Plane Accident
-
సురభివారి గాలి మోటార్
కొల్లాపూర్: నేడు విమానాల్లో ప్రయాణించటం పెద్ద విషయమేమీ కాదు. సామాన్యులు కూడా విమాన ప్రయాణాలు చేస్తున్నారు. కానీ, ఓ వందేళ్లు వెనక్కు వెళితే? అప్పుడప్పుడే గాల్లోకి ఎగురుతున్న విమానం సాధారణ ప్రజలకు ఒక వింత. డబ్బున్నవాళ్లకు దానిని సొంతం చేసుకోవాలన్న ఆరాటం. నాడు సొంత విమానాలు కలిగి ఉండటమంటే మామూలు విషయం కాదు. కానీ, తెలంగాణలోని ఓ సంస్థానాదీశులు ఆ ఘనతను సాధించారు. జటప్రోలు (కొల్లాపూర్) సంస్థానాన్ని పాలించిన సురభి వంశస్తులు దాదాపు 93 ఏళ్ల క్రితమే సొంత విమానాల్లో తిరిగారు. పైలట్లుగా శిక్షణ పొంది లైసెన్సులూ సంపాదించారు. ఐవీఆర్తో ప్రారంభం క్రీ.శ. 6వ శతాబ్దం నుంచి కొల్లాపూర్ ప్రాంతాన్ని సురభి వంశస్తులు పరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది. 1507 సంవత్సరం నుంచి వారి పాలనకు సంబంధించిన ఆధారాలున్నాయి. 1840లో తమ సంస్థానాన్ని జటప్రోలు నుంచి కొల్లాపూర్‌కు మార్చారు. 1884 నుంచి 1929 వరకు నిజాం నవాజ్వంత్ బహదూర్గా పిలిచే రాజా వెంకటలక్ష్మారావు కొల్లాపూర్‌ను పాలించారు. ఆయన తర్వాత రాణి వెంకటరత్నమ్మ రాజ్యపాలన చేపట్టారు. వెంకటలక్ష్మారావు కుమార్తె సరస్వతీ దేవిని బొబ్బిలి రాజ్యంలోని తిరుపాచారు జమీందారు ఇనుగంటి వెంకటకృష్ణారావు (ఐవీఆర్) వివాహం చేసుకున్నారు.ఆయన విమానాలు నడపాలనే కోరికతో పైలట్‌గా శిక్షణ కూడా పొందారు. 1931 నవంబర్ 11న ఆయన ఢిల్లీలో పైలట్‌గా లైసెన్స్ తీసుకొన్నారు. తమ అల్లుడు ఐవీఆర్ కోసం సురభి రాజులు ఇద్దరు ప్రయాణించగల విమానాన్ని కొనుగోలు చేశారు. అప్పట్లో మద్రాసు ప్రావిన్సులో మాత్రమే ఒక రాజ కుటుంబానికి సొంత విమానం ఉండేది. దక్షిణ భారతదేశంలో సొంత విమానం కొనుగోలు చేసిన రెండో కుటుంబం సురభి రాజులదే. దీనికి వేంకట అనే పెట్టారు. విమానాన్ని నిలిపేందుకు కొల్లాపూర్‌లోని జఫర్ మైదానాన్ని ఎయిర్‌పోర్టుగా వినియోగించారు. హకీంపేటలో నిర్వహించిన విమానాల పోటీల్లో జేఆర్డీ టాటాతోపాటు ఐవీఆర్ కూడా పాల్గొన్నారు.మద్రాసు నుంచి బెంగళూరు వరకు 1,800 అడుగుల ఎత్తులో విమానాన్ని నడిపి ఐవీఆర్ రికార్డు సృష్టించారు. ఇంతటి ప్రతిభావంతుడైన ఐవీఆర్.. దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలోనే 1935 ఆగస్టు 25న మరణించారు. ఆయన స్మారకార్థం జఫర్ మైదానం సమీపంలోనే (ఆర్ఐడీ బాలుర జూనియర్ కళాశాల పక్కన, వాలీ్మకి గుడి వద్ద) స్తూపం ఏర్పాటుచేశారు. -
మంటల్లో విమానం.. 89 మందిని సినీ ఫక్కీలో రక్షించిన సిబ్బంది
టర్కీలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. రష్యా నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ ప్లేన్కు మంటలు అంటుకున్నాయి. అయితే.. ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తతో ప్రయాణికులు, విమాన సిబ్బంది మొత్తం అందరూ సురక్షితంగా బయటపడ్డారు.అజిముత్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సుఖోయ్ సూపర్ జెట్ విమానం(రష్యా).. నల్ల సముద్రం తీరాన ఉన్న సోచి రిసార్ట్ నుంచి ప్రయాణికులను తీసుకుని టర్కీ అంటల్యా ఎయిర్‌పోర్టుకు చేరింది. అయితే ల్యాండ్ అయ్యే సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగి.. క్రమంగా విమానానికి వ్యాపించాయి.విమానంలో 89 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వెంటనే పైలట్ విమానాన్ని రన్‌వేపై ర్యాష్ ల్యాడింగ్ చేశాడు. అయితే సకాలంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది స్పందించారు. సినీ ఫక్కీలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. విమానం నుంచి అందరినీ బయటకు రప్పించారు. మంటలను ఆర్పేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సదరు విమానం ఏడేళ్ల కిందటే సర్వీస్‌లోకి వచ్చిందని, అలాగే ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు విమానయాన సంస్థ ప్రకటించింది. This was the terrifying moment a plane the #Russian-made #Sukhoi Superjet 100 passenger plane from #AzimuthAirlines went up in flames following a nightmare landing at a #Turkish #Antalya airport. pic.twitter.com/QY3EmzdQBY— Hans Solo (@thandojo) November 25, 2024 -
విమాన ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి
-
ప్రమాదం.. కూతుళ్లతో సహా ప్రముఖ నటుడి దుర్మరణం
ఘోర ప్రమాదం జరిగింది. ప్రముఖ నటుడు దుర్మరణం చెందాడు. ఇతడితో పాటు విమానంలో ప్రయాణిస్తున్న అతడు ఇద్దరు కూతుళ్లు కూడా ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం ఈ వార్త అతడి అభిమానుల మనసు కదిలిపోయేలా చేసింది. ఇంతకీ అసలేం జరిగింది? ఎవరా నటుడు? (ఇదీ చదవండి: ఓటీటీలోకి మరో డిఫరెంట్ సిరీస్.. స్టార్ దర్శకుడికి ఇదే తొలిసారి) జర్మనీలో పుట్టి ప్రస్తుతం హాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన క్రిస్టియన్ ఒలీవర్(51).. తాజాగా కరీబియన్ దీవులకు ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. అయితే గ్రెనాడిస్ అనే ద్వీపం నుంచి సెయింట్ లూసియా అనే ప్రాంతానికి ప్రైవేట్ జెట్‌లో వెళ్లాడు. కాకపోతే గురువారం ఈ విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే.. పక్కనే ఉన్న నదిలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నటుడు క్రిస్టియన్ ఒలీవర్తోపాటు ఇతడు ఇద్దరు కుమార్తెలు, పైలెట్ మృతి చెందారు. ప్రమాదం జరుగుతున్నప్పుడు ఎవరో దూరం నుంచి వీడియో తీయగా.. అది ట్విట్టర్లో వైరల్ అవుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే డైవర్స్ స్పందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాడీలని ఒడ్డుకు తీసుకొచ్చిన పోలీసులు.. యాక్సిడెంట్‌కి కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) -
తుఫ్రాన్‌లో కూలిపోయిన శిక్షణ విమానం.. పైలట్ మృతి
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలోని తుఫ్రాన్‌లో శిక్షణ విమానం కూలిపోయింది. అయితే, విమానం కూలిపోయిన వెంటన భారీగా మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పైలెట్, కో-పైలట్ మృతిచెందారు. వివరాల ప్రకారం.. తుఫ్రాన్ మున్సిపల్ పరిధిలోని టాటా కాఫీ కంపెనీ సమీపంలో ఉన్న గుట్టల మధ్య సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలిపోయింది. కాగా, కూలిన విమానాన్ని దుండిగల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన శిక్షణ విమానంగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా విమానం కూలిపోవడంతో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. Two Indian Air Force pilots were killed in action when their Pilatus trainer aircraft crashed at 8:55 during training at Air Force Academy, Dindigul in Telangana. The pilots include an instructor and one cadet: Indian Air Force officials pic.twitter.com/48bGdfawRy — ANI (@ANI) December 4, 2023 -
వీడియో వైరల్: రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొన్న విమానం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వింత ఘటన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద ప్రయాణిస్తున్న ఓ కారును.. విమానం ఢీకొట్టింది. ఇదేంటి గాల్లో ఉండే విమానం ఎలా ఢీకొట్టింది అనుకుంటున్నారా?. అదే ఇక్కడ వెరైటీ. కాగా, ఈ వింత ఘటన టెక్సాస్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. టెక్సాస్ రాష్ట్రంలోని మెక్కిన్నేలో ఓ విమానం రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. శనివారం మధ్యాహ్నం స్థానిక ఏరో కౌంటీ ఎయిర్‌పోర్టులో Iv-P ప్రాప్‌జెట్ విమానం రన్‌వే పై నుంచి టేకాఫ్ అయ్యింది. కానీ, వెంటనే దానిని పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ విమానం రన్‌వేపై చివరి వరకు వచ్చినా ఆగలేదు. దీంతో అక్కడే ఉన్న కంచెను దాటుకొని రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొంది. That’s gonna leave a mark, ouch! 🫣 T31 airport in Mc Kinney, Texas today 🎥 IG jackschneider17 via @HamWa07 pic.twitter.com/CKbgCTHOse — Thenewarea51 (@thenewarea51) November 11, 2023 దీంతో, వెంటనే అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకొన్నాయి. పైలట్, ప్రయాణికుడు, కారు డ్రైవర్‌ను రక్షించాయి. వీరిలో ఒకరికి స్వల్పగాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన రోడ్డును కొన్ని గంటలపాటు మూసివేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది కూడా చదవండి: Israel-Hamas War: గాల్లో వేలాది ప్రాణాలు! -
ప్రిగోజిన్ మృతిపై క్రెమ్లిన్ రియాక్షన్..
వాగ్నర్ చీఫ్, తిరుగుబాటు నాయకుడు ప్రిగోజిన్‌ను రష్యానే హతమార్చిందని పశ్చిన దేశాల నాయకుల ఆరోపణలపై తాజాగా క్రెమ్లిన్ స్పందించింది. అదంతా పచ్చి అబద్దం అని తెలిపింది. ప్రిగోజిన్ ఖచ్చితంగా చనిపోయాడనే విషయాన్ని తెలపడానికి నిరాకరిచింది. దర్యాప్తు పరీక్షల ఫలితాలు రావాలని స్పష్టం చేసింది. అటు.. ప్రైవేటు విమానం ప్రమాదానికి గురైన సమయంలో వాగ్నర్ చీఫ్ అందులోనే ఉన్నారని రష్యా విమానయాన అథారిటీ వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని పేర్కొంది. విమాన ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుభూతి తెలిపారు. ప్రిగోజిన్, ఆయన సహచరులను పొగుడుతూనే.. కొన్ని తప్పులు కూడా చేశారని అన్నారు. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మరణంపై పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసినందుకు ప్రతీకారంతోనే అతన్ని అంతం చేశారని ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన రష్యా అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలని అన్నారు. దర్యాప్తులోనే అసలైన నిజాలు బయటకొస్తాయని చెప్పారు. ఇదీ చదవండి: Wagner Chief Plane Crash Video: అంతా 30 సెకన్లలోనే.. వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్ -
రన్‌వేపై రెండు ప్యాసింజర్ విమానాలు ఢీ
ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేపై రెండు ప్యాసింజర్ విమానాలు ఢీ కొన్నాయి. దీంతో అధికారులు రన్‌వేని మూసేశారు. ఈ ఘటకు గల కారణాలు అస్పష్టంగా ఉన్నాయి. ఈ ప్రమాదం జపాన్ రాజధాని టోక్యలో హనెడా విమానాశ్రయం వద్ద చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటనలో ప్రయాణికులకు తీవ్ర గాయలైనట్లు జపాన్ మీడియా పేర్కొంది. అయితే ప్రభుత్వం మాత్రం ఎవరికీ ఏం కాలేదని అంటోంది. టోక్యోలోని హనెడా విమానాశ్రయం వద్ద టాక్సీవేలో ప్రయాణికులతో కూడిన రెండు విమానాలు ఢీ కొన్నాయి. దీంతో రన్‌వే ఒక్కసారిగా మూసివేశారు అధికారులు. బ్యాంకాకు బయలుదేరిని థాయ్ ఎయిర్వేస్ ఇంటర్నేషనల్ జెట్ ప్రమాదవశాత్తు తైపీకి వెళ్తున్న ఎవా ఎయిర్వేస్ విమానాన్ని ఢీ కొట్టింది. ఈ షాకింగ్ ఘటన కారణంగా మిగతా విమానాలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ ఈ ఘటన శనివారం ఉదయం 11 గంటలకు జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఎలాంటి నష్టం వాటిల్ల లేదని పేర్కొంది. కానీ జపాన్ స్థానిక మీడియాలు మాత్రం ప్రయాణికులు కొద్దిపాటి గాయాలయ్యాయని, అలాగే ఓ విమానం రెక్కదెబ్బతిందని పేర్కొంది. ఈ ప్రమాద సమయంలో టోక్యో విమానాశ్రయం సత్వరమే స్పందించడంలో జాప్యం చేసిందని పలు విమర్శనాత్మక కథనాలు వెలువరించడం గమనార్హం. కాగా, అసలు ఈ ఘటనకు దారితీసిన కారణాలేంటో తెలియాల్సి ఉంది. (చదవండి: రాజ భవనంలాంటి ఆ బంగ్లా.. ఎలుకలు ఉన్నాయని కూల్చేస్తున్నారు!) -
నేపాల్ విమాన ప్రమాదం.. 10 సెకన్ల ముందు వీడియో వైరల్..
కాఠ్మాండు: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు 10 సెకన్ల ముందు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఓ స్థానికుడు మొబైల్లో ఈ వీడియోను చిత్రీకరించాడు. ఇందులో విమానం అతి తక్కువ ఎత్తులో ఎగురుతోంది. క్షణాల్లోనే అదుపుతప్పి ఏటవాలుగా ప్రయాణించింది. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. The terrible last moments of the #NepalPlaneCrash! pic.twitter.com/wRTnB9i0QW — Ayushi Agarwal (@ayu_agarwal94) January 15, 2023 విమానం నేపాల్ రాజధాని కాఠ్మాండు నుంచి పోఖారా వెళ్లే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. కాఠ్మాండు నుంచి టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత పోఖారా చేరుకోవడానికి క్షణాల ముందు విమానం క్రాష్ ల్యాండ్ అయింది. ఘటన తర్వాత అక్కడి దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కూలిపోయిన విమానం నుంచి భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. Aerial shots of plane crash site in Pokhara#NepalPlaneCrash #pokhra #PokharaAirport #nepal pic.twitter.com/Fz1KsdqB4y — Vivek Bajpai (@vivekbajpai84) January 15, 2023 ప్రమాదం సమయంలో సిబ్బంది సహా మొత్తం 72 మంది విమానంలో ఉన్నారు. ఇందులో 68 మంది చనిపోయినట్లు నేపాల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఘటనా స్థలం నుంచి వారి మృతదేహాలను సిబ్బంది వెలికి తీశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఈ విమానంలోని ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. #NepalPlaneCrash Prayers! pic.twitter.com/pn7ECs1Gyk — Rukhsar (@Rukhsar987) January 15, 2023 काठमांडू से पोखरा के लिए रवाना हुआ था विमान हादसे का शिकार, 72 में से अब तक 36 शव बरामद#YetiAirlines #NepalPlaneCrash #planecrash pic.twitter.com/wse90PU3n2 — Anchor Charul Sharma (@Anchor_Charul) January 15, 2023 చదవండి: వెలుగులోకి మరో భూమి.. ఇదే తొలిసారి.. అచ్చంగా భూ గ్రహం మాదిరిగానే! -
Viral Video: బీచ్ లో ల్యాండ్ అయిన విమానం
-
అమెరికాలో ఘోర ప్రమాదం.. ఆకాశంలోనే ఢీకొన్న యుద్ధ విమానాలు
అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికాలో నిర్వహించిన వైమానిక ప్రదర్శనలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. రెండు యుద్ధ విమానాలు ఆకాశంలో ఎగురుతున్న సమయంలో ఒకదానినొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో పైలట్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. అమెరికాలో టెక్సాస్‌లోని డల్లాస్‌లో వైమానిక ప్రదర్శన జరుగుతున్న సమయంలో బోయింగ్ బీ-17 బాంబర్ యుద్ధ విమానం, పీ-63 కింగ్ కోబ్రా యుద్ధ విమానం రెండూ ఢీకొన్నాయి. అయితే, బోయింగ్ విమానం ప్రయాణిస్తుండగా మార్గం తప్పిన కోబ్రా యుద్ధ విమానం వచ్చి దాన్ని ఢీకొట్టింది. దీంతో, పెద్ద శబ్ధంతో విమానాలు నేలపై కుప్పకూలిపోయాయి. ఆకాశంలోనే విమానం ముక్కలైంది. ఈ రెండు విమానాల్లోని పైలట్ల ఆరోగ్య వివరాలపై ఇంకా సమాచారం అందలేదు. ఈ ప్రమాదంలో పైలట్ల గురించిన సమాచారం ఇంకా నిర్దారించలేదని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) వెల్లడించింది. కాగా, వైమానిక ప్రదర్శనలు వచ్చిన వారు చూస్తుండగా.. వీడియోలు తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో, ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు.. ఎయిర్ ఫోర్స్ వింగ్స్ స్మారకంగా నిర్వహించిన ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరిగిందని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్.. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. బీ-17 యుద్ధ విమానం రెండో ప్రపంచ యుద్ద కాలంలో కీలక పాత్ర పోషించింది. ఇదే సమయంలో పీ-63 కింగ్ కోబ్రా యుద్ధ విమానాన్ని కూడా తయారుచేశారు. ఈ చిన్న విమానాన్ని సోవియెట్ ఎయిర్ ఫోర్స్‌కు వ్యతిరేకంగా మాత్రమే వినియోగించినట్టు సమాచారం. pic.twitter.com/peyMeEMA25 — Giancarlo (@GianKaizen) November 12, 2022 BREAKING: 2 planes, including a B-17 Flying Fortress, collide at Dallas airshow pic.twitter.com/hdieiJuqvX — BNO News Live (@BNODesk) November 12, 2022 -
ఘోర ప్రమాదం.. సరస్సులో కూలిపోయిన విమానం
దార్ ఎస్ సలాం: ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. 49 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం విక్టోరియా సరస్సులో కూలిపోయింది. బుకోబా నగరంలో ల్యాండింగ్ కావాల్సిన కొద్ది సమయానికి ముందే వాతావరణం అనుకూలించకపోవటంతో సరస్సులో పడిపోయింది. ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ‘ప్రెసిషన్ ఎయిర్ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. ఎయిర్‌పోర్ట్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్న నీటిలో పడిపోయింది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ప్రయాణికులను రక్షించేందుకు భద్రతా బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.’ అని రీజనల్ పోలీస్ కమాండర్ విలియమ్ వాంపఘేల్ తెలిపారు. మరోవైపు.. విమానంలో ప్రయాణికులు 49 మంది ఉన్నట్లు స్థానిక మీడియాలు నివేదించగా.. ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉడొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. టాంజానియా ఆర్థిక రాజధాని దార్ ఎస్ సలాం నుంచి బుకోబాకు ప్రయాణిస్తోంది. ప్రెసిషన్ ఎయిర్ సంస్థ టాంజానియాలో అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థ. విమాన ప్రమాదం జరిగినట్లు ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన చేసింది. ప్రమాద ఘటనా స్థలానికి సహాయక బృందాలను పంపామని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. ఉత్తర టాంజానియాలో సఫారీ సంస్థకు చెందిన విమాన ప్రమాదంలో 11 మంది చనిపోయిన 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ప్రమాదం జరిగింది. Precision Air plane crashes into Lake Victoria while trying to land in Tanzania; no word on casualties pic.twitter.com/EpRrgPvAVB — BNO News (@BNONews) November 6, 2022 ఇదీ చదవండి: వారెవ్వా.. సరికొత్త గిన్నిస్ రికార్డ్.. ‘కీహోల్’లోంచి ఏడు బాణాలు! -
నింగి నుంచి నీళ్లలోకి...!
దక్షిణ ఫ్రాన్స్‌లోని మోంట్‌పిల్లర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయ్యాక రన్‌వే దాటి దూసుకెళ్లి సరస్సులోకి దూసుకెళ్లింది ఓ సరకు రవాణా విమానం. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. ప్రమాద సమయంలో బోయింగ్ 737 కార్గో విమానంలో మొత్తం ముగ్గురు ఉన్నారు. విమానాన్ని తొలిగంచే వరకు ఎయిర్‌పోర్ట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీపంలోని సరస్సులోకి దూసుకెళ్లగా విమానంలోని ఒక ఇంజిన్ నీటిలో మునిగిపోయింది. శనివారం తెల్లవారుజామున పారిస్ ఛార్లెస్ డీ గౌల్లే ఎయిర్పోర్ట్ నుంచి మోంట్‌పిల్లర్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన క్రమంలో ప్రమాదం జరిగింది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ⚠️ Accident du @BoeingFrance #737 immatriculé EC-NLS exploité par #WestAtlantic / sortie de piste pendant atterrissage survenue le 24/09/22 à l’aéroport de @mplaeroport / 4 enquêteurs @BEA_Aero sur place / ouverture d’une enquête de sécurité. pic.twitter.com/H76U3BbRxk — BEA ✈️ ⚙️🔬🇫🇷 (@BEA_Aero) September 24, 2022 ఇదీ చదవండి: 8 నిమిషాల్లోనే గుండె వైఫల్యం నిర్ధారణ -
ఘోర విమాన ప్రమాదం.. ఏడుగురు యువకులు..
వాషింగ్టన్ : ఓ విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఈ విషాదకర ఘటన అమెరికా నార్త్ కరోలినా రాష్ట్రంలోని ఔటర్ బ్యాంక్స్ వద్ద చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఎనిమిది మంది యువకులతో హైడ్ కౌంటీ ఎయిర్పోర్ట్ నుంచి పిలాటస్ పీసీ-12/47 అనే సింగిల్ ఇంజిన్ విమానం టేకాఫ్అయింది. అనంతరం 25 నిమిషాల్లో 29 కిలోమీటర్ల(18 మైళ్లు) దూరం ప్రయాణించిన తర్వాత రాడార్‌తో ఆ విమాన సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆ విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయిందని కోస్ట్ గార్డ్ అధికారులు నిర్ధారించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సముద్రంలో సహాయక చర్యలను ప్రారంభించింది. ఈ క్రమంలో సముద్రంలో విమాన శకలాలను సిబ్బంది గుర్తించారు. ఆ ప్రాంతంలోనే ఓ వ్యక్తి మృతదేహాన్ని కూడా కోస్ట్ గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గల్లంతైన మరో ఏడుగురి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, వీరంతా కార్టెరెట్ కౌంటీకి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. -
క్రీడాలోకం దిగ్భ్రాంతి: విమానం నుంచి పడిన క్రీడాకారుడు
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ నుంచి బయల్దేరిన విమాన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన ప్రపంచం మరువలేదు. తాజాగా విమానం నుంచి కిందపడిన వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు వివరాలు వెల్లడి కాగా మరో యువకుడు మృతి చెందడంతో క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఎందుకంటే ఆ దేశ జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు విమానం నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా ధ్రువీకరించింది. ఈ విషాదకర వార్త వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: విమానం నుంచి పడిపోయిన ఘటన.. అన్నదమ్ముల విషాద గాథ ) తాలిబన్లు దేశాన్ని హస్తగతం చేసుకోవడంతో అఫ్గానిస్తాన్‌లో భయాందోళనలు ఏర్పడిన విషయం తెలిసిందే. తాలిబన్లు ఆగస్టు 15వ తేదీన ఆక్రమించగా ఆ భయంతో ఆ తెల్లారి 16వ తేదీన ప్రజలు కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పరుగుల బాట పెట్టారు. అక్కడ ఉన్న అమెరికా యుద్ధ విమానం ఎక్కి ముగ్గురు కిందపడిన విషయం తెలిసిందే. మిగతా ఇద్దరు సోదరులు కాగా మరో యువకుడు ఆ దేశ అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఈ విషయం తెలుసుకున్న క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఎంతో ప్రతిభ గల క్రీడాకారుడు దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా అత్యంత దారుణ పరిస్థితిలో మరణించడం కలచివేస్తోంది. అతడి పేరు జాకీ అన్వరీ. అఫ్గానిస్తాన్ జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు. అమెరికా యుద్ధ విమానం సీ-17 పై నుంచి కిందపడిన వారిలో జాకీ ఒకడు. ఈ విషయాన్ని ఆ దేశ క్రీడా శాఖ ధ్రువీకరించింది. జాకీ అన్వరీ గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. చదవండి: అథ్లెటిక్స్ దిగ్గజం కన్నుమూత.. విషాదంలో పీటీ ఉష -
విమాన ప్రమాదంలో ఫుట్‌బాల్ ఆటగాళ్ల మృతి
బ్రసీలియా: ఇండోనేషియా విమాన ప్రమాదం ఘటన మరువకముందే బ్రెజిల్లో మరో ఘోర ప్రమాదం సంభవించింది. విమానం కుప్పకూలి నలుగురు ఫుట్‌బాల్ ఆటగాళ్లు సహా ఆరుగురు మృత్యువాత పడ్డారు. బ్రెజిల్‌లోని టొకాన్టిన్ రాష్ట్రంలో ఈ విమాన ప్రమాదం జరిగింది. పామాస్ ఫుట్‌బాల్ క్లబ్ అధ్యక్షుడితో పాటు పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. విలానోవా జట్టుతో ఆట ఆడేందుకు ఆటగాళ్లంతా జోయియానియాకు వెళ్తున్నారు. టేకాఫ్ అవుతుండగా దక్షిణాది రాష్ట్రమైన టొకాన్టిన్లో ఈ ప్రమాదం సంభవించిందని ఆ దేశ మీడియా వెల్లడించింది. టేకాఫ్ అయ్యే సమయంలో విమానం ఒక్కసారిగా నేలకూలడంతో ప్రమాదం జరిగింది. విమానంలో ఉన్న ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడలేదు. మృతి చెందిన వారిలో అధ్యక్షుడు లుకాస్ మెయిరా, ఆటగాళ్లు లుకాస్ ప్రాక్సేడెస్, గుయిల్హెర్మె నో, రనులే, మార్కస్ మోలినారి ఉన్నారు. పామాస్ ఫుట్‌బాల్ క్లబ్ ను 1997లో స్థాపించారు. ఇది బ్రెజిల్‌లోని నార్త్ ఫోర్ డివిజన్‌కు చెందిన క్లబ్. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం తీరుపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. -
నా రెండు చేతులూ పోయాయనుకున్నా..
తిరువనంతపురం: కోళీకోడ్ విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపి ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ దుర్ఘటనలో నా రెండు చేతులు పోయాయనుకున్నా. తీవ్రమైన నొప్పితో కనీసం కదపడానికి కూడా వీలు లేనంత బాధను భరించా అని ప్రమాదం నుంచి బయటపడిన ఆశిక్ పెరుంబల్ అనే ప్యాసింజెర్ తెలిపాడు. 'స్పృహ కోల్పోయి మెలకువ రాగానే నా సోదరుడిని నేను అడిగిన మొదటి ప్రశ్న నా చేతులు ఏవి అని. ఆ సమయంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎవరో నన్ను స్ట్రెచర్‌పై పడుకోబెట్టారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం 2:05 గంటలకు బయలుదేరింది. విమానం ఎక్కేముందే అందరం కరోనా పరీక్షలు చేయించుకున్నాం. ప్రతీ ఒక్కరిలో కరోనా గురించి భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఒక్కరూ మాస్క్‌ను కొంచెం సేపు కూడా పక్కన పెట్టలేదు. ఎవరూ వాష్‌రూంకు కూడా వెళ్లలేదు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అనే ఉత్కంఠే అందరిలోనూ ఉంది. ల్యాండింగ్ అవుతున్న సమయంలోనే పెద్ద శబ్ధం రావడంతో అందరం చాలా భయపడ్డాం ఏం జరుగుతుందో తెలుసుకనేలోపే విమానం ముక్కలైంది. ఆ తర్వాత ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాం' అనే విషయాలను గుర్తుచేసుకున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దుబాయ్ నుంచి స్వదేశానికి తరలిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ శుక్రవారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. (కోళీకోడ్ ప్రమాదం: భయంతో ముందు సీట్లను పట్టుకున్నాం) దుబాయ్ నుంచి వచ్చిన విమానం కోళీకోడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న క్రమంలో అదుపుతప్పి ఒక్కసారిగా పక్కకు దూసుకెళ్లింది. దీంతో విమానం రెండుగా విరిగిపోయింది. ముందు భాగం పూర్తిగా ధ్వంసమవడంతో ఇద్దరు పైలెట్లతో సహా 18 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పలువురు గాయాలపాలై ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అలాంటి వారిలో ఆశిక్ ఆయన సోదరుడు మొహమ్మద్ అస్సియాస్ కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పృహ కోల్పోయి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నామని, చాలామంది సహాయం చేయడానికి వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చి తన సోదరుడు ఏమై పోయాడో అని మళ్లీ వెనక్కి వచ్చి చూసుకున్నట్లు తెలిపాడు. భగవంతుడి దయ వల్ల తాము క్షేమంగా బయటపడ్డామని తనకు సహాయం చేసిన వైద్యులు, సిబ్బందికి ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపాడు. (కోళీకోడ్ ఘటన: ప్రాణం కాపాడిన ఫైన్) -
‘మరోసారి విమానం ఎక్కాలని లేదు ’
తిరువనంతపురం: కోళీకోడ్ విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో విషాదం నింపింది. మరికొద్ది క్షణాల్లో సొంత గడ్డపై కాలుమోపబోతున్నామనే సంతోషంతో ఉన్నవారిని ఊహించని ప్రమాదం ఛిన్నాభిన్నం చేసింది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారికి ఈ దుర్ఘటన ఓ పీడకలగా మారింది. అంతా 15 సెంకడ్లలో జరిగిపోయిందని ప్రమాదం నుంచి బయటపడిన ముహమ్మద్ జునైద్ అనే ప్యాసింజెర్ చెప్పాడు. దేవుడి దయతో తాను బయటపడ్డానని, ఇంకోసారి విమాన ప్రయాణం చేయాలనే ఆలోచననే లేదని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దుబాయ్ నుంచి స్వదేశానికి తరలిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ శుక్రవారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. (చదవండి : భయంతో ముందు సీట్లను పట్టుకున్నాం..) ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా 18 మంది మరణించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కొంతమంది స్పల్ప గాయాలతో బయటపడ్డారు. వారిలో ఒకరు జునైడ్(25) ఒకరు. మూడేళ్ల క్రితం దుబాయ్‌కి వెళ్లి అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. నెలకు 75 వేల జీతం. అంతా బాగుంటుందన్న సమయంలో కరోనా మహ్మమారి అతని ఉపాధిని దెబ్బతీసింది. మే నెలలో సగం జీతం ఇచ్చిన కంపెనీ.. తర్వాత మూడు నెలలు సెలవులపై వెళ్లాలని చెప్పి చేతులు దులుపుకుంది. ఈ క్రమంలో భారత్‌కు తిరిగి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. విమానం వెనుక భాగం చివరి సీట్లో కూర్చోవడం వల్ల తాను బతికి బయటపడ్డానని జునైద్ చెప్పాడు. విమాన పైకప్పు తాకడం వల్ల తలకి, పెదాలకు చిన్న గాయం తప్పా ఎలాంటి ప్రమాదం జరగలేదని జునైద్ పేర్కొన్నారు. దేవుని దయతో బయటపడ్డానని, మరోసారి విమానం ఎక్కాలని లేదని చెప్పుకొచ్చారు. (చదవండి : కోళీకోడ్ ఘటన: ప్రాణం కాపాడిన ఫైన్) -
గాల్లో ఢీకొన్న విమానాలు: 8 మంది మృతి
వాషింగ్టన్: అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రెండు విమానాలు గాల్లో ఢీ కొట్టుకున్న ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. విమానాలు రెండూ కోయర్ డీఅలెన్ సరస్సులో మునిగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. రెండు మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. (గల్వాన్ లోయలో కీలక పరిణామం) మృతుల్లో పిల్లలు, పెద్దవాళ్లు ఉన్నారని చెప్పారు. రెండు విమానాలు ఢీ కొట్టుకోవడం వెనుక ఉన్న కారణాన్ని ఇంకా కనుగొనలేదని తెలిపారు. సరస్సులో మునిగిపోయిన రెండు విమానాల శకలాలను సోనార్ సాయంతో గుర్తించినట్లు వెల్లడించారు. వాటిని బయటకు తీయడానికి ఒకటి నుంచి రెండు రోజుల సమయం పడుతుందన్నారు. విమాన ప్రమాదంపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు. (ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. 100 ఏళ్ల తర్వాత) -
కూలిన విమానం : నలుగురి మృతి
న్యూయార్క్ : అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా కరోనా మున్సిపల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం కూలిపోవడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. కరోనా ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం ఉదయం చిన్నపాటి సింగిల్ ఇంజిన్ విమానం టేకాఫ్ అవుతుండగా, విమానం గాలిలో ప్రయాణించలేకపోయింది. ఆ తర్వాత విమానం ఫెన్స్‌ను తాకుతూ కుప్పకూలి విమానాశ్రయానికి తూర్పున ఉన్న బారికేడ్‌ను తాకింది. 80 గ్యాలన్ల ఇంధనాన్ని మోస్తున్న విమానం, ఆపై పల్టీలు కొట్టి మంటల్లో చిక్కుకుంది తర్వాత మంటలు చెలరేగాయి. పైలట్‌కు విమానంపై కంట్రోల్ తప్పిందని రన్‌వేపై చాలా వేగంగా విమానం పరిగెత్తిందని ప్రమాద ఘటనను వీక్షించిన మరో పైలట్ దొర్తీ వోల్ చెప్పారు. ఇంధన ట్యాంకుల నుంచి పేలుడు శబ్ధం వినిపించగా విమానంలో మంటలు వ్యాపించాయని ప్రయాణీకులు పరిగెత్తుతూ కనిపించారని తెలిపారు. విమానం గంటకు 90 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుండవచ్చని మరో పైలట్ వాట్ సిండర్ అంచనా వేశారు. కాగా విమాన మోడల్‌తో పాటు ప్రమాదానికి ప్రధాన కారణం వంటి వివరాలు ఇంకా వెల్లడికాలేదని అధికారులు తెలిపారు. విమాన ప్రమాదంతో విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు విచారణకు ఆదేశించాయని వెల్లడించారు. చదవండి : 176 మంది మృతి: ‘నా తండ్రి సజీవంగా ఉన్నారు’ -
పేలిన విమానం ..ఇద్దరి మృతి
మాస్కో : ఇంజన్ ఫెయిలవడంతో అత్యవసరంగా ల్యాండ్ అయ్యే సమయంలో విమానం పేలిన ఘటన సైబీరియాలోని బుర్యేతియా ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ విమానం రష్యాకి చెందిన ఆంటోనోవ్ ఏఎన్-24గా గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ఉలాన్-ఉడే నుంచి ఐదుగురు సిబ్బంది, 48మంది ప్రయాణికులతో నిజ్నియాన్గార్క్స్కు ఏఎన్-24 విమానం బయలుదేరిందని తెలిపారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో బుర్యేతియా ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు పైలట్ యత్నించాడని.. ఆ సమయంలో విమానం రన్‌వేను బలంగా తాకడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. కాగా ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారని, మరణించిన వారిలో ఒకరు పైలట్, మరొకరు టెక్నీషయన్ అని అధికారులు ధ్రువీకరించారు. -
ఫుట్‌బాల్ జట్టుకు తృటిలోతప్పిన ప్రమాదం
-
ఫుట్‌బాల్ జట్టుకు తప్పిన ప్రమాదం
రాస్తోవ్: సౌదీ అరేబియా ఫుట్‌బాల్ జట్టు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా సౌదీ ఫుట్‌బాల్ ప్లేయర్లు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఉరుగ్వేతో మ్యాచ్ ఆడేందుకు రాస్తోవ్‌కు వెళ్తున్న సమయంలో విమానంలోని ఓ ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించాయి. విమానం గాల్లో ఉండగానే మంటలు వ్యాపించడంతో ఆటగాళ్లంతా ఆందోళనకు గురయ్యారు. కాగా, ఆ విమానం చివరకు సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తమ ప్లేయర్లు అంతా సురక్షితంగా ఉన్నట్లు సౌదీ ఫుట్‌బాల్ సంఘం వెల్లడించింది. సాంకేతిక లోపం కారణంగా ఇంజిన్‌లో మంటలు వ్యాపించినట్లు తెలుస్తుండగా, మంటలు చెలరేగడానికి పక్షి ఢీకొనడం కారణంగా రష్యా ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనను విమానంలో ఉన్న ఆటగాళ్లు వీడియో తీయగా, దాన్ని సౌదీ మీడియా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. -
నేపాల్ విమాన ప్రమాదం
-
80 ఏళ్ల మిస్టరీ వీడింది
వాషింగ్టన్ : దాదాపు 8 దశాబ్దాలకు పైగా నెలకొన్న మిస్టరీకి ఎట్టకేలకు తెర పడింది. అదృశ్యమైన అమెరికన్ వైమానికురాలు అమెలియా ఇయర్హార్ట్ మృతదేహం తాలూకు అవశేషాలను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. పశ్చిమ పసిఫిక్ ఐలాండ్‌లో పరిశోధకులు వీటిని గుర్తించగా.. వాటిని పరిశోధించిన టెన్నెస్సె యూనివర్సిటీ ఆంథ్రోపాలజిస్ట్ రిచర్డ్ జాన్ట్జ్ ఇది అమెలియా అవశేషాలనే అని పేర్కొన్నారు. యాత్రికురాలు, రచయిత అయిన అమెలియా 1937లో విమానం ద్వారా ప్రపంచ యాత్రకు బయలుదేరారు. విమానంలో ఆమెతోపాటు నేవిగేటర్ ఫ్రెడ్ నూనన్ కూడా ఉన్నారు. విమానం ఫసిఫిక్ సముద్రం మీదుగా వెళ్తుండగా నికూమరోరో ప్రాంతంలో అదృశ్యమైంది. ఆ తర్వాత రెండేళ్లకు ఆమె జాడ తెలియకపోయేసరికి చనిపోయినట్లుగా అధికారులు ప్రకటించారు. అప్పటి నుంచి ఆమె అదృశ్యం గురించి రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఈమె జీవిత చరిత్రపై పలు భాషల్లో చిత్రాలు కూడా వచ్చాయి. చివరకు 1940లో ఎముకల గూడు గార్డనర్ ఐలాండ్‌కు కొట్టుకొచ్చాయి. అప్పటి నుంచి వాటిపై అంథ్రోపాలజిస్టులు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. మృత దేహ నిర్ధారణ కోసం చేసిన అధ్యయనాల్లో చాలా వరకు గందరగోళ ప్రకటనలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. చివరకు శాస్త్రీయంగా మూడు సిద్ధాంతాలను అన్వయించిన రిచర్డ్ .. చివరకు అది అమెలియాదే అని తేల్చారు. ఇంధనం అయిపోవటంతోనే విమానం కూలిపోయి ఉంటుందని.. ఆమె అస్థిపంజరం ద్వీపానికి కొట్టుకొచ్చిందని ఆయన అంచనా వేస్తున్నారు. ఫ్రెడ్ నూనన్ అవశేషాలు మాత్రం ఇప్పటిదాకా లభ్యం కాలేదు. అమెలియా ఇయర్హార్ట్ చివరి చిత్రం