
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో దారుణం జరిగింది. మంత్రాలు చేస్తుందనే నెపంతో డేగల ముత్తవ్వ అనే మహిళపై ఆ ఊరి గ్రామస్తులు దాడి చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. గ్రామస్తులు దాడితో ఆమె కొడుకు,కోడలు పారిపోయారు.
అయితే తీవ్రగాయాల పాలైన ముత్తవ్వను ఆమె బంధువులు వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని రామాయంపేట ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ముగ్గురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment