రెండో సారి.. ఎస్‌ఐ సస్పెన్షన్‌ | ACB Trapped SI Venkatesh, Suspended Again Over Corruption Allegations In Hyderabad, More Details Inside | Sakshi
Sakshi News home page

రెండో సారి.. ఎస్‌ఐ సస్పెన్షన్‌

Mar 5 2026 9:34 AM | Updated on Mar 5 2026 11:36 AM

ACB trapped si venkatesh suspended again over corruption allegations hyderabad

హైదరాబాద్:  డబ్బు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కి సస్పెండ్‌ అయ్యాడు.. అనంతరం కొద్ది సంవత్సరాల తరువాత విధుల్లో చేరాడు.. ఈ క్రమంలో సిటీలోని ఓ పీఎస్‌లో ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టాడు. ఇక్కడా అతని పంథా మారలేదు..వసూళ్ల పర్వం కొనసాగించాడు. గమనించిన ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. పాతబస్తీ ఐఎస్‌ సదన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ వెంకటేశ్‌ను  నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు.   వెంకటేశ్‌ జూన్‌లో స్టేషన్‌లో ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. 

అప్పటి నుంచీ వెంకటేశ్‌పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్‌ స్టేషన్‌లో కేసులను నమోదు చేయకుండా జాప్యం చేయడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.  బాధితులు, నేరస్తుల నుంచి భారీగా డబ్బు డిమాండ్‌ చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో  విచారణ  అనంతరం  నగర పోలీసు కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. 2019లో మహబూబ్‌నగర్‌ తెల్కపల్లిలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యాపారి నుంచి డబ్బు తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన కేసులో కొన్ని సంవత్సరాలపాటు సస్పెన్షన్‌లో ఉన్నాడు. ఇప్పుడు కూడా అతని తీరు మారకపోవడం విచారకరం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement