Police
-
సైబరాబాద్ అధికారి‘అదనపు’ విధులు!
సాక్షి, సిటీబ్యూరో: పోలీసులు.. సాధారణంగా నిర్వర్తించాల్సిన బాధ్యతల్నీ నిర్లక్ష్యం చేస్తారనే విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. న్యాయస్థానాలతో పాటు ఉన్నతాధికారులు సైతం ఈ విషయంపైనే పలువురిపై చర్యలు తీసుకుంటూ ఉంటాయి. కొందరు ఖాకీలకు ఇదంతా డ్యూటీల దగ్గర మాత్రమే... ‘వాటా’ల వద్దకు వచ్చేసరికి మాత్రం తమవి కాని విధుల్నీ నిర్వర్తించేస్తుంటారు. భూ కబ్జాదారులతో కుమ్మక్కై ఇతర శాఖల అధికారులతో కలిసి ‘ప్లాన్’ చేస్తూ భూ యజమానుల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇలాంటి ఓ వ్యవహారమే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరుగుతోంది. హైటెక్ జోన్ కేంద్రంగా ఓ ఉన్నతాధికారి నిర్వర్తిస్తున్న ‘అదనపు’ విధులకు బల్దియా అధికారి సైతం సహకరిస్తుండటం గమనార్హం. భూ విలువలు పెరగడంతో కుట్రలు.. నగర వ్యాప్తంగా భూములు విలువలు గణనీయంగా పెరిగిపోవడం కొత్త వివాదాలకు కారణం అవుతోంది. ఖాళీ జాగాలకు కొత్త యజమానులు పుట్టుకువస్తున్నారు. మదీనాగూడ కేంద్రంగా జరిగిన ఈ వ్యవహారం కూడా అలాంటిదే. నగరానికి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం ఆ ప్రాంతంలోని రెండు సర్వే నంబర్లలో ఉన్న స్థలం ఖరీదు చేశారు. మొత్తం వెయ్యి చదరపు గజాలకు పైగా ఉన్న ఈ స్థలంలో చాలా భాగం విక్రయించారు. మిగిలిన 300 గజాల్లో నిర్మాణం చేపట్టడానికి సిద్ధమయ్యారు. దీనిపై కన్నేసిన పాత యజమాని సంబం«దీకులు కొందరు వివాదం చేయడం మొదలెట్టారు. రేటు ఆకాశాన్ని అంటడంతో ఏమాత్రం అవకాశం చిక్కినా చట్టపరంగా ఆ భూమిని తిరిగి సొంతం చేసుకోవాలని ప్రయత్నించారు. కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వచ్చినా.. ఈ స్థలంపై యాజమాన్యం హక్కు కోసం, ఆపై టెనెంట్ కేసుతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దానికోసం కొన్ని నోటరీ పత్రాలను సమరి్పంచారు. ఖాళీ స్థలాలకు కేవలం ప్లాట్ నంబర్లు మాత్రమే ఉంటాయి. వివాదం చేయాలని భావించిన వాళ్లు ఏకంగా డోర్ నంబర్ వేసుకుని మరీ పత్రాలు రూపొందించారు. దీంతో న్యాయస్థానం వారి పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ భూమి ఎవరి పేరుతో ఉందో ఆ మహిళకే కోర్టు పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ సైతం ఇచి్చంది. దీని ఆధారంగా జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్న భూ యజమాని నిర్మాణం కోసం అనుమతి కూడా తెచ్చుకున్నారు. ఈమెను ఇబ్బంది పెట్టడం ద్వారా లబి్ధ పొందాలని ప్రయతి్నంచిన కబ్జారాయుళ్లు దీనికోసం కొత్త పథకం వేశారు. ఒత్తిడికి యత్నించి.. సైబరాబాద్ కమిషరేట్ పరిధిలోని ఓ కీలక జోన్లో పని చేస్తున్న ఉన్నతాధికారిని సంప్రదించాడు. ఇద్దరి మధ్యా జరిగిన ‘ఒప్పందం’తో రంగంలోకి దిగిన అధికారి తొలుత పోలీసులను వాడి భూ యజమానికిపై ఒత్తిడికి ప్రయతి్నంచారు. ఇది ఫలితం ఇవ్వకపోవడంతో కథ మార్చారు. బల్దియాకు చెందని మరో ఉన్నతాధికారితో కలిసి ‘ప్లాన్’ చేశాడు. వీలైనంత త్వరగా ఆ పోలీసు, బల్దియా అధికారులకు కలిసి సెటిల్ చేసుకుంటే ఉత్తమం అంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. దీంతో విసిగిపోయిన ఆ యజమాని న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. -
‘నాపై దుండగుడు కత్తితో ఇదిగో ఇలా దాడి చేశాడు’.. పోలీసులకు సైఫ్ వాంగ్మూలం!
ముంబై : తనపై దుండగుడు జరిపిన దాడి గురించి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బాంద్రాలోని సైఫ్ నివాసానికి వెళ్లి దాడి వివరాల్ని సేకరించినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తనపై దుండగుడు ఏ విధంగా దాడి చేసింది. తాను ఎలా ప్రతిఘటించిన విధానాన్ని సైఫ్ వివరించినట్లు సమాచారం.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ‘సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అందులో.. ‘నేను,నా భార్య కరీనా కపూర్ ఖాన్ 11వ అంతస్తులో బెడ్ రూమ్‌లో ఉన్నాం. ఆ సమయంలో మా ఇంట్లో సహాయకురాలు ఎలియామా ఫిలిప్ బిగ్గరగా కేకలు వేసింది. దుండగుడు (మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్) నా చిన్న కుమారుడు జహంగీర్ ( జెహ్) నిద్రిస్తున్న గదిలోకి చొరబడ్డాడు. కత్తితో అగంతకుడు జెహ్ను బెదిరించాడు. కోటి రూపాయిలు ఇవ్వాలని ఫిలిప్‌ను డిమాండ్ చేశాడు. దుండగుడు కత్తితో బెదిరించడంతో జెహ్ ఏడ్వడం మొదలపెట్టాడు. వెంటనే, దుండగుడి నుంచి జెహ్ను రక్షించేందుకు ఫిలిప్ ప్రయత్నించింది. ఈ క్రమంలో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.ఫిలిప్ కేకలు విన్న నేను జెహ్ రూంకు వెళ్లి చూడగా.. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతోంది. జెహ్ను రక్షించేందుకు నేనూ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశా. అప్పుడే దుండగుడు నా వీపు భాగం,మెడ, చేతులపై పలుమార్లు కత్తితో పొడిచాడు. నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడి నుంచి జెహ్ను రక్షించిన సహాయకులు మరో రూంలోకి తీసుకెళ్లారు’ అని పోలీసులకు వివరించారు.ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్ అలీఖాన్‌ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. కత్తి దాడి రెండు మిల్లీమీటర్ల మేర తృటిలో తప్పి వెన్నెముక పక్కన కత్తి పోట్లు దిగబడినట్లు వైద్యులు తెలిపారు. మెడ, చేతిపై గాయాలకు చికిత్స అనంతరం జనవరి 21న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సైఫ్‌పై దాడి ఘటనపై పోలీసులు విచారించారు. విచారణలో దొంగతనం చేయాలని ఉద్దేశ్యంతో దుండగుడు సైఫ్ ఇంట్లో చొరబడినట్లు పోలీసులు తెలిపారు. దండుగుడు బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించారు. సైఫ్‌పై దాడి అనంతరం దుండగుడు షెహజాద్ తప్పించుకున్నాడు. థానేలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.ఇదిలా ఉంటే, సైఫ్ అలీ ఖాన్ బాంద్రా ఫ్లాట్ నుండి సేకరించిన వేలిముద్రలు షరీఫుల్‌తో సరిపోలినట్లు నిర్ధారించబడింది. నిందితుడు భవనంలోని పదకొండవ అంతస్తుకు ఎక్కేందుకు ఉపయోగించిన డక్ట్ పైపుపై,గది డోర్ హ్యాండిల్, బాత్రూమ్ డోర్‌పై వేలిముద్రల్ని గుర్తించారు. అయితే, సైఫ్ అలీఖాన్ ఇంటిలోని సీసీటీవీ ఫుటేజీలోని దుండగుడు, తన కుమారుడు షెహజాద్‌లు ఒకరు కాదని. ఇద్దరు వేర్వేరుగా ఉన్నారని షెహజాద్ తండ్రి రూహుల్ అమీన్ వాదిస్తున్నాడు. -
రషీద్ కుటుంబానికి ప్రభుత్వం వేధింపులు
-
AP: పోలీసు ఉద్యోగ పరీక్షలో దొడ్డిదారి యత్నం!
కర్నూలు: ఎలాగైన పోలీసు ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో కొంతకాలంగా సాధన చేసిన ఓ అభ్యర్థి ఛాతీ, ఎత్తు కొలతల్లో ఫెయిల్ కావడంతో దొడ్డిదారిలో యత్నించి అడ్డంగా దొరికిపోయాడు. అధికారులను మోసగించే క్రమంలో అక్కడ సాంకేతికత ద్వారా గుర్తించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని 4వ పట్టణ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేసి కటకటాల్లోకి పంపారు. పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌లో డిసెంబరు 30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామానికి చెందిన పి.నరసింహుడు కుమారుడు పబిత తిరుమల బయోమెట్రిక్‌కు హాజరయ్యాడు. అయితే, అతను ఎత్తు, ఛాతి కొలతల్లో ఫెయిల్ కావడంతో వె నక్కి పంపారు. అయితే క్వాలిఫై అయినట్లుగా హాల్ టికెట్‌ను కలర్ జిరాక్స్ తీసుకొని.. క్వాలిఫై అయినట్లు టిక్ మార్క్ వేసుకొని 1600 మీటర్ల పరుగులో పాల్గొనేందుకు వరుస క్రమంలో నిలబడి మోసగించేందుకు ప్రయత్నించగా...స్టాటింగ్ పాయింట్ బందోబస్తు డ్యూటీలో రిజర్వు ఇన్స్పెక్టర్ నాగభూషణం గుర్తించి అభ్యర్థి మోసాన్ని వెలుగులోకి తెచ్చారు. పాడ్ క్యారియర్ లేకుండా 1600 మీటర్ల పాయింట్ వద్ద ఆర్ఎప్ఐడీ రిజిస్ట్రేషన్ కంప్యూటర్ ఆపరేటర్ జయరాం దగ్గరకు వెళ్లి పరిశీలించగా...సిస్టమ్‌లో అభ్యర్ధి పేరు చూపడం లేదని, హాల్ టికెట్లో మాత్రం క్వాలిఫై అయినట్లుగా నకిలీ తయారు చేసి టిక్ మార్క్ వేసుకున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఎస్పీ బింధుమాదవ్ దృష్టికి తీసుకెళ్లగా.. 4వ పట్టణ పోలీసులకు అప్పగించాలని ఆదేశించారు. ఈ మేరకు అభ్యర్థి పబిత తిరుమలపై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ గోపీనాథ్ తెలిపారు.కాగా 11 రోజు మంగళవారం పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు మొత్తం 600 మందిని ఆహ్వానించగా... 412 మంది వచ్చారు. వీరిలో ప్రధాన పరీక్షకు మంగళవారం 267 మంది ఎంపికయ్యారు. -
Delhi Election: 150 సరిహద్దుల మూసివేత.. పారా మిలటరీ దళాల మోహరింపు
న్యూఢిల్లీ: రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని దేశ రాజధానిలోని 150 సరిహద్దులను మూసివేశారు. ఈ 150 సరిహద్దుల్లోని 162 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు దిగ్బంధించారు. ఈ ప్రాంతాల్లో పారామిలిటరీ దళాలతో పాటు, స్థానిక పోలీసులు 24 గంటలు పహారా కాస్తున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే ఢిల్లీలోకి అనుమతిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయానికి చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ ఢిల్లీ సరిహద్దుల్లో 162 చోట్ల దిగ్బంధనాలు ఏర్పాటు చేసి, 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసిన తర్వాతే ఢిల్లీలోకి అనుమతిస్తున్నామని తెలిపారు. భద్రతా ఏర్పాట్ల కోసం పోలీసులు 175 కంపెనీల పారామిలిటరీ దళాలను మోహరించారు. హోం మంత్రిత్వ శాఖ నుండి 250 కంపెనీల పారామిలిటరీ దళాలు రంగంలోకి దిగనున్నాయి. నగదు, మద్యం అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఢిల్లీలోని వివిధ ప్రదేశాలలో పికెట్లను ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఢిల్లీ పోలీస్ ఎలక్షన్ సెల్ తెలిపిన వివరాల ప్రకారం రాజకీయ పార్టీల ర్యాలీలు, బహిరంగ సమావేశాల విషయంలో ముందుగా వచ్చిన వారికి తొలుత అనుమతినిస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీ అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం -
ఆ నలుగురు రైతులను విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటనలో సంబంధం ఉందంటూ అరెస్టు చేసిన నలుగురు రైతులను విడుదల చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. వారి వద్ద రూ.25 వేల వ్యక్తిగత బాండ్ తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా జైలు సూపరింటెండెంట్‌కు సూచించింది. ఒకే అంశంపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని తప్పుబట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాది (పీపీ)కి స్పష్టం చేస్తూ, తదుపరి విచారణ వచ్చే నెల 12కు వాయిదా వేసింది.వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనకు సంబంధించి బొంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్లో రైతులు ముదావత్ రమేశ్, గోపాల్ నాయక్, మదారయ్య, మంగ్యా నాయక్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తొలి ఎఫ్ఐఆర్ 153లో వీరిని అరెస్టు చేయగా బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ 154, 155లోనూ వీరు నిందితులని పేర్కొంటూ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. దీనిపై రైతులు కోర్టును ఆశ్రయించారు. ఒకే అంశంపై పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, కావాలని పోలీసులు మరో రెండు కేసులు పెట్టారని పేర్కొన్నారు. 154, 155లను రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం విచారణ చేపట్టారు. పేర్లు తప్ప వారి పాత్రపై వివరాలు ఏవీ? ప్రభుత్వం తరఫున పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపిస్తూ.. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా 154, 155 ఎఫ్ఐఆర్లలో పిటిషనర్లను పోలీసులు నిందితులుగా చేర్చారని చెప్పారు. అయితే పిటిషనర్ల పేర్లు ప్రస్తావించడం తప్ప వారికి వ్యతిరేకంగా ఏమీ పేర్కొనలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పిటిషనర్ల పాత్ర ఏంటో వివరించలేదన్నారు. పిటిషనర్లు వ్యవసాయదారులని, దాదాపు మూడు నెలలుగా జైల్లో ఉంటున్నారని గుర్తు చేశారు. వారి వద్ద వ్యక్తిగత బాండ్ తీసుకుని విడుదల చేయాలని ఆదేశించారు. -
నెటిజన్ ‘వార్నింగ్’కు పోలీసుల రియాక్షన్ ఇది
బెంగళూరు: తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని ఓ వ్యక్తి తీవ్ర బెదిరింపులకు దిగాడు. ఏకంగా హత్య చేస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి పోలీసులు స్పందించిన తీరు.. ఆపై అతను ఇచ్చిన రిప్లై చర్చనీయాంశంగా మారాయి.యాదగిరి జిల్లా కోడేకల్ కి చెందిన షరీఫ్ అనే వ్యక్తి ఎక్స్‌లో తల్వార్ ఫోటో పోస్టు చేసి మరీ ‘‘హత్య చేస్తా’’ అంటూ హెచ్చరించాడు. ‘మేము ఇల్లు కడుతుండగా కొందరు అడ్డుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళితే అక్కడ ఎవరూ పట్టించుకోలేదు’ అని ఆరోపించాడు. పైగా స్థానిక ఎమ్మెల్యే పీఏ ద్వారా ఒత్తిడి వల్లే మమ్మల్ని పోలీసులు పట్టించుకోలేదంటూ సంచలన ఆరోపణలు చేశాడు. కాబట్టి నేను ఇదే తల్వార్‌తో మర్డర్ చేస్తాను అంటూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు.ఈ పోస్ట్ కు బెంగళూరు సిటీ పోలీస్ అకౌంట్ నుంచి.. ఏ పోలీస్‌స్టేషన్ కు మీరు వెళ్లారు అని ప్రశ్నించారు. కోడేకల్ ఠాణాకు వెళ్లానని, నేను మా తండ్రి నెలరోజులుగా ఠాణా చుట్టూ తిరుగుతున్నాము, పేదలం అని ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. మీరు చర్యలు తీసుకోకపోతే నేను నా చట్ట ప్రకారం మర్డర్ చేస్తానని హెచ్చరించారు. ఈ అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ನಮ್ಮ್ ಮನೆಯ ಎಲ್ಲಾ ಧಾಖಲೆ ಇದೆ ನಮ್ಮ್ ಮನೆ ಕಟ್ಟುತಿರುವಾಗ ಜೀವ ಬೆದರಿಕೆ ಹಾಕತಾರನಾವು police station complaint ಕೊಡೋಕೆ ಹೋದ್ರೆ ಅಲ್ಲಿ ಯಾರು ಕೇರ್ ಮಾಡಲ್ಲ Station ಗೆ MLA P. A ಯಿಂದ ಹೇಳ್ತೆಸರ police ಯಾರು ಕೇರ್ ಮಾಡಲ್ ಅದ್ಕೆ ನಾ ಇದೆ ತಲ್ವಾರ್ ಯಿಂದ ಮರ್ಡರ್ ಮಾಡತೀನಿ 👇👇ಇಲ್ಲಾ FIR ತೊಗೋಳಿ pic.twitter.com/Fwc1sbWrhw— shareef (@LoverBoy1381979) January 19, 2025కాంతారగడ -
ప్రియుడితో కొన్నాళ్లు సహజీవనం.. భర్తను నమ్మించి..
పలమనేరు: పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన దళిత నేత శివకుమార్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తమ వివాహేతర సంవాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు షామీర్(30) పథకం ప్రకారం శివకుమార్‌ను హత్య చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో నిందితుడు షామీర్‌ను అరెస్ట్ చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు షామీర్(30) పథకం ప్రకారం శివకుమార్‌ను హత్య చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో నిందితుడు షామీర్‌ను అరెస్ట్ చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పలమనేరు మండలంలోని ముసలిమొడుగుకు చెందిన శివకుమార్ భార్య ఉషారాణి గత 8 నెలల నుంచి పలమనేరులోని షామీర్ బిరియాని హోటల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు షామీర్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భర్త శివకుమార్ పలుమార్లు భార్యను ప్రశ్నించాడు. ఆమె కొన్నాళ్లు ప్రియుడితో కలిసి బెంగళూరు వెళ్లిపోయింది. దీంతో శివకుమార్ తన భార్య కనిపించలేదని వేలూరులో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇకపై తాను భర్తతోనే కాపురం చేస్తానని ఉషారాణి అందరినీ నమ్మించింది. షామీర్ కూడా తాను ఉషారాణి విషయంలో జోక్యం చేసుకోనని చెప్పాడు. స్నేహితులుగా ఉందామని శివకుమార్‌ను నమ్మించి ఈ నెల 13న పలమనేరు సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంకు పక్కనున్న వెంచర్లోకి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించి చాతీపై బండరాయితో కొట్టి హత్య చేశారు. ఈ కేసును మూడు రోజుల్లో ఛేదించిన సీఐ నరసింహరాజు, ఎస్ఐ స్వర్ణతేజను డీఎస్పీ అభినందించారు. -
గుట్కా లేటుగా ఇచ్చాడని.. చాయ్‌వాలాపై కాల్పులు
నలంద:బీహార్‌లోని నలందలో ఘోరం చోటుచేసుకుంది. మత్తుకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు క్షణికావేశంలో తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.వివరాల్లోకి వెళితే బీహార్‌లోని నలంద జిల్లాలో టీ దుకాణదారునిపై కాల్పులు జరిపిన ఉదంతం వెలుగుచూసింది. గుట్కా ఇవ్వడంలో ఆలస్యం చేశాడనే కారణంతో దుండగులు ఆ చాయ్‌వాలాపై కాల్పులకు పాల్పడ్డారు. బుల్లెట్ శబ్దం విని చుట్టుపక్కలవారు టీ దుకాణం వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిని చూసిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దుకాణదారుడిని గాయపడిన స్థితిలో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటన నలంద జిల్లాలోని సారే పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీనగర్ గ్రామంలో చోటుచేసుకుంది. రాత్రివేళ ముగ్గురు సాయుధ దుండగులు టీ దుకాణానికి వచ్చి, చాయ్‌వాలాను గుట్కా ప్యాకెట్లు కావాలని అడిగారు. అతను వాటిని ఇవ్వడంతో కొంత జాప్యం చేశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ దుండగులు దుర్భాషలాడుతూ, చాయ్‌వాలాపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బుల్లెట్ దుకాణదారుడి వీపు గుండా దూసుకెళ్లింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన దుకాణదారుడిని నరేష్ యాదవ్ కుమారుడు రాకేష్ యాదవ్‌గా గుర్తించారు.ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ధర్మేష్ కుమార్ గుప్తా మీడియాకు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుని దర్యాప్తు ప్రారంభించారని, బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. ముగ్గురు యువకులు ఈ నేరానికి పాల్పడ్డారని, ఈ కేసును త్వరలోనే చేధిస్తామని తెలిపారు.ఇది కూడా చదవండి: దీక్ష విరమించను.. వైద్య చికిత్సకు ఓకే: రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్ -
బిహార్ గ్యాంగ్ పనేనా?
-
బిహార్ గ్యాంగ్ పనేనా?
సాక్షి, హైదరాబాద్ : బీదర్‌లో డబ్బు దోచుకోవడానికి.. పట్టుబడతామనే భయంతో అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపిన దుండగులు బిహార్‌కు చెందిన వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరిని బిహార్‌కు చెందిన పాతనేరగాడు మనీశ్కుష్వాడగా గుర్తించినట్టు తెలిసింది. గురువారం చోటు చేసుకున్న ఈ ఉదంతాల్లో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపగా, శుక్రవారం తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, బిహార్‌ల్లో గాలిస్తున్నా యి. మరోపక్క కర్ణాటక పోలీసులు నగరానికి చేరుకొని కేసు దర్యాప్తులో పాలుపంచుకున్నారు. ఆటోలో ఎంజీబీఎస్ వైపు నుంచి ..: బీదర్‌లో దుండగులిద్దరూ ‘ఏపీ’రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న బైక్‌పై రూ.93 లక్షలున్న అల్యూమినియం డబ్బా ఎత్తుకొని ఉడాయించారు. అక్కడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చి మార్గమధ్యలో ఆ డబ్బును బ్యాగ్‌లోకి మార్చుకున్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామమైన సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలోని ßæనుమాన్ టెంపుల్ వద్ద గల సీసీ ఫుటేజీల్లో దుండగులు కనిపించారు. సుల్తాన్పూర్, డప్పూర్, హత్నూర్, న్యాల్కల్ మీదుగా హైదరాబాద్ వెళ్లారు. అయితే ఆ డబ్బా, బైక్ ఎక్కడ వదిలేశారన్నది ఇంకా తేలలేదు. ఒకరు ఈ పెద్ద బ్యాగ్ పట్టుకొని, మరొకరు బ్యాక్ ప్యాక్ తగిలించుకొని గురువారం సాయంత్రానికి రోషన్ ట్రావెల్స్ వద్దకు వచ్చారు. ఈ ద్వయం ఎంజీబీఎస్ వైపు నుంచి ఆటోలో వచ్చి ట్రావెల్స్ వద్ద దిగినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఫోన్ నంబర్ ఇచ్చి... రాయ్‌పూర్ వెళ్లడానికి అమిత్‌కుమార్ పేరుతో రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ సెల్‌నంబర్ ఇచ్చారు. బస్సు, సీట్ల నంబర్లు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయని, సరిచూసుకోవాలని ట్రావెల్స్ నిర్వాహకులు చెప్పారు. దీంతో ఓ దుండగుడు తన ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని, ఇక్కడే ఉండి మీతోనే వచ్చి బస్సు ఎక్కుతామని వారికి చెప్పాడు. ఆ బస్సు ప్రయాణించే మార్గం, మార్గమ«ధ్యలో దాని స్టాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలు ట్రావెల్స్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మదీనాలో రెండు బ్యాగ్స్ ఖరీదు.... రూ.93 లక్షలతో కూడిన బ్యాగ్‌ను చేత్తో పట్టుకొని మోయడం కష్టంగా ఉండటంతో ట్రాలీ బ్యాగ్ ఖరీదు చేయాలని భావించారు. అవి ఎక్కడ దొరుకుతాయంటూ ట్రావెల్స్ నిర్వాహకులను అడిగారు. మదీనా ప్రాంతంలో దుకాణాలు ఉన్నాయని చెప్పగా, అక్కడకు వెళ్లి రెండు ట్రాలీ బ్యాగ్స్ ఖరీదు చేశారు. మూసీనది సమీపంలో లేదా పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్లి పెద్ద బ్యాగ్‌లో ఉన్న నగదును ఓ ట్రాలీలోకి మార్చారు. మరో దాంట్లో కొన్ని వ్రస్తాలతోపాటు హెల్మెట్ పెట్టారు. బ్యాక్ ప్యాక్‌లో మాత్రం తుపాకీ దాచి ఉంచారు. కాల్పులు జరిపింది మినీ బస్సులోనే... రోషన్ ట్రావెల్స్ కార్యాలయం అఫ్జల్‌గంజ్ బస్టాప్‌లోనే ఉంటుంది. అక్కడ మినీ బస్సుల్ని ఆపడానికి అవకాశం ఉండదు. దీంతో తమ ప్రయాణికుల్ని ట్రావెల్స్ బస్సుల వరకు చేర్చే మినీ బస్సుల్ని సమీపంలో ఉన్న మెట్రో ట్రావెల్స్ వద్ద ఆపుతారు. గురువారం సైతం ఇలానే ఆగడంతో..రోషన్ ట్రావెల్స్ నుంచి మిగిలిన ప్రయాణికులు, బీదర్ పోలీసులతో కలిసి ఇద్దరు దుండగులూ ఆ బస్సు ఎక్కారు. బస్సులో ప్రయాణికుల లగేజీ తనిఖీ చేస్తున్న ట్రావెల్స్ ఉద్యోగి జహంగీర్ దుండగుల ఓ ట్రాలీని తెరిచి చూసి హెల్మెట్, వస్త్రాలు గుర్తించారు. రెండోది తెరవడానికి ప్రయత్నిస్తుండగా, అందులో నగదు ఉండటంతో ఓ దుండగుడు తన బ్యాక్ ప్యాక్ నుంచి తుపాకీ బయటకు తీసి ఒక రౌండ్ కాల్చాడు. ఈ శబ్దం విన్న బస్సు డ్రైవర్ తొలుత టైరు పగిలిందని భావించి కిందకు దిగాడు. అదే అదనుగా ఇద్దరు దుండగులూ తమ ట్రాలీలతో సహా కిందకు దిగి ట్రాఫిక్‌కు రాంగ్ సైడ్‌లో నడుచుకుంటూ వెళ్లారు. పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఆటో ఎక్కి... అదే మినీ బస్సులో ఉన్న ఇద్దరు బీదర్ పోలీసు కానిస్టేబుళ్లు వీరిని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ సమీపం వరకు నడుచుకుంటూ వెళ్లిన దుండగులు ఓ ఆటో ఎక్కి ఎంజే మార్కెట్ మీదుగా ఉడాయించారు. ఠాణా సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను బట్టి రాత్రి 7.09 గంటలకు దుండగులు ఆటో ఎక్కారు. దీని ప్రకారం కాల్పులు 7 గంటల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. క్షతగాత్రుడు మినీ బస్సు దగ్గర నుంచి రోషన్ ట్రావెల్స్ వరకు వచ్చి, వారికి విషయం చెప్పి, పోలీసులకు సమాచారం ఇచ్చేసరికి సమయం దాదాపు రాత్రి 7.30 గంటలైంది. సికింద్రాబాద్ మీదుగా పరారీ... దుండగులు ప్రయాణించిన ఆటో ఎంజే మార్కెట్, అబిడ్స్, ట్యాంక్‌బండ్ మీదుగా సికింద్రాబాద్ వరకు వెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆటో నంబర్, దాని ద్వారా డ్రైవర్‌ను గుర్తించిన అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రశ్నించారు. తాను ఇద్దరినీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్ వరకు తీసుకెళ్లానని చెప్పాడు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైలులో ఛత్తీస్‌గఢ్ లేదా బిహార్‌కు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. -
ఫైర్ ఎగ్జిట్ మెట్ల ద్వారా ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు
-
పోలీస్ విచారణకు హాజరైన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
హైదరాబాద్, సాక్షి: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ విచారణ ముగిసింది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మాసబ్ ట్యాంక్ సీఐ ఎదుట ఆయన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అరగంటకుపైగా ఆయన్ని విచారణ జరిపినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 4వ తేదీన కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి బంజారాహిల్స్(Banjara Hills) పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తన ఫోన్ ట్యాప్ అవుతోందంటూ ఆయన ఫిర్యాదు చేయబోయారు. అయితే ఆ సమయంలో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ బయటకు వెళ్తున్నారు. దీంతో.. సీఐ వాహనానికి తన వాహనాన్ని అడ్డు పెట్టి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. ఈ ఘటనపై సీఐ రాఘవేందర్ ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)పై కేసు నమోదు అయ్యింది. అయితే ఫిర్యాదుదారుడు సీఐ కావడం, అది బంజారాహిల్స్ పీఎస్‌లోనే కావడంతో.. దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ సీఐ పరుశురాంను ఉన్నతాధికారులు నియమించారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కౌశిక్‌కు నోటీసులు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇవాళ విచారణకు హాజరయ్యారు. నా తప్పేమీ లేదు: కౌశిక్రెడ్డిమాసబ్ ట్యాంక్ పీఎస్ లోపలికి వెళ్లే క్రమంలో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘నేను చేసిన తప్పేమీ లేదు. విచారణకు పూర్థిస్తాయిలో సహకరిస్తా’’ అన్నారు. అయితే తన అడ్వొకేట్(Advocate)తో కలిసి ఆయన లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా సిబ్బంది అడ్డుకున్నారు. ఆపై ఆయన విజ్ఞప్తితో ఉన్నతాధికారులను సంప్రదించి.. అనంతరం వాళ్లను లోపలికి వెళ్లనిచ్చారు. -
‘దారి’తప్పిన పోలీసులు.. మూడ్ బాగోలేదంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై దాడి
సాక్షి, అనంతపురం: జిల్లాలో పోలీసులు దారి తప్పారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై దాష్టీకం చూపారు. సమాచారం అడిగితే విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసుల వైనం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. అనంతపురం నగరానికి చెందిన యువకుడు ఇంతియాజ్ అహ్మద్ బెంగళూర్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అనంతపురం ఆర్టీవో కార్యాలయం వద్ద నివసించే ఇంతియాజ్ ఇంట్లో చోరీ జరిగింది. ఇదే సమయంలో తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు.తల్లికి ఇడ్లీ తెచ్చేందుకు సూర్యా నగర్ రోడ్డులోని ఓ హోటల్‌కు వెళ్లారు. ఇదే సమయంలో కానిస్టేబుల్ నారాయణస్వామి, హోం గార్డు దాదాపీర్ కనిపించడంతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇంతియాజ్ వారితో మాట్లాడారు. తన ఇంట్లో చోరీ జరిగిందని.. తాను ఉన్న ఇళ్లు ఏ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని కానిస్టేబుల్ నారాయణస్వామిని అడిగారు. తన మూడ్ బాలేదని... తాను ఎలాంటి సమాచారం ఇవ్వలేనని కానిస్టేబుల్ నారాయణస్వామి.. ఇంతియాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగక అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు కానిస్టేబుల్. విచారించాల్సిన హోంగార్డు కూడా కానిస్టేబుల్ నారాయణస్వామికి మద్దతు ఇవ్వటంతో ఇద్దరూ కలిసి ఇంతియాజ్ పై దాడి చేసి కొట్టారు. అనంతపురం పోలీసుల దాష్టీకం సీసీ కెమెరాలలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.పోలీసుల చేతిలో గాయపడిన ఇంతియాజ్ అహ్మద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అండగా నిలిచారు. అకారణంగా దాడి చేసిన పోలీసులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీం, ఇతర పార్టీ నేతలు డీఎస్పీ కి ఫిర్యాదు చేశారు.అనంతపురం జిల్లాలో పోలీసుల వైఖరి రోజు రోజుకూ వివాదాస్పదం అవుతోంది. అనంతపురం టవర్ క్లాక్ వద్ద ఇటీవల ఓ వ్యక్తి పై ట్రాఫిక్ కానిస్టేబుళ్లు దాడి చేశారు. అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ లాయర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనలు మరువకముందే ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇంతియాజ్ పై దాడి చేయడం పోలీసుల పనితీరును ప్రశ్నిస్తోంది.ఇదీ చదవండి: తిరుమల: బంగారు బిస్కెట్ చోరీ ఘటన కీలక మలుపు -
తిరుమలలో పోలీసుల దురుసు ప్రవర్తన
-
డ్రోన్ తప్పుకుంది.. కోడి గెలిచింది!
సాక్షి, అమరావతి: టెక్నాలజీ పేరుతో హడావుడి చేయడంలో రాష్ట్ర పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబును మించిపోయారు. చంద్రబాబు మాట్లాడితే డ్రోన్ల ప్రస్తావన చేస్తుంటారు. ఆయన కంటే తామేమి తక్కువ తినలేదన్నట్టుగా పోలీసులు ఈసారి కోడి పందాల కట్టడికి డ్రోన్లను రంగంలోకి దించారు. ప్రతి యేటా సంక్రాంతికి ముందు కోడి పందాల కట్టడి పేరుతో పోలీసులు హడావుడి చేయడం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది సంక్రాంతి కోడి పందేలను అడ్డుకుంటామని విజయవాడ పోలీస్ కమిషనరేట్‌తోపాటు ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పోలీసులు డ్రోన్లను ఎగుర వేశారు.బరుల గుర్తింపు, వాటి వద్ద నిర్వాహకుల ఏర్పాట్లను వాటితో చిత్రీకరించారు. పలు ప్రాంతాల్లో కోళ్లకు కత్తులు కట్టే వారిని, నిర్వాహకులను అదుపులోకి తీసుకుని బైండోవర్ చేశారు. కోడి పందేలు చట్ట రీత్యా నేరం అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేయడంతోపాటు మైక్ ప్రచారాన్ని నిర్వహించారు. రెండు రోజులుగా కొన్ని చోట్ల కోడి పందేల బరులను ట్రాక్టర్లతో దున్నించి ధ్వంసం చేశారు. ఇంతా చేసి చివరకు చేతులెత్తేయాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం సాయంత్రం నుంచి ఆయా ప్రాంతాల్లో బరులు సిద్ధమైపోతుండటం గమనార్హం.సీన్ కట్ చేస్తే..కోడి పందేల నిర్వాహకులు పోలీసుల ఎత్తుకు పై ఎత్తు వేస్తూ అధికార పార్టీ నేతలను రంగంలోకి దించి వారి ఆశీస్సులతో ఏర్పాట్లు పూర్తి చేశారు. చిన్నపాటి బరుల నుంచి భారీ బరుల వరకు వందల సంఖ్యలో సిద్ధం చేశారు. భోగి రోజునే పందేలు మొదలుపెట్టి మూడు రోజులపాటు అడ్డు అదుపు లేకుండా నిర్వహించుకునేలా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా కోడి పందేలకు బ్రాండ్‌గా నిలిచిన భీమవరం, ఐభీమవరం, వెంప, ఏలూరు, అమలాపురం, కోనసీమ కొబ్బరి తోటల్లో భారీ బరులు సిద్ధం చేశారు. ఒక్కొక్క బరిని రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల ఖర్చుతో తీర్చిదిద్దారు.బరుల్లో భారీ స్క్రీన్లు, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయగా, బరులకు ఆనుకుని మద్యం బెల్ట్ షాపులు, గుండాట, పేకాట నిర్వహించుకునే ఏర్పాట్లతోపాటు కూల్ డ్రింక్స్, బిర్యానీ, కోడి పకోడి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందేలను చూసేందుకు, బెట్టింగ్‌లు వేసేందుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి పందేల రాయుళ్లు ఈ ప్రాంతాలకు తరలి వస్తున్నారు. వారి కోసం భీమవరం తదితర పట్టణాల్లో మూడు నెలల ముందు నుంచే లాడ్జీలు, హోటళ్లు బుక్ చేశారు. పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లకు తోడు చేపల చెరువుల వద్ద మకాంలను కూడా సిద్ధం చేశారు. ఇప్పటి దాకా ఇంత చేసిన పోలీసులు ఆ మూడు రోజులు మాత్రం గప్చిప్ అని నిర్వాహకులు బాహాటంగా చెబుతున్నారు. -
హెల్మెట్ లేకుండా నడిచినందుకు ఫైన్!
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఆపి, ‘హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైన్ కట్టు’అంటాడు ఓ సినిమాలో ట్రాఫిక్ పోలీస్. మధ్యప్రదేశ్‌లో పోలీసులు మరో అడుగు ముందుకేశారు! రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తకి హెల్మెట్ పెట్టుకోలేదంటూ రూ.300 జరిమానా విధించారు! పన్నా జిల్లాలో అజయ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వింత ఘటన జరిగింది. సుశీల్ కుమార్ శుక్లా అనే వ్యక్తి తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకు అతిథులను ఆహ్వానించేందుకు వెళ్తుండగా ఓ పోలీసు వాహనం అడ్డగించింది. బలవంతంగా వాహనంలోకి ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కుమార్తె పుట్టినరోజు వేడుకలకు ఇంటికి వెళ్లాల్సి ఉందని చెప్పినా పోలీసులు విన్పించుకోలేదు. పక్కనే ఉన్న ఓ బైకు రిజి్రస్టేషన్ నంబర్ రాసి మరీ, హెల్మెట్ లేకుండా వాహనం నడిపావంటూ శుక్లాకు జరిమానా విధించారు. దాంతో ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో ఆధారంగా తప్పక చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వైఎస్ జగన్ కాన్వాయ్ అడ్డగింత (ఫోటోలు)
-
గూగుల్ మ్యాప్‌తో పోలీసులు కాస్త దొంగలయ్యారు!
గూగుల్ మ్యాప్ మరోసారి హ్యాండిచ్చిన ఘటన ఇది. ఓ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్నారు. అయితే అది కాస్త దారుణ పరాభవానికి దారి తీసింది. పోలీసులను దొంగలుగా భావించి చితకబాదిన జనం.. రాత్రంతా కట్టేసి బందీలుగా ఉంచుకున్నారు. చివరకు అసలు విషయం తెలిసి సారీ చెప్పి వదిలేశారు. అసోంలోని జోరాత్ జిల్లాకు చెందిన 16 మందితో కూడిన పోలీసు బృందం నిందితుడిని పట్టుకునేందుకు బయలుదేరింది. ఈ క్రమంలో ఈ బృందం గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుంది. మ్యాప్ అసోంలోని ఓ తేయాకు తోటను చూపించింది. నిజానికి అది నాగాలాండ్‌లోని నాగాలాండ్‌లోని మోకోక్చుంగ్ జిల్లా ప్రాంతం. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం లోపలికి వెళ్లారు. అయితే.. వారి వద్దనున్న అధునాతన ఆయుధాలు చూసిన స్థానికులు వారిని దుండగులుగా పొరబడి చుట్టుముట్టి దాడి చేశారు. ఆపై వారిని బంధించారు. ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడ్డారు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న జోరాత్ పోలీసులు వెంటనే మోకోక్‌చంగ్ ఎస్పీతో మాట్లాడారు. దీంతో ఆయన స్థానికుల చేతుల్లో బందీలుగా ఉన్న పోలీసులను విడిపించేందుకు మరో బృందాన్ని పంపించారు. స్థానికులకు అసలు విషయం తెలియడంతో గాయపడిన పోలీసు సహా ఐదుగురిని విడిచిపెట్టారు. మిగిలిన 11 మందిని రాతంత్రా బందీలుగా ఉంచుకుని నిన్న ఉదయం విడిచిపెట్టడంతో కథ సుఖాంతమైంది. -
దీక్షా శిబిరం దాటొస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరిక
-
ప్రధాని పర్యటనలో పోలీసుల ఓవరాక్షన్.. ఉక్కు కార్మికులకు వార్నింగ్
సాక్షి,విశాఖపట్నం:ప్రధాని మోదీ విశాఖపట్నం సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్ష చేస్తున్న విశాఖ స్టీల్ కార్మికులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. దీక్షా శిబిరం నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే కార్మికులు దీక్ష చేస్తున్న కూర్మన్నపాలెంలో పోలీసులు భారీగా మోహరించారు.ఏ నిమిషమైనా పోరాట కమిటీ నేతలను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. మారుతి సర్కిల్ నుంచి ఐఎన్ఎస్ డేగా, కాన్వెంట్ జంక్షన్,రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో వాహనాలను నిలిపివేశారు. ప్రెగ్నెంట్ లేడీ ఆసుపత్రికి వెళ్లేందుకు బ్రతిమిలాడినా పోలీసులు అనుమతించలేదు. నిండు గర్భిణీ హాస్పిటల్ పేపర్స్ చూపించినా కనికరించలేదు.టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిని మాత్రం అటుగా వెళ్లేందుకు పోలీసులు అనుమతించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.విశాఖ(visakhapatnam)లో స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాట కమిటీ నిరాహార దీక్షకు పూనుకుంది. విశాఖకు ప్రధాని మోదీ(PM Modi) వస్తున్న తరుణంలో పోరాట కమిటీ సభ్యులు.. ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. అయితే, ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో విశాఖలో ప్రధాని స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక జారీ చేశారు.మరోవైపు.. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ సొంత గనుల గురించి ఇప్పటి వరకు నోరు మెదపని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్.. ఏకంగా ఆర్సెలార్ మిట్టల్‌కు ఏజెంట్‌గా మారారని మండిపడ్డారు. కేంద్ర ఉక్కు మంత్రి కుమార్‌స్వామిని కలిసి రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ పరిశ్రమకు నిరాటకంగా ముడి ఇనుప ఖనిజం సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారని ఆరోపించారు. తక్షణం మంత్రి పదవి నుంచి భరత్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. -
తప్పు స్పెల్లింగ్‌తో నకిలీ కిడ్నాప్ గుట్టు రట్టు
లక్నో: ఓ ఫేక్ కిడ్నాప్ కేసును ఉత్తరప్రదేశ్ పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఒక ఇంగ్లీష్ పదానికి రాంగ్ స్పెల్లింగ్ రాసిన క్లూతో కేసు అసలు గుట్టును రట్టు చేశారు. ఈ నకిలీ కిడ్నాప్ ఘటన యూపీలోని హర్దోయి జిల్లాలో జరిగింది. జిల్లాకు చెందిన సందీప్ (27) తాను కిడ్నాప్ అయినట్లు నాటకమాడి,రూ.50వేలు ఇవ్వాలని తన సోదరుడిని డిమాండ్ చేస్తూ వేరే ఫోన్ నుంచి మెసేజ్ పెట్టాడు.సోదరుడికి పంపిన బెదిరింపు మెసేజ్‌లో డబ్బులు ఇవ్వకుంటే సందీప్‌ను చంపేస్తామని రాసిన చోట డెత్ అనే పదాన్ని తప్పుగా(deathబదులుdeth)అని రాశాడు. ఈ మెసేజ్ నిశితంగా పరిశీలించిన పోలీసులు దానిని పంపిన వ్యక్తి అంతగా చదువుకోని వ్యక్తి అని నిర్ణయానికి వచ్చారు. పైగా సందీప్‌కు శత్రువులు ఎవరూ లేకపోవడంతో అనుమానం బలపడింది. ఫోన్ సిగ్నల్ ఆధారంగా సందీప్ ఆచూకీ గుర్తించారు.కిడ్నాప్ విషయమై సందీప్‌ను విచారించారు. విచారణ సందర్భంగా ఆ బెదిరింపు మెసేజ్‌ను రాయమని సందీప్‌ను కోరారు. దీంతో సందీప్ మరోసారి ‘డెత్’ అనే పదాన్ని తప్పుగా రాయడంతో కిడ్నాప్ నాటకమాడింది అతడేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. డబ్బుల కోసం తానే ఈ నాటకం ఆడానని, ఓ పాపులర్ క్రైమ్ సీరియల్ చూసి ఈ పని చేశానని పోలీసులకు చెప్పాడు. ఇదీ చదవండి: పెళ్లికి సాయం చేస్తానని పిలిచి -
మరి చైనా వైరస్ సార్!
-
కోర్టులకన్నా ఎక్కువ అనుకుంటున్నారా?
సాక్షి, అమరావతి : సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో పోలీసుల తీరుపై హైకోర్టు నిప్పులు చెరిగింది. రవీంద్రరెడ్డిని ఎప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నారు? ఎప్పుడు అరెస్ట్ చూపారు? ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా అన్న ప్రశ్నలకు సూటిగా సమాధానాలివ్వాలని పోలీసు లను ఆదేశించింది. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచీ తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తు న్నారంటూ మండిపడింది. రవీంద్రరెడ్డితో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్ కుమార్‌రెడ్డిలను తమ ముందు హాజరుపరచాలని ఆదేశిస్తే కింది కోర్టు ముందు హాజరుపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇలాంటి తీరును సహించేదే లేదని తేల్చి చెప్పింది. కోర్టులకన్నా ఎక్కువ అనుకుంటున్నారా అంటూ పోలీసులను నిలదీసింది. ఎస్పీ తీరు చూస్తే అలాగే అనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ కేసు తీవ్రత అర్థమవుతున్నట్లు లేదని, ఆరోపణలు నిజమని తేలితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులను హెచ్చరించింది. ఆరోపణ లున్నా స్పందించడంలేదంటే ఏమనుకోవాలంటూ నిలదీసింది. రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.పోలీసులు కోర్టునూ తప్పుదోవ పట్టిస్తున్నారుతన భర్తను అక్రమంగా నిర్బంధించారని వర్రా రవీంద్రరెడ్డి భార్య కళ్యాణి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా కళ్యాణి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పోలీసుల అన్యాయాలు, అక్రమ నిర్బంధాలకు అడ్డుకట్ట వేయాలని కోర్టును కోరారు. అవాస్తవాలతో కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. నవంబర్ 8న రవీంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్నారా? లేదా? అన్న విషయంపై పోలీసులు మాట్లాడటంలేదన్నారు. చట్టం కన్నా, కోర్టుల కన్నా తామే ఎక్కువ అన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కోర్టు ఆదేశించినా ఇప్పటివరకు కౌంటర్లు దాఖలు చేయలేదన్నారు.ముఖ్యంగా కడప ఎస్పీపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేశామని, ఆయన ఇప్పటివరకు కౌంటర్ వేయలేదని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) టి.విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. అన్నమయ్య జిల్లా ఎస్పీ కౌంటర్ దాఖలు చేశారని, ఆయనే ఇప్పుడు కడప జిల్లాకు ఇన్చార్జి ఎస్పీగా ఉన్నారని తెలిపారు. రవీంద్రరెడ్డి నిర్బంధానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని నిరంజన్‌రెడ్డి కోరగా.. ఆ పని తాము చేయలేమని ధర్మాసనం చెప్పింది. అలా అయితే సంబంధిత జిల్లా జడ్జికి ఆ బాధ్యతలు అప్పగించాలని నిరంజన్‌రెడ్డి సూచించారు. -
అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసుల నోటీసులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్లాలనుకుంటే తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవలే చిక్కడపల్లి పీఎస్‌కు వెళ్లే సమయంలోనూ అల్లు అర్జున్ మేనేజర్‌కు రాంగోపాల్ పేట్ పోలీసులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై మరోసారి నోటీసులు అందజేశారు.అసలేం జరిగిందంటే..కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప 2 విడుదలకు ముందు రోజు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన (Sandhya Theatre Stampede) జరిగింది. అక్కడకు వచ్చిన అల్లు అర్జున్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.(ఇది చదవండి: అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు)అల్లు అర్జున్ అరెస్ట్..ఈ కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయాన్నే జూబ్లీహిల్స్‌లోని ఐకాన్ స్టార్ ఇంటికి వెళ్లిన పోలీసులు చిక్కడపల్లి పీఎస్‌కు తీసుకొచ్చారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత బన్నీని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా 14 రిమాండ్ విధించింది.మధ్యంతర బెయిల్‌పై విడుదల..అయితే అరెస్ట్ అయిన రోజే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్ న్యాయవాదులు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అల్లు అర్జున్‌కు నాలుగువారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ అరెస్ట్ అయిన రోజు బెయిల్‌కు సంబంధించిన ప్రక్రియ ఆలస్యం కావడంతో బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆ రోజు రాత్రి అల్లు అర్జున్ జైలులోనే గడిపారు.(ఇది చదవండి: తొక్కిసలాట ఘటన: నాంపల్లి కోర్టుకు సంధ్య థియేటర్ యాజమాన్యం)ఉదయం రిలీజ్..బెయిల్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరుసటి రోజు ఉదయం బన్నీ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ ప్రముఖులంతా బన్నీని కలిసి పరామర్శించారు. ఆ తర్వాత అల్లు అర్జున్.. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ కేసు నమోదైన తర్వాత తొలిసారి చిరుతో భేటీ అయ్యారు.రేవతి కుటుంబానికి ఆర్థియసాయం..ఈ ఘటన తర్వాత రేవతి కుటుంబానికి పుష్ప టీమ్ ఆర్థిక సాయం అందించింది. అల్లు అర్జున్ తరఫున అల్లు అరవింద్ కోటీ రూపాయల చెక్ అందజేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు సైతం రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.పరామర్శించిన దిల్‌రాజు..సినీ ఇండస్ట్రీ తరఫున తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఆస్పత్రి వెళ్లి ఆరా తీశారు. శ్రీతేజ్ ఫ్యామిలీకి అన్ని విధాలా సాయం చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని దిల్ రాజు వెల్లడించారు.