
జమ్ము:జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు(ఎల్‌ఓసీ) వద్ద మంగళవారం(జనవరి14) ఉదయం భారీ పేలుడు సంభవించింది. మందుపాతర పేలిన ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. రాజౌరిలోని ఖంబా ఫోర్టు ప్రాంతంలో గోర్ఖా రైఫిల్స్‌కు చెందిన జవాన్లు రోజువారి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వారి వాహనం వద్ద మందుపాతర పేలింది.
పేలుడులో గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. జవాన్లకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment