kashmiri youth
-
‘మా కుమారుడ్ని విడిచిపెట్టండి’
శ్రీనగర్: కశ్మీర్‌కు చెందిన మరో యువకుడు ఉగ్రవాదుల్లో చేరాడు. గ్రేటర్ నోయిడాలోని శారద విశ్వవిద్యాలయంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకుంటున్న అహ్‌తెసామ్ బిలాల్ సోఫీ(17) ఇస్లామిక్‌స్టేట్ ఆఫ్ జమ్మూకశ్మీర్(ఐఎస్‌జేకే) ఉగ్రసంస్థలో చేరాడు. ఐఎస్ జెండా ముందు బిలాల్ దిగిన ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. శ్రీనగర్‌కు చెందిన సోఫీ నోయిడాలో చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లేందుకు వర్సిటీ అధికారుల నుంచి అనుమతి తీసుకుని అక్టోబర్ 28న వర్సిటీ నుంచి బయలుదేరిన సోఫీ అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు నోయిడాతో పాటు శ్రీనగర్‌లోని ఖన్యార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిని దయచేసి ఇంటికి పంపాలని ఉగ్రవాదులను వేడుకుంటూ సోఫీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సోఫీ తండ్రి బిలాల్ ఓ వీడియోలో ఉగ్రవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మా మీద దయ చూపండి. దయచేసి నా కుమారుడిని ఇంటికి పంపండి. మా మొత్తం కుటుంబంలో ఏకైక మగ సంతానం అతడే. సోఫీ.. మన కుటుంబంలోని 12 మందికి నువ్వే దిక్కు. గత రెండేళ్లలో మన కుటుంబంలో నలుగురిని పోగొట్టుకున్న సంగతి మర్చిపోయావా?’ అని అన్నారు. ఇంటికి రావాల్సిందిగా తల్లి సైతం కొడుకును వీడియోలో కోరింది. -
కన్నడ మాట్లాడలేదని....!
సాక్షి, బెంగళూరు : దేశంలో నెలకొన్న ప్రాంతీయ దురాభిమానాలు వ్యక్తుల్లో సంకుచితత్వాన్ని రెచ్చ గొడుతున్నాయి. కర్ణాటకలో కన్నడం మాట్లాడలేదని అన్నదమ్ములను కొందరు వ్యక్తులు చావగొట్టిన ఘటన బెంగళూరులో జరిగింది. దాదాపు ఐదేళ్లుగా కశ్మీర్‌కు చెందిన అన్నదమ్ములు బెంగళూరులో నివాసముంటున్నారు. ఎప్పటిలానే ఇద్దరు సోదరులు.. డిసెంబర్12 రాత్రి.. ఒక స్టార్ హోటల్లో భోజనం చేసి కారులో ఇంటికి వెళుతున్నారు. సంజయ్ నగర్‌లోని ఎన్టీఐ బస్టాండ్ దగ్గరకు వచ్చాక.. వారిని పదిమంది యువకులు అడ్డగించారు. కన్నడంలో మాట్లాడాలని డిమాండ్ చేశారు. వారితో సోదరులిద్దరూ కన్నడంలో మాట్లాడకపోవడంతో.. దుండగులు భౌతిక దాడికి దిగారు. కన్నడంలో మాట్లాడ్డం వస్తేనే ఇక్కడ ఉండండి.. లేకపోతే.. కర్ణాటక నుంచి వెళ్లిపోండి అంటూ సోదరులను దుండగులు బెదిరించారు. మేం ఉత్తర భారతం నుంచి వచ్చాం.. మేము కన్నడం ఎలా మాట్లాడగలం అంటూ ఇద్దరు సోదరులు వారిని ప్రశ్నించారు. దీంతో మరింత ఆగ్రహించిన దుండగులు సోదరుల కారుపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనపై బాధితులు బెంగళూరు నార్త్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై బెంగళూరు నార్త్ డీసీపీ చేతన్ సింగ్‌రాథోడ్ మాట్లాడుతూ.. ఇది వాస్తమేనని చెప్పారు. నిందితుల్లో ఇద్దరిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. నిందితులపై సెక్షన్ 341, సెక్షన్ 504 కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. -
థియేటర్లో జాతీయ గీతాన్ని అగౌరపరిచినందుకు..
♦ ముగ్గురు కశ్మీరి విద్యార్థులు అరెస్టు హైదరాబాద్: నగరంలోని ఓ థియేటర్లో జాతీయగీతం వస్తున్నప్పుడు నిలబడనందుకు ముగ్గురు కశ్మీర్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. నగర శివార్లైన చేవెళ్లలోని ఓ ప్రయివేట్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న ఓమర్ ఫైయాజ్ లూనీ, ముదాబిర్ షబ్బీర్, జమీల్ గుల్లు ఆదివారం అత్తాపుర్లోని ఓ థియేటర్‌కు సినిమా చూడడానికి వెళ్లారు. సినిమాకు ముందు జాతీయ గీతం రాగా సదరు విద్యార్థులు నిలబడకుండా అగౌరవపరిచారని అదే థియేటర్లో ఉన్న ఓ ఐజీ ర్యాంకు పోలీస్ అధికారి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే థియేటర్ కు చేరుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు వారిని అరెస్టు చేసి 1971 జాతీయ జెండా నిబంధనల ఉల్లంఘన చట్టం కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు యువకుల్ని గంటలకొద్దీ స్టేషన్లో ఉంచిన పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకొని బెయిల్ మంజూరు చేశారు. -
ఆ సైనికులపై చర్యలు తీసుకున్నాం
లెఫ్టినెంట్ జనరల్ శ్రీనగర్: విధులు నిర్వర్తించే సమయంలో కశ్మీరీ యువతపై మితిమీరి ప్రవర్తించిన సైనికులపై చర్యలు తీసుకున్నామని లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సంధూ శనివారం చెప్పారు. కశ్మీర్లో యువకులపై ఆర్మీ సిబ్బంది దౌర్జన్యం చేశారంటూ గతంలో కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడం తెలిసిందే. ఆ వీడియోలను పరిశీలించామనీ, నిజంగానే సైనికులు దురుసుగా, మితిమీరి ప్రవర్తించారని తేలిన ఘటనల్లో వారిపై చర్యలు తీసుకున్నామని సంధూ చెప్పారు. అయితే కొన్ని వీడియోల్లో పూర్తి సంఘటన లేకుండా వాటిని ఎడిట్ చేసి తప్పుడు అభిప్రాయం కలిగించారనీ, మరికొన్న వీడియోలు పాతవని ఆయన వెల్లడించారు. -
రాళ్లు రువ్వడంలో జనసేన శిక్షణ!
నగరంలోని జనసేనకు చెందిన దాదాపు వెయ్యి మంది కార్యకర్తలు ఆదివారం బయల్దేరి కశ్మీర్‌కు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. వారంతా కశ్మీర్ అందాలను తిలకించేందుకు బయల్దేరిన పర్యాటకులని అనుకుంటే పొరపాటే. కశ్మీర్లో భారత సైనికుల మీదకు రాళ్లు రువ్వే అల్లరిమూకలకు రాళ్లతోనే బుద్ధి చెప్పాలనుకుంటున్న కార్యకర్తలు. వారికి గత కొంతకాలంగా రాళ్లు రువ్వడంలో జనసేన శిక్షణ ఇస్తోంది. గంగా నది కాలువ పక్కన రెండు గడ్డి బొమ్మలను ఏర్పాటు చేసి, వాటికి తగిలేలా రాళ్లు రువ్వడంలో యువతీ యువకులకు శిక్షణ ఇచ్చినట్లు జనసేన వ్యవస్థాపకుడు అరుణ్ పూరి చైతనాయ్ తెలిపారు. శిక్షణకు సంబంధించిన వీడియో కూడా మీడియాలో కనిపిస్తోంది. అందులో ‘పాకిస్తాన్ చావాలి’ అనే నినాదాలతో జనసేన కార్యకర్తలు గడ్డిబొమ్మలపైకి రాళ్లు రువ్వుతూ కనిపించారు. అయితే ఆ వీడియోను చూస్తే అందులో ఆవేశంతో, అక్రోశంతో రాళ్లు రువ్వుతున్న సుశిక్షితుల్లా ఎవరూ లేరు. కేవలం నిరసనగా రాళ్లు బొమ్మలకు తగిలేలా విసురుతున్నట్లు కనిపిస్తోంది. కశ్మీర్లో రాళ్లురువ్వే అల్లరి మూకలను ఎదుర్కొనేందుకు తమ కార్యకర్తలు వెయ్యిమంది సిద్ధమయ్యారని, అందుకు అనుమతించాలని అటు ప్రధాన మంత్రి నరేంద్రమోదీతోపాటు స్థానిక అధికారులను కూడా కోరామని, ఆదివారం సాయంత్రానికి కూడా వారినుంచి అనుమతి రాకపోవడంతో స్థానిక పోలీసులు తమను అడ్డుకున్నారని అరుణ్ పూరి తెలిపారు. తమకు అనుమతి రాకపోయినా సరే, వ్యక్తిగత స్థాయిలోనైనా సరే కశ్మీర్ వెళ్తామని, తమవెంట ట్రక్కుల్లో రాళ్లు కూడా వస్తాయని ఆయన చెప్పారు. -
సీక్రెట్ బ్రౌజర్లతో వాళ్లేం చేస్తున్నారు?
జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలను ప్రభుత్వం కొన్నాళ్ల పాటు నిషేధించడంతో కశ్మీరీ యువత కొత్త దారులు వెతుక్కుంటోంది. సీక్రెట్ బ్రౌజర్లు ఉపయోగించి తమకు కావల్సిన సామాజిక మాధ్యమాలన్నీ చూసుకుంటోంది. ఉచితంగా అందుబాటులో ఉన్న టెక్నాలజీ సాయంతో తాము చెప్పదలచుకున్న విషయాలను వీడియోలు, ఫొటోల ద్వారా ప్రచారం చేస్తూ కశ్మీర్ లోయలో ఉద్రిక్తతలను మరింత రెచ్చగొడుతున్నారు. ఈ విషయాలన్నీ అధికారుల దర్యాప్తులో తెలుస్తున్నాయి. నిషేధం విషయాన్ని ప్రకటించక ముందునుంచే తమకు ప్రత్యామ్నాయం ఉందని తెలుసని, ఇంతకుముందు కూడా ఇలాగే ఇంటర్నెట్ను నిషేధించినా తాము వాడుకున్ఆనమని కశ్మీర్ యూనివర్సిటీ ఉద్యోగి జహూర్ అహ్మద్ తెలిపారు. తాను ఇప్పటికీ ఫేస్బుక్ ఎంచక్కా వాడుతున్నట్లు ఆయన చెప్పారు. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్కింగ్ (వీపీఎన్)తో పాటు సిగ్నల్ లాంటి ఎన్క్రిప్టెడ్ మెసెంజర్ సర్వీసులు తమకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. వాట్సప్‌ను కూడా నిషేధించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వీపీఎన్ నెట్వర్కులకు డిమాండ్ పెరుగుతోంది. నిషేధాన్ని ఎదుర్కోడానికి మార్గాలు ఇవంటూ.. దాదాపు 12 రకాల అప్లికేషన్ల వివరాలను శ్రీనగర్‌కు చెందిన బ్లాగర్ మహ్మద్ ఫైజల్ షేర్ చేశాడు. పౌరులను భద్రతాదళాలు చిత్రహింసలు పెడుతున్నట్లుగా లేనిపోని వీడియోలను సృష్టించి వాటిని సోషల్ మీడియాలో వైరల్‌గా ప్రచారం చేస్తుండటంతో అవి ప్రజాభద్రతకు ముప్పని భావించిన ప్రభుత్వం.. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాను కశ్మీర్లో నిషేధించింది. ఇలా సోషల్ మీడియా సైట్లను నిషేధించే కంటే.. పెద్దపెద్ద వీడియోలు, ఫొటోలు షేర్ కాకుండా చూసుకుంటే మంచిదని సైబర్ మీడియా రీసెర్చ్ నిపుణుడు ఫైజల్ కవూసా చెప్పారు. కశ్మీర్లో ఉండి తాను వీడియోను షేర్ చేయలేకపోతే కశ్మీర్ వెలుపల ఉన్నవారి సాయం తీసుకుంటారని, అదే వీపీఎన్ లేదా సిగ్నల్ లాంటి అప్లికేషన్లు వాడితే వాళ్లు ఎక్కడున్నదీ తెలియదని ఆయన వివరించారు. అందుకే వాటి సాయంతో తాము ఎక్కడున్నామో గుర్తించే వీలు లేకుండా విద్వేష వీడియోలను పెట్టేస్తున్నారు. సిగ్నల్ అనేది కూడా వాట్సప్లాగే మెసెంజర్. కానీ అది బాగా ఎన్‌క్రిప్ట్ అయి ఉండటంతో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ఫైర్‌వాల్ కూడా దాన్ని ఏమీ చేయలేదు. ఉగ్రవాద నాయకుడు బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచి కశ్మీర్ లోయలో ఉద్రిక్తతలు బాగా పెరిగాయి. వేర్పాటువాద శక్తులతో తాము చర్చించేది లేదని.. 'ఆజాదీ' కావాలనుకునే వాళ్లతో తాము ఏం చర్చిస్తామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా స్పష్టం చేసింది. ఆ తర్వాత ఒక వ్యక్తిని జీపు ముందు కట్టి మానవకవచంగా వాడుకున్న వీడియో బాగా వైరల్‌గా వెళ్లింది. దాంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. దాంతో ప్రభుత్వం సోషల్ మీడియాను నిషేధించింది. కానీ వీపీఎన్‌లను మాత్రం ఏమీ చేయలేకపోతోంది. తన ఫోన్లో తన స్నేహితుడు ఒపెరా వీపీఎన్ డౌన్లోడ్ చేసి ఇచ్చాడని, ఆ తర్వాతి నుంచి ఎంచక్కా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ అన్నీ చూసుకుంటున్నానని శ్రీనగర్ ప్రభుత్వ వైద్యకళాశాల ఉద్యోగి ఒమర్ బెహజాద్ చెప్పాడు. -
'అలా చేస్తే కాల్చిపారేయాలి'
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై అల్లరిమూకలు అనుచితంగా ప్రవర్తించడం పట్ల ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సైనికుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిని కాల్చిపారేయాలని అన్నాడు. అల్లరి మూకల ఆట కట్టించేందుకు సైనికులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. 'కశ్మీర్ లో ఏదైతే జరిగిందో అది చాలా తప్పు. మన సీఆర్పీఎఫ్ జవాన్లను తీవ్రంగా అవమానించారు. సైనికుడిపై దారుణంగా దాడి చేశారు. అతడి హెల్మెట్ రోడ్డుపై దొర్లకుంటూ వెళ్లింది. భారత్ కు తీరని అవమానం జరిగింది. మన సైనికుడిని యువకులు తోసివేయడం చాలా బాధ కలిగించింది. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా నడుచుకున్నా, సైనికుల పట్ల అనుచితంగా ప్రవర్తించినా కాల్చిపారేయాల'ని యోగేశ్వర్ దత్ అన్నాడు. శ్రీనగర్ లో పోలింగ్ బూత్ నుంచి తిరిగివస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై యువకులు దాడి చేసిన వీడియో బయటకు రావడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ప్రముఖులు సైనికులకు మద్దతుగా మాట్లాడారు. సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిని క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, విశ్వనటుడు కమల్ హాసన్ ఖండించారు. -
నానా పాటేకర్.. నాలుగు మాటలు
-
నానా పాటేకర్.. నాలుగు మాటలు
బాలీవుడ్లో విలక్షణ నటులు చాలామందే ఉన్నారు. వాళ్లందరిలోకీ కూడా విలక్షణమైన వ్యక్తి నానా పాటేకర్. నూటికి నూరుపాళ్లు తాను చెప్పేది ఆచరించే మనిషి ఆయన. వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లోపాల మీద కూడా ఆయన చేసే పోరాటం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అవే విషయాలను చాలాసార్లు సినిమాల్లో తన పాత్రల ద్వారా కూడా చెబుతారు. అలాంటి నానా.. జమ్ము కశ్మీర్‌లోని యువతను బుధవారం కలిశారు. వాళ్లతో మాట్లాడారు. ఆర్మీ జవాన్లతో కలిసి యువతీ యువకులను కలిసిన నానా.. వాళ్లకు నాలుగు మంచి మాటలు చెప్పారు. యువత ముందుగా చదువుకోవాలని, ప్రధాన స్రవంతిలోకి రావాలని సూచించారు. చదువుకుంటేనే ఏమైనా సాధ్యమవుతుందని, బాగా పైకొచ్చి దేశాన్ని కూడా అభివృద్ధి చేయాలని తెలిపారు. అంతేతప్ప.. ఇలా చేస్తే మాత్రం (రాళ్లు రువ్వడం) జీవితంలో ఏమీ సాధించలేరని చెప్పారు. అసలు ముందు ఈ దేశాన్ని మీది అనుకుంటే, ఆ తర్వాత అన్నీ చాలా సులభం అవుతాయని అన్నారు. సైనికుల స్ఫూర్తి భేష్ తాను ఇక్కడికి సైనికుల మనోధైర్యం పెంచడానికి రాలేదని, వాళ్లే తనకు బోలెడంత స్ఫూర్తినిచ్చారని అన్నారు. వాళ్లను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. హోలీ, దీపావళి.. ఏ పండుగైనా వాళ్లకు మాత్రం లేదని, అయినా చాలా సంతోషంగా ఉన్నారని నానా అన్నారు. వాళ్లకు కనీసం సెలవులు కూడా లేవని చెప్పారు. కతువా సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకుంటూ ప్రాణాలు కోల్పోయిన గుర్నామ్ సింగ్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. నోట్ల రద్దు మంచిదే.. పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుందని నానా ప్రశంసించారు. ఇన్ని సంవత్సరాల బట్టి మనం చాలా భరిస్తూ వచ్చామని.. ఈ పది, ఇరవై రోజుల కష్టాన్ని భరించలేమా అని ప్రశ్నించారు. -
జవానును రక్షించారు
శ్రీనగర్: బైపాస్ రోడ్డుపై యాక్సిడెంట్ అయి వాహనం ఇరుక్కుపోయిన ఓ జవానును కశ్మీరీ ప్రజలు రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనగర్ లోని లాస్జన్ ప్రాంతంలో బైపాస్ పై వేగంగా వెళ్తున్న ఆర్మీ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కను ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్న వాహనంలో ఓ సైనికుడు ఇరుక్కుపోయాడు. మిగిలిన జవానులు అతన్ని బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం చెందాయి. దీంతో తీవ్రంగా గాయపడిన జవానును అక్కడే ఉన్న కశ్మీరీ యువత ట్రక్కు సాయంతో బయటకు లాగి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను కొందరు తమ మొబైళ్లలో చిత్రించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా ప్రస్తుతం కశ్మీర్ లో పరిస్ధితులు కల్లోలంగా ఉన్న విషయం తెలిసిందే. -
సైన్యాన్ని కించపరిచారని కశ్మీరీ యువకులపై కేసు
భారత సైన్యాన్ని కించపరిచేలా కొందరు యువకులు చేసిన వ్యాఖ్యలపై బెంగళూరులోని జే.సీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ బెంగళూరులోని థియోలాజికల్ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కొంతమంది యువకులు ‘కాశ్మీర్‌లోని భారత సైన్యం వల్ల అక్కడి పండిట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే భారత సైన్యం అక్కడి నుంచి వెళ్లి పోవాలి’ అని నినదించారు. దీంతో అక్కడ కలకలం రేగింది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, ఈ ఘటనపై ఏబీవీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. భారత సైన్యానికి వ్యతిరేకంగా వాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పేర్కొంటూ జే.సీ నగర్లో ఆదివారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, భారత సైన్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యాలను చేసింది బెంగళూరులో ఉంటూ చదువుకుంటున్న కొంతమంది కాశ్మీర్ యువకులని పోలీసుల విచారణలో ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. బెంగళూరుకు చదువుకోవడానికి వచ్చిన కాశ్మీర్ యువత ఇలాంటి వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలని రాజ్యసభ విపక్ష నేత గులాంనబీఆజాద్ ఢిల్లీలో వాఖ్యానించారు.