ఇస్తాంబుల్‌తో పాటు, పారిశ్రామిక వాడలు కూడా ఈ ఫాల్ట్ జోన్ వెంబడే ఉన్నాయి. మరోవైపు తూర్పు అనతోలియా ఫాల్ట్ జోన్ వెయ్యి కిలోమీటర్ల పొడవుతో దేశ ఆగ్నేయ ప్రాంతం గుండా ప్రయాణిస్తూంటుంది. లక్షల జనాభా ఉన్న చిన్న చిన్న నగరాలు, పల్లెలు ఈ జోన్లోనే ఉన్నాయి. ఈ సమస్యను ఎదు ర్కొనేందుకు టర్కీ ఇప్పటికి చాలా ప్రయత్నాలే చేసింది. 1959లో ఆ దేశ పార్లమెంటు ‘డిజాస్టర్ లా 7269’(విపత్తు చట్టం)ను ఆమోదించింది. ప్రకృతి వైపరీత్యాల నష్టాన్ని నివారించేందుకు ప్రణాళికలను రూపొందించాలనీ, జాతీయ స్థాయి నుంచి మున్సిపాలిటీల వరకూ నియమ, నిబంధనలు సిద్ధం చేయాలనీ తీర్మానించారు. ఈ ఏర్పా ట్లన్నీ ప్రజల్లో భూకంప విపత్తుపై కొంత అవగాహనైతే పెంచాయి కానీ, 1990లలో గణనీయమైన స్థాయిలో ఉన్న ఐదు భూకంపాలు చోటు చేసుకున్నా మార్పులేమీ కనబడకపోవడంతో ఆ చట్టంపై ఆశలు సన్నగిల్లాయి. 1999లో మార్మరా ప్రాంతంలో వచ్చిన భూకంపాల్లో సుమారు 17 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత టర్కీ ప్రభుత్వం భూకంపాలను తట్టుకునే భవనాల నిర్మాణానికి, ప్రోత్సా హానికి ఒక కార్యక్రమం చేపట్టింది. అయినాసరే, ప్రభుత్వంలోని విపరీతమైన అవినీతి ఫలితంగా ఈ భవన నిర్మాణ నియంత్రణలు అమల్లోకి రాలేదు. భవిష్యత్తులో భూకంపాలు వస్తే వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకని ప్రభుత్వం ‘భూకంప పన్ను’ పేరుతో పన్నులు వసూలు చేసింది కూడా. దీనిద్వారా సుమారు 460 కోట్ల అమెరికన్ డాలర్ల మొత్తం జమకూడింది. అయితే ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు పెట్టారన్న విషయంలో అనేక ప్రశ్నలు తలెత్తాయి. 2009లో టర్కీ ‘నేషనల్ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ’ (జాతీయ విపత్తు మరియు అత్యవసర పరిస్థితి నిర్వహణ సంస్థ) ఒకదాన్ని ఏర్పాటు చేసింది. విపత్తు నిర్వహణకు సిబ్బందిని సిద్ధం చేయడం, తద్వారా ప్రమాద నష్టాన్ని తగ్గించడం దీని ఉద్దేశం. రాష్ట్ర, మున్సిపాలిటీ స్థాయిల్లో సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, భూకంపాలు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలో ప్రజలకు వివరించడం దీని పని. 2014లోనూ టర్కీ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ప్లాన్ (జాతీయ విపత్తు సంసిద్ధతా పథకం) ఒకదాన్ని సిద్ధం చేసింది. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వ సంస్థలు ఎలాంటి పాత్ర పోషించాలో సూచించిందీ పథకం. పోషకాహారం, అత్యవసర గృహ వసతి, సమాచార వ్యవస్థలు.. ఇలా వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసి వాటికి నిర్దిష్ట బాధ్యతలు అప్పగించారు. 2014లోనే సోమా ప్రాంతంలో భూగర్భ గనిలో ఓ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 301 మంది మరణించారు. ఈ ఘటనపై సమీక్షించిన టర్కీ ప్రభుత్వం జాతీయ విపత్తు పథక పునఃసమీక్షకు నిర్ణయించింది. జపాన్, అమెరికా, యూరప్ ప్రతినిధులతో కూడిన సలహా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచించిన మార్పులను జాతీయ విపత్తు పథకంలో చేర్చారు. నిరంతర నిఘా, విపత్తు నిర్వహణ సిబ్బందికి మరింత ఆధునికమైన శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడం, సంస్థల మధ్య సమన్వయం వంటి మార్పులు చేశారు. అయితే ఈ ప్రణాళికలను 2015 జనవరి నుంచే సైద్ధాంతికంగా అమల్లో పెడుతున్నట్లు నేతలు ప్రకటించారు కానీ, వాస్తవ ఆచరణ ఇప్పటికీ జరగలేదు. నేషనల్ డిజాస్టర్అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ నాయకత్వాన్ని మార్చడంతో సరిపెట్టింది ప్రభుత్వం. పైగా మంచి శిక్షణ, ఆధునిక సమాచార వ్యవస్థలు కావాలని కోరిన వారిని పదవుల నుంచి తప్పించింది. ఈ మార్పులు స్థానిక ప్రభుత్వాలపై తీవ్ర ప్రభావం చూపాయి. జపాన్, కాలిఫోర్నియా పాఠాలు... మార్పులు చేసిన నేషనల్ డిజాస్టర్ ప్లాన్ అమలు చేయకపోవడం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. భూకంప ముప్పును ఎదుర్కొనే విషయంలో టర్కీ వద్ద ఉన్న జ్ఞానానికీ, ఆచరణకూ మధ్య అంతరం ఉంది. భూకంపాలను ఎలాగూ ఆపలేము. కానీ వాటిని తట్టుకోగల భవనాలను నిర్మించవచ్చు. జపాన్, కాలిఫోర్నియాల్లో ఇదే జరిగింది. భూకంపాలను తట్టుకోగల భవనాలకు సంబంధించిన నియమావళిని టర్కీ రూపొందించింది. దేశంలో 1.50 లక్షల మంది సివిల్ ఇంజినీర్లూ ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేలా రోడ్లు, భవనాలు, వంతెనలు ఎలా కట్టాలో వీరికి తెలుసు. అయితే ఇప్పటికే ఉన్న భవనాలను కొత్త ప్రమాణాల ప్రకారం కట్టేందుకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ కావడంతో ఆ కార్యక్రమం చాలా నెమ్మదిగా సాగుతోంది. భవనాల డిజైన్ నియంత్ర ణలు 2000 సంవత్సరం నుంచే అమల్లో ఉన్నా, వాటి అత్యాధునిక అవసరాలను స్థానిక ఇంజినీర్లు పెద్దగా అర్థం చేసుకోలేకపోయారు. భవన నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకూ 2010 నుంచి ఒక కమిటీ ఉంది కానీ దేశంలోని కోటీ అరవై లక్షల భవనాలను పర్యవేక్షించ లేకపోతోంది. భవిష్యత్తు దశ, దిశ 2023 ఫిబ్రవరి ఆరున సంభవించిన భారీ భూకంపంతో టర్కీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. స్వల్పకాలికం మాత్రమే కాదు, సుదీర్ఘకాలం పనిచేయగల ప్రణాళికలు అత్యవసరంగా అమలు చేయాల్సిన పరిస్థి తిని ఆ దేశం ఎదుర్కొంటోంది. గృహ నిర్మాణాన్ని ఇప్పటిలానే లోపాలతో కొనసాగించడమా, వ్యయప్రయాసలకు ఓర్చి అత్యాధునిక, దృఢమైన, మెరుగైన డిజైన్ కలిగిన భవన నిర్మాణాలను చేపట్టడమా అన్నది నిర్ణయించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ కార్యక్ర మంలో ప్రజలందరినీ భాగస్వాములు చేయడం ద్వారా భూకంపా లతో వచ్చే ముప్పును గుర్తించే సమాజాన్ని సిద్ధం చేయాలి. అంతే కాకుండా తగిన ప్రణాళిక, ఆచరణలతో నష్టాన్ని తగ్గించవచ్చునన్న తెలివిడి కూడా వీరికి కలిగించాల్సిన అవసరం ఉంది. – లూయిస్ కె. కంఫర్ట్, ప్రొఫెసర్, పిట్స్బర్గ్ యూనివర్సిటీ – పోలాత్ గుల్కన్, ప్రొఫెసర్, బాష్కెంట్ యూనివర్సిటీ – బుర్చాక్ బాష్బూ ఎర్కాన్ అసోసియేట్ ప్రొఫెసర్, మిడిల్ ఈస్ట్ టెక్నికల్ యూనివర్సిటీ (‘ద కాన్వర్జేషన్’ సౌజన్యంతో) -
'సహాయం చేయడమే మా కర్తవ్యం': మోదీ
తుర్కియే, సిరియాలో ఫిబ్రవరి 6న భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు భారత బలగాలు భూకంప ప్రభావిత దేశానికి సహాయా సహకారాలు అందించేందుకు సమయాత్తమయ్యాయి. అందులో భాగంగా ఆపరేషన్ దోస్త్ పేరుతో మొత్తం మూడు ఎన్డీఆర్ఎప్ బృందాలు ఫిబ్రవరి 7న ప్రభావిత ప్రాంతాలకు తరలి వెళ్లాయి. అంతేగాదు భూకంప బాధిత ప్రజలకు విస్తృతమైన సేవలందించడానికి భారత సైన్యం, వైద్య బృందం భారీ సంఖ్యలో మోహరించి సహాయ సహకారాలు అందించింది. ఈ క్రమంలో టర్కీ నుంచి తిరిగి వచ్చిన సిబ్బందిని ఉద్దేశించి మోదీ మీరు మానవాళికి గొప్ప సేవ చేశారని, అలాగే భారతదేశాన్ని గర్వించేలా చేశారని అన్నారు. ఈ మేరకు మోదీ ట్విట్టర్ వేదికగా...మేము ప్రంపంచాన్ని కుటుంబంగా పరిగణిస్తాం. సంక్షోభంలో ఉన్న ఏ సభ్యునికైనా.. త్వరగా సహాయం చేయడం మా కర్తవ్యంగా భావిస్తాం. భారతదేశం గత కొన్నేళ్లుగా స్వయం సమృద్ధి కలిగిన దేశంగా తన గుర్తింపును బలోపేతం చేసిందని, ఇది నిస్వార్థంగా ఇతర దేశాలకు సహాయం చేస్తోంది. ప్రపంచంలో ఏ సంక్షోభం వచ్చినా.. మొదట స్పందించేందకు భారత్ ఎప్పుడూ సదా సిద్దంగానే ఉంటుంది. అలాగే ప్రపంచంలోనే అత్యుత్తమ రిలీఫ్ అండ్ రెస్క్యూ టీమ్‌గా మన గుర్తింపును పటిష్టం చేసుకోవాలి. అలాగే విపత్తు ప్రతిస్పందన సహాయక చర్యల్లో మన బలగాల కృషి అభినందనీయమని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా అంతకు ముందురోజే విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్లో...టర్కీలో ఆపరేషన్ దోస్త్ కింద మోహరించిన భారత సైన్యం, వైద్య బృందం భారత్‌లోకి తిరిగి వచ్చింది. సుమారు 151 ఎన్డీఆర్ఎప్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్లతో కూడిన మూడు బృందాలు భూకంప ప్రభావిత టర్కీయేకు సహాయం అందించాయి. అని పేర్కొన్నారు. (చదవండి: పెళ్లికి ముందు రోజే వధువు కాలికి ఆపరేషన్.. ఆస్పత్రి వార్డులో తాళికట్టిన వరుడు) -
Turkey-Syria earthquakes: శిథిలాల కింద 12 రోజులు...
అన్‌టాకియా: తుర్కియే, సిరియాను భూకంపం కుదిపేసి 12 రోజులు గడుస్తున్నా ఇంకా కొందరు శిథిలాల కింద నుంచి మృత్యుంజయులుగా బయట పడుతున్నారు. హతాయ్ ప్రావిన్స్‌లోని అన్‌టాకియా నగరంలో కుప్పకూలిన అపార్ట్మెంట్ శిథిలాల కింద 296 గంటలుగా ఇరుక్కున్న ఒక కుటుంబంలో ముగ్గురిని బయటకు తీసుకువచ్చారు. సిమెంట్ పెళ్లల కింద క్షణమొక యుగంలా గడిపిన ఒక కుటుంబంలోని ముగ్గురి మూలుగులు ఉన్న సహాయ సిబ్బంది వారిని బయటకి తీశారు. వీరిలో భార్యాభర్తలిద్దరికీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తూ ఉంటే వారి 12 ఏళ్ల కుమారుడి ప్రాణాలు మాత్రం వైద్యులు కాపాడలేకపోయారు. రెండు దేశాల్లోనే భూకంప మృతుల సంఖ్య 44 వేలు దాటింది. తుర్కియేలో మొత్తం 11 ప్రావిన్స్‌లకు గాను రెండు తప్ప తొమ్మిది ప్రావిన్స్‌లలో సహాయ చర్యలు నిలిపివేసినట్టు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. భూకంప బాధితుల కోసం అమెరికా నుంచి వచ్చిన సహాయ సామగ్రిని టర్కీలోని అడెనా ఎయిర్ బేస్ వద్ద ట్రక్కుల్లోకి చేరేయడంలో యూఎస్ సైనిక సిబ్బందికి సాయం చేస్తున్న ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్. భూకంప ప్రభావిత ప్రాంతాలను ఆదివారం ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. -
టర్కీ భూకంపం.. రెండుగా చీలిన గ్రామం..13 అడుగులు కుంగిన ఇళ్లు
ఇస్తాన్‌బుల్: టర్కీలో ఫిబ్రవరి 6న సంభవించిన భారీ భూకంపం 11 రాష్ట్రాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకు 46వేల మందికిపైగా మరణించారు. అయితే ఈ భూకంపం కారణంగా హతాయ్ రాష్ట్రంలోని డెమిర్కోప్రు అనే గ్రామం రెండుగా చీలీపోయిది. భూప్రంకనల ధాటికి భారీ పగుళ్లు వచ్చి ఇక్కడి ఇళ్లు భూమిలోకి 13 అడుగుల మేర కుంగిపోయాయి. ఈ కారణంగా భూకంపం ముందు రోడ్డపక్కన కన్పించిన ఇళ్లు ఇప్పుడు మాయమయ్యాయి. 1000 మంది నివసించే ఈ గ్రామంలో ఇళ్లన్నీ కుంగిపోయాయి. ఎటు చూసినా శిథిలాలు, నేలకూలిన చెట్లు, మురికి నీరే కన్పిస్తోంది. తన ఇల్లు 4 మీటర్ల లోతులోకి కుంగిపోయిందని 42 ఏళ్ల మహిర్ కరటాస్ అనే వ్యక్తి వెల్లడించాడు. ఈ గ్రామంలో తొలినాళ్లలోనే ఈయన ఇల్లు కట్టుకున్నాడు. అదృష్టవశాత్తు గ్రామంలో ఎవరూ చనిపోలేదని, కానీ చాలామందికి గాయాలయ్యాయని వివరించాడు. భూకంపం వచ్చినప్పుడు ఈ గ్రామంలోని ప్రజలు ఇళ్ల కిటికీల నుంచి బయటకు దూకేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో పరుగులు తీసి సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు. భూప్రకంపనల వల్ల ఈ గ్రామంలోని ఓ పశువుల కొట్టం కూడా కుంగిపోయింది. దాని మధ్యలో చీలికలు వచ్చాయి. దీంతో ఓ ఆవు అందులోనే కూరుకుపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చదవండి: లీటర్ పాలు రూ.250, కేజీ చికెన్ రూ.780.. పాకిస్తాన్ దివాళా తీసిందని ఒప్పుకున్న మంత్రి.. -
టర్కీ భూకంపం.. మృత్యువుతో పోరాడి ఓడిన స్టార్ ఫుట్‌బాలర్
ఫుట్‌బాల్‌లో విషాదం నెలకొంది. టర్కీలో సంభవించిన భూకంపంలో శిథిలాల కింద చిక్కుకున్న ఘనా ఫుట్‌బాలర్ క్రిస్టియన్ అట్సూ 11 రోజులు మృత్యువుతో పోరాడి శనివారం(ఫిబ్రవరి 18న) కన్నుమూశాడు. క్రిస్టియన్ అట్సూ మృతిని ఘనా ఫుట్‌బాల్ అధికారికంగా ప్రకటించింది. ''ఈ విషయాన్ని మేం జీర్ణించుకోలేకపోతున్నాం. మృత్యువుతో పోరాడి అలసిపోయిన క్రిస్టియన్ అట్సూ ఇవాళ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. అతని కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి.'' అంటూ నానా సెక్కెర్ ట్వీట్ చేశారు. ఇక టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పావుగంట వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు వదిలారు. ఇప్పటికే మృతుల సంఖ్య 20వేలు దాటింది. ప్రస్తుతం అతను టర్కీష్ సూపర్ క్లబ్ హట్సేపోర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భూకంపం సంభవించిన సమయంలో క్రిస్టియన్ అట్సు సదరన్ ప్రావిన్స్ ఆఫ్ హటే ప్రాంతంలో శిథిలాల కింద చిక్కుకున్నాడు. ఫిబ్రవరి 7న రెస్క్యూ టీమ్ వచ్చి అట్సూను శిథిలాల నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ఇన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అట్సూకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి చనిపోయినట్లు వైద్యలు దృవీకరించారు. అట్సు చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్‌కు కూడా గతంలో ప్రాతినిధ్యం వహించాడు. న్యూక్యాసిల్కు ఐదేళ్ల పాటు ఆడిన క్రిస్టియన్ అట్సు 2021లో సౌదీ అరేబియా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవలే టర్కీష్ ఫుట్‌బాల్ క్లబ్‌కు మారాడు. ఇక ఘనా తరపున 65 మ్యాచ్‌లాడిన అట్సూ 9 గోల్స్ చేశాడు. It is with the heaviest of hearts that I have to announce to all well wishers that sadly Christian Atsu’s body was recovered this morning My deepest condolences go to his family and loved ones. I would like to take this opportunity to thank everyone for their prayers and support — Nana Sechere (@iAmNana7) February 18, 2023 -
శిథిలాల్లో 'అద్భుతం'.. 228 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడి..
తుర్కియే, సిరిమాలో సంభవించిన వరుస భూకంపాలు మాటలకందని విషాదాన్ని నింపాయి. ఘోర విపత్తు తలెత్తి 9 రోజులు అవుతున్నా.. నేటికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎటుచూసినా కూలిన భవనాల శిథిలాలు.. వాటి కింద చితికిన బతుకులే దర్శనమిస్తున్నాయి. భూకంప ధాటికి భవనాలు పేకమేడల్లా కూలడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.. వేలాది మంది విగతా జీవులుగా మారారు. మరికొందరు అయిన వారిని కోల్పోయి అనాథలుగా మిగిలారు. అసలు వారు ప్రాణాలతో ఉన్నారో లేరో తెలియని పరిస్థితి! ఘోర మృత్యుకంపం ధాటికి ఇరు దేశాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 41 వేలు దాటింది. మొత్తంగా భారీ భూకంపం రెండు దేశాల్లో పూడ్చుకోలేని నష్టాన్ని, తీరని శోకాన్ని మిగిల్చింది. అయితే ఇప్పటికీ పలుచోట్ల చిన్నారులు, మహిళలతో సహా కొంతమంది ప్రాణాలతో బయటపడటం అద్భుతమనే చెప్పాలి. భూకంపం వచ్చిన 9 రోజుల తర్వాత కూడా ఇద్దరు మహిళలు సజీవంగా బయటపడ్డారు. తుర్కియేలోని కహ్రామన్మారస్లో శిథిలాల కింద చిక్కుకున్న 45 ఏళ్ల మెలికే ఇమామోగ్లు, 74 ఏళ్ల సెమిలే కెకెక్ అనే ఇద్దరి మహిళలను రెస్క్యూ సిబ్బంది బుధవారం సురక్షితంగా బయటకు తీశారు. మహిళను రక్షించి అంబులెన్స్‌లో ఆసపత్రికి తరలిస్తున్న దృశ్యాలను డారికా మేయర్ ముజాఫర్ బియిక్ షేర్ చేశారు. మరోవైపు భూకంపాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన మరో తుర్కియే నగరం అంటాక్యాలో 228 గంటల తర్వాత (గురువారం) శిథిలాల కింద నుంచి ఎరిల్మాజ్ అనే మహిళతోపాటు ఆమె ఇద్దరు పిల్లలను సజీవంగా బయటకు తీశారు. రక్షించిన సిబ్బందితో మొదటగా ఆమె ‘ఇది ఏ రోజు’ అని అడగటం గమనార్హం. అంతేగాక తుర్కియేలో ధ్వంసమైన భవనం శిథిలాల నుంచి ముస్తఫా అనే 13 ఏళ్ల బాలుడిని రక్షించారు. సుమారు 74 దేశాలకు చెందిన సహాయక బృందాలు ప్రజలను ప్రాణాలతో కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్నట్లు తుర్కియే ప్రభుత్వం తెలిపింది. Kahramanmaraş Dulkadiroğlu ilçesinde arama-kurtarma çalışmaları 9. günde de devam ediyor. Depremin 226. saatinde ekiplerimizin çalışmalarıyla enkaz altından canlı olarak çıkartılan 74 yaşındaki Cemile Kekeç teyzemizin kurtarma çalışmalarına şahitlik ettik. 📍Kahramanmaraş pic.twitter.com/PtL7XOcDo6 — Muzaffer Bıyık (@muzafferbiyik) February 15, 2023 -
‘ఎవరీ మేజర్ బీనా తివారీ’
తుర్కియే - సిరియా భూకంప బాధితులకు అండగా నిలుస్తోన్న ఇండియన్ ఆర్మీ మేజర్ బీనా తివారీపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. ఇది భారత్ ఇమేజ్ అంటూ తాజాగా బీనా ఓ బాలికను కాపాడిన చిత్రాల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తుర్కియే, సిరియాలో గతవారం సంభవించిన భారీ భూకంపంలో మృత్యువిలయం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఘోర విపత్తులో మృతుల సంఖ్య 41వేలకు చేరినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. భూకంపం సంభవించి తొమ్మిది రోజుల తర్వాత కూడా శిథిలాల కింద నుంచి ప్రజల ఆర్తనాధాలు వినిపిస్తున్నట్లు స్థానిక మీడియా కథనాల్ని ప్రచురించింది. ఇక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న భూకంప బాధితులకు భారత్ భరోసా ఇస్తోంది. 'ఆపరేషన్ దోస్త్' పేరుతో మీకు మేమున్నాం’ అంటూ గడ్డకట్టే చలిలోనూ ఇండియన్ ఆర్మీ సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది. ముఖ్యంగా భారత్ నుంచి సహాయక చర్యల కోసం అక్కడికి వెళ్లిన మేజర్ బీనా తివారీ సేవలపై స్థానికుల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె తమపట్ల చూపిస్తున్న ఆత్మీయతకు తుర్కియే వాసులు కరిగిపోతున్నారు. తుర్కియే మహిళ బీనా తివారీని ప్రేమగా ముద్దాడిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఆ చిత్రాలపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. తాజాగా ఆమె ఓ బాలికను కాపాడిన చిత్రాల్ని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అదిపెద్ద సైన్యాల్లో భారత్ ఒకటి. సహాయకచర్యలు, పీస్‌కీపింగ్‌లో మనకు దశాబ్దాల అనుభవం ఉంది. ఇదీ భారత్ ఇమేజ్’ అని ప్రశంసించారు. ఎవరీ మేజర్ బీనా తివారీ 28 ఏళ్ల ఇండియన్ మేజర్ బీనా తివారీ తుర్కియే భూకంప బాధితురాల్ని కాపాడింది. అందుకు కృతజ్ఞతగా బుగ్గన ముద్దు పెట్టుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఈ ఫోటోను ఇండియన్ ఆర్మీ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేయగా..ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. డెహ్రాడూన్‌కు చెందిన బీనా తివారీ కుటుంబ సభ్యులు మొత్తం దేశానికి సేవలందిస్తున్నారు. ఇప్పటికే బీనా తివారీ తాత కైలానంద్ తివారీ (84) కుమావ్ రెజిమెంట్ సుబేదార్‌గా సేవలందించి రిటైర్ అయ్యారు. ఆమె తండ్రి మోహన్ చంద్ర తివారీ (56) అదే రెజిమెంట్‌లో సుబేదార్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. ఆమె భర్త కూడా వైద్యుడే. ప్రస్తుతం ఆమె కల్నల్ యదువీర్ సింగ్ ఆధ్వర్యంలో అస్సాంలో పనిచేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ ఫిబ్రవరి 7న తుర్కియే - సిరియా క్షతగాత్రుల్ని కాపాడేందుకు 99 మంది వైద్య నిపుణుల బృందాన్ని అక్కడికి పంపిన విషయం తెలిసిందే. వారిలో మేజర్ బీనా తివారీ కూడా ఉన్నారు. -
Turkey and Syria Earthquake: బాల్యం శిథిలం
అమ్మ పొత్తిళ్లలో హాయిగా పడుకోవాల్సిన అభం శుభం తెలియని పసికందులు అందరినీ కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. ఎందుకీ విపత్తు ముంచుకొచ్చిందో తెలీక నిలువ నీడ లేక ఎందుకు రోడ్లపైకొచ్చామో అర్థం కాక బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తుర్కియే, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపం ఎందరో చిన్నారుల్ని అనాథల్ని చేసింది. వీరిలో చాలా మంది రోజుల పసికందులే. ఇప్పటికే అంతర్యుద్ధంతో అల్లాడిపోతున్న సిరియాలో భూకంపం పిల్లల నెత్తిన పిడుగుపాటులా మారింది. ప్రకృతి వైపరీత్యాలు, అధికార కాంక్షతో మానవులు చేస్తున్న యుద్ధాలు చిన్నారులకు ఎలా శాపంగా మారుతున్నాయి..? తుర్కియే భూకంపంలో శిథిలాల మధ్యే ఒక పసిపాప భూమ్మీదకొచ్చింది. బిడ్డకి జన్మనిచ్చిన ఆ తల్లి ప్రాణాలు కోల్పోవడంతో పుడుతూనే అనాథగా మారింది. అయా (అరబిక్ భాషలో మిరాకిల్) అని పేరు పెట్టి ప్రస్తుతానికి ఆస్పత్రి సిబ్బందే ఆ బిడ్డ ఆలనా పాలనా చూస్తున్నారు. ఈ రెండు దేశాల్లో సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటే ఎక్కువగా పిల్లలే శిథిలాల కింద నుంచి ప్రాణాలతో బయటకి వస్తున్నారు. 10 రోజుల నుంచి 14 ఏళ్ల వయసున్న వారి వరకూ ప్రతీ రోజూ ఎందరో పిల్లలు ప్రాణాలతో బయటకి వస్తున్నారు. వారంతా తల్లిదండ్రులు, బంధువుల్ని కోల్పోయి అనాథలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఈ చిన్నారులకు అండగా యునిసెఫ్ బృందం తుర్కియే చేరుకుంది. తుర్కియేలో 10 ప్రావిన్స్‌లలో 46 లక్షల మంది చిన్నారులపై ప్రభావం పడిందని యూనిసెఫ్ అధికార ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ చెప్పారు. సిరియాలో బాలల దురవస్థ పన్నెండేళ్లుగా అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాలో ఇప్పటికే చిన్నారులు దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. యుద్ధ వాతావరణంలో గత పదేళ్లలో సిరియాలో 50 లక్షల మంది జన్మిస్తే వారిలో మూడో వంతు మంది మానసిక సమస్యలతో నలిగిపోతున్నారు. బాంబు దాడుల్లో ఇప్పటికే 13 వేల మంది మరణించారు. పులి మీద పుట్రలా ఈ భూకంపం ఎంత విలయాన్ని సృష్టించిందంటే 25 లక్షల మంది పిల్లల జీవితాలను అల్లకల్లోలం చేసినట్టుగా యూనిసెఫ్ అంచనా వేస్తోంది. ఇంతమందికి సరైన దారి చూపడం సవాలుగా మారనుంది. పిల్లల భవిష్యత్తుకి చేయాల్సింది ఇదే.! ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల విద్య, సంక్షేమం కోసం కృషి చేసే ఐక్యరాజ్యసమితి సంస్థ యునిసెఫ్ ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు జరిగే ప్రాంతాలు, కరువు, పేదరికం ఎదుర్కొనే దేశాల్లో పిల్లలకి భద్రమైన భవిష్యత్ కోసం కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది... ► ప్రభుత్వాలు యూనివర్సల్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్‌లతో పిల్లలకు ప్రతి నెలా ఆదాయం వచ్చేలా చూడాలి. ► శరణార్థులు సహా అవసరంలో ఉన్న పిల్లలందరికీ సామాజిక సాయం అందేలా చర్యలు చేపట్టాలి. ► ప్రకృతి వైపరీత్యాల ముప్పున్న ప్రాంతాలతో పాటు , ఇతర ఘర్షణాత్మక ప్రాంతాల్లో సంక్షేమ వ్యయాన్ని వీలైనంత వరకు పరిరక్షించాలి. ► పిల్లల చదువులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు బడి బాట పట్టేలా చర్యలు తీసుకోవాలి. ► మాత శిశు సంరక్షణ, పోషకాహారం అందించడం. ► బాధిత కుటుంబాలకు మూడు పూటలా కడుపు నిండేలా నిత్యావసరాలపై ధరల నియంత్రణ ప్రవేశపెట్టాలి. చిన్నారులపై పడే ప్రభావాలు ► ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులతో ప్రభావానికి లోనయ్యే పిల్లల సంఖ్య సగటున ఏడాదికి 17.5 కోట్లుగా ఉంటోందని యునెస్కో గణాంకాలు చెబుతున్నాయి. ► ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలతో ఒంటరైన పిల్లలు ఎన్నో శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల వారిలో పెరుగుదల ఆరోగ్యంగా ఉండదు. ఇలా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారు పుట్టకొకరు చెట్టుకొకరుగా మారిన పిల్లల్లో 18% వరకు ఉంటారు. ► 50% మంది పిల్లలు మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. భూకంపం వంటి ముప్పులు సంభవించినప్పుడు గంటల తరబడి శిథిలాల మధ్య ఉండిపోవడం వల్ల ఏర్పడ్డ భయాందోళనలు వారిని చాలా కాలం వెంటాడుతాయి. ► సమాజంలో ఛీత్కారాలు దోపిడీ, దూషణలు, హింస ఎదుర్కొంటారు. బాలికలకు ట్రాఫికింగ్ ముప్పు! ► తుఫాన్లు, వరదలు, భూకంపాల వల్ల ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. ► 2021లో ప్రకృతి వైపరీత్యాలు, ఉక్రెయిన్ వంటి యుద్ధాల కారణంగా 3.7 కోట్ల మంది పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరుగా మారారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
37 వేలు దాటిన భూకంప మృతులు.. లక్ష దాటే అవకాశం..!
ఇస్తాన్‌బుల్: తుర్కియే, సిరియాలో గత సోమవారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 37వేలకు చేరింది. ఇందులో టర్కీకి చెందిన వారు 31,643 మంది కాగా.. సిరియాకు చెందిన వారు 5,814 మంది అని అధికారులు తెలిపారు. శిథిలాలు మొత్తం తొలగిస్తే మృతుల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా.. టర్కీ, సిరియాకు ఇతర దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలతో సాయం అందిస్తున్నాయి. టర్కీకి ఇప్పటికే భారత్ వైద్య, రెస్క్యూ బృందాలను పంపింది. మరోవైపు సిరియాకు రష్యా సాయం చేస్తోంది. ఆ దేశానికి చెందిన 300 మంది సైనికులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. pawsitivepawsrescues Miracle, after 7 days, this pittie survived buried from the earthquake in turkey! #Turkey #turkey🇹🇷 #Earthquake #survivor pic.twitter.com/lGjPVd2ksV — Rob Cardella (@RobertoCardel18) February 14, 2023 #Turkey Antakya before and after the devastating #earthquake pic.twitter.com/HolDmYrbRO — AlAudhli العوذلي (@AAudhli) February 14, 2023 చదవండి: అమెరికా మిచిగాన్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి -
Turkey-Syria earthquake: భూకంప మృతులు 35,000
అదియామాన్: తుర్కియే, సిరియాలో వారం రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటిదాకా 35,000 మందిపైగా మరణించారని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కొందరు శిథిలాల్లో చిక్కుకొని సజీవంగా బయటపడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా తుర్కియేలోని దక్షిణ హతాయ్ ప్రావిన్స్‌లో 13 ఏళ్ల బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. తుర్కియేలో ఉష్ణోగ్రత మైనస్ 6 డిగ్రీలకు పడిపోయింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు వాపోతున్నారు. భూకంపం వల్ల తుర్కియేకు 84.1 బిలియన్ డాలర్లకుపైగా నష్టం వాటిల్లినట్లు టర్కిష్ ఎంటర్ప్రైజ్ అండ్ బిజినెస్ కాన్ఫెడరేషన్ అంచనా వేసింది. -
ఏం మాట్లాడుతున్నావ్! అంటూ పాక్ ప్రధానిని దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు
పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ఒక ప్రకటన ఆయనను విమర్శల పాలు చేసింది. ఏదో తన దేశీయుల గొప్పగా భావిస్తారని.. చెబితే అది కాస్త షరీఫ్‌కి తలనొప్పిగా మారింది. ఈ మేరకు ప్రధాని షరీఫ్ మన పాకిస్తాన్‌కి చెందిన అజ్ఞాత వ్యక్తి ఒకరు టర్కీ, సిరియా భూకంప బాధితులకు 30 మిలియన్ల డాలర్లు సాయం అందిచాడని గర్వంగా చెప్పారు. అమెరికాలోని టర్కీ రాయబార కార్యాలయానికి వెళ్లి మరీ సాయం అందిచినట్లు తెలిపారు. ఇది నన్ను ఎంతగానో కదిలించింది. ఇది మానవాళి అధిగమించలేని అసమానతలపై విజయం సాధించేలా చేసే అద్భతమైన దాతృత్వ చర్యగా పేర్కోన్నారు. దీనికి తాను ఎంతగానో గర్వపడుతున్నానంటూ ట్విట్టర్ వేదికగా గొప్పగా చెప్పుకొచ్చారు. దీంతో షరీఫ్ చేసిన ప్రకటన అక్కడ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తానీయులకు మింగుడుపడలేదు. దీంతో ట్విట్టర్ వేదికగా షరీప్‌పై పలు విమర్మలు ఎక్కుపెట్టారు. తన సొంత దేశం అస్తవ్యస్తంగా ఉంటే ఎందుకు సాయం చేసేందుకు ముందుకు రాలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మీలాంటి అవినీతి పరులు ఉన్నారు కాబట్టి సాయం చేసేందుకు రాలేదు కాబోలు అంటూ షరీఫ్‌కి చివాట్లు పెట్టారు నెటిజన్లు. అంతేగాదు ఆ అనామకుడు పాక్ దౌత్య కార్యాలయంలోకి వెళ్లి వరదల్లో అల్లకల్లోలం అయిన తన దేశానికి ఎందుకు ఇవ్వలేదనేది పాక్ రచయిత్రి అయేషా సిద్ధిఖా కూడా ప్రధాని షరీఫ్‌ని ప్రశ్నించారు. ఎందుకంటే అధికారంలో ఉన్నది దొంగలని అతనికి తెలుసు అందుకే ఇవ్వలేదని, ఇది నిజంగా సిగ్గుతో చచ్చిపోవాల్సిన విషయం అంటూ షరీఫ్‌ని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఏకిపరేశారు. Deeply moved by the example of an anonymous Pakistani who walked into Turkish embassy in the US & donated $30 million for earthquake victims in Türkiye & Syria. These are such glorious acts of philanthropy that enable humanity to triumph over the seemingly insurmountable odds. — Shehbaz Sharif (@CMShehbaz) February 11, 2023 (చదవండి: మరోసారి భారత్‌కు ధన్యవాదాలు! ఎప్పటికీ మనం దోస్తులమే!: టర్కీ రాయబారి) -
వైరల్ వీడియో: ఆ సమయంలో నర్సుల ధైర్యానికి హ్యాట్సాఫ్
-
థాంక్యూ భారత్! ఎప్పటికీ మనం దోస్తులమే!: టర్కీ రాయబారి
టర్కీలో వచ్చిన భారీ భూకంపం కారణంగా సుమారు 30 వేల మంది దాక చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ 'ఆపరేషన్ దోస్త్'లో భాగంగా టర్కీకి తక్షణ సాయం అందించడమే గాక పలు రెస్క్యూ బృందాలను కూడా పంపించింది. అందులో భాగంగానే భారత్ 23 టన్నులకు పైగా సహాయక సామాగ్రితో మరో ఏడవ ఆపరేషన్ దోస్త్ విమానాన్ని టర్కీకి పంపించింది. ఆ విమానం ఆదివారం భూకంప బాధిత సిరియాకు చేరుకుంది. దీనిని డమాస్కస్ విమానాశ్రయంలోని స్థానిక పరిపాలన, పర్యావరణ డిప్యూటీ మంత్రి మౌతాజ్ డౌజీ అందుకున్నారు. ఈ మేరకు టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ సోమవారం తమ దేశానికి మరోసారి సహాయక సామాగ్రిని పంపినందుకు భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు. రాయబారి సునెల్ ట్విట్టర్ వేదికగా.. భారత ప్రజల నుంచి మరో బ్యాచ్ అత్యవసర విరాళాలు టర్కీకి చేరుకున్నాయి. భూకంపం సంభవించిన ప్రాంతానికి ప్రతి రోజు ఎంతో ఉదారంగా ఉచిత సహాయాన్ని అందజేస్తోంది. అందుకు భారతదేశానికి ధన్యావాదాలు. వందల వేల మంది భూకంప నుంచి బయటపడిన వారందరికి ఈ సమయంలో గుడారం, దుప్పటి, స్లీపింగ్ బ్యాగ్ వంటివి చాలా ముఖ్యమైనవి. అలాంటి వాటన్నింటిని ఈ విపత్కర సమయంలో మా ప్రజలకు అందించి ఎంతో మేలు చేసింది. లాంఛనప్రాయంగా ప్రారంభమైన ఈ 'ఆపరేషన్ దోస్త్' మనం ఎప్పటికీ స్నేహితులమని నిరూపించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలోపేతం కావలి అని ట్వీట్ చేశారు. THANK YOU INDIA! 🇮🇳🇮🇳🇮🇳 Each tent, each blanket or sleeping bag are of vital importance for the hundreds of thousands of earthquake survivors. https://t.co/v9rsXtdzjL — Fırat Sunel फिरात सुनेल فرات صونال (@firatsunel) February 13, 2023 (చదవండి: ఉక్రెయిన్ మరితంగా బ్రిటన్ మిటలరీ సాయం..మండిపడుతున్న రష్యా) -
Turkey-Syria Earthquake: టర్కీ సహాయక చర్యల్లో అద్భుతాలు
-
శిథిలాల కింద 90 గంటలపాటు సజీవంగా 10 రోజుల పసికందు
-
కోలుకోక ముందే దెబ్బ మీద దెబ్బ.. టర్కీలో మరోసారి భూకంపం..
ఇస్తాంబుల్: గత సోమవారం సంభవించిన భారీ భూకంపంతో కకావికలమైన టర్కీలో మరోసారి భూకంపం వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పలుచోట్ల భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 4.7గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. దక్షిణ టర్కీ నగరం కహ్రమన్మరాస్ సమీపంలో 15.7 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ భూకంపం వల్ల భవనాలు కూలిపోయినట్లు గానీ, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. 34వేలకు పెరిగిన మృతులు.. తుర్కియే, సిరియాలో గత సోమవారం సంభవించిన భారీ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 34వేలు దాటినట్లు అధికారులు తెలిపారు. వేల మంది గాయపడినట్లు చెప్పారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు టర్కీ హతాయ్ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా దెబ్బతిన్న రన్‌వేను రిపేర్ చేసినట్లు చెప్పారు. దొంగతనాలు.. భూకంపం కారణంగా సర్వస్వం కోల్పోయి వేల మంది ప్రజలు నిరాశ్రయులైతే.. మరోవైపు దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లలో చొరబడి వస్తువులు, నగలు, డబ్బులు దోచుకెళ్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నందున దొంగలపై కఠిన చర్యలు తప్పవని అధ్యక్షుడు రికెప్ తయ్యిప్ హెచ్చరించారు. సాధారణంగా వాళ్లకు ఒక్కరోజు ఉండె జైలు నిర్భంధం ఇప్పుడు నాలుగు రోజులకు పెరిగినట్లు గుర్తు చేశారు. లూటీలకు పాల్పడిన 57 మందిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. చదవండి: మరో గుర్తుతెలియని వస్తువును కూల్చేసిన అమెరికా..వారంలో నాలుగోది! -
అదే దైన్యం..! కోలుకోని తుర్కియే, సిరియా.. 33 వేలు దాటిన మృతుల సంఖ్య
అంటాక్యా (తుర్కియే): ఆరు రోజులు గడిచినా భూకంప ప్రకోపం ప్రభావం నుంచి తుర్కియే, సిరియా ఏమాత్రమూ తేరుకోలేదు. కుప్పకూలిన వేలాది భవనాల శిథిలాల నుంచి ఇంకా మృతదేహాలు బయట పడుతూనే ఉన్నాయి. మరోవైపు లక్షలాది మంది సర్వం పోగొట్టుకుని కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మిగలడంతో ఈ విపత్తు క్రమంగా పెను మానవీయ సంక్షోభంగా మారుతోంది. వారికి కనీస వసతులు కల్పించడం కూడా ప్రభుత్వానికి సవాలుగా పరిణమిస్తోంది. దాంతో బాధితుల్లో ఆక్రోశం ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకుంటోంది. మరోవైపు రెండు దేశాల్లో మృతుల సంఖ్య ఇప్పటికే 33 వేలు దాటేసింది. తుర్కియేలోనే కనీసం 80 వేల మందికి పైగా గాయపడ్డారు. మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. వెలికితీత, సహాయ కార్యక్రమాలు నత్తనడకన నడుస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. భూకంపం రావచ్చని ముందే సమాచారమున్నా దాన్ని ఎదుర్కొనేందుకు సరైన చర్యలు తీసుకోలేదంటూ కూడా ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి భారీ జన నష్టానికి కారకులయ్యారంటూ తుర్కియేలో వందలాది మంది కాంట్రాక్టర్లను అరెస్టు చేస్తున్నారు. తుర్కియేలో ఈ శతాబ్ది విపత్తుగా పరిగణిస్తున్న ఈ భూకంపం ధాటికి 500 కిలోమీటర్ల పరిధిలో 1.3 కోట్ల మంది తీవ్రంగా ప్రభావితులయ్యారు. సిరియాలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాలు ప్రభుత్వ, వేర్పాటువాదుల అధీనంలోని ప్రాంతాల మధ్య విస్తరించడం సహాయ చర్యలకు అడ్డంకిగా మారింది. ఇప్పటిదాకా 4,000కు పైగా మరణించారని అంచనా. వీరంతా మృత్యుంజయులు తుర్కియేలో ఓ రెండు నెలల చిన్నారిని ఏకంగా 128 గంటల తర్వాత శిథిలాల నుంచి సజీవంగా రక్షించారు! అదియమాన్ నగరంలో ఓ ఆరేళ్ల బాలున్ని ఏకంగా 151 గంటల అనంతరం ఆదివారం కాపాడారు. ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం! మరో చిన్నారి బాలికను కూడా 150 గంటల తర్వాత కాపాడారు. అంటాక్యాలో మరో 35 ఏళ్ల వ్యక్తిని 149 గంటల తర్వాత కాపాడారు. శిథిలాల కింద చిక్కిన వారిని గుర్తించేందుకు థర్మల్ కెమెరాలు తదితర మార్గాల్లో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారత్‌తో పాటు పలు దేశాల నుంచి వచ్చిన సిబ్బంది అహోరాత్రాలు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో చెమటోడుస్తున్నారు. -
టర్కీ, సిరియాలో 29,000 దాటిన భూకంప మృతులు..
ఇస్తాన్‌బుల్: తుర్కియే(టర్కీ), సిరియాలో భూకంప మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శిథిలాలు తవ్వేకొద్ది వేల సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 29,000మందికిపైగా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. టర్కీలో 24,617 మంది, సిరియాలో 4,500 మంది మరణించినట్లు తెలిపారు. పరిస్థితి చూస్తుంటే ఈ సంఖ్య 50 వేలకు పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి అధికారులు అంచనా వేస్తున్నారు. టర్కీ, సిరియా భూకంపం ప్రాంతాల్లో సహాయక చర్యలు ఏడో రోజూ కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారులు సహా అనేక మందిని సహాయక బృందాలు రక్షించాయి. దక్షిణ టర్కీ హతాయ్ ప్రావిన్స్‌లో శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని 149 గంటల తర్వాత బయటకు తీశారు. మరోవైపు టర్కీ దేశస్థులు తమ దేశంలోని బంధువుల ఇంట్లో తాత్కాలికంగా తలదాచుకోవచ్చని జర్మనీ తెలిపింది. ఈ విపత్కర పరిస్థితిలో తమవంతు సాయం అందిస్తామని చెప్పింది. ఇతర దేశాలు కూడా టర్కీకి ఆపన్నహస్తం అందిస్తున్నాయి. చైనా 53 టన్నుల టెంట్లను సాయంగా అందించింది. భారత్ ఇప్పటికే సహాయక బృందాలతో పాటు వైద్య బృందాలు, ఔషధాలు, ఇతర సామగ్రిని టర్కీకి పంపింది. చదవండి: టర్కీ విధ్వంసం.. మూత్రం తాగి బతికిన యువకుడు -
Turkey Syria Earthquake: ఆ సమయంలో నర్సుల ధైర్యానికి హ్యాట్సాఫ్
టర్కీలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. టర్కీలో సరిగ్గా అదే సమయంలో ఓ ఆస్పత్రిలోని నర్సులు మాత్రం భూకంప ప్రకంపనాలకు భయంతో పారిపోలేదు. అక్కడే ఉండి ఇంక్యుబేటర్‌లో ఉన్న నవజాత శిశువులను కాపాడాలని నిర్ణయించుకున్నారు. ఇంక్యుబేటర్‌లో ఉన్న శిశువల ఉన్న గది వద్దకు త్వరిత గతిన చేరుకుని, అక్కడే ఉండి వాటిని పడిపోకుండా పట్టుకుని అలానే నుంచొని ఉన్నారు. వారు చేసిన ప్రయత్నాల కారణంగా ఆ ఇంక్యుబేటర్లు కింద పడిపోకుండా ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియోని టర్కీలోని ఫాత్మా సాహిన్ అనే రాజకీయవేత్త ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా టర్కీ, సీరియాలలో సంభవించిన భూకంపం కారణంగా మృతుల సంఖ్య 30 వేల మందికి చేరుకున్న సంగతి తెలిసిందే. Sağlıkçılarımız şahane insanlar👏#GaziantepBüyükşehir İnayet Topçuoğlu Hastanemiz yenidoğan yoğun bakım ünitesinde, 7.7'lik #deprem esnasında minik bebekleri korumak için Hemşire Devlet Nizam ve Gazel Çalışkan tarafından gösterilen gayreti anlatacak kelime var mı? 🌹🌼💐👏👏👏 pic.twitter.com/iAtItDlOwb — Fatma Şahin (@FatmaSahin) February 11, 2023 (చదవండి: శిథిలాల కింద వారిని అలా చూడగానే.. ఒక్కసారిగా తన్నుకొచ్చిన ఆనందం) -
'నమ్మలేని నిజం': శిథిలాల కింద వారిని అలా చూడగానే.. ఒక్కసారిగా..
టర్కీ, సిరియాలలో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకూ 20 వేల మందికి పైగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా ప్రాంతాల్లో రక్షణ బృందం నిరంతరం రెస్క్యూ చర్యలు కొనసాగిస్తోంది. అక్కడున్నవారికి ప్రతి క్షణం ఆ శిథిలాల కింద గుండె పగిలే దృశ్యాలతో తీవ్ర నిరాశలో ఉన్న వారికి ఓ ఘటన అవధులు లేని ఆనందాన్ని కొనితెచ్చింది. ఈమేరకు రెస్క్యూ సిబ్బంది భవనాల కింది ఉన్న వారిని రక్షించే పనిలో ఉండగా..ఓ కుప్ప కూలిన భవం కింద ఉన్న వ్యక్తులను కోసం గాలిస్తున్నారు. ఐ తే అనహ్యంగా ఆ శిథిలాల కింద ఒక కుటుంబంలోని ఐదుగురు సభ్యులు సజీవంగా బయటపడటంతో అక్కడ ఉన్న వారి అందరీ ముఖాల్లో కన్నీళ్లతో కూడిన సంతోషం వెల్లవిరిసింది. అక్కడ ఉన్న వారంతా తమవారిని పోగోట్టుకుని నిరాశలో ఉన్నప్పటికీ.. ఒక కుటుంబమైన తమలా కాకుండా అందరూ సజీవంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులతో సహా పెద్దలు కూడా సురక్షితంగానే ఉన్నారు. ఆ కుటంబం క్షేమంగా ఉందని తెలియంగానే వారంతా.. గాడ్ ఈజ్ గ్రేట్, ఇది నిజంగా నమ్మలేని నిజం అంటూ ఆనందంతో గట్టిగా నినాదాలు చేశారు. రెస్క్యూ సిబ్బంది వారందర్నీ హుటాహుటినా ఆస్పత్రికి తరలించి తక్షణ చికిత్స అందించింది. అందకు సంబంధించిన వీడియోని సిరియా డిఫెన్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఒక అద్భుతమైన క్షణం అనే క్యాప్షన్‌ని జోడించి మరీ నెట్టింట పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. A true miracle...the sounds of joy embrace the sky... joy beyond belief. An entire family was rescued from under the rubble of their house this afternoon, Tuesday, February 7, in the village of Bisnia, west of #Idlib.#Syria #earthquake pic.twitter.com/Cb7kXLiMjT — The White Helmets (@SyriaCivilDef) February 7, 2023 (చదవండి: పాక్‌లో దారుణం..కస్టడీలో ఉన్న వ్యక్తిపై హత్యయత్నం) -
Turkey-Syria earthquake: ఆశలు సమాధి?
అంటాక్యా: తుర్కియే, సిరియాలో భూకంపం వచ్చి అయిదు రోజులు దాటిపోవడంతో కనిపించకుండా ఉన్న తమ సన్నిహితులు క్షేమంగా తిరిగి వస్తారన్న విశ్వాసం అందరిలోనూ సన్నిగిల్లుతోంది. ఇప్పటివరకు 26 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ శవాల గుట్టలు బయటకు వస్తూనే ఉన్నాయి. తుర్కియేలో హతే ప్రావిన్స్‌కు వెళ్లి ఫుట్‌బాల్ బృందంలో ఉన్న వారందరి మృతదేహాలు బయటకు వచ్చాయి. ఇప్పటివరకు తుర్కియేలో మాత్రమే 80 వేల మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంటే, 10 లక్షల మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఆ శవాల మధ్య జీవచ్ఛవాలుగా మారిన కొందరు కొన ఊపిరితో ఉన్న ప్రాణాలతో బయటపడుతున్నారు. 80 ఏళ్ల ముదుసలి నుంచి పది రోజుల బాలుడు వరకు దాదాపుగా 120 గంటల సేపు శిథిలాల కింద కూరుకుపోయిన వారు ఇప్పటివరకు 12 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరాఖండ్ వాసి మృతి భూకంపం వచ్చిన రోజు నుంచి కనిపించకుండా పోయిన భారతీయుడు, ఉత్తరాఖండ్‌కు చెందిన విజయ్‌కుమార్ గౌడ్ మరణించాడు. అతను బస చేసిన హోటల్ శిథిలాల నుంచి మృతదేహాన్ని వెలికి తీశారు. ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లాకు చెందిన విజయ్‌కుమార్ గౌడ్ బెంగళూరు కంపెనీలో పని చేస్తున్నారు. ఆఫీసు పని మీద తుర్కియే వెళ్లారు. అప్పుడే కుదిపేసిన భూకంపం ఆయన నిండు ప్రాణాలను తీసేసింది. అతని చేతి మీద ఉన్న ఓం అన్న టాటూ సాయంతో గౌడ్ మృతదేహాన్ని గుర్తు పట్టినట్టుగా భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఒకే కుటుంబంలో ఐదుగురు క్షేమం గజియాంటెప్ ప్రావిన్స్ నర్డాగ్‌లో ఒక ఇల్లు కుప్పకూలిపోయి, ఆ ఇంట్లో శిథిలాల కింద చిక్కిన ఉన్న ఐదుగురు కుటుంబసభ్యులను సహాయ సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. మొదట తండ్రి హసన్ అస్లాన్‌ను శిథిలాల కింద నుంచి బయటకు తీయాలని అనుకుంటే , ఆయన తన కొడుకు, కూతుళ్లని మొదట బయటకు తీయండని మొరపెట్టుకున్నాడు. మొత్తమ్మీద అందరినీ కాపాడిన సహాయ సిబ్బంది గాడ్ ఈజ్ గ్రేట్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. పదిరోజుల పసికందు మృత్యుంజయుడు గడ్డ కట్టించే చలి, భవనం శిథిలాల మధ్య, నీళ్లు, పాలు లేకుండా భూకంపం పది రోజుల వయసున్న బాలుడు 90 గంటల సేపు పోరాటం చేశాడు. చివరికి గెలిచి మృత్యుంజయుడై తిరిగి వచ్చాడు. తుర్కియేలో భూకంప ప్రభావం అధికంగా ఉన్న హతే ప్రావిన్స్‌లో శిథిలాల కింద తల్లి, తన పదేళ్ల బాలుడు యాగిజ్ ఉలాస్‌తో నాలుగు రోజులు అలాగే ఉండిపోయింది. సహాయ సిబ్బంది సిమెంట్ శ్లాబుల తొలగిస్తూ ఉండగా ఆ పసికందు మూలుగు వినిపించింది. జాగ్రత్తగా శిథిలాల నుంచి తొలగించి ప్రాణాలతో ఉన్న ఆ బాలుడిని థర్మల్ బ్లాంకెట్‌లో చుట్టి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ మిరాకిల్ బాయ్ చురుగ్గా ఉన్నప్పటికీ తల్లి బాగా నీరసించిపోయే దశలో ఉంది. -
ఆశలు ఆవిరి.. టర్కీలో భారతీయ యువకుడు మృతి
సాక్షి, బెంగళూరు: టర్కీలో అదృశ్యమైన భారతీయ యువకుడు విగత జీవిగా మారాడు. వ్యాపార పనుల నిమిత్తం టర్కీ వెళ్లిన భారత్‌కు చెందిన ఓ యువకుడు ఫిబ్రవరి 6న అక్కడ సంభవించిన వరుస భూకంపాల తర్వాత అదృశ్యమైన విషయం తెలిసిందే. భూకంపం సంభవించి నాలుగు రోజులైనా అతని ఆచూకీ తెలియలేదు. అయితే విజయ్ కుమార్ బస చేసిన హోటల్ శిథిలాల వద్ద శుక్రవారం అతని పాస్‌పోర్టు ఇతర వస్తువులు లభించాయి. తాజాగా శనివారం విజయ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. అతడు బస చేసిన మలత్వాలోని హోటల్ శిథిలాల కింద విజయ్ కుమార్ మృతదేహం గుర్తించినట్లు టర్కీలోని భారత రాయబార కార్యాలయం దృవీకరించింది. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. విజయ్ మృదేహాన్ని అవశేషాలను అతని కుటుంబానికి వీలైనంత త్వరగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. We inform with sorrow that the mortal remains of Shri Vijay Kumar, an Indian national missing in Turkiye since February 6 earthquake, have been found and identified among the debris of a hotel in Malatya, where he was on a business trip.@PMOIndia @DrSJaishankar @MEAIndia 1/2 — India in Türkiye (@IndianEmbassyTR) February 11, 2023 అసలేం జరిగిందంటే కర్ణాటక రాజధాని బెంగళూరు ప్రాంతానికి చెందిన ఇంజినీర్ టర్కీలో చోటు చేసుకున్న భూ కంపంలో గల్లంతయ్యాడు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన విజయ్‌కుమార్ బెంగళూరులో పీణ్యలోని నైట్రోజన్ ఉత్పత్తి సంస్థలో తమ్ముడితో కలిసి ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అదే ప్రాంతంలో ఇద్దరూ నివాసం ఉంటున్నారు. ఫ్యాక్టరీకి అవసరమైన పరికరాల కోసం విజయ్‌కుమార్ నాలుగు నెలల క్రితం టర్కీకి వెళ్లారు. తుర్కియేలోని తూర్పు అనటోలియా ప్రాంతం మలత్యాలోని అవ్సర్ హోటల్లో దిగాడు. టర్కీలో భూకంపం వచ్చినప్పటినుంచి విజయ్‌కుమార్ నుంచి ఫోన్ రాలేదని తమ్ముడు అరుణ్‌కుమార్ తెలిపారు. ఈ క్రమంలో టర్కీలో అదృశ్యమైన విజయ్‌కుమార్ పాస్‌పోర్ట్, వస్తువులు లభించాయి. అతను బస చేసినట్లు భావిస్తున్న హోటల్ శిథిలాలను రెస్క్యూ సిబ్బంది తొలగించిన తర్వాత స్వాధీనం చేసుకున్నారు. చదవండి: అద్భుతం: 90 గంటలు శిథిలాల కిందే.. మృత్యువును జయించిన10 రోజుల చిన్నారి -
టర్కీ విధ్వంసం.. నాలుగు రోజులు మూత్రం తాగి బతికిన యువకుడు..
ఇస్తాన్‌బుల్: తుర్కియే, సిరియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపం ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. భూకంపం దాటికి ఇళ్లు కూలిపోవడంతో అనేక మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. కొందరు ప్రాణాలతో బయటపడగా.. మరొకొందరు మాత్రం తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. అయితే సోమవారం శిథిలాల కింద చికుక్కున్న 17 ఏళ్ల యువకుడు అద్నాన్ ముహమ్మెత్ కోర్కుట్ అనూహ్యంగా నాలుగు రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. 94 గంటలపాటు శిథిలాల కిందే బిక్కుబిక్కుమంటూ గడిపిన అతడు గొంతు ఎండిపోకుండా తన మూత్రం తాగి బతికినట్లు భయానక విషయాలు వెల్లడించాడు. ఈ నాలుగు రోజులు ఎలా గడిచాయో స్వయంగా అతని మాటాల్లోనే.. 'సోమవారం ఇంట్లో నిద్రోపోయా. ఒక్కసారిగా భూకంపం రావడంతో ఇళ్లు కూలిపోయింది. నేను శిథిలాల కింద చిక్కుకున్నా. బయటకు రాలేని పరిస్థితి. సహాయక సిబ్బందికి నేను కన్పిస్తానే లేదో అని భయం వేసింది. నిద్రపోవద్దని ఫోన్లో ప్రతి 25 నిమిషాలకు అలారం పెట్టుకున్నా. రెండు రోజుల తర్వాత బ్యాటరీ అయిపోయి ఫోన్ స్విచాఫ్ అయింది. నాకు బాగా దాహం వేసినప్పుడు నా మూత్రమే తాగా. ఆకలి వేసినప్పుడు ఇంట్లోని పూలు తిన్నా. చివరకు 94 గంటల తర్వాత సహాయక సిబ్బంది నాకు కన్పించారు. కానీ నా మాటలు వారికి వినపడుతాయో లేదో అని ఆందోళన చెందా. శిథిలాలు తొలిగించేటప్పుడు నన్ను చూడకపోతే వాటి కిందే నలిగిపోతా అనుకుని భయపడ్డా. కానీ చివరకు నన్ను వారు చూసి క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. నన్ను కాపాడిన వాళ్లకి రుణపడి ఉంటా.' అని యువకుడు ఆస్పత్రిలో తన నాలుగు రోజుల నరకయాతన వివరించాడు. 📌Gaziantep'te 95.saatte 17 yaşındaki Adnan Muhammet Korkut enkazdan sağ olarak kurtarıldı. pic.twitter.com/fP4Bq1vseg — Şoreş Seven 7️⃣🐬🍃🕊🕊🕊H D P🕊🕊🕊 (@Sores1SevenHDP) February 10, 2023 తుర్కియే, సిరియాలో సోమవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 24వేల మందికిపైగా చనిపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న ఎంతోమందిని సహాయక సిబ్బంది రక్షించారు. వీరిలో చిన్నారులు, అప్పడే పుట్టిన పసికందులు కూడా కన్పించారు. కొందరు తల్లిదంద్రులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి బిడ్డలను కాపాడుకున్నారు. చదవండి: కన్నీరు పెట్టిస్తున్న వీడియో.. తన ప్రాణాలు అడ్డేసి కుమారుడ్ని కాపాడిన తండ్రి.. -
90 గంటలు శిథిలాల కిందే.. మృత్యువును జయించిన10 రోజుల శిశువు.
భూకంపం తర్వాత టర్కీ, సిరియాలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకృతి ప్రకోపానికి రెండు దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. వరుస భూకంపాల తర్వాత భవన శిథిలాల గుట్టలు ఆ భయానక దృశ్యానికి సాక్షాలుగా నిలిచాయి. రోజులు గడుస్తున్న కొద్దీ మరణించిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భూ ప్రళయంలో కన్నుమూసిన వారు ఇప్పటి వరకు 25 వేలు దాటింది. ఒక్క టర్కీలోనే 20 వేల మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. మరోవైపు గడ్డకట్టే చలిలోనూ సహాయక బృందాలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. సహాయక చర్యలతోపాటు శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. భీకర భూకంపం సంభవించి 100 గంటలు గడిచిపోయిన శిథిలాల కింద మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఘోర విపత్తు ద్వారా కూతురిని కోల్పోయిన తండ్రి, తల్లిని కోల్పోయిన చిన్నారులు, తోబుట్టువులు ఇలా పలు చోట్ల హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొందరు సజీవంగా బయటపడటం ఊరట కలిగిస్తోంది. మృత్యుంజయులుగా బయటపడుతున్న చిన్నారులు తుర్కియేలో శిథిలాలను తొలగిస్తుండగా శుక్రవారం ఒక్కరోజే 100 మందికిపైగా బాధితులు ప్రాణాలతో బయటకు వచ్చారు. తాజాగా హతయ్ ప్రావిన్సులో శిథిలాల కింద మరో మహిళ, నవజాత శిశువు మృత్యంజయులుగా నిలిచారు. భూకంపం సంభవించిన 90 గంటల తర్వాత శిథిలాల నుంచి తల్లితో సహా యాగిజ్ ఉలాస్ అనే పది రోజుల శిశువును అధికారులు రక్షించారు. నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి మరణాన్ని జయించింది చిన్నారి. అనంతరం దుప్పటిలో చుట్టి హతే ప్రావిన్స్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అదే హతే ప్రావిన్స్‌లో భూ ప్రళయం చోటుచేసుకున్న 100 గంటల తర్వాత శిథిలాల నుంచి 3 ఏళ్ల జైనెప్ ఎలా పర్లక్ అనే చిన్నారి ప్రాణాలతో బయటపడింది. చదవండి: Donald Trump: ట్రంప్ ఈజ్ బ్యాక్.. రెండేళ్ల తర్వాత..! -
సాయమే లక్ష్యం: రంగంలోకి భారత్‌కు చెందిన జూలీ.. రోమియో.. హానీ.. రాంబో
సిరియా, టర్కీలో భయంకర ప్రకృతి విలయం సంభవించిన విషయం తెలిసిందే. భూకంపం కారణంగా దాదాపు 24వేలకు పైగా మంది మృత్యువాతపడ్డారు. రెండు ప్రాంతాల్లో ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని సహయక బృందాలు బయటకు తీస్తున్నాయి. ఈ క్రమంలో అనే దేశాలకు చెందిన టీమ్స్ సహయక చర్యల్లో పాల్గొన్నాయి. భారత్ కూడా అందరి కంటే ముందే సహాయక చర్యలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఆర్మీ యుద్ధ విమానాల్లో అక్కడికి వైద్య సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారుఉ. ఇదిలా ఉండగా.. భారత్‌కు చెందిన డాగ్ స్క్వాడ్లు కూడా రంగంలోకి దిగాయి. నలుగురు సభ్యుల డాగ్ స్క్వాడ్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటోంది. ఎన్డీఆర్ఎఫ్ స్క్వాడ్‌లోని నాలుగు లాబ్రడార్ శునకాలు ఉన్నాయి. జూలీ, రోమియో, హానీ, రాంబో కుక్కులు తుర్కియే భూకంప బాధితుల్ని గుర్తించే పనిలో నిమగ్నం అయ్యాయి. ఈ నాలుగు జాగిలాలతో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెళ్లాయి. కాగా, స్నిఫింగ్‌లో ఈ డాగ్ స్క్వాడ్ ఎంతో స్పెషల్. రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రత్యేకంగా వాళ్లు శిక్షణ పొందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ఈ డాగ్ స్క్వాడ్ వెంటనే పసిగడుతుంది. మరోవైపు.. విపత్కర వాతావరణంలోనూ ఇండియన్ డాగ్ స్క్వాడ్ బాధితుల్ని గుర్తించడం విశేషం. ఇక, టర్కీలో ఉష్ణోగ్రతలు మైనస్ అయిదు డిగ్రీలకు చేరుకోవడంతో సహాయ చర్యలకి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భూకంపం కారణంగా టర్కీ ఆ దేశం భౌగోళికంగా అయిదు నుంచి ఆరు మీటర్లు పక్కకి జరిగి ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పొరల్లో ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ (ఫలకాలు) తీవ్రమైన రాపిడి కారణంగానే ఇది సంభవించినట్టు తెలిపారు. సిరియాతో పోల్చి చూస్తే టర్కీలో రెండు ఫలకాల మధ్య ఏర్పడిన ఒత్తిడి వల్ల రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూకంపం కుదిపేసిందని, ఫలితంగా దేశమే కాస్త జరిగిందని ఇటలీకి చెందిన సెసిమాలజిస్ట్ ప్రొఫెసర్ కార్లో డొగ్లోని చెప్పారు. భూ పొరల్లో ఉన్న అనతోలియా ప్లేట్ వాయవ్య దిశగా ఉన్న అరేబికా ప్లేట్ వైపు జరగడంతో ఇలా దేశమే భౌగోళికంగా కదిలే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఒక టెక్టోనిక్ ప్లేట్ పశ్చిమ వైపు, మరో ప్లేట్ తూర్పు వైపు కదలడంతో భారీ భూకంపం సంభవించిందని ఆయన వివరించారు. వాలీబాల్ ఆట కోసం అడియామాన్‌కు వచ్చిన కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు 39 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా భావిస్తున్నారు. ఫమగుస్తా కాలేజీకి చెందిన ఈ బృందం ఏడంతస్తులున్న ఒక హోటల్లో బస చేశారు. -
మృత్యుంజయులుగా బయటపడుతున్న చిన్నారులు
-
Turkey Syria Earthquake: ప్లీజ్ దేవుడా! ఒక్క బిడ్డనైనా కాపాడు..
టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆ శిథిలాల కింద చితికిన బతుకులు విషాధ గాథలు పేగులు మెలిపెట్టించేలా ఉన్నాయి. పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు, అనాథలుగా మారిన చిన్నారులతో కన్నీటి సంద్రాన్ని తలిపించేలా ఉన్నాయి అక్కడి దృశ్యాలు. మరోవైపు కొందరూ ఆ శిథిలా కింద తమవారు బతికే ఉండాలని ఆత్రంగా ఎదురుచూపులు. ఆయా ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది శిథిలలు తొలగింపు కార్యక్రమాలు కొనసాగిస్తుండగా..నాజర్ అల్ వకా అనే వ్యక్తి ప్లీజ్ దేవుడా ఒక్క బిడ్డనైన బతికించు అంటూ దీనంగా విలపించాడు. సరిగ్గా ఆ శిథిలాల వద్ద వాకా కూర్చొని వారి కోసం ఆత్రుత పడుతుండగా కనిపించిన ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా బోరున విలపించాడు. కాంక్రీట్ దిమ్మల మధ్య చితికిపోయిన తన భార్య, పిల్లలను చూసి అతను ఏడుస్తున్న విధానం అక్కడ ఉన్న అందర్నీ కంటతడి పెట్టించింది. వాకా ఎంతమంది పిల్లలను కోల్పోయాడనేది స్పష్టం కాలేదు గానీ, ఇద్దరు పిల్లలు మాత్రం రక్షక సిబ్బంది సజీవంగా తీసినప్పటికీ కాసేపటికే వారు చనిపోయారు. అతడి పెద్ద కుమార్తె తన చెల్లెలు మృతదేహాన్నిఒడిలో పెట్టుకుని విగతజీవిగా కనిపించింది. ఈ మేరకు వాక భూకంపం జరిగిన క్షణాలను గుర్తు చేసుకుంటూ.. సిరియా అంతర్యుద్ధంలో అతలా కుతలమైన నాటి ఘటనలు మళ్లీ పునురావృతమయ్యిందా! అన్నట్లు ఉంది అని కన్నీటిర్యంతమయ్యాడు. ఈ ఘటన జరిగినప్పుడూ తాను బయటకు పరుగుపెడుతూ..దేవుడా ఒక్క బిడ్డనైనా బతికించు చాలు అని ప్రార్థించాను, కానీ ఇప్పడూ తాను సర్వకోల్పోయానంటూ బోరుమన్నాడు. అక్కడి స్మసశాన వాటికలన్ని పెద్దలు, చిన్నారుల మృతదేహాలతో కిక్కిరిసిపోయాయి. (చదవండి: Turkey–Syria Earthquake: 24 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య) -
Turkey–Syria Earthquake: 24 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య
అంకారా/న్యూఢిల్లీ: తుర్కియే(టర్కీ), సిరియాలో భూకంప మృతుల సంఖ్య ఏకంగా 24,000 దాటింది. సహాయక చర్యలతోపాటు శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. భీకర భూకంపం సంభవించి 100 గంటలు గడిచిపోయింది. శిథిలాల కింద మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. కొందరు సజీవంగా బయటపడడం ఊరట కలిగిస్తోంది. తుర్కియేలో శిథిలాలను తొలగిస్తుండగా శుక్రవారం ఒక్కరోజే 100 మందికిపైగా బాధితులు ప్రాణాలతో బయటకు వచ్చారు. కొన్నిచోట్ల హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. తీవ్రమైన చలిలో ఆకలి బాధలతో ప్రాణాలు నిలుపుకొనేందుకు వారుపడిన కష్టాలు వర్ణనాతీతం. శిథిలాల కింద ఇరుక్కుపోయి, బయటపడే మార్గం లేక కేవలం మూత్రం తాగి ఆకలిదప్పులు తీర్చుకున్నామని బాధితులు చెబుతుండడం కన్నీరు పెట్టిస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తుర్కియేలో అంత్యక్రియల కోసం తీసుకొస్తున్న మృతదేహాలతో ఇప్పటికే శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయి. చాలా సమయం వేచి చూడాల్సి వస్తోందని మృతుల బంధువులు చెబుతున్నారు. ఈ భూకంపం ‘ఈ శతాబ్దపు విపత్తు’ అని తుర్కియే అధ్యక్షుడు తయీఫ్ ఎర్డోగాన్ వ్యాఖ్యానించారు. భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన తుర్కియేకు దాదాపు 95 దేశాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్, ఆయన భార్య అస్మా శుక్రవారం అలెప్పో యూనివర్సిటీ ఆసుపత్రిలో భూకంప మృతులను పరామర్శించారు. భూకంపం సంభవించినప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి. 75,000 మంది నిరాశ్రయులు భూకంపం వల్ల తుర్కియేలో ఇప్పటిదాకా 18,900 మంది మరణించారని, దాదాపు 75,000 మంది గాయపడ్డారని తుర్కియే డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. ఇళ్లు కూలిపోవడంతో 75,000 మందికిపైగా జనం నిరాశ్రయులైనట్లు అంచనా వేస్తున్నామని తెలిపింది. సిరియాలో భూకంపం కారణంగా 3,300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ధ్రువీకరించింది. రెండు దేశాల్లో కలిపి ఇప్పటివరకు 22,000 మందికి పైగా బలైనట్లు తెలుస్తోంది. తుర్కియేలో 12,000 దాకా భవనాలు నేలమట్టం కావడమో లేక దెబ్బతినడమో జరిగిందని మంత్రి మురాత్ కరూమ్ చెప్పారు. తుర్కియే ప్రజలకు అండగా ఉంటాం: మోదీ ‘ఆపరేషన్ దోస్త్’లో భాగంగా తుర్కియేలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మన దేశ సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం తెలిపారు. రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాయని చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రాణాలను, ఆస్తులను కాపాడడానికి మన బృందాలు కృషి చేస్తూనే ఉంటాయని ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలో తుర్కియే ప్రజలకు భారత్ పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు. -
Turkey–Syria Earthquake: శిథిలాల కింద బాధితుల వేదన
ఆంటాక్యా/జందారిస్: ఆశలు అడుగంటుతున్నాయి. శిథిలాల కింద సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న వారిని కాపాడగలమన్న నమ్మకం తగ్గిపోతోంది. ఉష్ణోగ్రతలు మైనస్ అయిదు డిగ్రీలకు చేరుకోవడంతో సహాయ చర్యలకి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటివరకు తుర్కియే, సిరియాల్లో 19 వేల మందికి పైగా మరణించారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా శిథిలాల కింద లక్షలాది మంది ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. సహాయ చర్యల్లో లోపాలున్నాయని తుర్కియే అధ్యక్షుడు తయిపీ ఎర్డోగన్ స్వయంగా అంగీకరించారు. ఈ స్థాయిలో ప్రళయం సంభవిస్తే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. భూకంపం వచ్చిన ప్రాంతం దేశంలో ఒక మారుమూల ఉండడంతో సహాయ బృందాలను పంపించడంలో ఆలస్యమైందని అన్నారు. మరోవైపు భూకంపానికి ఇళ్లు కోల్పోయిన వారు వీధుల్లోనే కాలం గడుపుతున్నారు. చలి తట్టుకోలేక వారంతా తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. చాలా మంది రాత్రి వేళల్లో రోడ్లపై పార్క్ చేసి ఉంచిన కార్లలో ఉంటున్నారు. ఆ 72 గంటలు ముగిశాయ్..! భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మొదటి మూడు రోజులే అత్యంత కీలకం. ఈ 72 గంటల్లో ఎంతమందిని కాపాడారన్నదే ముఖ్యం. ఆ తర్వాత శిథిలాలు తొలగించినా ప్రాణాలతో బయటపడేవారి సంఖ్య చాలా తక్కువ. గురువారం ఉదయానికి 72 గంటలు గడిచిపోవడంతో ఇంకెన్ని మరణాలు సంభవిస్తాయోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. భూకంపాల సమయంలో మొదటి మూడు రోజుల్లో సర్వ సాధారణంగా 90శాతం మందిని బాధితుల్ని రక్షిస్తారు. మూడు రోజులు దాటితే శిథిలాల కింద ఉన్న వారికి మంచినీళ్లు, ఆహారం అందించాలి. అవి అందక మిగిలిన వారు ప్రాణాలతో బయటపడడం కష్టంగా మారుతుంది. ఆరేళ్ల బాలికను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం తుర్కియేలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న భారత నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) శిథిలాల కింద నలిగిపోతున్న ఆరేళ్ల బాలికను కాపాడాయి. మన దేశం నుంచి వెళ్లిన మూడు బృందాలు అలుపెరుగకుండా సహాయ కార్యక్రమాలు అందిస్తున్నాయని కేంద్ర హోంశాఖ ట్వీట్ చేసింది. ‘‘భారత్‌కు చెందిన సహాయ బృందం నర్డగి ప్రాంతంలో ఆరేళ్ల బాలికను కాపాడింది. ఎన్డీఆర్ఎఫ్ చేస్తున్న సహాయానికి గర్వపడుతున్నాం’’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ట్వీట్ చేశారు. ఆ బాలికను కాపాడిన వీడియోను కూడా షేర్ చేశారు. హైపోథెర్మియా ముప్పు తుర్కియేలో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్న అడియమాన్ ప్రావిన్స్‌లో బాధితులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. భూకంపం వచ్చి నాలుగు రోజులైనా సహాయ సిబ్బంది ఎవరూ రాలేదని రెసాట్ గొజ్లు అనే బాధితుడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. శిథిలాల కింద ఉన్న వారిలో చాలా మంది హైపోథెర్మియా పరిస్థితులతో మరణించారని తెలిపారు. శరీరంలో ఉష్ణం పుట్టే వేగం కంటే, ఉష్ణం కోల్పోయే వేగం ఎక్కువగా ఉంటే దానిని హైపోథెర్మియా అని అంటారు. గట్టకట్టించే చలిలో బాధితుల శరీర ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోయి మరణిస్తారు. దేశమే జరిగింది...! తుర్కియే (టర్కీ)లో సంభవించిన భూకంపం ధాటికి ఆ దేశం భౌగోళికంగా అయిదు నుంచి ఆరు మీటర్లు పక్కకి జరిగి ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పొరల్లో ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ (ఫలకాలు) తీవ్రమైన రాపిడి కారణంగానే ఇది సంభవించినట్టు తెలిపారు. సిరియాతో పోల్చి చూస్తే తుర్కియేలో రెండు ఫలకాల మధ్య ఏర్పడిన ఒత్తిడి వల్ల రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూకంపం కుదిపేసిందని, ఫలితంగా దేశమే కాస్త జరిగిందని ఇటలీకి చెందిన సెసిమాలజిస్ట్ ప్రొఫెసర్ కార్లో డొగ్లోని చెప్పారు. భూ పొరల్లో ఉన్న అనతోలియా ప్లేట్ వాయవ్య దిశగా ఉన్న అరేబికా ప్లేట్ వైపు జరగడంతో ఇలా దేశమే భౌగోళికంగా కదిలే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఒక టెక్టోనిక్ ప్లేట్ పశ్చిమ వైపు, మరో ప్లేట్ తూర్పు వైపు కదలడంతో భారీ భూకంపం సంభవించిందని ఆయన వివరించారు. వాలీబాల్ ఆట కోసం అడియామాన్‌కు వచ్చిన కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు 39 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా భావిస్తున్నారు. ఫమగుస్తా కాలేజీకి చెందిన ఈ బృందం ఏడంతస్తులున్న ఒక హోటల్లో బస చేశారు. కాపాడడమూ కష్టమే..! భూకంపం శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించి వారిని కాపాడడం అంత తేలిౖMðన విషయం కాదు. సహాయ సిబ్బందితో పాటు బాధితులు కూడా సహకరించాలి. అందుకు ఈ ఫొటో నిదర్శనం. తుర్కియేలోని తీవ్ర విధ్వంసం జరిగిన హతేలో ఇంటి పైకప్పు మొత్తం మీద పడిపోవడంతో కాళ్లు కదల్చలేని స్థితిలో అబ్దుల్అలీమ్ అనే వ్యక్తి ఉన్నాడు. అంత పెద్ద శ్లాబుని తొలగించి అతనిని బయటకు తీసుకురావడం సహాయ సిబ్బందికి కష్టమైంది. అబ్దుల్‌ను కాపాడినా అతని భార్య, పిల్లలు ప్రాణాలు కోల్పోవడం విషాదం. శిథిలాల్లో చిక్కుకున్న వారిలో ఒక ప్రాణాన్ని కాపాడడానికి 10 లక్షల డాలర్లు ఖర్చు అవుతుందని తుర్కియే ప్రభుత్వం అంచనా వేస్తోంది. సిరియాలో సహాయానికి అంతర్యుద్ధమే అడ్డు భూకంపం సంభవించిన ప్రాంతాలు ఎవరి అధీనంలో? అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాలో సంభవించిన భూకంపంలో సహాయ కార్యక్రమాలు సరిగా కనిపించడం లేదు. దేశంలోకి వెళ్లడానికి కేవలం రెబెల్స్ అధీనంలో ఒకే ఒక మార్గం తీసి ఉంది. సాయం అందించడం కోసం వచ్చిన అంతర్జాతీయ సంస్థలు సిరియాలో ఒక్కో ప్రాంతం ఒక్కొక్కరి అధీనంలో ఉండడంతో ముందుకు వెళ్లడానికి సవాలక్ష అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. కుర్దులు, సిరియన్ తిరుగుబాటుదారులు, జిహాదీ శక్తులు, తుర్కియే మిలటరీ మద్దతున్న రెబెల్స్, సిరియా ప్రభుత్వం ఇలా దేశం మొత్తం పలువురి అధీనంలో ఉండడం సహాయ కార్యక్రమాలకు ఆటంకంగా మారింది. -
కన్నీరు పెట్టిస్తున్న వీడియో.. తన ప్రాణాలు అడ్డేసి కుమారుడ్ని కాపాడిన తండ్రి
ఇస్తాన్‌బుల్: టర్కీలో సోమవారం సంభవించిన భూకంపం వేల మందికి బలికొంది. తవ్వేకొద్ది మృతదేహాలు లభిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుక్కున్న వారిలో చాలా మంది చనిపోగా.. మరికొంత మంది ప్రాణాలతో బయపడ్డారు. అయితే ఓ తండ్రీకొడుకుల వీడియో మాత్రం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఓ వ్యక్తి తన ప్రాణాలను అడ్డేసి కుమారుడి ప్రాణాలు నిలిపాడు. శిథిలాల కింద చిక్కుకుని అతను కన్నుమూసినా కుమారుడు మాత్రం క్షేమంగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ये वीडियो ह्रदयविदारक है .. 💔💔 पिता ने साँस छोड़ दी पर अपने बच्चे को बचाने के लिए उसका साथ और हाथ नहीं छोड़ा .. बच्चा बच गया ❤️#TurkeySyriaEarthquake pic.twitter.com/l9GW72J9fJ — Vinod Kapri (@vinodkapri) February 8, 2023 సహాయక బృందాలు శిథిలాలు తొలగిస్తున్న సమయంలో మొదట మట్టిలోక కూరుకుపోయి ఉన్న తండ్రి విగతజీవిగా కన్పించాడు. అతను కౌగిలించుకుని ఉన్న కుమారుడు కూడా మరణించి ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు చిన్నారి ప్రాణాలతోనే ఉన్నాడు. దీంతో సహాయక సిబ్బంది వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చదవండి: షాకింగ్.. భూకంపం ధాటికి 6 మీటర్లు పక్కకు జరిగిన టర్కీ! -
షాకింగ్.. భూకంపం ధాటికి 6 మీటర్లు పక్కకు జరిగిన టర్కీ!
ఇస్తాన్‌బుల్: టర్కీలో సోమవారం 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘోర వివత్తులో వేల మంది చనిపోయారు. అయితే భూకంపం కారణంగా టర్కీ దేశం ఐదారు మీటర్ల దూరం పక్కకు జరిగినట్లు భూవిజ్ఞాన పరిశోధకులు తెలిపారు.. ట 'సోమవారం టర్కీలో సంభవించిన శక్తివంతమైన భూకంపాలు అది ఉన్న టెక్టోనిక్ ప్లేట్లను మూడు అడుగుల నుంచి 10 మీటర్ల వరకు కదిలించి ఉండవచ్చు. టర్కీ పశ్చిమం వైపు సిరియాతో పోలిస్తే ఐదు నుంచి ఆరు మీటర్లు పక్కకు జరిగే అవకాశం ఉంది.' అని ఇటాలియన్ భూకంప శాస్త్రవేత్త ప్రొఫెసర్ కార్లో డోగ్లియోని స్థానిక వార్తా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతంలోని మార్పుల గురించి మాట్లాడుతూ.. 190 కిలోమీటర్ల పొడవు, 25 వెడల్పుతో భారీ పగుళ్లు ఏర్పడి, భూమి భీకరంగా కదిలిందని పేర్కొన్నారు. తొమ్మిది గంటల వ్యవధిలో రెండు అత్యంత శక్తివంతమైన భూకంపాలు వచ్చాయన్నారు. వాస్తవానికి భూమి కంపిస్తూనే ఉందని రిక్టర్ స్కేల్‌పై 5-6 డిగ్రీల వద్ద తరచుగా గణనీయమైన తీవ్రతతో నాశనం అవుతూనే ఉందన్నారు. అదే సమయంలో చిన్నపాటి కుదుపులకు గురైనట్లు వివరించారు. అంతా క్షణాల్లోనే జరిగిపోయిందని పేర్కొన్నారు. చదవండి: 38 ఏళ్లోచ్చినా గర్ల్‌ఫ్రెండ్ లేదు.. నా కుమారుడులో ఏదో లోపం ఉంది.. ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లికి షాక్..! -
భూకంప మృతుల సంఖ్య వేలల్లో..!
భూకంప మృతుల సంఖ్య వేలల్లో..! -
ఘోర విపత్తు.. దారణంగా టర్కీ పరిస్థితి.. శాటిలైట్ ఫోటోలు వైరల్
టర్కీ, సిరియాలో ఇటీవల సంభవించిన వరుస భూకంపాలు అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. ప్రకృతి విలయానికి ఇరు దేశాలూ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. ఎటుచూసినా కూలిన భవన శిథిలాలు.. వాటి కింద చితికిన బతుకులే దర్శనమిస్తున్నాయి. ఘోర మృత్యుకంపం ధాటికి ఇరు దేశాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేలమట్టమైన వేలాది భవనాల శిథిలాల కింద భారీగా శవాలు బయటపడుతున్నాయి. ఇప్పటి దాకా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15,383 వేలకు చేరింది. వేలాది మంది ప్రజలు గాయపడ్డారు. ఒక్క తుర్కియేలోనే దాదాపు 12,391 మంది ప్రాణాలు కోల్పోగా.. సిరియాలో 2,992 మంది మరణించినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. తుర్కియే, సిరియా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆప్తుల ఆక్రందనలు, మిన్నింటిన రోదనా దృశ్యాలతో భయానంకంగా తయారయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలన్నింటినీ తొలగిస్తే మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. అయితే ఎత్తయిన వేలాది భవనాలు కుప్పకూలడంతో వాటి శిథిలాలను తొలగించడం తలకుమించిన పనిగా మారింది. చదవండి: తుర్కియే, సిరియాల్లో భూకంపం.. ఆందోళనలో భారత్.. ముప్పు ఎంత? శాటిలైట్ దృశ్యాలు విడుదల రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం దెబ్బకు టర్కీ, సిరియా విలవిల్లాడుతున్నాయి. తాజాగా భూకంపం ముందు, తర్వాత ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన శాటిలైట్ విడుదల చేసిన దృశ్యాలు ఉపద్రవం సృష్టించిన వినాశనం కళ్లకు అద్దం పట్టిన్నట్లు చూపిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాలు, స్టేడియాల్లో సహాయక చర్యల కోసం ఏర్పాటు చేసిన అత్యవసర ఆశ్రయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారీ భూకంపం కారణంగా ప్రధాన నగరాల్లో ఎత్తైన భవనాలన్నీ నేలమట్టమైన దృశ్యాలు కలవరానికి గురిచేస్తున్నాయి. టర్కీలోని దక్షిణ నగరాలైన అంటాక్యా, కహ్రమన్మరాస్, గాజియాంటెప్ భూకంపానికి గురైన అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ కుప్పకూలిన భవనాలు, గుట్టలుగా పేరుకుపోయిన శిథిలాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ 25వేల మందికి పైగా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. 2 కోట్ల 30 లక్షల మంది ప్రభావితం భారీ భూకంపం కారణంగా దాదాపు 2 కోట్ల 30 లక్షల మంది ప్రభావితమైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ప్రభావిత ప్రాంతాల్లో 77 జాతీయ, 13 అంతర్జాతీయ అత్యవసర వైద్య బృందాలను మోహరించినట్లు పేర్కొంది. భారత్ సైతం, టర్కీ, సిరియాకు సహాయ సామాగ్రిని అందించింది. -
Earthquakes: రెస్క్యూ ఆపరేషన్‌లో చిన్నారులు సేఫ్!
గజియాన్టెప్(తుర్కియే): భూకంప శిథిలాలను తొలగించేకొద్దీ వెలుగుచూస్తున్న విగతజీవులు.. ప్రాణాధార వ్యవస్థలు అందుబాటులోలేక రక్తమోడుతూ సాయం కోసం ఎదురుచూస్తున్న క్షతగాత్రులు.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు కాలంతో పోటీపడుతూ నిర్విరామంగా శ్రమిస్తున్న సహాయక సిబ్బంది, స్థానికులు.. ఎటుచూసినా ఆప్తుల ఆక్రందనలు, మిన్నంటిన రోదనా దృశ్యాలతో తుర్కియే, సిరియా భూకంప ప్రభావ ప్రాంతాలు భయానకంగా తయారయ్యాయి. దశాబ్దకాలంలో ఎన్నడూలేనంతటి ఘోర మృత్యుకంపం ధాటికి ఇరుదేశాల్లో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య తాజాగా 11,200 దాటేసింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎర్డోగన్ పర్యటన సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ హతే ప్రావిన్స్, కహ్రామన్మరాస్ పట్ణణం, భూకంప కేంద్రం గుర్తించిన పజార్సిక్ పట్టణాల్లో పర్యటించారు. క్షతగాత్రులతో నిండిన తాత్కాలిక ‘టెంటుల సిటీ’లో బాధితులతో మాట్లాడారు. ‘ఎవరినీ ఇలా వీధుల్లో వదిలేసి వెళ్లిపోము. అందరినీ ఆదుకుంటాం’ అని హామీ ఇచ్చారు. భూకంపం మిగిల్చిన విషాదం మొదలై రెండ్రోజులైన తర్వాత కహ్రామన్మరాస్ పట్టణంలో శిథిలాల నుంచి మూడేళ్ల బాలుడు ఆరిఫ్ ఖాన్‌ను సురక్షితంగా బయటకు తీయగలిగారు. అదియామన్ సిటీలో పదేళ్ల బాలిక బీటల్ ఎడీస్‌ను కాపాడారు. A baby and his mother were rescued from the rubble after spending 55 hours in Turkey's Gaziantep. #TurkeyQuake#Turkiye #Turkiye#Turkey #TurkeySyriaEarthquake #TurkeyQuake #earthquakes #Syria #زلزال #زلزال_سوريا_تركيا #TurkeySyriaEarthquake pic.twitter.com/Kt5NFteETZ — Ali Cheema🔥🥀 (@ali_cheema10) February 8, 2023 కుప్పకూలిన వేలాది భవంతుల కింద చిక్కుకున్న వారి కోసం కొనసాగుతున్న అన్వేషణకు గడ్డకట్టే చలి, మంచు పెద్ద అవరోధంగా మారాయి. తుర్కియేలోని మలాట్యా సిటీలో వీధి పొడవునా మృతదేహాలు ఉంచి మార్చురీ వాహనాల కోసం జనం ఎదురుచూస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. మైనస్ ఆరు డిగ్రీ సెల్సియస్ వాతావరణంలో శిథిలాల్లో కొందరు చలికే గడ్డకట్టుకుని చనిపోయి ఉంటారని సహాయక సిబ్బందిలో ఒకరైన పికల్ వ్యాఖ్యానించారు. టర్కీ అత్యవసర సిబ్బందికి దాదాపు డజను దేశాల నుంచి ఆగమేఘాల మీద వచ్చేసిన సహాయక బృందాలు జతకలిసి బాధితుల అన్వేషణలో బిజీగా మారాయి. This video broke my heart 💔 The little girl says to the rescuer when he reaches her: Get me out from under this wreckage,sir,me and my sister, and I will become your slave.#earthquakeinturkey #Syria #هزه_ارضيه #زلزال #İstanbul #earthquake #Turkey #PrayForTurkey pic.twitter.com/U9mMrZdROM — Zuher Almosa (@AlmosaZuher) February 7, 2023 సిరియాలో పరిస్థితి దారుణం తుర్కియేతో సత్సంబంధాల కారణంగా చాలా దేశాలు తమ బృందాలను ఆ దేశానినికి పంపి సాయపడుతున్నాయి. కానీ, అంతర్యుద్దం, ద్వైపాక్షిక సంబంధాలు బొత్తిగాలేని సిరియాకు ఇతర దేశాల నుంచి సాయం సరిగా అందట్లేదు. దీంతో అక్కడ సహాయక చర్యలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. దీంతో శిథిలాల్లో బాధితుల ఆక్రందనలు అరణ్యరోదనలయ్యాయి. సిరియాను ఆదుకునే మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. భూకంపంతో ఆ దేశాల్లో 2.3 కోట్ల ప్రజల బ్రతుకులు దుర్భరంగా మారనున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. A young Syrian boy smiled and started to play with rescue workers who pulled him from the rubble of a building that was destroyed following deadly earthquakes in Turkey and Syria pic.twitter.com/kM3Qt4UqvG — Reuters (@Reuters) February 8, 2023 భారత్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిన భారత్ మరో బృందాన్నీ తుర్కియేకి పంపనుంది. ‘తుర్కియేలో 11 మంది భారతీయులు చిక్కుకున్నారు. వారిలో ఒకరి జాడ తెలియాల్సిఉంది. మిగతావారు క్షేమం’ అని భారత విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. మరోవైపు ఆరు టన్నుల సహాయక సామగ్రిని సిరియాకు భారత్ అందజేసింది. My heart goes out to the people of Turkey and Syria and all affected by the devastating Turkey-Syria earthquake. The death toll continues to grow in Turkey and northern Syria where two powerful earthquakes destroyed buildings and left some villages in total rubble. 🙏💔 pic.twitter.com/Gv8ZGnvBHw — Maha Mehanna (@MahaMehanna) February 7, 2023 -
టర్కీ, సిరియాలో భారీ భూకంపం
టర్కీ, సిరియాలో భారీ భూకంపం -
17 గంటలపాటు ఆ శిథిలాల కిందే.. తమ్ముడి కోసం ఆ చిన్నారి..
టర్కీలో ఘోరమైన భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భవనాలన్నీ పేకమేడల్లా కూలిపోయి శిథిలాల నగరంగా మారింది. ఎటు చూసినా మనసును కలిచి వేసే దృశ్యాలే. తల్లులను పోగొట్టుకున్న చిన్నారులు ఒకవైపు పిల్లలను పోగొట్టుకుని గర్భశోకంతో ఆక్రందనలు చేస్తున్న తల్లిదండ్రులు మరోవైపు. అక్కడి కన్నీటి రోదనలు ప్రకృతే విలపించేలా విషాదంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఒక వైరల్ ఫోటో అందరి హృదయాలను ద్రవింపచేసింది. ఆ ఫోటోలో ఇద్దరు చిన్నారులు శిథిలాల కింద తమను కాపాడే వారి కోసం బిక్కు బిక్కుమంటూ ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు ఉంది. అందులో ఆ చిన్నారి తన తమ్ముడి తలపై చేయి వేసి శిథిలాల కింద నలిగిపోకుండా కాపాడుతోంది. వాళ్లు అలా శిథిలాల కింద సుమారు 17 గంటల పాటు చిక్కుపోయినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఫోటోను ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మహ్మద్ సఫా ట్విట్టర్లో షేర్ చేశారు. ఆయన ట్విట్టర్లో.." ఆ ఏడేళ్ల బాలిక తమ్ముడిని రక్షించుకోవడానికి పడుతున్న తాపత్రయం మనసును పిండేస్తుంది. ఈ ఫోటోని ఎవరూ షేర్ చేయలేదు, ఆ చిన్నారి చనిపోక మునుపే షేర్ చేయండి. ఆ చిన్నారులు బతకాలని కోరుకుందాం. పాజిటివ్‌గా ఆలోచిద్దాం" అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు తమ్ముడి మీద ఆ చిన్నారికి ఉన్న ప్రేమకు ఫిదా అవుతూ..ఏ అక్క చేయని సాహసం చేస్తోంది ఆ చిన్నారి. వారిద్దరూ బతకడమే గాక ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ..ట్వీట్లు చేశారు. The 7 year old girl who kept her hand on her little brother's head to protect him while they were under the rubble for 17 hours has made it safely. I see no one sharing. If she were dead, everyone would share! Share positivity... pic.twitter.com/J2sU5A5uvO — Mohamad Safa (@mhdksafa) February 7, 2023 (చదవండి: ఆ విమానం కూలి మంటల్లో చిక్కుకుంది..కానీ ఆ ఇద్దరు పైలట్లు..) -
Turkey Earthquake: విషాదం.. గోల్‌కీపర్ కన్నుమూత
టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం దాటికి వేలాది మంది మృత్యువాత పడ్డారు. సోమవారం సంభవించిన భూప్రకంపనల్లో వందలాది భవనాలు కుప్పకూలగా.. వాటి శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయారు. ఇప్పటికి రెస్క్యూ బృందం శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటికి తీస్తున్నారు. ప్రస్తుతం భూకంపం సంభవించిన ప్రాంతంలో ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, రోదనలే. ఇప్పటిదాకా టర్కీలో 5,400 మందికి పైగా, సిరియాలో 1,800కి పైగా మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. పూర్థిస్థాయిలో శిథిలాల తొలగింపు జరిగితే మరణాల సంఖ్య 20 వేలకు పైనే దాటోచ్చని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే టర్కీకి చెందిన 28 ఏళ్ల ఫుట్‌బాలర్.. గోల్‌కీపర్ అహ్మత్ ఎయుప్ తుర్క్‌స్లాన్ మృత్యువాత పడ్డాడు. శిథిలాల కింద చిక్కుకున్న ఎయుప్ కన్నుమూసినట్లు యేని మాలత్యస్పోర్ ఫుట్‌బాల్ క్లబ్ తన ట్విటర్లో ధృవీకరించింది. మాకు ఇది విషాదకర వార్త. గోల్ కీపర్ ఎయుప్ తుర్క్‌స్లాన్ మృత్యువాత పడ్డాడు. శిథిలాల కింద చిక్కుకున్న అతన్ని రక్షించలేకపోయాం. అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అంటూ ట్వీట్ చేసింది. 2011లో కెరీర్ ప్రారంభించిన ఎయుప్ తుర్క్‌స్లాన్ అన్ని క్లబ్‌లకు కలిపి 80 మ్యాచ్‌ల్లో గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు. ఇక ఘనాకు చెందిన మరో ఫుట్‌బాలర్ క్రిస్టియన్ అట్సూ మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు టర్కిష్ ఫుటబాల్ సూపర్ లీగ్ క్లబ్ పేర్కొంది. Başımız sağ olsun! Kalecimiz Ahmet Eyüp Türkaslan, meydana gelen depremde göçük altında kalarak, hayatını kaybetmiştir. Allah rahmet eylesin, mekanı cennet olsun. Seni unutmayacağız güzel insan.😢 pic.twitter.com/15yjH9Sa1H — Yeni Malatyaspor (@YMSkulubu) February 7, 2023 చదవండి: టర్కీ భూకంపం.. శిథిలాల కింద స్టార్ ఫుట్‌బాలర్ LeBron James: సంచలనం.. 40 ఏళ్ల రికార్డు కనుమరుగు -
ఘోర విపత్తు.. 20 వేలమంది దాకా మృతి??
నాన్న.. లేరా: భూకంపం సృష్టించిన విలయంలో కళ్లెదుటే కన్నకూతురు శాశ్వతనిద్రలోకి జారుకుంది. శిథిలాల్లో ఆమె మృతదేహం చిక్కుకుపోయింది. ఆమె చేతిని పట్టుకుని అక్కడే స్థాణువై కూర్చుండిపోయాడా తండ్రి. టర్కీలోని ఖరామన్మరస్ ప్రాంతంలోనిదీ హృదయవిదారక దృశ్యం ఎటు చూసినా శిథిలాలే. వాటికింద చితికిన బతుకులే. కుప్పలుగా శవాలే. వరుస భూకంపాలు తుర్కియే, సిరియాల్లో అంతులేని విధ్వంసం సృష్టించాయి. వేలాది భవనాలు కుప్పకూలడంతో వాటి శిథిలాలను తొలగించడం తలకుమించిన పనిగా మారింది. వాటికింద చిక్కుకున్న వారు కాపాడాలంటూ చేస్తున్న ఆక్రందనలు కలచివేస్తున్నాయి. మృతుల సంఖ్య ఇప్పటికే 8 వేలకు చేరువైంది. శిథిలాలన్నింటినీ తొలగిస్తే అది మరింత భారీగా పెరిగేలా కన్పిస్తోంది. తుర్కియే (టర్కీ), సిరియాల్లో సంభవించిన ఘోర భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేటమట్టమైన వేలాది భవనాల శిథిలాల కింద భారీగా శవాలు బయటపడుతున్నాయి. ఇప్పటిదాకా మృతుల సంఖ్య 7,800 దాటింది. ఒక్క తుర్కియేలోనే దాదాపు 6,000 పై చిలుకు భవనాలు కూలిపోయినట్లు నిర్ధారించారు. విపరీతమైన చలి వణికిస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. శిథిలాలను తొలగించడం, వాటి కింద చిక్కుకున్న వారిని గుర్తించడం కష్టతరంగా మారింది. సోమవారం మూడు భారీ భూకంపాలు ఇరు దేశాలను కుదిపేయడం తెలిసిందే. అనంతరం ఇప్పటిదాకా కనీసం 200కు పైగా చిన్నా పెద్దా ప్రకంపనలు వణికించాయి. వాటి భయానికి భారీగా జనం ఇళ్లూ వాకిలీ వీడి వలస బాట పడుతున్నారు. సహాయక చర్యలకు చలి తీవ్ర విఘాతం కలిగిస్తోంది. పిల్లలు, వృద్ధులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని అధికార యంత్రాగంతో అంచనా వేయించిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్.. పది ప్రావిన్స్‌లో మూడు నెలలపాటు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఇది మహా విపత్తుగా అభివర్ణించింది ఐరాసకు చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. డబ్ల్యూహెచ్ఓ సెక్రటరీ జనరల్ థెడ్రోస్ అధోనం గెబ్రెయేసస్ స్పందిస్తూ.. టర్కీ, సిరియాలో రెండున్నర కోట్ల మంది.. భూకంపంతో ప్రభావితం అయ్యి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఆయా దేశాల రీజియన్‌ను డిజాస్టర్ జోన్‌గా ప్రకటిస్తూ.. ఆయా దేశాలకు వీలైనంత సాయం అందించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటిదాకా టర్కీలో 5,400 మందికి పైగా, సిరియాలో 1,800కి పైగా మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. పూర్థిస్థాయిలో శిథిలాల తొలగింపు జరిగితే మరణాల సంఖ్య 20 వేలకు పైనే దాటోచ్చని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేస్తోంది. ఇప్పటికే అత్యవసర వైద్య బృందాలను ఆ దేశాలకు పంపినట్లు ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. తుర్కియే (టర్కీ), సిరియా భూకంపంలో గుండెపగిలే దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరియాలోని అలెప్పో గ్రామీణ ప్రాంతంలో శిథిలాల మధ్య నెలలు నిండిన మహిళ ప్రసవించింది. కొత్తగా లోకాన్ని చూసిన ఆ పసిబాలుడ్ని సహాయ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. శిథిలాల కింద తల్లిపేగు తెంచి బాలుడి ప్రాణాన్ని కాపాడగలిగారు. కానీ కన్న తల్లికి మాత్రం అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి. సహాయ సిబ్బంది ఒకరు ఆ పసిబాలుడ్ని బయటకు తీసుకువస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒక విపత్తుని ఎదిరించి పురుడు పోసుకున్న ఆ బాలుడు సిరియన్లకు ఆశాకిరణంగా మారాడన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతటా ఆర్తనాదాలే శిథిలాల కింది నుంచి బాధితుల ఆక్రందనలు హృదయవిదారకంగా వినిపిస్తున్నాయని భూకంపం నుంచి బయటపడ్డవారు చెప్తున్నారు. ‘‘కానీ వారిని కాపాడుకొనే మార్గం కనిపించడం లేదు. కాంక్రీట్ స్లాబ్‌లను తొలగించే పరికరాలు మా దగ్గర లేవు. ప్రభుత్వం నుంచి ఏ సాయమూ అందడం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా జాప్యం జరిగితే బాధితులు చనిపోయే ప్రమాదముందంటున్నారు. తుర్కియేలోని హతాయ్ ప్రావిన్స్‌లో వేలాది మంది క్రీడా ప్రాంగణాలు, ఫంక్షన్ హాళ్లలో తలదాచుకున్నారు. సైన్యం రంగంలోకి దిగి టెంట్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. షాపింగ్ మాల్స్, స్టేడియాలు, మసీదులు, కమ్యూనిటీ సెంటర్లలోనూ నిరాశ్రయులకు వసతి కల్పిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు ఆహారం, నీరు అందజేస్తున్నాయి. భూకంప కేంద్రమైన గాజియాన్‌టెప్ నగరంలో పరిస్థితి భీతావహంగా మారింది. ఎటు చూసినా బాధితుల ఆక్రందనలే వినిపిస్తున్నాయి. సహాయక చర్యలు పూర్తయితేనే స్పష్టత తుర్కియేలో ఇప్పటిదాకా 3,400 మందికి పైగా మరణించారని, 21,000 మందికి పైగా గాయపడ్డారని ఉపాధ్యక్షుడు ఫౌత్ ఒక్తాయ్ ప్రకటించారు. 10 ప్రావిన్స్‌ల్లో 7,800 మందిని రక్షించారు. సిరియాలో ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతంలో 800 మంది మృతిచెందారని, 1,400 మంది క్షతగాత్రులయ్యారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. తిరుగుబాటుదారుల ఆక్రమణలోని వాయవ్య ప్రాంతంలో 790 మంది మరణించారని, 2,200 మందికి పైగా గాయాల పాలయ్యారని సహాయక చర్యల్లో నిమగ్నమైన వైట్ హెల్మెట్స్ అనే వైద్య సంస్థ తెలిపింది. రెండు దేశాల్లోనూ మృతుల సంఖ్య భారీగా పెరగనుందని, సహాయక చర్యలు పూర్తయ్యాకే దీనిపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. దేశాల ఆపన్న హస్తం తుర్కియే, సిరియాకు అండగా నిలిచేందుకు ఐక్యరాజ్యసమితితోపాలు పలు దేశాలు ముందుకొచ్చాయి. సహాయక సిబ్బంది, నిత్యావసరాలు, వైద్య సామగ్రి పంపుతున్నాయి. భారత్ ఎక్స్–రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లు, కార్డియాక్ మానిటర్లను అందజేసింది. నిత్యావసరాలు, వైద్య పరికరాలతో రెండు విమానాలను పంపనుంది. ఇప్పటికే రెండు సైనిక రవాణా విమానాల్లో రెస్యూ్య టీమ్‌లను తుర్కియేకు పంపినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తుర్కియే అధ్యక్షుడు తయ్యీప్ ఎర్డోగాన్‌తో ఫోన్లో మాట్లా3డారు. భూకంప మృతులకు సంతాపం ప్రకటించారు. అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ బుధవారం తుర్కియేలో పర్యటించనున్నారు. పలు దేశాల అంతరిక్ష సంస్థలు అందించిన భూకంపం, అనంతర పరిణామాల శాటిలైట్లు చిత్రాలు సహాయక చర్యల్లో ఉపయోగపడుతున్నాయి. సిరియా జైలు నుంచి 20 మంది ఉగ్రవాదుల పరారీ సిరియాలో భూకంపంలో ధ్వంసమైన జైలు నుంచి 20 మంది ఉగ్రవాదులు పరారయ్యారు. వీరిలో చాలామంది అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు చెందినవారేనని అధికారులు తెలిపారు. తుర్కియే సరిహద్దులో రాజో పట్టణంలోని ఈ మిలటరీ పోలీసు జైలులో 2,000 మంది ఖైదీలున్నారు. వీరిలో 1,300 మంది ఐసిస్ ఉగ్రవాదులే. భూకంపంతో జైలు గోడలు, ద్వారాలు ధ్వంసమయ్యాయి. దాంతో 20 మంది సులభంగా తప్పించుకున్నట్లు భావిస్తున్నారు. అమ్మ ఎక్కడ..? ప్రకృతి ఉగ్రరూపానికి తల్లిడిల్లుతున్న తుర్కియే (టర్కీ) సిరియాల్లో తల్లీ బిడ్డల్ని వేరు చేసిన ఘటనలు హృదయాన్ని కదిలిస్తున్నాయి. కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకొని అనాథగా మారిన ఏడాదిన్నర బిడ్డ మా అమ్మ ఏది, ఎక్కడుంది ? అని అడుగుతూ ఉండడం అందరి హృదయాలన్ని పిండేస్తోంది. సిరియాలోని అజాజ్‌లో ఏడాదిన్నద వయసున్న ఒక పాప శిథిలాల కింద నుంచి మృత్యుంజయురాలై బయటకు వచ్చింది. గర్భిణిగా ఉన్న ఆమె తల్లి, సోదరుడు, సోదరి ఇలా కుటుంబమంతా శిథిలాల కింద పడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే, వెన్ను విరిగిపోయిన తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇలా కుటుంబాన్ని కోల్పోయి బిక్కుబిక్కుమంటున్న చిన్నారుల్ని చూస్తుంటే అందరి గుండెలు పగిలిపోతున్నాయి. ఆస్పత్రుల్లో జీవచ్ఛవాలు తుర్కియే, సిరియాల్లోని ఆస్పత్రుల్లో ఒక వైపు శవాల గుట్టలు, మరోవైపు చావు బతుకుల మధ్య జీవచ్ఛవాలుగా మారిన వారితో నిండిపోయాయి. భూకంపం ధాటికి సర్వస్వం కోల్పోయిన వారు, కుటుంబాల్ని కోల్పోయి అనాథలుగా మిగిలిన పసివారి రోదనలతో హృదయవిదారకంగా మారింది. ఒక స్వచ్ఛంద సంస్థ తరఫున వైద్యం అందించడానికి బ్రిటన్ వైద్యుడు పరిస్థితుల్ని చూసి తల్లడిల్లిపోతున్నారు. వెంటిలేటర్లు సరిపడా లేకపోవడంతో ఒక రోగి నుంచి వెంటిలేటర్ తీసేసి మరో రోగికి అమరుస్తున్నారు. మరోవైపు, బతికే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయో వారికే వైద్యం చేస్తున్నామని, ఇలా చేయడం చాలా దుర్భరంగా అనిపిస్తోందని ఆ డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు!. గూడు వీడిన పక్షులు తుర్కియేలో భూకంపం సంభవించడానికి ముందే పక్షులు గుంపులు గుంపులుగా తమ గూళ్లని వదిలి వెళ్లిపోయిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. పక్షులన్నీ రొద చేసుకుంటూ గుంపులుగా హడావుడిగా గూడి వదిలి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లిపోయిన దృశ్యాలు అందులో ఉన్నాయి. సాధారణంగా భూకంపాన్ని పక్షులు, జంతువులు ముందే పసిగడతాయని అంటారు. ఈ వీడియోని పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర కూడా షేర్ చేశారు. ‘‘ప్రకృతి మనకు ఇచ్చిన హెచ్చరికల వ్యవస్థ. కానీ మనకే వాటిని అర్థం చేసుకోవడం తెలీడం లేదు’ అని కామెంట్ చేశారు. 2004లో సునామీకి ముందు కూడా ఇలాగే జరిగిందని ఆయన గుర్తు చేసుకున్నారు. క్రీస్తుపూర్వం 373లో గ్రీస్‌లో భూకంపం సంభవించడానికి చాలా రోజుల ముందే ఎలుకలు, పాములు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన పోయిన విషయాన్ని ఈ సందర్భంగా అమెరికా జియోలాజికల్ సర్వే ఒక నివేదికలో గుర్తు చేసింది. -
భూప్రళయం.. జన విలయం
పేకమేడల్లా కూలిన అపార్ట్మెంట్లు.. నేలకొరిగిన ఎత్తైన స్తంభాలు.. నిలువునా చీలిన విమానా శ్రయ రన్వేలు.. ధ్వంసమైన ఆసుపత్రులు.. వేలకొద్దీ మృతులు, క్షతగాత్రులు.. లక్షల్లో నిరాశ్ర యులు.. ఇది కనివిని ఎరుగని భూప్రళయం. కన్నీరాగని జన విలయం. సిరియా సరిహద్దులకు సమీపంలో టర్కీ (నూతన నామం తుర్కియా) ఆగ్నేయ ప్రాంతంలో, ఆ పొరుగునే వాయవ్య సిరియాలో సోమవారం తెల్లవారుజామున తీవ్రస్థాయిలో వచ్చిన భూకంపం, ఆపైన ఆగని ప్రకంప నల దృశ్యాలు కదిలించేస్తాయి. 2021 ఆగస్ట్‌లో దక్షిణ అట్లాంటిక్‌లో వచ్చిన ప్రకంపన తర్వాత అమె రికా భూగర్భ సర్వేక్షణ సంస్థ రికార్డ్ చేసిన ప్రపంచంలోని అతి పెద్ద భూకంపం ఇదే. ఇప్పటికి కనీసం 5 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 6 వేల భవనాలు కుప్పకూలాయి. మరో 11 వేల భవనాల పరిస్థితీ అనధికారికంగా అలానే ఉంది. అంకెలు శరవేగంతో మారుతుండడంతో మృతుల సంఖ్య 10 వేలు దాటినా ఆశ్చర్యం లేదు. బాధితుల సంఖ్య 2.3 కోట్ల దాకా ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్క. ఇది 21వ శతాబ్దిలోకెల్లా అతి పెద్ద ప్రకృతి వైపరీత్యం అంటున్నది అందుకే. భూఉపరితలానికి దిగువన భూఫలకాల మధ్య ఘర్షణతో భూకంపాలు వస్తాయని లెక్క. ప్రపంచంలో ప్రధానంగా అరేబియన్, యురేషియన్, ఇండియన్, ఆఫ్రికన్, మరో చిన్నదైన అనటోలియన్ భూఫలకాలున్నాయి. మధ్యప్రాచ్యంలో భూకంపాలకు ఇవే కారణం. తాజాగా అనటోలియన్, అరేబి యన్ భూఫలకాల మధ్య 100 కిలోమీటర్ల పైగా దూరం పగులు, ఒరిపిడితో 7.8 రిక్టర్ స్కేల్ స్థాయి భూకంపం టర్కీ, సిరియాలను తాకింది. టర్కీలో చారిత్రక గాజియన్టెప్ సమీపంలో జన సమ్మర్ద ప్రాంతంలో భూకంప కేంద్రం నెలకొంది. సోమవారమే 12 గంటల్లో 3 సార్లు భూమి కంపించింది. రెండోరోజూ 2 తీవ్ర కంపనలొచ్చి, సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్‌లలో ప్రభావం చూపాయి. భూకంప అనుబంధ అనంతర ప్రకంపనలైతే డజన్లలో వస్తున్నాయి. వారసత్వ కట్టడాలూ దెబ్బతిన్నాయి. హృదయవిదారక జగత్ప్రళయ దృశ్యాలతో, వేలాది మరణాలు సంభవించిన భూకంప బాధిత ఆగ్నేయ ప్రావిన్సులు పదింటిలో మూడు నెలలు ఎమర్జెన్సీ విధించారు టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్. ఒక పక్క వాన, మరోపక్క చలికాలపు మైనస్ డిగ్రీల అతి శీతల గాలుల్లో సహాయక చర్యలూ కష్టమే. శిథిలాల కింద నుంచి ఆర్తనాదాలు, మూలుగులు వినిపిస్తున్నా వారిని కాపాడే వ్యక్తులు, వసతులు కరవయ్యాయి. కొనవూపిరితో కొట్టుకుంటున్నవారూ చలిలో గడ్డకట్టుకు పోతున్న పరిస్థితుల్లో... వట్టి చేతులతోనైనా శిథిలాలను తవ్వి అయినవాళ్ళను కాపాడుకోవాలన్న విఫల ప్రయత్నాలు సాగుతున్న వేళ... భారత్ సహా 45 దేశాలు మానవతా దృక్పథంతో అత్యవసర సామగ్రితో సాయానికి దిగాయి. అసలే యుద్ధంతో, భౌగోళిక రాజకీయాలతో, ఆపైన కరోనాతో, తర్వాత కలరాతో కన్నీట మునిగిన సిరియాకు తాజా భూకంపం దెబ్బ మీద దెబ్బ. యుద్ధంతో ఆ దేశం వదిలి దక్షిణ టర్కీలో క్రిక్కిరిసిన పరిస్థితుల్లో బతుకీడుస్తున్న వారికీ, సిరియాలోనే తిరుగుబాటుదారుల చేతిలోని ఇడ్లిబ్ నగరంలో చమురు కొరత, ఆకాశాన్నంటే ధరల మధ్య అంతర్జాతీయ మానవతా సాయంతో ప్రాణాలు నిలబెట్టుకుంటున్నవారికీ ఇప్పుడు కాలి కింద భూమినీ ప్రకృతి లాగేసింది. వైట్ హెల్మెట్స్ లాంటి çసంస్థలు సేవలందించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నా, సామగ్రి కొరతతో కష్టమవుతోంది. ఈ అత్యవసర సమయంలోనూ శరణార్థుల సాయానికి దోవలన్నీ సిరియా మూతబెడితే, బాధితులకు కనీసం తిండి, మంచినీళ్ళు, మందులు అందేదెలా? దౌత్య, రవాణా వసతుల పరంగా పెను సవాలైన దీన్ని అంతర్జాతీయ సమాజం పరిష్కరించకుంటే ఇది మరో పెను మానవవిషాదం. నిజానికి, భౌగోళికంగా భూకంప ప్రేరక ప్రాంతంలో టర్కీ ఉంది. టర్కీ, సిరియా, జోర్డాన్లున్న తూర్పు మధ్యధరా ప్రాంతాన ఆఫ్రికన్, అరేబియన్, యురేషియన్ భూఫలకాల మధ్య సంక్లిష్ట సంబంధాలున్నాయి. అనటోలియన్ బ్లాక్ సరేసరి. అందుకే, టర్కీలో శతాబ్దాలుగా భూవిలయాలు పరిపాటి. అక్కడ 1939 నాటి భూకంపంలో 33 వేల మంది చనిపోయారు. ఈసారి ఈ శతాబ్దిలో కెల్లా బలమైన భూకంప తాకిడితో ఆ దేశం చిగురుటాకులా వణికింది. లోతైన భూకంపాలు సంభ విస్తే వాటి తాకిడి భూ ఉపరితలానికి తాకేసరికి చాలావరకు శక్తి కోల్పోయి, కొంత తక్కువ నష్టం కలిగి స్తాయి. కానీ, లోతు లేని భూకంపాలు శక్తిమంతంగా పైకి తాకి, పెను విధ్వంసం రేపుతాయి. తాజా భూకంపం అలాంటిదే. అయితే ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ముందే ఊహించి, హెచ్చరించే వ్యవస్థలు నేటికీ లేవు. కాంతి వేగం కన్నా చాలా నిదానంగా, సెకనుకు 5 నుంచి 13 కి.మీ.ల దూరం ప్రయాణించే భూకంప తరంగాలు ఉపరితలం చేరడానికి సెకన్ల ముందే తెలుసుకోగలుగుతున్నాం. టర్కీతో పోలిస్తే హిమాలయ ప్రాంతానికి భూకంపాల ముప్పు ఎక్కువ. ఉపరితలం కింద ఒత్తిడి అనూహ్యంగా పేరుకున్న హిమాలయాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం. భారత్‌లో 59 శాతం ప్రాంతానికి అలా ప్రమాదం పొంచివుంది. టర్కీ ఘటన మనకు మేలుకొలుపు. దీన్నుంచి తక్షణం పాఠాలు నేర్చుకోవాలి. రెండు వారాల క్రితం నేపాల్‌లో భూకంపం తాలూకు ప్రకంపనాలు ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కనిపించాయని మర్చిపోరాదు. ఏటా జనవరి 16న జాతీయ భూకంప దినం జరుపుతూ నేపాల్ లాంటివి జనచైతన్యం పెంచుతుంటాయి. అలాంటి ఆలోచనల్ని మనమూ ఆచరణలో పెట్టాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకొనే కన్నా తెలివిగా, ముందుజాగ్రత్తతో ఉండాలి. ముందస్తుగా కార్యాచరణకు సిద్ధమవ్వాలి. బాధిత దేశాల పునరుజ్జీవనానికి చేయూత నిస్తూనే ఈ పనిలోకీ దిగాలి. హృదయ విదారక ప్రళయసదృశ దృశ్యాలు గుర్తుచేస్తున్నదదే. -
బుద్ధిమారని పాక్.. టర్కీకి భారత్ సాయం అందకుండా మోకాలడ్డు!
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధి చాటుకుంది. భూకంపంతో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న టర్కీకి సాయం అందించేందుకు వెళ్తున్న భారత యుద్ధ విమానాలు తమ గగనతలం మీద నుంచి వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో భారత సీ-17 యుద్ధ విమానం వెనక్కి వచ్చి వేరే దేశం మీదుగా టర్కీకి చేరుకోవాల్సి వచ్చింది. ఈమేరకు భారత మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే భారత యుద్ధవిమానాలు అసలు పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లలేదని, ఇందుకు సంబంధించి ఎలాంటి అనుమతులు కూడా పాకిస్తాన్‌ను భారత్ అడగలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. భారత్‌లోని టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ కూడా ఈ విషయంపై స్పందించారు. భారత యుద్ధవిమానాలు ఎగిరేందుకు పాకిస్తాన్ అనుమతి నిరాకరించిందనే విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. 2021లో కూడా అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పుడు భారతీయులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చింది కేంద్రం. అప్పుడు కూడా మనం పాక్ గగనతలాన్ని వినియోగించుకోలేదు. మన విమానాలు అఫ్గాన్ నుంచి ఇరాన్ మీదుగా భారత్ చేరుకున్నాయి. రెండు యుద్ధవిమానాలు.. భూకంపం అనంతరం టర్కీకి భారత్ తనవంతు సాయం చేస్తోంది. ఇప్పటివరకు రెండు యుద్ధ విమానాల్లో సహాయక సిబ్బంది, పరికరాలు, ఔషధాలను పంపింది. మొదటి యుద్ధ విమానం సోమవారం రాత్రే టర్కీ చేరుకోగా.. రెండో యుద్ధ విమానం మంగళవారం వేకువజామున టర్కీకి వెళ్లింది. ఈ విమానాల్లో జాతీయ విపత్తు నిర్వహణ దళాలు, ప్రత్యేక శిక్షణ తీసుకున్న డాగ్ స్క్వాడ్లు, డ్రిల్లింగ్ మెషీన్లు, ఔషధాలు, పరికరాలు సహా ఇతర సామగ్రిని భారత్ టర్కీకి పంపింది. First Indian C17 flight with more than 50 @NDRFHQ Search & Rescue personnel, specially trained dog squads,drilling machines, relief material, medicines and other necessary utilities & equipment reaches Adana,Türkiye. Second plane getting ready for departure. @MevlutCavusoglu pic.twitter.com/sSjuRJJrIO — Dr. S. Jaishankar (@DrSJaishankar) February 7, 2023 చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్.. -
టర్కీ, సిరియా భూకంపం: క్షణాల్లో అంతా తారుమారు! హృదయం ద్రవించే ఫోటోలు
-
భూకంపంతో జైలు గోడలు ధ్వంసం.. 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు జంప్..!
టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించి వేల భవనాలు నేలమట్టం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భూకంపం కారణంగా కొందరు ఖైదీలకు జైలు నుంచి తప్పించుకునేందుకు అవకాశం లభించింది. టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతం రాజోలోని జైలు భూప్రకంపనల కారణంగా పాక్షికంగా దెబ్బతింది. గోడలకు పగుళ్లు వచ్చి కులిపోయాయి. దీన్నే అదునుగా భావించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు చెందిన ఖైదీలు జైలులో తిరుగుబాటు చేశారు. జైలులోని ఓ భాగాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అనంతరం 20 మంది జైలు నుంచి తప్పించుకుని పారిపోయారు. వీరంతా ఐసిస్ సంస్థకు చెందిన వారేరని అధికారులు తెలిపారు. ఈ జైలును టర్కీ అనుకూల గ్రూప్‌లే నియంత్రిస్తాయి. మొత్తం 2,000 మంది ఖైదీలున్నారు. వీరిలో 1,300 మంది ఐసిస్ ఉగ్రసంస్థకు చెందినవారే. వీరితో పాటు సిరియా అనుకూల ఖుర్షీద్ దళాలకు చెందిన ఫైటర్లు ఉన్నారు. అయితే జైలులో తిరుగుబాటు జరిగిన విషయం నిజమేనని, కానీ 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు ధ్రువీకరించలేమని బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబసర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వార్ మానిటర్ తెలిపింది. ఐసిస్ ఖైదీలను తప్పించేందుకు గతేడాది డిసెంబర్లో సెక్యూరిటీ కాంప్లెక్స్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో ఖుర్దీష్ దళాలకు చెందిన ఆరుగురు చనిపోయరు. చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్.. -
భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్..
ఇస్తాన్‌బుల్: టర్కీ, సిరియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ భయానక విపత్తులో 5,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 24 వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. టర్కీలో భూకంపం తర్వాత దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. పేకమేడల్లా కూలిపోయిన భవనాలు, శిథిలాలను చూస్తుంటే గుండె తరుక్కుపోయేలా ఉంది. భూకంపం తర్వాత టర్కీ హతాయ్ ప్రాంతంలో పరిస్థితిని కళ్లగట్టేలా ఓ హుమానిటేరియన్ రిలీఫ్ ఫౌండేషన్ డ్రోన్ దృశ్యాలను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. A drone video released by Humanitarian Relief Foundation shows the extent of destruction in Hatay province in Turkey, which was rocked by a 7.8 magnitude earthquake pic.twitter.com/L6mbqIkJZp — Reuters Asia (@ReutersAsia) February 7, 2023 చదవండి: భూకంపం వస్తుందని మూడు రోజుల ముందే చెప్పాడు.. కానీ ఎవరూ నమ్మలే -
టర్కీ భూకంపం.. శిథిలాల కింద స్టార్ ఫుట్‌బాలర్
టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పావుగంట వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు వదిలారు. తాజా సమాచారం ప్రకారం.. 4800కు పైగా మృతదేహాలను శిథిలాల నుంచి రెస్క్యూ టీంలు వెలికి తీశాయి. వందల సంఖ్యలో భారీ బిల్డింగ్లు కూలిపోవడం, అర్ధరాత్రి కావడంతో గాఢనిద్రలో ఉండడంతో ప్రజలు బయటకు పరుగులు తీసేందుకు కూడా వీల్లేకుండా పోయింది. వేలాది మంది ఇంకా శిథిలాలే కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.టర్కీ, సిరియాలో ఎంతెంత మంది మరణించారనే సమాచారంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఘనా స్టార్ ఫుట్‌బాల్ క్రిస్టియన్ అట్సు ప్రాణాలతో భయటపడ్డాడు. ప్రస్తుతం అతను టర్కీష్ సూపర్ క్లబ్ హట్సేపోర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భూకంపం సంభవించిన సమయంలో క్రిస్టియన్ అట్సు సదరన్ ప్రావిన్స్ ఆఫ్ హటే ప్రాంతంలో శిథిలాల కింద చిక్కుకున్నాడు. అయితే దేవుని దయవల్ల అతనికి ఏం జరగలేదు. రెస్క్యూ టీమ్ వచ్చి అట్సూను శిథిలాల నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఘనాకు చెందిన రేడియో కమ్యూనికేషన్ స్టేషన్ మార్నింగ్ బులెటిన్‌లో వెల్లడించింది. ''మీకొక గుడ్‌న్యూస్. మాకు అందిన సమాచారం ప్రకారం ఘనా స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియన్ అట్సూ ప్రాణాలతో బయటపడ్డాడు. భూకంపం సంభవించిన టర్కీలోని సదరన్ ప్రావిన్స్ ఆఫ్ హటేలో అతను ఉంటున్న బిల్డింగ్ కూలింది. దీంతో శిథిలాల కింద చిక్కుకున్నాడు. రెస్క్యూ సిబ్బంది అతన్ని రక్షించారు.'' అంటూ పోస్ట్ చేసింది. ఇక అట్సు చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్‌కు కూడా గతంలో ప్రాతినిధ్యం వహించాడు. న్యూక్యాసిల్కు ఐదేళ్ల పాటు ఆడిన క్రిస్టియన్ అట్సు 2021లో సౌదీ అరేబియా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవలే టర్కీష్ ఫుట్‌బాల్ క్లబ్‌కు మారాడు. ఇక ఘనా తరపున 65 మ్యాచ్‌లాడిన అట్సూ 9 గోల్స్ చేశాడు. Update: We've received some positive news that Christian Atsu has been successfully rescued from the rubble of the collapsed building and is receiving treatment. Let’s continue to pray for Christian🙏🏽 — Ghana Football Association (@ghanafaofficial) February 7, 2023 చదవండి: ఎటు చూసినా గుండె పగిలే దృశ్యాలు -
'నిజమైన స్నేహితుడికి అర్థం భారత్'!..: టర్కీ
కనివినీ ఎరుగని రీతిలో 24 గంటల్లో మూడు సార్లు భూమి కంపించి టర్కీని ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఆయా ప్రాంతాలన్నీ మృత్యు ఘోషతో విషాదమయంగా మారాయి. కోలుకోలేని బాధలో ఉన్న టర్కీకి భారత్ స్నేహ హస్తం చాపి కావాల్సిన నిధులను అందించింది. అలాగే టర్కీకి అవసరమయ్యే రెస్క్యూ, వైద్య బృందాలను పంపింది. దీంతో భారత్‌లోని టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ న్యూఢిల్లీకి కృతజ్ఞతలు తెలుపుతూ..ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా.. టర్కిష్ భాషలోనూ, హిందీలోనూ 'దోస్త్' (స్నేహితుడు) అనేది కామన్ పదం. టర్కిష్‌లోని 'దోస్త్ కారా గుండె బెల్లి ఒలూర్ (ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు)' అనే సామెతను ప్రస్తావిస్తూ..భారత్‌కి చాలా ధన్యవాదాలు అని అన్నారు. కాగా, విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ టర్కీ రాయబార కార్యాలయాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతిని, మానవతావాద మద్దతును కూడా ఆయన తెలియజేశారు. అంతేగాదు రిపబ్లిక్ ఆఫ్ టర్కీ ప్రభుత్వ సమన్వయంతో ఎన్డీఆర్ఎఫ్ వైద్య బృందాలు, సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌ల తోపాటు రిలీఫ్ మెటీరియల్‌ను టర్కీకి పంపాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. అంతేగాదు ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్లు, అవసరమైన పరికరాలు, సుమారు 100 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భూకంపం సంభవించిన ప్రాంతాలకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని కూడా ప్రకటనలో తెలిపింది. అలాగే తక్షణ సహాయక చర్యలపై చర్చించేందుకు సౌత్ బ్లాక్‌లో ప్రధాని ప్రిన్సిపాల్ సెక్రటరీ పీకే మిశ్రా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేబినేట్ సెక్రటరీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ), డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, రక్షణ దళాల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పౌర విమానాయన ఆరోగ్య మంత్రిత్వ శాక తదితర ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మేరకు ఈ పాటికే సహాయక సామాగ్రితో రెండు భారత్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టర్కీ, సిరియాలకు బయలుదేరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేగాదు ఆ బృందాలు వైద్య సామాగ్రి, మందులతో టర్కీలోని డమాస్కస్ చేరుకున్నాయని సమాచారం. (చదవండి: వరల్డ్ బ్రైటెస్ట్ స్టూడెంట్స్ జాబితాలో భారత సంతతి అమ్మాయికి స్థానం) -
భూకంపం: హృదయ విదారక దృశ్యాలు..ఐదు వేల మంది మృతి!
-
Turkey–Syria Earthquakes 2023: ఎటు చూసినా గుండె పగిలే దృశ్యాలు
భారీ భూకంపాలు. ఊగిపోతూ పేక మేడల్లా కూలిన భారీ భవనాలు. వాటి కింద చిధ్రమైన బతుకులు.. విగతజీవుల్ని చూసి మిన్నంటుతున్న అయినవాళ్ల రోదనలు. సాయం కోసం శిథిలాల కిందే ఆర్తనాదాలతో ఎదురుచూపులు. ఈలోపు గంటల వ్యవధిలో మరోసారి ప్రకంపనలు. వెరసి.. సోమవారం సంభవించిన విలయం రెండు దేశాల్లో 4 వేలకు పైనే ప్రాణాలను బలిగొంది. 7.8, 7.6, 6.0 రిక్టర్ స్కేల్‌పై నమోదు అయిన భూకంప తీవ్రత. 20 సార్లు శక్తివంతమైన ప్రకంపనలు. ఊరు, పట్టణాలనే తేడా లేకుండా మరు భూములుగా మారిపోయాయి. టర్కీ, సిరియాలో ధరిత్రీ ప్రకోపానికి భారీగా ప్రాణ-ఆస్తి నష్టమే వాటిల్లింది. బిల్డింగ్‌ల శిథిలాల కింద నలిగిపోయిన బతుకులు.. గాయపడి సాయం కోసం కొందరు పెడుతున్న కేకలు.. తమ వాళ్లు ఏమైపోయారో అనే ఆందోళనతో మరికొందరు చేస్తున్న ఆర్తనాదాలు.. ఎటు చూసినా గుండె పగిలే దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. టర్కీలో.. రోడ్లు దెబ్బతినడం, కరెంట్-ఇంటర్నెట్ సేవలకు అంతరాయంతో పాటు చాలాచోట్ల మంచి నీటి సరఫరాకు విఘాతం ఏర్పడడంతో.. రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రకృతి విలయం చేసిన గాయంతో.. వారం పాటు సంతాప దినాలు ప్రకటించుకుంది టర్కీ. పాశ్చాత్య, అగ్ర దేశాలతో పాటు భారత్ సహా మొత్తం పన్నెండు దేశాలు టర్కీకి తక్షణ సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే రిలీఫ్ మెటీరియల్‌ను టర్కీకి పంపించాయి కూడా. వేల మంది ఇంకా శిథిలా కిందే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) టర్కీలో.. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ దేశాల్లో ప్రకంపనల ప్రభావం కనిపించిందంటే.. టర్కీ, సిరియాల్లో సంభవించిన విలయం ఎంతటి శక్తివంతమైందో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు దేశాల్లోనూ శిథిలాల చిక్కుకున్న వాళ్లను రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌లో.. ఇప్పటిదాకా 4వేలకు పైగా మృతదేహాలను వెలికి తీశారు. టర్కీ చరిత్రలోనే ఇది భారీ భూకంపంగా నమోదు కాగా.. అధికంగా మృతుల సంఖ్య కూడా ఇక్కడే నమోదు అయ్యిందని తెలుస్తోంది. భారీ ప్రకంపనల ధాటికి సెకన్ల వ్యవధిలోనే వందల సంఖ్యలో భవన సముదాయాలు కుప్పకూలడం ఒక ఎత్తయితే.. అర్ధరాత్రి అంతా నిద్రలో ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. సిరియాలో.. ఇదిలా ఉంటే.. 8వేల మందిని శిథిలాల నుంచి సురక్షితంగా రక్షించినట్లు అత్యవసర విభాగపు అధికారులు ప్రకటించుకున్నారు. సోమవారం నాటి భూకంపం ధాటికి 14వేల పైనే గాయపడగా.. వీళ్లలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిరియాలోనూ క్షతగాత్రులు నాలుగు వేల మందికి పైనే ఉండొచ్చని అనధికార లెక్కలు చెప్తున్నాయి. సిరియాలో.. టర్కీ ప్రపంచంలో అత్యంత చురుకైన భూకంప జోన్లలో ఒకటి. భూగర్భంలోని వైవిధ్యతే అందుకు కారణం!. అందుకే భవన నిర్మాణాల విషయంలో ప్రామాణికత పాటించాలని అక్కడి నిపుణులు సూచిస్తుంటారు. 1939లో తూర్పు ఎర్జింకన్ ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో భూకంపం సంభవించి.. 33,000 మంది మరణించారు. డజ్సే ప్రాంతంలో 1999లో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 17,000 మందికి పైగా మరణించారు. ముఖ్యంగా ఇస్తాంబుల్‌లో 16 మిలియన్ల జనాభాతో.. ఇరుకు ఇరుకు ఇళ్లతో ఉంటుంది. భారీ భూకంపాలు వస్తే.. ఇస్తాంబుల్ సర్వనాశనం అవుతుందని నిపుణులు ఎన్నో ఏళ్ల నుంచి హెచ్చరిస్తూ వస్తున్నారు. కానీ, అక్కడి జనం, అధికార యంత్రాంగం ఆ హెచ్చరికలను పెడచెవిన పెడుతూ నిబంధనలకు విరుద్ధంగా భారీ భారీ బిల్డింగ్లు కడుతూ వస్తున్నారు. In a world where HUMANITY actually mattered, #Turkey would’ve invested in #earthquake resistant construction in #Kurdish areas, but alas—the death of 1000s of Kurds is a gift 2the Turkish govt & nationalists who have made it their life mission to eradicate the Kurdish population pic.twitter.com/CFodWAFd6p — Samira Ghaderi (@Samira_Ghaderi) February 6, 2023 ఇక సిరియా సైతం భూకంప ప్రభావిత ప్రాంతమే. అలెప్పో, లటాకియా, హమా, టార్టస్ ప్రాంతాలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. పైగా విషాదానికి ముందే అలెప్పోలోని(రష్యా యుద్ధ స్థావర కేంద్రం కూడా) భవనాలు కొన్ని కూలిపోతూ వస్తున్నాయి. అయినా అధికారులు ముందు జాగ్రత్త పడలేదు. అయితే ఇళ్ల నుంచి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు చాలామంది. ఇక సహజ వాయువు నిక్షేపాల ప్రాంతం కావడంతో.. సమయస్ఫూర్తితో వ్యవహరించి వాయువుల సేకరణను, విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో.. మరింత నష్టం జరగకుండా మాత్రం నిలువరించగలిగారు. శవాల దిబ్బలుగా టర్కీ, సిరియా (ఫొటోలు) -
Turkey–Syria Earthquakes: ఎందుకీ భూ ప్రకోపం?
టర్కీ, సిరియాలో శక్తివంతమైన భూకంపం ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ భవనాలు నేటమట్టమయ్యాయి. 456 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్, 874 కిలోమీటర్ల దూరంలో ఉన్న లెబనాన్, 1,381 కిలోమీటర్ల దూరంలోని ఇజ్రాయెల్, 1,411 కిలోమీటర్ల దూరంలోని ఈజిప్ట్‌లో సైతం భూప్రకంపనలు నమోదయ్యాయి. దక్షిణ–మధ్య టర్కీలోని గాజియాన్‌టెప్ సిటీకి 33 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూ ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు మొదలైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. టర్కీలో గత 100 ఏళ్లలో ఇదే అత్యంత శక్తివంతమైన భూకంపమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 95 శాతం భూభాగం భూకంప ప్రభావితమే భౌగోళికంగా ‘అనటోలియన్ టెక్టానిక్ ప్లేట్’ ప్రాంతంలో ఉన్న టర్కీలో భూప్రకంపనలు సర్వసాధారణంగా మారాయి. 2020లో 33,000 భూకంపాలు నమోదయ్యాయి. వీటిలో 332 భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై దాదాపు 4.0గా రికార్డయ్యింది. భూమి పై పొరను టెక్టానిక్‌గా వ్యవహరిస్తారు. ఇందులో 15 భారీ టెక్టానిక్ ప్లేట్లు (రాతి పొరలు) ఉంటాయి. రెండు పొరల సరిహద్దుల నడుమ ఖాళీ ప్రదేశం ఉంటుంది. కొన్నిచోట్ల ప్లేట్ల మధ్య పగుళ్లు ఉంటాయి. భూ అంతర్భాగంలో సర్దుబాట్ల వల్ల రెండు టెక్టానిక్ ప్లేట్లు బలంగా ఢీకొన్నప్పుడు భారీ భూకంపం సంభవిస్తుందని బ్రిటిష్ ఆర్కియాలాజికల్ సర్వే వెల్లడించింది. యూరేసియన్, ఆఫ్రికన్ ప్లేట్ల చీలిక భాగంలో టర్కీ భూభాగం ఉంది. యూరేసియన్, అనటొలియన్ టెక్టానిక్ ప్లేట్ల నడుమ నార్త్ అనటొలియన్ ఫాల్ట్(ఎన్‌ఏఎఫ్) లైన్ అనే చీలిక ఉంది. రెండు ప్లేట్లు ఢీకొనడంతో ఇక్కడే భూకంపం ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. ఎన్‌ఏఎఫ్ చీలిక దక్షిణ ఇస్తాంబుల్ నుంచి ఈశాన్య టర్కీ దాకా విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. 1999, 2011లోనూ ఈ ప్రాంతం నుంచే భూకంపాలు విస్తరించినట్లు పరిశోధకులు వెల్లడించారు. 1999 నాటి భూకంపంలో 18,000 మంది, 2011 నాటి భూకంపంలో 500 మందికిపైగా జనం మృతిచెందారు. టర్కీలో ఏకంగా 95 శాతం భూభాగం భూకంప ప్రభావిత ప్రాంతమే కావడం గమనార్హం. పెద్ద నగరాలైన ఇస్తాంబుల్, ఇజ్‌మీర్‌తోపాటు ఈస్ట్ అనటోలియా కూడా భూకంపం ముప్పును ఎదుర్కొంటున్నాయి. 3 రోజుల క్రితమే చెప్పేశాడు తాజా భూకంపంపై ముందే చెప్పిన ఫ్రాంక్ త్వరలో భారత్‌కూ రావచ్చని హెచ్చరికలు అమ్‌స్టర్‌డ్యామ్: టర్కీ, సిరియాలో వేలాది మందిని బలితీసుకున్న భూకంపం గురించి నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్రాంక్ హూగర్‌గీట్స్ అనే పరిశోధకుడు ముందే హెచ్చరించారు. దక్షిణ మధ్య టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించనుందని, ఇది రిక్టర్ స్కేల్‌పై 7.5గా నమోదవుతుందని ఈ నెల 3న ఆయన ట్వీట్ చేశారు. ఆయన జోస్యం నిజమేనని మూడు రోజుల తర్వాత తేలింది. మొదటి భూకంపం తర్వాత కొన్ని గంటలు గడిచాక రెండో భూకంపం సంభవిస్తుందంటూ తన సంస్థ చేసిన ట్వీట్‌ను ఆయన షేర్ చేశారు. అది కూడా నిజమేనని తేటతెల్లమయ్యింది. త్వరలో భారత్‌తో పాటు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్లకు కూడా భూకంపం రావచ్చని హెచ్చరిస్తున్నారు. హూగర్బీట్స్ ‘సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే’ అనే సంస్థలో పరిశోధకుడిగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ భూకంపాలపై అధ్యయనం చేస్తోంది. అయితే, హూగర్బీట్స్ నకిలీ సైంటిస్టు అని పలువురు ట్విట్టర్లో విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా, తాను చెప్పింది వాస్తవరూపం దాల్చడం పట్ల హూగర్బీట్స్ విచారం వ్యక్తం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భూకంపం వస్తుందని మూడు రోజుల ముందే చెప్పాడు.. ఎవరూ నమ్మలే..
టర్కీ, సిరియాలో సోమవారం భారీ భూకంపం సంభవించి 2300 మందికిపైగా చనిపోవడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ఉపద్రవాన్ని ఓ వ్యక్తి మూడు రోజుల ముందే ఊహించారంటే? నమ్మగలరా? టర్కీ, సిరియాలో త్వరలో భారీ భూకంపం రాబోతుందని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. కానీ ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆయన అంచనాలు ఎప్పుడూ నిజమైన దాఖలాలు లేవని కొట్టిపారేశారు. కానీ మూడు రోజుల తర్వాత ఆయన చెప్పిందే నిజమైంది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతో భూకంపం వచ్చి టర్కీ, సిరియా అతలాకుతలం అయ్యాయి. వేల భవనాలు నేలమట్టయ్యాయి. బిల్డింగులు పేక మేడల్లా కూలిపోయాయి. భూకంపాన్ని ముందే ఊహించిన ఈ వ్యక్తి పేరు ఫ్రాంక్ హూగర్బీట్స్. భూకంప కార్యకలాపాలను అధ్యయనం చేసే 'సోలార్ సిస్టం జియోమెట్రిక్ సర్వే'(SSGEOS) పరిశోధకులు. ఈయన మూడు రోజుల క్రితం చేసిన ట్వీట్ ఇది.. 'అతి త్వరలో లేదా తర్వాత సౌత్ సెంట్రల్ టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతాల్లో 7.5 తీవ్రతో భారీ భూకంపం వస్తుంది.' అని ఫ్రాంక్ ఫిబ్రవరి 3న ట్వీట్ చేశారు. Sooner or later there will be a ~M 7.5 #earthquake in this region (South-Central Turkey, Jordan, Syria, Lebanon). #deprem pic.twitter.com/6CcSnjJmCV — Frank Hoogerbeets (@hogrbe) February 3, 2023 అయితే ఈ ట్వీట్‌ను కొందరు కొట్టపారేశారు. ఫ్రాంక్ నకిలీ శాస్త్రవేత్త అని విమర్శలు కూడా గుప్పించారు. గతంలో ఆయన అంచనాలు ఏనాడూ నిజం కాలేదని చులకన చేసి మాట్లాడారు. కానీ మూడు రోజుల తర్వాత ఆయన అంచనాలే అక్షరసత్యం కావడంతో అందరూ షాక్ అయ్యారు. భూకంపం అనంతరం ఫ్రాంక్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చెప్పిందే నిజమైందని వందల మంది ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉందని ట్వీట్ చేశారు. వందేళ్లకు ఓసారి ఇలాంటి భారీ భూకంపం వస్తుందని, 115, 526 సంవత్సారాల్లో కూడా ఇలాంటి పెను విపత్తులే సంభవించాయని వివరించారు. My heart goes out to everyone affected by the major earthquake in Central Turkey. As I stated earlier, sooner or later this would happen in this region, similar to the years 115 and 526. These earthquakes are always preceded by critical planetary geometry, as we had on 4-5 Feb. — Frank Hoogerbeets (@hogrbe) February 6, 2023 భూకంపం తర్వాత ట్విట్టర్లో ఫ్రాంక్ ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఆయన పేరుతో నకిలీ ఖాతాలు కూడా సృష్టించే పరిస్థితి వచ్చింది. దీంతో యూజర్లు జాగ్రత్తగా ఉండాలని, తన పేరుతో నకిలీ ఖాతాలు క్రియేట్ చేస్తున్న వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. చదవండి: టర్కీ భూకంపం లైవ్ వీడియో.. పేకమేడలా కూలిన భవనాలు.. భయానక దృశ్యాలు.. -
టర్కీ భూకంపం.. పేకమేడలా కూలిన భవనాలు.. భయానక దృశ్యాలు..
టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. భూకంపం ముందు ఓ వ్యక్తి తీసిన లైవ్ వీడియో వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. ముందుగా మెరుపులు వచ్చి ఆ తర్వాత ప్రకంపనలు రావడంతో విద్యుత్ సరఫరా స్తంభించిపోయి అంతా చీకటిమయం అయింది. ఆ తర్వాత క్షణాల్లోనే భూప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 🎥1 Scary footage of how the #earthquake struck #Turkey last night. 🎥2 A 6-story building in Urfa, Turkey falls over after earthquake As per estimate over 1700 buildings have been destroyed with over 800 deaths PM Modi extends condolences and offers help to all effected pic.twitter.com/B9CSpvRh2J — Megh Updates 🚨™ (@MeghUpdates) February 6, 2023 రెండో భూకంపం.. అతిపెద్ద భూకంపం సంభవించిన 12 గంటల్లోనే టర్కీ, సిరియాలో మరోసారి భూకంపం రావడం ఆందోళన కల్గిస్తోంది. మొదటిసారి భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.8గా నమోదు కాగా.. రెండోసారి భూకంపం వచ్చినప్పుడు తీవ్రత 7.6గా నమోదైంది. 1700మందికిపైగా మృతి.. టర్కీ చరిత్రలోనే అతిపెద్ద విపత్తుగా చెబుతున్న ఈ భూకంపంలో ఇప్పటివరకు 1498 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. శిథిలాలు తవ్వేకొద్ది మృతదేహాలు బయటపడుతుండటంతో మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. అటు సిరియాలో 430 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సిరియా ప్రభుత్వ నియంత్రణలో లేని ప్రాంతాల్లో 380 మంది చనిపోయారు. మొత్తంగా 2300 మందిపైగా మృత్యుఒడికి చేరారు. Turkey💔 #Turkey #amed #earthquake #Earthquake pic.twitter.com/qVwPXft9Hu — Ismail Rojbayani (@ismailrojbayani) February 6, 2023 ఈ వీడియోల్లో కన్పిస్తున్న దృశ్యాల్లో కొన్ని బహుళ అంతస్తుల భవనాలు కళ్లుముందే పేకమేడల్లా కూలిపోవడం హృదయాలను కలచివేస్తోంది. వందల మంది చనిపోయారు. వేల మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. తమను కాపాడమని ఆర్తనాదాలు పెడుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు తీస్తున్నారు. February 6, 2023 ....There are reports of several hundred dead. The Entire buildings collapsed in South #Turkey the epicenter of 7.8 magnitude earthquake in last hour,#Turkey #earthquake pic.twitter.com/pJtFoJlWfK — Naveed Awan (@Naveedawan78) February 6, 2023 భూకంపం ధాటికి వేలాది భవనాలు నేలమట్టం కావడంతో టర్కీ, సిరియాలో కొన్ని ప్రాంతాల్లో భయానక దృశ్యాలు కన్పిస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా కూలిపోయిన భవనాల శిథిలాలే దర్శనమిస్తున్నాయి. భూకంపం వల్ల ఇళ్లు కోల్పోయిన వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తమకు కావల్సిన వారిని కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు. #Turkey #earthquake #Syria #Iraq #Turkey #Iran#earthquake #Turkey Prayers for Turkey 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/Eh6ny5qYut — vipin singh (@vipin_tika) February 6, 2023 టర్కీలో 2,818 భవనాలు నేలమట్టం.. 1939 తర్వాత దేశంలో ఇదే అతిపెద్ద విపత్తు అని, భూకంపంలో 2,818 భవనాలు నేలమట్టమయ్యాయని టర్కీ అధ్యక్షుడు రెకెప్ తయ్యిప్ ప్రకటించారు. ప్రపంచ దేశాలు టర్కీ, సిరియాకు సంఘీభావం ప్రకటించాయి. ఈ విపత్కర పరిస్థితిలో సాయం అందిస్తామనని చెప్పాయి. భారత్ కూడా తన వంతు సాయంగా టర్కీకి ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు, వైద్య బృందాలతో పాటు సహాయ సామగ్రిని టర్కీకి పంపింది. In #Kahramanmaras the moment #earthquake rocking #Turkey recorded by security camera of a pharmacy. #deprem #PrayForTurkey pic.twitter.com/6oNPPQHEnY — JournoTurk (@journoturk) February 6, 2023 #earthquake in #Turkey and #Lebanon Ya Allah save everyone 7.8 GOD bless Everyone #Syria pic.twitter.com/UYOsZAbwLo — waqar haider (@whaiderr25) February 6, 2023 The impact of the massive #earthquake in the streets of Gaziantep, southern Turkey. Update- 1006 Killed & 5590 injured.#deprem #Idlib #Syria #DEPREMOLDU #TurkeyEarthquake #Turkey pic.twitter.com/n4ejuCz28l — Chaudhary Parvez (@ChaudharyParvez) February 6, 2023 చదవండి: అమెరికా వెళ్లాలనుకునేవారికి శుభవార్త.. వెయిటింగ్ అక్కర్లే 14 రోజుల్లోనే వీసా! -
Turkey Earthquake: మృతులకు ప్రధాని మోదీ సంతాపం
టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించింది. దీంతో ఈ ఘటనలో సుమారు వంద మందికి పైగా మృతి చెందారు. ఈ టర్కీ ఘటనపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో.. "టర్కీలో సంభవించిన భూకంపం కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాలకు చింతిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రడాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. టర్కీ ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుంది. అలాగే టర్కీ ఈ విషాధాన్ని తట్టుకునేలా అన్ని విధాల సహాయాన్ని అందించేందుకు భారత్ సదా సిద్ధంగా ఉంది అని మోదీ ట్వీట్ చేశారు. కాగా, టర్కీలోని కొన్నిప్రావిన్స్‌లలో మూడు సార్టు భూమి కంపించినట్లు సమాచారం. అలాగే మరి కొన్నిప్రాంతాల్లో ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. (చదవండి: ప్రధాని మోదీ కోసం వక్కలపేటా, హారం ) -
భారీ భూకంపం: శవాల దిబ్బలుగా టర్కీ, సిరియా (ఫొటోలు)
-
టర్కీ, సిరియా భూకంపం: 2600 మంది మృతి
ఇస్తాంబుల్: టర్కీ(తుర్కియే), సిరియా భూకంపం విపత్తు స్థితిని ఏర్పరిచింది. భారీ భూకంపం దాటికి 2600 మందిదాకా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. వేల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. 2200కు పైగా మృతదేహాలను శిథిలాల నుంచి రెస్క్యూ టీంలు వెలికి తీశాయి. వందల సంఖ్యలో భారీ బిల్డింగ్లు కూలిపోవడం, అర్ధరాత్రి కావడంతో గాఢనిద్రలో ప్రజలు ఉండడంతో ప్రజలు బయటకు పరుగులు తీసేందుకు కూడా వీల్లేకుండా పోయింది. స్వల్ప వ్యవధిలో భారీగా రెండుసార్లు భూమి కంపించడం.. ఆ ప్రభావంతో రెప్పపాటులో పలు బహుళంతస్థుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చారిత్రాత్మకంగా.. కేంద్రం చరిత్రలో నమోదైన అతిపెద్ద భూకంపమని టర్కీ నేషనల్ భూకంప కేంద్రం చీఫ్ రాయిద్ అహ్మద్ రేడియో ద్వారా ప్రకటించారు. టర్కీ, సిరియాలో ఎంతెంత మంది మరణించారనే సమాచారంపై స్పష్టత రావాల్సి ఉంది. సిరియాలో 300 మంది దాకా మృతి చెందినట్లు ఒక అనధికార ప్రకటన వెలువడింది. అర్ధరాత్రి భూకంపం సంభవించడంతో.. చాలామంది శిథిలాల కిందే సమాధి అయినట్లు భావిస్తున్నారు. శిథిలాల తొలగింపు కొనసాగుతుండడంతో.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారత కాలమానం ప్రకారం.. సోమవారం వేకువ ఝామున రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు యూఎస్ జియోగ్రాఫికల్ సర్వీస్ వెల్లడించింది. ఆపై పావుగంటకు 6.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. తుర్కియే గజియాన్టెప్ ప్రాంతంలో 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదు అయ్యింది. సిరియాకు సరిహద్దుగా ఉండే గజియాన్టెప్ ప్రాంతం.. తుర్కియేకి ప్రధానమైన పారిశ్రామిక కేంద్రం కూడా. భూకంపం ప్రభావంతో.. లెబనాన్, ఈజిప్ట్, సైప్రస్‌లోనూ ప్రకంపలు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ మూడు చోట్ల నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇక భూకంపం తర్వాత తుర్కియేలోని కహ్రామన్మరాస్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Turkey💔 #Turkey #amed #earthquake #Earthquake pic.twitter.com/qVwPXft9Hu — Ismail Rojbayani (@ismailrojbayani) February 6, 2023 Thousands feared dead after a massive 7.8 magnitude #earthquake strikes #Turkey pic.twitter.com/1yLAP22jhI — Narrative Pakistan (@narrativepk_) February 6, 2023 Huge fire raging in the city of Kahramanmaraş, Turkey following the 7.8 MAG earthquake overnight. pic.twitter.com/3PWZ4Tx35N — Citizen Free Press (@CitizenFreePres) February 6, 2023 మృతులు, క్షతగాత్రులపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో భూకంపానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తుర్కియే(పూర్వపు టర్కీ).. తరచూ భూకంపాల భారీన పడుతుంది. 1999లో.. 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం దాటికి 17వేల మంది దుర్మరణం పాలయ్యారు. Rescue teams pulling children from the under the rubble of #collapsed buildings in northwestern #Syria At least 50 people killed, 500+ injured, 140+ buildings destroyed in southern Malatya province as 7.8 #earthquake hits #Türkiye.#deprem #DepremiOldu #Turkey pic.twitter.com/vKnEnG3N2k — Chaudhary Parvez (@ChaudharyParvez) February 6, 2023 Another Video- First video is emerging after a M7.8 earthquake in central Turkey.#earthquake in #Şanlıurfa#Turkey #Earthquake pic.twitter.com/mVxNorZ0j0 — Chaudhary Parvez (@ChaudharyParvez) February 6, 2023 ఇక 2020 జనవరిలో ఎలజిగ్‌లో 40 మందిని, అదే ఏడాది అయిజీన్ సీప్రాంతంలో 7 తీవ్రతతో సంభవించిన భూకంపం 114 మందిని పొట్టబెట్టుకున్నాయి. భద్రతా ప్రమాణాలను పాటించకుండా.. అడ్డగోలుగా భవనాలు నిర్మించడమే అందుకు కారణమని అక్కడి నిపుణులు చెప్తున్నారు. Entire buildings collapsed in S. #Turkey the epicenter of 7.8 magnitude earthquake in last hour, that also sent shockwaves to Syria, Lebanon, Iraq, Israel, Palestine, Cyprus. We don’t know death toll yet: pic.twitter.com/A7fomc3AXT — Joyce Karam (@Joyce_Karam) February 6, 2023 People are stuck under rubble while sending out live streams or videos requesting help. #earthquake #Turkey pic.twitter.com/SxTzPzFAmn — Nerdy 🅰🅳🅳🅸🅲🆃 (@Nerdy_Addict) February 6, 2023 -
ప్రజాస్వామ్యంపై ఎర్డో‘గన్’
నియంతృత్వం బహురూపి. అది ఎప్పుడే రూపంలో ఉంటుందో, ఆద్యంతాలేమిటో ఎవరూ అంచనా కట్టలేరు. దాని ఉనికిని గుర్తించేలోపే అది అందరినీ ముంచేస్తుంది. మూడు దశాబ్దాల క్రితం సోవియెట్ యూనియన్ పతనమైనప్పుడు కాలక్రమంలో ఆ శిథిలాల్లోంచి పుతిన్ పుట్టు కొస్తాడనీ, మున్ముందు కొరకరాని కొయ్యవుతాడనీ యూరప్ దేశాలు అనుకోలేదు. సరిగ్గా టర్కీ విషయంలోనూ ఇప్పుడదే జరుగుతోంది. గత కొన్నేళ్లుగా టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయీప్ ఎర్డోగాన్ విపరీత పోకడలు పోవడం కనబడుతూనే ఉంది. అయినా యూరొపియన్ యూనియన్(ఈయూ) పట్టనట్టు ఉంటోంది. ఇక ఇప్పుడు ఆయన అచ్చంగా పుతిన్‌ను అనుకరిస్తున్న వైనం కళ్లకు కడుతోంది. ఇస్తాంబుల్ మేయర్‌గా 2019లో ఎన్నికైన రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ(సీహెచ్‌పీ) నాయకుడు ఎక్రెమ్ ఇమామోలును ఎర్డోగాన్ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఎన్నికల అధికారులను దూషించారన్న ఆరోపణతో ఇమామోలుకు గురువారం న్యాయస్థానం రెండేళ్ల ఏడునెలల జైలు శిక్ష విధించింది. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన తనకు బలమైన ప్రత్యర్థి అవుతారన్న భయంతోనే ఎర్డోగాన్ పావులు కదిపి ఈ శిక్ష పడేలా చేశారు. దేశంలో ఎన్నికల ప్రక్రియను పర్య వేక్షిస్తున్న ఉన్నత స్థాయి ఎన్నికల బోర్డు అధికార పక్షం చెప్పినట్టల్లా తలూపడం రివాజైంది. ఇటీవల కింది కోర్టులు సైతం అధికార పక్షం అభీష్టానికి అనుకూలంగా తీర్పులివ్వటం మొదలుపెట్టాయి. ఇస్తాంబుల్ మేయర్ ఎన్నిక వ్యవహారం ఆసక్తికరమైనది. 2019 మార్చిలో ఆ పదవికి జరిగిన ఎన్ని కల్లో ఇమామోలు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. దీన్ని జీర్ణించుకోలేని ఎర్డోగాన్ ప్రభుత్వం ఆ ఎన్నిక రద్దయ్యేదాకా నిద్రపోలేదు. చివరకు అదే ఏడాది జూన్‌లో మరోసారి ఎన్నికలు నిర్వహిం చారు. ఈసారి ఇమామోలు ఏకంగా 8 లక్షల ఓట్ల మెజారిటీతో అధికార పక్ష అభ్యర్థిని చిత్తుచేశారు. రాజకీయంగా తన ఎదుగుదలకు మూలకారణమైన చోట ఎన్ని ఎత్తులు వేసినా ప్రత్యర్థి మేయర్ కావటం ఆయనకు కంటగింపైంది. ఇస్తాంబుల్ నగరం దేశానికి ఆర్థికంగా ఆయువు పట్టు. స్థూల దేశీయోత్పత్తిలో దాని వాటా 40 శాతం. అందుకే ఎర్డోగాన్ ప్రభుత్వం మేయర్ అధికారాలను కత్తి రించి, అడుగడుగునా ఇమామోలుకు అడ్డుపడటం మొదలెట్టింది. ఇది చాలదన్నట్టు అధికారులను దూషించారన్న అభియోగం నమోదైంది. 2019 మార్చి ఎన్నిక రద్దు చేసిన అధికారులు బుద్ధిహీను లని అప్పట్లో ఇమామోలు వ్యాఖ్యానించారు. విధి నిర్వహణలో ఉన్న అధికార గణాన్ని ఇలా అనటం నేరమన్నది సర్కారు అభియోగం. తాజాగా ఈ కేసులో పడిన శిక్షను ఉన్నత న్యాయస్థానం ధ్రువీక రిస్తే అధ్యక్ష ఎన్నికలతో సహా ఏ ఎన్నికలోనూ ఇమామోలు అభ్యర్థిగా నిలబడలేరు. ఓటేసే హక్కు కూడా కోల్పోతారు. ఇప్పటికే సీహెచ్‌పీ పార్టీకి చెందిన మరో నేతకు ఇదే రకమైన శిక్షపడింది. టర్కీ జాతిపిత ముస్తఫా కెమెల్ అటాటుర్క్ నెలకొల్పిన సెక్యులర్ వ్యవస్థనూ, సంక్షేమ రాజ్య భావననూ 2003లో అధికారంలోకి రాగానే ఎర్డోగాన్ ధ్వంసం చేశారు. నయా ఉదారవాద విధానా లను చకచకా అమలుచేశారు. ఆ విధానాల పర్యవసానంగా అంతవరకూ ఒడిదుడుకుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ బలపడిన మాట నిజమే. వృద్ధి రేటు 9 శాతం దాటింది. కానీ సంపదంతా గుప్పెడుమంది సంపన్నుల చేతుల్లో కేంద్రీకృతమైంది. అవినీతి ఆకాశాన్నంటింది. అటుపై 2008 ఆర్థిక మాంద్యం తీవ్రంగా దెబ్బతీసింది. వృద్ధిరేటు 3 శాతానికి దిగజారింది. ఆ తర్వాత ఇస్లామిక్ భావజాల పరి రక్షకుడిగా ఎర్డోగాన్ అవతారమెత్తారు. ఒకపక్క ఈయూలో భాగస్వామిగా ఉంటూనే అందులోని భాగస్వామ్య దేశాల వల్ల ప్రమాదం ముంచుకొస్తున్నదని ఊదరగొట్టడం ఆయన ప్రత్యేకత. కుర్దులను దేశానికి శత్రువులుగా చిత్రీకరించి వారి ప్రాంతాలపై వైమానిక దాడులు చేయటం, పెను ముప్పును నివారించినట్టు స్వోత్కర్షలకు పోవటం అలవాటు. ఇస్లామిక్ సిద్ధాంతాలు అవలంబిం చకపోతే దేశం నాశనమవుతుందని ఒకపక్క, ఐఎస్ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచివుందని మరోపక్క ప్రచారం చేస్తూ 2015 నవంబర్ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అటుపై సైనిక తిరుగుబాటు డ్రామాను నడిపి తన పాలనను మరింత సుస్థిరం చేసుకున్నారు. ఇలా ఎప్పటి కప్పుడు జనం భావోద్వేగాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటూ వస్తున్న ఎర్డోగాన్‌ను 2019 ఇస్తాంబుల్ మేయర్ ఎన్నిక ఊహించని రీతిలో దెబ్బతీసింది. టర్కీలో దాదాపు అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. నిర్మాణ రంగం కుదేలైంది. అన్ని రకాల సరఫరాలూ దెబ్బతిన్నాయి. ఆహారం, ఇంధనం ధరలు ఆకాశాన్నంటి ద్రవ్యోల్బణం 170 శాతం వరకూ పోయిందని ఆర్థికవేత్తల అంచనా. ఇలాంటి సమయంలో ఎర్డోగాన్‌ను ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం ఒకవిధంగా ఆదుకుంది. ఈయూకూ, పుతిన్‌కూ ఏర్పడ్డ విభేదా లను తెలివిగా సొమ్ము చేసుకుని లాభపడుతున్న ప్రపంచ నేతల్లో ఎర్డోగాన్ ఒకరు. ఎంతకాలం ఇలాంటి ఎత్తుగడలతో నెట్టుకొస్తారన్నది చూడాల్సి ఉంది. తనకు 2023 అధ్యక్ష ఎన్నికలే ఆఖరివని ఎర్డోగాన్ చెబుతున్నారు. ఆయన గెలిస్తే భవిష్యత్తులో ఎన్నికలే ఉండవని విపక్షాలు భాష్యం చెబు తున్నాయి. పొరుగున పుతిన్ చేసిందేమిటో గమనిస్తే ఇలా అనటంలో వైపరీత్యమేమీ లేదు. మరో పుతిన్‌లా తయారై దేశంలో రాజకీయ ప్రత్యర్థులను సమాధి చేస్తున్న ఎర్డోగాన్‌ను నియంత్రించ టంలో విఫలమైతే, చూసీచూడనట్టు వదిలేస్తే స్వీయ వినాశనం కొనితెచ్చుకున్నట్టేనని ఇప్పటికైనా ఈయూ గుర్తించటం మంచిది. -
Viral Video: ఐస్‌క్రీం ఇవ్వకుండా చిన్నారిని ఏడిపించిన వ్యక్తి
-
ఐస్‌క్రీం ఇవ్వకుండా చిన్నారిని ఏడిపించిన వ్యక్తి.. పిల్లలతో ఆటలేంటి?
ఐస్ క్రీం అంటే అందరికి ఇష్టమే.. కాలంతో సంబంధం లేకుండా లొట్టలేసుకుంటూ తింటుంటారు. ఈమధ్య కాలంలో టర్కిష్ ఐస్ క్రీం పేరు అందరినోట ఎక్కువగా వినిపిస్తుంది. కారణం దాని రుచి కాకపోయిన అక్కడి వ్యాపారస్థులు చేసే జిమ్మిక్కులు. దీని వల్లే ఈ ఐస్‌క్రీం ఎక్కువ పాపులర్ అయ్యింది. ఐస్క్రీంను ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ వెనక్కి లాగుకుంటూ కస్టమర్లను సరాదాగా ఆటపట్టిస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చూసే ఉంటాం. తాజాగా టర్కిష్ ఐస్ క్రీం వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇందులో కౌంటర్ ఎదురుగా ఐస్‌క్రీం కోసం నిలబడి ఉన్న చిన్నారితో విక్రేత ఫ్రాంక్ చేస్తుంటారు. తన ట్రిక్స్‌తో పాపను ఆటపట్టిస్తూ ఉంటాడు. ఐస్ క్రీం కోసం చేయి చాపిన ప్రతీసారి అతను మ్యాజిక్ చేసి ఖాళీ కోన్‌ను ఇస్తుంటాడు. అతని పిచ్చి చేష్టలు అర్థం కాక ఏడవడం మొదలు పెడుతుంది. అయినప్పటికీ ఆ పాపకు ఐస్‌క్రీం ఇవ్వకుండా అలాగే చేస్తుంటాడు. ఐస్‌క్రీం ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ వెనక్కు తీసుకుంటాడు. దీంతో పట్టరాని కోపంతో ఖాళీ కోన్‌ను అతనిపై విసిరేస్తుంది. ఎట్టకేలకు ఆ పాప తండ్రి ఆమెను ఎత్తుకున్నాక ఐస్‌క్రీమ్ దక్కుతుంది.ఈ వీడియోను ఓ యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. क्यों परेशान कर रहे हो बेचारी को 😂👏😎 pic.twitter.com/V5slqNAqwr — ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 22, 2022 ఈ వీడియో వైరల్‌గా మారింది. లక్షకుపైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అంత చిన్న పాపను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు. పిల్లలకు ఐస్‌క్రీం అంటే ఎంతో ఇష్టం. వారిని ఏడిపించకండి. పాప ఏడుస్తుంటే మిగతా వాళ్లంతా నవ్వడం ఏంటి. పిల్లల విషయంలో ఇలాంటి జోక్‌లు చేయవద్దు. ఐస్‌క్రీం అమ్మేవాడిని శిక్షించాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఇస్తాంబుల్ బాంబ్ బ్లాస్ట్: అనుమానితుడి అరెస్ట్
అంకారా: టర్కీ ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లో చోటు చేసుకున్న భారీ పేలుడు ఘటన.. ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఆదివారం సాయంత్రం ఇస్తిక్లాల్ అవెన్యూ రద్దీ మార్కెట్లో పేలుడు సంభవించగా.. ఆ ధాటికి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఇక ఈ పేలుడు ఘటనలో మరో 81 మంది గాయపడ్డారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడిని టర్కీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అత్యంత రద్దీ ఉండే ఆ వీధిలో సదరు దుండగుడు బాంబును వదిలేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. అనుమానితుడి అరెస్ట్ విషయాన్ని టర్కీ మంత్రి సులేమాన్ సోయ్లూ సోమవారం ధృవీకరించారు. #URGENT Person who left bomb that caused explosion Sunday on Istanbul’s Istiklal Avenue arrested by police, says Interior Minister Suleyman Soylu pic.twitter.com/I08OTC4rPb — ANADOLU AGENCY (@anadoluagency) November 14, 2022 మరోవైపు ఈ దాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్.. ఇదొక ఉగ్రవాద దాడనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారాయన. ఇదిలా ఉంటే.. 2015-2016లో ఇస్తిక్లాల్ స్ట్రీట్‌లో పేలుడు జరిగి సుమారు 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ❗Blast hits central #Istanbul, local media report. pic.twitter.com/s95VcL1BRr — NonMua (@NonMyaan) November 13, 2022 ఇదీ చదవండి: ఇస్తాంబుల్ పేలుడు.. చెవులు పగిలిపోయేలా సౌండ్ -
షాపింగ్ స్ట్రీట్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. 53 మందికి గాయాలు
ఇస్తాంబుల్: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఆదివారం సాయంత్రం భారీ పేలుడు కలకలం సృష్టించింది. నిత్యం పర్యాటకులు, స్థానికులతో రద్దీగా ఉండే బెయోగ్లూ జిల్లాలోని ఇస్తిక్లాల్ షాపింగ్ స్ట్రీట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం 4.00 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పేలుడు జరిగిన క్రమంలో ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో పరుగులు పెడుతున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, ఆరోగ్య విభాగం, ఏఎఫ్ఏడీ బృందాలు సంఘటానా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పేలుడు జరిగిన క్రమంలో ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేపట్టారు పోలీసులు. నగరంలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే, పేలుడుకు గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. రెండో పేలుడు జరుగుతుందనే అనుమానంతో ఆ ప్రాంతాన్ని మూసివేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. మార్కెట్ ప్రవేశ మార్గాల్లో భారీగా బలగాలను మోహరించినట్లు వెల్లడించింది. ‘ఘటనాస్థలానికి నేను 50-55 మీటర్ల దూరంలోనే ఉన్నాను. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వచ్చింది. ముగ్గురు-నలుగురు పడిపోయి కనిపించారు. భయంతో అక్కడి వారంతా పరుగులు పెట్టారు. నల్లటి పొగ కమ్ముకుంది. శబ్దం చెవులు పగిలిపోయేలా భారీగా వచ్చింది’ అని ప్రత్యక్ష సాక్షి, 57 ఏళ్ల కెమాల్ డెనిజ్కి తెలిపారు. ఇస్తిక్లాల్ షాపింగ్ వీధిలో ఆదివారం భారీగా జనం ఉంటారు. ఈ క్రమంలో పేలుడు జరగటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2015-2016లో ఇస్తిక్లాల్ స్ట్రీట్‌లో పేలుడు జరిగి సుమారు 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ❗Blast hits central #Istanbul, local media report. pic.twitter.com/s95VcL1BRr — NonMua (@NonMyaan) November 13, 2022 విద్రోహ చర్య.. ఖండించిన ప్రెసిడెంట్.. రద్దీగా ఉండే ప్రాంతంలో సామాన్యులే లక్ష్యంగా చేసిన దాడిని ఖండించారు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయీప్ ఎర్డోగాన్. ఇది ఉగ్రవాదులు చేసిన విద్రోహ చర్యేనని పేర్కొన్నారు. దుండగులను పట్టుకునేందుకు సంబంధిత విభాగాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. Police cordon off the scene of the explosion in #Istanbul. pic.twitter.com/m0XtxNNa9T — NEXTA (@nexta_tv) November 13, 2022 ఇదీ చదవండి: ‘పులిని చూసిన మేకల్లా పారిపోయారు’.. రష్యా సేనలపై ఉక్రెయిన్ పౌరుల సెటైర్లు -
Turkey: బొగ్గు గనిలో భారీ పేలుడు.. కార్మికుల దుర్మరణం
అంకారా: టర్కీ ఉత్తర భాగంలో ఘోర ప్రమాదం సంభవించింది. అమస్రా వద్ద ఓ బొగ్గు గనిలో మీథేన్ పేలుడు సంభవించి పాతిక మందికి పైగా మరణించారు. డజన్ల మంది ఇంకా గనిలోనే చిక్కుకుని పోయారు. వాళ్లంతా సురక్షితంగా బయటకు రావాలని ప్రార్థనలు చేస్తున్నారు ఆ దేశ ప్రజలు. శుక్రవారం సూర్యాస్తమయం కంటే కాస్త ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. వందల మీటర్ల భూగర్భంలో డజన్ల మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో 110 మందికిపైగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. పేలుడు సంభవించిన వెంటనే కొందరు కార్మికులు వాళ్లంతట వాళ్లుగా బయటకు వచ్చిన దృశ్యాలు నెట్లో వైరల్ అవుతున్నాయి. దాదాపు 50 మంది కార్మికులు భూమికి దిగువన 300 మరియు 350 మీటర్ల (985 నుండి 1,150 అడుగులు) మధ్య రెండు వేర్వేరు ప్రాంతాలలో చిక్కుకుని ఉంటారని రెస్క్యూ టీం అంచనా వేస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెఉలస్తోంది. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో ఈ ఉదయం నుంచి చర్యలు మొదలుకానున్నాయి. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని.. శనివారం ప్రమాద స్థలానికి చేరుకుంటారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. గతంలో.. 2014లో టర్కీ పశ్చిమ పట్టణం సోమాలో సంభవించిన ఎయ్నజ్ బొగ్గు గని ప్రమాదంలో 310 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. Update- #Rescue operation underway.. At least 25 killed and dozens trapped underground after massive blast tears through coal mine in #Turkey. Around 110 workers were in the mine at the time of the #explosion.#bartin #bartinamasra #MineBlast #News pic.twitter.com/g3mwAgfmkQ — Chaudhary Parvez (@ChaudharyParvez) October 15, 2022 -
సరుకు కలెక్ట్ చేస్తుండగా.. హఠాత్తుగా మునిగిపోయిన ఓడ: వీడియో వైరల్
టర్కీలో ఓ భారీ ఓడ సరుకు అన్లోడ్ చేస్తుండగా..మునిగిపోయింది. ఈ హఠాత్పరిణామానికి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వివరాల్లోకెళ్తే.. ఈజిప్ట్‌కి చెందిన సీ ఈగిల్ అనే కార్గో ఓడ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటన టర్కీలోని ఇస్కెండరమ్ పోర్ట్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం సంభవించినప్పుడూ సిబ్బంది కంటైనర్ల లోడ్‌ని దింపుతోంది. ఇంతలో ఓడ ముందుకు కదిలి ఆ తర్వాత ఒక్కసారిగా బోల్తాపడింది. దీంతో లోడ్‌ను కలెక్ట్ చేస్తున్న సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఈ మేరకు టర్కీ రవాణా, మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో... ఈ ఓడ ప్రమాదం కారణగా సుమారు 24 కంటైనర్లు మునిగిపోయాయని తెలిపింది. అలాగే కొద్ది మోతాదులో చమురు కూడా లీక్ అయినట్లు వెల్లడించింది. అదృష్టవశాత్తు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది. ఈ ఓడ గత కొంతకాలంగా స్థిరత్వానికి(బ్యాలెన్సింగ్) సంబంధించిన విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. ఈ ఓడ సెప్టెంబర్ 17న టర్కీలోని ఇస్కెండరమ్ పోర్ట్‌కి చేరుకుందని, అప్పుడే ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొంది. ఈ ఓడను 1984 నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలను టర్కీలోని పోర్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఓడను వెలికితీసే ఆపరేషన్ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. అంతేగాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. SEA EAGLE isimli konteyner gemisinden denize düşen 24 konteynerin tamamı denizden çıkarılmış olup, dalgıç marifetiyle batık bölgesinde gerekli kontroller yapılarak deniz yüzeyinin temizlenmesine müteakip batıkla ilgili çalışmalara devam edilecektir. pic.twitter.com/RV19PsH7PZ — DENİZCİLİK GENEL MÜDÜRLÜĞÜ (@denizcilikgm) September 18, 2022 Sinking moment of the Sea Eagle in İskenderun... pic.twitter.com/mgg3VtKIMl — focuSEA (@focuseatv) September 19, 2022 (చదవండి: భూమిని ఢీ కొట్టిన జెట్ విమానం...మంటల్లో సైతం ఎగిరి...: వీడియో వైరల్) -
నాతోనే ప్రాంకా.. ఐస్‌క్రీం వ్యాపారికి షాక్ ఇచ్చిన బుడ్డోడు.. వీడియో వైరల్
టర్కీలో ఐస్‌క్రీం వ్యాపారస్థులు కస్టమర్లను భలే ఆటపట్టిస్తుంటారు. కోను చేతిలో పెట్టినట్టే పెట్టి టక్కున వెనక్కి లాగేసుకుంటారు. నోరూరించే ఐస్‌క్రీం తిందామని వెళ్లిన వారికి ఫ్రస్టేషన్ వచ్చే వరకు ప్రాంక్ చేస్తూనే ఉంటారు. చివరకు కస్టమర్లకు నీరసం వచ్చే టైంలో ఐస్‌క్రీం చేతిలో పెడతారు. ఇందుకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూశాం. కానీ ఓ బుడ్డోడు ఇలానే ప్రాంక్ చేద్దామనుకున్న ఓ టర్కీ ఐస్‌క్రీం వ్యాపారస్థుడికి షాక్ ఇచ్చాడు. ప్రాంక్ చేద్దామనుకుంటే చుక్కలు చూపించాడు. ఐస్‌క్రీం కోను చేతిలో పెట్టి వెనక్కి లాగేసుకుందాం అనే లోపే.. ఈ బుడ్డోడు ఐస్‌క్రీం ఇచ్చే కర్రను చేతితో బిగ్గరగా పట్టుకున్నాడు. అంతేకాదు ఐస్‌క్రీం వెండర్ చేతిపై కొట్టాడు. బాల భీముడిలా ఉన్న పిల్లాడి బలం ముందు ఆ వెండర్ నిలబడలేకపోయాడు. ఐస్‌క్రీం స్టిక్ వెనక్కి తీసుకునేందుకు వంగి వంగి ప్రయత్నించినా సఫలం కాలేకపోయాడు. చివరకు బుడ్డోడు హీరోలా తన ఐస్‌క్రీం తీసుకొని హాయిగా తినుకుంటూ వెళ్లాడు. అక్కడున్న వారంతా బుడ్డోడి చర్యను చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. View this post on Instagram A post shared by Dinesh Kumar (@black_dancer_dinesh) ఓ వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. బుడ్డోడిని అనేక మంది మెచ్చుకుంటున్నారు. ప్రాంక్ చేద్దామనుకుంటే షాక్ ఇచ్చాడు.. చిన్నోడు మామూలోడు కాదు అని కొనియాడారు. చదవండి: ఏడుస్తున్న చిన్నారిని కౌగిలించుకున్న మేఘన్.. వీడియో వైరల్ -
నరకానికి ప్రవేశ ద్వారం.. 2200 సంవత్సరాలుగా!
నరకానికి ప్రవేశద్వారం భూమ్మీదే ఉంది. గ్రీకు నగరం హీరాపోలిస్లో దాదాపు 2200 సంవత్సరాలుగా ఈ నరక ప్రవేశద్వారం చెక్కు చెదరకుండా ఉంది. అప్పట్లో ఈ నగరం రోమన్ సామ్రాజ్య పరిధిలో ఉండేది. ఫొటోల్లో ఒక కొలను, దానికి పక్కనే పొగలు చిమ్ముతూ ఒక గుహలాంటి మార్గం కనిపిస్తున్నాయి కదా, గుహలాంటి మార్గమే, నరకానికి ప్రవేశద్వారం. ఈ కొలను ఒక వేడినీటి బుగ్గ. హీరాపోలిస్ నగరంలో ఇలాంటి వేడినీటి బుగ్గలు చాలానే కనిపిస్తాయి. ఈ నగరంలోని పురాతన కట్టడమైన ‘ప్లూటో’ ఆలయంలో ఉంది ఈ నరక ప్రవేశద్వారం. ఈ ద్వారం దాటుకుని లోపలకు అడుగుపెట్టాలనుకుంటే, ఎలాంటి జీవి అయినా ప్రాణాలు కోల్పోవాల్సిందే! అందుకే దీనికి ‘గేట్‌వే టు హెల్’ (నరకానికి ప్రవేశద్వారం) అని పేరు వచ్చింది. రోమన్ సామ్రాజ్యకాలంలో అప్పటి పూజారులు ఈ ప్రవేశద్వారం ముందే ఎద్దులను బలి ఇచ్చేవారట. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ డ్యూయిస్‌బర్గ్–ఎసెన్కు చెందిన శాస్త్రవేత్తలు నాలుగేళ్ల కిందట ఈ కట్టడంపై పరిశోధనలు జరిపారు. ఈ నరక ప్రవేశద్వారానికి చేరువగా ఎగిరే పక్షులు ఇక్కడకు వచ్చే సరికి కుప్పకూలి, చనిపోతుండటాన్ని వారు గమనించారు. ఈ గుహ అడుగు భాగాన అగ్నిపర్వతం ఉండవచ్చని, దాని నుంచి నిరంతరం వెలువడే విషవాయువుల కారణంగానే, దీనికి చేరువగా వచ్చే జీవులు ప్రాణాలు కోల్పోతుండవచ్చని డ్యూయిస్‌బర్గ్–ఎసెన్ వర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ గుహ ద్వారం నుంచి వెలువడే వాయువుల్లో 91 శాతం కార్బన్ డయాక్సైడ్ ఉన్నట్లుగా నిర్ధారించారు. గుహ లోపలి రసాయనిక వాయువుల ఫలితంగానే, ఇక్కడి కొలనులోని నీటి మట్టం ఇక్కడి వేదిక మట్టాని కంటే దాదాపు 16 అంగుళాలు ఎత్తుగా ఉన్నట్లు తేల్చారు. -
పాముపై పగ తీర్చుకున్న 2 ఏళ్ల చిన్నారి.. ఏం జరిగింది?
ఇస్తాంబుల్: పాములు పగ తీర్చుకునే సంఘటనలు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. నిజ జీవితంలోనూ అక్కడక్కడ జరిగినట్లు తెలుసు. కానీ, పాముపై పగ తీర్చుకున్న సంఘటన ఎప్పుడైనా విన్నారా? అవునండీ.. నిజమే, తనను కాటు వేసిందనే కోపంతో ఓ రెండేళ్ల చిన్నారి పాముపై పగ తీర్చుకుంది. దానిని నోటితో ముక్కలు ముక్కలు చేసింది. ఈ సంఘటన టర్కీలోని కంతార్ గ్రామంలో జరిగింది. గ్రామంలోని తన ఇంటి వెనకాల పెరటిలో చిన్నారి ఆడుకుంటోంది. ఒక్కసారిగా పెద్దగా అరిచింది. దీంతో ఏదో జరిగిందని ఆందోళన చెందిన చుట్టుపక్కలవారు పరుగున పెరట్లోకి వెళ్లారు. అయితే, ఆ చిన్నారిని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పాప నోట్లో పాము ఉంది. మరోవైపు.. చిన్నారి కింది పెదవిపై పాము కాట్లు ఉన్నాయి. వెంటనే చిన్నారికి ప్రథమ చికిత్స అందించి స్థానిక బింగోల్ మెటర్నిటీ, చిల్డ్రెన్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సమక్షంలో 24 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచారు. చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ‘మా పాప చేతిలో పాము ఉన్నట్లు ఇరుగుపొరుగు వాళ్లు నాకు చెప్పారు. దాంతో ఆమె ఆడుకుంటుండగా కాటు వేసింది. ఆ కోపంతో ఆమె పామును కొరికేసింది.’ అని పాప తండ్రి మెహ్మెట్ ఎర్కాన్ పేర్కొన్నారు. మరోవైపు.. పాము కాటుకు గురైన ఓ 8 ఏళ్ల బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన సంఘటన టర్కీలోని మరో ప్రాంతంలో జరిగింది. చేతిపై కాటు వేయటంతో సాదారణ సైజ్‌తో పోలిస్తే ఐదింతలు ఉబ్బిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇదీ చదవండి: పోలీసులకు చిక్కకుండా గర్ల్‌ఫ్రెండ్ టెడ్డీబేర్‌లో దాక్కున్న దొంగ.. చివరికి -
నల్ల సముద్రం మీదుగా ధాన్యం రవాణా
ఇస్తాంబుల్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తిన ప్రపంచ ఆహార కొరతను తీర్చే దిశగా కీలకమైన ముందడుగు పడింది. నల్ల సముద్రం మీదుగా నౌకల ద్వారా ఆహార ధాన్యాల రవాణా కొనసాగించేందుకు ఐక్యరాజ్యసమితి, తుర్కియెలతో రష్యా, ఉక్రెయిన్ను వేర్వేరుగా ఒప్పందాలు చేసుకున్నాయి. ఉక్రెయిన్ నౌకాశ్రయాలను రష్యా సైన్యం దిగ్బంధించింది. దీంతో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజా ఒప్పందం ద్వారా రష్యా, ఉక్రెయిన్ల నుంచి లక్షలాది టన్నుల ధాన్యంతోపాటు, రష్యా నుంచి ఎరువుల రవాణాకు మార్గం ఏర్పడింది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, ఉక్రెయిన్ మౌలిక వనరుల మంత్రి ఒలెక్జాండర్ కుబ్రకోవ్‌లు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, తుర్కియె రక్షణ మంత్రి హులుసి అకార్‌లతో వేర్వేరు ఒప్పందాలపై సంతకాలు చేశారు. దీని ప్రకారం..నల్ల సముద్రం మీదుగా సరుకు నౌకల రవాణా సవ్యంగా సాగేలా తుర్కియె చూసుకుంటుంది. ఈ నౌకల ద్వారా ఆయుధాల రవాణా జరగకుండా తుర్కియె తనిఖీలు చేస్తుంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా గోధుమలు, మొక్కజొన్నలు, పొద్దు తిరుగుడు నూనె ఎగుమతి చేసే దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి. ఐదు నెలలుగా సాగుతున్న యుద్ధం కారణంగా ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఒప్పందంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. -
హైదరాబాద్‌లో టర్కీ ఫుడ్ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని హయత్ ప్లేస్ వేదికగా నేటి నుంచి జులై 3వ తేదీ వరకు ఫ్లేవర్స్ ఆఫ్ టర్కీ పేరుతో టర్కీష్ ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభ కార్యక్రమాన్ని బుధవారం హయత్ ప్లేస్‌లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా టర్కీ కాన్సులేట్ జనరల్ ఒర్హాన్ ఎల్మాన్ ఒకన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరవాసుల కు తమ ఆహారం, సంస్కృతిని మరింత దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశామ ని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా టాప్ టెన్‌లో టర్కిష్ ఫుడ్ వెరైటీస్ ఉంటాయని తెలిపారు. హైదరాబాదీ ఫుడ్‌కు, టర్కీ ఫుడ్‌కు సారూప్యత ఉంటుందన్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొనే వారు లక్కీ డ్రాలో భాగంగా టర్కీలో ఉచితంగా బస చేసే బహుమతిని పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: మంచు ఖండాన.. గ్రీన్ చాలెంజ్ జెండా) -
Turkey To Turkiye: టర్కీ పేరు మార్చుకోవడానికి కారణం ఇదే!
అంకారా: మిడిల్ ఈస్ట్ కంట్రీ టర్కీ.. అధికారికంగా తన పేరు మార్చుకుంది. టర్కీ కాస్త ఇక నుంచి ‘తుర్కియె’గా మారనుంది. ఇక నుంచి కొత్త పేరుతో తమను గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిపాదన పంపారు. ఆ వెంటనే ఐరాస అంగీకారం చెబుతూ.. ఈ విషయాన్ని ప్రకటించింది. దేశం గుర్తింపులో మార్పులుచేసే ‘‘రీబ్రాండింగ్’’ను.. కిందటి ఏడాది అధ్యక్షుడు రెచప్ టయ్యప్ ఎర్దోవాన్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా దేశం పేరును మార్చాలంటూ ప్రముఖ అంతర్జాతీయ సంస్థలను అక్కడి ప్రభుత్వ అధికారులు ఆశ్రయిస్తున్నారు. ఎర్దోగాన్ సైతం తమ దేశం పేరును తుర్కియె (Türkiye)గా ఉచ్చరించాలని ప్రపంచ దేశాలను కోరుతున్నారు. తుర్కుల సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, విలువలకు తుర్కియా అనే పదం చక్కగా నప్పుతుందని ఎర్దోవాన్ చెబుతూ వస్తున్నారు. గత ఏడాది పేరును మారుస్తున్నట్లు టర్కీ ప్రకటించిన వెంటనే ప్రభుత్వ మీడియా సంస్థ టీఆర్టీలో వెంటనే మార్పులు చేశారు. టర్కీ (turkey)గా ఉన్న దేశం పేరును తుర్కియె(Türkiye)గా మార్చుకున్నట్లు.. ఐక్యరాజ్య సమితికి పంపిన లేఖలో పేర్కొన్నారు. కొత్త పేరును అధికారికంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితిని కోరారు టర్కీ విదేశాంగ మంత్రి. తమ దేశం పేరును మార్చాలని టర్కీ పెట్టుకున్న అభ్యర్థనకు ఐరాస అంగీకారం తెలిపింది. దీంతో టర్కీ అనే పేరు ఇక చరిత్ర కానుంది. కారణం ఇదే.. టర్కీ అనేది ఒక పక్షి పేరు. అంతేకాదు.. ఫెయిల్యూర్, మూర్ఖుడు, సిల్లీ ఫెలో అనే ఇంగ్లిష్ అర్థాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ పేరు మార్చాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని టీఆర్టీ చెబుతోంది. గత జనవరిలో ‘హలో తుర్కియా’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. రీబ్రాండింగ్ ప్రక్రియలో భాగంగా.. ఇక నుంచి ఆ దేశం నుంచి ఎగుమతి అయ్యే ప్రాడక్టులపై ‘మేడ్ ఇన్ తుర్కియె’ మారుస్తారు. దేశం కొత్త పేరును విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని అక్కడి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మిశ్రమ స్పందన దేశం పేరును మార్చడంపై అక్కడి ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎర్దోవాన్ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జనాలు కూడా తమ పరిస్థితి పట్టించుకోకుండా.. ఇలా పేర్లు మారుస్తున్న ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. దేశాలు ఇలా పేర్లు మార్చుకోవడం కొత్తేమీ కాదు. 2020లో డచ్ ప్రభుత్వం హోలాండ్ అనే పేరును ఇకపై వాడబోమని నెదర్లాండ్స్, ఐరాసకు తెలిపింది. అంతకుముందు మాసిడోనియా కూడా గ్రీస్‌తో ఉన్న గొడవల నేపథ్యంలో.. నార్త్ మాసిడోనియాగా పేరు మార్చుకుంది. గతంలో పర్షియా ఇరాన్ అయ్యింది. అలాగే.. సియామ్ కాస్త థాయ్‌లాండ్ అయ్యింది. ఇలా ఎన్నో దేశాలు పేర్లు మార్చుకున్నాయి. -
అదిరిందయ్యా.. ఇందూరు పంచ్
నిజామాబాద్ స్పోర్ట్స్ : బాక్సింగ్ ప్రపంచంలో ఇందూరు బిడ్డ నిఖత్ జరీన్ కీర్తి కిరీటంగా నిలిచింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో గురువారం జరిగిన సీనియర్ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ (52 కేజీల విభాగం)లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. నిఖత్ జరీన్ 3–2 తేడాతో థాయ్‌లాండ్ దేశానికి చెందిన జిట్‌పోంగ్ జుటామస్‌పై గెలిచి బంగారు పతకం సాధించింది. నిఖత్ విజయంతో జిల్లా లోని క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ క్రీడాకారులు నిఖత్ తమకు స్ఫూర్తిగా నిలిచిందంటున్నారు. నిఖత్‌లో ఉన్న పట్టుదల, క్రమశిక్షణే ఆమెను ప్రపంచ చాంపియన్‌గా నిలిపిందని క్రీడా ప్రముఖులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌కు చెందిన నిఖత్ 1996 జూన్ 14న జన్మించింది. ఒకటో తరగతి నుంచి పది వరకు ఇక్కడే చదివిన నిఖత్ ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. ప్రస్తుతం ఎంబీఏ మొదటి సంవత్స రం చదువుతోంది. సాధించిన విజయాలు ఇలా.. 2011లో టర్కీలో జూనియర్ మహిళ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం 2012లో సెర్బియాలో బాక్సింగ్ టోర్నమెంట్లో రజిత పతకం 2013లో బల్గేరియాలో అండర్–19 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజితం 2014లో సెర్బియాలో 3వ నేషన్ కప్‌లో బంగారు పతకం 2014లో సెర్బియాలో అండర్–19 బాక్సింగ్ టోర్నిలో బంగారు పతకం 2015లో పంజాబ్‌లోని జలంధర్‌లో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్ షిప్లో బంగారుపతకం, బెస్ట్ బాక్సర్ అవార్డు 2015లో శ్రీలంకలో జరిగిన సీనియర్ నేషనల్ టోర్నమెంట్లో బంగారు పతకంతో పాటు బెస్ట్ బాక్సర్ అవార్డు 2015లో అస్సాంలో జరిగిన జాతీయ సీనియర్ టోర్నమెంట్లో బంగారు పతకం 2016లో అస్సాంలో జరిగిన సౌత్ ఏషియన్ ఫెడరేషన్ టోర్నమెంట్లో క్యాంసం 2016లో కజకిస్తాన్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. 2016లో ఉత్తరఖండ్ రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి సీనియర్ ఉమెన్ బాక్సింగ్ చాంపియన్ షిప్లో క్యాంసం 2018లో హరియానాలో సీనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్లో క్యాంసం. 2018లో సెర్బియాలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నిలో బంగారు పతకం 2019లో బెల్లారిలో జరిగిన జాతీయ బాక్సింగ్ టోర్నిలో రజితం 2019 ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు బల్గేరియాలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నిలో బంగారు పతకం 2019లో బ్యాంకాక్‌లో అసియా బాక్సింగ్ చాంపియన్ షిప్లో క్యాంసం 2019లో గౌహతిలో జరిగిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నిలో క్యాంసం 2019లో థాయ్‌లాండ్‌లో జరిగిన ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్‌లో రజితం 2019లో ఇటలీలో జరిగిన బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం 2019లో టోక్యోలో జరిగిన టోర్నమెంట్లో క్యాంసం 2021లో టర్కీలోని ఇస్తాంబుల్‌లో బాక్సింగ్ చాంపియన్ షిప్లో క్యాంసం 2021లో హరియానాలో జరిగిన జాతీయ బాక్సింగ్ టోర్నిలో బంగారు పతకంతో పాటు బెస్ట్బాక్సర్ అవార్డును అందుకుంది. తండ్రితో వాకింగ్ చేస్తూ.. నిఖత్ జరీన్ తన తండ్రి జ మీల్ హైమాద్తో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మై దానంలోకి సరదగా ఆడుకోవడానికి 13 ఏళ్ల వయస్సులో వచ్చేది. మైదానంలో స్టేజిపై బాక్సింగ్ కోచ్ షంసమోద్దీన్ బాక్సింగ్‌లో శిక్షణ ఇవ్వడాన్ని నిఖత్ గమనించింది. బాక్సింగ్ శిక్షణ ఇస్తున్న తీరు, ప్రాక్టీ సు చేస్తున్న క్రీడాకారులను చూసి తను కూడా బా క్సింగ్ నేర్చుకుంటానని తండ్రికి చెప్పింది. తండ్రి దెబ్బలు తగులుతాయని సర్దిచెప్పాడు. అయినా పట్టుబట్టడంతో కోచ్ షంసమోద్దీన్కు తన కూతు రును పరిచయం చేసి బాక్సింగ్‌లో శిక్షణ ఇవ్వాలని కోరాడు. శిక్షణ ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ని ఖత్ పవర్ పంచ్‌లను విసరడం నేర్చుకుంది. రన్నింగ్‌లో రాణించాలని మొదట్లో అనుకున్న నిఖత్ బా క్సింగ్పై ఏర్పడిన మక్కువతోనే ఈ రోజు ప్రపంచ స్థాయిలో నిలిచి బంగారు పతకం సాధించింది. రాష్ట్రానికే గర్వకారణం ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్లో ఇందూరు ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం రాష్ట్రానికే గర్వకారణం. ఆమె ఘన విజయంతో తెలంగాణ, జిల్లా కీర్తి ప్రతిష్టలు మరోసారి ప్రపంచం నలుదిశలా వ్యాపించాయి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారులను అన్నివిధాలా ఆదుకుంటుంది, ప్రోత్సహిస్తోందని చెప్పడానికి జరీన్ విజయమే నిదర్శనం. ఆమెకు రూ. లక్ష నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తా. – వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి మాలాంటి క్రీడాకారులకు ఆదర్శం బాక్సింగ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. నిఖత్ బాక్సింగ్ ఆడుతుంటే చూసి తనలాగా పంచ్ విసరాలని శిక్షణ తీసుకున్నాను. నిఖత్ మాలాంటి క్రీడాకారులందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆమె సాధించిన విజయం మరిచిపోలేనిది. ఈ విజయం మాకు పండుగలా మారింది. – గీర్వాని శివసాయి, జాతీయ స్థాయి బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్‌కు అభినందనలు.. నిఖత్‌కు బాక్సింగ్‌లో మొట్టమొదటిసారిగా శిక్షణ ఇచ్చింది నేనే అయినందుకు చాలా సంతోషంగా ఉంది. తనలో పట్టుదల, కృషి, తపన, సాధించాలన్న కసి ఉండడం వల్లే ఉన్నత శిఖరాలకు ఎదిగింది. నా శిక్షణలో నా కొడుకులతో పాటు నిఖత్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఒక కోచ్‌గా ఇది నాకు చాలా గర్వకారణం. – షంసమోద్దీన్, బాక్సింగ్ కోచ్ -
నాటోలో చేరిక.. ఫిన్లాండ్, స్వీడన్లకు షాక్..?
Turkey Blocking Sweden and Finland NATO Bids: ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫిన్లాండ్, స్వీడన్.. నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. నాటో చేరువద్దంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఈ రెండు దేశాలు దరఖాస్తు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటో దరఖాస్తు పత్రంపై సంతకాలు చేశాయి. దీన్ని బ్రస్సెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయంలో బుధవారం అందజేయనున్నాయి. ఇక, ఈ రెండు దేశాలకు నాటో సభ్యత్వం దక్కలంటే.. అందులోని 30 సభ్య దేశాల ఆమోదం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఏ ఒక్క దేశం వ్యతిరేకంగా ఉన్నా కొత్త దేశం నాటోలో చేరలేదు. అయితే, ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటో చేరికపై అగ్రరాజ్యం అమెరికా సహా మరిన్ని దేశాలు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. కానీ, టర్కీ మాత్రం అడ్డుపుల్ల వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల టర్కీ అధ్యక్షుడు రికెప్ తయ్యిప్ ఎర్డోగన్.. రష్యా దాడుల భయంతోనే ఫిన్లాండ్, స్వీడన్ నాటోలో చేరేందుకు ముందుకు వచ్చాయని సెటైరికల్‌గా ఆరోపించారు. మరో అడుగు ముందుకేసి ఈ రెండు దేశాలు కుర్దీస్థాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే) మిలిటెంట్లకు ఆశ్రయం కల్పిస్తున్నాయని కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్ తగిలింది. దీంతో టర్కీ అడ్డుపడుతుందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. నాటోలో చేరేందుకు సిద్ధమైన స్వీడన్, ఫిన్లాండ్ దేశాధినేతలతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీ కానున్నారు. వైట్‌హౌస్ వేదికగా గురువారం స్వీడన్ ప్రధాని మాగ్డెలినా అండర్సన్,ఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్టోలతో బైడెన్ సమావేశం కానున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో వీరి మధ్య భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది కూడా చదవండి: అమెరికాలో కరోనా కల్లోలం.. బైడెన్ కీలక నిర్ణయం -
మీరొస్తానంటే.. నేనొద్దంటా!
స్టాక్‌హోమ్: నాటో కూటమిలో స్వీడన్, ఫిన్లాండ్ చేరికను టర్కీ మరోమారు తీవ్రంగా వ్యతిరేకించింది. అవి కుర్దిష్ మిలిటెంట్లకు సాయం చేస్తున్నాయని ఆరోపించింది. టర్కీ అభ్యంతరాలు నాటో కూటమిలో కలకలం సృష్టిస్తున్నాయి. టర్కీ వ్యాఖ్యల్లో ఇటీవలి కాలంలో మార్పు వచ్చిందని ఫిన్లాండ్ ప్రధాని నినిస్టో అన్నారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. నాటోలో చేరాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఫిన్లాండ్ పార్లమెంట్ మంగళవారం 188–8 ఓట్లతో మద్దతు పలికింది. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సభ్యత్వ దరఖాస్తులను బ్రస్సెల్స్‌లోని నాటో కేంద్ర కార్యాలయంలో అందించారు. టర్కీ అభ్యంతరాల నేపథ్యంలో వీటి సభ్యత్వంపై నిర్ణయానికి సమయం పట్టవచ్చని అంచనా. టర్కీతో చర్చలకు బృందాన్ని పంపుతామన్న స్వీడన్ ప్రతిపాదనను కూడా ఎర్డోగన్ వ్యతిరేకించారు. టర్కీతో చర్చలకు ఎదురుచూస్తున్నామని, నాటో దేశాలతోనూ చర్చిస్తున్నామని స్వీడన్ ప్రధాని మగ్డలీనా చెప్పారు. టర్కీ అభ్యంతరాలు అమెరికాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వాటి సంబంధాలు ఇటీవల బాగా క్షీణించాయి. రష్యా నుంచి టర్కీ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను కొనడం అమెరికాకు నచ్చలేదు. చర్చలే చర్చలు నాటోలో చేరాలని నిర్ణయించిన స్వీడన్, ఫిన్లాండ్ ప్రధానులతో త్వరలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చర్చిస్తారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. వీటిపై తమ అభ్యంతరాలు తెలిపేందుకు టర్కీ విదేశాంగ మంత్రి కవుసోగ్లు అమెరికాకు పయనమ్యారు. ఈ రెండు దేశాలు ఏళ్లుగా తటస్థంగా ఉంటున్నాయి. నాటోలో చేరితే తీవ్ర పరిణామాలుంటాయని వాటిని రష్యా పలుమార్లు హెచ్చరించింది. మంగళవారం ఇద్దరు ఫిన్లాండ్ దౌత్యాధికారులను రష్యా బహిష్కరించింది. చదవండి: (ఉత్తరకొరియాలో ఒకే రోజు 2.7 లక్షల కరోనా కేసులు) నార్డిక్ దేశాలు నాటోలో చేరడంపై టర్కీ అభ్యంతరాలు త్వరలో సమసిపోతాయని నాటో అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి చేరికను పలు యూరప్ దేశాలు స్వాగతించాయి. తమ దేశం కోరిన ఒక్క కుర్దిష్ నాయకుడిని కూడా నార్డిక్ తమకు దేశాలు అప్పగించలేదని టర్కీ ఆరోపించింది. నాటోలో కొత్తగా సభ్యత్వం పొందాలంటే ప్రస్తుతమున్న 30 సభ్యదేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాల్సిఉంది. స్టీల్ ప్లాంట్ ఫైటర్ల తరలింపు మారియుపోల్‌లో చిక్కుకున్న తమ సైనికులను రక్షించేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది. 264 మందిని తరలించామని తెలిపింది. మరోవైపు డోన్బాస్లో పలు నగరాలపై రష్యా బాంబింగ్ కొనసాగుతూనే ఉంది. సివియర్డొనెట్స్క్లో 10మంది మరణించారు. పశ్చిమాన లివివ్పైనా రష్యా దాడులు చేసింది. ఖార్కివ్‌లో మాత్రమే ఉక్రెయిన్ సేనలకు కొంత ఊరట లభించింది. నగరానికి సమీపంలోని రష్యా సరిహద్దు వద్దకు ఉక్రెయిన్ సేనలు చేరుకున్నాయి. ఇకపై డోన్బాస్ నగరాలపై రష్యా తీవ్రంగా విరుచుకుపడవచ్చని బ్రిటన్ ఇంగ్లండ్ హెచ్చరించింది. -
లవ్లీనా బొర్గోహైన్ శుభారంభం
ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ శుభారంభం చేసింది. టర్కీలో సోమవారం జరిగిన 70 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో లవ్లీనా 3–2తో చెన్ నియెన్ చిన్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. నేడు జరిగే 48 కేజీల విభాగం తొలి రౌండ్లో స్టెలుటా దుతా (రొమేనియా)తో భారత బాక్సర్ నీతూ తలపడుతుంది. -
Anand Mahindra: నితిన్ గడ్కారీజీ మనమూ ఇలా చేద్దామా?
కేంద్ర రవాణా, ఉపరితల శాఖ మంత్రిగా నితిన్ గడ్కారీ నిమిషం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఓవైపు ఈవీ వెహికల్స్‌ని ప్రోత్సహిస్తూనే మరోవైపు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే లక్ష్యంతో స్వయంగా హైడ్రోజన్ సెల్ కారులో ప్రయాణం చేస్తున్నారు. ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్సీ ఇంజన్ల తయారీపై మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలకు సూచనలు చేస్తున్నారు. కాలుష్య రహిత ఇంధనం కోసం ఇంతలా పరితపిస్తున్న మంత్రి నితిన్ గడ్కారీకి ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా ఓ సూచన చేశారు. టర్కీకి చెందిన ఇస్తాంబుల్ యూనివర్సిటీ విద్యార్థులు ఇటీవల అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. రోడ్లపై వాహనాలు వేగంగా ప్రయాణించినప్పుడు గాలిని చీల్చుకుంటూ వెళ్తాయి. ఈ క్రమంలో గాలులు బలంగా వీస్తాయి. ఈ విండ్ ఫోర్స్‌ని ఉపయోగించుకుని కరెంటు ఉత్పత్తి చేసే టర్బైన్లని డెవలప్ చేశారు. ఈ టర్బైన్లు గంటకి 1 కిలోవాట్ పవర్‌ను జనరేట్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టను టర్కీలోని ఇస్తాంబుల్ రోడ్లపై చేపట్టారు. ఇస్తాంబుల్‌లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు వీడియోను ఉద్దేశిస్తూ .. ఇండియాలో ఉన్న ట్రాఫిక్‌కి ఈ తరహా ప్రాజెక్టును కనుక చేపడితే ప్రపంచంలోనే విండ్ పవర్లో ఇండియా గ్లోబల్ ఫోర్స్‌గా నిలుస్తుంది. మనదేశంలోని హైవేల వెంట ఇలాంటి టర్బైన్లు ఏర్పాటు చేద్దామా అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని అడిగారు ఆనంద్ మహీంద్రా. Developed by Istanbul Technical University. Ingenious. Uses the wind generated by passing traffic. Given India’s traffic, we could become a global force in wind energy! 😊 Can we explore using them on our highways @nitin_gadkari ji? https://t.co/eEKOhvRpDo — anand mahindra (@anandmahindra) April 6, 2022 -
ఉక్రెయిన్ యుద్ధం.. చర్చల్లో పురోగతి
కీవ్: ఉక్రెయిన్ సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారం లభించే సూచనలు కన్పిస్తున్నాయి. నెలకు పైగా సాగుతున్న యుద్ధానికి తెర దించేందుకు టర్కీ వేదికగా రష్యా, ఉక్రెయిన్ జరుపుతున్న తాజా చర్చల్లో చెప్పుకోదగ్గ పురోగతి కన్పిస్తోంది. ఉక్రెయిన్‌కు విశ్వాసం కల్పించే చర్యల్లో భాగంగా రాజధాని కీవ్, చెహిర్నివ్ నగరాల నుంచి సైన్యాన్ని భారీగా ఉపసంహరిస్తున్నట్టు రష్యా మంగళవారం ప్రకటించింది. వాటినుంచి రష్యా దళాలు వెనుదిరుగుతున్నాయని ఉక్రెయిన్ కూడా ధ్రువీకరించింది. అంతేగాక ఇరు దేశాల అధ్యక్షులు పుతిన్, జెలెన్స్కీ ముఖాముఖి సమావేశమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చర్చల్లో పాల్గొంటున్న ఉక్రెయిన్ బృందం సభ్యుడొకరు వెల్లడించారు! టర్కీ విదేశాంగ మంత్రి మేవ్లట్ కౌసోగ్లు కూడా దీన్ని ధ్రువీకరించారు. చర్చలు అర్థవంతంగా సాగాయని, పలు అంశాలపై ఇరు పక్షాలకు ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. వీటికి కొనసాగింపుగా త్వరలో రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రులు భేటీ అవుతారన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య గతంలో బెలారస్ తదితర చోట్ల జరిగిన నాలుగైదు రౌండ్ల చర్చల్లో పెద్దగా ఏమీ తేలకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు వారాల పై చిలుకు విరామం తర్వాత ఇరు దేశాల బృందాలు తాజాగా మంగళవారం టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో సమావేశమయ్యాయి. ఇరు దేశాల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించాయి. చర్చల నేపథ్యంలో పరస్పర విశ్వాస కల్పన ప్రయత్నాల్లో భాగంగానే సైన్యాన్ని వెనక్కు రప్పించాలన్న నిర్ణయం తీసుకున్నట్టు రక్షణ శాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ చెప్పారు. భవిష్యత్తులో ఏవైపూ మొగ్గకుండా తటస్థంగా ఉంటామని, అణ్వస్త్రరహిత దేశంగా కొనసాగుతామని చర్చల్లో ఉక్రెయిన్ ప్రతిపాదించిందని ఫోమిన్ చెప్పారు. బదులుగా ఆ దేశానికి ఇవ్వాల్సిన భద్రతా హామీలపై కూడా ఏకాభిప్రాయం కుదిరేలా కన్పిస్తోందన్నారు. ఆ మేరకు ఒప్పంద రూపకల్పన దిశగా చర్చలు సాగాయని వివరించారు. తటస్థంగా ఉండాలంటే రష్యాతో పాటు అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, టర్కీ, చైనా, పోలండ్, ఇజ్రాయెల్ వంటి దేశాలు తమకు భద్రతా హామీ ఇవ్వాలని ఉక్రెయిన్ బృందం ప్రతిపాదించినట్టు సమాచారం. సదరు హామీ ‘ఒక్కరిపై దాడి, అందరిపైనా దాడి’ అన్న నాటో సూత్రం మాదిరిగా ఉండాలని కోరిందంటున్నారు. 2014లో రష్యా ఆక్రమించిన క్రిమియా ద్వీపకల్పం హోదాపై 15 ఏళ్ల సంప్రదింపుల అవధి ఉండాలని ఉక్రెయిన్ ప్రతిపాదించింది. వీటిపై రష్యా స్పందన తెలియాల్సి ఉంది. అయితే చర్చలు అర్థవంతంగా సాగాయని రష్యా బృందం కూడా సంతృప్తి వెలిబుచ్చింది. ఉక్రెయిన్ ప్రతిపాదనలను సమీక్షించి పుతిన్‌కు నివేదిస్తానని రష్యా బృందంలోని కీలక సభ్యుడు వ్లాదిమిర్ మెడిన్స్కీ తెలిపారు. అధ్యక్షుల స్థాయి చర్చలకు ఈ మాత్రం పురోగతి చాలని ఉక్రెయిన్ బృంద సభ్యుడు డేవిడ్ అర్కామియా అన్నారు. చర్చల వేదిక వద్ద పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన రష్యా కుబేరుడు, చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్ యజమాని రోమన్ అబ్రమోవిచ్ ప్రత్యక్షమయ్యారు! ఇరు దేశాల అంగీకారంతోనే చర్చల్లో ఆయన అనధికారిక మధ్యవర్తిగా ఉన్నారని పుతిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ చెప్పారు. యథాతథంగా కొనసాగుతున్న దాడులు ఓవైపు చర్చలు జరుగుతుండగా∙పశ్చిమ, దక్షిణ ఉక్రెయిన్‌లో పలు ప్రాంతాలపై రష్యా దాడులు తీవ్రస్థాయిలో కొనసాగాయి. పశ్చిమ ప్రాంతంలోని ఓ ఇంధనాగారంపై భారీగా క్షిపణి దాడులు జరిగాయి. దక్షిణాదిన రేవు పట్టణం మైకోలేవ్‌లో 9 అంతస్తుల పాలనా భవనంపై క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇందులో ఏడుగురిదాకా మరణించారని అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఉద్యోగులు భవనంలోకి వెళ్లేదాకా ఆగి మరీ దాడికి దిగి పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రష్యా దళాలను తమ సైన్యాలు అద్భుతంగా తిప్పికొడుతున్నాయన్నారు. కీవ్ శివార్లలోని కీలకమైన ఇర్పిన్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 60కిపైగా మతపరమైన కట్టడాలను రష్యా నేలమట్టం చేసిందని ఉక్రెయిన్ పేర్కొంది. తమకు పూర్తిస్థాయిలో సాయం చేసేందుకు వెనకాడుతున్న పశ్చిమ దేశాలు ఈ విధ్వంసానికి పరోక్షంగా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమీ సమీపంలోని ట్రోస్టియానెట్స్ నగరాన్ని ఉక్రెయిన్ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. రష్యా సైనికుల మృతదేహాలు, కాలిపోయిన రష్యా యుద్ధ ట్యాంకులు నగరంలో పర్యటించిన ఏపీ వార్తా సంస్థ సిబ్బందికి కన్పించాయి. రష్యా, బెలారస్‌ల్లో కార్యకలాపాలను ఆపేస్తున్నట్టు ఆర్థిక సేవల సంస్థ బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఉక్రెయిన్‌లోని అణు వ్యవస్థల భద్రతను సమీక్షించేందుకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) చీఫ్ ఆ దేశంలో పర్యటించారు. -
పోరాట స్ఫూర్తి
‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ’ మొదలైంది. చిత్రాభిమానుల విశిష్ట పండగ లో ఈసారి రెండు విశేషాలు ఉన్నాయి. మొదటి విశేషం... చిత్రోత్సవంలో ప్రదర్శితమయ్యే సగం చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ మహిళా దర్శకుల చేతుల్లో రూపుదిద్దుకున్నవి. ప్రారంభ చిత్రంగా ప్రదర్శితమైన బంగ్లాదేశ్ చిత్రం ‘రెహన మరియమ్ నూర్’ మహిళల సమస్యను ప్రతిబింబిస్తుంది. 37 సంవత్సరాల రెహన మెడికల్ కాలేజి ప్రొఫెసర్. ఒక బిడ్డకు తల్లిగా, అమ్మకు కూతురిగా, సోదరుడికి అక్కగా ఆమె వ్యక్తిగత జీవితానికి, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్‌గా వృత్తి జీవితానికి మధ్య సమన్వయం, వాటి మధ్య తలెత్తే వైరుధ్యాలు, వాటి పరిష్కారం కోసం చేసే ప్రయత్నం ఈ చిత్రంలో కనిపిస్తుంది.రెండో విశేషం... ఈ చిత్రోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన కుర్దిష్ ఫిల్మ్‌మేకర్ లిసా కలన్ను ‘స్పిరిట్ ఆఫ్ సినిమా’ పురస్కారంతో సత్కరిస్తారు. కొన్ని నిజజీవిత కథలు, కల్పన కంటే ఆశ్చర్యపరుస్తాయి. ‘లిసా కలన్’ది అచ్చంగా అలాంటి కథ... ఐసిస్ ఉగ్రవాదుల బాంబుదాడిలో రెండు కాళ్లు పోగొట్టుకుంది లిసా. అయితే ఆమె పోగొట్టుకుంది కాళ్లు మాత్రమే. ఆమెలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం, దూసుకుపోయే తత్వం ఎక్కడికీ పోలేదు. ‘హిడెన్’ అనే సినిమాకు ఆర్ట్‌డైరెక్టర్‌గా వ్యవహరించడంతో పాటు నటించింది. ‘వాయిస్ ఆఫ్ ది స్ట్రీట్’ సినిమాకు సౌండ్ అండ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించింది. ఎన్నిరకాల సృజనాత్మక బాధ్యతలను చేపట్టినా ఆమె నమ్మిన సూత్రం ... బాధితుల గొంతును ప్రపంచానికి వినిపించాలని. ఇందుకు చిత్రాలను బలమైన ఆయుధంగా ఎంచుకుంది. టర్కీలోని కుర్ద్‌ల కుటుంబంలో పుట్టిన లిసా, బాల్యంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంది. రాజ్యహింసను దగ్గర నుంచి చూసింది. హైస్కూల్ చదువుతోనే ఆమె చదువు ఆగిపోయింది. దీనికి కారణం...పై చదువులు తన మాతృభాషలో కాకుండా ‘టర్కిష్’లో మాత్రమే చదువుకునే పరిస్థితి ఉండడం. చదువుకు దూరమైనప్పటికీ ‘అరమ్ టైగ్రన్ సిటీ కన్జర్వేటరీ’లో సినిమా పాఠాలు చదువుకుంది. విస్తృతమైన ప్రపంచాన్ని చూసింది. సినిమా కోర్స్ తన మాతృభాష లోనే ఉండడం ఆమెకు బాగా నచ్చిన విషయం. ఈ చిత్రకళల ఆలయంలో తాను గడిపిన రెండు సంవత్సరాల కాలం విలువైనది. విలువల గురించి తెలుకునేలా చేసింది. ఆ తరువాత... ఊరు, వాడ, పల్లె, పట్లణం అనే తేడా లేకుండా కుర్దుల జీవితాన్ని చూడడానికి తిరిగింది. ముఖ్యంగా కుర్దీష్ స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు లిసాను కదిలించాయి. వారి ఆత్మగౌరవ పోరాటం ఆకట్టుకుంది. తాను చూసిన దృశ్యాలను పొలిటికల్ డాక్యుమెంటరీల రూపంలో ప్రపంచానికి చూపింది. మృత్యువు ఎదురొచ్చిన రోజు... జూన్, 2015లో దియర్బకిర్ నగరంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో పాల్గొంది లిసా. పార్టీని లక్ష్యంగా చేసుకొని ‘ఐసిస్’ ఉగ్రవాదులు చేసిన బాంబుదాడిలో మృత్యువు అంచుల వరకు వెళ్లింది లిసా. రెండు కాళ్లు పోగొట్టుకుంది. ‘లిసా బతకడం అరుదైనఅదృష్టం’ అన్నారు. మంచమే ఆమె ప్రపంచం అయింది. తాను అమితంగా ప్రేమించిన చిత్రప్రపంచం దూరమైపోయింది. ‘ఇంటిపట్టునే ఉండు తల్లీ ఎందుకొచ్చిన కష్టాలు!’ అన్నవాళ్లతోపాటు– ‘రెండు కాళ్లే పోయినప్పుడు, ఇంట్లో పడుండక ఏమి చేస్తుంది’ అని వెక్కిరించిన వాళ్ళూ ఉన్నారు. ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో ఆరు సంవత్సరాలు నరకప్రాయంగా గడిచాయి. వేరే వాళ్లలో అయితే జీవన ఆసక్తి అంటూ లేకుండా పోయేదేమోగానీ లిసా మాత్రం మళ్లీ అడుగులు వేసింది. ఈసారి కృత్రిమకాళ్లతో! గతంలోలాగే ఉద్యమాలలో భాగం అయింది. చిత్రాలను తీయడం మొదలు పెట్టింది. ‘ఎందరి జీవితాలనో తెరకెక్కించింది లిసా. నిజానికి ఆమె జీవితమే ఒక అద్భుతమై చిత్రం’ అనే మాట తిరువనంతపురం చిత్రోత్సవంలో నలుమూలలా వినిపిస్తూనే ఉంది. -
Ukraine Russia War: ఏం తేలలే.. ఎటూ తెగలే
అంటాలె: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు టర్కీలో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో ఈసారీ ఎలాంటి ఫలితం తేలలేదు. కాల్పుల విరమణ, మానవతా కారిడార్లపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్తో గురువారం టర్కీలో చర్చించామని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబా తెలిపారు. కాల్పుల విరమణపై 24 గంటలకు పైగా చర్చించామని, కానీ ఎలాంటి పురోగతి లేదని అన్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి రష్యాలో వేరే అధికారులున్నారని తెలుస్తోందన్నారు. వాళ్లు ఉక్రెయిన్ లొంగిపోవాలని అంటున్నారని, ఇది జరగబోదని స్పష్టం చేశారు. మరియూపోల్‌లో చిక్కుకున్న వందలాది మందిని తరలించేందుకు మానవతా కారిడార్ల ఏర్పాటు పైనా చర్చించామని, దీనిపైనా లావ్రోవ్ సరైన నిర్ణయం చెప్పలేదని అన్నారు. సమస్యలకు పరిష్కారం కోసం మళ్లీ చర్చలకు సిద్ధమని చెప్పారు. మరోవైపు లావ్రోవ్ మాట్లాడుతూ.. రష్యాతో దౌత్య చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని, ఈ విషయంలో ప్రెసిడెంట్ పుతిన్ కూడా సానుకూలంగానే ఉన్నారని తెలిపారు. సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా జీవాయుధాల దాడి చేయొచ్చు: అమెరికా ఉక్రెయిన్‌లో అమెరికా అక్రమంగా రసాయన ఆయుధాలను అభివృద్ధి చేస్తోందన్న రష్యా ఆరోపణలను బైడెన్ యంత్రాంగం కొట్టిపారేసింది. తాము అలాంటి పనులేం చేయట్లేదని స్పష్టం చేసింది. రష్యా వ్యాఖ్యలు చూస్తుంటే మున్ముందు ఉక్రెయిన్‌పై జీవ, రసాయన ఆయుధాలతో ఆ దేశమే దాడి చేసేలా కనిపిస్తోందని హెచ్చరించింది. వాళ్ల దాడులను సమర్థించుకోవడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. జీవ, రసాయన ఆయుధాలను ఉక్రెయిన్ తమ భూభాగంలో అమెరికా సాయంతో అభివృద్ధి చేస్తోందని ఆధారాలు చూపించకుండా రష్యా ఆరోపించిన విషయం తెలిసిందే. అమెరికన్లు సాయం చేస్తామంటున్నారు: ఉక్రెయిన్ ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ప్రజల సాయం తీసుకోవడానికి అమెరికాలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ప్రయత్నాలు చేస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా పోరాడే వలంటీర్ల కోసం రకరకాల ఆఫర్లు ప్రకటిస్తోంది. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధం అన్యాయమైనదని అమెరికా ప్రజలు భావిస్తున్నారని చెప్పింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా వలంటీర్లుగా పని చేసేందుకు వాషింగ్టన్‌లోని తమ ఎంబసీలో దాదాపు 6 వేల మందికి పైగా వివరాలు అడిగారని, వీళ్లలో ఎక్కువ మంది అమెరికన్లేనని ఉక్రెయిన్ మిలటరీ అధికారి మేజర్ జనరల్ బోరిస్ క్రెమెనెట్స్క్యి తెలిపారు. -
ఎయిర్ ఇండియా సీఈఓను వెంటనే తొలిగించాలి: ఆర్ఎస్ఎస్
గత కొద్ది రోజుల క్రితం ఇల్కర్ ఐసీని ఎయిర్ ఇండియాకు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫసర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ టాటా సన్స్ నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. 2022 ఫిబ్రవరి 14న జరిగిన బోర్డు మీటింగ్‌లో కొత్త సీఈఓగా ఇల్కర్ ఐసీని నియమిస్తున్నట్లు టాటా గ్రూప్ వెల్లడించింది. టర్కీలో తన మునుపటి రాజకీయ సంబంధాలను ఉటంకిస్తూ.. ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫసర్‌గా ఇల్కర్ ఐసీ నియామకాన్ని అడ్డుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేంద్రాన్ని కోరింది. ప్రస్తుత టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ 1994లో ఇస్తాంబుల్ మేయర్'గా పనిచేసినప్పుడు అతనికి సలహాదారుగా ఉన్న ఇల్కర్ ఐసీని తన బ్యాగ్ గ్రౌండ్ చెకింగ్ క్షుణ్ణంగా దర్యాప్తు చేయలని ఆర్ఎస్ఎస్ కేంద్రాన్ని కోరింది. టర్కిష్ ఎయిర్ లైన్స్ మాజీ చైర్మన్ ఐసీ ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇటీవల 2.4 బిలియన్ డాలర్ల రుణభారంతో ఉన్న విమానయాన సంస్థను స్వాధీనం చేసుకున్న తర్వాత టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా సీఈఓగా ఐసీని నియమించింది. ఆర్ఎస్ఎస్ ప్రకటనపై టాటా గ్రూప్ కూడా స్పందించలేదు. స్వదేశీ జాగరణ్ మంచ్ సహ కన్వీనర్ అశ్వనీ మహాజన్ మాట్లాడుతూ.. టర్కీ భారత ప్రత్యర్థి పాకిస్తాన్ పట్ల సానుభూతితో ఉన్నందున ఐసీ నియామకాన్ని ప్రభుత్వం ఆమోదించరాదని అన్నారు. భారతదేశంలో ఒక విమానయాన సంస్థకు సీఈఓగా విదేశీ జాతీయుడి నియమించడానికి ముందు ప్రభుత్వ క్లియరెన్స్ అవసరం అని ఆయన అన్నారు. (చదవండి: ముఖం మీద పిడిగుద్దులు పడుతున్నా.. చిరునవ్వుతో!) -
అతని శరీరంలో కరోనా శాశ్వతంగా ఉండిపోతుందట.. ఇదే తొలికేసు!
కరోనా మహమ్మారీ ప్రపంచ దేశాలను ఎలా గజగజలాడించిందో చూశాం. అంతేకాదు చాలామంది కరోనా బారిన పడినవారు ఉన్నారు. అయితే కొంతమంది త్వరితగతిన కోలుకుంటే మరీ కొంతమందికి ప్రాణాంతకంగా మారి చనిపోవడం కూడా జరిగింది. మరి కొద్దిమంది ఈ కరోనా నుంచి ప్రాణాలతో బయటపడ్డప్పటికీ దుష్ప్రభావాలతో పోరాడుతున్నవారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడోక వ్యక్తికి మాత్రం ఒకటి రెండుసార్లు కాదు ఏకంగా 78 సార్లు కరోనా బారిన పడ్డాడు . అసలు విషయంలోకెళ్తే... టర్కీకి చెందిన 56 ఏళ్ల ముజఫర్ కయాసన్‌కి గతేడాది నవంబర్ 2020న తొలిసారిగా కరోనా సోకింది. దీంతో కయాసన్ ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి అతను నిర్భంధంలోనే ఉంటున్నాడు. నిజానికి కొన్ని రోజుల తర్వాత కరోనా నుంచి కోలుకోవడంతో అతనికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే రిపోర్ట్‌లో కయాసన్‌కి కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. ఇలా ఒకటి రెండుసార్లు కాదు ఏకంగా 78 సార్లు కరోనా పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. దీంతో వైద్యులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. కయాసన్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తిగా విచారించగా..అతను లూకేమియాతో బాధపడుతున్నాడని తేలింది. ఇది ఒకరకమైన బ్లడ్ కేన్సర్. ఈ వ్యాధి వల్ల ఆ వ్యక్తులకు వ్యాధులతో పోరాడటానికే సహాయపడే తెల్లరక్తకణాలు తగ్గిపోవడమే కాక వ్యాధినిరోధక శక్తి కూడా తగ్గిపోదంతుందని వైద్యులు తెలిపారు. అందువల్లే కయాసన్ శరీరం నుంచి కరోనా వైరస్ శాస్వతంగా నిర్మూలించలేమని వైద్యులు వెల్లడించారు. కానీ కయాసన్ ఏడాదిగా అంటే సుమారు 14 నెలలు నుంచి నిర్భంధంలోనే ఉన్నాడు. పైగా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరంగా చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అంతేకాదు అతను కరోనా పాజిటివ్ కారణంగా వ్యాక్సిన్ వేయించుకోలేని దుర్భర స్థితిలో ఉండటంబాధకరం. ఇది ప్రపంచంలోనే తొలి కేసుగా పేర్కొన్నారు. (చదవండి: విదేశాల నుంచి వచ్చిన వారు క్యారంటైన్లో ఉండక్కర్లేదు!) -
మిలటరీ బేస్ వద్ద తిరుగుబాటు జరిగిందంటూ వదంతులు!!
Africa: ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశ రాజధాని దగ్గరలోని మిలటరీ బేస్ వద్ద ఆదివారం భారీ కాల్పులు జరిగాయి. దీంతో టర్కీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిలటరీ తిరుగుబాటు జరిగిందన్న పుకార్లు వ్యాపించాయి. ఇటీవల కాలంలో దేశంలో పెరిగిపోతున్న ముస్లిం తిరుగుబాట్లను ప్రభుత్వం సరిగా అణిచివేయడంలేదన్న ఆరోపణలున్నాయి. అయితే ఆర్మీ తిరుగుబాటు ఏమీ జరగలేదని, అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరేను ఎవరూ నిర్భంధించలేదని రక్షణ మంత్రి సింపురె ప్రకటించారు. సైనికుల్లో అభిప్రాయభేదాలు ముదిరి కాల్పులు జరుపుకున్నారని ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఆర్మీలో క్రమశిక్షణ నెలకొల్పేందుకు యత్నిస్తున్నట్లు తెలిపింది. అంతకుముందు ఆందోళన చేస్తున్న సైనికులు మీడియాకు ఫోన్ చేశారు. తమకు సరైన పనిచేసే పరిస్థితులు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. దేశంలో మిలటరీ, ఇంటెలిజెన్స్‌ల్లో వంశపారంపర్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఆందోళనలు పెరుగుతున్న సందర్భంగా ఇటీవలే దేశ ప్రధానిని అధ్యక్షుడు తొలగించారు. (చదవండి: భారీ మూల్యం తప్పదు!..ఉక్రెయిన్ అధిపతిగా రష్యా అనుకూల నేత! -
‘బంగారు’ కుర్రాడికి ఘనస్వాగతం
కాశీబుగ్గ: టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన యాదం సతీష్‌కుమార్ బంగారు పతకం సాధించాడు. ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గతేడాది డిసెంబర్లో ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ నిర్వహించిన ఈ పోటీల్లో ఆంధ్రా క్రీడాకారులకు పతకాలు లభించాయి. అందులో సతీష్ బంగారు పతకంతో మెరిశాడు. విద్యార్థి విశాఖలోని బుల్లయ్య కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా పలాస. పతకం సాధించాక ఆదివారం స్వగ్రామానికి రావడంతో స్థానికులు విద్యారి్థకి ఘన స్వాగతం పలికారు. విద్యార్థి తల్లిదండ్రులు సావిత్రి, ఆంజనేయులు వెదురు బుట్టలు అల్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమారుడికి దక్కిన స్వాగతం చూసి వారు ఆనందభరితులయ్యారు. -
కింతాడ అబ్బాయి నరేష్.. రష్యా అమ్మాయి ఇరీనా అలా ఒక్కటయ్యారు
సాక్షి, విశాఖపట్నం: రష్యాకి చెందిన యువతి ఇరీనాను విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం కింతాడ గ్రామ సర్పంచ్ బండారు ఈశ్వరమ్మ, ముత్యాలనాయుడు కుమారుడు నరేష్ వివాహం చేసుకున్నారు. నరేష్ రష్యాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అదే ఆఫీసులో పనిచేస్తున్న రష్యా దేశానికి చెందిన ఆండ్రీ, నేతాలియా దంపతుల కుమార్తె ఇరీనాతో ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమను నరేష్, ఇరీనా తల్లిదండ్రులు అంగీకరించడంతో కింతాడలో వీరి వివాహన్ని హిందూ సంప్రదాయ పద్ధతిలో బుధవారం నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకలో ఇరీనా తల్లి సైతం చీరకట్టులోనే కనిపించడం విశేషం. –కె.కోటపాడు గుంటూరు అబ్బాయి..టర్కీ అమ్మాయి.. వేద మంత్రాల సాక్షిగా, మూడు ముళ్ల బంధంతో టర్కీ అమ్మాయి...గుంటూరు అబ్బాయి ఒక్కటయ్యారు. గుంటూరు ఆత్మ డెప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ దమ్మాటి వెంకటేశ్వర్లు కుమారుడు మధుసంకీర్త్ ఉద్యోగ రీత్యా టర్కీలో స్థిరపడ్డాడు. అక్కడ తన సహచర ఉద్యోగిని, టర్కీలోని ఇజ్మిర్ నగర్‌కు చెందిన గిజెమ్తో ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమ వివాహాన్ని జరిపించేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. గుంటూరు భారత్‌పేట ఆరో వీధిలోని తన్విక ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి వీరి వివాహం జరిగింది. –గుంటూరు -
యాసిడ్ పోసినా ప్రేమిస్తూనే ఉంటా!.. ‘తప్పుచేశావమ్మా’
Turkey Acid Victim Marriage ex despite acid attack: లవ్ ఈజ్ బ్లైండ్.. యస్, ఎలాంటోళ్లనైనా తన మాయలో ముంచెత్తుతుంది ప్రేమ. ఆ మత్తులో మునిగితే మంచే కాదు.. ఒక్కోసారి చెడు కూడా జరుగుతుంటుంది. అయితే ఆ యువతి జీవితంలో మాత్రం ‘ప్రేమ’ ఘోరమైన తప్పటడుగు వేసింది. మాజీ ప్రియుడన్న ట్యాగ్‌ను తట్టుకోలేక ఉన్మాద చర్యకు పాల్పడ్డాడు. వికారంగానేకాదు.. అంధురాలిగా కూడా మార్చేశాడు. అయితేనేం మాయని గాయం చేసిన వాడినే మనువాడి.. ఆసక్తికర చర్చకు తెర తీసింది ఆ యువతి. బెర్ఫిన్ ఒజెక్(20).. టర్కీ యువతి. 2019లో యాసిడ్ దాడికి గురైంది. 70 శాతం చూపు పొగొట్టుకుని.. ముఖం అందవికారంగా మారిపోయింది. ఆ దాడి చేసింది ఎవరో కాదు.. ఆమె మాజీ ప్రియుడు ఒజన్ సెల్టిక్. బ్రేకప్ తర్వాత ఓరోజు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. క్షమించమని, తిరిగి ప్రేమించాలన్నా అతని కోరికను ఆమె అంగీకరించలేదు. తనకు దక్కకుంటే ఎవరికీ దక్కకూడదనే నిర్ణయానికి వచ్చాడు. ఆ కోపంలో ఆమెపై యాసిడ్ గుమ్మరించాడు. పోరాటం.. బెర్ఫిన్పై జరిగిన దాడికి టర్కీ మొత్తం కదిలింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు కోర్టుకు ఎక్కాయి. దీంతో పరారీలో ఉన్న ఒజన్ను ఎట్టకేలకు పోలీసులు కనిపెట్టి.. అరెస్ట్ చేశారు. అయినా న్యాయపోరాటం ఆగలేదు. జనాగ్రహానికి కదిలిన ఇస్కెండెరన్ కోర్టు (హతాయ్ ప్రావిన్స్) 13 ఏళ్ల ఆరు నెలల శిక్ష విధించింది. యాసిడ్ బాధిత కేసుల్లో బెర్ఫిన్ కేసు పోరాటం ద్వారా ఒక స్ఫూర్తిగా నిలిచింది. పూలు.. ప్రేమ లేఖలు.. క్షమాపణలు ఒజన్ జైలుకి వెళ్లినా.. బెర్ఫిన్కు ప్రేమ సందేశాలు పంపడం ఆపలేదు. పైగా జరిగిన ఘటనకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ లేఖలు, పూలు పంపసాగాడు. దీంతో కరిగిపోయిన ఆ యువతి తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. దీంతో అతని శిక్షా కాలం తగ్గిపోయింది. మరోవైపు కరోనా కారణంగా మే 2022లో రిలీజ్ కావాల్సిన ఒజన్.. ఈమధ్యే బయటకు వచ్చాడు ఒజన్. వచ్చిరాగానే వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆమె సంతోషంగా ఒప్పుకుంది. ఇద్దరూ సంతకాలతో ఒక్కటయ్యారు. కన్నవాళ్ల కోపం.. ఇంటర్నెట్లో మంట బెర్ఫిన్ నిర్ణయం సోషల్ మీడియాలో నెటిజన్లకు మంట తెప్పించింది. ఒక బాధితురాలిగా ఆమెకు మద్దతు తెలిపిన వాళ్లంతా.. ఇప్పుడు తిరగబడ్డారు. ముఖాన్ని వికారంగా మార్చేసి.. కంటిచూపు పోయేలా చేసిన మృగాన్ని ఎలా క్షమిస్తావని? పైగా పెళ్లి చేసుకుంటావా? అని తిట్టిపోస్తున్నారు. తప్పు చేశావమ్మా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రేమ ఎక్కువ రోజులు నిలవదని శాపనార్థాలు పెడుతున్నారు. మరోవైపు బెర్ఫిన్ తండ్రి ఈ వ్యవహారంపై స్పందించేందుకు ఇష్టపడడం లేదు. తమకు తెలియకుండానే కూతురు వివాహం చేసుకుందని, ఆమె కోసం చేసిన పోరాటం అంతా వృథా అయ్యిందని ఆయన బాధపడుతున్నాడు. వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలపై ఈ కొత్త జంట స్పందించాల్సి ఉంది. -
వెర్రి వేయి రకాలు.. కుక్కని బుక్ చేసేందుకు...మరీ అలా చేయాలా?
CCTV Footage shows Man Tries Dog Planting Faece: కొంతమంది కొందర్ని కించపరిచే ఉద్దేశంతోనో లేక శాడిజంతోనే తెలియదు గానీ కొన్ని భయంకరమైన పనులు చేస్తారు. పైగా వాటిని చూస్తే చాలా జుగుప్సకరంగా కూడా అనిపిస్తుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఎంత చెండాలమైన పనిచేశాడో చూడండి. (చదవండి: వామ్మో!! ఆరు టన్నుల లాంతర్ ఆవిష్కరణ!!) అసలు విషయంలోకెళ్లితే....టర్కీలోని ఒక వ్యక్తి ఇస్తాంబుల్ వెళ్లుతున్న ఒక బస్సు సీటులో కుక్క మలం ఉంచుతాడు. ఆ ఘటన సీసీఫుటేజ్‌లో రికార్డు అవుతుంది. ఆ తర్వాత చాలా మంది అక్కడ ఇస్తాంబుల్‌లో అందరికి సుపరిచితమైన వీధి కుక్క అయిన బోజీ పనిగా భావిస్తారు. అయితే ఇస్తాంబుల్ మునిసిపాలిటీ ప్రతినిధి మురత్ ఒంగున్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటపడుతుంది. దీంతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటూ దుష్ప్రచారంతో మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లును చెడుగా చూపించేందుకే ఇలా చేస్తున్నారంటూ అక్కడ స్థానిక మీడియా చెబుతోంది. అంతేకాదు గతంలో మేయర్ పరువు తీయడానికి జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ (ఎకెపి) అనేక ప్రయత్నాలు చేసిందని వెల్లడించింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటజన్లు సిగ్గుతెచ్చుకోండి మరీ ఇలాంటి పనుల చేస్తారా అంటూ ఆ వ్యక్తి పై మండిపడుతూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఇంట్లో వీల్‌చైర్‌లా... బయట స్కూటీలా) Wow, Turkey can still surprise me with how evil people can be! Disgusting man tries to defame an opposition-darling dog, Boji, who famously travels on public transport, by planting dog shit on a seat. OK, I just read that back. Turkey is surreal.pic.twitter.com/7jmisr8heO — Can Okar (@canokar) November 20, 2021 -
సెమీస్‌లో సింధు
ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–13, 21–10తో నెస్లిహాన్ యిగిట్ (టర్కీ)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్)తో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో భారత్‌కే చెందిన శ్రీకాంత్ కూడా సెమీఫైనల్ చేరాడు. శ్రీకాంత్ 21–7, 21–18తో సహచరుడు ప్రణయ్‌ను ఓడించాడు. -
చిన్న అక్షర దోషం.. రాజకీయ నాయకుడి భార్యకు జైలు శిక్ష
అంకారా: మన వల్ల ఎలాంటి తప్పు జరగకపోయినా సరే శిక్ష అనుభవించాల్సి వస్తే చాలా బాధగా ఉంటుంది. అలాంటిది వేరేవారి నిర్లక్ష్యం కారణంగా.. చిన్న అక్షర దోషం ఫలితంగా కోర్టు ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తే.. అది కూడా ఓ రాజకీయ నాయకుడి భార్యకు ఈ పరిస్థితి తలెత్తితే.. పీకల దాకా కోపం వస్తుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు టర్కీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి భార్య. ఆమె తప్పు ఏం లేకపోయినా.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆమెకు ఏకంగా రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఆ వివరాలు.. (చదవండి: సోఫాతో ఆమెను చంపేద్దామనుకున్నావా ఏంటి?) టర్కీకి చెందిన టీచర్, రాజకీయ నాయకుడి భార్య బసక్ డెమిర్టాస్ అనే మహిళ 2015లో తీవ్రమైన అస్వస్థతకు గురయ్యింది. ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉంది. అనారోగ్యం ఫలితంగా డెమిర్టాస్‌కు గర్భస్రావం అయ్యింది. ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బంది ఆమెను ఐదు రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే డెమిర్టాస్ ఆస్పత్రిలో చేరింది 2015, డిసెంబర్ 11న కాగా.. ఆస్పత్రి సిబ్బంది డిసెంబర్ 14 అని రిపోర్టులో తప్పుగా టైప్ చేశారు. ఇది గమనించని డెమిర్టాస్.. వైద్యులు సూచించిన మేరకు ఐదు రోజులు సెలవు తీసుకుంది. ఇక పెయిడ్ లీవ్ అప్లై చేస్తూ.. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టును అందులో సబ్మిట్ చేసింది. అయితే దానిలో డెమిర్టాస్ డిసెంబర్ 14న ఆస్పత్రిలో చేర్చినట్లు ఉంది. ఈ క్రమంలో ఆమె తప్పుడు రిపోర్టులు సబ్మిట్ చేసి.. మోసం చేసిందనే ఆరోపణలపై డెమిర్టాస్ మీద పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కోర్టు 2018లో డెమిర్టాస్‌కు, ఆమెకు వైద్యం చేసిన డాక్టర్‌కి రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. (చదవండి: కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను) ఈ సందర్భంగా డెమిర్టాస్ న్యాయవాదులు మాట్లాడుతూ.. ‘‘ఆసుపత్రి రికార్డు పుస్తకంలో డెమిర్టాస్ డిసెంబర్ 11న ఆస్పత్రిలో చేరినట్లు ఉంది. అక్షర దోషం వల్లే ఈ తప్పు జరిగిందని కోర్టుకు తెలిపాము. ఈ క్రమంలో కోర్టు ఆస్పత్రి రికార్డు బుక్‌ను సాక్ష్యంగా చూడకుండానే శిక్ష విధించింది. ఇది కేవలం రాజకీయ కుట్రే’’ అని పేర్కొన్నారు. ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ‘‘ఒక సైంటిఫిక్ ఫైల్‌కు సంబంధించి చిన్న క్లరికల్ తప్పిదం వల్ల కోర్టు డెమిర్టాస్, డాక్టర్‌కి కలిపి ఐదు సంవత్సరాల శిక్ష విధించింది. ఇది చిన్న తప్పిదం కాదు. భయంకరమైన రాజకీయ కుట్ర’’ అని టర్కీపార్లమెంట్ రిపోర్టర్ నాచో సాంచెజ్ అమోర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: మహిళను తోసేసిన ఎమ్మెల్యే.. గర్భస్రావం -
పదేళ్లుగా ఉదయాన్నే లేవడం, ఊరంతా బలాదూర్ తిరగడం.. ఈ కుక్క ప్రత్యేకత
కొందరికి రైలెక్కడం సరదా, ఇంకొందరికి విమానం ఎక్కడం సరదా. టర్కీకి చెందిన బోజీ అనే ఈ శునకరాజానికి నగర సంచారం కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలెక్కడం సరదా. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో సంచరించే ప్రయాణికులందరికీ చిరపరిచిత నేస్తం బోజీ. గత పదేళ్లుగా ఉదయాన్నే లేవడం, కనిపించిన బస్సు లేదా లోకల్ ట్రెయిన్ ఎక్కి ఊరంతా బలాదూర్ తిరగడం ఈ శునకరాజం హాబీ. దీనిని గమనించిన అధికారులు ఇంతకూ ఇదెక్కడకు వెళుతుందో తెలుసుకోవడానికి దీని చెవికి ఒక ట్రాక్ చిప్ అమర్చారు.ఇస్తాంబుల్ నగరంలోని చారిత్రిక కట్టడాలను చూడటానికి ఈ శునకరాజం రోజూ బస్సు, మెట్రో, బోటు సహా ప్రతి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాహానాన్నీ పావనం చేస్తోంది. దొరక్కుంటే ఏ బస్సులోనో అడ్జస్టయిపోతుందనుకోండి! మెట్రోస్టేషన్లలోని లిఫ్టులు, ఎస్కలేటర్లను కూడా ఈ జాగిలం మిగిలిన ప్రయాణికులతో కలసి దర్జాగా ఉపయోగించుకోవడం చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టక తప్పదు. ఇస్తాంబుల్ జనాలకు పదేళ్లుగా ఈ జాగిలం బాగా అలవాటైపోవడంతో, ఇది ఏ వాహనంలోకి చొరబడినా ఎవరూ దీనిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించడం లేదు. పైగా, ఇది సుఖంగా కూర్చోవడానికి వీలుగా తప్పుకుని మరీ దారి కూడా ఇస్తున్నారు.సమయానికి సమయం, శ్రమకు శ్రమ ఆదా చేసే మెట్రో ట్రెయినంటేనే దీనికి కాస్త మక్కువ ఎక్కువ. ఎక్కువగా మెట్రోలో ప్రయాణించడానికే ఇష్టపడుతుంది. చదవండి: అదొక అందమైన తోట.. ముచ్చటపడి ఏది ముట్టుకున్నా ప్రాణాలకు ముప్పే.. -
PV Sindhu: సింధుకు తొలి పరీక్ష
ఒడెన్స్ (డెన్మార్క్): గత ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచాక ప్రపంచ చాంపియన్ పీవీ సింధు మళ్లీ రాకెట్ పట్టనుంది. నేటి నుంచి మొదలయ్యే డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సింధు బరిలోకి దిగనుంది. తొలి రౌండ్లో ప్రపంచ 29వ ర్యాంకర్ నెస్లిహాన్ యిగిట్ (టర్కీ)తో సింధు ఆడనుంది. భారత్‌కే చెందిన మరో స్టార్ సైనా నెహ్వాల్ కూడా ఈ టోరీ్నలో ఆడనుంది. తొలి రౌండ్లో అయా ఓరి (జపాన్)తో సైనా తలపడనుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఏకంగా ఏడుగురు భారత ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, సమీర్ వర్మ, పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ, లక్ష్య సేన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
బ్రేకింగ్ రికార్డ్.. ఏడడుగుల సౌకుమార్యం
డ్రెస్ అయినా, చీర అయినా కాస్త పొడవుగా ఉన్నవాళ్లకు చూడముచ్చటగా ఉంటుంది. అందుకే ఇంకాస్త పొడవుంటే నా పర్సనాలిటికీ ఈ డ్రెస్ బాగా నప్పుతుంది అని టీనేజ్ అమ్మాయిల నుంచి పెళ్లయిన మహిళల వరకు అంతా తెగ మదనపడుతుంటారు. వీళ్లు ఇలా ఫీల్ అవుతుంటే రుమేసా మాత్రం ప్రపంచంలో నా అంతా ఎత్తు ఎవరూ లేరు, ప్రపంచంలో నేనే పొడవైన మహిళనంటోంది. అనడమేకాదు తన పేరుమీద గిన్నిస్ రికార్డులను కూడా తిరగ రాసేస్తుంది. టర్కీకి చెందిన 24 ఏళ్ల రుమేసా గల్గీ ప్రంచంలోనే అతిపొడవైన మహిళగా గిన్నిస్‌బుక్ రికార్డు నెలకొల్పింది. నిలుచున్నప్పుడు 7 అడుగుల 0.7 (215.16 సెంటీమీటర్లు) అంగుళాలతో ప్రపంచంలో జీవించి ఉన్న పొడవైన వనితగా నిలిచింది.అయితే రుమేసా గిన్నిస్బుక్ను రికార్డు నెలకొల్పడం ఇది తొలిసారి కాదు. ఆమెకు 18 ఏళ్లు ఉన్నప్పుడు మొదటిసారి టాలెస్ట్ మహిళా టీనేజర్‌గా గిన్నిస్‌బుక్ రికార్డు సృష్టించింది. అప్పుడు రుమేసా ఎత్తు 7 అడుగుల 0.09 అంగుళాలు(213.6 సెంటీమీటర్లు). రుమేసా చేతులు 24.5 సెంటీమీటర్లు, కాళ్లు 30.5 సెంటీమీటర్లు పొడవు ఉన్నాయి. అయితే రుమేసాకంటే ముందు ప్రపంచంలో పొడవైన మహిళ రికార్డు చైనాకు చెందిన యోడిఫెన్ పేరు మీద ఉంది. ఈమె ఎత్తు 7 అడుగుల 7 అంగుళాలు (233.3 సెంటీమీటర్లు), ఈమె 2012లో మరణించింది. ప్రపంచంలోనే అతిపొడవైన వ్యక్తి కూడా టరీ్కకి చెందిన వారు కావడం విశేషం. జీవించి ఉన్న అతిపొడవైన వ్యక్తి సుల్తాన్ కొసెన్ ఎత్తు 8 అడుగుల 2.8 అంగుళాలు. ప్రపంచంలోనే అతిపొడవైన మహిళగా చైనాకు చెందిన జెంగ్ జిన్లియన్ పేరు మీదే ఇప్పటికీ రికార్డు ఉంది. ఆమె ఎత్తు 8 అడుగుల ఒక అంగుళం(246.3 సెంటీమీటర్లు). జెంగ్ 1982లో మరణించారు. వీవర్ సిండ్రోమ్.. రుమేసా వీవర్ సిండ్రోమ్ కారణంగా ఇంత పొడవు పెరిగింది. ఇది చాలా అరుదుగా కనిపించే సమస్య. ఈ సమస్య ఉన్నవాళ్లలో అస్థిపంజరం సాధారణం కంటే అధికంగా పెరిగిపోతుంది. ఇలా ఉన్నవాళ్లు స్వయంగా నడవడం కూడా కష్టమే. ఎక్కువగా వీరు ఇతరుల సాయం లేదా వీల్ చెయిర్, వాకర్ స్టిక్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. రుమేసా ఎక్కువగా వీల్ చెయిర్‌ను వాడుతుంది. తనకు ఈ సిండ్రోమ్ ఉందని రుమేసా ఎప్పుడూ బాధపడకపోగా తనలాంటి వారికి..ఇది కేవలం ఒక ఆరోగ్య సమస్య అని, దీనిని అంగీకరించి ధైర్యంగా ఉండాలని చెబుతోంది. ప్రతి ప్రతికూలతకు ఒక అనుకూలత ఉంటుంది. అది బయట పడేంతవరకు వేచి ఉండి, మనలో ఉన్న సామర్థ్యాలతో ముందుకు సాగాలని చెబుతూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. -
అమేజింగ్.. ప్రపంచంలోనే అత్యంత పొడగరి!
టర్కీ: టర్కీకి చెందిన 24 ఏళ్ల రుమేసా గెల్గి ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా అవతరించారు. అంతే కాదు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆమెను సజీవంగా ఉన్న పొడవైన మహిళగా పేర్కొంది. రుమేసా 7.07 ఫీట్ల (215.16 సెం.మీ) పొడవుంది. ఆమె అసాధారణమైన పెరుగుదలకు కారణం వీవర్స్ సిండ్రోమ్ అని వైద్య నిపుణలు వెల్లడించారు. ఇది ఒక అరుదైన జన్యుపరమైన రుగ్మతగా పేర్కొన్నారు. (చదవండి: మూడో ప్రపంచ యుద్ధం గ్రహాంతరవాసులతోనే అటా!) దీంతో ఆమె అసాధారణంగా పెరగడమే కాక చేతులు 24.5 సెంటిమీటర్లు, పాదాలు 30.5 సెం.మీ. పొడవు ఉన్నట్లు వివరించారు. దీంతో ఆమె నడవడానికి ఇబ్బంది పడటమే కాక అనేక శారీరక సమస్యలతో బాధపడుతోందన్నారు. ఈ మేరకు ఆమె ఎక్కువగా వీల్ చైర్ లేదా వాకింగ్ ఫ్రేమ్ సాయంతో నడుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. 'ప్రతి ప్రతికూలత మనకు ప్రయోజనకారే మీరు, మీ సామర్థ్యాన్ని గుర్తించండి' అంటూ ఒకరూ.. మరొకరేమో గుంపులో ఒకరుగా కాక మీకంటూ ఒక ప్రత్యేకతను కలిగిన వ్యక్తిగా ఉంటారంటూ’ నెటిజన్లు రకరకాలుగా ఆమెకి ధైర్యం నూరిపోస్తు ప్రోత్సహిస్తున్నారు. (చదవండి: వెలుగులోకి 1,500 ఏళ్ల నాటి పురాతన వైన్ కాంప్లెక్స్) -
'పీకాబు' అంటూ తన పిల్లల్ని పలకరిస్తున్న టర్కీ చిలుక
టర్నీ: మనం అప్పుడే పుట్టిన నవజాతువు శిశువుల్ని చూడగానే చిన్నతల్లి లేదా చిన్న తండ్రి లేదా మరేదైనా ముద్దు పేరుతో పిలుస్తూ ఆనందిస్తాం కదా. అచ్చం మనిషిలాగేనే టర్కీలోని బుర్సాలో ఒక చిలుక తన పిల్లలను ముద్దు ముద్దుగా పలకరిస్తోంది. కాకాటిల్స్ అనే పక్షి రామచిలుక జాతికి చెందినది. (చదవండి: "సైక్లోథాన్‌తో మానసిక ఆరోగ్యం పై అవగహన కార్యక్రమాలు") ఈ పక్షి మనుషులను చక్కగా అనుకరించడమే కాక మనం ఏదైన శిక్షణ ఇస్తే అత్యంత సులభంగా నేర్చుకోగలదు. ఇది అత్యంత తెలివైన పక్షి. ఆ చిలుకకు ఇష్టమైన ఆట పికాబు కావడంతో ఆ పేరుతోనే తన పిల్లలను చక్కగా పలకరిస్తోంది. పైగా వాటిని పింగాణి పాత్రలో భద్రపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోను నెస్టేక్ కనట్లర్ అనే జంతు ప్రేమికుడు ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింగ తెగ వైరల్ అవుతోంది. ఎంత చక్కగా తన పిలల్ని పలకరిస్తోందో మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: బుడిబుడి నడకల బుడతడు డ్యాన్స్ చేసి అదరగొడుతున్నాడు) -
వైరల్: సింగిల్ మీల్‌కు లక్షా ఎనభై వేలు!!
Turkey Stylish Chef Salt Bae Bill: కొత్తగా మొదలైన రెస్టారెంట్ అది. అయినా లోపల సీట్లు ఫుల్ అయ్యాయి. బయటేమో జనాలు క్యూ కట్టి ఉన్నారు. ఇంతలో బయటకు వచ్చిన ఓ వ్యక్తి తన చేతిలోని బిల్ చూపించాడు. సింగిల్ మీల్ రేటు మరీ అంతా? అని ఆశ్చర్యపోయారంతా. అలాగని వాళ్లేం కంగారుపడి వెనక్కి వెళ్లిపోయారనుకునేరు. ఏదేమైనా సరే.. ఎంత ఖర్చైనా ఆ రెస్టారెంట్లో ఒక్కసారైనా తిని తీరాల్సిందేనని తమ వంతు కోసం ఎదురుచూశారు. లండన్‌లోని ఓ రెస్టారెంట్ ‘కాస్ట్లీ’ బిల్లు ఇప్పడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. సింగిల్ మీల్‌కు 1800 పౌండ్లు(మన కరెన్సీలో ఒక లక్షా ఎనభై వేలు).. లండన్‌లో కొత్తగా మొదలైన నుస్ర్-ఇట్ రెస్టారెంట్ వేసిన ఛార్జ్ ఇది. కేవలం ఆ రెస్టారెంట్ చీఫ్ చెఫ్ సర్వ్ చేశాడన్న ఒక కారణంతో అంతేసి బిల్ వేశారు. వ్యాపారంలో సక్సెస్‌కి ప్రధాన సూత్రం.. కరెక్ట్ మార్కెటింగ్. అది లేకుంటే క్వాలిటీ ఎంతున్నా, ఎన్ని వ్యూహాలు పాటించినా ప్రయోజనం ఉండదు. గల్లీలో రుచికరమైన వంటలు వండే నుస్రెట్ గోక్సె.. తన హోటల్ వ్యాపారాన్ని వెరైటీగా ప్రమోట్ చేసుకున్నాడు. వెరైటీ స్టయిల్‌తో సర్వింగ్ చేయడం మొదలుపెట్టాడు. అది అతనికి ఊహించని రేంజ్లో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఎంత ఖర్చైనా సరే అతని స్టైల్‌ను తాకిన తిండిని తినాలని జనాలు క్యూ కట్టేంతగా మార్చేసింది. Salt Bae is the world's greatest living artist pic.twitter.com/ZZMydLsoah — Francisco Garcia (@Ffranciscodgf) September 27, 2021 నుస్రెట్ నుస్రెట్ గోక్సె.. టర్కీ షెఫ్. మాంసాన్ని కట్ చేసే తీరు.. మోచేతి మీదుగా ఇస్టయిల్‌గా సాల్ట్‌ను, మసాలాను మాంసం మీద చల్లుతూ చాలామందిని ఆకట్టుకున్నాడు. పేద కుటుంబంలో పుట్టిన నుస్రెట్ గోక్సె.. 2010-17 మధ్య చాలా దేశాలు తిరిగి పాక శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించాడు. 2017లో టర్కీలోని ఓ ఇరుకుగల్లీలోని తన చిన్నిదుకాణంలో ఉన్న ఇతను.. స్టయిల్‌గా సాల్ట్, మసాలా చల్లే తీరు.. ‘సాల్ట్ బే’గా ఇంటర్నేషనల్ ఫేమ్ తెచ్చిపెట్టింది. మీమ్‌గా అతని ఫొటో బాగా పాపులర్ అయ్యింది. విపరీతమైన క్రేజ్‌తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, బ్రాండ్స్ ప్రమోటర్‌గా బోలెడంత డబ్బు కూడా వచ్చిందతనికి. దీంతో ప్రపంచంలోని చాలా చోట్ల లగ్జరీ రెస్టారెంట్లను ఓపెన్ చేశాడు. తాజాగా సెప్టెంబర్ 23న లండన్‌లో రెస్టారెంట్ ఓపెన్ చేయగా.. అందులోని సింగిల్ మీల్ తాలుకా బిల్ ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Nusr_et#Saltbae (@nusr_et) చదవండి: ప్రపంచంలోనే ఫస్ట్ టైం.. మిస్సింగ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్ -
ప్రపంచంలోనే మొదటిసారి.. మిస్సింగ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్
ఇస్తాంబుల్: కొన్ని రోజలు క్రితం తన నీడ పోయిందంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేసే కథ ఆధారంగా తెలుగులో ఓ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇలాంటి సినిమాటిక్ సంఘటన ఒకటి వాస్తవంగా చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కనిపించకుండా పోయానని చెప్పి.. తనను తానే వెతుక్కున్నాడు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. ఈ సంఘటన టర్కీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. టర్కీకి చెందిన బెహాన్ ముట్లు(50) అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం స్నేహితులతో కలిసి ఇనెగల్ నగరానికి సమీపంలో ఉన్న శయ్యక గ్రామీణ ప్రాంతంలో ఓ పార్టీకి వెళ్లాడు. మద్యం ఎక్కువగా తీసుకోవడంతో మత్తులో పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి.. స్పృహ కోల్పోయాడు. బెహాన్ ఎంతకి తిరిగి రాకపోవడంతో.. అతడి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చదవండి: సోఫాతో ఆమెను చంపేద్దామనుకున్నావా ఏంటి?) ఈ క్రమంలో పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసి.. గాలింపు చర్యలు ప్రారంభించారు. బెహాన్ తప్పిపోయిన అటవీ ప్రాంతానికి వెళ్లి.. అతడి పేరును పెద్దగా పిలుస్తూ.. గాలింపు చర్యలు కొనసాగించారు. స్పృహ కోల్పోయిన బెహాన్‌కి అప్పుడే కొద్దిగా మెలకువ వచ్చింది. పూర్తిగా మత్తు వదలలేదు. ఈ క్రమంలో అతడు పోలీసులతో కలిసి బెహాన్ గురించి అంటే తన గురించి తానే వెతకడం ప్రారంభించాడు. (చదవండి: వైరల్ స్టోరీ : ‘దేవుడు కరుణిస్తే.. అమ్మను చూస్తా’) మరోసారి పోలీసులు బెహాన్ పేరు పిలవడంతో అతడి మత్తు వదిలిపోయింది. ఓ నిమిషం షాక్ అయ్యాడు. ఆ తర్వాత పోలీసులకు దగ్గరకు వెళ్లి.. ఎవరి గురించి వెతుకుతున్నారని ప్రశ్నించాడు. అప్పుడు పోలీసులు బెహాన్ అనే వ్యక్తి అడవిలో తప్పిపోయాడని తెలిపారు. వెంటనే బెహాన్.. వారు వెతుకుతుంది తన కోసమే అని తెలిపాడు. ఆ తర్వాత పోలీసులు బెహాన్‌ని అతడి ఇంటికి చేర్చారు. ఇక పోలీసులతో కలిసి గాలింపు చర్యల్లో పాల్గొన్న బెహాన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనలు.. బహుశా ప్రపంచంలోనే తనను తాను వెతుక్కున్న మొదటి వ్యక్తి ఇతడే అయ్యుంటాడు అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: 1000 మంది గర్ల్‌ఫ్రెండ్స్.. 1075 ఏళ్ల జైలు శిక్ష -
టర్కీలో సల్మాన్ ఖాన్ సందడి: వైరల్ వీడియో
సాక్షి, ముంబై: 'టైగర్ 3' సినిమా షూటింగ్ కోసం టర్కీ వెళ్లిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పార్టీలో తెగ ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. టర్కీలోని కప్పడోసియాలో మెయిన్ సాంగ్ షూట్ షెడ్యూల్‌ను ముగించుకున్న అనంతరం ఏర్పాటు చేసిన పార్టీలో సందడి సందడి చేశాడు. తన పాపులర్ మూవీలోని ఒక పాటకు స్టెప్పులతో ఇరగ దీశాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు సన్‌రైజ్‌ను ఆస్వాదిస్తున్న ఒక అద్భుతమైన ఫోటోను స్వయంగా సల్మాన్ ఇన్‌స్టాలో షేర్ చేయడం విశేషం. టైగర్-3 షూటింగ్లో బిజీగా ఉన్న సల్మాన్ పాట షూటింగ్ ముగియడంతో పార్టీలో సందడి చేశాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ పార్టీలో టర్కీ ఫ్యాన్స్‌కోసం 'టవల్ స్టెప్' తో సీటీలు కొట్టించాడు. 2004 లో విడుదలైన ముఝ్ సే షాదీ కరోగీ‘ మూవీలోని పాపులర్ పాట జీనే కే హై చార్ దిన్ పాటకు డ్యాన్స్‌తో ఇరగదీశాడు. దీంతో అభిమానులు సందడి చేస్తున్నారు. "కోయి డిస్టర్బ్ మత్ కరో, టైగర్ అభీ మిషన్ పార్ హై’’ (ఎవరూ అతడిని డిస్టర్బ్ చేయొద్దు.. టైగర్ మిషన్‌లో ఉన్నాడు) అని ఒకరు , కత్రినా కైఫ్ ఎక్కడ భాయ్ అని మరొకరు కామెంట్ చేశారు. ఈ సందర్భంగా టర్కీ మంత్రితో దిగిన ఫొటోలు గత వారం నెట్టింట హల్ చల్ చేశాయి. టైగర్ 3 టీమ్ తన కార్యాలయానికి వచ్చిన ఫోటోలను టర్కీ సాంస్కృతిక, పర్యాటక శాఖామంత్రి మెహ్మెత్ నూరి ఎర్సోయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో వస్తున్న టైగర్-3 మూవీలో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan) View this post on Instagram A post shared by Salman Khan 🔵 (@salman.khan.universe) -
అల్లకల్లోల అఫ్గాన్: సరిహద్దుల్లో 295 కి.మీ గోడ నిర్మిస్తున్న టర్కీ
అంకార: తాలిబన్ల దురాక్రమణ అనంతరం అఫ్గనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో ఆ దేశ పౌరులు దేశాన్ని విడిచి వెళ్లేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాలిబన్లు దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని రోడ్డు, వాయు మార్గాలను దిగ్భంధించినప్పటికీ సామాన్య పౌరులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడ నుంచి బయటపడేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గన్ నుంచి ఇరాన్ మీదుగా తమ దేశంలోకి వచ్చే అక్రమ చొరబాటుదారులను అడ్డుకునేందుకు టర్కీ దేశం ఓ భారీ గోడను నిర్మిస్తోంది. ఇరాన్ సరిహద్దులో 295 కిమీ మేర గోడను నిర్మిస్తున్నట్లు టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డొగాన్ తాజాగా వెల్లడించారు. VIDEO: Turkey is building a wall along its border with Iran to prevent a new influx of refugees, mainly from Afghanistan as the Taliban take over the country. For now, a 5km section is under construction but Turkey is aiming to build a 295km-long wall on its Iranian border pic.twitter.com/YJAZgUOEGa — AFP News Agency (@AFP) August 17, 2021 ఈ గోడ నిర్మాణంలో సింహ భాగం ఇదివరకే పూర్తైనట్లు ఆయన ప్రకటించారు. గత కొంతకాలంగా ఇరాన్ గుండా తమ దేశంలోకి అక్రమ చొరబాట్లు ఎక్కువయ్యాయని, వారి వల్ల తమ దేశం సమస్యలను ఎదుర్కొంటోందని, ఈ గోడ నిర్మాణం ద్వారా అక్రమ వలసలను పూర్తిగా అడ్డుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. సరిహద్దు ప్రాంతాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దేశ భద్రతను కట్టుదిట్టం చేశామని ఆయన తెలిపారు. కాగా, అఫ్గాన్‌లో అంతర్యుద్ధం కారణంగా ప్రతి రోజు వేల సంఖ్యలో ఆ దేశ పౌరులు తూర్పూ సరిహద్దుల (ఇరాన్) గుండా టర్కీలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు టర్కీలో ఇప్పటికీ రెండు లక్షల మంది సిరియన్లు మరో ఆరు లక్షల మంది అఫ్గాన్లు శరణార్దులుగా ఉన్నారు. చదవండి: అఫ్గన్‌లో సాధారణ వాతావరణం: ఎందుకో అనుమానంగానే ఉంది! -
కూలిన అగ్నిమాపక విమానం, 8 మంది దుర్మరణం
ఇస్తాంబుల్: టర్కీ అడవుల్లో చెలరేగిన మంటలను అర్పేందుకు రష్యా నుంచి వచ్చిన యాంఫిబియస్ బెరివ్ బీఈ–200 అగ్నిమాపక విమానం కుప్పకూలిన ఘటనలో 8 మంది మరణించారు. ఈ ఘటన దక్షిణ టర్కీలోని అదానా ప్రావిన్సులో చోటు చేసుకుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రమాదాన్ని పరిశీలించేందుకు దర్యాప్తు బృందం ఘటనా స్థలానికి బయలుదేరిందని టర్కీ ప్రభుత్వ మీడియా తెలిపింది. ప్రమాదం పట్ల టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుత్ కావుసోగ్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి త్యాగాలను టర్కీ మరచిపోదని వ్యాఖ్యానించారు. ప్రమాదానికి ముందు విమానంతో కమ్యూనికేషన్ తెగిపోయిందని, ఆ తర్వాత విమానం కూలినట్లు తెలిసిందని స్థానిక గవర్నర్ ఒమర్ ఫరూక్ కోస్కున్ తెలిపారు. ఈ ప్రమాదం పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతాపం వ్యక్తం చేశారు. ఇందులో టర్కీ పౌరులు మరణించడంపై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌కు పుతిన్ తన సంతాపం తెలిపారు. ఈ రెండు ఇంజిన్లు కలిగిన యాంఫిబియస్ అగ్నిమాపక విమానం 270 మెట్రిక్ టన్నుల నీటిని మోసుకెళ్లగలదు. చదవండి : చూపుడు వేలుపై 3 గంటలకు పైగా -
టర్కీ ని దహించి వేస్తున్న కార్చిచ్చు
-
‘వామ్మో ఏంటా బట్టలు.. ముందు ఫ్లైట్ దిగు’
ఆడవాళ్ల వేషధారణ సొసైటీలో ఎడతెగని ఓ చర్చాంశం. అయితే తన దేశంలో వివక్ష ఎదురవుతుందనే.. ఆమె వెస్ట్రన్ దేశాలకు వలస వెళ్లింది. అక్కడ తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకుంది. కానీ, ఊహించని రీతిలో అక్కడా ‘చేదు’ అనుభవమే ఎదురయ్యిందంటూ కన్నీళ్లతో వాపోయింది. కానీ.. దెనిజ్ సెపినర్(26).. టర్కీ ఫిట్నెస్ మోడల్. అయితే అక్కడి సంప్రదాయలు ఆమెను ప్రొఫెషనల్‌లోకి అనుమతించలేదు . దీంతో అమెరికాకు వలస వెళ్లింది. ఫిట్నెస్ మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరు సంపాదించుకుంది. ఇంటర్నేషనల్ గుర్తింపు దక్కించుకున్న మొదటి టర్కీ బాడీ బిల్డర్ కూడా ఈమెనే. ఈ క్రమంలో బికినీ మోడలింగ్ కాంపిటీషన్లో పాల్గొనేందుకు జులై 8న మియామీ నుంచి టెక్సాస్‌కు బయలుదేరింది. అయితే ఫ్లైట్ ఎక్కిన కాసేపటికే సిబ్బంది ఒకరు వచ్చి.. ‘మీరు దిగిపోవాలి’ అన్నాడు. ఆమె అది జోక్‌గా అనుకుందట. దీంతో ‘మీ బట్టలు బాగోలేవు. మీ వల్ల ఇందులో ఉన్న ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి. దిగిపోండి’ అని మరోసారి చెప్పాడట. కావాలంటే తన టీషర్ట్‌తో కాళ్లను కప్పేసుకుంటానని ఆమె చెప్పినప్పటికీ.. వినకుండా ‘మీరు నగ్నంగా ఉన్నారు. దిగిపోవాల్సిందేన’ంటూ ఆమెతో దురుసుగా వ్యవహరించారట. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకుని వాపోయిందామె.‘ఆ మాట వినగానే భయమేసింది. వణికిపోయా. వాళ్లసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. నేనేం నగ్నంగా లేను కదా. రాత్రంతా ఒంటరిగా ఎయిర్‌పోర్ట్‌లో ఉండిపోయా. నా దేశంలో స్వేచ్ఛ లేదనే ఇక్కడికి వచ్చా. కానీ, ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదు’ అంటూ కన్నీళ్లతో వీడియోను పోస్ట్ చేసింది దెనిజ్. ట్విస్ట్ అయితే దెనిజ్ దుస్తులు మరీ బికినీ తరహాలో కురచగా ఉన్నాయని, అందుకే ఆమెను దించేశామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ‘ఫ్లైట్స్‌లో వెళ్లేవాళ్లకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా పడితే అలా బట్టలు వేసుకొస్తే.. అవతలి వాళ్లు ఇబ్బంది పడతారు కదా. ఆమె వేషధారణ అసభ్యంగా ఉందని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం మా సిబ్బంది చేసింది. కానీ, ఆమెనే దురుసుగా ప్రవర్తించడంతో ప్రతిగా అలా చేయాల్సి వచ్చింద’ని అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. దీంతో ఆమెకే నెగెటివ్ కామెంట్లు వస్తుండడంతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు కాసేపు ప్రైవసీ పెట్టేసిందామె. -
సోఫాతో ఆమెను చంపేద్దామనుకున్నావా ఏంటి?
ఇస్తాంబుల్ : బద్ధకంతో పని తగ్గించుకోవటానికి లేదా తప్పించుకోవటానికి మనం చేసే పనులు ఒక్కోసారి ఇతరుల ప్రాణాల మీదకు తెస్తాయి. అవతలి వ్యక్తులకు భూమ్మీద నూకలుంటే బ్రతికి బయటపడతారు.. లేకపోతే చచ్చి ఊరుకుంటారు. టర్కీకి చెందిన ఓ వ్యక్తి చేసిన బద్ధకపు పనికి పొరుగింటి అమ్మాయి ప్రాణాలు పోయేవే.. భూమ్మీద నూకలుండబట్టి బతికి బయటపడింది. వివరాల్లోకి వెళితే.. టర్కీలోని ఉస్కుదార్ జిల్లాకు చెందిన మీసట్ దురాన్ కొద్దిరోజుల క్రితం కొత్త సోఫా కొనుక్కున్నాడు. ఈ నేపథ్యంలో తన దగ్గర ఉన్న పాత సోఫా బయట పడేయటానికి నిశ్చయించుకున్నాడు. అపార్ట్మెంట్ బిల్డింగ్ మూడో అంతస్తులో ఉంటున్న అతడు దాన్ని మెట్లగుండా తీసుకుపోవటానికి బద్ధకించాడు. రియర్ విండోలోంచి దాన్ని కిందకు తోసేశాడు. అయితే, అదే సమయంలో మీసట్ దురాన్ పొరిగింటి అమ్మాయి కింద రోడ్డు మీదకు వస్తోంది. బిల్డింగ్‌లోంచి బయటకు వచ్చిన వెంటనే ఆమె పక్కన ‘ఢాం’ అంటూ సోఫా పడింది. ఆమె కొంచెం పక్కకు జరిగిఉంటే ప్రాణాలు పోయేవి. వీడియో దృశ్యం దీనిపై మీసట్ దురాన్ మాట్లాడుతూ.. ‘‘ నేను కొత్త సోఫా కొన్నాను. కిటిలోంచి కిందకు చూసినపుడు అక్కడ ఎవరూ లేరు. అంతా ఓకే అనుకున్నాకే కిటికీలోంచి సోఫాను పడేశాను. అప్పుడే మా పొరిగింటి అమ్మాయి బయటకు వచ్చింది. ఆమె చాలా లక్కీగా తప్పించుకుంది. లేకపోతే చనిపోయి ఉండేది. నేను హంతకుడ్ని అయ్యేవాడిని’’ అని అన్నాడు. సెక్యూరిటీ కెమెరాలో రికార్డయిన ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై.. ‘‘ సోఫాతో ఆమెను చంపేద్దామనుకున్నావా ఏంటి?’’.. ‘‘ ఇలాంటి వెధవలు ప్రతీ దేశంలో ఉంటారు’’...‘‘ ఇలాంటి వాళ్లను ఊరికే వదిలేయకూడదు, పోలీసులకు అప్పగించాలి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
Viral Video: శునకం చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా
అంకారా: శునకాన్ని విశ్వాసానికి మారుపేరుగా భావిస్తారు. పరిస్థితులను బట్టి మనుషులు మారిపోతుంటారేమో.. కానీ కుక్కలు మాత్రం అలాకాదు! అందుకే చాలా మంది శునకాలను తమ కుటుంబంలో ఒక సభ్యునిగా, ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. వాటికి స్నానం చేయించటం దగ్గర నుంచి మంచి ఆహారం పెట్టడం, వాకింగ్‌కు తీసుకెళ్లడం వంటివి చేస్తుంటారు. కుక్కలు కూడా తమ యజమానుల పట్ల ఎనలేని విశ్వాసాన్ని చూపిస్తూ వారితో ప్రేమగా ఆడుకుంటాయి. ఒక్కోసారి తమ యజమాని కనిపించకపోతే తల్లడిల్లిపోతాయి. ఆహారం కూడా తినకుండా ఎదురుచూస్తాయి. ఇక యజమాని రాగానే, వారి చుట్టూ తిరుగుతూ.. తోక ఆడిస్తూ.. నాకుతూ.. తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటాయి. ఎవరైనా యజమానితో దురుసుగా మాట్లాడినా, కొట్టడానికి వెళ్లినా వారిపై దూకి దాడి చేస్తాయి. కాగా, ఇప్పటికే శునకాలు, తమ యజమానుల పట్ల ప్రదర్శించే ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా టర్కీలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. వివరాలు.. ఇస్తాంబుల్‌లోని బుయుకడా ఐలాండ్‌లోని ఒక మహిళ అనారోగ్యానికి గురై, కొన్ని రోజుల పాటు మంచానికే పరిమితమయ్యింది. ఆ మహిళ ఒక శునకాన్ని పెంచుకునేది. అయితే, ప్రతిరోజు తనతో ఆడుకునే యజమాని లేవకుండా ఒకే దగ్గర ఉండటాన్ని చూసి కుక్క తల్లడిల్లిపోయింది. ప్రతిరోజు తన యజమాని దగ్గరకు వెళ్లడం నోటితో నాకుతూ.. కదిలించటానికి ప్రయత్నించేది. కొన్ని రోజులకి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో బంధువులు అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ కుక్క కూడా అంబులెన్సు వెనుక పరిగెడుతూ ఆసుపత్రికి చేరుకుంది. ఆ తర్వాత, యజమానిని ఆసుపత్రి గదిలోకి తరలించారు. అయితే, శునకం మాత్రం.. తన యజమాని కోసం ఆసుపత్రి బయట కూర్చుని ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ మనుషుల కంటే శునకాలే నయం’, ‘ఆ మహిళ నిజంగా అదృష్టవంతురాలు’, ‘ఆ కుక్క చూపిస్తున్న ప్రేమకు కన్నీళ్లు వస్తున్నాయి..’, ‘ఆ మహిళ తొందరగా కొలుకోవాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు! వైరల్ వీడియో -
ఇటలీ శుభారంభం
రోమ్: ప్రతిష్టాత్మక యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో మాజీ చాంపియన్ ఇటలీ శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా టర్కీతో జరిగిన మ్యాచ్‌లో ఇటలీ 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. 53వ నిమిషంలో టర్కీ ప్లేయర్ దెమిరల్ సెల్ఫ్ గోల్‌తో ఇటలీ ఖాతా తెరిచింది. ఆ తర్వాత కిరో ఇమోబిల్ (66వ నిమిషంలో), లొరెంజో (79వ నిమిషంలో) ఇటలీ జట్టుకు ఒక్కో గోల్ అందించారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా వేల్స్, స్విట్జర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. -
నేటి నుంచి ‘యూరో’
రోమ్: స్టార్ ఆటగాళ్లంతా పాల్గొనే ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ టోర్నీ ‘యూరో కప్’కు రంగం సిద్ధమైంది. కరోనాతో గతేడాది వాయిదా పడిన ఈ మెగా ఈవెంట్‌ను ఈ సంవత్సరం నిర్వహిస్తున్నారు. నేడు అర్ధరాత్రి 12.30 నుంచి జరిగే తొలి మ్యాచ్‌లో ఇటలీతో టర్కీ తలపడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క ఆతిథ్య దేశం కాకుండా 11 దేశాల్లో ఈ సారి యూరో కప్ నిర్వహిస్తుండటం విశేషం. రోమ్ (ఇటలీ)లో మొదలయ్యే ఈ టోర్నీ రష్యా, అజర్బైజాన్, జర్మనీ, రుమేనియా, స్పెయిన్, నెదర్లాండ్స్, హంగేరి, డెన్మార్క్, స్కాట్లాండ్లలో లీగ్ మ్యాచ్‌లు జరుపుకొని ఇంగ్లండ్‌లో జూలై 12న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు కూడా లండన్‌లోనే జరుగనున్నాయి. మొత్తం 24 జట్లు ఆరు గ్రూపులుగా తలపడనున్నాయి. మ్యాచ్‌ల్ని స్టేడియంలో ప్రత్యక్షంగా తిలకించే అవకాశముంది. కరోనా ప్రొటోకాల్‌ను అనుసరించి తీవ్రత తక్కువ ఉన్న దేశాల్లో అధిక సీట్ల సామర్థ్యంతో, వైరస్ తీవ్రంగా ఉన్న దేశాల్లో స్వల్ప సంఖ్యలోనైనా ప్రేక్షకుల్ని అనుమతిస్తున్నారు. టీవీలో ఈ మెగా టోర్నీని ‘సోనీ నెట్వర్క్’ ప్రసారం చేస్తోంది. తెలుగు ఫుట్‌బాల్ అభిమానుల కోసం ఇటీవలే కొత్తగా ప్రారంభించిన ‘సోనీ టెన్ 4’ చానల్లో తెలుగులో వ్యాఖ్యానంతో తొలిసారి యూరో కప్‌ను ప్రసారం చేస్తున్నారు. ఎవరు ఏ గ్రూపులో... టర్కీ, ఇటలీ, వేల్స్, స్విట్జర్లాండ్ (ఎ), డెన్మార్క్, ఫిన్లాండ్, బెల్జియం, రష్యా (బి), నెదర్లాండ్స్, ఉక్రెయిన్, ఆస్ట్రియా, నార్త్ మెక్డోనియా(సి), ఇంగ్లండ్, క్రొయేషియా, స్కాట్లాండ్, చెక్ రిపబ్లిక్ (డి), స్పెయిన్, స్వీడెన్, పొలండ్, స్లోవేకియా (ఇ), హంగేరి, పోర్చుగల్, ఫ్రాన్స్, జర్మనీ (ఎఫ్). -
వైరల్ స్టోరీ : ‘దేవుడు కరుణిస్తే.. అమ్మను చూస్తా’
సోషల్ మీడియాతో ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియడం లేదు. చూపులేకున్నా తన టాలెంట్‌తో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకోగలిగాడు బిలాల్ గోరెజెన్. ఒకప్పుడు వీధుల్లో డ్రమ్స్ వాయించే బిలాల్‌కు ఈ క్రేజ్ దక్కడానికి కారణం.. తెగ ఊగిన ఓ పిల్లితో ఉన్న అతని వీడియో ఒకటి వైరల్ కావడమే. టర్కీకి చెందిన బిలాల్ వయసు 33 ఏళ్లు. పుట్టుకతోనే అంధుడు. కానీ, డ్రమ్స్ నేర్చుకుని వీధుల్లో వాయిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. 2011లో ఓ సెస్ టర్కీ అనే రియాలిటీ షో అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ, ఆర్థికంగా మాత్రం సాయం అందించలేదు. రెండేళ్ల క్రితం ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్తో కలిసి చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ తర్వాత ‘లెవన్ పొల్క్కా’ వీడియో అతని నుదుటిరాతను పూర్తిగా మార్చేసింది. View this post on Instagram A post shared by Bilal Göregen (@bilalgoregen) పిల్లి తెచ్చిన లక్ లెవాన్ పొల్క్కా ఒక ఫిన్లాండ్ పాపులర్ సాంగ్. ఆ సాంగ్‌ను తనకొచ్చిన రీతిలో పాడుతూ.. డ్రమ్స్ వాయించాడు బిలాల్. అయితే ఆ వీడియోకు జపాన్ వైబింగ్ క్యాట్(పిల్లి సరదాగా తల ఊపిన వీడియో)ను ఎడిట్ చేయడంతో అది బాగా పేలింది. సోషల్ మీడియాలో బిలాల్‌కు పేరు దక్కింది. ఆ వీడియో తర్వాత బిలాల్ ఎన్నో ఫేమస్ పాటలకు డ్రమ్స్ వాయించాడు. మన వరకు బాలీవుడ్ ‘ఖలియో కా ఛమన్’, దలేర్ మెహందీ ’తున్క్ తున్క్ తున్’ ఆల్బమ్స్, లేటెస్ట్గా త్రీ ఇడియెట్స్లో ‘ఆల్ ఈజ్ వెల్’తో ఇండియన్స్‌ను బిలాల్ ఆకట్టుకోగలిగాడు. షకీరా ఆల్బమ్స్‌ను సైతం తన స్టయిల్లో కంపోజ్ చేశాడతను. ఇక పాపులర్ పాప్ సాంగ్స్‌తో పాటు టీవీ సిరీస్‌ల థీమ్ సాంగ్‌లను నోటితో హమ్మింగ్ చేస్తూ డ్రమ్స్ వాయిస్తాడు బిలాల్. View this post on Instagram A post shared by Bilal Göregen (@bilalgoregen) దేవుడంటే కోపం లేదు బిలాల్ ఇంటర్నెట్ సెలబ్రిటీ అయ్యాక ఈమధ్య ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. అందులో యాంకర్ దేవుడు కరుణించి వరాలిస్తే ఏం కోరుకుంటావని బిలాల్‌ను అడిగాడు. దానికి బిలాల్ స్పందిస్తూ.. ‘‘మా అమ్మ ముఖం చూడాలని ఉందని చెప్తా. ఆమె నన్ను కన్నదని ఈ మాట చెప్పట్లేదు. కానీ, నా అవిటితనపు బాధను ఆమె అనుభవించింది. కన్నీళ్లు కార్చింది. ఆ బాధను మోస్తున్నప్పుడు ఆమె ముఖం చూడాలన్నదే నా కోరిక’’ అని చెప్పాడు. పనిలో పనిగా రంగులు చూడాలన్న కోరికను కూడా అడిగేస్తానని చెప్పాడు. నాకు ఆ భగవంతుడి మీద నాకెలాంటి కోపం లేదు. ఎందుకంటే నా జీవితమే నాకు గొప్ప అని చెప్పడంతో అక్కడున్న ఆడియెన్స్ నిల్చుని చప్పట్లతో బిలాల్ పట్ల గౌరవం ప్రదర్శించారు. View this post on Instagram A post shared by Bilal Göregen (@bilalgoregen) -
ర్యాంప్‌పై హొయలు ఒలుకుతన్న గొర్రెలు ...
-
గొర్రెల క్యాట్ వాక్ కేకో కేక
ర్యాంప్‌పై హొయలు ఒలుకుతూ.. వయ్యరంగా నడుస్తూ వస్తున్న గొర్రెలు ఔరా అనిపించాయి. అందంగా తయారైన గొర్రెలు మోడళ్లకు తీసికట్టు మాదిరి అందచందాలు ప్రదర్శిస్తూ క్యాట్ వాక్ చేశాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ దృశ్యం టర్కీలో కనిపించింది. గొర్రెల పెంపకంపై అవగాహన కల్పించేందుకు.. గొర్రెల రకాలు, వాటి మాంసం వివరాలు తెలుపుతూ ఈ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ షో టర్కీలోని దియాబకీర్ నగరంలో జరిగింది. ఈ పోటీలో దాదాపు 12 గొర్రె జాతులు పాల్గొన్నాయి. ఆ గొర్రెలను యజమానులు అందంగా తయారు చేసి ర్యాంప్‌పై నడిపించారు. ఈ క్రమంలో స్టేజీపైకి వచ్చిన గొర్రెలు పెద్ద ఎత్తున జనాలు ఉండేసరికి గందరగోళ పడ్డాయి. యజమానులు వెంట నిల్చుని వాటిని నడిపించేందుకు అపసోపాలు పడ్డారు. ఒక్కో గొర్రె ఒక్కో రీతిన తయారై జ్యూరీ వారి దృష్టిని ఆకర్షించేలా వాటిని తయారుచేశారు. ఫ్యాషన్ షోల మాదిరి గొర్రెలకు నంబర్లు ఇచ్చి ర్యాంప్‌పై హొయలొలికిస్తూ అవి నడిచాయి. కళ్లజోడు ధరించి.. వింత హెయిర్ స్టైల్‌తో ఉన్న గొర్రె ఫైనల్ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా విజేతతో కలిసి అందరూ ఫొటోలు దిగారు. అనంతరం పోటీల పాల్గొన్న అన్ని గొర్రెలతో యజమానులు ఫొటోలకు ఫోజిచ్చారు. ఈ ఫ్యాషన్ షోకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఈ సమయంలో నిర్వాహకులు కరోనా నిబంధనలు విధిగా పాటించారు. పోటీల్లో పాల్గొన్న వారందరూ మాస్క్ ధరించారు. పెద్దాచిన్న గొర్రెలు సందడి చేశాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
కూలిన ఆర్మీ హెలికాప్టర్.. 11మంది మృతి
అంకారా : ప్రమాదవశాత్తు మిలిటరీ హెలికాప్టర్ కూలిన ఘటనలో 11 మంది మృత్యువాత పడగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన టర్కీలోని టట్వాన్లో గురువారం చోటుచేసుకుంది. హెలికాప్టర్ టట్వాన్నుంచి బింగోల్ వెళుతున్న నేపథ్యంలో స్థానిక కాలమానం ప్రకారం 2.25 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిది మంది అక్కడికక్కడే మృత్యువాత పడగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో లెఫ్టినెంట్ జెనర్ ఒస్మానా ఎర్బాస్, ఆర్మీకాప్ కమాండర్లు ఉన్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా చోటుచేసుకుంది అన్న వివరాలు తెలియరాలేదు. ఈ సంఘటనపై యురోపియన్ యూనియన్, అమెరికాలు తమ సంతాపం తెలియజేశాయి. -
బాస్ మీద కోపం.. డ్రింక్‌లో కరోనా రోగి లాలాజలం
ఇస్తాంబుల్: బాస్ మీద కోపంతో ఓ ఉద్యోగి కోవిడ్ రోగి లాలాజలంతో తన బాస్‌ని చంపేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. ఆగ్నేయ టర్కీలోని అదానాకు చెందిన ఇబ్రహీం ఉన్వర్డి కారు డీలర్షిప్ యజమానిగా పని చేస్తున్నాడు. రంజాన్ సిమెన్ అనే వ్యక్తి మూడేళ్లుగా అతడి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. చెప్పిన పని చేస్తూ.. నమ్మకంగా ఉండటంతో ఇబ్రహీం అప్పుడప్పుడు రంజాన్ చేతికి డబ్బులు కూడా ఇచ్చే వాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఇబ్రహీం కారు అమ్మగా వచ్చిన 2,15,000టర్కిష్ లిరాలను(2,22,2160 రూపాయలు) రంజాన్ సిమెన్కి ఇచ్చాడు. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి ఆఫీసులో జమ చేయాల్సిందిగా కోరాడు. అయితే ఇంత పెద్ద మొత్తం చేతికి రావడంతో రంజాన్ మనసులో చెడు ఆలోచనలు ప్రవేశించాయి. పైగా అప్పటికే అతడు లోన్ బకాయి ఉన్నాడు. ఈ క్రమంలో ఇబ్రహీం ఇచ్చిన డబ్బు తీసుకుని ఉడాయించాడు రంజాన్. దాంతో ఇబ్రహీం అతడి మీద పోలీసులకు ఫిర్యాడు చేయడమే కాక.. ఉద్యోగంలో నుంచి తొలగించాడు. అప్పటి నుంచి రంజాన్ బాస్ మీద పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అతడిని చంపాలని భావించాడు. ఈ క్రమంలో ఓ దారుణమైన ఆలోచన చేశాడు. బాస్, అతడి కుటుంబ సభ్యులు తాగే డ్రింక్స్‌లో కరోనా వైరస్ సోకిన వ్యక్తి లాలాజలాన్ని కలిపి అందరిని ఒకేసారి చంపాలని భావించాడు. ఇందుకు గాను ఓ కరోనా రోగికి 50 టర్కిష్ లిరాలు (రూ. 516)చెల్లించి అతడి లాలాజలాన్ని కొన్నాడు. అయితే ఇబ్రహీం అదృష్టం కొద్ది రంజాన్ చేస్తోన్న దారుణం గురించి అతడికి ముందే తెలిసింది. రంజాన్ సహోద్యోగి ఒకరు దీని గురించి బాస్‌కు తెలపడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాక్ష్యాధారాలు సమర్పించాడు. దాంతో పోలీసులు రంజాన్ మీద హత్యానేరం కేసు నమోదు చేశారు. అయితే ఇంత జరిగినా రంజాన్ మాత్రం మారలేదు. ‘‘నేను నిన్ను వైరస్‌తో చంపడం కాదు.. ఈ సారి నీ పుర్రెని పుచ్చకాయాల పేల్చేస్తాను’’ అంటూ బాస్‌కి బెదిరింపు సందేశాలు పంపుతున్నాడట. ఇబ్రహీం దీని గురించి మాట్లాడుతూ.. ‘‘రంజాన్‌ను చూస్తే.. భయం వేస్తుంది. ప్రస్తుతం నేను, నా భార్య, పిల్లలు అందరం ఇంట్లోనే ఉంటున్నాం. మా సొంత ఇంట్లోనే మేం బందీలుగా బతుకుతున్నాం. ఇలా ఇంకేన్నాళ్లో’’ అంటూ వాపోయాడు. చదవండి: ‘ఓవెన్ వెలిగించమన్నారు.. చుట్టూ మాంసం ముక్కలు’