శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంటుకి చెందిన జవాను జావేద్ అహ్మద్ కొద్దిరోజుల క్రితమే సెలవులపై ఇంటికి తిరిగొచ్చాడు. మార్కెట్ కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుండి బయటకు వచ్చిన అతడు తర్వాత అదృశ్యమైనట్లు తెలిపారు కుటుంబ సభ్యులు.
దక్షిణ కాశ్మీర్ లో నివాసముండే భారత జవాను జావేద్ అహ్మద్(25) జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంటులో విధులు నిర్వర్తిస్తున్నాడు. సెలవుపై ఇంటికి వచ్చిన జావేద్ శనివారం సాయంత్రం 6.30 గంటలకు మార్కెట్ కు వెళ్లి వస్తానని చెప్పి ఆల్టో కారులో బయటకు వెళ్ళాడు. రాత్రి 9.00 అయినా అతను తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడి కోసం గాలించడం మొదలుపెట్టారు.
మార్కెట్ కు కొంత దూరంలో రక్తపు మరకలు అంటుకున్న కారు కనిపించింది కానీ అందులో జావేద్ లేడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కాశ్మీర్ పోలీసులు కేసును నమోదు చేసి ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. రక్షణ దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
గతంలో కూడా కొంతమంది సైనికులు సెలవుపై ఇంటికి వచ్చాక ఇలాగే అపహరణకు గురైన వారిని తీవ్రవాదులు దారుణంగా కడతేర్చారు. దీంతో ఇది కూడా ఉగ్రవాద చర్యగా భావించి జావేద్ తల్లి.. దయచేసి మమ్మల్ని క్షమించండి.. నా కుమారుడిని విడుదల చేయండి, నా జావేద్ ను విడుదల చేయండి.. వాడిని సైన్యంలో పనిచేయకుండా ఆపుతాను.. కానీ వాడిని విరిచిపెట్టండి.. అంటూ జవాను తల్లి ఒక వీడియో సందేశాన్ని కూడా సిద్ధం చేశారు.
ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లకు వారే కారణమా..?
Comments
Please login to add a commentAdd a comment