మీ చొరవ అసమానం  | Military Officer Praises KCR About Commitment On Soldiers | Sakshi
Sakshi News home page

మీ చొరవ అసమానం 

Published Sat, Jun 27 2020 2:48 AM | Last Updated on Sat, Jun 27 2020 4:44 AM

Military Officer Praises KCR About Commitment On Soldiers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లద్దాఖ్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి అత్యంత ఉదారంగా పునరావాస ప్యాకేజీని ప్రకటించడమే కాకుండా, సత్వరమే అందజేయడంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చూపిన చొరవను డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ నావల్‌ స్టాఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ ఎంఎస్‌ పవార్‌ కొనియాడారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నెల 24న ఆయన లేఖ రాశారు.  

ఉన్నత ప్రమాణాలను నిర్దేశించారు.. 
‘సంతోష్‌బాబు కుటుంబానికి ప్యాకేజీ ప్రకటించి, సత్వరంగా అందించడానికి మీరు చూపిన చొరవ అసమానమైనది. ఇతరులు అనుసరించడానికి ఉన్నతమైన ప్రమాణాలను నిర్దేశించింది. మాతృభూమి రక్షణ కోసం ప్రాణత్యాగానికి భారతీయ సైనికుడు ఎప్పుడూ భయపడడు అనేదానికి చరిత్రే సాక్ష్యం. జాతీయ యుద్ధ స్మారక వనంలో చెక్కిన అనేక మంది అమరవీరుల పేర్లు ఇందుకు నిదర్శనం. నా కార్యాలయానికి రోజూ వెళ్లే సమయంలో సౌత్‌బ్లాక్‌ కారిడార్లలో శౌర్య పురస్కారాలు అందుకున్న వీరుల చిత్రాలను చూస్తూ గర్వపడుతుంటాను. యుద్ధరంగంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా దేశం మా కుటుంబాలకు అండగా నిలుస్తుందని సైనికులకు మీరు నిలిపిన ఈ ప్రమాణాలు భరోసా ఇస్తాయి.

అనుసరించడానికి ఉన్నతమైన ప్రమాణాలను నిర్దేశించింది. మాతృభూమి రక్షణ కోసం ప్రాణత్యాగానికి భారతీయ సైనికుడు ఎప్పుడూ భయపడడు అనేదానికి చరిత్రే సాక్ష్యం. జాతీయ యుద్ధ స్మారక వనంలో చెక్కిన అనేక మంది అమరవీరుల పేర్లు ఇందుకు నిదర్శనం. నా కార్యాలయానికి రోజూ వెళ్లే సమయంలో సౌత్‌బ్లాక్‌ కారిడార్ల లో శౌర్య పురస్కారాలు అందుకున్న వీరుల చి త్రాలను చూస్తూ గర్వపడుతుంటాను. యుద్ధరంగంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా దేశం మా కుటుంబాలకు అండగా నిలుస్తుందని సైనికులకు మీరు నిలిపిన ఈ ప్రమాణాలు భరోసా ఇస్తాయి. అమరుడైన ఓ సైనికుడి కుటుంబాన్ని ఓదార్చడానికి ఒక రాష్ట్ర సీఎం వందల కిలోమీట ర్లు ప్రయాణించడం అరుదైన విషయం.

సంతోష్‌బాబు కుటుంబంతో పాటు ఆయన సహచరులైన మిగిలిన 19 మంది సైనికులు తెలంగాణవాసులు కాకపోయినా వారి పట్ల మీరు చూపిన ఆదరణ.. మీ నాయకత్వ లక్షణాలు, సైన్యం పట్ల మీ దృక్పథానికి, సహృద్భావానికి అద్దంపడుతోంది. ఈ విషయంలో మీ కుమార్తె కె.కవిత చూపిన చొరవ సైతం ప్రశంసనీయం’అని పవార్‌ తన లేఖలో పేర్కొన్నారు. కోరుకొండలోని సైనిక్‌ స్కూల్‌ను సందర్శించాలని సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. కల్నల్‌ సంతోష్‌ ఇక్కడి పూర్వ విద్యార్థి అని, ఇక్కడ తెలంగాణకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement