Prabhas Radhe Shyam Teaser: Likely To Release On Feb 14th Valentines Day - Sakshi
Sakshi News home page

ప్రేమికుల రోజు ‘రాధేశ్యామ్‌’ టీజర్‌?

Published Thu, Feb 4 2021 5:45 PM | Last Updated on Thu, Feb 4 2021 8:19 PM

Prabhas Likely To Unveil Radhe Shyam Teaser On Valentines Day - Sakshi

యంగ్‌ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. షూటింగ్‌ పూర్తి కావస్తున్నా కూడా సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. మరోవైపు తెలుగు ఇండస్ట్రీలో సినిమా రిలీజ్‌ డేట్స్‌ల జాతర కొనసాగుతోంది. ఇప్పటి నుంచి వచ్చే ఏడాది తేదీలకు కూడా పోటీపడి మరి విడుదల తేదీలు ప్రకటిస్తున్నారు. బాలయ్య, చిరంజీవి, పవన్, వెంకటేష్, అల్లు అర్జున్, రవితేజ, ఒకరా ఇద్దరా అందరూ హీరోలు విడుదల తేదిలు ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపారు. అయితే వచ్చి ప్ర‌భాస్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తన అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రాధేశ్యామ్‌ టీజర్‌ ఎప్పుడు విడుద‌ల‌వుతుంద‌నేది ఆస‌క్తిక‌ర‌మైన అంశంగా మారింది. ఈ క్రమంలో ప్రభాస్‌ తన అభిమానులకు త్వరలోనే శుభవార్త అందించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. చదవండి: ఆదిపురుష్‌ ఆరంభ్‌.. ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌

ఈ సినిమా టీజర్ త్వరలో రాబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌డే సందర్భంగా ‘రాధే శ్యామ్’ టీజర్ విడుదలైయ్యే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆశిస్తున్నారు. త్వరలోనే చిత్రయూనిట్ టీజర్‌తోపాటు విడుదల తేదీని కూడా ఖరారు చేస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో #RadheShyamTeaser అనే హ్యష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ అమర ప్రేమికుల టీజర్‌ ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో చూడాలి. చదవండి: ఉప్పెన ట్రైలర్‌: ‘మరీ ఇంత అందగత్తె పుట్టిందంటే..’

ఇక ప్రభాస్‌, పూజా హెగ్డే జోడీగా రూపొందుతోన్న 'రాధేశ్యామ్‌' పీరియాడికల్‌ లవ్‌స్టోరిగా రూపొందుతోంది. పాన్ ఇండియా మూవీగా అయిదు బాషలలో విడుదల కాబోతుంది. ప్రభాస్‌, కృష్ణంరాజు మద్య కొన్ని సన్నివేశాలు మినహా దాదాపు చిత్రీకరణంతా పూర్తయ్యింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో కనిపించనుందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement