Valentines Day
-
ఖరీదైన కారు చెత్త కుప్పలో... అసలు సంగతి తెలిసి విస్తుపోతున్న జనం
ప్రియురాలు అలిగితే ప్రియుడు గ్రహించి అలక తీర్చాలి. అది రూల్.అయితే పెళ్ళికి ముందు ఈ అలకలు ముద్దు..ముద్దుగా బాగానే ఉంటాయి. భార్యాభర్తలుగా మారిన తరువాతే అలకలు కాస్త చిరాకులు, పరాకులుగా, వివాదంగా మారిపోతాయి. అందుకే ‘‘అలుక సరదా మీకూ అదే వేడుక మాకూ..కడకు మురిపించి గెలిచేది మీరేలే’’ అంటూ కోప్పకుండానే తనమనసులోని మాట చెప్పేశాడు సినీకవి ఆరుద్ర. అలాగే అలిగిన భార్యను ఎలాగైనా బుజ్జగించాలనుకున్నాడో భర్త. తన ప్రేమసముద్రంలో లేచిన ప్రణయకలహానికి చెక్ పెట్టాలనుకున్నాడు. కానీ సీన్ సితార్ అయింది!అలిగిన తన భార్యకు వాలెంటైన్స్ రోజున ఖరీదైన బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఎలాగైన ఆమె ప్రేమను పొందాలనుకున్నాడు. బాగా ఆలోచిస్తే ఆమెకు కార్లంటే పిచ్చ ప్రేమ అని గుర్తొచ్చింది. అంతే క్షణం ఆలోచించకుండా లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ప్రేమికుల రోజున 27 లక్షల రూపాయల విలువ చేసే ఎస్‌యూవీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే అది ఆమెకు నచ్చలేదు. తిరస్కరించింది. దీంతో భర్తగారు బాగా హర్ట్ అయ్యాడు. వెంటనే లక్షల విలువైన కారును చెత్తకుప్పలో పడేశాడు. ఇంతకీ అంత ఖరీదైన కారు ఆమెకు ఎందుకు నచ్చలేదో తెలిస్తే.. ‘‘మొదట మగవారు వేస్తారు వేషాలు పెళ్ళి కాగానే చేస్తారు మోసాలు’’ అనిపించక మానదు.రష్యా స్థానిక మీడియా కథనాల ప్రకారం..రష్యా రాజధాని మాస్కో సమీపంలో మైటిష్చి పట్టణంలో ఓ జంటకు ఈ మధ్య విభేదాలొచ్చాయి. తగాదాలతో దూరంగా ఉంటున్నారు. దీంతో భార్యను ప్రసన్నం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మరో పయత్నం చేశాడు. ఖరీదైన పోర్షేకారును కొనుగోలు చేశాడు. అయితే యాక్సిడెంట్లో స్వల్పంగా డ్యామేజీ అయినా కారది. అలాంటి దానికి రెడ్ రిబ్బన్ కట్టేసి మేనేజ్ చేద్దామనుకున్నాడు. ‘సీతతో అదంత వీజీ కాదన్నట్టు’ ఆమె ఈ విషయాన్ని ఇట్టే పసిగట్టేసింది. పైగా కార్ల లవర్ కదా అందుకే దాంట్లోని లోపాన్ని చటుక్కున గుర్తించింది. హన్నన్నా.. ఇంతటి అవమానమా? అంటూ మండిపడింది. అందుకే మరి ఛీ... పొమ్మంది. ఇక ఏం చేయాలో తెలియక ఖరీదైన ఆ పోర్షేకారును తీసుకుపోయి పెద్ద చెత్తకుప్పలో పడేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. అసలా కారును చెత్తలో ఎలా పడేశాడు? కంటైనర్‌లో ఈ కారు ఎలా పట్టింది అనేది నెటిజన్లు మధ్య చర్చకు దారి తీసింది. దాదాపు రెండు వారాలుగా, పోర్స్చే కారు ఆ ప్రదేశంలోనే ఉండిపోవడంతో ఇది స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. ఫోటోలకు ఎగబడ్డారు. దీంతో ఆ ప్రదేశం టూరిస్ట్ ప్లేస్‌గా మారిపోయిందట. -
నిమిషానికి 607 కేకులు: ప్రేమికుల రోజు ఎక్కువ ఆర్డర్స్ అక్కడి నుంచే..
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్బంగా.. భారీగా కేక్ ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పటి వరకు అదే ఆల్ టైమ్ రికార్డ్ అని ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ సీఈఓ 'రోహిత్ కపూర్' వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వాలెంటైన్స్ డే రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి.. స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. గతంలో ఇప్పటి వరకు పొందనన్ని కేక్స్ ఆర్డర్.. ఆరోజు వచ్చినట్లు పేర్కొన్నారు. నొయిడాకు చెందిన ఒక వినియోగదారు ఏకంగా రూ. 25,335 విలువైన ఆర్డర్ పెట్టారు. ఆర్డర్లో థియోస్ నుండి తొమ్మిది కేకులు, ప్రీమియం పాటిస్సేరీ, చాక్లెట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా.. ''ప్రేమంటే ఇదే, దానిని పంచుకున్నప్పుడు అది పెరుగుతుంది” అని కపూర్ అన్నారు.One user from Noida today bought cakes worth ₹25,335! 9 cakes from Theos. Pyaar ho toh aisa, jitna baatoge utna badhega 🥰— Rohit Kapoor (@rohitisb) February 14, 2025స్విగ్గీ యాప్ నుంచి నిమిషానికి 607 కేక్ డెలివరీ జరిగాయి. అత్యధికంగా ఆర్డర్ చేసిన వాటిలో కేక్ మిల్క్ చాక్లెట్ ఉంది. బెంగళూరులోనే అత్యధికంగా కేకులు ఆర్డర్ చేసుకున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం ప్రేమ వేడుక చాలా మధురంగా ఉందని అన్నారు.Ludhiana, Amritsar, Shillong, Noida, and Agra are leading the charge with the biggest spikes in food deliveries tonight! Who said celebrating love is only a big city trend? 🧡— Rohit Kapoor (@rohitisb) February 14, 2025లూథియానా, అమృత్సర్, షిల్లాంగ్, నోయిడా, ఆగ్రాలలో వాలెంటైన్స్ డే రోజు ఫుడ్ డెలివరీ ఎక్కువగా జరిగింది. స్విగ్గీ బోల్ట్ తిరుపూర్‌లోని ఎన్ఐసీ ఐస్ క్రీమ్స్ నుంచి 3.4 నిమిషాల్లో ఆర్డర్‌ను డెలివరీ చేసింది. ఈ సందర్భంగా “వేడి వేడిగా ఉంటుంది, చలి చల్లగా ఉంటుంది.. కోరికలు ఎప్పుడూ వేచి ఉండాల్సిన అవసరం లేదు” అని కపూర్ వ్యాఖ్యానించారు.Fresh, fast, and right on time! Swiggy Bolt’s fastest order today was 3.4 minutes from NIC Ice Creams in Tirupur. Hot stays hot, cold stays cold, and cravings never have to wait. That’s Swiggy Bolt ⚡️— Rohit Kapoor (@rohitisb) February 14, 2025 -
ఈ–కామర్స్‌కు ‘ప్రేమోత్సవ్’!
సాక్షి, హైదరాబాద్: గులాబీలు, చాక్లెట్లు్ల, బంగారు ఆభరణాలు, టెడ్డీబేర్ బొమ్మలు, ప్రముఖులు రాసిన పుస్తకాలు.. ఇలా కాదేదీ ప్రేమ వ్యక్తీకరణకు అనర్హం అన్నట్లుగా సాగింది ఈసారి ప్రేమికుల రోజు. ఏటా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. గతంలో సమీపంలోని షాపునకు వెళ్లి పూలో, గ్రీటింగ్ కార్డులో కొని తమ మనసు గెలిచినవారికి ఇచ్చి శుభాకాంక్షలు తెలిపేవారు. కానీ, ఇప్పుడు ప్రతి వస్తువుకూ ఈ–కామర్స్ సైట్లవైపే చూస్తున్నాం కదా! ప్రేమికుల రోజున కూడా ప్రేమికులంతా ఈ సైట్లపైనే పడ్డారు. గులాబీలు, చాక్లెట్లు, అందమైన బొమ్మలు తదితర వస్తువులను ప్రేమికులరోజు (శుక్రవారం ) వివిధ ఈ–కామార్స్ సైట్లలో రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. ఆఫర్ల జోరు ప్రేమికుల రోజున జొమాటో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి ప్లాట్‌ఫామ్స్‌తోపాటు రెస్టారెంట్లు, ట్రావెల్ కంపెనీలు కూడా జతకలిసి లిమిటెడ్ ఎడిషన్ ప్రొడక్టులు మొదలు వివిధ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఐజీపీ, ఫ్లవర్ ఆరా ఫ్లడ్ వంటి గిఫ్టింగ్ ప్లాట్‌ఫామ్స్ పర్సనలైజ్డ్ మగ్స్, హార్ట్ షేప్ కుషన్లు, ఇతర కానుకలను పరిచయం చేశాయి. దేశీయ స్టార్టప్‌లు సైతం వివిధ రంగాలు, సెక్టార్లవారీగా పలు వస్తువులను వ్యాప్తిలోకి తెస్తున్నాయి. చివరకు ఇండిగో స్పెషల్ వాలంటైన్స్ డే సేల్‌ను ప్రకటించి డిస్కౌంట్ రేట్లపై జంటలు విమానాల్లో ప్రయాణించే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అ‘ధర’హో ఈ కామర్స్ సంస్థలు ప్రేమికులరోజు రష్ను బాగా నే క్యాష్ చేసుకున్నట్లు ఫెర్ష్న్ ఎన్పెటల్స్ వెబ్సైట్ పేర్కొంది. ప్రేమికుల రోజు ప్రత్యేకం పేరుతో పలు వస్తువులను అధికధరలకు అమ్మినట్లు తెలిపింది. పలు గిఫ్ట్ హ్యాంపర్ల ధర రూ.90 వేల పైచిలుకు ఉన్నది. పలు సైట్లలో చాక్లెట్ల ధరలు రూ.499తో మొదలై రూ.82,999 (ఐఫోన్ సహితంగా) వరకు ఉన్నాయి. డైసన్ ఎయిర్‌వ్రాప్ ఫ్యాన్సీ ప్యాకింగ్ హ్యాంపర్‌కు రూ.46,999కు విక్రయించారు. 14న తమ ప్లాట్‌ఫామ్స్‌పై విక్రయాల రికార్డులను పలు ఈ కామర్స్ సంస్థలు ప్రకటించాయి. » ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి 24 ఆర్డర్ల ద్వారా 174 చాక్లెట్లను రూ,29,844కు కొనుగోలు చేశాడు. » 14న పీక్‌టైమ్‌లో నిమిషానికి 581 చాక్లెట్లు, 324 గులాబీలకు ఆర్డర్ వచ్చినట్టు స్విగ్గీ ప్రకటించింది. » ప్రేమికుల రోజున 4 లక్షల గులాబీలకు ఆర్డర్లు పొందినట్లు ఎఫ్ఎన్బీ తెలిపింది. ఈ నెల ప్రారంభం నుంచి 13వ తేదీ వరకు 15 లక్షల గులాబీలు విక్రయించినట్లు వెల్లడించింది. » ఫిబ్రవరిలో మొదటి 11 రోజుల్లోనే యూనీకామర్స్ యూనీవేర్ ప్లాట్‌ఫామ్ కోటికి పైగా బహుమతి వస్తువుల (గిఫ్టింగ్ ఐటమ్స్)ను విక్రయించింది. -
Valentine's Day Special: టాలీవుడ్ బ్యూటిఫుల్ జోడీ రామ్‌చరణ్- ఉపాసన (ఫోటోలు)
-
ప్రియుడిపై కంప్లైంట్
-
కృతి శెట్టి వాలెంటైన్ వైబ్స్..వైట్ డ్రెస్‌లో ఇలా (ఫోటోలు)
-
విశాఖపట్నం : ప్రేమసాగరం ఆర్కేబీచ్లో ప్రేమికుల సందడి (ఫొటోలు)
-
Valentine's Day Special: వివాహబంధంతో ఒక్కటైన సినీ తారలు (ఫొటోస్)
-
Valentines Day: జాగ్రత్త భయ్యా... ప్రేమిస్తే..!
-
వారికి మాత్రమే వాలైంటెన్స్ డే.. మీకోసం కాదు: ఉపాసన పోస్ట్ వైరల్
వాలైంటైన్స్ డే సందర్భంగా మెగా కోడలు ఉపాసన కొణిదెల ఆసక్తికర పోస్ట్ చేసింది. ప్రేమికుల దినోత్సవానికి సరికొత్త అర్థం చెబుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఫిబ్రవరి 14 కేవలం వారికి మాత్రమేనని సరదా కొటేషన్ రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఉపాసన ఏం రాసిందో మీరు ఓ లుక్కేయండి. మెగా కోడలు ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ నవ్వులు తెప్పిస్తోంది. వాలంటైన్స్ డే అనేది కేవలం 22 ఏళ్ల లోపు ఉన్నవారికి మాత్రమే.. మీరు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు అయితే.. ఆంటీ దయచేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వరకు వేచి చూడండి' అని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. లవర్స్ డే రోజున ఉపాసన చేసిన ఈ సరదా పోస్ట్ నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది. -
బేగంపేట : హుషారుగా..డార్లింగ్స్ డే.. (ఫొటోలు)
-
చెల్లెలు కలిపిన బంధం..ఐపీఎస్ సుధీర్ రాంనాథ్ లవ్ స్టోరీ
ఆరు నెలల తర్వాత.. నా అభిప్రాయం చెప్పా.. ప్రపంచంలో ప్రతీజీవి తోడు కోరుకుంటుంది. ఆ తోడు కోరుకోవడంలో ఆచితూచి అడుగులు వేయడం కీలకం. కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రులు అంటే గౌరవం, బాధ్యతలు అన్నింటిని సరిచూసుకుంటూ.. నచ్చిన జోడీని ఎంచుకోవడం, అదికూడా ఆకర్షణ కాకుండా జీవితంగా భావించి.. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకునేందుకు సమయం తీసుకొని.. అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం అంటే.. ఒక మహాయజ్ఞంలాంటిదే. సరిగ్గా అదే జరిగింది మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్– ప్రియాంక దంపతుల ప్రేమ వివాహంలో. నేడు (శుక్రవారం) ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఐపీఎస్ సుధీర్ రాంనాథ్ కేకన్ తన ప్రేమ వివాహ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..– సాక్షి, మహబూబాబాద్నేను, ప్రియాంక ఒకరినొకరం ఇష్టపడిన విషయం ఇంట్లో తెలిసింది. కొన్నిరోజులు చర్చలు జరిగాయి. ముందుగా ప్రియాంక కుటుంబ సభ్యులు మా ఇంటికి వచ్చి మాట్లాడారు. కొంతసమయం తీసుకొని మా కుటుంబ సభ్యులు వారి ఇంటికి వెళ్లారు. పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ, నేను కొన్ని ఆంక్షలు పెట్టాను. ఆ సమయంలో నేను సివిల్స్ ప్రిపరేషన్లో ఉన్న. నేను సివిల్స్ సాధించిన తర్వాతే పెళ్లి అనుకున్నాం. విషయాన్ని ఇటు కుటుంబ సభ్యులకు, అటు ప్రియాంకకు చెప్పాను. నా ప్రతిపాదనకు అందరూ అంగీకరించారు. సివిల్స్ బాగా రాశాను. మంచి ర్యాంకు వస్తుందని చెప్పాను. అంతా సంప్రదాయం ప్రకారం లగ్నపత్రిక పెట్టుకున్నారు. పెళ్లికి 15 రోజుల ముందు సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఐపీఎస్‌కు సెలక్ట్ అయ్యాను. కుటుంబ సభ్యులు, మిత్రులు అభినందనలు తెలిపారు. ప్రియాంక ఫోన్లో అభినందనలు తెలిపినప్పుడు ఇద్దరి సంతోషం చెప్పలేను. ఆ తరువాత సంప్రదాయబద్ధంగా మా వివాహం జరిగింది. నేను అనుకున్నట్లు ఒకవైపు ప్రియాంకను, మరోవైపు ఐపీఎస్‌ను సాధించాను. ఇప్పటివరకు మా వైవాహిక జీవితం ఆనందంగా సాగుతోంది. మా ఇద్దరికి తోడు మా బాబు విరాజ్. ముగ్గురం సంతోషంగా ఉన్నాం.అవగాహన లేకపోతే బంధం గుదిబండనే..మనిషికి మహిళ తోడు అవసరం. వివాహం అనేది అందరి జీవితంలో కీలక ఘట్టం. దీనికి ఆచితూచి అడుగులు వేయాలి. ప్రేమ అనేది ఒక ఆకర్షణ కావద్దు. ఇద్దరి బంధమనుకోవాలి. ఒకరి భావాలు మరొకరు పంచుకుంటూ ఒక అవగాహనతో వెళ్లాలి. లేకపోతే ఇరువురి కుటుంబ సభ్యులకు గుది బండగానే ఉంటుంది. ఇష్టపడటం, అనుకున్న ల క్ష్యాలను సాధించి తర్వాత వివాహం చేసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. నేటి యువత ఈ దిశగా ఆలో చించాలి. కని పెంచిన తల్లిదండ్రులను గౌరవించాలి. అప్పుడే ఆనందంగా ఉంటుంది.నాన్న అంటే అందరికీ భయమే.. కానీ చెప్పక తప్పదు..ఒకవైపు చెల్లెలి ఫ్రెండ్. అప్పటికే ఆమె బీటెక్ చేసి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. నేను సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నా. నేనంటే ఇష్టమని ప్రియాంక చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. మొదట ఏమి చెప్పాలో తెలియలేదు. సివిల్స్ సాధనే నా లక్ష్యం. ఈ సమయంలో ప్రేమ ఏంది అనుకున్నా. నా అభిప్రాయం చెప్పేందుకు కొంత సమయం అడిగాను. ఆమె కూడా సరేనంది. మాది పెద్ద కుటుంబం. నాన్న అంటే ముగ్గురు అన్నలతోపాటు అందరికీ భయమే. కానీ, ఆయన మాత్రం మాతో సరదాగానే ఉంటూనే పద్ధతిగా ఉండాలని చెబుతారు.. ఇటువంటి పరిస్థితిలో ప్రియాంక ప్రపోజ్ చేసిన విషయం ఇంట్లో చెప్పలేను. అలా అని ఉండలేను. నాలోనే నేను ఆలోచనలో పడ్డా. ఆరు నెలల తర్వాత ప్రియాంకకు ఓకే అని నా అభిప్రాయం చెప్పాను.చెల్లెలు కలిపిన బంధంమా ఊరుకు 20 కిలోమీటర్ల దూరంలో మా పిన్ని కూతురు అత్తగారి ఇల్లు ఉంటుంది. మా చెల్లి అంటే అందరికి ఇష్టం. ఆమెకు కూడా మేం అంటే ప్రాణం. అందుకోసమే తరచూ నేను అక్కడికి వెళ్లేవాడిని. అక్కడ మా చెల్లి దగ్గరికి తన స్నేహితురాలు ప్రియాంక వచ్చేది. చెల్లిని కలిసినప్పుడు ఒకరోజు ప్రియాంకను పరిచయం చేసింది. ఆమె కూడా సరదాగా మాట్లాడేది. కానీ, అది ప్రేమగా మారుతుందని అనుకోలేదు. చూస్తూ ఉండగానే ఒకరోజు నేనంటే ఇష్టమని నా చెల్లెలికి చెప్పింది. ఈ విషయం చెల్లి నాకు చెప్పేందుకు తడబడినా.. చివరకు చెప్పింది. -
ప్రేమకు శ్వాస విశ్వాసమే- రకుల్
‘‘ఒక బంధం బలంగా సాగాలంటే ప్రేమ మాత్రమే సరిపోదు.. నమ్మకమూ ఉండాలి. ప్రేమకు శ్వాస విశ్వాసమే’’ అంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). జీవితంలో తాను అద్భుతమైన ‘ఫేజ్’లో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆ ఆనందానికి కారణం జీవిత భాగస్వామి జాకీ భగ్నానీ. బాలీవుడ్ నటుడు–నిర్మాత జాకీ భగ్నానీ(Jackky Bhagnani), రకుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2021లో ఈ ఇద్దరూ తమ ప్రేమ గురించి బయటపెట్టారు. 2024 ఫిబ్రవరి 21న పెళ్లి చేసుకున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో రకుల్ స్పెషల్ చిట్ చాట్ ... → మీరు, జాకీ ప్రేమలో ఉన్నప్పుడు జరుపుకున్న వాటిలో మరచిపోలేని ‘ప్రేమికుల దినోత్సవం’ గురించి చెబుతారా? మా ఇద్దరి కాంబినేషన్ (జాకీ నిర్మాత–రకుల్ హీరోయిన్)లో వచ్చిన మొదటి సినిమా ‘కఠ్ పుతలీ’ (2022). ఆ సినిమా అప్పుడే మేం ఫస్ట్ వేలంటైన్స్ డే జరుపుకున్నాం. మా డేటింగ్ మొదలైంది అప్పుడప్పుడే. ఓ హోటల్లోని గ్రీన్హౌస్ ఏరియాని జాకీ క్యాండిల్ లైట్ డిన్నర్‌కి తగ్గట్టుగా మార్పించాడు. ఒకవైపు గిటారిస్ట్‌లు పాడుతుంటే ఆ పాటలు వింటూ, ఆరోగ్యకరమైన విందుని ఆస్వాదించాం. జాకీ నా కోసం గులాబీ పువ్వులు, పుష్పగుచ్ఛాలు ఇచ్చాడు. అదొక అందమైన, ఆహ్లాదకరమైన రోజు. సో.. నాకెప్పటికీ ఆ వాలంటైన్స్ డే గుర్తుండి పోతుంది. → ఓ జంట మధ్య బలమైన బంధం ఉండాలంటే మీరు ఇచ్చే సలహాలు? పెద్ద టిప్ ఏంటంటే ‘నమ్మకం’. ఒకరి పట్ల మరొకరికి పూర్తి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే బలమైన బంధానికి పునాది వేస్తుంది. రిలేష్న్షిప్లో మంచి ష్రెండ్షిప్ ఉండటం చాలా ముఖ్యం. ఎప్పుడైతే భాగస్వామిలో మంచి ఫ్రెండ్‌ని చూస్తామో, అప్పుడు ఆ బంధం బలంగా ఉంటుంది. ఎవరికైనా జీవితం చాలా సునాయాసంగా సాగాలి... ఒత్తిడిగా కాదు. హ్యాపీగా సాగాలంటే నమ్మకం, విశ్వాసం, స్నేహం ముఖ్యం. → మీ ‘బెటర్‌హాఫ్’ జాకీ భగ్నానీ గురించి కొన్ని మాటలు... జాకీ నా జీవిత భాగస్వామి కావడం నిజంగా నా అదృష్టం.. తను నా సోల్‌మేట్ కావడం ఆనందం. మా ఇద్దరి ఆలోచనలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. మా ఇద్దరికీ ఉన్న పెద్ద తేడా ఏంటంటే నేను చాలా ‘హైపర్’, తను చాలా ‘కూల్’. నా హైపర్‌ని జాకీ ఎప్పుడూ విమర్శించింది లేదు సరికదా... పొగుడుతుంటాడు. అయినా ఒకరు హైపర్... మరొకరు కూల్... ఇలా ఉండటం కూడా బాగుంటుంది. బ్యాలెన్స్ అవుతుంది (నవ్వుతూ). నా పార్ట్నర్లో నేను బెస్ట్ ఫ్రెండ్‌ని చూశాను. మేం ఇద్దరం ఏ విషయం గురించైనా చాలా ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. ఏం చేయాలన్నా చేస్తాం. ఇక మేం ఒకరికొకరం ఇచ్చుకునే సపోర్ట్ చాలా గొప్పగా ఉంటుంది. అలాగే మేం మా పార్ట్నర్ కోసం మారాల్సిన అవసరం రాలేదు. పెళ్లికి ముందెలా ఉన్నామో ఆ తర్వాతా అలానే ఉన్నాం. అందుకే మేం ఇద్దరం అదృష్టవంతులం అంటాను.→ అయితే పెళ్లి తర్వాత మీరు మారాల్సిన అవసరం రాలేదంటారా? ఏ మార్పూ లేదు. అసలు ఒకరి జీవితం పెళ్లి కారణంగా ఎందుకు మారాలి? పెళ్లి తర్వాత జీవితం మెరుగవ్వాలి. నా లైఫ్ బెటర్ అయింది. పెళ్లికి ముందు నాకు నచ్చిన పనులు చేసినట్లే ఇప్పుడూ చేస్తున్నాను. ఫీలింగ్స్‌ని దాచేయకుండా షేర్ చేసుకునేంత స్వేచ్ఛ నా సోల్‌మేట్‌తో ఉంది. అందుకే జీవితం అందంగా, ఆనందంగా ఉంది. అర్థం చేసుకునే జీవిత భాగస్వామి లభించడం ఓ అదృష్టం. అర్థం చేసుకునే వ్యక్తి పక్కన ఉన్నప్పుడు జీవితంలోని ఆ దశ అద్భుతంగా ఉంటుంది.– డి.జి. భవాని -
వాలెంటైన్స్ డే: వెండితెరే ప్రేమలేఖ
‘ప్రేమ కోసమై వలలో పడెనె పాపం పసివాడు’ అని ‘పాతాళభైరవి’ సినిమా ప్రేమను వినిపించినా మనవారు తలకెక్కించుకోలేదు. ‘మల్లీశ్వరి’, ‘దేవదాసు’ ప్రేమకథల ట్రెండ్‌ను కొనసాగించలేదు. 1965 తర్వాతే ప్రేమ అనే మాట వెండితెర మీద ఎక్కువగా వినిపించింది. 1980ల నాటికి ప్రేమ సినీ ప్రేక్షకుల బ్లడ్గ్రూపుల్లో ఒకటిగా స్థిరపడింది. ‘మరో చరిత్ర’(Maro Charitra) ఇందుకు ఒక కారణమైతే ‘ప్రేమాభిషేకం’(Premaabhishekam) మరో కారణం. వాలెంటైన్స్ డే(Valentine Day) సందర్భంగా ప్రేమరీలు ఫ్లాష్‌బ్యాక్.‘మనసు గతి ఇంతే...’ అని ఆత్రేయ రాశాడుగాని ‘ప్రేమ గతి ఇంతే’ అని రాయలేదు. తెలుగు సినిమాల్లో చాలా కాలం ప్రేమకు బదులుగా ‘మనసు’, ‘మమత’ అనే మాటలే ఉండేవి. ‘మూగ మనసులు’, ‘తేనె మనసులు’... ప్రేమకథలే. వాటిని ‘మూగ ప్రేమలు’, ‘తేనె ప్రేమలు’ అనలేదు. ‘మల్లీశ్వరి’ కళాత్మక ప్రేమకథ. కానీ దాని సెట్టింగ్ వర్తమానంలో లేదు. ‘పాతాళభైరవి’ ప్రేమ కథే. అయితే అది జానపద కథై కూచుంది. ‘దేవదాసు’కు మించిన ప్రేమ కథ ఏముంది? ఇది వర్తమానంలో ఉన్నా సందేశం పరమ చేదైన నిషా కావడంతో ‘ప్రేమ’ మాటెత్తితే ఎక్కడ కుర్రాళ్లు దేవదాసులైపోతారోనని జనం దడుచుకునేవారు. తెలుగు సినిమా రంగం తన కథల్లో కుటుంబంలో ఉండే ప్రేమ గురించి, దాని చుట్టూ ఉండే డ్రామా గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టింది. దానికి కారణం ఇద్దరు సూపర్స్టార్లు ఎన్టీఆర్, ఏఎన్నాఆర్లు భిన్న పాత్రలు, కథాంశాలతో ముందుకు సాగుతుండటమే.అదీగాక ‘పెద్దలు కుదిర్చే పెళ్లి’ అనే భావన చాలా గట్టిగా ఉన్న కాలంలో ప్రేమను పదేపదే చెప్పడం కుదిరే పని కాదు. 1965లో ‘ప్రేమించి చూడు’ అనే టైటిల్ పెడితే పలకడానికి సంకోచించిన ఆడపిల్లలు ఉన్నారు. ఆ మాటెత్తితే చిర్రుబుర్రుమన్న పెద్దలు ఉన్నారు. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా అంత స్థాయిలో తెలుగులో ఆడలేదు. ‘ప్రేమనగర్’ (1971) అంటే ‘ప్రేమసౌధం’ కాబట్టి చెల్లుబాటయ్యింది. తాజ్‌మహల్ కాలం నుంచి ప్రేమసౌధాలు ఉన్నవే. అంటే వెండితెర మీద నుంచి ప్రేక్షకుల్లోకి ప్రేమ అంగీకారం పొందాలంటే చాలా కాలం పట్టింది.దశ మార్చిన ‘మరో చరిత్ర’వయసులో ఉన్న అమ్మాయి, అబ్బాయి... అదే వయసు హీరో హీరోయిన్లు... వారు ప్రేమలో పడ్డారు... జనం ఆశ్చర్యపోయారు. విగ్గులు, మేకప్ అవసరం లేని హీరో, హీరోయిన్లు కావడం వల్ల వారి ప్రేమ కాలానికి తగినట్టుగా ఉండటం వల్ల అందులోని సవాళ్లను వారు అసహజంగా కాకుండా సహజంగా ఎదుర్కొన్నారు కనుక ‘ప్రేమచరిత్ర’ (1978) సూపర్‌హిట్ అయ్యింది. ఇది తెలుగు ప్రేక్షకులకు ప్రేమరోగాన్ని గట్టిగా అంటించింది.1981లో మూడు సినిమాలు ‘ప్రేమాభిషేకం’. ‘సీతాకోక చిలుక’, ‘ముద్దమందారం’... తెలుగు నేల మీద ప్రేమదుమారం రేపాయి. ఈ సంవత్సరంతో తెలుగు సినిమాల్లో ప్రేమ ఒక గట్టి ఫార్ము లాగా స్థిరపడింది. అయితే తమిళం నుంచి డబ్ అయిన ‘ప్రేమ సాగరం’ (1983) పై సినిమాల్లో లేని ‘కాలేజీ’ని ఆకర్షణీయమైన పాత్రగా ప్రవేశపెట్టి కాలేజీ కుర్రాళ్లను ఐడెంటిఫై అయ్యేలా చేసుకోవడంతో తమిళంలో ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలుగులో కూడా అంతే పెద్ద హిట్టయ్యింది. ఇక ప్రేమ కథల జైత్రయాత్ర తెలుగులో మొదలైంది.గీతాంజలిఆ తర్వాత అందరు హీరోలు ఏదో ఒక ప్రేమ కథలో నటించారు. లేదా ప్రేమ కథాంశాలు వారికి లాభించాయి. చిరంజీవి ‘ఖైదీ’ (1983), బాలకృష్ణ ‘సాహసమే జీవితం’ (1984), నాగార్జున ‘మజ్నూ’ (1987), వెంకటేశ్ ‘ప్రేమ’ (1989).... ఈ వరుసలో మణిరత్నం ‘గీతాంజలి’ (1989) ప్రేమ నిప్పులోన కాలదు.. నీటిలోన నానదు అని నిరూపించింది.కొత్త పాయింటే సక్సెస్అన్నీ ప్రేమ కథలే. కానీ కొత్త పాయింట్ చెప్పినప్పుడల్లా హిట్ అయ్యాయి. ‘చంటి’ (1991), ‘గులాబీ’ (1996), తొలిప్రేమ (1998) ఇవన్నీ హిట్ అవగా 2000 సంవత్సరంలో వచ్చిన ‘నువ్వే కావాలి’... స్నేహితుల మధ్య కూడా ప్రేమ ఉండొచ్చు అని చెప్పి సూపర్ హిట్టయ్యింది. కొత్త తరం హీరోలు వచ్చాక నాటి నుంచి నేటి వరకు ఎన్నో హిట్ ప్రేమ కథలు ప్రేక్షకుల మధ్యకు వచ్చాయి. ‘జయం’, ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ’ఖుషీ’, ‘బొమ్మరిల్లు’, ‘అర్జున్ రెడ్డి’, ‘ఫిదా’, ‘గీత గోవిందం’, ‘ఉప్పెన’. ‘సీతారామం’, ‘నిన్ను కోరి’... ఇప్పుడు ‘తండేల్’ వరకు ప్రేమ కథకు తిరుగు లేదని నిరూపించాయి.నిజమే... ప్రేమ ఎంత మధురం. -
ప్రేమికులూ.. ఓటీటీలో ఈ సినిమాలు అస్సలు మిస్ అవొద్దు!
ప్రేమికుల రోజు (February 14 - Valentine's Day) చాలామందికి స్పెషల్. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూనో, కలిసి కాలక్షేపం చేస్తూనో సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమను వ్యక్తం చేయనివారు ఎలాగైనా ధైర్యం చేసి అవతలి వ్యక్తికి ప్రపోజ్ చేసేందుకు సిద్ధమవుతుంటారు. అసలు ప్రేమలోనే లేనివాళ్లు మేమెప్పుడూ ఆ జాబితాలో చేరుతామో ఏంటోనని నిట్టూర్పు విడుస్తారు. అయితే వీరందరినీ ఏకం చేసే శక్తి సినిమాకుంది. ప్రేమలో ఉన్నా, లేకపోయినా మీ మనసుల్ని మెలిపెట్టి, ఏడిపించి, నవ్వించి, గిలిగింతలు పెట్టే వెండితెర కథలు ఎన్నో.. అందులో కేవలం పదింటిని కింద ఇస్తున్నాం. ఇవి ఏయే ఓటీటీలో ఉన్నాయన్న వివరాలు కూడా పొందుపర్చాం. నచ్చితే మీరూ చూసేయండి..🎦 ఏ మాయ చేసావెజీ5, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో అందుబాటులో ఉంది.🎦 ఆనంద్హాట్స్టార్లో అందుబాటులో ఉంది.🎦 రాజా రాణిహాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.🎦 మళ్లీ మళ్లీ ఇది రాని రోజుహాట్స్టార్లో అందుబాటులో ఉంది.🎦 సీతారామంఅమెజాన్ ప్రైమ్‌లో ఉంది.🎦 మజిలీసన్ నెక్స్ట్, అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.🎦 ఆర్యసన్ నెక్స్ట్లో ఉంది.🎦 3నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.🎦 నువ్వొస్తానంటే నేనొద్దంటానాజియో టీవీ, సన్ నెక్స్ట్లో ఉంది.🎦 శ్యామ్సింగరాయ్నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.చదవండి: రెండుసార్లు ప్రేమ.. నరకం చూపించారు.. నా ఎగ్స్ దాచిపెట్టా: ఐశ్వర్య రాజేశ్భార్య వేధింపులు తాళలేక సింగర్ ఆత్మహత్య -
ఐఫోన్ కొనడానికి ఇదే మంచి సమయం: భారీగా తగ్గిన ధరలు
ప్రేమికుల రోజు(Valentine's Day)ను పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్ తన 'వాలెంటైన్స్ డే సేల్ 2025'ని ప్రారంభించింది. ఇందులో యాపిల్ ఐఫోన్ల మీద గొప్ప డిస్కౌంట్స్ ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి మొదలైన ఈ సేల్స్ 14 వరకు కొనసాగుతుంది.ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్ 2025లో.. డిస్కౌంట్స్ లభిస్తున్న ఐఫోన్లలో.. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 14 వంటివి ఉన్నాయి.ఐఫోన్ 16 ప్లస్ ఇప్పుడు రూ. 11,000 తగ్గింపుతో.. రూ. 78,999 వద్ద లభిస్తుంది. ఇది కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ. 5,000 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. అంటే రూ. 74000కు లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా ఇంకా తగ్గింపు లభిస్తుంది.ఐఫోన్ 15 ధర రూ.64,999 నుంచి ప్రారంభమవుతుంది.. ఐఫోన్ 15 ప్లస్ రూ.68,999 కు లభిస్తుంది. ఐఫోన్ 14 మోడల్ రూ.53,999 ధరకు లభిస్తుంది. కేవలం ఫ్లిప్‌కార్ట్ మాత్రమే కాకుండా.. వివిధ ఈ కామర్స్ వెబ్సైట్లు కూడా కొన్ని ప్రత్యేకమైన ఉత్పత్తుల మీద మంచి ఆఫర్స్ అందిస్తాయి. ఇందులో కేవలం మొబైల్ ఫోన్స్ మాత్రమే కాకుండా.. ఇతర ఎలక్ట్రానిక్స్, బట్టలు, ఇతర వస్తువులు ఉంటాయి. -
వాలెంటైన్స్ డేకి మీ ఇష్టసఖిని ‘ది బెస్ట్’తో సర్ప్రైజ్ చేయండిలా.. (చిత్రాలు)
-
Valentines Day: అమ్మను ప్రేమిద్దామా..!
ప్రేమించిన ప్రియుడితో ఎప్పుడెప్పుడు తన మనసులోని మాటను చెబుదామని అమ్మాయి...ఎన్నాళ్ల నుంచో దాచుకున్న ప్రేమనంతా ఈ వాలెంటైన్స్ డే రోజున బయటపెట్టాలని అబ్బాయి..ఇలా కుర్రకారు తహతహలాడిపోతుంటుంది. నిన్న మొన్న వచ్చిన ఇలాంటి ప్రేమల కన్నా..ఈ భూమ్మీదకు తీసుకువచ్చి..ప్రాణాలన్నీ మనమీదే పెట్టుకుని బతికే అమ్మ ప్రేమను ఇలాంటి రోజును గుర్తు చేసుకుందాం. ప్రేమకు ప్రతిరూపం అమ్మ..అంటారే అలాంటి అమ్మ ప్రేమకు సాటిలేదు ఏ ప్రేమ. మనం ఎలా ఉన్నా..ఇష్టంగా లాలించే దేవత ఆమె. మనం పుట్టక ముందు నుంచి ప్రేమిస్తూ..మన ఆలన పాలనా కోసం ఎన్నో త్యాగాలు చేసి ఆ దేవతకు ఈ పవితమైన రోజున..మన గుండెల్లోని ప్రేమనంతా ఈ విధంగా తెలుపుదామా..!.ఈ వాలెంటైన్ డే రోజున అమ్మ కళ్లు నులుముకుంటు నిద్రలేచేసరికి ఎదురుగా ఆమె ముందు నిల్చుని చూడండి. ఎప్పుడూ తానే మనల్ని నిద్రలేపే ఆమె ముందు గనుక మనమే ముందు లేచి ఎదురుగా ఉంటే కొంచెం తత్తరపాటు తోపాటు ఏంటా అని కచ్చితంగా కంగారుపడుతుంది. ఎందుకంటే అమ్మ కదా..? మనం ఏదైనా టెన్షన్లో ఉన్నామా..? లేక బాధగా ఉన్నామా..? అని భయపడుతుంది. కాస్త అనుమానంగా నటిస్తూ..విష్ చేస్తూ నవ్విచండి..ఏదో అయిపోతుందా రా ఈ రోజు అంటూ నవ్వేస్తుంది. మనం ఇష్టపడ్డ అమ్మాయి లేదా అబ్బాయికి ప్రపోజ్ చేయడం కాదు. మనల్ని ఇన్నాళ్లు సాకి, ఎన్నో ఒడుదుడుకులు, కష్టాలను దిగమింగిన మన అమ్మకు I Love You Maa అంటూ ప్రపోజ్ చేయండి. ఆమె పైకి కోపం నటించినా..ఈ విషయం అంతా చుట్టుపక్కల వాళ్లతో గొప్పగా చెప్పుకుని తప్పక ఆనందిస్తుంది. అలాగే రోజూ ఎప్పుడు చివరగా మిగిలిపోయింది తినే ఆమెకు..కనీసం ఈరోజునైనా మనం ఆ అవకాశం ఇవ్వకుండా ఏదైనా చేసిపెట్టండి. లేదా కనీసం ఆమె చూడని వెరైటీ స్వీట్ లేదా చాక్లెట్‌తో నోటిని తీపి చెయ్యండి. మనల్ని ఆడించడాని అమ్మ బొమ్మగా మారిన రోజులను గుర్తు తెచ్చుకుంటూ..ఆమె చిత్రంతో పెయింట్ చేసిన గ్లాస్ లేదా టెడ్డీ బొమ్మల గిఫ్ట్‌గా ఇవ్వండి. ఆమె కోసం కాదు..మన కోసమే. ఎందుకంటే..బిజీ బిజీ లైఫ్‌లతో అమ్మ ప్రేమను మర్చిపోతున్న మనకు ఇలాంటి రోజునైనా అలనాటి స్మృతులను గుర్తు తెచ్చుకునేలా సెలబ్రేట్ చేసుకునేందుకు. ప్రతి అమ్మకి తన బిడ్డకు మించిన గొప్ప బహుమతి ఉండదు. అయినా ఆమె మననుంచి ఆశించదు కూడా. అలాగే కడ వరకు తనకు మంచి బిడ్డగా ఉంటాననే భరోసా ఇవ్వండి. ఆమెకు రెక్కల్లొస్తే ఎగిరిపోయే పక్షులం కాదు..నాకోసం ఆహర్నిశలు శ్రమించిన నిన్ను ఎన్నటికీ మర్చిపోను అనే నమ్మకం కలిగించండి. చిన్నప్పుడు అందంగా రెడీ చేసి..బుగ్గన దిష్టి చుక్కగా కాటుక పెట్టి మురిసిపోయే ఆ అమ్మను ఈ రోజున మనం రెడీ చేద్దాం. ఎలా ఉన్నా.. ఎవరి అమ్మ వారికి అందం, ఇష్టం ఉంటాయి కదా..!. అందుకే ఈరోజున నాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అమ్మ నుదిటిని ముద్దాడదాం. అలాగే చిన్నప్పుడు మనం భయపడినా..పరీక్షలప్పుడూ పాసవ్వుతానా? లేదా..? అన్న టెన్షన్ పడుతున్నప్పడు అమ్మ మనల్ని దగ్గరకు తీసుకుని హత్తుకుని ధైర్యం చెప్పేది కదా..అది గుర్తుతెచ్చుకుని మరీ వయసు మళ్లినా.. నీ చేయి ఎన్నటికీ వదలను అనేట్టుగా ఆమెను ఆలింగనం చేసుకోండి. చివరిగా వీటిలో ఏ ఒక్కటి మనం చేసినా..అమ్మ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఆమె మనకిచ్చిన అనంతమైన ప్రేమలో రవ్వంతైనా తిరిగిచ్చే ప్రయత్నం చేద్దామా..!. నిజానికి అమ్మ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మ సరిపోదు. ఆ దేవతకు ప్రేమను ఇవ్వడమే గానీ తీసుకోవడం తెలియదు. ఆమె ప్రేమే మనకు సంజీవని, శ్రీరామ రక్ష. అలాంటి అమ్మకు ఈ రోజున మర్చిపోలోని ఆనందం కలిగేలా ప్రేమిద్దాం. ప్రస్తుత ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో ప్రేమను వ్యక్తం చేసే సావకాశం కూడా లేని ఈ పరిస్థితుల్లో ఇలాంటి రోజుని మిస్ చేయకుండా ఉపయోగించుకుందాం. -
ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి.. హ్యాపీగా ఫీలయ్యా: శివ కార్తీకేయన్
ప్రతి వ్యక్తికి ఓ లవ్ స్టోరీ ఉంటుంది. కొంతమంది ప్రేమలో సక్సెస్ అయితే..మరికొంతమందికి విఫలం అవుతారు. అయితే సక్సెస్ అయినా కాకపోయినా సరే ఫస్ట్‌లవ్ అనేది ఓ మధుర జ్ఞాపకం. మొదటగా ప్రేమించిన అమ్మాయి/ అబ్బాయిని మర్చిపోలేం. అందరిలాగే తాను కూడా తన ఫస్ట్‌లవ్‌ని మర్చిపోలేనని అంటున్నాడు తమిళ హీరో శివకార్తీకేయన్(Sivakarthikeyan ). ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు శివకార్తికేయ. రీసెంట్గా ‘అమరన్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన లవ్‌స్టోరీని చెప్పుకున్నాడు. తన ఫస్ట్‌లవ్ విఫలమైందని చెప్పారు. ‘కాలేజీ డేస్‌లో ఒక అమ్మాయిని ప్రేమించాను. నాది వన్‌సైడ్ లవ్. ఆమెను కలిసి నా ప్రేమను వ్యక్తం చేయలేదు. కానీ దూరంగా చూస్తూనే ప్రేమించాడు. ఓ సారి ఆమె తన ప్రియుడితో కలిసి వెళ్లిపోవడం చూశాను. అప్పటి నుంచి ఆమెను చూడలేదు. నా ప్రేమ విషయం చెప్పకుండానే విఫలం అయింది. చాలా రోజుల తర్వాత ఓ షాపింగ్ మాల్లో ఆమెను మళ్లీ చూశాను. అప్పటికే ఆమెకు పెళ్లి అయింది. అయితే ఆమె పెళ్లి చేసుకున్నది ముందు ప్రేమించిన వ్యక్తి కాదు. వేరే అబ్బాయితో పెళ్లి జరిగిపోయింది. అది చూసి ‘మనకు దొరకని అమ్మాయి అతనికి కూడా దొరకలేదు(నవ్వుతూ..)’ అని సంతోషించాను’ అని శివకార్తీకేయ తన ఫెల్యూర్ లవ్‌స్టోరీని చెప్పుకొచ్చాడు.కాగా శివ కార్తికేయన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. 2010లో ఆర్తిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ జంటకి 2013లో కూతురు ఆరాధన, 2021లో కుమారుడు గుగన్ దాస్ జన్మించారు.సినిమాల విషయానికొస్తే.. శివ చేతిలో ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ఒక సినిమాకు ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా టైటిల్ ఫిబ్రవరి 17న నటుడు శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదల కానుంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన రుక్మిణి వసంత నటిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు సుధా కొంగర దర్శకత్వంలో ‘పరాశక్తి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శివకార్తీకేయన్ తో పాటు శ్రీలీల, అథర్వ, రవి మోహన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ప్రేమానుగ్రహం రాశిపెట్టుందా?
జన్మ జాతకం ఎలా ఉన్నా ప్రేమ జాతకం బాగుంటే మంచి ఆత్మిక భాగస్వామి దొరుకుతారు. సవాళ్లు విసిరే జీవితంలో ప్రేమ నిండిన బంధం చాలా అవసరం. స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ వారిని ఉత్సాహంగా ముందుకు నడవడానికి కారకం అవుతుంది. జీవితాన్ని అర్థవంతం చేస్తుంది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే. సౌరమానం ప్రకారం ఆ రోజు దిన ఫలితాలు ఇక్కడ ఇస్తున్నాం. ఈ ఫలితాలు సంవత్సరమంతా ప్రభావం చూపిస్తాయి...మేషం (21 మార్చి–19 ఏప్రిల్)ఈ రాశి వారికిప్రాకృతిక శక్తి సహకరిస్తుంది. అంగారక గ్రహ ప్రభావం వలన ప్రేమ వృద్ధి చెందుతుంది. వీరు తాము ప్రేమించినవారి కోసం ఏదైనా ప్రత్యేకమైన ఫంక్షన్ ఏర్పాటు చేసి వారి మన్ననలు అందుకుంటారు. చాలా రొమాంటిక్ గా కాలం గడుస్తుంది. ఈ రాశి ప్రేమికులు ఈ సంవత్సరం దంపతులవుతారు. దంపతులుగా ఉన్నవారు తల్లిదండ్రులవుతారు.వృషభం (20 ఏప్రిల్– 20 మే)శుక్ర గ్రహ ప్రభావం వల్ల రొమాంటిక్ భావాలు పెరుగుతాయి. ప్రేమించిన వారి పట్ల ప్రేమ ఆప్యాయతలు అధికమవుతాయి. స్థిరపడుతాయి. ప్రేమ విషయంలో కొత్త విధానాలు అవలంబిస్తారు. ఆ కొత్త విధానాల వలన ప్రేమ సఫలీకృతం అవుతుంది. పెద్దలు మీ ప్రేమను అంగీకరిస్తారు. ఈ సంవత్సరం మంచి జీవితాన్ని గడుపుతారు.మిథునం (21 మే– 20 జూన్)బుధ గ్రహ ప్రభావం వల్ల మీరు ప్రేమించిన వారి పట్ల ప్రేమను సూటిగా చక్కగా అర్థవంతంగా తెలుపగలుగుతారు. మీ మాటలకు మీరు ఇష్టపడినవారు ప్రభావితులవుతారు. మిథునం అంటేనే జంట, ఈ సంవత్సరం ప్రేమికుల జంట పంట పండినట్టే. ఆదర్శమైన జంటగా పేరు పొందుతారు.కర్కాటకం (21 జూన్– 22 జూలై):చంద్ర గ్రహప్రభావం వల్ల మీలో ప్రేమాభిమానాలు ఉప్పొంగి మీ ప్రేమికుల పట్ల సుహృద్భావం కలిగిస్తుంది. వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. చిన్న నాటి స్నేహితులను కలుసుకుంటారు. గతంలో తెగిన బంధాలు ఇప్పుడు అతుకుతాయి.సింహం (23 జూలై– 22 ఆగస్టు)సూర్యగ్రహ ప్రభావం వల్ల మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీరు ప్రేమించినవారికి ఆకర్షించగలుగుతారు. అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు. మీ ప్రేమను స్పష్టంగా తెలియజేయగలుగుతారు. ఈ సంవత్సరం మీకు తిరుగు ఉండదు. అన్నిటిలో విజయమే లభిస్తుంది. మీ ప్రేమ ఫలిస్తుంది.కన్య (23 ఆగస్టు– 22 సెప్టెంబర్)ఆత్మ పరిశీలన చేసుకొని సంబంధ బాంధవ్యాలను విశ్లేషిస్తారు. మీ భావాలను బాగా తెలియజేస్తారు. ప్రేమికుల మధ్య బంధాలు బలపడతాయి. ఈ సంవత్సరం మీకు మహోన్నతంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు. చేతిలో ధనం బాగా నిలుస్తుంది. దైవబలం మీకు తోడుగా ఉంది.తుల ( 23 సెప్టెంబర్- 22 అక్టోబర్)శుక్ర గ్రహ ప్రభావం వల్ల ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాల సమతుల్యత పెరిగి ప్రేమ వికసిస్తుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, డిమాండ్లు తగ్గుతాయి. ప్రేమికులు సామరస్యంగా ఉంటారు. ప్రేమలోను, వ్యాపార రంగంలోను మీదే పైచేయి అవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. నూతన వ్యాపారాలు ఈ సంవత్సరంప్రారంభించి లాభాలు పొందుతారు.వృశ్చిక (23 అక్టోబర్– 21 నవంబర్)అంగారక ప్రభావం వల్ల ప్రేమాభిమానాలు వృద్ధి చెందుతాయి. మీరు ప్రేమించిన వారిని ఈ రోజు మీరు అయస్కాంతంలా ఆకర్షిస్తారు. లోతైన ప్రేమ గొప్ప అనుభవాలను తీసుకొస్తుంది. ఈ సంవత్సరం మీ కష్టాలు తొలగిపోయి, ఆనందం ఐశ్వర్యం లభిస్తాయి. మీరు చాలా సంతోషంగా ఉంటారు.ధనుస్సు (22 నవంబర్- 21 డిసెంబర్)గురు గ్రహ ప్రభావం వల్ల మీలో ఆశావాదం పెరుగుతుంది. దాంతో సాహస ప్రవృత్తి పెరిగి అది ప్రేమించినవారిని ఆకర్షించి కట్టిపడేసేలా చేస్తుంది.. ఆనందం వెల్లివిరుస్తుంది. సింగిల్‌గా ఉన్నవారికి ఈ సంవత్సరం మంచి ప్రేమైక భాగస్వామి తారసపడతారు. ఈ సంవత్సరం గొప్ప అభివృద్ధిని సాధిస్తారు. ప్రేమించిన వారి వల్ల మంచి జరుగుతుంది.మకరం (22 డిసెంబర్–19 జనవరి)శనిగ్రహ ప్రభావం వల్ల మీ ప్రేమ వ్యవహారం బలపడుతుంది. ప్రేమలో మీరు గతంలో ఇచ్చిన మాట, హామీలు నెరవేరుస్తారు. సింగిల్‌గా ఉన్నవారికి తగిన జోడు లభిస్తుంది. స్త్రీ వల్ల పురుషులు, పురుషుల వల్ల స్త్రీలు లాభం పొందుతారు. ఈ సంవత్సరం ఏలిననాటి శని తొలగి గొప్ప ఉన్నతిని సాధిస్తారు.కుంభం (20 జనవరి– 18 ఫిబ్రవరి)శుక్ర, యురేనస్ గ్రహ ప్రభావం వల్ల రొమాంటిక్ భావాలు ఉద్దీప్తమవుతాయి. మీలోని అసాధారణ శక్తి బంధాలను బలపరుస్తుంది. ప్రేమ విషయంలో కొత్త ఆలోచనలు కలిగిస్తుంది. సింగిల్‌గా ఉన్నవారు సంప్రదాయేతర స్థలాలలో వింత పరిచయాలను ఎదుర్కొంటారు. ప్రేమికుల వల్ల ఈ సంవత్సరం మీకు వృత్తి పరంగా మంచి అవకాశాలు వచ్చి రాణిస్తారు.చదవండి: నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తామీనం (19 ఫిబ్రవరి– 20 మార్చి)నెప్ట్యూన్ ప్రభావం వల్ల అసాధారణ భావోద్వేగం మీ హృదయానికి సరైన దారి చూపిస్తుంది. ఈరోజు మీలో సున్నితమైన ప్రేమ సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది. ప్రేమికుల మధ్య బంధం పెరిగి కలలు సాకారమవుతాయి. సింగిల్‌గా ఉన్నవారు అనుకోకుండా సోల్‌మేట్‌ను కలుసుకుంటారు. ఎంతో కాలంగా ఉన్న అభిలాషలు ఈ సంవత్సరం తీరుతాయి. పది సంవత్సరాల వరకు మీకు తిరుగు ఉండదు.– డా. మహమ్మద్దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
వాలెంటైన్స్ డే స్పెషల్.. సూర్య సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ద్విపాత్రాభినయంలో వచ్చిన చిత్రం 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సిమ్రాన్, సమీరా రెడ్డి, రమ్య ప్రధాన పాత్రల్లో నటించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తమిళంలో వారనమ్ అయిరమ్ పేరుతో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో సూర్య సన్నాఫ్ కృష్ణన్ గా డబ్ చేసి రిలీజ్ చేశారు. 2008 నవంబర్ 14న విడుదలైన ఈ చిత్రం తమిళం కంటే తెలుగులోనే పెద్ద విజయం సాధించింది. ఆ మధ్య రీ రిలీజ్ చేస్తే అప్పుడూ అద్భుతమైన విజయం అందుకుందీ సినిమా. తాజాగా ఈ ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి తెలుగులో విడుదల కాబోతోంది.ఈ సందర్భంగా సి.ఎల్.ఎన్ మీడియా ప్రొడక్షన్ హౌస్ వారు మాట్లాడుతూ.. 'సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదలవుతోంది. ఈ మూవీలో సూర్య అద్భుతమైన నటనతో మెప్పించారు. గౌతమ్ మీనన్ ప్రేమ నేపథ్యంలో ఓ కళాఖండాన్ని సృష్టించారు. హరీస్ జయరాజ్ మ్యూజిక్ ఇప్పటికీ అన్ని వేదికలపైనా పాటలు లేకుండా కనిపించదు. అంతటి ప్రజాదరణ పొందిన పాటలున్న చిత్రం ఇది. పివీఆర్ థియేటర్స్ వాళ్లు ఒక కంటెస్ట్ లవర్స్ డే వీక్ అనే ప్రోగ్రామ్ చేశారు. ఈనెల 14న రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు తెలుగు వర్షన్ కర్ణాటక, ఓవర్శీస్ మొత్తం మేమే విడుదల చేస్తున్నాం. ఇలాంటి చిత్రాన్ని విడుదల చేయడం మా సంస్థకు గర్వకారణం " అని అన్నారు. -
నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా..
వీచే చిరుగాలిని వెలివేస్తా.. పారే నదినావిరి చేస్తా.. నేనున్న నేలంతా మాయం చేశా లేనేలేదే అవసరమే.. నువ్వే నాకు ప్రియవరమే.. నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ ఎవరూ గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా నువులేని లోకంలో నన్నే నే బలిచేస్తా నువ్వుంటే నా జతగా అంటూ రామజోగయ్య శాస్త్రి రచించిన పాటకు ఏఆర్ రెహ్మాన్ (AR Rahman) అందించిన స్వరాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఈ పాట వింటున్నప్పుడు ఎంత ఫీల్ ఉంటుందో.. ప్రేమికుల దినోత్సవానికి ముందు జరుపుకునే వాలంటైన్స్ వారంలో అంతటి ఫీల్ ఉంటుందని తెలుస్తోంది.. హైదరాబాద్ (Hyderabad) నగరంలో హడావుడి చూస్తోంటే.. వ్యాపార వర్గాల మొదలుకుని పర్యాటక రంగం వరకూ వాలంటైన్స్ డే (Valentine's Day) సందర్భంగా అనేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు.. దీనికితోడు యువత హడావుడీ మామూలుగా లేదనేలా సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో దీని గురించి మరిన్ని విశేషాలు.. ఫిబ్రవరి నెల మొదటి రెండోవారం మొదలైన దగ్గర నుంచి సోషల్ మీడియాలో వాలంటైన్స్ వీక్ (Valentine week) సందడి కనబడుతోంది. గత రెండు మూడు రోజులుగా ఎక్కుడ చూసినా ఇదే సందడి అన్నట్లుంది హడావుడి. అయితే ఈ వాలంటైన్ వీక్ కొత్తదేం కాదు.. ఈ సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ ప్రేమికుల వారం నగర సంస్కృతిలో మరింత భాగమైన సూచనలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా వాలంటైన్స్ వీక్ సంబంధించిన పోస్టులు, రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. యానిమేటెడ్, విఎఫ్ఎక్స్ వీడియోలు కాకుండా చాలమంది యువతరం స్వయంగా వీడియోలు చేసి నెట్టింట పెట్టడంతో వైరల్‌గా మారుతున్నాయి. దీనికి సంబంధించి వాలంటైన్ వీక్‌లో మొదటి రోజైన రోజ్ డే ప్రభావం అధికంగా కనిపించింది. ఈ నేపథ్యంలో సోమాజిగూడలోని ఓ ఫ్లవర్ బొకే షాపు యజమాని జలీల్‌తో ముచ్చటించగా.. ఈ నెల 6న చిన్న సైజు గులాబీ పువ్వుల కోసం చాల ఆర్డర్లు వచ్చాయని, అంతేకాకుండా రోజ్ డే అయిన 7వ తేదీన విడి రోజా పూలను అధిక సంఖ్యలో అమ్మానని చెప్పుకొచ్చాడు. సాధారణంగా బొకేలు తప్ప విడిగా ఒక్కొక్క గులాబీ పువ్వులు అంతగా అమ్ముడుపోవు.. ఈ రోజ్ డే ప్రభావమే దీనికి కారణమని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.ప్రేమను పంచుకోవాలి కదా!ఏళ్ల తరబడి వాలంటైన్స్ వీక్ అని చెప్పుకోవడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్ప వాస్తవంగా అంతగా జరుపుకోలేదు. కానీ ప్రస్తుతం ఈ సంస్కృతి మెల్లమెల్లగా పెరుగుతోంది. చాక్లెట్ డే రోజు చాక్లెట్ ఇవ్వడం, హగ్ డే రోజు హగ్ చేసుకోవడం, ప్రపోజ్ డే రోజు కచ్చితంగా తమ ప్రేమను మళ్లీ ఒకసారి వ్యక్తపరచడం.. ఇలా ఈ తరం ‘ప్రేమికుల వారాన్ని’ స్వయంగా ఆస్వాదిస్తున్నారు. విదేశాల్లోనో, స్థానికంగానో ఉండి కలవడానకి వీలుకాని ప్రేమికులు.. డెలివరీ యాప్స్‌లో గులాబీ పూలను, చాక్లెట్లను ఆయా ప్రత్యేక రోజుల్లో తమ భాగస్వాములకు డోర్ డెలివరీ చేస్తుండటం విశేషం. చదవండి: అంతా ప్రేమమయం...ఇందులో భాగంగా వాలంటైన్స్ వీక్‌లో టెడ్డీ డే, రోజ్ డే, చాక్లెట్ డే రోజున వీటి ఆర్డర్ల సంఖ్య నగరంలో భారీగా పెరిగిందని డెలివరీ సంస్థల యాజమాన్యాలు చెబుతున్న మాట. హగ్ డే, ప్రామిస్ డే వంటివి వర్చువల్ వేదికగా సరిపెట్టుకుంటున్నారు. తమ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు ఇచ్చిన ఈ గిఫ్టులకు మంచి లవ్ మెలోడీ ట్రాక్‌ని జోడించి వాట్సాప్ స్టేటస్లు, ఇన్‌స్టా పోస్టులతో సందడి చేస్తున్నారు. అయితే ఈ వాలంటైన్స్ వీక్‌లో ప్రముఖ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, సెలిబ్రిటీలు కూడా ఉండటం విశేషం.ప్రేమికుల దినోత్సవం కోసం ప్యార్ బజార్..వాలంటైన్స్ డేని పురస్కరించుకుని ప్రముఖ ఆన్లైన్ విపణి.. అమెజాన్ ‘ప్యార్ బజార్’ పేరిట సరికొత్త ఫ్యాషన్ ఉత్పత్తులు, ఫోన్ యాక్సెసరీలను ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ విషయాన్ని అమెజాన్ ఇండియా సెంట్రల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ జహీద్ ఖాన్ తెలిపారు. ఓ చక్కని రొమాంటిక్ డేట్ ఎంజాయ్ చేసేందుకు వీలైన ఉత్పత్తుల, గిఫ్ట్ ఆర్టికల్స్ జ్యువెలరీ మొదలుకుని, మనసును హత్తుకునేలా వాలంటైన్స్ డే కోసం ప్యార్ బజార్ విభాగంలో లభిస్తాయని వివరించారు.– సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో -
అంతా ప్రేమమయం...
అలనాడు భక్త రామదాసుకు అంతా రామమయంగా, జగమంతా రామమయంగా అగుపించింది గాని, ప్రేమికులకు మాత్రం అంతా ప్రేమమయంగా, జగమంతా ప్రేమమయంగా కనిపిస్తుంది. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే. ప్రేమికులు జరుపుకొనే రోజు కాబట్టి ఇది ప్రేమికుల దినోత్సవంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. మన దేశంలో ఆర్థిక సరళీకరణలు మొదలయ్యాక ప్రపంచీకరణ నేపథ్యంలో పలు విదేశీ వేడుకలు మన దేశానికీ పాకాయి. మూడు దశాబ్దాలకు ముందు మనవాళ్లకు వాలంటైన్స్ డే ఏమిటో తెలీదు. వాలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవం అని ఇప్పుడు అందరికీ తెలుసు. దీనికి కారకుడైన సెయింట్ వాలంటైన్ చరిత్ర గురించి కూడా జనాలకు కొంతవరకు తెలుసు. అయితే, వాలంటైన్స్ డే గురించి చాలామందికి తెలియని విశేషాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని అరుదైన విశేషాలు మీ కోసం..» వాలంటైన్స్ డే నేపథ్యం క్రీస్తుపూర్వం ఆరో శతాబ్ది నాటిది. అప్పట్లో రోమన్ ప్రజలు ‘లూపర్‌కేలియా’ పేరుతో సంతాన సాఫల్య వేడుకను ఫిబ్రవరి 13–15 తేదీలలో జరుపుకునేవారు. వారు ఈ వేడుకలో సంతాన సా«ఫల్యానికి అధిదైవమైన లూపర్కస్ను ఆరాధించేవారు. ఈ సందర్బంగా జంతుబలులు ఇచ్చేవారు. పోప్ గెలాషియస్–ఐ క్రీస్తుశకం ఐదో శతాబ్ది చివరి రోజుల్లో ‘లూపర్‌కేలియా’ వేడుకను నిషేధించి, దాని బదులుగా ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేను ప్రవేశపెట్టాడనే కథనం ఉంది.»సెయింట్ వాలంటైన్ ఒకరు కాదు, ముగ్గురు అని కూడా చెబుతారు. విచిత్రంగా వీరిలో ఇద్దరు క్రీస్తుశకం మూడో శతాబ్ది నాటి రోమన్ పాలకుడు క్లాడియస్–ఐఐ చేతిలో ప్రాణాలు కోల్పోయినవారే! యుద్ధ సమయంలో సైనికులు పెళ్లిళ్లు చేసుకోరాదన్న క్లాడియస్– ఐఐ ఆజ్ఞలను ఉల్లంఘించి, రోమ్ నగరంలో సైనికులకు ప్రేమ వివాహాలు జరిపించినందుకు సెయింట్ వాలంటైన్ మరణశిక్ష పొందాడు.ఈ కథనం చాలామందికి తెలిసినదే! రోమ్కు చేరువలోనే తెర్ని పట్టణానికి చెందిన సెయింట్ వాలంటైన్ పేరు గల మరో వ్యక్తి కూడా క్లాడియస్–ఐఐ చేతిలో మరణశిక్షకు గురయ్యాడు. అయితే, కేథలిక్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్ సమాచారం ప్రకారం సెయింట్ వాలంటైన్ పేరుతో ముగ్గురు వ్యక్తులు ఉన్నారట!» సైనికులకు పెళ్లిళ్లు జరిపించాడనే అభియోగంపై సెయింట్ వాలంటైన్‌ను క్లాడియస్–ఐఐ నిర్బంధించాడు. చెరసాల నుంచి సెయింట్ వాలంటైన్, చెరసాల పర్యవేక్షకుడి కూతురికి ప్రేమలేఖ రాశాడు. దాంతో అప్పటి వరకు చూపులేని ఆమెకు చూపు వచ్చిందనే కథనం ప్రచారంలో ఉంది. అయితే, సెయింట్ వాలంటైన్‌కు క్రీస్తుశకం 270 ఫిబ్రవరి 14న ఉరిశిక్ష అమలు చేశారు. » వాలంటైన్స్ డే వేడుక ఖండాంతరాలకు పాకిన తర్వాత వాలంటైన్స్ డే గ్రీటింగ్ కార్డులకు గిరాకీ పెరిగింది. తొలి వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డు ఆధునిక కాలానికి చెందినదై ఉంటుందని చాలామంది భావిస్తారు. అయితే, క్రీస్తుశకం పదిహేనో శతాబ్దిలో లండన్ టవర్ జైలులో బందీగా ఉన్న ఖైదీ అక్కడి నుంచి తన భార్యకు బొమ్మలతో కూడిన ప్రేమలేఖ రాశాడు. బహుశా అదే తొలి వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డు అని చరిత్రకారులు భావిస్తారు. ఇరవయ్యో శతాబ్ది తొలిరోజుల్లో వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డులు బాగా ప్రాచర్యంలోకి వచ్చాయి. » పాశ్చాత్య ప్రపంచంలో పదిహేడో శతాబ్దం వరకు ప్రేమికులు చేతితో రూపొందించిన గ్రీటింగ్ కార్డులను ఇచ్చి పుచ్చుకునేవారు. అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన ఎస్తర్ ఏ హౌలాండ్ వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డుల చరిత్రనే మార్చేసింది. పంతొమ్మిదో శతాబ్దిలో ఆమె స్వయంగా రూపొందించిన డిజైన్లతో అందంగా ముద్రించిన వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డులను అమ్మడం ప్రారంభించింది. ఆమె వ్యాపారం అనతి కాలంలోనే అమెరికా అంతటా విస్తరించింది. దీంతో ఎస్తర్ ‘మదర్ ఆఫ్ అమెరికన్ వాలంటైన్స్’గా ప్రఖ్యాతి పొందింది.» తాజా లెక్కల ప్రకారం వాలంటైన్స్ డే రోజున వివిధ దేశాల ప్రేమికులు ఇచ్చి పుచ్చుకునే గ్రీటింగ్ కార్డుల సంఖ్య 15 కోట్లకు పైగానే ఉంటుంది. వీటికి తోడు చాక్లెట్ గిఫ్ట్ బాక్సులు, గులాబీల పుష్పగుచ్ఛాలు, బంగారు ఉంగరాలు, ఇతరేతర కానుకల సంఖ్య లెక్కలకు కూడా అందదు. ఏది ఏమైనా, వాలంటైన్స్ డే ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల పర్వదినం. -
#HappyRoseDayQuotes : హ్యాపీ రోజ్ డే (ఫొటోలు)
-
Valentine's Day: మూడు ఇన్టు ఏడు..గుండెల్లో ఏముందో..!
ఫిబ్రవరి మాసం మొదలు కాగానే ‘‘గుండెల్లొ ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది...కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే’’ అంటూ ప్రేమగీతాలైపోతారు ప్రేమికులు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ దాకా ప్రేమే ప్రపంచంగా మారిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి మాసం ప్రేమికుల మాసంగా మారిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదురోజ్ డేతో ప్రారంభమై , ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం వరకు లవ్‌బర్డ్స్ సందడి మామూలుగా ఉండదు. ప్రేమికుల వారంలో ఒక్కోరోజు ఒక్కో పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు. రోజ్ డే (ఫిబ్రవరి 7), ప్రపోజ్ డే (ఫిబ్రవరి 8), చాక్లెట్ డే (ఫిబ్రవరి 9), టెడ్డీ డే (ఫిబ్రవరి 10), ప్రామిస్ డే (ఫిబ్రవరి 11), హగ్ డే (ఫిబ్రవరి 12),, కిస్ డే (ఫిబ్రవరి 13), చివరిగా ఫిబ్రవరి14న వాలెంటైన్స్ డేతో సంబరాలు అంబరానికి చేరతాయి.అయితే అసలు ప్రేమ అంటే ఏంటి? ఎలా పుడుతుంది? ఎపుడైనా ఆలోచించారా? రాబర్ట్ స్టెర్న్‌బర్గ్ ట్రయాంగిల్ థియరీ గురించి తెలుసా. త్రిభుజాకార సిద్ధాంతం (Triangular Theory) ప్రేమలోని మూడు భాగాలను ప్రతిపాదిస్తుంది. సాన్నిహిత్యం, వ్యామోహం, నిబద్ధతల కలయికలతో ఏడు రకాల ప్రేమలు పుడతాయని ఇదిచెబుతోంది. మనస్తత్వవేత్త రాబర్ట్ స్టెర్న్‌బర్గ్ ప్రకారం ప్రేమలు ఏడు రకాలులైకింగ్, ఇన్ఫాట్యుయేషన్, ఎంప్టీ లవ్, రొమాంటిక్ లవ్, కంపానియట్ లవ్, ఫటస్ లవ్, కంజుమేటివ్ లవ్ 1999లో లెమియక్స్ , హేల్ అనే అండర్ గ్రాడ్యుయేట పరిశోధకులు తన అధ్యయనంతో స్టెర్న్‌బర్గ్ త్రిభుజాకార ప్రేమ సిద్ధాంతానికి మద్దతు ఇచ్చారు. మరుసటి సంవత్సరం, 2000లో వీరే ఇలాంటి మరో అధ్యయనాన్ని నిర్వహించారు, ఈసారి వివాహితులతో నిర్వహించిన స్టడీలో ఈ మూడు అంశాలు వారి మధ్య బంధాన్ని బలపర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ట్రాయింగిల్ థీయరీ పైనే 2009లో పరిశోధకుడు డెవెరిచ్ స్టెర్న్‌బర్గ్ సిద్ధాంతం ప్రకారం కౌమారదశలో ఉన్నవారు సంపూర్ణ ప్రేమలో ఉండగలరా లేదా అని తెలుసుకోవడానికి ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మూడు అంటే సాన్నిహిత్యం, వ్యామోహం, నిబద్ధతలలో లోపాల కారణంగా కౌమారదశలో ఉన్నవారు పూర్తిగా ప్రేమలో ఉండలేరని తేల్చారు. న్యూరోసైన్స్ ప్రకారం మనుషుల్లో ప్రేమ భావన పెంపొందడంలో మెదడులోని రివార్డ్ సిస్టం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ లవ్ అనే ఫీలింగ్ కలిగినప్పుడు మెదడులో ఏం జరుగుతుందనే దానిపై హార్వర్డ్ మెడికల్ కళాశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మెదడులో విడుదలయ్యే కొన్ని రసాయనాల ఫలితమే ప్రేమ అని తేల్చి చెప్పారు. అలాగే న్యూయార్క్‌లోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెడికల్ కాలేజ్‌కి చెందిన బినాక అస్విడో రొమాంటిక్ లవ్‌పై పరిశోధనలో భాగంగా ప్రేమ మెదడులో ఎక్కడ ఉంటుందో తెలుసు కోవడానికి ప్రయత్నించారు. ఫలితంగా మెదడులోని వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా (వీటీఏ), న్యూక్లియస్ అకమ్బన్స్, వెంట్రల్ పల్లిడియం, రఫే న్యూక్లియస్ ప్రాంతాలు ఉత్తేజితమయ్యాయని ఎఫ్.మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ద్వారా తెలుసుకున్నారట.ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్ మరో ఆసక్తికరమైన విషయంమెదడులోని వివిధ భాగాల స్పందనను బట్టి ఈ ప్రేమ ఆరు రకాలుగా ఉంటుంది మరో అధ్యయనంలో తేలింది. ప్రేమకు సంబంధించిన ఐదు భాషలపై చాలా పరిశోధనలు జరిగాయి. కానీ ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ప్రేమలో ఆరు రకాలు ఉన్నాయని, ప్రతి ఒక్కటి మెదడులోని వేర్వేరు భాగాలనుయాక్టివేట్ చేస్తుందని గుర్తించారు. మానవ అనుభవం అంటే లైంగిక ఆరాధన నుండి తల్లిదండ్రుల లేదా పెంపుడు జంతువుల ప్రేమ లేదా ప్రకృతి ప్రేమ వరకు అనేక రకాల సందర్భాలను వివరించడానికి “ప్రేమ” అనే పదాన్ని ఉపయోగిస్తారు.రొమాంటిక్ ప్రేమపేరెంటల్ ప్రేమస్నేహితుడిపై ప్రేమఅపరిచితుడి పట్ల ప్రేమపెంపుడు జంతువు పట్ల ప్రేమప్రకృతి పట్ల ప్రేమలవ్వో..గివ్వో.. ఐ వానా ఫాలో.. ఫాలోప్రేమకు ఎవరెన్ని నిర్వచనాలు చెప్పినా. అది వైయుక్తికం. ఎవరికి వారు అనుభవించి తీరాల్సిన మధురభావన. ప్రేమ అనంతమైనది. ప్రేమ మనిషికి,మనసుకు ఉల్లాసానిస్తుంది. లవ్వో గివ్వో.... రివ్వు రివ్వున సాగిపోవాలి.... ఒకరి హృదిలో ఇంకొకరు గువ్వలా ఒదిగిపోవాలి. ఎన్ని కష్టాలైనా, పరీక్షలైనా తట్టుకొని నిలబడాలి. ‘‘నాకు.. నువ్వు..నీకు నేనూ..’’ ఇదే తారక మంత్రం. నిస్వార్థంతో నిబద్ధతతో విశ్వాసంగా నిలబడితే అది పరిపూర్ణమైన ప్రేమ. -
Valentine's day : లవ్‌బర్డ్స్‌కి వారమంతా సందడే ఇలా! (ఫొటోలు)
-
ప్రేమ పరీక్షకు వేళాయే
మనసు ముసిముసిగా నవ్వితే..ఊహ ఉప్పొంగితే..గుండె ఆనందంతో గంతులేస్తే..ఆ సందడి పేరే ప్రేమ. చిరునవ్వుతో వరమిస్తావా.. చితి నుంచి నడిచొస్తాను.. మరు జన్మకు కరుణిస్తావా.. ఈ క్షణమే మరణిస్తానంటూ ప్రేమికుల మనసు పలికే మాటల్ని ఓ సినీ కవి అద్భుతంగా చెప్పారు. నిజమే.. ప్రేమిస్తే.. ప్రపంచమంతా మనసిచ్చిన మనిషిలోనే కనిపిస్తుంది. ప్రేమిస్తే..నీడ కూడా జంట హృదయం వెన్నంటే ఉంటుంది.ఎందుకంటే.. అది ప్రేమంట అంటున్నారు ప్రేమికులు. అందుకే.. ప్రేమ పండుగను వారం రోజుల పాటు చేసుకునేలా వాలెంటైన్ వీక్ రానే వచ్చింది. గుప్పెడంత గుండెలో ఉప్పెనంత ఊహల్ని నింపేలా..అనిర్వచనీయమైన మధురానుభూతిగా చెప్పుకునే ప్రేమకు వారాల పండగ చేసుకునేందుకు కొత్తతరం లవ్‌బర్డ్స్ సిద్ధమవుతున్నారు. వారం పాటు ప్రేమానందాల్ని మూటకట్టి నచ్చిన మనసుల ముందు పెడితే..గుండె ఆనందంతో గంతులేస్తుంది..గొంతు సంబరంతో గోల చేస్తుంది.మనసు ఊహల్లో తేలే మధుమాసపు పండగను తీసుకొచ్చిందని ప్రేమ పక్షులు వలపు గూటికి చేరుకొని ఊసులాడుకుంటున్నాయి. వాలెంటైన్స్ డే రోజునే ప్రేమికులు నిజమైన పండగలా చేసుకుంటారు. కానీ..ఆ పండగనూ వారం రోజుల పాటు విభిన్నతలతో వలపు హృదయాలు విహరించేలా చేసుకోవాలనే తపన ఉన్న వారికీ ఓ వీక్ ఉంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజని అందరికీ తెలుసు. కానీ ఆ అసలైన పండగను వారం రోజుల పాటు జరుపుతారని కొంతమంది ప్రేమికులకే తెలుసు. ఎదలోతులో ఏ మూలనో దాగి ఉన్న ప్రేమను ఎదుటి వారికి చెప్పేందుకు ఒకటి కాదు.. ఏకంగా వారం పాటు ఒక్కో విధంగా వ్యక్తపరచవచ్చు. కానుకలు, పుష్పగుచ్ఛాలతో ఎదుటి వారి మనసుల్ని కొల్లగొట్టేందుకు ప్రేమికులు ఉవ్విళ్లూరుతుంటారు. ఆ కానుకల్ని ఒక్కో స్పెషల్ రోజున ఒక్కో విధంగా ఇస్తూ వారి ప్రేమను పొందేందుకు వచ్చిందే వాలెంటైన్ వీక్. ప్రేమికుల రోజు ముందు వారం రోజుల పాటు అంటే ఈ నెల 7 నుంచి వాలెంటైన్ వీక్‌ను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాం.వాలెంటైన్ డే (ఫిబ్రవరి 14)ఇక చివరి రోజైన వాలెంటైన్ డే గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో కొత్త రకాల ప్లాన్లతో మనసులు ఉరకలేస్తుంటాయి. తన భాగస్వామి ఊహించని రీతిలో బహుమతి అందించాలని, సమ్‌థింగ్ స్పెషల్‌గా ప్రేమను వ్యక్తం చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. నచ్చిన స్టైల్లో.. ఎదుటి వారి మనసు దోచేలా ప్రేమను వ్యక్తం చేయండి. ఇందుకోసం విశాఖలో ప్రధాన హోటల్స్ అన్నీ ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీలనూ ప్రకటిస్తున్నాయ్. చుట్టూ గులాబీ పూల మధ్య క్యాండిల్ లైట్ డిన్నర్లు, ప్లెజెంట్ మ్యూజిక్‌తో మైమరపించేలా ఏర్పాట్లకు సిద్ధమవుతున్నాయి. హ్యాపీ వాలెంటైన్స్ వీక్!!రోజ్ డే (ఫిబ్రవరి 7)ఎదుటి వారికి ప్రేమను వ్యక్తం చెయ్యాలంటే 90 శాతం మంది ఎంచుకునే ప్రధాన మార్గం గులాబీ. ఎర్ర గులాబీని ఇచ్చి కళ్లల్లోకి చూస్తూ ఐ లవ్ యూ చెబితే ఎదుటి వారి మనసు లోతుల్ని తాకుతుందంటారు. అందుకే ఈ వాలెంటైన్ వీక్ తొలి రోజుని రోజ్ డేగా పండగ చేసుకుంటారు. ఈ రోజున మొదటిసారిగా మీకు చాలా ఇష్టమైన వారితో కలవాలన్నా, పలకరించాలన్నా ఈ రోజ్‌డే రోజున మంచి గులాబీ ఇచ్చి ప్రపోజ్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. విశాఖ నగరంలో చాలా మంది యువత బుధవారం రోజ్ డే సంబరాల్ని చేసుకున్నారు. వైజాగ్‌లోని రామాటాకీస్లోని ఓ ఫ్లోరిస్ట్ దుకాణంలో రోజుకి 200 నుంచి గులాబీలు అమ్ముడవుతుంటాయి. కానీ.. రోజ్ డే రోజు మాత్రం 1000 వరకూ గులాబీలు అమ్ముడు పోతాయని దుకాణ యజమాని రాజు తెలిపారు. ఇక దేశంలో ప్రతి రోజూ రూ.68.4 కోట్ల గులాబీ వ్యాపారం జరుగుతుంటుంది. వాలెంటైన్స్‌డే, రోజ్‌డే రోజు మాత్రం రూ.100 కోట్లకు చేరుకుంటుంది.ప్రపోజ్ డే (ఫిబ్రవరి 8) ప్రేమను వ్యక్తపరచాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేకపోవడం వల్లే చాలా మంది ప్రేమలు మనసు లోతుల నుంచి బయటకు వచ్చి పెదాల వద్దే నిలిచిపోతున్నాయి. ఆ రెండు మాటలు చెప్పేందుకు తటపటాయించే ప్రేమికులకు ఈ ప్రపోజ్ డే కొత్త ఉత్సాహాన్నిస్తుంది. నచ్చిన వ్యక్తిని తనకు నచ్చిన ప్రాంతానికి తీసుకెళ్లి చిన్న బహుమతి ఇచ్చి ప్రేమను వ్యక్తీకరిస్తే చాలు మనసులు పెనవేసుకునే మధుమాసం వచ్చేస్తుంది. అందుకే ఈ రోజుకి చాలా ప్రాముఖ్యమిస్తుంటారు.చాక్లెట్ డే (ఫిబ్రవరి 9) చాక్లెట్ అంటే ఇష్టంలేని వారు ఎవరుంటారు. అమ్మాయిలకు చాక్లెట్ ఇస్తే చాలు ప్రపంచాన్ని తమ చేతిలో పెట్టినట్లుగా ఎగిరి గంతేస్తారు. అందుకే చాలా మంది ప్రేమికులు తన ప్రేయసికి ప్రపోజ్ చెయ్యాలంటే ఓ ఎర్రగులాబీతో పాటు చాక్లెట్ ఇస్తుంటారు. అలాంటి వారికోసం ఈ చాక్లెట్ డే. ప్రేమ ఓకే అయితే ఓ తియ్యని వేడుక చేసుకుందాం.. మన ప్రేమకు ఇదో తీపి గుర్తుగా భావిద్దాం.. అంటూ చిన్న భావుకవితను చెబుతూ చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే సరి.. ఆ సంబరమంతా జీవితాంతం తీపి గురుతుగా ఉండిపోతుంది. సాధారణంగా దేశంలో ప్రతి రోజూ 3.87 లక్షల కిలోల చాక్లెట్లు అమ్ముడుపోతుంటాయి. చాక్లెట్డే రోజున మాత్రం 5 లక్షల కిలోల అమ్మకాలు పక్కా అని మార్కెట్‌దారులు అంచనా వేస్తున్నారు.టెడ్డీ డే (ఫిబ్రవరి 10) ముద్దు ముద్దుగా ఉండే టెడ్డీ బేర్‌ను చూసి ఇష్టపడని వారంటూ ఉండరు. మనసుకు హత్తుకునేలా ఉండే టెడ్డీలను ఇష్టపడే ప్రేయసి ఉంటే ఈ రోజున ఓ బొమ్మను బహుమతిగా ఇచ్చి ఆనందపరచండి. నచ్చిన రంగుని ఎంపిక చేసి మరీ కొంటే వారు పొందే ఆనందం వెలకట్టలేనిది. అర చేతిలో పట్టే టెడ్డీ నుంచి ఆరడుగులుంటే టెడ్డీ బేర్ వరకూ మార్కెట్లో వివిధ సైజుల్లో లభిస్తున్నాయి. జగదాంబా సెంటర్లోని దావూద్ టెడ్డీబేర్ దుకాణంలో గతేడాది ఇదే రోజున సుమారు 250 బొమ్మలు అమ్ముడు పోయాయంట. ఇక నగరం మొత్తం చూస్తే ఈరోజున ఎన్ని టెడ్డీబేర్లు ప్రేమికుల గుండెలపై వాలిపోతాయో అర్థం చేసుకోవచ్చు. దేశంలో సగటున ప్రతి రోజూ సగటున రూ.14.67 కోట్ల సాఫ్ట్‌టాయ్స్ వ్యాపారం జరుగుతుంది. టెడ్డీడే, వాలెంటైన్స్‌డే రోజున మాత్రం ఏకంగా రూ.25 లక్షలకు పైగా విక్రయాలు జరుగుతుంటాయని సాఫ్ట్‌టాయ్స్ కంపెనీలు చెబుతున్నాయి.ప్రామిస్ డే (ఫిబ్రవరి 11) రెండు హృదయాల మధ్య చిగురించిన ప్రేమకు నమ్మకం పునాది. చిలిపి ఉదాహరణగా చెప్పుకుంటే రెండు బిస్కెట్లను క్రీమ్ అంటిపెట్టుకొని ఉంటేనే క్రీమ్ బిస్కట్ అన్నట్లుగానే రెండు మనసుల్ని జీవితాంతం కలిపి ఉంచేది నమ్మకమే. అలాంటి నమ్మకాన్ని ఎదుటివారిలో కలిగించడానికి ఈ రోజు గొప్పదనే చెప్పుకోవాలి. నచ్చిన వ్యక్తికి దగ్గర కావడానికి, వారిలో తనపై ఉన్న ప్రేమను కలకాలం ఉంచేందుకు వాగ్దానాలు చేస్తుంటారు. ప్రేయసి మీద మీకున్న ప్రేమను ఈ రోజున వాగ్దానం చేసి తెలిపితే.. ఎదుటి వారు మీకు మరింత చేరువవుతారు.హగ్ డే (ఫిబ్రవరి 12)ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు, కష్ట సుఖాలకు చిహ్నం హగ్. ఒక కౌగిలి.. కష్టాల్లో ఉన్న ఎదుటి మనసుకు సాంత్వననిస్తుంది. బాధలను దూరం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించేస్తుంది. అందుకే ఈ కౌగిలింత మంత్రాన్నే యువతరం ప్రేమ మంత్రంగా పాటిస్తున్నారు. చిన్న కౌగిలింతతో వలచిన మనసు పరవశంలో ముంచేస్తూ మెప్పించేస్తున్నారు. ప్రశాంతతను కలిగించేలా ప్రేమికుడికి, ప్రేయసికి ఒక హగ్ ఇస్తే చాలు.. అందులోనే మన ప్రేమలోతుల్ని అన్వేషించగలరు. 10 నిమిషాల పాటు హగ్ చేసుకుంటే హైబీపీ కూడా అదుపులోకి వచ్చేస్తుందంట. ఆనందం కలిగినప్పుడు ఎలానో.. హగ్ చేసుకున్నప్పుడు కూడా ఆక్సిటోసిన్ అనే రసాయనం విడుదలై మనసుకి సంతోషాన్ని కలిగిస్తుంటుంది. ఒక సమస్యలో ఉన్న లవర్‌కు రోజుకు 8 హగ్‌లు ఇస్తే చాలంట. రోజుకు 12 సార్లు హగ్ చేసుకుంటే..లైఫ్ సాఫీగా సాగిపోతుందంటూ అధ్యయనాలు ప్రేమ పాఠాలు చెబుతున్నాయండోయ్. అందుకే..ఈ రోజున ఒక హగ్‌తో మీరెంతగా ప్రేమిస్తున్నారో చెప్పేసుకోవచ్చు.కిస్ డే (ఫిబ్రవరి 13) వేయి మాటలు చెప్పలేని ఓ భావాన్ని చిన్న ముద్దు చెబుతుంది. ఎదుటివారి మీద అంతులేని ప్రేమ ఉన్నా చెప్పలేని వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారు ఓ తియ్యని ముద్దుతో తన ప్రేమను వ్యక్తపరిచే రోజు ఇది. అందుకే కిస్ డే రోజున మీ భాగస్వామికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఓ ముద్దు ఇస్తే చాలు.. మీ ప్రేమ అలా.. నిలబడిపోతుంది. అన్నట్లు ముద్దు కూడా ఒక దివ్యౌషధమేనంట. ముద్దు పెట్టుకోవడం వల్ల మీ శరీరంలో ఎపినెర్ఫిన్ విడుదలై రక్తనాళాలు వెడల్పుగా మారి రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు దోహదపడి మానసిక విశ్రాంతిని అందిస్తుంది. గుండె రేటుని పెంచడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రవాహం సక్రమంగా సాగుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు నచ్చిన వ్యక్తికి ముద్దు పెడితే.. రక్తపోటు తగ్గుతుంది. ముద్దు వల్ల రెండు మనసుల మధ్య ప్రేమ బదిలీ అవ్వడమే కాదు.. బ్యాక్టీరియా కూడా బదిలీ అవుతుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇద్దరు వ్యక్తులు చుంబించుకునే సమయంలో ఉత్పత్తయ్యే సెరోటోనిన్ డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి సంతోష రసాయనాలు..ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.హ్యాపీ వాలెంటైన్స్ వీక్!! -
ప్రియుడితో సీక్రెట్ ఎంగేజ్మెంట్.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్!
ఈ బ్యూటీ తెలుగు సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. బోణి అనే చిత్రం ద్వారా టాలీవుడ్ బోణి కొట్టిన ముద్దుగుమ్మ కృతి కర్బంద. ఆ తర్వాత అలా మొదలైంది, కెమెరామెన్ గంగతో రాంబాబు, తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ, మిస్టర్ నూకయ్య,ఓం త్రీడీ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. చివరసారిగా 2015లో వచ్చిన 'బ్రూస్ లీ' మూవీలో రామ్ చరణ్‌కి అక్కగా నటించింది. మోడల్ కెరీర్ ప్రారంభించిన ఢిల్లీ భామ తెలుగుతో పాటు కన్నడలోనూ చాలా సినిమాలు చేసింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిపోయింది బాలీవుడ్ భామ. అయితే 2019 నుంచి ఓ బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్న కృతి ఇటీవలే రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరి రిలేషన్ నిజమేనని తెలిపోయింది. కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే కృతి కర్బందా-పులకిత్ సామ్రాట్ ఎంగేజ్మెంట్ జరిగింది. దీంతో వీరి పెళ్లి ఎప్పుడనే విషయంపై చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా కృతి చేసిన పోస్ట్‌తో పెళ్లిపై హింట్ కూడా ఇచ్చేసింది. వాలైంటైన్స్ డే సందర్భంగా తనకు కాబోయే భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా మార్చి నెలలోనే ఒక్కటి కాబోతున్నామంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో జంట వచ్చే నెలలోనే పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రేమికుల రోజే క్లారిటీ ఇచ్చేసింది ముద్దుగుమ్మ. ఇంకా పెళ్లి తేదీ ఎప్పుడనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. పుల్కిత్ సామ్రాట్, కృతి కర్బందా 2019 నుంచి డేటింగ్ కొనసాగిస్తున్నారు. పాగల్పంటి అనే మూవీ సెట్లో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఈ జంట పాగల్పంటి సినిమాతో పాటు వీరే కి వెడ్డింగ్, తైష్ వంటి చిత్రాలలో కలిసి నటించారు. పుల్కిత్ సామ్రాట్ చివరిసారిగా ఫక్రీ- 3లో కనిపించారు. కృతి కర్బంద నటించిన తాజా చిత్రం రిస్కీ రోమియో విడుదలకు సిద్ధమవుతోంది. View this post on Instagram A post shared by Pulkit Samrat (@pulkitsamrat) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) -
పబ్‌లో ప్రియుడి తల పగలగొట్టిన పాయల్
'ఆర్ఎక్స్ 100' సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది పాయల్ రాజ్‌పుత్. ఇంకేముంది.. ఒక్క హిట్టు పడటంతో తనకు టాలీవుడ్లో తిరుగులేదనుకున్నారు. కానీ ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, జిన్నా ఇలా ఎన్నో సినిమాలు చేసినా పెద్ద బ్రేక్ అయితే రాలేదు. అనగనగనగా ఓ అతిథి సినిమాతో ఓటీటీలో అడుగుపెట్టి అక్కడ సక్సెస్ సాధించింది. 3 రోజెస్ అనే సిరీస్ కూడా చేసింది. ప్రియుడితో వాలంటైన్స్ డే కెరీర్ ఎటు వెళ్తుందో తెలియని అనిశ్చితిలో ఉన్న ఆమెకు అజయ్ భూపతి మంగళవారం సినిమా ఛాన్స్ ఇచ్చాడు. గతేడాది రిలీజైన ఈ మూవీ హిట్ కొట్టడంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇకపోతే పాయల్‌కు సౌరభ్ ఢింగ్రా అనే ప్రియుడు ఉన్నాడు. తరచూ వీళ్లిద్దరు షికార్లకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో వాలంటైన్స్ డే (ఫిబ్రవరి 14న) ఇలా సెలబ్రేట్ చేసుకున్నానంటూ పాయల్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇంకోసారి కొట్టాల్సింది పబ్బులో ఉన్న ఆమె.. తన ప్రియుడు సౌరభ్ నెత్తిని బాటిల్‌తో పగలకొట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన ఓ నెటిజన్.. అయ్యో అని విచారం వ్యక్తం చేస్తూనే ఇంకోసారి కొట్టాల్సింది అని కామెంట్ చేసింది. ఈ కామెంట్‌కు సౌరభ్ స్పందిస్తూ.. చాలా బ్యాడ్ ఐడియా అని రిప్లై ఇచ్చాడు. ఇక ఈ వీడియో రియల్ కాదు, రీల్ అని ఇట్టే తెలిసిపోతోంది. ఏదైనా ఓ సినిమా షూటింగ్లో భాగంగా పాయల్ ఇలా చేసిందని అర్థమవుతోంది. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) చదవండి: ఓటీటీలోకి 20 సినిమాలు.. ఆ నాలుగు హైలెట్ -
రిజెక్ట్ చేశారా? ఎగతాళి చేస్తున్నారా?.. డోంట్ కేర్!
'ప్రేమంటే ఏమిటంటే.. నిను ప్రేమించినాక తెలిసే..', 'ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ..' ఈ రెండు పాటలు ఈ రోజు మార్మోగడం ఖాయం.. ఈరోజు వాలంటైన్స్ డే కదా.. సక్సెస్ అయిన జంటలు బ్యాగ్రౌండ్లో హుషారైన ప్రేమపాటలు వేసుకుంటారు. ప్రపోజల్ రిజెక్ట్ అయిన వన్ సైడ్ లవర్స్ బ్రేకప్ సాంగ్స్ వింటూ బాధతో గడిపేస్తారు. ఇలా రిజెక్ట్ చేయడానికి కారణాలు అనేకం! అందులో లవ్వంటే ఇంట్రస్ట్ లేదు అనేది మొదటి స్థానంలో ఉంటుంది. రంగు, ఎత్తు పొడుగు, శరీర సౌష్ఠవం, బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తిపాస్తులు, ఫిట్నెస్.. ఇవి కూడా ఆ జాబితాలోనివే! సరే.. వాళ్లు నో చెప్పారే అనుకో.. ప్రపంచమే అంతరించిపోతున్నట్లు బాధపడాలా? అక్కర్లేదు.. బాహ్య సౌందర్యానికి, కరెన్సీ నోట్లకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చేవాళ్లు మనకవసరమే లేదని చిల్ అయిపోవాలి. ఒకరి ప్రేమ కోసం పరితపించడానికి ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. సెల్ఫ్ లవ్ గురించే ఈ కథనం.. నవ్వులాట.. ఫెయిల్ అనేది రేపటి విజయానికి పునాది.. ఇప్పుడు తిట్టేవాళ్లే ఒకస్థాయి వస్తే చప్పట్లు కొడుతుంటారు. 12th ఫెయిల్ ఇందుకు అతిపెద్ద ఉదాహరణ. ఇంట్లో ఉండే ఆడవాళ్లను చులకన చేసి మాట్లాడుతుంటారు. కానీ ఆమె తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అద్భుతాలూ సృష్టించగలదు. అందుకు ఇంగ్లీష్ - వింగ్లీష్ బెస్ట్ ఎగ్జాంపుల్. బొద్దుగా ఉన్నావ్.. రెండడుగులు నడిస్తే ఆయాసం, కూర్చుంటే నిలబడలేవు.. నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? ఇలాంటి మాటలకైతే లెక్కలేదు. లావుగా ఉంటే అందవిహీనంగానా? లావుగా ఉన్నవాళ్లు కనిపిస్తేనే కొందరు ఫక్కుమని నవ్వుతుంటారు. ఏం పాపం? వాళ్లేం తప్పు చేశారు? లావుగా ఉండటం నేరమా? కొందరు ఆహారపు అలవాట్ల వల్ల లావెక్కితే మరికొందరు జెనిటిక్స్ వల్ల అలా ఉంటారు! అయినా అందానికి అసలైన నిర్వచనమేంటో సైజ్ జీరో చూస్తే అర్థమవుతుంది. అందం అంటే ఆత్మవిశ్వాసమే! అని అప్పుడు మీరే ఒప్పుకుంటారు. ఛామనచాయ, నలుపు రంగు ఉన్నవాళ్లను కొందరు హీనంగా చూస్తారు. ఎగతాళి చేస్తారు. అవి ఏ రేంజ్లో ఉంటాయో కలర్ ఫోటో సినిమా చూస్తే తెలిసిపోతుంది. మనల్ని మనం ప్రేమించుకుంటే చాలు అయినా తక్కువరంగు ఉన్నవారు ఊసరవెల్లిలా రంగులు మార్చరే! మరి ఈ నలుపు రంగు వల్ల ఎవరికి హాని? ఎవరికి ఇబ్బంది? దీనికి ఎప్పటికీ సమాధానం దొరకదు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడున్నాయ్.. ముందు మనల్ని మనం ప్రేమించుకుంటేనే అవతలివారి విమర్శలకు గట్టి సమాధానాలు ఇవ్వగలం. లేదంటే అక్కడే ఆగిపోతాం! జీవితమన్నాక అన్నీ ఉంటాయ్.. కష్టాలు కూడా క్లాస్మేట్స్ అనుకుని ముందుకు సాగిపోవాల్సిందే! కామెంట్స్ అంటారా.. డోంట్ కేర్ అంటూ లైట్ తీసుకోవాల్సిందే! ఆత్మవిశ్వాసమే అసలైన అందం అని మర్చిపోకండి.. ఎవరినైనా ప్రేమించేముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.. చదవండి: భార్య కోసం ప్రేమను త్యాగం చేసిన స్టార్ హీరో.. ఆయన మరణం కూడా మిస్టరీనే - పోడూరి నాగ ఆంజనేయులు -
Valentine's Day: మన ప్రేమలు ఏడు రకాలు!
ప్రేమంటే ఏమిటంటే.. ఒక వ్యక్తిపై మనకు కలిగే బలమైన ఉద్వేగ, మానసిక స్పందనే ప్రేమ. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరిని చూసినప్పుడు అందరికీ ఇలాంటి ఫీలింగ్ కలిగే ఉంటుంది. అది చాలా సహజం. మనిషి అనేకానేక అవసరాల మీదుగా స్వీయజ్ఞానం వరకూ సాగుతుందని ప్రఖ్యాత సైకాలజిస్ట్ అబ్రహాం మాస్లో అంటారు. మొదట బతకడానికి కావాల్సిన తిండి, నీరు, నిద్ర, ఆ తర్వాత రక్షణ అవసరాలు, ఆ తర్వాత ప్రేమావసరాలు. దానిపైన ఆత్మగౌరవం, స్వీయజ్ఞానం. అంటే ప్రేమ ప్రతి మనిషికీ తప్పని మానసికావసరం. అయితే మాస్లో ప్రకారం సెక్స్ తర్వాత ప్రేమ రావాలి. కానీ మన దేశంతోపాటు, చాలా సమాజాల్లో ప్రేమ తర్వాతే సెక్స్. ఇక ప్రేమ చుట్టూ ఎన్నెన్నో కథలు, కలలు, కవితలు. ప్రేమ చుట్టూ తీసిన సినిమాలెన్నో, పాటలెన్నెన్నో. వీటన్నింటిని వింటూ, చూస్తూ, చదువుతూ పెరిగినవారిలో ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రేమ భావన పుట్టక మానదు. అది ఎప్పుడు ఎవరిపై ఎలా పుడుతుందో చాలా కష్టం. ప్రేమకు హార్మోన్స్, ఫెర్మోన్స్ కారణమని బయాలజీ చెప్తుండగా… భావసారూప్యత, ఆకర్షణ కారణాలని సైకాలజీ చెబుతుంది. కాదుకాదు సోషల్ కండిషనింగ్ కారణమని సోషియాలజీ అంటుంది. మూలాలేవైతేనేం సెక్స్ ఎలా తప్పని శారీరకావసరమో, ప్రేమ కూడా అలాగే ఒక తప్పని మానసికావసరం. ఎవరికైనా అలాంటి అవసరం ఎప్పుడూ కలగలేదంటే వారి అవసరాన్ని అణచివేసేంత సోషల్, మోరల్ కండిషనింగ్ వారిపై జరిగిందని అర్థం. ప్రేమ సిద్ధాంతం.. ప్రేమ గురించి రకరకాల సిద్ధాంతాలున్నాయి. అందులో ప్రఖ్యాత సైకాలజిస్ట్ రాబర్ట్ స్టెర్నబర్గ్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఎక్కువ ఆమోదం పొందింది. ప్రేమలో passion, intimacy, commitment అనే మూడు అంశాలు ఉంటాయంటాడు స్టెర్నబర్గ్. వాటి ఆధారంగా ఏడు రకాల ప్రేమలున్నాయంటాడు. ఇష్టం: కేవలం ఇంటిమసీ మాత్రమే ఉండేది. ఇది స్నేహితుల మధ్య కూడా ఉంటుంది. వాంఛ: కేవలం ఒకరిపట్ల ఒకరికి ప్యాషన్ మాత్రమే ఉండేది. శూన్యప్రేమ: కేవలం నిబద్ధత మాత్రమే ఉండేది. పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత కొన్ని జంటలకు మిగిలేదిదే. రొమాంటిక్ లవ్: ఒకరికి పట్ల ఒకరికి తీవ్రమైన ఇష్టం, ఇద్దరిమధ్య సాన్నిహిత్యం ఉండేది. ఇందులో నిబద్ధత కనిపించదు. చాలామంది టీనేజ్ జంటల్లో కనిపించేది ఇలాంటి ప్రేమే. సహచర ప్రేమ: ఒకరిపట్ల ఒకరికి వాంఛ లోపించి.. కేవలం సాన్నిహిత్యం, నిబద్ధత మాత్రమే మిగిలిన ప్రేమ. పెళ్లయిన తర్వాత కొన్ని జంటల్లో మిగిలేది ఇలాంటి ప్రేమే. మూఢప్రేమ: ఇద్దరిమధ్య ఎలాంటి సాన్నిహిత్యం లేకపోయినా.. తీవ్రమైన భావావేశం, నిబద్ధత ఉండేది. సంపూర్ణ ప్రేమ: ఒకరిపట్ల మరొకరికి వాంఛ, ఇద్దరిమధ్య సాన్నిహిత్యం, ఒకరిపట్ల మరొకరికి నిబద్ధత ఉండేది. ప్రేమించుకుంటున్నామనుకునే చాలా జంటల్లో అరుదుగా కనిపించే ప్రేమ. ఒకసారి ప్రేమ పుడితే, ప్రేమలో పడితే జీవితాంతం ఆ వ్యక్తినే ప్రేమిస్తారనే, ప్రేమించాలనే అపోహ మనలో చాలామందికి ఉంది. ప్రేమనేది ఒక noun అనుకోవడం వల్ల వచ్చే సమస్యిది. కానీ ప్రేమ ఒక verb, అంటే ఒక ప్రక్రియ. ఒకసారి ప్రేమ పుట్టినా, ప్రేమలో పడ్డా.. దాన్ని నిలుపుకునేందుకు ఇద్దరూ నిరంతరం ప్రయత్నిస్తుండాల్సిందే. లేదంటే కొన్నాళ్లకు, కొన్నేళ్లకు ఒకరిపట్ల ఒకరికి passion దూరమై కేవలం సహచర ప్రేమ మాత్రమే మిగులుతుంది. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
స్కూల్‌మేట్స్.. కాలేజీలో ప్రేమ: నేను ఎస్సై.. తను టీచర్
ప్రేమ రెండక్షరాలు.. రెండు హృదయాలు.. ఇద్దరు మనుషులు.. ప్రేమ.. ఒక ధైర్యం.. ఒక సాహసం.. ప్రేమ అనిర్వచనీయం... చూపులు కలిసి.. మనుసులు ఒక్కటై జీవిత భాగస్వాములుగా కలకాలంగా జీవించేందుకు పునాది వేస్తుంది. ఆ జీవన ప్రయాణంలో ఏళ్లు గడిచినా.. ఇంకా కొత్తగానే అనిపిస్తుంది. ఆ మధుర స్మృతులను కలకాలం గుర్తుండేలా చేస్తుంది. ఇలా.. ఉమ్మడి కరీంనగర్‌జిల్లాకు చెందిన పలువురు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. క్లాసురూముల్లో మొదలైన ప్రేమను కలకాలం నిలుపుకుని ఆనందంగా గడుపుతున్నారు. ప్రేమ ఎంత మధురమో.. జీవితంలో స్థిరపడడం అంతే ముఖ్యమంటూ సూచిస్తున్నారు. ప్రస్తుత టీనేజీ యువత ఆకర్షణను ప్రేమ అనుకుంటూ.. జీవితంలో దారి తప్పుతున్నారని పలువురు హెచ్చరిస్తుండగా.. స్వచ్ఛమైన ప్రేమ కలకాలం నిలుస్తుందని మరికొందరు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పలు ఆలయాలు ప్రేమ పెళ్లిళ్లకు వేదికగా నిలవగా.. కొన్ని లవ్స్పాట్స్ వారి స్వీట్ మెమొరీస్‌కు వేదికవుతున్నాయి. నేడు ప్రేమికుల దినోత్సవంగా సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..!! ప్రేమ.. ఉద్యోగం.. పెళ్లి బుగ్గారం: మాది ప్రేమ వివాహం. నేను నా భార్య హరికరెడ్డి ఒకే పాఠశాలలో చదువుకున్నాం. పక్కపక్క గ్రామాలు కావడంతో పరిచయం పెరిగింది. కాలేజీ రోజులలో ప్రేమగా మారింది. పెద్దలకు తెలిసినా జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చారు. అప్పటికి నేను కానిస్టేబుల్ ఉద్యోగం సాధించా. తను బీఈడీ చదువుతోంది. కొద్దిరోజులకు స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించింది. రెండేళ్లకు నేను ఎస్సైగా ఎంపికయ్యాను. ఇటీవలే పెళ్లిబంధంతో ఒక్కటయ్యాం. ఇప్పుడు ఇద్దరం ఒకే నియోజకవర్గంలో ఉద్యోగాలు చేస్తున్నాం. ప్రేమ ఎంత ముఖ్యమో కెరియర్ అంతే ముఖ్యమని యువత గుర్తించాలి. – శ్రీధర్‌రెడ్డి, ఎస్సై బుగ్గారం, జగిత్యాల జిల్లా శాలపల్లి అబ్బాయి.. నేపాల్ అమ్మాయి. గొల్లపల్లి: జిల్లాలోని పెగడపల్లి మండలం శాలపల్లి గ్రామానికి చెందిన కొండి వెంకటి– లక్ష్మి దంపతుల కొడుకు రవి ఆరేళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నాడు. అక్కడే పనిచేసే నేపాల్‌కు చెందిన చంద్రమయ రాయ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్లక్రితం ఇరు కుటుంబాలను ఒప్పించి దుబాయ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఏడాది క్రితం వీరికి కుమారుడు జన్మించాడు. ప్రేమ, అనుబంధాలకు భాష, సరిహద్దులు అడ్డురావని రవి–చంద్రమయ రాయ్ చెబుతున్నారు. డాక్టర్ లవర్స్.. జమ్మికుంట: నా పేరు కన్నవేన తిరుపతి. సొంతూరు జమ్మికుంట మండలం మాచనపల్లి. కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సు చదువున్న సందర్భంలో హైదరాబాద్ మల్కాజిగిరికి చెందిన కె.స్వర్ణలతలో పరిచయం ఏర్పడింది. మొదట స్నేహితులుగా ఉన్నాం. తరువాత ప్రేమగా మారింది. 2015లో పీజీ చదువుతుండగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ఇరు కుటుంబాల అంగీకారంతో 2017లో వివాహం చేసుకున్నాం. ఇప్పుడు మాకు ముగ్గురు పిల్లలు. 2020 నుంచి జమ్మికుంటలో ఓ ఆస్పత్రి నెలకొల్పి వైద్య సేవలు అందిస్తున్నాం. – కన్నవేన తిరుపతి, జమ్మికుంట అల్గునూర్ అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి తిమ్మాపూర్: చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన అల్గునూర్ అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమను పదేళ్లు నిలుపుకుని, పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలెక్కారు. తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌కు చెందిన అరుణ్‌కుమార్ ఇంజినీరింగ్ పూర్తిచేసి పైచదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. శ్రీలంకలో డిగ్రీ చదివిన అజ్జూరా.. ఎంబీఏ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. 2014లో ఇద్దరూ పరిచయమయ్యారు. వారిమధ్య ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఆ ప్రేమను పెద్దలు అంగీకరించేందుకు చాలా సమయం పట్టింది. ఆలస్యమైనా పదేళ్లు నిరీక్షించారు. చివరకు తల్లిదండ్రులు వారి ప్రేమలోని నిజాయితీని గుర్తించి అంగీకరించారు. పెద్దల అంగీకారంతో అజ్జూరాతోపాటు ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను తీసుకుని అల్గునూర్‌కు వచ్చాడు అరుణ్‌కుమార్. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో హిందూ వివాహ చట్టం ప్రకారం గత డిసెంబర్లో వివాహంతో ఒక్కటయ్యారు. ఇక జనవరిలో ఈ జంట శ్రీలంక వెళ్లింది. వధువు కుటుంబసభ్యులు బౌద్ధులు కావడంతో అక్కడ ఇద్దరూ మరోమారు బౌద్ధ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. కులాంతర వివాహాల ‘మరిమడ్ల’ కోనరావుపేట(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల ప్రేమాలయంగా వర్ధిల్లుతోంది. ఆ ఊరి జనాభా నాలుగు వేలు. ఆ పల్లెలో దశాబ్దకాలంగా 30 జంటలు ఒక్కటయ్యాయి. కట్నాలు లేకుండా.. ఆదర్శ పెళ్లిళ్లు చేసుకున్నారు. అక్కడ కొట్లాటలు, గొడవలు, ‘పరువు’ హత్యలు కనిపించవు. ఈ ఊరిలో ప్రేమించుకున్న వాళ్లు ధైర్యంగా పెద్దలకు చెప్పి, పెళ్లి చేసుకుంటారు. ప్రభుత్వం జరిపించే కల్యాణమస్తు సామూహిక వివాహ వేదికలో నిజామాబాద్ జిల్లాకు చెందిన రవికుమార్‌తో ముంబయికి చెందిన రజిత వివాహాన్ని మరిమడ్ల వాసులు దగ్గరుండి జరిపించారు. -
మీ భార్యను ప్రేమిస్తున్నా.. సర్లే ఆమెకు చెప్తా!
Pat Cummins's response Goes Viral: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ది ప్రేమ వివాహం. ఈ స్టార్ బౌలర్‌కు 2013లో బెకీ బోస్టన్ అనే అమ్మాయితో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. మనసులు కలవడంతో ప్రేమపక్షుల్లా విహరిస్తూ పరస్పరం అభిరుచులు పంచుకున్న ఈ జంట.. 2020లో నిశ్చితార్థం చేసుకుంది. అప్పటికే సహజీవనం చేస్తున్న కమిన్స్- బెకీ 2021లో తాము తమ తొలి సంతానానికి జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటి ఏడాది అంటే 2022లో వివాహ బంధంలో అడుగుపెట్టారు. కుమారుడు ఆల్బీతో కలిసి సంతోషంగా జీవితం గడుపుతున్న ఈ జంట ఎప్పుటికప్పుడు కపుల్ గోల్స్ సెట్ చేయడంలో ముందుంటారు. గొప్ప తల్లి, భార్య, నా వాలైంటైన్ ఇక వాలంటైన్స్ డే సందర్భంగా భార్య బెకీతో కలిసి ఉన్న ఫొటోను ప్యాట్ కమిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘‘గొప్ప తల్లి, భార్య, నా వాలైంటైన్. సర్ఫింగ్ చేయడంలోనూ దిట్ట. ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు బెకీ’’ అంటూ సతీమణిపై ప్రేమను కురిపించాడు. మీ భార్యను ప్రేమిస్తున్నా ఇందుకు స్పందించిన ఓ నెటిజన్.. ‘‘నేను భారతీయుడిని.. మీ భార్యను ప్రేమిస్తున్నా’’ అంటూ కామెంట్ చేశాడు. అయితే, ప్యాట్ కమిన్స్ ఇందుకు హుందాగా బదులిస్తూ... ‘‘సరే.. ఈ సందేశాన్ని ఆమెకు చేరవేస్తాను’’ అని పేర్కొనడం వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Pat Cummins (@patcummins30) కాగా గతేడాది ప్యాట్ కమిన్స్ కెరీర్లో అద్భుతంగా గడిచింది. అతడి సారథ్యంలో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23, వన్డే వరల్డ్‌కప్-2023 టైటిల్స్ గెలిచింది. ప్రస్తుతం క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్న కమిన్స్ కుటుంబానికి సమయం కేటాయించాడు. rఇక ఐపీఎల్ తాజా సీజన్లో అతడు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలో దిగనున్నాడు. చదవండి: IPL 2024- SRH: తెలివైన నిర్ణయం.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా అతడే! Sanjana Ganesan: వదినమ్మ అంటూనే వెకిలి కామెంట్.. పో.. ఇక్కడి నుంచి! -
తెగిన గాలిపటం జీవిత భాగస్వామిని చేరుతుందట!
నేడు ఫిబ్రవరి 14.. ఒకవైపు వసంత పంచమి. మరోవైపు ప్రేమికుల రోజు. ఉత్తరప్రదేశ్‌లో వాలెంట్సైన్స్ డే సందర్భంగా గాలిపటాలు ఎగురవేస్తుంటారు. పతంగులను ఎగురవేయడం ద్వారా తమ ప్రేమను చాటుతున్నామని యూపీలోని మీరఠ్‌కు చెందిన యువత చెబుతోంది. యువతీ యువకులు తాము గాలిపటం ఎగురవేసినప్పుడు దాని దారం తెగితే.. అది నేరుగా వారి జీవిత భాగస్వాముల దగ్గరికి చేరుతుందని అంటుంటారు. మీరఠ్‌లో వాలెంటైన్స్‌డే సందర్భంగా ఆకాశమంతా గాలిపటాలతో నిండిపోయింది. ఈసారి ప్రత్యేకమైన గాలిపటాలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా గుండె ఆకారంలోని గాలిపటాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. కొన్ని గాలిపటాలలో అబ్బాయి, అమ్మాయిల రూపురేఖలు చిత్రీకరించారు. వాటి మధ్యలో హృదయాకారాన్ని తీర్చిదిద్దారు. -
వాలెంటైన్స్ డే స్పెషల్.. టాలీవుడ్ ప్రేమ జంటలు!
మరో ఏడాదిలో వాలెంటైన్స్ డే వచ్చేసింది. ఫిబ్రవరి 14 అనగానే ప్రేమ పక్షులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజును ఎందరో ప్రేమికులు ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్లాన్‌తో ఉంటారు. ప్రేమ అనే రెండు అక్షరాలను.. పెళ్లి వరకు తీసుకెళ్లిన వారు చాలా అరుదుగానే కనిపిస్తారు. రెండు అక్షరాలతో మొదలై.. అదే రెండక్షరాల పెళ్లిగా మారేదే నిజమైన ప్రేమకు నిదర్శనం. ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా అలా ప్రేమలో పడి.. పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ జంటలు చాలానే ఉన్నాయి. వారిలో మన స్టార్ హీరోలు కూడా ఉన్నారు. టాలీవుడ్ సక్సెస్ అయిన ప్రేమకథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. నాగార్జున-అమల: మొదట కిరాయి దాదా మూవీ సెట్స్‌లో కలుసుకున్న ఈ జంట ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో 1992లో (జూన్ 11న) వివాహం చేసుకున్నారు. ప్రేమ యుద్దం, చినబాబు, శివ, నిర్ణయం లాంటి చిత్రాల్లో జంటగా నటించారు. అయితే నాగార్జునని పెళ్లాడిన తర్వాత అమల సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత కూడా ఒకటి,రెండు సినిమాల్లో నటించింది. 2. రాజశేఖర్-జీవిత: తెలుగు స్టార్ హీరోల్లో రాజశేఖర్ అంటేనే ఓ స్పెషల్. రాజశేఖర్, జీవిత జంటగా సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. మొదట జీవితనే రాజశేఖర్‌కు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత మూడేళ్లపాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఆహుతి, స్టేషన్‌మాస్టర్, అంకుశం, బావ మరుదుల సవాల్ లాంటి చిత్రాలు వీరిద్దరూ కలిసి జంటగా నటించారు. 3. శ్రీకాంత్-ఊహా: 1994లో ‘ఆమె’ సినిమా షూటింగ్ సమయంలో శ్రీకాంత్, ఊహల మధ్య పరిచయం ఏర్పడింది. ఆమె, ఆయనగారు లాంటి చిత్రాల్లో కలిసి నటించారు ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో జంటగా నటించారు. వీరి ప్రేమను 1997 జనవరి 20న పెళ్లితో పదిలపర్చుకున్నారు. వీరి పెళ్లయిన ఏడాది తర్వాత ఆయనగారు చిత్రం విడుదలైంది. 4. మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్: 2000వ సంవత్సరంలో వంశీ చిత్రంలో మహేశ్ - నమ్రత కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. దాదాపు ఐదేళ్లపాటు సీక్రెట్‌గా తమ బంధాన్ని కొనసాగించారు. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 5. అల్లు అర్జున్-స్నేహ: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్నేహను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమెకు సినిమా ఇండస్ట్రీకి ఏ విధంగానూ సంబంధం లేకపోయినా.. అల్లు అర్జున్ ఓ స్నేహితుడి వివాహంలో తనను కలుసుకున్నారు. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు మార్చుకోవడం.. రోజూ ముచ్చట్లు చెప్పుకోవడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు.. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అల్లు అర్జున్- స్నేహరెడ్డిల 2011న మార్చి 6న జరిగింది. 6. రామ్ చరణ్-ఉపాసన: మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, ఉపాసన చిన్నప్పటి నుంచి స్నేహితులు. 2010లో విడుదలైన ‘ఆరేంజ్’ సినిమా నుంచి వీరిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 5 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు కుటుంబాల అంగీకారంతో జూన్ 14, 2012న వివాహం చేసుకున్నారు. అపోలో హాస్పిటల్ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసనకు సినిమాలతో సంబంధం లేదు. 7. లక్ష్మి మంచు-ఆండీ శ్రీనివాసన్: మోహన్ బాబు కూతురు లక్ష్మి మంచు.. ఆండీ శ్రీనివాసన్ని అనుకోకుండా కలిశారు. ఆమె చెన్నైలో తన స్నేహితురాలి వివాహానికి షాపింగ్‌కు వెళ్లినప్పుడు అతన్ని మొదటిసారి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆండీ, లక్ష్మి ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత ఈ జంట ఆగస్ట్ 4న 2006లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 8. నాని-అంజనా యలవర్తి: టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ ప్రేమజంట నాని-అంజనా యలవర్తి. నాని భార్య అంజన సాఫ్ట్వేర్ ఇంజినీర్. నాని విశాఖపట్నంలో వీడియో జాకీ(వీజే)గా ఉన్నప్పుడు అంజనా ఓ పని మీద అతన్ని కలిసింది. ఆ తర్వాత ఫోన్లో స్నేహితులుగా మారిన వీరిద్దరు ప్రేమాయణం కొనసాగించారు. ఐదేళ్లపాటు డేటింగ్ ఉన్నప్పటికీ ఎక్కడా రివీల్ చేయలేదు. ఆ తర్వాత చివరకు 27 అక్టోబర్ 2012న వివాహం చేసుకున్నారు. 9. నాగ చైతన్య-సమంత: 2009లో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏ మాయ చేసావే’ సినిమా సెట్స్‌లో యంగ్ హీరో నాగ చైతన్య, సమంతా రూత్ ప్రభు మొదటిసారి కలుసుకున్నారు. వీరిద్దరు ప్రేమలో పడిన తర్వాత ఆటోనగర్ సూర్య, మనం వంటి చిత్రాల్లో కలిసి నటించారు. చైతూ సూపర్ హిట్ ప్రేమమ్ చిత్రంలో సామ్ అతిథి పాత్రలో నటించింది. ఆ తర్వాత ఈ జంట ప్రేమ వివాహం చేసుకుంది. కానీ పెళ్లయిన నాలుగేళ్లకే 2021లోనే నాగచైతన్య- సమంత తమ వివాహాబంధానికి ముగింపు పలికారు. 10. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్.. నవంబర్ 1న 2023న పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్లో జంటగావరుణ్ తేజ్- లావణ్య జంటగా మిస్టర్ (2017), అంతరిక్షం చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. 2012లో అందాల రాక్షసి చిత్రం ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. అందాల రాక్షసి చిత్రానికి లావణ్య ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. అయితే సినిమాల్లో రాకముందు ఆమె హిందీ సీరియల్ ప్యార్ కా బంధన్ (2009)తో తొలిసారిగా నటించింది. 11.మంచు మనోజ్- భూమా మౌనిక టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఇండస్ట్రీలోకి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ వారి కుటుంబంతో ఉన్న పరిచయంతో భూమా మౌనికతో ప్రేమలో పడ్డారు. మంచు లక్ష్మీ నివాసంలో జరిగిన వివాహ వేడుకలో మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నారు. 12.సూపర్ స్టార్ కృష్ణ- విజయ నిర్మల సూపర్ స్టార్ కృష్ణ ‘సాక్షి’ సినిమాలో విజయ నిర్మలతో జోడీ కట్టారు. ఇద్దరి మనసులు కలవడంతో 1969లో రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో పెళ్లే అయినప్పటికీ ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్య దంపతులగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరితో పాటు ఇంకా టాలీవుడ్లో ప్రేమవివాహం చేసుకున్నా స్టార్స్ కూడా ఉన్నారు. సుమంత్- కీర్తి రెడ్డి, బాలాజీ-మధుమిత, వరుణ్ సందేశ్- వితికా షేరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. -
ఏ సినిమా ప్రేమలు... ఎవరి స్టయిల్ వారిదే!
ప్రేమించడం నిజజీవితంలో కాస్త అరుదే. అక్కడెవరో వాళ్లెవరో ప్రేమించారట, ఇక్కడెవరో ప్రేమించి పెళ్లి చేసుకున్నారట అంటూ వినడం తప్ప వాస్తవంలో ప్రేమ అందరికీ అంతగా అనుభవంలోకి రాదు. (కాపోతే కాలేజీల్లో విరివిగా కనిపించినా... చదువు ముగిసేనాటికి, మురిగిపోయే జస్ట్ సీజనల్ ప్రేమలవి). సినిమాల్లో అలా కాదు. ప్రతి మూవీలోనూ ప్రేమ ఉండనే ఉంటుంది. పట్టుబట్టి విషాదాంతం తీయాలని భీష్మించుకుంటే తప్ప... హీరో, హీరోయిన్ల ప్రేమ ఫలించి తీరుతుంది. విచిత్రం ఏమిటంటే... హీరోను బట్టి లేదా దర్శకుడిని బట్టి వారి వారి ప్రేమలకూ ఓ శైలి ఉంటుంది. హీరో మ్యానరిజంలాగా అదీ ప్రత్యేకంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. ఉదాహరణకు ఎన్టీఆర్ సినిమాల్లో అంతా జస్ట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రేమ. అక్కినేని వారి ప్రేమల్లా ఇక్కడ సంక్లిష్టతలుండవు. కాకపోతే అలనాటి గుండమ్మకథలో ‘కోలుకోలోయమ్మ కోలో నాస్వామి’ అంటూ పాడుతూ... ‘హేయ్ బుల్లెమ్మా...’ ‘ఓయ్ బుల్లెమ్మా’ అంటూ అరుపులు అరిచినా... ఆ తర్వాత ‘త్తిఖ రేగీ థిమ్మిరెఖ్ఖీ’ అంటూ యమగోల చేసినా... అప్పటి అరుపులతో ఇప్పుడు నడుం మీద చరుపులూ కనిపిస్తాయి. వెరసి అవి... దట్టంగా, దిట్టంగా మిళాయించిన మసాళాలా, గ్యాసెక్కువైన సోడాలా ఘాటుగా నాటుగా ఉంటాయంతే. ఎన్టీఆర్ ప్రేమలన్నీ దాదాపుగా ఒక హీరోయిన్‌తోనే... సిక్స్ లేన్స్ హైవే మీద ఎదురెవ్వరూ రాని ట్రాఫిక్‌లా సాఫీగా, హాయిగా సాగిపోయే ప్రేమలే. ఇక ఏఎన్నార్ దగ్గరికి వస్తే ఆయన సినిమా ప్రేమలన్నీ సంక్లిష్టంగా ఉంటాయ్. ఆయన ఎవరినో ప్రేమిస్తాడు... హీరోయిన్ కూడా యథాశక్తి ఏఎన్నార్‌ను లవ్ చేస్తుంది. కానీ మరెవరో సెకండ్ హీరోయిన్ కూడా నాగేస్రావ్నే లవ్ చేయడంతో... కుటుంబంకోసమో, చెల్లెలి ప్రేమ కోసమో... తప్పనిసరి పరిస్థితుల్లో అక్కినేని కూడా ఆమెనే ప్రేమించాల్సొస్తుంది. అంతే...! పాపం అక్కడో ఓ త్రికోణ ప్రేమ ఏర్పడటంతో త్రికోణమితి సూత్రాలూ, లెక్కలూ సినిమాలోకి వచ్చేసి ఈక్వేషన్లను చిక్కుముడుల్లా సంక్లిష్టంగా మార్చేస్తుంది. దాంతో ప్రేక్షకులు కూడా ఆ బెర్ముడా ట్రయాంగిల్లో చిక్కి... పాపం గిలగిల్లాడతారు. జామెట్రీ భాషలో చె΄్పాలంటే ఎన్టీఆర్వన్నీ సరళరేఖ ప్రేమలూ... ఏఎన్ఆర్ వన్నీ ట్రిగనామెట్రీ లెక్కలూ!! శోభన్బాబువి కూడా ఇంచుమించూ త్రికోణమితులేగానీ... ఆయన మనసు మరీ విశాలం కావడంతో ఇద్దరు హీరోయిన్లనీ మితిమీరి సమానంగా ప్రేమిస్తాడు. వారిద్దరి ప్రేమల్నీ తన మనసు సున్నితపు త్రాసులో సమానంగా తూస్తాడు. అద్దిగ్గో... అక్కడొస్తుంది కథలో బలం. నిజానికి ట్రిగనామెట్రీలన్నీ శోభన్బాబువే. నిజం చె΄్పాలంటే ఏఎన్నార్వి ‘సుడిగుండాలే’! ఇక సూపర్‌స్టార్ కృష్ణ ప్రేమలు కూడా దాదాపు ఎన్టీఆర్ ప్రేమల్లా స్ట్రెయిట్‌గా ఉంటాయి. కాకపోతే హీరోయినే ప్రేమించి ప్రేమించి పైపైన పైపైన పడిపోతుంటుంది. ఈమె తప్పనిసరిగా విలన్ కూతురే అయి ఉంటుంది. అంతగా పైపైన పడిపోయినందుకు కృష్ణ కూడా రుణం ఉంచుకోడు. పరిహారంగా డ్యూయెట్లలో ఈయన కూడా ఏదో ఓ టైమ్‌లో ఆమె ఎద మీద తలవాల్చి బదులు తీర్చుకుంటాడు. ఆ దృశ్యమే వాల్‌పోస్టర్‌గా మారి ప్రేక్షకుల్ని సినిమాకు ఆహ్వానిస్తుంది. చిరంజీవి హీరోయిన్ల తీరు కూడా ఇంచుమించూ సూపర్‌స్టార్ కృష్ణ స్టైల్లోనే ఉంటది. ఈయన కూడా కృష్ణలాగే హీరోయిన్ను ‘హేయ్ తింగరిబుచ్చి’ అంటూ తీసిపారేస్తూనో... ‘చెయ్యి చూశావా.. ఎంత రఫ్‌గా ఉందో’ అంటూ సరదా బెదిరింపులతో సందడి చేస్తుంటాడు. చిరంజీవి బెదిరిస్తాడు. హీరోయిన్ ప్రేమకోసం దేబిరిస్తుంది. ఇంకో విశేషం... చిరంజీవి సినిమాల్లోనూ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అయితే వాళ్లిద్దరూ తమ శక్తికొద్దీ హీరోని ప్రేమించినప్పటికీ... ఏఎన్నార్, శోభన్‌బాబు ప్రేమల్లోలా ఇక్కడ సంక్లిష్టతలుండవ్. ఆ ఇద్దరి ప్రేమలూ గ్లామర్ కోసమే. కాబట్టి ఈ ప్రేమల్లో సంఘర్షణలూ ఉండవు. ఇవన్నీ అందంగా చెదిరిపడ్డ సరళరేఖలే కావడంతో ప్రేక్షకులు అదిరిపడ్డానికి ఆస్కారాలుండవ్. ∙∙ హీరోల ప్రేమలకే కాదు... తెర మీద ప్రేమను చూపడంలోనూ దర్శకులకూ ఓ స్టైలుంటుందీ, ఓ మేనరిజముంటుంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ సినిమాలో హీరోయిన్ ప్రేమలన్నీ చాలా ఉదాత్తంగా ఉంటాయ్. నిజజీవితంలో ఏ హీరోయిన్లు కూడా ప్రవర్తించనంత ఉన్నతంగా ఉంటాయ్. అంతెందుకు... మన జీవితాల్లో మన చెల్లెలికో, మన కూతురికో విశ్వనాథ్ సినిమాలో లాంటి హీరో సంబంధం వస్తే స్ట్రెయిటవే వద్దనేస్తాం. అలాంటి హీరోకి మనింటి ఆడబిడ్డనివ్వం. డైరెక్టర్ రాఘవేంద్రరావు సినిమాలకు వద్దాం. ఇక్కడ ప్రేమలన్నీ ఫ్రూట్ జ్యూసులంత మధురంగా, పండ్లు తింటే సమకూరేంత ఆరోగ్యంగా నవనవలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా డ్యూయెట్లలో!. అప్పటిదాకా తీసిపారేసే హీరో కూడా... హీరోయిన్ ఎద మీద నడుములిరిగిపోయినట్టు వాలిపోయినట్టే... నడుములిరగకపోయినా ప్రేక్షకులూ ఆమె మీద అంతే మోతాదులో మనసు పారేసుకుంటారు. ∙∙ హీరో హీరోయిన్లకు తోడు, సపోర్టింగ్ క్యారెక్టర్లూ మేమూ ఉన్నామంటూ తగుదునమ్మా అంటూ వచ్చేస్తారు. వాళ్లూ హీరోయిన్ని ప్రేమిస్తారు. హీరోయిన్ దక్కాల్సింది హీరోకే కదా. అందుకే ప్రేమించిన పాపానికి... పాపం వాళ్లు తగిన మూల్యం చెల్లించి శంకరగిరి మాన్యాలకు ట్రైన్ టిక్కెట్టు అడ్వాన్సు బుకింగ్ చేయించుకుంటారు. అందరికీ తెలిసినా క్లైమాక్స్ వరకూ వాళ్లకా విషయం తెలియకపోవడమే ఇక్కడ విశేషం. ఉదాహరణకు... మాయాబజార్లో లక్ష్మణకుమారుడైన రేలంగి కూడా శశిరేఖ సావిత్రి మీద మనసు పడతాడు. కానీ నాగేస్రావ్కే కదా సావిత్రి దక్కాల్సిందీ! కాబట్టి... దర్శకుడు రేలంగిని ముప్పుతిప్పలు పెట్టిస్తాడు. చేతులు ఠక్కున అంటుకుపోవడంతో... చప్పట్లు కొట్టడానికి కూడా జంకేలా భయపడతాడు. పులిని చూసినట్టు భయపడటమనేది రేలంగికి నిజంగానే అనుభవంలోకొస్తుంది. అప్పుడు రేలంగైనా అంతే... ఇప్పుడు అదుర్స్‌లో బ్రహ్మానందానికైనా ఇంతే. సినిమాలు మారతాయి. హీరోలూ, హీరోయిన్లలో కొత్త తరాలు వస్తాయి. కానీ ప్రేమమాత్రం అజరామరంగా ఉండిపోతుంది. కాకపోతే ఒకనాటి పాత సినిమాల్లో ప్రేమ ఉదాత్తంగా ఉంటుంది. ఈ తర్వాత చిరంజీవి నాటి మధ్యయుగాల్లో కాస్త రఫ్‌గా ఉన్నా సరదా సరదాగా ఉంటుంది. ఇక ఈ తరం అర్జున్‌రెడ్డిలకు వచ్చేసరికి అప్పటి మేన్లీ మేన్ కాస్తా... ఇంకాస్త హార్ష్ అండ్ పవర్ఫుల్ అవుతాడు. యాంగ్రీయంగ్ కాస్తా యానిమల్ అయిపోతాడు. సినీ విమర్శకులంతా డార్విన్లాగా వచ్చేసి... పరిణామక్రమంలో ఆల్జీబ్రాలూ, ఆల్ కెన్ బి అఛీవ్డ్ బై హీరోలనే ఆ ధీరోదాత్తులు తమకు ఉన్న టైటిల్లోని ఉదాత్తత కోల్పోయి... ఆల్ఫా మేల్స్‌గా యానిమల్స్గా ప్రవర్తిస్తుంటారని సెలవిచ్చేస్తారు. హీరోయిన్లు మాత్రం అప్పుడూ ఇప్పుడూ డిల్లమొహాలేసుకుని, తెల్లబోతూ, జెల్లకొట్టే ఆ హీరోనే అనాదిగా, అనంతంగా, ఆత్రంగా అలా ప్రేమిస్తూనే ఉండిపోతారు. – యాసీన్ -
వాలెంటైన్ డే స్పెషల్.. ఈ ప్రేమకథ చిత్రాలు మీ కోసమే!
ప్రతి మనిషికి ప్రాణం ఉన్నట్లే .... ప్రతి మనసుకు ఓ ప్రేమకథ ఉంటుంది. ఒకరి ప్రేమ సఫలం... మరొకరిది విఫలం... ఇంకొకరిది త్యాగం... ఇలా ఒక్కో ప్రేమకథది ఒక్కో ముగింపు. మరి.. రానున్న ప్రేమకథా చిత్రాల్లో ఏ కథ ముగింపు ఎలా ఉంటుందో వెండితెర పైనే చూడాలి. ‘పడ్డారండి ప్రేమలో మరి..’ అంటూ సిల్వర్ స్క్రీన్ కోసం కొందరు హీరోలు–హీరోయిన్లు ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ ప్రేమకథా చిత్రాల గురించి తెలుసుకుందాం. సైనికుడి ప్రేమకథ... ‘ఛత్రపతి’, ‘మిర్చి’, ‘బాహుబలి’, ‘సలార్’... ఇలా యాక్షన్ చిత్రాలే కాదు.. ప్రభాస్ కెరీర్లో ‘వర్షం’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘రాధేశ్యామ్’ వంటి ప్రేమకథా చిత్రాలు కూడా ఉన్నాయి. తాజాగా ప్రభాస్ మరో ప్రేమకథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 2022లో ‘సీతారామం’ వంటి బ్లాక్‌బస్టర్ ప్రేమకథను ఇచ్చిన హను రాఘవపూడి మరో ప్రేమకథను రెడీ చేశారు. పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తారని టాక్. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తారనీ టాక్. అలాగే ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘రాజా సాబ్’ ఒకటి. ఫ్యాంటసీ హారర్ ఎలిమెంట్స్‌తో పాటు ఓ మంచి లవ్‌ట్రాక్ కూడా ఈ చిత్రంలో ఉందట. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్దీ కుమార్ హీరోయిన్లు. మరో లవ్‌స్టోరీ... ‘లవ్‌స్టోరీ’ (2021) చిత్రం తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కలిసి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మరో ప్రేమకథా చిత్రం ‘తండేల్’. నాగచైతన్యతో ‘ప్రేమమ్’ వంటి లవబుల్ సినిమా తీసిన చందు మొండేటి ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరంలకు చెందిన మత్స్యకారులు 2018లో గుజరాత్‌కు వలస వెళ్లి, సముద్రంలో చేపల వేటను కొనసాగిస్తుంటారు. ఓ 24 మంది మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు బందీలుగా చిక్కుతారు. వీరిలో ఓ మత్స్యకారుడి వివాహం జరిగి ఏడాది మాత్రమే అవుతుంది. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో ఆ మత్స్యకారుడు పాకిస్తాన్లో బందీ కాబడతాడు. ఈ వ్యక్తి జీవితం ఆధారంగా ‘తండేల్’ను ప్రేమకథప్రాధాన్యంగా తీస్తున్నారు మేకర్స్. ప్రేమికులే శత్రువులయితే... విడిపోయిన ప్రేమికులు శత్రువులుగా ఎదురుపడితే అనే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న లవ్‌స్టోరీ మూవీ ‘డెకాయిట్’. ‘ఒక ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. అడివి శేష్, శ్రుతీహాసన్ జంటగా నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాతో కెమెరామేన్ షానీ డియోల్ దర్శకుడిగా మారారు. రెండు ప్రేమకథల్లో... గత ఏడాది ‘బేబీ’ అనే లవ్‌స్టోరీ మూవీతో హిట్ అందుకున్నారు హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య (విరాజ్ మరో లీడ్ రోల్ చేశారు). ఈ ‘బేబీ’ జోడీ రిపీట్ అవుతోంది. ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమాకు కథ అందించగా, రవి నంబూరి దర్శకుడిగా పరిచయం కానున్నారు. అలాగే మరో లవ్‌స్టోరీ ‘డ్యూయెట్’ కూడా చేస్తున్నారు ఆనంద్ దేవరకొండ. ఈ ఎమోషనల్ లవ్‌స్టోరీ ఫిల్మ్‌లో రితికా సింగ్ కథానాయిక. మిథున్ వరదరాజ కృష్ణన్ దర్శకత్వం వహిసున్నారు. ఇలా ఒకేసారి రెండు ప్రేమకథా చిత్రాల్లో నటిస్తున్నారు ఆనంద్ దేవరకొండ. డబుల్ లవ్... డీజే టిల్లు ఓ డిఫరెంట్ లవర్. పిచ్చిగా ప్రేమిస్తాడు. ఆ ప్రేమలో తేడా వస్తే ప్రేయసినైనా జైలుకు పంపిస్తాడు. అలాంటి డీజే టిల్లు మళ్లీ లవ్‌లో మునిగాడు. మరి.. ఈసారి అతని లవ్‌స్టోరీ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలంటే మార్చి 29వరకు ఆగాల్సిందే. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న చిత్రం ‘టిల్లు స్క్వేర్’. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు ‘తెలుసు కదా’ అనే లవ్‌స్టోరీ కూడా చేస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లు. లైలా లవ్వు... ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి.. దేవుడా!’, ‘పాగల్’ వంటి లవ్‌స్టోరీ చిత్రాల్లో నటించారు విశ్వక్ సేన్. ఈ యంగ్ హీరో రీసెంట్గా మరో లవ్‌స్టోరీకి పచ్చజెండా ఊపారు. ఆ సినిమా పేరు ‘లైల’. ఈ సినిమాలో తానే టైటిల్ రోల్ చేస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తానని ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు విశ్వక్. దిల్ రుబా... కెరీర్లో తొలి సినిమానే ‘రాజావారు రాణిగారు’ వంటి లవ్‌స్టోరీ చేశారు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’, ‘సమ్మతమే’, ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రాల్లో మంచి లవ్‌ట్రాక్ ఉంది. ఇప్పుడు ఈ యంగ్ హీరో ఓ కంప్లీట్ లవ్‌స్టోరీ సినిమా చేస్తున్నారు. విశ్వ కరుణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ అని తెలిసింది. ఈ సినిమాకు ‘దిల్ రుబా’ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా లవ్‌స్టోరీస్ ఎక్కువగా అబ్బాయిల దృష్టి కోణంలో నుంచి వస్తుంటాయి. ఓ అమ్మాయి తన ప్రేమకథను చెబితే ఎలా ఉంటుంది? అనే అంశం ఆధారంగా వస్తున్న చిత్రం ‘ది గాళ్ ఫ్రెండ్’. ‘చి.ల.సౌ’ వంటి సినిమా తీసిన నటుడు– దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ కొత్త లవ్‌స్టోరీకి దర్శకుడు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ∙అభిషేక్ పచ్చిపాల, నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వంలో అర్షద్ తన్వీర్, ప్రకాశ్ ధర్మపురి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా నుంచి తాజాగా ‘నువ్వంటే ఇష్టం’ అనే పాటను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మంగళవారం విడుదల చేశారు. యస్. కె భాజీ ఈ సినిమాకు స్వరకర్త. ఇంద్ర , కోమల్ నాయర్, దీపు, స్వాతి శర్మ, ఇమ్రాన్, షీతల్ భట్ లీడ్ రోల్స్ చేసిన చిత్రం ‘ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని ‘నా కల..’ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ విడుదల చేశారు. లక్ష్మణ్ జెల్ల దర్శకత్వంలో చంద్ర ఎస్. చంద్ర, డా. విజయ రమేష్ రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. శ్రవణ్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈ ప్రేమికల దినోత్సవం (ఫిబ్రవరి 14) సందర్భంగా ఇప్పటికే విడుదలైన కొన్ని ప్రేమకథా చిత్రాలు మళ్లీ రిలీజ్ కానున్నాయి. ఆ వివరాలు... ►సిద్ధార్థ్, షామిలీ హీరోహీరోయిన్లుగా ఆనంద్ రంగ దర్శకత్వం వహించిన ‘ఓయ్!’ (2009), దుల్కర్ సల్మాన్– మృణాళ్ ఠాకూర్ జోడీగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతారామం’ (2022), గత ఏడాది విడుదలైన ‘బేబీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సూర్య ద్విపాత్రాభినయం చేసిన తమిళ చిత్రం ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ (2008) తెలుగు అనువాదం సైతం రీ రిలీజ్ అవుతోంది. ఇలా మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
వాలెంటైన్స్ డే వేళ... కొన్ని సరదా సంగతులు!
ఫిబ్రవరి 14... వాలెంటైన్స్ డే.. అంటే ప్రేమికుల రోజు. ఆ రోజున ప్రేమికులంతా ఆనంద డోలికల్లో మునిగితేలుతుంటారు. ప్రేమ ఊసులు చెప్పుకుంటారు. అయితే వాలెంటైన్స్ డేకు సంబంధించిన కొన్ని ఆసక్తికర సంగతులు చాలామందికి తెలియవు. వాటిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం. మొదటి వాలెంటైన్ డే వేడుక 15వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో జరిగింది. మొదటి అధికారిక వాలెంటైన్స్ డే పారిస్‌లో జరిగిందని చెబుతారు. ఫిబ్రవరినాటి మధ్యస్థ రోజుల్లో పక్షుల సంభోగంలో పాల్గొంటాయట. అందుకే ఇది శృంగారాన్ని జరుపుకోవడానికి తగిన సమయమని అంటుంటారు. వాలెంటైన్స్ డే నాడు ప్రతి సంవత్సరం 145 మిలియన్ గ్రీటింగ్ కార్డ్‌లను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. యునైటెడ్ స్టేట్స్లో అత్యధిక వాలెంటైన్స్ గ్రీటింగ్ కార్డులు పంచుకుంటారట. పెంపుడు జంతువుల యజమానులలో 25 శాతం మంది వాలెంటైన్స్ డే సందర్భంగా తమ పెంపుడు జంతువులకు వాలెంటైన్స్ డే బహుమతులు ఇస్తారు. అంటే వాలెంటైన్స్ డే.. కేవలం మనుషులకే కాదు కుక్కలు, పిల్లులు,పక్షులు, ఇతర పెంపుడు జంతువులకు సంబంధించినది కూడా. హృదయాకార మిఠాయిలను 1800లో తయారుచేశారట. బోస్టన్ ఫార్మసిస్ట్ ఆలివర్ చేజ్ వీటిని తయారుచేసే ప్రక్రియను సులభతరం చేయడానికి ఒక యంత్రాన్ని కనుగొన్నాడు. ప్రతి సంవత్సరం ఎనిమిది బిలియన్ల హృదయ సంభాషణలు రూపొందిస్తారట. వివిధ రకాల క్యాండీలపై క్లాసిక్ రొమాంటిక్ పదబంధాలలో ‘బి మైన్’, ‘క్యూటీ పై’ ‘ఐ యామ్ యువర్స్’ అనే అక్షరాలను ముద్రిస్తారు. వాలెంటైన్స్ డే నాడుప్రేమికులు 58 మిలియన్ పౌండ్ల విలువైన చాక్లెట్లు, మిఠాయిలను కొనుగోలు చేస్తారట. వాలెంటైన్స్ డే మిఠాయి అమ్మకాలలో గుండె ఆకారంలో ఉండే చాక్లెట్ బాక్స్‌లు దాదాపు 10శాతం ఉంటాయి. 1850లో క్యాడ్బరీ కంపెనీ చాక్లెట్లతో కూడిన బాక్స్ రూపొందించింది. దశాబ్ధకాలం తరువాత మొదటి గుండె ఆకారపు చాక్లెట్ బాక్స్‌ను తయారయ్యింది. మొదటి వాలెంటైన్స్ డే గ్రీటింగ్ కార్డు జైలు నుండి పంపించారు. డ్యూక్ ఆఫ్ ఓర్లీన్స్ 15వ శతాబ్దం ప్రారంభంలో ఖైదీగా మారినప్పుడు మొదటి వాలెంటైన్ లేఖ రాశాడు. దానిలో ఒక కవిత రాసి, తన రెండవ భార్యకు పంపాడు. అయితే అతను జైలులో ఉన్నందున ఆ కవితకు ఆమె నుంచి వచ్చిన స్పందనను అతను చూడలేదు. అత్యధికంగా టీచర్లు వాలెంటైన్డే గ్రీటింగులను అందుకుంటారు. వాలెంటైన్స్ డే కోసం 250 మిలియన్ల గులాబీలను పండిస్తారు! రోమన్ ప్రేమ దేవత వీనస్‌కు ఇష్టమైనవి ఎరుపు రంగు గులాబీలు. ఇవి శృంగారాన్ని, ప్రేమను సూచిస్తాయి. -
'వాలెంటైన్స్ డే' రోజు షాకివ్వనున్న డ్రైవర్లు, డెలివరీ బాయ్స్!
మెరుగైన వేతనం, మెరుగైన పరిస్థితుల కోసం వాలెంటైన్స్ డే సందర్భంగా టేక్అవే డెలివరీ డ్రైవర్లు సమ్మె (స్ట్రైక్) చేయాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే డెలివరూ, ఉబెర్ ఈట్స్‌తో సహా నాలుగు ఫుడ్ యాప్‌ల డ్రైవర్లు, రైడర్లు ఈ స్ట్రైక్‌లో పాల్గొంటారని సమాచారం. రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫుడ్-ఆర్డరింగ్ యాప్‌లలో పనిచేసే వేలమంది డెలివరీ వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొంటారు. దీనికి సంబంధించి 'డెలివరీజాబ్ యూకే' ఇన్స్టాగ్రామ్ పేజీలో ఓకే పోస్ట్ చేశారు. ఇందులో చాలీచాలని వేతనాలకు నిరంతరాయంగా పని చేయడం కంటే మా హక్కుల కోసం కొన్ని గంటలు త్యాగం చేయడం చాలా అవసరమని వెల్లడించారు. స్ట్రైక్ చేయడానికి కారణం, 'ప్రతి రోజూ దోపిడీకి గురవుతూ, మా జీవితాలను పణంగా పెట్టి అలసిపోయాము. ఇది మా గొంతులను వినిపించాల్సిన సమయం వచ్చింది. మేము చేసే పనికి మాకు న్యాయమైన పరిహారం కావాలి' అని చెప్పడమే. డెలివరీ జాబ్ చేసే యూకే డ్రైవర్లు ప్రతి డెలివరీకి 2.80 పౌండ్స్ నుంచి 3.15 పౌండ్స్ మధ్య సంపాదిస్తారు. ఈ చెల్లింపు కనీసం 5 పౌండ్స్‌కు పెరగాలని కోరుకుంటున్నారు. యూకేలో మాత్రమే కాకుండా యూఎస్‌లో దాదాపు 1,30,000 మంది డ్రైవర్లు ఈ సమ్మెకు మద్దతు తెలియజేయనున్నట్లు జస్టిస్ ఫర్ యాప్ వర్కర్స్ తెలిపింది. ఇదీ చదవండి: ఈ స్కిల్ మీలో ఉంటే చాలు.. ఉద్యోగం రెడీ! View this post on Instagram A post shared by Delivery Job UK (@deliveryjobuk) -
‘కిస్ డే’ ఎలా పుట్టిందో.. ప్రాధాన్యత ఏంటో తెలుసా?
వాలెంటైన్ వీక్‌లో ప్రేమికుల రోజుకు ముందుగా వచ్చే రోజును ‘కిస్ డే’ అని అంటారు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రేమికులు పరస్పరం ముద్దులు ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటారు. వాలెంటైన్ వీక్‌లో ఫిబ్రవరి 13న ‘కిస్ డే’గా సెలబ్రేట్ చేస్తారు. ప్రేమించిన వారికి ముద్దు పెట్టి తమ ప్రేమను వారి ఎదుట వ్యక్తం చేస్తారు. ఇంతకీ ఈ వాలెంటైన్ వీక్‌లోకి ‘కిస్ డే’ ఎలా వచ్చింది? దీని ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమికుల వారోత్సవంలో ఈ వారమంతా కలిసి సమయాన్ని వెచ్చించేందుకు ప్రేమికులంతా ప్లాన్ చేసుకుంటారు. తమకు ఇష్టమైర రీతిలో గడిపేందుకు ఈ వారాన్ని ప్రత్యేకంగా కేటాయిస్తారు. అయితే వాలంటైన్ వీక్‌లో వచ్చే ‘కిస్ డే’ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందినప్పటికీ, దీని చరిత్రకు సంబంధించిన వివరాలు చాలామందికి తెలియదు. నిజానికి ‘కిస్ డే’ అనేది ప్రేమ జంటల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. జంటల మధ్యనున్న రిలేషన్‌ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. చాలామంది ప్రేమికులు ప్రేమలో తమ కొత్త ప్రయాణానికి ముద్దుతో శ్రీకారం చుడతారు. ‘కిస్ డే’.. వాలెంటైన్స్ డేని మరింత రొమాంటిక్‌గా మారుస్తుంది. ప్రేమికులు తమలోని ప్రేమ, ఆప్యాయతలను వ్యక్తపరచడానికి ఇదొక అర్థవంతమైన మార్గమని చెబుతుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఉండే ముద్దులో పరస్పర ఆప్యాయత తొణికిసలాడుతుంది. ఈ కిస్ డే అనేది 19వ శతాబ్ధం నాటి విక్టోరియన్ శకంలో అత్యంత ప్రజాదరణ పొందిందని చెబుతుంటారు. ఆ సమయంలో బహిరంగంగా ముద్దు పెట్టుకోవడాన్ని తప్పుగా చూసేవారట. అందుకే కిస్డేని సీక్రెట్‌గా చేసుకునేవారని చెబుతారు. ప్రపంచంలోని వివిధ దేశాలలో కిస్ డేను జరుపుకుంటారు. తమ సన్నిహితులపై తమకు ఉండే అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు ఈ రోజును సద్వినియోగం చేసుకుంటారు. కొన్ని దేశాల్లో ప్రేమికులు అక్కడ నిర్వహించే రొమాంటిక్ ఈవెంట్లలో పాల్గొని ముద్దులు పెట్టుకుంటారు. ఇళ్లలోనూ దీనిని ఘనంగా సెలబ్రేట్ చేసుకునేవారు ఉన్నారు. ముద్దు అనేది ప్రేమ, అభిరుచితో పాటు ఓదార్పు, ఆనందంతో సహా పలు భావాలను వ్యక్త పరుస్తుంది. నిజానికి ముద్దు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య సాన్నిహిత్యాన్ని మరింతగా పెంచుతుంది. వారి సంబంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. మాట కన్నా ముద్దుతో ప్రేమను సంపూర్ణంగా వ్యక్తం చేయవచ్చని చాలామంది చెబుతుంటారు. కిస్ డే సందర్భంగా ప్రేమికులు తమ ప్రైవేట్ క్షణాలను ఆనందంగా గడుపుతారు. చాక్లెట్లు, పూలు లేదా ప్రేమ లేఖలు ఇచ్చి, ఈ డేని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కిస్ డే అనేది పాశ్చాత్య పోకడలు కలిగిన రోజు కావడంతో భారత్‌లో దీనికి అంత ప్రాధాన్యత లేదు. అందుకే ప్రేమికులు ఈ రోజును ప్రైవేట్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. -
valentines day: అందంగా మెరిసిపోవాలనుకుంటున్నారా?
ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ప్రేమికుల సందడి మొదలవుతుంది. ఎక్కడ చూసినా ‘వాలంటైన్స్ డే ’ఫీవరే. వాలెంటైన్ వీక్ అంటూ ప్రేమికులు వారం రోజులపాటు సంబరాలు చేసుకుంటారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవంతో ఈ సంబరాలు పీక్ అన్నట్టు. మరీ మీ ఫేస్ అందంగా, ఫుల్ వాలెంటైన్ గ్లోతో అచ్చమైన చందమామలా మెరిసిపోవాలిగా? అందుకే... ఈ చిట్కాలు మీ కోసమే...! ♦అరకప్పు కీరాదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి మిక్స్ చేయండి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. కీరాదోస పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది. ఇది ముడతలు, సన్నని గీతలు వంటి సమస్యలు దూరం అవుతాయి. ♦ ఒక పాత్రలో బార్లీ గింజల పొడిని తీసుకుని అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. దీన్ని 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తుంటే.. మచ్చలు, మృత కణాలు తొలగిపోయి ముఖ చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. ♦ పాలల్లో కొద్దిగా ఓట్స్ వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత ఇందులో కాస్త పెరుగు, తేనె వేసి బాగా కల΄ాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట అప్లై చేసుకుని బాగా ఆరనివ్వాలి. తర్వాత మైల్డ్ క్లెన్సర్ ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మంపై ఉండే బ్లాక్‌హెడ్స్ సులభంగా తొలగిపోతాయి. ♦ రెండు టీస్పూన్ల వేప పొడి, ఒక స్పూన్ నిమ్మరసం తీసుకోండి. వీటిని మెత్తగా చేసి ముఖం, మెడ భాగాలల్లో రాయాలి. పావు గంట తర్వాత చల్లటి నీటితో వలయాకారంలో ముఖాన్ని రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం కాంతిమంతంగా మెరుస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చర్య సౌందర్యానికి సమతుల్య ఆహారం తీసుకోవడం ఎప్పుడూ ముఖ్యమైనది. చివరి నిమిషంలో మొటిమలు రాకుండా ఉండటానికి చక్కెర ,పాల ఆహారాలకు దూరంగా ఉండండి. ఒక కప్పు వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగితే మచింది. ఇలాచే స్తే టాక్సిన్స్ అన్నీ పోయి చర్మానికి మెరుపు వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. బ్రోకలీ బచ్చలికూర, క్యారెట్లు, అవకాడోలు, అరటిపండ్లు, యాపిల్స్, పుచ్చకాయలులాంటి వాటిని డైట్లో చేర్చుకోండి. తగినంత నీరు త్రాగడం మీ చర్మాన్ని లోపలినుంచి ఆరోగ్యంగా ఉంచుతుందనే మర్చిపోకూడదు. -
ప్రేమికులూ జరభద్రం!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రేమికులపై ఫోకస్ పెట్టారు. వాలెంటైన్స్ డే దగ్గర పడుతుండడంతో డిస్కౌంట్లు, ఆఫర్లు, సర్ఫ్రైజ్ గిఫ్ట్ లు, గిఫ్ట్ కూపన్లు అంటూ సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. ఏటా ఈ తరహా మోసాలు షరామామూలే అయినా.. ఎప్పటికప్పుడు సైబర్ నేరగాళ్ల బారిన పడే బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉందని సైబర్ భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు తెరతీ స్తున్నారు. మీకు అత్యంత సన్నిహితులు వాలెంటైన్స్ డే సందర్భంగా మీకు సర్ఫ్రైజ్ గిఫ్ట్ పంపారు.. దాన్ని పొందాలంటే మేం చెప్పిన ఖాతాకు కస్టమ్స్ చార్జి కోసం కొంత మొత్తం పంపండి అంటూ వల వేస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రధానంగా చేస్తున్న మోసాలు చూస్తే.. షాపింగ్ ఫ్రాడ్స్..: ఆన్లైన్ షాపింగ్, బెస్ట్ ఆఫర్స్, గిఫ్ట్‌లు, డిన్నర్లు అంటూ సోషల్‌మీడియా ఖాతాల్లో మోసపూరిత యాడ్స్ ఇస్తు న్నారు. ఈ ఆఫర్ల కోసం సంప్రదించే వారి నుంచి వ్యక్తిగత, బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని మోసం చేస్తున్నారు. ఫిషింగ్ ఈమెయిల్స్.. సైబర్ నేరగాళ్లు వాలెంటైన్స్ డేకు సంబంధించి ప్రత్యేక కొటేషన్లు, మెసేజ్‌లు, ఎమోజీలు, గ్రాఫిక్ వీడియోలు అంటూ ఫిషింగ్ లింక్‌లను ఈమెయిల్స్‌కు పంపుతున్నారు. వీటిపై క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్, ల్యాప్‌టాప్‌లోకి మాల్వేర్ వచ్చేలా చేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు. ఈ విషయాలు మరవొద్దు..: ► ఆన్లైన్లో వాలెంటైన్స్ డే గిప్ట్‌లు కొనాలంటే నమ్మదగిన ఈ కామర్స్ వెబ్సైట్లనే ఉపయోగించాలి. కొత్త యాప్స్ వినియోగించాల్సి వస్తే వాటి రేటింగ్ తప్పక చూసుకోవాలి. వాలెంటైన్స్ డే ప్యాకేజీలు, గిఫ్ట్‌ల పేరిట నమ్మశక్యం కాని ఆఫర్లు ఉంటే అది సైబర్ మోసగాళ్ల అనుమానాస్పద ప్రకటనగా గుర్తించాలి. ►అనుమానాస్పద మెసేజ్‌లు,ఈ మెయిల్స్‌లోని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. మీ వ్యక్తిగత, బ్యాంకు ఖాతా నంబర్లు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు, పిన్ నంబర్లు, సీవీవీ నంబర్లు ఎవరితోనూ పంచుకోవద్దు. -
వాలెంటైన్స్ డే: ఈ క్రెడిట్ కార్డుల ఆఫర్లతో మరింత ఆనందంగా..
ప్రేమ పక్షులు ఎదురుచూస్తున్న వాలెంటైన్స్ డే వచ్చేస్తుంది. ఆ రోజున తమ ప్రేమను తెలియజేసేందుకు, ఆనందంగా గడిపేందుకు ఏడాదంతా ఎదురు చూస్తారు. ప్రత్యేకమైన ఈరోజున ప్రేమికులు ప్రధానంగా డైనింగ్ కోసం రెస్టారెంట్లకు వెళ్తుంటారు లేదా నచ్చిన ఫుడ్‌ను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భంలో మంచి డిస్కౌంట్ ఆఫర్లు ఉంటే మరింతగా ఆనందించవచ్చు కదా.. వాలెంటైన్స్ డే నాడు అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు అందించే కొన్ని క్రెడిట్ కార్డుల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. బజాజ్ ఫిన్సర్వ్కు అనుబంధ సంస్థ అయిన బజాబ్ మార్కెట్స్ డైనింగ్‌పై డిస్కౌంట్లు అందిస్తున్న కొన్ని క్రెడిట్ కార్డుల గురించి తెలియజేసింది. ప్రేమికుల రోజును మరింత ఆనందంగా జరుపుకోవాలనుకుంటున్నవారు బజాబ్ మార్కెట్స్ వెబ్‌సైట్‌కి వెళ్లి వీటి గురించి తెలుసుకోవచ్చు. వాటిలో ముఖ్యమైన కొన్ని క్రెడిట్ కార్డుల గురించి ఇక్కడ అందిస్తున్నాం.. యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డు క్యాండిల్ లైట్ డిన్నర్లు ప్లాన్ చేస్తున్నవారికి ఈ క్రెడిట్ ఉపయోగపడుతుంది. ఇది స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసే ఫుడ్ డెలివరీలపై తక్షణ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ కార్డుకు రూ.500 జాయినింగ్ ఫీజు ఉంటుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ప్లాటినమ్ ఆరా ఎడ్జ్ క్రెడిట్ కార్డు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా వాలైంటైన్స్ పార్టీలకు చేసే రెస్టారెంట్ బిల్లులపై 1.5 సేవింగ్ పాయింట్లు లభిస్తాయి. ఇక్కడ మరో ప్రయోజనకర విషయం ఏమిటంటే దీనికి ఎలాంటి వార్షిక ఫీజు లేదు. యాక్సిస్ బ్యాంక్ నియో క్రెడిట్ కార్డ్ దీనిపై ఏకంగా 15 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కార్డు పార్ట్నర్ రెస్టారెంట్లలో చేసే డిన్నర్లకు ఇది వర్తిస్తుంది. అయితే ఈ క్రెడిట్ కార్డుకు రూ.250 జాయినింగ్ ఫీజు ఉంటుంది. -
వాలైంటైన్స్ డే స్పెషల్.. 9 సూపర్ హిట్ చిత్రాలు రీ రిలీజ్
ప్రేమికుల రోజు రానుంది. ఈ రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఇప్పటికే ప్లాన్స్ వేసే ఉంటారు. తన ప్రియురాలు/ ప్రియుడికి ఎలాంటి కానుకలు ఇవ్వాలని ఆలోచించే ఉంటారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారు మొదట ఎక్కడ కలుసుకున్నారో ఆ నాటి స్మృతులను మరోసారి గుర్తుచేసుకుంటారు. ప్రేమించేవారిని ఎలా సర్ప్రైజ్ చేయాలో నిర్ణయానికి వచ్చి ఉంటారు. వాట్సప్ డీపీగా ఏ ఫొటో పెట్టాలో... ఫేస్బుక్ పేజీలో ఏ కవిత పోస్ట్ చేయాలో... ఇన్‌స్టాగ్రాంలో ఏ చిత్రం పంచుకోవాలో.. సిద్ధంగా ఉంచుకునే ఉంటారు. ఇలా చాలా మంది ప్రేమికులకు సినిమా అనేది ఒక భాగం. అందుకే ప్రేమ గురించి గతంలో లెక్కలేనన్ని సినిమాలు వచ్చేశాయి. అలా ప్రేమికులను మెప్పించిన ఆ సినిమాలు మళ్లీ రీరిలీజ్ అవుతున్నాయి. వాలెంటైన్స్ డే నాడు వచ్చే చిత్రాలు ఏంటో చూద్దాం. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కాంబినేషన్లో 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' చిత్రం విడుదలై సూపర్ హిట్ కొట్టింది. 2008లో విడుదలైన ఈ సినిమా గతేడాదిలోనే రీ రిలిజ్ అయి భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల అవుతుంది. ఇందులో హీరో సూర్య డ్యుయల్ రోల్లో మెప్పించాడు. హ్యారీస్ జైరాజ్ సంగీతం ఈ మూవీకి పెద్ద ప్లస్ అయింది. సిద్ధార్థ్ ప్రేమ కథా చిత్రాల్లో 'ఓయ్' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో షామిలీ హీరోయిన్గా అద్భుతంగా నటించింది. ఈ సినిమా 2009లో రిలీజ్ అయి మంచి లవ్ స్టోరీగా మిగిలిపోయింది. సుమారు 15 ఏళ్ల తర్వాత వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి మరోసారి వచ్చేస్తుంది. ఈ సినిమా కోసం యూత్ బాగానే ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పాన్ ఇండియా రేంజ్లో భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం సీతారామం. 2022లో వచ్చిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఎమోషనల్ లవ్ స్టోరీతో ఆకట్టుకుంది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా క్లాసికల్ హిట్‌గా నిలిచింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి మరోసారి వచ్చేస్తుంది. 1998లో బ్లాక్‌బస్టర్ అందుకున్న తొలిప్రేమ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం ప్రేమికుల మనసులను గెలుచుకొని బ్లాక్బాస్టర్ అయింది. ఒక రకంగా పవన్‌కు ఈ చిత్రం స్టార్‌డమ్‌ను కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఇప్పటికే గతంలో రీ రిలీజ్ కావడంతో ఇప్పుడు తక్కువ సంఖ్యలో మాత్రమే థియేటర్లలోకి రానుంది. అలానే ఈ చిత్రాలతో పాటు సిద్ధార్, త్రిష జంటగా నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', పన్నెండేళ్ల క్రితం శర్వానంద్, అంజలి జై కాంబినేషన్లో వచ్చిన 'జర్నీ' సినిమా కూడా రీ రిలీజ్ కానున్నాయి. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ పలు ప్రేమ కథా చిత్రాలు రీ రిలీజ్ కానున్నాయి. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్ తో పాగల్ హై', మొహబ్బతే వంటి హిట్ సినిమాలు కూడా రానున్నాయి. ఈ వాలెంటైన్స్ డే నాడు సినిమా అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు. -
ప్రేమికుల రోజుని జైల్లో సెలబ్రేట్ చేసుకోవడం గురించి విన్నారా?
వాలెంటైన్స్ డేని కేవలం ప్రేమికులే గాక పెద్దల అంగీకారంతో చేసుకున్న జంటలు కూడా హ్యాపీగా చేసుకుంటారు. అంతేగాదు మనల్ని ఎంతగానో ప్రేమించే మన ఆత్మీయులు, స్నేహితులు కూడా ఆ రోజుని ఎంతగానో సెలబ్రెట్ చేసుకుంటారు. అయితే ఆ రోజు కచ్చితంగా చాలమంది బయటే డిన్నర్ చేసేందుకు ప్లాన్లు చేస్తుంటారు. ఇది కామన్. అయితే విలక్షణతను ఇష్టపడే వాళ్లు మర్చిపోలేని గుర్తులా ఉండేలా వెరైటీగా చేసుకునేందుకు ఆరాటపడుతుంటారు. అలాంటి వాళ్లు ఈ జైల్లోని ఖైదీల సెల్లో చేసుకోండి. అంతేగాదండోయ్! ప్రేమికుల రోజు సందర్భంగా విభిన్న రుచులతో కూడిన మెనూని కూడా ఆ జైలు అందిస్తోంది. ఖైదీలు ఉంచే సెల్లో డిన్నర్ చేస్తే ఎలా ఉంటుంది? అనే అనుభూతి కూడా పొందొచ్చు. ఎక్కడ? ఏ జైలు ఈ ఆఫర్ అందిస్తోందంటే..? వివరాల్లోకెళ్తే..బ్రిటన్ ఆక్స్ఫర్డ్ జైలు ప్రేమికులకు గొప్ప ఆఫర్ అందిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా సరదాగా సెల్లో డిన్నర్ చెసేలా వసతులు ఏర్పాటు చేసింది. పైగా అందుకోసం ప్రత్యేకమైన మూడు విధాన మెనూని కూడా ఏర్పాటుచేసింది. అంతేగాదు ఆ జైలులో ఖైదీలు ఉండే సెల్లో తినాలనుకుంటే సుమారు 17 వేల రూపాయాలు వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఘోరమైన హత్యానేరాలకు పాల్పడ్డ ఖైదీలసెల్లో తినాలనుకుంటే ఏకంగా 19 వేలు వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ జైల్లో భోజనం చేయడానికి వచ్చే అతిథుల కోసం క్యాండిల్స్, పువ్వులతో అలంకరించిన డైనింగ్ టేబుల్ ఆహ్వానం పలుకుతుంది. మాంసాహారు కోసం బ్రైజ్డ్ బీఫ్ బ్లెడ్, షార్ట్ రిబ్ పిరోగి, వైన్ తదితర పానీయాలను అందిస్తారు. అలాగే శాకాహరలు కోసం టొమాటో టార్టేర్, కాల్చిన చీజ్ సౌఫిల్, బ్రైజ్డ్ క్యాబేజీ, చాక్లెట్, రాస్బెర్రీస్, పిస్తాతో డెకరేట్ సిన కేక్, కాక్టైల్ వంటి పానీయాలు కూడా ప్యాకేజ్‌లో ఉన్నాయి. ఇక్కడకు వచ్చే అతిథులు తమకు నచ్చిన ప్యాకేజ్ని ఎంపిక చేసుకోవచ్చని అని ఆక్స్ఫర్డ్ జైలు తన వెబ్సైట్లో పేర్కొంది. నిజానికి ఈ జైలు సుమారు వెయ్యి ఏళ్ల నాటి చారిత్రాత్మక కోట. 1073లో ఈ కోటని వైద్యశాలగా నిర్మించారు. అయితే 1642 నుంచి 1651ల మధ్య బ్రిటీషర్ల అంతర్యుద్ధం కారణంగా గణనీయమైన నష్టాన్ని ఎదుర్కొని 1786లో జైలుగా మార్చబడింది. అలా జైలుగా 1996 వరకు పనిచేసింది. ఆ తర్వాత ఆ ఆక్స్ఫర్డ్ జైలుని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మార్చేశారు. (చదవండి: ఆసియాలోనే ఉత్తమ మహిళా చెఫ్‌గా 'పిచాయా పామ్') -
కొత్త బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన హీరోయిన్, రొమాంటిక్ పిక్స్ వైరల్
ఐ, ఎవడు, రోబో 2.0 సినిమాలతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్. నటిగా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ జాక్సన్ పెళ్లికాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటామని ప్రకటించిన అమీ నుంచి ఇప్పటివరకు ఏ సమాచారం లేదు. అయితే అమీ జాక్సన్ బ్రిటీష్ నటుడు ఎడ్వెస్ట్విక్తో డేటింగ్లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ వార్తలపై ఏనాడు రియాక్ట్ కాలేదు ఆమె. చదవండి: పొలిటికల్ లీడర్‌ను పెళ్లాడిన హీరోయిన్ తాజాగా ఆ పుకార్లనే నిజం చేస్తూ కొత్త ప్రియుడిని పరిచయం చేసింది. ఎడ్వెస్ట్విక్తో ప్రేమలో ఉన్నట్టు వాలంటైన్స్ డే సందర్బంగా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఎడ్వెస్ట్వీక్తో దిగిన పలు రొమాంటిక్ పిక్స్‌ను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ వాలంటైన్స్ డే బేబీ, నీ అంతులేని ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని జత చేసింది. దీంతో ఆమె పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు క్యూట్ కపుల్ అంటూ హార్ట్ ఎమోజీలతో స్పందిస్తూంటే మరికొందరు ఆమె తీరుపై విమర్శిస్తున్నారు. పెళ్లి కాకుండానే సహజీవనం, బిడ్డకు జన్మనివ్వడం.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమయాణం ఏంటని తప్పుబడుతున్నారు. చదవండి: బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్.. ఆ స్టార్ డైరెక్టర్‌ను ఉద్దేశించేనా? View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) -
రెండుసార్లు బ్రేకప్.. అది బ్లాక్ డే అంటున్న బ్యూటీ
కోలీవుడ్ సంచలన హీరోయిన్లలో ఆండ్రియా ఒకరు అని చెప్పవచ్చు. ఏ విషయాన్నైనా చాలా బోల్డ్‌గా మాట్లాడే ఆండ్రియా నటి మాత్రమే కాదు మంచి గాయని కూడా. నటుడు శరత్‌కుమార్ హీరోగా నటించిన పచ్చైక్కిళి ముత్తుచ్చారం చిత్రం ద్వారా నాయకిగా పరిచయం అవగా ఆ తరువాత కమల్‌హాసన్, కార్తీ, ఉదయనిధి స్టాలిన్ వంటి పలువురు స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆండ్రియా తెలుగు, మలయాళం ప్రేక్షకులకు సుపరిచితమే. ఇకపోతే ఆ మధ్య యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో సరసాలు సాగించిన ఈ బ్యూటీ ఆ తరువాత ఆయనకు దూరం అయ్యారు.. కారణం తన కంటే అతని వయసు తక్కువ కావడమేనని ఒక భేటీలో బహిరంగంగానే చెప్పారు. ఇకపోతే ఇటీవల వివాహితుడైన ఒక వ్యక్తితో రెండేళ్లు రిలేషన్షిప్లో ఉండి జీవితాన్ని నాశనం చేసుకున్నానని చెప్పి వార్తల్లోకెక్కారు. ఆ తరువాత శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవడంతో ఆయుర్వేద చికిత్సతో అందులోంచి బయట పడినట్లు చెప్పారు. కాగా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఆండ్రియా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇది తనకు బ్లాక్ డే అని ట్వీట్ చేశారు. నల్లదుస్తులు ధరించిన తన ఫొటోను పెట్టి తాను ప్రస్తుతం సింగిలే అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈమె చేతిలో పిశాచి 2 చిత్రం మాత్రమే ఉంది. మిష్కిన్ దర్శకత్వం వహించిన ఇందులో ఆండ్రియా ప్రధాన పాత్రలో నటించారు. ఇది త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) చదవండి: వినరో భాగ్యము విష్ణుకథ హీరోయిన్ గురించి ఈ విషయాలు తెలుసా? -
వాలంటైన్స్ డే: తమన్నా-విజయ్ వర్మ రిలేషన్‌పై క్లారిటీ వచ్చేసింది?
ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెరపై తన అందం, అభినయం, డాన్స్‌తో కుర్రకారును కట్టిపడేస్తుంది. అలా మిల్కీ బ్యూటీగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే ఇప్పటికీ గాసిప్స్‌కు దూరంగా ఉన్న తమన్నా ఈ ఏడాది న్యూఇయర్ నుంచి డేటింగ్ రూమర్స్‌తో వార్తల్లోకి ఎక్కింది. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలో నటుడు విజయ్ వర్మకు లిప్‌లాక్ ఇచ్చి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. దీంతో అతడితో తమన్నా రిలేషన్లో ఉందంటూ ఒక్కసారిగా గాసిప్స్ గుప్పుమన్నాయి. దీనిపై ఇప్పటి మిల్కీ బ్యూటీ దీనిపై స్పందించకపోవడం గమనార్హం. అయితే తమన్నా రిలేషన్ స్టేటస్‌పై అభిమానులంతా సందేహంలో ఉన్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియక ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాలంటైన్స్ డే సందర్భంగా తమన్నాతో డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు నటుడు విజయ్. ప్రేమికుల రోజును పురస్కరించుకుని విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ ఓ పోస్ట్ షేర్ చేశాడు. అందులో ఎదురెదురుగా నిలుచుని ఉండి, ఇద్దరి కాళ్ల మధ్యలో హార్ట్ ఎమోజీని జత చేసి ఫొటో పోస్ట్ చేశాడు. అయితే ఈ ఫొటోలో వారి ముఖాలు కనపడకుండ జాగ్రత్త పడ్డాడు. విజయ్ ఎదురుగా ఉన్నది తమన్నా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు ఈ వ్యక్తి వేసుకున్న షూ, జాకెట్ ఆధారంగా అది తమన్నానే అంటూ పట్టేశారు నెటిజన్లు. గతంలో తమన్నా అచ్చం అలాంటి షూ, చేతిలో జాకెట్ పట్టుకుని ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాలంటైన్స్ డే రోజు స్పెషల్ పోస్ట్ షేర్ చేసి పరోక్షంగా తమన్నాతో రిలేషన్ రూమర్స్‌పై స్పష్టత ఇచ్చాడని నెటిజన్లంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇదే విషయాన్ని కన్ఫాం చేస్తూ తమన్నా ఫ్యాన్ పేజీలో ఓ ట్విటర్ యూజర్ పోస్ట్ కూడా షేర్ చేశారు. దీంతో ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. కాగా తమన్నా ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్ చిత్రంతో బిజీగా ఉండగా.. తమిళం, హిందీలో పలు చిత్రాలు చేస్తోంది. Exclusive Confirmed 👌🏻 Happy Valentine's day to #VijayVarma Live in partner @tamannaahspeaks parents arent in favour of Tamanna living with Vijay and getting married with him after few months. Her parents tried hard to change decision but she's behaving adamant. Look at choice pic.twitter.com/KJ07mDK1oM — ♥️Sneha Tamannaah 😘 💫 (@Tamannaahspeakk) February 14, 2023 -
వాలెంటైన్స్ డే సాక్షిగా బయటపడ్డ ఇద్దరు స్టార్ క్రికెటర్ల సీక్రెట్స్
క్రికెట్ ఫాలోవర్స్‌కు 2023 వాలెంటైన్స్ డే ప్రత్యేకంగా గుర్తుండిపోనుంది. ఈ రోజు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా మళ్లీ పెళ్లి చేసుకోగా.. టీమిండియా నవ యువ సంచలన క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా పర్సనల్ వ్యవహారాలు బయటపడ్డాయి. హార్ధిక్.. తన భార్య నటాశాను ఉదయ్‌పూర్‌లో మళ్లీ మనువాడగా.. శుభ్‌మన్ గిల్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ల ప్రేమ వ్యవహారం వెలుగుచూసింది. గిల్ వాలెంటైన్స్ డే రోజు సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఆధారంగా గిల్-సారాలు డేటింగ్ చేశారు/చేస్తున్నారని అభిమానులు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. పృథ్వీ షా విషయానికొస్తే.. పర్సనల్ లైఫ్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకునే ఈ ముంబై కుర్రోడు.. వాలెంటైన్స్ డే రోజు తన లవ్ లైఫ్‌ను కన్ఫర్మ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. మోడల్ కమ్ యాక్ట్రెస్ అయిన నిధి తపాడియాతో ప్రేమలో ఉన్నట్లు నిర్ధారించిన షా.. తన పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫ్యూజులు ఎగురగొట్టాడు. ఈ ఫోటోలో షా-నిధి జంట ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ఈ ఫోటోనే హాట్‌గా ఉందనుకుంటే.. దీనికి షా పెట్టిన క్యాప్షన్ జనాలకు మరింత పిచ్చెకిస్తుంది. హ్యాపీ వాలంటైన్స్ డే వైఫీ అంటూ మోటు భాషలో షా పెట్టిన క్యాప్షన్ క్షణాల్లో దావణంలా వ్యాపించింది. దీంతో వెంటనే వాలెంటైన్స్ డే పోస్ట్‌ను డిలీట్ చేసిన షా.. మరో పోస్ట్ చేస్తూ.. ఆ ఫోటో పెట్టింది నేను కాదు, ఎవరో ఎడిట్ చేశారు, అసలు నిధి ఎవరో తనకు తెలియదన్నట్లు బిల్డప్ ఇచ్చాడు. షా వాలెంటైన్స్ డే తతంగం నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. షా నిజంగా పెళ్లి చేసుకున్నాడా.. అసలు ఆ పోస్ట్ అతను పెట్టిందేనా.. అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఆట వల్ల పాపులర్ కాలేని షా.. ఎఫైర్‌తో హాట్ టాపిక్ ఆఫ్ ఇండియాగా మారిపోయాడు. కాగా, ఇటీవలికాలంలో దేశవాలీ టోర్నీల్లో పరగుల వరద పారించిన షా.. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను ఎంపికయ్యాడు. అయితే అతనికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. వాస్తవానికి షా టీ20ల్లో కాకుండా టెస్ట్‌ల్లో స్థానం దక్కుతుందని అశించాడు. అయితే తలా తోక సెలెక్టర్లు షాను టీ20 జట్టుకు ఎంపిక చేశారు. అరంగేట్రం టెస్ట్‌లోనే సెంచరీ చేసి సత్తా చాటిన షా.. ఆ తర్వాత కొన్ని టెస్ట్‌లకే ఫామ్ కోల్పోయి ఉద్వాసన గురయ్యాడు. -
శ్రీసత్యకు ప్రపోజ్ చేసిన మెహబూబ్, చేయి కోసుకుంటానంటూ బ్లాక్మెయిల్!
బిగ్‌బాస్ ఫేం శ్రీసత్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్‌బాస్ 6 సీజనల్లో హౌజ్‌లో అడుగుపెట్టి తనదైన ఆట తీరుతో బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె స్టార్ మా ప్రసారం అవుతున్న బిబి జోడి డాన్స్‌లో షోలో అలరిస్తోంది. ఇందులో శ్రీసత్య మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సేతో జోడికట్టింది. వీరిద్దరి జోడికి మంచి రెస్పాన్స్ వస్తోంది. స్టేజ్‌పై డాన్స్ చేస్తుండగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందంటూ షో జడ్జస్ కూడా వారి పర్ఫామెన్స్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: వాగ్వాదంగా మారిన అనసూయ వాలంటైన్స్ డే పోస్ట్, చెప్పుతో కొడతానంటూ..! ఇదిలా ఉంటే మంగళవారం వాలంటైన్స్ డే సందర్భంగా మెహబూబ్ దిల్ సే శ్రీసత్యకి ఎర్ర గులాబిల బోకెతో ప్రపోజ్ చేసి షాకిచ్చాడు. దీంతో శ్రీసత్య అతడిపై సీరియస్ అయిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కొరియోగ్రఫర్స్ ప్రియాంక, సంకేత్ల సాయంతో మహబూబ్ దిల్ సే శ్రీసత్యకు తన ప్రేమను వ్యక్తం చేశాడు. శ్రీసత్య దగ్గరికి వెళ్లి మొదట పరోక్షంగా ఓ అమ్మాయిని ప్రమించానని, తను రిజెక్ట్ చేస్తే తట్టుకోలేనంటూ వాపోయాడు. ఎవరిని అంటూ ఆరా తీయగా.. నిన్నేనని ఆమెను సర్ప్రైజ్ చేశాడు. దీంతో శ్రీసత్య షాకైన శ్రీసత్య బిగ్‌బాస్ హౌజ్‌లో పెంట అయ్యింది.. ఇప్పుడు కూడా పెంట అయ్యిద్ది? అంటూ మహబూబ్‌పై గట్టిగా అరిచింది. చదవండి: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ దీనికి అతడు ‘నువ్వు, నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చాయ్. నీలాంటి మంచి అమ్మాయిని వదుకోవాలనుకోవడం ఇష్టం లేదు’ అంటూ తన మనసులో మాట చెప్పాడు. ఇక శ్రీసత్య తన ప్రపోజల్‌ను ఒప్పుకోకపోవడంతో చేయి కోసుకుంటానంటూ మహబూబ్ బ్లాక్మెయిల్ చేయడంతో.. ‘ఇప్పటికే నేను ఆత్మహత్యయత్నం కూడా చేశా తెలుసా? నా ఎంగేజ్మెంట్ బ్రేకప్ తర్వాత నా లైఫ్‌లో ఎవరికి మరో చాన్స్ ఇవ్వాలనుకోవడం లేదు. నాకు మనుషుల మీదే నమ్మకం పోయింది’ అంటుంది శ్రీసత్య. అలా కాసేపు ఇద్దరు అర్గ్యూ చేసుకున్న అనంతరం ఇది ప్రాంక్ అంటూ అందరికి షాకిచ్చాడు మహబూబ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. -
ప్రేమంటే ఏమిటంటే.. కల్యాణ్ దేవ్ ఇలా.. శ్రీజ అలా..
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్ దేవ్ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. వీరిద్దరి పర్సనల్ లైఫ్‌పై ఇప్పుడు రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో వీరిద్దరు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అటు కల్యాణ్ దేవ్ కానీ, ఇటు శ్రీజ కానీ.. ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్ పెట్టిన అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14) పురస్కరించుకొని ప్రేమపై ఈ జంట విడి విడిగా పెట్టిన సోషల్ మీడియా పోస్టులు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వాలెంటైన్స్ డే విషెస్ తెలుపుతూ కల్యాణ్ దేవ్ ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టాడు. మనం ఎంతగా ప్రేమిస్తున్నామని కాదు.. వాళ్లు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేది ముఖ్యం’ అని అందులో రాసుకొచ్చాడు. మరోవైపు శ్రీజ కొణిదెల ప్రేమ గురించి చెబుతూ.. ‘లవ్ అంటే.. నీతో ప్రేమలో పడేసుకోవడం కాదు.. తనతో తనే ప్రేమలో పడేలా చేయడం.. ఉన్న ప్రేమను గుర్తించాలి.. ప్రేమ కోసం ఎక్కడో వెతకకూడదు’ అని చెప్పుకొచ్చింది. ఈ రెండు పోస్టులు చూస్తుంటే ఒకరిపై ఒకరు కౌంటర్‌గా ఇలా చేశారనే విషయం అర్థమవుతుంది. అసలు వీరిద్దరు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందనే విషయం ఎవరికీ అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై ఇప్పటికీ ఈ జంట స్పందించకపోవడం గమనార్హం. -
Hyderabad: సంస్థల హెచ్చరికలు.. కానరాని ప్రేమ పక్షులు
సాక్షి, హైదరాబాద్: వలెంటైన్స్ డే.. ప్రేమ పక్షులకు ఇదో ప్రత్యేకమైన రోజు. ఎంతో ఆహ్లాదకరంగా జంటలు.. జంటలుగా వలెంటైన్స్ డేను జరుపుకొంటారు. పార్కులకు వెళ్లి ప్రేమ కబుర్లతో గడుపుతుంటారు. కానీ.. మంగళవారం నాటి వలెంటైన్స్ డే.. వెలవెలాబోయింది. పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే ఈ రోజున ప్రేమికులెవరూ బహిరంగంగా సంచరించవద్దని, పార్కుల్లో, ఇతర ప్రాంతాల్లో జంటలుగా కనిపించవద్దని.. ఒకవేళ కనిపిస్తే ‘పెళ్లి’ చేస్తామని కొన్ని సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో నగరంలోని పార్కుల్లో, లవ్ హైదరాబాద్ ఎదుట ప్రేమజంటల హడావుడి కనిపించలేదు. చదవండి: Makkah Masjid: ఎనిమిదేళ్లకు ‘గంట’ కొట్టింది! -
రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ బ్రేకప్ సాంగ్ విన్నారా?
ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ సాథియా’. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా స్టార్ డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా ఈ సినిమా లోని 'వెళ్లిపోయే..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. వెళ్లిపోయే.. పాపా వెళ్లిపోయే.. అంటూ సాగిపోయే ఈ బ్రేకప్ సాంగ్ లో యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. భాస్కరభట్ల రాసిన పదాల కూర్పులో నిజమైన ప్రేమికుడి భావాలు మనసుకు హత్తుకుంటున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన తీరు.. సాంగ్ కి తగ్గట్టుగా బాబా భాస్కర్ కొరియోగ్రఫీ ఈ పాటలో హైలైట్ అయ్యాయి. వినోద్ కుమార్ (విన్ను) అందించిన మ్యూజిక్ ఈ సాంగ్‌కి మేజర్ అట్రాక్షన్ గా మారింది. త్వరలోనే సినిమా విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్రం బృందం పేర్కొంది. -
వాలంటైన్స్ డే: శాకుంతలం చిత్రం నుంచి మరో మెలోడీ సాంగ్
స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన శాకుంతలం ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణ శేఖర్ పౌరాణిక ప్రేమ కావ్యంగా శాకుంతలంను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టిజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శాకుంతలం పాటలు అయితే యూట్యూబ్‌లో ట్రెండింగ్ జాబితాలో నిలిచాయి. నేడు ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం మరో మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ‘మధుర గతమా..’ అంటూ సాగే ఈ పాటను తాజాగా విడుదల చేశారు. శ్రీమని సాహిత్యం అందించిన ఈ పాటను అర్మాన్ మాలిక్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. కాగా ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా సమంత లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీ మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించాడు. అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ భరతుడి పాత్ర పోషించగా.. ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు, గౌతమి, మధుబాలలు కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శాకుంతం మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
అనసూయ వాలంటైన్స్ డే స్పెషల్ పోస్ట్.. ఇన్‌స్టాగ్రామ్‌లో వాగ్వాదం!
ప్రేమికుల రోజున నటి అనసూయకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. వాలంటైన్స్ డే సందర్భంగా అనసూయ చేసిన స్పెషల్ పోస్ట్‌పై సోషల్ మీడియాలో రకరకాలు రెస్పాన్స్ వస్తోంది. పలువురు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ప్రేమికుల రోజును పురస్కరించుకుని భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది అనసూయ. ‘నీతో లైఫ్ చాలా క్రేజీగా ఉంటుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘అదేం లేదు అక్క.. వాడి దగ్గర డబ్బు చాలా ఉంది అందుకే’ అంటూ కామెంట్ చేశాడు. ఇక అతడి కామెంట్‌పై అనసూయ అసహనం వ్యక్తం చేసింది. దీనిపై స్పందిస్తూ సదరు నెటిజన్ను చెప్పుతో కొడతానంటూ చెప్పకనే చెప్పి కౌంటర్ ఇచ్చింది. ‘అదేంట్రా తమ్ముడు అలా అనేశావు. ఎంతుందేంటి డబ్బు? చెప్పు.. నాకు లేదా మనీ మరి? నీకు అన్ని తెలుసు కదా.. అయినా ఆయన డబ్బు, నా డబ్బు అనేది కూడా ఉందా? రేయ్ చెప్పరా బాబూ.. అయినా బావ గారిని వాడు, వీడు అనొచ్చా? ఇదేం పెంపకంరా నీది. చెంపలేసుకో. లేకపోతే నేను వేస్తా చెప్పులతో.. సారి అదే చెంపలేస్తానంటున్నా’ అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఇక అనసూయ రెస్పాన్స్ రికౌంటర్ సదరు నెటిజన్ మరో కామెంట్ చేశాడు. ‘మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి. రియాలిటీని అర్థం చేసుకోండి. మీరు ఎన్ని చెప్పినా నిజమ నిజమే’ అని అన్నాడు. దీనిపై కూడా అనసూయ రిప్లై ఇచ్చింది. ‘నీ బొందరా నీ బొంద.. ముందు మాట్లాడటం నేర్చుకో. అంతర్యామిలా అన్నీ తెలిసినట్లు బిల్డప్ ఒకటి. నా రియాలిటీ నీకేం తెలుసురా.. పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. నీ బుద్ధి మనీ ఒకటే కాబట్టి.. అందరిదీ అదే అనిపిస్తుంది. వీలైతే నీ బుద్ధి మార్చుకో.. గెట్ వెల్ సూన్.. తమ్ముడివి కదా మంచి, చెడు చెప్తున్నా.. ఏమనుకోకయ్యా’ అని అంటూ కామెంట్స్ చేసింది. ఒకరి కామెంట్‌పై ఒకరు స్పందిస్తూ వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం అనసూయ ఇన్స్టాగ్రామ్ పోస్ట్, కామెంట్స్ నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలిచాయి. కాగా గతంలోనూ ఇలానే అనసూయ నెటిజన్లతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ట్విటర్లో తనని ట్రోల్ చేసిన వారినిక సమాధానం ఇస్తూ ఇలా రెండు, మూడు రోజుల పాటు అనసూయ గొడవ పడింది. అప్పట్లో ఇది చర్చనీయాంశమైంది. అంతేకాదు దనని ట్రోల్ చేసిన వారిపై అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని చెప్పా: జగపతి బాబు షాకింగ్ కామెంట్స్ -
Valentines day 2023:పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్ చూశారా..!
సాక్షి,ముంబై: వాలెంటైన్ డే సందర్బంగా పేమెంట్ సంస్థ పేటీఎం లవర్స్‌కు వాలెంటైన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది రూ.140 దాకా క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. పేటీఎం ద్వారా చెల్లింపులు చేసిన కస్టమర్లకు ఈ ఆఫర్ అందిస్తోంది. ఈ చెల్లింపుల ద్వారా ఒక్కొక్కటి మూడు చొప్పున మూడు రకాల కార్డులను అందిస్తోంది. లవ్ అండ్ ఎఫెక్షన్, ఎంటర్టైన్మెంట్, డిన్నర్ కార్డ్ పేరుతో ఉన్న ఈ తొమ్మిది కార్డ్‌లను సేకరించిన తర్వాత, వినియోగదారులు రూ. 140 విలువైన 14,000 పేటీఎం క్యాష్‌బ్యాక్ పాయింట్లను పొందుతారు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 20 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ కార్డ్‌లను పొందాలంటే పేటీఎంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా వినియోగదారులు డబ్బులు స్వీకరించినా, డబ్బును బదిలీ చేసినా, మొబైల్‌కి రీఛార్జ్, యుటిలిటీ బిల్లులను చెల్లించినప్పుడు పాయింట్లను సంపాదించవచ్చు నన్న సంగతి తెలిసిందే. వాలెంటెన్స్ క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందాలంటే పేమెంట్ తరువాత పేటీఎం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌పై క్లిక్ చేయండి క్రిందికి స్క్రోల్ చేసి, 14వేల క్యాష్‌బ్యాక్ పాయింట్ల బ్యానర్లో ప్లే అండ్ విన్ నొక్కండి. ఇలా వచ్చిన మొత్తం 9 తొమ్మిది కార్డ్‌లను స్క్రాచ్ చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు స్నేహితులనుంచి అదనపు కార్డ్‌ను తీసుకోవచ్చు, ఇవ్వవచ్చు. అన్‌లాక్ చేయకుంటే స్క్రాచ్ కార్డ్‌లు స్వీకరించిన 3 రోజుల తర్వాత పనికిరావు This Valentine's, win over love & cashback with #PaytmValentinesCashback!🤩 Send money, recharge, pay bills & more to collect cards & win up to 14000 Cashback points!* Play now to win: https://t.co/fE1siDe2Ko *Offer ends on 20th February 2023 #PaytmSeUPI — Paytm (@Paytm) February 13, 2023 -
ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..
హీరోయిన్ అదితి రావ్ హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందామె. ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది. అయినప్పటికీ హీరో సిద్ధార్థ్‌తో డేటింగ్ రూమర్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజులుగా వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై వీరిద్దరి నుంచి అధికారిక సమాచారం లేదు. చదవండి: ఆలియా బాటలోనే కియారా! పెళ్లికి ముందే ప్రెగ్నెంటా? నటుడి షాకింగ్ ట్వీట్ రీసెంట్గా యంగ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థంలో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించడంలో వీరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే ఇవాళ వాలంటైన్స్ డే సందర్భంగా అదితి సిద్ధార్థ్‌కు షాకిచ్చింది. సిద్ధార్థ్‌కు కాకుండ మరో సీనియర్ హీరోకి ఆమె ప్రపోజ్ చేసింది. వాలంటైన్స్ డే సందర్భంగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌కి బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్రతో పాటు అదితి కూడా ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా అదితి ఆయనకు రెడ్ గులాబి ఇచ్చి సరదగా ప్రపోజ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఎయిర్పోర్ట్ వివాదం: విజయ్ సేతుపతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం ఈ ఫొటోని అదితి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. దీనికి ‘ది మోస్టెస్ట్ హ్యాండ్సమ్’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పోస్ట్‌పై హీరో సిద్ధార్థ్ స్పందించడం విశేషం.పోస్ట్ 2 హార్ట్ ఎమోజీలతో అదితి పోస్ట్‌పై స్పందించాడు. అయితే వాలంటైన్స్ డే రోజున సిద్ధార్థ్‌కు ప్రపోజ్ చేయకపోవడం ఏంటి? అంటూ నెటిజన్లు ఆమె పోస్ట్‌పై స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. కాగా సిద్ధార్థ్, అదితి రావు హైదరీలు మహాసముద్రం చిత్రంలో ప్రేమికులుగా నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
ప్రేమికుల దినోత్సవం రోజున మెదక్ జిల్లాలో విషాదం
-
రష్మిక వాలెంటైన్స్ డే విషెస్.. విజయ్ కోసమేనా..!
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అటు టాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాలతో తెగ బిజీగా మారిపోయిందీ బ్యూటీ. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా రష్మిక చేసిన పోస్ట్ తెగ వైరలవుతోంది. మీ అందరికీ హ్యాపీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసింది. రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ..'నన్ను ప్రేమించే వారికి మా తరఫున ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.' అంటూ ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఆ వీడియోలో తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ కనిపించింది ముద్దుగుమ్మ. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ కోసమేనా అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో విజయ్ ఎక్కడ? కియారా-సిద్ధార్థ్ లాగా మీరు కూడా పెళ్లి చేసుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక- విజయ్ బెస్ట్ కపుల్స్ అంటూ కామెంట్స్ పెట్టారు. కాగా.. ఇటీవలే విజయ్‌తో నటించిన వారిసు(వారసుడు)తో సక్సెస్ అందుకున్న నేషనల్ క్రష్ అల్లు అర్జున్ పుష్ప-2 నటించనుంది. ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రష్మిక ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఎదిగింది. 'పుష్ప' హిట్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం రణ్‌బీర్‌తో ‘యానిమల్’ సినిమాలో నటిస్తుంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
Valentine's Day: ప్రేమ పేరుతో ఉన్మాదం.. ప్రాణాలు తీస్తున్న అకృత్యాలు
భిన్న సంస్కృతుల సమ్మేళనం మన మహా నగరం. విభిన్న సంప్రదాయాల సంగమం మన హైదరాబాద్. ‘భాగ్య’నగరమే ప్రేమ పునాదిగా వెలసిందని కొందరి నమ్మకం. ఆ ప్రేమకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి కొన్ని జంటలు. నగరంలోని కొన్ని ప్రాంతాలు. ప్రేమ అనే రెండు పదాలు మదిలో నాటుకున్న తర్వాత అవి వేద మంత్రాలై పెళ్లికి దారి తీస్తాయి. వివాహంతో ఒక్కటవుతాయి. కష్ట సుఖాలను పంచుకుంటాయి. నీతోటిదే లోకమంటూ కలకలం సాగుతాయి. ఇలాంటి ప్రేమలు కొన్ని అయితే.. మరికొన్ని పగతో రగులుతున్నవీ ఉన్నాయి. క్షణికావేశమో, పక్కా ప్లాన్‌తోనే ప్రేమనే అంతమోందించిన ఘటనలు ఉన్నాయి. మంగళవారం వలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనాలు. పెళ్లి చేసుకోమన్నందుకు.. ఓల్డ్ అల్వాల్ సాయిబాబానగర్‌కు చెందిన సరస్వతి, భూదేవి నగర్‌కు చెందిన దీపక్ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమె అతడిపై ఒత్తిడి తెస్తోంది. కొన్నాళ్లు దాటవేత ధోరణి ప్రదర్శించిన అతగాడు చివరకు ఆమెను హత్య చేయాలని పథకం వేశాడు. స్నేహితులకు ఫోన్ చేసి చెప్పి మరీ ఆమెను చంపేశాడు. పెళ్లికి నిరాకరించినందుకు.. తనను ప్రేమించి పెళ్లి వద్దన్నందుకు యాప్రాల్ ప్రాంతానికి చెందిన గిరీష్ బాపూజీనగర్‌కు చెందిన చామంతిపై హత్యాయత్నం చేసి, తానూ ఆత్మహత్యకు యతి్నంచాడు. సదరు యువతిని వేధించిన కేసులో అతడు న్యాయ స్థానంలో జరిమానా చెల్లించడం గమనార్హం. ప్రేమించి మోసం చేసిందని... వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ బీఈడీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ సరూర్‌నగర్‌లో నివసిస్తున్నాడు. చదువుకునే రోజుల్లో పరిచయమైన యువతితో ప్రేమలో పడ్డాడు. కొన్ని రోజులు కలిసిమెలిసి ఉన్నా ఇటీవల ఆమె ఇతడిని దూరం పెట్టింది. దీంతో తనను మోసం చేసిందని భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ పేరుతో ఉన్మాదం పేట్రేగి ప్రాణాలు తీస్తున్న అకృత్యాలు..లైంగిక వేధింపులతో వెంటపడుతూ చేస్తున్న అఘాయిత్యాలు, ప్రేమ విఫలమైందనే కారణంగా ఆత్మహత్యలు నగరంలో జరుగుతూనే ఉన్నాయి. పదును లేని చట్టాలంటే పట్టని ఉన్మాదులు దాడులతో తెగపడుతున్నారు. అధికారిక గణాంకాల అటుంచితే పరువు, ప్రతిష్టలకు భయపడి జరిగిన అన్యాయంపై బాధితులు ఫిర్యాదు చేయని సందర్భాలు ఎన్నో. ప్రేమ నేపథ్యంలో జరుగుతున్న ఆత్మహత్యలు సైతం అనేకం ఉంటున్నాయి. అపరిపక్వతే ఈ దురాగతాలకు ప్రధాన కారణంగా మారుతోంది. సమాజంలో మహిళలకు సమున్నత స్థానం, వారి హక్కులను యువకులకు, ముఖ్యంగా ఇప్పుడిప్పుడే యవ్వనంలో అడుగిడుతున్న యువతకు క్షుణ్ణంగా బోధించాలన్న ఉద్దేశంతో రూపొందినదే జాతీయ యువజన విధానం. మహిళల పట్ల యువజనులు గౌరవంగా మసలుకొనేలా వారికి అవసరమైన కౌన్సెలింగ్ ఇవ్వాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఏళ్ల క్రితం నాటి ఈ విధానం లక్ష్యాలు నెరవేరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. యువజనులను 13–19, 20–35 ఏళ్ల మధ్య వయస్సు గల వారిగా రెండు గ్రూపులుగా యువజన విధానంలో విభజించారు. యవ్వన దశలో కీలకమైన 13–19 ఏళ్ల మధ్య వయస్కులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని అందులో నిర్దేశించారు. ప్రేమోన్మాదులు, వారి బారినపడుతున్న వారిలో అత్యధికులు ఈ పాతికేళ్లలోపు వారే. జాతీయ యువజన విధానంలో పొందుపరిచిన విధంగా ఇక్కడి సమాజంలో స్త్రీల స్థానం, వారికి గల హక్కులపై మగపిల్లలకు అవగాహన కల్పించడంలో, మహిళల పట్ల గౌరవంగా మసలుకొనేలా కౌన్సెలింగ్ చేయడంలో కానీ ప్రభుత్వాలు శ్రద్ధ చూపట్లేదు. -
Valentine's Day: తీరం చేరిన ప్రేమకథలు.. లవ్, లైఫ్‌లో గెలిచిన జంటలు
సాక్షి , కరీంనగర్: ప్రేమ.. కులమతాలకు అతీతమైన భావన. టీనేజీ వయసులో మొదలయ్యే ప్రేమకథలు ఆకర్షణతో మొదలై.. అక్కడితో ముగుస్తాయి. కానీ, పరిణితితో కూడిన ప్రేమకథలు కచ్చితంగా విజయతీరాలు చేరతాయి. ఒక చేత్తో కెరీర్, మరో చేత్తో ప్రేమను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతాయి. ఖండాలు దాటినా, ఏళ్లకు ఏళ్లు గడిచినా ఎదురుచూపుల్లోనే బతికేస్తారు. చివరికి తమ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆ తరువాత పెద్దల్ని ఒప్పిస్తారు. కొందరికి ఈ అవకాశం లేకపోవచ్చు. అయినా వీరు చేరుకున్న విజయతీరాలు, సమాజంలో వీరికి దొరికే స్థానం వీరిపై ఉన్న వ్యతిరేక భావనను క్రమంగా దూరం చేస్తుంది, అందరినీ దగ్గర చేస్తుంది. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కులమతాలకు అతీతంగా ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలపై కథనం. మాది లవ్ కం అరేంజ్ మ్యారేజ్ ఉద్యోగంలో సెటిల్ అయ్యాక మా స్నేహితులతో మా మధ్య ప్రేమ చిగురించింది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలి్సన అవసరం రాలేదు. అందరినీ ఒప్పించి సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాం. నా భార్య దివ్యాన్షీ కంటి డాక్టర్. ఈ తరం యువతకు నేను చెప్పేది ఒక్కటే.. కెరీర్‌పై దృష్టి పెట్టి లక్ష్యం సాధిస్తే అన్ని మనవద్దకు వచ్చి చేరుతాయి. ఆకర్షణకు గురైతే లైఫ్ ఆగమవుతుంది. – సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్– డాక్టర్ దివ్యాన్షీ దంపతులు ఖండాలు దాటిన ప్రేమ నేను ఎస్సారార్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నక్రమంలో నాకు రమేశ్ పరిచమయ్యాడు. రోజూ మా కాలేజీకి వచ్చేవాడు. ఒకరోజు నాకు ప్రపోజ్ చేశాడు. అయితే, జీవితంలో పైకి రావాలన్న నా కలను వివరించాను. అయినా తను వెనకడుగు వేయలేదు. నాకు పూర్తిగా సహకరించాడు. ఉన్నత విద్య కోసం నేను బ్రిటన్ వెళ్లాను. పీజీ పూర్తయి ఉద్యోగంలో చేరాక ఇండియా వచ్చాను. నా కోసం ఎదురుచూస్తున్న రమేశ్‌తో వివాహం జరిగింది. కులాలు వేరుకావడంతో మొదట్లో మా పెద్దలు వ్యతిరేకించినా.. కెరీర్లో నిలదొక్కుకున్న తీరుకు మా ప్రేమను అంగీకరించారు. ఇపుడు లండన్‌లో రెండు రెస్టారెంట్లు, ఒక కేక్షాప్ నడుపుతున్నాం. నలుగురికి ఉపాధి కల్పిస్తున్నం. ఏటా మా ఇద్దరి పిల్లలతో ఇండియాకు వస్తాం. – సుష్మ– రమేశ్ నేనే ప్రపోజ్ చేశా.. ఏదో సందర్భంలో తన ఫ్రెండ్ ప్రశాంత్‌ను పరిచయం చేశారు. ఆ పరిచయమే కొన్నాళ్లకు ఇష్టంగా మారింది. ధైర్యం చేసి నేనే పెళ్లి ప్రేమను ప్రతిపాదించా. అమ్మానాన్న అంగీకరించలేదు. గొడవలు కూడా అయ్యాయి. సొంతంగా నిర్ణయం తీసుకుని అగ్రహారం ఆంజనేయస్వామి సన్నిధిలో పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్ల తరువాత ఇరు కుటుంబాల వాళ్లు అంగీకరించి కలిసిపోయారు. ప్రస్తుతం అంతా సంతోషంగానే ఉంది. – లహరి, ప్రశాంత్ అనాథ యువతికి అన్నీ తానై.. కథలాపూర్(వేములవాడ): అనాథ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచాడు ఓ సామాజిక సేవకుడు. కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన కాసారపు శేఖర్ షైన్ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు లేని అదే గ్రామానికి చెందిన రమ్యను ప్రేమించాడు. 2013లో శేఖర్, రమ్య ప్రేమ వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు లేని ఆమెకు అన్నీ తానయ్యాడు. వీరికి శ్రీహర్ష, రిషికేశ్ ఇద్దరు కుమారులు. శేఖర్ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో 2018లో గవర్నర్ చేతులమీదుగా అవార్డు అందుకున్నాడు. కులాంతరమే కాదు.. అనాథ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శేఖర్‌ను పలువురు అభినందించారు. ప్రేమ కోసం దేశంలోనే.. మాది మంథని, మా వారిది కరీంనగర్. నేను అపుడు పీజీ చదువుతున్నా. మా ఆయన ప్రభాకర్ అప్పటికే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఒక పెళ్లి వేడుకలో అనుకోకుండా కలిశాం. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నాం. మాకు ఇపుడు ఒక పాప. మా ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు చివరికి మమ్మల్ని క్షమించేశారు. హైదరాబాద్‌లో ఓ ఇంటి వారిమయ్యాం. విదేశాలకు వెళ్లే అవకాశాలు వచ్చినా మా పేరెంట్స్‌ను చూసుకునేందుకు మా ప్రభాకర్ వాటిని సున్నితంగా తిరస్కరిస్తారు. ఏమాత్రం సెలవు దొరికినా మా పేరెంట్స్‌కే టైం కేటాయిస్తాం. – స్వప్న– ప్రభాకర్ అప్పట్లో చాలా కష్టపడ్డాం నాది జగిత్యాల, ఆమెది కరీంనగర్. డిగ్రీ చదువుకునే రోజుల్లో మాకు ఎన్సీసీలో పరిచయం. పీజీకి వెళ్లాక కూడా కొనసాగింది. అపుడే ఎస్సై నోటిఫికేషన్ వచ్చింది. దీంతో తనకు దాదాపుగా ఏడాది దూరంగా ఉండి ప్రిపేరయ్యా. ఈ లోపు విషయం ఇంట్లో తెలిసిపోయింది. దీంతో తన కుటుంబ సభ్యులు మొదట్లో వ్యతిరేకించారు. నేను ఎస్సైగా సెలెక్ట్ అయ్యాక మరో ఏడాది దూరంగా ఉన్నాం. పోస్టింగ్ తీసుకున్నాక వెళ్లి వారిని ఒప్పించా. తొలుత వ్యతిరేకించినా... కొన్నిరోజులకు కలిసిపోయాం. ఇపుడు నేను సీఐగా మానుకోటలో విధులు నిర్వహిస్తున్నా. మాకిద్దరు పాపలు. కులాలు వేరైనా జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకుంటే అంతా ఆమోదిస్తారు. – సుష్మ– రవిరాజ్ ప్రేమ ముందు ఓడిన వైకల్యం పెద్దపల్లిరూరల్: ‘నా స్వాతి బంగారం.. నేను మరుగుజ్జుగా పుట్టినా నాకు ఆ భగవంతుడు స్వాతి రూపంలో మంచి జీవితాన్నే ఇచ్చాడు’ అని చెప్పుకొచ్చాడు రవికిరణ్. స్వాతి కుటుంబం ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు నుంచి పెద్దపల్లికి వలస వచ్చింది. వారు రవికిరణ్ ఇంటి సమీపంలో అద్దెకు రావడంతో స్వాతితో ఏర్పడ్డ పరిచయం పరిణయానికి దారితీసింది. స్వాతి కుటుంబీకులు వ్యతిరేకించడంతో అప్పటి సీఐ హబీబ్ఖాన్ను ఆశ్రయించగా ఠాణాలోనే పెళ్లి జరిపించారని రవికిరణ్, స్వాతి పేర్కొన్నారు. వారికి ఓ బాబు, ఇద్దరు కూతుళ్లు జన్మించినా అనారోగ్య కారణాలతో బాబు, ఓ కూతురు చనిపోయారని బాధపడ్డారు. అయినా ఉన్న ఒక్కగానొక్క కూతురు ఆశాజ్యోతిని తమకున్నంతలో అల్లారుముద్దుగా పెంచుతున్నారు. మరుగుజ్జునైన తనకు ప్రభుత్వం నుంచి దివ్యాంగ పింఛన్ అందుతోందని, మెప్మాలో పనిచేసినందుకు మరో నాలుగు వేలతోనే నెట్టుకొస్తునన్నాడు. టీనేజ్ ప్రేమతో సమస్యలు చదువు పూర్తికాకుండానే టీనేజ్‌లో ప్రేమలో పడుతున్న వారు చాలా మంది ఆ తరువాత కాలంలో ప్రేమ, ఆకర్షణ తేడాలు తెలుసుకుని తమ అభిప్రాయాలు మార్చుకుంటున్నారు. ప్రేమికులు ఇద్దరిలో ఏ ఒక్కరు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నా ఇంకొకరు గౌరవించే రీతిలో ప్రేమ ఉండాలి. అంతే కాని ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌ల్లో పెడతానని బ్లాక్‌మెయిలింగ్ దిగడం సరికాదు. ఇలాంటి విషయాల్లో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తే కచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. – రాజశేఖర్‌రాజు, సీఐ, కోరుట్ల -
Nick Vujicic: ‘పరిపూర్ణతే’ అర్హతా? ఆమెది నిజమైన ప్రేమ.. నలుగురు పిల్లలతో ముచ్చటగా..
‘లవ్ వితౌట్ లిమిట్స్’.. అవధుల్లేని ప్రేమ ప్రేమంటే.. ఒకరిపై ఒకరికి నమ్మకం ఎదుటి వ్యక్తిని అచ్చంగా ఇష్టపడటం గుణం, రూపం, వ్యక్తిత్వం.. ఒక్కటేమిటి మొత్తంగా ఓ మనిషిని ‘నా’ అనుకునే ఫీలింగ్! ఇష్టపడ్డ వ్యక్తిలోని సుగుణాలే తప్ప ‘లోపాల’ని మైనస్‌లా చూడలేని ఆరాధ్య భావన! ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్ని వర్ణనలైనా సరిపోవు..!! PC: Instagram మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్న మాటకు నిలువెత్తు రూపం అతడు.. దృఢసంకల్పం ఉంటే విధికి ఎదురొడ్డి జీవనమాధుర్యాన్ని ఆస్వాదించొచ్చని నిరూపించిన స్ఫూర్తిప్రదాత.. అతడి ఆత్మవిశ్వాసం.. ఆకాశాన్ని తాకే శిఖరం.. అతడి బతుకు పోరాటం.. నిరాశలో కూరుకుపోయిన వారికి ఆశాకిరణం.. అతడి చిరునవ్వు.. ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపులో ఉన్నవారిని మార్చేసే ఆయుధం.. అతడి మాటలు.. కోట్లాది మందిలో నిస్పృహను వదిలించి నూతనోత్తేజాన్ని నింపే ఔషధపు చుక్కలు PC: Instagram Valentine's Day 2023: Nick Vujicic- Kanae Miyahara Love Story In Telugu: బయటి నుంచి చూసే వారికి అతడంటే ఇంతే! మరి ‘అసలైన అతడు’ ఎలా ఉంటాడు? తనకూ ఇష్టాయిష్టాలు ఉంటాయి.. తన జీవితం ఇలానే ఉండాలనే కోరికలు.. తనకంటూ భార్య, పిల్లలతో ముచ్చటైన కుటుంబం కావాలన్న తపన.. కానీ పుట్టుకతోనే ‘ఇంపర్ఫెక్ట్’ అంటూ ముద్ర.. ఒకానొక దశలో చచ్చిపోదామన్నంతగా కుంగుబాటు.. కానీ అమ్మానాన్నలు తనను కాపాడి పునర్జన్మను ఇచ్చారు. తమ స్వచ్ఛమైన ప్రేమతో అతడి ఆలోచనలు మార్చివేశారు.. ‘‘దేవుడిచ్చిన గొప్ప బహుమతి నువ్వు.. కాకపోతే అందరి కంటే ఇంకాస్త గొప్పగా ఉన్నావు’’ అంటూ స్ఫూర్తిని నింపారు. ఇష్టమని పక్కకు తప్పుకొన్నారు టీనేజ్‌లో ఎంతో మంది అమ్మాయిలు నువ్వంటే ఇష్టమన్నారు.. కొన్నాళ్లు డేటింగ్ చేశారు.. కానీ సెట్ అవ్వదని పక్కకు తప్పుకొన్నారు.. చాలా వరకు అన్నీ చేదు అనుభవాలే.. ట్వంటీస్‌లోకి వచ్చే సరికి తనిక ఫిక్సైపోయాడు. తన జీవితంలోకి ఇక ఏ అమ్మాయి రాదు.. తనను తనలా ప్రేమించలేదు.. తనతో లైఫ్ షేర్ చేసుకోలేదు! కానీ ఆమె రాక అతడి జీవితంలో వసంతాలు పూయించింది.. PC: Instagram ఆమె అతడిని నిజంగా ప్రేమించింది అతడి మనోసౌందర్యాన్ని మెచ్చి.. భార్యగా బంధాన్ని పెనవేసుకున్న ఆమె.. అతడితో తన ప్రేమకు ప్రతిరూపాలుగా నలుగురు అందమైన పిల్లలను బహుమతిగా ఇచ్చింది. ఆమె ప్రేమను గెలుచుకున్న రియల్ హీరో నిక్ వుజిసిక్.. ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్. అతడితో జీవితాన్ని పంచుకున్న ఆమె పేరు కనే మియహార. రేర్ డిజార్డర్ బిడ్డ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆస్ట్రేలియా దంపతులకు 1982, డిసెంబరు 4న నిక్ జన్మించాడు. ‘ఫోకోమెలియా’ అరుదైన డిజార్డర్ కారణంగా కాళ్లూ, చేతులూ లేకుండా పుట్టిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కానీ దేవుడిపై మాత్రం నమ్మకాన్ని కోల్పోలేదు. PC: Instagram కేవలం తమ జీవితాల్లోనే కాదు.. చిన్న చిన్న లోపాలకే డిప్రెషన్లో కుంగిపోయే లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపేలా.. ఆ దేవుడు ఇచ్చిన గిఫ్ట్‌ని మలచుకుంటామని మనసులో సంకల్పించుకున్నారు. చిరు నవ్వుతోనే అందుకు తగ్గట్లే తమ కుమారుడిని సాధారణ పిల్లల్లాగే పెంచారు. స్విమ్మింగ్ చేయడం సహా పలు ఆటలాడటం నేర్పించారు. తోటి వాళ్లు అవహేళన చేసినా చిరునవ్వుతోనే వాటిని ఎలా తిప్పికొట్టాలో నేర్పించారు. ఎంత నిలదొక్కుకుందామని చూసినా ఒక్కోసారి హేళనలు శ్రుతిమించినపుడు.. అందరూ తనని పక్కన పెట్టినపుడు.. ఒంటరితనం నుంచి పారిపోయేందుకు తనను తాను అంతం చేసుకోవాలని భావించాడు నిక్. అయితే, అదృష్టవశాత్తూ అమ్మానాన్నలు అతడిని కాపాడుకోగలిగారు. PC: Instagram ఇంపర్ఫెక్ట్ ఈజ్ పర్ఫెక్ట్ ‘‘నువ్వు ఎంత అసంపూర్తిగా ఉంటే ఇతరుల ముందు అంత పరిపూర్ణ వ్యక్తిగా నిరూపించుకోగలవు’’ అని అమ్మ చెప్పిన మాట అతడి మనసులో బలంగా నాటుకుపోయింది. ఓ న్యూస్పేపర్లో వచ్చిన ఆర్టికల్ అతడి జీవితాన్నే మార్చివేసింది. వైకల్యం ఉన్నా సదరు వ్యక్తి సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడో నిక్కు అర్థమైంది. ‘‘కాళ్లూ, చేతులు మాత్రమే లేవు.. అలా అని జీవితానికే అర్థం లేకుండా చేసుకోలేం కదా!’’ అన్న దృక్పథం అతడికి అలవడేలా చేసింది. దేవుడిని విశ్వసించే నిక్కు పదిహేడేళ్ల వయసులో ప్రేయర్ గ్రూప్‌లో స్పీచ్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. అప్పటి నుంచి అతడిలో ఆత్మవిశ్వాసం రెట్టించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ స్థాయికి ఎదిగాడు. దాదాపు 57 దేశాల్లో తన స్పీచ్‌తో కోట్లాదిమందిలో నూతనోత్తేజం నింపాడు. తొలి చూపులోనే ప్రేమ.. చూపులు కలిసిన శుభవేళ ఈ క్రమంలోనే కనే మియహారను కలుసుకున్నాడు. తొలి చూపులోనే ఆమెను ఎంతగానో ఇష్టపడ్డాడు. కానీ అప్పటికే.. తమ కుటుంబంలోని కలతలు చూసి విసిగిపోయిన కనేకు వైవాహిక బంధంపై పెద్దగా నమ్మకం లేదు. అందుకు తోడు.. నిక్‌ను కలిసే కంటే ముందున్న రిలేషన్షిప్స్ ఆమె మనసులో ఏ మూలో ఉన్న రవ్వంత నమ్మకాన్ని కూడా తుడిచిపెట్టుకుపోయేలా చేశాయి. అయితే, విధిరాత మరోలా ఉంది. నిక్‌తో చూపులు కలిసిన ఆ వేళ శుభప్రదమైంది.. ఇద్దరు ప్రేమలో పడ్డారు. PC: Instagram సమాజం నుంచి తమ జంటకు ఎదురుకాబోయే చేదు అనుభవాలు ఎలా ఉంటాయో ముందే చర్చించుకున్నారు. ఒకరి కోసం ఒకరు బతకాలని నిర్ణయించుకున్నారు. 2012లో వాలంటైన్స్ డేకి రెండ్రోజుల ముందు అంటే ఫిబ్రవరి 12న పెళ్లి చేసుకున్నారు. నిజమైన ప్రేమ ఎలాంటి అవరోధాలనైనా అధిగమిస్తుందనే సందేశాన్నిస్తూ ముందుకు సాగుతున్నారు. లవ్ వితౌట్ లిమిట్స్ ఆస్ట్రేలియా అబ్బాయి- మెక్సికో అమ్మాయి ఇలా ప్రేమతో ఒక్కటయ్యారు. తమ ప్రేమ ప్రయాణాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు.. ‘‘లవ్ వితౌట్ లిమిట్స్: ఎ రిమార్కబుల్ స్టోరీ ఆఫ్ ట్రూ లవ్ కాంకరింగ్ ఆల్’’.. (అవధుల్లేని ప్రేమ: నిజమైన ప్రేమ అన్నిటినీ జయిస్తుందన్న అర్థం) పేరిట పుస్తకాన్ని రచించారు. PC: Instagram దేవుడే తమను కలిపాడని నమ్మిన ఆ జంటకు ఇప్పుడు నలుగురు పిల్లలు. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారి పేర్లు కియోషి, డేజాన్, ఒలీవియా, ఎల్లీ. నిజమైన ప్రేమకు అర్థంగా నిలిచిన నిక్ వుజిసిక్- కనే మియహారకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు!! -సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ చదవండి: Hardik Pandya: ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి.. -
ఈ ఏడాది సరికొత్త ప్రేమకథా చిత్రాలు ఇవే..!
సినిమాల్లో ప్రేమకథలకు ఉన్న క్రేజే వేరు. లవ్ స్టోరీలను సినీ ప్రేమికులు ఎక్కువగా ఇష్టపడతారు. భాష ఏదైనా ప్రేమకథా చిత్రాలకు ఆదరణ ఉంటుంది. గతేడాదిలో పలు ప్రేమ కథాంశంగా తెరకెక్కిన చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా కూడా నిలిచాయి. అందులో సీతారామం మూవీ ఒకటి. మరీ ఈ ఏడాది కూడా ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని చిత్రాలు సిద్ధమయ్యాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా సరికొత్త ప్రేమకథలను పరిచయం చేసేందుకు టాలీవుడ్లో సిద్ధమవుతున్న చిత్రాలేవో చూసేద్దాం. ప్రేమకావ్యం.. శాకుంతలం కాళిదాసు రచించిన ప్రేమకావ్యం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపొందిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్, శకుంతలగా సమంత నటించారు. మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, గౌతమి, మధుబాల కీలక పాత్రలుపో షించారు. కాగా ఏప్రిల్ 14న ‘శాకుంతలం’ని విడుదల చేయనున్నట్లు శుక్రవారం కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. వినరో భాగ్యము విష్ణుకథ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి నటిస్తున్న చిత్రం 'వినరో భాగ్యము విష్ణుకథ'. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫోన్ నంబర్ ప్రధాన అంశంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. మన ఫోన్ నెంబర్ తర్వాత నెంబర్ వారితో పరిచయం ప్రేమగా మారితే ఎలా ఉంటుందన్నదే ప్రధాన కథాంశం. ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని- కీర్తి సురేశ్ 'దసరా' నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. యాక్షన్ చిత్రంగా తెరకెస్తున్నప్పటికీ ఓ మంచి ప్రేమకథ ఉందని పోస్టర్లు చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి.ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. సింగరేణి బొగ్గు గనుల సమీపంలోని వీర్లపల్లి గ్రామ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ధరణిగా నాని, వెన్నెలగా కీర్తిసురేశ్ నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ - సమంత 'ఖుషి' పవన్ కల్యాణ్, భూమిక జంటగా నటించిన ఖుషి ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే పేరుతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కూడా పూర్తయ్యింది. దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. -
ప్రేమించడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నా: సాయి ధరమ్ తేజ్
రిపబ్లిక్ సినిమా తర్వాత యాక్సిడెంట్‌కు గురి కావడంతో సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్ . ఆ సినిమా విడుదలైన ఏడాదిన్నరకు తాజాగా విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ భామ సంయుక్త మీనన్ అతనికి జంటగా నటిస్తోంది. వాలెంటైన్స్ సందర్భంగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. 'హౌ టూ ఫాల్ ఇన్ లవ్' పుస్తకం చదువుతున్న ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ అందమైన పుస్తకాన్ని నేను కేవలం నిద్ర పోయేందుకు చదువుతానని సరదాగా రాసుకొచ్చారు. ఈ సందర్భంగా అభిమానులకు హీరో వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. సాయి ధరమ్ తేజ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' నేను ఈ అందమైన పుస్తకాన్ని పరిశోధించడానికి ప్రయత్నించా(కేవలం నిద్ర పోవడానికి). మన జీవితంలో అత్యంత ముఖ్యమైంది ప్రేమ. ఈ పుస్తకం ద్వారా మనల్ని మనం ప్రేమించడం ఎంత ముఖ్యమో నేను గ్రహించా. సెల్ఫ్ లవ్ అంటే మనలోని ప్రత్యేకతలు, లోపాలను స్వీకరించడం. అలాగే మనల్ని మనం ప్రేమించుకోవడం గురించి ఈ పుస్తకంలో ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. ఇది సాయి ధరమ్ తేజ్ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అన్నా మనకు లవ్ మ్యారేజ్ సెట్ కాదు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టుకు బాలీవుడ్ నటి సయామి ఖేర్ నవ్వుతున్న ఎమోజీని జతచేసింది. కాగా.. విరూపాక్షలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తున్నారు. సాయి చంద్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సునీల్, అజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Sai Dharam Tej (@jetpanja) -
Valentine's Day: ప్రేమకు చిహ్నమైన ‘రెడ్’ కలర్ దుస్తుల్లో మతిపోగొడుతున్న భామలు (ఫోటోలు)
-
Valentines Day 2023: ప్రేమతో దగ్గరై పెళ్లితో ఒక్కటైన సెలబ్రిటీ కపుల్ (ఫొటోలు)
-
అభిమానితో ప్రేమ.. ఆ తర్వాత.. కాంతార హీరో ప్రేమకథలో ట్విస్టులు
కన్నడ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు రిషబ్ శెట్టి. ఇక కాంతార మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఎలాంటి అంచనాలు లేకండా ప్రాంతీయ సినిమాగా వచ్చిన పాన్ ఇండియా స్థాయిలో కలేక్షన్స్ రాబట్టింది. కేవలం రూ. 15 కోట్లతో నిర్మించిన కాంతార ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో రిషబ్ శెట్టి గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆయన వ్యక్తిగత జీవితంపై పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. అయితేరి షబ్ శెట్టిది లవ్ మ్యారేజ్. ఆయన భార్య పేరు ప్రగతి. ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా ఆయన ప్రేమ పెళ్లిపై ప్రత్యేక కథనం. అభిమానితో ప్రేమ సాధారణంగా హీరోలు తమ ఇండస్ట్రీలోని పరిచయమున్న వారితో ప్రేమలో పడట సహజం. కానీ అభిమానితో ప్రేమలో పడటం అంటే చాలా అరుదు. కానీ రిషబ్ శెట్టి జీవితంలో అదే జరిగింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయితో ఆయన ప్రేమలో పడ్డారు. ఓ ఈవెంట్లో ఆమెను చూసిన మనసు పారేసుకున్నారు. ఆ తర్వాత ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నారట. ఓ ఈవెంట్లో 2016లో పరిచయమైన ప్రగతిని 2017లో వివాహం చేసుకున్నారు రిషబ్ శెట్టి. వీరి ప్రేమ ఎలా మొదలైందంటే.. కిరాక్ పార్టీ ఫేమ్ రక్షిత్ శెట్టితో ఓ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. రిషబ్‌కు వీరాభిమాని అయిన ఆ ఈవెంట్‌కు వెళ్లింది. అక్కడే ఆమెను చూశారు రిషబ్. ఇంటికెళ్లి ఫోన్లో ఫేస్ బుక్ చూస్తే ఆ అమ్మాయి రిక్వెస్ట్ పెట్టిందట. ఆమె రిక్వెస్ట్ ఏడాది తర్వాత చూసి యాక్సెప్ట్ చేశారట. ఇక అప్పటి నుంచి చాటింగ్, ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. పట్టుబట్టి మరీ ఒప్పించిన ప్రగతి అయినా ప్రగతి ఇంట్లో వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. రిషబ్ జీవితంలో ఇంకా స్థిరపడలేదని వద్దని చెప్పారు. కానీ ప్రగతి పట్టుబట్టి మరీ కుటుంబ సభ్యులను ఒప్పించింది. ఆ తర్వాత 2017లో వీరి ప్రేమ పెళ్లి జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రిషబ్ సినీ కెరీర్ రిషబ్ కెరీర్ విషయానికొస్తే ఫిల్మ్ డైరెక్షన్లో డిప్లొమా చేశారు. కన్నడ స్టార్ డైరెక్టర్ ఏమ్మార్ రమేశ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన నిర్మాత, దర్శకుడిగా రెండు చిత్రాలు చేస్తున్నారు. -
Valentine's Day 2023:వామ్మో..చాట్‌జీపీటీని అలా కూడా వాడేస్తున్నారట!
సాక్షి: ముంబై: వాలెంటైన్స్ డే సందర్భంగా ఏఐ సంచలనం చాట్‌జీపీటీ క్రేజ్‌ను లవ్‌బర్డ్స్ కూడా బాగానే క్యాష్ చేసుకుంటున్నారు.లవర్స్ ఇంప్రెస్ చేసేందుకు చాట్‌జీపీటీ సాయం తీసుకుంటున్నారట అబ్బాయిలు. ప్రేమలేఖలు రాయడానికి భారతీయ పురుషులు, టీనేజర్లు చాట్ జీపీటీ సహాయం తీసుకుంటున్నారని తాజాగా ఒక సర్వే వెల్లడించింది. అంతేకాదు 73 శాతం మంది డేటింగ్ యాప్‌లలో తమ ప్రొఫైళ్లను మార్చుకునేందుకు ఏఐ టూల్‌ని వాడుకోవాలని చూస్తున్నారట. (ఇది కూడా చదవండి: Valentines Day2023: జియో బంపర్ ఆఫర్స్) తమ స్వీటీలను ఎలాగైనా ఆకర్షించాలనే ఉద్దేశంతో 60 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమ లేఖలు రాయడానికి చాట్‌జీపీటీ సహాయం తీసుకోవాలని భావించారని సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ తేల్చింది 'మోడరన్ లవ్' పేరుతో జరిపిన అధ్యయనంలో 78 శాతం మంది భారతీయ వయోజనులు చాట్‌జీపీటీలో రాసిన ప్రేమ లేఖల పట్ల మక్కువ చూపుతున్నారని, అసలు దానినిఏఐ లెటర్‌గా గుర్తించలేకపోతున్నారని మెకాఫీ స్టడీ తేల్చింది. అంతేకాదు ప్రేమలేఖలు రాయడానికి చాట్‌జీపీటీని వాడుకున్న ఎనిమిది దేశాలలో భారతీయులే ఎక్కువమంది ఉన్నారని కూడా తెలిపింది. తమ ప్రేమను వ్యక్తం చేయడానికి మాటలు రాని , ప్రేమలేఖలు రాయలేని లేదా దానికి పదాలు దొరకని వారు ఈ ఓపెన్ ఏఐని ఆశ్రయిస్తున్నారట. వాలెంటైన్స్ డేసందర్భంగా నిర్వహించిన ‘మోడరన్ లవ్’ పరిశోధనలో 9 దేశాల నుండి 5000 మందికి పైగా వ్యక్తులను సర్వే చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 27 శాతం మంది వ్యక్తులు చాట్‌జీపీటీ లేఖను పంపడం వల్ల తమకు మరింత ఆత్మవిశ్వాసం ఉందని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 49 శాతం మంది చాట్‌జీపీటీ రాసిన ప్రేమ లేఖలు అందుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా గగుల్కు షాకిస్తూ ఇటీవలి కాలంలో చాట్‌జీపీటీ దూసుకు పోతోంది. దీంతో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కూడా చాట్ జీపీటీకి పోటీగా ఏఐటూల్ బార్డ్‌ను తీసుకిచ్చింది. అయితే, ఒక తప్పిదం కారణంగా బార్డ్ భవిష్యత్తులో చాట్‌జీపీటీతో ఎలా పోటీ పడుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. అప్రమత్తత చాలా అవసరం ప్రపంచవ్యాప్తంగా, నలుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది (26 శాతం) ఏఐ ద్వారా నోట్‌ను రాయాలని ప్లాన్ చేస్తున్నారనీ, ఆన్లైన్ డేటింగ్ ప్రపంచంలోఇది రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటిదని మకాఫీ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ప్రేమికులు టార్గెట్ చేసే ప్రమాదం ఉందని, మనుషులు, ఏఐ మధ్య తేడాను గుర్తించగలరో లేదో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని నివేదికలో పేర్కొంది. అలాగేపార్ట్నర్తో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా డబ్బులు, వ్యక్తిగత వివరాలపై అనుమానాస్పదంగా అడిగినప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని బమెకాఫీ స్టీవ్ గ్రోబ్‌మాన్ సూచించారు. -
Valentines Day2023: జియో బంపర్ ఆఫర్స్
సాక్షి,ముంబై: వాలెంటైన్స్ డే సందర్భంగా టెలికాం దిగ్గజం ‘జియో వాలెంటైన్ ఆఫర్’ కింద, వాలెంటైన్స్ డే ప్రీ పెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. అదనపు డేటాతో మరికొన్ని ఆఫర్లను కూడా అందిస్తోంది. ముఖ్యంగా డిస్కౌంట్ కూపన్లు ,ఫెర్న్ & పెటల్స్, మెక్‌డొనాల్డ్స్ వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్ల నుండి ఆఫర్ ఉన్నాయి. జియో వాలెంటైన్ ఆఫర్ ♦ రూ. 121 విలువైన అదనపు డేటా యాడ్-ఆన్ (12 జీబీ డేటా). ♦ రూ. 1,000 విలువైన ప్రత్యేక తగ్గింపు వోచర్లు. ♦ ఫెర్న్ & పెటల్స్ రూ. 799 కొనుగోలుపై రూ. 150 తగ్గింపు. ♦ మెక్‌డొనాల్డ్స్ - రూ. 199 కొనుగోలుపై రూ. 105 తగ్గింపు (సౌత్ & వెస్ట్ రీజియన్ మాత్రమే). ♦ ఇక్సిగో - రూ. 4,500 విమాన బుకింగ్‌పై రూ. 750 తగ్గింపు. ఈ ఆఫర్‌ను పొందడానికి, “కూపన్ కోడ్ల వివరాల కోసం మై జియో యాప్‌లో కూపన్లు & విన్నింగ్‌లు” ట్యాబ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. రూ. 349, రూ.899 రూ. 2999 రీఛార్జ్‌పై జియో ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ప్రకారం, ఫిబ్రవరి 10న లేదా తర్వాత పైన పేర్కొన్న రీఛార్జ్‌ని చేస్తే అదనపు 12జీబీ 4జీ డేటా కూపన్‌కు అర్హులు. అలాగే రూ. 2999 ప్లాన్‌తో, అయితే, పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలతో పాటు, కస్టమర్లు 75జీబీ అదనపు డేటాతో పాటు 23 రోజుల అదనపు వ్యాలిడిటీని కూడా పొందుతారు. అంటే రూ. 2399 ప్లాన్‌తో అందించే మొత్తం అదనపు డేటా 87జీబీ అన్నట్టు. -
ప్రేమికుల రోజు చూడాల్సిన స్పెషల్ మూవీస్ ఇవే..
వాలెంటైన్స్ డే.. ప్రేమికులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోజిది. ఎప్పటినుంచో ప్రేమలో మునిగి తేలుతున్నా ఎందుకో ప్రేమికులకు ఈరోజు మాత్రం కాస్త స్పెషల్ అని చెప్పొచ్చు. లవ్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడానికి వాలెంటైన్స్ డేకి మించిన రోజు ఉండదని భావిస్తారు. అందుకే ప్రేమికుల రోజును మరింత స్పెషల్‌గా డిజైన్ చేసుకుంటారు. రెండు మనసుల్ని దగ్గర చేసే ప్రేమ మత్తు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి దేవదాసు దగ్గర్నుంచి లేటెస్ట్ సీతారామం వరకు ఎన్నో ప్రేమకథా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తనదైన మ్యాజిక్ చేశాయి. ప్రేమికుల రోజు సందర్భంగా ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్‌గా నిలిచిన సినిమాలేంటో చూసేద్దాం. ప్రేమికుల రోజు సోనాలి బింద్రే, కునాల్ జంటగా నటించిన ప్రేమికుల రోజు సినిమా వాలైంటైన్స్ డే స్పెషల్ మూవీస్‌లో టాప్ ప్లేస్‌లో ఉంటుందనడంలో సందేహం లేదు. కాథిర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఫేస్బుక్ ద్వారా ప్రేమలో పడటం, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోవడం, క్లైమాక్స్‌లో మళ్లీ కలవడం ఇలా ప్రతీ సీన్ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. కథకు తోడు ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. జయం దేశ డైరెక్షన్లో వచ్చిన జయం సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. నితిన్, సదా జంటగా నటించిన ఈ సినిమా హీరో,హీరోయిన్లకు స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగులో విజయం సాధించడంతో తమిళంలోనూ రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ సక్సెస్ అయ్యిందీ చిత్రం. గీతాంజలి నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఎవర్గ్రీన్ సినిమా గీతాంజలి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పటికీ ఇప్పటికీ సూపర్ హిట్టే. ఇళయరాజ సంగీతం సినిమాకు మరో ఆణిముత్యంలా నిలిచింది. ఇప్పటికీ ఇందులోని సాంగ్స్, సన్నివేశాలు ఎవర్గ్రీన్. ఏ మాయ చేసావే నాగార్జున, సమంత జంటగా నటించిన సినిమా ఏ మాయ చేసావే. గౌతమ్ మీనన్ డైరక్షన్లో వచ్చిన ఈ సినిమా క్లాసిక్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సమంతకు ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఈ మూవీ షూటింగ్ టైంలోనే సమంత, నాగ చైతన్య మధ్య స్నేహం కుదిరింది. పెళ్లికి దారితీసింది. కానీ ఏమైందో ఏమో మనస్పర్థల కారణంగా వాళ్లు విడాకులు తీసుకున్నారు. ఆర్య సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన అందమైన ప్రేమ కథ ఆర్య. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా బన్నీకి స్టార్డమ్కు తెచ్చిపెట్టింది. అప్పటికి వరకు వచ్చిన ప్రేమకథలకు బిన్నంగా తెరకెక్కిన ఆర్య సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ‘ఫీల్ మై లవ్’ అంటూ దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో ఆకట్టుకున్నారు. ఇప్పటికీ ఈ పాట ప్రపోజ్ డేకు బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు. లవ్ ఎట్ సైట్, ట్రయాంగిల్ లవ్‌స్టోరీని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ సూపర్ సక్సెస్ అయ్యారు. లవ్‌స్టోరీ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్‌స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం లవ్ యాంగిల్లోనే కాకుండా కుల వివక్ష, చిన్నతనంలోనే లైంగిక వేధింపులు వంటి సెన్సిటివ్ అంశాలను టచ్ చేశారు. నిజానికి శేఖర్ కమ్ముల గత సినిమాల కంటే ఇది కాస్త భిన్నమైనదనే చెప్పాలి. కథలో ఇంటెన్స్ స్టోరీతో పాటు టైటిల్‌కు తగ్గట్లుగా మంచి ఫీల్‌గుడ్ పాటలతో సాగిన ఈ చిత్రం వాలైంటైన్స్ డే స్పెషల్ మూవీస్‌లో ఒకటి. వీటితో పాటు సఖి, దేవదాసు, ప్రేమనగర్, ప్రేమదేశం, వర్షం, సీతారామం సహా ఎన్నో ప్రేమకథలు వెండితెరపై మరుపురాని చిత్రాలుగా నిలిచాయి. -
సెట్లో ప్రేమించుకున్నారు.. పెళ్లి సెట్ చేసుకున్నారు
ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు ప్రపంచంలోని ప్రేమికులంతా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే వాలెంటైన్స్ డేకు అంత ప్రాముఖ్యత ఉంది. ప్రేమ తర్వాత పెళ్లి వరకు చేరిన జంటలు మాత్రం ఇలా వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. కానీ బాలీవుడ్లో అలాంటి ప్రేమజంటలు ఎక్కువగానే ఉన్నాయి. తెరపై చూసిన ప్రేమ కథలే నిజ జీవితంలో ఒక్కటయ్యాయి. ప్రేమ పెళ్లిళ్లతో బాలీవుడ్ జంటలు అభిమానులకు సర్ప్రైజ్లు కూడా ఇచ్చాయి. కొన్ని జంటలు ప్రేమను పెళ్లిదాకా తీసుకెళ్లడంలో విఫలమైనా.. మరికొన్ని జంటలు మాత్రం పెళ్లి బంధంలో అడుగుపెట్టాయి. బాలీవుడ్లో ఇటీవలే పెళ్లి చేసుకున్న కియారా-సిద్ధార్థ్ జంట నుంచి ఇప్పటిదాకా ఒక్కటైనా జంటలు ఏవో తెలుసుకుందాం. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెట్లో ప్రేమించి పెళ్లి సెట్ చేసుకున్న బాలీవుడ్ ప్రేమ జంటలపై ఓ లుక్కేద్దాం పదండి. కాజోల్, అజయ్ దేవగన్ : కాజోల్, అజయ్ దేవగన్ 1995 చిత్రం హల్చల్ షూటింగ్ సెట్లో కలుసుకున్నారు. నాలుగేళ్ల ప్రేమ తర్వాత 1999లో పెళ్లి చేసుకున్నారు. కాజోల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అజయ్‌ని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించికున్నప్పుడు నెలల తరబడి తన తండ్రి తనతో మాట్లాడలేదని ఒప్పుకుంది. కానీ ఆ తర్వాత సంతోషంగా వివాహం చేసుకున్నారు. కాగా వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ బాలీవుడ్లో అత్యంత ఆదరణ పొందిన నటుల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. అమితాబ్ బచ్చన్ జయా బచ్చన్ జంట 1970లో మొదటిసారి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కలుసుకున్నారు. అయితే ఆ గుడ్డి సినిమా షూటింగ్ సమయంలో వీరి ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఏక్ నాజర్ సెట్స్‌లో ఉన్నప్పుడు వారి బంధం మరింత బలపడింది. చివరికి జూన్ 3, 1973న వివాహం చేసుకున్నారు. జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్‌ముఖ్ సెట్లో పరిచయమై పెళ్లిదాకా వెళ్లిన జంటల్లో జెనీలియా డిసౌజా, రితీష్ దేశ్‌ముఖ్. ఈ జంట2003లో తుజే మేరీ కసమ్ సెట్స్‌లో మొదటిసారి పరిచయంతోనే మంచి స్నేహితులయ్యారు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ తర్వాత ఈ ప్రేమ జంట ఫిబ్రవరి 3, 2012న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తేరే నాల్ లవ్ హో గయా, మస్తీ, లై భారీ వంటి సినిమాల్లో కలిసి పనిచేశారు. ట్వింకిల్ కన్నా, అక్షయ్ కుమార్ షూటింగ్ సెట్లో పరిచయంతో ఒక్కటైన జంట అక్షయ్ కుమార్, ట్వింకిల్ కన్నా. మొదటిసారి ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ షూటింగ్లో ఈ జంట కలుసుకున్నారు. ఆ తర్వాత అక్షయ్‌కి ట్వింకిల్‌పై ప్రేమ ఏర్పడింది. ఈ జంట ప్రేమ వ్యవహారం 1999లో ఇంటర్నేషనల్ ఖిలాడీ మేకింగ్ సమయంలో మొదలైంది. రెండేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన బాలీవుడ్ జంట చివరికి జనవరి 17, 2001న వివాహం చేసుకున్నారు. దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ బాలీవుడ్లో మోస్ట్ రొమాంటిక్ జంటల్లో దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ ఒకరు. వీరి ప్రేమ 2013లో గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా సెట్స్‌లో చిగురించింది. దాదాపు ఆరేళ్ల పాటు కలిసి ప్రేమలో ఉన్న ఈ జంట 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత పద్మావత్, ఫైండింగ్ ఫ్యానీ, బాజీరావ్ మస్తానీ సినిమాల్లో కనిపించారు. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ బాలీవుడ్లో మరో పవర్ ఫుల్ కపుల్ ఎవరంటే విక్కీ కౌశల్, కత్రినా కైఫ్. ఈ జంట డిసెంబర్ 2021లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. బాలీవుడ్లో జరిగిన అతిపెద్ద వివాహాలలో ఇది ఒకటిగా నిలిచింది. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ బాలీవుడ్లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్. దాదాపు ఐదేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఏప్రిల్ 2022లో ఒక్కటైంది. గతేడాది బ్రహ్మస్త్ర సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ జోడికి నవంబర్‌లో ఓ పాప కూడా జన్మించింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మణిరత్నం చిత్రం గురు షూటింగ్ సమయంలో కలుసుకున్న జంట ఐశ్వర్య అభిషేక్. ఈ జంట సెట్లోనే ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటచు ప్రేమలో ఉన్న జంట ఏప్రిల్ 10, 2007న వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరు ఉమ్రావ్ జాన్, ధూమ్ 2 వంటి చిత్రాలలో పనిచేశారు. ఈ జంట 2011లో ఆరాధ్య జన్మించింది కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్లో మరో ప్రేమజంట షాహిద్ కపూర్, కరీనా కపూర్. మొదట ఆమె తాషాన్ సెట్లో సైఫ్‌ను కలుసుకుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. సైఫ్, కరీనా రెండేళ్ల పాటు డేటింగ్ అనంతరం అక్టోబర్ 16, 2012న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఈ ఏడాదిలో ఒక్కటైన బాలీవుడ్ ప్రేమజంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ. రాజస్థాన్‌లో సూర్యగడ్లో ఫిబ్రవరి 7న వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి ప్రేమకథ మొదటి చిత్రం షేర్షా సెట్స్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా పుట్టినరోజు సందర్భంగా కియారా అద్వానీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా తెలియజేసింది. -
Valentine's Day: ఖండాంతరాలు దాటిన ప్రేమ
సాక్షి, హైదరాబాద్: కొండాపూర్‌లో నివసించే హర్షవర్ధన్ అచ్చమైన తెలంగాణ అబ్బాయి. చదువుకునే సమయంలో తమిళనాడుకు చెందిన ‘అరు’ అనే యువతి ప్రేమలో పడ్డాడు. పెళ్లి తంతు మొత్తం తమిళ బ్రాహ్మణ సంప్రదాయంలో జరగడం.. ఆమెతో పెళ్లి కోసం అతను చేసుకున్న సర్దుబాట్లలో ఒకటి మాత్రమే. అతని భార్యగా మారాక అరు కూడా ఇక్కడి ఆచారాలు, అలవాట్లకు తగ్గట్టుగా తన వంతుగా మారే ప్రయత్నం చేస్తున్నారు. ప్రేమ ముందు సంస్కృతీ సంప్రదాయాలు కూడా తలవంచుతాయి అని ఇలాంటి జంటలు నిరూపిస్తున్నాయి. ఖండాంతరాలు దాటిన ప్రేమ ‘మేం ఇద్దరం ఆరేళ్ల పాటు ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం. మేం పరిచయమయ్యే నాటికి నా వయసు 18 ఆయనకు 25పైనే’ అంటూ గుర్తు చేసుకున్నారు సెలీన్ (41). ప్రస్తుతం నగరంలోని మణికొండలో నివసిస్తున్న సెలీన్, ఆమె భర్త కాకుమాను విక్రమ్‌ను ఫ్రాన్స్‌లోనే కలిసి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఖండాంతరాలు దాటిన వీరి ప్రేమ పెద్దలు, మతాలు వంటి అవాంతరాలు దాటి 2006లో జరిగిన పెళ్లితో సుఖాంతమైంది. పెళ్లి అనంతరం ఫ్రెంచ్ భాషలో ప్రావీణ్యం సాధించిన విక్రమ్ ప్రస్తుతం ఓ ఫ్రెంచ్ కంపెనీలోనే ఉద్యోగం చేస్తుండగా సెలెన్ నగరంలో ఫ్రెంచ్ భాషా ఉపాధ్యాయిని. తనకెంతో ఇష్టమైన తెలుగు వంటలు వండటం భార్యకు రాకపోయినా విక్రమ్ సర్దుకుపోతుంటే.. భర్తతో కలిసి తిరుపతి వంటి హిందూ దేవుళ్ల ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించడం సెలెన్ అలవాటు చేసుకున్నారు. ఇక్కడి ఫంక్షన్లకు చక్కగా చీర కట్టుకుని మరీ హాజరయ్యే సెలెన్‌ను చూసినవారెవరైనా ఫ్రెంచ్ జాతీయురాలు అంటే నమ్మడం కష్టం. హైదరాబాద్ వాతావరణం చాలా నచ్చిందని, తెలుగు భాష కొద్దిగా నేర్చుకున్నానని చెబుతున్న సెలెన్.. తన భర్తకు నచ్చే విధంగా అత్తయ్యా, మావయ్యా అంటూ ఆయన తల్లిదండ్రులను సంబోధిస్తూ సంతోషపెడతారు. ఆపం, పుట్టు అతనికి.. ఇడ్లీ.. దోశ ఆమెకి.. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో నగరానికి చెందిన దేవేందర్ ఫార్మాసిస్ట్‌గా.. కేరళకు చెందిన శశికళ స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ.. ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కేరళ–హైదరాబాద్ మధ్య దూరం తరిగిపోయింది. సెటిలయ్యాకే పెళ్లి అనుకున్నారు కాబట్టి పెద్దలు ససేమిరా అని అడ్డం పడినా ఆ అభ్యంతరాలన్నీ దూది పింజలైపోయాయి. పెళ్లి తర్వాత కొబ్బరినూనెతో వండే కేరళ తరహా వంటలు దేవేందర్ ఇష్టపడక తప్పలేదు. అత్తగారి ఊరెళ్లాక అక్కడి వస్త్రధారణ అయిన పంచెకట్టులోనే గుళ్లూ గోపురాలూ తిరగడం అతనికి అలవాటైంది. మరోవైపు కొబ్బరినూనె లేకుండా వండే వంటలు శశికళ తినక తప్పలేదు. అయితే తర్వాత తర్వాత అక్కడి కోకోనట్ ఆయిల్‌తో వంటలు ఆరోగ్యకరమని గ్రహించిన దేవేందర్ తనకు తన పిల్లల వరకూ అదే ఆయిల్‌ని వాడడం కోసం కేరళ నుంచి 4 కిలోల నూనెను ప్రత్యేకంగా తెప్పిస్తారు. పుట్టు, ఆపం వంటి కేరళ వంటలతో పాటే దేవేందర్‌కు మలయాళం, ఇక్కడి ఇడ్లీ, పూరిలతో పాటే శశికళకు తెలుగు భాష కూడా వంటబట్టేశాయి. ఇంకా కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నా...పరస్పరంప్రేమ ముందు ఇలాంటి సర్దుబాట్లు చిన్నవే అంటోందీ జంట. కేరళ అబ్బాయి.. తమిళ అమ్మాయి అమెజాన్ కంపెనీలో పనిచేస్తూనే ప్రేమలో పడిన ప్రియాంక తమిళమ్మాయి, అబ్బాయి శ్రీకాంత్‌ది కేరళ. ఇద్దరూ ప్రేమను పంచుకున్నారు. మరి పూర్తిగా భిన్నమైన సంప్రదాయాలను ఎలా పంచుకుంటున్నారు? అంటే.. సందర్భాన్ని బట్టి, అప్పటికప్పుడు ఏది బెటరయితే అది ఫాలో అయిపోవడమే అంటూ సింపుల్‌గా చెప్పేస్తారిద్దరూ. ఉదాహరణకి వీరి పెళ్లి ఏ సంప్రదాయంలో జరగాలి? అనే చర్చ వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి ఆలోచించుకున్నారు. కేరళ సంప్రదాయంలో పెళ్లి పట్టుమని 15 నిమిషాలు కూడా ఉండదు కాబట్టి కాస్త గుర్తుంచుకునేలా ఉండడానికి ఇక్కడి సంప్రదాయాన్నే ఎంచుకున్నారు. ‘ప్యారా’నాపూల్ చార్మినార్: ప్రేమకు గుర్తుగా మూసీ నదిపై పురానాపూల్ వంతెనను నిర్మించారు. అప్పట్లో దీనిని ‘ప్యారా’నాపూల్ అనేవారు. తాను ప్రేమించిన భాగమతి దక్షిణ మూసీ ప్రాంతంలో ఉండటంతో.. ఉత్తరం వైపు ఉన్న గోల్కొండ నుంచి ప్రాణాలకు తెగించి నదిని దాటుకుంటూ వచ్చి వెళ్లేవాడు మహ్మద్ కులీ కుతుబ్ షా. ఇలా నది నీటిలో ఈదుకుంటూ వెళ్లి రావడం ఎప్పటికైనా ప్రమాదమని భావించిన మహ్మద్ కులీ కుతుబ్ షా తండ్రి సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా మూసీపై కొత్తగా వంతెన నిర్మాణానికి పూనుకున్నాడు. మూసీ నదిపై వంతెన నిర్మిస్తే తన కుమారుడు క్షేమంగా ఇవతలి నుంచి అవతలికి వెళ్లి రావడానికి అనువుగా ఉంటుందని.. అతను ప్రేమించిన భాగమతిని కలిసి వస్తాడని భావించి 1578లో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాడు. దీంతో మూసీ నదిపై భాగమతి ప్రేమకు గుర్తుగా ఈ వంతెనను నిర్మించాడు. అప్పట్లో ప్యారానాపూల్‌గా ప్రసిద్ధి గాంచిన ఈ వంతెన.. అనంతర కాలంలో పురానాపూల్‌గా వాడుకలోకి వచ్చింది. -
Valentines Day 2023: ఏళ్లు గడిచిన.. చెరిగిపోని ప్రేమబంధానికి సాక్ష్యం (ఫొటోలు)
-
Valentines Day 2023: నువ్వుంటే నా జతగా.. నేనుంటా ఊపిరిగా
ప్రేమ.. అనిర్వచనీయమైన అనుభూతి, ప్రేమ.. వెలకట్టలేని సంపద. నిస్వార్థమైన, నిజాయతీతో కూడిన ప్రేమ ఎంతో పవిత్రమైనది..శక్తివంతమైనది. ఈ ప్రపంచాన్నే ముందుకు నడిపించే భావోద్వేగమే ప్రేమ. ఏ బంధమైన వికసించాలన్నా..చిరకాలం నిలవాలన్నా ప్రేమ ఒక్కటే మార్గం. అది ఇద్దరు వ్యక్తుల మధ్య అయి ఉండవచ్చు.. లేదా కుటుంబం, సమాజం మీద అయి ఉండవచ్చు. నిజమైన ప్రేమ ధనంతో.. బలంతోనే దక్కించుకునేది కాదు. నిజమైన ప్రేమను నిజంగా ప్రేమించడం ద్వారానే జయించగలం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది తమ నిజమైన ప్రేమతో జీవితాన్ని ఆనందమయం చేసుకున్నారు. ప్రేమను గెలిపించి.. పెళ్లి బంధంతో ఏకమై ప్రేమానుభూతులను ఆస్వాదిస్తున్నారు. నువ్వుంటే నా జతగా... నేనుంటా నీ ఊపిరిగా అంటూ దేహాలు వేరైనా మన ప్రేమ ఒక్కటే అంటూ ముందుకు సాగుతున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో కొంతమంది ప్రేమానుభూతులు వారి మాటల్లో.. అలుపెరగని ప్రేమ జన్నారం: మండలంలోని పొనకల్‌కు చెందిన మూల భాస్కర్‌గౌడ్, రేణుక ఇంటర్‌లోనే ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు ఒక్కటే అయినా వయస్సు రీత్యా మైనర్లు కావడంతో ఐదేళ్లపాటు ఆగి ఆతర్వాత పెద్దలను ఒప్పించి 1980 ఫిబ్రవరి 14న వివాహం చేసుకున్నారు. దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. ప్రేమించడమే కాకుండా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నప్పుడే ఆ ప్రేమ చిరకాలం నిలుస్తుందని, తల్లిదండ్రులను బాధపెట్టవద్దన్నది మా ఉద్దేశమని వారు పేర్కొంటున్నారు. – భాస్కర్‌గౌడ్, రేణుక పెద్దలను ఒప్పించి.. చెన్నూర్‌రూరల్: పట్టణంలోని మంగళి బజార్లో నివాసం ఉంటున్న కారెంగుల శ్రావణ్ పటేల్, మానసరాణి దంపతులది ప్రేమ వివాహం. 2011లో మానస కాలేజీకి వెళ్తుండగా చూసిన శ్రావణ్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. సుమారు ఐదేళ్లపాటూ ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒకే కులానికి చెందినవారు కావడంతో యువతి ఇంటికి వెళ్లి పెద్దలతో మాట్లాడాడు. పెళ్లికి ఒప్పుకోవడంతో 2016లో వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు కుమారులు జన్మించారు. శావణ్ సోదరుడు సందీప్‌ది కూడా ప్రేమ వివాహమే. విజయ అనే యువతిని ప్రేమించి నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. – కారెంగుల శ్రావణ్, మానస రాణి నమ్మకమైన బంధానికి ప్రతిరూపం గుడిహత్నూర్: నమ్మకమైన బంధానికి ప్రతి రూపమే ప్రేమ అని.. ఇది లేకుండా మనిషి సంఘ జీవుడు కాలేడని చెప్తున్నారు ఉపారపు సత్యరాజ్–పార్వతి దంపతులు. మండలంలోని లింగాపూర్‌కు చెందిన సత్యరాజ్ 2017లో హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా అక్కడే పనిచేస్తున్న ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని గోయగాంకు చెందిన పార్వతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరుకావడంతో ఇరువురి పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో గతేడాది జనవరి 25న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. – సత్యరాజ్, పార్వతి ప్రేమలో గెలిచి.. బోథ్: మండల కేంద్రానికి చెందిన కట్ట పల్లవి, భూమేశ్ దంపతులది ప్రేమ వివాహం. ఒకే కాలనీలో ఉంటున్న ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇరువురి కులాలు వేరుకావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో 2011లో తలమడుగు మండలం కజ్జర్ల శివారులోని శివాలయంలో స్నేహితుల మధ్య వివాహం చేసుకున్నారు. వివాహమైన వారం రోజులకే ఇరువురి కుటుంబసభ్యులు కలిసిపోయారు. అప్పటినుంచి వారి దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది. ఏడాడూ వారి మధ్య భేదాభిప్రాయాలు రాలేదని దంపతులు పేర్కొంటున్నారు. – కట్ట పల్లవి, భూమేశ్ ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొని.. తాంసి: తాంసి మండల కేంద్రానికి చెందిన రేండ్ల అజయ్, ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన అనూష హైదరాబాద్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2010లో వివాహం చేసుకున్నారు. ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూనే చదువును పూర్తి చేశారు. అజయ్ ఎంబీఏ పూర్తి చేసి ఫార్మా కంపనీలో మార్కెటింగ్ ఉద్యోగంలో చేరాడు. రెండేళ్ల క్రితం అల్‌మైటి ఫార్మా కంపనీ ప్రారంభించాడు. అనూషను సైతం జీఎన్ఎం శిక్షణ పూర్తి చేయించడంతో హైదరాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్లో సీనియర్ నర్స్‌గా విధులు నిర్వర్తిస్తోంది. దీంతో ఆర్థిక కష్టాలు దూరమయ్యాయి. సమాజసేవలో సైతం ముందుండి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. – రేండ్ల అజయ్, అనూష చదువు అండగా నిలిచింది నిర్మల్‌చైన్‌గేట్: ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుతున్న సమయంలో ఆదిలాబాద్‌కు చెందిన కేంద్రీ సోనీతాయ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పీజీ పూర్తి చేసిన రెండేళ్ల తర్వాత ఇద్దరం హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఉద్యోగంలో చేరాం. ఇద్దరి కులం ఒక్కటైనా భాష వేరుకావడంతో పెళ్లికి పెద్దలు నిరాకరించారు. సెప్టెంబర్ 26, 2015న నిర్మల్ జిల్లా కేంద్రంలోని గండి రామన్న ఆలయంలో వివాహం చేసుకున్నాం. మేము చదివిన చదువు మాకు అండగా నిలిచింది. ప్రస్తుతం ఇద్దరం నిర్మల్‌లోనే లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నాం. 2018లో పాప జన్మించింది. ఆ తర్వాత మా కుటుంబ సభ్యులు మా ప్రేమను అర్థం చేసుకొని మాతో కలిసిపోయారు. – బలాస్ట్ శివరామకృష్ణ, కేంద్రీ సోనీతాయ్ ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొని.. తాంసి: తాంసి మండల కేంద్రానికి చెందిన రేండ్ల అజయ్, ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన అనూష హైదరాబాద్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2010లో వివాహం చేసుకున్నారు. ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూనే చదువును పూర్తి చేశారు. అజయ్ ఎంబీఏ పూర్తి చేసి ఫార్మా కంపనీలో మార్కెటింగ్ ఉద్యోగంలో చేరాడు. రెండేళ్ల క్రితం అల్‌మైటి ఫార్మా కంపనీ ప్రారంభించాడు. అనూషను సైతం జీఎన్ఎం శిక్షణ పూర్తి చేయించడంతో హైదరాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్లో సీనియర్ నర్స్‌గా విధులు నిర్వర్తిస్తోంది. దీంతో ఆర్థిక కష్టాలు దూరమయ్యాయి. సమాజసేవలో సైతం ముందుండి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. – రేండ్ల అజయ్, అనూష -
వలెంటైన్స్ డే అలర్ట్.. అడ్డుకుంటామంటున్న సంస్థలు
వలెంటైన్స్ డే బహిష్కరణ పిలుపులు... ప్రేమికులకు కౌన్సెలింగ్ ఇస్తామంటున్న కొన్ని సంస్థలు... ఈ పరిణామాల నేపథ్యంలో ఘర్షణలకు తావు లేకుండా హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పార్క్‌లు, యూనివర్సిటీలు, పబ్స్, హోటళ్లు, మాల్స్, నెక్లెస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయనున్నారు. నగరంలో అయిదు జోన్లలో చేయాల్సిన ఏర్పాట్లపై సన్నాహాలు ప్రారంభించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క ప్రైవేటు బౌన్సర్లకూ మంచి గిరాకీ ఏర్పడింది. నగరంలోని పబ్స్, మాల్స్, రెస్టారెంట్స్ యాజమాన్యాలు దినసరి వేతనంపై వీరిని నియమించుకుంటున్నాయి. హెచ్చరికలు చేసిన వారిపై నిఘా ఉంచడం, అవసరమైతే ముందస్తు అరెస్టు చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో అయిదు జోన్లలో పశ్చిమ మండలం అతి కీలకమైంది. అనేక పబ్స్, రెస్టారెంట్స్‌తో పాటు మాల్స్, పార్కులు ఇతర కీలక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. దీంతో దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు నిబంధనలు, సమయాలను అతిక్రమించకుండా చర్యలు తీసుకుంటున్నారు. బౌన్సర్లకు గిరాకీ.. బౌన్సర్... ఈ పేరు పబ్స్, బార్స్లకు తరచు వెళ్లే వారికి సుపరిచితమే. మితిమీరి ప్రవర్తించే వారిని, హద్దు మీరి మద్యం సేవించి గొడవలు చేసే వారిని కట్టడి చేయడానికి శాశ్వత ప్రాతిపదికన యాజమాన్యాలు వీరిని నియమించుకుంటాయి. కండలు తిరిగిన శరీరం, కళ్లల్లో చురుకుతనం, చిరునవ్వు కూడా కనిపించని ముఖం, నల్లటి యూనిఫాంలతో వీరు దర్శనమిస్తుంటారు. అయితే.. వలంటైన్ డే నేపథ్యంలో అనేక రెస్టారెంట్లు, మాల్స్ యాజమాన్యాలు సైతం వీరిని నియమించుకుంటున్నాయి. ఎవరికి వారు స్వీయ రక్షణ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పబ్స్, మాల్స్ తదితర సంస్థల యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతో పాటు బౌన్సర్లనూ ఏర్పాటు చేసుకుంటున్నారు. శాశ్వత ప్రాతిపదికన బౌన్లర్లు కలిగిన సంస్థలు సైతం మంగళవారం ఒక్క రోజుకూ అదనంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ బౌన్సర్లను అందించడానికి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలతో పాటు జిమ్స్ సైతం ముందుకు వస్తున్నాయి. ఒక్కొక్కరికి రోజుకు రూ.2 వేల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తంలో 60 శాతం బౌన్సర్‌కు, 40 శాతం ఆయా సంస్థలు/జిమ్‌లకు చెందుతాయి. చదవండి: ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే.. -
వాలెంటైన్స్ డే స్పెషల్ గిఫ్ట్స్
-
ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే..
కులము.. గిలము.. బలము చూసి.. వయసు.. వరస.. సొగసూ చూసి.. పుట్టుకొస్తాదా ప్రేమ..? మనసుకు మనసుకు వంతెనేసి.. తనువూ.. తనువూ మెలికలేసే తీరేరా ప్రేమ.. కవి చెప్పినట్లుగానే... ఆకాశమంతా.. ఆనందమై.. తెల్లారుతోంది ప్రేమికుల కోసమే.. ఆలోచనంతా ఆరాటమై.. అన్వేస్తోంది ఈరోజు కోసమేనంటున్నారు వైజాగ్ ప్రేమికులు సాక్షి, విశాఖపట్నం : నగరమంతా వాలంటైన్ ఫీవర్‌తో గులాబీలా విరుచుకుంది. జంట హృదయాలు వలపు సంబరాలు చేసుకుంటుంటే.. ఆ గుండెకు హత్తుకునేలా బహుమతులిచ్చిపుచ్చుకునే సందడితో వ్యాపారులు కూడా వాలెంటైన్ సంబరాలు చేసుకుంటున్నారు. లవ్ వైజాగ్‌లో... లవ్ యూ డార్లింగ్.. ప్రేమకు ప్రాంతం లేదు.. కులం లేదు.. మతం లేదు.. భాష లేదు, భావం లేదు. ప్రేమ అందరి హృదయాల్ని కొల్లగొట్టేసింది. విశాఖ యువతరం కూడా ప్రేమ వానలో తడిసి ముద్దయిపోతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఫిబ్రవరి 14 కోసం ఎదురుచూస్తూ తమకు నచ్చిన వారికి ముచ్చటైన బహుమతులు కొని ఇంప్రెస్ చెయ్యాలని రాత్రంతా అన్వేస్తోందినే ఉన్నారు. పార్కులు, బీచ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు.. ఇలా అన్ని చోట్లా జంట గువ్వలు గుసగుసలాడుకుంటూనే ఉంటాయి. తొలినాళ్లలో ప్రేమంటే మాటల ద్వారా వ్యక్తపరిచేది. ఆ తర్వాత ప్రేమలేఖలు.. ఆపై రోజా పూలు.. ఆ తర్వాత గ్రీటింగ్ కార్డులు.. ఇలా.. తరం మారుతున్న కొద్దీ లవ్ రిచ్‌గా మారిపోయింది. అదేమని అడిగితే.. హలో గురూ.. ప్రేమ కోసమే కదా అని జోష్‌తో చెబుతున్నారు ఈ తరం యూత్. మరి ఈ రోజున లవ్ వైజాగ్.. లవర్స్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..? అక్షరాలా రూ.20 కోట్ల రూపాయలు. తన కోసం ఎదురు చూసే ప్రేమ గుండెకు ఇచ్చే బహుమతిలోనే కొండంత ప్రేమ కనిపించాలని లవర్స్ ఉవ్విళ్లూరుతుంటారు. అందుకే.. విశాఖ యువత గిఫ్ట్ కోసం బోలెడు ఖర్చు చేస్తున్నారు. ► గతేడాది ప్రేమికుల రోజున నగరంలో రూ.15 కోట్ల వరకూ బహుమతులు కొన్నారని అంచనా. ► ఈ ఏడాది సుమారు రూ.20 కోట్ల వరకూ అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వాలంటైన్ వీక్ పేరుతో దాదాపు రూ.10 కోట్ల అమ్మకాలు జరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ► ప్రేమికుల రోజున మన నగరంలో రూ.2 కోట్ల రూపాయల గులాబీ పూలు అమ్ముడవుతాయని పూల వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా రెడ్, పింక్ గులాబీలే ఎక్కువగా అమ్ముడవుతాయంట. ► వ్యాపారులు గిఫ్ట్‌లకు 20 నుంచి 50 శాతం వరకూ డిస్కౌంట్ ఆఫర్లిచ్చి ఆకర్షిస్తున్నారు. ► రెస్టారెంట్స్, హోటల్స్ వాలెంటైన్స్ కోసం స్పెషల్ టేబుల్స్ రిజర్వ్ చేశాయి. బీచ్‌రోడ్డులోని కొన్ని హోటల్స్.. ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. ► దాదాపు అన్ని జ్యుయలరీ షాపులు.. వాలెంటైన్ స్పెషల్ జ్యుయలరీ స్పెషల్ డిస్కౌంట్‌తో అందిస్తున్నాయి. ► ఫిబ్రవరి 14 కోసం మలీ్టప్లెక్స్లలో అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు అమ్మకాలు జరగ్గా అందులో కపుల్ టికెట్స్ దాదాపు 50 శాతం ఉండటం విశేషం. ► భీమిలి సమీపంలోని ఓ హోటల్లో 50 టేబుల్స్ లవ్ స్పాట్లుగా అడ్వాన్స్ బుకింగ్ పెట్టినట్లు ప్రకటించిన 24 గంటల్లోనే అన్నీ బుక్ అయ్యాయంట. సోషల్ మీడియాలో లవ్ వాన విశ్వజనీయమైన ప్రేమ.. సోషల్ మీడియానూ లవ్ వానలో ముంచెత్తేలా చేస్తోంది. వారం రోజుల క్రితం మొదలైన ప్రేమికుల వారోత్సవాలప్పుడు ప్రారంభమైన లవ్ పోస్ట్‌లు.. చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. హార్ట్‌బీట్ సింబల్స్, కవితలు, గ్రీటింగ్ కార్డులు, ప్రేమ చిహా్నలు, గిఫ్ట్‌లు.. ఇలా ఎన్నో రకాలైన సింబల్స్, స్టిక్కర్లు, ఫొటోలు, కొటేషన్లతో ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, టెలిగ్రామ్, మెసెంజర్.. ఇలా.. అన్నీ బిజీ బిజీగా మారిపోయాయి. పెళ్లికి కాస్త ఆలోచిస్తున్నాం నిండా లవ్‌లో మునిగిన వారికి కూడా ఈ ప్రేమ నిర్వచనం సంగతి ఓ పట్టాన అంతుచిక్కదు. అందుకే ప్రేమకు అర్థం వెతికేందుకు నగరంలో దాదాపు 100 మంది యువతీ యువకులతో మాట్లాడగా.. చాలా మంది యువత కొత్త కొత్త అర్థాలు చెప్పారు. ఈ సమాధానాల్లోనే.. చాలా మంది వీర ప్రేమికులు, భగ్న ప్రేమికులు, టైంపాస్ బఠానీలు, వన్‌సైడ్ లవర్స్ కనిపించారు.ఆ సమాధానాల సంగతేంటో మీరు చదవండి... ♦ప్రేమంటే రెండు జీవితాలు, రెండు హృదయాలు, రెండు కుటుంబాలు : 35 మంది ♦పెళ్లి చేసుకోడానికి వేసే మొదటి అడుగు : 15 మంది. ♦కాలేజీలో ఒంటరి జీవితానికి తుంటరి తోడు : 10 మంది ♦జీవితం బోర్ కొట్టకుండా టైంపాస్ చేసుకునేది : 25 మంది ♦ప్రేమంటే సెక్స్ : 4 ♦వన్‌సైడ్ లవర్ని, నాకు అంతు చిక్కడంలేదు: 11 మంది -
సింపుల్ & స్వీట్
ఖరీదైన గిఫ్ట్లలోనే ప్రేమ ఉండదు. ప్రేమ గొప్పతనం అదే కదా! సింపుల్‌గా, తక్కువ ఖర్చుతో ప్రేమకానుకలు ఇవ్వడానికి మార్కెట్లో బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి. మచ్చుకు కొన్ని... ► హార్ట్ షేప్డ్ మగ్స్, హార్ట్ పేష్డ్ చాక్లెట్స్ ► 365 లవ్ మెసేజ్‌లు, తియ్యటి టోఫీలతో కూడిన జార్ ► రొమాంటిక్ గ్రీటింగ్ కార్డ్స్ ► వాలంటైన్స్ డే క్రిస్టల్ మెమెంటో ► ఫ్లోటింగ్ హార్ట్స్ గ్లాస్ఫ్రేమ్స్ ► ‘ఇట్ వాజ్ ఆల్వేస్ యూ’ ఫొటోపోస్టర్ ► రొటేటింగ్ పర్సనలైజ్డ్ పెన్ స్టాండ్ ► మెటల్ ఫొటో కీచైన్ ► వుడెన్ పర్సనలైజ్ జిగ్సా పజిల్ ►లవ్ నెవర్ ఎండ్స్ ఫ్రేమ్ ► లవ్ సర్టిఫికెట్ విత్ ఫ్రేమ్ టెక్సావి అయితే... ► ఫుజీ ఫిల్మ్ ఇన్స్టాక్స్ మినీ–11 కంపాక్ట్ ఇన్స్టంట్ కెమెరాతో క్రెడిట్–కార్ట్ సైజ్‌లో ఫొటోలు తీసుకోవచ్చు ► బిసైడ్ ల్యాంప్: మన వాయిస్‌తో రకరకాల రంగులను ఇల్లంతా వెదజల్లుతుంది ► రక రకాల హెయిర్‌స్టైల్స్‌ను ఇష్టపడే వారి కోసం: డైసన్ ఎయిర్‌రాప్ ► వీడియో గేమ్ ప్రేమికుల కోసం... ఎక్స్ బాక్స్ సిరీస్ ఎక్స్ కన్సోల్, లాగిటెక్ ఎ30 గేమింగ్ హెడ్సెట్ ► సంగీత ప్రేమికుల కోసం... జేబియల్ మినీబ్లూ స్పీకర్, అమెజాన్ ఎకో స్టూడియో స్పీకర్, శాంసంగ్ ఎంఎక్స్–ఎస్టీ 40బీ సౌండ్ టవర్ ► సెల్‌ఫోన్‌లోని మీ విలువైన జ్ఞాపకాల ఫొటోలను అప్పటికప్పుడు ప్రింట్ తీసుకోవడానికి... హెచ్‌పీ స్ప్రోకెట్పోర్టబుల్ ప్రింటర్ -
సతీ భూదేవి
యముడితో పో రాడి భర్తప్రా ణాలు తిరిగి తెచ్చుకున్న సతీ సావిత్రి కథ మనకు తెలుసు. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న భర్తను పరాయి దేశం నుంచి విడిపించుకుని రావడానికి పద్నాలుగేళ్లు పోరాటం చేసింది ఈ భూదేవి. నేడు వేలంటైన్స్ డే. ప్రేమకు పట్టం కట్టే రోజు. భర్త పట్ల భార్యకు ఎంత ప్రేమ ఉంటుందో... అతని శ్రేయస్సు కోసం ఆమె ఎంత తపన పడుతుందో ఈ రోజున ఈ ఘటన ద్వారా కాకుండా మరెలా తెలుసుకుంటాం? భార్య ప్రేమకు శక్తి ఉంటే అది ఇంత బలంగా ఉంటుంది. ఇంత అచ్చెరువొందేలా కూడా ఉంటుంది. తీవ్రవాదుల చెరలో బందీగా ఉన్న తన భర్తను విడిపించుకోవడానికి ‘రోజా’ సినిమాలో హీరోయిన్ తెగువను ఆస్వాదించాం. అచ్చం అలాంటి కథను పో లిన నిజజీవిత ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో చోటు చేసుకుంది. విద్యాగంధం ఏమంతగా అంటని మాకూరి భూదేవి మరణశిక్ష ఖరారైన తన భర్తకు క్షమాభిక్ష ప్రసాదించాలని సుదీర్ఘ న్యాయపో రాటం చేసి విజేతగానే కాదు, వార్తలలో కూడా నిలిచింది. భూదేవి 14 ఏళ్లుగా చేసిన న్యాయపో రాటానికి ఇటీవల ఫలితం దక్కింది. ఇప్పుడు భూదేవి, ఆమె కుమారుడు రాజు, భర్త శంకర్ ఆనందోత్సాహంలో మునిగి తేలుతున్నారు. అసలేం జరిగిందంటే... మెండోరాకు చెందిన మాకూరి శంకర్‌కు సెంటు కూడా వ్యవసాయ భూమి లేదు. ఇక్కడ కూలి పని చేస్తే పెద్దగా సంపా దించుకోవడం కష్టం అనుకున్నాడు. తన భార్య గర్భవతిగా ఉన్న సమయంలో 2004లో దుబాయ్‌కు వెళ్లిపో యాడు. అక్కడ ఒక నిర్మాణ సంస్థలో ఫోర్‌మెన్ (సూపర్వైజర్)గా చేరాడు. అతనికింద పని చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన రామావతార్ కుమావత్ ప్రమాదవశాత్తు భవనం ఆరో అంతస్థుపై నుంచి పడి చనిపో యాడు. ఫోర్‌మెన్‌గా ఉన్న శంకర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే రాజస్థాన్ వాసి మరణించాడని దుబాయ్ పో లీసులు నిర్ధారించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనను హత్య కేసుగా నమోదు చేసిన అక్కడి పో లీసులు శంకర్‌ను ప్రధాన నిందితునిగా గుర్తించి అరెస్టు చేసి పుజీరా జైలులో పెట్టారు. కోర్టు విచారణలో రామావతార్ కుమావత్ మృతికి తను బాధ్యుణ్ణి కాదని, అతను ప్రమాదవశాత్తు మరణించాడని శంకర్ ఎంత మొరపెట్టుకున్నా దుబాయ్ కోర్టులో చెల్లలేదు. పో లీసుల విచారణ నివేదిక ప్రకారం శంకర్‌ను దోషిగా తేల్చిన కోర్టు 2013లో మరణశిక్షను ఖరారు చేసింది. చదువులేకపో యినా... ఈ ఘటన 2009లో చోటు చేసుకుంది. మాకూరి శంకర్‌కే కాదు అతని భార్యకు కూడా చదువు రాదు. ఎవరిని సంప్రదించాలో, తమకేవిధంగా న్యాయం జరుగుతుందో తెలియదు. పుజీరా జైలులో ఉన్న శంకర్‌కు తన భార్య భూదేవితో నెల రోజులకు ఒకసారి ఫోన్లో మాట్లాడేందుకు జైలు పో లీసులు అవకాశం కల్పించారు. ‘‘అప్పుడు ఆయన నా గురించి, మా అబ్బాయి గురించి అడిగి ఏడ్చేవాడు. తాను బతికి బట్టకట్టాలంటే రాజస్థాన్ వాసి రామావతార్ కుమావత్ కుటుంబ సభ్యులు క్షమాభిక్షకు అంగీకరించాలని చెప్పాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ కుటుంబం అడ్రస్ తెలియదు. మా ఊళ్లో పెద్దలందరికీ ఈ విషయం చెప్పాను. కనపడినవారికల్లా మా కష్టం చెప్పాను. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదని ఏడ్వనిరోజు లేదు. రోజూ దిగులుగా ఉండేది. అలాగే నెలలు, ఏళ్లు గడిచిపో తున్నాయి. కానీ, దిగులుగా కూర్చుంటే అయ్యే పనులు కావు. నేనూ, నా బిడ్డ బతకాలి. కూలి పనులు చేసుకుంటూ బిడ్డను పో షించుకుంటూ వచ్చాను. గతంలో ఆర్మూర్ మండలం దేగాం వాసులు ముగ్గురు దుబాయ్‌లో మరణశిక్ష నుంచి బయటపడి ఇంటికి చేరుకున్నారని తెలిసింది. ఇందుకు అదే గ్రామానికి చెందిన యాదాగౌడ్ కృషి చేశారని తెలిసింది. గంపెడాశతో వెళ్లి యాదాగౌడ్‌ను సంప్రదించి ఎలాగైనా నా భర్తను మరణశిక్ష నుంచి తప్పించాలని వేడుకున్నాను..’ అని ఇన్నేళ్ల తన కష్టాన్ని వివరించింది భూదేవి. మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించి... ‘మా ఆయనకు ఫోన్ చేసినప్పుడల్లా ఊళ్లో విషయాలు, నేను చేస్తున్న పనుల గురించి, మా అబ్బాయి క్షేమం గురించి చెబుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని చెబుతూ మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునేదాన్ని. బాధిత కుటుంబాన్ని ఎలాగైనా ఒప్పించాలని కానీ, వాళ్లు ఎక్కడ ఉంటారో నాకు తెలియదని యాదాగౌడ్‌ను కలిసినప్పుడు చెప్పాను. అతను అన్ని వివరాలు కనుక్కొని, రాజస్థాన్ కుటుంబం గురించి తెలుసుకున్నాడు. వాళ్లకు ఆర్థికసాయం రూ.5 లక్షలు అందించాలంటే అందరినీ బతిమాలుకున్నాను. కూలీ చేసుకొని బతికేదాన్ని, నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంటుంది. మా ఊరి వాళ్లు, ఇంకొంతమంది దయగలవాళ్లు తమకు తోచినంత ఇచ్చారు. అలా వచ్చిన డబ్బును రాజస్థాన్‌లోని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశాం. మృతుని కుటుంబ సభ్యులు క్షమాభిక్షకు అంగీకరించారు’ అని తెలిపింది భూదేవి. అలా వారు సంతకాలు చేసిన పత్రాలను యాదాగౌడ్ ద్వారా న్యాయవాది అనురాధ సహకారంతో భూదేవి దుబాయ్‌లోని కోర్టుకు పంపించింది. దుబాయ్ కోర్టు ఈ పత్రాలను పరిశీలించి మరణశిక్షను రద్దు చేయడమేకాకుండా అతన్ని విడుదల చేస్తూ ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో మరణశిక్షను తప్పించుకున్న శంకర్ ఇంటికి చేరుకున్నాడు. కథ సుఖాంతమైంది. మా వాళ్లను చూస్తానని అనుకోలేదు నేను దుబాయ్‌కు వెళ్లే సమయంలో నా భార్య గర్భవతి. కొన్ని నెలలకే కొడుకు పుట్టాడు. ఈ సంతోష వార్త వినే సమయంలో నా భార్యకు చెప్పాను ‘త్వరలోనే వస్తాను’ అని. కానీ, అది సాధ్యం కాదని తర్వాత తెలిసింది. రాజస్థాన్ వ్యక్తి మరణించడంతో నేను ఈ ఘటనలో అరెస్టు అయ్యి జైలుపా లు కావడం, ఆ తరువాత మరణశిక్ష పడటం వరుసగా జరిగాయి. ఇక నా వాళ్లను చూస్తానని కలలో కూడా అనుకోలేదు. నా భార్యతో ఫోన్లో మాట్లాడిన ప్రతిసారీ నాకు ఎంతో ధైర్యం చెప్పేది. జైల్లో ఎంతో మనోవేదనతో ఉన్నా నా భార్య మాటలు నాకు జీవితంపై ఆశలు చిగురించేలా చేశాయి. నా విడుదల కోసం కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు. – మాకూరి శంకర్ – ఎన్.చంద్రశేఖర్, సాక్షి, మోర్తాడ్, నిజామాబాద్ -
Valentines Day 2023: స్పెషల్ గిఫ్ట్స్ కోసం యువత ఇలా..
-
Valentine's Day 2023: వాలైంటెన్స్ విషెస్ ఇలా ఎమోషనల్‌గా ఎప్పుడైనా చెప్పారా?
ప్రేమ సత్యం.. ప్రేమ నిత్యయవ్వనం..ప్రేమ వినూత్నం..ప్రేమ మధురం..ప్రేమను ఆస్వాదిస్తేనే తెలుస్తుంది. తడారిపోయిన మనసుల్లో పచ్చని ఆశలు చిగురింపజేసేది ప్రేమ. శిలలాంటి మనిషికి జీవం పోసేది ప్రేమ. కులమతాలను, దేశ సరిహద్దులను చెరిపేసేది ప్రేమ...ధనిక, పేద తారతమ్యాన్ని చెరిపేస్తుంది..బంధాలను వేరుచేసినా..బాంధవ్యాలను దగ్గరికి చేరుస్తుంది. ప్రేమైక జీవనం తనువులు వేరైనా..మనసులు ఒకటని చాటిచెప్తుంది. ప్రేమలో విజయం సాధించి, ఆదర్శంగా నిలిచిన వారి మధురానుభూతులు, జ్ఞాపకాలను నెమరేసుకునే రోజు. ‘ప్రేమికుల దినోత్సవం’. మరి ప్రేమికులు వాలెంటైన్స్ డేను జరుపుకోండిలా.. మీ ప్రేమను మరింత పదిలంగా ఉంచుకోండిలా..! మంటలోని మౌనం ప్రేమ.. మరుజన్మకు ప్రాణం ప్రేమ... హ్యాపీ వాలెంటైన్ డే 2023 నువ్వు ప్రేమించే వాళ్లు ఎంత మందైనా దొరుకుతారు కానీ నిన్ను ప్రేమించే వాళ్లు దొరకడం నీ అదృష్టం ప్రేమికుల రోజు శుభాకాంక్షలు నిన్ను చూడాలని తపించే కనులకు ఎలా చెప్పను .. హ్యాపీ వాలెంటైన్ డే 2023 నువ్వు నాలోనే ఉన్నావని ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ఉదయించే సూర్యడు ఈ ప్రపంచానికి వెలుగునిస్తే..నీరాక నా జీవితంలోకి వెలుగు నింపింది హ్యాపీ వాలెంటైన్ డే ఓటమినైనా ఓడదు ప్రేమ చితిలోనైనా కాలదు ప్రేమ .. హ్యాపీ వాలెంటైన్ డే 2023 జీవితమంతా... నీ ప్రేమలో కరిగిపోతాను నీ జీవితంలో ముత్యాన్నై వెలిగిపోయేలా చేస్తావుకదూ...హ్యాపీ వాలెంటైన్ డే 2023 ఎదలో ప్రేమ ఉంటే నిన్ను మరువగలను నీ ప్రేమ నా హృదయమైతే ఎలా మరిచిపోను .. హ్యాపీ వాలెంటైన్ డే 2023 పరిస్థితుల్ని బట్టి మారిపోయేది ప్రేమ కాదు పరిస్థితుల్ని అర్థం చేసుకునేది అసలైన ప్రేమ.. హ్యాపీ వాలెంటైన్ డే 2023 నువ్వు ప్రేమించే వాళ్లు ఎంత మందైనా దొరుకుతారు కానీ నిన్ను ప్రేమించే వాళ్లు దొరకడం నీ అదృష్టం.. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు నువ్వులేని ఈ క్షణము ఓ యుగంలా ఉంది.. యుగమంతా ఎదురుచూస్తా నీతో గడిపే ఆ క్షణం కోసం పరిస్థితుల్ని బట్టి మారిపోయేది ప్రేమ కాదు పరిస్థితుల్ని అర్థం చేసుకునేది అసలైన ప్రేమ ఎదలో ప్రేమ ఉంటే నిన్ను మరువగలను నీ ప్రేమ నా హృదయమైతే ఎలా మరిచిపోను మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు మనల్ని వెతుక్కుంటూ వచ్చేది నిజమైన ప్రేమ జీవితమంతా... నీ ప్రేమలో కరిగిపోతాను నీ జీవితంలో ముత్యాన్నై వెలిగిపోయేలా చేస్తావుకదూ... నేను లేకుండా నువ్వు ఉండగలవేమో. నువ్వు లేకుండా క్షణం కూడా నేను ఉండలేను. ఎందుకంటే నువ్వే నా ప్రాణం అయిపోయావు కాబట్టి. నిన్ను కలిసే వరకు ప్రేమ అంటే ఏమిటో నాకు తెలియదు.. హ్యాపీ వాలెంటైన్ డే 2023 నా జీవితంలో ప్రేమ మరియు సంతోషం తెచ్చినందుకు ధన్యవాదాలు. ఐ లవ్ యు నువ్వే నా సర్వస్వం అని చెప్పినా.. అది చిన్న మాటే అవుతుందేమో.. ఆల్ రెడీ నేను నువ్ అయిపోయాను. రాత్రి పడుకునేముందు చివరి ఆలోచన.. ఉదయం లేచాక మెుదటి ఆలోచన నువ్వే.. ఐ లవ్ య్యూ. జీవితంలో సంతోషంగా ఉండాలంటే.. ఆస్తులు అవసరం లేదు.. నువ్వు చాలు.. నాకు నువ్ ఎంత దూరంలో ఉన్నా.. నా మనసులో మాత్రం ఎప్పటికీ ఉంటావ్.. నా ప్రేమకు అర్థం లేదు.. నీ తోడు లేకుంటే.., నా కనుచూపునకు ప్రపంచం నచ్చడం లేదు.. నువ్వు కనపడకుంటే.., నా జీవిత గమనానికి గమ్యం లేదు.. నీతో ఏడు అడుగులు వెయ్యకుంటే.., నా మనసుకు ఓదార్పు లేదు నీ స్వరం వినపడకుంటే. ప్రతి ఉదయం సూర్యుడి రాకతో నీ కోసం చూస్తున్నా.. ప్రతి రాత్రి వెన్నెల వెలుగుల్లో నీ స్పర్శ కోసం తపిస్తున్నా.. అద్దంలాంటి నా మనసు నీకు ఇచ్చేసా.. వెన్నలాంటి నా హృదయం నీకే రాసిచ్చా.. నా ఒంటరి తనం దూరం చేసి.. నన్ను అల్లుకో.. నువ్ ఏడిస్తే చూడలేను.. నీకు కష్టం వస్తే తట్టుకోలేను.. అందుకే నీ నీడలా నీతోనే ఉంటాను నేను. నువ్వు నాకు గుర్తొస్తే ఎవరూ ఉండరు నీ జ్ఞాపకం తప్ప! నువ్వు నా పక్కనుంటే నేనే ఉండను నువ్వు తప్ప! నీవే నా అంతం… నీవే నా అంతరాత్మ.. నీవే నా పరమాత్మ… నీవే నా మరో జన్మాత్మ…! భాషలు వేరయినా భావాలు ఒక్కటే మనసులు వేరయినా మమతానురాగాలు ఒక్కటే దారులు వేరయినా మన ప్రేమ ఒక్కటే ప్రియా . మనల్ని నిజంగా ప్రేమించాలనుకునే వారికి, మనలోని లోపాలు కూడా అందంగానే కనిపిస్తాయి. ప్రపంచంలో అత్యంత అందమైనది, ఊహలకు అందనిది ప్రేమ. అది వర్ణనాతీతమైనది. ప్రేమను చెప్పడానికి నిమిషం చాలు, కానీ ఆ ప్రేమను చూపడానికి జీవితం సరిపోదు. నా బలం నువ్వే, నా బలహీనతా నువ్వే, నా సంతోషం నువ్వే, నా తియ్యని బాధ నువ్వే.కాలాలు మారినా, నీపై నా ప్రేమ కలకాలం ఉంటుంది. కలలో కూడా అనుకోలేదు నా అదృష్టం నీ రూపంలో వస్తుందని... నా జీవితంలోకి వచ్చినందుకు నీకు వేలవేల కృతజ్ఞతలు. మరచిపోవటానికి నువ్వు నా గతం కాదు జ్ఞాపకం. ప్రేమించటం అంటే ప్రేమను ఇవ్వటం తిరిగి ప్రేమను ఆశించటం కాదు. జీవితం ఒక ప్రయాణం … జీవనం ఒక ప్రమాణం అని ఎవరో అన్నారు నీతో జీవితం నాకు ప్రయాణం కావాలి నీ ప్రేమ నాకు ప్రమాణం కావాలి. -
valentine's day2023 రొటీన్‌గా టెడ్డీ, రోజ్ కాదు,వెరైటీగా ఇవి ఇస్తే..ఆ థ్రిల్లే వేరు!
సాక్షి,ముంబై: వాలెంటైన్స్ డే వస్తోందంటే చాలు ప్రేమికుల సందడి మొదలవుతుంది. దీనికి తగ్గట్టుగానే పలు ఆన్లైన్, ఆఫ్‌లైన్ సంస్థలు సిద్ధమవుతాయి. ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా వెరైటీ గిఫ్ట్‌లు, ఆఫర్లతో ఆకట్టుకుంటాయి. స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లు ఇతర ట్రెండీ బహుమతులపై తగ్గింపు ధరతో ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటాయి. మరోవైపు వాలెంటైన్స్ డే చరిత్ర, అర్థం, పరమార్థం, ఈ ఒక్క రోజు ప్రేమ ఉంటే చాలా ఇలాంటి విషయాలతో సంబంధం లేకుండా...రోజుకో డే చొప్పున వారం రోజులు పాటు గిఫ్ట్‌లు, చాక్లెట్లు, టెడ్డీ బేర్స్ , గులాబీలతో పండుగ చేసుకుంటారు. ముఖ్యంగా తన స్వీటీకి సంతోషం పెట్టేందుకు వాలెంటైన్ తెగ ఆరాటపడతారు. తన కలలరాణికి, లేదా తన రాకుమారుడికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలా అనేది ఒక సవాలే. ఏ గిఫ్ట్ అయితే తమ డార్లింగ్ ఫిదా అయి పోతుందా అని ఇంటర్నెట్లో, ఆన్లైన్ సైట్లలో తెగ సెర్చ్ చేస్తారు. ఈ నేపథ్యంలో గులాబీలు, టెడ్డీ బేర్లు, చాక్లెట్ల కంటే ఎక్కువ కిక్ ఇచ్చే, మరపురాని మధుర జ్ఞాపకంగా మిగిల్చే. గిఫ్ట్స్ ఏంటో కొన్ని చూద్దాం. ప్రేమికుల మధ్య ప్రధానంగా ఉండాల్సింది అండర్ స్టాండింగ్. ఎలాంటి అరమరికలు, దాపరికాలు లేకుండా.. మనసు విప్పి మాట్లాడుకోవడాన్ని మంచిన స్వీట్ మెమొరీ. అంతకుమించిన గొప్ప అనుభూతి ఏముంటుంది. రోజూ వాట్సాప్‌లో చాటింగ్, కాల్స్లోమాట్లాడుకుంటూనే ఉంటాంగా అనుకోకుండా....స్పెషల్‌గా మాట్లాడుకోండి. ముఖ్యంగా అమ్మాయిలు సర్ప్రైజ్లకి ఎక్కువ థ్రిల్ అవుతారట. సో.. వాలెంటైన్స్ డే, ఆమె కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయండి! మన మనసుకు నచ్చిన నేస్తంతో ఒక రోజు గడపడం, మాట్లాడటం, జోకులు వేసుకోవడం,ఇష్టమైన సినిమా చూడటం, షిట్స్ క్రీక్ (లేదా ఇతర కంఫర్ట్ షోలు) చూడటం, లాంగ్ డ్రైవ్, ఇష్టమైన ఫుడ్, డిన్నర్ డేట్ ఇవన్నీ సంతోషానిచ్చేవే. వీటన్నింటికి మంచి ఒక బిగ్ హగ్, లవ్లీ కిస్ .. ఆ కళ్లలో వెలిగే స్పార్క్.. ఇవన్నీ.. ఫర్ పఫర్ ఎవర్ గుర్తుండిపోయే స్వీట్ నథింగ్స్.. ఇది స్వయంగా లవ్ బర్డ్స్ చెబుతున్న మాట. మీ ప్రియురాలికి లేదా ప్రియుడికి బుక్స్ చదవడం హాబీ అయితే,అందులోనూ మంచి రచయిత అయితే.. ఒక మంచి పుస్తకాన్న బహమతిగా ఇవ్వండి. వారికి టెడ్డీ బేర్, ఫ్లవర్ బొకే కంటే కూడా పుస్తకం ఇస్తే వచ్చే ఆనందానికి అవధులు ఉంవడట. అదీ సర్ ప్రైజింగ్‌గా ప్రియ నేస్తం ఇంటికి డెలివరీ చేస్తే ఇంకా మంచిది. మధురమైన చాక్లెట్పాటు, మసాజ్ సెషన్ గిఫ్ట్ ఇవ్వడం లేటెస్ట్ ట్రెండ్, చాక్లెట్లు మన శరీరంలో సంతోషకరమైన డోపమైన్, ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ సెరోటోనిన్ హార్మోన్లను విడుదల చేస్తే, మసాజ్ మనస్సును రిలాక్స్ అయ్యేలా చేసిన కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అందుకే అర్బన్ కంపెనీ లేదా ఇంట్లో సెలూన్ సర్వీస్‌ను అందించే ఇతర సంస్థల ద్వారా మంచి మసాజ్ సెషన్‌ను బుక్ చేస్తున్నారట. సాధారణంగా ఇచ్చే గిఫ్ట్స్ కేక్ గులాబీలు హ్యాండ్ బ్యాగ్, స్లింగ్ బ్యాగ్ స్పెషల్‌గా డిజైన్ చేససిన కాఫీ కప్స్ స్వీట్లు చాక్లెట్లు టెడ్డీ బేర్స్ హార్ట్ షేప్ కుషన్లు సీసాలో ప్రేమ లేఖలు షాపింగ్ కూపన్లు ఫస్ట్ డేటింగ్ డేట్‌ను గుర్తు చేసేలా ఒక గిఫ్ట్ మాంచి రొమాంటిక్ సాంగ్స్, మ్యూజిక్‌తో స్లైడ్‌షో డేట్ నైట్ ఐడియా కార్డ్‌లు రొమాంటిక్ షోపీస్ గిఫ్ట్ బాక్స్‌లు/గిఫ్ట్ హాంపర్లు క్యూట్ అండ్ రొమాంటిక్ ల్యాంప్స్ బంగారు, డైమండ్ నగలు స్మార్ట్ ఫోన్లు, వాచెస్, ఇతర గాడ్జెస్ట్స్ -
ఫిబ్రవరి 14 మాత్రమే కాదు.. ప్రతి నెల 14 వారికి ప్రేమికుల రోజే! ఎక్కడంటే?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు 'ఫిబ్రవరి 14'వ తేదీనే ఎంచుకుంటారు. ఎందుకంటే ఈ రోజు చరిత్రలో ఎంతో ప్రత్యేకం. నిజమైన ప్రేమకు గుర్తుగా దీన్ని ప్రేమికుల రోజుగా ఏటా జరుపుకొంటారు. అయితే ప్రపంచం మొత్తం ఒక్కరోజే వాలెంటైన్స్ డేను జరుపుకొంటే కొరియాలోని యువత మాత్రం ప్రతి నెల 14వ తేదీని ప్రేమికుల రోజుగానే జరుపుకొంటారు. ఇలా మొత్తం ఏడాదిలో 12 రోజులు తమ ప్రియమైన వారికి కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. మరి ఆ 12 రోజుల ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం... డైరీ డే (జనవరి 14) దక్షిణ కొరియాలో జనవరి 14ను 'డైరీ డే'గా జరుపుకొంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు, స్నేహితులు, ఈరోజున కొత్త డైరీలను కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు. కొత్త ఏడాది తర్వాత డైరీ డే రావడంతో వ్యాపారులు కూడా ఆకర్షణీయంగా వీటిని రూపొందించి విక్రయిస్తారు. మరొకొందరు ఈ రోజును 'క్యాండిల్ డే'గా జరుపుకొంటారు. అలంకరించిన క్యాండిల్స్‌ను కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు. వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) ప్రపంచంలోని అన్ని దేశాల్లాగే ఈ రోజును ప్రేమికుల రోజుగా జరుపుకొంటారు కొరియా యువత. అయితే వీళ్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఈ రోజు అమ్మాయిలు మాత్రమే అబ్బాయిలకు చాక్లెట్లను కానుకగా ఇస్తుంటారు. అబ్బాయిలు రిటర్న్ గిఫ్ట్‌గా ఏమీ ఇవ్వకూడదు. ఇది వీళ్ల సాంప్రదాయంగా కొనసాగుతోంది. అందుకే కొరియా వ్యాపారులు ఈరోజు రకరకాల చాక్లెట్లను ప్రదర్శిస్తూ యువతను ఆకర్షిస్తుంటారు. వైట్ డే (మార్చి 14) వాలెంటైన్స్ డే తర్వాత వచ్చే 'వైట్ డే' కొరియాలో చాలా స్పెషల్. ప్రేమికుల రోజు తమ ప్రేయసి నుంచి చాక్లెట్లు కానుకగా అందుకున్న అబ్బాయిలు.. వైట్ డే రోజు వాళ్లకు రిటర్న్ గిఫ్టులు ఇస్తారు. తెల్లరంగు చాక్లెట్లనే ఇవ్వడం వల్ల ఈ రోజుకు వైట్ డే అని పేరు పెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో తెల్లరంగుతో పాటు నల్లరంగు చాక్లెట్లను కూడా రిటర్న్ గిఫ్టులుగా ఇవ్వడం అలవాటైంది. అయితే అమ్మాయిలు వాలెంటైన్స్ డే రోజు ఒక్క చాక్లెట్ గిఫ్ట్‌గా ఇస్తే.. అబ్బాయిలు మాత్రం రిటర్న్‌గా మూడు గిఫ్టులు ఇస్తారు. వైట్ చాక్లెట్‌తో పాటు క్యాండీస్, లాలీపప్లను కలిపి ఇస్తుంటారు. బ్లాక్ డే (ఏప్రిల్ 14) వాలెంటైన్స్ డే, వైట్ డే రోజున ఎలాంటి కానుకలు రాని యువత బ్లాక్ డేను జరపుకొంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది సింగిల్స్ డే. తమకు ప్రేమ ప్రపోజల్ రాని యువతీయువకులు ఈ రోజు కలిసి బ్లాక్ నూడుల్స్ తింటారు. సింగిల్స్ మీటింగ్‌గా చెప్పుకునే బ్లాక్ డే రోజున తమను ప్రేమించేవారు లేరని యువత కాస్త ఒత్తిడికి గురవుతారు. ఎల్లో డే (మే 14) ఈ రోజున ప్రేమికులు, దంపతులు పుసుపు రంగు పూలను ఇచ్చిపుచ్చుకుంటారు. తమ ప్రియమైన వారితో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేస్తారు. ఈ రోజు ఎక్కువ సమయం వారికి కేటాయిస్తారు. కిస్ డే (జూన్ 14) కొరియన్ల ఫేవరెట్ డే ఇది. తమ గాఢమైన ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రేమికులు, భార్యాభర్తలు ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటారు. జంటలకు ఇది బెస్ట్ రొమాంటిక్ డే అని చెప్పుకుంటారు. సిల్వర్ డే (జులై 14) ఈ రోజున ప్రేమికులు ఉంగరాలు మార్చుకుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే నిశ్చితార్థంలా అనమాట. జీవితాంతం కలిసి ఉంటామని ఇద్దరు ప్రామిస్ చేసుకుని రింగ్స్ మార్చుకుంటారు. గ్రీన్ డే (ఆగస్టు 15) ఈ రోజున ప్రేమికులు, దంపతులు అందమైన పశ్చికబయళ్లు ఉంటే ప్రదేశాలను సందర్శిస్తుంటారు. అక్కడే భోజనం చేస్తుంటారు. వీలైతే ఆకుపచ్చరంగు దుస్తులు ధరిస్తారు. ఈ రోజు ఫ్యామిలీస్ ఎక్కువగా పార్కులకు వెళ్లి ఆనందంగా గడుపుతారు. ఫొటో డే (సెప్టెంబర్ 14) ఈరోజున ప్రేమికులు, స్నేహితులు, ఫ్యామిలీస్ ప్రత్యేకంగా ఫొటోలు దిగుతారు. సెల్ఫీలతో పాటు స్టూడియోలకు వెళ్లి ఫొటో షూట్లు నిర్వహిస్తారు. తమ జీవితంలో ఈ రోజు ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చూసుకుంటారు. వైన్ డే (అక్టోబర్ 14) ఇది వైన్ ప్రియులకు ఇష్టమైన రోజు. ప్రేమికులు, దంపతులు వైన్ డే రోజున ప్రత్యేక పార్టీలు చేసుకుంటారు. స్నేహితులు, కుటంబసభ్యులతో కలిసి బార్లకు, పార్టీలకు వెళ్లి ఇష్టమైన వైన్ తాగుతారు. మూవీ డే (నవంబర్ 14) కొరియన్లకు ఇది కూడా చాలా ఇష్టమైన రోజు. తమ ప్రియమైన వారిని సినిమా హాళ్లలో కలుస్తారు. కొత్త సినిమాలు చూస్తారు. మరికొందరేమో ఇళ్లలోనే డీవీడీలు అద్దెకు తెచ్చుకుని పాప్‌కార్న్ తింటూ మూవీస్ చూసి ఎంజాయ్ చేస్తారు. హగ్ డే (డిసెంబర్ 14) ఈ రోజున కొరియన్ ప్రజలు తమకు ఇష్టమైన వారిని ఆలింగనం చేసుకుంటారు. ప్రేమికులు ఎక్కడున్నా ఈరోజు కలుసుకొని హగ్ ఇస్తుంటారు. సింగిల్స్ అయితే తమ ఇంట్లో వాళ్లని, స్నేహితులను ఆలింగనం చేసుకుంటారు. ఏడాదికి 12 రోజులు ఇలా ప్రత్యేకంగా జరుపుకొన్నా.. వాలెంటైన్స్ డే, వైట్ డే రోజుల్లో మాత్రం సందడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రోజులు వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి. చదవండి: ప్రేమ కానుక.. మనసు దోచెనిక.. ప్రేమికుల రోజు ఇచ్చే గిఫ్ట్‌లు ఇవే..! -
Valentines Day 2023: ప్రేమికుల రోజు ఇచ్చే గిఫ్ట్‌లు ఇవే..!
కరీంనగర్: ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు.. ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తం చేసే సందర్భం. ప్రేమలో ఉన్నవారు ఆరోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తమ మనసులో మాట చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. మదిలో ప్రేమ సందేశాలను ఇచ్చిపుచ్చుకునేందుకు మార్కెట్లో ఎన్నో వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. కేక్‌లు ప్రత్యేక డిజైన్లలో ఆకట్టుకుంటున్నాయి. ఆయా దుకాణాలు యువతీ యువకులతో కళకళలాడుతున్నాయి. వారు మెచ్చిన, నచ్చిన ఫొటోలు ఫ్రేమ్‌లో బంధించి ఇవ్వడంతోపాటు లవర్స్ స్పెషల్ కీచైన్లు, టుడే అండ్ టుమారో, జస్ట్ ఫర్ యూ అనే హార్ట్ పిల్లోస్‌పై ఆసక్తి చూపుతున్నారు. అలాగే ప్రేమికుల కోసం ఎన్నో రకాల విదేశీ చాక్లెట్లు నోరూరిస్తున్నాయి. గతంలో కంటే ఈసారి వెరైటీ గిఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. ముఖ్యంగా చైనా క్రిస్టల్‌తో తయారైన ఉత్పత్తులు యువతను ఆకర్షిస్తున్నాయి. ఇష్టమైన వారి ప్రేమను పొందేందుకు కానుకలు మంచి సాధనాలుగా పని చేస్తాయని నమ్మేవాళ్లు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఏటా ఒక బహుమతి ఇస్తా మాది ప్రేమ వివాహం. ఏటా ప్రేమికుల దినోత్సవం రోజు తప్పనిసరిగా మా వారికి ఏదో ఒక బహుమతి ఇస్తా. ఈసారి అది ప్రత్యేకంగా ఉండాలని షాపింగ్ చేస్తున్నా. ప్రేమ జీవితంలో భాగం కావాలి. – తాటి అమల పవన్, సవరన్ స్ట్రీట్ అందుబాటులో లవ్ గిఫ్ట్స్.. ఈసారి మా స్టోర్‌లో రూ.100 నుంచి రూ.2 వేల విలువైన లవ్ గిఫ్ట్స్ అందుబాటులో ఉంచాం. ప్రేమికులు రేటు ఆలోచించకుండా అందమైన బహుమతులు కొనుగోలు చేస్తున్నారు. – ఈశ్వర్, గణేశ్ జనరల్ స్టోర్, శాస్త్రీరోడ్ ప్రేమను ఇచ్చిపుచ్చుకోవాలి బహుమతుల కన్నా ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటే అది జీవితాంతం చెదిరిపోకుండా ఉంటుంది. నాకు కాబో యే శ్రీవారి కోసం ఈ సంవత్సరం ప్రత్యేక బహుమతి కొనుగోలు చేసి, పంపిస్తున్నాను. – ఉపాధ్యాయుల రుత్విక, సాఫ్ట్వేర్ ఉద్యోగిని, మంకమ్మతోట లవ్ సింబల్స్ ఉన్నవే ఎక్కువ.. లవ్ సింబల్స్ ఉన్న వస్తువులు, బొమ్మల విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో మంచి కొటేషన్లతో గ్రీటింగ్ కార్డులు వచ్చేవి. ఇప్పుడు రావడం లేదు. ఇంటర్నెట్ నుంచి తీసుకొని, ఇచ్చుకుంటున్నారు. – ఉప్పుగల్ల మురళీకష్ణ, వాణిశ్రీ బుక్స్, స్టేషనరీ, 7హిల్స్ చదవండి: ఏకకాలంలో ఒక్కటైన 220 జంటలు -
Valentines Day: ఎవరిని ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? మరి వాళ్లు ఏమైపోతారు?
ఎవర్ని ప్రేమించాలి? ప్రతి ఏటా ఫిబ్రవరి 14 వస్తుంది.. ప్రేమికులంతా చాలా గ్రాండ్‌గా వేలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ డేని సమర్థించేవారు ఎంతమంది ఉన్నారో.. వ్యతిరేకించేవారూ అంతేమంది ఉన్నారు. అసలు ప్రేమకు సెలబ్రేషన్ అవసరమా? ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటేనే ప్రేమ ఉన్నట్లా? .. ప్రేమ అనేది ప్రేమికులకు మాత్రమేనా? ప్రేమ కోసం పరితపించే జీవులు ఇంకెవరూ లేరా? సొసైటీలో ఎన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయి? .. ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు? అంటే ఖచ్చితంగా చెప్పలేం. తల్లిదండ్రులు పిల్లలతో ఆనందంగా గడిపేది మహా అయితే వాళ్లు డిగ్రీలు పుచ్చుకునే వరకే. ఉద్యోగం రాగానే.. పెళ్లి ఆ తరువాత పిల్లలు.. అలా వాళ్లకొక జీవితం ఏర్పడ్డాక తల్లిదండ్రులను పట్టించుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు. అమాయకపు తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా విదేశాల్లో స్థిరపడితే ఇక ఆ తల్లిదండ్రుల కష్టాలకు అంతే లేదు. డబ్బు ఉన్నా.. పిల్లల ఆప్యాయత.. అనురాగాల కోసం పరితపించి పోతూ ఎంతో మంది తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో మగ్గిపోతున్నారు.. రేపు వస్తాడు.. ఎల్లుండి వస్తాడు .. అని ఎదురుచూస్తూ వాళ్లు ఎప్పుడూ తిరిగి రారన్న అబద్ధం తెలియని ఎంతోమంది అమాయకపు తల్లిదండ్రులు అక్కడే తనువు చాలించేస్తున్నారు. క్షణకాలం వారి సుఖం ఆలోచిస్తారు కానీ.. అలా చాలామంది తల్లిదండ్రులకు పిల్లల నుంచి ప్రేమ దొరకట్లేదు.. ప్రేమించో.. పెద్దలు కుదిర్చినదో పెళ్లి చేసుకుంటారు. ఆపై మనస్పర్థలు.. కలిసి బతకడం ఇష్టం లేదంటూ విడాకులు తీసుకునే జంటలు ఎన్నో చూస్తున్నాం. ఒకరినొకరు అర్థం చేసుకోరు.. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండదు.. కానీ.. ఈలోపే పిల్లల్ని కంటారు. క్షణకాలం వారి సుఖం ఆలోచిస్తారు కానీ.. విడిపోతే తమ పిల్లల భవిష్యత్ ఏంటో ఆ క్షణం ఆలోచించరు. తల్లిదండ్రులు చేసిన తప్పునకు బలైపోయి అనాథలైన ఎంతోమంది పిల్లలు ఈ సమాజంలో ఉన్నారు. ఓవైపు తల్లిదండ్రుల నిరాదరణ.. మరోవైపు సమాజం చిన్నచూపు అక్కడా వారికి కరువైంది ప్రేమే కదా.. ప్రేమ.. కులం.. మతం .. వయసు… అన్ని అడ్డుగోడల్ని కూల్చేస్తుంది. ప్రేమించడం తప్పుకాదు.. కానీ అవగాహన లేని ప్రేమ జీవితాన్ని నాశనం చేస్తుంది. దీన్ని కూడా ప్రేమే అంటారా? నమ్మిన వాడు మోసం చేశాడని.. నమ్మిన ఆడది మంచిది కాదని ప్రేమలో విఫలమయ్యే దాకా చాలామంది ప్రేమికులకు అర్థం కాదు. దాన్ని తొందరపాటు అనాలో వారి గ్రహపాటు అనాలో తెలియదు. అదే తొందరపాటుకు ప్రతిఫలంగా పుట్టే పిల్లలు ఎంతమందో చెత్తబుట్టల్లో తేలుతున్నారు. పాపం వాళ్లేం చేశారు… కుక్కలు ఈడ్చుకుపోతుంటే వారి రోదన ఎవరికి వినిపిస్తుంది.. ఆ పాపం ఎవరిది.. దీన్ని కూడా ప్రేమే అంటారా? భర్త చనిపోతే భార్య, భార్య చనిపోతే భర్త మళ్లీ పెళ్లి చేసుకుంటారు. మొదటి భార్య, లేదా భర్తకు పుట్టిన పిల్లల్ని మాత్రం మర్చిపోతారు. వాళ్లేం పాపం చేశారండి. ఆ పిల్లల పట్ల ఎందుకు సమన్యాయం చూపించరు. ఆ పిల్లల్ని వదిలేసి తమ జీవితం చూసుకుంటే దాన్ని స్వార్ధమనేగా అంటారు. తమకు పుట్టిన బిడ్డలకి ప్రేమను పంచడంలో ఈ తేడాలేంటో.. ఇక తల్లిదండ్రుల్ని పంచుకునే పిల్లలు గురించి చెప్పాలి. కాటికి కాలు చాచే ఆ వయసులో వృద్ధాప్యంలో ఒకేచోట ఉండాల్సిన పేరెంట్స్‌ని తలొకరు పంచుకుంటూ ఉంటారు. తల్లిదండ్రుల్ని చూడటానికి అన్నదమ్ముల మధ్య పంతాలు.. మనస్పర్థలు.. చివరికి పంపకాలు. పిల్లల మనసు నొప్పించలేక.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఆ పెద్దవాళ్లు పడే బాధ మాటల్లో చెప్పలేం. కాటికి కాలు చాచే ఆ వయసులో పాపం.. అప్పుడూ వారికి ప్రేమ కరువవుతోంది. పిల్లలే జీవితంగా గడిపిన ఎంతోమంది పేరెంట్స్ ఇప్పుడు అదే పిల్లల దగ్గర తమ జీవితం ఎంత త్వరగా ముగుస్తుందా అని భారంగా కాలం వెళ్లదీస్తున్నారు.. పేరెంట్స్ ఇచ్చే ఆస్తులు కావాలి.. కానీ తల్లిదండ్రులు వద్దనుకుంటే ఆ పేరెంట్స్ ని ప్రేమించేది ఎవరు? ఇక అన్నదమ్ములు.. అక్క చెల్లెళ్లు.. తోడల్లుళ్లు.. తోడికోడళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎంతమంది మధ్య ప్రేమ ఉంది.. ఎక్కడ ప్రేమ దొరుకుతుంది అంటే ఒక ఛాన్స్ ఉందిలెండి. డబ్బుంటేనే.. అదేంటంటే డబ్బుండాలి. డబ్బుంటే ప్రేమాభిమానాలు పొంగుకొస్తాయి. అదే డబ్బులేని వాడి గురించి ఆలోచించడానికి కూడా మనసు ఒప్పుకోదు. డబ్బుతో కొనలేనివాటిలో మొదటిది.. చివరిది ఒకటే.. అదే 'ప్రేమ'. మన సమాజంలో నిజమైన ప్రేమ కోసం పరితపించిపోతున్న వాళ్లు ఇలా చాలామందే ఉన్నారు. ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి.. మన తల్లిదండ్రుల్ని ..మన కుటుంబాన్ని.. మన తోటివారిని .. ప్రేమించాలి.. మన పుట్టిన ఊరిని.. మన మట్టిని.. మన దేశాన్ని.. ప్రేమించగలగాలి. ప్రేమించడానికి ఇంతమంది ఉండగా.. లవర్స్ డే రోజు ప్రేమ అవసరమా.. నాకైతే అవసరం లేదనిపిస్తోంది. ఇది పూర్తిగా నా అభిప్రాయం.. ఎవరినీ కించపరచడానికి మాత్రం కాదు. -లక్ష్మీ పెండ్యాల, జర్నలిస్టు చదవండి: పిల్లలు సెల్‌ఫోన్, టీవీకి అడిక్ట్ అయ్యారా? ఇలా చేయండి.. కడుపులో నులిపురుగులు ఉంటే.. -
Valentine's Day: ప్రేమికులు మెచ్చిన హోసూరు గులాబీ
సాక్షి, బెంగళూరు: ఫిబ్రవరి 14వ ప్రేమికుల దినోత్సవం వస్తోందంటే హోసూరు గులాబీలకు రెక్కలు వస్తాయి. ప్రపంచం నలుమూలలకూ ఎగుమతి అవుతాయి. ప్రియుడు ప్రేమను చాటుకోవడానికి గులాబీల పువ్వులే సాయపడతాయి. ఈసారి 20 లక్షల గులాబీ పూలకు ఆర్డర్లు వచ్చాయి. హోసూరు, క్రిష్ణగిరి ప్రాంతంలో గులాబీ, ఇతర పుష్పాల సాగుకు అనుకూలమైన శీతోష్ణస్థితి ఉండడంతో పెద్దఎత్తున రైతులు గ్రీన్షెడ్లు ఏర్పాటు చేసి జరబరా, రోజా, కార్నేషన్ తదితర పూలతోటలను పెంచుతున్నారు. విదేశాలకు ఎగుమతులు వాలెంటైన్స్ డే కి హోసూరు ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం ఆ్రస్టేలియా, దుబాయ్, ఇంగ్లాండ్, సింగపూర్, అమెరికా తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ ఏడు ప్రేమికుల రోజును పురస్కరించుకొని 20 లక్షలకుగా తాజ్‌మహల్ రకం గులాబీలను ఎగుమతి చేపట్టారు. ఒక్కో పువ్వు ధర రూ. 20 నుంచి రూ. 22 దాకా పలుకుతుందని వ్యాపారులు, రైతులు తెలిపారు. స్థానిక మార్కెట్లో రూ. 14 నుంచి రూ. 18 వరకు అమ్ముతారు. మంచి ధరలు ఉన్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. గులాబీ మొక్కలకు సైతం ప్రేమికుల రోజు ఒక్క రోజా పూవు అందజేస్తే రెండో రోజుకు ఎండిపోతుందని, ప్రేమ నిలకడగా ఉండాలని ఆశిస్తూ కొంత మంది ప్రేమికులు తమ ప్రేయసికి గులాబీ మొక్కలను అందజేయడం మొదలైంది. గులాబీ మొక్కల పెంపకానికి ప్రసిద్ది పొందిన అగళకోట ప్రాంతంలోని నర్సరీలలో రోజా మొక్కలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం నర్సరీలలో రోజా మొక్కలకు ముందే ఆర్డర్లు ఇవ్వడంతో మిగతావారికి దొరకడం కష్టంగా ఉంది. -
వాలెంటైన్స్ డే జోష్! చాట్‌జీపీటీతో ప్రేమ లేఖలకు సిద్ధపడ్డ లవ్ బర్డ్స్
న్యూఢిల్లీ: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ప్రేమికులంతా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి కొత్త జోష్‌తో ఉన్నారు. మనసులో ప్రేమ భావనలు ఉప్పొంగుతున్నా వాటిని చక్కగా కాగితంపై పెట్టలేని వారు చాట్‌జీపీటీ సాయంతో ప్రేమలేఖలు రాయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు! 62% మంది ప్రేమికులు ఈ వాలెంటైన్స్‌డేకి చాట్‌జీపీటీ సాయంతో తమ మనసులో ఉన్న మాటల్ని రాస్తామని ఒక సర్వేలో వెల్లడించారు. 30% మంది తమ లవర్‌కి ఈ టూల్ సాయంతో ప్రేమలేఖ రాస్తామని చెప్పారు. మోడరన్ లవ్ రీసెర్చ్ తొమ్మిది దేశాల్లో 5 వేల మందిని ప్రశ్నించి ఒక నివేదిక రూపొందించింది. సహజసిద్ధంగా పుట్టే ప్రేమను వ్యక్త పరచడానికి కృత్రిమ మేధపై ఆధారపడతామని చెప్పిన వారిలో అత్యధికులు భారతీయులే! -
మధురిమలు పంచుకోండి.. మధురంగా..
ఒక గులాబీ.. ఒక చాక్లెట్.. ఒక గ్రీటింగ్ కార్డ్.. ఒక కేక్.. ఒక గిఫ్ట్.. ప్రేమికుల రోజును ఇలాంటి వాటితో ఆరంభించండి.. మీకు ప్రియమైన వారిపై మీకున్న ప్రేమను తెలియజేయండి. రోజూ చూపే ప్రేమను ఇది ఎన్నో రెట్లు ఎక్కువగా చేస్తుంది. ఈ అనుభూతి మరింత మధురానుభూతులను మీ జీవితంలో నింపుతుంది. నచ్చిన ఆట.. కలిసి ఆడండి. ఉదాహరణకు చెస్, క్యారమ్స్ వగైరా.. ఏదైనా.. ఆ ఆట ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది. సాక్షి, పశ్చిమగోదావరి డెస్క్: ప్రేమ అనేది ఓ మధుర భావన. ఇది మనసులను కలుపుతుంది.. మనుషులను దగ్గర చేస్తుంది. ప్రేమతో జీవించడం.. జీవితంలోని మాధుర్యాన్ని మన దరి చేరుస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారైనా.. పెళ్లి తర్వాత ప్రేమించుకుంటున్నవారైనా.. అంతిమంగా తమ భాగస్వామిపై చూపే ప్రేమే వారి జీవిత గమనాన్ని మధురంగా మారుస్తుంది. మరి ఇలాంటి జంటలు ఈ ఏడాది ప్రేమికుల రోజును ఎలా జరుపుకోవాలనే దానిపై ఆలోచిస్తుంటే.. వారికి నెటిజన్లు అనేక సూచనలు అందిస్తున్నారు. వాటిలో కొన్ని ఖర్చుతో కూడుకున్నవి కాగా.. మరికొన్ని తక్కువ వ్యయంతో ప్లాన్ చేసుకోదగినవి. అసలు ఖర్చే అవసరం లేనివి కూడా ఇందులో ఉన్నాయి. వాటిలో తమకు ఉత్తమంగా అనుకున్నవి.. సాధ్యమయ్యేవి ప్లాన్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటే.. ఆ మాధుర్యాన్ని ఎప్పటికీ మరిచిపోలేరని కూడా చెబుతున్నారు. ఇవి నెట్టింట చాలా ఎక్కువమందిని ఆకట్టుకుంటుండటం విశేషం. అవేంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా.. అయితే.. ఇవి మీకోసమే.. ► మీకు ఇష్టమైన పాటలను కలిసి ఎంచుకోండి. మీ సంబంధాన్ని గుర్తుచేసే, మీ భాగస్వామికి ఎక్కువగా ఇష్టమైన పాటలకు అందులో ప్రాధాన్యత ఇవ్వండి. వాటిని మీ ప్లే లిస్ట్‌లో ఉంచేందుకు సమయం కేటాయించండి. ► ఇద్దరూ కలిసి ఒకరోజు గడపడంలో ఉత్తమమైన మార్గాల్లో మరొకటి.. స్వచ్ఛంద సేవ. ఇతరులకు స్వయంగా సేవ చేయడం మీరు ఒకరికొకరు మరింత కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ► మీ సొంత ప్రాంతంలో పర్యాటకులుగా మారండి. మీ పట్టణంలో ఏదైనా ప్రసిద్ధమైన ప్రాంతాన్ని లేదా మీరు ఎప్పుడూ చూడని మ్యూజియాన్ని సందర్శించండి. ఫొటోగ్రాఫర్లుగా మారి నచ్చిన విధంగా ఫొటోలు తీయండి. ► మీ ఇద్దరి తీపి గుర్తులను కలిపి ఒక విలువైన పుస్తకంగా రూపొందించండి. లవ్ లెటర్లు, దుస్తులు, చేతి రుమాళ్లు, బహుమతులు, ఫొటోలు, పాత సినిమా టికెట్లు, గుర్తుగా దాచుకున్నవాటిని సేకరించి దీనిని తయారుచేయండి. ► డ్రైవ్ కోసం వెళ్లండి.. కారు లేదా బైక్ ఫుల్ ట్యాంకు చేయించండి. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నది కావచ్చు. అయినా ఇది మీరు వెళ్లే కొత్త ప్రాంతంలో సరికొత్త అనుభూతులను కలిసి ఆస్వాదించేందుకు ఉపకరిస్తుంది. ► ఇద్దరూ కలిసి మీ ప్రేమకు సింబాలిక్‌గా ఉండేలా గోడకు తగిలించే లేదా వేలాడదీసే ఒక ఆహ్లాదకరమైన కళాత్మక వస్తువును రూపొందించండి. దానిని మీరు నిత్యం సంచరించే ప్రాంతంలో ఏర్పాటు చేయండి. ► ఒకరికొకరు ప్రేమలేఖలు రాసుకోండి. ఇంతకుముందే రాసిన అనుభూతులు ఉన్నప్పటికీ.. ఇప్పుడు కొత్తగా ప్రయత్నించండి. మీ భాగస్వామి మీకు ఎందుకు ప్రత్యేకమైన వారో అందులో పొందుపరచండి. మీ భాగస్వామిలోని ఏ లక్షణాలను మీరు ఎక్కువగా ఆరాధిస్తారో, వారు మిమ్మల్ని ఎలా భావిస్తారో, మీరు వారితో ఎందుకు ప్రేమలో పడ్డారో ఆ లేఖలో తెలియజేయండి. ► ఇద్దరికీ ఇష్టమైన రొమాంటిక్ సినిమాలు చూడండి. పాప్‌కార్న్ వంటి స్టఫ్ కూడా అందుబాటులో పెట్టుకోండి. ► ఇద్దరూ కలిసి ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అది వంటకం కావచ్చు.. డ్యాన్స్ కావచ్చు.. మరేదైనా కావచ్చు. ► కలిసి యోగా లేదా వ్యాయామం సాధన చేయండి. ఆ సమయాన్ని ఆస్వాదించండి. ► ట్రెజర్ హంట్ (నిధి వేట) లాంటి ఆసక్తికరమైన ఆట ఎంచుకోండి. మీ భాగస్వామికి ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రేమికుల రోజు బహుమతిని దాచి ఉంచండి. దానిని కనుగొనడానికి ఆధారాలు రూపొందించి దానిని కనిపెట్టాలని సూచించండి. ► ప్రేమకు సూచిక అయిన హార్ట్ సింబల్లో ఆహారాన్ని కలిసి తయారు చేయండి. చపాతీ, పిజ్జా, ఆమ్లెట్, కేక్.. ఇలా మీ ఊహ మేరకు ప్రయత్నించండి. లేదంటే హార్ట్ సింబల్ ఆకారంలో కేక్‌కి ఆర్డర్ ఇవ్వండి. ► ఇద్దరూ కలిసి షాపింగ్‌కు వెళ్లండి. ఒకరి కోసం ఇంకొకరు ఇష్టమైన వస్తువును కొనడానికి ప్రయత్నించండి. ► ఇద్దరూ కలిసి పెయింట్ చేయండి. మీరు పెయింటర్లు కాకపోవచ్చు.. అయినా ఇద్దరూ కలిసి ఒక సొంత కళాఖండం రూపొందించడానికి ప్రయత్నించండి. అది తప్పనిసరిగా సరికొత్త అనుభూతులను పంచుతుంది. ► ఇద్దరూ కలిసి అందమైన పూలతోటను సందర్శించడానికి ప్రయత్నించండి. కనీసం మీకు సమీపంలోని నర్సరీకి వెళ్లి ప్రేమికుల రోజుకు గుర్తుగా ఒక మొక్క కొనుగోలు చేయండి. అద్భుతమైన ఫొటోలూ తీసుకోండి. ► రాత్రి భోజనం కలిసి వండండి. ఒక సూపర్ బిజీ రెస్టారెంట్లో తినడానికి బయటకు వెళ్లడం కంటే ప్రత్యేకంగా ఇంట్లో వండిన భోజనం చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. మీలో ఒకరికి చెఫ్‌కి సమానమైన నైపుణ్యాలు లేకపోయినా, మీరు ఇద్దరూ ఆనందించే చిరస్మరణీయమైన విందును చేయవచ్చు. ► ఒక గులాబీ.. ఒక చాక్లెట్.. ఒక గ్రీటింగ్ కార్డ్.. ఒక కేక్.. ఒక గిఫ్ట్.. ప్రేమికుల రోజును ఇలాంటి వాటితో ఆరంభించండి.. మీకు ప్రియమైన వారిపై మీకున్న ప్రేమను తెలియజేయండి. రోజూ చూపే ప్రేమను ఇది ఎన్నో రెట్లు ఎక్కువగా చేస్తుంది. ఈ అనుభూతి మరింత మధురానుభూతులను మీ జీవితంలో నింపుతుంది. ► నచ్చిన ఆట.. కలిసి ఆడండి. ఉదాహరణకు చెస్, క్యారమ్స్ వగైరా.. ఏదైనా.. ఆ ఆట ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది. -
ఐఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు.. భారీ డిస్కౌంట్!
వాలంటైన్ డే సందర్భంగా స్మార్ట్ఫోన్లపై ఈ కామర్స్ సైట్లు కళ్లు చెదిరే ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్ అయితే ఐఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్‌ను ప్రకటించింది. యాపిల్ ఐఫోన్ 12మినీ, యాపిల్ ఐఫోన్ 14 ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రూ.59,999 వేలు ఉండే ఐఫోన్ 12మినీ ఫోన్‌ను రూ.21,999లకు, రూ.79,900 ఉన్న ఐఫోన్ 14ను రూ.44,999లకే సొంతం చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ 12మినీ ధర ప్రస్తుతం రూ.59,999. కానీ ఫ్లిప్‌కార్ట్ వాలంటైన్ డే సేల్‌లో దీని ధర రూ.41,999. అంతేకాకుండా కస్టమర్లను మరింత ఆకట్టుకునేందుకు పాత స్మార్ట్‌ఫోన్ ఎక్సేంజ్‌పై అత్యధికంగా రూ.20,000 డిస్సౌంట్ అందిస్తోంది. దీన్ని గరిష్టంగా ఉపయోగించుకుంటే యాపిల్ ఐఫోన్ 12మినీ ఫోన్ మీకు రూ.21,999కే లభిస్తుందన్న మాట. అలాగే యాపిల్ ఐఫోన్ 14 ధర ప్రస్తుతం రూ.79,900 ఉంది. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా రూ.34,901 భారీ తగ్గింపు ఉంది. అంటే ఈ ఫోన్ కేవలం రూ.44,999లకే లభిస్తుంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 13,901 తగ్గింపు తర్వాత రూ.65,999 ఉన్నప్పటికీ అమెరికన్ ఎక్స్‌ప్రెస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్డీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా 10 శాతం గరిష్టంగా రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక పాత స్మార్ట్‌ఫోన్ ఎక్సేంజ్‌పై అత్యధికంగా రూ.20,000 డిస్సౌంట్ కలుపుకొంటే ఐఫోన్ 14ను కేవలం రూ.44,999కే కొనుక్కోవచ్చు. -
Valentine Day: ప్రియ సందేశం.. వాట్సాప్ ప్రేమాయణం!
ఫిబ్రవరి 14.. వాలంటైన్ డే. ప్రేమికుల దినోత్సవంగా చెప్పుకునే ఈ రోజున ప్రియమైన వారికి తమ మనసులోని ప్రేమను, భావాలను వివిధ మార్గాల ద్వారా తెలియజేస్తూ ఆకట్టుకుంటుంటారు. అయితే ఈ వాలంటైన్ డే రోజున మనం రోజూ వాడే వాట్సాప్ ద్వారా మీ మనసులోని భావాలను మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇందు కోసం వాట్సాప్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయో తెలుసుకోండి... డిజిటల్ అవతార్స్: వాట్సాప్‌లో డిజిటల్ అవతార్స్‌ను మీకు నచ్చినట్టుగా క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఉంది. వీటిని మీ అభిరుచిగా తగినట్టుగా మీ వ్యక్తిత్వాన్ని, మనసును తెలియజేసేలా రూపొందించి మీ ప్రియమైనవారితో సంభాషణల్లో ఉపయోగించండి. పిన్చాట్: ఈ పిన్చాట్ ఫీచర్‌తో మీ ఫేవరెట్ సంభాషణలను ఇన్‌స్టంట్‌గా పిన్ చేసి పెట్టుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫేవరెట్ చాట్‌ను హోల్డ్ చేసి పట్టుకుంటే పిన్చాట్ ట్యాబ్ క్రియేట్ అవుతుంది. అదే ఐఫోన్ యూజర్లు అయితే చాట్‌ను కుడివైపునకు స్వైప్ చేసే పిన్ ఆప్షన్ వస్తుంది. ఎమోజీలు: అవతలివారు పంపించే సందేశాలకు ప్రతిస్పందించడానికి ఎమోజీలకు మించిన సులువైన మార్గం లేదు. ఎమోజీలంటే కేవలం థంబ్సప్ వంటి చిహ్నాలే కాదు. అర్థవంతమైన ఎమోజీలను పంపి ఎదుటివారి మనసును ఇట్టే ఆకట్టుకోవచ్చు. స్టేటస్ అప్డేట్లు: వాట్సాప్ స్టేటస్ గురించి మనందరికీ తెలుసు. అయితే కాస్త విభిన్నంగా ఆలోచిస్తే మీ మనసు ఎదుటివారికి అర్థమయ్యేలా వీడియోలు, సౌండ్లు, టెక్ట్స్, జిఫ్స్ ద్వారా తెలియజేయచ్చు. ఇవి 24 గంటలపాటు అలాగే ఉంటాయి. వాయిస్ మెసేజ్‌లు: ఎదుటివారిలో సంభాషణల్లో వాయిస్ మెసేజ్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. మీలోని భావాలను మీకు అత్యంత ప్రియమైనవారికి స్వయంగా మీ స్వరంతోనే వినిపించండి. వారిని ఇవి కచ్చికంగా ఆకట్టుకుంటాయి. కస్టమ్ నోటిఫికేషన్స్: ఇది చాలా ఆసక్తికర ఆప్షన్. ప్రియమైన వారి దగ్గర నుంచి కాల్స్ లేదా సందేశాల కోసం ఎదురు చూసేవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వారి కాంటాక్ట్ ఇన్ఫోపై క్లిక్ చేసి ప్రత్యేకమైన అలర్ట్ టోన్‌ను సెట్ చేసుకోవచ్చు. లైవ్ లొకేషన్: ప్రియమైన వారి భద్రత, ఒకరి పట్ల మరొకరికి ఉన్న బాధ్యతను ఈ ఆప్షన్ తెలియజేస్తుంది. తెలియని ప్రదేశంలో ఉన్నప్పుడు దీని సాయంతో ఒకరినొకరు కలుసుకోవచ్చు. పోల్స్: ఈ ప్రత్యేకమైన రోజున మీ ప్రియమైన వారికి ఎలాంటి బహుమతులు ఇస్తే బాగుంటుందో తెలియక తికమకపడుతుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ వాట్సాప్ పోల్ ఫీచర్‌ను మీరు ఉపయోగించుకుని మీ స్నేహితుల సలహాలు కోరవచ్చు. -
అమెజాన్ వాలెంటైన్స్ డే సేల్...స్మార్ట్ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్స్
వాలెంటైన్స్ డే సందర్భంగా అమెజాన్ స్మార్ట్ఫోన్లపై మరో సేల్‌కి సిద్దమైంది. ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ అని పిలిచే అమెజాన్ కొత్త సేల్ ఫిబ్రవరి 14 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో ఈ-కామర్స్ దిగ్గజం కొనుగోలుదారులకు ఎస్బీఐ, మాక్స్ క్రెడిట్ కార్డ్‌లపై ఈఎంఐతో పాటు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ & ఈఎంఐ లావాదేవీలపై రూ. 1,250 వరకు స్మార్ట్‌ఫోన్ ఉపకరణాలపై మేడ్ ఫర్ ఈచ్ అదర్ డీల్‌లను పొందవచ్చు. వాలెంటైన్స్ డే డీల్‌లో బడ్జెట్ ఫోన్లైన రెడ్మీ10 పవర్, రెడ్మీ 10ఏ, రెడ్మీ ఏ1లపై ఫెడరల్ బ్యాంక్ ఆఫర్లను అందిస్తుంది. వీటి ధరలు రూ. 10,749, రూ. 7,862, రూ. 6,499 నుండి అందుబాటులో ఉన్నాయి. మరో స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్లపై ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు ఆఫర్లు పొందవచ్చు. గెలాక్సీ ఎం13, గెలాక్సీ ఎం 33, గెలాక్సీ ఎం04 లను వరుసగా రూ. 8,699, రూ. 13,999, రూ. 7,499కి కొనుగోలు చేయొచ్చు. అదనంగా, ఈ ఫోన్లపై 3 లేదా 6 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐని పొందవచ్చు. ఐక్యూ లేటెస్ట్ 5జీ ఫోన్లను సైతం అమెజాన్ ఈ సేల్‌లో విక్రయానికి పెట్టింది. ఐక్యూ జెడ్6 5జీ, ఐక్యూ జెడ్ 6 లైట్ 5జీ, ఐక్యూ నియో 6 5జీలను రూ. 14,499, రూ. 11,999, రూ. 24,990లలో పొందవచ్చు. ఎస్బీఐ, ఫెడరల్ బ్యాంక్‌లు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సందర్భంగా టెక్నో ఫోన్లపై భారీ డీల్స్ సొంతం చేసుకోవచ్చు. 4జీబీ ర్యాబ్, 64జీబీ స్టోరేజ్, 13 ఎంపీ, ఏఐ మోడ్‌తో వచ్చే టెక్నో స్పార్క్ 9 రూ. 7,019 నుండి అందుబాటులో ఉండగా.. టెక్నో పాప్ 6 ప్రో ఎస్బీఐ, ఫెడరల్ బ్యాంక్ నుండి డిస్కౌంట్లతో రూ. 5,399కి కూడా అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేక సెల్లో రియల్మీ 50 సిరీస్‌పై కస్టమర్లు అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చు. రియల్మీ 50ఐ ప్రైమ్, రియల్మీ 50ఏ ప్రైమ్ ధరలు వరుసగా రూ. 6,299, రూ. 8,999ఉన్నాయి. వీటిపై 3 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90హెచ్‌జెడ్ డిస్ప్లేతో కూడిన రియల్మీ 50 5జీ ఫోన్‌పై 3 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐతో రూ. 12,999కి అందుబాటులో ఉంది. -
సోషల్ మీడియాలో మీమ్స్.. కౌ హగ్ డే నిర్ణయంపై వెనక్కి తగ్గిన కేంద్రం
ఫిబ్రవరి 14న ప్రజలు ఆవును కౌగించుకోవాలన్న నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గింది. ప్రేమికుల దినోత్సవం రోజున కౌ హగ్ డే జరుపుకోవాంటూ ఇచ్చిన పిలుపును ఉపసంహరించుకుంది. ఈ మేరకు భారత జంతు సంరక్షణ బోర్డు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మత్స్య, పశుసంవర్థక, డెయిరీ మంత్రిత్వశాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు ఫిబ్రవరి 14న కౌ హగ్ డే జరుపుకోవాలంటూ ఇచ్చిన పిలుపును వెనక్కి తీసుకొంటున్నట్టు కేంద్ర పశు సంరక్షణ బోర్డు కార్యదర్శి ఎస్కే దత్తా ఓ నోటీసులో పేర్కొన్నారు. కాగా గోవులను ప్రేమించేవారు ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డేకి బదులుగా కౌ హగ్ డే జరుపుకోవాలని కేంద్ర జంతు సంక్షేమ శాఖ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతున్న నేపథ్యంలో భారతీయ పురాతన సంప్రదాయాలు అంతరించిపోతున్నాయని.. గోమాత ప్రాధాన్యతను గుర్తించి ఫిబ్రవరి 14న గోవులను ఆలింగనం చేసుకోవాలంటూ పేర్కొంది. గోవును కౌగిలించుకోవడం ద్వారా భావ సంపద వృద్ధి చెందుతుందని.. తద్వారా వ్యక్తిగత, సామూహిక సంతోషం పెరుగుతుందని తెలిపింది. అయితే ఈ ప్రకటన చే'rనప్పటి నుంచి కౌ హగ్ డే అంశం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అప్పటి నుంచి దీనిపై రచ్చ జరుగుతూనే ఉంది. కొంతమంది దీనిపై సానుకూలంగా స్పందిస్తుంటే.. మరికొందరు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శిస్తున్నారు. దీంతో నెట్టింట్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. అటు విపక్షాలు కౌ హగ్ డేపై సైతం విమర్శలు గుప్పించాయి. కౌ హగ్ డే పిలుపు హాస్యాస్పదమని.. ప్రధాని మోదీకి పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఓ ‘పవిత్ర గోవు’ అంటూ మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో జంతు సంరక్షణ బోర్డు ‘కౌ హగ్ డే’ పాటించాలంటూ ఇచ్చిన పిలుపును తాజాగా ఉపసంహరించుకోవడం గమనార్హం. చదవండి: మోదీ సర్కార్‌ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది: ఎమ్మెల్సీ కవిత -
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కాదు.. 'కౌ హగ్ డే'..!
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు అని అందరికీ తెలుసు. యువతీ, యువకులు తాము ప్రేమించిన వారికి ఈరోజే ప్రపోజ్ చేస్తుంటారు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వాములకు ప్రత్యేక కానుకలు ఇచ్చి సర్ఫ్రైజ్ చేస్తుంటారు. భారతీయ యువతలో ఈ ఆలోచనను మార్చాలని కేంద్ర పశుసంవర్ధక శాఖ భావిస్తోంది. పాశ్చాత్య దేశాల పట్ల ప్రభావితమై భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతున్న యువతలో మార్పు తీసుకురావాలనుకుంటోంది. అందుకే ఫిబ్రవరి 14ను 'కౌ హగ్ డే'గా జరుపుకొని గోవులను ఆలింగనం చేసుకోవాలని పిలుపునిచ్చింది. 'భారతీయ సంస్కృతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గోవులు వెన్నెముక. పశుసంపదకు, జీవ వైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మానవాళికి సకల సంపదలను అందించే తల్లి వంటి పోషకాహార స్వభావం ఉన్నందున ఆవును కామధేను, గోమాత అని పిలుస్తారు. గోవును ఆలింగనం చేసుకుంటే మానసిక ఆనందం కలుగుతుంది. అందుకే ఫిబ్రవరి 14 కౌ హగ్ డే జరుపుకోండి' అని పేర్కొంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ సూచన మేరకు ఆ శాఖ కార్యదర్శి ఈ ప్రకటన విడుదల చేశారు. చదవండి: పార్లమెంట్లో విపక్షాలను ఏకిపారేసిన మోదీ.. -
Odisha College: ‘ఆ రోజులోపు బాయ్‌ఫ్రెండ్ ఉండాల్సిందే’
పారాదీప్(ఒడిశా): ‘కళాశాలలో చదివే ప్రతి ఒక్క అమ్మాయి ప్రేమికుల దినోత్సవం రోజుకల్లా బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించాలి. లేదంటే కాలేజీలోకి అనుమతించబోము’ అంటూ ఒడిశాలో ఒక కాలేజీ తరఫున అధికారికంగా వెలువడిందని చెబుతున్న నోటీసు ఒకటి సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతోంది. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదుచేసి తప్పుడు నోటీస్ తయారుచేసిన నిందితుల కోసం వెతికే పనిలో పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలోని ఎస్వీఎం అటానమస్ కాలేజీ ప్రిన్సిపల్ పేరిట ఒక నకిలీ నోటీసు వెలువడింది. కాలేజీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో బిజయ్ కుమార్ వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. సంతకాన్ని దుర్వినియోగం చేశారని, అది నకిలీ నోటీసు అని కాలేజీ పరువు తీసేందుకు కావాలనే ఎవరో కుట్ర పన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ప్రేమికుల దినోత్సవానికి టైటానిక్
సినిమా లవర్స్‌కి.. అందులోనూ ప్రేమకథా చిత్రాల ప్రేమికులకు ఈ ప్రేమికుల దినోత్సవానికి సిల్కర్ స్క్రీన్ పై ‘టైటానిక్’ ప్రత్యక్షం కానుంది. టైటానిక్ ఓడలో పరిచయం అయి, ప్రేమికులుగా దగ్గరయ్యే జాక్, రోజ్లు చివరికి ఓడ ప్రమాదంలో దూరమయ్యే ఈ విషాదభరిత ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. ప్రేమికులుగా లియో నార్డో డికాప్రియో, కేట్ విన్ ్సలెట్ల కెమిస్ట్రీని అంత సులువుగా ఎవరూ మరచిపోలేరు. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ ఎవర్గ్రీన్ లవ్‌స్టోరీ విడుదలై 25 ఏళ్లయింది. ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ చిత్రాన్ని హై క్వాలిటీతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకు రావాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి పోస్టర్ని, ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన ట్వంటీయత్ సెంచురీ ఫాక్స్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 4కే ప్రింట్‌తో త్రీడీ వెర్షన్ లో ఈ లవ్‌స్టోరీ కొత్త హంగులతో రావడానికి సిద్ధమవుతోంది. ఇక 1997 నవంబర్‌లో విడుదలైన ‘టైటానిక్’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ. 13 వేల కోట్లకు పైగా కలెక్ట్ చేసి, రికార్డు సృష్టించింది. 2010లో జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ విడుదలయ్యే వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం రికార్డ్ ‘టైటానిక్’దే. కామెరూన్ తన సినిమా రికార్డ్‌ని తానే బద్దలు కొట్టడం విశేషం. ఇక ఆస్కార్ అవార్డ్స్‌లో 14 నామినేషన్లు దక్కించుకుని, 11 అవార్డులను సొంతం చేసుకున్న ఘనత కూడా ‘టైటానిక్’కి ఉంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు ఇలా పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం త్రీడీ వెర్షన్‌ని 2012లో విడుదల చేశారు. ఇప్పుడు మరింత క్వాలిటీతో ‘టైటానిక్’ రానుంది. -
యాంకర్ శ్రీముఖి పెళ్లి చేసుకోనుందా? ఆ ఫోటోతో సర్ప్రైజ్
యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది.బుల్లితెర ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ ఫోటోను షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 'ఫిబ్రవరి 14 2022 ఈ రోజు.. ఈ రోజు గుర్తు పెట్టుకోండి మళ్లీ మాట్లాడుకుందాం. బెస్ట్ వాలెంటైన్స్ ఎవర్' అంటూ లవ్ ఎమోజీలతో ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇక ఫోటోలో శ్రీముఖి ఓ ఫ్లవర్ బొకే పట్టుకొని ఉంది. దీంతో ఈ యాంకరమ్మ ప్రేమలో పడిపోయిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాయ్‌ఫ్రెండ్‌ని కూడా రివీల్ చెయ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
ఆమె అతడిలా.. అతడు ఆమెలా మారిన జంట ఇది!
సమాజం.. ముఖ్యంగా మన చట్టాలు అంగీకరించని వ్యవహారం ఇది. ఆమె అతడిలా, అతడు ఆమెలా మారిన ట్రాన్స్ జెండర్లు వీరిద్దరి. ప్రేమించుకున్నారు. పెళ్లితో ఒక్కటి కావాలనుకున్నారు. కానీ, ఇలాంటి వాటిని నిందించే సమాజం కదా. అయినా పెద్దలు ధైర్యం చేశారు. స్నేహితులు తోడుగా నిలిచారు. వేద మంత్రాల సాక్షిగా ప్రేమికుల దినోత్సవం నాడే మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. కేరళ తిరువనంతపురంలో ఫిబ్రవరి 14న ఘనంగా జరిగింది ఈ ట్రాన్స్ జంట వివాహం. త్రిస్సూర్ కు చెందిన వరుడు మనూ కార్తీక టెక్నోపార్క్ లోని ఓ ఐటీ సంస్థలో జాబ్ చేస్తున్నాడు. ఇక వధువు శ్యామా ఎస్. ప్రభ కేరళ సోషల్ జస్టిస్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసిన ట్రాన్స్ జెండర్ విభాగంలో విధులు నిర్వర్తిస్తోంది. 2010లో క్వీర్ ఉద్యమం సందర్భంగా ఇద్దరూ కలుసుకున్నారు. అప్పటి నుంచి పరిచయం కాస్త స్నేహంగా.. ఆపై ప్రేమగా మారింది. 2017లో తొలిసారిగా మనూ, శ్యామకు ప్రపోజ్ చేశాడట. వీళ్ల శరీరతత్వాల గురించి తెలిసిన పెద్దలు.. వీళ్ల ప్రేమకి, పెళ్లికి సైతం అడ్డుచెప్పలేదు. అయితే.. వాళ్లిద్దరూ వాళ్ల వాళ్ల ఇంట్లో పెద్దవాళ్లు. దీంతో కొన్ని బాధ్యతలు పెళ్లికి అడ్డుపడ్డాయి. అవి తీరాక ఇప్పుడు సంప్రదాయ బద్ధంగా పెద్దల సమక్షంలోనే ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి గురించి ముందుగా ప్రచారం జరగడంతో ట్రాన్స్జెండర్లు సైతం భారీ ఎత్తున్న హాజరై.. ఈ జంటను ఆశీర్వదించి వెళ్లారు. ఇప్పుడున్న వివాహ చట్టాల ప్రకారం వీళ్ల వివాహం ఆమోదయోగ్యం కాదు. అందుకే తమ వివాహాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు కేరళ హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ట్రాన్స్‌జెండర్ గుర్తింపు కింద తమ వివాహానికి చట్టబద్ధత కల్పించాలని కోరనున్నారు వీళ్లు. ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలను సిద్ధం చేసుకున్నామని ఈ జంట చెబుతోంది. ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. -
వారంలో ఓ డేట్ నైట్
Upasana Valentines Day Tips: ‘‘ప్రేమలో పడటం సులభమే. కానీ ఎప్పుడూ ప్రేమతో కొనసాగడం ప్రేమికులుగా పార్క్‌లో నడిచినంత సులభం కాదు’’ అంటున్నారు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన. సోమవారం వాలెంటెన్స్ డే సందర్భంగా తమ (రామ్‌చరణ్, ఉపాసన) వివాహం జరిగి పదేళ్లు పూర్తయ్యాయని, తమ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్‌కి ఇవే కారణాలై ఉండొచ్చన్నట్లుగా ఉపాసన కొన్ని సలహాలు, సూచనలను ఓ వీడియో రూపంలో షేర్ చేశారు. ∙దాంపత్య జీవితంలో ఆరోగ్యానిదే అగ్రస్థానం. కాబట్టి ఇద్దరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉదయాన్నే నిద్రలేవడం వల్లే మన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నేను నమ్ముతాను. చాలామంది మ్యారేజ్ గోల్స్‌ను పెయిన్‌ఫుల్‌గా భావిస్తారు. కానీ ప్రేమతో చేస్తే అవే బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ∙ప్రతిరోజూ మన ప్రియమైన వారితో కాస్త సమయాన్ని గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. కలిసి భోజనం చేయడం, కబుర్లు చెప్పుకోవడం, కలిసి సినిమాలు చూడటం.. ఇలాంటివి జీవితాన్ని మరింత ప్రేమతో నింపి మరింత అందంగా మారుస్తాయి. అలాగే వారంలో ఓసారి డేట్ నైట్‌ను ప్లాన్ చేసుకోండి. మీ వివాహ బంధంలో ఏవైనా దూరాలు ఉంటే మళ్లీ కనెక్ట్ అవ్వండి. జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించండి. ∙పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు కానీ అది నిజం కాదని నా నమ్మకం. భూమి మీద ఓ ఇద్దరు చేసే ఎఫర్ట్స్పైనే వారి దాంపత్య జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ అంశాలతో పాటు మన జీవిత భాగస్వామిపట్ల అమితమైన ప్రేమ, గౌరవాన్ని కూడా కలిగి ఉండాలని మర్చిపోవద్దు. -
అర్ధరాత్రి ప్రియుడికి నయనతార సర్ప్రైజ్, వీడియో వైరల్
సాధారణ రోజుల్లో ప్రేమను ఇచ్చిపుచ్చుకునే లవ్ బర్డ్స్ వాలంటైన్స్‌డే రోజు మాత్రం గిఫ్టులు ఇచ్చుకుంటారు. లేదంటే కలిసి కాలక్షేపం చేస్తూ ఆ రోజును జీవితంలో మధుర సంతకంలా మార్చుకుంటారు. ప్రేమ లేఖలు, పుష్పగుచ్ఛాలు, టెడ్డీబేర్లు, చాక్లెట్లు, విలువైన బహుమతులు, హాలీడే ట్రిప్పులు.. ఇలా ప్రేమను కురిపిస్తూ రోజంతా మైమరచిపోయేందుకు ఎన్నెన్నో చేస్తారు. ప్రేమికుల రోజును పురస్కరించుకుని కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార తన ప్రియుడిని సర్ప్రైజ్ చేసింది. అర్ధరాత్రి ప్రియుడు విఘ్నేశ్ శివన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి అతడిని ప్రేమ కౌగిలిలో బంధించింది. ఈ సర్ప్రైజ్కు ముగ్ధుడైన విఘ్నేశ్ ప్రియురాలి నుదుటిపై ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటూ ఆమెపై ప్రేమను కురిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మరో పోస్ట్‌లో విఘ్నేశ్ శివన్.. 'ప్రియమైన అందరికీ హ్యాపీ వాలంటైన్స్ డే. జీవితాన్ని పరిపూర్ణం చేసేది ప్రేమ మాత్రమే! కాబట్టి ప్రేమించడానికైనా, ప్రేమను ఆస్వాదించడానికైనా టైం తీసుకోండి. ఆసక్తి చూపించండి' అని పేర్కొంటూ నయనతారతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
'ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లెందుకు కాలేదు?'
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. ప్యారిస్ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథలో పూజా హెగ్డే కథానాయిక. కృష్ణం రాజు మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర పోషించగా జిల్ ఫేమ్ కేకే రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి వాలంటైన్స్ గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. లైఫ్‌లో వాడి ముఖం చూడను అన్న హీరోయిన్ డైలాగ్‌తో ఈ వీడియో ప్రారంభమవుతుంది. 'కుక్ చేస్తావ్, బాగా మాట్లాడతావ్.. ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లెందుకు కాలేదు?' అని హీరోయిన్ ప్రశ్నించగా ప్రభాస్ తత్తరపాటుకు లోనయ్యాడు. కానీ అతడు ఏమని సమాధానం చెప్పాడన్నది మాత్రం చూపించలేదు. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ మూవీ ‘గ్లాడియేటర్’కి యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన నిక్ పోవెల్ వర్క్ చేస్తుండటం విశేషం. -
‘సాక్షి’ వాలంటైన్స్‌డే స్పెషల్: తనువులు వేరైనా.. మనసులు ఒకటేనని.. ( ఫోటోలు)
-
Valentines Day Special: హ్యాపీ వాలెంటైన్స్ డే
-
Valentine's Day: తొలిప్రేమ.. తొమ్మిదేళ్లకు పెళ్లి
(కరీంనగర్) గుండెల్లో దాచుకున్న ప్రేమ, మాటల్లో చెప్పలేని భావాలను వెల్లడించే ప్రేమికుల రోజు రానే వచ్చింది. జాతి, కుల, మత, వర్గ, భాష, ప్రాంతీయ భేదాల్లేనిది ప్రేమ. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అది ఎలా పుట్టింది.. దాన్ని పండుగలా జరుపుకోడానికి కారణాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. వాలెంటైన్స్ డే నేపథ్యం.. ప్రేమికుల రోజు పుట్టడానికి ఆద్యుడు వాలెంటైన్. రోమ్కు చెందిన ఆయన క్రీస్తుపూర్వం 270లో యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేశాడు. దీనివల్ల యువత వాలెంటైన్‌ను ఆరాధించేవారు. అదే సమయంలో రోమ్ చక్రవర్తి క్లాడియస్ కుమార్తె ఆయనకు అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది. దీంతో యువతకు ప్రేమ సందేశాలిచ్చి, తప్పుదోవ పట్టిస్తున్నాడన్న కారణం చూపి, వాలెంటైన్‌కు మరణశిక్ష విధించి, ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు. ఇది జరిగిన రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పోప్ గెలాసియన్స్ వాలెంటైన్ చనిపోయిన రోజును ప్రేమికుల దినోత్సవంగా ప్రకటించారు. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును ప్రేమికులు పండుగలా జరుపుకుంటున్నారు. ప్రేమను వ్యక్తపరిచే రోజు ప్రేమికుల రోజున ప్రేమికులు తమ అనుబంధాన్ని పెంచుకునేందుకు గులాబీలు అందించి, ప్రపోజ్ చేసుకుంటారు. గిఫ్టుగా చాకెట్లు, టెడ్డీబేర్లు ఇస్తారు. ప్రామిస్ చేసి, తమ ప్రేమను ముద్దు ద్వారా తెలియజేస్తారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. థాయిలాండ్ అమ్మాయి, మల్యాల అబ్బాయి నా పేరు గసిగంటి హరీశ్. మాది మల్యాల. షార్జాలోని ఓ కంపెనీలో స్టోర్ కీపర్‌గా పని చేస్తున్న. ఇదే కంపెనీలో పని చేస్తున్న «థాయిలాండ్‌కు చెందిన కవిన్నాట్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మా కుటుంబాల వారు ఒప్పుకోవడంతో స్వగ్రామం వచ్చి, ఈ నెల 10న వివాహం చేసుకున్నాం. నెల తర్వాత థాయిలాండ్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం. – గసికంటి హరీశ్–కవిన్నాట్, మల్యాల మతం అడ్డొచ్చినా మనసులు కలిశాయి 2008లో తనే ముందుగా నన్ను ఇష్టపడింది. తర్వాత నేనూ ఇష్టపడ్డాను. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ మతం అడ్డు వచ్చింది. నేహ కుటుంబసభ్యులు చాలా గొడవ చేశారు. కానీ మా మనసులు కలవడంతో చివరికి ముస్లిం సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాం. అమ్మానాన్న ఆమెను కూతురిలా చూసుకుంటారు. నలుగురు పిల్లలతో హాయిగా ఉంటున్నాం. – మహమ్మద్ మోయిజ్–నేహ, సిరిసిల్ల 2009లో వివాహం చేసుకున్న 2009లో జ్యోత్స్నను ప్రేమ వివాహం చేసుకున్న. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్న. మాకు ఇద్దరు కుమారులు. మా తమ్ముడు ప్రదీప్‌కుమార్ కేరళ రాష్ట్రానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అమ్మానాన్న, అత్తామామలు అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. – గోలివాడ ప్రవీణ్‌కుమార్–జ్యోత్స్న, ఎన్టీపీసీ రామగుండం ఆనందంగా జీవిస్తున్నాం ఎన్టీపీసీ రామగుండం అన్నపూర్ణకాలనీకి చెందిన నాకు దీపిక పరిచయమైంది. మేము 2010లో ప్రేమ వివాహం చేసుకున్నాం. మాకు పాప సౌఖ్య, బాబు హవీష్లు ఉన్నారు. మా ఆవిడ వాళ్ల సోదరి జ్యోత్స్న కూడా ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నా. కుటుంబసభ్యులందరం కలిసి ఆనందంగా జీవిస్తున్నాం. – సామల శ్రీనివాస్–దీపిక, మేడిపల్లి రోడ్, రామగుండం ముందుగా నేనే ప్రపోజ్ చేశా విజయవాడ ప్రభుత్వ దంత వైద్యశాలలో బీడీఎస్ కోర్సులో చేరాను. అక్కడే జ్యోతి క్లాస్మేట్గా పరిచయమైంది. ముందుగా నేనే ప్రపోజ్ చేశాను. 10 రోజులు ఆలోచించుకున్నాక అంగీకారం తెలిపింది. కోర్సు పూర్తయిన మూడేళ్లకి పెద్దలను ఒప్పించి, పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం ఆమె దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్‌గా, నేను సిరిసిల్ల టౌన్లో ప్రైవేట్ డెంటిస్ట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నా. – డాక్టర్ దోర్నాల శ్యాంసుందర్–జ్యోతి, దంత వైద్యులు, సిరిసిల్ల ప్రేమికులుగా కారు గెలిచాం మాది ఖమ్మం జిల్లా ఇల్లెందు. లావణ్యది గోదావరిఖని. సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో కలిసి చదువుకున్నాం. ఆ పరిచయం ప్రేమగా మారింది. 2011లో టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ‘సెవెన్ వెడ్డింగ్ వోవ్స్’ కాంపిటీషన్లో ప్రేమికులుగా ఫస్ట్ ఫ్రైజ్‌లో విలువైన కారు గెలిచాం. 2012 నవంబర్ 29న పెద్దలను ఒప్పించి, పెళ్లి చేసుకున్నాం. మాకు ఒక బాబు. – డాక్టర్ మహేందర్(సుల్తానాబాద్ మెడికల్ ఆఫీసర్)– డాక్టర్ లావణ్య (ఓదెల ప్రభుత్వ ఆస్పత్రి), గోదావరిఖని తొలిప్రేమ.. తొమ్మిదేళ్లకు పెళ్లి మాది కరీంనగర్‌లోని మంకమ్మతోట. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువుతుండగా 2013 అక్టోబర్ 2న కలుసుకున్నాం. తొలిచూపులోనే ప్రేమ మొదలైంది. కానీ లైఫ్‌లో సెట్ అయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదని ప్రామిస్ చేసుకున్నాం. ప్రస్తుతం ఇద్దరం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నాం. 2021 డిసెంబర్లో ఇంట్లో వాళ్లకి చెప్పాం. అందరూ ఒప్పుకోవడంతో ఈ నెల 10న హైదరాబాద్‌లో మా పెళ్లి జరిగింది. – కట్ల హర్షిత్–భగవతి, కరీంనగర్ పోలీసుల సమక్షంలో ఒక్కటయ్యాం అప్పట్లో మాకో పుస్తకాల షాపు ఉండేది. అక్కడికి విద్యార్థులు చాలామంది వచ్చేవారు. వారిలో విద్య ఒకరు. నేను ప్రేమిస్తున్న విషయాన్ని ఆమెతో «ధైర్యంగా చెప్పా. కానీ విద్య పేరెంట్స్ ఒప్పుకోలేదు. అప్పటి కలెక్టర్ సుబ్బారావు, ఎంపీ చొక్కారావులను సంప్రదించాను. పోలీసుల సమక్షంలో పెళ్లితో ఒక్కటయ్యాం. 32 ఏళ్లవుతున్నా అరమరికలు లేకుండా జీవిస్తున్నాం. – సంగీతం సత్యనారాయణ–విద్య, గ్రెస్ పట్టణ అధ్యక్షుడు, సిరిసిల్ల -
చిన్ని లేదని.. తిరిగి రాదని.. ఏమిటా కథ?
కేవీపల్లె(చిత్తూరు జిల్లా): నీవే నాప్రాణం.. నీవే నా సర్వస్వం అనుకున్న ప్రియుడి గుండె బద్ధలైంది. తాను నమ్ముకున్న ప్రేయసిని పొరబాటున కాల్చి చంపాల్సి వచ్చింది. ఈ ఘటన కేవీపల్లె మండలం, మారేళ్ల పంచాయతీ పరిధిలోని గ్రామస్తులును నేటికీ కదిలిస్తోంది. అమర ప్రేమికుల ఆనవాళ్లను చూసినప్పుడల్లా గుండె తరుక్కుపోతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. చదవండి: Valentine's Day: ఇట్లు.. నీ ప్రేమ.. మారేళ్ల సమీపంలోని పాళెంలో వనం తిరుమలనాయునివారు, వనం తిమ్మయ్యనాయుని వారు, వనం గోపీ నాయునివారు, వనం యర్రమనాయునివారు అనే నలుగురు అన్నదమ్ములు ఉండేవారు. వీరిలో రెండోవాడు తిమ్మయ్యనాయునివారు (దొరవారు)కి తుపాకీతో అడవి జంతువులను వేటాడడం సరదా. ఈ క్రమంలో వేటాడుతూ వివిధ ప్రాంతాల్లో సంచరించేవాడు. ఈ నేపథ్యంలో మంచాలమందకు చెందిన చిన్ని అనే యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. గుండు కింద ఏర్పరుచుకున్న ఆవాసం ఏకాంతం కోసం ఆవాసం మారేళ్ల పంచాయతీ పరిధిలో పెద్దకొండ, ఊరకొండ, ఎగువబోడు, నల్లేనుకొండలతో కూడిన సువిశాల అటవీ ప్రాంతం ఉంది. దొరవారు, చిన్ని ఏకాంతంగా కలుసుకోవడానికి మధ్యలో ఉన్న నల్లేనుకొండను ఎంచుకున్నారు. ఈ కొండ దిగువ ప్రాంతంలో పెద్ద రాతిగుండును ఆవాసంగా ఏర్పరచుకున్నారు. రాతి గుండు కింద నివాసం ఉండే విధంగా రాతి కట్టడం చేపట్టి ఇల్లుని తలపించేలా రూపొందించుకున్నారు. దొరవారికి ఈ ప్రాంతం కొంచెం దగ్గర కావడంతో ప్రతిసారీ ఆయనే ముందు వచ్చి సేద తీరుతుండేవాడు. ఓ రోజు దొరవారికంటే ముందే చిన్ని వచ్చింది. సుదూర ప్రాంతం నుంచి పయనించడంతో అలసిపోయిన ఆమె నిద్రిస్తూ ఉంటుంది. అప్పటికే చీకటి అయిపోతుంది. దొరవారు రాతి గుండు వద్దకు చేరుకుంటాడు. లోనికి చూసేసరికి చిన్ని ధరించిన చీర పులిచారలు కలిగి ఉంటుంది. చీకటిలో సరిగ్గా కనబడకపోవడంతో తమ ఆవాసంలోకి పులివచ్చిందని భావించి తన వద్ద ఉన్న తుపాకీ తీసి కాల్చుతాడు. దీంతో చిన్ని అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తుంది. తరువాత విషయం తెలుసుకున్న దొరవారు చేజేతులా ప్రియురాలిని చంపుకున్నానని తీవ్ర ఆవేదన చెందుతారు. ఆపై తాను కూడా తుపాకీతో కాల్చుకుని చనిపోతాడు. వారి ప్రేమకు ప్రతిరూపంగా ఆ రాతిగుండు వద్దే వారిని ఖననం చేస్తారు. ఇప్పటికీ వారి సమాధి కట్టడాలు మనకు దర్శనమిస్తాయి. గొప్ప చరిత్ర ఉంది చిన్నిని చంపిన గుండుకు గొప్ప చరిత్ర ఉంది. గుండు కింద ఇప్పటికీ ప్రేమికులు ఏర్పరచుకున్న కట్టడాలు ఉన్నాయి. మృతి చెందిన అనంతరం ఇద్దరినీ అక్కడే ఖననం చేసినందుకు నిదర్శనంగా వారి సమాధులు ఉన్నాయి. వారి గాఢ ప్రేమకు నిదర్శనంగా ఈ గుండు నిలిచింది. – వెంకటరమణ, మారేళ్ల మా పెద్దోళ్లు కథలుగా చెబుతారు మా పెద్దోళ్లు ప్రేమికుల గురించి కథలు కథలుగా చెబుతున్నారు. దట్టమైన అడవీ ప్రాంతం కావడంతో వారు ఇద్దరూ ఏకాంతంగా కలుసుకోవడానికి నల్లేనుకొండలోని గుండును ఇల్లులాగా రూపొందించుకున్నట్లు ఇప్పటికీ ఆనవాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇక్కడ గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపి కొన్ని కట్టడాలు తొలగించారు. – శ్రీనివాసులు, మారేళ్ల -
మనసున మనసై.. ఇది అరకు ఎంపీ లవ్‌స్టోరీ
ప్రేమంటే.. సూర్యునిలా ఉదయించి.. అస్తమించేది కాదు. కళ్లల్లో ఉదయిస్తుంది.. కనుమూసినా తోడుంటుంది.. ప్రేమ వేదంలాంటిది. చదవగలిగితే.. పరిపూర్ణతనిస్తుంది.. ప్రేమంటే అమ్మ పాలంత స్వచ్ఛత.. నాన్న మమకారమంత బాధ్యత. అందుకే.. ప్రేమలోతులో మునిగాక.. పైకి తేలడం అంత సులభం కాదంటారు చాలా మంది. ఆరాధన భావమో.. ఆకర్షణ స్వభావమో.. నచ్చిన మనసు ఎదురు పడితే.. చూపు భావం పలికిస్తుంది.. మౌనం భాషను కనిపెడుతుంది. మెచ్చిన నెచ్చెలి మనసు దోచే మాట చెప్పాలంటే ముహూర్తం చూసుకునే హృదయాలెన్నో ఉన్నాయి. అలాంటి వారందరికీ నేడు పండగ రోజు. ప్రేమ లోకంలో విహరిస్తున్న హృదయాలు చెట్టపట్టాలేసుకొని వలపు పాటలు పాడుకునే పండగే ప్రేమికుల దినోత్సవం. ఈ రోజు యువజంటలు కొత్త సంబరాలు చేసుకుంటాయి. ప్రేమ వివాహం చేసుకుని విజయవంతంగా జీవనం సాగిస్తున్న జంటలు.. తన అనుభవాలు, జ్ఞాపకాలను నెమరువేసుకుంటాయి. –సాక్షి, విశాఖపట్నం సాక్షి, కొయ్యూరు (విశాఖపట్నం): స్నేహ బంధం.. ప్రేమగా అంకురించింది. పెద్దలు కాదన్న.. వారి ప్రేమ ఔననిపించి వివాహ బంధంతో ఒక్కటి చేసింది. అరకు ఎంపీ మాధవి, ఆమె భర్త శివప్రసాద్ లవ్‌స్టోరీ ఇది. 16 ఏళ్లు స్నేహితులుగా ఉన్న వీరు ఇంటర్ నుంచి కలసి చదువుకున్నారు. నవోదయ స్కూల్లో 10 తరగతి వరకు చదువుకున్న ఎంపీ మాధవి.. ఇంటర్ నుంచి బయట చదువుకున్నారు. అక్కడే ఒకరికొకరు పరిచయమయ్యారు. అలా వీరి మధ్య స్నేహం చిగురించింది. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో వీరి స్నేహం మరింత బలపడింది. అంతవరకు స్నేహితులుగా ఉన్న వీరు ప్రేమికులుగా మారారు. తర్వాత వీరి అభిప్రాయాన్ని పెద్దలకు చెప్పారు. రెండు వైపులా మొదట్లో వ్యతిరేకించినా.. నమ్మకమైన ప్రేమ ఇరుకుటుంబాలను అంగీకరించేలా చేసింది. ఈ నేపథ్యంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, గొలుగొండ మండలం కృష్ణదేవిపేటకు చెందిన కె. శివప్రసాద్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2019 అక్టోబర్ 17న శరభన్నపాలెంలో వీరి వివాహం జరిగింది. వివాహానికి ముందు ఒకరి ఇష్టాన్ని.. ఒకరు పంచుకుంటూ.. చివరి వరకు కలిసే జీవిస్తాం ప్రేమ ఎంతో గొప్పది. ఒకరి ఇష్టాలను మరొకరు తెలుసుకుని.. ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ ప్రేమ జీవితకాలం చిగురిస్తూనే ఉంటుంది. మేమిద్దరం కలిసి చదివాం. ఇద్దరి ఇష్టాలను ఒక్కటిగా మలచుకున్నాం. మా ప్రేమను పెద్దలకు వివరించాం. వారు అంగీకరించారు. రాజకీయాల్లో ఉన్నా.. లేకున్నా.. కలిసే బతుకుతాం. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని ధైర్యంగా ఉంటాం. –ఎంపీ మాధవి, శివప్రసాద్ దంపతులు ఔను.. వాళ్లు ఇష్టపడ్డారు! ఆరిలోవ(విశాఖ తూర్పు): ఇద్దరూ ఉన్నత విద్యావంతులే.. ఒకే బ్యాచ్‌లో విద్యాశాఖలో అధికారులుగా ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగం చేస్తూనే స్నేహితులయ్యారు. వారి మధ్య స్నేహం ఇరు కుటుంబాల పెద్దలకు నచ్చింది. కులాలు వేరైనా వారే వీరిని ఒక్కటి చేశారు. ఇదీ విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, మధ్యాహ్న భోజనం పథకం రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి దంపతుల కథ. డీఈవో చంద్రకళ మాటల్లో ఈ కథ విందాం. 2008 గ్రూప్–1 బ్యాచ్‌లో సుబ్బారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫస్ట్ ర్యాంకర్. అదే బ్యాచ్‌లో నేను కూడా మంచి ర్యాంక్ సాధించాను. ఇద్దరం డిప్యూటీ డీఈవోలుగా ఉద్యోగాల్లో చేరాం. డీఈవో చంద్రకళ, మిడ్ డే మీల్ అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి దంపతులు తెలంగాణ జిల్లాలో చెరో చోట ఉద్యోగాలు చేశాం. ఆ సమయంలో ఉద్యోగ రీత్యా శిక్షణ కార్యక్రమాలు, విధి నిర్వహణలో భాగంగా తరచూ కలుస్తుండటంతో.. స్నేహితులయ్యాం. ఈ విషయం ఇద్దరి ఇంట్లోనూ తెలుసు. ఆయన ఓ సందర్భంలో నా తల్లిదండ్రులతో సరదాగా పెళ్లి ప్రస్తావన లేవనెత్తారు. ఈ విషయం నా తల్లిదండ్రులు ఆయన కుటుంబ సభ్యులకు చెరవేశారు. ఇరు కుటుంబాలు అంగీకరించాయి. నేనూ ఒకే చెప్పాను. అలా మా ఇద్దరికీ 2009లో వివాహం జరిగింది. విజయనగరం జిల్లా రామభద్రపురం మా స్వగ్రామం. ఆయనది కడప జిల్లా. మాకు ఇద్దరు కుమారులు. ఒకే బ్యాచ్, ఒకే కేడర్ ఉద్యోగాలు కావడంతో మా మధ్య ఏర్పడిన స్నేహం.. కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంగా మారిందని ఆమె వివరించారు. -
Valentine's Day: ఇట్లు.. నీ ప్రేమ..
అనంతపురం కల్చరల్: ప్రేమ సత్యం.. ప్రేమ నిత్యయవ్వనం..ప్రేమ వినూత్నం..ప్రేమ మధురం..ప్రేమను ఆస్వాదిస్తేనే తెలుస్తుంది. తడారిపోయిన మనసుల్లో పచ్చని ఆశలు చిగురింపజేసేది ప్రేమ. శిలలాంటి మనిషికి జీవం పోసేది ప్రేమ. కులమతాలను, దేశ సరిహద్దులను చెరిపేసేది ప్రేమ...ధనిక, పేద తారతమ్యాన్ని చెరిపేస్తుంది..బంధాలను వేరుచేసినా..బాంధవ్యాలను దగ్గరికి చేరుస్తుంది. ప్రేమైక జీవనం తనువులు వేరైనా..మనసులు ఒకటని చాటిచెప్తుంది. ప్రేమలో విజయం సాధించి, ఆదర్శంగా నిలిచిన వారి మధురానుభూతులు, జ్ఞాపకాలను నెమరేసుకునే రోజు ‘ప్రేమికుల దినోత్సవం’.. సోమవారం (ఫిబ్రవరి 14) వాలంటైన్స్‌డే సందర్భంగా ప్రత్యేక కథనం. చదవండి: ‘ఐ లవ్ యూ’ చెప్తే సరిపోదండోయ్.. ఈ అయిదూ పాటిస్తే లవ్ లైఫ్ లక్కీనే అభి‘మత’మొక్కటే అనంతపురానికి చెందిన ఓమేశ్వర చక్రవర్తి డిగ్రీ చదువుతున్న సమయంలో రిజ్వానా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డారు. కానీ పెద్దలు మతాంతరం అంటే భయపడిపోయారు. ప్రేమ పెళ్లికి ససేమిరా అన్నారు. కానీ వారు అనేక కష్టాలకోర్చి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. భర్త కోసం రిజ్వానా (శశికళా బాయిగా పేరు మార్చుకుంది) హిందూ స్త్రీగా మారిపోయినా ఇస్లాంను అంతే గౌరవిస్తుంది. వీరి ఇద్దరు కూతుళ్లు ఏ మతం పాటించినా తల్లిదండ్రులిద్దరూ అంగీకరించడంతో వారిల్లే ఒక స్ఫూర్తి కేంద్రంగా మారింది. పెద్దలను ఒప్పించాలి వాసంతి సాహిత్య నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్. భర్త బండి శ్రీకాంత్. వేర్వేరు కులాలకు చెందిన వీరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ‘‘కులాలు, మతాలు అనేవి మనం ఏర్పరచుకున్నవి. దానికి అతీతంగా ఆలోచించినపుడే మన ఇష్టాలను నెరవేర్చుకోగలం. యువత ఆకర్షణను ప్రేమ అనుకోకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రేమ విషయంలో తల్లిదండ్రులను నొప్పించకుండా ఒప్పించడం అనేది అందరూ నేర్చుకోవాలి. అదే విజయ సూత్రంగా కూడా మారుతుంది’’ అని వారంటున్నారు. ఐదేళ్ల నిరీక్షణ.. రాగే హరిత ఏపీ రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్. సామాజిక ఉద్యమాలతో మమేకమైన చామలూరు రాజగోపాల్‌తో ఆమె పరిచయం, పరిణయం విచిత్రంగానే సాగింది. కులాల అడ్డు గీతలున్నా వారిద్దరూ ఒకటి కావడానికి ప్రేమ వారధిగా నిలిచింది. 2005లో వారిద్దరూ ఎస్కేయూలో చదువుకుంటున్నప్పుడు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు సహజంగానే అంగీకరించలేదు. ఐదేళ్లు నిరీక్షించి వివాహం చేసుకున్నారు. పెద్దలు కూడా అర్థం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘ప్రేమ అజరామరమైంది.. ఆస్వాదించేవారికే దాని విలువ తెలుస్తుంది’ అని అన్నారు. సంతోషమయ జీవితం నల్లమాడ: ముదిగుబ్బ మండల కేంద్రంలో పక్కపక్క వీధుల్లో నివాసం ఉండే మహేష్, త్రివేణికి 2005లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు. సమీప బంధువు సహకారంతో 2013లో మహే‹Ù, త్రివేణి పెళ్లి చేసుకున్నారు. పిల్లలు (సాతి్వక్, ప్రణవి) పుట్టాక ఇరు కుటుంబాల పెద్దలూ పంతాలు వీడి కలసిపోయారు. ప్రస్తుతం మహే‹Ù, త్రివేణి నల్లమాడ మండలంలోని వేర్వేరు సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. -
‘ఐ లవ్ యూ’ చెప్తే సరిపోదండోయ్.. ఈ అయిదూ పాటిస్తే లవ్ లైఫ్ లక్కీనే
అన్యోన్యంగా ఉండే దంపతుల బంధాన్ని ‘స్వచ్ఛమైన ప్రేమ’ అంటారు. ఎటువంటి పొరపొచ్చాలు.. అనుమానాలు.. అపార్థాలు రానివ్వకుండా.. కలకాలం పట్టి ఉంచుతుంది. కానీ నేటి తీరికలేని డిజిటల్ లైఫ్‌స్టైల్ వల్ల ఎంతో దృఢమైన బంధాల్లో సైతం బీటలు ఏర్పడుతున్నాయి. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు, పెద్దలు కలిపిన పరిణయ జంటలు ఎన్నో అపార్థాలతో అన్యమనస్కంగా ‘ఎడముఖం పెడ ముఖం’గా ఉంటున్నాయి. బంధం ఏర్పడిన కొద్దికాలానికే విడాకులతో విచ్ఛిన్నమవుతున్నాయి. అతి చిన్న కారణాలకే తెగిపోతున్న అనుబంధాలను నిలబెట్టుకోవడానికి ‘లవ్ లాంగ్వేజ్’లు వారధిగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు.. ‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’, ‘‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’’ అని చెప్పి అవతలి వ్యక్తి మీద తమకు ఉన్న అపారమైన ప్రేమను వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రేమను వ్యక్తం చేయడానికి ‘ఐ లవ్ యూ’ అన్న ఒక్క పదం సరిపోవడం లేదు. అంతకు మించి కావాలనిపిస్తుంది. పార్టనర్‌కు ప్రేమను అందించడానికి, పార్టనర్ అలిగినప్పుడు, కోప్పడినప్పుడు, అనుమానపడినప్పుడు.. అపోహలు తొలగించి ఇద్దరి మధ్య సఖ్యత కుదిరేందుకు ఈ ‘లవ్‌లాంగ్వేజ్’లు భరోసాను ఇస్తున్నాయి. ఆత్మీయ ఊసులు.. మనకు ఇష్టమైన వారిని కలిసినప్పుడు ముచ్చటించే పలకరింపులు ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. పార్టనర్‌తో మాట్లాడే ప్రతిసారి అప్యాయత, ఆత్మీయ అనురాగాన్ని కనపరచాలి. వారు చేసే పనులు, తీసుకునే నిర్ణయాలను మెచ్చుకుంటూనే లోటుపాటులను కూడా సున్నితంగా తెలియజెబుతుండాలి. ప్రతిపనిని నువ్వు చేయగలవని ప్రోత్సహించాలి. విమర్శ మీ మధ్య దూరాన్ని పెంచితే అభినందన బంధాన్ని మరింత బలపరుస్తుంది. చేదోడుగా.. మీ పార్టనర్ చేస్తోన్న పని కష్టమైనదిగా ఉండి ఇబ్బంది పడుతుంటే ఆ పనిలో సాయం చేసి వారి పని భారం తగ్గించాలి. ఈ విధంగా వారి మీద మీకున్న ప్రేమను వ్యక్తం చేయవచ్చు. రోజూ పార్టనర్ చేసే పనిని అప్పుడప్పుడు మీరు చేసి ఆశ్చర్యపరచాలి. ఇచ్చిపుచ్చుకోవడం ఏదైనా ఇచ్చిపుచ్చుకుంటే ఎంతో బావుంటుంది. ఇది కూడా ప్రేమను వ్యక్తం చేయడానికి మంచి మార్గం. సందర్భం ఉన్నా లేకపోయిన స్థోమతకు తగ్గట్టుగా బహుమతులు, చిన్నపాటి సర్ప్రైజ్లు ఇస్తూ పార్టనర్‌ను ఆనంద పరచాలి. పోతే రానిది.. ఈ ప్రపంచంలో ఎంతో విలువైనది ఏంటీ? అడిగితే టక్కున చెప్పేది సమయం. జరిగిపోయిన కాలం తిరిగి రాదు. అందుకే బిజీలైఫ్‌లో దొరికే కాస్త ఖాళీ సమయాన్ని పార్టనర్‌తో గడపడానికి కేటాయించాలి. అతిముఖ్యమైన సమయాల్లో కొన్ని పనులు పక్కనపెట్టాలి లేదంటే వాయిదా వేసి మరీ పార్టనర్‌తో గడపాలి. ఇలా చేయడం ద్వారా ‘‘జీవితంలో నువ్వే నాకు ముఖ్యం.. నీ తర్వాతే ఏదైనా’’ అనే భావన కలుగుతుంది. పార్టనర్ పదేపదే ఒకే విషయాన్ని చెబుతూ విసిగిస్తున్నారని దూరంగా వెళ్లకూడదు. వారితో కాస్త సమయం గడిపేందుకు ప్రయత్నించి వారిని ఆ మూడ్ నుంచి బయటకు తీసుకు రావాలి. ఇలా చేయడం వల్ల బలహీన సమయాల్లో పార్టనర్ తీసుకునే అపాయకరమైన నిర్ణయాల నుంచి వారిని కాపాడగలుగుతారు. చేతలతో.. కొన్నిసార్లు మౌనమే అన్నింటికి సమాధానం చెబుతుంది అంటారు. ఈ మౌనానికి స్పర్శ జోడిస్తే పార్టనర్ మీద మనకున్న అపారమైన ప్రేమను వ్యక్తం చేయవచ్చు. ప్రేమను పంచడంలో స్పర్శకూడా ముఖ్యమైనదే. ఆత్మీయ స్పర్శ ద్వారా పార్టనర్ మానసికంగా, భౌతికంగా తనతోనే ఉన్న అనుభూతి కలిగి బంధం మరింత గట్టిపడుతుంది. ఈ ఐదింటిలో పార్టనర్ మనస్తత్వాన్ని బట్టి కనీసం రెండైనా అనుసరించి ప్రేమను వ్యక్తం చేయవచ్చు. ఒక్కొక్కరు ఒక్కో భాషను ఇష్టపడతారు కాబట్టి వారి అభిరుచికి తగ్గట్లు వ్యవహరించి అనుబంధాన్ని దృఢపరుచుకోవాలి. ఇంకెందుకాలస్యం ఈ వ్యాలంటైన్స్డే నుంచే లవ్ లాంగ్వేజ్‌తో మీ జీవిత భాగస్వామికి మరింత దగ్గరవ్వండి. -
‘ప్రేమ’కు శాపంగా మారిన గోవా ఎన్నికలు! ఆ రోజు డ్రై డే.. మరి ఎలా?
పనాజి: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ఎందరో ప్రేమికుల్లో కొత్త జోష్ని నింపుతోంది. డెస్టినేషన్ ప్రేమికుల రోజు జరుపుకోవాలనుకునే ప్రేమికులకు ఈసారి ఊహించని విధంగా పోలింగ్ దెబ్బ తగిలింది. కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఎంచక్కా గోవా వెళ్లి ఎంజాయ్ చేయాలనుకునే ప్రేమికుల హుషారుపై ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నీళ్లు చల్లాయి. ఫిబ్రవరి 14నే గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండటంతో అక్కడ ఆ రోజు డ్రై డే. ఎన్నికల నియమావళి ఉండడంతో నైట్ క్లబ్బులు కూడా మూసేశారు. రాత్రి 11 గంటల తర్వాత మద్యం ఉండదు. హోటల్స్, బార్లలో ఫిబ్రవరి 12 సాయంత్రం 5 గంటల నుంచి, 15వ తేదీ వరకు మందు దొరికే ప్రసక్తే లేదు. దీంతో చలో గోవా అనుకున్న జంటలు నిరాశకు లోనవుతున్నారు. సాధారణంగా వాలెంటైన్స్ డే సమయంలో గోవాకి పర్యాటకులు పోటెత్తుతారు. కరోనాతో ఇన్నాళ్లూ అల్లాడిపోయిన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పట్టి ఆంక్షల్ని సడలిస్తున్నారు. (చదవండి: చలికాలంలో చుండ్రు బాధా? జుట్టు మెరవాలంటే ఏం చేయాలి?) దీంతో పర్యాటక రంగం గాడిలో పడుతుందనుకుంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చేశాయి. ‘‘ఎన్నికలు మా ఆదాయాన్ని దెబ్బ తీస్తున్నాయి. నెల రోజుల పాటు నైట్ క్లబ్బుల్ని ఎందుకు మూసేశారు ? గోవా ప్రశాంతమైన రాష్ట్రం. ఎప్పుడూ ఘర్షణలు చెలరేగే యూపీలో కూడా ఇంత కఠిన నిబంధనలు లేవు’’ అని కాండోలిమ్‌లో వాటర్ ఫ్రంట్ యజమాని నందన్ కుడ్చద్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల విషయం తెలియక హోటల్స్‌ని బుక్ చేసుకున్నవారు ఇప్పుడు రద్దు చేసుకుంటున్నారని, కరోనా థర్డ్ వేవ్, ఆ వెంటనే ఎన్నికలు గోవా ఆదాయాన్ని బాగా దెబ్బ తీశాయని గోవా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ రాల్ఫా డిసౌజా చెప్పారు. ప్రతీ ఏడాది వాలెంటైన్స్ డేకి గోవాలో హోటల్స్ 90% వరకు నిండిపోతాయి. కానీ ఈసారి పావు వంతు కూడా నిండే అవకాశం లేదన్న అంచనాలున్నాయి. (చదవండి: ‘లాక్డౌన్’ కోసం పక్కా ప్లాన్.. రూ.2 లక్షలు ఇచ్చి కిడ్నాప్, ప్రేమతోనే అలా?) -
ఆమెకు ప్రామిస్ చేస్తావా
మాట ఇవ్వడం.. ఒట్టు వేయడం... ప్రమాణం చేయడం... ప్రేమలో ఇవి అతి సులభం. అతి కష్టం. ఇవ్వడం సులభం. నిలబెట్టుకోవడం కష్టం. అబ్బాయి అమ్మాయి ప్రేమలోనే కాదు భార్యాభర్తల ప్రేమలో స్నేహితుల ప్రేమలో కూడా ఒకరి కోసం ఒకరు మాట ఇవ్వడం అవసరం. వాలెంటైన్ వీక్ నడుస్తోంది. ఇవాళ ప్రామిస్ డే. నేడు స్త్రీలు, యువతులు పురుషుల నుంచి కోరే ప్రామిస్‌లు ఏమిటి? పురుషులు ఆ మాత్రం ప్రామిస్ చేయలేరా? ప్రేమను నిలుపుకోలేరా? చాలా సినిమాల్లో, నవలల్లో ఒకటి చూస్తుంటాం. అమ్మాయి అబ్బాయిని ‘స్మోక్ చేయనని నాకు మాట ఇవ్వు’ అని అడుగుతూ ఉంటుంది. అబ్బాయి మాట ఇస్తాడు. అమ్మాయి సంతోషిస్తుంది. అమ్మాయిలు అబ్బాయిల నుంచి ప్రామిస్‌లు అడుగుతారు. దేనికి? వారి మంచికి. తద్వారా తమ మంచికి. తద్వారా ఇద్దరి మధ్య నిలవాల్సిన సుదీర్ఘ అనుబంధానికి. ఇవాళ తాము ప్రేమలో ఉన్న అబ్బాయిలతో అడిగే ప్రామిస్‌లు ఏమిటో తెలుసా? ► రాష్‌గా డ్రైవ్ చేయకు. ► డ్రింక్ చేసి డ్రైవ్ చేయకు. ► ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకు. ► కెరీర్ మీద ఫోకస్ పెడతానని మాట ఇవ్వు. ► నీ ఫ్రెండ్స్ నీ మంచితనాన్ని మిస్ యూజ్ చేసేలా చూడనని మాటివ్వు ► పొదుపు చేస్తానని చెప్పు ► ఫేస్బుక్లో ఎక్కువ సేపు ఉండనని మాటివ్వు ► గతంలోని నీ చేదు జ్ఞాపకాలన్నీ మర్చిపోతానని మాటివ్వు అమ్మాయిల ప్రపంచానికి అబ్బాయిల ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది. అబ్బాయిల ప్రపంచంలో తాను కోరుకునే అమ్మాయి కూడా ఉంటుంది. కాని అమ్మాయిల ప్రపంచంలో అబ్బాయి మాత్రమే ఉంటాడు. ప్రేమికుడు అయినా భర్త అయినా జీవన భాగస్వామి అయినా. అందుకే అమ్మాయిలు చిన్న చిన్నవే అయినా ఎన్నటికీ తప్పని ప్రామిస్‌లు కోరుకుంటారు. ► నా పుట్టినరోజు, మొదటగా పరిచయం అయిన రోజు, ఎంగేజ్మెంట్ రోజు, పెళ్లిరోజు... ఇలా నాకు సంబంధించిన ముఖ్యమైన రోజులన్నీ గుర్తు పెట్టుకోవాలి. ► నీ తల్లిదండ్రులను నేను గౌరవిస్తాను. నా తల్లిదండ్రులను నువ్వు గౌరవించాలి. ► నువ్వు ఎల్లప్పుడూ నా పట్ల నిజాయితీగా ఉంటూ నా కోసమే ఉండాలి. ► సమస్యలను ఇద్దరం కలిసి ఎదుర్కొనేలా ఉండాలి. ► నేను ఊహించని సమయాల్లో కానుకలు ఇస్తూ నన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి. ► నాకు చంద్రుణ్ణి తెస్తాను, డ్యూప్లెక్స్ కట్టిస్తాను అనే అబద్ధపు ప్రామిస్‌లు వద్దు. నువ్వు ఎంత చేయగలవో అది చేస్తానని ప్రామిస్ చెయ్. ► నా నుంచి నాకు తెలియాల్సిన విషయాలేవీ దాచొద్దు. ► నన్ను నీ జీవితం లో అతి ముఖ్యమైన మనిషిగా చూడాలి. గమనించి చూస్తే ఈ ప్రామిస్లన్నీ ప్రేమను, బంధాన్ని దృఢతరం చేసేవే. కాలం చాలా సుదీర్ఘమైనది. అది అనూహ్యమైన పరీక్షలు పెడుతుంటుంది. అబ్బాయి అమ్మాయి లేదా భార్యాభర్తలు ప్రతి రోజూ దగ్గరగా ఉండకపోవచ్చు. వృత్తి రీత్యా, ఉపాధి రీత్యా కొన్నాళ్లు దూరం ఉండాల్సి రావచ్చు. కాని ఇరువురూ కోరుకునేది మనం ఎంత దూరమైనా ఎప్పటికీ విడిపోము అనే ప్రామిస్నే. అమ్మాయి/భార్య అడక్క ముందే ‘నేను నువ్వూ దూరంగా ఉన్నాం. కాని మనం ఎప్పటికీ దగ్గరగా ఉంటామని నేడు నీకు ప్రామిస్ చేస్తున్నాను’ అని చెప్తే ఆ అనుభూతి వేరు. ‘నేను భోజనం చేసేశాను’ అని మనసు కు చెప్పుకున్నంత మాత్రాన నిజంగా భోజనం చేయకపోతే ఎలా కడుపు నిండదో ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని మనసులో అనుకున్నంత మాత్రాన ఆ ప్రేమ పెరగదు. పండదు. నోటితో చెప్పాలి. అందుకు ఈ ‘హ్యాపీ ప్రామిస్ డే’ లాంటి సందర్భాలు ఉపయోగపడతాయి. ‘మన నవ్వులు, సరదాలు, కోపతాపాలు, చిరాకులు, పరాకులు, కన్నీళ్లు, సంతోష సమయాలు, కలిసి ఉన్న ప్రతి క్షణం నాకు గుర్తే. నా పక్కన నువ్వు ఉన్నందుకు నాకెంతో సంతోషం. ఇలా ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉండేలా నేను మసలుకుంటాను. సంతోషంగా ఉంచుతాను’ అని ప్రామిస్ చేస్తే నోరు తెరిచి చెప్తే చెప్పినందుకు ఆ ప్రామిస్ ను నిభాయించాల్సిన కమిట్మెంట్ ఏర్పడుతుంది... విన్నందుకు ఆమెకు నిలదీసే హక్కూ వస్తుంది. ‘నేను ఎప్పటికీ నీవాడినే’ అని పురుషుడు చేసే ప్రామిస్ స్త్రీ ఎన్నిసార్లయినా వినడానికి ఇష్టపడుతుంది. ‘నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను’ అనే మాట కూడా. నిజానికి హ్యాపీ ప్రామిస్ డే రోజు పురుషుడి నుంచి స్త్రీ ఆశించే తప్పనిసరి ఒట్టు ఏమిటంటే ‘మన జీవితంలో ఉన్న ప్రస్తుత స్థితిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మనం ఈ స్థితి నుంచి ఇంకా మంచి స్థితికి వెళ్లేందుకు కలిసి పని చేద్దాం. నిరాశ, నిస్పృహలు, ఫిర్యాదులు, నిందించుకోవడాలు లేకుండా అవగాహనతో మరింత బాగా ఉండేందుకు ఏం చేయాలో చేద్దాం. నీ సలహాను నేను గౌరవిస్తాను. నా ఆలోచనను నువ్వు డిస్కస్ చెయ్. మంచి చెడ్డలు ఇద్దరం పంచుకుందాం’’. ఈ ప్రామిస్ పురుషుడు చేస్తే ఆ ప్రేమ, ఆ బంధం తప్పక ముందుకు సాగుతాయి. వృత్తి రీత్యా, ఉపాధి రీత్యా కొన్నాళ్లు దూరం ఉండాల్సి రావచ్చు. కాని ఇరువురూ కోరుకునేది మనం ఎంత దూరమైనా ఎప్పటికీ విడిపోము అనే ప్రామిస్నే. అమ్మాయి/భార్య అడక్క ముందే ‘నేను నువ్వూ దూరంగా ఉన్నాం. కాని మనం ఎప్పటికీ దగ్గరగా ఉంటామని నేడు నీకు ప్రామిస్ చేస్తున్నాను’ అని చెప్తే ఆ అనుభూతి వేరు. హ్యాపీ ప్రామిస్ డే. -
వాలెంటైన్స్ డే వీక్: అసలా కెమిస్ట్రీ ఏంటి?
అందమైన అమ్మాయి..ఆమె చేతిలో క్యూట్ క్యూట్ టెడ్డీ. ప్రేమికుల వారోత్సవాల్లో భాగంగా టెడ్డీ డే రోజు కనిపించే దృశ్యాలివే. నాలుగో రోజు ఫిబ్రవరి 10న టెడ్డీ డేగా జరుపుకుంటారు. అసలు ప్రేమికులకు ఈ టెడ్డీకి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏంటి? ఈ రోజు ఎందుకు టెడ్డీ బేర్ గిఫ్టుగా ఇస్తారు. మీ వాలెంటైన్‌కి ఎలాంటి టెడ్డీ సూట్ అవుతుంది. వైట్.. రెడ్ ఎలాంటి టెడ్డీ ఇస్తే లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అనిపిస్తుంది... లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ప్రేమను గిఫ్ట్‌లతో కొలవలేం కానీ, పెద్దదైనా, చిన్నదైనా ఎప్పుడైనా సరే గిఫ్ట్ ప్రేమను పంచుతుంది. పెంచుతుంది కూడా. ప్రేమను చాటడమే దాని ఉద్దేశం. ప్రేమికుల వారంలో భాగంగా నాలుగో రోజు ఫిబ్రవరి 10న టెడ్డీ డే గా వ్యవహరిస్తాం. ప్రేమికుల మధ్య ప్రేమను చాటేందుకు టెడ్డీ డే రోజున అబ్బాయిలు అమ్మాయిలకు టెడ్డీ బేర్‌ను ఇస్తారు. ఒక విధంగా చెప్పాలంటే చిన్నప్పటినుంచి అమ్మాయిలకు కూడా టెడ్డీ బేర్ అంటే ప్రాణం. తమకలవాటైన టెడ్డీ లేకుండా క్షణం కూడా నిద్రపోని అమ్మాయిలున్నారంటే అతిశయోక్తి కాదు. అమ్మాయిలు టెడ్డి బేర్స్‌ని ఎక్కువగా ఇష్టపడటం వెనుక కొన్ని మానసిక కారణాలు ఉన్నాయి. తమకు తోడుగా, అండగా మరో మనిషి ఉన్నారనే భరోసా వారికి చాలా ధైర్యాన్నిస్తుంది. అలా ఒంటరితనాన్ని పోగొట్టుకుంటారు. తన ప్రేయసికి సరిగ్గా ఇలాంటి సపోర్ట్ ఇచ్చేందుకే ఏ అబ్బాయైనా టెడ్డీని బెస్ట్ గిఫ్ట్‌గా ఎంచుకుంటాడు. 24/7 నేను నీతోనే..నీ పక్కనే అంటూ తన కలల రాణికి ధైర్యం చెబుతాడన్నమాట. తమ పెయిన్, గెయిన్ ఏదైనా టెడ్డి బేర్స్‌కు మాత్రమే చెబుతారు. ఎందుకంటే ఏ టెడ్డీ నెవర్ బ్రేక్స్ ద రూల్ అండ్ నెవర్ బ్రేక్స్ అప్ ది రిలేషన్. మరి ఎలాంటి టెడ్డీ ఇస్తే.. మీ కరెక్ట్ ఫీలింగ్ కన్వే అవుతుందో తెలుసా. రెడ్ టెడ్డీ బేర్ ఇస్తే.. లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అని అర్థం. పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తున్నట్టు అర్థం. ఇక పింక్ గులాబీ రంగు టెడ్డీతో ఇస్తే అవతలి వాళ్ల ప్రేమను హార్ట్‌ఫుల్‌గా స్వీకరించినట్టు. ఇక పవర్‌కి, హ్యాపీనెస్‌కి గుర్తు ఆరెంజ్. కాబట్టి, త్వరలోనే ఎవరికైనా ప్రపోజ్ చేయాలి అనుకుంటే టెడ్డీ డే రోజున ఆరెంజ్ టెడ్డీ ఇచ్చేయొచ్చు. బ్లూ టెడ్డీని బహుమతి ఇచ్చి పిచ్చి పిచ్చిగా ప్రేమించడమే కాదు..నువ్వు నా పక్కన ఉండటం అదృష్టం అని గట్టిగా చెప్పేసినట్టే. గ్రీన్ టెడ్డీ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పడం. టెడ్డీ డే రోజున బ్రౌన్ టెడ్డీ ప్రేమించిన వ్యక్తి గుండెను బద్దలు చేశారన్న బాధకు చిహ్నం. లాస్ట్ బట్ నాట్ ద లీ స్ట్. ప్రేమికులకు మాత్రం టెడ్డీ డే రోజున వైట్ టెడ్డీ అంత గుడ్ సింబల్ కాదు. ఆల్రెడీ వారు వేరే వ్యక్తితో లవ్‌లో ఉన్నట్టు అర్థం. సో.. సిల్కీ అండ్ స్మూదీ టెడ్డీ బేర్‌తో మీ ట్రూ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయండి.. హ్యాపీ టెడ్డీ డే. అరుదైన సందర్భాల్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలకు ఇస్తుంటారు. సాధారణంగా క్యూట్ యానిమల్స్ బొమ్మల్ని, లేదా హార్టీ టెడ్డీ బేర్‌ను గిఫ్టుగా ఇస్తారు. అయితే ఎంత ఖరీదైన బహుమతి ఇచ్చామన్నది కాదు, ప్రేమను ఎలా వ్యక్తం చేశామన్నదే ముఖ్యం. వాలెంటైన్స్ వీక్‌లో టెడ్డీ డే తర్వాత ఫిబ్రవరి 11న హ్యాపీ ప్రామిస్ డే, 12న హ్యాపీ హగ్ డే, 13న హ్యాపీ కిస్ డే జరగనుంది. చివరగా14న హ్యాపీ వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. -
వాలెంటైన్స్ డే లింకులతో లవ్ బర్డ్స్ జర జాగ్రత్త.. !
ప్రేమలో ఉన్న వారికి ప్రతిరోజు పండుగ వాతావరణమే ఉంటుంది. అయితే వాలెంటైన్స్ డే రోజు ఇతర రోజుల కంటే మరింత ఆనందంగా ఉండాలనీ, ప్రియురాలు లేదా ప్రియుడు వారికి మరింత దగ్గరవ్వాలని, వారి బంధం మరింత స్ట్రాంగ్ అవ్వాలని ఒకరికొకరు తమ బందానికి గుర్తుగా బహుమతులను ఇచ్చుకుంటారు. తమ ప్రియురాలు/ప్రియుడు ఆకట్టుకోవడం కోసం ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చేందుకు సిద్ద పడుతుంటారు. అయితే, మోసాగాళ్లు లవర్స్ అవసరాన్ని ఆసరా చేసుకొని వాట్సాప్ ద్వారా అమెజాన్ పేరుతో నకిలీ లింకులను పంపిస్తుంది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజు అమెజాన్ మీకు 15 వేల రూపాయలు విలువైన ఉత్పత్తులను అందిస్తుందని నకిలీ లింకులను కేటుగాళ్లు పంపిస్తున్నారు. అయితే, ఇలాంటి లింకుల నుంచి లవ్ బర్డ్స్ లేదా ఇతరులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెజాన్ ఎప్పుడు అలా వాట్సాప్ ద్వారా సందేశాలు పంపదు అని తెలుపుతున్నారు. ఏదైనా ఆఫర్ ప్రకటిస్తే, తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలియజేస్తుందని వారు పేర్కొంటున్నారు. అయితే, ఇలాంటి నకిలీ లింకులను వినియోగదారులు సులభంగా గుర్తించవచ్చు అని సైబర్ నిపుణులు తెలియజేస్తున్నారు. పై సందేశంలో మనం గమనిస్తే, ఆ సందేశం అమెజాన్ పేరుతో వచ్చిన ఆ వెబ్సైటు పేరు మాత్రం వేరు పేరుతో ఉంది. ఇలా వెంటనే మనం గుర్తుపట్టవచ్చు. ఒకవేల, ఎవరైనా ఆ లింకుల మీద క్లిక్ చేస్తే మీకు గూగుల్, మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్స్ వార్నింగ్ మెసేజ్ పంపుతాయని వారు అంటున్నారు. (చదవండి: జియో యూజర్లకు రెండు రోజులు ఉచితంగా కాల్స్, డేటా!) -
వాలెంటైన్స్ డే వీక్: మోస్ట్ రొమాంటిక్ డే.. ‘ప్రపోజ్ డే’
వాలెంటైన్స్ డే వీక్‌లో రొమాంటింక్ డే ప్రపోజ్ డే. ప్రేమ ఎప్పడు ఎక్కడ ఎలా పుట్టిందనే దానికంటే...ఎలా ప్రపోజ్ చేశామన్నదే లెక్క. వాలెంటైన్‌ను ఎలా ఇంప్రెస్ చేశామన్నదే మేటర్. వాలెంటైన్స్ డే వీక్‌లో రెండో రోజు ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే గురించి ఈ విషయాలు తెలుసా మీకు... వాలెంటైన్స్ డే లేదా సెయింట్ వాలెంటైన్స్ డే ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రేమను ప్రకటించుకోవడానికి, అవతలి వారి మనసు తెలుసుకోవడానికి ఫిబ్రవరి 14 కూడా ఒక ముహూర్తం లాంటిదే. అయితే ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే జరుపుకుంటున్నప్పటికీ, వాలెంటైన్స్ వీక్ అనేది భారతదేశంలో మాత్రమే జరుపుకుంటారు. ఇష్టమైన వ్యక్తికి ప్రేమను వ్యక్తపరచడం, వారి మనసు గెల్చుకోవడం అనుకున్నంత సులువు కావు. ఒక విధంగా అదొక ఆర్ట్. అందుకే లవ్ బర్డ్స్ ప్రపోజ్ డే కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. భావాలను వ్యక్తం చేసి బంధాలను కలుపుకునే మధురమైన రోజు. ప్రేమ మాటల కందని మధరానుభూతి. అనుభవిస్తేనే కానీ తెలియని ఓ ఉద్వేగం. కానీ ప్రతి ఒక్కరు ఈ ప్రేమ భావనకు అతీతులు కాదు. ప్రపోజ్ డే రోజున ఎదుటివారి పట్ల మీలో ఉన్న భావనలను వ్యక్తపరచడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వారికిష్టమైన వాచ్ లేదా రింగ్ లేదా ఏదైనా వస్తువు గిఫ్ట్ గా ఇచ్చి ప్రేమను వ్యక్తపరచవచ్చు. మంచి కవిత రాయొచ్చు.. మీరు మంచి ఆర్టిస్టులయితే ఆ పోర్ట్రయిట్ గీసి ఇచ్చి ఎందుకు నచ్చారో మీ ఫీలింగ్స్ చెప్పి చూడండి. ఇంకా స్మార్ట్‌గా...మీకు నచ్చిన మూవీ సాంగ్‌ను కోట్ చేస్తూ.. మీ ఫస్ట్ లవ్‌కు సింపుల్‌గా వాట్సాప్ చేసేయండి. ఎలా చెప్పనమ్మా అంటూ వెయిట్ చూస్తూ కూర్చుంటే కుదరదు కదా.. సో మనసులోని ప్రేమను వ్యక్తం చేసి ప్రపోజ్ డేని ఎంజాయ్ చేయండి. ప్రేయసి లేదా ప్రియుడికి ఒక రెడ్ రోజ్ ఇచ్చి మాటలతో చెప్పలేని భావాలను వ్యక్తం చేస్తారు. అలాగే గిఫ్ట్స్ కార్డులు, గిఫ్ట్స్, చాక్లెట్లు, టెడ్టీ ఇవ్వడం కామన్.. అయితే వెరీ వెరీ స్పెషల్‌గా ప్రేమను ప్రకటించి సర్ప్రైజ్ చేయడం విశేషం. అవతలి వారి అభిరుచులకు తగ్గట్టు, వారు ఊహించని విధంగా తమ మనసులోని మాటను వ్యక్తం పరుస్తారు చాలామంది. అలా తమ జీవితంలోని ఎమోషనల్ మూమెంట్‌ను రొమాంటిగ్గా సూపర్ డూపర్గాసెలబ్రేట్ చేసుకుంటారు. ఇక వాలెండైన్ వీక్‌లో 3వ రోజు ఫిబ్రవరి 9ని చాక్లెట్ డేగా, తర్వాత 4వ రోజున టెడ్డీ డేని ఫిబ్రవరి 10న జరుపుకుంటారు. ఈ వరుసలోనే ప్రామీస్ డే, హగ్ డే, కిస్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. -
వాలంటైన్స్ డే: 'రాధేశ్యామ్' నైట్ థీమ్ పార్టీ!
జనరల్‌గా సినిమా షూటింగ్స్ కోసం సెట్స్ వేస్తుంటారు. అలా ‘రాధేశ్యామ్’ సినిమా కోసం కూడా పలు సెట్స్ తయారు చేయించారు. అది మాత్రమే కాదు.. వాలెంటైన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ‘నైట్ థీమ్ పార్టీ’ కోసం సెట్ ఏర్పాటు చేయించింది ఈ చిత్రబృందం. ఈ నెల 14న రాత్రి 8 గంటల నుంచి ఈ పార్టీ ప్రారంభం కానుంది. ఈ పార్టీ కోసం ‘రాధేశ్యామ్’ సినిమా కథను ప్రతిబింబించేలా సెట్స్ వేయించారు. ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్’. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదల కానుంది. -
సర్కారు వారి పాట లేటెస్ట్ అప్డేట్
Sarkaru Vaari Paata Movie First Love Song Release Date Confirmed: సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలోని తొలి పాటను ఫిబ్రవరి14, వాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ని విడుదల చేసింది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. This Valentines Day, let us fall in love with the Melody Of The Year 💕#SVPFirstSingle on February 14.#SarkaruVaariPaata Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/AdexC9sZu6 — SarkaruVaariPaata (@SVPTheFilm) January 26, 2022 -
వివేక్ ఒబెరాయ్‌పై కేసు నమోదు
ముంబైలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఒకవైపు ప్రభుత్వం టెన్షన్ పడుతోంది. మరోవైపు సెలబ్రిటీలు కాసింత మైమరిచి ప్రవర్తించి చిక్కులు పడుతున్నారు. నటుడు వివేక్ ఒబెరాయ్‌పై తాజాగా కేసు బుక్ అయ్యింది. ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదైంది. దానికి కారణం హీరోగారి ఉత్సాహం. వేలెంటైన్స్ డే సందర్భంగా వివేక్ తన భార్య ప్రియాంకా అల్వాతో కలిసి హార్లి–డేవిడ్సన్ బైక్ మీద ముంబై వీధుల్లో షికారు చేశాడు. అంతేనా! చుట్టుముట్టిన అభిమానులతో ఫొటోలు దిగాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అక్కడి నుంచి సమస్య మొదలైంది. సోషల్ మీడియాలో అతణ్ణి చూసిన నెటిజన్లు ‘మాస్క్ ఏది? హెల్మెట్ ఏది?’ అని ప్రశ్నించడం మొదలెట్టారు. వెంటనే పోలీసులు రంగంలో దిగి హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు 500 రూపాయల ఫైన్ వేశారు. అది చెల్లించడం సులభం. భార్య ప్రియాంకా అల్వాతో వివేక్ అయితే మాస్క్ లేకుండా బాధ్యతారహితంగా తిరిగినందుకు సెక్షన్ 269 ప్రకారం కేసు నమోదైంది. మహమ్మారి సమయంలో అది వ్యాపించేలా తిరిగే వ్యక్తులపై ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. అయితే ఈ వ్యవహారంలో వివేక్ స్పందన ఇంకా తెలియలేదు. ఒకవైపు భార్యతో కలిసి ఏదో సరదాగా బయలుదేరాడనుకునేవారు ఉండొచ్చు. మరోవైపు ఇలా శిక్షించేలా ఉండాల్సిందే అనేవారూ ఉండొచ్చు. కాని వివేక్ చిన్నవాడేమి కాదు. ఏకంగా నరేంద్రమోది పాత్రను పోషించి ‘పి.ఎం. నరేంద్రమోదీ’ సినిమాలో నటించాడు. ఇంకా పెద్ద సినిమాలలో నటిస్తున్నాడు. కనుక ఈ కేసులు అతణ్ణి ఏమి చేస్తాయో చూడాలి. -
పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన బాలీవుడ్ హీరో
ముంబై : బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా వివేక్ భార్య ఆయనకు ఓ బైక్‌ని బహుమతిగా ఇచ్చింది. దీంతో అదే రోజు శ్రీమతిని బైక్‌పై ఎక్కించుకొని ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా వివేక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే వివేక్ హెల్మెట్ ధరించకపోవడంతో ఇది కాస్తా పోలీసుల దృష్టికి చేరింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా హీరో వివేక్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి చలానా విధించారు. అంతేకాకుండా కరోనా సమయంలో మాస్క్ ధరించనందున ఎఫైఐఆర్ నమోదు చేశారు. మహారాష్ట్రలోగత కొన్ని రోజులుగా కరోనా విజృంభిస్తుండంతో అధికారులు నిబంధనలను కఠినతరం చేశారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనల్ని పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వివేక్ చివరగా ప్రధానమంత్రి మోదీ బయోపిక్‌లో కనిపించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చదవండి : (వివేక్ ఒబెరాయ్ భార్యకు నోటీసులు!) (‘దిశా.. యమ హాట్‌గా ఉన్నావ్’) View this post on Instagram A post shared by Vivek Oberoi (@vivekoberoi) -
ఆ స్టేషన్ ఖర్చు కోటీ అరవై లక్షలట..
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందనే విషయం తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ వీడియోలో ఓ రైల్వేస్టేషన్ కనబడుతుంది. ఇటలీలోని స్టేషన్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలని ముందు అనుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఆ ఆలోచనను విరమించుకుని ఇక్కడే రైల్వేస్టేషన్ సెట్ వేశారు. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సెట్ వర్క్ జరిగింది. కోటీ అరవై లక్షల ఖర్చుతో సెట్‌ని నిర్మించారట. 30 రోజుల పాటు 250 మంది పని చేశారని తెలిసింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ నిర్మిస్తున్నాయి. 1970లలో ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథాచిత్రం ఇది. ఈ ఏడాది జులై 30న ఈ చిత్రం విడుదల కానుంది. -
లవర్స్ డే బీభత్సం: మాజీ ఎమ్మెల్యే, 22మందిపై కేసు
భోపాల్: ప్రేమికుల దినోత్సవం రోజు వచ్చిందంటే ప్రేమికులతో పాటు మరికొందరు గుర్తొస్తారు. వారే పాశ్చాత్య సంస్కృతి అంటూ వాలంటైన్స్ డే నిర్వహించుకోవద్దని చెబుతూ హిందూ సంఘాలు విజ్ఞప్తి చేస్తాయి. అయితే దాన్ని పట్టించుకోకుండా ఫిబ్రవరి 14 రోజులు ప్రేమికులు ఎక్కడైనా కనిపిస్తే వారికి పెళ్లి చేస్తామని హెచ్చరించే విషయం తెలిసిందే. అయితే ఈసారి కూడా ప్రేమికుల రోజు బీభత్సం జరిగింది. పలు చోట్ల దాడులకు పాల్పడడంతో ఓ మాజీ ఎమ్మెల్యేతో పాటు మొత్తం 23 మందిపై కేసు నమోదు చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. వాలంటైన్స్ డే రోజు శుక్రవారం భోపాల్‌లోని శ్యామల హిల్స్ ప్రాంతంలో బీజేపీ యూత్ వింగ్ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. అక్కడ ఉన్న హుక్కా బార్ లాంజ్ ఆస్తులపై కర్రలతో దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్‌పై కేసు నమోదు చేశారు. భోపాల్‌లోని అరేరా కాలనీ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. అయితే ఈ దాడిలో ముగ్గురు మహిళలు కూడా పాల్గొనడం విశేషం. శ్యామల హిల్స్ ప్రాంతంలో దాడులకు పాల్పడి విధ్వంసం సృష్టించిన వారిపై హబీబ్‌గంజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. హుక్కా బార్లను, లాంజ్‌లపై మాజీ ఎమ్మెల్యే సురేంద్ర నాథ్ వ్యతిరేకతను ప్రదర్శించారు. భోపాల్‌లో వివిధ ప్రాంతాల్లో హుక్కా బార్లను, లాంజ్‌లను మూసివేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ‘యువతులకు డ్రగ్స్ అందిస్తున్న, లవ్ జిహాద్‌కు ప్రోత్సహితస్తున్న హుక్కా బార్లకు ఇది ఒక ప్రారంభ హెచ్చరిక మాత్రమే’ అని బీజేవైఎం నాయకుడు అమిత్ రాథోడ్ చెప్పారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్‌తో పాటు ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు జోన్-3 అదనపు ఎస్పీ రామ్ సనేహి మిశ్రా తెలిపారు. వాలెంటైన్స్ డే రోజు చోటుచేసుకున్న రెండు ఘటనలకు సంబంధించి హబీబ్‌గంజ్, శ్యామలహిల్స్ పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. భోపాల్‌లో బీభత్సం సృష్టించిన ఘటనలో మొత్తం 23కేసులు నమోదయ్యాయని పోలీస్ వర్గాలు తెలిపాయి. Saffron brigade on the rampage on Valentine Day in Bhopal. Shiv Sena and BJYM (BJP's youth wing) activists vandalized property at separate restaurants and hookah bar-lounge.17 persons, icluding ex BJP MLA Surendra Nath Singh 'Mamma' held. @NewIndianXpress pic.twitter.com/PloSOiXqvG — Anuraag Singh (@anuraag_niebpl) February 14, 2021 -
వాలెంటైన్స్‌డే : కాజల్ ఎక్కడికి వెళ్లిందో తెలుసా?
చెన్నై : కొత్తగా పెళ్లయిన దంపతులు మొదటి వాలెంటైన్స్‌డేను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ సైతం తన భర్తతో కలిసి డిన్నర్ డేట్‌ను జరుపుకున్నారు. అయితే వారు వెళ్లింది ఏ స్టార్ హోటల్‌కో అని అనుకుంటే మీరు పొరపడినట్లే. చాలా సాధాసీదాగా ఉండే ఒక చిన్న మెస్‌కి భర్త గౌతమ్కిచ్లూను తీసుకెళ్లింది కాజల్. తమిళనాడు పొల్లాచిలోని శాంతిమెస్ అంటే తనకు ఎంతో ఇష్టమని, దాదాపు 9ఏళ్ల నుంచి తాను ఇక్కడి హోటల్‌కి వస్తున్నానని కాజల్ పేర్కొంది. 'శాంతి అక్క, బాల కుమార్ అన్న..ప్రేమానురాగాలతో వడ్డించి పెడతారు. అందుకే ఈ ఇక్కడి ఆహారం ఎంతో రుచికరంగా ఉండటంతో 27 ఏళ్ల నుంచి ఎంతో ప్రాచుర్యం పొందింది' అని కాజల్ తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అంతటి స్టార్ హీరోయిన్ అయ్యిండి కూడా ఎలాంటి గర్వం లేకుండా కాజల్.. ఓ చిన్న హోటల్ గురించి ఇంత గొప్పగా మాట్లాడటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాజల్-గౌతమ్ దంపతులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చదవండి : (సిగరెట్ కాల్చిన కాజల్.. అభిమానులు షాక్) (తనకున్న వ్యాధి గురించి చెప్పిన కాజల్) My absolute favourite Shanti mess in Pollachi. That’s Shanti akka and Balakumar anna,serving us with utmost love.That’s the reason why their food has consistently been delicious since the past 27years and I’ve been going to their adorable little outlet since 9 years! @kitchlug ❤️ pic.twitter.com/9eJesMI926 — Kajal Aggarwal (@MsKajalAggarwal) February 14, 2021 -
చెర్రి, నేను ఎప్పుడు గొడవ పడుతుంటాం: ఉపాసన
చిన్ననాటి స్నేహితులైన మెగా కపుల్ రామ్ చరణ్-ఉపాసనలు 2012లో వివాహ బంధంతో ఒక్కటైయ్యారు. టాలీవుడ్లో క్యూట్ కపుల్‌గా పేరొందిన ఈ జంట వైవాహిక బంధానికి ఎనిమిదేళ్లు గడిచాయి. అపోలా ఫార్మసీ చైర్మన్‌గా తన వ్యాపార విషయాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఉపాసన వాలంటైన్స్ డే సందర్భంగా ఓ ఇంటర్య్వూలో ముచ్చటించారు. ఈ సందర్భంగా చెర్రితో తన వైవాహిక బంధం గురించి మాట్లాడుతూ.. ‘భార్యాభర్తలు అన్నాక చిన్న గొడవలు, వాదనలు రావడం సర్వసాధారణం. అలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటేనే వారి బంధం మరింత బలపడుతుంది. అందరు భార్యాభర్తల మాదిరిగానే మా మధ్య కూడా విభేదాలు, గొడవలు వస్తుంటాయి. నేను, చరణ్ అప్పుడప్పుడు గొడవలు పడుతుంటాం. మా మధ్య ఇలాంటి ఎన్నో అపురూపమైన జ్ఞాపకాలు ఉన్నాయి’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అయితే తమ మధ్య వచ్చే గొడవలను, సమస్యలను ఇద్దరం కలిసి పరిష్కరించుకుంటామని చెప్పారు. ఇక ఈ వాలండైన్స్‌డేకు చెర్రి ఇచ్చిన అత్యంత విలువైన బహుహతి ఏంటని అడగ్గా.. ‘ఖరీదైన బహుమతుల కంటే కూడా అత్యంత విలువైన మధుర జ్ఞాపకాలను చరణ్ నాకు ఇచ్చాడు. వాటిని ఎప్పటికి మరచిపోలేను. అవే నాకు అత్యంత ఖరీదైన బహుహతులు. అయితే మా పెళ్లి జరిగిన తర్వాత వచ్చిన మొదటి వాలంటైన్స్ డే సందర్భంగా చరణ్ నాకు అపురూపమైన కానుక ఇచ్చాడు. హార్ట్ షేప్‌తో, ఎరుపు రంగు రాళ్లతో పొదిగిన డైమండ్ చెవి రింగులను ప్రత్యేకంగా తయారు చేయించి సర్ప్రైజ్ ఇచ్చాడు. అవి నాకు చాలా ప్రత్యేకమైనవి. వాటిని రోజు ధరిస్తాను’ అంటూ చెప్పారు. (చదవండి: శంకర్-చరణ్‌ల మూవీపై మెగా అప్డేట్) ఆర్ఆర్ఆర్: యుద్ధానికి మధ్యలో నవ్వులు! -
వాలంటైన్స్ డే: నయన్‌కు ప్రియుడి స్పెషల్ విషెస్
చెన్నై : కోలీవుడ్ లవ్ కపుల్ విఘ్నేష్ శివన్, నయనతార ప్రతీ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ సందడిని సోషల్ మీడియాలో పంచుకుంటారు. వేలంటైన్స్ డే సందర్భంగా ఈ ప్రేమజంట తీసుకున్న ఫొటోను షేర్ చేశారు విఘ్నేశ్. ‘‘నీతో ప్రేమలో ఉండటాన్ని ఎంతో ప్రేమిస్తుంటాను’’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ చేశారు. ప్రస్తుతం విఘ్నేష్ దర్శకత్వంలో ‘కాదువాక్కుల్ రెండు కాదల్’ సినిమాలో ఓ హీరోయిన్గా నటిస్తున్నారామె. ఇక నయనతార, విఘ్నేశ్ శివన్ విడదీయలేని ప్రేమ బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్లుగా వీరు ప్రేమలో మునిగి తెలుతున్నారు. ప్రేమలో ఉన్నామని ప్రకటించకపోయినా వాళ్ల ప్రయాణాలు, సోషల్ మీడియా పోస్టులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటాయి. ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: ఒక్కటైన ‘లవ్ మాక్‌టైల్’ జంట గుడ్‌న్యూస్: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
అక్కన్నపేట అబ్బాయి.. నేపాల్ అమ్మాయి
సాక్షి, అక్కన్నపేట(హుస్నాబాద్): వారి ప్రేమ దేశ ఎల్లలు దాటింది. వివాహ బంధంతో ఒక్కటిని చేసింది. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న వారు ఎట్టకేలకు కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రేమికుల దినోత్సవం రోజుల ఏడడుగులు నడిచి వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. అక్కన్నపేట అబ్బాయి.. నేపాల్ అమ్మాయి వివాహ వేడుక అక్కన్నపేట మండలం మసిరెడ్డితండాలో ఆత్మీయుల మధ్య ఆదివారం జరిగింది. తండాకు చెందిన మాలోతు లక్ష్మి– బద్యి దంపతుల చిన్న కుమారుడు రమేశ్. ఎనిమిది ఏళ్ల క్రితం ఉన్నత చదవుల కోసం అమెరికాకు వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేశాక ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరి అక్కడే స్థిరపడ్డాడు. పెళ్లి సంబంధాలు చూస్తున్న క్రమంలో నేపాల్ అమ్మాయి (కుమారి)తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారి ఆరు నెలల క్రితం అమెరికాలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. కాగా కుటుంబ సభ్యుల కోరిక మేరకు మసిరెడ్డితండాలో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఆదివారం ఒక్కటయ్యారు. చూడముచ్చటైన ఈ కొత్త జంటను చూసేందుకు తండావాసులు తరలివచ్చి ఆశీర్వదించారు. చదవండి: చదువే చెప్పలేదు ఫీజు ఎలా చెల్లిస్తాం? తుపాకీతో హెడ్‌కానిస్టేబుల్ హల్చల్ -
సింగర్ సునీత : ఇంట్రస్టింగ్ ఫోటో, వీడియో
సాక్షి, హైదరాబాద్: సినీ సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు మాల్దీవుల్లో విహరించేందుకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో సింగర్ సునీత కూడా తమ హాలిడే స్పాట్‌గా మాల్దీవులకే సై అన్నట్టున్నారు. వాలెంటైన్స్‌డే సందర్బంగా తన భర్త రామ్‌తో కలిసి ప్రకృతి సోయగాలను ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సందర్భంగా లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అంటూ సునీతరామ్ ఒక ఆసక్తికరమై ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. అయితే ఎక్కుడున్నదీ మాత్రం రివీల్ చేయలేదు. (సింగర్ సునీతకు ‘వాలెంటైన్’ డే సర్ప్రైజ్) అంతేకాదు ‘‘అభి న జావో ఛోడ్ కర్..కే దిల్ అభీ భరా నహీ..’’ బాలీవుడ్ మెలోడీని హమ్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ వీడియోను కూడా షేర్ చేయడం విశేషం. అయితే మోడ్రన్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకుంటున్న సునీత సర్ప్రైజింగ్ ఫోటో నెట్టింట్లో సందడి చేస్తోంది. ఫోటోలో బ్యాక్‌గ్రౌండ్ చూసి సునీతరామ్ మాల్దీవుల్లో ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు. మరిన్ని ఫోటోలు, వీడియోలతో దీనిపై సునీత క్లారిటీ ఇస్తారా.. చూద్దాం..!! -
కూతురి గిఫ్ట్‌ను చూసి మురిసిపోతున్న మహేష్
సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతల ముద్దుల కూతురు సితార చిన్నతనంలోనే సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. స్టార్ హీరో కూతురుగానే కాక డ్యాన్స్, సింగింగ్ లాంటి వ్యక్తిగత టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. సితారకు తల్లిదండ్రులు అంటే అమితమైన ప్రేమ.. తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా పేరెంట్స్‌కు మంచి బహుమతిని అందించి వారిపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకుంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు పురస్కరించుకొని మహేష్, నమ్రతకు గ్రీటింగ్ కార్డు ఇచ్చింది సితార. దానిపై లవ్ యూ అమ్మ, నాన్న.. హ్యపీ వాలెంటైన్ డే అని రాసిచ్చింది. కూతురు నుంచి ఇలా ఊహించని గిఫ్ట్ అందడంతో మహేష్ దంపతులు ఎమోషనల్ అయ్యారు. ఇక కూతురు ప్రేమగా ఇచ్చిన గ్రీటింగ్ కార్డును అభిమానులతో పంచుకున్నాడు మహేష్. థ్యాంక్ యూ సితూ పాప అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. నమ్రత సైతం సితార గిఫ్టుకు మురిసిపోయి, థ్యాంక్యూ తల్లి అంటూ కూతురుపై ప్రేమను కురిపించింది. ఇదిలా ఉండగా ప్రిన్స్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ దుబాయ్‌లో జరుగుతుంది. అక్కడే ఫ్యామిలీతో ఉన్న మహేష్ బాబు కుటుంబంతో ఎంజాయ్ చేస్తూనే షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు. గీత గోవిందం తర్వాత పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి 2022కు విడుదల కానుంది. చదవండి : వైరల్ అవుతున్న సితార తాజా ఫొటోలు View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
ప్రేమికుల దినోత్సవం రోజున 36 జంటలకు పెళ్లి
వజ్రపు కొత్తూరు రూరల్: శ్రీరస్తు.. శుభమస్తు.. అంటూ సామూహిక పెళ్లి పుస్తకాలను లిఖిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నువ్వల రేవు గ్రామస్తులు. ప్రేమికుల దినోత్సవం రోజైన ఆదివారం 36 జంటలకు సామూహికంగా వివాహాలు జరిపించి తమ ఆచారాన్ని కొనసాగించారు. ఇక్కడి వారంతా మత్స్యకారులే కావడంతో చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సంపాదన నామమాత్రమే కావటంతో దశాబ్దాల కిందట గ్రామ పెద్దలంతా కలిసి ఓ నిర్ణయం చేశారు. ఒక్కొక్కరు వివాహాలు చేసుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుందని కాబట్టి.. గ్రామంలో పెళ్లీడుకు వచ్చిన వారందరినీ గుర్తించి ఒకేసారి వివాహాలు చేయడం, వధూవరుల బంధువులందరికీ సామూహికంగా భోజనాలు ఏర్పాటు చేయడం వల్ల ఖర్చు తగ్గుతుందని భావించారు. అప్పటినుంచి ఇప్పటివరకూ అదే సంప్రదాయాన్ని పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం నాడే సామూహిక వివాహాలు జరిపించాలని నిర్ణయించి.. ఆ మేరకు 36 జంటలను ఏకం చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఒకే వేదికపై 36 మంది పురోహితులు ఏకకాలంలో వేద మంత్రాలు జపించగా.. తాళి కట్టే శుభవేళ ఊరు ఊరంతా మంగళధ్వనులతో మార్మోగింది. నూతన జంటలను ఆశీర్వదించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి బంధుమిత్రులు తరలిరావడంతో నువ్వల రేవు జన సంద్రంగా మారింది. చదవండి: ఆ కుటుంబం ఓటమి ఎరగదు.. హతవిధీ.. ‘గుర్తు’ తప్పింది! -
ప్రేమికుల రోజు: భార్యకు కిడ్నీ కానుక
ఆలూమగల మధ్య అన్యోన్యం తప్ప ప్రేమ ఉండదు అని అంటారు. ప్రేమ ఎందుకు ఉండదంటే ప్రేమకు కూడా చోటు ఇవ్వనంతగా వారు ఒకరికొకరు దగ్గరగా ఉంటారు. అన్యోన్యానికి మాత్రం ఎందుకు చోటువ్వాలి? అన్యోన్యం చోటు కాదు. ప్రేమకు గెస్ట్ హౌస్. అనుకోని అతిథిలా ప్రేమ ఎప్పుడైనా గడపలో ప్రత్యక్షమైతే భార్యాభర్తలు ఎదురెళ్లి స్వాగతం చెప్పి సేద తీరమని చూపించే అతిథి గృహం! నిన్న వాలెంటైన్స్ డే రోజు ఒక దాంపత్య ప్రేమకు అలాంటి ఆతిథ్యమే లభించింది! నేరుగా చెప్పాలంటే ఇది ఒక వాక్యంలో ముగిసిపోయే మహా ప్రేమ కావ్యం. ఆ కావ్యానికి పేరు పెట్టాలంటే ‘వినోద్’ అని పెట్టాలి. కానీ వినోద్ ఊరుకోడు. తన భార్య పేరు కూడా కలిపి పెట్టమంటాడు. ఆమె పేరు రీటా. రీటావినోద్ అని కానీ, వినోద్రీటా అని కానీ పెట్టొచ్చు. అప్పుడు ఆమె ‘నా పేరెందుకండీ.. వారి పేరు చాలు’ అనొచ్చు. చివరికి ఇద్దరికీ కలిపి పెట్టదగిన పేరు ఒక్కటే కనిపిస్తుంది.. ‘ప్రేమ’! నిన్న వాలెంటైన్స్ డే రోజు వినోద్ పటేల్ తన భార్యకు ఇచ్చిన ప్రేమ కానుక దేశంలోని ప్రేమికుల హృదయాలలో పూలజల్లు కురిపించే ఉంటుంది. ఆయన తన కిడ్నీని భార్య రీటా పటేల్‌కు కానుకగా ఇచ్చారు! ఇద్దరిలో ఎవరు అదృష్టవంతులు? భర్తలో సగభాగాన్నే కాక, అతడి ప్రేమలో పూర్తి మొత్తాన్ని పొందిన రీటానా! భార్య పై తన ప్రేమను తెలియజేసే భాగ్యం పొందిన వినోదా! ఇద్దరూ. ఇరవై రెండేళ్లయింది వాళ్ల పెళ్లయి. ఇరవై మూడో పెళ్లి రోజు కానుకగా తన కిడ్నీని భార్యతో పంచుకున్నారు వినోద్. అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఏర్పాట్లు జరిగాయి. ‘‘వాలెంటైన్స్ డే రోజు మేము తలపెట్టిన ఇలాంటి ఆపరేషన్ ఒకటి ఇదే మాకు మొదటిది’’ అని ఆసుపత్రి ప్రధాన వైద్యడు డాక్టర్ సిద్ధార్త్ మానవి అన్నారు. ‘‘వాలెంటైన్స్ డే కాబట్టి వీళ్లంతా నా భర్త నాకు ఇస్తున్న కిడ్నీని ప్రేమ కానుక అంటున్నారు. అయితే ఆయన తను మొత్తాన్నీ నాకు కానుకగా మా పెళ్లి తోనే ఇచ్చేసుకున్నారు’’ అని ఆపరేషన్ టేబుల్ మీదకు వెళ్లబోయే ముందు రీటా సంతృప్తిగా నవ్వుతూ అన్నారు. ఆమెలో భయం లేదు. ఆ కళ్లల్లో భర్తపై ఆరాధన తప్ప. వాలెంటైన్స్ డే రోజు ఆపరేషన్ జరగబోతుండటం గురించి వినోద్ కూడా తన భార్య ఏమన్నారో, ఆమే అదే అన్నారు. ‘‘ప్రేమికుల రోజు ఇస్తున్నారు. ఇది మీ ప్రేమ కానుకా..’ అని అంటే.. ‘‘కాదు, పెళ్లి రోజు కానుకే. ప్రేమతో ఇస్తున్న కానుక’’ అని నవ్వారు. నిజానికైతే ఆయన కానుకలా అనుకోవడం లేదు. భార్యతో అన్నీ షేర్ చేసుకున్నట్లే తన శరీరంలోని కొంత భాగాన్ని షేర్ చేసుకుంటున్నానని అన్నారు. విషయం మన వరకు వచ్చిందంటే ఇవేవీ ఆ భార్యాభర్తలు చెప్పుకున్నవి కావు. ఉత్సాహం కొద్దీ ఆ ఆసుపత్రి డాక్టర్లు మీడియాకు వెల్లడించినవి. ∙∙ మూడేళ్ల క్రితం తొలిసారి రీటాబెన్లో ‘ఆటోఇమ్యూన్ కిడ్నీ డిస్ఫంక్షన్’ ఉన్నట్లు బయటపడింది. మూడేళ్లుగా ఆమె మందులు వాడుతున్నారు. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి బయటి నుంచి వచ్చే శత్రువుతో పోరాడి సంహరిస్తుంది. అయితే కొన్నిసార్లు పొరపాటున దేహంలోని కణాలనే శత్రువులుగా భావించి వాటిని దెబ్బతీయడం మొదలుపెడుతుంది. అదే ఆటో ఇమ్యూన్ డిస్ఫంక్షన్. రీటాలో అది ఆమె కిడ్నీపై ప్రభావం చూపెట్టింది. మందుల శక్తి క్షీణించి క్రమంగా ఆమె పరిస్థితి ట్రాన్స్‌ప్లాంటేషన్ వరకు వచ్చింది. ఎవరిస్తారు కిడ్నీ? ఇవ్వాలని సొంతవాళ్లే ముందుకు వచ్చినా చాలామందికి కిడ్నీ ‘సెట్’ కాదు. కానీ వీళ్ల ప్రేమబలమేమో వినోద్ కిడ్నీని రీటా మార్చడానికి అడ్డంకులేమీ ఉండబోవని రిపోర్ట్ వచ్చింది. వినోద్ సంతోషించారు. రీటాలో మాత్రం ఆందోళన. ఆపరేషన్ తర్వాత ఆయన తిరిగా మామూలుగానే ఉండగలరా అనే ఆందోళన. తనకేం పర్వాలేదు అని డాక్టర్ల కంటే ఎక్కువగా భర్త ఆమెకు ధైర్యం చెప్పాడు. కిడ్నీ మార్పించుకోడానికి మానసికంగా భార్యను సిద్ధం చేశాడు. ‘‘అన్నీ బాగున్నప్పుడు సంతోషంగా కలిసి ఉంటాం. బాగోలేనప్పుడు కూడా ఆ సంతోషాన్ని నిలిపేది భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమ, గౌరవం మాత్రమే’’ అంటారు వినోద్. ‘‘ఈయన నా భార్తగా దొరకడం నేను చేసుకున్న అదృష్టం’’ అని రీటాబెన్. ‘‘కిడ్నీ సమస్య పెరిగిపోయి, ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయింది. ఆ సమయంలో తన కిడ్నీ ఇచ్చేందుకు నా భర్త ముందుకు వచ్చారు. ఇస్తున్నది తన కిడ్నీనే కావచ్చు. పోస్తున్నది మాత్రం ఊపిరే’’ అన్నారు రీటా కంటతడితో. ప్రేమను ఎంత ఉష్ణంలోనూ వాడిపోనివ్వని తడి అది. -
రామ్ అలా ప్రపోజ్ చేశాడు : సింగర్ సునీత
తన గాత్ర మాధుర్యంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ప్రముఖ గాయని సునీత. సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తన గొంతుతో వందలాది పాటలకు సరికొత్త అందాన్ని తీసుకొచ్చారు. ఇక ఎన్నో ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత తాజాగా వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. శంషాబాద్‌లోని ఓ ఆలయంలో ఈ ఏడాది జనవరి 9న వ్యాపారవేత్త రామ్ వీరపనేని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సునీత తన వైవాహిక బంధాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ జంట ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్ షోలో ఈ జంట తమ ప్రేమ బంధాన్ని వివరించింది. సునీత ప్రేమను పొందడానికి ఏడేళ్లు నిరీక్షించానని రామ్ చెప్పుకొచ్చారు. ‘ఏడేళ్లుగా సునీతను ఇష్టపడుతూ వచ్చాను. కానీ ఈ విషయాన్ని ఎప్పుడూ నేరుగా ఆమెతో చెప్పలేదు’అని రామ్ అన్నారు. ఇక ఇదే విషయమై సునీత మాట్లాడుతూ.. ‘రామ్ నాతో కేవలం ‘ఇంకేంటీ‘ అంటూ మాత్రమే అనేవాడు. దాంట్లో అర్థాన్ని తెలుసుకోలేకపోయాను. రామ్ ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేసేదాన్ని కాదు. నేను అసలు పెళ్లికి సిద్ధంగా లేను.. కానీ లాక్‌డౌన్‌లోనే ఏదో జరిగింది. ఏదో పని కోసం కాల్ చేసిన రామ్.. ఫోన్లోనే నాకు పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి మాట్లాడుకున్న తర్వాత నేనూ పెళ్లికి ఓకే చెప్పాను’ అని తమ లవ్‌స్టోరిని వెల్లడించారు. -
వాలెంటైన్స్ డే: ఏనుగులపై ఊరేగుతూ పెళ్లిళ్లు..
బ్యాంకాక్ : ప్రేమికుల రోజును ఒక్కో దేశంలో ఒక్కో విధంగా జరుపుకుంటుంటారు. కొన్ని చోట్ల వేడుకలు జరుపుకునే తీరు చాలా వింతగా విచిత్రంగా అనిపిస్తుంది. థాయ్‌లాండ్‌లోని ఓ ప్రాంతంలో ప్రేమికుల రోజున ఏనుగులపై జరిగే సామూహిక పెళ్లిళ్ల వేడుక కూడా అలాంటిదే. వివరాలు.. బ్యాంకాక్‌లోని ‘నాన్ నూప్ ట్రోపికల్ గార్డెన్’లో ప్రతీ ఏటా వాలెంటైన్స్ సందర్భంగా ఏనుగులపై సామూహిక వివాహాలు చేయటం ఆనవాయితీ. ఈ ఆదివారం ప్రేమికుల రోజున కూడా నాంగ్ నూచ్ ట్రోపికల్ గార్డెన్లో సామూహిక వివాహాలు జరిగాయి. మామూలు సమయంలో 100 జంటల దాకా ఈ కార్యక్రమంలో పాల్గొనేవి. ( ఫీల్ మై లవ్.. ఆన్లైన్ లవ్ జాతకం ) కానీ, కరోనా వైరస్ కారణంగా 50 జంటలు మాత్రమే ఇందులో పాల్గొన్నాయి. 100 మంది వధూవరులు ఏనుగులపై ఊరేగుతూ పెళ్లి చేసుకున్నారు. గార్డెన్ అధికారులు వీరికి మ్యారెజ్ సర్టిఫికేట్లు అందజేశారు. పెళ్లి వేడుక సందర్భంగా ఏనుగుపై ఊరేగుతూ.. పటిఫట్ పాథనాన్ అనే పెళ్లి కుమారుడు మాట్లాడాడు. ‘‘ ఈ వేడుకలో పాల్గొని పెళ్లి చేసుకోవాలని చాలా రోజులనుంచి అనుకుంటున్నాను. ఇది కచ్చితంగా అద్భుతంగా ఉండబోతోంది’’ అని పేర్కొన్నాడు. -
‘సోషల్’ హల్చల్: విష్ణుప్రియ సెగలు.. ఊరిస్తున్న శ్రీముఖి
♦హీరోయిన్ నిధి అగర్వాల్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సెగలు కక్కిస్తోంది. వాలెంటైన్స్‌డే సందర్భంగా హాట్ ఫోటోని షేర్ చేసి కుర్రకారుల మతులో పొగొడుతోంది. సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ♦ ప్రేమను ప్రతి రోజు సెలెబ్రేట్ చేసుకోమని సలహాలు ఇస్తూ వాలెంటైన్స్ డే సందర్భంగా హబ్బీతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది బాలీవుడ్ బ్యూటీ మాధురీదీక్షిత్ ♦ తన అందాలతో కుర్రకారులకు పిచ్చెక్కిస్తోంది బుల్లితెర యాంకర్ విష్టుప్రియ. గత కొద్ది రోజులుగా హాట్ ఫోటోలు పెట్టి హల్చల్ చేస్తున్న ఈ హాట్ యాంకర్.. ప్రేమికుల రోజు సందర్భంగా అందాలు ఆరబోస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది. ♦ సరైన వ్యక్తి జీవిత భాగస్వామిగా వస్తే ప్రతి రోజు వాలెంటైన్స్డేనే అంటుంది మంజుల ఘట్టమనేని. ప్రేమికుల రోజు సందర్భంగా తన భర్త సంజయ్ స్వరూప్‌తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ విషెష్ తెలియజేసింది. ♦ సింగిల్ కుర్రాళ్లకు వాలెంటైన్స్‌డే విషెష్ చెబుతూ హాట్ వీడియోని షేర్ చేసింది బ్యూటీ సిమ్రత్‌కౌర్. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘డర్టీహరి’ చిత్రంలో ఈ అమ్మడు ఒక హీరోయిన్గా చేసింది. ♦ అందం అంటే శరీరానికి సౌకర్యంగా ఉండడమే అంటున్న మంచు లక్ష్మీ ♦ మీకో బిగ్ న్యూస్ చెబుతానని నిన్నటి నుంచి ఊరిస్తుంది హాట్ యాంకర్ శ్రీముఖి. ఈ వాలెంటైన్స్ డే తనకు మిక్స్డ్ పీలింగ్ని మిలిల్చిందని చెబుతోంది. మరికొద్ది గంటల్లో మీకో న్యూస్ చెబుతానంటూ తన ఫోటోలను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Anchor Ariyana (@ariyanaglory) -
వాలెంటైన్స్ డే స్పెషల్: టాలీవుడ్ క్యూట్ కపుల్ ఫోటోలు
-
తెలంగాణ అబ్బాయి.. పోలాండ్ అమ్మాయి
సాక్షి, జవహర్‌నగర్: వారి ప్రేమకు ప్రాంతాలు, దేశాలు అడ్డురాలేదు. ఆ జంట జాతి, కులం, మతం, వర్గం, ప్రాంతం అనేది చూడలేదు. ఇద్దరి మనసులు కలవడంతో కుటుంబ పెద్దలను ఒప్పించారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లాలోని పాపయ్యపేటకు చెందిన కంచ కృష్ణకాంత్ హైదరాబాద్‌లో ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగ నిమిత్తం 2002లో లండన్ వెళ్లారు. అక్కడ పోలాండ్‌కు చెందిన బార్బర అనే యువతిని ప్రేమించారు. వీరిద్దరూ 2010లో హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పదేళ్ల ఆరన్, అయిదేళ్ల నేతన్ ఇద్దరు కుమారులు. ప్రస్తుతం కృష్ణకాంత్ సోదరుడు నరేష్ ప్రేమ వివాహం చేసుకుని లండన్ సిటిజన్‌షిప్ (బ్రిటన్ పౌరసత్వం) తీసుకుని అక్కడే నివాసముంటున్నారు. ఆదివారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా లండన్‌లోని కృష్ణకాంత్, బార్బర దంపతులను ‘సాక్షి’ ఫోన్లో పలకరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రేమించడమే కాదు, పెద్దలను మెప్పించాలి. ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకోవాలి. అప్పుడే ఎవరికీ ఇబ్బందులు ఉండవు అని పేర్కొన్నారు. చదవండి: బెబ్బులి మళ్లీ వచ్చింది..! ‘పోడు’ రగడ.. బావిలో దూకిన మహిళ -
ప్రపోజ్: ప్రేయసి ఉంగరాన్ని ఇంకో లవర్‌కు
ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమను వ్యక్తీకరించడం గొప్ప. చాలామంది చాటుగా ప్రేమిస్తూ ఊహల్లోనే కాలం గడిపేస్తుంటారు. అమ్మాయికు ఎదురు వెళ్లాలన్నా, ఆమెకు మనసులోని మాట చెప్పాలన్నా ధైర్యం చాలదు. క్షణాలు రోజులై, రోజులు నెలలై, నెలలు సంవత్సరాలైనా ప్రేమ విషయం చెప్పకుండా వన్‌సైడ్ లవర్స్‌గానే మిగిలిపోతుంటారు. మరికొందరు మాత్రం ఫోన్ నంబర్ మార్చినంత ఈజీగా ప్రేమికులను మారుస్తుంటారు. ఇక్కడ చెప్పుకునే వ్యక్తి రెండో రకానికి చెందినవాడు. ఇంతకీ ఫ్లోరిడాకు చెందిన ఈ రోమియో ఏం చేశాడో తెలియాలంటే ఇది చదివేయండి.. ఫ్లోరిడా: అమెరికాలోని జోసెఫ్ డేవిస్ ఫ్లోరిడాలోని ఆరెంజ్ సిటీకి చెందిన ఓ యువతి మీద మనసు పారేసుకున్నాడు. ఈ విషయాన్ని సదరు యువతికి చెప్పగా ఆమె కూడా ప్రేమకు పచ్చజెండా ఊపింది. ఇద్దరూ ఉంగరాలు కూడా మార్చుకున్నారు. అంతా బాగానే ఉన్నందుకున్న క్రమంలో ప్రియుడు సరిగా టచ్‌లో లేకుండా పోయాడు. ఓ రోజు అతడి ఫేస్‌బుక్‌ను చూస్తుండగా ఓ అమ్మాయి వేలికి ఉంగరం తొడిగి ఉన్న ఫొటో కనిపించింది. మరీ పరిశీలించి చూస్తే ఆ వజ్రపు ఉంగరం తనదే. ఎందుకైనా మంచిది, అది తనదేనా? కాదా? అన్న అనుమానంతో తన బీరువా అంతా వెతికి చూడగా ఖాళీ ఉంగరం బాక్సు మాత్రమే దర్శనమిచ్చింది. పైగా మరికొన్ని ఆభరణాలు కూడా మాయమైనట్లు గుర్తిచ్చింది. వీటన్నిటి విలువ 6,270 డాలర్లుగా ఉంది. దీంతో ఆగ్రహించిన ఆరెంజ్ సిటీ యువతి అతడిని నిలదీసింది. దీంతో అతడు కొన్నింటిని తిరిగిచ్చేసేందుకు అంగీకరించాడు. ఇంత జరిగాక అతడితో కలిసి జీవితం పంచుకోలేనని నిర్ణయించుకున్న యువతి అతడికి కటీఫ్ చెప్పింది. ఇదిలా వుంటే ఆరెంజ్ సిటీ మహిళ ఆఫీసుకు వెళ్లినప్పుడు తన ప్రియురాలిని తీసుకుని నేరుగా ఆమె ఇంటికే తీసుకెళ్లాడట. ఇక డేవిస్.. జో బబ్రౌన్, మార్కస్ బబ్రౌన్ అనే మారుపేర్లతో చాలామంది అమ్మాయిలను బురిడీ కొట్టించాడని పోలీసులు తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడికి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. చదవండి: 'నేను ఏలియన్ని' మస్క్ షాకింగ్ కామెంట్ -
ప్రేమ చరిత్ర
-
ఐ లవ్యూ చెప్పకపోతే ఏం పోయింది!
‘ప్రేమిస్తున్నాను..’ అంటాం. ఇవ్వడమే ప్రేమ అయినప్పుడు.. ప్రేమను ఇమ్మని ఏడ్వడం దేనికి?! అసలు.. ‘ప్రేమిస్తున్నాను’ అని ఎందుకు చెప్పాలి? లోపల ఉంచుకుంటే ప్రేమ కాదా! సో.. ‘ఐ లవ్యూ’ అంటే అర్థం.. ‘నేన్నిన్ను ప్రేమిస్తున్నాను’ అని కాదు.. ‘నన్ను ప్రేమించవా ప్లీజ్’ అనేనా! నువ్వు ప్రేమిస్తే నిన్ను ప్రేమించాలా? ఈ ఇచ్చిపుచ్చుకోవడం ఏంటి? నిజంగా ప్రేమంటే.. వన్ సైడెడ్ లవ్. ‘అన్రిక్వయిటెడ్’ లవ్. ఇవ్వడం మాత్రమే ఉన్నప్పుడు.. తీసుకునే థాట్ లేనప్పుడు.. బాధ ఉండదు. ఆశ ఉండదు. ఆవేదన ఉండదు. హర్ట్ అవడం ఉండదు.. హార్ట్ బ్రేక్ అవడం ఉండదు. అవునా! పూర్తిగా ‘అవును’ కాదు. కొంచెమైనా పెయిన్‌గా ఉంటుంది. ఆ పెయిన్ ఎలాంటిదో కవి డాంటే కి తెలుసు. ఆల్ఫ్రెడ్ నోబెల్‌కి తెలుసు. ఇంకా కొంతమందికి తెలిసుండొచ్చు. వాళ్లందరి పెయిన్లతో అల్లిన ఈ ‘ప్రేమ హారం’.. వాలెంటైన్స్ డే స్పెషల్. బీట్రిస్ పుట్టినరోజు ఎప్పుడో ఎవరికీ తెలీదు. ప్రేమ ఎప్పుడు పుట్టిందో లోకానికి తెలుసా! బీట్రిస్ పారినరీ.. ఇటాలియన్ అమ్మాయి. నెలల నిండగానే తల్లి కడుపులోంచి ఎకాఎకి 25 ఏళ్ల వయసుతోనే పుట్టిన ‘పసికందు యువతి’లా ఉంటుంది బీట్రిస్. ఆ రూపాన్ని మాత్రమే మిగిల్చి వెళ్లింది లోకానికి. లోకం అంటే లోకం అంతా కాదు. ఆమే లోకంగా జీవించిన ఒక వ్యక్తికి తన జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లిపోయింది! అతడు డాంటే. డాంటే అలిఘిరి. ఇటాలియన్ కవి. అతడు ప్రేమిస్తున్నట్లు ఆమెకు తెలియదు. ఆమెను ప్రేమిస్తున్నట్లు అతడూ చెప్పే వీలు లేదు. చెబితే భార్యకు చెప్పి ఏడవాలి. ‘నేను ఆ పిల్లను ప్రేమిస్తున్నా.. ఏం చెయ్యను?’ అని భోరుమనాలి. ఆర్నో నదీతీరంలో స్నేహితులతో కలిసి వెళుతున్న బిట్రీస్ను దూరం నుండి ఆరాధనగా చూస్తూ గుండె చేత్తో పట్టుకున్న డాంటే. మధ్యలో ఉన్న యువతే ట్రిస్. (ప్రసిద్ధ హెన్రీ హాలిడే తైలవర్ణ చిత్రం) మరకతాల్లా మెరిసే బీట్రిస్ కళ్లు డాంటే నిద్రను మింగేశాయి. అటూ ఇటుగా ఒక ఈడు వాళ్లు. ఆమె ఇరవై ఐదేళ్ల వయసప్పుడు చనిపోయింది. తర్వాత ముప్పై ఏళ్లకు డాంటే. వాళ్ల ప్రేమ చరిత్రలో ఇప్పటికీ నిలిచి ఉంది. ఆమేమీ అతడిని ప్రేమించలేదు. ఆరాధించలేదు. ఆమెకు తెలియకుండా తన గుండెలో ఆమెకొక ఆలయం కట్టుకున్నాడు. ఆ సంగతీ ఆమెకు చెప్పలేదు. ఆరాధ్య ప్రేయసికి మనసులోని మాట చెప్పలేక, పెళ్లికి తలవాల్చిన నిర్భాగ్యుడతడు! ‘‘నా జననం, నా మరణం, నా స్వర్గం, నా నరకం... అన్నీ బీట్రిస్సే’’అని భార్య ఎమ్మా డొనాటీ ఒడిలో బేలగా, దీనంగా వాలిపోయాడు. పిచ్చి ప్రేమ అతడిది. బీట్రిస్పై కవిత్వం రాశాడు. ‘బీట్రిస్‌ను కనడం కోసం ఫ్లారెన్స్ పుట్టిందా! పుట్టి, బీట్రిస్ కంటే ఒక ఏడాది ముందు అకారణంగా నన్ను కన్నదా?!’ అని ఫ్లారెన్స్ వీధుల్లో ఆమె నడిచి వెళ్లిన దారి వెంబడి పరిమళాలను వెతుక్కున్నాడు. ‘బీట్రిస్‌ను చూడకుండా నా తొమ్మిదవ యేటను దాటుకుని వెళ్లి ఉంటే జీవితంలో నాకింత హింస, ఇంత సంతోషం అవసరమై ఉండేవా?’ అని విలపించాడు. ఆమె ఎనిమిదేళ్ల వయసులో తనని చూశాడు. ఎనిమిదేళ్ల పిల్ల ఎలా ఉంటుందో అలా లేదు బీట్రిస్. స్త్రీలా ఉంది. అయితే.. మానవ స్త్రీలా కాదు. వన్‌సైడెడ్ లవ్ : స్వేచ్ఛనిస్తుంది! ఆ తర్వాత ఆర్నో నదీ తీరంలో... ఏడేళ్ల తర్వాత.. కన్యగా కళ్లు తెరుస్తున్న బీట్రిస్‌ను చూశాడు. మళ్లీ ఒకసారి ‘ఇరవై ఏళ్ల వయసు’ ఆమెలో ఒళ్లు విరుచుకుంటున్నప్పుడు! తిరిగి ఇంకోసారి రెప్పలు దించిన వధువుగా ఆమె పెళ్లప్పుడు. చివరిసారిగా ఆమె చనిపోయినప్పుడు. తను మాత్రమేనా బీట్రిస్లో ప్రేమను వెదుక్కుంది. దైవం కూడా. కానీ దైవం ఆమె ప్రేమను కోరుకున్నాడు. అందుకేనా ఆమె తీసుకెళ్లాడు.. మొగ్గ పూర్తిగా విడవకుండానే. బీట్రిస్పై డాంటేకు ఉన్నది అన్రిక్వైటెడ్ లవ్. మనసు లోపల దాచుకున్న ప్రేమ. ‘వెళ్లెళ్లు చెప్పేసెయ్ ఏమవ్వదు. లోలోన దాగుంటే ప్రేమవ్వదు’.. అని డార్లింగ్ సినిమాలో ప్రభాస్ మనసులో పాడిస్తాడు అనంత్ శ్రీరామ్. చెప్పే వీల్లేకపోతే ఏం చేయను అంటాడు డాంటే. పైకి చెబితేనే ప్రేమ అయ్యేపనైతే ఆల్ఫ్రెడ్ నోబెల్ దీ ప్రేమ కాదు. చెప్పిన ప్రేమా ప్రేమవ్వలేదు! అతడి ఫస్ట్ లవ్ అలెగ్జాండ్రా. ‘ఐ లవ్యూ’ అనగానే ‘ఐ యామ్ సారీ’ అనేసింది. రష్యన్ అమ్మాయి. అందంగా ఉంటుంది. అతడితో ఉండలేనంది. ప్రేమంటే ఉండటమేనా అని వగచాడు. అతడిది స్వీడన్. యవ్వనంలో దేశాలు పట్టుకుని తిరిగాడు. అప్పుడు చూశాడు అలెగ్జాండ్రాని. రెండో అమ్మాయి బెర్తా కిన్స్కీ. అతడితో ఉంది కాని ‘నిన్ను చేసుకోలేను’ అంది. ఉన్నన్నాళ్లూ టచ్‌లో ఉండటమే ఆమె అతడిపై చూపిన కనికరం. ఎప్పుడైనా భర్తతో కలిసి ఆల్ఫ్రెడ్‌ను చూడ్డానికి వచ్చిపోతుండేది. భర్తతో కలిసి అతడికి ఉత్తరాలు రాస్తుండేది! శాంతి ఉద్యమంలో ఉన్నారు ఆ భార్యాభర్తలు. ఒకరోజు ఆ అమ్మాయే ఆల్ఫ్రెడ్తో అంది – శాంతి కోసం ఏదైనా చేయమని. ‘‘డైనమైట్‌ని యుద్ధాలకు, విధ్వంసాలకు వాడుకుంటున్నారు. వాటిపై శాంతిని ప్రయోగించండి’ అని అడిగింది బెర్తా. నోబెల్ పీస్ ప్రైజ్ ఐడియా బెర్తాదే. ఇంకో అమ్మాయి సోఫీ హెస్. చిన్నపిల్ల. వియన్నాలో పూలు అమ్ముతుంటుంది. ఆమె అంటే తనకు ఎంత ఇష్టమో ఒకసారి బెర్తాకు చెప్పాడు. ఆ పిల్లను ‘మేడమ్ సోఫీ నోబెల్’ అని పిలుచుకోవడంలో జీవన సాఫల్యం లాంటి భావనేదో పొందేవాడు. అతడు పెళ్లి చేసుకోలేదు. ప్రేమను చేసుకున్నాడు అనాలి. ఆల్ఫ్రెడ్ ప్రకటించిన ప్రేమల కన్నా, అతడి అన్రిక్వైటెడ్ ప్రేమలే ఎక్కువ. లవ్ నుంచి బ్రేక్ అప్ అయినప్పుడు ఒంటరివాళ్లం అయిపోయామన్న నిస్పృహ ఆవరిస్తుంది. గుండెలోపల ఆ మనిషిపై ప్రేమ తోడుగా ఉన్నప్పుడు.. మనిషి దూరం అయితే మాత్రం ఒంటరివారు అవుతారా? వన్‌సైడెడ్ లవ్ హ్యాపీగా ఉంచుతుంది. ఏం కోరుకోం కనుక దేనికోసం వెతుక్కోం. ప్రేమంటే ఇదే కదా! సంతోషాన్ని పంచడం. -
ప్రేమికులకు స్వాగతం..
