ఫిబ్రవరి మాసం మొదలు కాగానే ‘‘గుండెల్లొ ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది...కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే’’ అంటూ ప్రేమగీతాలైపోతారు ప్రేమికులు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ దాకా ప్రేమే ప్రపంచంగా మారిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి మాసం ప్రేమికుల మాసంగా మారిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు
రోజ్ డేతో ప్రారంభమై , ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం వరకు లవ్‌బర్డ్స్ సందడి మామూలుగా ఉండదు. ప్రేమికుల వారంలో ఒక్కోరోజు ఒక్కో పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు. రోజ్ డే (ఫిబ్రవరి 7), ప్రపోజ్ డే (ఫిబ్రవరి 8), చాక్లెట్ డే (ఫిబ్రవరి 9), టెడ్డీ డే (ఫిబ్రవరి 10), ప్రామిస్ డే (ఫిబ్రవరి 11), హగ్ డే (ఫిబ్రవరి 12),, కిస్ డే (ఫిబ్రవరి 13), చివరిగా ఫిబ్రవరి14న వాలెంటైన్స్ డేతో సంబరాలు అంబరానికి చేరతాయి.
అయితే అసలు ప్రేమ అంటే ఏంటి? ఎలా పుడుతుంది? ఎపుడైనా ఆలోచించారా? రాబర్ట్ స్టెర్న్‌బర్గ్ ట్రయాంగిల్ థియరీ గురించి తెలుసా. త్రిభుజాకార సిద్ధాంతం (Triangular Theory) ప్రేమలోని మూడు భాగాలను ప్రతిపాదిస్తుంది. సాన్నిహిత్యం, వ్యామోహం, నిబద్ధతల కలయికలతో ఏడు రకాల ప్రేమలు పుడతాయని ఇదిచెబుతోంది. మనస్తత్వవేత్త రాబర్ట్ స్టెర్న్‌బర్గ్ ప్రకారం ప్రేమలు ఏడు రకాలు
లైకింగ్, ఇన్‌ఫాట్యుయేషన్, ఎంప్టీ లవ్, రొమాంటిక్ లవ్, కంపానియట్ లవ్, ఫటస్ లవ్, కంజుమేటివ్ లవ్
1999లో లెమియక్స్ , హేల్ అనే అండర్ గ్రాడ్యుయేట పరిశోధకులు తన అధ్యయనంతో స్టెర్న్‌బర్గ్ త్రిభుజాకార ప్రేమ సిద్ధాంతానికి మద్దతు ఇచ్చారు. మరుసటి సంవత్సరం, 2000లో వీరే ఇలాంటి మరో అధ్యయనాన్ని నిర్వహించారు, ఈసారి వివాహితులతో నిర్వహించిన స్టడీలో ఈ మూడు అంశాలు వారి మధ్య బంధాన్ని బలపర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ట్రాయింగిల్ థీయరీ పైనే 2009లో పరిశోధకుడు డెవెరిచ్ స్టెర్న్‌బర్గ్ సిద్ధాంతం ప్రకారం కౌమారదశలో ఉన్నవారు సంపూర్ణ ప్రేమలో ఉండగలరా లేదా అని తెలుసుకోవడానికి ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మూడు అంటే సాన్నిహిత్యం, వ్యామోహం, నిబద్ధతలలో లోపాల కారణంగా కౌమారదశలో ఉన్నవారు పూర్తిగా ప్రేమలో ఉండలేరని తేల్చారు.
న్యూరోసైన్స్ ప్రకారం మనుషుల్లో ప్రేమ భావన పెంపొందడంలో మెదడులోని రివార్డ్ సిస్టం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ లవ్ అనే ఫీలింగ్ కలిగినప్పుడు మెదడులో ఏం జరుగుతుందనే దానిపై హార్వర్డ్ మెడికల్ కళాశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మెదడులో విడుదలయ్యే కొన్ని రసాయనాల ఫలితమే ప్రేమ అని తేల్చి చెప్పారు. అలాగే న్యూయార్క్‌లోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెడికల్ కాలేజ్‌కి చెందిన బినాక అస్విడో రొమాంటిక్ లవ్‌పై పరిశోధనలో భాగంగా ప్రేమ మెదడులో ఎక్కడ ఉంటుందో తెలుసు కోవడానికి ప్రయత్నించారు. ఫలితంగా మెదడులోని వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా (వీటీఏ), న్యూక్లియస్ అకమ్బన్స్, వెంట్రల్ పల్లిడియం, రఫే న్యూక్లియస్ ప్రాంతాలు ఉత్తేజితమయ్యాయని ఎఫ్.మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ద్వారా తెలుసుకున్నారట.
ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్‌ప్రైజ్ గిప్ట్
మరో ఆసక్తికరమైన విషయం
మెదడులోని వివిధ భాగాల స్పందనను బట్టి ఈ ప్రేమ ఆరు రకాలుగా ఉంటుంది మరో అధ్యయనంలో తేలింది. ప్రేమకు సంబంధించిన ఐదు భాషలపై చాలా పరిశోధనలు జరిగాయి. కానీ ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ప్రేమలో ఆరు రకాలు ఉన్నాయని, ప్రతి ఒక్కటి మెదడులోని వేర్వేరు భాగాలనుయాక్టివేట్ చేస్తుందని గుర్తించారు. మానవ అనుభవం అంటే లైంగిక ఆరాధన నుండి తల్లిదండ్రుల లేదా పెంపుడు జంతువుల ప్రేమ లేదా ప్రకృతి ప్రేమ వరకు అనేక రకాల సందర్భాలను వివరించడానికి “ప్రేమ” అనే పదాన్ని ఉపయోగిస్తారు.
రొమాంటిక్ ప్రేమ
పేరెంటల్ ప్రేమ
స్నేహితుడిపై ప్రేమ
అపరిచితుడి పట్ల ప్రేమ
పెంపుడు జంతువు పట్ల ప్రేమ
ప్రకృతి పట్ల ప్రేమ
లవ్వో..గివ్వో.. ఐ వానా ఫాలో.. ఫాలో
ప్రేమకు ఎవరెన్ని నిర్వచనాలు చెప్పినా. అది వైయుక్తికం. ఎవరికి వారు అనుభవించి తీరాల్సిన మధురభావన. ప్రేమ అనంతమైనది. ప్రేమ మనిషికి,మనసుకు ఉల్లాసానిస్తుంది. లవ్వో గివ్వో.... రివ్వు రివ్వున సాగిపోవాలి.... ఒకరి హృదిలో ఇంకొకరు గువ్వలా ఒదిగిపోవాలి. ఎన్ని కష్టాలైనా, పరీక్షలైనా తట్టుకొని నిలబడాలి. ‘‘నాకు.. నువ్వు..నీకు నేనూ..’’ ఇదే తారక మంత్రం. నిస్వార్థంతో నిబద్ధతతో విశ్వాసంగా నిలబడితే అది పరిపూర్ణమైన ప్రేమ.
Comments
Please login to add a commentAdd a comment