Soldier
-
ఓ సిపాయీ... తెలుసుకొనవోయీ!
భాష తెలియని దేశంలో సైనికుడైనా సామాన్యుడే. కొత్త నేలపై కుదురుకోవటం యుద్ధం చేసినంత పని! భాష మాత్రమే కాదు, అక్కడి ఆహారాలకు అలవాటు పడాలి. సంస్కృతులకు సర్దుకుపోవాలి. సంప్రదాయాల కత్తుల వంతెనపై ఒద్దికగా నడవాలి. నడవడికను బుద్ధిగా ఉంచుకోవాలి. ముఖ్యంగా, కరెన్సీని అర్థం చేసుకోవాలి, బేరాలాడాలి. అత్యవసరంలో ప్రాథమిక చికిత్సా, అకాల పరిస్థితుల ముందుచూపూ ఉండాలి. ఇవన్నీ సైనికులకు ప్రభుత్వాలు చెప్పి పంపవు. ‘వెళ్లాక తెలుస్తుందిలే’ అని బదలీ పత్రాలు ఇచ్చేస్తాయి. అయితే, వెళ్లాక తెలుసుకోవటం కాదు, ‘తెలుసుకునే వెళ్లండి’ అంటూ నూటపాతికేళ్ల క్రితమే ఒక ప్రసిద్ధ బ్రిటిష్ సిగరెట్ కంపెనీ భారత్ వెళ్లే బ్రిటన్ సైనికుల కోసం హ్యాండ్‌బుక్‌ను ప్రచురించటం విశేషమే!‘వైల్డ్ ఉడ్బైన్’ బ్రాండు సిగరెట్లను ఉత్పత్తి చేస్తుండే 18వ శతాబ్దపు ప్రఖ్యాత బ్రిటన్ పొగాకు కంపెనీ ‘డబ్లు్య.డి. అండ్ హెచ్.వో. విల్స్’ తాత్కాలిక విధి నిర్వహణలపై భారతదేశానికి తరలివెళ్లే బ్రిటిష్ సైనికుల కోసం మార్గదర్శకాలతో కూడిన ఒక కరదీపికను ప్రచురించినట్లుంది! మన దేశంలో ఆ సైనికుల అపరిచిత స్థానిక వ్యవహారాలను సులభతరం చేయటానికి ఉద్దేశించిన ఆ పుస్తక ప్రతి ఒకటి గతవారం లండన్ , పోర్టోబెల్లో రోడ్డులోని పురాతన వస్తువుల దుకాణంలో నా కంట పడింది. చదువుతుంటే ఎంత సరదాగా అనిపించిందో! భారతదేశం ఎంత పెద్దదో చెప్పడంతో ఆ కర పుస్తకం మొదలౌతుంది. ‘‘ఇండియాలో ఇరవై గ్రేట్ బ్రిటన్లను పట్టించ వచ్చు’’ అని చెబుతూ, ఆనాటి మన కరెన్సీని, బ్రిటన్ కరెన్సీతో పోల్చి వాటి సమాన విలువలను తెలియబరిచింది. ఆ ప్రకారం:1 అణా 1 పెన్నీకి సమానం. 11 అణాలు 1 షిల్లింగ్కి సమానం (రూపాయికి 16 అణాలు అనే లెక్క ఆధారంగా). 1 రూపాయి 1 షిల్లింగు 5 పెన్నీలకు సమానం. 13 రూపాయల 6 అణాలు ఒక పౌండుకు సమానం. పుస్తకంలోని ఎక్కువ భాగంలో, సైనికుడు తెలుసుకోవలసిన అవసరం ఉన్న ముఖ్యమైన పదాలను, వాటి అర్థాలను, వాటిని ఉచ్చరించే విధానాన్ని పొందుపరచటం జరిగింది. ఉదాహరణకు, ఎలుక Chew-ha (చూహా), రోడ్ Rust-er (రస్తా), సముద్రం Some-under (సమందర్), చొక్కా Come-ease (కమీజ్), చక్కెర Chee-knee (చీనీ), నీళ్లు Par-knee (పానీ), మహిళ Awe-rut (ఔరత్) అని ఇచ్చారు. (ఈ హిందీ మాటలను పలికే విధానమంతా ఆంగ్ల పదాలకు దగ్గరగా ఉండేలా ఇచ్చారు.)సైనికుడు స్థానికులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు రోజువారీ వాడుక కోసం కొన్ని చిన్న చిన్న వాక్యాలు కూడా ఆ కర పుస్తకంలో ఉన్నాయి. మీరెక్కడికి వెళుతున్నారో తెలుసుకోవాలనుకున్న సైనికుడు "Kid-her jar-ta high?" (కిదర్ జాతా హై?) అంటాడు; అతనికేదైనా అర్థం కాకపోతే, "Tomb key-ah bowl-ta high?" (తుమ్ క్యా బోల్తా హై) అంటాడు. అతను పోస్టాఫీస్ కోసం వెదుకుతుంటే "Dark-car-ner kid-her high?" (డాక్ ఘర్ కిదర్ హై) అని అడుగుతాడు. దుకాణందారు ఎక్కువ రేటు చెప్పినట్లనిస్తే "Darm jars-tea high" (దర్ జాస్తి హై) అంటాడు. బ్రిటిష్ సైనికుల కోసం ముద్రించిన హ్యాండ్‌బుక్ కవరు పేజీ ఇప్పుడు బ్రిటన్ సైనికులు అనారోగ్యం పాలైనప్పుడు ఏం చేయాలని పుస్తకం చెప్పిందో చూద్దాం. జ్వరాలను తగ్గించుకోటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పే కచ్చితమైన సూచనలు కొన్ని పుస్తకంలో ఉన్నాయి. ‘‘అనేక కారణాల ఫలితంగా జ్వరం అనేది వస్తుంది. లవణాలు, ఆముదపు నూనె మోతాదులను ఎప్ప టికప్పుడు తీసుకోవటం ద్వారా జ్వరాన్ని తగ్గించుకోవచ్చు. అవి ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. వీలైనంత వరకు మాట్లాడకుండా, మౌనంగా ఉండండి. ముఖంపైన, తల పైన చల్లటి తడి గుడ్డను వేసుకుని పడుకోండి. ఒకవేళ మలేరియా సోకి, రోగికి చలిపుడుతూ, వణుకు వస్తున్నట్లయితే వేడి టీ చుక్కల్ని తాగిస్తే చమటలు పడతాయి. వణుకు తగ్గేవరకు రోగికి దుప్పటి కప్పి ఉంచాలి’’ అని ఆ కరదీపిక సూచించింది. పాము కాట్లకు బ్రిటిష్ వారు భయభ్రాంతులయ్యేవారని అని పిస్తోంది. అందుక్కూడా పుస్తకంలో ప్రాథమిక చికిత్సలు ఉన్నాయి. విషపూరితమైన సర్పం కాటేస్తే ‘‘తక్షణం, తీక్షణమైన చికిత్స’’ అవసరం అవుతుంది. అంటే, రక్త ప్రసరణను ఆపటానికి కాటుకు పైభాగాన వస్త్రపు నాడాతో గట్టిగా బిగించి కట్టాలన్న మాట. ఆ తర్వాత, పెదవులపై లేదా నోటిలో పుండ్లు, కోతలు, లేదా పొక్కులు లేని వ్యక్తి ఆ గాయాన్ని పీల్చి, విషాన్ని ఉమ్మేయాలి. ఆ తర్వాత, గాయంపై బలమైన పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణాన్ని, (లేదా, ముడి స్ఫటికాలను) అద్దాలి. ఒకవేళ ఆ ప్రదేశంలో సిర, లేదా ధమని ఉన్నందువల్ల కోత పెట్టటానికి వీలు లేకుంటే కాటు వేసిన చోట నిప్పు కణికను, మండుతున్న సిగరెట్‌ను, కాల్చిన తాడు కొసను తాకించాలి. ఇక్కడ నాకు ఆసక్తిగా అనిపించిన సంగతి: ‘‘ఇవన్నీ చేసేలోగా చేతిలో ఏదైనా బలమైన ఉద్దీపన ఉంటే (బ్రాందీ, విస్కీ మొదలు అమ్మోనియం కార్బోనేట్ కలిసిన శాల్ ఓలటైల్ వరకు ఏదైనా) కొంచెం తాగించాలి. అలా పదిహేను నిముషాలకొకసారి చేయాలి’’ అని ఉండటం! బహుశా, మద్యంతో నరాలను శాంతపరచటమే దీని ఉద్దేశం కావచ్చు. ఈ హ్యాండ్‌బుక్‌లో... ‘తగని పనులు – చిట్కాలు’ అనే ఒక కీలకమైన విభాగం కూడా ఉంది. ‘‘మండే సూర్యరశ్మిలో తలపై టోపీ లేకుండా బయటికి వెళ్లొద్దు – అది వేసవైనా, చలికాలమైనా’’. ‘‘సూర్యాస్తమయానికి ముందు వైన్, బీరు, ఆల్కహాల్ సేవించ వద్దు – (సేవించే అవకాశం వచ్చినప్పటికీ!). ‘‘కొన్ని ఆకులను,ముఖ్యంగా వేపాకులను మీరు అడవిలో ఉన్నప్పుడు మీ టోపీ కింద ఉంచుకోవటం మీ తలను చల్లగా ఉంచుతుంది’’. ‘‘ఫ్లానల్ షర్టును వేసుకోవటం మరచిపోవద్దు. శీతాకాలమైనా, వేసవి కాలమైనా అది మీకు సురక్షితమైన కవచం’’. ఫ్లానల్ వేడిమిని గ్రహించదు. (ఫ్లాన ల్లో చుట్టిన ఐసు ముక్కలు త్వరగా కరగకపోవటమే ఇందుకు రుజువు)’’ అని పుస్తకంలో రాసి ఉంది. బ్రిటిష్ సైనికుడు ఇండియాలో ఆడగలిగే అనేక ఆటల వివరాలు కూడా ఆ పుస్తకంలో ఉన్నాయి. ‘‘హాకీ, ఫుట్‌బాల్, క్రికెట్, టెన్నిస్, పోలో, గోల్ఫ్, స్విమ్మింగ్, రన్నింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, రోయింగ్, షూటింగ్, పిగ్–స్టిక్కింగ్, గేమ్ హంటింగ్ వంటివి... భారతదేశం అందించే ఆసక్తికరమైన ఆటలు, క్రీడల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇవన్నీ ఇండియాకు కొట్టిన పిండి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే ముగింపులో ఆ పుస్తకం ఇచ్చిన సలహా నా పొట్టను చెక్కలు చేసింది. ‘‘చివరిగా ఒక మాట. ఎట్టి పరిస్థితిలోనూ ఇండి యాలో మీరు మీ ప్రశాంతతను, ఉత్సాహాన్ని, నిద్రను కోల్పోకండి. బ్రిటన్‌పై బెంగ పెట్టుకోకండి. సమయం త్వరగానే గడిచిపోతుంది. అంతేకాదు, సౌతాంప్టన్ హార్బరులో మీకు వీడ్కోలు పలుకుతూ ఊగిన చేతి రుమాలు గతించిపోయిన కాలంలా అనిపిస్తుంది. అన్ని టినీ మించి ఇండియా మంచి దేశం.’’ కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఉక్రెయిన్‌లో బందీగా ఉత్తరకొరియా సైనికుడు
సియోల్:రష్యా(Russia) తరపున యుద్ధం చేసేందుకు వెళ్లిన ఉత్తరకొరియా(NorthKorea) సైనికుడొకరిని ఉక్రెయిన్ బలగాలు బందీగా తీసుకువెళ్లాయని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది.ఉక్రెయిన్(Ukraine)పై యుద్ధం చేసేందుకు వేలాది మంది సైనికులను ఉత్తరకొరియా రష్యాకు పంపిన విషయం తెలిసిందే.రష్యాలోని క్రస్క్ సరిహద్దు వద్ద గతంలో ఉక్రెయిన్ సైనికులు ఒక్కసారిగా రష్యాలోకి చొచ్చుకువచ్చి దాడి చేశారు.ఈ సమయంలోనే ఉత్తరకొరియా సైనికుడిని ఉక్రెయిన్ బలగాలు తీసుకువెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.రష్యాతో జరిగిన యుద్ధంలో వెయ్యి మంది ఉత్తరకొరియా సైనికులు మరణించారని ఇప్పటికే దక్షిణకొరియా ఇంటెలిజెన్స్ సంస్థ వెల్లడించింది.రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉత్తరకొరియా సైనికులను రష్యా ముందుంచి పోరాడుతోందని తెలిపింది.ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు కౌంటర్ ఇచ్చే సామర్థ్యం లేకపోవడంతో ఉత్తరకొరియా సైనికులు భారీగా మృత్యువాత పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
వీర జవాను సుబ్బయ్యకు వైఎస్ జగన్ నివాళులర్పించారు
-
వీర జవాను సుబ్బయ్యకు వైఎస్ జగన్ నివాళులు
సాక్షి,తాడేపల్లి: వీర జవాను సుబ్బయ్యకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్(ట్విటర్)లో బుధవారం(డిసెంబర్11) ఒక పోస్టు చేశారు.‘రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్. జమ్మూలో విధి నిర్వహణలో సుబ్బయ్య వీరమరణం చెందారు.ల్యాండ్‌మైన్ నుంచి 30 మంది జవాన్లను కాపాడి తాను మాత్రం ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులర్పిస్తున్నా’అని వైఎస్ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.— YS Jagan Mohan Reddy (@ysjagan) December 11, 2024 -
మదనపల్లె తహసీల్దార్ ఆఫీసులో మాజీ సైనికుడి ఆత్మహత్యాయత్నం
-
సైనికుడిపైనా టీడీపీ అరాచకం
నెల్లిమర్ల రూరల్/విజయనగరం అర్బన్: అధికార దర్పంతో చెలరేగిపోతున్న టీడీపీ మూకలు చివరకు దేశ సైనికుడినీ వదిలిపెట్టలేదు. టీడీపీకి ఓటేయలేదనే అనుమానంతో అతనిపై దౌర్జన్యానికి దిగాయి. టీడీపీ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసి.. అధికార బలంతో అతని ఇంటిపైకి జేసీబీని దూకించాయి. 24 ఏళ్ల పాటు దేశానికి రక్షణగా నిలిచిన మాజీ జవాన్ ఇంటి ప్రహరీని నిర్దాక్షిణ్యంగా కూల్చివేయించాయి. తనకు ఏ రాజకీయ పారీ్టతోనూ సంబంధం లేదని అతను కన్నీటిపర్యంతమైనా టీడీపీ మూకలు, అధికారులు కనికరించలేదు. ఈ ఘటన శనివారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేటలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. దన్నానపేటకు చెందిన పతివాడ వెంకినాయుడు 24 ఏళ్ల పాటు సైనికుడిగా దేశానికి సేవ చేశాడు. ఆ కష్టార్జితంతో ఇల్లు నిరి్మంచుకున్నాడు. అయితే ఆ ఇంటి ప్రహరీ ఆక్రమణలో ఉందని ఇటీవల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గేదెల రాజారావు అమరావతికి వెళ్లి ఆ పార్టీ నాయకులను కలిసి.. టీడీపీ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశాడు. అక్కడి నుంచి అందిన ఆదేశాల మేరకు ఆర్డీవో సూర్యకళ గురువారం గ్రామంలో పర్యటించారు. వెంకినాయుడు ఇంటి ప్రహరీ ఆక్రమణ భూమిలో ఉందని.. దానిని తొలగించాలని తహసీల్దార్ ధర్మరాజుకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో టీడీపీ నాయకుల ఆక్రమణలు కోకొల్లలుగా ఉన్నాయని, వాటిని తొలగించకుండా.. సైనికుడి ఇంటి మీదకు రావడమేంటని గ్రామస్తులు మండిపడ్డారు. కానీ, రెవెన్యూ అధికారులు శనివారం సుమారు 50 మందికి పైగా పోలీస్ సిబ్బందితో వచ్చి గ్రామస్తులను భయబ్రాంతులకు గురి చేశారు. ఆ వెంటనే జేసీబీతో వెంకినాయుడు, అతని సోదరుడు లక్ష్మణరావుకు చెందిన ఇంటి ప్రహరీని కూల్చివేశారు. వెంకినాయుడు దంపతులు కన్నీటిపర్యంతమై ప్రాధేయపడినా అధికారులు కనికరించలేదు. దీంతో అధికారులు, టీడీపీ నేతల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆందోళనకు దిగారు. దీంతో తహసీల్దార్ ధర్మరాజు.. టీడీపీ నేతల ఆక్రమణలు కూడా తొలగిస్తామంటూ పేపర్‌పై సంతకం పెట్టి బాధితులకు అందజేశారు. జవాన్‌ను వేధించడమే మీ రాజకీయమా?: బొత్స దేశ రక్షణ కోసం సేవలందించిన జవాన్ ఇంటి ప్రహరీని అన్యాయంగా కూల్చేయడమే మీ మంచి సంప్రదాయమా? సైనికుడిని వేధించడమే మీ రాజకీయమా? అని నెల్లిమర్ల టీడీపీ ఎమ్మెల్యేపై, ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఉగ్రవాది ఇంటికి వెళ్లినట్లుగా.. ఆర్మీ ఉద్యోగి ఇంటిపైకి 50 మంది పోలీసులతో వెళ్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. ‘మాజీ సైనికుడు వెంకినాయుడు ఇంటి ప్రహరీ కూల్చితే మీకొచ్చే లాభమేంటి? అదో మారుమూల గ్రామం. అయినా ఎందుకు కూల్చారు? కలెక్టర్, ఎస్పీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. రాజకీయాలకు కొత్తగా వచి్చన ఎమ్మెల్యే జిల్లాలోకి ఇలాంటి సంస్కృతిని తీసుకురావడం దారుణం’ అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ సురే‹Ùబాబు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పాల్గొన్నారు. దేశానికి సేవ చేస్తే.. ఇదా బహుమతి! మాజీ సైనికుడు వెంకినాయుడు మీడియాతో మాట్లాడుతూ... ‘నేను 24 ఏళ్ల పాటు దేశ రక్షణ కోసం పని చేశా. అలాంటి నాకు ఇదా ఈ ప్రభుత్వమిచ్చే బహుమతి. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయలేదనే కక్షతో గ్రామ టీడీపీ నేత గేదెల రాజారావు అమరావతి వరకు వెళ్లి మరీ నాపై ఫిర్యాదు చేశాడు. న్యాయం, ధర్మం అంటూ మాట్లాడే పవన్‌కళ్యాణ్, చంద్రబాబుకు ఈ మాజీ సైనికుడికి జరుగుతున్న అన్యాయం కనిపించడంలేదా? రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని నాపై వేధింపులకు పాల్పడడం సరికాదు. గ్రామంలోని టీడీపీ నేతల ఆక్రమణలు తొలగించే వరకు నా పోరాటం ఆగదు. టీడీపీ వాళ్ల దౌర్జన్యాలను అడ్డుకొని రాష్ట్రపతి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
బ్రిటిష్ సైనికుడిగా ప్రభాస్!
సైనికుడిగా కనిపించనున్నారట ప్రభాస్. ఆయన హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ లవ్‌స్టోరీ ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణను ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబరు మొదట్లో ప్రారంభించాలనుకుంటున్నారని తెలిసింది. యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందనున్న ఈ సినిమా కథనం భారతదేశ స్వాతంత్య్రం పూర్వానికి ముందు జరుగుతుందని, బ్రిటిష్ సైన్యంలో పని చేసే సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ టాక్.ఈ పాత్ర కోసం ప్రభాస్ స్పెషల్‌గా మేకోవర్ కానున్నారట. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గత నెల 27న విడుదలైన విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా చిత్రబృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. -
వీర జవాన్లకు అశ్రు నివాళి
విమానాశ్రయం(గన్నవరం)/రేపల్లె రూరల్/పెడన: లద్దాఖ్‌లో భారత్ – చైనా సరిహద్దు సమీపంలోని షియోక్ నదిలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన రాష్ట్రానికి చెందిన ముగ్గురు జవాన్లకు ప్రజలు అశ్రు నివాళులర్పించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లెకు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ముత్తముల రామకృష్ణారెడ్డి, కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్రకు చెందిన జవాను సాదరబోయిన నాగరాజు, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్‌కు చెందిన హవల్దార్ సుభాన్‌ఖాన్ మృతి చెందారు. వారి పారి్ధవదేహాలు సోమవారం గన్నవరం విమానాశ్రయానికి సోమవారం చేరుకున్నాయి.వీర జవాన్ల భౌతికకాయాలను ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి భారత వాయుసేనకు చెందిన విమానంలో సాయంత్రం ఇక్కడికి తీసుకువచ్చారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌లోని ఇంటర్నేషనల్ టెరి్మనల్ ఆవరణలో జవాన్ల పార్ధివదేహాలను ప్రజల సందర్శనార్ధం ఉంచారు. వీర జవాన్లకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తరపున ఆయన ఏడీసీ దీపక్‌శర్మ, పలువురు సైనికాధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం జవాన్ల భౌతికకాయాలను రోడ్డు మార్గం ద్వారా వారి స్వగ్రామాలకు తరలించారు. హవల్దార్ సభాన్ఖాన్, జవాను నాగరాజు అంత్యక్రియలు సోమవారం వారి స్వగ్రామాల్లో సైనిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు మంగళవారం ఆయన స్వగ్రామంలో ఘనంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుభాన్‌ఖాన్‌కు అశ్రునయనాలతో తుది వీడ్కోలు సుభాన్‌ఖాన్ (42) భౌతికకాయం సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో అతని స్వగ్రామం ఇస్లాంపూర్‌కు చేరుకుంది. సుభాన్‌ఖాన్ భౌతికకాయంను కడసారి చూసి తుది వీడ్కోలు పలికేందుకు గ్రామస్తులతో పాటు సమీప గ్రామంలోని ప్రజలు అతని గృహం వద్దకు చేరుకున్నారు. దేశరక్షణలో భాగంగా ప్రాణాలర్పించిన సుభాన్‌ఖాన్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి కన్నీటిపర్యంతమయ్యారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సుభాన్‌ఖాన్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్డీవో హెలా షారోన్, డీఎస్పీ మురళీకృష్ణ, పలు శాఖల అధికారులు సుభాన్‌ఖాన్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం సైనిక, పోలీసు లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. 17 ఏళ్ల క్రితం ఆర్మీలో జవాన్‌గా జీవితం ప్రారంభంసుభాన్ఖాన్ 17 సంవత్సరాల క్రితం ఆర్మీలో సైనికునిగా చేరి అంచెలంచెలుగా హవల్దార్ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ఈఎంఈ మెకానికల్ విభాగంలో పని చేస్తూ ప్రమాదవశాత్తు కన్నుమూశారు. సుభాన్‌ఖాన్‌కు భార్య, ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.ఆయన మరో రెండు సంవత్సరాలలో ఉద్యోగ విరమణ చేయనున్నాడు. సుఖాన్ఖాన్ తన కుటుంబాన్ని చూసుకునేందుకు ఈ నెల 7న కైతేపల్లి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే ఆయన ఆకస్మిక మృతిని జీరి్ణయించుకోలేని కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు చూపరులు సైతం కంటతడి పెట్టిస్తోంది.జవాన్ నాగరాజుకు ఘనంగా అంతిమ వీడ్కోలు ఆర్మీ జవాను సాదరబోయిన నాగరాజు (32) పారి్ధవదేహం సాయంత్రం 5.30 గంటల సమయంలో స్వగ్రామమైన చేవెండ్లకు చేరుకుంది. ఈ విషయం తెలిసి స్వగ్రామంతోపాటు మండలంలోని పలు గ్రామాల ప్రజలు వడ్లమన్నాడుకు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా చేవేండ్రకు తీసుకొచ్చారు. అక్కడ పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ నయీం ఆస్మీ, మచిలీపట్నం ఆర్డీవో ఎం.వాణి, డీఎస్పీ, సీఐలు, పలువురు అధికారులు, వివిధ పారీ్టల నాయకులు నాగరాజు పారి్ధవదేహంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంతిమక్రియలు నిర్వహించారు. నాగరాజు మరణం దురదృష్టకరమని, దేశం ఓ వీరుడిని కోల్పోయిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నివాళులర్పించారు. -
‘లద్దాఖ్’ మృతుల్లో పెడన జవాను
పెడన: సైనిక విన్యాసాల్లో భాగంగా తూర్పు లద్దాఖ్‌లోని ఎల్ఏసీ సమీపంలోని నదిని దాటుతున్న యుద్ధట్యాంకు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనలో మృతిచెందిన ఐదుగురిలో కృష్ణాజిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన జవాను సాదరబోయిన నాగరాజు (32) ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి (47) మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నాగరాజు కూడా ప్రాణాలు కోల్పోయారు.ఎనిమిదేళ్ల కిందట ఇంటర్ పూర్తయిన తరువాత నాగరాజు ఆర్మీలో చేరారు. నాగరాజుకు 2019 అక్టోబర్‌లో తేలప్రోలుకు చెందిన మంగాదేవితో వివాహమైంది. మంగాదేవి పెడన మండలం ఉరివి గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఏడాది వయసున్న కుమార్తె హాసిని ఉంది. భర్త మరణ వార్త విన్నప్పటి నుంచి మంగాదేవి ఉలుకుపలుకు లేకుండా ఉందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నాగరాజు తల్లిదండ్రులు వెంకన్న, ధనలక్షి్మ. నాగరాజుకు ఒక అక్క, తమ్ముడు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో సెలవులకు ఇంటికి వచి్చన నాగరాజు ఆర్మీ జవానుగా పనిచేస్తున్న తన తమ్ముడు శివయ్య కుమార్తెకు అన్నప్రాశన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో నాగరాజు తిరిగి విధులకు హాజరయ్యారు. నేడు స్వగ్రామానికి మృతదేహం నాగరాజు మృతదేహం సోమవారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంటుందని మిలటరీ అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారని పెడన ఎస్ఐ టి.సూర్యశ్రీనివాస్ చెప్పారు. ఆయన ఆదివారం నాగరాజు ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల్ని ఓదార్చారు. నాగరాజు మృతదేహం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేవేండ్ర గ్రామానికి చేరుకుంటుందని ఎస్ఐ తెలిపారు. సోమవారం సాయంత్రంలోగా సైనిక లాంఛనాలు, స్థానిక పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని చెప్పారు. -
వందేళ్ల యుద్ధ సైనికుని వివాహం.. హాజరైన బైడెన్
రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన అమెరికా మాజీ సైనికుడు హెరాల్డ్ టెరెన్స్ తన 100 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ వివాహానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.దేశాధినేతలైన బైడెన్, మాక్రాన్‌లు కొత్తగా పెళ్లయిన హెరాల్డ్ టెరెన్స్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరి వివాహం ఫ్రాన్స్, అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. హెరాల్డ్ పెళ్లి చేసుకున్న ప్రియురాలికి 96 ఏళ్లు. ఆమె పేరు జీన్ స్వెర్లిన్. వారిద్దరూ ఫ్రాన్స్‌లోని నార్మాండీలోని డి-డే బీచ్‌లలో ఉన్న టౌన్ హాల్లో వివాహం చేసుకున్నారు. 1944 జూన్ 6న అడాల్ఫ్ హిట్లర్ దౌర్జన్యాల నుండి ఐరోపాను విముక్తి చేయడానికి మిత్రరాజ్యాల విమానాలు ఇక్కడే ల్యాండ్ అయ్యాయి. అనంతరం ఇక్కడ భీకర యుద్ధం జరిగింది.హెరాల్డ్ తన పెళ్లికి రెండవ ప్రపంచ యుద్ధంలో తాను పోరాడిన ప్రదేశాన్నే ఎంచుకున్నారు. వీరి వివాహానికి హాజరైన కొందరు రెండవ ప్రపంచ యుద్ధం నాటి దుస్తులు ధరించారు. జీన్ స్వెర్లిన్ గులాబీ రంగు దుస్తులు ధరించగా, టెరెన్స్ లేత నీలం రంగు సూట్ ధరించారు. ఈ సందర్భంగా టెరెన్స్ మాట్లాడుతూ తన పెళ్లి రోజు తన జీవితంలోని ఉత్తమమైన రోజు అని, ప్రేమ అనేది కేవలం యువతీయువకులకు సంబంధించినది మాత్రమే కాదని పేర్కొన్నాడు. వీరి వివాహ విందు ఎలీసీ ప్యాలెస్‌లో జరిగింది. -
భారత జవాను ప్రాణాలను బలిగొన్న వడదెబ్బ
దేశంలో ఉత్తరాదిన ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక విషాదం చోటుచేసుకుంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)నకు చెందిన ఒక జవాను వీరమరణం పొందారు. ఆ సైనికుని అజయ్‌కుమార్‌గా గుర్తించారు. వడదెబ్బ కారణంగా ఆ జవాను కన్నుమూశారని సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 55 డిగ్రీలకు పైగా ఉన్నాయి. ఈ ఎండ వేడిమికి బీఎస్ఎఫ్ జవానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బీఎస్ఎఫ్ జవాను అజయ్ కుమార్ ఆదివారం (మే 26) భాను సరిహద్దు పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఎండ వేడిమికి ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో చికిత్స నిమిత్తం అజయ్‌ను రామ్‌గఢ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ సోమవారం (మే 27) ఉదయం ఆసుపత్రిలో కన్నుమూశారు. రామ్‌గఢ్ ఆస్పత్రి లో వీరమరణం పొందిన జవానుకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా 173వ కార్ప్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు కూడా ఈ సైనికునికి పూలమాల వేసి నివాళులర్పించారు.వీరమరణం పొందిన సైనికుని మృతదేహాన్ని రామ్‌గఢ్ నుండి జోధ్‌పూర్‌కు రోడ్డు మార్గంలో తీసుకువెళ్లనున్నారు. అనంతరం మృతదేహాన్ని జోధ్‌పూర్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురికి విమానంలో తరలించనున్నారు. షేర్‌గఢ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎల్ఓసీ వద్ద పేలిన ల్యాండ్‌మైన్.. ఆర్మీ జవాన్ మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో ల్యాండ్‌మైన్‌పై కాలు పెట్టడంతో పేలుడు సంభవించి భారత ఆర్మీ జవాను ప్రాణాలు విడిచాడు. మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ఉదయం 10.30 గంటలకు జరిగింది. రాజౌరీ జిల్లా నౌషేరాలో నియంత్రణ రేఖ వెంబడి సైనికులు పెట్రోలింగ్‌లో ఉండగా ఒక జవాను ల్యాండ్‌మైన్‌పై అడుగు పెట్టడంతో ప్రమాదవశాత్తూ అది ట్రిగ్గర్ అయ్యింది. దీంతో పేలుడు సంభవించండో ముగ్గురు ఆర్మీ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని ఉధంపూర్‌లోని కమాండ్ ఆసుపత్రికి తరలించగా ఒక సైనికుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అయితే మరణించిన జవాన్ వివరాలను ఇంకా భారత ఆర్మీ వెల్లడించలేదు. -
జమ్ములో ఏపీ జవాను మృతి
తుని రూరల్: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవానుగా జమ్ములో విధులు నిర్వహిస్తున్న తంతటి కిరణ్ కుమార్ (41) సోమవారం బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. తుని మండలం హంసవరం గ్రామం ఆయన స్వస్థలం. కిరణ్‌కుమార్ మృతి సమాచారం తెలియడంతో ఆయన భార్య విజయకుమారి, సోదరుడు రవికుమార్ హుటాహుటిన జమ్మూ వెళ్లారు. వారికి కిరణ్ కుమార్ పార్థివ దేహాన్ని సీఆర్పీఎఫ్ అధికారులు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో అప్పగించారు. భర్త మృతదేహాన్ని చూసి విజయకుమారి కన్నీరు మున్నీరుగా విలపించారు. రాత్రికి విశాఖపట్నానికి చేరుకుని తెల్లవారుజామున మృతదేహాన్ని గ్రామానికి తీసుకువస్తామని బంధువులు తెలిపారు. కిరణ్‌కుమార్ మృతదేహానికి బుధవారం ఉదయం అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కిరణ్ కుమార్‌కు భార్యతో పాటు కుమారుడు జతిన్ (12), కుమార్తె మెర్సీ (10), తల్లిదండ్రులు జాన్, భాగ్యవతి ఉన్నారు. దేశ సేవలో ఇద్దరు కుమారులు హంసవరం గ్రామానికి చెందిన జాన్, భాగ్యవతి దంపతులకు ముగ్గురు కుమారులు. మొదటి కుమారుడు గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూండగా రెండో కుమారుడైన కిరణ్ కుమార్ 2005లో సీఆర్పీఎఫ్లో చేరారు. మూడో కుమారుడు రవికుమార్ ఆర్మీలో చేరాడు. ఇద్దరు కొడుకులు దేశ రక్షణలో సేవలు అందిస్తూండటం తమ కుటుంబానికి ఎంతో సంతోషాన్నిచ్చిందని, కిరణ్ కుమార్ మృతి పుత్రశోకాన్ని మిగిల్చిందని తల్లిదండ్రులు బోరున విలపించారు. కిరణ్ కుమార్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులను సర్పంచ్ రాయి మేరీ అవినాష్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
జీవిత భాగస్వామి విషయంలో ఆ తప్పిదమే ఆ సైనికుడి జీవితాన్ని..!
ఏ దేశంలోనైనా బంధాలకు విలువనిచ్చే జీవితాలు ఎప్పటికీ ఆదర్శంగానే నిలుస్తాయి. అయితే ఒక బంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు ‘ఎవరి చేతిని పట్టుకుని నడవబోతున్నాం?’ అనేదాని పట్ల స్పష్టత అవసరం. లేదంటే జీవితం ఊహించని మలుపులు తిరిగి ఉక్కిరిబిక్కిరవుతుందని చెప్పే ఉదంతమే ఇది. 1978 డిసెంబర్ 19, డెరెల్డ్ టేసీ అనే సైనికుడి జీవితంలో అదో చీకటి రోజు. జార్జియా, రిచ్మండ్ కౌంటీలోని కార్నివాల్కి చెందిన అతను.. ప్రాణంగా ప్రేమించిన భార్యను పోగొట్టుకున్నాడు. అప్పటికే కొన్ని నెలలుగా ఎన్యూరిజం వ్యాధికి గురైన ఆమె (జార్జియా బోయిడ్) కోమాలోకి వెళ్లిపోయి.. చివరికి 22 ఏళ్ల వయసులో మరణించింది. కళ్లముందు చిన్న చిన్న పిల్లలు నలుగురు.. మెదడులో అంతుచిక్కని ప్రశ్నలు.. డెరెల్డ్‌ని కుదురుగా ఉండనివ్వడంలేదు. భార్య మరణం నాటి నుంచి మొదలైన అతడి అన్వేషణ.. చివరికి అసంపూర్తిగానే మిగిలిపోయింది. అప్పటికి మూడేళ్ల క్రితం వరకూ డెరెల్డ్ జీవితం బిందాస్‌గానే సాగింది. 1975లో జార్జియా బోయిడ్ పరిచయమైన తర్వాత అతని జీవితమే ఆమె అయిపోయింది. బోయిడ్ అగస్టాలోని ఒక బార్లో గోగో డాన్సర్‌గా పని చేస్తుందని తెలుసుకున్నప్పటి నుంచి.. అతని ప్రతి ప్రయాణం ఆమె కోసమే సాగింది. ఆమెతో స్నేహం, ప్రేమ, పెళ్లి, పిల్లలు ఈ క్రమంలో చాలా ట్విస్ట్‌లనే చూశాడు డెరెల్డ్. ‘చిన్నప్పటి నుంచి నార్త్ కరోలినాలో పెరిగాను. మా నాన్న చెరోకీ ఇండియన్. నన్నంతా జెరీ అని ముద్దుగా పిలుస్తారు’ అంటూ పరిచయమైన రోజునే డెరెల్డ్‌కి చెప్పింది బోయిడ్. స్నేహం బలపడిన తర్వాత తనకు అంతకుముందే పెళ్లి అయిందని చెప్పింది. తర్వాత ఒకరోజు ‘నాకిద్దరు ఆడపిల్లలు, భర్తతో విడిపోయాను’ అని చెబుతూనే.. డెరెల్డ్‌ని తన ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ మొదటిసారి ఆమె కూతుర్లు సాలీ, ఏంజెల్‌లను కలుసుకున్నాడు డెరెల్డ్. ‘మాతో పాటు ఈ గ్రానీ (నాయనమ్మ) ఉంటుంది’ అంటూ ఒక పెద్దావిడను పరిచయం చేసింది. అయితే ఆమె రక్తసంబంధీకురాలు కాదని తెలిపింది. రోజులు, వారాలు గడిచాయి. డెరెల్డ్, బోయిడ్ల మధ్య స్నేహం.. ప్రేమగా మారింది. తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని డెరెల్డ్తో లివిన్ రిలేషన్ మొదలుపెట్టింది బోయిడ్. అయితే కలసి జీవించే క్రమంలో.. బోయిడ్ కొన్నిసార్లు మతిస్థిమితం లేని దానిలా ప్రవర్తించడం.. డెరాల్డ్ని కాస్త భయపెట్టింది. పగలు కూడా తలుపులు, కిటికీలు మూసుకుని ఇంట్లో ఉండటం, ఫోన్ రాగానే ముందుగా తను చెప్పిన కోడ్‌ని అవతల వ్యక్తి చెబితేనే మాట్లాడటం.. ఇదంతా డెరెల్డ్‌కి నెమ్మది నెమ్మదిగా అలవాటైపోయింది. ఒకరోజు బోయిడ్‌ని కూర్చోబెట్టి ‘ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్?’ అంటూ ఆరా తీశాడు డెరాల్డ్. ‘నా మాజీ భర్త చాలా దుర్మార్గుడు. అతను సాలీ, ఏంజెల్‌లను కిడ్నాప్ చేస్తాడని భయంగా ఉంది’ అంటూ ఏడ్చేసింది. రెండు వారాల తర్వాత.. ఒకరోజు రాత్రి బోయిడ్‌ని ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన డెరెల్డ్‌కి.. ఆమె తను పనిచేసే బార్ ముందు భయపడుతూ కనిపించింది. కారణం అడిగితే.. ‘డెవిల్స్ గ్యాంగ్ అనే పేరున్న మోటర్ సైకిల్ ముఠాలోని ముగ్గురు సభ్యులు నన్ను బంధించి తీసుకెళ్లిపోవడానికి బార్కి వచ్చారు. గతంలో నేను వారి దగ్గర నుంచి తప్పించుకు వచ్చాను’ అని చెప్పింది. ఆమె చెప్పినట్లుగానే ఓ వ్యాన్.. వారి బండిని వెంబడించడం డెరెల్డ్ గుర్తించాడు. లక్కీగా దారిలో ఓ పోలీస్ అధికారి ఎదురుపడటంతో.. ఆ వ్యాన్ కాసేపటికి మాయం అయ్యింది. అయితే చాలాసార్లు తన మాజీ భర్త మంచివాడు కాదని.. తనను చాలా వేధింపులకు గురిచేశాడని చెప్పేది. ఇక ఒకరాత్రి చీకట్లో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడటం చూసిన డెరెల్డ్.. ఆ ఆగంతకుడ్ని పట్టుకోవడానికి విఫలయత్నం చేశాడు. ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా బోయిడ్‌ని మాత్రం వదిలిపెట్టలేదు. కొన్ని రోజులకు ఆమెను పెళ్లిచేసుకున్నాడు. పని ఒత్తిడి కారణంగా రాత్రిళ్లు ఆలస్యంగా ఇంటికి రావడాన్ని కూడా ఆమె తట్టుకోలేకపోయేది. భయంగా ఉంటోందని, ఎవరో.. తలుపులు వేసుకుని ఉన్నా ఇంటి చుట్టూ తిరుగుతూ వేధిస్తున్నారని చెప్పేది. కొన్ని రోజులకు ‘ఐ విల్ గెట్ యు డియర్’ అనే పెయింటింగ్ మెసేజ్ ఆమెని మరింత కుంగదీసింది. కొన్నాళ్లకు బోయిడ్, డెరెల్డ్ జంటకు ఒక కొడుకు పుట్టాడు. ఆ తర్వాత బోయిడ్ తీవ్రమైన తలనొప్పితో సతమతమయింది. ఆరోగ్యం కుదుటపడేలా చెయ్యాలని డెరెల్డ్.. తన భార్య బోయిడ్‌ని మిషిగన్‌లోని స్వస్థలానికి తీసుకెళ్లాడు. ఆమె అక్కడ రెండో కొడుక్కి జన్మనిచ్చింది. అయితే రెండో బిడ్డ పసికందుగా ఉన్నప్పుడే బోయిడ్ మంచం పట్టింది. ఆ తర్వాత కోమాలోకి వెళ్లి.. చనిపోయింది. ఆమె మరణం తర్వాత డెరెల్డ్.. ఆమె బంధువుల కోసం విస్తృతంగా అన్వేషించాడు. అయితే ఎవ్వరూ ఆమె గురించి ఏ సమాచారమూ ఇవ్వలేదు. పైగా అగస్టా బార్కి వెళ్లి ఆరా తీస్తే.. ఆమె గురించి విచారించడం మానేస్తే మంచిదనే సలహా ఇచ్చేవారు ఎక్కువయ్యారు. కొందరైతే ఆమె గురించి మాట్లాడటానికే ఇష్టపడలేదు. దాంతో స్థానిక టీవీ చానెల్లో ఆమె ఫొటోని 24 గంటలు ప్రసారంలో ఉంచమని.. తెలిసివారు తనని సంప్రదిస్తారని డీల్ మాట్లాడుకున్నాడు డెరెల్డ్. ముందు సరేనన్న ఆ చానెల్.. తర్వాత ప్రసారం చేయలేదు. ఏవో బెదిరింపుల వల్ల ఆ చానెల్ వెనక్కి తగ్గిందని డెరెల్డ్ కొన్నాళ్లకు తెలుసుకున్నాడు. అగస్టా పోలీసులు కూడా డెరెల్డ్‌కి సాయం చేయలేదు. ఎందుకంటే ‘విచారించడానికి ఇదేం మర్డర్ కేసు కాదుగా?’ అన్నారు. ఆ నలుగురు పిల్లల్ని.. బోయిడ్ కుటుంబంతో కలపాలనేది డెరెల్డ్ కోరిక. ఇక అతడి విచారణలో.. ఏంజెల్, సాలీల తండ్రి గ్యారీమూర్ను కలుసుకుని.. బోయిడ్ అసలు పేరు.. ‘ఎడిత్ గెరాల్డిన్ జాన్స్ మూర్’ అని తెలుసుకున్నాడు. ఇక కొన్నాళ్లకు బోయిడ్ బంధువుల్లో ఇంకొందరిని కూడా కలిశాడు. అయితే డెరెల్డ్‌కి.. మరో నిజం తెలిసింది. ఏంజెల్, సాలీ కంటే ముందే బోయిడ్కి 11 ఏళ్ల వయసులో.. యూజీన్, రోండా అనే కొడుకు, కూతురు పుట్టారని తెలుసుకున్నాడు. అయితే బోయిడ్ గురించి పూర్తి వివరాలు చెప్పడానికి.. సొంతవాళ్లు కూడా వెనకాడటం డెరెల్డ్‌ని కాస్త ఆశ్చర్యపరిచింది. కానీ ఆమె ఎందుకు తన దగ్గర అన్ని నిజాలను గోప్యంగా ఉంచింది? ఎవరి కారణంగా ఆమె అంతగా భయపడింది? ఆమెని ఎవరు అంతగా వేధించారు? అనే సందేహాలకు అతను సమాధానాలు రాబట్టలేకపోయాడు. నిజానికి ఒక సైనికుడై ఉండి.. జీవితభాగస్వామి వ్యక్తిగత విషయాలు పూర్తిగా తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవడం సరికాదనే విమర్శలు చాలానే వచ్చాయి. అయినా అతను బంధాలకు ఇచ్చే విలువ, పిల్లల్ని చేరదీసి పెంచిన విధానం అంతా ఆదర్శనీయంగా నిలిచింది. ఏదేమైనా 22 ఏళ్లకే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన బోయిడ్ అలియాస్ ఎడిత్ జీవితంలో.. ఆమెకు మాత్రమే తెలిసిన నిజాలు, భయాలు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. ∙సంహిత నిమ్మన (చదవండి: దెయ్యాలు కట్టిన గుడి కాకన్మఠ్ టెంపుల్ !..అక్కడ ప్రతి అంగుళం ఓ మిస్టరీ..!) -
మణిపూర్‌లో మళ్లీ హింస: నలుగురి అపహరణ, కాల్పుల్లో ఏడుగురికి గాయాలు!
దేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మే నెలలో మొదలైన హింసాకాండ ఇంకా చల్లారడం లేదు. తాజా ఘటనలో ఒక సైనికుని కుటుంబానికి చెందిన ముగ్గురు సహా మొత్తం నలుగురిని మైతీ ఉగ్రవాదులు అపహరించారు. ఈ సంఘటన ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ కిడ్నాప్ వార్త అంతటా వ్యాపించడంతో ఇంఫాల్ వెస్ట్, కాంగ్పోక్పి జిల్లాలతో పాటు కాంగ్‌చుప్ ప్రాంతంలో ఒక సమూహంపై సాయుధ కుకీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఒక మహిళతో సహా మొత్తం ఏడుగురు గాయపడ్డారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం, ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన నలుగురిలో 65 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నాడు. వీరిని రక్షించేందుకు తమ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని కాంగ్పోక్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ఎం ప్రభాకర్ తెలిపారు. కిడ్నాప్‌కు గురైన మిగతా నలుగురిని నెంగ్‌కిమ్ (60), నీలం (55), జాన్ తంగ్జామ్ హౌకిప్ (25), జామ్‌ఖోటాంగ్ (40)గా పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: ‘సరి- బేసి’ విధానం ఏ దేశంలో మొదలయ్యింది? -
హృదయాన్ని మెలిపెట్టే ఘటన: ఆ నవ్వు ముఖం ఇక చూడలేం!
ఇజ్రాయెల్-హమాస్ భీకర యుధ్దం తీవ్ర విషాదాన్నిమిగులుస్తోంది. హృదయాల్నిమెలిపెట్టే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ సైన్యంలోని 77వ బెటాలియన్‌లో సైనికురాలిగా పనిచేస్తున్న 19 ఏళ్ల కార్పొరల్ నామా బోని మరణం తీవ్రంగా కలిచివేస్తోంది. ఇజ్రాయెలీ వార్తా సంస్థ Ynet ప్రకారం చావు బతుకులమధ్య అత్యంత దయనీయ పరిస్తితుల్లో కుటుంబ సభ్యులకు పంపిన సందేశం వైరల్ అవుతోంది. హమాస్ సాయుధుడి దాడిలో బోని తలకు తీవ్ర గాయమైంది. అయినా ఎలాగోలా తప్పించుకుంది. ఓ తాత్కాలిక షెల్టర్‌లో తలదాచుకుని అక్కడినుంచి కుటుంబ సభ్యులకు మెసేజ్ చేసింది. ‘‘నా మీద కాల్పులు జరిగాయి. మీ గురించి చాలా బాధపడుతున్నాను. నా తలకు తీవ్ర గాయమైంది’’ అంటూ మెసేజ్ చేసింది. కాసేపటి తరువాత మరో అప్డేట్ను కూడా ఇచ్చింది. తనకు సమీపంలోనే ఉగ్రవాది ఉన్నాడనీ, ఏ క్షణాన్నైనా తనను కాల్చేయొచ్చనే అందోళన వ్యక్తం చేసింది. ఎవరో అరుస్తున్నట్లు వినిపిస్తోంది, మానవ ప్రాణనష్టం జరిగినట్లు కనిపిస్తోందంటూ అక్కడి పరిస్థితిని వివరించింది. అలాగే ప్రస్తుతం తాను గోలానీ బ్రిగేడ్‌కు చెందిన గాయపడిన సైనికుడితో ఉన్నాననీ. ఇక్కడ తమకు ఎలాంటి బలగాలు అందుబాటులో లేవని కూడా ఆ మెసేజ్‌లో ఆమె పేర్కొంది. ఆ తరువాత తీవ్రంగా గాయపడిన బ్రెజిలై మెడికల్ సెంటర్లో ఆసుపత్రిలో చేరిన ఆమె ఇక లేదని అధికారుల వివరాల బట్టి తెలుస్తోంది. అఫులాలో పుట్టి పెరిగింది బోని. ఏడు నెలల క్రితమే అక్కడి సైన్యంలో చేరింది. ఒక వారం క్రితం ఆమె పుట్టిన రోజును జరుపుకున్న బోనీ తిరిగి రావాలని కోరుకున్న కుటుంబ సభ్యులకు చివరకు విషాదమే మిగిలింది. కాగా హమాస్ రాకెట్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఐదు రోజుల క్రితం వైమానిక దాడులు ప్రారంభించినప్పటి నుండి 2.3 మిలియన్ల జనాభాఉన్న గాజా స్ట్రిప్‌లోని పౌరులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. గురువారం ఉదయం నాటికి 1,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. వీరిలో ఎంత మంది పౌరులు ఉన్నారో స్పష్టత లేదు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలోగాజా నగరంలో ఆహార కొరత నెలకొంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గాజాలోని అల్-షిఫా ఆసుపత్రికి వచ్చే రోగులతో నిండిపోయింది. ఒకవైపు ఆక్సిజన్‌తో సహా ఇతర అత్యవసర మందుల నిల్వలు క్షీణిస్తున్నాయి. మరోవైపు విద్యుత్ అంతరాయంతో రోగులను కాపాడేందుకు సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. -
కొనసాగుతున్న ఉగ్రవేట.. మరో సైనికుడి వీరమరణం
కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట గత మూడు రోజులుగా కొనసాగుతోంది. ఉగ్రవాదులకు సైనికులకు మధ్య భీకరపోరు జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు ఓ పోలీసు అధికారి మరణించారు. ఈ రోజు అనంతనాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో సైనికుడు తీవ్ర గాయాలతో నెలకూలాడు. జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్త ఆపరేషన్ చేపట్టింది. అనంతనాగ్ జిల్లాలో అటవీ ప్రాంతంలో తలదాచుకున్న ఉగ్రవాదులతో 48 గంటలుగా భీకర పోరు నడుస్తోంది. అటవీ ప్రాంతంలో భయంకరమైన బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయి. బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్, పోలీసు అధికారి డీఎస్పీ హుమయూన్ భట్లు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య వారి అంత్యక్రియలు జరిగాయి. ఇదీ చదవండి: Kerala Nipah Virus Updates:కేరళలో మరో వ్యక్తికి వైరస్ పాజిటివ్.. ఆరుకి చేరిన నిఫా కేసులు -
సైనికున్ని రక్షించేందుకు.. తూటాలకు ఎదురునిలిచి..
ఢిల్లీ: విధినిర్వహణలో ప్రాణాలను అర్పించింది ఓ సైనిక జాగిలం. సైనికుని ప్రాణాలను కాపాడటం కోసం తన ప్రాణాలను పనంగా పెట్టింది. ఉగ్రవాదుల తూటాలకు ఎదురునిలిచి వీర మరణం పొందింది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులకు-సైన్యానికి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో కెంట్ అనే సైనిక జాగిలం ప్రాణాలను కోల్పోయినట్లు ఆర్మీ తెలిపింది. 'ఆపరేషన్ సుజలిగల'లో భాగంగా జమ్మూ రాజౌరీ జిల్లాలోని నార్లా ప్రాంతంలో సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపడుతోంది. వారికి తోడుగా 21వ ఆర్మీ డాగ్ యూనిట్‌కు చెందిన ఆరేళ్ల కెంట్ అనే కుక్కను తీసుకువెళ్లారు. సైనికులందరూ కెంట్‌ను అనుసరిస్తున్నారు. ఉగ్రవాదుల జాడను పసిగట్టిన కెంట్.. సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు సైన్యానికి మధ్య భీకర కాల్పులు జరిగాయి. #WATCH | Indian Army dog Kent, a six-year-old female labrador of the 21 Army Dog Unit laid down her life while shielding its handler during the ongoing Rajouri encounter operation in J&K. Kent was leading a column of soldiers on the trail of fleeing terrorists. It came down under… pic.twitter.com/ZQADe50sWK — ANI (@ANI) September 13, 2023 కాల్పుల్లో ఉగ్రవాదులు ఓ సైనికున్ని చుట్టుముట్టారు. అతన్ని రక్షించడం కోసం కెంట్ ఉగ్రవాదులకు ఎదురునిలిచింది. ఈ క్రమంలో తూటాలు తగిలి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయిందని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది, ఒక ఆర్మీ జవాన్ మరణించారని వెల్లడించారు. Army dog Kent laid down her life while shielding its handler during operation in Rajouri, J&K Kent was leading column of soldiers on the trail of fleeing terrorists. It came down under heavy hostile fire Till now, 1 terrorist killed Thank you Kent for serving nation. Om Shanti pic.twitter.com/BeeVjktB8K — Anshul Saxena (@AskAnshul) September 12, 2023 ఇదీ చదవండి: ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు.. -
కాశ్మీర్లో సెలవుపై వచ్చిన భారత జవాను అదృశ్యం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటుకి చెందిన జవాను జావేద్ అహ్మద్ కొద్దిరోజుల క్రితమే సెలవులపై ఇంటికి తిరిగొచ్చాడు. మార్కెట్ కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుండి బయటకు వచ్చిన అతడు తర్వాత అదృశ్యమైనట్లు తెలిపారు కుటుంబ సభ్యులు. దక్షిణ కాశ్మీర్ లో నివాసముండే భారత జవాను జావేద్ అహ్మద్(25) జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటులో విధులు నిర్వర్తిస్తున్నాడు. సెలవుపై ఇంటికి వచ్చిన జావేద్ శనివారం సాయంత్రం 6.30 గంటలకు మార్కెట్ కు వెళ్లి వస్తానని చెప్పి ఆల్టో కారులో బయటకు వెళ్ళాడు. రాత్రి 9.00 అయినా అతను తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడి కోసం గాలించడం మొదలుపెట్టారు. మార్కెట్ కు కొంత దూరంలో రక్తపు మరకలు అంటుకున్న కారు కనిపించింది కానీ అందులో జావేద్ లేడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కాశ్మీర్ పోలీసులు కేసును నమోదు చేసి ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. రక్షణ దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గతంలో కూడా కొంతమంది సైనికులు సెలవుపై ఇంటికి వచ్చాక ఇలాగే అపహరణకు గురైన వారిని తీవ్రవాదులు దారుణంగా కడతేర్చారు. దీంతో ఇది కూడా ఉగ్రవాద చర్యగా భావించి జావేద్ తల్లి.. దయచేసి మమ్మల్ని క్షమించండి.. నా కుమారుడిని విడుదల చేయండి, నా జావేద్ ను విడుదల చేయండి.. వాడిని సైన్యంలో పనిచేయకుండా ఆపుతాను.. కానీ వాడిని విరిచిపెట్టండి.. అంటూ జవాను తల్లి ఒక వీడియో సందేశాన్ని కూడా సిద్ధం చేశారు. ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లకు వారే కారణమా..? -
జెలెన్స్కీ ఇంటి ముంగిటే..నాటు నాటు స్టెప్పులతో ..: వీడియో వైరల్
ఆర్ఆర్ఆర్ మూవీ క్రేజ్ మాములుగా లేదు. ఆ మూవీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డుని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న థియోటర్లలో ఇంకా ప్రదర్శితమవుతూనే ఉంది. అదీగాక ఈ పాటకి చిందులు వేస్తూ రోజు ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అవ్వడం, వైరల్ అవ్వడం జరుగుతుంది. తాజగా ఇప్పుడు ఉక్రెయిన్ సైనికులు ఆ పాటకు స్టెప్పులు వేశారు. ఎలాగైతే ఆ మూవీలో ఇద్దరు నటులు బ్రిటీస్ వారికి వ్యతిరేకంగా ఎలా డ్యాన్స్‌ని ప్రదర్శించారో అలానే ఇద్దరు ఉక్రెయిన్ సైనికులు చేసి అందర్నీ అలరించారు. ఈ పాటతో ఆ నటులిద్దరు బ్రిటిష్ అధికారికి వ్యతిరేకంగా ఎలా అయితే తమ నిరసనను వ్యక్తం చేశారో అలా రష్యాకి వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఆపాటను చిత్రీకరించింది ఉక్రెయిన్ ఆర్మీ. అదీకూడా సరిగ్గా ఆర్‌ఆర్‌మూవీ నాటు నాటు పాటను ఎక్కడైతే షూట్ చేశారో అక్కడే(జెలెన్స్కీ అధికారిక నివాసం ఎదుట) ఆప్రదేశంలోనే ఉక్రెయిన్ సైనికులు కూడా తమ వీడియోని చిత్రీకరించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో ఉక్రెయిన్ నెటిజన్లు మేము మా స్వంత వలసవాదులతో పోరాడుతున్నాం. ఉక్రెయిన్ స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉందని రష్యాకు మరోసారి అర్థమయ్యేలా చేస్తాం అని ఒకరు, యుద్ధం వేళ ఈ పాట అనుకరణగా అద్భతంగా ఉందని మరోకరు ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ అధికార ఖాతా కూడా ఈ వీడియోకి ఫోల్డింగ్ హ్యాండ్స్ ఎమోజీలను పెట్టడమే గకా వీడియోని రీట్వీట్ చేసింది. అంతేగాదు ఈ వీడియోకి ఇప్పటి వరకు ఆరు లక్షలకు పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: కోర్టు బోనెక్కి సాక్ష్యం చెప్పనున్న ప్రిన్స్ హ్యారీ) -
యుద్ధ మరణం: చనిపోయిన 73 ఏళ్లకు.. సైనికుడికి అంత్యక్రియలు..
విధి లిఖితమో దురదృష్టమో గానీ కొందరు చనిపోతే తదనంతరం చేయాల్సి కార్యక్రమాలకు రకరకాల అడ్డంకులు ఎదురవుతాయి. యుద్ధంలో లేక మిస్సింగ్ కేసులో చనిపోతే ఆ వ్యక్తి ఆఖరి చూపు కోసం కుటుంబసభ్యుల నిరీక్షణ అంతా ఇంత కాదు. ఈలోగ అతడి బంధవులంతా చనిపోయినా.. లేక ఆ వ్యక్తి లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేక ఇంటిల్లిపాది ఆత్మహత్య చేసుకుంటున్న విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అచ్చం అలానే ఇక్కడొక సైనికుడు యుద్ధంలో వీరమరణం పొందాడు. కానీ అతడి మృతదేహం లేదా అవశేషాలు గానీ లేక అంతిమ సంస్కరాలు నిర్వహించలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది అతడి కుటుంబం. ఐదో, పదో ఏళ్లు కాదు ఏకంగా 73 ఏళ్లు ఆ సైనికుడి అవశేషాల కోసం ఎదురు చూసింది ఆ కుటుంబం. వివరాల్లోకెళ్తే..యూఎస్ సైనికుడు సీపీఎల్ లూథర్ హెర్షెల్ స్టోరీ 18 ఏళ్ల వయసులో 1950 సెప్టంబర్ 1న జరిగిన కొరియన్ యుద్ధంలో మరణించాడు. ఐతే అదే యుద్ధంలో మరికొంతమంది సైనికులు చనిపోవడంతో సదరు సైనికుడు హెర్షెల్ అవశేషాలు అంత తేలికగా దొరకలేదు. దీని కోసం దర్యాప్తు సంస్థ పలు విధాలుగా విచారించింది కూడా. ఐతే ఆ యద్ధ సమయంలో మరణించిన సైనికులు అవశేషాలతో అతడి కుటుంబసభ్యుల డీఎన్ఏతో మ్యాచ్ కాలేదు. దీంతో ఆ కుటుంబం అతడి అంతిమ సంస్కరాలు చేయడం కోసం చాలా ఏళ్ల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు అతడి అవశేషాలు దొరకడమే గాక అతడి కుటుంబ సభ్యలు డీఎన్ఏతో సరిపోయింది. దీంతో అతడు చనిపోయిన 73 ఏళ్లకు జార్జియాలోని స్వస్థలంలో సైనిక లాంఛనాలతో ఖననం చేశారు. కొరియన్ యుద్ధ సమయంలో పరాక్రమంతో శత్రువులను మట్టికరిపించినందుకు ఆ సైనికుడు అత్యంత గుర్తింపు పొందాడు. యూఎస్ ఆర్మీ అతని మరణాంతరం సైనిక అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించడమే గాక ఆ మెడల్ని అతడి తండ్రికి ప్రధానం చేసింది. ఆతడు అసాధారణ పోరాట పటిమకు నిలవెత్తు నిదర్శనం అని ప్రశంసించింది. అకుంఠిత దీక్ష, ధైర్యసాహసాలకు ఈ అత్యున్నత మెడల్ సత్కారమని యూస్ ఆర్మీ పేర్కొంది. ఈ మేరకు అతడి చిత్ర పటంతోపాటు ఆ అత్యున్నత మెడల్ని నేషనల్ మెడల్ ఆఫ్ ఆనర్ మ్యూజియంలో ప్రదర్శనగా ఉంచింది. (చదవండి: ఆమె చనిపోయి నాలుగేళ్లైంది..ఐనా మృతదేహం కించెత్తు పాడవ్వకుండా..) -
తుఫాన్‌కు ఎదురెళ్లిన జవాన్.. వీడియో వైరల్!
-
నలుగురు సైనికులను కాల్చి చంపింది మన జవానే.. ఉగ్ర కోణం లేదు..
చండీగడ్: గత బుధవారం పంజాబ్‌లోని భటిండా సైనిక శిబిరంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇది ఉగ్రవాదుల పనా? అని అనుమానాలు తలెత్తాయి. అయితే ఈ ఘటనలో ఉగ్ర కోణం లేదని పంజాబ్ పోలీసులు సోమవారం వెల్లడించారు. దాడి చేసింది తోటి జవాన్ మోహన్ దేశాయ్ అని తెలిపారు. కాల్పుల అనంతరం అనుమానంతో అతడ్ని అరెస్టు చేసి విచారించగా నేరంగా అంగీకరించినట్లు పేర్కొన్నారు. కాల్పుల్లో చనిపోయిన నలుగురు జవాన్లు తనను వేధించడం వల్లే దాడి చేసి హతమార్చినట్లు మోహన్ దేశాయ్ అంగీకరించినట్లు అధికారులు చెప్పారు. మొదట పోలీసులను అయోమయానికి గురి చేసేందుకు కట్టు కథలు చెప్పాడని, ఆ తర్వాత విచారణలో నిజాన్ని ఒప్పుకున్నాడని వివరించారు. ఈ ఘటనలో ఉపయోగించిన ఆయుధాలను మిలిటరీ స్టేషన్ నుంచే మోహన్ దొంగిలించాడని పేర్కొన్నారు. మోహన్‌కు ఇంకా పెళ్లి కాలేదని ఒంటరిగానే ఉంటున్నాడని అధికారులు వెల్లడించారు. అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే విషయంపైనా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఏం జరిగిందంటే? పంజాబ్‌లోని భటిండా సైనిక శిబిరంలో శతఘ్ని దళానికి చెందిన జవాన్లు నివసించే ఆర్మీ స్టేషన్‌లోని ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఇందులో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలిలో ఇన్సాస్ రైఫిల్‌కు చెందిన 19 ఖాళీ తూటాలు లభించాయి. ఘటన విషయం తెల్సిన వెంటనే తక్షణ స్పందన దళం రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు, సైన్యం.. నిందితుడి కోసం వేట మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా కన్పించిన మోహన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: మిలిటరీ స్టేషన్‌పై దుండగుల దాడి.. తుపాకులతో కాల్పులు.. నలుగురు సైనికులు మృతి.. -
మిలిటరీ స్టేషన్లో బుల్లెట్ గాయంతో సైనికుడి మృతి
చండీగఢ్: పంజాబ్‌లోని బటిండా సైనిక స్థావరంలో బుధవారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. తాజాగా అదే ప్రాంతంలో ఓ ఆర్మీ సైనికుడు తుపాకీ కాల్పులతో మరణించాడు. కాల్పుల ఘటనలో ఫిరంగి విభాగానికి చెందిన నలుగురు సిబ్బంది మరణించిన 12 గంటల తర్వాత.. బుధవారం మధ్యాహ్నం ఈ జవాను మృతి చెందాడు. ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ.. "భటిండా మిలిటరీ స్టేషన్లో ఏప్రిల్ 12న సాయంత్రం 4:30 గంటలకు ఒక సైనికుడికి తుపాకీ గాయమైంది. అతను తన సేవా ఆయుధంతో సెంట్రీ డ్యూటీలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సైనికుడిని వెంటనే మిలిటరీ ఆసుపత్రికి తరలించామని, అయితే అతను చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. అయితే, తాజా ఘటనకు అంతకుముందు జరిగిన కాల్పులతో ఎలాంటి సంబంధం లేదని అధికారలు పేర్కొన్నారు. ఈ జవాను ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఏదైనా ప్రమాదం జరిగిందా..? అన్నదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో మరణించినట్లు ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, తాజా ఘటనతో 24 గంటల వ్యవధిలోనే బఠిండా సైనిక స్థావరంలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. -
ఏరో ఇండియా 2023లో స్పెషల్ అట్రాక్షన్ గా ఎగిరే సైనికుడు
-
నాకే ఎదురుచెప్తావా.. డీఎంకే నేత దాడిలో సైనికుడు మృతి
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. అధికార డీఎంకే పార్టీకి చెందిన కౌన్సిలర్ రెచ్చిపోయాడు. భారత ఆర్మీకి చెందిన సైనికుడిపై దాడి చేయడంతో గాయపడ్డారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనలో డీఎంకే కౌన్సిలర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మృతుడి సోదరుడు కూడా సైనికుడే కావడంతో కౌన్సిలర్‌పై చర్యలు తీసుకునే వారకు తాను విధుల్లో చేరనని తెగేసి చెప్పాడు. వివరాల ప్రకారం.. తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన భారత ఆర్మీ సైనికుడు ప్రభు, అతడి అన్ని ప్రభాకర్.. ఫిబ్రవరి 8వ తేదీన పోచంపల్లిలో ప్రాంతంలో ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద బట్టలు ఉతికారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న డీఎంకే కౌన్సిలర్ చిన్నస్వామి.. వారితో వాదనకు దిగారు. ఇక్కడ బట్టలు ఎందుకు వాష్ చేస్తున్నావ్ అంటూ వారిద్దర్నీ ప్రశ్నించారు. దీంతో, వారి మధ్య వాదనలు పెరిగాయి. అయితే, ఇదే సమయంలో కొందరు వ్యక్తులు.. అక్కడే కార్లు వాష్ చేయడం, మరో ఇద్దరూ కూడా బట్టలు వాష్ చేస్తున్నారు. అయినప్పటికీ చిన్నస్వామి.. వీరిద్దరితో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రభు బద్రర్స్‌తో దురుసుగా మాట్లాడుతూ.. మీరు సైనికులు కావొచ్చు కానీ.. నన్ను మీరు ఏమీ చేయలేరని వార్నింగ్ ఇచ్చాడు. అనంతరం.. ఆగ్రహానికి లోనైన చిన్నస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అదే రోజు రాత్రి కౌన్సిలర్ చిన్నస్వామి, అతడి అనుచరులు కలిసి ప్రభు ఇంటిపై దాడి చేశారు. ప్రభు కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా.. చిన్నస్వామి తన అనుచరులతో వారిపై కత్తితో దాడికి దిగాడు. ప్రభును రక్షించే క్రమంలో కుటుంబ సభ్యులు కూడా గాయపడ్డారు. అయితే, ప్రభు తలపై కత్తితో వేటువేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, అతడిని వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. ఈ క్రమంలో గాయాల కారణంగా ఆరోగ్యం విషమించి ప్రభు.. మంగళవారం అకాల మరణం చెందాడు. కాగా, ప్రభు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. కౌన్సిలర్ చిన్నస్వామిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగానే మరో సైనికుడు ప్రభాకర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన అన్నను చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు తాను విధుల్లోకి వెళ్లే ప్రసక్తిలేదని తెలిపారు. న్యాయం కోసం డిమాండ్ చేశాడు. -
అనారోగ్యంతో ఉన్న సైనికుడి భార్య కోసం.. మరో ఆర్మీ సైనికుడి..
సాక్షి, చెన్నై: పుణెలోని ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియో థొరాసిక్ సైన్సెస్ అనారోగ్యంతో ఉన్న ఒక సైనికుడి భార్యకు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసింది. ఆ మహిళకు బ్రెయిన్ డెడ్ అయిన 40 ఏళ్ల ఆర్మీ వెటరన్ గుండెను అమర్చారు. ఫిబ్రవరి 8న మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో జరిగిన ప్రమాదంలో ఆ దిగ్గజ సైనికుడు తీవ్రంగా గాయపడటంతో బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో అతని గుండెను ఢిల్లీ నుంచి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో పుణేలోని అనారోగ్యంతో బాధపడుతున్న మరో సైనికుడి భార్య కోసం తరలించారు. అందుకోసం అధికారులు పూణే ట్రాఫిక్ అధికారుల సమన్వయంతో దాదాపు నాలుగంటల్లో తరలించారు. దీంతో ఆమెకు వైద్యులు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. పూణే ట్రాఫిక్ పోలీసుల సాయంతో విమానంలో గుండెను సకాలంలో తరలించడంతో విజయవంతంగా ఆపరేషన్‌ను పూర్తి చేయగలిగాం. ఇప్పటి వరకు ఈ ఆస్పత్రిలో ఇలాంటి శస్త్ర చికిత్సలు రెండు జరిగాయని ఇది మూడో శస్త్ర చికిత్స అని పుణె ఆర్మీ ఆస్పత్రి ట్వీట్టర్లో పేర్కొంది. #AICTS,#Pune performs second heart transplant in two weeks.The donor was a #veteran from #Delhi & the recipient is the wife of a soldier of #IndianArmy. Dedicated aircraft from #IAF & green corridor by #SouthernCommand provost unit & traffic police ensured timely response#WeCare pic.twitter.com/fyr1w9ku7Z — Southern Command INDIAN ARMY (@IaSouthern) February 12, 2023 (చదవండి: మూడేళ్లుగా రిలేషన్షిప్..చివరికి ప్రియురాలిని చంపి పరుపులో కుక్కి..) -
Video: 6 నెలల తర్వాత తొలిసారి.. ఉక్రెయిన్ సైనికుడిని చూసి భార్య భావోద్వేగం
ఉక్రెయిన్‌పై భీకర క్షిపణులు, డ్రోన్లతో రష్యా విరుచుకుపడుతోంది. కొత్త ఏడాదిలోనూ రష్యా దాడులు ముమ్మరం చేయడంతో ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉక్రెయిన్ సైత్యం మాస్కో చర్యకు ధీటుగా సమాధానమిస్తోంది. రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలను క్రమంగా తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. నూతనఏడాది సందర్భంగా ఆదివారం డొనెట్స్క్లోని మకీవ్వా నగరంలో మాస్కో సైనిక శిబిరంపై ఉక్రెయిన్ రాకెట్ లాంఛర్లతో దాడి జరిపింది. ఈ దాడిలో 89 మంది సైనికులు మరణించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మృతుల్లో తమ రెజిమెంట్ డిప్యూటీ కమాండర్, లెఫ్టినెంట్ కల్నల్ బచూరిన్ ఉన్నట్లు తెలిపింది. దాదాపు ఈ 11 నెలల యుద్ధ సమయంలో ఉక్రెయిన్ అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వేలాదిమంది సైనికులు యుద్ధ భూమిలో అమరులయ్యారు. ముఖ్యంగా రష్యా మొండి చర్యకు ఉక్రెయిన్ అమాయక ప్రజలు బలైపోయారు. అనేక కుటుంబాలు విచ్చిన్నమయ్యాయి. కోట్లలో ఆస్తి నష్టంతోపాటు ఏళ్ల చరిత్ర కలిగిన సంపంద నాశనమవ్వడంతో దేశం అందవిహీనంగా తయారైంది. సైనికులు, పౌరులకు సంబంధించి ఎన్నో భావోద్వేగ, హృదయ విదారక దృశ్యాలు బయటకొచ్చాయి. తాజాగా ఉక్రెయిన్‌లో గుండెను హత్తుకునే మరో వీడియో వెలుగులోకి వచ్చింది. దేశం కోసం పోరాడుతున్న ఉక్రెయిన్ సైనికుడు చాలా కాలం తర్వాత గర్భవతిగా ఉన్న తన భార్యను కలుసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంటోన్ గెరాష్చెంకో అనే ట్విటర్ అకౌంట్లో అ వీడియో పోస్టు చేశారు. ఇందులో గర్భిణీగా ఉన్న మహిళ ఉక్రెయిన్ సైనికుడైన తన భర్తకు కలవడానికి ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది.యూనిఫాం ధరించిన భర్తను చూడగానే అతన్ని గట్టిగా హత్తుకుంటుంది. భర్తను కలిసిన ఆనందంలో మహిళ కన్నీళ్లు పెట్టుకోవడం చూడవచ్చు. This is what we're fighting for. They haven't seen each other for 30 weeks. 📹: yanina_sham/Instagram pic.twitter.com/vVrkdlRAln — Anton Gerashchenko (@Gerashchenko_en) January 3, 2023 ‘దీనికోసమే మేయు యుద్ధంతో పోరాడుతున్నాం. ఈ సంతోషమే మాకు కావాల్సింది. వారు 30 వారాలుగా ఒకరినొకరు చూసుకోలేదు. ఎట్టకేలకు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న సందర్భం రానేవచ్చింది’ అనే క్యాష్షన్తో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు.‘విలువైన ప్రేమకు ఈ వీడియో నిదర్శనం. అద్భుతం.. హృదయాన్ని హత్తుకుంటోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: కిమ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన దక్షిణ కొరియా..! -
జవాన్‌కు జన్మ‘భూమి’!
ములుగు(గజ్వేల్): దేశరక్షణకు అంకితమైన ఆ సైనికుడికి ఇంటి స్థలం లేదు. ఆ విషయాన్ని స్వగ్రామం గుర్తించింది. వంద గజాల స్థలాన్ని అందజేసి ఆ సైనికుడిపై తమ గౌరవాన్ని చాటుకుంది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం సింగన్నగూడ గ్రామానికి చెందిన తాళ్ల వెంకటేష్ సైనికుడిగా జమ్ముకశ్మీర్‌లో సేవలందిస్తున్నాడు. అతనికి స్వగ్రామంలో ఇంటి స్థలం లేదు. దీంతో గ్రామస్తులు రామాలయం వెనుక ప్రాంతంలో గ్రామకంఠానికి చెందిన సుమారు రూ.6 లక్షల విలువైన వంద గజాల స్థలాన్ని వెంకటేశ్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం పంచాయతీ, గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు. అతని పేరిట స్థలం హక్కు పత్రాన్ని రాసి అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బట్టు అంజిరెడ్డి, ఎస్ఐ రంగకృష్ణ, సర్పంచ్ బాలకృష్ణ, ఉపసర్పంచ్ స్వామిగౌడ్ పాల్గొన్నారు. -
వైరల్ వీడియో: ఖెర్సన్ జూలో జంతువులను ఎత్తుకుపోతున్న రష్యా సేనలు
-
ప్చ్! పోరాడలేకపోయాం...కనీసం కొట్టేద్దాం: రష్యా బలగాలు
ఖెర్సన్ నుంచి రష్యా బలగాలు వైదొలగడంతో ఉక్రెయిన్‌లో పండగ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నగరమంతా రష్యా బలగాలను తరిమికొట్టేశాం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఆనందంగా ప్రకటించారు. ఈ మేరకు వెనక్కు మళ్లుతున్న రష్యా సేనాలు ఎలాగో పోరాడలేకపోయం కదా పోతూపోతూ... ఖెర్సన్ ప్రాంతంలో జూలోని జంతువులను పట్టుకుపోతున్నారు. బహుశా ఎలాగో పోతున్నాం కదా అని దొంగతనం చేస్తున్నారు కాబోలు. ఈ క్రమంలో ఖెర్సన్ జూలోని ఏడు రకూన్లు అనే అమెరికన్ ఎలుగుబంటి జాతులను, లామా అనే ఒంటె, నెమళ్లు, రెండు ఆడ తోడేళ్లు, గాడిద వంటి జంతువులను బలవంతంగా పట్టుకుని వాహనంలో ఎక్కించారు. కేవలం జంతువులే కాదు అక్కడ ఆస్పత్రుల్లో ఉన్న వివిధ కళాఖండాలు, వైద్య పరికరాలు వంటివి పట్టుకుపోయారు. ఈ మేరకు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ జంతు ప్రదర్శనశాల నుంచి రష్యా బలగాలు జంతువులను పట్టుకుపోవడాన్ని తప్పపట్టారు. ఆర్ట్ గ్యాలరీ నుంచి పెయింటింగ్‌లు,మ్యూజియంల నుంచి పురాత వస్తువులు తదితరాలన్నింటిని దొంగలించినట్లు తెలిపింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు రష్యా బలగాలు ఉక్రెయిన్‌ని ఏమీ చేయలేక ఈ దొంగతనానికి ఒడిగట్టారంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: చర్చల ప్రసక్తే లేదు...తెగేసి చెప్పిన జెలెన్స్కీ) -
పెళ్లి వేడుక.. సరిగ్గా తాళిబొట్టు కట్టే సమయానికి ట్విస్ట్..
యశవంతపుర: ఆదర్శంగా ఉండాల్సిన సైనికుడు తప్పుదోవ పట్టాడు. వితంతు మహిళను పెళ్లి చేసుకొని, మళ్లీ మరో యువతితో మూడుముళ్లకు సై అన్నాడు. మొదటి భార్య ఎంట్రీ తో సీన్ మారిపోయింది. ఈ సంఘటన హాసన్ జిల్లా భువనహళ్లిలో జరిగింది. గతంలో వితంతు మహిళను పెళ్లాడి వివరాలు... సైన్యంలో జవాన్‌గా పని చేస్తున్న కిరణ్‌కుమార్ కొంతకాలం కిందట ఒక వితంతు మహిళతో పరిచయం పెంచుకుని ఆమెను పెళ్లి చేసుకొని జీవిస్తున్నాడు. ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పలేదు. ఇంతలో ఎక్కువ కట్నం వస్తుందనే ఆశతో మరో యువతితో పెళ్లిని కుదుర్చుకున్నాడు. హాసన్ భువనహళ్లిలోని కళ్యాణ మండపంలో శుక్రవారం పెళ్లి వేడుక జరుగుతోంది. సరిగ్గా తాళిబొట్టు కట్టే సమయానికి మొదటి భార్య చేరుకుంది. తనను 6 నెలల క్రితం గుట్టుగా వివాహం చేసుకున్నట్లు వధువు తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అందరూ నిర్ఘాంతపోయారు. ఆమె ఎవరో తెలియదని, అబద్ధం చెబుతోందని పెళ్లికొడుకు మొండికేశాడు. తరువాత పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి అతన్ని విచారించగా, వితంతువును పెళ్లి చేసుకున్నట్లు ఒప్పుకున్నాడు. చివరికి పెళ్లి రద్దు కాగా, పోలీసులు వరుని కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: భర్తకు భలే ఆఫరాచ్చిన భార్య.. సోషల్ మీడియా ట్రెండింగ్‌లో దంపతులు -
మిరాకిల్.. యుద్ధ ట్యాంక్ కింద నలిగినా ప్రాణాలతో బయటపడి..
మాస్కో: సైన్యం మిలిటరీ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో ఓ యుద్ధ ట్యాంకర్ సైనికుడి పైనుంచి దూసుకెళ్లింది. 13 టన్నుల బరువున్న వాహనం తనపై నుంచి వెళ్లినా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. చక్రాల కింద నలిగినా మరణాన్ని జయించాడు. ఇంతా జరిగినా యథావిధిగా మళ్లీ లేచి తన స్థానంలో నిల్చున్నాడు. రష్యా సైన్యం మిలిటరీ డ్రైవ్ సమయంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 🤡Nothing says "Second Greatest Military Force in the World" quite like crushing your own soldiers under the wheels of a 13 tonne APC during a "cool military drive-by" demonstration. pic.twitter.com/xgFeTWYMCA — Captain Black Sea (@CaptainBlackSe1) October 13, 2022 అయితే రష్యా సైన్యం తీరుపై కొందరు నెటిజన్లు మండిపడ్డారు. ప్రపంచంలో శక్తిమైన సైన్యంగా చెప్పుకునే రష్యా ఆర్మీ.. సొంత సైనికుడి మీద నుంచే యుద్ధ ట్యాంకర్‌ను పోనివ్వడం వారి నైపుణ్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. మరికొందరు మాత్రం రష్యా సైనికుడు ప్రణాలతో బయటపడటం మిరాకిల్‌లా ఉందని అన్నారు. అతను అదృష్ట జాతకుడని, అందుకే ఇంకా ఆయుషు మిగిలి ఉందని పేర్కొన్నారు. చదవండి: షాకింగ్ ఘటన.. రూ.690 కోట్ల పెయింటింగ్‌పై.. -
రష్యా చెర నుంచి బయటపడిన ఉక్రెయిన్ సైనికుడి షాకింగ్ ఫోటోలు
కీవ్: రష్యన్ల బంధిఖానా నుంచి బయటపడిన ఉక్రెయిన్ సైనికుడి షాకింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ మైఖైలో డయానోవ్ అనే ఉక్రెయిన్ సైనికుడి ఫోటోలను ట్విట్టర్లో పంచుకుంది. ఉక్రెయిన్ మంత్రిత్వశాఖ ఆ షాకింగ్ ఫోటోలతోపాటు .. రష్యా జెనివా ఒప్పందాలకు కట్టుబడి దాదాపు 204 మంది ఉక్రెనియన్ యుద్ధ ఖైదీలను విడుదల చేసినట్లు పేర్కొంది. నాజీయిజానికి చెందిన వారసత్వాన్ని రష్యా ఇలా కొనసాగిస్తోంది అనే క్యాప్షన్ జోడించి మరీ ఆ సైనికుడు ఫోటోలను పోస్ట్ చేసింది. అయితే యుద్ధం చేస్తున్నప్పుడు ఉన్న సైనికుడి రూపు చెరలో నుంచి బయటపడిన తర్వాత అత్యంత ఘోరంగా మారిపోయింది. ఆ సైనికుడు ఇతనేనా అనేంత విస్తుపోయేలా దారుణంగా ఉన్నాడు. ఒకరకంగా చెప్పాలంటే డయానోవ్ రష్యా చెర నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడినందుకు అదృష్టవంతుడనే చెప్పాలి. కాగా అతను మారయుపోల్లోని అజోవ్‌స్టల్ స్టీల్ వర్క్‌లను రక్షించే నిమిత్తం యుద్ధం చేస్తున్న సమయంలోనే నిర్బంధింపబడ్డాడు. రష్యా విడుదల చేసిన 250 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలలో అతను ఒకడు. ఈ క్రమంలో సదరు యుద్ధ సైనికుడి సోదరి అలోనా నామ్రష్కో మాట్లాడుతూ...అతను ముఖం చేతులపై గాయాలతో కృశించిపోయి ఉన్నాడని తెలిపింది. ప్రస్తుతం డయానోవ్ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొంది. పేలుడు పదార్థాలలోని ఒక లోహం అతని చేతిలోకి దిగిపోయిందని, ఐతే దాన్ని వారు ఎలాంటి మత్తుమందు ఇవ్వకుండా తీయడంతో సుమారు 4 సెం.మీ ఎముకను తీసేయాల్సి వచ్చినట్లు వెల్లడించింది. అతని పరిస్థితి చాలా క్రిటకల్‌గా ఉందని, దీర్ఘకాలిక చికిత్స అవసరమని కన్నీటిపర్యంతమయ్యింది. తన సోదరుడు మానసికంగా దృఢంగా ఉన్నందుకు సంతోషంగా ఉందని, ముఖ్యంగా అతను తిరిగొచ్చినందుకు అత్యంత ఆనందంగా ఉందని చెప్పింది. డయానోవ్ కూడా తాను హాయిగా శ్వాస పీల్చుకోగలుగుతున్నాను, నడవగలుగుతున్నందుకు సంతోషంగా ఉందంటూ తన గుండె నిబ్బరాన్ని చాటుకున్నాడు. (చదవండి: దేశం వీడి పారిపోతున్న రష్యన్లు.. లక్షలు వెచ్చించి విమాన టికెట్లు కొనుగోలు) -
ఉక్రెయిన్‌లో వెల్లివిరిస్తున్న ఆనందం... తల్లిని కలుసుకున్న సైనికుడు: వీడియో వైరల్
రష్యా దురాక్రమణ యుద్ధంతో ఉక్రెయిన్ భూభాగంలోని చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐతే గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ సేనలు అలుపెరగని పోరుతో రష్యా నియంత్రణలో ఉన్న ప్రాంతాలన్నింటినికి ఒక్కొక్కటిగా తిరిగి స్వాధీనం చేసుకుంటూ విజయకేతనాన్ని ఎగరువేస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఉక్రెయిన్‌లో రెండోవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్ నగరాన్ని ఉక్రెయిన్ బలగాలు రష్యా నుంచి తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో నివాసం ఉంటున్న తన తల్లిని ఒక ఉక్రెయిన్ సైనికుడు కలుసుకున్నాడు. ఉక్రెయిన్ బలగాలు ఖార్కివ్ ప్రాంతం నుంచి రష్యా బలగాలను తరిమికొట్టిన తర్వాత ఆరునెలల సుదర్ఘీ పోరు తదనంతరం తన తల్లిన ఆలింగనం చేసుకుని భావోద్వేగం చెందాడు. ఈ మేరకు ఖార్కివ్ మేయర్ ఈ భావోద్వేగ సన్నివేశాన్ని ఒక వీడియోలో బంధించి.... 'చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మధురమైన క్షణం' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్ తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యాక్సిడెంట్.. ఆస్పత్రికి తరలింపు) -
38 ఏళ్ల తర్వాత ఆర్మీ జవాన్ మృతదేహం లభ్యం
న్యూఢిల్లీ: మంచు తుపాను కారణంగా గల్లంతైన జవాను ఆచూకీ 38 ఏళ్ల తర్వాత లభ్యమైంది. సియాచిన్ వద్ద హిమాలయాల్లో ఓ మంచుదిబ్బ వద్ద రెండు మృతదేహాల్ని జవాన్లు కనుగొన్నారు. అక్కడే లభించిన ఐడెంటిఫికేషన్ డిస్క్‌పై ఉన్న సంఖ్య ఆధారంగా ఆ అమర సైనికుడిని లాన్స్ నాయక్ చంద్రశేఖర్‌గా గుర్తించింది రాణిఖేట్‌లోని సైనిక్ గ్రూప్ సెంటర్. 19 కుమావోన్ రెజిమెంట్‌లో సభ్యుడైన చంద్రశేఖర్ హర్బోలా స్వస్థలం ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలోని ద్వారాహట్. 1975లో సైన్యంలో చేరారు. లాన్స్ నాయక్ హోదాలో భారత సైన్యంలో పని చేశారు. 1984లో 'ఆపరేషన్ మేఘ్‌దూత్'లో భాగంగా పాకిస్థాన్‌తో పోరాడేందుకు చంద్రశేఖర్ సహా మొత్తం 20 మంది జవాన్ల బృందాన్ని రంగంలోకి దింపింది భారత సైన్యం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం సియాచిన్‌లో వారిని మోహరించింది. మే 29వ తేదీన ఒక్కసారిగా మంచు తుపాను విరుచుకుపడింది. చంద్రశేఖర్ సహా మొత్తం 20 మందిని మంచు రక్కసి మింగేసింది. సైన్యం 15 మంది మృతదేహాల్ని వెలికితీసింది. ఎంత ప్రయత్నించినా మిగిలిన ఐదుగురి ఆచూకీ దొరకలేదు. అందులో చంద్రశేఖర్ ఒకరు. చంద్రశేఖర్ గల్లంతు కావడానికి 9 ఏళ్ల ముందు.. అల్మోరాకు చెందిన శాంతి దేవితో ఆయనకు వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు(వయసు 4 ఏళ్లు, ఏడాదిన్నర). అప్పుడు శాంతి దేవి వయసు 28 సంవత్సరాలు. అప్పటినుంచి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు ఆయన పరిస్థితి ఏంటో తెలియకుండానే గడుపుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ హల్ద్వానీలో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ మృతదేహం సోమవారం రాత్రికి స్వగ్రామం చేరుకోనుంది. హల్ద్వానీ సబ్ కలెక్టర్ మనీశ్ కుమార్, తహసీల్దార్ సంజయ్ కుమార్.. జవాను ఇంటికి వెళ్లారు. పూర్తిస్థాయి మిలిటరీ గౌరవంతో అత్యక్రియలను నిర్వహిస్తామని తెలిపారు. ఇదీ చదవండి: అట్టారీ-వాఘా సరిహద్దుల్లో అట్టహాసంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు -
జవాన్ల గ్రామం.. ఊరి తల్లిదండ్రులకు పాదాభివందనం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దుల్లో పహారా కాసే జవాన్లుగా ప్రత్యక్షంగా దేశసేవ చేస్తూ తమ ఊరికే కాక నిజామాబాద్ జిల్లాకే గర్వకారణంగా నిలుస్తున్నారు ఈ యువకులు. మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి నుంచి గత 21 ఏళ్లలో సగటున ఏడాదికొకరు చొప్పున 21 మంది యువకులు ఆర్మీ, ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్) దళాల్లోకి వెళ్లారు. మొత్తం ఉత్తర తెలంగాణలోనే ఈ ఊరి ప్రత్యేకతను చాటుతున్నారు. దీంతో ఈ గ్రామాన్ని ‘అడవి మామిడిపల్లి’ అని కాకుండా ‘జైహింద్ మామిడిపల్లి’ అని మార్చాలనే స్ఫూర్తిని కలిగిస్తోంది. ఇక ఊరిలోకి అడుగుపెట్టగానే స్వామి వివేకానంద విగ్రహం కనిపిస్తుంది. ఊరి మధ్యలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలు దర్శనమిస్తాయి. దేశభక్తి స్ఫూర్తిగా విగ్రహాలు నెలకొల్పడంతో పాటు తమ బిడ్డలను దేశ రక్షణ కోసం సరిహద్దుల పహారాకు పంపుతున్న ఆ ఊరి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలని పలువురు చెబుతుండడంలో అతిశయోక్తి లేదు. చాలాసార్లు ఏడుపొస్తుంది మా కుమారుడు కల్లెడి సాయికుమార్ 2012లో ఆర్మీలోకి వెళ్లాడు. ఉన్న ఎకరం అమ్మి కుమార్తె పెళ్లి చేశాం. మాకు ఇల్లు లేదు. అద్దెకు ఉంటున్నాం. ఇంటర్ తర్వాత చదివించలేకపోయాం. ఉన్న ఒక్క కొడుకు పట్టుబట్టి ఆర్మీలోకి వెళ్లాడు. ఒక్కడే కొడుకు కావడంతో బాధతో చాలాసార్లు ఏడుస్తాం. అయినా దేశానికి సేవ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఫోన్ చేసి ఏడవద్దని ఓదారుస్తాడు. మా కోడలి డెలివరీకి సైతం అతి కష్టంమీద సెలవు తీసుకుని వచ్చి వెళ్లాడు. –కల్లెడి జయ, నారాయణ దంపతులు అగ్నిపథ్‌కు ముందుకొస్తున్నారు.. మా ఊరి నుంచి యువకులు సైన్యంలోకి వెళ్లడం 2000 సంవత్సరం నుంచి మొదలైంది. ఇప్పటి వరకు 21 మంది యువకులు ఆర్మీ, ఐటీబీపీ విభాగాల్లోకి వెళ్లారు. ముగ్గురు ఇప్పటికే ఆర్మీ నుంచి రిటైర్ కాగా మిగిలినవారు సర్వీసులో ఉన్నారు. మరో ఎనిమిది మంది యువకులు అగ్నిపథ్‌కు దరఖాస్తులు చేసుకున్నారు. 600 గడపలు ఉన్న మా ఊరి నుంచి క్రమం తప్పకుండా యువకులు సైన్యంలోకి వెళుతుండడం ఊరంతటికీ గర్వకారణం. – గంగోని సంతోష్, మాజీ సర్పంచ్ ఎన్ఎస్జీలో పనిచేశాను.. దేశ సేవ చేయాలని ఆర్మీలోకి వెళ్లాను. అసోంలో పనిచేసే సమయంలో కఠినంగా సాధన చేసి ఎన్ఎస్జీ(నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్)కి ఎంపికయ్యా. ఎన్ఎస్జీలో మూడేళ్లు పనిచేశా. 90 రోజుల కఠిన శిక్షణలో నెగ్గితేనే దీనికి ఎంపిక చేశారు. మిలిటెంట్ ఆపరేషన్, వీఐపీ పర్యటనలు, బాంబ్ స్క్వాడ్ విధుల్లో పాల్గొన్నాను. 16 ఏళ్ల సర్వీసు పూర్తయ్యాక ఊరికి వచ్చి కౌలు వ్యవసాయం చేస్తున్నా. ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగావకాశాలు ఇవ్వడం లేదు. – కాపుకారి జానకీరాం, మాజీ జవాన్ శ్రీనగర్‌లో హవల్దార్‌గా.. గత 19 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తున్నా. సిపాయిగా ఎంపికై లాన్స్‌నాయక్, నాయక్‌గా ఉన్నతి పొంది ప్రస్తుతం హవల్దార్‌గా ఉన్నాను. ప్రస్తుతం శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్నాను. పలుసార్లు తీవ్ర మంచులో ఆపరేషన్లలో పనిచేశాను. రోడ్లు ధ్వంసమై, కొండచరియలు విరిగిపడిన సందర్భాల్లో నెలలతరబడి బయటకు రాలేని పరిస్థితి. కనీసం ఎవరితోనూ కమ్యూనికేషన్ లేకుండా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. – కేతావత్ రవీందర్ పెద్దనాన్న మృతి సైతం తెలియలేదు.. 2011లో ఆర్మీలో చేరాను. ప్రస్తుతం జమ్ములో నాయక్ హోదాలో పనిచేస్తున్నా. మహారాష్ట్ర, రాజస్థాన్, సికింద్రాబాద్, కశ్మీర్‌లలో పనిచేశాను. మేం మరణించినా సరే శత్రువును చంపడమే లక్ష్యంగా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. కొన్ని సందర్భాల్లో 3 నెలల పాటు కుటుంబ సభ్యులతో పాటు మరెవరితోనూ కమ్యూనికేషన్ లేదు. నా పెద్దనాన్న మృతి గురించి కూడా తెలియకుండా అయింది. – బాణావత్ నరేశ్ ఆర్టికల్ 370 రద్దు తరువాత.. 2012లో ఆర్మీలో చేరి ప్రస్తుతం జమ్ములో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నా. ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో మూడు నెలల పాటు ఏమాత్రం కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది. బయటి ప్రపంచంతో సంబంధం లేని లేకుండా విధులు నిర్వహించాం. ఆర్మీలో పనిచేయడం ఆనందంగా ఉంది. – సంగెం అనిల్ 17 ఏళ్ల సర్వీసు పూర్తి.. మా ఊరి నుంచి మొదటిసారి 2000 సంవత్సరంలో చంద్రశేఖర్ ఆర్మీలోకి వెళ్లారు. ఆయన స్ఫూర్తితో నేను సైతం దేశ సేవ చేసేందుకు 2004లో ఆర్మీలో చేరాను. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేశాను. 17ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 2021లో వచ్చాను. అప్పటినుంచి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నా. – మావూరి రవీందర్, మాజీ జవాన్ భర్త గురించి టెన్షన్ పడ్డా.. నా భర్త జానకీరాం ఆర్మీలో చేసే సమ యంలో నేను కూడా పంజాబ్, ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హైదరాబాద్ క్వార్టర్స్‌లో ఉన్నా. అయితే అభినందన్ వర్ధమాన్ ఘటన నేపథ్యంలో నా భర్త కిట్ బ్యాగులతో వెళ్లిన సందర్భంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందాను. నా భర్త ఏ విషయం చెప్పకపోవడంతో బాగా టెన్షన్ కలిగింది. ప్రస్తుతం సర్వీసు పూర్తి చేసుకుని ఊర్లోనే ఉంటున్నాం. – కాపుకారి భవిత గర్వంగా ఉంది.. నా భర్త అనిల్ ఆర్మీ లో పనిచేస్తున్నాడంటే ఏదో ఉద్యోగం అనుకున్నా. అయితే ఇది దేశం కోసం చేసే అత్యంత రిస్క్ అని తెలిసి ఆందో ళన చెందినప్పటికీ గర్వంగానే ఉంటోంది. కు టుంబాన్ని మిస్ అవుతున్నప్పటికీ మాకు గర్వమే. గతంలో ఢిల్లీలో ఉన్నాను. ఇప్పుడు నా భర్త జమ్ములో పనిచేస్తుండగా, నేను ఇద్దరు పిల్లలు, అత్త, మామలను చూసుకుంటూ ఊర్లోనే ఉంటున్నా. – సంగెం వాణి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది మాకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఏకైక కుమారుడు అనిల్ జమ్ము లో ఆర్మీలో పనిచేస్తున్నాడు. అందరికీ పెళ్లిళ్లు చేశాను. ఒక్కగానొక్క కొడుకును ఆర్మీలోకి ఎలా పంపావని చాలామంది అడుగుతుంటే, జమ్ము కశ్మీర్లో విధ్వంసకర వార్తలు వస్తుంటే బాధ కలుగుతుంది. అయినప్పటికీ మా కొడుకు విషయంలో గర్వంగా ఉంటోంది. – సంగెం చిన్న హనుమాండ్లు -
పాక్ మహిళల మాయలో ఆర్మీ జవాన్.. కీలక సమాచారం లీక్!
జైపూర్: పాకిస్థాన్ మహిళలు విసిరిన వలపు వల(హనీట్రాప్)లో పడి సైన్యానికి సంబంధించిన కీలక సమాచారం లీక్ చేశాడన్న ఆరోపణలతో ఓ ఆర్మీ ఉద్యోగి అరెస్టయ్యారు. సైన్యానికి సంబంధించిన సమాచారం లీక్ ఆరోపణలతో భారత ఆర్మీ జవాన్ శాంతిమే రాణా(24)ను అరెస్ట్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అధికారిక రహస్యాల చట్టం 1923 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని బగుండా జిల్లా కంచన్పుర్ గ్రామానికి చెందిన శాంతిమే రాణా ప్రస్తుతం జైపూర్‌లోని ఆర్టెరీ యూనిట్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘సామాజిక మాధ్యమాల వేదికగా పాకిస్థాన్ ఏజెంట్లు గుర్నౌర్ కౌర్ అలియాస్ అంకిత, నిషాలు రాణాకు పరిచయమయ్యారు. రాణా ఫోన్ నంబర్ తీసుకున్నారు. వాట్సాప్ ద్వారా ఇద్దరు జవాన్‌తో మాట్లాడేవారు. వారిని పూర్తిగా నమ్మినట్లు గుర్తించిన తర్వాత నిఘా సమాచారం సేకరించటం మొదలు పెట్టారు. అందుకు బదులుగా రాణా ఖాతాలో కొంత డబ్బు సైతం జమ చేశారు.’ అని రాజస్థాన్ పోలీస్ నిఘా విభాగం డీజీ ఉమేష్ మిశ్రా తెలిపారు. ఇలా ట్రాప్ చేశారు.. 2018, మార్చిలో ఆర్మీ చేరారు జవాన్ శాంతిమే రాణా. ప్రస్తుతం జైపూర్‌లోని ఆర్టెరీ యూనిట్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమయ్యారు ఇద్దరు పాకిస్థానీ మహిళా ఏజెంట్లు. చాలా కాలంగా ఆ ఏజెంట్లతో వాట్సాప్ చాట్, వీడియా, ఆడియో సందేశాలతో మాట్లాడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన మహిళగా పరిచయం చేసుకుంది గుర్నౌర్ కౌర్ అలియాస్ అంకిత. మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో పని చేస్తున్నట్లు తెలిపింది. మరో మహిళ నిషాగా పరిచయమైంది. ఆమె మిలిటరీ నర్సింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది. కొద్ది రోజుల తర్వాత సైనిక సమాచారం, రహస్య పత్రాల కోసం రాణాను అడిగారు. వారిని నమ్మిన రాణా వాటిని అందించారు. జవాన్ కదలికలపై అనుమానంతో నిఘా వేసిన ఉన్నతాధికారులు.. పాకిస్థాన్ మహిళలతో మాట్లాడుతున్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: రూ.3వేల కోట్లు విద్యుత్తు బిల్లు.. షాక్‌తో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి! -
ఆ చిన్నారి చేసిన పని చూస్తే... నోట మాట రాదు!వీడియో వైరల్
ఇటీవలకాలంలో చిన్నారులు స్మార్ట్ ఫోన్లతో అల్లరి చిల్లరిగా ఉంటున్నారు. అమ్మానాన్నలకు నేటి జనరేషన్‌ని హ్యండిల్ చేయడానికి చాలా ప్రయాసపడుతున్నారు. ప్రతి దాన్ని స్పీడ్‌గా క్యాచ్ చేసేస్తారు. ప్రశ్నించేందుకు కూడా ఏ మాత్రం భయపడరు. కానీ నేటి పిల్లలకు పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకోవడం తెలయడం లేదనే చెప్పాలి. పైగా తల్లిదండ్రలు చెప్పినా...పాటించే పిల్లలు కూడా అరుదే. కానీ ఇక్కడోక చిన్నారి చేసిన పని చూసి ఆశ్చర్యపోకుండా ఉండరు. కచ్చితంగా ఆ చిన్నారిని మెచ్చుకోకుండా ఉండలేరు కూడా. వివరాల్లోకెళ్తే...ఇక్కడోక చిన్నారి రైల్వేస్టేషన్లో ఉన్నా ఆర్మీ జవాన్ల వద్దకు నడుచుకుంటూ వెళ్లుతుంది. అక్కడ ఉన్నవాళ్లకు కూడా మొదట అర్థం కాదు. ఆ చిన్నారి ఎందుకు ఇలా తమ వద్దకు వస్తుందని ఆశ్చర్యంగా చూస్తారు. కాసేపటికీ ఒక జవాను పలకరిస్తాడు. అయినా ఆ చిన్నారి ఏ చెప్పకుండా హఠాత్తుగా ఆ జవాన్ కాళ్లను తాకి పాదాభివందనం చేస్తుంది. దీంతో అక్కడ ఉన్న జవాన్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఆమెను దగ్గరకు తీసుకుని మెచ్చుకోలుగా కాసేపు మాట్లాడతాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (చదవండి: ఎడారిలో స్మార్ట్ సిటీ...అక్కడ ఎగిరే డ్రోన్ టాక్సీలు, ఎలివేటర్,) -
మహోజ్వల భారతి: ఐదు యుద్ధాల వీరుడు
సాహసోపేత భారత సైనికుడు, జాతీయ హీరో.. ఫీల్డ్ మార్షల్ మానెక్షా పూర్తి పేరు శాం హోర్ముస్జీ ఫ్రేంజీ జెమ్షెడ్జీ మానెక్ షా . 1971లో పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్‌కు అతిపెద్ద సైనిక విజయాన్ని సాధించి పెట్టి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి అద్యుడయ్యారు. షా తన కెరీర్లో మొత్తం ఐదు యుద్ధాలలో పాల్గొన్నారు. గూర్ఖా రైఫిల్స్‌తో ఆయనకున్న అనుబంధానికి గుర్తుగా అందరూ ప్రేమతో ఆయనను ‘శ్యామ్ బహదూర్’ అని పిలుచుకునేవారు. షా అమృత్‌సర్‌లోని పార్శీ దంపతులకు జన్మించారు. నలుగురు అన్నలు, ఇద్దరు అక్కలు. బ్రిటిష్ హయాం మొదలుకొని నాలుగు దశాబ్దాల పాటు సైన్యంలో సేవలు అందజేసిన శాం మానెక్షా– రెండవ ప్రపంచ యుద్ధంలోను, భారత స్వాతంత్య్రానంతరం చైనా, పాకిస్థాన్లతో జరిగిన మూడు యుద్ధాల సందర్భంగాను ప్రదర్శించిన వ్యూహ చతురత, బుద్ధికుశలత అమోఘమైనవి. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జపాన్ ఆక్రమిత దళాలను తిప్పికొట్టేందుకు ఉద్దేశించిన సైనిక విభాగం అధిపతిగా బర్మాలో ఆయన ప్రాణాలొడ్డి పోరాడారు. కడుపులోకి ఏడు గుళ్లు దూసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. అపూర్వ ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే అత్యున్నత పతకం ‘మిలిటరీ క్రాస్’ను అమర వీరులకు ప్రకటించరాదన్నది నియమం. అందుకే మానెక్షా బతికి బట్టకట్టకపోవచ్చునని భావించిన నాటి మేజర్ జనరల్ డి.టి.కోవన్, తన ‘మిలిటరీ క్రాస్ రిబ్బన్’ను తక్షణం మానెక్షాకు ప్రదానం చేశారు. అదృష్టవశాత్తూ మృత్యుముఖంలోంచి బయటపడిన మానెక్షా, మరోసారి బర్మాలో జపాన్ సైనికులను ఢీకొన్నారు. మళ్లీ గాయపడినప్పటికీ వెన్నుచూపలేదు. జపాన్ సైనికులు లొంగిపోయాక, 10 వేల మందికిపైగా యుద్ధఖైదీలకు పునరావాసం కల్పించడంలో కూడా షా కీలకపాత్ర పోషించారు. 1947లో దేశవిభజన, 1947–48లో జమ్మూకశ్మీర్‌లో సైనికచర్యల సందర్భంగా ఆయన తన పోరాట సామర్థ్యాలను మరోమారు లోకానికి చాటిచెప్పారు. 1937లో షా లాహోర్‌లో ఉన్నప్పుడు ఓ కార్యక్రమంలో సిల్లూ బోడె ను ఆయన కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అదే ఏడాది ఏప్రిల్ 22 న వారు వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, షెల్లీ బాట్లీవాలా, మాయా దారూవాలా. నేడు (జూన్ 27) మానెక్షా వర్ధంతి. 1914 ఏప్రిల్ 3న ఆయన జన్మించారు. (చదవండి: స్వతంత్ర భారతి: మూడు రాష్ట్రాల అవతరణ) -
ఉక్రెయిన్ కోర్టు తొలిసారి కీలక తీర్పు.. యుద్ధ నేరానికి పాల్పడిన రష్యా సైనికుడికి..
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించి దాదాపు మూడు నెలలు కావొస్తుంది. గత 12 వారాల్లో రష్యా దళాలు ఉక్రెయిన్‌లో విధ్వంసం సృష్టించాయి. యుద్ధం ఫలితంగా భారీ స్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చోటుచేసుకుంటోంది. అయితే యుద్ధంలో ఇంత వరకు ఫలితం ఎటూ తేలలేదు. అయితే ఒక్క మరియూపోల్ నగరపై మాత్రం రష్యా ఆధిపత్యం సాధించింది. ఇక శత్రు బలగాలను ధీటుగా ఎదుర్కోవడమే కాకుండా రష్యాపై దాడులు కూడా చేస్తోంది ఉక్రెయిన్. కాగా తమ దేశంపై దండెత్తిన రష్యా సేనలపై ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాల కింద విచారణ మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ దేశ పౌరుడిని కాల్చి చంపినందుకు ఉక్రెయిన్ కోర్టు రష్యా సైనికుడికి జీవితఖైదు విధించింది. నిరాయుధుడైన 62 ఏళ్ల ఉక్రెయిన్ పౌరుడిని కాల్చి చంపి యుద్ధ నేరానికి పాల్పడినందుకు 21 ఏళ్ల ట్యాంక్ కమాండర్ వాదిమ్ షిషిమారిన్కు జీవిత కారాగార శిక్ష విధించింది. రష్యా సైనికుడి యుద్ధ నేరంపై విచారణ జరిపిన కోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఫిబ్రవరి 28న ఉక్రెయిన్‌లోని చుపాఖివ్కా గ్రామంలో వృద్ధుడిని రష్యా సైనిక అధికారి ఆదేశాల మేరకు కారులో నుంచి కాల్చి చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఇదిలా ఉండగా రష్యా యుద్ధ నేరాలకు సంబంధించి ఉక్రెయిన్ కోర్టు ఒక రష్యా సైనికుడికి ఇలా శిక్ష వేయడం తొలిసారి. చదవండి: ‘బీ కేర్‌ఫుల్’.. చైనాకు జో బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్ -
గ్రనేడ్లతో రష్యా సైనికుడి బెదిరింపులు
Ukraine Conflict: ఉక్రెయిన్‌లోని దక్షిణ తీర నగరం కొనొటొప్ను గురువారం రష్యా సేనలు దిగ్బంధించాయి. నగరంలోకి ప్రవేశించిన పౌరులను లొంగిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి. రష్యా సైనికుడొకరు నగరంలోని ఓ ప్రాంతంలో చేతుల్లో రెండు గ్రనేడ్లను పట్టుకుని, ప్రజల మధ్య తిరుగుతున్న వీడియో ఫుటేజీ ఒకటి బయటకు వచ్చింది. భయంతో కొందరు గ్రనేడ్ విసిరేయాలని అతడిని కోరగా, షేమ్ షేమ్ అని మరికొందరు అరుస్తున్నట్లుగా అందులో ఉంది. లొంగిపోతారా లేక పోరాడతారా అని నగర మేయర్ ఆర్టెమ్‌ను ఆ సైనికుడు హెచ్చరించాడు. ఈ విషయమై మేయర్ ఆర్టెమ్ స్పందిస్తూ.. ప్రస్తుతం బలగాలు నగరం బయటకు వెళ్లిపోయాయని చెప్పారు. తాము పోరాడటానికే నిశ్చయించుకున్నట్లు నగర ప్రజలు తెలిపారని అన్నారు. గురువారం ఉదయం నల్లసముద్ర తీర నగరం ఖెర్సన్‌పై పట్టుసాధించినట్లు రష్యా బలగాలు మొదటిసారిగా వెల్లడించాయి. (చదవండి: రష్యాకు కోలుకోలేని దెబ్బ.. ఇలా జరిగిందేంటి.. పుతిన్ తప్పు చేశారా..?) -
అమ్మ నాన్న ఐ లవ్ యూ !..వైరల్ అవుతున్న ఉక్రెయిన్ సైనికుడి చివరి వీడియో!
Ukrainian soldier deciding to record a video: ఉక్రెయిన్‌పై రష్యా భూ, వాయు, జల మార్గాలలో దాడుల చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా ఆకాశం నుంచి పడుతున్న క్షిపణులు వర్షంతో సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. అంతేకాదు మాస్కో ప్రారంభించిన దాడిలో సుమారు 137 మంది మరణించారని ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపిన సంగతి విధితమే. మరో వైపు మాస్కో ఏ మాత్రం కనికరం లేకుండా యుద్థ ట్యాంకులు, నౌకదళ నౌకలు, వైమానిక దాడులతో మూడు వైపుల నుండి భయంకరంగా దాడి చేస్తోంది. అంతకంతకు యుద్ధం తీవ్రతరం కావడంతో ఉక్రెయిన్లోనూ, ప్రపంచ దేశల్లోనూ అందరిలోనూ ఒకటే తీవ్ర ఉత్కంఠ. అదే సమయంలో ఒక సైనికుడు యుద్ధం చేసేందుకు వెళ్లే కొద్ది నిమిషాల ముందు తన తల్లిదండ్రులకు కలిచివేసే ఒక హృదయవిధారక సందేశాత్మక వీడియోని పంపాడు. అతను యుద్ధ బీభత్సంతో ఏ క్షణంలో ఏమవుతుందో అనే భావంతో తన తల్లిదండ్రులకు వీడ్కోలు చెప్పేందుకు ఒక వీడియోని రికార్డు చేశాడు . ఈ మేరకు ఆ సైనికుడు వీడియోలో.." మేము తీవ్రమైన బాంబు దాడిలో ఉన్నాము, ఇది మా వంతు. అమ్మా, నాన్న, ఐలవ్ యూ " అంటూ 13 నిమిషాల నిడివిగల సందేశాత్మక వీడియోని పంపాడు. ప్రసతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు కూడా మేము నీకు తెలియకపోవచ్చు మేము కూడా నిన్ను ప్రేమిస్తున్నాం అంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు. A video of a Ukrainian soldier after the shelling appeared on social networks Mom, Dad, I love you." #UkraineRussiaCrisis #Ukraine pic.twitter.com/Itz413EhHU — fazil Mir (@Fazilmir900) February 24, 2022 (చదవండి: ఉక్రెయిన్ ఉక్కు మహిళ! మా గడ్డ పై ఏం ఏం పని మీకు ?) -
జవానే 'హంతకుడు'! వీడిన బాలుడి హత్య కేసు మిస్టరీ
ఒంగోలు: దేశ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఓ సైనికుడే నరరూప రాక్షసుడిగా మారాడు. అభంశుభం తెలియని బాలుడిపై లైంగిక దాడి చేసి.. ఆపై దారుణంగా హత్య చేశాడు. పోలీసులకు దొరకకుండా తప్పించుకునేందుకు.. ప్రూఫ్ లేని సిమ్‌తో బెదిరింపు డ్రామాలాడాడు. చివరకు పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేసే పరిస్థితి తలెత్తడంతో అర్ధరాత్రి పూట వీఆర్వో ముందు లొంగిపోయాడు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఈ నెల 22 జరిగిన బాలుడి హత్య వెనుక మిస్టరీ వీడింది. ఈ వివరాలను ఎస్పీ మలికాగర్గ్ ఆదివారం ఒంగోలులో మీడియాకు వెల్లడించారు. కొమరోలు మండలం అక్కపల్లికి చెందిన భూమా శ్రీనాథ్(11) ఈనెల 22న స్నేహితులతో ఆడుకునేందుకు వెళ్లి అదృశ్యమయ్యాడు. దీనిపై బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనాథ్ కోసం పోలీసులు గాలిస్తుండగా.. 25వ తేదీన కత్తులవానిపల్లి–ఇడమకల్లు గ్రామాల మధ్య ఉన్న రెడ్డి బావిలో మృతదేహం దొరికింది. శరీరానికి రాయి కట్టి ఉండటంతో.. హత్యగా నిర్ధారించుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో వారిని పక్కదారి పట్టించేందుకు నిందితుడు ఎలాంటి ప్రూఫ్ లేని సిమ్‌కార్డును ఉపయోగించి బాలుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. వెంటనే రూ.50 లక్షలు ఇవ్వాలని.. లేకుంటే మరొకరిని చంపేస్తానని హెచ్చరించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సాంకేతికతను ఉపయోగించి నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇక తనను అరెస్టు చేస్తారని అర్థం చేసుకున్న దోనపాటి వెంకట ప్రశాంత్ (21) బాలుడ్ని తానే హత్య చేసినట్లు అంగీకరిస్తూ శనివారం అర్ధరాత్రి గ్రామ వీఆర్వో వద్ద లొంగిపోయాడు. వీఆర్వో అతడిని వెంటనే పోలీసులకు అప్పగించారు. అక్కపల్లికి చెందిన ప్రశాంత్ పంజాబ్‌లోని భటిండా రెజిమెంట్‌లో సైనికుడిగా పనిచేస్తున్నాడు. సెలవుపై ఇటీవల ఇంటికి వచ్చాడు. అశ్లీల వీడియోలు ఎక్కువగా చూసే ప్రశాంత్.. 22వ తేదీన స్నేహితులతో ఆడుకుంటున్న శ్రీనాథ్ ద్వారా కూల్‌డ్రింక్ తెప్పించుకున్నాడు. అనంతరం తన బైక్‌పై ఎక్కించుకుని రెడ్డి బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాలుడ్ని భయపెట్టి.. లైంగిక దాడి చేశాడు. బాలుడు పెద్దగా కేకలు వేస్తుండటంతో.. ప్రశాంత్ గొంతు పిసికి చంపేశాడు. మృతదేహానికి బండరాయి కట్టి బావిలో పడేశాడు. నిందితుడు వెంకట ప్రశాంత్‌పై ఐపీసీ సెక్షన్లు 364, 377, 302, 201, పోక్సో యాక్టు సెక్షన్ 6 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. దర్యాప్తులో పాల్గొన్న మార్కాపురం ఓఎస్డీ కె.చౌడేశ్వరి, మార్కాపురం డీఎస్పీ డాక్టర్ ఎం.కిషోర్ కుమార్, గిద్దలూరు సీఐ ఫిరోజ్‌లను ఎస్పీ మలికాగర్గ్ అభినందించారు. -
అడివి శేష్.. మేజర్ వాయిదా
అడివి శేష్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కింది. మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శోభితా ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ‘‘దేశంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కొన్ని చోట్ల కర్ఫ్యూ, మరికొన్ని చోట్ల కరోనా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ‘మేజర్’ విడుదల వాయిదా వేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
నా భర్తకు ఈ గుర్తింపు లభించడం సంతోషం: అమర జవాను సతీమణి
Sakshi Excellence Awards: దేశ సేవకు అంకితమై.. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు అర్పించిన అమర జవాను బాబూరావుకు ‘సాక్షి’ నివాళి అర్పించింది. వీర సైనికుడి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డు(‘మరణానంతర’ పురస్కారం)’ను ప్రకటించింది. హైదరాబాద్‌లో సెప్టెంబరు 17న జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న అమర జవాను సతీమణి ప్రియ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. వీర జవాను బాబూరావు ‘మరణానంతర’ పురస్కారం కుటుంబాలకు దూరంగా అనుక్షణం ప్రమాదపుటంచుల్లో విధులు నిర్వర్తిస్తూ భరతమాత రక్షణకు తమ జీవితాలను అంకితం చేస్తారు జవాన్లు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన బాబూరావు కూడా పాతికేళ్ల ప్రాయంలోనే అస్సాం రైఫిల్స్ లో చేరారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేతలో పాల్గొన్నారు బాబూరావు. అక్కడ టెర్రరిస్టులకు, జవాన్లకు మధ్య జరిగిన భీకర పోరులో తీవ్రగాయాలు పాలై అమరుడయ్యారు. అంతకు ఎనిమిది నెలల ముందే బాబూరావుకు వివాహం అయింది. దేశం కోసం.. పురస్కారం సైనికునిగా దేశానికి అందించిన సేవలకు, త్యాగానికి గాను నా భర్తకు ఈ గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. సాక్షికి ధన్యవాదాలు. –ప్రియ, అమర జవాన్ బాబూరావు సతీమణి చదవండి: స్ఫూర్తి ప్రదాతలకు.. సాక్షి పురస్కారాలు -
ఆఫ్గన్ మిషన్‌లో సిక్కోలు సైనికుడు
మందస: తాలిబన్ల స్వాధీనంతో అట్టుడికిపోతున్న ఆఫ్గనిస్తాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో భారత–టిబెటన్ సరిహద్దు భద్రతా దళం కమాండోలు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ దళంలో శ్రీకాకుళం జిల్లా వాసి కూడా ఉన్నారు. మందస మండలం చిన్నలింబుగాం గ్రామానికి చెందిన పులారి రాజశేఖర్ ఆఫ్గన్‌లో భారత రాయబార కార్యాలయంలో ఉన్నవారిని స్వదేశానికి తీసుకొచ్చే మిషన్‌లో చురుగ్గా వ్యవహరించారు. ప్రత్యేక విమానంలో వీరిని దేశానికి తీసుకురాగా.. రాజశేఖర్ వారి రక్షణ విధులు నిర్వర్తించారు. -
Fact Check: ఆ సైనికుడి కన్నీళ్లు ఉత్తవే!
ఓవైపు తుపాకుల మోత. ఆ బుల్లెట్ల శబ్దాల మధ్యే ఓ సైనికుడు తన సెల్‌ఫోన్ తీస్తాడు. ఇక ఇంటికి తిరిగొచ్చే అవశాలు లేవని, అమ్మను జాగ్రత్తగా చూసుకోమని సోదరుడికి చెప్తూనే.. ‘అమ్మా.. ఇక సెలవు’ అంటూ ముద్దులతో వీడియో కట్ చేస్తాడు. ఎమోషనల్ వీడియోగా ఇది సోషల్ మీడియాలో ఇది బాగా సర్క్యూలేట్ అవుతోంది. కన్నీటి రియాక్షన్లు చాలానే వస్తున్నాయి. ఐసిస్‌తో పోరాటంలో ఆ ఇరాక్ సైనికుడు ఈ వీడియో తీశాడని బాగానే ప్రచారం చేశారు. కట్ చేస్తే... 2015లో 17 నిమిషాల నిడివి ఉన్న ‘డయలింగ్’ అనే షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యింది. ఈ షార్ట్ ఫిల్మ్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ కావడంతో పాటు ప్రశంసలు అందుకుంది కూడా. ఈ ఇరాకీ షార్ట్ ఫిల్మ్‌కు బహా అల్ కజెమి అనే వ్యక్తి డైరెక్టర్‌గా వ్యహరించాడు. తాజాగా వైరల్ అయిన వీడియో.. ఆ షార్ట్ ఫిల్మ్లోనిదేనని క్లారిటీ ఇస్తూ అతను పోస్ట్ పెట్టాడు. ఇది అసలు ఫ్యాక్ట్ చెక్. విషాదాంతంగా ఉండే ఈ షార్ట్ ఫిల్మ్‌లో ఒక సైనికుడి వీరమరణం.. అతని రాక కోసం ఎదురు చూసే తల్లి చివర్లో గుండె పగిలిపోవడం కథాంశంగా ఉంటుంది. ఇక ఈ షార్ట్ ఫిల్మ్‌లో నటించిన మెన్హెల్ అబ్బాస్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోను పోస్ట్ చేసి.. వైరల్ వీడియో నిజంది కాదని, తన షార్ట్ ఫిల్మ్దని క్లారిటీ ఇచ్చాడు. చదవండి: ఆ అమ్మాయిని అసభ్యంగా తాకింది ఎవరంటే.. -
కొడుకు శవం కోసం 8 నెలలుగా తవ్వకాలు..
శ్రీనగర్: ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులను వదిలించుకునే సంతానం కోకొల్లలు.. బిడ్డలను వదిలేసే తల్లిదండ్రులు మాత్రం ఇంకా తయారు కాలేదు. తమ చివరి క్షణం వరకు బిడ్డల బాగోగుల గురించే ఆలోచిస్తారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో హత్యకు గురైన తన కొడుకు మృతదేహం కోసం ఓ తండ్రి గత ఎనిమిది నెలలుగా ప్రతి రోజు తవ్వకాలు జరుపుతూ గాలిస్తూనే ఉన్నాడు. ఈ తండ్రి కన్నీటి వ్యథ ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది. ఆ వివరాలు.. షకీర్ మంజూర్(25) అనే వ్యక్తి ప్రాదేశిక సైన్యంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆగస్టు 2న అతడిని కొందరు ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారం రోజులకు రక్తంలో తడిసిన షకీర్ దుస్తులు లభించాయి. దాంతో అతడు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు నిర్థరాణకు వచ్చారు. బిడ్డను పొగొట్టుకున్నారు.. కనీసం తనని కడసారిగా చూసుకుని.. ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలి అని షకీర్ తల్లిదండ్రులు భావించారు. కానీ నేటికి కూడా అతడి మృతదేహం వారికి లభించలేదు. ఈ సందర్భంగా షకీర్ తండ్రి మంజూర్ అహ్మద్ వాగే మాట్లాడుతూ.. ‘‘ఆగస్ట్ 2న ఈద్ సందర్భంగా నా కుమారుడు మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లిన గంటకు మాకు కాల్ చేశాడు. ‘‘నేను స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నాను. నా గురించి ఆర్మీ అధికారులు అడిగితే ఏం చెప్పకండి’’ అన్నాడు. అదే తన చివరి కాల్. అప్పటికే తను కిడ్నాప్ అయ్యాడని.. ఉగ్రవాదులే తనతో అలా మాట్లాడించారని ఆ తర్వాత మాకు అర్థం అయ్యింది’’ అన్నాడు వాగే. ‘‘మరుసటి రోజు షకీర్ వాడే వాహనం పూర్తిగా కాలిపోయి కనిపించింది. వారం రోజుల తర్వాత మాకు మా ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాధురా ప్రాంతంలో రక్తంలో తడిసిన తన దుస్తులు లభించాయి. తన మృతదేహం కోసం వెదికాం.. కానీ దొరకలేదు. ఈ క్రమంలో ఓ రోజు మా బంధువుల అమ్మాయి రాత్రి తన కలలో షకీర్ కనిపించాడని.. అతడి బట్టలు దొరికన చోటే తనని పాతి పెట్టారని.. వెలికి తీయాల్సిందిగా కోరినట్లు మాకు తెలిపింది. దాంతో మరి కొందరితో కలిసి నేను ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాను. కానీ ఫలితం శూన్యం’’ అన్నాడు వాగే. ‘‘అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు ఇలా తవ్వకాలు జరుపుతూనే ఉన్నాను. ఏదో ఓ రోజు షకీర్ మృతదేహం దొరుకుతుందనే ఆశతో జీవిస్తున్నాను. ఈ విషయంలో గ్రామస్తులు నాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎందుకంటే వారందరికి తనంటే ఎంతో ప్రేమ. ఇక నా కొడుకును కిడ్నాప్ చేసిన నలుగురు ఉగ్రవాదులు ఎవరో కూడా నాకు తెలుసు. కొన్ని రోజుల క్రితం వారిలో ఒక వ్యక్తి ఇక్కడి అధికారుల నుంచి ఏకే47 రైఫిల్స్ ఎత్తుకెళ్లి చిన్నపాటి గ్రూపును రన్ చేస్తున్నాడు. నా కుమారిడి శవాన్ని అప్పగించాల్సిందిగా మేం అన్ని మిలిటెంట్ సంస్థలను సంప్రదించాం. కానీ వారు తమకు ఏం తెలియదన్నారు’’ అన్నాడు వాగే. పోలీసు రికార్డుల్లో కిడ్నాప్‌గానే నమోదు... పోలీసు రికార్డుల్లో షకీర్ కిడ్నాప్ అయినట్లు నమోదు చేశారు. మరణించినట్లు ధ్రువీకరించలేదు. ఇక షకీర్‌ని ఎక్కడ సమాధి చేశారనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. స్థానిక పోలీసులు షకీర్ మృతదేహాం కోసం తీవ్రంగా గాలించారు. కానీ లాభం లేకుండా పోయింది. ఈ సందర్భంగా వాగే ‘‘చెట్టంత ఎదిగిన కొడుకును దూరం చేసుకున్నాను. కడసారి చూపుకు నోచుకోలేదు.. తనకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కూడా లేకపోయింది. పగ వాడికి కూడా ఇలాంటి పరిస్థితి వద్దు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి మాటలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. ఇక 2020 నుంచి ఉన్నతాధికారులు మిలిటెంట్ల దాడిలో మరణించిన సైనికుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం లేదు. కరోనా వల్లనే ఇలా చేయాల్సి వచ్చింది అంటున్నారు అధికారులు. అధికారులపై వాగే ఆగ్రహం.. తన కొడుకును అమరవీరుడిగా ప్రకటించకపోవడం పట్ల వాగే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. "నా బిడ్డ ఒక సైనికుడు, భారతదేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు. అధికారులు మొదట తన ప్రాణాలను కాపాడడంలో విఫలమయ్యారు. తరువాత అతని మృతదేహాన్ని కనుగొనడంలో విఫలమయ్యారు. అతన్ని అమరవీరుడిగా ప్రకటించాలని ప్రభుత్వానికి నా విజ్ఞప్తి. నా కొడుకును కిడ్నాప్ చేసి చంపారు. నా బిడ్డ వారి చేతిలో చిత్ర హింసలు భరించాడు.. కాని దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలాంటి వ్యక్తిని అమరవీరుడిగా ప్రకటించకపోవడం నాకు మరింత ఆగ్రహం తెప్పిస్తుంది’’ అన్నాడు. కశ్మీర్లో, గత మూడు దశాబ్దాలలో సుమారు 8,000 మంది తప్పిపోయారు. వారిని భద్రతా దళాలు తీసుకుని వెళ్లారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. అయితే ఒక సైనికుడు అదృశ్యం కావడం మాత్రం ఇదే ప్రథమం. చదవండి: నర్సింగ్ విద్యార్థిని కిడ్నాప్: రూ. 2 కోట్లిస్తే వదిలేస్తాం అజిత్ దోవల్ నివాసం వద్ద ఉగ్రవాదుల రెక్కీ -
సైనికుడే నేరస్తుడిగా మారి..
విజయనగరం క్రైమ్: ఆర్మీలో పనిచేస్తున్న ఓ సైనికుడు వ్యాపారిని బెదిరించి పోలీసులకు పట్టుబడిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్పీ బి.రాజకుమారి తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మండలం బంటువానివలస గ్రామానికి చెందిన చందనా పల్లి రాజేశ్వరరావు ఆర్మీలో పనిచేస్తున్నాడు. సె లవుపై వచ్చిన అతడు స్థలం కొనుగోలు, విక్ర యంలో రూ.22 లక్షలు నష్టపోయాడు. దాన్ని భర్తీ చేసుకునేందుకు మావోయిస్టు నాయకుడిగా అవతారమెత్తాడు. ఉత్తరప్రదేశ్‌లో కొనుగోలు చేసిన పిస్టల్‌తో పార్వతీపురానికి చెందిన బంగారు వ్యాపారి ఇందుపూరు చినగుంపస్వామి అలియాస్ బాబు ఇంటి కిటికీ అద్దాలపై ఈ నెల 6న అర్ధరాత్రి కాల్పులు జరిపాడు. మరుసటి రోజు వ్యాపారికి ఫోన్ చేసి జార్ఖండ్ మావోయిస్టు కమాండర్‌గా పరిచయం చేసుకున్నాడు. కాల్పులు జరిపినది తనేనని, రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయంపై పోలీసులకు వ్యాపారి ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు రూ.1.5 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. నిందితుడు వ్యాపారికి ఆదివారం ఫోన్‌చేసి డబ్బును విక్రం పురం–డంగభద్ర గ్రామాల మధ్యలోని కొండ ప్రాంతానికి తీసుకురావాలని చెప్పాడు. పోలీసులు మాటువేసి నిందితుడిని పట్టుకున్నారు. -
సైనికుడి పాత్రలో విజయ్ దేవరకొండ
సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా ఉంటుందనే సంగతి తెలిసిందే. 2022లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని ప్రకటించారు కూడా. తాజాగా ఈ సినిమా కథాంశం గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఇండియా–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని టాక్. విజయ్ దేవరకొండ సైనికుడి పాత్రలో నటించనున్నారని సమాచారం. -
కేరళలో కొత్త వ్యాధి కలకలం
కేరళ : మలేరియా జాతికి చెందిన కొత్త పరాన్నజీవి కేరళలో కలకలం రేపుతోంది. ఇటీవల సూడాన్ నుంచి కేరళకి వచ్చిన ఓ సైనికుడి శరీరంలో దీన్ని కనుగొన్నారు. అతడి ద్వారా వచ్చిన ఈ కొత్త జాతి ‘ప్లాస్మోడియం ఒవల్‌గా’ గుర్తించారని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కెకె.శైలజ తెలిపారు. అతనికి కన్నూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు గురువారం ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు. నివారణ చర్యలు చేపట్టడం ద్వారా, తగిన సమయానికి చికిత్స తీసుకోవటం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు అని ఆమె పేర్కొన్నారు. కాగా, భారత్‌లో తొలి కరోనా వైరస్ కేసు కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో నమోదయ్యింది. చైనాలోని వూహాన్ యూనివర్శిటీలో చదువుతున్న ఓ విద్యార్ధి అక్కడినుంచి భారత్ వచ్చాడు. అతడిలో కరోనా వైరస్‌ను గుర్తించారు. అంతేకాకుండా 2018లో వచ్చిన నిఫా వైరస్ కూడా ఇక్కడి కొజికొడ్ జిల్లాలో వెలుగుచూసింది. Plasmodium ovale, a new genus of malaria, has been detected in the State. It was found in a soldier who was being treated at the District hospital in Kannur. The soldier had come from Sudan. The spread of the disease can be avoided with timely treatment and preventive measures. — Shailaja Teacher (@shailajateacher) December 10, 2020 -
చైనా సైనికుడ్ని పీఎల్ఏకు అప్పగించిన భారత సైన్యం
న్యూఢిల్లీ : అనుకోకుండా భారత సరిహద్దుల్లోకి ప్రవేశించిన చైనా సైనికుడ్ని భారత సైన్యం.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కి అప్పగించింది. బుధవారం ప్రోటోకాల్స్‌ను అనుసరిస్తూ చుషూల్ మోల్డో పాయింట్ వద్ద చైనా సైన్యానికి అప్పగించింది. కాగా, చైనా సైనికుడు వాంగ్ యా లాంగ్ సోమవారం తూర్పు లద్ధాఖ్లోని డెమ్చోక్ వద్ద అనుకోకుండా భారత భూభాగంలోకి ప్రవేశించాడు. దీంతో భారత సైన్యం అతడ్ని అదుపులోకి తీసుకుంది. వాంగ్ జేబులో ఉన్న ఐడెంటిటీ కార్డు ఆధారంగా చైనాలోని సెంట్రల్ జెజియాంగ్, షాంగ్జిజెన్ పట్టణానికి చెందిన వాడిగా గుర్తించింది. ( చైనా సైన్యాన్ని ఎప్పుడు తరిమేస్తారు? ) దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘అతడ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత వైద్య సహాయం అందించాము. ఆ తర్వాత అతడినుంచి వివరాలు అడిగి తెలుసుకున్నాము. గూఢచర్యానికి సంబంధించిన కోణం మాకు కనిపించలేదు’’ అని తెలిపారు. తమ సైనికుడు పశువులు మేపుకునే వ్యక్తులకు సహాయం చేస్తుండగా పొరపాటున భారత సరిహద్దులోకి ప్రవేశించాడని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. -
లద్దాఖ్‌లో పట్టుబడ్డ చైనా జవాను
న్యూఢిల్లీ: చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కు చెందిన సైనికుడు ఒకరు సోమవారం తూర్పు లద్దాఖ్‌లో భారత సైన్యానికి పట్టుబడ్డాడు. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) దాటి అతడు భారత భూభాగంలోకి ప్రవేశించడం సంచలనం రేపింది. ఈ ఘటనపై భారత సైన్యం స్పందించింది. ‘ఈ నెల 19వ తేదీన తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లోని డెమ్చోక్ ప్రాంతంలో చైనా సైనికుడొకరు ఎల్ఏసీని దాటి భారత భూభాగంలోకి దారి తప్పి ప్రవేశించాడు. అతడి వద్ద ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా పీఎల్ఏ కార్పొరల్ వాంగ్ య లాంగ్గా తెలిసింది. స్వస్థలం చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌లోని షాంగ్జిఝెన్ పట్టణమని తేలింది. దీని వెనుక గూఢచర్యం ఉన్నట్లు భావించడం లేదు’ అని భారత ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘పర్వతమయమైన ఈ ప్రాంతంలో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య దారితప్పి వచ్చిన అతడికి ఆక్సిజన్, ఆహారంతోపాటు చలి నుంచి రక్షణ కల్పించే దుస్తులు అందించాం. తప్పిపోయిన తమ సైనికుడి ఆచూకీ కోసం పీఎల్ఏ నుంచి ఒక వినతి అందింది’అని భారత ఆర్మీ వెల్లడించింది. చైనాతో ఉన్న అవగాహనను అనుసరించి ఇతర లాంఛనాలన్నీ పూర్తయ్యాక చుషుల్–మోల్డో ప్రాంతంలో అతడిని తిరిగి చైనా సైనిక అధికారులకు అప్పగిస్తామని భారత సైన్యం స్పష్టం చేసింది. ‘భారత్–చైనా సరిహద్దులు దాటి భారత్‌లోకి అతడు ఎలా రాగలిగాడనే విషయం రాబట్టేందుకు అధికారులు ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం నాటికి అతడిని తిరిగి వెనక్కు పంపించే అవకాశాలున్నాయి’అని పేర్కొంది. భారత్, చైనాలు ఈ విషయంలో సంప్రదింపులు జరుపుతున్నాయని, పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాయని చైనా అధికార గ్లోబల్ టైమ్స్ తెలిపింది. సరిహద్దుల్లో ఇది మరో వివాదానికి తెరతీయబోదనీ, ఈ అంశం పరిష్కారం మరిన్ని ద్వైపాక్షిక చర్చలకు మార్గం సుగమం చేస్తుందని వ్యాఖ్యానించింది. పీఎల్ఏలో కార్పొరల్ హోదా భారత ఆర్మీలో నాయక్ స్థాయికి సమానం. కాగా, తూర్పు లద్దాఖ్‌లో ఎల్ఏసీ వెంట ఆరు నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. చైనాలో భాగంగా జమ్మూకశ్మీర్! జమ్మూకశ్మీర్ చైనాలో భాగం అంటూ ట్విట్టర్ చూపడం వివాదాస్పదంగా మారింది. ఈ పొరపాటును వెంటనే సరిచేసినట్లు ట్విట్టర్ చెబుతున్నప్పటికీ జమ్మూకశ్మీర్‌ను భారత్‌కు చెందినట్లు చూపకపోవడం, లేహ్ ప్రాంతాన్ని కశ్మీర్లో అంతర్భాగంగా పేర్కొనడం కొనసాగు తోందని నిపుణులు అంటున్నారు. జాతీయ భద్రతా వ్యవహారాల విశ్లేషకుడు నితిన్ గోఖలే ఆదివారం లేహ్‌లోని హాల్ ఆఫ్ ఫేంను గురించి ట్విట్టర్లో ఒక వీడియో పోస్టు చేశారు. అందులో లేహ్‌ను జమ్మూకశ్మీర్‌కు చెందినట్లు, జమ్మూకశ్మీర్ చైనాలో ఉన్నట్లు చూపుతోంది. సాంకేతిక లోపాల కారణంగా ఇలా జరిగిందని ట్విట్టర్ ఇండియా ప్రతినిధి చెప్పారు. -
లద్దాఖ్‌లో చైనా సైనికుడి అరెస్ట్
న్యూఢిల్లీ: లద్దాఖ్ సరిహద్దులో చైనా సైనికుడిని భారత భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. చుమర్-డెమ్చోక్ ప్రాంతంలో సైనికుడు పట్టుబడ్డాడు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన జవాను అనుకోకుండా భారత భూభాగంలోకి ఎంటర్ అయి ఉంటాడని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే ప్రోటోకాల్ ప్రకారం సమాచారం సేకరించిన తర్వాత అతన్ని తిరిగి పీఎల్ఏ దళానికి అప్పగించనున్నారు. చైనా సైనికుడి వద్ద సివిల్, మిలిటరీ డాక్యుమెంట్లు ఉన్నట్లు భారత అధికారులు గుర్తించారు. (చదవండి: చైనా కొత్త ఎత్తుగడ; అప్పుడే ఉపసంహరణ!) ఇటీవల లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద రెండు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. జూన్ 14న జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మృతిచెందారు. ఆ నాటి నుంచి సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఇరుపక్షాల మధ్య అనేక రౌండ్ల సైనిక, దౌత్య చర్చలు జరిగాయి. కాని యథాతథ స్థితిని పునరుద్ధరించే ఒప్పందాలకు కట్టుబడి ఉండటానికి చైనా నిరాకరిస్తోంది. -
నక్సలైట్ల కాల్పుల్లో జవాన్ మృతి..!
చత్తీస్గడ్: రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలోని కోటీ క్యాంపు సమీపంలో నక్సలైట్లు జవాన్లపై కాల్పులు జరిపిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. క్యాంప్ దగ్గరలోని ఓ కిరాణా షాపింగ్‌కి వెళ్లిన ఇద్దరు జవాన్లపై నక్సల్స్ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ జవాన్ మృతి చెందగా, మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన జవాన్ని దుష్యంత్ నందీశ్వర్‌గా గుర్తించి.. గాయపడిన జవాన్ని ఆస్పత్రికి తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
‘వారికి మా సంస్థలో ఉద్యోగాలు ఇస్తాం’
ముంబై: సైన్యంలో చేరాలని ఉత్సాహం చూపే యువత కోసం భారత సైన్యం ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ అనే నూతన ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఆచరణలోకి వస్తే ఆసక్తి ఉన్న యువత మూడేళ్లపాటు సైన్యంలో చేరి సేవలందించవచ్చు. ఇంకా చర్చల దశలోనే ఉన్న ఈ ప్రతిపాదన పట్ల ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తి కనబర్చారు. తమ సంస్థలో ఉద్యోగులను తీసుకునేటప్పుడు టూర్ ఆఫ్ డ్యూటీ కింద పని చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆర్మీకి మెయిల్ చేశారు.(లాక్డౌన్ ప్రాణాలు కాపాడింది కానీ..) ‘భారత ఆర్మీ ప్రతిపాదించిన టూర్ ఆఫ్ డ్యూటీ గురించి విన్నాను. దీని ద్వార భారత యువతకు మూడేళ్లపాటు సైన్యంలో సైనికులుగా, అధికారులుగా పని చేసే అవకావం లభిస్తుంది. పని చేసే చోట యువతకు ఇది అదనపు అవకాశంగా మారుతుంది. సైన్యంలో ఇచ్చే కఠిన శిక్షణ, ప్రమాణాలను దృష్ట్యా వీరిని మహీంద్రా గ్రూప్‌లోకి తీసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది’ అంటూ మెయిల్ చేశారు.(సైన్యంలో ‘పరిమిత’ సేవ!) -
సిక్కింలో హిమపాతం.. జవాను గల్లంతు
న్యూఢిల్లీ: సిక్కింలో దారుణం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న భారత సైనిక బృందంపై పెద్ద ఎత్తున మంచు చరియలు విరిగిపడ్డాయి. వివరాలు.. ఉత్తర సిక్కిం ప్రాంతంలోని లుగ్నాక్ లాలో సుమారు 17 నుంచి 18 మంది సైనికులు పెట్రోలింగ్-కమ్-స్నో క్లియరెన్స్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి మంచు చరియలు ఈ బృందంపై విరుచుకు పడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక సైనికుడిని మినహా మిగతా వారందరిని రక్షించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. గల్లైంతన సైనికుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుందన్నారు. మిగతా జవాన్లంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
భారత్ @ 158
న్యూఢిల్లీ/బెంగళూరు: భారత్‌లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య బుధవారానికి 158కి చేరింది. మంగళవారం నుంచి కొత్తగా 14 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. వారిలో ఒక సైనికుడు కూడా ఉన్నారు. లద్దాఖ్ స్కౌట్ రెజిమెంట్‌కు చెందిన 34 ఏళ్ల సైనికుడికి కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని భారత సైన్యం ప్రకటించింది. ఇరాన్ నుంచి ఫిబ్రవరి 20న ఎయిర్ ఇండియా విమానంలో భారత్ తిరిగొచ్చిన తన తండ్రి నుంచి ఆ సైనికుడికి ఆ వైరస్ సోకిందని, అతడి తండ్రికి కూడా కోవిడ్ నిర్ధారణ అయిందని వెల్లడించింది. వారు లేహ్‌లోని చౌహత్ గ్రామానికి చెందినవారని తెలిపింది. ఆ సైనికుడి సోదరుడికి కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా ఆర్మీ చర్యలు ప్రారంభించింది. సెలవుపై వెళ్లి వచ్చిన సైనికులకు వైరస్ నిర్ధారణ పరీక్షలు జరపడం, ఫ్లూ లక్షణాలు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టడం, అనవసర ప్రయాణాలను, అన్ని శిక్షణ కార్యక్రమాలను, సదస్సులను రద్దు చేయడం.. తదితర చర్యలు చేపట్టింది. ఈ వైరస్ సోకిన 158 మందిలో ముగ్గురు మృతులు, 25 మంది విదేశీయులు ఉన్నారు. ఏకాంతవాస కేంద్రాల(క్వారంటైన్ సెంటర్స్)ను సందర్శించి, అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ బాధితులతో సన్నిహితంగా ఉన్న దాదాపు 5700 మందిని వివిధ క్వారంటైన్ సెంటర్లలో ఉంచి, వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బుధవారం వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 42, కేరళలో 27, ఉత్తరప్రదేశ్‌లో 16, కర్ణాటకలో 11, ఢిల్లీలో 10, లద్దాఖ్‌లో 8, తెలంగాణలో 13 కేసులు నమోదయ్యాయి. హరియాణాలో కోవిడ్ బారిన పడిన 17 మందిలో 14 మంది విదేశీయులే కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా చికిత్స అనంతరం కోలుకుని 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల సౌదీ అరేబియా వెళ్లి వచ్చిన బీజేపీ ఎంపీ సురేశ్ ప్రభు స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. విదేశాల్లోని భారతీయులకు.. విదేశాల్లోని భారతీయుల్లో 276 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని విదేశాంగ శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్ బుధవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. వారిలో ఇరాన్‌లోని 255 మంది, యూఏఈలోని 12 మంది, ఇటలీలోని ఐదుగురు, శ్రీలంక, కువైట్, రువాండా, హాంకాంగ్‌ల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారన్నారు. యూఏఈలో 8 మంది భారతీయులను క్వారంటైన్ చేసినట్లు వెల్లడించారు. ఇరాన్లో సుమారు 6 వేల మంది భారతీయులున్నారన్నారు. వారిలో జమ్మూకశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట్రల నుంచి పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్లిన 1100 మంది, కేరళ, ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లిన 1000 మంది మత్స్యకారులు, జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాల నుంచి వెళ్లిన 300 మంది విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు. ఇప్పటివరకు ఇరాన్ నుంచి 389 మందిని వెనక్కు తీసుకువచ్చామన్నారు. రాజ్యసభలో మాస్కుల కలకలం రాజ్యసభకు తొలిసారి ఎంపీ డెరెక్ ఓ బ్రేన్ సహా నలుగురు టీఎంసీ సభ్యులు మాస్క్‌లతో వచ్చారు. సభా నిబంధనల ప్రకారం సభ్యులు మాస్క్‌లు ఉపయోగించరాదని సభ చైర్మన్ వెంకయ్యనాయుడు తొలుత అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, కరోనా ముప్పు నేపథ్యంలో మాస్క్‌ల వినియోగం తప్పనిసరి అని, దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా జారీ చేసిందని, అందువల్ల మాస్క్‌లను అనుమతించాలని కాంగ్రెస్ సభ్యుడు చిదంబరం కోరడంతో, వెంకయ్యనాయుడు అంగీకరించారు. కరోనా ముప్పు పొంచి ఉందని, అందువల్ల బడ్జెట్ సమావేశాలను కుదించాలని కాంగ్రెస్ సహా పలు పార్టీల సభ్యులు అభ్యర్థించారు. వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటూ ఉంటామని, అందువల్ల ఎంపీలకు వైరస్ ముప్పు అధికంగా ఉంటుందని, ఎంపీలమైనందువల్ల ఆ వైరస్ మన జోలికి రాదని అనుకోకూడదని కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ గౌడ వ్యాఖ్యానించారు. అయితే, ఈ అభ్యర్థనను ప్రభుత్వం తోసిపుచ్చింది. సబ్బుల ధరలపై కేంద్రం దృష్టి న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్న నిత్యావసరాలైన సబ్బులు, నేలలు తుడిచే క్లీనర్లు, థర్మల్ స్కానర్ల ధరలను కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. సాధారణంగా ఈ శాఖ దేశవ్యాప్తంగా 22 నిత్యావసరాల ధరలను పర్యవేక్షిస్తుంటుంది. తాజాగా ఫేస్ మాస్క్‌లు, చేతి శానిటైజర్లను ఆ జాబితాలో చేర్చింది. ‘కోవిడ్ కారణంగా డిమాండ్ పెరిగిన సబ్బులు, లైజాల్, డెటాల్ వంటి చేతులు, నేలలు శుభ్రపరిచే క్లీనర్ల ధరలను మేం పర్యవేక్షిస్తున్నాం’అని కేంద్ర మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 114 కేంద్రాల ద్వారా ఈ ఉత్పత్తుల ధరలను కేంద్రం పర్యవేక్షిస్తోంది. 22 నిత్యావసర వస్తువుల్లో బియ్యం, గోధుమలు, గోధుమ పిండి, పప్పు ధాన్యాలు, నూనెలు, కూరగాయలు, చక్కెర, పాలు, టీ, ఉప్పు తదితరాలు ఉన్నాయి. కోవిడ్‌పై ప్రజల్లో అవగాహన పెరగడంతో వేరే దేశాలతో పోలిస్తే భారత్‌లో తక్కువగా వ్యాపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఐఐటీ బాంబే బంద్ ► కరోనా ముప్పు నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ఎలాంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహించకూడదని బీజేపీ నిర్ణయించింది. ► మా పరుపులు వాడితే కరోనా వైరస్ రాదని ప్రచారం చేస్తున్న ఒక వ్యాపారిపై మహారాష్ట్రలోని థానేలో కేసు నమోదైంది. ► కోవిడ్–19 లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయొద్దని, బాధ్యతాయుతంగా ప్రవర్తించి, వెంటనే వైద్యుల పర్యవేక్షణలోకి వెళ్లాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై నకిలీ వార్తలు ప్రచారం చేసేవారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ► కరోనా వైరస్ నుంచి రక్షిస్తుందని పేర్కొంటూ గో మూత్రాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని నారాయణ చటర్జీ అనే బీజేపీ కార్యకర్త కోల్‌కతాలో మంగళవారం నిర్వహించారు. ఆ గోమూత్రం సేవించి, అనారోగ్యం పాలయిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చటర్జీని అరెస్ట్ చేశారు. ► ఐఐటీ బాంబే క్యాంపస్‌ను మార్చి 31 వరకు మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ► లండన్‌లో వేలాదిగా ఉన్న భారతీయులు ఇండియాకు తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై అక్కడి హైకమిషన్‌ను అభ్యర్థిస్తున్నారు. అయితే, బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులపై మార్చి 31 వరకు భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. బ్రిటన్‌లో కోవిడ్ కారణంగా 104 మంది చనిపోగా, దాదాపు 2 వేల మందికి ఈ వైరస్ సోకింది. ► పారా మిలటరీ సిబ్బందికి సంబంధించిన అన్ని అత్యవసరం కాని సెలవులను రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పార్లమెంట్ వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్యకు థర్మల్ స్క్రీనింగ్ దృశ్యం -
థాయిలాండ్ సైకో సైనికుడు హతం
-
సైకో సైనికుడిని హతమార్చిన ఆర్మీ
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో సైకో సైనికుడిని ఆర్మీ మట్టుపెట్టింది. విచక్షణారహితంగా కాల్పులు జరిపి 20 మందిని పొట్టనబెట్టుకున్న సర్జంట్ మేజర్ జక్రపంత్ తొమ్మాను ఆదివారం ఉదయం సైనికులు కాల్చి చంపారు. థాయిలాండ్‌లోని నఖోన్ రట్చసిమా నగరంలో శనివారం మధ్యాహ్నం జక్రపంత్ తొమ్మా విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. సైనిక స్థావరం నుంచి ఒక సైనిక వాహనాన్ని దొంగిలించిన జక్రపంత్ తొమ్మా నగరం నడిబొడ్డుకు దాన్ని నడుపుకుంటూ వెళ్లాడు. అక్కడి టెర్మినల్ 21మాల్లో ప్రవేశించి మెషీన్ గన్‌తో అక్కడ ఉన్నవారిపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 20 మంది ప్రాణాలు కోల్పోగా 14 మంది గాయాలపాలయ్యారు. అనంతరం మాల్లో పలువురిని నిర్భందించాడు. షాపింగ్ మాల్‌ను తమ దిగ్భందంలోకి తీసుకున్న సైనికులు, కొన్ని గంటల పోరాటం తర్వాత ఉన్మాదిని హతమార్చారు. చదవండి : థాయిలాండ్‌లో సైనికుడి కాల్పులు -
థాయిలాండ్‌లో సైనికుడి కాల్పులు
బ్యాంకాక్: థాయిలాండ్‌లో ఓ సైనికుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 20 మందిని పొట్టనబెట్టుకున్నాడు. థాయిలాండ్‌లోని నఖోన్ రట్చసిమా నగరంలో శనివారం మధ్యాహ్నం ఈ దారుణ ఘటన జరిగింది. నగరంలోని సైనిక స్థావరం నుంచి ఒక సైనిక వాహనాన్ని దొంగిలించిన సైనికుడు సర్జంట్ మేజర్ జక్రపంత్ తొమ్మా నగరం నడిబొడ్డుకు దాన్ని నడుపుకుంటూ వెళ్లాడు. అక్కడి టెర్మినల్ 21మాల్లో ప్రవేశించి మెషీన్ గన్‌తో అక్కడ ఉన్నవారిపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మంది గాయాలపాల య్యారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. కాల్పులకు సంబంధించిన ఫొటోలను స్వయంగా నిందితుడే తీసి ఫేస్బుక్లో షేర్ చేశాడు. ‘నేను లొంగిపోవాలా? మరణాన్ని ఎవరూ తప్పించుకోలేరు’ అంటూ ఒక పోస్ట్, ‘నేను అలసిపోయాను.. ఇక గన్ ట్రిగ్గర్ను లాగలేను’ అంటూ మరో పోస్ట్ పెట్టాడు. ప్రజలంతా భయపడుతూ పరిగెత్తడం మరో వ్యక్తి తీసిన వీడియోలో కనిపించింది. ఫేస్బుక్ దాన్ని తొలగించింది. నిందితుడు మాల్లో ఉన్నాడు. మాల్ చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు అదుపులోకి తీసుకొని రాకపోకలను నిషేధించారు. అయితే 16 మందిని అతడు నిర్బంధించాడని స్థానిక మీడియా తెలిపింది. -
సిపాయి ప్రాణం తీసిన సైబర్ నేరం!
సాక్షి, హైదరాబాద్: విలాస్ మధుకర్ ఆర్మీలో సిపాయి. కార్ఖానా పరిధిలో ఉండే ఈయనకు ఈ–కామర్స్ సైట్స్ సెర్చ్ చేయడం అలవాటు. ఈ క్రమంలో రూ.7,999 విలువైన కాండో ప్యాక్‌ను రూ.2,999కే ఆఫర్ చేస్తున్నట్టు ఓ వెబ్సైట్లో కనిపించడంతో వాట్సాప్ చాటింగ్ ద్వారా నిర్వాహకులను సంప్రదించాడు. ఆఫర్ పొందాలంటే కొంత మొత్తం చెల్లించాలని నిర్వాహకులు చెప్పడంతో అప్పులు చేసి మరీ మధుకర్ పలు విడతల్లో రూ.1.10 లక్షలు జమ చేశాడు. ఆ తరువాత సైట్ నిర్వాహకుల నుంచి స్పందన లేదు. ఆందోళనకు గురైన మధుకర్.. తన వస్తువులు, డబ్బు వెంటనే పంపకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ నిర్వాహకులకు ఈ–మెయిల్ పెట్టాడు. భార్య క్వార్టర్స్‌లో లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఏప్రిల్ 17న జరిగిన ఈ ఘటనపై బాధితుడి భార్య ఫిర్యాదు చేశారు. ఆర్మీ సిపాయి ఆత్మహత్యకు కారణమైన ఈ సైబర్ నేరాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇందులో కుట్ర, సైబర్ నేరం, మోసం ఉన్నాయని తేల్చారు. కారకులైన ఇద్దరిని ఢిల్లీలో అరెస్టు చేశారు. -
నర్సంపేటలో ఆర్మీ జవాన్ ప్రేమ్‌కుమార్ హత్య
-
దేశసేవలో తెలంగాణ సైనికుడి వీరమరణం
చింతలమానెపల్లి(సిర్పూర్): భరతమాత సేవలో ఓ సైనికుడు వీరమరణం పొందాడు. కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్ గ్రామానికి చెందిన సైనికుడు హావల్దార్ రాజేశ్‌దాక్వా(40) భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో సోమవారం రాత్రి మృతి చెం దారు. భారత ఆర్మీ అధికారులు తెలిపిన సమాచారంతో స్థానిక పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు కశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్ పరిధిలోని డోండా జిల్లా ఆర్ఆర్ రెజిమెంట్–4లో విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. 1978లో జన్మించిన రాజేశ్‌దాక్వా 1997లో సైనికుడిగా ఆర్మీలో చేరారు. క్రమంగా ఎదిగి హావల్దార్‌గా పదోన్నతి పొందారు. సోమవారం రాత్రి సమయంలో విధుల్లో ఉండగా కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. మృతుడికి కాగజ్‌నగర్ మండలం ఈస్గాం గ్రామానికి చెందిన జయతో వివాహం కాగా కుమార్తెలు రోహిణి, ఖుషి ఉన్నారు. తండ్రి మణిహోహన్ గతంలోనే మరణించగా తల్లి లతిక రవీంద్రనగర్‌లో హోటల్ నిర్వహిస్తున్నారు. కాగా రాజేశ్ పార్థివదేహాన్ని ముందుగా శ్రీనగర్ తరలించి అక్కడి నుంచి ఢిల్లీలో లాంఛనాలు ముగి శాక స్వస్థలానికి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఘటనతో చింతలమానెపల్లి మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజలు వీరసైనికుడికి నివాళులర్పించారు. ఇదిలా ఉండగా రాజేశ్ రవీంద్రనగర్‌లో 7వ తరగతి వరకు చదివారు. అనంతరం కాగజ్‌నగర్‌లోని సర్‌సిల్క్ శిశుమందిర్‌లో 10వ తరగతి చదివాడు. 18వ ఏట 1995లో దేశ రక్షణకోసం ఆర్మీలో చేరాడు. మొదటగా బెంగళూర్ ఇంజినీరింగ్ రెజిమెంట్‌లో శిక్షణ పొంది విధుల్లో చేరగా సైనికులకు అవసరమైన ఇంజినీరింగ్ విభాగంలో నిష్ణాతుడిగా పేరుగాంచారు. సైనికుడిగా విధుల్లో చేరిన రాజేశ్ అంచెలంచెలుగా లాన్స్‌నాయక్, నా యక్, హావల్దార్‌గా పదోన్నతులు పొందాడు. హా వల్దార్గా పనిచేస్తున్న రాజేశ్ మరి కొద్ది నెలల్లో 24 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకునేవాడు. దేశ భక్తుడు.. చిన్నతనం నుంచే అన్నింట్లో ముందున్న రాజేశ్‌లో సైనికుడిగా దేశభక్తి ఎక్కువ. ఈక్రమంలో సైనికుడిగా దేశం తరఫున మిత్రదేశం ఆఫ్రికాలో సేవలందించాడు. గతంలో సియాచిన్ గ్లేసియర్‌లో విధుల్లో ఉండగా జరిగిన దా డుల్లో సైతం ప్రమాదానికి గురయ్యా డు. సహచరుడిని కోల్పోయి చేతికి తీవ్ర గాయమైనా అధైర్యపడకుండా విధుల్లో కొనసాగాడు. 24 ఏళ్లలోఎక్కువగా దేశ రక్షణకు అత్యంత కీలకమైన సరిహద్దుల్లోనే విధులు నిర్వహించాడు. ప్రధానంగా అస్సాం, పంజాబ్, జమ్ముకశ్మీర్‌లోనే విధుల్లో ఉండడం రాజేశ్ దేశభక్తికి నిదర్శనం. కాగా రాజేశ్‌ను సురక్షిత ప్రాంతమైన కలకత్తాలో నియమించారు. అయినా దేశసేవకోసం పరితపించి సరిహద్దుల్లోనే విధులను ఎంచుకున్నాడు. అన్నింట్లో ముందంజే.. చిన్నతనంలో తనతోపాటు చదువుకున్న మిత్రులు జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నారు. రవీంద్రనగర్ గ్రామం నుంచి ఆటల పోటీలలో గ్రామం జట్టు తరఫున ఎన్నో పథకాలు సాధించామని క్రికెట్ ఆటగాడిగా ఒంటి చేత్తో విజయాలు సాధించేవాడని సన్నిహితులు మిత్రులు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం గ్రామం నుంచి దేశ రక్షణలో చాలా మంది ఉన్నారని కాని గ్రామం నుంచి రక్షణకోసం ఆర్మీలో మొదటిసారిగా రాజేశ్ చేరాడని గ్రామస్తులు తెలిపారు. తాజాగా జరిగిన ఎన్నికల సమయంలో 5న స్వస్థలానికి వచ్చిన రాజేశ్ తిరిగి ఈనెల 14న విధుల్లోకి వెళ్లాడు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో 18న సరిహద్దుల్లో విధుల్లో చేరాడు. ఒకే తేదీన ఇద్దరు సైనికులు.. చింతలమానెపల్లి: డిసెంబర్ 24 నియోజకవర్గంలో ఇద్దరు సైనికులు వీరమరణం పొం దిన రోజు. యాధృచ్చికమే అయినా ఇదే రోజు న ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. ఈనెల 24సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో రాజేశ్ దాక్వా మృతి చెందారు. కాగా నియోజకవర్గంలోని కోర్సిని గ్రామానికి చెందిన వసాకె భీమయ్య, నాగమణి దంపతుల కుమారుడు వసాకె సంతోష్ సైతం 2015 సంవత్సరంలో ఇదే నెలలో 24న వీరమరణం పొందాడు. కారాకోరం పర్వత శ్రేణుల్లోని సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ ప్రమాదానికి గురయ్యాడు. యాధృచ్చికమే అయినా ఒకే నెలలో ఒకే తేదీన సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన సైనికులు వీరమరణం పొందడం కలిచివేస్తోంది. -
చంపుకోండి.. కానీ నన్నేం అడగొద్దు!
శ్రీనగర్: ఉగ్రవాదులు తలపై తుపాకీ గురిపెట్టినా ఓ జవాన్ ఆర్మీ రహస్యాలను చెప్పేందుకు నిరాకరించాడు. దీంతో ఉగ్రవాదులు అతడిని దారుణంగా కాల్చిచంపారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకుంది. కుల్గామ్‌లోని ఛురత్ గ్రామానికి చెందిన లాన్స్‌నాయక్ ముఖ్తార్ అహ్మద్ మాలిక్ టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 162వ బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. ఈ నెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కుమారుడు చనిపోయాడు. దీంతో కుమారుడి కర్మకాండ నిర్వహించేందుకు సోమవారం మాలిక్ ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా ఆయన ఇంట్లోకి దూసుకెళ్లారు. తలపై తుపాకీ గురిపెట్టి ఆర్మీ స్థావరాలకు సంబంధించిన వివరాలు చెప్పాలని బెదిరించారు. అయితే ఏమాత్రం తొణకని మాలిక్.. ‘కావాలంటే నన్ను చంపుకోండి. కానీ ప్రశ్నలు మాత్రం అడగొద్దు’ అని కరాఖండిగా చెప్పేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఉగ్రవాదులు మాలిక్‌పై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి పరారయ్యారు. -
స్మార్ట్ ఫోన్లు వాడకుండా వారిని ఆపలేం..
సాక్షి, న్యూఢిల్లీ : ఆధునిక యుద్ధ తంత్రాల్లో సోషల్ మీడియా పాత్రను విస్మరించలేమని, సైనికులు వారి కుటుంబాలను స్మార్ట్ ఫోన్లు ఉపయోగించకుండా ఎవరూ ఆపలేరని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలని సైనికులను కోరాలని తమకు సూచనలు వచ్చాయని, స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండాలని సైనికులు, వారి కుటుంబాలను కోరగలమా అని ఆయన ప్రశ్నించారు. స్మార్ట్ ఫోన్‌ను అనుమతిస్తూనే క్రమశిక్షణను తీసుకురాగలగడం ముఖ్యమని ఆర్మీ చీఫ్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాను విస్మరించలేమని, సైనికులు దీన్ని వాడుకుంటారని స్పష్టం చేశారు. సోషల్ మీడియాను సైనికులు అవకాశంగా మలుచుకోవాలని రావత్ సూచించారు. ఆధునిక కదనరంగంలో కృత్రిమ మేథను అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ సోషల్ మీడియా ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందిపుచ్చుకునే ఆలోచన చేయాలని కోరారు. -
16 మందిని మింగిన ‘నిపా’
కోజికోడ్, కేరళ : ప్రాణాంతక ‘నిపా’ వైరస్ మహమ్మారి కేరళలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. దీంతో ఇప్పటివరకూ ‘నిపా’ బారిన పడి మరణించినవారి సంఖ్య 16కు చేరుకుంది. అంతేకాక కోజికోడ్‌కు చెందిన మరో వ్యక్తికి కూడా ‘నిపా’ వైరస్ సోకినట్లు వైద్య అధికారులు నిర్ధారించారు. మధుసూధన్(56), అకిహిల్ కరస్సేరి(28) కోజికోడ్‌లోని మెడికల్ కాలేజ్ ఆస్సత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారని వైద్యులు తెలిపారు. ఈ విషయం గురించి ఆస్పత్రి సిబ్బంది ‘చికిత్స ప్రారంభంలో కోలుకున్నట్లే కనిపించారు...కానీ తరువాత పరిస్థితి విషమించడంతో వారు మరణించారు. వీరికి ఈ వైరస్ ఆస్పత్రి నుంచే సోకిందన్నా’రు. మరో వ్యక్తికి కూడా నిపా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కోజికోడ్ ఆస్పత్రిలో ‘నిపా’ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన వారు ముగ్గురు, వైరస్ లక్షణాలు ఉన్న వారు మరో తొమ్మిది మంది ఉన్నారు. ఇదిలా ఉండగా కోల్‌కతాలో మరణించిన సైనికుడు శీను ప్రసాద్‌కు సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం తనకు తెలియదని స్టేట్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎల్ సరిత తెలిపారు. శీను ప్రసాద్.. నిపా వైరస్ బారిన పడే మరణించాడనే అనుమానం నేపథ్యంలో అతని శాంపిల్స్‌ను పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కి వ్యాధి నిర్ధారణకు పంపారు. భారతదేశంలో నిపా వైరస్‌ను గుర్తించగల సామర్ధ్యం ఉన్న ఏకైక లాబోరేటరీ ఎన్‌ఐవీలోనే ఉంది. అయితే బుధవారం మరణించిన అకిహిల్ ‘నిపా’ వ్యాప్తి ఉన్న ప్రాంతం వాడు కాదని, కనీసం ఈ మధ్య కాలంలో ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించలేదని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే అకిహిల్ ఈ మధ్యే కొజికోడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన స్నేహితున్ని చూడడానికి వచ్చాడని అతని బంధువులు తెలిపారు. రుతుపవనాలు సమీపిస్తున్న నేపథ్యంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. ఇప్పటికే చాలా వరకూ ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావడం లేదు. ప్రభుత్వం వారికి ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిస్తుంది. -
కోల్‌కతాలో నిపా వైరస్ కలకలం
కోల్‌కతా : కోల్‌కతా మహానగరంలో కేరళకు చెందిన సైనికుడు ఆసుపత్రిలో చికిత్స పొందతూ ప్రాణాలు విడిచారు. శీను ప్రసాద్ ఫోర్ట్ విలియం కోటలో పని చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రసాద్‌ను ఆసుపత్రికి తరలించారు. చికిత్సకు స్పందించని ప్రసాద్ సోమవారం తుది శ్వాస విడిచారు. కాగా, ప్రసాద్ నిపా వైరస్ సోకి ప్రాణాలు విడిచినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ప్రసాద్ శాంపిల్స్‌ను పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కి వ్యాధి నిర్ధారణకు పంపారు. భారతదేశంలో నిపా వైరస్‌ను గుర్తించగల సామర్ధ్యం ఉన్న ఏకైక లాబోరేటరీ ఎన్‌ఐవీలోనే ఉంది. కాగా, కేరళలో ఇప్పటికి నిపా వైరస్‌తో 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
ఆర్మీ టు హిజ్బుల్ ముజాహిద్దీన్
కశ్మీర్ : భారత ఆర్మీకి చెందిన ఓ జవాను గత శనివారం నుంచి అదృశ్యమయ్యాడని, బహుశా హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థలో చేరి ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. అదృశ్యమైన జవాను, ఉగ్రవాద సంస్థలో చేరినట్లు తెలియజేసేలా ఏకే- 47 పట్టుకుని ఉన్న ఫోటోను హిజ్బుల్ విడుదల చేసింది. ఈ ఫోటో స్థానిక మీడియాలో వైరల్ అవుతోంది. ఉగ్రవాద సంస్థలో చేరినట్లు భావిస్తున్న సిపాయి మీర్ ఇద్రీస్ సుల్తాన్, 12వ జమ్మూ కశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీకి చెందినవాడు. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని అతని స్వగ్రామానికి చివరిసారిగా ఈ నెల 12న వచ్చినట్లు తెల్సింది. ఏప్రిల్ 14 నుంచి అదృశ్యమయ్యాడు. ఈ విషయం గురించి మీర్ ఇద్రీస్ సుల్తాన్ తండ్రి స్థానిక పోలీసులను సోమవారం ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. మరో ఇద్దరు యువకులతో ఉగ్రవాద సంస్థలో మీర్ సుల్తాన్ చేరినట్లు మీడియాకు పోలీసులు వివరించారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా భారత ఆర్మీకి తెలిపారు. ఉగ్ర సంస్థలో చేరిన సుల్తాన్ ఫోన్ రికార్డులు పరిశీలిస్తున్నామని, అలాగే ఉగ్ర సంస్థలతో సుల్తాన్ సంబంధాలపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. అతను ఉగ్రవాద సంస్థలో చేరినట్లు తమ వద్ద ఎటువంటి ఆధారాలు ప్రస్తుతం తమ వద్ద లేవని, అతను సెలవులో ఉన్నపుడు కశ్మీర్‌కు వెళ్లాడా లేదా అనే సమాచారం కూడా తమ వద్ద లేదని భారత ఆర్మీ పేర్కొంది. ప్రస్తుతం బిహార్‌లోని కటిహర్‌లో మీర్ ఇడ్రీస్ సుల్తాన్ పనిచేస్తున్నాడు. జార్ఖండ్‌కు బదిలీపై వెళ్లాల్సి ఉంది. అయితే అక్కడకు వెళ్లేందుకు ఇష్టపడటంలేదని తెలిపింది. ఆ కారణంతోనే హిజ్బుల్‌లో చేరి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ విడుదల చేసిన చిత్రంలో సుల్తాన్, ఏకే-47 పట్టుకున్నట్లు, అతని వివరాలు గ్రీన్ అక్షరాలలో దానిపై కనపడేటట్లు ఉంది. అలాగే బీఎస్సీ రెండో సంవత్సరం చదివినట్లు ఆ ఫోటో మీద రాసి ఉంది. -
సైనికుల ఇళ్లలో చోరీ.. అధికారులు షాక్..!
సాక్షి, టీనగర్: రక్షణ కల్పించే సైనికుల ఇళ్లకు భద్రతా కరువైంది. మిలటరీ క్వార్టర్స్‌లో వరుసగా మూడు ఇళ్లలో నగదు, నగలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన చెన్నై పోర్ట్ రైల్వేస్టేషన్ సమీపంలోని నేవీ నగర్లో చోటుచేసుకుంది. వివరాలివి.. ఈ నేవీ నగర్లో మిలిటరీ, నేవీ సైనికులు నివశిస్తున్నారు. ఇక్కడ సాయుధ సైనికులు అన్ని వేళలా రక్షణ చర్యలు చేపడుతుంటారు. కానీ, ఆదివారం ఉదయం నేవీ అధికారులు సర్కార్తీజి, అఖిలేష్‌కుమార్, సెంథిల్‌కుమార్ ఇళ్ల తాళాలు పగులగొట్టి ఉన్నాయి. సమీపంలో నివశించే అధికారులు దీన్ని గమనించి షాక్‌కు గురయ్యారు. వారు వెంటనే పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం నిపుణులతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అయితే వేరే ఊర్లకు వెళ్లిన అధికారులు వచ్చిన తర్వాతే నగదు, నగలు ఏమేరకు చోరీకి గురయ్యాయనే విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. -
శౌర్యానికి ప్రతిరూపం
నీడని సైతం అనుమానించాలి. నిఘా నేత్రం ప్రసరించాలి. నేత్ర వీక్షణం సునిశితంగా సాగాలి. అప్పుడే సైనికుడు శత్రువు అంతు చూడగలడు. అవన్నీ ప్రదర్శించబట్టే ఆబోతుల వెంకటరావు ఆత్మాహుతి ముష్కర మూకల్ని మట్టుబెట్టగలిగాడు. వందలాది భారత వీరుల ఊపిరి నిలబెట్టగలిగాడు. భారత ప్రభుత్వ ‘శౌర్యచక్ర’ పురస్కారం అందుకోగలిగాడు. ఆయన సాహసం వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. రక్తం తాగే పిశాచాలని కుమ్మేసిన ఆబోతుల వెంకటరావు సాహసగాథ ఆయన మాటల్లో చదవండి. – విజయనగరం టౌన్ ఆరోజు 2016 అక్టోబర్ 6వ తేదీ. జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ నియంత్రణ రేఖలో విధులు నిర్వరిస్తున్నాను. నేనున్న 8 మద్రాస్ జనరల్ రెజిమెంట్ ముందు అలజడి.. ఏదో జరుగుతోంది.. అనుమానం నిజమైంది. శత్రువులు చొరబడ్డారు. ఆత్మాహుతి దళానికి చెందిన ముగ్గురు మిలిటెంట్లు తచ్చాడుతున్నారు. ఆర్మీ రెజిమెంట్‌పై దాడికి ప్రయత్నిస్తున్నారు.. సమయం లేదు.. అప్రమత్తం కావాలని సైన్యాన్ని సూచనలు ఇచ్చాను. ఇది గమనించిన తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. క్యాంప్‌లోకి చొరబడి ఆత్మాహుతి చేసుకోవాలన్నది వారి పన్నాగం. అదే జరిగితే.. పది నిమిషాల్లో మొత్తం బూడిదయ్యేది. సుమారు 350 మంది సైనికులు బలయ్యేవారు. గతంలో కమాండ్ కంట్రోల్ కోర్సులో పొందిన శిక్షణ నాకెంతగానో ఉపయోగపడింది. ఏకే 47తో పాయింట్ వ్యూలో ఒకే షాట్లో ఇద్దరు మిలిటెంట్లను హతమార్చాను. ఆ వెంటనే.. మూడో తీవ్రవాదిని కూడా మట్టుబెట్టాను. డ్యూటీ పోస్టులో ఉన్న ఏ ఒక్కరికీ చిన్న గాయం కూడా కాకుండా కాపాడాను. చిన్నప్పటినుంచి సైన్యమంటే ఆసక్తి మాది విజయనగరం వద్ద జమ్మునారాయణపురం గ్రామం. ఇంటర్ మీడియట్ వరకూ చదివాను. చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలన్న ఆసక్తి వల్ల సాధన చేసేవాడిని. ఇంటర్మీడియట్ పూర్తయిన సమయంలో తొలిసారిగా ఏలూరులో నిర్వహించిన ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో డాక్యుమెంటేషన్‌లో నెగ్గలేకపోయాను. ఆ తర్వాత 2009లో విజయనగరం విజ్జీ స్టేడియంలో నిర్వహించిన ఎంపికల్లో ఎంపికయ్యాను. ప్రస్తుతం ప్రత్యేక విధుల్లో భాగంగా యూఎన్ఓలో సభ్యత్వం పొందిన ఆఫ్రికాలోని సౌత్ సూడాన్‌కి పంపించారు. ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతల పరిరక్షణ విధులు నిర్వరిస్తున్నాను. 2013లో శ్యామలని వివాహం చేసుకున్నాను. మూడున్నరేళ్ల హరిణి, నాలుగునెలల ఈషా నా సంతానం శౌర్యచక్ర ఓ అద్భుతం నా సాహసం గుర్తించిన మా టీమ్, ఆర్మీ రెజిమెంట్ శౌర్యచక్రకు నామినేట్ చేయడం.. రాష్ట్రపతి కోవింద్ నుంచి పురస్కారం అందుకోవడం ఓ అద్భుతమైతే.. 60 ఏళ్లలో మా రెజిమెంట్‌కు వచ్చిన తొలి శౌర్య అవార్డు కావడం ఆనందంగా ఉంది. జిల్లాలో కూడా తొలి శౌర్యచక్ర అందుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఎంతో ఆనందంగా ఉంది భారతదేశం గర్వించదగ్గ పురస్కారాన్ని శౌర్యచక్ర మా బిడ్డ అందుకోవడం ఆనందంగా ఉంది. మారుమూల గ్రామం నుంచి వెళ్లి సరిహద్దుల్లో ప్రాణాలను లెక్క చేయకుండా శత్రుమూకల్ని చీల్చి చెండాడిన వెంకటరావు సేవల్ని గుర్తించడం మరువలేం. –రాము, చిట్టమ్మ -
దేశమే నా కుటుంబం
సరిహద్దే సైనికుడి ఇల్లు... దేశమే అతని కుటుంబం. ఆ కుటుంబానికి కాపలా సైనికుని విధి.డ్యూటీ ఫస్ట్ అనుకున్నాడు ఫిరోజ్లోని సైనికుడు. బుల్లెట్లకు ఎదురొడ్డి ‘నా దేశం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను’ అని నినదించాడు. నేడు సైనికుడు లేకపోవచ్చు...దేశం అనే ఈ కుటుంబం అతణ్ణి తలుచుకోకుండా ఉంటుందా? సరిహద్దే సైనికుడి ఇల్లు.ఇంటి కాపలా సైనికుని విధి.శతృవు టక్కరి నక్క అయినప్పుడు సైనికుడు పులిలా గాండ్రిస్తాడు.తుపాకీని ఎక్కుపెడతాడు.బుల్లెట్ తాకిన శతృవు హాహాకారాలు చేస్తాడు.బుల్లెట్లకు ఎదురొడ్డిన సైనికుడు ‘భారత్ మాతాకీ జై’ అని నినదిస్తాడు.నేడు సైనికుడు లేకపోవచ్చు.దేశం అనే ఈ ఇల్లు అతణ్ణి తలుచుకోకుండా ఉంటుందా?‘నస్రీన్.. బక్రీద్ పండక్కి రాలేకపోతున్నా..’ చెప్పాడు ఫిరోజ్.‘కోషీష్ చేయండి.. పిల్లలు చాలా జ్ఞాపకం చేస్తున్నారు... ’ నిరాశ పడుతూ అంది నస్రీన్. ‘నీకు తెలుసుగా నస్రీన్.. మిలట్రీలో ఇలాగే ఉంటుంది... పిల్లలని సముదాయించు’‘అలాగే... మీరు జాగ్రత్త’ దాదాపు అరగంట సాగింది ఆ సంభాషణ. ఆ అరగంటలో చాలాసార్లు సిగ్నల్ కట్ అయింది. మళ్లీ మళ్లీ ట్రై చేస్తూ భార్యతో మాట్లాడాడు. ఇంకా ఆమెకు భర్తను వినాలనే ఉంది. కాని జమ్ము, కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ కమ్యూనికేషన్ సిగ్నల్ అంత బలంగా లేదు. ఫోన్ డిస్కనెక్ట్ అయ్యాక ఫిరోజ్, నస్రీన్ ఇద్దరిలోనూ బాధే! నేపథ్యం... ఫిరోజ్ది హైదరాబాద్‌లోని నవాబ్సాబ్ కుంట. నస్రీన్ది ఎమ్.ఎస్ మఖ్తా. ఇద్దరికీ దూరపు బంధుత్వం ఉంది. 2006లో నిఖాతో విడదీయని బంధంగా మారారు. ఫిరోజ్ కుటుంబంలో అతనే మొదటి సంతానం. ఫిరోజ్ వాళ్ల నాన్న మిలటరీలో ఉండి రిటైరయ్యాడు. ఫిరోజ్ కూడా పద్దెనిమిదేళ్లకు మిలటరీలో జాయిన్ అయ్యాడు. యూనిఫామ్ అంటే అమితమైన భక్తి, గౌరవం. డ్యూటీ అంటే ప్రాణం. ఏ బార్డర్లో ఏ సెక్టార్లో బాధ్యతలు అప్పజెప్పినా అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. సౌత్ఆఫ్రికాకు వెళ్లమంటే ఇంట్లో వాళ్లు వద్దని వారించినా వినకుండా వెళ్లాడు. డ్యూటీ అంటే డ్యూటీనే అనేవాడు. వీరుడు లాన్స్ నాయక్ ఫిరోజ్.అమరవీరుడు ఫిరోజ్! 2013 అక్టోబర్... కశ్మీర్ సరిహద్దులో విపరీతంగా కాల్పులు జరుగుతున్నాయి. ఆ సంఘటనప్పడు ఆ రోజు డ్యూటీలో ఉన్నాడు ఫిరోజ్. అది బక్రీద్‌కు ముందు రోజు. ఆ సమయంలోనే దసరా కూడా ఉండడంతో హిందూ జవాన్లు సెలవుల మీద సొంతూళ్లకు వెళ్లారు. ఫిరోజ్ బక్రీద్‌కి లీవ్ తీసుకోకుండా డబుల్ డ్యూటీలో ఉన్నాడు. ఆ విషయాన్నే ఫోన్లో భార్యతో పంచుకున్నాడు. అన్నట్లుగానే సరిహద్దులో రెప్ప వేయకుండా నలు దిక్కులా దృషిసారిస్తున్నాడు. అప్పుడే అవతలవైపు నుంచి కాల్పులు మొదలయ్యాయి. సమాధానంగా ఫిరోజ్‌ఖాన్ తుపాకి గురిపెట్టాడు. ఫైర్ చేస్తూనే ఉన్నాడు. ధడ్ధడ్ధడ్... శతృవు తోక ముడుస్తూ ఉండగా... ధడ్ధడ్మంటూ ఎదురు నుంచి బుల్లెట్లు దూసుకొచ్చి జివ్వున ఫిరోజ్‌కు గుచ్చుకున్నాయి. అయినా ఫిరోజ్ తగ్గలేదు. పోరాడాడు. పోరాడుతూ పోరాడుతూనే కుప్పకూలాడు. వెంటనే అతణ్ణి శిబిరంలోకి చేర్చారు తోటి సైనికులు. అదే సమయానికి హైదరాబాద్‌లో... నస్రీన్ తన ముగ్గురు పిల్లల (ఇద్దరమ్మాయిలు, ఒక్కబ్బాయి)తో తల్లిగారింట్లో ఉంది. బక్రీద్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నస్రీన్ తండ్రి మొయినుద్దీన్ హడావిడిగా ఉన్నాడు. ఇంతలోకే అతనికి ఫోన్.. ‘బార్డర్లో చిన్నగా కాల్పులు. ఫిరోజ్‌కి షోల్డర్‌లో బుల్లెట్ దిగింది’ అని సమాచారం. ‘యాల్లాహ్...’ మొయినుద్దీన్ కంగారు పడ్డాడు. ‘కంగారు పడకండి.. ఏం కాలేదు. మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు’అని ఫిరోజ్‌కి ఫోన్ ఇచ్చారు. ‘అబ్బాజాన్.. అ..బ్బా...జా...’ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు ఫిరోజ్. కాని చెప్పలేకపోయాడు. అందరూ ఉన్న పని వదిలేసి దేవుడి ప్రార్థనల్లో మునిగి పోయారు. తెల్లవారో.. ఆ మర్నాడో.. ఫిరోజ్ భౌతిక కాయం రానే వచ్చింది. నస్రీన్ కుప్ప కూలిపోయింది. ‘పిల్లలు పెరుగుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఫౌజీ వద్దు ఏం వద్దు.. అందరం ఒక్క చోటే ఉందాం.. ఉన్నది తిందాం.. వచ్చేయండి’ ఎన్నో సార్లు బతిమాలుకుంది. ‘నస్రీన్.. దీన్ని నేనొక ఉద్యోగంలా అనుకోవట్లేదు. ఈ నేలను కాపాడ్డం ఈ దేశ పౌరుడిగా నా బాధ్యత అనుకుంటున్నా. నువ్వే అర్థం చేసుకోకపోతే ఎట్లా చెప్పూ..!? నాకు మాత్రం ఉండదా? నీతో, పిల్లలతో ఉండాలని. ఇన్ని రోజులు ఓపిక పట్టావు. ఇంకొన్ని రోజుల్లో రిటైరైపోతా.. అప్పుడంతా మీతోనే కదా..’ అంటూ అంతకుముందే ఆగస్ట్‌లో ఈద్ పండక్కి వచ్చినప్పుడు ఆప్యాయంగా చేయి పట్టుకొని భరోసా ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసి అట్లా ఎట్లా పోతాడు? అల్లాహ్.. ఈ పిల్లలకు ఏమని చెప్పాలి? ‘నస్రీన్.. తుపాకి భుజానేసుకొని జమీన్‌ను కాపాలకాసే జావాన్‌ను నేను. ఎప్పుడేమవుతుందో తెలియదు. అన్నిటికీ సిద్ధపడాలి. ఒంటరిగా బతకడం నేర్చుకోవాలి. ఇండిపెండెంట్‌గా బతికే ధైర్యాన్ని తెచ్చువాలి’ మొన్న ఈద్కొచ్చినప్పుడే అన్నాడు. గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఆమె కళ్లల్లో జలధారలు. ఎప్పుడూ దగ్గరగా లేకపోయినా అప్పుడప్పుడు కనీసం నెలకో రెండునెల్లకైనా అరగంట అయినా సిగ్నల్ సతాయిస్తూ అయినా ఫిరోజ్‌తో మాటలుండేది. ఊరడింపులు.. ధైర్యవచనాలు.. ప్రేమ.. అనురాగం.. భవిష్యత్ ప్రణాళికలు.. ఆశలు.. ఆశయాలు..ఎన్నో పంచుకునే వాళ్లు. డ్యూటీ గురించి ఎప్పడూ ఏమీ చెప్పవు అని గారంగా విసుక్కునేది. ‘చెబితే భయపడ్తావ్.. మళ్లీ నన్ను వెళ్లనివ్వవ్.. నీ భర్త బహద్దురీ నీ భర్త గుండెలోనే ఉండనివ్వు’ అనేవాడు నవ్వుతూ. ‘మరినాకెట్లా తెలిసేది.. మీ నాన్నను చూసి నువ్వు ఇన్స్పైర్ అయినట్లు వాళ్ల నాన్నను నా పిల్లలు ఇన్స్పైర్ కావొద్దా?’ అనేది. నవ్వి ఊరుకునేవాడు అంతే!ఆ నవ్వు లేదు.. ఆ ధైర్యం రాదు.. ఆ సాహసం కనిపించదు ఇప్పుడు! అన్నీ ఈ నేలకు సెల్యూట్ చేసి ఆయనతోపాటే వెళ్లిపోయాయి. ఫిరోజ్ అంటే.. వెలుగు.. విజయం! ఆ పేరే తనకు ప్రేరణ. ఆ వెలుగే తనకు దారి చూపిస్తోంది.. ఆ కామియాబీనే తనను నడిపిస్తోంది అంటుంది నస్రీన్. ఆమె కోరుకునేది ఒక్కటే. ‘బతికున్నంత కాలం.. ఫౌజీ ఫౌజీ అని తపించాడు. ఈ దేశం కోసం ప్రాణాలర్పించాడు. ఆయన చనిపోయినప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ రెండువందల గజాల స్థలాన్నిస్తానని చెప్పింది. జవాన్ భార్యగా అది నా హక్కు. ఆయన చనిపోయి అయిదేళ్లయినా ఇంకా ఆ జాగ ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పడ్డాక అదిచ్చే బాధ్యత తెలంగాణ గవర్నమెంట్‌కు వచ్చింది. రేపు మాపు అంటూ తిప్పుతూనే ఉన్నారు. కాని ఇప్పటికీ జాడలేదు. కాళ్లరిగేలా తిరుగుతున్నా.. అమర జవాన్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా?’ అంటూ ఆవేదన చెందుతోంది నస్రీన్. ఫిరోజ్ పెద్ద కూతురికి పదేళ్లు. పెద్దయ్యాక ఏమవుతావ్ అని అడిగితే.. ‘పప్పాలాగా మిలిట్రీ పోలీస్ అవుతా’ అంటుంది ఉత్సాహంగా. బక్రీద్ పండగ త్యాగానికి చిహ్నం.ఆ పండుగ సమయంలో దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసినవాడు ఫిరోజ్. సలాం.. ఫిరోజ్ సాబ్.. సలాం! – సరస్వతి రమ డ్యూటీ గురించి ఎప్పడూ ఏమీ చెప్పవు అని గారంగా విసుక్కునేది. ‘చెబితే భయపడ్తావ్.. మళ్లీ నన్ను వెళ్లనివ్వవ్.. నీ భర్త శౌర్యం నీ భర్త గుండెలోనే ఉండనివ్వు’ అనేవాడు నవ్వుతూ. -
అల్‌ఖైదా ఉగ్రదాడి..11 మంది సైనికుల మృతి
యెమెన్ : ఆర్మీ కాన్వాయ్‌పై అల్ ఖైదా తీవ్రవాదులు మెరుపుదాడి చేయడంతో 11 మంది యెమెన్ సైనికులు మృతిచెందారు. ఈ సంఘటన ఆగ్నేయ హంద్రామౌట్ ప్రావిన్స్‌లో బుధవారం సాయంత్రం చోటుచేసుకుందని భద్రతాబలగాల అధికారి తెలిపారు. చనిపోయిన సైనికుల్లో అందరూ కొత్తగా రిక్రూట్ అయిన వారే ఉన్నారని చెప్పారు. కొత్తగా నియామకమైన భద్రతా బలగాలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు, ప్రత్యేక భద్రతా బలగాలు కూడా యెమెన్‌లో సహకారం అందిస్తున్నాయి. వివిధ దిశల నుంచి ఒకేసారి కాల్పులు జరపడం వల్ల మృతుల సంఖ్య పెరిగిందని, అందువల్లే కాల్పులను సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోయామని ఓ అధికారి వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా అల్ ఖైదా ఇన్ అరేబియన్ పెనిన్సులా(ఏక్యూఏపీ), ఐసిస్‌తో పాటు పలు ఉగ్రవాద సంస్థలు ఆగ్నేయ ప్రాంతంలో చురుకుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా అల్ ఖైదా, ఐసిస్‌కు చెందిన వారు ఆత్మాహుతి దాడులకు కూడా దిగుతున్నారు. మానవతా సంక్షోభం ఎదుర్కొంటున్న మొదటి దేశంగా ఐక్యరాజ్యసమితి యెమెన్ దేశాన్ని ప్రకటించింది. కరువు, కలరా కారణంగా సుమారు 70 లక్షల మంది పౌరులు నిరాశ్రయులయ్యారు, మరో 2,000 మంది మృతిచెందారు. -
డీటీఓకు ఉపాధ్యాయ సంఘాల వినతి
కరీంనగర్‌ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల నుంచి సీఎం సహాయనిధికి ఒకరోజు వేతనం విరాళం అంగీకారం తెలిపిన వారి నుంచే మినహాయించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా ట్రెజరీ అధికారి శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించారు. సైనిక సంక్షేమ నిధికి ఏటా నవంబర్ నెల వేతనాల నుంచి విరాళం ఇస్తున్నామన్నారు. ఇప్పుడు సైనికుల సంక్షేమ నిధికి అదనంగా అవసరం అని ఎవరూ అడగలేదన్నారు. ఉపాధ్యాయుల అంగీకారం లేకుండా ఏ ఒక్కరి వేతనంతో కోత విధించరాదని వినతిపత్రంలో కోరారు. టీఎస్‌యూ అధ్యక్ష, కార్యదర్శులు కుమారస్వామి, అశోక్, టీపీటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు మల్లికార్జున్, రాంచంద్రారెడ్డి, డీటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు పి.ఈశ్వర్‌రెడ్డి, కోహెడ చంద్రమౌళి, ఎస్జీటీయూ అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ మాధవ్, ఈ.పోచయ్య, టీపీఎస్‌హెచ్‌ఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు సుభాష్, శ్యాంసుందర్‌రెడ్డి ఉన్నారు. -
వాయ్‌టెక్ అను నేను..
1944, ఫిబ్రవరి నెల.. రెండో ప్రపంచ యుద్ధ కాలం.. ఇటలీలోని పోర్ట్ ఆఫ్ నేపల్స్.. బ్రిటిష్ ఆఫీసర్ బ్రౌన్ సైనికుల రిజిస్టర్ చెక్ చేస్తున్నాడు.. అప్పుడే ఈజిప్టు నుంచి వచ్చిన నౌకలో పోలండ్ సైనికుల బృందం ఒకటి దిగింది.. జర్మన్, ఇటలీ సైన్యానికి వ్యతిరేకంగా తమతో కలిసి పోరాడటానికి.. అందుకే వారందరి వ్యవహారాలు చూడ్డానికి బ్రౌన్ ఇక్కడికి వచ్చాడు.. రిజిస్టర్ చూస్తూ.. ఒక్కో సైనికుడి పేరు పిలుస్తున్నాడు.. కార్పొరల్ వాయ్‌టెక్.. ఎవరూ పలకలేదు.. మరోసారి గట్టిగా పిలిచాడు.. ఊహూ.. సౌండ్ లేదు.. మరోసారి రిజిస్టర్ చెక్ చేసుకున్నాడు.. కార్పొరల్.. ఆర్మీలో నాన్ కమిషన్డ్ జూనియర్ ఆఫీసర్ ర్యాంక్.. సర్వీసు నంబర్ అంతా సరిగ్గానే ఉంది.. ఏమయ్యాడబ్బా.. వాయ్‌టెక్ అంటూ చిరాగ్గా ముఖం చిట్లించాడు.. అప్పుడొచ్చాడు వాయ్‌టెక్.. మందగమనంతో.. కేర్లెస్గా.. గుర్రుమన్నాడు.. అంతే.. అంతోటి ఆఫీసరుకూ ఆ చలికాలంలో చెమటలు పట్టాయి.. ఎందుకంటే వాయ్‌టెక్.. ఓ ఎలుగుబంటి!! ఓ ఎలుగుబంటి సైనికుడా.. అదెలా.. తెలియాలంటే.. ఓ రెండేళ్లు వెనక్కి వెళ్లాలి.. 1942లో ఇరాన్‌లోని పోలిష్ ఆర్మీ క్యాంప్.. అక్కడ గొర్రెలు కాచుకునే ఓ అబ్బాయికి చిన్నపాటి ఎలుగుబంటి దొరికింది. దాన్ని పట్టుకుని తిరుగుతున్నాడు. పోలండ్ సైనికులు చూశారు. కొన్ని టిన్ల ఆహారం, చాక్లెట్, స్విస్ కత్తి ఇస్తే.. ఆ ఎలుగుబంటిని ఇచ్చేశాడు. వారు దాన్ని పెంచుకోవడం మొదలుపెట్టారు. వాయ్‌టెక్ అని పేరు పెట్టారు. తమకు వచ్చే రేషన్‌లోని ఆహారాన్ని వంతులవారీగా వాయ్‌టెక్‌కు పెట్టారు. వాయ్‌టెక్ సైనికుల్లా బీర్లు తాగడం మొదలుపెట్టాడు. సిగరెట్టు తాగడం, తినడం మొదలుపెట్టాడు. నిజానికి ఆ క్యాంప్‌లో ఉన్నవారిలో ఎక్కువమంది యుద్ద ఖైదీలు. పోలండ్‌ను సోవియట్ యూనియన్ ఆక్రమించుకున్నప్పుడు పట్టుబడినవారు. జర్మనీ సోవియట్ మీద దాడి చేసిన సమయంలో వారిని వదిలేశారు. ఇంటికి తిరిగివెళ్దామనుకున్నారు.. కానీ తమ దేశం సోవియట్ అధీనంలో ఉంది. యుద్ధ సమయంలో చాలా మంది కుటుంబ సభ్యులూ చనిపోయారు. దీంతో వాళ్లకి వాయ్‌టెక్ ఓ ఎంటర్టైన్మెంట్. అందుకే వాడితోనే మల్లయుద్ధం, బాక్సింగ్ చేసేవారు. తాము ఏ దేశానికి వెళ్తే.. అక్కడికి తీసుకెళ్లేవారు. అయితే.. ఇప్పుడు వాయ్‌టెక్ ఆరడుగుల ఎలుగుబంటి. పెంపుడు జంతువంటే.. ఒప్పుకోవడానికి పోర్టు సిబ్బంది సిద్ధంగా లేరు. అందుకే.. పోర్ట్ ఆఫ్ నేపల్స్కు బయలుదేరినప్పుడు ఈజిప్టు పోర్టులో దాన్ని నిలిపేశారు. క్రూర జంతువన్నారు. దీంతో పోలండ్ సైనికులు ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. వాయ్‌టెక్‌ను సైనికుడిగా రిజిస్టర్ చేశారు. ర్యాంక్, సర్వీస్ నంబర్, పేబుక్ కూడా ఇచ్చారు. అందరిలాగే.. వాయ్‌టెక్‌కు శిక్షణ ఇచ్చారు. భారీ మందుగుండు సామగ్రి, క్షిపణులు ఉన్న బాక్సులను ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లడం నేర్పించారు. ఇప్పుడు వాయ్‌టెక్ క్రూర జంతువు కాదు.. పోలండ్ సైనికుడు... సైనికుడే కానీ సత్తా చాటే సమయం ఏదీ? అది కూడా రానే వచ్చింది. 1944.. మాంటే కసీనో యుద్ధం.. వెనుకంజ వేయలేదు.. బాంబులు పడుతున్నా బెదరలేదు..22వ ఆర్టిలరీ సప్లై కంపెనీ తరఫున యుద్ధ రంగంలోకి దూకాడు. మందుగుండు సామగ్రి ఉన్న బాక్సులతోపాటు భారీ క్షిపణులను మోస్తూ.. తమ సహచరులకు అందించాడు.. నిరంతరాయంగా పనిచేశాడు.. అచ్చంగా ఓ సైనికుడిలాగానే.. యుద్ధం ముగిసిన తర్వాత పోలండ్ సైనికులు బ్రిటన్ ఆశ్రయం కోరారు. వాళ్లతోనే వాయ్‌టెక్ కూడా.. స్కాట్లాండ్లో ఓ సెలబ్రిటీలా అయిపోయాడు. పిల్లలను తన వీపుమీద ఎక్కించుకుని.. వాగుల్లో ఈదాడు. పార్టీల్లో డాన్సులేశాడు.. తర్వాత తర్వాత వాయ్‌టెక్‌ను ఎడిన్‌బర్గ్‌లోని జూకు పంపించారు. అంతవరకూ స్వేచ్ఛగా తిరిగిన వాయ్‌టెక్ నిర్బంధాన్ని తట్టుకోలేకపోయాడు.. విచారంగా ఉండేవాడు.. 1963లో జూలోనే చనిపోయాడు.. వాయ్‌టెక్ సేవలకు గుర్తింపుగా 22వ ఆర్టిలరీ కంపెనీ తమ లోగోను మార్చేసింది. క్షిపణులను మోస్తున్న వాయ్‌టెక్ బొమ్మను లోగోగా పెట్టుకుంది. ఎడిన్బర్గ్తోపాటు పలు ప్రాంతాల్లో వాయ్‌టెక్ విగ్రహాలు వెలిశాయి. యుద్ధంలో పాల్గొన్న ఎలుగుబంటిగా చరిత్రకెక్కాడు.. అందుకే అంటారు.. కార్పొరల్ వాయ్‌టెక్.. ఓ క్రూర జంతువు కాదు.. ఓ యోధుడు.. ఓ హీరో.. నాటికీ.. ఏనాటికీ.. – సాక్షి, తెలంగాణ డెస్క్ . -
ఒక్కోసారి రాత కూడా మారొచ్చు
సైనికులు అంగీకారంగా తలూపారు. నొబునాగ ఆలయంలోకి వెళ్లి ప్రార్థన చేసి వచ్చాడు. సైనికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పదహారవ శతాబ్దంలో జపాన్‌లో ఒక యుద్ధవీరుడు ఉండేవాడు. ఆయన పేరు నొబునాగ. ఒకసారి అనుకోని విధంగా యుద్ధంలో పాల్గొనవలసి వచ్చింది. తీరాచూస్తే శత్రువు దగ్గర వున్న సైన్యంలో తన దగ్గరున్నది పదో వంతు మాత్రమే అని గ్రహించాడు. అయినప్పటికీ ఆ పోరులో గెలుస్తాననే ఆయన విశ్వసించాడు. కానీ సైనికులకు నమ్మకం లేదు. వాళ్లు అధైర్యపడ్డారు. రణరంగానికి తరలి వెళ్తుండగా, మార్గ మధ్యంలో వాళ్లకో ఆలయం కనబడింది. ‘అయితే ఒక పనిచేస్తాను’ అన్నాడు నొబునాగ. ‘నేను ముందు వెళ్లి ప్రార్థన చేసివస్తాను. వచ్చాక ఒక నాణేన్ని ఎగరవేస్తాను. బొమ్మ పడిందంటే మనం ఈ పోరాటంలో గెలిచినట్టే. బొరుసు పడిందా ఓడినట్టు. మన రాతను విధే నిర్ణయిస్తుంది’. సైనికులు అంగీకారంగా తలూపారు. నొబునాగ ఆలయంలోకి వెళ్లి ప్రార్థన చేసి వచ్చాడు. సైనికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నొబునాగ నాణేన్ని ఎగరవేశాడు. బొమ్మ పడింది. సైనికుల ముఖాలు వెలిగిపోయాయి. ఉత్సాహంతో ముందుకు సాగారు. అలవోకగా శత్రువును మట్టి కరిపించి, విజయోత్సాహంతో తిరిగొచ్చారు.వస్తుండగా దారిలో, నొబునాగ వ్యక్తిగత సేవకుడు ‘విధిరాతను మార్చడం ఎవరికి మాత్రం తరమవుతుంది?’ అన్నాడు, తమ గెలుపునకు విధే కారణమన్నట్టుగా. ‘అవున్నిజమే’ అన్నాడు నొబునాగ, రెండువైపులా బొమ్మ ఉండేలా చేయించిన ఆ ప్రత్యేక నాణేన్ని నవ్వుతూ చూపిస్తూ. -
సైనిక జీవితం భయరహితమా?
ఆదిత్య హృదయం మనందరమూ దేశభక్తులమే. కానీ ఒక సైనికాధికారి కుమారుడిగా, ఆత్మగౌరవం కలిగిన, దృఢమైన ప్రజాస్వామ్య దేశంలో మన సాయుధ బలగాలు దేశ ప్రజల ప్రేమను పొందడానికి ప్రత్యేక హక్కును కలిగిలేవని చెప్పాలనుకుంటున్నాను. మనకు సేవచేసే నర్సులు, వైద్యులు, పూజారులు, మౌల్వీలు, రైతులు, కూలీలు వంటివారిని అభిమానించడం కంటే మన సైన్యాన్ని ప్రేమించడంలో ఉన్నత మనోభావాలకు తావుండదు. నిజానికి, మిలటరీ డ్రమ్ వాయిస్తూ, మనం ప్రత్యేకమైన వారమని, లేదా అలాంటి పని చేస్తున్నందుకు మనం ఇతరులకంటే అధికులమని భావించడమంటే అది ప్రజాస్వామ్య దేశంగా మన అపరిపక్వతనే ప్రతిబింబిస్తుంది. పైగా సైన్యం పేరుతో మన దేశంలో నానా చెత్తా మాట్లాడుతున్నారు. సైన్యంతో నాకు ప్రత్యేక బాంధవ్యం ఉన్నందువల్ల, సైన్యాన్ని గౌరవించడంలో నేనెవరికీ తీసిపోనందువల్ల, సైన్యం పట్ల ఈ వాగాండబరాన్ని సరిచేయవలసిన అవసరం ఉందనుకుంటున్నాను. నేను సైన్యాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టే, దానిగురించిన అసందర్భ ప్రసంగాలతో నేను తలపడాలని భావిస్తున్నాను. బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రసంగాన్ని చూపుతున్న ఒక వాట్సాప్ వీడియోను నేను ఇక్కడ ఉదాహరణగా చూపుతున్నాను. ఆడంబరంగా జిగేలుమంటున్న వేదికపై నిలుచుని ఆమె ఒక సైనికాధికారి బిడ్డగా ఉండటంలోని అనుభూతి గురించి మాట్లాడారు. దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. కానీ ఆ వేదికమీద ఆమె చెప్పవలసి వచ్చిన మాటలు నాకు నవ్వు తెప్పించాయి. సైనికుల ఇళ్లు ఇతరుల ఇళ్లతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటాయని చెబుతూ అనుష్క తన ప్రసంగం ప్రారంభించారు. ఎందుకంటే సైనికుల ఇళ్లలో క్రమశిక్షణ రాజ్యమేలుతూ ఉంటుందట. అంటే సైనిక కుటుంబాల్లోని తల్లులు, తండ్రులు తమ పిల్లలను ఏ సందర్భంలోనూ పాడు చేయలేదని నేను భావించవచ్చా? ఆ కుటుంబాల్లో ప్రేమికులు, ప్రేయసిలు ఉండరా? అయినా, సైనికుల పిల్లలు ఏడవరా? వారు అబద్ధాలు అడరా లేక ఎవరినీ గిల్లరా? నాన్న యూనిఫాం ధరిస్తారు కనుక మనం ఇతరులకంటే విభిన్నంగా ఉంటామా? మనం చన్నీటి స్నానాలు, శారీరక వ్యాయామాలు, నిత్య కవాతులు వంటి ప్రత్యేక లక్షణాలతోటే పెరిగామా? ఇవేమీ కాదు. తనకే సొంతమైన కాల్పనిక పలాయనతత్వంలో అనుష్క శర్మ చిక్కుకుపోయారు. పైగా తమ భర్తలు, తండ్రులు యుధ్ధానికి వెళ్లేటప్పుడు వారి భార్యలు లేదా పిల్లలు ఎలా స్పందిస్తారనే అంశం విషయంలో ఆమె చక్కెర పూత పూసినట్లుగా మాట్లాడారు. సైనికుల తల్లులు దృఢంగా ఉంటారు. తమలోని ఉద్వేగాలను దాచిపెడతారు. ఆ విషయంలో వారు ప్రత్యేకమైన వారే అంటే నేను వ్యతిరేకించను. కానీ వారిలో జాతీయ స్ఫూర్తిని ఆసాంతం కుమ్మరించడం తప్ప.. వారిలో భయం ఉండదని, ఆందోళనలు వారి దరికి చేరవనే స్థాయిలో అనుష్క స్పందించారు. భారతీయ సైనికాధికారి చివరిసారిగా యుద్ధరంగానికి ఎప్పుడు వెళ్లాడు? ఆయన భార్యా పిల్లలు అనుష్క సూచించిన తరహా దేశభక్తికి చెందిన ఉద్వేగాన్ని ఎప్పుడు అనుభూతి చెందారు? కార్గిల్‌ని పూర్తిస్థాయి యుద్ధంగా భావించకుంటే మీరు 1971నాటి యుద్ధకాలానికి వెళ్లాలి. నేను పొరపాటు పడకపోతే అనుష్క ఆనాటికి బహశా జన్మించి ఉండరు. నేను అప్పుడు బోర్డింగ్ స్కూలులో చదువుతుండేవాడిని. కానీ యుద్ధం తలుపులు తట్టగానే మా ప్రపంచం ఒక్కసారిగా తల్లకిందులైంది. మనం కాస్త నిజాయితీగా ఉందాం. యుద్ధం సంభవించిన మరుక్షణం సైనిక హృదయాలు బద్దలవుతాయి. ఎందుకంటే తమ ప్రియతములు అత్యున్నత త్యాగానికి సిద్ధపడాల్సి ఉందనే ఎరుక సైనికుల భార్యలు, పిల్లలకు ప్రతి క్షణమూ అర్థమవుతుంది. రాబోయే చెడు వార్తను మోసుకొచ్చే టెలిగ్రాం లేక టెలిఫోన్ కోసం భయకంపితులవుతూ ప్రతి రోజూ, ప్రతి గంటా, ప్రతి క్షణం మీరు భయంతో జీవించాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే భయంకరమైన యుద్ధ రంగంలో కాకుండా, సైన్యంలోనే మరొక క్షేమకరమైన డెస్క్ జాబ్‌లో నాన్న పనిచేస్తే బావుంటుందని మీరు భావించే క్షణాలు కూడా ఎదురవుతాయి. సైనిక కుటుంబాల మనోభావాలకు పూతమందు పూయడం సులభమే కానీ అది అవివేకం. పైగా ఏ సందర్భంలో అయినా అలా చేయడం తప్పే అవుతుంది. సమాజంలోని ఇతరుల కంటే వారు భిన్నమైన వారని మాయమాటలు చెబితే వారిని మీరు గౌరవించినట్లు కాదు. అది వారిని సమాజం నుంచి దూరం చేస్తుంది, ఎవరికీ లేని ప్రత్యేకతల్లోకి నెడుతుంది. అంతిమంగా వారిని అమానవీకరిస్తుంది. ఎందుకంటే సైనికుల కుటుంబ సభ్యులు కూడా మీకు లాగే నాకు మల్లే రక్తం చిందిస్తారు. వారు బాధలను, భయాన్ని అనుభూతి చెందుతారు. తమ ప్రియతముల నుంచి చాలాకాలం దూరమవుతారు. మన కంటే వారు ధైర్యంగా ఉండవచ్చు. కానీ వారిలోని సాధారణ మానవ లక్షణాలను మీరు గుర్తించ నిరాకరిస్తే వారిలోని గొప్పగుణాలను మీరు గౌరవించినట్లు కాదు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net కరణ్ థాపర్ -
తూటా తగిలినా.. అద్భుతం జరిగింది
-
తూటా తగిలినా.. అద్భుతం జరిగింది
సాక్షి, శ్రీనగర్ : సుంజ్వాన్ ఉగ్రదాడిలో గాయపడిన క్షతగాత్రులు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా వీరిలో మగ్గురు కన్నుమూయటంతో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. ఇక కాల్పుల్లో ఓ గర్భిణి గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆమె కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్న ఆ కుటుంబంలో ఇప్పుడు సంతోషం వెల్లివిరుస్తోంది. అద్భుతం జరిగి ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శనివారం ఆర్మీ కార్టర్స్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో.. రైఫిల్‌మ్యాన్ నజీర్ అహ్మద్‌తోపాటు ఆయన భార్య షాజాద్ ఖాన్(24) తీవ్రంగా గాయపడ్డారు. ఆమె వెన్నెముకలోకి తూటా దూసుకుపోవటంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. 35 వారాల గర్భిణి అయిన ఆమెను హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్లో సత్వారీలోని మిలటరీ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికీ ప్రాణాపాయం ఉందని వైద్యులు చెప్పటం బిడ్డపై కుటుంబ సభ్యులు ఆశలు వదులుకుని.. కనీసం తల్లినైనా రక్షించాలని వేడుకున్నారు. చివరకు ఆమెకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు తర్వాత సిజేరియన్ చేయటంతో ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. 2.5 కేజీల బరువుతో ఆ బిడ్డ, తల్లీ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. కాగా, తీవ్ర రక్తస్రావంతో తల్లి, బిడ్డా ఇద్దరూ బతకటం కష్టమని భావించామని.. కానీ, ఏదో అద్భుతం జరిగినట్లు ఇద్దరూ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని ఆర్మీ డాక్టర్లు చెబుతున్నారు. కాగా, గాయపడిన ఆమె భర్త అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.