ACB
-
ఏసీబీ వలలో ఉప ఖజానా అధికారిణి
ఉదయగిరి: ఉదయగిరి ఉపఖజానా అధికారిణి సీహెచ్ మమత మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఓ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ శిరీష తెలిపిన సమాచారం మేరకు.. వరికుంటపాడు మండలం తూర్పుబోయమడుగుల గ్రామంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న లోకసాని వెంగయ్యకు సుమారు రూ.9 లక్షల వరకు పాత బిల్లులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఈ బిల్లులు మంజూరు చేయాలని వెంగయ్య ఉప ఖజానా అధికారిణి సీహెచ్ మమతను వారం రోజుల క్రితం కలిశారు. అందుకు పది శాతం లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సదరు ఉపాధ్యాయుడు అంత డబ్బు ఇవ్వలేక వెనుదిరిగాడు. తర్వాత అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీహరిని సంప్రదించి రూ.40 వేలు లంచం ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేక ఆ ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు మంగళవారం ఎస్టీఓకు లంచం ఇచ్చేందుకు కార్యాలయానికి వెళ్లి ఆమెను కలిసి రూ.40 వేలు తీసుకొచ్చానని చెప్పడంతో అదే కార్యాలయంలో పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తి పవన్‌కు ఇవ్వాలని సూచించింది. దీంతో బాధితుడు కార్యాలయం కింద ఉన్న ప్రైవేట్ వ్యక్తి పవన్‌కు రూ.40 వేలు లంచం ఇచ్చాడు. అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న ఏసీబీ అధికారుల బృందం పవన్‌ను అదుపులోకి తీసుకొని పైనున్న ఎస్టీఓ వద్దకు తీసుకెళ్లారు. ఎస్టీఓ సూచన మేరకే ఈ నగదు తీసుకున్నట్లు పవన్ ఏసీబీ అధికారులకు చెప్పడంతో ఆమెను అదుపులోకి తీసుకొని నగదుకు రసాయన పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎస్టీఓను, పవన్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు ఆంజనేయరెడ్డి, విజయకుమార్‌తోపాటు మరో పది మంది సిబ్బంది ఉన్నారు. మమత మూడేళ్ల క్రితం ఉదయగిరి ఉప ఖజానా అధికారిణిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె సక్రమంగా విధులకు రావడం లేదని, ప్రతి చిన్న బిల్లుకు కూడా పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐసీడీఎస్‌కు సంబంధించిన బిల్లుల విషయంలో కూడా లంచాలు డిమాండ్ చేసి సకాలంలో బిల్లులు పాస్ చేయలేదనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి.లంచం ఇవ్వడం ఇష్టం లేక పట్టించానునాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.8,92,710 పాత బిల్లులు పాస్ చేయాలని ఎస్టీఓను కోరాను. ఆమె పది శాతం లంచం అడిగారు. అంత ఇవ్వలేనని చెప్పినా ఒప్పుకోకపోవడంతో ఇదే కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ శ్రీహరి మధ్యవర్తిత్వం ద్వారా రూ.40 వేలకు ఒప్పందం చేసుకున్నాను. అయినా లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకు వ్యవహరించి లంచం నగదు ఇచ్చాను. -
హ్యాపీ బర్త్‌డే రేవంత్ : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ‘నేను హైదరాబాద్‌లో ఉన్నా. మీ ఏసీబీ అధికారులు ఎప్పుడైనా రావొచ్చు. వారికి నా స్వాగతం. మీ బర్త్‌డే కేక్ వారితో కట్ చేయిస్తా. చాయ్, బిస్కెట్లు కూడా ఇస్తా’ అని పేర్కొన్నారు. Happy Birthday @revanth_anumula I am very much in Hyderabad. Your agencies are welcome anytime Chai, Osmania biscuits and if they want to cut your birthday cake, it’s on me 👍 https://t.co/ccPOezg1WC— KTR (@KTRBRS) November 8, 2024 కాగా, అరెస్ట్ భయంతో కేటీఆర్ మలేషియా వెళ్తున్నారంటూ పలు మీడియా కథనాలపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుసు. జర్నలిజాన్ని జోక్‌గా మార్చొద్దు. కేటీఆర్ హైదరాబాద్‌లోని తన నివాసంలో చాయ్ తాగుతూ ఈ వార్తను చదువుతూ ఉంటారని చెప్పారు. ఆ ట్వీట్‌కు ట్యాగ్ చేస్తూ కేటీఆర్ పై విధంగా స్పందించారు. -
మళ్లీ తెరపైకి ఈ-కార్ రేస్ వ్యవహారం.. ఏసీబీకి ఫిర్యాదు
హైదారబాద్, సాక్షి: ఫార్ములా ఈ-కార్ రేస్ నిధుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేటాయింపులపై మున్సిపల్ శాఖ అధికారులు తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫార్ములా ఈ-రేస్ కేసు నిధుల బదలాయింపుపై విచారణ జరపాలని మున్సిపల్ శాఖ అధికారులు ఏసీబీని కోరారు. దీంతో విచారణ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. రూ.కోట్లల్లో నిధులు బదిలీ కావటంపై మున్సిపల్ శాఖ విచారణ కోరింది. నిబంధనలు పాటించకుండా ఎంఏయూడీ నిర్వహణ సంస్థ ఎఫ్ఈఓకు రూ.55కోట్ల చెల్లించింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలు పాటించకపోవడంతో ఫార్ములా ఈ-రేసింగ్ సిసన్-10 రద్దైన విషయం తెలిసిందే. బోర్డు, ఆర్థికశాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే రూ.55 కోట్లను విదేశీ సంస్థకు చెల్లించారు.చదవండి: ఫ్రస్టేషన్లో ప్రభుత్వం.. వైఫల్యాలను ఎత్తి చూపినందుకే :కేటీఆర్ -
ఏసీబీ సోదాలు.. కోట్లలో బయటపడ్డ అడిషనల్ కలెక్టర్ అక్రమాస్తులు
సాక్షి,హైదరాబాద్ : రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసంలో ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించారు ఏసీబీ అధికారులు. ఈ ఏడాడి ఆగస్ట్ నెలలో రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి రూ.8లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లతో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.5కోట్లకు పైచీలుకు స్థిర,చర ఆస్తుల గుర్తించారు.అయితే రూ.4కోట్ల 19లక్షల విలువైన ఆస్తులు బినామీల పేరు మీద ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు ఏసీబీ అధికారులు. రూ.8లక్షల లంచం తీసుకుంటూఈ ఆగస్ట్ 13న రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. రూ.8 లక్షల లంచం తీసుకుంటూ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ దొరికిపోయారు. వ్యక్తి ధరణి వెబ్ సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి 14 గుంటల ల్యాండ్‌ను తొలగించాలని సీనియర్ అసిస్టెంట్‌ను బాధితుడు కోరాడు. ఈ పని చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌లాల్ రూ. 8 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన ఏసీబీ అధికారులు రూ.8 లక్షల లంచం తీసుకుంటుండగా భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్‌ను పట్టుకున్నారు. తాజాగా మరోసారి సోదాలు నిర్వహించగా భూపాల్‌రెడ్డి వద్ద భారీ మొత్తంలో ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించారు. -
ఏసీబీ వలలో మేడ్చల్ ఏఎస్ఐ
మేడ్చల్‌రూరల్: స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 2 లక్షలు డిమాండ్ చేసిన ఏఎస్ఐని ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఏస్పీ శ్రీధర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్‌కు చెందిన శర్మ మేడ్చల్ మండలం, గౌడవెళ్లి గ్రామ పరిధిలోని సాకేత్ ప్రణమ్లో విల్లా కొనుగోలు చేశాడు. అందులో ఇంటీరియర్ పనుల కోసం సరూర్‌నగర్‌కు చెందిన విశ్వనాథ్‌తో రూ.8 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.4 లక్షలు చెల్లించాడు. సగం పనులు పూర్తి చేసిన విశ్వనాథ్ మిగిలిన డబ్బులు ఇవ్వాలని కోరగా, అందుకు శర్మ నిరాకరించడంతో విశ్వనాథ్ పనులు నిలిపివేశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శర్మ రెండు నెలల క్రితం మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో విశ్వనాథ్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నార్సింగిలో అతడిని అదుపులోకి తీసుకుని మేడ్చల్ పీఎస్‌కు తీసుకువచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ మధుసూదన్ స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు, ఇరువర్గాల మధ్య సయోద్య కుదిర్చేందుకు విశ్వనాథ్‌ను రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. అందులో భాగంగా మొదట రూ.10 వేలు తీసుకున్నాడు. మిగతా మొత్తాన్ని విడతల వారీగా ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 5న రూ.50 వేలు తీసుకురావాలని ఏఎస్ఐ ఫోన్ చేయడంతో విశ్వనాథ్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు సోమవారం స్టేషన్‌కు వచ్చి డబ్బులు ఇస్తానని ఏఎస్ఐకి చెప్పాడు. పథకం ప్రకారం మాటు వేసిన ఏసీబీ అధికారులు సోమవారం విశ్వనాథ్ ఏఎస్ఐ మధుసూదన్‌రావుకు స్టేషన్ ఆవరణ వెనుక నగదు అందజేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి నుంచి రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన అధికారులు ఏఎస్ఐని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ విషయంలో ఇతర అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నల్లా కనెక్షన్ కోసం లంచం.. మణికొండ జల మండలి మేనేజర్ అరెస్ట్
మణికొండ: మంచినీటి కనెక్షన్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసి వసూలు చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో పాటు జలమండలి మేనేజర్‌ను అవినీతి నిరోధక శాఖ( ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. మణికొండ జలమండలి డివిజన్–18లో మేనేజర్‌గా పనిచేస్తున్న స్ఫూర్తి రెడ్డితో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌గౌడ్‌ను వలపన్ని పట్టుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వేంకటేశ్వర కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉపేంద్రనాథ్‌రెడ్డి ఇచి్చన ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం దాడులు చేసి వారిని అరెస్టు చేశారు. తన అపార్ట్‌మెంట్‌కు రెండు నీటి కనెక్షన్లకు ఆన్లైన్లో ధరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవటంతో ఉపేంద్రనాథ్‌రెడ్డి జలమండలి కార్యాలయానికి వచ్చి మేనేజర్ స్ఫూర్తిరెడ్డిని కలిశాడు. ఆమె సమాధానం చెప్పకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌గౌడ్‌ను కలవాలని సూచించింది. అతన్ని కలవగా ఒక్కో కనెక్షన్‌కు రూ.15 వేల చొప్పున రూ.30 వేలు ఇస్తే మీ పని అయిపోతుందని సలహా ఇచ్చారు. దాంతో అతను ఏసీబీని ఆశ్రయించి మంగళవారం వారి సూచన మేరకు మణికొండ మర్రిచెట్టు సర్కిల్లో ఉన్న జలమండలి కార్యాలయం వద్ద నవీన్‌గౌడ్‌కు డబ్బులు ఇవ్వగానే ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. విచారణలో మేనేజర్ ఆదేశం మేరకే డబ్బు తీసుకున్నానని పేర్కొనటంతో ఆమెను కూడా అరెస్టు చేశారు. వసూలు చేసిన మొత్తంలో మేనేజర్‌తో పాటు డీజీఎం, జీఎంలకు వాటా ఇవ్వాల్సి ఉందని ఏసీబీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో నవీన్‌గౌడ్ అంగీకరించాడు. దాంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. దాడులలో ఏసీబీ సీఐలు ఆజాద్, జగన్మోహన్రెడ్డి, నవీన్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతున్న ఏసీబీ
-
ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎంవీ భూపాల్‌రెడ్డితో పాటు కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న మదన్‌మోహన్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి.. బాలాపూర్ మండలం గుర్రంగూడకు చెందిన జక్కిడి ముత్యంరెడ్డికి 14 గుంటల పట్టా భూమి ఉంది. ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితా నుంచి దీన్ని తొలగించాలని కోరుతూ ఆయన ఇటీవల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ను కలిసి అనేకసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఇ–సెక్షన్లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డిని సంప్రదించారు. విషయం అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఆయన రూ.10 లక్షలు డిమాండ్ చేయగా, రూ.8 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో అధికారులు స్కెచ్చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం మదన్‌మోహన్‌రెడ్డిని గుర్రంగూడ ఎక్స్‌రోడ్‌కు ముత్యంరెడ్డి పిలిపించాడు. మాటు వేసి.. సీనియర్ అసిస్టెంట్ తన స్విఫ్ట్ డిజైర్ టీఎస్ 08ఎఫ్ఆర్ 1134 కారులో అక్కడికి చేరుకోగా ముత్యంరెడ్డి రూ.8 లక్షల నగదుతో కూడిన సంచిని అందజేశాడు. అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు మదన్‌మోహన్‌రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే అతను అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకే తాను డబ్బులు తీసుకున్నట్లు చెప్పడంతో అతనితో భూపాల్‌రెడ్డికి ఫోన్ చేయించారు. నగదు తీసుకుని ఓఆర్ఆర్ పెద్ద అంబర్పేట్ ఎగ్జిట్ వద్దకు రావాలని భూపాల్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఇన్నోవా కారు (టీఎస్ 07జీకే0459)లో రాత్రి 10.41 గంటలకు పెద్ద అంబర్‌పేట ఓఆర్ఆర్ వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న మదన్మోహన్ తన కారులో ఉన్న నగదును భూపాల్‌రెడ్డి వాహనంలో పెట్టారు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు భూపాల్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్‌కు తీసుకొచ్చి విచారించారు. తెల్లారేవరకు అక్కడే ఉంచారు. కీలక ఫైళ్లను స్వా«దీనం చేసుకున్నారు. రూ.16 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లు స్వాదీనం హయత్‌నగర్ పరిధిలోని తట్టిఅన్నారం వద్ద ఇందు అరణ్య విల్లాస్‌లో ఉంటున్న భూపాల్‌రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. రూ.16 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లు స్వా«దీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం మదన్‌మోహన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డిలను ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఐదుగురిని పట్టించిన ముత్యంరెడ్డిగుర్రంగూడకు చెందిన జక్కిడి ముత్యంరెడ్డి గతంలో తుర్కయాంజాల్‌కు చెందిన ఓ వీఆర్వో, మున్సిపల్ పరిధిలోని బిల్ కలెక్టర్‌తో పాటు ఓ ఎస్ఐని కూడా వివిధ కేసుల్లో ఏసీబీకి పట్టించడం గమనార్హం. కాగా ఇప్పుడు ఏకంగా ఓ అదనపు కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్‌ను కూడా పట్టించారు. -
ఏసీబీ వలలో చిక్కిన అవినీతి అధికారులు అరెస్ట్
-
అవినీతి చేస్తే తప్పించుకోలేరు: సీవీ ఆనంద్ హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్: అవినీతికి పాల్పడే అధికారులపై తెలంగాణ ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఎక్స్(ట్విటర్)లో సంచలన ట్వీట్ చేశారు. లంచం తీసుకునే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.ఇందుకు తాజాగా రంగారెడ్డి జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్లను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకోవడమే నిదర్శనమన్నారు. ఈ ఇద్దరిని పట్టుకోవడానికి ఏసీబీ బృందం ఎంతో చాకచక్యంగా పని చేశారు. ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఇద్దరు లంచగొండి అధికారులను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు. ACB traps and arrests MV Bhoopal Reddy, Joint Collector and Senior Assistant Y.Madan Mohan Reddy of Rangareddy district collectorate who colluded and abused their official positions. They were caught redhanded while accepting bribe of Rs 8,00,000 from the complainant for removal… pic.twitter.com/6cN2qastGH— CV Anand IPS (@CVAnandIPS) August 13, 2024 -
అన్యాయంగా నా కొడుకు అరెస్ట్: జోగి రమేష్
-
జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు
-
తెలంగాణ వ్యాప్తంగా హాస్టళ్లలో అక్రమాలపై ఏసీబీ సోదాలు
-
రంగారెడ్డి: రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. రూ.8 లక్షల లంచం తీసుకుంటూ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ దొరికిపోయారు. ఆయన ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌లాల్ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో నిన్న సాయంత్రం నుంచి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.వ్యక్తి ధరణి వెబ్ సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి 14 గుంటల ల్యాండ్‌ను తొలగించాలని సీనియర్ అసిస్టెంట్‌ను బాధితుడు కోరాడు. ఈ పని చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌లాల్ రూ. 8 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఆ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా అధికారులు పట్టుకున్నారు. -
ఏసీబీ వలలో మున్సిపల్ అధికారి.. కళ్ళు చెదిరిపోయేలా నోట్ల కట్టలు
సాక్షి, నిజామాబాద్: అవినీతి అధికారుల గుండెల్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ గుబులు పుట్టిస్తోంది. తాజాగా నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్, రెవెన్యూ అధికారి దాసరి నరేందర్ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సమాచారంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో గుట్టలుగా ఉన్న నోట్ల కట్టల్ని గుర్తించారు. మొత్తం రూ. 6.70 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సోదాల్లో రూ.2కోట్ల 93లక్షల 81వేల నగదు, నరేందర్ బ్యాంకు ఖాతాల్లో రూ. కోటి 10 లక్షల నగదు, అరకిలో బంగారు ఆభరణాలు, 1కోటి 98 లక్షల విలువ చేసే ఆస్తుల్ని సీజ్ చేశారు. మొత్తం 6కోట్ల 7లక్షల విలువగల ఆస్తుల గుర్తించారు. ఆదాయం మించిన ఆస్తుల కేసులో నరేందర్‌పై కేసు నమోదు చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం మున్సిపల్ అధికారి నరేందర్ బంధువుల ఇళ్ళలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. నరేందర్‌ను అరెస్ట్ చేసిన అధికారులు హైదారాబాద్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టేందుకు తరలించారు.ACB Seizes Crores in Cash During Raid on Nizamabad Municipal SuperintendentIn a significant operation by the Anti-Corruption Bureau (ACB), a staggering amount of cash and assets were uncovered during a raid on the residence of Dasari Narendar, the Superintendent and in-charge… pic.twitter.com/oJa4hrfUv7— Sudhakar Udumula (@sudhakarudumula) August 9, 2024 -
Ameenpur: ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్, ధరణి ఆపరేటర్
రాష్ట్రంలో అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఏ శాఖలో చూసినా అవినీతి మరకలు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వేలు, లక్షల్లో జీతాలు అందుతున్నప్పటికీ అడ్డదారులు తొక్కుతూ ప్రజల నుంచి సైతం సొమ్మును జలగల్లా పీలుస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు.అమీన్పూర్ మండల కార్యాలయంలో ధరణి ఆపరేటర్‌గా పనిచేస్తున్న చాకలి అరుణ్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మన్నె సంతోష్ బాధితుడు వెంకటేశం యాదవ్ నుంచి రూ. 30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.బండ్లగూడకు చెందిన వెంకటేశం యాదవ్ వారసత్వం ఆస్తి ఫార్వర్డ్ కోసం సంబంధించిన ఫైలుపై సంతకాలు చేసేందుకు సంప్రదించగా ఉద్యోగులు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తీసుకున్న లంచం డబ్బును ఆపరేటర్ చాకలి అరుణ్‌కుమార్ కారులో దాచుకోగా కారును తనిఖీ చేసి అందులో దాచిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి ఆపరేటర్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు తహసీల్దార్ పి రాధను కూడా విచారించి ఆమె ఇంటిని సోదా చేశామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. -
ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ అధికారి
గన్‌ఫౌండ్రి: ఒక ప్రైవేటు సంస్థకు చెందిన ఆడిట్ పూర్తి చేయడానికి, గతంలో అందించిన నోటీసును మూసి వేయడానికి ఓ వ్యాపారి వద్ద నుండి తెలంగాణ రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ అధికారి రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ సంఘటన బుధవారం అబిడ్స్‌లోని వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..ఉప్పల్‌కు చెందిన శ్రీకాంత్‌కు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను మూడు సంవత్సరాలకు గాను ఆడిట్ చేయించేందుకు పంజగుట్ట సర్కిల్‌కు చెందిన స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అతను పొందుపరిచిన ఫార్మాట్ సరిగ్గా లేదంటూ శ్రీకాంత్‌కు వాణిజ్యపన్నుల శాఖ అధికారి నోటీసులు పంపించారు. అన్ని వివరాలను సరిగ్గానే అందజేశామని ఆ నోటీసులకు శ్రీకాంత్ సమాధానం చెప్పినప్పటికి మీ వివరాలను అసెస్మెంట్ చేయాలంటే రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను రూ.3 లక్షలు ఇవ్వలేనని, రూ.2 లక్షలు ఇస్తానని సదరు అధికారితో శ్రీకాంత్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని శ్రీకాంత్ ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అబిడ్స్‌లోని తన కార్యాలయంలో రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. -
లంచం ఇవ్వలేదని విద్యుత్ సరఫరా నిలిపివేత
ఆత్మకూర్(ఎస్): లంచం ఇవ్వలేదని తన పొలానికి విద్యుత్ లైన్మెన్ కరెంట్ లైన్ కట్ చేశాడని ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన రైతు బొల్లం వీరమల్లు ఆరోపించాడు. కందగట్ల, తిమ్మాపురం గ్రామాల మధ్య గల సోలార్ కంపెనీ సమీపంలో తనకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉందని, ఇటీవల కురిసిన వర్షాలకు తన వ్యవసాయ భూమి వద్ద రెండు విద్యుత్ స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా మారడంతో సరిచేయాలని గ్రామ లైన్మెన్ వెంకటయ్యను కోరినట్లు వీరమల్లు తెలిపాడు. ఈ మేరకు ఈ నెల 14వ తేదీన సిబ్బందితో సహా లైన్మెన్ వెంకటయ్య వచ్చి విద్యుత్ స్తంభాలను సరిచేసి రూ.10వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడని బాధిత రైతు ఆరోపించాడు. అంత ఇవ్వలేనని బతిమిలాడడంతో మరుసటి రోజు ఇవ్వాలని గడువు పెట్టాడని, అప్పటికీ ఇవ్వకపోవడంతో ఈ నెల 15వ తేదీన తన పొలానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో శుక్రవారం ఏఈ గౌతమ్‌కు రాతపూర్వకకంగా ఫిర్యాదు చేసినట్లు వీరమల్లు తెలిపాడు. ఈ విషయమై ఆత్మకూర్(ఎస్) మండల ఏఈ గౌతమ్‌ను వివరణ కోరగా.. విచారణ చేసి లైన్మెన్పై చర్యలు తీసుకుంటానన్నారు. విద్యుత్ సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు ఇవ్వవద్దన్నారు. అవసరమైతే ప్రభుత్వానికి చెల్లించే లావాదేవీలను డీడీల రూపంలో మాత్రమే తీసుకుంటామని వెల్లడించారు. -
తెలంగాణలో గొర్రెల స్కాం.. విచారణలో ఏసీబీ దూకుడు
సాక్షి,హైదరాబాద్ : గొర్రెల స్కాం దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీపై వివరాలు కావాలని తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్యకు లేఖ రాసింది. ఆ లేఖలో లబ్దిదారులు, అమ్మకం దారుడి వివరాలు, బ్యాంక్ అకౌంట్లు, డేటా ఆఫ్ గ్రౌండింగ్,ట్రాన్స్ పోర్ట్, ఇన్ వాయిస్‌లతో కూడా డేటా కావాలని ఆదేశించింది.ఇప్పటికే గొర్రెల స్కాంపై ఈడీ కేసు నమోదు చేసింది. స్కీంకు సంబంధించిన సమగ్ర నివేదిక కావాలని కోరింది. అయితే ఇప్పటివరకు ఈడీకి నివేదిక అందలేదని తెలుస్తోంది.ఈడీ,ఏసీబీ లేఖలతో తలలు పట్టుకోవడం అధికారుల వంతైంది. దర్యాప్తు సంస్థల ఆదేశాలతో అధికారులు గొర్రెల స్కాంకు సంబంధించి వివరాల్ని సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఆయా జిల్లాల వారీగా కలెక్టర్లకు లేఖలు రాస్తున్నారు. రూ.1000 కోట్ల అక్రమాలు జరిగినట్టురాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీలో రూ.1000 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. గొర్రెల పంపిణీలో భాగంగా మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు.. తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ
-
కొల్లగొట్టిన సొమ్ము ఏం చేశారు?
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రాథమిక ఆధారాల మేరకు రూ.700 కోట్ల మేరకు నిధులు దారి మళ్లించినట్టు ఏసీబీ గుర్తించింది. ఇలా కొల్లగొట్టిన కోట్లాది రూపాయల సొమ్మును ఏం చేశారు..? ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు..? మీరే ఈ కుంభకోణానికి తెరతీశారా..? లేదా మీపై ఇంకెవరైనా ఒత్తిడి పెట్టారా...? అంటూ ఏసీబీ అధికారులు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్‌కుమార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీలో భాగంగా అధికారులు ఇద్దరిని మంగళవారం రెండోరోజూ ప్రశ్నించారు. మొదటి రోజు ఇద్దరి నుంచి వేర్వేరుగా సేకరించిన అంశాలపైనా రెండో రోజు మార్చిమార్చి ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. ప్రైవేటు వ్యక్తులను గొర్రెల కొనుగోళ్లలోకి ఎలా తెచ్చారు.. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం వెనుక ఎవరి ఒత్తిడైనా ఉందా..? అని ప్ర శ్నించినట్టు తెలిసింది. ఈ ఇద్దరూ కలిసే ఈ మొత్తం కుంభకోణానికి తెరతీశారా..? ఇంకా ఎవరైనా ఆదేశాలిచ్చారా.. అన్న కోణంలోనూ ప్రశ్నించినట్టు తెలిసింది. బినామీల పేర్లతో చెక్కులు జారీ చేయించిన తర్వాత కొల్లగొట్టిన సొమ్మును అనుకూలుర బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారన్న దానిపైనా అధికారులు సమాచారం సేకరించినట్టు తెలిసింది. బినామీ బ్యాంకు ఖాతాలు, పరారీలో ఉన్న నిందితుల గురించి కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు రాంచందర్, క ల్యాణ్కుమార్ సమాధానాలు దాట వేసినట్టు సమాచారం. విచారణలో వారి నుంచి ఆశించిన సమాచారం రాలేదని, బుధవారం కస్టడీ చివరిరోజు కావడంతో కీలక సమాచారం రాబట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. రాంచందర్ సస్పెన్షన్ అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మే 31న ఏసీబీ రాంచందర్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాంచందర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదర్ సిన్హా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏసీబీ దూకుడు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) గత కొద్ది నెలలుగా దూకుడు పెంచింది. వరుస తనిఖీలు, ఆకస్మిక ‘ఆపరేషన్’లతో ఏసీబీ అధికారులు హల్చల్ చేస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజే వనపర్తి జిల్లా టీజీఎస్పీడీఎల్ ఉద్యోగులు ముగ్గురు, గొర్రెల కుంభకోణంలో ఇద్దరు, కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో సీఐ, ఎస్సై, మరో ప్రైవేటు వ్యక్తి కలిపి ముగ్గురు..గండిపేట్ ఎమ్మార్వో కార్యాలయంలో నలుగురు అధికారులు కలిపి మొత్తంగా 12 మంది అవినీతి అధికారులను కటకటాల వెనక్కి నెట్టారు. ఇక గొర్రెల కుంభకోణం కేసులో పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్‌ను అరెస్టు చేసి కొరడా ఝుళిపిస్తున్నామనే సంకేతాలనిచి్చంది ఏసీబీ. కొద్ది రోజుల ముందు ఆర్టీఏ కార్యాలయాలు, చెక్‌పోస్టులలో ఏకకాలంలో 15 ఏసీబీ అధికారుల బృందాలు 12 ప్రాంతాల్లో సోదాలు చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్లుగా మారు వేషాల్లో వెళ్లి మరీ ఆర్టీఏ చెక్పోస్టులపై సోదాలు చేయడం గమనార్హం. ఆనంద్ రాకతో.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించింది. ఆయన కింది స్థాయి అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో క్షేత్రస్థాయిలోని అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఫలితంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 78 కేసులు నమోదు చేయగా.. గతేడాది(2023)లో మొత్తం కలిపి కేసులు 94 మాత్రమే కావడం గమనార్హం. ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్,పట్టణాభివృద్ధిశాఖతోపాటు పోలీస్‌శాఖలో అవినీతిపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. దీంతో పాటు ఇటీవల ఆర్టీఏ కార్యాలయాలపై మెరుపు దాడులు చేయడంతో అవినీతికి నిలయాలుగా మారినన మిగతా ప్రభుత్వ శాఖలపైనా ఏసీబీ నజర్ ఉన్నట్టుగా తేటతెల్లం అయ్యింది. రాష్ట్రంలో అవినీతికి మూల కేంద్రాలుగా చర్చ జరుగుతోన్న ఎక్సైజ్, రిజి్రస్టేషన్ల శాఖలపై కూడా ఏసీబీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ రెండు శాఖలే టార్గెట్‌గా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినా ఆశ్చర్యపోవక్కర్లేదని తెలుస్తోంది. చిక్కుతున్న అవినీతి తిమింగలాలు.. ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్‌తో ముందుకు వెళుతుండడంతో అవినీతి తిమింగలాలు విలవిలలాడుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే హెచ్ఎండీఏలో పరాకాష్టకు చేరిన అవినీతి బాగోతం బయటకు లాగారు ఏసీబీ అధికారులు. ఆ శాఖలో అవినీతితో వేళ్లూనుకున్న హెచ్ఎండీఏ టౌన్‌ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు అప్పట్లో పెను ప్రకంపనలు సృష్టించింది.. వందల కోట్ల అవినీతి సొమ్మును వెలికి తీయడంతోపాటు వరుస అరెస్టులు ఈ కేసులో జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 19న రూ.84 వేలు లంచం తీసుకుంటుండగా గిరిజన సంక్షేమశాఖ ఇంచార్జి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ (ఎస్ఈ) జగజ్యోతిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సదరు అధికారి ఇంట్లో సోదాల్లో రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైంది. మార్చిలో జరిపిన ఏసీబీ సోదాల్లో మహబూబాబాద్ సబ్ రిజి్రస్టార్ తస్లీమా రూ.19 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నట్టు విశ్వసనీయ సమాచారంతో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్రావు ఇల్లు, బంధువుల ఇళ్లలో చేసిన సోదాల్లో రూ.కోట్ల ఆస్తులతోపాటు, తనతోపాటు అవినీతి భాగస్వాములుగా ఉన్న మరికొందరి పోలీస్ అధికారుల ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించడం సంచలనంగా మారింది.ప్రజలకు మరింత చేరువయ్యేలా ఏసీబీగతంలో ఏసీబీ అధికారులను సంప్రదించేందుకు కేవ లం 1064 టోల్‌ఫ్రీ నంబర్ మాత్రమే అందు బాటులో ఉండేది. ఇటీవల కాలంలో ప్రజలకు మరింత చేరువయ్యేలా ఏసీబీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. 94404 46106 వాట్సప్ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా"www. acb.telangana.gov.in ’వెబ్సైట్లో, ఫేస్బుక్"http//www.facebook.com/ ACBtelangana లో, "https://x.com/ Telangana ACB'sìæÓrt-ÆŠ‡ÌZ, "dg&acb@telangana.gov.in' ఈ–మెయిల్‌లోనూ ఏసీబీ అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. -
వందల కోట్ల గోల్మాల్!
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో రూ.వందల కోట్లు గోల్మాల్ అయినట్టు ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. ఓవైపు కీలక ఆధారాలు సేకరిస్తూ.. మరోవైపు వరుస అరెస్టులతో ఏసీబీ అధికారులు ఈ కేసులో వేగం పెంచారు. తాజాగా శుక్రవారం ఏసీబీ అధికారులు తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్‌కుమార్‌ను అరెస్టు చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కుంభకోణం వెనక కీలక సూత్రధారులుగా ఈ ఇద్దరు వ్యవహరించినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులు గొర్రెల పంపిణీ పథకం అమలు వ్యవహారంలోకి తేవడంలో ఈ ఇద్దరు అధికారులది ముఖ్యపాత్ర అని నిర్ధారణ అయ్యింది. ఇంకా ఎన్ని రూ.కోట్లు మింగారో? తొలుత రూ.2.10 కోట్ల అవినీతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు.. దర్యాప్తులో ఇప్పటి వరకు లభించిన ఆధారాల ప్రకారం రూ.700 కోట్లకుపైనే అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ ఇంకా ఎన్ని రూ.కోట్ల అవినీతి బయటికి వస్తుందోనన్న చర్చ జరుగుతోంది. శుక్రవారం అరెస్టయిన సబావత్ రాంచందర్, కల్యాణ్‌కుమార్‌ను జ్యుడీíÙయల్ కస్టడీకి తరలించారు. వీరిద్దరినీ తిరిగి పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఇద్దరు నిందితులను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది.ఆ ఇద్దరి వెనుక ఎవరైనా ఉన్నారా?కల్యాణ్‌కుమార్, రాంచందర్లే ఈ కుంభకోణానికి పాల్పడ్డారా..? వారి వెనుక ఇంకెవరైనా కీలక వ్యక్తులు ఉన్నారా..? అన్న కోణాల్లోనూ ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు అనుమతితో ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే ఇంకేవైనా కొత్త పేర్లు తెరపైకి వస్తాయా..?అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది. -
ఏసీబీ కస్టడీలో ఏసీపీ
-
రూ.3లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్ఐ
కుషాయిగూడ: భూ వివాదంలో తలదూర్చి.. వక్రమార్గం పట్టిన కుషాయిగూడ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు ఏసీబీ అధికారులకు చిక్కారు. మధ్యవర్తి ద్వారా డబ్బులు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వీరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం కుషాయిగూడ పరిధిలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జోన్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ, చక్రిపురంలోని స్థల సరిహద్దు వివాదంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించాడంటూ కాప్రా డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కుషాయిగూడకు చెందిన సింగిరెడ్డి భరత్‌రెడ్డి అనే వ్యక్తిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. దీనిపై కోర్టు ఆదేశాలతో పోలీసులు అతడికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే కుషాయిగూడకు చెందిన ఎల్.ఉపేందర్ అనే వ్యక్తి ఈ కేసులను కాంప్రమైజ్ చేసేందుకు పోలీసుల తరఫున మధ్యవర్తిత్వం వహించాడు. ఎస్ఐ షేక్ షఫీ ఆదేశాలతో సింగిరెడ్డి భరత్‌రెడ్డిని ఉపేందర్ ఆశ్రయించాడు. రూ.3 లక్షల ఇస్తే కేసులు లేకుండా చూస్తానంటూ భరత్‌రెడ్డికి ఆఫర్ ఇచ్చాడు. తనపై భరత్‌రెడ్డికి నమ్మకం కుదరకపోవడంతో ఉపేందర్ నేరుగా ఎస్ఐ షఫీతో మాట్లాడించాడు. మరి ఇన్స్పెక్టర్ విషయం ఏమిటంటూ భరత్‌రెడ్డి ఎస్ఐని ప్రశ్నించడంతో.. ఇన్స్పెక్టర్ వీరస్వామితోనూ కలిపించి రూ.3 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఒక్క కేసే క్లోజ్ చేస్తామని.. కానీ.. రెండు కేసులూ తప్పించడం సాధ్యం కాదని ఒక కేసు మాత్రమే క్లోజ్ చేస్తామని చెప్పారు. దీంతో సింగిరెడ్డి భరత్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన రంగారెడ్డి జోన్ ఏసీబీ అధికారులు శుక్రవారం ఓ ప్రైవేటు కార్యాలయంలో మధ్యవర్తి ఉపేందర్‌కు ఫిర్యాదుదారు భరత్‌రెడ్డి రూ.3 లక్షల నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షేక్ షఫీలను కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. సుమారు 5 గంటల పాటుగా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగింది. అలాగే గుర్రంగూడలోని ఇన్స్పెక్టర్ వీరస్వామి, దమ్మాయిగూడలోని ఎస్ఐ షఫీ ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తమకు లభించిన పక్కా సాంకేతిక ఆధారాలతో ఇన్స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షఫీ, మధ్యవర్తి ఎల్.ఉపేందర్‌లపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.