Watch: Cute Girl Gets Upset With Turkish Ice Cream Vendor Starts Crying, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: ఐస్‌క్రీం ఇవ్వకుండా చిన్నారిని ఏడిపించిన వ్యక్తి.. పాప ఏం చేసిందో చూడండి..

Published Thu, Nov 24 2022 1:34 PM | Last Updated on Thu, Nov 24 2022 3:48 PM

Viral Video: Cute Girl Gets Upset With Turkish Ice Cream Vendor - Sakshi

ఐస్‌ క్రీం అంటే అందరికి ఇష్టమే.. కాలంతో సంబంధం లేకుండా లొట్టలేసుకుంటూ తింటుంటారు. ఈమధ్య కాలంలో టర్కిష్‌ ఐస్‌ క్రీం పేరు అందరినోట ఎక్కువగా వినిపిస్తుంది. కారణం దాని రుచి కాకపోయిన అక్కడి వ్యాపారస్థులు చేసే జిమ్మిక్కులు. దీని వల్లే ఈ ఐస్‌క్రీం ఎక్కువ పాపులర్‌ అయ్యింది. ఐస్‌క్రీంను ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ వెనక్కి లాగుకుంటూ కస్టమర్లను సరాదాగా ఆటపట్టిస్తుంటారు. దీనికి సంబంధించిన  వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చూసే ఉంటాం.

తాజాగా టర్కిష్‌ ఐస్‌ క్రీం వీడియో నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. ఇందులో కౌంటర్‌ ఎదురుగా ఐస్‌క్రీం కోసం నిలబడి ఉన్న చిన్నారితో విక్రేత ఫ్రాంక్‌ చేస్తుంటారు. తన ట్రిక్స్‌తో  పాపను ఆటపట్టిస్తూ ఉంటాడు. ఐస్ క్రీం కోసం చేయి చాపిన ప్రతీసారి అతను మ్యాజిక్‌ చేసి ఖాళీ కోన్‌ను ఇస్తుంటాడు. అతని పిచ్చి చేష్టలు అర్థం కాక ఏడవడం మొదలు పెడుతుంది. 

అయినప్పటికీ ఆ పాపకు ఐస్‌క్రీం ఇవ్వకుండా అలాగే చేస్తుంటాడు. ఐస్‌క్రీం ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ వెనక్కు తీసుకుంటాడు. దీంతో పట్టరాని కోపంతో ఖాళీ కోన్‌ను అతనిపై విసిరేస్తుంది. ఎట్టకేలకు ఆ పాప తండ్రి ఆమెను ఎత్తుకున్నాక ఐస్‌క్రీమ్ దక్కుతుంది.ఈ వీడియోను ఓ యూజర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

ఈ వీడియో వైరల్‌గా మారింది. లక్షకుపైగా వ్యూస్‌ వచ్చాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అంత చిన్న పాపను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు. పిల్లలకు ఐస్‌క్రీం అంటే ఎంతో ఇష్టం. వారిని ఏడిపించకండి. పాప ఏడుస్తుంటే మిగతా వాళ్లంతా నవ్వడం ఏంటి. పిల్లల విషయంలో ఇలాంటి జోక్‌లు చేయవద్దు. ఐస్‌క్రీం అమ్మేవాడిని శిక్షించాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement