terrorists
-
జమ్మూకశ్మీర్ కథువా జిల్లాలో ఎన్ కౌంటర్
-
జమ్ములో కొనసాగుతున్న ఉగ్ర వేట.. నలుగురు పోలీసుల వీరమరణం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టగా.. మరికొందరి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులు వీరమరణం చెందారు. డీఎస్పీ అధికారి సహా మరో ముగ్గురు సిబ్బందికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.రాజ్‌బాగ్ ప్రాంతంలోని జఖోలె గ్రామం వద్ద గురువారం ఈ ఎన్కౌంటర్ జరిగింది. పాక్ భూభాగం నుంచి దొంగచాటుగా చొరబడిన ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన కార్డన్ ఆపరేషన్ సుదీర్ఘ ఎదురు కాల్పులకు దారి తీసింది. ఇంకా నలుగురు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఆదివారం సాయంత్రం కథువా జిల్లా హిరానగర్ సెక్టార్లో జమ్మూకశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ)కి ఎదురుపడ్డ ఉగ్రవాదుల గ్రూపు తప్పించుకుపోయింది. ఘటనాప్రాంతంలో ఎం4 కార్బైన్ తపాకులు నాలుగు, గ్రనేడ్లు 2, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఒకటి, ఐఈడీ సామగ్రి అక్కడ లభించాయి. శనివారం వీరు లోయమార్గం గుండా, లేదా కొత్తగా నిర్మించిన సొరంగం గుండా చొరబడి ఉంటారని భావిస్తున్నారు. అప్పటి నుంచి డ్రోన్లు, హెలికాప్టర్లు, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, జాగితాలతో వేటాడుతూనే ఉన్న ఎస్‌వోజీ అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో గురువారం వారి జాడను పసిగట్టింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సుఫైన్ గ్రామ సమీప దట్టమైన అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. పోలీసులకు తోడు ఆర్మీ, సీఆర్పీఎఫ్ను కూడా ఉన్నతాధికారులు అక్కడికి తరలించారు. -
రక్షణ దళాలకు, ఉగ్రవాదులకు, మధ్య ఎన్కౌంటర్!
హిరానగర్: జమ్మూ కశ్మీర్‌లోని కతూవా జిల్లాలో భారత్-పాక్ సరిహద్దు ప్రాంతమైన హిరానగర్ సెక్టార్ సన్యాల్ గ్రామంలో ఉగ్రవాదులకు, రక్షణ దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పూంచ్ పోలీసులు కలిసి సంయుక్తంగా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా భారత రక్షణ దళాల బృందంపై ఉగ్రవాదులు ఆకస్మికంగా కాల్పులు జరపడానికి యత్నించారు. దాంతో రక్షణ దళాలు కూడా అప్రమత్తమై ఎదురుకాల్పులకు దిగింది. కొంతమంది అనుమానితులు ఆ ప్రాంతంలో నిఘా వేసినట్లు సమాచారం అందుకున్న రక్షణ దళాలు.. ఆదివారం సాయంత్రం వేళ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు, రక్షణ దళాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.నిన్న భారత ఆర్మీ బలగాలు, పూంచ్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. సురాన్ కోట్ లో ఉగ్రవాదులు మాటు వేశారన్న సమాచారంలో ఈ జాయింట్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన విషయాన్ని పసిగట్టిన ఉగ్రమూకలు.. ఓ అటవీ ప్రాంతంలోకి జారుకున్నారు. అయితే అక్కడ ఉగ్రవాదులకు సంబంధించిన కొన్ని మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ కొనసాగింపులో భాగంగా ఆదివారం నాడు ఉగ్రవాదులు, భారత రక్షణ దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్‌కు సంబంధించి ఎవరైనా గాయపడ్డారా, మరణించారా అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. -
అఫ్గాన్ సరిహద్దుల్లో పాక్ ఆపరేషన్.. 30మంది ఉగ్రవాదులు హతం
పెషావర్: పాకిస్తాన్ సైన్యం పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ సైనిక చర్య జరిగింది. నిఘావర్గాలు అందించిన సమాచారం మేరకు భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టి, 30 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. దీనికి సంబంధించిన వివరాలను పాక్ సైన్యం మీడియాకు తెలిపింది.ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందిన నేపధ్యంలో దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలోని సరోఘా ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగింది. భద్రతా దళాలు ఉగ్రవాదుల రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, 30 మంది ఉగ్రవాదులను హతమార్చాయని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. ఈ సైనిక చర్య విజయవంతమైన నేపధ్యంలో పాకిస్తాన్ సాయుధ దళాలను ప్రధాని షాబాజ్ షరీఫ్ ప్రశంసించారు.దీనికి ముందు పాకిస్తాన్‌లోని సమస్యాత్మక వాయువ్య ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. వారు జరిపిన కాల్పుల్లో నలుగురు పాకిస్తాన్ సైనికులు మరణించగా, పలువురు గాయపడ్డారు. 2025 జనవరి నుంచి పాకిస్తాన్లో ఉగ్ర దాడులు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది 2024 డిసెంబర్ కంటే 42 శాతం ఎక్కువ. జనవరిలో ఉగ్రవాద నిరోధక చర్యలలో భాగంగా భద్రతా దళాలు 185 మంది ఉగ్రవాదులను హతమార్చాయని ఒక నివేదిక పేర్కొంది.ఇది కూడా చదవండి: రిస్క్‌లో కుంభమేళా మోనాలిసా? -
అనుమానాస్పద రేడియో సిగ్నళ్లు..ఉగ్రవాదుల పనే..?
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ల్లో ఇటీవల అనుమానాస్పద రేడియో సంకేతాలను గుర్తించారు. ఇవి దేశంలో త్వరలో జరగబోయే ఉగ్రదాడులకు సంబంధించిన సంకేతాలేనని అమెచ్యూర్ హామ్ రేడియో సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ యాసలో ఉర్దూ,బెంగాలీ,అరబిక్ కోడ్ భాషల్లో అనుమానాస్పద రేడియో సిగ్నళ్లను గత రెండు నెలలుగా తమ ఆపరేటర్లు గుర్తించారని తెలిపింది.పశ్చిమ బెంగాల్‌తో సరిహద్దులున్న బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు నెలకొనడం, ఇదే సమయంలో పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ అధికారులు సన్నిహితంగా ఉండడం వంటి పరిస్థితుల నేపథ్యంలో అనుమానాస్పద రేడియో సిగ్నళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. మళ్లీ ఇటువంటి సిగ్నల్స్ వస్తే తమకు తెలియజేయాని రేడియో ఆపరేటర్లకు పోలీసులు సూచించారు.గతేడాది డిసెంబర్లో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్హట్,బొంగావ్,దక్షిణ 24 పరగణాలలోని సుందర్బన్స్ ప్రాంతాల నుంచిఉర్దూ, అరబిక్ భాషలను వాడి వివిధ కోడ్లలో మాట్లాడుకుంటున్నట్లు తాము గుర్తించినట్లు హామ్ రేడియో సంస్థ అధికారులు తెలిపారు. మరికొన్ని సార్లు ఇతర భాషల్లోనూ సిగ్నల్స్ అందుతున్నాయన్నారు.అయితే, తాము తొలుత వీటిని పట్టించుకోలేదన్నారు.జనవరిలో జరిగిన గంగాసాగర్ మేళా సమయంలో వినియోగదారులు తమకు అనుమానాస్పద సంకేతాలు వినిపిస్తున్నాయని ఫిర్యాదు చేయడంతో వెంటనే అప్రమత్తమై కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.ఈ కోడ్ భాష అర్థం తెలుసుకోవడానికి కోల్‌కతాలోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ స్టేషన్ (రేడియో)కి సమాచారం పంపినట్లు బీఎస్ఎఫ్ అధికారి పేర్కొన్నారు. స్మగ్లర్లు,తీవ్రవాద గ్రూపులు రహస్య చర్చల కోసం ఇటువంటి సంకేతాలను వినియోగించుకుంటారన్నారు. వీటిని ట్రాక్ చేయడం కష్టమయినప్పటికీ డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 2002-03లో కూడా ఇదే విధంగా వచ్చిన అనుమానాస్పద సంకేతాలను ట్రాక్ చేసి దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గంగాసాగర్ ప్రాంతం నుంచి అక్రమ రేడియో స్టేషన్లను నిర్వహిస్తున్న ఆరుగురు తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నామన్నారు.2017లో బసిర్‌హట్‌లో మత ఘర్షణలు జరగడానికి ముందు హామ్ రేడియో వినియోగదారులు తమకు అనుమానాస్పద సంకేతాలను వినిపిస్తున్నాయని తెలిపినట్లు చెప్పారు. హామ్ రేడియో దేశ భద్రత విషయంలో అనేకసార్లు కీలక పాత్ర పోషించిందన్నారు. -
జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్..ఏడుగురు ఉగ్రవాదులు హతం
పూంచ్:జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు(ఎల్వోసీ) వద్ద ఇటీవల భారీ ఎన్కౌంటర్ జరిగింది. పూంచ్ జిల్లాలోని క్రిష్ణఘాటి సెక్టార్లో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు చొరబాటుదారులు హతమయ్యారు. మృతి చెందిన వారిలో ముగ్గురు దాకా పాకిస్తాన్ ఆర్మీ జవాన్లే కావడం గమనార్హం.పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ సభ్యులు ఫిబ్రవరి 4 అర్ధరాత్రి సరిహద్దు ద్వారా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వీరిని అడ్డుకోవడానికి సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఏడుగురు చొరబాటుదారులు మృతి చెందారు. ఫిబ్రవరి5వ తేదీని కాశ్మీర్ లిబరేషన్ డేగా పాకిస్తాన్ జరుపుకుంది. ఈ నేపథ్యంలో అదే రోజు పాక్ ఆర్మీకి చెందిన జవాన్లు భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం పట్ల సైన్యం అప్రమత్తమై వారి ప్రయత్నాన్ని అడ్డుకుంది.ఇటీవల జమ్ముకశ్మీర్‌లో వరుస ఘటనల్లో పలువురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఈ ఎన్కౌంటర్లలో పలువురు జవాన్లు కూడా గాయపడ్డారు. డిసెంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతమైన విషయం తెలిసిందే. -
జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదాలు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో గురువారం కద్దర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.Kulgam, Jammu and Kashmir: Encounter started between Security forces and militants in Kadder village of Behibagh, under the jurisdiction of Kulgam District, J&K. Heavy exchange of gunfire going on. Two terrorists are believed to be trapped pic.twitter.com/Etwtwlless— IANS (@ians_india) December 19, 2024‘ఉగ్రవాదుల ఉనికికి సంబంధించిన సమాచారం మేరకు కుల్గాం జిల్లా ఖాదర్‌లో భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదులు, సైనికుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ఐదురుగు టెర్రరిస్ట్‌లు మృతి చెందగా.. ఇద్దరు భారత సైనికులకు గాయాలయ్యాయి’అని భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ విభాగం ఎక్స్ వేదికగా ధృవీకరించింది. ఉగ్రవాదుల ఏరివేతలో భారత సైన్యంమరోవైపు, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల్ని ఏరివేత చేయడంలో భద్రతా బలగాలు కీలక ఆపరేషన్లు చేపట్టాయి. ఈ నెల ప్రారంభంలో, జమ్మూ కాశ్మీర్‌లోని గగాంగీర్, గందర్బల్, ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెర్రరిస్ట్‌ను శ్రీనగర్ జిల్లాలో కాల్చి చంపారు.గత నెలలో జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్, ఖన్యార్ ప్రాంతాల్లో ముగ్గురు ఉగ్రవాదులను, అక్టోబర్ నెలలో కాశ్మీర్లో గందేర్బల్ జిల్లాలోని గగన్‌గిర్ వద్ద గగన్‌గీర్ నుంచి సోనామార్గ్ వరకు చేపడుతున్న జడ్-మోర్హ్ సొరంగ నిర్మాణంలో పాల్గొన్న సిబ్బందిపై మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జునైద్ అహ్మద్ భట్ బృందం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో డాక్టర్, ఆరుగురు కార్మికులు మృతి చెందారు. టెర్రరిస్ట్‌ల కాల్పులతో అప్రమత్తమైన భారత సైన్యం ఎదురు దాడి చేసింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జునైద్ అహ్మద్ భట్‌ను మట్టుబెట్టింది. -
పాకిస్తాన్: నవంబర్‌లో 24 మంది కమాండర్లతో సహా 200 మంది ఉగ్రవాదులు హతం
పెషావర్: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సుల్లో నవంబర్‌లో సైన్యం జరిపిన ఉగ్రవాద వ్యతిరేక దాడుల్లో 24 మంది కమాండర్లతో సహా 200 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఉగ్రవాదులంతా తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇతర ఉగ్రవాద గ్రూపులతో సంబంధం కలిగినవారు.ఇటీవల తీవ్రవాద గ్రూపుల దాడులను దృష్టిలో ఉంచుకుని భద్రతా బలగాలు తీవ్రవాద గ్రూపులపై గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ల కింద నవంబర్ నెలలో 199 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, వీరిలో నిషేధిత సంస్థలకు చెందిన 24 మంది కీలక కమాండర్లు ఉన్నారన్నారు. హతమైన కమాండర్లలో సీనియర్ నేతలు కూడా ఉన్నారని, వీరి కోసం చాలా కాలంగా భద్రతా బలగాలు గాలిస్తున్నాయని అధికారులు తెలిపారు.మరోవైపు పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మతపరమైన హింసలో మృతిచెందిన వారి సంఖ్య ఆదివారం నాటికి 130కి పెరిగింది. కుర్రం జిల్లాలో వరుసగా పదకొండో రోజు కూడా ఘర్షణలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అలీజాయ్- బగన్ తెగల మధ్య ఘర్షణలు నవంబర్ 22న ప్రారంభమయ్యాయి. సున్నీ, షియా గ్రూపుల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని, హింస కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ముష్కరులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అనంత్‌నాగ్‌లో శనివారం(నవంబర్ 2) భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి.ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అక్కడ గాలింపు కొనసాగుతోంది. కాగా, శ్రీనగర్ బుడ్గమ్లో శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వలస కార్మికులు మరణించిన విషయం తెలిసిందే. ఈ వారంలో ఐదు ఉగ్రవాద సంబంధిత ఘటనలు జరగడం గమనార్హం.ఇదీ చదవండి: రూ.15 కోసం ముక్కును తెగనరికి -
ఉగ్రవాదుల చొరబాటు కట్టడికి అప్రమత్తంగా ఉన్నాం: ఆర్మీ
శ్రీనగర్: జమ్ము ప్రాంతంలోకి సరిహద్దు వెంబడి దాదాపు 50 మందికి పైగా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని భారత ఆర్మీ అంచనా వేస్తోంది. ఉగ్రవాదుల చొరబాటు కట్టడి విషయంలో ఆర్మీ బలగాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేస్తామని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అఖ్నూర్ సెక్టార్లో ముగ్గురు ఉగ్రవాదులను విజయవంతంగా అంతం చేసిన అనంతరం 10వ పదాతిదళ విభాగానికి చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ సమీర్ శ్రీవాస్తవ విలేఖరులతో మాట్లాడారు. ‘‘పౌరులకు హాని కలిగించే ఉగ్రవాదుల ప్రయత్నాలను ఆర్మీ అడ్డుకుంటుంది. మంగళవారం ఉదయం అఖ్నూర్ సెక్టార్‌లోని ఒక గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలో 27 గంటల కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య మూడుకు చేరుకుంది. అఖ్నూర్ కఠినమైన నిఘాలో ఉంది. ...అఖ్నూర్లో ఉగ్రవాదుల శాశ్వత ఉనికి లేదు. మేము మా గార్డును వదులుకోం. చాలా కాలంగా ఈ ప్రాంతం చొరబాట్లను చూడలేదు. ప్రతి ఏడాది చొరబాటు విధానం మారుతోంది. ముఖ్యంగా చలికాలం సమయంలో మేము కూడా ఉగ్రవాదుల చొరబాటు కట్టడి విషయంలో అప్రమత్తంగా ఉన్నాం’’ అని అన్నారు.ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం.. సరిహద్దుల వెంబడి 50 నుండి 60 మంది ఉగ్రవాదులు ఉన్నారని సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు. అఖ్నూర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చడం భద్రతా బలగాలకు లభించిన పెద్ద విజయంగా అభివర్ణించారు.చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
ఆర్మీ కాన్వాయ్‌పై ముష్కరుల కాల్పులు
జమ్మూ: జమ్మూ జిల్లాలోని అఖ్నూర్ సెక్టార్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. వాస్తవాధీన రేఖకు సమీపంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా ఆర్మీ కాన్వాయ్‌పైకి ఉగ్ర మూకలు కాల్పులకు దిగాయి. బలగాలు అప్రమత్తమై దీటుగా స్పందించడంతో ప్రమాదం తప్పింది. అనంతరం ముష్కరులు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పరారయ్యారు. ఆ ప్రాంతాన్ని దిగ్బంధించిన బలగాలు అదనంగా పోలీసులను, ఆర్మీని తరలించి గాలింపు ముమ్మరం చేశారు. ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడి వద్ద ఆయుధం స్వాధీనం చేసుసుకున్నారు. హెలికాప్టర్‌ను రంగంలోకి దించి బలగాలు ఓ భవనం బేస్మెంట్లో ఉగ్రవాదులు దాగినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా భారీ పేలుళ్లు, కాల్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు సభ్యుల ముష్కరుల ముఠా ఆదివారం రాత్రి సరిహద్దులు దాటి దొంగచాటుగా దేశంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ అంబులెన్సుకు కనీసం డజను బుల్లెట్లు తగిలాయని చెప్పారు. అంతకుముందు, ఉగ్రవాదులు అస్సన్ ఆలయంలోకి ప్రవేశించి సెల్‌ఫోన్ కోసం అక్కడి వారిని అడిగారు, ఇంతలోనే అటుగా వస్తున్న ఆర్మీ కాన్వాయ్‌ని గమనించి కాల్పులకు దిగారన్నారు. -
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. యూపీ కార్మికునికి తీవ్రగాయాలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో మరో ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఈసారి పుల్వామాలో ఉగ్రవాదులు కాశ్మీరేతరులను లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆర్మీ అధికారులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వార్తా సంస్థ పీటీఐ తెలిపిన వివరాల ప్రకారం జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గల ట్రాల్ ప్రాంతంలో గురువారం ఉదయం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక కార్మికునిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రీతమ్ సింగ్‌ను ఆర్మీ సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత వారం రోజులుగా కశ్మీర్లో స్థానికేతర కార్మికులపై దాడులు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి గందర్‌బాల్‌లోని శ్రీనగర్-లేహ్ హైవేపై సోనామార్గ్ సమీపంలోని గగాంగిర్ ప్రాంతంలో టన్నెల్ నిర్మిస్తున్న కంపెనీకి చెందిన వలస కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక వైద్యునితో సహా ఆరుగురు కార్మికులు మృతిచెందారు.మరణించిన కార్మికులలో కశ్మీరీలతోపాటు కశ్మీరేతరులు ఉన్నారు. కశ్మీర్లో వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరు ఇక్కడి ప్రాజెక్టులలో పనిచేస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లకు చెందిన కార్మికులు కశ్మీర్‌లోని యాపిల్ తోటలు, పలు నిర్మాణ పనులు, రైల్వే ప్రాజెక్టులలో పనులు చేస్తున్నారు. 2021లో కూడా వలస కార్మికులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇప్పుడు మళ్లీ కశ్మీర్లో ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: బాలికపై లైంగిక వేధింపులు.. మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత -
BSF: 150 మంది ఉగ్రవాదులు కాచుక్కూర్చున్నారు..
శ్రీనగర్: శీతాకాలం సమీపిస్తున్నండగా కశ్మీర్ లోయలో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి 150 మంది వరకు ఉగ్రవాదులు మన భూభాగంలోకి దొంగచాటుగా ప్రవేశించేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని బీఎస్ఎఫ్(సరిహద్దు భద్రతా దళం) తెలిపింది. చొరబాటుదారులు చేసే ఎలాంటి ప్రయత్నాలనైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ‘చొరబాటు యత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ నిఘా విభాగాల నుంచి అందుతున్న సమాచారం ఆధారంగా ఆర్మీతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దుల్లో భద్రతపై అప్రమత్తంగా ఉన్నాం’అని బీఎస్ఎఫ్ ఐజీ(కశ్మీర్) అశోక్ యాదవ్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ‘పాక్ వైపు సరిహద్దులకు సమీపంలోని స్థావరాల్లో ఉండే ముష్కరుల గురించిన అంచనాలను బట్టి, చొరబాటుయత్నాలను తిప్పికొట్టి, వారిపై పైచేయి సాధించేలా మా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాం’అని యాదవ్ వివరించారు. ‘ఎల్వోసీకి సమీపంలోని స్థావరాల్లో కాచుకుని ఉండే ఉగ్రవాదుల సంఖ్య 130–150 మధ్య మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇంతకంటే కాస్త ఎక్కువమందే ఉండొచ్చు’అని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఎల్వోసీ వెంట ఉన్న తంగ్ధర్, కెరన్ సెక్టార్ల పరిధిలో డ్రగ్స్ అక్రమ రవాణాకు అవకాశాలున్నాయంటూ ఆయన..వీటిని అడ్డుకునేందుకు మొబైల్ బంకర్లు, మహిళా ట్రూపర్లను రంగంలోకి దించామని వెల్లడించారు. స్మగ్లర్లు డ్రగ్స్ కొరియర్లుగా మహిళలను వాడుకుంటున్నారని ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. -
దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. ఉగ్ర కుట్ర కేసుకు సంబంధించి 22 చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. యూపీ, అస్సాం, జమ్మూకశ్మీర్, ఢిల్లీ, మహారాష్ట్రలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.కాగా, గత నెలలో చైన్నెతో పాటు రాష్ట్రంలో 12 చోట్ల ఎన్ఐఏ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. సెల్ఫోన్లను, లెక్కలోకి రాని నగదును సీజ్ చేశారు. ఇస్ బత్ తహీర్ పేరిట ఉన్న నిషేధిత తీవ్ర వాద సంస్థకు తమిళనాట యూట్యూబ్ ద్వారా ప్రచారం జరుగుతున్నట్టు ఇటీవల చైన్నె పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. ఈ సంస్థకు మద్దతుగా సాగుతూ వస్తున్న వీడియో ప్రచారాలు, వాటికి లైక్‌లు కొట్టే వారిని టార్గెట్ చేస్తూ తరచూ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే తంజావూరు, తూత్తుకుడి, తిరుచ్చి,మైలాడుతురై జిల్లాలో విస్తృతంగా సోదాలు జరిగాయి.ఇదీ చదవండి: కుప్వారాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం -
భయానక ఘటన.. గంటల వ్యవధిలో 600 మంది ఊచకోత
బుర్కినా ఫాసో: కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 600 మందిని దారుణంగా కాల్చి చంపిన అత్యంత భయానక ఘటన పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో జరిగింది. బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు ఈ కిరాతకానికి పాల్పడ్డారు. ఆగస్టులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఆగస్టు 24న బర్సాలోగో పట్టణంపై బైక్‌లపై దూసుకొచ్చిన ఉగ్రవాదులు కన్పించినవారిని కాల్చేశారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉన్నారు. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ రెబల్స్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్, మాలిలో ఉన్న అల్-ఖైదా అనుబంధ సంస్థ, బుర్కినా ఫాసోలో ఉగ్రవాద సంస్థలు ఆ దేశంలో క్రియాశీలకంగా పని చేస్తున్నాయి. ఈ ఘటనలో.. ఐక్యరాజ్యసమితి దాదాపు 200 మంది మరణించినట్లు అంచనా వేయగా, ఉగ్రవాద సంస్థ జెఎన్ఐఎం దాదాపు 300 మందిని చంపినట్లు ప్రకటించింది.ఇదీ చదవండి: ఇరాన్ అణుస్థావరాలు పేల్చేయండి: ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచన -
టార్గెట్ ఐసిస్..సిరియాపై అమెరికా దాడులు
వాషింగ్టన్:పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఓ పక్క లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తుండగానే సిరియాలో ఉగ్రవాద స్థావరాలపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అగ్రదేశం ప్రకటించింది.మరణించిన ఉగ్రవాదులు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐసిస్),అల్‌ఖైదాతో లింకున్న సంస్థలకు చెందినవారని అమెరికా వెల్లడించింది.హతమైన వారిలో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలిపింది.అల్‌ఖైదాతో లింకున్న హుర్రాస్ అల్దీన్ గ్రూపునకు చెందిన ఉగ్రవాదులు టార్గెట్‌గా వాయువ్య సిరియాపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇదీ చదవండి: హెజ్బొల్లాకు మళ్లీ షాక్..మరో ముఖ్యనేత హతం -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా పరిధిలోని ఓ మారుమూల గ్రామంలో ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం అందుతోంది. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.ఆ తర్వాత సైనికులు ప్రతీ దాడి జరిపారు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల మేరకు మెంధార్‌లోని పఠాన్ తీర్ ప్రాంతంలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు భద్రతా అధికారి తెలిపారు. దాక్కున్న ఉగ్రవాదులు సెర్చ్ పార్టీపై కాల్పులు జరిపారని, దీంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని ఆయన చెప్పారు.రెండు వైపుల నుంచి అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయని, అదనపు బలగాలను ఆ ప్రాంతానికి పంపామని అధికారి తెలిపారు. బారాముల్లాలో 12 గంటలకు పైగా జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. దాదాపు 12 గంటలకు పైగా జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఇది కూడా చదవండి: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి -
బారాముల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: అసెంబ్లీ ఎన్నికల ముందు జమ్ముకశ్మీర్‌లో బాంబు మోత మోగుతోంది. ఇప్పటికే కథువా, కిష్త్వార్ జిల్లాలో ఎన్కౌంటర్ కొనసాగుతుండగా.. తాజాగా బారాముల్లా జిల్లాలోనూ భద్రతా బలగాలు.. ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.ఈ ఎన్కౌంటర్ ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారు. ఉత్తర కాశ్మీర్ పట్టాన్ ప్రాంతంలోని చక్ తాపర్ క్రీలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. స్కూల్ బిల్డింగ్‌లో దాక్కున్న మిలిటెంట్లతో ఎదురుకాల్పులకు దిగారు. శుక్రవారం రాత్రి ఒక మిలిటెంట్ చనిపోగా, శనివారం ఉదయం మరో ఇద్దరు హతమయ్యారు.చదవండి: మోదీ పర్యటన ముందు జమ్ముకశ్మీర్‌లో కాల్పుల మోత.. ఇద్దరు జవాన్ల మృతిఎన్కౌంటర్లో ముగ్గురు చనిపోయినట్లు కశ్మీర్ ఐజీ వీకే బిర్డి వెల్లడించారు. ఆ మిలిటెంట్లను గుర్తించే ప్రక్రియలో ఉన్నట్లు చెప్పారు. మరోవైపు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ దోడా జిల్లాలో ప్రధాని మోదీ ప్రచారం చేపట్టనున్నారు.Joint operation with @JmuKmrPolice in progress at #Baramulla. https://t.co/YZY7MLjYeo pic.twitter.com/GkvBlwRJ2k— NORTHERN COMMAND - INDIAN ARMY (@NorthernComd_IA) September 14, 2024 -
సైన్యం కాల్పుల్లో ఉగ్రవాదులు మృతి
జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్లో దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని సోమవారం (సెప్టెంబర్ 9) సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఎన్కౌంటర్లో చనిపోయిన ఉగ్రవాదుల వద్ద నుంచి ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. నౌషేరా ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఇదే ప్రాంతంలో చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపి తప్పించుకున్నారు. ఈ ఘటన తర్వాత అప్రమత్తమైన సైన్యం ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఇదీ చదవండి.. ఘనంగా రెండో ప్రపంచ యుద్ధ వీరుడి బర్త్‌డే వేడుకలు -
మళ్ళీ మంటలు
మూడు నెలలుగా కాస్తంత ప్రశాంతత నెలకొన్నట్టుందనుకొనే లోగా కథ మళ్ళీ మొదటి కొచ్చింది. మణిపుర్లో శాంతి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. కల్లోలిత ఈశాన్య రాష్ట్రంలో మెయితీల ప్రాబల్య మున్న కొన్ని ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో మునుపెన్నడూ లేని డ్రోన్ దాడులతో దేశం ఉలిక్కి పడింది. ఇప్పటి దాకా భావిస్తున్నట్టు ఇది కేవలం రెండు వర్గాల మధ్య జాతి, మతఘర్షణలే అనుకోవడానికి వీల్లేదని తేలిపోయింది. ముందుగా వేసుకున్న ఒక పథకం ప్రకారం, వ్యవస్థీకృతంగా సాగిస్తున్న యుద్ధనేరాల స్థాయికి దాడులు చేరిపోయాయి. మణిపుర్లో ఘర్షణలు తగ్గిపోయాయంటూ ప్రధాని మోదీ చెప్పిన మాటల్లో పస లేదని క్షేత్రస్థాయి సంఘటనలతో స్పష్టమైంది. పైగా భారత భూభాగం లోపలే, సాక్షాత్తూ దేశ పౌరులపైనే ఇలా సైనిక వ్యూహంతో డ్రోన్ దాడులు మొత్తం ఈ ప్రాంతాన్నే భయంలోకి నెట్టి, అస్థిరపరచే కుట్రగా కనిపిస్తోంది. మయన్మార్‌లో జుంటాపై ప్రజాస్వామ్య అనుకూల వేర్పాటువాదులు సాగించే ఈ యుద్ధతంత్రం ఇక్కడ దర్శన మివ్వడం సరిహద్దుల ఆవల ప్రమేయాన్ని చూపుతోంది. ఇది ఆందోళనకరమైన పరిణామం. అత్యాధునిక సాంకేతిక జ్ఞానంతో కూడిన డ్రోన్ల ద్వారా తీవ్రవాదులు రాకెట్ చోదిత గ్రెనేడ్లను ప్రయోగించడంతో ఆదివారం పలువురు గాయపడ్డారు. సోమవారం సైతం మరో గ్రామంపై ఇదే పద్ధతిలో డ్రోన్ దాడులు జరిగాయి. మణిపుర్లో హింస కొంతకాలం నుంచి ఉన్నదే అయినా, ఇలా పౌరులపై డ్రోన్లతో బాంబులు జారవిడవడం ఇదే తొలిసారి. అదీ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌కు వ్యతిరేకంగా గిరిజనుల ఆధిక్యం ఉన్న కొన్ని జిల్లాల్లో కుకీ – జో వర్గాలు నిరసన ప్రదర్శనలు జరి పిన మర్నాడే ఈ ఘటనలు జరగడం గమనార్హం. యుద్ధాల్లో వాడే ఇలాంటి వ్యూహాలను ఇలా అనూహ్యంగా అందరిపై ప్రయోగించి, ఉద్రిక్తతల్ని పెంచినది కుకీలే అన్నది పోలీసుల ఆరోపణ. అదెలా ఉన్నా, ఇది మన నిఘా సంస్థల వైఫల్యానికీ, తీవ్రవాదుల కట్టడిలో మన భద్రతాదళాల వైఫల్యానికీ మచ్చుతునక. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం మణిపుర్లో జరిగిన డ్రోన్ దాడులను నిశితంగా అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. తీవ్ర వాదులు ఎలాంటి డ్రోన్లను వాడారన్నది మొదలు పలు అంశాలను ఈ కమిటీ నిశితంగా పరిశీలించనుంది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టా లన్న దానిపై నివేదిక సమర్పించనుంది. అయితే గతేడాది మేలో మొదలైన హింసాకాండ చివరకు ఈ స్థాయికి చేరిందంటే, ఇప్పటికీ చల్లారలేదంటే తప్పు ఎక్కడున్నట్టు? ఉద్రిక్తతల్ని చల్లార్చి, విభేదాలు సమసిపోయేలా చూడడంలో స్థానిక పాలనా యంత్రాంగం ఇన్ని నెలలుగా విఫలమైందన్న మాట. కొండ ప్రాంతాలకూ, లోయ ప్రాంతాలకూ మధ్య బఫర్ జోన్లు పెట్టి, భద్రతాదళాల మోహరింపుతో శాశ్వతంగా శాంతి భద్రతల్ని కాపాడగలమని పాలకులు భావిస్తే పిచ్చితనం.అసమర్థ పాలనతో పాటు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ మాత్రం కుర్చీ పట్టుకొని వేలాడుతూ, ఆ మధ్య కూడా గొప్పలు చెప్పారు. తాము నియమించిన శాంతిదూతలు గణనీయమైన పురోగతి సాధించారనీ, ఆరు నెలల్లో శాంతి తిరిగి నెలకొంటుందనీ ఊదరగొట్టారు. ఆ మాటలన్నీ నీటిమూటలేనని తాజా ఘటనలు ఋజువు చేశాయి. పైపెచ్చు, తాజాగా ఆధునిక సాంకేతికత సాయంతో, అత్యాధునిక ఆయుధాలతో సాగుతున్న దాడులను బట్టి చూస్తే, కొన్ని వర్గాలకు దేశం వెలుపల నుంచి అన్ని రకాల వనరులు అందుతున్నట్టు అనుమానం బలపడుతోంది. దేశ సమగ్రత, సార్వభౌమత్వానికే ముప్పుగా పరిణమించే ఇలాంటి పరిస్థితుల్లో పాలకులు కుంభకర్ణ నిద్ర పోతే పెను ప్రమాదం. శతాబ్దాలుగా అనేక సంక్షోభాలను ఎదుర్కొని, తమ మట్టినీ, మనుగడనూ కాపాడుకొన్న చరిత్ర మణిపుర్ ప్రజలది. అలాంటి ప్రాంతాన్ని పేరుకు మాత్రమే భారత్‌లో భూభాగంగా చూడక, ఆ ప్రాంత ప్రజల బాగోగులు, అక్కడి శాంతి సుస్థిరతలు తాము పట్టించుకుంటామని పాలకులు నిరూపించుకోవాల్సిన సమయమిది. 2023 నుంచి కుకీలు, మెయితీల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం అట్టుడుకుతోంది. ఎక్కడ ఏ వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంటే, అక్కడ అది ఆ వర్గపు అడ్డాగా ఇప్పటికే మణిపుర్ అనేక జోన్లుగా అనధికారంగా చీలిపోయింది. ఇంటిలోని ఈ గుండెల మీద కుంపటి చాలదన్నట్టు, ఆ పక్కనే మన దేశానికి సరిహద్దులు సైతం అంతే ఉద్రిక్తంగా తయారయ్యాయి. జుంటాకూ, తిరుగు బాటుదారులకు మధ్య ఘర్షణలతో మయన్మార్ రగులుతోంది. ఇటీవలి రాజకీయ సంక్షోభంతో పొరుగున బంగ్లాదేశ్‌తో వ్యవహారం అస్తుబిస్తుగా ఉంది. ఈ గందరగోళ భూభౌగోళిక వాతావరణం మణిపుర్ వ్యవహారాన్ని మరింత సున్నితంగా మార్చేస్తోంది. అంతా బాగానే ఉందనడం మాని, ఇప్పటికైనా బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ తాము అనుసరిస్తున్న ధోరణిని పునస్సమీక్షించుకోవాలి. మణిపుర్ మరో యుద్ధభూమిగా మిగిలిపోకూడదనుకుంటే, మన పాలకులకు కావాల్సింది రాజకీయ దృఢసంకల్పం, చిత్తశుద్ధి. దేశ అంతర్గత భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని గమనించి, తక్షణ నష్టనివారణ చర్యలు చేపట్టాలి. ఏ ఒక్క వర్గానికో కొమ్ము కాయడం మాని, పెద్దన్న తరహాలో అన్ని వర్గాల ప్రజల మధ్య స్నేహ సౌహార్దాలు నెలకొనేలా నిజాయతీగా కృషి చేయాలి. సంబంధిత వర్గాలన్నిటితో రాజకీయ చర్చలు సాగించాలి. ఘర్షణల్ని పెంచిపోషిస్తున్న అంతర్లీన అంశాలను గుర్తించి, వాటిని ముందుగా పరిష్కరించాలి. తాత్కాలిక సర్దుబాటు కాక శాశ్వత శాంతిస్థాపనకై చర్చించాలి. ఇప్పటికైనా పాలకులు వివేకాన్ని చూపగలిగితే, మణిపుర్‌ను మంటల్లో నుంచి బయటపడేయవచ్చు. లేదంటే దేశమంతటికీ కష్టం, నష్టం. -
జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురి ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో రెండు చోట్ల జరిగిన ఎన్కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. గురువారం కుప్వారా, రాజౌరీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందటంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రత బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంతరం భద్రతా బలంగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.‘ఉగ్రవాదుల చొరబాటుకు సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారం అదించింది. దీంతో 28, 29 తేదీల్లో ఆర్మీ బలగాలు, జమ్ము కశ్మీర్ పోలీసులతో సంయుక్తంగా మచల్, కుప్వారా ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ చేపట్టాం. ప్రతికూల వాతావరణంలో అనుమానాస్పద కదలికలుపై కాల్పులు జరిపాం. ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు’ అని శ్రీనగర్‌కు చెందిన చినార్ కార్ప్స్ ‘ఎక్స్’లో పేర్కొంది.OP PHILLORA, TANGDHAR #Kupwara Based on intelligence inputs regarding likely infiltration bids, a Joint anti-infiltration Operation was launched by #IndianArmy & @JmuKmrPolice on the intervening night of 28-29 Aug 24 in general area Tangdhar, Kupwara. One terrorist is likely to… pic.twitter.com/R2N6ql2NgM— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) August 29, 2024 ఇవాళ ఉదయం కుప్వారా మచిల్ సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల ఏరివేత కర్యకలాపాలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.J-K: One terrorist likely killed in anti-infiltration Op in KupwaraRead @ANI Story | https://t.co/R5Q1x1r2rp#Infiltration #Kupwara #IndianArmy pic.twitter.com/8aJvooyP4i— ANI Digital (@ani_digital) August 29, 2024 -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ ఒకరు ప్రాణాలు విడిచాడు. ఉదంపూర్‌లోని దాదు ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో జమ్ముకశ్మీర్ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్, సీఆర్పీఎఫ్ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసుల రాకను గమనించి ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగారు. మావోయిస్టుల కాల్పుల్లో సీఆర్ఎపీఎఫ్ అధికారి మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు.ఇదిలా ఉండగా.. జమ్మూ ప్రాంతంలో ఇటీవల తీవ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. జూలైలో, దోడా జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక అధికారితో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది, ఒక పోలీసు సిబ్బంది మరణించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ షాడో గ్రూప్ 'కశ్మీర్ టైగర్స్' పేర్కొంది. జూలై 8న కతువా జిల్లాలోని పర్వత రహదారిపై ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై మెరుపుదాడి చేయడంతో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. -
జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్, ఇద్దరు జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్‌లో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. అనంత్‌నాగ్ జిల్లా అహ్లాన్ గడోల్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కోకెర్నాగ్ సబ్‌డివిజన్‌లోని అడవిలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.విదేశీ పౌరులుగా భావిస్తున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రత్యేక బలగాలు, ఆర్మీ పారాట్రూపర్లను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో భద్రతా బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు తనిఖీలు చేస్తుండగా జవాన్లపైకి కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు సైతం ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. అయితే, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతిచెందగా.. మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. -
Jammu-Kashmir: ఈ ఉగ్రవాదుల ఆచూకీ చెబితే రూ. 5 లక్షల రివార్డు
ఇటీవలి కాలంలో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు కలకలం సృష్టిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు స్థానిక పోలీసులు, ఆర్మీ సిబ్బంది సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య పలుచోట్ల ఎదురుకాల్పులు జరిగాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని కథువా పోలీసులు నలుగురు ఉగ్రవాదుల స్కెచ్లను విడుదల చేశారు. ఈ ఉగ్రవాదులు చివరిసారిగా ధోక్ ఆఫ్ మల్హర్, బానీ, సియోజ్ధర్లో కనిపించారు. వీరికి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. జూన్ 9న రియాసీలో జరిగిన ఉగ్రదాడి తర్వాత జమ్మూ డివిజన్లో తీవ్రవాద ఘటనలు పెరుగుతూ వస్తున్నాయి. శివఖోడి నుంచి వైష్ణోదేవికి వెళ్తున్న బస్సును ఉగ్రవాదులు చుట్టుముట్టారు. అనంతరం డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, బస్సు అదుపు తప్పి కాలువలో పడింది. అనంతరం ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తొమ్మదిమంది మరణించగా, 41 మంది గాయపడ్డారు.ఈ దాడి జరిగిన రెండు రోజుల తరువాత కథువాలో రెండు ఉగ్రవాద ఘటనలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 11న జమ్మూ డివిజన్లోని కథువా, దోడా, భదర్వాలో ఉగ్రదాడులు జరిగాయి. నాటి ఎన్కౌంటర్లో భారత సైనికులు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. Kathua Police releases sketches of 04 terrorists who were last seen in dhoks of Malhar , Bani & Seojdhar. A reward of 05lakhs on each terrorist for an actionable information. Anyone with credible information of terrorists will also be suitably rewarded.@JmuKmrPolice@ZPHQJammu pic.twitter.com/FsBG1qdZdt— Kathua Police (@KathuaPolice) August 10, 2024 -
టేలర్ స్విఫ్ట్ కచేరీపై ఉగ్రదాడికి కుట్ర
వియన్నా: ఆ్రస్టియా భద్రతాధికారులు సకాలంలో స్పందించి పెనుముప్పు నివారించగలిగారు. అమెరికా గాయని టేలర్ స్విఫ్ట్ గురువారం రాజధాని వియన్నాలో తలపెట్టిన కచేరీలో నరమేధానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు. 19 ఏళ్ల ప్రధాన సూత్రధారి సహా 17 ఏళ్ల మరో యువకుడిని అరెస్ట్ చేశారు. 15 ఏళ్ల మరో అనుమానితుడిని ప్రశి్నస్తున్నారు. ఎర్నెస్ట్ చాపెల్ స్టేడియానికి వచ్చే వారిని పేలుడు పదార్థాలు వాడి లేదా కత్తులతో పొడిచి సాధ్యమైనంత ఎక్కువమందిని చంపాలని పథకం వేసినట్లు తేలింది. వీరికి ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)తో సంబంధాలున్నట్లు సోదాల్లో అధికారులు గుర్తించారు. ఈ పరిణామం నేపథ్యంలో టేలర్ పాల్గొనాల్సిన మొత్తం మూడు కచేరీలను రద్దు చేశారు. -
బంగ్లాదేశ్ అంటే భయపడాల్సిందేనా?
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఒక ప్రదర్శన, పాలనా వ్యవస్థ మార్పు అనే సింగిల్ పాయింట్ పిలుపుగా బంగ్లాదేశ్‌లో రంగులు మారింది. దాంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని వీడాల్సి వచ్చింది. నిరసనల్లో కొందరు పాకిస్తానీయులను జోడించారని ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి. భారత ఈశాన్య ప్రాంతాల నుండి ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామాలను సృష్టించడానికి, బంగ్లాదేశ్ అనుకూల వాతావరణాన్ని పాక్ మళ్లీ ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ, బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న చైనా కోరల గురించి భారత్ జాగ్రత్త పడాలి. ఈ పరిస్థితులలో భారత్ చేయవలసింది... బంగ్లాదేశ్ మిలిటరీకి మద్దతు ఇవ్వడం! ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో చైనా అనుకూలురు నిండిపోకుండా చూసుకోవడం!!ముజిబుర్ రెహ్మాన్ కుటుంబానికి ఆగస్టు ఎప్పుడూ క్రూరమైన నెలగానే ఉంటోంది. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నిర్మాత షేక్ ముజిబుర్ రెహ్మాన్ తన మొత్తం కుటుంబంతో సహా 1975 ఆగస్టు 15 తెల్లవారుజామున సైనిక తిరుగు బాటులో మరణించారు. ఆయన ఇద్దరు కుమార్తెలు షేక్ హసీనా, షేక్ రెహానా భారతదేశానికి వలస రావలసి వచ్చింది.తన తండ్రి వారసురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన షేక్ హసీనా, 2004 ఆగస్టు 21న తాను ప్రసంగిస్తున్న ర్యాలీపై గ్రెనేడ్ దాడిలో గాయపడి దాదాపు మరణం అంచులను తాకి వచ్చారు.బంగ్లాదేశ్‌లోని సిల్హెట్లో హర్కత్–ఉల్–జిహాద్ అనే ఉగ్రవాద సంస్థ చేసిన ఆ దాడిలో అవామీ లీగ్ కార్యకర్తలు చాలామంది మరణించారు. ఇప్పుడు 20 సంవత్సరాల తరువాత ఆగస్టు మధ్యాహ్నం, హసీనాను ప్రధాని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ, ఆమె నివాసంపై దాడి చేస్తామని బెదిరించిన నిరసనకారులను కాల్చి చంపడా నికి ఇష్టపడని బంగ్లాదేశ్ సైన్యం, ఆమెను పదవి వీడి ఢాకా నుండి పారిపోవాలని కోరింది.బంగ్లాదేశ్‌లో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబాల పిల్లలకు ఉద్యోగాల్లో 30 శాతం మేరకు కోటా కల్పిస్తున్నట్లు హసీనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కోటాకు వ్యతిరేకంగా నెల రోజుల పాటు సాగిన విద్యార్థి ప్రదర్శనల పట్ల షేక్ హసీనా ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదు. ఆ ఘటన... బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్– ఎ–ఇస్లామీ పార్టీల్లోని ఆమె ప్రత్యర్థుల మద్దతుతో పాలన మార్పు కోసం డిమాండ్‌గా మారిందని ఇక్కడ తిరిగి చెప్పాల్సిన పనిలేదు.బంగ్లాదేశ్ బాగుండాలని కోరుకునే వారికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, విద్యార్థుల ప్రతిఘటనా ఉద్యమం పాలనా మార్పు కోసం డిమాండ్‌గా మాత్రమే కాకుండా, భావజాల మార్పు కోసం ప్రతీకార యుద్ధంగా మారింది. హసీనా దేశం విడిచి పారి పోవ డంతో, బంగ్లాదేశ్ జాతిపిత ముజిబుర్ రెహ్మాన్ విగ్రహాన్ని ఇస్లాం విరుద్ధమని పేర్కొంటూ ఆందోళనాకారులు పగలగొట్టారు. అవామీ లీగ్ నాయకుల కార్యాలయాలను, ఇళ్లను కూడా తగలబెట్టారు.అంతకు ముందు రోజు రాత్రి రంగ్‌పూర్‌లో, ఇతర ప్రాంతాల్లో మైనా రిటీల ఇళ్లపై, గ్రామాలపై దాడులు జరిగాయి. ఇది బంగ్లాదేశ్‌కు, మరీ ముఖ్యంగా పొరుగు దేశాలకు ఏ సంకేతాలను ఇస్తోంది?గత రెండు ఎన్నికలలో రిగ్గింగ్ చేసిన ఆరోపణలతో సహా, ఎన్ని తప్పులు చేసినప్పటికీ, అవామీ లీగ్ దేశంలో లౌకిక పాలనను అందించింది. బంగ్లాదేశ్‌లో నివసించే మైనారిటీల భూములు కబ్జాకు గురై, అప్పుడప్పుడు దాడులు జరిగినప్పటికీ, ఏ సైనిక నియంతృత్వం లేదా దేశాన్ని పాలించిన మునుపటి పాలనా వ్యవస్ధల కంటే చాలా ఎక్కువ స్థాయిలో వాళ్లు సమాన అవకాశాలను పొందారన్నది వాస్తవం.చిట్టగాంగ్ కొండ ప్రాంతాలలో బౌద్ధ గిరిజనులపై దాడులు, బరిషల్, ఫరీద్‌పూర్‌లలో హిందూ గ్రామాలను తగులబెట్టడం తర చుగా జరుగుతూ వచ్చిన బంగ్లా నేషనలిస్టు పార్టీ పాలించిన రోజుల్లోకి ప్రస్తుతం బంగ్లాదేశ్ దిగజారిపోవడం భారత్‌కు నిజంగానే ఆందోళన కలిగించే విషయం. ఈ పరిణామం ఇప్పటికే జనాభాపరంగా విస్తరించి ఉన్న పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రా ల్లోకి వేలాదిమంది శరణార్థులను నెట్టివేస్తుంది. బంగ్లా నేషనలిస్టు పార్టీ పాలనలో, జిహాదీలను అఫ్గానిస్తాన్‌కు ఎగుమతి చేసి బంగ్లాదేశ్ అపఖ్యాతి పాలైంది. 2001లో తాలిబన్లను తరిమికొట్టిన తర్వాత, వారు బంగ్లాదేశ్‌కు తిరిగివచ్చి, ఢాకాలోనే కాకుండా భారత గడ్డపై దాడులకు పాల్పడి బీభత్సం సృష్టించారు. ఇప్పుడూ అలా జరిగే అవకాశం గురించి భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల ‘తిరుగుబాటు’లో కొందరు పాకిస్తానీ యులను జోడించారని ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి. భారతదేశ ఈశాన్య ప్రాంతాల నుండి ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామా లను సృష్టించడానికి, బంగ్లాదేశ్‌లోని అనుకూల వాతావరణాన్ని పాకిస్తాన్ మళ్లీ ఉపయోగించుకునే అవకాశం ఉంది.భారతదేశం వంటి పొరుగు దేశాలతో వాణిజ్యం, ప్రయాణ కనెక్టివిటీకి ప్రాధాన్యతనిస్తూనే స్వతంత్ర అలీన విదేశాంగ విధానాన్ని కోరుకునే వారికీ... చైనాతో సన్నిహిత సంబంధాలను నెరపడానికి అవసరమైతే భారతదేశ భద్రతా ప్రయోజనాలతో రాజీ పడటానికైనా సిద్ధపడేవారికీ మధ్య అవామీ లీగ్ పాలన విభజితమై ఉండింది. ఏదేమైనప్పటికీ, షేక్ హసీనా ఎల్లప్పుడూ ఇతరులకు ప్రాధాన్య తనిస్తూనే భారతదేశంతో మెరుగైన సంబంధాలను నిర్మించుకునే వైఖరిని తీసుకుంటూ వచ్చారు. తీస్తా నదిని దిగువకు అభివృద్ధి చేసే విషయంలో, చైనా ప్రతిపాదనను పక్కనబెట్టి బంగ్లాదేశ్‌తో భాగ స్వామి కావాలనే భారత ప్రతిపాదనకు సూటిగా అంగీకరించారు. ఆ మేరకు బీజింగ్ ఆమె పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు కొట్టివేసిన కోటాలకు (బంగ్లా స్వాతంత్య్రోద్యమం కోసం పోరాడిన కుటుంబాల పిల్లలకు ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు) వ్యతిరేకంగా జరిగిన ఒక ప్రదర్శన నుండి, పాలనా వ్యవస్థ మార్పు అనే సింగిల్ పాయింట్ పిలుపుగా విద్యార్థుల నిరసనలు రంగు మారుతున్న క్రమంలో ఇలా జరగటం అనేది మరొక విషయం. కానీ, చరిత్ర కారులు, అంతర్జాతీయ సంబంధాల పరిశీలకులు ఏదో ఒక రోజు దీనిపై పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఏమైనప్పటికీ, బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న చైనా కోరల గురించి భారతదేశమూ, గతంలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని అనేక అంశాలలో వ్యతిరేకించిన పాశ్చాత్య దేశాలూ జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవ సరం ఉంది. చైనాకు బంగ్లాదేశ్ దాదాపు 7 బిలియన్ డాలర్ల రుణా లను చెల్లించాల్సి ఉంది. దాని రుణ చెల్లింపులు ఇప్పటికే దాని విదేశీ మారక నిల్వలకు సంబంధించి సంక్షోభం సృష్టించాయి. ఇవి 2021 ఆగస్టు, 2024 జూన్ మధ్య కాలంలో 60 శాతం మేరకు పడి పోయాయి. శ్రీలంకను అనుసరించి బంగ్లాదేశ్ కూడా చైనా రుణ ఉచ్చులో మునిగిపోవచ్చు. రుణమాఫీకి బదులుగా రుణదాతకు వ్యూహాత్మక ఓడరేవులు, ఆర్థిక మండలాలను ఇవ్వవలసి వస్తుంది కూడా. చైనా ఓడలు నెలల పర్యంతం హిందూ మహాసముద్ర ప్రాంతాలను సర్వే చేస్తున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్ర ప్రాంత దేశాలలో విస్తరించిన చైనా నావికాదళ ఉనికితో ఇవి సంబంధం కలిగి ఉంటాయి. ఢాకాలో కొత్తగా రానున్న ప్రభుత్వంతో వ్యవహరించేటప్పుడు ఈ అంశాలన్నింటినీ భారతీయ ఉన్నతాధి కారులు పరిగణనలోకి తీసుకోవాలి. ఈ పరిస్థితులలో, భారతదేశం, ప్రజాస్వామ్య ప్రపంచం కాయ వలసిన ఉత్తమమైన పందెం ఏమిటంటే బంగ్లాదేశ్ మిలిటరీకి మద్దతు ఇవ్వడం, ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం చైనా అనుకూల మంత్రులు లేదా కరడుగట్టిన ఛాందసవాదులతో నింపబడకుండా చూసుకో వడం. అవామీ లీగ్ పని ముగియలేదు. అది ఇప్పటికీ దేశంలో లోతైన మూలాలను కలిగి ఉంది. పెద్ద సంఖ్యలో మద్దతుదారులను కలిగి ఉంది. సైన్యం ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసిన తాత్కాలిక ప్రభు త్వంలో అవామీ లీగ్ తన స్థానాన్ని కోల్పోకూడదు.చివరగా, ప్రపంచం శరవేగంతో మారుతుంది. కమ్యూనిజం రాత్రికి రాత్రే మరణించినట్లే, షేక్ హసీనా ప్రభుత్వం కూడా కుప్పకూలి పోయింది. ఏదేమైనప్పటికీ, భావజాలాలు పాలనా వ్యవస్థల కంటే ఎక్కువ కాలం కొనసాగుతాయి. ఇవి సరైన ‘వాతావరణ పరిస్థితు ల’లో పునరాగమనం చేయగలవు. బంగ్లాదేశ్‌లో పెట్టుబడులు పెట్టిన భారతదేశం, ఇతర దేశాలన్నీ ఆ పాఠాన్ని గుర్తుంచుకోవడం మంచిది.జయంత రాయ్ చౌధురీ వ్యాసకర్త పీటీఐ తూర్పు రీజియన్ మాజీ హెడ్(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
బీచ్‌లో ఆత్మాహుతి దాడి.. 32 మంది మృతి
మొగదీషు: సోమాలియాలో ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు రాజధాని మొగదీషులోని లిడో బీచ్‌కు వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. బీచ్ హోటల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుడులో మొత్తం 32 మంది మృతిచెందగా మరో 63 మంది గాయపడ్డారు. మొగదీషులోని బీచ్‌లోని ఓ హోటల్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు తొలుత కాల్పులు జరిపి అక్కడున్నవారిని భయభ్రాంతులకు గురి చేశారు. అనంతరం ఉగ్రవాదుల్లో ఒకరు తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ పేలుడులో చాలా మంది చనిపోయారు. పేలుడు తీవ్రతకు బీచ్‌లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉగ్రవాదుల దాడి సమాచారమందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ముగ్గురు ఉగ్రవాదులను అంతమొందించారు. మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని అల్‌ఖైదాతో సంబంధాలున్న అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. -
కుప్వారాలో ఎన్కౌంటర్.. ఒక జవాను వీరమరణం
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో భారత సైన్యం, పాక్ సైన్యం మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఉత్తర కశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై మచల్ (కుప్వారా) సెక్టార్లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ) జరిపిన దాడిని భారత సైనికులు భగ్నం చేశారు. ఈ ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఐదుగురు భారత సైనికులు గాయపడ్డారు. వారిలో ఒక జవాను వీరమరణం పొందారు. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కమాండోలతో పాటు, బాట్ టీమ్ స్క్వాడ్లలో అల్-బదర్, తెహ్రికుల్ ముజాహిదీన్, లష్కర్, జైష్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలోనే ఎన్కౌంటర్ జరిగింది.ప్రస్తుతం మచల్‌లో మిలటరీ ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం(నేడు) తెల్లవారుజామున మచల్ సెక్టార్‌లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్‌లో ఉన్న సైనికులు అటుగా కొందరు(బ్యాట్ స్క్వాడ్) వెళ్లడాన్ని గమనించారు. వారిని లొంగిపోవాలని కోరారు. దీంతో బ్యాట్ స్క్వాడ్ కాల్పులు జరిపి, పరుగులు తీయడం ప్రారంభించింది. దీంతో భారత సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు మూడు గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. ఈ నేపధ్యంలో ఐదుగురు భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఒక జవాను చికిత్స పొందుతూ వీరమరణం పొందారు. ఈ ఎన్కౌంటర్లో ఒక బ్యాట్ సభ్యుడు హతమయ్యాడు. అతని మృతదేహం పాక్ సైన్యానికి చెందిన డైరెక్ట్ ఫైరింగ్ రేంజ్లో పడి ఉంది. -
ఉగ్రవాదులు జైలుకు లేదా నరకానికి
న్యూఢిల్లీ: జమ్మూకశీ్మర్‌లో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాదులు అయితే జైలుకు లేదా నరకానికి వెళతారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో అన్నారు. మోదీ సర్కారు ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోదన్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఇటీవలి ఉగ్ర అలజడికి త్వరలో ముగింపు పలుకుతామని, ఉగ్రవాదులు తమ లక్ష్యాలను అందుకోలేరన్నారు. గత కొద్దిరోజుల్లో కశీ్మర్లో 28 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెప్పారు. -
జమ్మూలో 40 మందికి పైగా పాక్ ఉగ్ర మూకలు.. ఏరివేతలో భద్రతా బలగాలు
భారత్‌లో పాక్ ఉగ్ర మూకల వేట కొనసాగుతోంది. జమ్మూ ప్రాంతంలో సుమారు 40 నుంచి 50 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు కేంద్ర నిఘూ వర్గాలు గుర్తించాయి. దీంతో భద్రతా బలగాలు ఉగ్ర మూకల్ని ఏరిపారేసేందుకు కూంబింగ్ ప్రారంభించాయి..పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. జమ్మూ ప్రాంతంలోకి చొరబడిన ఉగ్రవాదులు అత్యున్నత శిక్షణ పొందారు. వారి వద్ద అమెరికా తయారు చేసిన ఎం4 కార్బైన్ రైఫిల్స్‌తో పాటు అత్యంత ఆధునిక, అధునాతన ఆయుధాలు ఉన్నట్లు సమాచారం. బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లోకి సైతం చొచ్చుకుపోయే సామర్థ్యం ఉన్న బుల్లెట్లను ఉన్నాయని తేలింది. జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదులు యాక్టీవ్‌గా ఉన్నారు. ముఖ్యంగా పర్వతాలు, అడవుల కేంద్రంగా ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. వారి ఏరివేత కోసం ఆర్మీ దళాలు కార్డన్, సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. -
ఉగ్రవాదుల కట్టడికి యువరక్తం!
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదులపై నిఘా పెట్టడంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) పాత్ర అత్యంత కీలకం. దేశంలోని అనేక నగరాలతోపాటు హైదరాబాద్‌లోనూ ముష్కర మూకల కుట్రలను తిప్పికొట్టడంలో ఐబీ తన మార్కు చూపించింది. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, ‘ఆన్లైన్ ఉగ్రవాదం’ నేపథ్యంలో ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. తాజాగా ఢిల్లీలో జరిగిన మల్టీ ఏజెన్సీ కమిటీ (మ్యాక్) సమావేశంలో దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర పరిధిలో ఉన్న వివిధ ఏజెన్సీల అధినేతలు ఈ ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఐబీ వంటి నిఘా విభాగాల్లో అనుభవానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని ఆపరేషన్లు సక్సెస్ కావడం అనేది అందులో పనిచేసిన వారి అనుభవం మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అనుభవజ్ఞులకు తోడు సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవడానికి యువ అధికారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు.టెర్రర్ రిక్రూట్మెంట్లో పంథా మారిందిపుష్కరకాలంగా ఉగ్రవాదుల పంథా పూర్తిగా మారింది. ఒకప్పుడు దేశంలో విధ్వంసాలు సృష్టించడానికి అవసరమైన వారిని రిక్రూట్ చేసుకోవడానికి పాకిస్తాన్ నుంచి ఏజెంట్లు వచ్చేవారు. 1998లో హైదరాబాద్ పాతబస్తీలో పట్టుబడిన మహ్మద్ సలీం జునైద్ ఆ కోవకు చెందినవాడే. ఇలా అనేకమంది ఏజెంట్లు పట్టుబడ్డారు. యువతను ఆకర్షించి, సరిహద్దులు దాటించి, శిక్షణ ఇచ్చి, తిప్పి పంపడంతో పాటు పేలుడు పదార్థాలు సైతం సరిహద్దు ఆవలి నుంచే పంపడంలో ఈ ఏజెంట్లు కీలకంగా వ్యహరించేవారు. అయితే దశాబ్దకాలంగా ఉగ్రమూకలు అప్డేట్ అయ్యాయి. యవతను ఆకర్షించి రిక్రూట్ చేసుకోవడం, వారిని ప్రేరేపించడం, శిక్షణ ఇవ్వడం, స్థానికంగా పేలుడు పదార్థాలు సమీకరించుకునే మార్గాలు సూచించడం... ఇవన్నీ ఆన్లైన్లోనే సాగుతున్నాయి. ప్రధానంగా ఐసిస్ ప్రాబల్యం పెరిగిన తర్వాత ఈ ధోరణి మరింత పెరిగింది. దీనికోసం ముష్కరమూకలు వివిధ రకాలైన సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో పాటు డార్క్ వెబ్ వాడుతున్నాయి. హైదరాబాద్‌లో పట్టుబడిన అనేక మంది ఉగ్రవాదులు ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతోనే వారికి చెక్ చెప్పేలా...హైటెక్ ఉగ్రవాదులకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారానే చెక్ చెప్పవచ్చని కేంద్రం నిర్ణయించింది. ఇదే అంశాన్ని శుక్రవారంనాటి మ్యాక్ సమావేశంలో అమిత్‌షా స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోపాటు మిషన్ లెర్నింగ్ టూల్స్ వినియోగించడం ద్వారా ఉగ్రవాదులు, వారి కార్యకలాపాలపై పటిష్ట నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం ఆ విభాగంలో ప్రస్తుతం ఉన్న అధికారులకు తోడు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న యువకులను ఎంపిక చేసుకొని బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉగ్రవాదుల కంటే ఒక అడుగు ముందు ఉండటానికి ఇది అవసరమని అమిత్‌షా అభిప్రాయపడ్డారు. ఏ మాత్రం కాలయాపనకు ఆస్కారం ఇవ్వకుండా వీలైనంత త్వరగా ఈ సంస్కరణలను అమలులోకి తీసుకురావాలని అమిత్‌షా స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలు నిత్యం ముష్కరుల టార్గెట్‌లో ఉండే హైదరాబాద్ సహా అనేక మెట్రో నగరాలకు కలిసి వచ్చే అంశమని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో అన్నారు. -
పాక్ సైన్యం ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందిలా.. బయటపడిన ఫొటోలు
జమ్ముకశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఈ ఉగ్రవాద దాడుల్లో కొందరు భారత ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. అదే సమయంలో ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. తాజగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలలో పాక్ దుశ్చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ స్వయంగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని ఈ చిత్రాలను చూస్తే తెలుస్తోంది.పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి ప్రాంతంలో పాక్ సైన్యం క్యాంపును ఏర్పాటు చేసి, అక్కడి యువతకు ఆయుధాలను వినియోగించడంలో శిక్షణ ఇస్తోందని తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యం ఇక్కడి యువకులను ఉగ్రవాదులుగా మార్చేందుకు శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం శిక్షణ పొందిన మాజీ ఆర్మీ లేదా కమాండోల సహాయం తీసుకుంటోందని సమాచారం.జమ్ముకశ్మీర్‌లోని దోడాలో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు, భారత సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు భారత సైన్యానికి చెందిన నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. తాజాగా పాఠశాలలో ఉన్న ఆర్మీ బృందంపై ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. -
జమ్ముకశ్మీర్‌లో నాల్గవరోజూ ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్లకు గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని దోడాలో వరుసగా నాల్గవరోజు కూడా ఎన్కౌంటర్ జరిగింది. నేడు (గురువారం) తెల్లవారుజామున ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించారు.కస్తిగఢ్ ప్రాంతంలోని జద్దన్ బాటా గ్రామంలో తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక భద్రతా శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. గంటకు పైగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు.ఉగ్రవాదులను ఏరివేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సోమ, మంగళవారాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక కెప్టెన్‌తో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. ఈ ఘటన అనంతరం ఆర్మీ సిబ్బంది.. గ్రామంతోపాటు చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు. జూన్ 12 నుంచి దోడాలో వరుసగా దాడులు జరుగుతున్నాయి. చటర్గాలా పాస్ వద్ద జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడగా, మరుసటి రోజు గండోలో కాల్పులు జరిగాయి. దానిలో ఒక పోలీసు గాయపడ్డాడు.జూన్ 26న, జిల్లాలోని గండో ప్రాంతంలో రోజంతా జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా, జూలై 9న ఘరీ కుంకుమ అడవుల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జమ్మూలోని ఆరు జిల్లాల్లో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 11 మంది భద్రతా సిబ్బంది, ఒక గ్రామ రక్షణ గార్డు, ఐదుగురు ఉగ్రవాదులు సహా మొత్తం 27 మంది మృతి చెందారు. -
అస్సాంలో ఎన్కౌంటర్
అస్సాం: రాష్ట్రంలోని కాచర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ఎస్పీ నుమాల్ మహట్టా తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాపూర్ రోడ్డు ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై పోలీసులకు సమాచారం అందింది. మంగళవారం కాచర్‌లోని ధలై గంగా నగర్లో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ఏకే రైఫిళ్లను, ఒక సాధారణ రైఫిల్, ఒక పిస్టల్‌ను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం పట్టుబడిన ముగ్గురూ హ్మార్ తీవ్రవాద సంస్థలో శిక్షణ పొందిన క్యాడర్‌గా ప్రాథమిక విచారణలో తేలింది. భుబన్ హిల్స్‌లోని సమీపంలోని అడవిలో మరికొందరున్నట్టు, అసోం–మణిపూర్ సరిహద్దుల్లో విధ్వంసాలకు సిద్ధమవుతున్నట్లు పట్టుబడిన ముగ్గురు వెల్లడించారు. దీంతో బుధవారం తెల్లవారుజామున అదనపు ఎస్పీ నేతృత్వంలోని బృందం అరెస్టయిన ఉగ్రవాదులతో పాటు భుబన్ హిల్స్‌లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సమయంలో భుబన్హిల్స్లో ఉన్న కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. గంటపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఇద్దరు కాచర్‌కు చెందినవారు కాగా ఒకరు మణిపూర్‌కు చెందినవారు. మరో ఆరు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు తప్పించుకున్నారు. వారికోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. -
కశ్మీర్ ఉగ్రవాదుల చేతికి అమెరికా తుపాకులు
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ నుంచి 2021లో నిష్క్రమించిన సందర్భంగా అమెరికా సేనలు అక్కడే వదిలేసిన అత్యాధునిక తుపాకులు పాకిస్తాన్ మీదుగా జమ్మూకశ్మీర్ ఉగ్రవాదుల చేతికందాయని నిపుణులు చెబుతున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి ఘటనల్లో వీటిని విరివిరిగా వాడటంపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేశారు. వీటిల్లో ముఖ్యంగా ఎం4 కార్బైన్ అసాల్ట్ రైఫిల్ ప్రధానమైంది. అత్యంత తేలిగ్గా ఉంటూ, మేగజీన్‌ను సులువుగా మారుస్తూ సునాయాసంగా షూట్‌చేసే వెలుసుబాటు ఈ రైఫిల్‌లో ఉంది. దాదాపు 600 మీటర్ల దూరంలోని లక్ష్యాలనూ గురిచూసి కొట్టొచ్చు. నిమిషానికి 700–970 బుల్లెట్ల వర్షం కురిపించే సత్తా ఈ రైఫిల్ సొంతం. ఇంతటి వినాశకర రైఫిళ్లు కశ్మీర్ ముష్కరమూకల చేతికి రావడంతో దూరం నుంచే మెరుపు దాడులు చేస్తూ సునాయాసంగా తప్పించుకుంటున్నారని రక్షణ రంగ నిపుణుడు లెఫ్టినెంట్ జనరల్ సంజయ్ కులకర్ణి అసహనం వ్యక్తంచేశారు. 2017 నవంబర్‌లో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ బంధువు రషీద్‌ను సైన్యం మట్టుబెట్టినపుడు అక్కడ తొలిసారిగా ఎం4 రైఫిల్‌ను సైన్యం స్వాధీనంచేసుకుంది. 2018లో, 2022లో ఇలా పలు సందర్భాల్లో ఉగ్రవాదుల ఎన్కౌంటర్ ఘటనాస్థలిలో ఈ రైఫిళ్లను భారత ఆర్మీ గుర్తించింది. జూలై 8వ తేదీన కథువాలో ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడిలోనూ ఇవే రైఫిళ్లను వాడారని తెలుస్తోంది. -
అల్మరాలో నక్కిన టెర్రరిస్ట్‌లు.. బయటకు లాగి మరి ఎన్కౌంటర్..
కుల్గాం : జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్‌లు హతమయ్యారు. భద్రతా బలగాలు ఓ ఇంట్లో ఫేక్ అల్మారాలో నక్కి ఉన్న టెర్రరిస్ట్‌ల్ని బయటకు లాగి ఎన్ కౌంటర్ చేశారు. అమర్ నాథ్ యాత్ర నేపథ్యంలో భారత భద్రతా దళాలు జమ్మూకశ్మీర్‌లో భద్రతపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా అనుమానిత ప్రాంతాల్ని జల్లెడ పట్టాయి.ఈ తరుణంలో ఆదివారం సాయంత్రం కుల్గామ్ జిల్లాలోని చింగామ్,సౌత్ కాశ్మీర్ కుల్గామ్ అనే ప్రాంతాలలో నివసించేందుకు టెర్రరిస్ట్‌లకు స్థానికులే వసతి కల్పించారనే సమాచారంతో ఎన్ కౌంటర్ ఆపరేషన్ నిర్వహించాయి భద్రతా బలగాలు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో ఫేక్ అల్మారా మాటున బంకర్‌ను ఏర్పాటు చేసుకున్న టెర్రరిస్ట్‌ల్ని బయటకు లాగి ఎన్ కౌంటర్ చేశాయి. మదర్గాంలో తొలి ఎన్కౌంటర్ జరగ్గా.. రెండో ఎన్కౌంటర్ కుల్గాం జిల్లా చింగాం అనే ప్రాంతంలో జరిగింది. సైనికులు జరిపిన మెరుపు దాడిలో నలుగురు టెర్రరిస్ట్‌లు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో ఒక భారత సైనికుడు వీరమరణం చెందారని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వీకే బర్డి తెలిపారు. ఇక ఎన్కౌంటర్లో హతమైన టెర్రరిస్ట్‌లు హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ గ్రూప్‌కు చెందినవారని,వారిలో ఒకరు లోకల్ కమాండర్‌గా పోలీసులు నిర్ధారించారు.చింగాంలో హతమైన నలుగురు టెర్రరిస్ట్‌లు యావర్ బషీర్ దార్,జాహిద్ అహ్మద్ దార్, త్వాహిద్ అహ్మద్ రాతీర్, షకీల్ అహ్ వ్వానిలు కాగా, మదర్గాంలో మృతి చెందిన టెర్రరిస్ట్‌లు ఫైసల్, అదిల్లుగా గుర్తించారు.మదర్గాంలో జరిగిన టెర్రరిస్ట్‌ల ఎదురు దాడిలో పారా కమాండో, లాన్స్ నాయక్ ప్రదీప్ నాయిన్, చింగాం గ్రామంలోని ఫ్రిసాల్ ఏరియాలో వన్ రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన హవల్దార్ రాజ్‌కుమార్ వీరమరణం చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. -
జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఆర్మీ జవాన్ వీరమరణం
జమ్మూకశ్మీర్‌లో శనివారం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కల్గామ్ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులు మద్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ జవాన్ అమరవీరుడైనట్లు కశ్మీర్ జోన్ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలోని మెడెర్గామ్ గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు ఆర్మా అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో ఆ ప్రాతంలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. వీరిని పసిగట్టిన టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. జవాన్లు సైతం ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులను వారి రహస్య స్థావరంలో మట్టుబెట్టారు. అయితే ఈ ఎన్కౌంటర్ ఓ సైనికులు సైతం ప్రాణాలువిడిచాడు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రియాసి ఉగ్రవాది ఊహాచిత్రం విడుదల.. పట్టిస్తే 20లక్షల రివార్డ్
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపిన ఉగ్రవాది స్కెచ్(ఫొటో)ను పోలీసులు విడుదల చేశారు. స్కెచ్ ఆధారంగా ఉగ్రవాది సమాచారం అందించిన వారికి రూ. 20 లక్షల రివార్డు సైతం ప్రకటించారు. రియాసి ఎస్పీ- 9205571332, రియాసి ఏఎస్పీ- 9419113159, ఎస్హెచ్ఓ పౌని- 7051003214 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని పోలీసులు కోరారు.రాస్నో-పౌని-త్రెయాత్ ప్రాంతాల్లో 11 భద్రతా బలగాల బృందాలతో ఉగ్రవాదులు వేట కొనసాగుతోంది. ఈ ఉగ్రదాడి వెనకాల లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ఉన్నట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి ఎన్ఐఏ ఫొరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తోంది.ఆదివారం 53 మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది యాత్రికులు మృతి చెందగా.. 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. యాత్రికుల బస్సు .. శివ్ కోరి నుంచి కాత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయానికి తిరిగి వస్తున్న సమయంలో ఉగ్రవాదులు దాడులతో విరుచుకుపడ్డారు. బస్సులో ఉత్తరపదేశ్, రాజస్తాన్, ఢిల్లీకి చెందిన యాత్రికులు ఉన్నారు. కాల్పులు జరగటంతో యాత్రికుల బస్సు లోయలోకి పడిపోయింది. -
ఆర్మీ పోస్ట్‌పై ఉగ్ర దాడి.. మూడు రోజుల్లో మూడో ఘటన
దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు తరచూ దాడులకు తెగబడుతున్నారు. జమ్మూకశ్మీర్‌లోని దోడాలో గల ఆర్మీ పోస్ట్‌పై మంగళవారం అర్థరాత్రి ఉగ్రవాదులు దాడి చేశారు. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.ఈ కాల్పుల్లో ఇద్దరు జవానులు గాయపడినట్లు సమాచారం. దీనికి ముందు కథువా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే మరో దాడి జరిగింది. మూడు రోజుల క్రితం ప్రయాణికులతో వెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ సమయంలో ఆ బస్సు లోయలో పడిపోయింది. అప్పుడు జరిగిన ఉగ్ర దాడిలో తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందగా, 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రస్తుతం ఉగ్రవాదులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.కథువా జిల్లాలోని చత్రగల ప్రాంతంలో నాలుగు రైఫిల్స్, పోలీసుల సంయుక్త పోస్ట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆనంద్ జైన్ మీడియాకు తెలిపారు. -
‘ఉగ్రదాడి సమయంలో సీట్ల కింద దాక్కున్నాం’
జమ్మూలోని రియాసి జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులతో నిండిన బస్సుపై శివఖోడిలో జరిగిన ఈ దాడి నుంచి వారణాసికి చెందిన అతుల్ మిశ్రా, అతని భార్య నేహా మిశ్రాలు తెలివిగా తప్పించుకున్నారు.అతుల్ మిశ్రా దంపతులు ఈ దాడి దృశ్యాలను కేవలం 10 అడుగుల దూరం నుంచి ప్రాణాలను ఉగ్గబట్టుకుని చూశారు. ఉగ్రవాదుల బుల్లెట్ల వర్షం నుంచి తప్పించుకునేందుకు బస్సు సీటు కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నామని వీరు ఇతర కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ఈ ఘటనలో వీరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.వారణాసిలోని కాలభైరవ ప్రాంతానికి చెందిన అతుల్ మిశ్రా అతని భార్య నేహా మిశ్రాలు మాతా వైష్ణో దేవిని దర్శించుకునేందుకు జమ్మూ వెళ్లారు. ఈ ప్రమాదం అనంతరం వీరిద్దరూ వీడియో కాల్ చేసి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.ఈ దురాగతానికి పాల్పడిన పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అతుల్ తండ్రి రాజేష్ మిశ్రా ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కాగా అతుల్, నేహా దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా జూన్ ఏడున వారణాసి నుండి జమ్మూకు బయలుదేరి వెళ్లారు. వైష్ణో దేవి దర్శనం అనంతరం శివఖోడి వెళ్లి అక్కడ దైవ దర్శనం చేసుకుని, ఇతర ప్రయాణికులతో పాటు బస్సులో తిరిగి వస్తుండగా ఈ ఉగ్ర దాడి ఘటన చోటుచేసుకుంది. దాడి సమయంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు కాలువలో పడింది. -
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై శనివారం(మే4) ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల ఊహాజనిత చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ టెర్రరిస్టుల గురించి సమాచారమిచ్చిన వారికి రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు. ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో విక్కీ పహాడే అనే ఎయిర్‌ఫోర్స్ అధికారి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాడి జరిగినప్పటి నుంచి ఉగ్రవాదుల కోసం రక్షణదళాలు భారీ సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టాయి. -
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
జమ్మూ: జమ్మూకశీ్మర్‌లోని పూంఛ్ జిల్లాలో భారత వాయుసేన జవాన్ల వాహనశ్రేణిపై ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. బలగాలు సనాయ్‌టోప్‌లోని శిబిరానికి తిరిగొస్తుండగా సురాన్‌కోటె పరిధిలోని షాసితార్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6.15 గంటలకు ఉగ్రవాదులు కాల్పులతో తెగబడ్డారు. ఒక వాహనం విండ్్రస్కీన్పై డజనుకుపైగా బుల్లెట్ల దాడి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఏకే రకం రైఫిళ్లతో దాడి చేసిన ఉగ్రవాదులు తర్వాత సమీప అడవిలోకి పారిపోయారు. గాయపడిన జవాన్లకు ఉధమ్‌పూర్‌లోని కమాండ్ ఆస్పత్రిలో చికిత్సచేస్తున్నారు. దాడి విషయం తెల్సి అప్రమత్తమైన సైన్యం, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. రా్రïÙ్టయ రైఫిల్స్ బృందాలు అణువణువునా గాలిస్తున్నాయి. కాన్వాయ్ సురక్షితంగా ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని వాయుసేన ‘ఎక్స్’లో పోస్ట్చేసింది. గత ఏడాది డిసెంబర్ 21న ఇక్కడి దగ్గర్లోని బఫ్లియాజ్లో సైన్యంపై మెరుపుదాడి చేసి నలుగురిని పొట్టనబెట్టుకున్న ఉగ్రముఠాయే ఈ దాడికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఫూంచ్‌లో గత రెండేళ్లుగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. -
ప్రశాంత కశ్మీర్‌కు మార్గం
జమ్మూ, కశ్మీర్లో ఉగ్రవాదం, రాళ్లదాడులు, హర్తాళ్లు, సరిహద్దుల్లో అలజడి వగైరాలు లేకుండా ఈసారి లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఉదమ్‌పూర్ ర్యాలీలో ఎంతో ఆత్మవిశ్వాసంతో చేసిన ప్రకటనను బహుశా విపక్షాలు కూడా స్వాగతిస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పుల్వామాలో సైనికులపై ఉగ్రవాద దాడి, ఆ వెనువెంటనే పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై మన సైన్యం సాగించిన సర్జికల్ దాడులు విపక్షాలకు దేశంలో అప్పటివరకూ కొద్దో గొప్పో ఉందనుకున్న అనుకూలతలను ఆవిరిచేశాయి. బీజేపీకి భారీ మెజారిటీని అందించాయి. కనుక ఈసారి అంతా సవ్యంగా ముగియాలని అవి కోరుకోవటంలో ఆశ్చర్యం లేదు. ఆ మాటెలావున్నా మోదీ చెప్పిన స్థాయిలో ఉగ్రవాదం బెడద సమసిపోయిందనుకోలేము. ఆ ఉదంతాల సంఖ్య గణనీయంగా తగ్గిన మాట వాస్తవమే అయినా అడపా దడపా వారి ఆగడాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. నిరుడు డిసెంబర్లో పూంచ్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడిన ఉదంతంలో నలుగురు జవాన్లు మరణించటమైనా, మరుసటి నెలలో అదేప్రాంతంలో సైనికులపై జరిగిన దాడి యత్నమైనా, శ్రీనగర్‌లో ఫిబ్రవరిలో ఒక పంజాబీ పౌరుణ్ణి కాల్చిచంపటమైనా మరింత అప్రమత్తత అవసరమన్న సంకేతాలిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేయటమైనా, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించటమైనా అక్కడి రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాయన్నది వాస్తవం. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఇది మరింత ప్రస్ఫుటమవుతుంది. లోక్‌సభ ఎన్నికలకంటే అసెంబ్లీ ఎన్నికలకే జమ్మూ, కశ్మీర్లో ఎప్పుడూ అధిక ప్రాధాన్యత వుండేది. అయితే మారిన పరిస్థితుల్లో లోక్‌సభ నియోజకవర్గాల్లో పట్టు సంపాదిస్తేనే భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడం సాధ్యమవుతుందని ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కొత్తగా రంగంలోకొచ్చిన గులాంనబీ పార్టీ డీపీఏపీ భావిస్తున్నాయి. ఇక బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ పార్లమెంటులో తమ సంఖ్యను పెంచుకోవటానికి ఎంతో కొంత దోహదపడుతుందన్నదృష్టితో వున్నాయి. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ది విషాద స్థితి. అంతక్రితం గెల్చుకున్న జమ్మూ, లద్దాఖ్‌లు రెండూ ఆ సార్వత్రిక ఎన్నికల్లో చేజారాయి. ఆ రెండూ బీజేపీ పరమయ్యాయి. కానీ మారిన పరిణామాలు లద్దాఖ్‌లో ఆ పార్టీకి ఆశలు పుట్టిస్తున్నాయి. ఉపాధి లేమి, హిల్ కౌన్సిళ్లను నీరుగార్చటం, పర్యావరణాన్ని దెబ్బతీసేలా సాగుతున్న కార్పొరేట్ సంస్థల భూదాహం లద్దాఖ్ ప్రజానీకానికి ఆగ్రహం కలిగించాయి. దానికితోడు చైనానుంచి ముప్పువుండొచ్చన్న ఆందోళనతో రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో లద్దాఖ్‌ను చేరుస్తామన్న హామీనుంచి బీజేపీ వెనక్కి తగ్గింది. అలా చేరిస్తే ఆదివాసీ ప్రాంతాలకు కార్యనిర్వాహక, శాసన, న్యాయ, ఆర్థిక రంగాల్లో స్వయం నిర్ణయాధికారం లభిస్తుంది. తమ ప్రాంతాల్లోని అడవులు, నదులు, వ్యవసాయం, గ్రామపాలన, వారసత్వ ఆస్తి, వివాహం, విడాకులు, సంప్రదాయాలు తదితరఅంశాల్లో చట్టాలు చేసుకునే అధికారం వుంటుంది. పొరుగున చైనా వున్న నేపథ్యంలో ఇది సమస్యాత్మకం కావొచ్చని ఆలస్యంగా గ్రహించటంతో బీజేపీకి ఎటూ పాలుబోవటం లేదన్నది వాస్తవం. అక్కడి ఉద్యమాల పర్యవసానంగా లే ప్రాంతంలో ఆధిపత్యంవున్న బుద్ధిస్ట్లకూ, కార్గిల్‌లో పైచేయిగా వున్న ముస్లింవర్గాలకూ మధ్య సంప్రదాయ సరిహద్దులు చెరిగిపోయాయి. ఫలితంగా ఇటీవల జరిగిన 26 స్థానాల హిల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీకి రెండు మాత్రమే దక్కాయి. కనుక బీజేపీ సంకల్పం నెరవేరటం అంత సులభం కాదు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు విడివిడిగా పోటీచేస్తున్నాయి. ఇటీవల సమష్టిగా అడుగులేసినట్టు కనబడిన ఈ రెండు పార్టీలూ ఎన్నికలు వచ్చేసరికి దూరం జరిగాయి. గతంలో ఒప్పందాలకు కట్టుబడి వుండటం అలవాటులేని పీడీపీతో పొత్తు అసాధ్యమన్నది నేషనల్ కాన్ఫరెన్స్ వాదన. చిత్రమేమంటే ఎప్పుడూ ‘మరింత స్వయంప్రతిపత్తి’, జమ్మూ, కశ్మీర్లో శాంతి స్థాపన చర్చలు ప్రధాన ఎజెండాగా చేసుకునే ఆ పార్టీలకు మారిన పరిస్థితుల్లో ఆ అంశాల ప్రస్తావనకే అవకాశం లేకుండా పోయింది. డీపీఏపీ ఎత్తుగడలే ఈ పార్టీలను కలవరపరుస్తున్నాయి. ఆజాద్ తాను బలంగావున్న ఉదంపూర్–దోడా నియోజకవర్గాన్ని వదిలి అనంత్‌నాగ్–రాజౌరికి ఆయన వలస రావటం వెనక ముస్లింల ఓట్లు చీల్చి బీజేపీకి మేలు చేయాలన్న వ్యూహం వున్నదని వాటి అనుమానం. ఉన్న ఆరు లోక్‌సభ స్థానాలకూ అయిదు దశల్లో పోలింగ్ నిర్వహించటం జమ్మూ, కశ్మీర్ వర్తమాన స్థితికి అద్దం పడుతుంది. అయిదేళ్లుగా నిద్రాణమైనట్టున్న ఈ ప్రాంతంలో లోక్‌సభ ఎన్నికల ప్రకటన తర్వాత కదలిక వచ్చింది. ఇప్పుడు లభించే ఓట్ల శాతాన్నిబట్టి భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన స్థానం ఏమిటన్నది తేలిపోతుందని బీజేపీ గట్టిగా భావిస్తోంది. మిలిటెంట్ల స్వరం ఈసారి మూగబోయిందన్నది వాస్తవం. అయితే రాష్ట్రంలో హిందూ సీఎంవుండాలన్న బీజేపీ ఆశ నెరవేరాలంటే ఉగ్రవాదాన్ని అణిచేయటం ఒక్కటే చాలదు. అందుకు అభివృద్ధికి బాటలు పరిచి యువతకు ఉపాధి అవకాశాలు పెంచటం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగపరిచే దిశగా చర్యలు తీసుకోవటం, మానవహక్కులకు ప్రాధాన్యతనీయటం తప్పనిసరి. సరిహద్దు ఆవల పాకిస్తాన్, చైనాలు వున్నాయన్న స్పృహతో మెలిగి, సున్నితంగా వ్యవహరించటం నేర్చుకుంటే ఆ ప్రాంత ప్రజల హృదయాలు గెల్చుకోవటం సులభమవుతుంది. -
Lok sabha elections 2024: ఉగ్రవాదులకు చావుదెబ్బ: మోదీ
రిషికేశ్/జైపూర్: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఉగ్రవాదులు చావుదెబ్బ తిన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ముష్కర మూకలను మన భద్రతా దళాలు వారి సొంత గడ్డపైనే మట్టుబెట్టాయని పేర్కొన్నారు. ఫీర్ ఏక్ భార్ మోదీ సర్కారు(మరోసారి మోదీ ప్రభుత్వం) అనే నినాదం దేశమంతటా ప్రతిధ్వనిస్తోందని అన్నారు. స్థిరమైన ప్రభుత్వం వల్ల కలిగే లాభాలను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని తెలిపారు. గురువారం ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో, రాజస్తాన్‌లోని కరౌలీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో కేంద్రంలో బలహీన, అస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉగ్రవాదులు చెలరేగిపోయారని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక తోక ముడిచారని వ్యాఖ్యానించారు. దేశాన్ని లూటీ చేయకుండా అవినీతిపరులను అడ్డుకున్నానని, అందుకే వారంతా తనను దూషిస్తున్నారని ఆక్షేపించారు. -
వలంటీర్లు టెర్రరిస్టులా!?
సాక్షి, అమరావతి/వీరపునాయునిపల్లె/ఏర్పేడు (తిరుపతి జిల్లా)/ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు) /కవితి/టంగుటూరు : నిరంతరం ప్రజల సేవలో ఉంటున్న వలంటీర్లను శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి టెర్రరిస్టులతో పోల్చడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ వ్యవస్థను మెచ్చుకుంటుంటే టీడీపీ నేతలు మాత్రం రాజకీయ కోణంలో వారిని టార్గెట్ చేయడంపై అన్ని వర్గాలు మండిపడుతున్నాయి. సేవే పరమావధిగా ప్రజలకు మంచి చేస్తున్న వీరిని స్లీపర్స్ సెల్స్ అని.. ఉగ్రవాదులు, డేటా చోరీ చేస్తున్నారని అనడం చాలా బాధాకరమని.. సుధీర్‌రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా రాష్ట్రంలోని వలంటీర్లందరికీ క్షమాపణలు చెప్పాలని వలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బొజ్జల సుధీర్‌రెడ్డి వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. కరోనా కష్టకాలంలో వలంటీర్ల సేవలను మరచిపోయారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వారు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని, అలాంటి వారిని ఉగ్రవాదులతో పోల్చడం అమానుషమన్నారు. గతంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు కూడా వలంటీర్లను తీవ్రంగా విమర్శించారని.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మంచిగా అమలవుతుండడంతో టీడీపీ, జనసేన పార్టీలకు కడుపుమంటగా మారిందన్నారు. వలంటీర్ల విశ్వసనీయత, తేల్చుకుందామా? మరోవైపు.. బొజ్జల సుధీర్‌రెడ్డి వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ వలంటీర్స్ అసోషియేషన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజలోకి మీరు, మేము వెళ్దాం.. ఎవరిపట్ల మంచితనం, విశ్వసనీయత, విశ్వాసం ఉందో చూద్దాం అని వలంటీర్లందరి తరఫున కమిటీ సవాల్ విసిరింది. అప్పట్లో సొంత కుటుంబ సభ్యులే దగ్గరికి రాని పరిస్థితుల్లో వలంటీర్లు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి సేవలు చేశారని.. అలాగే, ఆ రోజుల్లో సుధీర్‌రెడ్డి హైదరాబాద్‌కే పరిమితమయ్యారని.. కానీ, వలంటీర్లు ప్రజలకు అందించిన సేవలు ఆయనకేం తెలుసని ప్రశ్నించింది. ‘అలాంటి వారిపై సుధీర్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరమని, సుధీర్‌రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని వలంటీర్లందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం’.. అంటూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పీట నాగమల్లేష్, ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మద్దిలి కాళిదాస్, ఉపాధ్యక్షులు పూజారి ఉదయ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి కొమ్ము సురేష్‌బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 13 మంది వలంటీర్లు రాజీనామా.. సుధీర్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలంలోని పాయసంపల్లె సచివాలయ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 13మంది వాలంటీర్లు మంగళవారం రాజీనామా చేశారు. ఎంపీడీఓ పులి రాంసింగ్, పంచాయతీ కార్యదర్శి విజయ్‌కుమార్ నాయక్‌లకు రాజీనామా పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ నేతలు వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపట్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యాయమని ఆవేదన వ్యక్తంచేశారు. అవ్వతాతలు, చదువురాని పేదలకు సేవచేసేందుకు సీఎం వైఎస్ జగన్ తమకు అవకాశం కల్పించడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నామని.. కానీ, టీడీపీ నేతలు దీనిని రాజకీయం చేస్తున్నారన్నారు. బొజ్జల సుధీర్‌రెడ్డి లాంటి నేతలు మరోసారి విమర్శించేందుకు అవకాశంలేకుండా రాజీనామాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇక తిరుపతి జిల్లా ఏర్పేడులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వివిధ సచివాలయాలకు చెందిన వలంటీర్లు నిరసన చేపట్టారు. టీడీపీ అంటేనే టెర్రరిస్ట్ పార్టీ అని వారు మండిపడ్డారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవచేస్తున్న వలంటీర్లను జిహాదీ తీవ్రవాదులు, బాంబులు పెట్టే టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్ అంటూ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన బొజ్జల వలంటీర్లకు క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి: మంత్రి సురేష్ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ సంక్షేమ సారథులుగా సేవలందిస్తున్న వలంటీర్లపై టీడీపీ నాయకులు, కూటమి పార్టీల నేతలు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని మంత్రి, కొండపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మీడియా సమక్షంలో చెప్పారు. వలంటీర్లను చూస్తే చంద్రబాబు కూటమికి భయం పట్టుకుందన్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల సంగతి తెలుస్తామని గతంలో వారు మాట్లాడారన్నారు. ప్రజలకు సేవలు చేస్తున్న వలంటీర్లపై టీడీపీ నేతలు ఇలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వలంటీర్లే బుద్ధి చెబుతారని మంత్రి హెచ్చరించారు. అలాగే, వలంటీర్లపై టీడీపీ, జనసేసే, బీజేపీ కూటమి పగబట్టిందని విశాఖ ఎంపీ, తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖలో విమర్శించారు. వలంటీర్లను టెర్రరిస్టులుగా పేర్కొనడం దారుణమన్నారు. వలంటీర్లపై టీడీపీ కూటమి పగబట్టడం దారుణమన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తెచ్చిన జన్మభూమి కమిటీలు ప్రజలను ఎలా దోచుకున్నాయో అందరికీ తెలిసిందేనని.. కానీ, వలంటీర్లు అలా కాదని.. వారు అందిస్తున్న సేవలను ప్రజలు మరిచిపోరన్నారు. -
మాస్కో మారణకాండలో 115 చేరిన మృతుల సంఖ్య, 11 మంది అరెస్ట్
రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. క్రాకస్ సిటీ కన్టర్ట్ హాల్లో శుక్రవారం ఐసిస్ తీవ్రవాదులు ఒడిగట్టిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇప్పటి వరకు 115 చేరింది. 145 మంది గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి 11 మందిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో నలుగురు ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రషన్స్ శాసనసభ్యుడు అలెగ్జాండర్ ఖిన్‌స్టెయిన్ మాట్లాడుతూ.. దాడి చేసిన వ్యక్తులు పారిపోయారని.. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో కారును వెంబడించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల కారులో పిస్టల్, అసాల్ట్ రైఫిల్‌కు సంబంధించిన మ్యాగజైన్, తజకిస్థాన్‌కు చెందిన పాస్‌పోర్ట్‌లు లభించాయని తెలిపారు. మరో ఇద్దరు నిందితులు కాలినడకన సమీపంలోని అడవిలోకి పారిపోయారని పేర్కొన్నారు. అనంతరం వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కాగా పశ్చిమ మాస్కోలోని కాన్సర్ట్ హాల్లోకి దుండగులు విరుచుకుపడి కాల్పులు జరిపిన జరిపిన సంగతి తెలిసిందే. కాల్పులతో పాటు బాంబులు విసిరి బిభత్సం సృష్టించారు. దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఇప్పటికే ప్రకటించింది. చదవండి: మాట మార్చిన మాల్దీవులు.. భారత్ ఎప్పుడూ మిత్రుడే అంటూ.. -
ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. మారణాయుధాలు స్వాధీనం!
బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు పిస్టల్స్, నాలుగు మ్యాగజైన్లు, 30 కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై యూఏపీఏ, ఆయుధ చట్టం కింద అమృత్‌సర్‌లోని రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్ సెల్లో కేసు నమోదు చేశారు. అమెరికాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పసియాన్, ఉగ్రవాది హర్విందర్ సింగ్ అలియాస్ రిండా, అర్మేనియాకు చెందిన షంషేర్ సింగ్ అలియాస్ షేరాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం హ్యాపీ పసియాన్, రిండా, షంషేర్‌లు పంజాబ్‌లోని యువతను దేశ వ్యతిరేక కార్యకలాపాల దిశగా పేరేపిస్తున్నారు. హర్‌ప్రీత్ సింగ్, హర్విందర్ సింగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. In an intelligence-based operation, Punjab Police averts possible target killings with the arrest of 2 members of Babbar Khalsa International (BKI)-backed terror module The module was operated by #USA based Harpreet Singh @ Happy Passian, a close aide of #Pakistan based… pic.twitter.com/Ab9FNk2xtf — DGP Punjab Police (@DGPPunjabPolice) March 7, 2024 -
ఇరాన్, పాకిస్తాన్ మధ్య మళ్లీ హై టెన్షన్ !
టెహ్రాన్: ఇరాన్,పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. జైష్ అల్ అదిల్ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ మిలిటెంట్ కమాండర్‌తో పాటు అతడి అనుచరులపై పాకిస్తాన్ భూ భాగంలో ఇరాన్ ఆర్మీ దాడిచేసి హతమార్చింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. దక్షిణ ఇరాన్‌లోని సిస్తాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్ కేంద్రంగా 2012లో జైష్ అల్ అదిల్ కార్యకలాపాలు మొదలయ్యాయి. కొన్నేళ్ల తర్వాత ఈ సంస్థ ఉగ్రవాదులు ఇరాన్ భద్రతాబలగాలపైనే దాడులు చేయడం ప్రారంభించారు. గతేడాది డిసెంబర్లో సిస్తాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడిలో 11 మంది పోలీసులు చనిపోయారు. ఈ దాడి చేసింది తామేనని జైష్ అల్ అదిల్ ప్రకటించుకుంది. గత నెలలో పరస్పరం మిసైల్ దాడులకు దిగడంతో ఇరాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య భద్రతా సహకారం విషయమై ఒప్పందం కూడా జరిగింది. ఈ విషయమై రెండు దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్త మీడియా సమావేశం కూడా నిర్వహించారు. వెనక్కి పిలిచిన ఇరు దేశాల రాయబారులను తిరిగి వారి స్థానాల్లో నియమించారు. ఈ నేపథ్యంలో జైష్ అల్ అదిల్ టెర్రరిస్టులపై పాకిస్తాన్ భూభాగంలో ఇరాన్ బలగాల దాడి మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇదీ చదవండి.. రష్యాపై భారీ ఆంక్షలు -
ఎనిమిదేళ్లుగా మృత్యువుతో పోరాడి.. ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారి
ఢిల్లీ: ఉగ్రదాడిలో గాయపడి ఎనిమిదేళ్లుగా కోమాలో ఉన్న ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ కరణ్‌బీర్ సింగ్ నట్ ప్రాణాలు కోల్పోయారు. టెరిటోరియల్ ఆర్మీ విభాగానికి చెందిన కరణ్‌బీర్ సింగ్ 2015లో చేపట్టిన ఆపరేషన్‌లో ఉగ్రవాద కాల్పుల్లో గాయపడ్డారు. అప్పటి నుంచి ఆయన కోమాలో ఉన్నారు. టెరిటోరియల్ విభాగాని కంటే ముందు ఆయన 160 ఇన్ఫెంట్రీ విభాగానికి సెకండ్ ఇన్ కమాండ్‌గా పనిచేశారు. అంతకుముందు ఆయన పద్నాలుగేళ్లు సైన్యంలో పనిచేశారు. Army Officer, Who Was In Coma For 8 Years After Gunshot Injuries, Dies https://t.co/9AaAfXz7Vy — NDTV (@ndtv) December 26, 2023 2015 నవంబర్ 17న 41 రాష్ట్రీయ రైఫిల్స్ కుప్వారాలోని కలరూస్ ప్రాంతంలో టెర్రర్ ఆపరేషన్‌ను చేపట్టింది. దీనికి నాయకత్వం వహించిన కల్నల్ సంతోష్ మహదిక్ ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో కరణ్‌బీర్ సింగ్ తలకు తూటా గాయం అయింది. అనంతరం ఆయన్ని ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ ఇన్నేళ్ల చికిత్స తర్వాత ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక? -
ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల కాల్పులు.. ఐదుగురు జవాన్ల వీర మరణం
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఇవాళ ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. . పూంచ్‌లోని సురన్‌కోట్ ప్రాంతంలో ఆర్మీ ట్రక్‌పై మెరుపుదాడి జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారని అధికారులు తెలిపారు. ఆకస్మిక దాడి జరిగిన ప్రాంతానికి ఆర్మీ బలగాలను పంపినట్లు సమాచారం. కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురికి గాయాలుకాగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత నెలలో రాజౌరీలోని కలాకోట్‌లో సైన్యం ప్రత్యేక బలగాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు ఆర్మీ కెప్టెన్లతో సహా సైనికులు మరణించారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం ఉగ్రవాదులకు నిలయంగా మారడంతో సైన్యంపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో 10 మంది సైనికులు మరణించారు. గత రెండేళ్లలో ఈ ప్రాంతంలో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో 35 మందికి పైగా సైనికులు మరణించారు. ఇదీ చదవండి: పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం -
BSF: కశ్మీర్‌కు చొరబాట్ల ముప్పు
శ్రీనగర్: పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దుల గుండా జమ్మూ కశ్మీర్లోకి చొరబడేందుకు కనీసం 250 నుంచి 300 మంది దాకా ఉగ్ర ముష్కరులు నక్కి ఉన్నట్టు బీఎస్ఎఫ్ శనివారం తెలిపింది. ఈ మేరకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచరముందని బీఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. అయితే భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, వారి ఎత్తులను తిప్పికొడతాయని పేర్కొన్నారు. ఈ విషయంలో సైన్యంతో కలిసి సమన్వయంతో సాగుతున్నామని విలేకరులకు వివరించారు. కొన్నేళ్లుగా జమ్మూ కశ్మీర్ వాసులతో భద్రతా దళాలకు అనుబంధం, సమన్వయం పెరుగుతోందని ఆయన తెలిపారు. వారి సహకారంతో స్థానికంగా అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా ముందుకు తీసుకెళ్తామన్నారు. -
పాక్ ఆర్మీ పోస్ట్‌పై ఆత్మాహుతి దాడి
పెషావర్: పాకిస్తాన్లో తాలిబన్ ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. ఆర్మీ పోస్టుపై వెంటవెంటనే జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 23 మంది సైనికులు మృతి చెందారు. ఈ ఘటన ఖైబర్ పంక్తున్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం దారాబన్ ఏరియాలోని ఆర్మీ కార్యాలయంలోకి కొందరు ఉగ్రవాదులు చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఆర్మీ వారి ప్రయత్నాలను తిప్పికొట్టింది. కొద్దిసేపటి తర్వాత ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కుతో వేగంగా వచ్చి గేటును ఢీకొట్టారు. అనంతరం మరోసారి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. రెండు దాడుల్లో ఆర్మీ కార్యాలయ భవనం కుప్పకూలింది. అనంతరం ఆర్మీకి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది సైనికులు చనిపోగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా మారడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని భావిస్తున్నట్లు ఆర్మీ ప్రతినిధి తెలిపారు. ఈ ఆత్మాహుతి దాడులకు తమదే బాధ్యతంటూ తెహ్రీక్–ఇ– తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)అనుబంధంగా కొత్తగా ఏర్పడ్డ తెహ్రీక్–ఇ–జిహాద్ పాకిస్తాన్(టీజేపీ)ప్రకటించుకుంది. ఇలా ఉండగా, ఇదే జిల్లాలోని దారాజిందా, కులాచి ప్రాంతాల్లో సైన్యం జరిపిన దాడుల్లో 21 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ తెలిపింది. ఇద్దరు సైనికులు కూడా చనిపోయినట్లు పేర్కొంది. -
కశ్మీర్లో ముగిసిన ఎన్కౌంటర్..
రాజౌరీ/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో గురువారం రెండో రోజు కూడా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. బుధవారం ఎన్కౌంటర్ గాయపడిన ఇద్దరు జవాన్లలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని అధికారులు తెలిపారు. దీంతో, ఈ ఎన్కౌంటర్ అసువులు బాసిన జవాన్ల సంఖ్య అయిదుగురుకు చేరుకుంది. బుధవారం చనిపోయిన వారిని కెప్టెన్ ఎంవీ ప్రాంజల్(కర్ణాటక), కెప్టెన్ శుభమ్ గుప్తా(యూపీ), పారా ట్రూపర్ సచిన్ లౌర్(యూపీ), హవల్దార్ అబ్దుల్ మాజిద్(జమ్మూకశ్మీర్)గా గుర్తించారు. గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ధర్మసాల్లోని బాజిమాల్ ప్రాంతంలో బుధవారం ఎన్కౌంటర్ సందర్భంగా ఇద్దరు కెప్టెన్లు సహా నలుగురు జవాన్లు నేలకొరిగారు. మరో ఇద్దరు గాయాలపాలైన విషయం తెలిసిందే. రాత్రి వేళ కాల్పులను నిలిపివేసిన బలగాలు ఉగ్రవాదులు తప్పించుకునే అవకాశం లేకుండా, అక్కడి దట్టమైన అటవీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో దిగ్బంధించాయి. గురువారం ఉదయం తిరిగి రెండు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో, ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ ముగిసినట్లయిందని తెలిపారు. మృతుల్లో ఒకరిని పాకిస్తాన్‌కు చెందిన పేరుమోసిన ఉగ్రవాది క్వారీగా గుర్తించారు. మందుపాతరలను అమర్చడం, స్నైపర్ కాల్పుల్లోనూ ఇతడు నిపుణుడు. గుహల్లో ఉంటూ ఉగ్ర చర్యలకు పాల్పడుతుంటాడు. పాక్, అఫ్గానిస్తాన్‌లలో ఉగ్ర శిక్షణ పొందిన క్వారీ లష్కరే తోయిబాలో టాప్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. హతమైన మరో ముష్కరుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
సరిహద్దుల్లో ఉగ్రకాల్పులు
రాజౌరీ/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు కెపె్టన్లు, ఒక హవీల్దార్, ఒక జవాను వీరమరణం పొందారు. కాల్పులు జరుగుతున్న అటవీప్రాంతంలో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను తుదముట్టించేందుకు మరింతగా భద్రతా బలగాలు అక్కడకు చేరుకుంటున్నాయని సైన్యాధికారులు బుధవారం చెప్పారు. నక్కిన ఇద్దరు ఉగ్రవాదులు విదేశీయులని సైన్యం వెల్లడించింది. గులాబ్‌గఢ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంలో గాలింపు చేపట్టగా ధరమ్‌సాల్ పరిధిలోని బజిమాల్ సమీపంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుందని ఆర్మీ ట్వీట్‌చేసింది. ఈ ఘటనలో ఒక మేజర్, ఒక జవాను గాయపడ్డారు. -
కశ్మీర్లో రెండు ఎన్కౌంటర్లు..
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల ఘటనల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లాలో రాత్రంతా భద్రతా బలగాలతో కొనసాగిన ఎన్కౌంటర్లో అయిదుగురు ముష్కరులు హతం కాగా, రాజౌరీ జిల్లాలో మరొకరు మృతి చెందారు. కుల్గాం జిల్లా నెహమా ప్రాంతంలోని సమ్నో గ్రామంలో అనుమానాస్పద కదలికలపై అందిన సమాచారం మేరకు గురువారం బలగాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి సోదాలు చేపట్టాయి. బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. బలగాల దిగ్బంధనంలో చిక్కుకున్న ఉగ్రమూకలు రాత్రంతా కాల్పులు కొనసాగించాయి. ఉదయం కూడా కొనసాగిన కాల్పులతో ఉగ్రవాదులు దాక్కున్న ఇంటికి నిప్పంటుకుంది. దీంతో, బయటకు వచ్చిన అయిదుగురూ బలగాల చేతుల్లో హతమయ్యారని కశ్మీర్ ఐజీపీ వీకే బిర్డి చెప్పారు. మొత్తం 18 గంటలపాటు ఎన్కౌంటర్ కొనసాగిందన్నారు. మృతులను లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్(పీఏఎఫ్ఎఫ్), ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)లకు చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. వీరందరికీ వివిధ హింసాత్మక ఘటనలతో సంబంధముందని తెలిపారు. వీరి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నాలుగు ఏకే రైఫిళ్లు, రెండు పిస్టళ్లు, నాలుగు గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటన.. రాజౌరీ జిల్లా బుధాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెహ్రోటే ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల్లో గుర్తు తెలియని ఒక ముష్కరుడు హతమయ్యాడు. సంఘటనా ప్రాంతంలో ఏకే–47 రైఫిల్, మూడు గ్రెనేడ్లు లభించాయి. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో సోదాలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. -
జమ్ముకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం
కశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం ఎదురుకాల్పులు జరిగాయి. టెర్రరిస్టులు లష్కర్ ఎ తొయిబా ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించారు. పలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. J-K: Five Lashkar terrorists gunned down in ongoing Kulgam encounter Read @ANI Story | https://t.co/6qRrP7HdiL#JammuAndKashmir #Kulgamencounter pic.twitter.com/X0hL5Dkcjg — ANI Digital (@ani_digital) November 17, 2023 జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. కుల్గాంలోని దమ్హాల్ హంజి పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే ముందస్తు సమాచారంతో బలగాలు రెక్కీ నిర్వహించాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిదాడికి దిగిన బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. గత అక్టోబర్‌లోనే కుల్గాం జిల్లాలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఇదీ చదవండి: యెమెన్‌లో కేరళ నర్సుకు నిరాశ.. మరణశిక్ష అప్పీల్‌ను తోసిపుచ్చిన కోర్టు -
కొనసాగుతున్న ఆపరేషన్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి అక్రమ చొరబాటుకి యత్నించిన ఉగ్రవాదుల్ని కశ్మీర్ పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా మట్టుబెట్టాయి. గురువారం ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ పోలీసులు ప్రకటించారు. సరిహద్దు వెంట చొరబాటు కార్యకలాపాల నియంత్రణకు సైన్యం, జమ్ము పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టింది. కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్లో ఉదయం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు.. ఆపై కాల్పుల్లో మరో ముగ్గురు చనిపోయినట్లు జమ్ముకశ్మీర్ అదనపు డీజీ విజయ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందన్నారాయన. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటు నిరోధక ఆపరేషన్లలో పోలీసు బలగాల్ని సైతం వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా భారీ ఆపరేషన్ చేపట్టారు. కశ్మీర్‌కు చెందిన పోలీసులు, సెక్యూరిటీ ఏజెన్సీలు శ్రీనగర్‌లోని 15 కార్ప్స్లో బుధవారం భేటీ అయ్యారు. ఈ ఏడాది 46 మంది ఉగ్రవాదులు హతమవ్వగా.. వారిలో 37మంది పాకిస్థానీలు కాగా.. తొమ్మిది మంది స్థానికంగా ఉన్నవారేనని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. గత 33 ఏళ్లలో స్థానిక ఉగ్రవాదుల కన్నా.. విదేశీ ఉగ్రవాదులు అత్యధిక సంఖ్యలో హతం కావడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. -
ఉగ్రవాదులకు స్వర్గధామంగా కెనడా: భారత్
ఢిల్లీ: కెనడా తీవ్రవాదులకు స్వర్గధామంగా మారిందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి అన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాదంపై కెనడా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ఓ వైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే.. ప్రతిష్ట పొందుతోందని దుయ్యబట్టారు. ఇరు దేశాల మధ్య వివాదాస్పద పరిస్థితులు నెలకొన్న వేళ.. ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఉగ్రవాదుల కార్యకలాపాలను యధేచ్చగా జరగనిచ్చేలా అవకాశాన్ని కల్పించడం, ఉగ్రవాదులకు ఫండింగ్ సమకూర్చడం వంటి చర్యలకు కెనడా స్వర్గధామంగా మారింది. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను పంచుకోవాలని కోరితే స్పందన లేదు. కేవలం రాజకీయ మనుగడ కోసమే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఉగ్రవాదులకు మద్దతునివ్వడం మానుకోవాలని కెనడాను కోరుత్నునాం.' అని అరింధమ్ బాగ్చి తెలిపారు. కెనడా-భారత్ వివాదం.. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జారి సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ఉన్న భారత దౌత్య అధికారి ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. భారత దౌత్య అధికారులను కెనడా నుంచి బహిష్కరించారు. కెనడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. ఖలిస్థానీ ఉగ్రవాది గల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో జస్టిన్ ట్రూడో ఆరోపణలు సరైనవి కావని భారత్ మండిపడింది. భారత్‌లో ఉన్న కెనడా దౌత్య అధికారి కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. కేనడా ప్రయాణాలపై పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశ వీసాలను కూడా రద్దు చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాలపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదీ చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..? -
అరబిక్ క్లాసుల ముసుగులో ఉగ్ర పాఠాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ–తమిళనాడుల్లో ఉన్న కొన్ని కేంద్రాలు అరబిక్ క్లాసుల ముసుగులో ఉగ్రవాద పాఠాలు బోధిస్తూ, యువతను ఐసిస్ వైపు ఆకర్షిస్తున్నాయా? ఔననే అంటున్నాయి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వర్గాలు. ఇలా ప్రేరేపించిన నేపథ్యంలోనే 2022 అక్టోబర్ 23 కోయంబత్తూరులోని సంగమేశ్వర దేవాలయం వద్ద కారు బాంబు పేలుడు జరిగిందని స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చెన్నై ఎన్ఐఏ యూనిట్ శనివారం హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు చేసింది. హైదరాబాద్–తమిళనాడుల్లో మొత్తం 31 చోట్ల తనిఖీలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సోదాల్లో ఉగ్రవాద సంబంధిత పుస్తకాలు, పత్రాలతో పాటు ఫోన్లు, ల్యాప్టాప్స్, హార్డ్ డిస్క్‌లు వంటి డిజిటల్ పరికరాలు, రూ.60 లక్షల నగదు, 18,200 అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ పుస్తకాలు, పత్రాలు అరబిక్‌తో పాటు తెలుగు, తమిళం భాషల్లో ఉన్నట్లు అధికారులు వివరించారు. యువతను ఐఎస్ఐఎస్ వైపు ఆకర్షించడానికి కొందరు ఉగ్రవాదులు ప్రాంతాల వారీగా అధ్యయన కేంద్రాలు, అరబిక్ బోధన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. వాట్సాప్, టెలిగ్రామ్‌లో ఏర్పాటు చేసిన గ్రూపుల ద్వారా తమ భావజాలాన్ని ఐసిస్ విస్తరిస్తోందని ఎన్ఐఏ గుర్తించింది. చెన్నైకి చెందిన ఉగ్రవాది ఈ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. కొన్ని రోజులపాటు హైదరాబాద్‌లోనూ నివసించిన ఇతగాడు అల్ ఫుర్ఖాన్ పేరుతో ఓ పబ్లికేషన్స్ నిర్వహించాడు. ఇందులో తెలుగు, తమిళం, అరబిక్ భాషల్లో ఉగ్రవాద సాహిత్యం, భావజాలాన్ని వ్యాప్తి చేసే మెటీరియల్ ముద్రించాడు. ఐసిస్ మీడియా వింగ్ పేరు కూడా అల్ ఫుర్ఖానే కావడం గమనార్హం. ఇతగాడు ఇటీవలే విదేశాలకు పారిపోయాడని నిఘా వర్గాలు గుర్తించాయి. ఐదుగురి ఇళ్లపై ఏకకాలంలో దాడులు.. ఈ చెన్నై వాసి నగరంలో నివసించిన కాలంలో సైదాబాద్ పరిధిలోని సపోటాబాద్కు చెందిన హసన్, రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌కు చెందిన అమీర్, యూసుఫ్‌గూడ, బోరబండ ప్రాంతాలకు చెందిన నూరుల్లా, జాహెద్‌లతో పాటు గోల్కొండ పరిధిలోని షేక్‌పేటకు చెందిన జబ్బార్‌తో సన్నిహితంగా మెలిగాడు. వీరితో పాటు మరికొందరు ఉగ్రవాద సానుభూతిపరులతో సోషల్ మీడియా గ్రూపులు నిర్వహించాడు. తాను ముద్రించిన పుస్తకాలను అందించడంతో పాటు వివిధ అంశాలకు సంబంధించిన సాఫ్ట్‌కాపీలను షేర్ చేశాడు. కోయంబత్తూరు బాంబు పేలుడు కేసులో కీలక నిందితుడిగా ఉన్న కేరళ వాసి మహ్మద్ అజారుద్దీన్‌ను ఈనెల 1న ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇతడి నుంచీ ఎన్ఐఏ అధికారులు అల్ ఫుర్ఖాన్ ద్వారా ముద్రితమైన సాహిత్యం, పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ పుస్తకాలపై హైదరాబాద్‌లో ముద్రితమైనట్లు చిరునామా ఉంది. దీంతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి నగరానికి చెందిన ఐదుగురి వ్యవహారం ఎన్ఐఏ దృష్టికి వెళ్ళింది. దీంతో శనివారం నగరానికి చేరుకున్న ఎన్ఐఏ చెన్నై యూనిట్‌కు చెందిన ప్రత్యేక బృందం ఐదుగురి ఇళ్లపై ఏకకాలంలో దాడి చేసి సోదాలు నిర్వహించింది. అల్ ఫుర్ఖాన్ పబ్లిషర్స్ ద్వారా ముద్రితమైన పుస్తకాలు, ఇతర పత్రాలతో పాటు సెల్ఫోన్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. హసన్, అమీర్, నూరుల్లా, జాహెద్, జబ్బార్‌లకు సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేశారు. -
కశ్మీర్లో ఉగ్రఘాతుకం
రాజౌరీ/జమ్మూ: ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టిన సైన్యంపై ఉగ్రవాదులు మాటువేసి మెరుపుదాడి చేశారు. ఈ దుర్ఘటనలో ఆర్మీ కల్నల్, మేజర్, డిప్యూటీ ఎస్పీలు వీరమరణం పొందారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని గరోల్ దగ్గర్లోని కొకొరెనాగ్ కొండ ప్రాంతంలో జరిగింది. రాజౌరీలో ఉగ్రకాల్పుల్లో జవానును కాపాడబోయి సైనిక జాగిలం కెంట్ ప్రాణాలు కోల్పోయిన మరుసటి రోజే ఈ కాల్పుల ఘటన జరగడం విషాదకరం. బుధవారం ఉదయం సైనిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కొకొరెనాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో మంగళవారం రాత్రి సైన్యం, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు వెంటనే తూటాల వర్షం కురిపించారు. దీంతో 19వ రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ అధికారి అయిన కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిశ్ ధోనక్, డిప్యూటీ ఎస్పీ హుమయూన్ భట్ నేలకొరిగారు. J-K: Army Colonel, Major killed in gunfight with terrorists in Anantnag Read @ANI Story |https://t.co/29Tvl95ZE6#IndianArmy #TerroristAttack #Anantnag pic.twitter.com/HsGielfLEy — ANI Digital (@ani_digital) September 13, 2023 జమ్మూకశ్మీర్ మాజీ ఐజీ గులామ్ హసన్ భట్ కుమారుడే ఈ హుమయూన్. కాల్పుల ఘటనకు నిషేధిత రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థ బాధ్యత ప్రకటించుకుంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ లష్కరే తోయిబానే ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థను వెనక ఉండి నడిపిస్తోంది. ఆగస్టు నాలుగో తేదీన కుల్గామ్ జిల్లాలోని హలన్ అటవీప్రాంతంలో ముగ్గురు జవాన్ల మరణానికి కారకులైన వారే బుధవారం దాడి చేశారని సైనిక నిఘా వర్గాలు వెల్లడించాయి. Anantnag encounter | A Jammu and Kashmir Police official also lost his life in the encounter. The Army officers were leading the troops from the front after they had gone to search for terrorists in the area based on specific intelligence: Indian Army officials — ANI (@ANI) September 13, 2023 ఇదీ చదవండి: సైనికున్ని రక్షించేందుకు.. తూటాలకు ఎదురునిలిచి.. సైనిక శునకం ప్రాణ త్యాగం -
Manipur violence: మణిపూర్‌లో ఉద్రిక్తతలకు అవే కారణం
న్యూఢిల్లీ/ఇంఫాల్: మణిపూర్‌లో కొన్నేళ్లుగా నిద్రాణంగా ఉన్న ఉగ్రవాదుల ముఠాలు ప్రజల నిరసనల నేపథ్యంలో మళ్లీ చురుగ్గా మారాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల ఓ సైనికా« దికారిపై కాల్పులు జరిపి, తీవ్రంగా గాయపరిచిన ఘటనను వారు ఉదహరిస్తున్నారు. నిషేధిత యునై టెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(యూ ఎన్ఎ ల్‌ఎఫ్), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఉగ్రవాదులు దీని వెనుక ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. మణిపూ ర్లో నిరసనలకు దిగుతున్న పౌరులతో కలిసిపోయి ఉద్రిక్తతలు పెంచుతున్నారని చెబుతున్నారు. గత వారం టెంగ్నౌపల్ జిల్లా మొల్నోయి గ్రామంలో గిరిజనులపై దాడికి యత్నించిన కొందరు ఆందోళన కారులను అస్సాం రైఫిల్స్, ఆర్మీ బలగాలు అడ్డుకోగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో లెఫ్టినెంట్ కల్నల్ రమణ్ త్యాగి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన గువాహటిలో చికిత్స పొందుతున్నారు. ఆందోళనకారుల్లో కొందరు నిషేధిత గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు అనంతరం చేపట్టిన దర్యాప్తులో వెల్లడైందని అధికారులు వివరించారు. యూఎన్ఎల్ఎఫ్, పీఎల్ఏతోపాటు కంగ్లీ యవోల్ కన్బా లుప్(కేవైకేఎల్), పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కంగ్లీపాక్ (పీఆర్ఈపీఏకే) లు కూడా రాష్ట్రంలో యాక్టివ్‌గా అయ్యాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. యూఎన్ఎల్ఎఫ్కు 330, పీఎల్ఏకు 300, కేవైకేఎల్ 25 మంది కేడర్ కలిగి ఉన్నాయన్నారు. కేవైకేఎల్ చీఫ్ టాంబా అలియాస్ ఉత్తమ్ సహా ఆ గ్రూప్‌లోని 12 మంది జూన్‌లో పట్టుబడ్డారన్నారు. ఈ గ్రూపులన్నిటికీ ఆర్మీపై దాడులు, బలవంతపు వసూళ్లు, డ్రగ్స్ రవాణా, స్మగ్లింగ్ వంటి ఘటనలకు పాల్పడిన చరిత్ర ఉందని వివరించారు. మణిపూర్‌లో అల్లర్లు మొదలైనప్పటినుంచి పోలీస్ స్టేషన్ల నుంచి ఎత్తుకెళ్లిన మెషిన్ గన్స్, రైఫిళ్లు వంటి 4,537 ఆయుధాలు, 6.32 లక్షల రౌండ్ల వరకు బుల్లెట్లు వీరి వద్దే ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మే నుంచి తెగల మధ్య కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. -
ఎవరి మాటా వినని తాలిబన్లు
అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు తిరిగి ఆక్రమించి మొన్న ఆగస్టు 15 నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. 2020లో అమెరికాతో దోహాలో చేసుకున్న ఒప్పందానికి తాలిబన్లు కట్టుబడలేదు. ఉగ్రవాదుల అడ్డాగా మార్చకపోవడం, లింగ వివక్ష అంశాలతో పాటు, అఫ్గాన్ రిపబ్లిక్‌తో అధికారం పంచుకోవడంపైనా తాలిబన్లు చర్చలు జరిపారు. ఈ క్రమంలో అక్కడ కొత్త రాజ్యాంగం పురుడు పోసుకుంటుందన్న అంచనా తీరా తారుమారైంది. పాశ్చాత్య దేశాలు తమను కూలదోయలేవని తాలిబన్లకు తెలుసు. మొక్కుబడిగా కొన్ని డిమాండ్లు చేయడం, లేదంటే ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తే అంతే చాలన్నట్టుగా అంతర్జాతీయ సమాజం ఉంది. తాలిబన్లతో సంబంధాల విషయంలో భారత్ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి ఆక్రమించి మొన్న ఆగస్టు 15 నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. అదే రోజు అప్పటి అధ్య క్షుడు అశరఫ్ గనీ దేశం వదిలి పారిపోయారు. తాలిబన్లు తమ ఆయుధ బలం మొత్తాన్ని ఉపయోగించి, అఫ్గానిస్తాన్ ఆద్యంతం అఫ్గాన్ ఎమిరేట్‌ను పునఃస్థాపించారు. అమెరికాపై ఉగ్రదాడికి ప్రతిగా ఆ దేశ మిలిటరీ దళాలు అఫ్గానిస్తాన్ మీద 2001 నవంబరులో యుద్ధం ప్రకటించడంతోనే ఈ అఫ్గాన్ ఎమిరేట్ పతనమైన సంగతి తెలిసిందే. తాలిబన్లు మళ్లీ దేశాన్ని వశం చేసుకోవడానికి ముందు, అమెరికాతో దోహాలో 2020లో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడలేదు. మిలిటరీ బలగాలను వెనక్కు తీసుకున్నందుకు ప్రతిగా తాలిబన్లు అఫ్గాన్ ప్రాంతాన్ని ఉగ్రవాదులకు అడ్డాగా మార్చరాదని దోహా ఒప్పందం షరతు విధించింది. దీనితో పాటు, అఫ్గాన్ రిపబ్లిక్‌తో అధికారం పంచుకోవడంపై చర్చలు జరిపేందుకూ తాలిబన్లు అంగీకరించారు. ఈ క్రమంలో అక్కడ కొత్త రాజ్యాంగం పురుడు పోసుకుంటుందని వేసుకున్న అంచనా తారుమారైంది. తాలిబన్లు అఫ్గాన్ నేషనల్ ఆర్మీపై వేగంగా పైచేయి సాధించడంతో అధికారం పంచుకోవడం అన్న మాట పక్కకెళ్లిపోయింది. ఒకవైపు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖురాసాన్ తో తాలి బన్లు పోరాడుతూనే ఉన్నారు. మరోవైపు ఉగ్రవాద సంస్థ ఆల్– ఖైదాతో వారి అనుబంధం పెరుగుతూనే ఉంది. అల్–ఖైదా నేత అయ మాన్ అల్–జవాహిరిని 2022 జూలైలో అమెరికా ఒక డ్రోన్ దాడిలో హతం చేసినప్పుడు, ఈ సంబంధం కొనసాగుతున్నట్టు అర్థమైంది. అఫ్గానిస్తాన్‌లో అమెరికా, నాటోకు గట్టి దెబ్బ తగిలింది. తమ మిలిటరీ దళాలను వెనక్కు తీసుకునే ప్రక్రియను కూడా అవి సాఫీగా నిర్వహించలేకపోయాయి. గడచిన రెండేళ్లుగా, అమెరికా, దాని భాగ స్వాములు, అంతర్జాతీయ సమాజ సభ్యదేశాలు తాలిబన్ ప్రభుత్వం మానవ హక్కులు, మరీ ముఖ్యంగా లింగ వివక్షకు సంబంధించిన అంశాల్లో అందరినీ కలుపుకొని పోవాలని డిమాండ్ చేస్తున్నాయి. తాలిబన్ ప్రభుత్వం తాను అన్ని తెగలకు ప్రాతినిధ్యం కల్పించామని చెబుతోంది. అయితే లింగ వివక్షకు సంబంధించిన విషయాల్లో మాత్రం వాళ్లు ఇప్పటికీ షరియా చట్టాల అమలుకే మొగ్గు చూపు తున్నట్లుగా కనిపిస్తుంది. కాకపోతే 1990ల నాటి క్రూరత్వం కొంత తగ్గిందని చెప్పాలి. అంతర్జాతీయ సమాజపు డిమాండ్ల విషయంలో తాలిబన్లు వెనక్కి తగ్గలేదన్నది సుస్పష్టం. ప్రస్తుత అమీర్ (పాలకుడు) అయిన హిబతుల్లాహ్ అఖుంద్జాదా చేతుల్లో అధికారం ఉన్నంత వరకూ ఇది అసాధ్యమని కూడా చెప్పు కోవాలి. తాలిబన్లు ప్రధానంగా పష్తూన్లు. అదే సమయంలో ఇస్లామ్‌ను అనుసరిస్తారు. యాభై ఏళ్ల సంక్షోభం, యుద్ధాల ఫలితంగా అక్కడ సామాజిక మార్పులు చోటు చేసుకుని పష్తూన్ల సంప్రదాయ బలం తగ్గింది. ఈ నేపథ్యంలో తాలిబన్ అగ్రనేతకు అమిర్ అల్–ముమినీన్ హోదా కల్పించడంతో ఆయన మాట మీరడం ఎవరికైనా దుర్లభం. దేశ ఆగ్నేయ ప్రాంతంలో మంచి పట్టున్న అంతర్గత వ్యవహారాల తాత్కాలిక మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ, తాలిబన్ల వ్యవస్థాపకుడైన ముల్లా ఒమర్ కుమారుడిగా అదనపు అనుకూలత ఉన్న రక్షణ శాఖ మధ్యంతర మంత్రి ముల్లా యాకూబ్ లాంటి యువ నేతలు మార్పు నకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే, లింగ అంశాల మీద ప్రపంచాన్ని ధిక్కరిస్తున్న హిబతుల్లాహ్, ఆయన వర్గమైన సంప్ర దాయ ముల్లాలకు వ్యతిరేకంగా వారు నిలబడ లేకపోతున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొద లైన తరువాత అంతర్జాతీయ సమాజం, అగ్రరాజ్యాల ధ్యాస మొత్తం అటువైపు మళ్లింది. యూరోపియన్ దేశాలపై, అమెరికా–చైనా మధ్య కొనసాగుతున్న పోటీ విషయంలోనూ యుద్ధం ప్రభావం చాలా ఎక్కువే. పైగా ఈ యుద్ధం వల్ల భూ దక్షిణార్ధ గోళంలో చేపట్టిన సంక్షేమ కార్యకలాపాలపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. వీటన్నింటి కారణంగా అఫ్గానిస్తాన్ అంశం ఏడాదిన్నర కాలంగా కను మరుగైంది. అప్పుడప్పుడూ మొక్కుబడిగా కొన్ని డిమాండ్లు చేయడం, ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తే అంతే చాలన్నట్టుగా అంతర్జాతీయ సమాజం ఉంది. ఇదిలా ఉండగానే, అఫ్గానిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరీ దిగజారి, శరణార్థులు ఇతర దేశాలకు వెల్లువెత్త కుండా మానవతా సాయం కొంతవరకూ కాపాడుతోంది. అయితే విదేశాలకు వెళ్లగలిగిన స్థోమత ఉన్నవారు ఇప్పటికీ వెళుతూనే ఉండటం గమనార్హం. అఫ్గానిస్తాన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు ఇప్పుడు అంత ర్జాతీయ సమాజం అనాసక్తంగా ఉంది. ఆఖరికి అక్కడినుంచి పెరిగి పోతున్న మాదకద్రవ్యాల సరఫరా విషయాన్నీ పట్టించుకోవడం లేదు. మరోవైపు, ఏ అగ్రరాజ్యమైనా అక్కడ ఏం చేయగలదు? క్షేత్రస్థాయిలో అక్కడ ఎవరూ లేరు. ఉగ్రవాదుల గుంపు కార్యకలాపాలపై టెక్నాలజీ లేదా మానవ నిఘా ద్వారా ఎంత వరకూ పరిశీలించవచ్చు? అయితే అప్పుడప్పుడూ ఇవి కూడా ప్రభావవంతంగా ఉంటాయనడానికి అల్–జవాహిరిని మట్టుబెట్టడం నిదర్శనం. పాశ్చాత్య దేశాలు తలుచుకుంటే వాయుమార్గం ద్వారా తమను ఎప్పుడైనా దెబ్బతీయగలవనీ, అయినప్పటికీ తమ ప్రభుత్వాన్ని మాత్రం అవి కూల్చలేవనీ తాలిబన్లకు తెలుసు. ఇలా జరగాలంటే దేశంలో అసంతృప్తి పెరగాలి. కానీ అలాంటి పరిస్థితి ఏదీ కనిపించడం లేదు. ప్రజాగ్రహం లేదా విదేశాల్లో స్థిరపడ్డ ప్రతిపక్ష పార్టీల చర్యలు మచ్చుకైనా లేవు. అంతేకాకుండా అమెరికా, యూరప్, రష్యా, చైనా ప్రయోజనాలేవీ దెబ్బతినకుండా తాలిబన్లు జాగ్రత్త పడుతున్నారు. అమెరికన్లు, యూరోపియన్ల విషయంలో తాలిబన్లు కొంత సానుకూలంగా వ్యవహరిస్తున్నా పాకిస్తాన్‌తో మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నారు. తెహరీక్–ఎ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ), అఫ్గాన్ తాలిబన్ల సంబంధాలు మతపరమైనవి, వ్యక్తిగత మైనవి, తెగలకు కూడా సంబంధించినవి. టీటీపీ కూడా ‘అమీర్’కు విధేయులుగా ఉంటామని ఇప్పటికే ప్రకటించింది. అది ఇరు పక్షా లకూ పవిత్ర సంబంధం లాంటిది. టీటీపీ నియంత్రణలో తాలిబన్ల సహకారం ఏమాత్రం అందక పోవడంతో పాకిస్తాన్ సైన్యం, నిఘా వర్గాలు చాలా నిస్పృహలో ఉన్నాయి. ఇది కాస్తా ఘర్షణకు దారితీస్తోంది. ఇరువైపులా బాహాటంగా వ్యతిరేకత వెల్లడవుతోంది. ఆగస్టు 14వ తేదీన కాకుల్లో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా, పాకి స్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ మాట్లాడుతూ, ‘‘అఫ్గాన్ సోదరులను గౌరవిస్తూనే ఈ మాట. వారిని బాగా ఆదరిస్తున్న దేశం పాక్. వారు కూడా ఈ గౌరవ మన్ననలకు తగ్గట్టుగా వ్యవహరించా ల్సిన అవసరముంది. కనీసం మాకు వ్యతిరేకంగా పనిచేసే వారికి ఆశ్రయమైనా కల్పించకుండా ఉండాల్సింది’’ అని వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలను తాలిబన్ అధికార ప్రతినిధి తిరస్కరించడం గమనార్హం. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ తాలిబన్లు టీటీపీని వదులు కోరు. అంతర్జాతీయ సంబంధాల్లో ఉదారత అనేది ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం కాదని గ్రహించిన తొలి దేశం పాకిస్తాన్ ఏమీ కాదు. తాలిబన్లతో సంబంధాల విషయంలో భారత్ కొంచెం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఏడాది కాలంగా అఫ్గానిస్తాన్‌లో మన ‘టెక్నికల్ టీమ్’ ఒకటి పనిచేస్తోంది. భారత్ నుంచి మానవతా సాయం కూడా ఈ పొరుగు దేశానికి అందుతోంది. అయితే అఫ్గాన్ల పరిస్థితిని వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకుని ఆచరణ సాధ్యమైన ఆలోచనలను అమల్లో పెట్టడం మేలు. భద్రతా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూనే వీసాల జారీని కొంత సులువు చేయడం అవసరం. ఈ చర్య ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సంబంధాలను మరి కొంచెం దృఢతరం చేయగలదు. వివేక్ కాట్జూ వ్యాసకర్త విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
రష్యా అధ్యక్షుడికి జేజేలు.. నైగర్‌లో భారీగా మద్దతుదారులు..
నియామే: పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైగర్‌లో సైనిక దళాలు తిరుగుబాటు చేసి ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ బజోమ్స్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సైనిక చర్యను ప్రాన్స్ తప్పుబట్టగా వాగ్నర్ దళాధిపతి ప్రిగోజిన్ మాత్రం మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటు సైన్యానికి, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు జేజేలు పలుకుతూ భారీ సంఖ్యలో మద్దతుదారులు రాజధానికి తరలి వచ్చారు. తిరుగుబాటు పర్వం.. కొద్దిరోజుల క్రితం నైగర్‌లో చోటుచేసుకున్న తిరుగుబాటు ఇరుగు పొరుగు దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. రెండేళ్ల క్రితం 2021లో నైగర్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో మహమ్మద్ బజోమ్స్ గెలిచారు. కానీ ఆయన పరిపాలనలో ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద ముఠాలు పేట్రేగుతున్నాయని, అతని చేతగానితనంతో ఫ్రాన్స్ మళ్ళీ తమ గడ్డమీద పాగా వేయాలని చూస్తున్న నేపథ్యంలో తిరుగుబాటు చేసి అధ్యక్షుడిని చెరలో బంధించామని కల్నల్ మజ్ అమదౌ అబ్రందానే తెలిపారు. దేశమంతటా కర్ఫ్యూ.. ఈ మేరకు ఒక వీడియోని విడుదల చేస్తూ.. దేశ సరిహద్దులను మూసి వేస్తున్నామని, ఇది మా దేశ అంతర్గత వ్యవహారమని ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దని అన్నారు. మహమ్మద్ బజోమ్స్ ను అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నామని ప్రకటిస్తూ దేశమంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్లు టీవీ ద్వారా సందేశమిచ్చారు. COUP D'ETAT IN NIGER - Group of soldiers appear on state TV - Announce President Bazoum has been removed - Order 7 pm-5 am nationwide curfew - Borders closed until further notice - Bazoum appears to have been detained - Niger is Western ally in fight against terror pic.twitter.com/iHJ3XbaF1s — BNO News (@BNONews) July 26, 2023 అమెరికా కంగారు.. తిరుగుబాటు తదనంతరం సైనిక చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమెరికా, ఫ్రాన్స్ దేశాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించగా వారి గొంతు వెనుక స్వార్ధపూరిత కారణాలు కూడా లేకపోలేదంటున్నాయి నైగర్ సైనిక వర్గాలు. నైగర్‌లో అమెరికాకు రెండు డ్రోన్ స్థావరాలున్నాయని సుమారు 800 మంది వారి సైనికులు నైగర్ సైన్యానికి శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. జయహో పుతిన్.. ఇదిలా ఉండగా రష్యా తిరుగుబాటు సైన్యాధ్యక్షుడు యెవ్‌గనీ ప్రిగోజిన్ నైగర్ సైన్యం తిరుగుబాటు సరైనదేనని మద్దతు తెలిపారు. దీంతో నైగర్ తిరుగుబాటు సైన్యానికి మద్దతుదారులు భారీగా రాజధాని నియామేకి తరలి వచ్చి ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు జేజేలు పలుకుతూ రష్యా జెండాలను ప్రదర్శించారు. అనుమానమే నిజమైంది.. 1960లో ఫ్రాన్స్ నుండి స్వాతంత్య్రం పొందినప్పటి నుండి నైగర్‌లో తిరుగుబాట్లు జరిగాయి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన తర్వాత తిరుగుబాటు జరగడం ఇదే మొదటిసారి. అధ్యక్షుడిగా మహమ్మద్ బజోమ్స్ ఎన్నికైన తర్వాత పలుమార్లు ప్రెసిడెన్షియల్ గార్డ్స్ బృందం నుండి తనకు ముప్పు ఉందని తిరుగుబాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. చివరకు ఆయన అనుమానమే నిజమైంది. ఇది కూడా చదవండి: ఎత్తైన భవనంపై సాహాసం.. అంతలోనే పట్టుతప్పి.. -
కాశ్మీర్లో సెలవుపై వచ్చిన భారత జవాను అదృశ్యం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటుకి చెందిన జవాను జావేద్ అహ్మద్ కొద్దిరోజుల క్రితమే సెలవులపై ఇంటికి తిరిగొచ్చాడు. మార్కెట్ కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుండి బయటకు వచ్చిన అతడు తర్వాత అదృశ్యమైనట్లు తెలిపారు కుటుంబ సభ్యులు. దక్షిణ కాశ్మీర్ లో నివాసముండే భారత జవాను జావేద్ అహ్మద్(25) జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటులో విధులు నిర్వర్తిస్తున్నాడు. సెలవుపై ఇంటికి వచ్చిన జావేద్ శనివారం సాయంత్రం 6.30 గంటలకు మార్కెట్ కు వెళ్లి వస్తానని చెప్పి ఆల్టో కారులో బయటకు వెళ్ళాడు. రాత్రి 9.00 అయినా అతను తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడి కోసం గాలించడం మొదలుపెట్టారు. మార్కెట్ కు కొంత దూరంలో రక్తపు మరకలు అంటుకున్న కారు కనిపించింది కానీ అందులో జావేద్ లేడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కాశ్మీర్ పోలీసులు కేసును నమోదు చేసి ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. రక్షణ దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గతంలో కూడా కొంతమంది సైనికులు సెలవుపై ఇంటికి వచ్చాక ఇలాగే అపహరణకు గురైన వారిని తీవ్రవాదులు దారుణంగా కడతేర్చారు. దీంతో ఇది కూడా ఉగ్రవాద చర్యగా భావించి జావేద్ తల్లి.. దయచేసి మమ్మల్ని క్షమించండి.. నా కుమారుడిని విడుదల చేయండి, నా జావేద్ ను విడుదల చేయండి.. వాడిని సైన్యంలో పనిచేయకుండా ఆపుతాను.. కానీ వాడిని విరిచిపెట్టండి.. అంటూ జవాను తల్లి ఒక వీడియో సందేశాన్ని కూడా సిద్ధం చేశారు. ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లకు వారే కారణమా..? -
ఐదుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను నగర సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో బాంబు పేలుళ్ల ద్వారా విధ్వంసానికి పాల్పడేందుకు ఈ ఐదుగురు ముష్కరులు సుహైల్, ఉమర్, తర్బేజ్, ముదాసీర్, ఫైజల్ కుట్ర పన్నినట్లు పోలీసులు చెప్పారు. వారిని ఎన్ఐఏ కోర్టులో హాజరుపర్చగా, ఐదు రోజుల పాటు సీసీబీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దేశద్రోహ కార్యకలాపాలకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న సీసీబీ పోలీసులు హెబ్బాళ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఇంటిపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై హెబ్బాళ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి ఏడు దేశవాలీ పిస్తోళ్లు, 45 బుల్లెట్లు, వాకీటాకీ సెట్స్, 12 మొబైల్ ఫోన్లు, రెండు శాటిలైట్ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. బెంగళూరులో రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లకు ప్రణాళికలు రూపొందించినట్లు విచారణలో నిందితులు అంగీకరించాని పోలీసులు వెల్లడించారు. -
బెంగళూరులో ఉగ్ర కలకలం.. ఐదుగురి అరెస్ట్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అయిదుగురు అనుమానిత టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం వీరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిని జునైద్, సోహైల్, ముదాసిర్, ఉమర్, జాహిద్‌గా గుర్తించారు. వీరి నుంచి సెల్ ఫోన్లతోపాటు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఇతర వస్తులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తదుపరి విచారణ జరుగుతోందని సీసీబీ పోలీసులు తెలిపారు. ఈ కుట్రలో మరో అయిదుగురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం జల్లెడపడుతున్నారు. కాగా అరెస్ట్ అయిన నిందితులు 2017లో జరిగిన ఓ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కొంతకాలం బెంగుళూరు సెంట్రల్ జైలులో శిక్షననుభవించారని చెప్పారు. ఆ సమయంలో కొంతమంది ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడి పేలుడు పదార్థాలను నిర్వహించడంలో శిక్షణ పొందినట్లు వెల్లడించారు. చదవండి: ఐఏఎస్ ఆకాశ్‌పై భార్య వందన ఫిర్యాదు -
షరియత్ స్థాపనే హెచ్‌యూటీ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని పడగొట్టి షరియత్ స్థాపనే లక్ష్యంగా హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్‌యూటీ) సంస్థ పనిచేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్ధారించింది. ఈ సంస్థకు చెందిన 16 మంది ఉగ్రవాదులను మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు గత నెల్లో హైదరాబాద్, భోపాల్‌లో అరెస్టు చేసిన విషయం విదితమే. ఎన్ఐఏ ఈ కేసును గత నెల 24న రీ–రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టింది. ఇస్లామిక్ రాజ్యస్థాపనకు వ్యతిరేకంగా, అడ్డంకిగా ఉన్న ఓ వర్గానికి చెందిన నాయకులను టార్గెట్‌గా చేసుకోవడంతోపాటు ప్రార్థన స్థలాలు, రద్దీ ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద దేశంలో దీనిపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రాంతాల వారీగా తన్జీమ్లు ఏర్పాటు దేశంలో ఉన్న ప్రభుత్వం ఓ వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని, వారి హక్కుల కోసం పోరాడే సంస్థలపై నిషేధం విధిస్తూ, కార్యకర్తలను జైళ్లకు పంపుతోందని తమ కేడర్‌కు నూరిపోస్తోంది. దీనికి సంబంధించి ఆడియోలు, వీడియోలను రూపొందించి రాకెట్ చాట్, త్రీమా యాప్స్ ద్వారా ప్రచారం చేసింది. ఈ ఉగ్ర సంస్థ మధ్యప్రదేశ్, హైదరాబాద్‌ల్లో విస్తరించి ఉన్నట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ ఉగ్రవాదులు ప్రాంతాల వారీగా తన్జీమ్గా పిలిచే మాడ్యుల్స్ ఏర్పాటు చేసుకున్నట్లు ఎన్ఐఏ తేల్చింది. మధ్యప్రదేశ్ తన్జీమ్‌కు యాసిర్ ఖాన్, తెలంగాణ తన్జీమ్‌కు మహ్మద్ సలీం నేతృత్వం వహించారు. వీళ్లు మరింత మందిని తన సంస్థలో చేర్చుకుని వివిధ ప్రాంతాలకు విస్తరించడానికి కుట్ర పన్నారు. ఈ ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటిలో ఆడియో, వీడియోలతోపాటు ఐఎస్ఐఎస్ రూపొందించే ఆన్లైన్ పత్రిక వాయిస్ ఆఫ్ హింద్ ప్రతులు, ఖలాఫతుల్లా అల్ మహదీపై ఉన్న పత్రాలు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్, ఏకే 47, 303 రైఫిల్‌తోపాటు వివిధ పేలుడు పదార్థాల ఫొటోలు, వాటి డాక్యుమెంట్లను రిట్రీవ్ చేశారు. హైదరాబాద్‌లోనే కీలక నిర్ణయాలు మధ్యప్రదేశ్, తెలంగాణ తన్జీమ్లకు చెందిన 17 మంది ఉగ్రవాదులు గతేడాది హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. గోల్కొండ ప్రాంతంలోని సలీం ఇంట్లో జరిగిన ఈ మీటింగ్‌లోనే భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించి, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని అధికారులు తేల్చారు. సలీం సహా హైదరాబాద్ తన్జీమ్‌కు చెందిన ఆరుగురూ ఆపరేషన్స్ చేయడానికి సిద్ధమవుతూ శిక్షణ కూడా తీసుకున్నారు. హైదరాబాద్ తన్జీమ్‌కు సంబంధించి జవహర్‌నగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. ఇతడిని పట్టుకునేందుకు ఎన్ఐఏ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపింది. -
ఉగ్రవాదులు టార్గెట్ చేసిన రాష్ట్రాలు ఇవేనా?
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు హైదరాబాద్–భోపాల్‌లలో అరెస్టు చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరం చేసింది. ఈ కేసును ఢిల్లీ యూనిట్ గత నెల 24న రీ–రిజిస్టర్ చేసిన విషయం తెలిసిందే. దీని దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక ఎన్ఐఏ బృందం సోమవారం ఢిల్లీ నుంచి భోపాల్ చేరుకుంది. ఏటీఎస్ అధికారులతో సమావేశమైన ఈ టీమ్.. కేసు పూర్వాపరాలు తెలుసుకుంది. గత నెల 9న∙ఏటీఎస్ అధికారులు హైదరాబాద్‌లో ఐదుగురు, భోపాల్‌లో 11 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్‌యూటీ) ఉగ్ర సంస్థకు చెందిన ఈ మాడ్యుల్ షరియత్ స్థాపనే లక్ష్యంగా విధ్వంసాలకు పథక రచన చేసింది. వీరి టార్గెట్‌లో అనేక ప్రాంతాలతో పాటు మత నాయకులు కూడా ఉన్నట్లు ఏటీఎస్ ఆరోపిస్తోంది. కాగా, ఈ ఉగ్రవాదులు తెలంగాణ, మధ్యప్రదేశ్‌తో పాటు ఏయే రాష్ట్రాలను టార్గెట్‌గా చేసుకున్నారనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పేలుడు పదార్థాలనూ సమీకరిస్తున్న వీరి అసలు కుట్ర ఏమిటి అన్నదానిపై ఎన్ఐఏ దృష్టి సారించింది. ఈ 16 మంది ఉగ్రవాదులను అధికారులు ఇప్పటికే రెండుసార్లు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఎన్ఐఏ అధికారులు సైతం హైదరాబాద్, భోపాల్‌లకు చెందిన మహ్మద్ సలీం, యాసిర్ ఖాన్‌లతో పాటు మిగిలిన వారినీ మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా త్వరలో వీరిని హైదరాబాద్ తీసుకురావాలని ఎన్ఐఏ నిర్ణయించింది. -
ఎన్ఐఏ చేతికి భోపాల్ ఉగ్ర కేసు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–భోపాల్‌లలో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అరెస్టు చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పరిధిలోకి వెళ్లింది. ఈ నెల 9న ఏకకాలంలో దా డులు చేసిన ఏటీఎస్ అధికారులు హైదరాబాద్‌లో ఐదుగురు, భోపాల్‌లో 11 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గురువారం భోపాల్‌లో ఏటీఎస్ అధికారులతో భేటీ అయిన ఎన్ఐఏ అధికారులు.. శుక్రవారం నుంచి అధికారికంగా దర్యాప్తు ప్రారంభించారు. దీనికోసం ప్రత్యే కంగా కేసు నమోదు చేశారు. ఈ ఉగ్రవాదులకు ఉన్న విదేశీ లింకులు, ఆర్థిక మూలాలపైనే తొలుత దృష్టి సారించారు. దీనితోపాటు వారికి అందిన శిక్షణ, ఎక్కడెక్కడ శిబిరాలు నిర్వహించారన్నది ఆరా తీస్తున్నారు. హెచ్‌యూటీ పేరుతోనే కొనసాగింపు.. హైదరాబాద్, భోపాల్‌లలో అరెస్టైన ఉగ్రవాదులు తొలుత అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్‌యూటీ)కి అనుబంధంగా పనిచేశారు. రాకెట్ చాట్, త్రీమా యాప్స్‌లో ఏర్పాటు చేసుకున్న గ్రూపుల్లో హెచ్యూటీకి చెందినవారు పంపిన వీడియోలు, ఆడియోలు, పత్రాలను చూసి ప్రేరణ పొందారు. కానీ ఎంతకాలం ఎదురుచూసినా హెచ్‌యూటీ నుంచి విధ్వంసాలకు సంబంధించిన ఆదేశాలు అందలేదు. దీంతో సొంతంగా సలీం, యాసిర్‌ల నేతృత్వంలో హైదరాబాద్, భోపాల్ మాడ్యుల్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. నిషేదం నుంచి తప్పించుకోవడానికి ఈ మాడ్యూల్స్‌కు ఎలాంటి పేర్లూ పెట్టుకోలేదు. ప్రాథమిక ఆధారాలను బట్టి హెచ్‌యూటీ ఉగ్రవాదులుగానే పరిగణించాలని, ఆ సంస్థపై నిషేధం విధించాలని కేంద్ర హోంశాఖకు నివేదిక పంపేందుకు ఎన్ఐఏ సన్నాహాలు చేస్తోంది. కేసు దర్యాప్తు పూర్తిచేసి, అభియోగపత్రాలు దాఖలు చేశాక ఈ ప్రక్రియ చేపట్టనుంది. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో లాడెన్ వీడియోలు ఏటీఎస్ అధికారులు ఉగ్రవాదుల నుంచి స్వా«దీనం చేసుకున్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విశ్లేషణ చేయించగా.. పలు కీలక అంశాలను గుర్తించారు. యువత ఉగ్రవాద బాటపట్టా లని రెచ్చగొట్టేలా ఒసామా బిన్‌లాడెన్ చేసిన ప్రసంగాల వీడియోలు, తఫ్సీర్–ఎ–జిహాద్ పేరిట రెచ్చ గొట్టే వ్యాఖ్యల ఆడియోలు వాటిలో ఉన్నట్టు ఏటీఎస్ అధికారులు చెప్తున్నారు. ఈ ఉగ్రవాదుల్లో ఇంజనీరింగ్ చదివిన రిజ్వీ, డానిష్, కరీం, అబ్దుర్ రెహ్మాన్ (హైదరాబాద్‌లో అరెస్టయ్యాడు) ఎల్రక్టానిక్ పరికరాలను వినియోగించడంపై మిగతా వారికి శిక్షణ ఇచ్చారు. భోపాల్ మాడ్యుల్‌కు చెందినవారు అక్కడి ఇంద్రపురిలో ఉన్న కమల పార్కులో వివిధ అంశాలపై శిక్షణ తీసుకున్నరని దర్యాప్తు అధికారులు గుర్తించారు. యాసిర్ వీరికి తన ఫిట్నెస్ సెంటర్లో బాక్సింగ్, కత్తిని ఉపయోగించడం వంటి వాటిలో చిట్కాలు నేర్పినట్టు తేల్చారు. హైదరాబాద్‌లో శిబిరం ఎక్కడ? ఉగ్రవాదులను విచారించిన సమయంలో.. హైదరాబాద్‌తోపాటు భోపాల్‌కు చెందిన ఉగ్రవాదులు 2021 జూలైలో ఇక్కడి గోల్కొండలోని మహ్మద్ సలీం ఇంట్లో సమావేశమయ్యారని ఏటీఎస్ గుర్తించింది. తర్వాత రెండు రోజుల పాటు పెద్ద శిక్షణ శిబిరం నిర్వహించారని.. ఎయిర్ గన్ కాల్చడం, బరువు తగ్గడంతోపాటు ఆత్మరక్షణ, పోలీసుల ఇంటరాగేషన్‌ను ఎదుర్కోవడం వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారని తేల్చింది. అయితే ఈ శిక్షణ శిబిరం ఎక్కడ నిర్వహించారనేది ఉగ్రవాదులు బయటపెట్టలేదని.. ఆ ప్రాంతాన్ని గుర్తించడానికి ఎన్ఐఏ అధికారులు సాంకేతికంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారని తెలిసింది. ఇక గత ఏడాది నవంబర్‌లో భోపాల్ సమీపంలో జరిగిన శిబిరంలో వీరంతా నాటు తుపాకీ కాల్చడం, చిన్న చిన్న బాంబులు తయారు చేయడాన్ని ప్రాక్టీస్ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. -
ఆ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు ప్లాన్.. భోపాల్-హైదరాబాద్ ఉగ్ర కోణంలో సంచలన నిజాలు
సాక్షి, హైదరాబాద్: భోపాల్ ఉగ్రవాదుల కేసులో పలు కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. భోపాల్-హైదరాబాద్ ఉగ్ర కోణంలో నిజాలు బయటపడుతున్నాయి. కస్టడీలో నిందితుల నుంచి ఏటీఎస్ పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. హైదరాబాద్- భోపాల్ యువకులకు జిమ్ ట్రైనర్ యసిర్ ఉగ్ర శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. భోపాల్ శివార్లలో యువకులకు హెచ్‌యూటీ శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. హెచ్‌యూటీ కోడ్ భాషలో ఫిదాయీ అంటే.. ఆత్మాహుతి దాడి అని ఏటీఎస్ గుర్తించింది. 16 మంది హిజ్బుత్ సభ్యులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం లోతుగా విచారిస్తోంది. భోపాల్‌లోని.. భోజ్‌పురా సమీపంలోని రైసన్ అడవుల్లో యువతకు ఉగ్ర కర్యకలాపాలపై శిక్షణ ఇచ్చినట్లు గుర్తించగా, అరెస్ట్ అయిన వారి వద్ద పలు వీడియోలు.. కోడ్ భాషలో వున్న 50కి పైగా ఆడియోలు స్వాధీనం చేసుకున్నారు. భోపాల్‌లోని శాంతి ద్వీపం పేల్చేయాలన్న కోడ్ భాషను ఏటీఎస్ డీకోడ్ చేసింది. శాంతి ద్వీపం పేల్చడం అంటే.. బాంబు పేలుళ్లు జరపడం అని ఏటీఎస్ గుర్తించింది. చదవండి: అవసరమైతే ఆత్మాహుతి దాడులు! భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్, మోతీలాల్ నెహ్రూ స్టేడియం, బరాసియా డ్యాం వద్ద బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ఉగ్ర కార్యకలాపాల కోసం విదేశాల నుండి హవాలా మార్గం లో నిధులు వచ్చినట్టు ఏటీఎస్ బృందం గుర్తించింది. -
ఉగ్రవాదులపై అటవీ చట్టం!
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు ఈ నెల 9న హైదరాబాద్‌తో పాటు భోపాల్‌లో అరెస్టు చేసిన ఉగ్రవాదులపై అటవీ శాఖ చట్టం కిందా అభియో గాలు చేయనున్నారు. భోపాల్‌కు చెందిన ఓ పర్యావరణవేత్త ఇచ్చిన సూచన మేరకు ఏటీఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంబంధిత కేసుల్లో పోలీసులు సాధారణంగా.. చట్ట విరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం–1967లోని వివిధ సెక్షన్ల కింద ఆరోపణలు చేస్తారు. ఆ ఉగ్రవాదుల వ్యవహారశైలి, చేసిన విధ్వంసాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), ఆయుధ చట్టం, పేలుడు పదార్థాల చట్టంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ల కిందా ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్–¿ోపాల్ మాడ్యుల్స్‌పై మాత్రం అటవీ చట్టంలోని సెక్షన్లనూ జోడించాలని మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ నిర్ణయించింది. ఈ ఉగ్రవాదులు భోపాల్ శివార్లలోని రైసెన్ అడవుల్లో తుపాకీ కాల్చడాన్ని ప్రాక్టీసు చేశారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన సలీం తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. అటవీ చట్టాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లోకి ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించడం నేరం. అలా వెళ్లడమే కాకుండా నిషిద్ధ ప్రాంతంలో తుపాకులు వాడినందుకు వీరిపై అటవీ చట్టాల ప్రకారం ఆరోపణలు చేయడమే కాదు, అభియోగాలు సైతం మోపి విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ ఏటీఎస్‌కు శుక్రవారం ఓ లేఖ అందింది. భోపాల్‌కు చెందిన ఓ పర్యావరణవేత్త దీన్ని రాశారు. ఈ లేఖను పరిగణనలోకి తీసుకున్న ఏటీఎస్ ఆ చట్టంలోని సెక్షన్లను చేర్చాలని నిర్ణయించింది. 10 మంది పోలీసు కస్టడీ పొడిగింపు హైదరాబాద్, భోపాల్‌లలో అరెస్టు చేసిన 16 మంది ఉగ్రవాదుల పోలీసు కస్టడీ గడువు శుక్రవారంతో ముగియడంతో ఏటీఎస్ అధికారులు వీరిని భోపాల్‌లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీ గడువు మరో పది రోజులు పొడిగించాలని కోరారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి రఘువీర్ యాదవ్ 10 మంది కస్టడీని ఈ నెల 24 వరకు పొడిగించారు. ఆరుగురికి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కస్టడీ పొడిగించిన వారిలో సలీం, రెహా్మన్, యాసిర్ ఖాన్ తదితరులు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. వీరిని మరోసారి హైదరాబాద్‌కు తీసుకువస్తారా? సిద్దిపేటలో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
అవసరమైతే ఆత్మాహుతి దాడులకూ ప్లాన్!..
