Medak district
-
‘నిమ్మకాయల బాబా’ బాగోతం బట్టబయలు.. మహిళలకు మత్తుమందు ఇచ్చి..
సాక్షి, సిరిసిల్ల జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా బాబా ముసుగులో లైంగిక దాడులకు పాల్పడుతున్న ఓ దొంగ బాబా బాగోతాన్ని సిరిసిల్ల జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. మహిళలకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఓ ఫేక్ బాబా ఆటకట్టించారు. వేములవాడకి చెందిన బాపు స్వామి అనే వ్యక్తి.. సమస్యలను పరిష్కరిస్తానంటూ.. ఆరోగ్యం బాగలేకపోతే నయం చేస్తానని నమ్మించి ఆడవాళ్లను మోసం చేస్తున్నాడు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే తాను పూజలు చేసి నయం చేస్తానని నమ్మించి.. ప్రత్యేక పూజల పేరుతో మహిళలకు మత్తు మందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత లైంగిక దాడులకు పాల్పడేవాడు. ఈ ఫేక్ బాబా తన పూజల సమయంలో నిమ్మకాయలలో నిద్రమాత్రలు కలిపి మహిళలకు వాసన చూపించి, వాటిని తాగించేవాడు.. స్పృహ కోల్పోయిన తర్వాత వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు.ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసి, బాధితులను బ్లాక్ మెయిల్ చేసేవాడు. నిందితుడి నుంచి పోలీసులు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో వందలాది మహిళల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
పెళ్లి కుదరడంలేదని యువకుడి బలవన్మరణం
చిన్నశంకరంపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణ గౌడ్ కథనం మేరకు.. మండలంలోని మడూర్ గ్రామానికి చెందిన శివరాజ్(24)కు కొద్ది రోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఎక్కడా సంబంధం కుదరడంలేదు. దీంతో మానోవేదనకు గురయ్యాడు. గురువారం రాత్రి పొలం వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అర్థరాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో తండ్రి యాదగిరి, మరో రైతు సత్యనారాయణతో కలిసి పొలం వద్దకు వెళ్లి చూశారు. అప్పటికే పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తండ్రి యాదగిరి శుక్రవారం పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. భార్యతో గొడవపడి భర్త.. పటాన్చెరు టౌన్: భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుభాష్ సాకేత్(27) బతుకుదెరువు కోసం పటాన్‌చెరుకు వచ్చాడు. మండల పరిధిలోని పెద్ద కంజర్ల గ్రామంలో గల అరబిందో వెంచర్లో మేస్త్రీ వద్ద కూలీగా పని చేస్తూ అక్కడే షెడ్లో ఉంటున్నాడు. గురువారం రాత్రి ఫోన్లో భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి వెంచర్‌లోనే ఓ చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించి మృతుడి సోదరుడు విశాల్ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
పందిరి సాగు.. ఫలితాలు బాగు
చిన్నకోడూరు(సిద్దిపేట): ఆరుగాలం కష్టపడి ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని వరి సాగు చేస్తే సరైన దిగుబడి రాక, గిట్టుబాటు ధర అందడం లేదని ఆందోళన చెందుతున్న రైతులు తమ ఆలోచను మార్చుకుంటున్నారు. సంప్రదాయ పంటలకు బదులుగా ఉద్యాన పంటల వైపు మళ్లుతున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ తమకున్న కొద్దిపాటి సాగు భూమిలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉత్పత్తులు, ఉద్యాన పంటల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటే సాగును లాభాల బాటలో నడిపించొచ్చని నిరూపిస్తున్నారు. చిన్నకోడూరు మండలంలో సుమారు 90 ఎకరాల్లో పందిరి సాగు ద్వారా కూరగాయలు పండిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.పందిరి సాగుతో మేలురైతులు వారి భూముల్లో పందిరి వేసి, ఉద్యాన పంటను సాగు చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. ఎకరా భూమిలో పందిరి సాగు అమలు చేసే రైతులు ఉద్యానశాఖ ద్వారా రూ. లక్ష సాయం అందిస్తుండగా, ఇందులో రూ. 50 వేలు సబ్సిడీ వస్తుంది. మిగితా సగాన్ని రైతులు భరించాల్సి వస్తుంది. అధికారులే పందిరి సిద్ధం చేసి ఇస్తారు. సుమారు నాలుగేళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీగజాతి కూరగాయలు పండించుకోవచ్చు. కాకర, బీర, దొండ, సోరకాయ పండిస్తూ ఆదాయం పొందవచ్చు. పందిరి కింది బాగంలో ఖాళీగా ఉన్న స్థలంలో టమాట, వంకాయ, బెండ వంటి అంతర పంటలు సాగు చేయవచ్చు.దిగుబడి బాగుందిపందిరి సాగు విధానంతో దిగుబడులు బాగున్నాయి. ఈ విధానం ద్వారా కలుపు తక్కువగా ఉండి కూలీల అవసరం ఉండదు. కూరగాయలు కుళ్లిపోకుండా ఉంటాయి. చీడ పీడలు ఎక్కువగా ఆశించవు. పంటలు సాఫీగా వస్తాయి. మార్కెట్ల మంచి ధర పలుకుతుంది. (దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!)–నాగర్తి తిరుపతిరెడ్డి, రైతు మాచాపూర్ఇదీ చదవండి: మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం -
మెదక్ జిల్లాలో దారుణం.. ప్రియురాలు దూరం పెట్టిందన్న కక్షతో..
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. పోలీసుల విచారణలో హత్య ఘటన బయటపడింది. తనను దూరం పెట్టిందని ప్రియురాలిని ప్రియుడు హత్య చేశాడు. హత్య తర్వాత ప్రెటోలు పోసి తగలబెట్టాడు. ఈ నెల 6 నుంచి రేణుక కనిపించకూడా పోయింది. తల్లి కనిపించకపోవడంతో మెదక్ టౌన్ పీఎస్‌లో కొడుకు శ్రీనాథ్ ఫిర్యాదు చేశాడు.విచారణ చేపట్టిన పోలీసులు. మహిళ కాల్ డేటాలో ప్రియుడి నెంబర్ గుర్తించారు. దీంతో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త చనిపోవడంతో రేణుక.. తన ఇద్దరు పిల్లలతో కలిసి మెదక్ ఫతేనగర్ ఉంటుంది. ఇంటిపక్కనే ఉంటున్న వ్యక్తితో రేణుకకు వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం ఇంట్లో తెలిసి కుమారులు మందలించడంతో ఆ మహిళ ప్రియుడిని దూరంగా పెట్టింది. రేణుక దూరం పట్టిందనే కక్షతో ప్రియుడు హత్యకు ప్లాన్ చేశాడు. హత్య చేసిన తర్వాత ప్రెటోలు పోసి తగలబెట్టాడు. -
వాహనం ఢీకొని చిరుత మృతి
చిన్నశంకరంపేట(మెదక్): గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుత పులి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ అటవీ ప్రాంతంలో జరిగింది. గురువారం రాత్రి నార్సింగి–వల్లూర్ మధ్యన నర్సరీ సమీపంలో రహదారిపై తీవ్రగాయాలతో పడి ఉన్న చిరుతను వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వైద్యం కోసం చిరుతను తరలించేందుకుప్రయత్నిస్తున్నా క్రమంలో మృత్యువాత పడింది. మెదక్ జిల్లా అటవీ శాఖ అధికారి జోజీ, రామాయంపేట రేంజీ ఆఫీసర్ అక్కడికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ముందు ఒక వాహనం ఢీకొన్న అనంతరం చిరుత పరుగెత్తేందుకు ప్రయతి్నంచిన క్రమంలో మరో వాహనం ఢీకొని ఉండవచ్చని, నడుముకు, పొట్ట భాగంలో తీవ్ర గాయాలు కావడంతో అది మృతి చెందిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని నడిరోడ్డుపై చిరుత మృతిమెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు శివారులో NH-44పై రోడ్డు దాటుతున్న చిరుతను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనంనడుము విరిగి పలు చోట్ల గాయాలు కావడంతో నడిరోడ్డు పైనే చిరుత మృతి pic.twitter.com/KpHzjenKCw— Telugu Scribe (@TeluguScribe) January 31, 2025 -
మెదక్ జిల్లా వడియారంలో మంత్రి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం
-
మెదక్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగ
-
అమ్మా.. నీకు భారమయ్యా.. క్షమించు!
శివ్వంపేట(నర్సాపూర్): జులాయిగా తిరుగుతున్న కుమారుడిని తల్లి మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండల పరిధి దంతన్‌పల్లి గ్రామానికి చెందిన కుల్ల లక్ష్మీ నర్సింలు దంపతులకు సంతానం కలగకపోవడంతో ఓ బాబుని దత్తత తీసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత దంపతులకు కూతురు పుట్టింది. పిల్లలు చిన్నతనంలోనే నర్సింలు మృతి చెందాడు. అప్పటి నుంచి లక్ష్మీ కూలి పనులు చేసుకుంటూ దత్తత కుమారుడు వెంకటేశ్(24)తోపాటు కూతురు అఖిలను పోషిస్తుంది. కుమారుడు ఎలాంటి పనులు చేయకుండా జులాయిగా తిరుగుతుండటంతో తల్లి గురువారం మందలించింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అతడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. శుక్రవారం ఉదయం గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. అమ్మ నన్ను క్షమించు నీకు భారమయ్యాను. నా చావుకు కారణం ఎవరు కాదు. నీవు, చెల్లి ఆనందంగా ఉండండి అంటూ రాసిన సూసైట్ నోట్ మృతుడి జేబులో లభ్యమైంది. మృతుడు తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.ఉరేసుకొని వ్యక్తి..సిద్దిపేటరూరల్: చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణరావుపేట మండల పరిధిలోని జక్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నకోడూరు ఎస్ఐ బాలక్రిష్ణ కథనం మేరకు.. జక్కాపూర్ గ్రామానికి చెందిన కారంకంటి రాజు (32) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాజుకు నాలుగేళ్లుగా మానసిక స్థితి సక్రమంగా లేదు. ఆస్పత్రుల్లో వైద్యం చేయించినప్పటికీ ఫలితం లేదు. శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్తున్నానని వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
యువతిపై ప్రేమోన్మాది దాడి.. కత్తితో చేయి కోసి పరార్
సాక్షి,మెదక్‌జిల్లా: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద దారుణం జరిగింది. సోమవారం(నవంబర్ 4) ఉదయం దివ్యవాణి అనే యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. కత్తితో చేయి కోసి పరారయ్యాడు. ఓపెన్ డిగ్రీ పరీక్షలకు కాలేజీకి వస్తుండగా ఘటన జరిగింది.యువతిపై దాడి చేసింది బెంగుళూరుకు చెందిన చేతన్ అనే యువకుడిగా గుర్తించారు. ప్రస్తుతం యువకుడు పరారీలో ఉన్నాడు.యువతిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య -
బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్.. ఒకే ఇంట్లో నలుగురు మృతి
సాక్షి, మనోహరాబాద్: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు మృత్యువాతపడ్డారు.వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాలో శనివారం సాయంత్రం రోడ్డు ఘోర ప్రమాదం జరిగింది. మనోహరాబాద్ మండలం పోతారం వద్ద రోడ్డుపై స్థానిక రైతులు ధాన్యం ఆరబోశారు. ధాన్యం కుప్పలు ఉండడంతో రోడ్డుకు ఒకవైపు నుంచే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్.. ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఆంజనేయులు, ఆయన మరదలు లత, ఆమె ఇద్దరు పిల్లలు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో, వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు చదివిస్తా.. పేద విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి అండ
కౌడిపల్లి(నర్సాపూర్): చదువుల తల్లి సుమలతకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అండగా నిలిచారు. ఆమె ఎంబీబీఎస్ చదువు పూర్తయ్యే వరకు ఫీజు చెల్లించి.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్పూర్ భద్యతండాకు చెందిన కాట్రోత్ శివరాం, గంసీల కూతురు కాట్రోత్ సుమలతకు ఎంబీబీఎస్ సీటు వచ్చినా.. ఆర్థిక ఇబ్బందులతో కూలి పనులకు వెళ్తోందని బుధవారం సాక్షి దినపత్రికలో ‘ఎంబీబీఎస్ సీటొచ్చినా కూలీ పనులకు’ శీర్షికతో కథనం ప్రచురించింది. ఈ కథనానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. సుమలత, ఆమె తండ్రి శివరాంను హైదరాబాద్‌లోని తన ఇంటికి పిలిపించుకుని మంత్రి మాట్లాడారు. సుమలత చదువుకు ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా వైద్య కళాశాలకు రూ.1.5 లక్షలు చెల్లించారు. ఇతర ఖర్చులకు రూ.50 వేలు అందజేశారు. సుమలత ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాగా చదివి వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రికి సుమలత తండ్రి శివరాం కృతజ్ఞతలు తెలిపారు. సాయం చేస్తే డాక్టర్ అవుతా..బీహెచ్ఎంఎస్ సీటు సాధించిన పేద విద్యార్థి సంతోష్‌కుమార్ ఫీజు కట్టలేని స్థితిలో దాతల చేయూత కోసం ఎదురుచూపు అనంతగిరి: డాక్టర్ కావాలనుకుంటున్న ఆ విద్యార్థి కలకు పేదరికం అడ్డుపడుతోంది. మనసున్న దాతలు ఎవరైనా ఆర్థికంగా చేయూతనందిస్తే.. భవిష్యత్‌లో సమాజ సేవకు పాటుపడతానని చెబుతున్నాడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్ద చెల్మెడ గ్రామానికి చెందిన సంతోష్.. వికారాబాద్ పట్టణం శివారెడ్డిపేట మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ చదివి, 959 మార్కులు సాధించాడు. నీట్‌లోనూ ఉత్తమ ర్యాంకు రావడంతో హైదరాబాద్‌లోని రామంతాపూర్ జేఎస్పీఎస్ హోమియో మెడికల్ కాలేజీలో బీహెచ్ఎంఎస్ (బ్యాచ్‌లర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసన్ అండ్ సర్జరీ) సీటు వచ్చింది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఫీజు, వసతి కోసం నవంబర్ 2న లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉందని తెలిపాడు. అనారోగ్యం బారిన పడిన తండ్రి అశోక్ 11 నెలల క్రితం మృతిచెందగా.. తల్లి పుష్పమ్మ కూలి పనులు చేస్తోంది. తండ్రి మరణంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ఫీజు కట్టే స్తోమత లేదని సంతోష్ వాపోతున్నాడు. ఆర్థిక సాయం చేయాలనుకునే దాతలు సెల్ నంబర్ 9963870085లో సంప్రదించాలని కోరాడు.చదవండి: ఏడు ఉద్యోగాలు సాధించిన రైతు కుమారుడుగోండు కళాకారుడికి అవార్డు జైనూర్ (ఆసిఫాబాద్): ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను తెలిపేలా దండారీ ఉత్సవాల చిత్రాన్ని గీసిన ఆదివాసీ కళాకారుడు మడావి ఆనంద్‌రావు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా బుధవారం అవార్డు అందుకున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం రాసిమెట్ట గ్రామానికి చెందిన మడావి ఆనంద్‌రావు చిత్రకళలో రాణిస్తున్నాడు. ఈ క్రమంలో 13 రోజులుగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సంప్రదాయ చిత్రకళా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో ఆనంద్‌రావు గుస్సాడీ నృత్యాలకు సంబంధించిన చిత్రం గీసి అవార్డు అందుకున్నారు. -
ఎంబీబీఎస్ సీటొచ్చినా కూలి పనులకు.. ఏం చేయాలో తెలియక
కౌడిపల్లి(నర్సాపూర్): కూలి పనులు చేస్తేనే కూడు దొరకని కుటుంబం.. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. అయితేనేం ముత్యాల్లాంటి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు చదువులో మేటిగా ఉన్నారు. ఇప్పుడా దంపతుల రెండో కుమార్తెకు ఎంబీబీఎస్ సీటొచ్చినా.. డబ్బుల్లేక కూలి పనులకు వెళ్తోంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్పూర్ భద్యతండాకు చెందిన కాట్రోత్ శివరాం, గంసీలకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్న ఎకరం భూమి సాగు చేస్తూ, వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.పెద్ద కొడుకు విజయ్‌కుమార్ కాకినాడలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం.. పెద్దకూతురు అనిత సిరిసిల్ల ప్రభుత్వ కళాశాలలో నర్సింగ్ చదువుతున్నారు. చిన్న కొడుకు రాహుల్ ఖమ్మం ఎస్టీ గురుకుల కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండో కూతురు కాట్రోత్ సుమలత సిద్దిపేటలోని సురభి ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. కానీ ప్రైవేట్ కళాశాల కావడంతో ఏటా సుమారు రూ 3 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో ఉన్న పొలం తాకట్టుపెట్టి రూ.లక్షన్నర చెల్లించింది. ఇంకా హాస్టల్ ఇతరత్రా ఖర్చులకు రూ.లక్షన్నర అవసరం కావడంతో ఏం చేయాలో తెలియక సుమలత ఆవేదన చెందుతోంది. పెద్ద మనుసున్న దాతలు 77801 06423 ఫోన్ నంబర్‌కు తోచిన సాయం చేయాలని కోరుతోంది.మెడికల్ సీటు సాధించిన పేద విద్యార్థినికి పొన్నం భరోసా హుస్నాబాద్ రూరల్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్ తండాకు చెందిన పేద విద్యార్థిని లావుడ్య దేవి ఓ ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించినా ఆర్థిక స్థోమత లేక కూలి పనులకు వెళ్తోంది. దీనిపై ‘సాక్షి’ సోమవారం సంచికలో ‘డాక్టర్ చదువుకు డబ్బుల్లేక కూలి పనులకు..’ శీర్షికన కథనం ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గిరిజన విద్యార్థి కుటుంబం గురించి స్థానిక నాయకులతో అరా తీశారు. మంగళవారం హుస్నాబాద్‌కు వచ్చిన మంత్రి.. గిరిజన విద్యార్థిని అభినందించారు. ఆమె కాలేజీ ఫీజుకు ఆర్థిక సాయంతో చేయడంతోపాటు హాస్టల్ ఫీజు చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాదికి కూడా కాలేజీ ఫీజుకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. జెన్కో ఇంజనీర్లకు పోస్టింగ్‌లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)లో భారీ సంఖ్యలో ఈ నెల 9న అడ్హాక్ (తాత్కాలిక) పదోన్నతులు పొందిన ఇంజనీర్లకు ఎట్టకేలకు కొత్త పోస్టింగ్స్ కేటాయిస్తూ సోమవారం సంస్థ సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్, మెకానికల్, టెలీకమ్యూనికేషన్ విభాగాల్లోని 203 మంది ఏడీఈలు, ఎలక్ట్రికల్ విభాగంలో 34 మంది డీఈలు, ఏడుగురు ఎస్ఈలు, ఇద్దరు సీఈలతో పాటు మెకానికల్ విభాగంలో 12 మంది డీఈలు, ఎస్ఈలు.. సివిల్ విభాగంలో ఐదుగురు ఏఈఈలుగా, ఇద్దరు ఈఈలకు కొత్త పోస్టింగ్స్ ఇచ్చారు. చదవండి: దీపావళి పండుగవేళ.. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు శుభవార్త -
తలిచె తలిచె.. పాట రాసింది మనోడే
నర్సాపూర్: ‘ఏందిరా ఈ పంచాయితి’ సినిమాలో హిట్ కొట్టిన ‘తలిచె తలిచె కొద్దీ గుర్తొస్తున్నా–కురిసే కురిసే వెన్నెల నువ్వె నాన్న’ పాట రాసిన యువకవి మెదక్ జిల్లా నర్సాపూర్ వాసి. నర్సాపూర్‌కు చెందిన రమావత్ శ్రీకృష్ణ పేదరికంలో పెరిగి ప్రైవేటు దుకాణాల్లో పని చేస్తూ డిగ్రీ పట్టా పుచ్చుకొని కంప్యూటర్ కోర్సులు చదివినా అనంతరం కుటుంబ పోషణ చేపడుతూనే తనలో ఉన్న పాటలు, కథలు రాయాలన్న కవిత్వానికి జీవం పోశాడు.. ఇంకా పోస్తూనే ఉన్నాడు. స్వతహాగా పాటలు రాయాలన్న తపన..పాటలు, కథలు రాయాలన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి వెళ్లిన శ్రీకృష్ణ ఇప్పటి వరకు తెలుగులో 20 పాటలు, హిందీలో 10 పాటల వరకు రాశాడు. సుమారు రెండేళ్ల కిందట ‘సినిమా సోకులు’ పేరిట ఓ పాటతో ప్రైవేటు ఆల్బం తయారు చేశాడు. ఈ ఆల్బంలో శ్రీకృష్ణ రాసిన అరరే మామ పట్నం పోదామా పాటను సింగర్ పెద్దపల్లి రోహిత్ పాడారు. నర్సాపూర్ రత్నాలు, మిర్జాపూర్ ఫాంహౌజ్ తదితర పలు షార్ట్ ఫిలిమ్స్ చేసినా ఆర్థిక ఇబ్బందులతో వాటిని ప్రమోట్ చేయలేకపోతున్నాడు. కంప్యూటర్ కోర్సులు చదివే సమయంలో ఎడిటింగ్, డీఓపీ సైతం నేర్చుకోవడంతో పలు సోషల్ మీడియాకు వీడియోలు తయారు చేయడం, ఇతరత్రా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇండస్ట్రీలో అతన్ని శ్రీకృష్ణ గ్రిల్లర్గా పిలుస్తారు. కుటుంబ నేపథ్యంనర్సాపూర్ మండలంలోని తుల్జారాంపేట తండాకు చెందిన రమావత్ మంగు, జీరిభాయి దంపతులు సుమారు 40 ఏళ్ల కిందట నర్సాపూర్‌కు వచ్చి పట్టణంలోని జగన్నాథరావు కాలనీలో స్థిర పడ్డారు. వారి సంతానం రమావత్ శ్రీకృష్ణ. శ్రీకృష్ణకు 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. దీంతో కుటుంబం గడవడక పదవ తరగతి ఫెయిల్ కాగానే పట్టణంలోని పలు దుకాణాల్లో పని చేస్తూ కుటుంబపోషణలో తల్లికి అండగా నిలిచాడు. ఓపెన్ యూనివర్శిటీలో చేరి డిగ్రీ పూర్తి చేయడంతోపాటు కంప్యూటర్ కోర్సులు పూర్తి చేశాడు. తల్లి జీరిభాయి, భార్య మనస్విని, ఇద్దరు కూతుర్లు హయాతి, హైందవిశ్రీలతో కలిసి నర్సాపూర్‌లో నివాస ముంటున్నాడు. -
మెదక్: వాగులోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి
సాక్షి, మెదక్: శివంపేట పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉసిరికపల్లి-వెల్దుర్తి రహదారిలో కారు అతివేగంగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. మృతులు పాము బండ తండాకు చెందిన వారికిగా గుర్తించారు.ఈ ఘటనలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మహిళ సజీవ దహనం.. మంత్రాల నెపంతో గ్రామస్తుల దాడి
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో దారుణం జరిగింది. మంత్రాలు చేస్తుందనే నెపంతో డేగల ముత్తవ్వ అనే మహిళపై ఆ ఊరి గ్రామస్తులు దాడి చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. గ్రామస్తులు దాడితో ఆమె కొడుకు,కోడలు పారిపోయారు.అయితే తీవ్రగాయాల పాలైన ముత్తవ్వను ఆమె బంధువులు వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని రామాయంపేట ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ముగ్గురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయకపోతే, డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తాం: హరీష్ రావు
సాక్షి, మెదక్ : తన ఇంటిపై దాడి జరిగిందని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. 30 ఏళ్లుగా తమ గ్రామంలో మెలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవని తెలిపారు. గొడవ జరుగుతుందని తెలిసి ముందే పోలీసులకు చెప్పిన పట్టించుకోలేదని విమర్శించారు. గ్రామంలోని కొంతమందికి మద్యం తాగించి దాడులకు ఉసిగొల్పారని ఆరోపించారు. ఇంటి గేట్లు తన్నుకుంటూ వచ్చి తమ అనుచరులపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని తెలిపారు. ఇంటి లోపలికి టపాసులు వేసి రాళ్లు, కర్రలతో ఇంట్లో ఉన్నవారిపై దాడికి దిగారని పేర్కొన్నారు.దాడి చేసిన వారితో పాటు ఘటనను ప్రోత్సహించిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తానును ఎమ్మెల్యేగా గెలవడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకే దాడులకు దిగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడితే తాము రెచ్చిపోమని.. తమ సహనాన్ని పరీక్షించొద్దని సూచించారు. పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కోరారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ నుంచి నర్సాపూర్‌కు వెళ్లారు. గోమారంలోని ఎమ్మెల్యే నివాసంలో హరీష్ రావు మాట్లాడుతూ.. ‘సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు గూండా రాజ్యం నడుస్తుంది. ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు, హైదరాబాదులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి కావచ్చు, నిన్న సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు, రాష్ట్రంలో గుండు రాజ్యాన్ని తలపించే విధంగా పరిపాలన సాగుతుంది.తెలంగాణకున్న మంచి పేరును మంటగలిపి ఈరోజు బిహార్‌లాగా తెలంగాణను మారుస్తున్నారు. నిన్న సునీత లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి కాంగ్రెస్ నాయకత్వం ప్రోత్సాహంతో జరిగిన దాడి. రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలను ప్రతిపక్షాల మీద దాడి చేసే విధంగా ప్రోత్సహించినట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే నివాసంలో లేనప్పుడు ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలని, ఎమ్మెల్యే ఇంటి ముందు పటాకాయలు కాల్చడం, ఇంట్లోకి పటాకాయలు విసరడం ఇంట్లో ఉన్న వారిపై దాడి చేయడం హేయమైనది.ఇప్పుడే ఎస్పీ, ఐజీతో మాట్లాడాను వెంటనే కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాం. కాంగ్రెస్ నాయకులు దాడి చేశారన్న విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాకుండా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. హెడ్ కానిస్టేబుల్ చేతులోని ఫోన్ లాక్కోని నెట్టేస్తే ఆయన కింద పడిపోయాడు. పోలీసులపై దాడి జరిగినా కేసు తీసుకోవడం లేదు.కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. దేశంలో తెలంగాణ పోలీసులు అంటే మంచి పేరు ఉండేది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పోలీసులను చెడగొడుతున్నారు. పోలీసు అధికారులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఏనాడైనా ఎమ్మెల్యేల ఇంటిపైన దాడి జరిగిందా?ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ గుండాల రాజ్యంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు దాడి చేసిన వారిని అరెస్ట్ చేయరు.వెంటనే గోమారంలో దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలి . దాడిని ప్రోత్సహించిన వారిపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కూడా వెళ్తాం. దాడి చేసిన వారికి శిక్ష పడేదాకా వదిలిపెట్టం. ఇది ప్రజా పాలన కాదు గూండాల పాలన. మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటది. పోలీసులు ఇలాంటి దాడులను కట్టడి చేయడంలో విఫలమైతే రాయలసీమ లాంటి ఫ్యాక్షన్ పరిస్థితులు తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రాంతంతో తెలంగాణ ప్రజలతో మాది పేగు బంధం ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా మేము చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం, పోలీసులు కూడా వ్యవహరిస్తే మంచిది.ఇంట్లో చొరబడి దాడి చేసిన వారిని అరెస్టు చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉందని నిరూపించుకోవాలి. డీజీపీ ఉన్నతమైన పదవిలో ఉన్నారు మీరు ఆ పదవికి గౌరవం తెచ్చే విధంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లిన వారిని ఉపేక్షించవద్దు అని సూచిస్తున్నాను. రాష్ట్ర డిజిపి వెంటనే ఈ ఘటన పై స్పందించి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ అరెస్టు చేయనట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం’ అని పేర్కొన్నారు.సునీతా లక్ష్మారెడ్డితో అటు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా మాట్లాడారు. ఘటన వివరాలు, ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలపై పోలీసులు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలతో సునీతా లక్ష్మారెడ్డి లాంటి బలమైన నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు.కాగా మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇటుకలు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఆదివారం అర్ధరాత్రి హంగామా చేశారు. వినాయక నిమజ్జనం అడ్డుపెట్టుకుని గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటి గేటు ముందు పటాకులు కాల్చారు. ఇంటి లోపలికి వచ్చి ఇద్దరిపై దాడి చేశారు.అంతటితో ఆగకుండా ఇంటిపైకి ఇటుకలు విసిరారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకొని కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. రాత్రిపూట దాడులు చేయడం కాంగ్రెస్ నాయకుల పిరికిపంద చర్య బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. దాడికి నిరసనగా ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. -
సోషల్ మీడియాలో వేధింపులు.. తేజస్వినీ ఆత్మహత్య
సాక్షి, సంగారెడ్డి: ప్రేమ పేరుతో వేధింపుల కారణంగా బీఫార్మసీ విద్యార్థిని తేజస్వినీ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక, విద్యార్ధిని ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గుమ్మదిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన తేజస్వినీ బీఫార్మసీ చదువుతోంది. ఈ క్రమంలో ఓ యువకుడు ఇన్స్‌స్టాగ్రామ్ వేదికలో ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేశాడు. దీంతో.. అతడి వేధింపులు భరించలేక తేజస్వినీ ఆత్మహత్య చేసుకుంది. తన ఇంటివద్ద నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.ఈ క్రమంలో.. తల్లిదండ్రులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో, ఆసుపత్రికి చేరుకునేలోపే తేజస్వినీ మృతి చెందింది. అయితే, తనను ప్రేమించాలంటూ అదే గ్రామానికి చెందిన యువకుడు అతని స్నేహితులతో కలిసి తరచూ ఆమెను వేధింపులకు గురిచేసినట్టు తేజస్వినీ పేరెంట్స్ చెప్పారు. దీంతో, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
బడ్జెట్లో ఏపీకి నిధులు.. కేంద్రమంత్రి అథవాలే కీలక వ్యాఖ్యలు
సాక్షి,మెదక్: దేశంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. శనివారం(జులై 27) మెదక్‌లో పర్యటించిన అథవాలే మీడియాతో మాట్లాడారు.‘ఎన్డీఏ ప్రభుత్వానికి దేశమంతా సమానమే. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు కూడా బడ్జెట్లో నిధులు ఇచ్చాం. ఏపీకి రాజధాని లేకపోవడం వల్లే ఎక్కువ నిధులు కేటాయించాం. సౌత్ ఇండియాలో ఎన్డీఏ మెజార్టీ స్థానాలు సాధించింది. తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నాం అని అథవాలే తెలిపారు. -
కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, గాలి అనిల్
సాక్షి, పటాన్చెరు: తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇక, తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కూడా వలసలు మొదలయ్యాయి.తాజాగా బీఆర్ఎస్ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గత పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో వీరు హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్.ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రజా ప్రతినిధులు, ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కండువా కప్పుకున్నాను. ఇన్ని రోజులు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. పటాన్చెరు ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి నన్ను గెలిపించారు. కచ్చితంగా వారి నిర్ణయాన్ని గౌరవించాలి కాబట్టి పార్టీ కండువా కప్పుకున్నాను. గత పది ఏళ్లు నాకు సహకరించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు, ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలాఉండగా.. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. గూడెం మహిపాల్ రెడ్డితో ఈ సంఖ్య పదికి చేరుకుంది. ఇక, రానున్న రోజుల్లో మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
మెదక్ జిల్లాలో చిరుత సంచారం
-
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
ఒకసారి నాటితే 80 ఏళ్ల వరకు దిగుబడి..
-
మెదక్ బంద్ ప్రశాంతం
సాక్షి, హైదరాబాద్/ మెదక్‌జోన్/శంషాబాద్: మెదక్ పట్టణ బంద్ ప్రశాంతంగా జరిగింది. బీజేపీ నేతల ఆదివారం బంద్‌కు పిలుపునివ్వగా, వర్తక, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఇరువర్గాల ఘర్షణల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. శనివారం అర్ధరాత్రి దాటాక బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, బీజేవైఎం నేత సతీ‹Ùతోపాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం వారిని జడ్జి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించగా మెదక్ సబ్ జైలుకు తరలించారు. ఎవరినీ ఉపేక్షించం: ఐజీ రంగనాథ్ గొడవకు బాధ్యులైన ఎవరినీ ఉపేక్షించమని, ఇందుకు కారణమైన 45 మందిపై కేసులు నమోదు చేశామని మల్టీజోన్ ఐజీ రంగనాథ్ తెలిపారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, దాని అనుబంధ సంస్థలకు చెందిన 23 మందితోపాటు 22 మంది ముస్లింలపై కేసులు నమోదు చేశామన్నారు. పోలీసులు ఒక్కవర్గం వారిని మాత్రమే రిమాండ్ చేశారని, మరోవర్గం వారిని చేయలేదంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మొద్దని, ఘటనకు బాధ్యులైన ముస్లింలను కూడా రిమాండ్ చేస్తామన్నారు. » మెదక్‌లో రెండువర్గాల మధ్య జరిగిన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. » మెదక్ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కేసీఆర్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో ఎలాంటి మత కల్లోలాలకు తావు లేకుండా పూర్తి ప్రశాంతంగా ఉండేదని గుర్తు చేశారు. » గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మెదక్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ముంబయి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అల్లర్లలో గాయపడిన వారిని మియాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం రాజాసింగ్ తన నివాసానికి వెళ్లేంత వరకు ఆర్జీఐఏ పోలీసులు ఆయన వెంటే ఉన్నారు. -
మెదక్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఘన విజయం
మెదక్: మెదక్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పరిపాటి వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు బరిలోకి దిగిన ఓటమిపాలయ్యారు. -
ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
పాపన్నపేట (మెదక్): ధాన్యం రవాణా చేయాలని కోరుతూ వారం రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నా అధికారుల నుంచి స్పందన కరువైంది. వారి ఆందోళనను పట్టించుకోక పోగా ఓ తహసీల్దార్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. మెదక్ జిల్లా పాపన్న పేట సమీపంలో మిన్పూర్లో శుక్రవారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో వారం రోజులుగా రవాణా జరగక వందలాది క్వింటాళ్ల ధాన్యం కల్లాల్లో పేరుకు పోయింది. అయితే గురువారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి మొలకలెత్తాయి. దీంతో ధాన్యం రవాణా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు.సమాచారం అందుకున్న పోలీసులు పాపన్నపేట తహసీల్దార్ లక్ష్మణ్‌బాబుకు రైతుల ఆందోళన గురించి వివరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ‘ఎప్పు డంటే అప్పుడు వచ్చేయడానికి మాకు మాత్రం భార్యా పిల్లలు లేరా’అంటూ నిర్లక్ష్యంగా సమాధాన మివ్వడంతో ఆగ్రహించిన రైతులు బొడ్మట్‌పల్లి రోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్సై సురేశ్ అక్కడకు చేరుకుని రైతులకు నచ్చ జెప్పినప్పటికీ ఆందోళన విరమించలేదు. పోలీ సులు ఫోన్ చేసి తహసీ ల్దార్‌ను ఘటనా స్థలానికి పిలిపించారు. రైతులతో తహసీ ల్దార్ కొద్దిసేపు మాట్లాడి వారికి క్షమాపణ చెప్పారు. అదేవిధంగా గంటలో ధాన్యం రవాణా ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
ఆ నాలుగు ఎంపీ స్థానాల్లో విజయంపై బీఆర్ఎస్ ధీమా..
పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది? ఏయే అంశాలు ఆ పార్టీకి కలిసొస్తాయని భావిస్తున్నారు? అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి మారిన తర్వాత బీఆర్ఎస్ బలం పెరిగిందా? మరింత తగ్గిందా? అసలు గులాబీ శ్రేణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం..అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై మాత్రం చాలా ఆశలే పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులను లోక్ సభకు చేయకుండా చర్యలు తీసుకుంది. పోటీ చేసే అభ్యర్థులను దాదాపు మెజార్టీ స్థానాల్లో మార్చింది. ముఖ్యంగా నాగర్ కర్నూల్, పెద్దపల్లి, మెదక్, సికింద్రాబాద్ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తోంది. అసలెందుకు ఈ స్థానాల్లో ఆ పార్టీ ఆశలు పెట్టుకుందంటే అందుకు రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయంటోంది ఆపార్టీ. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో కాస్ట్ ఈక్వేషన్ ఎక్కువగా పనిచేస్తుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆర్ ఎస్ ప్రవీణ్ మాజీ పోలీస్ అధికారి స్థానికంగా బలం ఉంది. అదీకాక నియోజకవర్గంపై పట్టుకుంది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసే వ్యక్తి మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ గెలిచే అవకాశం ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. సికింద్రాబాద్ విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఉద్యమ నాయకుడు మాత్రమే కాదు స్థానికంగా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి పద్మారావు గౌడ్. అంతే కాకుండా బీజేపీఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం, అభివృద్ది సరిగా చేయలేదన్న విమర్శలు బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలని ఆపార్టీ అంచనా వేస్తోంది.పెద్దపల్లి లో కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని గులాబీ పార్టీ అంచనాలు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుండి పోటీ చేసి ఓడిన కొప్పుల ఈశ్వర్ కచ్చితంగా ఇక్కడ గెలుస్తారని భావిస్తోంది. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వడం పై కొంత జనంలో వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అందుకే పెద్దపల్లిలో పార్టీ గెలుస్తుందని ఆశలు పెట్టుకుంది. మెదక్పాలో ర్టీ సంస్థాగతంగా బలంగా ఉండటం తో పాటు, ఇక్కడ కొన్ని సిట్టింగ్ స్థానాలు ఉండటం పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిద్దిపేట గజ్వేల్ లో భారీగా ఓట్లు పడి మెజారిటీ ఎక్కువ వస్తుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇవి కాకుండా మరికొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చి అవకాశం కూడా ఉందని అంచనా వేస్తోంది. గెలవక పోయిన వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మల్కాజ్ గిరిలో రెండో స్థానంలో ఉండే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. అసెంబ్లీ ఫలితాలపై ఇలానే లెక్కలేసుకున్న బీఆర్ ఎస్ పార్టీకి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ఎన్ని స్థానాలు తెలంగాణ ప్రజలు కట్టబెడతారన్నది జూన్ 4న తేలనుంది. -
Medak: రన్నింగ్ కారులో మంటలు.. దగ్ధమైన కారు
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా జాతీయ రహదారిపై ఓ కారు అగ్నికి ఆహుతైంది. టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి వద్ద జాతీయ రహదారి 161పై వెళ్తున్న కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో నిమిషాల్లోనే కారు పూర్తిగా దగ్దమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి నారాయణ్ ఖేడ్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. #A car coming from HYD to Narayankhed burntdown at Bodmatpalli of Medak district on Sunday morning alert driver stopped car on the road side and got other from the car all are safe.@Kalyan_TNIE @balaexpressTNIE @NewIndianXpress pic.twitter.com/ffifPUnHNc— Krishna.panugannti (@Krishna_TNIEsrd) May 5, 2024 -
మోదీతో ఫైనల్స్
సాక్షి, హైదరాబాద్/ మెదక్ జోన్: ‘రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్స్ మాత్రమే. ఇప్పుడు ఫైనల్స్ ఆడుతున్నాం. సెమీస్‌లో బంగ్లాదేశ్ జట్టు లాంటి కేసీఆర్‌ను ఓడించాం. ఇప్పుడు పాకిస్తాన్ జట్టు లాంటి మోదీతో కొట్లాడాలి. బీజేపీ నేతలు అమిత్‌షా, జేపీ నడ్డా సహా ముఖ్య నేతలు తెలంగాణపై ముప్పేట దాడి చేస్తున్నారు. ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తల రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వమిది. దీన్ని మీరే కాపాడుకోవాలి.ప్రతి నిమిషం అలర్ట్‌గా ఉండాలి. 14 ఎంపీ సీట్లలో విజయమే లక్ష్యంగా పనిచేయాలి. రేవంత్ లేకపోతే చాలు.. ఎవరైనా ఫర్వాలేదు అనే పరిస్థితికి బీఆర్ఎస్ నేతలు వచ్చారు. బిడ్డ కవిత బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు..’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో, ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో జరిగిన జనజాతర సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ ‘పదేళ్ల పాలనలో మోదీ, కేసీఆర్ దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకున్నారు. దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారు.ఈ ఎన్నికలు దేశానికి అత్యంత కీలకం. రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఉద్దేశంతోనే 400 సీట్ల నినాదాన్ని బీజేపీ చేస్తోంది. రిజర్వేషన్లు రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు అమ్మేసే కుట్ర జరుగుతోంది. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు. బ్రిటిష్ జనతా పారీ్టగా మారింది. బ్రిటిష్ వాళ్ల మాదిరిగానే మోదీ దేశాన్ని దోచుకొనేందుకు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారు. ఏళ్ల తరబడి కులగణన జరగడం లేదు. దీంతో బీసీలకు జనాభా లెక్కల ప్రకారం దక్కాల్సిన లబ్ధి దక్కడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కులగణన జరిగితేనే రిజర్వేషన్ కల్పించడం సాధ్యమవుతుంది..’ అని రేవంత్ అన్నారు. జహీరాబాద్ స్థానం బీజేపీకి తాకట్టు ‘లోక్‌సభ ఎన్నికల్లో 12 సీట్లలో గెలిపిస్తే ఏడాదిలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ అంటున్నారు. అదెలా సాధ్యం? ఇక్కడ అల్లాటప్పాగా కూర్చున్నామా? తండ్రి పేరు చెప్పుకొని కురీ్చలోకి వచ్చామా? బిడ్డ కవిత బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. తన బిడ్డ కోసం జహీరాబాద్ స్థానాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు. జహీరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ను గెలిపించే కుతంత్రంలో మెదక్‌లో గాలి అనిల్‌కుమార్‌కు టికెట్ ఇవ్వాల్సి ఉండగా జహీరాబాద్‌లో ఇచ్చి గాలికి వదిలేశారు.తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు 60 ఏళ్లుగా అనేక పోరాటాలు జరిగాయి. చివరకు సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. కానీ రాష్ట్రంలో ఎవరికీ ఉద్యోగాలు రాకపోగా కేసీఆర్ కుటుంబానికి.. కొడుకు, కూతురు, అల్లుడుతో పాటు ఆయన బంధువులందరికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రి పదవులు దక్కాయి. పదేళ్లుగా గడీల్లో తెలంగాణ తల్లిని బందీ చేశారు. గడీలను బద్ధలు కొట్టి తెలంగాణ తల్లికి విముక్తి కల్పించాం..’ అని సీఎం చెప్పారు. వైఎస్సార్ హయాంలో సంక్షేమ పథకాలు ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ హయాంలో పేదలకు సంక్షేమ పథకాలు అందాయి. అప్పట్లో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టడం జరిగింది. రూ.400కే వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. పేదలకందరికీ ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారు. కానీ కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పి ఎవరికీ కట్టించిన పాపాన పోలేదు..’ అని రేవంత్ విమర్శించారు. ‘సోనియాగాంధీ అభీష్టం మేరకు ప్రవేశ పెట్టిన 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఇప్పటికే ఐదు గ్యారెంటీలు అమలు చేశాం..’ అని తెలిపారు. ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు శని వదిలిపోతుంది ‘హరీశ్‌రావు మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. మోసం చేయాలనుకున్న ప్రతిసారీ ఆయనకు స్తూపం గుర్తొస్తుంది. హరీశ్‌రావు సవాల్‌ను స్వీకరించా. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని చెప్పా. ఆ తేదీ తర్వాత సిద్ధిపేటకు ఆయన శని వదిలిపోతుంది..’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘హరీశ్‌రావు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లారా? రైతు రుణమాఫీతో పాటు మిగతా అంశాలను పేర్కొంటూ తన మామ చెప్పిన సీస పద్యమంతా రాజీనామా లేఖలో రాసుకొచ్చారు.స్పీకర్ ఫార్మాట్లో లేకుంటే రాజీనామా చెల్లుతుందా? మళ్లీ చెప్తున్నా.. ఆగస్టు 15 లోపు రుణ మాఫీ చేస్తా. హరీశ్‌రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు? దానికి రూ.30 –రూ.40 వేల కోట్లు అవుతుంది. కాళేశ్వరంలో మీరు దోచుకున్న రూ.లక్ష కోట్ల కంటే అది ఎక్కువా? హైదరాబాద్ చుట్టూ ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువా?..’ అని సీఎం ఎద్దేవా చేశారు. హరీశ్.. రాజీనామా లేఖ రెడీ పెట్టుకో..హరీశ్‌రావు సవాల్‌ను స్వీకరించా. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని చెప్పా. ఆ తేదీ తర్వాత సిద్ధిపేటకు ఆయన శని వదిలిపోతుంది. రైతు రుణమాఫీతో పాటు మిగతా అంశాలను పేర్కొంటూ తన మామ చెప్పిన సీస పద్యమంతా రాజీనామా లేఖలో రాసుకొచ్చారు. స్పీకర్ ఫార్మాట్లో లేకుంటే రాజీనామా చెల్లుతుందా? మళ్లీ చెప్తున్నా.. ఆగస్టు 15 లోపు రుణ మాఫీ చేస్తా. హరీశ్‌రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. -
పైపైనే గంగ.. లేదు బెంగ
మెదక్‌జోన్: మండే ఎండలకు చాలాచోట్ల భూగర్భజలాలు అడుగంటి పోయాయి. బోర్లు మూలన పడ్డాయి. కానీ మెదక్ పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఓ రైతు పొలంలో 25 ఏళ్ల క్రితం తవి్వన ఐదు గజాల బావిలో మాత్రం నీటి ఊటలు తరగడం లేదు. మండు వేసవిలో సైతం ఆ నీటితో ఆరు ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తున్నాడు.ళీ మెదక్ జిల్లా హవేళిఘనాపూర్ మండలం శమ్నాపూర్‌కు చెందిన బద్దం వెంకట్రాంరెడ్డికి గ్రామ శివారులో 6ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పాతికేళ్ల క్రితం తన భూమిలో కేవలం 5 గజాల లోతు బావిని తవ్వించాడు. అందులో విపరీతమైన నీటిధారలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి ఆ రైతు తన పొలంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు. బావి తవి్వన స్థలంలో 2 ఎకరాలు ఉండగా.. కొంత దూరంలో 4 ఎకరాలు ఉంది. బావిలో మోటార్ బిగించి పైపులైన్ వేసి ప్రస్తుతం మూడెకరాల్లో వరి, రెండెకరాల్లో మామిడి తోట, ఎకరంలో పలు రకాల కూరగాయ పంటలు సాగు చేస్తున్నాడు. 24 గంటలు మోటార్ నడిచినా.. ఐదు గజాల బావిలో మోటార్ బిగించిన రైతు వెంకట్రాంరెడ్డి 24 గంటల పాటు మోటార్ నడిపించినా నీటి ఊటలు ఏ మాత్రం తగ్గడం లేదు. పొలం పక్కన మరికొంత మంది రైతుల పొలాలు ఉన్నాయి. వారు బావులు తవ్వినా వాటిలో కొద్దిపాటి నీరు మాత్రమే వచి్చంది. వెంకట్రాంరెడ్డి బావిలో మాత్రం 24 గంటల పాటు మోటార్ నడిచినా నీరు తగ్గడం లేదు. ఏ కాలంలోనైనా నిండుగా.. ఏకాలంలోనైనా మా బావిలో నీరు నిండుగా ఉంటుంది. కరెంట్ ఉన్నంత సేపు మోటార్ నడుస్తూనే ఉంటుంది. పంటకు నీటి తడులు అవసరం లేనప్పుడు మాత్రమే మోటార్ బంద్ చేస్తాం. – బద్దం వెంకట్రాంరెడ్డి, రైతు, శమ్నాపూర్ -
పండుగ నింపిన విషాదం
జిన్నారం(పటాన్చెరు): ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలికొన్నది. గుమ్మడిదల మండలంలోని వీరన్నగూడ గ్రామంలో సోమవారం చెరువులో మునిగి ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా ఈ ఇద్దరు యువకుల మృతదేహాలు మంగళవారం చెరువులో లభ్యమయ్యాయి. గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వరెడ్డి కథనం ప్రకారం.. సూరారంలోని నివాసం ఉంటున్న శ్రావణ్(16), శంకర్ (22)లతోపాటు మరో పది మంది స్నేహితులు హోలి పండుగను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం స్నానం చేసేందుకు వీరన్నగూడ గ్రామంలోని వీరన్న చెరువు వద్దకు వెళ్లారు. తోటి స్నేహితులు స్నానం చేసి బయటకు రాగా శ్రవన్, శంకర్లు చెరువులోకి వెళ్లి బయటకు రాలేదు. గజ ఈతగాళ్లతో వెతికించినా ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం వీరిద్దరి మృతదేహాలు చెరువులో తేలాయి. మృతుడు శ్రావణ్ పదవ తరగతి చదువుతున్నాడు. పరీక్షలు ఉన్నా, తల్లిదండ్రులు చెబుతున్నారా వినకుండా సరాదా కోసం ఈతకు వెళ్లడంతో ఆ ఇంట విషాదం నెలకొంది. మృతులు ఇద్దరూ వరుసకు అన్నాదమ్ముళ్లు అవుతారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ తెలిపారు. ఇద్రేశం చెరువులో మరో యువకుడు పటాన్చెరు టౌన్: హోలీ వేడుక స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి స్నేహితుడిని రక్షించబోయి నీటిలో మునిగిపోయి గల్లంతైన ఘటనలో మంగళవారం మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన దాదాపు పది మంది స్నేహితులు సోమవారం హోలీ సంబురాలు జరుపుకున్నారు. అనంతరం ఇంద్రేశం గ్రామ శివారు సదర్ చెరువులో స్నానానికి వెళ్లారు. చెరువులో ఉన్న పుట్టె ఎక్కిన శివ అనే స్నేహితుడిని కాపాడబోయి బండి రాజేశ్ గల్లంతు కాగా, గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం తిరిగి గజఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టగా ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి సత్యనారాయణ ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
Medak Lok Sabha: మెదక్ నుంచి కేసీఆరే!
గులాబీ దళపతి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మెదక్ ఎంపీ స్థానం నుంచి బరిలో దిగనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే శ్రేణులను కార్యోన్ముఖులను చేసేలా రంగం సిద్ధమైనట్లు సమాచారం. మరో వైపు వంటేరు ప్రతాప్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తేలిన తరువాతే బరిలో ఎవరుంటారన్నది తేలనుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్, మెదక్ లోక్‌సభ స్థానాలున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు జహీరాబాద్ స్థానానికి అభ్యర్థులను ప్రకటించాయి. కానీ మెదక్ కు వచ్చేసరికి బీజేపీ మాత్రమే అభ్యర్థిని ప్రకటించింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు మాత్రం తమ అభ్యర్థులెవరో ఇంకా ప్రకటించకపోవడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు ఎప్పుడు తెరపడనుందో వేచిచూడాల్సిందే మరి.. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : మెదక్ లోక్‌సభ అభ్యర్థిత్వం విషయంలో గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్ టికెట్‌ను ప్రకటించినప్పటికీ, మెదక్ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ టికెట్‌ను వంటేరు ప్రతాప్‌రెడ్డికి ఇవ్వాలని అధినేత కేసీఆర్ పక్షం రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థిత్వం తేలిన తర్వాత ఇక్కడి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ టికెట్‌పై ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది. కాగా ఈ టికెట్ కోసం మరో ఇద్దరు ముఖ్యనాయకులు పోటీ పడుతున్నారు. మరికొంత మంది కూడా ఆశిస్తున్నారు. ముఖ్యంగా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలువుల మదన్‌రెడ్డి రేసులో ఉన్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ టికెట్‌ను సునీతారెడ్డికి ఖరారు చేసిన సందర్భంగా ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ అధినాయకత్వం హామీ కూడా ఇచ్చింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన గాలి అనిల్‌కు కూడా ఎంపీ టికెట్ ఇస్తామనే హామీ ఇచ్చారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు జహీరాబాద్ టికెట్ ఖరారు చేశారు. మరోవైపు తమకే కేటాయించాలని సంగారెడ్డికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు బీరయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్లో చేరిన కంఠారెడ్డి తిరుపతిరెడ్డి కూడా అధినాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అధినేత కేసీఆర్ మాత్రం వంటేరు ప్రతాప్‌రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వంటేరును లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పని చేసుకోమన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా మాత్రం ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ అభ్య ర్థిత్వం ఒకటీ రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. బీజేపీ మాత్రం వారం రోజుల క్రితమే ప్రకటించింది. ఈ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు కేటాయించింది. ఆయన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. అధినేతే బరిలోకి దిగుతారనే ప్రచారం? ఈ మెదక్ లోక్‌సభ స్థానం నుంచి స్వయంగా అధినేత కేసీఆరే బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం కూడా షురూ అయింది. అందుకోసమే ఈ అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన రాలేదనే టాక్ జోరందుకుంటోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుచుకునే సీట్లలో మెదక్ సీటు ముందుంటుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో ఆరు చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానం మాత్రం కాంగ్రెస్ గెలిచింది. ఈ ఎన్నికల్లో కూడా కారు జోరందుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టికెట్ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొంది. -
కొన ఊపిరితో ఉన్నాడు.. చచ్చాకే తలుపులు తీస్తా...
పాపన్నపేట (మెదక్): వేధింపులతో విరక్తి చెంది కన్న తండ్రినే కిరాతకంగా చంపాడు ఓ కుమారుడు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని రామతీర్థం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సంగం ప్రేమానందం (42), సుగుణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు సందీప్ సిద్దిపేటలో డిగ్రీ చదువుతుండగా, కూతురు 9వ తరగతి, చిన్న కుమారుడు ప్రవీణ్ 7వ తరగతి చదువుతున్నారు. ప్రేమానందం మద్యానికి అలవాటు పడి, భార్యను అనుమానిస్తూ తరచూ కొడుతుండేవాడు. 10 రోజుల కిందట అల్లాదుర్గం పోలీస్ స్టేషన్లో పోలీసులు సైతం ప్రేమానందంకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినా వారి కుటుంబంలో సఖ్యత కుదరలేదు. బుధవారం మళ్లీ గొడవ జరగడంతో తల్లి సుగుణమ్మ, పెద్ద కుమారుడు సందీప్ కలిసి రోకలి బండతో ప్రేమానందం మోకాళ్లు విరగ్గొట్టి నడవడానికి రాకుండా చేసి తల్లిగారింటికి వెళ్లిపోయారు. అయితే శనివారం మళ్లీ సందీప్ ఇంటికొచ్చేసరికి ప్రేమానందం తన తండ్రి ప్రసాద్, పక్కింటి వారితో మాట్లాడుతున్నాడు. వెంటనే సందీప్ తాత ప్రసాద్‌ను, పక్కింటి వారిని ఇంట్లో నుంచి బయటకు పంపి తలుపులు గడియపెట్టాడు. లేవలేని స్థితిలో ఉన్న తండ్రి ప్రేమానందంను కరెంట్ హీటర్‌తో విచక్షణా రహితంగా కొట్టడం మొదలుపెట్టాడు. చుట్టు పక్కలవారు తలుపులు తీయమని బతిమిలాడినా ‘కొన ఊపిరితో ఉన్నాడు.. ప్రాణం పోయాకే తలుపులు తీస్తానంటూ’ ఆగ్రహంతో ఊగిపోయాడు. కొద్దిసేపటి తర్వాత చున్నీతో ఉరి వేసి తండ్రిని హత్య చేశాడు. సమాచారం అందుకున్న ఎస్సై నరేశ్, క్లూస్ టీం తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి, సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సందీప్ ఇటీవల పోలీస్ ఉద్యోగానికి ప్రయత్నించగా,కొద్ది తేడాతో అవకాశం పోయినట్లు తెలిసింది. -
అధిక వడ్డీ..35 కోట్లు టోకరా
-
కాంగ్రెస్ గ్యారంటీలతో గారడీ చేస్తోంది
తూప్రాన్ (మెదక్)/గజ్వేల్: కాంగ్రెస్ పార్టీ అమలు కాని ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి...నేడు తికమకపడుతోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర మెదక్ జిల్లా తూప్రాన్‌కు చేరుకోగా కిషన్‌రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని, రెండూ కుటుంబపార్టీలేనని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తూ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 17 సీట్లు గెలుస్తుందని, హైదరాబాద్‌లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. కార్యక్రమంలో దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. రూ.12 లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిన కాంగ్రెస్ దేశంలో రూ.12 లక్షల కోట్ల దోపిడీకి పాల్పడ్డ కాంగ్రెస్‌కు వచ్చే ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ చేపట్టిన విజయ సంకల్పయాత్ర ఆదివారం రాత్రి గజ్వేల్‌కు చేరుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లకే పరిమితం కావడం వల్ల మూడు నెలల పాటు విదేశీయాత్రకు వెళ్లిన రాహుల్‌గాంధీకి ఈ సారి ఏకంగా ఏడాది పాటు విదేశాల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటకలోనూ బీజేపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. -
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను కారు ఢీకొట్టిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందినవారిని పాపన్నపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. -
సీఎంతో మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు), మాణిక్‌రావు (జహీరాబాద్), కొత్త ప్రభాకర్‌రెడ్డి (దుబ్బాక) జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిసారు. నియోజకవర్గంలో తాము ఎదుర్కొంటున్న ప్రొటోకాల్, పోలీసు ఎస్కార్ట్, వ్యక్తిగత భద్రత తదితర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వారు ‘సాక్షి’కి తెలిపారు. అయితే ప్రధాన ప్రతిపక్షానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎంను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. మీడియాలోనూ వీరి భేటీ వైరల్ అయ్యింది. దీంతో ఎమ్మెల్యేలు స్పందించారు. తమ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులు కొనసాగేలా చూడాలని సీఎంను కోరినట్లు కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. గతంలో పూర్తయిన అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపు అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. రేవంత్‌తో కేవలం మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు మాణిక్‌రావు తెలిపారు. తాము ముఖ్యమంత్రిని కలవడంపై విపరీతార్థాలు తీయొద్దని, ప్రధాన మంత్రి మోదీని రేవంత్‌రెడ్డి ఎలా అభివృద్ధి పనుల కోసం కలిశారో తాము కూడా అదే విధంగా కలిసినట్లు మహిపాల్‌రెడ్డి వివరించారు. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. కాగా వీరు బుధవారం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సీఎంతో భేటీపై వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇలావుండగా తమ భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ నలుగురు ఎమ్మెల్యేలు మంగళవారం ఇంటెలిజెన్స్ ఏడీజీ శివధర్‌రెడ్డిని కూడా కలిశారు. -
మెదక్ జిల్లా రెడ్డిపల్లి విలేజ్ లో బీజేపీ నేత నిర్వాకం
-
భారీగా చేరి.. బారులు తీరి..!
మెదక్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో సోమవారం క్రిస్మస్ సంబరాలు వైభవంగా జరిగాయి. మెదక్ పట్టణంలోని సుమారు 600 ఎకరాల చర్చి ప్రాంగణం జనంతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి మూడులక్షల మంది భక్తులు తరలివచ్చారని అంచనా. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ప్రార్థనలు మొదలయ్యాయి. చలితీవ్రతను కూడా లెక్కచేయకుండా భక్తులు యేసయ్య దీవెనల కోసం బారులుతీరారు. ఈ సందర్భంగా బిషప్ కె.పద్మారావు దైవసందేశం ఇచ్చారు. శాంతిద్వారానే సమసమాజ స్థాపన జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ క్రీస్తును ఆరాధించాలని, విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రతిసమస్యకూ పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ప్రభువు చూపిన మార్గంలో నడుస్తూ సుఖసంతోషాలతో విరాజిల్లాలంటూ ప్రార్థనలు చేశారు. అంతకుముందు చర్చి వందో యేటా అడుగు పెట్టిన సందర్భంగా రూపొందించిన కేలండర్‌ను ఆవిష్కరించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ‘కల్వరి’లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హఫీజ్‌పేట్(హైదరాబాద్): మియాపూర్ కల్వరి టెంపుల్లో సోమవారం వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు మూడు లక్షలమంది భక్తులు తరలివచ్చి యేసుక్రీస్తు ప్రార్థనలు చేశారు. కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు డాక్టర్ సతీశ్‌కుమార్ భక్తులకు క్రీస్తు జననం గురించి వివరించి, ప్రవచనాలు అందించారు. ఈ సందర్భంగా క్రీస్తు నాటక ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. టెంపుల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 100 అడుగుల క్రిస్మస్ ట్రీ ఆకట్టుకుంది. దీంతో ట్రీ వద్ద సందర్శకులు పెద్దఎత్తున ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపారు. -
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
మెదక్ జిల్లా తూప్రాన్ లో కుప్ప కూలిన ట్రైనింగ్ జెట్ విమానం
-
తుఫ్రాన్‌లో కూలిపోయిన శిక్షణ విమానం.. పైలట్ మృతి
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలోని తుఫ్రాన్‌లో శిక్షణ విమానం కూలిపోయింది. అయితే, విమానం కూలిపోయిన వెంటన భారీగా మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పైలెట్, కో-పైలట్ మృతిచెందారు. వివరాల ప్రకారం.. తుఫ్రాన్ మున్సిపల్ పరిధిలోని టాటా కాఫీ కంపెనీ సమీపంలో ఉన్న గుట్టల మధ్య సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలిపోయింది. కాగా, కూలిన విమానాన్ని దుండిగల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన శిక్షణ విమానంగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా విమానం కూలిపోవడంతో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. Two Indian Air Force pilots were killed in action when their Pilatus trainer aircraft crashed at 8:55 during training at Air Force Academy, Dindigul in Telangana. The pilots include an instructor and one cadet: Indian Air Force officials pic.twitter.com/48bGdfawRy — ANI (@ANI) December 4, 2023 -
మెదక్ లో అధ్యధికంగా పోలింగ్
-
మెతుకు సీమలో.. నువ్వా నేనా!
మెతుకుసీమ ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధిక శాసనసభ స్థానాల్లో నెగ్గి రాజకీయ ఆధిపత్యం నిలుపుకునేందుకు అధికార బీఆర్ఎస్ చెమటోడ్చుతుండగా, మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతజిల్లా ఉమ్మడి మెదక్‌లో బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా తలపడుతున్నాయి. బీజేపీ రెండు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీ బంధు, కల్యాణలక్ష్మి వంటి ప్రజాకర్షక సంక్షేమ పథకాలే ప్రధాన అండగా బీఆర్ఎస్ భావిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలుండగా, సిద్దిపేట, గజ్వేల్ మినహా మిగిలిన 8 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. అధికార బీఆర్ఎస్ కార్యకర్తలు సర్వశక్తులూఒడ్డి పార్టీని గట్టెక్కించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ పాత కేడర్ మళ్లీ సంఘటితమై ఆ పార్టీ గెలుపుకోసం పావులు కదుపుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజానాడిని పట్టేందుకు ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి అందిస్తున్న ప్రత్యేక గ్రౌండ్ రిపోర్టు. సిద్దిపేట మెజారిటీపైనే లెక్కలు సిద్దిపేటలో బీఆర్ఎస్ తరఫున మంత్రి తన్నీరు హరీశ్‌రావు, కాంగ్రెస్ తరఫున పూజల హరికృష్ణ పోటీ చేస్తున్నారు. 2004, 2008, 2010 ఉప ఎన్నికలు, 2009, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి వరుసగా ఆరు పర్యాయాలు గెలుపొందిన హరీశ్‌రావుకు ఈ ఎన్నికలు కూడా నల్లేరు మీద నడక లాంటివేనని తెలుస్తోంది. 2018లో 1.18లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచి ఆయన రికార్డు సృష్టించారు. ఆయనకు పెద్దగా పోటీ లేదనే చెప్పాలి. సంగారెడ్డి ఆ ఇద్దరి మధ్యే కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మధ్య సంగారెడ్డిలో ద్విముఖ పోటీ నెలకొని ఉంది. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి బలమైన నాయకుడిగా పేరు పొందడం జగ్గారెడ్డికి కలిసివచ్చే అంశం. ఆయన స్థానికంగా ఉండడం లేదని విమర్శ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన ఆలస్యంగా ప్రచారాన్ని ప్రారంభించగా, టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ రెండు నెలలుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. 2014లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన చింతా ప్రభాకర్ ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ పథకాలు, పార్టీ బలగంపై ఆశలు పెట్టుకున్నారు. మెదక్ మెరిసేదెవరో.. మెదక్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ మధ్య గట్టిపోటీ నెలకొని ఉంది. పద్మాదేవేందర్ రెడ్డి 2004లో రామాయంపేట(2009లో రద్దైంది), 2014, 2018 లో మెదక్ నుంచి గెలుపొందారు. నియోజకవర్గ వ్యవహారాల్లో ఆమె భర్త దేవేందర్‌రెడ్డి జోక్యంపై కొంత ప్రతికూల ప్రచారం ఉంది. బీఆర్ఎస్ పథకాలే ఆమెకు బలం. మల్కాజ్గిరి ఎంపీ మైనంపల్లి హన్మంతరావు కుమారుడైన మైనంపల్లి రోహిత్ తొలిసారిగా మెదక్ నుంచి పోటీచేస్తున్నారు. హన్మంతరావు 2009లో టీడీపీ తరఫున ఇక్కడి నుంచి గెలుపొందారు. స్థానికంగా మైనంపల్లి కుటుంబానికి గట్టి పట్టు ఉండడం రోహిత్‌కు కలిసి వచ్చే అంశం. జహీరాబాద్ ఎవరికి జై కొట్టేనో.. జహీరాబాద్ ఎస్సీ రిజర్వ్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొన్నింటి మాణిక్‌రావు, కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ మ«ద్య ద్విముఖ పోటీ నెలకొని ఉంది. మాణిక్‌రావు స్థానికుడిగా మూడోసారి పోటీ చేస్తున్న అభ్యర్థిగా ఓటర్లతో కలియతిరుగుతున్నారు. కాంగ్రెస్ నుంచి నరోత్తమ్ బీఆర్ఎస్లో చేరడం ఆయనకు కలిసి వచ్చే అంశమే. ఇక చంద్రశేఖర్ స్థానికుడైనా, ఈ ప్రాంత ప్రజలకు కొత్త అభ్యర్థి. అయితే కాంగ్రెస్ పార్టీకి జహీరాబాద్ కంచుకోటగా పేరుంది. ఇప్పటి వరకు ఇక్కడ 14 సార్లు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ పార్టీ 12 సార్లు గెలుపొందింది. స్థానికంగా పార్టీకి బలమైన కేడర్, ఓటు బ్యాంకు ఉండడం కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశాలు. పటాన్చెరు పోటాపోటీ పటాన్చెరులో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్‌గౌడ్ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. 2014, 2018లో ఇక్కడి నుంచి గెలిచిన మహిపాల్‌రెడ్డి స్థానికంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2018లో ఓడిన శ్రీనివాస్‌గౌడ్ పట్ల సానుభూతి ఉంది. శ్రీనివాస్‌గౌడ్ తండ్రి దర్శన్ గౌడ్ అమీన్పూర్ సర్పంచ్‌గా, భార్య అమీన్పూర్ ఎంపీటీసీగా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి తొలుత టికెట్ పొంది ఆ తర్వాత రద్దు కావడంతో బీఎస్పీ తరఫున అభ్యర్థి బరిలో దిగిన సర్పంచ్ నీలం మధు సైతం గట్టిపోనిస్తుండడంతో ఆయన చీల్చే ఓట్లు ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. దుబ్బాక ఆ ముగ్గురి మధ్యనే.. దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మధ్య త్రిముఖ పోటీ నెలకొని ఉంది. ముగ్గురు హోరాహోరీగా తలపడుతున్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డికి ప్రభుత్వ పథకాలు, అధికార పార్టీ బలం వచ్చే అంశాలు. శ్రీనివాస్‌రెడ్డి తండ్రి దివంగత ముత్యంరెడ్డి 1989, 1994, 1999లో వరుసగా మూడు పర్యాయాలు టీడీపీ తరఫున దొమ్మాట (2009లో రద్దైంది) నుంచి, 2009లో కాంగ్రెస్ తరఫున దుబ్బాక నుంచి గెలుపొందారు. ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా చెక్‌డ్యామ్‌లు నిర్మించడంతో ప్రజల్లో ఇంకా ఆదరణ ఉండడం శ్రీనివాస్‌రెడ్డికి కలిసివచ్చే అంశం. 2020 ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి 1,079 ఓట్ల స్వల్ప మెజారిటీతో బీజేపీ తరఫున గెలిచిన రఘునందన్ రావు సైతం మరోసారి గెలిచేందుకు గట్టిగా కృషిచేస్తున్నారు. యువతలో బీజేపీ పట్ల ఉన్న ఆదరణ కలిసి వచ్చే అంశం. గజ్వేల్ సీఎం కేసీఆర్‌తో ఈటల ఢీ గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. కేసీఆర్ ఆధిక్యతతో ముందంజలో ఉన్నా, ఈటల రాజేందర్ నుంచి కొంత పోటీ ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండు పర్యాయాలు సీఎం కావడం, గజ్వేల్‌ను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడం కేసీఆర్‌కు ఎన్నికల్లో కలిసివచ్చే అంశాలు. గజ్వేల్‌లో ముదిరాజ్ సామాజికవర్గ ఓటర్లు గణనీయంగా ఉండడంతో ఈటల రాజేందర్‌కు కొంత మద్దతు లభిస్తోంది. నారాయణఖేడ్ ద్విముఖ పోటీ నారాయణఖేడ్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మారెడ్డి భూపాల్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పటోళ్ల సంజీవరెడ్డి మధ్య గట్టిపోటీ నెలకొని ఉంది. భూపాల్‌రెడ్డి 2016 ఉపఎన్నిక, 2018 సాధారణ ఎన్నికల్లో ఇక్కడి నుంచి రెండు పర్యాయాలూ 50వేలకు పై చీలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించడం కలిసి వచ్చే అంశం. కాంగ్రెస్ టికెట్ తొలుత మాజీ ఎమ్మెల్యే సురేశ్‌షెట్కార్‌కు కేటాయించగా, ఆయన తప్పుకుని పటోళ్ల సంజీవరెడ్డికి అవకాశం కల్పించారు. సంజీవరెడ్డి తండ్రి పి.కిష్టారెడ్డి ఇక్కడి నుంచి గతంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేయడంతో వారి కుటుంబానికి స్థానికంగా మంచి పట్టు ఉంది. సురేశ్‌షెట్కార్ మద్దతు ఉండడం సంజీవరెడ్డికి కలిసి వచ్చే అంశం. అందోల్ ఎవరికి అండనో.. అందోల్ ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మధ్య ద్విముఖ పోటీ నెలకొని ఉంది. దామోదర రాజనర్సింహ 1989, 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచారు. చంటి క్రాంతి కిరణ్ తొలిసారిగా 2018 ఎన్నికల్లో రాజనర్సింహపై 16వేలపై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రభుత్వ పథకాలు, పార్టీ బలగంపై క్రాంతి కిరణ్ ఆశపెట్టుకోగా, తన సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రభుత్వ వ్యతిరేకతపై రాజనర్సింహ ఆశలు పెట్టుకున్నారు. గతంలో వరుసగా రెండుసార్లు ఓడిపోయారనే సానుభూతి ఆయనకు ఉంది. నర్సాపూర్ నువ్వానేనా నర్సాపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి వి.సునీతాలక్ష్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి మధ్య ద్విముఖ పోటీ నెలకొని ఉంది. సునీతా లక్ష్మారెడ్డి 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వరుసగా మూడు పర్యాయాలు ఇక్కడి నుంచి గెలుపొందగా, రాజీరెడ్డి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్లో చేరికలు పెరగడం సునీతారెడ్డికి కలిసొచ్చే అంశం. 20014, 2019లో ఇక్కడి నుంచి గెలుపొందిన సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీహెచ్ మదన్‌రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ నిరాకరించినా, ఆయన మాత్రం సునీతారెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత నాలుగైదు ఏళ్ల నుంచి రాజిరెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తుండడం ఆయనకు కలిసివచ్చే అంశం. మద్యానికి బానిసగా యువతను మార్చుతున్నారు ఎన్నికలొస్తే చిన్న వయస్సు పిల్లలను కూడా బాగా తాపించి కరాబ్ చేస్తున్రు. ఫంక్షన్ హాళ్లలో చికెన్ బిర్యానీ వండి పెడ్తున్రు. ఓటర్ల స్థాయిని బట్టి బ్రాండ్ల లిక్కర్ పంచుతున్రు. వాళ్లు బీరు, బిర్యానీ, 500 నోటు ఇవ్వుడు.. పోరగాళ్లు తాగి కింద పడుడు. నాలుగు రోజులు(ఎన్నికలు) పోయాక మద్యానికి డబ్బులు కావాలని ఇంట్లో పెళ్లాలను కొడుతున్నరు. ఆడవాళ్లతోనే ధర్నా చేయించాలనుకుంటున్నాం. – గొండి మల్లయ్య, సిర్పూరు, హత్నూర మున్సిపాలిటీతో ఉపాధి బంద్ అల్లాపూర్‌ను మున్సిపాలిటీలో కలపడంతో 2018 నుంచి ఉపాధి హామీ పథకం కట్ అయ్యింది. మా ఊర్లో 370 కుటుంబాలుంటాయి. ఇంట్లో ఇద్దరు కూలీకి పోతే ఒక్కొక్కరికి రోజుకి రూ.250 కూలీ వచ్చేది. ఇప్పుడు మొత్తం బంద్ అయింది. 2014లో గజ్వేల్ మున్సిపాలిటీ అయితే 2018 వరకు అక్కడ ఉపాధి హామీ పని నడిచింది. మా దగ్గర వెంటనే బంద్ చేశారు. – మన్నే భాస్కర్ ఎల్లాపూర్, గజ్వేల్ రైతుబంధుకు కటాఫ్ పెట్టాలి మా ఊర్లో 20 ఎకరాలున్న వారికి కూడా రైతుబంధు వస్తుంది. మినిమం కటాఫ్ పెట్టాలి. తుమ్మ చెట్లు మొలిచిన భూములకు, ఫారెస్ట్లాగా ఉన్న భూములకూ ఇస్తున్నరు. ఐదెకరాలు ఉన్నోడికి అదే ఇస్తున్రు. 200 ఎకరాలున్నోడికి అదే ఇస్తున్రు. వడగండ్లు పడి పోయిన పంట ఖరాబ్ అయింది. ఎకరాకు రూ.10వేలు ఇస్తామన్నరు. ఇప్పటి వరకు ఒక రూపాయి రాలేదు. –కిష్టయ్య, పైతరా, కొల్చారం -ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ముహమ్మద్ ఫసియుద్దీన్ -
మెదక్‌లో విషాదం.. తండ్రి అస్తికలు గంగలో కలిపేందుకు వచ్చి..
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా హవేళి ఘనపూర్ మండలంలో విషాదం నెలకొంది. తండ్రి అస్తికలు గంగలో కలిపేందుకు వచ్చిన ఇద్దరు అన్నాదమ్ముళ్లు నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు. హవేళి ఘనపూర్ మండలంలోఅస్తికలు కలిపేందుకు నీటిలో దిగిన అన్నాదమ్ముళ్లు.. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. జ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. కామారెడ్డి సరిహద్దు పోచారం ప్రాజెక్టు వద్ద ఈ ఘటన జరిగింది. మృతులను కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఇనాం తండాకు చెందిన హర్యా, బాల్‌సింగ్‌గా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
19 ఏళ్ల పోరాటం.. ఈసారైనా ఆమెను ఓడిస్తారా?
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల విషయంలో కొన్నిసార్లు ఆసక్తికర విషయాలు సంతరించుకుంటాయి. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నాదమ్ముళ్లు పోటీపడి అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తుండడం చూస్తూనే ఉంటాం. కానీ, ఒకే ప్రత్యర్థిపై ఒకే కుటుంబానికి చెందిన వారు వరుసగా పోటీ చేయడం అరుదుగా జరుగుతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు మెదక్ నియోజకవర్గంలో కనిపించింది. ఎమ్మెల్యే పద్మపై మైనంపల్లి కుటుంబీకులు చాలా ఏళ్లుగా పోటీ చేస్తూ రావడం ఆసక్తి సంతరించుకుంది. మెదక్: ప్రస్తుత మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఉమ్మడి ఏపీలో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యరి్థగా పోటీ చేయగా, ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి ప్రస్తుత మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సతీమణి మైనంపల్లి వాణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రామాయంపేట ఎమ్మెల్యేగా ఉన్న పద్మాదేవేందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో 2008లో జరిగిన రామాయంపేట ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మళ్లీ పద్మాదేవేందర్‌రెడ్డి పోటీ చేయగా, ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి మైనం పల్లి హన్మంత రావు బరిలో నిలిచి గెలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో.. అనంతరం నియోజకవర్గాల పునర్ విభజనలో రామాయంపేట నియోజకవర్గాన్ని రద్దుచేసి చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాలను మెదక్ నియోజకవర్గంలో కలిపారు. ఈ నేపథ్యంలో 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తులో భాగంగా మెదక్ టికెట్‌ను మైనంపల్లి హన్మంతరావుకు కేటాయించడంతో పద్మాదేవేందర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి మైనంపల్లి చేతిలో మరోసారి ఓటమి చవి చూశారు. ఆ తర్వాత 2014, 2018 లో వరుసగా పద్మాదేవేందర్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అభ్యరి్థగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా మూడోసారి సైతం పద్మారెడ్డికి బీఆర్ఎస్ హైకమాండ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈసారి పద్మపై రోహిత్.. గతంలో మైనంపల్లి హన్మంతరావు, వాణి దంపతులు పద్మాదేవేందర్‌రెడ్డిపై పోటీ పడగా, ప్రస్తుతం వారి కుమారుడు రోహిత్‌రావు కాంగ్రెస్ అభ్యరి్థగా పద్మకు పోటీగా బరిలో నిలిచారు. నాడు తల్లీదండ్రులు, నేడు కొడుకు పోటీపడుతుండడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 19 ఏళ్లుగా రాజకీయ వైరం వీరి మధ్యలోనే జరుగుతుండడం విశేషం. -
మెదక్‌లో పండగపూట విషాదం.. టపాసులు కొనడానికి వెళ్తుండగా..
సాక్షి, మెదక్ జిల్లా: మెదక్‌లో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఆటోనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. స్కూటీని టిప్పర్ ఢీకొనడంతో పృథ్వీతేజ్(12), ప్రణీత్ తేజ్(12) ప్రాణాలు కోల్పోయారు. తల్లికి అన్నపూర్ణకు గాయపడగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలు కొనడానికి తల్లితో పాటు కలిసి చిన్నారులు స్కూటీపై వెళ్తుండగా ఘటన జరిగింది. అన్నపూర్ణ భర్త శ్రీనివాస్ హోం గార్డ్.. రెండు సంవత్సరాల క్రితమే ఆయన ప్రమాదంలో మృతి చెందగా, ఇప్పుడు ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. చదవండి: వీడియో కాల్లో డబ్బులు అడుగుతున్నారా?.. ఇది తెలుసుకోండి.. -
కాంగ్రెస్‌లో టికెట్ల చిచ్చు.. హస్తానికి దామోదర రాజనర్సింహ గుడ్ బై!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ టికెట్ల కేటాయింపు అంశం అన్నీ పార్టీల్లోనూ అగ్గి రాజేసింది. ఇక, కాంగ్రెస్‌లో మూడు జాబితా నేతల్లో ఉన్న అసంతృప్తిని బయటపెట్టింది. దీంతో, తుది వరకు టికెట్ ఆశించి భంగపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ. ఇక, టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే, ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, పటాన్ చెరులలో సీట్ల కేటాయింపు విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు. అయితే, నారాయణఖేడ్ నుండి సంజీవరెడ్డికి, పటాన్ చెరు నుండి శ్రీనివాస్ గౌడ్‌కు టిక్కెట్లు కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వానికి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సూచించారు. సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలకు టిక్కెట్లు కేటాయించాలనే ఉద్దేశ్యంతో దామోదర రాజనర్సింహ సూచించిన వ్యక్తులకు కాకుండా వేరే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. మరోవైపు.. పటాన్చెరు టిక్కెట్‌ను నీలం మధుకు కేటాయించడంపై రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కోసం కాటా శ్రీనివాస్ గౌడ్ గత కొంతకాలంగా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. దీంతో, ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన ముఖ్య అనుచరులతో సమావేశమవుతున్నారు. కాగా, కాంగ్రెస్‌లో కొనసాగడంపై నేడో రేపో కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన నీలం మధుకు టిక్కెట్ ఎలా కేటాయిస్తారంటూ దామోదర రాజనర్సింహ ప్రశ్నిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌పై మండిపడుతున్నారు. ఇది కూడా చదవండి: ఇక ఆపండి.. కిషన్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ -
ఎంపీ ప్రభాకర్ మరో 4 రోజులు ఐసీయూలోనే.. దర్యాప్తు వేగవంతం
సాక్షి, హైదరాబాద్: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో సిద్ధిపేట పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రాజకీయ కుట్ర కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఎంపీపై దాడి చేసిన నిందితుడు రాజు కుటుంబ సభ్యులను చేప్యాలలో పోలీసులు విచారించారు. నిందితుడు రాజు కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు రాజుకి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడు కోలుకున్న తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నాలుగు రోజులు ఐసీయూలోనే.. కత్తిపోటుతో ప్రభాకర్‌రెడ్డి చిన్నపేగుకు గాయం కావడంతో సోమవారం యశోద ఆసుపత్రిలో వైద్యులు నాలుగు గంటలపాటు శ్రమించి ఆపరేషన్ చేశారు. చిన్న పేగును 10 సె.మీ మేర వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో చికిత్స అందిస్తుండగా మరో నాలుగు రోజులు ఐసీయూలోనే ఉండనున్నారు. మరోవైపు కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో బంద్‌కు పిలిపునిచ్చారు బీఆర్ఎస్ కార్యకర్తలు.వర్తక వ్యాపారులు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. అదే విధంగా ఎంపి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మెదక్ చర్చిలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అసలేం జరిగిందంటే.. దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రభాకర్‌రెడ్డి.. సోమవారం సిద్దిపేట జిల్లా సూరంపల్లిలో ప్రచారం నిర్వహించారు. తిరిగొస్తూ వాహనం వైపు వెళ్తుండగా ఓ వ్యక్తి కడుపులో కత్తితో పొడిచాడు. దీంతో ప్రభాకర్ రెడ్డిని మొదట గజ్వేల్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. దగ్గరుండి ఎంపీని ఆస్పత్రికి తీసుకొచ్చారు మంత్రి హరీశ్‌రావు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. గాయమైన చోట చిన్నపేగు భాగం తొలగించారు. సీఎం కేసీర్, మంత్రులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. చదవండి: Miryalaguda: ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట.. ఇప్పుడు అనాథగా.. -
చేదోడు లేని ఆ నలభై ఏడు!
తెలంగాణలో అధికారం కోసం ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీకి గత చరిత్ర మాత్రం చేదు జ్ఞాపకంగానే ఉంది. 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమేనని గత ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయా స్థానాల్లో కొన్నిచోట్ల గత పది ఎన్నికల్లో ఆ పార్టీ ఒకట్రెండు సార్లు మాత్రమే గెలవగలిగింది. 1967 తర్వాత నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థులు ఇప్పటివరకు విజయం సాధించలేదు. పునర్విభజన తర్వాత ఏర్పాటైన బెల్లంపల్లి, మంచిర్యాల, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కోరుట్ల, ధర్మపురి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, రాజేంద్రనగర్, దేవరకద్ర, పాలకుర్తి, వరంగల్ వెస్ట్, వైరాలోనూ ఇప్పటివరకు కాంగ్రెస్ పాగా వేయలేదు. మెదక్ నియోజకవర్గంలోనూ 1989 తర్వాత కాంగ్రెస్ గెలవలేదు. సిరిసిల్లలో 2009 నుంచి అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కెవిజయం సాధిస్తూనే ఉన్నారు. దుబ్బాకలో 2009లో చెరుకు ముత్యంరెడ్డి గెలిచారు. అంబర్‌పేటలో 1989లో వి. హనుమంతరావు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అక్కడ విజయం దక్కలేదు. మహబూబ్‌నగర్‌లో 1989లో పులివీరన్న గెలిచిన తర్వాత జరిగిన ఏడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. భువనగిరిలో 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కె.నర్సింహారెడ్డి మాత్రమే గెలిచారు. నర్సంపేటలో మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగితే 1957లో కె.కనకరత్నమ్మ, 1967లో కె.సుదర్శన్‌రెడ్డి మాత్రమే గెలిచారు. గతంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు ఎక్కువగా వీచిన నియోజకవర్గాలివే.. ♦ 2004 తర్వాత సిర్పూర్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపు దక్కలేదు. 1978 తర్వాత గెలిచింది 2004లోనే. అప్పుడు కోనేరు కోనప్ప విజయం సాధించగా, గత 10 సార్లు జరిగిన ఎన్నికల్లో ఒకసారి మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ♦ చెన్నూరులో కూడా 1978 తర్వాత గెలిచింది 2004లోనే. ఇక్కడ మాత్రం ఓడిపోయిన ప్రతిసారీ రెండోస్థానంలో నిలిచింది. 2004లో జి.వినోద్ గెలిచారు. ♦ 2009లో బెల్లంపల్లి అసెంబ్లీ స్థానం ఏర్పాటయిన తర్వాత ఒక్కసారి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ♦ మంచిర్యాలలోనూ కాంగ్రెస్ ఇప్పటివరకు గెలవలేదు. నాలుగుసార్లు (ఒక ఉప ఎన్నికతో సహా) ఓడిపోయిన కాంగ్రెస్ మూడుసార్లు రెండో స్థానంలో నిలిచింది. ♦ ఖానాపూర్‌లో 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి కె.భీంరావు గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవలేదు. ♦ 1983 నుంచి ఆదిలాబాద్ నియోజకవర్గంలో పదిసార్లు ఎన్నికలు జరిగితే 1989, 2004లో రెండుసార్లు సి.రామచంద్రారెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ♦ బోథ్ నియోజకవర్గంలో వరుసగా ఎనిమిది పర్యాయాలుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతోంది. ఇక్కడ 1983లో కాంగ్రెస్ పక్షాన ఎం.కాశీరాం గెలిచిన తర్వాత మరెవరూ గెలవలేదు. ♦ నిర్మల్‌లో 1999, 2004లో వరుసగా రెండు సార్లు ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత ఇప్పటివరకు కాంగ్రెస్ ఆ నియోజకవర్గంలో గెలవలేదు. ♦ 1989, 99 ఎన్నికల్లో రెండుసార్లు ఆర్మూరు నుంచి కాంగ్రెస్ గెలిచింది. 1999 తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ ఓడిపోయింది. ♦ ఎస్సీ రిజర్వుడు అయిన తర్వాత జుక్కల్ నియోజకవర్గంలో 10 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గెలిచింది నాలుగు సార్లు మాత్రమే. ఐదు సార్లు రెండోస్థానంలో నిలిచింది. చివరగా 2004లో సౌదాగర్ గంగారాం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ♦ బాన్సువాడలో గత నాలుగు సార్లు ఓటమిపాలయ్యింది. 2004లో బాజిరెడ్డి గోవర్దన్ గెలవగా, 2009, 2011 (ఉప ఎన్నిక), 2014, 2018లో ఓడిపోయింది. ♦ కామారెడ్డిలో 1983 తర్వాత కాంగ్రెస్ గెలిచింది రెండుసార్లు మాత్రమే. 1989, 2004లో షబ్బీర్‌అలీ ఇక్కడి నుంచి గెలిచారు. ♦ నిజామాబాద్ అర్బన్‌గా మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి గెలుపొందలేదు. 2009లో నియోజకవర్గం పేరు మారగా, అంతకుముందు 2004, 1999లో కాంగ్రెస్ తరఫున డి.శ్రీనివాస్ రెండుసార్లు గెలుపొందారు. ♦ నిజామాబాద్ రూరల్‌లో కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ గెలవలేదు. అంతకుముందు డిచ్‌పల్లిగా ఉన్నప్పుడు కూడా 2008 ఉప ఎన్నికలో, 1978లో ఆకుల లలిత, ఎ. బాల్‌రెడ్డిలు మాత్రమే ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. ♦ కోరుట్లలోనూ ఇప్పటివరకు కాంగ్రెస్ విజ యాన్ని అందుకోలేకపోయింది. బుగ్గారం (2009కి ముందు)గా ఉన్నప్పుడు మాత్రం రెండుసార్లు రత్నాకర్‌రావు, ఒకసారి కె.గంగారం, మరోమారు రాజారాం, ఇంకోసారి మోహన్‌రెడ్డిలు కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. ♦ పెద్దపల్లిలో 1989 తర్వాత కాంగ్రెస్ గెలుపొందలేదు. 1989లో గీట్ల ముకుందరెడ్డి గెలిచిన తర్వాత వరుసగా ఆరుసార్లు ఆ పార్టీ ఓటమి పాలు కావడం గమనార్హం. ♦ హుజూరాబాద్ నియోజకవర్గంలో 1978 తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అప్పుడు దుగ్గిరాల వెంకట్రావు విజయం సాధించారు. ♦ సిద్దిపేటలో కాంగ్రెస్ చివరగా గెలిచింది 1983లోనే. అంతకుముందు వరుసగా మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్, ఆ తర్వాత జరిగిన 12 ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడం గమనార్హం. ♦ దేవరకద్రలో ఇంతవరకు కాంగ్రెస్ బోణీ కొట్టలేదు. నాగర్‌కర్నూల్‌లో 1989లో వంగా మోహన్‌గౌడ్ గెలుపొందారు. ఆ తర్వాత ఆ పార్టీ ఓటమి పాలవుతూనే ఉంది. 1983 తర్వాత ఇబ్రహీంపట్నంలోనూ కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓటమి పాలవుతోంది. -
బీఆర్ఎస్ నర్సాపూర్ అభ్యర్థి ఖరారు
సాక్షి, హైదరాబాద్: నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి పేరును భారత రాష్ట్ర సమితి ఖరారు చేసింది. ఈ మేరకు స్వయంగా పేరు ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. బుధవారం ఆమెకు బీఫామ్ అందజేశారు. ప్రస్తుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డికి.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ, అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కోర్ కమిటీ సభ్యులు భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే నర్సాపూర్ టికెట్‌ను సునీతా లక్ష్మారెడ్డికి ఇవ్వాలని సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ మదన్ రెడ్డి నాతో పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడు. 35 ఏండ్లనుంచి నాతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా నాకు అత్యంత ఆప్తుడు. నాకు కుడి భుజం లాంటి వాడు. సోదర సమానుడు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాలమీద వేసుకుని సునీత లక్ష్మారెడ్డి ని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా వుంది. ప్రస్థుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ గా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుండి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కీలక సభ్యులకు, కార్యవర్గానికి అభినందనలు. వారి సీనియారిటిని పార్టీ గుర్తించి గౌరవించినందుకు పార్టీ మఖ్య కార్యవర్గాన్ని అభినందిస్తున్నా. మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కేవలం నర్సాపూర్ లోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వారు పాపులర్ లీడర్. వివాద రహితుడు సౌమ్యుడు మదన్ రెడ్డి గారి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాల్సివుంది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి గారు పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారు. వారికి నా ధన్యవాదాలు అభినందనలు అని కేసీఆర్ తెలిపారు. వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్‌లో ఉన్నారు. మూడుసార్లు నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్సార్, కొణిజెట్టి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు సీఎంలుగా ఉన్నప్పుడు మంత్రిగా పని చేశారు. 2019లో బీఆర్ఎస్లో చేరారామె. తెలంగాణ ప్రభుత్వంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా, సభ్యురాలిగా ఆమె పని చేశారు. -
బీఆర్ఎస్.. పట్టు బిగించేందుకు.. కాంగ్రెస్.. పాగా వేసేందుకు...
మెతుకుసీమ ఉమ్మడి మెదక్ జిల్లాలో మరోసారి పట్టు నిలుపుకునేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా ముందుకెళుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఉనికిని చాటుకునేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్ దూకుడు... ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా పేరుంది. ఈఎన్నికల్లో కూడా జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలనే తపనతో బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. 2018 ఎన్నికల్లో ఒక్క సంగారెడ్డి మినహా, మిగిలిన తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి పదికి పది స్థానాలను గెలుచుకోవాలని పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఒక్క నర్సాపూర్ మినహా ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థిత్వాలను ప్రకటించింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అభ్యర్థులు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లారు. ఒకటికి రెండుసార్లు నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఇతర పార్టీల నుంచి భారీ చేరికలతో బీఆర్ఎస్ హవా కొనసాగుతోందనే సంకేతాలను క్షేత్రస్థాయికి పంపారు. ఇప్పుడు బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తూ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. చేరికలతో పకడ్బందీగా కాంగ్రెస్.. ఉమ్మడి మెదక్‌లో పాగా వేసేందుకు హస్తం పార్టీ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా లో సంగారెడ్డిని మాత్రమే కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోగలిగింది. ఇక్కడ జగ్గారెడ్డి విజయం సాధించారు. ఈసారి జిల్లాలో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్, ఆయన కుమారుడు రోహిత్‌కు మెదక్ అభ్యర్థిత్వం ఖరారు చేసింది. అలాగే బీజేపీకి చెందిన మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్‌కు గాలం వేసిన కాంగ్రెస్.. ఆయనకు జహీరాబాద్ టికెట్ ప్రకటించింది. కాంగ్రెస్ ముఖ్యనేతలు దామోదర రాజనర్సింహ ఆందోల్ నుంచి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి నుంచి బరిలోకి దిగారు. మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థిత్వాలపై తకరారు కొనసాగుతోంది. బరిలో అగ్రనేతలు.. గజ్వేల్ నుంచి సీఎం కె.చంద్రశేఖర్‌రావు, సిద్దిపేట నుంచి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు, అందోల్ నుంచి సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితర అగ్రనేతలు ఈసారి కూడా బరిలోకి దిగుతున్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి మూడోసారి పోటీ చేస్తుండగా, ఈసారి ఆయన ఈ స్థానంతో పాటు, కామారెడ్డి నుంచి కూడా బరిలో నిలుస్తున్నారు. ♦ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధిస్తున్న మంత్రి హరీశ్‌రావు ఈసారి కూడా ఇదే హవాను కొనసాగించేలా ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల్లో భారీగా 1.18 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన మంత్రి హరీశ్‌రావు ఈసారి అంతకు మించి మెజారిటీ సాధిస్తామన్న ధీమాతో ఉన్నారు. ఇక వరుసగా రెండు పర్యాయాలు ఓటమిని చవిచూస్తున్న దామోదర్ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ♦ ప్రచార శంఖారావం ఇక్కడి నుంచే.. సెంటిమెంట్ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ బహిరంగసభతోనే ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. బలమైన నేతల కోసం బీజేపీ ఎదురుచూపులు.. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కమలం పార్టీ ఈ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో తన ఉనికిని చాటుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. దీంతో పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశించి., భంగపడిన నాయకులకు బీజేపీ గాలం వేస్తోంది. వారిని పార్టీలో చేర్చుకుని అభ్యర్థులుగా బరిలోకి దింపేందుకు వ్యూహాలను రచిస్తోంది. సీపీఐ హుస్నాబాద్ అడిగినా.. కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తుపై జాతీయ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. పొత్తులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సీపీఐ అడిగింది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పోటీ చేయాలని భావించారు. అయితే ఈ అసెంబ్లీ సెగ్మెంట్ సీపీఐకి కేటాయిస్తారా, కాంగ్రెస్ పోటీలో ఉంటుందా చూడాలి. బీఆర్ఎస్ది అభివృద్ధి నినాదం.. ♦ సిద్దిపేట సర్వతోముఖాభివృద్ధి ♦ మెదక్‌కు రైలుమార్గం, మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటు. ♦ సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం విపక్షాల ప్రచార అస్త్రాలు ♦ దళితబ0ధు అమలులో అవినీతి అక్రమాలు. ♦ బీసీబంధు, మైనార్టీబంధు అందరికీ అందకపోవడం. ♦ అందోల్ ప్రాంతంలో అధ్వానంగా రహదారులు. ♦ బీఆర్ఎస్ నేతలపై భూకబ్జాల ఆరోపణలు, అవినీతి అక్రమాలు. ♦ విచ్చలవిడిగా సాగిన అక్రమ మైనింగ్ సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే.. జహీరాబాద్‌లో మైనార్టీల ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నారాయణఖేడ్‌లో ఎస్టీలు, మిగతా చోట్ల ఎస్సీలు, బీసీల ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా ముదిరాజ్‌లు, లింగాయత్, పద్మశాలి, గౌడ్ వంటి సామాజికవర్గాలు జిల్లాలో అధికంగా ఉన్నారు. ఏడాదికో ఉపఎన్నిక మంచిర్యాల డెస్క్: 2018లో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడిన పరిణామాలతో ఏడాదికో ఉపఎన్నిక అనివార్యమైంది. 2019లో..: హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. దీంతో ఉప ఎన్నిక జరగ్గా, ఆయన భార్య పద్మావతిరెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉండగా, టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డి గెలిచారు. 2020లో..: దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన భార్య సుజాత పోటీ చేయగా, ఆమెపై బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. 2021లో..: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మరణించగా, జరిగిన ఉపఎన్నికలో ఆయన కుమారుడు భగత్ టీఆర్ఎస్ నుంచే పోటీ చేసి, జానారెడ్డిపై గెలిచారు. 2021లో..: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై బీజేపీ నుంచి పోటీ చేసి ఈటల గెలిచారు. 2022లో..: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికరాగా, ఆయనపై బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలిచారు. ♦ ఇక 2023 నవంబర్ 30న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. - పాత బాలప్రసాద్ -
వందేళ్ల పెళ్లి సంబరం
-
మాయమవుతున్న రూ.కోట్ల విలువైన పీడీఎస్ బియ్యం
సాక్షి, హైదరాబాద్/మెదక్: ‘మెదక్‌లోని పౌరసరఫరాల సంస్థ మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్‌కు ఎఫ్‌సీఐ నుంచి వచ్చిన బియ్యంలో 362 టన్నుల మేర తేడా వచ్చింది. అంటే రూ.3 కోట్ల విలువైన 18 లారీల బియ్యం లెక్క దొరకడం లేదు. వీటితో పాటు 700 బేల్స్ గన్నీ బ్యాగులు లేవు. 320 టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (ఎఫ్ఆర్కే) చెడిపోయాయి. మొత్తంగా ఈ మెదక్ ఎంఎల్ఎస్ పాయింట్లో జరిగిన అక్రమాల విలువ సుమారు రూ.6 కోట్లు. ఆకస్మిక తనిఖీలో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి..’పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ సోమవారం రాష్ట్ర స్థాయి అధికారుల వాట్సాప్ గ్రూప్‌లో స్వయంగా పోస్ట్ చేసిన వివరాలు ఇవి. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఎంఎల్ఎస్ పాయింట్లలో వ్యక్తిగతంగా తనిఖీలు నిర్వహించి శుక్రవారంలోగా నివేదిక ఇవ్వాలని ఆయన ఆ మెసేజ్‌లో స్పష్టం చేశారు. నిఘా కరువు..రికార్డుల్లేవు రైస్ మిల్లుల నుంచి సీఎంఆర్ కింద బియ్యం ఎఫ్‌సీఐ గోడౌన్లకు చేరతాయి. ఇక్కడి నుంచి ప్రజా పంపిణీ పథకం (పీడీఎస్) కింద ఎంఎల్ఎస్ పాయింట్లకు వెళతాయి. అక్కడి నుంచే జిల్లాల్లోని అన్ని రేషన్ దుకాణాలకు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు సరఫరా అవుతాయి. అయితే ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సరైన నిఘా, రికార్డుల వ్యవస్థ ఉండటం లేదు. రాష్ట్రంలో 171 ఎంఎల్ఎస్ పాయింట్లు ఉండగా, చాలాచోట్ల అధికారులు లేరు. ఔట్ సోర్సింగ్ కింద నియామకమైన డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో)ల పర్యవేక్షణలో నడుస్తున్నాయి. సెపె్టంబర్ 8న సంస్థ చైర్మన్ మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్‌ను తనిఖీ చేసినప్పుడు రెండేళ్లుగా అక్కడ స్టాక్ పాయింట్ ఇన్చార్జి లేడని, కేవలం డీఈవో ద్వారానే కోట్ల రూపాయల విలువైన బియ్యం పంపిణీ, సరఫరా ప్రక్రియ కొనసాగుతోందని తేలింది. అక్కడున్న 1,520 బ్యాగుల సన్నబియ్యం తినడానికి పనికిరాకుండా పోవడాన్ని కూడా గుర్తించారు. గోదాముల నుంచే మొదలు.. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం వచ్చే సమయంలోనూ భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్లతో మిల్లర్లు కుమ్మౖMð్క బియ్యం లోడ్లను పక్కదారి పట్టిస్తున్నట్లు ఇప్పటికే పలు సంఘటనల్లో బయటపడింది. గత ఏప్రిల్ మొదటి వారంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల ఎఫ్‌సీఐ గోదాం నుంచి సుల్తానాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్‌కు 5 లారీల్లో బియ్యం పంపించారు. కానీ 420 బస్తాల చొప్పున ఉన్న 3 లారీలు మాత్రమే గోదాంకు చేరాయి. మిగతా 2 లారీలు కాట్నపల్లి వద్ద ఉన్న ఓ రైస్ మిల్లులో అన్లోడ్ అయ్యాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లేఖ ద్వారా తెలియజేశారు. సంస్థ ప్రధాన కార్యాలయానికి సంబంధం లేకుండా పెద్దపల్లిలో సీఎంఆర్‌కు అదనంగా 30 వేల టన్నుల బియ్యం తీసుకున్నట్లు తేలిందని కూడా వివరించారు. ఈ ఘటనపై మరింత లోతైన విచారణ జరపాలని కోరారు. ఇక ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌకధరల దుకాణాలకు బియ్యం పంపించే క్రమంలో కూడా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని స్పష్టమవుతోంది. ఎంఎల్ఎస్ పాయింట్లలో కూడా భారీ మొత్తంలో బియ్యం మాయం అవుతున్నాయి. మెదక్‌తో పాటు రామాయంపేట, తూప్రాన్ ఎంఎల్ఎస్ పాయింట్లలో 10 వేల క్వింటాళ్లకు పైగా పీడీఎస్, సన్న బియ్యం లెక్క తేలకుండా పోయినట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ స్టాక్ పాయింట్ల ఇన్చార్జిలపై కేసులు కూడా నమోదయ్యాయి. పట్టించుకోని అధికారులు తనిఖీల్లో బయటపడుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు పెద్దగా దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు విని్పస్తున్నాయి. 171 ఎంఎల్ఎస్ పాయింట్లలో కనీసం 150 చోట్ల అక్రమాలు జరుగుతున్నాయని, జిల్లా స్థాయిల్లోని అధికార యంత్రాంగం అండతో బియ్యం య థేచ్ఛగా గాయబ్ అవుతున్నాయని సంస్థకు చెందినవారే అంగీకరించడం గమనార్హం. -
నీటమునిగి నలుగురి మృత్యువాత
మనోహరాబాద్(తూప్రాన్): దుస్తులు ఉతికేందుకు చెరువుకు వెళ్లగా..అదే వారి పాలిట మృత్యుకుహరమైంది. బోనాల పండుగకు వచ్చిన తోటికోడళ్లు, కుటుంబసభ్యులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందారు. మూడు కుటుంబాల్లో పెను విషాదం నింపిన ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో ఆదివారం బోనాలు జరిగాయి. గ్రామానికి చెందిన ఫిరంగిలక్ష్మి ఇంట్లో జరిగిన ఈ వేడుకలకు ఆమె అన్నదమ్ములు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబర్‌పేట్‌కు చెందిన దుడ్డు యాదగిరి, శ్రీకాంత్‌లు భార్యాపిల్లలతో హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం దుస్తులు ఉతికేందుకు ఫిరంగిలక్ష్మి తన పెద్దకూతురు లావణ్య (23), సోదరుల భార్యలు దుడ్డు బాలమణి (30), దుడ్డులక్ష్మి(25), బాలమణి కుమారుడు చరణ్(10)తో కలిసి ఊర చెరువు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో చెరువులో ఆడుకుంటున్న చరణ్ ఒక్కసారిగా నీటి మునిగిపోయాడు. గమనించిన లావణ్య, బాలమణి, లక్ష్మిలు కాపాడేందుకు లోతుగా ఉన్న నీటిలోకి వెళ్లి వారు కూడా మునిగిపోయారు. గట్టుపై ఉన్న ఫిరంగి లక్ష్మి కేకలు వేస్తూ వారిని కాపాడేందుకు నీటిలోకి దిగింది. పట్టుతప్పి ఆమె కూడా నీటిలో మునిగింది. అటుగా వెళుతున్న ఓ యువకుడు గమనించి ఆమెను జుట్టు పట్టి బయటకు లాగడంతో ప్రాణాలతో బయటపడింది. బాలుడితోసహా నీటిలో మునిగిన లావణ్య, బాలమణి, లక్ష్మిని బయటకు తీయగా, అప్పటికే వారు విగతజీవులుగా మారారు. చరణ్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డీఎస్పీ యాదగిరిరెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, సర్పంచ్ నాగభూషణం, తూప్రాన్ పీఎసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
విషాదం.. బాలుడిని కాపాడబోయి ముగ్గురు మహిళలు..
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయి నలుగురు మృతిచెందారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వివరాల ప్రకారం.. మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లిలో విషాదం నెలకొంది. స్నానానికి వెళ్లిన ఓ బాలుడు చెరువులో మునిగిపోయాడు. ఈ క్రమంలో చెరువులో మునిగిపోతున్న బాలుడిని ఓ మహిళ కాపాడబోయింది. దీంతో, సదరు మహిళ కూడా చెరువులో పడి మునిగిపోయింది. వీరిద్దరూ గమనించిన మరో ఇద్దరు మహిళలు వీరిని కాపాడబోయి.. చెరువు నీటిలో మునిగి మృతిచెందారు. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో హుటాహుటిన చెరువు వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం, స్థానికుల సహాయంలో ముగ్గురు మహిళ మృతదేహాలను బయటకు తీశారు. బాలుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, వీరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇది కూడా చదవండి: విషాదాన్ని మిగిల్చిన ప్రయాణం -
తెలంగాణలో కుండపోత వర్షాలు.. అక్కడ స్కూళ్లకు సెలవులు
సాక్షి, నిజామాబాద్: రాష్ట్రంలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. రాజధానిలో ఆకాశం మేఘావృతమై ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహదీపట్నం, నాంపల్లిలో జల్లులు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. గత రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ నేడు సెలవు ప్రకటించారు. భారీ వానలతో పలుచోట్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అత్యధికంగా మోపాల్ మండలంలో 15.7 సెంటీమీటర్లు, ఇందల్వాయిలో 14.8, డిచ్పల్లి మండలం గన్నారంలో 14 సెంటీమీటర్ల వర్షం పడింది. 10 మండలాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సిరికొండ మండలం తుంపల్లిలో 6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. చీమన్ పల్లి, గన్నారం, దర్పల్లి, కమ్మర్ పల్లి, మెండోరా , మోర్తాడ్ లో 5 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదైంది. ఇక జిల్లాలో కురుస్తున్న కుండపోత వానలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజులపాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది కామారెడ్డి జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు తాడ్వాయి, బిక్కనూరు, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, రాజంపేట సదాశివనగర్ మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షాల ధాటికి పలు మండలాల్లో వరి పంట నీట మునిగింది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు చెరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చదవండి: మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో పోస్టర్లు తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో వాగు పొంగిపొర్లుతోంది. వాగు ప్రవహించడంతో టేక్రియాల్, బ్రాహ్మణపల్లి, సంగోజి వాడి, కాలోజివాడి, చందాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేగాక తాడ్వాయి మండలం సంతయిపేట గ్రామ శివారులోని భీమేశ్వర వాగు, పాల్వంచ మండలం వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. మెదక్ జిల్లా కౌడిపల్లిలో 8.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అయిదు రోజులు వర్షాలు అల్పపీడన ప్రభావంతో వచ్చే అయిదు రోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశముందని హైదాబాద్ వాతావరణశాఖ తెలిపింది. నేడు, రేపు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నారాయణపేట, నిజామాబాద్,పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.అదిలాబాద్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, గద్వాల్,కొమరం భీం, మహబూబబాద్,మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, నిర్మల్, రంగా రెడ్డి, సిద్దిపేట, సూర్యా పేట, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి ఎల్లో అలెర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. -
బీమా డబ్బు కోసం భార్యతో కలిసి.. కన్న తల్లినే..
పాపన్నపేట (మెదక్): రైతు బీమా డబ్బులకు ఆశపడి కన్నతల్లినే చంపాడో కిరాతకుడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో వెలుగుచూసింది. అన్నారం గ్రామానికి చెందిన ధనమ్మోల్ల శంకరమ్మ (57) పేరిట 23 గుంటల భూమి ఉంది. జీవనోపాధి కోసం కొడుకు ప్రసాద్‌కు ఆటో కొనిచ్చింది. దురలవాట్లకు బానిసైన కొడుకు డబ్బుల కోసం తరచూ తల్లితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో తల్లిని చంపితే రైతు బీమాతో పాటు డ్వాక్రా గ్రూపు బీమా డబ్బు వస్తుందని దురాలోచన చేశాడు. భార్య కవితతో కలిసి ఆగస్టు 29 తెల్లవారుజామున నిద్రలో ఉన్న శంకరమ్మను కండువాతో ఉరివేసి హతమార్చాడు. దీనిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. కానీ శంకరమ్మ మెడపై గాట్లు ఉండటం చూసిన ఆమె కూతుళ్లు మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీ సులు విచారించగా.. శంకరమ్మను తామే హత్య చేసినట్లు కొడుకు, కోడలు అంగీకరించారు. చదవండి: కోరుట్ల దీప్తి కేసులో కీలక పరిణామం -
తెలంగాణ రాష్ట్రాన్ని దుర్మార్గులకు అప్పగించవద్దన్న ముఖ్యమంత్రి కేసీఆర్..ఇంకా ఇతర అప్డేట్స్
-
మెదక్ నుంచే ప్రగతి శంఖారావం
మెదక్: రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు కొత్త పథకాలకు బుధవారం మెదక్ నుంచి శ్రీకారం చుట్టనుందని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. మంగళవారం ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీడీ ప్యాకర్లకు, టేకేదార్లకు ఆసరా పింఛన్లు, దివ్యాంగులకు రూ.4,016 పింఛన్ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. మెదక్ నుంచే ప్రగతి శంఖారావం పూరిస్తారని చెప్పారు. బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలోకి తెచ్చేలా ఇక్కడ బహిరంగసభ ఉంటుందని, ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు గెలిచి కేసీఆర్‌కు బహుమానంగా ఇస్తామని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలతో తమ ఆత్మవిశ్వాసం పెరిగిందని, విపక్షాలు మాత్రం విలవిల్లాడుతున్నాయని పేర్కొన్నారు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారి నుంచి కాంగ్రెస్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని హరీశ్ ఆరోపించారు. తెలంగాణ పథకాలను కేంద్రంసహా వివిధ రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని, బీసీ కుల వృత్తిదారులకు రూ.లక్ష అందిస్తుండగా, దీనిని కేంద్రం కాపీ కొట్టి విశ్వకర్మలకు రూ.లక్ష అప్పు ఇస్తామని ప్రకటించిందని పేర్కొన్నారు. కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని, బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అని కొత్త అర్థం చెప్పారు. సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం పర్యటన వివరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి గుమ్మడిదల, నర్సాపూర్, కౌడిపల్లి మీదుగా మెదక్ పట్టణానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ కార్యాలయం, 1.20 గంటలకు ఎస్పీ కార్యాలయం, 1.40 గంటలకు కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే బహి రంగ సభలో మాట్లాడతారు. ఏర్పాట్లను మంత్రి హరీశ్ పర్యవేక్షించారు. ప్రారంభానికి ముస్తాబైన జిల్లా పోలీసు కార్యాలయ సముదాయం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతోంది. కలెక్టరేట్ భవనం, లోపలి చాంబర్లను రంగు రంగుల పూలు, విద్యుత్ దీపాలతో సిబ్బంది అలంకరించారు. -
పటాన్చెరు: అన్ని పార్టీల్లో వర్గపోరు!
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో పటాన్ చెరు ఒకటి. వైవిధ్యమైన ప్రాంతంగా దీనికి పేరు ఉంది. ఇండియాలోని అన్ని ప్రాంతాల వారికి ప్రాతినిధ్యం కల్పించే ప్రాంతంగా ఉన్న ఇక్కడ బీఆర్ఎస్ రెండు సార్లు గెలిచింది. మరోవైపు ఈసారి ఎలాగైన సీటు దక్కించుకునేందుకు ప్రతిపక్షాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంతో పటాన్చేరులోని రాజకీయాలు ఆసక్తిగా మారాయి. నువ్వా-నేనా అన్నట్టు సొంత పార్టీ అభ్యర్ధులే పోటీ పడుతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా టికెటు తనకే అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. మూడు పార్టీల్లోనూ వర్గపోరు! మూడు పార్టీల్లో వర్గ పోరు నడుస్తోంది. ఈసారి పటాన్చేరు ఎన్నికలు వాడివేడిగా కొనసాగేలా ఉన్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్లో సైతం వర్గపోరు గట్టిగానే నడిచింది. కానీ అధిష్టానంలో తన మాట ప్రకారం ఈసారి సిట్టింగ్‌లకే టికెట్ కెటాయించింది. దాంతో పటాన్‌చేరులో అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి మరోసారి మహిపాల్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ఇక కాంగ్రెస్‌లో కూడా ఇద్దరు పోటీపడుతున్నారు. మెదక్ పార్లమెంట్ ఇంచార్జీగా ఉన్న గాలి అనిల్ కుమార్, పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య వర్గపోరు నడుస్తోంది. టికెట్ తనకంటే తనకే అంటూ పోటీ పడుతూ మరి ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. దాంతో అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తిని సంతరించుకుంది. బీజేపీ నుంచి నందీశ్వర్, గోదావరి అంజిరెడ్డి పోటీలో ఉన్నారు. టికెట్ విషయంలో తగ్గేదే లే అన్నట్టుగా నేతలు పోటీ పడుతున్నారు. పార్టీల్లో నెలకొన్ని వర్గపోరు అధిష్టానాలకు తలనొప్పిగా మారేలా ఉంది. టికెట్ల వ్యవహారంతో అసమ్మతి నెలకొనే అవకాశం ఉందని భయపడుతున్నారు. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు : 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉండడం వివిధ మతాల సాంప్రదాయాలు సంస్కృతులు నిలయం. రాజకీయానికి అంశాలు : పారిశ్రామిక వాడ కాబట్టి ఒక గ్రామ వార్డు సభ్యులు కావాలంటే అన్ని లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది, రాజకీయం చేయడం అంటే డబ్బులతో కూడిన వ్యవహారం ఈ విషయంలోనె కొంతమంది రాజకీయ నాయకులు వెనుకడుగు వేస్తున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : పారిశ్రామిక రంగం, రియల్ ఎస్టేట్ రంగం.హైదరాబాద్ పట్టణానికి కూత వేటు దూరం కాబట్టి విద్య, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండడంతో 29 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వివిధ రకాల సంస్కృతులు సాంప్రదాయాలు, కూడుకోని ఉంటాయి. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు : బీఆర్ఎస్ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ : కాట శ్రీనివాస్ గౌడ్, గాలి అనిల్ కుమార్ (పిసిసి వైస్ ప్రెసిడెంట్) బిజెపి: మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మాజీ జెడ్పిటిసి గడిల శ్రీకాంత్ గౌడ్ అమీన్పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ పారిశ్రామికవేత్త అంజిరెడ్డి. -
సంగారెడ్డి: బీఆర్ఎస్లో అయోమయ పరిస్థితి!
మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యంత ఆసక్తిని రేపే నియోజకవర్గం ఇది. ఇక్కడి ప్రజాతీర్పు భిన్నంగా ఉంటుంది. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే.. ఆరు సార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. ఇక.. బీఆర్ఎస్ రెండు సార్లు, బీజేపీ, టీడీపీ ఒక్కోసారి అధికారంలోకి వచ్చాయి. మళ్లీ కాంగ్రెస్ పట్టు సాధించేనా? కాంగ్రెస్‌లో స్ట్రాంగ్ లీడర్‌గా ఉన్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి(అలియాస్ జగ్గారెడ్డి) 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండ తన సొంత క్యాడర్‌తో దూసుకుపోయాడు. 2004లో ఆయన తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు. ఆ తర్వాత 2009, 2018లో మాత్రం కాంగ్రెస్ తరఫున గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు వరకు కాంగ్రెస్ సంగారెడ్డి అడ్డాగా ఉండేది. కానీ 2014 ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారింది. అక్కడ గులాబీ జెండ ఎగరింది. దాంతో సంగారెడ్డిలో కాంగ్రెస్ వీక్ అయ్యి బీఆర్ఎస్ బలపడినట్లు అనిపించింది. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి గెలుపొందడంతో సంగారెడ్డిపై మళ్లీ హస్తం పట్టు సాధించింది. ఇక తాజా పరిణామాలు ప్రకారం.. ఇప్పుడు జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో రాబోయే సంగారెడ్డి అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలిక సంగారెడ్డిలో ఉత్కంఠత నెలకొంది. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు : మహబూబ్ చెరువు, మంజీర డ్యామ్ రాజకీయానికి అంశాలు బీఆర్ఎస్లో అయోమయం కార్ ఓవర్ లోడ్ అధిక పోటీలో బిఆర్ఎస్ నాయకులు MLA జగ్గారెడ్డి బిఆర్ఎస్లోఇక వెళ్ళే సూచనలు ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు: రియల్ వ్యాపారం హైదరాబాద్‌కి దగ్గర ఉన్నా నియోజక వర్గంలో మౌలిక వసతుల విషయంలో పెద్దగా అభివృద్ధి లేకపోవడం రాజకీయ పార్టీల వారీగా ప్రధాన పార్టీల టికెట్ల ఆశిస్తున్నవారు బీఆర్ఎస్ చింతా ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే) కాంగ్రెస్ జగ్గారెడ్డి బిజేపి రాజేశ్వర్ రావు దేశ్ పాండే (బిజేపి నియోజక వర్గ ఇంచార్జ్) శివరాజ్ పాటిల్ నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : నదులు : మంజీర నది ఆలయాలు : వైకుంట పురం ఆలయం / ఇస్మాయిల్ ఖాన్ పేట భవానీ మాత ఆలయం -
జహీరాబాద్: కాంగ్రెస్ కంచుకోటలో విచిత్ర పరిస్థితి
ఉమ్మడి మెదక్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం జహీరాబాద్. ప్రస్తుతం ఇది సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు ఇది కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. సీనియర్ మహిళ నేత గీతారెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ గీతారెడ్డి గెలిచారు. కానీ ముందస్తు ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావ్ గెలుపుపొందారు. బీఆర్ఎస్కి భారీ వలసలు.. నేతల మధ్య కుమ్ములాట! 2014 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ నేతలు వరసగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండటంతో.. అధికార బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రధానంగా నలుగురు నేతలు పోటీ ఉన్నప్పటికి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేనే టికెట్ వరించింది. గీతారెడ్డి సైలెంట్ వెనక వ్యూహాం? మరోవైపు కంచుకోట కాంగ్రెస్‌లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నుంచి వరసగా బీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్న సీనియర్ నేత గీతా రెడ్డి పట్టనట్టు వ్యవహరిస్తున్నారట. అంతేకాదు ఈమె పార్టీని కూడా పెద్ద పట్టించుకోవడం లేదని సొంత పార్టీలోనే వాదనలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా నరోత్తం లాంటి సీనియర్ నేతే పార్టీ వీడిన ఆమె సైలెంట్‌గానే ఉన్నారు. భారీగా వలసలు పెరుగుతున్న ఆమె సైలెంట్‌గా ఉండటంపై మిగతా లీడర్లు సర్ప్రైజ్ అవుతున్నారు. ఆమె తీరు పార్టీ నేతలకు కూడా అంతుపట్టడం లేదు. గీతారెడ్డి సైలెంట్ వెనుక ఏదైనా వ్యూహం ఉందా? కావాలనే ఇలా ఉంటున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో ఆమె జహీరాబాద్ నుండి కాకుండా కంటోన్మెంట్ నుండి పోటీ చేయాలని చూస్తుందనే వార్త తెరపైకి వచ్చింది. అందుకే గీతారెడ్డి ఇక్కడ దృష్టి సారించడం లేదనే ఈ ప్రచారం తెరమీదకు వచ్చింది. దాంతో పక్క జిల్లాలు, పక్క నియోజకవర్గ నేతలు జహీరాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నారట. జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఫుల్ క్యాడర్ ఉన్న వారిని పట్టించుకునే లీడర్ లేకపోవడం అనేది విచిత్ర పరిస్థితే అని చెప్పాలి. ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలక అంశాలు: నిరుద్యోగ సమస్య యువతకు ఉపాధి NIMZ రైతుల సమస్య చెరుకు రైతుల సమస్య రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు డిమాండ్. మంజూరైన ఐ టి ఐ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు బీఆర్ఎస్: కే మానిక్ రావు (సిట్టింగ్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ పార్టీ: మాజీ మంత్రి జే గీతారెడ్డికే టికెట్ ఖాయమని భావిస్తున్నా, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బి నరేష్, కండేమ్ నర్సింహులు, మాజీ సర్పంచ్ గోపాల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ రాంచంద్ర రాజనర్సింహ, చింతల గట్టు సుధీర్ కుమార్ లు టికెట్ రేస్ లో ఉన్నారు. వృత్తిపరంగా ఓటర్లు.. నియోజకవర్గంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో, వ్యాపార రంగంలో ప్రజలు అధికంగా ఆధార పడి ఉన్నారు. వ్యాపార పరంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ రెండో స్థానంలో ఉంది. మతం/కులం పరంగా ఓటర్లు? ఓటర్ల పరంగా చూస్తే 35 శాతం ఉన్న ముస్లింలు రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు కులాల పరంగా SC- మాదిగ, లింగాయత్‌లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు నదులు : నియోజకవర్గంలో నారింజ వాగు, పెద్ద వాగు, వీరన్న వాగు లు ఉన్నాయి. ఆలయాలు: దక్షిణ కాశీగా పేరు గాంచిన జరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం, స్వయంభూగా వెలిసిన రేజీంతల్ శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం. నియోజకవర్గం గురించి ఆసక్తికర అంశాలు : ఇప్పటి వరకు ఎన్నికలు 15 సార్లు జరగగా వాటిలో ఏకంగా 13 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కేవలం రెండు సార్లు మాత్రమే నాన్ కాంగ్రెసు పక్షమైన టిడిపి, టి ఆర్ ఎస్ లు చెరో సారి గెలుపొందాయీ. 7 సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్. బాగా రెడ్డి ఇక్కడి నుండే ప్రాతినిద్యం వహించారు. రాజకీయాకపరమైన అంశాలు : కాంగ్రెసేతర పక్షాలు పెద్ద మెజారిటీ తో గెలుపొంది నా అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆ పట్టును నిలుపుకో లేదు. కాంగ్రెసు పార్టీ కి వ్యతిరేకంగా నిలబడ్డ రాజకీయ పక్షాలలో ఐక్యత లేకపోవడం, కాంగ్రెసు పార్టీ తన పట్టును కొనసాగించడానికి ముఖ్య కారణం. -
అందోల్‌లో వేడెక్కుతున్న రాజకీయం.. వ్యూహాలు ఫలించేనా?
తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన 2014 మొదటి సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబుమోహన్ కాంగ్రెస్ అభ్యర్థి అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహపై విజయం సాధించడం జరిగింది. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ ఆభ్యర్థిగా జర్నలిస్ట్ నాయకుడు మలిదశ ఉద్యమకారుడు చంటి క్రాంతి కిరణ్ కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర రాజనర్సింహపై విజయం సాధించారు. ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి అయితే విజయం సాధిస్తారో అదే పార్టీ ప్రభుత్వం చేపడుతోంది. వేడెక్కుతున్న రాజకీయం.. అధికార పార్టీలో పోటీలు! రోజు రోజుకు అందోల్‌లో రాజకీయం వేడెక్కింది. పోటీలో ఉండే నాయకులు టికెట్ల కోసం వారి, వారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటి సిఎం దామోదర్ రాజనర్సింహ పేరు ఖరారు అయినట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి బాబూమోహన్ బరిలో నిలిచారు. ఈ సారి ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కమలంలో కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక అధికార పార్టీలో ఈసారి సిట్టింగ్‌లకే టికెటు దక్కడంతో మరోసారి అందోల్ నుంచి క్రాంతి కిరణ్ పోటీకి సై అంటున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : నిరుద్యోగ సమస్య గ్రామీణ రోడ్ల సమస్య రైతులు పండించిన పంటలకు మద్దత్తు ధర లేకపోవడం పీజీ కళాశాలలో మౌళిక వసతుల లేమి మున్సిపల్‌కు సొంత భవనం లేకపోవడం రాజకీయ పార్టీల ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు: బీఆర్ఎస్ చంటి క్రాంతి కిరణ్ (సిట్టింగ్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ బీజేపీ మాజీ మంత్రి పల్లి బాబుమోహన్ జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ బాలయ్య టికెట్ రేసులో ఉన్నారు. వృత్తి పరంగా ఓటర్లు: నియోజకవర్గంలో ప్రధానంగా ఎక్కువ మంది ప్రజలు రైతాంగంపైనే ఆధారపడి ఉన్నారు. కొంత శాతం మంది వ్యాపారంపై ఆధారపడి ఉన్నారు. వ్యాపార పరంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జోగిపేట మున్సిపాలిటీ ముందంజలో ఉంది. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు నదులు: మంజీరా అత్యంత కీలకమైనది. మంజీరా నదిపై సింగూరు జలాశయం 30 టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన ప్రాజెక్టు జంట నగరాల దాహార్తి తిరుస్తూ సంగారెడ్డి మెదక్ జిల్లాల రైతులకు సాగునీటి అవసరాలు తిరుస్తుంది. ఒక్క అందోలు నియోజకవర్గంలో ఎడమ కాలువ ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. సింగూరు పర్యాటక కేంద్రంగా విరజిల్లుతుంది. ఆలయాలు: ఉత్తర తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా పేరుగాంచిన అందోలు మండలంలోని కిచ్చన్నపల్లిలో దేవాలయం కలదు. అల్లాదుర్గం మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం అదే విధంగా అక్కడే బేతాళ స్వామి ఆలయం అత్యంత ప్రతిష్ట గాంచినవి. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు : ఇప్పటి వరకు అందోలు నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగగా మొదటి సారి జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి జోగిపేటకు చెందిన బసవ మామయ్య విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సార్లు విజయం సాధించగా టీడీపీ నాలుగు సార్లు విజయం సాధించింది. తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక బీఆర్ఎస్ రెండు సార్లు విజయం సాధించింది. రాజకీయానికి సంబంధించి ఇతర అంశాలు : 1957 లో మొదటిసారిగా ఏర్పడిన అందోలు నియోజకవర్గం మొదటి రెండు పర్యయాలు జనరల్ స్థానంగా ఉండి 1967 లో ఎస్సి రీజర్వు స్థానంగా ఏర్పడింది. 1957 లో జోగిపేటకు చెందిన ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు బసవ మనయ్య కాంగ్రెస్ అభ్యర్ధి రూక్ ఎండి.రూక్ మోద్దీన్ పై విజయం సాధించడం జరిగింది. 1962 లో లక్షిదేవి గారు కాంగ్రెస్ పార్టీ తరుపున స్వతంత్ర అభ్యర్థి బసవ మణయ్య పై విజయం సాధించారు. 1967 లో ఎస్సి రిజర్వుడ్ గా ఏర్పడిన తరువాత సిరారపు రాజనర్సింహ కాంగ్రెస్ పార్టీ తరుపున స్వతంత్ర అభ్యర్థి ఈశ్వరప్ప పై విజయం సాధించారు. 1972 లో రాజనర్సింహ కాంగ్రెస్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థి లక్మన్ కుమార్ పై విజయం సాధించారు. 1978 లో మరో మారు రాజనర్సింహ ఎమ్మెల్యేగా విజయం సాధించారు 1983 లో టిడిపి తరుపున ఆల్ దేకర్ లక్మన్ జి ఈశ్వరి భాయ్ పై విజయం సాధించడం జరిగింది 1985 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున మాల్యాల రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థి రాజనర్సింహ పై గెలుపొందడం జరిగింది. 1989 లో కాంగ్రెస్ పార్టీ తరువున దామోదర రాజనర్సింహ పోటి చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాల్యాల రాజయ్య పై విజయం సాదించారు. 1994 లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాల్యాల రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ పై గెలుపొందారు. 1998 లో అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కొనసాగుతున్న మాల్యాల రాజయ్య సిద్ధిపేట ఎంపీగా గెలుపొందడంతో జరిగిన బై ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గా సినీ యాక్టర్ బాబుమోహాన్ గెలుపొందారు. 1999 లో జనరల్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాబుమోహన్ కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ పై మరోమారు గెలుపొందడం జరిగింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ తెలుగుదేశం అభ్యర్థి బాబుమోహన్ పై రెండు సార్లు వరుసగా విజయం సాధించి ప్రాథమిక ఉన్న విద్యాశాఖలతో ఉప ముఖ్యమంత్రి గా కావడం జరిగింది. -
అభివృద్ధిలో ఆదర్శంగా నారాయణఖేడ్.. బీఆర్ఎస్కే అధికార పగ్గాలా?
మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, నారాయణ్‌ఖేడ్ మండలానికి చెందిన గ్రామం ఇది. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018 ఆగస్టు 2న నారాయణఖేడ్ పురపాలక సంఘంగా ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం తొమ్మిది ఏళ్లలోనే ఊహించని ప్రగతి సాధించి ఆదర్శంగా నిలుస్తుంది. వేలకోట్లతో ఇక్కడ అభివృద్ధి పనులు చేపడుతుండడంతో అన్ని వర్గాల ప్రజలకు వసతులు సమకూరుతున్నాయి. నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశాలు : అత్యధికంగా గిరిజన తాండాలు కలిగిన ఖేడ్ నియోజకవర్గం కాబట్టి ఉపాధి కోసం వలసలు పరిశ్రమలు ఇతర ఉద్యోగ అవకాశాలు లేకపోవడం కారణంగా నిరుద్యోగ యువత ఎక్కువ ఉంది. ఉపాధి కల్పన నైపుణ్య విద్య సాంకేతిక విద్య అందుబాటులో లేకపోవడం మౌలిక వసతుల్లో భాగంగా గ్రామాల అభివృద్ధి సరిఅయిన రవాణా సౌకర్యం లేకపోవడం కంగ్టీ, నాగలిగిద్ద సిర్గాపూర్, మండలాల రైతులకు సాగునీటి సౌకర్యం లేకపోవడం రాజకీయ పార్టీల వారీగా ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు : బీఆర్ఎస్ మహా రెడ్డి భూపాల్ రెడ్డి (ప్రస్తుతం ఎమ్మెల్యే ) కాంగ్రెస్ సురేష్ కుమార్ షెత్కర్ పట్లోల సంజీవరెడ్డి ( Ex MPP పిసిసి ఉపాధ్యక్షులు ) బీజేపీ మహా రెడ్డి విజయపాల్ రెడ్డి జన్వాడ సంగప్ప ( అధికార ప్రతినిధి ) వృత్తిపరంగా ఓటర్లు మత్స్యకారులు 16 % పంచకర్మలు 5% కుమ్మరి 2% మంగలి 2% చాకలి 3 % యాదవులు 10 % SC లు 12 % ST లు 16 % మైనార్టీలు 12% ఇతరులు 22 % నియోజకవర్గంలో ఆసక్తికర అంశాలు : ► వార్ కార్ సాంప్రదాయం, కన్నడ తెలుగు మరాఠీ ఉర్దూ తదితర భాషల ప్రయోగం. ► రాజకీయానికి సంబంధించి ఇతర ఏవైనా అంశాలు : షట్కార్, మహారెడ్డి, పట్లోళ్ల కుటుంబాల రాజకీయ వారసత్వం. భౌగోళిక పరిస్థితులు : నదులు : కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం, మంజీరా నది, నల్ల వాగు మధ్యతర ప్రాజెక్టు అడవులు: కడపల్ అటవీ ప్రాంతం ఆలయాలు : కొండాపూర్, పంచగామా, కోర్పోల్, అంతర్గాం, దామరగిద్ద రామాలయం పర్యాటకం : నారాయణఖేడ్, కంగ్టీ,పెద్ద శంకరంపేట్, నిజాంపేట్, మంజీరా నది తీర ప్రాంతం -
దుబ్బాక: ఓటర్ల తీర్పెటు? బీఆర్ఎస్లో హైటెన్షన్
దుబ్బాక నియోజకవర్గంలో నాల్గవసారి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాదించినప్పటికి ఆయన అనారోగ్యంతో 2020లో కన్నుముశారు. ఆ కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావు టీఆర్ఎస్ అభ్యర్ధి, దివంగతుడు అయిన రామలింగారెడ్డి సతీమణి సుజాతను కేవలం 1,079 ఓట్ల తేడాతో ఓడించి సంచలన విజయం అందుకున్నారు. ఎమ్. రఘునందన్‌రావుకు 63352 ఓట్లు రాగా, సుజాతకు 62273 ఓట్లు వచ్చాయి. దుబ్బాక నియోజకవర్గం నుండి పోటీలో ఉండొచ్చు అని భావిస్తున్న అభ్యర్థులు: బీజేపీ పార్టీ: మాధవనేని రఘునందన్ రావు (ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే) బీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రభాకర్ రెడ్డి (ప్రస్తుత మెదక్ ఎంపీ) కాంగ్రెస్ పార్టీ: చెరుకు శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ముత్యం రెడ్డి కుమారుడు కత్తి కార్తీక డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి ఎన్నికలలో ప్రభావితం చేసే అంశాలు: దుబ్బాక నియోజకవర్గం లో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. కావున వచ్చే ఎన్నికల్లో మహిళ ఓట్లే కీలకం కానున్నాయి.. నిత్యవసర వస్తువుల ధరలు, సిలిండర్ ధరలు, బస్సు చార్జీలు, కరెంటు బిల్లులు విపరీతంగా పెరగడంతో ఇల్లు గడపడం కుటుంబ ఖర్చులు కొనసాగించడం కష్టంగా ఉందని మహిళలు భావిస్తున్నారు. మహిళలకు డ్వాక్రా రుణాలు, అర్హులందరికీ రెండు పడకల గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వదలచిన మూడు లక్షలు ఇల్లు నిర్మాణానికి సరిపోవని మహిళలు భావిస్తున్నారు. నూతన మండలాలైన భూంపల్లి,రాయపొల్ మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఆయా వర్గాలకు కులస్తులకు ఇస్తున్న ఆర్థిక సహాయం పథకాలు అన్ని వర్గాలకు వర్తింపజేయాలని అన్ని కులస్తులకు వర్తింపజేయాలని కోరుతున్నారు. విద్యాలయాలు, ఆసుపత్రులు నూతన భవనాలు నిర్మించి వాటిలో సిబ్బందిని పెంచాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు సామాన్యులకు విద్యా వైద్యం అందాలని కోరుతున్నారు. ధరణి లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని లేదా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాల కల్పన చేయాలని ఈ ప్రాంత నిరుద్యోగులు కోరుతున్నారు. దుబ్బాక నియోజకవర్గం లోని ఆయా మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలు నెలకొల్పాలని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు -
గజ్వేల్: ఆ సెంటిమెంట్‌దే ఎప్పుడూ విజయం!
గజ్వేల్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను రాష్ట్రాధినేతగా నిలబెట్టింది ఈ నియోజకవర్గమే. విభిన్న సంస్కృతికి నిలయంగా పేరుగాంచిన నియోజకజవర్గం గజ్వేల్. ఎందరో ఉద్యమకారులకు, కవులు, కళాకారులకు జన్మనిచ్చిన గడ్డ. వివిధ మతస్థులు జాతుల సంగమంతో ఈ నియోజకవర్గాన్ని మినీ ఇండియాగా అభివర్ణిస్తారు. రాజకీయ పార్టీలకు ఆ సెంటిమెంటే: కేసీఆర్ ఇలాకాగా అభివర్ణించే ఈ నియోజకవర్గానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది స్థానికేతరులకు అచొచ్చిన నియోకవర్గం. 1952లో ఎమ్మెల్యేగా గెలిచిన పెండెం సుదేవ్ నుంచి 2014లో గెలిచిన కేసీఆర్ వరకు అంతా స్థానికేతరులే. అలాగే ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో అదే అధికారంలోకి రావడం మరో విశేషం. గత 13 ఎన్నికలు పరిశిలీస్తే అదే జరిగింది. దాంతో ఈ సెంటిమెంట్‌ను రాజకీయవర్గాలు అన్ని కూడా బలంగా నమ్ముతున్నాయి. ఇక 1952లో ఎమ్మెల్యేగా గెలిచిన పెండెం వాసుదేవ్, 1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో పనిచేసిన జేబీ ముత్యాలరావు, ఆర్.నరసింహారెడ్డి కూడా స్థానికేతరులే. ఆ తర్వాత 1962లో నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో ఎస్సీలు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత 1983లో అల్లం సాయిలు, 1985లో సంజీవరావు, 1989, 2004లలో డాక్టర్ జె గీతారెడ్డి, 1994లో డాక్టర్ జి విజయరామారావు, 1999లో సంజీవరావులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరంతా స్థానికేతరులే కావడం విశేషం. 2009లో జనరల్.. సీటు కొట్టేసిన కేసీఆర్! 2009లో జరిగిన ఎన్నికల్లో తూంకుంట నర్సారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందడమే కాకుండా స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గానికి కేసీఆర్ కూడా స్థానికేతరులే కావడం విశేషం. వాస్తవానికి 2008లోనే సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో పాగా వేశారు. ఇక్కడ ఫాంహౌజ్ ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేస్తూ తన ఇలాకాగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనగా తీర్చిదిద్దుతున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు భూ సేకరణ (జలశాలయాల నిర్మాణంకోసం,కంపెనీల ఏర్పాటు కోసం) సామాన్యుల సమస్యలు పరిష్కారం లేకపోవడం రోడ్లు,పెద్ద భవనాలు తప్ప సామాన్యులకు లబ్ది చేకూరలేదనే అపవాదు రాజకీయ పార్టీల వారిగా పోటీ : బీఆరెస్ పార్టీ కేసీఆర్(బీఆరెస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి) కాంగ్రెస్ పార్టీ తుంకుంట నర్సారెడ్డి(జిల్లా అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే) మాదాడి జశ్వంత్ రెడ్డి(టీపీసీసీ మెంబర్,సీనియర్ నాయకుడు రంగారెడ్డి తనయుడు) బండారు శ్రీకాంత్ రావు(టీపీసీసీ ప్రధాన కార్యదర్శి) -
సిద్దిపేట: తిరుగులేని తన్నీరు హరీష్‌రావు
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిద్దిపేట ఒకటి. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సిద్దిపేట అసెంబ్లీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR), మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరు సార్లు వరుసగా విజయాలు సాధించిన ఘనత ఇక్కడ ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సిద్ధిపేట ఎమ్మెల్యేగా బీఆర్ఎస్కు చెందిన హరీష్ రావు గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి శ్రీనివాస్ గౌడ్‌పై 80వేల ఓట్ల మెజార్టీతో హరీష్ రావు గెలిచారు. కులాల వారిగా ఓటర్లు శాతం ► ఎస్సీలు : 38.23 % ► ఎస్టీలు : 9.14 % ► బీసీలు : 41.94 % ► ఇతరులు : 10.69 % అభ్యర్థుల బలాలు, బలహీనతలు: 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కి చెందిన తాడూరి శ్రీనివాస్ గౌడ్‌పై 80,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయనకు 1,17,091 ఓట్లు రాగా, గౌడ్‌కు 36,280 ఓట్లు వచ్చాయి. హరీశ్‌రావు సిద్దిపేటలో ప్రజాభిమానం కలిగిన నాయకుడు, నియోజకవర్గ అభివృద్ధిలో తనవంతు కృషిచేశారనే పేరు ఉంది. సిద్దిపేట సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సిద్దిపేట విమానాశ్రయం, సిద్దిపేట పారిశ్రామిక పార్కుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రాంతానికి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిగానూ, టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. -
కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన వాయిదా పడింది. అయితే, వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్.. పర్యటనను వాయిదా వేసినట్టు సమాచారం. కాగా, సీఎం కేసీఆర్ ఈనెల 19వ తేదీన మెదక్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. వాతావరణ శాఖ అధికారుల సూచనతో వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 19కి బదులుగా 23వ తేదీన మెదక్ జిల్లాలో పర్యటించనున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. గేట్లు క్లోజ్ చేసిన పోలీసులు.. -
దడ పుట్టిస్తోన్న చెడ్డీ గ్యాంగ్.. అపరిచితుల హల్చల్..
సంగారెడ్డి: చెడ్డీ గ్యాంగ్.. గేటెడ్ కాలనీవాసుల్లో దడ పుట్టిస్తోంది. వారం రోజుల క్రితం అమీన్పూర్ శివారులోని ప్రణీత్ హోమ్స్‌లో జరిగిన దొంగతనం కలకలం రేపింది. చెడ్డీలు వేసుకున్న కొందరు అమీన్పూర్ పట్టణంలోని పలు కాలనీలో సంచరిస్తున్నట్టు సీసీ కెమెరాల్లో గుర్తించారు. 2022 మార్చి, ఏప్రిల్ లోనూ ఈ గ్యాంగ్ హల్చల్ చేసింది. ఇప్పటివరకు ఆ గ్యాంగ్‌లోని ఏ ఒక్కరిని పోలీసులు గుర్తించలేదు. తాజాగా మళ్లీ దొంగతనాలు జరగుతుండడంతో కాలనీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీలే లక్ష్యం.. అమీన్పూర్, లింగంపల్లి పరిసర ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాల్లో కనిపిస్తున్న దొంగలు ఎవరనేది నేటికీ వెల్లడి కాలేదు. అయితే ఇటీవల బీరంగూడ ప్రణీత్ హోమ్స్‌లో జరిగిన చోరీని పరిశీలిస్తే తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేశారని తెలుస్తోంది. అది కూడా ముందుగా తమకు అందిన సమాచారం మేరకే ఆ ఇళ్లలో చోరీకి పాల్పడినట్టు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఈ కాలల్లో పనిచేసిన వారు, పరిసరాలు తెలిసినవారే దొంగతనాలకు పాల్పడుతున్నారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే కొందరు నేరస్తులు అమీన్పూర్లో తలదాచుకుంటున్నారని గతంలో జరిగిన కొన్ని కేసుల్లో గుర్తించారు. రాయలసీమ ప్రాంతంలో ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు పోలీసులు కళ్లు గప్పి అమీన్‌పూర్‌లోని గేటెడ్ కమ్యూనిటీలో స్థిరపడ్డాడు. అతడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. మరో సంఘటనలో కొద్దిరోజుల క్రితం ఇద్దరి మహిళలను అపహరించి ఇక్రిశాట్ కాలనీలోని ఓ ఇంట్లో దాచి ఉంచారు. వారి అరుపులు విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిని బట్టి చూస్తే ఈ ప్రాంతంలో నేరస్తులు ఆశ్రయం పొందుతున్నారని తెలుస్తోంది. కొన్నిసార్లు 100కు ఫోన్ చేసినా స్పందన కరువైందని అమీన్పూర్ వాసులు ఆరోపిస్తున్నారు. రాత్రిపూట పోలీసులు వాహనాలు సంచరించడం లేదని చెబుతున్నారు. కాలనీల్లో గస్తీ పెంచాం.. అమీన్పూర్ పరిధిలో దొంగలు సంచరిస్తున్న నేపథ్యంలో గస్తీ పెంచాం. గేటెడ్ కమ్యూనిటీలతో పాటు వివిధ కాలనీల సెక్యూరిటీని అప్రమత్తం చేస్తున్నాం. అపరిచిత, కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించాం. ప్రణీత్, ప్రణవ్ పనోరమలో చోరీకి పాల్పడిన వారిపై నిఘా ఉంచాం. త్వరలోనే వారిని పట్టుకుంటాం. – శ్రీనివాసులురెడ్డి, అమీన్పూర్ సీఐ -
నర్సాపూర్‌పై నలుదిక్కుల నజర్..
మెదక్: సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నర్సాపూర్ నియోజకవర్గంపై బీసీ నాయకులు దృష్టి సారించారు. అసెంబ్లీ టికెట్‌ను తమ సామాజిక వర్గానికి కేటాయించాలనే డిమాండ్‌తో ప్రయత్నాలు ప్రారంభించారు. జనాభాలో అధిక శాతం ఉన్న తమకు పార్టీలు ప్రాధాన్యం ఇవ్వాలంటూ జిల్లాలో ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో బహిరంగంగానే ప్రకటించారు. మరోవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు టికెట్లు కేటాయించేందుకు సముఖంగా ఉండడం కూడా వీరికి కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు. దీనికి అనుగుణంగా జిల్లాలోని బీసీ నాయకులు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిని పోటీలో ఉంచేందుకు పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ నుంచి.. నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యే మదన్ రెడ్డి మరోసారి పోటీకి సై అంటుండగా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్, మాజీ మంత్రి సునీతారెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారు. కాగా బీసీ కోటాలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు, శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ టికెట్ ఆశిస్తున్నారు. 2014, 2018లో రెండు సార్లు ఎంపీపీగా ఎన్నికై న హరికృష్ణ ప్రస్తుతం రేసులో ఉన్నారు. బీజేపీలో.. బీజేపీ రాష్ట్ర నాయకుడు సింగాయిపల్లి గోపి గతంలో రెండుసార్లు పోటీ చేశారు. మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. బీసీ కోటాలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీ యాదవ్ సైతం టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం గోపికి ఉంది. ఆయన భార్య రాజమణి ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పని చేశారు. కాంగ్రెస్‌లో.. కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, ఉపాధ్యక్షుడు, మెదక్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్చార్జ్ గాలి అనిల్‌కుమార్ సైతం టికెట్‌పై దృష్టి పెట్టారు. విస్తృతంగా పర్యటిస్తు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సొంత నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నుంచి అవకాశం దొరకకుంటే నర్సాపూర్ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
వచ్చినవాడు గద్దర్.. ఆ హెడింగ్ చూసి ఆశ్చర్యపోయాం!
వచ్చినవాడు గద్దర్.. ఇది 1982లో ఒక పత్రికలో వచ్చిన శీర్షిక.. అప్పటికే జర్నలిస్టుగా ఉన్నప్పటికీ నాకు అంతవరకు అసలు గద్దర్ అంటే ఎవరో తెలియదు. కానీ ఆ వార్త చూశాక ఆయన గొప్పదనం ఏమిటో చూడాలని తిరుపతిలో జరిగిన సభకు వెళ్లాను. అక్కడ వేలాది మంది జనం ఉన్నారు. గద్దర్ వేదిక ఎక్కి గజ్జె కట్టి పాటలు పాడుతుంటే మైమరచిపోయామంటే అతిశయోక్తి కాదు. నిజానికి అవన్నీ విప్లవ ఉద్యమానికి సంబంధించిన గేయాలు. వాటిలో అత్యధికం ఆయన స్వయంగా రాసి పాడిన పాటలు. పై చొక్కా తీసివేసి ఒక నల్ల దుప్పటి భుజాన వేసుకుని పాట పాడడం, దానికి అనుగుణంగా డాన్స్ చేయడం సరికొత్త బాణిగా కనిపిస్తుంది. బ్యాంక్ ఉద్యోగం చేస్తూ విప్లవోద్యమంలోకి వెళ్లడం, తిరిగి ఆయన బయటకు వచ్చి పాటకు అంకితం అవడం గొప్ప విషయం. ఆయన ఒక స్కూల్ కూడా నడిపారు. నక్సలిజం నుంచి బయటకు వచ్చినా ఆ బాటను ఆయన పూర్తిగా విడిచిపెట్టలేదు. వారి తరపున ఒక సాంస్కృతిక వారధిగా ఆయన పనిచేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్కౌంటర్లు జరిగినా అక్కడకు వెళ్లి వారి కుటుంబాలకు అండగా నిలబడేవారు. ఒక మాటలో చెప్పాలంటే జానపద, విప్లవ గేయాల రచనలో, వాటిని ప్రజలలోకి తీసుకువెళ్లిన తీరు గద్దర్‌కు ముందు, గద్దర్‌కు తర్వాత అన్న చందం అని చెప్పడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు. ఆయన పాటలలో ఎల్లప్పుడూ అట్టడుగు, అణగారిన ప్రజల వాయిస్ వినిపిస్తుంటుంది. ‘మా భూమి’ సినిమాలో బండెనక బండి కట్టి ఏ బండ్లో వస్తవు కొడకా.. నైజాం సర్కరోడా అంటూ ఆయన చేసిన అలాపన ఎప్పటికీ ప్రజల చెవుల్లో రింగురింగుమంటూనే ఉంటుంది. అదేకాదు. ఎన్నియలో.. ఎర్రెర్రని జెండా ఎన్నియలో.. యంత్రమెట్ల తిరుగుతుందంటే.. నీ పాదం మీద పుట్టుమచ్చనై.. ఇలా ఒకటేమిటి అనేకం ఉన్నాయి. వాటిలో భావం, భాష అద్బుతంగా ఉంటాయి. చిన్నచిన్న పదాలతో ప్రజలందరికి అర్ధం అయ్యేరీతిలో ఆయన పాడే వైనం అపురూపం అని చెప్పాలి. గద్దర్ వేదిక ఎక్కితే ఒక సింహం మాదిరిగా ఉంటుంది. ఆయన పల్లవి ఎత్తుకుంటే అందరిని కదలించివేస్తుంది. అంతా మమేకం చెందవలసిందే. సాహిత్యం, సంగీతం కలిపి ఆయన సరికొత్త పాటను సృష్టించారు. ఆ రోజుల్లో గద్దర్ పాటల క్యాసెట్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. అందులోని సాహిత్యం విప్లవానికి సంబంధించింది అయినా, అందులోని భావజాలంతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా, ఆ పాటలలోని స్పూర్తి అందరిని ఆకట్టుకునేది. చాలాకాలం విప్లవోద్యమానికి బహిరంగ ప్రజాస్వరం మాదిరి వ్యవహరించారు. చదవండి: గద్దర్‌కు ఎన్నో ఆహ్వానాలు.. అయినా విమానం ఎక్కలేదు, విదేశాలకు పోలేదు తర్వాత కాలంలో ఆయన దానికి పూర్తిగా దూరం అయినా, విప్లవ భావజాలం, పేదలు, బలహీనవర్గాల కష్ట, సుఖాలపై తన అనురక్తిని మాత్రం వీడలేదు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 1997లో ఆయనపై కాల్పులు జరిగాయి. అది పోలీసుల పనే అని, ఆనాటి ప్రభుత్వమే ఆయనపై హత్యకు కుట్ర పన్నిందని పలువురు ఆరోపించేవారు. ఆ కాల్పులలో బులెట్ ఆయన వెన్నులో దిగింది. అయినా అదృష్టవశాత్తు ఆయన బతికి బయటపడ్డారు. ఆయన ఆ బుల్లెట్‌తోనే జీవితం గడిపారు. దానివల్ల ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలకు గురి అయినా తన వాణిని మాత్రం జనంలో వినిపించడానికి వెనక్కి తగ్గలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒకటి, రెండుసార్లు గద్దర్ కలవడం పెద్ద వార్త అయ్యేది. వైఎస్ చేపట్టిన ఆరోగ్యశ్రీ వంటివాటిని ఆయన మెచ్చుకునేవారు. అలాగే వైఎస్ పీపుల్స్ వార్ తీవ్రవాదులతో శాంతి చర్చలు జరపడం ఒక చరిత్ర. వాటన్నిటిలో ఆయనకు ఒక పాత్ర ఉండేది. ఆ క్రమంలోనే వైఎస్సార్ ఆనాటి మంత్రి కోనేరు రంగారావు ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి వారి డిమాండ్లపై అధ్యయనం చేయించేవారు. వాటిలో ఆచరణసాధ్యమైనవాటిని ఆయన అమలు చేసేందుకు యత్నించారు. గద్దర్‌కు వేలాది మంది ఏకలవ్య శిష్యులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆయన మాదిరి పాడాలని, ఆయన మాదిరి ఎగెరెగిరి డాన్స్ చేయాలని, ఉచ్చస్వరంతో పలకాలని చాలామంది కోరుకునేవారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక నిరసన కార్యక్రమాలలో కాని, రాజకీయ పార్టీల సభలలోకాని, పండగలు, పబ్బాలు జరిగినప్పుడు కాని, ఇలా ఏ సందర్భం అయినా గద్దర్ తరహా పాటలు పాడడం ఒక సంస్కృతిగా మారిందంటే ఆశ్చర్యం కాదు. తెలంగాణ ఉద్యమానికి ఆయన అంకితం అయి పనిచేశారు. పోరు తెలంగాణమా.. అంటూ ఆయన రాసిన పలు గీతాలు ఉర్రూతలూగించాయి. చదవండి: ‘బండెనుక బండి కట్టి... పదహారు బండ్లు కట్టి’ ఈ ఉద్యమంలో గద్దర్ బాణినే అన్ని చోట్ల మారుమోగుతుండేది. తెలంగాణ ఉద్యమకారులు ఈ పాటలు విని ఉర్రూతలు ఊగేవారు. కాగా తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకు రావల్సినంత గుర్తింపు రాలేదనిపిస్తుంది. కారణం ఏమైనా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పలు కార్యక్రమాలు చేపట్టారు. వివిధ రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్దపడ్డారు. సొంతంగా పార్టీ పెట్టడానికి ఈ మధ్య డిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా వెళ్లి వచ్చారు. ఆయన రాజకీయాల సంగతి ఎలా ఉన్నా , గద్దర్ పాట ఎప్పటికి చిరస్మరణీయంగానే ఉంటుంది. గద్దర్ కేవలం తెలంగాణ ఆస్తి మాత్రమే కాదు. తెలుగు ప్రజలందరి సొత్తు అని చెప్పాలి. అందుకే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన సంతాప సందేశంలో గద్దర్‌ను ఒక సామాజిక న్యాయ ప్రవక్తగా అభివర్ణించారు. గద్దర్ పాటకు మరణం లేదు. గద్దర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పాట రూపంలో ఎప్పటికీ మన మధ్యే జీవించే ఉంటారు. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
తెలంగాణలో టమాటాలు చోరీ.. తెల్లారేసరికి బాక్స్‌లు మాయం
సాక్షి, జహీరాబాద్: దేశవ్యాప్తంగా టమాటాలకు ఎంతో డిమాండ్ ఉందో తెలిసిందే. కొన్ని కిలో టమాటాల ధర ఏకంగా రూ.200లకు పైనే పలికింది. ఈ క్రమంలో కొందరు టమాట రైతులు కోట్ల రూపాయలు సంపాదించారు. ఇక, టమాటకు భారీ ధర పలుకుతున్న నేపథ్యంలో తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమ్ముకుందామని కూరగాయల మార్కెట్‌కు తెచ్చిన టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లడంతో ఓ రైతు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల ప్రకారం.. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్‌కు చెందిన ఓ రైతు టమాటాలు అమ్మడానికి పట్టణంలో కూరగాయల మార్కెట్‌కు తాను పండించిన టమాటాలను తీసుకువచ్చాడు. కాగా, శుక్రవారం రాత్రి టమాటా ట్రేలను దుకాణంలో ఉంచి ఇంటికి వెళ్లాడు. అయితే, శనివారం తెల్లవారుజామునే వచ్చి చూసేసరికి రూ.6,500 విలువైన మూడు టమాటా ట్రేలు కనిపించలేదు. అవి దొంగతనానికి గురయ్యయాయని గుర్తించిన రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా హెల్మెట్ పెట్టుకున్న ఓ వ్యక్తి టమాటా ట్రేలను ఎత్తుకెళ్తు గుర్తించారు. ఇక, అతడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా పలు చోట్ల టమాటాలు చోరీకి గురైన ఘటనలు చాలానే జరిగాయి. ఇటీవలే.. మహారాష్ట్రలోని పుణెలో అరుణ్ ధామ్ తన పొలంలో పండిన 400 కిలోల టమాటాలను పెట్టెల్లో సర్ది వాటిని రాత్రి ఒక వాహనంలో ఉంచి ఇంటి ముందు పార్క్ చేశాడు. ఉదయం వాహనాన్ని మార్కెట్‌కు తీసుకెళ్దామని చూడగా టమాటాలున్న బాక్స్‌లన్నీ చోరీ అయ్యాయి. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక, తమిళనాడులో కూడా విలువైన టమాటాలు చోరీకి గురయ్యాయి. ఇది కూడా చదవండి: 5 కోట్లు గెలిచి 58 కోట్లు పోగొట్టుకున్న అభాగ్యుడు.. -
పంపిణీకి నోచని డబుల్ బెడ్రూం ఇళ్లు..!
మెదక్: దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వని చందంగా మారింది డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల పరిస్ధితి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా ఇళ్లు కట్టివ్వలేదు. హుస్నాబాద్ పట్టణంలో మొదటి విడతగా 160 ఇళ్లు, రెండో విడతకు 400 డబుల్ బెడ్రూం పంపిణీకి మంజూరు చేసింది. పట్టణ శివారులో జీప్లస్ టూ పద్ధతిన ఇళ్లు నిర్మించారు. ఎన్నో ఏళ్ల సొంతింటి కల నేరవేరిందని సంతోషం పడుతున్న లబ్ధిదారులకు కలగానే మిగిలింది. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇళ్ల మంజూరునకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా, 1426 వచ్చాయి. ప్రస్తుతం 264 ఇళ్లు పూర్తికాగా మిగిలినవి చివరి దశలో ఉన్నా యి. లబ్ధిదారుల ఇళ్ల మంజూరునకు జిల్లా అధికా రులు సర్వే నిర్వహించారు. తొలి విడతలో 480 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. ఈ క్రమంలో జా బితాలో అనర్హులు ఉన్నారంటూ లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు రీ సర్వే చేపట్టారు. ఈ రీసర్వేలో 189 మందిని అనర్హులుగా గుర్తించి తొలగించారు. మొత్తం 560 ఇళ్లకు గాను 264 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. ఈ 264 ఇళ్లకోసం మొత్తం 342 మందిని ఎంపిక చేశారు. దీంతో మార్చి 22న డ్రా తీయగా, 264 మందికి ఇళ్ల పంపిణీ చేశారు. 78 మందికి నిరాశే మిగిలింది. 20 నుంచి 30 ఇళ్లు మిగిలాయి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి. దాదాపు 20 నుంచి 30 ఇండ్లకు సంబందించి చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. ఇప్పటికే పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సతీష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే లభ్దిదారులకు పట్టాలు ఇప్పించి గృహ ప్రవేశాలు చేయిస్తాం. – ఆకుల రజిత, మున్సిపల్ చైర్ పర్సన్, హుస్నాబాద్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ డబుల్ బెడ్రూం ఇళ్లను మే 5వ తేదీన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీ దుగా ప్రారంభించి కేవలం 5 గురు లబ్ధిదారు లకు మాత్రమే పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి పట్టాలు ఇచ్చిన వారికి ఇళ్లు ఇవ్వలేదు. ఎంపిక చేసిన మిగితా లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు ఇవ్వకపోవడంతో వారు నిరాశతో ఉన్నారు. పట్టాలు తీసుకున్న వారికి ఇల్లు వచ్చిందనే సంతోషం లేదు. డబుల్ బెడ్రూం ఇళ్లకు ఎంపికై న వారికి కూడా సంతోషం లేకుండా పోయింది. ప్రతి రోజూ ఇళ్ల వద్దకు వెళ్లి చూసి సంతోషపడాల్సిందే తప్ప గృహ ప్రవేశం చేసింది లేదు. -
పద్మక్క డాన్స్ అదరగొట్టింది
-
మటన్ పెట్టకుండా సాంబారు పోశాడని.. పెళ్లి విందులో కొట్లాట
సాక్షి, మెదక్: పెళ్లి విందులో తలెత్తిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. నర్సాపూర్ మండల పరిధిలోని చండి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సాపూర్ మండల పరిధిలోని చండి గ్రామానికి చెందిన అమ్మాయిని అదేమండలం నత్నయిపల్లికి చెందిన అబ్బాయితో శనివారం చండి గ్రామంలో పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం భోజనం వడ్డిస్తున్న క్రమంలో అబ్బాయి తరఫు వ్యక్తికి మటన్ ముక్కలు వేయకుండా సాంబార్ పోశాడని గొడవకు దిగారు. మటన్ వడ్డిస్తున్న వ్యక్తితో పాటు మరో వ్యక్తిపై అబ్బాయి తరఫు వారు దాడి చేయగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి నలుగురిపై కేసు నమోదు చేశారు. చదవండి: ఖమ్మం మెడికో విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలు! -
నిశ్చితార్ధం చెడగొట్టి ఆమెతో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు.. ముహుర్తం టైమ్‌కి..
సాక్షి, సంగారెడ్డి: వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. తమ ప్రేమ విషయాన్ని ఇద్దరి ఇళ్లలో చెప్పి ఎంతో కష్టం మీద పెళ్లికి ఒప్పించారు. తీరా.. పెళ్లి సమయానికి వరుడు వివాహ వేడుక నుంచి పారిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. కాగా, వరుడు వెళ్లిపోడానికి కారణం తెలిసి అక్కడున్న వారంత ఖంగుతిన్నారు. ఈ ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలానికి చెందిన యువతి, కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. అతనికి తమ కూతురుని ఇవ్వడానికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అంతేకాకుండా.. ఈ ఏడాది జనవరిలో ఇదే జిల్లా కంగ్టి మండలానికి చెందిన ఓ యువకుడితో అమ్మాయికి నిశ్చితార్థం జరిపించారు. ఇక, తన లవర్ పెళ్లి విషయం తెలుసుకున్న ప్రియుడు రంగంలోకి దిగాడు. నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తికి ఫోన్ చేసి తాను యువతిని ప్రేమిస్తున్నానని, వదిలేయాలని బెదిరించాడు. దీంతో, ఈ విషయాన్ని పెళ్లి కూతురు పేరెంట్స్ చెప్పి అతను పెళ్లికి నిరాకరించాడు. దీంతో, వధువు పేరెంట్స్ చేసేదేమీ లేక.. ప్రియుడితో పెళ్లికి ఒప్పుకున్నారు. అనంతరం, పెళ్లికి ముహుర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం కొండాపూర్ మండలంలోని ఒక గుడిలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అయితే, పెళ్లికి కొద్ది గంటలే సమయం ఉందనగా వరుడు ప్లేట్ ఫిరాయించాడు. తనకు కట్నంగా రూ.15 లక్షలు ఇస్తేనే తాళి కడతానని మొండికేసి కూర్చున్నాడు. దీంతో, అంత ఇవ్వలేమని రూ.6 లక్షలు ఇస్తామని యువతి కుటుంబీకులు చెప్పినా వరుడు వినిపించుకోలేదు. అనంతరం.. అందరి కళ్లుగప్పి పెళ్లి పీటలపై నుంచే పరారయ్యాడు. అతని కోసం ఎంత వెతికినా, ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో బాధిత వధువు కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కేసు నమోదు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: త్వరలో సికింద్రాబాద్ – నాగ్‌పూర్ మధ్య.. వందేభారత్ -
సొంత గూటిలోనే కుంపటి.. హ్యాట్రిక్ సాధించిన పద్మా దేవేందర్‌కు ఈసారి కష్టమే!
వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకే సీట్లని గులాబీ దళపతి కేసీఆర్ ఎప్పుడో ప్రకటించారు. మరి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి సీటు గురించి ఎందుకు భయపడుతున్నారు? ఇప్పటికే హ్యాట్రిక్ సాధించిన పద్మా దేవేందర్‌కు నాలుగోసారి సీటు కష్టమేనా? ఇంతకీ మెదక్ ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నిస్తున్నదెవరు? మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ ఎంట్రీతో మెదక్ నియోజకవర్గంలోని గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగిందనే టాక్ నడుస్తోంది. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ క్యాడర్‌ను పెంచుకుంటున్న మైనంపల్లి రోహిత్ మెదక్ నుంచి తాను పోటీలో ఉంటానని చెబుతున్నారు. ఇన్ని రోజులు తనకు పెద్దగా పోటీ ఇచ్చేవారు ఎవరూ లేరనుకున్న పద్మా దేవేందర్ రెడ్డికి మైనంపల్లి రోహిత్ రాక తలనొప్పిగా మారింది. మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మెదక్ నియోజకవర్గంలో ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటూ దూసుకుపోతున్నారు మైనంపల్లి తనయుడు రోహిత్. సీఎం కేసీఆర్‌తో మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడు రోహిత్ మైనంపల్లి రోహిత్ ఎంట్రీతో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడింది. సిట్టింగులకే సీట్లు అని కేసీఆర్ ప్రకటించినా.. మెదక్ సీటుపై ఎక్కడో తేడా కొడుతోందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిన్నా మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల్లో రోహిత్ ఎంట్రీతో జోష్ పెరిగింది. నియోజకవర్గంలోని రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా చేయాలని స్థానికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. చదవండి: కాంగ్రెస్.. మోదీ.. మధ్యలో కేటీఆర్ అదిరిపోయే ఎంట్రీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి నిర్లక్ష్యం వల్లనే రామాయంపేట అభివృద్ధి చెందడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలోని గిరిజన తండాలలో మంచినీరు, రోడ్లు, వైద్య సదుపాయం లేక గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నా పద్మా దేవేందర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారనే అపవాదును ఎదుర్కొంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కేడర్‌లోనూ.. ప్రజల్లోనూ ఉన్న వ్యతిరేకతను తనకు సానుకూలంగా మార్చుకునేందుకు మైనంపల్లి రోహిత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలే లక్షంగా నియోజకవర్గంపై పట్టు బిగిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని గుర్తించి ఆర్థిక సహాయం అందించి, వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. నిరుపేద యువతుల వివాహానికి పుస్తెలు, కాలి మట్టెలు అందిస్తున్నారు. నిరుపేదలు మృతి చెందితే కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. తల్లిదండ్రులు లేని చిన్నారులకు 25 వేల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. నిజాంపేట మండలంలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. రామాయంపేట మండలం, చిన్నశంకరంపేట మండలాల్లో నీటి ఎద్దడి ఉన్న గ్రామాలలో వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి గులాబీ పార్టీ ఆవిర్భవించినప్పటినుంచీ కొనసాగుతున్నారు. మూడు సార్లు గెలిచి, డిప్యూటీ స్పీకర్ పదవి నిర్వహించారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి పదవి వరిస్తుందని ఆశించినా నెరవేరలేదు. టిక్కెట్ ఆశించే హక్కు ఎవరికైనా ఉంటుందని, కాని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న తమ నాయకురాలు పద్మా దేవేందర్ వచ్చే ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ సీటు ఖాయమని ఆమె వర్గీయులు చెబుతున్నారు. -
మైనంపల్లి రోహిత్ రాకతో పద్మా దేవేందర్ రెడ్డికి తలనొప్పి
-
TS: వాతావరణశాఖ హెచ్చరిక.. ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి కారణంగా రేపు.. మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపుతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వానలు పడుతాయని పేర్కొంది. ఇక, బుధవారం మధ్యాహ్నం తర్వాత ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉండగా.. బుధవారం తెల్లవారుజామున జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. ధరూర్ మండలం నీలహళ్లిలో పిడుగుపాటుకు రైతు నర్సింహులుకు చెందిన రెండు ఎద్దులు మృతిచెందాయి. ఇదిలా ఉండగా.. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. దీంతో, దక్షిణ, ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకి దిగువ స్థాయిలోని గాలులు వీస్తున్నాయి. దీంతో, రాగల మూడు రోజులు తెలంగాణలో మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాగల ఐదు రోజులు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40°C కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అవుతాయి. కొన్ని చోట్ల 35°C కన్నా తక్కువగా అక్కడక్కడ నమోదు అయ్యే అవకాశముంది. ఇక నేడు, రేపు తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి గంటకు 40 నుండి 50కిమీ) వేగంతో పాటు వడగళ్ళతో కూడిన వర్షములు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
Theli Rajeshwari: మురికివాడ నుంచి లండన్ వరకు
తేలి రాజేశ్వరిది మెదక్ జిల్లా దప్పూరు. వలస కూలీలుగా తల్లిదండ్రులు ముంబైకి వెళితే అక్కడే పుట్టింది. స్లమ్స్‌లో ఉన్నా మరాఠీ మీడియంలో చదువుకున్నా ఏనాటికైనా పై చదువులకు విదేశాలకు వెళ్లాలని పట్టుదల. దానిని సాధించింది. లండన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న రాజేశ్వరి తన చదువు కొనసాగించడానికి డిజిటల్ మార్కెటింగ్‌లో పని చేస్తోంది. ఆమె ప్రయాణం ఆమె మాటల్లో. ‘నా పేరు రాజేశ్వరి. మాది మెదక్ జిల్లా దప్పూరు. మా అమ్మానాన్నలు వలస కూలీలు. ముంబై వలస వెళ్లి భవన నిర్మాణ కార్మికులుగా పని చేసేవారు. ఎక్కడ కడుతుంటే దాని బేస్మెంట్లో పట్టాలు కట్టుకుని కాపురం ఉండేవారు. అంధేరిలో వాళ్లు కూలి పని చేస్తుండగా నేను పుట్టాను. నాకు అప్పటికే అన్న ఉన్నాడు. ఎల్.కె.జి, యు.కె.జి నేను మరాఠి స్కూల్లో చదువుకున్నాక ముంబైలో చదువు కష్టమని నన్ను, అన్నను దప్పూరులోని మా నానమ్మ దగ్గరకు పంపారు. అక్కడ మళ్లీ అఆలు నేర్చుకోవడం నాకు కష్టమైంది. ఐదవ క్లాసు పూర్తయ్యేసరికి మా నానమ్మ చనిపోయింది. ఇక ఊళ్లో ఎవరూ లేరు. మళ్లీ అన్నా, నేను ముంబై చేరుకున్నాం’. ► పనిపిల్లగా ఉంటూ ‘2006లో ముంబైకి వచ్చాక ఆరోక్లాసు నుంచి చదవడానికి తెలుగుమీడియం స్కూల్ దొరకలేదు. మేముండే ములుండ్ నుంచి గంట దూరం వెళ్లి చదువుకుందామన్నా దొరకలేదు. చివరకు దగ్గరిలోని కన్నడ మీడియం స్కూల్లో చేరాల్సి వచ్చింది. నేను ముంబై వచ్చాక బాగా చదువుకోవాలని అనుకున్నాను. దానికి డబ్బు కావాలి. అందుకని నేను స్కూలుకు వెళ్లడంతోపాటు దగ్గరి ఇళ్లల్లో పనిపిల్లగా చేసేదాన్ని. అందుకు నేను కొంచెం కూడా ఇబ్బంది పడలేదు. నాకంటూ ఒక లక్ష్యం ఉంది. టెన్త్ వరకూ అలాగే చదువుకున్నాను. ఇంటర్‌కి వచ్చేసరికి కాలేజీకి అరాకొరా వెళుతూ టెలీకాలర్‌గా పని చేశాను. దానివల్ల అకౌంట్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. ఇక పై చదవలేనేమో అనిపించింది. ఎలాగో ఇంటర్ పూర్తి చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉద్యోగంలో చేరిపోయాను. అంతవరకూ నేను జీవితం గడిపింది స్లమ్స్‌లోనే’ ► మళ్లీ చదువుకు ‘ఇంటర్ అయ్యాక నేను ముంబైలోని ఎక్సెంచర్ సంస్థలో ఒక ఏజెన్సీ ద్వారా ఉద్యోగంలో చేరాను. ఇంటర్ పాస్ మీద వారిచ్చిన ఉద్యోగం నాకు తృప్తిగా ఉండేది. కాని 2018 వచ్చేసరికి నా ఉద్యోగంలో ఎటువంటి ఎదుగుదల లేదు. డిగ్రీ లేని నీకు ఈ మాత్రం జీతం ఇవ్వడమే గొప్ప అన్నారు సంస్థ వారు. మళ్లీ చదువు గుర్తుకొచ్చింది. ఏమిటి ఇలా తయారయ్యాను అనుకున్నాను. పై చదువులు చదవాలన్న పట్టుదల గుర్తుకొచ్చింది. ఎలాగైనా నా కలను సాధించుకోవాలనుకున్నాను. కాని ఉద్యోగం చేస్తూనే చదువుకోవాలని అలాంటి ఆప్షన్ కోసం ఎన్ని కాలేజీలు తిరిగినా వీలు కాదన్నారు. కరెస్పాండెన్స్ కోర్సు చేయమన్నారు. చివరకు కల్యాణ్ (ముంబైలోని ఒక ఏరియా) లో సంకల్ప్ కాలేజీ వాళ్లు నా తపన చూసి నీకు వీలున్నప్పుడు వచ్చి అటెండ్ అవుతూ ఉండు అని సీట్ ఇచ్చారు. అక్కడ నేను బికాం చేరాను. నా ఉద్యోగం వారంలో ఐదు రోజులు. ఏ రెండు రోజులైనా ఆఫ్ తీసుకోవచ్చు. అలా నేను అందరిలా శని, ఆదివారం కాకుండా వీక్‌డేస్ ఆఫ్ తీసుకుంటూ 2021 జూన్‌లో బి.కాం పూర్తి చేశాను. ఉద్యోగం చేస్తూ జాగ్రత్తగా పొదుపు చేస్తూ వచ్చాను’ ► యు.కె. కల ‘ఒకవైపు చదువు, ఉద్యోగంతో పాటు విదేశాలలో చదవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటో తెలుసుకుంటూ వచ్చాను. పాస్‌పోర్ట్ కోసం నా పర్మినెంట్ అడ్రస్ దప్పూర్ కావడం వల్ల హైదరాబాద్ నుంచే తీసుకోవాల్సి వచ్చింది. దానికోసం ఆధార్ కరెక్షన్, సర్టిఫికెట్లు చాలా పని. మరో వైపు 2022 సెప్టెంబర్ ఇన్‌టేక్ (యూకేలో సెప్టెంబర్‌లో మొదలయ్యే అకడెమిక్ ఇయర్ కోసం) కోసం ఆన్లైన్లో ఆయా యూనివర్సిటీల్లో అప్లికేషన్స్ వేస్తూ వెళ్లాను. కాని యు.కెలో చదవడం చాలా ఖర్చుతో పని. అందుకోసం నేను బ్యాంకులోను, వడ్డీ మీద బయటి వ్యక్తుల దగ్గర లోన్ తీసుకున్నాను. యూకేలో మాస్టర్స్ చేయడానికి నాకు సీట్ వచ్చింది. సెప్టెంబర్ 2022లో లండన్ చేరుకున్నాను. చదువుకుంటూ పార్ట్‌టైమ్ జాబ్ చేయడానికి పరిమిత గంటల అనుమతి ఉంటుంది. కాని అక్కడ వెంటనే పని దొరకదు. సులభంగా దొరికే ఉద్యోగం కేర్‌హోమ్‌లలో పని చేయడమే. మతి స్థిమితం లేనివారు, వృద్ధులు... వీరి బాగోగులు చూసుకుంటే డబ్బులు ఇస్తారు. అలా ఆరు నెలలు పని చేశాను. నాకు డిజిటల్ మార్కెటింగ్‌తో బాగా పరిచయం ఉంది కాబట్టి అందులోనూ సంపాదన వెతుకుతున్నాను. ముంబైలో స్లమ్స్‌లో ఉండిపోవలసిన దాన్ని. నా కష్టమే నన్ను యూకే దాకా చేర్చింది. ఇక్కడకు వచ్చి 9 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు ఈస్టర్ సెలవలు నడుస్తున్నాయి. ఈ సెలవుల్లో ఎక్కువ గంటలు పని చేయవచ్చు. పని చేస్తున్నా. కష్టేఫలి అన్నారు కదా’. -
తెలంగాణలో అధికారంపై ఆశలు సరే! ఆ జిల్లాలో బీజేపీకి నాయకులున్నారా?
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా జెండా ఎగరేయాలని కమలం పార్టీ ఆశపడుతోంది. అందుకోసం చాలా కష్టపడుతోంది. కానీ అనేక నియోజకవర్గాల్లో ఆ పార్టీకి నాయకులే కరువయ్యారు. కొన్ని చోట్ల ఉన్నవారు కూడా యాక్టివ్‌గా లేరు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ నాయకత్వ సమస్యతో సతమతమవుతోంది. ఎందుకిలా జరుగుతోంది? తెలంగాణలో అధికార పార్టీ వైఫల్యాలకు సంబంధించి బీజేపీ నాయకత్వం దూకుడు మీదుంటే.. మెదక్ జిల్లాలో మాత్రం ఆ పార్టీ నాయకులు నామ మాత్రంగా కూడా స్పందించడం లేదు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఆందోల్‌లో మాజీ మంత్రి బాబు మోహన్ కమలం పార్టీలో ఉన్నప్పటికీ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ నిర్ధేశించిన కార్యక్రమాలు కూడా అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ నియోజకవర్గానికి చుట్టపు చూపుగానే వచ్చి వెళ్తున్నారు. పార్టీ కేడర్ యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. కార్యకర్తలను నడిపించడానికి బలమైన నాయకుడు లేకుండా పోయారు. జహీరాబాద్ నియోజకవర్గానిది ఇదే పరిస్థితి. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన జంగం గోపిపై సస్పెషన్ వేటు పడింది. దీంతో బీజేపీ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించడానికి నాయకుడే లేకుండా పోయారు. జిల్లా కేంద్ర నియోజకవర్గం సంగారెడ్డిలో బీజేపీకి కొంత పట్టు ఉంది. నియోజకవర్గ ఇంచార్జ్ దేశ్ పాండే పార్టీ కార్యక్రమాలు బాగానే నిర్వహిస్తున్నా.. ఇక్కడ నేతల మధ్య విభేదాలు రగులుతున్నాయి. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో, విభేదాల కారణంగా పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను జిల్లా కేంద్రంలో నిర్వహించడంలో విఫలం అవుతున్నారు. పఠాన్ చెరులో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, గోదావరి అంజిరెడ్డి, శ్రీకాంత్ గౌడ్ లు ఎవరికీ వారే అన్న చందంగా తయారయ్యారు. నారాయణ ఖేడ్ లో మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి కూడా అంతంత మాత్రంగానే పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. చదవండి: కొడవళ్ళకు గులాబీ చిక్కడం లేదా? లెఫ్ట్ పార్టీల వన్ సైడ్ లవ్ ఇంకా ఎన్నాళ్ళు..? బీజేపీ జిల్లా అధ్యక్షుడితో పలు నియోజక వర్గాల నాయకుల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఉన్న కొద్ది మంది నాయకులు అంతర్గత కలహాల్లో మునిగి తేలుతున్నారు. గతంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంగా నాయకులు పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికలను ఎదుర్కోవడం బీజేపీకి పెద్ద సవాలుగా మారుతుందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. నాయకత్వ సమస్యను అధిగమించేందుకు ప్రత్యర్థి పార్టీలోని ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకునే కార్యక్రమం ఆపరేషన్ ఆకర్షపై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించినప్పటికీ జిల్లాలో పెద్దగా స్పందన రావడంలేదు. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎర్రగొల్ల మురళి యాదవ్ మినహా చెప్పుకోదగ్గ నేతలెవ్వరూ బీజేపీలో చేరలేదు. ఇటీవల మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ సోదరుడు రాంచందర్ కాషాయ కండువా కప్పుకున్నప్పటికీ ఏ మేరకు ప్రభావం చూపగలరనేది ప్రశ్నార్ధకమే. జిల్లా నాయకత్వం అనుసరిస్తున్న తీరుతోనే పార్టీ అగ్రనేతల కార్యక్రమాలు తరచుగా రద్దవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్‌డెస్క్ -
రూ.50 లక్షల కట్నం, బైక్ ముందే కావాలి.. ఇస్తేగాని పెళ్లి చేసుకోను
పటాన్చెరు టౌన్: కట్నం, బైక్ ముందే కావాలని, ఇస్తేగాని పెళ్లి చేసుకునేది లేదని ఓ యువకుడు ఫోన్లో యువతిని తిడుతూ అడగటంతో మనస్తాపం చెందిన యువతి రెండో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యయు యత్నించింది. ఈ సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. యువతి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్చెరు పట్టణంలోని నాయికోటి బస్తీకి చెందిన జంగయ్య కూతురు యామినికి పటాన్చెరు మండలం భానూర్ కంచర్లగూడెంకు చెందిన జంగయ్య అక్క లక్ష్మి కుమారుడు చిన్నోల శంకర్‌తో మార్చి 26వ తేదీన నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో రూ.50 లక్షలు కట్నం భూమి అమ్మిన తర్వాత ఇస్తామని చెప్పడంతో శంకర్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. నిశ్చితార్థం జరిగిన మార్నాడే కట్నంతో పాటు బైక్ ముందే కావాలని యువతికి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అడిగాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు శుక్రవారం యువకుడి ఇంటికి వెళ్లి మాట్లాడేందుకు వెళ్లడంతో తనకు పెళ్లి అవసరం లేదంటూనిశ్చితార్థం సమయంలో పెట్టిన రింగ్ తీసి పడేశాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు మళ్లీ మాట్లాడుదామని చెప్పి ఇంటికి వచ్చారు. దీంతో మనస్తాపం చెందిన యువతి భవనం రెండో అంతస్తు పైనుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే యామినిని చికిత్స కోసం పట్టణంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి మిషయంగా ఉందని వైద్యులు తెలిపారు. కట్నకానుకల విషయంలో శంకర్, అతడి కుటుంబ సభ్యులు వేధించడంవల్లే తమ కూతురు ఆత్మహత్యకు యత్నించిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
యువతి అదృశ్యం
మెదక్: యువతి అదృశమైన సంఘటన మండల పరిధి చెండిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవికాంత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన నర్మద గురువారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులు నిద్రకు ఉపక్రమించిన సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తెల్లవారుజామున గమనించిన కుటుంబసభ్యులు చుట్టు పక్కల, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం యువతి తండ్రి భూపాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. -
Medak: చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని మహిళ మృతి
సాక్షి, మెదక్ : చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఒడిశాకు చెందిన సంతోషి(30) అనే మహిళ కూలి పనుల కోసం వలస వచ్చింది. ముసాయిపేట్ మండలం కొప్పులపల్లి గ్రామ శివారులో ని ఇటుక బట్టీలలో పని చేసుకుంటూ జీవిస్తుంది. మంగళవారం తూప్రాన్ సంతకు వెళ్లిన మహిళ.. మద్యం సేవించి ఇంటికి వచ్చింది. అనంతరం ఇంట్లో చికెన్ వండుకుని తింటున్న సమయంలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తూప్రాన్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మహిళ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. వెల్దుర్తి ఎస్ఐ మధుసూదన్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: ‘సాక్షి’ చేతిలో సాత్విక్ సూసైడ్ నోట్.. నివ్వెరపోయే విషయాలు -
మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి..
వెల్దుర్తి (తూప్రాన్): మద్యం మత్తులో ఓ యువకుడు విద్యుత్ స్తంభం ఎక్కాడు. వివిద్యుదాఘాతంతో తీవ్రగాయాలై కిందపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శంకరాజ్ కొండాపూర్ గ్రామానికి చెందిన యాట సాయిరాం (24) శుక్రవారం సాయంత్రం వెల్దుర్తి నుంచి తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఉప్పులింగాపూర్ గ్రామ శివారులో పోలీసులు వాహన తనిఖీలతోపాటు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న సాయిరాం మద్యం మత్తులో హల్చల్ చేస్తూ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కాడు. గమనించిన పోలీçÜులు కిందకు దించి అక్కడి నుంచి పంపించారు. అనంతరం యథావిధిగా తనిఖీలు చేస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత సాయిరాం మళ్లీ తిరిగొచ్చి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభంపైకి ఎక్కి తీగలు పట్టుకోవడతో విద్యుదాఘాతంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని తూప్రాన్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. -
TS: లాకప్ డెత్‌పై డీజీపీ సీరియస్.. సీఐ, ఎస్ఐపై చర్యలు!
సాక్షి, హైదరాబాద్: మెదక్ లాకప్‌డెత్ ఘటనపై తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తునకు డీజీపీ ఆదేశించారు. ఈ క్రమంలోనే ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో సీఐ, ఎస్ఐపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. కాగా, పోలీసుల చిత్రహింసలతో ఖాదర్ చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులే కారణం.. మెదక్‌కు చెందిన ఖదీర్‌ఖాన్.. గాంధీ ఆసుపత్రిలో చిక్సిత పొందతూ ఫిబ్రవరి 12వ తేదీన మృతిచెందాడు. అయితే, దొంగతనం కేసులో ఖదీర్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే ఆయన చనిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగింది ఇది.. అయితే, జనవరి 27వ తేదీన మెదక్‌లోని అరబ్ గల్లీలో బంగారం గొలుసు దొంగతనం జరిగిందని ఓ మహిళ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా, ఘటనాస్థలంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఖదీర్‌ఖాన్‌ను జనవరి 29వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఖదీర్‌ను ఫిబ్రవరి 2వ తేదీ వరకు స్టేషన్లోనే ఉంచి.. తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా.. ఖదీర్ ఇంటికి వెళ్లిన మరుసటి రోజే.. అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో, అతడికి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించి అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఖదీర్ మృతిచెందాడు. అయితే, పోలీసులే కారణంగా ఖదీర్ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
మెదక్ లాకప్‌డెత్‌పై డీజీపీ అంజనీకుమార్ సీరియస్
-
ఇంటరాగేషన్‌లో గాయాలు.. వ్యక్తి మృతి!
మెదక్ జోన్: చైన్ స్నాచింగ్ చేశాడనే అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు చిత్రహింసలు పెట్టి, ఇష్టం వచ్చినట్టుగా కొట్టారని.. దానితో కిడ్నీలు దెబ్బతిని మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య ఎస్పీకి ఫిర్యాదు చేసింది. భర్త చావుకు కారణమైన పోలీసులపై హత్యకేసు పెట్టి, అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. అసలు ఏం జరిగింది? మెదక్ పట్టణంలోని అరబ్ గల్లీలో జనవరి 27న గుర్తు తెలియని దుండగుడు ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తెంపుకెళ్లాడు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించిన పోలీసులు.. ఆ దుండగుడు మహ్మద్ ఖదీర్ అని అనుమానించారు. మెదక్ పట్టణంలో చిన్న పాన్‌షాపు నడుపుకొనే ఖదీర్.. అది సరిగా నడవకపోవడంతో కొన్నిరోజులుగా హైదరాబాద్‌లోని తన సోదరి ఇంట్లో ఉంటూ కూలిపనులు చేసుకుంటున్నాడు. అతడి గురించి ఆరా తీసిన పోలీసులు జనవరి 29న హైదరాబాద్ వెళ్లి, సోదరి ఇంట్లో ఖదీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మెదక్ ఠాణాకు తరలించి ఐదు రోజులపాటు అదుపులో ఉంచుకున్నారు. ఏమీ తేలకపోవడంతో ఫిబ్రవరి 3న మెదక్ తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి వదిలేశారు. దెబ్బలకు కిడ్నీలు దెబ్బతిని.. పోలీసులు వదిలేసిన తర్వాత ఖదీర్ తీవ్రంగా అస్వస్థతకు లోనయ్యాడు. ఫిబ్రవరి 6న మెదక్ ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. పరీక్షలు చేసిన వైద్యులు బలమైన దెబ్బలు తగిలి కిడ్నీలు చెడిపోయాయని, మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. దీనితో ఖదీర్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, మూడు రోజులు చికిత్స చేయించారు. ఈ ఖర్చులను పోలీసులే భరించారని ఖదీర్ భార్య తెలిపింది. కానీ ఖదీర్ పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 12న గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ 16న రాత్రి మృతి చెందాడు. గురువారం రాత్రే ఖదీర్ చనిపోయినా.. కేసు నమోదవకపోవడం, ఎఫ్ఐఆర్ కాకపోవడంతో మృతదేహానికి శుక్రవారం రాత్రి వరకు పోస్టుమార్టం చేయలేదు. దీనితో పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. ఎస్సై, కానిస్టేబుళ్లు బదిలీ ఖదీర్ మృతి నేపథ్యంలో మెదక్ పట్టణ ఎస్సై రాజశేఖర్‌ను డీసీఆర్బీకి అటాచ్ చేస్తూ.. కానిస్టేబుల్ పవన్ కుమార్‌ను రేగోడుకు, ప్రశాంత్‌ను పాపన్న పేటకు బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. అకారణంగా నా భర్తను చంపేశారు దొంగతనం నెపంతో తన భర్తను దారుణంగా కొట్టి చావుకు కారణమైన పోలీసులపై హత్యకేసు నమో దు చేయాలని ఖదీర్ భార్య సిద్దేశ్వరి డిమాండ్ చేశా రు. దీనిపై శుక్రవారం మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన భర్తను అకారణంగా చంపి తనను, తన ముగ్గురు పిల్లలను రోడ్డున పడేసిన పోలీసులకు ఉసురు తగులుతుందంటూ ఆమె రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. కాగా.. హైదరాబాద్‌లోని తమ ఇంట్లో ఖదీర్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులు దారుణంగా కొట్టారని, కాళ్లు మొక్కినా వినలేదని ఖదీర్ సోదరి తపసుల్ పేర్కొన్నారు. పాత నేరస్తుడని అదుపులోకి.. ‘‘ఖదీర్ పాత నేరస్తుడు. అరబ్‌గల్లీలో ఓ మహిళ మెడలోంచి గొలుసు తెంపుకెళ్లిన వ్యక్తి సీసీ పుటేజీలో ఖదీర్లా ఉండటంతోనే అదుపులోకి తీసుకున్నాం. ప్రశ్నించిన తర్వాత ఫిబ్రవరి 3వ తేదీన తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి వదిలేశాం. 6వ తేదీన అతడు ఆస్పత్రిలో చేరాడు. మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు..’’ – మెదక్ డీఎస్పీ సైదులు -
మెదక్: నార్సింగిలో అదృశ్యమైన ప్రేమజంట ఆత్మహత్య
-
3 నెలల క్రితమే పెళ్లి.. వివాహితను బైక్‌పై తీసుకెళ్లిన యువకుడు
సాక్షి,మెదక్ : నార్సింగిలో ఇద్దరి అదృశ్యం మిస్టరీగా మారింది. మండల కేంద్రానికి చెందిన వివాహిత, మరో యువకుడు ఒకే బైక్‌పై సోమవారం రామాయంపేటలో కలిసి తిరిగినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయినట్టు తెలిసింది. అయితే ఆ బైక్ , ఇద్దరి చెప్పులు మంగళవారం ఉదయం నార్సింగి చెరువు వద్ద లభ్యమయ్యాయి. కూతురు కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదైంది. సదరు యువతికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. శివరాత్రి పండగ నిమిత్తం ఈనెల తొమ్మిదివ తేదీన ఆమెను అత్తగారింటినుంచి నార్సింగి తీసుకొచ్చారు. చెరువు వద్ద బైక్, చెప్పులు లభించడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకొని ఉంటారని ముందుగా అందరూ అనుమానించారు. విషయం తెలియగానే గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు. పోలీసులు గజ ఈతగాళ్లు, వలలతో చెరువులో గాలించినా ఇద్దరి ఆచూకీ లభించలేదు. అయితే అందరి దృష్టిని మళ్లించడానికే బైక్, చెప్పులు చెరువు వద్ద విడిచి వెళ్లినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మిస్టరీగా మారిన ఈకేసును త్వరలోనే చేధిస్తామని నార్సింగి ఎస్ఐ నర్సింలు పేర్కొన్నారు. -
ప్రేమికుల దినోత్సవం రోజున మెదక్ జిల్లాలో విషాదం
-
తెలంగాణలో రుణమాఫీపై నీలినీడలు.. అయోమయంలో రైతులు!
సాక్షి, మెదక్‌జోన్: రుణమాఫీపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు మెదక్ జిల్లాలో రూ. 25 వేల లోపు రుణాలు తీసుకున్న వారికి మాత్రమే మాఫీ కాగా.. ఇటీవల బడ్జెట్లో రుణమాఫీ విషయమై పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేదు. అప్పులకు వడ్డీ పెరగడంతో పాటు కొత్త రుణాలు అందడం లేదని వాపోతున్నారు. జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా 1.40 లక్షల మంది రైతులు ఉన్నారు. - జిల్లావ్యాప్తంగా వివిధ బ్యాంకుల ద్వారా రూ.236 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. వీరిలో మొదటి విడతగా 2020లో రూ. 25 వేల లోపు రుణాలు తీసుకున్న 20,873 మంది రైతులకు రూ. 82.38 కోట్లు మాఫీ అయింది. - ఇంకా 1,19,148 మంది రైతులు రూ. 50 వేల నుంచి లక్ష వరకు తీసుకున్న అప్పు రూ. 154 కోట్లు ఉంది. - ఈ లెక్కన ఇంకా రూ. 11,655 కోట్ల మేర అప్పులు అలాగే ఉన్నాయి. ఈ బడ్జెట్ లెక్కల ప్రకారం రైతుల రుణమాఫీ పూర్తిగా వర్తించని విధంగా ఉంది. - తీసుకున్న రుణాల్లో కేవలం 30శాతం మేరకే నిధులు కేటాయించడంతో జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. - 2018 ఎన్నికల సమయంలో రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పడంతో తాము బ్యాంకులో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదని.. ఇప్పుడు మాఫీ కాకుంటే మా పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. - జిల్లాలో మెజార్టీ రైతులకు రూ.లక్ష ఆ పైనే రుణాలు ఉన్నాయి. బ్యాంకర్లు ఎకరాకు రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు పంట రుణం ఇస్తుండడంతో రెండెకరాలు ఉన్న రైతులు రూ.లక్ష, ఆపై రుణం తీసుకున్నారు. - ప్రస్తుతం జిల్లాలో ఇంకా 1,19,148 మంది రైతులకు రూ. 154 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. బ్యాంకర్ల నోటీసులు - 2018లో రైతులు రూ. లక్ష లోపు తీసుకున్న రుణాలు చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో 60 శాతం మంది రైతులు రెన్యూవల్ కూడా చేయలేదు. - సకాలంలో రుణాలు చెల్లించని రైతులకు బ్యాంకర్లు నోటీసులు ఇచ్చారు. - ఏడాదిలోపు రెన్యూవల్ చేసుకుంటే కేవలం 7శాతం వడ్డీ మాత్రమే బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. - ఇలా చెల్లించిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించిన వడ్డీలో సగం సబ్సిడీ రూపంలో రైతులకు తిరిగి చెల్లిస్తోంది. - పంట రుణాలు పొందిన రైతులు ఏడాది లోగా రెన్యూవల్ చేయించకుంటే వడ్డీ ఏకంగా 14 శాతం పెరుగుతుంది. అంటే రెండింతలు అవుతుంది. - లక్ష పంటరుణం తీసుకుంటే ప్రతి సంవత్సరం సక్రమంగా చెల్లించే రైతుకు 5 ఏళ్లకు చెల్లించే వడ్డీ రూ. 20 వేలు మాత్రమే నిర్ణీత గడువులోగా చెల్లించని రైతుకు వడ్డీ ఐదే సంవత్సరాలకు రూ. 70 వేల పైచిలుకు చెల్లించాల్సి ఉంటుందని ఓ బ్యాంకు అధికారి పేర్కొన్నారు. - సక్రమంగా చెల్లించే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ వడ్డీలో సగం తిరిగి సదరు రైతు ఖాతాలో జమ కట్టడంతో పాటు బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణంలో 10 శాతం పెంచి ఇస్తుంది. - కాగా ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పడంతో జిల్లాలో 40 శాతం మంది రైతులు రెన్యూవల్ కూడా చేయలేదు. ముమ్మాటికి మోసమే నాకు నాలుగెకరాల భూమి ఉంది. 2018 డిసెంబర్లో రూ. లక్ష పంట రుణం తీసుకున్నా. ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పడంతో తీసుకున్న అప్పు కట్టలేదు. ఇప్పటివరకు అసలు రూ. లక్ష, వడ్డీ రూ. 80 వేలు కలిపి మొత్తం రూ. లక్షా 80 వేలు అయింది. ప్రస్తుతం ప్రభుత్వం రూ. 90 వేల లోపు రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పడం సరికాదు. ఇచ్చిన మాట ప్రకారం రూ. లక్ష వరకు రుణాలు మాఫీ చేయాలి – సాయిరెడ్డి, రైతు, మర్పల్లి రేగోడ్ మండలం సకాలంలో రెన్యూవల్ చేసుకోవాలి తీసుకున్న పంట రుణాలు సకాలంలో రెన్యూవల్ చేయకుంటే వ డ్డీ భారం పెరుగుతుంది. ఐదేళ్లలో తీసుకున్న రుణం రెండింతలు అవుతుంది. మా బ్యాంకులో 2,300 మంది రైతులు పంటరుణం తీసుకున్నారు. రుణాలు చెల్లించని 900 మంది రైతులకు నోటీసులు అందజేశాం. – శ్రీకాంత్, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్, చిన్న శంకరంపేట -
దొంగతనం చేశాడన్న అనుమానంతో..
మెదక్‌జోన్: మెదక్ జిల్లా కేంద్రంలో పోలీసులు ఓ వ్యక్తిని దొంగతనం చేశాడన్న అనుమానంతో ఐదు రోజులపాటు చితకబాదారు. గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడి భార్య సిద్ధేశ్వరి కథనం ప్రకారం.. మెదక్ పట్టణంలోని అరబ్‌గల్లిలో జనవరి 29వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా హైదరాబాద్‌లో పని చేసుకునే పిట్లంబేస్ వీధికి చెందిన మహ్మద్ ఖదీర్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో ఐదు రోజులపాటు కొట్టారు. అతడి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి ఈనెల 2న వదిలిపెట్టారు. ఇంటికి వెళ్లిన బాధితుడు పోలీసులు కొట్టిన దెబ్బలకు మంచం పట్టాడు. ఈనెల 6వ తేదీన కుటుంబీకుల సహాయంతో కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం అతడిని కుటుంబ సభ్యులు మెదక్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతో కిడ్నీలు దెబ్బతిన్నాయని, చేతులు పనిచేయడం లేదని గురువారం బాధితుడి భార్య తెలిపింది. హైదరాబాద్‌లో లేబర్ పనిచేసుకునే తన భర్త ఖదీర్‌ను పోలీసులు అకారణంగా చితకబాదారని ఆరోపించింది. తన భర్త పరిస్థితి విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. బాధితుడి కిడ్నీలు దెబ్బతిన్నాయి మహ్మద్ ఖదీర్‌కు దెబ్బలు బలంగా తగలడంతో రెండు కిడ్నీలు దెబ్బతిని చేతులు వాపు వచ్చాయి. ఇక్కడ వైద్యం చేసినా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశాం. –డాక్టర్ సంతోశ్, మెదక్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు -
బీఫార్మసీ విద్యార్థిని అదృశ్యం
పటాన్చెరు టౌన్: బీఫార్మసీ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామానాయుడు కథనం ప్రకారం.. రుద్రారం గీతం విశ్వవిద్యాలయంలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రోషిణి ఈనెల 13వ తేదీన సంక్రాంతి సెలవులకు బాబాయి ఇంటికి చెముడులంకకు వెళ్లింది. తిరిగి 16వ తేదీన కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంటి బయలుదేరింది. 22వ తేదీన టాంజానియాలో ఉన్న తండ్రి రాముకు ఫోన్‌చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు కళాశాలకు ఫోన్ చేయగా 22వ తేదీ వరకు సెలవులు ఉన్నాయని చెప్పారు. తండ్రి రాము కూతురుకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పేదింటి బిడ్డకు అరుదైన రోగం.. రూ.16 కోట్ల విదేశీ ఇంజెక్షనే సంజీవని..
మెదక్ జోన్: పేదింటి గిరిజన బిడ్డకు పెద్ద రోగమొచ్చింది. కోట్లాది మందిలో ఒకరికి పుట్టుకతో వచ్చే స్పైనల్ మస్కులర్ అట్రొఫీ (ఎస్ఎంఏ) అనే వెన్నెముకకు సంబంధించిన కండరాల బలహీనత వ్యాధితో ఓ చిన్నారి మూడేళ్లుగా మంచానికి పరిమితమైంది. ఆ చిన్నారి బతకాలంటే అమెరికా నుంచి అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌ను తీసుకురావాలి. దాని ఖరీదు రూ.16 కోట్లపైనే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు తమ బిడ్డను బతికించండి అంటూ కనిపించిన వారినల్లా వేడుకుంటున్నారు. పుట్టిన 6 నెలల తర్వాత... మెదక్ జిల్లా వాడి పంచాయతీ పరిధిలోని దూప్‌సింగ్ తండాకు చెందిన రేఖ–లక్ష్మణ్ దంపతులకు తొలి సంతానంగా రోజా పుట్టింది. ఆరు నెలల వరకు ఆ చిన్నారి ఆరోగ్యంగానే ఉండేది. ఆ తర్వాత బోర్లా పడే వయసు వచ్చినా పడుకోబెట్టిన చోటే కదలకుండా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులు ఆమెను తొలుత మెదక్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఆ తర్వాత హైదరా బాద్‌లోని నిలోఫర్, నిమ్స్ సహా పలు ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లి చూపించారు. బాలికను పరీక్షించిన వైద్యులు దీన్ని ఎస్ఎంఏ అనే జన్యుపరమైన వ్యాధిగా తేల్చారు. దీనివల్ల కండరాలు రోజురోజుకూ బలహీనపడి మరణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వీలైనంత వెంటనే అమెరికా నుంచి జన్యు లోపాన్ని సరిదిద్దే ఇంజెక్షన్‌ను తీసుకొస్తేనే వ్యాధిని నయం చేయవచ్చని డాక్టర్లు తేల్చిచెప్పారు. కన్నబిడ్డ కళ్లముందే కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే తట్టుకోలేని ఆ పేద తల్లిదండ్రులు నెలకు రూ. 10 వేలు ఖర్చు చేసి తాత్కాలిక చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఉన్నదంతా అమ్మి చికిత్స చేయించారు. తమ బిడ్డకు ఎప్పటికప్పుడు తాత్కాలిక చికిత్స అందించకపోతే ఊపిరి అందదని తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా, జీన్ థెరపీ ద్వారా ఎస్ఎంఏ రోగులకు కొత్త జీవితం ప్రసాదించవచ్చని మెదక్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీసీ శేఖర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఇంజెక్షన్ (zolgensma-onasemnogene abeparvovec) అమెరికాలో దొరుకుతుందని, . దాని విలువ రూ. 16 కోట్ల నుంచి 18 కోట్ల మధ్య ఉంటుందని అన్నారు. అమాయకపు చూపుల్లో ఎన్ని ప్రశ్నలో.. మృత్యువుతో పోరాడుతున్న రోజా అమాయకపు చూపులు అందరినీ కలచి వేస్తున్నాయి. అమ్మ ఒడిలో కూర్చొని ఆయాసంగా ఊపిరి తీసుకుంటోంది. నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లండి అంటూ సైగలు చేస్తోంది. చదవండి: Telangana: సచివాలయం కింద చెరువు.. -
పనికోసం నమ్మి వెళ్తే.. ‘బీమా’ ప్లాన్‌లో శవమయ్యాడు.. పాపం ఆ డ్రైవర్!
సాక్షి, మెదక్/హైదరాబాద్: మెదక్ కారు దహనం కేసులో అనూహ్య ట్విస్ట్ నెలకొన్న విషయం తెలిసిందే. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికే ఉన్నట్లు తేలింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నాటకం ఆడి సెక్రెటేరియేట్ ఉద్యోగి ధర్మా అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. అయితే ధర్మా ఆడిన నాటకంలో డ్రైవర్ బలి పశువుగా మారాడు. పనికి వెళ్తే నాలుగు పైసలు వస్తాయని ఆశించిన వ్యక్తి ఊహించని విధంగా విగతజీవిగా మారి ఈ లోకాన్నే విడిచి వెళ్లాడు. చనిపోయింది ఎవరు ? ధర్మానాయక్‌కు రెగ్యులర్ డ్రైవర్ లేడు. ఈ నెల 4న ధర్మా హైదరాబాద్‌లోని అడ్డాపై ఉన్న బిహార్‌కు చెందిన ఓ వ్యక్తిని రోజువారీ కిరాయి ఇస్తానని కారు డ్రైవర్‌గా పనిలో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తెలిసిన వ్యక్తిని కారు డ్రైవర్‌గా పెట్టుకుంటే చంపడం కుదరదనుకుని ఇలా ప్లాన్ చేశాడు. 8వ తేదీన డ్రైవర్‌కు ఫుల్‌గా మద్యం తాగించిన తర్వాత గొడ్డలితో నరికిచంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆపై కారులో ఆ డ్రైవర్ మృతదేహాన్ని ఉంచి పెట్రోల్ పోసి తగులబెట్టినట్టు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ఇదంతా చేశాడని, దీని కోసమే రెండు నెలల క్రితం సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేశాడు. డ్రైవర్‌తో సహా కారును సజీవదహనం చేశాక ధర్మానాయక్ జరిగిన విషయాన్ని భార్యకు చెప్పిన తర్వాత సమీప అటవీ ప్రాంతం గుండా షాబాద్ తండాకు చేరుకున్నాడు. అక్కడి నుంచి మరో వాహనంలో పరారయ్యాడు. మృతుడి స్వస్థలం బీహార్‌గా భావిస్తున్నారు. నవీన్‌పేటలో స్కెచ్ ధర్మానాయక్ అక్క నిజామాబాద్ జిల్లాలోని నవీన్‌పేటలో ఉంటుంది. అక్క కొడుకుతో కలిసి ఇన్సూరెన్స్ డబ్బు కోసం పథకం వేసినట్టు ప్రచారం జరుగుతోంది. సహకరిస్తే పెళ్లికి సాయంతోపాటు, కొంతడబ్బు కూడా ముట్టజెప్పుతానని ఆశ చూపినట్టు సమాచారం. బెట్టింగ్‌లు ఆడి... ధర్మా కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్‌తోపాటు బెట్టింగ్‌లు ఆడి సుమారు రూ.2 కోట్ల వరకు పోగొట్టుకున్నట్లు తెలిసింది. దీంతో తెచ్చిన అప్పులను తీర్చే మార్గం కానరాక భారీ స్కెచ్ వేశాడు. తన పేరుపై ఉన్న 4 ఎల్ఐసీ పాలసీల క్లెయిమ్ విలువ రూ.7 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రమాదంలో చనిపోయింది ధర్మానే అనేవిధంగా నమ్మించి బీమా డబ్బులు పొందాలని చూశాడు. కాగా, ధర్మానాయక్ తమ అదుపులోనే ఉన్నాడని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని చెప్పారు. కారు దహన ఘటనపై విచారిస్తున్నామని, బుధవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. మండిపడుతున్న తండావాసులు డబ్బు కోసం ధర్మానాయక్ ఈ ఘటనకు ఒడిగట్టడంపై తండావాసులు మండిపడుతున్నారు. మంగళవారం మీడియా బృందం తండాకు చేరుకొని ధర్మానాయక్ భార్య నీల, ఇతర కుటుంబసభ్యు లతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే వా రు నోరు మెదపలేదు. మెదక్ డీఎస్పీ, అల్లాదుర్గం సీఐ, మెదక్ సీఐ, టేక్మాల్ పోలీసులు ఘటనా స్థలానికి ధర్మా నాయక్‌ను తీసుకొచ్చి వివరాలు సేకరించినట్టు సమాచారం. ధర్మానాయక్ కస్టడీలో ఉన్నా తమకేమీ సమాచారం లేదంటూ పోలీసులు సమాధానం ఇస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే ఈనెల 9న టేక్మాల్ మండలం వెంకటాపూర్ చెరువు కట్ట సమీపంలో కారులో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఆ కారు సెక్రెటేరియేట్లో పనిచేసే ధర్మనాయక్‌ది అని, చనిపోయిందని అతనేనని భావించారు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు అనేక సందేహాలు రేకెత్తాయి. కారు దహనమైన చోట పెట్రోల్ బాటిల్ ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ధర్మానాయక్ కుటుంబసభ్యుల ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టడంతో కేసు మరో మలుపు తిరిగింది. డెత్ సర్టిఫికెట్ తీసుకోమంటూ ధర్మానాయక్ చేసిన మెసేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరపగా.. చనిపోయింది ధర్మానాయక్ కాదనే ఓ అంచనాకు వచ్చారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పూణే సమీపంలో ధర్మానాయక్ ఉన్నట్టు గుర్తించారు. మంగళవారం టేక్మాల్‌కు తీసుకొచ్చి పోలీసులు విచారించారు. ఆపై మెదక్‌కు తరలించారు. -
కారులో సజీవ దహనం కేసులో ఊహించని ట్విస్ట్
-
బీమా డబ్బుల కోసం డ్రామా
మెదక్‌జోన్: కారుతోసహా వ్యక్తి సజీవదహనమైన కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికే ఉన్నట్లు తేలింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నాటకం ఆడి అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన వివరాలు.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బీమ్లా తండాకు చెందిన ధర్మానాయక్ సెక్రెటేరియేట్‌లోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 5న స్వగ్రామానికి వచ్చా డు. 6న మిత్రులతో కలిసి బాసరకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. 7న రాత్రి ఇంటికొస్తున్నానని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. 8వ తేదీ రాత్రి వెంకటాపూర్ గ్రామ శివారులో ధర్మా కారుతో సహా కాలిపోయాడనే సమాచారం అందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పక్కనే ఖాళీ పెట్రోల్ బాటిల్ గుర్తించారు. దీంతో ధర్మా ప్రమాదంలో చనిపోయాడా? ఎవరైనా హత్య చేశారా.. అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మెస్సేజ్ ఆధారంగా గుర్తింపు.. విచారణ ప్రారంభించిన పోలీసులు ధర్మా భార్య నీల ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ధర్మా పుణెకు వెళ్లి తన భార్య ఫోన్‌కు తన డెత్ సర్టి ఫికెట్ తీసి ఇన్సూరెన్స్ డబ్బులకు దరఖాస్తు చేయాలని మెస్సేజ్ పంపాడు. దీని ఆధారంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు పుణెలో ధర్మాను అరెస్ట్‌చేశారు. భార్యభర్తలిద్దరూ కలిసే ఈ స్కెచ్ వేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ నెల 4న ధర్మా హైదరాబాద్‌లోని అడ్డాపై ఉన్న బిహార్‌కు చెందిన ఓ వ్యక్తిని కారు డ్రైవర్‌గా పనిలో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తెలిసిన వ్యక్తిని కారు డ్రైవర్‌గా పెట్టుకుంటే చంపడం కుదరదనుకుని ఇలా ప్లాన్ చేశాడు. ధర్మా 8వ తేదీన డ్రైవర్‌కు ఫుల్‌గా మద్యం తాగించిన తర్వాత గొడ్డలితో నరికిచంపి, ఆపై కారులో మృతదేహాన్ని ఉంచి పెట్రోల్ పోసి తగులబెట్టినట్టు అనుమానిస్తున్నారు. దీనిపై ధర్మాను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నట్టు తెలిసింది. బెట్టింగ్‌లు ఆడి... ధర్మా కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్‌తోపాటు బెట్టింగ్‌లు ఆడి సుమారు రూ.2 కోట్ల వరకు పోగొట్టుకున్నట్లు తెలిసింది. దీంతో తెచ్చిన అప్పులను తీర్చే మార్గం కానరాక భారీ స్కెచ్ వేశాడు. తన పేరుపై ఉన్న 4 ఎల్ఐసీ పాలసీల క్లెయిమ్ విలువ రూ.7 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రమాదంలో చనిపోయింది ధర్మానే అనేవిధంగా నమ్మించి బీమా డబ్బులు పొందాలని చూశాడు. కాగా, ధర్మానాయక్ తమ అదుపులోనే ఉన్నాడని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని చెప్పారు. కారు దహన ఘటనపై విచారిస్తున్నామని, బుధవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
మెదక్: కారులో వ్యక్తి సజీవదహనం కేసులో న్యూ ట్విస్ట్
-
Medak: కారులో వ్యక్తి సజీవదహనం కేసులో ట్విస్ట్.. ఎంతకు తెగించాడు
సాక్షి, మెదక్: జిల్లాలోని టేక్మాల్ మండలం వెంకటపురంలో వ్యక్తి సజీవ దహనం చేసిన కేసులో ట్విస్ట్ నెలకొంది. సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మా నాయక్ తన డ్రైవర్‌ను హత్య చేసినట్లు తేలింది. ఇన్సూరెన్స్ డబ్ముల కోసమే ధర్మ ఈ నాటకం ఆడినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈనెల 9న కారులో ప్రమాదవశాత్తు చనిపోయినట్లు ధర్మా నాయక్ నాటకం ఆడాడు. ప్రమాద స్థలంలో పెట్రోల్ డబ్బా దొరకడంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. ధర్మ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా తను ఇంకా బతికే ఉన్నాడని భావించి ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. ధర్మ బతికే ఉన్నాడని.. గోవాలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు. తమదైన శైలిలో దర్మను విచారించగా విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయింది కారు డ్రైవర్ అని పోలీసులు గుర్తించారు అప్పులు చేసి బెట్టింగ్ ఆడిన ధర్మ.. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే అప్పులు తీర్చొచ్చని పన్నాగం పన్నాడు.భావించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అసలేం జరిగిందంటే.. టేక్మాల్ మండలం వెంకటపురం గ్రామానికి చెందిన ధర్మా నాయక్ రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనె 9న గ్రామ శివారులోని చెరువు కట్ట కింది భాగంలో దహనమైన కారులో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీ సులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న దుస్తులు, బ్యాగు ఆధారంగా మృతుడిని పాతు లోత్ ధర్మానాయక్‌గా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కారులో వ్యక్తి సజీవ దహనమైన చోట పెట్రోల్ బాటిల్ పడి ఉండటంతో ఎవరైనా కుట్రతో హత్య చేసి, కారులో పడేసి తగలబెట్టారా.. లేదా ఏదైనా ప్రమాదామా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. చివరికి కారులోని మృతదేహం ధర్మాది కాదని అతని డ్రైవర్‌దిగా పోలీసులు గుర్తించారు. చదవండి: Alert: హైదరాబాద్‌కు వస్తున్న వారికి పోలీసుల కీలక సూచన -
ప్రమాదమా.. తగలబెట్టారా?
టేక్మాల్(మెదక్): కారులో ఓ వ్యక్తిని సజీవ దహనం చేసిన ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ జరపగా కారులో దహమైన వ్యక్తిని వెంకటాపూర్ పంచాయతీ పరిధిలోని బీమ్లాతండాకు చెందిన పాత్లోత్ ధర్మానాయక్‌గా గుర్తించారు. అల్లాదుర్గం సీఐ జార్జ్ కథనం ప్రకారం.. పాతులోత్ ధర్మానాయక్ (48) రాష్ట్ర సచివాలయంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఆయన కుటుంబ సభ్యులతో కలసి స్వగ్రామం వచ్చారు. 6వ తేదీన తన మిత్రులతో కలసి బాసరకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరారు. ఆదివారం రాత్రి భార్యకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పారు. ఈ క్రమంలో సోమ వారం ఉదయం గ్రామ శివారులోని చెరువు కట్ట కింది భాగంలో దహనమైన కారులో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీ సులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న దు స్తులు, బ్యాగు ఆధారంగా మృతుడిని పాతు లోత్ ధర్మానాయక్‌గా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కారులో ధర్మానాయక్ సజీవ దహనమైన చోట పెట్రోల్ బాటిల్ పడి ఉండటంతో ఎవ రైనా కుట్రతో హత్య చేసి, కారులో పడేసి తగలబెట్టారా.. లేదా ఏదైనా ప్రమాదామా? అనే కోణంలో దర్యాప్తు చేస్తు న్నారు. ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లు జార్ఖండ్‌లోని ఐఐటీలో విద్యన భ్యసిస్తున్నారు. కుమారుడు హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు స్థానికులు తెలిపారు. -
మెదక్ జిల్లా : వ్యక్తి సజీవదహనం కేసులో పురోగతి
-
కారులో గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనం
-
బతికుండగానే కారులో వ్యక్తి సజీవ దహనం.. ఏం జరిగింది?
సాక్షి, మెదక్ జిల్లా: అప్పటి వరకు బంధువులతో మాట్లాడిన వ్యక్తి.. అంతలోనే మృత్యుఒడికి చేరుకున్నాడు. అక్కా వస్తున్నా అని చెప్పిన తమ్ముడి రాక కోసం రాత్రంతా ఎదురుచూసి తెల్ల వారగానే అతని మరణ వార్త తెలియడంతో ఆమె తల్లడిల్లిపోయింది. తెలంగాణ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ధర్మా అనే వ్యక్తి సజీవదహనం కావడంతో టేక్మాల్ మండలం భీమ్లా తండాలో విషాదం నెలకొంది. టెక్మాల్ మండలం వెంకటాపురం గ్రామ శివారులో కారులో వ్యక్తి సజీవదహనం కావడం సంచలనంగా మారింది. కారు డోర్ వద్ద మృతుడి కాలు బయటకు రావడంతో ఇది ప్రమాదమా? లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ధర్మాకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ధర్మా మృతిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. గత అర్థరాత్రి వ్యక్తిని కారులో వేసి ప్రెటోల్ పోసి నిప్పు పెట్టినట్లు ఆనవాళ్లు పోలీసులు గుర్తించారు. కారు నంబర్‌ను దుండగులు పూర్తిగా దహనం చేశారు. కారు వద్ద బ్యాగుతో పాటు చెట్ల పొదల్లో పెట్రోల్ డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మూడేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి.. రెండు రోజులకే జీవితంలో సుడిగుండం..
మనోహరాబాద్(తూప్రాన్): ప్రేమించాడు..పెళ్లి చేసుకున్నాడు.. రెండురోజులకే ఇద్దరి కులాలు వేరంటూ వదిలేశాడు. తనకు న్యాయం చేయాలంటూ ఆ యువతి వేడుకున్నా కనికరించలేదు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగింది. నెల రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. దీంతో మృతురాలు కుటుంబీకులు, బంధువులు మృతదేహాన్ని ఆ యువకుడి ఇంటి వద్ద ఉంచి ఆందోళనకు దిగారు. ఈ విషాద ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తుప్రాన్ మండలపరిధిలోని ధర్మరాజ్పల్లి గ్రామానికి చెందిన యశ్వంత్‌రెడ్డి, అదే గ్రామానికి చెందిన బాషబోయిన తేజశ్రీ (18)లు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. గతేడాది అక్టోబర్ 15న పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ 19న పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు కాపురం చేసుకుంటామని ఒప్పుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరుకావడంతో విభేదాలు వచ్చాయి. యువతికి అండగా కులపెద్దలు ఉండి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపినా ఎలాంటి న్యాయం జరగలేదు. దీంతో, ఆ యువతి పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. నెల రోజులుగా చికిత్స పొందుతున్న తేజశ్రీ మంగళవారం వేకువజామున మృతి చెందింది. తేజశ్రీ మృతదేహాన్ని యశ్వంత్‌రెడ్డి ఇంటివద్ద ఉంచి ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ శ్రీధర్, ఎస్ఐ సందీప్‌రెడ్డిలు సంఘటన స్థలానికి వచ్చి ఆందోళనకారులకు నచ్చజె ప్పారు. పోలీసులు చివరికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి అంత్యక్రియలు చేశారు. -
Medak: నాలుగేళ్లు నరకం చూపిన చేపముల్లు
సాక్షి, మెదక్: ఓ వ్యక్తి గత నాలుగేళ్ల క్రితం చేపల కూరతో భోజనం చేస్తూ చేప ముల్లును మింగేశాడు. అప్పటి నుంచి నరకయాతన అనుభవించిన సదరు వ్యక్తికి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు ముల్లును తొలగించాడు. మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రానికి చెందిన సాయిలు నాలుగేళ్ల క్రితం చేపల కూరతో భోజనం చేస్తుండగా రెండు అంగుళాల పొడవుగల చేప ముల్లును మింగేశాడు. దీంతో అప్పటి నుండి ఇబ్బంది పడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్సలు పొందాడు. 15 రోజులుగా భరించలేని కడుపు నొప్పి రావటంతో అతను మెదక్‌లోని సాయిచంద్ర నర్సింగ్‌హాం ఆస్పత్రిలో చూపించుకోగా సదరు వైద్యుడు సురేశ్ శస్త్రచికిత్స చేసి ఆ ముల్లును బయటకు తీశాడు. వైద్యవృత్తిలో ఇది చాలా అరుదైన అంశంగా పలువురు పేర్కొన్నారు. -
మెదక్ జిల్లాలో రెచ్చిపోయిన కామాంధులు
-
మెదక్ జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా మద్దూరు మండలం లాడ్నూరు గ్రామంలో కామాంధులు రెచ్చిపోయారు. 23 ఏళ్ల మూగ యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత రాత్రి ఓ కారులో యువతిని బలవంతంగా ఎక్కించుకొని వెళ్లిన కొందరు యువకులు గ్రామశివార్లలో అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. కారును వెంబండించి పట్టుకుంటే ఆకునూరు గ్రామానికి చెందిన కనకస్వామి, నరేష్ అనే వ్యక్తులు అందులో ఉన్నారని బాధిత యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. వదిలేయాలని వేడుకున్నా..) -
నాలుగేళ్లుగా వీడని బాలుడి అదృశ్యం మిస్టరీ?
సాక్షి, మెదక్: రామాయంపేట మండలంలోని అక్కన్నపేట రైల్వేస్టేషన్ వద్ద నాలుగేళ్ల క్రితం కిడ్నాప్‌నకు గురైన బాలుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కుమారుడి కోసం తండ్రి తల్లడిల్లుతున్నాడు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం క్యాసంపల్లి తండాకు చెందిన లంబాడి కపూర్య, అతడి రెండేళ్ల కుమారుడు అఖిల్ గతంలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో ఏపని చేసుకోలేక విధిలేని పరిస్థితుల్లో కపూర్య భిక్షాటన ఎంచుకున్నాడు. కొడుకు, భర్తను వదిలి అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భిక్షాటనచేస్తూ తన కుమారుడితోపాటు రామాయంపేట వచ్చి కపూర్య కొద్దిరోజులపాటు ఇక్కడే గడిపాడు. అక్కన్నపేట రైల్వేస్టేషన్‌కు వెళ్లిన కపూర్య అక్కడ రైళ్లలో భిక్షాటనచేస్తూ రాత్రి స్టేషన్ ఆవరణలో నిద్రించాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడి కుమారుడు అఖిల్‌ను అపహరించుకపోయారు. తెల్లవారుజామున లేచి చూస్తే కుమారుడు కనిపించకపోవడంతో రామాయంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వాకబు చేసినా బాలుని ఆచూకీ లభించలేదు. రైలులో ప్రయాణిస్తున్నవారు బాలుడిని అపహరించుకపోయినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. కాగా మహారాష్ట్ర, ఇతర దూరప్రాంతాల వారు రైలులో ప్రయాణిస్తున్నవారే బాలుడిని అపహరించుకపోయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
మెదక్ సీఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
మెదక్‌జోన్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఘనంగా ప్రార్థనలు జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. తెల్లవారు జామున 4.30 గంటలకు మొదటి ఆరాధనతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రెవరెండ్ బిషప్ సాల్మన్‌రాజ్ భక్తులకు దైవ సందేశం అందించి.. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు క్రీస్తు జననం మానవాళి అంతటికీ శుభదినం అన్నారు. భక్తులు ఏసు చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు భక్తులకు చర్చి దర్శనానికి అనుమతిచ్చారు. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులను ఆశీర్వదించేందుకు 15 మంది గురువులను అందుబాటులో ఉంచామని రెండో ఆరాధనలో దైవ సందేశమిచ్చిన చర్చి ప్రెసిబిటరీ ఇన్చార్జ్ జార్జ్ ఎబనైజర్రాజ్ తెలిపారు. ఈ ఉత్సవాలకు డయాసిస్ పరిధిలోని 13 జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. చర్చిలో ఆలపించిన భక్తిగీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ సందర్భంగా కల్వరి టెంపుల్‌కు భారీగా హాజరైన భక్తులు అన్ని మతాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యం: మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ అన్ని మతాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, అందులో భాగంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ గిఫ్టు ప్యాకెట్లు అందజేశారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మతాలను గౌరవిస్తూ రాష్ట్ర శ్రేయస్సును కోరుకుంటున్న సీఎం కేసీఆర్‌కు ఏసుప్రభువు ఆశీస్సులు ఉండాలన్నారు. రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలను దేశానికి అందించాలనే ఉదేశంతో బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారన్నారు. ఆమెతోపాటు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. -
మెదక్: పట్టపగలే దారుణం..
మెదక్ మున్సిపాలిటీ: పట్టపగలు ఇంట్లో చొరబడిన గుర్తు తెలియని దుండగులు మహిళ గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడు, చెవి కమ్మలు దోచుకెళ్లారు. ఈ ఘటన శనివారం మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ మధు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెల్దుర్తి మండలం కలాన్‌శెట్టిపల్లి గ్రామానికి చెందిన తలకొక్కుల వెంకటేశం, సుజాత (42) దంపతులు మెదక్‌లోని పెద్దబజార్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మార్కెట్లో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శనివారం ఉదయం కూరగాయలు అమ్మేందుకు భార్యభర్తలిద్దరూ వెళ్లారు. ఉదయం 10 గంటల సమయంలో సుజాత ఇంటికి వెళ్లి వంటచేసి భోజనం తీసుకొని వస్తానంటూ వెళ్లింది. మధ్యాహ్నం ఒంటిగంట అవుతున్నా భార్య రాకపోగా, ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడంలేదని వెంకటేశం ఇంటికి వెళ్లాడు. రక్తపు మడుగులో పడి ఉన్న సుజాతను చూసి భయాందోళనకు గురయ్యాడు. స్థానికుల సహాయంతో వెంకటేశం మెదక్ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ సైదులు, పట్టణ సీఐ మధు, ఎస్ఐ మల్లారెడ్డి, మెదక్ రూరల్ సీఐ విజయ్‌కుమార్, పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం క్లూస్‌టీం, డాగ్‌స్కా్వడ్ రప్పించి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఎస్పీ రోహిణీప్రియదర్శిని ఘటనా స్థలానికి చేరుకొని హత్య తీరును పరిశీలించారు. దుండగులను వెంటనే పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మృతురాలి కుటుంబీకులకు హామీ ఇచ్చారు. దుండగులు సుజాత మెడను కోసి, ముఖంపై కత్తులతో పొడిచి దారుణంగా చంపారు. ఆమె మెడలోంచి మూడున్నర తులాల పుస్తెలతాడు, చెవి కమ్మలను దోచుకెళ్లారు. -
మెదక్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైన మెదక్ చర్చి
మెదక్‌జోన్: మెదక్ జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చి క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైంది. చర్చి ప్రాంగణంలో శాంతాక్లాస్, క్రిస్మస్ట్రీ, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో విద్యుత్ కాంతుల్లో చర్చి వెలుగులీనుతోంది. చర్చిలో ప్రత్యేక ఆరాధనలకు తరలివచ్చే భక్తులకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటలకు మొదటి ఆరాధనను బిషప్ సాల్మన్‌రాజ్, రెండో ఆరాధనను ఉదయం 9.30 గంటలకు చర్చి ప్రెసిబెటరీ ఇన్‌చార్జి్జ జార్జ్ ఎబినేజర్ ప్రారంభిస్తారు. వేడుకలకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు ఇంగ్లండ్ దేశస్తులు కూడా వస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు. -
మెదక్: కారు ఢీకొట్టి ఇద్దరు మహిళలు మృతి
-
రూ.30 లక్షల బిల్లులు రాక.. ఇన్చార్జ్ సర్పంచ్ భిక్షాటన
కౌడిపల్లి (నర్సాపూర్): గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో ఓ ఇన్చార్జి సర్పంచ్ భిక్షాటన చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెల్మకన్నలో సోమవారం చోటు చేసుకుంది. వెల్మకన్న గ్రామ ఇన్చార్జ్ సర్పంచ్ కాజిపేట రాజేందర్ మాట్లాడుతూ.. గతేడాది మార్చి నుంచి సుమారు రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. సీసీ రోడ్లు, మురికి కాల్వలు, క్రీడాప్రాంగణం, పారిశుధ్యం పనులు, హరితహారం, వీధి దీపాలు తదితర పనులు పూర్తి చేశామని తెలిపారు. అప్పులు తెచ్చి పనులు చేస్తే, ఇంత వరకు బిల్లులు రాలేదని, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేది లేక గ్రామంలో పంచాయతీ కారి్మకులతో కలిసి భిక్షాటన చేస్తున్నట్లు తెలిపారు. రెండున్నర నెలల క్రితం రూ.ఆరు లక్షలకు సంబంధించి ఎంబీలు పూర్తి చేయగా చెక్కులు ఇచ్చారని, అయినా డబ్బులు మాత్రం రాలేదని తెలిపారు. అధికారులను ఎన్నిసార్లు అడిగిన ఫ్రీజింగ్లో ఉందని, వచ్చాక ఇస్తామని చెబుతున్నారని అన్నారు. చదవండి: కరీంనగర్లో వింతవ్యాధి కలకలం..! ఉన్నట్టుండి వాంతులు విరేచనాలు, ఆపై -
చిట్టి డబ్బులడిగితే.. కోరిక తీర్చమని వేధింపులు
సాక్షి, మెదక్ మున్సిపాలిటీ: చిట్టీల వ్యాపారం నిర్వహించే ఓ ప్రభుత్వ ఉపాధ్యా యుడు తనకు ఇవ్వాల్సిన చిట్టీ డబ్బులు అడుగుతుంటే కోరిక తీరిస్తేనే ఆ సొమ్ములు ఇస్తానని వేధిస్తున్నాడంటూ ఓ యువతి ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఉత్తరాలు రాసింది. మెదక్ పట్టణంలో కలకలం రేపిన ఈ లేఖల వ్యవహారంపై పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. ‘తండ్రి మద్యానికి బానిసగా మారి బాగోగులు పట్టించుకోకపోవడంతో నా పెళ్లికోసమని జీతంలో నుంచి కొంత పొదుపు చేసి ప్రభుత్వ ఉపాధ్యాయుడి దగ్గర రూ.2 లక్షలకు చిట్టీ వేశాను. 26 నెలల చిట్టీ గడువు తీరి చాలా కాలమైంది. ఇటీవల పెళ్లి కుదరడంతో డబ్బులు అడిగితే మీ నాన్న కు ఇచ్చేశానని బుకాయిస్తున్నాడు. ఈ మధ్యన ఒంటరిగా కలిసినప్పుడు ఎలాగూ వచ్చేనెల పెళ్లి కాబట్టి, ఓ నాలుగు రోజులు నా దగ్గర గడుపు.. అలా అయితేనే నీ డబ్బులు నీకిస్తా’ అని వేధిస్తున్నాడు.. లేదంటే నీ క్యారెక్టర్ మంచిది కాదని పెళ్లి కొడుకు వాళ్లతో చెబుతాను.. మీ నాన్నకు ఓ పది వేలిస్తే అతను కూడా అదే చెప్తాడు.. అప్పుడు పరువుపోతుంది.. పైసలు పోతాయి.., పెళ్లి క్యాన్సిల్ అవుతుంది’ అంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని సదరు యువతి ఆ లేఖల్లో పేర్కొంది. కాగా ఈ వ్యవహారంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ మధు తెలిపారు. (చదవండి: నాడు నాన్న.. నేడు అమ్మ అనాథైన బాలిక) -
ఆర్ఆర్ఆర్: చివరి దశకు భూసేకరణ.. 15 రోజుల్లో త్రీడీ నోటిఫికేషన్!
గజ్వేల్: ట్రిపుల్ఆర్ భూసేకరణ చివరి దశకు చేరుకుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ప్రజాభిప్రాయసేకరణ పూర్తి కాగా, త్వరలోనే సంగారెడ్డి జిల్లాలో అభిప్రాయ సేకరణ పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గత రెండు సభల్లో బాధితుల నుంచి వ్యక్తమైన నిరసనల నేపథ్యంలో పకడ్బందీగా ప్రక్రియను పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సర్వే నంబర్ల వారీగా త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి, పరిహారం లెక్కలు కూడా తేల్చనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ట్రిపుల్ఆర్ 110 కిలోమీటర్ల విస్తీర్ణం ఉండనుంది. 14 మండలాల్లోని 73కిపైగా గ్రామాల్లో భూసేకరణ జరగనుంది. జగదేవ్‌పూర్ – గజ్వేల్ – తూప్రాన్ –నర్సాపూర్ –సంగారెడ్డి మీదుగా కంది వరకు ఈ రోడ్డు విస్తరించనుంది. ఈ క్రమంలోనే భూసేకరణను పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోంది. సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో, మెదక్ జిల్లాకు సంబంధించి నర్సాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో బాధితుల నుంచి నిరసన వ్యక్తమైంది. భూముల విలువ పెరిగిన తరుణంలో వాస్తవ విలువకు, ప్రభుత్వమిచ్చే పరిహారానికి పొంతన ఉండదని, ఈ నేపథ్యంలో భూమికి బదులు భూమి ఇవ్వాలనే డిమాండ్‌ను అధికారుల ముందుంచారు. త్వరలోనే ప్రజాభిప్రాయసేకరణ చేపట్టనున్న సంగారెడ్డి జిల్లాలో పకడ్బందీగా పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. 980 ఎకరాలు.. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన సిద్దిపేట, మెదక్ జిల్లాలో ఇక త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగ తలమునలై ఉన్నది. ఈ నోటిఫికేషన్లో సర్వే నంబర్లవారీగా రైతుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు. జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి, ఇటిక్యాల, అలిరాజపేట, మర్కూక్ మండలం అంగడికిష్టాపూర్, చేబర్తి, ఎర్రవల్లి, పాములపర్తి, గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్, మక్తమాసాన్‌పల్లి, బంగ్లావెంకటాపూర్, వర్గల్ మండలం మైలారం, జబ్బాపూర్, నెంటూర్, రాయపోల్ మండలం బేగంపేట, ఎల్కల్ గ్రామాల్లో మొత్తంగా 980 ఎకరాల భూసేకరణ జరగనుంది. ఆ గ్రామాలకు సంబంధించిన త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ 15 రోజుల్లో విడుదల కానుంది. మరో రెండు నెలల్లో.. మెదక్ జిల్లాకు సంబంధించి తూప్రాన్, నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ల నోటిఫికేషన్ సైతం త్వరలో రానుంది. రైతుల నుంచి అభిప్రాయసేకరణ ఎలా ఉన్నా.. ఈ త్రీడీ నోటిఫికేషన్ తర్వాత పరిహారం లెక్కలు తేల్చి భూముల స్వాధీనానికి చర్యలు చేపట్టనున్నారు. పరిహారం పంపిణీకి గతంలో అవలంబించిన విధానాలలు అనుసరిస్తారా? మార్పులు చేస్తారా...? అనేది వేచి చూడాల్సి ఉంది. పరిహారం లెక్కలు తేలిన తర్వాత స్వచ్ఛందంగా ముందుకొచ్చే రైతులకు వెంటనే పరిహారం అందిస్తారు. ముందుకురాని రైతులకు సంబంధించిన పరిహారాన్ని కోర్టుల్లో జమచేసి పనులు ప్రారంభిస్తారని తెలుస్తోంది. మొత్తానికి ఒకటి, రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే సంకల్పంతో అధికార యంత్రాంగం ముందుకుసాగుతోంది. త్వరలో గెజిట్ నోటిఫికేషన్ గజ్వేల్ డివిజన్ పరిధిలో ట్రిపుల్ఆర్ భూసేకరణ ప్రక్రియను తుది దశకు చేరుకుంది. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే సర్వే నంబర్ల వారీగా త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నాం. దీని తర్వాత భూముల విలువ ఆధారంగా పరిహారం లెక్కలు కూడా తేలనున్నాయి. ఆ తర్వాత ప్రక్రియను రెండు నెలల్లోపు పూర్తి చేసే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం. –విజయేందర్‌రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, గజ్వేల్ -
నాలుగేళ్ల చిన్నారిని చిదిమేసిన కారు..
సాక్షి, మెదక్: నిర్లక్ష్యపు డ్రైవింగ్ నాలుగేళ్ల చిన్నారిని చిదిమేసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాబు–నవ్య దంపతుల ఏకైక కుమార్తె కీర్తన (4) అంగన్వాడీ సెంటర్‌కు వెళ్తుంది. ఆదివారం సాయంత్రం గ్రామంలో ఆడుకుంటూ రోడ్డుదాటే ప్రయత్నం చేసింది. అదే గ్రామంలోని ఓ రైస్ మిల్ యజమాని కుమారుడు కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ చిన్నారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కీర్తన రక్తపుమడుగులో కొట్టుమిట్టాడి అక్కడే చనిపోయింది. కారు డ్రైవర్ ప్రమాదస్థలం నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకున్నారు. అదే కారులో చిన్నారిని మెదక్ పట్టణంలోని ఆస్పత్రికి తీసుకురాగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఈ విషయమై ఇంకా ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్ఐ మురళీ తెలిపారు. చదవండి: ‘సారీ.. అన్నయ్య మిస్ యూ’.. అంటూ మెసెజ్ పెట్టి.. -
మెదక్ చర్చి బిషప్‌పై సస్పెన్షన్ వేటు
సాక్షి, మెదక్: సీఎస్ఐ మెదక్ డయాసిస్ బిషప్ రెవ ఎ.సి.సాల్మన్‌రాజ్‌ను సస్పెండ్ చేస్తూ సీఎస్ఐ చెన్నై సినాడ్ మాడరేటర్ ధర్మరాజు రసాలం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మెదక్ బిషప్ ఎ.సి.సాల్మన్‌రాజు తన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని, సీఎస్ఐ గైడ్‌లైన్స్ ఉల్లంఘించారని సినాడ్‌కు ఫిర్యాదులు అందాయి. మెదక్ చర్చి పాస్టరేట్ కమిటీ పాలకవర్గ నియామకం విషయంలో మెజారిటీ సభ్యుల ప్యానెల్‌కు కాకుండా బిషప్ తన వర్గానికి పదవులు దక్కేలా చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై పాస్టరేట్ కమిటీ ఎన్నికల్లో మెజారిటీ సభ్యులు నిరసన తెలుపుతూ బిషప్‌పై చెన్నై సినాడ్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన సినాడ్ కోర్టు ఎ.సి.సాల్మన్‌రాజ్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పరిపాలన విషయాల్లో సీఎస్ఐ బైలాను పాటించలేదని నిర్ధారిస్తూ మెదక్ డయాసిస్ బిషప్ పదవి నుంచి ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో డోర్నకల్ మోడరేటర్ బిషప్ పద్మారావును మెదక్ డయాసిస్ ఇన్చార్జ్ బిషప్‌గా నియమిస్తున్నట్లు సీఎస్ఐ మాడరేటర్ ధర్మరాజ్ రసాలం తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన సికింద్రాబాద్‌లో సీఎస్ఐ ఆఫీస్‌లో బాధ్యతలు స్వీకరించారు. చదవండి: తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు: సుప్రీం వ్యాఖ్య -
ఎంపీ కాదు ఎమ్మెల్యే కావాలట.!
ఎమ్మెల్యే కావాలనుకున్నారు. కాని అంతకంటే పెద్ద పోస్టే దక్కింది. అదీ రెండుసార్లు ఎంపీగా గెలిచారు. కాని ఆయన కోరిక ఎమ్మెల్యే కావడమేనట. అందుకే ఈసారి సొంత గడ్డ మీద నుంచి ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు. మరి గులాబీ బాస్ ఆయన కోరిక నెరవేరుస్తారా? దృష్టంతా దుబ్బాక మీదే.! కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ నుండి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన ప్రభాకరరెడ్డి పార్టీ కోసం బలంగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో చివరి క్షణంలో ఎమ్మెల్యే సీటు చేజారి మళ్లీ ఎంపీ సీట్ ఆయన్ను వరించింది. 2019తో కూడా కలుపుకుని కొత్త ప్రభాకరరెడ్డి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే ఆయనకు ఎమ్మెల్యే కావాలన్న కోరిక బలంగా ఉంది. అందుకే ఇప్పుడైనా తన సొంత నియోజకవర్గమైన దుబ్బాక అసెంబ్లీ సీటు ఇవ్వాలని గులాబీ బాస్‌ను కోరినట్లు తెలుస్తోంది. తన ఆశయం నెరవేర్చుకునే క్రమంలో ఇటీవల... దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కువగా తిరుగుతున్నారట... అదేవిధంగా నియోజకవర్గంలో తన అనుచర గణాన్ని కూడా పెంచుకున్నట్లు చెబుతున్నారు. ప్రగతి భవన్ నుంచి కూడా కొత్త ప్రభాకర్ రెడ్డికి సానుకూలంగా సంకేతాలు వచ్చాయట. విషయం అర్థం కావడంతో ఎంపీ అనుచరులు దుబ్బాకలో అప్పుడే ప్రచారం ప్రారంభించేశారట. పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ 2014కి ముందు దుబ్బాక అసెంబ్లీ సీటు టార్గెట్‌గానే ఆయన పనిచేశారు. కాని సోలిపేట రామలింగారెడ్డి కారణంగా చివరగా ఎమ్మెల్యే టికెట్ చేయి జారింది. 2018లో కూడా ఆయన కోరిక నెరవేరలేదు. ఇలా రెండు సార్లు ఎంపీ ఎన్నికల్లోనే నిలబడి గెలిచారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంలో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి సుజాతకు టిక్కెట్టు ఇచ్చింది టీఆర్ఎస్ అధిష్టానం. ఆమెపై బిజెపి అభ్యర్థి రఘునందనరావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీఆర్ఎస్ సిటింగ్ సీటు చేజారిపోయింది. ఇక అప్పటినుంచి టిఆర్ఎస్ అధిష్టానం దుబ్బాక నియోజకవర్గంపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఇక్కడ పార్టీకి గట్టి లీడర్ అవసరమని భావించి.. ఎప్పటినుంచో ఎమ్మెల్యే కావాలనుకుంటున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అప్పటి నుండి పార్టీ కార్యక్రమం అయినా.. ప్రభుత్వ కార్యక్రమాలు అయినా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. టార్గెట్ రఘునందన్ మెదక్ ఎంపీగా కార్యక్రమాలు నిర్వహిస్తూనే... దుబ్బాక అసెంబ్లీ స్థానంలో తనకంటూ ఒక టీమును తయారు చేసుకుని..అందరినీ కలుపు పోతున్నారట కొత్త ప్రభాకరరెడ్డి. అసంతృప్తితో ఉన్న వారిని సైతం ప్రత్యేక సమావేశాల ద్వారా తన వైపు తిప్పుకుంటున్నారట. దుబ్బాకలో బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావును ఢీకొట్టే బలమైన నాయకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అంటూ ఆయన అనుచరులు నియోజకవర్గంలో గట్టిగానే ప్రచారం చేస్తున్నారట. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. దీనికి మంత్రి హరీష్ రావు సహకారం కూడా తోడవుతుందని చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వానికి సంబంధించి ఏ ప్రోగ్రామ్ జరిగినా...అటు ఎమ్మెల్యే రఘునందన్ రావు.. ఇటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరవుతూ జనం వద్ద మార్కులు కొట్టేస్తున్నారట. రెండు వర్గాల వారు ఏదో విషయంలో గొడవ పడుతూ ఉన్నారట. కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రం తగ్గేదే లేదంటూ నియోజకవర్గం అంతా తిరుగుతూ ప్రజలకు దగ్గరవుతున్నారట. పోటీ చేస్తా.. గెలిచి గిఫ్ట్ ఇస్తా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నాయకత్వం వహించే ఎంపీ సీటు కంటే ఒక అసెంబ్లీ సీటుకే పరిమితం కావాలని కొత్త ప్రభాకరరెడ్డి అనుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైతే కలిగే ప్రయోజనాలు వేరేగా ఉంటాయని ఆయన భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు దక్కించుకుని.. రఘునందన్‌పై గెలిచి పార్టీకి గిఫ్ట్ ఇస్తానంటున్నారు. -
కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి కూడా..
నర్సాపూర్ రూరల్: ఆర్థిక ఇబ్బందులతో కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది తట్టుకోలేని తల్లి గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఖాజీపేటలో జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఖాజీపేటకు చెందిన ముచ్చర్ల విజయ్‌గౌడ్ (28) ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం సాయంత్రం తన డెయిరీ ఫామ్ దగ్గర గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన చుట్టు పక్కలవారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. హైదరాబాద్, సూరారంలోని నారాయణ ఆస్పత్రికి సమీపిస్తుండగా మృతి చెందాడు. మృతదేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. విజయ్‌గౌడ్ చనిపోయిన విషయాన్ని రాత్రి 11 గంటల సమయంలో తల్లి ముచ్చర్ల స్వరూప (55)కు చెప్పారు. గుండెలు అవిసేలా రోదించిన ఆ తల్లి.. రాత్రి 2 గంటల సమయంలో గుండెపోటు తో ఇంట్లోనే ప్రాణాలొదిలింది. ఒకే రోజు తల్లీకొ డుకు మృతి చెందడంతో ఖాజీపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరి అంత్యక్రియలు సోమవారం సాయంత్రం నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్, సుధాకర్‌రెడ్డి, మదన్‌లతోపాటు ఆయా పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అప్పులబాధతో ఆత్మహత్య.. ముచ్చర్ల నర్సింహగౌడ్, స్వరూప దంపతులకు ఇద్దరు కొడుకులు. ఉమ్మడి కుటుంబం. పెద్ద కొడు కు శేఖర్‌గౌడ్ ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. రెండో కుమారుడైన విజయ్‌గౌడ్ అప్పు చేసి కొన్ని పాడి గేదెలు కొనుగోలు చేసి డెయిరీ ఫామ్ నిర్వహి స్తున్నాడు. ఇటీవల కొన్ని గేదెలు అనారోగ్యంతో మృతి చెందాయి. చేసిన అప్పులతో పాటు కుటుంబ పోషణకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. తీవ్ర మనస్తాపానికి గురై విజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య శిరీష, మూడేళ్ల కొడుకున్నాడు. శిరీష ప్రస్తుతం 8 నెలల గర్భిణి. -
మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
మనోహరాబాద్(తూప్రాన్): తాతల కాలం నాటి నుంచి సాగు చేసుకుంటూ జీవిస్తున్న భూమిని పరిశ్రమల పేరిట ప్రభుత్వం లాక్కుంటే ఎలా బతికేదని ఓ మహిళా రైతు అధికారుల ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండలం పర్కిబండ గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం అధికారులు సర్వే చేస్తుండగా పర్కిబండ గ్రామానికి చెందిన తీగుళ్ళ శ్యామల వారి వద్దకు వచ్చి తమకున్న రెండెకరాల సాగు భూమిని గుంజుకుంటే మాకు జీవనాధారం ఉండదని కాళ్లావేళ్లా పడి వేడుకుంది. మా చేతిలో ఏమీ లేదనీ తమ పైఅధికారుల ఆదేశాల మేరకే 209 సర్వే నంబర్లో 252 ఎకరాల కోసం స్థల సర్వే చేపట్టినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. దీంతో భూమి పోతుందనే దుఃఖంలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును అధికారుల ముందే తాగింది. ఇది గమనించిన అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పక్కనే ఉన్న స్థానికులు చికిత్స నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి రైతును పరామర్శించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఫోన్లో మాట్లాడి రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
మందుకొట్టి.. గొడ్డలి పట్టి కానిస్టేబుల్‌పై దాడి
సాక్షి, మెదక్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహనం స్వాదీనం చేసుకున్నారన్న కోపంతో ఒక మందుబాబు గొడ్డలితో కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో మంగళవారం జరిగింది. తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి తెలిపిన వివరాలివి. పట్టణంలోని నర్సాపూర్ వంతెన వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే మున్సిపల్ పరిధిలోని రావెల్లి గ్రామానికి చెందిన మల్లేశ్‌యాదవ్ తన ద్విచక్రవాహనంపై అటు వస్తున్నాడు. పోలీసులు అతని వాహనం ఆపి తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం తాగినట్టు తేలడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో కోపోద్రిక్తుడైన మల్లేశ్‌యాదవ్ తన ఇంటికి వెళ్లి.. కాసేపటికి నర్సాపూర్ వంతెన వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న చోటికి చేరుకున్నాడు. తన బైక్ స్వాధీనం చేసుకున్న కానిస్టేబుల్ ఆఫీజ్, హోంగార్డు ఇలియాస్‌పై వెంట తెచ్చుకున్న గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆఫీజ్ తలపై రెండు చోట్ల తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే కానిస్టేబుల్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మల్లేశ్‌యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్లాన్ ప్రకారమే ప్రాణం తీశారు.. ఆనంద్ భార్య లీల ఎక్కడ?
పటాన్చెరు టౌన్: కూతురిని ప్రేమిస్తున్న యువకుడిని యువతి కుటుంబ సభ్యులు పథకం ప్రకారం హత్య చేశారు. శుక్రవారం పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ భీంరెడ్డి ఆ వివరాలు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు గ్రామానికి చెందిన శివకుమార్ అదే గ్రామానికి చెందిన భారతి ప్రేమించుకుంటున్నారు. భారతి వాట్సాప్‌లో శివకుమార్‌తో చాటింగ్ చేసింది. చాట్ విషయం చిన్నాన్న ఆనంద్‌కు తెలిసింది. భారతిని తండ్రి బాలపీరు ఎదుటే మందలించాడు. అయినా పరిస్థితి మార్పు రాలేదు. దీంతో తండ్రి బాలపీరు, బాబాయి ఆనంద్ కలసి పథకం వేశారు. ప్రణాళికలో భాగంగా కూతురు భారతితో ఈనెల 7వ తేదీ రాత్రి ఫోన్ చేయించారు. అమీర్‌పేట్‌కు రమ్మని చెప్పించారు. డబ్బులు లేవని శివకుమార్ చెప్పడంతో యువతికి వరుసకు బావ అయిన బాలకృష్ణతో రూ.200 ఆన్లైన్లో వేయించారు. శివకుమార్ అమీర్‌పేట్‌కు వచ్చాక అతడిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నారు. హుస్సేన్‌సాగర్ దిగువనున్న గోశాల దగ్గరలో గల శ్మశాన వాటికకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపారు. మృతదేహాన్ని పక్కనే ఉన్న హుస్సేన్‌సాగర్ నుంచి మూసీ నదికి వెళ్లే కాలువలో పడివేశారు. కాలువలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మృతదేహం కొట్టుకుపోయింది. పోలీసులు సీసీ కెమెరాలు, ఫోన్ డేటా ఆధారంగా ముషీరాబాద్ బొలక్పూర్కు చెందిన భారతి బాబాయి ఆనంద్, తండ్రి బాలపీరు, తల్లి బాలకిష్టమ్మ, బావ బాలకృష్ణను గురువారం అదుపులోకి తీసుకొని విచారించారు. యువకుడిని హత్య చేసి కాలువతో పడేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఆనంద్ భార్య లీలను త్వరలో పట్టుకుంటామన్నారు. కాగా శివకుమార్ మృతదేహం కోసం ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ బృందాలతో గాలింపు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు కీలక పాత్ర పోషించిన పటాన్చెరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి, క్రైం సీఐ బీసన్న, ఎస్ఐలు రామానాయుడు, ప్రసాద్‌ను ఎస్పీ రమణకుమార్ అభినందించినట్టు డీఎస్పీ తెలిపారు. ఇది కూడా చదవండి: షాకింగ్ ఘటన.. కాలేజీ విద్యార్థిని ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్, వీడియో వైరల్ -
అభిమాని లేఖకు మంత్రి హరీశ్ రావు ఫిదా..
సాక్షి, సిద్దిపేట: హరీశ్‌రావు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్య బాధ్యతలు చూసే కీలక మంత్రిగా ఉన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషిచేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. ప్లాస్టిక్ వాడకంతో భయంకరమైన కేన్సర్ బారినపడే ఆవకాశాలు ఉన్నాయని వారిని జాగృతం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మరో మార్గం లేక మంత్రి కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ దప్పిక తీర్చుకొనే అత్యవసర పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని గుర్తించిన ఓ వీరాభిమాని అమాత్యుడు హరీశ్‌రావు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలంటూ శుక్రవారం దుబ్బాక పర్యటనలో మంత్రికి లేఖ అందించారు. మీ ఆరోగ్యమే మాకు మహాభాగ్యం..మీరు తప్పని పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడుతున్నారని, ఈ నీరు తాగడం వల్ల భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదన్నారు. ఇటీవల అంతర్జాతీయ ప్రముఖ రేడియాలజిస్టు డాక్టర్ విమల్ సోమేశ్వర్ ఇంటర్వ్యూలో చెప్పారని లేఖలో వివరించారు. దయచేసి ఇకపై కాపర్ వాటర్ బాటిల్ వినియోగించాలని మంత్రికి దుబ్బాక పరిధి మల్లాయపల్లికి చెందిన ఎంబీఏ విద్యార్థి కీసరి ప్రవీణ్ లేఖ అందించాడు. ప్రవీణ్ రాసినలేఖను చదివి తన ఆరోగ్యం పట్ల ఎంతో తపనతో రాశాడంటూ ఫిదా అయ్యాడు. ప్రవీణ్ కు మంత్రి ప్రత్యేకంగా ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియాలో లేఖ హల్చల్ అవుతోంది. చదవండి: చివరిశ్వాస వరకూ ‘అమ్మవారి’తోనే.. -
మంజీర నదిపై భారీ వంతెన నిర్మాణం.. కానీ..
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి, మెదక్ జిల్లాల మధ్యన దూరభారాన్ని తగ్గించేందుకు రూ.33 కోట్ల వ్యయంతో చేపట్టిన మంజీర నదిపై భారీ వంతెన, కామారెడ్డి జిల్లాలో రెండు వరుసల రహదారి నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. కానీ మెదక్ జిల్లా పరిధిలో (వంతెన అవతల) రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. ఈ రోడ్డు అందుబాటులోకి కానీ 40 కిలోమీటర్ల మేర దూరభారం తగ్గుతుంది. ఇరు జిల్లాల మధ్య వ్యాపార సంబంధాలు పెరుగుతాయి. 2015లో వంతెన నిర్మాణానికి రూ.12 కోట్లు, కామారెడ్డి జిల్లాలోని తాండూర్ గేట్ నుంచి తాండూరు, వెంకంపల్లి మీదుగా వంతెన వరకు రెండు వరుసల రహదారి నిర్మాణం కోసం రూ.21 కోట్లు మంజూరు చేశారు. రోడ్డు నిర్మాణం కోసం విలువైన భూములు కోల్పోతున్నామని రైతులు కోర్టుకు వెళ్లడంతో కొంత కాలం పనులు జరగలేదు. పరిహారం ఇచ్చిన తరువాత పనులు చేపట్టారు. అటవీ వివాదంతో కొద్దిమేర పనులు ఆగిపోయినా మిగతా పనులు దాదాపు పూర్తయ్యాయి. మంజీర మీద భారీ వంతెన అందుబాటులోకి వచ్చింది. కానీ వంతెన అవతల రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గమ్మ దర్శనానికి కామారెడ్డి జిల్లా నుంచి ప్రతి నిత్యం ఎంతో మంది వెళుతుంటారు. రోడ్డు అందుబాటులోకి వస్తే రాకపోకలు సులువవుతాయి. తగ్గే దూరం 40 కిలోమీటర్లు.. కామారెడ్డి జిల్లా వాసులు ముఖ్యంగా ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట తదితర మండలాల ప్రజలు మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలానికి వెళ్లాలంటే మెదక్ మీదుగా దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణించాలి. అయితే తాండూర్ గేట్ నుంచి తాండూర్, వెంకంపల్లి మీదుగా మంజీరపై నిర్మించిన వంతెన ద్వారా మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని మగ్దుంపూర్ మీదుగా పాపన్నపేటకు వెళ్లడానికి కేవలం 10 కిలోమీటర్లే ఉంటుంది. అంటే దాదాపు 40 కిలోమీటర్ల మేర దూరభారం తగ్గుతుంది. మంజీర మీద వంతెన లేక ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులుపడ్డారు. ఇప్పుడు వంతెన పూర్తయ్యింది. కానీ మెదక్ జిల్లాలో రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో ఆశలు అడియాసలయ్యాయి. (క్లిక్: హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. స్టాప్ లైన్ దాటితే ఇక అంతే!) నిధులు మంజూరైతేనే... మంజీర వంతెన నుంచి మగ్దుంపూర్ మీదుగా పాపన్నపేట వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఫార్మేషన్ రోడ్డు కూడా లేదు. పొలాల మధ్య నుంచి బండ్లబాట ఉంది. రోడ్డు నిర్మాణానికి ముందుగా రైతుల నుంచి భూసేకరణ జరపాలి. ఆ తర్వాత రోడ్డు పనులు చేపట్టాల్సి ఉంటుంది. రోడ్డు నిర్మాణం కోసం మెదక్ జిల్లా రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దానికి నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు. (క్లిక్: ఆర్టీసీ బస్సులకు కొత్త పేర్లు.. ఏదైతే బాగుంటుంది?) రూ.33 కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం శూన్యం.... కామారెడ్డి, మెదక్ జిల్లాల మధ్య దూరం మధ్య దూరం తగ్గించే రహదారిని పూర్తి చేయాలని జెడ్పీ మీటింగుల్లో ప్రతిసారీ అడుగుతున్నాం. ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించాం. అయినా ప్రయోజనం లేదు. రూ.33 కోట్లతో వంతెన, రోడ్డు నిర్మాణం పూర్తయినా, మెదక్ జిల్లాలో పనులు చేపట్టకపోవడంతో ప్రయోజనం లేకుండాపోయింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే ఏడుపాయల, మెదక్ చర్చి, పోచారం ప్రాజెక్టు, పోచారం అభయారణ్యానికి పర్యాటకులు పెరుగుతారు. – యు.మనోహర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు, నాగిరెడ్డిపేట -
మరో మహిళతో సంబంధం.. భర్త కొట్టడంతో మనస్తాపం చెంది
సాక్షి, సిద్దిపేట: భర్త వేధింపులు తాళలేక భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం జిల్లాలోని చిన్నకోడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన దాసరి రాజ్యలక్ష్మి (24)ని 2015లో చిన్నకోడూరుకు చెందిన శ్రీశైలంతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా శ్రీశైలం మూడేళ్లుగా అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరువురికి నచ్చజెప్పి సముదాయించారు. ఆదివారం రాజ్యలక్ష్మిని భర్త కొట్టడంతో మనస్తాపం చెంది రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అల్లుడు వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి దేవవ్వ ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: దసరాకి కొత్త దుస్తులు నాన్నా.. ఈ రోజే తెద్దాంలే కన్నా’.. అంతలోనే -
భర్త గొంతుకు తాడు బిగించి చంపిన భార్య
పాపన్నపేట (మెదక్): భర్త చేసే చిల్లర దొంగతనాలతో విసిగి వేసారిందో? లేక రైతు బీమా డబ్బులకు ఆశపడిందో? తెలియదు గాని.. మెడలో మూడుముళ్లు వేసి తాళి కట్టిన భర్త గొంతుకు తాడు బిగించి చంపేసిందో భార్య. కనిపెంచిన కూతుళ్లు సైతం మానవత్వాన్ని మరచి తల్లికి సహకరించారు. గురువారం రాత్రి 8 గంటలకు ఈ దారుణం జరిగితే.. శుక్రవారం ఉదయం 8 గంటలకు బయటపడిన ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతానగరం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సీతానగరానికి చెందిన రైతు లంగడి బాలయ్య(56), కిసనమ్మ భార్యాభర్తలు. వీరికి రాధమ్మ, వినోద అనే కూతుళ్లు ఉన్నారు. కొడుకు మల్లేశ్ ఇదివరకే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కూతుళ్లకు గ్రామానికి చెందిన వారికే ఇచ్చి పెళ్లిళ్లు చేశాడు. కాగా, బాలయ్యను ఇంట్లో సరిగా చూడకపోవడంతో మద్యం సేవిస్తూ అప్పుడప్పుడూ చిల్లర దొంగతనాలు చేసేవాడు. ఇటీవల ఈ కుటుంబం ఏడుపాయల ఆలయంవద్ద విందు చేసుకొని తిరిగి వస్తుండగా, అద్దెకు తీసుకెళ్లిన ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు యువకులు చనిపోయారు. దీంతో ట్రాక్టర్ యజమానితో కలసి బాలయ్య.. బాధిత కుటుంబాలకు రూ.2.50 లక్షల పరిహారం చెల్లించాడు. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. గురువారం గొడవ తీవ్రం కావడంతో భార్య కిసనమ్మ భర్త గొంతుకు తాడు బిగించగా.. మనవడు దుర్గేశ్, కూతుళ్లు రాధమ్మ, వినోదలు తలోవైపునకు లాగారు. అనంతరం ఇంటి ముందు వీధిలోకి ఈడ్చుకొచ్చారు. అయితే 10వ తరగతి చదువుతున్న మరో మనవడు బాల్‌రాజ్.. తాతను చంపవద్దని ప్రాధేయ పడినప్పటికీ వారు వినలేదు. అప్పటికే బాలయ్య చనిపోవడంతో అంతా కలసి మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లారు. గ్రామస్తుల నిరసన అమాయకుడైన బాలయ్యను అమానుషంగా చంపిన కుటుంబీకులను కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు నిందితుల ఇంటి ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాపన్నపేట ఎస్ఐ విజయ్, మెదక్ సీఐ విజయ్.. గ్రామస్తులకు నచ్చజెప్పి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితులను విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇంటి ముందు బైఠాయించిన గ్రామస్తులు -
మెదక్‌లో రైలు కూత
మెదక్‌జోన్: మెదక్ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. శుక్రవారం మెదక్‌లో రైలు కూత వినిపించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. మెదక్–అక్కన్నపేట రైల్వేస్టేషన్ మధ్య నూతన రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేస్తూ మెదక్ నుంచి కాచిగూడ వరకు ప్యాసింజర్ రైలును మెదక్ రైల్వేస్టేషన్లో కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డితో కలిసి ప్రారంభించి రైలు టికెట్ కొనుగోలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎన్నికై ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇక్కడి ప్రజలు రైలు కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. మెదక్ జిల్లా ప్రజలకు ఇది పండుగ వేళ అన్నారు. మెదక్–అక్కన్నపేట వరకు 17.2 కిలోమీటర్ల రైల్వేలైన్ కోసం రూ.205 కోట్లు వ్యయమైందన్నారు. మెదక్ నుంచి రెండు ప్యాసింజర్ రైళ్లను ప్రారంభిస్తున్నామన్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్–ముంబై ట్రాక్‌కు కనెక్ట్ చేస్తారని చెప్పారు. త్వరలో వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు గతంలో ఈ ప్రాంతంలోని మాసాయిపేట వద్ద పాఠశాల బస్సును రైలు ఢీకొట్టిన దుర్ఘటన ఇంకా తన కళ్ల ముందే కదలాడుతోందని, అలాంటి ఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 43 స్టేషన్ల పరిధిలో ప్రత్యేక పనులను చేపట్టామని కిషన్‌రెడ్డి చెప్పారు. భద్రాచలం, సత్తుపల్లిలో రైల్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు సైతం రూ.221 కోట్ల వ్యయంతో జరుగుతున్నాయని, రూ.653 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి అభివృద్ధి చేసుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజీ పడబోమని స్పష్టంచేశారు. కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి అన్ని రంగాల్లో్ల ప్రాధాన్యత ఇస్తోందని, మెదక్ జిల్లా కేంద్రానికి నేషనల్ హైవే నర్సాపూర్ మీదుగా నిర్మించారని చెప్పారు. అలాగే జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.లక్షా నాలుగు వేల కోట్లను ఖర్చుపెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య నియంత్రణ కోసం చర్లపల్లి రైల్వేస్టేషన్లో రూ.221 కోట్లతో రైల్వే టర్మినల్ నిర్మిస్తున్నామన్నారు. వరంగల్‌లో రూ.400 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
నిరీక్షణ ఫలించిన వేళ.. మెతుకుసీమకు రైలుబండి
మెదక్‌జోన్: ఎన్నో దశాబ్దాలుగా రైలుకోసం ఎదురు చూస్తున్న మెతుకు సీమ ప్రజల కల ఎట్టకేలకు నెరవేరే సమయం ఆసన్నమైంది. శుక్రవారం రైలు ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. దివంగత ఇందిరా గాంధీ ఎంపీగా మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటినుంచే ఈ ప్రాంతానికి రైల్వే సౌకర్యం కల్పించాలన్న డిమాండ్ ఉంది. అందుకోసం చాలా కాలం ఉద్యమాలు కొనసాగాయి. 2012 –13లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉండగా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకు ముందు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషి ఫలితంగా కాస్ట్ షేరింగ్ పద్ధతిలో రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్ జిల్లా కేంద్రం వరకు కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ మంజూరైంది. 2014లో శంకుస్థాపన.. మెదక్–అక్కన్నపేట రైల్వేలైన్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 17.2 కిలోమీటర్ల దూరం కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి 2012–2013 సంవత్సరంలో రూ.117 కోట్లు అవసరమని అంచనా వేసి ఆమోదం తెలిపారు. 2014లో రైల్వేలైన్ నిర్మాణానికి అప్పటి ఎంపీ విజయశాంతి చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత పనుల ఆలస్యంతో అంచనా వ్యయం రూ.206 కోట్లకు చేరింది. ఇందులో రూ.103 కోట్లు రాష్ట్రం భరించగా, మిగతా నిధులు కేంద్రం విడుదల చేసింది. భూసేకరణకు రాష్ట్ర నిధులు రైల్వేలైన్ కోసం అవసరమయ్యే 392 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైతులకు రూ.16.80 కోట్ల పరిహారం అందజేసింది. రేక్‌పాయింట్‌తో రైతులకు మేలు.. రెండు నెలల క్రితమే మెదక్‌కు రేక్‌పాయింట్ మంజూరు కాగా, మంత్రి హరీశ్‌రావు దానిని ప్రారంభించారు. రైతులు తాము పండించిన ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా తరలించుకోవడానికి ఈ పాయింట్ ఉపయుక్తంగా ఉంటుంది. అదే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎరువులు, ఇతర ఉత్పత్తులు కూడా దిగుమతి చేసుకోవచ్చు. మెదక్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు సౌలభ్యం మెదక్ నుంచి రైళ్ల రాకపోకలతో మెదక్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. మెదక్, హవేళిఘనాపూర్, చిన్నశంకరంపేట, కొల్చారం మండలాలు, కామారెడ్డి జిల్లా లింగంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వారు ఈ సేవలు పొందొచ్చు. కలనెరవేరింది... మెదక్ నుంచి ఇందిరాగాంధీ ఎంపీగా గెలుపొంది దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచే ఇక్కడి ప్రజలు రైలు కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని రాష్ట్ర వాటాగా 50 శాతం నిధులు విడుదల చేయడంతోపాటు భూసేకరణ కూడా వేగవంతం చేసి పరిహారం చెల్లించారు. దీంతో పనులు త్వరగా పూర్తయ్యాయి. ఎట్టకేలకు రైలు రాకతో ఈ ప్రాంత ప్రజల కల నెరవేరింది. :: పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మూడు రైల్వేస్టేషన్లు.. మెదక్– అక్కన్నపేట మధ్యలో కొత్తగా నిర్మించిన రైల్వేలైన్ దూరం 17.2 కిలోమీటర్లు. ఈ మధ్యలో మెదక్, శమ్నాపూర్, లక్ష్మాపూర్‌లలో కొత్తగా రైల్వేస్టేషన్లు నిర్మించారు. ప్రస్తుతానికి మెదక్ టు కాచిగూడ, మెదక్ టు మహబూబ్‌నగర్‌కు ఉదయం, సాయంత్రం వేళ రెండు రైళ్లు నడుపుతారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని రైళ్లు నడిపేందుకు ప్రయత్నిస్తామని దక్షిణమధ్య రైల్వే అధికారులు చెప్పారు. -
చావులోనూ వీడని బంధం
కౌడిపల్లి(నర్సాపూర్): చావులోనూ బంధాన్ని వీడకుండా భార్యాభర్తలిద్దరూ ఒకేతాడుతో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పంటలసాగులో వచ్చిన నష్టం ఆ దంపతుల ప్రాణాలను మింగేసింది. ఈ ఘటన శనివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్‌పల్లిలో చోటుచేసుకుంది. ముట్రాజ్‌పల్లికి చెందిన ఆకుల బాషయ్య(57), శివ్వమ్మ(53) భార్యాభర్తలు. వీరికి కొడుకు నరేశ్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. నరేశ్ ఏడాదిగా హైదరాబాద్‌లో ఉంటూ ఫొటో స్టూడియోలో పనిచేస్తున్నాడు. బాషయ్య, శివ్వమ్మ గ్రామంలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. పిల్లల పెళ్లిళ్లు, సాగు కోసం చేసిన రూ.4 లక్షల అప్పులు, ఇటీవల వేసిన బోరు ఫెయిల్ కావడం, పంటలో నష్టం రావడం.. వీటికితోడు భార్య అనారోగ్య పరిస్థితి ఆయనను ఆందోళనకు గురిచేశాయి. అప్పులు తీర్చే మార్గం కానరాక తరచూ మథనపడేవాడు. ఈ క్రమంలో శుక్రవారంరాత్రి పదిగంటల వరకు ఆ దంపతులు ఇరుగుపొరుగు వారితో ముచ్చట పెట్టి అనంతరం ఇంట్లోకి వెళ్లిపోయారు. శనివారం ఉదయం గ్రామానికి చెందిన మంగమ్మ బట్టలు ఉతికేందుకని బాషయ్య ఇంటికి వెళ్లి తలుపుతట్టగా లోపలి నుంచి ఉలుకూపలుకూలేదు. దీంతో ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా దంపతులిద్దరూ ఒకేతాడుతో దూలానికి ఉరేసుకుని మృతిచెందారు. కొడుకు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
పెళ్లయిన ఏడు నెలలకే..
రామాయంపేట(మెదక్): ఎన్నో కలలతో నూరేళ్ల దాంపత్య జీవితాన్ని ప్రారంభించిన యువజంటను ఏడాది పూర్తి కాకముందే మృత్యువు కబలించింది. అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచిన వారి బంధం ఏడు నెలలకే అర్థాంతరంగా ముగిసింది. వినాయక నవరాత్రి ఉత్సవాలకు హాజరైన దంపతులు తిరుగు ప్రయాణంలో మేడ్చల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాయంపేట పట్టణానికి చెందిన చకిలం శ్రీనివాస్, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సాయిరాజ్ (28) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఫిబ్రవరిలో గజ్వేల్‌కు చెందిన సారికను వివాహం చేసుకొని హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీకెండ్‌తో పాటు వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు శుక్రవారం రామాయంపేటకు వచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులతో ఉత్సాహంగా గడిపి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ఈక్రమంలో మేడ్చల్ వద్ద రోడ్డు దాటుతున్న ప్రయాణికుడిని ఢీకొట్టి దంపతులిద్దరూ రోడ్డుపై పడిపోయారు. వెనకనుంచి వచి్చన లారీ వారిపై నుంచి వెళ్లగా ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. బైక్ ఢీకొని తీవ్రంగా గాయపడిన ప్రయాణికుడు సైతం మృతి చెందాడు. పోలీసుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు విగతజీవులుగా పడిఉన్న దంపతులను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ముందు రోజు వరకు కళ్ల ముందే సంతోషంగా గడిపిన దంపతులిద్దరూ మృత్యువాత పడడంతో రామాయంపేటలో విషాదం నెలకొంది. -
విషాదం.. కొడుకును నడుముకు కట్టుకుని.. చెరువులో దూకిన తల్లి
సాక్షి, సిద్దిపేట: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత కుమారుడితో సహా చెరువులో దూకింది. కుమారుడు మృతి చెందగా, తల్లి ప్రాణాలతో బయటపడింది. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాలలో సోమవారం జరిగింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామానికి చెందిన చింతల స్వాతికి ముస్తాబాద్ మండలం బదనకల్‌కు చెందిన శరత్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు శివతేజ(3) ఉన్నాడు. కుటుంబ కలహాలతో ఏడాదిగా తల్లిదండ్రుల వద్ద మల్యాలలో ఉంటున్న స్వాతి, సిద్దిపేటలోని ఓ షోరూంలో పని చేస్తోంది. అయినా కొద్ది రోజులుగా శరత్ వేధింపులకు గురిచేస్తుండడంతో మనస్తాపం చెందింది. కుమారుడిని నడుముకు కట్టుకొని గ్రామంలోని చెరువులో దూకింది. గమనించిన గొర్రెల కాపరులు చెరువులో నుంచి ఇద్దరిని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే కుమారుడు శివతేజ మృతిచెందాడు. తానూ ప్రాణాలు తీసుకోవాలనుకుంటే తన కుమారుడు చనిపోయాడని, అందుకు కారణమైన భర్తపై చర్యలు తీసుకోవాలని స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: Khammam: తొలి తరం కమ్యూనిస్టు నేత భూపతిరావు మృతి -
వెంచర్లో వ్యభిచారం.. పోలీసుల దాడుల్లో నలుగురు అరెస్ట్
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఓ వెంచర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడులు నిర్వహించి, నలుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ మధు తెలిపారు, కొన్ని నెలలుగా పట్టణం చుట్టు పక్కల గల ఓపెన్ ప్లాట్స్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి దాడులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. -
సెల్ఫీ వీడియో తీస్తూ రైతు ఆత్మహత్యాయత్నం
కౌడిపల్లి(నర్సాపూర్): సెల్ఫీ వీడియో తీస్తూ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువ రైతు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. దేవులపల్లి గ్రామానికి చెందిన జింక శ్రీశైలంకు గ్రామ శివారులోని అటవీభూమి పక్కన సాగుభూమి ఉంది. అందులో వరితోపాటు మిరప పంట సాగు చేశారు. ఇటీవల గ్రామానికి బృహత్ పల్లె ప్రకృతి వనం మంజూరైంది. అటవీశాఖ అధికారులు దీనికోసం ఐదు ఎకరాల స్థలం కేటాయించారు. శనివారం అక్కడికి వచ్చిన డిప్యూటీ ఎఫ్ఆర్ఓ రాజమణి, బీట్ అధికారి హరిత.. మిగతా భూమితోపాటు శ్రీశైలం పోడు చేసుకుంటున్న అటవీభూమిని సైతం దున్ని చదును చేయాలని సిబ్బందికి చెప్పారు. దీంతో శ్రీశైలం తమ తాతల కాలం నుంచి పోడు భూమిలో సాగు చేస్తున్నామని.. పంటను నాశనం చేయొద్దని అధికారులను కోరాడు. ఈ నేపథ్యంలో అతను అధికారులతో వాగ్వాదానికి దిగాడు. పనులను అడ్డుకోవడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై వారు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీశైలం, అటవీశాఖ అధికారులు, సర్పంచ్ కలసి తన పొలంలో బృహత్ పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేస్తున్నారంటూ సెల్ఫీ వీడియో ద్వారా బాధను తెలిపాడు. ఈ భూమి పోతే తమకు వేరే ఆధారం లేదని రోదిస్తూ పురుగు మందు తాగాడు. వీడియోను చూసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అతడిని మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీశైలం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. అది అటవీ భూమి.. జింక శ్రీశైలం ఇప్పటికే అటవీ భూమిని ఆక్రమించి వరి సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది కొత్తగా మరో ఎకరా అటవీభూమి దున్ని మిరప పంట సాగు చేస్తున్నాడు. అటవీ భూమి కావడంతో పల్లెప్రకృతి వనం కోసం చదును చేస్తుండగా అడ్డుకొని ఇష్టానుసారంగా దూషించాడు. భూమికి సంబంధించి ఆధారాలు చూపించలేకపోయాడు. సిబ్బంది పనులకు అడ్డు తగలడంతో వాటిని నిలిపివేసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ కోసం వస్తారన్న ఆందోళనతో శ్రీశైలం పురుగు మందు తాగి ఉండవచ్చు. – రాజమణి, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ, కౌడిపల్లి -
తల్లీకొడుకును బలిగొన్న ప్రేమ
సాక్షి, మెదక్: ఓ యువకుడి ప్రేమ వ్యవహారం ఇద్దరిని బలిగొంది. ప్రేమ వ్యవహారంలో మనస్తాపం చెంది యువకుడు మూడు రోజల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. కన్న కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి శుక్రవారం తెల్లవారు జామున చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామాయంపేటకు చెందిన కటిక శివకుమార్ (21) నార్సింగికి చెందిన బాలికను ప్రేమించి రెండు నెలలక్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈనెల 14వ తేదీన ఆ అమ్మాయి మేజర్‌కాగా, తన ఇంటికి రావాలని శివకుమార్ పలుమార్లు ఫోన్‌చేసినా ఆమె స్పందించలేదు. దీనితో మనస్తాపానికి గురైన శివకుమార్ మూడు రోజలక్రితం పట్టణ శివారులో చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లడిల్లిన తల్లి వరలక్ష్మి (42) మూడు రోజులుగా నిద్రాహారాలు మాని విలపించసాగింది. అందరూ నిద్రించిన తరువాత శుక్రవారం తెల్లవారుజామున పాండ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం వరలక్ష్మి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. చెరువు కట్టవద్ద చెప్పులు కనిపించడంతో గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలించగా ఆమె మృతదేహం లభ్యమైంది. భార్య, కుమారుడి మరణంతో భర్త లక్ష్మణ్ మాత్రమే మిగిలాడు. ఎస్ఐ రాజేశ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి, ప్రాణాలతో బయటపడిన చిన్నారి
సాక్షి, మెదక్: వారిది ప్రేమ వివాహం. ఆనందంగా సాగుతున్న వారి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ప్రమాదంలో తల్లి చనిపోవడంతో, చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ సంఘటన కొల్చారం మండల కేంద్రంలోని మెదక్– నర్సాపూర్ జాతీయ రహదారిలో మంగళవారం జరిగింది. కొల్చారం ఏఎస్ఐ తారాసింగ్, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామానికి చెౌదిన చండూరి ప్రకాశ్ రెండో కూతురు మృతురాలు వంకిడి ప్రవల్లికకు(23) అదే మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన వంకిడి విజయ్ కుమార్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగుంది. వీరిది ప్రేమ వివాహం. వీరికి 7 నెలల పాప అక్షిత సిందూర ఉంది. పాపకు సోమవారం రాత్రి నుంచి జ్వరంతో బాధపడుతోంది. భార్యాభర్తలిద్దరూ మెదక్ పట్టణంలోని ఆస్పత్రిలో వైద్యం చేయించేందుకు ధర్మసాగర్ నుంచి బైక్‌పై బయలుదేరారు. మండల కేంద్రం కొల్చారం లోని సత్యసాయి పారా బాయిల్డ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న బైకును కొల్చారం గ్రామానికి చెందిన గుండు రామకృష్ణయ్య తన బైకుతో వెనుక నుంచి ఢీ కొట్టాడు. దీంతో ప్రవల్లిక, పాప ఎగిరి కింద పడ్డారు. ప్రవల్లిక తీవ్రంగా గాయపడగా, పాప అక్షిత స్వల్పంగా గాయపడింది. వారిని చికిత్స నిమిత్తం ప్రైవేటు వాహనంలో మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవల్లిక మృతి చెందింది. ఈ ప్రమాదంలో రామకృష్ణయ్యకు స్వల్పగాయాలయ్యాయి. రామకృష్ణయ్య అజాగ్రత్తగా బైకు నడపడంవల్లే ప్రమాదం జరిగిందని, మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. చదవండి: అసభ్యకర మెసేజ్‌లతో నటికి వేధింపులు.. సహజీవనం చేయాలని ఒత్తిడి -
దళితబంధులో సామాజిక న్యాయం పాటించాలి
మెదక్‌జోన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంలో సామాజిక న్యా యం పాటించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన వంగపల్లి మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో 22శాతం ఉన్న మాదిగలకు మొదట ప్రాధాన్యం ఇవ్వా లన్నారు. జనాభా దామాషా ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మాదిగలు అలుపెరుగని పోరాటం చేశారని గుర్తుచేశారు. డప్పు దరువు, గూటం దెబ్బతో ఉద్యమాన్ని ఉధృతం చేసి, కేంద్రం మెడలు వంచిన ఘనత మాదిగలకు ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రభాకర్, జాతీయ కార్యదర్శి యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రం పాల్గొన్నారు. -
రక్షించినా.. మళ్లీ దూకాడు
వెల్దుర్తి(తూప్రాన్): హల్దీవాగులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. మొదటి సారి వాగులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన అతడిని స్నేహితులు, గ్రామస్తులు రక్షించారు. అంతలోనే మళ్లీ దూకడంతో గల్లంతయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌కు చెందిన మర్కంటి ఆంజనేయులు(19) ఆదివారం రాత్రి వేళ గ్రామ శివారులోని హల్దీవాగు బ్రిడ్జిపై నుంచి నీటిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన స్నేహితులు, గ్రామస్తులు అతన్ని రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఘటనా విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడానికి కొందరు గ్రామానికి వెళ్లగా, రక్షణగా ఉన్నవారి కళ్లుగప్పి మళ్లీ వాగులోకి దూకాడు. రెండోసారి రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వెల్దుర్తి పట్టణానికి చెందిన గజ ఈతగాళ్లతో సోమవారం గాలింపు చేపట్టినా ఫలితం లేకుండాపోయింది. మంగళవారం మరోసారి వెదకనున్నట్లు ఎస్సై మధుసూదన్‌గౌడ్ తెలిపారు. కాగా యువకుడి తండ్రి యాదయ్య గతంలోనే మృతి చెందాడు. -
మెదక్ జిల్లాలో విస్తారంగా వర్షాలు
-
విక్రమార్కుడు సీన్ రిపీట్.. నగలు ఇస్తే పూజలు చేసి ఇస్తామని చెప్పి
సాక్షి, మనోహరాబాద్(మెదక్): ఫకీర్‌లమంటూ వచ్చి మాయమాటలు చెప్పి, మందు చల్లి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో షేక్ సాదుల్ల, జరీనాబేగం నివసిస్తున్నారు. షేక్ సాదుల్లా చికెన్ దుకాణ వ్యాపారి. ఈనెల 15వ తేదీ ఉదయం దుకాణానికి వెళ్లాడు. అతను వెళ్లిన కొంతసేపటికి ఇద్దరు ఫకీర్లు వచ్చారు. మీ ఇంటికి నజర్ బాగా ఉంది పోవడానికి రూ.1100 ఇస్తే నజర్ తీసేస్తామంటూ, ఇంట్లోకి బలవంతంగా వచ్చి కూర్చున్నారు. నీ భర్త మరో మూడు రోజుల్లో చనిపోతాడు, అతడికి ఎమీ కావద్దంటే నీ బంగారు ఆభరణాలు ఇవ్వాలని జరీనా బేగంను భయపెట్టారు. నీకు బంగారం ముఖ్యమా? భర్త ఆరోగ్యం ముఖ్యమా? అని కంగారుపెట్టారు. ఆ భయంతో తన ఒంటిపై ఉన్న రెండు తులాల బంగారపు నల్లపూసల దండ, తులం బంగారు చెవికమ్మలు, కాళ్లకు పెట్టుకున్న 15 తులాల వెండి పట్టీలు, 8 తులాల వెండిచైన్, 4 తులాల వెండి బ్రాస్లెట్, తులం వెండి ఉంగరాలు ఇచ్చింది. నగలు తీసుకున్న ఫకీర్లు జరీనాపై మందు చల్లడంతో సృహకోల్పోయింది. కొంత సేపటికి సృహ రావడంతో లేచి చూడగా వాళ్లు కనిపించలేదు, నగలు కనిపించలేదు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
TS: కేంద్ర మంత్రికి చేదు అనుభవం.. బీజేపీ నేతలు ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు కాషాయ పార్టీకి చెందిన నేతలు నగరానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో మెదక్ ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే, కేంద్ర మంత్రి బాల్యన్ కోసం స్థానిక బీజేపీ నేతలు గెస్ట్ హౌస్ బుక్ చేశారు. ఈ క్రమంలో శనివారం మంత్రితో పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి వెళ్లారు. కానీ, ఆర్ అండ్ బీ అధికారులు గెస్ట్ హౌస్‌కు తాళాలు వేసి ఉండటం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలో మంత్రితో పాటు అక్కడికి వచ్చిన బీజేపీ నేతలు అర గంట పాటు వేచి చూశారు. అనంతరం.. అధికారులను సంప్రదిస్తే ఎవరు ఫోన్‌కి స్పందించలేదు. మెదక్ ఆర్డీవో, తహసీల్దార్లను సంప్రదించగా వారి నుంచి కూడా స్పందన రాలేదు. దీంతో, అధికారుల తీరుపై ఆగ్రహించిన బీజేపీ నేతలు తాళం పగల కొట్టి లోపలికి వెళ్లారు. కేంద్ర మంత్రి వస్తే కనీస గౌరవం లేకుండా తాళం వేసి అధికారులు అందుబాటులో లేకపోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: సీఎం యోగి.. భాగ్యలక్ష్మి టెంపుల్ పర్యటనలో మార్పు -
జమునా హేచరీస్ భూములు బాధిత రైతులకు పంపిణీ
మెదక్ జోన్/ వెల్దుర్తి: మెదక్ జిల్లా మాసాయిపేట, చిన్నశంకరంపేట మండలాల్లోని వివాదాస్పద అసైన్డ్ భూములను అధికారులు బుధవారం బాధిత రైతులకు అప్పగించారు. తమ భూములను కాజేశారంటూ ఆయా మండలాల్లోని అచ్చంపేట, హకీంపేట, దరిపల్లి గ్రామాల రైతులు ప్రస్తుత బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (జమునా హేచరీస్)పై గతేడాది ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వ ఆదేశంతో సర్వే చేయించిన కలెక్టర్ హరీశ్ 66 ఎకరాల అసైన్డ్ భూములు కబ్జాకు గురై నట్లుగా ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించారు. దీనిపై జమునా హేచరీస్ కోర్టును ఆశ్రయిం చగా, 2021 నవంబర్‌లో మరో సర్వే చేశారు. 85 ఎకరాల 19 గుంటల భూమి కబ్జాకు గురైనట్టు గుర్తించి నివేదిక అందించారు. దీంతో ఈ భూమిని తిరిగి బాధితులకు అప్పగించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీఓ విడుదల చేసింది. దీంతో బుధవారం రెవెన్యూ అధికారులు మూడు సర్వే బృందాలను ఏర్పాటు చేసి బాధిత రైతులకు ఆయా సర్వే నంబర్లలో డివిజన్ల వారీగా హద్దులు చూపెట్టారు. ఈ ప్రక్రియ పరిశీలించడానికి వచ్చిన మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి బాధిత లబ్ధిదారులకు ఆ మేరకు పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. మాసాయిపేట మండ లం అచ్చంపేట శివారులోని 77, 78, 79, 80, 81, 82 సర్వే నంబర్లలో 62 మంది బాధితులకు 84 ఎకరాల 19 గుంటలు, హకీంపేట శివారులో సర్వే నంబరు 97లో ముగ్గురు రైతులకు ఎకరం భూమికి సంబంధించి పట్టాలు అందజేశారు. పట్టాలు సరే.. నిర్మాణాల సంగతేంటి? ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాలతో రైతులు హర్షం వ్యక్తం చేయగా, కొందరు మాత్రం అయోమయంలో ఉన్నారు. వారికి చూపించిన హద్దుల్లో హేచరీస్‌కు చెందిన శాశ్వత కట్టడాలు ఉండటంతో వాటిని ఎవరు..ఎప్పుడు తొలగిస్తారు అందులో తామెలా వ్యవసాయం చేసుకునేదని పలువురు వాపోతున్నారు. ఇదిలా ఉండగా..పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు అడ్డుకుం టారేమోనని తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి ఆధ్వ ర్యంలో పోలీసులు జమునా హేచరీస్ ముందు మోహరించారు. ఎవరైనా ఆందోళనలు చేస్తే అరెస్టు లు చేసి అక్కడి నుంచి తరలించేందుకు వీలుగా ప్రైవేట్ బస్సులు, డీసీఎంలను ఏర్పాటు చేశారు. -
మెదక్‌లో విషాదం: విద్యార్థులపై దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొల్చారం మండలం రంగంపేటలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు హాస్టల్ విద్యార్థులపై వెనకనుంచి వచ్చిన ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విద్యార్థి జశ్వంత్ మృతి సంఘటన ప్రాంతంలోనే మృతిచెందగా.. మెదక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో విద్యార్థి రజనీకాంత్ ప్రాణాలు విడిచాడు. తీవ్ర గాయాలైన విద్యార్థి చరణ్ మెదక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
మెదక్: ఎస్బీఐ బ్యాంక్‌లో రూ.5 కోట్లు గోల్ మాల్..!
మెదక్ : నర్సాపూర్‌లోని ఓ ఎస్బీఐ శాఖలో కొంతమంది ఉద్యోగులు బ్యాంకు డబ్బును దుర్వినియోగం చేశారని ఆడిట్లో తేలినట్లు తెలిసింది. దుర్వినియోగంపై ఆరోపణలు రాగానే బ్యాంకు ఉన్నతాధికారులు ఆడిటర్లను పంపి ఈనెల 21న అర్ధరాత్రి వరకు ఆడిట్ చేయించారు. ఈ నెల 22 న బ్యాంకులో, ఏటీఎంలలో అన్ని లావాదేవీలను నిలిపి వేసి ఆడిట్ చేయించారు. బ్యాంకుతోపాటు పట్టణంలోని మూడు ఏటీఎంలలో విచారణ చేశా రు. బ్యాంకులో, ఏటీఎంలలో సుమారు నాలుగు రోజుల పాటు ఆడిట్ చేయగా సుమారు 5 కోట్ల 20లక్షల రూపాయలకు లెక్కలు తేలకపోవడంతో ఈ మేరకు డబ్బులు గోల్మాల్ అయినట్లు ఆడిటర్లు ఒక అంచనాకు వచ్చారని తెలిసింది. బ్యాంకులో రుణాల కోసం తనఖా పెట్టిన బంగారం ఖాతా లను, రుణం కోసం పెట్టిన బంగారు నగలను పరిశీలించాల్సి ఉందని తెలిసింది. దుర్వినియోగంలో భాగంగా ప్రాథమికంగా ఒక ఉద్యోగిని ఇప్పటికే విధుల నుంచి తొలగించారని తెలిసింది. బ్యాంకులో డబ్బుల గోల్‌మాల్‌పై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని బ్యాంకు ఉన్నతాధికారులు ఓ దర్యాప్తు సంస్థకు ఇటీవల ఫిర్యాదు చేశారని తెలిసింది. బ్యాంకులో డబ్బులు దుర్వినియోగం అయినట్లు వస్తున్న ఆరోపణలతో పాటు ఆడిట్ వివరాలు తెలపాలని స్థానిక ఎస్బీఐ శాఖ మేనేజర్ నర్సయ్యను కోరగా ఆయన తనకేమి తెలియదని చెప్పారు. బ్యాంకులో ఆడిట్ పూర్తయిందని, ఆడిట్‌ను తమ బ్యాంకు ఉన్నతాధికారులు పర్యవేక్షించారని, తనకు ఎలాంటి వివరాలు తెలియవని చెప్పుకొచ్చారు. -
Photo Feature: ‘నాట్య’ మయూరం
మండల పరిధిలోని ఫైజాబాద్ శివారులోని పొలాల్లో పురివిప్పిన మయూరం చూపరులను ఆకట్టుకుంది. కురిసిన వర్షాలకు పచ్చగా చిగురించిన గడ్డిపై అందంగా మయూరం పురివిప్పడంతో ‘సాక్షి’ క్లిక్ మనిపించింది. – చిలప్‌చెడ్(నర్సాపూర్) -
చిన్నారి ప్రాణం తీసిన యువకుడి నిర్లక్ష్యం
నిజాంపేట్: కారు రూపంలో ఓ చిన్నారిని మృత్యువు కబళించింది. ఈ ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు..మెదక్‌జిల్లా పాపన్నపేట్కు చెందిన నరేష్, జ్యోతి దంపతులు నిజాంపేట్ కమ్మరి బస్తీలో నివాసముంటున్నారు. వీరికి హర్షవర్ధన్ (18 నెలల) బాబు ఉన్నాడు. శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో స్థానికంగా ఉన్న సాయిబాబా ఆలయ పూజారి సత్యనారాయణమూర్తి కుమారుడు వీర అశ్విత్ (20) కారును నిర్లక్ష్యంగా నడిపి ఆలయం సమీపంలో ఉన్న చిన్నారి హర్షవర్దన్‌ను ఢీకొట్టాడు. కారు ముందు టైరు బాలుడి తల మీదుగా వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో చిన్నారిని కేపీహెచ్‌బీలోని రెయిన్బో ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. చిన్నారి తండ్రి నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: 48 గంటల్లో నా భార్య ఆచూకీ కనుక్కోండి!) -
రెండు నెలల క్రితమే పెళ్లి.. కోడలు రాకతోనే ప్రమాదం జరిగిందని
సాక్షి, కరీంనగర్/ పటాన్‌చెరుటౌన్: అదనపు కట్నం వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అమీన్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డీఎస్పీ భీంరెడ్డి, సీఐ శ్రీనివాసులురెడ్డి వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా సోఫీనగర్‌కు చెందిన సంయుక్త(24) బీటెక్ పూర్తి చేసింది. సంయుక్తను నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉత్తేజ్ కుమార్‌కు ఇచ్చి ఏప్రిల్ 7న వివాహం చేశారు. ఉత్తేజ్ కొండాపూర్‌లోని యాక్సిస్ బ్యాంక్‌లో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే పెళ్లైన నాలుగు రోజులకే ఇంటి దైవానికి పూజ చేసేందుకు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దీంతో కోడలు రాకతో ప్రమాదం జరిగిందని కొత్తకారు ఇప్పించాలని కోడలిని అత్త వేధించడం మొదలుపెట్టింది. అనంతరం భార్యాభర్తలు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బంధం కొమ్ము గ్రామం శ్రీదామా హిల్స్‌లో కాపురం ఉంటున్నారు. సంయుక్తను తరచూ అత్త లావణ్య, మామ పవన్‌కుమార్ ఫోన్లో పెళ్లి సమయంలో రూ.15లక్షల కట్నం, పది తులాల బంగారం ఇచ్చారని, మరో సంబంధం చేసుకుంటే కట్నం ఎక్కువ వచ్చేదని వేధించేవారు. వీరితో పాటు భర్త కూడా అదనపు కట్నం కోసం వేధించేవాడు. దీంతో ఉత్తేజ్ బుధవారం ఉదయం విధులకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చేసరికి సంయుక్త ఉరేసుకుని కనిపించింది. అమీన్పూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి వీరశెట్టి విజయ్‌దర్శన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమ కూతుర్ని ఆమె భర్త ఉత్తేజ్ హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని సంయుక్త తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చదవండి: ఇష్టం లేని పెళ్లి చేశారని.. ఆ భర్త ఎంత పనిచేశాడంటే? -
మల్లేశంతో ప్రేమ వివాహం.. ఐదేళ్లయినా..
సిద్దిపేటకమాన్ (సిద్దిపేట): పెళ్లి జరిగి ఐదేళ్లు గడిచినా సంతానం కలగడం లేదనే తీవ్ర మనస్థాపానికై గురై రంగనాయక సాగర్ కాల్వలో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణం భరత్‌నగర్‌కు చెందిన శివాని(23)ఐదేళ్ల క్రితం కామారెడ్డి జిల్లా మాచాపూర్ మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన మల్లేశంను ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి వీళ్లు సిద్దిపేటలోని ముర్షద్‌గడ్డలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లి అయి ఐదేళ్లు గడిచినా సంతానం కలగక పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శివాని జీవితంపై విరక్తితో మంగళవారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో సిద్దిపేట పట్టణ శివారు ఇమాంబాద్ వార్డు వద్ద ఉన్న కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఉదయం గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న కుటంబ సభ్యులు మృతురాలిని గుర్తించారు. ఘటనపై మృతురాలి అన్న కృపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (నిశ్చితార్థం జరిగినా.. వీడియోలతో భయపెడుతూ పలుమార్లు అత్యాచారం) -
మహా జాదుగాళ్లు.. విదేశీ కరెన్సీ కావాలంటూ..
సాక్షి, మెదక్: విదేశీ కరెన్సీ కావాలని ఓ కిరాణ షాపులో మోసానికి పాల్పడిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడి వివరాల మేరకు.. నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న సాయి భైరవ కిరాణం దుకాణానికి శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి విదేశీ కరెన్సీ కావాలా? అంటూ కౌంటర్‌పై కూర్చున్న శ్రీతేజతోపాటు షాపులో పని చేస్తున్న సయ్యద్, సామగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిపాల్‌రెడ్డిలను మాటల్లో పెట్టారు. ఈ క్రమంలో కౌంటర్లోని రూ.30 వేలతోపాటు మహిపాల్‌రెడ్డి వద్ద రూ.2వేలు తీసుకొని మోసగాళ్లు అక్కడి నుంచి జారుకున్నట్లు తెలిపారు. ముగ్గురు వ్యక్తులు ముందుగా దుకాణంలోకి వచ్చి మా దగ్గరున్న విదేశీ కరెన్సీ తీసుకొని ఇక్కడి డబ్బు ఇవ్వాలని కోరుతూ మాటల్లో పెట్టారు. కౌంటర్లోని డబ్బుతోపాటు కిరాణ సామగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిపాల్‌రెడ్డి వద్ద రూ.2వేలు తీసుకున్న సమయంలో తమకు జరిగిన సంఘటన గుర్తులేకుండా పోయిందని బాధితులు వాపోయారు. ఆ ముగ్గురు మోసగాళ్లు నార్త్‌సైడ్ అధికారులుగా మంచి దుస్తులు వేసుకొని కారులో వచ్చినట్లు తెలిపారు. అదేరోజు రాత్రి కిరాణం కౌంటర్లో కూర్చున్న శ్రీతేజ తండ్రి ప్రభుశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై నర్సాపూర్ ఎస్ఐ గంగరాజును వివరణ కోరగా రవిశంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.