Rashmika Mandanna
-
రష్మిక 'గర్ల్‌ఫ్రెండ్'ని పరిచయం చేసిన దేవరకొండ
'పుష్ప 2'తో అందరి మనసుల్ని దోచేసిన రష్మిక.. ఇప్పుడు 'ద గర్ల్ ఫ్రెండ్'గా రాబోతుంది. ప్రముఖ నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తీస్తున్న ఈ సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీ. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ సాగడం విశేషం.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)'నీకని మనసుని రాసిచ్చేసా.. పడ్డానేమో ప్రేమలో బహుశా' అని విజయ్ దేవరకొండ చెబుతుంటే.. స్క్రీన్‌పై రష్మిక కనిపిస్తుంటే వీళ్లిద్దరి ఫ్యాన్స్‌కి కనులవిందుగా అనిపిస్తోంది. ఎందుకంటే చాన్నాళ్లుగా వీళ్ల రిలేషన్ గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్ టైంలో చూచాయిగా ప్రేమలో ఉన్నమన్నట్లు చెప్పారు. ఇప్పుడు ఈ టీజర్ చూస్తుంటే రష్మిక కోసం విజయ్ కవిత్వం చెబుతున్నాడేమో అనిపించింది.'ద గర్ల్ ఫ్రెండ్' సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. హేసమ్ అబ్దుల్ సంగీతమందించగా.. 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి.. రష్మికకు జోడిగా కనిపించబోతున్నాడు. టీజర్ మొత్తం రష్మిక క్లోజప్ షాట్స్ కనిపించాయి. ఇదంతా చూస్తుంటే ఈ మూవీలో రష్మిక యాక్టింగ్ అదరగొట్టేయబోతుందనిపిస్తోంది. బహుశా ఫిబ్రవరిలో మూవీ రిలీజ్ ఉండొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు) -
తెర వెనక శ్రీవల్లి.. 'పుష్ప 2'ని మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)
-
Pushpa2: థియేటర్స్‌లో మహిళలకు పూనకాలు.. వీడియో వైరల్
ఇండియన్ బాక్సాఫీస్‌ని పుష్ప 2 షేక్ చేస్తుంది. అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్లో నాలుగో చిత్రంగా తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రిమియర్ షో నుంచి ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. దీంతో తొలి రోజే ఏకంగా రూ. 294 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డుకెక్కింది. (చదవండి: పుష్ప చూశాక.. బన్నీ కూడా చిన్నగా కనిపించాడు, ఆర్జీవీ ట్వీట్)ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు జాతర సీన్, క్లైమాక్స్ గురించే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్లో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడని చెబుతున్నారు. థియేటర్స్‌లో జాతర ఎపిసోడ్ చూస్తే గూస్బంప్స్ గ్యారెంటీ అంటున్నారు. చెప్పడం కాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తుంటే.. సినిమా చూడని వారికి కూడా పూనకాలు వస్తున్నాయి.(చదవండి: పుష్ప 2 మూవీ రివ్యూ)థియేటర్లో సినిమా చూస్తున్న ఓ మహిళకు.. జాతర ఎపిసోడ్ రాగానే నిజంగానే పూనకం వచ్చింది. అమ్మవారు పూనడంతో సీట్లో కూర్చొనే గట్టిగా కేకలు వేస్తూ ఊగిపోయింది. అలాగే మరో మహిళ కూడా జాతర సీన్ చూసి.. పూనకం వచ్చినట్లుగా ప్రవర్తించింది. పక్కన ఉన్నవారి వచ్చి వారిని శాంతింపజేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పులను మైత్రీ మూవీ మేకర్స్ తమ ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేయగా..అవి కాస్త వైరల్‌గా మారాయి. ఇక పుష్ప 2 విషయానికొస్తే.. సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప ’చిత్రానికి సీక్వెల్ ఇది. అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక నటించగా.. ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. Neekanna Peddha Dhikku... Lokaana YekkadundhiNaivedhyam Ettanga... Maa Kaada YemitundhiMoralanni Aaalakinchi... Varameeyyave Thalli 🙏🙏🙏GANGO RENUKA THALLI 🙏🙏🙏 https://t.co/shS1a4rYvH— Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2024 -
విజయ్ దేవరకొండ పెళ్లి టాపిక్.. తండ్రి ఏమన్నారంటే?
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రాబోయే మార్చిలో రిలీజ్ కానుందని ఇదివరకే ప్రకటించారు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు విజయ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. విజయ్ దేవరకొండ పెళ్లి గురించి ఇతడి తండ్రి స్వయంగా మాట్లాడటినట్లు కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ టాపిక్ అసలు ఎందుకొచ్చింది?(ఇదీ చదవండి: 'పుష్ప2' టికెట్ల ధరలు తగ్గనున్నాయా.. కారణం ఇదేనా..?)విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే చాలామంది రష్మిక అని అంటారు. ఎందుకంటే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలారోజులుగా రూమర్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇది నిజమనేలా ఎప్పటికప్పుడు ఏదో ఓ టూర్‌కి కలిసి వెళ్తుంటారు. కానీ సోషల్ మీడియాలో వేర్వేరుగా ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో దీని గురించి ఎంత చర్చ నడిచినా కిక్కురుమనరు.తాజాగా విజయ్ తండ్రి గోవర్దన్ని కొడుకు పెళ్లి గురించి అడిగితే.. విజయ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడని, గౌతమ్ సినిమా జరుగుతోందని, సంక్రాంతి తర్వాత మైత్రీ మూవీస్ నిర్మాణంలో సినిమా ఉంటుందని, అనంతరం కొన్నాళ్లకు దిల్ రాజు నిర్మాతగా కొత్త ప్రాజెక్ట్ మొదలవుతుందని చెప్పారు. అందుకే కాస్త వీలు చూసుకుని, విజయ్‌కి టైమ్ కుదిరినప్పుడే పెళ్లి ఆలోచన చేస్తామని అన్నారు. దీనికి మరో ఆరు నెలల నుంచి ఏడాది పట్టొచ్చని చెప్పారు. అంటే ఇప్పట్లో విజయ్ పెళ్లి లేనట్లే!(ఇదీ చదవండి: నటిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ దర్శకుడు సందీప్ రాజ్) -
రష్మిక డిసెంబర్ సెంటిమెంట్ రిపీట్?
-
'పుష్ప' లైఫ్‌ని మార్చేసే పాత్ర.. ఈ నటి ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప 2' చూసిన రష్మిక
హీరోయిన్ రష్మిక.. హీరో విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందనే రూమర్స్ చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఇది నిజమేనని అనడానికి ఎప్పటికప్పుడు ఏదో ఓ విషయం కనిపిస్తూనే ఉంటుంది. విజయ్-రష్మిక అప్పుడప్పుడు కలిసి టూర్స్‌కి వెళ్తుంటారు. కానీ ఎవరికి వాళ్లు ఒంటరిగా దిగిన పిక్స్ పోస్ట్ చేస్తుంటారు. వాటిని కలిపి చూస్తే జంటగా వెళ్లారని నెటిజన్లు పట్టేస్తారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కలెక్షన్స్.. హిందీలో బన్నీ బ్రాండ్ రికార్డ్!)కొన్నాళ్ల క్రితం చెన్నైలో జరిగిన 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్లో పెళ్లి, ప్రియుడి గురించి టాపిక్ రాగానే రష్మిక తెగ సిగ్గుపడిపోయింది. నేను చేసుకోబోయేది ఎవరో మీకు కూడా తెలుసుగా! అని సమాధానమిచ్చింది. అంటే విజయ్ దేవరకొండ అని పరోక్షంగా కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు 'పుష్ప 2' సినిమా దేవరకొండ ఫ్యామిలీతో కలిసి చూసింది.బుధవారం రాత్రి మూవీ టీమ్‌తో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్లో సినిమా చూసిన రష్మిక.. గురువారం సాయంత్రం ఏఎంబీలో విజయ్ దేవరకొండ తల్లి, తమ్ముడితో కలిసి సినిమా చూసింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇన్నాళ్లు విజయ్ కుటుంబాన్ని కలిసినప్పటికీ ఎప్పుడు ఇలా బయటపడలేదు. కానీ ఇప్పుడు సినిమాని కలిసి చూడటం లాంటివి చూస్తుంటే త్వరలో విజయ్-రష్మిక గుడ్ న్యూస్ చెప్పేస్తారేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 19 సినిమాలు) -
వైల్డ్ ఫైర్.. ఆంధ్రా అంతా 'పుష్ప 2' నామస్మరణే (ఫొటోలు)
-
పుష్ప-2 మూవీ స్టిల్స్.. ఫోటోలు షేర్ చేసిన రష్మిక
-
‘పుష్ప 2’ మాస్ జాతర.. అల్లు అర్జున్ (ఫొటోలు)
-
Pushpa 2 Review: ‘పుష్ప 2’ మూవీ రివ్యూ
టైటిల్: పుష్ప 2: ది రూల్నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహద్ పాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్, ధనంజయ, తారక్ పొన్నప్ప, అజయ్ ఘోష్ తదితరులునిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్నిర్మాతలు: నవీన్ కుమార్, రవిశంకర్రచన-దర్శకత్వం: సుకుమార్సంగీతం: దేవీశ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్ఎడిటింగ్: నవీన్ నూలివిడుదల తేది: డిసెంబర్ 5, 2024అల్లు అర్జున్ అభిమానుల మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేల పుష్ప 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత ఆ స్థాయిలో యావత్ సినీలోకం ఎదురు చూస్తున్న తెలుగు సినిమా పుష్ప 2. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్ ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా చాలా గ్రాండ్‌గా నిర్వహించడంతో దేశం మొత్తం ‘పుష్ప 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? బన్నీ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.‘పుష్ప 2’ కథేంటంటే..?ఒక సాధారణ కూలీగా జీవీతం మొదలు పెట్టిన పుష్పరాజ్(అల్లు అర్జున్) ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది ‘పుష్ప పార్ట్-1’లో చూపించారు. పుష్పరాజ్ సిండికేట్ లీడర్ కావడంతో ‘పుష్ప : ది రైజ్’ కథ ముగుస్తుంది. పుష్ప 2: ది రూల్ (Pushpa 2 The Rule Movie Telugu Review) సినిమా కథ అక్కడ నుంచే ప్రారంభం అవుతుంది. శ్రీవల్లి(రష్మిక)ని పెళ్లి చేసుకొని అటు వ్యక్తిగతం జీవితాన్ని హాయిగా గడుపుతూనే.. మరోవైపు ఎర్ర చందనం స్మగ్లింగ్‌ని దేశం మొత్తం విస్తరిస్తాడు పుష్పరాజ్. ఎంపీ సిద్దప్ప(రావు రమేశ్) అండతో తన వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటాడు. ఓ సారి చిత్తూరుకి వచ్చిన ముఖ్యమంత్రి నరసింహరెడ్డిని కలిసేందుకు పుష్పరాజ్ వెళ్తాడు. భార్య శ్రీవల్లి కోరిక మేరకు అతనితో ఫోటో దిగేందుకు ప్రయత్నించగా..‘స్మగ్లర్‌తో ఫోటో దిగలేను’ అంటూ సీఎం నిరాకరిస్తాడు. అంతేకాదు శ్రీవల్లిని అవమానించేలా మాట్లాడతాడు. దీంతో ఆ సీఎంనే మార్చాలని పుష్పరాజ్ డిసైడ్ అవుతాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్దప్పను చేయాలనుకుంటాడు. దాని కోసం పుష్పరాజ్ ఏం చేశాడు? తనను అవమానించిన పుష్పరాజ్‌ని ఎలాగైన పట్టుకోవాలని చూస్తున్న ఎస్పీ షెకావత్(ఫాహద్ ఫాజిల్) ప్రయత్నం ఫలించిందా? షెకావత్‌కి పుష్పరాజ్ విసిరిన సవాల్ ఏంటి? కేంద్రమంత్రి ప్రతాప్‌రెడ్డి(జగపతి బాబు), పుష్పరాజ్ మధ్య ఎందుకు గొడవ వచ్చింది? ప్రతాప్‌రెడ్డి తమ్ముడు కొడుకు (తారక్ పొన్నప్ప) పుష్పరాజ్‌పై పగ పెంచుకోవడానికి గల కారణం ఏంటి? తనను తప్పించి సిండికేట్ లీడర్‌గా ఎదిగిన పుష్పరాజ్‌ను అణచివేసేందుకు మంగళం శ్రీను(సునీల్), దాక్షాయణి(అనసూయ)వేసిన ఎత్తుగడలు ఏంటి? చివరకు పుష్పరాజ్ అనుకున్నట్లుగా సిద్దప్పను సీఎం చేశాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కొన్ని సినిమాలకు కథ అవసరం లేదు. స్టార్ హీరో.. ఆయన స్థాయికి తగ్గట్లు ఎలివేషన్స్..భారీ యాక్షన్ సీన్స్.. మాంచి పాటలు ..ఇవి ఉంటే చాలు బొమ్మ హిట్టైపోతుంది. పుష్ప 2లో డైరెక్టర్ సుకుమార్ కూడా ఇదే ఫార్ములాను అప్లై చేశాడు. పుష్ప : ది రైజ్ సినిమాతో పుష్పరాజ్ పాత్రను డ్రగ్‌లా ఎక్కించిన సుక్కు.. పార్ట్ 2లో ఆ మత్తును అలానే కంటిన్యూ చేసేశాడు. కథపై కాకుండా ఎలివేషన్స్.. యాక్షన్ సీన్స్‌పై ఎక్కువ ఫోకస్ చేశాడు. పార్ట్ 1లో ఉన్నంత కథ కూడా ఈ సీక్వెల్లో లేదు. హై ఇవ్వడమే లక్ష్యంగా కొన్ని సీన్లను అల్లుకుంటూ పోయాడు అంతే. ప్రతి పది నిమిషాలకొకసారి హై ఇచ్చే సీన్ ఉండేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. కథనం నీరసంగా సాగుతుందన్న ఫీలింగ్ ఆడియన్స్‌కి వచ్చేలోగా.. ఓ భారీ యాక్షన్ సీన్ పడుతుంది. అందులో బన్నీ నటవిశ్వరూపం చూసి గూస్బంప్స్ తెచ్చుకోవడమే తప్ప.. మరో ఆలోచన రాదు. భార్య మాట భర్త వింటే ఎలా ఉంటుందనే పాయింట్‌ని ఈ స్మగ్లింగ్ కథతో ముడిపెట్టి చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.ఓ భారీ యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. పుష్పరాజ్ క్యారెక్టర్, అతని ప్రపంచం గురించి అల్రేడీ తెలుసు కనుక.. స్టార్టింగ్ నుంచే హీరోకి ఎలివేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఫహాద్ పాత్ర ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. ఫస్టాఫ్ అంతా షెకావత్-పుష్పరాజ్ మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్‌లా కథనం సాగుతుంది. ఎర్రచందనం పట్టుకునేందుకు షెకావత్ ప్రయత్నించడం.. పుష్పరాజ్ అతన్ని బురిడీ కొట్టించి దాన్ని తరలించడం .. ఫస్టాఫ్ మొత్తం ఇదే తంతు నడుస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే స్విమింగ్ఫూల్ సీన్ అదిరిపోతుంది. ఇద్దరి జరిగే సవాల్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అలాగే శ్రీవల్లీ, పుష్పరాజ్‌ల మధ్య వచ్చే ‘ఫీలింగ్స్’ సీన్లు నవ్వులు పూయిస్తాయి. ఇక ద్వితియార్థంలో ఎమోషన్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. జాతర ఎపిసోడ్ అదిరిపోతుంది. ఆ తర్వాత కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్ అయితే పూనకాలు తెప్పిస్తుంది. ఆ సీన్లో బన్నీ మాస్ తాండవం చేశాడు. క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోదు. పార్ట్ 3కి ఇచ్చిన లీడ్ అంతగా కిక్ ఇవ్వలేదు. సినిమా నిడివి (దాదాపు 3 గంటల 20 నిమిషాలు) ఎక్కువగా ఉండడం సినిమాకు కాస్త మైనస్ అనే చెప్పాలి. లాజిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాకుంటే అంత మంచిది. అయితే మాస్ ఆడియన్స్‌కి ఇవేవి అవసరం లేదు. వారిని ఎంటర్టైన్ చేస్తే చాలు. అలాంటి వారికి పుష్ప 2 విపరీతంగా నచ్చుతుంది. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి అయితే సుకుమార్ ఫుల్ మీల్స్ పెట్టారనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే..పుష్ప: ది రూల్’ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కథనంతా తన భుజాన వేసుకొని నడిపించాడు. మాస్ లుక్‌లోనే కాదు నటనలోనూ బన్నీ అదరగొట్టేశాడు. యాక్షన్ సీన్స్‌లో అయితే ‘తగ్గేదేలే’ అన్నట్లుగా తన నట విశ్వరూపం చూపించాడు. జాతర ఎపిసోడ్, క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్లో బన్నీ ఫెర్మార్మెన్స్ నెక్ట్స్ లెవన్‌లో ఉంది. చిత్తూర యాసలో ఆయన పలికిన సంభాషణలు అలరిస్తాయి.ఇక శ్రీవల్లీగా డీగ్లామర్ పాత్రలో రష్మిక జీవించేసింది. పార్ట్ 1తో పోలిస్తే ఈ చిత్రంలో ఆమె పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది. జాతర ఎపిసోడ్లో ఆమె చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి. డీఎస్పీ షెకావత్‌గా ఫహద్ పాజిల్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎంపీ సిద్దప్పగా రావు రమేశ్ మరోసారి తెరపై తమ అనుభవాన్ని చూపించారు. తారక్ పొన్నప్పకు మంచి పాత్ర లభించింది. బన్నీకి ఆయన మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల అదరగొట్టేసింది. బన్నీతో పోటీ పడి మరి డ్యాన్స్ చేసింది. మంగళం శ్రీను పాత్రలో నటించిన సునీల్‌కి పెద్దగా గుర్తుంచుకునే సీన్లేవి పడలేదు. దాక్షయణిగా నటించిన అనసూయ పరిస్థితి కూడా అంతే. ఒకటి రెండు చోట్ల ఆమె చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక కేంద్రమంత్రి ప్రతాప్ రెడ్డిగా జగపతి బాబు ఉన్నంత చక్కగా నటించాడు. పార్ట్ 3లో ఆయన నిడివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జగదీశ్, ధనుంజయ, అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. దేవీశ్రీ ప్రసాద్, శ్యామ్ సీఎస్ల నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ‘సూసేకీ..’, కిస్సిక్’, ‘ఫీలింగ్స్’ పాటలు తెరపై అలరించాయి. సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతి సీన్ చాలా రిచ్‌గా, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెపాల్సింది. నిడివిని కొంచెం తగ్గిస్తే బాగుండేవి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా ‘తగ్గేదేలే’ అన్నట్లుగా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు.- అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Pushpa 2 X Review: ‘పుష్ప 2’మూవీ ట్విటర్ రివ్యూ
అల్లు అర్జున్ ఫ్యాన్‌తో పాటు యావత్ సినీలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం.. బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప- ది రైజ్’ కి సీక్వెల్ కావడంతో ‘పుష్ప 2: ది రూల్’పై ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. దానికి తోడు పాట్నా మొదలుకొని చెన్నై, ముంబై, కొచ్చి లాంటి నగరాలతో పాటు దేశమంతా తిరిగి ప్రచారం చేయడంతో ‘పుష్ప 2’పై భారీ బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో గురువారం రాత్రి 9.30 గంటల నుంచే స్పెషల్ షోస్ పడిపోయాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.పుష్ప 2 కథేంటి? ఎలా ఉంది? బన్నీ ఖాతాలో మరో భారీ హిట్ పడిందా లేదా? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్ ) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్‌లో పుష్ప 2 చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. బన్నీ మాస్ యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. సుకుమార్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారీ బ్లాక్ బస్టర్‌తో ఈ ఏడాది ముగించారని కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది అయితే ఇది యావరేజ్ మూవీ అంటున్నారు. #Pushpa2 definately cross 250 cr on 1st day 🔥 What a film https://t.co/zSTuWaSX93— Sameer Chauhan 🥷 (@srk_MrX) December 5, 2024 First Day First Show #Pushpa2TheRulereviewReally A Great Movie - Full Paisa Wasool. #RashmikaMandana And #AlluArjun𓃵 Killer🔥 #Pushpa2 #AlluArjun #Pushpa2ThaRule #Pushpa2Review #WildfirePushpa pic.twitter.com/ii4jx7vbWs— Lokesh 🕉️ (@LokeshKhatri__) December 5, 2024 #Pushpa2 is a Decently Packaged Commercial Entertainer with a Good 1st Half and a 2nd Half that started well but drops pace significantly in the last hour. The first half starts right where Part 1 ends. This half runs purely on drama which feels slightly slow at times but…— Venky Reviews (@venkyreviews) December 4, 2024 పుష్ప 2 డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్.ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ స్టార్టింగ్ బాగుంది కానీ చివరి గంట డ్రాప్ అయినట్లుగా అనిపించిదంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాను.#Pushpa2TheRule Review 1st Half = Excellent 🥵2nd Half = Justified 🙂Rating = 3.25/5🥵❤️🔥— Rama (@RameshKemb25619) December 4, 2024 ఫస్టాప్ అద్భుతంగా ఉంది. సెకండాఫ్ కథకి న్యాయం జరిగింది అంటూ మరో నెటిజన్ 3.25 రేటింగ్ ఇచ్చారు.Icon star #ALLUARJUNNata viswaroopam 🔥🔥brilliant Director Sukumar Ramapage 🔥🔥🔥India’s Biggest Blockbuster #Pushpa2 #pushpatherule— Maduri Mattaiah Naidu (@madurimadhu1) December 4, 2024 ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నటవిశ్వరూపం, సుకుమార్ డైరెక్షన్ అదిరిపోయింది. ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.Kuthaa Ramp undhi Movie🔥🔥🔥@alluarjun acting ayithe vere level especially aa Jathara scene ayithe punakale🔥🔥🔥🔥🔥🔥🔥🔥#Sukumar writing excellent @ThisIsDSP bgm 🔥🔥Pushpa gadi Rulu India shake avuthadi🔥🔥🔥❤️🔥❤️🔥❤️🔥#Pushpa2TheRule #Pushpa2 #Pushpa2TheRuleReview #Pushpa2— Hanish (@HarishKoyalkar) December 4, 2024Good 1st half Below average 2nd half Bad climax#Pushpa2 #Pushpa2TheRule Bhaai one man show ! #Pushpa2Review #Pushpa2Celebrations— CeaseFire 🦖 (@Rebelwood_45) December 4, 2024#Pushpa2 #1stHalfReviewSuperb and very entertaining. Just a mass 🔥🔥 Comedy, dialogue delivery @alluarjun just nailed it. The real Rule of #Pushpa #FahadFaasil craziness is just getting started. Waiting for 2nd half 🔥#SamCS BGM 🔥🔥🔥— Tamil TV Channel Express (@TamilTvChanExp) December 4, 2024#Pushpa2 #AlluArjun𓃵 Power packed first half followed by a good second halfSukkumark in writing and screenplay 3hr 20 mins lo oka scene kuda bore kottadu 💥Rashmika acting 👌Songs bgm💥Cinematography too good vundi asalu @alluarjun nee acting ki 🙏Peak commercial cinema.— Hussain Sha kiran (@GiddaSha) December 4, 2024 -
Pushpa 2: పుష్ప 2 కథేంటి? సుకుమార్ ఏం చెప్పబోతున్నాడు?
మరికొద్ది గంటల్లో పుష్ప 2 థియేటర్స్‌లో సందడి చేయబోతుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప : ది రైజ్’కు కొనసాగింపుగా ఈ చిత్రం రాబోతుంది. ఈ రోజు(డిసెంబర్ 4) రాత్రి 9.30 గంటల నుంచి తెలంగాణలో స్పెషల్ షోస్ పడబోతున్నాయి. అర్థరాత్రి తర్వాత పుష్ప 2 టాక్ ఏంటనేది బయటకు వచ్చేస్తుంది. పుష్ప 2 కథ పార్ట్ 1 కంటే గొప్పగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. అసలు పార్ట్ 2లో సుకుమార్ ఏం చూపించబోతున్నాడనే ఆసక్తి బన్నీ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులందరిలో మొదలైంది. పార్ట్ 1లో వదిలేసిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెబుతాడనేది ఆసక్తికరంగా మారింది. అసలు పార్ట్ 1 వదిలేసిన ప్రశ్నలు ఏంటి? పార్ట్ 2లో ఏం చూపించబోతున్నారు? అనేది ఒక్కసారి చూద్దాం.👉 ఒక సాధారణ కూలీగా జీవితం మొదలుపెట్టిన పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదగాడన్నది ‘పుష్ప : ది రైజ్’లో చూపించారు. ఇక పుష్ప 2లో ఎర్ర చందనం సిండికేట్‌ను లీడ్ చేసే వ్యక్తిగా మారిన తర్వాత పుష్పరాజ్ తన వ్యాపారాన్ని ఎలా విస్తరించాడన్నది చూపించబోతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ని దేశంలోనే కాకుండా.. విదేశాలకు విస్తరించే అవకాశం ఉంది. ‘పుష్పా.. అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్’ అనే డైలాగ్‌తో ఈ విషయం చెప్పకనే చెప్పేశారు.👉 సాధారణంగా సీక్వెల్ కోసం ఓ బలమైన పాయింట్‌ని ముగింపులో చూపిస్తారు. బాహుబలి పార్ట్ 1లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనేది చెప్పకుండా పార్ట్ 2 కోసం ఎదురు చూసేలా చేశారు రాజమౌళి. కానీ పుష్పలో సుకుమార్ అలాంటి ఉత్కంఠత కలిగించే పాయింటేది దాచలేదు. ప్రేక్షకుడు ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు రావాలనే ఉద్దేశంతో అలా చేయ్యొచ్చు. సుకుమార్ సినిమాల్లో స్క్రీన్‌ప్లే చాలా బలంగా ఉంటుంది. తనదైన ట్విస్టులతో అలరిస్తాడు. ఆ నమ్మకంతోనే సుకుమార్ ఉత్కంఠతో ఎదురుచూసేలా బలైమన పాయింట్‌తో ముగింపు ఇవ్వలేదేమో.👉 పుష్ప 2లో సునీల్ పోషించిన మంగళం శ్రీను పాత్ర మరింత బలంగా చూపించే అవకాశం ఉంది. పార్ట్ 1లో మంగళం శ్రీను బామ్మర్థిని పుష్ప చంపేస్తాడు. అంతేకాకుండా సిండికేట్ లీడర్‌గా ఉన్న మంగళం శ్రీనుని పక్కకు జరిపి.. మాఫియా మొత్తాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు పుష్ప. ముష్పరాజ్‌ని ఎదుర్కొనే దీటైన వ్యక్తిగా మంగళం శ్రీనుని చూపించే అవకాశం ఉంది.👉 ఇక పార్ట్ 1లో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫహద్ ఫాజిల్ సినిమా చివర్లో ఎంట్రీ ఇస్తాడు. పుష్పరాజ్ అతన్ని ఘోరంగా అవమానిస్తాడు. భన్వర్ సింగ్ తన ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడనేది పార్ట్ 2లో చూపించనున్నారు. ‘పార్టీ ఉంది పుష్పా.. పార్టీ ఉంది’ అంటూ ట్రైలర్లో షేకావత్ పాత్రను బలంగా చూపించారు.👉 కన్నడ నటుడు ధనుంజయ పోషించిన జాలిరెడ్డి పాత్రకు పార్ట్ 2లో మరింత ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. శ్రీవల్లీని బలవంతం చేయడానికి ప్రయత్నించడంతో పుష్పరాజ్..జాలిరెడ్డిని చితక్కొడుతాడు. ఓ కూలోడు తనను కొట్టడాన్ని జాలిరెడ్డి అవమానంగా భావిస్తాడు. ఎలాగైన పుష్పరాజ్‌ని చంపేయాలని డిసైడ్ అవుతాడు. మరి జాలిరెడ్డి తన పగను ఎలా తీర్చుకున్నాడనేది పుష్ప 2లో చూపించే అవకాశం ఉంది.👉 పుష్పలో దాక్షాయణిగా కనిపించిన అనసూయ.. తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు పార్ట్ 1లో పెద్దగా ప్రాధాన్యత లేదు. కానీ పుష్ప 2లో మాత్రం ఈ పాత్రను ఎలివేట్ చేసే చాన్స్ ఉంది. అనసూయ కూడా పలు ఇంటర్వ్యూలో పార్ట్ 2లో తన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని చెప్పింది.👉 ఇక పుష్ప 1లో మొదటి నుంచి పుష్ప రాజ్‌కు ఇంటిపేరు లేదంటూ అవమానిస్తూ వస్తారు. సొంత అన్న(అజయ్) మొదలుకొని షేకావత్ వరకు పుష్పరాజ్‌కు ఇంటిపేరు లేదంటూ హేళన చేస్తుంటారు. పార్ట్ 2లో పుష్పరాజ్ ఇంటిపేరు సంపాదించే అవకాశం ఉంది. తనను అవమానించిన అన్నే అతనికి ఇంటిపేరు ఇచ్చే సీన్ ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా ఉటుందని టాక్. 👉 పుష్పరాజ్‌ను పట్టుకునేందుకు పలుమార్లు ప్రయత్నించినా.. డీఎస్పీ గోవిందప్ప(శత్రు)కి పరాభావమే ఎదురవుతుంది. ఆ అవమానం తట్టుకోలేక వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. తిరిగి పార్ట్ 2లో ఈ పాత్ర ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.👉 పార్ట్-1లో మురుగన్ ఓ వ్యక్తి అనుమతి కోసం వెయిట్ చేసినట్లు చూపిస్తారు. ఆ పాత్రను సుకుమార్ పూర్తిగా రివీల్ చేయలేదు. మరి ఆ కీలకపాత్రలో కనిపించేది ఎవరు? జగపతి బాబు పాత్ర ఏంటి? అనేది పార్ట్ 2లోనే తెలుస్తుంది. 👉 పార్ట్ 1లో శ్రీవల్లీ(రష్మిక) పాత్ర నిడివి కూడా అంతగా ఉండదు. కానీ సినిమా ముగింపులో పుష్ప శ్రీవల్లీని పెళ్లి చేసుకున్నట్లు చూపించారు. పార్ట్ 2లో ఆమె పాత్ర మరింత బలంగా ఉన్నట్లు తెలుస్తుంది. ‘శ్రీవల్లి నా పెళ్లాం. పెళ్లాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో పెపంచకానికి చూపిస్తా’ అని ట్రైలర్లో పుష్పరాజ్ చెప్పే డైలాగ్‌తో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. రష్మిక కూడా పార్ట్ 2లోనే తన పాత్ర నిడివి ఎక్కువ అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. 👉 జాతర ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అని చిత్రవర్గాలు చెబుతున్నాయి. మరి ఆ జాతరతో పుష్పరాజ్‌కు ఉన్న సంబంధం ఏంటనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. -
'పుష్ప 2' రెమ్యునరేషన్.. ఎవరికెంత ఇచ్చారు?
మరికొన్ని గంటల్లో 'పుష్ప 2' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. హైప్ అయితే గట్టిగానే ఉంది. మరోవైపు టికెట్ రేట్ల గురించి కాస్తంత విమర్శలు వచ్చాయి గానీ ఆ ప్రభావం, బుకింగ్స్‌పై మాత్రం కనిపించట్లేదు. తొలి భాగం తీసేటప్పుడు ఓ తెలుగు సినిమాగానే రిలీజ్ చేశారు. కానీ తర్వాత తర్వాత నార్త్‌లోనూ దుమ్మురేపింది. దీంతో అంచనాలు, బడ్జెట్, మూవీ స్కేల్ అమాంతం పెరిగిపోయాయి. దీనికి తోడు నటీనటులు పారితోషికాలు కూడా గట్టిగానే ఉన్నాయండోయ్. ఇంతకీ ఎవరెవరు ఎంత తీసుకున్నారు?'పుష్ప' తొలి పార్ట్ రిలీజ్ ముందు వరకు బన్నీ అంటే తెలుగు రాష్ట్రాలు, మహా అయితే కేరళ వరకు తెలుసేమో! కానీ ఇది సృష్టించిన ప్రభంజనం దెబ్బకు ఉత్తరాదిలోనూ బన్నీ పేరు గట్టిగానే వినిపించింది. ఆ తర్వాత 'పుష్ప' మూవీకిగానూ జాతీయ అవార్డ్.. ఇలా రేంజ్ పెరుగుతూనే పోయింది. దీంతో సీక్వెల్ విషయంలో రెమ్యునరేషన్ బదులు లాభాల్లో షేర్ తీసుకోవాలని బన్నీ నిర్ణయం తీసుకున్నాడు. కట్ చేస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లు దాటేసింది. అలా రూ.270-80 కోట్ల మొత్తం బన్నీ పారితోషికంగా అందుకున్నాడట.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ 'ప్లానెట్ స్టార్'.. ఆర్జీవీ ట్వీట్ వైరల్)బన్నీ తర్వాత డైరెక్టర్ సుకుమార్‌ది హయ్యస్ట్. తొలి పార్ట్ కోసం కేవలం దర్శకుడిగా పనిచేసిన ఇతడు.. సీక్వెల్‌కి వచ్చేసరికి తన సుకుమార్ రైటింగ్స్ సంస్థతో నిర్మాణంలోనూ భాగమయ్యాడు. అలా డైరెక్టర్ కమ్ నిర్మాతగా రూ.100 కోట్ల పైనే రెమ్యునరేషన్ అందుకున్నాడని తెలుస్తోంది. మిగిలిన నటీనటుల విషయానికొస్తే హీరోయిన్ రష్మికకు రూ.10 కోట్లు, ఫహాద్ ఫాజిల్‌కి రూ.8 కోట్లు, ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీలకు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారట. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి రూ.5 కోట్లు పైనే పారితోషికం ఇచ్చారట.వీళ్లు కాకుండా సినిమాలోని ఇతర కీలక పాత్రలు చేసిన జగపతిబాబు, రావు రమేశ్, సునీల్, అనసూయ, అజయ్ తదితరులకు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ లెక్కన చూసుకుంటే రూ.600 కోట్ల మేర మూవీకి బడ్జెట్ అయిందని అంటున్నారు. కానీ ఇందులో సగం బడ్జెట్, పారితోషికాలకే సరిపోయాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే అంతమంది స్టార్స్ పనిచేశారు మరి!(ఇదీ చదవండి: 'పుష్ప 2'పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్) -
వైవిధ్యమైన ప్రేమకథ
ఓ వైపు హీరోయిన్గా, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఫుల్ బిజీగా దూసుకెళుతున్నారు రష్మికా మందన్న. ఆమె లీడ్ రోల్లో రూపొందుతోన్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నటుడు–దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరో దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల కానుంది.ఈ చిత్రం టీజర్ చూసిన అనంతరం డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్‌ను రాహుల్ రవీంద్రన్ చూపించాడు. రష్మిక నటన, భావోద్వేగాలు, క్లోజప్ షాట్స్ చాలా బాగున్నాయి’’ అని పేర్కొన్నారు. ‘‘వైవిధ్యమైన ప్రేమ కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది’’ అన్నారు మేకర్స్. ఇదిలా ఉంటే త్వరలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్లో రష్మిక పాత్రను, నేపథ్యాన్ని హీరో విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో పరిచయం చేస్తారని సమాచారం. -
Pushpa 2: 80 దేశాలు.. 6 భాషలు.. 12500 థియేటర్స్.. నీయవ్వ తగ్గేదేలే
మరో రెండు రోజుల్లో ‘పుష్ప’రాజ్ థియేటర్స్‌లో అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే పుష్ప 2పై భారీ అంచనాలు ఏర్పడాయి. అల్లు అర్జున్ ఒక్కడే ఈ మూవీ ప్రచారాన్ని తన భుజనా వేసుకున్నాడు. కొచ్చి, చెన్నై, ముంబైతో పాటు దేశం అంతా తిరిగి ప్రచారం చేశాడు. నిన్న హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌తో పుష్ప 2 ప్రమోషన్స్‌కి ముగింపు కార్డు పడినట్లే. పక్కా ప్లాన్‌తో చేసిన ఈ ప్రమోషన్ ఈవెంట్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. రిలీజ్‌కి ముందే సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. ఈ మధ్యకాలంలో ఏపాన్ ఇండియా సినిమాకు రానంత హైప్ పుష్ప 2కి వచ్చింది. (చదవండి: ‘పుష్ప-2 బెనిఫిట్ షో కలెక్షన్లు ఏం చేస్తారు?’.. తెలంగాణ హైకోర్టులో విచారణ)ప్రిరిలీజ్ బిజినెస్‌లో కూడా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు 670 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ అయింది. ఇక ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్, ఓటిటి రూపంలో 400 కోట్లు వచ్చినట్టు ఇండస్ట్రీ టాక్. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఈ రేంజ్ లో బిజినెస్ చేయలేదు . దాదాపు 1060 కోట్ల బిజినెస్ తో ట్రేడ్ వర్గాల లో దడ పుట్టిస్తుంది.(చదవండి: 'పుష్ప 3' టైటిల్ ఫిక్స్.. కానీ సందేహమే!)టికెట్ ల విషయానికొస్తే నెల రోజుల ముందే ఓవర్సీస్ లో టికెట్ బుకింగ్ఫ్ స్టార్ట్ అయ్యాయి. కొన్ని గంటల వ్యవధిలో హాట్ కేక్ లా అమ్ముడుపోవడం ఒక రికార్డ్. బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా ఒక మిలియన్ టికెట్స్ అమ్ముడైన చిత్రంగా ‘పుష్ప2’ నిలిచింది. ఇది కేవలం బుక్ మై షోలోనే ఇన్ని టికెట్లు అమ్ముడు పోవడం విశేషం. ఇక నార్త్ ఇండియాలో పుష్ప కి ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు. హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్‌లో 24 గంటల్లోనే లక్ష టికెట్స్ అమ్ముడు పోయాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే టికెట్ బుకింగ్ ఓపెన్ అయినా గంటలోనే ఫస్ట్‌డే టికెట్స్ మొత్తం అయిపోయయని ఎగ్జిబిటర్స్ లు చెబుతున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో నే కాదు సౌత్ నార్త్ ఓవర్సీస్ లో ఏ సెంటర్ చూసిన పుష్ప 2 రికార్డులే ఇపుడు హాట్ టాపిక్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ మూడేళ్లు శ్రమించి పుష్ప2 చిత్రాన్ని నిర్మించింది. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ చిత్రం సుమారు 12 వేల 500పైగా థియేటర్లలో విడుదలకాబోతంది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే దాదాపు 55000 వేల షోస్ పడుతున్న మొట్టమొదటి తెలుగు సినిమా పుష్ప 2 కావడం విశేషం. 80 దేశాల్లో ఆరు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. సెన్సార్ టాక్ కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ రావడం తో బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న పుష్ప 2 సినిమా ప్రౌడ్ ఇండియన్ ఫిల్మ్ గా సినీలవర్స్ అభివర్ణిస్తున్నారు . రిలీజ్ కు ముందే ఇన్ని రికార్డు లను నెలకొల్పిన పుష్ప 2 సినిమా రిలీజ్ తరువాత మరేన్ని రికార్డు ను క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే. -
ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పుష్ప-2
-
పుష్ప2 ఈవెంట్లో 'పీలింగ్సే' అంటూ ఫిదా చేసిన రష్మిక మందన్న (ఫోటోలు)
-
ఏపీలో 'పుష్ప2' టికెట్ ధరలు పెంపు.. అల్లు అర్జున్ ట్వీట్
ఏపీలో 'పుష్ప2' టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సౌలభ్యం కల్పించిన విషయం తెలిసిందే. పుష్ప టికెట్ల ధరల విషయంపై ఏపీ అధికారికంగా జీవో విడుదల చేయడంతో అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. డిసెంబర్ 5న విడుదల కానున్న పుష్ప చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.పుష్ప2 నిర్మాతల విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో మాదిరే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోలకు అనుమతి ఇచ్చింది. ఈ రెండు బెనిఫిట్ షోలకుగాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌లలో ఏదైనా సరే టికెట్ ధర రూ.800గా నిర్ణయించారు. ఈ ధరకు జీఎస్టీ అధనంగా ఉంటుంది.అయితే, డిసెంబర్ 5న ఆరు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్స్‌లలో లోయర్ క్లాస్ రూ.100, అప్పర్ క్లాస్ రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. ఇక్కడ కూడా జీఎస్టీతో కలిపి టికెట్లు కొనాల్సి ఉంటుంది. ఈ ధరలు అన్నీ కూడా ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలకు అదనంగా యాడ్ అవుతుంది. డిసెంబరు 17 వరకు మాత్రమే పెంచిన ధరలు వర్తిస్తాయి. పుష్ప కోసం టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసిన తర్వాత అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణలో టికెట్ల ధరలు ఇలాపుష్ప-2 సినిమా టికెట్ల ధరల పెంపు, అదనపు షోలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సినిమా విడుదల ముందురోజు అంటే డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి ప్రదర్శించే బెన్ఫిట్ షోకు అన్ని రకాల స్క్రీన్లలో రూ.800 పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటల అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 5వ తేదీ నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.150, మల్టీఫ్లెక్స్‌లలో రూ. 200 పెంచుకోవచ్చని తెలిపింది. అయితే, డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్స్‌లలో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఉంది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. I extend my heartfelt thanks to the Government of Andhra Pradesh for approving the ticket hike. This progressive decision demonstrates your steadfast commitment to the growth and prosperity of the Telugu film industry.A special note of thanks to the Hon’ble @AndhraPradeshCM,…— Allu Arjun (@alluarjun) December 2, 2024 -
#Pushpa2TheRule : 'పుష్ప2' సాంగ్ HD స్టిల్స్
-
నేడు పుష్ప–2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. వెళ్లే వారికి పోలీసుల సూచనలు
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం 'పుష్ప2'.. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ ఈవెంట్స్ నిర్వహించిన పుష్ప ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేడు (డిసెంబర్2) హైదరబాద్‌లో జరపనున్నారు. యూసుఫ్‌గూడ పోలీస్‌లైన్స్‌లో సోమవారం జరగనున్న పుష్ప–2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏర్పాట్లను నగర అదనపు సీపీ విక్రమ్‌సింగ్ మాన్, వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్, వెస్ట్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ కట్టా పరిశీలించారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి యూసుఫ్‌గూడ బెటాలియన్‌లో ఈ కార్యక్రమం జరగనుండగా కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నట్లు ప్రజలు ఇతర రహదారుల నుంచి వెళ్లాలని కోరారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు నుంచి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం వైపు వెళ్లే వాహనదారులు శ్రీకృష్ణానగర్, శ్రీనగర్‌కాలనీ మీదుగా పంజగుట్ట వైపు వెళ్లాల్సి ఉంటుంది. మైత్రివనం జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారులు యూసుఫ్‌గూడ బస్తీ వద్ద ఆర్బీఐ క్వార్టర్స్ వైపు మళ్లి కృష్ణానగర్ జంక్షన్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్లాలి. బోరబండ బస్టాపు వైపు నుంచి మైత్రివనం జంక్షన్‌కు వెళ్లే వాహనదారులు ప్రైమ్ గార్డెన్, కల్యాణ్‌నగర్, మిడ్‌ల్యాండ్ బేకరీ, జీటీఎస్ కాలనీ, కల్యాణ్ నగర్ జంక్షన్, ఉమేష్ చంద్ర విగ్రహం మీదుగా యూ టర్న్ తీసుకుని, ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద యూ టర్న్ తీసుకుని మైత్రివనం వైపు వెళ్లాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పార్కింగ్ ఇలా.. కార్లను సవేరా అండ్ మహమూద్ ఫంక్షన్ హాళ్లలో పార్కు చేయాలి. జానకమ్మ తోటలో కార్లు, బైకులు పార్క్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. -
పుష్ప, శ్రీవల్లీల డ్యాన్స్.. ఫ్యాన్స్‌లో 'పీలింగ్స్' జోష్
అల్లు అర్జున్- సుకుమార్ హిట్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'పుష్ప2'. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, కిస్సిక్ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అయితే, తాజాగా పీలింగ్స్ అనే పాటతో అభిమానులను మరోసారి ఫిదా చేశారు. అన్ని భాషల్లో రానున్న ఈ సాంగ్‌లో వచ్చే పల్లవి లిరిక్స్ మలయాళంలోనే ఉండనున్నాయి. ఈ సాంగ్‌లో కూడా దేవీశ్రీ ప్రసాద్ తనదైన మార్క్‌ను చూపించారని చెప్పవచ్చు.పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగానే ప్లాన్ చేసింది. పాన్ ఇండియా రేంజ్లో ఇప్పటికే పట్నా,చెన్నై,కేరళ, కర్ణాటకలో పుష్ప ఈవెంట్స్ జరిగాయి. ఫైనల్‌గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డిసెంబర్ 2వ తేదీన హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బన్నీ అభిమానులు భారీగానే పాల్గొననున్నారు. -
'పుష్ప' టికెట్ ధర రూ. 3 వేలు.. ఎక్కడో తెలుసా..?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప ది రూల్'.. బాలీవుడ్లో కూడా పుష్ప చిత్రానికి భారీగా అభిమానులు ఉండటంతో అక్కడ భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తున్నారు. ‘పుష్ప 2’ సూపర్ డూపర్ హిట్ అవుతుందని అక్కడి సినీ ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఢిల్లీ, ముంబైలలోని కొన్ని థియేటర్లలో హిందీ వెర్షన్ టిక్కెట్ల ధర రూ. 3000 వరకు ఉంది. బుక్‌మైషోలోనే ఈ ధరకు టికెట్లు అమ్ముడుపోతున్నాయి.పుష్ప సినిమా టికెట్ ధరలు టాలీవుడ్ మాదిరే బాలీవుడ్లో కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ముంబైలోని మైసన్ PVR: Jio వరల్డ్ డ్రైవ్ థియేటర్లో ఒక టికెట్ ధర రూ. 3000 ఉంది. బుక్‌మైషోలోనే ఈ టికెట్లను పొందే అవకాశం ఉంది. ముంబైలోని పీవీఆర్, ఐనాక్స్ చైన్ లింక్‌లో ఉన్న కొన్ని స్క్రీన్స్‌లలో ఒక టికెట్ ధర రూ. 1500 నుంచి రూ. 2400 వరకు ఉంది. ఢిల్లీలోని PVR డైరెక్టర్స్ కట్ స్క్రీన్స్‌లో హిందీ 2D వెర్షన్ టిక్కెట్ ధర రూ. 2400 వరకు ఉంది. ఢిల్లీలో కూడా పీవీఆర్, ఐనాక్స్కు సంబంధించిన కొన్ని థియేటర్స్‌లలో రూ. 1500 పైగానే ఒక టికెట్ ధర ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించే అంశమని చెప్పవచ్చు. ఈ ధరలతో చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాస్త బెటర్ అనేలా పరిస్థితి ఉంది.తెలంగాణలో టికెట్ల ధరలు ఇలాపుష్ప-2 సినిమా టికెట్ల ధరల పెంపు, అదనపు షోలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సినిమా విడుదల ముందురోజు అంటే డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి ప్రదర్శించే బెన్ఫిట్ షోకు అన్ని రకాల స్క్రీన్లలో రూ.800 పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటల అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 5వ తేదీ నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.150, మల్టీఫ్లెక్స్‌లలో రూ. 200 పెంచుకోవచ్చని తెలిపింది. అయితే, డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్స్‌లలో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఉంది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఏపీ ప్రభుత్వం నుంచి ప్రస్థుతానికి టికెట్ల ధరల విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు.అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. ఆరు భాషలల్లో సుమారు 12 వేలకు పైగానే థియేటర్స్‌లలో విడుదల కానుంది. ఈ సినిమా రన్ టైమ్ విషయానికొస్తే 3 గంటలా 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో రాబోతోంది.#Pushpa2 one ticket price ₹3️⃣0️⃣0️⃣0️⃣ pic.twitter.com/bCo8JSZWTV— Manobala Vijayabalan (@ManobalaV) December 1, 2024 -
హైదరాబాద్‌లో ‘పుష్ప 2’ ఈవెంట్.. చివరి నిమిషంలో ప్లాన్ ఛేంజ్!
హైదరాబాద్‌లో పుష్ప 2 ఈవెంట్ పక్కా.. కానీ ఎక్కడ? ఎప్పుడు? అనేది నిన్నటి వరకు క్లారిటీ రాలేదు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్లో సోమవారం(డిసెంబర్ 2) ఈ ఈవెంట్ జరగనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్.చివరి నిమిషంలో ప్లాన్ ఛేంజ్ఇప్పటికే పాట్నా, ముంబై, చెన్నై, కొచ్చిలో భారీ ఈవెంట్స్ నిర్వహించిన పుష్ప 2 టీమ్.. అంతకు మించిన ఈవెంట్‌ని హైదరాబాద్‌లో జరపాలని ముందు నుంచే ప్లాన్ వేసుకున్నారు. డిసెంబర్ 1న ఈ ఈవెంట్‌ని నిర్వహించాలనుకున్నారు. తొలుత ఎల్బీ స్టేడియంలో ప్లాన్ చేశారు. కానీ అక్కడ పర్మిషన్ లభించలేదు. దీంతో మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్‌కి మార్చారు. అయితే అక్కడ కూడా అనుమతి లభించకపోవడంతో చివరి నిమిషంలో ఈ ఈవెంట్‌ని యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్‌కి మార్చారు. ఈ రోజు కాకుండా రేపు (డిసెంబర్ 2) ఈ భారీ ఈవెంట్‌ని నిర్వహించనున్నారు. బన్నీతో పాటు చిత్రబృందం అంతా ఈ కార్యక్రమానికి హాజరుకానుంది. ‘అలా.. ’తర్వాత మళ్లీ ఇలా..యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్లో బన్నీ సినిమా ఈవెంట్ జరగడం ఇది రెండోసారి. తొలిసారి 2020లో బన్నీ నటించిన ‘అల..వైకుంఠపురములో’ మూవీ మ్యూజికల్ ఈవెంట్ ఇక్కడే జరిగింది. దాదాపు ఆరు వేల మంది అంచనాతో ఈవెంట్ నిర్వహించగా.. 15 వేల మందికి పైగా హాజరయ్యారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అంతేకాదు ఆరు వేల మందికి పర్మిషన్ తీసుకొని..15 వేల మందిని ఆహ్వానించారంటూ ఈవెంట్ ఆర్గనైజేషన్ శ్రేయాస్ మీడియా పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.టికెట్ రేట్లు భారీగా పెంపుసుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రంపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయింది. బన్నీ మాస్ ఫెర్ఫార్మెన్స్ని చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారి కోసమే బెనిఫిట్ షోలు కూడా వేయబోతున్నారు. తెలంగాణలో నవంబర్ 4 రాత్రి 9.30 గంటల నుంచే ఈ బెన్ఫిట్ షోలు పడబోతున్నాయి. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అంతేకాదు టికెట్ ధరలు కూడా పెంచేశారు. బెనిఫిట్ షోల టికెట్ ధరలు రూ.800 ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లో బెనిఫిట్ షో లకు ఈ ధరలు వర్తిస్తాయి. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200లకు టికెట్ ధరను పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు అనుమతి తీసుకున్నారు. -
తెలంగాణలో ‘పుష్ప 2’ టికెట్ ధరల పెంపు.. ఒక్కో టికెట్ ధర ఎంతంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలతో పాటు అర్ధరాత్రి 1 షోలకు అనుమతి ఇచ్చినట్లు ఉత్తర్వులో పేర్కొంది. పుష్ప 2 బెనిఫిట్ షోల టికెట్ ధరలు రూ.800 ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లో బెనిఫిట్ షో లకు ఈ ధరలు వర్తిస్తాయి. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200లకు టికెట్ ధరను పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగల్ స్క్రీన్ లో రూ.20, మల్టీఫ్లెక్స్ లో రూ.50 చొప్పున పెంచుకునేందుకు మేకర్స్‌కి వెసులుబాటు కల్పించింది. (చదవండి: మెగా హీరో కొత్త సినిమా.. ఓటీటీలోకి ఇంత త్వరగానా?)ఇక పుష్ప 2 విషయానికొస్తే.. సుకుమార్ -బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగో సినిమా. మూడేళ్ల క్రింద విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్ ఇది. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. ఫాహద్ ఫాజిల్ మరో కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.