-
వాలెంటైన్ డే : హత్యలెందుకు..?
సాక్షి, హైదరాబాద్ : సృష్టిలో స్నేహం, ప్రేమ అనేవి ఎంతో అద్భుతమైనవి, అందమైనవి, తీయనైనవిగా కలకాలం నిలిచిపోతున్నాయి. ప్రేమ, స్నేహ భావం అనేవి జీవితంలోని అన్నిటా ఎల్లప్పుడూ, ఏదో ఒకరూపంలో స్పృశిస్తూనే ఉంటాయి. ప్రస్తుత డిజిటల్ విప్లవ కాలంలో, సోషల్ మీడియా క్రేజ్, హవా విపరీతంగా పెరిగిపోయిన ఇప్పటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజుగా (‘వాలెంటైన్ డే’) అంతర్జాతీయంగా ఎక్కడాలేని ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏర్ప డ్డాయి. వాలెంటైన్ డే అనేది ప్రేమికులకు మాత్రమే పరిమితమైంది కాదు. కుటుంబసభ్యులు, మిత్రులు, సహచరుల మధ్య పరస్పర స్నేహం, మిత్రుత్వం, అనుబంధం, ఆరాధన, గౌరవభావాలు చాటుకునేందుకు ఉద్దేశించినదే ఈ రోజు. హత్యలకెందుకు దారితీసున్నాయి? ఏ స్నేహమైనా, ప్రేమ అయినా ఏదో ఒక ఆకర్షణతో మొదలవుతుంది. అపోజిట్ సెక్స్ అట్రాక్షన్ అనేది సహజ పరిణామం. అది సినిమాల వల్ల, పాటల వల్ల, రకరకాల పరిస్థితుల ప్రభావం వల్ల ఏర్పడొచ్చు. ఆ ఆకర్షణ మధ్యలో ఏదో ఒక కారణం వల్ల తెగిపోతే, అందులో ఒకరు చాలా తీవ్రమైన ఆకర్షణలో ఉంటే. ఆ వ్యక్తి ఆకర్షణ తక్కువగా ఉన్న వ్యక్తి నిర్లక్ష్యాన్ని, పట్టించుకోనితత్వాన్ని అంగీకరించకుంటే, ఒప్పుకోకుంటే.. అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. మనిషి మృగంగా మారుతాడు. మోథేస్ అనే సైకాలజిస్ట్ పరిశోధనలో తేలిందేమంటే.. ప్రేమను కాపాడుకునేందుకు పుట్టేది అసూయ. ఇది ప్రేమ చేజారుతుందేమో అన్నప్పుడు కాకుండా, తన ప్రేమ మరో అబ్బాయికి దగ్గరవుతున్నప్పుడు అసూయ పెరుగుతుంది. ప్రేమ వల్ల కలిగే అనుభూతి బాగుంటుంది. కానీ ప్రేమను కోల్పోవడం జీవితాంతం మరిచిపోలేని బాధను మిగులుస్తుంది. ఇది మెదడులోని ‘సెరటోనిన్’ మాయజాలం. ప్రేమలో ఉన్నప్పుడు ఇది ఒక రివార్డు మెకానిజంలో సంతోషాన్ని కలిగిస్తుంది. అదే ప్రేమ విఫలమైనప్పుడు రివార్డ్ సైకిల్ తెగిపోతుంది. అప్పుడు ఆవేశం, కోపంతో ఊగిపోతారు. ఈ కొత్త పరిస్థితికి ఎలా అలవాటుపడాలో తెలియక భౌతికహింస లేదా దాడులకు పాల్పడుతారు. స్త్రీపై తనకున్న అధికారం, నియంత్రణ కోల్పోవడం అనేది నిస్సహాయతను, ఉక్రోషానికి, ఆవేశానికి కారణమై అందుకు కారణమైన వారిని అంతమొందించే ప్రయత్నం చేస్తారు. ప్రేమ ఓ పద్మవ్యూహం ‘ప్రేమ అనేది ఇప్పుడున్న అవగాహన ప్రకారం ఓ పద్మవ్యూహం. ఇందులో అర్జునులు, ద్రోణాచార్యులు చాలా తక్కువ. కానీ అభిమన్యులే ఎక్కువగా ఉంటున్నారు. తనతో ప్రేమలో ఉన్న అమ్మాయి మరొకరి ప్రేమలో పడి వెళ్లిపోవడం సదరు ప్రేమికుడిని తీవ్ర మానసికవేదనకు, తిరస్కారం వల్ల ఎదురయ్యే తీరని బాధకు దారితీస్తుంది. తన ప్రేమను అమ్మాయి తిరస్కరించడం కొంతమేరకు తట్టుకోగలిగినదైనా, మరొకరి చెంతకు చేరడం తట్టుకోలేనంత బాధను కలిగిస్తుంది. ఎవరైనా ఏదైనా రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టే ముందు చాలా అంశాల గురించి ఆలోచించాలి. అబ్బాయి, అమ్మాయి పరస్పరం ప్రేమించుకోవడానికి ముందే వారిద్దరి భావాలు, అభిప్రాయాలు కలుస్తాయా, అవగాహన కుదురుతుందా లేదా.. ఇళ్లలో వారి ప్రేమను అంగీకరించకపోయినా ఎదురయ్యే పరిణామాలను ధైర్యంగా ఎదుర్కోగలరా.. అన్న విషయాలపై ఆలోచించుకోవాలి. కొంతకాలం ప్రేమ కొనసాగించాక అభిరుచులు, అభిప్రాయాల్లో తేడాలొస్తే ఎదుటి వ్యక్తి సరైన వారు కాదని రిలేషన్షిప్ నుంచి దూరం జరగడంతో సమస్య మొదలవుతుంది. ప్రేమ తిరస్కరణను భరించలేక భౌతికదాడులు, హత్యల దాకా పరిస్థితులు దారితీస్తున్నాయి. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ í -
వాలెంటైన్స్ డే: మంత్రి కొప్పుల ఈశ్వర్ లవ్ స్టోరీ
► జగిత్యాల జిల్లాలో.. ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే, ప్రేమ విషయం పెద్దలకు చెప్పలేక యువతి ఉరివేసుకుంది. ఇది తెలిసి.. దుబాయ్‌లో ఉన్న ప్రియుడు ‘నువ్వు లేక నేను లేను’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ► పెద్దలు పెళ్లికి అంగీకరించరనే కారణంతో ఆ ప్రేమికులిద్దరూ కలిసి బావిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం వడ్లతండాలో చోటుచేసుకున్న ఘటన ఇది. ► నిజామాబాద్ జిల్లాలో.. వారిద్దరివీ వేర్వేరు కులాలు.. ప్రేమతో ఒక్కటవ్వాలనుకున్నారు. కానీ, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఒకరు.. కాదని మరొకరు అభిప్రాయ భేదాలకు గురై.. చివరకు ఇద్దరూ ఉరివేసుకున్నారు. కేవలం పెద్దలు పెళ్లికి అంగీకరించరనే భయంతోనే గడిచిన మూడు నెలల్లో పదిహేనుకుపైగా ప్రేమజంటలు ఆత్మహత్యలకు పాల్పడ్డాయి. చనిపోవడానికి కూడా ధైర్యం కావాలి.. అదే ధైర్యాన్ని వారు పెద్దల్ని ఒప్పించడానికి లేదా కలిసి బతకడానికి చూపాలని అంటున్నారు ఒకప్పటి ప్రేమికులు. కులమతాలు వేరైనా.. ‘ప్రేమ కోసం ధైర్యంగా నిలబడ్డాం. ఆ ధైర్యంతోనే ఇరుపక్షాల పెద్దల్ని ఒప్పించాం. ఇప్పుడెలాంటి స్పర్థలు లేకుండా ఆనందంగా ఉన్నాం’ అంటున్నాయి ‘ప్రేమ–పెళ్లి’లో సక్సెస్ అయిన జంటలు. నొప్పించకుండా పెద్దలను ఒప్పించగలగాలి.. అందుకోసం ఎన్నాళ్లైనా వేచిచూడగలగాలి.. ఇలాంటివి లోపించే నేటి ప్రేమలు విషాదాంతమవుతున్నాయని చెబుతున్న వీరు.. నాడు తామేం చేశామన్న సంగతిని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ తో పంచుకున్నారు. చనిపోవడానికైనా ధైర్యం కావాలి.. ఆ ధైర్యంతోనే కలిసి బతకొచ్చు ప్రేమలో సఫలం కావడానికి మేం చేసింది ఇదీ.. ‘ప్రేమికుల దినోత్సవం’ సందర్భంగా నాటి ప్రేమజంటలు చెబుతున్న సక్సెస్ స్టోరీస్ పెద్దల అంగీకారంతో.. జగిత్యాల: ‘ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. పెద్దల్ని ఒప్పించి చేసుకున్నా.. ఒకరినొకరు అర్థం చేసుకోవడమనేది ముఖ్యం’ అంటున్నారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు. 37 ఏళ్ల కిందట వీరు పెద్దల సమక్షంలో ఆషాఢమాసంలో కులాంతర వివాహం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన స్నేహలత తండ్రి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ఆ సమయంలో సింగరేణిలో పనిచేస్తూ కమ్యూనిస్ట్ పారీ్టలో ఉన్న కొప్పుల ఈశ్వర్ స్నేహలతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె అసలు పేరు కోకిలాదేవి. కమ్యూనిస్ట్ ఉద్యమ సమయంలో చనిపోయిన తన తోటి సహచరి స్నేహలత పేరును ఈశ్వర్ తన సతీమణికి పెట్టుకున్నారు. ఉద్యమం కలిపింది.. తొర్రూరు: ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు చెందిన సబీహాబాను, మహబాబూబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మంగళపల్లి శ్రీనివాస్ 25 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆదివాసీలు, గిరిజనుల సమస్యలపై శ్రీనివాస్‌తో కలిసి సబీహాబాను ఉద్యమాలు చేపట్టింది. ఆ ఉద్యమ సాహచర్యం కాస్తా ప్రేమ.. పెళ్లికి దారితీసింది. ఇంటర్ వరకు చదివిన సబీహాబానును హిందీలో పీజీ చదివించి ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించేలా శ్రీనివాస్ సహకరించాడు. ప్రస్తుతం ఆమె చెర్లపాలెం ప్రభుత్వ పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేస్తున్నారు. శ్రీనివాస్ ప్రత్యక్ష రాజకీయాల్లో చేరి తొర్రూరు జెడ్పీటీసీగా గెలుపొందారు. వీరికి ఇంజనీరింగ్ చదివే వాసే, 9వ తరగతి చదివే అమన్ సంతానం. ‘ప్రేమించడం తప్పుకాదు. నేడు దాన్ని సాధించేందుకు ఎంచుకునే మార్గాలే అభ్యంతరకరంగా ఉంటున్నా’యనేది వీరిమాట. ఒప్పించే చేసుకున్నాం మంచిర్యాలటౌన్: ‘మాది ప్రేమ వివాహమే. అయితే పెద్దల్ని ఒప్పించి చేసుకున్నాం’ అంటున్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి. ‘మాది కర్ణాటకలోని బెల్గాం జిల్లా గోకాక్ గ్రామం. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్ ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీసర్కిల్‌లో 2002లో చేరాను. అప్పుడే ఏపీలోని కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన సీవీ శంకర్‌రెడ్డి పరిచయమయ్యారు. మా ఇద్దరి భాషలు, రాష్ట్రాలు వేరు. అయినా ప్రేమ చిగురించింది. అయితే అది చదువుకు, లక్ష్యానికి అడ్డురాకూడదని నిర్ణయించుకున్నాం. 2002–03లో కోచింగ్ పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లాం. ప్రేమ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పాం. అలా పెద్దలను ఒప్పించి 2007లో పెళ్లి చేసుకున్నాం. 2009లో ఐపీఎస్‌కు, 2010లో ఐఏఎస్‌కు ఎంపికయ్యా. ఆయనకు తెలంగాణ టూరిజంలో ఉద్యోగం వచి్చంది. ప్రస్తుతం ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరక్టర్. ఇప్పుడు మాకో పాప. పేరు ఆధ్య. మా అత్తగారు నన్ను కోడలిగా కాకుండా కూతురుగా చూసుకుంటుంది. అలాంటి మంచి కుటుంబాన్ని నా భర్త అందించారు. ఒప్పించడానికి నాలుగేళ్లు.. కోదాడ: ‘ప్రేమించినంత తేలిక్కాదు తల్లిదండ్రులను ఒప్పించడం. అందుకు ఓపికుండాలి.. నమ్మివచ్చిన భాగస్వామికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. మేం ప్రేమ వివాహం చేసుకున్నాక తల్లిదండ్రులను ఒప్పించడానికి నాలుగేళ్లు పట్టింది. అందరం కలిసిపోయాం. పిల్లలతో ఆనందంగా ఉన్నా’మని చెబుతున్నారు కోదాడకు చెందిన కందుల మధు– విజయలక్ష్మి దంపతులు. ఉస్మానియా యూనివర్సిటీలో 2010లో ఎంబీఏ చదివే రోజుల్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సామాజికవర్గాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల తరువాత వీరి అన్యోన్య దాంపత్యాన్ని చూసిన ఇరుపక్షాల పెద్దలు ఇప్పుడు దగ్గరయ్యారు. నలభై ఐదేళ్ల క్రితం.. డోర్నకల్: ‘నలభై ఐదేళ్ల క్రితం.. ఇప్పటితో పోలిస్తే ఆ కాలంలో కట్టుబాట్లు ఎక్కువ. పెద్దలు కొందరు సరేనన్నారు. మరికొందరు కాదన్నారు. అయినా ధైర్యంగా పెళ్లి చేసుకుని నిలబడ్డాం’ అంటున్నారు డోర్నకల్ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన దేవకృపామణి, ఉప్పరి నారాయణ. వీరి కులమతాలు వేర్వేరు. పక్కపక్కిళ్లలో ఉండటం, ఒకే పాఠశాల, కళాశాలలో చదువుతున్న క్రమంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటామంటే ఇరుపక్షాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పెళ్లి చేసుకుని ఒక్కటవ్వడమే కాక.. అందరినీ మెప్పించాలని ధైర్యంచేసి 1976, నవంబర్ 19న పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇరు కుటుంబాలు కలసిపోయాయి. పిల్లల్లేకున్నా ఒకరికొకరుగా జీవితం సాగిస్తున్నారు నారాయణ, కృపామణి దంపతులు. ‘ప్రస్తుతం ప్రేమ పేరుతో జరుగుతున్న హింస, పెళ్లి చేసుకోలేమనే భయంతో ప్రాణాలు తీసుకోవడం వంటి సంఘటనలు వింటుంటే బాధ కలుగుతుంది. ధైర్యంగా ముందడుగు వేస్తే అన్నీ సర్దుకుంటాయి’ అంటున్నారు వీరు. నాలుగేళ్లకు ఒప్పించాం.. మహబూబాబాద్: తమ ప్రేమ.. పెళ్లి వైపు నడిపించిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్. ‘32 ఏళ్ల క్రితం నేను వరంగల్ ఆర్ఈసీ (ప్రస్తుతం నిట్)లో చదువుకుంటున్న సమయంలో ఒక ఫెస్ట్‌లో మెడిసిన్ చదువుతున్న సీతామహాలక్ష్మి (గుంటూరు జిల్లా తెనాలి) పరిచయమైంది. అదికాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి సామాజిక వర్గాలు వేర్వేరు. ఆమె ఇంట్లో విషయం తెలియడంతో.. మా ఇద్దరి మధ్య మాటలు బందయ్యాయి. అప్పట్లో ఇప్పటి మాదిరి సమాచార వ్యవస్థ లేదు. మా ప్రేమను కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇబ్బంది పడేవాళ్లం. ఇద్దరం ప్రభుత్వోద్యోగాలు సాధించి పెద్దల్ని ఒప్పిద్దామనుకుంటే అప్పుడూ నిరాకరణే ఎదురైంది. వాళ్ల అంగీకారం కోసం నాలుగేళ్లు వేచిచూశాం. అయితే, మా ప్రేమలోని నిజాయితీని తరువాత పెద్దలు గుర్తించారు. చివరకు 1994లో వారే దగ్గరుండి పెళ్లి చేశారు. నేను ఆర్అండ్బీ డీఈగా ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సీతామహాలక్ష్మి ఎంతో సహకరించింది. ఆమె డాక్టర్. సూర్యచంద్ర, తేజస్వి.. మాపిల్లలు. ప్రేమకు కులమతాలు అడ్డుకాదు. కాకపోతే, జీవితంలో స్థిరపడి, పరస్పరం నమ్మకం, భరోసా ఏర్పడ్డాకే పెళ్లి చేసుకోవాలి. తొందరపడి ప్రేమలోకి దిగి.. పెద్దల భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రేమికులను చూస్తే బాధ కలుగుతుంది’. ఒప్పించి.. మెప్పించాం కోల్‌సిటీ (రామగుండం): ‘మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే కనుక పెద్దలను ఒప్పించాలి’ అంటున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన డాక్టర్లు మహేందర్‌కుమార్, లావణ్య. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన మహేందర్కుమార్కు, గోదావరిఖని లక్ష్మీనగర్‌కు చెందిన లావణ్యకు సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో 2006లో సీటొచి్చంది. చదువులో చురుగ్గా ఉండే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే కులాలు వేర్వేరు. మహేందర్ దాపరికం లేకుండా ఇంట్లో విషయం చెప్పి ఒప్పించాడు. లావణ్యా అలాగే చేసింది. చదువుకు తమ ప్రేమ అడ్డుకాకుండా.. ఇద్దరూ డాక్టర్లయ్యాక 2012 నవంబర్ 29న పెద్దల సమక్షంలో ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులు నేటి ప్రేమల గురించి మాట్లాడుతూ– ‘ప్రేమలో పరిపక్వత ఉండాలి. పేరెంట్స్‌ను ఒప్పించి పెళ్లి చేసుకోగలమనే నమ్మకం ఉండాలి. మా కాలేజీలో దాదాపు 50 ప్రేమజంటల్ని చూశాం. కేవలం ఆరుజంటలే పెళ్లి చేసుకున్నాయి’ అని చెప్పారీ దంపతులు. మహేందర్ ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్, డీడీవోగా, డాక్టర్ లావణ్య జగిత్యాల జిల్లా మల్యాల పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్, డీడీవోగా పని చేస్తున్నారు. -
ఫీల్ మై లవ్.. ఆన్లైన్ లవ్ జాతకం
ఆన్లైన్ లవ్.. ప్రేమలో కొన్నాళ్లుగా ఇదో ట్రెండ్.. వీటిపై వ్యతిరేకత ఉన్నా.. ఇక్కడే కలిసి.. ప్రేమించుకుని.. పెళ్లి చేసుకున్న వాళ్లూ ఉన్నారు. పైగా.. ఈ ఆన్లైన్ డేటింగ్ యాప్స్ జోరు రోజురోజుకూ పెరుగుతోందని ‘స్టాటిస్టా డిజిటల్ మార్కెట్ ఔట్లుక్’ పేర్కొంది. 2021 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా కనీసం 37 కోట్ల మంది యాక్టివ్ యూజర్స్ వీటికి ఉండబోతున్నారని తెలిపింది. అంతేకాదు.. పెయిడ్, ఫ్రీ అకౌంట్ల ద్వారా వీటి ఆదాయం రూ. 24 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఈ యాప్స్ ఉపయోగిస్తున్నవారిలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. తర్వాత ఐరోపా దేశాలు ఉన్నాయి. చైనా, భారత్‌లాంటి దేశాల్లో ఉపయోగిస్తున్నవారి శాతం ప్రకారం తక్కువగానే ఉన్నా.. ఇక్కడున్న జనాభా దృష్ట్యా ఈ యాప్స్ రెవెన్యూ ఐరోపా దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఆన్లైన్ లవ్ జాతకం ఈ ఏడాది చివరి నాటికి ఎలా ఉండబోతోందో ఓసారి చూసేద్దామా.. ఈ ఏడాది చివరి నాటికి ఆయా దేశాల జనాభాలో డేటింగ్ యాప్స్‌ని వాడేవారి శాతం, ఆదాయం అంచనా (ఫ్రీ, పెయిడ్ యూజర్స్ కలిపి) -
మేయర్ ప్రేమ కథ: ఒప్పించాం.. ఒక్కటయ్యాం
సాక్షి, బంజారాహిల్స్: ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.. ఒకరిపై ఒకరు నమ్మకం నిలుపుకోవాలి.. ఎన్నాళ్లయినా తరగనంత ప్రేమను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి.. అంటున్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి. ఆమెది ప్రేమ వివాహమే.. అయితే తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని.. ప్రేమకు ముందు ఏర్పడిన పరిచయం తమను ఇక్కడిదాకా తీసుకొచ్చిందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన మనసులోని మాటను ఆమె వెల్లడించారు. ఇద్దరమూ క్రీడాకారులమే.. నేను క్రికెట్ ప్లేయర్‌ను. ఆయన బాస్కెట్ బాల్ ప్లేయర్.. నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు వచ్చి చూసేవారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వెంగల్రావునగర్ ఇక్రిశాట్ క్లబ్లో ఇద్దరం కలిసి టెన్నిస్ ఆడేవాళ్లం. అది స్నేహానికి దారి తీసింది. ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయి. ప్రేమంటే ఏంటో నాకు ఇంటర్ తర్వాత తెలిసింది. ఆయనకు సంబంధించిన స్నేహితుడితో మా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. పెద్దలను ఒప్పించాం.. నన్ను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించాను. బీబీఏ చదువుకున్న బాబిరెడ్డి తనతో ఉన్న స్నేహం ఆ తర్వాత ప్రేమకు దారి తీయడంతో పెళ్లి చేసుకుందామనే ప్రపోజల్ చేశారు. మా ఇద్దరి కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు ఒప్పుకొంటారో లేదో అని సందేహించాను. మీరే మా పెద్దలను ఒప్పించాలని చెప్పడంతో ఆయన తన తల్లిదండ్రులను తీసుకొచ్చి మా నాన్న కేకేను కలిశారు. మొత్తానికి మా పెళ్లికి ఒప్పించారు. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు నాకు ప్రేమ లేఖలు రాసేవారు. ముందు పెళ్లి చేసుకుందామని ఆయనే ప్రపోజ్ చేశారు. నేను ఒప్పుకొనే వరకూ నా వెంటతిరిగారు. తరగని ప్రేమ.. పెళ్లి తర్వాత ఇద్దరం కలిసి అమెరికా వెళ్లాం. అక్కడ నేను జాబ్ చేస్తూనే చదువుకునేదాన్ని. ఇద్దరి మధ్య ఏనాడూ పొరపొచ్చాలు రాలేదు. నా తల్లిదండ్రులు ఇండియాకు రావాలని కోరడంతో అదే విషయాన్ని ఆయనకు చెప్పాను. ఒక్క మాట కూడా అనకుండా నాతో పాటు ఇండియాకు వచ్చేశారాయన. కలిసే భోంచేస్తాం.. మా ఆయన ప్రతిరోజూ ఏదో ఒక పూట నాతో కలిసి భోజనం చేస్తారు. మధ్యాహ్నం లంచ్ లేదా రాత్రి డిన్నర్ మొత్తానికి ఇద్దరం కలిసే తింటాం. ఆయనతో పాటు ఆయన తల్లిదండ్రులది కూడా విశాలమైన హృదయం. నువ్వుంటే చాలు.. ఈ రోజుకు మా ఇద్దరి మధ్య ఏ విషయంలోనూ చిన్న గొడవ జరగలేదు. ఆయన ఎప్పుడూ నువ్వుంటే చాలు అంటుంటారు. మాకు పిల్లలు లేరన్న విషయంలో ఎప్పుడూ బాధ లేదు. నన్ను ఆయన తన సొంత పిల్లల్లా చూసుకుంటే ఆయనను నేను చిన్న పిల్లాడిగానే చూస్తాను. నాకు నా తండ్రి కేకే మొదటి ప్రాధాన్యం అయితే రెండో ప్రాధాన్యం భర్తకే ఇస్తాను. చదవండి: ఆర్ఆర్ఆర్.. రూ.13 వేల కోట్ల భారీ వ్యయంతో ప్రాజెక్టు -
వాలంటైన్స్ డే: 'టక్ జగదీష్' నుంచి లవ్ సాంగ్
వేలంటైన్స్ డే స్పెషల్‌గా ‘టక్ జగదీష్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాల్లోని ప్రేమ పాటలను రిలీజ్ చేశారు. ఆ విశేషాలు... ఇంకోసారి ఇంకోసారి ‘ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి’ అని తన ప్రేయసి గురించి పాడుకుంటున్నారు టక్ జగదీష్. ఈ పాట వెనుక కథేంటో సినిమా చూసి తెలుసుకోవాలి. నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టక్ జగదీష్’. ఈ సినిమాలోని మొదటి పాట ‘ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి’ని విడుదల చేశారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటను శ్రేయా ఘోషల్, కాలభైరవ ఆలపించారు. చైతన్య ప్రసాద్ రచించారు. ఏప్రిల్‌లో సినిమా విడుదల. గుచ్చే గులాబీ ‘గుచ్చే గులాబీలా నా గుండెలోతునే తాకినదే..’ అంటూ తన ప్రేయసి కోసం పాడుతున్నారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్. ఆయన హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమాలోని రెండో పాటను శనివారం విడుదల చేశారు. గోపీసుందర్ సంగీతంలో అనంత్ శ్రీరామ్ రచించిన ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడారు. జూన్ 19న విడుదల కానున్న ఈ సినిమాను ‘బన్నీ’ వాసు, వాసు వర్మ నిర్మించారు. మస్తీ చేస్కో ‘డబ్బే ఉంటే మస్తీ చేస్కో’ అంటు న్నారు విష్ణు మంచు. ఆయన హీరోగా నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘మోసగాళ్లు’. భారీ ఐటీ స్కామ్ ఆధారంగా హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ ఈ సినిమాను తెరకెక్కించారు. కాజల్ అగర్వాల్, రుహీ సింగ్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో రెండవ పాట ‘డబ్బే మనది కుమ్మేస్కో.. మస్తీ మస్తీ చేస్కో.. కాస్ట్లీ మందే వేసేస్కో...’ని శుక్రవారం రిలీజ్ చేశారు. సామ్ సీయస్ సంగీతం అందించిన ఈ పాటకు సిరాశ్రీ సాహిత్యం అందించగా హేమచంద్ర ఆలపించారు. ఈ పాటకు విశేష స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. రూ. 51 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మార్చి 19న, మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. -
ఫ్రేమ్ మారినా.... ప్రేమ అలాగే ఉంది!
బ్లాక్ అండ్ వైట్ డేస్ గాన్. ఈస్ట్‌మన్ కలర్ రోజులు పోయే. సినిమాస్కోప్ కే దిన్ చల్ బసే. కాని ప్రేమ అలాగే ఉంది. పోస్టర్ మారింది. ప్రేమ అలాగే ఉంది. అక్కినేని లేడు. ప్రేమ అలాగే ఉంది. ప్రభాస్ వచ్చాడు. ప్రేమ అలాగే ఉంది. ‘నిన్నా నేడూ నీదే ధ్యానం’ వేటూరి లేడు. ప్రేమ అలాగే ఉంది. ‘నీ కాళ్లను పట్టుకుని వదలవన్నవి’.. ఇల సినీపురములో ప్రేమ అలాగే ఉంది. ప్రేమ లేకుండా బుకింగ్స్ ఓపెన్ కావు. కలెక్షన్లు క్లోజూ కావు. ఫిబ్రవరి 14 ప్రేమగులాబీలు విరబూస్తాయి. ట్రెండ్ మారుతూ వచ్చిన ప్రేమకథలను గుర్తు చేస్తాయి. తొలి రోజుల్లో సినిమా ప్రేమ రక్త సంబంధీకుల మధ్యో, ఇరుగూ పొరుగుల మధ్యో ఉండేది. అపరిచితులను కలిసే చాన్స్ తక్కువ. ‘మల్లీశ్వరి’లో బావామరదళ్లైన ఎన్.టి.ఆర్, భానుమతి ప్రేమించుకుంటారు. కాని ‘ప్రేమ’ అనే మాట ఎక్కడిది అప్పట్లో. అనురాగం, ఆరాధన, మనసు పడటం... ఇవే. ఆ అనురాగాన్ని కూడా నేరుగా చెప్పుకుంటారా? ‘మనసున మల్లెల మాలలూగెనె’ అని మల్లెలనో పున్నమినో తోడు తెచ్చుకుంటారు. ‘దేవదాసు’లో నాగేశ్వరరావు ‘పల్లెకు పోదాం పారును చూదాం’ అంటాడు తప్పితే పారును ప్రేమిద్దాం అనడు. ఆమె లేకపోతే తాను లేడన్న సంగతి మాత్రమే తెలుసు అతనికి. దాని పేరు ప్రేమ అని తర్వాత పాత్రలకు, ప్రేక్షకులకు చెబుతూ వచ్చారు. పారు, దేవదాసు కలిసినప్పుడు కూడా ‘నా ఎదుటే నీ బడాయి’ అని ఆమె ‘జీవితమే ఓ లడాయి’ అని అతడు దెప్పిపొడుచుకుంటారు తప్ప ప్రేమను వ్యక్తపరచడం ఎలాగో తెలుసుకోరు. చంద్రుడే రాయబారి పాత రోజుల్లో అబ్బాయి అమ్మాయిలకు చంద్రుడే రాయబారి. వారి ప్రేమ, కోపం, అలక చంద్రుడితో చెప్పుకునేవారు. ‘రావోయి చందమామ... మా వింతగాధ వినుమా’ అని ‘మిస్సమ్మ’లో ఎన్.టి.ఆర్ సావిత్రి మీద ఉన్న ప్రేమను చంద్రుడితో మొత్తుకుని చెప్పుకుంటాడు. ఆమెకు అతనిపై ప్రేమ కలిగినా ‘ఏమిటో ఈ మాయా ఓ నెలరాజా చల్లని రాజా’ అని చంద్రుడికే చెప్పుకుంటుంది తప్ప అతనితో కాదు. ‘ముద్దబంతి పువ్వులో మూగకళ్ల ఊసులు’ కాలం అది. కాని అలా రాసిన ఆత్రేయే మరికొన్నాళ్లకు కుండబద్దలు కొట్టాడు. ‘ప్రేమనగర్’ సినిమా నుంచి ప్రేమను ముందుకు తెచ్చాడు. హీరో హీరోయిన్లు కూడా ప్రేమ అనే మాటను పలకడం మొదలెట్టారు. ‘నీ కోసం వెలసింది ప్రేమమందిరం’ అని హీరో పాడాడు. ఇప్పుడు ప్రేమ బట్టబయలు అయిపోయింది. హీరో అయితే ప్రేమించనన్నా ప్రేమిస్తాడు లేదంటే తన తల్లిదండ్రులను చంపిన విలన్‌పై పగసాధిస్తాడు. ప్రేమించిన వాడిని మహిళా ప్రేక్షకులు ఎక్కువగా ప్రేమించారు. చదువు తెచ్చిన ప్రేమ పాత రోజుల్లో అంతంతమాత్రంగా ఉండే చదువులు ఇప్పుడు ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. కాలేజీలు వచ్చాయి. అబ్బాయిలు అమ్మాయిలు ఒకేచోట కూచుని చదువుకోవడం మొదలెట్టారు. చదువయ్యాక నిరుద్యోగం ఒక సమస్యగా తీసుకుని కుర్రాళ్లు తిరగబడే కథలతో వచ్చిన సినిమాలు ఒకవైపు అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమలో మెరుపులై మెరిసే కథలు ఒకవైపు ఊపందుకున్నాయి. అక్కినేని ‘ప్రేమాబిషేకం’ తీసి ‘నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించానని’ అని పెద్ద హిట్ కొట్టాక కుర్రాళ్లు ఊరుకోలేదు. జంధ్యాల వల్ల ‘ముద్దమందారం’, ‘నాలుగు స్తంభాలాట’ వంటి ప్రేమకథలను చూపించారు. ‘చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పొంగు నీ ప్రేమ నా ప్రేమ’ అని ప్రేమపాఠం చదివారు. అదే సమయంలో డబ్బింగ్ చిత్రంగా వచ్చిన ‘ప్రేమ సాగరం’ పెద్ద దుమారం రేపింది. ‘నామం పెట్టు నామం పెట్టు కాలేజీకి చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజీకి’ అని కొత్త దిశను చూపింది. కాలేజీకి వెళ్లామంటే లవ్ చేయాల్సిందే అని కుర్రాళ్లు అనుకునేదాకా ఈ ప్రేమమత్తు ఎక్కిది. సినిమా వాళ్లు కూడా సామాన్యులు కారు. డబ్బులొస్తాయంటే ప్రేమను పట్టుకుంటారు. కలెక్షన్లు బాగున్నాయంటే పగనూ పట్టుకుంటారు. మరో చరిత్ర ఓ.కే. ప్రేమించుకున్నాం సరే. మరి దాని సమస్యలు. ప్రేమలో ఉన్న పెద్ద విశేషం ఏమంటే దాని నిర్ణయం అబ్బాయి అమ్మాయి తీసుకుంటారు. కాని అది చేరాల్సిన రేవు పెళ్లి అయితే గనక దానికి టికెట్ కొట్టాల్సిన వాళ్లు పెద్దవాళ్లవుతారు. ‘ప్రేమా లేదూ దోమా లేదూ’ అని ఈసడించే పెద్దవాళ్ల ముందు ప్రేమ పవిత్రత, శక్తి చూపి నాలుగు రూకలు సంపాదిద్దాం అనుకున్నాడు దర్శకుడు కె.బాలచందర్. ‘మరో చరిత్ర’ తీశాడు. ఇరుపక్షాల పెద్దలకు పెళ్లి ఇష్టం లేదు. సంవత్సరం పాటు ఒకరినొకరు చూసుకోకుండా ఉంటే అప్పుడు మీ ప్రేమను నమ్ముతాం అని చెబుతారు. ఏం షరతు ఇది. అమ్మాయిలందరూ సరితలో తమను చూసుకున్నారు. అబ్బాయిలందరూ కమలహాసన్‌లో తమను. ‘ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో’ అని వాళ్లు పాడుకుంటే చూడ్డానికి క్లాసులెగ్గొట్టి వచ్చారు. సరే.. వీళ్లది కులాల మధ్య పుట్టిన సమస్య. ‘సీతాకోకచిలుక’ వచ్చి మతాల మధ్య సమస్యను చెప్పింది. అబ్బాయి అమ్మాయికి ప్రేమలో పడే సమయంలో ఎవరు ఏ మతమో తెలియదు. కాని పెద్దలకు తెలుసు కదా. ‘నేనే నీవుగా పువ్వూ తావిగా సంయోగాల సంగీతాల విరిసేవేళలో’ అని వారు పాడుకుని ఈ సాంగత్యాన్ని వదలం అని ప్రేమను గెలుచుకున్నారు. సినిమాను గెలిపించుకున్నారు. ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో ప్రేమ పూర్తిగా ఎస్టాబ్లిష్ అయినట్టే. ఒక్క ప్రేమ ఎన్ని రంగులో... ప్రేమ ఒక సక్సెస్ ఫార్ములా అయ్యాక దానికి ఎన్ని కోణాలు, ఎన్ని పార్శా్వలు ఉన్నాయో వెతకడం మొదలెట్టారు సినీ కథకులు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కామన్. కాని సమస్య కొత్తది కావాలి. లేదా కొత్తగా చెప్పాలి. అసలు లోపల ప్రేమ పెట్టుకుని ఎప్పటికీ చెప్పలేని అబ్బాయి కథను సినిమాగా తీస్తే అనుకుని ‘హృదయం’ తీశాడు దర్శకుడు కదిర్. ‘ఊసులాడే ఒక జాబిలట’.. అని పాడతాడు. పెద్ద హిట్. తీరా ప్రేమ సంగతి చెప్పడానికి వచ్చేసరికి అతనికి గుండెపోటు వచ్చి చచ్చిపోతాడు. ఇంత సుకుమార ప్రేమ కూడా ఉంటుందని జగానికి తెలిసింది. ఇలాంటి కథే ఇటీవల తెలుగులో శర్వానంద్ హీరోగా ‘జాను’ పేరుతో వచ్చింది. ప్రేమించిన అమ్మాయిని అనుమానిస్తే ఆ ప్రేమ ఎలా భగ్నం అవుతుందో నాగార్జున ‘మజ్నూ’లో చూపిస్తాడు. తనతో జరగాల్సిన తొలిరాత్రి మరెవరికో జరుగుతుంటే ‘ఇది తొలిరాత్రి’ అని పాడి కుమిలిపోతాడు. అమ్మాయి తండ్రికి ప్రేమ ఇష్టం లేకపోతే అబ్బాయి మీద రౌడీలను పంపిస్తాడు. కాని తల్లికి ఇష్టం లేకపోతే? ‘ప్రేమ’ సినిమాలో వెంకటేశ్ తన కూతురు రేవతిని ప్రేమించడం మంజులకు ఇష్టముండదు. అమ్మాయి తల్లి గట్టిగా నిలబడినా కూడా పెద్ద చిక్కే ప్రేమకు. ‘ఈనాడే ఏదో అయ్యింది’ అని మధురంగా పాడుకోవడమే పాపం ఆ జంటకు మిగులుతుంది. సరే... ఒకమ్మాయిని ఇద్దరు ప్రేమిస్తే? ఆ ఇద్దరూ ఒకరికొకరు స్నేహితులయ్యి ఆ అమ్మాయి వారిద్దరికీ స్నేహితురాలైతే? ఈ ప్రేమ గొడవ మనకెందుకురా హాయిగా ముగ్గురం ఫ్రెండ్స్‌గా ఉందాం అని ఆ అమ్మాయి నిర్ణయం తీసుకుంటుంది. ‘ప్రేమదేశం’ కుర్రకారును మరోదేశంలో తిప్పి వదిలింది. ‘నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే ప్రేమా...’ అని ప్రేమ భావనను గాఢంగా చెప్పిన సినిమా ఇది. అసలు ప్రేమ అనే ఈ పిచ్చిలో పడి చదువు మానేసి, అయిన వారికి దూరమయ్యి జీవితం నాశనం చేసుకోవడం ఏమిటి ఇలా అక్కర్లేదు... ప్రేమ కోసం సర్వం కోల్పోవాల్సిన పని లేదు అని ‘సుస్వాగతం’ వంటి కథలూ వచ్చాయి. బొమ్మరిల్లు ప్రేమ బొమ్మరిల్లు ఫాదర్ ఉన్నట్టే బొమ్మరిల్లు ప్రేమ కూడా ఉంది. అదేమిటంటే మనం ప్రేమించిన అమ్మాయిని మన పెద్దలు నచ్చేంత వరకూ ఓపిక పట్టడం, వారికి పరిచయం చేసి, నచ్చేలా చేయడం. ‘అపుడో ఇపుడో ఎపుడో కలగన్న’ చెలిని నిజ జీవితంలో సొంతం చేసుకోవడం. మరో ప్రేమ కూడా ఉంది. ‘నా ప్రేమ నీకు తెలిసే దాకా ప్రేమిస్తానని... ఫీల్ మై లవ్’ అని చెప్పి ప్రేమను పొందే ‘ఆర్య’ మార్కు ప్రేమ. ఇది అన్నిసార్లు క్లిక్ కాకపోవచ్చు. పైగా మనం కటకటాల్లో పడొచ్చు. ఇక తొలిచూపులోనే ప్రేమ పుడుతుంది అంటారు. పుట్టొచ్చు. కాని అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ తమను తాము ఒకరినొకరు అర్థం చేసుకునేలా ఎదిగి ప్రేమ ఎదిగేలా చేసుకుని ఒక్కటవ్వాలి. ‘ఏ మాయ చేసావే’ చెప్పింది ఇదే. ఇక అర్జున్ రెడ్డి మార్కు ప్రేమ కూడా ఉంది. ప్రేమను సంపూర్ణం గా అనుభవించడం. వియోగాన్ని సంపూర్ణం గా అనుభవించడం. ఏ విధంగా అయినా పూర్తిగా ప్రేమలో మునగడం ఇది. ఏమైనా ప్రేమ జగత్తుకు రాజు, రాణి అబ్బాయి, అమ్మాయిలే. వారి రాజ్యాన్ని వారు విస్తరించుకుంటూ వెళుతుంటారు. ఆ రాజ్యం తక్కువసార్లే ఓడిపోగలదు. ఎక్కువసార్లు అది చెప్పేమాట– అమరం అఖిలం ప్రేమ. – సాక్షి ఫ్యామిలీ -
ఫిబ్రవరి 14: లవర్స్‌కు శ్రీరామ్ సేన హెచ్చరిక
బెంగళూరు: వాలంటైన్స్ డే అని ప్రేమికుల రోజు అని ఫిబ్రవరి 14వ తేదీన యువత ఒక ఉత్సవం మాదిరి చేసుకుంటుంది. ఏడాది పొడవునా యువతీయువకులకు అనడం బదులు ప్రేమికులకు ఉండే ఒకే ఒకరోజు. ఈరోజు జీవితంలో మరచిపోని విధంగా చేసుకోవాలని భావిస్తుంటారు. అలాంటి వారికి హిందూ సంఘాలు అడ్డంకిగా మారడం సహజం. సహజంగానే ఈసారి కూడా హిందూత్వ సంఘాలు ప్రేమికులకు హెచ్చరిక జారీ చేశాయి. లవర్స్ డే పాశ్చాత్య సంస్కృతి అని శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ తెలిపారు. ఫిబ్రవరి 14వ తేదీ వాలంటైన్స్ డేని ‘మాతా పిత పూజా దినోత్సవం’గా తాము పాటిస్తామని ప్రకటించారు. వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ పేరిట కర్ణాటకలో వివిధ చోట్ల జరిగే అసభ్య కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనికోసం తమ వలంటీర్లను నియమిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏడాది తాము రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజును మాతా పిత దినోత్సవంగా నిర్వహిస్తాం.. తల్లిదండ్రులను గౌరవించే రోజుగా పరిగణిస్తామని వివరించారు. కర్ణాటకలో 60 నుంచి 70 చోట్ల ఈ విధమైన కార్యక్రమాలు జరుగుతాయని ప్రమోద్ వెల్లడించారు. ఫిబ్రవరి 14వ తేదీ రోజు పబ్‌లు, బార్లు , ఐస్‌క్రీమ్ పార్లర్లు, పార్కులు వంటివాటిపై తమ సభ్యుల నిఘా ఉంటుందని ప్రమోద్ ముతాలిక్ స్పష్టం చేశారు. అయితే అసభ్యకర కార్యక్రమాలకు పాల్పడితే మాత్రం అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము పోలీసులకు సహకరిస్తారని తెలిపారు. 2009లో బెంగళూరులో శ్రీరామ్ సేన ప్రతినిధుల వైఖరి తీవ్ర వివాదం రేపిన విషయం తెలిసిందే. ప్రేమికుల రోజు మంగుళూరులోని ఓ పబ్ లోడ్యాన్స్లు చేస్తున్న యువతీయువకులపై దాడికి పాల్పడ్డారు. 2018లో కూడా ఈ విధమైన ఘటన చోటుచేసుకోగా దానికి కారకుడిగా పేర్కొంటూ ప్రమోద్ ముతాలిక్ను అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు అలాంటిదేమీ లేకుండా పోలీసులకు తాము సహకరిస్తామని శ్రీరామ్ సేన ప్రకటించింది. -
ప్రేమికుల రోజు; ఈ రంగు ‘విఫల ప్రేమ’కు సింబల్!
వాలెంటైన్ డే ను అర్ధవంతంగా, ఆనందంగా జరుపుకోవాలనే వారు ఈ రోజుకోసం ఎదురుచూస్తూనే ఉంటారు. ఆ రోజున నచ్చిన వారికి గులాబీలను, కానుకలు ఇచ్చి తమ ప్రేమను పంచుకుంటారు. ప్రత్యేకమైన ఈ రోజున ఏ కలర్ డ్రెస్ వేసుకుని బయటకు వెళితే ఏంటో అనే ఆలోచన ఉండేవాళ్లూ సహజం. సహజంగానే రెడ్ కలర్ ప్రేమకు, పసుపు స్నేహానికి.. అని బేరీజులు వేసుకునేవారూ ఉంటారు. కలర్ డ్రెస్సింగ్ విషయంలో గ్లోబల్ వైజ్‌గా ఉన్న కలర్‌ఫుల్ ముచ్చట్లివి.. నీలం: ఈ రంగు డ్రెస్‌ను వాలెంటైన్ డే రోజున ధరిస్తే ‘ఎవ్వరితోనూ ప్రేమలో లేను’ అనే అర్ధమట. ఎరుపు: ఎలాంటి సందేహం లేకుండా ప్రేమకు చిహ్నంగా ఈ రంగును వాడుతూనే ఉంటారు. ఎరుపు రంగు డ్రెస్ ధరిస్తే ‘ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్టు’ అని గుర్తు అట. పచ్చ: ‘ఆశ’ను చిగురంపజేసే సుగుణం ఆకుపచ్చ రంగుకు ఇచ్చేశారు. సో.. ఎదురుచూడండి అని చెప్పకనే చెబుతున్న విషయమట. ఆరెంజ్ ప్రేమికుల రోజున నచ్చినవారికి ‘ప్రపోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు’ అన్నమాటట. నలుపు: హాట్ కలర్‌గా పేరున్న రంగు నలుపు. ఈ డ్రెస్‌లో ఎవరినైనా ఇట్టే కట్టిపడేయచ్చు. కానీ, ప్రేమికుల రోజున దీనిని ధరిస్తే మాత్రం ‘విఫల ప్రేమ’కు అర్ధమట. తెలుపు: ఈ రంగు ప్రేమికుల రోజున ఎదుటివారికి మనల్ని ఎలా పరిచయం చేస్తుందంటే.. మీకు ‘వేరొకరితో ‘పెళ్లికి నిర్ణయమైపోయింద’ని అర్ధమట. పసుపు: ఎలాగూ ఈ రంగు గురించి తెలిసిందే సింపుల్‌గా ‘ఫ్రెండ్షిప్’ అని చెప్పకనే చెప్పడం అన్నమాట. ఈ రోజున కేవలం స్నేహానికే నా ప్రాముఖ్యత అని పసుపు రంగు డ్రెస్ ద్వారా తెలియజేయడం. బూడిద: ‘నా కెవ్వరిమీదా ఇంట్రస్ట్ లేదు’ అనే వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం గ్రే కలర్ ఇస్తుందట. పింక్: గులాబీ రంగును ప్రేమికుల రోజున ధరించారు అంటే మీరు ‘ప్రపోజల్స్‌కి సిద్ధం’గా ఉన్నారని అర్ధం వస్తుందట. అందుకని, పింక్ డ్రెస్ ధరించేవారు కొంచెం ఆలోచించుకోవాలట. పర్పుల్: వంగపండు రంగు అంటారు దీన్నే. ‘మొదటి చూపులోనే ఎవరితోనో ప్రేమలో పడ్డారు’ అని తెలిసిపోతుందట. పీచ్: ‘నాకు ఫ్రెండ్స్, పార్టనర్ లేరు’ అనే భావం వస్తుందట. ఎదుటి వారు కొంత జాలి కూడా చూపుతారట. అందుకని, పీచ్ కలర్ డ్రెస్ ధరించేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిదట. చదవండి: సింగర్ సునీతకు ‘వాలెంటైన్’ డే సర్ప్రైజ్ కిస్ చేస్తే ఇది ‘మిస్’ కారు.. -
సింగర్ సునీతకు ‘వాలెంటైన్’ డే సర్ప్రైజ్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సింగర్ సునీతకు భర్త రామ్వీరపనేని ప్రేమికులరోజు ను ఘనంగా సెలబ్రేట్ చేసుకోనున్నారు. మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన తరువాత వస్తున్న తొలి వాలెంటైన్స్ డే కావడంతో ఆయన భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట. తన వాలెంటైన్‌కు విలువైన కానుక ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విహార యాత్రకు వెళ్లి వచ్చిన దంపతులు తాజాగా ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా అయిపోయారు. ముఖ్యంగా సునీత నేపథ్య గాయనిగా తన కుమార్తెను సెటిల్ చేసేందుకు భారీ కసరత్తే చేస్తున్నారట. మరోవైపు సునీత త్వరలోనే పాడుతా తీయగా తరహాలో ఒక సరికొత్త ప్రోగ్రాంను ప్లాన్ చేస్తున్నట్లు పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణం కరోనాతో కన్నుమూసిన నేపథ్యంలో ఆ లోటును సాధ్యమైనంతవరకు భర్తీ చేయాలని సునీత యోచిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే మ్యూజికల్ రియాలిటీషో సన్నాహకాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఎపుడూ యాక్టివ్‌గా ఉండే సునీతారామ్ దీనిపై ఎప్పటికి క్లారిటీ ఇస్తారో వేచి చూడాల్సిందే! -
అమెరికా: ప్రేమలోకంలో అధ్యక్ష దంపతులు
వాషింగ్టన్: ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆ దేశ ప్రథమ పౌరురాలు జిల్ ప్రేమలోకంలో మునిగారు. ఈ సందర్భంగా అధ్యక్ష భవనం ఆవరణంతా లవ్ సింబల్స్‌తో నింపేశారు. దేశ ప్రజలందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా వాషింగ్టన్‌లోని శ్వేతసౌధం ఆవరణలో మొత్తం హృదయ (హార్ట్) గుర్తులు, ఐక్యత (యూనిటీ), హోప్ (నమ్మకం), ప్రేమ (లవ్) అని రాసి ఉన్న ఎర్రటి హార్ట్ సింబల్స్, పోస్టర్లు అధ్యక్ష భవనం ఆవరణలో అలంకరించారు. బైడెన్, ఆయన భార్య జిల్‌తో పాటు వారు పెంచుకుంటున్నరెండు జర్మన్ శునకాలు ఛాంప్, మేజర్‌తో పాటు ఆ పచ్చిక బయళ్లల్లో కలియ తిరిగారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఒకరినొకరు చూసుకంటూ తమ పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ‘ఈ కరోనా సమయంలో ప్రతి అమెరికా పౌరుడు కొంత నిరాశగా ఉండవచ్చునని, వేలంటైన్ డే ని మునుపటిలా ఉత్సాహంగా జరుపుకోలేకపోవచ్చు’ అని ప్రథమ పౌరురాలు జిల్ తెలిపారు. కొద్దిపాటి జాయ్, లిటిల్ హోప్ ఉండాలని సూచించారు. అయితే ‘ఇది ఫస్ట్ లేడీ ఫేవరేట్ డే’ అని బైడెన్ పేర్కొన్నారు. తాను అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన కార్యాలయంలో హార్ట్ సింబల్స్‌తో ఉన్న పోస్టర్లను జిల్ నింపేదని గుర్తుచేశారు. 43 ఏళ్ల వివాహ అనుబంధాన్ని బైడెన్ దంపతులు నెమరువేసుకున్నారు. I know the last year has been difficult and painful for all of us. I hope Jill’s Valentine’s Day message helped brighten your day. pic.twitter.com/jdEFMSDefm — President Biden (@POTUS) February 13, 2021 -
కిస్ చేస్తే ఇది ‘మిస్’ కారు..
కిస్.. అంటే ముద్దు పెట్టుకోవడం అని సింపుల్‌గా తీసిపారేయడానికి లేదు. ముద్దువల్ల వ్యక్తులు పొందే అనుభూతి అనిర్వచనీయం. ఇది మనసుకు దగ్గరైన వారితో మాత్రమే పంచుకునే ఒక తియ్యని అనుభూతి. అందుకే వాలెంటైన్స్ వీక్‌లో లవర్స్ ఈరోజు (ఫిబ్రవరి 13)ను కిస్‌డే గా సెలబ్రెట్ చేసుకుంటారు. అయితే ఈ కిస్‌లో అనిర్వచనీయ భావాలతోపాటు, మనసును ఉత్సాహపరిచే రొమాంటిక్ ఫీలింగ్స్‌లు ఎన్నో ఉంటాయి. అవేంటో చదివేయండి... ప్రేమికులు తమ మనసులోని ప్రేమను, వారి లవర్‌కి కొంత రొమాంటిక్‌గా వ్యక్తపరచుకోవాలన్నప్పుడు కిస్ చేస్తారు. ఈ చర్యతో వారే తమ ప్రపంచమని మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తారు. ఇలా చేయడం వలన ప్రేమించిన వారి పట్ల తమకున్న ప్రేమ, నమ్మకం, పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. ప్రేమికులు గాఢంగా చుంబించుకోవడం వలన కొన్ని రకాల రసాయనాలు విడుదలై ఒత్తిడి తగ్గి వారి మధ్య ఒక బాండింగ్ క్రియేట్ అవుతుందని కొన్ని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. కిస్ చేస్తే.. తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గర తీసుకొని నుదుటి పైన కిస్ చేస్తారు. ఈ చర్యతో వారిని ఆశీర్వదిస్తారు. ఒక్కొసారి పిల్లలు తమ వారు కిస్‌చేయడం వలన తామున్నమనే భరోసా ఏర్పడుతుందని అనుకుంటారు. చుంబించుకోవడం అనే చర్య వలన మానసిక ఆనందం కలిగి మాములు కన్నా 5 ఏళ్ల ఆయుర్దాయం పెరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. చదవండి: ప్రేమకు తాళం వేస్తున్న ప్రేమికులు ఎందరో! -
ప్రపోజ్ డే: హీరోకు వెరైటీ లవ్ ప్రపోజల్
ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14వ తేదీ ఉంటే దానికన్నా ముందే వారం రోజుల పాటు వివిధ రకాల సంబరాలు జరుగుతుంటాయి. చాక్లెట్ డే, ప్రపోజ్ డే తదితర రోజులు ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రపోజ్ డే వచ్చింది. ఈ ప్రపోజల్ డే నాడు హీరోకు ఓ అభిమాని వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పింది. అతడిని ఎంత ప్రేమిస్తుందో సౌర వ్యవస్థను ఉదాహరణగా చేసుకుని చెప్పింది. నా సౌర వ్యవస్థ మీరే.. నాకన్నీ మీరే అని సోషల్ మీడియాలో ప్రపోజ్ చేసింది. తెలుగు, తమిళ్, మళయాలం, హిందీతో పాటు మొత్తం ఏడు భాషల్లో నటించిన వ్యక్తి మాధవన్. ఆయనకు తమిళనాడులో వీరాభిమనులు ఉన్నారు. ఆయన సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలతో అందరికీ సుపరుచితులు. అయితే బుధవారం ప్రపోజ్ డే సందర్భంగా మాధవన్‌కు ఓ అభిమాని లవ్ ప్రపోజల్ వినూత్నంగా చేసింది. ‘ప్రపంచంలో 8 గ్రహాలు, 204 దేశాలు, 7 సముద్రాలు, 7,707 ద్వీపాలు, 7.8 బిలియన్ ప్రజలు ఉన్నారు. నేను మరణించేవరకు మిమ్మల్ని ప్రేమిస్తా. దయచేసి నా ప్రేమను అంగీకరించండి. మీరే నా జీవితం. నా ప్రపంచం. నా సౌర వ్యవస్థ. నాకు అన్ని మీరే’ అంటూ ఓ యువతి మాధవన్‌కు ప్రపోజ్ చేసింది. తన ప్రేమనంతా కలిపి వినూత్నంగా ప్రపోజ్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఆమె ప్రపోజల్‌కు మాధవన్ స్పందిస్తూ.. ‘నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలి. మీ ప్రేమకు నా కృతజ్ఞతలు’ అని బదులిచ్చారు. మాధవన్ ఇటీవల కాలంలో నాగచైతన్యతో ‘సవ్యసాచి’, అనుష్కతో కలిసి ‘నిశ్శబ్దం’ సినిమా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మాధవన్ ‘రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్’ అనే సినిమా తీస్తున్నారు. Haan .. haaan ... and Aur ek Haan. 😆😆😆😂😂😂❤️❤️❤️🙏god bless you... thank you for the love . https://t.co/H2FnJyhV82 — Ranganathan Madhavan (@ActorMadhavan) February 8, 2021 -
ప్రపోజ్ కోసం, ఎంతటి రిస్కు అయినా ఓకే!
ప్రేమికులు ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్ డేగా జరుపుకుంటారు. అయితే ఈ వారం రోజులను సంబరంగా చేసుకుంటారు. ఈ వారంలో వచ్చే రోజుకు ఒక్కో స్పెషాలిటీ ఉంది. అలా రోజ్ డేతో మొదలయ్యే ప్రేమికుల హుషారు వాలేంటైన్స్ డేతో ముగుస్తుంది. ఫిబ్రవరి 7ను రోజ్ డే జరుపుకున్న ప్రేమికులు, ఈ రోజు ప్రపోజ్ డే జరుపుకుంటారు. ప్రేమించడం ఒక ఆర్ట్ అయితే ప్రేమను వ్యక్తం చేయడం మరో గొప్ప ఆర్ట్..! ఎలా ప్రపోజ్ చేస్తారో తెలుసుకుందాం.. ప్రేమించిన వారికి ఏ గిఫ్ట్ ఇస్తే ఇంప్రెస్ అవుతారో అని ఆలోచిస్తూ నానాతంటాలు పడుతుంటారు చాలా మంది. ఇందుకోసం గ్రీటింగ్ కార్డులు, చాక్లెట్లు, గిఫ్ట్‌లు , పువ్వులు ఇలా రకారకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రేమికుల మోటో మాత్రం ఒక్కటే.. వీటిలో ఏదైనా వారికి సర్ప్రైజ్ అందించి మనసులో ఉన్న ప్రేమను చాటుకుంటారు. ఇందుకోసం ప్రేమించిన వారిని అనుసరించడం, వారి మిత్రులను కలవడం, వారి అభిరుచులు తెలుసుకోవడం వంటి చిన్నపాటి పోరాటాలు కూడా చేస్తారు. చివరికి వారికి నచ్చింది ఇచ్చి, ఆ కళ్లలో ఆనందం చూసి, వరల్డ్ కప్ గెలిచినంత సంబరపడతారు. అయితే ఈ ప్రపోజ్‌డేను కొత్తగా ప్రేమికులే కాకుండా , ఇప్పటికీ ప్రేమించి పెళ్లిచేసుకున్న దంపతులు ఈ రోజు ఒకరికొకరు ప్రత్యేక బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా చేయడం వల్ల వారి మధ్య బంధం మరింత దృఢపడుతుందని నమ్ముతారు. సాహసాలకు సిద్ధపడతారు.. మొదటిసారిగా ఇద్దరూ కలుసుకున్న చోటులో కొంత మంది ప్రేమికులు ప్రపోస్ చేస్తే, మరికొందరు టీ-షర్ట్‌మీద ఆక్సెప్ట్ మై లవ్ అని రాసుకొని ప్రేమికుల ఎదుట వాలిపోతారు. ఒక్కోసారి తమకు తామే ఒక బహుమతిగా మారిపోయి గిఫ్ట్ బాక్స్‌గా తమ వారి దగ్గరికి వెళతారు. తమదైన శైలిలో ప్రేమ విషయం చెప్పేందుకు మరికొందరు జూలియట్లు ప్రేమించిన వారి వివరాలు తెలుసుకునేందుకు సాహసాలకు సిద్ధపడతారు. ఆక్రమంలో చుట్టుపక్కల వారితోను, మిత్రులతోను చివాట్లు కూడా తింటారు. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రేమికుల సమాచారం సేకరించి వారికి ఇష్టమైంది బహుమతిగా ఇవ్వడానికి ఆరాటపడతారు. -
గుడ్‌న్యూస్ : ప్రేమికుల రోజునే 'రాధే శ్యామ్’ టీజర్
ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌డే సందర్భంగా ‘రాధే శ్యామ్’ టీజర్ విడుదల కానుంది. అదే రోజున సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రాధేశ్యామ్ షూటింగ్ దాదాపు పూర్తయినా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఈ సినిమా పీరియాడికల్ లవ్‌స్టోరీ కావడంతో ప్రేమికుల రోజునే ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది. రాధాకష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా అయిదు బాషలలో విడుదల కాబోతుంది. (రాధేశ్యామ్ స్టోరీలైన్ తెలిసిపోయింది!) యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్, యువీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనుందని సమాచారం. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం క్లైమాక్స్ సీన్ల కోసం దాదాపుగా 30 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా సెట్స్ వేస్తున్నట్లు వార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ మూవీ ‘గ్లాడియేటర్’కి యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన నిక్ పోవెల్ ‘రాధేశ్యామ్’కు వర్క్ చేస్తుండటం విశేషం. చదవండి: (ఆదిపురుష్ ఆరంభ్.. ప్రభాస్ సర్ప్రైజ్) Get ready for the biggest love announcement of the decade! ✨♥️ 14th Feb, save the date! 💕 #RadheShyamPreTeaser ▶️ https://t.co/ALrESp2z7v Starring #Prabhas & @hegdepooja Directed by @director_radhaa Presented by @UVKrishnamRaju garu pic.twitter.com/TGyV5JVXLD — UV Creations (@UV_Creations) February 6, 2021 -
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ టీజర్ రాబోతుందా!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. షూటింగ్ పూర్తి కావస్తున్నా కూడా సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మరోవైపు తెలుగు ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ డేట్స్‌ల జాతర కొనసాగుతోంది. ఇప్పటి నుంచి వచ్చే ఏడాది తేదీలకు కూడా పోటీపడి మరి విడుదల తేదీలు ప్రకటిస్తున్నారు. బాలయ్య, చిరంజీవి, పవన్, వెంకటేష్, అల్లు అర్జున్, రవితేజ, ఒకరా ఇద్దరా అందరూ హీరోలు విడుదల తేదిలు ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపారు. అయితే వచ్చి ప్రభాస్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తన అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రాధేశ్యామ్ టీజర్ ఎప్పుడు విడుదలవుతుందనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ క్రమంలో ప్రభాస్ తన అభిమానులకు త్వరలోనే శుభవార్త అందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. చదవండి: ఆదిపురుష్ ఆరంభ్.. ప్రభాస్ సర్ప్రైజ్ ఈ సినిమా టీజర్ త్వరలో రాబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌డే సందర్భంగా ‘రాధే శ్యామ్’ టీజర్ విడుదలైయ్యే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆశిస్తున్నారు. త్వరలోనే చిత్రయూనిట్ టీజర్‌తోపాటు విడుదల తేదీని కూడా ఖరారు చేస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ట్విటర్లో #RadheShyamTeaser అనే హ్యష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ అమర ప్రేమికుల టీజర్ ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో చూడాలి. చదవండి: ఉప్పెన ట్రైలర్: ‘మరీ ఇంత అందగత్తె పుట్టిందంటే..’ ఇక ప్రభాస్, పూజా హెగ్డే జోడీగా రూపొందుతోన్న 'రాధేశ్యామ్' పీరియాడికల్ లవ్‌స్టోరిగా రూపొందుతోంది. పాన్ ఇండియా మూవీగా అయిదు బాషలలో విడుదల కాబోతుంది. ప్రభాస్, కృష్ణంరాజు మద్య కొన్ని సన్నివేశాలు మినహా దాదాపు చిత్రీకరణంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్, యువీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనుందని సమాచారం.