ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు చేపట్టింది. ఉగ్ర కుట్ర కేసుకు సంబంధించి 22 చోట్ల ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. యూపీ, అస్సాం, జమ్మూకశ్మీర్, ఢిల్లీ, మహారాష్ట్రలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కాగా, గత నెలలో చైన్నెతో పాటు రాష్ట్రంలో 12 చోట్ల ఎన్‌ఐఏ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. సెల్‌ఫోన్లను, లెక్కలోకి రాని నగదును సీజ్ చేశారు. ఇస్ బత్ తహీర్ పేరిట ఉన్న నిషేధిత తీవ్ర వాద సంస్థకు తమిళనాట యూట్యూబ్ ద్వారా ప్రచారం జరుగుతున్నట్టు ఇటీవల చైన్నె పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు. ఈ సంస్థకు మద్దతుగా సాగుతూ వస్తున్న వీడియో ప్రచారాలు, వాటికి లైక్‌లు కొట్టే వారిని టార్గెట్ చేస్తూ తరచూ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే తంజావూరు, తూత్తుకుడి, తిరుచ్చి,మైలాడుతురై జిల్లాలో విస్తృతంగా సోదాలు జరిగాయి.
ఇదీ చదవండి: కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Comments
Please login to add a commentAdd a comment