commitment
-
నెలకు రూ.80,000.. ఇదేదో సాఫ్ట్వేర్ జీతం కాదు!
నెలకు రూ.85,000 వరకు వేతనం.. ఇదేదో సాఫ్ట్వేర్ ఉద్యోగి జీతం అనుకుంటే పొరపడినట్లే.. ఇది ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ సంపాదన! అవునండి.. దాదాపు రోజుకు 13 గంటలపాటు విభిన్న ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి బెంగళూరులోని ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ సంపాదిస్తున్న మొత్తం అది. తన సంపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించిన ఓ వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.బైక్ ట్యాక్సీలు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రజాదరణ పొందాయి. చాలామంది డ్రైవర్లకు, స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి మంచి అవకాశాలను అందిస్తున్నాయి. ఉబర్, రాపిడో, ఓలా.. వంటి కంపెనీలు ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉంచాయి. బెంగళూరుకు చెందిన ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ ఉబర్, రాపిడోలో వచ్చిన రైడ్లను పూర్తి చేస్తూ, రోజుకు 13 గంటల పాటు పనిచేస్తూ నెలకు రూ.80,000-రూ.85,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ మేరకు అప్లోడ్ చేసిన వీడియో చూసినవారు బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా ఉంటూ అంతమొత్తంలో ఆర్జించడంపట్ల ఆశ్చర్య పోతున్నారు.A classic Bengaluru moment was observed in the city when a man proudly claimed that he earns more than ₹80,000 per month working as a rider for Uber and Rapido. The man highlighted how his earnings, driven by his hard work and dedication, have allowed him to achieve financial… pic.twitter.com/4W79QQiHye— Karnataka Portfolio (@karnatakaportf) December 4, 2024ఇదీ చదవండి: నిలిచిన రైల్వే ఈ-టికెట్ సేవలు..!ఇటీవల @karnatakaportf పోస్ట్ చేసిన ఈ వీడియోకు మూడు వేలకు పైగా లైకులు, ఆరు లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై వీక్షకులు విభిన్నంగా కామెంట్ చేస్తున్నారు. కొందరు డ్రైవర్ అంకితభావం, కృషిని ప్రశంసిస్తున్నారు. ‘మేము కూడా అంత సంపాదించడం లేదు భయ్యా!’ అని మరొకరు కామెంట్ చేశారు. 13 గంటల పాటు రోడ్డుపై డ్రైవింగ్ చేయడం చాలా కష్టమని మరోవ్యక్తి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. -
ఐదేళ్ల కష్టం వృథా అయ్యింది.. ‘కమిట్మెంట్’ ప్రశ్నపై స్పందించిన అనన్య
‘పొట్టేల్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో హీరోయిన్ అనన్య నాగళ్లకు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్‌ని ప్రస్తావిస్తూ.. ‘అవకాశాల కోసం హీరోయిన్లు కమిట్మెంట్ ఇవ్వాలట కదా .. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా?’అని ఓ మహిళా జర్నలిస్ట్ అనన్యను ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు షాకైన అనన్య.. సున్నితంగా సమాధానం ఇచ్చి అక్కడితో ఆ ఇష్యూని ఆపేసింది. అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అయింది. చాలా మంది అనన్యకు మద్దతుగా నిలుస్తూ కామెంట్స్ పెడుతున్నారు.తాజాగా ఈ వైరల్ వీడియోపై అనన్య స్పందించింది. సంస్కారం ఉన్నవాళ్లు ఇలాంటి ప్రశ్నలు అడగరంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో అనన్య మాట్లాడుతు..‘ఇంత డైరెక్ట్‌గా అలాంటి ప్రశ్నలు ఎలా అడుగుతారని ఇంటికి వెళ్లాక ఆలోచించాను. సంస్కారం అనేది ఉంటే ఇలాంటి ప్రశ్నలు అడగరు. మీడియా వాళ్లు చాలా మంది నాకు కాల్ చేసి ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ..ఒక తెలుగమ్మాయిని అలా అడగడం బాధగా ఉందని చెప్పారు. వాళ్లు నా గురించి చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఒక తెలుగమ్మాయిని వాళ్లు ఇంతలా సపోర్ట్ చేస్తుండడం సంతోషంగా ఉంది. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కల. దాని కోసం ఐదేళ్లుగా ఇంట్లో వాళ్లతో ఫైట్ చేస్తున్నా. కానీ ఆ ఒక్క ప్రశ్నతో నా ఐదేళ్ల కష్టం వృథా అయిందనిపించింది. నేను ఇప్పుడు సక్సెస్ అయినా.. కమిట్మెంట్కు అంగీకరించాను కాబట్టి సక్సెస్ అయ్యానని అందరూ అనుకుంటారు. ఇప్పుడు మళ్లీ బంధువులందరూ ఇదే విషయం మా అమ్మను అడుగుతారు. ఆ జర్నలిస్ట్ ప్రశ్న వేసినప్పుడు నాకు ఇన్ని ఆలోచనలు రాలేదు. ఆమెకు సంస్కారం లేదా? ఇలాంటి ప్రశ్న వేసిందనుకున్నా ఇంటికి వెళ్లాక దీని గురించి ఎంతో ఆలోచించా. ఇంకా నయం ఆ ప్రెస్ మీట్‌కి మా అమ్మను రమ్మని చెప్పారు. తనే రానని చెప్పింది. వచ్చి ఉంటే చాలా బాధపడేది’అని అనన్య అన్నారు. కాగా అనన్య, అజయ్ కీలక పాత్రల్లో నటించిన ‘పొట్టేల్’చిత్రం అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
#HBDYSJagan జయహో జననేతా..ఏ దైవం పంపించాడో!
జనం మాటే. జగన్ బాట. ఆపదలో ఆపన్నహస్తం. కష్టాల్లో తోడు నీడ. అనేకమంది ఆశలకు, ఆశయాలకు రెక్కలు...ఏ దైవం పంపాడో ..పండగలా దిగివచ్చిన దేవుడు. తమ నీడకు నీడై, తోడుకు తోడై..వెలుగు పూలు పూయించిన జనహృదయనేత. జయహో జగన్. ఇదీ జనం మాట! అడగనిదే అమ్మ అయినా పెట్టదు అనేది సామెత. అన్నా..అని సాయం కోరితే చాలు.. నేనున్నానంటూ ఇచ్చే కొండంత ధైర్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మాకూ ఓ జగన్ కావాలనేంత.. భరోసా! మాట నిలబెట్టు కోవడంలో, హామీలను తు.చ. తప్పకుండా నెరవేర్చడంలో ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ తరువాతే ఎవరైనా. అన్నదాతలను అక్కున చేర్చు కోవడం దగ్గరినించి వైద్య ఆరోగ్య సేవల వరకు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్ల నుంచి , మహిళా సాధికారత వరకు, చదువుల నుంచి పౌరసేవల దాకా అన్నింటా ఆయనొక భరోసా.పేదలు గెలిచే వరకు.. వారి జీవితం బాగుపడే వరకు.. యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది.Telugu Rap Song 🔥#HBDYSJagan pic.twitter.com/aQ812SOH5H— Roja Selvamani (@RojaSelvamaniRK) December 21, 2023ఆడపడుచులకు అండగా, బిడ్డలకు విద్యా దీవెనగా, పేద బడుగు వర్గాల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలు ఆయన మానస పుత్రికలు. కనుకనే ఎన్ని విమర్శ లొచ్చినా నిండుమనసుతో అమలు చేస్తున్న నిబద్ధత ఆయన సొంతం. అందుకే మాట తప్పని నేతగా, జననేతగా నిలిచారు. అంతేకాదు కరువొచ్చినా, కష్టమొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా, అరుదైన వ్యాధి వచ్చినా, చదువు కోవాలన్నా ‘నేను ఉన్నాను’ అంటూ ఆదుకునే ఆ మంచి మనసు భరోసా నభూతో నభవిష్యతి. తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని రుజువు చేస్తూ జననీరాజనాలు అందుకుంటున్నారు సీఎం జగన్. అవినీతికి, వివక్షకు తావులేకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు వేగిరమే ముందుకు రావడమే కాదు. ప్రకటించిన సంబంధిత సాయాన్ని తక్షణమే అందించడంలో ఆయన తీరే వేరు. బాధితులకు ఆర్థిక సాయం అందించడంలో గానీ, ఉద్యోగార్థులకు ఉద్యోగావకాశాన్ని కల్పించడంలో గానీ, ముఖ్యంగా తుపాను సమయాల్లో, ప్రభావిత ప్రాంతాలను పర్యటించడంలోగానీ, బాధితులను ఆదుకోవడంలోగానీ సీఎం జగన్ ఎపుడూ ముందే ఉంటారు. బాధితులను ఆదుకునేలా వెనువెంటనే సాయాన్ని అందించే పెద్ద మనసు. అలాగే ఆరుగాలం పండించిన పంట పాడైపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అన్నదాతలను ఓదార్చి, వరద ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని యుద్ధ ప్రాతిపదికన జమచేసిన ఘనత ఆయనది. ఇటీవల మిచౌంగ్ తుపాను కారణంగా తడిసిన ధాన్యంలో ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను తీసుకొవడమే ఇందుకు గొప్ప నిదర్శనం.2023లొ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన శ్రావణి పైలట్ కావాలన్నకలను నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. శ్రావణి ఏవియేషన్ శిక్షణకు రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. విజయవాడలో కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారికి తక్షణమే సాయం, అన్ని విధాలా ఆదకుంటామని హామీ. 2022లో అరుదైన ‘గాకర్స్’ వ్యాధితో బాధపడుతున్న హనీ చిన్నారికి కోటి రూపాయిల సాయం అందించారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి హృదయానికి హత్తుకునే ఘటనలు కోకొల్లలు. ఉద్ధానమా.. గర్వించు!అంతెందుకు ఏ నాయకుడూ నామమాత్రంగా కూడా పట్టించుకోని శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం సంగతి చూడండి. ఉద్ధానం కిడ్నీ బాధితులకిచ్చిన మాటను జగన్ అక్షరాల నెరవేర్చిన సందర్భం అపూర్వం, వేనోళ్ల కీర్తి దగించిందే! దశాబ్దాల తరబడి ఆ ప్రాంత వాసులను వేధించిన సమస్యకు శాశ్వత పరిష్కారంగా వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మచ్చుతునకలు. వీటన్నింటికీ మించి ఆయన రాష్ట్రంలో ఏమూల పర్యటనకు వెళ్లినా.. పేద, గొప్ప, కులం, జాతి మతంతో సంబంధం లేకుండా తన దగ్గరికొచ్చిన వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా అక్కున చేర్చుకోవడం ఆయన ప్రత్యేకత. ఏ ప్రజకైనా తమ నాయకుడిని నెత్తిన పెట్టుకోవడానికి ఇంతకన్నా ఏం కావాలి. (విన్నారు.. ఆదుకున్నారు)కోవిడ్-19 సంక్షోభ సమయంలో వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రంలోని లక్షలాదిమంది ప్రజల్ని మహమ్మారి ముప్పునుంచి కాపాడాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును, ప్రశంసల్ని దక్కించుకున్నాయి. కరోనా కష్టకాలంలో తమ ప్రియతమ నేత తీసుకున్న కీలక నిర్ణయాలు, చూపించిన ప్రేమ, ఆదరణను ఇప్పటికీ, ఎప్పటికీ ప్రజలు మరువలేరు. సీఎం జనగ్ సేవలను గుర్తు చేసుకుంటూ కన్నతండ్రిలా తమను ఆదుకున్న జన నేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ‘‘హ్యాపీ బర్త్‌డే జగనన్నా.. వెయ్యేళ్లు వర్ధిల్లు’’ అంటూ నిండు మనసుతో జనం ఆశీర్వదిస్తున్నారు. -
కౌశల్ ఆర్మీ టార్చర్ వల్ల తాగుడుకు బానిసయ్యా: తేజస్వి
'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి తేజస్వి మదివాడ. కేరింత, ఐస్‌క్రీమ్ వంటి చిత్రాలతో పాపులర్ అయిన తేజస్వి బిగ్‌బాస్ సీజన్-2లో పాల్గొని నెగిటివిటిని మూటగట్టుకుంది. ఆ తర్వాత చాలాకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తేజస్వి ప్రస్తుతం కమిట్మెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన తేజస్వి బిగ్‌బాస్ విన్నర్ కౌశల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సినిమాలు అన్నీ ఒక ఎత్తయితే.. బిగ్‌బాస్ మరోక ఎత్తు. కౌశల్ ఆర్మీ కారణంగా చాలా మనోవేధనకు గురయ్యాను. నాపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్లు. చెత్తమీమ్స్తో నన్ను బ్యాడ్ చేశారు. కౌశల్ మండా ఆర్మీ నన్ను టార్గెట్ చేసి మరీ టార్చర్ చూపించారు. బిగ్‌బాస్ తర్వాత కూడా వదల్లేదు. ఇవన్నీ చూసి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఇండియా వదిలి వేరే దేశాలకి వెళ్లిపోయాను. సోషల్ మీడియాలో నామీద కౌశల్ ఆర్మీ చేస్తున్న ట్రోలింగ్ చూసి ఫ్రస్ట్రేషన్‌తో తాగుడుకు బానిసయ్యాను. కానీ తర్వాత దాన్నుంచి బయటికొచ్చాను. నాపై ఇంత చేశారు. చివరికి వాళ్లకి ఏమొచ్చింది? కౌశల్ ఇప్పుడు ఫామ్‌లో ఉన్నాడా? ఆఖరికి హోస్ట్ నాని కూడా హౌస్‌లో నన్నే తిట్టేవాడు. ఇవన్నీ చూసి బిగ్‌బాస్ తర్వాత ఇక ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. కానీ ఈ కమిట్మెంట్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నా అంటూ వెల్లడించింది. -
30 మంది ఫుల్‌గా తాగి నన్ను అటాక్ చేశారు: తేజస్వి
బిగ్‌బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ హీరోయిన్గా నటించిన చిత్రం కమిట్మెంట్. తేజస్వితో పాటు అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ సింహా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. లక్ష్మీ కాంత్ చెన్న దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 19న) రిలీజైంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో తేజు తను ఎదుర్కొన్న చేదు సంఘటనలను వెల్లడించింది. 'ఓసారి ఈవెంట్‌కు వెళ్లినప్పుడు సుమారు 30 మంది ఫుల్‌గా తాగొచ్చి రాత్రి నన్ను అటాక్ చేశారు. నేను ఏదోలా తప్పించుకుని ఇంటికి వెళ్లి తెగ ఏడ్చాను. అలాగే ఇండస్ట్రీలో చాలామంది నన్ను కమిట్మెంట్ అడిగారు. కొందరు ఫోన్లో అడిగారు, మరికొందరి నేరుగా చూపులతోనే అడిగేవారు. అది ఈజీగా తెలిసిపోయేది. సినీ ఇండస్ట్రీ అనే కాదు, ప్రతి రంగంలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంది. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా లేదు. అదే ఇప్పుడు ఏదైనా జరిగితే పేరుతో సహా సోషల్ మీడియాలో అన్నీ బయటపెట్టొచ్చు' అని తేజస్వి చెప్పుకొచ్చింది. చదవండి: మొన్నే కదా బిడ్డ పుట్టింది, అప్పుడే మళ్లీ ప్రెగ్నెంటా? స్టార్ హీరోల సినిమాలను వెనక్కునెట్టిన నిఖిల్ మూవీ -
సమస్యలను మహిళలు ఎలా ఎదుర్కోవాలో చూపించాం: నిర్మాత
Commitment Movie Pre Release Event: "టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ నాలుగు కథలతో వస్తున్న ఇంట్రస్టింగ్ మూవీ "కమిట్ మెంట్". తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ సింహా రెడ్డి నటీనటులుగా లక్ష్మి కాంత్ చెన్న దర్శకత్వంలో బల్ దేవ్ సింగ్, నీలిమ.టిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగష్టు 19న థియేటర్స్‌లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేసింది. నటుడు అమిత్ తివారి మాట్లాడుతూ.. "కమిట్ మెంట్" అంటే అందరూ ఎదో అనుకుంటారు. కానీ కమిట్ మెంట్ అంటే మన వర్క్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవ్, ప్రొఫెషన్ కోసం ఎంతదూరం వెళ్తారు, ఆలా కమిట్ మెంట్ కోసం వెళ్లినప్పుడు సొసైటీలో మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేదే ఈ "కమిట్ మెంట్". ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో పవర్ ఫుల్ మెసేజ్ ఉంటుంది. ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా కనెక్ట్ అవుతారు'' అని తెలిపాడు. చదవండి: ప్రభాస్ విషయంలో ఆ నిర్మాత వెనుకడుగు.. కారణం అదేనా? మహేశ్ బాబు థియేటర్లో దళపతి విజయ్.. వీడియో వైరల్ చిత్ర నిర్మాత నీలిమ.టి మాట్లాడుతూ.. ''ఇది నా మొదటి సినిమా. సొసైటీకి మంచి సినిమా చూపించాలని ఒక ఉమెన్ గా ఈ సినిమా తీశాము. ఈ సినిమా పోస్టర్స్ చూసో, క్లిప్పింగ్స్ చూసో అందరూ బోల్డ్ కంటెంట్ ఉంటుంది అనుకోవద్దు. ఇందులో కొంత బోల్డ్ సీన్స్ ఉన్నా అవి ఎందుకు ఉన్నాయి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం మహిళలు వర్క్ లో కానీ ఇలా ఇందులోనైనా కానీ ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఎదుర్కొంటున్నారు అనేది ఈ సినిమాలో చుపించాము. అలాగే వాటిని ఓవర్ కమ్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపించడం జరిగింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క అమ్మాయికి కచ్చితంగా నచ్చుతుంది'' అని పేర్కొన్నారు. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
అందుకే పెళ్లి చేసుకోవడం మానేశా : తేజస్వి మదివాడ
బిగ్‌బాస్ ఫేమ్ తేజస్వి మదివాడ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం కమిట్మెంట్. నాలుగు ఇంట్రెస్టింగ్ కథలతో తెరకెక్కిన ఈ మూవీని రచనా మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. లక్ష్మీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తేజస్వీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఈ సినిమాలో నాలుగు స్టోరీలు ఉన్నాయి అందులో ఒకటి నాది. ఇందులో నా క్యారెక్టర్ సినిమా చాన్స్ అవకాశాల కోసం తిరిగేది.ఇండస్ట్రీ లో జరిగే న్యాచురాలిటీ కి దగ్గర గా ఈ సినిమా ఉంటుంది . అందుకే ఈ స్టోరీ వినగానే ఓకే చేశాను . సినిమా ఇండస్ట్రీని బద్నామ్ చేయొద్దు అని చెప్పేదే ఈ మూవీ మెసేజ్. కమిట్మెంట్ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇది చాలా డిఫరెంట్ మూవీ. ఇందులో ప్రతిదీ నేచురల్‌గా ఉంటుంది. ► ఒక సినిమా కి ఎంత అవసరం ఉంటుందో అంతే చేయాలి. బోల్డ్ అయినా కిస్ సీన్ అయినా కంటెంట్ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తాను . ఈ సినిమాలోనూ రొమాన్స్ ఉంటుంది. ఈ మూవీలో శ్రీనాథ్ నాతో రొమాన్స్ సీన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు(నవ్వుతూ..) ► ఇండస్ట్రీలో నన్ను ఎవరూ కమిట్మెంట్ అడగలేదు. అందరూ నాతో కూల్‌గానే ఉన్నారు. నన్ను కమిట్మెంట్ అడగాలి అంటే బయపడేవాళ్లు . ఇప్పటికీ వరుస అవకాశాలు వస్తున్నాయి కానీ.. చాలా మంది అక్క, చెల్లి క్యారెక్టర్స్ అని చెబుతున్నారు. లేదంటే బోల్డ్ క్యారెక్టర్స్ తీసుకొస్తున్నారు. ‘కేరింత’లాంటి క్యారెక్టర్స్ ఎవరూ ఇవ్వడం లేదు(నవ్వుతూ) ► సినిమాలు మానేసి పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు అన్నారు. అందుకే పెళ్లి చేసుకోవడం మానేశా(నవ్వుతూ..) ► బిగ్‌బాస్‌లోకి వెళ్లడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఆ షో కారణఃగానే ఇల్లు, కారు కొనుక్కొని హ్యాపీగా ఉన్నాను. బిగ్‌బాస్‌లోకి వెళ్లడం వల్ల ఆఫర్స్ మిస్ అయ్యాయని ఎవరైనా అంటే కూడా ఐ డోంట్ కేర్. , సినిమా ఇండస్ట్రీ కి వచ్చిందే మనీ కోసం. నేను చాల స్మార్ట్.. లైఫ్‌ని ఎలా రన్ చేయాలో బాగా తెలుసు. ► ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ చిత్రంలోనూ నటిస్తున్నాను. ఇతర భాషల నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. -
బిగ్‌బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ 'కమిట్మెంట్'.. బోల్డ్‌గా ట్రైలర్
Tejaswi Madivada Commitment Trailer Released: బిగ్‌బాస్ ఫేమ్ తేజస్వి మదివాడ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం కమిట్మెంట్. నాలుగు ఇంట్రెస్టింగ్ కథలతో తెరకెక్కిన ఈ మూవీని రచనా మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. లక్ష్మీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్ వివాదానికి గురి కాగా డైరెక్టర్ లక్ష్మీ కాంత్ క్షమాపణలు తెలిపారు. ఇప్పుడు తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను బుధవారం (ఆగస్టు 3) విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలు ఏ రంగంలో ఎదగాలన్న కమిట్మెంట్ ఇవ్వాలన్న పరిస్థితులు నెలకొన్నట్లు ఈ మూవీలో చూపించినట్లు తెలుస్తోంది. 'సమాజంలో ఒక మగాడు ఎలాగైనా బతుకుతాడు, కానీ ఆడది యుద్ధం చేస్తేనే బ్రతుకుతది' అసలు మాలో ఉన్న ఆడతనాన్ని చూసి మీరు మనుషుల్ల సంగతే మరిచిపోతున్నారు, కాస్త మనుషుల్లా ఆలోచించండి' వంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అలాగే ట్రైలర్‌ను పలు బోల్డ్ సీన్లతో కట్ చేసిన అమ్మాయిలు 'కమిట్మెంట్' అనే విషయంతో ఎలా నలిగిపోతున్నారనే విషయాన్ని చూపించారు. నరేష్ కుమరన్ సంగీతం అందించిన 'కమిట్మెంట్' ఆగస్టు 19న ప్రేక్షకులు ముందుకు రానుంది. -
తేజస్వి 'కమిట్మెంట్' మూవీపై కరాటే కల్యాణి ఫిర్యాదు
బిగ్‌బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ నటించిన కమిట్మెంట్ సినిమా ట్రైలర్‌పై కేసు నమోదైంది. మూవీ ట్రైలర్లో భగవద్గీత శ్లోకాన్ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లా వాడింది చిత్రయూనిట్. దీనిపై నటి కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువుల మనోభావాలు కించపరిచేలా ట్రైలర్ ఉందంటూ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బూతు సన్నివేశాలకు భగవద్గీత శ్లోకం ఎలా వాడుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి దీనిపై చిత్రయూనిట్ ఏమని స్పందిస్తుందో చూడాలి! కాగా కమిట్మెంట్ చిత్రాన్ని ఆగస్టు 19న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు. రచన మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్ 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. చదవండి: దుస్తులు లేకుండా రణ్వీర్.. అది సరైన పద్ధతి కాదన్న జాన్వీ కిడ్నీ ఫెయిలై మహాభారత్ నటుడు మృతి -
తేజస్వి మదివాడ 'కమిట్మెంట్' రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ నాలుగు కథలతో ఇంట్రస్టింగ్ మూవీ రాబోతోంది. రచన మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్ 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ”కమిట్ మెంట్”. ఇందులో తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సినిమా టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని సెన్సార్ సభ్యులతో ప్రశంసలు అందుకున్న ఈ మూవీని ఆగష్టు 19న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ బల్దేవ్ సింగ్, నీలిమ తాడూరి గారు మాట్లాడుతూ.. మా మంచి ప్రయత్నంగా ఈ సినిమా నిర్మించాం. మా సినిమా పనిచేసిన ప్రతి ఒక్క నటి నటులు టెక్నిషియన్ సపోర్ట్ చేసి మంచి అవుట్ పుట్ ఇచ్చారు. చదవండి: అమెరికా వెళ్లిన కమల్! 3 వారాలు అక్కడే.. ఎందుకో తెలుసా? శాడిస్టులు, బతికుండగానే నాకు సమాధి కడుతున్నారు.. -
మంచి మాట: ఆత్మ నిగ్రహం అసలైన బలం
మనస్సు చంచలమైనది. అది నిరంతరం ఏదో ఒక దానిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియాలకు అధీనమైపోతుంది. కామక్రోధాదులను బలపరుస్తుంది. అహంకార మమకారాలను వృద్ధి చేస్తుంది. ఈ క్రమంలో ఇంద్రియాలకు లాలసుడైన మనిషి విచక్షణను కోల్పోయి క్షణిక సుఖాలకు దగ్గర అవుతాడు. దీంతో అతని అభివృద్ధి నిలిచిపోయి అథః పాతాళంలోకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మనస్సును ఎప్పటికప్పుడు విమర్శ చేసుకొంటూ ఇంద్రియ వశం కాకుండా మంచి పనులు మాత్రమే చేయాలనే నిబద్ధతతో సత్సాంగత్యం తో మనసును అదుపులో పెట్టుకోవాలి. అలా మనస్సును అధీనంలో ఉంచుకోవడమే మనో నిగ్రహం. మనోస్థైర్యం దానికి ఆలంబన. 3చంచలమైన మనస్సును నిశ్చలంగా చేయడం సాధారణమైన విషయం కాదు. సామాన్యులకే కాదు, అత్యంత శూరుడైన అర్జునికి కూడా మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యం కాలేదు. యుద్ధంలో ప్రతిపక్షం మీద దృష్టి సారించి తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, గురుపుత్రుడు అశ్వత్థామ, దాయాదులైన కౌరవ సోదరులను చూసి విషాదంలో పడిపోయాడు. వారంతా తన స్వజనం కావడంతో యుద్ధం చేయడానికి అతనికి మనస్కరించలేదు. దాంతో అతని మనస్సు నిగ్రహాన్ని కోల్పోయింది. ధనుర్బాణాలు పక్కన పడేసి, నైరాశ్యంలో కూరుకుపోయాడు. ఇది గమనించిన శ్రీ కృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధానికి సన్నద్ధం చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 అధ్యాయాలుగా ఉండే భగవద్గీతను బోధించాడు. భౌతికమైనవి, తాత్వికమైనవి అనేకానేక విషయాలు తాను గురువుగా మారి అర్జునునికి బోధించాడు. దాంతో అర్జునుడు శత్రువులను సంహరించడానికి సిద్ధపడ్డాడు. అర్జునుడు మనోనిగ్రహాన్ని తిరిగి పొందడం వల్లనే తిరిగి తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. దీనినే మనం నిత్య జీవిత పోరాటంలో పాఠంగా మలచుకోవాలి. ఆ పాఠం మనల్ని సత్య సంధులుగా, న్యాయపరులుగా, నీతివేత్తలుగా తీర్చిదిద్దుతుంది. అందుకే భగవద్గీతను కంఠోపాఠంగా కాకుండా జీవన వెలుగు దివిటీగా చేసుకోమంటారు పెద్దలు. ప్రవరాఖ్యుడికున్నంత మనోనిగ్రహం అందరికీ ఉండాలన్నది శాస్త్ర వచనం. ప్రవరాఖ్యుడు ఒకసారి హిమాలయాలు చూడడానికి వెళ్ళాడు. సిద్ధుడిచ్చిన లేపనం అక్కడ కరిగి పోయింది. కష్టకాలం వచ్చింది. అక్కడ అమిత సౌందర్యవతి అయిన గంధర్వ కాంత కనిపించింది. ఆమెను దారి చెప్పమని ప్రవరాఖ్యుడు అడిగాడు. కానీ ఆమె అతనిని తనను వివాహమాడమని తియ్యని మాటలెన్నో చెప్పింది. ప్రవరాఖ్యుడు ఆమె మాటలకు చలించలేదు. అందాలు ఆరబోసి అతనిని రెచ్చగొట్టినప్పటికీ అతడు నిగ్రహాన్ని విడిచిపెట్టకుండా తన భార్యను, బంధువులను గుర్తు పెట్టుకున్నాడు. ప్రవరాఖ్యుడి వలెనే అందరూ మనో నిగ్రహంతో ముందుకు వెళ్ళాలంటోంది సనాతన ధర్మం. అయితే దీనిని భక్తిమార్గంలో నడవడం వల్లనే సులువుగా సాధించవచ్చు. మనో నిగ్రహం అలవడితే దివ్యశక్తి ఆవహిస్తుంది. సద్గుణ సంపన్నులు అవుతారు. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలు కలిగి, సమదృష్టి అలవడుతుంది. ఆత్మజ్ఞానాన్ని అవగతం చేస్తుంది. మనోనిగ్రహం ఆధ్యాత్మిక సాధనకు అత్యవసరం. లౌకిక విషయాల సాధనకు కూడా మనో నిగ్రహం అవసరం. అలాంటపుడే మనిషి సజ్జనుడిగా నలుగురిలో కీర్తింపబడతాడు. చంచల చిత్తమైన మనస్సును, విషయ లోలత్వం నుంచి మరల్చి ఆత్మయందే స్థాపితం చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండేటట్లు చేయాలని భగవద్గీతతో సహా ఇంచుమించు ఇతర మతగ్రంథాలన్నీ ప్రబోధించాయి. మనస్సును జయిస్తే చాలు. ముల్లోకాలను జయిస్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేవి అదుపులో ఉంటాయి. దుర్గుణాలు సద్గుణాలుగా మారి శాంతి సౌఖ్యాలనిస్తాయి. అయితే ఆత్మనిగ్రహానికి ఆత్మ స్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మస్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ప్రోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. దైవం పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకపోయినప్పటికీ తన పట్ల గురి, నమ్మకం ఉన్న వ్యక్తి ఆత్మస్థైర్య సంభూతుడే అవుతాడు. ప్రతిభ ఉండీ పిరికితనం వల్ల మనిషి చాలా పోగొట్టుకుంటాడు. ఆత్మస్థైర్యం మనిషి శక్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేస్తుంది. ఆత్మ స్థైర్యం ఓ బలవర్ధక పానీయం వంటిది. అది పిరికితనాన్ని పారదోలుతుంది. విద్యార్జనకు, ఆరోగ్యసాధనకు తోడ్పడుతుంది. భిన్నత్వం గల సమాజంలో ఏకతా భావన సాధించేందుకు తగిన బలాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక సాధన లో సైతం ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. అందువల్ల జీవితంలో ఉన్నత సోపానాలను అధిరోహించాలనుకునే ప్రతి వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటే ఆత్మనిగ్రహం దానికదే సొంతమవుతుంది. ఆత్మనిగ్రహానికి ఆత్మ స్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మస్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ప్రోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. – దాసరి దుర్గాప్రసాద్ -
పెద్ద సినిమాలో అవకాశం.. కమిట్మెంట్ అడిగారు : నటి
Actress Sneha Sharma Open Up On Casting Couch: సినీ ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. పైకి ఎంతో అందంగా కనపడినా బయటకి కనిపించని మరకలు ఎన్నో ఉంటాయి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ కల్చర్ గురించి ఇప్పటికే చాలామంది నటీమణులు ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఒకవిధంగా సినీ పరిశ్రమలో ఈ లైంగిక వేధింపులపై మీటూ ఉద్యమం కూడా పుట్టుకొచ్చింది. స్టార్ హీరోయిన్స్ నుండి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదిగే హీరోయిన్స్ వరకు ఎంతో మంది వారి వారి అనుభవాలను చెప్పుకున్నారు. తాజాగా నా ప్రేమ నాకు కావాలి ఇండిపెండెంట్ మూవీ హీరోయిన్ స్నేహా శర్మ తనకు ఎదురైన ఇబ్బందుల గురించి ఓపెన్ అప్ అయ్యింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో ఇలాంటివి నేను కూడా ఫేస్ చేశాను. కమిట్మెంట్ అడిగారు. నో చెప్పినందుకు సినిమాలోంచి తీసేశారు. అలా పెద్ద సినిమాల్లో కూడా అవకాశం కోల్పోయాను. అయినప్పటికీ అడుక్కు తిని అయినా బతుకుతా కానీ ఇలాంటి పనులు చేయను అని చెప్పేశాను. అయినా ఇక్కడ బలవంతాలు ఉండవు. మన మీద కూడా ఆధారపడి ఉంటుంది. అడిగేవాళ్లు అడుగుతారు. నిర్ణయం మాత్రం మనదే' అంటూ తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. -
ఆమెకు ప్రామిస్ చేస్తావా
మాట ఇవ్వడం.. ఒట్టు వేయడం... ప్రమాణం చేయడం... ప్రేమలో ఇవి అతి సులభం. అతి కష్టం. ఇవ్వడం సులభం. నిలబెట్టుకోవడం కష్టం. అబ్బాయి అమ్మాయి ప్రేమలోనే కాదు భార్యాభర్తల ప్రేమలో స్నేహితుల ప్రేమలో కూడా ఒకరి కోసం ఒకరు మాట ఇవ్వడం అవసరం. వాలెంటైన్ వీక్ నడుస్తోంది. ఇవాళ ప్రామిస్ డే. నేడు స్త్రీలు, యువతులు పురుషుల నుంచి కోరే ప్రామిస్‌లు ఏమిటి? పురుషులు ఆ మాత్రం ప్రామిస్ చేయలేరా? ప్రేమను నిలుపుకోలేరా? చాలా సినిమాల్లో, నవలల్లో ఒకటి చూస్తుంటాం. అమ్మాయి అబ్బాయిని ‘స్మోక్ చేయనని నాకు మాట ఇవ్వు’ అని అడుగుతూ ఉంటుంది. అబ్బాయి మాట ఇస్తాడు. అమ్మాయి సంతోషిస్తుంది. అమ్మాయిలు అబ్బాయిల నుంచి ప్రామిస్‌లు అడుగుతారు. దేనికి? వారి మంచికి. తద్వారా తమ మంచికి. తద్వారా ఇద్దరి మధ్య నిలవాల్సిన సుదీర్ఘ అనుబంధానికి. ఇవాళ తాము ప్రేమలో ఉన్న అబ్బాయిలతో అడిగే ప్రామిస్‌లు ఏమిటో తెలుసా? ► రాష్‌గా డ్రైవ్ చేయకు. ► డ్రింక్ చేసి డ్రైవ్ చేయకు. ► ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకు. ► కెరీర్ మీద ఫోకస్ పెడతానని మాట ఇవ్వు. ► నీ ఫ్రెండ్స్ నీ మంచితనాన్ని మిస్ యూజ్ చేసేలా చూడనని మాటివ్వు ► పొదుపు చేస్తానని చెప్పు ► ఫేస్బుక్లో ఎక్కువ సేపు ఉండనని మాటివ్వు ► గతంలోని నీ చేదు జ్ఞాపకాలన్నీ మర్చిపోతానని మాటివ్వు అమ్మాయిల ప్రపంచానికి అబ్బాయిల ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది. అబ్బాయిల ప్రపంచంలో తాను కోరుకునే అమ్మాయి కూడా ఉంటుంది. కాని అమ్మాయిల ప్రపంచంలో అబ్బాయి మాత్రమే ఉంటాడు. ప్రేమికుడు అయినా భర్త అయినా జీవన భాగస్వామి అయినా. అందుకే అమ్మాయిలు చిన్న చిన్నవే అయినా ఎన్నటికీ తప్పని ప్రామిస్‌లు కోరుకుంటారు. ► నా పుట్టినరోజు, మొదటగా పరిచయం అయిన రోజు, ఎంగేజ్మెంట్ రోజు, పెళ్లిరోజు... ఇలా నాకు సంబంధించిన ముఖ్యమైన రోజులన్నీ గుర్తు పెట్టుకోవాలి. ► నీ తల్లిదండ్రులను నేను గౌరవిస్తాను. నా తల్లిదండ్రులను నువ్వు గౌరవించాలి. ► నువ్వు ఎల్లప్పుడూ నా పట్ల నిజాయితీగా ఉంటూ నా కోసమే ఉండాలి. ► సమస్యలను ఇద్దరం కలిసి ఎదుర్కొనేలా ఉండాలి. ► నేను ఊహించని సమయాల్లో కానుకలు ఇస్తూ నన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి. ► నాకు చంద్రుణ్ణి తెస్తాను, డ్యూప్లెక్స్ కట్టిస్తాను అనే అబద్ధపు ప్రామిస్‌లు వద్దు. నువ్వు ఎంత చేయగలవో అది చేస్తానని ప్రామిస్ చెయ్. ► నా నుంచి నాకు తెలియాల్సిన విషయాలేవీ దాచొద్దు. ► నన్ను నీ జీవితం లో అతి ముఖ్యమైన మనిషిగా చూడాలి. గమనించి చూస్తే ఈ ప్రామిస్లన్నీ ప్రేమను, బంధాన్ని దృఢతరం చేసేవే. కాలం చాలా సుదీర్ఘమైనది. అది అనూహ్యమైన పరీక్షలు పెడుతుంటుంది. అబ్బాయి అమ్మాయి లేదా భార్యాభర్తలు ప్రతి రోజూ దగ్గరగా ఉండకపోవచ్చు. వృత్తి రీత్యా, ఉపాధి రీత్యా కొన్నాళ్లు దూరం ఉండాల్సి రావచ్చు. కాని ఇరువురూ కోరుకునేది మనం ఎంత దూరమైనా ఎప్పటికీ విడిపోము అనే ప్రామిస్నే. అమ్మాయి/భార్య అడక్క ముందే ‘నేను నువ్వూ దూరంగా ఉన్నాం. కాని మనం ఎప్పటికీ దగ్గరగా ఉంటామని నేడు నీకు ప్రామిస్ చేస్తున్నాను’ అని చెప్తే ఆ అనుభూతి వేరు. ‘నేను భోజనం చేసేశాను’ అని మనసు కు చెప్పుకున్నంత మాత్రాన నిజంగా భోజనం చేయకపోతే ఎలా కడుపు నిండదో ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని మనసులో అనుకున్నంత మాత్రాన ఆ ప్రేమ పెరగదు. పండదు. నోటితో చెప్పాలి. అందుకు ఈ ‘హ్యాపీ ప్రామిస్ డే’ లాంటి సందర్భాలు ఉపయోగపడతాయి. ‘మన నవ్వులు, సరదాలు, కోపతాపాలు, చిరాకులు, పరాకులు, కన్నీళ్లు, సంతోష సమయాలు, కలిసి ఉన్న ప్రతి క్షణం నాకు గుర్తే. నా పక్కన నువ్వు ఉన్నందుకు నాకెంతో సంతోషం. ఇలా ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉండేలా నేను మసలుకుంటాను. సంతోషంగా ఉంచుతాను’ అని ప్రామిస్ చేస్తే నోరు తెరిచి చెప్తే చెప్పినందుకు ఆ ప్రామిస్ ను నిభాయించాల్సిన కమిట్మెంట్ ఏర్పడుతుంది... విన్నందుకు ఆమెకు నిలదీసే హక్కూ వస్తుంది. ‘నేను ఎప్పటికీ నీవాడినే’ అని పురుషుడు చేసే ప్రామిస్ స్త్రీ ఎన్నిసార్లయినా వినడానికి ఇష్టపడుతుంది. ‘నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను’ అనే మాట కూడా. నిజానికి హ్యాపీ ప్రామిస్ డే రోజు పురుషుడి నుంచి స్త్రీ ఆశించే తప్పనిసరి ఒట్టు ఏమిటంటే ‘మన జీవితంలో ఉన్న ప్రస్తుత స్థితిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మనం ఈ స్థితి నుంచి ఇంకా మంచి స్థితికి వెళ్లేందుకు కలిసి పని చేద్దాం. నిరాశ, నిస్పృహలు, ఫిర్యాదులు, నిందించుకోవడాలు లేకుండా అవగాహనతో మరింత బాగా ఉండేందుకు ఏం చేయాలో చేద్దాం. నీ సలహాను నేను గౌరవిస్తాను. నా ఆలోచనను నువ్వు డిస్కస్ చెయ్. మంచి చెడ్డలు ఇద్దరం పంచుకుందాం’’. ఈ ప్రామిస్ పురుషుడు చేస్తే ఆ ప్రేమ, ఆ బంధం తప్పక ముందుకు సాగుతాయి. వృత్తి రీత్యా, ఉపాధి రీత్యా కొన్నాళ్లు దూరం ఉండాల్సి రావచ్చు. కాని ఇరువురూ కోరుకునేది మనం ఎంత దూరమైనా ఎప్పటికీ విడిపోము అనే ప్రామిస్నే. అమ్మాయి/భార్య అడక్క ముందే ‘నేను నువ్వూ దూరంగా ఉన్నాం. కాని మనం ఎప్పటికీ దగ్గరగా ఉంటామని నేడు నీకు ప్రామిస్ చేస్తున్నాను’ అని చెప్తే ఆ అనుభూతి వేరు. హ్యాపీ ప్రామిస్ డే. -
అలా చేస్తే కమిట్మెంట్ ఇస్తానని చెప్పా : నటి ఖుష్బూ
కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. తొలి సినిమాతోనే విక్టరీ వెంకటేష్‌తో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. వరుస సినిమాలతో అతి తక్కువ కాలంలోనే దక్షిణాదిన స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇక కోలీవుడ్‌లో ఖుష్బూకున్న స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెను ఎంతగానో ఆరాధించే అభిమానులు ఖుష్బూ కోసం ఏకంగా గుడి కూడా కట్టించారు. తమిళనాడులో గుడి కలిగిన తొలి హీరోయిన్గా ఖుష్బూ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలె తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి అనూహ్యంగా ఓడిపోయింది. తాజాగా తన సినీ కెరీర్‌పై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోయిన్గా ఉన్న సమయంలో తెలుగులో ఓ స్టార్ హీరో తనను కమిట్మెంట్ అడిగాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. స్టార్ హీరో అయి ఉండి అలా కమిట్మెంట్ అడిగేసరికి చాలా కోపం వచ్చిందని, దాంతో మీ కూతుర్ని నా తమ్ముడి గదిలోకి పంపిస్తే నేను కూడా కమిట్మెంట్ ఇస్తానని సదరు హీరోకు చెంప చెళ్లుమనిపించే ఆన్సర్ ఇచ్చిందట. ఖుష్బూ చెప్పిన సమాధానం విని ఆ హీరో షాక్ అయ్యాడని, ఇక అప్పటి నుంచి తామిద్దరి మధ్యా మాటలు లేవని ఖుష్బూ పేర్కొంది. అయితే తనను కమిట్మెంట్ అడిగిన ఆ స్టార్ హీరో పేరు చెప్పేందుకు మాత్రం నిరాకరించింది. దీంతో ఈ స్టార్ హీరో ఎవరు అయ్యింటారా అని నెటిజన్లు సందేహంలో మునిగిపోయారు. ఖుష్బూ తెలుగులో చేసింది కూడా తక్కువ సినిమాలే కావడం, వాటిలో కూతుళ్లు ఉన్న స్టార్ హీరోలు ఎవరుంటారబ్బా అని నెట్టింట సెర్చింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో ఖుష్బూ నటించిన చివరి సినిమా అజ్ఞాతవాసి. -
ప్రతి అమ్మాయి జీవితకథ
నలుగురు ఆడవాళ్ల జీవితంలోకి మగవాళ్లు ఎంటర్ అయిన తర్వాత వాళ్ల జీవితం ఏ విధంగా మారిపోయింది అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కమిట్మెంట్’. తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, రమ్య పసుపులేటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘హైదరాబాద్ నవాబ్స్’ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించారు. రచన మీడియా వర్క్స్ సమర్పణలో బల్దేవ్ సింగ్, నీలిమా .టి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘ఆడపిల్లలు కనపడితే కమిట్మెంటులు, కాంప్రమైజ్‌లు తప్ప ఇంకేమీ ఆలోచించరా’’ అంటూ తేజస్వి చెప్పే డైలాగ్‌తో టీజర్ సాగుతుంది. ఈ సందర్భంగా తేజస్వి మాట్లాడుతూ– ‘‘ప్రతి యాక్టర్ కెరీర్లో ఓ క్లిష్ట దశ ఉంటుంది. నేను కూడా అలాంటి స్టేజ్‌లో ఉన్నప్పుడు ఈ అవకాశం నా దగ్గరకు వచ్చింది. మళ్లీ నాకు సినిమాలపై ఇంట్రస్ట్ రావటానికి కారణం డైరెక్టర్ లక్ష్మీకాంత్గారే. ఇది కేవలం స్క్రిప్ట్ మాత్రమే కాదు, ప్రతి అమ్మాయి జీవితకథ’’ అన్నారు. అన్వేషి జైన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో తెలుగు నటీనటులతో కలిసి పనిచేయటం మంచి ఎక్స్పీరియన్స్. అన్ని అంశాలు కలగలిపి ఈ సినిమా ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది’’ అన్నారు. లక్ష్మీకాంత్ మాట్లాడుతూ– ‘‘అన్ని ఇండస్ట్రీల్లో అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కిన్ షో చేసి అమ్ముకోవాలని ఈ సినిమా చేయలేదు. కథను బలంగా నమ్మి తీసిన చిత్రమిది’’ అన్నారు. ‘‘అనిల్‌గారితో కలిసి ఈ సినిమా నిర్మించాను. దర్శకుడు చక్కగా తెరకెక్కించటంతో పాటు ప్రతి ఒక్కరూ బాగా నటించారు’’ అన్నారు నిర్మాత బల్దేవ్ సింగ్. ఈ చిత్రానికి సంగీతం: నరేష్ కుమరన్. -
తేజస్వి మడివాడ, అన్వేషి జైన్ గ్లామర్ ఫోటోలు
-
మీ చొరవ అసమానం
సాక్షి, హైదరాబాద్: లద్దాఖ్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి అత్యంత ఉదారంగా పునరావాస ప్యాకేజీని ప్రకటించడమే కాకుండా, సత్వరమే అందజేయడంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చూపిన చొరవను డిప్యూటీ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్ కొనియాడారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నెల 24న ఆయన లేఖ రాశారు. ఉన్నత ప్రమాణాలను నిర్దేశించారు.. ‘సంతోష్‌బాబు కుటుంబానికి ప్యాకేజీ ప్రకటించి, సత్వరంగా అందించడానికి మీరు చూపిన చొరవ అసమానమైనది. ఇతరులు అనుసరించడానికి ఉన్నతమైన ప్రమాణాలను నిర్దేశించింది. మాతృభూమి రక్షణ కోసం ప్రాణత్యాగానికి భారతీయ సైనికుడు ఎప్పుడూ భయపడడు అనేదానికి చరిత్రే సాక్ష్యం. జాతీయ యుద్ధ స్మారక వనంలో చెక్కిన అనేక మంది అమరవీరుల పేర్లు ఇందుకు నిదర్శనం. నా కార్యాలయానికి రోజూ వెళ్లే సమయంలో సౌత్‌బ్లాక్ కారిడార్లలో శౌర్య పురస్కారాలు అందుకున్న వీరుల చిత్రాలను చూస్తూ గర్వపడుతుంటాను. యుద్ధరంగంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా దేశం మా కుటుంబాలకు అండగా నిలుస్తుందని సైనికులకు మీరు నిలిపిన ఈ ప్రమాణాలు భరోసా ఇస్తాయి. అనుసరించడానికి ఉన్నతమైన ప్రమాణాలను నిర్దేశించింది. మాతృభూమి రక్షణ కోసం ప్రాణత్యాగానికి భారతీయ సైనికుడు ఎప్పుడూ భయపడడు అనేదానికి చరిత్రే సాక్ష్యం. జాతీయ యుద్ధ స్మారక వనంలో చెక్కిన అనేక మంది అమరవీరుల పేర్లు ఇందుకు నిదర్శనం. నా కార్యాలయానికి రోజూ వెళ్లే సమయంలో సౌత్‌బ్లాక్ కారిడార్ల లో శౌర్య పురస్కారాలు అందుకున్న వీరుల చి త్రాలను చూస్తూ గర్వపడుతుంటాను. యుద్ధరంగంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా దేశం మా కుటుంబాలకు అండగా నిలుస్తుందని సైనికులకు మీరు నిలిపిన ఈ ప్రమాణాలు భరోసా ఇస్తాయి. అమరుడైన ఓ సైనికుడి కుటుంబాన్ని ఓదార్చడానికి ఒక రాష్ట్ర సీఎం వందల కిలోమీట ర్లు ప్రయాణించడం అరుదైన విషయం. సంతోష్‌బాబు కుటుంబంతో పాటు ఆయన సహచరులైన మిగిలిన 19 మంది సైనికులు తెలంగాణవాసులు కాకపోయినా వారి పట్ల మీరు చూపిన ఆదరణ.. మీ నాయకత్వ లక్షణాలు, సైన్యం పట్ల మీ దృక్పథానికి, సహృద్భావానికి అద్దంపడుతోంది. ఈ విషయంలో మీ కుమార్తె కె.కవిత చూపిన చొరవ సైతం ప్రశంసనీయం’అని పవార్ తన లేఖలో పేర్కొన్నారు. కోరుకొండలోని సైనిక్ స్కూల్‌ను సందర్శించాలని సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. కల్నల్ సంతోష్ ఇక్కడి పూర్వ విద్యార్థి అని, ఇక్కడ తెలంగాణకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు. -
సఫారీ పర్యటనకు మాటివ్వలేదు: ధుమాల్
న్యూఢిల్లీ: ఆగస్టు నెలలో దక్షిణాఫ్రికాలో పర్యటించే అంశంపై సఫారీలకు తాము ఎటువంటి మాటివ్వలేదని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. కేవలం ద్వైపాక్షిక సిరీస్ నిర్వహణకు అందుబాటులో ఉండే అవకాశాల గురించి మాత్రమే చర్చించామని తెలిపారు. భారత్ తమ దేశంలో పర్యటించేందుకు ఒప్పుకుందని గురువారం పేర్కొన్న క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ వ్యాఖ్యలను ధుమాల్ కొట్టిపారేశారు. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు అమల్లో ఉన్నంత కాలం ఏ దేశంలోనూ తాము పర్యటించబోమని పునరుద్ఘాటించారు. -
ఈ ఆటో డ్రైవర్ రూటే సెపరేటు
సాక్షి, జహీరాబాద్ : మండలంలోని చిన్న హైదరాబాద్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బరూర్బాబు తన ఆటో ద్వారా ప్రజా ఉపయోగ కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అంతే కాకుండా తన ఆటోపై సమాజానికి ఉపయోగపడే సందేశాలను రాయించుకుని అందరిరికీ ఆదర్శంగా నిలిచారు. ఆటో ద్వారా పేదలకు సేవలు సైతం అందిస్తున్నారు. ఇచ్చినంతే తీసుకుని.. ముఖ్యంగా ఉచిత వైద్య శిబిరాలకు వెళ్లే రోగులు ఇచ్చినంతనే డబ్బు తీసుకుంటున్నారు. డబ్బులు ఇవ్వని వారికి వత్తిడి చేయడం లేదు. గ్రామంలో అర్ధరాత్రి అత్యవసర వైద్యం కోసం ఆటో అవసరం అయినా వెంటనే అంగీకరించి ఆస్పత్రికి చేర్చుతున్నాడు. ఇచ్చినంతమే డబ్బు తీసుకుంటున్నాడు. పేదరికంలో ఉన్న వారు డబ్బులు ఇవ్వకున్నా సేవలు అందిస్తున్నారు. రహదారిపై ఎవరైనా ప్రమాదాలకు గురైతే వెంటనే స్పందించి క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి చేర్చుతుంటాడు. హరితహారంలో నాటేందుకు అవసరమైన మొక్కలను సైతం తన ఆటో ద్వారా సుమారు 5 కిలో మీటర్ల వరకు నర్సరీ నుంచి ఉచితంగా సరఫరా చేస్తుంటాడు. ఎవరికైనా అత్యవసరంగా రక్తం అవసరం అయినా తన వంతు సహాయ పడతాడు. ఇందు కోసం అవసరమైన ఏర్పాట్లు సైతం చేసి శభాష్ అనిపించుకుంటాడు. తను పేదరికంలో ఉన్నా ఇతరుడు సహాయపడడంలో ఉన్న తృప్తి మరి దేంట్లో ఉండదంటారు బాబు. డ్రైవర్ వృత్తిని నిర్వహిస్తూ తనవంతు అయిన సహాయం చేయడంలో ముందుటాడు. -
‘మహా’ ఒప్పందంపై హర్షం
చిలుకూరు: అంతరాష్ట్ర నీటి ప్రాజెక్ట్‌పై మహారాష్ట్రతో ఒప్పందాలను కుదుర్చుకోవడాన్ని హర్షిస్తూ సీఎం కేసీఆర్ చిత్ర పటానికి బుధవారం స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది చారిత్రాత్మక ఒప్పందం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డైరక్టర్ కస్తూరి నర్సయ్య, మాజీ ఎంపీపీ దొడ్డా సురేష్‌బాబు, మండల పార్టీ అధ్యక్షుడు వట్టకూటి నాగయ్య, టీఆర్ఎస్ నాయకులు రాయళ్ల లక్ష్మీనారాయణ, మేకపోతుల శ్రీను, కడియాల వెంకటేశ్వర్లు, నెల్లూరి నాగేశ్వరరావు, మాదారపు శ్రీను, కస్తూరి వెంకటి, ఎంఎమ్ సాయి. కైలాసపు ఏడుకొండలు, భిక్షం తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మ తపన!
మరణం తర్వాత కూడా తన స్నేహితుల కోసం తపించే ఓ వ్యక్తి ఆత్మ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కమిట్మెంట్’. విజయ్శ్రీరామ్, నవీన్, రాధిక ముఖ్యపాత్రల్లో స్వామిచంద్ర దర్శకత్వంలో రాంబాబు పట్నాల నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘స్నేహం నేపథ్యంలో సాగే చిత్రమిది. సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. -
సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు
రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ‘మంచిరెడ్డి’ శతచండీయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు ఇబ్రహీంపట్నం రూరల్ : బీడు వారిన నేలలకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని, ఇబ్రహీంపట్నం ప్రజల కల నేరవేరుస్తారని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నా రు. తెలంగాణ రాష్ట్రం, ఇబ్రహీంపట్నం నియోజవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేపట్టిన మహా శత చండీయాగం 6వ రోజుకు చేరింది. ఈ యాగంలో పాల్గొనేందుకు రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, పత్రికాధిపతి చెరుకూరి రామోజీరావులు హాజరయ్యారు. సోమవారం రోజు ఉదయం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ప్రాతకాల పూజ, చక్రార్చన, అమ్మావారికి అభిషేకం, లక్ష్మీగణపతి జపాలు, అభిషేకం, వేదపారాయణం, నవగ్రహపూజలు, చండీ హోమం, యాగం చేపట్టారు. సాయంత్రం లక్ష బిల్వార్చాన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర హోం శాఖ మంత్రినాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ మానవ ప్రయత్నంతో పాటు భగవంతుడి ఆశీర్వాదాలు కావాలంటే ఇలాంటి హోమాలు, యాగాలు అవసరమన్నారు. తెలంగాణ రాష్ట్రం క్షేమంగా ఉండాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్లో యాగం చేపడుతున్నరని రని, ఇప్పటికే యాగం ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో పశుసంవర్దక శాఖ ఆర్జేడీ వరప్రసాద్‌రెడ్డి, ఏడీఏ వీనరంది, పట్నం ఎంపీపీ మర్రి నిరంజన్‌రెడ్డి, యాచారం జెడ్పీటీసీ రమేష్‌గౌడ్, నగర పంచాయతీ చైర్మన్ భరత్‌కుమార్, కౌన్సిలర్ ఆకుల యాదగిరి, యాచారం రవిందర్, ఎంపీటీసీ కొప్పు జంగయ్య , ఉప్పరిగూడ సర్పంచ్ పోరెడ్డి సుమతి అర్జున్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, జే రాంరెడ్డి, ప్రసాద్‌గౌడ్, బోసుపల్లి వీరేష్‌కుమార్, మాచర్ల శంకర్‌లతో పాటు వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు . -
జయశంకర్ సహకారంతోనే ఎదిగా
ఆచార్య దేవోభవ పురస్కార ప్రదాన సభలో ప్రొ. కోదండరాం హైదరాబాద్: నిబద్ధతకు మారుపేరుగా కీర్తిగడించిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పేరిట ఏర్పాటు చేసిన ‘ఆచార్య దేవోభవ’ పురస్కారాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆయన సహకారంతోనే ఎదిగానని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారంరాత్రి హైదరాబాద్‌లోని రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరిగిన జయశంకర్ జయంతి ఉత్సవాల్లో కోదండరామ్‌కు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ చలువతోనే తానింతటిస్థాయికి చేరినట్లు చెప్పారు. ఆయన సహకారంతోనే విద్యావంతుల వేదికకు అధ్యక్షుడు, రాజకీయ జేఏసీకి చైర్మన్‌గా నియమితులయ్యానన్నారు. నమ్మిన ఆశయాల కోసం జయశంకర్ నిబద్ధతతో పని చేసేవారని కొనియాడారు. రమణాచారి ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కోదండరామ్ విజయం సాధించారని, ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణానికి చేయూతనివ్వాలని కోరారు. కార్యక్రమంలో వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్తలకు నేనున్నా..
- నిబద్ధత కలిగిన నాయకులు పార్టీలో ఉన్నారు.. - ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి - మిగిలిన జిల్లాలకు - ఖమ్మం ఆదర్శం కావాలి - స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల శిక్షణలో వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, - ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం: ప్రతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రజా ప్రతినిధికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్తగూడెం క్లబ్లో జిల్లాలోని వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. రిటైర్డ్ డీఎల్పీవో క్రిష్టఫర్ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు వారి విధులు, నిధులు, హక్కులు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం జరిగిన ముగింపు కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో సుమారు 135 మంది ప్రజా ప్రతినిధులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారని, వీరిని అధికార, ఇతర పార్టీల నాయకులు ప్రలోభాలకు గురిచేసినప్పటికీ కేవలం 18 మంది మాత్రమే పార్టీని విడిచి వెళ్లారన్నారు. నిబద్ధత, నిజాయితీ కలిగిన ప్రజా ప్రతినిధులంతా తనవెంట, పార్టీలోనే ఉన్నారని గుర్తుచేశారు. బూర్గంపాడు, భద్రాచలం ప్రాంతాల్లో గెలుపొందిన ప్రజా ప్రతినిధులచే ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయించలేదన్నారు. ఈ విషయంపై తాము కోర్టుకు సైతం వెళ్లామని గుర్తుచేశారు. త్వరలోనే కోర్టు తీర్పు వస్తుందన్నారు. కొందరు ఇతర పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులను ప్రలోభపెడుతూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి నాయకులను చూస్తుంటే సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుందన్నారు. అధికారం, పదవులు శాశ్వతం కాదని, తనను ఎన్ని మానసిక ఒత్తిళ్లకు గురిచేసినా, మానసిక క్షోభ పెట్టినా పార్టీని విడిచిపెట్టేది లేదన్నారు. ఎంపీగా ఎన్నికైన తరువాత మొదటి దఫా వచ్చిన ఎంపీలాడ్స్ నిధులు రూ.5 కోట్లు ఎంపీటీసీలకు కేటాయించానని, రెండోసారి వచ్చే ఎంపీలాడ్స్ నిధులను ఇతర ప్రజా ప్రతినిధులకు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీగా ప్రజలు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ప్రజల రుణం తీర్చుకునేందుకు కృషి చేయాలి: పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులుగా గెలిపించినందుకు ప్రజల రుణం తీర్చుకునేందుకు కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని జిల్లా నలుమూలలా చాటి చెప్పారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు అసెంబ్లీ స్థానాలతోపాటు ఒక పార్లమెంట్ స్థానం గెలుచుకోవడం సామాన్య విషయం కాదన్నారు. ఎంపీగా ఎన్నికైన తరువాత పొంగులేటి గతంలో ఏ ఎమ్మెల్యే, ఎంపీ తిరగని విధంగా తిరుగుతున్నారు. వివిధ స్థానాల్లో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు మనం ఏ మేరకు పనిచేస్తున్నాం అని ప్రశ్నించుకోవాలని, శీనన్నను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలనే భావన కలగాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు వాటిని నెరవేర్చట్లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదన్నారు. ఆగస్టు 15న ఆర్భాటంగా ప్రారంభించినా జిల్లాలో దళితులకు భూమి పంచిన దాఖలాలు లేవన్నారు. జిల్లా వ్యాప్తంగా, మండలాల్లో దళిత సోదరులను సమీకరించి ఆందోళనలు చేయాలని వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులకు సూచించారు. గిరిజనులు, బీసీల సమస్యలపై మేనిఫెస్టోలో పొందుపరిచినా ఇప్పటివరకు వాటి ఊసే ఎత్తడంలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చుపెట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఎస్సార్సీపీని బలమైన పార్టీగా శీనన్న నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లాలని, ప్రతిరోజు పార్టీ కోసం రెండుమూడు గంటలు కేటాయించాలని, ప్రజలకు దగ్గరై ప్రజా నాయకులుగా ఎదిగితే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరిస్తారన్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను మాయమాటలు, మభ్యపెట్టి, ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి చేర్చుకున్నారని ఆరోపించారు. తనను సైతం ప్రలోభాలు పెట్టినా, ఇబ్బందులకు గురిచేసినా కమ్యూనిస్టు భావాలతో ప్రజా మనిషిగా, నీతి నిజాయితీకి కట్టుబడి బి-ఫాం తీసుకున్న పార్టీని అభివృద్ధి చేయాలని, పార్టీని నమ్ముకున్న ప్రజల కోసం పనిచేయాలని భావించి పార్టీలోనే కొనసాగుతున్నానన్నారు. అధికారం లేకపోయినా నమ్ముకున్న ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, మహిళలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో బలమైన శక్తిగా తెలంగాణలో వైఎస్సార్సీపీ ఎదుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు జె.వి.ఎస్.చౌదరి, షర్మిలా సంపత్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శి కొదమసింహం పాండు రంగాచారయ్యలు, పాలేరు, ఇల్లెందు, వైరా, మధిర నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు సాధు రమేశ్‌రెడ్డి, గుగులోత్ రవిబాబునాయక్, బొర్రా రాజశేఖర్, తూమాటి నర్సారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి భీమా శ్రీధర్, జిల్లా అధ్యక్షులు ఎం.డి.ముస్తఫా, జిల్లా అధికార ప్రతినిధులు మందడపు వెంకటేశ్వర్లు, గుండా వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యర్రంశెట్టి ముత్తయ్య, రైతు విభాగం, వాణిజ్య విభాగం, ఎస్టీ సెల్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఏలూరి కోటేశ్వరరావు, ధారా యుగంధర్, గుగులోతు బాబు, తోట రామారావు, పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి పులి రాబర్ట్ రామస్వామి, జిల్లా నాయకులు బండి సత్యనారాయణ, తూమాటి వెంకన్న, జూపల్లి రమేష్, జాలె జానకిరెడ్డి, కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిలర్లు భీమా శ్రీవల్లి, కంభంపాటి దుర్గా ప్రసాద్, తాండ్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
యంగ్ ఎట్ హార్ట్
చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరే క్రమంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. లక్ష్యాలను చేరుకున్నారు. పిల్లలూ జీవితంలో స్థిరపడ్డారు.పదవీవిరమణ పొందారు. ఇంకేం సాధించాలి? ‘ఇప్పుడే అసలు జీవితం మొదలైంది’ అంటున్నారు ప్రభాకర్ జైని. వరంగల్‌కు చెందిన ఈ నిత్యకృషీవలుడు... రిటైర్మెంట్ అంటే మరో పనికి కమిట్మెంట్ అంటున్నారు. సంబంధం లేని సినీ రంగంలో అడుగుపెట్టిన ఆయన.. వెండితెర ప్రస్థానాన్ని ఏబీసీడీలతో మొదలుపెట్టి.. విజ్ఞులు మెచ్చే విజయాలు నమోదు చేస్తున్నారు. నచ్చిన పనిలోనే విశ్రాంతి అంటున్న ప్రభాకర్ సిటీప్లస్‌తో పంచుకున్న విశేషాలివీ... వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా రిటైర్మెంట్కు రెండేళ్లకు ముందుగానే ఆఫ్టర్ రిటైర్మెంట్, లైఫ్ ఎలా ఉండాలో ప్లాన్ చేసుకుని, దర్శకత్వశాఖలో తెలుగు యూనివర్సిటీ నుంచి పీజీ డిప్లొమా పూర్తి చేశాను. సరొగసి ప్రక్రియకు గర్భాన్ని అద్దెకిస్తున్న వివాహిత మహిళల కష్టాలను తెరకెక్కిస్తూ ‘అమ్మా నీకు వందనం’ తీశాను. అది ఉత్తమ ప్రయోజనాత్మక చిత్రంగా భరతముని అవార్డ్ అందుకుంది. మలయాళంలోకి అనువాదం కానుంది. తర్వాతి ప్రయత్నంగా ప్రణయవీధుల్లో.. తీశా. శతాబ్దాల చరిత్ర ఉన్న రామప్ప గుడి శిల్పకళా చాతుర్యాన్ని, వైభవాన్ని చాటి చెబుతూ తీసిన చిత్రమిది. అంతకు ముందుగానే ‘హు కిల్డ్ మి’ అనే షార్ట్ ఫిల్మ్ కూడా తీశాను. రచన...ఓ వ్యాపకం... యువకుడిగా ఉన్నప్పటి నుంచి రాయడం అలవాటు. అవీ సమాజంలోని పలు సంఘటనల్ని, సమస్యల్ని ప్రస్తావిస్తూ సాగినవే. షేర్‌మార్కెట్ హర్షద్ మెహతా బూమ్ నేపథ్యంలో చోర్‌బజార్ పేరుతో డైలీ సీరియల్‌గా ‘రూపాయిలొస్తున్నాయ్ జాగ్రత్త’ రాశాను. అలాగే గమ్యం, కాలవాహిని, అలలవాలున పేరుతో పలు ప్రముఖ దినపత్రికల్లో సీరియల్స్ రాశాను. ఆంగ్లంలోనూ ది టార్గెట్-ఐఏఎస్, ది ఎయిమ్ నవలలు రాశాను. పద్య సంకలనాలూ రాశాను. అప్పట్లో పని ఒత్తిడి వల్ల రాయలేకపోయిన ఆలోచనలకు ఇప్పుడు అక్షర రూపం ఇస్తున్నాను. మరోవైపు నా చిత్రాలకు పాటలు, సంభాషణలు రాస్తున్నాను. అలాగే ఆంగ్లంలో రాసిన ఫేక్స్ నవల ప్రస్తుతం ప్రచురణ దశలో ఉంది. పై పుస్తకాలన్నీ ఒక ఎత్తయితే.. సినీ పరిశ్రమకు వచ్చిన స్వల్పకాలంలోనే చూసిన ఎన్నో విశేషాలు, అనుభవాలు ఏర్చి కూర్చి రాసిన ‘నా సినిమా సెన్సార్ పూర్తయిందోచ్’ ఒక ఎత్తు. ఇప్పటిదాకా సినీ పరిశ్రమకు సంబంధించి వెలుగులోకి రాని అంశాలెన్నో ఇందులో ప్రస్తావించాను. రాయడమే కాదు చదవడమూ ఎక్కువే. వరుసగా 3-4 నవలలు చదివేస్తాను. ఇప్పటిదాకా దాదాపు 5 వేల దాకా ఇంగ్లిష్ నవలలు చదివుంటాను. వయసునెలా జయిస్తున్నానంటే... అర్ధరాత్రి 2 గంటలకే నిద్ర లేచి 2 గంటల పాటు రాసుకుంటాను. ఆ తర్వాత 20 నిమిషాల పాటు కపాలభాతి, 30 నిమిషాల పాటు భస్త్రిక, సూక్ష్మ ప్రాణయామాలు చేస్తాను. తర్వాత ఓ గంట వాకింగ్ చేస్తాను. వీట్‌గ్రాస్ పౌడర్ విత్ వాటర్‌తో పొద్దున్నే తీసుకుంటాను. అరగంట తర్వాత నానబెట్టిన బాదం పప్పు, అక్రోట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటాను. మరో 2 గంటల తర్వాత యాకుల్ట్ (ప్రిబయోటిక్ డ్రింక్) సేవిస్తాను. జొన్న రొట్టె, వెజ్ కర్రీలతో 1 గంట సమయంలో లంచ్ పూర్తి చేస్తాను. గంట తర్వాత పవర్నాప్గా 15 నిమిషాల చిన్న కునుకు. సాయంత్రం 4 గంటల సమయంలో గ్రీన్ టీ, 6 గంటలకు మొలకెత్తిన గింజలు తీసుకుంటాను. మరో గంట తర్వాత వెజ్‌సూప్, ఫ్రూట్ స్క్వాష్ లేదా ప్రొటీన్ షేక్‌లతో డిన్నర్ ముగిస్తాను. రాత్రి 9 గంటలకల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్ర పోవాల్సిందే. అందుకే ఇంత ఎనర్జిటిక్‌గా ఉన్నాను.