Searches
-
హనుమకొండ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు
సాక్షి, హనుమకొండ జిల్లా: డీటీసీ పుప్పాల శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదులతో బీమారంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హనుమకొండలో అద్దె ఇంటితో పాటు, హైదరాబాద్, జగిత్యాలలోని బంధువుల ఇళ్లలోను ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ అధికారిగా పనిచేసిన పుప్పాల శ్రీనివాస్ గతేడాది ఫిబ్రవరిలో వరంగల్ జిల్లాకు బదిలీపై వచ్చారు. అయితే ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. -
దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. ఉగ్ర కుట్ర కేసుకు సంబంధించి 22 చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. యూపీ, అస్సాం, జమ్మూకశ్మీర్, ఢిల్లీ, మహారాష్ట్రలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.కాగా, గత నెలలో చైన్నెతో పాటు రాష్ట్రంలో 12 చోట్ల ఎన్ఐఏ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. సెల్ఫోన్లను, లెక్కలోకి రాని నగదును సీజ్ చేశారు. ఇస్ బత్ తహీర్ పేరిట ఉన్న నిషేధిత తీవ్ర వాద సంస్థకు తమిళనాట యూట్యూబ్ ద్వారా ప్రచారం జరుగుతున్నట్టు ఇటీవల చైన్నె పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. ఈ సంస్థకు మద్దతుగా సాగుతూ వస్తున్న వీడియో ప్రచారాలు, వాటికి లైక్‌లు కొట్టే వారిని టార్గెట్ చేస్తూ తరచూ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే తంజావూరు, తూత్తుకుడి, తిరుచ్చి,మైలాడుతురై జిల్లాలో విస్తృతంగా సోదాలు జరిగాయి.ఇదీ చదవండి: కుప్వారాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం -
మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు.. ఏకకాలంలో 16 చోట్ల తనిఖీలు చేపట్టాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పొంగులేటి నివాసం, ఆయన వ్యాపార సంస్థల కార్యాలయాల్లో ఈడీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఆయన అనుచరులకు సంబంధించిన నివాసాలు, ఆఫీసుల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. కస్టమ్స్ డ్యూటీ ఎగవేత కేసులో నేపథ్యంతోనే ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ రైడ్స్‌కు సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. -
‘ఓఎం’ గ్రూప్ చారిటీ సంస్థలో ఈడీ సోదాలు..
సాక్షి, హైదరాబాద్: దళిత, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్య, భోజన వసతి కల్పన పేరిట విదేశాల నుంచి కోట్ల రూపాయల విరాళాలు సేకరించి వాటి ద్వారా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆపరేషన్ మొబిలైజేషన్ (ఓఎం) సంస్థలో సోదాలు నిర్వహించారు. ఈనెల 21, 22 తేదీల్లో హైదరాబాద్, ఇతర 11 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో పలు కీలక పత్రాలు, డిజిటల్ డివైజ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఆపరేషన్ మొబిలైజేషన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ సంస్థ.. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, డెన్మార్క్, జర్మనీ, ఫిన్లాండ్, ఐర్లండ్, మలేసియా, నార్వే, బ్రెజిల్, చెక్ రిపబ్లిక్, ఫ్రాన్స్, రుమేనియా, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్ దేశాల్లోని దాతల నుంచి దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్ ద్వారా రూ.300 కోట్ల మేర నిధులు వసూలు చేయడంపై తెలంగాణ సీఐడీ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఓఎం సంస్థ వంద పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత విద్య, భోజన వసతి కల్పిస్తున్నామంటూ విరాళాల రూపంలో వసూలు చేసిన డబ్బులను ఆస్తులను కూడబెట్టేందుకు, ఇతర అనధికార పనులకు వాడినట్టు అధికారులు గుర్తించారు. ఉచిత విద్య, ట్యూషన్ ఫీజుల పేరిట నెలకు ఒక్కో విద్యార్థికి రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు ఓఎం సంస్థ వసూలు చేసినట్టు సీఐడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ సొమ్మును సదరు సంస్థ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర ఆస్తుల కొనుగోలుకు వినియోగించినట్టు వెల్లడైంది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద వసూలు చేసిన నిధులకు సంబంధించి సైతం సరైన రికార్డులు లేవని తేలింది. ఈ అక్రమాలన్నింటిపైనా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఆస్తుల కొనుగోలు..ఈడీ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఓఎం గ్రూప్ ఆఫ్ చారిటీస్ పేరిట విదేశాల నుంచి సేకరించిన సొమ్ముతో సంస్థల్లోని కీలక ఆఫీస్ బేరర్స్ పేరిట తెలంగాణ, గోవా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.ఓఎం గ్రూపు సంస్థలకు సంబంధించిన ఎఫ్ఆర్సీఏ (ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) రిజిస్ట్రేషన్లు సైతం రెన్యువల్ చేయలేదని, ఓఎం బుక్స్ ఫౌండేషన్ సంస్థ పేరిట సేకరించిన విదేశీ విరాళాలు ఇతర సంస్థలకు రుణాలు ఇచ్చినట్టుగా చూపి దారి మళ్లించినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. ఓఎం సంస్థలకు చెందిన ఆఫీస్ బేరర్స్ గోవాలో పలు డొల్ల కంపెనీలను సృష్టించి వాటిలో వారంతా ఉద్యోగులుగా చూపి, వేతనాల రూపంలోనూ డబ్బులు దండుకున్నట్టు తేలింది. కేసు దర్యాప్తులో భాగంగా ఓఎం గ్రూప్ సంస్థ కీలక సిబ్బంది ఇళ్లు, కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో బినామీ కంపెనీలకు సంబంధించిన పలు పత్రాలు, అనుమానాస్పద లావాదేవీల వివరాలు, డిజిటల్ డివైజ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు వారు వెల్లడించారు. -
రాయదుర్గంలో ఎన్ఐఏ దాడుల కలకలం
సాక్షి, అనంతపురం: రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి. సోహైల్ అనే ప్రైవేట్ ఉద్యోగిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాగుల బావి వీధిలో రిటైర్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.అబ్దుల్ తనయుడు సోహైల్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ.. ఉగ్రవాదులతో లింకులపై ఆరా తీస్తోంది. అబ్దుల్ ఇద్దరు కుమారులు బెంగళూరులో నివాసముంటున్నారు. గత కొంతకాలంగా వారిద్దరూ కనిపించకపోవడంతో ఎన్ఐఎ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో దాడుల కలకలం.. ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అశోక్‌నగర్‌లో ఆయన ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ఇంటితో పాటు ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలో ఆరు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలపై ఏసీబీ అధికారులు దాడులు జరుపుతున్నారు. సాహితీ ఇన్ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు.ఇబ్రహీంపట్నం రియల్ మర్డర్ కేసులో ఉమా మహేశ్వరరావు సస్పెండయిన సంగతి తెలిసిందే. డబుల్ మార్డర్ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడని ఉమామహేశ్వరరావుపై అభియోగాలు ఉన్నాయి. -
పెరూ అధ్యక్షురాలి ఇంట్లో ‘రోలెక్స్’ల కోసం సోదాలు!
లీమా: రోలెక్స్ గేట్ వ్యవహారం పెరూను కుదిపేస్తోంది. అధ్యక్షురాలు డినా బొలార్టీ వద్ద 10కి పైగా అతి ఖరీదైన లెక్స్ గడియారాలున్నాయన్న ఆరోపణలపై దర్యాప్తు మొదలైంది. వాటికోసం కోర్టు ఆదేశాలతో లిమాలోని ఆమె నివాసంలో పోలీసులు సోదా లు నిర్వహించారు! సోదాలను టీవీ చానల్లో ప్రసారం చేశారు. వాచ్‌లు దొరికాయో లేదో వెల్లడించలేదు. తనవద్ద 18 ఏళ్ల వయసులో సొంత డబ్బులతో కొనుక్కున్న ఒకే రోలెక్స్ ఉందని డినా అంటున్నారు. -
కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆమె ఇంట్లో సోదాల సందర్భంగా లభించిన ఆధారాల మేరకు శనివారం హైదరాబాద్‌లో మరోమారు తనిఖీలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి ఏడుగురు అధికారులతో కూడిన ఈడీ బృందం మాదాపూర్ డీఎస్ఆర్ అపార్ట్మెంట్స్లోని కవిత ఆడపడుచు అఖిల ఫ్లాట్‌తోపాటు ఇతర బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించింది. ఈ సోదాల్లో కవిత ఆడపడుచు అఖిల అల్లుడు మేక శరణ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. కవిత అరెస్టు సందర్భంగా హైదరాబాద్‌లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టిన సమయంలోనూ కవిత భర్త అనిల్‌తోపాటు శరణ్ సైతం అక్కడే ఉన్నారు. సోదాల సమయంలో ఈడీ అధికారులు కవిత, ఆమె భర్త అనిల్, శరణ్తోపాటు కవిత పీఏలు రాజేశ్, రోహిత్‌రావు ఇతరుల ఫోన్లను సీజ్ చేశారు. శరణ్ తీరుపై అనుమానాలు ఉండటంతో ఫోన్లను తనిఖీ చేయగా స్కాంకు సంబంధించిన పలు ఆర్థిక లావాదేవీల అంశాలు బయటపడ్డట్లు సమాచారం. తమ కస్టడీలో కవిత నుంచి సేకరించిన సమాచారం.. గతంలో ఫోన్లలో వెలుగు చూసిన అంశాలను ఆధారంగా చేసుకొనే ఈడీ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. లిక్కర్ పాలసీ కుంభకోణంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు ఈడీ అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. ప్రధానంగా గోవా, పంజాబ్ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి హైదరాబాద్ నుంచే రూ. కోట్లు సమకూరినట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసులో సౌత్ గ్రూప్‌లో కీలకంగా వ్యవహరించిన వారిపై ఈడీ అధికారులు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆమె నుంచి సేకరిస్తున్న సమాచారంతో మరికొందరి పాత్రను బయటకు తెస్తున్నారు. ఆర్థిక లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన షెల్ కంపెనీలన్నీ కవిత ఆడపడుచు కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా ఆరా తీస్తే కొత్త కోణాలు వెలుగు చూస్తాయని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి: కవిత తనపై అక్రమ కేసులు పెట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రౌస్ అవెన్యూ కోర్టులోకి వెళ్లే క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈడీ విచారణలో అడిగిన ప్రశ్నలనే పదేపదే అడుగుతున్నారని చెప్పారు. ఏడాది కాలంగా అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులను అరెస్టు చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. తన అరెస్టుపై న్యాయస్థానాల్లో పోరాడతానని కవిత పేర్కొన్నారు. -
820 కోట్ల స్కామ్! 67 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: ఐఎంపీఎస్ లావాదేవీల ముసుగులో జరిగిన భారీ కుంభకోణాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించింది. దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో తాజాగా సీబీఐ సోదాలు నిర్వహించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యూకో బ్యాంక్‌లో జరిగిన భారీ కుంభకోణంలో కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ గురువారం పలుచోట్ల తనిఖీలు చేపట్టింది. రాజస్థాన్, మహారాష్ట్రలోని ఏడు నగరాల్లో 67 చోట్ల సోదాలు జరుపుతోంది. యూకో బ్యాంక్‌లోని వివిధ ఖాతాల్లో సుమారు 820 కోట్ల అనుమానాస్పద ఐఎంపీఎస్ లావాదేవీలకు సంబంధించిన కేసులో సీబీఐ ఈ దాడులు చేస్తోంది. వివిధ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ అయిన సొమ్మును మళ్లీ వెనక్కి తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఈ సోదాల్లో భాగంగా యూకో బ్యాంక్, ఐడీఎఫ్సీకి చెందిన 130 పత్రాలను అధికారులు సీజ్ చేశారు. అలాగే మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. 30 మంది అనుమానితులను కూడా విచారించినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు పేర్కొన్నారు. కాగా గత ఏడాది నవంబర్ 10 నుంచి13 మధ్య ఏడు ప్రైవేట్ బ్యాంకులకు చెందిన 14,600 ఖాతాల నుంచి తమ బ్యాంక్‌కు చెందిన 41,000 ఖాతాలలో ఐఎంపీఎస్ అంతర్గత లావాదేవీలు తప్పుగా జరిగినట్లు గుర్తించిన యూకో.. సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా నవంబర్ 21న కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. దీని ఫలితంగా బదిలీ చేసిన బ్యాంక్ ఖాతాల నుంచి డెబిట్ కాకుండానే యూకో బ్యాంక్ ఖాతాల్లో రూ. 820 కోట్లు జమ అయ్యాయి. దీంతో డబ్బులు పడ్డాయని తెలిసిన చాలా మంది ఖాతాదారులు వారి ఖాతాలలోని ఆకస్మిక మొత్తాన్ని విత్‌డ్రా కూడా చేసుకున్నారు. ఇక 2023 డిసెంబర్‌లోనూ కోల్‌కతా, మంగళూరులోని యూకో బ్యాంక్ అధికారులకు చెందిన 13 ప్రదేశాలలో సీబీఐ సోదాలు జరిపింది. చదవండి: సవాల్ విసిరితే.. దేనికైనా సిద్ధమే: రాజ్‌నాథ్ సింగ్ -
Delhi: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు
న్యూఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు జరుపుతోంది. తమిళనాడు, కర్ణాటక సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 17 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తోంది. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును సోమవారమే ఎన్ఐఏకు దర్యాప్తు నిమిత్తం అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్ఐఏ చేస్తున్న సోదాలు లష్కరే ఉగ్రవాది బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఖైదీలకు ఉగ్రవాద భావజాలం నూరిపోస్తున్న కేసులో జరుగుతున్నట్లు సమాచారం. పరప్పన జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నజీర్ ఉగ్రవాద బోధనలు చేస్తున్నట్లు 2023లో బెంగళూరులో పట్టుబడిన ఐదుగురు ఉగ్రవాదుల ద్వారా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఇదీ చదవండి.. మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ నేత దారుణ హత్య -
HYD: డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు.. 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు
సాక్షి, హై దరాబాద్: నగరంలోని పలు బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. నిబంధనలు పాటించని 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. ప్లేట్లెట్స్, ప్లాస్మా నిల్వ, రక్త సేకరణ పరీక్షల్లో లోపాలున్నట్లు గుర్తించింది. మలక్‌పేట, చైతన్యపురి, లక్డీకపూల్, హిమయాత్ నగర్,సికింద్రాబాద్, కోఠి, మెహదీపట్నం, బాలానగర్, ఉప్పల్ ప్రాంతాల్లోని బ్లడ్ బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహించారు. కాగా, సాధారణ తనిఖీల్లో భాగంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఫిబ్రవరి 2న మూసాపేటలోని హీమో సరీ్వసెస్ లాబోరేటరీలో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సామర్థ్యానికి మించి నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. నిర్వాహకుడు ఆర్ రాఘవేంద్రనాయక్ అక్రమంగా ప్లాస్మాను నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. శ్రీకర, న్యూలైఫ్ బ్లడ్ బ్యాంకుల నుంచి హోల్ బ్లడ్‌ను సేకరించి, ప్లాస్మాను వేరు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ అక్రమాల్లో భాగస్వామిగా ఉన్న మియాపూర్‌లోని శ్రీకర ఆస్పత్రి బ్లడ్ బ్యాంకు సహా, దారుషిఫాలోని న్యూలైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ బ్యాంకు కూడా ఉంది. ఈ రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గ్రేటర్లో ఐపీఎం సహా 76 ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీఓ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు ప్రముఖుల బర్త్‌డేల పేరుతో ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ కంపెనీల్లో తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఆపదలో ఉన్న రోగులను కాపాడాలనే ఉద్దేశంతో చాలా మంది తమ రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు వస్తుంటారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్రాసెస్ చేసి, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రోగుల కు అందజేయాల్సి ఉంది. కానీ నగరంలోని పలు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం రక్తాన్ని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్‌జే కేన్సర్ సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా అందజేయాలనే నిబంధన ఉంది. దీనిని నగరంలోని పలు బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. -
నకిలీ పాస్‌పోర్ట్‌ల ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్, సాక్షిప్రతినిధి, కరీంనగర్: నివాస ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు ఇలా అన్నింటినీ నకిలీవి సృష్టించి విదేశీయులకు స్థానికంగా పాస్‌పోర్టులు జారీ చేయిస్తున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు తెలంగాణ సీఐడీ పోలీసులు. ఈ మొత్తం ముఠాలో కీలక నిందితుడు అబ్దుస్ సత్తార్ ఉస్మాన్ అల్ జహ్వరీతో పాటు నకిలీ పాస్ పోర్టుల జారీకి పనిచేస్తున్న తొమ్మిది మంది ముఠా సభ్యులు, వీరికి సహకరిస్తున్న ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులు.. మొత్తం 12మందిని శుక్రవారం అరెస్టు చేశారు. విదేశాల నుంచి వచ్చిన శరణార్థులు, అక్రమ చొరబాటు దారులకు నిబంధనలకు విరుద్ధంగా పాస్‌పోర్టులు జారీ అవుతున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ సీఐడీ రంగంలోకి దిగింది. హైదరాబాద్, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో సీఐడీ అధికారుల 12 ప్రత్యేక బృందాలు ఈనెల 18న ఏక కాలంలో సోదాలు జరిపాయి. ఈ సోదాల్లో 108 పాస్‌పోర్టులు, 15 మొబైల్ ఫోన్లు, ఐదు ల్యాప్‌టాప్‌లు, మూడు ప్రింటర్లు, 11 పెన్‌డ్రైవ్‌లు, ఒక స్కానర్, పాస్‌పోర్టు దరఖాస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐడీ ఎకనమిక్ అఫెన్స్ వింగ్ ఎస్పీ కే వెంకట లక్ష్మి నేతృత్వంలో చేపట్టిన ఈ ఆపరేషన్ వివరాలను సీఐడీ అడిషనల్ డీజీ శిఖాగోయల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నకిలీ పత్రాల తయారీ నుంచి పాస్‌పోర్టుల వరకు హైదరాబాద్‌కు చెందిన అబ్దుస్ సత్తార్ స్థానికంగా గ్రాఫిక్ డిజైనింగ్, ప్రింటింగ్ వర్క్‌లో పనిచేసేవాడు. 2011నుంచి ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్, డిగ్రీ సర్టిఫికెట్లు, జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించడం ప్రారంభించాడు. చెన్నైకి చెందిన ఓ పాస్‌పోర్టు బ్రోకర్‌తో టచ్‌లోకి వెళ్లిన సత్తార్..రూ.75 వేల కమీషన్‌కు ఒక్కో పాస్‌పోర్టు జారీ చేసేలా.. ఇందుకు అవసరమైన నకిలీ పత్రాలు కూడా సృష్టించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా నకిలీ ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన తర్వాత సత్తార్ హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని పాస్‌పోర్టు కార్యాలయాల్లో స్లాట్లు బుక్ చేయించి ఇక్కడి నుంచి పాస్‌పోర్టులు జారీ చేయించేవాడు. పోలీస్ వెరిఫికేషన్‌కు వచ్చే స్పెషల్ బ్రాంచ్ అధికారులకు సైతం లంచాలు ఇస్తూ ఈ దందా కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు కీలక నిందితులతోపాటు ఈ ముఠాలో చెన్నై ఏజెంట్‌ను సైతం బెంగళూరులో అరెస్టు చేసి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ ముఠా నుంచి పాస్‌పోర్టులు పొందిన వారిలో 92 మంది విదేశీ ప్రయాణాలు చేసినట్టు సీఐడీ అధికారుల దర్యాప్తులో తెలిసింది. మొత్తం 12 మంది నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు వారు పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు లంచాల ఎర! నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణంలో సీఐడీ అధికారులు తవ్విన కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ఈ ముఠా.. కేవలం నకిలీ పత్రాలతో పాస్‌పోర్టులను సంపాదించడమే కాకుండా.. విదేశీయులు, దేశంలోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు కూడా భారతీయత ఉండేలా తప్పుడు ఐడీలు సృష్టించి, పాస్‌పోర్టులు, వీసాలు ఇప్పించి సాగనంపారని తెలుస్తోంది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సైతం లంచాలిచ్చి భారతీయులు కాని వారికి సైతం ఇక్కడి జనన, విద్యార్హత, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఇప్పించి విదేశాలకు విమానాలెక్కించారని విచారణలో తెలిసింది. చాలా పాస్‌పోర్టులకు ఒకే ఆధార్ కార్డు ఉండటం, కస్టమర్లందరికీ ఏజెంట్లు తమ ఫోన్నెంబరునే అటాచ్ చేసి ఉంచడంతో అనుమానం వచ్చిన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు చేపట్టడంతో ముఠా గుట్టు బయటపడింది. అరెస్టు అయింది వీరే! అబ్దుస్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరీ నాంపల్లి.. హైదరాబాద్, మహ్మద్ ఖమ్రుద్దీన్ కోరుట్ల, చాంద్ ఖాన్ కోరుట్ల, దేశోపంతుల అశోక్ రావు కోరుట్ల, పెద్దూరి శ్రీనివాస్ తిమ్మాపూర్.. కరీంనగర్, గుండేటి ప్రభాకర్ జగిత్యాల, పోచంపల్లి దేవరాజ్ వేములవాడ, చెప్పాల సుభాష్ భీంగల్.. నిజామాబాద్, అబ్దుల్ షుకూర్ రాయికల్.. జగిత్యాల, సయ్యద్ హాజీ (కాలాపత్తర్) తోపాటు వీరికి సహకరించిన మరో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులు అరెస్టయ్యారు. -
మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్ వైపే అందరి చూపు!
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్షద్వీప్‌లో పర్యటించడం వల్ల అక్కడి దీవుల్లో పర్యాటకానికి ఊతం లభించిందని మేక్మైట్రిప్ సంస్థ పేర్కొంది. లక్షద్వీప్ టూర్ కోసం తమ ఆన్-ప్లాట్‌ఫారమ్ సెర్చ్‌లో 3,400 శాతం పెరిగిందని తెలిపింది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల రాజకీయ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వివాదం చెలరేగిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత్-మాల్దీవుల మధ్య వివాదం చెలరేగడంతో మాల్దీవులకు విమానాల బుకింగ్‌లను నిలిపివేసినట్లు భారతీయ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ అయిన EaseMyTrip ఇప్పటికే ప్రకటించింది. మన దేశానికి సంఘీభావంగా నిర్ణయం తీసుకున్నామని EaseMyTrip వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. మాల్దీవుల పర్యాటకంపై ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. బైకాట్ మాల్దీవులు అంటూ నినాదాలు విస్తృతంగా వ్యాప్తి చేశారు. ఈ వివాదంపై ఇరుదేశాలు ఇప్పటికే హైకమిషనర్లకు సమన్లు జారీ చేశారు. ఇదీ చదవండి: లక్షద్వీప్‌తో మాల్దీవులకు సమస్య ఏంటి?.. స్థానిక ఎంపీ ఫైర్ -
రూ.300 కోట్లు డంప్ చేశారు
బంజారాహిల్స్: విశ్రాంత ఐఏఎస్, మాజీ ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్ ఇంట్లో ఎన్నికల అధికారులు సోదాలు జరిపారు. ఎన్నికల కోసం ఏకే గోయల్ ఇంట్లో సుమారు 300 కోట్ల రూపాయల డంప్ ఉందని దీనిపై విచారణ జరపాలంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఎన్నికల కమిషన్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు జూబ్లీహిల్స్‌లోని గోయ ల్ ఇంట్లో సోదాలు జరిపారు. ఐదుగురు అధికారుల బృందం లోపలికి వెళ్లగా జూబ్లీహిల్స్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా సమాచారం అందుకున్న మల్లు రవితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గోయల్ నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్‌కు చెందిన వాహనాలతోపాటు టాస్‌్కఫోర్స్ సిబ్బంది ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌కు చెందిన ఓ మహిళా ఉద్యోగిని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారించారు. అయినప్పటికీ కార్యకర్తలు వినిపించుకోకపోవడంతో స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఈ తోపులాటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రకాశ్, జ్ఞానేశ్వర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అజారుద్దీన్ అండ్ కో ధర్నా పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో జూబ్లీహిల్స్ నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, సీ నియర్ కాంగ్రెస్ నాయకుడు భవాని శంకర్ తదితరులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విచక్షణా రహితంగా లాఠీచార్జ్ చేసి న పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధర్నా చేశా రు. దీంతో జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల క్రితమే సమాచారం: మల్లు రవి గోయల్ ఇంట్లో నుండి డబ్బులు తరలిస్తున్నట్టు రెండు రోజుల క్రితమే తమకు సమాచారం అందిందని మల్లు రవి తెలిపారు. ఈ వ్యవహారంపై నిఘా పెట్టి నిర్ధారించుకున్న అనంతరం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎన్నికల అధికారులు ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చాక కొన్ని వాహనాలు బయటికి వెళ్లడంపై తమకు అనుమానాలు ఉన్నాయని ఈ విషయంపై ప్రశ్నించినందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారని ఆరోపించారు. సోదాలు రాత్రి పొద్దు పోయేవరకు సాగాయి. పశ్చిమ మండలం అడిషనల్ డీసీపీ హనుమంతరావు, జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్, బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ సుబ్బయ్య ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, మంచిర్యాల: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్, మంచిర్యాలలోని వివేక్ ఇళ్లలో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. వివేక్ ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన కంపెనీలు, అతని ముఖ్య అనుచరులు, బంధువుల ఇళ్లలోనూ ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల వివేక్‌కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్విసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాలోకి బదిలీ అయిన రూ.8 కోట్లు సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. సోమాజీగూడలోని వివేక్ నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. నాలుగున్నర గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 13న ఫ్రీజ్ చేసిన నగదుపై ఐటీ అధికారులు ఆరా తీశారు. కాగా, మంచిర్యాలోని వివేక్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. చదవండి: తనిఖీల జప్తులో తెలంగాణ టాప్.. ఏకంగా 659 కోట్ల స్వాధీనం -
సీఎం కేసీఆర్ బస్సులో తనిఖీలు..
సాక్షి,కొత్తగూడెం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరిగేందుకు ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎంతటివారి వాహనాన్ని అయినా అధికారులు ఆపి చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభ కోసం వచ్చిన సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతిపథం వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఇటీవలే మంత్రి కేటీఆర్‌తో పాటు హోం మంత్రి మహమూద్ అలీల వాహనాలను కూడా ఎన్నికల అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం వాహనం తనఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏదైనా సమాచారం మేరకు సీఎం బస్సును తనిఖీ చేశారా రొటీన్ చెకింగ్‌లో భాగంగా చేశారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
సామాన్యుడి సమయం... సోదాహరణం
ఎన్నికల్లో డబ్బు, మద్యం తదితర ప్రలోభాలను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం చేస్తున్న సోదాలు, హడావుడి ఈ సందర్భంగా ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లు సాధారణ ప్రజలు, చిరు వ్యాపారులకు తీవ్రమైన చికాకు తెప్పిస్తున్నాయి. ఎన్నికల్లో డబ్బు రవాణా, పంపిణీని నిలువరించేందుకు పటిష్టమైన ఇంటెలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడే బదులు.. అడుగడుగునా ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ల వద్ద రోజూ సాధారణ జనం నుంచి సైతం నిత్యం నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇంతా చేస్తే.. ఈ తతంగమంతా వృథా ప్రయాసగానే మారుతోందని, చాలావరకు కేసుల్లో అసలు దోషుల్ని గుర్తించడం లేదని, కొన్ని కేసులు విచారణకు సైతం నోచుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 90% డబ్బులు వెనక్కే.. గడిచిన రెండు సాధారణ ఎన్నికల్లోనూ భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన ఎన్నికల యంత్రాంగం.. ఎన్నికల అనంతరం నూటికి 96 శాతం తిరిగి సంబంధిత వ్యక్తులకు అప్పగించేశారు. ప్రస్తుతం కూడా వివిధ చెక్‌పోస్టుల్లో స్వాదీనం చేసుకుంటున్న కేసుల్లో 90 శాతం డబ్బును జిల్లా స్థాయి కమిటీలే తిరిగి సంబంధిత వ్యక్తులకు అందజేస్తున్నా..ఈ సందర్భంగా చిన్నా చితక వ్యాపారులు, సాధారణ జనాన్ని రోజుల తరబడి జిల్లా కలెక్టరేట్ల చుట్టూ తిప్పుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల్లో ప్రలోభాల కోసం రాజకీయ పక్షాలు అత్యధికంగా హవాలా, ప్రైవేటు బ్యాంకులు, విద్యా సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థల నుండి భారీగా రవాణా చేస్తున్నా..అలాంటి వాటిని వదిలి పోలీసులు సాధారణ జనం మీద పడుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక సాధారణ ట్రాఫిక్ సాఫీగా ముందుకు సాగిపోయే వీల్లేకుండా రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనే విమర్శలు కూడా విన్పిస్తున్నాయి. పన్ను కట్టించుకుని వదిలేస్తున్న ఐటీ 2014–2018 సాధారణ ఎన్నికల సందర్భంలోనూ స్వా«దీనం చేసుకున్న డబ్బు – శిక్షలు తదితర అంశాలపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ఆర్ఐటీ ద్వారా సమాచారం సేకరించగా, పది లక్షల లోపు అయితే జిల్లా అధికారులు, పది లక్షలు దాటితే ఐటీ అధికారులు పరిశీలించారు. ఐటీకి సంబంధించి ఒక వేళ పన్ను కట్టకపోతే పన్ను కట్టించుకుని, మరికొన్ని కేసుల్లో అడ్వాన్స్ పన్ను కట్టించుకుని ఆ మొత్తాలను తిరిగి ఇచ్చేసినట్లు తేలింది.హవాలా ద్వారా భారీ ఎత్తున వెళుతున్న డబ్బును స్వాధీనం చేసుకున్న మెజారిటీ కేసుల్లో ఇంకా న్యాయ విచారణలే మొదలు పెట్టకపోవటంతో ఒక్కరికీ శిక్ష పడలేదు. అడ్వాన్స్ ట్యాక్స్‌లు.. సాగని విచారణలు ♦ 2018 ఎన్నికల్లో జనగామ వద్ద రూ.5.8 కోట్లతో వెళుతున్న కంటెయినర్‌ను పట్టుకున్న పోలీసులు కేసు నమోదు (576–2018) చేసి కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో తీవ్ర అభియోగాలు నమోదు చేసినా.విచారణ ముందుకు సాగలేదు. ♦ ములుగు పరిధిలో పట్టుకున్న రూ.19.95 లక్షల కేసులోనూ రాజకీయ పార్టీ కి సంబంధించిన ఆధారాలున్నా ఆ దిశగా విచారణ ముందుకు సాగటం లేదు. ♦ 2104 ఎన్నిక సమయంలో బేగంబజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విశ్వాస్‌కుమార్ అనే వ్యక్తి నుండి స్వాదీనం చేసుకున్న రూ.8.38 లక్షల డబ్బును ఐటీ విభాగానికి అప్పగించగా, అందులోనుండి రూ.3.38 లక్షలు అడ్వాన్స్‌ట్యాక్స్‌గా కట్టించుకుని మిగిలిన డబ్బును తిరిగి అప్పగించారు. ♦ 2018లో కొడంగల్ నియోజకవర్గం మిర్జాపూర్‌లో రూ.17.5 కోట్ల నగదు ఉందని సమాచారం వస్తే ఐటీ అధికారులు దాడి చేసి నగదు స్వాదీనం చేసుకున్నారు. తీరా రూ.51 లక్షలు మాత్రమే స్వాదీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. ♦ 2018లో పోలీసులు రూ.79.23 లక్షలు (500 డినామినేషన్) స్వాదీనం చేసుకుని కేసు నమోదు (190–2018) చేశారు. ఎన్నికలయ్యాక..అందులో రూ.23,000 మాత్రమే ఒరిజినల్ నోట్లుగా తేల్చి మిగిలినవి నకిలీగా పేర్కొన్నారు. రాజకీయ లింకులు పరిశీలించాలి ఎన్నికల సమయంలో యంత్రాంగం స్వాధీనం చేసుకునే మొత్తం రూ.10 లక్షల లోపు అయితే జిల్లా కమిటీకి, రూ.10 లక్షలు దాటితే ఆదాయపు పన్ను శాఖకు పంపుతున్నారు. కాగా జిల్లా స్థాయి కమిటీలు తగు రశీదులు సమర్పిస్తే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తున్నాయి. అలా కాకుండా ప్రతి వ్యక్తి వెనుక రాజకీయ లింకులను లోతుగా పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐటీకి వెళ్లిన డబ్బు విషయంలో కూడా రవాణా చేస్తున్న వ్యక్తుల వివరాలు, ఇతరత్రా లోతుల్లోకి వెళ్లకుండా..కేవలం నల్లధనమా లేక తెల్లధనమా అనేది చూస్తున్నారు. ఒక వేళ నల్లధనమైతే పన్ను కట్టించుకుని వదిలేస్తున్నారు. డబ్బును తీసుకువెళుతున్న కారణాన్ని విశ్లేషించి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇక భారీ మొత్తాలు దొరికిన సమయాల్లో రాజకీయ పార్టీ ల కార్యకర్తలు, వారు నియమించిన కూలీలు దొరికిన సందర్భాల్లో లోతైన విచారణలు చేయాలి. అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇన్వాల్వ్ చేయాలని సూచిస్తున్నారు. -
ప్రొద్దుటూరులో 300 కిలోల బంగారం సీజ్
ప్రొద్దుటూరు క్రైం: బంగారం వ్యాపారానికి ప్రసిద్ధి గాంచిన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారులు సోదాలు జరిపి సుమారు 300 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. బంగారు నగలతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని రెండు వాహనాల్లో తిరుపతికి తరలించారు. ప్రొద్దుటూరులోని నాలుగు బంగారం దుకాణాల్లో ఈ నెల 19 నుంచి ఆదాయపన్నుశాఖ అధికారులు జరిపిన తనిఖీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. అధికారులు బంగారం దుకాణాలతో పాటు యజమానులు, వారి బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఒక దుకాణంలో సుమారు 200 కిలోలు, మరో రెండు దుకాణాల్లో 100 కిలోల వరకు లెక్కలు చూపని బంగారం లభించడంతో దాన్ని సీజ్ చేశారు. కాగా ఐటీ అధికారులు ఈ వివరాలను అధికారికంగా ధ్రువీకరించలేదు. పండుగ సమయంలో స్తంభించిన వ్యాపారం కొనుగోలుదారులకు బిల్లులు ఇవ్వకుండా బంగారు నగలు విక్రయించడంతో పాటు అక్రమంగా బంగారం దిగుమతి చేసుకుంటున్నారని ఫిర్యాదులు వెల్లటంతో ప్రొద్దుటూరులోని నాలుగు బంగారం దుకాణాల్లో ఈ నెల 19న సుమారు 40 మంది ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్దమొత్తంలో లెక్కలు లేని బంగారం లభించడంతో పట్టణంలోని బంగారం దుకాణాల్లో జీరో వ్యాపారం జరుగుతోందన్న విషయం బయటపడిందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలా సుదీర్ఘంగా సోదాలు జరగలేదని వ్యాపారులు పేర్కొన్నారు. వేలాది బంగారం దుకాణాలున్న ప్రొద్దుటూరులో ఐటీ అధికారుల దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా వ్యాపారాలు స్తంభించిపోయాయి. తనిఖీలు తమవరకు ఎక్కడ వస్తాయో అనే భయంతో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. పండుగ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలు దుకాణాలు మూసివేయడంతో నిరాశ చెందారు. -
రాష్ట్రంలో 53 చోట్ల ఎన్ఐఏ సోదాలు
సాక్షి, అమరావతి: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు సానుభూతిపరులు, మద్దతుదారులు, పౌరహక్కుల నేతల నివాసాల్లో సోమవారం సోదాలు చేసింది. విప్లవ రచయితల సంఘం (విరసం), మానవహక్కుల సంఘం, రాష్ట్ర పౌరహక్కుల సంఘం, అమరుల బంధుమిత్రుల సంఘం, చైతన్య మహిళా సంఘం, కులనిర్మూలన పోరాట సమితి, పేట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్మెంట్, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, ప్రజాకళా మండలి, ఇండియన్ అసోషియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ తదితర సంఘాల నేతల నివాసాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కోణంలో 53 నివాసాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో ఒక నాటు తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్లతోపాటు మావోయిస్టు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కూటగల్లులోని రాష్ట్ర ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్.చంద్రనర్సింహులు ఇంట్లో నాటు తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్లను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. కడపలోని ఒక ఇంట్లో రూ.13 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు సానుభూతిపరులుగా పేర్కొంటూ పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని హైదరాబాద్‌లోని ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఎన్ఐఏ అధికారులు గుంటూరు జిల్లాలో 13 ఇళ్లలోను, శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది, ఎన్టీఆర్ జిల్లాలో ఆరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో నాలుగేసి, విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో మూడేసి, తూర్పుగోదావరి జిల్లాలో రెండు, విజయనగరం, శ్రీసత్యసాయి, ఏలూరు, తిరుపతి, పల్నాడు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, బాపట్ల జిల్లాల్లో ఒక్కో ఇంట్లో సోదాలు నిర్వహించారు. 2020లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ఐఏ ఓ కేసు నమోదు చేసి 2021 మే నెలలో చార్‌్జషీట్ దాఖలు చేసింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్టు ఎన్ఐఏ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
లెనోవో ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లూ తనిఖీ
భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులు చైనాకు చెందిన పర్సనల్ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవో (Lenovo) ఫ్యాక్టరీ, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని లెనోవా ఫ్యాక్టరీ, బెంగళూరులోని ఆఫీసులోనూ ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రచురించింది. సోదాల్లో భాగంగా ఐటీ శాఖ అధికారులు లెనోవో ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లను సైతం తనిఖీ చేసినట్లు తెలిసింది. సోదాల సమయంలోనూ, ముగిసిన తరువాత అధికారులు లెనోవా సీనియర్ మేనేజ్మెంట్ను సంప్రదించడానికి ప్రయత్నించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. (అమెరికా నుంచి ఐఫోన్ తెప్పించుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి..) అంతకుముందు రోజు, తమిళనాడు రాష్ట్రంలోని లెనోవో కాంట్రాక్ట్ తయారీదారు ఫ్లెక్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలలోనూ ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారని రాయిటర్స్ నివేదించింది. కంపెనీ, దాని అనుబంధ సంస్థలపై పన్ను ఎగవేత విచారణలో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. కాగా దీనిపై లెనోవా స్పందిస్తూ ఐటీ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు పేర్కొంది. “బాధ్యతగల కార్పొరేట్ పౌరులుగా మేము వ్యాపారం చేసే ప్రతి అధికార పరిధిలో వర్తించే అన్ని చట్టాలు, నిబంధనలు, రిపోర్టింగ్ అవసరాలకు కచ్చితంగా కట్టుబడి ఉంటాం. అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాం. వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తాం” అని లెనోవా ప్రతినిధి తెలిపారు. లెనోవో కంపెనీ భారత దేశంలో 17 శాతం మార్కెట్ వాటాతో 2022-23లో 1.9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. -
రాష్ట్రంలో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్/చర్ల: రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శనివారం వరుస దాడులు నిర్వహించింది. తెలంగాణలోని వరంగల్, కొత్తగూడెం జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లోనూ ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగాయి. ఈ దాడులు రెండు రోజులుగా జరుగుతున్నప్పటికీ శనివారం వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ముగ్గురి నుంచి పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లాత్ మిషన్‌ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు. భద్రతా బలగాలకు వ్యతిరేకంగా పేలుడు పదార్థాలు, డ్రోన్లు ఉపయోగించేందుకు చేసిన కుట్రలో నిషేధిత మావోయిస్ట్ పార్టీ ప్రమేయం ఉండటంతో కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా మరో 12 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఆ విచారణ కొనసాగింపులో భాగంగానే శనివారం వరంగల్‌లో ఐదు చోట్ల, భద్రాద్రి కొత్తగూడెంలో రెండు చోట్ల, అదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడులోని నిందితుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డిజిటల్ డివైజ్‌లను, డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. నిందితులు యాంటీ భారత్ ఎజెండాలో భాగంగా పలు ముడిపదార్థాలను మావోయిస్టులకు చేర్చేందుకు ప్రయత్నించినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని తెలిపారు. ఏజెన్సీలో ఇద్దరు అదుపులోకి? ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపురం ఏజెన్సీలో మావోయిస్టుల గురించి ఎన్ఐఏ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఎదిరె, సూరవేడు కాలనీ, విజయపురితో పాటు పలుచోట్ల మావోయిస్టు దళానికి డ్రోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర సామగ్రి సరఫరా చేశారనే సమాచారంతో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ.. ఏజెన్సీలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల సరిహద్దులోని ఏజేన్సీ ప్రాంతాల్లో దేశవాళీ తుపాకులను తయారు చేసి వాటిని మావోలకు పంపుతున్నారన్న సమాచారం మేరకు సోదాలు జరిపినట్లు తెలిసింది. -
నిబంధనలను అనుసరించి సోదాలు చేయొచ్చు
సాక్షి, అమరావతి: చిట్‌ఫండ్ చట్ట నిబంధనల ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన అన్ని శాఖల్లో సోదాలు చేయవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్ 46 ప్రకారం చిట్ పుస్తకాలు, రికార్డులను తనిఖీ చేసే అధికారం రిజిస్ట్రార్‌కు ఉందని తెలిపింది. అలాగే ప్రభుత్వం నియమించే అధీకృత అధికారి కూడా పని వేళలు లేదా పని దినాల్లో నోటీసు ఇచ్చి లేదా నోటీసు ఇవ్వకుండా తనిఖీలు చేయవచ్చని చెప్పింది. మార్గదర్శి రోజూవారీ వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా సోదాలు చేయొచ్చని, ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను గౌరవించాలని తెలిపింది. చట్ట నిబంధనలకు అనుగుణంగా తప్ప, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఎలాంటి సోదాలు నిర్వహించడానికి వీల్లేదంది. సీఐడీ లేదా ఇతర అధి కారులు సోదాల పేరుతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యా పార కార్యకలాపాలకు ఇబ్బంది కలిగించడానికి వీల్లేదని చెప్పింది. డిప్యూటీ రిజిస్ట్రార్ కొందరికి ఆథరైజేషన్ ఇవ్వడం చిట్స్ ఇన్స్పెక్టర్ల నియామకం కిందకు రాదని పేర్కొంది. అలాంటి ఆథరైజేషన్ అనుమతించదగ్గదా కాదా అన్న విషయాన్ని లోతుగా విచారిస్తామంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తమ సంస్థకు చెందిన అన్ని శాఖల్లో చిట్ రిజిస్ట్రార్లు చేస్తున్న సోదాలను సవాలు చేస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోదాల నిమిత్తం జారీ చేసిన ప్రొసీ డింగ్స్‌ను స్టే చేయడంతో పాటు తమ సంస్థ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అనుబంధ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య రెండు రోజుల క్రితం మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ వాదనలు విని తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. బుధవారం ఆయన తన నిర్ణయాన్ని వెలువరిస్తూ.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ శాఖల్లో సోదాలను నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే చట్ట ప్రకారం సోదాలు చేసేందుకు అనుమతినిచ్చారు. -
‘మార్గదర్శి’.. మరో ‘అగ్రిగోల్డ్’..!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఒక మేడి పండు అన్న నిజం వెలుగు చూసింది. పొట్ట విప్పి చూస్తే ఆర్థిక అక్రమాలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. ఫోర్జరీ సంతకాలతో మోసాలు.., చందాదారులకు తెలియకుండానే చిట్టీ పాటలు.., మేనేజ్మెంట్ టికెట్లు పేరిట బురిడీలు.., ఏజెంట్ల ద్వారా కనికట్టు.., బ్రాంచిల నుంచి ప్రధాన కార్యాలయానికి అక్రమంగా నిధులు మళ్లింపు.., నిధుల్లేక ఖాళీగా ఉన్న బ్యాంకు ఖాతాలు.. ఇలా మార్గదర్శి చిట్‌ఫండ్స్ లోగుట్టు ఆధారాలతో సహా వెలుగు చూసింది. చందాదారుల సొమ్ముతో రామోజీరావు అక్రమ వ్యాపార సామ్రాజ్యం విస్తరణకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఇం‘ధనం’గా ఉపయోగపడుతోందన్నది రూఢీ అయ్యింది. అదే సమయంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ సొంత ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా ఉందన్న అసలు వాస్తవం వెల్లడైంది. చందాదారుల సొమ్ముకు ఏమాత్రం భద్రత లేదన్న విషయం ఆధారాలతో సహా బయటపడింది. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే మార్గదర్శి చిట్‌ఫండ్స్ మరో అగ్రిగోల్డ్ కానున్నదన్నది విస్పష్టమైంది. వేలాదిమంది మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు నిండా మునిగిపోయే ప్రమాదం ఉందన్న విషయం రూఢీ అయింది. రాష్ట్రంలో ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ 37 శాఖల్లో స్టాంపులు – రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు గురువారం సోదాలు చేశారు. ప్రత్యేక బృందాలతో ఏకకాలంలో చేపట్టిన ఈ ఆకస్మిక సోదాల్లో సంస్థ ఆర్థిక అక్రమాలు భారీగా వెలుగులోకి వచ్చాయి. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం, ఆర్బీఐ నిబంధనలే కాదు.. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కింద కూడా పలు నేరాలకు సంస్థ యాజమాన్యం పాల్పడినట్టు వెల్లడైంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాలపై ఆ సంస్థ చైర్మన్ రామోజీరావు ఏ–1గా, మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్ ఏ–2గా, బ్రాంచి మేనేజర్లు (ఫోర్‌మెన్) ఏ–3గా సీఐడీ కేసు నమోదు చేసి, చార్జిషీటు కూడా దాఖలు చేసింది. ఈ కేసు దర్యాçప్తులో భాగంగా స్టాంపులు – రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారుల బృందాలు చేపట్టిన సోదాలు గురువారం అర్ధరాత్రి కూడా కొనసాగుతున్నాయి. ఈ సోదాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశాలున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే బోర్డు తిప్పేయడమే విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో జరిగిన సోదాల్లో పలు విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామోజీరావు ఘనంగా చెప్పుకొనే ఈ సంస్థ ఆర్థికంగా కుదేలవుతుందనేందుకు స్పష్టమైన ఆధారాలు బయటపడ్డాయి. సంస్థ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. అధికారులు సోదాలు చేస్తున్న 37 శాఖల బ్యాంకు ఖాతాల్లో వాటి చందాదారుల నిధులు లేవని వెల్లడైంది. అంటే చందాదారులు చెల్లించిన డబ్బును అక్రమంగా ప్రధాన కార్యాలయానికి తరలించేశారు. ఆ నిధులు ప్రధాన కార్యాలయం బ్యాంకు ఖాతాలో ఉన్నాయా అంటే అక్కడా లేవు. వాటిని గుట్టుచప్పుడు కాకుండా రామోజీరావు సొంత వ్యాపార సంస్థల్లో, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులుగా మళ్లించేశారు. వెరసి రాష్ట్రంలోని 37 మార్గదర్శి శాఖల ఆర్థిక పరిస్థితి కుదేలైంది. ఆ శాఖల చందాదారులు చిట్టీ పాటలు పాడిన సొమ్ము (ప్రైజ్ మనీ)ని చెల్లించే స్థితిలో సంస్థ లేదన్న విషయం సోదాల్లో తేలింది. ఇది ఎన్నో ఏళ్లుగా ఉన్న పరిస్థితే అని కూడా స్పష్టమైంది. కొత్తగా చిట్టీ వేసే చందాదారులు చెల్లించే చందా మొత్తంతో పాత చిట్టీల చందాదారులు పాడిన ప్రైజ్‌మనీని చెల్లిస్తూ ఇన్నాళ్లూ సంస్థ కనికట్టు చేస్తోంది. కానీ కేంద్ర చిట్‌ఫండ్ చట్టం–1982ను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర చిట్ రిజిస్ట్రార్ స్పష్టం చేయడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ గత ఏడాది డిసెంబర్ నుంచి కొత్త చిట్టీ గ్రూపులు వేయడంలేదు. అంటే 9 నెలలుగా వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. కొత్త చిట్టీలు, కొత్త చందాదారులు, కొత్తగా చందా మొత్తాలు రాక డిసెంబర్ ముందు మొదలు పెట్టిన వేలాది చందాదారులకు చిట్టీపాట ప్రైజ్‌మనీ చెల్లించడం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు తలకుమించిన భారంగా పరిణమించింది. మరో వైపు చందాదారులకు చిట్టీపాట మొత్తం చెల్లించకుండా వాటిని అక్రమ డిపాజిట్లుగా మళ్లిస్తోంది. కాలపరిమితి తీరిన డిపా జిట్లు చందాదారులకు తిరిగి చెల్లించాలి. అందుకు కూడా మార్గదర్శి చిట్‌ఫండ్స్ వద్ద నిధులు లేవు. ఈ పరిణామాల నేపథ్యంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైజ్‌మనీ, డిపాజిట్ల చెల్లింపు సందేహాస్పదంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే మూసివేతకు ముందు అగ్రిగోల్డ్ సంస్థ ఏ దుస్థితిలో ఉందో.. ప్రస్తుతం మార్గదర్శి చిట్‌ఫండ్స్ అదే ఆర్థిక దుస్థితిని ఎదుర్కొంటోందన్నది ఆధారాలతో సహా బయటపడినట్టు సమాచారం. మార్గదర్శి భవిష్యత్‌లో కూడా కోలుకునే అవకాశాలు కనిపించడంలేదు. దాంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏ క్షణంలోనైనా బోర్డు తిప్పేస్తే చందాదారులు, డిపాజిట్‌దారులు నిండా మునిగిపోయే ప్ర మాదం ఉందన్నది స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ సోదాల్లో బయటపడినట్టు తెలుస్తోంది. చందాదారులు, డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అనివార్యత కనిపిస్తోంది. అన్నీ అక్రమాలే.. ఇక చిట్టీ గ్రూపుల్లో మేనేజ్మెంట్ టికెట్ల చందాను మార్గదర్శి చిట్‌ఫండ్స్ వాస్తవంగా చెల్లించడమే లేదన్నది కూడా ఆధారాలతో వెల్లడైంది. ఏదైనా చిట్టీ గ్రూపులో కొన్ని టికెట్లు (సభ్యులు) ఖాళీగా ఉండిపోతే వాటిని మేనేజ్మెంట్ పేరిట నమోదు చేస్తారు. ఆ టికెట్ల చందా మొత్తాన్ని సంస్థ యాజమాన్యం చెల్లించాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ 37 బ్రాంచిల్లోనూ సంస్థ పేరిట ఉన్న టికెట్ల చందాను చెల్లించడమే లేదు. అందుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు ఏవీ రికార్డుల్లో నమోదు కానేలేదు. కానీ మేనేజ్మెంట్ టికెట్లకు చెల్లించాల్సిన డివిడెండ్లు, టికెట్ల పేరిట చిట్టీ పాట పాడి ప్రైజ్‌మనీని మాత్రం తీసుకుంటోంది. అంటే రామోజీరావు, ఆయన కుటుంబ సభ్యులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే.. అక్రమ డిపాజిట్లు వసూలు చేస్తున్నట్టుగా కూడా వెల్లడైంది. మార్గదర్శి సహాయ నిరాకరణ స్టాంపులు – రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ సోదాలకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందుకు యత్నించింది. అధికార బృందాలు లోపలికి రాకుండా సిబ్బంది వాగ్వాదానికి దిగారు. సోదాల సందర్భంగా కీలక రికార్డులు చూపించేందుకు సిబ్బంది నిరాకరించారు. అధికారుల బృందాలకు సహకరించవద్దని మార్గదర్శి ప్రధాన కార్యాలయం శాఖలకు ఫ్యాక్స్ ద్వారా ఆదేశించడం గమనార్హం. ఈనాడు పాత్రికేయులను మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఉద్యోగుల పేరిట కార్యాలయాల్లోపల మోహరించారు. వారు సోదాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈనాడు ప్రధాన కార్యాలయానికి చేరవేశారు. వారిచ్చిన సమాచారాన్ని వక్రీకరిస్తూ మీడియాలో వార్తలు ప్రసారం చేయడం ద్వారా అధికారుల బృందాలను బ్లాక్ మెయిల్ చేసేందుకు పన్నాగం పన్నారు. ఈ విధంగా సోదాలను అడ్డుకునేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికీ అధికారుల బృందాలు నిబంధనలను పాటిస్తూ సోదాలు కొనసాగిస్తున్నాయి. ఫోర్జరీ సంతకాలతో యథేచ్ఛగా అక్రమాలు మార్గదర్శి చిట్‌ఫండ్స్ దశాబ్దాలుగా యథేచ్ఛగా ఆర్థిక అక్రమాలకు పాల్పడుతోందన్నది పూర్తి ఆధారాలతో ఈ సోదాల్లో వెల్లడైంది. ఆ సంస్థ కేవలం చిట్‌ఫండ్స్ చట్టం, ఆర్బీఐ నిబంధనలే కాదు.. ఐపీసీ చట్టాలను కూడా ఉల్లంఘిస్తూ ఆర్థిక అక్రమాలు, మోసాలకు పాల్పడుతోంది. ప్రధానంగా చందాదారుల సంతకాలను ఫోర్జరీ చేసి మరీ అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా అధికారులు గుర్తించినట్టు సమాచారం. చిట్టీ గ్రూపుల పాటలు నిర్వహిస్తే కనీసం ఇద్దరు సభ్యుల కోరం ఉండాలి. కానీ ఆ కోరం కూడా లేకుండానే చిట్టీ పాటలు నిర్వహిస్తోంది. అందుకోసం చందాదారులు వచ్చినట్టుగా వారి సంతకాలను మినిట్స్ బుక్‌లో ఫోర్జరీ చేస్తోంది. అంతేకాదు కొందరు చందాదారులు వారు రాలేనందున వారి తరపున చిట్టీ పాటలో పాల్గొనేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏజెంట్లకు అనుమతి (ఆథరైజేషన్) ఇచ్చినట్టుగా పత్రాలు కనిపించాయి. ఈ రెండు సందర్భాల్లోనూ చందాదారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్టుగా అధికార బృందాలు గుర్తించాయి. ఆ సంతకాలు ఉన్న చందాదారులను అధికారులు సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. అసలు తాము ఎవరికీ ఆథరైజేషన్ ఇవ్వనేలేదని, తాము రాకున్నా వచ్చినట్టు మినిట్స్ బుక్‌లో నమోదు చేయడం ఏమిటని ఆ చందాదారులు తిరిగి ప్రశ్నించారు. అవి తమ సంతకాలు కావని, ఫోర్జరీవి అని స్పష్టం చేశారు. ఆ చందాదారుల అసలు సంతకాలను మార్గదర్శి చిట్‌ఫండ్స్ రికార్డుల్లో ఉన్న సంతకాలతో పోల్చి చూడగా అవి ఫోర్జరీ అనే విషయం స్పష్టమైంది. ఆ విధంగా ఏకంగా 70 శాతం చందాదారుల సంతకాలు ఫోర్జరీయేనని అధికారులు గుర్తించారు. ఫోర్జరీ సంతకాలతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ దశాబ్దాలుగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది. కీలక పత్రాలు స్వాదీనం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాలకు సంబంధించిన కీలక ఆధారాలను స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలు, చిట్టీ గ్రూపుల చందాల వివరాలు, నిధుల మళ్లింపునకు సంబంధించిన పత్రాలు, ఫోర్జరీ సంతకాలు చేసిన రికార్డులు, హార్డ్ డిస్‌్కలను జప్తు చేసి పంచనామా నిర్వహించారు. తమ సంతకాలను ఫోర్జరీ చేసినట్టుగా చందాదారుల వాంగ్మూలాలను నమోదు చేశారు. దాంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో సీఐడీ అధికారులు కీలక పురోగతి సాధించినట్టైంది. ఈ సోదాలు శుక్ర, శనివారాలు కూడా కొనసాగే అవకాశాలున్నాయి. దాంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. -
పవన్ ముంజాల్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా హీరో మోటో కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పవన్ ముంజాల్‌తోపాటు ఇతరుల నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, గుర్గావ్లో ఈ సోదాలు జరిగినట్లు వెల్లడించారు. పవన్ ముంజాల్‌తోపాటు ఇతర నిందితులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఈడీ గతంలోనే కేసు నమోదు చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్(సీబీఐసీ) ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈడీ దర్యాప్తునకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని హీరో మోటో కార్ప్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఢిల్లీ, గుర్గావ్లో పవన్ ముంజాల్ నివాసం, రెండు ఆఫీసుల్లో సోదాలు జరిగాయని తెలియజేసింది. పన్నుల ఎగవేత కేసులో ఐటీ శాఖ గత ఏడాది మార్చిలో పవన్ ముంజాల్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. -
విజయవాడలో ఏసీబీ సోదాలు
సాక్షి, విజయవాడ: నగరంంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. బృందావన కాలనీలో సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్ ఇంటితో పాటు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు అందిన సమాచారం మేరకు ప్రసాద్ ఇంట్లో సోదాలు చేపట్టారు. సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించారు. 1991లో హైదరాబాద్‌లో ఐటీబీపీ కానిస్టేబుల్‌గా.. ఎస్పీఎఫ్లో హెడ్ కానిస్టేబుల్‌గా ఎస్ఐ, సీఐగా పదోన్నతి పొందారు. 2007లో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్-I అధికారిగా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఏటీవోగా చేరారు. గతంలో భువనగిరి జిల్లా ఏటీవోగా ట్రెజరీ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ (DRDA) కృష్ణా, డివిజనల్ ట్రెజరీ అధికారి విజయవాడ, అనంతరం డిప్యూటేషన్‌పై కృష్ణా, ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు. -
హౌసింగ్ డీఈఈ ఇళ్లలో ఏసీబీ సోదాలు
ఒంగోలు టౌన్/చీరాల/మేదరమెట్ల/నగరంపాలెం/ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు గుంటూరులో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈగా పని చేస్తున్న చెంచు ఆంజనేయులు ఇళ్లలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో గుంటూరు, ఒంగోలు, బాపట్ల జిల్లా మేదరమెట్ల, వేటపాలెం మండలం కొత్తపేట, కొరిశపాడు మండలం దైవాలరావూరు గ్రామాల్లోని ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఒంగోలులో ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు ఈ సోదాల వివరాలను మీడియాకు వెల్లడించారు. ఒంగోలులో జీ ప్లస్ త్రీ హౌసింగ్ కాంప్లెక్స్, ఒక ప్లాటు, కొప్పోలులో 8 ఇళ్ల స్థలాలు, చీరాలలో ఒక జీ ప్లస్ వన్ భవనం, రెండు స్థలాలు, కడవకుదురు వద్ద 1.9 ఎకరాల భూమి కొనుగోలుకు సంబంధించి రూ.53 లక్షల సేల్‌డీడ్ పత్రాలు లభించినట్లు తెలిపారు. కిలో బంగారం, 6 కిలోల వెండి ఆభరణాలు, రెండు కార్లు, రెండు బైక్‌లు ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ ధరల మేరకు ఆస్తుల విలువ రూ.2.81 కోట్లు ఉన్నట్లు తేలిందన్నారు. ఆంజనేయులును అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఎస్ఈబీ సీఐ ఇళ్లల్లో రూ.కోటి విలువైన అక్రమాస్తుల గుర్తింపు శ్రీకాకుళం జిల్లా పొందూరులో లంచం తీసుకుంటూ దొరికిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఆయన బంధువుల ఇళ్లలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి రూ.కోటి విలువైన అక్రమాస్తులను గుర్తించారు. విశాఖలోని విశాలాక్షినగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు ఇంటితోపాటు విశాఖ, శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలిలోని ఆయన బంధువుల ఇంట్లోనూ సోదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఎస్ఈబీ సీఐగా పనిచేసిన శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ ఈ నెల 7న ఏసీబీకి దొరి కారని తెలిపారు. అప్పటి నుంచి ఆయన విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్నారని చెప్పారు. గతంలో పాడేరు ఎస్ఐగా పనిచేస్తున్న కాలంలోనూ ఆయన గంజాయి కేసులో ఏ8 నిందితుడిగా పట్టు బడి ఏడాది జైలు శిక్ష అనుభవించారని తెలిపారు. -
మూడు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
న్యూఢిల్లీ/బనశంకరి: నిషేధిత ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కుట్రలపై దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు బుధవారం మూడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. బిహార్‌లోని కతీహర్ జిల్లా, కర్ణాటకలోని దక్షిణ కన్నడ, షిమోగా జిల్లాలు, కేరళలోని కాసర్గోడ్, మలప్పురం, కోజికోడ్, తిరువనంతపురం జిల్లాల్లో మొత్తం 25 చోట్ల ఈ సోదాలు జరిగాయి. అనుమానితుల నివాసాల్లో సోదాలు చేపట్టినట్లు ఎన్ఐఏ అధికారులు తెలియజేశారు. మొబైల్ ఫోన్లు, హార్డ్‌డిస్కులు, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్‌లు, డేటా కార్డులు, ఇతర డిజిటల్ పరికరాలు, పత్రాలు, పీఎఫ్ఐకి సంబంధించిన సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ సోదాల్లో రూ.17.50 లక్షల నగదు లభ్యమైందని వివరించారు. భారత్‌లో విధ్వంసకర కార్యకలాపాల కోసం పీఎఫ్ఐకి విదేశాల నుంచి హవాలా డబ్బు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల కర్ణాటకలోని బంట్వాళ, పుత్తూరుల్లో నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. కేరళలోని కాసరగోడ్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పీఎఫ్ఐ కార్యకలాపాలకు సంబంధించి కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఎన్ఐఏ గుర్తించింది. కశ్మీర్‌లోనూ... శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్, బుద్గామ్ జిల్లాల్లో మూడు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కొన్ని కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికార ప్రతినిధి చెప్పారు. పాక్ దన్నున్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, అల్–బదర్, అల్‌కాయిదా ఉగ్ర సంస్థల అనుబంధ సంస్థల సభ్యులు, సానుభూతిపరుల నివాసాల్లో సోదాలు జరిగాయి. ద రెసిస్టెన్స్ ఫోర్స్, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్–జమ్మూకశ్మీర్, ముజాహిదీన్ గజ్వాత్–ఉల్–హింద్, జమ్మూకశ్మీర్ ఫ్రీడం ఫైటర్స్, కశ్మీర్ టైగర్స్, పీపుల్స్ యాంటీ–ఫాసిస్ట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థలు ఇటీవల కొత్తగా పుట్టుకొచ్చాయి. -
మార్గదర్శి హెడ్ ఆఫీస్‌లో కొనసాగుతున్న సీఐడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి హెడ్ ఆఫీసులో ఏపీ సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాలెన్స్ షీట్లతో పాటు ఇతర డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఏ1 రామోజీ, ఏ2 శైలజను సీఐడీ విచారించింది. అయితే, విచారణలో డాక్యుమెంట్లను చూపేందుకు రామోజీ, శైలజ నిరాకరించారు. నిబంధనలకు విరుద్ధంగా భారీగా నగదు మళ్లించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. వైఎస్ ఛైర్మన్, ఫైనాన్స్ డైరెక్టర్లను విచారించిన సీఐడీ.. మరో నలుగురు కీలక ఉద్యోగులను పశ్నించింది. కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామోజీ, శైలజ, ఉద్యోగుల స్టేట్మెంట్లను సీఐడీ పరిశీలించింది. మార్గదర్శి ఫండ్స్ పెట్టుబడుల రూపంలో ఇతర కంపెనీలకు మళ్లించారు. మార్గదర్శి కస్టమర్ల సొత్తును రిస్క్ ఎక్కువగా ఉండే షేర్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ రంగంలో యాజమాన్యం పెట్టుబడులు పెట్టింది. కస్టమర్ల చిట్స్ కోసం సేకరించిన సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో మార్గదర్శి యాజమాన్యం జమ చేసుకుంది. మనీలాండరింగ్ జరిగినట్లు ఏపీ సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. దర్యాప్తు జరపాలని ఈడీ, సీబీడీటీకీ సీఐడీ అధికారులు సమాచారం ఇచ్చారు. చదవండి: ‘చెక్కు’తో చిక్కారు!.. -
‘చెక్కు’తో చిక్కారు!.. మార్గదర్శి హెడ్ ఆఫీస్‌లో సీఐడీ విస్తృత సోదాలు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతమైంది. మనీ లాండరింగ్‌కు పాల్పడిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) దృష్టికి సీఐడీ తీసుకొచ్చింది. చట్టాలను ఉల్లంఘించి రామోజీరావు, ఆయన కుటుంబం పాల్పడుతున్న ఆర్థిక మోసాలను ఆధారాలతో సహా వివరించింది. మరోవైపు సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో బుధవారం విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అర్ధరాత్రి వరకు కొనసాగిన సోదాల్లో అక్రమ పెట్టుబడులు, చందాదారులు సొమ్ము నిబంధనలకు విరుద్ధంగా బదిలీకి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. ప్రధానంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజ కిరణ్, సంస్థ డైరెక్టర్ల పాత్రకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంస్థ బ్యాలన్స్ షీట్లు, నగదు–చెక్కు వ్యవహారాలకు సంబంధించిన రికార్డులు, నిధుల మళ్లింపునకు సంబంధించిన రికార్డులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో వెలుగు చూసిస ఆర్థిక అక్రమాలకు మూలం అంతా హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయమేనని వెల్లడైంది. బెడిసికొట్టిన ఏ–1 రామోజీ, ఏ–2 శైలజ పన్నాగం ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2గా ఉన్న చెరుకూరి శైలజ కిరణ్ ఈ కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు చేసిన ప్రయత్నాలను సీఐడీ తాజా సోదాలతో అడ్డుకుంది. ఈ నెల 3న రామోజీరావును, శైలజను ఈ నెల 6న సీఐడీ అధికారులు విచారించిన విషయం విదితమే. మార్గదర్శి చిట్‌ఫండ్స్ నుంచి నిధులు మళ్లించామని అంగీకరిస్తూనే ఆ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని, అంతా బ్రాంచి మేనేజర్లు (ఫోర్‌మెన్) చూసుకుంటారని ఈ సందర్భంగా రామోజీరావు అడ్డగోలుగా వాదించారు. మరోవైపు శైలజా కిరణ్ కూడా అదే రీతిలో విచారణకు సహకరించకుండా సహాయ నిరాకరణ చేశారు. అక్రమంగా బదిలీ చేసింది వారిద్దరే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చందాదారుల సొమ్మును అక్రమంగా మళ్లించింది సంస్థ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణేనని సీఐడీ సోదాల్లో వెల్లడైంది. ఆ నిధులను రామోజీరావు కుటుంబానికి చెందిన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, మార్గదర్శి చిట్‌ఫండ్స్(కర్ణాటక)– బెంగళూరు, మార్గదర్శి(తమిళనాడు)–చెన్నై సంస్థల్లోకి మళ్లించారు. కంపెనీ చైర్మన్ హోదాలో రామోజీరావు, ఎండీ హోదాలో శైలజతోపాటు డైరెక్టర్ల ఆమోదంతోనే ఆ నిధులు మళ్లించారనేందుకు కీలక ఆధారాలు సీఐడీకి లభ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు కేసు దర్యాప్తులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని విశ్వసనీయ సమాచారం. ఆ చెక్కులు ఎక్కడ..? ఏటా సరిగ్గా.. మార్చి 31న రూ.వందల కోట్ల విలువైన చెక్కులు వస్తున్నట్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్ తన బ్యాలన్స్ షీట్లో చూపిస్తోంది. 2022 మార్చి 31న కూడా రూ.550 కోట్ల విలువైన చెక్కులు వచ్చినట్లు చూపించారు. కానీ నిర్ణీత 90 రోజుల్లోగా ఆ చెక్కులను నగదుగా మార్చడం లేదని సీఐడీ అధికారుల సోదాల్లో వెలుగులోకి వచ్చింది. చెక్కుల్లో చూపిస్తున్న నిధులను రామోజీ తన కుటుంబ ప్రయోజనాల కోసం అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపైనే సీఐడీ అధికారులు ప్రశ్నించడంతో శైలజా కిరణ్ షాక్‌కు గురయ్యారు. ఆ చెక్కులు నగదుగా మారాయో లేదో రికార్డులు తమ వద్ద లేవని చెప్పడంతో ప్రధాన కార్యాలయానికి వెళ్లి పరిశీలిద్దామని సీఐడీ అధికారులు సూచించారు. అందుకు ఆమె అంగీకరించకపోగా సీఐడీ అధికారులు అక్కడకు వెళ్లేందుకు కూడా సమ్మతించలేదు. ప్రధాన కార్యాలయంలోని కీలక రికార్డులను సీఐడీ పరిశీలించేందుకు శైలజా కిరణ్ ఒప్పుకోకపోవడం ఈ కేసులో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు బుధవారం నిర్వహించిన సోదాల్లో ఏటా బ్యాలన్స్ షీట్లో చూపిస్తున్న చెక్కులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అసలు చెక్కులు రావడంగానీ, వాటిని నగదుగా మార్చడం గానీ జరగడం లేదని గుర్తించారు. నగదు రూపంలో ఏటా రూ.500 కోట్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిబంధనలకు విరుద్ధంగా ఏటా రూ.500 కోట్లను నగదు రూపంలో వసూలు చేస్తున్నట్లు బ్రాంచి కార్యాలయాల్లో గతంలో నిర్వహించిన సోదాల్లో వెలుగు చూసింది. కానీ ఆ నిధులను బ్రాంచి కార్యాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంలేదు. ఆ నగదు నిల్వలేవీ ప్రధాన కార్యాలయంలోని రికార్డుల్లో కూడా లేనట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. అంటే ఆ డబ్బులను నల్లధనం రూపంలో అక్రమంగా తరలిస్తున్నట్లు రూఢీ అయింది. అందుకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామోజీ బెంబేలు మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను సీఐడీ ఆధారాలతో సహా జాతీయ దర్యాప్తు సంస్థల దృష్టికి తేవడంతో ఈ కేసులో ఏ–1గా ఉన్న రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. సీఐడీ దర్యాప్తుపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన ఆయన తొలిసారిగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరిట తాజాగా పత్రికా ప్రకటన జారీ చేశారు. ఈడీ, సీబీడీటీ దర్యాప్తు తప్పదేమోనన్న ఆందోళన అందులో వ్యక్తమైంది. రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యకలాపాలు నిలిచిపోయాయని ఆ ప్రకటనలో అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ కొత్త చిట్టీలు ఏవీ ప్రారంభించడం లేదని పేర్కొనడం గమనార్హం. చదవండి: అడ్డంగా దొరికినా అడ్డదారిలోనే! -
దుస్తులు విప్పించి సోదాలు!
లండన్: బ్రిటన్ పోలీసులు నల్లజాతి చిన్నారుల పట్ల జాతి వివక్షతో వ్యవహరిస్తున్నారని ఓ నివేదిక పేర్కొంది. తరచూ వారినే ఎక్కువగా దుస్తులు విప్పించి సోదాలు చేస్తున్నట్లు వెల్లడించింది. ‘‘2018–2022 మధ్య ఇలా 3 వేల మంది పిల్లలను సోదాలు చేశారు. వీరిలో మూడొంతులు నల్లజాతి పిల్లలే. అంతా చూస్తుండగానే ఎనిమిదేళ్ల పిల్లలను కూడా బట్టలిప్పి తనిఖీలు చేయడం ఘోరం. అమ్మాయిలను తనిఖీ చేసేటప్పుడు పురుష అధికారులు, అబ్బాయిలకైతే మహిళా అధికారులు ఉండటం మరీ శోచనీయం’’ అని చిల్డ్రన్స్ కమిషనర్ రాచెల్ డిసౌజా అన్నారు. ‘‘2020లో లండన్‌లోని ఓ స్కూల్లో 15 ఏళ్ల నల్లజాతి బాలికను డ్రగ్స్ ఉన్నాయంటూ మహిళా అధికారులు దుస్తులు విప్పి సోదాలు జరిపారు. ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు. దీనికి జాతి వివక్షే కారణమని భావిస్తున్నాం’’ అని తెలిపారు. -
ఏపీ: మార్గదర్శి మేనేజర్లు, అధికారుల ఇళ్లలో సీఐడీ సోదాలు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ నిధుల మళ్లింపు వ్యవహారంలో ఏపీ వ్యాప్తంగా సీఐడీ తనిఖీలు చేపట్టింది. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లలోనూ సీఐడీ సోదాలు జరిపింది. కాగా, చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి ఖాతాదారుల సొమ్ము మళ్లింపు, నిబంధనల ఉల్లంఘనలపై ఆరోపణల నేపథ్యంలో సీఐడీ అధికారులు శనివారం ఉదయం నుంచి తనిఖీలు నిర్వహించారు. విజయవాడ మార్గదర్శి మెయిన్ బ్రాంచ్‌లో మేనేజర్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని సీఐడీ అధికారులు విచారించారు. ఇక, గతంలోనూ సీఐడీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, నిధుల మళ్లింపుపై సీఐడీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సీఐడీకి అందిన ఫిర్యాదు మేరకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేశారు. -
బైడెన్ ఇంట్లో ఎఫ్‌బీఐ సోదాలు.. అధ్యక్షుడి మెడకు రహస్య ఫైళ్ల వ్యవహారం
వాషింగ్టన్: రహస్య ఫైళ్ల వ్యవహారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చుట్టుకుంటోంది. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఫైళ్లు బయటపడడం ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆయన నివాసంలో తాజాగా చేపట్టిన సోదాల్లో మరో ఆరు ఫైళ్లు లభ్యం కావడం కలకలం రేపుతోంది. విల్మింగ్టన్లోని బైడెన్ ప్రైవేట్ నివాసంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) అధికారులు శుక్రవారం ఉదయం నుంచి రాత్రి దాకా ఏకంగా 13 గంటలపాలు సోదాలు చేపట్టారు. మొత్తం ఆరు ఫైళ్లు లభ్యమయ్యాయి. ఎఫ్‌బీఐ అధికారులు వీటిని ఉన్నతాధికారులకు నివేదించారు. సోదాల సమయంలో ఇరుపక్షాలకు చెందిన న్యాయ బృందాలతోపాటు శ్వేతసౌధం అధికారి ఒకరు ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సోదాలు జరుపుతున్న సమయంలో బైడెన్ గానీ, ఆయన భార్య గానీ ఇంట్లో లేరని తెలిసింది. సోదాల్లో ఫైళ్లతో పాటు చేతి రాతతో ఉన్న కొన్ని పత్రాలు కూడా లభించినట్లు సమాచారం. ఆరు ఫైళ్లు లభ్యం కాగా, ఇందులో కొన్ని బైడెన్ సెనేటర్‌గా ఉన్నప్పటివి, మరికొన్ని ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలానికి సంబంధించినవని ఆయన వ్యక్తిగత అటార్నీ బాబ్ బోయర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. నాకు ఎలాంటి విచారం లేదు: బైడెన్ గత ఏడాది నవంబర్ 2న వాషింగ్టన్ డీసీలో బైడెన్‌కు చెందిన పెన్ బైడెన్ సెంటర్లో, డిసెంబర్ 20న వాషింగ్టన్ ఇంట్లోని గ్యారేజీలో, ఈ ఏడాది జనవరి 12న అదే ఇంట్లో మరోసారి రహస్య దస్త్రాలు బయటపడడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత ఆయన వాటిని నేషనల్ ఆర్కైవ్స్ అందజేశారు. నిజానికి పదవీ కాలం ముగిసిన తర్వాత అధికారిక రహస్య పత్రాలను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. ఇలాంటి చర్యలను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. అధ్యక్షుడిని అభిశంసించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ చట్టం ప్రకారం.. పదవీ కాలం ముగిసిన తర్వాత అధికారిక పత్రాలను నేషనల్ ఆర్కైవ్స్‌కు పంపించాలి. ఇదిలా ఉండగా, తన నివాసాల్లో జరుగుతున్న సోదాలపై బైడెన్ స్పందించారు. ఫైళ్లు దొరకడంపై తనకు ఎలాంటి విచారం లేదన్నారు. అయితే, బైడెన్ తీరుపై రిపబ్లికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహస్య పత్రాల విషయంలో బైడెన్ ఇక తప్పించుకోలేరని చెబుతున్నారు. ఆయన కుటుంబంతోపాటు కుమారుడు హంటర్ బైడెన్ అక్రమ వ్యాపారాలపై సమగ్ర దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నారు. బైడెన్ నివాసాల్లో రహస్య పత్రాలు బయటపడడంపై కాంగ్రెస్ విచారణ చేపడుతుందని స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ ఆశాభావం వెలిబుచ్చారు. బైడెన్‌కు సన్ స్ట్రోక్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రి అధికారమే అండగా ఆయన కుమారుడు హంటర్ బైడెన్ చెలరేగిపోయాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికాకు ప్రత్యర్థి దేశాలుగా భావించే చైనా, రష్యాలో హంటర్ బైడెన్‌కు వ్యాపారాలున్నాయి. ఆయా దేశాల్లో పలు కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టి, భారీగా ఆర్జించినట్లు సమాచారం. అంతేకాకుండా రష్యా నుంచి హంటర్ లక్షలాది డాలర్లు ముడుపులుగా స్వీకరించాడని సాక్షాత్తూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు హంటర్ బైడెన్‌కు చెందినవిగా భావిస్తున్న ల్యాప్‌టాప్‌ల్లో ఆయన మత్తు మందులు వాడుతున్న ఫొటోలు, ఇతర వీడియోలు, మెయిళ్లు బయటపడడం సంచలనం సృష్టించింది. 2019 డిసెంబర్లో ఎఫ్‌బీఐ ఆ ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకుంది. అందులోని వివరాలను న్యూయార్క్ పోస్టు పత్రిక ప్రచురించింది. -
మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో రెండో రోజు సోదాలు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో రెండో రోజు కూడా సోదాలు నిర్వహించారు. సుమారు 10 గంటల పాటు తనిఖీలు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లను సేకరించి చిట్టీల సొమ్మును ఇతర సంస్థల్లోకి మళ్లించిన మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యవహారాలపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అధికారుల తనిఖీలను వీడియో కెమెరాల్లో చిత్రీకరించారు. సొంత మీడియాతో అధికారుల విధులకు మార్గదర్శి యాజమాన్యం ఆటంకం కలిగించింది. పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డిస్క్ లోని సమాచారం అధికారులు సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫిక్స్ డిపాజిట్లు సేకరించినట్టు అనుమానం వ్యక్తమవుతుంది. ఇతర గ్రూప్ ఆఫ్ కంపెనీలకు మర్గదర్శి నిధుల మళ్లింపుపై అధికారులు ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మార్గదర్శి కార్యాలయాల్లో మూడు విడతలు సోదాలు నిర్వహించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాల్లో లభ్యమైన సమాచారం ఆధారంగా హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఎంత మంది డిపాజిట్ చేశారన్న వివరాలను వెల్లడించకుండా మార్గదర్శి గుట్టుగా వ్యవహరిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రజల సొమ్మును ఇతర సంస్థలకు మళ్లించినట్లు పక్కా ఆధారాలు లభ్యమైన తరువాతే హైదరాబాద్‌లోని కార్యాలయంలో సోదాలు చేపట్టినట్లు అధికార వర్గాల సమాచారం. చదవండి: వేగులం కాదు.. ప్రజా సేవకులం -
NRI ఆస్పత్రిలో.. డబ్బు రోగం.
-
NRI ఆస్పత్రి, మెడికల్ కాలేజీ లో ముగిసిన ఈడీ తనిఖీలు
-
విజయవాడ అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రిలో నూ ఈడీ తనిఖీలు
-
రాష్ట్రంలోని చిట్ ఫండ్ కంపెనీలపై రెండో రోజు తనిఖీలు
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొనసాగుతున్న సిట్ సోదాలు
-
జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లలో... ఐటీ శాఖ సోదాలు
రాంచీ/న్యూఢిల్లీ: జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కుమార్ జైమంగళ్, ప్రదీప్ యాదవ్‌ల నివాసాలు, కార్యాలయాల్లో అదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేసినట్లు ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్నాయని, దర్యాప్తులో భాగంగానే రాంచీ, బెర్మో, పట్నాలో ఈ సోదాలు జరిగాయని అధికారులు వెల్లడించారు. చైబాసాలో ముడి ఇనుప ఖనిజ వ్యాపారితోపాటు మరికొందరి ఇళ్లల్లోనూ సోదాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఐటీ సోదాలపై ఎమ్మెల్యే జైమంగళ్ అలియాస్ అనూప్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీ ఒత్తిళ్లతోనే ఈ సోదాలు నిర్వహించారని ఆరోపించారు. బీజేపీని వ్యతిరేకిస్తే వేధిస్తారా? అని ప్రశ్నించారు. తనను ఎవరూ భయపెట్టలేరని అన్నారు. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టే కుట్రల్లో భాగంగానే తమ ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు జరిగాయని జార్ఖండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ విమర్శించారు. అయితే, ఐటీ శాఖ ఆపరేషన్‌తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ శాసనసభా పక్షనేత బాబూలాల్ మరాండీ తేల్చిచెప్పారు. పన్నుల ఎగవేత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐటీ శాఖపై బురద చల్లుతున్నారని జార్ఖండ్ బీజేపీ నేత ప్రతుల్ షాదియో దుయ్యబట్టారు. జార్ఖండ్‌లో అధికార జేఎంఎం నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్ సైతం భాగస్వామిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
ఈఎస్ఐ స్కాం: నాయిని అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేపట్టింది. ఉదయం నుంచి ఒకేసారి 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయిని వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ముకుంద రెడ్డి, దేవికా రాణి, ఇతర నిందితుల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో వైద్య కిట్లు, మందుల కొనుగోళ్ల వ్యవహారంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.6.5 కోట్లు కుంభకోణం జరిగినట్టు ఏసీబీ గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌లో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా తొమ్మిది మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. చదవండి: ముగ్గురు మాయ లేడీలు.. భలే దోపిడీలు! కన్నీరు తుడవంగ.. సొంతింట్లోకి సగర్వంగా -
ఢిల్లీ: తెలుగు ఎంపీ నివాసంలో సీబీఐ సోదాలు
సాక్షి, ఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు.. ముగ్గురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి ముగ్గురు వ్యక్తులు లంచం డిమాండ్ చేశారు. వారిని రాజీవ్ భట్టాచార్య, శుభాంగి గుప్తా, దుర్గేశ్ కుమార్‌గా గుర్తించారు. సీబీఐ సోదాల సమయంలో ఎంపీ ఇంట్లో లేరు. మిగిలిన వారిద్దరూ ఎవరో తెలియదు: ఎంపీ సీబీఐ సోదాలపై ఎంపీ మాలోతు కవిత స్పందించారు. దుర్గేష్‌కుమార్ తమ డ్రైవర్ అని, నా నివాసంలోని స్టాఫ్ క్వార్టర్స్ అతనికి ఇచ్చానని పేర్కొన్నారు. మిగిలిన వారిద్దరూ ఎవరో తనకు తెలియదన్నారు. ఢిల్లీలో తనకు పీఏలు లేరని.. పట్టుబడినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. చదవండి: మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో దారుణం.. నాంపల్లి హైకోర్టుకు హాజరైన విజయశాంతి -
ముంచంగిపుట్టు కేసులో ఆరుగురు అరెస్ట్
సాక్షి,అమరావతి/ద్వారకానగర్ (విశాఖ దక్షిణ)/వజ్రపుకొత్తూరు రూరల్/టంగుటూరు: విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు కేసులో ఆరుగురు పౌరహక్కుల సంఘం నేతలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. మావోయిస్టులకు విప్లవ సాహిత్యం తీసుకెళ్తున్న జర్నలిస్టు పాంగి నాగన్నను ముంచంగిపుట్టు పోలీసులు గతేడాది అరెస్టు చేశారు. దీనిపై గత నవంబర్ 23న ముంచంగిపుట్టు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు గత నెల 7న కేసు నమోదు చేసిన ఎన్ఐఏ పాంగి నాగన్నను విచారించింది. మావోయిస్టులకు సహకరిస్తున్నట్టు నాగన్న అంగీకరించడంతోపాటు మరో 64 మంది పౌరహక్కుల సంçఘాల, విరసం నేతల పేర్లు వెల్లడించడంతో వారిపై ఎన్ఐఏ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 12 జిల్లాల్లోని 31 ప్రాంతాల్లో ఉన్న పౌర హక్కుల నేతల ఇళ్లల్లో బుధ, గురువారాల్లో ఎన్ఐఏ సుదీర్ఘంగా సోదాలు నిర్వహించింది. ఆరుగురిని అరెస్టు చేసినట్టు మీడియాకు గురువారం తెలిపింది. విస్తృతంగా సోదాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి, కడప జిల్లాలతోపాటు తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్ జిల్లాల్లో ఈ సోదాలు జరిగాయి. సోదాల్లో దొరికిన పలు ఆధారాలతో పాంగి నాగన్న, అందులూరి అన్నపూర్ణ, జంగర్ల కోటేశ్వరరావు, మునుకొండ శ్రీనివాసరావు, రేల రాజేశ్వరి, బొప్పూడి అంజమ్మలను ఎన్ఐఏ అరెస్టు చేసింది. సోదాల్లో రూ.10 లక్షల నగదు, 40 మొబైల్ ఫోన్లు, 44 సెల్‌ఫోన్ సిమ్‌లు, 70 స్టోరేజ్ డివైజెస్(హార్డ్‌డిస్క్‌లు), మైక్రో ఎస్డీ కార్డులు, ఫ్లాష్ కార్డులు, 184 సీడీలు, డీవీడీలు, 19 పెన్‌డ్రైవ్‌లు, ట్యాబ్, ఆడియో రికార్డర్లు, సీపీఐ మావోయిస్టు జెండాలు, మావోయిస్టులకు సంబంధించిన సాహిత్యం, లేఖలు, పత్రాలు, ప్రెస్నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టులకు పౌరహక్కుల నేతలు సహకరించారని, పోలీసుల కదలికలను మావోయిస్టులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని, ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలను మావోయిస్టులకు అనుకూలంగా సమీకరించి పోలీసులను అక్కడికి రాకుండా అడ్డంకులు కల్పిస్తున్నారని, ప్రజలను పోలీసులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని అభియోగాలు మోపింది. సోదాలపై నిరసన.. పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, న్యాయవాదుల ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించడాన్ని ఖండిస్తూ గురువారం విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కులో ఆయా సంఘాలు నిరసన చేపట్టాయి. పీవోడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి మాట్లాడుతూ ఎన్ఐఏ అధికారులు ప్రజాసంఘాల నేతల ఇళ్లపై అక్రమంగా సోదాలు చేయకూడదని హైకోర్టు ఇచ్చిన రిలీఫ్‌ఆర్డర్‌ను కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ముంచంగిపుట్టు సంఘటనకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో 32 మందిపై ఉపా చట్టాన్ని ప్రయోగిస్తున్నారని, అందులో భాగంగానే సోదాలు జరిపి విచారించారని శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారధి గ్రామానికి చెందిన ప్రజాసంఘ నాయకురాలు పోతనపల్లి అరుణ పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలను అణగదొక్కేందుకే ఈ దాడులు చేస్తున్నట్లు విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వరా? ప్రజాజీవన స్రవంతిలో కలిసిపోయిన వారికి మీరిచ్చే గౌరవం ఇదేనా.. ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వరా? అంటూ మావోయిస్టు నేత ఆర్కే సతీమణి శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. బుధవారం రాత్రి, గురువారం సోదాలు చేసిన ఎన్ఐఏ అధికారులు పెన్‌డ్రైవ్, 5 పుస్తకాలు తీసుకెళ్లారన్నారు. ఎన్ఐఏ విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారని తెలిపారు. ఇదేనా మాకిచ్చే భరోసా.. ఇక్కడి కంటే అడవుల్లో ఉండటం మంచిదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఆమె వెంట విరసం నేత కళ్యాణరావు తదితరులు ఉన్నారు. చదవండి: మన బాధ్యత మరింత పెరిగింది: సీఎం జగన్ వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. -
‘న్యూస్‌క్లిక్’పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు
న్యూఢిల్లీ: న్యూస్‌క్లిక్ అనే న్యూస్ పోర్టల్‌కు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం ఏకకాలంలో దాడులు చేపట్టింది. మొత్తం ఎనిమిది చోట్ల దాడులు జరిగినట్లు ఈడీ అధికారులు చెప్పారు. మనీ లాండరింగ్ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికోసం ఈడీ అధికారులు ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను పరిగణనలోకి తీసుకున్నారు. వీరు నడుపుతున్న వెబ్సైట్ పేరు న్యూస్‌క్లిక్.ఇన్ అని తెలిపారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, ఖాతాలకు సంబంధించిన కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పలువురిని ప్రశ్నించినట్టు సమాచారం. దానికి ప్రబీర్ పుర్కాయస్త ఎడిటర్ ఇన్ చీఫ్‌గా పని చేస్తున్నారు. తమపై దాడి జరగడంపై ఆయన స్పందిస్తూ.. జర్నలిజాన్ని తొక్కేసేందుకు, నిజాలు బయటకు రాకుండా ఉండేందుకు కేంద్రం ఈ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని, న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే ఈడీ అధికారులు మాత్రం.. ఆ న్యూస్ పోర్టల్‌కు విదేశాల నుంచి వస్తున్న నిధుల్లో అవకతవకలు ఉన్న కారణంగా చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. చదవండి: ఎర్రకోట ఘటన: ‘మోస్ట్ వాంటెడ్’ అరెస్టు! ఇక వారానికి నాలుగే పనిరోజులు! -
కామెడీ క్వీన్‌కు ఎన్సీబీ సెగ
సాక్షి, ముంబై: బాలీవుడ్ కామెడీ క్వీన్ భారతీ సింగ్‌కు మరో షాక్ తగిలింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత మాదకద్రవ్యాల తుట్టె కదిలింది. బాలీవుడ్ ప్రముఖులపై నిషేధిత మత్తు పదార్ధాల వినియోగం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని విచారించింది. తాజాగా నటి భారతీ సింగ్ ముంబై నివాసంపై శనివారం ఉదయం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దాడి చేసింది. భారతి సింగ్‌తోపాటు, ఆమె భర్తపైనా నిషేధిత పదార్థాలు తీసుకున్న ఆరోపణలు వచ్చాయని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. డ్రగ్ పెడ్లర్ విచారణలో భారతి సింగ్ పేరు వెలుగులోకి రావడంతో ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని బృందం ఈ దాడులు చేపట్టింది. కొద్దిమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీనియర్ అధికారి తెలిపారు. దీంతో భారతి, ఆమె భర్త హర్ష్ లింబాచియాకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఈ నెల ప్రారంభంలో నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్సీబీ దాడులు చేసింది. రాంపాల్, అతని స్నేహితురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ ఇద్దరినీ ప్రశ్నించింది. అయితే తన నివాసంలో ఎన్సీబీ స్వాధీనం చేసుకున్నవి ప్రిస్క్రిప్షన్‌లో భాగమని రాంపాల్ చెప్పాడు. ప్రిస్క్రిప్షన్ మేరకు మందులు వాడుతున్నాను తప్ప, తనకు డ్రగ్స్‌తో సంబంధం లేదనీ పేర్కొన్నాడు. తాను దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్సీబీ దాడులు
ముంబై: మాదక ద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిపై, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సోదాలు నిర్వహించింది. నవంబర్ 11న విచారణకు హాజరుకావ్సాలిందిగా ఎన్సీబీ రాంపాల్‌కి సమన్లు జారీచేసింది. సబర్బన్ బాంద్రాలోని ఆయన ఇంటి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎన్సీబీ ఆయన డ్రైవర్‌ను విచారించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం బాలీవుడ్లో మాదక ద్రవ్యాల వాడకంపై ఎన్సీబీ విచారణను ప్రారంభించిన సంగతి తెలిసిందే. జూహూ ప్రాంతంలోని బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నదియాద్వాలా ఇంటిపై దాడిచేసి, మాదకద్రవ్యాలు కలిగి ఉన్నారంటూ ఆయన భార్యని ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఎన్సీబీ ఎదుట హాజరైన నదియాద్వాలా తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదివరకే అరెస్టు అయిన వహీద్ అబ్దుల్ ఖాదిర్ షేక్ అలియాస్ సుల్తాన్ ఇచ్చిన సమాచారంతో ఎన్సీబీ అధికారులు నదియాద్వాలా ఇంటిపై దాడిచేసి, పది గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాదకద్రవ్యాల కేసులో ఎన్సీబీ, తాజాగా మరో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. ఇప్పటివరకు 727.1 గ్రాము గంజా, 74.1 గ్రాముల ఇతర మాదకద్రవ్యాలను, రూ.3.58 లక్షల నగదును వారి వద్దనుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. -
కోవైలో ఎన్ఐఏ సోదాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో శ్రీలంక పేలుళ్ల ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడి పేలుడు సంఘటనలతో సంబంధాలున్నట్లు సందేహిస్తున్న కోయంబత్తూరుకు చెందిన ఐదుగురికి చెందిన ఇళ్లు, పుస్తకాల దుకాణంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు గురువారం తనిఖీలు చేశారు. శ్రీలంకలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈస్టర్ పండుగ రోజున క్రైస్తవ ప్రార్థనామందిరాలు, స్టార్ హోటళ్లలో బాంబు పేలుళ్లు చోటుచేసుకోగా సుమారు 200 మందికి పైగా మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఐఎస్ఐ తీవ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది. జహరాన్ ఐఎస్ఐ తీవ్రవాది అనే ఇందుకు ప్రధాన సూత్రధారి అని కూడా అధికారులు గుర్తించారు. అతనితో వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా కోయంబత్తూరుకు చెందిన కొందరు సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలడంతో ఎన్ఐఏ అధికారులు వారిపై తీవ్రస్థాయిలో ఇటీవల నిఘా పెట్టారు. జూన్‌లో కోయంబత్తూరులో ఎనిమిది చోట్ల ఎన్ఐఏ అధికారులు మెరుపుదాడులు నిర్వహించి మహమ్మద్ అజారుద్దీన్, అక్రంజిందా, షేక్ ఇదయతుల్లా, అబూబకర్, సదాం హుస్సేన్, ఇబ్రహీం ఇళ్లు, అజారుద్దీన్‌కు చెందిన ట్రావెల్స్ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మహమ్మద్ అజారుద్దీన్ కార్యాలయం నుంచి ముఖ్యమైన డాక్యుమెంట్లు, సెల్ఫోన్లు, సిమ్ కార్డులు, పెన్‌డ్రైవ్‌లు, మెమొరీకార్డులు, సీడీ, డీవీడీలు, నిషేధిత పోస్టర్లు, కరపత్రాలు స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. మిగతావారిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. వీరి నుంచి సేకరించిన సమాచారంతో కోయంబత్తూరులో మరో మూడుచోట్ల తనిఖీలు నిర్వహించారు. షాజహాన్, షబీబుల్లా, మహమ్మద్ హుస్సేన్ అనే వ్యక్తుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించగా పలు డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. అరెస్టయిన అజారుద్దీన్ వద్ద జరిపిన విచారణలో కోయంబత్తూరు ఉక్కిడం జీఎంనగర్ మసీదు వీధికి చెందిన సదాం హుస్సేన్‌కు తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు తేలింది. దీంతో అతనికి కూడా సమన్లు పంపి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు సద్దాం హుస్సేన్ ఇంటిలో తనిఖీలు చేశారు. కేరళ రాష్ట్రం కొచ్చికి చెందిన 25 మంది ఎన్ఐఏ అధికారుల బృందం కోయంబత్తూరు పోలీసుల సహకారంతో గురువారం తెల్లవారుజాము 5 గంటల సమయంలో సదాం హుస్సేన్‌తోపాటు పలువురు అనుమానితుల ఇళ్లలోకి అకస్మాత్తుగా ప్రవేశించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు ఉదయం 10.30 గంటల వరకు సాగాయి. ఇదిలా ఉండగా, చెన్నైకల్పాక్కం సమీపం కూవత్తూరు గుండమనిచ్చేరి గ్రామానికి చెందిన సూర్య (22) ఈనెల 23వ తేదీన తిరుప్పోరూరులోని తన మేనమామ ఇంటికి వచ్చినపుడు తన స్నేహితులు దిలీప్రాఘవన్ (24), తిరుమాల్ (24), యువరాజ్ (27) జయరామన్ (26), విశ్వనాథన్ (24)లతో కలిసి 24వ తేదీన అక్కడి గంగై అమ్మన్ ఆలయ కొలను పూడిక తీశారు. అదేరోజున దిలీప్ జన్మదినం కావడంతో ఆలయ పరిసరాల్లో కేక్ కట్ చేసి సంబరం చేసుకున్నారు. ఈ సమయంలో అక్కడ కనపడిన వస్తువులను చేతికి తీసుకుని తెరుస్తుండగా అది పేలడంతో సూర్య, దీలీప్ రాఘవన్ దారుణంగా మరణించారు. అలాగే చెంగల్పట్లు సమీపంలోని ఒక చెరువులో బాంబు బయటపడింది. సైనికులు, ఐపీఎస్ అధికారులకు అక్కడికి సమీపంలోని మైదానంలో తుపాకీపై శిక్షణ ఇస్తున్నందున వారిని లక్ష్యంగా చేసుకునే ఈ బాంబు అమర్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ వరుసలో గురువారం హనుమంతపురం చెరువులో ఒక ఆవు మేతమేస్తుండగా భారీఎత్తున పేలుడు పదార్థాలు బైటపడడంతో పోలీసులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. కాగా, పుళల్ జైలు సూపరింటెడెంట్‌పై గురువారం దాడియత్నానికి దిగిన ఇద్దరు తీవ్రవాదులపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
తమిళనాడులో ఎస్ఐఏ సోదాలు
-
రెండోరోజూ కొనసాగిన ఐటీ సోదాలు
సాక్షి, అమరావతి/విశాఖ క్రైం: రాష్ట్రంలోని వివిధ వ్యాపార సంస్థలపై శుక్రవారం మొదలైన ఆదాయపన్ను శాఖ(ఐటీ) అధికారుల సోదాలు శనివారం రెండోరోజూ కొనసాగాయి. విజయవాడ, విశాఖపట్నంలలో సదరన్ డెవలపర్స్, శుభగృహ సంస్థల్లో శనివారమూ సోదాలు జరిపిన ఐటీ అధికారులు విలువైన పత్రాలు, హార్డ్ డిస్క్‌లను సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, ఆయన బంధువులకు చెందిన సదరన్ డెవలపర్స్‌లో శనివారం సాయంత్రం దాకా కొనసాగాయి. రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసిన భూలావాదేవీలపై ప్రధానంగా దృష్టిపెట్టినట్టు సమాచారం. ఈ భూముల్ని ఎవరి పేరుమీద కొనుగోలు చేశారు.. దీనికైన నగదు ఎక్కడిదని ఐటీ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో 8, 9 తేదీల్లో హాజరు కావాలంటూ ఎమ్మెల్యే పోతుల రామారావుకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై స్పందించడానికి ఐటీ అధికారులు నిరాకరించారు. సాధారణంగా ఆదాయపన్ను విభాగం జరిపే సోదాల్ని ఐటీశాఖ బహిర్గతం చేయదని, ఈ కేసుల్లోనూ తాము అదే పద్ధతి పాటిస్తామని ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సోదాల సందర్భంగా తీసుకున్న పత్రాలను పరిశీలించి అవసరమైన సమాచారాన్ని సంబంధిత వ్యక్తులనుంచి సేకరిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా, నంబూరు శంకర్రావుకు చెందిన శుభగృహ, ఎన్ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్లో శనివారం రాత్రి కూడా సోదాలు కొనసాగాయి. ఐటీ అధికారుల వద్ద ఉన్న సమాచారానికి, సోదాల్లో లభ్యమైన డాక్యుమెంట్లకు సరిపోలకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో విజయవాడ మాచవరంలోని శుభగృహకు చెందినవారి బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. మరోవైపు నెల్లూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు చెందిన బీఎంఆర్ గ్రూపుల్లో గురువారం మొదలైన సోదాలు శనివారం ఉదయం వరకు కొనసాగాయి. సోదాలకు తొలుత బీఎంఆర్ గ్రూపు సహకరించకపోవడంతో ఐటీశాఖ తనదైన శైలిలో ప్రశ్నించడంతో దారికొచ్చారు. ఇక్కడా విలువైన డాక్యుమెంట్లను సీజ్ చేసి తీసుకెళ్లడంతోపాటు తదుపరి విచారణకోసం నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. విశాఖలో.. విశాఖ నగరంలోని పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఐటీ అధికారులు శనివారమూ సోదాలు కొనసాగించారు. సీతమ్మధారలోని ఎన్‌ఎస్‌ఆర్‌ఎన్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శుభగృహ సంస్థల్లో పోలీసు భద్రత మధ్య సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతంలో జరిపిన భూముల క్రయవిక్రయాలు, ఐటీ చెల్లింపులపై ఆరా తీసినట్టు సమాచారం. బీద మస్తాన్‌రావు సంస్థల్లో మూడోరోజూ ఐటీ సోదాలు భారీగా నగదు, నకిలీ డాక్యుమెంట్లు, హవాలా లావాదేవీల గుర్తింపు.. కావలి: టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వ్యాపార సంస్థల్లో మూడోరోజైన శనివారమూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా భారీగా నగదు, నకిలీ డాక్యుమెంట్లు, హవాలా లావాదేవీలను ఐటీ అధికారుల బృందం గుర్తించినట్టు తెలుస్తోంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని విమానాశ్రయ భూముల వద్ద ఉన్న బీద మస్తాన్‌రావుకు చెందిన విదేశాలకు రొయ్యలు ఎగుమతి చేసే ప్రాసెసింగ్ ప్లాంట్, రొయ్యల మేత ఫ్యాక్టరీ ప్రాంగణంలో భారీగా నగదు బయటపడినట్టు తెలిసింది. అలాగే తనిఖీల సందర్భంగా చెన్నైలోని ఒక రహస్య భవనంలో భారీగా నగదునూ ఐటీ అధికారులు కనుగొన్నట్టు సమాచారం. అక్కడే కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలం ఇస్కపల్లి ప్రాంతంలో ఉన్న బీద మస్తాన్‌రావుకు చెందిన రొయ్యల గుంతలు, రొయ్య పిల్లల హేచరీలకు సంబంధించిన భూముల యాజమాన్య హక్కుల నకిలీ డాక్యుమెంట్లను కూడా ఐటీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అలాగే బీద మస్తాన్‌రావుకు చెందిన సంస్థలు, కార్యాలయాలున్న దామవరం, నెల్లూరు, చెన్నైలలో జరిపిన తనిఖీల్లో హవాలా రూపంలో విదేశాల నుంచి నగదు లావాదేవీలు జరిగిన విషయం బహిర్గతమైంది. మస్తాన్‌రావుకు అమెరికాలో రొయ్యల విక్రయ కేంద్రం ఉంది. అమెరికాతోపాటు పలు దేశాలకు రొయ్యలను ఎగుమతి చేస్తారు. ఈ విదేశీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వ పన్నుల భారం నుంచి తప్పించుకోవడానికి, సురక్షితంగా తమ వద్దకు నగదును చేర్చుకోవడానికి హవాలా మార్గాన్ని అనుసరించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. బ్యాంకులద్వారా జరిగిన లావాదేవీలు, బ్యాంకులతో సంబంధం లేకుండా కేవలం పుస్తకాలలో రాతలద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను వేర్వేరుగా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారని సమాచారం. కాగా, బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రలతోపాటు వారి కుటుంబసభ్యుల పేర్లమీదున్న సంస్థలద్వారా టీడీపీ నాయకులకిచ్చిన నగదు వివరాల్నీ ఐటీ అధికారులు సేకరించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే కోటరీలో ముఖ్యులుగా ఉన్న టీడీపీ నాయకులు భీతిల్లిపోతున్నారు. మరోవైపు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బీద రవిచంద్ర భాగస్వామ్యం ఉన్న సంస్థలతోపాటు ప్రైవేటుగా నిర్వహించిన లావాదేవీలపైనా ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్లు తెలిసింది. -
ఐటీ సోదాలంటే ‘నిప్పు’ గజగజ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ఏదో పెనుముప్పు ముంచుకొస్తున్నట్లుగా ఐటీ దాడులంటూ గురువారం రాత్రి నుంచి కొన్ని టీవీ చానెళ్లు బ్రేకింగ్ వార్తలు ప్రసారం చేస్తున్నాయని, ఓ కుట్ర సిద్ధాంతాన్ని సీఎం చంద్రబాబు మనుషులు, ఎల్లో మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఉత్తుత్తి ఐటీ దాడులు జరుగుతు న్నాయన్నారు. రాష్ట్ర మంత్రులు, లోకేష్, చంద్రబాబు నివాసాలపై ఐటీ సోదాలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సాధారణంగా జరుగుతున్న సోదాలను కూడా ఏపీపై దాడిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. గ్రహాంతర వాసులు, తీవ్రవాదులు దాడులు చేస్తున్నారనే తరహాలో, దేశంలో ఎప్పుడూ ఎవరిపైనా ఐటీ దాడులే జరగనట్లుగా ఎల్లో మీడియా ప్రసారాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ముందే ఎలా తెలిసింది? చంద్రబాబు ఆదేశాల మేరకు లోకేష్ స్వయంగా ఎల్లో మీడియాతో మాట్లాడి తమపై ఐటీ దాడులు జరుగుతున్నాయంటూ విపరీ తంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలిచ్చినట్లుగా తెలుస్తోందన్నారు. ఫలానా మంత్రుల మీద ఐటీ దాడులు జరుగుతాయని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఐటీ సోదాలు అంటేనే చంద్రబాబు జోలికి వచ్చినట్లు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. గతంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఐటీ సోదాలు జరిగినపుడు చంద్రబాబు అనుకూల మీడియా సంస్థలు ఏం రాశాయో ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ఐటీ సోదాలు జరిగే విషయం అధికా రులు హఠాత్తుగా దాడి చేసే వరకూ ఎవరికీ తెలియదని,బ చంద్రబాబు, ఆయన మంత్రులపై ఐటీ దాడులు జరుగు తాయని నాలుగు రోజుల నుంచి చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అన్ని వ్యవస్థల్లోనూ చంద్రబాబు తన మనుషులను ఉంచారని పద్మ పేర్కొన్నారు. ఐటీ శాఖలో ఉన్న తన మనుషుల ద్వారా చంద్రబాబు సానుభూతి పొందేందుకు కుట్ర సిద్ధాంతం ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారన్నారు. నియోజకవర్గానికి రూ.20 కోట్లు పంపిణీ! ఎక్కడా ఐటీ దాడులు జరగకూడదని చంద్రబాబు ఎందుకు అడ్డు చెబుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రతి నియోజ కవర్గంలో ఎన్నికల ఖర్చుకు ఇప్పటికే రూ.20 కోట్లు పంపించా మని లోకేష్ గతంలో తనకు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడిం చిన నేపథ్యంలో ఆయన మాటల ఆధారంగా ఆ రూ. 20 కోట్లు ఎక్కడున్నాయో ఐటీ అధికారులు వెలికి తీయాలని పద్మ కోరారు. తనను తాను ‘నిప్పు’ అని పొగుడుకునే చంద్రబాబు ఐటీ దాడులంటే ఎందుకంత భయపడు తున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ కుట్రపూరితంగా దాడులు చేయిస్తున్నారని గగ్గోలు పెట్టే బదులు సీబీఐ విచారణకు సిద్ధమని చంద్రబాబు ఎందుకు సవాలు విసరలేకపోతున్నారని ప్రశ్నించారు. బీజేపీతో కుమ్మక్కు అయ్యారు కాబట్టే చంద్రబాబు, లోకేష్ బయట ఉన్నారని వ్యాఖ్యానించారు. లేదంటే వారు జైల్లో ఉండేవారని చెప్పారు. సంపన్నుల జాబితాలో భువనేశ్వరి ఎలా చేరారు? ఐటీ, సీబీఐ నుంచి రాష్ట్రానికి ఎవరు వచ్చినా తనపై కుట్ర జరుగుతోందంటూ చంద్రబాబు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని పద్మ విమర్శించారు. తెలంగాణ, కేంద్రం నుంచి దర్యాప్తునకు పోలీసు కానిస్టేబుల్ వచ్చినా చంద్రబాబు గగ్గోలు పెడుతూ అడ్డు పడుతున్నారన్నారు. చంద్రబాబుకు రెండెకరాల నుంచి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఎలా వచ్చింది? నారా భువనేశ్వరి దేశంలో సంపన్నుల జాబితాలో ఎలా చేరారు? అని పద్మ సూటిగా ప్రశ్నించారు. చేతికి వాచీ, వేలికి ఉంగరం, మెడలో చైన్ లేవని చంద్రబాబు చెబితే దర్యాప్తు సంస్థలు నమ్మి ఊరుకోవాలా? ఎవరూ ప్రశ్నించకూడదా? అని నిలదీశారు. -
ఇంత వణుకెందుకో?
సాక్షి, అమరావతి: భారీగా ఆర్జించి పన్ను ఎగవేసిన సంస్థలలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సోదాలు జరపడం సర్వసాధారణమే అయినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గజగజా వణికిపోవడం.. ఏదో మిన్ను విరిగి మీదపడిపోయినట్లు హడావుడిగా కేబినెట్ సమావేశం జరపడం చూసి అటు ప్రజలు, ఇటు అధికారులు విస్తుపోతున్నారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాలలోని పలు కంపెనీలలో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. అందులో అన్ని పార్టీల నాయకులకు చెందిన సంస్థలు ఉన్నాయి. అలాగే ముఖ్యమంత్రి సన్నిహితులకు సంబంధించినవి కూడా ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి ఎందుకు వణికిపోతున్నారు? మంత్రివర్గ సమావేశాన్ని పార్టీ నేతల సమావేశంగా మార్చి ఈ సోదాలపై ఎందుకు చర్చిస్తున్నారు.? వీటిని ఎలా ఎదుర్కోవాలో చెప్పాలని మంత్రులను సలహా అడగడం, న్యాయ శాఖ కార్యదర్శిని పిలిపించుకుని ఏం చేయాలో చెప్పాలని కోరడం, న్యాయ నిపుణులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, టీడీపీ ఎంపీలు, ముఖ్య నాయకులను శనివారం సమావేశానికి రావాలని పిలవడం.. ఇవన్నీ చూస్తే చంద్రబాబును ఐటీ సోదాలు బెంబేలెత్తిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఎందుకిలా ఆయన భుజాలు తడుముకుంటున్నారు? రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పలు కంపెనీలలో జరుగుతున్న సోదాలను రాష్ట్రంపై జరుగుతున్న దాడిగా చంద్రబాబు అభివర్ణించడంలో అర్థం ఏమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. సాధారణంగా ఐటీ రిటన్స్ సమర్పించిన తరువాత సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో ఐటీ శాఖ అసెస్మెంట్ చేస్తుందని, అసెస్మెంట్లో తేడాలున్న సంస్థలకు ఐటీ నోటీసులు జారీ చేయడం అనేది సర్వసాధారణమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నోటీసులకు స్పందించకపోతే ఐటీ సోదాలు చేయడం అనేది దేశంలో ఎక్కడైనా జరుగుతుందని, అందుకు రాష్ట్రం అతీతం ఏమీ కాదని ఆ అధికారి పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలలో జరుగుతున్నవేగా.. చంద్రబాబు ఎందుకు ఇంతలా భయపడుతున్నారు అనే చర్చ అన్ని వర్గాల్లోనూ జరుగుతోంది. ఐటీ అధికారుల బృందాలకు కల్పించిన పోలీసు భద్రతను ఉపసంహరించుకుంటామని ప్రకటించడం, కేంద్ర సంస్థలపై ఎదురు కేసులు పెట్టాలని చంద్రబాబు నిర్ణయించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇటీవల కర్నాటక, తమిళనాడులో ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో పలు సంస్థలలో సోదాలు చేసిన ఐటీ అధికారులు శుక్రవారం రాష్ట్రంలోనూ అవే తరహా సోదాలు జరిపారు. ఇద్దరు టీడీపీ నాయకులకు చెందిన కంపెనీలతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన పోతుల రామారావు, ఇతర కంపెనీలలో సోదాలు జరిగాయి. వైఎస్సార్సీపీకి చెందిన నంబూరి శంకరరావు కంపెనీలోనూ సోదాలు జరిగాయి. గతంలోనూ రాష్ట్రంలో ఇదే తరహాలో పలు సంస్థలలోనూ, ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న సోదాలపై చంద్రబాబు, ఆయన పరివారం ఉలిక్కిపడడమేగాక ఏదో జరిగిపోతోందని, ఇది కేంద్రానికి, రాష్ట్రానికి జరుగుతున్న యుద్ధమని, మోడీ ఏపీపై దాడి చేయిస్తున్నారని, ఏపీ ప్రజలకు, మోడీకి యుద్ధం జరుగుతోందని అనుకూల మీడియాలో రెండురోజుల నుంచి ఊదరగొట్టిస్తున్నారు. మంత్రి నారాయణ కాలేజీలు, ఆస్తులపై దాడులు చేస్తున్నారని, మీడియాను చూసి ఐటీ అధికారులు వెనక్కి వెళ్లిపోయారనే ప్రచారాన్ని లేవనెత్తారు. బాబు ఎడతెగని చర్చలు చంద్రబాబు శుక్రవారం ఉదయం నుంచి జరుగుతున్న సోదాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఎడతెగని చర్చలు జరిపారు. మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం జరగాల్సి వున్నా దానికి గంట ముందే అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమై కేంద్రం, రాష్ట్రంపై యుద్ధం ప్రకటించిందని, దీన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పాలని కోరారు. మంత్రివర్గ సమావేశంలోనూ అజెండాను పక్కనపెట్టి ఇదే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. తాను తన ప్రభుత్వం నిజాయితీకి మారుపేరని చెప్పుకునే చంద్రబాబు ఐటీ సోదాలు జరుగుతుంటే ఇంతగా బెంబేలెత్తిపోవడం చూసి విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. తప్పు చేయకపోతే ఇంతలా భయపడాల్సిన అవసరం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పలేక టీడీపీ మంత్రులు, నాయకులు సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఐటీ అధికారులకు భద్రత ఉపసంహరిద్దాం మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో సోదాలు చేయడానికి వచ్చిన ఐటీ అధికారుల బృందాలకు ఇచ్చిన భద్రతను ఉపసంహరించుకోవాలని చంద్రబాబు చెప్పారు. దీనిపై న్యాయశాఖ కార్యదర్శిని పిలిపించి భద్రత ఉపసంహరించుకోవచ్చా అని అడగ్గా ఐటీ అధికారులకు భద్రత కచ్చితంగా కల్పించాలనే నిబంధన ఏదీ లేదని ఆయన చెప్పినట్లు తెలిసింది. అయితే అలాగే చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. మన పోలీసులను భద్రత కోసం ఉపయోగించుకుంటూ మన వారికి చెందిన సంస్థలలో సోదాలు చేయడం ఏమిటని పలువురు మంత్రులు అన్నట్లు తెలిసింది. కేంద్రం పరిధిలోని ఐటీ శాఖ రాష్ట్రంలో సోదాలు చేస్తున్నట్టే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అధికారులపై ఏసీబీ ఇతర దర్యాప్తు సంస్థలు దాడులు చేసే అవకాశం ఉందా అని చంద్రబాబు అధికారులను ఆరా తీశారు. గతంలో ఇలాంటి అధికారం రాష్ట్రానికి ఉండేదని కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చేసుకున్న ఒప్పందం వల్ల ప్రస్తుతం ఆ అవకాశం లేదని న్యాయ శాఖ అధికారులు సమాధానమిచ్చారు. కేంద్రంతో చేసుకున్న ఆ ఒప్పందాన్ని ఉపసంహరించుకునేలా వెంటనే చర్యలు చేపట్టాలని, సాంకేతికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే ఐటీ సోదాలపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించి దీనిపై ఎలా ముందుకెళ్లాలో చర్చించేందుకు శనివారం న్యాయ నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే టీడీపీ ఎంపీలు, మంత్రులు, ముఖ్య నాయకులతోనూ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అడ్వకేట్ జనరల్‌ను పిలిపించాలని ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు, ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు మోడీ ఈ దాడులు చేయిస్తున్నారని ప్రచారం చేయాలని మంత్రులకు సూచించారు. ఇది ఏపీపై మోడీ చేస్తున్న దాడి అని, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రాకుండా, కాంట్రాక్టర్లు భయపడి పనులు చేయకుండా అడ్డుకునేందుకు ఐటీ దాడులతో ఇలా అలజడి సష్టిస్తున్నారని చెప్పాలని ఆదేశించారు. కేంద్రంపై పోరాడుతున్న రాష్ట్రంపై దాడులు చేస్తున్నారని, న్యాయం కోసం పోరాడుతుంటే అన్యాయంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలని దిశానిర్దేశం చేశారు. ఐటీ దాడులు, కేసీఆర్ తనపై చేస్తున్న విమర్శల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై సంతృప్తి శాతం పెరిగిందని చంద్రబాబు సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. వీటివల్ల సానుభూతి పెరిగి 79 శాతం ఉన్న సంతృప్తి శాతం 83కి పెరిగిందని ఆర్టీజీ అధికారులు ఈ సమావేశంలో చంద్రబాబుకు తెలిపారు. బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించి ధర్మాబాద్ కోర్టుకు హాజరయ్యే విషయంపైనా చర్చించారు. అప్రమత్తంగా ఉండండి ముగ్గురు మంత్రులకు సీఎం హెచ్చరిక ఏ క్షణంలోనైనా ఐటీ అధికారులు దాడులు చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ముగ్గురు మంత్రులకు చెప్పినట్లు తెలిసింది. శుక్రవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రులు నారాయణ, అచ్చెంనాయుడు, యనమల రామకష్ణుడులకు ప్రత్యేకంగా చంద్రబాబు ఈ హెచ్చరికలు చేశారు. ఐటీ అధికారులు జాబితాలో చాలామంది టీడీపీ నాయకులున్నారని కానీ ప్రధానంగా వీరిపై ఎక్కువ దృష్టి ఉందని ఆయన చెప్పినట్లు సమాచారం. వీరుకాకుండా మరో ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమంచి కష్ణమోహన్, గొట్టిపాటి రవికుమార్, దామచర్ల జనార్థన్ తదితరులపై దాడులు జరిగే అవకాశం ఉందని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. శుక్రవారం ఐటీ సోదాలు జరిగిన సంస్థలకు చెందిన వారితో టీడీపీకి ఉన్న లింకులు ఏమిటో ఆరా తీసి పూర్తి వివరాలు తనకు చెప్పాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాల వారీగా ఐటీ దాడులు జరిగే అవకాశం ఉన్న వారి నాయకులను గుర్తించి వారిని అప్రమత్తం చేయాలని, దాడులు జరిగితే తప్పించుకునేందుకు ఎలాంటి సమాధానాలు చెప్పాలో, ఆస్తులను ఎలా కాపాడుకోవాలో వారికి సూచనలు, సహకారం ఇవ్వాలని పలువురు అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కాగా ఐటీ దాడులు జరుగుతాయని, అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సీఎం సూచించడం వెనుక ఉద్దేశమేమిటని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ‘అక్రమాస్తులు, పన్ను ఎగవేతలు లేనప్పుడు అప్రమత్తం అవ్వాల్సిన పని ఏముంటుంది? తప్పులు చేసి ఆర్జించిన వారే ఆస్తులను దాచుకోవాలి. ఇందుకోసం అప్రమత్తం కావాలి. చంద్రబాబు చేసిన సూచనను పరిశీలిస్తేనే తన మంత్రివర్గంలోని వారు, పార్టీలోని కీలక నేతలు భారీగా అక్రమంగా సంపాదించి ఆదాయ పన్ను ఎగవేసినట్లు అర్థమవుతోంది. అప్రమత్తంగా ఉండాలని చెప్పడమంటే ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఐటీ అధికారులకు దొరక్కుండా ఎక్కడైనా భద్రపరుచుకోవాలని చెప్పడమే. అంటే ముఖ్యమంత్రే అక్రమార్కులను దొరక్కుండా తప్పించుకోవాలని సూచించినట్లు స్పష్టమవుతోంది’ అని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఐటీ సోదాలు కొత్తేమీ కాదు రాష్ట్రంలో ఐటీ సోదాలు కొత్తేమీ కాదని ఆ శాఖ అధికారులు చెపుతున్నారు. మచ్చుకు... ♦ 2017 లో జీవీపీఆర్ కన్స్ట్రక్షన్స్ కు చెందిన జి.లక్ష్మయ్య, కె.వెంకటరమణరావు కార్యాలయాలు, ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయి. ♦ 2017 గోల్డ్ విన్నర్ ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్ కంపెనీకి చెందిన సోదాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 54 చోట్ల జరగ్గా కాకినాడలో కాళేశ్వరి రిఫైనరిలో కూడా సోదాలు జరిగాయి. ♦ 2016లో రాష్ట్ర వ్యాప్తంగా బంగారు వర్తకుల షాపులు, ఇళ్లల్లో సోదాలు ♦ 2016లో బాహుబలి సినీ నిర్మాత శోభు యార్లగడ్డ కార్యాలయాలలో ఐటీ సోదాలు.. ♦ 2016 తెలుగుదేశం ఎమ్మెల్యే సత్యప్రభ ఆస్తులకు సంబంధించి మూడు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. -
ఐదు జిల్లాల్లో ఐటీ సోదాలు
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ప్రముఖ రియల్ ఎస్టేట్, ఆక్వా, గ్రానైట్ వ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. అధికారులు బృందాలుగా విడిపోయి విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. చేస్తున్న వ్యాపారం కంటే తక్కువ పన్ను చెల్లిస్తున్న వారితోపాటు అనుమానిత రియల్ ఎస్టేట్ లావాదేవీలే లక్ష్యంగా ఈ దాడులు ప్రారంభించినట్లు సమాచారం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న సదరన్, శుభగృహ సంస్థలతోపాటు వీఎస్ గ్రూపు కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయి. ప్రకాశం జిల్లా కందూకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, ఆయన సమీప బంధువులకు చెందిన సదరన్ డెవలపర్స్, సదరన్ ఆక్వా ప్రాసెసింగ్, సదరన్ గ్రానెట్ సంస్థలకు చెందిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. నంబూరు శంకర్రావుకు చెందిన శుభగృహ డెవలపర్స్, ఎన్ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు జరిపారు. గుంటూరుకు చెందిన వీఎస్ లాజిస్టిక్స్, జగ్గయ్యపేటలోని ప్రీకాస్ట్ బ్రిక్స్ తయారు చేసే వీఎస్ ఎకో బ్రిక్స్ సంస్థల్లో కూడా సోదాలు జరిగాయి. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు చెందిన బీఎంఆర్‌గ్రూపులో రెండోరోజు కూడా విస్తృతంగా సోదాలు నిర్వహించారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి రాక తాజాగా చేపట్టిన సోదాల వివరాలను బయటపెట్టడానికి స్థానిక ఐటీ అధికారులు నిరాకరించారు. దాడులు పూర్తయిన తర్వాత సంబంధిత వివరాలను హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం తెలియజేస్తుందని, ప్రస్తుతానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని రాష్ట్ర ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర ఐటీ అధికారులతో సంబంధం లేకుండా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ల నుంచి వచ్చిన సుమారు 10 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు తెలిసింది. శుక్రవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు అర్ధరాత్రి దాటినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల మధ్యాహ్నం కల్లా సోదాలు పూర్తి చేశారు. వ్యాపార లావాదేవీలకు చెందిన విలువైన పత్రాలను ఐటీ అధికారులు తమవెంట తీసుకెళ్లారు. ఖండించిన మంత్రి నారాయణ రాష్ట్ర మంత్రి పి.నారాయణకు చెందిన విద్యాసంస్థలపై ఐటీ దాడులు మొదలైనట్లు మీడియాలో తొలుత ప్రచారం జరిగింది. తన సొంత జిల్లా నెల్లూరుతోపాటు విజయవాడ, హైదరాబాద్‌లోని నారాయణ విద్యాసంస్థలపై దాడులు జరుగుతున్నట్లు వచ్చిన వార్తలను మంత్రి నారాయణ ఖండించారు. తమ సంస్థల్లో ఆదాయపు పన్ను అధికారులు ఎలాంటి సోదాలు నిర్వహించలేదని స్పష్టం చేశారు. రాజధానిలో ఐటీ దాడుల కలకలం ఐటీ అధికారులు చేపట్టిన దాడులు రాజధానిలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. విజయవాడలోని పలు ప్రాంతాల్లో సాగుతున్న సోదాల్లో ఐటీ అధికారులు కీలకమైన సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. మొదట విజయవాడలోని నారాయణ కళాశాలకు వచ్చిన ఐటీ అధికారులు ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆటోనగర్‌లోని ఐజీ, జాయింట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి బయల్దేరిన 10 ఐటీ బృందాలు ఏకకాలంలో లబ్బీపేట, భారతీనగర్, వినాయక థియేటర్, కరెన్సీనగర్, బెంజ్ సర్కిల్ సమీపంలోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న సదరన్ డెవపలర్స్, వీఎస్ లాజిస్టిక్స్, శుభగృహ ప్రాజెక్టు కార్యాలయాల్లో దాడులు చేశాయి. సదరన్ డెవలపర్స్ కార్యాలయంలో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ డాక్యుమెంట్లు ఓ మంత్రికి చెందినవిగా గుర్తించారు. సదరన్ డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ పేరుతో అమరావతిలో భూ లావాదేవీలు జరిపినట్లు ఐటీ శాఖ గుర్తించింది. చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ మంత్రి బంధువు ఈ కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని నవాబుపేట పంచాయతీ పరిధిలో ఉన్న వీఎస్ ఎకో బ్లాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కంపెనీ గుంటూరుకు చెందిన వల్లభనేని శ్రీనివాసరావు అనే కాంట్రాక్టర్ పేరిట నడుస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరులోని వీఎస్ లాజిస్టిక్స్ కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించారు. అలాగే ఆయా కంపెనీల ప్రతినిధుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. జగ్గయ్యపేటలో బంగారం దుకాణాలు మూత కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో శుక్రవారం బంగారం వ్యాపారులు మూడు గంటలపాటు దుకాణాలను మూసివేశారు. ఐటీ అధికారులు జగ్గయ్యపేటకు వస్తున్నారనే సమాచారంతో వెంటనే అప్రమత్తమై దుకాణాలను మూసేశారు. ఎమ్మెల్యే పోతుల సంస్థల్లో సోదాలు ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ఆస్తులపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. జరుగుమిల్లి మండలం కె.బిట్రగుంట వద్ద ఎమ్మెల్యేకు చెందిన సదరన్ ఇన్ఫ్రా ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్‌పై ఐటీ అధికారులు శుక్రవారం ఉదయం 6 గంటలకే దాడులు ప్రారంభించారు. రెండు వాహనాల్లో వచ్చిన 10 మంది అధికారులు ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టారు. కీలక పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే సమీప బంధువు, కంపెనీ ఎండీ కార్తీక్‌ను అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం వరకూ ఈ దాడులు కొనసాగాయి. ఎమ్మెల్యేకు సంబంధించి టంగుటూరు మండలం కారుమంచి వద్ద, ఉలవపాడు మండలం రామాయపట్నం వద్ద అనధికారికంగా ఏర్పాటు చేసిన రొయ్యలు వలిచే ఫ్యాక్టరీల వివరాలు ఐటీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి. వీటితోపాటు ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెం వద్ద సదరన్ రాక్ గ్రానైట్ పాలిషింగ్ యూనిట్, పేర్నమిట్ట వద్ద ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఫ్యాక్టరీలకు చెందిన ఉన్నతాధికారులను ప్రశ్నించి, కీలక సమాచారాన్ని రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పోతుల రామారావు పన్నులు చెల్లించకుండానే పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిపారని ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ సంస్థలపై గురి విశాఖపట్నంలోని పలు రియల్ ఎస్టేట్ సంస్థల కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సీతమ్మధారలోని ఎన్‌ఎస్‌ఆర్‌ఎన్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శుభగృహలో శుక్రవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఆయా సంస్థల బ్యాంక్ లాకర్లను సైతం తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది. పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. భూముల క్రయవిక్రయాలు, ఐటీ చెల్లింపులపై ఆరా తీశారు. ఆదాయపు పన్నుతో పాటు జీఎస్టీ పత్రాలను కూడా పరిశీలించారు. విశాఖపట్నంలో ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. వీఎస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసుపై దాడులు గుంటూరు రూరల్ మండలం తురకపాలెం పంచాయతీ పరిధిలోని వీఎస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు మొదలైన సోదాలు అర్ధరాత్రి దాకా కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా ఆర్థిక లావాదేవీలు జరిపిన సంస్థలపై తనిఖీల్లో భాగంగా ఈ దాడులు చేపట్టినట్లు తెలిసింది. బిల్లులు, లావాదేవీల వివరాలను చూపాలని కోరారు. మండలంలోని వీఎస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారంతోపాటు గుంటూరు నగరంలోని విద్యానగర్, కృష్ణనగర్, స్వర్ణభారతినగర్‌లో గల సంస్థ ప్రతినిధుల నివాసాలు, కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
ఐసిస్‌తో లింకులపై ఇద్దరు హైదరాబాదీల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్నాయనే అనుమానంతో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆదివారం అరెస్టు చేసింది. ‘అబుధాబి మాడ్యూల్’కేసు దర్యాప్తులో భాగంగా గత సోమవారం నుంచి నగరంలో సోదాలు చేపట్టి పలువురిని విచారించిన ఎన్ఐఏ...ఆధారాలు లభించడంతో మహ్మద్ అబ్దుల్లా బాసిత్ (24), మహ్మద్ అబ్దుల్ ఖదీర్ (19)లను అరెస్టు చేసింది. అనంతరం ట్రాన్సిట్ వారంట్‌పై ఢిల్లీ తరలించింది. అలాగే మరో ఆరుగురు అనుమానితుల్ని విచారణ నిమిత్తం ఢిల్లీలోని ఎన్ఐఏ కార్యాలయానికి హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. సోమవారం ఇద్దరు నిందితుల్నీ ఢిల్లీలోని పటియాలా కోర్టులో హాజరు పరిచి తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకోనుంది. అబ్దుల్లా బాసిత్ అరెస్టు కావడం గత రెండున్నరేళ్లలో ఇది రెండోసారి. ఈ కేసులో ఎన్ఐఏ 2016 జనవరిలో షేక్ అజర్ ఉల్ ఇస్లామ్, అద్నాన్ హసన్, మహ్మద్ ఫర్హాన్ షేక్‌లను అరెస్టు చేసింది. నగరంలోని హఫీజ్ బాబానగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్లా బాసిత్‌ను అద్నాన్ హసన్ గతంలోనే ఆకర్షించాడు. దీంతో 2014 ఆగస్టులో మరికొందరితో కలసి సిరియా వెళ్లేందుకు బాసిత్ ప్రయత్నించి కోల్‌కతాలో దొరికాడు. అప్పుడు వారందరికీ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. అయినా తీరు మార్చుకోని బాసిత్, మాజ్, ఒమర్‌లు పీఓకే వెళ్లేందుకు ప్రయత్నించి 2015లో నాగ్‌పూర్‌లో దొరికారు. దీంతో సిట్ పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారిపై అభియోగ పత్రాలు దాఖలయ్యాయి. గతేడాది ఓ జాతీయ చానల్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో బాసిత్ ఉగ్రవాద ఆకర్షిత భావ జాలం ప్రదర్శించడం అప్పట్లో కలకలం సృష్టించింది. ఒకప్పుడు ఐసిస్ సానుభూతిపరుల నుంచి నిధులు పొందిన బాసిత్ ఇటీవల సొంతంగా నిధులు సమీకరించి విదేశాలకు పంపినట్లు ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. అబుధాబి మాడ్యుల్ కేసు దర్యాప్తులో వెలుగులోకొచ్చిన అంశాల ఆధారంగా ఎన్ఐఏ ఢిల్లీ యూనిట్ రంగంలోకి దిగడంతో బాసిత్‌తోపాటు ఖదీర్, మరో ఆరుగురి ఉదంతం బయటపడింది. ఆధారాలు లభించడంతో బాసిత్, ఖదీర్ లను అరెస్టు చేసి మిగిలిన వారిని విచారణ కోసం ఢిల్లీ రావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. -
నగరంలో ఐసిస్ కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి ఐసిస్ కలకలం రేగింది. 2016లో ఢిల్లీ ఎన్ఐఏ యూనిట్ నమోదు చేసిన అబుదాబి మాడ్యూల్ కేసులో ఇప్పుడు చర్యలకు ఉపక్రమించింది. ఆ కేసులో నగరానికి చెందిన 12 మంది అనుమానితులున్నారు. వీరిలో ఏడుగురి పాత్రలపై ఆధారాలు లభించిన నేపథ్యంలో సోమవారం వారి ఇళ్లలో సోదాలు చేసి పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకుంది. మూడురోజుల్లోగా హైదరాబాద్ ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సిందిగా ఢిల్లీ ఎన్ఐఏ యూనిట్ నోటీసులు జారీ చేసింది. ఈ ఏడుగురిలో చాంద్రాయణగుట్ట, హుమాయూన్నగర్లకు చెందిన అబ్దుల్లా బాసిత్, సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ, మాజ్ హసన్ ఫారూఖ్ సమీప బంధువులు. దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ఐసిస్‌కు చెందిన అబుదాబి మాడ్యూల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) 2016 జనవరి 28న కేసు నమోదు చేసింది. ఆ మరుసటి రోజే ప్రధాన నిందితుడు షేక్ అజర్ ఉల్ ఇస్లామ్‌ను, రెండో నిందితుడు అద్నాన్ హసన్‌ను, మూడో నిందితుడు మహ్మద్ ఫర్హాన్ షేక్‌లను అరెస్టు చేసింది. జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన ఈ ముగ్గురూ దుబాయ్‌లో స్థిరపడి ఐసిస్ కోసం పని చేశారు. ఈ ముగ్గురూ ఐసిస్ కీలకనేత ఖాలిద్ ఖిల్జీ(కేకే) ఆదేశాల మేరకు వ్యవహరించారు. పాకిస్తాన్‌కు చెందిన ఇతడు అప్పట్లో దుబాయ్ కేంద్రంగా ఐసిస్ కార్యకలాపాలు నడిపాడు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్స్, టాబ్స్, సెల్ఫోన్ల విశ్లేషణలో నగరవాసులకు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయి. నగరవాసులతోనూ వీరికి సంబంధాలు... అప్పట్లో దుబాయ్‌లో నివసించిన ఈదిబజార్వాసి మహ్మద్ ముజ్తబ ద్వారా చాంద్రాయణగుట్ట సమీపంలోని హఫీజ్‌బాబానగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్లా బాసిత్‌తో వీరికి పరిచయం ఏర్పడింది. ఐసిస్ భావజాలానికి ఆకర్షితుడైన బాసిత్ తన అనుచరులుగా ఉన్న మరికొందరితో కలసి ఐసిస్‌లో చేరి సిరియా వెళ్లడానికి సంసిద్ధత వ్యక్తం చేశాడు. ముజ్తబ తనకు పరిచయస్తుడైన మహ్మద్ ఇస్మాయిల్ ద్వారా రూ.53,202కు సమానమైన దీరమ్స్‌ను తమ ఎస్ బ్యాంక్ ఖాతా నుంచి చార్మినార్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న తన సమీప బంధువు హన్నన్ ఖురేషి ఖాతాలోకి బదిలీ చేయించాడు. ఈ నగదు వినియోగించిన బాసిత్ తనతోపాటు తన సోదరి, అద్నాన్ అహ్మద్‌లకు చెందిన పాస్‌పోర్ట్స్‌ను తత్కాల్ స్కీమ్ కింద రెన్యువల్స్ చేయించాడు. ఈ ముగ్గురూ టర్కీ మీదుగా సిరియా వెళ్లాలని భావించి టూరిస్ట్ వీసా కూడా తీసుకున్నారు. అద్నాన్ కుమారుడు ఖలీల్ అహ్మద్‌ను సైతం సిరియా వచ్చేలా ఒప్పించాడు. అదనపు నిధులు సైతం అందించాడు... ఇంటర్నెట్ ద్వారా బాసిత్‌తో సంప్రదింపులు జరిపిన అద్నాన్ హసన్ అదనపు నిధులు సమకూర్చడానికి అంగీకరించాడు. బాసిత్‌కు పంపడానికి అద్నాన్ 3,000 దీరమ్స్‌ను ముజ్తబకు ఇచ్చాడు. అద్నాన్ ఆదేశాల మేరకు నగరానికే చెందిన మహ్మద్ ఖాజా లతీఫుద్దీన్ అలియాస్ అబ్దుల్ లతీఫ్ ఫోన్ ద్వారా బాసిత్‌తో సంప్రదింపులు జరిపాడు. వీరిద్దరూ సిరియా ప్రయాణంపై సమాలోచనలు చేశారు. అద్నాన్ దుబాయ్ నుంచే నగరంలో ఉన్న బాసిత్, సన, ఖురేషీలతోపాటు అబ్రార్, మాజ్, ఫారూఖ్, అద్నాన్, నోమన్, లతీఫ్, సిరియాకు చెందిన అబు హంజా, అబు జకారియా నేరుగా బాసిత్, సనతోనూ సంప్రదింపులు జరిపారు. కోల్‌కతా, నాగ్‌పూర్ మీదుగా ప్రయత్నాలు... బాసిత్ అనుచరుడైన నోమన్‌కు సిరియాలో ఉన్న ఓ ఐసిస్ నేత నుంచి వెస్ట్రన్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా రూ.25 వేలు, నెదర్లాండ్స్‌లో ఉంటున్న మరో ఐసిస్ ఉగ్రవాది ఎవ్లియన్ బ్రోవర్ నుంచి 2014 ఆగస్టులో రూ.7,790, ఖతర్‌లో ఉంటున్న జైమే నుంచి రూ.25,013 అందాయి. 2014 ఆగస్టులో బాసిత్, నోమన్, అబ్రార్, మాజ్‌లతో కలసి బంగ్లాదేశ్ మీదు గా అఫ్గానిస్తాన్‌కు, అక్కడ నుంచి సిరియా వెళ్లాలని పథకం వేశారు. కోల్‌కతా పోలీసులు వీరిని పట్టుకొని నగరానికి తరలించారు. కౌన్సెలింగ్ అనంతరం నగర పోలీసులు వీరిని విడిచిపెట్టారు. అయినా పంథా మార్చుకోని బాసిత్, మాజ్, ఒమర్‌లు నాగ్‌పూర్ మీదుగా శ్రీనగర్ చేరుకుని పీవోకే వెళ్లాలని పథకం వేశారు. 2015 డిసెంబర్ 27న నాగ్‌పూర్ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఖదీర్ పాత్ర ఏంటి? జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు షహీన్‌నగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ ఇంట్లోనూ సోమవారం సోదాలు చేశారు. ఈయన కుమారుడైన మహ్మద్ అబ్దుల్ ఖదీర్(19) అక్కడ ఓ ఇంటర్నెట్ సెంటర్లో పనిచేస్తుంటాడు. మంగళవారం బేగంపేటలోని ఎన్ఐఏ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాల్సిందిగా ఖదీర్‌కు నోటీసులు జారీ చేశారు. అబుదాబి మాడ్యూల్ కేసు అభియోపగపత్రాల్లో ఖదీర్ పేరు ఎక్కడా లేదు. అయితే, ఆ కేసులోని అనుమానితులు ఎవరైనా ఖదీర్ పని చేస్తున్న ఇంటర్నెట్ సెంటర్‌ను అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించి ఉంటారని, ఈ కారణంగానే సాక్షిగా పరిగణించడానికే ఖదీర్‌ను పిలిచి ఉండవచ్చని అధికారులు చెప్తున్నారు. తన కుమారుడు అమాయకుడని, స్నేహితుల వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చి ఉండవచ్చని, విచారణకు హాజరవుతామని ఖుద్దూస్ మీడియాకు వెల్లడించారు. మళ్లీ అదే పంథాలో ఉండటంతో... అబుదాబి మాడ్యూల్‌పై ఢిల్లీ ఎన్ఐఏ యూనిట్ 2016లో కేసు నమోదు చేసింది. నాటి దర్యాప్తులోనే సిటీకి చెందిన బాసిత్, ఖురేషీ, అద్నాన్, సన సహా మొత్తం 12 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. షేక్ అజర్ ఉల్ ఇస్లామ్‌ను, అద్నాన్ హసన్‌ను, మహ్మద్ ఫర్హాన్ షేక్‌లపై 2016 జూలై 25న పాటియాల కోర్టులో అభియోగపత్రాలు సైతం దాఖలు చేసింది. ఇప్పుడు ఈ చర్యలు తీసుకోవడానికి బలమైన కారణం ఉందని తెలుస్తోంది. ఆ అనుమానితుల్లో కొందరు మళ్లీ అసాంఘిక కార్యకలాపాలు ప్రారంభించి ఉంటారని, అందుకే ఎన్ఐఏ చర్యలకు ఉపక్రమించిందని తెలుస్తోంది. -
నవయుగపై వారంలో నివేదిక!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫ్రా, ఇంజనీరింగ్, ఐటీతో సహా వివిధ రంగాల్లో విస్తరించిన నవయుగ గ్రూపు కంపెనీల కార్యకలాపాలపై ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ (ఐసీఎల్ఎస్) అధికారులు వారంలోగా నివేదిక రూపొందించనున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణపట్నం పోర్టును కూడా ప్రమోట్ చేస్తున్న ఈ సంస్థ... హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఒకే చిరునామాపై ఏకంగా 47 కంపెనీల్ని రిజిస్టరు చేసింది. నిజానికి ఒక కంపెనీ రికార్డులు నిర్వహించడానికే బోలెడంత స్థలం కావాలి. అందుకే ఒకే అడ్రస్‌పై 25 కంపెనీలకన్నా ఎక్కువ నమోదై ఉంటే ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ (ఐసీఎల్ఎస్) అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయా కంపెనీల ఆడిట్ రిపోర్ట్లు, ఐటీ రిటర్న్స్, ఇతరత్రా రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలిస్తున్నామని, మరో వారం రోజుల్లో సమగ్ర నివేదిక రూపొందించి కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శికి అందజేస్తామని ఆర్ఓసీ వర్గాలు తెలియజేశాయి. ‘‘సోదాలు జరిపిన ఏ కంపెనీ అయినా కార్యకలాపాల నిర్వహణలో అవక తవకలకు పాల్పడినట్లు రుజువైతే బ్యాంక్ ఖాతాలను సీజ్ చేస్తాం. ఆస్తుల్ని కూడా స్వాధీనం చేసుకుంటాం. కంపెనీ అధికారులకు జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది’’ అని పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని ఆర్ఓసీ అధికారి ఒకరు తెలియజేశారు. ఇటీవల ఆర్ఓసీ తన తనిఖీల్లో భాగంగా నవయుగతో పాటు ఒకే చిరునామాపై 114 కంపెనీలు రిజిస్టరు చేసిన ఎస్ఆర్ఎస్ఆర్ అడ్వైజరీ, 30 కంపెనీలున్న కేబీసీ అసోసియేట్స్‌లో కూడా సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. మరికొన్నాళ్లు సోదాలు! ఒకే చిరునామాతో 25కి పైగా కంపెనీలను రిజిస్టర్ చేసి.. కార్యకలాపాలను సరిగా నిర్వహించని సంస్థల్ని ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఆర్వోసీకి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. దీనిలో భాగంగానే కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని పలు కంపెనీల కార్యాలయాల్లో ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ అధికారుల (ఐసీఎల్ఎస్) బృందం ఆకస్మిక తనిఖీలు చేస్తోంది. ‘‘హైదరాబాద్‌లో ఒకే అడ్రస్‌లో 25కు పైగా రిజిస్టరైన కంపెనీలు యాభైకి పైనే ఉన్నాయి. అందుకే తనిఖీలు మరికొన్నాళ్లు సాగుతాయి’’ అని ఓ అధికారి తెలియజేశారు. పంజాబ్ నుంచి ఆర్వోసీకి మెయిల్.. ఈ మధ్య ఆర్వోసీ అధికారులు ఎల్లారెడ్డిగూడలో కేసీఎస్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సోదాలు జరిపారు. విశేషం ఏంటంటే అక్కడ షెల్ కంపెనీ ఉందని ఆర్వోసీకి పంజాబ్ నుంచి మెయిల్ వచ్చింది!! కేసీఎస్ సాఫ్ట్వేర్ ఆన్లైన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఒక్కొక్కరి నుంచి రూ.18,200 వసూలు చేస్తున్నట్లు పంజాబ్ నుంచి ఓ బాధితుడు ఆర్వోసీకి మెయిల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆర్ఓసీ రికార్డులను పరీక్షిస్తే అసలు కేసీఎస్ పేరిట ఎలాంటి కంపెనీ రిజిస్టరే కాలేదని తెలిసింది. వెంటనే సంబంధిత అడ్రస్‌కు వెళ్లి పర్యవేక్షిస్తే.. అక్కడ కంపెనీయే లేదు. ఆన్‌లైన్‌లోనూ కంపెనీ వెబ్సైట్ షట్‌డౌన్ అయింది. కొంతమంది బాధితులు పేటీఎం నుంచి కూడా నగదును కేసీఎస్కు పంపించినట్లు గుర్తించామని సదరు అధికారి చెప్పారు. కేజీబీ అసోసియేట్ 5 కోట్ల పన్ను.. అశోక్‌నగర్‌లో కేబీజీ అసోసియేట్ అడ్రస్‌లో 30 వరకు కంపెనీలున్నట్లు ఐసీఎల్ఎస్ తనిఖీలో తేలింది. కేజీబీ అసోసియేట్ సెక్రటరీ స్వయంగా తన చిరునామాతోనే ఇతర కంపెనీల కార్యకలాపాలు, లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. గతంలో ఇదే అడ్రస్‌పై 60 కంపెనీలుండేవని.. తొలి దశ తనిఖీల్లో సగం వరకు కంపెనీలను తొలగించగా, ఇపుడు 30 కంపెనీలున్నాయి. తనిఖీల గురించి మీడియాలో వస్తున్న కథనాలను గమనించిన సెక్రటరీ వెంటనే పలు కంపెనీలకు అడ్రస్‌లు మార్పు చేస్తూ మెయిల్స్ పంపించారని, రూ.5 కోట్ల పన్ను బకాయి ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. -
మాజీ డీఎస్పీ భూపతి ఇంట్లో టాస్కఫోర్స్ సోదాలు
-
జాయింట్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
-
జాయింట్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
విజయనగరం జిల్లా : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కాకర్ల నాగేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తోన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. బెంగుళూరు, విశాఖపట్నంలోని 4 ప్రాంతాల్లో, అనకాపల్లి, విజయనగరం జిల్లాలోని 3 ప్రాంతాల్లో, పశ్చిమ గోదావరి జిల్లా పోతవరం మండలం త్యాజంపూడి గ్రామంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
న్యాయమూర్తి ఇంట్లో ఏసీబీ సోదాలు
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ మధు ఇంటిపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో హైదరాబాద్ అడిషనల్ ఎస్పీ రమణకుమార్, కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్, మెదక్ ఏసీబీ డీఎస్పీ ప్రతాప్, మరో ఎనిమిది సీఐలతో పాటు మరి కొంతమంది పాల్గొన్నారు. న్యాయమూర్తి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఇటీవల తీవ్ర ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. న్యాయమూర్తి పలు కేసులను కావాలని పక్కదోవ పట్టించి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, ఏకంగా జగిత్యాలలోని న్యాయవాదులు అంతా కూడా ఇటీవలే ధర్నా కూడా చేశారు. ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వెయ్యి కోట్ల పన్ను ఎగవేత!
సాక్షి, చెన్నై: ‘ఆపరేషన్ క్లీన్ మనీ’లో భాగంగా చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో శశికళ సన్నిహితుల ఇళ్లలో ఐటీ సోదాలు రెండో రోజూ కొనసాగాయి. ఈ సోదాల్లో శశికళ, ఆమె కుటుంబ సభ్యులు రూ. 1000 కోట్ల పన్ను ఎగవేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, బంగారు నగలు, వెండి, వజ్రాలు బయటపడినట్లు తెలిసింది. పెద్ద సంఖ్యలో బినామీ సంస్థల ద్వారా నగదు బట్వాడా, బ్యాంకు ఖాతాలు, విదేశీ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన రికార్డులు స్వాధీనంచేసుకున్నట్లు సమాచారం. బంధువుల నుంచి పనిమనుషుల వరకు.. అక్రమాస్తుల కేసులో శిక్షననుభవిస్తున్న శశికళ, ఆమె భర్త నటరాజన్, సోదరుడు దివాకరన్, మేనల్లుడు దినకరన్‌లతో పాటు సన్నిహితులు, వారి సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది, వారి బంధువులు, వారి వంట, పనిమనుషులు, జ్యోతిష్కుడు, వైద్యుడు, ఆడిటర్.. ఇలా ఆ కుటుంబంతో సంబంధమున్న వారి ఇళ్లల్లో, కార్యాలయాల్లో శుక్రవారం దాడులుచేశారు. రెండో రోజు 147 చోట్ల తనిఖీల్లో ఐటీ వర్గాలు నిమగ్నమయ్యాయి. పలుచోట్ల శశికళ, దినకరన్, దివాకరన్ మద్దతుదారులు దాడులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. శశికళ స్వగ్రామం మన్నార్గుడిలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో ఆమె మద్దతుదారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ తనిఖీల్లో వెయ్యి కోట్ల మేరకు పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలు చిక్కినట్టు ఓ అధికారి పేర్కొన్నారు. అలాగే, మన్నార్గుడిలోని దివాకరన్ కళాశాలలో రూ.25 లక్షలు విలువగల నగలు, వెండి బయట పడ్డట్టు తెలిసింది. ప్రధానంగా పది బినామీ సంస్థల వివరాలతో పాటు, విదేశాల్లోని అనేక సంస్థల్లో శశికళ కుటుంబం పెట్టుబడులకు సంబంధించిన రికార్డులు, దస్తావేజుల్ని ఐటీ వర్గాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
అటవీ ప్రాంతంలో తనిఖీలు
సీతారామపురం : మండలంలోని దేవమ్మ చెరువు బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గుంటూరు స్పెషల్ బ్రాంచి స్కా ్వడ్ ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ నాగేంద్రం అడవుల నుంచి అక్రమంగా ఎర్రచందనం తరలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అటవీ సంపద తరలకుండా నిరంతరం అడవుల్లో సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు అటవీ సిబ్బందికి సహకరించి అడవులను కాపాడుకోవాలని ఆ ప్రాంత ప్రజలకు సూచించారు. అటవీ సంపద అక్రమంగా తరలుతుంటే వెంటనే సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఓలు వంశీకృష్ణ, రాంబాబు, బాలశంకర్, రామ్మోహన్, ఎఫ్‌బీఓలు నసింహారెడ్డి, రాజు, సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీబీ సోదాలు
సీఎస్ భూ అక్రమాల నేపథ్యం... భూములకు సంబంధించిన దస్త్రాలు స్వాధీనం నేను ఏ తప్పూ చేయలేదు: సీఎస్ అరవింద్ జాదవ్ బెంగళూరు: బెంగళూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవినీతి నిరోదక దళం (ఏసీబీ) బుధవారం ఉదయం అకస్మాత్తుగా సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో అనేకల్ వద్ద ఉన్న రామనాయకనహళ్లి వద్ద ప్రభుత్వం వివిధ వర్గాల వారికి కేటాయించిన భూములకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అరవింద్ జాదవ్ తల్లి ఇదే ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన విషయంలో సీఎస్ పై అధికార దుర్వినియోగ విమర్శలు వచ్చిన విషయం...నగరానికి చెందిన సమాచార హక్కు కార్యకర్త భాస్కరన్ ఇందుకు సంబంధించి ఏసీబీకు మంగళవారం సాయంత్రం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు స్వీకరించిన 24 గంటల్లోపే ఏసీబీ కలెక్టర్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి సంబంధిత దస్త్రాలను స్వాధీనం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మీడియాకు దొరక్కుండా ఉన్న సీఎస్ అరవింద్‌జాదవ్ బుధవారం విడుదల చేసిన మీడియా ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు. ‘నేను ఎటువంటి తప్పు చేయలేదు. ఆ భూముల కొనుగోలు సమయంలో నేను కేంద్ర సర్వీసులో ఉంటూ ఢిల్లీలో ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నా. భూమి కొనుగోలు నా తల్లి తారాబాయ్ స్వ విషయం. వంశపార్యం పర్యంగా వచ్చిన కొన్ని భూములను అమ్మి వచ్చిన సొమ్ముతో రామనాయకనహళ్లిలోని సర్వే నంబర్ 29లో ఉన్న భూముల్లో కొన్ని ఎకరాలను కొన్నాం. వీటికి సరిహద్దులు (పోడి) నిర్ణయించాలని సంబంధిత రెవెన్యూశాఖ అధికారులను కోరుతూ నిబంధనలమేరకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంలో నేను ఏ అధికారి పై ఒత్తిడి తీసుకురాలేదు.’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అరవింద్‌జాదవ్ భూ అక్రమాలకు సంబంధించి బుధవారం జరిగిన మంత్రి మండలిలో కొంత చర్చ జరిగింది. కొంతమంది అమాత్యులు ఆయన్ను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం ఈ విషయమై రెవెన్యూశాఖ అందించే నివేదికను అనుసరించి నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు సమాచారం. మరోవైపు శాసనసభ విపక్షనేత, బీజేపీ సీనియర్ నాయకుడు సీఎస్ అరవింద్జాదవ్ను వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. లోకాయుక్తకు మరో ఫిర్యాదు.. అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రభుత్వ భూమిని తన తల్లి పేరుతో కొనుగోలు చేసినట్లు అరవింద్‌జాదవ్ పై రాష్ట్ర లోకాయుక్తలో మరో ఫిర్యాదు బుధవారం దాఖలైంది. ‘అరవింద్ జాదవ్ భూ అక్రమాల’కు బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ శంకర్‌తో పాటు ఆనేకల్ తాహసిల్దార్ కార్యాలయంలోని కొంతమంది అధికారులు సహకరించారని నగరానికి చెందిన భ్రష్టాచార నిర్మూలన సమితి అధ్యక్షుడు రమేష్ చేసిన సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ముమ్మరంగా సోదాలు
నయీమ్ బంధువులు, అనుచరుల ఇళ్లలో పోలీసుల తనిఖీలు భారీగా నగదు, భూ పత్రాలు, ఆయుధాలు లభ్యం! హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ బంధువులు, అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలను ముమ్మరం చేశారు. ఎల్బీనగర్ పరిధిలోని హస్తినాపురం, కుంట్లూర్తోపాటు నయీమ్ నివాసమున్న అల్కాపూర్ టౌన్షిప్లో మళ్లీ తనిఖీలు చేశారు. హస్తినాపురం ద్వారకానగర్‌లో నయీమ్ బంధువుల ఇంటి పై బుధవారం వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఎనిమిదేళ్ల క్రితం నయీమ్ ద్వారకానగర్‌లో బండ జైపాల్‌రెడ్డి ఇంటిని కొనుగోలు చేసి అందులో నజియాబేగంను ఉంచాడు. ఆ తర్వాత నయీమ్ అనుచరులు సుధాకర్‌చారి, నవీన్‌లు ఈ ఇంటిని సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చారు. పోలీసులు ఈ ఇంటికి వెళ్లినపుడు తాళం వేసి ఉండటంతో పగులగొట్టి తనిఖీలు చేపట్టారు. నగదు, పత్రాలు, ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సోదరుడి ఇంటిపై దాడులు నయీమ్ పెద్దమ్మ కొడుకు సలీం గత ఆర్నె ల్లుగా పెద్దఅంబర్‌పేట పరిధిలోని కుంట్లూరు తెలంగాణనగర్‌లో నివాసం ఉంటున్నాడు. పోలీసులు బుధవారం ఆ ఇంటిపై దాడి చేసి సలీంతోపాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇంటి నుంచి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక అల్కాపురిలోని నయీమ్ ఇంటి ని నార్సింగి పోలీసులు, రెవెన్యూ అధికారులు మరోసారి తనిఖీ చేశారు. ఒక బెడ్రూమ్ను తనిఖీ చేసేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. బుధవారం ఉదయం 10.30కి రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, నార్సింగ్ సీఐ రామ్‌చందర్‌రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరోసారి నయీమ్ ఇంట్లో సోదాలు జరిపారు. డాక్యుమెంట్లు, బ్యాంక్ పాస్ బుక్‌లు లభించినట్లు తెలిసింది. నయీమ్ కేసుల వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ ఇన్చార్జి నాగిరెడ్డి బుధవారం సాయంత్రం అల్కా పురిలోని నయీమ్ ఇంటికి వచ్చి పోలీసుల నుంచి సోదాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, పోలీసుల ఇంటి నుంచి స్వాధీ నం చేసుకున్న నగదు, బంగారు అభరణాలు, పత్రాలను పోలీసులు గురువారం ఉప్పర్‌పల్లి కోర్టుకు అందజేసి, అనంతరం బ్యాంక్‌లో డిపాజిట్ చేయనున్నారు. పోలీస్ కస్టడీలో ఫర్హానా, ఆసియాలు నార్సింగి పోలీసులు ఫర్హానా, ఆసియాలను బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో కస్టడీకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు మూడు రోజులపాటు వీరిని విచారించనున్నట్లు తెలుస్తోంది. రహస్య ప్రదేశానికి తీసుకు వెళ్ళి నయీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వీరి నుంచి రాబడుతున్నట్టు సమాచారం. -
విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు
– వ్యవసాయశాఖ విజిలెన్స్ బృందం ఏడీఏ సురేష్‌బాబు వెంకటగిరి : ఎరువుల దుకాణదారులు విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని విజిలెన్స్ బృందం ఏడీఏ రమేష్‌బాబు హెచ్చరించారు. గురువారం వెంకటగిరిలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎరువుల దుకాణాల్లో పురుగు మందులు, ఎరువుల నాణ్యత, అమ్మకం రేట్లు, అమ్మే ఎరువులకు సంబంధించి అనుమతి పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించేలా ప్రభుత్వ కార్యాచరణ రూపొందించిందన్నారు. నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, పొదలకూరు డివిజన్లలో తనిఖీలు చేయగా 27 ఎరువులు, 15 పురుగుమందుల దుకాణాల్లో సుమారు రూ.60 లక్షల విలువైన ఎరువులు, సుమారు రూ.50 లక్షల విలువైన పురుగు మందులను దుకాణదారులు అనుమతి లేని కంపెనీల సరుకు అమ్ముతున్నట్లు గుర్తించామని, వాటి అమ్మకాలు నిలుపుదల చేసినట్లు చెప్పారు. వీరికి 21 రోజులు గడువు ఇచ్చి క్రమబద్ధీకరించుకునేలా అవకాశం ఇస్తామని, స్పందించని దుకాణదారుల్లోని ఎరువులను స్వాధీనం చేసుకుంటామన్నారు. తనిఖీల్లో విజిలెన్స్ బృందం సభ్యులు ఎంసీ మద్దిలేటి (ఏడీఏ రాయదుర్గం, అనంతరంపురం జిల్లా) రవీంద్ర (ఏఓ తాడిపత్రి ) డక్కిలి వ్యవసాయాధికారిణి సుజాత, వెంకటగిరి ఏఈఓ ఎస్పీ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
రైస్ మిల్లులపై డీఎస్ఓ దాడులు
కావలి: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సిన లెవీ ఇవ్వకుండా బయట మార్కెట్లో అక్రమంగా అమ్ముకుంటున్నారన్న సమాచారంతో బుధవారం రెండు రైస్‌మిల్లులపై డీఎస్ఓ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. మద్దూరుపాడు పారిశ్రామిక వాడలో ఉన్న శ్రీమారుతి మోడరన్ రైస్ ఇండస్ట్రీస్, మండలంలోని కొత్తసత్రంలో ఉన్న మరో రైస్‌మిల్లులో డీఎస్ఓ బృందం తనిఖీలు చేపట్టింది. 5 నెలలుగా ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి రైతులకు చెందిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు ప్రభుత్వం సరఫరా చేసింది. అయితే మిల్లర్లు అక్రమంగా బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారని సమాచారం. ఇందులోని ఒక మిల్లరు గత సీజన్‌లోని ఇలాంటి అక్రమాలకు పాల్పడటంతో ఆ మిల్లు సేల్స్ ట్యాక్స్, ఆర్సీ, ట్రేడర్స్‌ను అధికారులు బ్యాంకులో ఉంచినట్లు తెలిసింది. దీంతో ఈ సీజన్‌కు అదే ప్రాంగణంలో మరో పేరుతో ఆర్సీ అధికారులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్త ట్రేడర్స్ పేరుతో ఉన్న ఆర్సీని అడ్డం పెట్టుకుని రైతుల నుంచి స్వీకరించిన బియ్యాన్ని ప్రభుత్వం ద్వారా మిల్లులకు తెప్పించుకుని బియ్యం బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు డీఎస్ఓకు సమాచారం అందడంతో ఆయన ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. మిల్లు ప్రాంగణంలో ఉన్న ధాన్యపు నట్టులను టెక్నికల్ సిబ్బంది ద్వారా కొలతలు జరుపుతున్నామని తెలిపారు. ఈ కొలతలు గురువారం కూడా జరుగుతాయని తర్వాత∙పూర్తి వివరాలు తెలియజేస్తామని ధర్మారెడ్డి చెప్పారు. డీఎస్‌ఓతో పాటు ఏఎస్ఓలు లక్ష్మీనారాయణ రెడ్డి, పుల్లయ్య, డీటీలు సురేంద్ర, హరినాథ్, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
గూగుల్‌లో సినిమాలను తెగ వెతికేస్తున్నారు!
భారతీయులు గూగుల్‌ని అత్యధికంగా దేని గురించి అడుగుతున్నారో తెలుసా? మన దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న సినిమాల గురించే. మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వాడే వినియోగదారులు గూగుల్‌లో వెతుకుతున్న ప్రతి 10 అంశాల్లో ఒకటి సినిమాలకు సంబంధించిన విషయమేనట. అందుకే సినిమా ప్రియులు మరింత సులభంగా వారి అభిమాన చిత్రాలు, తారలు, సంగీతాల గురించి తెలుసుకునేందుకు వీలు కల్పిస్తూ గూగుల్ కొత్త ఆప్షన్లను జోడించనుంది. ఇక నుంచి సినిమాల గురించి వెతికేవారికి సమాధానాలతో పాటు కరోజల్స్ రూపంలో ఆయా ప్రాంతాల్లో సినిమాల సమయాలు, సినిమాల గురించి సంక్షిప్త సమాచారం అందనుంది. కాగా గూగుల్ సెర్చ్ లో సినిమాలకు సంబంధించిన సమాచారం గురించే వినియోగదారులు అత్యధికంగా వెతుకుతున్నట్లు తెలియడంతో ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గూగుల్ ఇండియా హెడ్ స్వప్నా చడ్డా తెలిపారు. భారతదేశ వినియోగదారుల్లో ఎక్కువమంది సినిమా గురించే అడుగుతున్నట్లుగా గూగుల్ కంపెనీ గమనించినట్లు ఆమె తెలిపారు. అయితే ఎంత శాతమో సంఖ్య సరిగా తెలపని ఆమె... ఇండియాలో పదిమందిలో ఒకరు సినిమాను గురించే శోధిస్తున్నట్లు వివరించారు. సినిమాతోపాటు క్రికెట్ గురించిన సమాచారాన్ని కూడ భారత వాసులు అధికంగా శోధిస్తున్నట్లు చడ్డా తెలిపారు. భారత్ కు ఉత్పత్తులు అందించడంలో గూగుల్ కు సుదీర్థ చరిత్ర ఉందని, అందుకే లక్షలమంది ఇండియన్ సినిమా అభిమానులకు వారికిష్టమైన సినిమాలు, నటులు, సంగీతం, పాటలు గురించిన సమాచారం అందించి వారికి కావలసిన సంతోషాన్ని అందించాలని గూగుల్ నిర్థారించుకున్నట్లు చడ్డా తెలిపారు. -
అందర్నీ వేధించండి.. మావాళ్లను రక్షించండి
పోలీసులకు సర్కారు ఆదేశం టీడీపీ నేతల కాల్‌మనీ కేసును నీరుగార్చే కుట్ర అర్ధరాత్రి సోదాలతో హడావుడి చేస్తున్న పోలీసులు మాధవధారలో ఓ వడ్డీ వ్యాపారి ఇంటిలో మంగళవారం అర్ధరాత్రి పోలీసులు సోదాలు జరిపారు. ఆధారాలేవీ లభించకపోయినా అతన్ని తమతో తీసుకుపోయారు. వన్‌టౌన్ పరిధిలో ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకుని తెల్ల కాగితాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి మరోవైపు : ఇద్దరు బాధితురాళ్లు గుడివాడ రామకృష్ణ అనే వ్యాపారి వేధింపులపై నవంబర్‌లో ఫిర్యాదు చేసినా పోలీసుల ఉదాసీనత. సదరు వ్యాపారి మంత్రికి సన్నిహితుడు కావడం.. అధికార టీడీపీకి చెందిన వాడు కావడమే దీనికి కారణం. బాధితులు బీజేపీ ఎమ్మెల్యేను ఆశ్రయించడంతో కేసు నమోదు చేయకతప్పలేదు. అయితే అతను పరారీలో ఉన్నట్లు చూపుతున్నారు. ..ఈ మూడు ఉదంతాలు పాలకుల దుర్నీతికి దర్పణం పడుతున్నాయి. విజయవాడ కాల్‌మనీ కేసులను నీర్చుగార్చేందుకు.. జనం దృష్టి మళ్లించి తెలుగు తమ్ముళ్లను రక్షించేందుకు సర్కారు పన్నిన పన్నాగంలో పోలీసులు పావులుగా.. ‘కాల్’ నాగులుగా మారి అమాయక వడ్డీ వ్యాపారులను కాటేస్తున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిజంగా వేధింపులకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు ఉన్న వారిపై చర్యలు చేపట్టకుండా.. అందరు వ్యాపారులపై దాడులకు పాల్పడటం.. ‘అందర్నీ వేధించి.. తమ వారిని రక్షించుకునే ధోరణి కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం: విజయవాడలో వెలుగుచూసిన టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, నేతల కాల్‌మనీ దురాగతాల కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నింది. పరిమితికి లోబడి వడ్డీ వ్యాపారం చేసే వారిపై కూడా దాడులు చేయాలని పోలీసులను ఆదేశించింది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టి మళ్లించి తమ నేతలను రక్షించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అందర్నీ ఒకే గాటన కట్టేయడం ద్వారా టీడీపీ నేతల దురాగతాల కేసును నీరుగార్చాలన్నది అసలు పన్నాగం. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు జిల్లాలో వడ్డీ వ్యాపారులను తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేస్తూ హడలెత్తిస్తున్నారు. టీడీపీ తమ్ముళ్ల కేసు నీరుగార్చేందుకే.... విజయవాడలో కాల్‌మనీ అకృత్యాలకు పాల్పడినవారికి సీఎం చంద్రబాబు, లోకేష్‌ల అండదండలు ఉన్నట్లు ఆధారాలు బయటపడ్డాయి. దాంతో ఈ కేసును నీరుగార్చి తమ పార్టీ నేతలను కాపాడటానికి సీఎం చంద్రబాబు పన్నాగం పన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు చేసి వేధించాలని పోలీసులను ఆదేశించారు. అత్యధిక వడ్డీ వసూలు చేస్తూ వేధించేవారిని, మహిళలపై అకృత్యాలకు పాల్పడేవారిపైన చర్యలు తీసుకోవచ్చు. ఇందులో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ పరిమితికి లోబడే వడ్డీలు వసూలు చేసే వ్యాపారులను, వేధింపులకు గురి చేయని వారినీ వేధించాలని ప్రభుత్వం ఆదేశించింది. సందట్లో సడేమియాగా అన్ని కేసులతోపాటు విజయవాడలో టీడీపీ నేతల అకృత్యాల కేసును కూడా నీరుగార్చాలని ఎత్తుగడ వేశారు. దాడులు... వేధింపులు సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు జిల్లాలో వడ్డీ వ్యాపారులపై విరుచుకుపడుతున్నారు. ఫిర్యాదు లేకపోయినప్పటికీ అర్ధరాత్రిళ్లు ఇళ్లలో సోదాలు చేస్తూ హడలెత్తిస్తున్నారు. ఆధారాలు లభించకపోయినా సరే వ్యాపారులను అనధికారికంగా నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. మాధవధారలో ఓ వడ్డీవ్యాపారి ఇంటిలో మంగళవారం రాత్రి పోలీసులు సోదలు చేశారు. అత్యధిక వడ్డ వసూలు చేస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించకపోయినా ఆయన్ని తమతోపాటు తీసుకుపోయారు. వన్ టౌన్ పరిధిలో ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తెల్లకాగితాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ నేత కేసులో ఉదాసీనత నిబంధనల మేరకు వడ్డీ వ్యాపారం చేస్తున్నవారిని వేధిస్తున్న ప్రభుత్వం టీడీపీ నేతలకు మాత్రం రక్షాకవచంగా నిలుస్తోంది. విజయవాడలో మాదిరిగానే విశాఖపట్నం లాసన్స్‌బే కాలనీకి చెందిన గుడివాడ రామకృష్ణ అనే వ్యాపారి మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు వచ్చింది. మంత్రి అయ్యన్నపాత్రుడుకు సన్నిహితుడైన ఆయన తన వాహనానికి టీడీపీ జెండా పెట్టుకుని తిరుగుతుంటారు. ఆయన ఓ మహిళకు రూ.100కు రూ.30 వడ్డీపై అప్పు ఇచ్చారు. అప్పు తీర్చాలని లేకపోతే తన కోరిక తీర్చాలని వేధిస్తున్నారు. బాధితురాలు నవంబర్ 21న అతనిపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. మరో మహిళ ఇచ్చిన అప్పు తీర్చినప్పటికీ ప్రామిసరీ నోటు ఇవ్వాలంటే తన కోరిక తీర్చమని రామకృష్ణ వేధిస్తున్నారు. ఆమె కూడా నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామకృష్ణ మంత్రి అయ్యన్నకు సన్నిహితుడు కావడంతో పోలీసులు పట్టించుకోలేదు. విజయవాడ కాల్‌మనీ దురాగతాలు బయటపడిన తరువాత బాధితులు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌రాజును మంగళవారం ఆశ్రయించారు. ఎమ్మెల్యే చెప్పడంతో రామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఆయన పరారీలో ఉన్నారని చెబుతున్నారు. అమాయకులైన వడ్డీవ్యాపారులపై ప్రభుత్వ వేధింపులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలను రక్షించుకోవడానికే..! కాల్‌మనీ సంఘటనలు వెలుగులోకి వచ్చిన వెంటనే టీడీపీ నేతలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వారందరినీ ముందుగా అరెస్టు చేసి కేసు పూర్వాపరాలు పరిశీలించాలి. మిగిలిన జిల్లాల్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు ఎలా ఉన్నాయో నివేదిక రప్పించుకోవాలి. అంతేగానీ దాడులకు పురిగొల్పి అందరినీ పోలీస్ స్టేషన్‌కు రప్పించుకుని విచారించడం అసలు కేసును పక్కదోవపట్టించడానికే. టీడీపీ నేతలను రక్షించుకోవడానికే. కేస్ టు కేస్ పరిశీలించకుండా మొత్తం అందరినీ ఒకే రీతిన ఇబ్బంది పెట్టాలను కోవడం ప్రభుత్వ కుట్రగా కనిపిస్తోంది. చట్టవ్యతిరేకంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న అందరినీ శిక్షించాలి. అంతే కానీ అందరికీ ఒకే శిక్ష అనడం సరైంది కాదు. -జేవీ సత్యన్నారాయణ మూర్తి, రాష్ట్ర సహాయ కార్యదర్శి, సీపీఐ ఫిర్యాదులుంటే చర్యలు చేపట్టండి..! టీడీపీ నేతల ఆరాచకాల కేసును.. పక్కదారి పట్టించేందుకే ఇలా అందర్నీ వేధిస్తున్నారు. ఫిర్యాదులుంటే వడ్డీ వ్యాపారులపై చర్యలు చేపట్టండి. ఫిర్యాదులు రాకపోతే బాధితులకు మనోధైర్యం కల్పించి ఫిర్యాదులు స్వీకరించిన తర్వాతే కేసులు పెట్టండి. అంతే గానీ చట్టపరంగా వ్యాపారం చేసుకునే వారిపై కూడా కాల్‌మనీ ముసుగులో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడం సరైంది కాదు. లెసైన్స్ హోల్డర్లు చట్టపరంగా చేస్తున్నారో లేదో పరిశీలించండి. బాధితుల నుంచి ఏమైనా అభ్యంతరాలుంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి. -నండూరి రామకృష్ణ ఎంవీపీకాలనీ 12 సెక్టార్ల అధ్యక్షుడు -
కాల్‌మనీ వ్యవహారంలో పోలీసుల ఓవరాక్షన్
-
చిట్ కంపెనీపై సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: ఇన్ ఫినిటి రియల్ కాన్ అనే చిట్ కంపెనీకి సంబంధించిన పలు ప్రాంగణాల్లో సీబీఐ బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఆ సంస్థకు ఉన్న 19 ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. చిట్ కంపెనీల డైరెక్టర్లు ప్రణబ్ ముఖర్జీ, సర్బారి ముఖర్జీ, ప్రబీర్ ముఖర్జీ, సుమేన్ మెల్లిక్ పార్థా ప్రతిమ్ ముఖర్జీ నివాస ప్రాంగణాల్లో కూడా సీబీఐ గాలింపులు చేపట్టింది. ఒడిశాలో రెండు ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్‌లోని 17 ప్రాంతాల్లో సీబీఐ ఈ దాడులు నిర్వహించింది. -
బందిపోటు దొంగలపై నిఘా !
సూర్యాపేట కాల్పులపై అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టుల కదలికలపై ఆరా అనుమానిత ప్రాంతాల్లో సోదాలు విజయవాడ సిటీ : నల్గొండ జిల్లా సూర్యాపేట పోలీసులపై జరిగిన కాల్పులతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్ధు జిల్లా కావడంతో కాల్పులు జరిపిన దుండగులు నగరం మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు తరలివెళ్లే అవకాశం ఉందనే సమాచారంపై పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. పోలీసులపై కాల్పులు జరిపిన వారు బందిపోటు ముఠాలకు చెందిన వారా? లేక మావోయిస్టులా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తొలుత ఉత్తరాదికి చెందిన బందిపోటు ముఠాలే పోలీసులపై కాల్పులు జరిపినట్లు పోలీసు అధికారులు భావించారు. ఇదే జరిగితే హైదరాబాద్ మీదుగా కంటే విజయవాడ మీదుగానే ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లేందుకు ముఠాల సభ్యులు ప్రయత్నిస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రైల్వేస్టేషన్, బస్టాండ్ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెట్టారు. అనుమానిత ప్రాంతాల్లో అవసరమైన సోదాలు జరుపుతున్నారు. బుధవారం అర్థరాత్రి సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్, హోంగార్డు అక్కడికక్కడే చనిపోగా..ఇన్స్పెక్టర్, గన్మ్యాన్తీవ్రంగా గాయపడ్డారు. గన్‌మ్యాన్ నుంచి కార్బన్(తుపాకీ) గుంజుకొని పరారయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గన్‌మ్యాన్ వద్ద కార్బన్ గుంజుకునే సమయంలో ఓ వ్యక్తికి చెందిన గుర్తింపు కార్డు(ఐడెంటిటీ) కార్డు కిందపడిపోగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తింపు కార్డులోని వ్యక్తి ఒడిశాకు చెందిన వాడిగా గుర్తించారు. దీంతో ఆముఠా కూడా ఒడిశా ప్రాంతానిదేనని పోలీసులు భావిస్తున్నారు. ఒడిశా దొంగల ముఠాలు ఆయుధాలు వినియోగించవని, బీహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని దొంగలే ఉపయోగిస్తారని పోలీసులు చెబుతున్నారు. పోలీసులను ఏమార్చేందుకు నకిలీ గుర్తింపు కార్డును ఘటనా స్థలంలో వదిలేసి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. దోపిడీ ముఠాలేనా? కాల్పుల్లో గాయపడిన ఇన్స్పెక్టర్ మొగిలయ్య బస్సు దోపిడీ ముఠాలను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట మీరట్‌కు చెందిన ఆరుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరిని వెంట తీసుకొని సొత్తు రికవరీకి ప్రయత్నిస్తున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే దోపిడీ ముఠాలు కాల్పులు జరిపి ఉండొచ్చని భావిస్తున్నారు. మీరట్‌కు చెందిన పండాలు దోపిడీలు మాత్రమే చేస్తుంటారు. ప్రయాణికుల మాదిరి బస్సుల్లో ప్రయాణిస్తూ అందరూ ఆదమరిచి ఉన్న సమయంలో సూట్‌కేసులు, బ్యాగులు తీసుకొని ఉడాయిస్తుంటారు. ఇప్పటివరకూ పండాలు ఆయుధాలు వినియోగించిన దాఖలాలు లేవని నగర నేర పరిశోధన విభాగం పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ తప్పించుకునే క్రమంలో కాల్పులు జరిపినా, పోలీసుల ఆయుధాలు తీసుకెళ్లేంత సాహసం చేయరనేది పోలీసుల బలమైన అభిప్రాయం. వీరు బీహార్‌లో చౌకగా లభ్యమయ్యే తపంచాలను వాడుతుంటారని చెబుతున్నారు. మావోయిస్టుల ప్రమేయంపై ఆరా! పోలీసులపై జరిగిన కాల్పుల్లో మావోయిస్టుల ప్రమేయం కాదనలేమని పోలీసులు అంటున్నారు. సాధారణంగా పోలీసులు తారసపడినప్పుడు మావోయిస్టులు కాల్పులకు తెగబడుతుంటారు. ఆ కాల్పుల్లో పైచేయి సాధించినప్పుడు సంబంధిత పోలీసుల నుంచి ఆయుధాలు తీసుకొని పరారవుతుంటారు. ఇక్కడ గన్‌మ్యాన్ కార్బన్ తీసుకెళ్లడాన్ని బట్టి ఇది మావోయిస్టుల పనే అయి ఉంటుందని సీనియర్ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు ఒడిశాలో మావోయిస్టుల కదలికలున్నాయంటున్నారు. ఘటనా స్థలంలో దొరికిన గుర్తింపు కార్డులోని వ్యక్తి వివరాలు తెలిస్తే తప్ప సూర్యాపేట కాల్పుల కేసు కొలిక్కిరాదనేది పోలీసుల నిశ్చితాభిప్రాయం. -
సంబరాలు డౌటే..!
* నూతన సంవత్సర వేడుకుల అనుమతి అనుమానమే? * ఇప్పటికే విక్రయించిన నూతన సంవత్సర వేడుకల టిక్కెట్లు * నగదు వెనక్కి ఇవ్వాలని పరుగుతీస్తున్న యువత బెంగళూరు: ప్రతి సంవత్సరం ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డులలో అత్యంత వైభవంగా నిర్వహించే నూతన సంవత్సరం వేడుకలకు ఈ సంవత్సరం (2015) అనుమతి ఇచ్చే అవకాశం తక్కువగా ఉన్నాయని పోలీసు వర్గా లు అంటున్నాయి. ఆదివారం రాత్రి ఎంజీ రోడ్డు సమీపంలోనే బాంబు పేలుడు జరగడం, ఎంజీ రోడ్డులో జరిగే నూతన సంవత్సర వేడుకలకు బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి ఎక్కువ మంది వస్తారు. ఈ సందర్భంలో సోదాలు, తనిఖీలు చేయడం కష్టం అవుతుందని కొందరు పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడులకు అనుమతి ఇవ్వడం అంత మంచిది కాదని కొందరు అధికారులు అంటున్నారు. చిన్నస్వామి స్టేడియం దగ్గర బాంబు పేలుడు జరిగినా కొన్ని గంటల వ్యవధిలో స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించి అందరి దగ్గర శభాష్ అనిపించుకున్న బెంగళూరు పోలీసులు.. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే క్రికెట్ స్టేడియం వేరు, బహిరంగ ప్రాంతం వేరు అని పోలీసు వర్గాలు అంటున్నాయి. మా డబ్బు తిరిగి ఇవ్వండి సార్ నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబర్ రాత్రి నుంచి జనవరి వేకువ జామున రెండు గంటల వరకు బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్‌లు, హొటల్లు నిర్వహించరాదని పోలీసులు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గతంలో జనవరి 1వ తేదీన వేకువ జామున రెండు గంటల వరకు వ్యాపారాలు చేసుకొవచ్చని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే అర్దరాత్రి ఒంటి గంటలకు వ్యాపారాలు నిలిపి వేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం రాత్రి నగరంలో బాంబు పేలుడు జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎంజీ రోడ్డు, బ్రిగే డ్ రోడ్డు, జయనగర, హెచ్ఎస్ఆర్ లేఔట్, ఇందిరానగర, శివాజీనగర, రెసిడెన్సీ రోడ్డు, కన్నింగ్హొం రోడ్డు, దోమ్మలూరు, పాత మద్రాసు రో డ్డు, పాత ఎయిర్ పోర్టు రోడ్డు, బెంగళూరు- బళ్లారి రోడ్డు, గాంధీనగర, డబుల్‌రోడ్డు, శాంతినగర, మైసూరు రోడ్డు, కంగేరి, ఎలక్ట్రానిక్ సిటీ, కోరమంగల తదితర ప్రాంతాల్లోని పబ్‌లు, క్లబ్‌లు, బార్ అండ్ ఫ్యామిలి రెస్టారెంట్ల నిర్వహకులు నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని టిక్కెట్లు విక్రయించారు. ఒక్కోక్క టిక్కెట్ రూ. మూడు వేల నుంచి రూ. 25, రూ. 50 వేల వరకు ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవచ్చని భావిం చిన వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, ఐటీ బీటీ, కార్పొరేట్ ఉద్యోగులు ఇప్పటికే వారికి అవరసరమై టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఎక్కువగా ఇక్కడి ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, రెసిడెన్సీ రోడ్డు తదితర చోట్ల ఉన్న పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లలో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఆదివారం రాత్రి బాంబు పేలుడు జరగడంతో టిక్కెట్లు తీసుకున్న వారు హడిలిపోయారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా వెళ్లి వచ్చే సమయంలో జరగరానిది జరిగితే ఎలా అని భయపడుతున్నారు. సోమవారం ఇక్కడి ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, రెసిడెన్సీ రోడ్డులలోని పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు చేరుకున్న కొందరు తాము తీసుకున్న టిక్కెట్లు వెనక్కు తీసుకుని నగదు చెల్లించాలని మనవి చేశారు. నూతన సంవత్సరం వేడుకులు నిర్వహించడానికి టిక్కెట్లు విక్రయించిన వారు తలలు పట్టుకున్నారు. కొందరు నిర్వహకులు టిక్కెట్ ధరలో 30 శాతం కట్ చేసి మిగిలిన 70 శాతం నగదు తిరిగి చెల్లిస్తున్నారు. -
లోకాయుక్త పంజా
నలుగురు అవినీతి తిమింగలాల బాగోతం బట్టబయలు భారీ ఆస్తులు కూడబెట్టుకున్న ఏఎస్ఐ బెంగళూరు: అక్రమ మార్గంలో ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలపై నలుగురు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లు, కార్యాలయూల్లో శనివారం ఏకకాలంలో లోకాయుక్త రాష్ట్రంలోని వివిధ చోట్ల సోదాలు నిర్వహించింది. అధికారుల సోదాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే స్థిర, చరాస్తులు బయటపడ్డాయి. లోకాయుక్త ఏడీజీపీ ప్రేమ్కుమార్మీన తెలిపిన వివరాల ప్రకారం... బెంగళూరు గ్రామీణ జిల్లా ఆనేకల్‌లోని పీఎల్డీ బ్యాంక్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వై వెంకట్రాజు సుమారుగా రూ.1.86 కోట్ల స్థిర, చరాస్తులు కూడబెట్టినట్లు లోకాయుక్త సోదాల్లో బయటపడింది. ఇతని ఆదాయంతో పోలిస్తే సంపద విలువ 194 రెట్లు ఎక్కువని లోకాయుక్త అధికారులు లెక్కగట్టారు. చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరెలోని నాయకనాథహట్టి పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.రహ్మతుల్లా ఆదాయంతో పోల్చినప్పుడు సంపద విలువ 90 రెట్లు ఎక్కువగా ఉన్నటు బయటపడింది. చిత్రదుర్గలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ అకౌంట్స్ విభాగంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్.తిమ్మబోవి దాదాపు కోటిరూపాయలు అక్రమమార్గంలో సంపాదించినట్లు లోకాయుక్త గుర్తించింది. ఆదాయంతో పోల్చినప్పుడు ఇతని సంపాదన 155 రెట్లు ఎక్కువ. రాష్ట్రపారిశ్రామికాభివృద్ధి శాఖ బెల్గాం విభాగంలో జాయింట్ డెరైక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కే.పీ పరమేశ్వరప్ప దాదాపు రూ.1.50 కోట్ల స్థిర,చరాస్తులు కలిగి ఉన్నట్లు తేలింది. దాదాపు 143 రెట్లు ఎక్కువ ఆస్తులను కూడబెట్టినట్లు లోకాయుక్త మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
టపాసుల దుకాణాల్లో సోదాలు
సాక్షి,సిటీబ్యూరో/అమీర్‌పేట: అధిక ధరలకు టపాసులు విక్రయిస్తున్న షాపులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ ఎస్.గోపాల్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి నగర వ్యాప్తంగా దాడులు చేశారు. మొత్తం 25 కేసులు నమోదు చేశారు. టపాసులు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు చేశామని ఆ శాఖ నగర అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీనివాసులు తెలిపారు. అమీర్‌పేటలోని విష్ణు ఫైర్స్‌తో పాటు పలు షాపుల్లో టపాసుల డబ్బాలపై సొంతంగా ధరలు వేసి, విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. సుమారు 2 లక్షల విలువైన టపాసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పలు దుకాణాల్లో 2010లో తయారు చేసిన టపాసులకు కొత్త ప్యాకింగ్ వేసి విక్రయించడాన్ని తీవ్రంగా పరిగణించారు. సుమారు 20 లక్షల టపాకాయలు, కాకర్స్‌ను సీజ్ చేసి 25 కేసులు నమోదు చేశారు. ఈ దాడులు వరసగా మూడు రోజుల పాటు సాగనున్నాయి. రైళ్లలో తరలిస్తే కఠిన చర్యలు: జీఎం శ్రీవాస్తవ రైళ్లలో టపాసులు, బాణాసంచా తరలిస్తే చర్యలు తీసుకుంటామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. ఆర్పీఎఫ్, ఇతర భద్రత, వాణిజ్య విభాగాలు స్టేషన్లలో, రైళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సోమవారం రైల్‌నిలయంలో దీపావళి నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పేలుడు పదార్థాలు రైళ్లలోకి ప్రవేశించకుండా తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. పొగ తాగేవారిని కూడా అనుమతించకూడదని ఆదేశించారు. భద్రతను దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే సెక్యూరిటీ హెల్ప్‌లైన్ 1322 నంబర్‌కు సమాచారం అందజేయాలని జీఎం కోరారు. రహదారులపై నిషేధం పయాణికులతో రద్దీగా ఉండే రహదారులు, పాఠశాలలు, ఆస్పత్రుల సమీపంలో టపాసులు కాల్చడంపై నిషేధం విధించినట్లు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. ధ్వని కాలుష్యానికి కారణమవుతున్న భారీ శబ్దాన్ని ఉత్పత్తి చేసే టపాసులు వాడొద్దని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. క్రాకర్స్‌కు బదులు సహజ సిద్ధమైన దీపాలతో ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం ఉత్తమమన్నారు. -
ఇటు ఫ్రెండ్లీ పోలీసింగ్ అటు సోదాలు
వీకెండ్లో బిజీబిజీగా గడిపిన సైబరాబాద్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: ఒకపక్క రాఖీ పండుగ.., మరోపక్క వీకెండ్. అయినా సైబరాబాద్ పోలీసులు మాత్రం విధి నిర్వహణలో ఆదివారం బిజీబిజీగా గడిపారు. శంషాబాద్‌జోన్‌లో 250 మందితో ‘కార్డన్ అండ్ సర్చ్’ నిర్వహించగా, మరోపక్క ఎల్బీనగర్, బాలానగర్ జోన్ పోలీసులకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన తరగతులు నిర్వహించారు. ప్రజల్లో పోలీసు ప్రతిష్టను మరింత పెంచేందుకు నడుంబిగించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ .. ముందుగా తమ సిబ్బందికి ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అన్ని ఠాణాల సిబ్బందిని ఒక్కచోట కూర్చోబెట్టి అవగాహన తరగతులు నిర్వహించాలని ఆయా జోన్ల డీసీపీలను ఆదేశించారు. ప్రజలతో పోలీసులు ఎలా ప్రవర్తించాలి, బాధితులకు ఎలా సాయమందించాలనే విషయాలపై సిబ్బందికి వివరించాలని ఆయన సూచించారు. ఐపీఎస్ అధికారి నుంచి కానిస్టేబుల్ వరకూ వారి ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే ప్రజల నుంచి పోలీసులకు మన్ననలు అందుతాయని కమిషనర్ భావిస్తున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు బాలానగర్, ఎల్బీనగర్ డీసీపీలు ఏఆర్ శ్రీనివాస్, విశ్వప్రసాద్‌లు తమ జోన్ పరిధిలో ఆదివారం పోలీసు సిబ్బందికి ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన కల్పించారు. కార్డన్ సర్చ్.. సైబరాబాద్‌లో శాంతి భద్రతలు, నేరాలు అదుపునకు మరోపక్క జోన్ల వారీగా ఇప్పటికే కార్డన్ సర్చ్ (బస్తీ గస్తీ) కార్యక్రమం నిర్వహిస్తూ నేరస్తులను పసిగట్టే పనిలో పడ్డారు. గత పదిహేను రోజుల్లో బాలానగర్, మాదాపూర్ డీసీపీ జోన్ల పరిధిలో కార్డన్ సర్చ్‌లో వందలాది దొంగ వాహనాలు, పదుల సంఖ్యలో నేరస్తులు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇది నేరస్తులను సైబరాబాద్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేసేందుకు ఎంతో ఉపకరిస్తోంది. తాజాగా, ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ జోన్ పరిధిలో డీసీపీ రమేష్‌నాయుడు, క్రైమ్స్ ఇన్‌ఛార్జి డీసీపీ జి.జానకీషర్మిల నేతృత్వంలో 250 మంది పోలీసులు పహాడీషరీఫ్‌లోని శ్రీరామ్‌కాలనీ, మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలోని లక్ష్మీగూడలో కార్డన్ సర్చ్ నిర్వహించి 44 వాహనాలను సీజ్ చేశారు. మరో ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. -
లోకాయుక్త దాడులు
ఏడుగురు అధికారుల ఇళ్లలో సోదాలు రూ. 9.70 కోట్ల సొత్తు గుర్తింపు సాక్షి,బెంగళూరు : అవినీతి ఆరోపణలున్న ఏడుగురు ప్రభుత్వ అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో రాష్ట్ర లోకాయుక్త బుధవారం సోదాలు నిర్వహించింది. 19 చోట్ల ఏకకాలంలో చేసిన తనిఖీల్లో రూ.9.70 కోట్ల సొత్తు వెలుగు చూసింది. కాగా, లోకాయుక్త సోదాల్లో బయటపడిన సొత్తు విలువ బహిరంగ మార్కెట్లో మూడు రెట్లకుపైగా ఉంటుంది. లోకాయుక్త అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్ఎన్ సత్యనారాయణరావు తెలిపిన వివరాల మేరకు.. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏబీ హేమచంద్ర రూ 2 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నాయి. అక్రమ సంపాదన అతని ఆదాయం కంటే 97 శాతం ఎక్కువగా ఉంది. కర్ణాటక రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, బెంగళూరులో ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎం వేణుగోపాల్ తన ఆదాయం కంటే 120 రెట్ల ఎక్కువ ఆస్తులు కూడబెట్టారు. కర్ణాటక కౌన్సిల్ ఫర్ టెక్నికల్ అప్‌గ్రెడేషన్, బెంగళూరులో మేనేజింగ్ డెరైక్టర్ వీ.మునియప్ప రూ.2.77 కోట్ల స్థిర, చరాస్తులు కూడబెట్టారు. అతని సంపాదనతో పోలిస్తే ఈ ఆస్తుల విలువ 115 రెట్లు అధికం. కర్ణాటక స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టార్ బీఎన్ మునినారాయణప్ప తన ఆదాయం కంటే 278 రెట్ల ఎక్కువ ఆస్తులు కూడబెట్టారు. ప్రజాపనుల శాఖ దేవరాజ్అర్స్ ట్రక్ టర్మినల్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ హెచ్ఎస్ ప్రసన్నకుమార్ రూ.2.13 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు, రూ.58 లక్షల విలువ చేసే చరాస్తులను కూడబెట్టారు. అవి అతని ఆదాయంతో పోలిస్తే 216 రెట్లు అధికం. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ ఇంజనీర్ హవగిరిరావు తన ఆదాయం కన్నా 247 రెట్ల అధికం ఆస్తులు కూడబెట్టారు. రెవెన్యూ శాఖలో గుల్బర్గా రీజనల్ కమిషనర్ సయ్యద్ నజీర్ అహ్మద్ వజీర్ తన ఆదాయం కన్నా 96 రెట్లు ఎక్కువగా ఆస్తులు కలిగి ఉన్నారు. -
విశాఖ KGHలో ఎసిబి అధికారులు సోదాలు
-
లోకాయుక్త పంజా
రాష్ట్ర వ్యాప్తంగా 23 చోట్ల ఏకకాలంలో సోదాలు రూ.7 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం ఆదాయం కన్నా 201 రెట్లు ఆస్తులున్న ఐఎఫ్ఎస్ అధికారి సాక్షి, బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్న ఏడుగురు ప్రభుత్వ అధికారులకు చెందిన కార్యాలయాలు, ఇళ్లపై రాష్ట్ర లోకాయుక్త శుక్రవారం ఏకకాలంలో దాడులు చేసింది. బెల్గాం, చిక్కమగళూరు, దార్వాడ, గుల్బర్గా, తుమకూరు, యాదగిరి జిల్లాలో 23 చోట్ల సోదాలు చేపట్టింది. దాదాపు రూ.7 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు లోకాయుక్త అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్.ఎన్ సత్యనారాయణరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ స్థిర, చరాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు నాలుగురెట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. వివరాలు... బెల్గాంలో ప్రజాపనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇర్షద్ అహ్మద్ షంశుద్దీన్ కిత్తూర్ రూ.1.12 కోట్ల స్థిర, రూ. 63 లక్షల చరాస్తులను కలిగి ఉన్నారు. వీటి విలువ అతని ఆదాయం కంటే 247.78 శాతం అధికం. కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్, శివమొగ్గాలో డిప్యుటేషన్‌పై అ సిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఈ హలెశెప్పా ఆదాయం కంటే 127 శాతం ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. హుబ్లీలో హుబ్లీ-దార్వాడ డెవెలప్‌మెం ట్ అథారిటీలో మేనేజర్ పరమేశ్వర ప్ప హుచ్చప్పగౌడ విభూతి రూ.51, 73,000 విలువైన స్థిరాస్తులు, రూ.33, 49,610 విలువ జేసే చరాసు లు ఉన్నాయి. ఆదాయం కంటే 166 శా తం ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. గుల్బర్గాలోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శరణప్ప బోవినకెరి ఆదాయం కంటే 171 రెట్ల ఆస్తులు కూడబెట్టారు. గుల్బర్గా, కర్ణాటక గృహమండలిలో ఆఫీస్ సూపరింటెండెంట్ శివపుట్టప్ప రూ.2.12 కోట్ల విలువైన స్థిర,చరాస్తులు కూడబెట్టారు. వీటి విలువ అతనికి వచ్చే ఆదాయంతో పోలిస్తే 146 రెట్లు ఎక్కువ. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ బెంగళూరులో మేనేజింగ్ డెరైక్టర్, ఐఎఫ్ఎస్ ర్యాంకు అధికారి ఏసీ కేశవమూర్తి రూ.1.39 కోట్ల స్థిరాస్తులు, రూ.2.86 కోట్ల విలువజేసే చరాస్తులను కూడబెట్టారు. వీటి విలువ అతని ఆదాయం కన్నా 201.53 రెట్లు అధికం. గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖలో జూనియర్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సుభాష్ చంద్ర తనకు వచ్చే ఆదాయంతో పోలిస్తే 278 రెట్ల ఆస్తులు కలిగి ఉన్నారు.