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఇటీవల హైదరాబాద్–భోపాల్‌లలో అరెస్టు చేసిన 16 మంది ఉగ్రవాదుల కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు చేయడానికి ఈ మాడ్యూల్స్ సిద్ధమయ్యాయని, వీటికి విదేశాల నుంచి ఆదేశాలు అందుతున్నాయని ప్రాథమిక ఆధారాలు లభించాయి. మహ్మద్ సలీం, యాసిర్ ఖాన్ సహా ముగ్గురి నుంచి రికవరీ చేసిన ఫోన్లను ఏటీఎస్ అధికారులు విశ్లేషించారు. అవసరమైతే ఆత్మాహుతి దాడులకు సిద్ధం కావాలంటూ ఓ వ్యక్తి నుంచి వీరికి ఆదేశాలు అందినట్టు గుర్తించారు. ఫోన్ల నుంచి ఆడియోలు రికవరీ ఏటీఎస్ అధికారులు అరెస్టు చేసిన 16 మందిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఉగ్రవాదులు సమాచార మారి్పడికి రాకెట్ చాట్, త్రీమా యాప్స్ వినియోగించారని.. ఎప్పటికప్పుడు డేటాను డిలీట్ చేయడం వల్ల కీలకమైన సమాచారమేదీ లభించలేదని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా 50 ఆడియో ఫైళ్లను రికవరీ చేసినట్టు సమాచారం. ఈ ఆడియోల్లో ప్రసంగించిన వ్యక్తి.. ఒకేసారి అనేక మందిని చంపడం (మాస్ కిల్లింగ్), సాబోటేజ్ (విధ్వంసాలు సృష్టించడం), ఎంపిక చేసుకున్న వ్యక్తులను హతమార్చడం (టార్గెట్ కిల్లింగ్)తోపాటు ఆత్మాహుతి (ఫిదాయీన్) దాడులకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టు తేల్చారు. ఈ ఆడియోలతోపాటు వీరికి అందిన ఆదేశాలు, సూచనల సందేశాలూ రికవరీ అయ్యాయి. ఇక ఈ ఫోన్లకు పాకిస్తాన్ నంబర్ల నుంచి కాల్స్ వచ్చాయని, కాంటాక్ట్స్ లిస్టులోనూ ఆ దేశ నంబర్లు ఉన్నాయని గుర్తించారు. ఆ ఫోన్ నంబర్లు ఎవరివి, ఆడియోల్లోని వ్యక్తి ఎవరు అనేది గుర్తించేందుకు కేంద్ర నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. కొన్ని ఆడియోల్లో కఫీల్ అహ్మద్ ప్రస్తావన ఫోన్ల నుంచి రిట్రీవ్ చేసిన ఆడియోల్లో లండన్‌లోని గ్లాస్గో విమానాశ్రయంపై 2007లో మానవ బాంబు దాడికి ప్రయత్నించిన బెంగళూరు వాసి, వృత్తిరీత్యా డాక్టర్ అయిన కఫీల్ అహ్మద్ ప్రస్తావన ఉన్నట్లు ఏటీఎస్ గుర్తించింది. ఇతను హిజ్బ్ ఉత్ తెహరీర్ (హెచ్‌యూటీ) సంస్థ తరఫునే మానవబాంబుగా మారాడు. హైదరాబాద్–¿ోపాల్ మాడ్యూల్ ఉగ్రవాదులూ తొలినాళ్లలో ఇదే ఉగ్రవాద సంస్థ తరఫున పనిచేశారు. ఈ క్రమంలో ఫోన్లలోని ఆడియోలు హెచ్‌యూటీ హ్యాండ్లర్‌విగా భావిస్తున్నారు. ఇక ఏటీఎస్ విచారిస్తున్న 16 మంది పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. మరో ఐదు రోజులు కస్టడీ కోరాలని ఏటీఎస్ భావిస్తోంది. ఈ కేసులో మరో ముగ్గురు హైదరాబాద్ వాసులను సాక్షులుగా చేరుస్తున్నారు. చదవండి: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 17 రైళ్లు రద్దు -
అడవులే కేంద్రంగా ఉగ్రవాద శిక్షణ
సాక్షి, హైదరాబాద్: నగరంతో పాటు భోపాల్‌లో పట్టుబడిన 16 మంది ఉగ్రవాదులు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లోనే శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. నగర శివార్లలో ఉన్న వికారాబాద్‌లోని అనంతగిరి అడవుల మాదిరిగానే భోపాల్ సరిహద్దుల్లోని రైసెన్ అడవిని ఎంచుకున్నట్లు ఏటీఎస్ అధికారులు నిర్థారించారు. అక్కడ అరెస్టయిన 11 మందితో పాటు నగరంలో చిక్కిన ఐదుగురినీ ప్రస్తుతం ఏటీఎస్ తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. భోపాల్‌లోని సాఫ్ట్వేర్ ఇంజినీర్ సయ్యద్ డానిష్ అలీ ఇంటిలో సూత్రధారి యాసిర్ ఖాన్ నిర్వహించిన సమావేశాలకు నగరం నుంచి సలీంతో పాటు అబ్దుల్ రెహా్మన్, షేక్ జునైద్ కూడా హాజరయ్యారని ఏటీఎస్ చెప్తోంది. దానికి సంబంధించిన ఆధారాలు సైతం తమకు లభించినట్లు స్పష్టం చేస్తోంది. గోల్కొండలోని సలీం నివాసంలో ఎయిర్ పిస్టల్, పిల్లెట్స్, భోపాల్‌లోని యాసిర్ ఇంటి నుంచి నాటు తుపాకీ, తూటాలు సీజ్ చేశారు. ఈ నాటు తుపాకీ సేకరించింది, భోపాల్ మాడ్యుల్‌కు శిక్షణ ఇచ్చింది కూడా సలీం అని ఏటీఎస్ అనుమానిస్తోంది. ఆ కోణంలో అతడిని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. విదేశీ నంబర్లకు ఫోన్లపై ఆరా నగర మాడ్యుల్‌కు చెందిన ఐదుగురు సభ్యుల ఫోన్ల నుంచి విదేశీ నెంబర్లకు ఫోన్లు వెళ్లినట్లు అనుమానిస్తున్న దర్యాప్తు అధికారులు వాటి వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి విదేశాల్లో ఉన్న వారితో ఉన్న సంబంధాల పైనా దర్యాప్తు చేయనున్నారు. ఉగ్రవాద సాహిత్యాన్ని తన ల్యాప్‌టాప్ వినియోగించి సొంతంగా తయారు చేసిన సలీం అందులో అనేక అంశాలు చేర్చాడు. ఆన్లైన్లో ఉన్న విషయాలతో పాటు వివిధ పుస్తకాల్లోని అంశాలు క్రోడీకరించి రూపొందించిన ఇందులో జిహాద్, ముజాహిదీన్ అంటే ఏమిటి? తాము ఏం చేయాలి? అనే వివరాలతో పాటు ఉగ్రవాద చర్యల్లో పాల్గొంటూ చనిపోయిన వారి కుటుంబాలను ఎలా ఆదుకోవాలి? ఎలాంటి ఆయుధాలు సమీకరించుకోవాలి? క్యాడర్‌ను ఎలా రిక్రూట్ చేసుకోవాలి? వివరాలు పొందుపరిచాడు. ఈ కేసులో సాక్షులుగా ‘వారు’: సలీం రెహ్మాన్ న్ గతంలో మరికొందరిని ఆకర్షించారు. వీళ్లు కేవలం మతపరమైన కార్యక్రమాలు చేపడుతున్నారని భావించిన వాళ్లు కొన్ని సమావేశాలకు హాజరయ్యారు. కొన్నాళ్లకే వీరి వ్యవహరశైలి, కార్యకలాపాలు అనుమానాస్పదంగా భావించిన వారంతా దూరయమ్యారు. వీరిని గుర్తించి, ఈ కేసులో సాక్షులుగా మార్చాలని పోలీసులు భావిస్తున్నారు. -
దేశవ్యాప్తంగా ఏకకాల దాడులకు కుట్ర! విచారణలో కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు భోపాల్, హైదరాబాద్‌లలో అరెస్టు చేసిన ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు బయటపడింది. మధ్యప్రదేశ్, హైదరాబాద్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులకు వారు సిద్ధపడ్డట్లు తెలియవచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో పట్టుకున్న ఐదుగురినీ ఏటీఎస్ అధికారులు బుధవారం భోపాల్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారిని ఈ నెల 20 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. పోలీసుల నుంచి తృటిలో తప్పించుకున్న జవహర్‌నగర్‌లోని శివాజీనగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్ కోసం ఏటీఎస్తోపాటు రాష్ట్ర నిఘా వర్గాలు, పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బుధవారం రాత్రి వరకు అతడి ఆచూకీ లభించలేదు. భోపాల్, హైదరాబాద్‌లలో ఇప్పటివరకు అరెస్టయిన 16 మంది విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... టాస్క్ లు ఇవ్వకపోవడంతో... భోపాల్‌లోని షాజహానాబాద్‌కు చెందిన యాసిర్ ఖాన్ నేతృత్వంలో 2018లో ఈ మాడ్యూల్ ఏర్పడింది. ఓ వర్గానికి చెందిన వారితో మతమార్పిళ్లు చేయించి యాసిర్ వారిని ఉగ్రవాద బాట పట్టించాడు. అతడి మాడ్యూల్‌లోని వారిలో 90 శాతం ఇలాంటి వాళ్లేనని నిఘా వర్గాలు గుర్తించాయి. యాసిర్ తొలినాళ్లలో హిజ్బ్ ఉత్ తహ్రీర్ (హెచ్‌యూటీ) సంస్థలో పనిచేశాడు. మొదట్లో ఐసిస్‌కు అనుబంధంగా పనిచేసిన ఆ సంస్థ ఆపై దాన్నే విమర్శించింది. విదేశాల్లోని హెచ్‌యూటీ కేడర్‌తో యాసిర్ రాకెట్ చాట్‌తోపాటు త్రీమా యాప్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. ఎన్నాళ్లు నిరీక్షించినా ఎలాంటి టాస్్కలు ఇవ్వకపోవడంతో ఆ సంస్థకు దూరమై మహ్మద్ సలీంగా మారిన సౌరభ్‌రాజ్ విద్యతో కలసి సొంతంగా మాడ్యూల్ తయారు చేయడం మొదలెట్టాడు. ఆ పని మీదే సలీంను హైదరాబాద్ పంపి కొందరిని ఉగ్రబాట పట్టించడంతోపాటు మరో ముఠా తయారయ్యేలా ప్రేరేపించాడు. వాటికి హెచ్‌యూటీ (భోపాల్), హెచ్‌యూటీ (హైదరాబాద్) పేర్లు పెట్టుకున్నారు. ఎప్పుడైనా దాడులకు సిద్ధంగా ఉండేలా... టార్గెట్ కిల్లింగ్స్‌గా పిలిచే ఎంపిక చేసుకున్న వారిని హత్య చేయడం, తద్వారా మత కలహాలు రెచ్చగొట్టడం లక్ష్యంగా పెట్టుకున్న యాసిర్, సలీంలు ఆ పంథాలోనే సిద్ధమవుతున్నారు. దేహదారుఢ్యంతోపాటు తుపాకులు కాల్చడం, కత్తులు, గొడ్డళ్ల వినియోగంపై దృష్టి పెట్టారు. పెల్లెట్స్‌తో పనిచేసే ఎయిర్ పిస్టల్స్ వాడకంపై అనంతగిరి అడవుల్లో, నాటు తుపాకులు కాల్చడంపై భోపాల్ సరిహద్దుల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేశారు. అటు యాసిర్ ఇంట్లో, ఇటు హైదరాబాద్‌లోని ఐదుగురి ఇళ్లలో తరచూ సమావేశాలు నిర్వహించారు. ఏడాదిన్నరగా ఈ శిక్షణ పెరిగినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 32 గంటల వరకు ఏమీ ముట్టకుండా... టార్గెట్ కిల్లింగ్స్తోపాటు కిడ్నాప్‌లు, మాల్స్, సినిమా హాళ్లను అదీనంలోకి తీసుకోవడమూ వారి పథకాల్లో భాగమే. హోస్టేజ్‌గా పిలిచే అలాంటి సందర్భాల్లో నిర్భంధంలోని వారికి అన్నీ అందించినా... ఉగ్రవాదులు సైతం కొన్ని గంటలపాటు నీళ్లు, ఆహారం లేకుండా ఉండాల్సి వస్తుంది. పోలీసులు లేదా భద్రతా బలగాలు నీళ్లు, ఆహారంలో మత్తుమందు కలిపి తమను పట్టుకొనే ఆస్కారం ఉందని ఉగ్రవాదులు ఏమీ ముట్టకుండా ఉంటారు. ఇలా గరిష్టంగా 48 గంటల వరకు మాడ్యూల్‌లోని వారంతా ఏమీ తీసుకోకుండా ఉండేలా శిక్షణ ఇవ్వాలని యాసిర్ నుంచి సలీంకు ఆదేశాలు అందాయి. ఈ సర్వైవల్ టెక్నిక్స్‌తోపాటు పర్వతారోహణను ముష్కరులు అనంతగిరి అడవుల్లో ప్రాక్టీస్ చేసినట్లు బయటపడింది. గరిష్టంగా 32 గంటల వరకు ఏమీ తీసుకోకున్నా జీవించేలా హైదరాబాద్ గ్యాంగ్ సిద్ధమైంది. రెండు నెలల క్రితం తన ఇంటికి వచ్చిన యాసిర్‌కు సలీం ఈ వీడియోలను చూపించాడు. పక్కింటి వాళ్లు ఫోన్ చేయడంతో... ముష్కరులను పట్టుకోవడానికి మధ్యప్రదేశ్ ఏటీఎస్, రాష్ట్ర నిఘా వర్గాలు హైదరాబాద్‌తోపాటు భోపాల్‌లోనూ మంగళవారం తెల్లవారుజామున ఏకకాలంలో దాడులు చేశాయి. ఫలితంగా అక్కడ 11 మంది, నగరంలో ఐదుగురు చిక్కారు. నగరానికి చెందిన మహ్మద్ సలీం, అబ్దుర్ రెహ్మాన్, మహ్మద్ అబ్బాస్ అలీ, షేక్ జునైద్, మహ్మద్ హమీద్లతోపాటు జవహర్‌నగర్‌లోని శివాజీనగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్‌ను కూడా పట్టుకోవాల్సి ఉంది. అయితే పోలీసుల దాడి సమయంలో అతడు పాల ప్యాకెట్ల కోసం బయటకు వెళ్లాడు. అయితే పోలీసుల రాకను పక్కింటి వాళ్లు ఫోన్ చేసి చెప్పడంతో సల్మాన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మరోవైపు పోలీసులు బుధవారం ఆరుగురు ఉగ్రవాదుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించగా అరెస్టయిన ఉగ్రవాదులతోపాటు వారి భార్యలూ మతమారి్పడి చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. -
ఉగ్ర ముఠాపై పంజా!
వారు మంచి ఉద్యోగాలు, వృత్తుల్లో ఉన్నవారు.. అందరి మధ్య ఉంటూనే అవసరమైనప్పుడు దాడి చేసి, కలకలం సృష్టించి.. మళ్లీ ఏమీ తెలియనట్టు ఉండిపోయేలా ఉగ్రవాద శిక్షణ పొందుతున్న వారు.. ఇంకా అవసరమైతే బాంబులతో విధ్వంసానికీ వెనకాడనివారు.. హైదరాబాద్‌లో దాడులకు సిద్ధమై చాప కింద నీరులా ప్లాన్ అమలుకు సిద్ధమయ్యారు. మధ్యప్రదేశ్ ఏటీఎస్, రాష్ట్ర నిఘా విభాగం కలసి ఈ కుట్రను భగ్నం చేశాయి. సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), రాష్ట్ర నిఘా వర్గాలు సంయుక్తంగా హైదరాబాద్‌లో మంగళవారం చేపట్టిన ఆపరేషన్‌లో ఐదుగురు హిజ్బూ ఉత్ తహరీర్ (హెచ్‌యూటీ) సంస్థ ఉగ్రవాద అనుమానితులు చిక్కారు. ఈ మాడ్యుల్‌కు సూత్రధారిగా ఉన్న మహ్మద్ సలీం.. ఓ మెడికల్ కాలేజీలో డిపార్ట్మెంట్ హెడ్‌గా పనిచేస్తుండగా, పట్టుబడినవారిలో ఒక దంత వైద్యుడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండటం కలకలం రేపుతోంది. ఈ ఐదుగురినీ ఏటీఎస్ అధికారులు పీటీ వారెంట్‌పై భోపాల్‌కు తరలించారు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌లోనూ ఏటీఎస్ అధికారులు మరో 11 మంది హెచ్‌యూటీ సంస్థ సభ్యులను అరెస్టు చేశారు. వారందరినీ అక్కడి కోర్టులో హాజరుపర్చగా.. ఈ నెల 19వ తేదీ వరకు వారిని ఏటీఎస్ కస్టడీకి అప్పగించింది. ఐసిస్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా.. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్కు అనుబంధంగా హెచ్‌యూటీ సంస్థ పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు, ఉగ్రవాదులకు సానుభూతిపరులను తయారుచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్న ఈ సంస్థ.. భారత్ సహా 50కిపైగా దేశాల్లో ఉనికిలో ఉంది. మన దేశంలో దీనిపై నిషేధం లేదు. కొంతకాలం నుంచి హెచ్‌యూటీ సంస్థ ఎక్కడికక్కడ మాడ్యూల్స్‌ను తయారు చేసుకుంటూ విస్తరిస్తోంది. తమకు ఆకర్షితులైన వారికి శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఆర్మ్డ్ వింగ్‌ను ఏర్పాటు చేసుకుంది. సోషల్ మీడియాలో గ్రూపులనూ నిర్వహిస్తోంది. కేడర్‌కు ప్రమాదకర ఆయుధాల వినియోగంతోపాటు రసాయన, జీవాయుధాల (కెమికల్, బయోలాజికల్) దాడులు చేసేలా.. వీటికి సంబంధించి ఎవరికి వారు మెటీరియల్ సిద్ధం చేసుకునేలా తర్ఫీదు ఇస్తోంది. మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ మాడ్యూల్.. భోపాల్‌కు చెందిన యాసీర్ హెచ్‌యూటీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. తనతో కలసి చదువుకున్న సౌరభ్‌రాజ్ వైద్యను మతం మార్చుకుని, హెచ్‌యూటీలో చేరేలా ప్రోత్సహించాడు. మహ్మద్ సలీంగా పేరుమార్చుకున్న సౌరభ్.. 2019లో హైదరాబాద్‌లోని గోల్కొండ బాబాబజార్ మోతీ మహల్‌కు వలస వచ్చాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా ఉద్యోగంలో చేరాడు. మరోవైపు కొన్నేళ్ల కింద ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన దేవీప్రసాద్ పాండ కొన్నేళ్ల క్రితమే మతం మార్చుకుని అబ్దుర్ రెహ్మాన్గా మారాడు. గోల్కొండలోని ధన్కోక ప్రాంతంలో నివాసం ఉంటూ.. ఓ సాఫ్ట్వేర్ సంస్థలో క్లౌడ్ సర్వీస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇక హైదరాబాద్‌లోని హఫీజ్‌బాబా నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ బస్క వేణుకుమార్ కూడా కొన్నేళ్ల క్రితం మతం మార్చుకుని మహ్మద్ అబ్బాస్ అలీగా మారాడు. సలీం ఈ ఇద్దరితోపాటు గోల్కొండ బడాబజార్‌కు చెందిన దంత వైద్యుడు షేక్ జునైద్, జగద్గిరిగుట్ట మగ్దూంనగర్‌కు చెందిన మహ్మద్ హమీద్, జవహర్‌నగర్‌లోని శివాజీనగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్‌లను ఆకర్షించాడు. తనతో సహా ఆరుగురితో హెచ్‌యూటీ మాడ్యూల్‌ను ఏర్పాటు చేశాడు. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో యాసీర్ నేతృత్వంలో 11 మంది మరో మాడ్యూల్ కార్యకలాపాలు ప్రారంభించింది. మూడు నెలల పాటు నిఘా పెట్టి.. యాసీర్, సలీంల మాడ్యూల్స్ ఉగ్రవాద దాడులకు సిద్ధమవుతున్న విషయంపై మధ్యప్రదేశ్ ఏటీఎస్ అధికారులకు మూడు నెలల క్రితం జాతీ నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. అప్పటి నుంచి తెలంగాణ నిఘా వర్గాల సాయంతో ఏటీఎస్ అధికారులు వీరిపై కన్నేసి ఉంచారు. అన్ని అంశాలను నిర్ధారించుకుని.. మంగళవారం తెల్లవారుజామున అటు భోపాల్‌లో, ఇటు హైదరాబాద్‌లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. భోపాల్‌లో 11 మంది పట్టుబడగా.. హైదరాబాద్‌కు చెందిన మాడ్యూల్లో మహ్మద్ సల్మాన్ మినహా ఐదుగురిని పట్టుకున్నారు. మహ్మద్ సలీం ఇంటి నుంచి రెండు ఎయిర్గన్లు, పిల్లెట్స్, కత్తులు, గొడ్డళ్లతోపాటు ఉగ్రవాద సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐదుగురిని పీటీ వారెంట్‌పై భోపాల్‌కు తరలించారు. పరారీలో ఉన్న మహ్మద్ సల్మాన్ కోసం రాష్ట్ర పోలీసులు గాలిస్తున్నారు. నిషేధం విధించేలా.. హెచ్‌యూటీ సంస్థపై 2021లో తమిళనాడులో ఓ కేసు నమోదైంది. దాన్ని దర్యాప్తు చేసిన ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)’గతేడాది అభియోగపత్రాలు దాఖలు చేసినట్టు అధికారులు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సంస్థపై నిషేధం విధించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్టు వెల్లడించారు. అనంతగిరి అడవుల్లో క్యాంప్.. హైదరాబాద్‌లో రెక్కీ.. యాసీర్, సలీంల నేతృత్వంలోని 17 మంది ప్రత్యేకంగా రాకెట్ చాట్ యాప్ ద్వారా సంప్రదింపులు జరిపారు. తుపాకులు, కత్తులు, గొడ్డళ్లను వినియోగించి ఎవరికి వారుగా ‘లోన్ వూల్ఫ్ ఎటాక్స్ (ఒంటరిగానే ఎవరిపైనైనా దాడిచేసి కలకలం రేపడం)’చేయాలని.. అవసరమైనప్పుడు బాంబులు తయారు చేసి జనసమ్మర్థ ప్రాంతాల్లో విరుచుకుపడాలన్నది వీరి పథకం. ఇందుకోసం అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలతో పోరాడిన ఐసిస్ మాడ్యుల్స్‌ను ఆదర్శంగా తీసుకున్నారు. రెండు మాడ్యూల్స్‌కు చెందిన 17 మంది కొన్నినెలల కింద వికారాబాద్ అనంతగిరి అడవుల్లో క్యాంపు నిర్వహించారు. ఎవరిని టార్గెట్‌గా ఎంచుకోవాలి? ఏ విధంగా దాడులకు దిగాలనేది చర్చించుకున్నారు. తర్వాత హైదరాబాద్ నగరంలో రెక్కీ చేశారు. పలు కీలక ప్రాంతాల్లో డ్రోన్లతోనూ రెక్కీ చేసి.. దాడులకు సన్నాహాలు చేసుకున్నారు. ఆన్లైన్ ద్వారా సంప్రదింపుల్లో ఉంటూ దాడులకు మెటీరియల్‌ను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఐసిస్ కన్నా ప్రమాదకరంగా హెచ్‌యూటీ! ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్‌యూటీ) సంస్థ పనిచేస్తున్నట్టు ప్రచారమున్నా.. దాని మూలాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 1952లో ఇజ్రాయెల్‌లోని జేరుసలేంలో స్థాపితమైన ఈ సంస్థ.. ప్రస్తుతం లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. యూరప్‌తోపాటు ఆసియాలోని ముస్లిం ప్రభావిత దేశాలకు విస్తరించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియాలో దీని ఉనికి ఎక్కువ. నేరుగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడకపోవడంతో చాలా దేశాల్లో దీనిపై నిషేధమేదీ లేదు. అయితే ఐసిస్ ఉగ్రవాద సంస్థ పతనం అనంతరం ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు హెచ్‌యూటీ ప్రయత్నిస్తున్నట్టు అంతర్జాతీయ నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ సంస్థ ఐసిస్ కన్నా ప్రమాదకరంగా మారుతోందని.. రసాయన, జీవాయుధాల వినియోగంపై కేడర్‌కు శిక్షణ ఇస్తోందని హెచ్చరించాయి. భారత్‌లో హెచ్‌యూటీ కార్యకలాపాల విస్తరణపై అంతర్జాతీయ భద్రతా సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందిందని సమాచారం. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా నిఘా పెట్టినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. -
జమ్ముకశ్మీర్‌లో ఐఈడీ పేల్చిన ఉగ్రవాదులు.. ఇద్దరు జవాన్లు మృతి..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలో పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. కండి ఫారెస్ట్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే పక్కా సమాచారంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించేందుకు శుక్రవారం ఉదయం వెళ్లారు జవాన్లు. ఓ గుహలో ఉన్న ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. అయితే జవాన్లు లక్ష్యంగా ఉగ్రవాదులు ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారత సైన్యం ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇద్దరు సైనికులను బలిగొన్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపిటన్లు తెలిపింది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య కాల్పుల ఘటన జరగడం మూడు రోజుల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం. గురువారం బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఉద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మణిపూర్‌లో హైటెన్షన్.. మంత్రిపై దాడి.. రైళ్లు బంద్ -
తిరుమలలో తీవ్రవాదులు!.. ఫేక్ అని స్పష్టం చేసిన ఎస్పీ
తిరుమల: తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి మెయిల్ రావడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. పోలీసులు తిరుమలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి తనిఖీలు చేపట్టారు. అలిపిరి టోల్గేట్ వద్ద కూడా తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ మెయిల్ ఎస్పీకి ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై పరిశీలించి.. చివరికి ఇది ఫేక్ అని గుర్తించారు. ఈ విషయంపై ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో ఎలాంటి ఉగ్రవాదుల కదలికలు లేవని స్పష్టం చేశారు. భక్తులు ఇటువంటి దు్రష్పచారాలను నమ్మవద్దని సూచించారు. దీనిపై టీటీడీ సీవీఎస్వో నరసింహకిషోర్ మాట్లాడుతూ తిరుమలలో ఉగ్రవాద కదలికలన్నది పూర్తిగా అవాస్తమని తెలిపారు. ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారి ఆలయానికి ఉగ్రవాదుల ముప్పు ఉన్నట్లు పలుమార్లు కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో ఇంతకుముందే తిరుమలలోని కీలకమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పాటు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇది కూడా చదవండి: జగజ్జనని చిట్ ఫండ్స్.. ఆదిరెడ్డి అప్పారావు, వాసు అరెస్ట్ -
ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట
పూంచ్: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఐదుగురు జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భారత సైన్యం వేట ముమ్మరం చేసింది. డ్రోన్లు, జాగిలాలతోపాటు హెలికాప్టర్‌తో గాలింపు కొనసాగిస్తోంది. బాటా–డోరియా అటవీ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది జల్లెడ పడుతున్నారు. గాలింపు చర్యలను సైనిక, పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందం శుక్రవారం ఘటనా స్థలాన్ని సందర్శించింది. గురువారం ముష్కరుల దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన ఐదుగురు చనిపోవడంతోపాటు మరొకరు గాయపడిన సంగతి తెలిసిందే. అమర జవాన్ల మృతదేహాలకు ఉన్నతాధికారులు శుక్రవారం నివాళులర్పించారు. అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించారు. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో హై అలర్ట్ విధించారు. నియంత్రణ రేఖ వద్ద నిఘాను పటిష్టం చేశారు. ముష్కరుల దుశ్చర్యను ఖండిస్తూ బీజేపీ, వీహెచ్‌పీ, రాష్ట్రీయ బజరంగ్ దళ్, శివసన, డోగ్రా ఫ్రంట్, జమ్మూ స్టేట్హుడ్ ఆర్గజనైజేషన్ జమ్మూలో భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. -
హ్యాండ్ గ్రెనేడ్లు పేల్చేశారు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో గతేడాది దసరా ఉత్సవాల నేపథ్యంలో విధ్వంసాలకు కుట్ర పన్ని చిక్కిన లష్కరేతొయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాదుల నుంచి స్వాదీనం చేసుకున్న హ్యాండ్ గ్రెనేడ్లను పోలీసులు పేల్చేశారు. వీటిని భద్రపరచడం ముప్పుతో కూడిన వ్యవహారం, నిర్విర్యం చేయడం సాధ్యం కాకపోవడంతో సీసీఎస్ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ కేసు ఎన్ఐఏ బదిలీ కావడంతో ఈ మేరకు ఆ అధికారులకు సమగ్ర నివేదికను అందించింది. చైనా గ్రెనేడ్లు మనోహరాబాద్ మీదుగా... గత ఏడాది అక్టోబర్ 2న అరెస్టయిన ఉగ్రత్రయం అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫారూఖ్‌లు పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఉన్న హ్యాండ్లర్స్ ఫర్హతుల్లా ఘోరీ, సిద్ధిఖ్ బిన్ ఉస్మాన్, అబ్దుల్ మాజిద్ ఆదేశాల మేరకు పని చేశారు. దసరా రోజు నగరంలో విధ్వంసాలు సృష్టించేందుకు సిద్ధమైన వీరికి చైనాలో తయారైన హ్యాండ్ గ్రెనేడ్లను వారు పంపారు. డ్రోన్లద్వారా కశ్మీర్‌కు వచ్చిన వాటిని అక్కడ నుంచి మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ వరకు చేర్చిన స్లీపర్‌సెల్స్ ఓ రహస్య ప్రదేశంలో దాచాయి. అక్కడకు వెళ్లిన సమీయుద్దీన్ నాలుగు గ్రెనేడ్స్‌ను తీసుకువచ్చాడు. రెక్కీలు చేస్తుండగానే సిట్ అధికారులకు చిక్కారు. ఈ కేసుల్లో సీజర్ కీలకాంశం... ఈ తరహా ఉగ్రవాద సంబంధ కేసుల్లో నిందితుల నుంచి స్వాదీనం చేసుకున్న సీజర్ ప్రాపర్టీ నేరం నిరూపణలో కీలక ఆధారంగా మారుతుంది. దీంతోనే కోర్టులో నిందితులను దోషిగా నిరూపించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఉగ్రత్రయం నుంచి స్వాదీనం చేసుకున్న గ్రెనేడ్స్‌ను తొలుత కోర్టులో దాఖలు చేశారు. ఆ పై న్యాయస్థానం ఆదేశాల మేరకు తమ ఆ«దీనంలోనే భద్రపరిచారు. ఇవి ప్రమాదకరం కావడంతో తొలు త వీటిని నిర్వీర్యం చేసేందుకే పోలీసులు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే చైనాలో తయారైనవి కావడంతో ఆ ప్రయత్నం చేస్తే పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. దీంతో వీటిని పేల్చేయడమే మేలని భావించి, న్యాయస్థానం అనుమతి అనుమతి పొందారు. ఇటీవల బాంబు నిర్విర్యం బృందాల సమక్షంలో ఈ తంతు పూర్తి చేశారు. -
మహిళలు బాలికలపై హింస ప్రబలంగా ఉంది! యూఎన్‌లో భారత్
మహిళలు, బాలికలపై ఉగ్రవాదులు సాగిస్తున్న హింస ప్రబలంగా ఉందని భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మహిళల శాంతి భద్రతలకు సంబంధించి 1325 రిజల్యూషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రసంగించారు. ఈమేరకు రుచిరా మాట్లాడుతూ.. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం తదితరాలు మానవహక్కులను తీవ్రంగా ఉల్లంఘించేవి. పైగా ప్రపంచ శాంతి భద్రతలకు నిరంతరం ముప్పుగా కొనసాగుతున్నాయి. దీని కారణంగా మహిళలు, బాలికలు తీవ్రంగా కలత చెందుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రకాల తీవ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభించాలని ఆమె పిలుపునిచ్చారు. అక్టోబర్‌లో మహిళల శాంతి భద్రతలపై ఐరాస భద్రతా మండలి 1325వ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం సంఘర్షణలు, శాంతి చర్చలు, శాంతి నిర్మాణం, శాంతి పరిరక్షణ, మానవతా ప్రతిస్పందన, తదితరాల్లో మహిళల పాత్రను తెలియజేస్తోంది. అంతేగాదు ఇది సంఘర్షణ అనంతర పునర్నిర్మాణం, సమాన భాగస్వామ్యం, శాంతి భద్రతలకు సంబంధించి అన్ని రకాలుగా వారి పూర్తి ప్రమేయానికి సంబంధించిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. మహిళలకు మంచి అనుకూలమైన వాతావరణాన్ని అందించడానికి చట్టబద్ధమైన నియమాలు తప్పనిసరి. అలాగే అఫ్ఘనిస్తాన్ పరిస్థితిని ప్రస్తావిస్తూ.. ఆగస్టు 2021లో భారత్ కౌన్సిల్ ఆఫ్‌ది ప్రెసిడెన్సీలో ఆమోదించిన యూఎన్ఎస్సీ తీర్మానం 2593 ప్రకారం.. అప్ఘనిస్తాన్‌లో మహిళల భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత ప్రాతినిథ్య పాలన ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. అలాగే మహిళలపై హింసకు పాల్పడే వారి శిక్షార్హత గురించి తనిఖీ చేయడంలో జాతీయ అధికారులు ఐక్యరాజ్యసమితి, ప్రాంతీయసంస్థలకు సాయం చేయాలి. సంఘర్షణ అనంతర పరిస్థితుల్లో మహిళలు ఎదుర్కొంటున్న అసమానతలు, హింసలను పరిష్కరించడంలో సభ్యదేశాలకు మద్దతు ఇవ్వాలి. శాంతిస్థాపన ప్రయత్నాలలో మహిళలపై దృష్టి పెట్టడం అత్యంత కీలకం. ఇలాంటి వాటిని ముందుకు తీసుకువెళ్లడంలో మహిళా పోలీసు అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. అలాగే భారత్‌లో లింగ సమానత్వాన్ని స్వాగతిస్తున్నాం. జనవరి 2023లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యక్రమాలకు అత్యధికంగా సైన్యాన్ని అందించిన దేశాలలో భారత్ ఒకటి. 2007 లైబీరియాలో మొత్తం మహిళా పోలీసుల విభాగాలను ఏర్పాటు చేసిన మొదటి దేశం భారతదేశం. అంతేగాదు మహిళ రక్షణ సలహాదారుల విస్తరణకు భారత్ మద్దతు ఇస్తోంది. మహిళా శాంతి భద్రతల ఎజెండాను బలోపేతం చేస్తున్నప్పటికీ శాంతి స్థాపనలో మహిళలు ఇప్పటికీ తక్కువగానే ప్రాతినిధ్యం వహించడం బాధకరం. కానీ భారత సాంస్కృతిక సంప్రదాయల్లో భూమిని తల్లిగా పరిగణించటం ప్రజలకు నేర్పింది. దేశ సాధికారతకు మహిళ పురోగతి చాలా ముఖ్యమని భారత్ గట్టిగా విశ్వసిస్తుందని రుచిరా అన్నారు. (చదవండి: వక్రీకరించే వైఖరిని మార్చుకోమంటూ యూఎస్‌కి చైనా స్ట్రాంగ్ వార్నింగ్) -
JK: మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కశ్మీరీ పండిట్‌పై కాల్పులు..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కశ్మీరీ పండిట్ లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. పుల్వామా అచాన్ ప్రాంతంలో ఆదివారం ఉదయం మార్కెట్‌కు వెళ్తున్న సంజయ్ శర్మపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సంజయ్ శర్మ ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్యతో కలిసి ఆదివారం ఉదయం 10:30 గంటలకు మార్కెట్‌కు వెళ్తుండగా ముష్కరులు అతనిపై దాడి చేశారని పోలీసులు చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడిని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. సంజయ్ శర్మ మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈమేరకు ట్వీట్ చేశారు. Deeply saddened to hear of the demise of Sanjay Pandith of Achan in Pulwama district of South Kashmir. Sanjay was working as a bank security guard & was killed in a militant attack earlier today. I unequivocally condemn this attack & send my condolences to his loved ones. — Omar Abdullah (@OmarAbdullah) February 26, 2023 కశ్మీర్ పండిట్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు తరచూ దాడులకు పాల్పడుతున్నారు. గతేడాది మైనారిటీ వర్గాలకు చెందిన 14 మంది కాల్చి చంపారు. వీరిలో ముగ్గురు కశ్మీరీ పండిట్లు ఉన్నారు. చదవండి: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి.. అద్దాలు ధ్వంసం.. -
హైదరాబాద్ లో ఉగ్రకుట్ర భగ్నం కేసులో మరొకరు అరెస్ట్
-
భూకంపంతో జైలు గోడలు ధ్వంసం.. 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు జంప్..!
టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించి వేల భవనాలు నేలమట్టం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భూకంపం కారణంగా కొందరు ఖైదీలకు జైలు నుంచి తప్పించుకునేందుకు అవకాశం లభించింది. టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతం రాజోలోని జైలు భూప్రకంపనల కారణంగా పాక్షికంగా దెబ్బతింది. గోడలకు పగుళ్లు వచ్చి కులిపోయాయి. దీన్నే అదునుగా భావించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు చెందిన ఖైదీలు జైలులో తిరుగుబాటు చేశారు. జైలులోని ఓ భాగాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అనంతరం 20 మంది జైలు నుంచి తప్పించుకుని పారిపోయారు. వీరంతా ఐసిస్ సంస్థకు చెందిన వారేరని అధికారులు తెలిపారు. ఈ జైలును టర్కీ అనుకూల గ్రూప్‌లే నియంత్రిస్తాయి. మొత్తం 2,000 మంది ఖైదీలున్నారు. వీరిలో 1,300 మంది ఐసిస్ ఉగ్రసంస్థకు చెందినవారే. వీరితో పాటు సిరియా అనుకూల ఖుర్షీద్ దళాలకు చెందిన ఫైటర్లు ఉన్నారు. అయితే జైలులో తిరుగుబాటు జరిగిన విషయం నిజమేనని, కానీ 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు ధ్రువీకరించలేమని బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబసర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వార్ మానిటర్ తెలిపింది. ఐసిస్ ఖైదీలను తప్పించేందుకు గతేడాది డిసెంబర్లో సెక్యూరిటీ కాంప్లెక్స్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో ఖుర్దీష్ దళాలకు చెందిన ఆరుగురు చనిపోయరు. చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్.. -
చొరబాటు యత్నం భగ్నం.. ఇద్దరు టెర్రరిస్టులు హతం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్లో శనివారం ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు. ఇటీవల ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు పెరిగాయని, అయితే భద్రతా దళాలు విజయవంతంగా అడ్డుకుంటున్నట్లు తెలిపారు. చొరబాటుకు యత్నించి ఉగ్రవాదుల వద్ద భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముష్కరులు నియంత్రణ రేఖ వద్ద భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ముగ్గురిని అరెస్ట్ చేస్తే 100 మంది వచ్చారు.. పోలీసులకే చుక్కలు చూయించారు! -
ఉగ్రవాద లెక్కలు పరమ సత్యాలా?
ఏం చెప్పినా ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారని ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా పోలీసు అధికారులు భావిస్తుండవచ్చు. దీనికి మంచి సాక్ష్యం కశ్మీర్లో తీవ్రవాదుల సంఖ్య గురించిన సమాచారం. కశ్మీర్ లోయలో ఇప్పుడు 81 మంది ఉగ్రవాదులు ఉన్నారనీ, వీరిలో 29 మంది స్థానికులు కాగా, 52 మంది విదేశీ ఉగ్రవాదులనీ డీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. అంత కచ్చితంగా ఆయన ఎలా చెప్పగలిగారు? వాళ్లు ఏమైనా వస్తూపోతున్నప్పుడు ఒక రిజిస్టర్లో సంతకాలు ఏమైనా పెడుతున్నారా? లేక వారి గురించిన సమస్త వివరాలనూ వాసన పట్టేసే మార్గాలు అక్షరాలా మనవద్ద ఉన్నాయా? వీళ్ల ఆనుపానులు కూడా ఇంత కచ్చితంగా తెలిసినప్పుడు మరి వాళ్లను ఎందుకు పట్టుకోవడం లేదు? ఉగ్రవాదుల గురించిన వివరాలపై మనం ఇలాంటి మామూలు ప్రశ్నలు కూడా వేయలేమా? పైగా వాటిని నిలదీయడానికి వీల్లేని పరమ సత్యాలుగా భావిస్తుండటం మరీ విషాదం. ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులకు చాలావరకు మనలాంటి సాధారణ ప్రజలు ఏది చెప్పినా సరే మందమతుల్లాగ తలా డించేస్తుంటారని గట్టినమ్మకం. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా లేక ఆఫీసులో ఉంటున్న ఏ అధికారి విషయంలోనైనా ఇది నిజమనే చెప్పాలి. కానీ అప్పుడప్పుడూ వాళ్లు ఇచ్చే సమాచారం ప్రతిదీ నమ్మేసేవాళ్లను కూడా ఆలోచనలో పడేస్తుంది. జమ్మూ కశ్మీర్‌లోని ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినంత వరకూ ఇది చాలా తరచుగా నిజమేనంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. గత శనివారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) విజయ్ కుమార్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికకు నివ్వెరపరచే వివరాలు వెల్లడించారు. ‘‘ప్రస్తుతం కశ్మీర్ లోయలో 81 మంది యాక్టివ్ ఉగ్రవాదులు ఉన్నారు. వీరిలో 29 మంది స్థానికులు కాగా, 52 మంది విదేశీ ఉగ్రవాదులు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఆయన ఇంత కచ్చితంగా ఎలా చెప్పగలరు? ఉగ్రవాదులు వచ్చి సంతకాలు పెట్టిపోయేలా మనం ఏమైనా ఒక రిజిస్టర్ నిర్వ హిస్తున్నామా? పైగా వారి మూలం, నేపథ్యం గురించి మనకేమైనా చెప్పారా? లేక వారి గురించిన సమస్త వివరాలనూ వాసన పట్టేసే మార్గాలు అక్షరాలా మనవద్ద ఉన్నాయా? అంకెలు సరిపోతున్నాయా? అంతమాత్రమే కాదు. డీజీపీ ఇంకా చాలా నిర్దిష్టంగా ఉన్నారు. ‘‘బందీపుర్, కుప్వారా, గాందర్బల్ జిల్లాల్లో స్థానిక ఉగ్రవాదులు అసలు లేరు. కాగా అనంతనాగ్, శ్రీనగర్, బారాముల్లా, బడ్గావ్ జిల్లాల్లో ఒక్కో ఉగ్రవాది మాత్రమే చురుగ్గా పనిచేస్తున్నారు’’ అని ఆయన చెప్పారు. ఉగ్రవాదుల సంఖ్య విషయంలో ఆయన అంత నిర్దిష్టంగా, కచ్చితంగా ఎలా చెప్పగలిగారు అనే ప్రశ్నను కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు విదేశీ ఉగ్రవాదుల అంశం ముందుకు తెద్దాం. తొలి మూడు జిల్లాల్లోనే విదేశీ తీవ్రవాదులు పనిచేస్తున్నారని డీజీపీ సూచిస్తున్నారా? రెండవది, ఆయన పేర్కొన్న చివరి నాలుగు జిల్లాల్లో ఒకే ఒక స్థానిక ఉగ్రవాది ఉంటున్నాడా? వారి ఉనికిని ఇంత కచ్చితంగా మనం తెలుసుకుంటున్నప్పుడు, అంటే వారు ఉన్న ప్రదేశం కూడా మనకు తెలిసిపోయినప్పుడు వారిని మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? వాస్తవానికి ఈ ప్రశ్నలు డీజీపీ విజయ్ కుమార్‌ని ఇబ్బంది పెట్టవు. ఆయన్ని తన మార్గం నుంచి వైదొలిగేలా చేయవు కూడా! పైగా ప్రతి సంవత్సరం ఎంతమంది స్థానిక కశ్మీరీలు తీవ్రవాదుల్లో చేరుతున్నారు అనేది కూడా ఆయనకు తెలిసినట్లే కనబడుతోంది. బహశా వారు తమ వివరాలు ఆయనకు తెలిపి ఉండవచ్చు లేదా వారికి అత్యంత విశ్వసనీయమైనవారు, సన్నిహితమైనవారు డీజీపీ చెవిలో ఊది ఉండవచ్చు. 2018లో 201 మంది స్థానికులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా ఈ సంవత్సరం వారి సంఖ్య 99కి పడిపోయిందని డీజీపీ ప్రకటించారు. ఇంత కచ్చితమైన వివరాలు ఆయనకు ఎలా తెలిశాయి అని ఎవరూ డీజీపీని అడగలేరు. లేదా ఆయన బహుశా చెప్పరు కూడా! నిజానికి తనను వైరుద్ధ్యాల్లోకి లాగుతున్న ఈ 99 సంఖ్యను తాను బయటపెట్టినప్పటికీ తనను ఎవరూ నిలదీయరని ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నట్లున్నారు. ఈ సంవత్సరం కశ్మీర్ లోయలో 99 మంది స్థానికులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో 64 మంది హతమై పోయారనీ, 17 మందిని అరెస్టు చేయగా 18 మంది ఉగ్రవాదులు మాత్రమే క్రియాశీలంగా ఉన్నారనీ డీజీపీ వివరించి చెప్పారు. అయితే పైన చెప్పిన వివరాలకేసి చూస్తే, 29 మంది స్థానిక ఉగ్రవాదులు మాత్రమే లోయలో ఉన్నారని ఆయన చెప్పి ఉన్నారు. మరి మిగతా 11 మంది ఉగ్రవాదులు ఎక్కడ తప్పిపోయారు? ఇవి కేవలం వివరాలు మాత్రమే కాబట్టి వీటికి పెద్ద ప్రాధాన్యం ఉండకపోవచ్చని నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే డీజీపీ మరింత ముఖ్యమైన విషయం ప్రకటించారు. అదేమిటంటే, చనిపోయిన 64 మంది ఉగ్రవాదుల్లో 57 మంది వారు చనిపోవడానికి సరిగ్గా నెల ముందే ఉగ్రవాద సంస్థల్లో చేరారన్న సంగతి! ఈ విషయం కూడా ఆయనకు ఎలా తెలుసు? వారు ఎప్పుడు చేరిందీ ఆయనకు తెలిసి ఉంటే, వారిని ఎందుకు ఆపలేకపోయారు లేదా కనీసం వారిని ఎందుకు పట్టుకోలేకపోయారు? అయితే ఈ ప్రశ్నలను నేను అడగలేదు. మొత్తం మీద ఉగ్రవాదులకు చెందిన ఇంత సున్నితమైన వివరాలు డీజీపీ చేతివేళ్లపై అంత కచ్చితంగా ఆడుతున్నప్పుడు నాకు ఒకే సందేహం ఉంది. కొంప దీసి డీజీపీ విజయ్ కుమార్ ఈ ఉగ్ర వాదుల జీవిత చరిత్రలు త్వరలో రాసినా నేనేమీ ఆశ్చర్యపోను. ప్రశ్నించరనే ధీమానా? ఇప్పుడు, కశ్మీర్ లోయలో పోలీసుల కచ్చితత్వం గురించి మూగ పోయేవారిలో నేనే మొదటివాణ్ణి కాదు. 2000 సంవత్సరపు ప్రారంభంలోకి వెళ్లి చూద్దాం. పాకిస్తాన్ నుంచి నెలకు ఎంతమంది జిహాదీలు వాస్తవాధీన రేఖను దాటి వస్తున్నారో నాటి పోలీసులు మాకు నిత్యం వివరాలు చెబుతున్నప్పుడు, ఈజిప్ట్ రాయబారి గెహాద్ మాది తన ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయారు. ‘‘ఈ నెలలో 241 మంది వాస్తవాధీన రేఖను దాటి వచ్చారు. గత నెలలో 225 మంది, అంతకు ముందు నెలలో 230 మంది భారత్ భూభూగంలోకి వచ్చారు అని చెబుతున్నారు. ఇంత కచ్చితంగా వారు ఎలా చెప్పగలరు? వాస్తవాధీన రేఖను దాటి భారత్‌లోకి అడుగుపెట్టే ముందు జిహాదీలు రిజిస్టర్లో సంతకం పెట్టివచ్చే కార్యాలయం ఏమైనా ఉందా?’’ అని ఈజిప్టు రాయబారి వ్యంగ్యంగా ప్రశ్నించారు. గెహాద్ తన దౌత్య పరిధులను దాటి బహిరంగంగా తన సందేహాలను లేవనెత్తి ఉండకపోవచ్చు. కాబట్టి ఆయన సంధించిన ప్రశ్నలకు ఎవరూ సమాధానం ఇచ్చి ఉండరు. కానీ ఇప్పుడు ఉగ్రవాదుల గురించి డీజీపీ విజయ్ కుమార్ చెప్పిన వివరాలపై కొన్ని మామూలు ప్రశ్నలు కూడా మనం వేయలేమా? డీజీపీ ఎవరి వద్దనయితే ఈ వివరాలు చెప్పారో ఆ జర్నలిస్టులు ఆయనను ఏమాత్రం ప్రశ్నించకపోవడం విషాదకరమైన విషయం. వారు ఏమీ అడగలేరని ఆయనకు తెలియడమూ, పైగా ఆయన చెప్పిన వివరాలు నిలదీయడానికి వీల్లేని పరమ సత్యాలుగా మనం కూడా ఆమోదిం చాలని డీజీపీ భావిస్తుండటమూ మరింత విషాదం. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఉగ్రవాదంపై మోదీ వ్యాఖ్యలు...పాక్, చైనాకు ఊహించని ఝలక్
No Money for Terror: పాక్ చైనాలను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని అంతర్జాతీయ మంత్రివర్గ సమావేశంలో ఉగ్రవాద వ్యతిరేక ఫైనాన్సింగ్(నో మనీ ఫర్ టెర్రర్)పై మాట్లాడుతూ...."కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో భాగంగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయి. మరికొన్ని దేశాలు ఉగ్రవాద వ్యతిరేక చర్యలను అడ్డుకుంటూ పరోక్షంగా మద్దుతిస్తున్నాయి. ఉగ్రవాదం పట్ల సానుభూతి చూపే సంస్థలు, వ్యక్తులను ఒంటరిని చేయాలి. ఇలాంటి విషయాల్లో క్షమాగుణం చూపకూడదు. అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకించేలా ప్రంపంచం ఏకం కావాలి. ఈ సందర్భంగా లష్కరే తోయిబా(ఎల్ఈటీ) చీఫ్ హఫీజ్ సయీద్‌తో సహా ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు యత్నించిన అంతర్జాతీయ ప్రయత్నాలను చైనా ఎలా విఫలం చేసిందో ప్రస్తావించారు. ఉగ్రవాద సంబంధ కార్యకలాపాలను అరికట్టేందుకు నిధులను నిలిపేయాలి. టెర్రర్ ఫైనాన్సింగ్‌పై దాడి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అంతేగాదు టెర్రర్ ఫైనాన్సింగ్ కోసం కొత్తరకాల టెక్నాలజీలను వినియోగిస్తున్నారు. అలాగే మనీలాండరింగ్, ఆర్థిక నేరాలు వంటి కార్యకలాపాలు టెర్రర్ ఫండింగ్‌కి సహయపడతాయని తెలుస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యూఎన్ఎస్సీ, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఎఫ్‌ఏలీఎఫ్) వంటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాయం చేస్తున్నాయి. ఉగ్రవాదానికి సంబంధించిన ఒక్క దాడి జరిగిన, ఒక్క ప్రాణం పోయినా సహించం, నిర్మూలించేంత వరకు వదిలిపెట్టం. కాశ్మీర్ తరుచుగా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటుందని, పరిష్కరించడం అత్యంత ముఖ్యమని చెప్పారు. యావత్తు ప్రపంచం ఉగ్రవాదాన్ని తీవ్రంగా పరిగణించక ముందే భారదత్ తీవ్ర భయాందోళనలు ఎదుర్కొందన్నారు. ఎన్నో దశాబ్దాలుగా వివిధ రూపాల్లో ఉగ్రవాదం భారత్‌ని దెబ్బతీయాలని చూసిన తాము ధైర్యంగా పోరాడం" అని చెప్పారు. ఈ క్రమంలో సదస్సును ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ...ఉగ్రవాదం కంటే ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేయడమే అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఉగ్రవాదాలను తమ హింసను నిర్వహించేందుకు... యువతను రిక్రూట్ చేసుకోవడం, ఆర్థిక వనరులను పెంచుకోవడం తదితరాల ఎప్పటికప్పుడూ కొత్త మార్గాలను అన్వేషిస్తారన్నారు. ఉగ్రవాదుల తమ ఉనికిని దాచేలా డార్క్‌నెట్‌ని వినియోగిస్తున్నారని జాగుకతతో ఉండాలని సూచించారు. (చదవండి: వీడియో: నెహ్రూ మునిమనవడి వెంట గాంధీ మునిమనవడు.. వైరల్) -
భారత్ ప్రతిపాదనకు నో.. పాకిస్థాన్ ఉగ్రవాదికి చైనా అండ!
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కీలక నాయకుడు షాహిద్ మహమూద్‌కు ఐక్యరాజ్య సమితిలో చైనా అండా నిలిచింది. మహమూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్, అమెరికాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదులపై చర్యలు చేపట్టకుండా ఐక్యరాజ్య సమితిలో గత కొన్ని నెలల్లో చైనా అడ్డుకోవడం ఇది నాలుగోసారి కావటం గమనార్హం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీ కింద షాహిద్ మహమూద్‌పై చర్యలు తీసుకోవాలని.. భారత్, అమెరికా ప్రతిపాదనలు చేశాయి. అయితే, పాకిస్థాన్ మిత్రదేశమైన చైనా అందుకు అడ్డుపడింది. ఈ ప్రతిపాదనలను నిలిపివేసింది. మరోవైపు.. 2016లోనే అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ షాహిద్ మహమూద్, మహుమ్మద్ సార్వర్లపై ఆంక్షలు విధించింది. ఉగ్రవాదానికి వీరు నిధులను సమకూర్చటాన్ని అడ్డుకునే క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ భారత పర్యటనలో భాగంగా 26/11 ముంబై ఉగ్రదాడిలో మరణించి వారికి నివాళులర్పించిన క్రమంలోనే.. చైనా టెర్రరిస్టులకు అండగా నిలవటం గమనార్హం. ఎవరీ షాహిద్? అమెరికా ట్రెజరీ విభాగం వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. షాషిద్ మహమూద్ కరాచీలోని లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో సీనియర్ సభ్యుడు. 2007 నుంచి లష్కరే ఉగ్రసంస్థ కోసం పనిచేస్తున్నాడు. 2013లో అతడు లష్కరే పబ్లికేషన్స్ విభాగ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టాడు. 2014 నుంచి లష్కరే అనుబంధ విభాగమైన ఫలహ్ ఇ ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్)లో కొనసాగి.. 2015-16 మధ్యలో ఆ సంస్థ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించాడు. సిరియా, టర్కీ, బంగ్లాదేశ్, గాజా వంటి ప్రాంతాల్లో పర్యటించి ఉగ్రవాదానికి నిధులు సమకూర్చాడు. మరో ఉగ్రనేత సాజిద్ మిర్‌తో కలిసి విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించాడు. ఇదీ చదవండి: ఎందుకింత ఉగ్రరూపం? జెలెన్స్కీ ట్వీట్ -
పోరాడి ఓడిన సైనిక శునకం.. ఆర్మీ అధికారుల నివాళులు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ జిల్లాలోని టాంగ్పావా ప్రాంతంలో ఉగ్రవాదుల సర్చ్ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన జూమ్ అనే వీర శునకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఉగ్రవాదులను చేజ్ చేసే ఆపరేషన్‌లో రెండు బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోయినా లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడింది. దీంతో వెంటనే అధికారులు జూమ్(కుక్క)ని హుటాహుటిన ఆర్మీ ఆస్పత్రికి తరలించి తగిన చికిత్స అందించారు. ఐతే ఈ ఘటనలో జుమ్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించి ప్రాణాలతో పోరాడుతూ... గురువారం ఉదయం 11. 50 నిమిషాలకు మృతి చెందిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు జూమ్‌కి శ్రీనగర్‌లోని చినార్ వార్ మెమోరియల్ బాదామి బాగ్ కంటోన్మెంట్ వద్ద భారత సైన్య ఘనంగా నివాళులర్పించినట్లు పీఆర్ఓ డిఫెన్స్ కల్నల్ ఎమ్రాన్ ముసావి తెలిపారు. అంతేగాదు ఈ కార్యక్రమంలో పలు ఆర్మీ శునకాలు పాల్గొని మృతి చెందిన వీర శునకం జూమ్‌కి నివాళులర్పించాయి. ఆర్మీ కనైన్ చినార్ వారియర్స్‌లో అమూల్యమైన సభ్యుడిని కోల్పాయమని కల్నల్ ముసావి అన్నారు. జూమ్ పలు ఉగ్రవాదక నిరోధక కార్యకలాపాల్లో వీరోచితంగా పోరాడి ధైర్యసాహసాలను కనబర్చినట్లు తెలిపారు. #WATCH | 29 Army Dog Unit pays tributes to Indian Army Dog 'Zoom' in Jammu. He passed away yesterday at 54 AFVH (Advance Field Veterinary Hospital) in Srinagar where he was under treatment after sustaining two gunshot injuries in Op Tangpawa, Anantnag, J&K on 9th Oct. pic.twitter.com/0nlU7Mm7Ti — ANI (@ANI) October 14, 2022 (చదవండి: మాస్కో విమానంలో బాంబు కలకలం...అప్రమత్తమైన అధికారులు) -
పాకిస్తాన్లో దారుణం.. సీనియర్ మంత్రిని కిడ్నాప్ చేసి..
దాయాది దేశం పాకిస్తాన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాక్ సీనియర్ మంత్రి అబైదుల్లా బైగ్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అనంతరం జైల్లో ఉన్న తమ గ్రూప్ సభ్యులను విడిచిపెట్టాలని ఉగ్రవాదులు డిమాండ్ చేశారు. దీంతో, ఉగ్రవాదుల షరతులకు అంగీకారం తెలిపిన పాక్ మీడియా పేర్కొంది. వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి పాకిస్తాన్‌కు చెందిన సీనియర్ మంత్రి, మరో ఇద్దరిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కాగా, ఈ విషయాన్ని అధికారులు బయటకు చెప్పకుండా సీక్రెట్‌గా ఉంచారు. అయితే, ఉగ్రవాదులు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు. నంగా పర్బత్, దియామేర్ ప్రాంతాల్లో విదేశీయులను ఊచకోత కోసిన ఉగ్రవాదులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. దీంతో, వారిని విడుదల చేయాలని హెహ్రీక్-ఇ-తాలిబన్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హబీబుర్ రహమాన్ డిమాండ్ చేస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అనంతరం, ఉగ్రవాదుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో ఆ ముగ్గురిని ఉగ్రవాదులు శనివారం విడుదల చేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది. కాగా, అబైదుల్లా.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. దేశంలో సీనియర్ నేత కావడంతో ఉగ్రవాదుల డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. -
సరిహద్దుల వద్ద 250 మంది ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్ర శిబిరాల్లో 250 ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. చొరబాట్లు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి రవాణాతోపాటు సరిహద్దుల ఆవలి నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ ఆందోళన కలిగిస్తోందని డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. చలికాలం రానున్నందున 12 వేల అడుగుల ఎత్తులో గస్తీ విధుల నిర్వహణ మరింత కఠిన తరం కానుందన్నారు. నిఘా వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు. ఇద్దరు ఉగ్రవాదులు హతం అనంత్‌నాగ్ జిల్లా పొష్‌క్రీరి ప్రాంతంలో భద్రతా బలగాలతో ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిని డనిష్ భట్, బషరత్ నబీగా గుర్తించారు. -
Azadi Ka Amrit Mahotsav: పంజాబ్‌లో ఉగ్ర ముఠా గుట్టు రట్టు
చండీగఢ్: స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ఉగ్రవాద ముఠాను పంజాబ్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులతో కలిసి చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో నలుగురు టెర్రరిస్టులను అరెస్టు చేశారు. వారినుంచి హాండ్ గ్రెనేడ్లు, అత్యాధునిక మందుపాతరలు, పిస్టళ్లు, 40 బులెట్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ‘‘వీరికి పాకిస్తానీ నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతుంది. అంతేగాక కెనడా, ఆస్ట్రేలియాకు చెందిన కరడుగట్టిన భారత సంతతి గ్యాంగ్స్టర్లు అర్‡్ష డల్లా, గుర్జంత్ సింగ్‌లతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి’’ అని వివరించారు. పంద్రాగస్టు సందర్భంగా పేలుళ్లకు పాల్పడి దేశంలో కల్లోలం సృష్టించాల్సిందిగా వీరికి ఆదేశాలున్నట్టు చెప్పారు. నలుగురినీ ఐదు రోజుల రిమాండ్‌లోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో చండీగఢ్‌లో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. జైషే ఉగ్రవాది అరెస్టు లఖ్‌నవూ: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హబీబుల్ ఇస్లాం అలియాస్ సైఫుల్లా అనే 19 ఏళ్ల యువకున్ని యూపీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అరెస్టు చేసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌కు చెందిన జైషే సభ్యులతో అతను సోషల్ మీడియా ద్వారా లింకులు పెట్టుకున్నట్టు తెలిపారు. సస్పెండెడ్ బీజేపీ నేత నుపుర్ శర్మ హత్య కోసం జైషే పంపిన మహ్మద్ నదీమ్‌ను ఇటీవల ఏటీఎస్ అరెస్టు చేసింది. అతనిచ్చిన సమాచారం ఆధారంగా సైఫుల్లాను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది. ‘‘వర్చువల్ ఐడీలు సృష్టించడంలో సైఫుల్లా దిట్ట. నదీమ్‌తో పాటు పాక్, అఫ్గాన్‌కు చెందిన ఉగ్రవాదులకు 50కి పైగా వాటిని అందజేశాడు’’ అని వివరించింది. -
ఉగ్రవాదులతో సంబంధాలు.. నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
శ్రీనగర్: ఉగ్రవాదులతో సంబంధాలున్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం వేటు వేసింది. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు చీఫ్‌నని ప్రకటించుకున్న సయ్యద్ సలాహుద్దీన్ కుమారుడు, జైల్లో ఉన్న వేర్పాటువాద నాయకుడు బిట్టా కరాటే భార్యతో సహా నలుగురిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ శనివారం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్న వారితో సంబంధాలుండడంతో వారిని ఉద్యోగుల నుంచి తీసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాద సంస్థలతో లింకులుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ప్రభుత్వ పరమైన ఎలాంటి విచారణ చేయకుండా ఉద్యోగాలను తొలగించే అధికారం ప్రభుత్వాలకి ఉంటుంది. వాణిజ్య, పరిశ్రమల శాఖలో పని చేస్తున్న సయ్యద్ అబ్దుల్ ముయీద్, జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ అసాబ్ ఉల్ అర్జామంద్ ఖాన్ (ఫరూక్ అమ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటె భార్య) , కశ్మీర్ యూనివర్సిటీలోని శాస్త్రవేత్తగా పని చేస్తున్న డాక్టర్ ముహీత్ అహ్మద్ భట్, కశ్మీర్ యూనివర్సిటీలోనే అసిస్టెంట్ ప్రొఫసర్‌గా పని చేస్తున్న మజీద్ హుస్సేన్ ఖాద్రిలు ఉద్యోగాలు కోల్పోయారు. సోంపెరాలోని జమ్మూ కశ్మీర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ (జేకేఈడీఐ) కాంప్లెక్స్‌లో జరిగిన పేలుళ్లతో అబ్దుల్ ముయీద్‌కు సంబంధం ఉంటే, అర్జామంద్‌ఖాన్‌కు పాస్‌పోర్టు కోసం తప్పుడు సమాచారం అందించారు. డాక్టర్ ముహీత్ అహ్మద్ భట్ యూనివర్సిటీల్లో విద్యార్థుల్ని భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా పాఠాలు బోధిస్తూ ఉంటే, మరో ప్రొఫెసర్ మజీద్ హుస్సేన్‌కు నిషిద్ధ లష్కరేతోయిబా సహా పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి. సయ్యద్ సలాహుద్దీన్ కుమారులు ఇద్దరు గతంలోనే ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మూడో కుమారుడిపైన కూడా వేటు పడింది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలతో లింకులున్న దాదాపుగా 40 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. -
Jammu and Kashmir: 100 నాటౌట్
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది ఇప్పటికే 100 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. వీరిలో పాకిస్తాన్‌కు చెందిన ముష్కరులు 30 మంది ఉన్నారు. జూన్ 12న పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హతమైన ముగ్గురు లష్కరే తోయిబా సభ్యులతో కలుపుకుని, ఈ ఏడాది ఇప్పటిదాకా పలు ఆపరేషన్లలో 100 మంది ముష్కరులను ఏరివేసినట్లు భద్రతాధికారులు పేర్కొన్నారు. సరిహద్దుల ఆవల నుంచి చొరబాట్లు, రిక్రూట్మెంట్లు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటీవలి కాలంలో సరిహద్దులకు సమీపంలో పాక్ ఆర్మీ 12కు పైగా ఉగ్ర శిక్షణ శిబిరాలను తిరిగి ప్రారంభించిందన్నారు. దీంతో కశ్మీర్‌వ్యాప్తంగా గాలింపు చర్యలను ఉధృతం చేశామన్నారు. ‘కశ్మీర్లో ఇంకా 158 మంది వరకు ఉగ్రవాదులు పనిచేస్తున్నట్లు సమాచారముంది. వీరిలో 83 మంది వరకు లష్కరేకు చెందిన వారే. 30 మంది జైషే మొహమ్మద్, 38 మంది హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల వారున్నారు. అమర్నాథ్ యాత్రను భగ్నం చేసేందుకు ఉడి, కశ్మీర్‌లోయలోని ఆరు చోట్ల ఐఎస్ఐ ఉగ్ర శిబిరాలను నిర్వహిస్తోంది. ఇందుకోసం స్టికీ బాంబులను వాడొచ్చు’’ అని వెల్లడించారు. ‘‘బాల్టాల్ మార్గంలో కంగన్ వద్ద, పంథా చౌక్ మీదుగా వెళ్లే యాత్రికులపైనా ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. వీటిని తిప్పికొట్టేందుకు పూర్తిస్థాయిలో నిఘా చేపట్టాం’ అని భద్రతాధికారులు తెలిపారు. -
Amarnath Yatra: అమరనాథ్ యాత్రపై కన్నేసిన ఉగ్రవాదులు
మూడేళ్ల విరామం తర్వాత మొదలవుతున్న అమరనాథ్ యాత్రపై ఉగ్రవాదులు కన్నేశారు. జూన్ 30 నుంచి మొదలై 43 రోజుల పాటు సాగే యాత్రను భగ్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా స్టికీ బాంబులతో విరుచుకుపడొచ్చని నిఘా వర్గాలకు ముందే ఉప్పందింది. ఇందుకోసం తరలిస్తున్న ఈ బాంబుల్ని తాజాగా పోలీసులు పట్టుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో స్టికీ బాంబుల కథా కమామిషు... హిందువులకు అత్యంత పవిత్రమైన అమర్నాథ్ యాత్రను భగ్నం చేయడానికి ఉగ్రవాదులు స్టికీ బాంబులతో సవాల్ విసురుతున్నారు. ఇందులో భాగంగా వాటిని డ్రోన్ల ద్వారా తరలిస్తుండగా జమ్ము పోలీసులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. జమ్ము శివార్లలో పాక్ డ్రోన్ ఒకటి ఓ పేలోడ్‌ను జారవిడిచింది. స్టికీ బాంబులతో కూడిన టిఫిన్ బాక్సులు అందులో దొరికాయి. 3, 8 గంటల్లో పేలేలా వాటికి టైమర్లు కూడా సెట్ చేశారు. వాటిని పోలీసులు నిర్వీర్యం చేశారు. అమర్నాథ్ యాత్రలో భక్తులపై ప్రయోగించేందుకే వీటిని పాక్ నుంచి తరలించినట్టు చెప్పారు. తొలిసారి వాడిందెప్పుడు? స్టికీ బాంబుల్ని తొలిసారిగా బ్రిటన్ రెండో ప్రపంచ యుద్ధంలో వినియోగించింది. అప్పట్లో ఇది గ్రెనేడ్‌లా ఉండేది. గోళాకారపు గాజు ఫ్లాస్క్‌లో నైట్రో గ్లిసరిన్ నింపి తయారు చేసేవారు. దాన్ని లోహంతో కవర్ చేసి అంటించేవారు. బాంబును ప్రయోగించేటప్పుడు దాని రక్షణ కవచాన్ని బయటకు లాగి విసిరేవారు. ఐదు సెకండ్లలో బాంబు పేలేది. అఫ్గానిస్తాన్, ఇరాక్ యుద్ధాల్లో వీటిని బాగా వాడారు. గతేడాది అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించినప్పుడు అమెరికా సైనికులపై వీటిని ఎక్కువగా వాడారు. కాబూల్‌లో జనసమ్మర్ధ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ స్టికీ బాంబులు పెటట్డంతో అమెరికా సైనికులు నిత్యం హడలిపోయేవారు. 2020 డిసెంబర్లో కాబూల్ డిప్యూటీ ప్రొవిన్షియల్ గవర్నర్‌ను స్టికీ బాంబుతోనే బలిగొన్నారు. చదవండి: (బెంగాల్ విభజన ఆపేందుకు... రక్తం కూడా చిందిస్తా: మమత) మన దేశంలో... ►2012 ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయంపై దాడిలో స్టికీ బాంబులు వాడారు. ►2012 ఫిబ్రవరిలో కశ్మీర్లో సాంబా సెక్టార్లో భద్రతా దళాలు వీటిని స్వాధీనం చేసుకున్నాయి. ►2021 ఏప్రిల్‌లో జమ్ము శివార్లలో సిధారా బైపాస్ దగ్గర, ఆగస్టులో పూంచ్‌లో ఇవి దొరికాయి. ►2021 మేలో కథువాలోని హరియా చౌక్ దగ్గర మినీ డ్రోన్‌ను కశ్మీర్ పోలీసులు కూల్చేశారు. అందులోనూ స్టికీ బాంబులు దొరికాయి. ►2021 మేలో వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న బస్సు పెట్రోల్ ట్యాంక్‌కు స్టికీ బాంబులు అతికించి నలుగురిని బలిగొన్నారు. భద్రతా వ్యూహంలో మార్పు స్టికీ బాంబులతో ఉగ్రవాదులు దాడి చేసే ప్రమాదమున్నందున ఈసారి అమర్నాథ్ యాత్రకు పకడ్బందీ భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లతో ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఏమిటీ స్టికీ బాంబులు? చిన్న సైజుల్లో ఉండే బాక్సుల్లో పేలుడు పదార్థాలుంచి ఈ బాంబుల్ని తయారు చేస్తారు. వాటికి నాణెం ఆకారంలోని మాగ్నెట్లను అతికిస్తారు. దాంతో ఈ బాంబులు వాహనాలకు సులభంగా అతుక్కుంటాయి. టైమర్‌తో అనుకున్న సమయానికి వీటిని పేల్చవచ్చు. వీటి తయారీ చౌకే గాక తరలించడమూ సులభమే. వీటిని వాడే ప్రక్రియ ఒకప్పుడు కాస్త సంక్లిష్టంగా ఉండేది. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చాక అదీ సులభంగా మారింది. పార్క్ చేసిన వాహనాలకు వీటిని అతికించి రిమోట్‌తో పేలుస్తారు. -
ఉగ్రవాదులు మరో ఘాతుకం.. కుల్గామ్‌లో బ్యాంకు మేనేజర్ హత్య
-
సరిహద్దుల్లో బయటపడ్డ సొరంగం
సాంబా: జమ్మూకశ్మీర్‌లో త్వరలో జరగబోయే అమర్నాథ్ యాత్రలో అలజడి సృష్టించేం దుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశామని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) గురువారం వెల్లడించింది. సాంబా జిల్లాలో సరిహద్దుల వెంట చాక్ ఫకీరా బోర్డర్ ఔట్‌పోస్టు వద్ద ఉగ్రవాదులు ఏర్పాటు చేసిన 2 అడుగుల వెడల్పున్న సొరంగాన్ని గుర్తించామని తెలిపింది. అందులో 265 అడుగుల పొడవైన ఆక్సిజన్ పైపులను వెలికితీశామని పేర్కొంది. -
బార్డర్ దాటడానికి వెనకాడం: రాజ్‌నాథ్ వార్నింగ్
గుహవాటి(గౌహాతి): ఉగ్రవాద చర్యలతో దేశ సరిహద్దు బయట నుంచి భారత్‌ను టార్గెట్ చేస్తే.. తాము సైతం సరిహద్దులు దాటడానికి వెనకాడబోమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన శనివారం 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న మాజీ అసోం వెటరన్స్ సన్మానసభలో పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో భారత దీటూగా వ్యవహరిస్తుందన్న సందేశాన్ని ప్రపంచదేశాలకు చెప్పడంలో విజయవంతమయ్యామని తెలిపారు. ఉగ్రవాదలు సరిహద్దు బయట నుంచి భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం.. భారత్ సైతం బార్డర్ దాటడానికి వెనకడుగు వేయదని రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే దేశ పశ్చిమ సరిహద్దుతో పోల్చితే.. తూర్పు సరిహద్దులో శాంతి, స్థిరత్వం నెలకొందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ స్నేహపూర్వక పొరుగు దేశమని అందుకే తూర్పు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు లేవని తెలిపారు. ఈశాన్య ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)ను కేంద్రం ఇటీవల ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. శాంతి పరిస్థితులు మెరుగుపడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటుందని పేర్కొన్నారు. ఏఎఫ్ఎస్పీఏ అమల్లో ఉండాలని సైన్యం కోరుకుంటుందనటం ఒక అపోహని ఆయన స్పష్టం చేశారు. చదవండి: Hanuman Chalisa Row: ముంబైలో హైడ్రామా.. ఎంపీ నవనీత్ కౌర్ అరెస్ట్, పోలీసులతో వాగ్వాదం, ఆపై ఫిర్యాదు -
కశ్మీర్లో ఆరుగురు ఉగ్రవాదుల అరెస్ట్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో లష్కరేతోయిబాకు చెందిన వారిగా అనుమానిస్తున్న ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరు ఆయుధ సరఫరా, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, ఆర్థిక తోడ్పాటునందించడం, యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షితుల్ని చేయడం వంటి చర్యలతో వీరికి సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. పుల్వామా జిల్లా కాకాపొరాకు చెందిన లష్కరే కమాండర్ రియాజ్ అహ్మద్ దార్ అలియాస్ ఖాలిద్, అలియాస్ షీరాజ్ నేతృత్వంలో వీరు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు కూడా వెల్లడైందని పోలీసు శాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. -
కశ్మీర్ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా మిలిటెంట్లు హతమయ్యారు. మరో సాధారణ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా పోలీసులు వెల్లడించారు అమిషిపొరా గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న కచ్చితమైన సమాచారం మేరకు జరిగిన ఆపరేషన్‌లో ఉగ్రవాదుల్ని నిర్బంధించడానికి ప్రయత్నించగా వారు జరిపిన కాల్పుల్లో షకీల్ అహ్మద్ అనే పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడని, ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రంతా జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టుగా వివరించారు. -
సాహసానికి సెల్యూట్.. ఉగ్రమూకతో పోరాడిన హిమప్రియ
శ్రీకాకుళం రూరల్/శ్రీకాకుళం న్యూకాలనీ: 2018 ఫిబ్రవరి 10.. జమ్మూ ప్రాంతంలోని ఆర్మీ క్వార్టర్స్.. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది.. ఉదయం ఐదు గంటల సమయం. చిక్కటి చలిలో.. చీకటిలో ఆదమరిచి నిద్ర పోతున్న మనుషులంతా ఆ రోజు తూటా చప్పుళ్లకు ఉలిక్కిపడి లేచారు. ఇంకా చీకటి ఉండగానే ఉగ్రమూక ఆ క్వార్టర్స్‌పై దాడికి తెగబడింది. నాలుగైదు గంటల పాటు ఆపకుండా తూటాల వర్షం కురిపిస్తూనే ఉంది. ఆ భీకర దాడిలో ఓ బాలిక అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించింది. ఆర్మీ జవానైన తండ్రి ఆ సమయంలో ఇంటిలో లేకపోయినా ఉగ్రవాదులకు ఎదురెళ్లింది. ఒంటి నిండా దెబ్బలు తగిలినా వెరవకుండా తన తల్లితో పాటు తోటి వారిని కాపాడేందుకు ప్రయత్నించింది. ఆమె పేరు గురుగు హిమప్రియ. తల్లి పద్మావతి. తండ్రి పేరు గురుగు సత్యనారాయణ. ఆర్మీ జవాన్. ఈ దాడి సమయంలో ఆయన అక్కడకు 60 కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వహిస్తున్నారు. వీరి స్వస్థలం శ్రీకాకుళం రూరల్ మండలం, పొన్నాం గ్రామం. ఈ సాహసాన్ని అప్పట్లోనే కేంద్రం గుర్తించింది. రక్షణమంత్రి అభినందనలు అందుకుని.. హిమప్రియ ధైర్యసాహసాలు తెలుసుకున్న నాటి రక్ష ణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జమ్ములోని ఆర్మీ క్వార్టర్స్‌కు వెళ్లి, హిమప్రియ ఇంటిని సందర్శించి ఆ బాలికను, ఆమె తల్లిదండ్రులను అభినందించారు. అప్పటికి హిమప్రియ వయసు 8 ఏళ్లు. ఇప్పు డు ఆ బాలికకు ప్రభుత్వం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు ప్రకటించినట్టు కలెక్టర్ శ్రీకే ష్ బి.లాఠకర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ బాలికా దినోత్సవం రోజున.. ధైర్య సాహసాలు ప్రదర్శించే విభాగంలో భారత ప్రభుత్వం, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తారు. ఈ ఏడాది గురుగు హిమప్రియ ఎంపికైంది. బాలిక ఈ నెల 24న జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో వర్చువల్ విధానంలోధ్రువీకరణపత్రం, రూ.లక్ష నగదు అందుకోనుంది. ఈ కార్యక్రమం ఈ నెల 24 ఉదయం 11.30 గంటల నుంచి వెబ్ కాస్ట్ ద్వారా హెచ్‌టీటీపీఎస్://పీఎంఇండియా వెబ్‌కాస్ట్.ఎన్ఐసీ.ఇన్/ లేదా దూరదర్శన్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు, ముఖ్యంగా పాఠశాల/కళాశాలల విద్యార్థులు వీక్షించాలని, ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ విజ్ఞప్తి చేశారు. హ్యాట్సాఫ్ హిమప్రియ.. హిమప్రియ 2019లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆర్మీకి సంబంధించిన ఓ పుస్తకంలో ఆమె ధైర్యసాహసాలను వివరిస్తూ ఓ వ్యాసం ప్రచురితమైంది. నాటి ఘటనలో బాలిక తల్లికి చేయి పూర్తిగా దెబ్బతింది. హిమప్రియ భుజానికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం హిమప్రియ పూణేలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సెవెన్త్ చదువుతోంది. -
కశ్మీర్లో పోలీసుల బస్సుపై ఉగ్ర దాడి
Terrorists Open Fire On Police Bus: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది గాయపడ్డారు. సోమవారం సాయంత్రం పంథా చౌక్‌లోని జెవాన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సాయుధ పోలీసు బలగాలను తీసుకెళ్తున్న బస్సుపైకి ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారని అధికారులు తెలిపారు. దీంతో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు చనిపోగా మరో 12 మంది పోలీసులు గాయపడ్డారు. చదవండి: మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడులు.. యువతులు, నిర్వాహకుల అరెస్ట్ క్షతగాత్రులందరినీ వెంటనే చికిత్స కోసం వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ఘటనతో అప్రమత్తమైన బలగాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి, తనిఖీలు చేపట్టాయి. శ్రీనగర్ శివారులోని రంగ్రేత్ ప్రాంతంలో భద్రతాబలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు విదేశీయుడని పోలీసులు తెలిపారు. సరిహద్దుల గుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన పాకిస్తాన్‌కు చెందిన ఒక మహిళను భద్రతాబలగాలు కాల్చి చంపాయి. -
నీ కడుపుకోత తీర్చలేం.. ‘జై హింద్ మాజీ’
సాక్షి, ఇంటర్నెట్: తల్లి ప్రేమ గురించి పూర్తిగా చెప్పడానికి ఈ ప్రపంచంలో సరైన పదాలు లేవు. అమ్మ అన్న పిలుపులో అమృతం ఉంటుంది. అందుకే దేవతలు సైతం.. ఆ ప్రేమను పొందడానికి మనుషులుగా పుడతారని చెప్పుకుంటారు. అంత గొప్పది తల్లి మనసు. తాను ఎలాంటి స్థితిలో ఉన్నా సరే బిడ్డ క్షేమం, సుఖసంతోషాల గురించి అనునిత్యం పరితపిస్తుంది. తన ఆయుషు కూడా పోసుకుని బిడ్డ నిండ నూరేళ్లు.. చల్లగా బతకాలని కోరుకుంటుంది తల్లి. అటువంటిది.. తన కళ్ల ముందే బిడ్డ మరణిస్తే.. ఆ తల్లి కడుపుకోతను తీర్చే శక్తి ఎవరికి లేదు. ఆమె బాధ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. అది చూసి ప్రతి ఒక్కరి మనసు బాధతో విలవిల్లాడుతోంది. ఆ వివరాలు.. శత్రువులతో భీకరంగా పోరాడి వీర మరణం పొందిన అమరులకు బుధవారం ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేశారు. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో 2019లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ బిలాల్ అహ్మద్ మాగ్రే వీర మరణం పొందారు. ఈ ఆపరేషన్‌లో మాగ్రే తీవ్రంగా గాయపడినప్పటికి తన ప్రాణాలను పణంగా పెట్టి.. ముష్కరులతో భీకరంగా పోరాడి.. పౌరులను కాపాడాడు. ఈ క్రమంలో ఆయన మృతి చెందారు. మాగ్రే సాహసానికి గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు సైన్యంలో మూడవ అత్యున్నత పురస్కారం అయిన శౌర్య చక్రను ప్రకటించింది. (చదవండి: ఎన్కౌంటర్లతో దద్దరిల్లిన కశ్మీర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం ) అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా కొడుకు తరఫున ఈ పురస్కారాన్ని ఆందుకోవడానికి మాగ్రే తల్లి సారా బేగం ఢిల్లీకి వచ్చారు. ఇక అవార్డు ప్రకటించిన అనంతరం నాటి భద్రతా ఆపరేషన్‌లో మాగ్రే చూపించిన సాహసం.. ప్రాణాలు పణంగా పెట్టి ముష్కరులను ఎదిరించిన తీరు.. పౌరులను కాపాడిన విధానం గురించి వర్ణించారు. కొడుకు పేరు మైక్‌లో వినపడగానే ఆ తల్లి పేగు కదిలింది. బిడ్డ జీవితం అంతా ఆమె కళ్ల ముందు మెదిలింది. ఇక కుమారుడు లేడనే వాస్తవం ఆమెను ఉక్కిరిబిక్కిర చేసింది. లోపల నుంచి దుఖం తన్నకువచ్చింది. కానీ తాను ఏడిస్తే.. కొడుకు చేసిన సాహసం తక్కువవతుందని భావించిన ఆ తల్లి.. తన బాధను దిగమింగుకుంది. భోరున ఏడవాలని అనిపించినా.. అతి కష్టమ్మీద దుఖాన్ని ఆపుకుంది. అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ చేతుల మీదుగా కుమారుడికి లభించిన శౌర్యచక్ర పతకాన్ని ఆందుకుంది. (చదవండి: 'నేను ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా') ఆ తల్లి మనోవేదనకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వీరమాతకు సెల్యూట్ చేస్తున్నారు నెటిజనులు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న తర్వాత సారా బేగం తన వెనుక కూర్చున్న సీనియర్ మంత్రులను పలకరించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ తల్లిని ఓదార్చారు. (చదవండి: ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!) నాడు ఏం జరిగింది అంటే.. బారాముల్లాలోని ఓ ఇంటి వద్ద ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయని అవార్డుకు సంబంధించిన ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. "బిలాల్ అహ్మద్ మాగ్రే స్వయంగా రూమ్ ఇంటర్వెన్షన్ ఆపరేషనల్ పార్టీలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అనంతరం ఆయన ఉగ్రవాదుల టార్గెట్ హౌస్‌లో చిక్కుకున్న పౌరులను ఖాళీ చేయించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో దాక్కున్న ఉగ్రవాది అనేక హ్యాండ్ గ్రెనేడ్లను కాల్చాడు’’. ‘‘మాగ్రేతో పాటు అతని కార్యనిర్వాహక సహచరులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఫలితంగా మాగ్రే, అతడి పార్టీ కమాండర్ ఎస్సై అమర్ దీప్, సోనూ లాల్ అనే ఒక పౌరుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి," అని ప్రశంసా పత్రంలో ఉంది. అంతేకాక తీవ్రంగా గాయపడినప్పటికీ, మిస్టర్ మాగ్రే "అత్యంత ధైర్యాన్ని ప్రదర్శించి.. గాయపడిన వారిని, ఇతర పౌరులను బయటికి తరలించాడు" అని పేర్కొంది. దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికి. స్పృహ కోల్పోయే వరకు కాల్పులు జరుపుతూనే ఉన్నాడని పేర్కొంది. చదవండి: అంత్యక్రియల కోసం దాచిన సొమ్ము లూటీ.. పోలీసాఫీసర్‌పై ప్రశంసలు -
ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) కమాండర్ అఫాక్ సికందర్ ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. కుల్గాం జిల్లా పాంబే, గోపాల్‌పొరాలో బుధవారం భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో మొత్తం ఐదుగురు ముష్కరులు మరణించారు. గోపాల్‌పొరాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా వారు భద్రతా అధికారులపై కాల్పులు జరిపారని, ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ ఐజీ విజయ్ ట్వీట్ చేశారు. వారిలో ఒకరు నిషేధిత టీఆర్ఎఫ్కు చెందిన కమాండర్ సికందర్‌గా గుర్తించినట్టు పేర్కొన్నారు. ఇక పాంబే ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. చదవండి: CJ Sanjib Banerjee: నన్ను క్షమించండి..! -
పీఓకేను ఖాళీ చేయండి: భారత్
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతారని చరిత్ర ఇప్పటికే నిరూపించిందని, ఉగ్రవాదులకు కొమ్ముకాయడం, వారికి శిక్షణ, ఆర్థిక సహకారం అందివ్వడం పాక్ విధానమని భారత్ దుయ్యబట్టింది. మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో యూఎన్‌లో భారత శాశ్వత మిషన్ కౌన్సెలర్ కాజల్ భట్ మాట్లాడారు. పాకిస్తాన్ రాయబారి మునీర్ అక్రమ్ జమ్మూ కశ్మీర్‌పై చేసిన వాదనని కాజల్ తిప్పికొట్టారు. యూఎన్ వేదికల్ని ఉపయోగించుకొని కశ్మీర్‌పై అవాస్తవాలను ప్రచారం చేయడం పాక్‌కు కొత్త కాదన్నారు. కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలన్నీ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత్ దేశానిదేనని, చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ప్రాంతాలన్నీ పాక్ వెంటనే ఖాళీ చేయాలని ఆమె అల్టిమేటమ్ జారీ చేశారు. పాకిస్తాన్ సహా ఇరుగుపొరుగు దేశాలతో సామరస్యంగా ఉండాలనే భారత్ కోరుకుంటుందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపితేనే పాకిస్తాన్‌తో శాంతియుత వాతావరణంలో చర్చలు జరుగుతాయని భట్ అన్నారు. అప్పటివరకు భారత్ సీమాంతర ఉగ్రవాదంపై కఠినమైన విధానంతోనే ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి నిషేధిత ఉగ్రవాదుల్లో అత్యధికులు పాక్‌లోనే తలదాచుకోవడాన్ని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని అన్నారు. -
ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!
నంగర్హర్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక అక్కడ రోజుకో ఆంక్ష అన్నట్లే ఉంది. ఇప్పటికే ప్రజలపై ఎన్నో ఆంక్షలు విధించిన తాలిబన్ ప్రభుత్వం.. తాజాగా ట్యాక్సీ డ్రైవర్లకు పలు ఆంక్షలు విధించింది. ట్యాక్సీల్లో ముష్కరులను ఎవరినైనా తీసుకొస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది. తూర్పు నంగర్హార్ ప్రావిన్స్‌కు చెందిన ట్యాక్సీ డ్రైవర్లను తాలిబాన్ అనుబంధ సంస్థలకు సంబంధించిన వారిని మినహాయించి ఇతర ముష్కరులను ఎవ్వరిని మీరు ట్యాక్సిల్లో ఎక్కించుకోని తీసుకురావద్దని ఆదేశించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. (చదవండి: విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు!) ఆ ప్రావిన్స్‌కు చెందిన ట్యాక్సీ డ్రైవర్ల అందుకు అంగీకరించినట్లు వెల్లడించింది. అదే సమయంలో టాక్సీలలో ఎవరైనా అనుమానాస్పద గన్మెన్లను చూసినప్పుడు అధికారులకు తెలియజేయాలని ప్రజలకు తాలిబన్లు ఆదేశించినట్లు తెలిపింది. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రావిన్సులలో మోహరిస్తున్న ఐఎస్ఐఎస్-కే ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు ఇలాంటి ఆదేశాలు జారిచేసిందని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. (చదవండి: ‘ప్రవేశం లేదు’ బోర్డు.. ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి!) -
కశ్మీర్లో మరిన్ని దాడులు చేస్తాం: ఐఎస్కేపీ హెచ్చరిక
న్యూఢిల్లీ: కశ్మీర్లో ఇటీవలి కాలంలో జరిగిన లక్షిత దాడుల వంటివే మరికొన్ని చేపడతామంటూ జమ్మూకశ్మీర్ ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్(ఐఎస్కేపీ) హెచ్చరికలు పంపింది. తన అధికార ఆన్లైన్ పత్రిక ‘వాయిస్ ఆఫ్ హింద్’లో సోమవారం ఒక ఫొటోను ప్రచురించింది. చిరు వ్యాపారిని వెనుక నుంచి తుపాకీతో కాలుస్తున్నట్లున్న ఆ ఫొటోకు ‘మేం వస్తున్నాం(వుయ్ ఆర్ కమింగ్)’అంటూ శీర్షిక పెట్టింది. త్రిశూలంతో ఉన్న హిందూ దేవుళ్ల ఫొటోను కూడా ప్రచురించింది. తమ తదుపరి లక్ష్యం వారేనంటూ పరోక్షంగా హెచ్చరించింది. పండుగ సీజన్లో పేలుళ్లకు పథకం వేసిన ఉగ్రవాదులను ఇటీవల భద్రతా బలగాలు పట్టుకున్న విషయం తెలిసిందే. ఐఎస్కేపీ స్లీపర్ సెల్స్ కశ్మీర్ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. -
జైషేకు ఝలక్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. రోజుకొక ఎన్కౌంటర్ జరుగుతోంది. బుధవారం పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ హతమయ్యాడు. అతనిని షామ్ సోఫిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. పుల్వామా జిల్లా అవంతిపోరాలోని తిల్వాని మొహల్లా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ గ్రామాన్ని చుట్టుముట్టి వారిని అదుపులోనికి తీసుకోవడానికి ప్రయత్నించాయి. అయితే మిలిటెంట్లు భద్రతా బలగాలపై హఠాత్తుగా కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచి్చందని పోలీసులు వెల్లడించారు. ఈ ఎదురు కాల్పుల్లో ఒకరు మరణించారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని చూసి జైషే మహమ్మద్ టాప్ కమాండర్ షామ్ సోఫిగా గుర్తించినట్టు కశీ్మర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విటర్ ఖాతాలో కూడా వెల్లడించారు. -
కశ్మీర్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో మంగళవారం చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరిని ముఖ్తర్ షాగా గుర్తించారు. ఇతడు గతంలో బిహార్‌కు చెందిన వీరేంద్ర పాశ్వాన్‌ను హత్య చేసిన అనంతరం సోఫియాన్‌కు పారిపోయాడు. దీని గురించి కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్ చేశారు. (చదవండి: కశ్మీర్లో ఎదురుకాల్పులు.. ఐదుగురు జవాన్లు మృతి) #ShopianEncounterUpdate: Out of 03 killed #terrorists, one terrorist has been identified as Mukhtar Shah of #Ganderbal, who shifted to #Shopian after killing one street hawker Virendra Paswan of Bihar: IGP Kashmir@JmuKmrPolice https://t.co/0vgygLxLpr — Kashmir Zone Police (@KashmirPolice) October 11, 2021 సోఫియాన్ జిల్లాలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక దాడిలో ఈ ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు. వీరు లష్కరే తోయిబాకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. తొలుత వీరిని లొంగిపోమని సూచించామని... కానీ వారు వినకుండా తమపై కాల్పులు ప్రారంభించారని పోలీసులు తెలిపారు. దాంతో తాము కాల్పులు చేయాల్సి వచ్చిందని.. ఈ క్రమంలో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి సహా నేరపూరిత పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని.. సోదాలు కొనసాగుతున్నాయిన తెలిపారు. చదవండి: కశ్మీర్లో ‘ఉగ్ర’ ఉద్యోగులపై వేటు -
కశ్మీర్లో ఎదురుకాల్పులు.. ఐదుగురు జవాన్లు మృతి
కశ్మీర్: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో బుధవారం చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో భారత ఆర్మీ సైనికులు ఐదుగురు మరణించారు. మృతిచెందిన వారిలో నలుగురు జవాన్లు, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) ఉన్నారు. ఉగ్రవాదుల ఉనికి గురించి నిఘా వర్గాలకు అందిన సమాచారం మేరకు.. సూరంకోట్‌లోని డీకేజీకి దగ్గరగా ఉన్న గ్రామంలో ఈ సర్చ్ ఆపరేషన్ ప్రారంభమైనట్లు రక్షణ ప్రతినిధి తెలిపారు. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు అక్కడ దాక్కున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో ఆర్మీ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. (చదవండి: తాలిబన్ల రాజ్యం: ‘పరిణామాలు ఎదుర్కొనేందుకు మేం సిద్ధం’) గాలింపు చర్యలు జరుపుతున్న ఆర్మీ అధికారులపైకి ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో జేసీఓతో పాటు మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా "తీవ్రంగా గాయపడిన జేఓవీ, నలుగురు జవాన్లను సమీప ఆస్పత్రికి తరలించాము. చికిత్స అందిస్తుండగా వారు మరణించారు. సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది" అని ఆర్మీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. చదవండి: చదువు కోసం వెళ్తారు.. ఉగ్రవాదులుగా తిరిగొస్తారు -
కశ్మీరీ పండిట్ కాల్చివేత
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రముఖ వ్యాపారి, కశ్మీరీ పండిట్ మఖన్ లాల్ బింద్రో హత్యకు గురయ్యారు. పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి దుండగులు ఆయన్ను కాల్చి చంపారని పోలీసులు వెల్లడించారు. శ్రీనగర్‌లో ఆయనకు బింద్రో మెడికేట్ ఫార్మసీ వ్యాపారం ఉంది. ఇక్బాల్ పార్క్ వద్ద ఉన్న తన ఫార్మసీలో ఉన్న సమయంలో ఉగ్రవాదులు ఆయన వద్దకు వచ్చి కాల్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనానంతరం ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, ఆస్పత్రికి చేరే సమయానికే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనానంతరం మరో ఇద్దరు వ్యక్తులను కూడా ఉగ్రవాదులు కాల్చి చంపారు. భేల్పురి అమ్మే వీరేందర్‌ను పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారు. వీరేందర్‌ను చంపిన కొన్ని నిమిషాల్లోనే మొహమ్మద్ షఫి లోనె ను కూడా చంపారు. స్థానిక టాక్సీ స్టాండ్‌కు మొహమ్మద్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ హత్యలను నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఖండించారు. చదవండి: (13 మంది హజారాలను తాలిబన్లు అన్యాయంగా చంపేశారు) -
చొరబాట్లను అడ్డుకున్న సైన్యం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సరిహద్దు దాటి భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. హాత్‌లంగా ప్రాంతంలోని ఘటనా స్థలం నుంచి భారీస్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు గురువారం సైన్యాధికారి చెప్పారు. హతమైన వారిలో ఒకరు పాకిస్తానీ అని, మిగతా వారి వివరాలు ఇంకా తెలియదని అధికారి పేర్కొన్నారు. ఉరీ సెక్టార్, గోహలన్ ప్రాంతాల్లో చొరబాట్లు జరగొచ్చనే ముందస్తు సమాచారం మేరకు సరిహద్దు వెంట గాలింపు పెంచామని, చివరకు ఇలా ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకున్నామని లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే చెప్పారు. మొత్తం ఆరుగురు చొరబాటుకు ప్రయత్నించారని, నలుగురు సరిహద్దు ఆవలే ఉండిపోయారని, ఇద్దరు సరిహద్దు దాటారని, ఎదురుకాల్పుల్లో మొత్తంగా ముగ్గురు హతమయ్యారని వివరించారు. భారత్‌లో ఉగ్రచర్యల్లో పిస్టళ్లను వాడే కొత్త పంథాను పాక్ అవలంభిస్తోందని కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. ఈ ఏడాది 97 పిస్టళ్లను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది నిరాయుధులైన పోలీసులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రదాడుల్లో 85 శాతం ఘటనల్లో పిస్టళ్లనే వాడారని ఐజీ పేర్కొన్నారు. షోపియాన్‌లో మరో ఉగ్రవాది.. షోపియాన్ జిల్లాలో కేశ్వా గ్రామంలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో అనాయత్ అష్రాఫ్ అనే ఉగ్రవాది మరణించాడు. అక్రమంగా ఆయుధాలను సమీకరిస్తూ, మాదక ద్రవ్యాల లావాదేవీలు కొనసాగిస్తున్నాడనే పక్కా సమాచారంతో సైన్యం అష్రఫ్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసింది. లొంగిపోకుండా అష్రఫ్ సైన్యం పైకి కాల్పులు జరిపాడు. దీంతో సైన్యం జరిపిన కాల్పుల్లో అతను మృతిచెందాడు. -
సామాన్యుడి ముసుగులో ఉగ్రదందా!
మనం రోజూ పండ్లు కొనే వ్యక్తి పచి్చనెత్తురు తాగే ఉగ్రవాదని, మనకు రోజూ ఎదురయ్యే ఎంబీఏ నిరుద్యోగి ఎంతకైనా తెగించే టెర్రరిస్టని ఎవరైనా ఊహించగలరా! సరిగ్గా ఈ పాయింటును పట్టుకొని పాక్ ఐఎస్ఐ కుటిల కుట్రకు పాల్పడింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారతీయ సమాజంలో సాధారణ జీవనం గడపమని పంపింది, అవకాశం చూసి విధ్వంసాలకు పాల్పడేలా ప్లాన్ చేసింది. ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీసుల పుణ్యమా అని ఈ ఉగ్ర కుట్ర భగ్నమైంది. నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాల సందర్భంగా భారీ విధ్వంసాలకు ప్రణాళిక రచించిన ఉగ్రవాదులను అరెస్టు చేసిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు తెలుస్తున్నాయి. అరెస్టయిన వారంతా కరడు కట్టిన టెర్రరిస్టులమని వారి ఇరుగుపొరుగు కూడా తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకోసం సాధారణ జీవనం గడుపుతూ సమాజంలో కలిసిపోయారు. అదును చూసి పెట్రేగాలని ఆలోచించారు కానీ చివరకు దొరికిపోయారు. వీరిలో యూపీకి చెందిన జీషన్ ఖమర్ ఎంబీఏ గ్రాడ్యుయేట్. దుబాయ్‌లో అకౌంటెంట్‌గా పనిచేశాడు. కరోనా లాక్డౌన్ సందర్భంగా భారత్‌కు తిరిగివచ్చి ఖర్జూరాలమ్మే వ్యాపారం ఆరంభించాడు. లక్నోకు చెందిన మొహ్మద్ అమీర్ జావెద్, జీషన్‌కు దగ్గర చుట్టం. జెడ్డాలో చాలా సంవత్సరాలు గడిపాడు. భారత్‌కు వచ్చాక మతబోధకుడి అవతారం ఎత్తాడు. అబూ బకర్ సైతం జెడ్డా నుంచి భారత్‌కు వచ్చి స్థిరపడ్డాడు. దీయోబంద్లోని ఒక మదర్సాలో చదువుకున్నాడు. కుట్రలో కీలకమైన మూల్‌చంద్ అలియాస్ లాలాకు డీ కంపెనీ (దావూద్ ఇబ్రహీం దందా)తో దగ్గర సంబంధాలున్నాయి. కానీ బయటకు మాత్రం రైతుగా కనిపించేవాడు. ఇక ఒసామా సమీ కుటుంబం డ్రైఫ్రూట్ బిజినెస్‌లో ఉంది. ఇతను చాలాసార్లు మధ్యాసియా దేశాలకు వెళ్లి వచ్చాడు. మస్కట్ నుంచి పాకిస్తాన్‌కు జలమార్గంలో చేరుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన జాన్ మహ్మద్ షేక్ అలియాస్ సమీర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సెంట్రల్ ముంబైలో నివశిస్తున్న ఇతనికి ఇద్దరు కూతుర్లున్నారు. పోలీసులు అరెస్టు చేసేవరకు వీరి గురించి పక్కింటివారికి కూడా తెలియదంటే ఎంత పకడ్బందిగా వ్యవహరించారో అర్ధం అవుతోంది. డీ కంపెనీతో లింకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నిర్వహించే ముఠాతో అరెస్టయిన వారికి దగ్గర సంబంధాలున్నాయి. వీరిలో ఒసామా, ఖమర్‌లు ఐఎస్ఐ వద్ద శిక్షణ పొందిన ఉగ్రవాదులు కాగా, దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీంకు సమీర్ దగ్గరవాడు. అంటే వీరికి డీ కంపెనీతో పాటు పాక్ అండదండలు కూడా ఉన్నట్లు అర్థమవుతోందని పోలీసులు చెప్పారు. పాక్‌లో ఉంటున్న అనీస్ ఆదేశాల ప్రకారం సమీర్ పేలుడు పదార్ధాలను, ఆధునిక ఆయుధాలను, గ్రెనేడ్లను భారత్‌లోని వివిధ ప్రాంతాల్లోని టెర్రరిస్టులకు అందించాలని ప్లాన్ చేశారు. గతేడాది ముంబై పోలీసులు ఫజుల్ రహమన్ ఖాన్ అలియాస్ ముజ్జుతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ ముంబైలోని ఒక వ్యాపారవేత్తను చంపమని వీరికి అనీస్ ఆదేశాలిచ్చాడు. దావూద్ అనుచరుడు ఫహీమ్ మాచ్మచ్కు ముజ్జు సన్నిహితుడు. అతనితో పనిచేసేవారు, కిరాయి హంతకుల గురించిన సమాచారాన్ని పోలీసులు మజ్జు నుంచి రాబట్టారు. ఇతని విచారణలోనే జాన్ మహ్మద్ పేరు బయటపడింది. అప్పటినుంచి ఇతని కదలికలపై పోలీసులు కన్నేసి ఉంచారు. కానీ జాన్ సాధారణ డ్రైవర్‌గా గడుపుతున్నట్లు నటించడంతో ఎలాంటి ఉగ్రకుట్ర గురించి తొలుత బయటపడలేదు. గతనెల ఫహీమ్ మరణించిన తర్వాత అనీస్ ఇతనికి నేరుగా ఆదేశాలు ఇవ్వడం ఆరంభించాడు. దీంతో ఇతని గుట్టు రట్టయింది, అప్పటివరకు ముంబైలో స్లీపర్ సెల్‌గా జాన్ పనిచేస్తున్నాడని, గ్యాంగుకు ఆయుధాలు సరఫరా చేసేవాడని తెలిసింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో మొత్తం ఉగ్ర కుట్ర బయటపడింది. యూపీపై కన్ను యూపీలో వరుస పేలుళ్లను జరిపాలని ప్లాన్ చేశారు. ప్రయాగ్ రాజ్‌లో ఒక ఐఈడీ(పేలుడు పదార్ధం)ని టెర్రరిస్టులు అమర్చారని పోలీసులకు తెలిసింది. కచ్చితంగా ఎక్కడ ఈ బాంబు పెట్టారో తెలియకపోవడంతో ఆందోళన అధికమైంది. దీనికితోడు యూపీలో వీఐపీల రాకపోకలు అధికంగా ఉండడంతో సోదాలు నిర్వహించడం, దర్యాప్తు చేయడం ఎంతో కష్టమయ్యాయని పోలీసులు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల వేడితో రాష్ట్రంలో హడావుడి పెరిగింది. ఈ నేపథ్యంలో బాంబున్న ప్రదేశాన్ని కనుగొనడం సముద్రంలో సూదిని వెతికినట్లయింది. దీనికితోడు టెర్రరిస్టులు తప్పించుకోవడానికి అనువుగా నేపాల్ బోర్డర్‌ను ఆనుకొనే యూపీ ఉంది. కానీ ముమ్మర సోదాలు, లోతైన విచారణతో ఎట్టకేలకు బాంబు లొకేషన్ కనుగొని దాన్ని నిర్వీర్యం చేశారు. ఆపరేషన్ తొలిదశలోనే ఉగ్రవాదులు పట్టుబడడంతో ఎంతో ప్రాణనష్టాన్ని నివారించినట్లయింది. అయితే పాక్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఇదే చివరిసారి కాదని, అప్రమత్తతే దేశానికి రక్ష అని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. –నేషనల్ డెస్క్, సాక్షి -
తాలిబన్ విజయంతో ఉగ్రమూకలకు ధైర్యం!
న్యూయార్క్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు విజయం సాధించడం ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లోని ఉగ్రవాదులకు ధైర్యాన్నిచ్చే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకపక్క అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, మరోపక్క తాలిబన్లతో ఐరాస చర్చలు జరపాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అంతర్జాతీయ సంబంధాల్లో అఫ్గాన్ కీలక పాత్ర పోషించాలని ఐరాస ఆశిస్తోందన్నారు. ‘‘ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అఫ్గాన్‌లో తాలిబన్లు విజయం సాధించడం ఇతర ప్రాంతాల్లోని ఉగ్రవాదులకు మనోధైర్యాన్నిస్తున్నది నిజం. అయితే ఇతర ఉగ్రగ్రూపులు తాలిబన్లతో పోలిస్తే భిన్నమైనవి, వీరి మధ్య పోలిక కనిపించదు.’’ అని ఆంటోనియో అభిప్రాయపడ్డారు. పలు టెర్రరిస్టు గ్రూపులు తాలిబన్లకు అభినందనలు పంపడమే కాకుండా, తమ సామర్ధ్యంపై బలమైన నమ్మకాన్ని పెంచుకుంటున్నాయన్నారు. ఆఫ్రికాలోని సహేల్ ప్రాంతంలో తీవ్రవాదుల దుశ్చర్యలను ఆయన ప్రస్తావించారు. చాలా ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని సమర్థంగా తిప్పికొట్టే పరిస్థితులు లేవన్నారు. దీనివల్ల టెర్రరిస్టులు క్రమంగా పట్టు సాధిస్తున్నారు, వీరికి తాజా పరిణామాలు ధైర్యాన్నిస్తున్నాయని చెప్పారు. ఐకమత్యమే అవసరం ఒక టెర్రరిస్టు గ్రూపు.. అది ఎంత చిన్నదైనా సరే, ఆత్మాహుతికి సిద్ధపడి ఒక దేశంపై దాడికి దిగితే, సదరు దేశ సైన్యాలు సైతం ఆ గ్రూపును ఎదుర్కోలేకపోతాయని ఆంటోనియో ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఉదాహరణగా అఫ్గాన్ ఆర్మీ 7రోజుల్లో మాయమవడాన్ని ప్రస్తావించారు. టెర్రరిజంపై యావత్ ప్రపంచం ఏకతాటిపై నిలబడితే సమర్ధవంతంగా ఎదుర్కోగలమన్నారు. అఫ్గాన్‌ను ఉగ్రవాదులకు నిలయంగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. అఫ్గాన్ తాలిబన్లతో ఐరాస నిరంతరం చర్చిస్తోందని, ఈ స్థితిలో చర్చలే ఉత్తమమార్గమని ఆయన చెప్పారు. తాలిబన్ల ప్రభుత్వం సమ్మిళితంగా ఉంటుందని ఆశించామని చెప్పారు. తాలిబన్లు అన్ని వర్గాలను పాలనలో మిళితం చేయాలని, మానవ హక్కులను కాపాడాలని, మహిళలు, బాలికల హక్కులపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ సంబంధాల్లో అఫ్గానిస్థాన్ నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు. -
ఉగ్రవాదులే పాలకులు..!
కాబూల్/పెషావర్/ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో ఏకంగా 14 మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఐక్యరాజ్యసవిుతికి చెందిన భద్రతా మండలి వారిని గతంలోనే టెర్రరిజం బ్లాక్‌లిస్టులో చేర్చింది. ఈ జాబితాలో నూతన ప్రధానమంత్రి ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్‌తోపాటు ఇద్దరు ఉపప్రధానుల పేర్లు సైతం ఉండడం గమనార్హం. అఫ్గానిస్తాన్‌లోని కొత్త మంత్రివర్గంలో కరడుగట్టిన ఉగ్రవాదులు స్థానం దక్కించుకోవడం పట్ల అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సిరాజుదీ్దన్ హక్కానీ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడ్డారు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. సిరాజుదీ్దన్ హక్కానీ మామ ఖలీల్ హక్కానీ కాందిశీకుల సంక్షేమ మంత్రిగా నియమితులయ్యారు. రక్షణ శాఖ మంత్రి ముల్లా యాకూబ్, విదేశాంగ మంత్రి ముల్లా అమీర్ ఖాన్ ముత్తాఖీ, విదేశాంగ శాఖ సహాయ మంత్రి షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ తదితరులను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన శాంక్షన్స్ కమిటీ(తాలిబన్ శాంక్షన్స్ కమిటీ) గతంలోనే టెర్రరిజం బ్లాక్‌లిస్టులో చేర్చింది. పాకిస్తాన్ ఆర్మీలో కీలక మార్పులు పాక్ ప్రభుత్వం ఆ దేశ ఆర్మీలో కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం నియంత్రణ రేఖ వెంట భద్రతా పరమైన విభాగాలను పర్యవేక్షిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ అజర్ అబ్బాస్‌ను చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌గా నియమించింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తర్వాత రెండో ప్రాధాన్యం ఉన్న పోస్టు చీఫ్ జనరల్ స్టాఫ్ కావడం గమనార్హం. జనరల్ అబ్బాస్ బలూచ్ రెజిమెంట్‌కు చెందిన వ్యక్తి. ఇప్పటి వరకూ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌గా పని చేసిన లెఫ్టినెంట్ జనరల్ షషీర్ శంషాద్ మీర్జాను రావల్పిండిలోని 10 కార్ప్స్ కమాండర్‌గా పంపించారు. ఇంకోవైపు ముల్తాన్ కార్ప్స్ కమాండర్‌గా లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ ఛిరాగ్ హైదర్‌ను నియమించారు. తాలిబన్లకు చైనా ఆర్థిక సాయం అఫ్గానిస్తాన్‌కు 3.1 కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని చైనా ప్రకటించింది. అఫ్గాన్‌లో తాలిబన్లు ఏర్పరిచిన తాత్కాలిక ప్రభుత్వాన్ని స్వాగతించింది. అశాంతిని పోగొట్టి, శాంతిని నెలకొల్పే చర్యగా ప్రభుత్వ ఏర్పాటును అభివర్ణించింది. అఫ్గాన్‌కు ఆహార ధాన్యాలు, టీకాలు, మందులు ఇస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ చెప్పినట్లు అధికారిక మీడియా వెల్లడించింది. ఇరాన్, తజకిస్తాన్, తుర్కుమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా విదేశాంగ మంత్రులతో పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి రష్యా హాజరు కాలేదు. అఫ్గానిస్తాన్ ప్రజలకు తొలి విడతలో 30 లక్షల టీకా డోసులు పంపుతామని వాంగ్ భరోసా ఇచ్చారు. చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెంబిన్ మాట్లాడుతూ అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొన్నారు. చైనా ఎప్పుడూ అఫ్గానిస్తాన్ సార్వ¿ౌమత్వాన్ని, స్వాతంత్య్రాన్ని గౌరవిస్తుందని చెప్పారు. పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీలకు విలువ లేదు తాము పూర్తిగా మారిపోయామని, అఫ్గాన్ ప్రజలకు సుపరిపాలన అందిస్తామని నమ్మబలుకుతున్న తాలిబన్లు మరోవైపు తమ అసలు రూపాన్ని బయటపెట్టుకుంటున్నారు. పవిత్రమైన షరియా చట్టాల ప్రకా రమే అఫ్గానిస్తాన్ పరిపాలన, ప్రజా జీవనాన్ని నిర్దేశిస్తామని తాలిబన్ అగ్రనేత హైబ తుల్లా అఖుంద్జాదా స్పష్టం చేశారు. అఫ్గాన్ నూతన ఉన్నత విద్యాశాఖ మంత్రి షేక్ మోల్వీ నూరుల్లా మునీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మా రాయి. ‘‘పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీలకు పెద్దగా విలు వలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న తాలిబన్లు, ముల్లాలను చూడండి. వారిలో ఎవరికీ పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీలు కాదు కదా కనీసం ఎంఏ, హైసూ్కల్ డిగ్రీలు కూడా లేవు. అయినప్పటికీ వారు ఉన్నత స్థాయికి చేరుకున్నారు’’ అని మునీర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో నికొలాయ్ పాట్రుశేవ్ భేటీ న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం భారత్‌కు చేరుకున్న రష్యా భద్రతా మండలి కార్యదర్శి నికొలాయ్ పాట్రుశేవ్ బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తామిద్దరం కీలకమైన అంశాలపై సంప్రదింపులు జరిపినట్లు మోదీ తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం
కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపొరాలోని త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారని, దీంతో ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారని వెల్లడించారు. టెర్రరిస్టుల కోసం ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని పేర్కొన్నారు. -
జమ్ముకశ్మీర్ ఎన్కౌంటర్లో అమరుడైన ఆర్మీ జేసీఓ
శ్రీనగర్:జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో గురువారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) అమరుడైనట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. రాజౌరీలోని తనమండి బెల్ట్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే ఉగ్రవాదుల కోసం వెతుకుతుండగా.. ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు కాల్పులు తిప్పికొట్టాయని పోలీసు అధికారులు తెలిపారు. జమ్మూ డిఫెన్స్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ మాట్లాడుతూ...ఉగ్రవాదుల కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) తీవ్రంగా గాయపడ్డారని, ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, అయినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఆయన అమరుడయ్యారని తెలిపారు. -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు శుక్రవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కుల్గాం జిల్లాలో బీఎస్‌ఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు బద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పలు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టగా. .మరో ఉగ్రవాది తప్పించుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్‌ఫ్ అధికారులకు, మరో ఇద్దరు స్థానిక పౌరులకు గాయాలయ్యాయి. -
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలో శనివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర కశ్మీర్‌లోని బండిపోరాలో సుంబ్లార్ ప్రాంతంలోని షోక్‌బాబా అడవిలో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలు సమాచారం అందుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే ఉగ్రవాదుల కోసం వెతుకుతుండగా.. ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా గత వారం రోజుల్లోనే ఈ లోయలో పలు ఎన్కౌంటర్లు జరిగిగాయి. బారాముల్లాలోని సోపోర్‌లోని వార్పోరా గ్రామంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా (ఎల్ఇటీ) ఉగ్రవాదులు మరణించారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఇక జమ్మూ కశ్మీర్‌లోని షోపియన్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో సోమవారం లష్కరే తోయిబా ఉగ్రవాది, మరో గెరిల్లా మృతి చెందారు. -
ఉగ్రవాదుల కలకలం.. ఇద్దరు అరెస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కకోరిలో దుబ్బగ్గలో లక్నో ఏటీఎస్ అధికారులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానిత ఉగ్రవాదులకు అల్‌ఖైదాతో సంబంధాలున్నట్లు గుర్తించారు. వారి నుంచి విదేశీ తుపాకులు సహా.. పేలుడు పదార్థాలు ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ప్రెజర్ కుక్కర్ బాంబులను కూడా ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీరియల్ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అయోధ్య, కాశీ పరిసర ప్రాంతాల్లో భారీగా భద్రతను పెంచారు. సకాలంలో ఉగ్రవాదులు పట్టుబడడంతో ప్రమాదం తప్పిందని ఏటీఎస్ అధికారులు పేర్కొన్నారు. -
11 మంది ‘ఉగ్ర’ ఉద్యోగుల తొలగింపు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో 11 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. వారికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని, బలగాల కదలికలను గురించి ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చారనే అభియోగాల మీద జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత అధికారులు వారిని తొలగించినట్లు శనివారం ప్రకటించారు. తొలగింపునకు గురైన వారిలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ చీఫ్ సలాహుద్దీన్ కుమారులు సయీద్ అహ్మద్ షకీల్, షాహిద్ యూసుఫ్‌లు ఉన్నారని పేర్కొన్నారు. తొలగించిన వారిలో పోలీస్, విద్య, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, విద్యుత్, ఆరోగ్య శాఖలకు చెందిన వారు ఉన్నారని వెల్లడించారు. వీరిలో నలుగురు అనంతనాగ్, ముగ్గురు బుద్గమ్‌కు చెందిన వారు కాగా.. బారాముల్లా, శ్రీనగర్, పుల్వామా, కుప్వారా జిల్లాల నుంచి ఒకరు చొప్పున ఉన్నట్లు తెలిపారు. వీరందరిని భారత రాజ్యాంగంలోని 311వ ఆర్టికల్ ద్వారా తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ ద్వారా ఉద్వాసనకు గురైతే వారు హైకోర్టులో మాత్రమే ఆ నిర్ణయాన్ని సవాలు చేయగలరు. రెండు సమావేశాల్లో.. కశ్మీర్‌కు చెందిన ఉన్నతాధికారుల కమిటీ ఇటీవల రెండు సార్లు సమావేశమైందని అధికారులు వెల్లడించారు. ఇందులో మొదటి సమావేశంలో ముగ్గురిని, రెండో సమావేశంలో 8 మందిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తొలగింపునకు గురైన వారు పలు రకాలుగా ఉగ్రవాదులకు సాయం అందించారని ఆరోపిం చారు. హవాలా ద్వారా డబ్బును పొందినట్లు వెల్లడించారు. భద్రతా బలగాలు చేపట్టబోయే కార్యకలాపాల వివరాలను చేరవేసి ఉగ్రవాదులకు సాయపడినట్లు అభియోగాలు మోపారు. -
Darbhanga Blast: యూపీలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్భంగా పేలుడు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో భాగంగా... నిందితుల సమాచారం మేరకు హైదరాబాద్ మాలిక్ బ్రదర్స్‌తో పాటు యూపీకి చెందిన హాజీ సలీం, కాఫీల్ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ పేలుడు కుట్రలో హాజీ సలీం అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది. ఎన్ఐఏ అధికారుల వివరాల ప్రకారం.. హజీ సలీం, కాఫిల్ లష్కరే తోయిబాకు చెందిన వారుగా గుర్తించినట్లు తెలిపారు. దర్భంగా బ్లాస్ట్‌కు ఫిబ్రవరి 2021లో వ్యూహాలు రచించగా, యూపీలోని హాజీ సలీం ఇంట్లో నలుగురు ఉగ్రవాదులు ఈ పేలుడుకు ప్లాన్ చేశారని వెల్లడించారు. పథకం ప్రకారం వాళ్లు రన్నింగ్ ట్రైన్లో ఐఈడీ బాంబులను ఫిక్స్ చేయాలనుకున్నట్లు తెలిపారు. లష్కరే తోయిబా ముఖ్యనేత ఇక్భాల్ ఖాన్‌కు హాజీ సలీం దగ్గరి బంధువని, పేలుడుకు సంబంధించి మాలిక్ బ్రదర్స్‌కు ఇక్భాల్ ఖాన్ కు హాజీ సలీం మధ్యవర్తిత్వం వహించినట్లు తెలిపారు. ఇవే కాక మాలిక్ బ్రదర్స్‌కు ఇక్భాల్ ఖాన్ నుంచి నిధులు సమకూర్చింది కూడా హాజీ సలీమేనని దర్యాప్తులో తేలింది. 9 రోజులు ఎన్ఐఏ కస్డడీలో మాలిక్ బ్రదర్స్ గతనెల 30న ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్ అరెస్టు కాగా శుక్రవారం వీరిని పాట్నా కోర్టులో ఎన్ఐఏ అధికారులు ప్రవేశపెట్టారు. నిందితులను 10 రోజుల కస్టడీ కోరుతూ ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేయగా, 9 రోజుల పాటు కస్టడీకి పాట్నా కోర్టు అనుమతినిచ్చింది. -
భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీర్: శ్రీనగర్‌లోని నౌగం ప్రాంతంలోని వగూరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఎదురు కాల్పులు జరిగినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఓ ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగపడిపట్లు వెల్లడించారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మృతి చెందగా.. మరో ఉగ్రవాది ప్రాణాలతో చిక్కినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల నుంచి పిస్తోల్, మ్యాగజైన్, 6 రౌండ్ల బుల్లెట్లు, 2 గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చదవండి: బహుమతి పంపించానంటూ.. రూ.80 లక్షలు స్వాహా -
సోపోర్‌లో ఉగ్రవాదుల మెరుపు దాడి
జమ్మూకశ్మీర్: జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం సోపోర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) క్యాంప్‌పై గ్రనేడ్‌తో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు జవాన్లు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఎల్ఈటీ ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఈ దాడిని ఖండిస్తూ ట్విట్ చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు. చదవండి: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం థర్డ్‌వేవ్ ముప్పు నిజమే.. యుద్ధ ప్రాతిపదికన చర్యలు: కేజ్రీవాల్ -
మధురైలో ఎన్ఐఏ సోదాల కలకలం
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేరళ నుంచి వచ్చిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు మధురైలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇద్దరు తీవ్రవాద అనుమానితుల ఇళ్లలో సోదాలు చేశారు. శ్రీలంక చర్చిలో మూడేళ్ల క్రితం జరిగిన మారణహోమంలో తమిళనాడుకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందని భారత్‌కు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు లోతుగా విచారణ చేపట్టగా తమిళనాడు పాత్రను గుర్తించారు. అనాటి నుంచి తమిళనాడులోని అనుమానితులపై నిఘాపెట్టారు. ఫేస్బుక్లో సందేహాస్పద పోస్టింగ్‌లను గమనించిన మధురై పోలీసులు అదే ప్రాంతానికి చెందిన సెంథిల్‌కుమార్ అలియాస్ మహమ్మద్ ఇక్బాల్‌కు తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉండవచ్చని అనుమానించి గతంలో కేసు పెట్టారు. ఈ కేసు ఏప్రిల్‌లో ఎన్ఐఏకు బదిలీకాగానే ఇక్బాల్‌ను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, కేరళ నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందం ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మధురై కాజీమర్ వీధి, కే పుత్తూరు, పెత్తానియాపురం, మగప్పాళయం తదితర ప్రాంతాల్లో ఇక్బాల్ అతని స్నేహితుల ఇళ్లలో మధ్యాహ్నం 1 గంట వరకు తనీఖీలు సాగాయి. ఇక్బాల్ ఇంటి నుంచి పెన్ డ్రైవ్, సిమ్‌కార్డు సహా 16 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక తిరుప్పూరుకు చెందిన ఒక యువకుడు ఇక్బాల్‌తో ఎక్కువసేపు వాట్సాప్‌లో చాటింగ్ చేసిన విషయం బయటపడింది. సుమారు 8 గంటలపాటూ ఆ యువకుడిని విచారించి విడిచిపెట్టారు. (చదవండి: Covid-19: తలైవా విరాళం రూ. 50 లక్షలు) -
ముగ్గురు ఓఎన్జీసీ సిబ్బందిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
న్యూఢిల్లీ: అస్సాంలోని ఆయిల్ అండ్ నేచరల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)కు చెందిన ముగ్గురు ఉద్యోగులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆయుధాలు కలిగిన అయిదుగురు ఉగ్రవాదులు శివసాగర్‌లోని కార్యాలయంలోకి ప్రవేశించి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. కంపెనీకి చెందిన ఎమర్జెన్సీ కమ్ మెడికల్ వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లారని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. అనంతరం ఆ వాహనాన్ని నిమోనగర్ అడవి వద్ద వదిలేశారని వెల్లడించారు. ఈ అడవి అస్సాం–నాగాలాండ్ సరిహద్దులో ఉంది. ఈ ఘటనానంతరం ఉన్నత స్థాయి రివ్యూ సమా వేశం నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు -
కొడుకు శవం కోసం 8 నెలలుగా తవ్వకాలు..
శ్రీనగర్: ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులను వదిలించుకునే సంతానం కోకొల్లలు.. బిడ్డలను వదిలేసే తల్లిదండ్రులు మాత్రం ఇంకా తయారు కాలేదు. తమ చివరి క్షణం వరకు బిడ్డల బాగోగుల గురించే ఆలోచిస్తారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో హత్యకు గురైన తన కొడుకు మృతదేహం కోసం ఓ తండ్రి గత ఎనిమిది నెలలుగా ప్రతి రోజు తవ్వకాలు జరుపుతూ గాలిస్తూనే ఉన్నాడు. ఈ తండ్రి కన్నీటి వ్యథ ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది. ఆ వివరాలు.. షకీర్ మంజూర్(25) అనే వ్యక్తి ప్రాదేశిక సైన్యంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆగస్టు 2న అతడిని కొందరు ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారం రోజులకు రక్తంలో తడిసిన షకీర్ దుస్తులు లభించాయి. దాంతో అతడు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు నిర్థరాణకు వచ్చారు. బిడ్డను పొగొట్టుకున్నారు.. కనీసం తనని కడసారిగా చూసుకుని.. ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలి అని షకీర్ తల్లిదండ్రులు భావించారు. కానీ నేటికి కూడా అతడి మృతదేహం వారికి లభించలేదు. ఈ సందర్భంగా షకీర్ తండ్రి మంజూర్ అహ్మద్ వాగే మాట్లాడుతూ.. ‘‘ఆగస్ట్ 2న ఈద్ సందర్భంగా నా కుమారుడు మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లిన గంటకు మాకు కాల్ చేశాడు. ‘‘నేను స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నాను. నా గురించి ఆర్మీ అధికారులు అడిగితే ఏం చెప్పకండి’’ అన్నాడు. అదే తన చివరి కాల్. అప్పటికే తను కిడ్నాప్ అయ్యాడని.. ఉగ్రవాదులే తనతో అలా మాట్లాడించారని ఆ తర్వాత మాకు అర్థం అయ్యింది’’ అన్నాడు వాగే. ‘‘మరుసటి రోజు షకీర్ వాడే వాహనం పూర్తిగా కాలిపోయి కనిపించింది. వారం రోజుల తర్వాత మాకు మా ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాధురా ప్రాంతంలో రక్తంలో తడిసిన తన దుస్తులు లభించాయి. తన మృతదేహం కోసం వెదికాం.. కానీ దొరకలేదు. ఈ క్రమంలో ఓ రోజు మా బంధువుల అమ్మాయి రాత్రి తన కలలో షకీర్ కనిపించాడని.. అతడి బట్టలు దొరికన చోటే తనని పాతి పెట్టారని.. వెలికి తీయాల్సిందిగా కోరినట్లు మాకు తెలిపింది. దాంతో మరి కొందరితో కలిసి నేను ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాను. కానీ ఫలితం శూన్యం’’ అన్నాడు వాగే. ‘‘అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు ఇలా తవ్వకాలు జరుపుతూనే ఉన్నాను. ఏదో ఓ రోజు షకీర్ మృతదేహం దొరుకుతుందనే ఆశతో జీవిస్తున్నాను. ఈ విషయంలో గ్రామస్తులు నాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎందుకంటే వారందరికి తనంటే ఎంతో ప్రేమ. ఇక నా కొడుకును కిడ్నాప్ చేసిన నలుగురు ఉగ్రవాదులు ఎవరో కూడా నాకు తెలుసు. కొన్ని రోజుల క్రితం వారిలో ఒక వ్యక్తి ఇక్కడి అధికారుల నుంచి ఏకే47 రైఫిల్స్ ఎత్తుకెళ్లి చిన్నపాటి గ్రూపును రన్ చేస్తున్నాడు. నా కుమారిడి శవాన్ని అప్పగించాల్సిందిగా మేం అన్ని మిలిటెంట్ సంస్థలను సంప్రదించాం. కానీ వారు తమకు ఏం తెలియదన్నారు’’ అన్నాడు వాగే. పోలీసు రికార్డుల్లో కిడ్నాప్‌గానే నమోదు... పోలీసు రికార్డుల్లో షకీర్ కిడ్నాప్ అయినట్లు నమోదు చేశారు. మరణించినట్లు ధ్రువీకరించలేదు. ఇక షకీర్‌ని ఎక్కడ సమాధి చేశారనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. స్థానిక పోలీసులు షకీర్ మృతదేహాం కోసం తీవ్రంగా గాలించారు. కానీ లాభం లేకుండా పోయింది. ఈ సందర్భంగా వాగే ‘‘చెట్టంత ఎదిగిన కొడుకును దూరం చేసుకున్నాను. కడసారి చూపుకు నోచుకోలేదు.. తనకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కూడా లేకపోయింది. పగ వాడికి కూడా ఇలాంటి పరిస్థితి వద్దు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి మాటలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. ఇక 2020 నుంచి ఉన్నతాధికారులు మిలిటెంట్ల దాడిలో మరణించిన సైనికుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం లేదు. కరోనా వల్లనే ఇలా చేయాల్సి వచ్చింది అంటున్నారు అధికారులు. అధికారులపై వాగే ఆగ్రహం.. తన కొడుకును అమరవీరుడిగా ప్రకటించకపోవడం పట్ల వాగే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. "నా బిడ్డ ఒక సైనికుడు, భారతదేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు. అధికారులు మొదట తన ప్రాణాలను కాపాడడంలో విఫలమయ్యారు. తరువాత అతని మృతదేహాన్ని కనుగొనడంలో విఫలమయ్యారు. అతన్ని అమరవీరుడిగా ప్రకటించాలని ప్రభుత్వానికి నా విజ్ఞప్తి. నా కొడుకును కిడ్నాప్ చేసి చంపారు. నా బిడ్డ వారి చేతిలో చిత్ర హింసలు భరించాడు.. కాని దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలాంటి వ్యక్తిని అమరవీరుడిగా ప్రకటించకపోవడం నాకు మరింత ఆగ్రహం తెప్పిస్తుంది’’ అన్నాడు. కశ్మీర్లో, గత మూడు దశాబ్దాలలో సుమారు 8,000 మంది తప్పిపోయారు. వారిని భద్రతా దళాలు తీసుకుని వెళ్లారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. అయితే ఒక సైనికుడు అదృశ్యం కావడం మాత్రం ఇదే ప్రథమం. చదవండి: నర్సింగ్ విద్యార్థిని కిడ్నాప్: రూ. 2 కోట్లిస్తే వదిలేస్తాం అజిత్ దోవల్ నివాసం వద్ద ఉగ్రవాదుల రెక్కీ -
బీజేపీ నాయకుడి ఇంటిపై ఉగ్రదాడి
కశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్థానిక బీజేపీ నేత ఇంటి వద్ద కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి మృతి చెందాడు. బీజేపీ నాయకుడు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. జమ్మూకశ్మీర్ నౌగామ్‌లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగర శివార్లలోని నౌగామ్, అరిగం ప్రాంతంలోని బీజేపీ నాయకుడు అన్వర్ ఖాన్ ఇంటి బయట గురువారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ సెంట్రీ తీవ్రంగా గాయపడ్డాడు. ఉగ్రవాదులు అక్కడి నుంచి ఎస్ఎల్ఆర్ రైఫిల్‌తో పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సెంట్రీని ఎస్ఎంహెచ్ఎస్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు హస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నజీర్ చౌదరి తెలిపారు. ఇదిలా ఉండగా, పార్టీ కశ్మీర్ యూనిట్ ఈ దారుణ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ మీడియా ఇన్‌ఛార్జి మంజూర్ భట్ తెలిపారు. #NewsAlert | One cop martyred as terrorists target guard post outside BJP leader's residence in Naugam, J&K. Details by Ieshan & Sohil. pic.twitter.com/rjjqDAgaw7 — TIMES NOW (@TimesNow) April 1, 2021 చదవండి: రెచ్చిపోయిన ఉగ్రవాది.. నడి రోడ్డుపై కాల్పులు -
జమ్మూకాశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
-
రెచ్చిపోయిన ఉగ్రవాది.. నడి రోడ్డుపై కాల్పులు
-
రెచ్చిపోయిన ఉగ్రవాది.. నడి రోడ్డుపై కాల్పులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పట్టపగలు, నడి రోడ్డుపై కాల్పులకు తెగ బడ్డారు. దుకాణం వద్ద నిలబడి ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులకు తెగ బడ్డాడు ఓ ఉగ్రవాది. శ్రీనగర్ భగత్ బర్జుల్లా ప్రాంతంలో శుక్రవారం ఈ దారుణం చోటు చేసుకుంది. జమ్మూకశ్మీర్ పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన కానిస్టేబుల్స్ సోహైల్ అహ్మద్, మహ్మద్ యూసుఫ్ బర్జుల్లాలోని ఓ టీ స్టాల్ వద్ద నిల్చుని ఉన్నారు. ఇంతలో నడుచుకుంటూ వచ్చిన ఓ ఉగ్రవాది తన వద్ద ఉన్న ఏకే-47 తుపాకీతో కాల్పులకు తెగ బడ్డాడు. ఊహించని ఈ ఘటనకు చుట్టు పక్కల ఉన్న స్థానికులు త్రీవ భయందోళనకు గురయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాది అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటన గురించి తెలిసి ఆర్మీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్స్ సోహైల్ అహ్మద్, మహ్మద్ యూసుఫ్‌లు మరణించారు. అక్కడే ఉన్న సీసీకెమరాలో ఉగ్రవాది దాడి చేసిన దృశ్యాలు రికార్డయ్యాయి. శ్రీనగర్‌లో మూడు రోజుల వ్యవధిలో ఉగ్రవాదులు ఇలా బరి తెగించడం ఇది రెండో సారి. నగరంలోని హై సెక్యూరిటీ దుర్గానాగ్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్ యజమాని కొడుకుపై మూడు రోజుల క్రితం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. చదవండి: అజిత్ దోవల్ నివాసం వద్ద ఉగ్రవాదుల రెక్కీ -
ఎన్కౌంటర్: ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా బుద్గాం ప్రాంతంలో గురువారం అర్దరాత్రి ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. అలాగే భారత్ జవాన్ మృతి చెందగా, మరో జవాన్‌కు గాయాలయ్యాయి. షోపియాన్ ప్రాంతంలోని బడిగాంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు జమ్మూకశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో జమ్మూకశ్మీర్ పోలీసులు సైనికులు, సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి గురువారం అర్దరాత్రి కార్డన్ సెర్చ్ ప్రారంభించారు. ఒక ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు వారిని గాలిస్తున్న భద్రతా బలగాలపై కాల్పులకు దిగారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించారని పోలీసులు చెప్పారు. యూరప్, ఇస్లామిక్ దేశాల ప్రతినిధులు, రాయబారుల బృందం జమ్మూకశ్మీర్ లో సందర్శిస్తున్న సమయంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ స్థలంలో పోలీసులు ఉగ్రవాదుల కోసం శుక్రవారం ఉదయం కూడా గాలింపు కొనసాగిస్తున్నారు. చదవండి: ఏనుగులు దాడి: యువకుడి మృతి గల్వాన్ ఘటన: తొలిసారి వివరాలు వెల్లడించిన చైనా -
అజిత్ దోవల్ నివాసం వద్ద ఉగ్రవాదుల రెక్కీ
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకి కుట్ర పన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆయన నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దీంతో దోవల్ కార్యాలయం, నివాసం వద్ద భద్రతను పెంచారు. జైషే మహమ్మద్ ఉగ్రవాది హిదయత్ ఉల్లా మాలిక్‌ను అరెస్ట్ చేసి ప్రశ్నించడంతో రెక్కీ విషయం బయటపడింది. దోవల్‌తో పాటుగా ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న వారి సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్‌కు చేరవేసినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 6న పోలీసులు మాలిక్‌ను అరెస్ట్ చేశారు. అతనితో సహా నలుగురిని పోలీసులు ప్రశ్నించారు. వారిలో మాలిక్ భార్య, చండీగఢ్‌కు చెందిన ఒక విద్యార్థి, బీహార్ నివాసి ఉన్నారు. పోలీసుల విచారణలో పాకిస్తాన్ ఆదేశాల మేరకే తామందరం రెక్కీ నిర్వహించామని మాలిక్ అంగీకరించాడు. గత ఏడాది మేలో న్యూఢిల్లీలోని దోవల్ కార్యాలయం సహా కొన్ని ప్రాంతాలను వీడియో తీసి పంపించామని వెల్లడించాడు. దోవల్ 2019 బాలాకోట్ వైమానిక దాడులు జరిగినప్పట్నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉన్నారు. దీంతో ఆయనకి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. -
ఉగ్రమూకల కొత్త యాప్ బాట
శ్రీనగర్: ఉగ్రమూకలు సరికొత్త పన్నాగాలకు తెరలేపుతున్నాయి. ఎన్క్రిప్షన్ సదుపాయం ఉన్నప్పటికీ వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ వంటి యాప్‌లను వాడకుండా మరింత ఎన్క్రిప్షన్ ఉంటూనే తక్కువ నెట్‌వర్క్‌లోనూ సమర్ధవంతంగా పని చేయగల యాప్‌ల వైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి 3 యాప్‌లను ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ మూడే ఎందుకు ? భద్రతా కారణాల రీత్యా ఆయా యాప్‌ల పేర్లను అధికారులు బయటపెట్టలేదు. అయితే ఆ మూడు యాప్‌లలో ఒకటి అమెరికా, రెండోది యూరోప్, మూడోది టర్కీకి చెందిన నిపుణులు తయారు చేసినవని వెల్లడించారు. ఈ యాప్‌లో ఎండ్ టు ఎండ్ డివైజ్ ఎన్క్రిప్షన్ ఉంటోంది. ప్రత్యేకించి ఇటీవల భారత్‌లో జరిగిన ఉగ్ర ఎన్కౌంటర్లలో మరణించిన వారి మొబైల్ ఫోన్లను పరిశీలించిన అధికారులకు టర్కీ యాప్‌ను ఉపయోగిస్తున్నట్లు ఆధారాలు లభించాయి. 2జీ నెట్వర్క్ కోసం... కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత చాలా కాలం పాటు ఆ ప్రదేశాల్లో ఇంటర్నెట్ సౌకర్యం నిలిపేశారు. అనంతరం కేవలం 2జీ నెట్‌వర్క్‌ను మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. 2జీ వేగంలో ఉత్తమ ఫలితాన్ని ఇవ్వగల టర్కీ యాప్ వైపు ఉగ్రవాదులు మొగ్గు చూపుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ యాప్‌లు కూడా ఫ్రీ సర్వీసులను అందించడం గమనార్హం. ఫోన్ నంబర్ అక్కర్లేదు ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న ఈ మూడు యాప్‌లలో ఒకదానికి అసలు మొబైల్ నంబర్ కూడా అవసరం లేకుండానే రిజిస్టర్ చేసుకొని సమాచారం పంచుకోవచ్చు. ఒకరకంగా ఇది వర్చువల్ సిమ్‌లాంటి టెక్నాలజీతో పనిచేస్తుంది. పుల్వామా–2019 ఘటనలోనూ ఇలాంటి వర్చువల్‌సిమ్ కార్డులను దాదాపు 40 వరకూ ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఘటనలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
ఉగ్రవాదుల ఎత్తుగడ.. ఆన్లైన్ కోచింగ్
న్యూఢిల్లీ : కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లూ, నిరంతర నిఘా మధ్య.. ఉగ్రవాద సంస్థల్లో నియామకాలు కష్టంగా మారడంతో ఉగ్రమూకలు శాస్త్ర సాంకేతికతను అనువుగా చేసుకొని ఆన్లైన్ నియామకాలకు శ్రీకారం చుట్టినట్టు భారత నిఘావర్గాలు కనిపెట్టాయి. భద్రతాదళాల అప్రమత్తత కారణంగా, ఉగ్రవాదుల పాచిక పారకపోవడంతో సైబర్ ఎత్తుగడతో రంగంలోకి దిగినట్టు సమాచారం. గత నెలలో 34 రాష్ట్రీయ రైఫిల్స్ ఆఫ్ ఆర్మీ ఎదుట లొంగిపోయినతవార్ వాఘే, అమీర్ అహ్మద్ మీర్లు వెల్లడించిన సమాచారంతో భారీస్థాయిలో ఉగ్రవాదుల సైబర్ రిక్రూట్మెంట్ జరుగుతున్న విషయం రూఢీ అయ్యింది. ఉగ్రవాదుల రిక్రూట్మెంట్లు నేరుగా సాగకపోవడంతో సైబర్, మొబైల్ అప్లికేషన్స్ ద్వారా నియామకాలు కొనసాగిస్తున్నాయి ఉగ్రమూకలు. భద్రతాదళాలు దారుణాలకు పాల్పడినట్లు ఫేక్ వీడియోలను సృష్టించి, పాకిస్తాన్‌కి చెందిన ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలు యువతలో ఎమోషన్స్‌ని రెచ్చగొట్టేపనిలో పడ్డాయి. గతంలో ఉగ్రవాదుల సానుభూతిపరులు నేరుగా నియామకాలు జరిపేవారు. ఉగ్రవాదుల సానుభూతిపరులను నిఘావర్గాలు అణచివేయడంతో వారు సైబర్ వేదికనుపయోగించుకొని ఉగ్రవాద సంస్థల్లో రిక్రూట్మెంట్లను నిర్వహిస్తూ, ఆన్లైన్ వేదికగా యూట్యూబ్‌లో శిక్షణను కూడా ఇస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పీచమణిచిన భద్రతాదళాలు... గత ఏడాది 2020లో రెండు డజన్లకుపైగా ఇటువంటి ఉగ్రవాద వ్యవస్థలను భధ్రతాదళాలు ఛేదించి, దాదాపు 40 మంది సానుభూతిపరులను అరెస్టు చేశాయి. సైన్యంలోని 34 రాష్ట్రీయ రైఫిల్స్ ఎదుట లొంగిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు తవార్ వాఘీ, అమిర్ అహ్మద్ మీర్లు తాము ఆన్లైన్లో టెర్రరిస్టు గ్రూపులో చేరినట్టు వెల్లడించడంతో అసలు బండారం బట్టబయలైంది. భారీస్థాయిలో సైబర్ రిక్రూట్మెంట్లు జరుగుతున్నట్టు తేటతెల్లమైంది. వీరిద్దరితో ఫేస్బుక్ ద్వారా పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాదులు సంప్రదింపులు జరిపారు. ఖలీద్, మహ్మద్ అబ్బాస్ షేక్ అనే రిక్రూటర్ కోడ్ నేమ్ ద్వారా ఆన్లైన్లో పాకిస్తాన్‌కి చెందిన ఐఎస్ఐ సంస్థల్లో చేర్చుకున్నారు. ఆన్లైన్లో వివిధ లింకుల ద్వారా, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమ వేదికల్లో వీరికి శిక్షణనివ్వడం మరింత ఆశ్చర్యానికి గురిచేసే విషయం. వీరిరువురు కేవలం ఒకే ఒక్కసారి, సౌత్ కశ్మీర్‌లోని షోపియాన్‌లో స్థానిక ఉగ్రవాద ముఠా వ్యక్తులతో నేరుగా కలిశారు. కశ్మీర్ లోయలో పాకిస్తాన్‌కి చెందిన ఐఎస్ఐ వ్యవస్థీకరించిన స్లీపర్ సెల్స్ ఆచూకీ తెలియకుండా ఉండడం కోసం ఉగ్రవాదులు ఈ ఎత్తుగడలు వేస్తున్నట్టు భధ్రతాదళాలు గమనించాయి. స్థానికుల నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలకు అందిన సమాచారం మేరకు ఈ సైబర్ ఉగ్రవాద కార్యకలాపాల గుట్టుని భద్రతాదళాలు రట్టు చేశారు. లష్కరే కనుసన్నల్లో టీఆర్ఎఫ్ నిషేధిత లష్కరేతోయిబా నీడలో పనిచేస్తోన్న ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)లోకి రిక్రూట్ చేసుకున్న తరువాత ఈ ఇరువురికీ పాకిస్తాన్‌కి చెందిన బుర్హాన్ హమ్జా నుంచి ఆదేశాలు అందుతాయి. అలాగే వీరికి మతసంబంధిత బోధనలు కూడా చేస్తారు. ప్రత్యేకించి దక్షిణ కశ్మీర్లో ఇలా సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద సంస్థల్లో చేరిన సంఘటనలు 40కి పైగా ఉన్నట్టు అధికారులు చెపుతున్నారు. కొత్తగా రిక్రూట్ అయిన వారు పాకిస్తాన్ నుంచి ఆదేశాల కోసం వేచి ఉన్నట్టు సమాచారం. టెర్రరిస్టు గ్రూపుల వద్ద తగినన్ని ఆయుధాలు లేకపోవడం వల్ల కూడా వారు నేరుగా రిక్రూట్మెంట్లు చేయకుండా, మ్యాన్ పవర్కంటే కూడా ఆయుధ సమీకరణపై దృష్టిపెట్టినట్టు అర్థం అవుతోంది. గత నెలలో జమ్మూలో సరిహద్దుల్లో దొరికిపోయిన నలుగురు ఉగ్రవాదుల వద్ద 11 రైఫిల్స్, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రి పట్టుబడటమే అందుకు ఉదాహరణ అని అధికారులు తెలిపారు. -
26/11 దాడి తరహాలో మరో ఉగ్రదాడికి భారీ ప్లాన్!
సాక్షి,ఢిల్లీ: రెండు రోజుల క్రితం జమ్మూలో జరిగిన నగ్రోటా ఎన్‌కౌంటర్‌పై ప్రధాన మంత్రి మోదీ శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌తో సమీక్ష సమావేశాన్నినిర్వహించారు. ఈ సమీక్షలో భారత ఉన్నత నిఘా సంస్థ, విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా పాల్గొన్నారు. 26/11 ఉగ్రదాడి జరిగి 12 ఏళ్లు పూర్తి కావొస్తున్న తరుణంలో భారత్‌లో మరో భారీదాడి చేయాలని ఉగ్రవాదులు పన్నాగం పన్నినట్లు మోదీకి అధికారులు వివరించారు.(చదవండి: భారీ విధ్వంసానికి వ్యూహం: ఉగ్రవాదుల హతం) ఎన్‌కౌంటర్‌పై ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. జైష్-ఇ-మహమ్మద్ ఉగ్రవాద దాడిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాదులకు అందిస్తున్న సాయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించింది. జాతీయ భద్రతను కాపాడుకోవాడానికి అవసరమైన చర్యలు తీసుకోవాడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మోదీ అభినందన.. "పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థ జైష్-ఇ-మహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను హతమార్చి, వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలతో విధ్వంసాలను చేయడానికి ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బలగాలు మరోసారి అడ్డుకున్నాయని" ప్రధాని మోదీ తన ట్వీట్లో ప్రశంసించారు. రాబోయే స్థానిక ఎన్నికలే లక్ష్యంగా.. జమ్మూలో నగ్రోటా పట్టణానికి సమీపంలో భద్రతా దళాలతో గురువారం జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 22 వరకు జమ్మూలో జరిగే జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) ఎన్నికల్లో భాగంగా భారీకుట్రకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భద్రతా దళాలకు సమాచారం అందిందని జమ్మూ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ముఖేష్ సింగ్ తెలిపారు. జమ్మూ జిల్లాలోని నగ్రోటా పట్టణానికి సమీపంలో హైవేపై ఉన్న బాన్ టోల్ ప్లాజా వద్ద గురువారం తెల్లవారుజామున ప్రారంభమైన మూడు గంటల పాటు జరిగిన కాల్పుల్లో నలుగురు జైష్-ఇ-మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించారు. కాల్పుల్లో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజి)కు చెందిన ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాదులతో ప్రయాణిస్తున్న ట్రక్కును భద్రతా దళాలు అడ్డగించడంతో కాల్పులు ప్రారంభమయ్యాయి. 11 ఎకె -47 రైఫిళ్లు, మూడు పిస్టల్స్, 29 గ్రెనేడ్లు, ఆరు యుబిజిఎల్ గ్రెనేడ్లు, మొబైల్ ఫోన్లు, దిక్సూచి, మందుగుండు సామగ్రిని ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ముఖేష్ సింగ్ తెలిపారు. -
కశ్మీర్లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం
జమ్మూ/శ్రీనగర్: కశ్మీర్లో భారీస్థాయి దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. జమ్మూ శివారులో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతం కాగా, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందిన వారనీ, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలిగించడమే వీరి లక్ష్యంగా భావిస్తున్నట్లు జమ్మూ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీపీ) ముకేశ్ చెప్పారు. జమ్మూ హైవేపై నగ్రోటా ప్రాంతంలోని బాన్ టోల్‌ప్లాజా వద్ద అనుమానాస్పదంగా కనిపించిన బియ్యం ట్రక్కును తనిఖీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ట్రక్కు డ్రైవర్ వెంటనే దిగి పారిపోగా, ట్రక్కులో బియ్యం బస్తాల మాటున దాక్కున్న ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసరుతూ, కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు ఆ ట్రక్కును చుట్టుముట్టి, దీటుగా స్పందించారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం కాగా, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ట్రక్కు నుంచి 11 ఏకే రైఫిళ్లు, 24 మేగజీన్లు, 3 పిస్టళ్లు, 35 గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు భారీగా మందులు, పేలుడు సామగ్రి, వైర్ల బండిళ్లు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు లభ్యమయ్యాయి. కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈనెల 28వ తేదీన, డిసెంబర్ 22న జిల్లా అభివృద్ధి మండళ్లకు జరగనున్న ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలిగించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ ప్రయత్నాలను భగ్నం చేసేందుకు తాము అత్యంత అప్రమత్తతతో పనిచేస్తున్నామన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అభ్యర్థులు, పార్టీల నేతలకు వేర్వేరుగా భద్రత కల్పించడం కష్టసాధ్యమైనందున, వారు వెళ్లే ప్రాంతాల్లో భద్రతా చర్యలను పెంచామన్నారు. -
ప్రవీణ్ కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ సీహెచ్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. దేశం కోసం ప్రవీణ్‌కుమార్ చేసిన ప్రాణ త్యాగం వెలకట్టలేనిదని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆయన త్యాగానికి దేశం మొత్తం గర్విస్తోందన్నారు. వీర జవాన్ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, వారికి కొంతైనా ఆసరాగా ఉండేలా సీఎం సహాయ నిధి నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భార్య రజితకు సీఎం సోమవారం ఒక లేఖను రాస్తూ ఈ సహాయం స్వీకరించాలని కోరారు. ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సోమవారం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, ముఖ్యమంత్రి రాసిన లేఖను వారికి అందజేశారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్ 18 ఏళ్లుగా భారత సైన్యంలోని మద్రాస్ రెజిమెంట్‌లో పని చేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ–కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన మాచిల్ సెక్టార్, నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో వీర మరణం పొందారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దేశ రక్షణ కోసం సిపాయి ప్రవీణ్ కుమార్‌రెడ్డి బలిదానం చేశారని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపాలెంకు చెందిన చీకాల ప్రవీణ్ కుమార్‌రెడ్డి మృతిపట్ల గవర్నర్ సోమవారం ఓ ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
సలాహుద్దీన్.. భత్కల్ సోదరులు..
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదం పీచమణిచే చర్యల్లో భాగంగా మరో 18 మంది వ్యక్తులను మంగళవారం కేంద్రప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. వీరిలో నిషేధిత హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్, ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకులు భత్కల్ సోదరులు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు చోటా షకీల్ ఉన్నారు. దీంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాల (సవరణ) చట్టం (యూఏపీఏ) కింద కేంద్రం ఉగ్రవాదులుగా ప్రకటించిన వారి సంఖ్య 31కు చేరుకుంది. తాజా జాబితాలో 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన అబ్దుల్ రవూఫ్ అస్ఘర్, ఇబ్రహీం అథర్, యూసఫ్ అజార్, ముంబై ఉగ్రదాడుల సూత్రధారుల్లో ఒకడు, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా టాప్ కమాండర్ సాజిద్ మిర్, అదే సంస్థ కమాండర్ యూసఫ్ ముజమ్మిల్ తదితరుల పేర్లున్నాయి. ఇదే ఘటనకు సంబంధించి జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ముగ్గురు సోదరులు అబ్దుల్ రవూఫ్ అస్ఘర్, ఇబ్రహీం అఖ్తర్, యూసఫ్ అజార్‌లను ఉగ్రవాదులుగా ప్రకటించింది. నిషేధిత హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ అలియాస్ సయ్యద్ మొహమ్మద్ యూసఫ్ షా, డిప్యూటీ చీఫ్ గులాం నబీ ఖాన్ అలియాస్ అమిర్ ఖాన్‌లను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించింది. భత్కల్ సోదరులు.. ఇండియన్ ముజాహిదీన్ అనే ఉగ్రసంస్థను ఏర్పాటు చేసిన రియాజ్ ఇస్మాయిల్ షాబంద్రి అలియాస్ రియాజ్ భత్కల్, అతని సోదరుడు ఇక్బాల్ భత్కల్ పేర్లు ఉన్నాయి. వీరు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (2010), జమా మసీదు (2010), షీతల్‌ఘాట్ (2010), ముంబై (2011)ల్లో బాంబు దాడులకు పాల్పడ్డారు. వీరిపై జైపూర్ (2008), ఢిల్లీ (2008), అహ్మదాబాద్, సూరత్ (2008)ల్లో వరుస పేలుళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దావూద్ అనుచరులు నలుగురు.. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించిన దావూద్ ఇబ్రహీం నలుగురు ముఖ్య అనుచరులు చోటా షకీల్, మొహమ్మద్ అనిస్ షేక్, టైగర్ మెమన్, జావెద్ చిక్నా పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. యూఏపీఏ అమల్లోకి వచ్చాక కేంద్రం 2019 సెప్టెంబర్‌లో నలుగురిని, 2020 జూలైలో 9 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఇప్పటికే ఉగ్రముద్ర పడిన వారిలో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, ముంబై ఉగ్రదాడి నిందితుడు జకీ ఉర్ రహ్మాన్ లఖ్వి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరంజీత్ సింగ్ పన్వర్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషన్ చీఫ్ వాధవా బబ్బర్ తదితరులు ఉన్నారు. -
కశ్మీర్‌పై డ్రోన్లతో దాడికి పాక్ కుట్ర
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మరోసారి తన దుర్బుద్ధిని ప్రదర్శించడానికి సిద్ధమైంది. జమ్మూకశ్మీర్ లక్ష్యంగా డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించడానికి కుట్రలు పన్నుతోంది. ఈ మేరకు పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) లష్కరే తోయిబా, కొందరు ఉగ్రవాదులకు శిక్షణనిస్తోంది ఇరాక్, సిరియాలౖపై దాడుల కోసం వాడుతున్న డ్రోన్లు, బాంబులు వెదజల్లే ఫ్లయింగ్ మిషన్లతో ఉగ్రవాద సంస్థలకి శిక్షణ నిస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. తొలుత పాకిస్తాన్ నాసిరకమైన డ్రోన్లు వాడి వాటి వీడియోలను ప్రచారం కోసం వాడుకోవాలని అనుకుంది. కానీ ఆ తర్వాత మనసు మార్చుకొని డబ్బులు వెదజల్లుతూ అంతర్జాతీయ విపణిలో లభించే డ్రోన్లు, ఫ్లయింగ్ మిషన్లను తీసుకుంది. వాటితో జైషే మహమ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులకు శిక్షణ నిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 3 కి.మీ. వరకు బాంబుల వర్షం పాకిస్తాన్ ఐఎస్ఐ కొనుగోలు చేసిన డ్రోన్లు, ఫ్లయింగ్ మిషన్లు అయిదు కేజీల పేలుడు పదార్థాలను మోసుకుపోగలవు. వాటి ద్వారా మూడు కి.మీ. పరిధి వరకు విధ్వంసం సృష్టించవచ్చు. ఇస్లామిక్ స్టేట్ ఫైటర్స్ ఈ డ్రోన్లను కొనుగోలు చేసి మొట్టమొదటి గురి కశ్మీర్‌పైనే పెట్టినట్టుగా ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఉగ్రవాదంపై పోరాటం కోసం ఏర్పాటైన యునైటెడ్ స్టేట్స్ మిలటరీ అకాడమీ సెంటర్‌కి చెందిన డాన్ రస్లార్ అనే ప్రొఫెసర్ చెప్పిన వివరాల ప్రకారం తొలుత పాకిస్తాన్ డూప్లికేట్ డ్రోన్లపైనే దృష్టి సారించింది. కానీ ఆ తర్వాత భారీగా నగదు వెచ్చించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డ్రోన్లను తీసుకుంది. ఎలాంటి దాడినైనా తిప్పి కొడతాం: భారత్ పాక్ వైపు నుంచి వచ్చిన ఏ ముప్పునైనా తిప్పికొట్టడానికి భారత్ సిద్ధంగా ఉంది. సరిహద్దు ఆవల నుంచి డ్రోన్లు, ఫ్లయింగ్ మిషన్లు ఏవీ వచ్చినా వెంటనే వాటిని కూల్చేందుకు సమాయత్తమవుతున్నట్టుగా సరిహద్దు భద్రతా దళానికి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. -
ఆత్మాహుతి దాడి: 13మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో కారు బాంబుతో జరిపిన ఆత్మాహుతి దాడిలో 13 మంది మరణించగా, 120 మంది గాయపడిన దుర్ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పశ్చిమ అఫ్గాన్‌లోని ఘోర్ ప్రావిన్స్‌లో ఉన్న ప్రావిన్సియల్ పోలీస్ చీఫ్ ఆఫీసర్ భవనం వద్ద ఈ ఘటన జరిగింది. తాలిబాన్లకు, అఫ్గాన్ ప్రభుత్వానికి మధ్య ఖతార్‌లో మొట్టమొదటి భేటీ జరిగిన సమయంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. (తైవాన్‌పై దాడికి చైనా కుట్ర!) -
శౌర్యచక్ర అవార్డు గ్రహీత బల్విందర్ కాల్చివేత
చండీగఢ్: శౌర్యచక్ర అవార్డు గ్రహీత బల్విందర్ సింగ్ (62)ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు ఆయనపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో ఆయన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లోని తారన్ తరణ్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. రాష్ట్రంలో ఖలిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడిన ఆయనపై గతంలోకూడా అనేకసార్లు ఉగ్రవాదులు ఎటాక్ చేశారని పోలీసులు తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక సంవత్సరం క్రితం రాష్ట్ర ప్రభుత్వం బల్విందర్ భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబం మొత్తం ఉగ్రవాదుల హిట్ జాబితాలో ఉందని బల్విందర్ సింగ్ సోదరుడు రంజిత్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన బల్విందర్ సింగ్ కు 1993లో రక్షణ మంత్రిత్వ శాఖ శౌర్యచక్ర పురస్కారం లభించింది. అంతర్జాతీయ మీడియాను కూడా ఆయన ధైర్యసాహసాలు ఆకట్టుకున్నాయి. ప్రధానంగా నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ తోపాటు అనేక డాక్యుమెంటరీలు ఆయనపై రూపొందాయి. -
ఉగ్రవాదుల కుట్రను తిప్పికొట్టిన భారత బలగాలు
జమ్మ-కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కెరాన్ సెక్టార్ వద్ద అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదుల కుట్రను భారత బలగాలు శనివారం తిప్పికొట్టాయి. మిషన్ గంగానది ఒడ్డున కూడా అక్రమంగా ఆయుధాలను తరలించేందు ముష్కరులు ప్రయత్నించారు. పాక్ అక్రమిత కశ్మీర్(పీఓకే) నుంచి ఓ ట్యూబ్‌ను తాడుతో కట్టి దాని ద్వారా ఉగ్రవాదులు ఆయుధాలు తరలించాలని చుశారు. ఉగ్రవాదుల కుట్రకు భారత బలగాలు భంగం కలిగించి ఏకే 47 రైఫిల్స్‌తో పాటు భారీ స్థాయిలో ఆయుధాలను భారత్ స్వాధీనం చేసుకుంది. -
భారీ కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ
-
భారీ కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఉగ్ర దాడులకు కుట్రపన్నిన ఆల్‌ఖైదా ఆపరేటర్లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఎన్ఐఏ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఈ మేరకు శనివారం ఉదయం బెంగాల్, కేరళలో 11 మంది ఆల్‌ఖైదా ఆపరేటర్లను అరెస్ట్ చేసింది. కేరళ, బెంగాల్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాడికల్స్‌ను అధికారులు విచారిస్తున్నారు. దేశంలోని ముఖ్య పట్టణాల్లో భారీ విధ్వంసం సృష్టించేందుకు ఈ బృందం ప్రణాళికలు రచిస్తున్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. వీరి నుంచి మరింత సమచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. (తృటిలో తప్పిన పుల్వామా తరహా ఘటన!) కాగా శుక్రవారం నాడు కశ్మీర్‌లోని గుడీకల్ ప్రాంతంలో భారీ పేలుడు సామాగ్రీని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడి తరహాలోనే మరోసారి విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని బలగాలు భావిస్తున్నాయి. ఆ ప్రాంతంలో 125 గ్రాముల చొప్పున మొత్తం 416 ప్యాకెట్లలో పేలుడు పదార్థాలు లభించాయని ఆర్మీ వెల్లడించింది. మరిన్ని సోదాలు నిర్వహించగా మరో ట్యాంక్‌లో 50 డిటోనేటర్లు కనుగొన్నామని పేర్కొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో హోంశాఖ అధికారులు అప్రమ్తతమైయ్యారు. -
దాడి చేసి.. తప్పించుకోడానికి అంబులెన్స్
కశ్మీర్: పాండచ్ మిలిటెంట్ అటాక్ కేసును పరిష్కరించినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు శుక్రవారం పేర్కొన్నారు. మే నెలలో నగర శివార్లలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు హతమార్చి వారి ఆయుధాలను దోచుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి, రెండు అంబులెన్సులు, రెండు టూ వీలర్లను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు ఈ వాహనాలను దాడి చేసే వారిని తీసుకెళ్లేందుకు ఉపయోగించారని పోలీసులు తెలిపారు. రవాణా, లాజిస్టిక్స్, ప్రణాళిక, దాడిని అమలు చేయడంలో సహకరించిన ఐదుగురు వర్గీకరించని గ్రూపులకు చెందిన ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పోలీసు ప్రతినిధి తెలిపారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘దర్యాప్తులో, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నాము. ఇందులో రెండు ప్రైవేట్ అంబులెన్సులు, ఒక బైక్, స్కూటీ ఉన్నాయి’ అని ఆయన చెప్పారు. దాడికి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి డీజీపీ అనుమతించారని తెలిపారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తూ, ఉగ్రవాదులను బిజ్బెహారా నుంచి శ్రీనగర్‌లోని పాండచ్కు రవాణా చేయడానికి అంబులెన్స్ నంబర్ జేకే01ఏడీ 0915ను ఉపయోగించారు అన్నారు. అంతేకాక గాయపడిన జవాన్ల నుంచి ఆయుధాలను దోచుకున్న తరువాత.. వాటిని దాడి చేయడానికి, తప్పించుకోవడానికి బైక్ నంబర్ జేకే01ఏహెచ్ 2989, స్కూటీ నంబర్ జేకే01వీ 8288 ఉపయోగించారు. శ్రీనగర్ నుంచి ఉగ్రవాదులను తిరిగి బిజ్బెహారాకు రవాణా చేయడానికి అంబులెన్స్ జేకే01ఏఎఫ్ 9417ను ఉపయోగించారు అని తెలిపారు. -
జమ్మూలో ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూ శివార్లలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిన ఎదురుకాల్పుల్లో కశ్మీర్ పోలీస్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ఏఎస్సై) ఒకరు నేలకొరిగారు. కశ్మీపోర్‌లీసులు, సీఆర్పీఎఫ్ కలిసి జమ్మూ శివార్లలోని పంథాచౌక్ ప్రాంతంలో శనివారం రాత్రి నాకా బందీ చేపట్టాయి. అర్ధరాత్రి సమయంలో ముగ్గురు ఆగంతకులు బైక్‌పై వచ్చి, బలగాలపైకి కాల్పులు జరిపారు. వారి వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరుపుతూ వారి ప్రయత్నాలను తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా ఎదురు కాల్పుల్లో ఏఎస్సై బాబూరామ్ నేలకొరగ్గా, ఒక దుండగుడు హతమయ్యాడు. మిగతా వారు కాల్పులు జరుపుతూ బైక్ వదిలి పరారయ్యారు. వెంబడించిన బలగాలు..దుండగులు దాగున్న ధోబీ మొహల్లా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. లొంగిపోవాలని పదేపదే హెచ్చరికలు చేశాయి. పాంపోర్ ప్రాంతానికి వారి సంబంధీకులను అక్కడికి తీసుకువచ్చి, వారి ద్వారా లొంగిపోవాలని కోరినా వినలేదు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తెల్లవారే దాకా కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో మిగతా ఇద్దరు దుండగులు చనిపోయారు. మృతులను లష్కరే తోయిబాకు చెందిన సకీబ్ బషీర్ ఖాన్‌దే, ఉమర్ తారిఖ్ భట్, జుబైర్ అహ్మద్ షేక్‌గా గుర్తించారు. ముగ్గురిదీ పాంపోర్ జిల్లా ద్రంగ్‌బల్ ప్రాంతమే. వీరిలో ఖాన్‌దే ఏడాదిన్నర నుంచి కమాండర్‌గా ఉంటూ అనేక నేరాలకు పాల్పడినట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఎల్వోసీ వెంట పాక్ కాల్పులు అసువులు బాసిన జేసీవో జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి అమరుడయ్యారు. ఎలాంటి కవ్వింపులేకుండా జరిపిన ఈ కాల్పులకు భారత్ బలగాలు దీటుగా స్పందించాయి. పాక్ వైపు భారీగా నష్టం వాటిల్లిందని సైన్యం తెలిపింది. పాక్ కాల్పుల్లో నాయిబ్ సుబేదార్ రజ్వీందర్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆయన ఆస్పత్రిలో కన్నుమూశారని సైనిక వర్గాలు తెలిపాయి. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన రజ్వీందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రజ్వీందర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారంతోపాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. -
నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని సోపియన్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కిలూరి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నలుగరు ఉగ్రవాదులు మరణించారని జమ్ము కశ్మీర్ పోలీసులు నిర్ధారించారు. కిలూర గ్రామంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు, పోలీసులు అక్కడికి చేరుకోగా గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు మరణించారని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు దాగిఉన్నారనే అనుమానంతో భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. కాగా ఈ ఏడాది కశ్మీర్లో 26 మంది ఉగ్రవాద సంస్ధల టాప్ కమాండర్లు సహా 150 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. చదవండి : లష్కరే కీలక కమాండర్ హతం -
కాచుకూర్చున్న 300 మంది ఉగ్రవాదులు
శ్రీనగర్: భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు సుమారు 300 మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి ఏర్పాటు చేసుకున్న లాంచ్ప్యాడ్స్లో సిద్ధంగా ఉన్నారని భారత ఆర్మీ శనివారం వెల్లడించింది. ముఖ్యంగా నౌగర్ సెక్టార్ ప్రాంతంలో ఉన్న లాంచ్ ప్యాడ్లు ఉగ్రవాదులతో కిక్కిరిసిపోయాయని, వారు ఏ క్షణంలోనైనా ఇండియాలోకి చొరబడే అవకాశం ఉందని మేజర్ జనరల్ వీరేంద్ర వాత్స్ వెల్లడించారు. 250 నుంచి 300 మంది టెర్రరిస్టులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని నిఘా వర్గాల ద్వారా తెలిసిందని చెప్పారు. (కరోనా : చైనాపై మరో బాంబు) ఈ రోజు తెల్లవారుజామున కుప్వారాలో ఎల్వోసీ దాటి భారత్‌లోకి చొరబడిన ఇద్దరు టెర్రరిస్టులను సైన్యం హతమార్చింది. వారి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రూ.1.50 లక్షల విలువ చేసే ఇండియా, పాకిస్తాన్ కరెన్సీని స్వాధీనం చేసుకుంది.(మారణహోమానికి పాక్ కుట్ర) -
మారణహోమానికి పాక్ కుట్ర
శ్రీనగర్: భారత్‌లో మరో మారణహోమానికి పాకిస్తాన్ కుట్ర పన్నింది. ఆర్టికల్ 370 రద్దై ఏడాది పూర్తి కావొస్తున్న తరుణంలో జమ్మూకాశ్మీర్‌లో అలజడి రేపేందుకు పెద్ద ఎత్తున మారణాయుధాలతో టెర్రరిస్టులను పంపుతోంది. శనివారం తెల్లవారుజామున ఇద్దరు టెర్రరిస్టులు ఏకే–47 తుపాకులు, పెద్ద సంఖ్యలో బుల్లెట్లు, చైనా తయారీ హ్యాండ్ గన్స్, ఆస్ట్రియా టెక్నాలజీతో పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన హ్యాండ్ గ్రెనేడ్లతో కుప్వారా జిల్లా వద్ద గల ఎల్వోసి బోర్డర్‌ను దాటారు.(‘రెమ్‌డెసివిర్ ద్వారా మరణాల సంఖ్య తగ్గే అవకాశం’) దాదాపు వంద మీటర్లు లోపలికి వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులను సిక్కు లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన సైనికులు మట్టుబెట్టినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. టెర్రరిస్టులు ఇద్దరిలో ఒకరిని కుప్వారాకు చెందిన ఇద్రిస్ అహ్మద్ భట్(23)గా గుర్తించినట్లు తెలిపారు. 2018లో ఇద్రిస్ పాకిస్తాన్ వెళ్లాడని వివరించారు. ఇరువురూ లష్కర్ ఈ తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నట్లు వెల్లడించారు.(లాక్డౌన్: లగ్జరీ కారును అమ్మకానికి పెట్టిన అథ్లెట్) ఐఎస్ఐ ప్రోద్భలంతో ఉగ్రవాదులు చైనాకు చెందిన డ్రోన్లతో ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తారనే సమాచారంతో ఎల్వోసీ వద్ద ముందుస్తుగా నిఘాను పెంచినట్లు భారత ఆర్మీ అధికారి మేజర్ జనరల్ వీరేంద్ర పేర్కొన్నారు. ఫెన్సింగ్ కట్ చేసి కాశ్మీర్‌లోకి చొరబడిన టెర్రరిస్టులను సైనికులు అడ్డుకున్నట్లు చెప్పారు. పార్లమెంటుపై దాడిలో ఇవే గ్రెనేడ్లు 2001లో ఇండియా పార్లమెంటుపై జైషే ఈ మహమ్మద్ చేసిన ఉగ్రదాడిలో వాడిన గ్రెనేడ్లు, శనివారం టెర్రరిస్టుల వద్ద లభించిన గ్రెనేడ్లు ఒకే రకానికి చెందినవి. వీటితో 20 మీటర్ల పరిధిలో ఉన్న అందరినీ చంపొచ్చు. చైనా నుంచి అందుకున్న డ్రోన్లతో పాకిస్తాన్ పంజాబ్‌లోకి డ్రగ్స్, ఆయుధాలను పంపుతోంది. దీంతో సరిహద్దుల్లో డ్రోన్లను కూల్చివేసే యాంటీ డ్రోన్ సిస్టమ్స్‌ను మోహరించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
ఉగ్రవాదుల జాబితా ప్రకటించిన కేంద్రం..
న్యూఢిల్లీ: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ సహా తొమ్మిది మందిని ఉగ్రవాదులుగా గుర్తించింది. ఈ మేరకు బుధవారం రోజున కేంద్ర ప్రభుత్వం జాబితా ప్రకటించింది. అమెరికాలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా పంజాబ్ యువకులను ఉగ్రవాదంలోకి చేరడానికి ప్రేరేపిస్తున్నాడనే కారణంతో పన్నూన్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. యూఏపీఏ కింద ఉగ్రవాదులుగా గుర్తించబడిన వారిలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందిన పరమ్‌జిత్ సింగ్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌కు చెందిన హర్దీప్ సింగ్ నిజ్జర్, ఖలీస్తాన్ జిందాబాద్ ఫోర్స్‌కు చెందిన గుర్మిత్ సింగ్ బాగ్గా తదితరులు ఉన్నారు. కాగా గత సెప్టెంబర్‌లో.. సవరించిన యూఏపీఏ నిబంధనల ప్రకారం ప్రకటించిన ఉగ్రవాదులైన మౌలానా మసూద్ అజార్, హఫీజ్ సయీద్, జాకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, దావూద్ ఇబ్రహీంలతో కలిపి ఈ సంఖ్య 13కు చేరుకుంది. (కీలక నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీ..)