Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Kommineni Comments On Chandrababu Govt1
ఇమేజీ బాగా డ్యామేజీ అవుతోంది బాబూ!

ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోందన్న భావన రోజు రోజుకూ బలపడుతోంది. తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులున్నా.. పోలీసులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం కూడా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఇదే విషయానికి ‘‘బాబు ష్యూరిటీ- గుండాయిజం గ్యారంటీ..’’ శీర్షికతో సాక్షి ప్రచురించిన ఒక కథనం అద్దం పడుతోంది.కొద్ది రోజుల క్రితం ఒక స్వతంత్ర సంస్థ జరిపిన సర్వే కూడా ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి బాగా దిగజారిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అత్యధిక శాతం ప్రజలు ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలను కోరుకున్నా అది ఆశించినంతమేర సాగడం లేదని సమాచారం. ప్రజల నుంచి ఎక్కడికక్కడ నిరసన వ్యక్తమవుతూండటంతో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారట.ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు ప్రజలు పట్టుపడుతూండటంతో ఎమ్మెల్యేలు దిక్కుతోచని స్థితిలో పడ్డారని తెలుస్తోంది. ఇదే సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ‘‘రీకాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో’’ అంటూ జనంలోకి వెళుతోంది. అన్ని నియోజక వర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రజలకు చేసిన మోసాలను అంకెలతో వివరిస్తున్నారు. ఇది కాస్తా ప్రభుత్వానికి చికాకుగా మారింది. దీన్ని అడ్డుకునేందుకా అన్నట్టు టీడీపీ, జనసేనలు రెండూ వైసీపీ సభలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి.గుడివాడలో జరిగిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశాన్ని టీడీపీ వారు అడ్డుపడే ప్రయత్నం చేయడం ఏమిటి? పోలీసులు నిలువరించలేకపోవడం ఏమిటి? ప్రజాస్వామ్యంలో ఎవరైనా సమావేశాలు పెట్టుకోవచ్చు. జెడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేయడం ఏమిటి? వాహనం అద్దాలు పగులగొట్టి మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలం వాడడం ఏమిటి?వైఎస్సార్‌సీపీ వారిపై నిత్యం ఏదో ఒక ఆరోపణ చేసి తామే మహిళోద్దారకులం అని చెప్పుకునే కూటమి పెద్దలు ఈ అంశంపై నోరు తెరవకపోవడం ఏమిటి? పైగా వాహనంలో ప్రయాణిస్తున్న హారిక భర్త రాముపై ఎదురు కేసు పెట్టారట. దాడి ఘటనపై కేసు పెట్టకపోవడంపై గట్టి హెచ్చరిక చేయడంతో టీడీపీ వారిపై కేసులు నమోదు చేసినా కీలకమైన వ్యక్తిపై మాత్రం పెట్టలేదట. అసలు అల్లరికి కారణమైన వ్యక్తిని వదలి వేస్తే ఏమిటి అర్థం? ఇదేనా పోలీసు వ్యవస్థ పనితీరు!నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడిచేసి విధ్వంసం సృష్టించిన వారిపై ఎందుకు చర్య తీసుకోలేదు? ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంతి చేసిన ఫిర్యాదుపై మాత్రం పోలీసులు వేగంగా స్పందించారు. ఎవరి తప్పు ఉన్నా కేసు పెట్టవచ్చు. కాని పోలీస్ యంత్రాంగం ఒక వైపే చూడడం ఏపీ స్పెషాలిటీగా మారింది. వైఎస్సార్‌ కాంగ్రెస్ అధినేత జగన్ ఎక్కడకు వెళ్లినా, పోలీసులు ఏదో రకంగా అడ్డం తగలడం, ఆ పార్టీ వారిపై కేసులు పెట్టడం నిత్యకృత్యంగా మారింది. జగన్ సత్తెనపల్లి టూర్‌కు సంబంధించి సుమారు 150 మందికి పోలీసులు నోటీసు ఇచ్చి విచారణ పేరుతో వేధిస్తున్నారని చెబుతున్నారు.అనంతపురం వద్ద లింగమయ్య అనే వైఎస్సార్‌సీపీ నేత హత్యకు గురైతే అక్కడకు జగన్ వెళ్లినప్పుడు కూడా ఇలాగే చేశారు. జగన్ హెలికాఫ్టర్ వద్ద సరైన సెక్యూరిటీ పెట్టకుండా, దాని విండ్ షీల్డ్ దెబ్బతింటే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి, ఇతర కార్యకర్తలపై కేసులు పెట్టారు. జగన్ మామిడి రైతుల పరామర్శకు బంగారుపాళ్యం వెళితే అక్కడా అదే తంతు. అసలు జగన్ పర్యటనలో 500 మించి పాల్గొనరాదని ఆంక్ష పెట్టి ఏమి సాధించదలిచారు.అయినా జనం వేలాదిగా తరలివచ్చారు అంటే అది జగన్ మీద అభిమానంతోనే కదా? దానిని తట్టుకోలేక ఇక్కడ కూడా ఏదో కారణం చూపి కొందరిని అరెస్టు చేశారు. పైగా చిన్న కేసులు పెట్టవలసిన చోట ఏకంగా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం, వీలైతే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం వంటివి చేస్తున్నారు. పొగాకు రైతుల సమస్యపై పొదిలి వెళితే అక్కడకు టీడీపీ గూండాలను పోలీసులు ఎలా అనుమతించారు?వైఎస్సార్‌సీపీ రీకాలింగ్ చంద్రబాబు మానిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తుండడం అధికార పార్టీ కూటమికి కంటగింపుగా మారింది. దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియక వారే అల్లర్లు సృష్టిస్తున్నారు. దీంతో ఏపీలో ఒక రకమైన భయానక వాతావరణం నెలకొంటోంది. రాజకీయపరమైన వేధింపులే కాదు.. ఇతరత్రా కూడా అనేక సంఘటనలు ఏపీలో శాంతి భద్రతలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఉదాహరణకు ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పంలో అప్పు తీర్చలేదని ఒక మహిళను చెట్టుకు కట్టి హింసించిన ఘటన కలకలం రేపింది.మహిళలపై అత్యాచారాల ఘటనలు రిపోర్టు అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా శ్రీకాళహస్తిలో జనసేన ఇంఛార్జి కోట వినూత దంపతులు తమ వద్ద పనిచేసిన డ్రైవర్ శ్రీనివాసులును హత్య చేసిన ఉదంతం తీవ్ర సంచలనమైంది. వినూతకు, టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి మధ్య ఉన్న విబేధాల గురించి వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఒక మహిళా నేతను బెదిరించడానికి బొజ్జల అనుసరించారని వస్తున్న ఆరోపణలు జుగుప్స కలిగిస్తాయి.అవి నిజమైతే అయితే ఈయనపై కూడా కేసు పెట్టాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం పవన్ కళ్యాణ్‌కు తెలిసినా ఆయన పట్టించుకోలేదని వినూత దంపతులు చెబుతున్నారు. చెన్నై పోలీసులు ఈ కేసును పట్టుకున్నారు కాబట్టి ఈ మాత్రం అయినా వెలుగులోకి వచ్చింది. లేకుంటే హత్య ఘటనే ఎవరికి తెలియకుండా పోయేదేమోనన్న సందేహాలు వస్తున్నాయి. వినూతను ఎవరు, ఎందుకు బ్లాక్ మెయిల్ చేశారు, మొదలైన అంశాలు పూర్తిగా వెలుగులోకి రావల్సి ఉంది. ఈ హత్యపై వస్తున్న వార్తల గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌ వంటివారు నోరువిప్పడం లేదు. ఇంకో వైపు కరేడు వద్ద భూ సేకరణ వివాదం, ఇండోసోల్‌కు గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన భూములు వెనక్కి లాక్కుని కరేడు వద్ద వివాదం సృష్టించడం అంటే ఆ పరిశ్రమను ఇబ్బంది పెట్టడమే కదా! రాజధాని అదనపు భూముల పూలింగ్ గొడవ, గతంలో ఒఒక మోసకారి నటిని పట్టుకు వచ్చి ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్‌ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించడం, ఆ సందర్భంగా ఒక సీనియర్ ఐపీఎస్‌ అధికారిని జైలులో పెట్టడం, గత ప్రభుత్వంలో పనిచేసిన కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను ఏదో ఒక కేసులో ఇరికిస్తుండడం, పలువురికి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం, కొంతమంది డీజీ స్థాయి అధికారులు పరిపాలన తీరుతెన్నులపై అసంతృప్తితో ఉండడం, చివరికి తమకు ఉద్యోగం వద్దని చెప్పి రాజీనామా చేసే వరకు వెళ్లడం వంటివి చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్టను బాగా దెబ్బతీస్తున్నాయి. ఐఏఎస్‌, ఐపీఎస్‌లను కూడా వేధిస్తున్నారన్న సమాచారం సహజంగానే దేశమంతటా తెలుస్తుంది. దాని వల్ల ఏపీ ఇమేజీ తీవ్రంగా డామేజి అవుతోంది. అయినా ఫర్వాలేదు.. తమకు రెడ్ బుక్కే ప్రధానమని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి నేతలు భావిస్తే అది ఏపీ ప్రజలు చేసుకున్న ఖర్మ అనుకోవల్సిందే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Nitish Kumar Says Free electricity for up to 125 units In Bihar2
ఎన్నికల ‘పవర్‌ ప్లే’.. ఉచితం అంటూ బీహారీలకు నితీశ్‌ బంపరాఫర్‌!

పాట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షం.. ప్రజలకు వరాలను ప్రకటిస్తున్నాయి. బీహార్‌లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి నితిశ్‌ కుమార్‌ భారీ ప్లాన్‌తో హామీలు ఇస్తున్నారు. తాజాగా ప్రజలకు బంపరాఫర్‌ ఇచ్చారు. బీహార్‌లో 125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులు వస్తే డబ్బులు చెల్లించాల్సి అవసరం లేదని ఆఫర్‌ ప్రకటించారు. వచ్చే నెల నుంచే ఇది అమలులోకి వస్తుందని నితిశ్‌ చెప్పుకొచ్చారు.సీఎం నితీశ్‌ కుమార్‌ తాజాగా ట్విట్టర్‌ వేదికగా మరో పథకాన్ని ప్రకటించారు. ట్విట్టర్‌లో నితిశ్‌..‘బీహార్‌ ప్రజల అవసరాల కోసం మేం మరో పథకాన్ని తీసుకువస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంట్‌ చార్జీలు అందుబాటు ధరల్లోనే ఇస్తున్నాం. దీనిపై ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నాం. గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకు కరెంట్‌ వాడుకుంటే.. వారు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.అంటే, జూలై బిల్లులను కూడా కట్టనక్కర్లేదు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.67 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. రానున్న మూడేళ్లలో గృహ వినియోగదారులందరి మద్దతుతో ప్రతి ఇంటిపై సోలార్‌ పవర్‌ ప్లాంట్లను అమర్చాలని నిర్ణయించాం. బీహార్‌లో 10వేల మెగావాట్ల సోలార్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాంకుటీర్‌ జ్యోతి పథకం కింద.. అత్యంత పేద కుటుంబాలకు సోలార్‌ ప్లాంట్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. మిగతా వారికి అందుబాటు ధరల్లోనే వీటిని అందజేస్తాం’ అని వెల్లడించారు. దీంతో, ఈ పథకంపై బీహార్‌ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఈ పథకం ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా.. బీహార్‌ మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారం కోసం అన్ని పార్టీ ప్రజలకు కీలక హామీలు ఇస్తున్నాయి. ఇక, తాము మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని నీతీశ్ ఇటీవల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. हमलोग शुरू से ही सस्ती दरों पर सभी को बिजली उपलब्ध करा रहे हैं। अब हमने तय कर दिया है कि 1 अगस्त, 2025 से यानी जुलाई माह के बिल से ही राज्य के सभी घरेलू उपभोक्ताओं को 125 यूनिट तक बिजली का कोई पैसा नहीं देना पड़ेगा। इससे राज्य के कुल 1 करोड़ 67 लाख परिवारों को लाभ होगा। हमने यह…— Nitish Kumar (@NitishKumar) July 17, 2025

Pan Pan Pan: Delhi Goa Indigo Flight Emergency Landing3
విమానం నుంచి ‘ప్యాన్‌ ప్యాన్ ప్యాన్‌’.. ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ముంబైలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానాన్ని ముంబైలో అత్యవసర ల్యాండ్‌ చేసిన పైలట్‌.. ‘ప్యాన్‌ ప్యాన్‌ ప్యాన్‌’ అంటూ సంకేతమిచ్చారు. ప్రాణాపాయం ఏమీ లేదు కానీ.. అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ కావాల్సి ఉందంటూ సంకేత భాషలో పైలట్‌ సందేశం పంపించారు.నిన్న(బుధవారం) ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి గోవా బయలేరిన ఇండిగో ఎయిర్‌బస్‌ ఏ320 నియో విమానంలో సమస్య తలెత్తింది. గాలిలో ఉండగా.. ఒక ఇంజిన్‌ పనిచేయకపోవడంతో పైలట్‌ ‘ప్యాన్‌.. ప్యాన్‌.. ప్యాన్‌’ సంకేత భాషలో సమాచారం ఇచ్చారు. దీంతో ఉదయం 9.53 గంటల ప్రాంతంలో విమానాన్ని అత్యవసరంగా ముంబైలో ల్యాండ్‌ చేశారు. విమానంలో 191 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.ఈ ఘటనపై ఇండిగో సంస్థ స్పందిస్తూ.. సాంకేతికలోపం తలెత్తడంతో విమానాన్ని ముంబైకి దారి మళ్లించినట్ల పేర్కొంది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది.కాగా, గత నెల ఇండిగో విమానం నుంచి ‘మేడే కాల్‌’తో ఒక్కసారిగా కలకలం రేగింది. గువహటి నుంచి చెన్నైకి వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పెను ప్రమాదమే తప్పడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇటీవల అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం నుంచి ‘మేడే కాల్‌’ వచ్చిన సంగతి తెలిసిందే. ఎవరైనా పైలట్‌ నుంచి ఏటీసీకి మేడే కాల్‌ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు అత్యవసరం కాని సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు.సహాయం కోసం మేడే కాల్‌ ఇచ్చిన పైలట్‌ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎలాంటి ప్రమాదంలో ఉంది? విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలు కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్‌ను సాధారణంగా 121.5 మెగాహెడ్జ్, 243 మెగాహెడ్జ్‌లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు.

Janasena rayudu Grand Mother Rajeshwari Key Comments On Pawan4
అయ్యా పవన్‌.. నా మనవడి కోసం కాళ్లు పట్టుకున్నా సామీ: రాజేశ్వరమ్మ

సాక్షి, శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జి కోట వినుత మాజీ డ్రైవర్‌ శ్రీనివాసులు అలియాస్‌ రాయుడు దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, రాయుడు హత్యపై అటు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, ఇటు కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపులేదు. ఇక, తన మనవడు రాయుడు హత్యపై రాజేశ్వరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై పవన్‌ కల్యాణ్‌ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘నా మనవడిని ఏం చేయవద్దని కాళ్లు పట్టుకుని వేడుకున్నాను. కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు. హత్యకు ముందు ఐదుసార్లు పంచాయితీ జరిగింది. ఏ మాత్రం కనికరం లేకుండా నా మనవడిని హత్య చేశారు. ఈ ఘటనపై పవన్‌ కల్యాణ్‌ స్పందించకపోవడం బాధాకరం. నా మనవడికి డబ్బు ఇచ్చారని చెబుతున్నారు. ఆ డబ్బు ఎక్కడుందో తెలియాలి. తమిళనాడు పోలీసులే మాకు న్యాయం చేస్తారు. ఏపీకి కేసు బదిలీ చేస్తే కేసు నీరుగారిపోతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తనను చంపేస్తున్నారని.. టీడీపీ నేతకు కూడా రాయుడు మెసేజ్‌ పెట్టాడు. కానీ, ఆయన ఏమీ స్పందించలేదు. నా పేరు బయటకు చెప్పవద్దు.. మీ చావు మీరు చావండి అని అన్నాడని చెప్పుకొచ్చారు. అంతకుముందు.. రాయుడు సోదరి కీర్తి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకున్న ఒకే ఒక్క సోదరుడు శ్రీనివాసులు అని.. అతన్ని పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరవుతోంది. దీన్ని ఇక్కడితో వదిలేస్తే రేపు ఇంకోటి జరుగుతుందని.. తమకు న్యాయం జరగాల్సిందేనని ఆమె పట్టుబడుతోంది. అంతేకాక.. ‘నా అన్నను నాకు లేకుండా చేశారు. మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం. పవన్‌ రావాలి.. మాకు న్యాయం చేయాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. మా అన్నను చంపిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాల్సిందే’.. అని చెప్పింది.ఇదిలా ఉండగా.. అతి సామాన్య కుటుంబానికి చెందిన శ్రీనివాసులును కోట వినుత ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురితో కలిసి అతికిరాతకంగా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ముఖ్యనేతలెవరూ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తమిళ మీడియాలో కూడా ఈ ఉదంతంపై వరుస కథనాలు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగానీ, జనసేన అధినేతగానీ ఇప్పటివరకు నోరువిప్పలేదు. అయితే, మృతుడు కుటుంబ సభ్యులు మాత్రం పవన్‌ రావాలి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.హత్య ఎందుకు జరిగింది..ఎలా చేశారంటే?జనసేన నేత వినుత వద్ద ఉన్న శ్రీనివాసులుపై నిఘా పెట్టిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ముఖ్యనేత అతడికి డబ్బులు ఎర చూపి, వారి రాజకీయ వ్యూహాలు, ఇతర వ్యక్తిగత విషయాలకు సంబంధించి కీలక సమాచారాన్ని తెలుసుకున్నట్లు సమాచారం. దీన్ని కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గత నెల 21న శ్రీనివాసులును విధుల నుంచి తొలగించారు. అయితే కోట వినుతతో ఉన్న కొన్ని వీడియోలు బయట పడడంతో అతడిని మట్టుబెట్టాలని గత నెలలోనే పక్కా ప్లాన్‌ వేసినట్లు చెన్నై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.అయితే అందులోని కొన్ని వీడియోలు బహిర్గతం కావడంతో జీర్ణించుకోలేని కోట చంద్రశేఖర్‌నాయుడు అతడిని ఎలాగైనా అంతమొందించాలని భావించినట్టు తెలిసింది. తలచిందే తడువుగా పక్కా ప్లాన్‌ ప్రకారం పార్టీలోని మరో నలుగురు వ్యక్తుల సహాయంతో శ్రీనివాసులును శ్రీకాళహస్తిలోని ఓ గోడౌన్‌కు తీసుకెళ్లి అక్కడ విచక్షణా రహితంగా కొట్టి చంపినట్టు చెన్నై పోలీసులు భావిస్తున్నారు. అక్కడి నుంచి కారులో చెన్నైకి తీసుకెళ్లి మింట్‌ ఏరియా కూవం నదిలో పడేసి ఆంధ్రాకు తిరిగి వచ్చేశారని చెన్నై పోలీసులు వెల్లడించారు.నిందితులను పట్టించిన పచ్చబొట్టుచెన్నై నగరం, నార్త్‌ జోన్‌ సెవన్‌ వెల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రైనేజీ కాల్వలో యువకుడి మృతదేహాన్ని ఈనెల 8వ తేదీన గుర్తించిన పోలీసులు పోస్టుమార్టంలో హత్య జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే మృతుడి చేతి మీద జనసేన పార్టీ గుర్తు, వినుత పేరు పచ్చబొట్టు ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజ్‌ లభించడంతో శనివారం తెల్లవారుజామున శ్రీకాళహస్తికి చేరుకున్న చెన్నై పోలీసులు జనసేన ఇన్‌చార్జి కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు, హత్యకు సహకరించిన రేణిగుంటకు చెందిన దస్తా సాహెబ్, శ్రీకాళహస్తికి చెందిన కె.శివకుమార్, తొట్టంబేడు మండలానికి చెందిన ఎస్‌.గోపిని తమిళనాడు పోలీసులు అరెస్ట్‌ చేసి చెన్నైకి తీసుకెళ్లారు.

Virat Kohli Becomes Number One T20 Ranker For Most Days In T20Is After ICC Rating Points Updation5
రిటైరైనా చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. బాబర్‌ ఆజమ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు

రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినా చారిత్రక రికార్డులు సాధించాడు. తాజాగా ఐసీసీ ఆల్‌టైమ్ టీ20 పాయింట్లను అప్‌డేట్‌ చేయగా.. అందులో విరాట్‌ కెరీర్‌ అత్యుత్తమ రేటింగ్‌ పాయింట్లు 897 నుంచి 909 పాయింట్లకు పెరిగాయి. దీంతో విరాట్ మూడు ఫార్మాట్లలో 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ (అత్యుత్తమంగా) అందుకున్న తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికే విరాట్ టెస్ట్‌ల్లో అత్యుత్తమంగా 937, వన్డేల్లో అత్యుత్తమంగా 909 రేటింగ్ పాయింట్స్ కలిగి ఉన్నాడు.ఐసీసీ టీ20 రేటింగ్‌ పాయింట్ల అప్‌డేషన్‌ తర్వాత విరాట్‌ మరో చారిత్రక రికార్డును కూడా సాధించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం నంబర్‌ వన్‌గా కొనసాగిన బ్యాటర్‌గా అవతరించాడు. రేటింగ్‌ పాయింట్ల అప్‌డేషన్‌ తర్వాత విరాట్‌ నంబర్‌ వన్‌గా కొనసాగిన జమానా 1013 రోజుల నుంచి 1202 రోజులకు మారింది. రేటింగ్‌ పాయింట్ల అప్‌డేషన్‌కు ముందు అత్యధిక కాలం నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌గా కొనసాగిన రికార్డు పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ పేరిట ఉండేది. బాబర్‌ టీ20ల్లో 1057 రోజులు నంబర్‌ వన్‌గా కొనసాగాడు. తాజా అప్‌డేషన్‌తో విరాట్‌ బాబర్‌ రికార్డును బద్దలు కొట్టి అత్యధిక కాలం నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌గా కొనసాగిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.పై రెండు రికార్డులతో విరాట్‌ టీ20 కెరీర్‌ మరింత హైలైట్‌ అయ్యింది. విరాట్‌ ఇప్పటికే వన్డే, టెస్ట్‌ల్లో లెక్కలేనన్ని, ఎవరికీ సాధ్యపడని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కొత్తగా చేరిన రెండు రికార్డులతో విరాట్‌ అంతర్జాతీయ కెరీర్‌ మొత్తం పరిపూర్ణమైనట్లైంది.విరాట్‌ అంతర్జాతీయ కెరీర్‌లో 125 టీ20లు ఆడి 48.69 సగటుతో 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా టెస్టుల్లో 123 మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 31 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. టీ20, టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విరాట్‌ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 36 ఏళ్ల విరాట్‌ వన్డేల్లో ఇప్పటివరకు 302 మ్యాచ్‌లు ఆడి 57.9 సగటున 51 సెంచరీలు, 74 హాఫ్‌ సెంచరీల సాయంతో 14181 పరుగులు చేశాడు.

Shubhanshu Shukla emotional reunion with family Members6
ఇది అద్భుత క్షణం.. భార్య, కుమారుడిని హత్తుకుని శుభాంశు ఎమోషనల్‌

ఢిల్లీ: భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుతమైన అధ్యాయానికి ఘనమైన ముగింపు లభించింది. మన వ్యోమగామి, వాయుసేన గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా 18 రోజుల అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించుకుని అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి క్షేమంగా తిరిగొచ్చారు. ఇక, తాజాగా శుభాంశు శుక్లా ఎట్టకేలకు తన కుటుంబాన్ని కలుసుకున్నారు. హూస్టన్‌లోని పునరావాస కేంద్రంలో భార్య కమ్నా, కుమారుడు కైశ్‌ను కలిసి ఎమోషనల్‌ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.హూస్టన్‌లోని పునరావాస కేంద్రంలో శుభాంశు శుక్లా.. తన కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా ఎమోషనల్‌గా భార్య, కుమారుడిని హత్తుకున్నారు. రెండు నెలల తర్వాత వారిని కలవడంతో శుభాంశ్‌ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించి ఫొటోలను శుభాంశు.. సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని.. పోస్టులో చెప్పుకొచ్చాడు. సోషల్‌ మీడియాలో పోస్టులో శుభాంశు.. ‘అంతరిక్షయానం అద్భుతం. చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడం సైతం అంతే అద్భుతం. ఈ ప్రయాణం కోసం రెండు నెలలు క్వారంటైన్‌లో గడిపాను. ఈ సమయంలో దూరం నుంచి నా కుటుంబాన్ని చూడాల్సి వచ్చింది. భూమికి తిరిగివచ్చి ఫ్యామిలినీ హత్తుకున్నప్పుడు ఇంటికి వచ్చినట్లే అనిపిస్తోంది. కొన్నిసార్లు మనం బిజీగా ఉంటాం. మన జీవితాల్లోని వ్యక్తులు ఎంత ముఖ్యమైన వారో మర్చిపోతుంటాము. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన వారిని కలిశాను. అంతరిక్ష ప్రయాణాలు మాయాజాలంగా అనిపిస్తాయి. అయితే మనుషుల వల్లే అవి అలా మారాయి’ అని ఎమోషనల్‌ అయ్యారు.Gp Capt Shubhanshu Shukla reunites with his family after returning from space ❤️🇮🇳 pic.twitter.com/yfENxJr7ed— ISRO Spaceflight (@ISROSpaceflight) July 16, 2025మరోవైపు, శుభాంశు సతీమణి కమ్నా స్పందిస్తూ.. ‘శుభాంశు సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. ఈ అద్భుత ప్రయాణం తర్వాత తను తిరిగి మమ్మల్ని కలవడమే మాకు అతిపెద్ద సెలబ్రేషన్‌. ఇకపై తను మునుపటి జీవితాన్ని కొనసాగించడంపైనే దృష్టి నిలుపుతాం. అంతరిక్షంలో ఉన్న సమయంలో తను ఇంటి ఆహారాన్ని మిస్‌ కావాల్సి వచ్చింది. ఇంటికి వచ్చాక తనకు ఇష్టమైన ఆహారాన్ని వండేందుకు ఇప్పటికే ప్లాన్‌ చేసుకుంటున్నా అని’ ఆనందంతో పోస్టు పెట్టారు. Our hero has returned! 👨‍🚀Group Captain #ShubhanshuShukla's successful completion of the historic Axiom Mission 4 is a giant leap for India's space dreams and a powerful step toward Gaganyaan. The nation is filled with pride. 🚀🇮🇳 pic.twitter.com/rSEhnhjZ1v— Piyush Goyal (@PiyushGoyal) July 15, 2025

USA Alaska Hits Earthquake And Tsunami7
అమెరికాను వణికించిన భూకంపం.. సునామీ హెచ్చరిక!

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలోని అలస్కా సముద్ర తీరం భారీ భూకంపం కారణంగా వణికిపోయింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.3గా నమోదు అయినట్టు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే గుర్తించింది. అలాగే, సునామీ హెచ్చరికలు సైతం జారీ చేసింది. దీంతో, అధికారులు అప్రమత్తమన్నారు. ఇక, భూకంపానికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. వివరాల ప్రకారం.. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.37 గంటలకు అలస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.3 తీవ్రతగా దీన్ని గుర్తించారు. 20.కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. స్యాండ్‌ పాయింట్‌ సిటీకి 87 కి.మీ దూరంలో దీని ఎపీసెంటర్‌ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ముందస్తు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు.We got this incredible footage of today's earthquake from a resident in Sand Point, about 50 miles from the epicenter. We are grateful to those who shared their experiences -- it allows others to understand what an earthquake is like, and be better prepared. We are also grateful… pic.twitter.com/5tkqcbgp9Y— Alaska Earthquake Center (@AKearthquake) July 17, 2025 #BREAKING: Water levels have dropped significantly in the last 30 minutes near Raspberry Island, Alaska, following the M7.2 earthquake.This could be a sign of an incoming tsunami wave.#TsunamiWarning #Alaska #RaspberryIsland #Earthquake pic.twitter.com/nbK8cSKpil— upuknews (@upuknews1) July 16, 2025మరోవైపు.. యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అలస్కా, అలస్కా పెనిన్‌సులా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. గంట తర్వాత హెచ్చరికలను విరమించుకున్నారు. భూకంపాలు తరుచుగా వచ్చే పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ప్రాంతంలో అలస్కా ఉంది. 1964 ఉత్తర అమెరికా ప్రాంతంలో 9.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక, 2023లో కూడా అలస్కాలో భూమి కంపించింది. అప్పుడు 7.2 తీవ్రతతో భూమి కంపించడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. Receding waters ahead of the Alaska Tsunami pic.twitter.com/IEaF9UDCRS— Gpena (@SunPowerFusion) July 16, 2025🚨 BREAKING: Water is now receding along the Alaskan coast following the 7.3 earthquake, a clear sign a tsunami is approaching.Residents of Sand Point, Alaska have been ordered to EVACUATE IMMEDIATELY.The National Weather Service and U.S. Tsunami Warning Center have issued an… pic.twitter.com/tcg1GslJsV— Hank™ (@HANKonX) July 16, 2025

Trump says August 1 lot of Money will come into country8
‘ఆగస్టు ఒకటిన మాకు డబ్బే డబ్బు’: ట్రంప్‌‌ కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా విధించిన సుంకాల గడువు తరుముకొస్తున్న తరుణంలో అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉందని ప్రకటించారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు ఒకటి తమకు ఒక ముఖ్యమైన రోజు కానున్నదని, ఆ రోజున తమ దేశానికి పెద్దమొత్తంలో డబ్బు వస్తుందని ట్రంప్‌ పేర్కొన్నారు.భారతదేశంతో తాము కొత్త వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు చెబుతూనే, దీనిపై భారతదేశం- అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ట్రంప్‌ ఆ సమావేశంలో తెలిపారు. ఆగస్టు ఒకటిన తమ దేశానికి గణనీయంగా డబ్బు వస్తుందని, తాము పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని ట్రంప్‌ ప్రకటించారు. ఇప్పడు ఇంకో ఒప్పందం కుదరబోతోందని, అది బహుశా భారతదేశంతో కావచ్చని, దీనిపై చర్చల్లో ఉన్నామని ట్రంప్‌ పేర్కొన్నారు. వారికి తాము ఒప్పందానికి సంబంధించి, ఒక లేఖ పంపామని తెలిపారు. భారతదేశంతో ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్‌ పేర్కొన్నారు.భారత మార్కెట్లకు లబ్ధి చేకూర్చే ఒప్పందంపై అమెరికా పనిచేస్తోందని అన్నారు. కాగా భారత్‌- అమెరికా మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు (బీటీఏ) ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల మేరకు ముందుకు సాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతం ఐదవ రౌండ్ చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వ అధికారులు ఏఎన్‌ఐకి తెలిపారు.

Tamil Nadu: Rahu Kethu temple Thirupampuram Pambunathar full deets inside9
రాహుకేతు పూజలు : తమిళుల కాళహస్తి తిరుప్పాంపురం

జాతకంలో కాలసర్ప దోషం, కళత్ర దోషాలు ఉంటే ఆ దోషాలను తొలగించుకునేందుకు శ్రీకాళహస్తి వెళ్లి రాహుకేతు దోష పూజలు చేయించుకోవడం తెలుగువారి మరి తమిళ తంబీలకు..? వాళ్లకు కూడా ఇలాంటి క్షేత్రం ఒకటి ఉంది.అదే తిరుప్పాంపురం. రాహుకేతువులు ఏకశరీరంగా ఉన్న మహా మహిమాన్వితమైన సర్పక్షేత్రమిది. ఉత్తర శ్రీకాళహస్తిగా పేరు పొందిన ఈ క్షేత్రం తమిళులకు అత్యంత పవిత్రమైనది. తమిళులే కాదు.. ఇరుగు పొరుగు రాష్ట్రాల వారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని సర్పదోషనివారణ పూజలు చేయించుకుని ఉపశమనం పొందుతుంటారు. తిరుక్కాళాత్తి, కుడండై, తిరునాగేశ్వరం, నాగూర్, కీయ్‌ పెరుపల్లం తదితర అయిదు పుణ్యక్షేత్రాల గొప్పతనాన్ని ఒక్కటిగా కలిగి ఉన్న పవిత్ర స్థలమే తిరుప్పాంపురం. సాక్షాత్తూ సర్పాలే తమకు కలిగిన దోషాన్ని ఇక్కడకు వచ్చి తొలగించుకున్న గాథలు ఉన్నాయి. తిరుప్పాంపురం ఆలయంలో ఉన్న దైవం పేరు శేషపురీశ్వరుడు. అమ్మవారు వండుచేర కుయిలి. ఇక్కడ ఉన్న పుణ్య తీర్థం ఆదిశేష తీర్థం. ఈ ఆలయ విశిష్టతను తమిళ వాల్మీకిగా కొనియాడబడిన తిరునావుక్కరుసు వంటివారు కొనియాడారు. స్థలపురాణం: ఒకసారి కైలాసంలో శివుడిని వినాయకుడు పూజిస్తున్నాడు. అప్పుడు శివుడి మెడలోని పాములు తమనూ కలుపుకుని పూజిస్తున్నట్లు గర్వపడ్డాయి. అది గ్రహించిన శివుడు ఆగ్రహించి, ఇక మీదట నాగుపాములన్నీ తమ దివ్యశక్తులను కోల్పోయి సామాన్య సర్పాలవలె మానవుల చేత చిక్కి నానాహింసల పాలూ అయి మరణిస్తాయని శపించాడు. దీంతో శివుడి మెడలోని వాసుకితోపాటు రాహుకేతువులు తదితర సర్పాలు తమ శక్తిని కోల్పోయి తల్లడిల్లాయి. అవి తమ తప్పును తెలుసుకుని తమకు శాపవిమోచనం కల్పించవలసిందిగా పరమేశ్వరుని ప్రాధేయపడ్డాయి. దాంతో బోళాశంకరుడి మనసు కరిగిపోయింది. మహాశివరాత్రి రోజున తిరు΄్పాంపురం వెళ్లి అక్కడ కొలువై ఉన్న తనను ఆరాధిస్తే శాపవిమోచనం కలుగుతుందని చెప్పాడు. అప్పుడు వాసుకి, ఆదిశేషుడు తదితర అన్ని నాగులూ కలసి ఆ ఏడాది మహాశివరాత్రిరోజు తెల్లవారు ఝామునే తిరునాగేశ్వరంలోని నాగనాథ స్వామిని, తిరుప్పాంపురంలోని పాంబునాథుడిని, నాగూరులోని నగనాథుని ఆరాధించాయి. తిరుప్పాంపురం క్షేత్రంలో ఆరాధించిన వెంటనే నాగుల శాపం తొలగిపోయింది. ఇక్కడ ఈశ్వరుడిని ఆరాధించేందుకు వచ్చిన సర్పాలు ఒక పుణ్యతీర్థాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తీర్థానికే ఆదిశేష తీర్థమని పేరు. బ్రహ్మ, ఇంద్రుడు, అగస్త్యుడు, గంగాదేవి వంటి వారు ఇక్కడి ఆలయాన్ని సందర్శించి ధన్యులైనట్లు పురాణ గాథలున్నాయి. ఇదీ చదవండి: అవరోధాలు, అపజయాలు కుంగదీస్తున్నాయా? ఇదిగో పరిష్కారం!ఇక్కడ ఉన్న మూడవ కుళోత్తుంగ చోళుడి శిలాఫలకాన్ని బట్టి చూస్తే ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నాటిదని చెప్పవచ్చు. తంజావూరును పాలించిన శరభోజి చక్రవర్తిపాలనలో ఈ ఆలయానికి వసంతమండ΄ాన్ని, తూర్పుదిక్కుగా రాజగోపురాన్ని నిర్మించారు. ఈ గోపురానికి ఎదురుగానే ఆదిశేష తీర్థం ఉంది. ఇక్కడ ఉన్న వినాయక విగ్రహానికి కూడా పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి స్వామికి శేషపురీశ్వరుడు, పాంబుపుర నాథుడు, పాంబుపురీశ్వరుడు తదితర నామాలున్నాయి. గర్భగుడిలో శివుని పూజించే రీతిలో ఉన్న ఆదిశేషుని విగ్రహం కనువిందు చేస్తుంది. వెలుపలి ప్రాకారానికి ప్రదక్షిణ మార్గంలో భైరవుడు, సూర్యుడు, దుర్గ, శనీశ్వరుడు, రాహువు, కేతువు తదితర సన్నిధులున్నాయి. ఇక్కడ ఉన్న రావిచెట్టుకింద అసంఖ్యాకంగా సర్పశిలలున్నాయి. ఆలయంలో ఈశాన్య దిక్కుమూలలో రాహుకేతువులు ఒకే సన్నిధిలో కనిపిస్తారు. ఇక్కడ రాహుకాల పూజలు విశేషంగా జరుగుతాయి. అలాగే సర్పదోష పరిహార పూజలకు ఈ ఆలయం పెట్టింది పేరు. రాహుకాలంలో ఆలయం తెరిచిన వెంటనే నేతిదీపాలు కొని వెలిగిస్తారు. రాహు, కేతు దోషాల పరిహారపూజలకు తగిన సంభారాలు ఇక్కడే లభిస్తాయి. సర్పదోష నివృత్తి కోసం వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు చేయించుకుంటూ కనిపిస్తారు. జాతకంలో సర్పదోషం ఉన్నవారు, రాహుకేతువులకు మొక్కుకుని, తిరుప్పాంపురంలో పూజలు చేయించుకునే వారు అధిక సంఖ్యాకంగా కనిపిస్తుంటారు. చదవండి: అమెరికా స్టోర్‌లో రూ. లక్ష కొట్టేసిన భారత మహిళ, అరెస్ట్‌ : నెట్టింట చర్చఎలా వెళ్లాలంటే..?తమిళనాడులోని కుంభకోణం నుంచి కారైక్కాల్‌ వెళ్లే దారిలో ప్రధాన రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. చెన్నై సెంట్రల్‌ నుంచి కుంభకోణానికి రైళ్లు, బస్సులు ఉన్నాయి. కుంభకోణం వరకు వెళ్తే అక్కడ నుంచి తిరుప్పాంపురం వరకు వెళ్లడానికి మినీ బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాలు, ఆర్టీసు బస్సులు ఉన్నాయి. చూడదగ్గ ఇతర ప్రదేశాలు: సాధారణంగా తమిళనాడులోని నవగ్రహాలయానికి వెళ్లే వారు ఇక్కడికి వస్తుంటారు లేదంటే ఇక్కడికి వచ్చినవారు నవ గ్రహాలయానికి వెళ్తారు. అలాగే కుంభకోణంలోని ఐరావతీశ్వరన్‌ ఆలయం, ఉప్పిలియప్పన్‌ ఆలయం, ఆదికుంభేశ్వరన్‌ ఆలయం, సారంగపాణి ఆలయం, ఆరుల్‌మిగు స్వామినాథన్‌ ఆలయం, సూర్యనాయర్‌ కోయిల్, పట్టీశ్వరం ఆలయం తదితరాలున్నాయి.– డి.వి.ఆర్‌. భాస్కర్‌

Hari Hara Veera Mallu Poster On Burj Khalifa Is Real Or Fake10
'వీరమల్లు' ఈ రుద్దుడు ఎందుకు..?

'గబ్బర్ సింగ్' సినిమాలో 'నాకు కొంచెం తిక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది' అంటూ పవన్‌ కల్యాణ్‌ చెప్పిన డైలాగ్‌ చాలా పాపులర్‌ అయింది. అయితే, ఆయన అభిమానులు 'హరి హర వీరమల్లు' సినిమా విషయంలో ఇదే లెక్కను ఫాలో అవుతున్నారనిపిస్తుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఎలాంటి బజ్‌లేని ఈ చిత్రాన్ని ప్రమోట్‌ చేసేందుకు నానాపాట్లు పడుతున్నారు. ట్రైలర్‌ విడుదల సమయంలో వ్యూస్‌ పరంగా ఫేక్‌ చేశారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరో కొత్త ప్లాన్‌ వేశారు. ఈ క్రమంలో దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా మీద హరి హర వీరమల్లు పోస్టర్‌ అంటూ అందుకు సంబంధించిన ఫేక్‌ ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. అయితే, అవి నిజమేనని అందరూ నెటిజన్లు కూడా షేర్‌ చేస్తున్నారు. విషయం తెలిసిన వారు మాత్రం ఇలాంటి ఫేక్‌ ప్రచారాలు ఎందుకు చేసుకుంటారని ఘాటుగానే విమర్శిస్తున్నారు.గత కొన్ని గంటలుగా సోషల్‌మీడియాలో బుర్జ్ ఖలీఫా మీద 'హరి హర వీరమల్లు' పోస్టర్ అంటూ ట్రెండ్‌ అవుతుంది. అయితే, అది నిజమైనది కాదు. సినిమా అధికారిక హ్యాండిల్‌ను అనుకరించే నకిలీ ఖాతా నుంచి మొదటసారి పోస్ట్‌ చేయబడింది. ఆపై వందల కొద్ది పలు పేజీలు దానిని షేర్‌ చేయడంతో వైరల్‌ అయిపోయింది. అంతపెద్ద ఎత్తున పోస్టర్‌ను పంచుకుంటే.. చిత్ర యూనిట్‌ తప్పకుండా తమ అధికారిక పేజీలో షేర్‌ చేస్తుంది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమా విడుదలకు కేవలం ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, సినిమా ప్రచార మాత్రం పెద్దగా లేదని కొందరు చెబుతున్నారు. అందుకే ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే, టాలీవుడ్‌లో సినిమా బజ్‌ బాగున్నప్పటికీ.. హిందీ, తమిళ్‌లో పెద్దగా బజ్‌ లేదని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రమోషన్‌ కార్యక్రం కూడా చిత్ర యూనిట్‌ నిర్వహించలేదు. హిందీ హక్కులను ఎవరు కొనుగోలు చేశారన్న వివరాలు అధికారికంగా ఇప్పటికీ వెల్లడించలేదు.పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వేదికను మేకర్స్‌ ఫైనల్‌ చేశారు. జులై 24న పాన్‌ ఇండియా రేంజ్‌లొ విడుదల కానున్న ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు విడుదల కానుంది. అయితే, ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకను ఈ నెల 20న విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. సినిమా రన్‌టైమ్‌: 2:42 నిమిషాలు ఉన్నట్లు పేర్కొంది.Trust the Process 🔥🦅#HariHaraVeeraMallu #BurjKhalifa pic.twitter.com/tvH2Y8FGo1— HariHaraVeeraMallu (@HHVMTeam) July 16, 2025Nice job @HHVMFilm, @AMRathnamOfl, @MegaSuryaProd HHVM hits Burj Khalifa, excellent promotions👏🏻👏🏻#HariHaraVeeraMallu pic.twitter.com/siMGeNqnkl— Megha Shyam Reddy 🦅🚩 (@MSRv96) July 16, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement