రష్మిక దీపావళి సెలబ్రేషన్స్‌.. ఆ టాలీవుడ్ హీరో ఇంట్లోనే! | Rashmika Mandanna celebrates Diwali with Vijay Deverakonda family | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్‌..!

Published Fri, Nov 1 2024 3:21 PM | Last Updated on Fri, Nov 1 2024 3:36 PM

Rashmika Mandanna celebrates Diwali with Vijay Deverakonda family

పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియావ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న బ్యుటీ రష్మిక మందన్నా. ప్రస్తుతం పుష్ప-2తో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది. అల్లు అర్జున్‌ సరసన శ్రీవల్లిగా మెప్పించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీపావళి సందర్భంగా పుష్ప-2 పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

‍అయితే ఈ ముద్దుగుమ్మ దీపావళి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను తాజాగా తన ఇన్‌స్టాలో పంచుకుంది. దీపాలు పళ్లెంలో పట్టుకుని సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. అంతే కాకుండా పిక్ క్రెడిట్స్‌ ఆనంద్ దేవరకొండ అంటూ క్యాప్షన్‌ కూడా రాసుకొచ్చింది. అంటే దీపావళి పండుగను విజయ్ దేవరకొండ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

అయితే గత కొన్నేళ్లుగా వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించారు. గతంలోనూ విజయ్ దేవరకొండ  ఇంటికి వెళ్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలా ఎప్పుడెళ్లినా ఫోటోలతో నెటిజన్లకు దొరికిపోయింది. ఈ సారి కూడా దీపావళి పండుగను విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఈ జంట తమ రిలేషన్‌పై ఎక్కడా కూడా బయటికి చెప్పలేదు.


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement