teaser
-
రెమ్యునరేషన్‌పై హీరోకు ప్రశ్న.. నాకు ఇదేం టార్చర్ రా బాబు!
సరికొత్త సినిమాలతో టాలీవుడ్ ప్రియులను అలరిస్తోన్న యంగ్ హీరో సుహాస్(Suhas). తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సుహాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఓ భామ అయ్యో రామా'(O Bhama Ayyo Rama). ఆ మూవీలో మాళవిక మనోజ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో సుహాస్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు యాడ్లకు ఎంత తీసుకుంటారో.. అలాగే సినిమాకు అంతే రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్ ఉంది.. దీనిపై మీరేమంటారు అని సుహాస్‌ను ప్రశ్నించారు. దీనిపై సుహాస్ కూడా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.సుహాస్ మాట్లాడుతూ..' ఇదేంటీ నాకు టార్చర్. నేను అనుకున్నంత నంబర్ అయితే లేదు. అయినా కూడా నా యాక్టింగ్ బాగుందో లేదో చూడాలి కానీ.. ఈ రెమ్యునరేషన్ గోల ఏంది? అన్నారు. అలాగే ప్రభాస్ స్పిరిట్‌లో నటిస్తున్నారా? అని ప్రశ్నించగా..అదేం లేదు అని సుహాస్ సమాధానమిచ్చారు. కాగా.. ఈ చిత్రంలో అనిత హస్సానందాని, అలీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
అమ్మాయిల్ని నమ్మొదంటూ 'సుహాస్' కొత్త సినిమా టీజర్
టాలీవుడ్ హీరో సుహాస్(Suhas) నటించిన కొత్త సినిమా 'ఓ భామ అయ్యో రామ'(Oh Bhama Ayyo Rama) నుంచి టీజర్ వచ్చేసింది. మాళవిక మనోజ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని వీ ఆర్ట్స్ బ్యానర్‌పై హరీశ్ నల్ల నిర్మించారు. ఈ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త కథలతో ఆడియన్స్‌ను అలరిస్తోన్న సుహాస్ మరో కథతో ప్రేక్షకులను మెప్పించేలా టీజర్ ఉంది. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో అనిత హాసానందని, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ , ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మోయిన్, సాథ్విక్ ఆనంద్, నాయని పావని కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్'.. అనిరుధ్ అదరగొట్టేశాడు!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్డమ్'. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. గతనెల ఫిబ్రవరిలో సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించింది. ఈ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం టీజర్‌కు మరింత హైప్‌ను క్రియేట్ చేసింది.తాజాగా ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన ఫ్యాన్స్‌కు మరో ట్రీట్ ఇచ్చారు. కింగ్డమ్ టీజర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ను తాజాగా విడుదల చేశారు. నిమిషం 30 సెకన్ల పాటు ఉన్న ఈ సాండ్ ట్రాక్ అద్భుతందా ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ బీజీఎం అదిరిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తోన్న సంగతి తెలిసిందే. -
'పొలిమేర' దర్శకుడి మరో దెయ్యం సినిమా.. టీజర్ రిలీజ్
'పొలిమేర' రెండు సినిమాలు ఎంత సెన్సేషన్ సృష్టించాయో అందరికీ తెలిసిందే. తొలిభాగం ఓటీటీలో రిలీజై హిట్ కాగా.. తొలుత థియేటర్లలో రిలీజైన సీక్వెల్ అంతకు మించిన రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ విశ్వనాథ్.. మరో దెయ్యం మూవీతో వచ్చేస్తున్నాడు.(ఇదీ చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్)కాకపోతే ఈసారి అనిల్ విశ్వనాథ్.. దర్శకుడి బాధ్యతలు తీసుకోలేదు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూనే షో రన్నర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో అల్లరి నరేశ్ హీరోగా చేస్తున్నాడు. తాజాగా '12 ఏ రైల్వే కాలనీ' టైటిల్ పెట్టినట్లు టీజర్ రిలీజ్ చేశారు. 'ఈ స్పిరిట్స్, ఆత్మలు కొంతమందికే ఎందుకు కనబడతాయ్?' అనే డైలాగ్ ఆకట్టుకుంది.టీజర్ బట్టి చూస్తే ఇందులో దెయ్యాలు, ఆత్మలు కనిపించే వ్యక్తిగా అల్లరి నరేశ్ కనిపించనున్నాడు. 'పొలిమేర' హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ఇందులోనూ సాయికుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవిలో విడుదల ప్లాన్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: రూ.100 కోట్ల ఖరీదైన ఇల్లు కొన్న నయన్?) -
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' యాక్షన్–ప్యాక్డ్ టీజర్
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ టీజర్ వచ్చేసింది. ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న విజయశాంతి పవర్ఫుల్ డైలాగ్స్‌తో ప్రారంభం అవుతుంది. యాక్షన్–ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా టీజర్ ఉంది. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అర్జున్ పాత్రలో కల్యాణ్ రామ్, వైజయంతి పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు.‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ తల్లీకొడుకుల బలమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగే యాక్షన్ ఫిల్మ్ అని తెలుస్తోంది. సోహైల్ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ‘యానిమల్’ ఫేమ్ పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం అజనీష్ లోక్‌నాథ్ అందించారు. -
విక్రమ్ మాస్ అవతార్.. 'వీరశురధీర' టీజర్ రిలీజ్
తమిళ హీరో విక్రమ్ అనగానే ప్రయోగాత్మక సినిమాలే గుర్తొస్తాయి. గత కొన్నాళ్లుగా సరైన హిట్ పడక చాలా వెనకబడిపోయిన ఈ హీరోని ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవట్లేదు. దీంతో కమర్షియల్ కథతో మూవీ చేశాడు. అదే 'వీర ధీర శూర'. మార్చి 27న తెలుగు-తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: కుడుంబస్థాన్ సినిమా రివ్యూ (ఓటీటీ))టీజర్ బట్టి చూస్తే.. హీరో కిరాణా కొట్టు నడుపుతూ ఉంటాడు. ఓ హీరోయిన్ తో ప్రేమలోనూ ఉంటాడు. కట్ చేస్తే సింపుగా కనిపించే హీరోకి భాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇంతకీ అదేంటనేదే సినిమా కథలా అనిపిస్తుంది.విక్రమ్ సరసన దుషారా విజయన్ నటించిది. ఎస్జే సూర్య, సూరజ్ వెంజుమోడు లాంటి స్టార్స్ నటించారు. ఎస్ఏ అరుణ్ కుమార్ దర్శకుడు. నేరుగా ఈ సినిమా పార్ట్-2 రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇది హిట్ అయితే 'కాంతార' టైపులో ప్రీక్వెల్ తీస్తారేమో?(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి హిట్ సినిమా) -
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. టీజర్ మేకింగ్ వీడియో చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు.ఇప్పటికే ఈ మూవీ టీజర్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా టీజర్ మేకింగ్ వీడియోతో ఆడియన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ మేకింగ్ వీడియోలో అజిత్ కుమార్ టీమ్ పడిన కష్టాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ముఖ్యంగా తన ఫర్మామెన్స్తో సీన్స్‌లో అద్భుతంగా నటించారు. మీరు ఈ మేకింగ్ వీడియో చూసేయండి. ఈ యాక్షన్ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు.(ఇది చదవండి: అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. తెలుగు టీజర్ చూశారా?)అజిత్ కుమార్ ఇటీవల విదాముయార్చి మూవీతో ప్రేక్షకులను పలకరించారు. తెలుగులో పట్టుదల పేరుతో ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. మరి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతోనైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని అజిత్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.Here is the making of #GoodBadUglyTeaser ❤️🔥▶️ https://t.co/qLYnc6f41WAfter Teaser Sambavam, it is time for the first single. Ready, Maamey?#OGSambavam from March 18th.A @gvprakash Musical ❤️🔥#GoodBadUgly Grand release on 10th April, 2025 with VERA LEVEL entertainment 🤩… pic.twitter.com/2K5Makpxph— Mythri Movie Makers (@MythriOfficial) March 14, 2025 -
రూ.197 కోట్ల స్కామ్.. ఆసక్తికరంగా 'భద్రకాళి' టీజర్
'బిచ్చగాడు' మూవీతో తెలుగులో బోలెడంత పాపులారిటీ తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. స్వతహాగా మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఇతడు.. నటుడు, నిర్మాత, పాటల రచయిత, ఎడిటర్, సంగీత దర్శకుడిగా ఆకట్టుకుంటున్నాడు. ఇతడి 25వ మూవీ టీజర్ రిలీజ్ చేయగా అది ఆసక్తికరంగా ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్)'అరువి', 'వాళ్' లాంటి వైవిధ్యమైన సినిమాలు తీసిన అరుణ్ ప్రభు.. విజయ్ ఆంటోనితో తీస్తున్న మూవీకి తెలుగులో 'భద్రకాళి' అనే టైటిల్ పెట్టారు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. కథని పెద్దగా బయటపెట్టలేదు గానీ విజువల్స్ చూస్తుంటే మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి.ఇది రాజకీయ నేపథ్య కథతో తీసిన సినిమా అని తెలుస్తోంది. ఏదో రూ.197 కోట్ల స్కామ్ చుట్టూ తిరిగే కథలా అనిపిస్తోంది. విజయ్ ఆంటోనీ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించాడు. గ్యాంగ్ స్టర్, మోసగాడు, ఫ్యామిలీ మ్యాన్, గవర్నమెంట్ ఆఫీసర్, ఖైదీగా.. ఇలా రకరకాల కోణాల్లో చూపించారు. వేసవి కానుకగా ఇది థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: 40 ఏళ్ల చరిత్ర గల 'రజినీకాంత్' థియేటర్ కూల్చివేత) -
'ఈగ' స్టోరీతో మరో సినిమా.. టీజర్ రిలీజ్
ఇప్పుడంటే రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్. కానీ అప్పట్లో ఓ సాధారణ దర్శకుడిగా ఉన్నప్పుడు ఓ ఈగని హీరోగా పెట్టి సినిమా తీసేశాడు. దక్షిణాదితో పాటు హిందీలో రిలీజైన ఈ చిత్రం హిట్ అయింది. ఇప్పుడు అలా ఈగతో మలయాళంలో మరో సినిమా తీశారు. చూస్తుంటే జక్కన్న మూవీకి సీక్వెల్ లా అనిపించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)'ప్రేమలు', 'లియో' తదితర డబ్బింగ్ చిత్రాలతో ఓటీటీ వల్ల తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమైన మలయాళ నటుడు మథ్యూ థామస్. ఇతడితో పాటు ఈగని ప్రధాన పాత్రధారులుగా పెట్టి 'లవ్లీ' మూవీ తీశారు. ఏప్రిల్ 4న తెలుగులోనూ విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.ఓ కుర్రాడితో ఈగ స్నేహం చేయడం, అతడికి కష్టమొస్తే ఆదుకోవడం లాంటి సీన్స్ చూపించారు. ఈగ విజువల్స్ చూస్తుంటే రాజమౌళి 'ఈగ' గుర్తొచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందనేది చూడాలి?(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి) -
సెన్సిటివ్ టాపిక్.. అలరించేలా 'సంతాన ప్రాప్తిరస్తు' టీజర్
ప్రెగ్నెన్సీ, స్మెర్మ్ కౌంట్ లాంటి పదాల గురించే మాట్లాడుకోవడానికే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఈ తరహా కాన్సెప్ట్ తో మూవీ తీయడం తక్కువే. తెలుగులో ఒకటి రెండు చిత్రాలతో ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు 'సంతాన ప్రాప్తిరస్తు' పేరుతో మరో సినిమా రాబోతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'మార్కో'.. అసలు ముద్దాయి సెన్సార్ బోర్డ్!)ఇంజినీరింగ్ జాబ్ చేసే ఓ కుర్రాడు.. ప్రేమించి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తీరా అతడి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందని వైద్యపరీక్షల్లో తేలుతుంది. అంటే పిల్లలు పుట్టే అవకాశం తక్కువని డాక్టర్స్ చెబుతారు. స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు వైద్యుల సలహాలు, డైట్ ఫాలో అవుతూ వంద రోజుల్లో తన భార్యను ప్రెగ్నెంట్ చేయాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు హీరో. చివరకు ఏమైందనే అసలు కథ. టీజర్ చూస్తే ఇదే అనిపించింది.ఇది సెన్సిటివ్ విషయమే కానీ దీన్ని ఎంటర్ టైనింగ్ గా చెప్పినట్లు తెలుస్తోంది. విక్రాంత్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. సంజీవ్ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం టీజర్ రిలీజ్ చేశారు. త్వరలో రిలీజ్ వివరాలు ప్రకటిస్తారు.(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్) -
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. తెలుగు టీజర్ చూశారా?
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను మార్క్ ఆంటోని ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ బ్యానర్లో నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ వేసవిలో థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే తమిళ టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్ ఇవాళ తెలుగుతో పాటు హిందీలోనూ గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీ టీజర్లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు.అజిత్ కుమార్ ఇటీవల విదాముయార్చి మూవీతో ప్రేక్షకులను పలకరించారు. తెలుగులో పట్టుదల పేరుతో ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతోనైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని అజిత్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.This summer, it is going to be a crazy entertaining ride 💥💥#GoodBadUglyTeaser out now!Telugu ▶️ https://t.co/Ynl6esv1jhHindi ▶️ https://t.co/Y5QRRG1E67#GoodBadUgly Grand release on 10th April, 2025 with VERA LEVEL entertainment 🤩A @gvprakash Musical ❤️🔥… pic.twitter.com/5BxIRxZ1sz— Mythri Movie Makers (@MythriOfficial) March 1, 2025 -
'కన్నప్ప' కొత్త టీజర్ రిలీజ్
-
'కన్నప్ప' కొత్త టీజర్ రిలీజ్.. ఈసారి మాత్రం
మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి కొత్త టీజర్ రిలీజైంది. ఎనిమిది నెలల క్రితం రిలీజైన టీజర్ తో పోలిస్తే ఈసారి ట్రోల్ చేసేంతలా ఏం లేదు. సినిమాలోని కీలక పాత్రధారుల్ని చూపిస్తూ కన్నప్ప ప్రపంచం ఎలా ఉందనేది చూచాయిగా చూపించారు.(ఇదీ చదవండి: రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బాపు')1:24 నిమిషాల టీజర్ లో విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, ప్రీతి ముకుందన్.. ఇలా అందరిని చూపించేశారు. నాస్తికుడు అయిన తిన్నడు.. అలియాస్ మన హీరో శివయ్య భక్తుడిగా ఎలా మారాడు అనేదే స్టోరీ అని తెలుస్తోంది.ఏప్రిల్ 25న పాన్ ఇండియా వైడ్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. రీసెంట్ గానే ముంబైలో ప్రెస్ మీట్ పెట్టారు. శ్రీకాళహస్తిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఉంటుందని మంచు విష్ణు చెప్పారు. టీజర్ అంతా ఏమో గానీ చివర్లో ప్రభాస్ ని కాసేపు అలా చూపించి అతడి అభిమానులని అయితే ఆకట్టుకున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) -
అజిత్ యాక్షన్ థ్రిల్లర్.. గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను మార్క్ ఆంటోని ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ బ్యానర్లో నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్నా అలా జరగలేదు. దీంతో వేసవిలో థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. అజిత్‌పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు.అజిత్ కుమార్ ఇటీవల విదాముయార్చి మూవీతో ప్రేక్షకులను పలకరించారు. తెలుగులో పట్టుదల పేరుతో ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతోనైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని అజిత్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.Maamey! The festival is here 💥This summer is going to be SUPER CRAZY 🔥🔥Here's the #GoodBadUglyTeaser ❤️🔥▶️ https://t.co/evp1QJiM2J#GoodBadUgly Grand release on 10th April, 2025 with VERA LEVEL entertainment 🤩A @gvprakash Musical ❤️🔥#AjithKumar… pic.twitter.com/M4hRGPdbAr— Mythri Movie Makers (@MythriOfficial) February 28, 2025 -
సల్మాన్ ఖాన్ యాక్షన్ చిత్రం.. టీజర్ వచ్చేసింది
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'సికందర్'. ఈ సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సల్మాన్ సరసన పుష్ప భామ రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు.టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సల్మాన్ గతేడాది సింగం ఎగైన్, బేబీ జాన్ చిత్రాల్లోనూ కనిపించారు. అయితే అంతకుముందు 2023లో టైగర్-3 మూవీతో ప్రేక్షకులను అలరించాడు సల్మాన్ ఖాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ విఫలం కావడంతో సికందర్పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం ఈద్ కానుకగా మార్చి 28న థియేటర్లలోకి రానుంది. Jo dilon par karta hai raj woh aaj kehlata hai Sikandarhttps://t.co/Bn5NdtKN2z #SajidNadiadwala’s #Sikandar Directed by @ARMurugadoss @iamRashmika #Sathyaraj @TheSharmanJoshi @MsKajalAggarwal @prateikbabbar #AnjiniDhawan @jatinsarna #AyanKhan @DOP_Tirru…— Salman Khan (@BeingSalmanKhan) February 27, 2025 -
నాని వయొలెన్స్.. దెబ్బకు విజయ్ దేవరకొండ రికార్డ్ బ్రేక్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'హిట్-3'. హిట్ సిరీస్‌లో వస్తోన్న మూడో చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నాని సరసన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. నాని బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేయగా యూట్యూబ్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో హిట్-3 టీజర్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి దాదాపు 21 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించింది. ఈ చిత్రంలో నాని మునుపెన్నడు కనిపించని పాత్రలో నటించారు. టీజర్లో సన్నివేశాలు చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది. ఇంతకుముందెన్నడు చేయని మోస్ట్ వయొలెంట్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ చిత్రంలో నాని.. అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అభిమానులను అలరించనున్నారు.అయితే ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ మూవీకి 24 గంటల్లోనే 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఎన్టీఆర్ వాయిస్ అందించిన ఈ టీజర్‌కు ఇప్పటి వరకు 15 మిలియన్ల వీక్షణలు సాధించింది. కానీ నాని మూవీ హిట్-3 టీజర్ కేవలం 24 గంటల్లోనే కింగ్డమ్ వ్యూస్ రికార్డ్‌ను అధిగమించింది. దీంతో హీరో నాని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వేసవి కానుకగా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నారు. -
ఆర్య హీరోగా వస్తోన్న స్పై థ్రిల్లర్.. తెలుగు టీజర్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ ఆర్య హీరోగా నటించిన తాజా చిత్రం 'మిస్టర్ ఎక్స్'. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. గూఢచారుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే తమిళ టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.భారతీయ గూఢచర్య వీరుల జీవితాల ఆధారంగా ఈ కథను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. దేశాన్ని కాపాడటం మన పని మాత్రమే కాదు.. అది మన బాధ్యత.. అంటూ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. శత్రువుల నుంచి మనదేశాన్ని కాపాడే నేపథ్యంలో ఈ కథను రూపొందించారు. ప్రధానంగా ఓ న్యూక్లియర్ డివైజ్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని టీజర్లోనే తెలుస్తోంది. కాగా.. ఈ స్పై థ్రిల్లర్ సినిమాను వినీత్ జైన్, ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో గౌతమ్ రామ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్, అనఘా, రైజా విల్సన్, అతుల్య రవి, జయప్రకాష్, కాళి వెంకట్ కీలక పాత్రల్లో నటించారు. -
అను ఇమ్మాన్యుయేల్ సైకలాజికల్ థ్రిల్లర్.. టీజర్ గ్లింప్స్ చూశారా?
అను ఇమ్మాన్యుయేల్, శివకందుకూరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బూమరాంగ్ (Boomerang Movie). ఈ మూవీని సైకలాజికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బూమరాంగ్ టీజర్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ చిత్రాన్ని ఓ సందేశాత్మక సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఆండ్రూ బాబు దర్శకత్వం వహించారు. కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ సినిమా తీసినట్లు డైరెక్టర్ వెల్లడించారు. సితార ఫిల్మ్స్ లిమిటెడ్ లైన్ ప్రోడక్షన్ బ్యానర్‌పై లండన్ గణేశ్, డా. ప్రవీణ్ రెడ్డి ఊట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. -
'హిట్ 3' టీజర్ రిలీజ్.. అస్సలు ఊహించలే!
హీరో నాని అంటే పక్కంటి కుర్రాడి తరహా పాత్రలతో బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాస్ సినిమాలు చేస్తూ తనలో డిఫరెంట్ యాంగిల్ పరిచయం చేస్తూ వస్తున్నాడు. దసరా, సరిపోదా శనివారం చిత్రాలు.. ఆ తరహా ప్రయత్నాలే. ఇప్పుడు వాటిని మించిపోయేలా బ్రూటల్ మాస్ చూపించబోతున్నాడు.నాని ప్రస్తుతం 'హిట్ 3' చేస్తున్నాడు. ఈ ఫ్రాంచైజీలో ఇదివరకే రెండు మూవీస్ వచ్చాయి. విశ్వక్ సేన్, అడివి శేష్ హీరోలుగా నటించిన ఈ చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథలతో వీటిని తెరకెక్కించారు. వీటిని నిర్మించిన నాని.. మూడో భాగాన్ని నిర్మిస్తూ హీరోగా నటించాడు. ఇతడి పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)'హిట్ 3' సినిమా చాలా వయలెంట్ గా ఉంటుదని నాని కొన్నాళ్ల క్రితమే చెప్పాడు. అందుకు తగ్గట్లే టీజర్ ఉంది. లాఠి పట్టుకుంటే రెచ్చిపోయే అర్జున్ సర్కార్ అనే పోలీస్ గా కనిపించాడు. వైట్ కోట్ తో ఓ వ్యక్తిని చంపే సీన్ అయితే భయం కలిగించింది.టీజరే ఇలా ఉందంటే సినిమా ఇంకెలా ఉండబోతుందో అర్థమైపోతుంది. మే 1న థియేటర్లలోకి రాబోతుంది. శైలేష్ కొలను దర్శకుడు కాగా.. మిక్కీ జే మేయర్ సంగీతమందించాడు. 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?) -
ఓదెల 2లో తమన్నా శివతాండవం..
-
జీవితంలో ఒక్కసారే ఇలాంటి చాన్స్ వస్తుంది: తమన్నా
‘‘మహా కుంభమేళా జీవితంలో ఒక్కసారే వస్తుంది. అలాగే ‘ఓదెల 2’ లాంటి సినిమాలో నటించే అవకాశం కూడా జీవితంలో ఒక్కసారే వస్తుంది’’ అని తమన్నా అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, యువ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.ప్రయాగ్ రాజ్‌లోని మహా కుంభ మేళాలో త్రివేణి సంగమం వద్ద నాగ సాధువుల సమక్షంలో ‘ఓదెల 2’ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘సంపత్ నంది విజన్‌ని దర్శకుడు అశోక్ తేజ అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చాడు. సంపత్ నందిగారితో నాలుగు సినిమాలు సైన్ చేశాను. కానీ ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది’’ అని తెలిపారు. సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత తమన్నా మాంసాహారం తినడాన్ని మానేశారు.‘అమ్మోరు’లో సౌందర్యగారిని, ‘అరుంధతి’ మూవీలో అనుష్కగారిని ఎంత ఆరాధించామో... అలా ఈ సినిమాతో తమన్నా కూడా ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘అవకాశం ఇచ్చిన సంపత్ నందిగారికి, తమన్నా, డి. మధుగార్లకు ధన్యవాదాలు’’ అని తెలిపారు అశోక్‌తేజ. ‘‘ఇది థియేటర్స్‌లో చూడాల్సిన చిత్రం’’ అన్నారు డి. మధు. -
లుక్స్‌తోనే భయపెట్టిన తమన్నా.. ఉత్కంఠంగా ‘ఓదెల 2’ టీజర్
‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ (Odela 2)తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా ప్రధాన పాత్రలో నటించగా, హెబ్బా పటేల్, వశిష్ట కీలక పాత్రలు పోషిస్తున్నారు. తొలి భాగాన్ని తెరకెక్కించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా..నాగసాధు పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్(Odela 2 Teaser)ని మహాకుంబమేళాలో విడుదల చేశారు మేకర్స్. నాగసాధు పాత్రలో తమన్నా నటన అదిరిపోయింది. ఉత్కంఠ రేకెత్తించే సీన్లలో టీజర్‌ని కట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు విడుదలైన టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. -
క్రైమ్ థ్రిల్లర్
నానీ(Nani) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. యునానిమస్ ప్రోడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా మే 1న విడుదల కానుంది. కాగా ఈ నెల 24న నానీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ఈ మూవీలో అర్జున్ సర్కార్‌గా పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు నానీ.‘హిట్’ సిరీస్‌లో మూడవ భాగంగా రాబోతున్న ఈ చిత్రం గ్లింప్స్, పోస్టర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్), లైన్‌ప్రోడ్యూసర్: అభిలాష్ మాంధదపు. -
బ్యూటీ టీజర్ చూశారా?
ఆయ్ ఫేమ్ అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బ్యూటీ. గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేమ్ వర్ధన్ దర్శకత్వం వహించారు. వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ బ్యానర్లపై అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మించారు. ఈ సినిమాకు బి.ఎస్. రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా ‘బ్యూటీ’ టైటిల్‌ను ప్రకటించడంతోపాటు ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌ను కూడా విడుదల చేశారు. నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా శ్రీ సాయి కుమార్ దారా పని చేస్తున్నారు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్షన్: బేబీ సురేష్ భీమగాని, ఎడిటింగ్: ఎస్బి ఉద్ధవ్. చదవండి: -
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' టీజర్.. కొన్ని గంటల్లోనే రికార్డ్
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్డమ్'. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు వీడీ12 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌తో పాటు టైటిల్‌ను కూడా రివీల్ చేశారు మేకర్స్. కింగ్డమ్ అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేశారు.అయితే ఈ మూవీ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. యూట్యూబ్‌లో 10 మిలియన్స్ వ్యూస్‌తో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ విజయ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఫ్యాన్స్‌ను ఊపేస్తున్నాయి. ఈ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం టీజర్‌కు మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. దీంతో కింగ్డమ్ వ్యూస్ పరంగా మరింత వేగంగా దూసుకెళ్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. #Kingdom Teaser delivers all the emotions with KING SIZED MOMENTS! 💥💥💥10M+ views and standing tall! ❤️🔥❤️🔥▶️ https://t.co/rHwYoKCDgI#VD12 #Saamraajya @TheDeverakonda @anirudhofficial @gowtam19 @dopjomon #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @artkolla… pic.twitter.com/HpHNpmxWZi— Sithara Entertainments (@SitharaEnts) February 12, 2025 -
'విజయ్ దేవరకొండ కింగ్డమ్ టీజర్'.. రష్మిక పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాకు కింగ్డమ్ అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా టైటిల్ రివీల్ చేయడంతో పాటు టీజర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌కు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్‌ను అందించారు. ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ రౌడీ హీరో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.అయితే ఈ మూవీ టీజర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో కింగ్డమ్ టీజర్ పోస్టర్‌ను పంచుకుంది. 'ది మ్యాన్ కమ్స్ విత్ సమ్‌థింగ్ మెంటల్.. విజయ్ను చూస్తుంటే గర్వంగా ఉంది' అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కొన్నేళ్లుగా డేటింగ్ రూమర్స్..టాలీవుడ్లో ఈ జంటపై కొన్నేళ్లుగా డేటింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో చాలాసార్లు వీరిద్దరు పెట్టిన పోస్టులతో ఫ్యాన్స్‌కు దొరికిపోయారు. గతేడాది దీపావళికి సైతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ చేసుకుంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత మరోసారి ఈ జంటపై రూమర్స్ వైరలయ్యాయి. తాజాగా కింగ్డమ్ టీజర్‌ను రష్మిక షేర్ చేయడంతో మరోసారి చర్చ మొదలైంది. కాగా.. వీరిద్దరు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా నటించారు. ప్రస్తుతం ఛావా మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది రష్మిక. ఈ బాలీవుడ్ చిత్రంలో విక్కీ కౌశల్ సరసన హీరోయిన్గా కనిపించనుంది. -
విజయ్ దేవరకొండ 'వీడీ12'.. టీజర్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం 'వీడీ 12'. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. వీడీ12 టైటిల్ రివీల్ చేయడంతో పాటు టీజర్ విడుదల చేశారు. అయితే ఈ సినిమా టీజర్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పారు. తాజాగా విడుదలైన టీజర్ రౌడీ హీరో ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.అయితే ఈ సినిమాకు కింగ్డమ్ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. అలాగే వీడీ12 మూవీకి హిందీ టీజర్‌కు యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్ తన వాయిస్ అందించారు. తమిళంలో స్టార్ హీరో సూర్య వాయిస్‌తో టీజర్ విడుదల చేశారు మేకర్స్. మూడు భాషల్లో ముగ్గురు స్టార్ హీరోల వాయిస్‌తో టీజర్‌ను విడుదల చేయడం విశేషం.తాజాగా రిలీజైన టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ టీజర్లో విజయ్ దేవరకొండ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో విజయ్ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేసేలా ఉన్నాయి. ఈ టీజర్‌తో కింగ్డమ్పై అభిమానుల్లో భారీగా అంచనాలు పెంచేసింది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా ఎదురుచూసిన అభిమానులకు ఆ కోరిక నేటితో తీరింది. 'జెర్సీ' వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ కింగ్డమ్ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
'మీ నాన్నకు తెలియనంత జాబ్ ఏం చేస్తున్నావ్?'.. ఆసక్తిగా టీజర్
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) 'జాక్' (Jack)మూవీతో అభిమానులను అలరించనున్నారు. గతేడాది టిల్లు స్క్వేర్తో ఫ్యాన్స్‌ను మెప్పించిన సిద్ధు మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తోన్న జాక్‌లో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తోంది. ఇవాళ సిద్ధు పుట్టిన రోజు కావడంతో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా జాక్ మూవీ టీజర్‌ను ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు.టీజర్ చూస్తే తండ్రి, కుమారుల మధ్య జరిగే స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో సన్నివేశాలు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు అర్థమవుతోంది. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య, సిద్ధు మధ్య వచ్చే డైలాగ్స్ ఫ్యాన్స్‌ను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, వీకే నరేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. #Jack Konchem Crack 😉But adento adagoddu - It’s confidential 🤫 Presenting an exhilarating character who will run a MASSIVE entertainment show 🔥— https://t.co/VWrugmWs2n#JackTeaser out now! #JackOnApril10th#SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @SVCCofficial… pic.twitter.com/gQYQjYSW4o— SVCC (@SVCCofficial) February 7, 2025 -
వెంకటేశ్- రానా సూపర్ హిట్ కాంబో.. టీజర్ వచ్చేసింది
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati)నటించిన డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్ నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ విడుదలైంది.ఈ సిరీస్‌కు ఆదరణ దక్కడంతో మేకర్స్ సీజన్-2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో రానా నాయుడు సీజన్-2 టీజర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. తాజాగా విడుదలైన అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్‌తో రానా, వెంకటేశ్ మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యాక్షన్, క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు.Ab hogi todfod ki shuruvaat mamu, kyun ki ye Rana Naidu ka style hai 👊. Watch Rana Naidu Season 2, out in 2025, only on Netflix #RanaNaiduS2#RanaNaiduS2OnNetflix #NextOnNetflixIndia pic.twitter.com/AKzezumPzN— Netflix India (@NetflixIndia) February 3, 2025 -
మ్యాడ్ బ్యూటీ '8 వసంతాలు' టీజర్ రిలీజ్
మ్యాడ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సానీల్కుమార్(Ananthika Sanilkumar) కొత్త సినిమా '8 వసంతాలు.' మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. మొదటి విడుదలైన గ్లింప్స్‌లో అద్భుతమైన లొకేషన్స్‌తో పాటు హీరోయిన్ ఎలివేషన్‌తో చూపిస్తే.. ఇప్పుడు టీజర్లో మంచి కంటెంట్ ఉన్న లైన్‌తో ఎమోషనల్‌గా చూపించారు ఈ చిత్రాన్ని ఫణింద్ర(Phanindra Narsetti) తెరకెక్కిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 3' ఐటెమ్ సాంగ్.. ఆ హీరోయిన్ అయితే సూపర్ హిట్టే: దేవిశ్రీ ప్రసాద్)'8 వసంతాలు'(8 Vasantalu) చిత్రం మార్షల్ ఆర్ట్స్ ప్రధానంశంగా ఉండనుంది. అమ్మాయిలు ఈ పోటీకి పనికిరారు అనే వివక్షను తొలగించే బలమైన పాత్రలో అనంతిక నటించింది. టీజర్‌తోనే సినిమాపై మంచి అంచనాలను చిత్ర యూనిట్ కల్పించింది. మ్యాడ్ మూవీలో జెన్నీ పాత్రలో అనంతిక సనీల్‌కుమార్ అదరగొట్టింది. ఇప్పుడు ఆమె మ్యాడ్ సిక్వెల్లో కూడా నటిస్తుంది. ఈ మూవీతో ఆమె చాలామంది యూత్‌కు క్రష్‌గా మారిపోయింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ చిత్ర పరిశ్రమకు రాకముందిఅనంతిక సనీల్‌కుమార్ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ వివిధ రకాల కంటెంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు షేర్ చేస్తుండేది. అలా గుర్తింపు రావడంతో తెలుగులో మొదట రోజ్ మిల్క్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అయితే, మ్యాడ్ సినిమాతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. అనంతికకు కర్రసాముతో పాటు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంది. ఆమెకు క్లాసికల్ డ్యాన్స్ కూడా వచ్చు. -
'అక్కడ ఎక్కడో చావడానికి రూ.70 లక్షలా?'.. ఆసక్తిగా టీజర్
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం పరదా. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఆనంద మీడియా బ్యానర్లో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హీరో దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు.టీజర్ చూస్తే ఈ మూవీని సోషియో ఫాంటసీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. 'పిచ్చి గిచ్చి పట్టిందా తనకీ.. అక్కడ ఎక్కడో చావడానికి 70 లక్షలు ఇస్తుందట' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. టీజర్ చూస్తే ఈ కథ అంతా పర్వత ప్రాంతాల్లోనే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లాంటి ఎత్తైన ప్రాంతాల్లో ఉండే గ్రామీణ సంప్రదాయాలు, ఆచారాల నేపథ్యంలో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
పవర్ఫుల్ డైలాగ్స్‌తో భైరవం.. టీజర్ చూశారా?
హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భైరవం. ఇది తమిళ 'గరుడన్' సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి సోమవారం (జనవరి 20) టీజర్ రిలీజ్ చేశారు. రాత్రి నాకో కల వచ్చింది. చుట్టూ తెగిపడిన తలలు, మొండాలు.. అంటూ జయ సుధ చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. శీనుగాడి కోసం నా ప్రాణాలిస్తా.. వాడి జోలికెవడైనా వస్తే ప్రాణాలు తీస్తా అని మనోజ్ పవర్ఫుల్ డైలాగ్ చెప్పాడు. యాక్షన్‌కు ఢోకా లేదన్నట్లుగా ఉన్న ఈ టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాను కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్‌తో పాటు ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్, రాజా రవీంద్ర, సంపత్ రాజ్, సందీప్ రాజ్, వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చదవండి: అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ -
'మనకు తెల్లగా చేసుడే కాదు.. తోలు తీసుడు కూడా వచ్చు'.. టీజర్ చూశారా?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం లైలా. గతేడాది మెకానిక్ రాకీతో అలరించిన హీరో.. ఈ లవర్స్ డే రోజున ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. లైలా టీజర్ చూస్తుంటే ఫుల్ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లేడీ గెటప్లోనూ ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు. 'మనకు తెల్లగా చేసుడే కాదు.. తోలు తీసుడు కూడా వచ్చు' అనే డైలాగ్ మాస్ కా దాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా టీజర్ చూసేయండి. కాగా.. ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. Welcome to the world of #Laila filled with fun, action and romance ❤🔥The Echipaad #LailaTeaser out now 💥💥▶️ https://t.co/YHl8j4IgAKGRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th @RAMNroars #AkankshaSharma @leon_james @sahugarapati7 @Shine_Screens @JungleeMusicSTH pic.twitter.com/OQ5I4yzaJN— VishwakSen (@VishwakSenActor) January 17, 2025 -
అర్థమైందా.. రాజా!
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ నిర్మించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘జైలర్’ (2023). ఈ మూవీకి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రానుంది. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లోనే తెరకెక్కనున్న ‘జైలర్ 2’ సినిమాను సంక్రాంతి సందర్భంగా ప్రకటించారు మేకర్స్. త్వరలోనే చిత్రీకరణనుప్రారంభించనున్నట్లు ‘జైలర్ 2’ అనౌన్స్మెంట్ టీజర్లో వెల్లడించారు. ‘టైగర్ కా హుకుమ్’ సాంగ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు వీడియో చివర్లో ‘అర్థమైందా.. రాజా’ అనే ఓ డైలాగ్ ఉంది. ‘జైలర్ 2’ కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందని కోలీవుడ్ సమాచారం. సన్‌పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. -
సేమ్ లుక్.. సేమ్ స్టైల్.. యష్ 'టాక్సిక్' టీజర్ పై ట్రోల్స్..!
-
ఉత్కంఠభరితంగా వరుణ్ సందేశ్ 'కానిస్టేబుల్' టీజర్
క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ చిత్రాలకు ఆడియెన్స్ ఎప్పుడూ మొగ్గు చూపుతూనే ఉంటారు. అలాంటి ఓ ఇంటెన్స్ జానర్ మూవీతో వరుణ్ సందేశ్ రాబోతున్నారు. వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం 'కానిస్టేబుల్'. ఈ చిత్రంతో మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయం కానున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన రిలీజ్ చేశారు.ఈ టీజర్ చూస్తుంటే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇచ్చేలా ఉంది. ఓ అమ్మాయి అతి దారుణంగా హత్యకు గురవ్వడం, ఆ హత్యను ఛేదించే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో వరుణ్ సందేశ్ కనిపించబోతున్నారని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇక ఈ టీజర్‌లోని విజువల్స్, ఆర్ఆర్ క్రైమ్, థ్రిల్లర్ జానర్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. ఈ టీజర్‌తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. నాలుగు భాషల్లో ఈ టీజర్ అందుబాటులో ఉంది. వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు ఈ చిత్రంలో నటించారు. -
ఆకట్టుకుంటున్న ‘కోర’ టీజర్
యాక్షన్ జానర్, పీరియాడిక్ డ్రామాతో వస్తున్న చిత్రాలకు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి తరుణంలోనే కన్నడ నుంచి మరో యాక్షన్ మూవీ రాబోతోంది. ఒరాటశ్రీ దర్శకత్వంలో సునామీ కిట్టి హీరోగా ‘కోర’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చరిష్మా, పి.మూర్తి ప్రధాన పాత్రలను పోషించారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్, రత్నమ్మ మూవీస్ బ్యానర్ల మీద డా.ఎ.బి.నందిని, ఎ.ఎన్.బాలాజీ, పి.మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ కోర మీద అంచనాలు పెంచేశాయి.తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ మూవీ టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేస్తూ టీంకు అభినందనలు తెలిపారు. ఇక కోర టీజర్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లతో సరైన పాన్ ఇండియన్ మూవీలా కోర తెరకెక్కింది. టీజర్లో చూపించిన విజువల్స్, కెమెరా వర్క్, ఆర్ఆర్, యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియెన్స్‌కు ఐ ఫీస్ట్‌లా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సెల్వం మాతప్పన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తుండగా.. బిఆర్ హేమంత్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కె.గిరీష్ కుమార్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. -
దిల్రూబా టీజర్: ప్రేమ గొప్పది.. కానీ అదిచ్చే బాధే భయంకరంగా ఉంటుంది!
క సినిమాతో కెరీర్లో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). అతడి పనైపోయిందని విమర్శించినవారితోనే భలే సినిమాతో వచ్చాడని మెచ్చుకునేలా చేశాడు. ప్రస్తుతం ఇతడు దిల్రూబా అనే చిత్రంలో నటిస్తున్నాడు. రుక్సర్ ధిల్లన్ కథానాయిక. ఈ మూవీతో విశ్వ కరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.శుక్రవాం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. మ్యాగీ తన ఫస్ట్ లవ్ అని.. మార్చిలో ఎగ్జామ్స్ ఫెయిలయినట్లు మొదటి ప్రేమలో విఫలమయ్యానంటూ హీరో వాయిస్‌తో టీజర్ మొదలవుతుంది. మార్చి పోతే సెప్టెంబర్ వచ్చినట్లు నా లైఫ్‌లోకి అంజలి వచ్చిందంటూ హీరోయిన్ను చూపించారు. వీళ్ల ప్రయాణం, గొడవలు.. ఇలా అన్నింటినీ చూపించారు. దీనికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇచ్చిన క్లాసిక్ మ్యూజిక్ అదనపు ఆకర్షణగా ఉంది.ప్రేమ గురించి చెప్పడమైపోగానే కిరణ్ యాక్షన్ మోడ్‌లోకి మారాడు. తనకు అడ్డొచ్చినవారిని కోపంతో చితక్కొట్టాడు. ప్రేమ చాలా గొప్పది.. కానీ అదిచ్చే బాధే చాలా భయంకరంగా ఉంటుంది అన్న డైలాగ్‌తో టీజర్ ముగిసింది. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ మూవీలో నజియా కీలక పాత్రలో నటిస్తోంది. దవ -
'స్వీయ నాశనానికి మూడు ద్వారాలు ఉన్నాయి'.. ఆసక్తిగా టీజర్
పొలిమేర మూవీ సిరీస్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టిన టాలీవుడ్ నటుడు సత్యం రాజేశ్(satyam Rajesj>). తాజాగా మరో హిస్టారికల్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడైన బార్బరికుడి కథతో వస్తోన్న లేటేస్ట్ మూవీ 'త్రిబాణధారి బార్బరిక్'. ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ఠ ఎన్.సింహ, ఉదయభాను కీలక పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను(Tribanadhari Barbarik Teaser) మేకర్స్ రిలీజ్ చేశారు. పురాణాల్లో పాత్రల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'స్వీయ నాశనానికి మూడు ద్వారాలు ఉన్నాయి' అనే డైలాగ్ ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్ర, ప్రభావతి, మేఘన, కార్తికేయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
భయపెట్టేలా ‘కరావళి’ టీజర్
ప్రస్తుతం ఆడియెన్స్‌ను ఆకట్టుకోవాలంటే కథలో ఏదో ఒక కొత్త పాయింట్ ఉండాలి. ఇది వరకు చూడనటువంటి కంటెంట్‌ను, కాన్సెప్ట్‌ను చూపిస్తేనే ఆడియెన్స్ థియేటర్ వరకు వస్తున్నారు. ఈ క్రమంలో కన్నడలో డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ అంటూ అందరినీ మెస్మరైజ్ చేసే కంటెంట్, కాన్సెప్ట్‌తో వస్తున్నారు.‘అంబి నింగే వయసైతో’ తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గురుదత్త గనిగ ‘కరావళి’ మూవీని తెరకెక్కిస్తున్నారు. వీకే ఫిల్మ్స్ బ్యానర్‌తో కలిసి గురుదత్త గనిగ ఫిల్మ్స్ బ్యానర్ మీద గురుదత్త గనిగ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, ప్రోమో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఈ టీజర్లోనే గూస్ బంప్స్ మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి.మహిషాలకు, మానవులకు మధ్య జరిగే కాన్సెప్ట్‌లా ఈ టీజర్లో ఏదో కొత్త కథను చూపించారు. 'పిశాచి రాక' అంటూ వదిలిన ఈ టీజర్‌లోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, ఆర్ఆర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ రాబోతోందని ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు.సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సల్మాన్ ఖాన్, మురుగదాస్ యాక్షన్ టీజర్ విడుదల
సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సికందర్’. సల్మాన్ ఖాన్ పుట్టినరోజు కానుకగా ఆ చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ ప్రాజెక్ట్‌లో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనుంది. సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాను నిర్మించనున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా 2025 రంజాన్ కానుకగా విడుదల కానుంది. యానిమల్, పుష్ప వంటి చిత్రాలతో రష్మికకు బాలీవుడ్లో క్రేజ్ పెరిగింది. ఇప్పుడు సికందర్ మూవీ ఆమెకు మరింత పాపులరాటిని తీసుకురావచ్చని చెప్పవచ్చు. -
'అంబానీ మామ.. నీకు వంద రీచార్జులు'.. నవీన్ పొలిశెట్టి కొత్త సినిమా టీజర్
హీరోలు కూడా అలవోకగా కామెడీ పండించగలరు అని నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నిరూపించాడు. తను నోరు విప్పితే చాలు ఏదో ఒక పంచ్ రావాల్సిందే.. ప్రేక్షకుల పొట్ట చెక్కలవ్వాల్సిందే! నేడు (డిసెంబర్ 26న) నవీన్ పొలిశెట్టి బర్త్‌డే. ఈ సందర్భంగా అతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా (Anaganaga Oka Raju Movie) నుంచి రాజుగారి ప్రీవెడ్డింగ్ వీడియో రిలీజ్ చేశారు.ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యమంతే..టీజర్ ప్రారంభంలో పెళ్లికి వచ్చిన అతిథులందరికీ బంగారు పళ్లెంలో భోజనం వడ్డిస్తున్నారు. మరోవైపు రాజుగారు నవీన్ పొలిశెట్టి.. ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వీడియో చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ముకేశ్ అంబానీ ఫోన్ చేశాడట! ముకేశ్ మామయ్య... నీకు వంద రీచార్జులు.. ఇప్పుడే మన అనంత్ పెళ్లి క్యాసెట్ చూస్తున్నా.. అంటూ సంభాషణ మొదలుపెట్టాడు. తన ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యమంతే! జస్టిన్ బీబర్, కిమ్ కర్దాషియన్, జాన్ సేన.. అందరితో తన సంగీత్‌లో స్టెప్పులేయిస్తాడంటున్నాడు. చివర్లో పెళ్లికూతురు మీనాక్షి చౌదరితో ఫోటోషూట్ కూడా చేయించారు.ప్రీవెడ్డింగ్ వీడియో అదిరింది!ఈ ప్రీవెడ్డింగ్ వీడియో బ్లాక్‌బస్టర్ అవడం గ్యారెంటీ! మూడు నిమిషాల వీడియోలోనే ఇంత ఫన్ ఉంటే ఫుల్ సినిమా ఇంకే రేంజ్లో ఉంటుందోనని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇకపోతే... అనగనగా ఒక రాజు సినిమా విషయానికి వస్తే మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. తార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. -
సూర్య 'రెట్రో' సినిమా.. అలరిస్తున్న టీజర్
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ఈసారి అదిరిపోయే మాస్ కమ్ బ్యాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. గతనెలలో 'కంగువ' (Kanguva Movie) మూవీతో వచ్చాడు. ప్రేక్షకులు మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే 'బాహుబలి'లా తీద్దామనుకున్నారు కానీ మూవీ బెడిసికొట్టేసింది. ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజుతో ఓ మూవీ చేశారు. దానికి 'రెట్రో' (Retro Movie) అనే టైటిల్ ఖరారు చేయడంతో పాటు టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కేసీఆర్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)డీ గ్లామర్ లుక్‌తో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డేతో సూర్య మాట్లాడుతుంటాడు. నీతో ప్రేమ కోసం రౌడీయిజం, గుండాయిజం అన్ని వదిలేస్తున్నానని.. మీ నాన్న దగ్గర పనిచేయడం కూడా మానేస్తానని చెప్పడం బాగుంది. ఓవైపు ఇంటెన్స్ యాక్షన్ చూపిస్తూనే.. ప్రేమకథ కూడా ఉందనే విషయాన్ని టీజర్ చెప్పకనే చెప్పింది. వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలో మూవీని విడుదల చేస్తామని ప్రకటించారు.కార్తిక్ సుబ్బరాజు సినిమాలన్నీ సమ్‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉంటాయి. సూర్యతో చేసిన 'రెట్రో' టీజర్ చూస్తుంటే హిట్ కళ కనిపిస్తోంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే సూర్యకి హీరోగా కమ్ బ్యాక్ దొరుకుతుంది. ఎందుకంటే గత మూడేళ్లుగా 'కంగువ' కోసం పనిచేశారు. కానీ ఫలితం అనుకున్నట్లు రాలేదు. ఇప్పుడు 'రెట్రో' హిట్ కావడం అనేది సూర్య కెరీర్‌కి చాలా కీలకం. ప్రస్తుతానికి తమిళ టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. త్వరలో మిగతా భాషల టీజర్స్ విడుదల చేస్తారేమో?(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ) -
ఆటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా.. రిలీజైన టీజర్
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కొత్త సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'. సంపత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా దీన్ని లాంచ్ చేశారు. గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటిస్తోంది. త్వరలోనే సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్)తెలంగాణలోని రుద్రారం అనే ఊరి నేపథ్యంగా సినిమా ఉండనుంది. పరస్పరం గొడవలు పడే ఊరిలో లవ్ స్టోరీని చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నా రీసెంట్ మూవీ రామ్ నగర్ బన్నీ ఆడియెన్స్ కు బాగా రీచ్ అయ్యింది. నేను నా నెక్ట్స్ మూవీ ఎలా ఉండాలని అనుకున్నానో అలాంటి సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'. దీనికి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా అని చంద్రహాస్ చెప్పాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు) -
తేజ్ ఊచకోత చూస్తారు – రామ్ చరణ్
‘‘సంబరాల ఏటిగట్టు’ తేజుకి 18వ సినిమా. అందరికీ ఒకటే మాట చెబుతున్నా. తేజు ఊచకోత ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూడబోతున్నారు. ఔట్ స్టాండింగ్ విజువల్స్. డైరెక్టర్ రోహిత్ మొదటి సినిమా చేస్తున్నట్టుగా లేదు.. చాలా అద్భుతంగా తీస్తున్నాడు’’ అని రామ్ చరణ్ తెలిపారు. సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘ఎస్వైజీ’(సంబరాల ఏటిగట్టు) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాని 2025 సెప్టెంబర్ 25 తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మూవీ టైటిల్ టీజర్‌ని రామ్ చరణ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘తేజు ఈరోజు ఇక్కడ ఇలా నిలిచి ఉండటానికి కారణం అభిమానుల ఆశీర్వాదాలే. ఇది తనకి పునర్జన్మ. ఈ జన్మ అభిమానులే ఇచ్చారు. అంటే తను మా తేజ్ కాదు.. మీ తేజ్. తనపై ఇంత పెద్ద బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు నిరంజన్, చైతన్యగార్లను చూస్తే సినిమా పట్ల వారికి ఉన్న ప్యాషన్ తెలిస్తోంది. ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘తేజు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయిందంటే నమ్మశక్యంగా లేదు. మా విజయ దుర్గ అదృష్టవంతురాలు. తన పేరును తీసుకెళ్లి తన పేరులో పెట్టుకున్నాడు తేజు(సాయి దుర్గా తేజ్). అలాంటి కొడుకు ఉండటం అదృష్టం. తను మృత్యుంజయుడు’’ అని తెలిపారు. సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ–‘‘ఈ వేదికపై నేను ఉండటానికి కారణమైన మా ముగ్గురు మావయ్యలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ(అభిమానులు) అందరి ప్రేమను ΄÷ందే అదృష్టం నాకు దక్కింది. బైక్ నడుపుతున్నప్పుడు నేను హెల్మెట్ ధరిస్తాను.. మీరు కూడా హెల్మెట్ ధరించాలి’’ అని కోరారు. ‘‘ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, తేజుగారికి ధన్యవాదాలు’’ అన్నారు రోహిత్ కేపీ. ‘‘సంబరాల ఏటిగట్టు’ చాలా కొత్తగా, అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు చైతన్య రెడ్డి. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి, డైరెక్టర్స్ వైవీఎస్ చౌదరి, దేవా కట్టా, కిషోర్ తిరుమల, మారుతి, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, ఎస్కేఎన్ మాట్లాడారు. -
గేమ్ ఛేంజర్‌తో పోటీపడనున్న స్టార్ హీరో మూవీ.. టీజర్ వచ్చేసింది!
పశుపతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్. టాలీవుడ్లో జులాయి, అతడు, అరుంధతి చిత్రాలతో మెప్పించారు. తెలుగు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ప్రతినాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం ఫతే. ఈ మూవీకి తానే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఆ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సోనాలి సూద్, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు.తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే సైబర్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సైబర్ మాఫియా బారిన ఒక అమ్మాయిని హీరో ఏవిధంగా రక్షించాడు? అనే కోణంలో రూపొందించారని అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న బాలీవుడ్లో విడుదల కానుంది. దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో ఇప్పటికైతే క్లారిటీ ఇవ్వలేదు. అయితే అదే రోజున రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా రిలీజవుతోంది.किरदार ईमानदार रखना जनाज़ा शानदार निकलेगा ! 🪓 #Fateh Teaser out now 🔥Releasing in cinemas on 10th January. @Asli_Jacqueline @ZeeMusicCompany @ShaktiSagarProd @ZeeStudios_ Link: https://t.co/wfeG5hIR3W pic.twitter.com/LV0DCjv5rb— sonu sood (@SonuSood) December 9, 2024 -
రష్మిక 'గర్ల్‌ఫ్రెండ్'ని పరిచయం చేసిన దేవరకొండ
'పుష్ప 2'తో అందరి మనసుల్ని దోచేసిన రష్మిక.. ఇప్పుడు 'ద గర్ల్ ఫ్రెండ్'గా రాబోతుంది. ప్రముఖ నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తీస్తున్న ఈ సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీ. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ సాగడం విశేషం.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)'నీకని మనసుని రాసిచ్చేసా.. పడ్డానేమో ప్రేమలో బహుశా' అని విజయ్ దేవరకొండ చెబుతుంటే.. స్క్రీన్‌పై రష్మిక కనిపిస్తుంటే వీళ్లిద్దరి ఫ్యాన్స్‌కి కనులవిందుగా అనిపిస్తోంది. ఎందుకంటే చాన్నాళ్లుగా వీళ్ల రిలేషన్ గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్ టైంలో చూచాయిగా ప్రేమలో ఉన్నమన్నట్లు చెప్పారు. ఇప్పుడు ఈ టీజర్ చూస్తుంటే రష్మిక కోసం విజయ్ కవిత్వం చెబుతున్నాడేమో అనిపించింది.'ద గర్ల్ ఫ్రెండ్' సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. హేసమ్ అబ్దుల్ సంగీతమందించగా.. 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి.. రష్మికకు జోడిగా కనిపించబోతున్నాడు. టీజర్ మొత్తం రష్మిక క్లోజప్ షాట్స్ కనిపించాయి. ఇదంతా చూస్తుంటే ఈ మూవీలో రష్మిక యాక్టింగ్ అదరగొట్టేయబోతుందనిపిస్తోంది. బహుశా ఫిబ్రవరిలో మూవీ రిలీజ్ ఉండొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు) -
టాలీవుడ్ డైరెక్టర్ యాక్షన్ మూవీ.. సన్నీ డియోల్ యాక్టింగ్ చూశారా?
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటిస్తోన్న తాజా చిత్రం జాట్. ఈ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంలో రెజీనా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మూవీకి టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ పాన్ ఇండియా మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.(ఇది చదవండి: ఓటీటీలో కంగువా.. అనుకున్న తేదీకంటే ముందే స్ట్రీమింగ్)టీజర్ చూస్తే ఈ మూవీని ఫుల్ యాక్షన్ కథాంశంగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, స్వరూప ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా.. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. शैतान नहीं, भगवान नहीं जाट हैं वो 💥💥💥Action Superstar @iamsunnydeol in and as #JAAT 🔥🔥 🔥 #JaatTeaser out now ❤️🔥▶️ https://t.co/3WmWn7VEEhMASS FEAST loading in cinemas April 2025. 🙌 Produced by @MythriOfficial & @peoplemediafcy A @MusicThaman Mass Beat 🔥🔥… pic.twitter.com/77fPDP2mWl— Gopichandh Malineni (@megopichand) December 6, 2024 -
2040లో అసలేం జరగనుంది.. భయపెడుతోన్న టీజర్!
శాండల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం యూఐ ది మూవీ. ఈ చిత్రానికి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. లహరి ఫిల్మ్స్ అండ్ వెనుస్ ఎంటర్టైనర్స్ బ్యానర్లపై జి మనోహరన్, శ్రీకాంత్ కేపీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ చూస్తేటీజర్ చూస్తే ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనే ఈ సినిమాలో చూపించనున్నారు. 2040 కల్లా ఆహారం కోసం ఒకరిని ఒకరు చంపుకునే రోజులు రాబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. విజువల్స్ చూస్తుంటే కేజీఎఫ్ సినిమాను తలపిస్తోంది. మీ ధిక్కారం కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ ఉంటూ ఉపేంద్రం డైలాగ్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఆలస్యమెందుకు టీజర్ చూసేయండి. -
Osey Arundhathi Teaser: ఆసక్తికరంగా ‘ఒసేయ్ అరుంధతి! ’ టీజర్
‘వెన్నెల’ కిశోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు, ‘చిత్రం’ శ్రీను ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. విక్రాంత్ కుమార్ దర్శకత్వం వహించారు. పద్మ నారాయణ ప్రొడక్షన్స్‌పై ప్రణయ్ రెడ్డి గూడూరు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ‘ఒసేయ్ అరుంధతి’ టీజర్‌ను విడుదల చేశారు. ప్రణయ్ రెడ్డి గూడూరు మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా ‘ఒసేయ్ అరుంధతి’ నిర్మించాం. త్వరలో మా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. విక్రాంత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అరుంధతి పిల్లాడితో పాటు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. ఓసారి సత్యనారాయణ స్వామి వత్రం చేయాలనుకుంటుంది. అయితే అనుకోకుండా ఆమెకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తనని తాను కాపాడుకుంటూ ఇంటి పరువును ఎలా కాపాడుకుంది? అనేదే ‘ఒసేయ్ అరుంధతి’ చిత్రకథ. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది’’ అన్నారు. -
అప్పడప్పుడు ఆ అలవాటు కూడా ఉందంటూ.. 'బచ్చల మల్లి' టీజర్
అల్లరి నరేశ్ కొత్త సినిమా 'బచ్చల మల్లి' నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. డిసెంబర్ 20న ఈ మూవీ రిలీజ్ కానుంది. 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుబ్బు మంగదేవి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా.. రావు రమేశ్,రోహిణి, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా బచ్చల మల్లి సినిమాను నిర్మిస్తున్నారు.‘బచ్చల మల్లి’ సినిమాలో అల్లరి నరేశ్ లుక్ చాలా రగ్గడ్‌గా ఉంది. ఈ మూవీ టీజర్ గమనిస్తే ఆయన పాత్ర చాలా మాస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే డైలాగ్స్ మెప్పించేలా ఉన్నాయి. 'మందుతో పాటు అప్పడప్పుడు నాకు అమ్మాయిల అలవాటు కూడా ఉంది' అంటూ అల్లరి నరేశ్ చెప్పే డైలాగ్స్ యూత్‌ను ఆకట్టుకునేలా టీజర్లో ఉన్నాయి. డిసెబర్ 20న ఈ మూవీ విడుదల కానుంది. -
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్.. డిటెక్టివ్ టీజర్ చూశారా?
టాలీవుడ్ నటుడు వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. చంటబ్బాయ్ తాలుకా అనే ఉపశీర్షిక. ఈ సినిమాకు ప్రముఖ రచయిత మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో వెన్నెల కిశోర్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే క్రైమ్ కామెడీ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వెన్నెల కిశోర్ యాక్టింగ్ ఫర్మామెన్స్తో తెగ ఆకట్టుకుంటోంది. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నారు. -
నయనతార విశ్వరూపం మీరూ చూసేయండి
లేడీ సూపర్‌స్టార్ నయనతార పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చింది. తాజాగా తన నటించనున్న కొత్త సినిమా టైటిల్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న నయన్ 'రక్కయీ' (RAKKAYIE) అనే కొత్త సినిమాను ప్రకటించింది. కథలో ఉమెన్ పాత్రకు ఎక్కువ ప్రధాన్యతను ఇచ్చేలా టీజర్ ఉంది. ఈ చిత్రానికి సెంథిల్ నల్లసామి దర్శకత్వం వహిస్తున్నారు. డ్రమ్ స్టిక్స్ ప్రోడక్షన్, మూవీ వర్స్‌ఇండియా సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. తల్లి పాత్రలో నటిస్తున్న నయన్తన కూతురు కోసం చేసే పోరాటం చాలా భయంకరంగా ఉండబోతుందని దర్శకుడు టీజర్లోనే చూపించాడు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. -
టీజర్లోనే ఇన్ని బూతులు ఉంటే.. ఇక సినిమా పరిస్థితి ఏంటో..?
ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో బూతు డైలాగ్స్‌కు ఎలాంటి కొదవ లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా టీజర్,ట్రైలర్లోనే కొన్ని డైలాగ్స్‌తో సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వచ్చిన 'డ్రింకర్ సాయి' సినిమా టీజర్ కూడా అదే కోవకు చెందినట్లు కనిపిస్తుంది. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్లు ‘డ్రింకర్ సాయి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్ కూడా ఉంచారు. ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్‌ను డైరెక్టర్ మారుతి లాంచ్ చేసిన విషయం తెలిసిందే.యూత్‌ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ డ్రింకర్ సాయి చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్లో ఎక్కువగా బోల్డ్ డైలాగ్స్‌తో పాటు ధర్మ , ఐశ్వర్య శర్మ లవ్ స్టోరీ హైలెట్‌గా కనిపిస్తుంది. వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ యూత్‌ను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ ఐశ్వర్య శర్మకు యూత్ ఫిదా అవుతున్నారు. షోషల్ మీడియాలో ఆమె డైలాగ్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రమ్, బిగ్ బాస్ ఫేమ్ కిర్రాక్ సీత, రీతూ చౌదరి, ఫన్ బకెట్ రాజేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
బాలకృష్ణ 'డాకు మహారాజ్' టీజర్ రిలీజ్
కొన్నిరోజులుగా అనుకుంటున్నట్లే బాలకృష్ణ కొత్త సినిమాకు 'డాకు మహారాజ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దాదాపు 96 సెకన్ల నిడివి ఉన్న టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో నల్లని గుర్రంపై కనిపించిన బాలయ్యకు.. డైరెక్టర్ బాబీ అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చాడు. దానికి తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే రేంజ్ అనేలా కొట్టాడు.(ఇదీ చదవండి: అల్లు వారి పెళ్లి సందడి.. ఆశీర్వదించిన చిరు, బన్నీ)'ఈ కథ వెలుగుని పంపే దేవుడిది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు, ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది.. కండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది.. మరణాన్నే వణికించిన మహారాజుది' అనే వాయిస్ ఓవర్ ఆగగానే.. 'మహారాజ్, డాకు మహారాజ్' అని బాలకృష్ణ చెప్పడం ఆకట్టుకుంది.ఇందులో బాలయ్యతో పాటు చౌందిని చౌదరి, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్ తదితరులు నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు) -
డబ్బు కోసం ఏమైనా చేసే 'రాబిన్ హుడ్' టీజర్ విడుదల
'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. టైటిల్ ప్రకటించిన సమయం నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్ అందిస్తున్నారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. -
కార్తీ కొత్త మూవీ టీజర్.. టైటిల్ వింతగా ఉందేంటి?
ఇటీవల సత్యం సుందరం మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ స్టార్ కార్తీ. గతనెల విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో అరవింద్ స్వామి కీలకపాత్ర పోషించారు.అయితే కార్తీ తాజాగా మరో సినిమాకు రెడీ అయిపోయారు.కార్తీ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం వా వాతియార్. ఇందులో ఉప్పెన భామ కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.కాగా.. ఈ చిత్రానికి సంతోశ్ నారాయణన్ సంగీతమందిస్తున్నారు. వా వాతియార్ మూవీలో సత్యరాజ్, రాజ్‌కిరణ్, ఆనంద్ రాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్, జీఎం సుందర్, రమేష్ తిలక్, పీఎల్ తేనప్పన్, విద్యా బోర్గియా, నివాస్ అద్ధితన్, మధుర్ మిట్టల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. ఒక్క రోజులోనే క్రేజీ రికార్డ్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది. విడుదలకు మరో రెండు నెలల టైమ్ ఉండడంతో వరుస మూవీ అప్డేట్స్తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ రిలీజైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. అన్ని భాషల్లో కలిపి ఒక్క రోజులోనే ఏకంగా 55 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్ ద్వారా పంచుకుంది. రామ్ చరణ్ పోస్టర్ షేర్ చేస్తూ వెల్లడించింది. దీంతో చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గ్లోబల్ స్టార్ రేంజ్ ఇదేనంటూ కామెంట్స్ పెడుతున్నారు.కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ నటుడు ఎస్జే సూర్య ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.అంతకుముందు పొంగల్ బరిలో చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర విడుదల కావాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా ఆ మూవీ పోటీ నుంచి తప్పుకోవడంతో గేమ్ ఛేంజర్ రేసులో నిలిచింది. మెగాస్టార్ నటిస్తోన్న విశ్వంభర చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. Crazy 55 Million+ Views ♥️Off the charts, right into the audience’s hearts😍#GameChangerTeaser 💥🔗 https://t.co/ihtvtgPel9In cinemas worldwide from 10th Jan.GlobalStar @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @yoursanjali @iam_SJSuryah @MusicThaman @actorsrikanth… pic.twitter.com/dQmzVtVtFU— Sri Venkateswara Creations (@SVC_official) November 10, 2024 -
గేమ్ ఛేంజర్ టీజర్ సెన్సేషన్.. మెగా హీరోస్, ఫ్యాన్స్ కు పండగే..
-
'గేమ్ ఛేంజర్' టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Game Changer Teaser: వాడు మంచోడే కానీ కోపమొస్తే 'గేమ్ ఛేంజర్' టీజర్
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పేరున్న సిటీ లక్నోలో ఈ మూవీ టీజర్‌ను మొదట విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు జిల్లా కేంద్రాల్లోని థియేటర్లలో గేమ్ ఛేంజర్ టీజర్‌ను విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న రిలీజ్ కానుంది. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో సిటీలతో పాటు దేశవ్యాప్తంగా 11 చోట్ల టీజర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.గేమ్ ఛేంజర్’ చిత్రంలో రామ్ చరణ్ ఎన్నికలను సజావుగా నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా రానుంది. ఇందులో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ సహ నిర్మాత. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. -
నా మార్కెట్ పడిపోయిందని చాలామంది అన్నారు: పూజా
జీవితంలో ఎవరికైనా జయాపజయాలు సహజం. విజయాలతో విర్రవీగిన మహామహులు కూడా అపజయాలను చవి చూశారు. ఇందుకు సినీ తారలు అతీతం కాదు. నటి పూజాహెగ్డే విషయానికి వస్తే ఈ ఉత్తరాది భామ గత 12 ఏళ్ల క్రితం టాలీవుడ్,కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. అయితే, తెలుగులోనే ఎక్కువ చిత్రాల్లో నటించారు. తమిళ చిత్రాల నుంచి ఎప్పుడో ఎగ్జిట్ అయిపోయారు. ఇప్పుడు రీఎంట్రీలో కూడా తెలుగుతో పాటు తమిళ్లో మళ్లీ అవకాశాలు దక్కుతున్నాయి.గతంలో మహేశ్‌బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించిన చిత్రాలు సూపర్‌హిట్ కావడంతో పూజాహెగ్డేకు ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చేసింది. దీంతో కోలీవుడ్ స్వాగతం పలికింది. అయితే అలా తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ చిత్రం కూడా పూర్తిగా నిరాశ పరిచింది. అదే సమయంలో టాలీవుడ్, బాలీవుడ్లో పూజాహెగ్డే నటించిన చిత్రాలు ప్లాప్ కావడంతో ఇక ఈ అమ్మడి పనైపోయింది అనే ప్రచారం జోరందుకుంది. కాగా ప్రస్తుతం హిట్స్ లేకపోయినా భారీ అవకాశాలు పూజాహెగ్డే తలుపు తట్టడం విశేషం. తమిళంలో సూర్యకు జంటగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించి పూర్తి చేశారు. తాజాగా నటుడు విజయ్‌తో ఆయన 69వ చిత్రంలో జత కడుతున్నారు. అలాగే తెలుగులోనూ అవకాశాలు రావడం మొదలెట్టాయి. ఈ సందర్బంగా నటి పూజాహెగ్డే ఒక భేటీలో తన కెరీర్ గురించి పేర్కొంటూ తన మార్కెట్ పడిపోయిందనే ప్రచారం గురించి తాను ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. అలాగే అపజయాల గురించి బాధ పడిందిలేదు, భయపడింది లేదన్నారు. తన వరకూ తాను తన పాత్రలకు వంద శాతం న్యాయం చేస్తున్నానని, మంచి టైమ్ కోసం సహనంగా ఎదురు చూస్తున్నానని అన్నారు. ప్రస్తుతం 5 చిత్రాల్లో నటిస్తున్నట్లు ,అందులో రెండు తమిళం, ఒక హిందీ చిత్రాలు ఉన్నాయని నటి పూజాహెగ్డే పేర్కొన్నారు. -
'గేమ్ చేంజర్' టీజర్.. అక్కడ గ్రాండ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న రిలీజ్ కానుంది. హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పేరున్న సిటీ లక్నోలో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేసింది. ఆపై ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో సిటీల్లో టీజర్ లాంచ్ కానుంది. నవంబర్ 9న గ్రాండ్‌గా గేమ్ చేంజర్ టీజర్‌ను విడుదల చేయనున్నారు.భారీ అంచనాలున్న గేమ్ చేంజర్ టీజర్ ఈవెంట్‌కు రామ్ చరణ్, కియారా అద్వానీ, డైరెక్టర్ శంకర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ‘జరగండి జరగండి.. ’, ‘రా మచ్చా రా..’ సాంగ్స్‌కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ నెల 9న టీజర్ రిలీజ్ అయ్యాక ఈ చిత్రంపై అంచనాలు మరింత రేంజ్లో పెరగనున్నాయి. టీజర్ కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.‘గేమ్ చేంజర్’ చిత్రంలో రామ్ చరణ్ ఎన్నికలను సజావుగా నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అవినీతి రాజకీయ నాయకుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎలక్షన్స్‌ను నిబద్ధతతో నిర్వహించే ఆఫీసర్‌గా మెప్పించనున్నారు. జనవరి 10న రిలీజ్ కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ సహ నిర్మాత. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. Ready, Set... Command 😎Get ready for #GameChanger ‘s charge in Lucknow ❤️🔥🧨#GameChangerTeaser launch event on 9th NOVEMBER in Lucknow, UP.#GameChanger takes charge in theatres on JAN 10th ❤️🔥Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @iam_SJSuryah… pic.twitter.com/gq9LXHCs1y— Sri Venkateswara Creations (@SVC_official) November 5, 2024 -
'తెరి' హిందీ రీమేక్ మూవీ టీజర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో విజయ్ హిట్ సినిమాల్లో 'తెరి' ఒకటి. దీన్నే 'పోలీసోడు' పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా హిట్ అయింది. ఆల్రెడీ తెలుగు వచ్చిన మూవీ పవన్ కల్యాణ్ రీమేక్ చేస్తున్నాడు. అదే 'ఉస్తాద్ భగత్ సింగ్' అని టాక్. చాలా ఏళ్ల క్రితమే ఇది మొదలైంది కానీ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. మరోవైపు 'తెరి'ని హిందీలోనూ రీమేక్ చేశారు. 'బేబీ జాన్' పేరుతో దీన్ని తీస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)ఒరిజినల్లో విజయ్, సమంత, అమీ జాక్సన్ చేయగా.. అదే పాత్రల్లో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామికా గబ్బి నటించారు. టీజర్ చూస్తే చూచాయగా అదే కథ అని అర్థమైపోయింది. కాకపోతే అప్పట్లో ఓ మాదిరి మాస్ చూపిస్తే ఇప్పుడు ఎలివేషన్స్ కోసమా అన్నట్లు మూవీ తీసినట్లు కనిపిస్తుంది. సంగీతమందించిన తమన్ అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో హోరెత్తించాడు. టీజర్ చూస్తుంటే హిట్ కొట్టేలానే ఉంది.డిసెంబరు 25న 'బేబీ జాన్' థియేటర్లలోకి రానుంది. 'తెరి' దర్శకుడు అట్లీ దగ్గర సహాయకుడిగా చేసిన కలీస్.. ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. నిర్మాతల్లో అట్లీ భార్య కూడా ఒకరు. చాలా రోజుల నుంచి బాలీవుడ్లో సరైన మాస్ మూవీ రాలేదు. మరి ఆ లోటుని 'బేబీ జాన్' తీరుస్తుందేమో చూడాలి.(ఇదీ చదవండి: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?) -
నాగార్జున 'కుబేర'.. ఫ్యాన్స్‌కు దీపావళీ అప్డేట్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ ధనుశ్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం కుబేర. ఈ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. దీపావళి సందర్భంగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈనెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ విడుదల చేస్తూ అనౌన్స్మెంట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో ఇదివరకెన్నడూ చేయని ఓ సరికొత్తపాత్రలో ధనుష్ కనిపించనున్నరు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని ఇప్పటికే చిత్రయూనిట్ పేర్కొంది. బాలీవుడ్ నటుడు జిమ్‌సర్భ్ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Wishing you a sparkling Diwali from #SekharKammulasKubera! 💥The wait is almost over!!Catch the explosive #KuberaTeaser on Kartik Purnima, November 15th! 💥🔥@dhanushkraja KING @iamnagarjuna @iamRashmika @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @AsianSuniel @SVCLLP… pic.twitter.com/9vAsnAv4tu— Annapurna Studios (@AnnapurnaStdios) November 1, 2024 -
లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'అనంతం'.. టీజర్ రిలీజ్ చేసిన టాలీవుడ్ హీరో!
వెంకట్ శివకుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం తాజా చిత్రం "అనంతం". ఈ సినిమాలో రుచిత సాధినేని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీని ఆరుద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ లక్ష్మి, సుధీర్ నిర్మిస్తున్నారు. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీని టీజర్ విడుదల చేశారు మేకర్స్. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ టీజర్ అద్భుతంగా ఉందని నిఖిల్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా.. ఈ చిత్రంలో రామ్ కిషన్, స్నిగ్ధ నయని, వసంతిక మచ్చ, చైతన్య సగిరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.నిర్మాతలు మాట్లాడుతూ - 'మా మూవీ టీజర్ రిలీజ్ చేసిన హీరో నిఖిల్‌కు థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన ఎంతో బిజీగా ఉన్నా మాకు టైమ్ ఇచ్చారు. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను నిర్మించాం. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చాలా ఇంట్రెస్టింగ్గా మూవీ ఉంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించి థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తాం' అని అన్నారు. -
గోద్రా అల్లర్లపై సినిమా.. టీజర్ ఎలా ఉందంటే?
నిజజీవిత సంఘటనలు, వివాదాలపై హిందీలో ఎప్పటికప్పుడు సినిమాలు వస్తూనే ఉంటాయి. 'ద కశ్మీర్ ఫైల్స్', 'ద కేరళ స్టోరీ' చిత్రాలు అలాంటివే అని చెప్పొచ్చు. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు, మళ్లీ ఓటీటీలోకి ఈ మూవీస్ వచ్చిన టైంలో రచ్చ రచ్చ జరిగింది. ఇప్పుడు మరో కాంట్రవర్సీ కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం ఒకటి విడుదలకు సిద్ధమైంది. తాజాగా టీజర్ రిలీజ్ చేయడంతో వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్)2002లో గుజరాత్‌లోని గోద్రాలో అల్లర్లు జరిగాయి. సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ని దుండగులు దహనం చేశారు. ఈ వివాదం చాలా ఏళ్ల పాటు కోర్టులో నడిచింది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌పై సినిమా అంటే సాహసమనే చెప్పాలి. టీజర్ మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. '12th ఫెయిల్' విక్రాంత్ మస్సే, రాశీఖన్నా ఇందులో లీడ్ రోల్స్ చేశారు.టీజర్ బట్టి చూస్తే 'ద సబర్మతి రిపోర్ట్' మూవీ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. హృదయాన్ని కదిలించే ప్రమాద దృశ్యాలు, మతపరమైన ఉద్రిక్తతలు, మరోవైపు ఆ ఘటన చుట్టూ చోటుచేసుకున్న రాజకీయాల నేపథ్యంలో అసలు నిజం ఏంటనే కాన్సెప్ట్‌తో సినిమా తీసినట్లు అనిపిస్తుంది. నవంబరు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. కంటెంట్ చూస్తుంటే కాంట్రవర్సీ అయ్యేలానే ఉంది మరి!(ఇదీ చదవండి: పవన్ సినిమా రీమేక్ కాదు.. అప్పుడో మాట ఇప్పుడో మాట!) -
సినీ చరిత్రలోనే తొలిసారి... ఓకేసారి మూడు వర్షన్స్
ఆర్జీవీ సమర్పణలో తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం శారీ. ఈ సినిమాలో కోలీవుడ్ భామ ఆరాధ్యదేవి లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం ఈ బోల్డ్ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ పంచుకున్నాడు రాంగోపాల్ వర్మ. ఈ చిత్రంలోని సాంగ్‌కు సంబంధించిన టీజర్‌ను ఆర్జీవీ రిలీజ్ చేశారు. కేవలం టీజర్‌తోనే సాంగ్‌పై అంచనాలను మరింత పెంచేశాడు. ఈ సినిమాలోని ఐ వాంట్ లవ్ అనే పాటకు సంబంధించిన మూడు వర్షన్ల ప్రోమోను ఆర్జీవీ తన ట్విటర్ ద్వారా విడుదల చేశారు. సినిమా చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ మూవీలోని సాంగ్ టీజర్ చూస్తుంటే కుర్రకారుకు హీటు పుట్టించేలా ఉంది. పూర్తి పాటను అక్టోబర్ 17న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఆర్జీవీ వెల్లడించారు.సినీ చరిత్రలో ఏఐ ద్వారా రూపొందించిన ఒకే పాటకు మూడు వర్షన్స్ రిలీజ్ చేయడం విశేషం. కాగా.. ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ సమర్పణలో.. గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సాంగ్‌లో ఆరాధ్యదేవి తన అందాల ఆరబోత ఖాయంగా కనిపిస్తోంది.Here’s a sneak peak teaser reel of I WANT LOVE AI song ONE (Crazy ) from SAAREE film featuring https://t.co/4vViOc25qQ Full song releasing Oct 17 th 5 pm #SaareeSongsAI #RGVsSAAREE pic.twitter.com/RgNnwHGdx6— Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2024 -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఘటికాచలం.. ఆసక్తిగా టీజర్!
నిఖిల్ దేవాదుల, సమ్యు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఘటికాచలం. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి అమర్ కామేపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంసీ రాజు కథ అందించారు. ఈ చిత్రానికి ఫేవియో సంగీతమందిస్తున్నారు. -
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో '8 వసంతాలు' టీజర్
మ్యాడ్ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా గుర్తింపుపొందిన అనంతిక సానీల్కుమార్ నటిస్తున్న కొత్త సినిమా '8 వసంతాలు.' మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. అద్భుతమైన లొకేషన్స్‌తో పాటు మంచి కంటెంట్ ఉన్న లైన్‌తో ఈ సినిమాను ఫణింద్ర తెరకెక్కిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.'8 వసంతాలు' చిత్రం నుంచి 'శుద్ధీ అయోధ్య టీజర్' పేరుతో చిత్ర యూనిట్ ఒక వీడియోను పంచుకుంది. మార్షల్ ఆర్ట్స్ ప్రధానంశంగా ఈ చిత్రం ఉండనుంది. అమ్మాయిలు ఈ పోటీకి పనికిరారు అనే వివక్షను తొలగించే బలమైన పాత్రలో అనంతిక నటించింది. టీజర్‌తోనే సినిమాపై మంచి అంచనాలను చిత్ర యూనిట్ కల్పించింది. -
'అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలేరా?'.. ఆసక్తిగా టీజర్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. తాజాగా దసరా సందర్భంగా ఆయుధ పూజకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు మేకర్స్.అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఫ్యాన్స్‌కు మరో సర్ప్రైజ్ ఇచ్చాడు హీరో నిఖిల్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ అభిమానులను పలకరించేందుకు వచ్చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ రివీల్ చేసిన మేకర్స్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.అప్పుడో ఇప్పుడో ఎప్పుడో టీజర్ చూస్తుంటే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. లండన్ వెళ్లి తెల్లపిల్లను పడేసి ప్రపంచమంతా చుట్టేద్దామనుకున్నాడు అనే డైలాగ్ వింటే లవ్ అండ్ యూత్‌ఫుల్ స్టోరీ అని అర్థమవుతోంది. 90 శాతం మంది అబ్బాయిలు మందు తాగడానికి కారణం అమ్మాయిలేరా అనే నిఖిల్ డైలాగ్ ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అంతే కాకుండా హర్ష చెముడు కామెడీ ఈ సినిమాకు ప్లస్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో ఈ మూవీలో రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.Did an Experimental Screenplay based breezy film with @sudheerkvarma @rukminitweets @itsdivyanshak @SVC_official @harshachemudu Here is the teaser 👇🏼 https://t.co/hHtdfqcEDe @dvlns @BvsnP @SunnyMROfficial @singer_karthik @Rip_Apart @NavinNooli @JungleeMusicSTH— Nikhil Siddhartha (@actor_Nikhil) October 11, 2024 -
మెగా హీరో 'మట్కా' టీజర్ ఎలా ఉందంటే?
మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'మట్కా'. 1980 బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా విజయవాడలో లాంచ్ చేశారు. గత కొన్నాళ్లుగా వరస ఫ్లాఫ్స్ దెబ్బకు పూర్తిగా డీలా పడిపోయిన వరుణ్ తేజ్ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. టీజర్ అయితే ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: వాళ్ల మాటల వల్ల ఇప్పటికీ బాధపడుతున్నా: ప్రియమణి)యుక్త, వృద్ధ పాత్రల్లో వరుణ్ తేజ్ కనిపించాడు. వింటేజ్ లుక్ కూడా బాగుంది. యాక్షన్ సీన్స్ కూడా గట్టిగానే ఉండబోతున్నాయని టీజర్‌తో హింట్ ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ 'మట్కా' టైటిల్‌కి తగ్గట్లు ఈ గేమ్‌కి సంబంధించిన సీన్స్ ఎక్కడ చూపించలేదు. బహుశా ట్రైలర్లో రివీల్ చేస్తారేమో?'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. వరుణ్ సరసన మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు. నవంబరు 14న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: నటి వనిత నాలుగో పెళ్లి.. అసలు నిజం ఇది) -
‘లవ్‌రెడ్డి’ నాకు చాలా స్పెషల్ : స్మరన్ రెడ్డి
‘లవ్‌రెడ్డి..నా మొదటి సినిమా. చాలా జాగ్రత్తగా తెరకెక్కించాను. సినిమాలో చిన్న గాలి సౌండ్ కూడా వదల్లేదు. ఎక్కడ ఏ సీన్ ఉండాలి.. ఏ మేరకు ఉండాలి అనేది ఒకటికి రెండు సార్లు చూసుకొని మరీ ఈ సినిమాను తెరకెక్కించాను. ఈ మూవీ నాకు చాలా స్పెషల్. నా తొలి సినిమానే మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది’అన్నారు యంగ్ డైరెక్టర్ స్మరన్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘లవ్ రెడ్డి’. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్, బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రంలో అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంధ్ర కర్ణాటక బాడర్ లో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న అక్టోబర్ 18న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా డైరెక్టర్ స్మరన్ రెడ్డి మాట్లాడుతూ.. లవ్ రెడ్డి సినిమా ఇంతవరకు వచ్చింది అంటే అందుకు కారణం హీరో అంజన్ రామచంద్ర. మా మధ్య చాలా జర్నీ ఉంది, మేము కలిసి షార్ట్ ఫిలిమ్స్ చేశాము, ఇప్పుడు సినిమాతో మీ ముందుకు వస్తున్నాను, హీరోయిన్ శ్రావణి చాలా బాగా నటించింది, అందరూ కష్టపడి చేసిన సినిమా ఇది, సన్నీ సంగీతం, వరప్రసాద్ కెమెరా వర్క్ బాగుంది, అలాగే మోహన్ చారి, అస్కర్ ఆలీ ఈ సినిమాకు కెమెరామెన్స్ గా వర్క్ చేశారు, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు గారు సపోర్ట్ మర్చిపిలేనిది. ఈ కొత్త ప్రేమ కథ ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘ఈ సినిమా తప్పకుండా సెన్సేషనల్ సృష్టిస్తుంది. ‘సినిమా ఎండింగ్ లో ఒక గొప్ప ఫీల్ తో బయటికి వస్తారు’ అని హీరో అంజన్ రామచంద్ర అన్నారు. ‘మంచి కంటెంట్ తో వస్తోన్న సినిమా ఇది, అక్టోబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని నిర్మాత మదన్ అన్నారు. -
రియల్ లైఫ్ పాత్రలో సాయిపల్లవి.. ఇంట్రో వీడియో చూశారా?
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత సాయిపల్లవి రెండు సినిమాలతో రాబోతుంది. అందులో ఒకటి నాగచైతన్య 'తండేల్', మరొకటి తమిళ మూవీ 'అమరన్'. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న 'అమరన్'లో అతడి భార్య ఇందుగా సాయిపల్లవి కనిపించనుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పాత్ర టీజర్ రిలీజ్ చేశారు. చూస్తున్నంతసేపు ఆహ్లాదంగా అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈమె పాత్రని మరింత ఎలివేట్ చేసిందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)విలక్షణ నటుడు కమల్ హాసన్ నిర్మించిన 'అమరన్'.. అక్టోబరు 31న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకుడు. జీవీ ప్రకాష్ సంగీతమందించాడు. సాయిపల్లవి వీడియో చూస్తుంటే చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఈ సినిమాతో మరో హిట్ కొట్టడం గ్యారంటీ అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 20 సినిమాలు) -
వరల్డ్ బెస్ట్ సిరీస్.. రెండో సీజన్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్
ఓటీటీల్లో కొన్ని సినిమాలు లేదా వెబ్ సిరీసులు అనుహ్యంగా హిట్ అవుతుంటాయి. అలాంటి వాటిలో 'స్క్విడ్ గేమ్' ఒకటి. పేరుకే ఇది కొరియన్ సిరీస్. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ లవర్స్‌ని మెప్పించింది. 2021లో రిలీజైన తొలి సీజన్ అద్భుతమైన రికార్డులు సెట్ చేయగా.. ఇప్పుడు రెండో సీజన్ విడుదలకి సిద్ధమైంది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేయడంతో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన బెస్ట్ వెబ్ సిరీసుల్లో 'స్క్విడ్ గేమ్' ఒకటి. చిన్నపిల్లలు ఆడుకునే ఆటల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా కథ రాయడం విశేషం. డబ్బు అవసరమున్న 456 మందిని ఓ ద్వీపానికి తీసుకొచ్చి ఉంచుతారు. వీళ్ల మధ్య చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. పోటీల్లో గెలిచినోళ్లు తర్వాత దశకు వెళ్తుంటారు. మిగిలిన వాళ్లని నిర్వహకులు నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుంటారు. చివరకు గెలిచిన ఒక్కరు ఎవరనేదే స్టోరీ.తొలి భాగం ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి రెండో సీజన్ మొదలవుతుంది. ఈసారి కూడా 456 మంది ఉంటారు. మళ్లీ వీళ్ల మధ్య కొత్త గేమ్స్ పెడతారు. మరి ఇందులోనూ హీరో గెలిచాడా? ఈసారి ఏమేం గేమ్స్ ఉండబోతున్నాయనేది టీజర్లో చూచాయిగా చూపించారు. ఇక ఏడాది చివరి వారంలో అంటే డిసెంబరు 26న సిరీస్ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. మరి ఈ సిరీస్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు?(ఇదీ చదవండి: 27 ఏళ్లకే ప్రముఖ సింగర్ మృతి.. కారణమేంటి?) -
నలుగురు హీరోయిన్లతో 'రామ్‌నగర్ బన్నీ'.. టీజర్ వచ్చేసింది!
చంద్రహాస్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం రామ్‌నగర్ బన్నీ. ఈ చిత్రంలో విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ప్రభాకర్ మాట్లాడుతూ ..'నన్ను బుల్లితెరపై ఆదరించారు. కుటుంబ ప్రేక్షకులు చూడటం వల్లే నా సీరియల్స్ సక్సెస్ అయ్యాయి. మా అబ్బాయిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నప్పుడు నాకున్న ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకున్నాం. చంద్రహాస్ మొదటి సినిమా సకుటుంబంగా ప్రేక్షకులు చూడాలని అనుకున్నాం. అందుకే మరో రెండు సినిమాలు ఉన్నా..ఈ సినిమానే ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాం. చంద్రహాస్ మీద ట్రోలింగ్స్ వచ్చినప్పుడు మేమంతా బాధపడిన మాట వాస్తవమే. తనలో ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. నేను ఇండస్ట్రీలో సంపాదించిందిన డబ్బుతో రామ్ నగర్ బన్నీ చేశా. నటుడిగా నా కొడుకులోని ప్యాషన్ చూసే సినిమా నిర్మాణానికి ముందుకొచ్చా. అతను గొప్ప స్థాయికి వెళ్తాడని నమ్మకం ఉంది. అక్టోబర్ 4న థియేటర్స్ కు వెళ్లి మా మూవీ చూడండి.' అని అన్నారు.దర్శకుడు శ్రీనివాస్ మహత్ మాట్లాడుతూ' ప్రభాకర్ నాకు మంచి మిత్రుడు. నా దగ్గర ఉన్న ఒక కథ గురించి తెలిసి ఆయన వింటా అన్నారు. కథ నచ్చడంతో వాళ్ల అబ్బాయి చంద్రహాస్తోనే చేయాలని ముందుకొచ్చాడు. చంద్రహాస్ దర్శకుల హీరో. సినిమాకు నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు. అతను హీరోగా పెద్ద స్థాయికి వెళ్తాడు. ఫ్యామిలీ అంతా కలిసి చూడాలనే అన్ని ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులందరికీ నచ్చేలా చేశాం. అక్టోబర్ 4న వస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్, సలీమ్, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని కీలక పాత్రలు పోషించారు. -
ప్రేమ మరీ ఎక్కువైపోతే? ఆసక్తికరంగా ఆర్జీవీ 'శారీ' టీజర్
సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ 'శారీ'. టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ అంటే ప్రేమ మరీ ఎక్కువైతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అనే స్టోరీతో ఈ మూవీ తీశారు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా లెవల్లో నవంబరులో తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించగా.. ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రముఖ బిజినెస్‌మాన్ రవి వర్మ నిర్మిస్తున్నారు. పలు నిజజీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా 'శారీ' తీశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)ఉత్తరప్రదేశ్‌లో అమాయకులైన ఎంతో మంది మహిళలని 'శారీ కిల్లర్' అతి క్రూరంగా మానభంగం చేసి చిత్ర హింసలకు గురిచేసి హత్యలు చేశాడు. ఆ మృగాడికి మగువలపై ఎంతటి తీవ్రమైన కాంక్ష ఉండేదో అనే పాయింట్‌తో శారీ మూవీ తీశారు. చీరలో ఉన్న అమ్మాయిని చూసి పిచ్చివాడై ఆమెతో ప్రేమలోపడి ఎంతో హానికరంగా, డేంజరస్‌గా ఓ అబ్బాయి ఎలా మారిపోయాడనేది టీజర్లో చూపించారు.ఇందులో అబ్బాయిగా సత్య యాదు, అమ్మాయి పాత్రలో ఆరాధ్య దేవి నటిస్తోంది. ఆరాధ్య దేవి స్వస్థలం కేరళ. నిజానికి ఆరాధ్యని వర్మ ఎవరో ఫార్వర్డ్ చేసిన ఓ ఇన్ స్టా రీల్లో తొలుత చూశారు. అలా ఆమెని ప్రధాన పాత్ర కోసం తీసుకుని ఏకంగా శారీ సినిమా తెరకెక్కించారు.(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8లో రెండో ఎలిమినేషన్.. కొత్త ట్విస్ట్) -
ఆర్జీవీ 'శారీ' సినిమా.. క్రేజీ అప్డేట్
కాంట్రవర్సీ టాపిక్స్, నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ప్రస్తుతం 'శారీ' మూవీ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో శ్రీలక్ష్మీ సతీశ్ అనే అమ్మాయిని చూసి ఇందులో హీరోయిన్గా ఎంచుకున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేయగా.. ఇప్పుడు టీజర్ గురించి క్రేజ్ అప్డేట్ వచ్చేసింది.(ఇదీ చదవండి: హీరో ఇంట్లో పనిమనిషిగా మంత్రి కూతురు.. ఏకంగా 20 రోజులు)ఈ సినిమా టీజర్‌ని సెప్టెంబరు 15న అంటే ఆదివారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ఆర్జీవీ ట్వీట్ చేశారు. అలానే ఇది ఉత్తరప్రదేశ్‌లోని శారీ కిల్లర్‌కి సంబంధించిన కథ కాదని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే నిజ జీవిత సంఘటనల ఆధారంగానే తెరకెక్కించినట్లు పేర్కొన్నారు.ఇకపోతే గిరి కృష్ణ కమల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్జీవీ డెన్ పతాకంపై వర్మ సమర్పిస్తుండగా రవి వర్మ నిర్మిస్తున్నారు. నవంబరులో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రిలీజ్‌కి ముందే 'తంగలాన్'కి దెబ్బ)Unlike some people are speculating , SAAREE film, is not based on the SAAREE killer of U P , but it’s based on several true life incidents #RGVsSAAREE pic.twitter.com/tDjmovrPNs— Ram Gopal Varma (@RGVzoomin) September 14, 2024 -
'మా నాన్న సూపర్ హీరో'.. ఎమోషనల్ టీజర్ వచ్చేసింది!
హరోం హర తర్వాత సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం మా నాన్న సూపర్ హీరో. ఈ చిత్రంలో ఆర్నా హీరోయిన్గా నటిస్తున్నారు. లూజర్ వెబ్‌సిరీస్ ఫేమ్ అభిలాష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని వీ సెల్యూలాయిడ్స్, క్యామ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధం కథాంశంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చాలా రోజుల తర్వాత పోకిరి నటుడు షాయాజీ షిండే టాలీవుడ్ అభిమానులను అలరించనున్నారు. 'నేను కష్టపడుతున్నాను కదా నాన్న.. ఇక నువ్వేందుకు పనిచేయడం' అన్న డైలాగ్ చూస్తుంటే ఈ మూవీ ఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్ చూస్తే 'అమ్మని అన్నం పెట్టమని అడిగితే అడుక్కున్నట్లు కాదు... నాన్న ముందు తగ్గితే ఓడిపోయినట్టు కాదు!! లాంటి ఎమోషనల్ డైలాగ్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. తండ్రీ, కుమారుల అనుబంధం, ఎమోషన్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది దసరా పండుగకు అక్టోబర్ 11న థియేటర్లలో మా నాన్న సూపర్ హీరో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సాయిచంద్, రాజు సుందరం, శశాంక్, ఆమని, చంద్ర, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమ్మని అన్నం పెట్టమని అడిగితే అడ్డుకునట్టు కాదు... నాన్న ముందు తగ్గితే ఓడిపోయాయినట్టు కాదు!!A heartwarming tale coming this Dusshera#MNSHTeaser - https://t.co/ke3FnMyr9w#MaaNannaSuperHero grand release on Oct 11th@abhilashkankara @sayajishinde #SaiChand @jaymkrish… pic.twitter.com/asU6FJtUwe— Sudheer Babu (@isudheerbabu) September 12, 2024 -
'మొక్కల్నే అంత జాగ్రత్తగా చూసుకుంటే.. మొగున్ని అయితే'.. ఆసక్తిగా టీజర్
సాయి తేజ కల్వకోట, పావని కరణం జంటగా నటించిన చిత్రం 'పైలం పిలగా'. ఈ మూవీకి ఆనంద్ గుర్రం దర్శకత్వం వహిస్తున్నారు. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రామకృష్ణ బొద్దుల, ఎస్కే శ్రీనివాస్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.హరీష్ శంకర్ మాట్లాడుతూ..' టీజర్ చూస్తుంటే సినిమాని చాలా సహజంగా చిత్రీకరించారని తెలుస్తోంది. టీజర్ చాలా చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. మంచి డైలాగ్స్ ఉన్నాయి . మొక్కల్నే అంత మంచిగా చూసుకుంటే మొగున్ని ఇంకెంత మంచిగా చూసుకుంటుంది అనే డైలాగ్ నాకు బాగా నచ్చింది' అంటూ ఆయన అభినందించారు . ఈ చిత్రంలో డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు యశ్వంత్ నాగ్ ఆ సంగీతాన్ని అందించారు. ఈ మూవీ సెప్టెంబర్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. -
'విశ్వం' టీజర్ రిలీజ్.. శ్రీనువైట్ల మార్క్ కామెడీ
గోపీచంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వం'. శ్రీనువైట్ల దర్శకుడు. అప్పట్లో 'వెంకీ', 'దుబాయ్ శీను', 'ఢీ' తదితర సినిమాలతో తెలుగులో తనకంటూ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న శ్రీనువైట్ల.. ఆ తర్వాత రొటీన్ మూస తరహా స్టోరీలతో మూవీస్ తీశాడు. అవి ఘోరంగా ఫెయిలయ్యాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని చేసిన సినిమా 'విశ్వం'.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8'లో కుక్కర్ పంచాయతీ.. ఆమెకి ఎలిమినేషన్ గండం?)దసరా కానుకగా అక్టోబరు 11న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. టీజర్ చూస్తే శ్రీనువైట్ల మార్క్ కామెడీ కనిపించింది. అలానే తనకు అచ్చొచ్చిన ట్రైన్ కామెడీనే 'విశ్వం' కోసం మరోసారి నమ్ముకున్నట్లు కనిపిస్తుంది. ఓవైపు కామెడీ చేస్తూనే మరోవైపు యాక్షన్, నాన్న అనే ఎమోషన్ కూడా చూపించారు.టీజర్ చూస్తే పర్వాలేదనిపిస్తోంది గానీ స్టోరీ ఏ మాత్రం రొటీన్‌గా ఉన్నాసరే ప్రేక్షకులు తిరస్కరించే ఛాన్స్ ఉంది. మరి 'విశ్వం' సినిమాతో గోపీచంద్-శ్రీనువైట్ల కాంబో ఏం చేస్తుందో చూడాలి? తెలుగులో దసరాకి చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేం లేవు. తమిళ నుంచి రజినీకాంత్ 'వేట్టాయాన్' ఉంది. మరి రజనీ మూవీని తట్టుకుని 'విశ్వం' ఏ మేరకు నిలబడుతుందో చూడాలి?(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం) -
తెలంగాణ నేపథ్యంలో 'లగ్గం' టీజర్
సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'లగ్గం'. ఈ సినిమాకు 'రమేశ్ చెప్పాల' కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో పెళ్లిలో ఉండే విందు,చిందు, కన్నుల విందుగా చూపించబోతున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా అని మేకర్స్ తెలిపారు. రెండు రాష్ట్రాల వారు ఈ చిత్రం చూసి మెచ్చుకుంటారని వారు చెబుతున్నారు. ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు హీరో ఆది సాయికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ... 'లగ్గం టీజర్ చాలా బాగుంది. విజువల్స్ అదిరిపోయాయి. డైరెక్టర్ 'రమేష్ చెప్పాల' మంచి టేస్ట్‌తో ఈ సినిమాను తీశారనిపిస్తుంది. ఈసినిమాలో నటించిన రాజేంద్రప్రసాద్, రోహిణి, కృష్ణుడు వంటి వారితో నాకు మంచి అనుబంధం ఉంది. నాకు బాగా దగ్గరిగా ఉన్నవారందరూ ఈ సినిమాలో ఉండడం సంతోషంగా ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని ఆయన అన్నారు.నిర్మాత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... 'మంచి సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నప్పుడు డైరెక్టర్ రమేష్ చెప్పాల తీసిన 'భీమదేవరపల్లి' సినిమా చూశాను. చాలా బాగా నచ్చి వెంటనే రమేష్‌తో సినిమా చేయాలని అనుకున్నాను. ఈ క్రమంలో రమేష్ 'లగ్గం' కథ చెప్పడం జరిగింది. కథ నచ్చి వెంటనే సినిమా స్టార్ట్ చేశా. మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే, ఫీల్ గుడ్ సాంగ్స్ లగ్గం సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను' అని అన్నారు. -
ఆ రోజు ఏం జరిగింది?
డిటెక్టివ్‌గా ఓ మర్డర్ కేసును పరిష్కరించే పనిలో పడ్డారు హీరోయిన్ కరీనా కపూర్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ది బకింగ్హమ్ మర్డర్స్’. హన్సల్ మెహతా దర్శకత్వం వహంచిన ఈ చిత్రం సెప్టెంబరు 13న రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. విదేశాల్లో నివసిస్తున్న ఓ భారతీయుడి కుటుంబంలోని ఓ చిన్నారి హత్య నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో బ్రిటిష్– ఇండియన్ డిటెక్టివ్ జస్మిత్ భామ్రా పాత్రలో కరీనా నటిస్తున్నారని తెలుస్తోంది. ‘‘ఆ రోజు పార్కులో ఏం జరిగింది?, నువ్వు అతన్ని ఎలా చంపావ్?’...., ‘నువ్వు డిటెక్టివ్ కదా.. తెలుసుకో...!’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఏక్తా కపూర్, శోభా కపూర్లతో కలిసి ఈ సినిమాను కరీనా కపూర్ నిర్మించడం విశేషం. -
ఆమెతో కలిసి నటించాలన్న కల నెరవేరింది: హీరో
కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం 'జ్యువెల్ థీఫ్'.శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పీఎస్ నారాయణ దర్శకత్వం వహించాడు. కృష్ణ సాయి, ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు నటించారు.తాజాగా ఈ సినిమా టీజర్‌ను 30 ఇయర్స్ పృధ్వీ విడుదల చేశాడు. ఆయన మాట్లాడుతూ.. హీరోగా కృష్ణసాయి 'జ్యువెల్ థీఫ్' సినిమాలో యాక్షన్ పార్టులు బాగా చేసాడు. సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. సమాజం కోసం కృష్ణ సాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణ సాయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిజ జీవితంలోనూ ఆయన రియల్ హీరో అని తెలిపాడు.హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ... నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. ఒకప్పుడు హీరోయిన్ ప్రేమ గారి సినిమాలు చూశాను. ఆమెతో కలిసి నటించాలన్న కల 'జ్యువెల్ థీఫ్' సినిమాతో నెరవేరింది అని పేర్కొన్నాడు. -
1980's Radhekrishna Teaser: నెత్తుటితో రాసిన ప్రేమకథ
ఎస్ఎస్ సైదులు హీరోగా, భ్రమరాంబిక అర్పిత హీరోయిన్గా నటించిన ద్విభాషా చిత్రం (తెలుగు, బంజారా) ‘1980లో రాధేకృష్ణ’. ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఊడుగు సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్‌కి నిర్మాతలు రామ్ తాళ్లూరి, బెక్కం వేణుగోపాల్, నటులు సోహైల్, ఆటో రామ్‌ప్రసాద్ అతిథులుగా హాజరయ్యారు. ‘‘కృష్ణలంక... ఇక్కడ పుట్టే కులాన్ని బట్టి రాతలు రాయబడే ప్రాంతం. బతుకు బాగు కోసం ఎన్నో విప్లవ గేయాలు పాడిన గొంతులు మూగబోయిన ప్రాంతం, ఇది రాధాకృష్ణుల ప్రేమకావ్యాన్ని నెత్తురుతో లిఖించబడ్డ ప్రాంతం’’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఎస్ఎస్ సైదులు మాట్లాడుతూ– ‘‘మంచి కథతో తీసిన మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘తనికెళ్లభరణిగారి వాయిస్‌తో మా సినిమాకు ఒక కొత్త ఫీల్ వచ్చింది’’ అన్నారు ఇస్మాయిల్. ‘‘1980 కి తగ్గట్లుగా ఈ సినిమాను ఇస్మాయిల్గారు తీశారు’’ అని పేర్కొన్నారు ఊడుగు సుధాకర్. -
బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ చేతులపై 'కళింగ' టీజర్ రిలీజ్
'కిరోసిన్' హిట్‌తో పేరు తెచ్చుకున్న ధృవ వాయు.. ఇప్పుడు 'కళింగ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నటించడంతో పాటు ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ విడుదల చేశారు.సస్పెన్స్, థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రాబోతున్న 'కళింగ' సినిమా టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా, గ్రిప్పింగ్ కథనంతో అందరినీ మెప్పించేలా ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోంది. ప్రేక్షకులని భయపెట్టారు కూడా. ప్రగ్యా నయన్ హీరోయిన్ కాగా, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలో నటించారు. -
రవితేజ 'మిస్టర్ బచ్చన్' టీజర్ రిలీజ్ ఎలా ఉందంటే?
రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే టీజర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ఫెర్ఫెక్ట్ కమర్షియల్ అంశాలతో సినిమాని తీసినట్లు టీజర్ చూస్తే క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?)ఓ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.. ఓ పేరుమోసిన గుండాకి ఇంటికి రైడ్‌కి వెళ్తాడు. చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీలా అనిపిస్తుంది. దీనికి అదనంగా హీరోయిన్, పాటల్లాంటి హంగులు ఉన్నాయి. ప్రస్తుతం కాకుండా 90ల్లో జరిగిన కథలా విజువల్స్ చూస్తుంటే అర్థమవుతోంది. టీజర్ చూస్తే బాగానే ఉందనిపిస్తోంది. మరి ప్రేక్షకులు ఏ మేరకు దీన్ని రిసీవ్ చేసుకుంటారో తెలియాలంటే మరికొన్నిరోజులు ఆగాలి. బాలీవుడ్ హిట్ సినిమా 'రైడ్'కి దీన్ని రీమేక్‌గా తెరకెక్కించారు. కాకపోతే అధికారికంగా ఏం ప్రకటించలేదు.(ఇదీ చదవండి: టాలీవుడ్లో చాలా సమస్యలు ఉన్నాయి.. సి.కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
Average Student Nani: ఆకట్టుకుంటున్న టీజర్
పవన్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. . శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. మోస్ట్ రొమాంటిక్‌గా సాగిన ఈ టీజర్ యూత్ ఆడియెన్స్‌ను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.‘మనం ఆర్డినరీ అయినా మనం ట్రై చేసే అమ్మాయి ఎక్స్ట్రార్డినరీగా ఉండాలి’,, ‘కాలేజ్‌లో ఉన్నంత వరకే స్టూడెంట్ నాని.. ఆ తరువాత కూకట్ పల్లి నాని’ అంటూ సాగే డైలాగ్స్‌తో యావరేజ్ స్టూడెంట్ నాని మోస్ట్ రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా సాగింది. ఈ టీజర్లో యూత్‌కి కావాల్సిన ప్రతీ అంశం ఉంది. రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని యాంగిల్స్‌ను టచ్ చేస్తూ టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ఈ టీజర్లో విజువల్స్, ఆర్ఆర్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. -
రిలీజ్‌కు సిద్ధమైన పరాక్రమం మూవీ.. డేట్ ఫిక్స్!
బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం "పరాక్రమం". ఈ చిత్రాన్ని బీఎస్కే మెయిన్‌స్ట్రీమ్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను ఆగస్టు 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో మూవీ రిలీజ్ అనౌన్స్మెంట్ టీజర్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ..'మా పరాక్రమం సినిమాను చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేస్తున్నాం. పరాక్రమం విషయానికి వస్తే ఇదొక సంఘర్షణతో కూడుకున్న కథ. నేను మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చా. నేను గతంలో నిర్భందం , నిర్భందం 2 , మాంగళ్యం సినిమాలను రూపొందించా. ఒక మంచి ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం నా స్టైల్ మార్చాలని ఫిక్స్ అయ్యా. అలా మార్చి చేసిన సినిమానే పరాక్రమం. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
శ్రీ కృష్ణుడు vs నరకాసుర.. టీజర్ కాని టీజర్
నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. పేరుకి తగ్గట్లే అప్డేట్స్ అన్నీ ఒక్కో శనివారం రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇందులో విలన్‌గా నటిస్తున్న ఎస్జే సూర్య పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. టీజర్ కానీ టీజర్ అని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది?(ఇదీ చదవండి: 'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?)ప్రతి శనివారం.. హీరో రకరకాలుగా ప్రవర్తించడం అనే స్టోరీతో తీసిన సినిమా 'సరిపోదా శనివారం'. నాని, ప్రియాంక మోహన్ హీరోహీరోయిన్ కాగా.. తమిళ నటుడు ఎస్జే సూర్య ప్రతినాయకుడు. కృూరమైన పోలీస్ అధికారిగా చేస్తున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన వీడియోతో క్లారిటీ వచ్చేసింది.నాని-ప్రియాంక శ్రీకృష్ణుడు-సత్యభామగా.. ఎస్జే సూర్య నరకాసురుడు అని చెప్పడం లాంటి రిఫరెన్సులు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. టీజర్ కాని టీజర్ అంటూనే ఆసక్తి రేకెత్తించారు. ఆగస్టు 29న పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు సినిమా.. ఎందులో ఉందంటే?) -
విలన్‌గా సునీల్ ఎంట్రీ.. టీజర్ అదిరిపోయింది!
రాజమౌళి ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్. ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో మ్యాక్స్ మూవీలో నటిస్తున్నారు. 2022లో విక్రాంత్ రోనా తర్వాత సుదీప్ చేస్తోన్న మూవీ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కిచ్చా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.టాలీవుడ్ నటుడు సునీల్ విలన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా రిలీజైన టీజర్లో సుదీప్ డిఫరెంట్ లుట్లో కనిపించారు. టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్‌గా సునీల్ లుక్ సైతం ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ద్వారానే సునీల్ శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు.కాగా.. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో వస్తోన్న మ్యాక్స్ మూవీని కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ పాత్రలో కనిపించడంతో.. సుదీప్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.MAX Takes Charge! 💥👿🔗https://t.co/GbhvhNzPAl#MAXManiaBegins with the explosive #MaxTeaser 🔥 #boloMAXii@Max_themovie @theVcreations @Kichchacreatiin @vijaykartikeyaa @AJANEESHB @shivakumarart @shekarchandra71 @ganeshbaabu21 @dhilipaction @ChethanDsouza @saregamasouth…— Kichcha Sudeepa (@KicchaSudeep) July 16, 2024 -
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టీజర్.. సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్!
కిరణ్ అబ్బవరం.. టాలీవుడ్ యంగ్ హీరోల్లో కాస్త మెరిట్ ఉన్న నటుడు. కాకపోతే దగ్గరకొచ్చిన సినిమాలన్నీ చేసేసి వరస ఫ్లాఫులు ఎదుర్కొన్నాడు. లెక్కకు మించిన విమర్శలు వచ్చేసరికి ఆలోచనలో పడిపోయాడు. ఏడాదికి మూడు సినిమాలు చేసే ఇతడు.. చాలా నెలల తర్వాత కొత్త సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. దీని టీజరే ఇప్పుడు కిరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్)'రాజావారు రాణిగారు' మూవీతో హీరోగా పరిచయమైన కిరణ్.. ఆ తర్వాత వరస సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ చూడలేకపోయాడు. దీంతో కాస్త టైమ్ తీసుకుని చేసిన పీరియాడికల్ మూవీ 'క'. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ బట్టి చూస్తుంటే.. ఇదేదో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌లా అనిపిస్తోంది. పక్కనోళ్ల ఉత్తరాలు చదివే ఓ పోస్ట్ మాస్టర్.. ఊరిలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. చివరకు ఏమైందనేదే స్టోరీ అని తెలుస్తోంది.'నాకు తెలిసిన నేను మంచి.. నాకు తెలియని నేను..' అనే డైలాగ్‌తోపాటు విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా అన్నీ కూడా కిరణ్ అబ్బవరం గత చిత్రాలతో పోలిస్తే కాస్త డిఫరెంట్‌గా ఉన్నాయి. టీజర్ కాబట్టి కంటెంట్ పెద్దగా రివీల్ చేయలేదు. కానీ ప్రామిసింగ్‌గా ఉంది. మీరు ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
'అడిగేవాడు లేకపోయినా ఆఖరి కోరిక చెబుతున్నా'.. ఆసక్తిగా టీజర్!
ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం కలి. ఈ చిత్రాన్ని శివ సాషు డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ బ్యానర్లో లీలా గౌతమ్ వర్మ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన కలి టీజర్ చూస్తే ఈ సినిమాను ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'అడిగేవాడు లేకపోయినా ఆఖరి కోరిక చెబుతున్నా.. నెక్ట్స్ లైఫ్ ఉంటుందో లేదో తెలియదు.. ఉంటే మాత్రం మనిషిగా పుట్టకూడదు.. మంచితనంతో అస్సలు పుట్టకూడదు.' అనే డైలాగ్‌లో టీజర్ ప్రారంభమైంది. టీజర్లో ట్విస్ట్‌లు, సన్నివేశాలు ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో నేహా కృష్ణన్, గౌతన్ రాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, సివిఎల్ నరసింహారావు, మణిచందన, మధు మణి, త్రినాధ కీలక పాత్రల్లో నటించారు. -
'35 చిన్న కథ కాదు'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్!
నివేదా థామస్, విశ్వదేవ్ ఆర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '35 చిన్న కథ కాదు'. ఈ సినిమాకు నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.కాగా.. తిరుపతి నేపథ్యంలో జరిగే ఈ కథలో నివేదా థామస్ తల్లి పాత్ర పోషించారు. పరీక్షల్లో పాస్ మార్కులు కూడా రానందుకు తండ్రి మందలించగా.. కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోతాడు. కుమారుడి కోసం తల్లి ఆరాటపడటం లాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. -
'కన్నప్ప' టీజర్... మూడు కోట్ల మంది చూశారు!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' నుంచి ఈ మధ్యే టీజర్ రిలీజైంది. అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.(ఇదీ చదవండి: 'కల్కి' ముందు పెద్ద సవాలు.. నాగ్ అశ్విన్ ఏం చేస్తాడో?)'కన్నప్ప' టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులని అలరిస్తోంది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి.(ఇదీ చదవండి: 'కల్కి' టికెట్ కొంటున్నారా? ఆ విషయంలో బీ కేర్‌ఫుల్!) -
థ్రిల్లింగ్‌గా ‘1000 వాలా’ టీజర్
అమిత్, షారుఖ్, నవిత, కీర్తి, సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘1000 వాలా’. అఫ్జల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. "మా 1000 వాలా చిత్రం టీజర్ సోషల్ మీడియా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. లైక్స్ మరియు కామెంట్స్ చూసి మా సినిమా తప్పక విజయం సాధిస్తుంది అనే నమ్మకం కలిగింది. త్వరలో విడుదల తేది ప్రకటిస్తాం" అని తెలిపారు. -
హీరోగా మగధీర విలన్.. టీజర్ రిలీజ్ చేసిన రాజమౌళి!
రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం మగధీర, రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో విలన్ పాత్రలో దేవ్‌గిల్ ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం అహో విక్రమార్క. ఈ చిత్రానికి పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. 'ఇది అసుర రాజ్యం.. ఇక్కడికీ ఎవడైనా రావడమే తప్ప.. ప్రాణాలతో తిరిగిపోవడం ఉండదు' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. తాజాగా విడుదలైన ఈ టీజర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో దేవ్ గిల్ పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. 'పోలీస్ అంటే సింహం కాదురా.. సింహాన్ని కూడా వేటాడే వేటగాడు' అనే డైలాగ్ ఈ మూవీపై అంచనాలు పెంచుతోంది. అసుర రాజ్యం పేరిట అమాయకులను హింసించే వారిని హీరో ఏం చేశాడనేది కథ. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. Forever grateful to you @ssrajamouli garu 🙏🏼❤️#AhoVikramaarkaTeaser out now! - https://t.co/WIxYwyGxu7#AhoVikramaarka @iamdevsinghgill @ChitraShuklaOff @WriterPravin @tejaswwini @SayajiShinde @BithiriSathi_ @prabhakalakeya @petatrikoti pic.twitter.com/V5bw3GKavM— Dev Gill (@iamdevsinghgill) June 20, 2024 -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తోన్న శివం భజే.. టీజర్ వచ్చేసింది!
అశ్విన్ బాబు, దిగంగనా జంటగా నటించిన చిత్రం 'శివం భజే'. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి నిర్మాతగా.. అప్సర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ''వైవిధ్యమైన కథతో మా సంస్థ నిర్మాణంలో వస్తోన్న చిత్రం 'శివం భజే'. టైటిల్, ఫస్ట్ లుక్కు మించి టీజర్‌కు స్పందన రావడం ఆనందంగా ఉంది. జూలైలో ప్రపంచవ్యప్తంగా విడుదల చేయడానికి సిద్దమవుతున్నాం. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అని అన్నారు.దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ.. " శివం భజే టైటిల్ తోనే అందరి దృష్టి ఆకర్షించాం. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత మహేశ్వర రెడ్డి పూర్తి సహకారంతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందిస్తాం. విడుదల తేదీ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం" అని అన్నారు.హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. "టీజర్‌కు అనూహ్య స్పందన వస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అన్ని వర్గాలు ప్రేక్షకులని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది. దర్శకుడు అప్సర్, నిర్మాత మహేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని ఊహించిన దానికంటే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదంతో త్వరలోనే మా చిత్రాన్ని మీ ముందుకి తెస్తాం" అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'రా రాజా'.. టీజర్‌తోనే భయపెట్టారు!
సుగి విజయ్, మౌనిక మగులూరి జంటగా నటించిన చిత్రం 'రా రాజా'. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై శివప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఫుల్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ..'రా రాజా సినిమా టీజర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది . డైరెక్టర్ కథ చెబుతున్నంత సేపు చాల ఆసక్తిగా అనిపించింది. ఇందులో నటించిన ఇరవై నాలుగు క్యారెక్టర్స్ ఎవరి మొహాలు కనిపించకపోవడం అద్బుతం. ఏఐ జనరేషన్లో కూడా అసలు మొహాలు కనిపించకుండా సినిమా ఎలా తీశారు. ఆ ఒక్క రీజన్ కోసం అయినా త్వరగా చూడాలని ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా కచ్చితంగా ట్రెండ్ సెట్ చేస్తుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' అని అన్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. -
పండెరుపు చీరలో శ్రద్ధా స్టన్నింగ్ లుక్..ధర ఎంతంటే!
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రద్ధా కపూర్ టీన్ పట్టి అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచియం అయింది. అయితే ఆషికీ-2 సినిమాతోనే శ్రద్ధా కపూర్ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ నటనకు బాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఇప్పుడు శ్రద్ధా స్ట్రీ2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో శ్రద్ధా సంప్రదాయ చీరలో తళుక్కమంది. ఈ చీర ఆమె ఫ్యాషన్ శైలి ఏంటో చెప్పకనే చెప్పింది. ఆమె పూల మొక్కలతో కూడిన పండెరుపు చీరలో శ్రద్ధా ఎర్ర గులాబీలా అందంగా కనిపించింది.ఆ చీరకు తగ్గట్టు గోల్డెన్ బ్యాంగిల్స్, చక్కటి చెవిపోగులు, స్లీవ్ లెస్ బ్లౌజ్, సింపుల్ మ్యాకప్‌తో మరింతో అందంగా కనిపించిది. ఈ చీరను డిజైనర్ ధృవ్ పంచల్ తీర్చిదిద్దారు. దీని ధర ఏకంగా రూ. 31,500/-. శ్రద్ధా ఇలా చీరలో ఇంతకుమునుపు కూడా సందడి చేసింది. ప్రతి చీర ఆమె స్కిన్ టోన్‌కి తగ్గట్లుగా ఎంపిక చేసుకుంటుంది. తన లుక్ అందంగా కనిపించేలా సింపుల్ మేకప్‌కే ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఆమె నట్టించిన స్ట్రీ2 మూవీ వచ్చే నెల ఆగస్ట 15 థియోటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తన మూవీ ప్రమోషనల్ సందడి చేసేలా తన లుక్స్ పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది శ్రద్ధా.. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)(చదవండి: స్లిమ్‌గా మారిన నటి విద్యాబాలన్..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
Kannappa Teaser Launch : కన్నప్ప టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. టీజర్ వచ్చేసింది!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రంలో పలువురు అగ్రతారలు నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. కాగా.. ఇటీవల కన్నప్ప టీజర్‌ను కేన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆడియెన్స్‌లో ఆసక్తిని మరింత పెంచేసింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
'ఇక సెప్పెదేం లేదు.. సేసేదే'.. రిలీజ్ టీజర్ అదిరిపోయింది!
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన చిత్రం హరోం హర. ఈ సినిమాను జ్ఞానసాగర ద్వారక దర్శకత్వంలో తెరెకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న హరోం హర ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ హీరోలు విశ్వక్ సేన్, అడివిశేష్ అతిథులుగా హాజరయ్యారు.తాజాగా హరోం హర మూవీకి సంబంధించిన రిలీజ్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. విడుదలకు ముందు రోజు ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను పంచుకున్నారు. 44 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఫైట్స్, యాక్షన్ సీన్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. చివర్లో ఇక సెప్పెదేం లేదు.. సేసేదే అనే సుధీర్ బాబు చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. కాగా.. ఈ సినిమా కోసం సుధీర్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
అనుపమ 'లాక్డౌన్' టీజర్ విడుదల
టాలీవుడ్లో 'టిల్లు స్వేర్' చిత్రంతో ఇటీవలే మంచి విజయాన్ని దక్కించుకుంది మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ చిత్రంలో స్క్రీన్‌పై హాట్‌గా కనిపించడమే కాకుండా తనలోని సరికొత్త టాలెంట్‌ను తెరపై చూపించింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల బాటలో అనుపమ దూసుకురానుంది. ఈ క్రమంలో లాక్డౌన్,పరదా వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా అనుపమ పరమేశ్వరన్ నటించిన లాక్డౌన్ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. అయితే, తమిళ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ మూవీకి ఏ.ఆర్.జీవా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తుంది. లాక్డౌన్ నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో సరికొత్తగా ఉండే స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం విడుదలైన లాక్డౌన్ టీజర్ నిమిషంలోపే ఉన్నప్పటికీ కాస్త ఆసక్తిగానే సాగుతుంది. తెలుగులో పరదా అనే చిత్రంతో పాటు తమిళంలో 'బైసన్ కాలమాదన్' అనే తమిళ చిత్రంలో కూడా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఇలా వరుస సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా ఉంది. -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ డైనమిక్ స్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావొస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. కాగా.. ఇటీవల కన్నప్ప టీజర్‌ను కేన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ టీజర్‌ను జూన్ 14న కన్నప్ప రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంచు విష్ణు కన్నప్ప స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో గుర్రం మీద విష్ణు కూర్చుని కనిపించారు.అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆడియెన్స్‌లో ఆసక్తిని మరింత పెంచేసింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.After an overwhelming reception at Cannes, I am thrilled to share the teaser for this epic tale, 'Kannappa', with you on 14th June. This film holds a special place in my heart, and I can’t wait to welcome you all to the captivating world of #Kannappa🏹. #kannappateaser… pic.twitter.com/bhmCEi6K4s— Vishnu Manchu (@iVishnuManchu) June 7, 2024 -
'పరాక్రమం' టీజర్ విడుదల.. టీమ్‌కు సపోర్ట్‌గా నిలిచిన విశ్వక్ సేన్
గల్లీ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న తెలుగు చిత్రం ‘పరాక్రమం’. 'మాంగల్యం' మూవీ ఫేమ్ బండి సరోజ్ హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు సంగీతం, ఎడిటింగ్‌తో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా పరాక్రమం సినిమా టీజర్ కార్యక్రమాన్ని మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకులు బుచ్చిబాబు, జ్ఞానసాగర్ ద్వారక, నిర్మాత ఎస్ కేఎన్ అతిథులుగా పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా పరాక్రమం టీజర్‌ను విడుదల చేశారు. తన సొంత బ్యానర్ బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ ద్వారా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ చిత్రం లో శాస్త్రీయ నృత్య కళాకారిణి శృతి సమన్వి మరియు నాగ లక్ష్మి హీరోయిన్లుగా నటించారు. మరో 50 మంది నూతన నటి నటులు పరిచయం కాబోతున్నారు. వీళ్లలో చాలామంది థియేటర్ ఆర్టిస్ట్ లు పౌర్ణమి, 100% లవ్ లాంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ గా పనిచేసిన వెంకట్ ఆర్ ప్రసాద్ పరాక్రమం చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. -
ఆనందం.. ఉద్వేగం...
30న హైదరాబాద్‌లో ‘కన్నప్ప’ టీజర్... శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. విష్ణు మంచు టైటిల్ రోల్లో ముఖేష్ కుమార్ దర్శకత్వంలో మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. కాన్స్ చిత్రోత్సవాల్లో ‘కన్నప్ప’ ప్రీమియర్ టీజర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విష్ణు మంచు, మోహన్‌బాబు, ప్రభుదేవా పాల్గొన్నారు. ‘‘కన్నప్ప’ టీజర్‌ను కాన్స్‌లో చూపించాం. అందరూ ప్రశంసించారు. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ‘కన్నప్ప’ టీజర్ చూసి ముగ్దులయ్యారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో తెలుగు వెర్షన్ ‘కన్నప్ప’ టీజర్‌ను ప్రదర్శించనున్నాం. జూన్ 13న ఈ టీజర్‌ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు విష్ణు మంచు.కాన్స్‌లో తొలిసారి... కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రతిష్టాత్మక ‘పామ్ డి ఓర్’ అవార్డు సినీ పరిశ్ర మకు సుదీర్ఘకాలంగా సేవలు అందించినవారికి ఇస్తుంటారు. ఈ ఏడాది 77వ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ‘పామ్ డి ఓర్’ అవార్డుకు మెరిల్ స్ట్రీప్, జార్జ్ లూకాస్‌లను ఎంపిక చేశారు. కాగా కాన్స్ చరిత్రలోనే తొలిసారి ఓ స్టూడియోకు ఈ అవార్డు దక్కింది. జపాన్‌లోని యానిమేటెడ్ స్టూడియో ‘ఘిబ్లీ’కి ఫామ్ డి ఓర్ అవార్డును ప్రదానం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ స్టూడియో యానిమేషన్ రంగంలో ఉంది. ఇక హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ ఆల్రెడీ ఈ అవార్డు స్వీకరించారు. హాలీవుడ్ దర్శక–నిర్మాత జార్జ్ లూకాస్ చిత్రోత్సవాల చివరి రోజున ఈ అవార్డు అందుకోనున్నారు.కన్నీళ్లు పెట్టుకున్న కెవిన్... కెవిన్ కాస్ట్నర్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హరిజన్: యాన్ అమెరికన్ సాగ’. అమెరికన్ సివిల్ వార్‌కు ముందు ఉన్న పరిస్థితులు, వార్ తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మూడు చాప్టర్స్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. తొలి చాప్టర్ ‘హరిజన్: యాన్ అమెరికన్ సాగ’ను కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రీమియర్‌గా ప్రదర్శించగా, మంచి స్పందన లభించింది. దాదాపు పది నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ దక్కడంతో కెవిన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా నిర్మాణానికి 35 ఏళ్లుగా కెవిన్ కష్టపడుతున్నారని హాలీవుడ్ టాక్. ట్రంప్ బయోపిక్... అమెరికా మాజీ అధ్యక్షుడు, వ్యాపారవేత్త డోనాల్డ్ ట్రంప్ జీవితం ఆధారంగా ‘ది అప్రెంటిస్’ సినిమా తీశారు దర్శకుడు అలీ అబ్బాసి. ఈ సినిమాను తొలిసారిగా కాన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించగా, స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. సెబాస్టియన్ స్టాన్ ఈ చిత్రంలో డోనాల్డ్ ట్రంప్ పాత్రపోషించారు. ఫిల్మ్ మేకర్స్ పొలిటికల్ మూవీస్ మరిన్ని చేయాలని కాన్స్ వేదికగా అలీ అబ్బాసి పేర్కొన్నారు. శునకం సందడి... లాటిటియా డెస్చ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘డాగ్ ఆన్ ట్రయిల్’. ఫ్రాన్స్‌లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ కుక్క కొంతమందిని కరుస్తుంది. అప్పుడు ఆ శునకాన్ని ఓ లాయర్ ఏ విధంగా కోర్టు కేసు నుంచి రక్షించారు? అన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. లాటిటియాతో పాటు ఈ సినిమాలో నటించిన శునకం చిత్రోత్సవాలకు హాజరైంది.కాన్స్‌లో భారతీయం... కాన్స్‌లో ఈ ఏడాది మన దేశీ తారలు ఐశ్వర్యా రాయ్, ఊర్వశీ రౌతేలా, కియారా అద్వానీ, శోభితా ధూళిపాళ వంటి వారు సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదితీ రావ్ హైదరి ఈ చిత్రోత్సవాల్లో సందడి చేయడానికి ఫ్రాన్స్ వెళ్లారు. ఇక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దాదాపు 35 ఏళ్ల తర్వాత పామ్ డి ఓర్ విభాగంలో పోటికి భారతీయ చిత్రం ‘అల్ వీ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ నిలిచిన సంగతి తెలిసిందే.భారతీయ ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కపాడియా ఫ్రాన్స్‌లోనే ఉన్నారు. అలాగే ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫిల్మ్‌మేకర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్’ చిత్రం ఉంది. ఈ చిత్రంలో నటించిన సహానా గోస్వామి,సంజయ్ బిష్ణోయ్‌లతో పాటు సంధ్యా సూరి ఫ్రాన్స్ చేరుకున్నారు. -
విజయ్ సేతుపతి కొత్త సినిమా.. టీజర్ చూశారా?
అభిమానుల గుండెల్లో మక్కల్ సెల్వన్‌గా నిలిచిపోయిన విజయ్ సేతుపతి పాన్ ఇండియా నటుడిగానూ సత్తా చాటుతున్నారు. ఆ మధ్య హిందీలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ చిత్రంలో విలన్‌గా అదరగొట్టారు. ప్రస్తుతం ఆయన నటించిన తమిళ చిత్రం మహారాజ త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇది ఆయన నటించిన 50వ చిత్రం కావడం గమనార్హం.హీరోయిన్ ఎవరంటే?తన 51వ చిత్రానికి ఏస్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా యోగిబాబు, పీఎస్. అవినాష్, దివ్యా పిళ్లై, బబ్లు, రాజ్‌కుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆర్ముగకుమార్ దర్శకత్వంలో 7సీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని, కరణ్ బహదూర్ చాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. కలర్‌ఫుల్ పోస్టర్ఇందులో విజయ్ చేతిలో సిగార్, వెనుక భాగంలో స్మిమ్మింగ్ టబ్, చుట్టూ చదరంగం డైస్‌తో పోస్టర్ కలర్ఫుల్గా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యోగిబాబు చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. Presenting the quirky Title Teaser of #ACE🔥Not just a card but a Game Changer!😎#MakkalSelvan #VijaySethupathi51 @VijaySethuOffl @7CsPvtPte @Aaru_Dir @justin_tunes @rukminitweets @iYogiBabu #BablooPrithiveeraj #KaranBRawat #Avinashbs @R_Govindaraj @rajNKPK pic.twitter.com/F2O6A0RDo1— 7Cs Entertaintment (@7CsPvtPte) May 18, 2024 చదవండి: ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది -
రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?
'లైగర్' దెబ్బకు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. 'డబుల్ ఇస్మార్ట్'తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయాడు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు? ఇంతకీ ఎలా ఉంది? హిట్ కొడతారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)2019లో రిలీజైన 'ఇస్మార్ట్ శంకర్'.. ఊహించిన విధంగా హిట్ అయింది. పూరీ జగన్నాథ్‌కి చాన్నాళ్ల తర్వాత సక్సెస్ రుచి చూపించింది. రామ్ కూడా ఫుల్ ఖుషీ అయిపోయాడు. కానీ దీని తర్వాత పూరీకి 'లైగర్' రూపంలో ఘోరమైన డిజాస్టర్ ఎదురైంది. రామ్‌ది ఇదే పరిస్థితి. చేసిన సినిమా చేసినట్లే ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో వీళ్లిద్దరూ కలిసి 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ చేశారు. అదే 'డబుల్ ఇస్మార్ట్'. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.పూరీ జగన్నాథ్ సినిమాలంటే పంచ్ డైలాగ్స్, మాస్ మూమెంట్స్‌ని ఆడియెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈ టీజర్లో ఆ రెండూ మిస్ అయ్యాయి. టీజర్ అంతా కూడా పాత్రల పరిచయానికే ఉపయోగించినట్లు కనిపిస్తుంది. 'డబుల్ ఇస్మార్ట్'లో రామ్ తనదైన మేనరిజమ్ చూపించగా.. హీరోయిన్గా కావ్య థాపర్ కనిపించింది. అలీకి ఆది మానవుడి తరహా కామెడీ పాత్ర ఇచ్చినట్లు ఉన్నారు. సంజయ్ దత్ గన్స్‌తో కనిపించాడు. రామ్ రెండు డైలాగ్స్ చెప్పాడు గానీ వీటిలో పంచ్ అయితే లేదు. ఎప్పటిలానే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆకట్టుకోగా.. చివర్లో శివ లింగాన్ని చూపించి సినిమాలో డివోషనల్ టచ్ కూడా ఉందని చెప్పకనే చెప్పారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్‌పై అలా) -
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో వస్తోన్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో పూరి దర్శకత్వంలో రూపొందించిన బ్లాక్‌బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2019లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. డబుల్ ఇస్మార్ట్ టీజర్ రిలీజ్ తేదీని ప్రకటించారు. రామ్ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రూపొందించారు. ఈనెల 15న టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఉదయం 10:03 నిమిషాలకు టీజర్ విడుదల చేయనున్నారు. తాజాగా రిలీజైన వీడియోలో ఇస్మార్ట్ శంకర్ సీన్స్‌ను జోడించారు. ఈ మూవీలోని సన్నివేశాలతో పాటు అప్పుడు థియేటర్స్‌లో అభిమానులు చేసిన సందడితో కూడిన సన్నివేశాలు మాస్ ఇమేజ్ను గుర్తుచేస్తున్నాయి. డబుల్ ఇస్మార్ట్ టీజర్‌తో రామ్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు మేకర్స్. A proud film of @PuriConnects which created a Never Before Mass Hysteria in every nook and corner🔥Here's a sizzling recap of a Mass phenomenon called #iSmartShankar before you experience the Madness of #DoubleISMART 😎𝗱𝗶𝗠𝗔𝗔𝗞𝗜𝗞𝗜𝗥𝗜𝗞𝗜𝗥𝗜 #DoubleISMARTTeaser… pic.twitter.com/n0kL1HkTbQ— Puri Connects (@PuriConnects) May 14, 2024 -
కాన్స్‌లో కన్నప్ప
ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘కన్నప్ప’ టీమ్ సందడి చేయనుంది. విష్ణు మంచు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ‘మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.కాగా ఈ నెల 14 నుంచి 25 వరకూ జరగనున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో 20వ తేదీన ‘ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప’గా కన్నప్ప మూవీ టీజర్‌ని ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని విష్ణు మంచు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ‘‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘కన్నప్ప’ సినిమా టీజర్‌ను ఆవిష్కరించనుండటం ఆనందంగా ఉంది. మేం ఎంతో ఇష్టంగా రూపొందిస్తున్న కన్నప్పను ప్రపంచ ప్రేక్షకులకు చూపించేందుకు కాన్స్ అనువైన వేదికగా ఉపయోగపడుతుంది. మన భారతీయ చరిత్రను ప్రపంచ వేదికపైకి తీసుకురావడం, మన కథలు, సాంస్కృతిక వారసత్వం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని ట్వీట్ చేశారు విష్ణు మంచు. -
హీరోగా రవితేజ వారసుడు.. టీజర్ రిలీజ్
మాస్ మహరాజ్ రవితేజ వారసుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మాధవ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం "మిస్టర్ ఇడియట్". పెళ్లి సందడి ఫేమ్ డైరెక్టర్ గౌరీ రోణంకి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా కనిపించనుంది.. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవిచంద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రవితేజ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు అల్ ది బెస్ట్ చెప్పారు.టీజర్ చూస్తే రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాలేజీ ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను రూపొందించినట్లు టీజర్లో కనిపిస్తోంది. టీజర్ కాలేజీ సీన్స్, కామెడీ చూస్తే ఫుల్ లవ్ అండ్ కామెడీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. -
రజినీకాంత్ టీజర్‌పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం తలైవార్171. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రివీల్ చేశారు. కూలీ పేరుతో టైటిల్ టీజర్ మేకర్స్ రిలీజ్ చేశారు. రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ టీజర్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే తాజాగా ఈ టీజర్‌ను ఉద్దేశించి స్టార్ డైరెక్టర్ చేసిన పోస్ట్ కోలీవుడ్‌లో వివాదానికి దారితీసింది. రజనీకాంత్ కూలీ టీజర్‌ను ఉద్దేశించే వెంకట్ ప్రభు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ కొందరు ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని కొందరు కొట్టి పారేయగా.. మరికొందరు ఖండించారు. ఇంతకీ వెంకట్ చేసిన పోస్ట్ ఏంటి? అసలు అది ఎందుకు వివాదంగా మారిందో తెలుసుకుందాం.దళపతి విజయ్ హీరోగా గోట్ చిత్రీకరణలో బిజీగా ఉన్న దర్శకుడు వెంకట్ ప్రభు. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో కమర్షియల్ తమిళ సినిమా ట్రైలర్ ఫార్ములాపై చర్చించే రీల్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. అందుకో కమెడియన్ కార్తీక్ కుమార్ ప్రస్తుతం కమర్షియల్ సినిమాల ట్రైలర్స్ అన్ని ఓకే విధంగా ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఆ అల్ను వెంకట్ ప్రభు ఇన్‌స్టాలో పంచుకోవడంతో కాంట్రవర్సీగా మారింది.ఇదంతా రజనీకాంత్ కూలీ టీజర్‌ను ఉద్దేశించే పోస్ట్ పెట్టారని వెంకట్ ప్రభుపై నెటిజన్స్ మండిపడ్డారు. కూలీ టైటిల్ టీజర్ లక్ష్యంగా చేసుకున్నారని రజనీకాంత్ అభిమానులు ఆరోపించారు. అయితే మరికొందరు నెటిజన్స్ మాత్రం మద్దతుగా నిలిచారు. ఇదంతా జస్ట్ ఫన్నీ కోసమేనంటూ కొట్టిపారేశారు.తాజాగా తన పోస్ట్‌పై దర్శకుడు వెంకట్ ప్రభు క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. " కాదు.. ఇది మేమంతా చేస్తున్న కమర్షియల్ ఫ్లిక్ కోసమే.! అతను చెప్పేదాంట్లో కూడా కొంత నిజం ఉంది. మనం రెగ్యులర్ కమర్షియల్ టెంప్లేట్‌కు భిన్నంగా ఏదైనా ఇవ్వాలని ప్రయత్నిస్తే ఫ్యాన్స్ కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు " అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఈ వివాదానికి వెంకట్ ప్రభు తెరదించారు. కాగా.. గతంలో అట్లీ మూవీ మెర్సల్‌ను సమయంలోనూ ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇదిలా ఉండగా గోట్ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. Breaking News 🚨 : Director @vp_offl reposted an Instagram story in which @Dir_Lokesh is being Mocked for #Coolie Title Teaser , Then Atlee .... Now Lokesh ... pic.twitter.com/AfN201kqGn— Let's X OTT GLOBAL (@LetsXOtt) April 28, 2024 -
హీరోగా సీనియర్ నటుడు.. మూవీ టీజర్ రిలీజ్
చాలా ఏళ్ల నుంచి చాలా సినిమాల్లో పలు పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజా రవీంద్ర. ఇప్పుడు ఇతడు ప్రధాన పాత్రలో ఓ మూవీ చేశాడు. అదే 'సారంగదరియా'. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మే నెలలో సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇన్నేళ్ల ఒంటరి జీవితానికి కారణమేంటి?) టీజర్ రిలీజ్ చేసిన యంగ్ హీరో శ్రీవిష్ణు.. మూవీ యూనిట్‌కి విషెస్ చెప్పారు. ఓ మధ్య వయస్కుడైన ఓ వ్యక్తి.. తన భార్య, ఇద్దరు కొడుకులు, కూతురితో సంసారాన్ని వెల్లదీస్తుంటాడు. సమాజంలో పరువుగా బతికితే చాలు అనుకునే వ్యక్తికి.. తన కొడుకులు, కూతురు వల్ల ఇబ్బందులు వస్తాయి. సమాజం అతన్ని నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు ఆ కన్నతండ్రి ఏం చేశాడు.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు.. అనే కథతో సినిమా తీసినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ప్రముఖ బుల్లితెర నటికి రోడ్డు ప్రమాదం..!) -
దేవర భామ స్పై యాక్షన్ థ్రిల్లర్.. టీజర్ చూశారా!
దేవర మూవీతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా జాన్వీ ప్రధాన పాత్రలో తెరెకక్కుతోన్న తాజా చిత్రం ఉలజ్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ విదేశీ రాయబారి పాత్రలో కనిపించనుంది. సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో గూఢచర్యంపై కథాంశంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాతో యాక్షన్ అవతార్‌లోకి అడుగు పెట్టింది. కాగా.. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిల్ హుస్సేన్, రాజేష్ తైలాంగ్, మెయాంగ్ చాంగ్, రాజేంద్ర గుప్తా, జితేంద్ర జోషి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. జంగిల్ పిక్చర్స్ పతాకంపై వినీత్ జైన్ నిర్మించిన ఈ చిత్రం జూలై 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ యాక్షన్ జోనర్లో అడుగు పెట్టింది. కాగా.. టాలీవుడ్లో కొరటాల డైరెక్షన్లో వస్తోన్న దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కనిపించనుంది. ఆ తర్వాత రామ్ చరణ్‌తోనూ జతకట్టనుంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఆర్సీ16లో జాన్వీ హీరోయిన్గా నటించనుంది. అంతే కాకుండా బాలీవుడ్‌లోనూ కరణ్ జోహార్ మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మహి షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. -
తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. మరో క్రేజీ రికార్డ్ సొంతం!
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవల్లిగా తెలుగు ప్రేక్షకుల అభిమానం దక్కించుకున్న రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. పుష్ప-2 టీజర్‌ను రిలీజ్ చేశారు. ఏప్రిల్ 8న విడుదలైన పుష్ప-2 యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. అతి తక్కువ టైమ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించిన టీజర్.. తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగిన టీజర్‌గా నిలిచింది. ఇప్పటివరకు పుష్ప-2 టీజర్‌కు 110 మిలియన్లకు పైగా వ్యూస్, 1.55 మిలియన్ల లైక్స్‌తో దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని పుష్ప టీం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. #Pushpa2TheRuleTeaser becomes the first teaser to be 𝗧𝗥𝗘𝗡𝗗𝗜𝗡𝗚 #𝟭 on YouTube for a record 138 HOURS ❤🔥 Takes over the nation with 𝟏𝟏𝟎𝐌+ 𝐕𝐈𝐄𝐖𝐒 & 𝟏.𝟓𝟓𝐌+ 𝐋𝐈𝐊𝐄𝐒 🔥🔥 ▶️ https://t.co/5Mvmxzyfrp Grand release worldwide on 15th AUG 2024 💥💥… pic.twitter.com/LderAMGCRg — Pushpa (@PushpaMovie) April 14, 2024 -
పుష్ప-2 టీజర్.. ఆ సినిమాను దాటలేకపోయింది!
ఐకాన్ స్టార్ పుష్ప-2 ది రూల్ చిత్రానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు బర్త్ డే రోజే అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. పుష్ప-2 టీజర్‌ను పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేశారు. అయితే విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఒక్కసారిగా నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అయితే ఆ ఒక్క విషయంలో మాత్రం పుష్ప-2 రికార్డ్ బ్రేక్ చేయలేకపోయింది. ప్రభాస్ సలార్ మూవీ టీజర్ రికార్డ్‌ను అధిగమించలేకోపోయింది. సలార్ టీజర్ రిలీజైనప్పుడు కేవలం 6 గంటల 15 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. అదే లైక్స్ పుష్ప-2 టీజర్‌కు రావడానికి 9 గంటల 59 నిమిషాలు పట్టింది. ఇక ఇదే జాబితాలో ఆర్ఆర్ఆర్ చిత్రం 36 గంటల 4 నిమిషాలతో మూడుస్థానంలో ఉంది. ఏదేమైనా యూట్యూబ్‌లో మాత్రం రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Allu Arjun Jatara Look Secret: పుష్పరాజ్ భీకర రూపం రహస్యం ఇదేనా?
పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పీక్కు చేరింది. ఈ మూవీకి జాతీయ ఉత్తమ అవార్డు గెలుచు కుని మరో మెట్టు ఎక్కాడు అల్లు అర్జున్. దీనికి సీక్వెల్‌గా వస్తున్న 'పుష్ప 2: ది రూల్' పై అంచనాలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే పుష్ప 2 సినిమా టీజర్లో అల్లు అర్జున్ నీలి రంగు చీర, నగలు, నిమ్మకాయ దండలతో వెరైటీ లుక్ హాట్‌టాపిక్‌గా నిలిచింది. దీంతో అభిమాన హీరో కొత్త ట్రెండ్ సెట్ చేయడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. 2003లో గంగోత్రి సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్ ..ఈ మూవీలో లేడీ గెటప్‌తో కనిపించి అలరించాడు. తాజాగా పుష్ప-2 సినిమాలో కూడా అమ్మవారి భీకర రూపంతో ఫ్యాన్స్‌ని మరింత ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఎర్రచందనం, తిరుపతి జిల్లాలో కథ సాగుతుంది కనుక ఇది గంగమ్మ జాతర నేపథ్యమే ఈ లుక్అని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటీ గంగమ్మ జాతర తెలుసుకుందాం రండి. తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామదేవతగా అవతరించిన గంగమ్మ.. సాక్షాత్తు తిరుమల శ్రీవారి చెల్లెలని భావిస్తారు. వారం రోజుల పాటు జరిగే గంగమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. గంగమ్మ జాతర విశిష్టత పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించి వేధించేవాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కోవడంతో అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసి, పాలెగాడిని అంత మొందించిందని భక్తుల విశ్వాసం. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేసుకుంటారు. ఈ జాతరలో తొలి రోజున బైరాగివేషం ,రెండోరోజు బండవేషం,మూడోరోజు తోటివేషం,నాలుగోరోజు దొరవేషం వేసుకుంటారు. నాలుగో రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదోరోజున మాతంగి వేషం ధరిస్తారు. ఆరోరోజు సున్నపుకుండల వేషం వేస్తారు. ఏడోరోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను (వెదురు బద్దలతో) తయారుచేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాళ్ళ వేషం వేస్తారు.మగవారు ఆడవేషం వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా చేస్తే అమ్మవారు అనుగ్రహించి తమ కోర్కెలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. పేరంటాలు వేషంలోఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్నితయారుచేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచిమట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. బన్నీ న్యూ లుక్ రహస్యం వీడాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు పుష్ప 2: ది రూల్ టీజర్‌కి రెస్పాన్స్ ఒక రేంజ్లో ఉంది. బన్నీ మాతంగి లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘‘మరో బ్లాక్‌బస్టర్..బన్నీకి మరో జాతీయ అవార్డు పక్కా" అని కమెంట్ చేశారు. -
Pushpa 2 Teaser Photos: చీర కట్టులో పుష్ప రాజ్ విశ్వరూపం
-
Pushpa 2 Teaser: పుష్పరాజ్ మాస్ జాతర చూస్తారా?
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరూ.., నీ యవ్వ తగ్గేదేలే.. ఈ డైలాగులకు రికార్డులు తగలబడిపోయాయి. అల్లు అర్జున్ చిత్తూరు యాసలో మాట్లాడుతుంటే జనాలకు భలే గమ్మత్తుగా అనిపించింది. అభిమానులకైతే సినిమా చూసిన తర్వాత ఎక్కిన మత్తు అంత ఈజీగా దిగలేదు. ఇప్పుడు మరోతూరి అందర్నీ పిచ్చెక్కించేందుకు రెడీ అయిపోయాడు పుష్ప. నేడు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా పుష్ప:ది రూల్ సినిమా టీజర్‌ను చెప్పిన టయానికి టంచనుగా రిలీజ్ చేశారు. అమ్మోరు గెటప్‌లో బన్నీ పుష్పగాడు సిండికేట్ అయ్యాక తన రేంజే పెరిగింది. శ్రీవల్లి ఒంటినిండా నగలతో మెరిసిపోయినట్లు పోస్టర్స్‌లో చూపించారు. టీజర్లో మాత్రం హీరో అమ్మోరు గెటప్‌లో కనిపించారు. ఊచకోత తర్వాత చీర కొంగు నడుముకు చుట్టుకున్నట్లు చూపించారు. డైలాగ్ మాత్రం లేదు. టీజర్ నిడివి కేవలం ఒక్క నిమిషమే ఉంది. అయినా సరే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. పుష్పరాజ్‌ను చూస్తుంటే పాత రికార్డులు పాతరేసి.. గంగమ్మ జాతర జరిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనబడ్తా ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ ఈపారికి టీజర్‌తో కడుపు నింపేసుకుంటామంటున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఫహద్ ఫాజిల్, సునీల్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. బాక్సాఫీస్‌ను రూల్ చేసేందుకు పుష్ప ఆగస్టు 15న రాబోతున్నాడు. చదవండి: అల్లు అర్జున్ గురించి ఈ విషయాలు తెలిస్తే.. ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాల్సిందే -
Pushpa 2: The Rule Teaser: పుష్ప టీజర్ అప్డేట్.. గూస్బంప్స్ ఖాయమేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ -1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఇటీవలే వైజాగ్‌లో పుష్ప-2 షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అంతే కాకుండా యాగంటి క్షేత్రంలోనూ రష్మిక మందన్నాపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కావడంతో టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ పుష్ప-2 టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. తాజాగా టీజర్ టైమింగ్‌ను రివీల్ చేశారు మేకర్స్. బన్నీ బర్త్ డే రోజున 11:07 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా గూస్ బంప్స్ గ్యారంటీడ్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో పుష్ప అభిమానులు వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. #Pushpa2TheRule teaser tomorrow at 11:07AM. pic.twitter.com/utmMi2Hdyu — Allu Arjun (@alluarjun) April 7, 2024 𝐓𝐎𝐌𝐎𝐑𝐑𝐎𝐖 is the day ❤️🔥 𝟏𝟏.𝟎𝟕 𝐀𝐌 is the time ❤️🔥#Pushpa2TheRuleTeaser will mark the entry of #PushpaRaj that will create ripples across the box office💥💥 𝗚𝗢𝗢𝗦𝗘𝗕𝗨𝗠𝗣𝗦 𝗚𝗨𝗔𝗥𝗔𝗡𝗧𝗘𝗘𝗗 🔥#PushpaMassJaathara #Pushpa2TheRule pic.twitter.com/kMTYEgx8GB — Pushpa (@PushpaMovie) April 7, 2024 -
అల్లు అర్జున్ పుష్ప-2.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ -1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఇటీవలే వైజాగ్‌లో పుష్ప-2 షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అంతే కాకుండా యాగంటి క్షేత్రంలోనూ రష్మిక మందన్నాపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ పుష్ప-2 అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్తో వచ్చారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కావడంతో టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప-2 టీజర్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని పుష్ప స్టైల్లో దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి దక్షిణాది నటుడిగా బన్నీ నిలిచారు. #Pushpa2TheRule Teaser out on April 8th, 2024!!! pic.twitter.com/ivTN2CJZBh — Allu Arjun (@alluarjun) April 2, 2024 Let the #PushpaMassJaathara begin 💥 𝗧𝗛𝗘 𝗠𝗢𝗦𝗧 𝗔𝗪𝗔𝗜𝗧𝗘𝗗 #Pushpa2TheRuleTeaser out on April 8th ❤️🔥❤️🔥 He is coming with double the fire 🔥🔥#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024. Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/gCPRAxqoPh — Pushpa (@PushpaMovie) April 2, 2024 -
ఐదు భాషల్లో డబ్బింగ్
‘నేను సూడలేదని ఓ పులుపెక్కి పోతాండవట కదా..’ అంటూ ‘పుష్ప’ సినిమాలో రష్మికా మందన్నా అదో రకం మాస్ స్టయిల్లో చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ కూర్గ్ బ్యూటీ ‘పుష్ప’ కోసం చిత్తూరు యాస నేర్చుకుని మరీ ఆ సినిమాలో తాను చేసిన శ్రీవల్లి పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఇక ఈ మధ్యకాలంలో సంచలన విజయం సాధించిన ‘యానిమల్’కి హిందీలోనూ, ఆ చిత్రం తెలుగు, కన్నడ అనువాదాలకూ తన పాత్రకు సొంత గొంతు వినిపించారు. ఇప్పుడు ఏకంగా ఐదు భాషలు మాట్లాడారు రష్మికా మందన్నా. తాను లీడ్ రోల్ చేస్తున్న ‘గర్ల్ ఫ్రెండ్’ చిత్రం టీజర్‌కి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో డబ్బింగ్ చెప్పారు రష్మిక. ఆమె మలయాళం మాట్లాడటం ఇదే తొలిసారి. ఐదు భాషల్లోనూ రష్మిక డబ్బింగ్ చెప్పిన విధానం అద్భుతం అని కొనియాడుతున్నారు ‘గర్ల్ ఫ్రెండ్’ చిత్రదర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఈ నెల 5న రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఐదు భాషల టీజర్ విడుదల కానుంది. మరి.. రష్మికతో టీజర్‌కి డబ్బింగ్ చెప్పించిన రాహుల్ పూర్తి పాత్రకు ఆయా భాషల్లో డబ్బింగ్ చెప్పిస్తారేమో చూడాలి. -
పుష్ప-2 క్రేజీ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ లీక్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే వైజాగ్‌తో పాటు యాగంటిలో పుష్ప-2 షెడ్యూల్ జరిగింది. దీంతో పుష్ప-2 అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ పుష్ప-2 అప్డేట్ గురించి ప్రశ్నించాడు. చాలా మంది ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్‌ని సోషల్ మీడియా వేదికగా ఆరా తీశారు. వారికి ట్వీట్‌కు స్పందించిన శరత్ పుష్ప టీజర్ అప్ డేట్ ఇచ్చాడు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న టీజర్ వస్తుందని కామెంట్ చేశాడు. ఇది చూసిన బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Teaser untundi birthday ki…Fix — Sarath Chandra Naidu (@imsarathchandra) March 29, 2024 -
‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ నుంచి కొత్త టీజర్
ఓవెన్ టీగ్, ఫ్రెయా అల్లన్, కెవిన్ డురాండ్, పీటర్ మకాన్, విలియమ్ హెచ్. మేసీ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’. వెస్ బాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 10న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘వెల్కమ్ టు మై కింగ్డమ్’, ‘బెండ్ ఫర్ యువర్ కింగ్’, ‘..నెవర్’ అనే డైలాగ్స్ ఈ టీజర్లో ఉన్నాయి. ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ రీ బూట్ సిరీస్‌లో వస్తోన్న నాలుగో చిత్రం ఇది. ఈ సిరీస్ నుంచి గతంలో వచ్చిన ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (2011)’, ‘డ్వాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (2014), ‘వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ (2017) చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. -
నువ్వు ఇంస్ట్రుమెంట్ వాయిస్తున్నావా?.. గేదెను గోకుతున్నావా?.. ఆసక్తిగా టీజర్!
ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం నీ దారే నీ కథ. ఈ చిత్రానికి వంశీ జొన్నలగడ్డ నిర్మాతగా ఉంటూ దర్శకత్వం వహిస్తున్నారు. జేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు తేజేష్ వీర, శైలజ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత తేజేష్ మాట్లాడుతూ.. 'ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అందరూ కొత్త టీం తోనే ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఇది మా మొదటి సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మీ ముందుకు తీసుకొస్తున్నాం. తర్వాత వచ్చే సినిమాలు కూడా అంతే కొత్తగా ఉంటాయి. మాకు బ్యాక్ బోన్ సపోర్ట్ ఏమీ లేదు. మీడియానే మాకు పెద్ద సపోర్ట్. మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నా మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రముఖులకు ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు. నిర్మాత శైలజ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. 'సినిమా మీద ఉన్న ప్యాషన్‌తోనే నిర్మించాం. బుడాపెస్ట్‌లో చేసిన మ్యూజిక్ ఆర్కెస్ట్రా థీమ్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. మీడియా, ప్రేక్షకులు మాలాంటి వాళ్లను ఎంకరేజ్ చేసి సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. దర్శకుడు వంశీ జొన్నలగడ్డ మాట్లాడుతూ..'నేను న్యూయార్క్‌లో డైరెక్షన్ గురించి చదువుకుని వచ్చాను. యూఎస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ని తెలుగు వాళ్లకు నచ్చే విధంగా మార్పులు చేసి చిత్రీకరించాం. ఈ సినిమాతో కథనే ఎంజాయ్ చేయకుండా కథతో పాటు మ్యూజిక్ ఒక మంచి ఫీల్ అందిస్తుంది' అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి ఆల్బర్టో గురియోలి సంగీతమందిస్తున్నారు. -
సూర్య 'కంగువ' టీజర్.. కళ్లు చెదిరిపోయేలా విజువల్స్!
సూర్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా కొత్త సినిమా 'కంగువ' టీజర్ తాజాగా విడుదల అయింది. పీరియాడికల్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. జగపతిబాబు, బాబీ డియోల్, యోగిబాబు, కోవై సరళ తదితరులు పోషిస్తున్నారు. శివ దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ‘కంగువ’ టీజర్.. పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకులందరినీ మెప్పించింది. అందులో సరికొత్త అవతారంలో ప్రేక్షకుల్ని సూర్య మెప్పించారు. తాజాగా విడుదలైన టీజర్‌ను చూస్తుంటే సూర్య నట విశ్వరూపం ఏంటో ఇండియన్ బాక్సాఫీస్‌కు చూపెట్టనున్నారని తెలుస్తోంది. సుమారు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న కంగువ రూ. 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ పెట్టుకుని బరిలోకి దిగనుంది. పార్ట్ 2, పార్ట్ 3 కథలు సిద్ధంగా ఉన్నాయని నిర్మాత ధనంజయన్ గతంలో చెప్పారు. పార్ట్ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించే ప్లాన్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. కంగువా టీజర్ చూస్తే విజువల్ వండర్‌గా ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసింది. కంగువ పాత్రలో సూర్య పోరాట యోధుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. పులితో సూర్య చేసిన ఫైట్ సీక్వెన్స్ స్క్రీన్ మీదే చూడాలని అనిపించేలా ఉంది. హార్స్ ఫైటింగ్, బిగ్ షిప్ వార్ సీన్స్‌తో వరల్డ్ సినిమా హిస్టరీలోని ఎపిక్ వార్ మూవీస్‌ను ఈ టీజర్ గుర్తు చేసింది. హై క్వాలిటీ విజువల్స్‌ను దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత ఎలివేట్ చేసింది. ఉధిరన్తో కంగువ చేసిన రూత్‌లెస్.. ఫెరోషియస్ ఫైట్ టీజర్లో హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం హీరో సూర్య పడిన శ్రమంతా ఆయన మేకోవర్, క్యారెక్టర్లో కనిపించింది. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. -
'అమ్మాయిని వదిలేసి ఆంటీ వెనక పడ్డావా?'.. ఆసక్తిగా టీజర్!
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ఆ ఒక్కటీ అడక్కు. గతేడాది మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం లాంటి మాస్ సినిమాలు చేసిన మళ్లీ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రానికి మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో పెళ్లి కోసం ఆరాటపడే యువకుడు గణ పాత్రలో నరేశ్ కనిపించనున్నారు. అతడికి 25 రోజుల 10 గంటల 5 నిమిషాల్లోగా పెళ్లి జరగాలని.. లేకపోతే జన్మంతా బ్రహ్మాచారిగానే ఉండిపోతాడని జ్యోతిష్యుడు చెప్పడంతో టీజర్ మొదలైంది. దీంతో నీ పెళ్లెప్పుడు అంటూ అల్లరి నరేశ్‌ను అందరూ ఆట పట్టిస్తుంటారు. అతడికి పెళ్లి సంబంధం కుదిర్చేందుకు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నిస్తారు. పెళ్లి అనే కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను కామెడీ అందించేందుకు నరేశ్ రెడీ అయిపోయారు. టీజర్ చూస్తే నరేశ్ మరోసారి తన మార్క్ కామెడీని చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. -
'ఒకసారి డేట్‌కు పిలిస్తే కదా తెలిసేది'.. టీజర్‌తోనే భయపెట్టేశాడు!
టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'లవ్ మీ'. ఇటీవలే పెళ్లి చేసుకున్న హీరో సరికొత్త ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. హార్రర్ థ్రిల్లర్‌గా అరుణ్ భీమవరపు దర్శకత్వం తెరెకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన కూతురు హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తే ఈ చిత్రాన్ని హారర్ జానర్లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒకవైపు భయపెడుతూనే రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందించినట్లు అర్థమవుతోంది. గతంలో దెయ్యం కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ దెయ్యంతో హీరో ప్రేమను కొనసాగించడం కాస్తా ఆసక్తిని పెంచుతోంది. దెయ్యంతో డేటింగ్, రొమాన్స్, ప్రేమను ఈ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. 'లవ్ మీ' ఇఫ్ యూ డేర్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. -
మృణాల్ అలాంటి పిలుపు.. ఏం కావాలంటోన్న విజయ్ దేవరకొండ!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం'ఫ్యామిలీ స్టార్'. పరశురామ్ పెట్ల డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై టాలీవుడ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ టీజర్ నంబర్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. అంతే కాకుండా మృణాల్ ఠాకూర్ క్యూట్‌గా విజయ్ను పిలుస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఏవండీ.. ఏవండీ.. అంటూ మృణాల్ పిలవగా.. ఆ.. ఏం కావాలి? అంటూ మన హీరో రిప్లై ఇచ్చాడు. దీనికి మృణాల్ నవ్వులు చిందిస్తూ చిందులు వేస్తూ కనిపించింది. మృణాల్ అలా ప్రేమగా పిలవడంతో మా సెట్ వెలిగిపోతోందంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటో మీరు చూసేయండి. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. #FamilyStar trending at No 1 ❤️ And @mrunal0801 is glowing in your love and lighting up our set with “THE PILUPU”https://t.co/gRbhprx4rV pic.twitter.com/D4d8u17jgR — Vijay Deverakonda (@TheDeverakonda) March 5, 2024 -
పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా
‘గీతగోవిందం’ (2018) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబోలో రూపొందుతున్న తాజా సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేశారు మేకర్స్. ‘‘ఏమండి.. నేను కాలేజీకి వెళ్లాలి... కొంచెం దించేస్తారా? (మృణాల్ ఠాకూర్), ‘ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా..’(విజయ్ దేవరకొండ)’ వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం గోపీ సుందర్, కెమెరా: కేయూ మోహనన్. -
'లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా'.. అంచనాలు పెంచుతోన్న టీజర్!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. ఈ సినిమాకు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ టీజర్ ఫుల్ ఫ్యామిలీ మ్యాన్‌లా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. అంతే కాదు.. ఊర మాస్ ఫైట్స్‌తో అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. గోపీ సుందర్ కంపోజ్ చేసిన 'దేఖొరో దెఖో' అనే సాంగ్‌తో హీరో క్యారెక్టరైజేషన్ వర్ణిస్తూ సాగిన ఈ టీజర్ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ అంటే వీక్నెస్ ఉన్న కలియుగ రాముడిగా హీరో విజయ్ దేవరకొండను ఈ టీజర్లో చూపించారు. దేవుడి పూజతో సహా ఇంటి పనులన్నీ చేసుకుంటూ తన కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకునే పాత్రలో విజయ్ కనిపించారు. వాళ్ల జోలికి ఎవరైనా వస్తే మడత పెట్టి కొడతాడు. అతను వేస్తే బడ్జెట్ షాక్.. ప్లాన్ గీస్తే ప్రాజెక్ట్ షేక్ అవుతుంది. టీజర్ చివర్లో హీరోయిన్ మృణాల్ 'నేను కాలేజ్‌కు వెళ్లాలి.. కొంచెం దించేస్తారా..' అని అడిగితే..'లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా' అనే డైలాగ్ అభిమానులకు నవ్వులు తెప్పిస్తోంది. ఫ్యామిలీ, క్లాస్, మాస్, లవ్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. Sorry thalli, ochestundi..❤️ Next few minutes lo teaser upload aipotundi.. Ee saari naa guarantee.. https://t.co/TbfzSDgWOf — Vijay Deverakonda (@TheDeverakonda) March 4, 2024 -
'గీతాంజలి మళ్లీ వచ్చింది'.. టాలీవుడ్ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా!
అంజలి టైటిల్ రోల్లో, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘గీతాంజలి’ (2014) సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అంజలి, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఎన్నడు లేని విధంగా ఆడియన్స్‌కు షాకింగ్ న్యూస్ ఇచ్చారు. ఈనెల 24న రాత్రి 7 గంటలకు బేగంపేట్ శ్మశాన వాటికలో టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు లేని విధంగా ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి. దీంతో శ్మశాన వాటికలో టీజర్ లాంఛ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ శనివారం రాత్రి 7 గంటలకు బేగంపేట్ స్మశాన వాటికలో ⚰️ గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్ 🥶👻 Brace Yourselves for a Never Before Event In Telugu Cinema ❄️🔥#GeethanjaliMalliVachindhi #Anjali50 @yoursanjali @konavenkat99 @MP_MvvOfficial #GV #ShivaTurlapati @Plakkaraju… pic.twitter.com/dAqb09Vddh — Telugu FilmNagar (@telugufilmnagar) February 22, 2024 -
లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా ‘వాస్తవం’
మేఘశ్యాం, రేఖ నిరోష హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘వాస్తవం’. జీవన్ బండి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అంజనిసూట్ ఫిలిమ్స్ సంస్థ పై ఆదిత్య ముద్గల్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఆదిత్య ముద్గల్ మాట్లాడుతూ : ‘ఈ సినిమా ఇష్టంతో చాలా కష్టపడి తీసాం. డైరెక్టర్ జీవన్ చెప్పిన కథ తీసిన విధానం చాలా బాగుంది. హీరో మేఘశ్యాం హీరోయిన్ రేఖా నిరోషా చాలా బాగా నటించారు. పి. ఆర్ అందించిన మ్యూజిక్ కి చాలా మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని ప్రేక్షకులు ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు జీవన్ బండి మాట్లాడుతూ.. ఈ సినిమాలో చేసిన ప్రతి చిన్న క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. నా టెక్నీషియన్స్ అందరూ ఆర్టిస్టులు నాకు చాలా సపోర్ట్. పి. ఆర్ అందించిన మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. హీరో మేఘశ్యాం హీరోయిన్ రేఖ నిరోషా చాలా బాగా నటించారు. కచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం మాకు ఉంది’ అన్నారు. ‘ఈ సినిమా చాలా కష్టపడి తీసాం. అందరికీ నచ్చే కథ అవుతుంది. అతి త్వరలో ఈ సినిమాను మీ ముందుకు తీసుకురాబోతున్నాం’అని హీరోయిన్ రేఖ నిరోషా అన్నారు. ‘నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. కాలేజ్ నుంచే థియేటర్ ఆర్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. తెలుగు ప్రేక్షకుల సపోర్ట్ మాకు ఉండాలి అని కోరుకుంటున్నాను’ అని హీరో మేఘ శ్యాం అన్నారు. -
Deadpool & Wolverine:మార్వెల్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేసింది!
మార్వెల్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో సూపర్ హీరో మూవీ రాబోతుంది. ఇప్పటికే మార్వెల్ యూనివర్స్ నుంచి వచ్చిన డెడ్‌పూబ్లా సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఈ సిరీస్ నుంచి మరో సినిమా రాబోతుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’ .ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూగ్ జాక్మాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. షాన్ లెవీ దర్శకత్వం వహిస్తున్నాడు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంటర్టైనమెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఫుల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉంది. డెడ్‌పూల్‌గా ర్యాన్ రేనాల్డ్స్ మరోసారి ఎంటర్టైన్ చేయడానికి సిద్దమయినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మాథ్యూ మక్‌ఫాడియన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
పవర్ఫుల్ పాత్రలో ఆదా శర్మ.. మరో కాంట్రవర్సీ అవుతుందా?
గతేడాది 'ది కేరళ స్టోరీ' మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన భామ ఆదా శర్మ. సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వివాదానికి దారితీసింది. కేరళలోని ముగ్గురు అమ్మాయిల కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సన్‌షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు. అయితే ఈ చిత్రంపై విమర్శలు వచ్చినప్పటికీ.. కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా తర్వాత ఆదా శర్మ నటిస్తోన్న మరో కాంట్రవర్సీ చిత్రం బస్తర్. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ది కేరళ స్టోరీ ఫేమ్ సుదీప్తో సేన్ బస్తర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అదాశర్మ నీర్జా మాధవన్ అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని గతంలో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో 76 మంది జవానులు ప్రాణాలు కోల్పోయిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నారు. టీజర్ చూస్తే ఆదా శర్మ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. నక్సలైట్లతో జరిగిన పోరాటంలో కన్నుమూసిన జవానుల గురించి అదాశర్మ చెప్పిన డైలాగ్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. బోర్డర్లో పాకిస్థాన్‌తో పోరాడి కన్నుమూసిన జవాన్ల కంటే.. నక్సలైట్లతో పోరులో మరణించిన జవాన్ల సంఖ్యే ఎక్కువగా ఉందంటూ అదాశర్మ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. బస్తర్‌లో జరిగిన మారణహోమంలో 76 మంది జవానులను నక్సలైట్లు పొట్టన పెట్టుకుంటే జేఎన్‌యూ స్టూడెంట్స్ సంబరాలు చేసుకున్నారంటూ టీజర్లో వివాదాస్పద డైలాగ్స్ కనిపిస్తోన్నాయి. ది కేరళ స్టోరీ మూవీ టీమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ వేదికగా ‘యాత్ర 2’ టీజర్
యాత్ర’మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీజర్‌ను న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం విశేషం. రిపబ్లిక్ డే ని పురస్కరించుకుని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ వేదికగా ఈ మూవీ టీజర్‌ను చూపించారు. ఇప్పటివరకు అతి కొద్ది సినిమాలకే ఈ అరుదైన అవకాశం లభించగా.. ఇప్పుడు యాత్ర 2 మూవీ ఈ జాబితాలో చేరిపోయింది. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రాబోతోంది. ఇక ఈ టీజర్లో 'నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' అని అసెంబ్లీలో జగన్ పాత్రధారి చెప్పే సీన్స్‌తో పాటు 'చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్న' అనే సీన్స్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. టీజర్ ఇలా ఉందంటే సినిమా అంతకుమించి ఉండబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. -
మాటలు హత్తుకునేలా ఉన్నాయి – ‘దిల్’ రాజు
‘‘అలనాటి రామచంద్రుడు’ చిత్ర దర్శకుడు, నిర్మాత.. ఇలా అందరూ కొత్తవారే. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని థియేటర్లోకి తీసుకెళ్లడం గొప్ప విషయం. ఇకపై ఈ యూనిట్ అంతా చాలా కష్టపడాలి.. సినిమాని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. కృష్ణవంశీ, మోక్ష జంటగా చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని ‘దిల్’ రాజు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘అలనాటి రామచంద్రుడు’ టైటిల్ బాగుంది. మాటలు మనసుని హత్తుకునేలా ఉన్నాయి. ఈ మూవీని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ‘‘సరికొత్త ప్రేమకథా చిత్రమిది. చక్కని వినోదం ఉంటుంది’’ అన్నారు చిలుకూరి ఆకాష్ రెడ్డి. ‘‘మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మా సినిమా ప్రేక్షకులని అలరిస్తుంది’’ అన్నారు శ్రీరామ్ జడపోలు. ‘‘అలనాటి రామచంద్రుడు’ వంటి మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు కృష్ణవంశీ, మోక్ష. -
మట్కా మూవీ టీజర్
-
కీర్తి సురేశ్ లేటెస్ట్ మూవీ.. కాంట్రవర్సీ అయ్యేలా ఉందే?
జాతీయ భాష హిందీ గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాషపై చాలా వ్యతిరేకత ఉంది. మాతృభాష (తమిళభాష)పై ప్రేమ చూపించే తమిళనాడులో హిందీ భాషను నేర్చుకోవాలి అనే ఒత్తిడిని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడమే ఇందుకు కారణం. హిందీలో మాట్లాడితేనే ప్రభుత్వ ఉద్యోగాలు అనే నిబంధన విధించడం కూడా ముఖ్య కారణం. ఇక ఇదే అంశాన్ని సినిమాగా తీసినట్లు కనిపిస్తోంది. అదే 'రఘుతాత'. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?) 'సలార్', 'కేజీఎఫ్' సినిమాలని నిర్మించిన హోంబలే ఫిల్మ్.. కీర్తి సురేశ్‌ని ప్రధాన పాత్రలో పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. హిందీ భాషకు వ్యతిరేకంగా తీసిన ఈ చిత్రం.. వివాదాల్లేకుండా రిలీజైపోతుందా? లేదా? అనేది కొన్నిరోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే?) -
తెలుగు యువ హీరో కొత్త మూవీ.. టీజర్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో లక్ష్ చదలవాడ లేటెస్ట్ మూవీ 'ధీర'. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు తదితర సినిమాల తర్వాత లక్ష్ చేస్తున్న చిత్రమిది. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్) ఈ టీజర్లో మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ దట్టించారు. దీనిబట్టి చూస్తే సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఉండనుందని తెలుస్తోంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇకపోతే 'ధీర' మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కూడా ముగించుకుని.. ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. (ఇదీ చదవండి: Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ) -
హీరోగా బిగ్‌బాస్ కంటెస్టెంట్.. పాటతో కుమ్మేసిన భోలె!
ఆట సందీప్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్లో కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్ సీజన్లో విజేతగా నిలిచి ఫేమస్ అయ్యారు. అప్పటినుంచి ఆయన పేరు ఆట సందీప్‌గా మారిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్ కూడా మంచి డ్యాన్సరే కావడం విశేషం. అంతే కాకుండా గతేడాది జరిగిన బిగ్‌బాస్ రియాలిటీ షో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. చాలా వారాల పాటు హౌస్‌లోనూ తన ఆటతీరుతో మెప్పించారు. అయితే ప్రస్తుతం ఆట సందీప్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ది షార్ట్‌కట్ అనే చిత్రంలో ఆయన నటిస్తున్నారు. విజయానికి అడ్డదారులువండవు అనేది ఈ మూవీకి క్యాప్షన్. ఈ చిత్రాన్ని రామకృష్ణ కంచి దర్శకత్వంలో తోట రంగారావు, రజినీకాంత్ పున్నపు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్లో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ పాల్గొన్ని సందడి చేశారు. ఈవెంట్‌కు హాజరైన వారిలో భోలె షావలి, టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, శివాజీ, అశ్విని, గౌతమ్ ఉన్నారు. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
‘ఇది ఏఐ వరల్డ్ కాదు.. యుఐ వరల్డ్’
‘ఇది ఏఐ వరల్డ్ కాదు.. యుఐ వరల్డ్’ అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో మొదలవుతుంది ‘యుఐ’ చిత్రం టీజర్. ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్న చిత్రం ‘యుఐ’. జి. మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ మనోహరన్ సహనిర్మాత. బందీలుగా ఉన్నవారి హాహాకారాలు, విచిత్ర వేషధారణలో ఉన్న వ్యక్తులు కనిపిస్తుండగా, వారిని రక్షించడానికే అన్నట్లు హీరో ఉపేంద్ర ఎంట్రీతో టీజర్ ముగుస్తుంది. సోమవారం జరిగిన ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘ఈ చిత్రానికి ఇండస్ట్రియల్ లైట్ మ్యాజిక్ (ఐఎల్ఎమ్) క్రియేషన్ టెక్నాలజీని వాడాం. దాదాపు 90 శాతం వీఎఫ్ఎక్స్ ఉంటాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఉపేంద్ర సరసన రీష్మా నానయ్య నటిస్తున్న ఈ చిత్రంలో నిధి సుబ్బయ్య, మురళీ శర్మ, పి. రవిశంకర్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బి. లోక్‌నాథ్, కెమెరా: హెచ్‌సి వేణుగోపాల్. -
నాగచైతన్య తండేల్ సినిమా టీజర్
-
'తండేల్' టీజర్ లాంటి వీడియో.. 2 నిమిషాల్లో కథేంటో చెప్పేశారుగా!
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య అదరగొట్టేశాడు. 'తండేల్' సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడీ అక్కినేని హీరో. 'ఎసెన్స్ ఆఫ్ తండేల్' పేరుతో తాజాగా ఓ స్పెషల్ వీడియోని చిత్రబృందం రిలీజ్ చేసింది. చెప్పాలంటే శుక్రవారం సాయంత్రమే విడుదల చేయాల్సింది కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల శనివారం ఉదయం రిలీజ్ చేశారు. అయితే టీజర్ లాంటి ఈ వీడియో ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ప్రమాదం.. కూతుళ్లతో సహా ప్రముఖ నటుడి దుర్మరణం) గతంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు జాలర్లు పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో వాళ్లని కొన్నేళ్ల పాటు పాక్ ప్రభుత్వం జైల్లో నిర్భంధించి చిత్రహింసలు పెట్టింది. ఆ తర్వాత చాన్నాళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొస్తాడు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌తో 'తండేల్' సినిమా తీస్తున్నారు. జాలారి పాత్రలో చైతూ నటిస్తుండగా, అతడి భార్యగా సాయిపల్లవి నటిస్తోంది. బోటుపై చేపల వేటకు వెళ్తున్న హీరో.. 'దద్దా గుర్తెట్టుకో.. ఈపాలి యాట గురి తప్పేదెలేదేస్.. ఇక రాజులమ్మ జాతరే' చెప్పే ఓ డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అతడు పాక్ ప్రభుత్వానికి చిక్కడం, అక్కడ జైల్లో ఇబ్బంది పెడుతున్న అధికారికి కౌంటర్ ఇవ్వడం లాంటి సీన్స్ చూపించారు. చివర్లో సాయిపల్లవిని అలా చూపించి టీజర్‌ని ముగించారు. అయితే కథేంటనేది.. ఈ వీడియోలో చూచాయిగా చెప్పేశారు. చైతూ మాట్లాడిన శ్రీకాకుళం యాస కూడా బాగుంది. ఏదేమైనా పాన్ ఇండియా లెవల్లో 'తండేల్'తో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) -
Bhimaa Teaser: వేటాడేందుకు బ్రహ్మ రాక్షసుడు వచ్చేశాడు
టాలీవుడ్ మ్యాచోస్టార్ గోపీచంద్ 'భీమా'గా బాక్సాఫీస్ బరిలోకి అడుగు పెట్టనున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్నారు. కేకే రాధామోహన్ నిర్మాత. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నారు. టీజర్లో ఆయన లుక్ అదిరిపోయేలా ఉంది. గోపీచంద్ ఒక ఎద్దుపై కూర్చొని సంకెళ్లతో పాటు ఖాకీ దుస్తుల్లో కనిపించాడు. వినూత్నమైన యాక్షన్ ఎంటర్టైనర్గా గోపీ కెరియర్లో 31వ చిత్రంగా భీమా తెరకెక్కుతుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న భీమా సినిమాతో దర్శకుడు హర్ష టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఫిబ్రవరి 16న భీమా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనువైట్ల డైరెక్షన్లో తన 32 వ సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది. -
యాత్ర 2 సినిమా టీజర్ రిలీజ్
-
Yatra 2 Teaser: రిలీజైన 'యాత్ర 2' టీజర్
'యాత్ర 2' సినిమా టీజర్ వచ్చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. అయితే ఏయే సంఘటనల ఆధారంగా తీశారనేది మొన్నటివరకు కాస్త సందేహం ఉండేది. తాజాగా వచ్చిన టీజర్‌తో సినిమాపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అలానే అంచనాలు కూడా పెరిగిపోయాయి. టీజర్లో ఏముంది? వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) కొడుకుగా వై.ఎస్.జగన్ (జీవా) రాజకీయాల్లోకి రావటానికి కారణమేంటనే అంశాన్ని చిన్నహార్ట్ టచింగ్ సన్నివేశంతో చూపించారు. అలానే తండ్రి లాంటి నాయకుడిని కోల్పోయినప్పుడు వారిని ఓదార్చటానికి ఓదార్పు యాత్ర చేద్దామంటే నాటి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఆ అడ్డంకులని జగన్ ఎలా అధిగమించారు? తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎలా ఎదిగారనేదే 'యాత్ర 2' సినిమా. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) గూస్బంప్స్ సీన్స్ ఈ టీజర్లో ఓ చోట.. 'ఉన్నదంతా పోయినా పర్లేదని తెగించినా.. జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడమ్' అని సోనియాగాంధీతో ఓ పాత్రధారి చెప్పే సీన్.. 'చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్న' అనే మరో సీన్.. 'నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' అని అసెంబ్లీలో జగన్ పాత్రధారి చెప్పే సీన్స్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. టీజర్ ఇలా ఉందంటే సినిమా అంతకుమించి ఉండబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా 'యాత్ర 2' సినిమా తీశారు డైరెక్టర్ మహి వి రాఘవ. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు. ఈ ఫిబ్రవరి 8న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. (ఇదీ చదవండి: OTT Releases This Week: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!) -
కొత్త స్టోరీతో వస్తోన్న పలాస హీరో.. టీజర్ రిలీజ్!
పలాస 1978 ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూస్తే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అహ్లాదకరమైన ప్రేమకథలా ఉంది. అలాగే హీరో, హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన టైటిల్ సాంగ్ ‘శశివదనే’, ‘డీజే పిల్లా..’ అనే సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విడుదలైన టీజర్ నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళుతుంది. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్, రిలీజ్ డేట్‌పై మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శరవణన్ వాసుదేవన్ సంగీతం మందిస్తున్నారు. -
ఈ-మెయిల్ మూవీ టీజర్