ఆ స్టేషన్‌ ఖర్చు కోటీ అరవై లక్షలట.. | Prabhas Radhe Shyam train set costs Rs 1.6 Cr | Sakshi
Sakshi News home page

ఆ స్టేషన్‌ ఖర్చు కోటీ అరవై లక్షలట..

Published Fri, Feb 19 2021 3:00 AM | Last Updated on Fri, Feb 19 2021 8:28 AM

Prabhas Radhe Shyam train set costs Rs 1.6 Cr - Sakshi

ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందనే విషయం తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ వీడియోలో ఓ రైల్వేస్టేషన్‌ కనబడుతుంది. ఇటలీలోని స్టేషన్‌లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలని ముందు అనుకున్నారు. అయితే కోవిడ్‌ నేపథ్యంలో ఆ ఆలోచనను విరమించుకుని ఇక్కడే రైల్వేస్టేషన్‌ సెట్‌ వేశారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సెట్‌ వర్క్‌ జరిగింది. కోటీ అరవై లక్షల ఖర్చుతో సెట్‌ని నిర్మించారట. 30 రోజుల పాటు 250 మంది పని చేశారని తెలిసింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌  నిర్మిస్తున్నాయి. 1970లలో ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథాచిత్రం ఇది. ఈ ఏడాది జులై 30న ఈ చిత్రం విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement