soldiers
-
Tony Radakin: రోజుకు 1,500!
లండన్: ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యా యుద్ధక్షేత్రంలో భారీగా రక్తమోడుతోందని బ్రిటన్ తాజాగా ప్రకటించింది. సంబంధిత వివరాలను బ్రిటన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ టోనీ ర్యాడకిన్ ఆదివారం వెల్లడించారు. గత నెలలో ఉక్రెయిన్ నుంచి భారీ స్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో అక్టోబర్‌లో ప్రతి రోజూ 1,500 మంది రష్యా సైనికులు చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరిగిందని టోనీ చెప్పారు. ‘‘ 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా మొదట్లో పలు ఉక్రెయిన్ ప్రాంతాలను వేగంగా ఆక్రమించుకుంది. కానీ తర్వాత యూరప్ దేశాల దన్నుతో, అధునాతన ఆయుధాల సాయంతో ఉక్రెయిన్ దీటుగా బదులిస్తోంది. ప్రతిఘటనను పెంచింది. దీంతో ఇటీవలి కాలంలో సమరంలో సమిధలవుతున్న రష్యా సైనికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా అక్టోబర్‌లో ప్రతి రోజూ 1,500 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడమో, శరీరభాగాలు కోల్పోవడమో జరిగింది. యుద్ధం మొదలైననాటి నుంచి చూస్తే ఒక్క నెలలో ఇంతటి నష్టం ఇదే తొలిసారి. పుతిన్ రాజ్యవిస్తరణ కాంక్షకు ఇప్పటిదాకా ఉక్రెయిన్ యుద్ధంలో 7,00,000 మంది రష్యా సైనికులు బలయ్యారు. ఆక్రమణతో రష్యా భూభాగం పెరుగుతోంది. జాతీయభావనను పెంచి పుతిన్ రష్యాలో మరింత పాపులర్ అయ్యారు. కానీ ప్రభుత్వ ఖజానా, సైన్యంపరంగా దేశానికి అపార నష్టం వాటిల్లుతోంది. రష్యా ప్రభుత్వ వ్యయంలో దాదాపు 40 శాతాన్ని కేవలం ఈ యుద్ధం కోసమే పుతిన్ కేటాయిస్తున్నారు. ఇది దేశార్థికంపై పెను దుష్ప్రభావం చూపుతుంది. పుతిన్ యుద్ధోన్మాదం లక్షలాది మంది రష్యన్లను కష్టాలపాలుచేస్తోంది. యువతను బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటున్నారు. ఎంతో మంది తమ ఆప్తులను యుద్ధభూమిలో కోల్పోతున్నారు’’ అని టోనీ అన్నారు. దీనిపై రష్యా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. రష్యా 145, ఉక్రెయిన్ 70 డ్రోన్లతో దాడులు మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం పెద్ద సంఖ్యలో డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. రష్యా శనివారం రాత్రి 145 షహీద్ డ్రోన్లను ఉక్రెయిన్‌పైకి ప్రయోగించింది. యుద్ధం మొదలయ్యాక ఒకే రాత్రిలో ఇంత భారీ సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించడం ఇదే మొదటిసారని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు 62 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నాయంది. మరో 67 డ్రోన్లు వివిధ ప్రాంతాల్లో పడ్డాయని, 10 వరకు డ్రోన్లు గురితప్పి మాల్డోవా, బెలారస్, రష్యా ప్రాంతాలవైపు దూసుకెళ్లాయని ఉక్రెయిన్ పేర్కొంది. ఆదివారం ఉదయం మాస్కో దిశగా ఉక్రెయిన్ ఆర్మీ అత్యధికంగా 34 డ్రోన్లను ప్రయోగించిందని రష్యా తెలిపింది. ఆరు ప్రాంతాలపైకి మొత్త 70 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపింది. ఈ సంఖ్యలో ప్రయోగించడం ఇదే మొదటిసారని పేర్కొంది. వీటన్నిటినీ కూల్చేశామని వివరించింది. డ్రోన్ శకలాలు పడి రెండో చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. -
రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేశ్ కుమార్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ కార్యదర్శిగా నియమితులైన రాజేశ్ కుమార్ సింగ్ ఢిల్లీ సౌత్ బ్లాకులో శుక్రవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. కేరళ కేడర్ 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆర్కే సింగ్ ఈ ఏడాది ఆగస్టు 20న రక్షణశాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (రక్షణ కార్యదర్శి పదవిలో)గా బాధ్యతలు చేపట్టారు. కాగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించే కంటే ముందు ఆర్కే సింగ్ నేషనల్ వార్ మెమోరియల్‌కు వెళ్లి, అమరులైన జవానులకు నివాళులు సమర్పించారు. ‘మాతృభూమికి సేవ చేయడంలో అత్యున్నత త్యాగానికి వెనుదీయని మన శూర జవానులకు ఈ దేశ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. అమర జవానుల అసాధారణ ధైర్య సాహసాలు, వారి త్యాగాలు భారత్‌ను ఒక సురక్షిత, సమృద్ధ దేశంగా తీర్చిదిద్దడానికి మనకందరికీ శక్తిని, ప్రేరణను అందిస్తూనే ఉంటాయి’అని రాజేశ్ కుమార్ సింగ్ అన్నారు. అంతకు ముందు, ఆయన 2023 ఏప్రిల్ 24 నుంచి 2024 ఆగస్టు 20 మధ్య కాలంలో వాణిజ్య, పరిశ్రమ శాఖలోని అంతర్గత వాణిజ్యం–పరిశ్రమల ప్రోత్సాహక విభాగం కార్యదర్శిగా సేవలు అందించారు. కాగా రక్షణ కార్యదర్శిగా గురువారం పదవీ విరమణ చేసిన ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి గిరిధర్ అరమానే స్థానంలో ఆ పదవిని ఆర్కే సింగ్ చేపట్టారు. -
సైనికులతో ప్రధాని మోదీ దీపావళి.. పాక్‌కు వార్నింగ్
ప్రతి ఏడాది దీపావళి పండుగను సైనికులతో గడిపే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈ సారి కూడా కొనసాగించారు. సరిహద్దుల్లో గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.ఆర్మీ యూనిఫాం ధరించిన ప్రధాని.. కచ్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలో గల లక్కీ నాలాకు బోటులో చేరుకున్నారు. అనంతరం బీఎస్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో సమావేశమయ్యారు. సైనికులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చారు.. ‘‘కచ్వైపు పాక్ కన్నెత్తి చూసే సాహసం చేయదు. ఇక్కడ రక్షణగా సుక్షితులైన సైనికులు ఉన్నారని వారికి తెలుసు అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘సర్ క్రిక్‌పై దాడికి గతంలో శత్రు దేశాలు కుట్రలు చేశాయి. ఇక్కడ రక్షణగా ఉన్న సైనికులుగా కుట్రలను తిప్పికొట్టారు.’’ అని మోదీ అన్నారు.దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం విషయంలోనూ కూడా రాజీపడలేని ప్రభుత్వం ఇప్పుడు ఉంది. దౌత్యం పేరుతో సర్ క్రీక్‌ను లాక్కోవాలనే కుట్ర గతంలో జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నేను దానిని వ్యతిరేకించాను’’ అని ప్రధాని చెప్పారు. ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిని చూస్తోందని ప్రధాని చెప్పారు.2014 నుంచి ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న సైనికులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2014లో సియాచిన్, 2015లో పంజాబ్ సరిహద్దు, 2016లో హిమాచల్ ప్రదేశ్‌లోని సుమ్డో, 2017లో జమ్మూ కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్, 2018లో ఉత్తరాఖండ్‌లోని హర్సిల్, 2019లో జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ, 2019లో రాజస్థాన్, 2019లో కాశ్మీర్‌లోని నౌషేరా, 2019లో నౌషేరా, 2022లో జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్, 2023లో హిమాచల్‌లోని లెప్చాలో పర్యటించారు. Celebrating Diwali with our brave Jawans in Kutch, Gujarat.https://t.co/kr3dChLxKB— Narendra Modi (@narendramodi) October 31, 2024 -
ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరు ఇరాన్ సైనికులు మృతి
టెహ్రాన్: ఇజ్రాయెల్ తమ దేశంపై జరిపిన దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ శనివారం(అక్టోబర్ 26) దాడులు జరిపింది.కొన్ని నెలలుగా తమ దేశంపై నిరంతరాయంగా జరుగుతున్న దాడులకు సమాధానంగానే తాము ఈ ప్రతిదాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో తమకు పెద్దగా నష్టమేమీ జరగలేదని ఇరాన్ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల పట్ల ధీటుగా స్పందిస్తామని ఇరాన్ తెలిపింది.ఇదీ చదవండి: ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు -
జమ్ముకశ్మీర్: ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి
గుల్మార్గ్: జమ్మూకశ్మీర్‌లోని గుల్మార్గ్లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. బారాముల్లా జిల్లాలోని బోటాపాత్ర్ వద్ద ఉగ్రవాదులు వాహనంపై కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.కాగా, గుల్మార్గ్లో సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడికి కొన్ని గంటల ముందు పుల్వామాలో ఉగ్రవాద దాడిలో వలస కార్మికుడు గాయపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన కార్మికుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. -
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా భీకర దాడి
డెయిర్ అల్–బలాహ్: ఇజ్రాయెల్‌లోని ఆర్మీ బేస్‌పై ఆదివారం హెజ్బొల్లా చేపట్టిన భీకర దాడిలో నలుగురు సైనికులు చనిపోగా మరో 61 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. రెండు వారాల క్రితం లెబనాన్‌లో తాము భూతల దాడులు మొదలు పెట్టాక హెజ్బొల్లా జరిపిన అతిపెద్ద దాడిగా ఇజ్రాయెల్ పేర్కొంది. గురువారం బీరుట్‌పై చేపట్టిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఆదివారం బిన్యామియా నగరంపై డ్రోన్లతో దాడి చేశామని హెజ్బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రత్యేక బలగాలైన ‘గొలాన్ బ్రిగేడ్’లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థను నిరీ్వర్యం చేసేందుకు డజన్ల కొద్దీ మిస్సైళ్లను, అదే సమయంలో పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించామని పేర్కొంది. ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలున్నప్పటికీ క్షిపణులు, డ్రోన్ల దాడిలో ఇంత భారీ స్థాయిలో నష్టం వాటిల్లడం చాలా అరుదైన విషయమని చెబుతున్నారు. స్కూలుపై దాడి..20 మంది మృతి గాజాలోని నుసెయిరత్ శరణార్ధి శిబిరంలోని స్కూలుపై ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడిలో పలువురు చిన్నారులు సహా 20 మంది చనిపోయారు. సోమవారం ఉదయం డెయిర్ అల్–బలాహ్లోని అల్ అక్సా మారి్టర్స్ ఆస్పత్రి వెలుపల జరిగిన మరో దాడిలో ముగ్గురు చనిపోయారు. దాడులతో టెంట్లతో మంటలు చెలరేగి, 50 మందికి కాలిన గాయాలయ్యాయి. లెబనాన్‌లో 21 మంది మృత్యువాత లెబనాన్‌లో ఉత్తర ప్రాంత అయిటో నగరంలోని ఓ చిన్న అపార్టుమెంట్ భవనంపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 21 మంది చనిపోయారని రెడ్ క్రాస్ తెలిపింది. హెజ్బొల్లా బలంగా ఉన్న దక్షిణ లెబనాన్, బీరుట్ ఉత్తర శివారు ప్రాంతాలపైనే ప్రధానంగా దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ ఆర్మీ ఉత్తర భాగంపై దాడికి దిగడం ఇదే మొదటిసారి. ‘ఐరాస దళాల మాటున హెజ్బొల్లా’లెబనాన్‌లోని శాంతి పరిరక్షక దళాలు హెజ్బొల్లా మిలిటెంట్లకు మానవ రక్షణ కవచాలుగా ఉపయోగపడుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆరోపించారు. ఐరాస దళాల ముసుగులో హెజ్బొల్లా మిలిటెంట్ల కార్యకలాపాలు దక్షిణ లెబనాన్ ప్రాంతంలో చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయని విమర్శించారు. తమ బలగాలు హెచ్చరికలను పాటించి, ఆ ప్రాంతం నుంచి వెంటనే ఐరాస బలగాలు వైదొలగాలన్నారు. ఉత్తర గాజాను ఖాళీ చేయించేందుకు ప్రయత్నం ఉత్తర గాజా ప్రాంతంలో ఉన్న సుమారు 4 లక్షల మందిని అక్కడి నుంచి ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లి పోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. వీరిని ఎలాగైనా ఖాళీ చేయాలనే లక్ష్యంతోనే ఈ నెల ఒకటోతేదీ నుంచి ఈ ప్రాంతానికి ఆహార సరఫరాను సైతం నిలిపివేసింది. వెళ్లకుండా అక్కడే ఉండే వారిని మిలిటెంట్లుగా గుర్తించేందుకు ఉద్దేశించిన ప్రణాళికను మాజీ సైనిక జనరళ్లు ప్రభుత్వానికి అప్పగించినట్లు సమాచారం. -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్ల మృతి
శ్రీనగర్:కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. కిష్త్వార్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు విడిచారు. అదే విధంగా కథువాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో భారత బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపారు.కాగా చత్రూలోని నైద్ఘం గ్రామ సమీపంలోని పింగ్నాల్ దుగడ్డ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులుకాల్పులు జరిపాయి. వీటిని బలగాలు ధీటుగా తిప్పికొట్టాయి. అయితే ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇద్దరు భారత ఆర్మీ జవాన్లు గాయపడినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి#𝐈𝐧𝐝𝐢𝐚𝐧𝐀𝐫𝐦𝐲𝐎𝐏 𝐊𝐇𝐀𝐍𝐃𝐀𝐑𝐀In the Joint operation launched on 11 Sep by 𝐓𝐫𝐨𝐨𝐩𝐬 𝐨𝐟 𝐑𝐢𝐬𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐫 𝐂𝐨𝐫𝐩𝐬 & 𝐉&𝐊 𝐏𝐨𝐥𝐢𝐜𝐞, Two Terrorists Neutralised & Large War Like Stores Recovered. 𝐎𝐩𝐞𝐫𝐚𝐭𝐢𝐨𝐧𝐬 C𝐨𝐧𝐜𝐥𝐮𝐝𝐞𝐝 pic.twitter.com/QUc92EhElN— Rising Star Corps_IA (@RisingStarCorps) September 13, 2024ఇక ఉదంపూర్ జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన కొద్ది రోజులకే ఈ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. గత జూలైలో దోడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ముడిపడి ఉన్న ఉగ్రవాదులే తాజా కాల్పుల్లోనూ పాల్గొన్నట్లు సంబధిత వర్గాలు తెలిపాయి. దోడా ఎన్కౌంటర్లో ఓ అధికారి సహా నలుగురు సైనికులు వీర మరణం పొందారు.అయితే శనివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. ప్రధాని రేపు దోడాను సందర్శించే అవకాశం ఉంది.దోడా, ఉదంపూర్, కథువా జిల్లాల్లో ఇటీవల తీవ్రవాద దాడులు పెరిగాయి దోడాలో జరిగిన ఆపరేషన్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులతో పాటు ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు మరియు ఏడుగురు సైనికులతో సహా దాదాపు డజను మంది మరణించారు.ఇక సెప్టెంబరు 18న దక్షిణ కాశ్మీర్ జిల్లాలైన అనంత్‌నాగ్, పుల్వామా, షోపియాన్, కుల్గామ్‌లోని 16 స్థానాలతో పాటు చీనాబ్ లోయ ప్రాంతంలోని దోడా, కిష్త్వార్, రాంబన్ జిల్లాల్లో ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కిష్త్వార్, దోడా, రాంబన్ జిల్లాల్లో భద్రతను పెంచారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాలు, పోలింగ్ స్టేషన్ల భద్రత కోసం అదనపు బలగాలను మోహరించారు. జమ్మూ, కథువా, సాంబా జిల్లాలో సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న రెండో, మూడో దశలలో ఓటింగ్ జరగనుంది. -
పట్టాలపై లైఫ్‌లైన్
నర్సు ఓల్గా.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంతటా విరామం లేకుండా తిరుగుతూనే ఉన్నారు. రోగుల ఆక్సిజన్ స్థాయిలను తనిఖీ చేసి నోట్ చేసుకుంటున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న రోగులను ఓ కంట కనిపెడుతున్నారు. ఓ ఆస్పత్రిలో ఇదో సాధారణ దృశ్యం. కానీ ఆమె పనిచేస్తున్నది నడుస్తున్న రైలులో. వైద్యం అందిస్తున్నది యుద్ధంలో గాయాలపాలైన సైనికులకు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి ఉక్రెయిన్ ఈ రైలాస్పత్రిని నడుపుతోంది. ఆ దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఇప్పుడిది కీలక భాగంగా మారింది. యుద్ధంలో గాయపడిన సైనికుల కోసం తూర్పు ఉక్రెయిన్‌లోని చాలా నగరాల్లోని ఆసుపత్రుల్లో పడకలు లేవు. అవి ఖాళీ చేయడానికి కొందరిని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అంబులెన్సుల్లో సుదూర ప్రయాణంతో సైనికుల ప్రాణాలకే ముప్పుకావచ్చు. రష్యా దాడుల నేపథ్యంలో హెలికాప్టర్ అంబులెన్స్‌లు కూడా ఉపయోగించలేరు. ఈ క్లిష్ట స్థితిలో రైళ్లు సైనికుల ప్రాణాలను కాపాడుతున్నాయి. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే ఇందులోని బోగీలు పూర్తి స్థాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లుగా పనిచేస్తున్నాయి. ఆర్మీ డాక్టర్లు, ఇతర సిబ్బంది సైనికులకు రైలులోనే సేవ లు అందిస్తున్నారు. కదులుతున్న రైలులో ఐసీయూ యూనిట్ నడపడం చాలా కష్టమైన పని. అయినా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ‘ఇక్కడ మా సామర్థ్యం చాలా పరిమితం. ఏదైనా జరిగితే బయటి కన్సల్టెంట్‌ను పిలవలేం. రక్తస్రావాన్ని ఆపడానికి చిన్న చిన్న ఆపరేషన్లు వంటివి చేస్తాం. పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేయలేం’అని డాక్టర్స్ చీఫ్ ఒకరు తెలిపారు. పర్యాటక రైలు కాస్తా ఆస్పత్రిగా.. యుద్ధం ప్రారంభంలో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఉక్రెయిన్ సమయస్ఫూర్తికి రైలాస్పిత్రి ఒక ఉదాహరణ. 2022 ఫిబ్రవరిలో దేశంపై రష్యా దాడులు ప్రారంభించినప్పుడు ఉక్రెయిన్ వద్ద ఎటువంటి మెడికల్ రైలు బోగీలు లేవు. గాయపడిన సైనికులను సాధారణ రైళ్లలోకి కిటికీల గుండా బలవంతంగా ఎక్కించేవారు. దీనికి పరిష్కారం ఆలోచించిన ఉక్రెయిన్ రైల్వే.. సాధారణ రోజుల్లో పర్యాటకులను కార్పాతియన్ పర్వతాలకు తీసుకెళ్లడానికి ఉపయోగించే రైళ్లను పునరుద్ధరించింది. అలా ఆస్పత్రి రైలుకు రూపకల్పన జరిగిందని ఉక్రెయిన్ రైల్వే ప్యాసింజర్ ఆపరేషన్స్ సీఈఓ ఒలెక్సాండర్ పెర్తోవ్స్కీ చెప్పారు. గంటకు 50 మైళ్ల వేగంతో.. ఈ రైలు గంటకు 80 కిలోమీటర్లు (50 మైళ్లు) వేగంతో ప్రయాణిస్తుంది. సాధారణ రైలు వేగంలో సగమే అయినప్పటికీ ఐసీయూ మాత్రం అటూఇటూ కదిలిపోతూంటుంది. దీంతో పనిచేసేటప్పుడు సిబ్బంది చాలా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంబులెన్స్ రైళ్లను మొదట 1850లలో క్రిమియన్ యుద్ధం సమయంలో ఉపయోగించారు. కానీ ఈ ఆధునిక వెర్షన్లలో వెంటిలేటర్లు, లైఫ్ సపోర్ట్ యంత్రాలు, అ్రల్టాసౌండ్ స్కానర్లు, పోర్టబుల్ ఎయిర్ కండిషనర్లు ఉన్నాయి. ప్రతి క్యారేజీలో నిరంతర విద్యుత్ కోసం జనరేటర్లుంటాయి. బోగీల్లో పిల్లల చిత్రాలు, ఉక్రెయిన్ జాతీయ జెండాలు ఉంటాయి. గాయపడిన సైనికులకు ఇవి కొంత ఓదార్పును అందిస్తాయి. రెండు భిన్న దృశ్యాలు.. తొమ్మిది గంటల ప్రయాణం తరువాత రైలాస్పత్రి ఒక నగరంలోని రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించగానే.. అంబులెన్సులు సైనికుల కోసం ఎదురు చూస్తుంటాయి. ఐసీయూ లోని నర్సులు సైనికులను ప్లాట్‌ఫామ్‌పై ఎదురుచూస్తున్న వైద్యులకు అప్పగిస్తారు. స్టేషన్ నుంచి అంబులెన్సులు బయల్దేరి వెళ్లాక ఊపిరి పీల్చుకుంటారు. వారికి ఎదురుగా కొత్తగా రిక్రూట్ అయిన సైనికులతో ఓ రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది. తల్లిదండ్రులకు వీడ్కోలు పలుకుతూ పిల్లలు కనపడతారు. సాయంత్రానికి ఆ యువసైనికులు అపస్మారక స్థితిలోనో, తీవ్ర గాయాలతోనే అదే రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఈ రెండు దృశ్యాలకు ప్రత్యక్ష సాకు‡్ష్యలు రైలాస్పత్రి సిబ్బందే. యుద్ధం మిగుల్చుతున్న అంతులేని విషాదమిది. ‘యుద్ధ క్షేత్రం నుంచి తీవ్రంగా గాయపడి వచ్చే సైనికులను చూడటం బాధాకరమైన విషయమే. కానీ, వారికి సేవ చేస్తున్నామన్న తృప్తి మాత్రం మాకు మిగులుతుంది’అని చెబుతున్నారు ఐసీయూ నర్సు ఓల్గా. 2015లో సైన్యంలో నర్సుగా చేరిన ఆమె.. 2022 నుంచి యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స అందిస్తున్నారు. అలసిపోయాం.. యుద్ధం చెల్లించుకుంటున్న మూల్యానికి ఈ రైలాస్పత్రి ఓ చిన్న ఉదాహరణ. ‘రష్యన్ విసిరిన గ్రెనేడ్‌తో నా చేతులు, భుజాలు, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్దాలు నా వినికిడి శక్తినే దెబ్బతీశాయి. నేనే కాదు.. చాలా మందికి మనోధైర్యం ఉంది. కానీ చాలా అలసిపోయారు. ఇలాంటప్పుడు ఏదేమైనా కానీ భారమంతా దేవుడిదే అనుకుంటాం’అని చెబుతున్నారు రష్యా డ్రోన్ దాడిలో గాయపడి రైలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 35 ఏళ్ల సైనికుడు. అలసట యుద్ధక్షేత్రంలోని సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోందనడానికి ఇదో ఉదాహరణ. ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఈయన 18 నెలల నుంచి డోనెట్స్క్ ప్రాంతంలోని పదాతిదళంలో యాంటీ ట్యాంక్ గన్నర్‌గా పనిచేస్తున్నారు. ఇన్ని రోజుల్లో కేవలం 45 రోజులు మాత్రమే ఫ్రంట్‌లైన్‌కు దూరంగా ఉన్నారు. గాయాల నుంచి ప్రేరణ.. ఈయనకు కొన్ని పడకల దూరంలో కూర్చున్న స్టానిస్లావ్ మూడు నెలల క్రితం స్వచ్ఛందంగా సైన్యంలో చేరారు. అతడున్న కందకంపైన డ్రోన్ దాడి జరగడంతో ఊపిరితిత్తులకు గాయమైంది. పక్కటెముకలు విరిగాయి. అయినా స్టానిస్లావ్ పూర్తి భిన్నమైన మానసిక స్థితిలో కనిపించారు. ‘‘గాయపడ్డాక నాలో ఆత్మస్థైర్యం తగ్గలేదు. నేను మరింత ప్రేరణ పొందాను’’అని చిరునవ్వుతో చెబుతున్నారు. యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జవాన్ ల స్వాతంత్య్ర దినోత్సవ విన్యాసాలు
-
జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్, ఇద్దరు జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్‌లో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. అనంత్‌నాగ్ జిల్లా అహ్లాన్ గడోల్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కోకెర్నాగ్ సబ్‌డివిజన్‌లోని అడవిలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.విదేశీ పౌరులుగా భావిస్తున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రత్యేక బలగాలు, ఆర్మీ పారాట్రూపర్లను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో భద్రతా బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు తనిఖీలు చేస్తుండగా జవాన్లపైకి కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు సైతం ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. అయితే, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతిచెందగా.. మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. -
అమర వీరులకు ప్రధాని మోదీ నివాళి
-
జమ్ముకశ్మీర్‌లో నాల్గవరోజూ ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్లకు గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని దోడాలో వరుసగా నాల్గవరోజు కూడా ఎన్కౌంటర్ జరిగింది. నేడు (గురువారం) తెల్లవారుజామున ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించారు.కస్తిగఢ్ ప్రాంతంలోని జద్దన్ బాటా గ్రామంలో తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక భద్రతా శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. గంటకు పైగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు.ఉగ్రవాదులను ఏరివేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సోమ, మంగళవారాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక కెప్టెన్‌తో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. ఈ ఘటన అనంతరం ఆర్మీ సిబ్బంది.. గ్రామంతోపాటు చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు. జూన్ 12 నుంచి దోడాలో వరుసగా దాడులు జరుగుతున్నాయి. చటర్గాలా పాస్ వద్ద జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడగా, మరుసటి రోజు గండోలో కాల్పులు జరిగాయి. దానిలో ఒక పోలీసు గాయపడ్డాడు.జూన్ 26న, జిల్లాలోని గండో ప్రాంతంలో రోజంతా జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా, జూలై 9న ఘరీ కుంకుమ అడవుల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జమ్మూలోని ఆరు జిల్లాల్లో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 11 మంది భద్రతా సిబ్బంది, ఒక గ్రామ రక్షణ గార్డు, ఐదుగురు ఉగ్రవాదులు సహా మొత్తం 27 మంది మృతి చెందారు. -
కశ్మీర్లో ఉగ్రకాల్పులు... నలుగురు సైనికుల వీరమరణం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలపై ముష్కర మూకల దాడులు పెరిగిపోతున్నాయి. సోమవారం రాత్రి దోడా జిల్లాలో బలగాలపై భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. వారిని కెప్టెన్ బ్రిజేశ్ థాపా, నాయక్ డొక్కరి రాజేశ్, సిపాయిలు బిజేంద్రసింగ్, అజయ్‌కుమార్ సింగ్ నరుకాగా గుర్తించారు. గాయపడ్డ మరో సైనికున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.కథువా జిల్లా మారుమూల మఛేడీ అటవీప్రాంతంలో సైన్యంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగి ఐదుగురు జవాన్లను పొట్టన పెట్టుకున్న వారం రోజులకే తాజా ఘటన చోటుచేసుకుంది. దోడాలో బలగాలు, ఉగ్రవాదుల మధ్య గత మూడు వారాల్లో ఇది మూడో ఎన్కౌంటర్. ఇది తమ పనేనని పాక్ దన్నుతో చెలరేగిపోతున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ‘కశ్మీర్ టైగర్స్’ ప్రకటించుకుంది.ఉగ్రవాదులు నక్కారన్న నిఘా సమాచారంతో రాష్టీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దేసా అటవీ ప్రాంత పరిధిలోని ధారీ గోటే ఉరర్‌బాగీ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 20 నిమిషాల ఎదురుకాల్పుల అనంతరం ఉగ్రవాదులు వెన్నుచూపారు. ప్రతికూల అటవీ ప్రాంతంలోనూ కెపె్టన్ సారథ్యంలో బలగాలు వారిని వెంటాడాయి. దాంతో సోమవారం రాత్రి 9 గంటల అనంతరం మరోసారి చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కెపె్టన్‌తో పాటు మరో ముగ్గురు అసువులు బాశారని అధికారులు తెలిపారు. ఈ ముష్కరులు అక్రమంగా సరిహద్దు దాటి చొచ్చుకొచ్చి రెండు నెలలుగా అటవీ ప్రాంతంలో నక్కినట్టు భావిస్తున్నారు. వారికోసం అదనపు బలగాలతో సైన్యం, పోలీసులు భారీగా గాలిస్తున్నారు. ఎలైట్ పారా కమెండోలను కూడా రంగంలోకి దించారు. బాధగా ఉంది: రాజ్‌నాథ్ ముష్కరులను ఏరేసే క్రమంలో నలుగురు వీర జవాన్లు అమరులు కావడం చాలా బాధగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఆయనతో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, సైనిక ఉన్నతాధికారులు వారికి ఘనంగా నివాళులరి్పంచారు. కుటుంబాలకు సానుభూతి తెలిపారు.నా కొడుకు త్యాగానికి గర్విస్తున్నా..దేశ రక్షణలో అమరుడైన కొడుకును చూస్తే గర్వంగా ఉందని కెప్టెన్ బ్రిజేశ్ థాపా తల్లిదండ్రులు కల్నల్ (రిటైర్డ్) భువనేశ్ కె.థాపా, నీలిమ అన్నారు. ‘‘నా కుమారుడు చిన్నతనం నుంచీ నన్నే స్ఫూర్తిగా తీసుకున్నాడు. సైన్యంలో చేరాలని ఉవి్వళ్లూరేవాడు. 27 ఏళ్ల వయసులో కల నెరవేర్చుకున్నాడు. రెండు రోజుల క్రితమే నాతో ఫోన్లో మాట్లాడాడు. నిత్యం ప్రాణాపాయం పొంచి ఉండే ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో నా కుమారుడు అమరుడైనందుకు గర్విస్తున్నా’’ అని భువనేశ్ చెప్పారు. ఆర్మీ డే రోజు పుట్టాడు కెపె్టన్ థాపా ఆర్మీ డే అయిన జనవరి 15న జని్మంచారని తల్లి తెలిపారు. తనకింకా పెళ్లి కూడా కాలేదని సుళ్లు తిరుగుతున్న బాధను అణచుకుంటూ చెప్పారామె. కుటుంబంలో ఆయన వరుసగా మూడో తరం సైనికుడు! థాపా తండ్రితో పాటు తాత కూడా సైన్యంలో సేవ చేశారు. ఆయన ఇంజనీరింగ్ చేసి కూడా పట్టుబట్టి ఆరీ్మలోనే చేరారు. 145, ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్‌కు చెందిన థాపా రాష్రీ్టయ రైఫిల్స్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు.బీజేపీ తప్పుడు విధానాల వల్లే... జవాన్ల మృతిపై రాహుల్ నిప్పులుసాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో 78 రోజుల్లో 11 ఉగ్రదాడులు జరిగినా కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. బీజేపీ తప్పుడు విధానాల ఫలితాన్ని వీర సైనికులు, వారి కుటుంబాలు అనుభవించాల్సి వస్తోందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వానికి లేఖ రాశారు. 11 ఉగ్రదాడుల్లో 13 మంది ఆర్మీ, పోలీసు సిబ్బంది అమరులయ్యారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఈ దాడులను, సైనికుల బలిదానాలను ఆపడానికి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆరి్టకల్ 370 రద్దుతో ఉగ్రవాదాన్ని నాశనం చేశామనే బూటకపు వాదనకు సైనికులు తమ ప్రాణాలతో మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.ఆ అమర సైనికునిది ఏపీసంతబోమ్మాళి: దోడాలో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన డొక్కరి రాజేశ్ (25)ది ఆంధ్రప్రదేశ్. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సంతబోమ్మాళి మండలం చెట్లతాండ్ర. రాజేశ్ ఐదేళ్ల కింద ఆర్మీలో చేరారు. వారిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు చిట్టివాడు, పార్వతి కేవలం ఎకరం పొలం సాగు చేస్తూ రాజేశ్‌ను, ఆయన సోదరున్ని చదివించారు. సోదరుడు మధుసూదనరావు డిగ్రీ పూర్తి చేశాడు. రాజేశ్ మృతితో తల్లిదండ్రులు కంటికో ధారగా విలపిస్తున్నారు. గ్రామంలో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి.ఈ ఏడాదే 12 మంది సైనికుల మృతి2024లో జమ్మూలో ఉగ్ర దాడులు... ఏప్రిల్ 22: రాజౌరీ జిల్లాలో ప్రభుత్వోద్యోగిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఏప్రిల్ 28: ఉధంపూర్ జిల్లాలో ఉగ్రవాదులతోఎదురు కాల్పుల్లో విలేజీ రక్షక దళ సభ్యుని మృతి. మే 4: పూంచ్ జిల్లాలో ఉగ్ర దాడిలో ఐఏఎఫ్ సిబ్బంది మరణించగా ఐదుగురు గాయపడ్డారు. జూన్ 9: రీసీ జిల్లాలో ఉగ్ర దాడిలో 9 మంది భక్తులు మరణించగా 42 మంది గాయపడ్డారు. జూన్ 11, 12: కథువా జిల్లాలో ఎన్కౌంటర్లో ఇద్దరు విదేశీ ముష్కరులు హతమవగా ఒక సీఆరీ్పఎఫ్ జవాను అమరుడయ్యాడు. జూన్ 12: దోడా జిల్లాలో ఉగ్ర దాడిలో ఓ పోలీసుకు గాయాలు. జూన్ 26: దోడా జిల్లాలో ముగ్గురు విదేశీ ముష్కరుల కాలి్చవేత. జూలై 7: రాజౌరీ జిల్లాలో ఉగ్ర దాడిలో సైనిక సిబ్బంది గాయపడ్డారు. జూలై 8: కథువా జిల్లాలో ఉగ్రవాదుల ఉచ్చులో చిక్కి ఐదుగురు సైనికులు బలయ్యారు. జూలై 15: దోడా ఎన్కౌంటర్లో కెప్టెన్‌తో పాటు మరో ముగ్గురు సైనికుల వీరమరణం. -
కొరత సృష్టించిన అగ్నిపథ్!
అయిదేళ్ల కాల పరిమితి తర్వాత కూడా సైన్యంలో కొనసాగడానికి అర్హత సాధించాలనే ప్రయత్నంలో అగ్నివీర్ల మధ్య అనారోగ్యకరమైన పోటీ, వారిపై స్పష్టమైన ఒత్తిడి ఉండటం కనిపిస్తోంది. అంతేకాదు, అగ్నిపథ్ పథకం... సైన్యంలో తీవ్రమైన కొరతకు కూడా దారి తీసింది. సైన్యంలోంచి ఏటా పదవీ విరమణ చేసేవారి సంఖ్యలో సగాని కంటే కాస్త మాత్రమే ఎక్కువగా అగ్నివీర్లను తీసుకున్నారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నిలుపుకొంటారు కనుక ఈ లోటు మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పథకం తీవ్రమైన లోపాలతో ఉన్నందున, చిన్న చిన్న మార్పులు విలువైన ప్రయోజనాన్ని అందించలేవనే భావన కూడా సర్వత్రా వ్యక్తం అవుతోంది.లోపాలను సరిదిద్దడానికి ‘ఫలితానంతర’ చర్యలపై ఆధారపడే వ్యవస్థీకృత మార్పు ఏదైనా సరే అంతర్గతంగా లోపభూయిష్ఠంగా ఉంటుంది. అగ్నిపథ్ పథకం అలాంటి ఉదాహరణగా నిలుస్తుంది. రెండేళ్ల క్రితం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆఫీసర్ ర్యాంకుకు కిందిస్థాయిలో ఉన్న సైనికుల నియామక ప్రక్రియను మార్చడానికి అంటూ దీన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. పెరిగిపోతున్న రిటైర్డ్ సైనికుల పెన్షన్ బిల్లును తగ్గించడానికి కూడా దీన్ని తీసుకొచ్చారు. సాయుధ దళాలలోని ఇతర ర్యాంకులు యువతతో నిండి వుండేలా ఇది దోహదపడుతుంది. అయితే ఈ పథకం సాయుధ దళాలలో చేరడానికి ఆసక్తి ఉన్న యువత నుండి ప్రతిఘటనను ఎదుర్కొంది. దీనిపై సమగ్ర సమీక్ష చేయాలంటూ రాజకీయవర్గాలు బలంగా డిమాండ్ చేస్తున్నాయి. అగ్నిపథ్ ఆలోచన ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ (నిర్దిష్ట ప్రాంతంలో నిర్దిష్ట సైనిక సేవలు) అనే భావన నుండి తీసుకోవటం జరిగింది. ఇది సైనిక సేవ కోసం ఎంపిక చేసేవారి కొరతను అధిగమించడానికి పాశ్చాత్య దేశ సైన్యాల్లో విస్తృతంగా ఆచరణలో ఉంది. అప్పటి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ మన సాయుధ దళాలలో ఈ ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. సైనికులను చిన్న సంఖ్యలలో రిక్రూట్ చేయడం ద్వారా ఈ ప్రతిపాదనను పరీక్షించడం అసలు ఉద్దేశం. అయితే, ఈ పథకం ఏకపక్షంగా ముందుకు సాగినట్లు తెలుస్తోంది. మాజీ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకంలో నివేదించిన అంశాలు దీన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ పథకాన్ని సైనిక విభాగాలకు ‘పిడుగుపాటు’గా ఆయన ఈ పుస్తకంలో అభివర్ణించారు.ప్రస్తుతం ఈ పథకం కింద 17.5 నుండి 21 సంవత్సరాల వయస్సు ఉండి 12వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ‘అగ్నివీర్’లుగా ఆరు నెలల శిక్షణ ఇచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల కాలానికి నియమించారు. వారిలో 25 శాతం మంది మాత్రమే పింఛను, పదవీ విరమణ అనంతర ప్రయోజనాలతో మరో 15 సంవత్సరాల కాలం కొనసాగేందుకు అర్హులు అవుతారు. దీనికోసం వారిని తిరిగి నమోదు చేసుకుంటారు. ఇక సైన్యం నుంచి విడుదలైన మిగతా 75 శాతం మందికి పరిహారంగా ‘సేవా నిధి’ కింద రూ.10 లక్షల ప్యాకేజీ ఇస్తారు. ప్రస్తుతం మొత్తం రక్షణ శాఖ పెన్షనర్ల సంఖ్య దాదాపు 24.62 లక్షలు. వీరిలో సాయుధ దళాల సీనియర్లు దాదాపు 19 లక్షలు కాగా, పౌర విభాగ సిబ్బంది 5.62 లక్షల మంది ఉన్నారు. 2022 గణాంకాల ప్రకారం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు రక్షణ బడ్జెట్ రూ. 5,25,166 కోట్లు. ఇందులో పింఛను ఖర్చు రూ.2,07,132 కోట్లు. రక్షణ సిబ్బంది వాటా రూ. 1,19,696 కోట్లు కాగా, పౌర విభాగం వాటా రూ. 87,436 కోట్లు. ఈ రెండో మొత్తం పెన్షనరీ బడ్జెట్లో 40 శాతం వాటాను కలిగి ఉంది.కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా సాయుధ దళాలలో గౌరవప్రదమైన వృత్తిని కోరుకునే వ్యక్తులు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఆర్పీఎఫ్) అగ్ర ఎంపికగా ఉండటం వలన ఈ పథకంపై ప్రతికూల ప్రభావం స్పష్టంగా ఉంది. నేను ఈ ధోరణిని నా సొంత రాష్ట్రమైన పంజాబ్‌లో చూశాను. సైన్యం నుంచి విడుదలైన అగ్నివీరులలో తాము విస్మరించబడ్డామనే అపకీర్తిని మోస్తున్నట్లు, గర్వించ దగిన అనుభవజ్ఞులుగా తమను చూడరనే సాధారణ భావన కూడా వారిలో ఉన్నట్లు నేను గ్రహించాను. ఇటీవల, అగ్నివీరులు కార్యాచరణ ప్రాంతాల్లో మోహరించినప్పుడు వారు అత్యున్నత త్యాగం చేసిన రెండు సందర్భాలు ఉన్నాయి. అయితే పూర్తి పెన్షన్ కు అర్హులైన సాధారణ సైనికులకు భిన్నంగా వారి బంధువులు ఏకమొత్తంలో మాత్రమే పరిహారం పొందేందుకు అర్హులు. ఈ వివక్ష తీవ్రమైన క్రమరాహిత్యంగా నిలుస్తోంది. ఈ రోజు సైనిక విభాగాల్లో రెగ్యులర్ సైనికులు, అగ్నివీరులు అనే రెండు వర్గాలు ఉన్నాయి. అయిదేళ్ల తర్వాత కూడా సైన్యంలో కొనసాగడానికి అర్హత సాధించాలనే వారి ప్రయత్నంలో అగ్నివీర్ల మధ్య అనారోగ్యకరమైన పోటీ, స్పష్టమైన ఒత్తిడి కనిపిస్తోంది. నిజానికి ఇది స్నేహబంధం, సైనికుల మధ్య పరస్పర సహకారం, యూనిట్ కల్చర్, రెజిమెంట్ పునాది వంటివాటికి హానికరమైనది. మెరుగైన ఆయుధాలతో సన్నద్ధమైన ప్రత్యర్థులకు వ్యతిరేకంగా మన సాయుధ దళాల అత్యాధునిక సామర్థ్యానికి ఇది చేటు కలిగిస్తుంది. వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్లలో అమెరికన్లు; గాజాలో ఇజ్రాయెలీలు; రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో రెండు వైపుల సైనికులు – ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ని నిష్ప్రయోజనమైనదిగా గుర్తించారు. మన విషయానికి వస్తే, నేటికీ కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రతిష్టంభన సమయంలో లద్దాఖ్‌లో చైనా సైన్యం కూడా పేలవంగా పని చేసింది.అగ్నిపథ్ పథకం సైనిక బలగంలో తీవ్రమైన కొరతకు కూడా దారితీసింది. సైన్యంలోంచి ఏటా పదవీ విరమణ చేసేవారి సంఖ్య 70,000 అయితే, కేవలం 42,000 మంది అగ్నివీర్లను మాత్రమే తీసుకున్నారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నిలుపుకోవడంతో ఈ లోటు మరింత పెరగనుంది. 39 గూర్ఖా బెటాలియన్ లలోని 60 శాతం సైనికులు ‘నేపాల్ స్థానిక గూర్ఖా’ల నుండి వచ్చినందున గూర్ఖాల నియామకం గరిష్ఠంగా దెబ్బతింది. నేపాల్ ప్రభుత్వం అగ్నిపథ్‌ను తిరస్కరించడం వల్ల తీవ్రమైన చిక్కులు ఎదురవుతున్నాయి. అదే సమయంలో గూర్ఖాలను రిక్రూట్ చేయడానికి చైనీస్ సైన్యం చేసిన ప్రకటనలను తోసిపుచ్చలేము. భారతీయ యువత విదేశీ సైన్యంలో చేరడం ఆందోళన కలిగించే ధోరణి. రష్యా సైన్యంలో చేరేందుకు ఆకర్షితులవుతున్న కొంతమంది వ్యక్తుల గురించి వెలువడిన ఇటీవలి నివేదికలు దీనికి ఉదాహరణ.అగ్నిపథ్ పథకాన్ని పునస్సమీక్షిస్తున్నారనే నివేదికలు వస్తున్నాయి. వాటిని బట్టి అగ్నివీరులను నిలబెట్టుకోవడంతో పాటుగా, సేవా సంవత్సరాల పొడిగింపు శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ పథకం తీవ్రమైన లోపాలతో ఉన్నందున, చిన్న చిన్న మార్పులు విలువైన ప్రయోజనాన్ని అందించవు. రిక్రూట్మెంట్ ప్రక్రియ మరింత శాస్త్రీయంగా, కఠినంగా ఉండేలా మునుపటి వ్యవస్థను చక్కగా తీర్చిదిద్దడం ముఖ్యం. ఫిట్నెస్ శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటినీ కలిగి ఉంటుంది కాబట్టి వయఃపరిమితిని 32 నుండి 26కి తగ్గించడంతో ఫలితం ఉండదు. సైనికుడిని సర్వతోముఖంగా తయారు చేయడానికి ఆరు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది; వ్యక్తిగత దారుఢ్యం 20ల చివరలో, 30ల ప్రారంభంలో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. అయితే వివాదాస్పద సరిహద్దులను 42 ఏళ్లు పైబడిన మధ్యస్థ వయస్సుతో కాపు కాస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది ఫిట్నెస్ ఎప్పుడూ ప్రశ్నార్థకం కాకపోవడం గమనార్హం. సాయుధ దళాలు, రక్షణ విభాగంలోని పౌర సంస్థల సంఖ్యను సరైన పరిమాణంలోకి తీసుకురావడం ద్వారా పెన్షన్ బిల్లును గణనీయంగా తగ్గించవచ్చు. ఉదాహరణకు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) 10,000 మంది కాంట్రాక్టు కార్మికులను, సుమారు 50 పరిశోధన శాలలతో పాటు దాదాపు 30,000 మంది సిబ్బందిని కలిగి ఉంది. డీఆర్డీఓని పునర్నిర్మించడం, కుదించటం కోసం విజయ్ రాఘవన్ కమిటీ ఇటీవలి సిఫార్సులు సరైన దిశలో ఒక అడుగు. దాదాపు 80,000 మంది కార్మికులు పనిచేస్తున్న 41 ఆర్డినెన్స్ కర్మాగారాలకు ఇదే విధమైన కసరత్తు అవసరం.ఒక వ్యవస్థ స్థితిస్థాపకత... తప్పును సరి చేయగల దాని సామర్థ్యంలో ఉంటుంది. సైనిక విభాగం పెద్దలు అన్ని ఇతర పరిగణనలను పక్కన పెట్టి భారీ సంస్థాగత ప్రయోజనార్థం అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తారని ఆశిస్తున్నాను.జి.జి. ద్వివేది వ్యాసకర్త రిటైర్డ్ మేజర్ జనరల్ -
‘లద్దాఖ్’లో జవాన్ల మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి,తాడేపల్లి : లద్దాఖ్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన ఏపీ జవాన్ల కుటుంబాలకు కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయాలని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం(జులై1) ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. లద్దాఖ్‌లో యుద్ధట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు జవాన్లు మరణించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశ రక్షణలో జవాన్ల సేవలు చిరస్మరణీయమని గుర్తుచేశారు. లడఖ్‌లో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు వీరమరణం పొందడం తీవ్రంగా కలిచివేసింది. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివి. వీరమరణం పొందిన జవాన్లలో కృష్ణా జిల్లాకి చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లాకి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లాకి చెందిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 1, 2024వారి త్యాగాలు మరువలేనివని కీర్తించారు. ‘కృష్ణాజిల్లా పెడన మండలం చేవెండ్రకు చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీవో) ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాన్ ఖాన్ల కుటుంబాలకు నా సంతాపం. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కుటుంబాలను ఆదుకోవాలి. మరణించిన జవాన్ల కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఆర్థికసాయం చేయాలి. ఆయా నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు జవాన్ల అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబాలకు బాసటగా నిలవాలి’అని వైఎస్ జగన్ కోరారు. -
గాజాలో భారీ పేలుడు.. 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
ఇజ్రాయెల్, హమాస్ మధ్య గాజాలో యుద్ధం కొనసాగుతోంది. దక్షిణ గాజాలో చోటు చోసుకున్న పేలుడులో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. దక్షిణ గాజాలోని రఫా నగరానికి సమీపంలో ఇజ్రాయెల్ సైనికులు ప్రయాణిస్తున్న నేమర్ వాహనం పేలటంతో ఈ ఘటన జరిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.ఈ పేలుడు భారిగా సంభవించడంతో వాహనం పూర్తిగా దగ్ధం అయిదని, అదే విధంగా మృత దేహాలను గుర్తించటంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇజ్రాయెల్ సైనిక అధికారులు తెలిపారు. ఈ పేలుడు ఎవరు జరిపారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అయితే ఆ ప్రాంతంలో హమాస్ మిలిటెంట్లు పేలుడు పరికరం అమర్చా? లేదా యాంటీ ట్యాంక్ మిసైల్‌ను నేరుగా ప్రయోగించారా? అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.❗🇵🇸⚔️🇮🇱 - An explosion in Rafah in southern Gaza killed eight Israeli soldiers in a Namer armored combat engineering vehicle, raising the Israel Defense Forces (IDF) death toll to 307 in the ground offensive against Hamas and operations throughout from the Gaza border. The… pic.twitter.com/5e1tiV6Hgb— 🔥🗞The Informant (@theinformant_x) June 15, 2024 శనివారం జరిగిన పేలుడులో 8మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందటం భారీ నష్టమని తెలిపారు. ఇక.. ఇప్పటివరకు 306 మంది ఇజాయెల్ సైనికులు మృతి చెందారని అన్నారు. మృతి చెందిన సైనికులకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాళులు అర్పించారు. సైనికుల భారీ నష్టంతో తన హృదయం ముక్కలైందని అన్నారు. అస్థిరమైన పరిస్థితులు నెలకొన్నా.. భారీ నష్టం జరిగినా యుద్ధ లక్ష్యాలకు కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. -
Rahul Gandhi: ‘అగ్నిపథ్’లో వివక్షను అడ్డుకోండి
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకం అమలులో జోక్యం చేసుకుని అమర జవాన్ల కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయమే అయినప్పటికీ జాతి భద్రతపై ప్రభావం కలిగించే ఈ అంశంపై సాయుధ బలగాల సుప్రీం కమాండర్‌గా ప్రత్యేక పరిస్థితుల్లో జోక్యం చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు శనివారం రాహుల్ ఒక లేఖ రాశారు. దేశం కోసం జీవితాలనే త్యాగం చేస్తున్న అగ్నివీర్లకు మిగతా సైనికుల మాదిరిగానే ప్రయోజనాలను వర్తింపజేయాలని కోరారు. -
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
జమ్మూ: జమ్మూకశీ్మర్‌లోని పూంఛ్ జిల్లాలో భారత వాయుసేన జవాన్ల వాహనశ్రేణిపై ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. బలగాలు సనాయ్‌టోప్‌లోని శిబిరానికి తిరిగొస్తుండగా సురాన్‌కోటె పరిధిలోని షాసితార్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6.15 గంటలకు ఉగ్రవాదులు కాల్పులతో తెగబడ్డారు. ఒక వాహనం విండ్్రస్కీన్పై డజనుకుపైగా బుల్లెట్ల దాడి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఏకే రకం రైఫిళ్లతో దాడి చేసిన ఉగ్రవాదులు తర్వాత సమీప అడవిలోకి పారిపోయారు. గాయపడిన జవాన్లకు ఉధమ్‌పూర్‌లోని కమాండ్ ఆస్పత్రిలో చికిత్సచేస్తున్నారు. దాడి విషయం తెల్సి అప్రమత్తమైన సైన్యం, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. రా్రïÙ్టయ రైఫిల్స్ బృందాలు అణువణువునా గాలిస్తున్నాయి. కాన్వాయ్ సురక్షితంగా ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని వాయుసేన ‘ఎక్స్’లో పోస్ట్చేసింది. గత ఏడాది డిసెంబర్ 21న ఇక్కడి దగ్గర్లోని బఫ్లియాజ్లో సైన్యంపై మెరుపుదాడి చేసి నలుగురిని పొట్టనబెట్టుకున్న ఉగ్రముఠాయే ఈ దాడికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఫూంచ్‌లో గత రెండేళ్లుగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. -
Lok Sabha Election 2024: పొలిటికల్ టాప్ గన్స్.. రాజకీయాల్లో రాణించిన సైనికాధికారులు
వారు కదన రంగంలో శత్రువుల భరతం పట్టిన వీర సైనికులు. రెండో ఇన్సింగ్స్‌లో రాజకీయ రణరంగంలోనూ అంతే గొప్పగా రాణించారు. త్రివిధ దళాల్లో పలు హోదాల్లో దేశానికి సేవలందించిన సైనిక ఉన్నతాధికారులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పారు. జశ్వంత్‌సింగ్, రాజేశ్ పైలట్ మొదలుకుని తాజాగా ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) బదౌరియా దాకా ఈ జాబితా పెద్దదే...జశ్వంత్ సింగ్ బహుముఖ ప్రజ్ఞాశీలి సైనికాధికారిగా శత్రువులతో పోరాడిన జశ్వంత్ రాజకీయాల్లో చేరి రక్షణ మంత్రిగా త్రివిధ దళాలకు బాస్ అయ్యారు. 1965లో ఇండో–పాక్ యుద్ధంలో పాల్గొన్న జశ్వంత్ మేజర్ హోదాలో 1966లో పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. భారతీయ జన సంఘ్, ఆర్ఎస్ఎస్ సభ్యుడు. బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1980లో బీజేపీ తరఫున తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004 దాకా ఐదుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1989లో సొంత రాష్ట్రం రాజస్తాన్‌లోని జో«ద్‌పూర్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో 1998 నుంచి 2004 దాకా కీలకమైన ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ వంటి శాఖలు చూశారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌గా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అత్యధిక కాలం పార్లమెంటు సభ్యునిగా కొనసాగిన కొద్దిమందిలో జశ్వంత్ ఒకరు. రాజేశ్ ‘పైలట్’ అసలు పేరు రాజేశ్వర్ ప్రసాద్ బిధూరి. పైలట్ వృత్తినే పేరులోనే చేర్చుకుని రాజకీయాల్లో వెలుగు వెలిగారు. భారత వైమానిక దళంలో బాంబర్ పైలట్‌గా 1971 భారత్–పాక్ యుద్ధంలో పోరాడారు. స్క్వాడ్రన్ లీడర్ హోదాలో రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజీవ్‌కు సన్నిహితుడు. 1980లో కాంగ్రెస్ తరఫున భరత్పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి 1999 దాకా ఎంపీగా గెలిచారు. కేంద్రంలో పలు కీలక శాఖలకు మంత్రిగా చేశారు. 2000 జూన్‌లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన తనయుడు సచిన్ పైలట్ కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగుతున్నారు.అమరీందర్ కెప్టెన్ టు సీఎం కెపె్టన్ అమరీందర్ సింగ్ జవాన్ల కుటుంబం నుంచి వచ్చారు. 1965 ఇండో–పాక్ యుద్ధంలో శత్రువుకు చుక్కలు చూపించారు. కెపె్టన్ హోదాలో రిటైరైన ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది రాజీవ్. అమరీందర్ 1980లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 నుంచి 2017 దాకా మూడుసార్లు పంజాబ్ పీసీసీ చీఫ్‌గా, 2002 నుంచి 2007 దాకా సీఎంగా చేశారు. 2017లో మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి రెండోసారి సీఎం అయ్యారు. కాంగ్రెస్ వర్గ విభేదాలతో పార్టీకి, సీఎం పదవికి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టారు. తర్వాత దాన్ని బీజేపీలో విలీనం చేశారు. బి.సి.ఖండూరీ స్వర్ణ చతుర్భుజి సారథి మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నత విద్యనభ్యసించిన భువన్ చంద్ర ఖండూరీ 1954 నుంచి 1990 దాకా భారత సైన్యంలో సేవలందించారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇంజనీర్ స్థాయి నుంచి ఆర్మీ ఇంజనీర్ ఇన్ చీఫ్ విభాగంలో అదనపు డైరెక్టర్ జనరల్ దాకా కీలక హోదాల్లో పని చేశారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో రెజిమెంట్ కమాండర్‌గా పోరాడారు. మేజర్ జనరల్ హోదాలో రిటైరయ్యారు. 1991లో తొలిసారి ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గారు. ఐదుసార్లు ఎంపీ అయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో రహదారులు, హైవేల మంత్రిగా చేశారు. దేశ నలు దిక్కులను కలిపిన స్వర్ణ చతుర్భుజి హైవేల ప్రాజెక్టును దిగ్విజయంగా అమలు చేసిన ఘనత ఖండూరీదే. నిజాయితీకి మారుపేరైన ఆయన ఉత్తరాఖండ్ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజేతగా నిలిపి సీఎం అయ్యారు.అయూబ్ ఖాన్ వార్ హీరో సైనికుల కుటుంబం నుంచి వచ్చిన అయూబ్ ఖాన్ 1965 ఇండో పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. భారత సైన్యంలోని 18వ సాయుధ అశి్వక దళంలో రిసాల్దార్గా పని చేస్తున్న అయూబ్‌ను యుద్ధంలో జమ్మూకశీ్మర్ సియాల్కోట్ సెక్టార్లో నియమించారు. పాకిస్తాన్ సైన్యం యుద్ధ ట్యాంకులతో మన జవానులను చుట్టుముడుతున్న తరుణంలో నాలుగు పాక్ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడంతో పాటు ఒక ట్యాంకును స్వా«దీనం చేసుకుని శత్రువుకు చుక్కలు చూపించారు. ఆ యుద్ధంలో పరాక్రమానికి వీర్ చక్ర పురస్కారం అందుకున్నారు. గౌరవ కెపె్టన్ హోదా కూడా దక్కింది. ‘నేను పాక్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్‌ను కలుసుకోలేదు గానీ భారతీయ అయూబ్‌ను కలిసినందుకు గర్వంగా ఉంది’ అంటూ నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఈ వీర సైనికున్ని హత్తుకోవడం విశేషం. 1983లో రిటైరయ్యాక అయూబ్ రాజకీయాల్లోనూ సత్తా చాటారు. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ అయూబ్‌ను ఒప్పించి మరీ ఎన్నికల్లో నిలబెట్టారు. రాజస్తాన్‌లోని ఝుంఝును నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. ఆ రాష్ట్రం నుంచి తొలి ముస్లిం ఎంపీగా కూడా చరిత్ర సృష్టించారు. 1991లో రెండోసారి విజయం సాధించి, పీవీ కేబినెట్లో వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.కాండెత్ గోవా విముక్తి వీరుడు దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా గోవాలో మాత్రం 1961 దాకా పోర్చుగీసు వలస పాలనే సాగింది. 1961లో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ ద్వారా గోవాను విలీనం చేసుకుంది. ఈ కీలక సైనిక చర్యకు సారథ్యం వహించిన ధీరుడు కేరళకు చెందిన మేజర్ జనరల్ కున్హిరామన్ పాలట్ కాండెత్. తర్వాత కొంతకాలం గోవా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా చేశారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో పశి్చమ కమాండ్ సైనిక బలగాన్ని నడిపించారు. పరమ విశిష్ట సేవా మెడల్‌తో పాటు పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 1972లో లెఫ్టినెంట్ జనరల్‌గా రిటైరయ్యారు. 1990ల్లో బీజేపీలో చేరారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా చేశారు. జనరల్ వీకే సింగ్... రాజకీయాల్లో సక్సెస్ భారత సైన్యంలో కమాండో స్థాయి నుంచి ఆర్మీ ఛీఫ్ అయిన తొలి వ్యక్తి జనరల్ విజయ్ కుమార్ సింగ్. 1971 ఇండో–పాక్ యుద్ధంతో సహా అనేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. 2010 నుంచి 2012 దాకా సైనిక దళాధిపతిగా చేశారు. రిటైరయ్యాక 2014లో బీజేపీలో చేరారు. స్వరాష్ట్రం యూపీలోని ఘాజియాబాద్ నుంచి ఎంపీ అయ్యారు. 2019లో రెండోసారి విజయం సాధించారు. మోదీ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా చేశారు.విష్ణు భగవత్... గురి తప్పిన టార్పెడో భారత నావికాదళంలో అత్యంత ప్రతిభాపాటవాలతో అత్యున్నత పదవికి చేరుకున్న అడ్మిరల్ విష్ణు భగవత్... వివాదాస్పద వ్యవహార శైలితో అపకీర్తిని కూడా మూటగట్టుకున్నారు. 1971 ఇండో–పాక్ యుద్ధంలో, పోర్చుగీస్ చెర నుంచి గోవాకు విముక్తి కలి్పంచిన ఆపరేషన్ విజయ్‌లో కీలక పాత్ర పోషించారు. ఎన్డీఏ ప్రభుత్వంతో విభేదాల కారణంగా 1998లో ఉద్వాసనకు గురయ్యారు. నేవీ చీఫ్‌గా ఉంటూ వేటుకు గురైన తొలి వ్యక్తి ఆయనే. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అడ్మిరల్ హోదానూ కోల్పోయారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బిహార్ రాజకీయాల్లో కొంతకాలం చురుగ్గా వ్యవహరించారు. ‘ఉత్తమ’ ఫైటర్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి. వైమానిక దళంలో మిగ్ 21, మిగ్ 23 వంటి ఫైటర్ జెట్లు నడిపి శత్రువులపై పోరాడారు. రాజకీయాల్లోనూ రియల్ ఫైటర్‌గా కొనసాగుతున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ 1982 నుంచి 1991 దాకా ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ పైలట్‌గా చేశారు. 1994లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ఎన్నికల్లో కోదాడ నుంచి ఓడినా 1999లో అక్కడి నుంచే విజయఢంకా మోగించారు. మూడు దశాబ్డాల రాజకీయ జీవితంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి నల్లగొండ ఎంపీగా, పీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా చేశారు. తాజాగా హుజారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఉత్తమ్ భార్య పద్మావతి కూడా రెండుసార్లు కోదాడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో వచి్చన టెర్రర్ అనే తెలుగు సినిమాలో ఆయన సీఎం పాత్ర పోషించడం విశేషం!జేజే సింగ్... తొలి సిక్కు ఆర్మీ చీఫ్ జోగిందర్ జస్వంత్ సింగ్. తొలి సిక్కు ఆర్మీ జనరల్. 2005 నుంచి 2007 దాకా దేశ 21వ ఆర్మీ చీఫ్‌గా సేవలందించారు. రిటైరయ్యాక 2008లో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా అయ్యారు. 2017లో అకాలీదళ్‌లో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కెపె్టన్ అమరీందర్ సింగ్ చేతిలో ఓడారు. 2019లో అకాలీదళ్ (తక్సలీ)లో నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2022లో బీజేపీలో చేరారు. వీకే సింగ్ తర్వాత కాషాయం తీర్థం పుచ్చుకున్న రెండో జనరల్‌గా నిలిచారు.బదౌరియా... పొలిటికల్ టేకాఫ్ రాజకీయాల్లోకి వచి్చన తొలి వైమానిక దళపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ బదౌరియా చరిత్ర సృష్టించారు. ఎయిర్‌ఫోర్స్ ఫైటర్‌గా విధుల్లో చేరిన ఆయన 41 ఏళ్ల కెరీర్లో 26 రకాల ఫైటర్ జెట్స్, రవాణా విమానాలు నడిపిన విశేష ప్రతిభావంతుడు. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ చీఫ్ టెస్ట్ పైలట్‌గా, ప్రాజెక్ట్ టెస్టింగ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. 2019 నుంచి 2021 దాకా ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా చేసి రిటైరయ్యారు. ఇటీవలే బీజేపీలో చేరారు. రాథోడ్ గురి పెడితే... టార్గెట్ తలొంచాల్సిందే! యుద్ధభూమి అయినా, క్రీడా మైదానమైనా ఆయన గురి పెడితే టార్గెట్ తలొంచాల్సిందే! ఆయనే కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. విశ్వ క్రీడా ప్రపంచంలో భారత్‌కు ఘన కీర్తి సాధించి పెట్టిన అభినవ అర్జునుడు. చదువులోనూ, ఆటలోనూ ‘గోల్డెన్’ బాయ్‌గా నిలిచిన రాథోడ్ కార్గిల్ యుద్ధంలో పోరాడారు. 2002 కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ కొట్టారు. ఆ ఈవెంట్లో ఆయన నెలకొలి్పన రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 2004 గ్రీస్ ఒలింపిక్స్ డబుల్ ట్రాప్ ఈవెంట్లో వెండి పతకం కొట్టడంతో రాథోడ్ పేరు మారుమోగింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు అదే తొలి వ్యక్తిగత వెండి పతకం! కెరీర్లో ఏకంగా 25 అంతర్జాతీయ పతకాలను సొంతం చేసుకున్నారు. 2013లో ఆర్మీ నుంచి రిటైరై బీజేపీలో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. మోదీ ప్రభుత్వంలో సమాచార, క్రీడా మంత్రిగా చేశారు. 2019లోనూ ఎంపీగా గెలిచారు. 2023లో రాజస్తాన్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యాకు ఎదురుదెబ్బ
కీవ్: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాకు బుధవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక కమాండర్ రాక కోసం శిక్షణాప్రాంతం వద్ద గుమిగూడిన సైనికులపై రెండు క్షిపణిలు వచ్చి పడ్డాయి. దీంతో 60 మంది రష్యా సైనికులు మరణించారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ ఘటనపై రష్యా రక్షణ మంత్రి సెర్గియో షొయిగూ నోరు మెదపలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీకి కొద్దిసేపటికి ముందే ఈ దాడి జరగడం గమనార్హం. ఇతర ప్రాంతాల్లో రష్యా సైన్యం విజయాలను పుతిన్‌కు వివరించిన సెర్గియో ఈ దాడి వివరాలను మాత్రం వెల్లడించలేదు. రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం డొనెట్కŠస్ రీజియన్‌లో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. సెర్బియా ప్రాంతంలో ఉండే 36వ రైఫిల్ బ్రిగేడ్ ట్రుడోవ్స్కే గ్రామంలో ఒక మేజర్ జనరల్ రాకకోసం వేచి చూస్తుండగా ఈ దాడి జరిగింది. ఒకే చోట డజన్లకొద్దీ జవాన్లు విగతజీవులుగా పడి ఉన్న వీడియో ఒకటి అంతర్జాతీయ మీడియాలో ప్రసారమైంది. అమెరికా తయారీ హై మొబిలిటీ ఆరి్టలరీ రాకెట్ సిస్టమ్(హిమార్స్) నుంచి దూసుకొచి్చన మిస్సైళ్లే ఈ విధ్వంసం సృష్టించాయని రష్యా చెబుతోంది. మరోవైపు రష్యా వ్యతిరేకంగా సైనిక వార్తలు రాసే బ్లాగర్ ఆండ్రీ మొరజోవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన టెలిగ్రామ్ చానెల్‌కు లక్ష మంది చందాదారులు ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో చాలా ప్రాంతాల్లో రష్యా తోకముడిచిందంటూ, వేల మంది సైనికులు చనిపోయారని తాను రాసిన విశ్లేషణాత్మక కథనాలను వెంటనే తొలగించాలంటూ రష్యా సైన్యం నుంచి ఈయన చాన్నాళ్లుగా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాడు. ఇంకెవరో వచ్చి చంపే బదులు తానే కాల్చుకుని చస్తానని తన బ్లాగ్‌లో రాశాడని వార్తలొచ్చాయి. ఇప్పటిదాకా యుద్ధంలో రష్యా 45వేలకుపైగా సైన్యాన్ని కోల్పోయిందని ‘బీబీసీ రష్యా’ తెలిపింది. -
Russia-Ukraine war: చేజారిన తోడే.. బొడ్డుతాడై...
ఉక్రెయిన్. ఒకప్పటి అందాల దేశం. ఇప్పుడు రష్యా రక్త దాహానికి బలైన శిథిల చిత్రం. యుద్ధం మిగిల్చే బీభత్సానికి సాక్షి. పోరులో ప్రాణాలొదిలిన వేలాది మంది ఉక్రెయిన్ యువ సైనికుల జీవిత భాగస్వాములది మాటలకందని దైన్యం. వారిలోనూ అసలు సంతానమే లేనివారిదైతే చెప్పనలవి కాని వ్యథ. ఎవరి కోసం బతకాలో తెలియని నైరాశ్యం. అయితే తమ జీవిత భాగస్వాములు ముందుజాగ్రత్తగా భద్రపరిచి వెళ్లిన వీర్యం/అండాలు వారిలో కొత్త ఆశలు నింపుతున్నాయి. వాటి సాయంతో బిడ్డలను కంటున్నారు. తమను శాశ్వతంగా వీడి వెళ్లిన తోడు తాలూకు నీడను వారిలో చూసుకుంటున్నారు. భవిష్యత్తుపై ఆశలు పెంచుకుంటున్నారు... ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలై రెండేళ్లవుతోంది. 2022 ఫిబ్రవరి 24న ఆ దేశంపై రష్యా సైన్యం హఠాత్తుగా విరుచుకుపడింది. రోజుల్లో తల వంచుతుందనుకున్న ఉక్రెయిన్ దీటుగా పోరాడుతోంది. దాంతో రెండేళ్లయినా పోరు కొనసాగుతూనే ఉంది. యుద్ధమంటేనే ప్రాణనష్టం! ఇప్పటిదాకా ఏకంగా 70,000 మంది ఉక్రెయిన్ జవాన్లు మరణించినట్లు అంచనా. మరో లక్షన్నర మందికి పైగా క్షతగాత్రులుగా మారారు. యుద్ధంలో జవాను వీరమరణం పొందితే అతడి/ఆమె వంశం అంతమైపోవాల్సిందేనా? బతికుండగానే అండాలు, వీర్యం భద్రపర్చుకొని, తాము లేకపోయినా జీవిత భాగస్వామి ద్వారా సంతానం పొందే వెసులుబాటును ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఇలాంటి ప్రశ్నలు ఉక్రెయిన్ సైన్యం నుంచి గట్టిగా వినిపించాయి. దీనిపై ప్రభుత్వమూ సానుకూలంగా స్పందించింది. పార్లమెంటులో ఇటీవలే ఒక బిల్లును ఆమోదించింది. అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్స్కీ సంతకం చేస్తే చట్టంగా మారనుంది. ఇదొక విప్లవాత్మక చట్టం కానుందని నిపుణులు ప్రశంసిస్తున్నారు. యుద్ధంలో మరణించినవారి వీర్యం/అండాలతో సంతానం పొందే అవకాశం ఇప్పటిదాకా ఉక్రెయిన్‌లో చట్టపరంగా లేదు. ఇక ఈ పరిస్థితి మారనుంది... ► ఉక్రెయిన్ పార్లమెంట్లో ఆమోదించిన బిల్లు ప్రకారం జవాన్లు తమ వీర్యం, అండాలు భద్రపర్చుకోవచ్చు. వారు యుద్ధంలో అమరులైతే వాటి సాయంతో జీవిత భాగస్వాములు సంతానం పొందవచ్చు. ► ఈ కొత్త చట్టాన్ని అంతా స్వాగతిస్తున్నారు. దీని ద్వారా అమర సైనికుల కుటుంబ వారసత్వం కొనసాగుతుందంటున్నారు. ► జవాన్ల వీర్యం/అండాలు ఉచితంగా భద్రపరుస్తామని ఉక్రెయిన్‌లో పలు సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. యుద్ధం మొదలైనప్ప టి నుంచే ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నాయి. ► ఇందుకు వీలుగా యుద్ధంలో మృతి చెందిన జవాన్ల వీర్యం/అండాలను మూడేళ్ల పాటు భద్రపరుస్తారు. ఇందుకు ప్రభుత్వమే ఆర్థిక సాయం అందిస్తుంది. ► వీర్యం/అండాలు భద్రపర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్న సైనికుల సంఖ్య ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. ప్రభుత్వం అనుమతితో పాటు ఆర్థిక సాయమూ అందిస్తుందని స్పష్టత రావడమే కారణమని తెలుస్తోంది. ► యుద్ధంలో క్షతగాత్రులై, ఆరోగ్యం దెబ్బతిని సంతానోత్పత్తికి, బిడ్డలకు జన్మనిచ్చే సామర్థ్యానికి దూరమైన సైనికులు కూడా వీర్యం/అండాలను భద్రపర్చుకుని సంతానం పొందవచ్చు. ► యుద్ధంలో గాయపడిన పలువురు జవాన్లు ఈ సేవలు ఉపయోగించుకుంటున్నారు. ► ఇలా భద్రపర్చిన వీర్యం/అండాలతో పుట్టే పిల్లలకు చట్టబద్ధంగా అన్ని హక్కులూ ఉంటాయి. అమర వీరులైన తల్లి/తండ్రి పేరును వారి బర్త్ సరి్టఫికెట్లో ముద్రిస్తారు! ► ఇప్పటికే ఒక బిడ్డ ఉన్నవారు కూడా మరో బిడ్డను కనడానికి ముందుకొస్తున్నారు. ఇలా భద్రపర్చుకుంటున్న జవాన్లలో మహిళల కంటే పురుషుల సంఖ్య అధికంగా ఉంది. మన పాప నవ్వుల సాక్షిగా... నువ్వెప్పటికీ నాతోనే... మనసుతో చూడగలిగితే లక్ష భావాలను, కోటి ఊసులను కళ్లకు కట్టే ఫొటో ఇది. ఇందులో నేపథ్యంలోని పోస్టర్లో కనిపిస్తున్నది రష్యాతో పోరులో మరణించిన ఉక్రెయిన్ సైనికుడు విటాలీ. బుల్లి పాపాయిని ఎత్తుకున్నది అతని భార్య విటాలినా. భర్త మరణానంతరం ఆయన వీర్యంతో గర్భం దాల్చి ఈ పండంటి పాపాయికి జన్మనిచి్చందామె. కూతురిని భర్త ఫొటోకు చూపిస్తూ ఇలా భావోద్వేగానికి గురైంది. రష్యాతో యుద్ధం మొదలయ్యే కొద్ది నెలల ముందే విటాలీ ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. ఫ్రంట్ లైన్లో పోరాడుతూ యుద్ధం మొదలైన తొలి నాళ్లలోనే మరణించాడు. అప్పటికే విటాలినా 13 వారాల గర్భవతి. కానీ ఆ గర్భం నిలవలేదు. భర్త క్షేమం తాలూకు ఆందోళనే అందుకు ప్రధాన కారణమని ఇప్పటికీ కన్నీళ్లపర్యంతం అవుతుంటుంది విటాలినా. ‘‘అటు జీవితాంతం తోడుండాల్సిన భర్తను, ఇటు ఇంకా లోకమే చూడని మా కలల పంటను కొద్ది రోజుల తేడాతో శాశ్వతంగా కోల్పోయా. బతుకంతా ఒక్కసారిగా శూన్యంగా తోచింది’’ అంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకుందామె. ‘‘ఇలాంటి పరిస్థితిని ఊహించే నా భర్త వీర్యాన్ని భద్రపరిచి వెళ్లాడు. దాని సాయంతో తల్లిని కావాలని నిర్ణయించుకున్నా. అలా ఈ చిట్టి తల్లి ఈ లోకంలోకి అడుగు పెట్టింది. తన రాకతో నాకు నిజంగా సాంత్వన చేకూరింది. పాప వాళ్ల నాన్న పోలికలనే గాక హావభావాలను కూడా ముమ్మూర్తులా పుణికి పుచ్చుకుంది. దైవ కృప అంటే బహుశా ఇదేనేమో. నిజానికి గంపెడు సంతానాన్ని కనాలని, మాది పెద్ద కుటుంబం కావాలని పెళ్లికి ముందు నుంచీ ఎన్నెన్నో కలలు కన్నాం. కానీ విధి రాత మరోలా ఉంది. అయినా తను ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఈ చిట్టితల్లి రూపంలో ఇలా ఫలించింది’’ అంటుంటే విని చెమర్చని కళ్లు లేవు. కాస్త అటూ ఇటుగా ఉక్రెయిన్ సైనిక వితంతువులందరి గాథ ఇది...! – సాక్షి, నేషనల్ డెస్క్ -
21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
జెరూసలేం: గాజాలో ఇజ్రాయెల్ రక్షణ దళా(ఐడీఎఫ్)నికి తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒకే ఘటనలో 27 మంది సైనికులు మృతి చెందారు. అక్టోబర్ 7వ తేదీన హమాస్‌పై యుద్ధం మొదలయ్యాక ఇంతమంది సైనికులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. యుద్ధం నిలిపేసి, బందీలను విడుదలయ్యేలా చూడాలంటూ నెతన్యాహు ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెరుగుతున్న సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనను ఇజ్రాయెల్‌కు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ పరిణామంపై ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. పూర్తి స్థాయి విజయం సిద్ధించే దాకా యుద్ధం కొనసాగుతుందని ప్రకటించారు. -
భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. భారత్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మయన్మార్ ప్రభుత్వ ఆర్మీ(జుంటా) సైనికులు భారత్‌లోకి చొచ్చుకురావటంపై కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయటంలో భాగంగా భారత సరిహద్దుల వెంట త్వరలో పటిష్టమైన కంచెను ఏర్పాటు చేయనున్నట్లు హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎలాంటి కంచె ఉందో.. ఇక్కడ (భారత్-మయన్మార్) సరిహద్దు వద్ద కూడా చాలా పటిష్టమైన కంచె ఏర్పాటు చేస్తామని అన్నారు. దీంతో మనదేశంలోకి సరిహద్దులు దాటుకొని మయన్మార్ సైనికులు రావటం సాధ్యం కాదని పేర్కొన్నారు. సుమారు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరం రాష్ట్రంలోకి వచ్చారు. జుంటా ఆర్మీ స్థావరాలను ఆ దేశ అంతర్గత ఘర్షణలో భాగంగా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ (AA) స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఆర్మీ సైనికులు మిజోరంలోని సరిహద్దు లాంగ్ట్లై జిల్లాలోకి వచ్చారు. ప్రస్తుతం మయన్మార్ ఆర్మీ సైనికులు అస్సాం రైఫిల్స్ సైనిక క్యాంప్‌లో ఆశ్రయం పొందుతున్నారు. మయన్మార్ ఆర్మీ సైనికుల విషయాన్ని.. మిజోరం సీఎం లాల్దుహోమ కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. భారత సరిహద్దుల్లోని మిజోరం ప్రాంతం నుంచి మయన్మార్ ఆర్మీ సైనికులను వెనక్కి పంపించాలని కేంద్రాన్ని ఆయన అభ్యర్థించిన విషయం తెలిసిందే. చదవండి: భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. కేంద్రానికి మిజోరం అభ్యర్థన -
భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. కేంద్రానికి మిజోరం అభ్యర్థన
గౌహతి: మయన్మార్‌లో కొన్ని రోజులుగా దేశ సైనిక ప్రభుత్వం, అక్కడి ప్రజాస్వామ్య సాయుధ దళాలకు మధ్య ఉద్రిత్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మయన్మార్ ఆర్మీ(జుంటా) సైనికులు భారత సరిహద్దులు దాటి భారత్‌లోని మీజోరంకి వరుసకడుతున్నారు. దీంతో మిజోరం ప్రభుత్వం అప్రమత్తమైంది. మీజోరం భూభాగంలోకి చొచ్చుకువస్తున్న జుంటా సైనికులను వెంటనే మయన్మార్‌కు తిరిగి పంపిచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సుమారు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరం రాష్ట్రంలోకి వచ్చారు. జుంటా ఆర్మీ స్థావరాలను ఆ దేశ అంతర్గత ఘర్షణలో భాగంగా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ (AA) స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఆర్మీ సైనికులు మిజోరంలోని సరిహద్దు లాంగ్ట్లై జిల్లాలోకి వచ్చారు. ప్రస్తుతం మయన్మార్ ఆర్మీ సైనికులు అస్సాం రైఫిల్స్ సైనిక క్యాంప్‌లో ఆశ్రయం పొందుతున్నారు. పెద్ద ఎత్తున సరిహద్దు దాటుకొని మిజోరం వైపు వస్తున్న మయన్మార్ సైనికులను వెనక్కి పంపిచాలని మిజోరం సీఎం లాల్దుహోమ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరినట్లు మిజోరం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిత్త పరిస్థితుల నేపథ్యంలో తిరిగి స్థిరత్వం నెలకొల్పడానికి మయన్మార్ సైనికులు వెనక్కి పంపించాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఇక.. ఇటీవల తరచూ మయన్మార్ సైనికలు భారత సరిహద్దులు దాటుకొని మిజోరం రాష్ట్రంలోకి వస్తున్నారని మిజోరం సీఎం లాల్దుహోమ తెలిపారు. మనవతా సాయం కింద మయన్మార్ సైనికులకు తాము సైనిక క్యాంప్‌లో సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇలా 450 మంది జుంటా సైనికులను వెనక్కి పంపించినట్లు తెలిపారు. 2021 నుంచి మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం.. ఇక్కడి ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థల నుంచి తీవ్రమైన తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలు నగరాల్లోని సైనిక స్థావరాలను తిరుగుబాటు సంస్థలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: గాంధీలను మించిన అవినీతి పరులు ఎవరైనా ఉంటారా? -
పూంచ్‌లో జిల్లాలో ఆర్మీ కాన్వాయ్‌పై మరోసారి ఉగ్రదాడి..
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పూంచ్ జిల్లాలో ఖనేటర్ ప్రాంతంలో వెళుతున్న భారత ఆర్మీ కాన్వాయ్‌పై శుక్రవారం సాయంత్రం టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. సమీపంలోని కొండపై నుంచి జవాన్లపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అప్రమత్తమైన సైనిక బలగాలు ఎదురు కాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందిన సమాచార మేరకు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదని తెలుస్తోంది. సంఘటన స్థలంలో సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. కాగా దాడికి గురైన ఆర్మీ కాన్వాయ్‌లో అనేక వాహనాలు ఉన్నట్లు సమాచారం. కాగా నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో సహా ఉన్నత స్థాయి అధికారులు ప్రస్తుతం పూంచ్‌లోనే ఉన్నారు. అక్కడ తరుచూ జరుగుతున్న తీవ్రవాద దాడులను ఎదుర్కొనేందుకు వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడి జరగడం గమనార్హం. గత ఆరు ఏడు నెలల్లో పిర్ పంజాల్ ప్రాంతంలో( రాజౌరీ, పూంచ్) ఉగ్రదాడులు ఎక్కువయ్యాయని, ఈ కాలంలో అధికారులు కమాండోలతో సహా 20 మంది సైనికులు మరణించారు. ఇక నెల రోజుల వ్యవధిలో పూంచ్ జిల్లాలో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. మూడు వారాల క్రితం పూంచ్ జిల్లాలో భద్రతా బలగాల వాహానాలపై ముష్కరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు వీర మరణం పొందారు. ఈ దాడుల వెనక పాకిస్థాన్ - చైనా పన్నిన కుట్ర దాగుందని భారత రక్షణశాఖ వర్గాలు విశ్వసించాయి.