Radheshyam
-
సినిమా వాళ్లపై ప్రజల్లో అలాంటి అభిప్రాయం: రాధేశ్యామ్ నటి కామెంట్స్!
మైనే ప్యార్ కియా (తెలుగులో ప్రేమ పావురాలు) సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టిన బాలీవుడ్ భామ భాగ్యశ్రీ. మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ కిసీ కీ జాన్ చిత్రంలో కనిపించింది. అంతేకాక గతేడాది ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంలో కీలకపాత్ర పోషించింది. ఈ ఏడాదిలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన చత్రపతి చిత్రంలోనూ కనిపించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన భాగ్యశ్రీ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్లో పనిచేసేవారు మంచి వ్యక్తులు కాదని ప్రజలు భావిస్తారని అన్నారు. అయితే వారి అభిప్రాయాల కారణంగా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఇబ్బందిగా ఉంటుందని భాగ్యశ్రీ చెప్పింది. ఇలాంటివి ఆమెను ఎలా ప్రభావితం చేస్తాయనే అనే విషయంపై తన అభిప్రాయాలను పంచుకుంది. (ఇది చదవండి: నీచమైన బతుకులు, మానసికంగా చంపుతున్నారు.. ఏడ్చేసిన అమర్ తల్లి) బాలీవుడ్లో ఉన్న అభిప్రాయాల గురించి అడిగినప్పుడు, భాగ్యశ్రీ మాట్లాడుతూ.. 'బాలీవుడ్లో పనిచేసే వ్యక్తులు మంచి వ్యక్తులు కాదనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. ఈ విషయంలో మనం ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉండాలి. ఎవరైనా వంట చేస్తున్నట్టు లేదా శుభ్రం చేస్తున్నట్టు సోషల్ మీడియా పోస్ట్ చేస్తే.. ప్రజలు వాటికి కూడా.. 'మీరు అవన్నీ చేయకూడదు, ఇంట్లో చాలా మంది ఉన్నారు కదా' అని సలహాలిస్తారు. నిజంగా చెప్పాలంటే మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి. మన ఆహారం మనమే వండుకోవాలి. మేము మీలాగా సాధారణ మనుషులమే. కానీ ప్రజలు మరింత రూడ్‌గా, సున్నితంగా మారినప్పుడే ఇలాంటి సమస్య ఎదురవుతుందని' ఆమె అన్నారు. గతంలో సినిమాలపై భాగ్యశ్రీ మాట్లాడుతూ.. 'నేను 80వ దశకంలో బాలీవుడ్లో అరంగేట్రం చేశా. సినిమాల్లోకి ప్రవేశించినప్పుడే ఇలాంటి భావం ప్రజల్లో అప్పటికే ఉంది. సినిమాలు చాలా చెడ్డ ప్రపంచం. మంచి కుటుంబం నుంచి వచ్చిన ఏ వ్యక్తిని చిత్ర పరిశ్రమకు వెళ్లనివ్వరు. ఇలాంటి అభిప్రాయం 30 సంవత్సరాల క్రితమే చూశా. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ప్రస్తుతం సెట్ డిజైనింగ్ నుంచి మేకప్ వరకు ప్రతి అంశంలోనూ మహిళలు ఉన్నారు. ఇది ఎప్పటికీ పరిశ్రమలో ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నా.' అని అన్నారు. భాగ్యశ్రీ ప్రస్తుతం సజిని షిండే కా వైరల్ వీడియోలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో రాధికా మదన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. మడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో సుబోధ్ భావే కూడా నటించారు. (ఇది చదవండి: సిద్దార్థ్ ఎమోషనల్ మూవీ 'చిన్నా' ఓటీటీ పార్ట్నర్ ఇదే!) -
‘పద్మ’ అవార్డుల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: 2022 సంవత్సరానికి 64 మందికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సోమవారం పద్మ పురస్కారాలను అందించారు. ఇందులో రెండు పద్మ విభూషణ్, 8 పద్మభూషణ్, 54 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాలులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తరఫున ఆయన కుమార్తెలు కృతిక రావత్, తరిణి రావత్, గీతాప్రెస్ అధినేత దివంగత రాధేశ్యామ్ ఖేమ్కా తరఫున ఆయన కుమారుడు కృష్ణ కుమార్ ఖేమ్కాలు పద్మ విభూషణ్ పురస్కారాలను స్వీకరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, సీరం ఇన్స్టిట్యూట్ ఎండీ సైరస్ పూనావాలా, పంజాబీ జానపద గాయకుడు గుర్మీత్ బావా (మరణానంతరం), టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహర్షి, దేవేంద్ర ఝఝరియా, రషీద్ ఖాన్, సచ్చిదానంద స్వామి తదితర ప్రముఖులు పద్మభూషణ్ పురస్కారాలను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల నుంచి మహా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు, డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావు, కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య, నాదస్వర వాయిద్యకారుడు గోసవీడు షేక్ హసన్ సాహెబ్ (మరణానంతరం)లు పద్మశ్రీ అవార్డులను స్వీకరించారు. 2022 పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం ఈ నెల 28న జరుగనుంది. ఏటా మాదిరిగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మొత్తం 128 పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో నాలుగు పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్, 107 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రెండు విడతల్లో 34 మంది మహిళలు, 10 మంది విదేశీయులు/ఎన్ఆర్ఐలు ఉండగా, 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించారు. -
రాదేశ్యామ్ సినిమా ఫ్లాప్ అయ్యిందని అభిమాని ఆత్మహత్య
కర్నూలు (టౌన్): ఇటీవల విడుదలయిన హీరో ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ ఫ్లాప్ అయ్యిందని కర్నూలులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలలోకి వెళితే.. కర్నూలు తిలక్‌నగర్‌లో నివసించే ముత్యాల రవితేజ (24) వృత్తిరీత్యా వెల్డింగ్ పని చేస్తుంటాడు. తల్లి ఉషారాణి రోజు వారీ కూలీ పనులు చేస్తుంది. తండ్రి లేడు. మృతుడు హీరో ప్రభాస్ వీరాభిమాని. శుక్రవారం ప్రభాస్ నటించిన రాదేశ్యామ్ సినిమా చూశాడు. మిత్రులతో కలిసి సినిమా ఫ్లాప్ అయ్యిందని బాధపడ్డాడు. ఇంట్లో తల్లితో కూడా ఇదే చెప్పాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణం చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కథ విన్నాక నో చెప్పలేకపోయా!
‘‘మిర్చి’, ‘బాహుబలి’ (రెండు భాగాలు), ‘సాహో’ వంటి యాక్షన్ చిత్రాల తర్వాత ‘రాధేశ్యామ్’ వంటి పీరియాడికల్ లవ్‌స్టోరీ ఫిల్మ్ చేయడం నాకు వ్యక్తిగతంగా కిక్ ఇచ్చింది. ఈ సినిమాలో పెద్దగా ఫైట్స్ ఉండవు కానీ యాక్షన్ ఫీల్ ఉంటుంది. విక్రమాదిత్య పాత్రకు మాస్ టచ్ ఉంటుంది’’ అని ప్రభాస్ అన్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్’. ఇందులో జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, డాక్టర్ ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటించారు. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా విలేకర్ల సమావేశంలో ప్రభాస్ మాట్లాడుతూ – ‘‘నాలాంటి యాక్టర్‌కు లవ్‌స్టోరీ ఇవ్వడానికి భయపడుతుంటారు. కానీ రాధాకృష్ణ ‘రాధేశ్యామ్’ లాంటి మంచి ప్రేమకథ చెప్పారు. ఈ సినిమా కథ చెప్పడానికి రాధాకృష్ణ వచ్చి.. కథలో హీరో జ్యోతిష్కుడు అన్నారు. ఇలాంటి వాటిపై నాకు పెద్దగా నమ్మకం లేదు. వెంటనే ‘నో’ చెబితే బాగోదని, ఇంట్రవల్ వరకు విని నచ్చలేదని చెబుదామనుకుని ‘రాధేశ్యామ్’ కథ వినడం స్టార్ట్ చేశాను. కానీ కథ వింటున్నంత సేపు ఆసక్తిగా కనిపించింది. ముఖ్యంగా సెకండాఫ్‌లోని సీన్లు నన్ను ఎగై్జట్ చేశాయి. దీంతో ‘రాధేశ్యామ్’ సినిమా చేయాలని డిసైడ్ అయిపోయాను. దర్శకుడు రాధాకృష్ణ నాలుగేళ్లుగా ఈ సినిమాకే కమిట్ అయ్యున్నారు. క్లైమాక్స్‌లో వచ్చే ఒక్క షిప్ ఎపిసోడ్ కోసమే దాదాపు రెండేళ్లు కష్టపడ్డారు. ఈ 13 నిమిషాల షిప్ ఎపిసోడ్ విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. గోపీకృష్ణా మూవీస్‌లో వచ్చిన ‘కృష్ణవేణి’ చిత్రం పెదనాన్నగారి (నటుడు, నిర్మాత కృష్ణంరాజు) కెరీర్లో మంచి హిట్‌గా నిలిచింది. ఈ బ్యానర్లో 13 సినిమాలు నిర్మిస్తే దాదాపు 10 సినిమాలు హిట్. దీంతో గోపీకృష్ణా మూవీస్ నుంచి వస్తోన్న చిత్రం అంటే హిట్ సాధించాలనే కోరుకుంటాను. అలాగే ఈ చిత్రానికి నా సిస్టర్ ప్రసీద (కృష్ణంరాజు కుమార్తె) ఓ నిర్మాత. యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ బాగా హెల్ప్ చేశారు. ఇక పెదనాన్నగారు, నేను చేసిన ‘బిల్లా’ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ చేశాం. ఈ చిత్రంలో పెదనాన్నగారు పరమహంస అనే ఫిలసాఫికల్ పాత్ర చేశారు. ఆయనకు కథ చెప్పడానికి రాధాకృష్ణ మొదట్లో భయపడ్డారు. అయితే పైకి ఆయన అలా ఉంటారు కానీ చాలా కూల్ పర్సన్. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్‌గారు పర్ఫెక్ట్గా సెట్స్‌ను డిజైన్ చేశారు. కెమెరామ్యాన్ పరమహంసగారు నాకు, పూజాకు మధ్య ఉండే రొమాంటిక్ సీన్స్‌ని బాగా చిత్రీకరించారు. ఇక ఈ లవ్‌స్టోరీకి జస్టిన్ ప్రభాకరన్గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. అలాగే తమన్‌గారి మ్యూజిక్ ‘రాధేశ్యామ్’ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది’’ అన్నారు. వెయ్యి కోట్ల ట్రీట్: రాధాకృష్ణ ‘‘రాధేశ్యామ్’ జర్నీతో ప్రభాస్‌గారు నా లైఫ్‌లోనే స్వీటెస్ట్ పర్సన్ అయిపోయారు. ఈ చిత్రంలో విక్రమాదిత్య, ప్రేరణ పాత్రల్లో ప్రభాస్, పూజా హెగ్డే మెప్పిస్తారు. థియేటర్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు విక్రమాదిత్య ఎమోషన్‌ను, ప్రేరణ ఇంటెన్స్‌ను ఆడియన్స్ ఇంటికి తీసుకుని వెళతారు. కృష్ణంరాజుగారు ఈ సినిమాకు ఇచ్చిన సలహాలు, సూచనలు ఉపయోగపడ్డాయి. ఈ సినిమాకు దాదాపు 300 కోట్ల బడ్జెట్ అయ్యింది. కానీ వెయ్యికోట్ల విజువల్ ట్రీట్‌ను థియేటర్స్‌లో చూస్తారు. రిటర్న్ గిఫ్ట్: తమన్ ప్రభాస్ సినిమాతో తొలిసారి అసోసియేట్ అవ్వడం సంతోషంగా ఉంది. ఇక తెలుగుకు మణిరత్నంగారి వంటి దర్శకుడు రాధాకృష్ణ రూపంలో దొరికాడా? అని నాకు అనిపిస్తోంది. నా కెరీర్ కాస్త డౌన్లో ఉన్నప్పుడు యూవీ క్రియేషన్స్వారు నాకు ‘భాగమతి’, ‘మహానుభావుడు’ వంటి సినిమాలను ఇచ్చారు. ఇప్పుడు నేను రిటర్న్ గిఫ్ట్‌గా ‘రాధేశ్యామ్’ చేశాను. ఎంత అవసరమో అంతే: రవీందర్ ‘‘రాధేశ్యామ్’ను తొలుత ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో షూట్ చేయడం జరిగింది. రాధాకృష్ణను నమ్మి నిర్మాతలు అంత బడ్జెట్ ఖర్చుపెట్టారు. కానీ మేం సినిమాకు ఏది అవసరమో, ఎంత అవసరమో అంతే డిజైన్ చేశాం. అలాగే కోవిడ్ టైమ్‌లో ‘రాధేశ్యామ్’ చిత్రం కోసం వినియోగించిన వైద్యపరికరాలను కరోనా బాధితులకు ఉపయోగపడేలా చేయడం సంతోషాన్నిచ్చింది. ‘‘రాధేశ్యామ్’ క్లాసిక్ ఫిల్మ్’’ అన్నారు జస్టిన్ ప్రభాకరన్. ‘సలార్’ చిత్రం రెండు భాగాలుగా రానుందా? అన్న ప్రశ్నకు ప్రభాస్ సమాధానమిస్తూ... ‘‘ఈ విషయం గురించి మరో సందర్భంలో మాట్లాడతాను. త్వరలో కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేయనున్నాను. ఇక ఇప్పటికిప్పుడు నాకు జాతకం చూసే శక్తులు వస్తే ‘రాధేశ్యామ్’ గురించిన రిజల్ట్‌ను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు. -
డార్లింగ్ ప్రభాస్.. రాధేశ్యామ్.. హాలీవుడ్ కంటే ముందుగా..
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాధేశ్యామ్ రిలీజ్‌కి ముందే అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచ సినీ చరిత్రలో ఇంతవరకు ఎవరూ చేయని విధంగా మెటావర్స్ వెర్షన్ ట్రైలర్‌ని లాంచ్ చేసింది. రాధేశ్యామ్ సినిమాలో భూత, వర్తమాన, భవిష్యత్తులను చెప్పే వ్యక్తిగా కనిపిస్తున్న ప్రభాస్.. తన సినిమాని ఫ్యూచర్ టెక్నాలజీగా చెప్పుకుంటున్న మెటావర్స్‌లో రిలీజ్ చేశారు. మార్క్ జుకర్‌బర్గ్ మరో అద్భుత సృష్టి మెటావర్స్. వాస్తవ ప్రపంచం రూపు రేఖలను మెటావర్స్ మార్చేయగలదని టెక్ నిపుణులు చెప్పుకుంటున్నారు. వర్చువల్ రియాలిటీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తూ వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో ఓ కొత్త ప్రపంచపు అనుభూతిని కలిగించడమే మెటావర్స్ ప్రత్యేకత. History has been made! For the first time ever in the history of cinema, a film trailer has been launched in the metaverse. Click on the link for an enthralling experience! #RadheShyamOnMetaversehttps://t.co/J3BCANbeEf — Radhe Shyam (@RadheShyamFilm) March 3, 2022 రాధేశ్యామ్ మెటావర్స్ ట్రైలర్‌ని 2022 మార్చి 3న చిత్ర నిర్మాతలు రిలీజ్ చేశారు. మెటావర్స్‌లో చూసేందుకు వీలుగా లింక్ కూడా ఇచ్చారు. మెటావర్స్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే కొన్ని ప్రత్యేక యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు వీఆర్ హెడ్సెట్, ఇయర్‌ఫోన్స్ కూడా కావాల్సి ఉంటుంది. ఇంకా ప్రారంభ దశలోనే ఈ టెక్నాలజీలో ట్రైలర్ రిలీజ్ చేసి కొత్త సంప్రదాయానికి చిత్ర యూనిట్ తెర లేపింది. 🙌Congrats to the entire #RadheShyam team on an incredible movie premier in @spatialxr! We're honored to host all 90k+ that have joined your space for this experience! @TSeries @hegdepooja @director_radhaa @UV_Creations@RedGiantMovies_ @RadheShyamFilm #RadheShyamOnMetaverse pic.twitter.com/IDzldinEKB — Spatial (@spatialxr) March 3, 2022 మెటావర్స్ వినియోగించేందుకు ఇండియన్ సెలబ్రిటీలు పోటీ పడుతున్నారు. భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ప్రముఖ పాప్ సింగర్ దలేర్ మెహందీ తొలిసారిగా మెటావర్స్‌లో లైవ్ కన్సర్ట్ ఇచ్చారు. ఇంకా ఆ వేడి చల్లారకముందే డార్లింగ్ ప్రభాస్ తన సినిమా ట్రైలర్ మెటావర్స్‌లో అందించించారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో హాలీవుడ్‌కి భారత సినిమా ఏమాత్రం తీసిపోదని నిరూపించారు. చదవండి: డేటాకు ‘మెటావర్స్’ దన్ను.. -
అందుకే మళ్లీ సినిమాల్లో నటిస్తున్నా!
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్’. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేశారు అప్పటి ‘మైనే ప్యార్ కియా’ ఫేమ్ భాగ్యశ్రీ. ఈ సినిమాలో నటించడం గురించి భాగ్యశ్రీ మాట్లాడుతూ – ‘‘హీరోయిన్గా నా మొదటి సినిమా ‘మైనే ప్యార్ కియా’ (హీరోగా సల్మాన్ ఖాన్‌కి కూడా ఇది తొలి సినిమా). ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలు చేశాను. కెరీర్ బాగున్నప్పటికీ పెళ్లి చేసుకోవడానికి అది సరైన సమయం అని, అప్పుడు చేసుకుంటే మంచి ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడుతుందని హిమాలయ్‌ని పెళ్లి చేసుకున్నాను. కుటుంబ బాధ్యతలు, పిల్లల పోషణతో బిజీగా ఉన్నందువల్ల సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. అందుకని నా భర్త, పిల్లలు తిరిగి నన్ను సినిమాల్లో నటించమని సపోర్ట్ చేస్తున్నారు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశాను. ప్రభాస్ ‘రాధేశ్యామ్’, కంగనా రనౌత్ ‘తలైవి’ (తమిళనాడు మాజీ సీయం, ప్రముఖ నటి జయలలిత బయోపిక్) చిత్రాల్లో యంగ్ మదర్ క్యారెక్టర్స్ చేసే అవకాశాలు వచ్చాయి. అయితే కరోనా వల్ల ‘రాధేశ్యామ్’ విడుదల వాయిదా పడింది. ‘రాధేశ్యామ్’ వంటి సినిమాలో తల్లి పాత్ర చేసినందుకు గర్వంగా ఉంది. ప్రభాస్ గొప్ప నటుడు.. నిగర్వి కూడా. ఈ చిత్రనిర్మాతలు మేకింగ్ విషయంలో రాజీ పడలేదు. జార్జియాలో గడ్డకట్టే చలిలో షూటింగ్ జరిగినప్పుడు కూడా యూనిట్‌ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్‌వారు ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాలవైపే చూస్తున్నారు. తెలుగు పరిశ్రమ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి. తెలుగులో మదర్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న అన్ని పాత్రలు చేయాలని ఉంది’’ అని చెప్పుకొచ్చారు భాగ్యశ్రీ. -
ఎంటర్‘ట్రైన్’మెంట్: ట్రైన్ సీన్లు కీలకంగా ఉన్న కొత్త సినిమాలివే!
ట్రైన్లో ప్రేమ.. ట్రైన్లో ఫైట్.. ట్రైన్లో కామెడీ.. ట్రైన్లో ఎమోషన్.. ట్రైన్ జర్నీలో ఎన్నో... వెండితెరపై ఎన్నో భావోద్వేగాలను ట్రైన్ చూపించింది. ఆడియన్స్‌ని ఎంటర్‘ట్రైన్’ చేసింది. ట్రైన్‌కి చాలా సీన్ ఉన్న సినిమాలు ఇప్పుడు ట్రాక్‌లో ఉన్నాయి. ఆ ఎంటర్‘ట్రైన్’మెంట్లోకి వెళదాం... Tollywood Movies With A Train Backdrop: ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రాధేశ్యామ్’. ఇందులో జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, డాక్టర్ ప్రేరణగా పూజా హెగ్డే కనిపిస్తారు. 1970నాటి యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీలో ఓ ట్రైన్ ఎపిసోడ్ కీలకంగా నిలవనుంది. ‘రాధేశ్యామ్’ మోషన్ పోస్టర్లో ట్రైన్లో ప్రభాస్, పూజ కనిపిస్తారు. ప్రేరణగా పూజా హెగ్డే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ట్రైన్లో ఉన్న స్టిల్‌నే విడుదల చేశారు. ఓ ప్రకృతి వైపరీత్యం కారణంగా జరిగే ట్రైన్ యాక్సిడెంట్లో విడిపోయిన విక్రమాదిత్య, ప్రేరణ మళ్లీ ఎలా కలుసుకుని వారి ప్రేమకు శుభం కార్డు వేశారు? అనేది ఈ చిత్రం ప్రధానాంశం అని సమాచారం. ఈ చిత్రం మార్చి 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇక ‘రాధేశ్యామ్’ చిత్రంలోని హీరో పాత్ర పేరు విక్రమాదిత్యనే టైటిల్‌గా పెట్టి దర్శకుడు తేజ 1836 నేపథ్యంలో సాగే ఓ లవ్‌స్టోరీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లో ట్రైన్ విజువల్ స్పష్టంగా కనిపిస్తోంది. సో.. ‘విక్రమాదిత్య’లో ట్రైన్ ఎపిసోడ్ కీలకంగా ఉండటమే కాకుండా, ట్రైన్ బ్యాక్‌డ్రాప్‌లో మేజర్ కథ సాగుతుందని ఊహించవచ్చు. అలాగే ‘సర్ ఆర్ధర్ కాటన్ ధవళేశ్వరం’ బ్యారేజ్‌కు, ‘విక్రమాదిత్య’ చిత్రకథకు లింక్ ఉందని చిత్రం యూనిట్ హిట్ ఇచ్చింది. ఇక రవితేజ కెరీర్లో ఓ హిట్ మూవీగా నిలిచిన ‘వెంకీ’లోని ట్రైన్ ఎపిసోడ్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ ఎపిసోడే కథను ముందుకు నడిపిస్తుంటుంది. తాజాగా కథను ముందుకు నడిపే ట్రైన్ ఎపిసోడ్‌తో రవితేజ చేస్తోన్న చిత్రం ‘రామారావు: ఆన్ డ్యూటీ’. ఈ సినిమా కొత్త పోస్టర్ ఇటీవల రిలీజైంది. సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఉన్నట్లుగా ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది. అయితే రవితేజ ‘వెంకీ’ చిత్రంలోని ట్రైన్ ఎపిసోడ్ కామెడీతో ఉంటే, ‘రామారావు: ఆన్ డ్యూటీ’లోని ట్రైన్ ఎపిపోడ్స్ సీరియస్‌గా ఉంటాయని తెలుస్తోంది. ట్రైన్లో మంటలు చెలరేగడం, బాధితులకు న్యాయం చేసే ఓ ఎమ్మార్వోగా రవితేజ పోరాటం చేయడం అనే అంశాల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 25న విడుదల కానుంది. ఇక రవితేజ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్‌గా రూపొందుతోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టూవర్టుపురం దొంగగా పేరుగాంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ఇది. వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో ట్రైన్లో దొంగతనాలు చేసే నాగేశ్వరరావుగా కొన్ని సీన్స్‌లో రవితేజ కనిపిస్తారట. ఇంకోవైపు ‘వి’ చిత్రం తర్వాత హీరో నాని కాస్త నెగటివ్ రోల్లో కనిపిస్తారని ప్రచారం అవుతోన్న చిత్రం ‘దసరా’. ‘నేను లోకల్’ చిత్రం తర్వాత నాని, కీర్తీ సురేష్ హీరోహీరోయిన్లుగా నటించనున్న ఈ పీరియాడికల్æఫిల్మ్‌కు శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ మోషన్ పోస్టర్ స్టార్టింగ్‌లో పొగతో వచ్చే రైలు బండి కనబడుతుంది. ఇక ఈ సినిమాలో రైలు ఎపిసోడ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాలా? గోదావరి ఖనిలోని సింగరేణి కోల్‌మైన్స్ సమీపగ్రామంలో ‘దసరా’ స్టోరీ సాగుతుంది. మార్చిలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. మరోవైపు కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లో ట్రైన్లో నుంచి కల్యాణ్ రామ్ తుపాకీతో ప్రత్యర్థులపై గురి పెట్టినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. దీన్నిబట్టి ఈ ట్రైన్ ఎపిసోడ్ సినిమాను మలుపు తిప్పుతుందని అనుకోవచ్చు. 1945లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వ సారథ్యంలోని అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో అనుకోని çఘటనల వల్ల ఓ గూఢచారి జీవితం ఎలా ప్రభావితం అయింది? అనే అంశం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకుడు. ఈ సినిమాలే కాక మరికొన్ని తెలుగు చిత్రాల్లో ట్రైన్ సన్నివేశాలు సెట్స్‌లో ట్రాక్‌పై ఉన్నాయి. రైలు జర్నీ బాగుంటుంది. సినిమాలో రైలు ఎపిసోడ్లూ దాదాపు బాగుంటాయి కాబట్టి వెండితెరపై ట్రైన్ జర్నీ కొనసాగాలని కోరుకుందామా! -
ప్రభాస్ చేతిలో 8 పాన్ ఇండియా సినిమాలు.. కొత్తగా మూడు
Prabhas Upcoming 8 Pan India Movies: ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రభాస్.. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభిమానులను, ప్రేక్షకులను తనదైన నటనతో మెప్పిస్తున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ హల్చల్ సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవికాకుండా ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ వంటి పెద్ద ప్రాజెక్టులతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. (చదవండి: హాలీవుడ్ సైతం ఆరా తీస్తున్న ఏకైక ఇండియన్ హీరో ప్రభాస్: నిర్మాత) బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో వస్తున్న ఆదిపురుష్ సినిమా చిత్రీకరణ పూర్తయింది ఇదివరకే ప్రకటించారు. అలాగే ప్రాజెక్ట్ కె సినిమా కోసం ప్రభాస్, దీపికా పదుకొణె మధ్య కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. అతివేగంగా సినిమా షూటింగ్స్ జరుపుకుంటూ ముందుకు సాగుతున్నాడు డార్లింగ్. ప్రభాస్ రేంజ్ తెలిసిన మేకర్స్ కూడా డార్లింగ్‌తో సినిమాలు చేసేందుకు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. పాన్ ఇండియా కథలతో ప్రభాస్ ఇంటి డోర్ కొడుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ మూడు సరికొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందులో ఒకటి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై బీటౌన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ రూపొందించినున్నట్లు తెలుస్తోంది. (చదవండి: ప్రభాస్ హైఓల్టేజ్ యాక్షన్ సీన్స్.. అన్ని కోట్ల ఖర్చు) ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కూడా ఒక కొత్త చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రభాస్ ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. ఈ రెండు కాకుండా డీవీవీ దానయ్యతో ఓ మూవీ చేసేందుకు ఎస్ చెప్పాడట ప్రభాస్. డైరెక్టర్ మారుతి ఓ హార్రర్ కామేడీ కథను డార్లింగ్‌కు వినిపించగా దానికి ప్రభాస్ ఓకే అన్నాడని తెలుస్తోంది. ప్రభాస్, మారుతి, దానయ్య ఈ ముగ్గురి కాంబినేషన్లో రానున్న సినిమాకు 'రాజా డీలక్స్' పేరు ప్రచారంలో ఉంది. ఇదంతా చూస్తుంటే విడుదలకు సిద్ధంగా ఉన్న 'రాధేశ్యామ్'తో కలుపుకుని ప్రభాస్ మొత్తం 8 చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. (చదవండి: 'స్పిరిట్'లో ప్రభాస్ రోల్ రివీల్ !.. ఇక ఫ్యాన్స్‌కు పండగే) -
ఆ పాత్ర కోసం ఎంతో రీసెర్చ్ చేశా: పూజా హెగ్డె
Pooja Hegde Recalls Her Role In Radhe Shyam Movie: ఈ సంక్రాంతికి సందడి చేస్తాయనుకున్న పాన్ ఇండియా చిత్రాలు వాయిదా పడి సినీ ప్రేక్షకులను, అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఈ వాయిదా పడిన చిత్రాలలో డార్లింగ్ అభిమానుల మోస్ట్ అవేయిటెడ్ మూవీ 'రాధేశ్యామ్' కూడా ఉంది. దీని తర్వాత మళ్లీ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో 'రాధేశ్యామ్' తాజా రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పరిస్థితులు అనుకూలిస్తే ఈ సినిమాను మార్చి 18న విడుదల చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం తాను ఎంత కష్టపడిందో చెప్పింది టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డె. 'విభిన్నమైన లవ్ స్టోరీస్‌లలో నటించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. రాధేశ్యామ్ సినిమాతో నా కల నెరవేరింది. రాధేశ్యామ్ చిత్రంలో ప్రేరణగా నటించడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఇందులో హీరోయిన్ రోల్ అద్భుతంగా ఉంటుంది. నాకు తెలిసినంతవరకు ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల్లో రాధేశ్యామ్ క్లిష్టమైనది. ఇది ఒక పీరియాడికల్ సినిమా కావడంతో ప్రేరణ పాత్రలో ఒదిగిపోయేందుకు ఎంతో రీసెర్చ్ చేశా.' అని పూజా హెగ్డె తెలిపింది. అభిమానులు, ప్రేక్షకులలాగే తాను కూడా ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఎదురుచూస్తున్నాని పేర్కొంది. -
‘రాధేశ్యామ్’కి భారీ ఓటీటీ ఆఫర్.. ఎన్ని వందల కోట్లో తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ విశ్వరూపం దాల్చింది. ఓమిక్రాన్ దెబ్బకి పలు దేశాల్లో మళ్లీ ఆంక్షల విధింపు మొదలైన విషయం తెలిసిందే. మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ విధించాయి. పలు చోట్ల సినిమా థియేటర్స్‌ని మూసివేశారు. దీంతో పలు పాన్ ఇండియా చిత్రాలు విడుదలను వాయిదా వేసుకున్నాయి. టాలీవుడ్ లో దాని ప్రభావం ‘ఆర్.ఆర్.ఆర్.’ పై పడింది. జనవరి 7న విడుదల కావలసి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తూన్నట్లు ఇటీవల చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.ఈ మూవీ సమ్మర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పీరియాడికల్ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’ కూడా వాయిదా పడొచ్చనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఈ మూవీ జనవరి 14న థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. చిత్రబృందం కూడా ఇదివరకు చెప్పినట్లుగానే సంక్రాంతి సందర్భంగా జనవరి 14నే ‘రాధేశ్యామ్’విడుదల అవుతుందని స్పష్టం చేసింది. కానీ కరోనా కారణంగా ఈ మూవీ పక్కా పోస్ట్ పోన్ అవుతుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో ‘రాధేశ్యామ్’కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల అవుతుందట. (చదవండి: ఊహించిందే నిజమైందా? దీని అర్థమేంటి డైరెక్టర్ గారూ..) దేశంలో ఆంక్షలు ఎక్కువైతే.. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు గానూ ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రూ. 400 కోట్లు ఆఫర్ చేసిందట. అయితే ఓటీటీలో విడుదల చేసే ఆలోచన మాత్రం చిత్రబృందానికి లేదని తెలుస్తోంది. కానీ, కరోనా ఆంక్షలు ఎక్కువతున్న ఇలాంటి సమయంలో.. , కనీసం రూ. 450కోట్ల ఆఫర్ వస్తే నేరుగా ఓటీటీలో విడుదల చేసే అవకాశం లేకపోలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. -
సంక్రాంతి బరిలో పది సినిమాలు!
సంక్రాంతి వస్తోందే తుమ్మెద కొన్ని సినిమాలు తేనుందే తుమ్మెద సినీ కాంతి పంచనుందే తుమ్మెద సినీ ప్రేమికులను ఖుషీ చేయనుందే తుమ్మెద కలెక్షన్లతో బాక్సాఫీస్ కళకళలాడనుందే తుమ్మెద మొత్తం ఎన్ని సినిమాలు వస్తాయంటే తుమ్మెద... పది వరకూ రావొచ్చు తుమ్మెద. ఆ సినిమాలపై ఓ లుక్కేద్దాం తుమ్మెద. సంక్రాంతి బరిలో నిలిచిన ప్యాన్ ఇండియన్ మూవీ ‘రాధేశ్యామ్’. ఈ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించారు. 1970 యూరప్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీ చిత్రానికి కె. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. ఈ చిత్రంలో జ్యోతిష్కుడిగా ప్రభాస్, డాక్టర్ ప్రేరణగా పూజా, పరమహంస పాత్రలో కృష్ణంరాజు కనిపిస్తారు. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఇక ఇదే రోజున చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన ‘సూపర్ మచ్చీ’, సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన ‘డిజె టిల్లు’ చిత్రాలు కూడా రిలీజ్‌కు రెడీ అయ్యాయి. పులి వాసు దర్శకత్వంలో ‘సూపర్ మచ్చీ’ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మించగా, కన్నడ బ్యూటీ రచితా రామ్ హీరోయిన్గా నటించారు. ఇటు సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘డిజె టిల్లు’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ఇది. ఇక పండగ రోజున అంటే జనవరి 15న తొలిసారి ‘హీరో’గా వస్తున్నాడు మహేశ్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని గల్లా పద్మావతి నిర్మించారు. నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, అర్చన కీలక పాత్రల్లో నటించారు. ఆర్ఆర్ఆర్ వాయిదా వల్ల... ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియన్ మూవీ ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్) ఈ నెల 7న విడుదల కావాల్సింది. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్‌లో సీటింగ్ సామర్థ్యం, కొన్ని రాష్ట్రాల్లో సినిమాల ప్రదర్శనల నిలిపివేత వంటి కారణాల చేత జనవరి 7న సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నామని చిత్రబృందం వెల్లడించింది. ఇలా ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడిన వల్ల సంక్రాంతికి రిలీజయ్యేందుకు సినిమాలు క్యూ కట్టాయి. ఇక జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కన్ఫార్మ్ కాకముందు సంక్రాంతికి వస్తామంటూ ముందు ప్రకటించిన చిత్రాల్లో మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’, పవన్ కల్యాణ్ – రానాల ‘భీమ్లా నాయక్’ వెంకటేశ్–వరుణ్‌తేజ్‌ల ‘ఎఫ్ 3’ చిత్రాలు ఉన్నాయి. కానీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం జనవరి 7న వస్తామని చెప్పిన తర్వాత ‘సర్కారువారి పాట’ చిత్రం ఏప్రిల్ 1కి, ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25కి , వెంకటేశ్–వరుణ్‌తేజ్‌ల ‘ఎఫ్ 3’ ఏప్రిల్ 29కి వాయిదా పడ్డ విషయం తెలిసిందే. పండగకు ముందే అతిథి దేవో భవ సంక్రాంతి పండగకి వారం ముందే రానున్న చిత్రం ‘అతిథి దేవో భవ’. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించారు. ఈ చిత్రంలో సువేక్ష హీరోయిన్. ఆదివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ‘‘ఇది మంచి స్పాన్ ఉన్న సినిమా. కథ కొత్తగా ఉంటుంది. క్యారెక్టర్స్ అన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. పండగ సీజన్లో వస్తున్నందుకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అని ఆది సాయికుమార్ అన్నారు. ‘‘ఆది సాయికుమార్‌లోని నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రం ఇది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఇప్పటికే విడుదలైన పాటలకు, ట్రైలర్‌కి మంచి స్పందన లభించింది’’ అన్నారు దర్శకుడు. ఇప్పటివరకు సంక్రాంతి రేసులో నిలిచిన చిత్రాల్లో విడుదల తేదీలను ఖరారు చేసుకున్న చిత్రాల గురించి చెప్పుకున్నాం. ఇక పండగ రేసులో ఉన్నామంటూ ఇంకా రిలీజ్ డేట్‌ను ప్రకటించని చిత్రాల్లో ‘బంగార్రాజు’ ముందు వరుసలో ఉన్నాడు. నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘బంగార్రాజు: సోగ్గాడు మళ్లీ వచ్చాడు’. ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. విడుదల తేదీ చెప్పలేదు. జనవరి 13 లేదా 15 తేదీల్లో ‘బంగార్రాజు’ థియేటర్స్‌కు వస్తాడట. అలాగే ‘7 డేస్ 6 నైట్స్’, ‘రౌడీ బాయ్స్’ చిత్రబృందాలు సంక్రాంతి రిలీజ్‌లను కన్ఫార్మ్ చేశాయి కానీ విడుదల తేదీ విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. బ్యాచ్‌లర్ ట్రిప్ కోసం గోవా వెళ్లిన ఇద్దరు యువకులు, మరో ఇద్దరు యువతుల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇక ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. ‘హుషారు’ వంటి హిట్ మూవీ తీసిన హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. ‘దిల్’ రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలే కాదు... సంక్రాంతి బరిలో నిలిచేందుకు మరో రెండు సినిమాలు కూడా సిద్ధమవుతున్నాయని ఫిల్మ్‌నగర్ సమాచారం. -
రాధేశ్యామ్ తో రాధాకృష్ణ బాలీవుడ్ ఎంట్రీ
-
రాధే శ్యామ్ ట్రైలర్ రిలీజ్
-
రాధేశ్యామ్ రెండో సాంగ్.. ఫ్లర్టేషన్‌షిప్ కోరుకుంటున్నాడట
Radheshyam Movie Second Song Aashique Aa Gayi Released: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'రాధేశ్యామ్' సినిమా నుంచి మరో సాంగ్ వచ్చేసింది. ముందుగా హిందీలో చిత్రీకరించిన ఆషికీ ఆ గయా సాంగ్‌ను బుధవారం (డిసెంబర్ 1) విడుదల చేశారు మేకర్స్. పాట ఆరంభంలో 'నిన్ను నువ్వు రోమియో అనుకుంటున్నావా ?' అని పూజా, ప్రభాస్‌ను అంటే.. 'అతడు ప్రేమ కోసం ప్రాణాలిచ్చాడు. నేను ఆ టైపు కాదు' అని ప్రభాస్ బదులిస్తాడు. దీనికి 'కానీ, నేను జూలియెట్. నన్ను ప్రేమిస్తే తప్పకుండా చచ్చిపోతావ్' అని పూజా రొమాంటిక్‌గా వార్నింగ్ ఇస్తుంది. దీంతో 'కానీ నేను మాత్రం ఫ్లర్టేషన్‌షిప్ కోరుకుంటున్నా' అంటూ ప్రభాస్, పూజను కిస్ చేయడంతో పాట మొదలవుతుంది. ఈ సాంగ్‌లో విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ప్రభాస్, పూజాల లుక్స్ అభిమానులకు పండగలా అనిపిస్తాయి. ప్రస్తుతం హిందీలో విడుదలైన 'ఆషికీ ఆ గయా సాంగ్'ను తెలుగులో నగుమోము తారలేగా బుధవారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రభాస్ పల్మానాలజిస్ట్గా ఆకట్టుకోబోతున్నాడు. ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. Love like there's no tomorrow. Presenting the first from #MusicalOfAges #Radheshyam, #AashiquiAaGayi by @mithoon11 & @arijitsinghhttps://t.co/lApuOeh2H5 Starring #Prabhas & @hegdepooja — T-Series (@TSeries) December 1, 2021 ఇది చదవండి: ‘రాధేశ్యామ్’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది -
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రాధేశ్యామ్ నుండి మరో క్రేజీ అప్డేట్
Prabhas Radhe Shyam Second Song Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు శుభవార్త. ‘రాధేశ్యామ్(Radhe Shyam)’నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ విడుదల కాబోతుంది. రేపు(నవంబర్ 29) వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్ సాంగ్ టీజర్ రిలీజ్ కానుంది. ‘రాధేశ్యామ్’ లవ్ ఆంథెమ్ సెకండ్ సాంగ్ హిందీ టీజర్‌ని మధ్యాహ్నం 1 గంటలకు లాంచ్ చేయనుండగా, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్లను రాత్రి 7 గంటలకు లాంచ్ చేయనున్నారు. సాహో తర్వాత ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రమే ‘రాధేశ్యామ్’.పూజ హెగ్డే హీరోహీరోయిన్. కె. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా, పూజ హెగ్డే ప్రేరణగా నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. Make way for the #LoveAnthem, the next song from #RadheShyam that will take your breath away. One heart, two heartbeats for the first time in the history of Indian cinema, bringing to you one movie with two different music experiences. pic.twitter.com/QciRVlMsvF — UV Creations (@UV_Creations) November 28, 2021 -
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘రాధేశ్యామ్’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
ఎట్టకేలకు ‘రాధేశ్యామ్’తొలి సాంగ్ వచ్చేసింది. సాహో తర్వాత ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రమే ‘రాధేశ్యామ్’.పూజ హెగ్డే హీరోహీరోయిన్. కె. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా, పూజ హెగ్డే ప్రేరణగా నటిస్తోంది. ఈ సినిమా అప్డేట్ గురించి ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో వేచి చూశారు. వారి నిరీక్షణకు తెరదించుతూ మంచి ప్రేమ గీతాన్ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ‘ఎవరో వీరెవరో ’అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి ఆలపించారు. జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. -
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు ‘రాధేశ్యామ్’ అప్డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎట్టకేలకు ‘రాధేశ్యామ్’(Radhe Shyam)నుంచి అప్డేట్ వచ్చింది. సాహో తర్వాత ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రమే ‘రాధేశ్యామ్’.పూజ హెగ్డే హీరోహీరోయిన్. కె. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా, పూజ హెగ్డే ప్రేరణగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చాలా రోజులు అయినప్పటికీ.. ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. సినిమా విడుదల చేయకపోయినా సరే.. కనీసం ఒక్క అప్డేట్ అయినా ఇవ్వడంటూ.. సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ అభిమాని ఏకంగా సూసైడ్ నోట్ కూడా రాశాడు. దీంతో రాధేశ్యామ్ చిత్రయూనిట్ ఒక మెట్టు దిగొచ్చి.. తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. రాధేశ్యామ్ సినిమా నుంచి “ఈ రాతలే.. ” అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ వీడియోను ఈనెల 15న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ని సోషల్ మీడియాలో విడుదల చేసింది. View this post on Instagram A post shared by UV Creations (@uvcreationsofficial) -
తగ్గిన ‘రాధేశ్యామ్’ వ్యూస్.. యూట్యూబ్ టీమ్ ఏమందంటే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హేగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఇటలీలో జరిగే పీరియాడికల్ ప్రేమ కథగా వస్తున్న ఈ సినిమాకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.యూవీ క్రియేషన్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర టీజర్ రెబల్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న విడుదలై మంచి రెస్పాన్స్ని అందుకుంది. అత్యధిక వ్యూస్ సంపాదించి రికార్డు క్రియేట్ చేసి దూసుకుపోతోంది ఈ టీజర్. అయితే ఈ విషయంలో అనుకోకుండా చిన్న సమస్య వచ్చింది. 63 మిలియన్గా ఉన్న వ్యూస్ ఒక్కసారిగా 62 మిలియన్లకి పడిపోయాయి. ఇది గమనించిన నెటిజన్లు ఎందుకిలా జరిగింది అంటూ యూట్యూబ్ టీమ్‌కి ట్విటర్లో మేసేజ్ పెట్టారు. అభిమానుల ట్వీట్లకి స్పందించిన ఆ టీమ్ కారణాన్ని తెలియజేసింది. ‘యూట్యూబ్ వ్యాలిడేట్ చేసే విధానం వల్ల వ్యూస్ అప్డేట్ చేయడంలో ఆలస్యం జరుగుతుంటుంది. ఒక్కోసారి తాత్కాలికంగా నెమ్మదించడం లేక వ్యూస్ ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంటుంది’ అని ఆ టీమ్ తెలిపింది. కాగా ‘రాధేశ్యామ్’ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. చదవండి: నాకు అన్ని తెలుసు.. కానీ చెప్పను Thanks for reaching out – there may be a delay in the view count because of how YouTube validates views. Temporarily slowing down or even freezing a video's view count is expected, here are more details about why this happens and how it works: https://t.co/x3N7d5IYy2 — TeamYouTube (@TeamYouTube) October 27, 2021 -
రాధేశ్యామ్ టీజర్ వచ్చేసింది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-పూజ హెగ్డే హీరోహీరోయిన్‌గా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘రాధేశ్యామ్’. కె. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా, పూజ హెగ్డే ప్రేరణగా నటిస్తోంది. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా శనివారం ఈ మూవీ టీజర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో ప్రభాస్ లుక్, డైలాగ్‌లు, హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘నువ్వు ఎవరో నాకు తెలుసు. కానీ నీకు చెప్పను. నీ హృదయం ఎప్పుడు ముక్కలవుతుందో నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ చావు నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నాకు అన్నీ తెలుసు. కానీ నీకు చెప్పను. ఎందుకంటే, చెప్పినా మీ ఆలోచనలకు అందదు. నా పేరు విక్రమాదిత్య. నేను దేవుడిని కాదు. మీలో ఒక్కడిని కూడా కాదు’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. -
ఒక వైపు సూపర్ స్టార్ మరోవైపు పవర్ స్టార్..విజయమెవరిది?
టాలీవుడ్ కు కాసులు కురిపించే సీజన్ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండగ మాత్రమే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కరోనా సమయంలోనూ సంక్రాంతి సీజన్ కు విడుదలైన సినిమాలు కనీవినీ ఎరుగని రీతిలో బాక్సాఫీస్ ను షేక్ చేసాయి. అందుకే ఈసారి మ్యాగ్జిమమ్ స్టార్స్ సంక్రాంతి సీజన్ కు సై అంటున్నారు. ఈసారి సంక్రాంతి సీజన్ కు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కనీవినీ ఎరుగని పోటీ కనిపించనుంది. ఎందుకంటే ఒక వైపు సూపర్ స్టార్ మరో వైపు పవర్ స్టార్ ఇంకో వైపు రాధే శ్యామ్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నట్లు ఇప్పటికే కన్ ఫామ్ చేసారు. జనవరి 7న ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతున్నప్పటికీ సంక్రాంతికే వస్తున్నామని మాటిమాటికి రిలీజ్ డేట్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. జనవరి 12న పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న భీమ్లానాయక్ విడుదల కానుంది. ఇక జనవరి 13న మహేశ్ బాబు సర్కారువారి పాటతో రానున్నాడు. అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే.ఆ రోజున స్పెషల్ టీజర్ రిలీజ్ చేయనుంది రాధే శ్యామ్ యూనిట్. అందుకు సంబంధించిన పోస్టర్ పై కూడా జనవరి 14న ఈ మూవీ రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే ఈ మూడు భారీ చిత్రాలతో పాటు మరో రెండు ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్స్ కూడా పోటపడబోతున్నాయంట. ఈ మూడు చిత్రాలతో పాటు ఎఫ్ 3 కూడా రిలీజ్ కానుందని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్లే మూవీని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ బంగార్రాజు కూడా ఈ సంక్రాంతి సీజన్ కు రానుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అప్పుడు సంక్రాంతి సమరం మరింత ఆసక్తికరంగా మారుతుంది. 2016లో సంక్రాంతికి విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా సంచలన విజయం సాధించింది. కింగ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అందుకే మరోసారి సంక్రాంతి సీజన్ లోనే ఈ సినిమా సీక్వెల్ ను విడుదల చేయాలనుకుంటున్నారట.నాగార్జున, రమ్యకృష్ణ మరోసారి కనువిందు చేయనుంది. నాగ చైతన్య, కృతి శెట్టి తొలిసారి కలసి నటిస్తున్నారు. మనం తర్వాత నాగార్జున, నాగ చైతన్య కలసి స్టెప్పులేయనున్నారు. -
‘రాధేశ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్.. కానీ కొంచెం వెరైటీగా..
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. పీరియాడికల్ లవ్‌స్టోరీగా వస్తున్న ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వంలో వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌లకు, మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అక్టోబర్ 23న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది మూవీ టీం. ‘విక్రమాదిత్య ఎవరు?’ తెలుసుకునేందుకు సిద్ధంగా కావాలని తెలిపారు. అయితే ఈ టీజర్‌ని కొంచెం వెరైటీగా ఇంగ్లీష్ ఆడియోతో విడుదల చేయనున్నారు. అయితే మల్టీ లాంగ్వేజెస్‌లో సబ్ టైటిల్స్ రానున్నాయి. అయితే యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా పలు భాషల్లో జనవరి 14న విడుదల కానుంది. అంతేకాకుండా ఈ పోస్ట్‌కి #GlobalPrabhasDay అనే ట్యాగ్‌ని జత చేయడం విశేషం. చదవండి: ప్రభాస్‌కు విలన్‌గా రంగంలోకి బాలీవుడ్ నటుడు? Who is Vikramaditya? 🤔 Stay tuned to find out in the #RadheShyam teaser, out on 23rd October! ☺️💕 Enjoy the teaser in English with subtitles in multiple languages! #GlobalPrabhasDay Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/JmkiSZY40v — Radha Krishna Kumar (@director_radhaa) October 20, 2021 -
బాలీవుడ్ పై టాలీవుడ్ దండయాత్ర.. బరిలో ఆ నాలుగు చిత్రాలు
బాలీవుడ్ మార్కెట్ ను కబ్జా చేసేందుకు టాలీవుడ్ సీరియస్ గా ట్రై చేస్తోంది. అందుకే వరుసపెట్టి పాన్ఇండియా మూవీస్ నిర్మిస్తోంది. బాహుబలి సిరీస్, సైరా, సాహో లతో హిందీ సినీ మార్కెట్ లో వందల కోట్లు కొల్లగొట్టాయి తెలుగు చిత్రాలు. ఇప్పుడు ఈ వసూళ్లను పెంచుకునేందుకు త్వరలో భారీ ఎత్తున అక్కడ సినిమాలు విడుదల చేయనుంది టాలీవుడ్. డిసెంబర్ 17న పుష్పరాజ్ తొలిసారి బాలీవుడ్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. జనవరి 7న ఆర్ఆర్ఆర్ భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అవుతోంది. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషన్ వీడియోస్ హిందీ ఆడియెన్స్ కు బాగా అలరిస్తూ వచ్చాయి. ఈ మూవీతో రామ్ చరణ్, తారక్ భారీ స్థాయిలో బాలీవుడ్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారు. జనవరి 14న ప్రభాస్ నటిస్తున్న ప్రేమకథా చిత్రం రాధేశ్యామ్ రిలీజ్ అవుతోంది. బాహుబలి 2, సాహో మూవీస్ తో ప్రభాస్ బాలీవుడ్ బాక్సాపీస్‌ను పీస్ పీస్ చేసాడు. బాహుబలి 2 తో ఏకంగా 500 కోట్లు రాబట్టాడు. సాహో ఇండియా వైడ్ గా నిరాశపరిచినా, బాలీవుడ్ మాత్రం 100 కోట్లకు పైగా రాబట్టింది. ఇప్పుడు రాధే శ్యామ్ పై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. రాధేశ్యామ్ తర్వాత సేమ్ ఇయర్ ఆదిపురుష్ రిలీజ్ అవుతోంది. పూరి డైరెక్ట్ చేస్తున్న లైగర్ కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ ను గురి పెట్టింది. విజయ్ దేవరకొండ ఫస్ట్ ఎవర్ బాలీవుడ్ మూవీ ఇది. పైగా అక్కడి స్టార్ మేకర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. బీటౌన్ హార్ట్ త్రోబ్ అనన్య పాండే హీరోయిన్ గా నటించడం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. -
ప్రభాస్‌కు విలన్‌గా రంగంలోకి బాలీవుడ్ నటుడు?
బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన ఆ స్థాయిలోనే సినిమాలు చేస్తున్నాడు. ఆయన హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. పూజా హెగ్డే హీరోయిన్. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ప్రభాస్‌కి విలన్‌గా బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని రంగంలోకి దించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదే నిజమైతే వెంకటేశ్, పవన్ కల్యాణ్ ‘గోపాల గోపాల’ తర్వాత మిథున్‌కు ఇది మరో తెలుగు సినిమా అవుతుంది. ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారని భోగట్టా. కాగా ఇటలీలో తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఈ సినిమా 1970లో సాగే పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ వేసిన సెట్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది చివరికి మూవీని విడుదల చేసేలా టీం ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ డెరెక్షన్‌లో ‘ఆదిపురుష్’, కేజీఎఫ్ డెరక్టర్ ప్రశాంత్ నీల్‌తో ‘సలార్’, టాలీవుడ్ డెరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. -
ప్రభాస్ సినిమాలో చాన్స్ కొట్టేసిన ‘ఎయిర్టెల్ పాప’
టీవీ యాడ్స్ చూసే వాళ్లకు బాగా పరిచయం ఉన్న మెహం సాషా చెట్రిది. పేరు చెప్పగానే గుర్తుపట్టకపోవచ్చు కానీ, ఎయిర్టెల్ యాడ్‌లో కనిపించే పొట్టి జుట్టు అమ్మాయి అంటే మాత్రం వెంటనే మైండ్‌లో ఫ్లాష్ అయిపోతుంది. లుక్స్ లోనే కాకుండా చక్కని స్మైల్ తో యాక్టింగ్ తో ఆ యాడ్ రక్తి కట్టేలా బాగా నటించి సక్సెస్ అవ్వడంలో కీలక పాత్ర పోషించింది సాషా. ఈ బ్యూటీ ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది సాషా. ఈ మూవీలో ఆమె రోల్ మిస్టీరియస్ ఎలిమెంట్స్‌తో కథకి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటుందని తెలుస్తోంది. అయితే సాషాకి ఇది తొలి సినిమా మాత్రం కాదు. గతంలో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చిత్రంలో నటించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా చిత్రంలో, అది కూడా ప్రభాస్ పక్కన నటించే అవకాశం సాషాని వరించింది. ఈ సినిమాతో అయినా సాషాకి మంచి గుర్తింపు వస్తుందో చూడాలి మరి. కాగా, రాధేశ్యామ్ సినిమా వచ్చేఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సంక్రాంతి రేస్‌లో టాప్ హీరోలు.. వర్కౌట్ అయితే బాక్సాఫీస్ షేక్ షేకే
New Telugu Movies For Sankranthi 2022: సంక్రాంతి పండగ అంటే చాలు సినిమా ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రతి ఏడాది కొత్త సినిమాలతో ముస్తాబవుతుంది. ఈ సారి కూడా బాక్సాఫీస్ సంక్రాంతి సమరానికి తెరలేచింది.కానీ ఈ సంక్రాంతికి ఆడియన్స్ మరింత స్పెషల్...ఎందుకంటే...రేస్‌లో ఉన్నవారంతా టాప్ హీరోలే. బాక్సాఫీస్ టాప్ లేపేవారే. సంక్రాంతి సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు తమ సినిమాలను ఎప్పటికప్పుడు రెడీ చేస్తుండటం అనవాయితీగా వస్తున్న సంగతే. ఇలా సారి కూడా బాక్సాఫీస్ సంక్రాంతి సమరానికి రంగం సిద్ధం అవు తుంది. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో గత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందకు వచ్చి సూపర్‌హిట్ కొట్టారు మహేశ్‌బాబు. దీంతో 2022 సంక్రాంతికి 'సర్కారువారి పాట'ను రిలీజ్ చేయనున్నట్లు మహేశ్ ఎప్పుడో చెప్పారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇలా సంక్రాంతి బరిలో నిలిచిన తొలి చిత్రం 'సర్కారువారిపాట'. పరశురామ్ పేట్ల దర్శకత్వం డైరెక్షన్లో రూపొందుతున్న 'సర్కారువారి పాట' చిత్రం బ్యాంకు మోసాల బ్యాక్‌డ్రాప్‌లో సాగుంతుందని తెలుస్తుంది. మహేశ్‌బాబుతో ఇప్పుడు ప్రభాస్ కూడా సంక్రాంతి సమరానికి సై అయ్యారు. రాధాకృష్ణకుమార్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రాధేశ్యామ్' సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. 'రాధేశ్యామ్' కొత్త పోస్టర్‌తో ఈ విషయాన్ని శుక్రవారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మహేశ్‌బాబు సర్కారువారి పాట మూవీ విడుదల అయిన తర్వాతి రోజే, అంటే జనవరి 14న ప్రభాస్ రాధేశ్యామ్ రాబోతోంది. సంక్రాంతి సమరంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఉన్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ పండగ పోటీల్లో ఉంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్-రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిత్యామేనన్-ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక మహేశ్, ప్రభాస్‌తో పాటు వెంకటేశ్ 'ఎఫ్ 3', నాగార్జున 'బంగర్రాజు' రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాలు కూడా సంక్రాంతి రిలీజ్‌కు సంబంధించిన సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేశ్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా నటించిన 'ఎఫ్ 2' 2019 సంక్రాంతికి బంపర్ హిట్‌గా నిలిచింది. ఇక 2016 సంక్రాంతి టైమ్‌లో నాగార్జున 'సొగ్గాడే చిన్ని నాయానా' సూపర్‌హిట్. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న 'బంగర్రాజు' చిత్రం సంక్రాంతి పండక్కే విడుదల చేస్తామని 'వైల్డ్‌డాగ్' ప్రమోషన్స్‌లో నాగార్జున చెప్పారు. మరోవైపు రవితేజ కెరీర్‌ను మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి తెచ్చిన 'క్రాక్' గత ఏడాది సంక్రాంతికి విడుదలైంది.సో..తమ సక్సెస్ సెంటిమెంట్స్‌ను వెంకటేష్, నాగార్జున, రవితేజ ఫాలో అయితే మాత్రం సంక్రాంతి బాక్సాఫీస్ పోరు మరింత టఫ్‌గా మారుతుంది. ‘డబ్బింగ్’సందడి కూడా ఎక్కువే సంక్రాంతి పండక్కి టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద తెలుగు చిత్రాలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్న అనవాయితీ గత మూడేళ్లుగా కనిపిస్తుంది. 2019 సంక్రాంతికి రజనీకాంత్ 'పేట', అజిత్ 'విశ్వాసం' చిత్రాలు వచ్చాయి. 2020 సంక్రాంతికి రజనీకాంత్ 'దర్భార్' చిత్రం విడుదలైంది. ఈ ఏడాది సంక్రాంతికి విజయ్ 'మాస్టర్'గా థియేటర్స్‌లోకి వచ్చాడు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా...సంక్రాంతి టైమ్‌లో విడుదలైన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయట. దీంతో మరోసారి సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని విజయ్ భావిస్తున్నారట. ఇందుకు తగ్గట్లుగానే తన తాజా చిత్రం 'బీస్ట్' షూటింగ్ పనులను ప్లాన్ చేస్తున్నారట విజయ్. అంతేకాదు..కమల్‌హాసన్ నటిస్తున్న 'విక్రమ్' కూడా సంక్రాంతికే అన్న టాక్ ఇప్పుడైతే కోలీవుడ్‌లో వినిపిస్తుంది. ఇప్పుడైతే సంక్రాంతి సమరానికి చెప్పు కోవడానికి చాలా సినిమాల పేర్లు వినిపిస్తూన్నాయి. కానీ అసలు నిజంగా సంక్రాంతి బరిలో ఉండే సిని మాలు ఏవీ అనేది తెలియడానికి కొంత టైమ్ పడుతుంది. ఎందుకంటే..ముందుగా సినిమాల విడుదల తేదీల అనౌన్స్మెంట్స్ రావడం, ఆ తరవాత అవి తారుమారు అవ్వడం ఇండస్ట్రీలో మాములే. -
ఓటీటీలో విడుదల కానున్న ప్రభాస్ ‘రాధేశ్యామ్’, కానీ..
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ సినీరంగంపై పిడుగులాపడింది. సినిమా భాషలో చెప్పాలంటే.. కరోనా విలన్లా మారి సినిమా పరిశ్రమపై దాడి చేస్తోంది. ఈ మహామ్మారి కారణంగా చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు. షూటింగ్‌లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇక ఇప్పటికే షూటింగ్‌లు పూర్తి చేసుకున్న కొన్ని చిన్న సినిమాలు ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నాయి. కానీ పెద్ద సినిమాల పరిస్థితి అలా కాదు. ఓటీటీలలో విడుదల చేస్తే లాభాల మాట ఏమో కానీ పెట్టిన పెట్టుబడి కూడా రాదు. పోనీ విడుదల వాయిదా వేద్దామనుకుంటే.. భారీ బడ్జెట్ కారణంగా అదీ వీలుకాదు. ఇలాంటి తరుణంలో కొత్త విధానాలను వెతుక్కుంటున్నాయి. పే పర్ వ్యూ విధానంతో ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ‘రాధే: ది మోస్ట్ ఆంటెడ్ భాయ్’ ధియేటర్లతో పాటు ఓటీటీల్లో పేపర్ వ్యూ విధానంలో విడుదల చేస్తున్నామని ప్రకటించారు. మే 13న ఈ సిసిమా విడుదల కానుంది. థియేటర్లకు వెళ్లలేని వారు కొంతమొత్తంలో డబ్బులు చెల్లించి మొబైల్లోనే సినిమా చూడొచ్చన్నమాట. తాజాగా సల్మాన్‌ఖాన్‌నే ఫాలో అవుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. తన తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ని ఓటీటీ వేదికగా ఫే పర్ వ్యూ విధానంలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ‘జిల్’ సినిమా దర్శకుడు రాధాకృష్ణ.. ఈ సినిమాని తెరకెక్కించాడు. పూజా హెగ్డే హీరోయిన్. దాదాపు షూటింగ్ పూర్తైన ఈ సినిమాని జూలై 30న విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. అప్పటికి పరిస్థితులు మెరుగై థియేటర్లు తెరుచుకుంటే.. సినిమాను యధావిధిగా థియేటర్లలోనే రిలీజ్ చేసే యోచనలో నిర్మాణ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. లేని పరిస్థితుల్లో సినిమాను ఓటీటీలో పే పర్ వ్యూ విధానంలో విడుదల చేస్తారని టాక్. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. మరి ‘రాధేశ్యామ్’.. ‘రాధే’ని ఫాలో అవుతాడా.. లేదా తన రూట్లోనే వెళ్తాడా అని వేచి చూడాలి. చదవండి: రెచ్చిపోయిన అనసూయ, ఏకంగా వీధుల్లో ఇలా.. ఇష్టమైన బైక్‌ను అమ్మకానికి పెట్టిన 'ఫిదా' నటుడు -
‘రాధేశ్యామ్’ మరో రొమాంటిక్ లుక్, ఫ్యాన్స్ ఫిదా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధే శ్యామ్’. పీరియాడికల్ యాక్షన్ డ్రామ నేపథ్యంలో దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ రోమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. కాగా ఇప్పటికే మూవీ నుంచి ప్రభాస్-పూజలకు సంబంధించిన పలు రోమాంటి సన్నివేశాలకు సంబంధించిన పోస్టర్లను చిత్ర యూనిటి విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. వీటికి ప్రేక్షకులను నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా హీరో ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ మూవీ నుంచి మరో పోస్టర్‌ను విడుదల చేశాడు. ఈ పోస్టర్ ప్రభాస్, పూజ హెగ్డెలు మంచులో పడుకుని ప్రేమమైకంలో తెలుతున్నట్లుగా కనిపిస్తున్నారు. ప్రభాస్ షేర్ చేసిన ఈ రోమాంటిక్ లుక్ అందరిని తఆకట్టుకుంటోంది. ‘కొందరు దీనిని పిచ్చి అంటారు.. మేం మాత్రం ప్రేమ అంటాం.. ఈ ప్రేమకథ మీ హృదయాలలో ఎప్పటికీ నిక్షిప్తమై ఉంటుంది‘ చిత్ర యూనిటి ఈ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా రాధేశ్యామ్‌లో ప్రభాస్ సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సాగే ఓ రొమాంటిక్ పాత్రలో ప్రభాస్ అభిమానులను ఆకట్టుకోనున్నాడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న రాధేశ్యామ్ పలు భాషల్లో జులై 30న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas) చదవండి: ప్రేమ కోసం చచ్చే టైప్ కాదంటున్న ప్రభాస్ రాధేశ్యామ్ : ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసం 6కోట్లు! -
‘ప్యాన్ ఇండియా’ను టార్గెట్ చేసిన చిరు, చెర్రీ, ప్రభాస్
తెలుగు సినిమా పరిధి పెరిగింది. బాక్సాఫీస్ స్టామినా పెరిగింది. దాంతో, మన సినిమా బడ్జెట్లు పెంచుకుంది. కథల్ని విస్తృతపరుచుకుంది. తాజాగా పలు తెలుగు సినిమాలు... అఖిల భారత (ప్యాన్ ఇండియా) స్థాయిలో తెరకెక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానున్నాయి. ఆలిండియా బాక్సాఫీస్‌ను కొల్లగొట్టే ప్లాన్‌లో ఉన్నాయి. ఒక్కమాటలో మనవి ఇప్పుడు ప్రాంతీయ స్థాయి సినిమాలు కాదు... ‘ప్యాన్’తీయ సినిమాలు! ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ‘ప్యాన్తీయ’ చిత్రాల వివరాలు, విశేషాలు... ఆర్ఆర్ఆర్ ‘బాహుబలి’తో తెలుగు సినిమాకు కొత్త మార్కెట్‌ను, కొత్త ప్రేక్షకులను అందించారు దర్శకధీరుడు రాజమౌళి. ఈ సినిమా తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. సుమారు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. సుమారు పది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. రాధేశ్యామ్ – ఆదిపురుష్ – సలార్ – వైజయంతీ వారి చిత్రం ‘బాహుబలి’ చిత్రం ప్రభాస్‌ని భారతదేశం మొత్తానికి నచ్చిన సూపర్‌స్టార్‌ని చేసింది. ఆయన చేసే ప్రతీ సినిమా అన్ని ప్రాంతాల్లోనూ విడుదల చేసేలా మార్కెట్ ఏర్పడింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న నాలుగూ ప్యాన్ ఇండియా సినిమాలే. అవి – రాధాకృష్ణతో చేస్తున్న ప్రేమకథా చిత్రం ‘రాధే శ్యామ్’ (300 కోట్లు), ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ (500 కోట్లు), ప్రశాంత్ నీల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ (250), నాగ్ అశ్విన్‌తో చేయబోయే వైజయంతీ వారి సైన్స్ ఫిక్షన్ చిత్రం (400 కోట్లు). తర్వాత ప్రభాస్ చేయబోయేవీ దాదాపు ప్యాన్ ఇండియా రిలీజ్ ఉండే చిత్రాలే. మోసగాళ్లు ఐటీ రంగంలోనే జరిగిన అతి పెద్ద స్కామ్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్లు’. మంచు విష్ణు నటించి, నిర్మించిన ఈ చిత్రాన్ని హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గిన్ చీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కించారు. అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ మార్చి నెలలోనే విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. సుమారు రూ. 50 కోట్లతో ఈ సినిమా తెరకెక్కింది. పుష్ప హిట్ కాంబినేషన్ అల్లు అర్జున్, సుకుమార్ చేస్తోన్న మాస్ ఎంటర్టైనర్ ‘పుష్ప’. తెలుగులో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు రూ. 150 కోట్ల వ్యయంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆగస్ట్ 13న ‘పుష్ప’ థియేటర్స్‌లోకి వస్తుంది. అహం బ్రహ్మాస్మి చిన్న గ్యాప్ తర్వాత మంచు మనోజ్ ఓ ప్యాన్ ఇండియా సినిమాతో కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్‌తో మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ మోతాదు ఎక్కువగా ఉంటుందట. రూ. 25 కోట్లతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నటించడంతో పాటు నిర్మిస్తున్నారు కూడా మనోజ్. 5 భాషల్లో ఈ సినిమా విడుదలవుతుంది. శాకుంతలం గుణశేఖర్, సమంత కాంబినేషన్లో ఓ భారీ పౌరాణిక చిత్రం తెరకెక్కనుంది. దుష్యంతుడు, శకుంతల కథను తెరపై ‘శాకుంతలం’ పేరుతో చూపించనున్నారు. కొన్ని కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. గుణశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్లో ఉంది. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా, ‘ఒక్కడు’ చార్మినార్ సెట్ ఫేమ్ కళా దర్శకుడు అశోక్ కుమార్, సంగీత దర్శకుడు మణిశర్మ లాంటి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. లైగర్ ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్‌తో ఫుల్ జోష్ మీద ఉన్నారు పూరి జగన్నాథ్. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో కలసి ఆయన చేస్తున్న క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైగర్’. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్‌గా కనిపిస్తారు. దీన్ని ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 9న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌తో కలసి పూరి జగన్నాథ్, చార్మి ఈ సినిమాను 50 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మేజర్ ముంబయ్ తాజ్ హోటల్ దాడుల్లో మరణించిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్ చేస్తూ ఈ సినిమా కథను సమకూర్చారు. అడివి శేష్‌తో ‘గూఢచారి’ తెరకెక్కించిన శశికిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకుడు. సుమారు రూ. 30 కోట్లతో ఈ సినిమా తీశారు. జూన్ 2న ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుంది. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలవుతుంది. ప్లానింగ్‌లో మరిన్ని... ఇటీవలే శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు రామ్‌చరణ్. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందనుంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మహేశ్‌బాబుతో ఓ సినిమా చేయనున్నారు రాజమౌళి. ఇది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ చేసిన తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తారు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌తో సినిమా ఉంటుంది. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఉంటుందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది. -
ఆ స్టేషన్ ఖర్చు కోటీ అరవై లక్షలట..
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందనే విషయం తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ వీడియోలో ఓ రైల్వేస్టేషన్ కనబడుతుంది. ఇటలీలోని స్టేషన్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలని ముందు అనుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఆ ఆలోచనను విరమించుకుని ఇక్కడే రైల్వేస్టేషన్ సెట్ వేశారు. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సెట్ వర్క్ జరిగింది. కోటీ అరవై లక్షల ఖర్చుతో సెట్‌ని నిర్మించారట. 30 రోజుల పాటు 250 మంది పని చేశారని తెలిసింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ నిర్మిస్తున్నాయి. 1970లలో ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథాచిత్రం ఇది. ఈ ఏడాది జులై 30న ఈ చిత్రం విడుదల కానుంది. -
‘రాధేశ్యామ్’ టీజర్ అప్డేట్ ఇచ్చిన పూజా హెగ్డే
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా టీజర్‌ని వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు. పాన్ ఇండియన్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. అన్ని భాషలలో కూడా రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌లకు, రీసెంట్గా విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రేమికుల రోజున విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ కోసం పూజా హెగ్డే డబ్బింగ్ చెబుతున్నారు. ఈ విషయం చెబుతూ.. ఆమె తాజాగా ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లో ఆమె డబ్బింగ్ చెబుతున్న ఫొటోని కూడా జత చేసింది. ‘ఉదయాన్నే చిత్ర టీజర్ కోసం డబ్బింగ్ స్టార్ట్ చేశాను.. ఫిబ్రవరి 14న టీజర్‌తో వచ్చేస్తున్నాం..'అని పూజా తన ట్వీట్లో పేర్కొంది. Early morning dub for our teaser..14th Feb, here we come ☺️😉 #soundon🔊 #RadheShyam pic.twitter.com/FzYYwwtjhX — Pooja Hegde (@hegdepooja) February 9, 2021 -
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ టీజర్ రాబోతుందా!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. షూటింగ్ పూర్తి కావస్తున్నా కూడా సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మరోవైపు తెలుగు ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ డేట్స్‌ల జాతర కొనసాగుతోంది. ఇప్పటి నుంచి వచ్చే ఏడాది తేదీలకు కూడా పోటీపడి మరి విడుదల తేదీలు ప్రకటిస్తున్నారు. బాలయ్య, చిరంజీవి, పవన్, వెంకటేష్, అల్లు అర్జున్, రవితేజ, ఒకరా ఇద్దరా అందరూ హీరోలు విడుదల తేదిలు ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపారు. అయితే వచ్చి ప్రభాస్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తన అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రాధేశ్యామ్ టీజర్ ఎప్పుడు విడుదలవుతుందనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ క్రమంలో ప్రభాస్ తన అభిమానులకు త్వరలోనే శుభవార్త అందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. చదవండి: ఆదిపురుష్ ఆరంభ్.. ప్రభాస్ సర్ప్రైజ్ ఈ సినిమా టీజర్ త్వరలో రాబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌డే సందర్భంగా ‘రాధే శ్యామ్’ టీజర్ విడుదలైయ్యే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆశిస్తున్నారు. త్వరలోనే చిత్రయూనిట్ టీజర్‌తోపాటు విడుదల తేదీని కూడా ఖరారు చేస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ట్విటర్లో #RadheShyamTeaser అనే హ్యష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ అమర ప్రేమికుల టీజర్ ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో చూడాలి. చదవండి: ఉప్పెన ట్రైలర్: ‘మరీ ఇంత అందగత్తె పుట్టిందంటే..’ ఇక ప్రభాస్, పూజా హెగ్డే జోడీగా రూపొందుతోన్న 'రాధేశ్యామ్' పీరియాడికల్ లవ్‌స్టోరిగా రూపొందుతోంది. పాన్ ఇండియా మూవీగా అయిదు బాషలలో విడుదల కాబోతుంది. ప్రభాస్, కృష్ణంరాజు మద్య కొన్ని సన్నివేశాలు మినహా దాదాపు చిత్రీకరణంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్, యువీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనుందని సమాచారం. -
రాధేశ్యామ్: ప్రేమికుల రోజు సర్ప్రైజ్
ప్రేమికుల రోజు తన లవ్‌స్టోరీకి సంబంధించి చిన్న టీజర్ చూపిస్తారట ప్రభాస్. ఆయన నటిస్తున్న పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. రాధాకష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం టీజర్‌ను వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనుకుంటున్నారని టాక్. టీజర్‌తోనే సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించాలనుకుంటున్నారని తెలిసింది. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రమిది. (చదవండి: సలార్ : శృతి హాసన్‌కు భారీ రెమ్యునరేషన్!) -
కథ క్లైమాక్స్‌కి వచ్చింది
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ దర్శకుడు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. శనివారంతో 30 రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేశారట చిత్రబృందం. దీంతో షూటింగ్ క్లైమాక్స్‌కి వచ్చేసింది. ఇంకొక్క షెడ్యూల్ చిత్రీకరణతో ‘రాధేశ్యామ్’ షూటింగ్ మొత్తం పూర్తి కానుందని తెలిసింది. అలానే ఈ సినిమా క్లైమాక్స్ ఓ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. సుమారు 15 నిమిషాల పాటు సాగే ఈ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయట. ఇటీవలే ‘రాధేశ్యామ్’ చిత్రబృందానికి చేతి గడియారాలను బహుమతిగా అందించారు ప్రభాస్. ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
‘రాధేశ్యామ్’ టీమ్‌కి ప్రభాస్ సర్ప్రైజ్!
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ మూవీ షూటింగ్‌ని త్వరగా ముగించాలని తీవ్రంగా కృషి చేస్తున్న చిత్ర యూనిట్‌కి డార్లింగ్ ప్రభాస్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడట. సినిమా కోసం పని చేస్తున్న వారందరికీ చేతి వాచ్‌లు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వాచ్లకు సంబంధించిన ఫొటోలను ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇక రాధేశ్యామ్ సినిమా ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం.. ఆదిపురుష్, రాధేశ్యామ్, నాగ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా, కేజీఎఫ్ దర్శకుడితో సలార్ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. శుక్రవారం ఈరోజు 'సలార్' షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. #Prabhas Gift To RadheShyam Team Members 💥🤩 Darling For A Reason ❤️🙏#RadheShyam#SalaarLaunch pic.twitter.com/HGxQyalVpO — Fukkard (@fukkarddd) January 14, 2021 Super 🥳#Prabhas gifted watches to #RadheShyam Team members ❤️ pic.twitter.com/XVda4Fx5iB — Sai Prasad (@Saiprasad_drlng) January 14, 2021 -
నీలి రంగు తెరపై రాధేశ్యామ్ మేకింగ్ వీడియో
సాక్షి, హైదరాబాద్: బాహుబలి ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ మేకింగ్ వీడియోను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ గురువారం షేర్ చేశారు. అక్టోబర్‌లో ఇటలీ షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫీల్మ్ సిటీలో చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ గురువారం మేకింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. నీలిరంగు స్ర్కీన్‌లో ఉన్న ఈ వీడియోకు ‘మా చిత్ర బృందంతో నీలి రంగు తెరపై’ అనే క్యాప్షన్‌ను జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ‘బాహుబలి’, ‘సాహో’ వంటి సినిమాలతో పాన్ ఇండియా నటుడిగా మారిన ప్రభాస్ ‘రాధేశ్యామ్’పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్నా వారందరిని ‘రాధేశ్యామ్’ మేకింగ్ వీడియో తెగ ఆకట్టుకుంటోంది. ఉన్నది కొద్ది సెకండ్లే అయినా బ్లూ స్ర్కీన్‌పై సరికొత్తగా తీసిన ఈ మేకింగ్ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ సినిమాపై ‘డార్లింగ్’ ప్రభాస్ అభిమానుల అంచనాలు మరింత పెరిగాయనిపిస్తోంది. (చదవండి: ముప్పై కోట్లతో సెట్) View this post on Instagram A post shared by Radha Krishna Kumar (@director_radhaa) అయితే గత నెల ఇటలీలో షూటింగ్ జరుపుకున్న ‘రాధేశ్యామ్’ చిత్ర బృందం ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫీలిం సిటీలో క్లైమాక్స్ సీన్లన రూపొందిస్తున్నారు. అయితే క్లైమాక్స్ సీన్ల కోసం దాదాపుగా 30 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా సెట్స్ వేస్తున్నట్లు వార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ మూవీ ‘గ్లాడియేటర్’కి యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన నిక్ పోవెల్ ‘రాధేశ్యామ్’కు వర్క్ చేస్తుండటం విశేషం. యూరప్ నేపథ్యంలో పీరియాడికల్ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కొన్ని భారీ యాక్షన్ సీన్లు ఉన్నట్లు ఇటీవల ఓ సందర్భంలో ప్రభాస్ పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. అంతేగాక సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, భాగ్యశ్రీ, మురళీ శర్మ, సత్యన్ శివకూమార్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ షూటింగ్ పూర్తిగానే ప్రభాస్ తర్వాతి చిత్రం ‘అదిపురుష్’ షూటింగ్ పాల్గొననున్నట్లు సినీ వర్గాల సమాచారం. (చదవండి: ‘రాధేశ్యామ్’ విషాదమా.. అమర ప్రేమ కావ్యమా?) -
ప్రేమికులు పండక్కి వస్తారా?
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. రాధాకష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకష్ణా మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. 1970లలో ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథాచిత్రం ఇది. ఎక్కువ శాతం ప్రేమ, తక్కువ యాక్షన్ పార్ట్ ఉంటుందని తెలిసింది. ఈ డిసెంబర్‌తో సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతుందని సమాచారం. దాంతో ప్రేమజంట ‘రాధేశ్యామ్’ సంక్రాంతికి రాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ సంక్రాంతి రేసులో పలు సినిమాలు ఉన్నాయి. మరి ‘రాధేశ్యామ్’ కూడా కూడా జాయిన్ అవుతారా? వేచి చూడాలి. -
రాధేశ్యామ్ స్టోరీలైన్ తెలిసిపోయింది!
రెబల్‌స్టార్ ప్రభాస్ తదుపరి సినిమా రాధేశ్యామ్. బాహుబలి తరువాత ప్రభాస్ తీస్తున్న సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. వరుస విడుదలవుతున్న రాధేశ్యామ్ మోషన్ పోస్టర్లు, ఫోటోలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇప్పటికే డార్లింగ్ ఈ సినిమాలో తన లుక్‌తో అందరిని కట్టిపడేశాడు. ఇక డార్లింగ్ సరసన మన బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజ కూడా తన అందంతో అందరిని మరోసారి ఆకట్టుకుంది. అసలు ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందని చాలా మంది అభిమానులు ఆలోచిస్తున్నారు. ఈ కథ జ్యోతిష్యానికి, సైన్స్‌కు మధ్య జరిగే కన్సెప్ట్‌తో తెరకెక్కుతుందని సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సచిన్ కేడ్కర్ తెలిపారు. ఈ సినిమాలో తాను ఒక డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. ప్రభాస్ భవిష్యత్తు పట్ల చాలా స్పష్టమైన ఆలోచనలు ఉన్న ఒక వ్యక్తిగా ఈ సినిమాలో కనిపించనన్నుట్లు సచిన్ కేడ్కర్ తెలిపారు. ఇక ఈ సినిమాను డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ఎలా తెరపై చూపించనున్నారో సినిమా విడుదలైన తరువాత తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. చదవండి: ‘రాధేశ్యామ్’ విషాదమా.. అమర ప్రేమ కావ్యమా? -
గొప్ప ప్రేమజంట
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఫిక్షనల్ రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. శుక్రవారం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానుల కోసం బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ అనే మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. చరిత్రలో నిలిచిపోయిన గొప్ప ప్రేమజంటలు దేవదాస్–పార్వతి, లైలా–మజ్నుల ఫోటోల మీదగా ట్రైన్లో మోషన్ పోస్టర్ మూవ్ అవుతున్నట్లు మోషన్ పోస్టర్లో కనబడుతుంది. చివరగా ప్రభాస్, పూజా హెగ్డే జోడీ పోస్టర్లో కనబడుతుంది. ఈ జంట కూడా అంతటి గొప్ప ప్రేమికులనే అర్థం వచ్చేట్లు లుక్‌ను డిజైన్ చేశారు దర్శక–నిర్మాతలు. -
‘రాధేశ్యామ్’ విషాదమా.. అమర ప్రేమ కావ్యమా?
డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తోన్న 'బీట్ ఆఫ్ రాధేశ్యామ్'ని మోషన్ పోస్టర్ని రిలీజ్ చేశారు. విజువల్ వండర్‌గా వచ్చిన ఈ పోస్టర్ అభిమానులను ఎంతో అలరిస్తుంది. 1.16 నిమిషాల నిడివి ఉన్న ఈ పోస్టర్లో ముందుగా అర చేయి కనిపిస్తుంది. దాంట్లో అడవి.. అందులో రైలు. ఒపెన్ చేస్తే ఫస్ట్ రోమియో-జులియేట్, తర్వాత సలీం-అనార్కలీ, తర్వాత దేవదాసు-పార్వతీల బొమ్మలు కనిపిస్తాయి. ఆ తర్వాత పూజా హెగ్డే రైలు బోగి డోర్ వద్ద నిల్చుని బయటకు చూస్తుంది. తర్వాత డార్లింగ్ ఆమెను చూస్తూ నిల్చుంటాడు. ఇదంతా చూస్తుంటే ఓ ట్రైన్లో వీరిద్దరి మధ్య జరిగే ప్రేమ కథగా రాధేశ్యామ్ తెరకెక్కినట్లు తెలుస్తోంది. అలానే ముందు వచ్చిన అమర ప్రేమికుల బొమ్మలను చూస్తే.. ఈ చిత్రం కూడా గొప్ప అమర ప్రేమ కావ్యంగా ఉంటుందా లేక ఆ కథల్లనే రాధేశ్యామ్ కూడా విషాదంగా ముగుస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కానీ ఈ మోషన్ పోస్టర్ మాత్రం సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. (చదవండి: ‘రాధేశ్యామ్’ సర్ప్రైజ్.. ప్రభాస్ లుక్ అదుర్స్) ఇక ఈ మూవీలో విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపించనుండగా.. పూజా ప్రేరణగా నటిస్తున్నారు. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న రాధే శ్యామ్‌ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు. -
‘రాధేశ్యామ్’ సర్ప్రైజ్.. ప్రభాస్ లుక్ అదుర్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్యాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’సర్ప్రైజ్ వచ్చేసింది. ప్రభాస్ పుట్టిన రోజు(అక్టోబర్ 23) సందర్భంగా సినిమాలో ప్రభాస్ పాత్ర పేరును రివీల్ చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్ వదిలింది చిత్రబృందం. రాదేశ్యామ్‌లో విక్రమాదిత్యగా ప్రభాస్ అలరించనున్నాడు. ఈ పోస్టర్లో ప్రభాస్ చాలా రాయల్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత తమ అభిమాన హీరో మూవీ అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ ప్యాన్ ఇండియా సినిమాకి రాధా కృష్ణకుమార్ దర్శకుడు. కృష్ణంరాజు సమర్పణలో ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. (చదవండి : ‘రాధే శ్యామ్’ లో ప్రేరణగా పూజా.. ఫస్ట్‌లుక్ అదుర్స్) ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పేరు ప్రేరణ. పీరియాడికల్ ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన 'బీట్ ఆఫ్ రాధేశ్యామ్'ను అక్టోబర్ 23న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు వచ్చింది. ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా అతి తక్కువమంది బృందంతో యూరప్‌లో షూటింగ్ జరుగుతోంది. పలు హిట్ చిత్రాలకు స్వరాలందించిన జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు. -
లవ్‌లో పడేస్తారు!
అభిమాన హీరో పుట్టినరోజు వస్తోందంటే అభిమానుల్లో ఎక్కడలేని సంతోషం నెలకొంటుంది. పుట్టినరోజున రక్తదానం, అన్నదానం, పండ్లు పంపిణీ.. ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. హీరోలు కూడా అభిమానుల్ని ఖుషీ చేసేందుకు తాము నటిస్తున్న తాజా చిత్రాల నుంచి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్.. ఇలా ఏదో ఒకటి విడుదలయ్యేలా ప్లాన్ చేస్తుంటారు. ఈ నెల 23న హీరో ప్రభాస్ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు కానుకగా ఎలాంటి అప్డేట్స్ వస్తాయా? అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధే శ్యామ్’. ఆయన బర్త్ డే గిఫ్ట్‌గా ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పేరుతో ‘రాధేశ్యామ్’ మోష¯Œ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘వాళ్లు (హీరోహీరోయిన్ ప్రభాస్, పూజా హెగ్డే) మిమ్మల్ని మరోసారి కచ్చితంగా లవ్‌లో పడేస్తారు. అక్టోబర్ 23న మోష¯Œ పోస్టర్‌ను విడుదల చేస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ఇటలీకి హాయ్
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కోవిడ్ బ్రేక్ తర్వాత విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న భారీ తెలుగు చిత్రమిదే. 1970ల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఆల్రెడీ ప్రభాస్ అండ్ టీమ్ షూటింగ్ మొదలెట్టారు. తాజాగా పూజా హెగ్డే కూడా ఇటలీకి హాయ్ చెప్పారు. ఈ చిత్రం షూటింగ్‌లోకి ఎంటర్ అయ్యారు. ఈ సినిమాలో పూజా హెగ్డే ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. ప్రభాస్, పూజా కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని దర్శకుడు ఇటీవలే పేర్కొన్నారు. భాగ్యశ్రీ, కృష్ణంరాజు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. -
బ్రదరాఫ్ ప్రభాస్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ తిరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ తమ్ముడి పాత్రలో తమిళ యంగ్ హీరో అథర్వా మురళి నటిస్తారని సమాచారం. ఈ మధ్య విడుదలైన వరుణ్‌తేజ్ ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో కీలక పాత్ర చేశారు అథర్వా మురళి. ‘రాధేశ్యామ్’లోనూ అతని పాత్ర కీలకంగా ఉంటుందట. ఈ నెల చివర్లో ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో మళ్లీ ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ ప్యాన్ ఇండియా మూవీ విడుదల కానుంది. -
‘రాధేశ్యామ్’ ఫస్ట్ లుక్
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరీక్షణకు ఫుల్స్టాప్ పడింది. ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రానికి ‘రాధేశ్యామ్’ అనే టైటిల్‌ని ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్‌ని శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం. ప్రభాస్, పూజాహెగ్డేల బార్బిడాల్ డ్యాన్స్ పోజుతో రిలీజ్ చేసిన ఈ మొదటి లుక్ లవ్లీగా ఉందని సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రెబల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమెద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. వైవిధ్యమైన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే 70 శాతం టాకీ పార్ట్‌ని పూర్తి చేసుకుంది. మిగతా షూటింగ్ పార్ట్‌ని కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ప్రారంభించాలనుకుంటున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సత్యరాజ్, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, జగపతిబాబు, జయరాం, సచిన్ ఖేడ్కర్, భీనా బెనర్జీ, మురళీ శర్మ, శాషా ఛత్రి, ప్రియదర్శి, రిద్దికుమార్, సత్యాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. సందీప్. -
తీపి కబురు
అభిమానులకు ప్రభాస్ ఓ తీపి కబురు చెప్పారు. తన తాజా చిత్రం ఫస్ట్ లుక్‌ను రేపు (శుక్రవారం) ఉదయం పదిగంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు ‘ఓ డియర్’, ‘జాన్’, ‘రాధేశ్యామ్’ అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు టైటిల్‌పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
రాధేశ్యామ్ @ రూ.3 వేల కోట్ల స్కామ్
సాక్షి, హైదరాబాద్: ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (ఎఫ్ఎంఎల్సీ) పేరుతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం)కు పాల్పడిన రాధేశ్యామ్ చేసిన స్కామ్ రూ.3 వేల కోట్ల వరకు ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఆ కంపెనీ సీఎండీగా వ్యవహరించిన ఆయన్ను ఈవోడబ్ల్యూ (ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హరియాణాలోని హిసార్‌కు చెందిన రాధేశ్యామ్, భన్సీలాల్, సురేందర్సింగ్, మనోజ్, సద్బీర్ సింగ్ తదితరులు ఎఫ్‌ఎంఎల్‌సీని రూ.1 లక్ష పెట్టుబడితో, అద్దె గదిలో ప్రారంభించారు. రూ.7,500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, అందులో రూ.2,500 రిజిస్ట్రేషన్ చార్జీ కింద మినహాయించి, మిగిలిన రూ. 5వేల విలువైన ఆరోగ్య ఉత్పత్తులు అందజేస్తామంటూ స్కీం మొదలు పెట్టారు. స్కీమ్‌లో చేరిన ఒక్కొక్కరు మరో ఇద్దర్ని చేర్పిస్తే రూ.500 చొప్పున కమీషన్ ఇస్తూ వచ్చారు. ఇలా పలు స్కీమ్‌లతో దేశవ్యాప్తంగా 60 లక్షల మంది సభ్యుల్ని ఏర్పాటు చేసుకుని వారి నుంచి ఇప్పటివరకు రూ.3 వేల కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల్లో తెలుగు రా ష్ట్రాలతో పాటు హరియాణా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన వారున్నారు. ఇటీవల శ్యామ్ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు ఒక తుపాకి, 10 తూటాలు, 4 ల్యాప్‌టాప్‌లు, 6 మొబైల్ ఫోన్లు, రూ.60 లక్షల నగదుతోపాటు 3 ఖరీదైన కార్లనూ స్వాధీనం చేసుకున్నారు. -
తెలుగు కళాకారులకు అవార్డులు
రాధేశ్యామ్, దుర్గాప్రసాద్‌లకు ‘సంగీత నాటక’ పురస్కారాలు న్యూఢిల్లీ/కూచిపూడి/విజయనగరం టౌన్: సంగీత నాటక అకాడమీ అందించే ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఇద్దరు తెలుగు వారు ఎంపికయ్యారు. 2014 ఏడాదికి సంబంధించి సంగీతం, నాట్యం, నాటకం తదితర రంగాల్లో మొత్తం 36 మందిని ఎంపిక చేయగా.. వీరిలో తెలుగువారైన కూచిపూడి నాట్యకళాకారుడు వేదాంతం రాధేశ్యామ్, వయొలిన్ విద్వాంసుడు ద్వారం దుర్గాప్రసాద్ రావు ఉన్నారు. వీరిని కూచిపూడి, వయొలిన్ విభాగాల్లో ఎంపిక చేశారు. విజేతల వివరాలను శుక్రవారం ఢిల్లీలో అకాడమీ కార్యదర్శి హెలెన్ ఆచార్య వెల్లడించారు. విజేతలకు రూ. లక్ష చొప్పున నగదు, తామ్రపత్రాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు. అయితే, అవార్డు ప్రదాన తేదీని ఇంకా ఖరారు చేయలేదు. కాగా, అకాడమీ ఫెలోషిప్‌లకు 40 మంది కళాకారులను ఎంపిక చేశారు. రాధేశ్యామ్ కళాప్రతిభ... రాధేశ్యామ్‌కు సంగీత నాటక అవార్డు ప్రకటించడంతో ఆయన స్వగ్రామమైన ఏపీలోని కృష్ణాజిల్లా కూచిపూడి వాసులు సంబరాలు చేసుకున్నారు. రాధేశ్యామ్.. సత్యనారాయణ, సత్యవతమ్మలకు 1954లో జన్మించారు. ఐదో ఏట నుంచే అన్నగారైన సీతారామశాస్త్రి, పినతండ్రి పార్వతీశం వద్ద నాట్యంలో శిక్షణ పొందారు. సత్యభామగా, గొల్లభామగా వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. 2014లో మైసూర్‌లోని అవధూత దత్తపీఠం ఆస్థాన విద్వాంసుడిగా నియమితులయ్యారు. కూచిపూడిలోని శ్రీసిద్ధేంద్ర కళాక్షేత్రంలో అధ్యాపకుడిగా పనిచేసి 2013లో ఉద్యోగ విరమణ చేశారు. దుర్గాప్రసాద్ ప్రస్థానం... ద్వారం దుర్గాప్రసాద్ రావు కుటుంబమంతా సంగీతానికే అంకితమైంది. తండ్రి నరసింగరావు సంగీత కళాశాల అధ్యక్షులుగా పనిచేశారు. ఆకాశవాణి నిర్వహించిన అఖిల భారత సంగీత సమ్మేళనంలో దుర్గాప్రసాద్ చిన్నతనంలోనే విజేతగా నిలిచి నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ద్వారా అవార్డు అందుకున్నారు. విజయనగరం సంగీత కళాశాలలో అధ్యక్షులుగా పనిచేసి పదవీ విర మణ చేశారు.