మంటల్లో విమానం.. 89 మందిని సినీ ఫక్కీలో రక్షించిన సిబ్బంది | Russian plane catches fire in Turkey: Video Viral | Sakshi
Sakshi News home page

మంటల్లో విమానం.. 89 మందిని సినీ ఫక్కీలో రక్షించిన సిబ్బంది

Published Mon, Nov 25 2024 8:16 PM | Last Updated on Mon, Nov 25 2024 8:21 PM

Russian plane catches fire in Turkey: Video Viral

టర్కీలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. రష్యా నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్‌ ప్లేన్‌కు మంటలు అంటుకున్నాయి. అయితే.. ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది అప్రమత్తతో ప్రయాణికులు, విమాన సిబ్బంది మొత్తం అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

అజిముత్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ విమానం(రష్యా).. నల్ల సముద్రం తీరాన ఉన్న సోచి రిసార్ట్‌ నుంచి ప్రయాణికులను తీసుకుని టర్కీ అంటల్యా ఎయిర్‌పోర్టుకు చేరింది. అయితే ల్యాండ్‌ అయ్యే సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగి.. క్రమంగా విమానానికి వ్యాపించాయి.

విమానంలో 89 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వెంటనే పైలట్‌ విమానాన్ని రన్‌వేపై ర్యాష్‌ ల్యాడింగ్‌ చేశాడు. అయితే సకాలంలో ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది స్పందించారు. సినీ ఫక్కీలో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించారు. విమానం నుంచి అందరినీ బయటకు రప్పించారు. మంటలను ఆర్పేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

సదరు విమానం ఏడేళ్ల కిందటే సర్వీస్‌లోకి వచ్చిందని, అలాగే ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు విమానయాన సంస్థ ప్రకటించింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement