సాక్షి, హైదరాబాద్: మెదక్ లాకప్‌డెత్ ఘటనపై తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తునకు డీజీపీ ఆదేశించారు. ఈ క్రమంలోనే ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో సీఐ, ఎస్‌ఐపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. కాగా, పోలీసుల చిత్రహింసలతో ఖాదర్ చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీసులే కారణం..
మెదక్‌కు చెందిన ఖదీర్‌ఖాన్.. గాంధీ ఆసుపత్రిలో చిక్సిత పొందతూ ఫిబ్రవరి 12వ తేదీన మృతిచెందాడు. అయితే, దొంగతనం కేసులో ఖదీర్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే ఆయన చనిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జరిగింది ఇది..
అయితే, జనవరి 27వ తేదీన మెదక్‌లోని అరబ్ గల్లీలో బంగారం గొలుసు దొంగతనం జరిగిందని ఓ మహిళ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా, ఘటనాస్థలంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఖదీర్‌ఖాన్‌ను జనవరి 29వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఖదీర్‌ను ఫిబ్రవరి 2వ తేదీ వరకు స్టేషన్‌లోనే ఉంచి.. తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా.. ఖదీర్ ఇంటికి వెళ్లిన మరుసటి రోజే.. అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో, అతడికి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించి అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఖదీర్ మృతిచెందాడు. అయితే, పోలీసులే కారణంగా ఖదీర్ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment