ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేసే నాని(23)తో రేవతి (33) కొంతకాలంగా... | Snatching love couple In Hyderabad | Sakshi
Sakshi News home page

ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేసే నాని(23)తో రేవతి (33) కొంతకాలంగా...

Feb 20 2026 8:38 AM | Updated on Feb 20 2026 11:54 AM

Snatching love couple In Hyderabad

బంజారాహిల్స్‌ : జల్సాలకు అలవాటుపడ్డ ఓ ప్రేమ జంట తమ ఖర్చు కోసం ఈజీ మనీపై దృష్టిపెట్టి స్నాచింగ్‌ అవతారమెత్తి పోలీసు వలలో చిక్కారు. ఈ మేరకు స్నాచర్ల జంటను జూబ్లీహిల్స్‌ పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. గుంటూరుకు చెందిన గిద్దల నరేంద్ర అలియాస్‌ నాని (23), కాకినాడకు చెందిన చేశెట్టి రేవతి (33) గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ సనత్‌నగర్‌లో ఉంటున్నారు.

ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేసే నరేంద్ర రేవతితో కలిసి నిర్మానుష్య ప్రాంతాల్లో తిరుగుతూ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళల కదలికలపై దృష్టిపెట్టసాగాడు. మూడు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మెడలో నుంచి వెనుక కూర్చొన్న రేవతి గొలుసు తెంచుకుని పరారయ్యారు. వీరిద్దరినీ రిమాండ్‌కు తరలించగా గొలుసును రికవరీ చేశారు.   కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస రెడ్డి తెలిపారు. 

 వార్త చదవండి : ఆమెకు 33.. అతనికి 23..ఇద్దరూ కలిసి సనత్‌నగర్‌లో గది అద్దెకు తీసుకుని

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement