Prabhas
-
ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, ధోనీ.. హెయిర్ కట్ కోసం ఎంత చెల్లిస్తారంటే..
జీవితంలో ఏదైనా జరగవచ్చు. సాధారణ వృత్తి అనుకున్న దానిలో కూడా లక్షలు గడించవచ్చు. అందరూ చేసే అదే వృత్తిలో కొందరు మాత్రమే పాపులర్ అవుతుంటారు. దీన్నే లక్ అంటారనుకుంటా.. కానీ, దాని వెనుక ఎంతో కష్టం కూడా ఉండొచ్చు. కొందరి జీవిత సక్సెస్ స్టోరీలు చూస్తే మనకు నిజమే అనిపిస్తుంది. అందుకు చిన్న ఉదాహరణ ఆలీమ్ హకీమ్. సాధారణంగా ఒక సెలూన్ షాప్‌నకు వెళితే అక్కడ ఒక మనిషి హెయిర్ కటింగ్‌కు రూ.150 తీసుకుంటారు. లగ్జరీ సెలూన్ అయితే రూ.500 తీసుకుంటారు. ఇక సెలబ్రిటీస్‌కు ఇంకా ఎక్కువ మొత్తంలో చెల్లిస్తుండవచ్చు. అయితే ఒక్కసారి కటింగ్‌కు లక్షల్లో చెల్లించడం అనేది ఎప్పుడైనా విని ఉంటామా..? మనం విని ఉండకపోవచ్చు. ఇది జరుగుతున్న వాస్తవం. ఆలీమ్ హకీమ్ అనే హెయిర్‌స్టర్ గురించే ఇదంతా. ఇతను హాలీవుడ్ హెయిర్‌స్టర్. మొదట్లో ఒకరికి హెయిర్ కట్ చేస్తే రూ.20 తీసుకునేవారట. ఆ తరువాత దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఇప్పుడు మినిమమ్ లక్ష రూపాయల వరకూ తీసుకుంటున్నారని సమాచారం. ఏంటి ఒకసారి జుత్తు కట్ చేస్తే లక్ష ఎవరు చెల్లిస్తారు ? అని ఆశ్చర్యపోతున్నారా. నిజమేనండి..? ఇది కూడా మినిమమ్ ధర మాత్రమేనట.. అత్యధికంగా ఆయన రూ.2.5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని సమాచారం. ఆలీమ్ హకీమ్ ఇప్పుడు సాదారణ హెయిరిస్ట్ కాదు. సెలబ్రిటీల హెయిరిస్ట్. అదీ మామూలు సెలబ్రిటీలకు కాదు. సూపర్‌స్టార్స్‌కు హెయిర్‌స్టర్. ఈయన తల మీద కత్తెర పెట్టారంటే అక్షరాలు లక్ష చెల్లించాల్సిందేనట. హాలీవుడ్‌కు చెందిన ఈయనకు కస్టమర్స్ అందరూ ఇండియాకు చెందిన వారే కావడం విశేషం. ఆలీమ్ హకీమ్ కస్టమర్స్ లిస్ట్ ఇదేఈయనకు సినీ, క్రికెట్ క్రీడాకారుల మధ్య మంచి క్రేజ్ ఉంది. ఈయన కస్టమర్లంతా సినీస్టార్స్, క్రికెట్స్టార్స్ వంటి వారే. అందులో సూపర్‌స్టార్ రజనీకాంత్,విజయ్ సేతుపతి, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అభిషేక్ బచ్చన్, క్రికెట్ స్టార్ ఎంఎస్.ధోని, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్,చాహల్ వంటి సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. రజనీకాంత్ తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో ఆయనకు హెయిర్స్టర్గా పని చేసింది ఆలీమ్ హకీమే. అటువంటింది ఆయన హెయిర్‌స్టైల్ పని తనం. ఏదైనా ఒక్కసారి పాపులర్ అయితే ఆ తరువాత పేరైనా, డబ్బైనా వెతుక్కుంటూ వస్తుందనడానికి ఇదొక ఉదాహరణ. -
ఒకటికి రెండు
తెలుగు సినిమాల గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, సలార్, కల్కి 2898 ఏడీ, దేవర, పుష్ప’ వంటి చిత్రాల విజయాలు అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలన్నింటిలోని కామన్ పాయింట్ ఏంటంటే... ఈ సినిమా కథలన్నీ భారీ స్థాయిలో ఉన్నాయి.అందుకే ఒకటి కాదు... రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ సినిమాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఒకటికి రెండు ట్రెండ్ టాలీవుడ్లో ఊపందుకుంది. భారీ కథలు ఎంపిక చేసుకుని, ఆ కథను పలు భాగాలుగా ఆడియన్స్‌కు చూపిస్తున్నారు మేకర్స్. ఈ కోవలో పెద్ద కథలతో రానున్న కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం.ఉగాదికి రిలీజ్ హీరో మహేశ్‌బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ చిత్రీకరణ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను ఇటీవలే ఒడిశాలోని కోరాపుట్‌లో పూర్తి చేశారు. నెక్ట్స్ షెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్ చేశారు.కాగా దక్షిణాఫ్రికా, కెన్యా దేశాల్లో ఈ మూవీ చిత్రీకరణ జరగనుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని, తొలి భాగం 2026 చివర్లో లేదా 2027 ఉగాది సమయంలో ప్రేక్షకుల ముందుకు రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన ‘బాహుబలి’ సినిమా ‘బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్’ అంటూ రెండు భాగాలుగా వచ్చి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు కెరీర్‌లోని ఈ 29వ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైతే, మహేశ్‌బాబు కెరీర్లో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి చిత్రం ఇదే అవుతుంది.ఈ ఏడాదిలోనే రాజా సాబ్ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ హీరోగా చేసే సినిమాలు భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. రెండు భాగాలుగా వచ్చిన ‘బాహుబలి’ సినిమా బ్లాక్‌బస్టర్ సాధించడంతో ప్రభాస్ నెక్ట్స్ సినిమాలు కూడా భారీ స్థాయిలో రూపొందుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘కల్కి 2898 ఏడీ, సలార్’ చిత్రాలు ఫ్రాంచైజీలుగా రానున్నాయి. ఈ రెండు సినిమాల తొలి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చి, సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.మలి భాగాల చిత్రీకరణకు ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ప్రభాస్ హీరోగా చేస్తున్న మరో సినిమా ‘రాజా సాబ్’ కథ కూడా పెద్దదే. ఈ హారర్ కామెడీ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మూడేళ్లుగా కొనసాగుతోంది. మూడు తరాలు, ఆ తరాలకు చెందిన ఆత్మలు, హారర్ ఎలిమెంట్స్ వంటి అంశాలతో ‘రాజా సాబ్’ మూవీ రెండు భాగాలుగా రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు.ఇప్పటికే ‘రాజా సాబ్’ సినిమా నుంచి ప్రభాస్‌కు చెందిన రెండు డిఫరెంట్ లుక్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సింది. కానీ కొంత టాకీ పార్టు, సాంగ్స్ షూట్, వీఎఫ్ఎక్స్... వంటివి పెండింగ్ ఉండటంతో ‘రాజా సాబ్’ సినిమా రిలీజ్ వాయిదా పడనుంది. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్ కానుందని సమాచారం. వీరమల్లు పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హిస్టారికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగంగా ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ మే 9న విడుదల కానుంది. 17వ శతాబ్దంలో జరిగే ఈ కథలో పవన్ కల్యాణ్ కథ రీత్యా ఓ దొంగ తరహా పాత్రలో కనిపిస్తారని తెలిసింది. ఈ మూవీలో నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, సత్యరాజ్, బాబీ డియోల్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. డబ్బింగ్ పనులూ మొదలయ్యాయి. ఏఎమ్ రత్నం, అద్దంకి దయాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి స్వరకర్త.కింగ్డమ్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారట విజయ్ దేవరకొండ. ఈ చిత్రంలో విజయ్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నామని ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తొలి భాగం మే 30న రిలీజ్ కానుంది. ఈ పీరియాడికల్ ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్‌లో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని సమాచారం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరకర్త.కోహినూర్ వజ్రం కోసం...‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందనున్న హిస్టారికల్ ఫిల్మ్ ‘కోహినూర్’. ‘ది కింగ్ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్’ అనేది క్యాప్షన్. గత ఏడాది దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. ఈ సినిమాకు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించనున్నారని, 2026 జనవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నామని కూడా అప్పట్లో మేకర్స్ వెల్లడించారు. కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం అనే అంశం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుంది.‘భద్రకాళి దేవత మహిమగల వజ్రం సామ్రాజ్యవాదుల చేతుల్లోకి వెళ్లింది. కోహినూర్ వజ్రాన్ని తిరిగి మూలాలకు తీసుకు రావడానికి ఓ యువకుడు సాగించే, చారిత్రాత్మక ప్రయాణం నేపథ్యంలో ఈ మూవీ కథ ఉంటుంది’’ అని ఈ మూవీ గురించి మేకర్స్ పేర్కొన్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక హీరో సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్ కాంబినేషన్లో ‘క్షణం, కృష్ణ అండ్ హీజ్ లీల’ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో మూడో చిత్రంగా ‘కోహినూర్’ తెరకెక్కనుంది.ఏటిగట్టు కథలు హీరో సాయిదుర్గా తేజ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న పీరియాడికల్ మాస్ ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కేపీని దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను దాదాపు రూ. 125 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ యాక్షన్ ఫిల్మ్ కోసం విదేశాల్లో ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్నారు సాయిదుర్గా తేజ్.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ మూవీలో సంజయ్ దత్ మరో లీడ్ రోల్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. కాగా ఈ మూవీ కూడా రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.స్వయంభూ నిఖిల్ నటిస్తున్న హిస్టారికల్ అండ్ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త, నభా నటేష్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, భారీ స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సునీల్ ఓ సర్ప్రైజింగ్ క్యారెక్టర్లో కనిపించనున్నారని తెలిసింది. కాగా ఈ మూవీ చిత్రీకరణ 95 శాతం పూర్తయినట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు నిఖిల్.‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది. తొలి భాగాన్ని ఈ ఏడాదిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఇక ఈ చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ వంటి విద్యల్లో నిఖిల్ ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. మిరాయ్ సాహసాలు ‘హను–మాన్’తో భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించారు హీరో తేజ సజ్జా. ఆ మూవీ తర్వాత తేజ సజ్జా చేస్తున్న మరో మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మంచు మనోజ్ విలన్ రోల్ చేస్తున్నారు.ఈ సినిమాలో తేజ సజ్జా సాహసాలు, యాక్షన్ సీక్వెన్స్ సూపర్‌గా ఉంటాయట. కాగా ‘మిరాయ్’ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతున్నట్లుగా తెలిసింది. ఈ సినిమాను ఈ ఆగస్టు 1న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. సో... ఆ రోజున ‘మిరాయ్’ సినిమా తొలి భాగం విడుదల కావొచ్చని ఊహించవచ్చు. ఇలా రెండు భాగాలుగా విడుదల కానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
ప్రభాస్‌కి అన్నయ్యగా..?
ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ అనే సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించనున్నారట. అది కూడా ప్రభాస్‌కి అన్నయ్య పాత్రలో ఆయన కనిపించనున్నారని టాక్. తనదైన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తీర్చిదిద్దనున్నారట సందీప్. ఈ మూవీలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు ప్రభాస్.ఇందులో యాక్షన్ ఓ రేంజ్లో ఉంటుందని భోగట్టా. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రూపొందనుంది. బాలీవుడ్లో సంజయ్ దత్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రభాస్‌కి అన్నయ్యగా ఆయన్ని తీసుకోనున్నారట సందీప్. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కి సంజయ్ అయితే పక్కాగా సరితూగుతారన్నది దర్శకుడి ఆలోచనట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్. మరి ‘స్పిరిట్’లో సంజయ్ దత్ భాగం అవుతారా? లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. -
గేమ్ ఛేంజర్ దెబ్బకు ప్రభాస్ రాజసాబ్ కి టెన్షన్
-
కల్కి-2లో ఆ రెండు పాత్రలపైనే ఎక్కువగా ఉంటుంది: నాగ్ అశ్విన్
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. గతేడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. అశ్వత్తామ పాత్రలో అభిమానులను మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి-2 అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగాఎవడే సుబ్రమణ్యం రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కల్కి-2 ఎప్పుడొస్తుందనే విషయంపై నాగ్ అశ్విన్ స్పందించారు.నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది. అది పూర్తయ్యాక షూటింగ్ మొదలు పెడతాం. సెకండ్ పార్ట్‌లో భైరవ, కర్ణకు సంబంధించిన పార్ట్ ఎక్కువగా ఉంటుంది. అంతా సజావుగా సాగితే ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లే ప్రయత్నం చేస్తాం. కల్కిలో మహాభారతం నేపథ్యం, సుమతి, అశ్వత్థామ పాత్రలను డిజైన్ చేసుకుని ఇక్కడి వరకూ వచ్చాం. ప్రభాస్‌ను పార్ట్-2లో ఎక్కువగానే చూపిస్తాం. ఇంకా చాలా వర్క్ ఉంది. విడుదల తేదీ గురించి ఇంకా ఏం డిసైడ్ చేయలేదు.' అని అన్నారు.కాగా.. ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్తో బిజీగా ఉన్నారు. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబల్ స్టార్ నటించనున్నారు. ఈ మూవీకి స్పిరిట్ అనే టైటిల్ ఖరారు చేశారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ తర్వాతే కల్కి-2లో ప్రభాస్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రశాంత్ నీల్‌తో సలార్ 2- శౌర్యంగ పర్వం, ప్రశాంత్ వర్మతో ఓ మూవీ చేయనున్నారు. -
ప్రభాస్ 'రాజాసాబ్' పాటల్ని పక్కనపడేసిన తమన్
ప్రస్తుతం ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్(Thaman) ఒకడు. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా తేడా లేకుండా దాదాపు చాలా భాషల సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇతడు ప్రభాస్ 'రాజాసాబ్' (The Rajasaab Movie) కోసం కూడా పనిచేస్తున్నాడు. కానీ ఇప్పటివరకు ఈ మూవీ కోసం చేసిన సాంగ్స్ అన్నీ పక్కనపడేశానని, కొత్తగా మళ్లీ చేస్తున్నానని అన్నాడు. ఇంతకీ ఏమైంది?(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి సింగర్ మంగ్లీ.. ఫొటోలు వైరల్)ఓ ఇంగ్లీష్ ఎంటర్ టైన్ మెంట్ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో తమన్ చాలా విషయాలు మాట్లాడాడు. కానీ 'రాజాసాబ్' పాటల్ని డస్ట్ బిన్ లో వేశానని చెప్పడం చర్చనీయాంశమైంది. 'రాజాసాబ్'కి పాటలు కంపోజ్ చేయడం ఇప్పుడే మొదలుపెట్టా. షూటింగ్ అంతా దాదాపు పూర్తయిపోయింది. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత సాంగ్స్ చేయడం మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ సర్.. చాలా కాలం తర్వాత కమర్షియల్ పాటలతో వస్తున్నారు''ఈ సినిమాలో ఇంట్రో, మెలోడీ, ఐటమ్ సాంగ్స్ ఉంటాయి. ఓ పాటలో ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ క్రేజీ డ్యాన్స్ చేయబోతున్నారు. రాబోయే ఐదు నెలలో సాంగ్స్ షూటింగ్ పూర్తవుతుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే ఒక్కో పాట చేస్తున్నాం. నిజానికి 'రాజాసాబ్' కోసం చాలా పాటలు చేశారు. కానీ నాకెందుకో మార్చేద్దాం అనిపించింది. ఎప్పుడో ట్యూన్స్ చేసిచ్చా. వాళ్లు షూటింగ్ మొదలుపెట్టలేదు. దీంతో ఇవన్నీ డస్ట్ బిన్ లో పడేశా. కొత్తగా సాంగ్స్ కంపోజ్ చేస్తున్నా. డైరెక్టర్ కి కూడా ఇదంతా చెప్పా. ఇవి ఇప్పుడు వర్కౌట్ కావు. నేను నా మ్యూజిక్ ని చీట్ చేయలేను. ఇలా ఉండటమే కరెక్ట్' అని తమన్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?) -
ప్రభాస్ నెక్స్ట్ మూవీ కి కూడా ఆ డైరెక్టరే ?
-
హను రాఘవపూడికి బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రభాస్..
-
హీరోల చేతిలో ముచ్చటగా మూడు
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు... మూడు సినిమాలను లైన్లో పెట్టేశారు. చిరంజీవి, ప్రభాస్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, నాని, నితిన్, సిద్ధు జొన్నలగడ్డ, శర్వానంద్ వంటి హీరోల చేతిలో ముచ్చటగా మూడు ప్రాజెక్టులున్నాయి. మరికొందరు నాలుగు సినిమాలు చేస్తున్నారు... ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.. చిరంజీవి... భలే జోరు తెలుగులో స్టార్ హీరోల్లో ఒకరైన చిరంజీవి భలే జోరుమీదున్నారు. ఈ సీనియర్ హీరో వరుసగా ప్రతిభావంతులైన యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి వంటి స్టార్‌తో అందివచ్చిన అవకాశాన్ని నిరూపించుకుని, ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో దర్శకులు సైతం ఉన్నారు. చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న వశిష్ఠ మల్లిడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, కునాల్ కపూర్ ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఫ్యాంటసీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదలకు సిద్ధం అవుతోంది.చిరంజీవి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కాంబినేషన్ చాలా రోజుల తర్వాత ‘విశ్వంభర’తో రిపీట్ అవుతోంది. ఇదిలా ఉంటే.. ‘విశ్వంభర’ తర్వాత కూడా చిరంజీవి యంగ్ డైరెక్టర్స్‌తో పని చేయనున్నారు. కెరీర్ ఆరంభం నుంచి వరుస విజయాలు అందుకుంటున్న అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నట్లు చిరంజీవి ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే తొలి చిత్రం ‘దసరా’తో (నాని హీరో) సూపర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు చిరంజీవి పచ్చజెండా ఊపారు. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో ‘ది ప్యారడైజ్’ మూవీ రూపొందిస్తున్నారు. మరి చిరంజీవి ముందుగా అనిల్ మూవీని సెట్స్‌కి తీసుకెళతారా? శ్రీకాంత్ ఓదెల మూవీ చేస్తారా? అనేది వేచి చూడాలి. ఇక ‘వాల్తేరు వీరయ్య’ మూవీ దర్శకుడు బాబీ కూడా చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. పవన్ కల్యాణ్... తీన్మార్‘బ్రో’ (2023) సినిమా తర్వాత పవన్ కల్యాణ్ వెండితెరపై కనిపించలేదు. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు చేస్తున్నారాయన. ప్రస్తుతం ఆయన చేతిలో కూడా మూడు చిత్రాలున్నాయి. వాటిలో ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ఒకటి. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్యప్రోడక్షన్స్ పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.అయితే ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఈ మూవీ విడుదల వాయిదా పడనుందని టాక్. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. కాగా ‘రన్ రాజా రన్, సాహో’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ అనే ఓ మూవీ చేస్తున్నారు పవన్. అలాగే ‘గబ్బర్ సింగ్’ తర్వాత హీరో పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభాస్... ఫుల్ స్వింగ్‘బాహుబలి’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు హీరో ప్రభాస్. ఆ చిత్రాల తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో దూసుకెళుతున్నారాయన. గత ఏడాది ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో (‘కన్నప్ప’ చిత్రంలో అతిథి పాత్ర) బిజీ బిజీగా ఉన్నారు.మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ సినిమా చేస్తున్నారాయన. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీని ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే విధంగా ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. అలాగే మంచు విష్ణు హీరోగా రూపొందిన ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ రుద్రుడిగా అతిథి పాత్ర చేశారు. ఇక ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్: పార్ట్ 1–సీజ్ఫైర్’కి కొనసాగింపుగా ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ రూపొందనున్న సంగతి తెలిసిందే.హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించనున్న ఈ పాన్ ఇండియన్ మూవీ 2026లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’తో పాటు మరో రెండు సినిమాలు ప్రభాస్ తమ బ్యానర్లో చేయనున్నట్లు హోంబలే ఫిల్మస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2027, 2028లో వరుసగా ఈ సినిమాలు విడుదలవుతాయి. నితిన్... జోరుగా‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ’ మూవీతో 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ 2024ని మిస్ అయ్యారు. కానీ ప్రస్తుతం ఆయన మూడు సినిమాలతో జోరుగా ఉన్నారు. ‘భీష్మ’ (2020) వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందిన ద్వితీయ చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది.అదే విధంగా ‘వకీల్ సాబ్’ మూవీ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘తమ్ముడు’ సినిమా చేస్తున్నారు నితిన్. ఇందులో సప్తమి గౌడ కథానాయికగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అక్కా తమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో నితిన్‌కి అక్కగా లయ నటిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా మే 9న విడుదల కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. అలానే తొలి మూవీ ‘బలగం’తో బంపర్ హిట్ సాధించిన వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేయనున్నారు నితిన్. ఏప్రిల్ లేదా మేలో ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుందట. ఎన్టీఆర్... యమా స్పీడు ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’ వంటి వరుస విజయాల తర్వాత హీరో ఎన్టీఆర్ యమా స్పీడుమీదున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు చూడనటువంటి మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని ప్రెజంట్ చేయనున్నారు ప్రశాంత్ నీల్. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వార్ 2’. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారని టాక్. యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. కాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర: పార్ట్ 1’ (2024) హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘దేవర 2’ రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు కొరటాల శివ. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్‌పైకి వెళుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. నాని... ఫుల్ జోష్హీరో నాని ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఓ వైపు హీరోగా రెండు మూడు చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారాయన. నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయిక. యునానిమస్ప్రోడక్షన్స్ తో కలిసి నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో అర్జున్ సర్కార్‌గా పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు నాని.‘హిట్’ సిరీస్‌లో మూడవ భాగంగా ఈ చిత్రం రానుంది. ఇదిలా ఉంటే... ‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఫుల్ రా రస్టిక్ పాత్ర చేస్తున్నారు నాని.తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లిష్, స్పానిష్, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో 2026 మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ రెండు సినిమాల తర్వాత ‘రన్ రాజా రన్, సాహో’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు నాని. భారీ యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని సమాచారం. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ మూవీ నిర్మించనున్నారు. శర్వానంద్... బిజీ బిజీహీరో శర్వానంద్ బిజీ బిజీగా ఉన్నారు. ‘మనమే’ (2024) చిత్రంతో ప్రేక్షకులను నవ్వించిన ఆయన ప్రస్తుతం మూడుప్రాజెక్టులతో దూసుకెళుతున్నారు. అభిలాష్ కంకర దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న చిత్రం ‘శర్వా 36’ (వర్కింగ్ టైటిల్). విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్న్స్పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ బేస్డ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో శర్వానంద్ బైక్ రేసర్‌గా కనిపించనున్నారు. అదే విధంగా శర్వానంద్ నటిస్తున్న 37వ చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాక్షీ వైద్య, సంయుక్త కథానాయికలు.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే శర్వానంద్ నటిస్తున్న 38వ చిత్రం ‘శర్వా 38’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకుడు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. 1960లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇది. ఈ మూవీలో 60ల నాటి పాత్రను పోషించడానికి మేకోవర్ అవుతున్నారు శర్వానంద్. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సిద్ధు జొన్నలగడ్డ... హుషారుగా...‘డీజే టిల్లు’ (2022), ‘టిల్లు స్క్వేర్’(2024) వంటి వరుస హిట్స్‌తో జోరుగా హుషారుగా దూసుకెళుతున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ’జాక్ – కొంచెం క్రాక్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘బేబి’ మూవీ ఫేమ్ వైష్ణవీ చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. కాగా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘తెలుసు కదా’.ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాలతో పాటు ‘టిల్లు క్యూబ్’ కూడా చేయనున్నారు సిద్ధు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తారని ఇప్పటికే ప్రకటించారు ఆ చిత్రనిర్మాత నాగవంశీ.పైన పేర్కొన్న కథానాయకులే కాదు... మరికొందరు కూడా మూడుప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇంకొందరు హీరోల చేతిలో రెండు సినిమాలు ఉండగా మూడో సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. – డేరంగుల జగన్ మోహన్ -
నో డూప్.. ప్రభాస్‌కు సందీప్‌రెడ్డి వంగా కండీషన్!
యానిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga). ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ ప్రభాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ‘స్పిరిట్’(Spirit Movie)అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా ఎప్పుడో పూర్తయింది. ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం..షూటింగ్ స్టార్ అవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ని సరికొత్తగా చూపించబోతున్నాడట సందీప్. తొలిసారి పూర్తి స్థాయి పోలీసు అధికారిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రభాస్‌కి సందీప్ కొన్ని కండీషన్స్ పెట్టినట్లు సమాచారం. షూటింగ్ కోసం నాన్‌స్టాఫ్‌గా 65 రోజుల కాల్షిట్లు ఇవ్వాలని, గ్యాప్ లేకుండా రావాలని ప్రభాస్(Prabhas)కి చెప్పాడట. అలాగే ఇంకో పెద్ద కండీషనే ప్రభాస్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. స్పిరిట్ సినిమా కోసం డూప్ ని వాడే ప్రసక్తే లేదని తెల్చిచెప్పాడట. ప్రతి షాట్ ప్రభాస్‌తోనే చిత్రీకరించాలని కండీషన్ పెట్టాడట. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలందరూ డూప్‌ని సెట్ చేసుకుంటున్నారు. యాక్షన్ సీన్స్‌తో పాటు చాలా సన్నివేశాలను డూప్‌తోనే కానిస్తున్నారు. కొంతమంది హీరోలు అయితే..లాంగ్ షాట్లు, బ్యాక్ షాటులు, క్లోజ్‌లు మినహా మిగతాదంతా డూప్‌తో ముగించాలని కండీషన్స్ పెడుతున్నారు. ప్రభాస్ గత సినిమాల్లో కూడా బాడీ డబుల్స్(డూప్) వాడారు. అయితే సందీప్ మాత్రం సినిమాలోని అన్ని షాట్స్ హీరోనే డైరెక్ట్‌గా చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా షూటింగ్‌ని జూన్ రెండు వారంలో ప్రారంభించాలనుకుంటున్నారట. నాన్ స్టాప్‌గా షూటింగ్ పూర్తి చేసి..వచ్చే సంక్రాంతికి స్పిరిట్‌ని బరిలోకి దింపాలని సందీప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
ప్రభాస్ @ 'బక'.. ఇంతకీ దీని అర్థమేంటి?
ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలున్నాయి. ప్రస్తుతానికైతే రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) ప్రాజెక్టులు చేస్తున్నాడు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' చేస్తాడు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2.. ఇలా చాలానే ఉన్నాయి.ఇవి సరిపోవంటూ ఈ మధ్యే 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మతోనూ ప్రభాస్ సినిమా ఒకటి ఓకే అయింది. దీని లుక్ టెస్ట్ కూడా అయిపోయిందని టాక్. ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది. 'బక' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని టాక్. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ షాకవుతున్నారు.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 2 తెలుగు సినిమాలు)టైటిల్ చూడగానే మీకు కూడా విచిత్రంగా ధ్వనించి ఉంటుంది. అయితే మహాభారతంలోని బకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడుగా. అతడి కథనే ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లు ప్రశాంత్ వర్మ రాశాడని, అందుకే సింపుల్ గా 'బక' అని పెట్టినట్లు తెలుస్తోంది. ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.ఇప్పటివరకు వచ్చిన పౌరాణిక, మైథలాజికల్ సినిమాలతో పోలిస్తే ఈ మూవీ భిన్నంగా ఉంటుందని, పూర్తిగా విజువల్ ఎఫెక్ట్ బేస్డ్ చిత్రమని అంటున్నారు. అలానే ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన సినిమా అని టాక్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
కష్టాల 'రాజాసాబ్'.. అసలేం జరుగుతోంది?
ప్రభాస్ (Prabhas) చేస్తున్న వాటిలో కాస్త తక్కువ బజ్ ఉన్న సినిమా అంటే 'రాజాసాబ్'.(The Rajasaab Movie) ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చినప్పుడు తొలుత డార్లింగ్ ఫ్యాన్స్ వద్దన్నారు. కానీ తర్వాత వచ్చిన కొంత కంటెంట్ చూసి ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం మాత్రం ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు.దర్శకుడు మారుతి.. హారర్ కామెడీ కథతో తీస్తున్న మూవీ 'రాజాసాబ్'. లెక్క ప్రకారం ఈ ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో వాయిదా గ్యారంటీ. కొన్నాళ్ల ముందు టీజర్ గురించి అదిగో, ఇదిగో వచ్చేస్తుందని అన్నారు. కానీ దాని అప్డేట్ ఏంటో చెప్పట్లేదు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)మరోవైపు ఇంకా మూడు పాటలు షూటింగ్ చేయాల్సి ఉందని, కానీ హీరోయిన్లు మాళవిక మోహన్, నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆలస్యమవుతూనే ఉంది. మరోవైపు బడ్జెట్ ప్రాబ్లమ్ కూడా ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. గతేడాది చాలా ఫ్లాప్స్ వల్ల నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాస్త ఇబ్బందుల్లో ఉందని, అందుకే 'రాజాసాబ్' లేట్ అవుతుందని అనుకుంటున్నారు.ఇవన్నీ పక్కనబెడితే ఇప్పటికే 'రాజాసాబ్' ఫుటేజ్ మూడున్నర గంటలు వచ్చిందని, పాటలు కూడా కలిపితే మరో 15 నిమిషాలు పెరుగుతుంది. కాబట్టి లింక్స్ మిస్ కాకుండా వాటిని ఎడిట్ చేయాల్సిన పెద్దపనే ఉందని అంటున్నారు. అలానే ఈ ఏడాది రాబోయే పండగల కోసం కొత్త మూవీస్ ఆల్రెడీ కర్చీఫ్ వేసేశాయి. ఇలా ఇన్ని కష్టాలు పడుతున్న 'రాజాసాబ్'.. ఈ ఏడాది రిలీజ్ అవుతుందా? లేదంటే వచ్చే ఏడాది పడుతుందా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా) -
ప్రభాస్ స్పిరిట్ పై అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
-
తారక్ బాటలో ప్రభాస్
-
'స్పిరిట్' టార్గెట్ రూ.2000 కోట్లు.. సందీప్ సమాధానమిదే
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. తీసింది రెండు మూడు సినిమాలే గానీ దేశవ్యాప్తంగా యమ క్రేజ్ సంపాదించాడు. ఇతడి సినిమాలే అనుకుంటే ఇంటర్వ్యూలు కూడా ఆ రేంజులోనే ఉంటాయి. ప్రస్తుతం 'స్పిరిట్' పనుల్లో బిజీగా ఉన్న ఇతడు.. మూవీ టార్గెట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ తో చేయబోయే సినిమా 'స్పిరిట్'. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు కానీ డార్లింగ్ హీరో వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ మొదలుపెట్టడం ఆలస్యమవుతోంది. సరే ఈ విషయం పక్కనబెడితే రీసెంట్ గా సందీప్.. బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. బోలెడన్ని విషయాల్ని పంచుకున్నాడు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?)అయితే సందీప్ చెప్పిన ఓ సమాధానం మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. 'షాహిద్, రణ్ బీర్ సింగ్ కి వాళ్ల కెరీర్ లోనే పెద్ద హిట్స్ ఇచ్చారు. మరి ప్రభాస్ 'స్పిరిట్'కి మీ టార్గెట్ ఏంటి?' అని అడగ్గా.. ఒకవేళ నా సినిమా, బాహుబలిని దాటాలంటే రూ.2000 కోట్లు కలెక్షన్స్ రావాలి. ఇది చాలా పెద్ద టార్గెట్. ఇప్పటికైతే నేను మంచి సినిమా తీస్తా. బాక్సాఫీస్ దగ్గర అది ఎంత కలెక్ట్ చేస్తుందనేది చూడాలి అని సందీప్ సమాధానమిచ్చాడు.బాహుబలి తర్వాత రెండు సినిమాల విషయంలో ప్రభాస్ కాస్త డౌన్ అయినట్లు కనిపించాడు. కానీ సలార్, కల్కి 2898 చిత్రాలతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. మరి ముఖ్యంగా కల్కి మూవీ రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మరోవైపు సందీప్ చివరగా తీసిన యానిమల్ కూడా వెయ్యి కోట్ల రూపాయలు సాధించింది. దీనిబట్టి చూస్తే 'స్పిరిట్'కి రూ.1000 కోట్లు రావడం పెద్ద విషయం కాదు. కానీ రూ.2000 వస్తే మాత్రం ఇద్దరూ రికార్డ్ సెట్ చేసినట్లే.(ఇదీ చదవండి: బన్నీ నెక్స్ట్ మూవీకి ఏంటి సమస్య?) -
ప్రభాస్ 'బ్రహ్మరాక్షస్'లో ట్రెండింగ్ హీరోయిన్?
సాధారణంగా ఫ్లాప్ వస్తే ఆ సినిమా హీరోయిన్లని పెద్దగా పట్టించుకోరు. కానీ ఓ బ్యూటీకి మాత్రం వరస అవకాశాలొస్తున్నాయి. చేతిలో ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులుండగా.. ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రంలోనూ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ?గతేడాది రిలీజైన 'మిస్టర్ బచ్చన్'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. దీనికి ముందు ఒకటి రెండు హిందీ చిత్రాల్లో నటించిందంతే. బచ్చన్ మూవీ ఫ్లాప్ అయినా సరే దుల్కర్ సల్మాన్ 'కాంత', విజయ్ దేవరకొండ 'కింగడమ్', రామ్ కొత్త మూవీలో ఈమెనే హీరోయిన్.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)పై మూడు కాకుండా సూర్య-వెంకీ అట్లూరి కాంబోలో తీసే మూవీలోనూ భాగ్యశ్రీనే తీసుకోవాలని ఫిక్సయ్యారట. ఇలా చేతినిండా సినిమాలతో ఉన్న ఈమెని ఇప్పుడు ప్రభాస్ కోసం లుక్ టెస్ట్ చేశారట.రీసెంట్ గా ప్రశాంత్ వర్మ-ప్రభాస్ మూవీ ఓకే అయింది. ఇందులోనే హీరోయిన్ గా భాగ్యశ్రీని పరిశీలించారట. అందులో భాగంగానే శుక్రవారం లుక్ టెస్ట్ షూట్ కూడా జరిగిందట. దాదాపు ఓకే అని అంటున్నారు. ఒకవేళ నిజమైతే మాత్రం భాగ్యశ్రీ.. లక్ తోక తొక్కేసినట్లే.(ఇదీ చదవండి: మార్చిలో థియేటర్ మూవీస్.. హిట్ కొడితే చాలు!) -
ఈ బ్యూటీని గుర్తుపట్టారా? బన్నీ, ప్రభాస్ సినిమాల్లో హీరోయినే కానీ (ఫొటోలు)
-
‘కన్నప్ప’ మూవీ HD స్టిల్స్
-
'కన్నప్ప' కొత్త టీజర్ రిలీజ్.. ఈసారి మాత్రం
మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి కొత్త టీజర్ రిలీజైంది. ఎనిమిది నెలల క్రితం రిలీజైన టీజర్ తో పోలిస్తే ఈసారి ట్రోల్ చేసేంతలా ఏం లేదు. సినిమాలోని కీలక పాత్రధారుల్ని చూపిస్తూ కన్నప్ప ప్రపంచం ఎలా ఉందనేది చూచాయిగా చూపించారు.(ఇదీ చదవండి: రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బాపు')1:24 నిమిషాల టీజర్ లో విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, ప్రీతి ముకుందన్.. ఇలా అందరిని చూపించేశారు. నాస్తికుడు అయిన తిన్నడు.. అలియాస్ మన హీరో శివయ్య భక్తుడిగా ఎలా మారాడు అనేదే స్టోరీ అని తెలుస్తోంది.ఏప్రిల్ 25న పాన్ ఇండియా వైడ్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. రీసెంట్ గానే ముంబైలో ప్రెస్ మీట్ పెట్టారు. శ్రీకాళహస్తిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఉంటుందని మంచు విష్ణు చెప్పారు. టీజర్ అంతా ఏమో గానీ చివర్లో ప్రభాస్ ని కాసేపు అలా చూపించి అతడి అభిమానులని అయితే ఆకట్టుకున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) -
నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు
తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో ప్రభాస్ అంత బిజీగా మరొకరు ఉండరు. ఎందుకంటే చేతిలో ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో రెండింటి షూటింగ్ జరుగుతోంది. ఇంత బిజీగా ఉన్నా సరే మంచు విష్ణు 'కన్నప్ప'లో అతిథి పాత్ర చేశాడు. తాజాగా ప్రభాస్.. ఈ మూవీలో నటించడం గురించి హీరో మంచు విష్ణు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.'కన్నప్ప' సినిమాలో నటించమని అడిగేందుకు ప్రభాస్ కి ఫోన్ చేయగా.. మరో క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పాడని మంచు విష్ణు బయటపెట్టాడు. తొలుత నాన్న (మోహన్ బాబు) ఫోన్ చేసి అడగడంతో ప్రభాస్ కాస్త భయపడ్డాడని, అదే విషయాన్ని తనకు చెప్పిన విషయాన్ని విష్ణు రివీల్ చేశాడు. ఏదైనా పనుంటే నువ్వే (విష్ణు) కాల్ చేయ్ అని తనతో ప్రభాస్ చెప్పినట్లు పేర్కొన్నాడు.(ఇదీ చదవండి: కన్నప్పలో భాగమవడం గౌరవం: అక్షయ్ కుమార్)మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'కన్నప్ప'. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్.. అలా ఇండియన్ మూవీ స్టార్స్ కూడా ఇందులో కీలకపాత్రల్లో నటించారు. మార్చి 1న టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ముంబైలో ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగానే నాన్న ఫోన్ చేస్తే ప్రభాస్ భయపడిన విషయాన్ని మంచు విష్ణు బయటపెట్టాడు.రూ.100 కోట్ల బడ్జెట్ తో తీసిన కన్నప్ప.. ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతుంది. ఇదివరకే ఓ పాట రిలీజ్ చేయగా.. అది అలరిస్తోంది. చిత్ర విడుదలకు ఇంకా టైముంది కాబట్టి ప్రమోషనల్ కంటెంట్ మరింత రిలీజ్ చేస్తారేమో!(ఇదీ చదవండి: సిద్దార్థ్‌కు, నాకు పడేది కాదు.. 'బాయ్స్'లో నాకే ఎక్కువ పారితోషికం: తమన్)Rebel Star #Prabhas okka kshanam kooda aalochinchakunda idhi chayyadam anukunnaru ❤️🔥 #Kannappa #ManchuVishnu pic.twitter.com/ewtDFYkoZG— prabhas_garu_taluka (@varmadatla2) February 27, 2025 -
ఖండాలు దాటిన హీరో ప్రభాస్ క్రేజ్.. ఆయన పేరుతో ఊరు కూడానా? (ఫోటోలు)
-
Prashanth Varma: త్వరలో ప్రభాస్ తో భారీ ప్రాజెక్ట్ సినిమా!
-
బాలయ్య వారసుడికి బిగ్ షాక్
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ, సడెన్‌గా ఆ వార్తలకు ఫుల్స్టాప్ పడిపోయింది. కొన్ని గంటల్లో క్లాప్ కొట్టి సినిమా ప్రారంభించాలని ఏర్పాట్లు కూడా చేశారు. అందుకోసం సుమారు రూ. 30 లక్షలు ఖర్చు కూడా పెట్టారు. అయితే, మోక్షజ్ఞకు ఆరోగ్యం బాగోలేదంటూ చివరి నిమిషంలో ప్రశాంత్ వర్మకు బాలకృష్ణ కాల్ చేయడంతో ఈ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడింది. ఆ సమయం నుంచి మళ్లీ ఈ కాంబినేషన్ గురించి ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. అయితే, తాజాగా సమాచారం ప్రకారం మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ సినిమా లేనట్లే అని తెలుస్తోంది. కొద్దిరోజుల్లో అధికారికంగా ప్రకటన కూడా రావచ్చు.ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మోక్షజ్ఞ మూవీ రానుందని ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, ఈ సినిమా నుంచి ప్రశాంత్ దాదాపు తప్పుకున్నట్లే అని తెలుస్తోంది. రేపోమాపో ప్రకటన రావడమే ఇక మిగిలి ఉంది. త్వరలో ప్రభాస్‌తో ఒక భారీ ప్రాజెక్ట్ చేసేపనిలో ప్రశాంత్ వర్మ ఉన్నట్లు పక్కా సమాచారం ఉంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయి. శివరాత్రి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ టెస్ట్ లుక్ కూడా చేయనున్నారని సమాచారం. ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో ప్రభాస్ అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. ప్రభాస్‌తో మూడు పెద్ద ప్రాజెక్ట్‌లు నిర్మిస్తామని ఇప్పటికే హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. ఈ క్రమంలో సలార్2 కూడా లైన్లో ఉంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా ప్రభాస్ చిత్రం రానుంది.మోక్షజ్ఞ నిర్మాతకు మరో ఆఫర్ ఇచ్చిన బాలయ్యమోక్షజ్ఞ తొలి సినిమా ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం కావడంతో హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఈ మూవీ కోసం మోక్షజ్ఞ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని కూడా తెలుస్తోంది. అయితే, పూజా కార్యక్రమం రోజే సినిమాకు ఫుల్స్టాప్ పడిపోయింది. లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఎస్.ఎల్.వి.సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పిస్తున్నట్లు తెలిపారు. అయితే, సినిమా ఉంటుందని వారు చెబుతున్నప్పటికీ ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అప్డేట్ లేదు. కానీ, మోక్షజ్ఞ ప్రాజెక్ట్‌కు బదులుగా నిర్మాత సుధాకర్ చెరుకూరికి బాలయ్య మరో ఆఫర్ ఇచ్చారట. తన తర్వాతి ప్రాజెక్ట్ గోపీచంద్ మలినేనితో ఉంది. ఈ సినిమాను ఆయనకే అప్పజెప్పారని సమాచారం. -
ఆ ఊరి పేరు 'ప్రభాస్'.. ఎక్కడో తెలుసా?
డార్లింగ్ ప్రభాస్ పేరు చెప్పగానే పాన్ ఇండియా సినిమాలు, వేల కోట్ల వసూళ్లు, ఇంటర్నేషనల్ క్రేజ్.. ఇలా చాలా గుర్తొస్తాయి. కానీ ప్రభాస్ పేరు మీద ఓ ఊరు ఉందని, అది కూడా మనకు పక్కనే ఉండే నేపాల్ లో అని మీలో ఎంతమందికి తెలుసు?రీసెంట్ టైంలో తెలుగు కుర్రాళ్లు చాలామంది యూట్యూబ్ వీడియోలు, మోటో వ్లాగింగ్ చేస్తున్నారు. అలా ఓ తెలుగు యువకుడు.. నేపాల్ లో పర్యటిస్తున్నాడు. అక్కడ అనుకోకుండా ప్రభాస్ పేరుతో ఉన్న ఓ ఊరి బోర్డ్ కనిపించింది. ఇంకేం వెంటనే ఓ వీడియో తీసి పోస్ట్ చేశాడు. ఇప్పుడది వైరల్ అయిపోయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?)అయితే ఈ ఊరికి మొదటి నుంచి ప్రభాస్ పేరు ఉందని తెలుస్తోంది. ఏదేమైనా డార్లింగ్ హీరో ఫ్యాన్స్ మాత్రం తన అభిమాన హీరో పేరుపై ఏకంగా నేపాల్ లో ఊరు ఉందని తెగ మురిసిపోతున్నారు.ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. త్వరలో సందీప్ రెడ్డి వంగా తీయబోయే 'స్పిరిట్' చేస్తాడు. దీనిపై అంచనాలు గట్టిగానే ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: 38 ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్.. నటుడు గోవిందా విడాకులు!) -
ప్రభాస్ సినిమా.. సుప్రీకోర్టులో నిర్మాతకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కాపీరైట్ వివాదానికి సంబంధించి దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలంటూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు రెండు వారాల పాటు స్టే విధించింది. అంతేకాక తదుపరి విచారణ వరకు దిల్ రాజుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ‘నా మనసు నిన్ను కోరే నవల‘ఆధారంగా ‘మిస్టర్ పర్ఫెక్ట్‘అనే సినిమా తీశారంటూ రచయిత్రి ముమ్ముడి శ్యామలాదేవి 2017లో దిల్ రాజుపై కేసు పెట్టారు. దీంతో మాదాపూర్ పోలీసులు నిర్మాత దిల్ రాజుపై కాపీ రైట్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జరిగింది. విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న సిటీ సివిల్ కో ర్టు.. సాక్ష్యాలను పరిశీలించి 2019లో దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ దిల్ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించగా జస్టిస్ జె.బి. పార్ధీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వాద నలు విన్న ధర్మాసనం తదుపరి విచార ణను రెండు వారాలపాటు వాయిదా వేసింది. అప్పటి వరకు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా విషయానికొస్తే.. ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ, ప్రకాశ్‌రాజ్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రం 2011లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దశరథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. -
ప్రభాస్ కి కండీషన్స్ పెట్టిన సందీప్ రెడ్డి వంగా?
ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. దాదాపు అందరూ హీరో ఒకటి తర్వాత ఒకటి అంటూ సినిమాలు చేస్తుంటే డార్లింగ్ హీరో మాత్రం ఒకేసారి రెండు మూడు మూవీస్ చేస్తున్నాడు. అయినా సరే టైమ్ సరిపోవట్లేదు. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ కి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కొన్ని స్ట్రిక్ట్ కండీషన్స్ పెట్టాడట!బాహుబలి హిట్ తర్వాత ప్రభాస్ వరస సినిమాలు చేస్తున్నాడు. అలా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాల్ని రిలీజ్ చేశాడు. దేశవ్యాప్తంగా వేలకోట్ల వసూళ్లు కొల్లగొట్టాడు. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాలూ ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ జరుగుతోంది.(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి అజిత్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)మరోవైపు 'యానిమల్' తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ తో 'స్పిరిట్' చేయాలి. లెక్క ప్రకారం జనవరి నుంచే షూటింగ్ ప్రారంభం కావాలి. కానీ ప్రభాస్ షూటింగ్స్ వల్ల స్పిరిట్ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ మొదలుపెడితే మరొకటి చేయకూడదని సందీప్.. ప్రభాస్ కి చెప్పాడట.దీంతో చేతిలో ఉన్న రాజాసాబ్, ఫౌజీ చిత్రాల్ని పూర్తి చేసి.. మే నెల నుంచి ప్రభాస్ స్పిరిట్ సెట్స్ పైకి వస్తాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తయిందని.. ఒక్కసారి ప్రభాస్ వస్తే ఆపకుండా షూటింగ్ చేసి పూర్తి చేస్తారని టాక్. ఈ మూవీలో ప్రభాస్.. పోలీస్ గా కనిపించబోతున్నాడని ఇదివరకే సందీప్ చెప్పాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?) -
తండ్రిని కోల్పోయిన బాధలోనూ సాయం చేసిన ప్రభాస్.. రచయిత ఎమోషనల్
డార్లింగ్ ప్రభాస్ (Prabhas) మంచితనం గురించి అందరికీ తెలుసు. సెట్లోని వారికి ఇంటిభోజనం తెచ్చి కడుపు నిండే ఈయన ఆపదలో ఉన్న ఎంతోమందిని ఆదుకున్నాడు. ఆ జాబితాలో తానూ ఉన్నానంటున్నాడు రచయిత తోట ప్రసాద్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 2010 ఫిబ్రవరిలో మహాశివరాత్రికి ముందు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాను. దురదృష్టవశాత్తూ అదేరోజు ప్రభాస్ తండ్రి సూర్యనారాయణరాజు (Uppalapati Surya Narayana Raju) కన్నుమూశారు. అది పన్నెండవ తారీఖు అనుకుంటాను!తండ్రిని కోల్పోయిన బాధలోనూ..తండ్రి మరణంతో శోకంలో మునిగిపోయిన ఆయన.. నేను ఆస్పత్రిలో ఉన్నానన్న విషయం తెలిసి నాకోసం కొంత డబ్బు పంపించారు. నాపై అంత శ్రద్ధ తీసుకున్నారు. ఎవరైనా తన ఇంట్లో కష్టం ఉన్నప్పుడు ఎదుటివారి గురించి ఆలోచించరు. అందులోనూ తండ్రిని కోల్పోవడం అంటే మామూలు బాధాకర విషయం కాదు. అటువంటి పరిస్థితిలోనూ ఆయన.. నా సినిమా రచయిత అని నన్ను సొంత మనిషిగా భావించి వెంటనే స్పందించారు. కన్నప్ప ద్వారా..ప్రభాస్.. అంతటి మంచి వ్యక్తి. చాలాకాలం తర్వాత కన్నప్ప మూవీ ద్వారా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది అని ఎమోషనలయ్యాడు. ప్రభాస్ బిల్లా సినిమాకు ప్రసాద్ సహరచయితగా పనిచేశాడు. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం మారుతి 'రాజా సాబ్', హను రాఘవపూడి 'ఫౌజీ' సినిమాల్లో నటిస్తున్నాడు. అనంతరం స్పిరిట్, సలార్ 2, కల్కి 2 చిత్రాలు పట్టాలెక్కించనున్నాడు.చదవండి: 'హిట్ 3' టీజర్ రిలీజ్.. అస్సలు ఊహించలే! -
ప్రభాస్ 'ఫౌజీ'లో బ్రిటిష్ రాణి గా అలియా భట్
-
స్టార్ డైరెక్టర్ వద్ద శిక్షణ తీసుకుంటున్న త్రివిక్రమ్ కుమారుడు
తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్రవేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్వరలో ఆయన కుమారుడు రిషీ మనోజ్ కూడా మెగా ఫోన్ పట్టనున్నాడు. దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్‌ను కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంతలో తన కుమారుడికి శిక్షణ ఇచ్చే బాధ్యతను త్రివిక్రమ్ తీసుకోకుండా మరో ఇద్దరు దర్శకులకు ఆ పని అప్పజెప్పారు. ఇప్పటికే రిషీ ట్రైన్ అయి ఉన్నాడు. అయితే, ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఒక పాన్ ఇండియా సినిమాకు పనిచేయబోతున్నాడు.జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్నానూరి వద్ద త్రివిక్రమ్ కుమారుడు ఇప్పటికే శిక్షణ తీసుకున్నాడు. విజయ్- గౌతమ్ తిన్ననూరి 'కింగ్డమ్' సినిమాకు అసిస్టెంట్‌గా త్రివిక్రమ్ కుమారుడు పనిచేస్తున్నాడు. దాదాపు ఈ ప్రాజెక్ట్ పూర్తి కావస్తోంది. ఈ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగా దగ్గరకు రిషీ వెళ్లనున్నాడు. ఇక్కడ త్రివిక్రమ్ ఫోన్ చేసి తన కుమారుడిని అసిస్టెంట్‌గా తీసుకోవాలని కోరితే ఎవరు వద్దంటారు..? అందుకే ప్రభాస్ స్పిరిట్ సినిమాకు రిషీ అసిస్టెంట్‌గా పనిచేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత రిషీ కూడా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వొచ్చని తెలుస్తోంది.మరో రెండేళ్లలో పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. అకీరా, రిషీ ఇద్దరూ ఒకే ప్రాజెక్ట్‌తో పరిచయం అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పవన్-త్రివిక్రమ్‌ల మధ్య ఉన్న స్నేహం ఈ ప్రాజెక్ట్ సులభంగా పట్టాలెక్కనుందని చెప్పవచ్చు. -
గురూ.... కొత్త కాంబినేషన్ షురూ
జానర్ మాత్రమే కాదు... ఒక్కోసారి కాంబినేషన్స్ కూడా ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పిస్తాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్ మూవీస్‌కు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. కొందరు తెలుగు స్టార్ హీరోలు ఇప్పటివరకు తమతో సినిమాలు చేయని దర్శకులతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న కొన్ని కొత్త కాంబినేషన్స్ కథా కమామీషుపై ఓ లుక్ వేయండి.ప్రభాస్‌తో లోకేశ్ ‘రాజా సాబ్, ఫౌజి’ సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు తుది దశకు చేరుకుంటున్నాయి. దీంతో త్వరలోనే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లోని ‘స్పిరిట్’ మూవీ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్. ‘స్పిరిట్’ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. అయితే తనతో ‘సలార్’ వంటి మాస్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలింస్‌తో ప్రభాస్ మూడు సినిమాలు కమిటయ్యారు. ఈ మూడు సినిమాలు వరుసగా 2026, 2027, 2028లలో విడుదల కానున్నాయి.కాగా వీటిలో ఓ చిత్రాన్ని తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే లోకేశ్ కార్తీతో ‘ఖైదీ 2’ చేయాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభాస్–లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లోని మూవీ చిత్రీకరణ కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యే చాన్సెస్ ఉన్నాయి.అలాగే ‘హనుమాన్’ తో భారీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ మూవీ చేయనున్నారు. ప్రస్తుతం ‘జై హనుమాన్’తో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్‌తో ప్రశాంత్ వర్మ సినిమా చేసే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం.గ్రీన్ సిగ్నల్తమిళంలో రజనీకాంత్‌తో ‘జైలర్’ సినిమా తీసి సూపర్‌హిట్ అందుకున్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్. ప్రస్తుతం రజనీకాంత్‌తోనే ‘జైలర్ 2’ సినిమా చేసే పనుల్లో నిమగ్నమయ్యారు నెల్సన్. అయితే ‘జైలర్’కు, ‘జైలర్ 2’కు మధ్య తనకు లభించిన గ్యాప్‌లో ఓ కథ రాసుకున్నారట నెల్సన్. ఈ కథను ఎన్టీఆర్‌కు వినిపించగా, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.అయితే ఇటీవలే హిందీలో ‘వార్ 2’ (ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరో) సినిమాను పూర్తి చేసిన ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో తాను కమిటైన ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీ సినిమా కోసం కావాల్సిన మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నారు. వచ్చే నెలలో ‘డ్రాగన్’ మూవీ రెగ్యులర్ షూటింగ్లో జాయిన్ అవుతారు ఎన్టీఆర్.ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాత నెల్సన్ సినిమాను ఎన్టీఆర్ సెట్స్‌కు తీసుకువెళతారని ఊహించవచ్చు. అలాగే ‘హాయ్ నాన్న’ వంటి ఫీల్‌గుడ్ మూవీ తీసిన శౌర్యువ్ కూడా ఎన్టీఆర్కుప్రాథమికంగా ఓ లైన్ చెప్పారని, స్టోరీ కుదిరితే శౌర్యువ్‌తోనూ ఎన్టీఆర్ మూవీ చేస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది.అర్జున్‌తో అట్లీ‘పుష్ప: ది రూల్’ సినిమా సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు అల్లు అర్జున్. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేసేందుకు ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్నారు అల్లు అర్జున్. కాగా ‘పుష్ప’ సినిమా నిర్మాణం సమయంలోనే దర్శకుడు త్రివిక్రమ్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలతో అల్లు అర్జున్ సినిమాలు చేయనున్నట్లుగా అధికారిక ప్రకటనలు వెల్లడయ్యాయి. అయితే ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీతో సందీప్ రెడ్డి వంగా బిజీగా ఉండటంతో అల్లు అర్జున్ తన నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్‌తో చేస్తారనే టాక్ వినిపించింది.కానీ త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్ చేయాల్సిన సినిమాకు మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్ ఉంటుందట, చాలా గ్రాఫిక్స్ వర్క్ అవసరం అవుతుందట. ఇలా ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ ఇంకా సమయం పడుతుందట. దీంతో తన నెక్ట్స్ మూవీ కోసం తమిళ టాప్ డైరెక్టర్ అట్లీతో చర్చలు జరిపారట అల్లు అర్జున్. అట్లీ డైరెక్షన్లోనే అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారని, సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుందని భోగట్టా. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా రూ. 1871 కోట్ల వసూళ్లు రాబట్టింది.మరోవైపు దర్శకుడిగా షారుక్ ఖాన్‌తో రూ. 1000 కోట్ల ‘జవాను’ను తీశారు అట్లీ. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ స్పెయిన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ మూవీ పై మరింత సమాచారం బయటకు రానుందని తెలిసింది. అలాగే ప్రముఖ హిందీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ఇటీవల ముంబైలో కలిశారు అల్లు అర్జున్. వీరి మధ్య ఓ సినిమాకు సంబంధించిన చర్చలు జరిగాయి. సో... భన్సాలీతో కూడా అల్లు అర్జున్ సినిమా చేసే చాన్స్ ఉందని ఊహించవచ్చు.మాస్ ప్లస్ క్లాస్ ఎక్కువగా మాస్, వీలైనప్పుడు క్లాస్ మూవీస్ చేస్తుంటారు రవితేజ. అయితే రీసెంట్ టైమ్స్‌లో రవితేజ మాస్ సినిమాలే ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘మాస్ జాతర’ మాస్ అప్పీల్ ఉన్న సినిమాయే. దీంతో ఓ క్లాస్ మూవీ చేయాలని రవితేజ అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే కిశోర్ తిరుమల రెడీ చేసిన ఓ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీకి రవితేజ పచ్చజెండా ఊపారని, త్వరలోనే ఈ వీరి కాంబినేషన్లోని మూవీపై స్పష్టత రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఓకే చెప్పిన నానీశివ కార్తికేయన్‌తో తమిళంలో ‘డాన్’ (2022) వంటి క్యాంపస్ డ్రామా ఫిల్మ్ తీసి హిట్ సాధించారు తమిళ యంగ్ డైరెక్టర్ సిబీ చక్రవర్తి. అప్పట్నుంచి సిబీ చక్రవర్తితో ఓ మూవీ చేయాలని నానీ అనుకుంటున్నారట. ఆ సమయం ఇప్పడు వచ్చిందని, నానీ–సిబీ చక్రవర్తి కాంబినేషన్లోని మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయని, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం నానీ ‘హిట్ 3’ మూవీతో బిజీగా ఉన్నారు.మే 1న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ మూవీ తర్వాత తనకు ‘దసరా’ వంటి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నానీ ‘ప్యారడైజ్’ అనే మూవీ చేస్తారు. అయితే ‘ప్యారడైజ్’ చిత్రానికి సమాంతరంగా సిబీ సినిమాను కూడా నానీ చేస్తారా? లేక ‘ప్యారడైజ్’ చిత్రాన్ని పూర్తి చేశాక సిబీ చక్రవర్తి సినిమాను స్టార్ట్ చేస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.అలాగే దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పిన ఓ కథ నానీని ఇంప్రెస్ చేసిందని, నానీ ప్రస్తుత కమిట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత శేఖర్ కమ్ములతో చేసే మూవీపై ఓ స్పష్టత వస్తుందని సమాచారం. ఈ నెల 24న నానీ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ హీరో తదుపరి చిత్రాలపై అధికారిక అప్డేట్స్ ఏమైనా వస్తాయా? అనేది చూడాలి.కిల్ డైరెక్టర్‌తో..!హిందీలో ‘కిల్’ వంటి మాస్ యాక్షన్ ఫిల్మ్ తీసి, ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యారు దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్. ఈ దర్శకుడు ఇప్పుడు ఓ క్రేజీ తెలుగు హీరోతో భారీ బడ్జెట్ మూవీ తీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్‌లో విజయ్ దేవరకొండను కలిశారు నిఖిల్ నగేశ్. వీరి మధ్య ఓ కొత్త సినిమా గురించిన చర్చలు జరిగాయి. ప్రస్తుతం ‘కింగ్డమ్’ మూవీ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.మే 30న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో రాయలసీమ నేపథ్యంలో ఓ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్, రవికిరణ్ కోలాతో ఓ విలేజ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ కమిటయ్యారు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలు పూర్తయ్యాక విజయ్ దేవరకొండ–నిఖిల్ నగేశ్‌ల కాంబినేషన్లోని మూవీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ప్రభాస్ ఫౌజిలో యువరాణి?
ప్రభాస్(Prabhas) హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘సీతా రామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt) ఓ కీలక పాత్రలో అతిథిగా మెరవనున్నారనే టాక్ వినిపిస్తోంది.పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆలియా ఓ యువరాణి పాత్ర చేయనున్నారని భోగట్టా. సినిమాలో కీలకంగా ఉండే ఈ పాత్ర కోసం చిత్రయూనిట్ ఆమెను సంప్రదించగా, ఆమె కూడా పచ్చజెండా ఊపారని బాలీవుడ్ టాక్. మరి ‘ఫౌజి’లో ఆలియా భట్ అతిథి పాత్రలో నటిస్తారా? లేదా అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (2022) చిత్రంలో రామ్‌చరణ్‌కి జోడీగా ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఇక జయప్రద, మిధున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఫౌజి’కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. -
స్పిరిట్‌లో విష్ణు
‘స్పిరిట్’(spirit) సినిమా కోసం స్పెషల్ అప్లికేషన్ పెట్టుకున్నారు హీరో మంచు విష్ణు(Manchu Vishnu). ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న మూవీ ‘స్పిరిట్’. ఈ చిత్రంలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు ప్రభాస్(Prabhas). ఈ వేసవిలో ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణను ప్రారంభించనుంది యూనిట్. దీంతో నటీనటుల కోసం ‘ఎక్స్’లో ఓ నోట్‌ను షేర్ చేసింది.‘‘ఫిల్మ్ అండ్ థియేటర్ బ్యాక్‌గ్రౌండ్‌లో అనుభవం ఉన్న నటీనటులు మా సినిమాలో యాక్ట్ చేసేందుకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటూ కొన్ని షరతులతో ‘స్పిరిట్’ టీమ్ ఓ నోట్‌ను షేర్ చేసింది. ఈ నోట్‌ను ‘ఎక్స్’లో షేర్ చేసి, తాను ‘స్పిరిట్’ సినిమా కోసం అప్లికేషన్ పెట్టుకున్నానని, ఏం జరుగుతుందో చూడాలన్నట్లుగా విష్ణు మంచు పేర్కొన్నారు.మరోవైపు విష్ణు మంచు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’లో రుద్రగా ప్రభాస్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. మరి... ప్రభాస్ ‘స్పిరిట్’ లో నటించే చాన్స్ విష్ణు మంచుకు దక్కుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక టీ–సిరీస్, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్ ‘స్పిరిట్’ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. -
‘కన్నప్ప’కోసం ప్రభాస్, మోహన్‌లాల్ ఎంత తీసుకున్నారంటే..
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’(Kannappa). అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించిన ఈమూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ని ముమ్మరం చేశారు మేకర్స్. ప్రతి సోమవారం ఈ చిత్రం నుంచి ఒక అప్డేట్ ఇస్తున్నారు. దీంతో పాటు మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నప్ప సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా కోసం ఏడేళ్లుగా పని చేస్తున్నామని, దాదాపు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించామని చెప్పాడు. ఇందులో నటీనటులు పారితోషికాలతో కలిపి చూస్తే.. ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరగాల్సింది. కానీ చాలా మంది నటీనటులు డబ్బులు తీసుకోకుండానే నటించారట. మోహన్ లాల్, ప్రభాస్ అయితే ఒక్క రూపాయి తీసుకోకుండానే నటించారట. ఈ విషయాన్ని మంచు విష్ణునే చెప్పారు.‘ఈ చిత్రంలో ప్రభాస్(Prabhas), మోహన్ లాల్(Mohanlal) పోషించిన పాత్రలు చాలా కీలకం. వాళ్లను కథ చెప్పగానే ఒప్పుకున్నారు.ఈ సినిమా కోసం వాళ్లిద్దరూ ఒక్క రూపాయి పారితోషికం కూడా తీసుకోలేదు. నాన్నగారిపై(మోహన్ బాబు)పై ఉన్న అభిమానంతో వారిద్దరు నటించారు. మోహన్‌లాల్ దగ్గరకు వెళ్లి కథ చెప్పిన తర్వాత పారితోషికం గురించి మీ మేనేజర్‌తో మాట్లాడమంటారా అని అడిగితే..‘అప్పుడే అంత పెద్ద వాడివయ్యావా?’ అన్నాడు. ఇక ప్రభాస్ నాకు మంచి స్నేహితుడు. అతని వల్ల నాకు స్నేహంపై నమ్మకం పెరిగింది. నా కోసం ప్రభాస్ ఇందులో నటించాడు. అలాగే అక్షయ్ కుమార్ పోషించిన పాత్ర కూడా కీలకమే. శివుని పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తే.. రెండు సార్లు సున్నితంగా తిరస్కరించాడు. తర్వాత వేరే దర్శకుడితో చెప్పించి ఆయనను ఒప్పించాం. చాలా అద్భుతంగా నటించాడు’ అని విష్ణు చెప్పుకొచ్చాడు.అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుద్రగా ప్రభాస్, పార్వతీదేవిగా కాజల్ నటిస్తున్నారు. శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ప్రభాస్‌తో కలిసి నటించాలనుకుంటున్నారా?.. ఇదే గోల్డెన్ చాన్స్!
ప్రభాస్(Prabhas )ని చూస్తే చాలు అనుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఆయనతో ఒక సెల్ఫీ దిగితే చాలు..ఇంకేం వద్దు అనుకునే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అలాంటిది ప్రభాస్‌తో కలిసి నటించే చాన్స్ వస్తుందంటే.. ఎవరైనా ఊరుకుంటారా? అసలు అలాంటి అవకాశం వస్తుందని కూడా ఊహించరు కదా? ఇప్పుడు అలాంటి గొప్ప అవకాశాన్ని కల్పించేందుకు ముందుకు వచ్చింది ‘స్పిరిట్’(Spirit Movie ) యూనిట్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘యానిమల్’’ఫేం సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను మార్చ్ లో ప్రారంభించాలని యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ప్రభాస్ తన కెరీర్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్, ఆలియా భట్, రష్మికా మందన్నా..తదితర స్టార్ హీరోయిన్ ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే.. వారితో ఎవరూ కూడా ఫైనలేజ్ కాలేదట.ఇదిలా ఉంటే.. ఈ సినిమా లో కలిసి నటించే సువార్ణావకాశాన్ని కల్పించింది నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్.‘స్పిరిట్’ కోసం నటీనటులు కావాలంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. వయసుతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్న పురుషులు, స్త్రీలు అంతా తమ ప్రొఫైల్ పంపించాల్సిందిగా కోరింది. అయితే ఇక్కడ ఓ చిన్న కండీషన్ కూడా పెట్టింది. గతంలో ఫిలిం లేదా థియేటర్ బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లు మాత్రమే ఇందుకు అర్హులని ప్రకటించింది.అయితే ఇందుకు 2 ఫొటోలు, 2 నిమిషాల వీడియో రికార్డ్ చేసి..spirit.bhadrakalipichtures@gmial.com పంపించాలని ప్రకటించారు. ఆసక్తి గలవారు ఓ వీడియో రికార్డ్ చేసి, ఈ ఈమెయిల్ కు పంపించాలని ప్రకటించారు. ఈ మేరకు 'కాస్టింగ్ కాల్' అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ గా మారింది. కాగా, ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమా పూర్తి అయినా తరువాత 'స్పిరిట్'సినిమా షూటింగ్ లో పాల్గొన అవకాశముంది. -
ప్రభాస్ చిత్రంలో ది కశ్మీర్ ఫైల్స్ నటుడు.. డైరెక్టర్ ఎవరంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ది రాజాసాబ్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాది కల్కి 2898తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ మారుతి డైరెక్షన్లో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతేడాది ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి వీడియోతో కూడిన స్పెషల్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు.ది రాజాసాబ్‌లో ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో పని చేయనున్నారు. వీరి కాంబోలో వస్తోన్న చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. (ఇది చదవండి: ‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!)అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బాహుబలి ప్రభాస్‌తో నా 544వ చిత్రం చేయడం ఆనందంగా ఉందని అనుపమ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్, డైరెక్టర్‌తో హను రాఘవపూడితో దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా.. అనుపమ్ ఖేర్ బాలీవుడ్లో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో మరింత ఫేమస్ అయ్యారు. ANNOUNCEMENT: Delighted to announce my 544th untitled film with the #Bahubali of #IndianCinema, the one and only #Prabhas ! The film is directed by the very talented @hanurpudi ! And produced by wonderful team of producers of @MythriOfficial ! My very dear friend and brilliant… pic.twitter.com/sBIXCS98t6— Anupam Kher (@AnupamPKher) February 13, 2025 -
బంధువుల పెళ్లిలో ప్రభాస్ సిస్టర్స్.. రెబల్ స్టార్ పెళ్లి ఎప్పుడంటోన్న ఫ్యాన్స్ (ఫోటోలు)
-
పెళ్లి వేడుకలో ప్రభాస్ సిస్టర్స్.. రెబల్ స్టార్ మ్యారేజ్‌పై మొదలైన చర్చ!
టాలీవుడ్ హీరోల్లో ఎవరి పెళ్లి కోసమైనా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే అది ఆయన ఒక్కరిదే. ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. గతేడాదిలోనే నాగచైతన్య ఓ ఇంటివాడయ్యారు. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే అఖిల్ అక్కినేని సైతం పెళ్లి చేసుకోబోతున్నారు. అలా దాదాపు మన హీరోలంతా పెళ్లిళ్లు చేసుకుని వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.ప్రభాస్ పెళ్లి కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు..కానీ టాలీవుడ్ ఫ్యాన్స్‌కు ఇప్పటి వరకు తీరని కోరిక ఏదైనా ఉందంటే అది మన రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వేడుకే. ప్రభాస్ పెళ్లి కోసం ఆయన ఫ్యామిలీ కంటే.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే టాలీవుడ్లో ఏదో ఒక సందర్భంలో ఈ టాపిక్ గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. అలానే తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి చర్చ మొదలైంది.అందుకు కారణం ప్రభాస్ బంధువుల పెళ్లిలో ఆయన ముగ్గురు చెల్లెల్లతో పాటు కృష్ణంరాజు భార్య శ్యామల దేవి కనిపించారు. పెళ్లిలో వారంతా కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేశారు. ఇంకేముంది ప్రభాస్ అన్న పెళ్లి ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల జరిగిన బంధువుల పెళ్లికి కృష్ణంరాజు భార్య శ్యామల దేవి హాజరయ్యారు. ఆమెతో పాటు ముగ్గురు కుమార్తెలు(ప్రభాస్ చెల్లెళ్లు) ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి కూడా ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. అందరూ కలిసి దిగిన ఫోటోలను ప్రసీద్ ఉప్పలపాటి తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఇవీ చూసిన అభిమానులు ప్రభాస్ అన్నకు త్వరగా పెళ్లి చేయండి సిస్టర్స్ అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ప్రసీద తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటున్నారు. మిగిలిన ఇద్దరు సిస్టర్స్ మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. View this post on Instagram A post shared by Sai Praseedha Uppalapati (@praseedhauppalapati) -
రెండుసార్లు మ్యాజిక్ రిపీట్... అందుకే హిట్ పెయిర్ అంటున్న ఇండస్ట్రీ
-
ఇండియాలో రిచ్ స్టార్ మన టాలీవుడ్ హీరోనే. .ఏ హీరో ఆస్తి ఎంతంటే..?
ఒకప్పుడు నార్త్ ఇండియా స్టార్స్ అన్ని విధాలుగా మన టాలీవుడ్ తారల కన్నా ముందుండేవారు. వ్యక్తిగత సంపదలో సైతం అక్కడి అగ్రగామి నటులదే పైచేయిగా ఉండేది. ఇటీవలి కాలంలో ఉత్తరాది చిత్రాల రికార్డ్స్‌ను మన టాలీవుడ్ తుడిచిపెడుతున్నట్టే... సంపద విషయంలోనూ వారిని మనవాళ్లు తోసిరాజంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించింది మనీ కంట్రోల్ అనే ఆర్ధిక వ్యవహారాల సంస్థ. ఈ సంస్థ చెబుతున్న ప్రకారం చూస్తే... దక్షిణాదికి చెందిన అత్యంత సంపన్న తార వాస్తవానికి బాలీవుడ్లో చాలా మంది కంటే సంపన్నుడుగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు మన టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యంత సంపన్నుడు అని మనీకంట్రోల్ తేల్చి చెప్పింది. సంస్థ విశ్లేషణ ప్రకారం, నాగార్జున నికర ఆస్తుల విలువ 410 మిలియన్లు (రూ.3572 కోట్లకు పైగా) కలిగి ఉన్నారు, తద్వారా దేశంలోనే అత్యంత రిచ్ స్టార్స్‌లో ఒకరుగా నిలిచారు. మన నాగ్ కన్నా ముందున్నది కేవలం షారుఖ్ ఖాన్, జుహీ చావ్లాలు మాత్రమే. అమితాబ్ బచ్చన్ (రూ.3200 కోట్లు), హృతిక్ రోషన్ (రూ3100 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ.2900 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.2700 కోట్లు) అమీర్ ఖాన్ (రూ1900 కోట్లు) వంటి ఎ–లిస్ట్ బాలీవుడ్ తారల కంటే నాగార్జున ముందున్నారు.నాలుగు దక్షిణాది పరిశ్రమలకు చెందిన నటులలో, నాగార్జున సమకాలీనుడైన చిరంజీవి సైతం నాగ్ తర్వాతి స్థానంలో ఉన్నారు, ఆయన నికర ఆస్తుల విలువ రూ1650 కోట్లు. ఇతర అత్యంత ధనవంతులైన దక్షిణాది తారల్లో రామ్ చరణ్ (రూ1370 కోట్లు), కమల్ హాసన్ (రూ600 కోట్లు), రజనీకాంత్ (రూ500 కోట్లు), జూనియర్ ఎన్టీఆర్ (రూ500 కోట్లు), ప్రభాస్ (రూ250 కోట్లు)...గా ఉన్నారు. నిస్సందేహంగా నాగార్జున తెలుగు సినిమాలలో అత్యంత విజయవంతమైన నటులలో ఒకరు. కానీ, ఆయన సమకాలికులైన చిరంజీవి కన్నా అలాగే నేటి బిగ్ స్టార్స్ అయిన ప్రభాస్ రామ్ చరణ్ కన్నా కూడా ఎలా సూపర్‌రిచ్ అయ్యారు? అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు స్మార్ట్ వ్యాపార పెట్టుబడుల ద్వారా నాగ్ టాప్ ప్లేస్‌ను సాధించారని సదరు మనీ కంట్రోల్ వెల్లడించింది.నాగార్జున కేవలం సినిమాల నుంచే కాకుండా రియల్ ఎస్టేట్, సినిమా స్పోర్ట్స్ ఫ్రాంచైజీలతో సహా ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా తన దైన మార్క్‌ని చూపారు. టాలీవుడ్‌లోని అతిపెద్ద నిర్మాణ సంస్థలు స్టూడియోలలో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున సొంతం. ఆయన రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థ అయిన ఎన్3 రియల్టీ ఎంటర్‌ప్రైజెస్‌ను కూడా కలిగి ఉన్నారు. దైనిక్ భాస్కర్ ప్రకారం, నాగార్జునకు చెందిన అన్ని రియల్ ఎస్టేట్ వాల్యూ ప్రకారం దాదాపు రూ.900 కోట్లు. అలాగే నాగార్జునకు మూడు స్పోర్ట్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి, ప్రైవేట్ జెట్ అర డజనుకు పైగా లగ్జరీ కార్లు నాగ్ స్వంతం. అయితే ఇవన్నీ పలు సంస్థలు లెక్కగట్టిన విలువలే తప్ప వీటికి ఎటువంటి అధికారిక థృవీకరణ లేదనే విషయం ఇక్కడ గమనార్హం. -
డార్లింగ్ కు జోడీగా సాయి పల్లవి..?
-
యమ్మీ... యమ్మీ...
జనరల్‌గా డిన్నర్ లైట్‌గా తీసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. హీరోయిన్ ఇమాన్వీ కూడా ఇంచు మించు ఇదే టైప్. అయితే గురువారం డిన్నర్‌ని మాత్రం లైట్‌గా కాకుండా ఓ పట్టు పట్టారు. మరి... కళ్ల ముందు పదికి పైగా నోరూరించే వంటకాలు కనిపిస్తే లాగించకుండా ఉంటారా! అది కూడా హీరో ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన వంటకాలాయె. ఆ విషయంలోకి వస్తే... ప్రభాస్ సరసన ఓ కథానాయికగా ఇమాన్వీ నటిస్తున్న ‘ఫౌజీ’ (పరిశీలనలో ఉన్న టైటిల్ అని సమాచారం) చిత్రం తాజా షెడ్యూల్ రెండు మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఆరంభమైంది.ముందు ఇమాన్వీ ΄పాల్గొన్నారు. గురువారం నుంచి ప్రభాస్ కూడా ΄పాల్గొంటున్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్న ఢిల్లీ బ్యూటీ ఇమాన్వీకి గురువారం డిన్నర్‌కి తన ఇంటి నుంచి భోజనం తెప్పించారు. అవి ఆరగించి, ఆ వంటకాల వీడియో షేర్ చేసి, ‘‘ఈ యమ్మీ యమ్మీ... మంచితనానికి థ్యాంక్యూ ప్రభాస్’’ అని పేర్కొన్నారు ఇమాన్వీ. ఇక హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందుతోందని సమాచారం. -
షారుఖ్ ఖాన్ సినిమా రీమేక్ లో ప్రభాస్
-
కొత్త హీరోయిన్‌కు ఆతిథ్యం ఇచ్చిన ప్రభాస్
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ భోజన ప్రియుడు అనే విషయం తెలిసిందే. సినిమా షూటింగ్లో ఆయన ఉన్నారంటే చాలు.. అక్కడ ఉన్న వారందరికీ భోజన ఏర్పాట్లను ప్రభాసే చూసుకుంటారు. ఈ క్రమంలో ఆయన ఇచ్చే ఆతిథ్యం గురించి ఇండస్ట్రీలోని స్టార్స్ అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు. పాన్ ఇండియా స్టార్‌గా ఆయన ఎదిగినప్పటికీ చిత్ర యూనిట్ వారికి ఆతిథ్యమివ్వడం మాత్రం వదిలిపెట్టలేదు. ప్రభాస్ ఇంటి భోజనమంటే బాలీవుడ్ స్టార్స్ కూడా లొట్టలేసుకుని ఆరగించేస్తారు. అయితే, తాజాగా తన హీరోయిన్‌కు ప్రభాస్ ఇంటి నుంచి క్యారేజీ వెళ్లింది. ఇదే విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.ఢిల్లీ బ్యూటీ ఇమాన్వీకి ప్రభాస్ ఆతిథ్యం ఇచ్చారు. తన ఇంటి నుంచి ఆమెకు క్యారేజీ పంపారు. భోజనం చాలా బాగుంది అంటూ ఆమె ఒక వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ప్రభాస్ (Prabhas) హీరోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో (Hanu) ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమం జరిగింది. షూటింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'ఫౌజీ' (Fauji) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ భారీ ప్రాజెక్ట్‌తోనే ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. ఇన్స్టాగ్రామ్ స్టార్‌గా నెటిజన్లకు ఆమె సుపరిచితురాలు. ఇన్‌స్టాలో ఆమె డ్యాన్స్ రీల్స్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా ఆమెకు సినిమా అవకాశం దక్కింది. ఈ సినిమానే ఆమెకు తొలి ప్రాజెక్ట్ కావడం విశేషం. కొత్త హీరోయిన్లకు కూడా ప్రభాస్ ఆతిథ్యం ఇవ్వడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. ఆయన ఎంత రేంజ్‌కు చేరుకున్నా కూడా ఇలాంటి విషయంలో ఏంత మాత్రం తగ్గడంటూ ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) -
ప్రభాస్ 'స్పిరిట్' ఆరంభం ఎప్పుడంటే..?
‘స్పిరిట్’(Spirit) సినిమా సెట్స్‌కు వెళ్లే సమయం ఆసన్నమైంది. ప్రభాస్(Prabhas) హీరోగా ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా ప్రీప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను మేలో ప్రారంభించాలని యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు.దీంతో లుక్స్, ఫిజిక్ పరంగా స్పెషల్‌గా మేకోవర్ కానున్నారట. ‘స్పిరిట్’ చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యం కావడానికి ఇదొక కారణమని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్, ఆలియా భట్, రష్మికా మందన్నా... ఇలా పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇంకా ఎవరూ ఫైనలేజ్ కాలేదట. టీ సిరీస్ భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా (సందీప్‌రెడ్డి వంగా సోదరుడు) భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్న ‘స్పిరిట్’ చిత్రం 2026 చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్. -
ఆ విషయంలో ప్రభాస్ గ్రేట్.. తనను చూసి నేర్చుకోవాలి: పృథ్వీరాజ్
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) సలార్ సినిమాతో తెలుగులోనూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. గతేడాది ద గోట్ లైఫ్ (ఆడుజీవితం), గురువాయూర్ అంబలనడయిల్ చిత్రాలతో రెండు హిట్లు అందుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఐదారు సినిమాలున్నాయి. SSMB29 (మహేశ్‌బాబు- రాజమౌళి కాంబో) సినిమాలోనూ పృథ్వీరాజ్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేశ్-రాజమౌళి సినిమాలో పృథ్వీరాజ్?తాజాగా దీనిపై పృథ్వీరాజ్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి నాకంటే ఎక్కువ మీ అందరికే బాగా తెలిసినట్లు అనిపిస్తోంది. ఇప్పటివరకు ఇంకా ఏదీ ఫైనలవలేదు. ఇంకా మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. అంతా ఫిక్సయ్యాక అప్పుడు చూద్దాం.. అన్నాడు. సలార్ 2 (Salaar 2 Movie) గురించి మాట్లాడుతూ.. సలార్ సీక్వెల్ ఉందని మాత్రమే నేను చెప్పగలను. ప్రశాంత్ నీల్ (Prashanth Neel).. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు. అది అయిపోయిన వెంటనే సలార్ 2 మొదలుపెడ్తాం.ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలిప్రభాస్ (Prabhas) గురించి చెప్పాలంటే తన స్టార్డమ్ తనకు తెలియదు. ఆయన సోషల్ మీడియాలో లేడనుకుంటాను. ఒకవేళ ఉన్నా కూడా దాన్ని అతడు మాత్రం హ్యాండిల్ చేయడు. సామాజిక మాధ్యమాలకు వీలైనంత దూరంగా ఉంటాడు. తన చుట్టూ ఏం జరుగుతుందో అసలు పట్టించుకోడు. పబ్లిక్‌లో ఉండటానికి బదులు ప్రైవేట్‌గా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతాడు. అది నిజంగా గ్రేట్. ఇది ప్రభాస్ దగ్గర అందరూ నేర్చుకోవాల్సిన అంశం అని చెప్పాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ కేవలం నటుడు మాత్రమే కాదు దర్శకుడు, సింగర్ కూడా! లూసిఫర్, బ్రో డాడీ చిత్రాలకు ఈయనే దర్శకత్వం వహించాడు. మలయాళంలో పలు పాటలు ఆలపించాడు.చదవండి: ప్రేమించుకున్నారు.. గొడవపడ్డారు.. అంతా వాళ్లే!: హృతిక్ రోషన్ తండ్రి -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ప్రభాస్ ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసింది
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ అక్షయ్‌కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి పలువురు స్టార్స్ నటిస్తున్నారు. అంతేకాదు మన రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఇందులో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా కన్నప్ప మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రెబల్ స్టార్ ప్రభాస్ లుక్‌ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 3న తేదీన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.టీజర్‌కు ఊహించని రెస్పాన్స్..ఇప్పటికే కన్నప్ప టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్తో కన్నప్ప టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. Here’s a glimpse of the Darling-Rebel Star '𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬' in #Kannappa!🌟 🎬Experience the beginning of an epic journey, and don’t miss the full reveal on 3rd February. Stay tuned for more updates! 🙌 #Prabhas #HarHarMahadevॐ@themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas… pic.twitter.com/ujJMFf93W8— Kannappa The Movie (@kannappamovie) January 27, 2025 -
చలో కారైకుడి
హీరో ప్రభాస్ తమిళనాడుకు వెళ్లారట. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ వారంలో తమిళనాడులో ప్రారంభం కానుందని తెలిసింది. కారైకుడి, మధురై లొకేషన్స్‌లో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారట. ఇక ఈ సినిమాలో ఓ బ్రాహ్మణ యువకుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని, సినిమాలో దేవీపురం అనే బ్యాక్‌డ్రాప్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. -
హీరోల్లో రెబల్ స్టార్ టాప్.. హీరోయిన్లలో ఎవరంటే?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా ప్రతినెల సినీ స్టార్లకు సంబంధించిన ర్యాంకులను ప్రకటిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్న స్టార్ల జాబితాను వెల్లడిస్తుంది. అంతేకాకుండా మోస్ట్ అవైటేడ్ చిత్రాల వివరాలు కూడా ప్రకటిస్తుంది. తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన వివరాలను ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది. డిసెంబర్-2024లో ఇండియాలో అత్యంత ఆదరణ ఉన్న హీరో, హీరోయిన్లు జాబితాను వెల్లడించింది.హీరోల్లో మొదటి ప్లేస్‌లో రెబల్ స్టార్..హీరోల విషయానికొస్తే దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న స్టార్స్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచారు. ఆ తర్వాత రెండో స్థానంలో పుష్పరాజ్ అల్లు అర్జున్ చోటు దక్కించుకున్నారు. వీరిద్దరి తర్వాత మూడో ప్లేస్‌లో దళపతి విజయ్ ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, అజిత్ కుమార్, మహేశ్ బాబు, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ టాప్-10 లిస్ట్‌లో ఛాన్స్ కొట్టేశారు.హీరోయిన్లలో సమంత టాప్..హీరోయిన్ల విషయానికొస్తే సమంత టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ భామలు ఆలియా భట్, దీపికా పదుకొణె వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరుసగా పుష్ప భామ రష్మిక మందన్నా, తండేల్ హీరోయిన్ సాయి పల్లవి, త్రిష, నయనతార, కాజల్ అగర్వాల్, శ్రీలీల, శ్రద్ధాకపూర్ ఉన్నారు. ఈ జాబితాలను హీరో, హీరోయిన్ల క్రేజ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆధారంగానే వెల్లడించినట్లు తెలుస్తోంది. Ormax Stars India Loves: Most popular female film stars in India (Dec 2024) #OrmaxSIL pic.twitter.com/cRd7Jb4WsI— Ormax Media (@OrmaxMedia) January 19, 2025 Ormax Stars India Loves: Most popular male film stars in India (Dec 2024) #OrmaxSIL pic.twitter.com/Tniww2cO7Z— Ormax Media (@OrmaxMedia) January 19, 2025 -
‘‘మోస్ట్ అవైటెడ్ మూవీ’’లో ప్రభాస్ సినిమాలకి టాప్ ప్లేస్
ఒక ఏడాదిలో విడుదలైన సినిమాల నుంచి ప్రేక్షకాదరణను అనుసరించి టాప్ హిట్స్, టాప్ ఫ్లాప్స్ అంటూ జాబితాలు ప్రకటించడం మామూలే. అయితే ఇప్పుడిప్పుడే కొత్త ఏడాదిలో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రాలను కూడా గుర్తించి జాబితాలు ప్రకటించడం ట్రెండీగా మారింది. సినిమాలకు సంబంధించి రేటింగ్ పరంగా అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్లైన్ వేదికగా పేరున్న ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండిబి). ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఐఎండీబీ కస్టమర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా 2025లో మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను తాజాగా ప్రకటించింది. సినిమాలు, టీవీ షోలు ప్రముఖులపై సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఎండిబి పేజ్‌కి ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకులున్నారు. తమ వీక్షకుల ద్వారా ఈ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం అత్యధిక సంఖ్యాకులైన ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వాటిలో నెం.1గా నిలిచింది సికందర్.ఐఎండిబి విడుదల చేసిన 2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్‌ను పరిశీలిస్తే...1. సికందర్, 2. టాక్సిక్,3. కూలీ,4. హౌస్ ఫుల్ 5. బాఘీ, 6.రాజా సాబ్, 7. వార్ 2 8. ఎల్2: ఎంపురాన్ 9. దేవా 10. చావా 11. కన్నప్ప 12. రెట్రో 13. థగ్ లైఫ్ 14. జాట్ 15. స్కై ఫోర్స్ 16. సితారే జమీన్ పర్ 17. థామా 18. కాంతారా ఏ లెజెండ్: చాప్టర్ 1 , 19. ఆల్ఫా 20. తండెల్ఈ జాబితాలోని 20 టైటిల్స్ లో 11 హిందీ సినిమాలు, మూడు తమిళ, తెలుగు, రెండు కన్నడ, ఒకటి మలయాళ సినిమా కావడం గమనార్హం. హౌస్ ఫుల్ 5 (నెం.4), కన్నప్ప (నెం.11), స్కై ఫోర్స్ (నెం.15) వంటి మూడు చిత్రాల్లో అక్షయ్ కుమార్ నటించగా, రష్మిక మందన్న3 సినిమాలు సికందర్ (నెం.1), చావా (నెం.10), థమా (నెం.17)లలో, మోహన్ లాల్, ప్రభాస్, పూజా హెగ్డే, కియారా అద్వానీ లు రెండేసి చిత్రాల్లో నటిస్తున్నారు.నెంబర్ వన్ కావడం సంతోషంగా ఉంది...మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్‌లో నెం.1 గా నిలిచినందుకు సికందర్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘2025 ఐఎండిబి మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ లో సికందర్ అగ్రస్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అతని ఎనర్జీ, అంకితభావం సికందర్ సినిమాను మాటల్లో వర్ణించలేని విధంగా తీర్చిదిద్దాయి. అందుకు సహకరించిన నిర్మాత సాజిద్ నదియాడ్ వాలాకు ధన్యవాదాలు. సికిందర్ లో ప్రతి సన్నివేశం చెరగని ముద్ర వేసేలా తీర్చిదిద్దాం. ప్రేక్షకులతో ఎప్పటికీ నిలిచిపోయేలా ప్రతి క్షణాన్ని డిజైన్ చేయడం కోసం నేను మనస్పూర్తిగా పనిచేశాను’’ అంటూ చెప్పారు. -
రాజాసాబ్ సంక్రాంతి స్పెషల్ పోస్టర్.. లుక్ అదిరింది!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్లో "రాజా సాబ్" సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడుతోంది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా "రాజా సాబ్" సినిమా నుంచి శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ "రాజా సాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తోంది. "రాజా సాబ్" సినిమా అందరికీ గుర్తుండిపోయేలా రూపొందిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం "రాజా సాబ్" చిత్రీకరణ తుది దశలో ఉంది.దిల్ రూబా పండగ పోస్టర్యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటిస్తోంది. "దిల్ రూబా" చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ రోజు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా "దిల్ రూబా" సినిమా నుంచి విషెస్ చెబుతూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో హీరో కిరణ్ అబ్బవరం జాయ్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా "దిల్ రూబా" ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.చదవండి: టీవీల్లో 'గేమ్ ఛేంజర్' ప్రత్యక్షం.. మండిపడ్డ టాలీవుడ్ నిర్మాత -
ప్రభాస్ తో సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్
-
ఈమెతోనే ప్రభాస్ పెళ్లి
-
రాజా సాబ్ వాయిదా?
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రస్తుత చిత్రాల్లో ‘రాజా సాబ్’ ఒకటి. ఈ హారర్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘రాజా సాబ్’ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా, చిత్రయూనిట్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కావడం లేదని, కొత్త విడుదల తేదీపై త్వరలోనే చిత్రయూనిట్ ఓ ప్రకటన చేయనుందని తెలిసింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సంక్రాంతి సందర్భంగా ‘రాజా సాబ్’ సినిమాకు చెందిన ఓ అప్డేట్ని ఇవ్వడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోందట. బహుశా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ రావొచ్చని సమాచారం. -
ప్రభాస్ పెళ్లి ఎవరితో.. రివీల్ చేసిన రామ్ చరణ్
ప్రభాస్ (Prabhas) పెళ్లి ఎప్పుడు..? ఆయన చేసుకోబోయే అమ్మాయి ఎవరూ అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి చాలా వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా డార్లింగ్‌కు కాబోయే సతీమణి వివరాలను రామ్ చరణ్ వెళ్లడించారు. బాలకృష్ణ (Balakrishna) నిర్వహించే అన్‌స్టాపబుల్ వేదికగా చరణ్(Ram Charan) ఈ విషయాలు చెప్పనట్లు తెలుస్తోంది. ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ ప్రశ్నించగా రామ్‌చరణ్ రివీల్ చేశారని టాక్ ఉంది.గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అన్‌స్టాపబుల్ షోలో బాలయ్యతో పాటు చరణ్ పాల్గొన్నారు. ఇప్పటికే ఒక భాగం టెలికాస్ట్ అయింది. రెండో భాగం జనవరి 14న విడుదల అవుతుంది. అయితే, ప్రభాస్ పెళ్లి గురించి చరణ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గణపవరానికి చెందిన అమ్మాయిని అతడు పెళ్లి చేసుకోనున్నారని చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ మరో రెండురోజుల్లో ప్రసారం కానుంది. అందులో ప్రభాస్ పెళ్లి విశేషాలు ఏమైనా తెలుపుతారేమో చూడాలి. ఈ వార్త బయటకు రాగానే డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్‌కు రామ్ చరణ్ ఫోన్ చేసి మాట్లాడుతారు. అదే సమయంలో బాలయ్య కూడా సరదాగా పలు విశేషాల గురించి డార్లింగ్‌తో ముచ్చటించారు. చరణ్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రభాస్ అక్కడ పంచుకున్నారు. ఇదే షోలో చరణ్ స్నేహితులు శర్వానంద్, విక్కీ కూడా పాల్గొన్నారు.2025 దసరా లోపు పెళ్లికృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి రీసెంట్గా ప్రభాస్ పెళ్లి గురించి ప్రకటించారు. ప్రభాస్ పెళ్లి త్వరలోనే కచ్చితంగా ఉంటుందని ఆమె తెలిపారు. అమ్మాయి ఎవరు..? డేట్ వంటి వివరాలు చెప్పను గానీ అంటూనే త్వరలో శుభకార్యం తప్పకుండా ఉంటుందని ఆమె అన్నారు. ఈ దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటివాడు అవుతాడని ఆమె ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు చరణ్ మాటలు చూస్తుంటే డార్లింగ్ పెళ్లి త్వరలోనే జరగనుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు) సలార్,కల్కి సినిమాల హిట్‌తో ఉన్న ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుందని ప్రకటించారు. ఈ చిత్రం తర్వాత సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' మూవీ లైనులో ఉంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆయన డైరీలో ఉన్నాయి. -
ప్రభాస్ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్!
టాలీవుడ్ పాటల రచయిత అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాల్లో హైందవ ధర్మాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. సినిమాలు వ్యాపారమే అయినప్పటికీ హిందూ ధర్మాన్ని కించపరచడం సరికాదని హితవు పలికారు. ఇలా వక్రీకరణకు పాల్పడుతున్నందుకు ఒక సినిమా వ్యక్తిగా తాను సిగ్గు పడుతున్నట్లు శ్రీరామ్ అన్నారు. చిత్రపరిశ్రమ తరపున నేను క్షమాపణలు చెబుతున్నా అని మాట్లాడారు. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను మనం తిరస్కరించాలని సూచించారు. విజయవాడలో ఆదివారం జరిగిన హైందవ శంఖారావం సభలో ఆయన మాట్లాడారు.కల్కి చిత్రంపై ఆరోపణలు..సినిమాల్లో హైందవ ధర్మంపై మూడుకోణాల్లో జరుగుతోందని అనంత శ్రీరామ్ ఆరోపించారు. తెరపైన కనిపించే పాత్రలు...వినిపించే పాటల్లో హైందవ ధర్మం దుర్వినియోగం.. కావ్యేతిహాసపురాణాల వక్రీకరణ.. తెరవెనుక మా ముందు అన్యమతస్తుల ప్రవర్తన అని తెలిపారు. వినోదం కోసం వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రకు అనవసర గొప్పతనం ఇచ్చినందుకు సినిమా పరిశ్రమ వ్యక్తిగా సిగ్గుపడుతున్నా అని తెలిపారు. మూడు కోణాల్లో దాడి..అనంత శ్రీరామ్ మాట్లాడుతూ..'సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి మూడు కోణాల్లో జరుగుతోంది. కావ్యేతిహాస పురాణాలను వక్రీకరించడం, తెర మీద కనిపించే పాత్రలు, పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, తెరవెనక, మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం భారత సాహితీ, వాంగ్మయ శరీరానికి రెండు కళ్లలాంటివి. కానీ అదే రామాయణం, మహభారతాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కొకోల్లలు. గత కొన్నేళ్ల క్రితం వచ్చిన సినిమాల నుంచి.. నిన్న, మొన్న విడుదలైన కల్కి చిత్రంలో కూడా కర్ణుడి పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నా. ఈ విషయాన్ని నిర్మొహమాటంగా చెబుతున్నా. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డమీదే చెబుతున్నా. అప్పటి చిత్ర దర్శకులు.. ఇప్పటి సినిమా నిర్మాతలు ఇదే జిల్లాకు చెందినవారైనా సరే పొరపాటును పొరపాటు అని చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్లు కాదు.. హైందవ ధర్మాన్ని ఆచరించినట్లు కాదు.. హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థమని గంటాపథంగా తెలియేజేస్తున్నా' అని అన్నారు. కృష్ణాజిల్లా గడ్డపై నిలబడి చెబుతున్నా..అనంతరం మాట్లాడుతూ..'కల్కి సినిమాలో అగ్ని దేవుడిచ్చిన ధనుస్సు పట్టిన అర్జునుడి కంటే... సూర్యదేవుడిచ్చిన ధనుస్సు పట్టిన కర్ణుడు వీరుడని చెప్పారు. ఇలాంటి అభూతకల్పనలు... వక్రీకరణలు జరుగుతున్నా మనం చూస్తూ ఊరుకుంటే ఎన్ని సినిమాలైనా వస్తాయి. చిత్రీకరణ,గీతాలాపనలో ఎన్నో రకాలుగా వక్రీకరణ జరుగుతోంది. హైందవ ధర్మాన్ని అవహేళన చేస్తుంటే మనం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటే ఎలా? మన హైందవ ధర్మాన్ని అవమానిస్తే నిగ్గదీసి నిలదీద్దాం. ఒక సినిమా పాట రాసేందుకు ఒక సంగీత దర్శకుడి దగ్గరకు వెళ్లా. ఆపాటలో బ్రహ్మాండ నాయకుడు అనే హిందూ పదం ఉందని ఆ పాట చేయనన్నాడు. ఆ పాట చేయనన్నందుకు జీవితాంతం ఆ సంగీత దర్శకుడికి పాటలు రాయనని చెప్పా. 15 ఏళ్లుగా ఒక్క పాట కూడా రాయలేదు. పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు చిత్ర దర్శకనిర్మాతలతో తిరుపతి పవిత్రతను హేళన చేస్తున్నా నిమ్మకనీరెత్తినట్లు ఉంటాం. కారణం వాళ్లకు మార్కెట్ ఉంది కాబట్టి. సినిమా అనేది వ్యాపారాత్మకమైన, కళాత్మకమైన వ్యాపారం. ఆ వ్యాపారాన్ని సినిమాలకు లేకుండా చేయాలంటే...హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను ప్రభుత్వం బహిష్కరించాలి. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణ గొప్పమార్గం. మనం తిరస్కరిస్తే వ్యాపారం నడవదు..డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హైందవ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తారో చూద్దాం.' అని అనంత శ్రీరామ్ అన్నారు -
లుక్కు మారింది.. కిక్కు ఖాయం
సంవత్సరం మారింది... లుక్ మార్చి బాక్సాఫీస్ లెక్కలు కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు కొందరు హీరోలు. ఇందు కోసం కథానుగుణంగా గెటప్ మార్చేశారు. ఇలా సరికొత్త లుక్‌లో తమ అభిమాన హీరోలు కనిపించడానికి అభిమానులకు ఓ కిక్కు అని ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక ఈ ఏడాది స్క్రీన్‌పై ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం.సరికొత్త మహేశ్ మహేశ్‌బాబు కెరీర్లో ఇప్పటివరకు ఇరవై ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. అయితే స్క్రీన్‌పై ఎప్పుడూ కనిపించనంత కొత్తగా మేకోవర్ అయ్యే పనిలో పడ్డారు మహేశ్‌బాబు. రాజమౌళి డైరెక్షన్‌లోని కొత్త సినిమా కోసమే మహేశ్‌బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలోని లుక్, మేకోవర్ కోసం ఆయన జర్మనీలో కొంత సమయం గడిపారు. గురువారం ఈ సినిమా లాంచ్ జరిగింది. కానీ మహేశ్ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి అండ్ టీమ్. ఈ సినిమాలో మహేశ్ లాంగ్ హెయిర్‌తో, కాస్త గెడ్డంతో కనిపిస్తారని ఇటీవల బయటికొచ్చిన ఆయన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాజా సాబ్ ప్రభాస్ తొలిసారిగా చేస్తున్న హారర్ మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ రెండు గెటప్స్‌లో ఉన్న లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే ప్రభాస్ కుర్చీలో కూర్చున్న ఓ గెటప్ మాత్రం కొత్తగా అనిపిస్తోంది. అలాగే ప్రభాస్ ఇటీవల ఎక్కువగా రగ్డ్ లుక్‌తో, గెడ్డంతోనే కనిపించారు. కానీ ‘రాజాసాబ్’లో మాత్రం క్లీన్ షేవ్‌తో ఓ గెటప్, కాస్త రగ్డ్ లుక్‌తో మరో గెటప్‌లో కనిపిస్తారు.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే విడుదల విషయంలో మార్పు ఉండొచ్చనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే పోలీస్ యాక్షన్ డ్రామా చిత్రం కమిటయ్యారు ప్రభాస్. ఈ చిత్రంలోనూ ప్రభాస్ ఓ డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారని టాక్. ఆ మేకోవర్ కోసం హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులను సంప్రదిస్తున్నారట సందీప్ రెడ్డి వంగా.రగ్డ్ పెద్ది ‘గేమ్ చేంజర్’ మూవీలో రామ్‌చరణ్ క్లీన్ షేవ్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం గుబురు గడ్డం, కాస్త లాంగ్ హెయిర్‌తో రగ్డ్గా కనిపిస్తున్నారు. చరణ్ ఇలా కొత్తగా మేకోవర్ అయ్యింది తన లేటెస్ట్ మూవీ కోసం అని ఊహించవచ్చు. రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.ఈ సినిమా కోసమే రామ్‌చరణ్ కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇందుకోసం రామ్ చరణ్ విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారని తెలిసింది. ఫిజిక్ విషయంలోనే కాదు... హెయిర్ స్టైల్‌తోనూ చరణ్ కొత్తగా కనిపిస్తారు. ‘పెద్ది’ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరిగింది. ఈ షెడ్యూల్లో సెలిబ్రిటీ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పాల్గొని, రామ్‌చరణ్ హెయిర్ స్టైల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఆఫీసర్ అర్జున్ సర్కార్ రోల్‌కు తగ్గట్లుగా నాని మౌల్డ్ అవుతుంటారు. తాజాగా అర్జున్ సర్కార్ పాత్ర కోసం నాని కొంత మేకోవర్ అయ్యారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్ 3’. ఈ మూవీలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఈ చిత్రంలో నాని కొన్ని సీన్స్‌లో ఫుల్ వైట్ హెయిర్‌తో కనిపిస్తారని తెలిసింది. అంటే... ఓ సీనియర్ పోలీసాఫీసర్ లెక్క అన్నమాట. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ మే 1న రిలీజ్ కానుంది. అలాగే ‘దసరా’ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఫుల్ వయొలెన్స్‌తో సాగే ఈ చిత్రంలో ఓ ఫిరోషియస్ లుక్‌లో నాని కనిపించనున్నారు. ఇందుకోసం నాని ప్రత్యేకంగా మేకోవర్ కావాల్సి ఉంది. ‘హిట్ 3’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత నాని కొత్త మేకోవర్ స్టార్ట్ అవుతుందని ఊహించవచ్చు.రొమాంటిక్ లవ్‌స్టోరీ గతేడాది వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కాస్త మాసీ లుక్‌లో కనిపించారు హీరో రామ్. తన తాజా చిత్రం కోసం రామ్ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ కోసం లాంగ్ హెయిర్ పెంచారు రామ్. అలాగే బరువు కూడా తగ్గారు. యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్‌లోకి వచ్చే చాన్స్ ఉంది. స్పై డ్రామా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో ఫ్యామిలీ మేన్‌లా కనిపించారు విజయ్ దేవరకొండ. అయితే ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో అందుకు భిన్నంగా కనిపించనున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లుగా తెలిసింది. దీంతో పోలీస్ రోల్‌కు తగ్గట్లుగా షార్ట్ హెయిర్‌తో, కరెక్ట్ ఫిజిక్‌తో కనిపించనున్నారట విజయ్. కాగా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో విజయ్ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఈ సీన్స్‌లో విజయ్ లుక్ రగ్డ్గా... చాలా మాస్‌గా ఉంటుందని సమాచారం. ఇలా ఈ చిత్రంలో విజయ్ రెండు గెటప్స్‌లో కనిపించనున్నారట. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీలో మార్పు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.మాస్ సంబరాలు ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో సాయి దుర్గా తేజ్ మేకోవర్ చూశారుగా... మాసీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ మాస్ సినిమా కోసం ఫిజికల్‌గా చాలా హార్డ్‌వర్క్ చేశారు సాయి దుర్గాతేజ్. సిక్స్‌ఫ్యాక్ చేశారు. కేపీ రోహిత్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, దాదాపు రూ. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.లేడీ గెటప్‌లో.. మాసీ లుక్స్‌తో కనిపించే విశ్వక్ సేన్ తొలిసారిగా లైలాగా అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. ఓ అబ్బాయి లేడీ గెటప్‌లో నటించాలంటే స్పెషల్‌గా మేకోవర్ అవ్వాల్సిందే. అలా లైలాగా కనిపించడానికి విశ్వక్ మౌల్డ్ అయ్యారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోను, లైలా అనే అమ్మాయి... ఇలా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు విశ్వక్ సేన్. లెనిన్‌గా... ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ హీరోగా చేయాల్సిన నెక్ట్స్ మూవీపై మరో అధికారిక ప్రకటన రాలేదు. అయితే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరితో అఖిల్ ఓ మూవీ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని, ఆల్రెడీ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని, ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే ఈ సినిమా కథ అనంతపురం నేపథ్యంలో సాగుతుందని, లెనిన్ పాత్ర కోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారని తెలిసింది.పీరియాడికల్ వార్ హీరో నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘స్వయంభూ’. పీరియాడికల్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం నిఖిల్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. చెప్పాలంటే గత ఏడాదిగా ఈ లుక్‌నే మెయిన్టైన్ చేస్తున్నారు నిఖిల్. లాంగ్ హెయిర్‌తో, స్ట్రాంగ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు నిఖిల్. అంతే కాదు... ఈ సినిమా కోసం నిఖిల్ కొన్ని యాక్షన్ సీన్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ కోవలో మరికొందరు హీరోలు కూడా తమ కొత్త సినిమాల కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
స్పిరిట్ లో మృణాల్ ప్లేస్.. కన్ఫామ్ అయినట్లు ప్రచారం
-
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో స్టార్స్.. ప్రభాస్ ఎక్కడంటే..?
2024కి బై చెప్పి... 2025కి వెల్కమ్ చెప్పడానికి అందరూ సెలబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. కొందరు స్టార్స్ అయితే కొత్త సంవత్సరం జరుపుకోవడానికి విదేశాలు వెళ్లారు. షూటింగ్స్‌కి కాస్త విరామం దొరకడంతో వెకేషన్ ప్లాన్ చేసుకునే అవకాశం ఈ స్టార్స్‌కి దక్కింది. వారి ఈ వెకేషన్ గురించి తెలుసుకుందాం...ఈ ఏడాది మహేశ్‌బాబు ఇప్పటికే రెండుసార్లు జర్మనీ వెళ్లొచ్చారు. అయితే ఇది హాలిడే ట్రిప్ కాదు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ప్రిపరేషన్లో భాగంగా జర్మనీ వెళ్లారని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఏడాది మహేశ్‌బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫారిన్లో జరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా ఫారిన్లోనే మహేశ్‌బాబు ప్లాన్ చేశారని సమాచారం. మహేశ్‌బాబు మోస్ట్లీ యూరప్‌కు వెళ్లనున్నారట. ఇక ప్రభాస్ ఆల్రెడీ యూరప్‌లో ఉన్నారని తెలిసింది. ఇటీవల ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా ప్రభాస్ కాలికి గాయమైంది. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. యూరప్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని, ప్రభాస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే అని టాక్. విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘రాజా సాబ్, ఫౌజి’ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్. ఈ సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ చిత్రాన్ని ఆరంభిస్తారు ప్రభాస్. ఇక ‘దేవర’ సక్సెస్ జోష్‌లో ఉన్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీలో స్ట్రయిట్ ఫిల్మ్ ‘వార్ 2’ (ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరో) లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు చెందిన ఓ లెంగ్తీ షూట్‌ను పూర్తి చేశారు. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారని తెలిసింది. సో... ఎన్టీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లండన్‌లోనే అని ఊహించవచ్చు. లండన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్‌తో ఎన్టీఆర్ బిజీ అవుతారట. ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం హీరోయిన్ పూజా హెగ్డే స్పెయిన్ వెళ్లారు. రష్మికా మందన్నా ఆల్రెడీ ఫారిన్లోనే ఉన్నారని తెలిసింది. హీరోయిన్ తమన్నా, ఫరియా అబ్దుల్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను అమెరికాలో ప్లాన్ చేశారని తెలిసింది. వీరితో పాటు మరి కొందరు టాలీవుడ్ యాక్టర్స్ గోవా, మాల్దీవ్స్‌లో వేడుకలు ప్లాన్ చేశారని సమాచారం. భర్త విఘ్నేష్ శివన్‌తో నయనతార దుబాయ్ వెళ్లారు. అక్కడే మాధవన్, ఆయన భార్య సరిత కూడా ఉన్నారు. సో... ఈ రెండు ఫ్యామిలీస్ ఒకే చోట వేడుక చేసుకోనున్నారు. కలిసి ఉన్న ఫొటోను కూడా షేర్ చేశారు. అలాగే బాలీవుడ్ స్టార్ట్ హీరో హృతిక్ రోషన్ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్పాట్‌గా దుబాయ్‌నే ఎంచుకున్నారు. ఇంకా ఫ్యామిలీతో కలిసి దియా మీర్జా శ్రీలంక వెళ్లారు. అర్జున్ రాంపాల్ సెలబ్రేషన్స్ గోవాలో జరుతాయని సమాచారం. ఫ్యామిలీతో కలిసి కరీనా కపూర్ స్విట్జర్లాండ్‌లో, శిల్పాశెట్టి లండన్‌లో, భర్త జహీర్ ఇక్భాల్‌తో కలిసి హీరోయిన్ సోనాక్షీ సిన్హా ఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోనున్నారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ ఫిన్‌ల్యాండ్ వెళ్లారు. -
కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉండగా.. డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్: ప్రభాస్
-
ఎంటర్టైన్మెంట్ ఉండగా.. డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్: ప్రభాస్
డ్రగ్స్ నిర్మూలనకు టాలీవుడ్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ తన స్వరం కలిపారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ ప్రభాస్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. లైఫ్‌లో మనకు బోలెడన్నీ ఎంజాయ్ మెంట్స్, ఎంటర్టైన్మెంట్ ఉన్నాయని ప్రభాస్ అన్నారు. మనల్ని ప్రేమించే వారు, మనకోసం బతికే మనవాళ్లు ఉండగా.. డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? అని ప్రభాస్ ప్రశ్నించారు. సే నో టూ డ్రగ్స్ అంటూ అభిమానులను, సినీ ప్రియులను ప్రభాస్ కోరారు. మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్ కు బానిసలైతే 8712671111 నెంబర్‌కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మత్తుకు బానిసలైనవాళ్లు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వీడియోలో ప్రభాస్ మాట్లాడారు. -
2025లోనూ ప్రభాస్ జోరు.. మూడు సినిమాలు పక్కా
-
కొత్త భాష నేర్చుకుంటున్న ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్
-
ప్రభాస్ కి భయపడని చిన్న హీరోలు
-
Salaar@1 Year: 6 రోజుల్లో 500 కోట్లు.. టెండ్రింగ్‌లో 300 రోజులు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీ ‘సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్’ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన "సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్" వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 700 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే రూ.500 కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరడం విశేషం. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా 300 రోజులు కంటిన్యూగా ట్రెండింగ్ లో కొనసాగి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ చేసిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఓవరాల్ పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఛరిష్మా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాయి."సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్" రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఈ సినిమా పోస్టర్స్ సందడి చేస్తున్నాయి. "సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్" సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించగా..భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించారు. ప్రస్తుతం "సలార్ 2, శౌర్యంగపర్వ" చిత్రీకరణ జరుపుకుంటోంది. -
'సలార్' రిజల్ట్‌తో నేను హ్యాపీగా లేను: ప్రశాంత్ నీల్
ప్రభాస్ 'సలార్' సినిమా రిలీజై అప్పుడే ఏడాది పూర్తయిపోయింది. గతేడాది సరిగ్గా ఇదే రోజున (డిసెంబర్ 22) థియేటర్లన్నీ సందడిగా మారిపోయింది. ఇప్పుడు అభిమానులు.. 'సలార్' గుర్తుల్ని నెమరవేసుకుంటున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. బోలెడన్ని సంగతులు చెప్పాడు.'సలార్ ఫలితంతో నేను సంతోషంగా లేను. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కోసం చాలా కష్టపడ్డాను. కానీ ఎక్కడో కేజీఎఫ్ 2 ఛాయలు కనిపించాయి. అయితే 'సలార్ 2' సినిమాని మాత్రం నా కెరీర్లో బెస్ట్ మూవీగా తీస్తాను. ప్రేక్షకులు ఊహలకు మించిపోయేలా ఆ మూవీ తీస్తాను. జీవితంలో కొన్ని విషయాలపై కాన్ఫిడెంట్‌గా ఉంటాను. 'సలార్ 2' అందులో ఒకటి' అని ప్రశాంత్ నీల్ చెప్పాడు.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' చూసేసిన సుకుమార్.. ఫస్ట్ రివ్యూ)ప్రశాంత్ నీల్ చెప్పింది కరెక్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే గతేడాది 'సలార్' మూవీ చూసిన చాలామంది 'కేజీఎఫ్'తో పోలికలు పెట్టారు. కానీ తర్వాత ఓటీటీలో మాత్రం బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. మరీ ముఖ్యంగా కాటేరమ్మ ఫైట్‌ని అయితే డార్లింగ్ ఫ్యాన్స్ రోజుకోకసారైనా చూడందే నిద్రపోరు.'సలార్ 2' విషయానికొస్తే కాస్త టైమ్ పట్టేలా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో మూవీ చేస్తున్నాడు. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతుంది. లెక్క ప్రకారం 2026 సంక్రాంతికి రిలీజ్ అని చెప్పారు గానీ ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువ. అంటే 2026 వేసవి తర్వాత 'సలార్ 2' షూటింగ్ మొదలవ్వొచ్చు. ఎలా లేదన్నా 2027-28లోనే ఇది వచ్చే అవకాశాలున్నాయి.(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా)I'm not completely happy with #Salaar’s performance in theatres, says Prashanth Neel pic.twitter.com/WXIBkdgMh5— Aakashavaani (@TheAakashavaani) December 22, 2024 -
ప్రభాస్ నంబర్ వన్ ... సమంత హ్యాట్రిక్
రికార్డ్ ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతి నెలా దేశంలోని సెలబ్రిటీలపై సర్వే నిర్వహించి, టాప్ ΄పోజిషన్లోని వారి జాబితాలను విడుదల చేస్తుంటుంది. అందులో భాగంగా నవంబరు నెలకుగాను మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను ప్రకటించగా హీరో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు. హీరోయిన్లలో సమంత తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు... కథానాయికల జాబితాలో సమంత వరుసగా మూడో సారి (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్) ఫస్ట్ ప్లేస్‌లో నిలవడం విశేషం.ప్రభాస్ వరుసగా రెండో సారి (అక్టోబర్, నవంబర్) నిలిచారు. ఇక నవంబర్ నెలకు ప్రకటించిన మోస్ట్ పాపులర్ స్టార్ జాబితాలో ప్రభాస్ తర్వాతి స్థానంలో విజయ్ రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వరుసగా అల్లు అర్జున్, షారుక్ ఖాన్, ఎన్టీఆర్, అజిత్ కుమార్, మహేశ్‌బాబు, సూర్య, రామ్‌చరణ్, అక్షయ్ కుమార్ నిలిచారు.ఇక హీరోయిన్ల విషయానికొస్తే... సమంత తొలి స్థానంలో నిలిచారు. వరుసగా మూడు నెలలపాటు ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలో తొలి స్థానంలో నిలిచి, హ్యాట్రిక్ రికార్డ్ సృష్టించారు సమంత. దీంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ జాబితాలో సమంత తర్వాతి ప్లేస్‌లలో ఆలియా భట్, నయనతార, సాయి పల్లవి, దీపికా పదుకోన్, త్రిష, కాజల్ అగర్వాల్, రష్మికా మందన్నా, శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్ ఉన్నారు. -
స్పిరిట్‌లో..?
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పోలీస్ యాక్షన్ డ్రామాగా ‘స్పిరిట్’ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తొలిసారిగా పోలీసాఫీసర్‌గా నటించనున్నారు ప్రభాస్. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ దాదాపు పూర్తి కావచ్చాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించాలనుకుంటున్నారు. దీంతో ఈ సినిమాలోని నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రను మృణాల్ ఠాకూర్ చేయనున్నారనే టాక్ బాలీవుడ్లో తెరపైకి వచ్చింది. అలాగే ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ నటిస్తారనే ప్రచారం కూడా బీ టౌన్లో జరుగుతోంది. ఇక ఆల్రెడీ సౌత్ కొరియన్ నటుడు డాన్ లీ ఈ చిత్రంలో ఓ రోల్ చేయనున్నారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి... బాలీవుడ్లో ప్రచారం జరుగుతున్నట్లుగా ప్రభాస్ సరసన మృణాళ్ కనిపిస్తారా? అలాగే కీలక పాత్రల్లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ కన్ఫార్మ్ అవుతారా? అనేది వేచి చూడాల్సిందే. -
ది రాజాసాబ్ ఆన్ ట్రాక్.. రూమర్స్‌పై స్పందించిన నిర్మాణ సంస్థ!
కల్కి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రొమాంటిక్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఇటీవల బచ్చలమల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన మారుతి.. ప్రభాస్ సినిమా గురించి మాట్లాడారు. నా నవ్వు చూస్తే చాలు.. ది రాజాసాబ్ గురించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అయితే మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ది రాజాసాబ్ విడుదల వాయిదా పడిందంటూ వార్తలొచ్చాయి. అదే రోజు సిద్ధు జొన్నలగడ్డ మూవీ రానుందని.. అందువల్లే ది రాజాసాబ్ డేట్ మారినట్లు న్యూస్ వైరలైంది.డే అండ్ నైట్ జరుగుతోంది..తాజాగా ఈ వార్తలపై ది రాజాసాబ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పందించింది. ది రాజాసాబ్ విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని తెలిపింది. ఈ మూవీ షూటింగ్ డే అండ్ నైట్ షెడ్యూల్స్ నిరంతరాయంగా జరుగుతున్నాయని పేర్కొంది. ఇప్పటికే దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించింది.అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ది రాజా సాబ్ టీజర్ విడుదల కానుందని మరికొన్ని ఊహాగానాలు వస్తున్నాయని తెలిసింది. ఇలాంటి వాటిని ఎవరూ కూడా నమ్మవద్దని కోరుతున్నట్లు టీమ్ వెల్లడించింది. ఈ మూవీకి సంబంధించి సరైన సమయంలో మేమే అప్డేట్స్ ఇస్తామని ట్విటర్ ద్వారా కోరింది నిర్మాణ సంస్థ. ఈ ప్రకటనతో ది రాజాసాబ్ చిత్రంపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది.గాయం కావడం వల్లే రూమర్స్..'ది రాజాసాబ్' వాయిదాకు ప్రబాస్ గాయమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చీలమండ బెణికిందని న్యూస్ వచ్చింది. దీనికి సర్జరీ చేయించుకునేందుకు త్వరలో ఇటలీ వెళ్తున్నాడని, జనవరి చివరి వారంలో ప్రభాస్ తిరిగి స్వదేశానికి వస్తాడని తెలుస్తోంది. ఇది కూడా వాయిదాకు మరో కారణమని అంటున్నారు. #TheRajaSaab shooting is progressing rapidly with continuous day and night schedules. Nearly 80% of the shoot has been completed, and post production work is in full swingWe’ve noticed various speculations circulating about the teaser release during Christmas or New Year. We… pic.twitter.com/qJIX2AXxDh— People Media Factory (@peoplemediafcy) December 18, 2024 -
అక్కడి ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన ప్రభాస్... ఎందుకంటే?
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. దాదాపు రూ.1200 కోట్లపైచిలుకు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా జపాన్‌లో రిలీజ్ చేయనున్నట్లు ఆ మధ్య వైజయంతి మూవీస్ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 3న జపాన్‌లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.జపాన్ భాషలో సారీ చెప్తూ..అంతేకాదు, జపాన్ను సైతం వస్తానని మాటిచ్చాడు ప్రభాస్. కానీ ప్రస్తుతం కాలికి గాయంతో బాధపడుతున్నందున ఆ ప్లాన్‌ను వాయిదా వేశాడు. దీంతో జపాన్ భాషలో అక్కడివారికి సారీ చెప్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. 'నాపై, నా సినిమాలపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. గాయం వల్లే..జపాన్‌కు రావాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను. కానీ నా కాలికి గాయం కావడం వల్ల రాలేకపోతున్నాను. కానీ త్వరలోనే మీ ముందుకు వస్తానని మాటిస్తున్నాను. జనవరి 3న జపాన్‌లో రిలీజయ్యే కల్కి 2898 ఏడీ మూవీ చూసి ఎంజాయ్ చేయండి' అని పేర్కొన్నాడు. ఇకపోతే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు నాగ్ అశ్విన్ జపాన్ పర్యటనలో బిజీగా ఉన్నాడు.కల్కి సినిమా సంగతులుకల్కి విషయానికి వస్తే.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వర్షన్స్)తో పాటు నెట్‌ఫ్లిక్స్ (హిందీ వర్షన్)లో అందుబాటులో ఉంది.#プラバース から日本のすべてのファンの皆さんへメッセージ 🫶❤️🔥- https://t.co/mLRYxxFLXl#Kalki2898AD releasing in cinemas across Japan from January 3rd!#カルキ2898AD #Kalki2898ADinJapan@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani… pic.twitter.com/CYdG1kmTmm— Kalki 2898 AD (@Kalki2898AD) December 18, 2024//#カルキ2898ADジャパンプレミア実況🏹\\TOHOシネマズ六本木ヒルズ 無事終了いたしました✨次は、19:00〜新宿ピカデリーにて!🔥#カルキ2898AD来日譚 pic.twitter.com/YIEbOzkhF6— 【公式】映画『カルキ 2898-AD』 (@kalki2898AD_jp) December 18, 2024చదవండి: నటిపై లైంగిక వేధింపులు.. యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్ -
ప్రభాస్ 'రాజాసాబ్' రిలీజ్ వాయిదా పడ్డట్లే
లెక్క ప్రకారం ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కావాలి. కానీ గత కొన్నిరోజుల నుంచి వాయిదా అని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అధికారికంగా ఏం చెప్పలేదు గానీ దాదాపు వాయిదా పడ్డట్లే. ఎందుకంటే యంగ్ హీరో సిద్ధు జొన్నల్లగడ్డ.. అదే తేదీకి తన కొత్త సినిమాని తీసుకొస్తున్నట్లు ప్రకటించడంతో ఈ క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సత్యదేవ్ కొత్త సినిమా)'టిల్లు' సినిమాలతో ఫేమస్ అయిన సిద్ధు.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'జాక్' మూవీ చేస్తున్నాడు. 'బేబి' వైష్ణవి చైతన్య హీరోయిన్. షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పుడు హఠాత్తుగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 'రాజాసాబ్' వాయిదా గురించి వీళ్లకు క్లారిటీ ఉన్నట్లు ఉంది. అందుకే అంత కచ్చితంగా అదే డేట్ వేశారు.'రాజాసాబ్' వాయిదాకు ప్రబాస్ గాయమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చీలమండ బెణికిందని న్యూస్ వచ్చింది. దీనికి సర్జరీ చేయించుకునేందుకు త్వరలో ఇటలీ వెళ్తున్నాడని, జనవరి చివరి వారంలో ప్రభాస్ తిరిగి స్వదేశానికి వస్తాడని తెలుస్తోంది. ఇది కూడా వాయిదాకు మరో కారణమని అంటున్నారు. (ఇదీ చదవండి: రూ.10 టికెట్లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త) -
'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్
ప్రస్తుతం మంచు ఫ్యామిలీ వివాదం నడుస్తోంది. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. మోహన్ బాబు- మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం దగ్గర నుంచి తాజాగా మోహన్ బాబు భార్య నిర్మల.. మనోజ్ చేసిందని తప్పంటూ లేఖ విడుదల చేయడం వరకు వచ్చింది. దీని వల్ల మంచు విష్ణు 'కన్నప్ప' మూవీ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఓ నెటిజన్‌కి ట్వీట్‌కి విష్ణు ఆసక్తికర రిప్లై ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. భర్త గురించి వరలక్ష్మి)మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా 'కన్నప్ప'. విష్ణు, మోహన్ బాబు, విష్ణు కూతుళ్లు-కొడుకు.. వీళ్లతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్.. ఇలా భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇదివరకే టీజర్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు.'కన్నప్ప'లో ప్రభాస్ కూడా అతిథి పాత్ర చేస్తున్నాడు. తాజాగా ఓ నెటిజన్.. విష్ణుని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. 'అన్నా.. మూవీ ఎలా ఉన్నా పర్లేదు. ప్రభాస్ లుక్స్, పాత్ర తేడా రాకుండా చూస్కో. ఐదు సార్లు వెళ్తా మూవీకి' అని రాసుకొచ్చాడు. దీనికి రిప్లై ఇచ్చిన విష్ణు.. '100 శాతం మీకు ప్రభాస్ పాత్ర నచ్చుతుంది బ్రదర్. కాస్త ఓపిగ్గా ఉండు. త్వరలో బోలెడన్ని విషయాలు చెబుతా' అని అన్నాడు. (ఇదీ చదవండి: మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు.. పోలీసులకు లేఖ రాసిన తల్లి నిర్మల)My brother, I am 100% sure you will love my brother #prabhas character and I wish I can tell you more. Exciting to reveal more. Patience please 🙏 🤗🥰 https://t.co/956puAYJ4X— Vishnu Manchu (@iVishnuManchu) December 17, 2024 -
స్టార్ హీరో ప్రభాస్ మళ్లీ గాయపడ్డాడా?
వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది. గతేడాది 'సలార్', ఈ ఏడాది 'కల్కి 2898 ఏడీ' చిత్రాలతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న డార్లింగ్ హీరో.. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) మూవీస్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. మరి ఎప్పుడు జరిగిందో గానీ ప్రభాస్ చిత్రీకరణ సందర్భంగా గాయపడ్డాడట. ఈ విషయాన్ని స్వయంగా ఇతడే వెల్లడించినట్లు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం)'బాహుబలి' తర్వాత నుంచి ప్రభాస్ తన ప్రతి సినిమాను జపాన్‌లోనూ విడుదల చేస్తున్నాడు. రాబోయే జనవరి 3న 'కల్కి' జపాన్‌లో రిలీజ్ చేయనున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. ఈ సినిమా ప్రీమియర్ కోసం ప్రభాస్ వెళ్లే ప్లాన్ ఫిక్సయింది. ఇప్పుడు ఇతడి చీలమండ బెణికిందని, దీంతో జపాన్ రాలేకపోతున్నానని జపనీస్ భాషలో ప్రభాస్ ఓ లెటర్ ఒకటి వైరల్ అవుతుంది. దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. గతంలో పలుమార్లు ప్రభాస్ గాయపడ్డాడు!ప్రభాస్ 'రాజాసాబ్' మూవీ.. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికే చాలా షూటింగ్ పెండింగ్‌లో ఉందని, బహుశా ఈ తేదీకి రాకపోవచ్చనే రూమర్స్ నడుస్తున్నాయి. విడుదల తేదీ ఇంకా చాలా దూరముంది కాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేం. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' చేస్తున్నాడు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
స్పిరిట్ మూవీలో ప్రభాస్ తో సీత రొమాన్స్
-
అల్లు అర్జున్ విషయంలో ప్రభాస్, శ్రీలీల రియాక్షన్
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు మద్ధతుగా చిత్ర పరిశ్రమ నుంచి పలువురు నటీనటులు ఇప్పటికే స్పందించారు. ఈ క్రమంలో కొందరు బన్నీ ఇంటికే కూడా వెళ్లి ఆయన్ను కలిసి వచ్చారు. తాజాగా ప్రభాస్ తన స్నేహితుడు అల్లు అర్జున్‌తో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. దీంతో ఇరువురి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. కన్నడ హీరో ఉపేంద్ర కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. వీరిద్దరూ 'S/O సత్యమూర్తి' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా ఈరోజు అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఆయన సినిమా షూటింగ్ పనుల వల్ల హైదరాబాద్‌లో లేరని తెలుస్తోంది. దీంతో బన్నీకి ఫోన్ చేసి తన యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ ఉదయం నుంచి బన్నీ ఇంటికి చాలామంది సెలబ్రిటీలు క్యూ కట్టారు. ముఖ్యంగా చిరంజీవి సతీమణి సురేఖ, డైరెక్టర్ సుకుమార్ కంటతడి పెట్టడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.అల్లు అర్జున్ తప్పు చేయరు: శ్రీలీలఅల్లు అర్జున్ అరెస్టుపై నటి 'శ్రీలీల' కూడా రియాక్ట్ అయింది. ఆయన్ను అరెస్టు చేయడం బాధాకరమని ఆమె చెప్పారు. ఈ ఘటనతో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆయన ఎప్పుడు తప్పు చేయరు. న్యాయవ్యస్థను ఆయన గౌరవిస్తారు. కాబట్టి అల్లు అర్జున్‌కు మంచి జరిగింది. ఆయన పెద్ద స్టార్ అయినప్పటికీ భారత పౌరుడిగా మన వ్యవస్థలోని రూల్స్‌ను అందరిలాగే పాటించారు.' అని శ్రీలీల పేర్కొంది. -
‘భయం’తో బాక్సాఫీస్‌పై దాడి.. కాసుల వర్షం కురిసేనా?
హారర్ సినిమాలు ఏ మాత్రం ఆడియన్స్‌కు కనెక్ట్ అయినా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. అందుకే కథాబలం ఉన్న భయపెట్టే కథలు తమ దగ్గరకి వస్తే చేసేందుకు భయపడరు హీరోలు, హీరోయిన్లు. కథలోని భయాన్నే భరోసాగా చేసుకుని, ప్రస్తుతం కొందరు నటీనటులు హారర్ సినిమాలు చేస్తున్నారు. ఆ స్టార్స్ చేస్తున్న హారర్ చిత్రాల గురించి తెలుసుకుందాం.రాజా డీలక్స్ థియేటర్లో రాజా సాబ్ ప్రభాస్ కటౌట్ చాలు బాక్సాఫీస్ భయపడటానికి. కానీ వెండితెరపై ప్రభాస్ భయపడితే ఎలా ఉంటుంది? ఆడియన్స్‌ను ప్రభాస్ భయపెడితే ఎలా ఉంటుంది? అనేది ‘రాజా సాబ్’ సినిమాలో చూడొచ్చు. ‘ప్రేమకథా చిత్రమ్’తో ఆడియన్స్‌ని నవ్విస్తూనే భయపెట్టి, బాక్సాఫీస్ కాసులను కురిపించిన దర్శకుడు మారుతి ‘రాజా సాబ్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, తాతా మనవళ్ళుగా ప్రభాస్ కనిపిస్తారని, ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో సీరియస్ హారర్ సీన్స్ ఉన్నాయని సమాచారం. ‘రాజా డీలక్స్’ అనే థియేటర్లో జరిగే హారర్ సీన్స్ ఈ సినిమాకు కీలకమని ఫిల్మ్‌నగర్ భోగట్టా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చాలా సీజీ వర్క్ చేయాల్సి ఉంది. దీంతో వీలైనంత తొందరగా షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హారర్ తరహా జానర్లో ప్రభాస్ ఇప్పటివరకు సినిమా చేయలేదు. దీంతో ‘రాజా సాబ్’ సినిమా ఎలా ఉండబోతుంది? అనే క్యూరియాసిటీ ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్‌లోను నెలకొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇప్పుడు సినిమాలోనూ... నాగచైతన్య కెరీర్లో ఇప్పటివరకూ హారర్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు లేవు. అయితే హారర్ టచ్ ఉన్న ‘ధూత’ అనే వెబ్ సిరీస్ చేశారు. ఈ సిరీస్‌కు వీక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఓ పర్ఫెక్ట్ హారర్ మూవీతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు నాగచైతన్య. ‘విరూపాక్ష’ సినిమాతో దర్శకుడు కార్తీక్‌వర్మ దండు ఆడియన్స్‌ను బాగా భయపెట్టి, బాక్సాఫీస్ వద్ద డబ్బులు రాబట్టుకున్నారు. ఈ దర్శకుడు తెరకెక్కించనున్న కొత్త సినిమాలో నాగచైతన్య హీరోగా నటించనున్నారు. ‘విరూపాక్ష’ను మించిన హారర్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయని, కథకు కాస్త మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందని సమాచారం. ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఓ ఎత్తైన పర్వతం పైకి ఎక్కుతున్న నాగచైతన్యను ఓ పక్షి కన్నులో నుంచి చూపించారు మేకర్స్. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్‌కు ఆసక్తి నెలకొంది. ఈ నెలాఖర్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. నాగచైతన్య కెరీర్‌లోని ఈ 24వ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. కొరియన్ కనకరాజు లవ్‌స్టోరీ, యాక్షన్ జానర్స్‌లో సినిమాలు చేశారు వరుణ్ తేజ్. అయితే ఈసారి కొత్తగా ప్రయత్నించాలని వరుణ్ తేజ్ డిసైడ్ అయ్యారు. అందుకే ఓ హారర్ కామెడీ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వరుణ్. ‘రన్ రాజా రన్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ వంటి చిత్రాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ సినిమా కథనం రాయలసీమ నేపథ్యంలో ఉంటుంది. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించాలనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది పీరియాడికల్ ఫిల్మ్‌గా ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. మార్చిలో చిత్రీకరణ అంటున్నారు కాబట్టి, వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ఊహించవచ్చు. చీకటి–వెలుగుల మధ్యలో...! చీకటి వెలుగుల మధ్య దాగి ఉన్న ఓ మిస్టరీని చేధించే పనిలో పడ్డారట బెల్లకొండ సాయి శ్రీనివాస్. ఆయన హీరోగా కౌశిక్ పెగుళ్లపాటి దర్శకత్వంలో ఓ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది. సాయి శ్రీనివాస్ కెరీర్‌లోని ఈ 11వ చిత్రంలో ‘కిష్కింధపురి’ అనే కల్పిత ప్రాంతం ఉంటుందని, అక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయని, ఈ నేపథ్యంలో ఓ హారర్ కథను కౌశిక్ రెడీ చేసుకున్నారనీ భోగట్టా. ఈ సినిమాకు ‘కిష్కింధపురి’ అనే టైటిల్ అనుకుంటున్నారట. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కావొచ్చు. రహస్యాలను కనిపెట్టే యువతిగా∙ఈ ఏడాది ‘అరణ్మణై 4’ (తెలుగులో ‘బాకు’) వంటి హారర్ సినిమాతో ఆడియన్స్‌ను ఆలరించారు తమన్నా. ఈ సినిమాలో ఓ పాజిటివ్ ఆత్మగానే కనిపించారు. అలాగే ఈ ఏడాదే విడుదలైన హిందీ బ్లాక్‌బస్టర్ హారర్ ఫిల్మ్ ‘స్త్రీ 2’లోనూ మెరిశారు తమన్నా. కానీ ఆమె పాత్రకు హారర్ టచ్ లేదు. ఓ స్పెషల్ సాంగ్‌తోనే సరిపోయింది. కాగా ప్రస్తుతం తమన్నా ‘ఓదెల 2’ అనే మైథలాజికల్ హారర్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో నాగసాధువు శివశక్తి పాత్రలో కనిపిస్తారు తమన్నా. హెబ్బా పటేల్, వశిష్ఠ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశం. సంపత్ నంది ఈ సినిమాకు కథ అందించారు. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సంపత్ నంది టీమ్ వర్క్స్, మధు క్రియేషన్స్ పతాకాలపై డి. మధు ఈ నిర్మిస్తున్నారు. మరోవైపు గాంధారి కోటలోని రహస్యాలను కనిపెట్టే యువతి పాత్రలో నటించారు హన్సిక. ‘శ్రీ గాంధారీ’ సినిమా కోసం హన్సిక ఈ పాత్ర చేశారు. హారర్, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో మెట్రో శిరీష్, మయిల్ సామి, తలైవాసల్ విజయ్ ఇతర కీలక పాత్రధారులు. ఆర్. కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో రాజు నాయక్ రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇంకా సత్యం రాజేశ్ ‘పొలిమేర 3’, తిరువీర్ ‘మసూద 2’, వంటి హారర్ సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయని తెలుస్తోంది. మరికొందరు యువ దర్శకులు కూడా హారర్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. - ముసిమి శివాంజనేయులు -
తొలి స్థానంలో స్త్రీ2... రెండో స్థానంలో కల్కి 2898 ఏడీ
ప్రతి ఏడాది ప్రేక్షకులను ఆకర్షించే, చర్చించుకునేలా చేసే సినిమాలు కొన్ని ఉంటాయి. అలా ఈ ఏడాది కూడా పలు ఇండియన్ సినిమాలు ప్రేక్షకులను ఆకర్షించాయి.... అలరించాయి. కాగా ఇండియాలో గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చెస్ ఫర్ మూవీస్ జాబితాలోని మొదటి పది చిత్రాల్లో మూడు తెలుగు చిత్రాలు నిలిచాయి. తొలి స్థానంలో రాజ్‌కుమార్ రావు– శ్రద్ధా కపూర్ నటించిన హిందీ చిత్రం ‘స్త్రీ 2’, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘కల్కి 2898 ఏడీ’ రెండో స్థానంలో నిలిచాయి. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన మరో చిత్రం ‘సలార్’కు తొమ్మిదో స్థానం లభించింది. 3, 4, 5, 6, 7, 8 స్థానాల్లో వరుసగా హిందీ చిత్రాలు ‘ట్వల్త్ ఫెయిల్, లాపతా లేడీస్’, తెలుగు చిత్రం ‘హను–మాన్’, తమిళ చిత్రం ‘మహారాజా’, మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’, తమిళ చిత్రం ‘గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రాలు నిలిచాయి. మలయాళంలో ఫాహద్ ఫాజిల్ చేసిన ‘ఆవేశం’ సినిమా చివరి స్థానంలో నిలిచింది. అలాగే గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చెస్ షోల జాబితాలో తొలి స్థానంలో ‘హీరామండి’ వెబ్ సిరీస్ నిలిచింది. ‘మిర్జాపూర్, పంచాయత్, కోట ఫ్యాక్టరీ’ వంటి సిరీస్‌లకు చోటు దక్కింది. -
అత్యంత ఆదరణ కలిగిన చిత్రంగా టాలీవుడ్ మూవీ.. సెకండ్ ప్లేస్ ఏదంటే?
తాజాగా ఈ ఏడాది ఐఎండీబీ సినిమా ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ ఏడాది అత్యంత ఆదరణ కలిగిన చిత్రాల జాబితాను విడుదల చేసింది. 2024లో మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీగా ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్‌లో శ్రద్ధకపూర్ సూపర్ హిట్ చిత్రం స్త్రీ-2 నిలవగా.. మూడోస్థానాన్ని విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రం దక్కించుకుంది.ఆ తర్వాత స్థానాల్లో వరుసగా.. అక్షయ్ కుమార్ సైతాన్, హృతిక్ రోషన్ ఫైటర్, మలయాళ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్, బాలీవుడ్ మూవీ భూల్ భూలయ్యా-3, కిల్, సింగం ఏగైన్, లపట్టా లేడీస్ ఉన్నాయి. ఇక వెబ్ సిరీస్‌ల విషయానికొస్తే మొదటిస్థానంలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి: ది డైమండ్ బజార్ నిలిచింది. ఈ జాబితాను ప్రకటిస్తూ ఐఎండీబీ పోస్టర్స్‌ను విడుదల చేసింది.కాగా.. నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశాపటానీ, కమల్ హాసన్ లాంటి స్టార్స్ నటించారు.Presenting the Most Popular Indian Movies of 2024 that captured your hearts and kept you coming back for more! 💛📍Of all the movies released in India between January 1 and November 25, 2024, that have an average IMDb user rating of 5 or higher, these 10 titles were… pic.twitter.com/aP8nYcQuvO— IMDb India (@IMDb_in) December 11, 2024 ఐఎండీబీ టాప్-10 చిత్రాలు- 20241.కల్కి 2898 ఏడీ2.స్త్రీ-23.మహారాజా4.సైతాన్5.ఫైటర్6. మంజుమ్మెల్ బాయ్స్7.భూల్ భూలయ్యా-38.కిల్9.సింగం ఏగైన్10. లపట్టా లేడీస్టాప్-10 వెబ్ సిరీస్‌లు ఇవే..1. హీరామండి ది డైమండ్ బజార్2. మీర్జాపూర్ సీజన్-33.పంచాయత్ సీజన్-34.గ్యారాహ్ గ్యారాహ్5. సిటాడెల్ హనీ బన్నీ6.మామ్లా లీగల్ హ7.తాజా ఖబర్ సీజన్-28. మర్డర్ ఇన్ మహిమ్9. శేఖర్ హోమ్10.ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో -
ప్రభాస్ లేకుండానే జరిగింది.. లేకపోతే నేను బలి: జగపతి బాబు ఫన్నీ వీడియో
టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ఫన్నీ వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా మరో క్రేజీ వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఓ మూవీ షూటింగ్ కోసం వెళ్లిన సమయంలో తాను ఆరగించే భోజనం గురించి ఈ వీడియోలో ప్రస్తావించారు.(ఇది చదవండి: చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్ కానున్నాడా..?)అయితే ఆ భోజనాన్ని జగపతిబాబుకు పంపంది మరెవరో కాదు.. సినిమా సెట్స్‌లో అందరి ఆకలి తీర్చే రెబల్ స్టార్ ప్రభాస్. భీమవరం రాజుల ప్రేమ అంటూ విందు భోజనానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఇదంతా ప్రభాస్ ప్రమేయం లేకుండానే జరిగింది.. ఎవరికీ చెప్పొద్దు.. తాను పెట్టే ఫుడ్ తింటే ఈ బాబు బలి.. అది బాహుబలి స్థాయి అంటూ చాలా ఫన్నీగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. జగపతి బాబు ఈ ఏడాది సూర్య కంగువా చిత్రంలో నటించారు. అల్లు అర్జున్ పుష్ప-2లోనూ కీలక పాత్రలో కనిపించారు. Vivaaha bojanambu..idhi prabhasa premayam Leykunda jarigindhi. evaru cheppaddhu. Chepthe ee Tanu petey food tho ee babu bali… Adhee baahubali level.. pandikoku laaga thini ambothlaaga Padukuntunanu. pic.twitter.com/64TPjI46L1— Jaggu Bhai (@IamJagguBhai) December 9, 2024 -
నెక్స్ట్ ఇయర్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫెస్టివల్..
-
లోకేష్ కనకరాజ్-ప్రభాస్ మూవీ ఓకే చెప్పిన యంగ్ రెబల్ స్టార్..
-
చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్ కానున్నాడా..?
సలార్, కల్కి 2898ఏడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా 'రాజాసాబ్'. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీకి మారుతి దర్శకుడు. చాలావరకు ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు కూడా.. అయితే, ఇప్పుడు అనుకున్న సమయానికి ఈ చిత్రం విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది. ఈమేరకు ఇండస్ట్రీలో వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.‘రాజాసాబ్’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 2025 జనవరి సమయానికి ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి అవుతుంది. కానీ, ఈ సినిమాలో ఎక్కువ సీన్స్‌కు VFX వర్క్‌తో లింక్ అయి ఉన్నాయట. దీంతో ఏప్రిల్ 10 నాటికి కూడా ఆ పనులు పూర్తి కావడం కాస్త కష్టమేనని తెలుస్తోంది. సమ్మర్‌కు విడుదల అవుతుందని అశించిన ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురుకానుందని తెలుస్తోంది. అయితే, సంక్రాంతి కానుకగా ఒక సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు సమాచారం.చిరంజీవి కోసం ప్రభాస్ కాంప్రమైజ్చిరంజీవి 'విశ్వంభర' సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటూ గేమ్ ఛేంజర్‌కు ఛాన్స్ ఇచ్చారు. అయితే, విశ్వంభర ఎప్పుడు విడుదల అవుతుందో మాత్రం వారు ప్రకటించలేదు. అయితే, వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుందని నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. అదే డేట్‌కు ప్రభాస్ రాజాసాబ్ వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. కానీ, విశ్వంభర సినిమాను ప్రభాస్ అనుబంధ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండటంతో మెగాస్టార్‌కు పోటీగా ఆయన ఎట్టి పరిస్థితిల్లో బరిలోకి దిగడని తెలుస్తోంది. ఈ కారణం వల్ల రాజాసాబ్ ఏప్రిల్ 10న విడుదల కాకపోవచ్చని కూడా సమాచారం. ప్రభాస్ లిస్ట్‌లో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. కె.జి.ఎఫ్, సలార్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్‌తో ప్రభాస్ మూడు సినిమాలు చేయనున్నారు. 'సలార్2'తో ఈ ప్రయాణం మొదలవుతోందని ఆ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. 2026, 2027, 2028 సంవత్సరాల్లో ఆ సినిమాలు రానున్నట్లు కూడా తెలిపింది. ప్రభాస్ - ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఒక సినిమాతో పాటు ప్రభాస్ - లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కించాలని ఈ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కూడా లైన్లో ఉన్న విషయం తెలిసిందే. -
అక్కడి 'ప్రభాస్' ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రం జపాన్‌లో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ప్రభాస్ కెరీర్లో బాహుబలి తర్వాత అంతటి విజయాన్ని కల్కి అందుకుంది. సుమారు రూ. 1200 కోట్లకు పైగానే ఈ చిత్రం కలెక్షన్స్ రాబట్టింది.కల్కి చిత్రం జపాన్‌లో విడుదల చేస్తున్నట్లు వైజయంతీ మూవీస్ ప్రకటించింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం జపనీస్‌లో కూడా విడుదల కానుందని ఒక వీడియోతో మేకర్స్ పంచుకున్నారు. 2025 జనవరి 3న జపాన్‌లో గ్రాండ్‌గా ఈ చిత్రం రిలీజ్ కానుంది.పురాణాలను, సైన్సును ముడిపెడితూ తీసిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 27న భారత్‌లో విడుదలైంది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి స్టార్స్ నటించారు. విజువల్ వండర్లా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
‘రాజా సాబ్’ చూడాలంటే.. నా పక్కన ఒకరు ఉండాల్సిందే: నిధీ అగర్వాల్
‘‘నేను తెలుగు బాగా మాట్లాడగలను. కేవలం ‘అందరికీ నమస్కారం’ అనే బ్యాచ్ కాదు’’ అన్నారు హీరోయిన్ నిధీ అగర్వాల్. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో ‘రాజా సాబ్’, పవన్ కల్యాణ్‌తో ‘హరి హర వీరమల్లు’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ సమయం కుదిరినప్పుడల్లా నెటిజన్లతో ముచ్చటిస్తుంటారు. అయితే కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేని నిధీ అగర్వాల్ చాలా విరామం తర్వాత ‘ఆస్క్ నిధి’ పేరుతో నెటిజన్లతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా కెరీర్, వ్యక్తిగత విషయాలపై నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. మీకు తెలుగు మాట్లాడటం వస్తుందా మేడం? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘‘నాకు తెలుగు మాట్లాడటం బాగా వస్తుంది. కేవలం ‘అందరికీ నమస్కారం’ అంటూ జస్ట్ అలా మాట్లాడే బ్యాచ్ కాదు’’ అంటూ సూటిగా జవాబిచ్చారు. ‘తెలుగులో ఎందుకు తక్కువ సినిమాలు చేస్తున్నారు?’ అనే మరో ప్రశ్నకు.. ‘‘నేను మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. మీకు బోర్ కొట్టకుండా మీ అభిమానం పొందే చిత్రాల్లోనే నటించాలని నిర్ణయించుకున్నా. అయితే 2025లో తెలుగులో నేను నటించిన ఎక్కువ సినిమాలు విడుదలవుతాయి’’ అని చెప్పారు. ‘జీవితంలో ఏది చాలా ముఖ్యం అనుకుంటారు?’ అనే మరో ప్రశ్నకు ‘‘ప్రశాంతత’’ అంటూ సమాధానం ఇచ్చారు. ‘ఓ నటిగా మీకు చాలా కష్టంగా అనిపించేది ఏంటి?’ అని ఓ నెటిజన్ అడగ్గా.. ‘‘పీఆర్ మెయింటేన్ చేయడం నాకు చాలా కష్టమైన పనిగా అనిపిస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘మీకు హారర్ సినిమాలంటే ఇష్టమేనా? ఒంటరిగా కూర్చొని చూస్తారా?’ అనే ప్రశ్నకు ‘‘అస్సలు చూడలేను. నాతో పాటు ఎవరో ఒకరు ఉండాల్సిందే. ‘రాజా సాబ్’ (హారర్ నేపథ్యంలో రూపొందుతోంది) సినిమా చూడ్డానికి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో థియేటర్స్‌కి రండి’’ అని బదులిచ్చారు. అలాగే మరికొందరు నెటిజన్ల ప్రశ్నలకు నిధీ అగర్వాల్ స్పందిస్తూ– ‘‘ప్రభాస్‌గారితో కలిసి నటించిన ‘రాజా సాబ్’ సినిమా సెట్లో ఎంతో సరదాగా పని చేశాం. ఈ మూవీ టీమ్‌లో ఎంతో నిజాయతీ ఉంది. ‘హరి హర వీరమల్లు’ సెట్లో పవన్ కల్యాణ్‌గారితో ఇటీవల ఓ సెల్ఫీ తీసుకున్నాను... త్వరలోనే ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. రాబోయే నూతన సంవత్సరంలో నేను నటించిన ‘ది రాజా సాబ్’, ‘హరి హర వీరమల్లు’ విడుదలవుతాయి.. ఆ సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువవుతాను. ఆ రెండు చిత్రాలతో పాటు మరో సర్ప్రైజింగ్ మూవీ కూడా ఉంది.. త్వరలోనే ఆ మూవీ ప్రకటన కూడా వస్తుంది’’ అంటూ తెలిపారు నిధీ అగర్వాల్. -
‘సలామ్...పోలీస్’ అంటున్న టాలీవుడ్ స్టార్స్
వెండితెరపై కనిపించే ‘సూపర్ హీరో’ తరహా పాత్రల్లో పోలీస్ పాత్ర గురించి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు సమాజం మేలు కోసం ఓ సూపర్ హీరో చేసే అన్ని సాహసాలు పోలీస్ ఆఫీసర్లు చేస్తుంటారు. ఇలా పోలీసాఫీసర్లకు ‘సలామ్’ కొట్టేలా కొందరు హీరోలు వెండితెరపై పోలీసులుగా యాక్షన్ చేస్తున్నారు. ఆ హీరోలపై కథనం.హుకుమ్...రజనీకాంత్ కెరీర్లో ఈ మధ్యకాలంలో వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్‌గా నిలిచిన చిత్రాల్లో ‘జైలర్’ ఒకటి. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2023లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రజనీకాంత్ మేజర్ సీన్స్‌లో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా, కొన్ని సీన్స్‌లో పోలీస్ డ్రెస్ వేసుకున్న జైలర్‌గా స్క్రీన్‌పై కనిపించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ తెరకెక్కనుంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేశారు నెల్సన్ దిలీప్ కుమార్. ‘జైలర్ 2’కి సంబంధించి రజనీకాంత్ లుక్ టెస్ట్ కూడా జరిగిందని సమాచారం. డిసెంబరు 12న రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా ‘జైలర్’ సీక్వెల్ అప్డేట్ ఉండొచ్చనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. అంతేకాదు... ‘జైలర్’ సినిమా సీక్వెల్‌కు ‘హుకుమ్’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ‘జైలర్’లోని ‘హుకుమ్’ పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ పాటనే సీక్వెల్‌కు టైటిల్‌గా పెడితే ఆడియన్స్‌కు సినిమా మరింత బాగా రీచ్ అవుతుందని, ‘హుకుమ్’ అనే టైటిల్ అన్ని భాషలకు సరిపోతుందని టీమ్ భావిస్తోందట. కళానిధి మారన్ నిర్మించనున్న ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. ఫ్యామిలీ పోలీస్ ‘సూపర్ పోలీస్, సూర్య ఐపీఎస్, ఘర్షణ’ వంటి సినిమాల్లో సీరియస్ పోలీసాఫీసర్‌గా వెంకటేశ్ మెప్పించారు. ‘బాబు బంగారం’ సినిమాలో కామిక్ టైమ్ ఉన్న పోలీస్‌గా వెంకీ నటించారు. అయితే ఫస్ట్ టైమ్ ఫ్యామిలీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారాయన (‘ది ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి చేసిన రోల్ తరహాలో...) ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాలో మాజీ పోలీసాఫీసర్‌గా వెంకటేశ్ కనిపిస్తారు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌లో వెంకీ ఆన్ డ్యూటీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారని తెలిసింది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. మీనాక్షీ చౌదరి కూడా ఈ చిత్రంలో ΄ోలీసాఫీసర్గానే కనిపిస్తారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఫస్ట్ టైమ్ పోలీస్‌గా... ప్రభాస్ వంటి కటౌట్ ఉన్న హీరో పోలీస్ ఆఫీసర్‌గా స్క్రీన్‌పై కనిపిస్తే ఆడియన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. తనను పోలీసాఫీసర్‌గా స్క్రీన్‌పై చూపించే అవకాశాన్ని ‘అర్జున్‌రెడ్డి, యానిమల్’ వంటి సినిమాలు తీసిన సందీప్‌రెడ్డి వంగా చేతుల్లో పెట్టారు ప్రభాస్. ‘స్పిరిట్’ టైటిల్‌తో రానున్న ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది. ప్రభాస్ ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్‌గా ఈ చిత్రంలో నటిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ సీరిస్‌లపై భూషణ్ కుమార్ నిర్మించ నున్న ఈ సినిమా 2025లో రిలీజ్ కానుంది. కేసు నంబరు 3 సూపర్‌హిట్ ఫ్రాంచైజీ ‘హిట్’ నుంచి ‘హిట్: ద థర్డ్ కేస్’ రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తయింది. ‘హిట్ 1, హిట్ 2’ చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కోలనుయే మూడో భాగానికీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘హిట్’ ఫ్రాంచైజీలో తొలి రెండు సినిమాలను నిర్మించిన నాని, ‘హిట్ 3’లో హీరోగా నటిస్తూ, నిర్మిస్తుండటం విశేషం. నాని వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ చిత్రం 2025 మే 1న విడుదల కానుంది. బంధూక్ హీరో విశ్వక్ సేన్ తుపాకీ పట్టుకుని చాలాసార్లు స్క్రీన్‌పై కనిపించారు. కానీ రియల్ పోలీస్ ఆఫీసర్‌గా కాదు... అయితే ‘బంధూక్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా కోసం విశ్వక్ సేన్ పోలీసాఫీసర్‌గా ఖాకీ డ్రెస్ ధరించి, తుపాకీ పట్టారు. ఈ పోలీస్ యాక్షన్ డ్రామాకు శ్రీధర్ గంటా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంపద హీరోయిన్. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా 2025లో రిలీజ్ కానుంది. ఎస్ఐ యుగంధర్ ఈ మధ్య కాలంలో పోలీసాఫీసర్ రోల్స్‌కే ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్లున్నారు హీరో ఆది సాయికుమార్. ఆయన హీరోగా విడుదలైన గత ఐదు సినిమాల్లో రెండు పోలీసాఫీసర్ సినిమాలు ఉన్నాయి. ఈలోపు మరో పోలీసాఫీసర్ మూవీ ‘ఎస్ఐ యుగంధర్’కు ఆది సాయికుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఎస్ఐ యుగంధర్‌గా ఓ కొత్త క్యారెక్టరైజేషన్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్ కనిపిస్తారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇందులో మేఘా లేఖ హీరోయిన్గా నటిస్తున్నారు. యశ్వంత్ దర్శకత్వంలో ప్రదీప్ జూలురు నిర్మిస్తున్న ఈ చిత్రం 2025లో రిలీజ్ కానుంది. మర్డర్ మిస్టరీ ఓ మర్డర్ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు హీరో త్రిగుణ్ (అరుణ్ అదిత్). స్క్రీన్‌పై ఓ పోలీసాఫీసర్‌గా ఈ కేసును పరిష్కరించే క్రమంలో త్రిగుణ్‌కు ఓ టర్నింగ్ ΄ాయింట్ దొరికింది. ఇది ఏంటీ అంటే...‘టర్నింగ్ ΄ాయింట్’ సినిమా చూడాల్సిందే. హెబ్బా పటేల్, ఇషా చావ్లా, వర్షిణి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కుహాన్ నాయుడు దర్శకుడు. సురేష్ దత్తి నిర్మించారు. ఇలా పోలీసాఫీసర్ రోల్స్‌లో నటించే హీరోలు మరికొంతమంది ఉన్నారు. మరికొందరు స్క్రిప్ట్స్ వింటున్నారని తెలిసింది.– ముసిమి శివాంజనేయులు -
‘కల్కి’లో ఆ పాత్ర చేయమని అడిగితే..నచ్చలేదని తిరస్కరించా : కీర్తి సురేశ్
‘‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఒక పాత్ర చేయమని నన్ను కోరారు నాగ్ అశ్విన్. అయితే ఆ పాత్ర నాకు అంత ఆసక్తిగా అనిపించలేదు.. అందుకే సున్నితంగా తిరస్కరించాను’’ అని హీరోయిన్ కీర్తీ సురేష్ అన్నారు. ఇటీవల గోవాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫీ) వేడుకల్లో డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి పాల్గొన్నారు కీర్తీ సురేష్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘కల్కి 2898 ఏడీ’లో నన్ను అడిగిన పాత్రను నేను తిరస్కరించినప్పటికీ నాగ్ అశ్విన్ ఏదో ఒక రకంగా ఆ సినిమాలో నన్ను భాగస్వామ్యం చేస్తాడని నమ్మాను. నేను అనుకున్నట్లుగానే బుజ్జి పాత్రకు (ప్రభాస్ వాడిన కారు పేరు) నాతో డబ్బింగ్ చెప్పించాడు. బుజ్జికి వాయిస్ ఓవర్ చెప్పడం వల్ల ప్రేక్షకులకు ఎలా చేరువ అవుతావు? అని కొందరు నన్ను ప్రశ్నించారు. కానీ, చాలా ప్రత్యేకంగా ఉంటుందని భావించి, నాగి అశ్విన్ అడిగిన వెంటనే ఓకే చెప్పాను. సినిమా విడుదల తర్వాత చాలా మంది.. ‘బుజ్జి కారుకు నీ డబ్బింగ్ ప్లస్ అయింది’ అని నాతో అనడం ఆనందాన్నిచ్చింది’’ అన్నారు. ఇదిలా ఉంటే... నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మహానటి’ (2018). సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమాలో సావిత్రిగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కీర్తి. ఈ సినిమాకి జాతీయ ఉత్తమ నటి అవార్డును కీర్తీ సురేష్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక కీర్తి వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.... తన స్నేహితుడు ఆంటోనీ తట్టిల్‌ని డిసెంబరులో గోవాలో పెళ్లి చేసుకోబోతున్నారామె. -
45 రోజులు వర్షంలో షూటింగ్.. ఆ సినిమా మానేసి వెళ్లిపోదాం అనుకున్నా : త్రిష
‘నా కెరీర్లో ‘వర్షం’ సినిమా చాలా ప్రత్యేకం’ అన్నారు హీరోయిన్ త్రిష. ఇటీవల ఓ టీవీ షోలో తల్లి ఉమతో కలిసి పాల్గొన్నారు త్రిష. ‘మీ కెరీర్లో బాగా ఇబ్బంది పడిన సినిమా ఏంటి?’ అంటూ త్రిషని ప్రశ్నించారు యాంకర్. ఇందుకు ఆమె సమాధానం ఇస్తూ–‘‘నా కెరీర్లో ‘వర్షం’ మూవీ చాలా స్పెషల్. అలాగే ఎక్కువ ఇబ్బంది పడ్డ సినిమా కూడా అదే. నా కెరీర్ ఆరంభంలో ‘వర్షం’ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను. ఈ చిత్రం కోసం దాదాపు 45 రోజులు వర్షంలో షూటింగ్ చేశాం. ఆ సమయంలో తడవడంతో జలుబు, జ్వరంతో ఇబ్బంది పడ్డాను. ఒక దశలో సినిమా మానేసి వెళ్లిపోవాలనిపించింది.అయితే ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో నా కష్టం మరచి పోయాను. తెలుగులో నాకు బ్రేక్ ఇచ్చిన సినిమా ‘వర్షం’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... త్రిష సోలో హీరోయిన్గా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన డైరెక్ట్ చిత్రం ‘వర్షం’. తరుణ్ హీరోగా తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కిన ‘నీ మనసు నాకు తెలుసు’ (2003) చిత్రంలో శ్రియ ఓ హీరోయిన్ కాగా త్రిష మరో కథానాయికగా నటించారు. ప్రభాస్ హీరోగా శోభన్ దర్శకత్వం వహించిన ‘వర్షం’ చిత్రంలో సోలో హీరోయిన్గా నటించారు త్రిష. 2004 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘వర్షం’తో సూపర్‌హిట్ జోడీ అనిపించుకున్న ప్రభాస్–త్రిష ఆ తర్వాత ‘పౌర్ణమి’ (2006), ‘బుజ్జిగాడు’ (2008) వంటి చిత్రాల్లో నటించారు. ఇక ‘వర్షం’ తర్వాత తెలుగులో త్రిష బిజీ హీరోయిన్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, రవితేజ, గోపీచంద్, నితిన్, సిద్ధార్థ్ వంటి హీరోలకి జోడీగా నటించారు త్రిష. రెండు దశాబ్దాల కెరీర్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించిన త్రిష ఇప్పటికీ బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. అలాగే యువ హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం త్రిష నటిస్తున్న తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారామె. ‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. వచ్చే ఏడాది వేసవిలో ‘విశ్వంభర’ విడుదల కానుందని టాక్. అదే విధంగా ప్రస్తుతం పలు తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు త్రిష. -
మరో జన్మ ఉంటే ప్రభాస్ లాంటి కొడుకు కావాలి: ది రాజాసాబ్ నటి
టాలీవుడ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌పై సీనియర్ నటి జరీనా వాహబ్ ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ తాజా చిత్రం ది రాజా సాబ్ గురించి ఆమె మాట్లాడారు. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాలో జరీనా వాహబ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె షూటింగ్ సెట్స్‌లో ప్రభాస్ తీరు గురించి ఆమె మాట్లాడారు. మరో జన్మంటూ ఉంటే ప్రభాస్ లాంటి కొడుకు కావాలని కోరుకుంటున్నానని జరీనా వెల్లడించారు.జరీనా వాహబ్ మాట్లాడుతూ..' నేను ప్రస్తుతం ప్రభాస్‌తో ఓ మూవీ చేస్తున్నా. ది రాజాసాబ్‌లో నటిస్తున్నా. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. మరో జన్మ ఉంటూ ఉంటే నాకు ఇద్దరు కొడుకులు ఉండాలి. అందులో తప్పకుండా ప్రభాస్ లాంటి కుమారుడు నాకు కావాలని కోరుకుంటా. అంత మంచి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. అతనొక స్టార్ అనే ఫీలింగ్ లేదు. సెట్లో ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాడు. ఎవరైనా ఆకలితో ఉన్నారని తెలిస్తే షూటింగ్ సిబ్బందితో పాటు అందరికీ భోజనాలు ఇంటికి ఫోన్ చేసి మరి తెప్పిస్తాడు. ప్రభాస్ నిజమైన డార్లింగ్' అంటూ ప్రశంసలు కురిపించింది.ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ రొమాంటిక్ హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. ది రాజా సాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ కానుంది. -
యూరప్ వెళ్లనున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..?
ప్రభాస్ యూరప్ వెళ్లనున్నాడు. రాజాసాబ్ సాంగ్ చిత్రీకరణలో భాగంగా ఆయన అక్కడకు వెల్లేందుకు సిద్ధం అవుతున్నాడు.మారుతి దర్శకత్వలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సలార్, కల్కి చిత్రాల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇప్పటికే రాజాసాబ్ షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి. అయితే, సాంగ్స్ చిత్రీకరణ పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆరు పాటలు ఉన్నట్లు సంగీత దర్శకుడు థమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనిలో భాగంగా వచ్చే నెలలో యూరప్‌లో ఒక సాంగ్‌ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ పాట కూడా ప్రభాస్, మాళవిక మోహనన్‌ల మధ్య ఉంటుందట. అదిరిపోయే లొకేషన్స్‌లో చాలా గ్లామరస్‌గా ఈ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచే రాజాసాబ్ ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా తొలి సాంగ్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ రాజాసాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో సంజయ్‌దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 10న పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
అంతర్జాతీయ స్థాయిలో ‘కల్కి 2’: స్వప్న, ప్రియాంక
‘‘కల్కి 2’ సినిమా పనులు ఇప్పటికే మొదలయ్యాయి.. ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి’’ అని నిర్మాతలు స్వాప్న దత్, ప్రియాంక దత్ చెప్పారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌పై సి.అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ లో విడుదలై, ఘనవిజయం సాధించింది.‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’కి సీక్వెల్‌గా ‘కల్కి 2’ రానుందని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో మెయిన్ స్ట్రీమ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాని ప్రదర్శించారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్వాప్నదత్, ప్రియాంక దత్ బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం ‘కల్కి 2’ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తొలి పార్టు చిత్రీకరణ టైమ్‌లోనే 30 నుంచి 35 శాతం ‘కల్కి 2’ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమాలోని ప్రధాన నటీనటుల షూటింగ్ కాల్షీట్స్ ఫైనలైజ్ కావాల్సి ఉంది. తొలి పార్టులో మదర్ రోల్ చేసిన దీపికా పదుకొనే ‘కల్కి 2’లోనూ మదర్ రోల్ చేస్తారు. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేస్తాం’’ అని పేర్కొన్నారు ‘కల్కి 2’ చిత్రీకరణ వచ్చే ఏడాది ్రపారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నయనతార మరో సెన్సేషనల్ డెసిషన్?
-
ప్రభాస్‌తో నయనతార ‘స్పెషల్’ స్టెప్పులు..?
స్పెషల్ సాంగ్.. బడా హీరోల సినిమాల్లో ఇది మరింత స్పెషల్ అయిపోయింది. సినిమాలో స్టార్ హీరోయిన్లు ఒకరిద్దరు ఉన్నపటికీ.. స్పెషల్ సాంగ్‌కి వచ్చేసరికి కచ్చితంగా మరో స్టార్ హీరోయిన్ని తీసుకొస్తున్నారు. మార్కెట్ లెక్కలేసి మరీ ఐటమ్ సాంగ్‌పై ప్రత్యేక దృష్టిపెడతున్నారు. హీరో రేంజ్‌కి తగ్గట్లుగా స్టార్ హీరోయిన్‌తో స్పెషల్ డ్యాన్స్ చేయిస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తుండగా..ఇప్పుడు ప్రభాస్ కోసం మరో స్టార్ హీరోయిన్ ‘ప్రత్యేక’ స్టెప్పులేసేందుకు రెడీ అవుతోందట. ఆమే లేడీ సూపర్‌స్టార్ నయనతార.ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంతో ‘ది రాజాసాబ్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. మారుతి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. క్యాస్టింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇక ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉందట. దాని కోసం ఓ భారీ సెట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారట. అయితే ఈ స్పెషల్ సాంగ్‌ని మరింత స్పెషల్ చేసేందుకు నయనతారని బరిలోకి దింపబోతున్నారట. ఇప్పటికే ఈ పాట కోసం మారుతి నయనతారని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ పాట చేసేందుకు నయన్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. గతంలో మారుతి తెరకెక్కించిన బాబు బంగారం సినిమాలో నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పరిచయంతోనే రాజాసాబ్తో స్టెప్పులేసేందుకు నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కాగా, ప్రభాస్, నయన్ కలిసి గతంలో యోగి అనే సినిమాలో నటించారు. మళ్లీ చాలా కాలం తర్వాత ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది నయనతార. వీరిద్దరి కలయికలో రాబోతున్న స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. -
హీరోల్లో రెబల్ స్టార్ టాప్ ప్లేస్.. హీరోయిన్లలో ఎవరంటే?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతినెల సినీస్టార్స్‌కు సంబంధించిన రేటింగ్స్ ఇస్తోంది. ఎప్పటిలాగే అక్టోబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ హీరో, హీరోయిన్ల జాబితాను వెల్లడించింది. హీరోల్లో తొలిస్థానంలో రెబల్ స్టార్ నిలవగా.. నటీమణుల్లో సమంత టాప్ ప్లేస్ దక్కించుకుంది. హీరో, హీరోయిన్లకు సంబంధించి టాప్-10 ర్యాంకులను వెల్లడిస్తూ పోస్టర్స్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.హీరోల్లో ప్రభాస్ తర్వాత విజయ్, షారూఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, అజిత్ కుమార్ తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరసగా అల్లు అర్జున్, మహేశ్ బాబు, సూర్య, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ఇటీవల హన్నీ బన్నీ ప్రేక్షకులను అలరించిన సమంత టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత ఆలియా భట్, నయనతార, దీపికా పదుకొణె, త్రిష టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకున్నారు. కాజల్ అగర్వాల్, శ్రద్దాకపూర్, సాయిపల్లవి, రష్మిక, కత్రినా కైఫ్ టాప్ టెన్‌లో నిలిచారు.Ormax Stars India Loves: Most popular female film stars in India (Oct 2024) #OrmaxSIL pic.twitter.com/aa6SKu5kZB— Ormax Media (@OrmaxMedia) November 21, 2024Ormax Stars India Loves: Most popular male film stars in India (Oct 2024) #OrmaxSIL pic.twitter.com/t1qOxTGkKo— Ormax Media (@OrmaxMedia) November 21, 2024 -
Raja Saab ఆ హీరో సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నారా?
-
'రాజాసాబ్' కోసం సెన్సేషనల్ సాంగ్ రీమిక్స్
మారుతి - ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రాజాసాబ్. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజాసాబ్‌లో ఆరు పాటలు ఉంటాయని అందులో ఒకటి పాపులర్ రీమిక్స్ సాంగ్ ఉంటుందని తెలిపారు. దీంతో ఆ హిట్ సాంగ్ ఏదై ఉంటుందని నెట్టింట చర్చ జరుగుతుంది.భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదని ఆయన అన్నారు. ఈ చిత్రం స్కేల్‌ను కూడా ఎవరూ ఊహించలేరని ఆయన అన్నారు. అయితే, రాజాసాబ్ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హిట్ సినిమా నుంచి ఒక పాటను రీమిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన రైట్స్ కోసం కూడా ఆయన సుమారుగానే ఖర్చు చేసినట్లు టాక్. సంజయ్‌దత్ హీరోగా నటించిన 'ఇన్సాఫ్ అప్నే లాహూ సే' సినిమా నుంచి 'హవా హవా..' అనే సాంగ్‌ను డైరెక్టర్ మారుతి ఎంపిక చేసుకున్నారట. 1994లో వచ్చిన ఈ సాంగ్ అప్పట్లో బాలీవుడ్ ప్రేక్షకులను షేక్ చేసింది. ఇప్పుడు ‘రాజా సాబ్’ కోసం థమన్ ఆ పాటనే రీమిక్స్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ రాజాసాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో సంజయ్‌దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సలార్, కల్కి 2898 ఏడీ వంటి వరుస హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన ప్రభాస్ లుక్‌పై మంచి టాక్ వస్తుంది. 2025 సమ్మర్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
తెలుగింటి హీరో... పక్కింటి దర్శకుడు
హీరోయిన్లు ఒకే భాషకు పరిమితం కారనే విషయం తెలిసిందే. హీరోలు, దర్శకులు మాత్రం దాదాపు ఒకే భాషలోనే సినిమాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలకు, దర్శకులకు హద్దులు, సరిహద్దులు లేవని పాన్ ఇండియన్ సినిమాలు చెబుతున్నాయి. దర్శకులు, హీరోలు ఇప్పుడు ఏ భాషలో అయినా సినిమాలు చేస్తున్నారు. కానీ ఈ ట్రెండ్ టాలీవుడ్లో మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. మరి... మన తెలుగింటి హీరోలు... ఏ పక్కింటి దర్శకులతో సినిమాలు చేస్తున్నారో తెలుసుకుందాం. కాంబో రిపీట్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వేసవిలో రిలీజ్ కావొచ్చని టాక్. ఈ చిత్రం తర్వాత చిరంజీవి ఏ దర్శకుడితో సినిమా చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. హరీష్ శంకర్, మారుతి... ఇలా చాలామంది పేర్లు వినిపించాయి. అయితే ఇటీవల ఓ సందర్భంలో తన తర్వాతి చిత్రాల్లో ఒకటి చిరంజీవితో ఉంటుందని, సామాజిక నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని, రచయిత–దర్శకుడు బీవీఎస్ రవి పేర్కొన్నారు. ఈ సినిమాకు బీవీఎస్ రవి కేవలం కథ మాత్రమే ఇస్తున్నారని, దర్శకత్వ బాధ్యతలు మోహన్‌రాజా తీసుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మోహన్ రాజా తెలుగు అయినప్పటికీ చెన్నైలో సెటిల్ అయి, తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇక చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక హీరో చిరంజీవి–దర్శకుడు మోహన్‌రాజా కాంబినేషన్లో ఆల్రెడీ ‘గాడ్ ఫాదర్’ (2022) అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ మలయాళ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ‘గాడ్ ఫాదర్’ చిత్రం రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. నవీన్‌తో నెక్ట్స్ సోలో హీరోగా నాగార్జున నెక్ట్స్ ఫిల్మ్ ఎవరితో ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ తమిళంలో ‘మూడర్ కూడం, అగ్ని సిరగుగళ్’ సినిమాలు తీసిన దర్శకుడు నవీన్ గత ఏడాది నాగార్జునకు ఓ కథ వినిపించారట. ఈ మూవీకి నాగార్జున కూడా ఓకే చెప్పారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరచే పనిలో నవీన్ బిజీగా ఉన్నారని, ఈ సినిమా విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని భోగట్టా. మరోవైపు ప్రస్తుతం నాగార్జున తమిళ చిత్రం ‘కూలీ’లో ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘కూలీ’ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. అలాగే తమిళ హీరో ధనుష్‌తో కలిసి నాగార్జున ‘కుబేర’ చేస్తున్నారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకుడు. బిజీ బిజీ ప్రభాస్ చాలా చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా ‘రాజా సాబ్, ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్)’ సినిమాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా సెట్స్‌లోకి వెళ్తారు. కాగా ఇటీవల కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్లో ప్రభాస్ మూడు సినిమాలు కమిట్ అయ్యారు. ఈ చిత్రాల్లో ఒకటి తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో ఉంటుందని తెలిసింది. మరోటి కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ అని ఊహించవచ్చు. ఇంకో సినిమాకు తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇలా... ఓ తమిళ దర్శకుడు, ఓ కన్నడ దర్శకుడితో ప్రభాస్ సినిమాలు చేయనున్నారు. అంతేకాదు... ఇటీవల ప్రభాస్‌కు ఓ హిందీ దర్శకుడు కథ వినిపించారని, ఇప్పటికే ప్రభాస్ కమిటైన సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమాను ప్రకటిస్తారని బాలీవుడ్ భోగట్టా. ‘జైలర్’ దర్శకుడితో...ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘వార్ 2’. హిందీ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరోగా చేస్తున్నారు. ‘వార్ 2’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా షూట్లో జాయిన్ అవుతారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమయ్యేలా ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేశారు. ముందుగా ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరించి, కొత్త సంవత్సరంలో ఎన్టీఆర్ పాల్గొనే సన్నివేశాల షూట్‌ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారని తెలిసింది. 2026 జనవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. అలాగే తమిళంలో ‘కోలమావు కోకిల, డాక్టర్, జైలర్’ సినిమాలను తీసిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఇటీవల ఎన్టీఆర్‌కు ఓ కథ వినిపించారు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చేసేందుకు అంగీకరించారని తెలిసింది. అయితే రజనీకాంత్‌తో ‘జైలర్ 2’ చేసిన తర్వాత ఎన్టీఆర్‌తో నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా చేస్తారు. కాబట్టి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది 2026లోనే అని ఊహింవచ్చు. కథ విన్నారా? రామ్‌చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రం జనవరి 10న సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే రామ్‌చరణ్ తర్వాతి చిత్రాలకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన, సుకుమార్ డైరెక్ట్ చేస్తారు. అయితే ఓ హిందీ దర్శకుడు రామ్‌చరణ్‌కు కథ వినిపించారనే టాక్ కొన్ని రోజులు క్రితం ప్రచారంలోకి వచ్చింది. మరి... ఈ వార్త నిజమేనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మహాభారతం దర్శకుడితో... హిందీ సీరియల్ ‘మహాభారతం’ చాలా ఫేమస్. ఈ సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్‌ను ‘కన్నప్ప’ కోసం టాలీవుడ్‌కు తెచ్చారు విష్ణు మంచు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు, శరత్‌కుమార్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. జీబ్రా తమిళంలో కీర్తీ సురేష్‌తో ‘పెంగ్విన్’ సినిమా తీసిన తమిళ దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జీబ్రా’. సత్యదేవ్ ఈ చిత్రంలో హీరోగా నటించగా, కన్నడ నటుడు డాలీ ధనుంజయ మరో లీడ్ రోల్లో నటించారు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈశ్వర్ కార్తీక్‌కు తెలుగులో ఇదే స్ట్రయిట్ సినిమా. ఇతర భాషల దర్శకులతో సినిమాలు చేసే తెలుగు హీరోల జాబితాలో మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
ఒకే ఫ్రేమ్ లో రౌడీ, రెబల్, యానిమల్.. పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందే..!
-
ప్రభాస్ లేదా మహేశ్.. నీకు పోటీ ఎవరు? బన్నీ ఏం చెప్పాడంటే!
మరో 20 రోజుల్లో 'పుష్ప 2' రిలీజ్ ఉంది. 17న పాట్నాలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. దీంతో పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ షురూ కాబోతున్నాయి. అంతలోనే బన్నీ ప్రచారం మొదలుపెట్టేశాడు. 'అన్‌స్టాపబుల్' నాలుగో సీజన్లో ఇతడు పాల్గొన్న ఎపిసోడ్‌ని ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు. మూవీ గురించి, అలానే చాలా విషయాల గురించి బన్నీ ఓపెన్‌గా మాట్లాడేశాడు.మిగతా వాటి సంగతి పక్కనబెడితే ఇండస్ట్రీలో నీకు అతిపెద్ద పోటీ ఎవరని అనుకుంటున్నావ్? ప్రభాస్ లేదా మహేశ్ అని హోస్ట్ బాలయ్య అడగ్గా.. బన్నీ చాలా లాజికల్‌గా సమాధానం చెప్పాడు. 'నను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవడంటే అది రేపటి నేనే ! ఐ యామ్ మై బిగ్గెస్ట్ కాంపిటీషన్' అని అన్నాడు.(ఇదీ చదవండి: అల్లు వారి పెళ్లి సందడి.. ఆశీర్వదించిన చిరు, బన్నీ)ప్రస్తుతం 'పుష్ప 2'కి వస్తున్న హైప్ చూస్తుంటే బన్నీ చెప్పింది నిజమనేలా ఉంది. ఈ మూవీకి రిలీజ్‌కి వెయ్యి కోట్ల బిజినెస్ జరిగిందని టాక్. ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం ప్రభాస్ తరహాలో భారీ కలెక్షన్స్ రావడం గ్యారంటీ. అదే టైంలో ప్రభాస్, మహేశ్.. ఇద్దరిలో ఎవరు పేరు చెప్పినా సరే ఆయా ఫ్యాన్స్ హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.అలా ఓవైపు తనకు తాను ఎలివేషన్ ఇచ్చుకున్న బన్నీ.. మిగతా హీరోల అభిమానులని ఇబ్బంది పెట్టకుండా కామెంట్స్ చేశాడని చెప్పొచ్చు. ఇదే ఎపిసోడ్లో ప్రభాస్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్.. ఇలా తన తోటీ హీరోలందరి గురించి బన్నీ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు)I'm my biggest competitor. Says in Pushpa Raj style#AlluArjun #UnstoppableWithNBK #Pushpa2TheRule pic.twitter.com/2wZgZXVMWn— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) November 15, 2024 -
ప్రభాస్ ఆరడుగుల బంగారం: అల్లు అర్జున్
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో విజయవంతంగా రన్ అవుతోంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తవగా నాలుగో సీజన్ కూడా సక్సెస్ఫుల్ రన్ అవుతోంది. తాజాగా ఈ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చేశాడు.ప్రభాస్ గురించి ఏమన్నాడంటే?బన్నీతో పాటు అతడి తల్లి నిర్మలమ్మ కూడా షోలో సందడి చేయడం విశేషం. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించి వరుస ప్రోమోలు రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి మాట్లాడిన ప్రోమో విడుదల చేశారు. అందులో బన్నీ.. ప్రభాస్‌ను ఎప్పుడు చూసినా ఒకటే మాట చెప్తా.. ఆరడగుల బంగారం అని మెచ్చుకున్నాడు. అప్పట్లోనూ ఇదే మాటఇప్పుడే కాదు గతంలోనూ ప్రభాస్‌ను ఆకాశానికెత్తాడు. తన ఫేవరెట్ హీరో మాత్రమే కాదని, ఫేవరెట్ వ్యక్తి అని తెలిపాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆరడుగుల బంగారం అని ఓ ఈవెంట్లో పేర్కొన్నాడు. తాజాగా ఇదే మాటను ఆహా అన్‌స్టాపబుల్ షోలోనూ రిపీట్ చేయడంతో ఈ ప్రోమో వైరల్‌గా మారింది. ఫుల్ ఎపిసోడ్ నవంబర్ 15న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారం కానుంది. Appatiki ippatiki Same Words😍❤️.... fan boy movement🫂#Prabhas #AlluArjun pic.twitter.com/RmTPrDtcKY— Rᴀᴠɪ ᴠᴀ₹ᴍᴀ™ (@PrabhasVortex) November 14, 2024 -
ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు
-
ప్రభాస్ హెయిర్ స్టైల్ కావాలి.. ఫ్లాట్ హెయిర్ కట్ నచ్చడం లేదు!
‘మాకు హీరో ప్రభాస్‌లాగా హెయిర్ స్టైల్ కావాలి.. జుట్టు పొడుగ్గా పెంచుకొనేందుకు అనుమతి ఇవ్వాలి.. గాజులు వేసుకొనేందుకు పర్మిషన్ ఇవ్వాలి. టీచర్ల మాదిరిగా చీరలు కట్టుకోవాలని ఉంది’.. వరంగల్ జిల్లా రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూళ్లలో సమస్యలు తెలుసుకొనేందుకు అధికారులు ఏర్పాటుచేసిన ఫిర్యాదుల బాక్సుల్లో విద్యార్థులు వేసిన వినతులు ఇవి. ఆహారం బాగా లేదనో, హోం వర్క్ ఎక్కువ ఇస్తున్నారో, పుస్తకాలు లేవనో ఫిర్యాదులు వస్తాయని అధికారులు ఆశించారు. కానీ, ఫిర్యాదు బాక్సుల్లో మాత్రం ఇలాంటి వినతులు కనిపించాయి.దీనిపై ఓ విద్యార్థిని ఒక సీనియర్ అధికారి ప్రశ్నించగా.. ‘స్థానిక బార్బర్ అబ్బాయిలందరికీ ఒకే రకమైన ఫ్లాట్ హెయిర్ కట్ ‘తాపేలి కట్’చేస్తున్నాడు. అది నచ్చడం లేదు. అందుకే హీరోల వంటి హెయిర్ కట్ కావాలని కోరాం’ అని తెలిపాడు. ఈ విషయంలో వారు సీరియస్‌గానే ఉన్నారని ఆ అధికారి చెప్పారు. ‘ఈ పిల్లలకు ఫోన్లు అందుబాటులో లేవు. తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా మాట్లాడలేరు. అందుకే ఫిర్యాదు పెట్టెలను పెట్టించాం. వీళ్ల ఫిర్యాదులు ఆసక్తికరంగా ఉన్నాయి. తమ భావాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తున్నారు’అని జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా కొంతమంది విద్యార్థులు పాఠశాలలో పూజలు ఏర్పాటు చేయాలని కోరారు. కొంతమంది విద్యార్థినులు సీనియర్లు తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ప్రభావమే... ఇదంతా సోషల్ మీడియా ప్రభావమేనని విద్యారంగ నిపుణులు అంటున్నారు. ‘క్యాంపస్‌లలో ఫోన్లను అనుమతించనప్పటికీ, చాలా పాఠశాలల్లో కంప్యూటర్ సైన్స్ ల్యాబ్‌లు ఉన్నాయి. వాటి ద్వారా పిల్లలు సోషల్ మీడియాలో లేటెస్ట్ ట్రెండ్లను తెలుసుకుంటున్నారు. వాళ్లు తమ మనసులోని మాటలను చెప్పడం మంచిదే. వాళ్లపై ఏవి ప్రభావం చూపుతున్నాయో తెలియాలి’ అని పాఠశాల పిల్లలతో కలిసి పనిచేసే డెవలప్మెంట్ ప్రొఫెషనల్ కన్సల్టెంట్ ఒకరు చెప్పారు. కోవిడ్ –19కి ముందు ఎక్కువ ఫిర్యాదులు ఆహారం నాణ్యత, ఉపాధ్యాయుల శిక్షణ గురించి ఉండేవని.. ఇప్పుడు ఇలా ఉంటున్నాయని చెప్పారు.చదవండి: ముద్ద అన్నం.. తింటే కడుపు నొస్తోంది -
‘స్పిరిట్’ డిసెంబరులో స్టార్ట్
‘స్పిరిట్’ సినిమా సెట్స్‌కు వెళ్లే సమయం ఆసన్నమైంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘స్పిరిట్’. ఈ చిత్రం కోసం తొలిసారిగా పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నాడు ప్రభాస్. కాగా తాజాగా ‘స్పిరిట్’ సినిమా గురించి ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ స్పందించారు.‘‘స్పిరిట్’ ప్రారంభోత్సవం ఈ ఏడాది డిసెంబరులో ప్లాన్ చేస్తున్నాం. వచ్చే ఏడాది స్టార్టింగ్‌లో ఈ మూవీని సెట్స్‌కు తీసుకువెళ్తాం. 2026 మధ్యలో రిలీజ్ ఉండొచ్చు. ప్రస్తుతం సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ సాంగ్స్ పనుల్లో ఉన్నారు. నేను రెండు సాంగ్స్ విన్నాను.. బాగున్నాయి’’ అని ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భూషణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. -
సుడిగాలి సుధీర్ ప్రయత్నం.. కట్ చేస్తే ప్రభాస్ సినిమాలో
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ (వర్కింగ్ టైటిల్) మూవీ చేస్తున్నాడు. ఇమాన్వి అనే కొత్త అమ్మాయి హీరోయిన్గా చేస్తోంది. స్వతహాగా డ్యాన్సర్ అయిన ఈమెకు ఇదే తొలి మూవీ. సినిమా లాంచింగ్ రోజే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మాయి గురించి ఇప్పుడు కమెడియన్ గెటప్ శీను ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు.'జబర్దస్త్' ఫేమ్ సుడిగాలి సుధీర్.. తన కొత్త సినిమా 'G.O.A.T'లో ఇమాన్విని హీరోయిన్గా పెట్టాలని అనుకున్నారట. కాకపోతే ఎంత ప్రయత్నించినా సరే ఆమె వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి వదిలేశారట. ఈ విషయం గెటప్ శీను.. ఓ షోలో బయటపెట్టాడు.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)సుడిగాలి సుధీర్ సినిమాలో ఛాన్స్ వద్దనుకున్న ఇమాన్వి.. ప్రభాస్-హను మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఈమె షూటింగ్లో పాల్గొంది. ఓ పాట, కొన్ని సీన్సు షూట్ చేయగా.. ఇమాన్వి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని తెలుస్తోంది. ప్రభాస్-ఇమాన్వి కెమిస్ట్రీ కూడా సూపర్ అని లీక్ ఒకటి బయటకొచ్చింది.ఏదేమైనా సుడిగాలి సుధీర్ ప్రయత్నించాడు. ఒకవేళ ఓకే అనుకుంటే ఎందరో హీరోయిన్లలో ఒకరిగా మిగిలిపోయేది. ఇప్పుడు ప్రభాస్ మూవీ చేస్తోంది. ఈ మూవీ గనక హిట్ అయితే మాత్రం పాన్ ఇండియా స్టార్ అయిపోవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ) -
ప్రభాస్ ఫ్యాన్స్ పోరు పడలేక ఆ ఫొటో పెట్టాడా?
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు. 'రాజాసాబ్', 'ఫౌజీ'(వర్కింగ్ టైటిల్) మూవీస్ షూటింగ్స్ జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి 'స్పిరిట్' షురూ అవుతుంది. మరో మూడు నాలుగు సినిమాలు లైన్లో ఉన్నాయి. అయితే ప్రభాస్ 'స్పిరిట్'లో కొరియన్ స్టార్ డాన్ లీ ఉంటాడనే ప్రచారం కొన్నిరోజుల క్రితం జరిగింది. ఇప్పుడు ఇందులో మరో ట్విస్ట్!(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 46 ఏళ్ల తెలుగు నటుడు)కొరియన్ సినిమాల్లో మాఫియా డాన్, గ్యాంగ్‌స్టర్ పాత్రలు ఎక్కువగా చేసే మా డాంగ్ స్యూక్ అలియాస్ డాన్ లీ.. ఇప్పుడు ప్రభాస్ 'సలార్ 2' పోస్టర్ ఒకటి తన్ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. థంబ్సప్ సింబల్ కూడా దానిపై పెట్టాడు. దీంతో తెలుగు నెటిజన్లు.. రచ్చ రచ్చ చేస్తున్నారు. సలార్ 2 లో విలన్ ఇతడే అన్నట్లు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. 'స్పిరిట్' మూవీలో విలన్ గా చేస్తాడని అన్నారు కదా మరి 'సలార్ 2' పోస్టర్ ఎందుకు పెట్టాడా అని మరి కొందరు అనుకుంటున్నారు.'స్పిరిట్'లో ఇతడు యాక్ట్ చేస్తాడనే రూమర్ వచ్చినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్.. డాన్ లీ ఇన్ స్టాలో ప్రతి పోస్ట్ దిగువన ప్రభాస్-స్పిరిట్-సలార్ 2 అని వందలకొద్ది కామెంట్స్ చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. దీంతో వీళ్ల పోరు పడలేకపోయాడో ఏమో గానీ 'సలార్ 2' పోస్టర్ షేర్ చేశాడా అనిపిస్తుంది. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది డాన్ లీ ఫుల్ క్లారిటీ ఇస్తే తప్ప తెలియదు.(ఇదీ చదవండి: ఆర్జీవీ మేనకోడలు పెళ్లిలో రష్మిక, విజయ్ దేవరకొండ) -
ప్రభాస్‌తో పూరి జగన్నాథ్ సినిమా... ఈ సారి డైరెక్షన్ కాదు!
హీరో ప్రభాస్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ మూడో సారి కలసి పని చేయనున్నారని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా ‘బుజ్జిగాడు’(2008), ‘ఏక్ నిరంజన్’(2009) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు పూరి జగన్నాథ్. అయితే మూడోసారి మాత్రం ప్రభాస్ చిత్రాన్ని డైరెక్షన్ చేయడం లేదు పూరి. ‘స్పిరిట్’ చిత్రానికి పూరి జగన్నాథ్ డైలాగులు అందించబోతున్నారని టాక్. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ‘స్పిరిట్’ సినిమాకి డైలాగ్స్ రాసే బాధ్యతను పూరి జగన్నాథ్‌కు సందీప్ రెడ్డి అప్పగించినట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. సందీప్ స్వయంగా అడగడంతో పూరి కూడా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రభాస్‌తో తనకున్న స్నేహ బంధం ఓ కారణం అయితే.. సందీప్ స్టోరీకి డైలాగులు రాస్తే అది మరింతగా రీచ్ అవుతుందన్నది మరో ఆలోచన అట. అందువల్లే ఆయన అంగీకరించి ఉంటారని భోగట్టా. అయితే ఈ విషయంపై స్పష్టత రావాలంటే యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకూ వేచిచూడాల్సిందే. ఇదిలా ఉంటే.. ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించే సినిమాపై స్పష్టత రావాల్సి ఉంది. -
ప్రభాస్ ఫొటో లీక్.. కేసు పెట్టిన 'కన్నప్ప' టీమ్
అరడజనుకి పైగా సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. వీటితో పాటే మంచు విష్ణు 'కన్నప్ప' మూవీలోనూ శివుడి పాత్రలో నటిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం రిలీజైన టీజర్లో ప్రభాస్ కళ్లు మాత్రమే చూపించారు. తాజాగా ప్రభాస్ ఫుల్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో ఎవరో లీక్ చేశారు. ఇది తెగ వైరల్ అయిపోయింది.(ఇదీ చదవండి: 'అమరన్' హిట్.. మ్యూజిక్ డైరెక్టర్‌కి ఖరీదైన గిఫ్ట్)ఇప్పుడు ఈ విషయం 'కన్నప్ప' మూవీ టీమ్ దృష్టికి వెళ్లింది. దీంతో పోలీస్ కేసు పెట్టారు. అలానే నిందితుడిని పట్టుకునేందుకు ఏకంగా క్యాష్ రివార్డ్ కూడా ప్రకటించారు. ఈ సినిమా కోసం 2000 మందికి పైగా వీఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్నారని.. ఈ లీకైన ఫొటో వల్ల వాళ్ల పనిపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.ఇప్పటికే ఫొటో లీక్ విషయమై కేసు పెట్టామని, అయితే ఈ పని ఎవరో చేశారో కనుగొని ఆ వివరాలు మాకు చెబితే రూ.5 లక్షల రివార్డ్ ఇస్తామని 'కన్నప్ప' టీమ్ చెప్పింది. లీకైన ఫొటోని షేర్ చేసినా చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుందనని ప్రభాస్ అభిమానులతో పాటు అందరు హీరోల అభిమానులకు 'కన్నప్ప' టీమ్ రిక్వెస్ట్ చేసింది.(ఇదీ చదవండి: పెళ్లయిన 13 ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. నటి పోస్ట్ వైరల్) -
బాలీవుడ్ ఖాన్స్ రెమ్యునరేషన్ కలిపినా ప్రభాస్ రెమ్యునరేషన్ కి సరిపోదు
-
అగ్ర నిర్మాణ సంస్థ.. రెబల్ స్టార్‌తో బిగ్ డీల్.. ఏకంగా మూడు భారీ ప్రాజెక్టులు!
రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది కల్కి సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ నటించారు. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్ మెప్పించారు.అయితే గతేడాది డిసెంబర్ సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు.వరుసగా మూడు ప్రాజెక్టులుఅయితే తాజాగా భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ఈ బ్యానర్లోనే ప్రభాస్ సలార్-2 త్వరలోనే పట్టాలెక్కనుంది. అంతే కాకుండా రెబల్ స్టార్‌తో మరో రెండు ప్రాజెక్టులు చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ప్రభాస్‌తో వరుసగా 2026,2027,2028 సంవత్సరాల్లో మూడు చిత్రాలు విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.బిగ్ డీల్ఈ లెక్కన ప్రభాస్‌తో భారీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఒక్కో సినిమాకు రూ.150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్,.. ఏకంగా మూడు చిత్రాలకు దాదాపు రూ.450 కోట్లకు పైగానే పారితోషికం తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో హోంబలే ఫిల్మ్స్‌తో రాబోయే మూడు సినిమాలకు రెబల్ స్టార్ బిగ్ డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రభాస్ టాలీవుడ్లో ది రాజాసాబ్ మూవీలో నటిస్తున్నారు. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేయనున్నారు. ఈ చిత్రంలో తొలిసారి పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఆ తర్వాతే సలార్-2 సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms) -
ప్రభాస్ 'రాజాసాబ్'కి పోటీగా 'ఇడ్లీ' సినిమా
సాధారణంగా ప్రభాస్ సినిమా వస్తుందంటే మిగతా ఏ ఇండస్ట్రీల్లోనూ ఆ టైమ్‌కి వేరే పెద్ద హీరోల చిత్రాలు రిలీజ్‌కి పెట్టుకోరు. ఒకవేళ అలా కాదనుకుంటే షారుక్ 'డంకీ' మూవీకి అయినట్లు కలెక్షన్స్ డ్యామేజ్ అవ్వొచ్చు. కానీ తమిళ హీరో ధనుష్ మాత్రం తన కొత్త మూవీని 'రాజాసాబ్'కి పోటీగా బరిలో నిలబెట్టాడు.సలార్, కల్కి 2898ఏడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా 'రాజాసాబ్'. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీకి మారుతి దర్శకుడు. చాలావరకు షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇందులో ఏ మార్పు ఉండకపోవచ్చు.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)ఇకపోతే ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమా 'ఇడ్లీ కడై' (ఇడ్లీ మాత్రమే). ఇప్పుడు ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ 10నే థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ధనుష్ మూవీ అంటే తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ప్రభాస్ మూవీ ఉంది కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. తమిళంలో మాత్రం థియేటర్ల, కలెక్షన్ దగ్గర 'రాజాసాబ్'కి ఇడ్లీ మూవీ వల్ల ఇబ్బంది ఉండొచ్చు.ధనుష్ అదే తేదీన తన మూవీ రిలీజ్ చేయడానికి కారణముందనే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఉగాది ఉన్నట్లే తమిళ న్యూ ఇయర్.. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఉంది. దీంతో ఆ లాంగ్ వీకెండే ధనుష్ టార్గెట్. ఇదంతా చూస్తుంటే 'రాజాసాబ్' రిలీజ్‌తోపాటు ధనుష్ మూవీ రిలీజ్ విషయంలోనూ మార్పు ఉండకపోయే అవకాశాలే ఎక్కువ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన నాలుగు హిట్ సినిమాలు.. ఏది ఎందులో?) -
పాన్ ఇండియా మూవీస్ పంజా..!
-
ప్రభాస్ కమిట్మెంట్ కి షాక్ అవుతున్న టాలీవుడ్
-
నెగటివ్ షేడ్స్‌లో ప్రభాస్.. ప్రశాంత్ వర్మ భారీ ప్లాన్!
ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేయాల్సిన ‘స్పిరిట్’ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. జనవరిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. (చదవండి: ఆ కారణంతో దిల్ రాజు సినిమాను రిజెక్ట్ చేశా: దుల్కర్ సల్మాన్)అయితే ప్రభాస్ తర్వాతి చిత్రాలపై ఫిల్మ్‌నగర్‌లో కొత్త విషయాలు వినిపిస్తున్నాయి. ‘హను–మాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘బ్రహ్మరాక్షస’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాను ప్రభాస్ చేస్తారని, అలాగే తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఓ కొత్త చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... బాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఒకరైన రాజ్‌కుమార్ హిరాణీ కూడా ప్రభాస్‌తో ఓ సినిమా చేసేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని బాలీవుడ్ టాక్.(చదవండి: ఎన్టీఆర్ బావ మరిది 'నార్నే నితిన్' నిశ్చితార్థం) మరి... ‘రాజాసాబ్, ఫౌజి, స్పిరిట్’ చిత్రాల తర్వాత ప్రభాస్ తర్వాతి చిత్రం ఎవరి డైరెక్షన్లో ఉంటుంది? అనే విషయంపై ఓ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘బ్రహ్మరాక్షస’ సినిమాలో ప్రభాస్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. ఇక ఈ సినిమాను రణ్వీర్ సింగ్‌తో చేయాలనుకున్నారు ప్రశాంత్ వర్మ. కొన్ని కారణాల వల్ల ప్లాన్ మార్చి, ప్రభాస్‌తో చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. -
ప్రభాస్ 'స్పిరిట్'.. రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్..!
కల్కి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి డైరెక్షన్లో నటిస్తున్నారు. ది రాజాసాబ్ పేరుతో రొమాంటిక్-హారర్ జానర్లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలో సందడి చేయనుంది.ఈ మూవీ తర్వాత ప్రభాస్.. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో జతకట్టనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీలో ప్రభాస్ రోల్‌పై ఇటీవల ఓ ఈవెంట్లో సందీప్ క్లారిటీ ఇచ్చారు. పోలీస్ పాత్రలో కనిపించనున్నారని వెల్లడించారు. దీంతో ప్రభాస్ తొలిసారిగా ఖాకీ డ్రెస్‌లో కనిపించనున్నారు. కాగా.. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.(ఇది చదవండి: ‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!)ఇవాళ దీపావళి సందర్భంగా స్పిరిట్ టీమ్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ పనులు మొదలయ్యాయని వెల్లడించింది. ఈ విషయాన్ని మ్యూజిక్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో సందీప్ రెడ్డి వంగా మ్యూజిక్ వింటూ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ జోడీ కరీనాకపూర్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే వీటిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. View this post on Instagram A post shared by Harshavardhan Rameshwar (@harshavardhan_rameshwar) -
దేవర హిట్ తో సలార్ ని పక్కన పెట్టిన నీల్..
-
Prabhas: రైల్వేస్టేషన్లో...
హీరో ప్రభాస్ రైలు ప్రయాణం చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.కాగా ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోందని తెలిసింది. హైదరాబాద్‌లో వేసిన ఓ రైల్వేస్టేషన్ సెట్లో ప్రభాస్, ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇలా ఈ సినిమా కోసం రైలు ప్రయాణం చేస్తున్నారు ప్రభాస్. మిథున్ చక్రవర్తి, జయప్రద ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ పీరియాడికల్ అండ్ హిస్టారికల్ ఫిల్మ్‌కు సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
ప్రభాస్ ను టార్గెట్ చేస్తున్న కమల్ హాసన్..
-
బాహుబలి 3 కి రంగం సిద్ధం..!
-
షూటింగ్లో ప్రభాస్.. రూ.150 కోట్లకు ఓటీటీ డీల్!
డార్లింగ్ ప్రభాస్ చకచకా ఒక్కో సినిమా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం 'రాజాసాబ్' చివరి దశ షూటింగ్లో ఉంది. డిసెంబరు కల్లా పూర్తి చేస్తారని తెలుస్తోంది. మరోవైపు హను రాఘవపూడితో చేస్తున్న మూవీ సెట్లోకి ప్రభాస్.. శుక్రవారం అడుగుపెట్టేశాడట. కానీ అంతకు ముందే ఓటీటీ డీల్ పూర్తయినట్లు అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకొచ్చింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్ ఓటింగ్.. డేంజర్ జోన్లో ఇద్దరు!)ప్రభాస్.. పాన్ ఇండియా హీరో అవడం మాటేమో గానీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా తన గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్నాడు. 'సలార్', 'కల్కి 2898' చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం 'రాజాసాబ్'తో పాటు ఫౌజీ (రూమర్ టైటిల్) చేస్తున్నాడు. మైత్రీ నిర్మాణంలో హను రాఘవపూడి తీస్తున్న ఈ సినిమాని రూ.150 కోట్లు ఇచ్చి ప్రముఖ ఓటీటీ సంస్థ డిజిటల్ హక్కుల్ని దక్కించుకుందట.రిలీజ్ వరకు అంటే రేటు కాస్త పెరగొచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా రూ.150 కోట్లు ఇచ్చేసి ప్రభాస్ మూవీని ఓటీటీ సంస్థ కొనేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో ఇమాన్వి హీరోయిన్ అని ఇదివరకే ప్రకటించారు. బహుశా 2026లో ఇది థియేటర్లలో రిలీజ్ కావొచ్చు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు) -
ప్రభాస్ సలార్ మూవీ.. ఏకంగా 250 రోజులుగా!
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'సలార్ సీజ్ ఫైర్'. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు.అయితే ప్రస్తుతం సలార్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో దక్షిణాది భాషల్లో అందుబాటులో ఉంది. బాలీవుడ్ హక్కులు మాత్రం మరో ఓటీటీ దక్కించుకుంది. సలార్ హిందీ వర్షన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో క్రేజీ రికార్డ్ సృష్టించింది. ఏకంగా 250 రోజులుగా హాట్‌స్టార్‌లో ట్రెండింగ్‌లో నిలిచిన సినిమాగా అవతరించింది. ఈ విషయాన్ని ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఓటీటీ సంస్థ రివీల్ చేసింది. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. బాలీవుడ్ చిత్రాలను కాదని.. ప్రభాస్ చిత్రం రికార్డ్ క్రియేట్ చేయడం చూస్తుంటే నార్త్‌లో కూడా రెబల్ స్టార్ క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. -
ప్రభాస్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన బెస్ట్ ఫ్రెండ్.. ఎవరో తెలుసా?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే కల్కి మూవీతో ప్రేక్షకులను అలరించారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీతో బిజీగా ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇవాళ రెబల్ స్టార్ బర్త్ డే కావడంతో మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్లో ప్రభాస్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.అయితే ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో మెగాస్టార్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. తాజాగా ప్రభాస్‌కు బెస్ట్ ఫ్రెండ్ బర్త్ డే విషెస్ అంటూ ట్వీట్ చేశారు. ఆ బెస్ట్ ఫ్రెండ్ మరెవరో కాదు.. కల్కి మూవీలో బుజ్జిగా అలరించిన కారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. బుజ్జి పేరుతో ఉన్న ట్విటర్లో హ్యాండిల్లో వీడియోను పోస్ట్ చేసింది కల్కి టీమ్.కాగా.. ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో బుజ్జి పేరుతో ఉన్న కారుకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. రిలీజ్‌కు ముందు పలు నగరాల్లో బుజ్జి సందడి చేసింది. ఈ సినిమాలో బుజ్జి పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. కాగా.. బుజ్జికి హీరోయిన్ కీర్తి సురేశ్ వాయిస్‌తో డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.Happy Birthday BHAIRAVA - from your best friend #Bujji ❤️#Prabhas #Kalki2898AD pic.twitter.com/szhxo0xLqH— Bujji (@BelikeBujji) October 23, 2024 -
ఇలాంటి ఛాన్స్ కోసమే ఎదురు చూశా: ది రాజాసాబ్ హీరోయిన్
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇవాళ ప్రభాస్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. రెబల్ స్టార్ మోషన్ పోస్టర్ లుక్‌ను రివీల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. పుట్టినరోజున ది రాజాసాబ్ అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. న్యూ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ది రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ సరసన కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన అవకాశం రావడంపై స్పందించింది. ఇలాంటి ఛాన్స్ కోసమే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నానని తెలిపింది. తెలుగులో నా మొదటి సినిమానే ప్రభాస్‌తో కలిసి పనిచేయడం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని మాళవిక ఆనందం వ్యక్తం చేసింది. కాగా.. ఇటీవల తంగలాన్ మూవీతో అలరించిన మాళవిక మోహనన్.. ది రాజాసాబ్తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో మొదటి సినిమానే రెబల్ స్టార్‌తో కలిసి నటించడం ఈ ముద్దుగుమ్మకు కలిసి వస్తుందేమో వేచి చూడాల్సిందే. ప్రభాస్ మూవీ ది రాజా సాబ్ ఏప్రిల్ 10, 2025న విడుదల కానుంది. ఈ ఏడాదిలో యుద్రా సినిమా ద్వారా బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది తంగలాన్ బ్యూటీ. -
'అతను ఒక పవర్‌హౌస్'.. మంచువిష్ణు స్పెషల్ విషెస్!
రెబల్ స్టార్ ప్రభాస్‌కు మా అధ్యక్షుడు మంచు విష్ణు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. భారతీయ సినిమాకు ప్రభాస్ ఒక పవర్‌హౌస్ లాంటివాడని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మనసులు గెలుచుకున్నాడని కొనియాడారు. నా సోదరుడు ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని మంచు విష్ణు ట్విటర్లో రాసుకొచ్చారు.కాగా.. ఇవాళ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ సైతం కటౌట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ డిఫరెంట్ స్టైల్లో విషెస్ తెలిపారు.(ఇది చదవండి: ‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!)ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. మారుతి డైరెక్షన్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇవాళ రెబల్ స్టార్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ప్రభాస్ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దాదాపు 2 నిమిషాల పాటు ఉన్న వీడియో ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Wishing the powerhouse of Indian cinema, my brother #Prabhas, a very happy birthday! #Prabhas continues to conquer hearts and screens worldwide with his unmatched talent and dedication. Here’s to many more years of greatness! 🏆 #HappyBirthdayPrabhas pic.twitter.com/xX3Z26pApw— Vishnu Manchu (@iVishnuManchu) October 23, 2024 -
బర్త్ డే స్పెషల్.. నవరసాల్లో డార్లింగ్ ప్రభాస్
-
‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!
‘ది రాజాసాబ్’ అప్డేట్ వచ్చేసింది. ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన చిత్రం ‘ది రాజాసాబ్’. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. నేడు(అక్టోబర్ 23) ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి వీడియోతో కూడిన స్పెషల్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. అందులో ప్రభాస్ సింహాసనంపై కూర్చొని చేతిలో సిగార్ పటుకొని మహారాజులా కూర్చున్నాడు. మొత్తంగా ఈ సినిమాలో ప్రభాస్‌ని ఓ డిఫరెంట్ లుక్‌లో చూపించబోతున్నట్లు మోషన్ పోస్టర్‌తో చెప్పేశాడు డైరెక్టర్ మారుతి. (చదవండి: ఒకే ఒక మాటతో ట్రెండింగ్‌లోకి వచ్చేసిన ‘స్పిరిట్’)ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
టాలీవుడ్ నే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఏకైక స్టార్ ప్రభాస్
-
ట్రెండింగ్‌లో ‘స్పిరిట్’.. రూమర్సే నిజమయ్యాయి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఆయన ఒకవైపు ‘రాజాసాబ్’, మరోవైపు ‘ఫౌజీ’సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా చేయబోతున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే అటు సందీప్, ఇటు ప్రభాస్ ఇద్దరూ వేరు వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుంటే యానిమల్ సినిమాతో సందీప్ ట్రెండ్ సెట్ చేశాడు. ఆ సినిమా సక్సెస్‌లో ఎక్కువ శాతం సందీప్ కష్టమే ఉంది. ప్రభాస్‌తో సందీప్ సినిమా అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్‌తో పాటు సాదారణ సినీ ప్రేక్షకుల్లోనూ ‘స్పిరిట్’పై ఆసక్తి పెరిగింది. ప్రభాస్‌ను తెరపై ఎలా చూపించబోతున్నాడనే క్యూరియాసిటీ పెరిగింది.అప్డేట్ ఇచ్చిన సందీప్స్పిరిట్ స్టోరీ ఇదేనంటూ గత కొన్నాళ్లుగా రకరకాల కథలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీసుగా నటించబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇదంతా ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న చర్చే కానీ.. మేకర్స్ మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ అప్డేట్ ఇచ్చేశాడు. ప్రభాస్‌తో ఎలాంటి కథ చెప్పబోతున్నాడో చెప్పేశాడు.పోలీస్ స్టోరీతాజాగా ‘పొట్టేల్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కి సందీప్ రెడ్డి వంగా గెస్ట్‌గా వెళ్లారు. ఈ క్రమంలో యాంకర్ సుమ ‘స్పిరిట్’ సినిమా అప్డేట్ ఇవ్వాలని కోరింది. దీంతో సందీప్ పలకపై ‘పోలీస్ స్టోరీ’ అని రాసి చూపించాడు. అయితే స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీసుగా కనిపించబోతున్నాడని గత కొన్నాళ్లుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయాన్ని సందీప్ ధ్రువీకరించడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులేకుండా పోయింది. ప్రభాస్ బర్త్‌డే(అక్టోబర్ 23) రోజు స్పిరిట్ అప్డేట్ రావడం సంతోషంగా ఉందంటూ ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం స్పిరిట్( #Spirit) ఎక్స్‌లో ట్రెండింగ్‌గా మారింది. దీంతో పాటు సలార్-2 (#Salaar2), ది రాజాసాబ్( #TheRajaSaab ) హాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి. -
ప్రభాస్‌ను ఎవరైనా ప్రేమించాల్సిందే: చిరంజీవి
ప్రభాస్‌కు మాత్రమే డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. నేడు ఆయన పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో చిత్రపరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్ ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వెండితెర రారాజుగా విలసిల్లుతున్న ప్రభాస్ మనసు కూడా ఎంతో ప్రత్యేకం. దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితిలు వచ్చినా సరే తన వంతు సాయం చేసేందుకు ముందుకొస్తాడు. అలా తను మీడియా ప్రపంచానికి దూరంగా ఉంటూనే అభిమానుల గుండెలకు దగ్గరగా ఉంటాడు. అందుకే ఆయన్ను అభిమానించని వారంటూ ఉండరని చెప్పవచ్చు. సోషల్‌మీడియా వేదికగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. నేడు #Happybirthdayprabhas అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.ఆ కటౌట్ చూసి అన్ని నమ్మేయాలి డూడ్..! అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. పుట్టినరోజు శుభాకాంక్షలు డార్లింగ్ ప్రభాస్. ప్రేమ, సంతోషం, గొప్ప కీర్తి ఎల్లప్పుడు మీ వెంటే ఉంటాయని కోరుకుంటున్నాను..! ఈ అద్భుతమైన సంవత్సరం మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది.. - చిరంజీవిభారతీయ సినిమా పవర్‌హౌస్, నా సోదరుడు ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రభాస్ తన అసమానమైన ప్రతిభ, అంకితభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హృదయాలతో పాటు వెండితెరలపై జయిస్తూనే ఉన్నాడు. మరెన్నో సంవత్సరాల పాటు తన గొప్పతనం నిలిచిపోతుంది. హ్యాపీ బర్త్ డే ప్రభాస్.. -మంచు విష్ణునిబద్ధత, కోరిక, ప్రతిభ, సంసిద్ధత, కఠోర శ్రమ, వినయం అన్నీ కలిస్తేనే గెలుపు ఖాయం . నువ్వే విజేత. జన్మదిన శుభాకాంక్షలు ప్రభాస్.. - త్రివిక్రమ్నా ప్రియమైన మిత్రుడు ప్రభాస్‌కి జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.. - రామ్ చరణ్అందరికి ప్రియమైన ప్రభాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ వినయం, నిబద్ధత,అంకితభావం ఇవన్నీ నేడు మిమ్మల్ని ఇంతటి స్థాయిలో ఉంచాయి. మీరు కేవలం నటుడిగానే కాకుండా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే శక్తిగా మారారు. బాక్సాఫీస్ వద్ద మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా.. - ప్రశాంత్ వర్మ -
బర్త్ డే స్పెషల్.. చిన్నప్పటి ఫొటోలతో ప్రభాస్ చెల్లి
డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. మిగతా వాళ్ల సంగతేమో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూతురు ప్రసీద షేర్ చేసిన ఫొటోలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి. ఎందుకంటే తాను చిన్నప్పుడు ప్రభాస్‌తో దిగిన చాలా ఫొటోల్ని ప్రసీద ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ప్రభాస్ ఇంటి వద్ద అభిమానుల హాల్ చల్)కృష్ణంరాజు నలుగురు కూతుళ్లలో ప్రసీద ఒకరు. ఈమెతో పాటు మిగతా ముగ్గురు చెల్లెళ్లు అంటే ప్రభాస్‌కి చాలా ఇష్టం. ప్రసీద అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంటుంది. కానీ ఇప్పుడు అన్న పుట్టినరోజు సందర్భంగా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు దిగిన చాలా పిక్స్‌ని పంచుకుంది. ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ లైక్స్ కొట్టేస్తున్నారు.(ఇదీ చదవండి: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ప్రభాస్'.. ఎలా సాధ్యమైంది..?) View this post on Instagram A post shared by Sai Praseedha Uppalapati (@praseedhauppalapati) -
అర్థరాత్రి ప్రభాస్ అభిమానుల హల్ చల్
-
ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ప్రభాస్'.. ఎలా సాధ్యమైంది..?
'ఈశ్వర్'లా వెండితెరపై అడుగుపెట్టి అభిమానుల చేత 'సాహో' అనిపించుకున్నాడు. నేడు ఇండియన్ బాక్సాఫీస్‌కు 'ఛత్రపతి'లా 'ఏక్ నిరంజన్' అయ్యాడు. కేవలం రూ.100 కోట్లకే పరిమితమైన తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెట్‌ను ఏకంగా రూ.2 వేల కోట్లకు చేర్చి తెలుగోడి సత్తా ఏంటో బాలీవుడ్‌కు పరిచయం చేశాడు. తను పుట్టిన గడ్డపై ప్రకృతి కన్నేర్ర చేస్తే తనవంతుగా 'పౌర్ణమి' లాంటి వెలుగును అందింస్తాడు. సిల్వర్ స్క్రీన్‌పై పౌరుషంతో కదం తొక్కే 'మిర్చి'లాంటి కుర్రాడిగానే కనిపిస్తూనే అమ్మాయిల కలల రాకుమారుడిగా 'డార్లింగ్' అని పిలిపించుకుంటాడు. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌లో 'సలార్' రూలింగ్ మాత్రమే జరుగుతుంది. ఇవాళ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మరిన్ని విషయాలు మీ కోసం..ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. అందరూ ముద్దుగా ప్రభ, డార్లింగ్ అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచి నటుడవ్వాలని ప్రభాస్ ఎప్పుడూ అనుకోలేదు. అయితే, ప్రభాస్ మంచి ఎత్తుతో పాటు చాలా గ్లామర్‌గా ఉండటంతో అందరూ ఆయన్ను 'హీరో... హీరో' అని పిలిచేవారట. కానీ సినిమాలంటే చాలా భయపడేవాడట. తనకు తెలిసిన మొదటి హీరో పెదనాన్న కృష్ణంరాజు. ఆయనకు ప్రభాస్ బిగ్ ఫ్యాన్ కూడా... ఓ రోజు భక్తకన్నప్ప సినిమా షూటింగ్ జరుగుతుంటే అక్కడికి ప్రభాస్ కూడా వెళ్లాడు.. అలా సినిమా సెట్లోని వాతావరణానికి అలవాటు పడ్డాడు. రోజూ పెదనాన్న కృష్ణంరాజు నటించిన సినిమాలు చూస్తూ అలా తన కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యాడు.వరుసగా ప్లాపులొచ్చినా మళ్లీ.. మళ్లీ తిరిగొచ్చాడుకృష్ణంరాజు వారసుడిగా 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో తొలి సినిమా. ఈ సినిమా విజయం సాధించినా ఆ తర్వాత 2003లో విడుదలైన 'రాఘవేంద్ర' సినిమా పరాజయం పాలైంది. ఈ రెండు చిత్రాలతో నటన, హావభావాలతో ఆకట్టుకున్నాడనే ప్రశంసలు ప్రభాస్‌కు దక్కాయి. కానీ, చిత్రపరిశ్రమలో తన మార్క్ వేయలేకపోయాడు. దీంతో మూడో చిత్రంతో మంచి విజయం అందుకోవాలని చాలా ఆశలు పెట్టుకుని 2004లో త్రిష కాంబినేషన్‌తో 'వర్షం' తెరకెక్కించారు. సినిమా విడుదల తర్వాత పర్వాలేదనే టాక్ మాత్రమే వినిపించింది. దీంతో ఈ చిత్రం కూడా పోయిందని ప్రభాస్ అనుకున్నాడు. అయితే, వారం తర్వాత వర్షంలా కలెక్షన్స్ పెరిగాయి. ఆపై సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేశాడు. అలా ప్రభాస్ కెరియర్లో తొలి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ అడవి రాముడు, చక్రం సినిమాల్లో నటించాడు. ఈ రెండు చిత్రాలు అట్టర్ ఫ్లాప్స్ కావడంతో మళ్లీ వర్షం లాంటి సినిమాతో హిట్ కొట్టాలని ప్రభాస్ తపించాడు. అలాంటి సమయంలో ‘ఛత్రపతి’ (2005) బ్లాక్‌బస్టర్ కొట్టాడు. మళ్లీ రెండేళ్ల పాటు ఒక్క హిట్ లేదు. పౌర్ణమి, యోగి, మున్నా వరుసుగా మళ్లీ పరాజయాలే.. ఇలా ఇండస్ట్రీలో పడిపోయిన ప్రతిసారి తిరిగి తానేంటో నిరూపించుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'బుజ్జిగాడు'తో డిఫరెంట్ మ్యానరిజాన్ని టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. 'బిల్లా'తో తనలోని స్టైలిష్ లుక్‌ను పరిచయం చేసిన ప్రభాస్ ఏక్ నిరంజన్‌తో మరో కోణాన్ని పరిచయం చేశాడు. అలా డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలతో అదరగొట్టేశాడు. బాహుబలి కోసం ఒకేఒక్కడుబాహుబల సమయంలో ప్రతి హీరో ఏడాదికి రెండు సినిమాలు తీస్తున్నాడు. కానీ ప్రభాస్ మాత్రం 'బాహుబలి' కోసం జక్కన్నకి ఐదేళ్లు పూర్తి కాల్షీట్లు ఇచ్చేశాడు. అప్పుడు దేశంలో ఇదో సంచలనం. అన్ని రోజులపాటు మరో సినిమా ఒప్పుకోకుండా నిలబడిని ఏకైక హీరోగా ఆయన పేరుపొందాడు. ఆ సమయంలో అనుష్క,రానా,తమన్నా వంటి వారందరూ వేరే సినిమాలు చేశారు. ప్రభాస్ ఒక్కడే బాహుబలి మొత్తం అయ్యే వరకు ఒకే సినిమాకి పనిచేశాడు. ప్రభాస్ పడిన కష్టానికి ఫలితం దక్కింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎనలేని గుర్తింపు వచ్చింది. ఇక్కడి నుంచే ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా కోసం నార్త్ ఇండియా ప్రేక్షకులూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్,సలార్,కల్కి వంటి చిత్రాలు బాలీవుడ్లో దుమ్మురేపాయి. టాలీవుడ్‌కు ఏమాత్రం తగ్గకుండా అక్కడ కలెక్షన్లు రాబట్టాయి. ఎన్నో ఎళ్ల పాటు బాలీవుడ్‌ను శాసిస్తున్న ఖాన్ హీరోలను ప్రభాస్ వెనక్కు నెట్టేశాడు. ఈ క్రమంలో బాలీవుడ్ కింగ్ కిరీటాన్ని ప్రభాస్ ఎప్పుడో అందుకున్నాడు.ప్రభాస్‌కు స్నేహితులు.. ఆ రెండు సినిమాలు 20 సార్లు చూశాడుప్రభాస్కు అభిమాన హీరో కృష్ణంరాజు అయితే, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, రాబర్ట్ డి నిరో, జయసుధ, శ్రియ, త్రిష నటన అన్నా ఆయనకు చాలా ఇష్టం. తనకు దగ్గరైన దోస్తులు చాలామందే ఉన్నారు. వారిలో గోపిచంద్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్‌లు ప్రభాస్‌కు మంచి స్నేహితులు. అయితే, కెరియర్ పరంగా తనను అత్యున్నత స్థానంలో నిలబెట్టిన డైరెక్టర్‌గా రాజమౌళి అంటే ప్రభాస్‌కి ఎనలేని అభిమానం. ఆయన తర్వాత అంత ఇష్టమైన దర్శకుడు మరొకరు ఉన్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ. ఆయన సినిమాలను ప్రభాస్ చాలా ఎక్కువగానే ఇష్టపడతాడు. ఆయన డైరెక్ట్ చేసిన త్రీ ఇడియట్స్, ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రాలను ఇరవైకి పైగా సార్లు చూసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.ప్రభాస్‌లో ఇవన్నీ ప్రత్యేకం► ప్రముఖ మ్యూజియం మేడమ్ టుసాడ్స్‌లో మైనపు విగ్రహం కలిగిన మొదటి దక్షిణాది స్టార్‌గా ప్రభాస్ గుర్తింపు పొందారు.► కేవలం 'బాహుబలి' ప్రాజెక్టు కోసం ఐదేళ్లు కేటాయించడం► ప్రభాస్ 2014లోనే తొలిసారి హిందీ సినిమాలో మెరిశారు. అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా కలిసి నటించిన 'యాక్షన్ జాక్సన్'లో అతిథిగా కనిపించారు.► ప్రభాస్‌కు పుస్తకాలు చదవడం అంటే ఎక్కువ ఆసక్తి. ఆయన ఇంట్లో ఓ చిన్న లైబ్రెరీ కూడా ఉందట.► స్టార్డమ్ సొంతం చేసుకుని ఎన్నో ఏళ్లయినా ప్రభాస్ ప్రకటనలకు కాస్త దూరంగా ఉన్నారు. 2015లో తొలిసారి ఓ కారు ప్రచారంలో భాగంగా వాణిజ్య ప్రకటనలో నటించారు.► ప్రభాస్ ఖాతాలో వెయ్యి కోట్లు సాధించిన సినిమాలు రెండు ఉన్నాయి బాహుబలి2, కల్కి 2898AD ► బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది.► మిర్చి సినిమాకు ఉత్తమనటుడిగా 2013లో నంది అవార్డు దక్కించుకున్న ప్రభాస్► ప్రభాస్ గత 20 ఏళ్లుగా ఏన్నోసేవా కార్యక్రమాలు చేశారు. తుఫాన్ లు, వరదలు వచ్చినప్పుడు, కొవిడ్ సమయంలో భారీ విరాళాలు ఇచ్చారు.► తన 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకొని తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ కు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.► ప్రభాస్ నటుడు కాకపోయుంటే..? హోటల్ రంగంలో స్థిరపడేవారు.► ప్రభాస్‌కు ఏపీలో శ్రీశైలం అంటే ఎంతో ఇష్టం► ఇష్టమైన పాట: 'వర్షం'లోని 'మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం' -
ప్రభాస్ ఇంటి వద్ద భారీగా ఫ్యాన్స్.. పోలీసుల ఆంక్షలు
పాన్ ఇండియా స్టార్ హీరో 'ప్రభాస్' నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి చేరుకున్నారు.. తమ అభిమాన హీరోకు శుభాకాంక్షలు చెప్పాలని సుదూర ప్రాంతాల నుంచి కూడా ఫ్యాన్స్ అక్కడికి వచ్చారు. అర్ధరాత్రి నుంచే ఆయన ఇంటి వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చేరడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. వారందరూ అక్కసారిగా మా సలార్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే, భారీ సంఖ్యలో ఫ్యాన్స్ రావడంతో ఏమైన సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉందని వారిని పోలీసులు అడ్డుకున్నారు.తమ అభిమాన హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని చాలా ప్రాంతాల నుంచి వచ్చామంటూ అడ్డుకున్న పోలీసులతో ప్రభాస్ ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగారు. ఎట్టిపరిస్థితిల్లోనూ ప్రభాస్‌ను కలిశాకే ఇక్కడి నుంచి వెళ్తామంటూ వారందరూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో వారందరినీ పోలీసులు చెదరగొట్టారు. -
బాక్సాఫీస్ బాహుబలి, మిస్టర్ ఫర్ఫెక్ట్, రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
Happy Birthday Prabhas: అజాతశత్రువు.. అందరికి ‘డార్లింగ్’
టాలీవుడ్‌కి చెందిన చాలా మంది హీరోలు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. కానీ టాలీవుడ్‌నే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఏకైక స్టార్ ఎవరంటే..అది ప్రభాస్ అనే చెప్పొచ్చు. ఈ ఒక్క పేరు ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. ఆల్ ఇండియా నెంబర్ వన్ హీరో మన రెబల్ స్టారే అని చెప్పేందుకు మాటలు కాదు ఆయన క్రియేట్ చేస్తున్న నెంబర్స్, రికార్డ్స్ తిరుగులేని నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభాస్ సినిమాల బాక్సాఫీస్ నెంబర్స్ ట్రేడ్ పరంగా ఒక స్కేలింగ్ అయితే.. ప్రభాస్ సినిమా వస్తుందంటే పిల్లల నుంచి పెద్దల దాకా థియేటర్స్ కు వెళ్లడం ఒక ఫినామినా. ఎప్పుడో ఒకసారి సినిమా చూస్తాం అనే మలి వయసు పెద్దలు కూడా ప్రభాస్ సినిమాకు థియేటర్స్ కు కదలడం ఆయన ఒక యూనివర్సల్ యాక్సెప్టెన్సీ ఉన్న స్టార్ అని తెలియజేస్తుంటుంది. అందుకే బాక్సాఫీస్ దగ్గర డే 1 రికార్డ్స్, ఫస్ట్ వీక్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ హయ్యెస్ట్ గ్రాస్, రికార్డ్ స్థాయి ఓవర్సీస్ కలెక్షన్స్ సాధ్యమవుతున్నాయి.ప్రభాస్ చుట్టూ ఉన్న పాజిటివ్ వైబ్స్ ప్రేక్షకుల్ని ఇంతలా ఆకర్షిస్తున్నాయని అనుకోవచ్చు. సలార్ లో ప్రభాస్ హ్యూజ్ యాక్షన్ సీన్స్ చేసినప్పుడు ఆ కటౌట్ కు కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనుకున్నారు ఆడియెన్స్. అదీ స్క్రీన్ ప్రెజెన్స్ లో ప్రభాస్ కున్న ఛరిష్మా. బాహుబలి నుంచి పాన్ ఇండియా జైత్రయాత్ర మొదలుపెట్టిన ప్రభాస్ ఆ తర్వాత సాహో, సలార్, కల్కి 2898ఎడి సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ రీజనల్ స్టార్స్ కే కాదు ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్ కు కూడా ఒక నెరవేరని కల, సాధ్యం కాని ఫీట్. కానీ ప్రభాస్ అలవోకగా బాహుబలి 2, కల్కి 2898 ఎడి సినిమాలతో రెండు సార్లు థౌసండ్ క్రోర్ గ్రాస్ మూవీస్ చేశాడు. బాహుబలి 2 డే 1, 200 కోట్ల రూపాయలు వసూళు చేయడం ట్రేడ్ వర్గాలను అవాక్కయ్యేలా చేసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ వెయ్యి రోజుల శ్రమ కలెక్షన్స్ రూపంలో రిజల్ట్ ఇచ్చింది. కల్కి 2898 ఏడి మూవీ 1100 కోట్ల రూపాయల గ్లోబల్ గ్రాస్ కలెక్షన్స్ చేయడం ప్రభాస్ రీసెంట్ గా క్రియేట్ చేసిన ఒక సెన్సేషన్. ప్రభాస్ బిగ్ హీరోనే కాదు బిగ్ టికెట్ హీరో అని ఈ బ్లాక్ బస్టర్స్ ప్రూవ్ చేస్తున్నాయి.ప్రభాస్ సినిమా అంటే ప్రొడ్యూసర్స్, ట్రేడ్ సెక్టార్ లో ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. ఆయన సినిమాల మీద ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు, ఆ పెట్టుబడికి ప్రభాస్ స్టార్ డమ్, బాక్సాఫీస్ స్టామినానే పూచీ. అందుకే వందల కోట్ల రూపాయలతో బడ్జెట్ తో ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తున్నాయి ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌసెస్. మారుతి డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ది రాజా సాబ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న సలార్ 2, సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా...ప్రభాస్ చేస్తున్న హ్యూజ్ ప్రాజెక్ట్స్. వీటిలో ది రాజా సాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి రాబోతోంది. మిగతా మూవీస్ చిత్రీకరణలో వివిధ దశల్లో ఉన్నాయి.ప్రభాస్ స్టార్ గానే కాదు వ్యక్తిగానూ అంతే గొప్పవారు. తనను ఇంత పెద్ద స్టార్ ను చేసిన అభిమానులు, ప్రేక్షకులంటే ఆయనకు ఎంతో ప్రేమ. అందుకే సొసైటీలో ఏ విపత్తు జరిగినా ప్రభాస్ ముందుగా స్పందిస్తుంటారు. మిగతా స్టార్స్ కంటే రెట్టింపు డొనేట్ చేస్తుంటారు. ఈ ఏడాది కేరళలో వనయాడ్ విలయానికి విపత్తు సాయంగా తన వంతు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రభాస్, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం 2 కోట్ల రూపాయలు విరాళం అందించారు. అజాతశత్రువు అనే పాత మాటకు డార్లింగ్ అనే కొత్త అర్థానిచ్చిన ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు( అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే) -
ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. రెబల్ స్టార్ స్టైలిష్ లుక్స్ చూశారా? (ఫోటోలు)
-
మోస్ట్ పాపులర్ హీరోగా విజయ్.. ప్రభాస్ ప్లేస్ ఎంతంటే!
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సినీ స్టార్స్‌కు సంబంధించిన ర్యాంకులను ప్రకటిస్తుంది. హీరో, హీరోయిన్ల క్రేజ్ ఆధారంగా ప్రతినెల మోస్ట్ పాపులర్ స్టార్స్ పేరిట టాప్ టెన్ జాబితాను రిలీజ్ చేస్తోంది. తాజాగా సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆ జాబితాను విడుదల చేసింది.తాజాగా రిలీజైన జాబితాలో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్‌లో విజయ్ మొదటిస్థానంలో నిలవగా.. రెబల్ స్టార్ ప్రభాస్, షారూఖ్ ఖాన్ టాప్-3లో నిలిచారు. ఆ తర్వాత అజిత్ కుమార్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, అక్షయ్ కుమార్, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన విజయ్ ఇటీవలే ది గోట్ మూవీతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.టాప్‌లో సమంత.. రష్మిక ప్లేస్ ఎక్కడంటే?ఆర్మాక్స్ మీడియా వెల్లడించిన మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్స్ జాబితాలో సమంత టాప్‌లో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో బాలీవుడ్ భామలు ఆలియా భట్, దీపికా పదుకొణెలు నిలిచారు. ఆ తర్వాత వరుసగా..నయనతార, త్రిష, శ్రద్ధాకపూర్, కాజల్ అగర్వాల్, సాయిపల్లవి, రష్మిక మందన్నా, పదో స్థానంలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ నిలిచింది.కాగా.. సమంత ప్రస్తుతం సిటాడెల్ హన్నీ బన్నీ ఇండియన్ వర్షన్లో కనిపించనుంది. ఇటీవల ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. రెండో స్థానంలో నిలిచిన ఆలియా భట్ ఇటీవలే జిగ్రా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. మూడో ప్లేస్‌లో ఉన్న దీపికా పదుకొణె కల్కి సినిమాతో అభిమానులను అలరించింది. Ormax Stars India Loves: Most popular female film stars in India (Sep 2024) #OrmaxSIL pic.twitter.com/wAxa5GF5DP— Ormax Media (@OrmaxMedia) October 22, 2024 Ormax Stars India Loves: Most popular male film stars in India (Sep 2024) #OrmaxSIL pic.twitter.com/ei4bfglzlm— Ormax Media (@OrmaxMedia) October 22, 2024 -
ప్రభాస్ 'ది రాజాసాబ్'.. బర్త్ డే రోజే వచ్చేస్తున్నాడు!
రెబల్ స్టార్ ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న చిత్రం ది రాజాసాబ్. కల్కి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా అని తెగ ఆరా తీస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కోసం ది రాజాసాబ్ టీమ్ అప్డేట్తో ముందుకొచ్చింది. మరో రెండు రోజుల్లో డార్లింగ్ బర్త్ డే కావడంతో డైరెక్టర్ మారుతి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.ఈనెల 23న డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు బ్లాస్టింగ్ ఖాయమని పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే అదే రోజున టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బర్త్ డే రోజు ఫ్యాన్స్‌కు ది రాజాసాబ్ టీమ్ రాయల్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో రెబల్ స్టార్ న్యూ లుక్‌లో అదిరిపోయేలా కనిపించాడు.(ఇది చదవండి: ప్రభాస్ 'ది రాజాసాబ్' గ్లింప్స్.. అది రెబల్ స్టార్ క్రేజ్!)ఇప్పటికే ది రాజాసాబ్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన 24 గంటల్లోనే 20 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. కాగా.. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. Swag turned up to the MAX 😎&Now….your Celebrations will go off in STYLE 😉 A ROYAL TREAT AWAITS on 23rd Oct 💥💥#Prabhas #TheRajaSaab pic.twitter.com/wEu31XSGFW— The RajaSaab (@rajasaabmovie) October 21, 2024 -
చిన్న సినిమాకు అండగా నిలిచిన ప్రభాస్
ఒక సినిమాను తెరకెక్కించడం ఎంత కష్టమో.. దాన్ని ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ప్రచారం చేయడం కూడా అంతే కష్టం. ఎంత మంచి సినిమా తీసినా సరే.. అది జనాల్లోకి తీసుకెళ్లకపోతే అంతే సంగతి. ఈ విషయంలో చిన్న సినిమా పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అందుకే ప్రమోషన్స్ కోసం పెద్ద హీరోలను సంప్రదిస్తుంటారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే అడిగిన వెంటనే తమవంతు సహాయం చేస్తుంటారు. వారిలో డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా లవ్‌రెడ్డి అనే ఓ చిన్న చిత్రాన్ని ప్రొత్సహిస్తూ ఇన్‌స్టా వేదికగా తన మద్దతు ప్రకటించాడు.లవ్ రెడ్డి చిత్రానికి సంబంధించి ఎన్నో మంచి విషయాలు తన దృష్టికి వచ్చాయని, ఇటీవల కాలంలో విడుదలైన ప్రేమ కథల్లో లవ్ రెడ్డి మంచి చిత్రంగా నిలువడం ఆనందంగా ఉందని ప్రభాస్ తెలిపారు. ఈ మేరకు ఇన్ స్టాలో తన అభిమానుల కోసం లవ్ రెడ్డి ట్రైలర్ ను షేర్ చేస్తూ ఆ చిత్రానికి అండంగా నిలువాలని ప్రభాస్ కోరారు. ఇప్పటికే ఈ చిత్రానికి యువ నటుడు కిరణ్ అబ్బవరం ముందుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో 4 స్పాన్సర్ షోలు వేసి మద్దతు ఇవ్వగా ప్రభాస్ లాంటి అగ్ర హీరో లవ్ రెడ్డి చిత్రానికి అండగా నిలువడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ప్రభాస్ లవ్ రెడ్డి చిత్రానికి మద్దతుగా నిలువడం పట్ల సామాజిక మాద్యమాల్లో నెటింజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. లవ్ రెడ్డి చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం "లవ్ రెడ్డి" . అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి "లవ్ రెడ్డి" చిత్రాన్ని నిర్మించారు. సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా "లవ్ రెడ్డి" సినిమా ఈ నెల 18వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. -
జపాన్‌లో ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రీ రిలీజ్ కూడా
పాన్ ఇండియా పుణ్యమా అని మన హీరోలకు ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ బోలెడంత మంది అభిమానులు ఉంటున్నారు. 'బాహుబలి'తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌కి మన దేశంతో పాటు జపాన్‌లోనూ లెక్కలేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లలో కొందరు ఇప్పుడు డార్లింగ్ ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.(ఇదీ చదవండి: కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!)అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు. ఆ రోజున రాజా సాబ్, కల్కి 2, సలార్ 2 సినిమాలకు సంబంధించి అప్డేట్స్ రావొచ్చని టాక్. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలుచోట్ల 'సలార్' రీ రిలీజ్ చేశారు. మిస్టర్ ఫెర్ఫెక్ట్, ఈశ్వర్, రెబల్ చిత్రాల్ని కూడా రీ రిలీజ్ చేస్తారు.ఇప్పుడు జపాన్‌లోనూ ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడంతో పాటు 'రాధేశ్యామ్' మూవీని రీ రిలీజ్ చేశారు. లేడీ ఫ్యాన్స్ చాలామంది ఈ సినిమాని చూసి ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఫొటోలు, వీడియోలు కొన్ని వైరల్ కావడంతో ఇక్కడి డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.(ఇదీ చదవండి: మరో స్టార్ కొరియోగ్రాఫర్‌పై చీటింగ్ కేసు)I’m overjoyed to see our darling #Prabhas fans in Japan celebrating his birthday in Tokyo! They sent their heartfelt wishes to our Rebel Star ♥️😍#HappyBirthdayPrabhas pic.twitter.com/yEBj9FSbMY— Prasad Bhimanadham (@Prasad_Darling) October 19, 2024 -
ప్రభాస్‌తో ప్రశాంత్ వర్మ సినిమా.. ఇప్పట్లో సాధ్యమేనా?
హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. వీరి కాంబినేషన్లో ఓ పవర్ఫుల్ సబ్జెక్ట్‌తో సినిమా రానుందని, ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉందని, ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందట. అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఈ చిత్రం భాగం కావొచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. (చదవండి: జపాన్‌లో ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రీ రిలీజ్ కూడా)అయితే ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే మాత్రం ఇది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్ వర్మ బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞతో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. అలాగే తన సినిమాటిక్ యూనివర్స్ పేరిట మహాకాళి, అధీరా లాంటి క్రేజీ ప్రాజెక్టులను ఇతర దర్శకులతో తీయిస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు ప్రభాస్ డేట్స్ కూడా కొన్నాళ్ల పాటు దొరకడం కష్టమే. (చదవండి: డ్యాన్స్ మాస్టర్‌తో పాటు అతడి భార్యపైనా కేసు)ప్రస్తుతం ఆయన ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’ సినిమాలతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ‘స్పిరిట్’ షూటింగ్లో పాల్గొంటాడు. ఆ తర్వాత కల్కి 2, సలార్ 2 చేయాలి. ఇవ్వన్ని పూర్తవ్వాలంటే కనీసం మూడున్నరేళ్లయినా పడుతుంది. ఆ తర్వాత కానీ ప్రభాస్ డేట్స్ ఖాలీగా ఉండవు. ఒకవేళ ప్రశాంత్ వర్మతో సినిమా ఉన్నా..ఇప్పట్లో అయితే ప్రారంభం అయ్యే చాన్స్ లేదు. మరి... ప్రభాస్ అండ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ సెట్ అవుతుందా? లేదా రూమర్‌గానే మిగిలిపోతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వివాదం
ప్రభాస్ బర్త్‌డే ఈవెంట్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వివాదంగా మారింది. ప్రభాస్ పుట్టిన రోజు (అక్టోబర్ 23)సందర్భంగా కొంతమంది ఫేక్ ఫ్యాన్స్‌తో కలిసి ప్రసన్న సాహో డబ్బులు వసూలు చేసి కమర్షియల్ ఈవెంట్స్ చేస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉండి వాసు ఆరోపించారు. ఆ ఈవెంట్‌ని కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే తాను ఎలాంటి కమర్షియల్ ఈవెంట్ చేయడం లేదని ప్రసన్న సాహో వర్గం వివరణ ఇచ్చింది. (చదవండి: రేణు దేశాయ్ ఇంట చండీ హోమం)ఎవరి దగ్గర తాను డబ్బులు తీసుకోలేదని, కావాలనే తనను టార్గెట్ చేశారంటూ ప్రసన్న మండి పడ్డారు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తామని ప్రసన్న సాహో వర్గం వెల్లడించింది.(చదవండి: టాప్ హీరో ఫ్యామిలీ నుంచి పూరీ జగన్నాథ్‌కు ఆఫర్)కాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 23న ఆయన కొత్త సినిమాల అప్డేట్స్ రావడంతో పాటు ఆయన నటించిన ఆరు సినిమాలు రీరిలీజ్ అవుతుండడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బర్త్‌డే రోజు మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, ఛత్రపతి, ఈశ్వర్, రెబల్, సలార్ చిత్రాలు రీరిలీజ్ చేస్తున్నారు. -
ప్రభాస్ బర్త్ డే.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
టాలీవుడ్లో ఇటీవల ఎక్కువగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరో బర్త్ డే రోజు వస్తే చాలు హిట్ సినిమాలు థియేటర్లో సందడి చేస్తున్నాయి. గతంలో మహేశ్‌బాబుతో పాటు పలువురు హీరోల సినిమాలు బిగ్ స్క్రీన్‌పై సందడి చేశాయి. ఇకపోతే ఈనెల రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే రానుంది. ఈనెల 23న ఆయన పుట్టిన రోజు జరుపుకోనున్నారు.ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం మిస్టర్ ఫర్ఫెక్ట్ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 22న థియేటర్లలో డార్లింగ్ ప్రభాస్ సినిమా సందడి చేయనుంది. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్విటర్ ద్వారా వెల్లడించింది. 2011లో వచ్చిన మిస్టర్ ఫర్ఫెక్ట్ మరోసారి బిగ్ స్క్రీన్‌పై అలరించనుంది.కాగా.. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. కె దశరధ్ దర్శకత్వం వహించిన మిస్టర్ ఫర్ఫెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో రావు రమేష్, మురళీ మోహన్, నాసర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో వస్తోన్న ది రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.The Darling we all adore is making a grand return! 😍Join us on October 22nd to celebrate our Rebel Star #Prabhas with #MrPerfect ❤️Theatres lo Dhol Dhol Dhol Bhale 😎🥁@directordasarad @ThisIsDSP @MsKajalAggarwal @taapsee @SVC_official @adityamusic pic.twitter.com/uGk4AY2nh7— Sri Venkateswara Creations (@SVC_official) October 15, 2024 -
ఒకే వేదికపై ప్రభాస్,రజనీ,సూర్య.. ఎందుకో తెలుసా..?
సూర్య హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'కంగువ'. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో సూర్యతో పాటు ప్రభాస్, రజనీకాంత్ వేదక పంచుకోనున్నారని ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అక్టోబరు 10న విడుదల కావాల్సిన ఈ చిత్రం రజనీకాంత్ వెట్టయాన్ కోసం వాయిదా పడింది. దిశా పటానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. నవంబరు 14న సినిమా విడుదల కానుంది.కంగువ కోసం ప్రభాస్, రజనీకాంత్రజనీకాంత్ వేట్టయాన్ సినిమా అక్టోబర్ 10న విడుదల కావడంలో సూర్య పాత్ర ఎక్కువ ఉంది. తలైవా మీద ఉన్న గౌరవంతో అక్టోబర్ 10న విడుదల కావాల్సిన కంగువ చిత్రాన్ని సూర్య వాయిదా వేసుకున్నారు. దీంతో రజనీకాంత్ కూడా కంగువ విజయం కోసం తన వంతుగా సపోర్ట్ ఇచ్చేందుకు ప్రీరిలీజ్ కార్యక్రమానికి వస్తున్నారట. ఇకపోతే ఇదే కార్యక్రమానికి ప్రభాస్ కూడా రానున్నారని తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం యూవీ క్రియేషన్స్ అని చెప్పవచ్చు. స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి కంగువ సినిమాను వారు నిర్మించారు. యూవీ బ్యానర్ అధినేతలు వంశీ, ప్రమోద్‌లు ఇద్దరూ ప్రభాస్‌కు మంచి స్నేహితులు. దీంతో ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మరింత ప్రమోషన్ కల్పించేందుకు పెంచేలా ప్రభాస్ కూడా భాగం కానున్నారని సమాచారం.రూ. 2000 కోట్లపై టార్గెట్కంగువ సినిమాను 3,500 థియేటర్లలో ఎనిమిది భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత జ్ఞానవేల్ క్లారిటీ ఇచ్చేశారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్, చైనీస్, స్పానిష్లోనూ ఈ మూవీ వస్తుందని వెల్లడించారు. ఏఐ సాయంతో ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా పూర్తి అయినట్లు ఆయన తెలిపారు. రూ. 1000 కోట్ల టార్గెట్‌తో దిగుతున్న ఈ సినిమా రూ. 2000 కోట్లు రాబడుతుందని నిర్మాత అంచనా వేశారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు సిద్ధంగా ఉన్నాయని.. పార్ట్ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. నవంబరు 14న సినిమా విడుదల కానుంది. -
ప్రభాస్‌తో ఛాన్స్ వస్తే.. నన్ను తొలగించి కాజల్‌ను తీసుకున్నారు: రకుల్
టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కొద్దిరోజుల క్రితం నెపోటిజం (బంధుప్రీతి) గురించి మాట్లాడి సంచలనం రేపారు. అయితే, తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్‌తో వచ్చిన ఒక సినిమా ఛాన్స్ ఎలా కోల్పోయిందో చెప్పుకొచ్చారు. ప్రభాస్‌తో ఒక ప్రాజెక్ట్ ప్రారంభమయ్యాక తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తొలగించారని రకుల్ పేర్కొన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తన స్థానంలో మరో హీరోయిన్ను తీసుకున్నారని తెలిపారు.రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే మొదట కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆపై తన నటనతో ప్రేక్షకులను మెప్పించి స్వశక్తితో అవకాశాలు దక్కించుకున్నారు. అయితే, తన సినీ కెరియర్ ప్రారంభంలోనే ప్రభాస్ సరసన సినిమా ఛాన్స్ వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు. ఆ ప్రాజెక్ట్‌లో తను కొంత భాగం షూటింగ్లో కూడా పాల్గొన్నట్లు తెలిపారు. ఆ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత తాను కాలేజీకి వెళ్లినట్లు చెప్పారు. అయితే, రెండో షెడ్యూల్ పిలుపు కోసం ఎదురు చూసిన తనకు నిరాశే మిగిలిందన్నారు. షూటింగ్ కోసం చిత్ర యూనిట్ నుంచి తనకు ఎలాంటి కబురు రాలేదని ఆమె అన్నారు. తన స్థానంలో కాజల్‌ను తీసుకున్నారని మరోకరి ద్వారా తనకు తెలిసినట్లు చెప్పుకొచ్చారు. అయితే, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా తనను తొలగించడంతో కాస్త బాధ అనిపించినట్లు తెలిపారు. వారిద్దరి కాంబినేషన్లో అప్పటికే వచ్చిన సినిమా హిట్ కావడంతో అదే జోడీని రిపీట్ చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించినట్లు తర్వాత తెలిసిందన్నారు. కొత్తగా సినిమా పరిశ్రమలోకి వచ్చే హీరోయిన్లకు ఇలాంటివి జరగడం సర్వసాధారణమని ఆమె అన్నారు. ఇలాంటి ఘటనలు ఆమెకు చాలానే ఎదురయ్యాయని అన్నారు. కాజల్ అగర్వాల్, ప్రభాస్ కాంబినేషన్లో రెండు సినిమాలు డార్లింగ్ (2010), Mr పర్ఫెక్ట్ (2011) వచ్చాయి. రకుల్ చెబుతున్న ప్రకారం 'Mr పర్ఫెక్ట్' చిత్రంలో తనకు వచ్చిన అవకాశం కోల్పోయినట్లు తెలుస్తోంది. -
ఫ్యాన్స్ కి ఊహించని ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ మళ్ళి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడా!
-
నా ఛాతీలో దమ్ముంది
‘నా కలర్ నలుపు... కానీ, నా క్యారెక్టర్ ఎరుపు’ అంటూ నటుడు అశోక్ కుమార్ చెప్పే డైలాగ్‌తో ‘ఈశ్వర్’ సినిమా ట్రైలర్ ఆరంభమైంది. ప్రభాస్ హీరోగా పరిచయమైన చిత్రం ‘ఈశ్వర్’. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీదేవి విజయ్‌కుమార్ హీరోయిన్గా నటించారు. బ్రహ్మానందం, శివ కృష్ణ, రేవతి ఇతర పాత్రలు పోషించారు. కొల్ల అశోక్ కుమార్ నిర్మించిన ఈ సినిమా 2002 నవంబరు 11న రిలీజై హిట్‌గా నిలిచింది.కాగా ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఈశ్వర్’ సినిమాని అదే రోజు 4కే క్వాలిటీలో రీ రిలీజ్ చేస్తోంది లక్ష్మీ నరసింహా మూవీస్. ఈ నేపథ్యంలో ఈ మూవీ రీ రిలీజ్ ట్రైలర్‌ని విడుదల చేశారు. రీ ఇంట్రడ్యూసింగ్ ప్రభాస్ అంటూ రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే... ‘నీ చేతిలో డబ్బుంటే... నా ఛాతీలో దమ్ముంది రా, ఈ రోజు ఆ పోరి సంగతి అటో ఇటో తేల్చేస్తాను, ప్రేమించింది మర్చిపోవడానికి కాదు’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగులు ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ఆర్పీ పట్నాయక్. -
ఈ పాపని గుర్తుపట్టారా? ప్రభాస్ కొత్త సినిమాలో హీరోయిన్
ఎప్పుడు ఎవరికీ ఎలాంటి లక్కీ ఛాన్స్ వస్తుందో తెలియదు. అలా ఈ పాప కూడా డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండటంతో ఈ వైపు వచ్చింది. సొంతంగా సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉన్న ఈమె.. ఊహించని విధంగా హీరోయిన్ అయిపోయింది. ఏకంగా ప్రభాస్ పక్కన, అది కూడా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు ఇమాన్వి. ప్రభాస్-హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది ఈ అమ్మాయే. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఇమాన్వికి డ్యాన్స్ అంటే మహా పిచ్చి. ఎంబీఏ చేసి జాబ్ కొట్టినా సరే ఎప్పటికప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండేది. కొత్త కొత్త స్టెప్పులు కనిపెట్టేది. ఇదంతా గమనించిన ఈమె తండ్రి యూట్యూబ్ ఛానల్ పెట్టమని ప్రోత్సాహించాడు.(ఇదీ చదవండి: 'విశ్వంభర' టీజర్లో గ్రాఫిక్స్‌పై ట్రోల్స్)చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసిన ఇమాన్వి.. పూర్తిస్థాయి డ్యాన్సర్ అయిపోయింది. ఈవెంట్స్, రీల్స్ అని ఫుల్ బిజీ అయిపోయింది. ఇన్‌స్టాలో తొమ్మిది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈమెకు తల్లి నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. ముఖ్యంగా ఈమె డ్యాన్స్‌తో పాటు ఇచ్చే ఎక్స్ప్రెషన్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలా ఈమె డ్యాన్స్ వీడియోలు తెలుగు దర్శకుడు హను రాఘవపూడా కంట్లో పడటంతో ప్రభాస్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.ఫౌజీ వర్కింగ్ టైటిల్‌తో తీస్తున్న ఈ సినిమాని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. 'సీతారామం'తో మృణాల్‌కి ఎంత పేరు వచ్చిందో.. ఇమాన్వికి అంతకు మించి పేరు రావొచ్చని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: సూపర్ హీరోగా బాలకృష్ణ.. వీడియో రిలీజ్) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) -
డైరెక్టర్ వి.వి.వినాయక్ బర్త్‌డే.. విషెస్ చెప్పిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
ధైర్యంగా ఉండు బాబాయ్.. రాజేంద్ర ప్రసాద్‌ను ఓదార్చిన ప్రభాస్
-
రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన రెబల్ స్టార్.. గాయత్రికి నివాళి
సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ పరామర్శించారు. కూకట్‌పల్లిలోని ఇందు విల్లాస్లోని ఆయన నివాసానికి వెళ్లిన ప్రభాస్ కూతురి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం గాయత్రి చిత్రపటానికి ప్రభాస్ నివాళులర్పించారు.కాగా.. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. గాయత్రి మరణంతో రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు మృతి చెందడంతో రాజేంద్రప్రసాద్ శోకసంద్రంలో మునిగిపోయారు. కూతురిపై ప్రేమతో తానే స్వయంగా రూ.3 కోట్లతో ఇంటిని నిర్మించి ఇచ్చారాయన. -
‘రాజా సాబ్’ మేకింగ్ వీడియో చూశారా?
మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘రాజాసాబ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ఫై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నేడు డైరెక్టర్ మారుతి బర్త్‌డే(అక్టోబర్ 8). ఈ సందర్భంగా రాజాసాబ్ మూవీ మేకింగ్ వీడియోని విడుదల చేశారు మేకర్స్. (చదవండి: 'పుష్ప 2'.. ఫస్ట్ హాఫ్ అంతా రెడీ)ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగార్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో సందడి చేయబోతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
రాజాసాబ్ కి సీక్వెల్ కన్ఫర్మ్..?