సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలోని తుఫ్రాన్లో శిక్షణ విమానం కూలిపోయింది. అయితే, విమానం కూలిపోయిన వెంటన భారీగా మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పైలెట్, కో-పైలట్ మృతిచెందారు.
వివరాల ప్రకారం.. తుఫ్రాన్ మున్సిపల్ పరిధిలోని టాటా కాఫీ కంపెనీ సమీపంలో ఉన్న గుట్టల మధ్య సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలిపోయింది. కాగా, కూలిన విమానాన్ని దుండిగల్ ఎయిర్పోర్టుకు సంబంధించిన శిక్షణ విమానంగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా విమానం కూలిపోవడంతో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
Two Indian Air Force pilots were killed in action when their Pilatus trainer aircraft crashed at 8:55 during training at Air Force Academy, Dindigul in Telangana. The pilots include an instructor and one cadet: Indian Air Force officials pic.twitter.com/48bGdfawRy
— ANI (@ANI) December 4, 2023
Comments
Please login to add a commentAdd a comment