సాక్షి, హనుమకొండ జిల్లా: డీటీసీ పుప్పాల శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదులతో బీమారంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హనుమకొండలో అద్దె ఇంటితో పాటు, హైదరాబాద్, జగిత్యాలలోని బంధువుల ఇళ్లలోను ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.
ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్ట్ అధికారిగా పనిచేసిన పుప్పాల శ్రీనివాస్ గతేడాది ఫిబ్రవరిలో వరంగల్ జిల్లాకు బదిలీపై వచ్చారు. అయితే ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment