![Tollywood Actress Rashmika Mandanna Shares Vijay Deverakonda Teaser](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Reshmika3.jpg.webp?itok=zYM3gm6M)
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాకు కింగ్‌డమ్ అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా టైటిల్ రివీల్ చేయడంతో పాటు టీజర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌కు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్‌ను అందించారు. ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ రౌడీ హీరో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అయితే ఈ మూవీ టీజర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో కింగ్‌డమ్ టీజర్ పోస్టర్‌ను పంచుకుంది. 'ది మ్యాన్ కమ్స్ విత్ సమ్‌థింగ్ మెంటల్.. విజయ్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది' అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
కొన్నేళ్లుగా డేటింగ్ రూమర్స్..
టాలీవుడ్‌లో ఈ జంటపై కొన్నేళ్లుగా డేటింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో చాలాసార్లు వీరిద్దరు పెట్టిన పోస్టులతో ఫ్యాన్స్‌కు దొరికిపోయారు. గతేడాది దీపావళికి సైతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ చేసుకుంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత మరోసారి ఈ జంటపై రూమర్స్ వైరలయ్యాయి. తాజాగా కింగ్‌డమ్ టీజర్‌ను రష్మిక షేర్ చేయడంతో మరోసారి చర్చ మొదలైంది. కాగా.. వీరిద్దరు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా నటించారు. ప్రస్తుతం ఛావా మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది రష్మిక. ఈ బాలీవుడ్ చిత్రంలో విక్కీ కౌశల్ సరసన హీరోయిన్‌గా కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment