
ఆ సైనికులపై చర్యలు తీసుకున్నాం
ఆ వీడియోలను పరిశీలించామనీ, నిజంగానే సైనికులు దురుసుగా, మితిమీరి ప్రవర్తించారని తేలిన ఘటనల్లో వారిపై చర్యలు తీసుకున్నామని సంధూ చెప్పారు. అయితే కొన్ని వీడియోల్లో పూర్తి సంఘటన లేకుండా వాటిని ఎడిట్ చేసి తప్పుడు అభిప్రాయం కలిగించారనీ, మరికొన్న వీడియోలు పాతవని ఆయన వెల్లడించారు.