రాధేశ్యామ్‌‌: ప్రేమికుల రోజు సర్‌ప్రైజ్‌ | Radhe Shyam Teaser Release Date Out On 14th Feb Valentine Day | Sakshi
Sakshi News home page

ప్రేమికుల దినోత్సవానికి..

Published Sun, Jan 31 2021 5:53 AM | Last Updated on Sun, Jan 31 2021 10:45 AM

Radhe Shyam Teaser Release Date Out On 14th Feb Valentine Day - Sakshi

ప్రేమికుల రోజు తన లవ్‌స్టోరీకి సంబంధించి చిన్న టీజర్‌ చూపిస్తారట ప్రభాస్‌. ఆయన నటిస్తున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం టీజర్‌ను వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని టాక్‌. టీజర్‌తోనే సినిమా రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించాలనుకుంటున్నారని తెలిసింది. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రమిది. (చదవండి: సలార్‌ : శృతి హాసన్‌కు భారీ రెమ్యునరేషన్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement