Prabhas And Pooja Hegde Radhe Shyam First Song Out - Sakshi
Sakshi News home page

Radhe Shyam: ‘రాధేశ్యామ్‌’ ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది

Published Mon, Nov 15 2021 10:05 PM | Last Updated on Tue, Nov 16 2021 9:26 AM

Radhe Shyam FIrst Song Out - Sakshi

ఎట్టకేలకు ‘రాధేశ్యామ్‌’తొలి సాంగ్‌ వచ్చేసింది. సాహో తర్వాత ప్రభాస్‌ నటించిన మరో పాన్‌ ఇండియా చిత్రమే ‘రాధేశ్యామ్‌’.పూజ హెగ్డే హీరోహీరోయిన్‌. కె. రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్‌, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్‌ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా, పూజ హెగ్డే ప్రేరణగా నటిస్తోంది.

ఈ సినిమా అప్‌డేట్‌ గురించి ప్రభాస్‌ అభిమానులు ఎప్పటి నుంచో వేచి చూశారు. వారి నిరీక్షణకు తెరదించుతూ మంచి ప్రేమ గీతాన్ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ‘ఎవరో వీరెవరో ’అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్‌ లిరిక్స్‌ అందించగా  యువన్‌ శంకర్‌ రాజా, హరిణి ఇవటూరి ఆలపించారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement