
జవానును రక్షించారు
శ్రీనగర్: బైపాస్ రోడ్డుపై యాక్సిడెంట్ అయి వాహనం ఇరుక్కుపోయిన ఓ జవానును కశ్మీరీ ప్రజలు రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనగర్ లోని లాస్జన్ ప్రాంతంలో బైపాస్ పై వేగంగా వెళ్తున్న ఆర్మీ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కను ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్న వాహనంలో ఓ సైనికుడు ఇరుక్కుపోయాడు.
మిగిలిన జవానులు అతన్ని బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం చెందాయి. దీంతో తీవ్రంగా గాయపడిన జవానును అక్కడే ఉన్న కశ్మీరీ యువత ట్రక్కు సాయంతో బయటకు లాగి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను కొందరు తమ మొబైళ్లలో చిత్రించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా ప్రస్తుతం కశ్మీర్ లో పరిస్ధితులు కల్లోలంగా ఉన్న విషయం తెలిసిందే.