![It Department Searches At Congress Candidate Vivek House - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/21/At-Congress-Candidate-Vivek-House.jpg.webp?itok=RxinsPTH)
సాక్షి, మంచిర్యాల: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్, మంచిర్యాలలోని వివేక్ ఇళ్లలో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి.
వివేక్ ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన కంపెనీలు, అతని ముఖ్య అనుచరులు, బంధువుల ఇళ్లలోనూ ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల వివేక్‌కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్విసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాలోకి బదిలీ అయిన రూ.8 కోట్లు సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే.
సోమాజీగూడలోని వివేక్ నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. నాలుగున్నర గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 13న ఫ్రీజ్ చేసిన నగదుపై ఐటీ అధికారులు ఆరా తీశారు. కాగా, మంచిర్యాలోని వివేక్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.
చదవండి: తనిఖీల జప్తులో తెలంగాణ టాప్.. ఏకంగా 659 కోట్ల స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment